Practice the AP 10th Class Social Bits with Answers 11th Lesson ఆహార భద్రత on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 11th Lesson ఆహార భద్రత
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. ప్రభుత్వము ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రధానంగా గోధుమలు, బియ్యం దీని ద్వారా సేకరిస్తుంది.
A) బి.సి.సి.ఐ.
B) యఫ్.సి.ఐ.
C) డి.సి.ఐ.
D) యఫ్.సి.సి.ఐ.
జవాబు:
B) యఫ్.సి.ఐ.
2. బలహీన వర్గాలకు ఆహార పదార్థాలను అందజేసేది
A) బహుళజాతి సంస్థ
B) ప్రపంచ ఆరోగ్య సంస్థ
C) ప్రజా పంపిణీ వ్యవస్థ
D) ప్రభుత్వ రక్షణ సంస్థ
జవాబు:
C) ప్రజా పంపిణీ వ్యవస్థ
3. కనీస మద్దతు ధరను నిర్ణయించునది ………….
A) రైతులు
B) ప్రభుత్వము
C) దళారీలు
D) వ్యాపారస్థులు
జవాబు:
B) ప్రభుత్వము
4. పోషకాహార సమస్యను అధిగమించుటకై పాఠశాలల్లో అమలవుతున్న పథకం
A) సమగ్ర శిశుసంక్షేమ పథకం
B) మరుగుదొడ్ల నిర్వహణ పథకం
C) స్వచ్ఛ భారత్ పథకం
D) మధ్యాహ్న భోజన పథకం
జవాబు:
D) మధ్యాహ్న భోజన పథకం
5. రోజుకు పట్టణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో కాలరీలు ………
A) 2100
B) 2200
C) 2300
D) 2400
జవాబు:
A) 2100
6. న్యాయస్థానం ఆదేశానుసారం మధ్యాహ్న భోజన పథకం అమలులో ప్రధాన అంశం ………
A) పాఠశాలల్లో, వేడిగా వండి పెట్టాలి
B) ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి
C) పోషకాహార విలువలు పాటించాలి
D) పైవన్నియూ సరైనవే
జవాబు:
D) పైవన్నియూ సరైనవే
7. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు …….. కిలోకాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి.
A) 2100
B) 2400
C) 2000
D) 2500
జవాబు:
B) 2400
8. అంత్యోదయ కార్డు కుటుంబాలకు నెలకు కుటుంబానికి ………… కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు.
A) 25
B) 30
C) 35
D) 15
జవాబు:
C) 35
9. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వ్యక్తికి సగటున కావలసిన కాలరీలు (కి.గ్రా.) ………
A) 200
B) 2,100
C) 2,400
D) 2,300
జవాబు:
C) 2,400
10. క్రింది వానిలో ప్రజా పంపిణీ వ్యవస్థతో సంబంధం గలది
A) స్వయం సహాయక బృందాలు
B) బ్యాంకులు
C) రైతు బజార్
D) చౌక ధరల దుకాణం
జవాబు:
D) చౌక ధరల దుకాణం
11. సరి అయిన వాక్యాల్ని గుర్తించండి.
i) భారత ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేసింది.
ii) జాతీయ పోషకాహార సంస్థ బెంగుళూర్ లో కలదు.
iii) రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100, కాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి
A) (i) మరియు (ii)
B) (ii) మరియు (iii)
C) (i) మరియు (iii)
D) (i), (ii) మరియు (iii)
జవాబు:
C) (i) మరియు (iii)
12. ఆహార భద్రతకు సంబంధించినవి
A) రేషన్ షాపులు (Ration shops)
B) మధ్యాహ్న భోజన పథకం
C) అంగన్‌వాడీ కేంద్రాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
13. కింది వానిలో చిరుధాన్యం కానిది
A) జొన్న
B) రాగి
C) సజ్జ
D) గోధుమ
జవాబు:
D) గోధుమ
14. మాంసకృత్తులు అధికంగా గల దానికి ఉదాహరణ
A) పప్పులు
B) జొన్నలు
C) రాగులు
D) పంచదార
జవాబు:
A) పప్పులు
15. జాతీయ ఆహార భద్రతా చట్టం – 2013 తో సంబంధం లేని పథకం
A) మధ్యాహ్న భోజన పథకం
B) సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS)
C) ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)
D) స్వయం సహాయక సంఘాలు
జవాబు:
D) స్వయం సహాయక సంఘాలు
16. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆహార ఉత్పత్తులను సరఫరా చేయునది
A) బహుళజాతి సంస్థలు
B) ప్రపంచ ఆరోగ్య సంస్థ
C) ప్రజాపంపిణీ వ్యవస్థ
D) ప్రపంచ బ్యాంకు
జవాబు:
C) ప్రజాపంపిణీ వ్యవస్థ
17. 2018 – జాతీయ ఆహార భద్రత చట్టం ప్రజల యొక్క ఈ హక్కుకు చట్టబద్ధత కల్పిస్తోంది
A) ఓటు హక్కు
B) పని హక్కు
C) ఉద్యోగ హక్కు
D) ఆహారం పొందే హక్కు
జవాబు:
D) ఆహారం పొందే హక్కు
18. ప్రజాపంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తే ప్రధానంగా ఈ అంశం మెరుగుపడుతుంది.
A) తలసరి ఆదాయం
B) పోషకాహార స్థాయి
C) విద్యాస్థాయి
D) ఉపాధి అవకాశాలు
జవాబు:
B) పోషకాహార స్థాయి
19. సేంద్రీయ వ్యవసాయ ముఖ్య లక్షణం కానిది
A) పంటల మార్పిడి
B) పెంటపోగు ఎరువు
C) స్థానిక వనరులను ఉపయోగించటం
D) ఆధునిక రసాయనిక క్రిమిసంహారక మందులను వినియోగించటం
జవాబు:
D) ఆధునిక రసాయనిక క్రిమిసంహారక మందులను వినియోగించటం
20. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచిన మొదటి రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) కర్ణాటక
C) తమిళనాడు
D) కేరళ
జవాబు:
C) తమిళనాడు
21. జాతీయ పోషకాహార సంస్థ నెలకొని ఉన్న ప్రదేశం లో
A) చెన్నె
B) హైదరాబాద్
C) ముంబై
D) ఢిల్లీ
జవాబు:
B) హైదరాబాద్
22. భారత ఆహార సంస్థ ఇది చేస్తుంది.
A) ఆహార ధాన్యాల కొనుగోలు
B) కనీస మద్దతు ధర ప్రకటన
C) రైతులకు విత్తనాల సరఫరా
D) వ్యవసాయానికి నిధులు కేటాయించడం
జవాబు:
A) ఆహార ధాన్యాల కొనుగోలు