AP 10th Class Social Bits Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

Practice the AP 10th Class Social Bits with Answers 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. భారత ప్రామాణిక కాలమానం (స్వేచ్ ప్రామాణిక కాలానికి ఎంత తేడా ఉంది?
A) 5½ గం||లు ముందు (+ 5.30 ని॥లు)
B) 5½ గం||లు వెనుక (- 5.30 ని॥లు)
C) 4½ గం॥లు ముందు (+ 4.30 ని||లు)
D) 4½ గం||లు వెనుక (- 4.30 ని||లు)
జవాబు:
A) 5½ గం||లు ముందు (+ 5.30 ని॥లు)

2. ఏది తప్పుగా జతపరచబడినది?
A) జమ్ము కొండలు – జమ్ము కాశ్మీర్
B) మిష్మి కొండలు – అరుణాచల్ ప్రదేశ్
C) కొచ్చార్ – అసోం
D) పాట్కా య్ – ఉత్తర ప్రదేశ్
జవాబు:
D) పాట్కా య్ – ఉత్తర ప్రదేశ్

3. సిమ్లా నైనితాల్, ముస్సోరి వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
A) ఉన్నత హిమాలయాలు
B) నిమ్న హిమాలయాలు
C) శివాలిక్ శ్రేణి
D) నీలగిరి
జవాబు:
B) నిమ్న హిమాలయాలు

AP 10th Class Social Bits Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

4. హిమాలయ దిగువ భాగంలో రాళ్ళు, గులకరాళ్ళతో కూడిన ప్రాంతం
A) భాబర్
B) టెరాయి
C) నల్ల మృత్తికలు
D) భంగర్
జవాబు:
A) భాబర్

5. క్రింది వానిలో భారతదేశం గుండా పోతున్న రేఖ
A) కర్కట రేఖ
B ) మకర రేఖ
C) ఉప అయన రేఖ
D) భూమధ్య రేఖ
జవాబు:
A) కర్కట రేఖ

6. ద్వీపకల్ప పీఠభూమికి సంబంధం లేని పర్వతాలు
A) ఆరావళి
B) సహ్యాద్రి
C) నీలగిరులు
D) తూర్పు కనుమలు
జవాబు:
A) ఆరావళి

7. భారతదేశ ప్రామాణిక రేఖాంశము …………..
A) 82½° పశ్చిమ రేఖాంశము
B) 82½° తూర్పు రేఖాంశము
C) 23½° పశ్చిమ రేఖాంశము
D) 23½° తూర్పు రేఖాంశము
జవాబు:
B) 82½° తూర్పు రేఖాంశము

8. మహాభారత పర్వత శ్రేణులు ఇచ్చట కలవు
A) ఉన్నత హిమాలయాలు
B) నిమ్న హిమాలయాలు
C) బాహ్య హిమాలయాలు
D) ఆరావళి పర్వత శ్రేణులు
జవాబు:
B) నిమ్న హిమాలయాలు

9. క్రింది వానిలో సరియైనది.
A) కొంకణ తీరం – ఆంధ్రప్రదేశ్
B) మలబారు తీరం – మహారాష్ట్ర
C) కోరమండల్ తీరం – తమిళనాడు
D) సర్కార్ తీరం – కేరళ
జవాబు:
C) కోరమండల్ తీరం – తమిళనాడు

10. క్రింది వానిలో ఏ అక్షాంశ రేఖ భారత దేశం గుండా వెళ్ళదు?
A) 5°N
B) 12°N
C) 30°N
D) 35°N
జవాబు:
A) 5°N

11. ‘సర్కార్ తీరం’ గల రాష్ట్రం …….
A) ఒడిశా
B) ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D) కేరళ
జవాబు:
B) ఆంధ్రప్రదేశ్

12. తూర్పు కనుమలలో భాగం కానిది.
A) వేలి కొండలు
B) పాల కొండలు
C) శేషాచలం
D)పళని కొండలు
జవాబు:
D)పళని కొండలు

13. మిష్మి కొండలు గల రాష్ట్రము
A) జమ్ము కాశ్మీర్
B) అస్సాం
C) అరుణాచల్ ప్రదేశ్
D) మేఘాలయ
జవాబు:
C) అరుణాచల్ ప్రదేశ్

14. భారతదేశం మధ్యగా పోవుచున్న అక్షాంశ రేఖ ……
A) భూమధ్య రేఖ
B) కర్కటరేఖ
C) మకరరేఖ
D) పైవన్నీ
జవాబు:
B) కర్కటరేఖ

15. భారతదేశ కాల నిర్ణయ రేఖ ………
A) 82° 30′ ల తూర్పు రేఖాంశము
B) 98° 27′ ల తూర్పు రేఖాంశము
C) 92° 30′ ల తూర్పు రేఖాంశము
D) 73° 30′ ల తూర్పు రేఖాంశము
జవాబు:
A) 82° 30′ ల తూర్పు రేఖాంశము

AP 10th Class Social Bits Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

16. అన్నామలై కొండలలో ఎత్తైన శిఖరము ……….
A) అనైముడి
B) దొడబెట్ట
C) గురుశిఖర్
D) ఆరోయకొండ
జవాబు:
A) అనైముడి

17. ద్వీపకల్ప పీఠభూమి ప్రత్యేక లక్షణం
A) ఎర్ర నేలలు
B) నల్ల నేలలు
C) ఒండ్రు నేలలు
D) లాటరైట్ నేలలు
జవాబు:
B) నల్ల నేలలు

18. హిమాద్రికి మరొక పేరు
A) ఉన్నత హిమాలయాలు
B) నిమ్న హిమాలయాలు
C) శివాలిక్ శ్రేణి
D) బాహ్య హిమాలయాలు
జవాబు:
A) ఉన్నత హిమాలయాలు

19. క్రింది వానిలో తప్పుగా జతచేయబడింది.
A) కొంకణ్ తీరం – మహారాష్ట్ర
B) కోరమండల్ తీరం – తమిళనాడు
C) మలబార్ తీరం – కేరళ
D) సర్కార్ తీరం – ఒడిశా
జవాబు:
D) సర్కార్ తీరం – ఒడిశా

20. హిమాలయ ప్రాంత వేసవి విడిదిలలో లేనిది
A) గుల్మార్గ్
B) డార్జిలింగ్
C) కొడైకెనాల్
D) నైనిటాల్
జవాబు:
C) కొడైకెనాల్

21. క్రింది వాక్యాలలో సరియైనది కానిది.
A) భారతదేశం 30° రేఖాంశాల పొడవున విస్తరించి యున్నది.
B) హిమాద్రి శ్రేణి సరాసరి ఎత్తు 6, 100 మీటర్లు.
C) పాక్ జలసంధి పాకిస్తాన్, భారతదేశాలను విడదీస్తున్నది.
D) పశ్చిమ తీరంలో ఎటువంటి సరస్సులు లేవు.
జవాబు:
C) పాక్ జలసంధి పాకిస్తాన్, భారతదేశాలను విడదీస్తున్నది.

22. ఈ పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి కలదు.
A) హిమాలయాలు
B) వింధ్య
C) సాత్పూరా
D) ఆరావళి
జవాబు:
D) ఆరావళి

క్రింది పటాన్ని పరిశీలించి 23 మరియు 24 ప్రశ్నలకు జవాబులివ్వండి.

23. క్రింది వానిలో భారతదేశంతో భూసరిహద్దును పంచుకోని దేశము
A) నేపాల్
B) చైనా
C) శ్రీలంక
D) పాకిస్తాన్
జవాబు:
C) శ్రీలంక

24. భారతదేశాన్ని ఇంచుమించు రెండు సమానభాగాలుగా విభజిస్తున్న రేఖ
A) కర్కటరేఖ
B) మకరరేఖ
C) భూమధ్యరేఖ
D) గ్రీనిచ్ రేఖ
జవాబు:
A) కర్కటరేఖ

25. భారతదేశ స్థానిక కాలం గ్రీనిచ్ కాలము కంటే …………….
A) 514 గంటలు ముందు ఉంటుంది.
B) 52 గంటలు వెనక ఉంటుంది.
C) 12 గంటలు ముందు ఉంటుంది.
D) 5 గంటలు వెనక ఉంటుంది.
జవాబు:
A) 514 గంటలు ముందు ఉంటుంది.

