AP Board 8th Class Maths Study Material Guide Solutions Pdf Download State Syllabus

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Maths Study Material Guide Pdf free download, 8th Class Maths Textbook Solutions in English Medium and Telugu Medium are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also go through AP Board 8th Class Maths Notes to understand and remember the concepts easily. Students can also read AP 8th Class Maths Bits with Answers for exam preparation.

AP State Syllabus 8th Class Maths Guide Study Material Pdf Free Download

AP 8th Class Maths Study Material Pdf Download Andhra Pradesh | AP 8th Class Maths Textbook Pdf Download

AP 8th Class Maths Study Material Pdf Download English Medium

AP State 8th Class Maths Study Material Chapter 1 Rational Numbers

AP State 8th Class Maths Solutions Chapter 2 Linear Equations in One Variable

AP 8th Class Textbook Pdf Download Chapter 3 Construction of Quadrilaterals

AP 8th Class Maths Solutions Chapter 4 Exponents and Powers

8th Class Maths TS State Syllabus Guide Pdf Chapter 5 Comparing Quantities Using Proportion

AP 8th Class Maths Textbook State Syllabus Solutions Chapter 6 Square Roots and Cube Roots

AP Board 8th Class Maths Guide Chapter 7 Frequency Distribution Tables and Graphs

AP SCERT 8th Maths Solutions Chapter 8 Exploring Geometrical Figures

AP State 8th Class Maths Textbook Solutions Chapter 9 Area of Plane Figures

8th Class Maths Textbook State Syllabus Pdf Chapter 10 Direct and Inverse Proportions

AP State Board 8th Class Maths Syllabus Chapter 11 Algebraic Expressions

AP 8th Maths Solutions Chapter 12 Factorisation

AP State 8th Class Maths Textbook Pdf Chapter 13 Visualizing 3-D in 2-D

8th Class Maths Solution Pdf Chapter 14 Surface Areas and Volume (Cube-Cuboid)

8th Class Maths Textbook Telugu Medium Chapter 15 Playing with Numbers

AP Board 8th Class Maths Textbook Solutions in Telugu Medium

AP State 8th Class Maths Study Material Chapter 1 అకరణీయ సంఖ్యలు

AP State 8th Class Maths Solutions Chapter 2 ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

AP 8th Class Textbook Pdf Download Chapter 3 చతుర్భుజాల నిర్మాణాలు

AP 8th Class Maths Solutions Chapter 4 ఘాతాంకాలు మరియు ఘాతాలు

8th Class Maths TS State Syllabus Guide Pdf Chapter 5 అనుపాతముతో రాశులను పోల్చుట

AP 8th Class Maths Textbook State Syllabus Solutions Chapter 6 వర్గమూలాలు, ఘనమూలాలు

AP Board 8th Class Maths Guide Chapter 7 పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

AP SCERT 8th Maths Solutions Chapter 8 జ్యామితీయ పటాల అన్వేషణ

AP State 8th Class Maths Textbook Solutions Chapter 9 సమతల పటముల వైశాల్యములు

8th Class Maths Textbook State Syllabus Pdf Chapter 10 అనులోమ మరియు విలోమ అనుపాతములు

AP State Board 8th Class Maths Syllabus Chapter 11 బీజీయ సమాసాలు

AP 8th Maths Solutions Chapter 12 కారణాంక విభజన

AP State 8th Class Maths Textbook Pdf Chapter 13 త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

8th Class Maths Solution Pdf Chapter 14 ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

8th Class Maths Textbook Telugu Medium Chapter 15 సంఖ్యలతో ఆడుకుందాం

AP State Board Syllabus 8th Class Textbook Solutions & Study Material

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

SCERT AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 12th Lesson Questions and Answers నక్షత్రాలు – సౌరకుటుంబం

8th Class Physical Science 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మీ ఊరిలో “ప్రాంతీయ మధ్యాహ్న వేళ” సమయం తెల్పండి. (AS1)
జవాబు:
ప్రాంతీయ మధ్యాహ్న వేళ సమయం తెలుసుకొనుట :

  1. ఒక మీటరు కంటే ఎక్కువ పొడవున్న ఒక కర్రను తీసుకోండి.
  2. చదునుగా ఉండే చెట్టు, ఇండ్ల నీడపడకుండా ఉండే స్థలాన్ని ఎంచుకోండి.
  3. ఈ స్థలంలో కర్ర యొక్క ఒక మీటరు భాగము కచ్చితంగా భూమిపై ఉండే విధంగా కర్రను పాతండి.
  4. ఉదయం 9 గంటలకు కర్ర నీడ చివరి బిందువు వద్ద ఒక ఇనుపమేకును గుచ్చి, నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
  5. ఈ విధంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీడ పొడవు మరియు సమయాన్ని నమోదు చేయండి.
  6. కర్ర యొక్క అతి తక్కువ పొడవైన నీడను, నమోదైన సమయాన్ని ప్రాంతీయ మధ్యాహ్న వేళ సమయం అంటారు. దీనిని మీ ప్రాంతంలో కనుగొని నమోదు చేయండి. దానినే మీ ప్రాంతీయ మధ్యాహ్న వేళ అంటారు.

ప్రశ్న 2.
ఈ కింది సందర్భాలలో మీకు రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు? (AS1)
ఎ) పౌర్ణమికి రెండు రోజుల ముందు
బి) అమావాస్యకు 2 రోజుల తర్వాత
జవాబు:
ఎ) పౌర్ణమికి రెండు రోజుల ముందు రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు తూర్పువైపు కనిపిస్తాడు.
బి) అమావాస్యకు రెండు రోజుల తరువాత రాత్రివేళలో ఆకాశంలో చంద్రుడు పడమర వైపు కనిపిస్తాడు.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 3.
ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున గ్రహణాలు ఎందుకు ఏర్పడవు? (AS1)
జవాబు:

  1. ప్రతి పౌర్ణమి రోజున లేదా ప్రతి అమావాస్య రోజున గ్రహణాలు ఏర్పడవు.
  2. ఎందుకంటే చంద్రుని కక్ష్యతలము భూమి కక్ష్యతలానికి 59, 9′ కోణంలో ఉంటుంది.
  3. భూ కక్ష్య తలానికి బాగా పైనగాని, కిందగాని చంద్రుడు ఉన్నప్పుడు గ్రహణాలు ఏర్పడవు.

ప్రశ్న 4.
ధృవ నక్షత్రం ఎక్కడ కనిపిస్తుంది? (AS1)
జవాబు:

  1. ధృవ నక్షత్రం భూభ్రమణ అక్షానికి సూచిగా పైవైపు కనిపిస్తుంది.
  2. ఆకాశంలో ఉత్తరం వైపుగల సప్తర్షి మండలంలోని చతుర్భుజ ఆకారంలో గల నాలుగు నక్షత్రాలలో బయటివైపున ఉన్న రెండు నక్షత్రాలను కలుపుతూ ఒక రేఖను ఊహించండి. ఈ రెండు నక్షత్రాల మధ్య దూరానికి సుమారు 5 రెట్ల దూరంలో ఊహించిన రేఖ పైనే ధ్రువ నక్షత్రం ఉంటుంది.
  3. ఆకాశంలో ఉత్తరం వైపు గల “m” ఆకారంలో గల శర్మిష్టరాశి యొక్క మధ్యలో గల నక్షత్రం నుండి తిన్నగా ఊహించిన రేఖ ధ్రువ నక్షత్రాన్ని చూపుతుంది.

ప్రశ్న 5.
ధృవ నక్షత్రానికి, ఇతర నక్షత్రాలకి మధ్య భేదమేమి? (AS1)
జవాబు:

ధృవ నక్షత్రం ఇతర నక్షత్రాలు
1) ధృవ నక్షత్రం ఎల్లప్పుడు కనిపిస్తుంది. 1) ఇతర నక్షత్రాలు కొంతకాలం కనిపిస్తాయి.
2) ధృవ నక్షత్రం నిశ్చలస్థితిలో ఉంటుంది. 2) ఇతర నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తాయి.

ప్రశ్న 6.
ధృవ నక్షత్రం కదలకుండా ఉన్నట్లు ఎందుకు కనబడుతుంది? (AS1)
జవాబు:

  1. ధృవ నక్షత్రం భూభ్రమణ అక్షానికి ఉత్తరం వైపు సూటిగా పై వైపున ఉంటుంది.
  2. కాబట్టి ధృవ నక్షత్రం కదలకుండా ఉన్నట్లు కనబడుతుంది.

ప్రశ్న 7.
కొన్ని నక్షత్ర రాశుల పేర్లు తెలపండి. (AS1)
జవాబు:
1) సప్తర్షి మండలం 2) శర్మిష్టరాశి 3) ఒరియన్ 4) లియో (సింహరాశి) 5) ఏరిస్ (మేషం) 6) టారస్ (వృషభం) 7) జెమిని (మిథునం) 8) కేన్సర్ -(కర్కాటక) 9) వర్గో (కన్య) 10) లిబ్రా’ (తుల) 11) స్కార్పియో (వృశ్చికము) 12) శాగిటారియస్ (ధనుస్సు) 13) కేఫ్రికార్న్ (మకరము) 14) ఎక్వేరియస్ (కుంభం) 15) ఫిస్బేస్ (మీనము).

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 8.
మన సౌరకుటుంబంలో ఎన్ని గ్రహాలున్నాయి? అవి ఏవి? (AS1)
జవాబు:

  1. మన సౌరకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి.
  2. అవి 1) బుధుడు (Mercury) B) శుక్రుడు (Venus) 3) భూమి (Earth) 4) కుజుడు లేదా అంగారకుడు (Mars) 5) గురుడు లేదా బృహస్పతి (Jupiter) 6) శని (Saturn) 7) వరుణుడు (Uranus) 8) ఇంద్రుడు (Neptune)

ప్రశ్న 9.
క్రింది గ్రహాల వివరాల పట్టికను చూసి అన్నిటికంటే చిన్న గ్రహాన్ని, పెద్ద గ్రహాన్ని తెలపండి. (AS1)
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1
జవాబు:
అతిచిన్న గ్రహం – బుధుడు
అతిపెద్ద గ్రహం – బృహస్పతి

ప్రశ్న 10.
సౌర కుటుంబంలో 8 గ్రహాలలోకి భూమి యొక్క ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:

  1. భూమిపై జీవం పుట్టడానికి, మనగలగడానికి ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు.
  2. సూర్యునికి తగిన దూరంలో ఉండటం, నీరు, వాతావరణం ఉండటం, వాటిని ఆవరించి ఓజోన్ పొర ఉండటం వంటివి భూమిపై జీవాన్ని నిలిపి ఉంచాయి.
  3. రాత్రి – పగళ్ళు ఏర్పడటం.
  4. జీవరాశికి కావలసిన విధంగా ఋతువులు ఏర్పడటం.
  5. భూమిపై సహజ వనరులు ఉండటం.

ప్రశ్న 11.
పగలు – రాత్రులు ఎలా ఏర్పడతాయి? (AS1)
జవాబు:
సూర్యునికి అభిముఖంగా భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల పగలు – రాత్రులు ఏర్పడతాయి.

ప్రశ్న 12.
నక్షత్రాలు కదులుతున్నాయా? నీవెలా చెప్పగలవు? (AS1)
జవాబు:

  1. నక్షత్రాలు కదలవు.
  2. భూమి తన అక్షం చుట్టూ పడమర నుండి తూర్పుకు భ్రమణం చేయడం వలన నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనిపిస్తాయి. కాని. నిజానికి నక్షత్రాలు కదలవు.

ప్రశ్న 13.
భూమి యొక్క దక్షిణార్ధగోళంలో ఉన్నవారు ధృవ నక్షత్రాన్ని చూడగలరా? ఎందుకు? (AS1)
జవాబు:

  1. భూమి యొక్క దక్షిణార్ధ గోళంలో ఉన్నవారు ధృవ నక్షత్రాన్ని చూడలేరు.
  2. ఎందుకంటే ధృవ నక్షత్రం భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో భూభ్రమణ అక్షానికి పైవైపు ఉంటుంది.

ప్రశ్న 14.
కృత్రిమ ఉపగ్రహాల వలన మన నిత్య జీవితంలో ఏమేమి ఉపయోగాలున్నాయి? (AS1)
జవాబు:

  1. దూరదర్శన్ (T.V), రేడియో ప్రసారాలలో ఉపయోగిస్తారు.
  2. వాతావరణ సూచనలు, సమాచారాన్ని ముందుగా అందజేస్తాయి.
  3. టెలిఫోన్, టెలిగ్రామ్, సెల్ ఫోన్, ఫ్యాన్ మరియు నెట్ ద్వారా సమాచారం అందించడం.
  4. సహజ వనరుల, భూగర్భజల నిక్షేపాలున్న ప్రాంతాల గుర్తింపు.
  5. రిమోట్ సెన్సింగ్ ద్వారా అడవి వనరుల సర్వే.
  6. వ్యవసాయ పంటల అభివృద్ధి, సాగునేలల రకాల విభజన
  7. ఉపగ్రహాలను, గ్రహాలను, నక్షత్రాలను, గెలాక్సీలను ‘పరిశోధించడానికి ఉపయోగిస్తారు.
  8. ఏదైనా ఒక దేశపు సైనిక విభాగంపై గూఢచర్యము చేయడానికి ఉపయోగిస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 15.
శుక్రుడు ఎందుకు కాంతివంతమైన గ్రహం? (AS1)
జవాబు:

  1. శుక్ర గ్రహం ఉపరితలంపై దట్టమైన కార్బన్ డై ఆక్సెడ్ వాయువులతో వాతావరణం ఏర్పడి ఉంటుంది.
  2. శుక్ర గ్రహంపై పడిన సూర్యకాంతిలో 75% కాంతిని పరావర్తనం చెందించడం వలన శుక్ర గ్రహం కాంతివంతమైనదిగా కనబడుతుంది.

ప్రశ్న 16.
మీరు చంద్రుని మీదకు వెళ్లాలనుకుంటున్నారా? ఎందుకు? (AS2)
జవాబు:
నేను చంద్రుని పైకి వెళ్లాలనుకుంటున్నాను. తను

  1. చంద్రునిపై ఉన్న శిలలను అధ్యయనం చేయడానికి.
  2. చంద్రునిపై నీటివనరులు ఉన్నవో లేవో అన్వేషించుటకొరకు.
  3. చంద్రునిపై జీవుల మనుగడకు అనువైన వాతావరణం ఉందో లేదో తెలుసుకొనుటకు.
  4. కృత్రిమ ఉపగ్రహాలను ఉపయోగించుకునే రీతిలో చంద్రున్ని ఉపయోగించవచ్చునో లేదో పరిశోధించుటకు.
  5. చంద్రుని అంతర నిర్మాణాన్ని తెలుసుకొనుటకు.
  6. చంద్రునిపై రాత్రి పగళ్ళు ఏర్పడుతాయా? రాత్రి పగళ్ళు ఎంతకాలం ఉంటాయి? అని తెలుసుకొనుటకు.
  7. చంద్రునిపై ఏ జీవరాశి అయినా ఉందా లేదా తెలుసుకొనుటకు.
  8. చంద్రునిపై నుండి భూమిని పరిశీలించుటకు.

ప్రశ్న 17.
భూమిలో నిటారుగా పాతిన కర్ర యొక్క నీడలను పరిశీలించినపుడు రమ్య మదిలో అనేక ప్రశ్నలు ఉదయించాయి. ప్రశ్నలేమై ఉండవచ్చును? (AS2)
జవాబు:

  1. కర్ర నీడ ఏర్పడుటకు కారణం ఏమిటి?
  2. కర్ర నీడ పొడవు ఎందుకు మారుతుంది?
  3. కర్ర నీడలలో అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడే సమయాన్ని ఏమంటారు?
  4. కర్ర నీడలలో అతి తక్కువ పొడవు గల నీడ సూచించే దిశలు ఏమి తెలియజేస్తాయి?
  5. కర్ర యొక్క నీడల ద్వారా నీడ గడియారము తయారుచేయవచ్చా?

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 18.
రాత్రివేళ ఆకాశాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీకు ఏం సందేహాలు కలిగాయి? (AS2)
జవాబు:

  1. చంద్రుడు ఉపగ్రహం అయినప్పటికి ఎందుకు కాంతివంతంగా కనబడుతున్నాడు?
  2. నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకు మంటున్నాయి?
  3. నక్షత్రాలు ఎందుకు కదులుతున్నట్లు కనబడుతున్నాయి?
  4. ధృవ నక్షత్రం ఎందుకు కదలుటలేదు?
  5. రోజురోజుకు చంద్రుని ఆకారం ఎందుకు మారుతుంది?
  6. అమావాస్య రోజున చంద్రుడు రాత్రివేళ ఎందుకు కనిపించడు?

ప్రశ్న 19.
మన వద్ద గడియారం లేకున్నా పగటి వేళలో కొన్ని వస్తువుల నీడను బట్టి మనం సమయాన్ని చెప్పవచ్చు. మరి రాత్రివేళ సమయాన్ని ఎలా చెప్పగలమో మీ స్నేహితులతో చర్చించండి. (AS2)
జవాబు:
రాత్రివేళ ధృవ నక్షత్రం సహాయంతో సమయాన్ని తెలియజేస్తారు.

ప్రశ్న 20.
మీరు ఇప్పుడున్న ప్రదేశంలో ఉత్తర – దక్షిణ దిక్కులను ఎలా కనుగొంటారు? (AS3)
జవాబు:

  1. ఒక మీటరు కంటే ఎక్కువ పొడవున్న ఒక కర్రను తీసుకోండి.
  2. చదునుగా ఉండే, చెట్లు, ఇండ్ల నీడ పడకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి.
  3. ఈ స్థలంలో కర్ర యొక్క ఒక మీటరు భాగము కచ్చితంగా భూమిపై ఉండేవిధంగా కర్రను పాతండి.
  4. ఉదయం 11 గంటలకు కర్ర నీడ చివరి బిందువు వద్ద ఒక ఇనుపమేకును గుచ్చి, నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
  5. ఈ విధంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
  6. కర్ర యొక్క అతి తక్కువ పొడవైన నీడను గుర్తించండి.
  7. ఈ కర్ర నీడ ఎల్లప్పుడు ఆ ప్రాంతాల ఉత్తర – దక్షిణ దిక్కులను సూచిస్తుంది.

ప్రశ్న 21.
ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉత్తర – దక్షిణ దిక్కులలో ఎటు కదులుతున్నాడు? (AS3)
జవాబు:
ఈ కింది గమనికను బట్టి జవాబు వ్రాయండి.

గమనిక :

  1. డిసెంబరు 22 నుండి జూన్ 21 వరకు దక్షిణం నుండి ఉత్తరం వైపు కదులుతూ ఉంటాడు.
  2. జూన్ 21 నుండి డిసెంబరు 22 వరకు ఉత్తరం నుండి దక్షిణం వైపు కదులుతూ ఉంటాడు.

ప్రశ్న 22.
ఆకాశంలో మీరు ఏయే గ్రహాలను చూశారు.? ఎప్పుడు చూశారు? (AS3)
జవాబు:

  1. ఆకాశంలో నేను శుక్ర గ్రహాన్ని చూశాను.
  2. కొన్నిసార్లు సూర్యాస్తమయం తర్వాత చూశాను.
  3. కొన్నిసార్లు సూర్యోదయం కన్నా ముందు చూశాను.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 23.
ఈ రోజు పగలు – రాత్రుల నిడివి ఎంత? గడచిన వారం రోజుల వార్తాపత్రికలు సేకరించి పగలు, రాత్రులు నిడివులను పరిశీలించి ఇప్పుడు ఎండాకాలం రాబోతుందో, శీతాకాలం రాబోతుందో తెలపండి. (AS4)
జవాబు:
01-03-2014 శనివారం రోజున పగలు గంటలు 11 : 49 నిమిషాలు రాత్రి గంటలు 12 : 11 నిమిషాలు
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 2

  1. పగలు నిడివి పెరుగుతుంటే ఎండాకాలం రాబోతుంది అని తెలుస్తుంది.
  2. పగలు నిడివి తగ్గుతుంటే శీతాకాలం రాబోతుంది అని తెలుస్తుంది.
    (గమనిక : ఈనాడు వార్తా పత్రిక నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం ల నుండి పగలు – రాత్రుల నిడివిని కనుగొని ఈ ప్రశ్నకు జవాబు రాయాలి).

ప్రశ్న 24.
మీ జిల్లా గుండా పోయే అక్షాంశంపైన ఉన్న ఇతర జిల్లాలు ఏవి? (AS4)
జవాబు:

  1. మా తూర్పు గోదావరి జిల్లా గుండా పోయే అక్షాంశ డిగ్రీ (ఉత్తరం) 17°.
  2. మా జిల్లా గుండా పోయే అక్షాంశం పైన ఉన్న ఇతర జిల్లాలు :
    1) తూర్పు గోదావరి,
    2) విశాఖపట్నం,
    3) రంగారెడ్డి (తెలంగాణ),
    4) హైదరాబాద్ (తెలంగాణ),
    5) నల్గొండ (తెలంగాణ).

సూచన : మిగిలిన జిల్లాల వారు ఈ ప్రశ్నకు జవాబు ఈ క్రింది పట్టిక ఆధారంగా రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 3

ప్రశ్న 25.
వార్తా పత్రికల నుండి, అంతర్జాలం నుండి అంతరిక్ష వ్యర్థాలపై సమాచారాన్ని సేకరించండి. వాటివల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ ఒకచార్టును తయారుచేసి మీ పాఠశాల ప్రకటనల బోర్డులో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
1. ఆస్టరాయిడ్స్ :
కుజుడు, బృహస్పతి మధ్యగల ఆస్టరాయిడ్లు ఒక్కొక్కసారి కూపర్ బెల్ట్ నుండి బయటకు వచ్చి గ్రహాల మధ్య తిరుగుతుంటాయి. ఏదైనా గ్రహం గురుత్వాకర్షణ పరిధిలోనికి వచ్చినపుడు, గ్రహ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వాటి వాతావరణంలో జరిగే ఘర్షణ వల్ల మండిపోతాయి లేదా వాతావరణం లేని గ్రహం మీద అయితే ఢీకొనడం వల్ల అక్కడ గోతులు ఏర్పడతాయి. ఈ విధంగా భూమి మీద జరిగితే ప్రాణ, ఆస్తినష్టం జరుగుతుంది.
ఉదా : సిరిస్

2. తోకచుక్కలు :
తోకచుక్క తన కక్ష్యలో ప్రయాణం చేస్తూ సూర్యునికి సమీపంగా వచ్చినపుడు దానిలో ఉండే మంచు, ధూళి, సూర్యుని వేడివల్ల విడిపోయి గ్రహాల మీద పడిపోతుంది.
ఉదా : షూమేకర్ – లేవి – 9 (టెంపుల్ టటిల్ తోకచుక్క) 1994 జులైలో బృహస్పతిని ఢీ కొట్టింది. ఇదే కనుక భూమిని ఢీకొట్టి ఉంటే విపరీతమైన పరిణామాలు ఏర్పడేవి.

3. రేడియేషన్ :
రేడియేషన్ విశ్వవ్యాప్తమైనది. సూర్యకిరణాలు, ఉష్ణకిరణాలు, మైక్రోవేవ్స్, రేడియో తరంగాలు, కాస్మిక్ కిరణాలు, రేడియోధార్మిక లోహాల నుండి వెలువడే వికిరణాలను రేడియేషన్ అంటారు. అంతరిక్షంలో నుండి ” స్వాభావికముగా వెలువడే వికిరణాలతో బాటు మానవ కార్యకలాపాల వల్ల స్వాభావిక రేడియోధార్మిక లేదా కృత్రిమ రేడియోధార్మికత వలన పర్యావరణము కలుషితమై జీవరాశులకు హాని కలిగిస్తాయి. రేడియేషన్ అధికంగా సోకడం వలన జన్యు ఉత్పరివర్తన ఏర్పడి కేన్సర్ వ్యాధులు సోకుతాయి.

4. మానవ చర్యల వలన :
మానవుడు ప్రయోగించిన అనేక కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు కాలం తీరిపోయిన తరువాత పనిచేయక అంతరిక్షంలో ఉండిపోతాయి. వాటివల్ల పనిచేస్తున్న అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలకు తరచుగా ప్రమాదాలు జరుగుతాయి.

ప్రశ్న 26.
నీడ గడియారాన్ని తయారుచేయండి. తయారీ విధానం వివరించండి. (కృత్యం – 3) (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 4

  1. ఒక కార్డుబోర్డు ముక్కను తీసుకొని ప్రక్క పటంలో చూపినట్లు ABC లంబకోణ త్రిభుజాన్ని తయారుచేయాలి.
  2. దీనిలో 4 వద్ద లంబకోణం , C వద్ద ప్రాంతపు అక్షాంశ డిగ్రీకి సమానమైన కోణం ఉండేలా తీసుకొనవలెను.
  3. ఒక దీర్ఘచతురస్రాకారపు చెక్క ముక్క మధ్యలో కార్డు బోర్డుతో చేసిన నీడ గడియారం త్రిభుజం యొక్క BC భుజం ఆనునట్లు నిలువుగా ఉంచవలెను.
  4. త్రిభుజంలో BC భుజం వెంట కాగితాన్ని కొంతమేరకు అంటించి, మిగిలిన కాగితాన్ని చెక్కముక్కకు అంటించి పటంలో చూపినట్లు చెక్కపై త్రిభుజం నిలబడేట్లు చేయాలి.
  5. దీనిని రోజంతా సూర్యుని వెలుగు తగిలే విధంగా ఉన్న చదునైన ప్రదేశంలో త్రిభుజం యొక్క భుజం BC లో B ఉత్తర దిశలో, C దక్షిణ దిశలో ఉండే విధంగా అమర్చాలి.
  6. ఉదయం 9 గంటలకు AC భుజం యొక్క నీడ చెక్కపై ఎక్కడ వరకు పడిందో గమనించి రేఖను గీయాలి.
  7. ఈ రేఖ వెంట 9 గంటలు అని సమయాన్ని నమోదు చేయాలి.
  8. ఈ విధంగా ప్రతి గంటకు తప్పనిసరిగా నీడను పరిశీలించి రేఖలు గీయాలి మరియు సమయాన్ని నమోదు చేయాలి.
  9. ఈ విధంగా సూర్యాస్తమయం వరకు రేఖలు గీసి’ సమయాలను నమోదు చేయాలి.
  10. దీనిని ఉపయోగించి ప్రతిరోజూ సమయాన్ని తెలుసుకోవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 27.
చంద్రుని యొక్క వివిధ ఆకారాలను (చంద్రకళలను) గీసి వాటి, పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఆకారాల క్రమంలో అమర్చండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 5

ప్రశ్న 28.
సప్తర్షి మండలం నుండి ధృవ నక్షత్రం ఏ దిశలో ఉంటుందో బొమ్మ గీచి చూపండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 6

ప్రశ్న 29.
సౌర కుటుంబం బొమ్మ గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 7

ప్రశ్న 30.
మన పూర్వీకులు విశ్వం గురించి అనేక విషయాలు తెలుసుకున్న పద్ధతిని నీవెలా అభినందిస్తావు? (AS6)
జవాబు:

  1. చంద్రగ్రహణ సమయంలో చంద్రునిపై పడే భూమి నీడను చూసి భూమి గుండ్రంగా ఉందని భావించినారు.
  2. నావికులు సముద్రంపై ప్రయాణిస్తూ ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత తిరిగి వారు బయలుదేరిన ప్రదేశానికి చేరుకున్నారు. దీని వలన భూమి గోళాకారంగా ఉందని భావించారు.
  3. సముద్రతీరాన నిలబడి చూసేవారికి సముద్రంలో సుదూరం నుండి తీరం చేరే ఓడల యొక్క పొగ మొదట కనబడటం, తర్వాత కొంత సేపటికి పొగగొట్టం కనబడడం, మరికొంత సేపటికి ఓడ పైభాగం తర్వాత ఓడ మొత్తం కనబడటం వంటి అంశాల ద్వారా భూమి ఆకారాన్ని తెలుసుకోవడానికి సహాయపడింది.
    విశ్వానికి కేంద్రంలో సూర్యుడున్నాడని మిగిలిన అంతరిక్ష వస్తువులన్నీ దాని చుట్టూ పడమర నుండి తూర్పు వైపుగా తిరుగుతున్నాయని కోపర్నికస్ తెలిపాడు.
  4. భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి, పగళ్ళు ఏర్పడతాయని మన పూర్వీకులు నిర్ధారించారు.
  5. గెలీలియో టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలు ప్రజలకు చూపించాడు.
  6. భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయని తెలియజేసినారు.
  7. మన పూర్వీకులు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఎలా ఏర్పడతాయో వివరించగలిగినారు.
  8. ఉత్తరాయణం, దక్షిణాయణం ఎలా ఏర్పడతాయో వివరించగలిగినారు.
  9. చంద్రకళలు ఏర్పడుటను వివరించగలిగినారు.
    పై విషయాలన్నీ మన పూర్వీకులు ఏ సాధనలు లేకుండా, తెలుసుకున్న పద్ధతిని మనం అభినందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

ప్రశ్న 31.
వివిధ అవసరాల కొరకు మనం భూమిచుట్టూ అనేక కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించాం. వాటివల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం జీవవైవిధ్యంపై ఎలా ఉంటుంది? (AS7)
జవాబు:
కృత్రిమ ఉపగ్రహాలను ఉపయోగించడం వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం :

  1. రేడియేషన్ జీవుల యొక్క నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది.
  2. రేడియేషన్ జీవుల యొక్క ప్రత్యుత్పత్తిపై ప్రభావాన్ని చూపుతుంది.
  3. రేడియేషన్ వలన క్యాన్సర్ వ్యాధికి గురి అవుతారు.
  4. రేడియేషన్ మానవుల రక్తప్రసరణ వ్యవస్థపై పనిచేస్తుంది.
  5. అయనీకరణం చెందితే రేడియేషన్ క్యాన్సర్, థైరాయిడ్ గ్రంథి మరియు బోన్‌మ్యారో పై ఎక్కువ ప్రభావం చూపి వ్యాధి – తీవ్రతను పెంచుతుంది.
  6. రేడియేషన్ ద్వారా చర్మవ్యాధులు వస్తాయి.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 32.
సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలలో భూమిపైన మాత్రమే జీవమున్నది. ఈ భూమిని, దాని వాతావరణాన్ని మనం ఎలా సంరక్షించాలో తెలపండి. (AS7)
జవాబు:
1. నేల కాలుష్యం సంరక్షణ :
అ) భారీ పరిశ్రమల నుండి విడుదలైన విష వ్యర్థ పదార్థాలను ప్రత్యేకంగా సూచించబడిన స్థలాలలో పెద్ద పెద్ద గుంతలు తీసి అందులోకి పంపించాలి.
ఆ) థర్మల్ పవర్ కేంద్రంలోని ప్లెయాష్ ను ఇటుకలు, సిమెంట్ హాలో బ్రిక్స్ తయారీలో ఉపయోగించాలి.
ఇ) రసాయన ఎరువులకు బదులుగా జైవి ఎరువులు ఉపయోగించాలి.
ఈ) గృహ సంబంధ చెత్తతో కంపోస్ట్ ఎరువులు తయారు చేయాలి.

2. గాలి కాలుష్యం కాకుండా సంరక్షణ :
అ) వాయువు కాలుష్య కారకాలైన పదార్థాలను ఇంధనాల నుండి తొలగించాలి.
ఆ) వాహనాల ఇంజన్లను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించి మంచి కండీషన్లో ఉంచాలి.
ఇ) వాహనాలలో పెట్రోల్ కు బదులుగా ఎల్ పిజి, సిఎజ్ గ్యా న్లు వాడాలి.
ఈ) పరిశ్రమల నుండి వెలువడే వాయువులను ఎత్తైన చిమ్మీల ద్వారా వాతావరణంలోని పై భాగములోకి పంపించాలి.

3. జలకాలుష్యం కాకుండా సంరక్షణ :
అ) మురుగు నీటిని శుద్ధి చేసిన తరువాత ఆ నీటిని జలాశయానికి లేదా నదులలోకి పంపించాలి.
ఆ) పరిశ్రమల నుండి వెలువడే విషపూరిత వ్యర్థ పదార్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతనే బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి.
ఇ) మురుగునీటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలి.

4. శబ్ద కాలుష్యం కాకుండా సంరక్షణ :
అ) వాహనాలకు సైలెన్సర్లను ఉపయోగించాలి.
ఆ) వాహనాలకు తక్కువ శబ్ద తీవ్రత గల హారన్లను ఉపయోగించాలి.
ఇ) ఫ్యాక్టరీలకు, సినిమా హాళ్ళకు సౌండ్ ఫ్రూఫ్ గోడలతో నిర్మించాలి.
ఈ) ఆరాధన స్థలాలు, ఊరేగింపులో, శుభకార్యాలలో లౌడ్ స్పీకర్లను సాధ్యమైనంత తక్కువ స్థాయిలో ఉపయోగించాలి.

5. అడవుల సంరక్షణ :
అ) అడవులలో ఏవైనా కొన్ని చెట్లు అవసరాల కొరకు కొట్టి వేసినపుడు అంతకంటే ఎక్కువ చెట్లను నాటాలి. దీనివలన సమతుల్యత కాపాడబడుతుంది.
ఆ) ప్రజలను చైతన్య పరిచి చెట్లను నరకకుండా కాపాడాలి.
ఇ) తగ్గుతున్న అడవి విస్తీర్ణం కంటే పెంచే అడవి విస్తీర్ణం ఎక్కువగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి.

పరికరాల జాబితా

నిటారు మీటరు పొడవైన కర్ర, నీడ గడియారం నమూనా, గ్రహణాలను ప్రదర్శించే చిత్రాలు, గ్రహాలకు సంబంధించిన చిత్రాలు.

8th Class Physical Science 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 162

ప్రశ్న 1.
ఒక మీటరు పొడవు ఉండునట్లు పాతిన కర్ర యొక్క నీడ కదిలిన మార్గాన్ని గుర్తించడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అమర్చిన “పెగ్” లను పరిశీలించండి. వీటిని బట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆకాశంలో సూర్యుని స్థానం ఎలా మారుతుందో చెప్పగలరా?
జవాబు:
ఆకాశంలో సూర్యుని స్థానం దీర్ఘవృత్తాకార మార్గంలో తూర్పు నుండి పడమరకు మారుతున్నట్లు కనబడుతుంది.

8th Class Physical Science Textbook Page No. 164

ప్రశ్న 2.
సూర్యుడు ఉత్తర దిక్కుకో లేక ,దక్షిణ దిక్కుకో కదులుతున్నట్లు ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:

  1. సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే మార్గంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. దీనినే కక్ష్యతలం అంటారు.
  2. కక్ష్యతలానికి, భూమి భ్రమణాక్షం లంబంగా ఉండకుండా 23.5° కోణంలో వంగి ఉంటుంది.
  3. భూభ్రమణాక్షం 23.5° కోణంలో వంగి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వలన సూర్యుడు ఉత్తర దిక్కుకో లేదా – దక్షిణ దిక్కుకో కదులుతున్నట్లు కనిపిస్తుంది.

8th Class Physical Science Textbook Page No. 189

ప్రశ్న 3.
చంద్రునిపై కొన్ని కట్టడాలను నిర్మించి అందులో నివసించేందుకు ఏర్పాట్లు చేయాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. అక్కడ గాలి లేదని మీకు తెలుసు. మరి అక్కడ నివసించడం ఎలా సాధ్యం?
జవాబు:
చంద్రునిపై సంచరించి వచ్చిన నీల్ ఆర్న్ స్టాంగ్ లాంటి వ్యోమగాములు తమవీపుపై ఆక్సిజన్ సిలిండర్లను మోసుకునిపోయి, అక్కడ సంచరించి తిరిగి వచ్చారు. అలాగే పర్వతారోహకులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తమతో ఆక్సిజన్ సిలిండర్లు తీసుకునిపోతారు. ఇలాంటి ఏర్పాట్లను చేయడంగాని, లేదా మొత్తం కట్టడానికి ఆక్సిజన్ అందించే పైపులైన్లుగాని ఏర్పరిస్తే తప్ప చంద్రుని ఉపరితలం మీద మానవులు నివసించడం సాధ్యం కాదు.

