These AP 10th Class Social Studies Important Questions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ will help students prepare well for the exams.

AP Board 10th Class Social 9th Lesson Important Questions and Answers రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social 9th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. ఒక హెక్టారు ఎన్ని ఎకరాలకు సమానం?
జవాబు:
2 ½ ఎకరాలు

2. ఒక హెక్టారుకు ఎన్ని చదరపు మీటర్లుకు సమానం?
జవాబు:
10,000 చ.కి.మీ.

3. భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానము ఏది?
జవాబు:
హెక్టారు.

4. ఖరీఫ్ కాలంలో పండించే పంటకు ఒక ఉదాహరణ ఇవ్వండి ?
జవాబు:
వరి, జొన్న, సజ్జ.

5. రబీ కాలంలో పండించే ప్రధాన పంటకు ఉదాహరణ ఇవ్వండి?
జవాబు:
గోధుమ.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

6. ఉత్పత్తికి అవసరం లేని సహజ వనరు ఏది?
జవాబు:
గాలి.

7. ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులు, యంత్రాలు మరియు నిర్మాణాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
స్థిర / భౌతిక మూలధనం

8. MGNREGA ని విస్తరింపుము.
జవాబు:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

9. వర్షాకాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
ఖరీఫ్.

10. శీతాకాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
రబీ.

11. వేసవి కాలపు పంట ఋతువు నేమంటారు?
జవాబు:
జయాద్.

12. భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి / ఉపాధి కార్యకలాపం ఏది?
జవాబు:
వ్యవసాయం.

13. రాంపురం గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:
ఉత్తరప్రదేశ్.

14. రాంపురంలో సాగుభూమి ఏ సంవత్సరం నుంచి సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు?
జవాబు:
1921.

15. ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చెయ్యటాన్ని ఏమంటారు?
జవాబు:
బహుళ పంటల సాగు.

16. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో ఎంత శాతాని కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది?
జవాబు:
40%

17. రాంపురం జనాభా ఎంత? ఎన్ని కుటుంబాలున్నాయి?
జవాబు:
2660, 450

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

18. రాంపురంలో ఎన్నో వంతు మందికి భూమి లేదు?
జవాబు:
1/3 వంతు.

19. రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగుచేసే రైతుల నేమంటారు?
జవాబు:
చిన్న రైతులు.

20. రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగుచేసే రైతుల నేమంటారు?
జవాబు:
పెద్ద, మధ్య తరగతి రైతులు.

21. గ్రామాలలో పని దొరకని రోజులలో వ్యవసాయ కూలీలు ఏ పథకంలో పనికోసం పంచాయితీలో దరఖాస్తు చేసుకొంటారు?
జవాబు:
MGNREGA.

22. రాంపురంలోని పనిచేసే వాళ్ళల్లో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
జవాబు:
25%

23. 2009 – 2010లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
జవాబు:
32 మంది.

24. చెరుకు యొక్క పంటకాలం ఎంత?
జవాబు:
సంవత్సరం.

25. శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా దీనికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ అది సూచిస్తుంది?
జవాబు:
ఉత్పత్తికి.

26. వ్యవసాయ ఉత్పత్తికి ఏ ఉత్పత్తికారకం చాలా కీలకమైన అంశం?
జవాబు:
భూమి.

27. అక్టోబరు – డిసెంబరు నెలల మధ్య ఏ పంట సాగుచేస్తారు?
జవాబు:
బంగాళాదుంప.

28. భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడులను కలుపుకుని వ్యక్తులు లేదా వ్యాపార వేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటిని ఏమంటారు?
జవాబు:
ఉత్పత్తి కారకాలు.

29. రాంపురంలోని నేలలు ఏ రకపు నేలలు?
జవాబు:
ఒండ్రు.

30. రాంపురం గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేనప్పుడు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ఏ పరికరాన్ని వాడారు?
జవాబు:
పర్షియన్ వీల్.

31. భూసారం తగ్గడానికి గల కారణాలలో ఏదైన ఒకదానిని రాయండి?
జవాబు:
రసాయనిక ఎరువుల వాడకం, పురుగుమందుల వాడకం.

32. భారతదేశంలో 2 హెక్టార్లకంటే తక్కువ విస్తీర్ణాన్ని సాగుచేస్తున్న చిన్న రైతుల శాతం ఎంత?
జవాబు:
87%

33. భారతదేశంలో మధ్య తరగతి, పెద్ద రైతులు సాగుచేస్తున్న సాగు భూమి శాతం ఎంత?
జవాబు:
52%

34. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయటానికి ఉత్పత్తిదారులకు కావలసిన సహజ వనరులు ఏవి?
జవాబు:
భూమి, నీరు, ఖనిజలవణాలు, అడవులు, సూర్యరశ్ని.

35. సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి, వాటికి కొంత మరమ్మత్తు, నిర్వహణ కోసం పెట్టే పెట్టుబడి నేమంటారు?
జవాబు:
భౌతిక పెట్టుబడి.

36. ముడి సరుకు కొనుగోలు పై పెట్టే పెట్టుబడి నేమంటారు?
జవాబు:
నిర్వాహక పెట్టుబడి.

37. 2011 డిసెంబరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విత్తనాలు నాటినందుకు పురుషునికి ఇచ్చే రోజువారీ కూలీరేటు ఎంత ఉంది?
జవాబు:
197 రూపాయలు.

38. పాలను నిల్వ చేయటానికి ఉపయోగించు ప్రక్రియ ఏది?
జవాబు:
శీతలీకరణ.

39. రాంపురం నందు రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని?
జవాబు:
60.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

40. రాంపురంలో మూడవ పంటగా ఏమి పంట పండిస్తున్నారు ?
జవాబు:
బంగాళాదుంప.

41. ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలం చెల్లించగా మిగిలిన ఉత్పత్తిని ఏమంటారు?
జవాబు:
మిగులు ఉత్పత్తి (లేదా) రైతు మిగులు.

42. రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంత మంది కంటే తక్కువ ఉన్నారు?
జవాబు:
50 మంది.

43. గ్రామీణ ప్రాంతంలో రెండవ సాధారణ కార్యకలాపం ఏది?
జవాబు:
పశుపోషణ.

44. కమతాల వరిమాణం తగ్గిపోవడానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
వారసత్వ చట్టాలు (కుటుంబాలు విచ్చిన్నం కావడం)

45. శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
జవాబు:
పాల ఉత్పత్తికి.

46. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ప్రధాన పరిమితి ఏమిటి?
జవాబు:
సాగుభూమి విస్తీర్ణత కొరత.

47. భారతదేశంలో మధ్యతరగతి, పెద్ద రైతులు ఎంత శాతం ఉన్నారు?
జవాబు:
13%

48. భారతదేశంలో చిన్న రైతులు సాగుచేస్తున్న సాగుభూమి శాతం ఎంత?
జవాబు:
48%

49. పెద్ద రైతులు వేటిపై ఆధారపడటం పెరగడంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గి పోతున్నాయి?
జవాబు:
యంత్రాలు.

50. చాలామంది చిన్న రైతులు నిర్వాహణ పెట్టుబడి కోసం ఎవరిపై ఆధారపడతారు?
జవాబు:
వడ్డీ వ్యాపారులు.

51. క్రింది వానిలో భౌతిక / స్థిర పెట్టుబడి కానిది?
→ ట్రాక్టర్ → నాగలి → జనరేటర్ → ముడిసరుకు
జవాబు:
ముడిసరుకు

52. క్రింది వానిలో సరియైన వాక్యాలను ఎంచుకుని రాయండి?
i) ముడిసరుకు, డబ్బు అవసరాలు – నిర్వాహక పెట్టుబడి.
ii) యంత్రాలు, పరికరాలు, భవనాలు- స్థిర పెట్టుబడి
iii) పైవన్నీ ఉత్పత్తి ప్రక్రియలు పూర్తిగా వినయగారిచేవిడి వివరికి మిగలవు.
జవాబు:
(i) మరియు (ii)

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

53. క్రింది వానిలో సరికాని జత.
→ వర్షాకాలం – ఖరీఫ్.
→ చలికాలం – రబీ.
→ ఋతుపవనకాలం- దాళ్వా,
→ ఎండాకాలం – జయాద్..
జవాబు:
ఋతుపవన కాలం – దాళ్వా.

54. భూమి, స్థిర పెట్టుబడి, వడ్డీ, వ్యవస్థాపనంలలో ఉత్పత్తి కారకం కానిది ఏది?
జవాబు:
వడ్డీ.

55. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచెయ్యటాన్ని బహుళ పంటల సాగు అంటారు.
ii) భూమి నుంచి ఉత్పత్తి పెంచటానికి ఇది అత్యంత సాధారణ పద్దతి.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

56. 2010 సంవత్సరం నాటికి భారతదేశంలోని సాగు విస్తీర్ణం; (మి|| హెక్టార్లు) ఎంత?
జవాబు:
140 మిలియన్ హెక్టార్లు

57. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) గ్రామాలలో అనేక రకాల వ్యవసాయేతర పనులలో చాలా కొద్దిమందికే ఉపాధి దొరుకుతుంది.
ii) 2009 -10లో భారతదేశంలోని ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులలో 32 మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (1) మాత్రమే
B) (II) మాత్రమే
C) (1) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C – (i) మరియు (ii)

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము రాయుము.
పట్టిక : డిసెంబరు 2011లో వివిధ వ్యవసాయ పనులకు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కూలి రేట్లు (రూపాయలలో)
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1

58. పురుషులు మాత్రమే చేస్తున్న పని ఏది?
జవాబు:
దున్నటం.

59. స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
జవాబు:
నాట్లు వేయటం, పత్తి ఏరడం

60. స్త్రీ, పురుష కూలి రేట్లలో వ్యత్యాసం ఎందుకుంది?
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన.

క్రింది రేఖాచిత్రము పరిశీలించి ఇచ్చిన ప్రశ్నకు సరియైన సమాధానము వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

61. పై రేఖా చిత్రం ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
సాగుభూమి పంపిణీలో అసమానతలను.

62. తక్కువ మంది కలిగి ఉండి, ఎక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులు ఎవరు?
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులు.

63. ఎక్కువ మంది ఉండి, తక్కువ సాగుభూమి కలిగి ఉన్న రైతులు ఎవరు?
జవాబు:
చిన్న రైతులు.

10th Class Social 9th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బహుళ పంటల విధానమనగానేమి?
జవాబు:
ఒక నిర్ణీత భూభాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించటాన్ని బహుళ పంటల విధానం అంటారు.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో గల ప్రధానమైన వ్యవసాయేతర కార్యకలాపాలేవి?
జవాబు:
కోళ్ల పెంపకం, రవాణా, బుట్టల తయారీ, పాడిపరిశ్రమ, వడ్రంగం పని, ఇటుకల తయారీ, దుకాణాల ఏర్పాటు, చేపల పెంపకం.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
రాంపురం గ్రామ ఆర్థిక రంగంలో నీకు నచ్చిన రెండు అంశాలు రాయుము.
జవాబు:
రాంపురంలో నాకు నచ్చిన అంశాలు :

  1. రాంపురంలో ఖాళీగా ఉన్న భూమి కొంచెం కూడా లేకపోవడం అంటే మొత్తం వ్యవసాయానికి వినియోగించడం.
  2. వ్యవసాయేతర పనులు కూడా అభివృద్ధి చెందడం.
  3. రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందటంతో మిగతా రంగాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి.

ప్రశ్న 4.
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది ఏది?
జవాబు:
వ్యవసాయ రంగంలో ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనది భూమి.