AP 10th Class Social Bits Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

26. మలబారు తీరము ప్రధానంగా ఏ రాష్ట్రములో ఉన్నది?
A) కర్ణాటక
B) కేరళ
C) తమిళనాడు
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
B) కేరళ

27. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు
A) సాత్పురా పర్వతశ్రేణులు
B) మహదేవ్ పర్వతశ్రేణులు
C) కైమూర్ పర్వతశ్రేణులు
D) మైకాల్ పర్వతశ్రేణుల ఒక భాగం
జవాబు:
A) సాత్పురా పర్వతశ్రేణులు

28. క్రింది వానిలో తూర్పు వైపున ఉన్న తీరం
A) కొంకణ్
B) కెనరా
C) మలబార్
D) ఉత్క
జవాబు:
D) ఉత్క

29. క్రింది పేర్కొన్న ఏ రాష్ట్రంలో ముందుగా సూర్యోదయం అవుతుంది?
A) అసోం
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్
జవాబు:
A) అసోం

30. కర్కట రేఖ ఈ రాష్ట్రం గుండా వెళుతుంది.
A) అరుణాచల్ ప్రదేశ్
B) సిక్కిం
C) మేఘాలయ
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
D) ఆంధ్రప్రదేశ్

31. లక్షద్వీప సమూహం వేటిచేత ఏర్పడింది?
A) అగ్నిపర్వత శిలలు
B) రూపాంతర శిలలు
C) అవక్షేప శిలలు
D) కోరల్ రీఫ్స్ (పగడపు దిబ్బలు)
జవాబు:
D) కోరల్ రీఫ్స్ (పగడపు దిబ్బలు)

32. గంగా-సింధూ మైదానంలోని తూర్పుభాగం ప్రధానంగా ఈ నది వల్ల ఏర్పడింది.
A) గంగా నది
B) బ్రహ్మపుత్ర నది
C) సింధూ నది
D) యమునా నది
జవాబు:
B) బ్రహ్మపుత్ర నది

33. కులు, కంగ్ర లోయలు ఈ క్రింది శ్రేణులలో కలవు
A) ఉన్నత హిమాలయాలు
B) నిమ్న హిమాలయాలు
C) శివాలిక్
D) సహ్యాద్రి
జవాబు:
B) నిమ్న హిమాలయాలు

34. మా డోక్ డింపెప్ లోయ క్రింది రాష్ట్రంలో కలదు.
A) కర్నాటక
B) అసోం
C) బీహార్
D) ఛత్తీస్ ఘడ్
జవాబు:
C) బీహార్

AP 10th Class Social Bits Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

35. పశ్చిమ రాజస్థాన్లో ఈ తరహా వాతావరణం ఉంటుంది.
A) శుష్క
B) అర్థ శుష్క
C) మధ్యధరా
D) ధృవ
జవాబు:
A) శుష్క

AP SSC 10th Class Social Bits with Answers in English and Telugu

Andhra Pradesh SCERT AP State Board Syllabus SSC 10th Class Social Studies Important Bits with Answers in English and Telugu Medium are part of AP Board 10th Class Textbook Solutions.

Students can also read AP Board 10th Class Social Solutions for board exams.

AP State Syllabus 10th Class Social Studies Important Bits with Answers in English and Telugu

10th Class Social Bits in English

10th Class Social Bits in Telugu

AP State Syllabus Bits with Answers

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

These AP 10th Class Social Studies Important Questions 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 1st Lesson Important Questions and Answers భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

10th Class Social 1st Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

I. క్రింది ప్రశ్నలకు ఒక్కమాటలో జవాబునివ్వండి.

1. హిమాలయాలు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి?
జవాబు:
2400 కి.మీ.

2. భారత దేశ ప్రామాణిక కాలమాన రేఖ ఏది?
జవాబు:
82½ తూర్పు రేఖాంశం.

3. భారత ప్రామాణిక కాలమానం (స్విచ్ ప్రామాణిక కాలానికి ఎంత తేడా ఉంది?
జవాబు:
5½ గం|| ముందు.

4. పిర్ పంజాల్, మహాభారత శ్రేణులు ఏ హిమాలయాలలో భాగంగా ఉన్నాయి?
జవాబు:
హిమాచల్.

5. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉన్న లోయ ఏది?
జవాబు:
బ్రహ్మపుత్ర లోయ.

6. మాక్ డోక్ డింపెప్ లోయ ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
మేఘాలయ.

7. ద్వీపకల్ప పీఠభూమి ఏ దిక్కుకు కొద్దిగా వాలి ఉంది?
జవాబు:
తూర్పుకు

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

8. నీలగిరి పర్వతాలు పడమటి కనుమలను ఎక్కడ కలుస్తాయి?
జవాబు:
గూడలూరు.

9. ద్వీపకల్ప పీఠభూమిలో ఎటువంటి నేలలు కలవు?
జవాబు:
నల్లరేగడి.

10. థార్ ఎడారి ఏ పర్వతాల వర్షచ్ఛాయ ప్రాంతంలో ఉంది?
జవాబు:
ఆరావళీ.

11. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల ఏ కొండలలో ఉంది?
జవాబు:
శేషాచలం కొండలు.

12. భారతదేశంలో అత్యంత పొడవైన కొలువ ఏది?
జవాబు:
ఇందిరాగాంధీ కాలువ.

13. నార్కొండం, బారెన్ దీవులు వేటి వల్ల ఏర్పడినాయి?
జవాబు:
అగ్ని పర్వతాల.

14. భారతదేశ దక్షిణ అంచు ‘ఇందిరా పాయింట్’ ఏదీవుల్లో ఉంది?
జవాబు:
నికోబార్ దీవుల్లో.

15. లక్ష ద్వీప దీపులు వేనివల్ల ఏర్పడినాయి?
జవాబు:
ప్రవాళ భిత్తికలు (కోరల్స్),

16. లక్ష ద్వీప దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత?
జవాబు:
32 చ.కి.మీ.

17. భారతదేశము ఉత్తర దక్షిణాలుగా సుమారు ఎన్ని కి.మీ. వ్యాపించి ఉంది.?
జవాబు:
3214 కి.మీ.

18. భారతదేశము తూర్పు పడమరలుగా సుమారు ఎన్ని కి.మీ. వ్యాపించి ఉంది?
జవాబు:
2933 కి.మీ.

19. భారతదేశంలో మొట్టమొదటి సూర్యోదయం పొందు రాష్ట్రం ఏది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్.

20. హిమాద్రి పర్వతాల సరాసరి ఎత్తు?
జవాబు:
6100 మీ.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

21. మాల్వా, దక్కన్ పీఠభూములను వేరు చేస్తున్నది ఏది?
జవాబు:
నర్మదా నది.

22. కులు, కంగ్ర లోయలు ఏ హిమాలయ శ్రేణిలో ఉన్నాయి?
జవాబు:
నిమ్న హిమాలయాలు.

23. భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత?
జవాబు:
15200 కి.మీ.

24. చిట్ట చివర సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?
జవాబు:
గుజరాత్.

25. సహ్యాద్రి శ్రేణులని (ఏ పర్వతాలనంటారు) వేటినంటారు?
జవాబు:
పశ్చిమ కనుమలని.

26. పులికాట్ సరస్సు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు.

27. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ నగరం గుండా పోతుంది?
జవాబు:
అలహాబాద్.

28. భారతదేశం పూర్తిగా ఈ అర్ధగోళంలో ఉంది?
జవాబు:
ఉత్తరార్ధగోళంలో

29. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది?
జవాబు:
గోండ్వానా భూమీ.

30. నిమ్న హిమాలయాలు ఏ అరణ్యాలకు ప్రసిద్ధి?
జవాబు:
సతత హరిత.

31. ‘డూన్’లు ఏ శ్రేణుల మధ్య ఉన్నాయి?
జవాబు:
నిమ్న హిమాలయాలకు, శివాలిక్ శ్రేణుల మధ్య

32. దిహంగ్ (బ్రహ్మపుత్ర) లోయ ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్.

33. ఖాసి కొండలు, గారో కొండలు, జైంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జవాబు:
మేఘాలయ.

34. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్వేది.

35. చిత్తడి నేలలను ఇలా కూడా పిలుస్తారు?
జవాబు:
టెరాయి.

36. ఖనిజ వనరులు సమృద్ధిగా ఏ పీఠభూమిలో ఉన్నాయి?
జవాబు:
చోటానాగపూర్.

37. నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
దక్కన్ పీఠభూమి.

38. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు ఏది?
జవాబు:
సాత్పురా పర్వతాలు.

39. ఉదగ మండలం (ఊటి) ఏ పర్వతాలలో ఉంది?
జవాబు:
నీలగిరులు.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

40. పడమటి కనుమలు ఎన్ని కి.మీ.||లు పొడవున వ్యాపించాయి?
జవాబు:
1600 కి.మీ.||

41. ఇందిరాగాంధీ కాలువ పొడవు ఎంత?
జవాబు:
650 కి.మీ||

42. తూర్పు తీర మైదానంను స్థానికంగా ఒడిశాలో ఏమంటారు?
జవాబు:
ఉత్కల్ తీరం.

43. తూర్పు తీర మైదానంను స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఏమంటారు?
జవాబు:
సర్కార్ తీరం.

44. తూర్పు తీర మైదానంను స్థానికంగా తమిళనాడులో ఏమంటారు?
జవాబు:
కోరమండల్ తీరం.

45. పడమటి తీర. మైదానంను మహారాష్ట్ర, గోవాలో ఏమంటారు?
జవాబు:
కొంకణ్ తీరం.

46. పడమటి తీర మైదానంను కర్నాటకలో ఏమంటారు?
జవాబు:
కెనరా తీరం

47. పడమటి తీర మైదానంను కేరళలో ఏమంటారు?
జవాబు:
మలబారు తీరం.

48. హిమాలయాల్లో అన్నిటి కంటే దక్షిణంగా ఉన్న శ్రేణి ఏది?
జవాబు:
శివాలిక్.

49. లక్షద్వీప దీవులు ఏ సముద్రంలోని దీవులు?
జవాబు:
అరేబియా సముద్రం.

50. మూడు వైపుల సముద్రం ఉన్న భూభాగంను ఏమంటారు.?
జవాబు:
ద్వీపకల్పం.