8th Class Physical Science Textbook Page No. 161

ప్రశ్న 4.
ఆకాశంలో మనం చూడగలిగే అంతరిక్ష వస్తువులు ఏవి?
జవాబు:
ఆకాశంలో మనం చూడగలిగే అంతరిక్ష వస్తువులు : 1) సూర్యుడు, 2) చంద్రుడు, 3) నక్షత్రాలు, 4) గ్రహాలు.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 5.
నక్షత్రాలు కదులుతున్నాయా?
జవాబు:
కదులుతున్నవి.

ప్రశ్న 6.
మనకు రాత్రివేళలో కనబడిన నక్షత్రాలే తెల్లవారుజామున కనబడతాయా?
జవాబు:
కనబడవు.

ప్రశ్న 7.
మీకు వేసవికాలంలో రాత్రిపూట కనబడిన నక్షత్రాలే చలికాలంలో కూడా కనబడతాయా?
జవాబు:
కనబడవు.

ప్రశ్న 8.
చంద్రుని ఆకారం ఎలా ఉంటుంది? అది ప్రతిరోజూ ఎందుకు మారుతుంటుంది? మరి సూర్యుని ఆకారం మారదేం?
జవాబు:

  1. చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. సూర్యకాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందడం వల్ల చంద్రుడు కాంతివంతగా కనిపిస్తాడు.
  2. అయితే చంద్రుడికి ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో తిరిగి కనిపించడానికి ఒక రోజు పైన సుమారు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. అందువలన చంద్రుడు మనకు సంపూర్ణ వృత్తాకారం నుండి అసలు కనిపించని స్థితికి వివిధ ఆకృతులలో కనిపిస్తాడు.
  3. కాని సూర్యుడు అలా కాక సరిగా ఒక నిర్ణీత ప్రదేశంలో సరిగ్గా 24 గంటల తర్వాత కనిపిస్తాడు. పైగా స్వయం ప్రకాశం గలవాడు. కనుక సూర్యుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా కనిపిస్తాడు.

ప్రశ్న 9.
మిట్టమధ్యాహ్నం వేళ సూర్యుడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు?
జవాబు:
మిట్టమధ్యాహ్నం వేళ సూర్యుడు ఖచ్చితంగా నడినెత్తిన ఉంటాడు.

ప్రశ్న 10.
ఉదయం నుండి సాయంత్రం వరకూ ఒక చెట్టునీడలో ఎందుకు మార్పు వస్తుంది?
జవాబు:
సూర్యకిరణాలు ఆ చెట్టుపై ఏటవాలుగా పడినప్పుడు నీడ పొడవుగాను, సూర్యుడు ఆకాశం మధ్యలో ఉంటే నీడ పొట్టిగానూ, సూర్యునిస్థానం బట్టి మారుతుంది.

8th Class Physical Science Textbook Page No. 165

ప్రశ్న 11.
ఆకాశంలో చంద్రుని కదలికను మీరెప్పుడైనా పరిశీలించారా?
జవాబు:
పరిశీలించాను.

ప్రశ్న 12.
ప్రతిరోజూ చంద్రుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒకే చోట కనిపిస్తాడా?
జవాబు:
కనిపించడు.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 13.
ప్రతిరోజూ చంద్రుని ఆకారం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
ఉండదు.

8th Class Physical Science Textbook Page No. 169

ప్రశ్న 14.
చంద్రునిపై మనం శబ్దాలను వినగలమా? ఎందుకు?
జవాబు:

  1. చంద్రునిపై మనం శబ్దాలను వినలేము.
  2. శబ్ద ప్రసారానికి యానకం అవసరం. చంద్రునిపై గాలి లేదు. శూన్య ప్రదేశం మాత్రమే. శూన్య ప్రదేశం గుండా శబ్దం ప్రసరింపజాలదు.

ప్రశ్న 15.
చంద్రునిపై జీవం ఉంటుందా? ఎందుకు?
జవాబు:
జీవ జాలానికి ప్రధానమైనది శ్వాసక్రియ. శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం. చంద్రునిపై వాతావరణం లేదు. కేవలం ఆ శూన్యప్రదేశం మాత్రమే ! కనుక జీవం ఉండదు.

8th Class Physical Science Textbook Page No. 170

ప్రశ్న 16.
చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే ఎందుకు ఏర్పడుతుంది?
జవాబు:
పౌర్ణమినాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలో ఉండి, భూమి సూర్యచంద్రుల మధ్యగా ఉంటుంది. కనుక పౌర్ణమినాడు మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ప్రశ్న 17.
పటం 7 ప్రకారం భూమినీడ చంద్రునిపై ఎప్పుడు పడుతుంది?
జవాబు:
పటం 7 ప్రకారం భూమి నీడ చంద్రునిపై పడాలంటే సూర్యుడు, చంద్రుల గమనమార్గాలు ఖండించుకునే స్థానానికి సరిగ్గా ఒకే సమయానికి అవి రెండూ చేరుకోవాలి, మరియు భూమి వాటిని రెండింటినీ కలిపి సరళరేఖలో ఉండాలి.

ప్రశ్న 18.
ఈ పరిస్థితి ఒక్క పౌర్ణమినాడే సంభవిస్తుందా?
జవాబు:
అవును.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 19.
సూర్యగ్రహణం అమావాస్యనాడే ఎందుకు ఏర్పడుతుందో మీరిప్పుడు చెప్పగలరా?
జవాబు:
అమావాస్యనాడు చంద్రుని నీడ భూమిపై పడటం వలన భూమిపై కొన్ని ప్రాంతాలలో సూర్యుడు కన్పించడు. అందువల్ల అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

8th Class Physical Science 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
నీడ పొడవులో మార్పును పరిశీలించుట
(లేదా)
మీ ప్రాంతం యొక్క “ప్రాంతీయ మధ్యాహ్నవేళ” సమయాన్ని ఒక కృత్యం ద్వారా కనుగొనండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 8

  1. ఒక మీటరు కంటే ఎక్కువ పొడవున్న ఒక కర్రను తీసుకోండి.
  2. చదునుగా ఉండే, చెట్లు, ఇండ్ల నీడ పడకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి.
  3. ఈ ప్రదేశంలో కర్ర యొక్క ఒక మీటరు భాగము కచ్చితంగా భూమిపై ఉండే విధంగా కర్రను పాతండి.
  4. ఉదయం 11 గంటలకు కర్ర నీడ చివరి బిందువు వద్ద ఒక ఇనుపమేకును గుచ్చి, నీడ పొడవును మరియు సమయాన్ని నమోదు చేయండి.
  5. ఈ విధంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నీడ పొడవు మరియు నీడ పొడవులో తేడాలు – సమయాన్ని నమోదు చేయండి.
  6. ఏర్పడిన కర్ర నీడ పొడవులలో అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడినపుడు నమోదు అయిన సమయాన్ని ‘ప్రాంతీయ మధ్యాహ్నవేళ’ అంటారు.
  7. ప్రాంతీయ మధ్యాహ్నవేళను, సమయాన్ని గుర్తించండి.

కృత్యం – 2

ప్రశ్న 2.
ఉత్తర – దక్షిణ దిశలలో సూర్యుడు కదలడాన్ని అవగాహన చేసుకొనుట.
(లేదా)
ఉత్తరాయణం, దక్షిణాయణం అర్థం చేసుకొనుటకు ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 9

  1. సూర్యోదయాన్ని చూడటానికి ఏదైనా డాబా పైన గానీ, మైదాన ప్రాంతాన్ని గానీ ఎన్నుకోండి.
  2. ఎంచుకున్న స్థానం నుండి తూర్పు దిక్కుగా ఏదైనా ఒక చెట్టు లేదా స్తంభం వంటి కదలని వస్తువును “సూచిక”గా ఎంచుకోండి. ఉదయించే సూర్యుని స్థానాన్ని పరిశీలించుట
  3. వరుసగా 10 నుండి 15 రోజులు నిర్ణయించుకున్న ఈ స్థానానికి చేరి సూర్యోదయం ఎక్కడ జరుగుతుందో పరిశీలించండి.
  4. ఎంచుకున్న సూచికను దానికి అనుగుణంగా ఉదయిస్తున్న సూర్యుణ్ణి గమనించి పై పటంలో చూపినట్లు ప్రతిరోజూ పుస్తకంపై బొమ్మను గీయండి.
  5. సూర్యుడు ఉదయించే స్థానం ఒకవేళ మారితే సూర్యుడు ఏ దిక్కుకు జరుగుతున్నట్లు ఉన్నదో గమనించండి.
  6. సూర్యుడు రోజురోజుకీ దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే అది దక్షిణాయణం అనీ, ఉత్తర దిక్కుగా కదులుతున్నట్లు అయితే అది ఉత్తరాయణం అనీ అంటారు.

కృత్యం – 4

ప్రశ్న 3.
చంద్రకళలను పరిశీలించుట :
ఈ కింది విధంగా కృత్యాన్ని చేస్తూ, పరిశీలిస్తూ, కృత్యం కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 10
1) అమావాస్య తర్వాత మొదటిసారిగా చంద్రుడు (నెలవంక) కనబడిన రోజు యొక్క తేదీని మీ నోట్ బుక్ లో రాసుకోండి. ఆ రోజు చంద్రుడు అస్తమించే సమయాన్ని నమోదు చేయండి. అదేవిధంగా ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎక్కడున్నాడో గుర్తిస్తూ పటంలో చూపి నట్లు చంద్రుని ఆకారాన్ని బొమ్మ గీయండి. ఆ రోజు తేదీని చంద్రుడు అస్తమించిన సమయాన్ని ఆ కాగితం పైనే రాసుకోండి.

ఇలా మీకు వీలైనన్ని రోజులు చంద్రుణ్ణి పరిశీలించండి.

2) పౌర్ణమికి కొన్ని రోజుల ముందు నుండి పౌర్ణమి తర్వాత కొన్ని రోజుల వరకు చంద్రుణ్ణి పరిశీలించండి. పౌర్ణమికి ముందు రోజులలో సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించండి. ఆ సమయాన్ని, ఆ రోజు తేదీని నమోదు చేయండి.

పౌర్ణమి తరువాత రోజులలో ఆకాశంలో తూర్పువైపున చంద్రుడు ఉదయించే సమయాన్ని, ఆ రోజు తేదీని రాయండి. ప్రతిరోజూ చంద్రుని ఆకారాన్ని, ఆకాశంలో దాని స్థానాన్ని బొమ్మగీయడం మరవకండి.

ఈ పరిశీలనల వల్ల మీరు ఏం అర్థం చేసుకున్నారు?

ఎ) రెండు వరుస చంద్రోదయాల మధ్య లేదా రెండు వరుస చంద్ర అస్తమయాల మధ్య ఎన్ని గంటల సమయం పడుతుందో లెక్కగట్టగలరా?
జవాబు:
రెండు వరుస చంద్రోదయాల మధ్య లేదా రెండు వరుస చంద్ర అస్తమయాల మధ్య 1 రోజు (24 గంటలు) కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.

బి) రెండు వరుస సూర్యోదయాలు లేదా సూర్యాస్తమయాల మధ్య కాలమెంత?
జవాబు:
దాదాపు 24 గంటలు (ఒక రోజు)

సి) ఆకాశంలో రెండు వరస సూర్యోదయాలు, రెండు వరుస చంద్రోదయాల మధ్య కాలాలు సమానంగా ఉంటాయా?
జవాబు:
సమానంగా లేవు.

డి) సూర్యాస్తమయ సమయాన ఆకాశంలో చంద్రుడు ప్రతిరోజూ ఒకే స్థానంలో కనబడుతున్నాడా?
జవాబు:
సూర్యాస్తమయ సమయాన ఆకాశంలో చంద్రుడు ప్రతిరోజూ ఒకే స్థానంలో కనబడడు.

ఇ) చంద్రుడు ఏ ఆకారంలో ఉన్నాడు? ప్రతిరోజూ అదే ఆకారంలో ఉంటుందా?
జవాబు:
చంద్రుని ఆకారం ప్రతిరోజూ మారుతుంది. చంద్రుని ఆకారంలో కలిగే మార్పులనే చంద్రకళలు అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

కృత్యం – 7

ప్రశ్న 4.
నక్షత్రరాశుల కదలికను పరిశీలించుట.
AP Board 8th Class Physical Science Solutions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 11

20 సెం.మీ. పొడవు, 20 సెం.మీ. వెడల్పు గల తెల్ల కాగితాన్ని తీసుకొని దాని మధ్యలో 1 సెం.మీ. వ్యాసం గల రంధ్రాన్ని చేయండి. పటంలో చూపినట్లు ఆ కాగితానికి ఒక వైపున ‘x’ గుర్తునుంచండి.

ఈ కాగితాన్ని మీ ముఖానికి ఎదురుగా ఉంచుకుని దానిపై ఉన్న ‘x’ గుర్తు కింది వైపుగా ఉండేట్లు పట్టుకోండి. కాగితం మధ్య నున్న రంధ్రం గుండా ధృవనక్షత్రాన్ని చూడండి. ధృవ నక్షత్రాన్ని గుర్తించాక కాగితాన్ని కదలకుండా పట్టుకుని సప్తర్షి మండలం, శర్మిష్ట రాశి ఏ దిశలో ఉన్నాయో వెదకండి.

ధృవ నక్షత్రానికి సప్తర్షి మండలం ఏ దిశలో కనిపిస్తుందో కాగితంపై ఆ దిశలో ‘G’ అని, శర్మిష్ట రాశి ఏ దిశలో కనబడుతుందో కాగితంపై ఆ దిశలో ‘C’ అని రాయండి. మీరు ఆ రాశులను గుర్తించిన సమయాన్ని ఆ అక్షరాల పక్కన రాసుకోండి.

మీరు ఈ పరిశీలన చేసేటప్పుడు మీ దగ్గరలో ఉన్న చెట్టు లేదా స్తంభం వంటి ఏదేని సూచిక నొకదానిని ఎన్నుకోండి. – అది మీకు ఏ దిశలో ఉందో మీ ప్రయోగ కాగితంపై ఆ దిశలో దాని బొమ్మ గీయండి.

ఈ పరిశీలన చేసేటప్పుడు మీకు ఎక్కడైతే నిలబడ్డారో ప్రతీసారి అక్కడే నిలబడుతూ గంట గంటకూ ఈ రెండు రాశు లను చూడండి.

ప్రతిసారి సప్తర్షి మండలం కనబడిన దిశలో ‘G’ అక్షరాన్ని శర్మిష్ట రాశి కనబడిన దిశలో ‘C’ అక్షరాన్ని కాగితంపై రాయండి. మరియు మీరు పరిశీలించిన సమయాన్ని ఆ అక్షరాల పక్కన తప్పక రాయండి: మీరు నిర్ణయించుకున్న సూచిక (చెట్టు / స్తంభం) ను బట్టి ధృవ నక్షత్ర స్థానం మారిందో లేదో గమనించండి. ఒకవేళ మారితే మారిన స్థానాన్ని గుర్తించండి. ఈ విధంగా వీలైనన్ని సార్లు (నాలుగు సార్లకు తక్కువ కాకుండా) ఈ కృత్యాన్ని చేయండి. ప్రతిసారి కాగితంపై నున్న ‘x’ గుర్తు కింది వైపుగా ఉండాలి. –

మీరు గీసిన చిత్రాన్ని గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
ఎ) మీరు చూసిన నక్షత్రాల స్థానాలలో ఏమైనా మార్పు కన్పించిందా?
జవాబు:
కన్పించింది.

బి) ధృవ నక్షత్రం స్థానం కూడా మారిందా?
జవాబు:
మారలేదు.

సి) సప్తర్షి మండలం, శర్మిష్ట రాశుల ఆకారం మాత్రమే మారిందా? లేక ఆకాశంలో వాటి స్థానం కూడా పూర్తిగా మారిపోయిందా?
జవాబు:
వాటి స్థానం కూడా పూర్తిగా మారిపోయింది.

డి) ఈ రాశులు ఆకాశంలో కదిలిన మార్గం ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
దీర్ఘవృత్తాకారంలో ఉంది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

SCERT AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 11th Lesson Questions and Answers కొన్ని సహజ దృగ్విషయాలు

8th Class Physical Science 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిలో ఏ వస్తువులకు రాపిడి ద్వారా ఆవేశాన్ని కలిగించలేం? (AS1)
ఎ) ప్లాస్టిక్ స్కేలు
బి) రాగి కడ్డీ
సి) గాలి నింపిన బెలూన్
డి) ఉన్ని గుడ్డ
ఇ) కర్ర ముక్క
జవాబు:
బి) రాగి కడ్డీ.

ప్రశ్న 2.
గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు ఏం జరుగుతుంది? (AS1)
ఎ) కడ్డీ, సిల్క్ గుడ్డ రెండూ ధనావేశం పొందుతాయి.
బి) కడ్డీ ధనావేశం పొందుతుంది. ఎందుకంటే సిల్క్ గుడ్డ రుణావేశం పొందుతుంది.
సి) కడ్డీ, సిల్క్ గుడ్డ రెండూ ఋణావేశం పొందుతాయి.
డి) కడ్డీ ఋణావేశం పొందుతుంది. ఎందుకంటే సిల్క్ గుడ్డ ధనావేశం కలిగి ఉంటుంది.
జవాబు:
డి) కడ్డీ ఋణావేశం పొందుతుంది. ఎందుకంటే,సిల్క్ గుడ్డ ధనావేశం కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 3.
కింది వాక్యాలను పరిశీలించి సరైనవైతే ‘అవును’ అని, సరైనవి కాకపోతే ‘కాదు’ అని గుర్తించండి. (AS1)
ఎ) ఒకే రకమైన ఆవేశాలు ఆకర్షించుకుంటాయి.
జవాబు:
కాదు

బి) ఆవేశం కలిగిన గాజుకడ్డీ, ప్లాస్టిక్ స్ట్రాలు ఆకర్షించుకుంటాయి.
జవాబు:
అవును

సి) తటిద్వాహకం మెరుపుల నుండి భవనాలను రక్షించలేదు.
జవాబు:
కాదు

డి) భూకంపాన్ని ముందుగా ఊహించలేం.
జవాబు:
అవును

ప్రశ్న 4.
చలికాలంలో చలికోటును విడిచే సమయంలో శబ్దం వస్తుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. చలికాలంలో చలికోటును విడిచే సమయంలో శబ్దం వస్తుంది.
  2. చలికోటు కృత్రిమ దారాలతో తయారుచేయబడి ఉంటుంది.
  3. చలికాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. కావున వాతావరణంలో కొంత తేమ ఉంటుంది.
  4. ఈ వాతావరణంలోని తేమ కణాలు చలికోటులోని కణాలను ఆవేశపరుస్తాయి.
  5. చలికోటులోని ఆవేశ కణాలు లోదుస్తులను లేదా చర్మంపై ఉండే వెంట్రుకలను ఆకర్షించుకుంటాయి.
  6. చలికోటు విడిచే సమయంలో ఈ ఆకర్షణ బలాలను వ్యతిరేకించడం వలన శబ్దం ఏర్పడును.

ప్రశ్న 5.
ఆవేశం కలిగిన వస్తువును చేతితో తాకినపుడు ఆవేశం కోల్పోతుంది. ఎందుకు? (AS1)
జవాబు:

  1. ఆవేశం కలిగిన వస్తువు చేతితో తాకినపుడు ఆవేశం కోల్పోతుంది.
  2. ఎందుకంటే ఆవేశాలు శరీరం ద్వారా భూమికి చేరుతాయి.

ప్రశ్న 6.
భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని దేనితో కొలుస్తారు? భూకంపాన్ని స్కేలుపై కిగా గుర్తించారు. భూకంప లేఖిని ద్వారా దానిని గుర్తించవచ్చా? ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుందా? (AS1)
జవాబు:

  1. భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని భూకంప లేఖిని లేదా భ్రామక పరిమాణ స్కేలు ద్వారా కొలుస్తారు.
  2. భూకంప లేఖిని ద్వారా 3.5 కన్నా తక్కువ రిక్టరు స్కేలుతో నమోదు చేస్తుంది. కానీ మనం దానిని గుర్తించలేము.
  3. రిక్టరు స్కేలు 3ను చూపినపుడు నష్టం ఏమీ జరగదు.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 7.
పిడుగు లేదా మెరుపుల నుండి రక్షించుకోవడానికి మూడు పద్ధతులు తెల్పండి. (AS1)
జవాబు:

  1. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళాలి.
  2. తక్కువ ఎత్తుగల ఇల్లు లేక భవనం సురక్షితమైనది.
  3. అడవిలో ఉన్నప్పుడు పొట్టి చెట్టు కింద ఉండడం సురక్షితం.
  4. ఇండ్లకు లేదా భవనాలకు తటిద్వాహకం అమర్చాలి.
  5. చివరి ఉరుము వచ్చిన 30 ని|| తరువాత బయటకు వెళ్ళాలి.
  6. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో కారు లేదా బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే కిటికీలు మరియు తలుపులు మూసివేయవలెను.

ప్రశ్న 8.
ఆవేశం కలిగిన బెలూన్, ఆవేశం లేని బెలూన్ ఆకర్షించుకుంటాయి. కానీ ఒకే ఆవేశం కలిగిన రెండు బెలూన్లు ఎందుకు వికర్షించుకుంటాయి? వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆవేశం గల బెలూన్ దగ్గరకు ఆవేశం లేని బెలూన్ ను తీసుకొని వచ్చినపుడు ఆవేశం లేని బెలూన్ పై ఆవేశం గల బెలూన్ ప్రభావంతో వ్యతిరేక ఆవేశం ప్రేరేపించబడుతుంది.
  2. వ్యతిరేక ఆవేశాలు గల బెలూన్ల మధ్య ఆకర్షణ బలం పనిచేయడం వల్ల ఆకర్షించుకొంటాయి.
  3. కాబట్టి ఆవేశం కలిగిన బెలూన్, ఆవేశం లేని బెలూన్ ను దగ్గరకు తెచ్చినపుడు ఆకర్షించుకొంటుంది.
  4. ఒకే ఆవేశం గల వస్తువుల మధ్య వికర్షణ బలం ఉంటుంది.
  5. కాబట్టి ఒకే ఆవేశం గల బెలూన్ల మధ్య వికర్షణ బలం వలన వికర్షించుకొంటాయి.

ప్రశ్న 9.
భారతదేశంలో భూకంపాలు తరచుగా వచ్చే రాష్ట్రాలను మూడింటిని తెల్పండి. (AS1)
జవాబు:
భారతదేశంలో భూకంపాలు తరచుగా వచ్చే రాష్ట్రాలు :

  1. కాశ్మీర్
  2. రాజస్థాన్
  3. గుజరాత్.

ప్రశ్న 10.
మీరున్న ఆవాస ప్రాంతం భూకంప ప్రమాద ప్రాంతంలో ఉందా? వివరించండి. (AS1)
జవాబు:
మేము ఉన్న ఆవాస ప్రాంతం భూకంప ప్రమాద ప్రాంతంలో లేదు.
(లేదా)

  1. మేము ఉన్న ఆవాసప్రాంతం భూకంప ప్రమాద ప్రాంతంలో ఉంది.
  2. ఆంధ్రప్రదేశ్ లో భూకంప ప్రమాద ప్రాంతాలు :
    1) ఒంగోలు
    2) విజయనగరం
    3) దర్శి

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1

ప్రశ్న 11.
మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువసార్లు భూకంపం వచ్చింది? (AS1)
జవాబు:

  1. ఒంగోలు
  2. నెల్లూరు
  3. శ్రీకాకుళం
  4. గుంటూరు
  5. తిరుపతి
  6. కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతాలు
  7. బంగాళాఖాతములో ఎక్కువసార్లు భూకంపాలు వచ్చాయి.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 12.
ఒక పదార్థం ఎప్పుడు ఆవేశం పొందుతుంది? (AS1)
జవాబు:

  1. పదార్థం రాపిడిలో ఉన్నప్పుడు ఆవేశం పొందుతుంది.
  2. ఒక పదార్థం వద్దకు మరొక ఆవేశం గల పదార్థాన్ని దగ్గరగా తెచ్చినపుడు ఆవేశంలేని పదార్థంలో ఆవేశం ప్రేరేపించబడి, వ్యతిరేక ఆవేశం ఏర్పడుతుంది.
  3. ఆవేశం లేని వస్తువుకు, వాహకం ద్వారా ఆవేశపరచినపుడు ఆవేశం పొందుతుంది.

ప్రశ్న 13.
ఒకే ఆవేశం కలిగిన రెండు వస్తువులను దగ్గరగా చేర్చితే ఏం జరుగుతుంది? వేరు వేరు ఆవేశాలు కలిగివున్న రెండు వస్తువులను దగ్గరగా చేర్చితే ఏం జరుగుతుంది? ఇటువంటి ఉదాహరణలు ఏమైనా ఇవ్వగలరా? (AS1)
జవాబు:
ఎ) రెండు వస్తువులు ఒకే ఆవేశం కలిగి ఉంటే వాటి మధ్య వికర్షణ బలం ఉంటుంది.
ఉదా : 1) ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్, ఉన్ని గుడ్డతో రుద్దిన మరో బెలూన్ ను వికర్షించినది.
2) పాలిథిన్ కాగితంతో రుదైన రిఫిల్ ను, పాలిథిన్ కాగితంతో రుద్దిన మరో రీఫిల్ వికర్షించినది.
3) ఒకే ఆవేశం గల బెలూన్లు లేదా ఒకే ఆవేశం గల రిఫిల్ మధ్య వికర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.

బి)

  1. వేరు వేరు ఆవేశపూరిత వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఉంటుంది.
  2. రెండు వస్తువులు వేరు వేరు ఆవేశాలు కలిగి ఉంటే వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది.
    ఉదా : 1) ఒక రిఫిల్ ను తీసుకొని పాలిథిన్ కాగితంతో రుద్ది, దానిని ఒక ప్లాస్టిక్ గ్లాసులో ఉంచండి.
    2) ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్ ను గ్లాసులో గల రిఫిల్ వద్దకు తీసుకుని వెళ్ళి పరిశీలించండి.
    3) రిఫిల్ ను బెలూన్ వికర్షిస్తుంది. కాబట్టి విరుద్ధ ఆవేశాలు గల వస్తువుల మధ్య వికర్షణ బలం ఉంటుందని తెలుస్తుంది.

ప్రశ్న 14.
ఆవేశాల బదిలీ వలన కలిగే ప్రభావాన్ని వివరించే నిత్యజీవిత సందర్భాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
ఆవేశాల బదిలీ వలన కలిగే ప్రభావాన్ని వివరించే రెండు ఉదాహరణలు :

  1. ఎర్తింగ్ చేయడం.
  2. విద్యుదర్శిని ఉపయోగించి ఒక వస్తువు పై గల ఆవేశాన్ని గుర్తించడం.
  3. ఘటాలలో ఉండే విద్యుదావేశాలను తీగల ద్వారా బల్బుకు అందించి వెలిగించడం.

ప్రశ్న 15.
రెండు బెలూన్లను ఊదండి. వాటిని మొదటగా గుడ్డతో, తర్వాత వేరొక వస్తువుతో రాపిడి చేయండి. రెండు సందర్భాలలోనూ అవి ఆకర్షించుకుంటాయా? (AS3)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 2

  1. రెండు బెలూన్లను తీసుకొని గాలిని నింపండి.
  2. రెండు బెలూన్లను ప్రక్క పటంలో చూపినట్లు ఒకదాని ప్రక్కన మరొకటి తగలకుండా వేలాడదీయండి.
  3. ఒక బెలూనను ఉన్నిగుడ్డతో రుద్ది వదలండి.
  4. రెండవ బెలూనను ప్లాస్టిక్ కాగితంతో రుద్ది వదలండి.
  5. రెండు బెలూన్లను ఉన్ని గుడ్డ, ప్లాస్టిక్ కాగితంతో రుద్దే సమయంలో మీ చేతులు బెలూన్లకు తగలకుండా జాగ్రత్త వహించాలి.
  6. రెండు బెలూన్లు ఒక దానితో మరొకటి వికర్షించుకొనుటను గమనించవచ్చును.
  7. పై ప్రయోగం ఆధారంగా రెండు బెలూన్లను తీసుకొని ఒకదానిని ఉన్ని గుడ్డతో, రెండవ దానిని ప్లాస్టిక్ కాగితం (ఇతర వస్తువుతో) రాపిడికి గురిచేస్తే ఆ రెండు బెలూన్లు వికర్షించుకొంటాయి అని తెలుస్తుంది.

ప్రశ్న 16.
భూమిలోని పలకలు ఢీకొన్నప్పుడు విడుదలయ్యే శక్తిని, ఆ సమయంలో భూ వాతావరణంలో మార్పులను ఏ విధంగా పోలుస్తారు? (AS4)
జవాబు:
భూమిలోని పలకలు ఢీకొన్నప్పుడు విడుదలయ్యే శక్తి భూ వాతావరణంలో మార్పులు :

  1. పెద్ద భవనాలు, కట్టడాలు నేలమట్టం అవుతాయి.
  2. పెద్ద పెద్ద చెట్లు, ఎలక్ట్రికల్, టెలిఫోన్ స్తంభాలు నేలమట్టం అవుతాయి.
  3. నదుల మార్గాలను మారుస్తాయి.
  4. భూ తలాలను చీలుస్తాయి.
  5. పెద్ద పెద్ద భూభాగాలు వాటి స్థానం నుండి దూరంగా జరుగుతాయి.
  6. పర్వతాలు లోయలుగా మారవచ్చును.

ప్రశ్న 17.
ప్రపంచంలో ఏ దేశంలో తరచుగా భూకంపాలు వస్తాయి? ఈ మధ్యకాలంలో జపాన్లో వచ్చిన భూకంపం వివరాలు, చిత్రాలు సేకరించండి. (AS4)
జవాబు:
ప్రపంచంలో జపాన్ దేశంలో తరచుగా భూకంపాలు వస్తాయి.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 3

ప్రశ్న 18.
మీరున్న ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు బాధితులకు సహాయం అందించే సంస్థలు ఏవైనా ఉన్నాయా గుర్తించండి. భూకంప బాధితులకు ఏ రకమైన సహాయం ఇస్తారో కనుక్కోండి. ఈ అంశాలపై చిన్న నివేదికను రూపొందించండి. (AS4)
జవాబు:

  1. ప్రభుత్వం బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి తగిన ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయం చేస్తుంది.
  2. ప్రభుత్వ, ప్రభుత్వేతర డాక్టర్లు మరియు జూనియర్ డాక్టర్లు బాధితులకు వైద్య సేవలు చేస్తారు.
  3. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగస్థులు విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తారు. దీనిని ప్రభుత్వం బాధితులకు ఉపయోగిస్తుంది.
  4. పాఠశాల, కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా విరాళాలు మరియు బట్టలు సేకరించి బాధితులకు సరఫరా చేస్తారు.
  5. వివిధ దిన పత్రికలు బాధితుల సహాయ నిధికి విరాళాలు సేకరించి, బాధితులకు ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయం చేస్తాయి.
  6. వివిధ ప్రాంతాలలో ఉండే స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు బాధితులకు విరాళ రూపేణా ఆర్థిక మరియు వారికి కావలసిన వస్తువులను అందిస్తారు.
  7. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు సేకరించి బాధితులకు కావలసిన ఆర్థిక మరియు వారి అవసరాలకు సంబంధించిన సహాయం చేస్తుంది. ఉదా : సినిమా యాక్టర్లు, సంగీత కళాకారులు.
  8. ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు బాధితులకు పిల్లలకు కావలసిన పుస్తకాలు, బట్టలు, పాఠశాల నిర్మాణాలకు సహాయం చేస్తాయి.
  9. యువజన సంఘాలు విరాళాలు సేకరించి బాధితులకు వారికి అవసరమైన విధంగా సహాయం చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 19.
వస్తువుకున్న ఆవేశాన్ని గుర్తించడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు? పటం ద్వారా వివరించండి. (కృత్యం -1) (AS5)
జవాబు:
ఒక వస్తువు ఆవేశాన్ని గుర్తించడానికి విద్యుదర్శినిని ఉపయోగిస్తారు.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 4

విద్యుదర్శిని :

  1. ఒక ఖాళీ సీసా తీసుకోండి.
  2. సీసా మూతకంటే పెద్దదైన కార్డుబోర్డు ముక్కను తీసుకోండి.
  3. కార్డుబోర్డు ముక్కకు మధ్యలో చిన్న రంధ్రం చేయండి.
  4. 4 సెం.మీ x 1 సెం.మీ పరిమాణంలో గల రెండు అల్యూమినియం రేకులను తీసుకోండి.
  5. వాటిని ప్రక్క పటంలో చూపినట్లు పేపరు క్లిప్ యొక్క ఒక కొనపై ఉంచి, ఆ పేపర్ క్లిప్ ను కార్డ్ బోర్డ్ యొక్క రంధ్రం గుండా గుచ్చి సీసాలోకి నిలువుగా వేలాడదీయండి.
  6. ఆవేశ పరచబడిన ఒక వస్తువును పేపరు క్లిప్ రెండవ కొనకు తాకించండి.
  7. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశం పేపరు క్లిప్ ద్వారా రెండు అల్యూమినియం రేకులకు అందుతుంది.
  8. అల్యూమినియం రేకులకు అందిన ఆవేశం ఒకే రకమైనది కాబట్టి అల్యూమినియం రేకులు వికర్షించుకుంటాయి.
  9. అల్యూమినియం రేకులు వికర్షించుకొని దూరం జరగడం వలన వస్తువులో ఆవేశం ఉన్నట్లుగా గుర్తించవచ్చును.

ప్రశ్న 20.
భారతదేశ పటంలో భూకంప ప్రమాద ప్రాంతాలను రంగులతో గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 5

ప్రశ్న 21.
భూకంప లేఖిని నమూనా రూపొందించండి. (AS5)
జవాబు:
భూకంపలేఖిని నమూనాను తయారుచేయుట.

కావలసిన వస్తువులు :

  1. శీతలపానీయ సీసా,
  2. L ఆకారం గల లోహపు కడ్డీ,
  3. దీర్ఘచతురస్రాకార ప్లాస్టిక్ డబ్బా,
  4. బాల్ పాయింట్ పెన్ను,
  5. దారం,
  6. ఇసుక,
  7. తెల్ల కాగితం.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 6
తయారుచేయు విధానం :

  1. శీతలపానీయ సీసాలో పటంలో చూపిన విధంగా (L) ఆకారం గల లోహపు కడ్డీని అమర్చి ఇసుకతో నింపండి.
  2. బరువు గల బాల్ పాయింట్ పెన్నుకు దారమును కట్టి లోహపు కడ్డీకి వేలాడదీయండి.
  3. బాల్ – పాయింట్ పెన్ను లోలకం వలె పనిచేస్తుంది.
  4. దీర్ఘచతురస్రాకార ప్లాస్టిక్ డబ్బాపై తెల్లకాగితం ఉంచి, బాల్ – పాయింట్ మొన తెల్లకాగితాన్ని తాకునట్లు అమర్చవలెను.
  5. భూకంపం వచ్చే సమయంలో బాల్ – పాయింట్ పెన్ను ఇసుక భూకంపనాల వలన కంపిస్తుంది.
  6. బాల్ – పాయింట్ పెన్ను చేసే కంపనాలు తెల్లకాగితంపై నమోదు అగును. వాటిని అధ్యయనం చేసి భూకంప వివరాలను రూపొందించవచ్చును.

ప్రశ్న 22.
భూకంప తీవ్రత, దాని మూలాన్ని గుర్తించే పరికరం రూపొందించిన శాస్త్రవేత్తల కృషిని ఎలా ప్రశంసిస్తావు? (AS6)
జవాబు:

  1. భూకంప తీవ్రత, దాని మూలాలను గుర్తించే పరికరాలు భూకంపలేఖిని, భూకంపదర్శిని.
  2. భూకంపదర్శిని గుర్తించే రిక్టర్ స్కేలు విలువలను బట్టి భూకంప ప్రభావాన్ని గుర్తిస్తారు.
  3. రిక్టరు స్కేలు విలువల ఆధారంగా భూకంపం ఎన్ని కిలోమీటర్ల మేరకు ప్రభావాన్ని చూపుతుందో అంచనా వేయవచ్చును.
  4. రిక్టరు స్కేలు విలువను బట్టి జరిగిన ఆస్తి మరియు ప్రాణ నష్టాన్ని అంచనా వేయవచ్చును.
  5. భూకంప ప్రభావిత ప్రాంతాలలో వచ్చే భూకంపాలను తట్టుకొనే విధంగా భవన నిర్మాణాలను నిర్మించవచ్చును.
  6. భూకంప సమయంలో ఎక్కువగా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు తగిన సూచనలను ఇవ్వవచ్చును. ఇన్ని ఉపయోగాలు గల భూకంప లేఖిని, భూకంపదర్శినిని తయారుచేసిన శాస్త్రవేత్తలను ప్రశంసించవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 23.
భూకంపం వచ్చినపుడు ఇంటి బయట ఉంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? (AS7)
జవాబు:

  1. భవనాలకు దూరంగా ఉండవలెను.
  2. చెట్లకు దూరంగా ఉండవలెను.
  3. హైటెన్షన్ విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి.
  4. కారులో గాని, బస్సులో గాని ప్రయాణిస్తున్నట్లైతే నెమ్మదిగా బహిరంగ ప్రదేశానికీ నడపాలి. కారు లేదా బస్సు నుండి బయటకు రాకూడదు.