ప్రశ్న 5.
రాంపురం గ్రామములో మధ్య తరగతి, పెద్ద రైతులు వ్యవసాయ కూలీలు తమ దగ్గర పని చేయటానికి ఏమి చేస్తారు?
జవాబు:
రాంపురం గ్రామములో మధ్య తరగతి, పెద్ద రైతులు వ్యవసాయ కూలీలు తమ దగ్గర పనిచేయడానికి అన్నం పెడతారు, పనికి కూలీ చెల్లిస్తారు. కూలీ పంట రూపేణాకాని, డబ్బు రూపేణాకానీ ఉంటుంది.

ప్రశ్న 6.
ఉత్పత్తి కారకాలను పేర్కొనండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలు :

  1. భూమి,
  2. శ్రమ (లేదా) శ్రామికులు,
  3. మూలధనం (లేదా) పెట్టుబడి,
  4. వ్యవస్థాపన (లేదా) జ్ఞానం, వ్యాపార దక్షత

ప్రశ్న 7.
ఒకే పనికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ వేతనాన్ని సాధారణంగా ఎందుకు చెల్లిస్తారు?
జవాబు:

  1. పురుషాధిక్య సమాజం కావడం వలన
  2. లింగ వివక్షత ఉండడం వలన

ప్రశ్న 8.
ఉత్పత్తి కారకాలని వేటినంటారు?
జవాబు:
భూమి, శ్రమ, పూలధనము, జ్ఞానం, వ్యాపార దక్షత / వ్యవస్థాపనము, భౌతిక పెట్టుబడులను ఉత్పత్తి కారకాలంటాం.

ప్రశ్న 9.
‘వ్యవసాయం ప్రాముఖ్యత’ గురించి ఒక నినాదం రాయండి.
జవాబు:

  1. సేంద్రీయ వ్యవసాయం – ఆరోగ్య ఫలసాయం
  2. రైతులేనిదే – ఆహారం లేదు
  3. జలమే జీవం – వ్యవసాయమే జీవనం.

ప్రశ్న 10.
చిన్న రైతులు వ్యవసాయానికి ఆతసరమైన పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటారు?
జవాబు:
చిన్న రైతులు వ్యవసాయానికి ఆశ్వసర్వక పెట్టుబడులని సమకూర్చుకునే విధానాలు

  1. పెద్ద రైతుల నుండి అప్పుడు
  2. వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పు
  3. ఉత్పాదకాలను సరఫరా చేసే వ్యాపారస్తుల నుండి అప్పు

ప్రశ్న 11.
భౌతిక పెట్టుబడికి, నిర్వహణ పెట్టుబడికి మధ్య గల తేడా ఏమిటి?
జవాబు:
భౌతిక పెట్టుబడికి నిర్వహణ పెట్టుబడికి గల తేడా :

భౌతిక పెట్టుబడి నిర్వహణ పెట్టుబడి
అనేక సంవత్సరాల పాటు వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడే యంత్రాల కోసం పెట్టే పెట్టుబడి. ముడిసరుకు మరియు ఉత్పత్తి పూర్తి చేయటానికి కావలసిన చెల్లింపుల కోసం వెచ్చించే ‘డబ్బు.

ప్రశ్న 12.
రాంపురం ఎక్కడ ఉంది?
జవాబు:
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం ఉంది.

ప్రశ్న 13.
వర్షాకాలం, శీతాకాలంలో వీటిని పంటల సీజన్లుగా ఏమని పిలుస్తాం.
జవాబు:
వర్షాకాలాన్ని, ఖరీగా, శీతాకాలాన్ని రబీ అని పిలుస్తాం.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 14.
రాంపురంకు సమీపంలో మార్కెట్ యార్డ్ ఎక్కడ ఉంది?
జవాబు:
రాంపురంకు సమీపంలో రాయిగంజ్ లో మార్కెట్ యార్డ్ ఉంది.

ప్రశ్న 15.
రాంపురంకు సమీపంలోని పట్టణమేది?
జవాబు:
రాంపురంకు 12 కి.మీ. దూరంలో జహంగీరాబాదు అనే పట్టణం కలదు.

ప్రశ్న 16.
బహుళ పంటల సాగు అంటే ఏమిటి?
జవాబు:
ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగుచేయడాన్ని ‘బహుళ పంటల సాగు’ అంటాం.

ప్రశ్న 17.
విద్యుత్ రాకముందు రాంపురం గ్రామస్తులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి ఉపయోగించిన పరికరం ఏది?
జవాబు:
పర్షియన్ వీల్

ప్రశ్న 18.
రాంపురం జనాభా ఎంత ? అక్కడ ఎన్ని కుటుంబాలున్నాయి?
జవాబు:
రాంపురం జనాభా 2660. అక్కడ 450 కుటుంబాలున్నాయి.

ప్రశ్న 19.
ఉత్పత్తి ప్రక్రియలో లాభ, నష్టాలను భరించే వారినేమంటారు?
జవాబు:
యజమానులు.

ప్రశ్న 20.
భారతదేశంలోని ప్రధాన ఉత్పత్తి కార్యకలాపాలేంటి?
జవాబు:
భారతదేశ గ్రామాలలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు. వీటిలో చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ వంటివి ఉంటాయి.

ప్రశ్న 21.
ఉత్పత్తిలో పెట్టుబడి ఎన్ని రకాలుగా ఉంటుందో వర్గీకరించండి.
జవాబు:
ఉత్పత్తిలో పెట్టుబడి రెండు రకాలుగా ఉంటుంది.

  1. భౌతిక లేదా స్థిర పెట్టుబడి.
  2. నిర్వహణ పెట్టుబడి.