51. పాట్ కాయ్ కొండలు ఏ హిమాలయాల్లో భాగం?
జవాబు:
పూర్వాంచల్.

52. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది?
జవాబు:
అనైముడి.

53. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది?
జవాబు:
అనైముడి.

54. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది?
జవాబు:
అరోయకొండ.

55. నీలగిరులలో ఎత్తైన శిఖరం ఏది?
జవాబు:
దొడబెట్ట.

56. భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా వేరు చేస్తున్న పర్వత శ్రేణులు ఏవి?
జవాబు:
వింద్య – సాత్పురా పర్వతాలు.

57. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
జవాబు:
8.4′ నుంచి 379.6′.

58. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది?
జవాబు:
689,7′ నుంచి 979.25′.

59. భారతదేశం మధ్య గుండా పోతున్న ప్రధాన అక్షాంశం ఏది?
జవాబు:
కర్కట రేఖ (23½° ఉ.అ)

60. అంగారా, గోండ్వానా భూములు విడిపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు ఏవి?
జవాబు:
హిమాలయాలు.

61. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఏర్పడిన భూభాగమేది?
జవాబు:
ఉత్తర మైదానాలు.

62. ఏ మైదాన ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు ఉన్నాయి?
జవాబు:
సింధూనదీ మైదానం.

63. ‘ఘగ్గర్’ నది నుండి ‘తీ” నది వరకు విస్తరించియున్న మైదానం ఏది?
జవాబు:
గంగానది మైదానం.

64. ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ అంచు ఏది?
జవాబు:
కన్యాకుమారి అగ్రము.

65. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు:
ఒడిషా.

66. కొల్లేరు సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.

67. థార్ ఎడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది?
జవాబు:
100 – 150 మి.మీ.

68. సింధూనది యొక్క పరివాహక ప్రదేశం ఎక్కడ ఎక్కువగా ఉంది?
జవాబు:
పాకిస్తాన్.

69. 2004లో సంభవించిన సునామీలో ముంపుకు గురైన దీవి ఏది?
జవాబు:
ఇందిరా పాయింట్.

70. లారెన్షియా భూభాగానికి గల మరో పేరేమిటి?
జవాబు:
అంగారా భూమి.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

71. పశ్చిమ రాజస్థాన్లో ఏ తరహా వాతావరణం ఉంటుంది?
జవాబు:
శుష్క వాతావరణం.

72. హిమాద్రి శ్రేణి సరాసరి ఎత్తు ఎంత?
జవాబు:
6100

73. హిమాచల్ శ్రేణి సరాసరి ఎత్తు ఎంత?
జవాబు:
3700 – 4500 మీ|| మధ్య.

74. శివాలిక్ శ్రేణి సరాసరి ఎత్తు ఎంత?
జవాబు:
900 – 1100 మీ|| మధ్య.

75. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత?
జవాబు:
8848 మీ||

76. అనైముడి శిఖరం ఎత్తు ఎంత?
జవాబు:
2695 మీ||

77. దొడబెట్ట శిఖరం ఎత్తు ఎంత?
జవాబు:
2637 మీ

78. అరోయ కొండ ఎత్తు ఎంత?
జవాబు:
1680 మీ॥

79. హిమాలయాల వెడల్పు పశ్చిమం, తూర్పుకు వరసగా ఎంత?
జవాబు:
500 కి.మీ., 200 కి.మీ॥

80. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్ లో స్థానికంగా ఎలా పిలుస్తారు?
జవాబు:
మిష్మి కొండలు.

81. శివాలిక్ శ్రేణిని జమ్ము, కాశ్మీర్ లో స్థానికంగా ఎలా పిలుస్తారు?
జవాబు:
జమ్ము కొండలు.

82. శివాలిక్ శ్రేణిని అస్సాంలో స్థానికంగా ఎలా పిలుస్తారు?
జవాబు:
కచాలు

83. క్రింది వానిలో భిన్నంగా ఉన్నది ఏది?
గుల్మార్గ్, డార్జిలింగ్, కొడైకెనాల్, నైనిటాల్జ.
జవాబు:
కొడైకెనాల్.

84. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ కొంకణ తీరం – మహారాష్ట్ర
→ కోరమండల్ తీరం – తమిళనాడు.
→ కెనరా తీరం – కర్నాటక
→ మలబార్ తీరం – ఒడిశా
జవాబు:
మలబారు తీరం – ఒడిశా

85, క్రింది వానిని సరిగా జతపరచండి.
i) అనైముడి (‘) a) హిమాలయాలు
ii) ఎవరెస్ట్ ( ) b) దక్షిణ భారతదేశం
iii)దొడ బెట్ట ( ) c) తూర్పు కనుమలు
iv) అరోయకొండ ( ) d) నీలగిరులు
జవాబు:
1-b, ii-a, iii – d, iv-c

86. IST అనగా?
జవాబు:
ఇండియన్ స్టాండర్డ్ టైమ్.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

87. GMT అనగా?
జవాబు:
గ్ర్వీ చ్ మీన్ టైమ్.

88. నర్మదానదికి ఉత్తరాన, గంగా మైదానానికి దక్షిణాన ఉన్న పశ్చిమం వైపు ఉన్నత భూములు ఏవి?
జవాబు:
మాల్వా పీఠభూమి.

89. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి.
→ హిమాద్రి – ఉన్నత హిమాలయాలు
→ శివాలిక్ – బాహ్య హిమాలయాలు (బాహ్య)
→ పూర్వాంచల్ – తూర్పు హిమాలయాలు
→ హిమాచల్ – అత్యున్నత హిమాలయాలు
జవాబు:
హిమాచల్ – అత్యున్నత హిమాలయాలు.

90. భారతదేశ ఉనికికి సంబంధించి క్రింది వానిలో సరికానిది.
→ భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధ గోళంలో ఉంది.
→ భారతదేశం రేఖాంశాల పరంగా పశ్చిమార్ధ గోళంలో ఉంది.
→ భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది.
→ భారతదేశం మూడు వైపుల సముద్రంచే ఆవరించ బడి ఉంది.
జవాబు:
భారతదేశం రేఖాంశాల పరంగా పశ్చిమార్ధ గోళంలో ఉంది.

91. క్రింది వానిలో సరికాని జత :
(ఎ) నీలగిరులు – ఊటి
(బి) కర్నాటక – కార్డమం కొండలు
(సి) అన్నామలై – అనైముడి
(డి) చింత పల్లి – అరోయ కొండ
జవాబు:
(బి) కర్నాటక – కార్డమం కొండలు.

92. కర్కటక రేఖ వెళ్ళే 4 రాష్ట్రాలను పశ్చిమం నుండి తూర్పుకు వరసగా రాయండి.
జవాబు:
గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్.

93. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) చిత్తడి ప్రాంతం ( ) a) టెరాయి
ii) గులక రాళ్ళతో కూడిన ప్రాంతం ( ) b) భాబర్
iii) శుష్క ప్రాంతం ( ) c) ఎడారి
iv) రెండు నదుల మధ్య ప్రాంతం ( ) d) అంతర్వేది
జవాబు:
i va, ii – b, iii – c, iv-d

94. భారతదేశ పశ్చిమ తీరము మూడు భాగాలుగా విభజించబడింది.
I) కొంకణ్ తీరం II) కెనరా తీరము III)?
ప్ర : మూడవ భాగం పేరు రాయండి.
జవాబు:
మలబారు తీరం.

95. భారతదేశ తూర్పు తీరము మూడు భాగాలుగా విభజించ బడింది.
I) ఉత్కర్ తీరం II) సర్కార్ తీరము III)?
ప్ర : మూడవ భాగం పేరు రాయండి.
జవాబు:
కోరమండల్ తీరం.

96. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే మూడు శ్రేణులు ఉన్నాయి.
I) హిమాద్రి II) హిమాచల్ III)?
ప్ర : మూడవ శ్రేణి పేరు రాయండి.
జవాబు:
శివాలిక్లు.

II. మొదటి జతలోని అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి.
97. హిమాలయాలు : ఎవరెస్ట్ :: పశ్చిమ కనుమలు 😕
జవాబు:
అనైముడి.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

98. తూర్పు కనుమలు : ఆరోయకొండ :: నీలగిరులు 😕
జవాబు:
దొడబెట్ట

99. అనే ముడి : 2695 మీ|| :: దొడబెట్ట 😕
జవాబు:
2637 మీ||

100. పళని కొండలు : తమిళనాడు :: కార్డమం కొండలు 😕
జవాబు:
కేరళ.

101. బంగాళాఖాతము : అండమాన్ నికోబార్ దీవులు :: అరేబియా సముద్రం 😕
జవాబు:
లక్ష ద్వీట్లు

102. సిమ్లా :
హిమాలయాలు :: ఊటి 😕
జవాబు:
నీలగిరులు.

103. హిమాలయాలు : 2400 కి.మీ :: పడమటి కనుమలు 😕
జవాబు:
1600 కి.మీ.

104. కొల్లేరు : ఆంధ్రప్రదేశ్ :: చిల్కా 😕
జవాబు:
ఒడిశా.