ప్రశ్న 24.
వాతావరణశాఖ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావచ్చని హెచ్చరించింది. ఆ సమయంలో మీరు బయటకు – వెళ్లాల్సి వచ్చింది. మీరు గొడుగు తీసుకొని వెళ్తారా? వివరించండి. (AS7)
జవాబు:

  1. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో నేను బయటకు వెళ్లాల్సివస్తే గొడుగును తీసుకొనిపోను. వర్షపుకోటు వేసుకుపోతాను.
  2. గొడుగు లోహపు గొట్టాలు మరియు లోహపు పుల్లతో తయారుచేయబడి ఉంటుంది. లోహం విద్యుత్ వాహకం.
  3. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో గొడుగుతో వెళితే, ఉరుము, మెరుపులు గొడుగు ద్వారా మన శరీరంలోనికి అధికమొత్తంలో విద్యుదావేశం ప్రవేశించి, విద్యుత్ షాక్ ద్వారా హాని కలుగుతుంది.
    కాబట్టి ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో గొడుగుతో బయటకు వెళ్ళకూడదు.

ప్రశ్న 25.
మీరున్న ప్రాంతంలో భూకంపం వస్తే ఏం చేస్తారు? మీరు ఇంటిలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ఏం చేస్తారు? (AS7)
జవాబు:
భూకంపం వచ్చినప్పుడు రక్షించుకొనుటకు ఈ కింది విధంగా చేయవలెను.

  1. భవనాలకు దూరంగా ఉండవలెను.
  2. చెట్లకు, హైటెన్షన్ తీగలకు దూరంగా ఉండవలెను.
  3. కారులోగాని, బస్సులోగాని ప్రయాణిస్తున్నట్లైతే నెమ్మదిగా బహిరంగ ప్రదేశాలకు నడపాలి.
  4. కారులో నుండి గాని, బస్సులో నుండి గాని బయటకు రాకూడదు.

ప్రశ్న 26.
మీరు ఇంటిలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ఏం చేస్తారు? (AS7)
జవాబు:

  1. భూమి కంపించడం తగ్గే వరకు బల్ల కిందికి వెళ్లటం.
  2. కిటికీలకు, అల్మరాలకు (బీరువాలకు) దూరంగా ఉండవలెను.
  3. ఎత్తైన వస్తువులకు దూరంగా ఉండవలెను.
  4. ఒకవేళ మంచంపై పడుకొని ఉన్నట్లయితే తలపై దిండును పెట్టుకోవలెను.
  5. విద్యుత్ సరఫరాను ఆపివేయవలెను.

పరికరాల జాబితా

పొడిదువ్వెన, రబ్బరు బెలూన్లు, కాగితం ముక్కలు, రీఫిల్, స్ట్రా, ఎండిన ఆకులు, ఊక లేదా పొట్టు, స్టీలు స్పూన్, పాలిథీన్ షీటు, కాగితం, ఉన్ని గుడ్డ, థర్మోకోల్ బంతి, సిల్కు గుడ్డ, గాజు సీసా, కార్డుబోర్డు ముక్క పేపర్ క్లిప్, వెండిపొర, గాజుకడ్డీ, పలుచని అల్యూమినియం రేకులు.

8th Class Physical Science 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
రాపిడి ద్వారా ఆవేశాన్ని ఉత్పత్తి చేయుట – రాపిడి యొక్క ఫలితము.

ఈ కింది పట్టికలోని వస్తువులకు రాపిడి ద్వారా ఆవేశాలను ఉత్పత్తి చేసి, ఆ ఆవేశాలు వివిధ వస్తువులతో ఆకర్షణ, వికర్షణలు ఏ విధంగా ఉండునో పట్టికలో నమోదు చేయండి. మరియు ఈ కృత్యం వలన మీరు గమనించిన విషయాన్ని రాయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 7
ఈ కృత్యం ద్వారా గమనించిన విషయాలు :
1) వస్తువులను రాపిడికి గురిచేస్తే వస్తువులపై ఆవేశం ఏర్పడుతుంది.
2) ఆవేశం గల వస్తువును ఆవేశం లేని వస్తువు వద్దకు దగ్గరకు తెస్తే ఆవేశం లేని వస్తువుపై ఆవేశం ప్రేరేపింపబడి, ఆకర్షిస్తుంది.

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 2.
వస్తువులను రాపిడికి గురిచేయడం వల్ల ఏర్పడే ఆవేశాల మధ్య ఆకర్షణ వికర్షణ బలాలు ఉంటాయని ప్రయోగం ద్వారా వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
వివిధ వస్తువులతో రుద్దడం వలన ఆవేశాన్ని పొందిన వస్తువుల ఆవేశ ప్రభావాన్ని కనుగొనుట).

కావలసిన పరికరాలు :
రిఫిల్, బెలూన్, దువ్వెన, రబ్బరు, స్టీల్ స్పూన్, పాలిథిన్ షీట్, కాగితం, ఉని, గుడ్డ.

పద్దతి :
ఈ కింది పట్టికలోని మొదటి వరుసలో గల వస్తువులను వాటికెదురుగా గల రెండవ వరుసలోని వస్తువులతో కొద్ది సేపు రుద్దండి. తరువాత అలా రుద్దిన ప్రతి వస్తువునూ చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గరకు తీసుకురండి.
పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 8

నిర్ధారణ :
రీఫిల్, దువ్వెన వంటి కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేక పదార్థాలతో రుద్దినపుడు కాగితపు ముక్కల వంటి చిన్న చిన్న వస్తువులను ఆకర్షిస్తాయి. కాని స్పూనవంటి వస్తువులను ఏ పదార్థంతో రుద్దినప్పటికీ ఇతర వస్తువులను ఆకర్షించవు.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

కృత్యం – 2

ప్రశ్న 3.
ఆవేశాల రకాలను అవగాహన చేసుకొనుట:
ఒకే ఆవేశం గల వస్తువుల మధ్య వికర్షణ ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 2

  1. రెండు బెలూన్లను తీసుకుని వాటిలో గాలిని ఊడండి.
  2. ప్రక్క పటంలో చూపిన విధంగా రెండు బెలూన్లను ఒకదానికి మరొకటి తగలకుండా వేలాడదీయండి.
  3. రెండు బెలూన్లను ఉన్ని గుడ్డతో రుద్ది వదలండి.
  4. ఉన్ని గుడ్డతో బెలూన్లను రుద్దే సమయంలో చేతులను బెలూనకు తగలకుండా జాగ్రత్త పడండి.
  5. రెండు బెలూన్లు ఒకదానితో మరొకటి వికర్షించుకుంటాయి.
  6. రెండు బెలూన్లు ఉన్ని గుడ్డతో రుద్దడం వలన రెండు బెలూన్లకు ఒకే ఆవేశం ఏర్పడుతుంది.
  7. ఒకే ఆవేశం గల వస్తువుల మధ్య వికర్షణ ఉంటుందని ఈ కృత్యం ద్వారా మనకు తెలుస్తుంది.

కృత్యం – 3

ప్రశ్న 4.
ఒక వస్తువుపై ఉన్న ఆవేశాన్ని కనుగొనుట.
ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 9

  1. ఒక చిన్న థర్మాకోల్ బంతిని తీసుకోండి. దాని చుట్టూ పలుచని వెండిపొరను చుట్టండి.
  2. ఈ థర్మాకోల్ బంతిని ప్రక్క పటంలో చూపిన విధంగా స్టాండుకు వేలాడదీయండి.
  3. సిల్క్ గుడ్డతో రుద్దిన గాజు కడ్డీని ఈ థర్మాకోల్ బంతి దగ్గరకు తీసుకురండి. రెండూ ఆకర్షించుకొంటాయి.
  4. గాజు కడ్డీని థర్మాకోల్ బంతికి ఆనించండి. ఆ తరువాత గాజుకడ్డీని మరల సిల్క్ గుడ్డతో రుద్దండి.
  5. తిరిగి గాజు కడ్డీని థర్మాకోల్ బంతి వద్దకు తీసుకురండి.
  6. ఈసారి థర్మాకోల్ బంతి గాజుకడ్డీకి దూరంగా పోవుటను అనగా వికర్షించుటను గమనించవచ్చును.
  7. థర్మాకోల్ బంతి మరియు గాజుకడ్డీలపై ఒకే రకమైన ఆవేశం ఉండటం వలన రెండూ వికర్షించుకొంటున్నాయి.
  8. ఈ కృత్యం ద్వారా ఒకే ఆవేశాలు వికర్షించుకొంటాయి అని తెలుస్తుంది.
  9. ఆవేశాన్ని గుర్తించడానికి వికర్షణ ధర్మం సరియైనది అని తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

కృత్యం – 5

ప్రశ్న 5.
భూకంపాల వల్ల కలిగే నష్టాల సమాచారాన్ని సేకరించుట.

భూకంపాలు సంభవించినప్పుడు పెద్దఎత్తున జరిగే ఆస్తి, ప్రాణ నష్టం గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. భూకంపం వచ్చిన రోజుల్లో పత్రికలో వచ్చిన చిత్రాలు, వార్తా కథనాలను సేకరించండి.
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 10

AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 11
ఎ) భూకంపం అంటే ఏమిటి?
జవాబు:
భూపటలంలో ఏర్పడే కదలికల వలన భూకంపాలు వస్తాయి.

బి) భూకంపం వచ్చినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
భూకంపం వచ్చినపుడు భూమి తీవ్రమైన ప్రకంపనలకు గురి అవుతుంది. దీని ఫలితంగా భూమిపై గల భవనాలు, కట్టడాలు శిథిలమై ప్రమాదాలు సంభవిస్తాయి. సముద్రాలలో సునామీలు ఏర్పడతాయి.

సి) భూకంప ప్రభావాన్ని తగ్గించడానికి ఏమి చేయవచ్చు?
జవాబు:

  1. ముఖ్యంగా సెస్మిక్ ప్రాంతాల్లో నివసించేవారు భవన నిర్మాణాలను భూకంపాలకు తట్టుకునే విధంగా చేసుకోవాలి.
  2. భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నచోట్ల మట్టి, కలప, తేలికపాటి చెక్కలు ఉపయోగించి నిర్మాణాలు చేయాలి. భవనాలపై భాగం తేలికగా ఉంటే అవి కూలిపోయినప్పుడు నష్టం తక్కువగా ఉంటుంది.
  3. ఇంటి గోడలకు అల్మారాలు ఏర్పాటు చేయాలి. అవి త్వరగా పడిపోవు.
  4. గోడలకు వ్రేలాడదీసిన వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అవి మీద పడవచ్చు.
  5. భూకంపాలు వచ్చిన సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కనుక విద్యుత్ పరికరాలు, గ్యాస్ సిలిండర్ల పట్ల జాగ్రత్త వహించాలి.
  6. పెద్ద పెద్ద భవనాల్లో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

కృత్యం – 6

ప్రశ్న 6.
సునామికి గురి అయిన ప్రాంతాలను పటంలో గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 12

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

SCERT AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 10th Lesson Questions and Answers సమతలాల వద్ద కాంతి పరావర్తనం

8th Class Physical Science 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కాంతి పరావర్తన నియమాలను తెల్పండి. (AS1)
(లేదా)
కాంతి పరావర్తన నియమాలను వ్రాయుము.
జవాబు:
పరావర్తన నియమాలు :

1) కాంతి ఏదైనా ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు, పతన కోణం (i), పరావర్తనకోణం (r) లు సమానంగా ఉంటాయి.
2) పతనకోణం, పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం మరియు పరావర్తన కిరణం ఒకే తలంలో ఉంటాయి. ప్రక్క పటంలో
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 1
PQ = పతన కిరణం
QR = పరావర్తన కిరణం
QS = లంబం
Q = పతన బిందువు
∠i = పతన కోణం
∠r = పరావర్తన కోణం
AQB = పరావర్తన తలం

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 2.
కాంతి మొదటి పరావర్తన సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా మీరు ఎలా సరిచూస్తారు? (AS3)
(లేదా)
సుధీర్ పరావర్తన సూత్రాలను నిరూపించాలనుకున్నాడు. అతనికి అవసరమైన పరికరాలేవి? పరావర్తన సూత్రాలను తెల్పి ప్రయోగ నిర్వహణను గూర్చి తెల్పుము.
(లేదా)
రాజు అను విద్యార్థి, సమతల దర్పణంలో పతన కోణము విలువ పరావర్తన కోణము విలువకు సమానమని వినెను. దీని నిరూపణకు ఒక ప్రయోగమును వ్రాయుము. (ప్రయోగశాల కృత్యం -1)
జవాబు:
ఉద్దేశ్యం :
కాంతి మొదటి పరావర్తన సూత్రాన్ని సరిచూచుట.

కావలసిన వస్తువులు :
అద్దం, డ్రాయింగ్ బోర్డు, తెల్లకాగితం, గుండుసూదులు, డ్రాయింగ్ బోర్డు క్లాంపులు, స్కేలు మరియు పెన్సిల్.
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 2

పద్ధతి :

  1. ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొని క్లాంపుల సహాయంతో దానిపై ఒక తెల్ల కాగితాన్ని అమర్చండి.
  2. కాగితం మధ్య భాగంలో AB అనే రేఖాఖండాన్ని గీయండి.
  3. AB పై ఏదైనా బిందువు ‘O’ వద్ద AB కి లంబాన్ని (ON) గీయండి.
  4. ON తో కొంతకోణం (i) చేసే విధంగా PQ రేఖాఖండాన్ని గీయండి.
  5. P, Q బిందువుల వద్ద రెండు గుండుసూదులను నిలువుగా గుచ్చండి.
  6. AB వెంబడి నిలువుగా అమర్చిన అద్దంలో P, Qల వద్ద గుచ్చిన గుండుసూదుల ప్రతిబింబాలు P’, Q’ లను పరిశీలించండి.
  7. P’, Q’ లతో ఒకే వరుసలో ఉండే విధంగా R, Sల వద్ద మరో రెండు గుండుసూదులు గుచ్చండి.
  8. R, S మరియు ) లను కలపండి.
  9. ON, RS ల మధ్య కోణం (r) ను కొలవండి.
  10. ∠i = ∠r అని మనము గుర్తించవచ్చును.
  11. ఇదే ప్రయోగాన్ని వివిధ పతనకోణాలతో చేసి చూడండి.
  12. ప్రతీ సందర్భంలో ∠i = ∠r అని గమనించండి.
  13. ఈ విధంగా కాంతి ఏదైనా ఉపరితలంపై పడి పరావర్తనం చెందినపుడు పతనకోణం, పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయి. కాంతి మొదటి పరావర్తన నియమాన్ని గమనించవచ్చును.

ప్రశ్న 3.
కాంతి రెండవ పరావర్తన సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా మీరు ఎలా సరిచూస్తారు?
(లేదా)
రఘు అను విద్యార్థి సమతల దర్పణంతో కాంతి ప్రసరణ నందు ఒకే తలంపై ఉండునని తెలుసుకొనెను. దీని నిరూపణకు కావలసిన పరికరాలేవి? ప్రయోగం ద్వారా నిరూపించుము.
(లేదా)
నీవు ఏ విధముగా కాంతి రెండవ పరావర్తన నియమమును సరిచూచెదవు? వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
కాంతి రెండవ పరావర్తన సూత్రాన్ని సరిచూచుట.

కావలసిన వస్తువులు :
అద్దం, డ్రాయింగ్ బోర్డు, తెల్లకాగితం, గుండుసూదులు, డ్రాయింగ్ బోర్డు క్లాంపులు, స్కేలు మరియు పెన్సిల్
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 2

పద్దతి :

  1. ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొని క్లాంపుల సహాయంతో దానిపై ఒక తెల్ల కాగితాన్ని అమర్చండి.
  2. కాగితం మధ్య భాగంలో AB అనే రేఖాఖండాన్ని గీయండి.
  3. AB పై ఏదైనా బిందువు ‘O’ వద్ద AB కి లంబాన్ని (ON) గీయండి.
  4. ON తో కొంతకోణం (i) చేసే విధంగా PQ రేఖాఖండాన్ని గీయండి.
  5. P, Q బిందువుల వద్ద రెండు గుండుసూదులను నిలువుగా గుచ్చండి.
  6. AB వెంబడి నిలువుగా అమర్చిన అద్దంలో P, Q ల వద్ద గుచ్చిన గుండుసూదుల ప్రతిబింబాలు P’, Q’ లను పరిశీలించండి.
  7. P’, Q’ లతో ఒకే వరుసలో ఉండే విధంగా R, S ల వద్ద మరో రెండు గుండుసూదులు గుచ్చండి.
  8. R, S మరియు 0 లను కలపండి. 9) P, Q బిందువుల గుండా పోవు కిరణం “పతన కిరణం”.
  9. R, S బిందువుల గుండా పోవు కిరణం “పరావర్తన కిరణం”.
  10. ON అనునది ‘O’ వద్ద అద్దానికి లంబం.
  11. ఈ మూడు ఒకే కాగితం అనగా ఒకే తలంపై కలవు.
  12. ఈ విధంగా పరావర్తన 2వ నియమాన్ని సరిచూడవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 4.
పిహోల్ కెమెరాలో ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని పటం ద్వారా వివరించండి. (కృత్యం -1) (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 3
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 4

  1. ఒక కొవ్వొత్తిని వెలిగించి దానిని పిస్తోల్ కెమెరా గుండా చూడుము.
  2. లోపల అమర్చబడిన సన్నని గొట్టపు వెనుక భాగం నుండి చూస్తూ సన్నని గొట్టాన్ని వెనుకకు, ముందుకు కదుపుతూ కొవ్వొత్తి మంట గొట్టానికి అమర్చిన తెరపై స్పష్టంగా కనిపించునట్లు చేయుము.
  3. తెరపై కొవ్వొత్తి మంట తలక్రిందులుగా ఉండునట్లు కనపడును.
  4. కొవ్వొత్తి మంట, ప్రతి బిందువు నుండి అన్ని దిశలలో కాంతి – ఋజుమార్గంలో ప్రయాణించును.
  5. కాని ఒక ప్రత్యేక దిశలో పిహోల్ కెమెరా వైపుగా వచ్చిన కాంతి కిరణాలే కెమెరాలోనికి ప్రవేశిస్తాయి.
  6. కొవ్వొత్తి మంట యొక్క పై భాగం నుండి వెలువడిన కాంతి ఋజుమార్గంలో ప్రయాణించి, కెమెరాలోని తెరక్రింది ఆ భాగానికి చేరును.
  7. అదే విధంగా కొవ్వొత్తి మంట క్రింది భాగం నుండి వెలువడిన కాంతి కెమెరాలోని తెర పైభాగానికి చేరును.
  8. దీనివలన తెరపై మంట ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడును.
  9. కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడటం అనునది కాంతి ఋజుమార్గ ప్రయాణం వలన సాధ్యం.

ప్రశ్న 5.
సమతల దర్పణానికి ముందు ఉంచిన రెండు గుండుసూదుల తలలను తాకుతూ పోయి దర్పణంపై పతనమయ్యే కిరణానికి సంబంధించిన పరావర్తన తలాన్ని ప్రయోగపూర్వకంగా కనుక్కోండి. (AS3)
జవాబు:
ఉద్దేశ్యం :
పరావర్తన తలాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొనుట.

కావలసిన వస్తువులు :
అద్దం, డ్రాయింగ్ బోర్డు, తెల్లకాగితం, క్లాంపులు, గుండుసూదులు, స్కేలు మరియు పెన్సిల్.
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 2

పద్దతి :

  1. ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొని క్లాంపుల సహాయంతో దానిపై ఒక తెల్ల కాగితాన్ని అమర్చండి.
  2. కాగితం మధ్య భాగంలో AB అనే రేఖాఖండాన్ని గీయండి.
  3. AB పై ఏదైనా బిందువు ‘O’ వద్ద AB కి లంబాన్ని (ON) గీయండి.
  4. ON తో కొంతకోణం (i) చేసే విధంగా PQ రేఖాఖండాన్ని గీయండి.
  5. P, Q బిందువుల వద్ద రెండు గుండుసూదులను నిలువుగా గుచ్చండి.
  6. AB వెంబడి నిలువుగా అమర్చిన అద్దంలో P, Q ల వద్ద గుచ్చిన గుండుసూదుల ప్రతిబింబాలు P’, Q’ లను పరిశీలించండి.
  7. P’, Q’ లతో ఒకే వరుసలో ఉండే విధంగా R, Sల వద్ద మరో రెండు గుండుసూదులు గుచ్చండి.
  8. R, S మరియు O లను కలపండి.
  9. P, Q బిందువుల గుండా పోవు కిరణం “పతన కిరణం”.
  10. R, S బిందువుల గుండా పోవు కిరణం “పరావర్తన కిరణం”.
  11. ON అనునది ‘O’ వద్ద అద్దానికి లంబం.
  12. ఈ మూడూ ఒకే కాగితం అనగా ఒకే తలంపై కలవు.
  13. ఈ మూడూ అనగా పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబం ఉన్నటువంటి తలాన్ని “పరావర్తన తలం” అంటారు.
  14. ఈ విధంగా మనం ప్రయోగపూర్వకంగా పరావర్తన తలాన్ని పరిశీలించవచ్చును.

ప్రశ్న 6.
వర్షం వల్ల ఏర్పడ్డ నీటిగుంటలలో ఆకాశపు ప్రతిబింబాన్ని మీరెప్పుడైనా చూశారా? ఇందులో కాంతి పరావర్తనం ఎలా జరుగుతుందో వివరించండి. (AS6)
జవాబు:

  1. వర్షం వల్ల ఏర్పడ్డ నీటి గుంటలలో ఆకాశపు ప్రతిబింబం ఏర్పడుతుంది.
  2. దూరం నుండి చూసినపుడు నీటిలో చిన్న ఎండమావి కన్పిస్తుంది.
  3. ఈ ఏర్పడ్డ ఎండమావి నిజమైన వస్తువు (ఆకాశం) క్రింద ఏర్పడింది.
  4. నీలి ఆకాశం నుండి వచ్చిన కాంతి కిరణాలు గాలి గుండా ప్రయాణించి నీటి ఉపరితలంపై తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
  5. ఈ ప్రక్రియ పినహోల్ కెమెరాను పోలి ఉంటుంది.
  6. ఇక్కడ నీరు అద్దము వలె పనిచేసి ఆకాశ ప్రతిబింబం కనిపిస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 7.
భవంతులు, డాబాలను అద్దాలతో అలంకరించటం వల్ల కలిగే లాభనష్టాలను చర్చించండి. (AS6)
(లేదా)
కుంభాకార దర్పణాలను మాత్రమే “రియర్ వ్యూ మిర్రర్”గా వాడుటలో గల ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
భవంతులు, డాబాలను అద్దాలతో అలంకరించడం వల్ల కలిగే లాభాలు :

  1. అద్దాలను వాడటం వలన కాంతి మన ఇంటిలోనికి ధారాళంగా ప్రసరిస్తుంది.
  2. అద్దాలను మనకు కావలసిన ఆకారాలలో, డిజైన్లలో, పరిమాణాలలో ‘తయారుచేసుకోవచ్చును.
  3. అద్దాలను వాడటం వలన ఇంటి బయట ఏ మార్పులు సంభవిస్తున్నాయో ఇంటిలో నుండి కూడా గమనించవచ్చును.
  4. అద్దాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవచ్చు.

భవంతులు, డాబాలను అద్దాలతో అలంకరించడం వల్ల కలిగే నష్టాలు :

  1. అద్దాలతో అలంకరించడం అనేది ఖర్చుతో కూడిన పని.
  2. ఇవి సులభంగా పగులుతాయి.
  3. ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద కరిగిపోతాయి.
  4. ఇవి ఆకాశంను ప్రతిబింబిస్తాయి. దాని ప్రభావం వలన కీటకాలు, పక్షులు మొదలగునవి అయోమయంలో పడి ప్రమాదాలకు లోనవుతాయి.
  5. వీటి సూర్యకాంతి పరావర్తనం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కలదు.

ప్రశ్న 8.
ఒక కాంతి కిరణం, సమతల దర్పణంపై లంబంగా పతనమయితే పరావర్తన కోణం ఎంత ఉంటుంది? (AS1)
జవాబు:
ఒక కాంతి కిరణం, సమతల దర్పణంపై లంబంగా పతనమయితే పరావర్తన కోణం విలువ సున్నా.

ప్రశ్న 9.
సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం ఎందుకు పార్శ్వవిలోమాన్ని పొందుతుంది? (AS1)
జవాబు:
సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబము పార్శ్వవిలోమాన్ని పొందడానికి కారణం :

  1. మన కుడివైపు నుండి వచ్చే కాంతి కిరణాలు సమతల దర్పణంపై పడి పరావర్తనం చెంది మన కంటికి చేరుకున్నాయని అనుకుందాం.
  2. కాని మన మెదడు ఆ కాంతి కిరణాలు సమతల దర్పణం లోపల నుండి వస్తున్నట్లుగా మన మెదడు భావిస్తుంది.
  3. అందువలన ప్రతిబింబం యొక్క కుడి భాగం, ఎడమ భాగంలాగా కనిపిస్తుంది.
  4. దీన్నే కుడి ఎడమల తారుమారు లేదా పార్శ్వవిలోమం అంటారు.

ప్రశ్న 10.
సమతల దర్పణం వలన ఒక బిందురూప వస్తువుకు ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలియజేసే పటం గీచి వివరించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 5
వివరణ :

  1. ‘O’ వస్తుస్థానము.
  2. ‘0’ నుండి వెలువడిన కొన్ని కిరణాలు దర్పణంపై పడి, పరావర్తనం చెందుతాయి.
  3. మనము దర్పణంలోనికి చూసినప్పుడు, ఈ పరావర్తన కిరణాలు ‘l’నుండి వచ్చినట్లుగా కనబడతాయి.
  4. కనుక ‘l’ వస్తువు ‘O’ యొక్క ప్రతిబింబస్థానమౌతుంది.

ప్రశ్న 11.
ప్రక్క పటంలో AO, OB లు వరుసగా పతన, పరావర్తన కిరణాలను సూచిస్తాయి. AOB = 90° అయితే పతన కోణం, పరావర్తన కోణం ఎంత? (AS1)
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 6
జవాబు:
పతన కోణం = పరావర్తన కోణం i = r ………….. (1)
పటం నుండి ∠AOB ⇒ i + r = 90°
(1) నుండి ⇒ i + i = 90°
⇒ 2i = 90° ⇒ i = 90/2 = 45° ⇒ i = r = 45°
∴ పతన కోణం (i) – 45°: .రావర్తన కోణం (r) = 45°.

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 12.
హిందుజా ఒక సమతల దర్పణానికి ఎదురుగా 5 మీ. దూరంలో నిలబడి తన ప్రతిబింబాన్ని దర్పణంలో చూసుకున్నది. ఆమె దర్పణం దిశగా 2 మీ. దూరం నడిస్తే ఆమెకు, ఆమె ప్రతిబింబానికి మధ్య దూరం ఎంత ఉండవచ్చు? (AS1)
జవాబు:
సమతల దర్పణమునకు మరియు హిందుజాకు మధ్య గల దూరము = 5 మీ.
ఆమె దర్పణం దిశగా కదిలిన దూరం = 2 మీ.
∴ ఆమెకు, సమతల దర్పణానికి గల మధ్య దూరం = 5 – 2 = 3 మీ.
దర్పణం దిశగా నడిచిన తరువాత దర్పణానికి, ఆమె ప్రతిబింబానికి మధ్యగల దూరం = 3 మీ. ……….. (2)
∴ దర్పణం దిశగా నడిచిన తరువాత ఆమెకు, ఆమె ప్రతిబింబానికి మధ్యగల దూరం
= (1) + (2) = 3 మీ. + 3 మీ. = 6 మీ.

ప్రశ్న 13.
‘B’ అక్షరానికి సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాన్ని పటం గీచి చూపండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 7

ప్రశ్న 14.
తెల్ల కాగితం తనపై పడిన కాంతిని పరావర్తనం చెందించగలదు. అయిననూ తెల్ల కాగితంలో మనం మన ప్రతిబింబాన్ని ఎందుకు చూడలేము? (AS1)
జవాబు:
తెల్లకాగితం తనపై పడిన కాంతిని పరావర్తనం చెందించగలదు. అయిననూ తెల్లకాగితంలో మనం మన ప్రతిబింబాన్ని చూడలేక పోవుటకు గల కారణాలు :

  1. తెల్ల కాగితం యొక్క ఉపరితలం మనకు నునుపుగా కనిపించిననూ, దాని ఉపరితలం వాస్తవంగా నునుపుగా ఉండదు.
  2. అందువలన తెల్లకాగితంపై కాంతి పడినపుడు, అది వివిధ కోణాలలో కాంతిని పరావర్తనం చెందిస్తుంది.
  3. ఈ బహుళ పరావర్తనం, పరావర్తన కిరణాలను పరిక్షేపణం చేస్తుంది.
  4. అందువలన మనము ప్రతిబింబాన్ని చూడలేము.

ప్రశ్న 15.
ఇచ్చిన పటాన్ని పరిశీలించండి. AB, BC అనే సమతల దర్పణాలు పరస్పరం 120° డిగ్రీల కోణంతో అమరియున్నాయి. AB దర్పణంపై 55° కోణంతో ఒక కాంతి కిరణం పతనమయితే ‘x’ విలువను కనుగొనండి. (AS1)
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 8
జవాబు:
పటంలో చూపబడిన కోణాలను a, b, c, d లుగా గుర్తిద్దాం.
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 9
a = 55° [∵ i = r]
a + b = 90° [∵ తలానికి ఉన్న లంబానికి ఇరువైపులానున్న కోణాలు]
55° + b = 90° ⇒ b = 90° – 55° = 35°
120° + b + c = 180° [∵ త్రిభుజములోని కోణాల మొత్తము]
120° + 35° + C = 180° ⇒ c = 180° – 155° = 25°
c + d = 90° [∵ తలానికి ఉన్న లంబానికి ఇరువైపులా ఉన్న కోణాలు]
155, 25° + d = 90° ⇒ d = 90°- 25° = 65°
Ab 120, d = x [∵ i = r]
∴ x = 65°

ప్రశ్న 16.
మీ ముందు ఉన్న అద్దం నుండి ఒక వస్తువును మీ ‘కంటి వైపుగా జరుపుతున్నప్పుడు అద్దంలో ఆ వస్తువు ప్రతిబింబ పరిమాణం వస్తుపరిమాణం కంటే తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అంశాన్ని వివరించే విధంగా కోణాలను తెలియపరుస్తూ చిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 10

ప్రశ్న 17.
సమతల దర్పణాలను ఉపయోగించే వివిధ సందర్భాల సమాచారాన్ని సేకరించి నివేదిక తయారుచేయండి. (AS1)
జవాబు:
సమతల దర్పణాలను ఉపయోగించే వివిధ సందర్భాలు :

  1. మన ఇండ్లలో సాధారణంగా వ్యక్తిగత అలంకరణ కొరకు సమతల దర్పణాన్ని ఉపయోగిస్తాము.
  2. నగల దుకాణాలు, మిఠాయి అంగళ్ళలో, బార్బర్ షాట్లు వంటి దుకాణాలలో వస్తువులను, మనుషులను వివిధ దిశలలో గమనించుటకు మరియు అధిక ప్రతిబింబాలు పొందుటకు సమతల దర్పణాలను ఉపయోగిస్తారు.
  3. పెరిస్కోప్ వంటి పరికరంలో సమతల దర్పణాలను ఉపయోగిస్తారు.
  4. సోలార్ కుక్కర్ తయారీలో సమతల దర్పణాలను కాంతి పరావర్తన తలాలుగా వాడతారు.
  5. కెలిడయాస్కో లో సమతల దర్పణాలను వాడతారు.

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. పతన కోణానికి, పరావర్తన కోణం సమానమని తెలియజేసే సూత్రం
A) ఫెర్మాట్ సూత్రం
B) న్యూటన్ సూత్రం
C) పాస్కల్ సూత్రం
D) బెర్నౌలి సూత్రం
జవాబు:
A) ఫెర్మాట్ సూత్రం

2. ఈ క్రింది అక్షరాలలో సమతల దర్పణం వలన పార్శ్వవిలోమం పొందనట్లుగా కనిపించేది
A) K
B) O
C) J
D) S
జవాబు:
B) O

3. సమతల దర్పణానికి 90° కోణంతో ఒక కాంతి కిరణం పతనమయితే పరావర్తన కోణం విలువ :
A) 0°
B) 90°
C) 180°
D) 45°
జవాబు:
A) 0°

4. వస్తువును సమతల దర్పణం నుంచి కొంత దూరంగా జరిపితే ప్రతిబింబ పరిమాణం
A) పెరిగినట్లు కనిపిస్తుంది
B) తగ్గినట్లు కనిపిస్తుంది
C) వస్తు పరిమాణంతో సమానంగా ఉన్నట్లు కనిపిస్తుంది
D) ప్రతిబింబం కనబడదు
జవాబు:
B) తగ్గినట్లు కనిపిస్తుంది

5. సమతల దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబానికి సంబంధించి క్రింది వాటిలో సరి కొనిది ఏది?
A) ప్రతిబింబం నిటారుగా ఉంటుంది
B) ప్రతిబింబం నిజ ప్రతిబింబంగా ఉంటుంది
C) ప్రతిబింబం పార్శ్వవిలోమం పొందుతుంది
D) ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణానికి సమానం
జవాబు:
D) ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణానికి సమానం

6. ఒక వస్తువు సమతల దర్పణానికి ముందు 7 సెం.మీ. దూరంలో ఉంచబడినది. దర్పణంలో ఆ వస్తువు ప్రతిబింబం దూరం
A) 3.5 సెం.మీ.
B) 14 సెం.మీ.
C) 7 సెం. మీ.
D) 21 సెం.మీ.
జవాబు:
C) 7 సెం. మీ.

పరికరాల జాబితా

డ్రాయింగ్ బోర్డ్, సమతల దర్పణం, గుండు పిన్నులు, ఫ్లాష్ కార్డులు, పిన్‌హోల్ కెమెరా, చార్టులు.

8th Class Physical Science 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 135

ప్రశ్న 1.

కెమెరాకు పెద్ద రంధ్రం చేసి చూస్తే ప్రతిబింబం పాఠంలో చర్చించిన విధంగానే ఏర్పడిందా?
జవాబు:
అవును ఏర్పడింది.

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 2.
కెమెరా రంధ్రం ఇంకా పెద్దగా అనగా కొవ్వొత్తి మంట పరిమాణంలో ఉంటే ఏం జరుగుతుంది?
జవాబు:
కెమెరా రంధ్రం ఇంకా పెద్దగా అనగా కొవ్వొత్తి మంట పరిమాణంలో ఉంటే ప్రతిబింబం ఏర్పడదు.

ప్రశ్న 3.
రంధ్రం పెద్దగా ఉన్నప్పుడు కెమెరా తెరపై కొవ్వొత్తి మంట ప్రతిబింబం ఏర్పడుతుందా? ఎందుకు?
జవాబు:
కెమెరా యొక్క రంధ్రం కొంచెం పెద్దగా ఉంటే ప్రతిబింబం కొంచెం మసకబారినట్లుగా ఏర్పడుతుంది.

ప్రశ్న 4.
అదే కొవ్వొత్తి మంటను అదే పిన్పల్ కెమెరాతో చాలా దూరం నుండి చూస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ప్రతిబింబ పరిమాణం వస్తు దూరంపై ఆధారపడును. కావున తక్కువ పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడును.

ప్రశ్న 5.
పినహోల్ కెమెరాకు రెండు రంధ్రాలు చేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
పి హోల్ కెమెరాకు రెండు రంధ్రాలు చేస్తే రెండు ప్రతిబింబాలు ఏర్పడతాయి.