10th Class Social 9th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
కరువు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుపుతూ మీ తహసీల్దార్ (MRO) కు లేఖ రాయండి.
జవాబు:

ప్రదేశము : ………..
తేది : ……………

తహసీల్దార్ (MRO) గారి దివ్యసముఖమునకు
…………………
…………………

గౌరవనీయులైన అయ్యా,

నేను …………… ప్రాంతం వాడిని. మా ప్రాంతంలో ఈ సంవత్సరము తగినంత వర్షపాతము లేదు. పంటలు దెబ్బ తినడం వలన వ్యవసాయదారుల జీవనము అస్తవ్యస్తముగా మారినది. వ్యవసాయదారులు పెట్టుబడుల వలన, పంట నష్టాల వలన, పని దొరకకపోవడం వలన అనేక ఇబ్బందులు పాలైనారు. చాలా కుటుంబాలు అనాసక్తతతో ఉన్నాయి.

ప్రభుత్వమువారు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, అవసరమైన సహాయక చర్యలను తీసుకోవలెను. బ్యాంకు నుండి లోన్లు ఇప్పించడం ద్వారా, ఉపాధి పనుల ద్వారా రైతు కుటుంబాలను ఆదుకోవలెను.

ధన్యవాదములు.

మీ విశ్వాసపాత్రుడు,
……………………..

చిరునామా:
………………………… ,
………………………… ,
………………………… .

ప్రశ్న 2.
క్రింది పట్టికలో ఇవ్వబడిన సమాచారానికి ఒక ‘పై’ (Pie) చిత్రాన్ని (చిత్తుపటం) గీయండి. మీ పరిశీలనను రాయండి.

రైతుల రకాలు సాగుభూమి శాతం
చిన్న రైతులు 48%
మధ్య తరగతి, పెద్ద రైతులు 52%

జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 2
పరిశీలన :
ఎక్కువ వాటా భూమి (52%) మధ్యతరగతి మరియు పెద్ద రైతుల చేతిలో ఉండగా, తక్కువ వాటా భూమి (48%) చిన్న రైతుల చేతిలో ఉన్నది.

ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
a) చిన్న రైతులు అంటే ఎవరు?
జవాబు:
రెండు హెక్టార్ల కంటే తక్కువగా సాగుభూమి కలిగినవారిని చిన్న రైతులు అంటారు.

b) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని నీవు అంగీకరిస్తావా? వివరించుము.
జవాబు:
అవును. అసమానతలు ఉన్నాయని అంగీకరిస్తాను. కారణమేమనగా 87% రైతులు కేవలం 18% భూమిని సాగుచేస్తుండగా కేవలం 13% రైతులు 52% భూమిని సాగు చేస్తున్నారు.

ప్రశ్న 4.
ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు పెరగాల్సిన ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం గ్రామాలలో వ్యవసాయేతర కార్యకలాపాలు పెరగాల్సిన ఆవశ్యకత :

  • అనిశ్చిత ఋతుపవనాలు
  • అక్షరాస్యుల సంఖ్య పెరగడం
  • సాంకేతిక విజ్ఞాన ప్రభావం
  • బ్యాంకు సేవలు – రుణాలు

ప్రశ్న 5.
క్రింది సమాచారాన్ని చదివి, మీ పరిశీలనను రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ
జవాబు:

  1. మొత్తం రైతులలో 87% మంది చిన్నరైతులు.
  2. 13% మంది మధ్యతరగతి మరియు పెద్దరైతులు.
  3. 13% ఉన్న పెద్ద, మధ్యతరగతి రైతుల చేతుల్లో 52% సాగుభూమి ఉంది.
  4. భారతదేశంలో భూమి పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయి.

ప్రశ్న 6.
ఉత్పత్తి కారకాలలో ఒకదాని గురించి వివరించండి.
జవాబు:
భూమి, శ్రమ, పెట్టుబడి, జ్ఞానం, వ్యాపార దక్షతలను ఉత్పత్తి కారకాలంటారు.
శ్రమ :
శ్రమ అనగా కేవలం కార్మికులు చేసే శ్రమయే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
చిన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
చిన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు :

  1. సాగునీటి సదుపాయం లేక వర్షాలపై ఆధారపడటంతో అతివృష్టి లేదా అనావృష్టి.
  2. ఎరువుల కొరత
  3. వ్యవసాయ కూలీల కొరత.
  4. పెట్టుబడి అందించే సంస్థాగత (నియత రుణాలు) ఏర్పాట్లు లేకపోవడం.
  5. పంటకు సరియైన గిట్టుబాటు ధరలు అందకపోవడం.
  6. సరియైన మార్కెటింగ్ సమాచారం రైతులకు తెలియకపోవడం.
  7. దళారుల వ్యవస్థ (వారి పెత్తనం) మొదలైనవి.

ప్రశ్న 8.
భారతదేశంలో సాగునీటి సదుపాయాలు గూర్చి క్లుప్తంగా రాయండి.
జవాబు:
భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. ఇందుకు విరుద్దంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు. తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో 40 శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది.

ప్రశ్న 9.
రాంపురంలో గ్రామంలో పెద్ద రైతులు సమకూర్చుకున్న భౌతిక పెట్టుబడులు ఏవి?
జవాబు:
ఈ గ్రామంలోని పెద్ద రైతులందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి. తమ పొలాలను దున్నటానికి, విత్తటానికి ఉపయోగించటమే కాకుండా వీటిని ఇతర చిన్న రైతులకు అద్దెకు ఇస్తారు. వీళ్లల్లో చాలామందికి నూర్పిడి యంత్రాలు ఉన్నాయి, కొంత మందికి పంటకోత యంత్రాలు కూడా ఉన్నాయి. ఈ పెద్ద రైతులందరికీ తమ పొలాలకు సాగునీళ్లు అందించటానికి అనేక బోరుబావులు ఉన్నాయి. ఈ పరికరాలు, యంత్రాలు అన్నీ వ్యవసాయానికి అవసరమైన భౌతిక పెట్టుబడితో భాగం.