105. .సర్కార్. తీరం : ఆంధ్రప్రదేశ్ :: ఉత్కల్ తీరం 😕
జవాబు:
ఒడిశా.

10th Class Social 1st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
హిమాలయాలలోని ప్రధానమైన లోయలు, వేసవి విడిది కేంద్రాలను పేర్కొనండి.
జవాబు:
హిమాలయాలలోని ప్రధానమైన లోయలు కాంగ్రా, కులు. వేసవి విడుదులు సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ మరియు రాణిఖేత్.

ప్రశ్న 2.
అగ్నిపర్వతాల కారణంగా ఏర్పడిన భారతదేశపు దీవులు ఏవి?
జవాబు:
అండమాన్ నికోబార్ దీవులు (లేక) నార్కొండాం, బారెన్ దీవులు.

ప్రశ్న 3.
లండన్లో ఉదయం 8 గంటల సమయం అయితే, మన దేశంలో సమయం ఎంతవుతుంది?
జవాబు:
మధ్యాహ్నం 1 గంట 30 నిముషములు.

ప్రశ్న 4.
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు
పై పట్టిక ప్రకారం ఏ ప్రదేశం తూర్పు దిక్కున ఉంది?
జవాబు:
ఇంఫాల్ తూర్పు దిక్కున ఉంది.

కింది పటంను చదివి 5, 6 ప్రశ్నలకు సమాధానములు రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 2
పటం : భారతదేశం-ఉత్తర, దక్షిణ, తూర్పు-పడమరల విస్తీర్ణం, ప్రామాణిక రేఖాంశం

ప్రశ్న 5.
భారతదేశాన్ని దాదాపుగా రెండు భాగాలుగా విభజిస్తున్న అక్షాంశం ఏది?
జవాబు:
కర్కట రేఖ లేదా 23° 30′ ఉత్తర అక్షాంశం భారతదేశాన్ని దాదాపుగా రెండు భాగాలుగా విభజిస్తుంది.

ప్రశ్న 6.
ఏ రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు?
జవాబు:
82° 30′ తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 7.
అండమాన్ నికోబార్ దీవుల, లక్షదీవుల నైసర్గిక లక్షణాల మధ్య గల ఏదేని ఒక భేదాన్ని పేర్కొనండి.
జవాబు:

అండమాన్ మరియు నికోబార్ దీవులు లక్షదీవులు
బంగాళాఖాతంలో ఉన్నాయి. అరేబియా సముద్రంలో ఉన్నాయి.
వీటిలో కొన్ని అగ్ని పర్వతాల వలన ఏర్పడ్డాయి. ప్రవాళభిత్తికల వలన ఏర్పడ్డాయి.

ప్రశ్న 8.
నార్కొండాం, బారెన్ దీవులు ఎలా ఏర్పడ్డాయి?
జవాబు:
నార్కొండాం, బారెన్ దీవులు ఏర్పడడానికి గల కారణం : నార్కొండం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి.

ప్రశ్న 9.
ద్వీపకల్ప నదులు ఎందుకు జీవనదులు కావు?
జవాబు:
ద్వీపకల్ప నదులు జీవనదులు కాకపోవడానికి గల కారణం : సంవత్సరమంతా నీళ్ళు ఉండవు. అందువలన ద్వీపకల్ప నదులు జీవనదులు కావు.

ప్రశ్న 10.
భారతదేశ పశ్చిమ తీరము మూడు భాగాలుగా విభజించబడింది.
I. కొంకణ్ తీరము
II. కెనరా తీరము
III. _ ?
ప్రశ్న : మూడవ భాగం పేరు రాయండి.
జవాబు:
మలబారు తీరము

ప్రశ్న 11.
మొదటి జతలోని రెండు అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. (AP SCERT)
హిమాలయాలు : ఎవరెస్ట్ : : తూర్పు కనుమలు : _ ?_
జవాబు:
అరోయ కొండ

ప్రశ్న 12.
భారతదేశ ఉనికి (గ్లోబు) ఏది?
జవాబు:
భారతదేశం భౌగోళికంగా ఉత్తరార్ధగోళంలో ఉంది. 8° 4′ – 37° 6′ ఉత్తర అక్షాంశాలకు, 68° 7′ – 97°25′ తూర్పు . రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

ప్రశ్న 13.
భారతదేశ ప్రామాణిక కాలమానంగా ఏ రేఖాంశాన్ని గైకొన్నారు? ఇది ఏ నగరం గుండా పోతుంది?
జవాబు:
82° 30′ తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక కాలమానంగా తీసుకొన్నారు. ఇది అలహాబాద్ గుండా పోతుంది.

ప్రశ్న 14.
గ్రీన్విచ్ కాలానికి, భారతదేశ ప్రామాణిక కాలానికి మధ్య ఉన్న తేడా ఎంత?
జవాబు:
గ్రీన్ విచ్ కాలానికి, భారతదేశ ప్రామాణిక కాలానికి మధ్య సమయంలో 5½ గంటలు తేడా ఉంది.

ప్రశ్న 15.
భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది?
జవాబు:
భారత ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది.

ప్రశ్న 16.
భారతదేశ భూభాగాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించారు?
జవాబు:
భారతదేశ భూభాగాన్ని ఆరు భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించారు.

ప్రశ్న 17.
హిమాలయాల్లో సమాంతరంగా ఉండే శ్రేణులు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
హిమాలయాల్లో సమాంతరంగా ఉండే శ్రేణులు మూడు. అవి :
హిమాద్రి, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు.

ప్రశ్న 18.
నిమ్న హిమాలయాల్లోని ముఖ్యశ్రేణులు ఏవి?
జవాబు:
నిమ్న హిమాలయాల్లో పింజాల్ శ్రేణి, మహాభారత్ శ్రేణి ముఖ్యమైన శ్రేణులు.

ప్రశ్న 19.
శివాలిక్ శ్రేణిని వివిధ ప్రాంతాలలో ఏ ఏ పేర్లతో పిలుస్తారు?
జవాబు:
శివాలిక్ శ్రేణిని జమ్ము ప్రాంతంలో “జమ్ము” కొండలని, అరుణాచల్ ప్రదేశ్ లో “మిష్మి” కొండలని, అసోంలో “కచార్” అని పిలుస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 20.
‘డూన్’ అనగానేమి ? ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఎ) విచ్ఛిన్న వరుసలలో ఉన్న సన్నని, సమతల భూతలం గల దైర్ఘ్య లోయలను “డూన్” అంటారు.
బి) నిమ్న హిమాలయాలకు, శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండే లోయలను స్థానికంగా “డూన్” అంటారు.
సి) ఉదా : డెహ్రడూన్, కోట్లిడూన్, పాట్లీడూన్ మొ||నవి.

ప్రశ్న 21.
పూర్వాంచల్ అని వేనినంటారు?
జవాబు:
భారతదేశానికి (ఈశాన్య రాష్ట్రాలలో) తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను “పూర్వాంచల్” అంటారు.

ప్రశ్న 22.
భారతదేశ రుతుపవన శీతోష్ణస్థితికి మూలం ఏవి?
జవాబు:
హిమాలయాలు భారతదేశ రుతుపవన శీతోష్ణస్థితికి మూలం.

ప్రశ్న 23.
విశాల ఉత్తర మైదానం ఏ నదుల వల్ల ఏర్పడింది?
జవాబు:
విశాల ఉత్తర మైదానం గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదుల వల్ల ఏర్పడింది.

ప్రశ్న 24.
గంగా – సింధూ మైదానాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? అవి ఏవి?
జవాబు:
గంగా – సింధూ మైదానాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు అవి :

  1. పశ్చిమభాగం
  2. మధ్యభాగం
  3. తూర్పుభాగం.

ప్రశ్న 25.
‘అంతర్వేది’ (Doab) అనగానేమి?
జవాబు:
రెండు నదుల మధ్య ప్రాంతాన్ని “అంతర్వేది” (దో అబ్) అంటారు.

ప్రశ్న 26.
‘భాబర్’ అనగానేమి?
జవాబు:
హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులకరాళ్లు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో 8-16 మీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని “భాబర్” అంటారు.

ప్రశ్న 27.
‘టెరాయి’ అనగానేమి?
జవాబు:
టెరాయి అనగా చిత్తడి (నేలలు) ప్రాంతం.

ప్రశ్న 28.
ద్వీపకల్పం అనగానేమి? ఉదాహరణనిమ్ము.
జవాబు:
మూడువైపులా నీరుండి ఒక వైపు భూభాగం కలిగి ఉన్న భూస్వరూపాన్ని “ద్వీపకల్పం” అంటారు.
ఉదా : భారత ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం.

ప్రశ్న 29.
ద్వీపకల్ప పీఠభూమిని ఎన్ని భాగాలుగా విభజించారు? అవి ఏవి?
జవాబు:
ద్వీపకల్ప పీఠభూమిని రెండు భాగాలుగా విభజించారు. అవి :

  1. మాల్వా పీఠభూమి
  2. దక్కన్ పీఠభూమి.

ప్రశ్న 30.
దక్కన్ పీఠభూమి ఏ దిక్కువైపునకు వాలి ఉంది? ఎందుచేత?
జవాబు:

  1. దక్కన్ పీఠభూమి కొద్దిగా తూర్పు వైపునకు వాలి ఉంది.
  2. తూర్పు కనుమల కంటే పశ్చిమ కనుమల ఎత్తు ఎక్కువ.

