Practice the AP 10th Class Social Bits with Answers 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. విభిన్నంగా ఉన్నదానిని గుర్తించండి.
A) స్వాతంత్ర్య పోరాటం అనుభవాల నుంచి భారత రాజ్యాంగం ఏర్పడింది.
B) అప్పటికే ఉన్న రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగం రూపొందింది.
C) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించారు.
D) భారత రాజ్యాంగం దేశాన్ని పాలించటానికి రాజ్యాంగ సూత్రాలను, అంశాలను పేర్కొంది.
జవాబు:
C) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించారు.
2. ప్రవేశికలోని ఈ పదాలు లౌకిక, సామ్యవాద విలువలకు ప్రాధాన్యతనిచ్చాయి
A) ఆదేశిక సూత్రాలు
B) ప్రజాస్వామ్య, గణతంత్ర
C) సమానత, స్వేచ్ఛ, న్యాయము
D) ప్రాథమిక హక్కులు
జవాబు:
C) సమానత, స్వేచ్ఛ, న్యాయము
3. సామాజిక ఇంజనీరింగ్ సాధనలో ఒక ముఖ్యమైన అంశం
A) అల్పసంఖ్యాక వర్గాల హక్కులు
B) ప్రాథమిక హక్కులు
C) ప్రాథమిక విధులు
D) సమాచార హక్కు
జవాబు:
A) అల్పసంఖ్యాక వర్గాల హక్కులు
4. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితులలోను సవరించటానికి వీలు లేదని తీర్పు యిచ్చిన కేసులో
A) షాబానో కేసు
B) కేశవానందభారతి కేసు
C) గోలక్ నాథ్ కేసు
D) 42వ రాజ్యాంగ సవరణ
జవాబు:
B) కేశవానందభారతి కేసు
5. సామ్యవాద ప్రభుత్వంలో ఏ సూత్రాన్ని నీవు ప్రశంసిస్తావు?
A) మతరాజ్యం
B) రాజు నియంత
C) సమానత్వం
D) పెట్టుబడిదారీ విధానం
జవాబు:
C) సమానత్వం
6. భారతదేశంలో రాజ్యాంగ సవరణ చేయు అధికారము వీరికి మాత్రమే కలదు
A) రాష్ట్రపతి
B) సుప్రీంకోర్టు
C) పార్లమెంటు
D) పైవానిలో ఏదీకాదు
జవాబు:
C) పార్లమెంటు
7. ‘లౌకిక-సామ్యవాద’ పదాలను రాజ్యాంగంలోపొందుపర్చినది.
A) షెడ్యూళ్ళలో
B) భాగములలో
C) ప్రవేశికలో
D) ప్రాథమిక హక్కులలో
జవాబు:
C) ప్రవేశికలో
8. ముసాయిదా రాజ్యాంగంలోయున్న అధికరణలు మరియు షెడ్యూళ్ళ సంఖ్య …………
A) 315 అధికరణలు, 8 షెడ్యూల్స్
B) 440 అధికరణలు, 12 షెడ్యూల్స్
C) 215 అధికరణలు, 4 షెడ్యూల్స్
D) 210 అధికరణలు, 8 షెడ్యూల్స్
జవాబు:
A) 315 అధికరణలు, 8 షెడ్యూల్స్
9. భారత సమాఖ్య అధిపతి …………
A) రాష్ట్రపతి
B) ఉపరాష్ట్రపతి
C) ప్రధాన న్యాయమూర్తి
D) ప్రధానమంత్రి
జవాబు:
A) రాష్ట్రపతి
10. రాజ్యాంగ సభ నిర్మాణానికి సంబంధించి తప్పుగానున్న
A) షెడ్యూల్డు కులాలకు చెందిన సభ్యులు 26 మంది
B) మహిళా సభ్యులు 9 మంది
C) 93 మంది సభ్యులు సంస్థానాల ద్వారా ఎన్నికైనారు
D) సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా సభ్యులు ఎన్నికైనారు
జవాబు:
D) సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా సభ్యులు ఎన్నికైనారు
11. భారత రాజ్యాంగంలోని 356వ అధికరణం దీనికి చెందినది.
A) రాష్ట్రపతి ఎన్నిక
B) రాజ్యాంగంలో సవరణలు
C) రాష్ట్రపతి పాలన
D) రాష్ట్రాలలో ఎన్నికలు
జవాబు:
C) రాష్ట్రపతి పాలన
12. సామాజిక నిర్మాణం కోసం భారత రాజ్యాంగం చేసిన ఏర్పాటు
A) రిజర్వేషన్లు
B) బలహీన వర్గాలకు ప్రత్యేక రక్షణ
C) అస్పృశ్యతను నిషేధించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
13. ‘లింగం’ అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేరొంది?
A) భారతదేశం
B) జపాన్
C) నేపాల్
D) దక్షిణ ఆఫ్రికా
జవాబు:
C) నేపాల్
14. దా|| B.R. అంబేద్కర్ నాయకత్వంలోని ముసాయిదా సంఘం బాధ్యత
A) రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించడం
B) విప్లవ సైన్యం ఏర్పాటు చేయడం
C) ముస్లిం లీగకు నాయకత్వం వహించడం
D) రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడం
జవాబు:
D) రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడం
15. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి
A) జవహర్‌లాల్ నెహ్రూ
B) సర్దార్ వల్లభ బాయి పటేల్
C) సరోజిని నాయుడు
D) మహాత్మా గాంధీ
జవాబు:
B) సర్దార్ వల్లభ బాయి పటేల్
16. భారత రాజ్యాంగ లక్షణము కానిది వాక్యం
A) సమాఖ్య ప్రభుత్వము
B) పార్లమెంటరీ ప్రభుత్వము
C) లిఖిత రాజ్యాంగము
D) ద్వంద్వ పౌరసత్వము
జవాబు:
D) ద్వంద్వ పౌరసత్వము
17. 1949 నవంబరు 26 ప్రత్యేకత
A) రాజ్యాంగం అమలులోకి రావడం
B) భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం
C) రాజ్యాంగం ఆమోదించడం
D) ముసాయిదా సంఘం ఏర్పడడం
జవాబు:
C) రాజ్యాంగం ఆమోదించడం
18. ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక “ప్రభుత్వం అన్నది ప్రజల పవిత్ర నమ్మకం” అని పేర్కొంది?
A) నేపాల్
B) జర్మనీ
C) జపాన్
D) ఇండియా
జవాబు:
C) జపాన్
19. ఈ క్రింది వానిలో ఏది భారతదేశ రాజ్యాంగానికి అనువర్తింపబడు అంశం?
A) ఒకే న్యా య వ్యవస్థ
B) పౌర, నేర అంశాలలోని మౌలిక చట్టాలలో సారూప్యత
C) అఖిల భారత సివిల్ సర్వీస్
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
20. క్రింది వారిలో భారత రాజ్యాంగ సభ సభ్యులు కానివారు
A) నెహ్రూ
B) డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
C) రాధాకృష్ణన్
D) గాంధీజీ
జవాబు:
D) గాంధీజీ