8th Class Physical Science 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం Textbook Activities

కృత్యములు

కృత్యం – 2

ప్రశ్న 1.
ఫెర్మాట్ నియమాన్ని ఒక కృత్యం ద్వారా క్లుప్తంగా వివరించుము.
(లేదా)
కాంతి కనిష్ఠ దూరాన్ని తెలిపే కృత్యాన్ని రాయుము.
(లేదా)
కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినపుడు అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్ని అనుసరిస్తుందని ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:

  1. ఒక చెట్టుపై ‘A’ అనే స్థానం వద్ద ఒక తెలివైన కాకి గలదు. నేలపై కొన్ని ధాన్యపు గింజలు చల్లబడి ఉన్నాయి.
  2. ఆ కాకి నేలపై ఉన్న గింజలలో ఏదో ఒక దానిని తీసుకొని త్వరగా వేరొక చెట్టుపై ఉన్న ‘B’ అనే స్థానం వద్దకు చేరాలనుకుంది.
  3. కాకి A స్థానం నుండి B స్థానానికి అతి త్వరగా వెళ్ళేందుకు వీలయ్యేటట్లు నేలపై ఒక స్థానాన్ని ‘అది ఎన్నుకోవాలి.
  4. కాకి యొక్క వేగం .స్థిరమని భావిస్తే, అది త్వరగా వెళ్ళాలంటే దగ్గరి మార్గం ఎన్నుకోవాలి.
    AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 11
  5. పైనున్న పటాలను పరిశీలించగా A నుండి B ను చేరడానికి అతి దగ్గరి మార్గం AEB అవుతుంది.
  6. పటం – 4లో చూపబడిన AEB మార్గాన్ని పరిశీలించగా ఆ కాకి E అనే స్థానం వద్ద నున్న గింజనే తీసుకుంటుంది.
  7. ‘E’ బిందువు వద్ద EE’ అను లంబాన్ని గీస్తే కోణం AEE’, కోణం E’EB లు సమానంగా ఉన్నాయని గుర్తించవచ్చును.
  8. పై సందర్భంలోని కాకివలె కాంతి కూడా తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుంది.
  9. కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినపుడు కూడా అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్ని అనుసరిస్తుంది. దీనినే “ఫెర్మాట్ సూత్రం” అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

కృత్యం – 3

ప్రశ్న 2.
పటం-(ఎ), (బి) పటాలతో పాటు ఒక సమతల దర్పణం ఇచ్చిన పటం-(సి) లో లాగా పట పరావర్తనం ఏర్పడింది. అదే విధముగా పటం-(బి) లోని అన్ని బొమ్మలకు పరావర్తనాలను ఏర్పరచగలరా?
(లేదా)
పరావర్తనం వలన కొన్ని అందమైన ఆకారాలు ఏర్పడతాయని కృత్యం ద్వారా చూపుము.
(లేదా)
నీ యొక్క కాంతి పరావర్తన ధర్మంను పరీక్షించుము.
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 12
జవాబు:
సమతల దర్పణ స్థానాన్ని క్రింద ……………) తో చూపడమైనది.
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 13
i)
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 14
ii) దర్పణ స్థానం అమర్చే అవసరం లేదు.
AP Board 8th Class Physical Science Solutions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 15

AP Board 8th Class Physical Science Important Questions and Answers English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Physical Science Physics Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also read AP Board 8th Class Physical Science Solutions (Physics & Chemistry) for exam preparation.

AP State Syllabus 8th Class Physical Science Important Questions and Answers English & Telugu Medium

AP 8th Class Physical Science Important Questions and Answers in English Medium

AP 8th Class Physics Important Questions and Answers in Telugu Medium

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

SCERT AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 9th Lesson Questions and Answers ద్రవాల విద్యుత్ వాహకత

8th Class Physical Science 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఘన, ద్రవ విద్యుత్ వాహకాలకు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
1. ఘన విద్యుత్ వాహకాలు : లోహాలన్నీ విద్యుత్ వాహకాలు.
లోహాలు : అల్యూమినియం, రాగి, బంగారం, ఇనుము మొదలగునవి.

2. ద్రవ విద్యుత్ వాహకాలు (విద్యుత్ విశ్లేష్య పదార్థాలు) :
a) ఆమ్లాలు : హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం.
b) క్షారాలు : సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్,
C) లవణ ద్రావణాలు : సోడియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్ ద్రావణం, కాల్షియం సల్ఫేట్ ద్రావణం .

ప్రశ్న 2.
ఘన, ద్రవ విద్యుత్ బంధకాలకు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
1. ఘన విద్యుత్ బంధకాలు :
చెక్క రబ్బరు, కాగితం, ప్లాస్టిక్, చాక్ పీస్.

2. ద్రవ విద్యుత్ బంధకాలు (అవిద్యుత్ విశ్లేష్యాలు) :
స్వేదనజలం, కొబ్బరినూనె, వెనిగర్, చక్కెర ద్రావణం, గ్లూకోజ్ ద్రావణం, బెంజీన్.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 3.
స్వేదనజలం గుండా విద్యుత్ ప్రవహించాలంటే నీవేమి కలుపుతావు? (AS1)
జవాబు:
స్వేదనజలం గుండా విద్యుత్ ప్రవహించాలంటే స్వేదన జలానికి ఆమ్లాలు లేదా క్షారాలు లేదా లవణాలు కలపాలి.

ప్రశ్న 4.
విద్యుత్ విశ్లేష్యం అంటే ఏమిటి? (AS1)
జవాబు:
విద్యుత్ విశ్లేష్యం :
విద్యుత్ ను తమగుండా ప్రసరింపనిచ్చే ద్రావణాన్ని విద్యుత్ విశ్లేష్యం అంటారు.

ప్రశ్న 5.
బల్బు వెలగడానికి ఘటం (Cell)లోని ఏ శక్తి కారణం? (AS1)
జవాబు:
ఘటంలోని రసాయనశక్తి విద్యుత్ శక్తిగా మారటం వల్ల బల్బు వెలుగుతుంది.

ప్రశ్న 6.
ఎలక్ట్రోప్లేటింగ్ ఉపయోగాలను తెలపండి. (AS1)
జవాబు:
ఎలక్ట్రోప్లేటింగ్ ఉపయోగాలు :

  1. ఇనుముతో తయారైన వస్తువులు తుప్పు పట్టకుండా ఉండుటకు నికెల్ లేదా క్రోమియం లోహాలతో పూత పూస్తారు.
  2. యంత్రాల భాగాలు తుప్పు పట్టకుండా ఉండడానికి, మెరవడానికి తరచుగా క్రోమియం పూతపూస్తారు.
  3. యంత్రాల పైభాగాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగుచేయడానికి వాటి పైభాగంలో కావలసిన లోహాన్ని పూతపూస్తారు.
  4. రాగి లేదా దాని మిశ్రమ లోహంతో తయారుచేయబడిన ఆభరణాలు, అలంకరణ వస్తువులపై వెండి లేదా బంగారం లోహాల పూత పూస్తారు.
  5. తినుబండారాలను నిల్వ ఉంచడానికి తగరం పూత పూయబడిన ఇనుప డబ్బాలను వాడతారు.
  6. వంతెనల నిర్మాణంలోనూ, వాహన పరికరాల తయారీలోనూ జింక్ పూత పూయబడిన ఇనుమును వాడుతారు.

ప్రశ్న 7.
ఇండ్లలో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు అగ్నిమాపకదళంవారు నీటితో మంటలను ఆర్పడానికి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. ఎందుకు? (AS1)
జవాబు:
అగ్నిమాపకదళంవారు ఉపయోగించే నీరు స్వేదన జలం కాదు. నీరు విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. కాబట్టి మంటలను ఆర్పడానికి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 8.
కొన్ని రకాల ఇనుప వస్తువులకు ప్లాస్టిక్ తొడుగులు ఉండటం మనం చూస్తుంటాం. ఆ ఇనుప వస్తువులపై ప్లాస్టిక్ తొడుగును ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలోనే అమర్చుతారా? ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా లోహాలపై ప్లాస్టిక్ పూతను ఎందుకు పూయలేం? (AS1)
జవాబు:

  1. ఇనుప వస్తువుపై ప్లాస్టిక్ తొడుగును ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో అమర్చలేరు.
  2. విద్యుత్ విశ్లేష్య పదార్థాలను మాత్రమే ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా లోహాల పై పూత పూయగలం. ప్లాస్టిక్ అవిద్యుత్ విశ్లేష్య పదార్థం. కావున ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా లోహాలపై ప్లాస్టిక్ పూత పూయలేము.

ప్రశ్న 9.
పూర్తిగా వాడిన బ్యాటరీని కావ్య వాళ్ళ నాన్న కొన్ని గంటలు ఎండలో ఉంచి ఉపయోగిస్తే LED వెలిగింది. అది చూశాక ఆమె మదిలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమయినవి. ఆ ప్రశ్నలేమిటో మీరు ఊహించగలరా? (AS2)
జవాబు:

  1. ఇంకా ఎక్కువ గంటలు ఎండలో ఉంచితే ఇంకా ఎన్ని గంటలు ఎక్కువ LED బల్బు వెలుగుతుంది?
  2. వాడిన బ్యాటరీను ఎండబెట్టితే ఎందుకు పనిచేస్తుంది?
  3. ఎన్ని గంటలు LED బల్బు వెలుగుతుంది?
  4. ఎన్నోసార్లు వాడేసిన బ్యాటరీని ఎండబెట్టినా LED బల్బు వెలుగుతుందా?
  5. వాడిన బ్యాటరీని ఫ్రిజ్ లో ఉంచితే ఎందుకు పనిచేయదు?

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 10.
ఇనుపతాళం చెవిపై రాగిపూత పూసే పద్ధతిని వివరించండి. అందుకు ఏర్పాటు చేసే వలయాన్ని బొమ్మగీయండి. (ప్రయోగశాల కృత్యం) (AS3)
(లేదా)
ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియను చూపే పటం గీయండి. నాణ్యమైన పూత ఏర్పడటానికి అవసరమైన ఏదేని ఒక అంశాన్ని రాయండి.
(లేదా)
కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, ఇనుప మేకు, రాగి తీగలను నీకు ఇచ్చినపుడు రాగి ఇనుముల చర్యా శీలతలను పరిశీలించుటకు నీవు చేసే కృత్యమును వివరింపుము. ఈ కృత్యము ద్వారా నీవు పరిశీలించిన అంశాలు ఏమిటి?
జవాబు:
ఉద్దేశం :
ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో ఇనుప తాళం చెవిపై రాగిపూతను పూయడం.

కావలసిన వస్తువులు :
రాగి పలక, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు, ఇనుప తాళం చెవి, గాజు బీకరు, నీరు, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, కొన్ని రాగి తీగలు మరియు బ్యాటరీ మొదలగునవి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 1

ప్రయోగ పద్ధతి :
నీటిలో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను కలిపి గాఢ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారుచేయండి. ఈ ద్రావణాన్ని గాజు బీకరులో పోసి దానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపండి. రాగి పలకను, ఇనుపతాళం చెవిని రాగి తీగలకు కట్టి ద్రావణంలో వేలాడదీయండి. ప్రక్క పటంలో చూపినట్లు బ్యాటరీ మరియు స్విచ్ తో వలయాన్ని ఏర్పాటు చేయండి.

ద్రావణంలో వేలాడే రాగి పలక, ఇనుప తాళంచెవి ఒకదాని కొకటి తాకకుండా జాగ్రత్త వహించండి. స్విచ్ ఆన్ చేసి 10 నిమిషాల పాటు విద్యుత్ ప్రవాహం జరపండి. తర్వాత స్విచ్ :”ఆఫ్” చేసి తాళం చెవిని బయటకు తీయండి.

పరిశీలన :
తాళం చెవిపై ముదురు గోధుమ రంగు పూత ఏర్పడి ఉంటుంది.

కారణం :
కాపర్ సల్ఫేట్ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహించినపుడు రసాయన చర్య వలన అది కాపర్ (Cu2+), సల్ఫేట్ (SO2-4) అయాన్లుగా విడిపోయింది. కాపర్ అయాన్లు బ్యాటరీ ఋణ ధృవం వైపు ప్రయాణించి, ఇనుప తాళం చెవిపై గోధమరంగు పూతను ఏర్పరచినాయి.

ప్రశ్న 11.
విద్యుతను నిల్వ ఉంచడానికి వీలుగా సెల్ ను రూపొందించడంలో “గాల్వాని, ఓల్టా” ల కృషిని మీరెలా అభినందిస్తారు? (AS6)
జవాబు:
1780 సం||లో ఇటలీ దేశపు “బోలోనా” ప్రాంత వాసియైన “లూయీ గాల్వానీ” అనే శాస్త్రవేత్త రాగి కొక్కానికి వేలాడదీసిన చనిపోయిన కప్ప కాలు వేరొక లోహానికి తగిలినప్పుడు బాగా వణకడం గమనించాడు. తర్వాత గాల్వాని కప్ప కాళ్ళతో అనేక ప్రయోగాలు చేసి చనిపోయిన జీవులనుండి “జీవ విద్యుత్”ను తయారు చేయవచ్చని భావించినాడు. గాల్వాని ప్రయోగం చాలా మంది ఐరోపా శాస్త్రవేత్తలలో వివిధ జంతువులతో ప్రయోగాలు నిర్వహించడానికి ఆసక్తి రేపింది. వారిలో ఇటలీ దేశానికి చెందిన అలెసాండ్ ఓల్టా ఒకరు.

ఓల్టా జీవ పదార్థాలకు బదులుగా ద్రవాలను తీసుకుని అనేక ప్రయోగాలు చేశాడు. “ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక ద్రవంలో ఉంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చ”ని కనుగొన్నాడు.

ఓల్టా 1800 సం||లో రాగి, జింక్ పలకలు మరియు సల్ఫ్యూరికామ్లంతో ఒక ప్రాథమిక ఘటాన్ని తయారుచేశాడు. దీనిని “ఓల్టా ఘటం” అని పిలుస్తారు. ఓల్టా ఘటములో రసాయనశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. గాల్వానీ, ఓల్టా కృషి ఫలితంగా ఎన్నో ఘటాలను కనుగొనడం జరిగినది. కాబట్టి గాల్వానీ, ఓల్టాల కృషి మరువలేనిదిగా చెప్పవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 12.
మీ పరిసరాలలోని వస్తువులను పరిశీలించి విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా జాబితా తయారుచేయండి. ఈ సమాచారాన్ని మీరు మీ దైనందిన కార్యక్రమాలలో ఎలా వినియోగించుకుంటారో చెప్పండి. (AS7)
జవాబు:
విద్యుత్ వాహకాలు :

  1. లోహాలు ఉదా : రాగి, ఇనుము, అల్యూమినియం, సీసం, వెండి మొదలగునవి.
  2. విద్యుత్ విశ్లేష్య పదార్థాలు (ఆమ్లాలు, క్షారాలు, లవణ ద్రావణాలు).

విద్యుత్ వాహకాల ఉపయోగాలు :

  1. లోహాలను విద్యుత్ తీగలుగా ఉపయోగిస్తారు.
  2. విద్యుత్ విశ్లేష్య పదార్థాలను ఉపయోగించి ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు.
  3. లోహ సంగ్రహణలో విద్యుత్ క్షయకరణ వలన లోహాలను తయారుచేస్తారు.
  4. లోహాలను విద్యుత్ విశ్లేషణ ద్వారా శుద్ధి చేస్తారు.

విద్యుత్ బంధకాలు :
కర్రలు, రబ్బరు, ప్లాస్టికు మొ||నవి. కర్రలు, రబ్బరు, ప్లాస్టిక్ లను విద్యుత్ పరికరాలకు పిడులుగా వాడుతారు.

ప్రశ్న 13.
నాలుగు నిమ్మకాయలతో సెల్ తయారుచేసి, అది పనిచేస్తుందో లేదో LED సహాడుంతో పరీక్షించండి. (AS3)
(లేదా)
నాలుగు నిమ్మకాయలను ఉపయోగించి ఘటాన్ని ఎలా తయారు చేస్తారు? కాంతి ఉద్గార డయోడ్ లో (LED) ఘటాన్ని ప్రయోగశాలలో ఎలా పరీక్షిస్తారో రాయండి.
జవాబు:
నాలుగు నిమ్మకాయలను తీసుకొని వాటిని రెండు ముక్కలుగా కోయండి. ఒక్కొక్క నిమ్మకాయ .నుండి ఒక్కొక్క ముక్క తీసుకొనండి. ఆ ముక్కలలో రెండు రాగి తీగలను గుచ్చి, వాటిని శ్రేణి పద్ధతిలో కలపండి. ఈ వలయానికి ఒక LEDని కలిపి, వలయాన్ని పూర్తిచేయండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 2

వలయంలో విద్యుత్ ఉండుట వలన LED వెలుగుతుంది. ఇక్కడ నిమ్మరసం అంటే సిట్రిక్ యాసిడ్ విద్యుద్విశ్లేష్యంగాను, రాగి తీగలు విద్యుత్ వాహకంగాను పనిచేస్తాయి. అందువలన రాగి తీగలు గుచ్చబడిన ఒక్కొక్క నిమ్మకాయముక్క ఒక్కొక్క ఘటంగా పనిచేస్తుంది. ఇవి శ్రేణిలో సంధానం చేయబడిన బ్యాటరీలలాగా పనిచేస్తాయి.

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలోని కృత్యం – 3 ని గమనించండి. స్వేదన జలంతో ప్రారంభించండి. LED వెలగదు. ఇపుడు కొన్ని చుక్కల ఆమ్లాన్ని కలపండి. LED వెలుగుతుంది. మరికొన్ని చుక్కల ఆమ్లాన్ని కలపండి. LED వెలుగును పరీక్షించండి. ప్రతిసారి రెండు లేక మూడు చుక్కల ఆమ్లాలు కలుపుతూ 5 లేక 6 సార్లు ఈ కృత్యాన్ని చేయండి. నీటిలో ఆమ్లాన్ని కలుపుతూ పోతున్న కొద్దీ LED వెలిగే తీవ్రతలో ఏమైనా మార్పు గమనించారా? మీ పరిశీలనబట్టి ఏం చెప్పగలరు? పై కృత్యాన్ని వంటసోడా తీసుకొని దానిని స్వేదన జలానికి కలుపుతూ చేయండి. రెండు సందర్భాలకు గల పోలికలు, భేదాలను వ్రాయండి. (AS3)
జవాబు:

స్వేదన జలం + ఆమ్లం స్వేదన జలం + వంటసోడా
1) స్వేదన జలానికి కొన్ని చుక్కల ఆమ్లం కలిపినపుడు ఏర్పడే ద్రావణాన్ని LED బల్బుగల టెస్టతో టెస్ట్ చేసినపుడు LED వెలిగింది. 1) స్వేదన జలానికి కొద్దిగా వంటసోడా కలుపగా ఏర్పడే ద్రావణాన్ని LED బల్బుగల టెస్టర్తో టెస్ట్ చేసినపుడు LED బల్బు వెలిగింది.
2) స్వేదన జలానికి అదనంగా మరికొంత ఆమ్లాన్ని కలిపి, LED టెస్ట ర్తో టెస్ట్ చేస్తే LED బల్బు తీవ్రత పెరిగినది. 2) స్వేదన జలానికి మరికొంత వంటసోడా కలిపి LED టెస్టర్తో టెస్ట్ చేసినపుడు LED బల్బు కాంతి తీవ్రత తగ్గింది.
3) స్వేదన జలానికి ఆమ్లాన్ని కలిపే కొద్దీ విద్యుత్ వాహకత పెరిగినది. 3) స్వేదన జలానికి వంటసోడా కలిపే కొద్దీ విద్యుత్ వాహకత తగ్గినది.
4) స్వేదన జలానికి ఆమ్లాన్ని కలిపినపుడు బీకరు ఉష్ణోగ్రత పెరిగినది. 4) స్వేదన జలానికి వంటసోడా కలిపినపుడు బీకరు ఉష్ణోగ్రత తగ్గింది.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 15.
ఈ పాఠ్యాంశంలోని అనేక కృత్యాలలో LED తో తయారుచేసిన “టెస్టర్”ను వినియోగించారు కదా ! LED కి బదులుగా మరేదైనా వాడి టెస్టర్ తయారు చేయవచ్చా? LED కి బదులుగా అయస్కాంత దిక్సూచిని వాడవచ్చు. విద్యుత్ ప్రవహిస్తున్న తీగ దగ్గరగా ఉన్నపుడు అయస్కాంత సూచిలో అపవర్తనం కలుగుతుందని మనకు తెలుసు. ఈ విషయం ఆధారంగా దిక్సూచిని వాడి టెస్టర్ తయారు చేయండి. కింద ఇవ్వబడిన పటాన్ని వినియోగించుకోండి. (AS4)
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 3
జవాబు:
LED బదులుగా దిక్చూచిని ఉపయోగించి టెస్టరు తయారు చేయవచ్చును. “విద్యుత్ ప్రవహిస్తున్న తీగ దగ్గరగా దిక్సూచి ఉన్నపుడు దిక్సూచిలోని అయస్కాంత సూచి అపవర్తనం చెందును”. అయస్కాంత సూచి అపవర్తనం చెందినట్లు అయితే . ‘ఆ తీగ గుండా విద్యుత్ ప్రవహించినట్లుగా తెలుస్తుంది.

పరికరాలు :
దిక్సూచి, డ్రైసెల్, లోహపు సూదులు, ఇంజక్షన్ బాటిల్ యొక్క రబ్బరు మూత మరియు రాగి తీగలు.

విధానము :
మొదట ఒక దిక్సూచిని తీసుకొని దానికి అనేక చుట్లు రాగి తీగతో చుట్టండి. ఒక రబ్బరు మూతకు రెండు ఇంజక్షన్ సూదులను పటంలో చూపిన విధంగా గుచ్చండి. ఒక ఇంజక్షన్ సూదిని రాగి తీగతో కలిపి, రాగితీగ రెండవ చివరను, దిక్సూచికి చుట్టిన తీగచుట్ట యొక్క ఒక చివర కలుపవలెను. తీగచుట్ట యొక్క రెండవ చివరను బ్యాటరీకి పటంలో చూపిన విధంగా కలపండి. రెండవ ఇంజక్షన్ సూధికి మరొక తీగ కలిపి ఈ తీగ రెండవ చివరను బ్యాటరీ యొక్క రెండవ చివర, పటంలో చూపిన విధంగా కలపండి. రెండు ఇంజక్షన్ సూదులను ఒకదానిని మరొకటి తాకునట్లు చేసినచో దిక్సూచిలోని సూచి అపవర్తనం చెందును. సూదులను విడదీయగానే సూచిలో అపవర్తనం ఉండదు. దీన్ని బట్టి దిక్సూచి టెస్టర్ గా పనిచేస్తుందని తెలుస్తుంది. దీనిని టెస్టర్ గా ఉపయోగించవచ్చును.

మనం టెస్ట్ చేయవలసిన ద్రావణాన్ని రబ్బరు మూతలో పోసి, దిక్సూచిలోని సూచిక అపవర్తనం చెందిందో లేదో తెలుసుకొని, విద్యుత్ వాహకమా లేదా విద్యుత్ బంధకమా అని నిర్ధారించవచ్చును.

పరికరాల జాబితా

ఇనుపసీల, చాక్ పీసు, స్ట్రా ముక్క, కాగితం ముక్క, పెన్సిల్ రబ్బరు, పెన్సిల్ గ్రాఫైట్ కడ్డీ, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ ముక్క, స్వేదన జలం, త్రాగునీరు, కొబ్బరి నీరు, నిమ్మరసం, వెనిగర్, కిరోసిన్, వెజిటబుల్ ఆయిల్, చక్కెర ద్రావణం, పాలు, పెరుగు,ఉప్పు, ఆలుగడ్డ, ఖాళీ ఇంజక్షన్ బాటిల్స్, ఇనుపతాళం చెవి, బ్యాటరీ, బల్బు, వైర్లు, రబ్బరుమూత, రాగి తీగలు, జింకు | తీగలు, గాజు బీకరు, కాపర్ సల్ఫేట్, జల సల్ఫ్యూరికామ్లం, నీరు.

8th Class Physical Science 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 123

ప్రశ్న 1.
కొన్ని రకాల పదార్థాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపనిస్తాయి, కొన్ని పదార్థాలు ప్రసరింపనీయవు. ఎందుకు?
జవాబు:
ఏ పదార్థాలు అయితే విద్యుత్ ను ప్రసరింపచేసినపుడు అయనీకరణం చెందునో ఆ పదార్థాలు విద్యుత్ ను ప్రసరింపచేస్తాయి. ఏ పదార్థాలగుండా విద్యుతను ప్రసరింపచేసినపుడు అయనీకరణం చెందవో ఆ పదార్థాలు తమగుండా విద్యుత్ను ప్రసరింపచేయవు.

8th Class Physical Science Textbook Page No. 127

ప్రశ్న 2.
ఒక బ్యాటరీ సెల్ ను చిన్న పెట్టెలో ఉంచి దాని రెండు ధ్రువాలకు అతుకబడిన రెండు తీగలను మాత్రమే బయటకు కనబడేట్లు ఉంచారు. వాటిలో ఏది ధన ధ్రువం నుండి వచ్చినదో, ఏది ఋణ ధ్రువం నుండి వచ్చిందో మీరెలా కనుగొంటారు?
జవాబు:
ఒక ఆలుగడ్డ ముక్కను తీసుకొని, బ్యాటరీ ధ్రువాల నుండి వచ్చిన రెండు తీగలను ఆలుగడ్డ ముక్కలో గుచ్చండి. 20 నుండి 30 నిమిషాల తరువాత ఆలుగడ్డ ముక్కను పరిశీలించండి. ఆలుగడ్డ ముక్కలో నీలం – ఆకుపచ్చరంగు ఏ తీగ వద్ద ఏర్పడిందో ఆ తీగ బ్యాటరీ యొక్క ధనధ్రువం అవుతుంది. రెండో తీగ ఋణ ధ్రువం.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

8th Class Physical Science Textbook Page No. 130

ప్రశ్న 3.
విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటే ఏమిటి?
జవాబు:
ద్రావణాల గుండా విద్యుత్ ప్రవహింపచేయడం వలన, అవి వాటి ఘటక మూలకాలుగా వియోగం చెందే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణ పద్ధతి అంటారు.

8th Class Physical Science 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత Textbook Activities

కృత్యం – 1 ఏయే పదార్థాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపనిస్తాయో పరీక్షించుట :

ప్రశ్న 1.
ఏయే పదార్థాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపనిస్తాయో పరీక్షించుట :
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 4
ఒక టార్చిలైట్ బల్బు లేదా LED, నిర్జల ఘటం (dry cell), చెక్క పలక, రెండు డ్రాయింగ్ పిన్నులు, ఒక పిన్నీసు మరియు వలయాన్ని కలపడానికి కొన్ని రాగి తీగలు సేకరించి, పటంలో చూపిన విధంగా సాధారణ విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేయండి. పిన్నీసును రెండు డ్రాయింగ్ పిన్నులకు ఆనిస్తే బల్బు వెలుగుతుంది.

పిన్నీసుకు బదులుగా చాక్ పీస్, స్ట్రా, కాగితం, పెన్సిల్ రబ్బరు, పెన్సిల్ లోని గ్రాఫైట్, పేపర్ క్లిప్, ప్లాస్టిక్ ముక్క వంటి వివిధ వస్తువులను ఉంచుతూ బల్బు వెలుగుతుందో లేదో చూడండి. బల్బు వెలిగితే విద్యుత్ వాహకం. బల్బు వెలగకపోతే విద్యుత్ బంధకంగా ఈ కింది పట్టికలో వ్రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 5

కృత్యం – 2 ద్రవాల విద్యుత్ వాహకతను పరిశీలించుట :

ప్రశ్న 2.
ద్రవాల విద్యుత్ వాహకతను పరిశీలించుట :
జవాబు:
ఒక LED, డ్రైసెల్, లోహపు సూదులు, ఇంజక్షన్ బాటిల్ యొక్క రబ్బరు మూత మరియు వలయాన్ని కలపడానికి రాగి తీగలు సేకరించండి. పటంలో చూపిన విధంగా వలయాన్ని కలిపి టెస్టర్ తయారుచేయండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 6

రబ్బరుమూతకు గుచ్చిన సూదుల మధ్య దూరం చాలా తక్కువగా అంటే 2 మి.మీ. మాత్రమే ఉండవలెను. అంటే సూదులు అతి దగ్గరగా ఉండాలి కాని అవి ఒకదానికొకటి తాకరాదు. అలాగే ఆ రెండు సూదులను తాకించనంత వరకు వలయంలోని LED వెలగరాదు.

ఇప్పుడు ఒకసారి ఆ సూదులను ఒకదానికొకటి అతికించి LED వెలుగుతుందో లేదో పరీక్షించవలెను. అలాగే రెండు సూదులను విడదీయగానే LED వెలగడం ఆగిపోవాలి. అప్పుడు మనకు టెస్టరు తయారైనట్లు.

ఈ టెస్టర్ యొక్క రబ్బరు మూతలో ఈ కింది పట్టికలో ఇచ్చిన ఒక్కొక్క ద్రావణం తీసుకొని అవి విద్యుత్ వాహకమా, విద్యుత్ బంధకమా తెలుసుకొని పట్టికలో నమోదు చేయండి.

ద్రవం LED వెలిగినది/ వెలగలేదు ద్రవం విద్యుత్ వాహకం/బంధకం
1. స్వేదన జలం వెలగలేదు విద్యుత్ బంధకము
2. త్రాగునీరు వెలిగినది విద్యుత్ వాహకము
3. కొబ్బరినూనె వెలగలేదు విద్యుత్ బంధకము
4. నిమ్మరసం వెలిగినది విద్యుత్ వాహకము
5. వెనిగర్ వెలిగినది విద్యుత్ వాహకము
6. కిరోసిన్ వెలగలేదు విద్యుత్ బంధకము
7. చక్కెర ద్రావణం వెలగలేదు విద్యుత్ బంధకము
8. తేనె వెలగలేదు విద్యుత్ బంధకము

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

కృత్యం – 3 విద్యుత్ విశ్లేష్యం యొక్క విద్యుత్ వాహకత :

ప్రశ్న 3.
విద్యుత్ విశ్లేష్యం యొక్క విద్యుత్ వాహకత.
జవాబు:
సమాన ఘనపరిమాణం గల స్వేదనజలాన్ని 3 వేర్వేరు పాత్రలలో తీసుకోండి. మొదటి దానికి సాధారణ ఉప్పు, రెండవ దానికి కాపర్ సల్ఫేట్, 3వ దానికి నిమ్మరసాన్ని కొద్ది మోతాదులో కలపండి. మీరు తయారుచేసిన టెస్టర్ సహాయంతో పరీక్షించి పట్టికలో నమోదు చేయండి.

పదార్థం LED వెలిగినది/ వెలగలేదు పదార్థం విద్యుత్ వాహకం/బంధకం
1. స్వేదన జలం వెలగలేదు విద్యుత్ బంధకం
2. స్వేదన జలం + ఉప్పు వెలిగినది విద్యుత్ వాహకం
3. స్వేదన జలం + కాపర్ సల్ఫేట్ వెలిగినది విద్యుత్ వాహకం
4. స్వేదన జలం + నిమ్మరసం వెలిగినది విద్యుత్ వాహకం

కృత్యం – 4 ఆలుగడ్డపై విద్యుత్ ప్రవాహ ఫలితాన్ని పరీక్షించుట :

ప్రశ్న 4.
మీరు తయారు చేసిన టెస్టర్ ను ఉపయోగించి ఆలుగడ్డపై విద్యుత్ ప్రవాహ ఫలితాన్ని పరీక్షించి ఫలితాలు మరియు మీ పరిశీలనలు తెల్పండి.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 7
జవాబు:
ఒక ఆలుగడ్డ ముక్కను తీసుకున్నాను. LED, బ్యాటరీ, రాగి తీగలతో ఒక టెస్టర్ తయారుచేసి రెండు రాగి తీగలను ఆలుగడ్డలో 1 సెం.మీ. దూరంలో గుచ్చాను. ఈ అమరికను 20 నుండి 30 నిమిషాలు ఉంచాను.

బ్యాటరీ ధనధ్రువం నుండి వచ్చిన రాగి తీగ ఆలుగడ్డను గుచ్చుకున్న ప్రదేశంలో నీలం – ఆకుపచ్చ రంగు మచ్చ ఏర్పడింది. ఇలాంటి మచ్చ బ్యాటరీ ఋణ ధ్రువం నుండి వచ్చిన రాగి తీగ గుచ్చిన చోట రాలేదు. ఇది ఆలుగడ్డలో జరిగిన రసాయన మార్పు వల్ల ఏర్పడినది.

ఈ కృత్యం వల్ల ఆలుగడ్డను ఉపయోగించి బ్యాటరీ యొక్క ధన ధ్రువమును తెలుసుకొనవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

కృత్యం – 5 విద్యుత్ ఘటాన్ని (Electrolytic cell) తయారు చేద్దాం :

ప్రశ్న 5.
సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ఒక విద్యుత్ ఘటాన్ని (Electrolytic cell) తయారుచేయండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
LED బల్బు, రాగి తీగలు, రెండు ఇంజక్షన్ సీసాలు, రెండు కాపర్ కడ్డీలు, రెండు జింక్ కడ్డీలు, ఇంజక్షన్ సీసాల రబ్బరు మూతలు.
AP Board 8th Class Physical Science Solutions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 8

విధానము :
ఒక్కొక్క ఇంజక్షన్ బాటిల్ రబ్బరు మూతకు ఒక రాగి తీగ ముక్క, ఒక జింక్ తీగ ముక్క చొప్పున గుచ్చండి. రాగి, జింక్ ముక్కలు ఒకదానికొకటి తాకకుండా జాగ్రత్త వహించండి. రెండు ఇంజక్షన్ సీసాలలోనూ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పోసి జాగ్రత్తగా రబ్బరు మూతలు పెట్టండి.

ఒక సీసాలోని రాగి తీగ ముక్క మరొక సీసాలోని జింక్ రేకు ముక్కకు కలిసే విధంగా, పటంలో చూపినట్లు వలయాన్ని కలపండి. ఒక LED సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం బల్బును తీసుకొని దాని రెండు ఎలక్ట్రోడ్లకు రెండు తీగలు కలపండి. ఇందులో ఒకదానిని మొదటి ఇంజక్షన్ సీసాలో విడిగా ఉన్న రాగి తీగకు, రెండవ దానిని సీసాలోని జింక్ ముక్కకు కలపండి. LED బల్బు వెలిగిందా? వెలగకపోతే కనెక్షన్స్ మార్చి చూడండి. ఇపుడు LED బల్బు వెలుగుతుంది. ఈ విధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో విద్యుత్ ఘటాన్ని తయారుచేయవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

SCERT AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 8th Lesson Questions and Answers దహనం, ఇంధనాలు మరియు మంట

8th Class Physical Science 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
దహనశీలి పదార్థాలకు 4 ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
దహనశీలి పదార్థాలు : కొవ్వొత్తి, కాగితం, కిరోసిన్, కర్రలు, పెట్రోల్, స్పిరిట్ మొ||నవి.

ప్రశ్న 2.
దహనశీలికాని పదార్థాలకు 4 ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
దహనశీలికాని పదార్థాలు : రాయి, నీరు, లోహాలు, గాజు, సిరామిక్స్ మొ||నవి.

ప్రశ్న 3.
స్పిరిట్, పెట్రోల్ ను నివాస ప్రాంతాలకు దగ్గరలో ఎందుకు నిల్వ ఉంచకూడదు? (AS1)
జవాబు:

  1. స్పిరిట్, పెట్రోల్ లకు జ్వలన ఉష్ణోగ్రత విలువలు చాలా తక్కువగా ఉంటాయి.
  2. ఇవి త్వరగా మండే పదార్థాలు కావున శీఘ్ర దహనం జరిగి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.
  3. కాబట్టి స్పిరిట్, పెట్రోల్ లను నివాస ప్రాంతాలకు దగ్గరలో నిల్వ ఉంచకూడదు.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

ప్రశ్న 4.
ఉత్తమ ఇంధనానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఎందుకు అది ఉత్తమమైనదని మీరు భావిస్తున్నారో వివరించండి. (AS1)
జవాబు:
L.P.G. వాయువు ఉత్తమ ఇంధనం.

