AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 5 జీవ గడియారాలు Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు
8th Class Telugu ఉపవాచకం 5th Lesson జీవ గడియారాలు Textbook Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. దివాచరాలు-పగలు చురుగ్గా ఉండేవి. నిశాచరాలు – రాత్రివేళ చురుగ్గా ఉండేవి.
మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. మానవునితో సహవాసం చేస్తున్నందుకుగాను కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్లు మాత్రం చురుగ్గా ఉంటాయి. కారణం సహజసిద్ధంగా అవి రాత్రిళ్లు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాల పరీక్షలకు గురిచేసారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడం, పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో వుంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ, ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయి అని రుజువైంది.
ప్రశ్నలు :
1. గబ్బిలాలు పగటిపూట ఏ గదిలో ఉంటాయి?
జవాబు:
గబ్బిలాలు పగటిపూట చీకటిగదిలో ఉంటాయి.
2. పగలు మాత్రమే విశ్రాంతి తీసుకునే జంతువులు ఏవి?
జవాబు:
ఎలుకలు, బొద్దింకలు, కోతులు మొదలైనవి పగలు విశ్రాంతి తీసుకుంటాయి.
3. రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు ఏవి?
జవాబు:
రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడే జంతువులు కుక్కలు, పిల్లులు.
4. ప్రపంచంలోని జంతువులను ఎన్ని వర్గాలుగా విభజించారు?
జవాబు:
ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు.
2. ఈ దైనందిన లయలు జంతువులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగా రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకొని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పురాదు. ఒక మల్లెపూవును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపచేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చూపే, ఈ మార్పులను పగటిలయలు – ‘డయర్నల్ రిథమ్స్’ అంటారు.
ప్రశ్నలు:
1. ఏ పూవును పగటివేళ, కటికచీకటి గదిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు?
జవాబు:
మల్లెపూవును పగటివేళ కటిక చీకటిలో ఉంచినా వికసింపచేయడం సాధ్యం కాదు.
2. జీవగడియారాలకు గల మరొక పేరు ఏమి?
జవాబు:
జీవగడియారాలకు గల మరొక పేరు శరీరధర్మ గడియారాలు.
3. లయలు జంతువులకు మాత్రమే కాకుండా వేటికి ఉంటాయి?
జవాబు:
లయలు జంతువులకు మాత్రమే కాకుండా మొక్కలకు కూడా ఉంటాయి.
4. ఏ జాతికి చెందిన ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి?
జవాబు:
చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కల ఆకులు ఉదయం పూట నిక్కపొడుచుకొని ఉంటాయి.
3. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమాయల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపచేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
ఒక జీవి పుట్టిన నాటి నుండి ఏర్పడిన ఈ లయలు, ఆ జీవి బాహ్యపరిస్థిలులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే కాబోలు పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో కానిపోవు అంటారు మనవాళ్లు.
ప్రశ్నలు:
1. సీతాకోకచిలుకలు ఎందుకోసం ప్యూపా నుండి బయటకు వస్తాయి?
జవాబు:
సీతాకోక చిలుకలో సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి వీలుగా ప్యూపా నుండి బయటకు వస్తాయి.
2. కీటకాలు ఏ సమయాల్లో చురుగ్గా ఉంటాయి?
జవాబు:
కీటకాలు మకరందం లభించిన సమయాల్లో చురుగ్గా ఉంటాయి.
3. ఈ పేరాలోని సామెత ఏది?
జవాబు:
ఈ పేరాలోని సామెత – “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానిపోవు”.
4. మొక్కలు ఏ సమయాల్లో పూలను వికసింపచేస్తాయి?
జవాబు:
మొక్కలు కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లో పుష్పాలు వికసింపచేస్తాయి.
4. సముద్రపు ఒడ్డున నివసించే ఫిడ్లర్ క్రాబ్’ అనే వాయులీన పీత, ఉదయం ముదురు రంగులో ఉండి, రాత్రిళ్ళు లేతరంగులకు మారిపోతుంది. బహుశః శత్రువులనుండి రక్షించుకోవడానికి కాబోలు ఈ రంగులు మార్చడం, దాన్ని ఎప్పుడూ వెలుతురు ఉండే ఎ.సి.గదిలోకి మార్చినా, రంగుల మార్పిడిలో మాత్రం తేడా రాలేదు. అంటే సూర్యునితో సంబంధం లేకుండానే ఈ లయ కొనసాగుతుందన్నమాట. “పీత కష్టాలు పీతవి”. అలాగే నిద్రగన్నేరు మొక్కలో ఆకుల కదలిక ఈ కోవకు చెందినదే.