ప్రశ్న 31.
‘ఉదకమండలం’ ప్రత్యేకత ఏమిటి? ఇది ఎక్కడ ఉంది? దీనికి మరో పేరేమి?
జవాబు:

  1. ఉదకమండలం ప్రఖ్యాతి గాంచిన వేసవి విడిది.
  2. ఇది నీలగిరి పర్వతాలలో ఉంది.
  3. దీనినే “ఊటీ” అంటారు.

ప్రశ్న 32.
పడమటి కనుమలలోని ప్రముఖ కొండలు ఏవి?
జవాబు:
పడమటి కనుమలలోని ప్రముఖ కొండలు అన్నామలై, పళని, కార్డమం కొండలు.

ప్రశ్న 33.
తూర్పు కనుమలలోని కొండల శ్రేణులు ఏవి?
జవాబు:
నల్లమల, వెలిగొండ, పాలకొండ, శేషాచలం వంటివి తూర్పు కనుమల్లో ఉన్నాయి.

ప్రశ్న 34.
భారతదేశ ఎడారి ప్రాంతం ఏది? ఇది ఎక్కడ ఉంది?
జవాబు:

  1. భారతదేశ ఎడారి {థార్ ఎడారీ) ప్రాంతం ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉంది.
  2. ఇది ఎక్కువ భాగం రాజస్థాన్లో విస్తరించి ఉంది.

ప్రశ్న 35.
పడమటి తీరమైదానం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది?
జవాబు:
పడమటి తీర మైదానం రాణ్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 36.
తూర్పు తీరమైదానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది?
జవాబు:
తూర్పు తీరమైదానం ఒడిశాలోని మహానది నుంచి మొదలయ్యి తమిళనాడులోని కావేరి డెల్టా వరకు విస్తరించి ఉంది.

ప్రశ్న 37.
తూర్పు తీరమైదానంలోని సరస్సులేవి?
జవాబు:
చిల్కా సరస్సు (ఒడిశా), కొల్లేరు, పులికాట్ (ఆంధ్రప్రదేశ్) సరస్సులు తూర్పు తీరమైదానంలో కలవు.

ప్రశ్న 38.
తూర్పు తీరప్రాంత మైదానాలను స్థానికంగా ఏ పేర్లతో పిలుస్తారు?
జవాబు:
ఉత్కల్ తీరం (ఒడిశా), సర్కార్ తీరం (ఆంధ్రప్రదేశ్), కోరమండల్ తీరం(తమిళనాడు) అని పిలుస్తారు.

ప్రశ్న 39.
భారతదేశంలో ఎన్ని ద్వీప సమూహాలు ఉన్నాయి? అవి ఏవి?
జవాబు:
భారతదేశంలో రెండు ద్వీప సమూహాలున్నాయి. అవి

  1. అండమాన్ నికోబార్ దీవులు
  2. లక్షద్వీప దీవులు.

ప్రశ్న 40.
లక్షద్వీప దీవులు ఎలా ఏర్పడినాయి?
జవాబు:
లక్షద్వీప దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్) నుండి ఏర్పడినాయి.

ప్రశ్న 41.
‘కోరల్స్’ అనగానేమి? ఉదాహరణనిమ్ము.
జవాబు:
కొన్నిరకాల సముద్రజీవుల స్రావాలతో ఏర్పడిన రంగురాయి. ఇవి తక్కువలోతు, బురదలేని వేచ్చని (సముద్ర) నీటిలో ఏర్పడతాయి.
ఉదా :
పగడము.

ప్రశ్న 42.
తూర్పు తీరప్రాంత మైదానం ఏ నదులతో ఏర్పడింది?
జవాబు:
తూర్పు తీరప్రాంత మైదానం మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులతో ఏర్పడింది.

10th Class Social 1st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింద ఇవ్వబడిన పటాన్ని పరిశీలించి దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
a) భారతదేశపు తూర్పు, పడమర కొసల మధ్య దూరం ఎంత?
b) భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న ఏవేని రెండు దేశాల పేర్లు రాయండి.
జవాబు:
a) 2933 కి.మీ.

b) భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు :
1) పాకిస్తాన్
2) చైనా
3) నేపాల్
4) భూటాన్
5) మయన్మార్
6) బంగ్లాదేశ్
7) శ్రీలంక
8) మాల్దీవులు
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 3

ప్రశ్న 2.
భారతదేశానికి హిమాలయాలు ఎందుకు ముఖ్యమైనవి?
జవాబు:
భారతదేశానికి హిమాలయాలు ముఖ్యమైనవి ఎందుకనగా :

  1. మధ్య ఆసియా నుండి వచ్చే చల్లని గాలులను ఇవి అడ్డుకుంటాయి.
  2. ఉత్తరప్రాంతం ఋతుపవన తరహా శీతోష్ణస్థితి కలిగి ఉండటానికి హిమాలయాలు దోషదపడుతున్నాయి.
  3. ఇవి జీవ నదులకు పుట్టినిల్లు
  4. హిమాలయాల కారణంగా గంగా, సింధు మైదానం ఏర్పడింది.

ప్రశ్న 3.
దిగువ నీయబడిన భారతదేశ పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) భారతదేశానికి భూ సరిహద్దు కల్గిన ఏవేని రెండు దేశాల పేర్లు రాయండి.
b) భారతదేశము ఏయే అక్షాంశాల మధ్య కలదు?
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 4
జవాబు:
a) భారతదేశానికి భూ సరిహద్దు కల్గిన దేశాలు :
పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్.

b) భారతదేశం 8°4′ – 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు.

ప్రశ్న 4.
తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలకు మధ్య వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలకు మధ్య వ్యత్యాసాలు

తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు
1. తూర్పు కనుమలు ఎత్తు తక్కువ 1. పశ్చిమ కనుమలు ఎత్తు ఎక్కువ
2. ఇవి విచ్ఛిన్న శ్రేణులు 2. ఇవి అవిచ్ఛిన్న శ్రేణులు
3. వీటిలో ఏ నదులు జన్మించవు 3. ఇవి నదులకు జన్మస్థానము
4. వీటిలో అరోమ కొండ ఎత్తైన శిఖరము 4. వీటిలో అనైముడి ఎత్తైన శిఖరము

ప్రశ్న 5.
భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి?
(లేదా)
భారతదేశ ముఖ్య భౌగోళిక స్వరూపాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
భారతదేశ ముఖ్య భౌగోళిక స్వరూపాలు ఈ కింది విధంగా వర్గీకరించవచ్చు :

  1. హిమాలయాలు
  2. గంగా-సింధూనది మైదానం
  3. ద్వీపకల్ప పీఠభూమి
  4. తీరప్రాంత మైదానాలు
  5. ఎడారి ప్రాంతం
  6. దీవులు

ప్రశ్న 6.
భారతదేశ ఉత్తర (సమతల) మైదాన ప్రాంతాలు ఎలా ఏర్పడినాయి?
జవాబు:

  1. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవటం వల్ల ఒక పెద్ద లోయ ఏర్పడింది.
  2. కాలక్రమంలో ఈ లోయ ఉత్తరాది నుంచి హిమాలయ నదులు, దక్షిణాది నుంచి ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రుతో మేటవేసింది.
  3. దీని ఫలితంగా భారతదేశంలో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 7.
నిమ్న హిమాలయాల గురించి నీకు తెలిసింది రాయుము.
జవాబు:

  1. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ‘నిమ్న హిమాలయాలు’ అంటారు.
  2. ఈ శ్రేణి బాగా ఎగుడుదిగుడులతో ఉంటుంది.
  3. ఇక్కడ బాగా ఒత్తిడికి గురైన రాళ్లు ఉంటాయి.
  4. పర్వతాల ఎత్తు 3,700 – 4,500 మీటర్ల మధ్య ఉంటుంది.
  5. ఈ శ్రేణిలో పిపంజాల్, మహాభారత పర్వతశ్రేణులు ముఖ్యమైనవి.
  6. నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్ర, కులు లోయలు ఉన్నాయి.
  7. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్ వంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతతహరిత అరణ్యాలకు ఈ శ్రేణి ప్రఖ్యాతిగాంచింది.

ప్రశ్న 8.
దక్కన్ పీఠభూమి సరిహద్దులేవి?
జవాబు:

  1. నర్మదానది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని “దక్కన్ పీఠభూమి” అంటారు.
  2. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి.
  3. మహదేవ్ కైమూర్, మైకాల్ శ్రేణిలో కొంత భాగం తూర్పు అంచుగా ఉన్నాయి.
  4. దక్కన్ పీఠభూమికి పశ్చిమ కనుమలు పశ్చిమ సరిహద్దుగా ఉన్నాయి.
  5. తూర్పు కనుమలు తూర్పు సరిహద్దుగా, నీలగిరి పర్వతాలు దక్షిణ సరిహద్దుగా, ఉన్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 9.
ప్రకృతి వైపరీత్యాల నుండి తప్పించుకోవడానికి నీవు అందించే సూచనలు ఏవి?
జవాబు:

  1. ప్రకృతి వైపరీత్యాల నుండి తప్పించుకోవడానికి ఆయా సమయాలలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, హెచ్చరికా కేంద్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
  2. ఆయా సమయాలలో ప్రజలు ఆ సంస్థలకు సహకరించి తక్కువ నష్టంతో బయటపడాలి. పునరావాసాలు పొందాలి.
  3. ఇంకొక జాగ్రత్తగా ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే విధమైన చర్యలను ప్రజలు ఉపసంహరించుకోవాలి.
  4. పర్యావరణానికి నష్టం చేకూర్చని లేదా తక్కువ హాని కలుగచేసే విధంగా ప్రజలు అన్ని కార్యకలాపాలను రూపుదిద్దుకోవాలి.