L.P.G. వాయువు ఉత్తమ ఇంధనంగా భావించుటకు కారణాలు :

  1. L.P.G. వాయువుకు ఇంధన దక్షత ఎక్కువగా ఉండుట.
  2. L.P.G. వాయువు ధర అందుబాటులో ఉండుట.
  3. వాడుటకు సౌలభ్యంగా ఉండుట.
  4. సులభంగా నిల్వ చేయవచ్చును.
  5. త్వరగా వెలిగించవచ్చును మరియు ఆర్పవచ్చును.
  6. ఇంధనం నిరంతరాయంగా, నిలకడగా మండేదిగా ఉండుట.
  7. తక్కువ కాలుష్యం కలిగించేదిగా ఉండుట.
  8. కెలోరిఫిక్ విలువ అత్యధికంగా ఉండుట.
  9. L.P.G. ఇంధనాన్ని సులభంగా రవాణా చేయవచ్చును.
  10. జ్వలన ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండాలి.

ప్రశ్న 5.
మండే నూనెలపై నీటిని చల్లరాదు. ఎందుకు? (AS1)
జవాబు:
నూనె వంటి పదార్థాలు మండుతున్నపుడు వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. కారణం నీరు నూనె కంటే బరువైనది. కాబట్టి నీరు నూనె యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది. పైనున్న నూనె మండుతూనే ఉంటుంది.

ప్రశ్న 6.
మంటలను నీటితో ఆర్పేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? (AS1)
జవాబు:
మంటలను నీటితో ఆర్పేటప్పుడు మందుగా విద్యుత్ సరఫరాని నిలిపివెయ్యాలి. తరువాత నీటిని చల్లి మంటలను ఆర్పా లి.

ప్రశ్న 7.
గ్యాస్ బర్నర్లలో వత్తిని ఎందుకు వాడరు? (AS1)
జవాబు:
వాయు ఇంధనాలు మాత్రమే దహనం చేస్తే మండుతాయి. ఘన, ద్రవ స్థితులలోని ఇంధనాలు వాయు స్థితికి మారిస్తే మండుతాయి. ఘన, ద్రవ స్థితులలో ఉన్న ఇంధనాలు మండిస్తే, వత్తి ద్వారా పైకి చేరి వాయువుగా మారి దహనం చెందడం ద్వారా మండుతాయి. కానీ గ్యాస్ బర్నర్లందు వాయు ఇంధనాన్ని (గ్యాస్) ఉపయోగిస్తారు. కావున గ్యాస్ బర్నర్లందు వత్తిని వాడరు.

ప్రశ్న 8.
విద్యుత్ పరికరాలు అగ్ని ప్రమాదానికి గురైతే మంటలను ఆర్పడానికి నీరు వాడరు. ఎందుకు? (AS1)
జవాబు:
నీరు విద్యుత్ వాహకం. విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నప్పుడు, నీటితో మంటలు ఆర్పడానికి ప్రయత్నించే వారికి విద్యుత్ ప్రవాహం వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. కావున విద్యుత్ పరికరాల మంటలను నీటితో ఆర్పకూడదు.

ప్రశ్న 9.
దిగువ తెలిసిన రెండు వాక్యాలను బలపరుస్తూ మరికొన్ని అభిప్రాయాలు రాయండి. (AS2)
ఎ) మంట మానవాళికి ఎంతో ఉపయోగం
బి) మంట వినాశకారి
జవాబు:
ఎ) మంట వల్ల మానవాళికి ఉపయోగాలు :

  1. గృహ అవసరాలకు (వంటకు) ఉపయోగపడును.
  2. పరిశ్రమలలో ఇంధనాలుగా ఉపయోగపడతాయి.
  3. వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు.
  4. విద్యుచ్ఛక్తి తయారుచేయుటకు ఉపయోగిస్తారు.

బి) ‘మంట’ వినాశకారి :

  1. అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.
  2. అధికంగా ఇంధనాలను మండిస్తే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా ఉష్ణతాపం ఏర్పడుతుంది.
  3. అడవులలో అగ్ని ప్రమాదాలు జరిగితే అడవులన్నీ అంతరించడం వల్ల వాతావరణంలో సమతుల్యం దెబ్బతింటుంది.
  4. పరిశ్రమలలో, వాహనాలలో ఇంధనాలు మండించడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

ప్రశ్న 10.
దహనచర్యకు ఆక్సిజన్ దోహదకారి కాకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. ఒకవేళ అదే నిజమైతే ఇంధనాలు ఇంకా ఏయే పనులకు పనికొస్తాయి? (AS2)
జవాబు:

  1. ఆక్సిజన్ మండుటకు ఉపయోగపడకపోతే దహనచర్య జరగదు.
  2. అంతేకాదు ఏ జీవరాశి భూమి మీద మనుగడ సాగించదు.
  3. ఇంధనాలు ఎన్ని ఉన్నప్పటికి వృథాయే.

ప్రశ్న 11.
మీరు చంద్రునిపై ఉన్నారనుకోండి. ఒక భూతద్దం. సహాయంతో సూర్యకాంతిని ఒక కాగితంపై కేంద్రీకరింపచేస్తే ఆ కాగితం మండుతుందా? లేదా? ఎందుకు? (AS2)
జవాబు:

  1. చంద్రునిపై ఒక భూతద్దం సహాయంతో సూర్యకాంతిని ఒక కాగితంపై కేంద్రీకరింపచేస్తే ఆ కాగితం మండదు.
  2. ఎందుకంటే చంద్రునిపై ఆక్సిజన్ లేదు కావున కాగితం మండదు.

ప్రశ్న 12.
కాగితపు పాత్రలో గల నీటిని వేడిచేయగలరా? అది ఎలా సాధ్యం? (AS3)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 1
ఒక కాగితపు పాత్రలో నీరు పోయండి. పక్క పటంలో చూపిన విధంగా త్రిపాదిపై కాగితపు పాత్రను ఉంచి కొవ్వొత్తితో వేడి చేయండి. కాగితపు పాత్రలోని నీరు వేడి ఎక్కుతుంది. ఎందుకంటే కొవ్వొత్తి ఇచ్చే ఉష్ణాన్ని కాగితపు పాత్ర నీటికి అందిస్తుంది. నీటి సమక్షంలో కాగితపు పాత్ర జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోదు. కాబట్టి కాగితపు పాత్ర మండకుండా, నీరు వేడెక్కుతుంది.

ప్రశ్న 13.
ఆక్సిజన్ లేకుండా దహన చర్య వీలవుతుందా? (AS3)
(లేదా)
పదార్థాలు మండుటకు ఆక్సిజన్ ఉపయోగపడుతుంది అని ఒక ప్రయోగము ద్వారా వివరించండి. (ప్రయోగశాల కృత్యం)
(లేదా)
మండడానికి ఆక్సిజన్ అవసరం – అని నిరూపించు కృత్యమును ఏ విధంగా నిర్వహిస్తావు? వివరించండి.
జవాబు:
ఉద్దేశం : ఆక్సిజన్ లేకుండా దహనచర్య వీలగునో లేదో నిరూపించుట.

కావలసిన పరికరాలు :
పరీక్షనాళిక, పట్టుకారు, సారాయి దీపం, అగ్గిపెట్టె, అగరుబత్తి, పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు (KMnO4),

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 2
నిర్వహణ పద్దతి :
ఒక అగరుబత్తి వెలిగించండి. దానిని 10 సెకన్లు వరకు మండనిచ్చి మంటను ఆర్పి ఒక ప్రక్కన ఉంచుకోండి. ఒక పరీక్షనాళికలో కొంత పొటాషియం పర్మాంగనేట్ స్పటికాలను తీసుకోండి. పట్టుకారు సహాయంతో పరీక్ష నాళికను పట్టుకొని సారాయి దీపంతో వేడిచేయండి.
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 3

పరిశీలన :
పొటాషియం పర్మాంగనేట్ ను వేడిచేస్తే ఆక్సిజన్ వాయువు వెలువడును. నిప్పు కలిగిన అగరుబత్తిని పరీక్ష నాళికలోనికి చొప్పించి పరిశీలిస్తే, నిప్పు కలిగిన అగరుబత్తి నుండి మంట రావడం గమనించవచ్చును. అంటే ఆక్సిజన్ దహనక్రియకు దోహదం చేయడం వలననే అగరువత్తికి మంట వచ్చి ప్రకాశవంతంగా మండుతుంది.

ఫలితము :
దీనిని బట్టి “ఆక్సిజన్ లేకుండా దహనచర్య వీలుకాదు” అని తెలుస్తుంది.

ప్రశ్న 14.
కింద ఇవ్వబడిన ఏ సందర్భంలో నీరు తక్కువ సమయంలో వేడెక్కుతుంది? ఊహించండి. చేసి చూసి సమాధానమివ్వండి. (AS3)
ఎ) శ్రీకర్ మంట యొక్క పసుపు ప్రాంతం (Yellow zone) కు దగ్గరగా నీరు గల బీకరు ఉంచి వేడి చేశాడు.
బి) సోను మంట యొక్క బయటి ప్రాంతం (Blue zone) లో నీరు గల బీకరు ఉంచి వేడిచేశాడు.
జవాబు:
మంట యొక్క బయటి ప్రాంతంలో నీరు గల బీకరు నుంచి వేడి చేసిన సోను బీకరు తక్కువ సమయంలో వేడి ఎక్కుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

ప్రశ్న 15.
మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళం వారు అవలంబించే వివిధ పద్ధతులను తెల్పండి. (AS4)
జవాబు:
మంటలను అదుపు చేయడానికి పాటించవలసిన నియమాలు :

  1. దహనశీల పదార్థాలను వేరు చేయుట (కానీ మండుచున్న దహనశీల పదార్థాలను వేరుచేయలేము).
  2. గాలిని (ఆక్సిజన్) తగలకుండా చేయుట.
  3. ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రతల కంటే తక్కువ అయ్యే విధంగా చేయుట.

పై నియమాల ఆధారంగా అగ్నిమాపక దళం వారు రెండు పద్ధతులలో మంటలను ఆర్పుతారు.

  1. నీటితో మంటలను అదుపుచేయుట.
  2. కార్బన్ డై ఆక్సైడ్ వాయువుతో మంటలను అదుపుచేయుట.

1. నీటితో మంటలు అదుపుచేయుట :
అగ్నిమాపక దళం వారు విద్యుత్ సరఫరా ఆపిన తరువాతనే మంటలు అదుపు చేయడం మొదలు పెడతారు. తరువాత నీటిని చల్లి మంటలను అదుపు చేస్తారు.

  1. మొదట నీరు దహనశీలి పదార్థాన్ని చల్లబరచి దాని ఉష్ణోగ్రతను ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ అయ్యే విధంగా చేస్తుంది. అందువల్ల మంటలు వ్యాపించకుండా నిరోధింపబడతాయి.
  2. అక్కడ ఉండే ఉష్ణోగ్రత వల్ల నీరు ఆవిరై దహనం చెందుతున్న పదార్థం చుట్టూ నీటి ఆవిరి చేరుతుంది. తద్వారా మండుతున్న పదార్థానికి గాలి, ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది.

2. కార్బన్ డై ఆక్సైడ్ (CO2) వాయువు ద్వారా :
సిలిండర్లలో ద్రవరూపంలో నిల్వ ఉంచిన CO2 వాయువును మంటపైకి వదిలినపుడు వ్యాకోచించిన మంట ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంతేగాక ఇది మంటను ఒక కంబళివలె కప్పివేసి మంటకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. తద్వారా మంటలు అదుపు చేయబడతాయి. నూనె, పెట్రోల్ మరియు విద్యుత్ పరికరాలకు సంబంధించిన మంటలను ఆర్పడానికి కార్బన్ డై ఆక్సైడ్ (CO2) ఉత్తమమైనది.

ప్రశ్న 16.
వివిధ రకాల ఇంధనాల ధర (ఒక కిలోగ్రాము)లను సేకరించండి. వాటి కెలోరిఫిక్ విలువలను, ధరలను పోల్చండి. (AS4)
జవాబు:

ఇంధనం ధర కెలోరిఫిక్ విలువను (కిలో ఔల్ / కి.గ్రా.)
1. పెట్రోలు 1 లీటరు ₹ 74.17 45,000
2. డీజిల్ 1 లీటరు ₹ 52.46 45,000
3. CNG 1 కిలోగ్రాము ₹ 46 50,000
4. LPG 1 కిలోగ్రాము ₹ 58 35,000 – 40,000
5. కర్ర 1 కిలోగ్రాము ₹ 4 17,000 – 22,000

ప్రశ్న 17.
కొవ్వొత్తి మంట బొమ్మ గీసి, అందులోని వివిధ ప్రాంతాలను గుర్తించండి. (AS3)
(లేదా)
క్రొవ్వొత్తి మంట యొక్క ఆకృతిని తెలుపు పటం గీచి భాగాలను గుర్తించండి. మంట యొక్క ఏ ప్రాంతంలో అసంపూర్తి దహనం జరుగుతుంది.
(లేదా)
క్రొవ్వొత్తి మంటను చూపే పటం గీచి భాగాలు గుర్తించండి. మంటలోని చీకటి ప్రాంతంలో ఏం జరుగుతుంది.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 4

i) మంట యొక్క అతిబాహ్య ప్రాంతంలో అసంపూర్తి దహనం జరుగుతుంది.
ii) మంటలోని చీకటి ప్రాంతంలో ఇంధనం భాష్పంగా మారుతుంది.

ప్రశ్న 18.
స్వతస్సిద్ధ దహనం, శీఘ్ర దహనాలను నిత్యజీవితంలో ఎక్కడ గమనిస్తారు? (AS7)
జవాబు:
స్వతస్సిద్ధ దహనాలు :

  1. ఫాస్ఫరస్ గాలిలో స్వతసిద్ధ దహనం అవుతుంది.
  2. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నపుడు ఎండుగడ్డి దానంతట అదే మండును.
  3. ఎండా కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు ఎండుటాకులు మండి తద్వారా అడవి అంతా మండును.

శీఘ్ర దహనాలు :

  1. అగ్గిపుల్లను, అగ్గిపెట్టె గరుకు తలంపై రుద్దినపుడు అగ్గిపుల్ల మండుట.
  2. లైటర్ తో గ్యాస్ స్టాప్ ను మండించుట.
  3. కర్పూరం, స్పిరిట్ మరియు పెట్రోలు వంటి పదార్థాలను గ్యాస్ లైటర్ తో మండించుట.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

ప్రశ్న 19.
జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఇంధనాలతో మీ నిత్యజీవిత కార్యక్రమాలను సరైన రీతిలో ఎలా నిర్వర్తిస్తారు? (AS7)
జవాబు:

  1. శిలాజ ఇంధనాలను వాడుతున్నపుడు. వాటి నుండి కాలుష్య కారకాలైన పదార్థాలను ముందుగానే తొలగించవలెను.
  2. వాహనాలకు పెట్రోల్, డీజిలకు బదులుగా కాలుష్యరహిత CNG వాయువును వాడవలెను.
  3. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలైన సౌరశక్తి, జలశక్తిలను వినియోగించాలి.
  4. వాతావరణ కాలుష్యం చేసే డీజిల్ కు బదులుగా బయో డీజిల్ వాడవలెను.
  5. వాహనాలు సౌరశక్తి లేదా విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాలను ఉపయోగించాలి.
  6. వాతావరణ కాలుష్యం తగ్గించుటకు అధిక సంఖ్యలో చెట్లను పెంచవలెను.
  7. వాతావరణ, జల, భూమి కాలుష్యం కాకుండా చూడాలి.

ప్రశ్న 20.
ఇంధనాలు మానవ జీవితంలో ఒక భాగమైపోవడం పట్ల నీ స్పందన ఏమి? (AS7)
జవాబు:
మానవ జీవితంలో జీవన అవసరాలను, కోరికలను తీర్చే సాధనాలలో అతి ముఖ్యమైనది ఇంధనం. ఇంధనాలు రవాణా, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలలో మరియు వివిధ వస్తువుల ఉత్పత్తులలో ఎంతగానో ఉపయోగిస్తారు. మానవ పురోగతి, దేశ అభివృద్ధి ఇంధనాలపై ఆధారపడి ఉన్నది. నిత్య జీవితంలో మానవ అవసరాలను తీర్చే ప్రతి వస్తువూ ఇంధనంపై ఆధారపడటం వలన ఇంధనాలు మానవ జీవితంలో ఒక భాగమైపోయాయనడం అతిశయోక్తి కాదు. కావున ఇంధనాలను పొదుపుగా వాడుకోవటమేగాక, శిలాజ ఇంధనాలు తరిగిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ – ఇంధనాలపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ప్రశ్న 21.
ఎండుగడ్డి కంటే పచ్చగడ్డిని మండించడం కష్టం ఎందుకు? (AS1)
జవాబు:
ఎండుగడ్డి మండించినపుడు తక్కువ ఉష్ణం గ్రహించి మండుతుంది. పచ్చిగడ్డిని మండించడం చాలా కష్టం. ఎందుకంటే పచ్చిగడ్డికి అందించిన ఉష్ణం పచ్చిగడ్డిలోని నీటికి చేరవేయబడుతుంది కావున పచ్చిగడ్డికి ఇచ్చిన ఉష్ణం జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోలేకపోవడం వల్ల పచ్చిగడ్డి మండదు.

ప్రశ్న 22.
రాబోయే కొద్ది కాలంలో భూమిలోని అన్ని ఇంధనాలు అడుగంటిపోతున్నాయి. అప్పుడు మానవాళి జీవనం ఎలా ఉంటుందో ఊహించండి? (AS2)
జవాబు:
ప్రస్తుత మానవాళి భూమిలోని ఇంధనాలపై 90% ఆధారపడి ఉన్నది. ఈ ఇంధనాలు పూర్తిగా అడుగంటిపోతే మానవాళి జీవనం ఈ కింది విధంగా ఉంటుంది.

  1. రవాణా వ్యవస్థలేని జీవనం.
  2. విద్యుచ్ఛక్తి లేని జీవనం.
  3. పరిశ్రమలు పనిచేయవు. తద్వారా మానవ మనుగడకు ఉపయోగపడే వస్తువుల ఉత్పత్తి ఉండదు.
  4. ఆహార పదార్థాలను తయారుచేయలేము.
  5. వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది.

ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనుటకు శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ శక్తివనరులను (సౌరశక్తి. జలశక్తి) అన్వేషించాలి.

ప్రశ్న 23.
ఇంధనాలు అతిగా వాడటంవల్ల కాలుష్యం పెరిగి మానవాళికేగాక భూమిపైనున్న సమస్త జీవజాలానికి నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు తగు సూచనలివ్వండి. (AS2)
జవాబు:
కాలుష్య నివారణ చర్యలు :

  1. ఇంధనాలను పొదుపుగా వాడాలి.
  2. వాయు కాలుష్య కారకాలైన పదార్థాలను ఇంధనాల నుండి తొలగించాలి.
    ఉదా : ఇంధనాలలో సల్ఫర్‌ను తొలగించడం వలన SO<sub>2</sub> కాలుష్యాన్ని నిరోధించవచ్చును.
  3. పెట్రోల్‌కు బదులు CNG వాయువును వాడవలెను.
  4. పరిశ్రమలలో వెలువడే వాయువులలో లోహ అయాన్లు, కాలుష్య కణాలను తొలగించడానికి బ్యాగు ఫిల్టర్లు, ఎలక్ట్రోస్టాటిక్ అవక్షేపాలను, సబ్బర్లను ఉపయోగించాలి.
  5. పరిశ్రమల ప్రాంతాలలో చెట్లను ఎక్కువగా పెంచాలి.
  6. శిలాజ ఇంధనాలకు బదులుగా సంప్రదాయేతర ఇంధనాలను వాడాలి.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

ప్రశ్న 24.
జోసఫ్ ప్రిస్టీ నిర్వహించిన ప్రయోగాలు, కనుగొన్న అంశాల గురించి మీ పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలు లేదా అంతర్జాలం (Internet) ద్వారా తెలుసుకోండి. దహనచర్యకు ఆక్సిజన్ అవసరమని ప్రిస్టీ చేసిన ప్రాయోగిక నిరూపణపై రెండు పేజీల నివేదికను తయారుచేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. (AS3)
జవాబు:
జోసెఫ్ ప్రిస్టీ ప్రయోగాలలో ముఖ్యాంశాలు :

  1. అతడు పొటాషియం క్లోరేటును వేడి చేస్తే అధిక ఉష్ణోగ్రత వద్దగాని ఆక్సిజన్ వెలువడలేదు.
  2. తర్వాత అనేక మార్పులను, చేర్పులను చేసి చివరకు పొటాషియం క్లోరేటుతో, మాంగనీసు డై ఆక్సెడ్ ను మిశ్రమం చేసి 450°C వద్దనే ఆక్సిజన్ విడుదల కావడం గమనించాడు.
  3. ఇలాగే పొటాషియం నైట్రేటు, సోడియం నైట్రేటు వంటి సంయోగ పదార్థాలను వేడిచేసి వాటి నుండి ఆక్సిజన్ వెలువడటం గుర్తించాడు.
  4. ఒక మండుతున్న పుల్లను ఆక్సిజన్’ వెలువడుతున్నప్పుడే పరీక్ష నాళికలోనికి చొప్పించి, మంట కాంతివంతంగా వెలగటాన్ని గమనించాడు.
  5. అతని పరిశోధనల ఫలితంగానే ఆక్సిజన్ దహన దోహదకారి అనే ప్రధాన ధర్మం ఆవిష్కరింపబడింది.

ప్రశ్న 25.
ప్రపంచవ్యాప్తంగా వివిధ అవసరాలకు ఒక సంవత్సరంలో ఖర్చుచేసే ఇంధనాల వివరాలను సేకరించండి. మనకు అందుబాటులో ఉన్న ఇంధనాలు ఎంత కాలం సరిపోతాయో లెక్కించండి. ఈ వివరాలతో ఒక పోస్టరును తయారుచేసి ఇంధనాన్ని పొదుపు చేయవలసిన అవసరాన్ని తెలియపరచండి. (AS4)
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా వివిధ అవసరాలకు ఒక సంవత్సరంలో ఖర్చు చేసే ఇంధనాల వివరాలను చూపే పట్టిక
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 5

ఇంధనాన్ని పొదుపు చేయవలసిన అవసరం :

  1. ఇంధనాలను పొదుపు చేయకపోతే భావితరాలవారు అనేక ఇబ్బందులు పడతారు.
  2. తిరిగి ఆదిమ జాతి మానవుడి జీవితం పునరావృతమవుతుంది.
  3. ప్రయాణ సాధనాలు లేక, మానవులు తాము ఉన్న చోటు నుండి వేరొక చోటికి ప్రయాణాలు చేయటం అసాధ్యం.
  4. విదేశీయానం పూర్తిగా ఆగిపోతుంది.
  5. ఒకే ప్రదేశానికి కట్టుబడి ఉండటం వలన మానవులలో ప్రపంచ విజ్ఞానం గురించిన అవగాహన తగ్గిపోతుంది.

పరికరాల జాబితా

కాగితం, బొగ్గు, మెగ్నీషియం రిబ్బన్, స్ట్రా, నూలు గుడ్డ, నైలాన్ గుడ్డ, ఎండుకర్ర, రాయి, మైనం, ప్లాస్టిక్ ముక్క, కొబ్బరి నూనె, ఆవనూనె, కిరోసిన్, స్పిరిట్, పెట్రోలు, కొవ్వొత్తి, అగ్గిపెట్టె, అగరుబత్తి, కాగితపు కళ్లు, నేలబొగ్గు, కర్ర బొగ్గు, మెగ్నీషియం, కర్ర, పిడకలు, కర్పూరం, నూనెదీపం, వలీ, కిరోసిన్ స్టా వత్తి, పట్టుకారు, లోహపు గిన్నెలు ,లేదా పింగాణీ గిన్నెలు, సారాయి దీపం, గాజు గ్లాసు, పరీక్ష నాళిక, భూతద్ధం, త్రిపాది, గాజు గొట్టం, స్లెడ్, రాగితీగ.

8th Class Physical Science 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 111

ప్రశ్న 1.
కొన్ని పదార్థాలు మండడానికి, మరికొన్ని పదార్థాలు మండకపోవడానికి కారణం రాయండి.
జవాబు:
I. కొన్ని పదార్థాలు మండడానికి కారణాలు :

  1. పదార్థం దహనశీల పదార్థం కావడం.
  2. మండుతున్న పదార్థానికి గాలి (ఆక్సిజన్) సరఫరా కావడం.
  3. పదార్ధ జ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండటం.

II. కొన్ని పదార్థాలు మండక పోవడానికి కారణాలు :

  1. పదార్థాలు దహనశీల పదార్థాలు కాకపోవడం.
  2. మండుతున్న పదార్థాలకు గాలి (ఆక్సిజన్) సరిగా అందకపోవడం.
  3. పదార్థాల జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణం దగ్గర ఉండటం.

ప్రశ్న 2.
సాధారణ ఉష్ణోగ్రత వద్ద మండని కొన్ని పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఎందుకు మండుతాయి?
జవాబు:
జ్వలన ఉష్ణోగ్రత అధికంగా గల పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద మండుతాయి.

8th Class Physical Science Textbook Page No. 112

ప్రశ్న 3.
మండుతున్న కొవ్వొత్తిపై బోర్లించిన గ్లాసును బల్ల ఉపరితలం నుండి 1 సెం.మీ. ఎత్తు వరకు ఎత్తితే ఏం జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
మండుతున్న కొవ్వొత్తి పై బోర్లించిన గ్లాసును బల్ల ఉపరితలం నుండి 1 సెం.మీ. ఎత్తు వరకు ఎత్తి ఉంచిన మండుతున్న కొవ్వొత్తి ఆరిపోవును. ఎందుకంటే కొవ్వొత్తి నుండి విడుదలైన వేడిగా ఉండే కార్బన్ డై ఆక్సైడ్ (CO2), నీటి ఆవిరి గ్లాసులో ఆక్రమించి, మంటకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. కావున మంట ఆరిపోతుంది.

8th Class Physical Science Textbook Page No. 113

ప్రశ్న 4.
వాయుపాత్రలోగల వాయువు ఆక్సిజనే అని మీరెలా చెప్పగలరు?
జవాబు:
మండుతున్న పుల్లను లేదా నిప్పుగల అగరుబత్తిని వాయుపాత్రలో ఉంచినట్లు అయితే అది కాంతివంతంగా మండుతుంది. దీనిని బట్టి వాయుపాత్రలో ఉన్నది ఆక్సిజన్ వాయువు అని నిర్ధారించవచ్చును.

ప్రశ్న 5.
ఆక్సిజన్ విడుదల చేయడానికి పొటాషియం పర్మాంగనేట్ కు బదులుగా వేరే ఏ పదార్థాన్నైనా వాడవచ్చా?
జవాబు:
పొటాషియం పర్మాంగనేట్ కు బదులుగా పొటాషియం రేట్ (KClO3) లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ (H2O2) లేదా పొటాషియం నైటీ (KNO3) లేదా మెర్యురిక్ ఆక్సెడ్ (HgO) లను వాడవచ్చును.

ప్రశ్న 6.
దహనానికి ఆక్సిజన్ దోహదపడుతుందని నిరూపించడానికి మరొక పద్ధతి ఏదైనా ఉందా?
జవాబు:
మండుతున్న పదార్థంపై ఇసుకపోసిన లేదా నీరు పోసిన ఆరిపోతుంది. కారణం మండుతున్న పదార్థానికి ఆక్సిజన్ అందకపోవుట వలన ఆరిపోతుంది. కాబట్టి దహనానికి ఆక్సిజన్ దోహదపడుతుంది.

8th Class Physical Science Textbook Page No. 115

ప్రశ్న 7.
ఫాస్ఫరస్ ను మనం ఎందుకు నీటిలో నిల్వ ఉంచుతాము?
జవాబు:
ఫాస్ఫరసకు జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద స్వతసిద్ధ దహనం జరుగుతుంది. కావున ఫాస్ఫరస ను నీటిలో నిల్వ చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

ప్రశ్న 8.
కిరోసిన్ పౌలకు, మీ ప్రయోగశాలలోని బున్ సెన్ బర్నర్ లకు చిన్న రంధ్రాలు ఉంటాయి. ఎందుకు?
జవాబు:
దహన చర్యకు ఆక్సిజన్ అవసరం. కావున చిన్న రంధ్రాల గుండా గాలి (ఆక్సిజన్) వెళ్ళుటకు కిరోసిన్ స్టాలకు, బున్ సెన్ బర్నర్లకు చిన్న రంధ్రాలు ఉంటాయి.

ప్రశ్న 9.
వర్షాకాలంలో అగ్గిపుల్లను వెలిగించడం కష్టం ఎందుకు?
జవాబు:
అగ్గిపుల్లను గరకుతలంపై రుద్దినప్పుడు ఎర్రఫాస్ఫరస్, తెలుపు ఫాస్ఫరస్ గా మారి వెంటనే అగ్గిపుల్లపై పొటాషియం క్లోరేటుతో చర్యనొందడం వలన ఉద్భవించిన ఉష్ణం ఆంటిమోని సల్ఫైడ్ ను మండించటం వలన అగ్గిపుల్ల మండుతుంది. కానీ వర్షాకాలంలో గది ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. పొటాషియం క్లోరేట్ విడుదల చేసిన ఉష్ణం, ఆంటిమోని సల్ఫైడ్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండుట వలన అగ్గిపుల్లను వెలిగించడం కష్టం.

8th Class Physical Science Textbook Page No. 118

ప్రశ్న 10.
కొవ్వొత్తి మంట పసుపు రంగులో ఉంటుంది. వంటగ్యాస్ మంట నీలిరంగులో ఉంటుంది. ఎందువలన?
జవాబు:
ఏదైనా దహనశీల వాయు పదార్థం తగినంత ఆక్సిజన్ లో దహనమైనపుడు నీలిరంగు మంటలో మండుతుంది. కొవ్వొత్తి మంటలోని లోపలి ప్రాంతంలో ద్రవ మైనం బాష్పంగా మారుతుంది. మధ్య ప్రాంతంలో బాష్ప మైనం దహనమగుటకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొవ్వొత్తి పసుపు రంగులో మండును.

గ్యాస్ బర్న లందు సన్నని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా వంటగ్యాస్ వచ్చినపుడు తగినంత ఆక్సిజన్ అందడం వల్ల వంటగ్యాస్ దహనమై నీలి రంగులో మండును.

8th Class Physical Science Textbook Page No. 111

ప్రశ్న 11.
నీటిని మండించే ప్రయత్నం :
ఒక పళ్ళెంలో 2 మి.లీ. నీటిని తీసుకోవలెను. ప్రక్కపటంలో చూపినట్లు మండుచున్న అగ్గిపుల్లను నీటి వద్దకు తీసుకువెళ్ళవలెను.
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 6
ఎ) నీటిని మండించడానికి చేసిన ప్రయత్నంలో మనమేం గమనించగలం?
జవాబు:
నీటిని మండించడానికి చేసిన ప్రయత్నంలో పుల్లకు ఉన్న మంటయే ఆరిపోయింది.

బి) పుల్లకు ఉన్న మంటలో ఏమైనా తేడా ఉందా?
జవాబు:
పుల్లకు ఉన్న మంట కూడా పూర్తిగా ఆరిపోయింది.

సి) మండుచున్న పుల్లను పళ్ళెంలో గల నీటి దగ్గరకు తెస్తే ఏం జరిగింది?
జవాబు:
మంట యొక్క కాంతి తగ్గింది.

8th Class Physical Science Textbook Page No. 113

ప్రశ్న 12.
నిప్పుల పైకి గాలి ఊదితే మంట ఏర్పడుతుంది. కాని వెలుగుతున్న క్రొవ్వొత్తి పైకి గాలిని ఊదితే దాని మంట ఆరిపోతుంది. ఎందుకు?
జవాబు:
నిప్పుల పై భాగంలో అప్పటికే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు కప్పి ఉంటుంది. మనం గాలి ఊదితే ఆ వాయువు తొలగింపబడి దాని స్థానంలో ఏర్పడిన ఖాళీలోకి చుట్టూ ఉన్న గాలి వచ్చి చేరడంతో, ఆ గాలిలోని ఆక్సిజన్ మంటను ఏర్పరచింది. కాని అప్పటికే వెలుగుతున్న క్రొవ్వొత్తి పైకి గాలిని ఊదితే, మనం బయటకు వదిలే గాలిలో కార్బన్ డయాక్సెడ్ అధికంగా ఉంటుంది కనుకనూ, మరియూ ఈ వాయువుకు మంటలను ఆర్పివేసే ధర్మం ఉండటంవల్లనూ మంట ఆరిపోతుంది.

ప్రశ్న 13.
ఎక్కువ మొత్తంలో ఎండుగడ్డి మండుతుంటే దానిని ఆర్పడం కష్టం. ఎందుకు?
జవాబు:
ఎక్కువ మొత్తంలో ఎండుగడ్డి మండుతుంటే, ఆ ప్రదేశంలో ఏర్పడిన శూన్య ప్రదేశంలోకి పరిసరాలలోని గాలి వేగంగా దూసుకువస్తుంది. అందులోని ఆక్సిజన్ ప్రభావం వల్ల మంట పెద్దదవుతుంది కనుక ఆర్పడం కష్టం.

ప్రశ్న 14.
ఏదైనా వస్తువు మండుతున్నప్పుడు దానిపై ఇసుక పోసి లేదా కంబళి కప్పి మంటను ఆర్పుతారు. ఎందుకు?
జవాబు:
మంటపై ఇసుక పోసినా లేదా కంబళి కప్పినా మంటకు గాలి తగలదు. అందువల్ల ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది.

8th Class Physical Science Textbook Page No. 116

ప్రశ్న 15.
అగ్నిమాపక దళం వారు విద్యుత్ సరఫరా ఆపిన తర్వాతనే మంటలను అదుపుచేయడం మొదలు పెట్టడానికి కారణమేమి?
జవాబు:
అగ్నిమాపకదళంవారు ఉపయోగించే నీరు స్వేదన జలం కాదు. నీరు విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. కాబట్టి మంటలను ఆర్పడానికి ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు.

8th Class Physical Science 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట Textbook Activities

కృత్యం – 1

ప్రశ్న 1.
అన్ని పదార్థాలు మండుతాయా?
జవాబు:
బొగ్గు, మెగ్నీషియం రిబ్బన్, స్ట్రా, నూలుగుడ్డ, నైలాన్ గుడ్డ, ఎండు కర్ర, రాయి, మైనం, ప్లాస్టిక్ ముక్క మొదలగు పదార్థాలను ఒక్కొక్కటిగా మంటపై ఉంచి వాటిలో వచ్చే మార్పులను ఈ కింది పట్టికలో (✓) నమోదు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 7

కృత్యం – 2

ప్రశ్న 2.
పదార్థాలు మండుటకు గాలి ఆవశ్యకతను పరీక్షించుట.
జవాబు:
ఒక కొవ్వొత్తిని వెలిగించి బల్లపై పెట్టండి. దానిపై ఒక గాజు గ్లాసును బోర్లించండి. కొవ్వొత్తి కొద్దిసేపు మండి తర్వాత దాని మంట రెపరెపలాడుతూ చివరికి ఆరిపోతుంది.
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 8

గాజు గ్లాసును తీసి కొవ్వొత్తిని మరొకసారి వెలిగించండి. దానిపై మరల గాజు గ్లాసును బోర్లించండి. కొవ్వొత్తి మంట రెపరెప లాడుతూ ఆరిపోతుందనిపించినపుడు గ్లాసును తొలగించండి. గ్లాసు బోర్లించడం వలన గాలి అందక కొవ్వొత్తి ఆరిపోయిందని మనకు తెలుస్తుంది.

కృత్యం – 3

ప్రశ్న 3.
సూర్యుని కిరణాలతో కాగితాన్ని మండించుట.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 9
ఎండ బాగా ఉన్న రోజున ఆరు బయట భూతద్దం (కుంభాకార కటకం) సహాయంతో సూర్యుని కిరణాలు కాగితంపై కేంద్రీకరించండి. కొంత సమయం తర్వాత సూర్యకిరణాలు కాగితంపై కేంద్రీకరింపబడిన చోట మంటమండును. దీనిని బట్టి “సూర్యుని కిరణాలతో కాగితాన్ని మండించవచ్చును” అని తెలుసు కోవచ్చును.