మానవులలో ఆహారం తీసుకోవడం ఒక అలవాటుగా మారడం వలన ఈ లయలో కొంత మార్పు ఉండవచ్చు. ప్రతిరోజూ నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి, నిర్ణీత సమయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవారికి రోజులో ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ కూడా,
ప్రశ్నలు :
1. సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన పీత పేరు ఏమి?
జవాబు:
సముద్రపు ఒడ్డున నివసించే వాయులీన కేత ఫిడ్లర్ క్రాబ్.
2. వాయులీన పీత ఎందుకు రంగులను మార్చుకుంటుంది?
జవాబు:
వాయులీన పీత శత్రువుల నుండి రక్షించుకోవడానికి రంగులను మారుస్తుంది.
3. నిర్ణీత సమయానికి ఎవరికి ఆకలి వేస్తుంది?
జవాబు:
ప్రతిరోజు నియమబద్ధంగా ఆహారం తీసుకొనే వారికి నిర్ణీత సమయానికి ఆకలి వేస్తుంది.
4. సంవత్సరం పొడవునా ఏవి సమానంగా ఉండవు?
జవాబు:
సంవత్సరం పొడవునా పగలు, రాత్రి సమానంగా ఉండవు.
5. మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధావ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడి సాధించవచ్చు. చేపలు, రొయ్యలు ఎప్పుడు ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాయో, తెలియడం వలన చేపల చెరువు శుభ్రంగా ఉండటమే కాక వృధా వ్యయం తగ్గుతుంది. కోళ్ల ఫారంలో ఎక్కువ సమయం వెలుగు ఉంచడం వలన గ్రుడ్లు ఉత్పత్తి పెరగడం రైతులందరికీ తెలిసిందే. పగలు తక్కువ ఉన్న కాలంలో గొర్రెలలో ఉన్ని ఎక్కువవుతుంది. కాబట్టి ఎండాకాలం చీకటిలో ఉంచడం వలన ఉన్ని ఉత్పత్తి ఎక్కువ చేయవచ్చు. ఇక మన సంగతి, రక్తంలో కొలెస్టరాల్, గ్లూకోజ్ శాతం లయబద్ధంగా మారుతుంటుంది. కాబట్టి ఏ సమయంలో మనం మందులు వాడితే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుందో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఆస్తమా రోగులలో రాత్రిళ్లు శ్వాస సమస్యలు అధికమౌతాయి. అందుచేత ఎడ్రినలిన్ అనే ఇంజక్షన్ రాత్రిళ్ళు ఇస్తారు. అలాగే ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినపుడే ఇవ్వాలి.
ప్రశ్నలు:
1. ఏ రకంగా మొక్కల నుండి అధిక దిగుబడిని సాధించవచ్చు?
జవాబు:
మొక్కలు చైతన్యవంతంగా ఉన్నప్పుడే పోషకాలు అందించడం ద్వారా వృధా వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడిని సాధింపవచ్చు.
2. గొర్రెలలో ఎప్పుడు ఉన్ని ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
గొర్రెలలో పగలు తక్కువ ఉన్న కాలంలో ఉన్ని ఎక్కువగా ఉంటుంది.
3. ఆస్తమా రోగుల్లో రాత్రిళ్ళు ఏ సమస్యలు అధికం అవుతాయి?
జవాబు:
ఆస్తమా ఉన్న రోగుల్లో రాత్రిళ్ళు శ్వాససంబంధమైన సమస్యలు అధికమౌతాయి.
4. ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వాలి?
జవాబు:
ఇన్సులిన్ ఇంజక్షన్ రక్తంలో గ్లూకోజ్ శాతం పెరిగినప్పుడే ఇవ్వాలి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి.
ప్రశ్న 1.
డయర్నల్ రిథమ్స్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
భూమిపై నివసించే జీవులన్నింటిలో జరిగే కార్యకలాపాలు నిర్ణీత సమయాలను అనుసరించి ఆవృత్తి అవుతుంటాయి. మానవులలో ఎన్ని గంటలకు నిద్రపోవాలి? ఎన్ని గంటలకు నిద్రలేవాలి? ఎప్పుడు భోజనం చేయాలి ? అనే విషయాలు మనం ఆరేడు నెలల వయసులో ఉన్నప్పుడే స్థిరపడిపోతాయి. ఈ గడియారాలు మనకు కనిపించకపోయినా వాటి ప్రభావం తెలుస్తూనే ఉంటుంది. మనకు అనుభవంలోకి వచ్చే, మనకు కనపించకుండా మన శరీరంలో ఉన్న ఈ జీవగడియారాలే మూలం.