ప్రశ్న 10.
“భారతదేశంలో రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి – బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు. మయన్మార్ కొండలు అర్కన్ యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకి వచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్, నికోబార్ దీవులు. ఈ దీవులలోని నార్కొండాం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరాపాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది.
ప్రశ్న : అగ్ని పర్వతాలకు, సునామీలకు ఏమైనా సంబంధం ఉందా? కారణాలు తెలపండి.
జవాబు:

  1. సముద్ర భూతలంపై సంభవించు భూకంపాల ఫలితంగా సునామి అని పిలువబడే అతి పెద్ద వరద తరంగాలు ఏర్పడతాయి.
  2. ఈ తరంగాల తరంగదైర్ఘ్యం 200 కి.మీ. వరకు, ప్రయాణవేగం గంటకు 800 కి.మీ. వరకూ ఉంటుంది.
  3. ఇవి ప్రయాణం చేసే మార్గంలో కొన్ని వందలు మరియు కొన్ని వేల కి.మీలలో గల ద్వీపాలు మరియు తీరాలలోని పల్లపు ప్రాంతాలు మునిగి తీవ్ర నష్టానికి గురౌతాయి.
  4. కావున అగ్నిపర్వతాలకు, సునామీలకు ఏమాత్రం సంబంధం లేదు.
  5. అయితే సునామీ వల్ల అగ్నిపర్వతాలున్న దీవి మునిగిపోవడం ఇక్కడ గమనించవచ్చు.

ప్రశ్న 11.
పటాన్ని చదివి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 4
1) భారతదేశం మధ్యగుండా పోయే ప్రధాన అక్షాంశ రేఖ ఏది?
2) భారతదేశ ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశము ఏది?
3) భారతదేశానికి వాయవ్య భాగంలోని సరిహద్దు దేశం ఏది?
4) భారతదేశం ఉత్తర, దక్షిణాలుగా ఎంత పొడవు ఉంది?
5) అరేబియా సముద్రంలో భారతదేశపు దీవులేవి?
6) భారతదేశం ఏ ఏ అక్షాంశాల మధ్య ఉన్నది?
7) భారతదేశం ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది?
జవాబు:
1) భారతదేశం గుండా, పోయే ప్రధాన అక్షాంశ రేఖ : కర్కట రేఖ.
2) భారతదేశ ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశము : 82½ ° తూర్పు రేఖాంశం.
3) భారతదేశానికి వాయవ్య భాగంలోని సరిహద్దు దేశం : పాకిస్తాన్.
4) భారతదేశం ఉత్తర, దక్షిణాలుగా 3214 కి.మీ. పొడవు ఉంది.
5) అరేబియా సముద్రంలోని భారతదేశ దీవులు : లక్షదీవులు.
6) భారతదేశం 8°4′ ఉత్తర అక్షాంశం నుండి 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది.
7) భారతదేశం 68°7′ తూర్పు రేఖాంశం నుంచి 97°25′ తూర్పు రేఖాంశం మధ్య ఉంది.

ప్రశ్న 12.
పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 5
1) ద్వీపకల్ప పీఠభూమికి వాయవ్య సరిహద్దులలోని పర్వతాలు ఏవి?
2) నర్మదానదికి ఉత్తరంగా ఉన్న పీఠభూమి ఏది?
3) నర్మదానదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార పీఠభూమి ఏది?
4) ద్వీపకల్ప పీఠభూమికి ఈశాన్య భాగంలో ఉన్న పీఠభూమి ఏది?
5) దక్కన్ పీఠభూమిలోని రెండు ముఖ్య నగరాలు ఏవి?
6) పశ్చిమంగా ప్రవహించే నదులేవి?
7) భారతదేశం మధ్య భాగంలోని పర్వతాలు ఏవి?
జవాబు:
1) ద్వీపకల్ప పీఠభూమికి వాయవ్య సరిహద్దులోని పర్వతాలు : ఆరావళి పర్వతాలు.
2) నర్మదానదికి ఉత్తరంగా ఉన్న పీఠభూమి : మాల్వా పీఠభూమి.
3) నర్మదానదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార పీఠభూమి : దక్కన్ పీఠభూమి.
4) ద్వీపకల్ప పీఠభూమికి ఈశాన్య భాగంలో ఉన్న పీఠభూమి : చోటానాగపూర్ పీఠభూమి.
5) దక్కన్ పీఠభూమిలోని రెండు ముఖ్య నగరాలు : బెంగళూరు మరియు హైదరాబాద్.
6) పశ్చిమంగా ప్రవహించే నదులు : నర్మద, తపతి.
7) భారతదేశం మధ్య భాగంలో ఉండే పర్వత శ్రేణులు : వింధ్య, సాత్పురా పర్వతాలు.

10th Class Social 1st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తూర్పు కనుమల మరియు పశ్చిమ కనుమల మధ్య గల భేదములను వివరించండి.
జవాబు:
తూర్పు కనుమలకు, పశ్చిమ కనుమలకు మధ్య గల భేదములు :

తూర్పు కనుములు పశ్చిమ కనుమలు
1) తూర్పు తీరానికి సమాంతరంగా ఉన్నాయి. 1) పడమటి తీరానికి సమాంతరంగా ఉన్నాయి.
2) విచ్ఛిన్న శ్రేణులు. 2) అవిచ్చిన్న శ్రేణులు.
3) ఎత్తు తక్కువ. 3) ఎత్తు ఎక్కువ.
4) సముద్రతీరానికి దూరము. 4) సముద్రతీరానికి దగ్గర.
5) చిన్న, మధ్యతరహా నదులకు జన్మస్థలము. 5) పెద్ద నదులకు జన్మస్థలము.
6) పడమటి కనుమల కన్నా పురాతనమైనవి. 6) తూర్పు కనుమల కన్నా నవీనమైనవి.
7) ఎత్తైన శిఖరం అరోయకొండ 7) ఎత్తైన శిఖరం అనైముడి.
8) అధిక వర్షపాత కారకం కాదు. 8) అధిక వర్షపాత కారకాలు.

ప్రశ్న 2.
మీకివ్వబడిన భారతదేశ పటంలో ఈ క్రింది వానిని గుర్తించుము.
i) కేరళ
ii) ఉదగమండలం
iii) సర్కార్ తీరం
iv) మానస సరోవరంలో పుట్టిన ఏదైనా ఒక నది
(లేదా)
a) 37°6′ ఉత్తర అక్షాంశం
b) నైనిటాల్
c) సాత్పురా పర్వతాలు
d) దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 6

ప్రశ్న 3.
హిమాలయ పర్వతాల ఉపయోగాలను వివరించండి.
జవాబు:

  1. హిమాలయాలు భారతదేశానికి ఉత్తరాన సహజ సరిహద్దులుగా ఉన్నాయి.
  2. తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వీచే చల్లటి గాలుల నుండి భారతదేశానికి రక్షణ కల్పిస్తున్నాయి.
  3. వేసవిలో వర్షాలకు కారణమవుతున్నాయి.
  4. భారతదేశంలో ఋతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం.
  5. హిమాలయాలే లేకపోతే భారతదేశం ఎడారిగా మారి ఉండేది.
  6. అనేక జీవనదులకు హిమాలయాలు జన్మనిస్తున్నాయి.
  7. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
  8. హిమాలయ నదులు తెచ్చే ఒండ్రుమట్టి వల్ల ఉత్తర మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి.