ప్రశ్న 10.
కొత్త వ్యవసాయ పద్ధతులు శ్రామికులను వ్యవసాయరంగానికి దూరం చేస్తున్నాయా?
జవాబు:
అవును. కొత్త వ్యవసాయ పద్ధతులు శ్రామికులను వ్యవసాయరంగానికి దూరం చేస్తున్నాయి. ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికులు అవకాశాల కోసం వెదుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు.

ప్రశ్న 11.
రాంపురంలో భూపంపిణీ ఎలా జరిగింది?
జవాబు:
రాంపురంలో మూడింట ఒక వంతు అంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమిలేని వాళ్లలో అధికశాతం దళితులు. రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు 60 దాకా ఉన్నాయి. పెద్ద రైతులలో కొంత మందికి 10 హెక్టార్లకు మించి సాగు భూమి ఉంది. రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగుచేసే కుటుంబాలు 240 ఉన్నాయి.

ప్రశ్న 12.
నిర్వహణ పెట్టుబడి కోసం చిన్న రైతులు ఏం చేస్తారు?
జవాబు:
నిర్వహణ పెట్టుబడి కోసం చాలా మంది చిన్న రైతులు అప్పు చేయాల్సి ఉంటుంది. వాళ్లు పెద్ద రైతుల నుంచి కానీ, వడ్డీ వ్యాపారస్తుల నుంచి కానీ, సాగుకు అవసరమయ్యే వివిధ ఉత్పాదకాలను సరఫరాచేసే వ్యాపారస్తుల నుంచి కానీ అప్పు – తీసుకుంటారు. ఇటువంటి అప్పుల మీద వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అప్పులు తిరిగి చెల్లించటం వాళ్లకు చాలా భారంగా ఉంటుంది.

ప్రశ్న 13.
పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలను వివరించండి.
జవాబు:
పాడి పరిశ్రమలో ఉత్పత్తి కారకాలు :
భూమి : గ్రామంలో సొంత కొట్టం (షెడ్డు).
శ్రమ : కుటుంబ శ్రమ ; ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పని చూస్తారు.
భౌతిక పెట్టుబడి : పశువుల సంతలో కొన్న గేదెలు.
నిర్వహణ పెట్టుబడి : తమ భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 14.
మిశ్రిలాల్ ఏం పనిచేస్తాడు?
జవాబు:
మిశ్రిలాల్ విద్యుచ్ఛక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారుచేస్తాడు. అంతకు ముందు చెరకురసం. తియ్యడానికి ఎడ్లను ఉపయోగించేవాళ్లు, కాని ఇప్పుడు అందరూ యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తను పండించిన చెరకును ఉపయోగించటమే కాకుండా మిశ్రిలాల్ ఇతర రైతుల నుంచి కూడా చెరకు కొని బెల్లం తయారుచేస్తాడు.

ప్రశ్న 15.
ఆధునిక వ్యవసాయ పద్ధతులను గురించి తెలపండి.
జవాబు:

  1. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగిస్తున్నారు.
  2. అలాగే రసాయనిక ఎరువులను, పురుగుల మందులను వినియోగిస్తున్నారు.
  3. మునుపటి కంటే లోతైన బోరుబావులు తవ్వి డీజిల్ / విద్యుత్ వినియోగంతో సాగునీటిని పొందుతున్నారు.
  4. ఆధునిక వ్యవసాయం సుస్థిరతతో కూడినది కాదు.

ప్రశ్న 16.
“శ్రామికులు ఉత్పత్తికి అవసరమైన వనరు.” ఈ వాక్యాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయటానికి బాగా చదువుకున్న, నైపుణ్యాలు ఉన్న కార్మికులు కావాలి.
  2. మిగిలిన పనులు చేయడానికి శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి.
  3. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందిస్తున్నాడు.
  4. కావున శ్రామికులు ఉత్పత్తికి అవసరమైన వనరు.

ప్రశ్న 17.
“పనిముట్లు, యంత్రాలు, భవనాలపై పెట్టే ఖర్చును భౌతిక పెట్టుబడి” అని అంటారు. ఎందుకో వివరించండి.
జవాబు:

  1. రైతులు ఉపయోగించే నాగలి పనిముట్లు నుంచి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్‌తో నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు. అవి ఉత్పత్తి ప్రక్రియతో అయిపోవు.
  2. అనేక సంవత్సరాల పాటు ఇవి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి.
  3. ఇలా సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి వాటికి కొంత మరమ్మతు నిర్వహణ అవసరం అవుతాయి.
  4. వీటిని స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు.

ప్రశ్న 18.
దేశవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రత్యామ్నాయాలను చూపండి.
జవాబు:

  1. దేశవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.
  2. నీటిని నిల్వచేసుకొనే ఇంకుడు గుంటలు, చెక్ డ్యాంలు, వనీకరణ, బండ్స్ నిర్మాణం, వాటర్‌షెడ్ పథకాలు చేపట్టాలి.
  3. సాగునీటి అవసరాలకు కాకుండా కేవలం త్రాగునీటికోసమే బోరుబావులను అనుమతించాలి.
  4. తక్కువ నీటితోనే పండే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు చూడాలి.

ప్రశ్న 19.
మీ ప్రాంతంలో పాడి పరిశ్రమ – పాల సేకరణ ఎలా జరుగుతుందో వివరించండి.
జవాబు:

  1. మా ప్రాంతంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి.
  2. గేదెలకు వివిధ రకాల గడ్డి, జొన్న, సజ్జ మేతను మేపుతారు.
  3. ఇద్దరు వ్యాపారస్తులు పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  4. కుటుంబ శ్రమ, ప్రధానంగా మహిళలు గేదెల పోషణ చూస్తారు.