మానవుల్లాగే జంతువులు కూడా ఈ భూమ్మీద తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. జంతువుల విషయానికొస్తే చురుకుగా ఉండే సమయాన్ని ఆధారం చేసుకొని జంతు ప్రపంచంలోని జంతువులను రెండు వర్గాలుగా విభజించారు. అవి :
1) దివాచరాలు (పగలు చురుగ్గా ఉండేవి)
2) నిశాచరాలు (రాత్రివేళ చురుగ్గా ఉండేవి)
మన ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలు, దోమలు, ఇత్యాదులు రాత్రివేళ మాత్రమే బయటకు వస్తాయి. పగలు ఇవి విశ్రాంతి తీసుకుంటాయి. పిచ్చుకలు, కాకులు, ఆవులు, ఇతర జంతువులు పగలు చురుగ్గా ఉంటాయి. కుక్క పిల్లి వంటి జంతువులు పగటివేళ మేలుకుని ఉన్నా, రాత్రిళ్ళు ఆహారం కోసం వేటాడతాయి. ఈ జీవులను శాస్త్రవేత్తలు రకరకాలుగా పరీక్షలు చేశారు. ఉదాహరణకు రాత్రిపూట సంచరించే గబ్బిలాన్ని పగటి సమయంలో చీకటి గదిలో ఉంచడు. పగటిపూట సంచరించే ఉడతను రాత్రిపూట పగటిలా వెలుగులో ఉంచడం వంటివి. అన్ని పరీక్షలలోనూ, జీవులన్నీ ఈ దైనందిన లయలను నిర్దిష్ట క్రమంలోనే ప్రదర్శిస్తాయని ఋజువైంది.
ఈ దైనందిన లయలు జంతువులకు పరిమితం అనుకుంటే పొరపాటే. మొక్కలలో కూడా ఇవి ఉంటాయి. కొన్ని చెట్ల ఆకులు మన మాదిరిగానే రాత్రికాగానే నిద్రపోయి తెల్లవారగానే మేలుకుంటాయి. చిక్కుడు జాతికి చెందిన కొన్ని మొక్కలలో ఆకులు ఉదయం నిక్కబొడుచుకుని ఉండి, సాయంత్రానికి వాలిపోతాయి. అలాగే పూలు వికసించడం కూడా అంతే. ఈ మొక్కలను పూర్తిగా చీకటిలో ఉంచినా, లేదా 24 గంటలూ వెలుగులో ఉంచినా వాటి పనిలో మార్పు రాదు. ఒక మల్లెపువ్వును పగటివేళ కటిక చీకటిగదిలో ఉంచినా కూడా వికసింపజేయడం సాధ్యం కాదు. ఈ విధంగా సూర్యుని వెలుతురు ఆధారం చేసుకొని జీవులు చంపే ఈ మార్పులను పగటిలయలు – “డయర్నల్ రిథమ్స్” అని అంటారు. ఈ విధంగా మానవులు, జంతువులు మరియు మొక్కలు దైనందిన లయలు ఈ డయర్నల్ రిథమ్స్ ని ఆధారం చేసుకొని నడుస్తుంటాయి.
2. జెట్ బాగ్ అంటే ఏమిటి? వివరించండి.
జవాబు:
మానవులలో, జంతువులలో, మొక్కలలో ఉండే జీవగడియారాల వల్లనే అవి ఎప్పుడు ఏ పనిచేయాలో నిర్ధారణ జరుగుతుంది. జీవుల శరీరంలోని గడియారంలో ఏ పని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. అంటే రాత్రివేళ ఆకులు విస్తరించి ఉండడం వలన ఉపయోగం ఉండదు. మనం చేతి గడియారం చూసుకొని ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటాం. అలాగే సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్య తాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాలు మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉంటాయి. మొక్కలు కూడా కీటకాలు చురుగ్గా ఉండే సమయాల్లోనే పుష్పాలు వికసింపజేస్తాయి. ఇది పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రతిరోజు నియమం ప్రకారం భోజనం చేసేవారికి నిర్ణీత సమాయానికే ఆకలి వేస్తుంది. రోజుకు ఒకసారి భోజనం చేసేవారికి ఒకసారి మాత్రమే ఆకలి వేస్తుంది. అలాగే నిద్ర, మెలకువ, కూడా అంతే. ప్రతిరోజు జీవుల శరీరంలోని ఈ కనిపించని గడియారం తనకు తాను సరిచేసుకుంటుంది. ఈ గడియారాన్ని మనం కృత్రిమంగా కూడా సరిచేయవచ్చు.