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాగ్రాను చదివి, భారతదేశ శీతోష్ణస్థితి మరియు హిమాలయాల గురించి వ్యాఖ్యానించండి.
హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ఉన్న ప్రాంతంలో ఋతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది.
జవాబు:

  • శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాల్లో భౌగోళిక స్వరూపం ప్రధానమైనది.
  • భారతదేశ శీతోష్ణస్థితిని హిమాలయాలు అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి.
  • భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి. హిమాలయాలు లేనట్లయితే ఈ తీవ్ర చలిగాలులు దేశమంతటా వీస్తాయి.
  • వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే ప్రధాన కారణం. భారతదేశ వ్యవసాయానికి, ఋతుపవనాలే ఆధారం. ఋతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి, వ్యవసాయం అనుకూలంగా లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చేది.
  • హిమాలయాలలోని సతతహరిత అరణ్యాలు ఆవరణ సమతౌల్యతను కాపాడటమే కాకుండా, ఆర్థికంగా కూడా లాభాన్ని చేకూరుస్తున్నాయి.
  • భారతదేశంలోని జీవనదులకు హిమాలయాలు ఆలవాలం. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకైన వ్యవసాయం ఈ నదులపైనే (ఋతుపవనాలు) ఆధారపడి ఉంది.
  • ఆవరణపరంగా, ఆర్థికపరంగా, పర్యాటకంగా, రక్షణపరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న “హిమాలయాలు” మన దేశానికి నిజంగా ప్రకృతి వరాలు. వీటిని రక్షించుకోవటంలోనే మనకుంటాయి జవజీవాలు.
  • కాలుష్యం, విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరగటం వలన వీటికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 5.
గంగా-సింధూ నదీ మైదానం, ద్వీపకల్ప పీఠభూమికి ఏ విధంగా భిన్నమైనదో పేర్కొనుము.
జవాబు:

గంగా-సింధూ మైదానం ద్వీపకల్ప పీఠభూమి
1. గంగా- సింధూ మైదానం నదులు తీసుకువచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడినాయి. 1. ద్వీపకల్ప పీఠభూమి అగ్నిపర్వత చర్యల వలన ఏర్పడినది.
2. ఈ మైదానం ఒండ్రుమట్టితో ఏర్పడినది. 2. ఈ పీఠభూమి పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్ని శిలలు, రూపాంతర శిలలతో ఏర్పడినది.
3. ఇది సారవంతమైన మరియు మెత్తటి ప్రాంతం. 3. ఇది గులకరాళ్ళతో నిండి మెట్ట పల్లాలుగా ఉంటుంది.
4. ఎక్కువ నీటి పారుదల సౌకర్యాలను కలిగిస్తుంది. 4. ఇక్కడ కూడా నీటిపారుదల సౌకర్యం కలదు.
5. ఇక్కడ జీవనదులు ప్రవహిస్తాయి. 5. ఇక్కడ జీవనదులు లేవు.
6. ఇది వ్యవసాయానికి మంచి అనుకూలం. 6. ఇక్కడ ఖనిజాలు బాగా లభిస్తాయి.

ప్రశ్న 6.
ఏవేని నాలుగు భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపాలను వివరించండి.
జవాబు:
1. హిమాలయాలు:
ఎ) హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దున 2400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి.
బి) హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అనే మూడు సమాంతర శ్రేణులుగా విస్తరించి ఉన్నాయి.

2. గంగా-సింధూ మైదానం :
ఎ) గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులు మరియు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది.
బి) సారవంతమైన ఒండ్రుమట్టి మైదానం, వ్యవసాయ యోగ్యంగా ఉంది.

3. ద్వీపకల్ప పీఠభూమి :
ఎ) భారతదేశ పీఠభూమికి, దానికి మూడువైపులా సముద్రాలు ఉన్నాయి. కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని కూడా అంటారు.
బి) ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తారు.

  1. మాల్వా పీఠభూమి,
  2. దక్కన్ పీఠభూమి.

4. తీరప్రాంత మైదానాలు :
ఎ) ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమాన ఉన్న పడమటి కనుమలు, అరేబియా సముద్రానికి మధ్య పడమటి తీర మైదానం, తూర్పున ఉన్న తూర్పు కనుమలు, బంగాళాఖాతానికి మధ్య తూర్పు తీర మైదానం విస్తరించి ఉన్నాయి.
బి) ఈ రెండు మైదానాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు.
ఉదా : ఆంధ్రప్రదేశ్ తీరం – సర్కారు తీరం, కేరళ తీరం – మలబార్ తీరం మొదలగునవి.

5. థార్ ఎడారి:
ఎ) ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి ఉంది.
బి) ఈ ప్రాంతంలో ప్రవహించే ఒకే నది ‘లూని’.

6. దీవులు:
ఎ) అగ్ని పర్వత ఉద్భూత దీవులైన అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి.
బి) అరేబియా సముద్రంలో ఉన్న లక్ష దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్ రీఫ్స్) నుండి ఏర్పడ్డాయి.

ప్రశ్న 7.
హిమాలయాలు ప్రస్తుతమున్న స్థానంలో ఉండకపోతే భారతదేశం యొక్క వ్యవసాయ రంగం ఏ విధంగా ఉండేది?
జవాబు:
హిమాలయాలు ప్రస్తుతమున్న స్థానంలో ఉండకపోతే

  1. సరిపడినంత వర్షపాతము ఉండేది కాదు.
  2. గంగా-సింధు మైదానంలో ఒండ్రు మృత్తికలు నిక్షేపించబడేవి కాదు.
  3. భారతదేశంలో జీవనదులు ఉండేవి కాదు.
  4. జల విద్యుచ్ఛక్తి కొరత ఉండేది.

ప్రశ్న 8.
తూర్పు తీర మైదానానికి, పశ్చిమతీర మైదానానికి గల పోలికలు, తేడాలను రాయండి.
జవాబు:
తూర్పుతీర మైదానానికి, పశ్చిమతీర మైదానానికి గల పోలికలు, తేడాలు :
పోలికలు :

  • సారవంతమైన మైదానాలు
  • వ్యవసాయానికి అనుకూలం
  • మత్స్య సంపద
  • జనసాంద్రత ఎక్కువ

తేడాలు :

తూర్పుతీర మైదానం పశ్చిమతీర మైదానం
ఒడిశా నుండి తమిళనాడు వరకు ‘రాణ్ ఆఫ్ కచ్’ నుండి కన్యాకుమారి వరకు
వెడల్పు ఎక్కువ వెడల్పు తక్కువ
సమతలంగా ఉంటుంది ఎత్తు పల్లాలుగా ఉండి, కొండలతో వేరు చేయబడుతుంది.
ఎక్కువ నదులు ప్రవహించడం. తక్కువ నదులు ప్రవహించడం

ప్రశ్న 9.
భారతదేశపు దీవుల గురించి వర్ణించండి.
(లేదా)
భారతదేశంలోని ద్వీప సమూహాలు, వాటి ఉద్భవం, విస్తరణను పేర్కొనండి.
జవాబు:

  1. భారతదేశంలో రెండు ద్వీప సమూహాలు ఉన్నాయి.
  2. బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప దీవులు.
  3. మయన్మార్ కొండలు అర్కన్ యోమా నుంచి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుంచి పైకివచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్, నికోబార్ దీవులు.
  4. ఈ దీవులలోని నార్కొండాం, బారెస్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి.
  5. భారతదేశ దక్షిణాది అంచు నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ దగ్గర ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది.
  6. లక్షద్వీప దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్) నుండి ఏర్పడ్డాయి.
  7. వీటి మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు.
  8. ఇక్కడ ఉండే రకరకాల వృక్ష, జీవ జాతులకు ఈ ద్వీప సమూహం ప్రఖ్యాతిగాంచింది.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 10.
మీకివ్వబడిన భారతదేశ పటంలో ఈ క్రింది వానిని గుర్తించుము.
1) భారత ప్రామాణిక రేఖాంశం
2) ఏదేని ఒక తీరము
3) గంగా సింధు మైదానం
4) పశ్చిమ కనుమలు
5) కర్కటరేఖ
6) హిమాచల్ ప్రదేశ్ రాజధాని
7) మాల్వా పీఠభూమి
8) ఇందిరా పాయింట్
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 7

ప్రశ్న 11.
ద్వీపకల్ప పీఠభూమి యొక్క నిర్మితీయ లక్షణాలను వివరించండి.
జవాబు:
ద్వీపకల్ప పీఠభూమి యొక్క నిర్మితీయ లక్షణాలు :

  • ఇక్కడ ప్రధానంగా పురాతన స్పటికాకార, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి.
  • ఈ పీఠభూమిలో లోహ, అలోహ ఖనిజ వనరులు పెద్ద మొత్తంలో ఉన్నాయి.
  • చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు ఉన్నాయి.
  • ఈ పీఠభూమి తూర్పు వైపుకి కొద్దిగా వాలి ఉంది.
  • దీనికి పడమర అంచుగా పడమటి కనుమలు, తూర్పు అంచుగా తూర్పు కనుమలు ఉన్నాయి.
  • ఈ పీఠభూమి దక్షిణ అంచుగా కన్యాకుమారి ఉంది.
  • ఈ పీఠభూమిని ప్రధానంగా మధ్య ఉన్నత భూములు (మాల్వా పీఠభూమి, చోటానాగపూర్), దక్కన్ పీఠభూమి అని రెండుగా విభజిస్తారు.
  • గంగా మైదానంతో పోలిస్తే పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది.
  • ఇక్కడి నదులు జీవ నదులు కావు.
  • గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన మధ్య ఉన్నత భూములు ఉన్నాయి.
  • చోటానాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి.
  • నర్మదా నదికి దక్షిణాన ఉన్న క్రమరహిత త్రిభుజాకార ప్రాంతమే దక్కన్ పీఠభూమి.

ప్రశ్న 12.
గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను అవి ఉన్న ప్రదేశం ఆధారంగా పడమర నుండి తూర్పుకు అమర్చి రాయండి.
జవాబు:
గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్.