కృత్యం – 4

ప్రశ్న 4.
జ్వలన ఉష్ణోగ్రతను అవగాహన చేసుకొనుటకు ఒక ప్రయోగాన్ని చేయండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 10
రెండు కాగితపు కప్పులలో రెండవ కప్పులో నీరు పోయండి. ఈ రెండు కప్పులను రెండు వేరువేరు త్రిపాదులపై ఉంచి ఒకే పరిమాణం గల కొవ్వొతులతో వేడి చేయండి. మొదటి కప్పు మండుతుంది. రెండవ కప్పు మండలేదు. రెండవ కప్పునకు అందించిన ఉష్ణం నీటికి చేరవేయబడినది. కావున నీటి సమక్షంలో రెండవ కప్పు జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోలేక పోవుట చేత మండలేదు.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట

కృత్యం – 5

ప్రశ్న 5.
ఈ కింది పట్టికలోని ఘన పదార్థాలను సేకరించి, ఒకే సారాయి దీపం మంటపై ఉంచి ఒకదాని తర్వాత ఒకటి మండిస్తూ అవి మంటను అందుకోవడానికి ఎంత సమయం పడుతుందో నమోదుచేయండి.
జవాబు:

పదార్థం మంటను ఏర్పరచింది మంటను ఏర్పరచలేదు
కొవ్వొత్తి
మెగ్నీషియం
పిడక
కర్రబొగ్గు
వంటగ్యాస్
కర్పూరం
కిరోసిన్ స్టా వత్తి

కృత్యం – 6

ప్రశ్న 6.
ఒక కొవ్వొత్తిని వెలిగించి దాని మంటలోని వివిధ రంగుల ప్రాంతాలను నిశితంగా గమనించండి. మంటలో ఎన్ని రంగులున్నాయి?
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 4

  1. మంట లోపల మధ్య భాగంలో నల్లని ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఇంధనం బాష్పంగా మారుతుంది.
  2. మంట కింది భాగంలో బాష్పంగా మారిన మైనం ఆక్సిజన్ తో చర్య జరిపి నీలిరంగులో మండుతుంది.

కృత్యం – 7

7. కొవ్వొత్తి మంటలోని వివిధ ప్రాంతాలలో ఏం జరుగుతుందో పరిశీలించి ఈ కింద నమోదు చేయండి.
జవాబు:
1) ఒక కొవ్వొత్తిని వెలిగించండి. ఒక గాజు గొట్టాన్ని పట్టుకారుతో పట్టుకొని మంట యొక్క నల్లని ప్రాంతం వరకు తీసుకెళ్లండి. గాజు గొట్టం రెండవ చివర మండుతున్న అగ్గిపుల్లను ఉంచండి, అగ్గిపుల్ల మండుతూనే ఉంటుంది. ఎందుకో గమనించండి.
AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 11a

వేడిగా ఉన్న ఒత్తి దగ్గరలోని మైనం త్వరగా ద్రవస్థితిలోకి రావడం వల్ల, నల్లని ప్రాంతంలో వాయువుగా మారి గాజు గొట్టం రెండవ చివర మండును.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 12
2) కొవ్వొత్తి మంట నిలకడగా ఉన్నపుడు. పసుపు మంట ప్రాంతం (Yellow zone) లో ఒక శుభ్రమైన సైడ్ ను 10 సెకన్ల సేపు ఉంచి, ఏం జరిగిందో గమనించండి. స్లెడ్ పై నలుపు రంగు వలయం ఏర్పడినది. మంట యొక్క Yellow zone ప్రాంతంలో కూడా ఇంకా కొంత మండని కార్బన్ కణాలు ఉన్నాయని అర్థమౌతుంది. ఈ ప్రాంతంలో దహనచర్య పూర్తిగా జరగలేదు.

AP Board 8th Class Physical Science Solutions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 13
3) ఒక పొడవాటి రాగి తీగను కొవ్వొత్తి మంటలో చివరి ఉపరితలంపై (మంట వెలుపల) ఒక అరనిమిషం సేపు పట్టుకోండి. ఏం గమనించారు? రాగి తీగ బాగా వేడెక్కడం గమనించవచ్చును. అనగా మంట వెలుపలి ఉపరితల భాగం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇది నీలి రంగులో మండును. కారణం ఈ ప్రాంతంలో గాలిలో ఆక్సిజన్ బాగా అందడం వలన దహనచర్య సంపూర్ణంగా జరుగుతుంది.

AP Board 8th Class Physical Science Study Material Guide Solutions | 8th Class Physics Study Material Pdf

Telangana & Andhra Pradesh SCERT AP State Board Syllabus 8th Class Physical Science Physics Study Material Guide Pdf free download, TS AP 8th Class Physical Science Physics Textbook Questions and Answers Solutions in English Medium and Telugu Medium are part of AP Board 8th Class Textbook Solutions.

Students can also go through AP Board 8th Class Physical Science Notes to understand and remember the concepts easily. Students can also read AP 8th Class Physical Science Important Questions (Physics & Chemistry) for exam preparation.

AP State Syllabus 8th Class Physics Study Material Pdf Download | 8th Class PS Guide

AP 8th Class Physics Study Material Pdf Download | 8th Class Physical Science Textbook Guide Question and Answer

AP 8th Class Physical Science Study Material Pdf Download English Medium

AP 8th Class Physics Textbook Questions and Answers Telugu Medium

Telangana SCERT Class 8 Physics Solutions | 8th Class PS Guide | 8th Class Physics Textbook Lessons

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

SCERT AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 7th Lesson Questions and Answers నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

8th Class Physical Science 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
క్రింది ఖాళీలను సారూప్యతను (Analogy) బట్టి సరైన పదంతో పూర్తి చేయండి. (AS1)

1. నేలబొగ్గు : తరిగిపోయేది :: …………….. : తరిగిపోనిది.
జవాబు:
సౌరశక్తి

2. కోల్ తార్ : ……………. :: కోక్ : స్టీల్ తయారీ
జవాబు:
కృత్రిమ అద్దకాలు లేదా ప్రేలుడు పదార్థాలు

3. పెట్రోరసాయనాలు : ప్లాస్టిక్ :: సి.యన్.జి. : ……
జవాబు:
ఇంధనం

4. కార్బన్ డై ఆక్సైడ్ : భూతాపము :: ……………… : నాసియా
జవాబు:
పెయింట్ల నుండి వెలువడే విషపదార్థాలు

ప్రశ్న 2.
జతపరచండి. (AS1)

1. సహజవనరు A) కార్బొ నైజేషన్
2. నేలబొగ్గు B) ప్లాస్టిక్ కుర్చీ
3. పెట్రోరసాయన ఉత్పన్నం C) కృష్ణా గోదావరి డెల్టా
4. సహజవాయువు D) ప్లాంక్టన్
5. పెట్రోలియం E) నీరు

జవాబు:

1. సహజవనరు E) నీరు
2. నేలబొగ్గు A) కార్బొ నైజేషన్
3. పెట్రోరసాయన ఉత్పన్నం B) ప్లాస్టిక్ కుర్చీ
4. సహజవాయువు C) కృష్ణా గోదావరి డెల్టా
5. పెట్రోలియం D) ప్లాంక్టన్

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 3.
బహుళైచ్ఛిక ప్రశ్నలు : (AS1)
i) క్రింది వానిలో కాలుష్య పరంగా ఆదర్శ ఇంధనం ఏది?
A) సహజవాయువు (CNG)
B) నేలబొగ్గు
C) కిరోసిన్
D) పెట్రోల్
జవాబు:
A) సహజవాయువు (CNG)

ii) బొగ్గులో ముఖ్య అనుఘటకం
A) కార్బన్
B) ఆక్సిజన్
C) గాలి
D) నీరు
జవాబు:
A) కార్బన్

iii) షూ పాలిష్ (Shoe Polish) ను తయారుచేయడానికి క్రింది వానిలో ఏ పదార్థాన్ని వాడతారు?
A) పారాఫిన్ మైనం
B) పెట్రోలియమ్
C) డీజిల్
D) లూబ్రికేటింగ్ నూనె
జవాబు:
D) లూబ్రికేటింగ్ నూనె

ప్రశ్న 4.
ఖాళీలు పూరించండి. (AS1)
ఎ) ………………….. ను ఉక్కు తయారీలో ఉపయోగిస్తాం.
జవాబు:
కోక్

బి) నేలబొగ్గు యొక్క …………………. అంశీభూతం కృత్రిమ అద్దకాలు మరియు పెయింట్స్ ఉపయోగిస్తాం.
జవాబు:
కోల్ తారు

సి) భూమిలోపల కప్పబడి ఉన్న ………………… గల ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో నేలబొగ్గు లభ్యమవుతుంది.
జవాబు:
జీవ అవశేషాలు

డి) భూతాపానికి మరియు వాతావరణ మార్పులకు కారణమయ్యే వాయువు …………..
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్

ప్రశ్న 5.
రోడ్లను వేసేటప్పుడు రోడ్డు పైపొరలో వాడే పెట్రోలియం ఉత్పత్తులను తెల్పండి. (AS1)
జవాబు:
రోడ్లను వేసేటప్పుడు రోడ్డు పై పొరలో ఉపయోగించే పెట్రోలియం ఉత్పత్తి తారు లేదా బిట్యుమెన్ (Bitumen).

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 6.
భూమిలో పెట్రోలియం ఏర్పడే విధానాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. సముద్రాల మరియు మహాసముద్రాల ఉపరితలాలకు దగ్గరగా ఉండే ప్లాంక్టన్ (Plankton) వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కప్పబడి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందుతాయి.
  2. ప్లాంక్టన్ల శరీరంలో కొద్ది మొత్తంలో చమురు ఉంటుంది.
  3. ఈ ప్రాణులు చనిపోయినప్పుడు వాటి అవశేషాలు నదులు, మహాసముద్రాల. అడుగున ఇసుక, మట్టి పొరలచేత కప్పబడతాయి.
  4. కొన్ని లక్షల సంవత్సరాలు ఆ మృత అవశేషాలు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండడం చేత అవి పెట్రోలియం, సహజవాయువులుగా రూపాంతరం చెందుతాయి.

ప్రశ్న 7.
ప్రాజెక్ట్ పని : (AS4)
సంపీడిత సహజవాయువు (CNG) తో మరియు డీజిల్ తో నడిచే వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు, కాలుష్య స్థాయి మరియు ఇంధన ధరల దృష్ట్యా పోల్చండి. మీరు కనుగొన్న అంశాలపై ఒక నివేదికను రూపొందించండి. (దీని కొరకు అవసరమైతే ఒక వాహన చోదకుడి సహాయం తీసుకోండి)

ఇంధన రకము ఇంధన ప్రస్తుతధర విడుదలయ్యే కాలుష్య కారిణులు
డీజిల్/ పెట్రోల్
CNG

జవాబు:

ఇంధన రకము ఇంధన ప్రస్తుతధర విడుదలయ్యే కాలుష్య కారిణులు
డీజిల్ ₹ 52-46 (లీ|| కు), CO, CO2, నైట్రోజన్ యొక్క ఆక్సెలు (NO, NO2),
పెట్రోల్ ₹ 78-60 (లీ|| కు) సల్ఫర్ యొక్క ఆక్సైలు (SO2, SO3), సీసం (Pb) మొదలైనవి.
CNG 49 (కి.గ్రా. కు) CO2

ప్రశ్న 8.
నీ ఇరుగు పొరుగులో ఉన్న ఐదు కుటుంబాలను ఎంచుకోండి. రవాణా మరియు వంట పనుల్లో శక్తి వనరులను పొదుపు చేయడానికి ఎటువంటి మార్గాలు. అనుసరిస్తున్నారో అడిగి తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారంను పట్టికలో నమోదు చేయండి. (AS4)
మీ పరిశీలనలతో ఒక రిపోర్ట్ తయారు చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 1
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 2

ఈ రిపోర్ట్ ను బట్టి తేలిన అంశములు :

  1. బైక్ ల కంటే కార్ల వినియోగం ఎక్కువైనది.
  2. వంట కొరకు చేసే ఖర్చు కంటే రవాణా వాహనాలపై ప్రతి కుటుంబం చేస్తూన్న ఖర్చు ఎక్కువైనది.
  3. వంట కొరకు చాలా కుటుంబాలు ఇండక్షన్ పొయ్యిలూ, రంపపు పొట్టు పొయ్యిలూ ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 9.
క్రింది పట్టిక 1991 నుండి 1997 వరకు భారతదేశంలో శక్తిలేమి (Power shortage) ని శాతాలలో సూచిస్తుంది. సంవత్సరాలను X అక్షంగా, శక్తిలేమి శాతంను Y అక్షంగా తీసుకొని మొత్తం దత్తాంశంను దిమ్మరేఖా చిత్రంలో (Bar graph) సూచించండి. (AS4)

సంవత్సరం శక్తిలేమి (%)
1. 1991 7.9
2. 1992 7.8
3. 1993 8.3
4. 1994 7.4
5. 1995 7.1
6. 1996 9.2
7. 1997 11.5

ఎ) శక్తిలేమి శాతం పెరుగుతున్నదా? తగ్గుతున్నదా?
జవాబు:
శక్తి లేమి శాతం పెరుగుతున్నది.

బి) శక్తిలేమి శాతం పెరుగుచున్నట్లయితే అది మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి.
జవాబు:
శక్తిలేమి శాతం క్రమంగా పెరుగుచున్నది. శక్తిలేమి శాతం తగ్గించవలెనంటే శక్తి వనరుల వినియోగరేటు పెంచవలెను. మనకు ఉన్న సాంప్రదాయ (తరిగిపోయే) ఇంధన వనరులు పరిమితంగా ఉన్నాయి. ఈ వనరులను వాడుకుంటూపోతే ఎంతోకాలం మిగలవు. కావున మనం ప్రస్తుతం ప్రకృతి నుండి లభించే ఎప్పటికి తరిగిపోని సాంప్రదాయేతర శక్తి వనరులైన సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి మొదలయిన శక్తివనరులను ఉపయోగించుకోవాలి.
AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 3

ప్రశ్న 10.
తరిగిపోయే మరియు తరిగిపోని వనరులు, వాటి ఉపయోగముపై క్రమచిత్రం (Flow chart) తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 4 AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 5

ప్రశ్న 11.
ఆంధ్రప్రదేశ్ లో నేలబొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు లభ్యమయ్యే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఆ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ పటం (Outline map) లో గుర్తించండి. (AS5)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో నేలబొగ్గు లభ్యమయ్యే ప్రాంతాలు లేవు.

పెట్రోలియం లభ్యమయ్యే ప్రాంతాలు : కృష్ణ-గోదావరి డెల్టా ప్రాంతం

సహజ వాయువు లభ్యమయ్యే ప్రాంతాలు : కృష్ణ-గోదావరి డెల్టా ప్రాంతం

పెట్రోలియం మరియు సహజవాయువులు కృష్ణ-గోదావరి డెల్టా ప్రాంతాలైన నర్సాపురం దగ్గర లింగబోయినచర్ల, కైకలూరు, రాజోలు, చించునాడు, పీచుపాలెం, ఎనుగువారి లంక, భీముని పల్లె, అబ్బయిగూడెం మరియు మేదరవాని మెరకల వద్ద నిక్షేపాలు గలవు.
AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 6

ప్రశ్న 12.
నేలబొగ్గు, పెట్రోలియంలకు ప్రత్యామ్నాయ శక్తి వనరులను కనుగొనడానికి మానవుడు చేసే ప్రయత్నాలను ఏవిధంగా నీవు అభినందిస్తావు? (AS6)
జవాబు:
నేలబొగ్గు మరియు పెట్రోలియంలు రెండూ తరిగిపోయే శక్తి వనరులు. వీటి నిల్వలు పరిమితంగా ఉన్నాయి. ఈ శక్తి వనరులు ఇంధనం మాత్రమే కాకుండా కొత్త సంయోగ పదార్థాల సంశ్లేషణకు ప్రారంభ పదార్థాలు. వీటి వినియోగం ఎక్కువవుతున్న రోజులలో వీటికి ప్రత్యామ్నాయ వనరులపై ప్రయత్నాలను క్రమంగానే సాంప్రదాయేతర శక్తి వనరులు అయిన సౌరశక్తి, వాయు శక్తి, జలశక్తి, బయోగ్యాస్, గార్బేజ్ శక్తి ఉపయోగించుకొంటున్నాము. ఇంకా సాంప్రదాయేతర వనరులైన భూ ఉష్ణశక్తి, అలల శక్తి పైన ప్రయత్నాలు జరుగుచున్నవి. సాంప్రదాయేతర శక్తి వనరులు తరగని శక్తి వనరులు అంతేకాదు వాతావరణ కాలుష్యరహితమైనవి. కావున సాంప్రదాయేతర శక్తి వనరుల ప్రయత్నాలను మనం అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 13.
హర్షిత్ తన తండ్రితో “దగ్గరి పనుల కొరకు బండికి బదులుగా సైకిల్ ను వాడితే మనం ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు కదా !” అని అన్నాడు. ఈ విషయాన్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS6)
జవాబు:
హర్షిత్ తన తండ్రితో అన్న విషయాన్ని బట్టి మనకు తెలిసినవి ఏమిటంటే

  1. ఇంధనాలను పొదుపుగా వాడుకోవడం.
  2. ఇంధనాన్ని పొదుపుగా వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించినట్లు అవుతుంది.
  3. శిలాజ ఇంధనాలు తరిగిపోయేవి కాబట్టి పొదుపుగా వాడుకుంటే ముందు తరాల వారికి అందించినట్లు అవుతుంది.

వీటినిబట్టి హర్షిత కు ఇంధన పొదుపుపై సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ మరియు ప్రకృతి పై గౌరవము ఉన్నట్లుగా అభినందించవచ్చును.

ప్రశ్న 14.
ప్రజలు శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలపై ఎందుకు దృష్టి సారిస్తున్నారు? (AS7)
జవాబు:

  1. శిలాజ ఇంధనాలు తరిగిపోయే శక్తి వనరులు.
  2. శిలాజ ఇంధన వనరుల నిల్వలు పరిమితంగా ఉండడం వలన.
  3. కొత్త సంయోగ పదార్థాల సంశ్లేషణకు ప్రారంభ పదార్థాలు శిలాజ ఇంధనాలు కావడం వల్ల.
  4. శిలాజ ఇంధనాలు వాతావరణ కాలుష్యాన్ని అధికం చేయడం వల్ల.
  5. ఇంధనాలను మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ భూతాపం (గ్లోబల్ వార్మింగ్)కి దారితీయడం వల్ల.
  6. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విడుదలయ్యే వాయువు మానవ అనారోగ్య సమస్యలకు మరియు గ్రీన్‌హౌస్ ప్రభావం ఏర్పడుట వల్ల.

పై కారణాల వల్ల శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించవలసి వస్తుంది.

ప్రశ్న 15.
ఒక వేళ నీవు వాహనచోదకుడివైతే పెట్రోలు మరియు డీజిల్ ను పొదుపు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటావు? (AS7)
జవాబు:
నేను వాహనచోదకుడిని అయితే పెట్రోల్, డీజిల్ పొదుపు చేయుటకు క్రింది చర్యలు తీసుకుంటాను.

  1. వాహనాన్ని నిర్ణయించిన నిర్ణీత వేగముతో నడపడం.
  2. వాహనాన్ని కొద్ది సమయం ఆపవలసి వచ్చినపుడు ఇంజన్ ఆపడం.
  3. సిగ్నల్ వద్ద గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకు ఇంజన్ ఆపడం.
  4. వాహన టైర్లలో నిర్ణీత గాలి పీడనం ఉండేటట్లు చూడడం.
  5. వాహనాన్ని తరచుగా సర్వీసింగ్ చేయిస్తూ ఉండడం.
  6. వాహనాలకు కత్తీ లేని ఇంధనాన్ని వాడడం.

ప్రశ్న 16.
“క్రూడాయిల్, శుద్ధి చేయబడిన ఇంధనం సముద్రాలలో ఓడ ట్యాంకర్ల నుండి బయటకు కారడం వలన సహజ ఆవరణ వ్యవస్థకు హానికలుగజేస్తుంది” చర్చించండి. (AS7)
జవాబు:
ముడిచమురు మరియు శుద్ధి చేసిన చమురు ఆయిల్ ట్యాంకర్లలో సముద్రం పై తరలిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ట్యాంకు నుండి జారిపడే చమురు సముద్రంలోకి చేరి నీళ్లపై తెట్టులాగా వందల కిలోమీటర్ల వరకు విస్తరించును. సముద్ర నీళ్లలోనికి గాలి, వెలుతురు వెళ్ళక, లోపలి జీవరాశుల జీవ ప్రక్రియలు ఆగిపోయి, సముద్రంలోని మొక్కలు, జంతువులు, చేపలు మరియు జీవరాశులు చనిపోతాయి. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 17.
“ఆటోమొబైల్ రంగంలో ఇంధనాలుగా CNG, LPG లను వాడితే వాయుకాలుష్యం తగ్గడంలో, పర్యావరణ సమతుల్యత కాపాడడంలో సహాయపడుతుంది.” ఇది అవును అనిపిస్తే వివరించండి. (AS7)
జవాబు:
ఆటోమొబైల్ రంగంలో వాహనాలకు CNG, LPG ఇంధనాలు వాడితే, వాహనాలు విడుదలచేయు వాయువులో CO2 (కార్బన్ డై ఆక్సైడ్) మాత్రమే ఉంటుంది. దీనివలన పర్యావరణానికి ఎక్కువగా నష్టం ఉండదు. ఎందుకంటే ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడు మొక్కలు, వృక్షాలు వినియోగించుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడినట్లు అవుతుంది. అంతే కాకుండా వృక్షాలు CO2 గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.

పరికరాల జాబితా

శక్తి వనరులకు సంబంధించిన చార్టుల సేకరణ, నేలబొగ్గు, పెట్రోలియం ఉత్పత్తుల చిత్రాలు లేదా. నమూనాల సేకరణ, పెట్రో ఉత్పత్తుల నమూనాలు లేదా చిత్రాల సేకరణ, శక్తి సంకటం గురించిన చిత్రాల సేకరణ, రెండు స్టాండులు, రెండు పెద్ద పరీక్ష నాళికలు, రబ్బరు బిరడాలు, వాయు వాహక నాళం, జెట్ నాళం, బుస్సెన్ జ్వాలకం.

8th Class Physical Science 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook InText Questions and Answers

8th Class Physical Science Textbook Page No. 96

ప్రశ్న 1.
మన చుట్టూ ఉండే ఈ వనరులు ఎల్లప్పుడు ఇలాగే అందుబాటులో ఉంటాయా?
జవాబు:
మన చుట్టూ ఉండే ఈ వనరులు ఎల్లప్పుడు ఇలాగే అందుబాటులో ఉండవు.

ప్రశ్న 2.
మన చుట్టూ ఉండే గాలి ఎప్పుడైనా పూర్తిగా లేకుండా పోతుందా?
జవాబు:
మన చుట్టూ ఉండే గాలి ఎప్పుడైనా పూర్తిగా లేకుండా పోదు.

ప్రశ్న 3.
ఎప్పుడైనా మనకి ప్రకృతిలో నీరు పూర్తిగా దొరక్కుండా పోయే అవకాశం ఉందా?
జవాబు:
జలచక్రం వల్ల నీరు ఎల్లప్పుడూ భూమిపై ఉంటుంది.

ప్రశ్న 4.
మానవ చర్యల వల్ల ఈ వనరులు తరిగిపోతున్నాయా?
జవాబు:
తరిగిపోతున్నాయి.

ప్రశ్న 5.
నేలబొగ్గు, పెట్రోలియంల అపరిమితమైన నిల్వలు మనకు అందుబాటులో ఉన్నాయా?
జవాబు:
ప్రస్తుతం ఉన్నాయి. ముందు ముందు ఉండకపోవచ్చు.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 6.
వివిధ అవసరాలను తీర్చే కలష కోసం తొందరగా అడవుల్ని నరికివేశారనుకోండి, ఏం జరుగుతుంది?
జవాబు:
ప్రకృతిలో సమతుల్యత నశించి, క్రమంగా అడవులు లేకుండా పోతాయి. చెట్లు మళ్లీ పెంచడానికి చాలా కాలం పడుతుంది.

8th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 7.
అడవులు తిరిగి పెరగడానికి ఎంత కాలం పడుతుందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
అడవులు తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుందని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 8.
పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు మనకింకా ఎన్నాళ్ళు అందుబాటులో ఉంటాయి? అవి తరిగిపోవా?
జవాబు:
పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలు మనకింకా కొద్దికాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి తరిగిపోతుంటాయి.

8th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 9.
శిలాజ ఇంధనాలైన నేలబొగ్గు, పెట్రోలియం పూర్తిగా హరించుకుపోతే ఏమౌతుంది?
జవాబు:
మానవుడు తిరిగి పాత రాతియుగపు జీవితాన్ని గడపాలి. ప్రయాణాలు ఉండవు. విద్యుత్తు కొరత తీవ్రమవుతుంది. ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి.

ప్రశ్న 10.
మన భవిష్యత్ శక్తి వనరులేమిటి?
జవాబు:
మన భవిష్యత్ వనరులు తరగని శక్తి వనరులు. అవి :

  1. సౌరశక్తి,
  2. జలశక్తి,
  3. పవనశక్తి,
  4. అలలశక్తి,
  5. బయోగ్యాస్,
  6. సముద్ర ఉష్ణమార్పిడి శక్తి,
  7. భూ ఉష్ణశక్తి,
  8. గార్బేజి పవర్,
  9. కేంద్రక శక్తి.

ప్రశ్న 11.
భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడానికి ఇప్పుడున్న శిలాజ ఇంధన వనరులు సరిపోతాయా?
జవాబు:
పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, జనాభా పెరుగుదల దృష్ట్యా ఇప్పుడున్న శిలాజ ఇంధన వనరులు సరిపోవు.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 12.
భవిష్యత్ ఇంధన అవసరాలు తీరడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. సౌరశక్తిని అధిక మొత్తం వినియోగించడము.
  2. జలశక్తిని వినియోగించుకోవడము.
  3. పవన శక్తిని వినియోగించుకోవడము.
  4. తీరప్రాంతాలలో అలల శక్తిని ఉపయోగించుకోవడం.
  5. బయోడీజిల్ ఉత్పత్తులను పెంచి, అధిక మొత్తంలో వినియోగించుకోవడం.
  6. బయోగ్యాస్ ఉపయోగించడం.
  7. గృహ వ్యర్థ పదార్థాల (గార్బేజి పవర్) నుండి శక్తిని వినియోగించడం.
  8. భూగర్భ ఉష్ణశక్తిని వినియోగించడం.
  9. సముద్ర ఉష్ణశక్తి మార్పిడిని వినియోగించుకోవడం.
  10. కేంద్రక శక్తిని వినియోగించడం.

పై చర్యలు చేయడం వలన భవిష్యత్ లో ఇంధన వనరుల అవసరాలను తీర్చవచ్చును.

8th Class Physical Science Textbook Page No. 105

ప్రశ్న 13.
ఇంధనం, శక్తి వనరులను మనం దుర్వినియోగం చేసే సందర్భాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?
జవాబు:

  1. వాహనాలు నడుపుతున్నపుడు రెడ్ సిగ్నల్స్ వద్ద వాహన ఇంజన్ ఆపుచేయకపోవడం.
  2. వాహనం నిర్ణయించే వేగంతో కాకుండా ఎక్కువ లేదా తక్కువ వేగంతో నడపడం.
  3. పబ్లిక్ వాహనాలను (ఆర్టిసి బస్సుల) ఎక్కకుండా వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం.
  4. వంట చేస్తున్నపుడు వంటకు కుక్కర్లను ఉపయోగించకపోవడం.
  5. తక్కువ దూరాలకు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం.
  6. పగటిపూట గదులలో కిటికీలు తీయకుండా లైట్లను, ఫ్యాన్లు ఉపయోగించడం.
  7. గదిలో లేకున్నను లైట్లు, ఫ్యాన్లు వినియోగించడం.
  8. వ్యక్తిగత వాహనాలను తరచుగా సర్విసింగ్ చేయించకపోవడం.
  9. అధిక సామర్థ్యం గల వాహనాలను ఉపయోగించకపోవడం.

ప్రశ్న 14.
ఇంధన వనరులను పొదుపు చేయడానికి, ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలను నీవు సూచించగలవా?
జవాబు:

  1. మన అవసరం పూర్తికాగానే ఇంధన వనరులను ఆపివేయడం.
  2. పెట్రోలు, డీజిల్ లీకేజీలను అరికట్టడం.
  3. అవసరమైన గదుల్లో మాత్రమే విద్యుద్దీపాలను వెలగనిచ్చి, మిగతా గదుల్లో ఆర్పివేయడం.
  4. పెట్రోలు లీకేజీ లేకుండా వాహనాలను మరమ్మతు చేయించడం.
  5. కొన్ని అవసరాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రశ్న 15.
శిలాజ ఇంధనాల అతి వినియోగం ప్రకృతిలో జీవవైవిధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. శిలాజ ఇంధనాలను అతిగా వినియోగించడం వలన కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, లెడ్, CFC, పొగ కణాలు ఇతర ఆక్సైడ్లు వాతావరణంలో విడుదల అవుతాయి.
  2. కార్బన్ మోనాక్సైడ్ (CO) విషవాయువు. ఇది రక్తం, ఆక్సిజన్ వాయువును తీసుకునిపోయే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
  3. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ వలన ఆస్తమా, దగ్గు లాంటి వ్యాధులు కలుగుతాయి.
  4. సల్ఫర్ డై ఆక్సైడ్ వలన శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.
  5. CFC వాయువులు ఓజోన్ పొరను క్షీణింపచేయడం వలన సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిపై పడి జీవరాశులకు హాని కలుగుజేస్తుంది.
  6. వాతావరణంలోని SO2, NO2 వలన ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వీటివలన జీవరాశులకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి.
  7. ఆమ్ల వర్షాలు చెట్ల యొక్క ఆకులను పాడైపోతాయి.
  8. వాతావరణంలోని లెడ్ కణాల వలన కిడ్నీ, జీర్ణవ్యవస్థలు పాడైపోతాయి.
  9. ఇంధనాలను మండించినపుడు ఏర్పడే సూక్ష్మ కణాలలోని భారలోహ కణాల వలన కేన్సర్, చర్మ, ముక్కు, గొంతు, కళ్ళు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి.

8th Class Physical Science 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ Textbook Activities

కృత్యం – 1 వివిధ అవసరాల కోసం మనం వాడే పరికరాలను, పదార్థాలను గుర్తించడం :

ప్రశ్న 1.
ఈ క్రింది పట్టికలో నిలువు వరుస A లో కొన్ని సందర్భాలు మరియు వస్తువులు ఇవ్వబడ్డాయి. ఆయా సందర్భాలలో వినియోగించిన వస్తువుల తయారీకి 30 – 40 సం||ల ముందు ఏ పదార్థాలు వాడేవారో నిలువు వరుస B లో నింపండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. అవే అవసరాలకి ప్రస్తుతం ఎటువంటి పదార్థాలను వాడుతున్నామో నిలువు వరుస C లో నింపండి. మీ అవగాహన కొరకు పట్టికలో కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.

సందర్భం / పరికరం (A) 30-40 సం|| క్రితం వాడిన పరికరం (B) ప్రస్తుతం వాడుతున్న పరికరం (C)
పచ్చళ్ళు నిల్వ చేసే జాడీ పింగాణి జాడీలు పింగాణి జాడి, ప్లాస్టిక్ జాడి
ప్రయాణ సమయంలో వాడే ఆహార పదార్థాల ప్యాకింగ్ విస్తరాకులు, అరిటాకులు ప్లాస్టిక్ ప్యాకెట్లు
ఇంట్లో వాడే నీటి పైపులు లోహపు పైపులు (ఇనుప) పి.వి.సి., రబ్బరు, ప్లాస్టిక్ పైపులు
దువ్వెనలు చెక్క దువ్వెనలు ప్లాస్టిక్ దువ్వెనలు
వంట సామాగ్రి రాగి పాత్రలు, మట్టి పాత్రలు స్టీలు వస్తువులు
వంటకు ఉపయోగించే ఇంధనాలు వంటచెఱకు కిరోసిన్, ఎల్.పి.జి. గ్యా స్
రైలు ఇంజనులో వాడే ఇంధనం నేలబొగ్గు డీజిల్, విద్యుత్ శక్తి
బట్టలు పెట్టడానికి ఉపయోగించే సామాను ట్రంకు పెట్టెలు సూట్ కేసు, బ్యాగులు
నీటి బకెట్లు, మూతలు లోహపు బకెట్లు, లోహపు మూతలు ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ మూతలు
నీరు నిల్వ చేయడానికి ఉపయోగించేవి కుండలు, సిమెంటు తొట్లు ప్లాస్టిక్ ట్యాంకులు
నిర్మాణ సామాగ్రి బంకమట్టి, ఇటుకలు, డంగు సున్నం సిమెంటు, సిమెంటు ఇటుకలు, కాంక్రీట్, స్టీల్ (ఐరన్ రాడ్స్)
ఆభరణాలు బంగారం, రాగి, వెండి డైమండ్స్, ప్లాటినం, ప్లాస్టిక్
గృహోపకరణాలు (కుర్చీలు, మంచాలు) కలప కుర్చీలు, మంచాలు ప్లాస్టిక్ కుర్చీలు, మంచాలు

1. 10 సంవత్సరాల క్రితం ఏ పదార్థాలు అందుబాటులో ఉండేవి?
జవాబు:
పి.వి.సి., రబ్బర్ పైపులు, ప్లాస్టిక్ దువ్వెనలు, ప్లాస్టిక్ కుర్చీలు.

2. 50 సంవత్సరాల క్రితం ఏ పదార్థాలు అందుబాటులో ఉండేవి?
జవాబు:
మట్టి కుండలు, రాగి పాత్రలు, ట్రంకు పెట్టెలు, బంగారం, వెండి, రాగి, కలప కుర్చీలు, కలప మంచాలు.

3. 100 సంవత్సరాల క్రితం వీటిలో ఏ పదార్థాలు అందుబాటులో ఉండేవి?
జవాబు:
మట్టి కుండలు, రాగి పాత్రలు, నేలబొగ్గు, వంటచెఱకు.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

కృత్యం – 2

ప్రశ్న 2.
పరిమితంగా ఉన్న సహజ వనరులు, తరగని సహజ వనరులను ఈ క్రింది పట్టికలో వాటికి సంబంధించిన గడిలో వ్రాయండి.
జవాబు:

తరగని సహజ వనరులు పరిమితంగా ఉన్న (తరిగిపోయే) సహజ వనరులు
సౌరశక్తి నేలబొగ్గు
జలశక్తి పెట్రోలియం
వాయుశక్తి సహజ వాయువు
బయోమాస్ శక్తి కట్టెలు
అలలశక్తి కర్రబొగ్గు
భూ ఉష్ణశక్తి
సముద్ర ఉష్ణశక్తి మార్పిడి
గార్బేజి పవర్ (గృహ వ్యర్థ పదార్థాల నుండి శక్తి)
పరమాణు కేంద్రక శక్తి
హైడ్రోజన్ శక్తి
బయోడీజిల్

కృత్యం – 3 వివిధ పెట్రోలియం ఉప ఉత్పత్తుల ఉపయోగాలు :

ప్రశ్న 3.
ఈ క్రింది పట్టికలో పెట్రోలియం మరియు వాటి ఉత్పత్తుల ఇతర ఉపయోగాలను వ్రాయండి.
జవాబు:

పెట్రోలియం ఉత్పత్తి పేరు ఉపయోగాలు
ఇంధన గ్యాస్ (పెట్రోలియం గ్యాస్) ఎల్.పి.జి. గ్యాస్ తయారు చేస్తారు.
పరిశ్రమలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
గృహాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
వాహనాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
పెట్రోల్ వాహనాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
ద్రావణిగా ఉపయోగిస్తారు.
డ్రైక్లీనింగ్ లో ఉపయోగిస్తారు.
కిరోసిన్ వంట ఇంధనంగా ఉపయోగిస్తారు.
జెట్ విమానాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
డీజిల్ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు.
విద్యుత్ జనరేటర్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు.
పారఫిన్ మైనం ఆయింట్ మెంట్ అగ్గిపెట్టె
ఫేస్ క్రీమ్ కొవ్వొ త్తి
గ్రీజు వాష్ పేపర్స్
వ్యాజ్ లిన్

కృత్యం – 4 నేలబొగ్గు ఉత్పత్తుల ఉపయోగాలు :

ప్రశ్న 4.
ఈ క్రింది పట్టికలో నేలబొగ్గు ఉత్పత్తుల ఉపయోగాలను వ్రాయండి.
జవాబు:

కోక్ కోల్ తారు కోల్ గ్యాసు
లోహ సంగ్రహణకు క్రిమిసంహారకాలు వంటగ్యాస్ గా ఉపయోగిస్తారు.
ప్రొడ్యూసర్ గ్యాస్ తయారీకి ప్రేలుడు పదార్థాలు కాంతి కొరకు ఉపయోగిస్తారు.
వాటర్ గ్యాస్ తయారీకి కృత్రిమ దారాలు
స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు. పరిమళ ద్రవ్యాలు
నాఫ్తలిన్
ఇంటి పైకప్పులు
ఫోటోగ్రఫిక్ పదార్థాలు
కృత్రిమ అద్దకాలు
పెయింట్లు
రోడ్లు వేయుటకు తారుగా ఉపయోగిస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 5.
నాణ్యమైన నేలబొగ్గు పొడిని వేడిచేస్తే వెలువడే వాయువు మండునో లేదో ప్రయోగం చేసి పరీక్షనాళికలలో ఏమి ఏర్పడునో పరిశీలనలను వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
నాణ్యమైన నేలబొగ్గు పొడిని వేడిచేస్తే వెలువడే వాయువు మండుతుందో లేదో పరిశీలించుట.