ప్రశ్న 20.
మీ ప్రాంతంలోని ఏదైనా వ్యాపారి యొక్క వ్యాపార దక్షతను గురించి వివరించంది.
జవాబు:

  1. మా ప్రాంతంలో వెంకటేశ్వరరావు అనే వస్త్రాల వ్యాపారి ఉన్నాడు.
  2. తొలుత అతను ఇంటింటికి తిరిగి దుస్తులు అమ్ముతూ వారం వారం డబ్బులు తీసుకుంటుండేవాడు.
  3. వ్యాపారం నమ్మకంగా చేస్తూ, నాణ్యమైన వస్త్రాలు అందజేస్తూ ప్రాంత ప్రజల విశ్వాసం చూరగొన్నాడు.
  4. తదుపరి పెట్టుబడితో స్వయంగా ఒక వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఆ దుకాణం విజయవంతంగా నడుస్తోంది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 21.
1960లో గోవిందు అనే రైతుకు 2.25 హెక్టార్ల భూమి ఉండేది. అప్పుడు దానికి సాగునీటి వసతి అంతగా లేదు. ముగ్గురు కొడుకుల సహాయంతో గోవిందు వ్యవసాయం చేసేవాడు. భోగభాగ్యాలు లేకపోయినా కుటుంబానికి ఉన్న ఒక బర్రెతో వచ్చే అదనపు ఆదాయంతో సరిపోయే ఆహారాన్ని పొందగలిగేవాళ్లు. కొన్ని సంవత్సరాలకు గోవిందు చనిపోవటంతో ముగ్గురు కొడుకులు భూమిని పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 0.75 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది. మెరుగైన సాగునీటి వసతి, ఆధునిక వ్యసాయ పద్ధతులతో కూడా గోవిందు కొడుకులకు భూమినుంచి కుటుంబ అవసరాలు పూర్తిగా తీరడం లేదు. సంవత్సరంలో కొన్ని నెలలపాటు వాళ్ళు ఇతర పనులు వెతుక్కోవలసి వస్తోంది. పై పేరాను చదివి, క్రింది ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రశ్న : కుటుంబ పరిమాణం పెరిగినపుడు గోవిందు లాంటి చిన్నరైతులు ఎలా స్పందించారు? బోరు బావిలో సాగునీరు ఎంతవరకు ఉపయోగపడింది?
జవాబు:

  1. కుటుంబ పరిమాణం పెరిగినపుడు భూమిని పంచుకోవలసి రావడం వలన చిన్న చిన్న కమతాలు ఏర్పడినాయి.
  2. చిన్న కమతాలతో మెరుగైన నీటివసతి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన కూడా కుటుంబ అవసరాలు తీరడం లేదు.
  3. వారు సంవత్సరంలో కొన్ని నెలలు వేరే పని చూసుకోవల్సి వచ్చింది.
  4. బోరుబావి నీరు వ్యవసాయ నీటిపారుదల అవసరాన్ని తీర్చలేదు.

ప్రశ్న 22.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలో ఉన్నాయి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
పై పట్టికను చదివి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1. రైతులు ఎన్ని రకాలు ఉన్నారు?
2. ఏ రైతులు ఎక్కువ శాతం ఉన్నారు?
3. సాగుభూమి శాతంలో తేడా ఎంత?
4. మధ్యతరగతి, పెద్ద రైతుల విషయంలో రైతుల శాతం తక్కువగా ఉన్నా, సాగుభూమి శాతం అధికంగా ఉండడానికి కారణాలను ఊహించండి.
జవాబు:

  1. రైతులు 2 రకాలు.
    i) చిన్న లేదా సన్నకారు రైతులు.
    ii) మధ్యతరగతి లేదా పెద్ద రైతులు.
  2. చిన్న రైతులు (87%) ఎక్కువ శాతం ఉన్నారు.
  3. సాగుభూమి శాతంలో 4% తేడా ఉంది. పెద్ద రైతులు ఎక్కువ సాగుభూమి కల్గి ఉన్నారు.
  4. మధ్యతరగతి, పెద్ద రైతుల భూకమతాలు పెద్దవిగా ఉంటాయి.

10th Class Social 9th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
క్రింది పట్టికను పరిశీలించండి.
పట్టిక : డిసెంబరు 2011లో వివిధ వ్యవసాయ పనులకు ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కూలి రేట్లు (రూపాయలలో)
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1

ఎ) పురుషులు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
జవాబు:
దున్నటం ఒక్కటే పురుషులు మాత్రమే చేస్తున్న పనులు.

బి) స్త్రీలు మాత్రమే చేస్తున్న పనులు ఏవి?
(లేదా)
స్త్రీలు మాత్రమే పాల్గొంటున్న వ్యవసాయ పనులేవి?
జవాబు:
నాట్లు వేయడం, ప్రతి ఏరడం మాత్రమే స్త్రీలు చేస్తున్న పనులు.

సి) ఏయే పనులలో స్త్రీ, పురుషుల కూలి రేట్లలో వ్యత్యాసం ఉన్నది?
జవాబు:
అన్ని పనులలో పురుషుల స్త్రీల కూలీ రేట్లలో వ్యత్యాసం ఉంది.

డి) పురుషుల కంటే స్త్రీలకు తక్కువ కూలి ఇవ్వడానికి కారణం ఏమిటి?
(లేదా)
ఒకే పనికి ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎందుకు ఎక్కువ కూలీ లభిస్తుంది.
జవాబు:
స్త్రీలకంటే పురుషులు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ కూలి ఇస్తున్నారు.

ప్రశ్న 2.
కింది వివరాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 4
a) రాంపురం గ్రామంలో ఏ రకపు ఇళ్ళు అధికంగా ఉన్నాయి?
b) రాంపురం గ్రామంలో 60% ప్రజలు ఏ తరగతికి చెందినవారు?
c) రాంపురం గ్రామంలో మధ్యతరగతికి చెందిన ప్రజల జనాభా సుమారుగా ఎంత ఉండవచ్చును?
d) సిమెంటు, ఇటుకలతో కట్టిన డాబా ఇండ్లలో ఎవరు నివసిస్తున్నారని భావిస్తావు?
జవాబు:
a) గుడిసెలు, తాటాకు ఇళ్ళు
b) పేదప్రజలు
C) 25%
d) ధనికులు

ప్రశ్న 3.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషించండి.
రైతులు సాగుచేసే భూమి వివరాలు తెలిపే దత్తాంశం
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
జవాబు:
పైన ఇవ్వబడిన పట్టికలో రైతులు, వారు సాగుచేస్తున్న భూమి వివరాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో రెండు రకాల రైతులను పేర్కొనడం జరిగినది.