మనం విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడి రాత్రి, పగలు షిఫ్ట్ లో పనిచేసేవారికి, ఈ తేడాను అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా నిర్ణీత సమయం మించి మేల్కొనడం సాధ్యం కాదు. ఈ విధంగా శరీరంలోని లయలను అలవాటు ద్వారా కృత్రిమంగా సరిచేయడాన్ని “జెట్ లాగ్” అంటాము.
“జెట్ బాగ్” అనేది కృత్రిమ ప్రక్రియ. ఇది కేవలం ప్రయత్నం, అలవాటు ద్వారానే కొనసాగించబడుతుంది.
3. జీవగడియారాలు పాఠం నుండి మీరు ఏమి గ్రహించారో సంక్షిప్తంగా గ్రహించండి.
జవాబు:
మానవ జీవన విధానంలో నిర్దిష్ట సమయంలో కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో నిర్వహించాలంటే దానికి గడియారం చాలా అవసరం. గడియారాలు రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసిన, ఇప్పటికీ తెలియజేస్తున్న జీవ గడియారం కోడిపుంజు. ఇది రోజులో నిర్ణీత సమయాలలో చాలాసార్లు కూస్తుంది. కోడిపుంజు ఇలా కూయడానికి కారణం దాని శరీరంలో ఉన్న, ఎవరికీ కనిపించని గడియారం.
దాని ప్రభావం వల్ల అది అప్రయత్నంగానే కూస్తుంది. మనుషుల్లో కూడా ఎప్పుడు భోంచేయాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఎప్పుడు మేల్కొనాలి? అనేది మన శరీరంలో కనిపించకుండా ఉన్న ఈ జీవగడియారాల వల్లనే తెలుస్తుంది. 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాలను ‘దైనందిన లయలు’ లేదా సర్కేడియన్ రిథమ్స్ అని అంటారు. ఈ లయలు గడియారంలో 24 గంటలను పోలి యుంటాయి. అందువల్ల వీటిని జీవగడియారం లేదా శరీర ధర్మగడియారం అనవచ్చు.
మన చేతి గడియారం మాదిరిగానే జీవుల శరీరంలోని గడియారం ఏ సమయంలో జీవి ఒక పనిని సమర్థవంతంగా చేయగలదో నిర్ణయిస్తుంది. మొక్కలు సూర్యుడు ఉండే పగటివేళలోనే ఆహారాన్ని తయారు చేయగలుగుతాయి. సీతాకోకచిలుకలు పుట్టిన వెంటనే సూర్యతాపానికి గురికాకుండా ఉండడానికి తెల్లవారుఝామునే ప్యూపా నుండి బయటకు వస్తాయి. కీటకాల మకరందం లభించే సమయాల్లో చురుగ్గా ఉండడం కూడా ఈ “జీవ గడియారాల” ద్వారానే జరుగును. ఒక జీవికి పుట్టిన నాటి నుండి ఏర్పడిన లయలు, ఆ జీవి బాహ్య పరిస్థితులు మారినా లయలు మాత్రం మారవు. అందుకే మన పెద్దలు “పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కాని పోవు” అంటారు.
తెలతెలవారుతుండగానే సందడిచేసే కాకులు, చీకటి పడగానే ముడుచుకుపోయే ఆకులు, 21 రోజులు రాగానే గుడ్డులోంచి బయటకు వచ్చే కోడిపిల్ల ఇలా ఎన్నెన్నో ప్రకృతి నియమాలను తెలియజేస్తాయి. ఇంత లయబద్దంగా కదులుతున్న ప్రకృతిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ప్రకృతి తన గురించి తెలుసుకోమంటే నిరంతరం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది. ఈ ప్రకృతి నియమాలు, జీవుల దైనందిన కార్యకలాపాలు ఈ జీవ గడియారాల వల్లనే నిరంతరంగా, నిర్దిష్టంగా, నియమిత సమయాలకనుగుణంగా పనిచేస్తున్నాయి.