ప్రశ్న 13.
నీకు తెలిసిన ‘శివాలిక్’ గురించి వర్ణింపుము.
జవాబు:

  1. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని “శివాలిక్” అంటారు.
  2. శివాలిక్ శ్రేణి 10-50 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది. దీంట్లోని పర్వతాల ఎత్తు 900 – 1100 మీటర్ల మధ్య ఉంటుంది.
  3. ఈ శ్రేణిని వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు : జమ్ము ప్రాంతంలో జమ్ము కొండలు అనీ, అరుణాచల్ ప్రదేశ్ లో మిష్మి కొండలు అనీ, అసోంలో కచార్ అనీ రకరకాల పేర్లతో పిలుస్తారు.
  4. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు, ఒండ్రుమట్టి ఉంటుంది.
  5. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా “డూన్” అంటారు.
  6. వీటిలో కొన్ని ప్రసిద్ధిగాంచిన డూన్లు : డెహ్రాడూన్, కోబ్లీడూన్, పాట్లీడూన్ మొదలైనవి.

ప్రశ్న 14.
హిమాలయాల ప్రాముఖ్యతను వివరించుము.
(లేదా)
“హిమాలయాలు పర్వతాలే కాదు భారతదేశానికి వరాలు” వ్యాఖ్యానించుము.
జవాబు:

  1. హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది.
  2. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి.
  3. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో రుతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం.
  4. అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది.
  5. హిమానీనదాల నుంచి నీళ్లు అందటంతో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్లు కలిగి ఉంటాయి.
  6. ఈ నదులు కొండల నుంచి కిందకి తెచ్చే ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి.

ప్రశ్న 15.
గంగా – సింధూ మైదానం ఏర్పడిన విధము మరియు మైదాన భాగాలను గురించి వివరింపుము.
జవాబు:

  1. మూడు హిమాలయ నదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రలు, వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం ఏర్పడింది.
  2. మొదట్లో (2 కోట్ల సంవత్సరాల క్రితం) అది తక్కువ లోతు ఉన్న పళ్లెం మాదిరి ఉండేది.
  3. హిమాలయాల నుంచి నదులు తెచ్చిన రకరకాల ఒండ్రుమట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది.
  4. భారతదేశంలోని గంగా-సింధూ నదీ మైదానాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు.
    1) పశ్చిమ భాగం 2) మధ్య భాగం 3) తూర్పు భాగం.
  5. ఎ) పశ్చిమ భాగం హిమాలయాల నుంచి ప్రవహించే సింధూనది, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్లతో ఏర్పడింది.
    బి) సింధూ నది పరీవాహక ప్రాంతం అధికభాగం పాకిస్థాన్లో ఉంది. కొంతభాగం మాత్రమే భారతదేశంలో ఉన్న పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది.
    సి) ఈ ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులు (Doab) అత్యధికంగా ఉన్నాయి. రెండు నదుల మధ్య ప్రాంతాన్నే “అంతర్వేది” అంటారు.
  6. ఎ) మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి పొందింది. ఇది గగ్గర నది నుంచి తీసా నది వరకు విస్తరించి ఉంది.
    బి) ఈ భాగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోనూ, కొంత హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ ఉంది.
    సి) ఇక్కడ గంగా, యమునా నదులు వాటి ఉపనదులైన సోన్, కోసి వంటివి ప్రవహిస్తాయి.
  7. ఎ) తూర్పుభాగం ప్రధానంగా అసోంలోని బ్రహ్మపుత్రలోయలో ఉంది.
    బి) ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది.

AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

ప్రశ్న 16.
థార్ ఎడారి భౌగోళిక స్వరూపమును, అక్కడి శీతోష్ణస్థితి గురించి వర్ణించుము.
జవాబు:

  1. ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి ఉంది.
  2. కాబట్టి ఇక్కడ వర్షపాతం తక్కువ. సంవత్సర వర్షపాతం 100 – 150 మి.మీ. మధ్య ఉంటుంది.
  3. ఎడారిలో ఎత్తు పల్లాలతో ఉండే ఇసుక మైదానం ఉండి అక్కడక్కడా శిలామయమైన బోడిగుట్టలు ఉంటాయి.
  4. రాజస్థాన్లోని అధికభాగంలో ఈ ఎడారి విస్తరించి ఉంది.
  5. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది, చెట్లు తక్కువ.
  6. వర్షాకాలంలో వాగులు ఏర్పడి, ఆ కాలం అయిపోవటంతోనే కనుమరుగవుతాయి.
  7. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క నది ‘లూని’. ఈ ఎడారులలో ప్రవహించే నది, కాలువలలోని నీరు సముద్రాన్ని చేరకుండా సరస్సులలోనికే (అంతస్థలీయ ప్రవాహం) ప్రవహిస్తాయి.

ప్రశ్న 17.
పడమటి తీరమైదానం విస్తరణ, వివిధ భాగాలను గురించి రాయుము.
జవాబు:

  1. పడమటి తీరమైదానం రాణ్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది.
  2. తూర్పు తీరమైదానం కంటే పడమటి తీరమైదానం వెడల్పు తక్కువ.
  3. ఈ తీరప్రాంత మైదానం ఎత్తుపల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది.
  4. దీనిని మూడు భాగాలుగా విభజించవచ్చు.
    ఎ) కొంకణ్ తీరప్రాంతం – ఇది ఉత్తర భాగం. మహారాష్ట్ర, గోవాలలో విస్తరించి ఉంది.
    బి) కెనరా తీరప్రాంతం – ఇది మధ్య భాగం. కర్ణాటకలోని తీరం దీనికిందకు వస్తుంది.
    సి) మలబార్ తీరప్రాంతం – ఇది దక్షిణ భాగం. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ఉంది.

ప్రశ్న 18.
భారతదేశ సరిహద్దు పటంలో ఈ క్రింద ఇవ్వబడిన వానిని గుర్తించుము.
1) 82° 30′ రేఖాంశం
2) కర్కటరేఖ
3) పొరుగుదేశాలు
4) దీవులు
5) హిందూమహాసముద్రం
6) బంగాళాఖాతం
7) అరేబియా సముద్రం
8) 8° 4′ దక్షిణ అక్షాంశం
9) 37°6′ ఉత్తర అక్షాంశం
10) 68°7′ తూర్పు రేఖాంశం
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు 4

ప్రాజెక్టు

మీ అట్లాసులోని భౌతిక, భౌగోళిక అంశాల ఉబ్బెత్తు, ఇతర పటాలను ఉపయోగించి నేల మీద మట్టితో భారతదేశ నమూనాని తయారుచెయ్యండి, వివిధ భౌగోళిక అంశాలను చూపించటానికి రకరకాల మట్టి లేదా ఇసుకను ఉపయోగించండి. శిఖరాల ఎత్తులలో తేడాలను చూపించండి. నదులను గుర్తించండి. మీ అట్లాసులో అడవుల పటం ఆధారంగా దానిని గడ్డి, ఆకులతో అలంకరించండి. తరువాత, కాలం గడిచేకొద్దీ ఇతర అంశాలను దాంట్లో జోడించవచ్చు.
జవాబు:

AP Board 10th Class Social Studies Important Questions and Answers 2021-2022 English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 10th Class Social Studies Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 10th Class Textbook Solutions.

Students can also read AP Board 10th Class Social Studies Solutions for board exams.

AP State Syllabus 10th Class Social Studies Important Questions and Answers 2021-2022 English & Telugu Medium

10th Class Social Studies Important Questions and Answers 2021 in English Medium

10th Class Social Important Questions 2021 Part 1 Resources Development and Equity

10th Class Social Studies Important Questions Pdf Part 2 Contemporary World and India

AP 10th Class Social Chapter Wise Important Questions 2021 in Telugu Medium

AP 10th Class Social Chapter Wise Important Questions 2021 భాగం-1 : వనరుల అభివృద్ధి, సమానత

10th Class Social Important Questions in Telugu Medium భాగం-2 : సమకాలీన ప్రపంచం, భారతదేశం

AP Board 8th Class Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Syllabus 8th Class Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 7th Class Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 7th Class Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Syllabus 7th Class Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 6th Class Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Syllabus 6th Class Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 9th Class Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board Solutions.

AP State Syllabus 9th Class Textbook Solutions Study Material Guide Pdf Free Download

AP Board 9th Class Hindi Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Hindi Textbook Solutions and Study Material Pdf are part of AP Board 9th Class Textbook Solutions.

AP State Syllabus 9th Class Hindi Textbook Solutions Study Material Guide Pdf Free Download

 

AP Board 9th Class Telugu Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Telugu Textbook Solutions and Study Material Pdf are part of AP Board 9th Class Textbook Solutions.

Students can also read AP Board 9th Class Telugu Important Questions for exam preparation.

AP State Syllabus 9th Class Telugu Textbook Solutions Study Material Guide Pdf Free Download

 

AP Board 6th Class Hindi Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 6th Class Hindi Textbook Solutions and Study Material Pdf in English Medium and Telugu Medium are part of AP Board 6th Class Textbook Solutions.

AP State Syllabus 6th Class Hindi Textbook Solutions Study Material Guide Pdf Free Download

सन्नद्धता कार्यक्रम

 

AP Board 8th Class Telugu Study Material Textbook Solutions Guide State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Telugu Textbook Solutions and Study Material Pdf are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also read AP Board 8th Class Telugu Important Questions for exam preparation.

AP State Syllabus 8th Class Telugu Textbook Solutions Study Material Guide Pdf Free Download