  1. చిన్న లేదా సన్నకారు రైతులు
  2. మధ్య తరగతి, పెద్ద రైతులు

సన్నకారు రైతులు 87% మంది 2 హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమిని కలిగివున్నారు. వారి వద్ద 48% వ్యవసాయ భూమి మాత్రమే కలదు. మధ్యతరగతి, పెద్ద రైతులు 13% మాత్రమే కాని వారు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి మొత్తం సాగు భూమిలో 52% కలిగి ఉన్నారు. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉందని తెలుస్తోంది.

దీని ప్రకారం మనకు తెలిసినది ఏమిటంటే చిన్న రైతులు గ్రామాల్లో ఎక్కువ మంది ఉన్నారు. సాగుచేసే సమయంలో వారి వద్ద డబ్బులు లేక సరియైన విత్తనాలు, ఎరువులు కొనలేక లాభాలను గడించలేకపోతున్నారు. కాని పెద్ద రైతులకు బ్యాంకులలో మిగులు డబ్బు మరియు వారి భూమి మీద లోన్ తీసుకుని ట్రాక్టర్లను, యంత్రాలను వాడి ఆధునిక వ్యవసాయం చేసి మరింత లాభాలను గడిస్తున్నారు. ‘సన్నకారు రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించక ఇబ్బందులు పడుతున్నారు.

కావున ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు రుణ సదుపాయం విషయంలో, విత్తనాలు, ఎరువుల కొనుగోలులో చేయూత ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
ఉత్పత్తి కారకాలను పేర్కొని, ఏవేని రెండింటిని గురించి వివరించండి.
జవాబు:
ఉత్పత్తి కారకాలు :
1. భూమి
2. శ్రమ / శ్రామికులు
3. మూలధనం / పెట్టుబడి
4. సాంకేతిక పరిజ్ఞానం / వ్యాపార దక్షత

1. భూమి :
ఉత్పత్తికి భూమి, నీరు, అడవులు, ఖనిజ లవణాలు వంటి సహజవనరులు కావాలి.

2. శ్రామికులు :
సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది. వృత్తి నైపుణ్యం గల కార్మికులు, శారీరక శ్రమచేసే శ్రామికులు ఈ విభాగంలోకి వస్తారు.

ప్రశ్న 5.
దిగువ ఇచ్చిన ను పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 5
జవాబు:
ఇవ్వబడిన గ్రాఫ్ నాలుగు రకాల రైతులు – చిన్న రైతులు, మధ్య తరగతి రైతులు, భూమిలేని రైతులు మరియు పెద్ద రైతుల శాతం గురించి వెల్లడిస్తోంది. దత్తాంశం 2011 జనాభా గణనకు సంబంధించినది. అందరికంటే ఎక్కువగా చిన్న రైతులు 60% మంది ఉన్నారు. పెద్ద రైతులు చాలా తక్కువగా అనగా 7% మంది మాత్రమే ఉన్నారు. మధ్యతరగతి రైతులు 19% మంది ఉండగా భూమిలేని రైతులు 14% మంది ఉన్నారు.

దశాబ్దాలుగా చాలా మంది ప్రజలకు భూములు లేవు. కాలక్రమంలో కొంతమంది భూములు సంపాదించుకున్నారు. వారు తమ కష్టార్జితంతో భూములను కొనుగోలు చేశారు. అత్యధిక గ్రామీణ కుటుంబాలలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ. తండ్రి భూమి కొడుకుల దాకా వచ్చేసరికి వారికి సమాన భాగాలలో పంచబడుతుంది. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన కొడుకులు తక్కువ భూమిని పొందుతున్నారు. భారతదేశంలో గరిష్టశాతం భూమి పెద్ద రైతుల నియంత్రణలో ఉంది. చాలా మంది రైతులకు తక్కువ భూమి ఉన్నందున వారి కుటుంబ సభ్యులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్ద రైతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ప్రభుత్వం ఇటువంటి చిన్న రైతులను, భూమి లేని రైతులను గురించి వారికి సరిపడినంత భూమిని పంపిణీ చేయాలి. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రభుత్వాలు కులం ఆధారంగా భూమి పంపిణీ చేస్తున్నాయి. అలా కాకుండా వారి ఆర్థిక స్థితి గతులు మరియు వారు భూమిని కలిగివున్నారా లేదా అనేది పరిగణనలోకి తీసుకొని భూమి పంపిణీ చేస్తే అత్యధిక శాతం రైతులు ప్రయోజనం పొందుతారు.

ప్రశ్న 6.
భూగర్భ జలాలు, రసాయన మందులు వాడకం ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:
రసాయనిక ఎరువులు, పురుగుమందులను అధికంగా, ఇష్టానుసారంగా వాడినందువల్ల భూసారం తగ్గుతోందని మన అనుభవం ద్వారా తెలుస్తోంది. నీటి పరిస్థితి కూడా అంతే ఆందోళన కలిగిస్తోంది. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా భూగర్భ జలాలమీదే ఆధారపడి ఉన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. వర్షాలు బాగా ఉండి, వాననీళ్ళు నేలలోకి ఇంకటానికి అనువుగా ఉండే ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భజలమట్టం పడిపోతుంటే రైతులు, మునుపటికంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సాగునీటికి డీజిలు/విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది.

ప్రశ్న 7.
రాంపురం వ్యవసాయరంగంలో ముందంజలో ఉండుటకు కారణాలేంటి?
జవాబు:
రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉన్నందువల్ల రైతులు సంవత్సరంలో మూడు పంటలదాకా సాగు చేస్తున్నారు. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్తు వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. అప్పటివరకు రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ‘పర్షియన్ వీల్’ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవాళ్లు. విద్యుత్ తో నడిచే బోరుబావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగునీటిని అందివ్వవచ్చని రైతులు గుర్తించారు. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మొదటి బోరుబావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత రైతులు సొంత ఖర్చుతో బోరుబావులు ఏర్పాటు చేసుకోసాగారు. ఫలితంగా 1970 దశాబ్ది మధ్యకాలం నాటికి 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందికి వచ్చింది.

AP 10th Class Social Important Questions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 8.
వ్యవసాయ కూలీలు ఎవరు ? కూలీల వినియోగంలో ప్రాంతాల మధ్యగల తేడాలేవి?
జవాబు:
వ్యవసాయ పనులు చేసే కూలీలను వ్యవసాయ కూలీలంటాం.

భూమిలేని కుటుంబాల నుంచి లేదా చిన్న రైతు కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు. తమ సొంత పొలాల్లో పనిచేసే రైతుల మాదిరి కాకుండా వ్యవసాయ కూలీలకు భూమిలో పండించే పంటలపై ఎటువంటి హక్కు ఉండదు. దానికి బదులుగా వాళ్లు చేసిన పనికి రైతు కూలీ చెల్లిస్తాడు. ఆ పని చెయ్యటానికి వీళ్లను నియమించుకుంటారు.

డబ్బు రూపేణా కానీ, వస్తు (పంట) రూపేణా కానీ కూలీ ఉండవచ్చు. కొన్ని సమయాల్లో కూలీలకు అన్నం కూడా పెడతారు. ప్రాంతాన్ని బట్టి, పంటను బట్టి, పనిని బట్టి (ఉదాహరణకు విత్తడం, పంటకోత) కూలిరేట్లలో చాలా తేడా ఉంది. పని దొరికే రోజులలో కూడా చాలా తేడా ఉంది. వ్యవసాయ కూలీని రోజువారీ కూలీగా పెట్టుకోవచ్చు, లేదా ఒక ప్రత్యేక పనికి గుత్త పద్ధతిలో పెట్టుకోవచ్చు, లేదా సంవత్సరమంతా జీతానికి పెట్టుకోవచ్చు.

ప్రశ్న 9.
వ్యవసాయేతర ఉత్పత్తి కార్యక్రమాలు దోహదపడే అంశాలు రాయండి.
జవాబు:
భవిష్యత్తులో గ్రామాలలో వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలు ఇంకా పెరగాలి. వ్యవసాయంలా కాకుండా వ్యవసాయేతర పనులకు చాలా తక్కువ భూమి కావాలి. కోంత పెట్టుబడి ఉన్న వాళ్లు వ్యవసాయేతర పనులు చేపట్టవచ్చు. ఎవరికైనా పెట్టుబడి ఎలా లభిస్తుంది ? ఇందుకు సొంతంగా ఉన్న పొదుపు మొత్తాలను ఉపయోగించవచ్చు, అయితే తరచుగా దాని కోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది. తక్కువ వడ్డీతో అప్పులు అందుబాటులో ఉండటం ముఖ్యం, అప్పుడు పొదుపు మొత్తాలు లేనివాళ్లు కూడా అప్పు తీసుకుని ఏదో ఒక వ్యవసాయేతర పని మొదలుపెట్టగలుగుతారు. వ్యవసాయేతర పనులు విస్తరించటానికి మరొక ముఖ్యమైన అవసరం ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అమ్మటానికి మార్కెటు ఉండటం. రాంపురంలో ఉత్పత్తి అవుతున్న పాలు, బెల్లం, గోధుమల వంటి వాటికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు, నగరాలలో మార్కెటు ఉండటాన్ని చూశాం. మంచిరోడ్లు, రవాణా, టెలిఫోను సౌకర్యం వంటివి మెరుగుపడటం ద్వారా గ్రామాలకు పట్టణాలు, నగరాలతో మంచి అనుసంధానం ఏర్పడి రానున్న సంవత్సరాలలో గ్రామాలలో వ్యవసాయేతర , ఉత్పత్తి కార్యకలాపాలు పెరుగుతాయి.

ప్రశ్న 10.
వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిదారులకు కావలసిన వస్తువులేవి? లేదా ఉత్పత్తి కారకాలేవి? వివరించుము.
జవాబు:
వస్తువులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిదారులకు కావలసిన వస్తువులనే ఉత్పత్తి కారకాలంటారు. అవి
1. భూమి,
2. శ్రమ,
3. పెట్టుబడి,
4. జ్ఞానము, వ్యాపార దక్షత.

1. భూమి :
ఉత్పత్తికి భూమి, నీరు, అడవులు, ఖనిజ లవణాలు వంటి సహజవనరులు కావాలి.

2. శ్రామికులు :
సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఇది సూచిస్తుంది. వృత్తి నైపుణ్యం గల కార్మికులు, శారీరక శ్రమచేసే శ్రామికులు ఈ విభాగంలోకి వస్తారు.

3. పెట్టుబడి :
పనిముట్లు, యంత్రాలు, భూమి, భవనాలు వంటి శాశ్వత అంశాలపై పెట్టుబడి – ధీనినే స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు.

దీంతోపాటు నిర్వహణ పెట్టుబడి అనగా ముడిసరుకు, ఇతర ఖర్చులకు డబ్బు కూడా పెట్టుబడిలో భాగమే.

4. జ్ఞానం, వ్యాపార దక్షత :
భూమి, శ్రమ, పెట్టుబడిని ఉపయోగించి సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన జ్ఞానము, ఆత్మ విశ్వాసం, వ్యాపార దక్షత అవసరం.