కావలసిన పరికరాలు :
రెండు పెద్ద పరీక్ష నాళికలు (boiling tubes), రబ్బరు బిరడాలు, ఇనుప స్టాండులు, వాయువాహక నాళం, జెట్ నాళం, బుస్సెన్ బర్నర్.
AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 7

పద్ధతి :
ఒక చెంచా నేలబొగ్గు పొడిని తీసుకొని గట్టి పరీక్ష నాళికలో వేసి, పటంలో చూపిన విధంగా స్టాండుకు బిగించితిని. పరీక్షనాళికను రబ్బరు కార్కుతో మూయాలి. రెండవ స్టాండుకు కొద్దిగా నీటితో నింపిన మరొక పరీక్షనాళికను బిగించి రెండింటినీ “U” ఆకారపు వాయువాహక నాళంతో వాయువాహక నాళం కలిపితిని, రెండవ పరీక్ష నాళికకు పటంలో చూపినట్లు జెట్ నాళం అమర్చితిని. బున్సెన్ బర్నర్ సహాయంతో నేలబొగ్గు ఉన్న పరీక్ష నాళికను బాగా వేడి చేసితిని.

మొదటి పరీక్షనాళిక నుండి గోధుమ-నలుపు రంగు గల వాయువు రెండవ పరీక్షనాళికలో గల నీటిలోకి చేరి రంగులేని వాయువు బుడగల రూపంలో పైకి వస్తుంది. జెట్ నాళం మూతి వద్ద మండుచున్న పుల్లను ఉంచితే తెల్లని కాంతితో మండినది.

మొదటి పరీక్షనాళికను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేసినప్పుడు నేలబొగ్గు పొడి, కోక్, కోల్ తారు మరియు కోల్ గ్యాస్లు ఏర్పడును. మొదటి పరీక్ష నాళికలో కోక్, రెండవ పరీక్ష నాళికలో నల్లని చిక్కని ద్రవం అనగా కోల్ తారు ఏర్పడినది. కోల్ గ్యాస్ జెట్ నాళం ద్వారా మండుచున్నది.

AP Board 8th Class Physical Science Solutions 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

కృత్యం – 5 ఇంధన వనరుల దుర్వినియోగం మరియు దాని పరిణామాలు :

ప్రశ్న 6.
ఇంధన వనరుల దుర్వినియోగం మరియు దాని పరిణామాలపై సమూహ చర్చ :
మన నిత్యజీవితంలో ఇంధన వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి నీవేమి ప్రత్యామ్నాయాలను సూచిస్తావు?
జవాబు:

  1. అవసరం లేనపుడు గదిలో లైట్లు, ఫ్యానుల స్విచ్ ఆఫ్ చేయవలెను.
  2. పగటి పూట వెలుతురు కొరకు కిటికీలు తెరుచుకొనవలెను.
  3. గదిలో కూలర్స్, ఎసి, హీటర్లు మరియు గీజర్లు అవసరమైనపుడు మాత్రమే ఉపయోగించాలి.
  4. వంట చేస్తున్నపుడు, నీరు మరుగునపుడు స్టాప్ మంట తగ్గించాలి.
  5. సాధారణ బల్బ్ లకు బదులుగా CFL లేదా LED బల్బులు మరియు ట్యూబ్ లైట్లను ఉపయోగించాలి.
  6. రవాణాకు ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రభుత్వ వాహనాలను ఉపయోగించాలి.
  7. దగ్గర దూరాలను నడకతోగాని లేదా సైకిల్ తోగాని ప్రయాణించాలి.
  8. పప్పులను ఉడికించుటకు కుక్కర్లను ఉపయోగించాలి.
  9. వంట చేసేటప్పుడు వంట పాత్రలపై మూతలు ఉంచాలి. ఇలా చేస్తే త్వరగా వండవచ్చును.
  10. వంటకు పొగలేని స్టార్లు ఉపయోగించాలి (గ్యాస్ స్టాప్ లు).
  11. దక్షత గల ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

SCERT AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 6th Lesson Questions and Answers ధ్వని

8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఖాళీలలో సరియైన సమాధానాలు రాయండి. (AS1)
ఎ) వస్తువు విరామ స్థానం నుండి ముందుకు, వెనుకకు కదలడాన్ని …………… అంటారు.
జవాబు:
కంపనం

బి) ఒక సెకనులో ఏర్పడే కంపనాల సంఖ్యను …………. అంటారు.
జవాబు:
పౌనఃపున్యము

సి) ధ్వని తీవ్రతను …………….. లో కొలుస్తాం.
జవాబు:
డెసిబెల్

డి) ధ్వని …………. గుండా ప్రయాణించలేదు.
జవాబు:
శూన్యం

ఇ) కంపించే వస్తువులు ……. ఉత్పత్తి చేస్తాయి.
జవాబు:
ధ్వనిని

ఎఫ్) ఒక వస్తువు తన విరామ స్థితి నుండి పొందే గరిష్ఠ స్థానభ్రంశాన్ని …………… అంటారు.
జవాబు:
కంపన పరిమితి

ప్రశ్న 2.
ఒక సాధారణ మానవుడు ధ్వనిని ……… నుండి …… కంపనాలు / సెకను వరకు వినగలుగుతాడు. (AS1)
జవాబు:
20 నుండి 20,000

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 3.
వివిధ ధ్వనుల కంపన పరిమితి, పౌనఃపున్యానికి గల తేడాను తెలపండి. మీ దైనందిన జీవితం నుండి రెండు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:

కంపన పరిమితి పౌనఃపున్యం
1) కంపన పరిమితి పెరుగుతూ ఉంటే ధ్వని తీవ్రత క్రమంగా పెరుగును.

ఉదా : సింహం గర్జించినపుడు ధ్వని కంపన పరిమితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

1) పౌనఃపున్యం తగ్గుతుంటే ధ్వని యొక్క కీచుదనం (పిచ్) క్రమంగా తగ్గుతుంది.

ఉదా : సింహం గర్జించినపుడు, ధ్వని పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది. కాబట్టి కీచుదనము (పిచ్) తక్కువగా ఉంటుంది.

2) కంపన పరిమితి తగ్గుతుంటే ధ్వని తీవ్రత క్రమంగా తగ్గుతుంది.

ఉదా : తుమ్మెద ఝంకారం చేసినపుడు ధ్వని యొక్క కంపన పరిమితి తక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని తీవ్రత తక్కువగా ఉంటుంది.

2) పౌనఃపున్యం పెరుగుతూ ఉంటే ధ్వని యొక్క కీచుదనము(పిచ్) క్రమంగా పెరుగును.

ఉదా : తుమ్మెద ఝంకారం చేసినపుడు ధ్వని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కీచుదనము (పిచ్) ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 4.
మీకు తెలిసిన మూడు సంగీత పరికరాల పేర్లు వ్రాయండి. అవి ఏ విధంగా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయో వివరించండి. (AS1)
జవాబు:
1. తబల :
తబలపై ఉండే చర్మం లేదా పొర మరియు తబల లోపల ఉన్న గాలి కంపించడం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది.

2. సితార్ :
సితార్ లోని తీగను కంపింపజేసినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది.

3. వీణ :
ఒక నిలువుపాటి చెక్కపై మెట్లు బిగించి ఉంటాయి. వీణకు ఒక చివర ఎండిన సొరకాయతో చేసిన “బుర్ర” ఉంటుంది. మెట్ల మీదుగా లోహపు తీగలు అమర్చుతారు. ఈ తీగలను చేతితో మీటితే అవి కంపించి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మెట్లమీద వేళ్లను కదిలించడం ద్వారా తీగల పొడవులను మార్చుతూ, వివిధ తీవ్రతలు గల ధ్వనులను ఉత్పత్తి చేస్తారు.

ప్రశ్న 5.
కీచురాళ్లు (కీటకాలు) రొద విని మనం చెవులు ఎందుకు మూసుకుంటాము? (AS1)
జవాబు:
కీచురాళ్ళు (కీటకాలు) వినడానికి ఇబ్బందికరంగా ఉండే కఠోర ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. మరియు కీచురాళ్ళు చేసే ధ్వని యొక్క పౌనఃపున్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కీచుదనం (పిచ్) ఉన్న ధ్వని విడుదలవుతుంది. కాబట్టి కీచురాళ్లరొద వినలేక మనం చెవులు మూసుకుంటాము.

ప్రశ్న 6.
రాబర్ట్ ఒక సంగీత వాయిద్యం ధ్వనిని ఉత్పత్తి చేయడం గమనించాడు. కానీ ఆ వాయిద్యంలో ఏ భాగమూ కంపనాలు చెందడం అతను గుర్తించలేకపోయాడు. ఈ పరిశీలన వల్ల అతని మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అతనికి తలెత్తిన ప్రశ్నలు ఏమిటో మీరు ఊహించగలరా? వాటిని వ్రాయండి. (AS2)
జవాబు:
రాబర్ట్ మెదడులో తలెత్తిన ప్రశ్నలు :

  1. కంపనం చెందకుండా వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయా?
  2. వాయు వాయిద్యంలో ఏ భాగము కంపనం చెందుతుంది?
  3. వాయు వాయిద్యంలో కంపనం చెందే భాగము కనిపిస్తుందా?
  4. డప్పు వాయిద్యాలలో గాలి కంపనం చెందుతుందా?
  5. పిల్లనగ్రోవిలో కంపించే భాగము ఏది?
  6. గిటార్ వాయించినపుడు గాలి కంపిస్తుందా?
  7. తబల, డోలలను వాయించినపుడు వాటిలో గల చర్మం లేదా పొరతోపాటు కంపించేది ఏది?
  8. విజిల్ ను ఊదినపుడు ఏ భాగం కంపించి ధ్వని వస్తుంది?
  9. వాయు వాయిద్యాన్ని తట్టడం లేదా కొట్టడం గాని చేయం. గాలిని మాత్రమే ఊదుతాం. అయితే ఏ భాగం కంపనం చెంది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది?

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 7.
“ఒక వస్తువులోని కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి” అని మీరు ఎలా రుజువు చేస్తారు? (AS3)
జవాబు:
సైకిల్ బెల్ ను మోగించండి. బెల్ పైన గల స్త్రీలు గిన్నె కంపనం చెందడం వలన సైకిల్ బెల్ నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. సైకిల్ బెల్ మ్రోగుతున్నపుడు చేతితో స్టీలు గిన్నెను పట్టుకోండి. అది కంపనం చెందుతున్నట్లు చేతి స్పర్శ ద్వారా కూడా తెలుస్తుంది. స్త్రీలు గిన్నెను పట్టుకొన్నప్పుడు ధ్వని ఆగిపోతుంది. కారణం కంపనం చెందడం ఆగిపోవుట వలన ధ్వని ఆగిపోతుంది. దీనిని బట్టి కంపిస్తున్న వస్తువు నుండి ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చును అని తెలుస్తుంది.

ప్రశ్న 8.
చిలుకలు మాట్లాడతాయా? మీ స్నేహితులతో చర్చించి, సమాచారం సేకరించండి. (AS4)
జవాబు:
చిలుకలకు సరియైన రీతిలో తర్ఫీదు ఇస్తే చక్కగా మాట్లాడతాయి. మనం టి.వి.లో చిలుకలు మాట్లాడటం, పాటలు పాడడం లాంటివి చూస్తూనే ఉంటాము. వీటికి సంబంధించిన ఉదాహరణలు :

  1. తూర్పు గోదావరి జిల్లాలో ద్వారక తిరుమలలో SBI లో పనిచేస్తున్న శ్రీ భాస్కరరావుగారు 1985 నుండి చిలుకను పెంచుతున్నారు. ఈ చిలుక చక్కగా మాట్లాడడం మరియు ఇంట్లో సభ్యులను పేరుతో పిలవడం లాంటివి చేస్తుంది. ఈ వార్త N – Studio లో సెప్టెంబర్ 22వ తేదీ 2011న ప్రసారమైనది.
  2. అవధూత దత్తపీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు చాలా చిలకలకు మాట్లాడడంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఈ చిలుకలు చక్కగా మాట్లాడడం మరియు స్వామీజీ చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తున్నాయి.

పై ఉదాహరణలను బట్టి చిలుకలు మాట్లాడతాయని మనకు తెలుస్తుంది.

ప్రశ్న 9.
స్థానిక సంగీతకారుల ఫోటోలను సేకరించండి. వాటిని మీ తరగతిగదిలో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 2

ప్రశ్న 10.
ధ్వని కాలుష్యం జరిగే రకరకాల సంఘటనల చిత్రాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకంను తయారు చేయండి. (AS4)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 3

ప్రశ్న 11.
“కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. మరియు ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది” ఈ విధంగా మనం ప్రతిధ్వనిని వినగలుగుతున్నాం” అని జాకీర్ అన్నాడు. ఈ వాక్యం నిజమని మీ పరిసరాలలో గమనించి సరైన ఉదాహరణల ద్వారా తెల్పండి. (AS4)
జవాబు:
1. కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి :
i) పాఠశాలలో లోహపు గంటను, లోహపు కడ్డీతో కొట్టినపుడు లోహపు గంట కంపించడం వలన ధ్వని ఉత్పత్తి – అవుతుంది.
ii) సైకిల్ బెల్ ను మ్రోగించినపుడు, ‘సైకిల్ బెల్ పై గల స్త్రీలు గిన్నె కంపనం చెందడం వలన ధ్వని ఉత్పత్తి అగును. పై ఉదాహరణల ద్వారా కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి అని తెలుస్తుంది.

2. ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది :
ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకొని రెండు వైపులా కోసి ఒక పైపు వలె తయారుచేయవలెను. ఒక చివర రబ్బరు బెలూనుతో మూస్తూ రబ్బరు బ్యాండ్ ను కట్టాలి. రబ్బరు బెలూనుపై కొన్ని చక్కెర కణాలను లేదా తేలికపాటి చిన్న గింజలను ఉంచాలి. రెండవ వైపు నుండి మీ స్నేహితుణ్ణి బిగ్గరగా మాట్లాడమని, చక్కెర కణాలను పరిశీలించండి. స్నేహితుడు మాట్లాడుతున్నపుడు చక్కెర కణాలు పైకి ఎగురుతూ ఉంటాయి. దీన్నిబట్టి ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది అని చెప్పవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 12.
మీ పరిసరాలలో లభించే వస్తువులతో సంగీత పరికరాలను తయారుచేసి మీ తరగతిలో ప్రదర్శించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 4
1) ఏతార :
ఒక కొబ్బరి చిప్పపై ఒక దళసరి కాగితంను అంటించి పటంలో చూపిన విధంగా వెదురు కర్ర, తీగతో తయారు చేయండి. తీగను కంపింప చేసినపుడు సంగీత ధ్వని ఏర్పడును.

2) మంజిర (Manjira) :
రెండు రేకుడబ్బా మూతలకు మధ్యలో రంధ్రాలను చేసి తాడుతో కట్టి మంజిర తయారుచేయవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 5
3) డోలక్ :
కావలసిన వస్తువులు : PVC పైపు, పాలిథిన్ కవర్లు, నైలాన్ దారం.

విధానం :

  1. 6 అంగుళాల వ్యాసం, 12 అంగుళాల పొడవు గల ఒక PVC. పైపును తీసుకోండి.
  2. PVC పైపుకు రెండు వైపుల పాలిథిన్ కవరును గట్టి నైలాన్ దారంతో కట్టండి. డోలక్ తయారగును.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 6
4) తబల :
కావలసిన వస్తువులు : ఒకవైపు తెరిచి ఉన్న ప్లాస్టిక్ డబ్బా, పాలిథిన్ కవరు, నైలాన్ దారం.

విధానము :
ప్లాస్టిక్ డబ్బా తెరచి ఉన్న వైపు పాలిథిన్ కవరును ఉంచి, నైలాన్ దారంతో గట్టిగా కట్టండి. పాలిథిన్ కవరు బిగుతుగా ఉండేట్లు చూడవలెను.

ప్రశ్న 13.
సూర్యునిలో జరిగే ప్రేలుళ్ల ధ్వనులను మనం ఎందుకు వినలేమో వివరించండి. (AS7)
జవాబు:
ధ్వని ప్రసరించాలంటే యానకం కావలెను. ధ్వని శూన్యంలో ప్రయాణించదు. సూర్యునిలో జరిగే ప్రేలుళ్ల ధ్వనులు మనం వినలేము కారణం సూర్యునికి, భూమికి మధ్యలో శూన్య ప్రదేశం ఉంటుంది. ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు కావున సూర్యునిలోని ధ్వనులను వినలేము.

ప్రశ్న 14.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే రెండు నినాదాలు రాయండి. (AS6)
జవాబు:

  1. “ధ్వని కాలుష్యం తగ్గించు – ప్రశాంత జీవనం సాగించు”.
  2. “చెట్లను విరివిగా నాటుదాం – ధ్వని కాలుష్యాన్ని తగ్గించుదాం”.

ప్రశ్న 15.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు మీరిచ్చే సలహాలు ఏమిటి? (AS7)
జవాబు:
ఈ క్రింది సలహాలు పాటించడం ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చును.

  1. వాహనాలకు, ఇతర మిషన్లకు సైలెన్సర్లు బిగించడం.
  2. తక్కువ ధ్వని ఉత్పత్తి చేసే యంత్రాలను తయారు చేయడం.
  3. టి.వి., టేప్ రికార్డులు, రేడియోలను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించడం.
  4. ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లను విరివిగా పెంచడం.
  5. పరిశ్రమలను, విమానాశ్రయాలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించడం.
  6. వాహనదారులు అవసరంలేని సమయంలో హారన్లను మోగించరాదు.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 16.
ధ్వని కాలుష్యం జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? వివరించండి. (AS7)
జవాబు:
ధ్వని కాలుష్యం జీవవైవిధ్యంపై ప్రభావం చూపే విధం :

  1. దీపావళి ఔట్లు పేల్చినప్పుడు, డైనమైట్లతో కొండ రాళ్లను పేల్చినపుడు, పక్షులు గోల చేస్తూ చెల్లాచెదురుగా తమ ఆవాసాలను వీడి ఎగిరిపోతాయి.
  2. జెట్ బాంబర్లూ, కన్ కార్డ్ విమానాలు ఆకాశంలో ఎగిరేటప్పుడు వచ్చే విపరీతమైన ధ్వనికి ఆకాశ హార్శ్యాలు (స్కైస్క్రైపర్లు) ప్రకంపనలు చెంది, గోడలు కూలిపోతే వాటిలో నివసించే జనాలకు ప్రాణ హాని కలుగుతుంది.
  3. సైలెన్సర్లు లేని మోటారు వాహనాలను జన సమ్మర్థం గల రోడ్లపై నడిపితే ధ్వని కాలుష్యం వలన వృద్ధులలో ఉద్రేకం పెరగడం, రక్తపోటు వృద్ధి కావడం జరుగుతుంది.
  4. కర్ణకఠోరమైన ధ్వనులు వింటే పసిపిల్లలలో కర్ణభేరి చెడిపోయి వినికిడి శక్తి తగ్గవచ్చు.

పరికరాల జాబితా

చెక్కగంట, రబ్బరు బ్యాండ్, నీటితో ఉన్న పళ్లెం, గ్లాసులు, హాక్ సా బ్లేడు, సగం కోసి గ్లాసులా చేసిన ప్లాస్టిక్ బాటిల్, సెల్ ఫోన్, బెలూన్, రబ్బరు బ్యాండు, ఒకే పరిమాణంగల బీకరులు, చెక్కబల్ల, లోహపు కడ్డీ లేదా చెక్క స్కేలు, దారం, టెలిఫోన్, కీచుమని శబ్దం చేసే బొమ్మ, బకెట్, నీరు, ఇనుప గంట, ఇత్తడి గంట, వివిధ సంగీత పరికరాలను చూపే చార్టు, స్వరపేటిక నిర్మాణం చార్టు, కర్ణభేరి నిర్మాణం చార్టు, ధ్వని కాలుష్యం ప్రభావాలను చూపే చార్టు, చెక్కబల్ల, ఇటుక.

8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 86

ప్రశ్న 1.
ధ్వని ప్రసరణ పై గాలిలో తేమ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వేసవి, శీతాకాలాలలో గాలిలో ధ్వని ప్రసారంలో ఏమైనా తేడా ఉంటుందా? మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:

  1. గాలిలో తేమ పెరుగుతూ ఉంటే ధ్వని ప్రసరణ పెరుగును.
  2. గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వల్ల వేసవి కాలంలో ధ్వని ప్రసరణ ఎక్కువగా ఉంటుంది.
  3. శీతాకాలంలో ధ్వని ప్రసరణ తక్కువగా ఉంటుంది.

8th Class Physical Science Textbook Page No. 87

ప్రశ్న 2.
కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి మరియు ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఏది నిజం?
జవాబు:

  1. కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి నిజం. ఎందుకంటే ఏ వస్తువునైనా కంపింపచేసినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు పాఠశాల గంట.
  2. ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా నిజం. ఉదాహరణ ధ్వని మన చెవిని చేరినపుడు ధ్వనికి మన చెవిలోని కర్ణభేరి కంపిస్తుంది.
  3. మనం టెలిఫోన్లో మాట్లాడుతున్నపుడు టెలిఫోన్ లోని డయాఫ్రమ్ ను ధ్వని కంపింపచేస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రశ్న 3.
మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే మూడు రకాల యానకాలున్నాయి. మీ స్నేహితులతో చర్చించి ఈ వాక్యం సరైనదో కాదో నిర్ణయించండి.
జవాబు:
మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే మూడు రకాల యానకాలు ఉన్నాయి. ఈ వాక్యం సరైనది. ఎందుకంటే

  1. చెవి వెలుపలి భాగంలోని రంధ్రంలో గాలి వాయు యానకంలా పనిచేస్తుంది.
  2. మధ్య చెవి భాగంలోని తేలికైన మూడు ఎముకలు మ్యాలియస్, ఇంకస్ మరియు స్టీలు ఘనస్థితిలో ఉన్నాయి. ఇవి ఘన యానకంలా పనిచేస్తాయి
  3. లోపలి చెవి భాగం అయిన కోక్లియా చిక్కని ద్రవంతో నింపబడి ఉన్నది. ఇది ద్రవ యానకంలా పనిచేస్తుంది. కాబట్టి మన చెవిలో ధ్వని ప్రసారానికి అనుకూలించే 3 రకాల యానకాలు ఉన్నాయి.

8th Class Physical Science 6th Lesson ధ్వని Textbook Activities

కృత్యములు

కృత్యం – 1 ధ్వనిని విని, ధ్వని జనకాన్ని ఊహించుట :

ప్రశ్న 1.
మీకు వినిపించే ధ్వనులను వినండి. ఆయా ధ్వనులు ఏ ఏ వస్తువుల నుండి ఉత్పత్తి అయి ఉంటాయో ఊహించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

విన్న ధ్వని ధ్వని జనకం
1. నెమ్మదిగా మొరుగుట దూరంగా ఉన్న కుక్క
2. గంట ధ్వని పాఠశాలలో ఉన్న గంట
3. విద్యార్థుల గోల ఆటస్థలంలో ఆటలాడుతున్న విద్యార్థుల అల్లరి
4. వాహనాల ధ్వనులు రోడ్డుపై వెళ్లే వాహనాల ధ్వనులు
5. మోటారు ధ్వని పాఠశాలలో గల మంచినీటి బోర్ మోటారు ధ్వని
6. చప్పట్ల ధ్వని విద్యార్థులు చప్పట్లు కొట్టడం

కృత్యం – 2 వివిధ ధ్వనులను గుర్తించండి :

ప్రశ్న 2.
వివిధ ధ్వనులను గుర్తించండి :
జవాబు:
ఒక విద్యార్థిని పిలిచి నల్లబల్లవైపు తిరిగి నిలబడమని చెప్పండి. మిగిలిన విద్యార్థులను వివిధ రకాల ధ్వనులను ఒకరి తరువాత ఒకరిని చేయమని చెప్పండి. నల్లబల్ల వద్ద నున్న విద్యార్థిని తాను విన్న ధ్వనులను, ఆ ధ్వనులు ఉత్పత్తి అయిన విధానాన్ని ఈ క్రింది పట్టికలో నమోదు చేయమనండి.

విన్న ధ్వని ధ్వని ఉత్పత్తి అయిన విధానము
1. గలగల ఒక రేకు పెట్టెలో రాళ్లు వేసి ఊపడం వల్ల
2. ఈలధ్వని ఒక విద్యార్థి ఈల వేయడం వలన
3. చప్పట్లు ఒక విద్యార్థి చప్పట్లు కొట్టడం వల్ల
4. అలారమ్ ధ్వని గడియారము అలారమ్ వల్ల
5. కిర్, కిర్, కిర్ కిర్ చెప్పులతో నడవడం వల్ల
6. టక్, టక్ టేబుల్ పై, ఇనుప స్కేలుతో కొట్టడం వల్ల

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

కృత్యం – 3 కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేయడం :

ప్రశ్న 3.
కంపించే వస్తువుల నుండి ధ్వనిని ఉత్పత్తి చేయవచ్చును అని కొన్ని కృత్యాల ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 7 AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 8

పై కృత్యాల ద్వారా కంపించే వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుందని తెలుస్తుంది.

కృత్యం – 4 ధ్వని శక్తిని కలిగి ఉంది :

ప్రశ్న 4.
ధ్వనికి శక్తి ఉందని నిరూపించుటకు ఒక కృత్యాన్ని సూచించండి.
జవాబు:
ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పై భాగాన్ని కోసి గ్లాసులాగా తయారు చేయండి. దానిలో ఒక సెల్ ఫోన్ ను ఉంచండి. ప్రక్క పటంలో చూపిన విధంగా ఒక రబ్బరు బెలూతో మూసి రబ్బరు బ్యాండుతో గట్టిగా బిగించండి. బెలూను సాగదీసి ఉంచడం వల్ల అది డయాఫ్రం వలె పనిచేస్తుంది. బెలూన్‌ పొర పై కొన్ని చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులను వేసి మరొక సెల్ ఫోన్లో రింగ్ చేయండి. బెలూన్ పొర పై గల చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులు మరియు రబ్బరు పొర కదులుతున్నాయి. సెల్ ఫోన్ రింగ్ ఆపుచేయగానే చక్కెర పలుకులు లేదా ఇసుక రేణువులు, బెలూను రబ్బరు పొర నిలకడగా ఉంటాయి. బెలూను కంపనాలు మరియు చక్కెర లేదా ఇసుక. రేణువుల కదలికలకు కారణం సెల్ ఫోన్ ఉత్పత్తి చేసిన ధ్వని. దీని ద్వారా ధ్వనికి బెలూను రబ్బరు మూత పైన గల ఇసుక రేణువులను కంపింపజేసే శక్తి ఉందని తెలుస్తుంది.
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 9

కృత్యం – 5

ప్రశ్న 5.
వర్షం పడేటప్పుడు వినిపించే చప్పుడును పోలిన ధ్వనులను కృత్యం ద్వారా సృష్టించండి.
జవాబు:
మన చేతి వేళ్లను ఉపయోగించి వర్షం వచ్చే శబ్దాన్ని సృష్టించవచ్చును. ఎడమ అరచేతి మీద కుడి చూపుడు వేలితో కొడుతూ శబ్దం చేయాలి. మధ్యవేలిని దానికి జత కలపాలి. తరువాత ఉంగరపు వేలిని, చివరగా చిటికెన వేలితో శబ్దం చేయాలి. తరువాత చిటికెన వేలు నుండి చూపుడు వేలు వరకు ఒక్కొక్కటిగా తీస్తూ శబ్దం చేయండి. ఈ విధంగా తరగతిలోని పిల్లలందరు కలిసి ఒకేసారి ఇలా చేస్తే వర్షం పెరుగుతున్న శబ్దం, వర్షం తగ్గుతున్న శబ్దం వినిపిస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

కృత్యం – 6 ధ్వనిలోని మార్పును పరిశీలించడం :

ప్రశ్న 6.
కంపించే వస్తువు నుండి మరియు వాయిద్య పరికరాలలోని ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించే గాలి కారణంగా ధ్వని ఏర్పడుతుందని జలతరంగిణి కృత్యం ద్వారా వివరించండి.
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 10
జవాబు:
4 నుండి 5 లోహపు లేదా గాజు గ్లాసులను తీసుకొని, వాటిని ఆరోహణ తీసుకొని ఒక్కొక్క గ్లాసు అంచుమీద మెల్లగా కొట్టండి. ఈసారి వాటిని సమాన స్థాయిలో నీటితో నింపండి. ప్రతి పాత్రను పైన చెప్పిన విధంగా చెంచాతో కొట్టండి. గ్లాసులో నీటిమట్టం మారే కొలది ఉత్పత్తి అయిన ధ్వనిలో క్రమమైన మార్పు ఉంటుంది. కంపించే వస్తువు నుండి మరియు వాయిద్య పరికరాలలో ఖాళీ ప్రదేశాల గుండా ప్రసరించే గాలి కారణంగా ధ్వని వెలువడుతుంది.

కృత్యం – 7 మాట్లాడుతున్నపుడు స్వరతంత్రులలోని కదలికలను గమనించడం :

ప్రశ్న 7.
మాట్లాడుతున్నపుడు స్వరతంత్రులలోని కదలికలను పరిశీలించి ధ్వని ఏ విధంగా ఏర్పడునో వివరించండి.
జవాబు:
మీ స్నేహితుని తల పైకెత్తమని చెప్పండి. అతని నోటికి అడ్డంగా ఒక చాక్లెట్ పై కాగితాన్ని (Wrapper) ఉంచండి. దాని పైకి బలంగా గాలి ఊదమని చెప్పండి. అతని స్వరపేటికను పరిశీలిస్తే స్వరపేటిక ఉబ్బి ఎక్కువ ధ్వని వెలువడుతుంది. ఈసారి మెల్లగా ఊదమని చెప్పి పరిశీలిస్తే సాధారణ స్థాయిలో ధ్వని వెలువడుతుంది. ఈ ధ్వనులు స్వరతంత్రులు మరియు చాక్లెట్ కాగితాల కంపనాల కలయిక వల్ల ఉత్పత్తి అయినవి.

కృత్యం – 8 ఘన పదార్థాలలో ధ్వని ప్రసారాలను పరిశీలించుట :

ప్రశ్న 8.
ఘన పదార్థాలలో ధ్వని ప్రసరణ జరుగుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 11
పై కృత్యాల ద్వారా “ధ్వని చెక్క లోహం, దారం వంటి ఘనపదార్థ యానకాల ద్వారా ప్రయాణిస్తుందని” తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

కృత్యం – 9 ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసరణ :

ప్రశ్న 9.
ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసరణ జరుగుతుందని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 12

  1. రెండు రాళ్లను తీసుకొని ఒకదానితో మరొకటి గాల్లో కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వనిని మీ మిత్రున్ని వినమనండి.
  2. ఒక వెడల్పాటి బకెట్ ను నీటితో నింపండి.
  3. పక్క పటంలో చూపిన విధంగా చేతిలోని రాళ్లు నీటిలో ఉంచి, ఒక దానితో ఒకటి కొట్టండి.
  4. అదే సమయానికి మీ స్నేహితున్ని ఆ బకెట్ యొక్క బయటి గోడకు చెవిని ఆనించి ధ్వనిని వినమనండి.
  5. గాలిలో విన్న ధ్వనికి, నీటి ద్వారా విన్న ధ్వనికి మధ్య తేడాను మీ మిత్రున్ని అడగండి. గాలిలో కంటె నీటి ద్వారా ఎక్కువ ధ్వని వినబడుతుంది. కావున పై కృత్యం ద్వారా ధ్వని ద్రవాల ద్వారా ప్రయాణిస్తుందని తెలుస్తుంది.

కృత్యం – 10 యానకం లేకపోతే ధ్వని ప్రసరించగలదా?

ప్రశ్న 10.
యానకం లేకపోతే ధ్వని ప్రసరిస్తుందో లేదో ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 13

  1. ఒక పొడవైన ప్లాస్టిక్ గ్లాసును లేదా గాజు గ్లాసును తీసుకోండి.
  2. గ్లాసు పొడవుకన్నా తక్కువ పొడవు ఉన్న సెల్ ఫోన్ ను గ్లాసులో నిలువుగా ఉంచండి.
  3. సెల్ ఫోన్లో రింగ్ టోన్ ను ఏర్పాటు చేయండి.
  4. ఆ రింగ్ టోన్ ధ్వని స్థాయిని జాగ్రత్తగా వినండి.
  5. ఇప్పుడు గ్లాసులో ఉన్న గాలిని ప్రక్క పటంలో చూపిన విధంగా మీ నోటితో పీల్చివేయండి.
  6. ఇలా గాలి పీల్చినప్పుడు గాలి బంధనం వల్ల గ్లాసు యొక్క అంచు మీ మూతి చుట్టూ అంటుకుంటుంది.
  7. ఇప్పుడు రింగ్ టోన్ స్థాయిని వినండి. గ్లాసులో గాలి ఉన్నప్పుడు ఎక్కువ ధ్వని వినపడింది.
  8. గ్లాసులోని గాలిని పీల్చిన తర్వాత రింగ్ టోన్ ధ్వని వినబడలేదు.
  9. ఈ కృత్యం ద్వారా ధ్వని ప్రసరణకు యానకం అవసరమని తెలుస్తుంది.

ప్రయోగశాల కృత్యం – 1

ప్రశ్న 11.
ధ్వని తీవ్రతకు, ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువు కంపన పరిమితికి మధ్య గల సంబంధాన్ని ఒక ప్రయోగం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 14
లక్ష్యం :
ధ్వని తీవ్రతకు, ధ్వనిని ఉత్పత్తి చేసిన వస్తువు కంపన పరిమితికి మధ్యగల సంబంధాన్ని తెలుసుకొనుట.

కావలసిన పరికరాలు :
చెక్కబల్ల, 30 సెం.మీ. పొడవు గల ఇనుప స్కేలు లేదా హాక్-సా బ్లేడు, ఇటుక.

పద్దతి :

  1. బ్లేడు పొడవులో 10 సెం.మీ. బల్ల ఉపరితలంపై ఉండునట్లు, మిగిలిన బ్లేడు భాగం గాలిలో ఉండునట్లుగా అమర్చి ఒక బరువైన ఇటుకను బల్ల ఉపరితలంపై ఉన్న స్కేలుపై ఉంచండి.
  2. కొద్ది బలాన్ని ఉపయోగించి బ్లేడులో కంపనాలను కలుగచేయండి. ఆ కంపనాల కంపన పరిమితిని, విడుదలైన ధ్వనిని పరిశీలించండి. ఈ విధంగా 3,4 సార్లు చేసి కంపనాల కంపన పరిమితిని విడుదలైన ధ్వనిని పట్టికలో నమోదు చేయండి.
  3. ఎక్కువ బలమును ఉపయోగించి బ్లేడులో ‘కంపనాలను కలుగజేసి, ఏర్పడ్డ కంపనాల కంపనపరిమితిని, ధ్వనిని పరిశీలించండి. ఇదే విధంగా 3,4 సార్లు చేసి, పరిశీలనలను ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 16
బ్లేడు కంపనాల కంపన పరిమితి పెరుగుతుంటే క్రమంగా ధ్వని తీవ్రత పెరుగుతుంది. బ్లేడు కంపనాల యొక్క కంపన పరిమితి తగ్గుతుంటే క్రమంగా ధ్వని తీవ్రత తగ్గుతుంది.

AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని

ప్రయోగశాల కృత్యం – 2

ప్రశ్న 12.
ధ్వని యొక్క కీచుదనము మరియు కంపనాల మధ్య గల సంబంధాన్ని ప్రయోగపూర్వకంగా వివరించండి.
(లేదా)
ధ్వని యొక్క కీచుదనాన్ని గుర్తించుటను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
లక్ష్యం :
ధ్వని యొక్క కీచుదనం మరియు కంపనాల మధ్యగల సంబంధాన్ని కనుగొనుట.

కావలసిన పరికరాలు :
ఒక చెక్క బల్ల, రెండు 30 సెం.మీ. పొడవు గల హాక్-సా బ్లేడు, రెండు ఇటుకలు.
AP Board 8th Class Physical Science Solutions 6th Lesson ధ్వని 15

పద్ధతి :

  1. బల్ల తలంపై ఒక చివర మొదటి బ్లేడు 10 సెం.మీ. పొడవు బల్లపై ఉండునట్లుగా మిగిలిన బ్లేడు భాగం బయటకు గాలిలో ఉండేలాగా అమర్చండి. బల్లపై ఉన్న 10 సెం.మీ. బ్లేడు భాగంపై బరువు కొరకు ఒక ఇటుకను బ్లేడులో, కంపనాలు ఉంచండి.
  2. రెండవ బ్లేడులో 25 సెం.మీ. భాగం బల్లపై మిగిలిన 5 సెం.మీ. భాగం గాలిలో ఉండేట్లు అమర్చండి. (ఇలా అమర్చిన బ్లేడ్ల మధ్య కనీసం 10 సెం.మీ. దూరం ఉండేటట్లు చూడాలి) బల్లపైన ఉంచిన భాగంపై ఇటుకను ఉంచాలి.
  3. రెండు బ్లేడ్లు ఒకే బలముతో కంపనాలకు గురి చేయండి. అప్పుడు బ్లేడ్లలో కలిగే కంపనాలను, వెలువడే ధ్వనులను పరిశీలించి ఈ క్రింది పట్టికలో నమోదు చేయండి.
గాలిలో బ్లేడు పొడవు కంపనాలు ధ్వని
స్కేలు 1 : 20 సెం.మీ. పొడవు తక్కువ కంపనాలు
(తక్కువ పౌనఃపున్యము)
తక్కువ కీచుదనము గల ధ్వని వినబడింది.
స్కేలు 2 : 5 సెం.మీ. పొడవు ఎక్కువ కంపనాలు
(ఎక్కువ పౌనఃపున్యము)
ఎక్కువ కీచుదనము (పిచ్) గల ధ్వని వినబడింది.

పై ప్రయోగం ద్వారా పొట్టి స్కేలు (ఎక్కువ కంపనాలు గల స్కేలు) ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క కీచుదనము (పిచ్) ఎక్కువగా వున్నది. పొడవు స్కేలు (తక్కువ కంపనాలు గల స్కేలు) ఉత్పత్తి చేసిన ధ్వని యొక్క కీచుదనము తక్కువగా ఉన్నది.

ధ్వని యొక్క కీచుదనము (పిచ్) దాని పౌనఃపున్యము (కంపనాల) పై ఆధారపడి ఉన్నది.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

SCERT AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 5th Lesson Questions and Answers లోహాలు మరియు అలోహాలు

8th Class Physical Science 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
సరైన ఉదాహరణలతో లోహాల భౌతిక ధర్మాలను వివరించండి. (AS1)
జవాబు:
1) ద్యుతిగుణం :
ఉపరితలంపై కాంతి పరావర్తనం చెందినపుడు మెరిసే గుణాన్ని ద్యుతిగుణం అంటారు. సాధారణంగా లోహాలకు ద్యుతిగుణం ఉంటుంది. ఉదాహరణకు బంగారం, వెండిలు ద్యుతిగుణం వల్ల మెరుస్తూ ఉంటాయి.

2) ధ్వనిగుణం :
నేలపై పడవేసినపుడు లేదా దృఢమైన వస్తువుతో కొట్టినపుడు ధ్వనిని ఉత్పత్తి చేసే గుణాన్ని ధ్వనిగుణం అంటారు.

ఉదాహరణకు ఎ) పాఠశాలలో ఉన్న ఇనుప గంటను లోహాల కడ్డీతో కొట్టినపుడు ధ్వని ఉత్పత్తి అగును.
బి) గుడిలో గంటను కొట్టినపుడు ధ్వని ఉత్పత్తి అగును.

3) సరణీయత :
లోహాలను రేకులుగా సాగగలిగే ధర్మాన్ని సరణీయత అంటారు. ఉదాహరణకు అల్యూమినియం లోహాన్ని రేకులుగా సాగదీసి, విమాన భాగాలు మరియు వంట పాత్రలు మొదలగునవి తయారు చేస్తారు.

4) తాంతవత :
లోహాలను సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు. ఉదాహరణకు రాగి, అల్యూమినియం తీగలను విద్యుత్ వలయాలలో ఉపయోగిస్తారు.

5) ఉష్ణవాహకత :
ఉష్ణం ఒక చోట నుండి మరొక చోటకు ప్రసరించు ధర్మాన్ని ఉష్ణ వాహకత అంటారు. లోహాలు ఉష్ణవాహకత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. లోహాలకు ఉండే అధిక ఉష్ణ వాహకత కారణంగా రాగి, అల్యూమినియంలను వంట పాత్రలుగా ఉపయోగిస్తారు.

6) విద్యుత్ వాహకత :
లోహాలు తమగుండా విద్యుత్ ను ప్రవహింపచేయు, ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటారు. లోహాలు విద్యుత్ వాహకత ధర్మం ప్రదర్శించుట వలన రాగి, అల్యూమినియం తీగలను విద్యుత్ వాహకాలుగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 2.
మీకు రెండు పదార్థాలు ఇచ్చినపుడు అందులో ఏది లోహమో, ఏది అలోహమో ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
ఇచ్చిన పదార్థాలలో ఏ పదార్థం ద్యుతిగుణం, ధ్వనిగుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణ వాహకత మరియు విద్యుత్ ఇచ్చిన పదార్థాలలో ఏ పదార్థం ద్యుతిగుణం, ధ్వనిగుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణ వాహకత మరియు విద్యుత్ వాహకత ధర్మాలను కలిగి ఉండదో ఆ పదార్థాన్ని అలోహం అంటారు.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 3.
ఆభరణాల తయారీకి ఏ లోహాలను వాడతారు? ఎందుకు? (AS1)
జవాబు:
బంగారం, వెండి మరియు ప్లాటినమ్ లోహాలను ఆభరణాల తయారీకి వాడతారు. ఇవి చూడటానికి అందంగా ఉంటాయి. మరియు వీటి స్తరణీయత గుణం వలన వీటితో ఆభరణాలు తయారుచేయటం సులభం.

ప్రశ్న 4.
లోహాలు దేనితో చర్యనొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి? (AS1)
జవాబు:
లోహాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 1

ప్రశ్న 5.
ఒక రసాయన చర్యలో జింక్ సల్ఫేట్ నుండి జింక్ ను ఐరన్ స్థానభ్రంశం చేయలేకపోయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
“తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించలేవు”.

ఐరన్ లోహానికి జింక్ లోహం కంటే తక్కువ చర్యాశీలత ఉంటుంది. కావున తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న ఐరన్ లోహం ఎక్కువ చర్యాశీలత గల జింక్ లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 2

ప్రశ్న 6.
పెనమునకు ఇనుప హాండిల్ ఎందుకు వాడం? (AS1)
జవాబు:
ఇనుప లోహం ఉష్ణ వాహకతను కలిగి ఉంటుంది. పెనమునకు ఇనుప హాండిల్ వాడితే పెనమును వేడిచేసినపుడు హాండిల్ కూడా వేడెక్కి కాలుతుంది. కావున పెనమునకు ఇనుప హాండిల్ ను వాడరు.

ప్రశ్న 7.
మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తెస్తే ఏ వాయువు “టప్” మని శబ్దం చేస్తుంది? (AS1)
జవాబు:
మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తెస్తే హైడ్రోజన్ (H2) వాయువు “టప్” మని శబ్దం చేస్తుంది.

ప్రశ్న 8.
సల్ఫర్ డై ఆక్సైడ్ ఒక …… (AS1)
A) క్షార ఆక్సైడ్
B) ఆమ్ల ఆక్సైడ్
C) తటస్థ ఆక్సైడ్
D) ద్వంద్వ స్వభావ ఆక్సైడ్
జవాబు:
B) ఆమ్ల ఆక్సైడ్

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 9.
గంటలను తయారుచేయడానికి చెక్కకు బదులుగా లోహాలను ఎందుకు వాడతారు? (AS1)
జవాబు:
చెక్కకు ధ్వనిగుణం ఉండదు. లోహాలకు ధ్వనిగుణం ఉంటుంది. కావున గంటలను తయారుచేయడానికి చెక్కకు బదులుగా లోహాలను వాడతారు.

ప్రశ్న 10.
కింది వాటిని జతపరచుము. (AS1)

1. పలుచని రేకులుగా తయారుచేయుట A) తాంతవత
2. పదార్థాల మెరుపు B) వాహకత
3. తీగలుగా సాగదీయుట C) శబ్దగుణం
4. ఉష్ణ వాహకత్వం D) ద్యుతి
5. ధ్వని ఉత్పత్తి E) సరణీయత

జవాబు:

1. పలుచని రేకులుగా తయారుచేయుట E) సరణీయత
2. పదార్థాల మెరుపు D) ద్యుతి
3. తీగలుగా సాగదీయుట A) తాంతవత
4. ఉష్ణ వాహకత్వం B) వాహకత
5. ధ్వని ఉత్పత్తి C) శబ్దగుణం

ప్రశ్న 11.
లోహాలు లేని మానవ జీవితం ఎట్లా ఉంటుందో ఊహించి, కొన్ని వాక్యాలు రాయండి. (AS2)
జవాబు:

  1. పనిముట్లు లేని జీవితం ఉండేది.
  2. విద్యుత్ కు సంబంధించిన విద్యుత్ పరికరాలు మరియు విద్యుత్ తీగలు ఉండేవి కావు.
  3. వంట పాత్రలు ఉండేవి కావు.
  4. వాహనాలు, వాహన పరికరాలు ఉండేవికావు.
  5. మిశ్రమ లోహాలు ఉండేవి కావు.
  6. క్షారాలు ఉండవు.

లోహాలు లేనిచో మానవుడికి సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవనం ఉండేది కాదు. మానవుల పురోగాభివృద్ధి ఉండదు.

ప్రశ్న 12.
రహీమ్ ఈ పాఠ్యాంశం పూర్తిచేసిన తర్వాత, లోహాలు దృఢంగాను, అలోహాలు మృదువుగాను ఉంటాయని అవగాహన చేసుకొన్నాడు. ఈ విషయాన్ని అతని అన్నయ్యతో చర్చించినప్పుడు (డైమండ్) వజ్రం దృఢంగా ఉన్నప్పటికి అది అలోహమని అదే విధంగా పాదరసం మృదువుగా ఉన్నప్పటికి లోహామని తెలుసుకొన్నారు. ఈ చర్చ ద్వారా రహీమ్ మదిలో మెదిలిన కొన్ని ప్రశ్నలను ఊహించి రాయండి. (AS2)
జవాబు:

  1. అలోహమైన వజ్రం (డైమండ్) ఎందుకు దృఢంగా ఉంటుంది?
  2. లోహమైన పాదరసం ఎందుకు మృదువుగా (ద్రవస్థితిలో) ఉంటుంది?
  3. వజ్రం కాకుండా ఇంకా ఏఏ అలోహాలు దృఢంగా ఉంటాయి?
  4. పాదరసం కాకుండా ఇంకా ఏయే లోహాలు ద్రవస్థితిలో ఉంటాయి?

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 13.
లోహాల, అలోహాల ఆమ్ల మరియు క్షార స్వభావాలను సరైన ప్రయోగాల ద్వారా వివరించండి. (AS3)
జవాబు:
ఉద్దేశ్యం :
లోహాలు, అలోహాలు ఆక్సిజన్ తో జరిపే చర్యను తెలుసుకొనుట.

కావలసిన పరికరాలు :
లోహము (మెగ్నీషియం తీగ), ఒక అలోహము (సల్ఫర్ పొడి), సారాయి దీపం, ఎరుపు, నీలం లిట్మస్ కాగితాలు, డిప్లగ్రేటింగ్ స్పూన్, వాయువుజాడీ మొ||నవి.

విధానము :
1) మెగ్నీషియం లోహపు తీగతో ప్రయోగం :
చిన్న మెగ్నీషియం తీగను సారాయి దీపం సహాయంతో గాలిలో మండించితిని. మెగ్నీషియం తీగ గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సెడ్ ను ఏర్పరచినది. ఏర్పడిన మెగ్నీషియం ఆక్సెడ్ బూడిదను స్వచ్చమైన నీరు గల బీకరులో వేసి కలిపితిని. ఏర్పడిన ద్రావణాన్ని ఎరుపు మరియు నీలి రంగు లిట్మస్ కాగితాలతో పరీక్షించితిని. మెగ్నీషియం ఆక్సైడ్ ఎరుపు లిట్మసను నీలి రంగులోకి మార్చినది. మెగ్నీషియం ఆక్సైడ్ కు క్షార స్వభావం గలదు.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 3

2) సల్ఫర్ అలోహంతో ప్రయోగం :
కొద్దిగా సల్ఫర్ (గంధకపు) పొడిని డిప్లగ్రేడింగ్ స్పూన్లో తీసుకొని మండించండి. మండుచున్న డిఫరేటింగ్ స్పూనను జాడీలో చేర్చి మూత బిగించండి. కొంత సేపటి తర్వాత వాయువు బయటకు పోకుండా స్పూన్ తీసివేసి జాడీలోకి కొద్దిగా నీరు కలిపి జాడీని బాగా కదపండి. ఆ వాయువు (సల్ఫర్ డై ఆక్సైడ్) నీటిలో కరిగించాలి.
సల్ఫర్ + ఆక్సిజన్స → సల్ఫర్ డై ఆక్సైడ్
S (ఘ) + 02 (వా) → SO2 (వా)

పై రసాయన చర్య ఏర్పడిన ద్రావణాన్ని ఎరుపు, నీలి లిట్మస్ కాగితాలతో పరీక్షించాలి. సల్ఫర్ డై ఆక్సైడ్ నీలి లిట్మసను ఎరుపు రంగులోకి మార్చును. సల్ఫర్ డై ఆక్సైడ్ ఆమ్ల ఆక్సెడ్ గా చెప్పవచ్చును.

పై ప్రయోగాల ద్వారా లోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సెన్లు ఇస్తాయని, అలోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి ఆమ్ల స్వభావం గల ఆక్సైడ్ ను ఇస్తాయని తెలుస్తుంది.

ప్రశ్న 14.
వంట పాత్రల నుండి అంతరిక్షవాహనాల వరకు అల్యూమినియం వినియోగిస్తారు. ఇన్ని రకాలుగా వినియోగించుకునే అవకాశంగల ఈ లోహ లక్షణాలను మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
అల్యూమినియం లోహ లక్షణాలు :

1) మరణీయత :
అల్యూమినియంకు స్తరణీయత లక్షణం ఆధారం. అల్యూమినియంతో రేకులు మరియు వంట పాత్రలను తయారుచేస్తారు. అల్యూమినియం రేకులు తేలికగా దృఢంగా ఉండుట వలన విమానాలు మరియు అంతరిక్ష వాహనాల తయారీకి ఉపయోగిస్తారు.

2) తాంతవత :
అల్యూమినియంను తాంతవత ధర్మం ఆధారంగా అల్యూమినియంతో తీగలు తయారుచేస్తారు.

3) ఉష్ణ వాహకత :
అల్యూమినియం లోహం ఉష్ణ వాహకతను ప్రదర్శిస్తుంది. కాబట్టి అల్యూమినియం పాత్రలను వంట పాత్రలుగా ఉపయోగిస్తారు.

4) విద్యుత్ వాహకత :
అల్యూమినియం తీగలను విద్యుత్ వాహక తీగలుగా ఉపయోగిస్తారు.

5) లోహద్యుతి :
అల్యూమినియం లోహానికి లోహద్యుతి లక్షణం ఉండటం వల్ల వాహన పరికరాలను మరియు తినుబండారాలను ప్యాకింగ్ చేయుటకు ఉపయోగిస్తారు.

అల్యూమినియం లోహం తేలికగా, దృఢంగా ఉండుట వలన యంత్ర భాగాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. ఉపయోగించిన అల్యూమినియంను మరల కావలసిన విధంగా తయారు చేసుకోవచ్చు. కావున అల్యూమినియం నిత్య జీవితంలో ఎంతో అవసరము.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 15.
లోహాల మరణీయత ధర్మం మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS7)
జవాబు:

  1. జింక్ మరియు ఇనుముల మిశ్రమ పదార్థం ఇనుపరేకుల తయారీలో ఉపయోగపడును.
  2. వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగపడును.
  3. విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగపడును.
  4. ఆటోమొబైల్, శాటిలైట్ తయారీలో ఉపయోగపడును.
  5. విమానాలు, వంట పాత్రల తయారీలో ఉపయోగపడును.
  6. యంత్రభాగాలు, అలంకరణ సామాగ్రి తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 16.
లోహ మరియు అలోహ వ్యర్థాల వలన పర్యావరణం కలుషితం అవుతుంది. ఈ వాక్యాన్ని సమర్థిస్తారా? అయితే సరైన ఉదాహరణల ద్వారా వివరించండి. (AS7)
జవాబు:

  1. లోహాలను మరియు అలోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహణ చేయునపుడు కొన్ని వ్యర్థ వాయువులు, వ్యర్థ పదార్థాలు వెలువడుతాయి. ఇవి వాతావరణమును కలుషితం చేస్తాయి.
    ఉదా :
    ఎ) హెమటైట్ నుండి ఇనుమును సంగ్రహణం చేయునపుడు CO, CO2 మరియు కాల్షియం సిలికేట్లు వెలువడును.
    బి) లవణ ఫాస్ఫేట్ నుండి విద్యుత్ పద్ధతి ద్వారా ఫాస్ఫరస్ తయారుచేయునపుడు CO మరియు కాల్షియం సిలికేట్లు ఏర్పడును.
  2. మేఘంలో మెరుపులు ఏర్పడినపుడు వాతావరణంలో నైట్రోజన్ ఆక్సిజన్ తో చర్య జరిపి NO, NO2 లాంటి వాయువులు వెలువడి వాతావరణ కాలుష్యం జరుగును.
  3. పరిశ్రమలలో లోహాలను ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క ధ్వనిగుణం ద్వారా వాతావరణంలో శబ్ద కాలుష్యం జరుగును.
  4. మిశ్రమ లోహాల తయారీ లేదా లోహాలతో యంత్ర పరికరాలు తయారుచేయునపుడు విడుదలయ్యే ఉష్ణం వాతావరణాన్ని వేడిచేయును మరియు విడుదలయ్యే వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.

పరికరాల జాబితా

చెక్కగంట, బొగ్గుముక్క, బ్యాటరీ, బల్బు, వైర్లు, కొవ్వొత్తి మైనము, గుండు సూదులు, ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం, ఇనుప గంట, ఇత్తడి గంట, స్టాండు, ఇనుపకడ్డీ, అల్యూమినియం కడ్డీ, రాగి కడ్డీ, లోహపు ముక్క (మెగ్నీషియం), సారాదీపం, లిట్మస్ కాగితాలు, వాచ్ గ్లాస్, బీకర్లు, జింకు ముక్కలు, ఇనుపముక్కలు, రాగి ముక్కలు, గంధకము, బొగ్గుపొడి, అయోడిన్, కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్

8th Class Physical Science 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 68

ప్రశ్న 1.
సల్ఫర్, కార్బన్, అయోడిన్లను ఉపయోగించి వలయాన్ని పూర్తిచేయగలరా?
జవాబు:
సల్ఫర్, కార్బన్, అయోడిన్లను ఉపయోగించి సాధారణ విద్యుత్ వలయాన్ని పూర్తి చేయలేము.

8th Class Physical Science 5th Lesson లోహాలు మరియు అలోహాలు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1 పదార్థాల రూపం, రంగులను పరిశీలించుట :

1. ఈ కింది పట్టికలో ఇవ్వబడిన వస్తువుల రంగును మరియు అవి కాంతివంతంగా ఉన్నాయో లేదో నిర్ణయించి మీ పరీశీలనలను రాయండి. పదార్థాల ఉపరితలం మురికిగా ఉంటే గరుకు కాగితం (Sand paper) తో శుభ్రం చేయండి.

నమూనా కాంతివంతం/కాంతివిహీనం రంగు
ఇనుపమేకు కాంతివంతం గోధుమ
జింకు కాంతివంతం తెలుపు
రాగి కాంతివంతం ఎరుపు
గంధకం కాంతివిహీనం పసుపు రంగు గల స్ఫటిక పదార్థం
అల్యూమినియం కాంతివంతం తెలుపు
కార్బన్ కాంతివిహీనం నలుపు
మెగ్నీషియం కాంతివంతం తెలుపు
అయోడిన్ కాంతివంతం నలుపు

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

కృత్యం – 2 కొన్ని పదార్థాల నుండి ఉత్పత్తి అయిన ధ్వనిని వినడం :

2. జింక్, కాపర్, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం మరియు అయోడిన్ వంటి నమూనాలను తీసుకోండి. ఈ నమూనాలను దృఢమైన నేలపై ఒక్కొక్కటిగా పడవేసి వరుసగా అవి ఉత్పత్తి చేసే ధ్వనులను విని పట్టికలో మీ పరిశీలనలను నమోదు చేయండి.

ధ్వనిని ఉత్పత్తి చేసినవి ధ్వనిని ఉత్పత్తి చేయనివి
జింక్ (Zn) సల్ఫర్ (S)
కాపర్ (Cu) కార్బన్ (C)
అల్యూమినియం (Al) అయోడిన్ (T2)
మెగ్నీషియం (Mg)

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 4

కృత్యం – 3 పదార్థాల స్తరణీయతను గుర్తించుట :

3. జింక్, కాపర్, సల్ఫర్, అల్యూమినియం, కార్బన్, మెగ్నీషియం మరియు అయోడిన్ వంటి పదార్థాలను సుత్తితో కొట్టండి. ఆ పదార్థాలలో వచ్చే మార్పులను (పదార్థాల స్తరణీయతను) గమనించి ఈ కింది పట్టికలో నమోదు చేయండి.

పరిశీలించే మార్పు నమూనా పేరు
చదునుగా మారడం ఇనుము, జింక్, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం
ముక్కలు, పొడిగా మారడం కార్బన్, సల్ఫర్, అయోడిన్
ఏ మార్పు లేకుండా ఉండడం ——-

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 5

కృత్యం – 4 పదార్థాల విద్యుత్ వాహకతను గుర్తించుట :

4. బ్యాటరీ, బల్బు, విద్యుత్ తీగల సహాయంతో ప్రక్క పటంలో చూపిన విధంగా సాధారణ వలయాన్ని తయారుచేయండి. P, Qలను ఈ కింది పట్టికలో నమోదు చేయబడిన నమూనాలతో P, Q ల మధ్య సంధానం చేసి బల్బు వెలుగుతుందో లేదో పరిశీలించి పట్టికలో నమోదు చేయండి. నమూనాలు పొడి రూపంలో ఉంటే వాటిని ‘లో పొడిని నింపి P, Qల మధ్య సంధానం చేయండి.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 6

నమూనా బల్బు వెలుగుతుందా ? (అవును/కాదు)
ఇనుము అవును
జింకు అవును
రాగి అవును
గంధకం కాదు
అల్యూమినియం అవును
కార్బన్ కాదు
మెగ్నీషియం కాదు
అయోడిన్ కాదు

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

కృత్యం – 5 లోహాల ఉష్ణవాహకతను పరిశీలించుట :

5. ఒక ఇనుపకడ్డీని తీసుకొని దానికి గుండుసూదులను మైనంతో అంటించండి. ఇనుపకడ్డీ ఒక చివరను స్టాండ్ కు అమర్చండి. రెండవ చివర సారాయి దీపంతో వేడిచేయండి. కొంత సేపటికి ఇనుపకడ్డీకి అంటించిన గుండుసూదులు పడిపోవడాన్ని పరిశీలించండి.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 7
మీరు పరిశీలనల ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1) గుండుసూదులు ఎందుకు పడిపోయాయి?
జవాబు:
సారాయి దీపంతో వేడి చేయడం వల్ల మైనం కరిగి గుండుసూదులు కింద పడిపోయాయి.

2) కడ్డీకి ఏ వైపున ఉన్న గుండుసూదులు ముందుగా కిందపడ్డాయి? దీనికి కారణమేమిటి?
జవాబు:
సారాయి దీపంతో వేడి చేయబడిన కడ్డీ రెండవ చివర గుండుసూదులు ముందుగా కింద పడిపోయాయి. దీనికి కారణం కడ్డీ రెండవ చివరనుండి కడ్డీ మొదటి చివరకు ఉష్ణం ప్రసరించుట.

3) ఇనుప కడ్డీలో (లోహంలో) ఒక చివర నుండి మరొక చివరకు ఉష్ణం ప్రసరించడాన్ని ఏమంటారు?
జవాబు:
ఇనుప కడ్డీలో (లోహంలో) ఒక చివర నుండి మరొక చివరకు ఉష్ణం ప్రసరించడాన్ని ఉష్ణవాహకత అంటారు.

ప్రయోగశాల కృత్యం లోహాలు ఆక్సిజన్ తో చర్య :

6. ఉద్దేశ్యం : లోహాలు, అలోహాలు ఆక్సిజన్ తో జరిపే చర్యను తెలుసుకొనుట.

కావలసిన పరికరాలు :
ఒక లోహపు ముక్క (మెగ్నీషియం), కొద్ది పరిమాణంలో అలోహం (సల్ఫర్), సారా దీపం లేదా బున్ సెన్ బర్నర్, లిట్మస్ కాగితాలు మొదలైనవి.

  1. మెగ్నీషియం తీగముక్కను తీసుకొని దాని భౌతిక స్వరూపాన్ని (Appearance) నమోదు చేయండి. ఆ తీగను మండించండి. చర్య జరిగిన తరువాత భౌతిక స్వరూపంలో వచ్చిన మార్పును నమోదు చేయండి.
  2. కాల్చిన తర్వాత ఏర్పడిన బూడిదను స్వచ్ఛమైన నీటిలో (Distilled water) కలపండి. ఏర్పడిన ద్రావణాన్ని ఎరుపు మరియు నీలి రంగు లిట్మస్ కాగితాలతో పరీక్షించి ఫలితాన్ని పట్టికలో నమోదు చేయండి.
  3. కొద్దిగా గంధకపు పొడిని డిప్లగ్రేటింగ్ స్పూన్లో తీసుకొని మండించండి.
  4. గంధకం మండటం ప్రారంభం కావడంతోనే స్పూన్ ను జాడీలో చేర్చి మూత బిగించండి. కొద్ది సేపటి తర్వాత స్పూను తీసివేసి వాయువు బయటకు పోకుండా జాగ్రత్తగా మూత పెట్టండి. జాడీలో కొద్దిగా నీరు కలపండి. జాడీని బాగా కలిపి ఆ ద్రావణాన్ని ఎరుపు, నీలి రంగు లిట్మస్ కాగితాలతో పరీక్షించి ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.
  5. గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో నమూనాలను మండించినప్పుడు జరిగే చర్యలు.
    AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 8

ఈ ఆక్సెను లిట్మతో పరీక్షించినట్లయితే మెగ్నీషియం ఆక్సెడ్ ఎరుపు లిట్మసను నీలిరంగులోకి, సల్ఫర్ డై ఆక్సైడ్ నీలి లిట్మసు ఎరుపు రంగులోకి మార్చుతాయి.

గ్రహించినది :
మెగ్నీషియం ఆక్సెడ్ ను క్షార ఆక్సెడ్ గాను సల్ఫర్ డై ఆక్సైడ్ ను ఆమ్ల ఆక్సెడ్ గాను చెప్పవచ్చు.

ఫలితం :
ఈ చర్యల ద్వారా అలోహాలు (Non – metals) ఆక్సిజన్ తో చర్య జరిపి ఆమ్ల స్వభావం కలిగి ఉన్న ఆక్సైడ్ లను ఇస్తాయి. లోహాలు (metals) ఆక్సిజన్ తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సైడ్ ను ఇస్తాయి.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 9

పట్టిక
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 10
జాగ్రత్త : సల్ఫర్‌ను మండించినపుడు ఏర్పడే వాయువును పీల్చకండి. ప్రమాదకరం.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

కృత్యం -7 ఆమ్లాలతో చర్యలు :

7. ఈ కింది ,పట్టికలో పేర్కొన్న నమూనాలను వేర్వేరు పరీక్షనాళికల్లో తీసుకోండి. ప్రతి పరీక్షనాళికలో 5 మి.లీ. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంను డ్రాపర్ సహయంతో కలపండి. కొద్దిసేపు పరీక్ష నాళికలోని చర్యలను పరిశీలించండి. మీరు ఏ విధమైన చర్యను గమనించకపోతే పరీక్ష నాళికను కొద్ది సేపు సన్నని మంటపై వేడిచేసి చూడండి. అప్పటికీ ఏ విధమైన చర్య గమనించకపోతే 5 మి.లీ. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. తరువాత పరీక్షనాళిక పై భాగంలో మండుతున్న అగ్గిపుల్లని ఉంచండి. ఏం జరుగుతుందో పరిశీలించండి.
మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.

నమూనా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య సజల సల్ఫూరిక్ ఆమ్లంతో చర్య
ఇనుము
జింకు
రాగి
గంధకం
అల్యూమినియం
కార్బన్
మెగ్నీషియం
అయోడిన్

కృత్యం – 8 లోహాల చర్యాశీలత :

8. ఆరు బీకరులను తీసుకొని, వాటికి a, b, c, d, e, f స్టిక్కర్లతో గుర్తించండి. ప్రతి బీకరులో 50 మి.లీ. నీరు తీసుకోండి. a, b బీకరులలో ఒక చెంచా కాపర్ సల్ఫేట్ (Cus) ను వేసి బాగా కలపండి. మిగిలిన C మరియు d లలో ఒక చెంచా జింక్ సల్ఫేట్ (Znson, e మరియు స్త్రీ లలో ఒక చెంచా ఐరన్ సల్ఫేట్ (FeSO4) వేసి బాగా కలపండి.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 11

కొద్దిసేపు బీకర్లను కదల్చకుండా ఉంచండి. బీకర్లలో గల ద్రావణాల రంగులో జరిగే మార్పులను పరిశీలించి ఈ కింది పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 12
ఈ రసాయన చర్యల నుండి ఎక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తున్నాయని, తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించ లేకపోతున్నాయని పై ప్రయోగాల పరిశీలన వల్ల తెలుస్తుంది.

AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

అదనపు కృత్యం – 1

ఈ కింది పట్టికలోని పదార్థ నమునాలు పరిశీలించి, ఇంతవరకు చేసిన కృత్యాల ఆధారంగా ఈ కింది పట్టికలో ధర్మాలను పాటిస్తే టిక్ ( ✓) కొట్టండి. లేకపోతే తప్పు (✗) గుర్తును రాయండి.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 13

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

SCERT AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 4th Lesson Questions and Answers కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కొన్ని దారాలను మాత్రమే మనము కృత్రిమ దారాలు అని ఎందుకంటాం? వివరించండి. (AS1)
జవాబు:

  1. నైలాన్, రేయాన్, అక్టోలిక్ మరియు పాలిస్టర్ వంటి కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటారు.
  2. పెట్రో రసాయనాలను ఎన్నో రసాయనిక ప్రక్రియలకు గురిచేయడం ద్వారా ఏర్పడే దారాలను కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారాలు అన్నీ పాలిమర్లు.
  3. నైలాన్ అనేది బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం.
  4. రేయాన్ సెల్యులోజ్ తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
  5. అక్టోలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.

ప్రశ్న 2.
వివిధ పదార్థాలను నిలువ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలను వాడడానికి గల కారణాలు చెప్పండి. (AS1)
(లేదా)
ప్లాస్టిక్ లను వాడటం వల్ల అనేక హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ మనం ప్లాస్టిక్ లను వినియోగిస్తున్నాము. ఆ ప్లాస్టిక్స్ వలన లాభాలేమిటి ?
జవాబు:

  1. ప్లాస్టిక్ నీరు మరియు ఇతర రసాయనాలతో చర్య జరుపదు.
  2. పదార్థాలను క్షయం చేయదు.
  3. ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
  4. ప్లాస్టిక్ పరిమాణంలోను, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
  5. ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
  6. ప్లాస్టికు ఉష్ణబంధక మరియు విద్యుత్ బంధక పదార్థాలు.
  7. ప్లాస్టిక్ లను వివిధ రంగులలో తయారుచేసుకోవచ్చును.
    పై కారణాల వలన ప్లాస్టిక్ పాత్రలను వస్తువులను భద్రపరచుకొనేందుకు వాడుతారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో ఏ ఏ పదార్థాలను రీసైక్లింగ్ చేయగలమో, వేటిని చేయలేమో వీడదీయండి. (AS1)
ప్లాస్టిక్ బొమ్మలు, విద్యుత్ స్విచ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బాల్‌ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు, కుక్కర్ పిడులు, ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ సంచులు, పాత్రలు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్లు మొదలగునవి.
జవాబు:

రీసైక్లింగ్ చేయగల పదార్థాలు రీసైక్లింగ్ చేయలేని పదార్థాలు
ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లు విద్యుత్ స్విచ్ లు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, కుక్కర్ పిడులు, పళ్ళుతోముకునే  బ్రష్ లు, ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథీన్ సంచులు.

ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ స్విచ్ లు థర్మోప్లాస్టిక్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది? (AS1)
జవాబు:
విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గుల వలన ఎలక్ట్రిక్ స్వి లో ఉష్ణం ఏర్పడుతుంది. థర్మోప్లాస్టిక్ తో తయారుచేసిన ఎలక్ట్రిక్ స్వి లు అయితే ఈ ఉష్ణానికి కరిగిపోతాయి.

ప్రశ్న 5.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కన్నా “ధర్మోప్లాస్టిక్ కు ప్రకృతి నేస్తాలు”. నీవేమి చెబుతావు? ఎందుకు? (AS1)
జవాబు:
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ల కన్నా “థర్మోప్లాస్టికు ప్రకృతి నేస్తాలు” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే

  1. విరిగిపోయిన, వాడలేని, పాతబడిన థర్మోప్లాస్టిక్ ను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయవచ్చును.
  2. థర్మోప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ (Reuse) వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.
  3. పట్టణాలలోని ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం థర్మోప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వాటినుండి సేకరించిన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా విద్యుత్, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాల వంటి వివిధ రూపాలలోనికి మార్చి, ఈ వ్యర్థాలను తిరిగి వనరులుగా ఉపయోగిస్తాం.

ప్రశ్న 6.
కింది వాటిని వివరించండి. (AS1)
ఎ) మిశ్రణం
బి) జీవ విచ్ఛిన్నం చెందడం
సి) రీసైక్లింగ్
డి) వియోగం చెందడం
జవాబు:
ఎ) మిశ్రణం :

  1. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
  2. టెర్లిన్ ను, నూలుతో మిశ్రణం చేస్తే టెరికాట్ ఏర్పడుతుంది. ఇది సౌకర్యవంతంగా, నలిగిపోనిదిగా ఉంటుంది.
  3. టెర్లిన్, ఊన్నితో మిశ్రణం చెందితే టెరిడోల్ ఏర్పడుతుంది.
  4. టెర్లిన్, సిల్క్ తో మిశ్రణం చెందితే టెరిసిల్క్ ఏర్పడుతుంది.

బి) జీవ విచ్చిన్నం చెందడం :

  1. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందడం అంటారు.
  2. పండ్లు, కూరగాయలు, చనిపోయిన జీవులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి.

సి) రీసైక్లింగ్ :

  1. విరిగిపోయి వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
  2. PET (కోడ్-1), PS (కోడ్-6) మరియు HDPE (కోడ్-B) లను రీసైకిల్ చేస్తారు.

డి) వియోగం చెందడం :

  1. కొన్ని పదార్థాలు నీరు, సూర్య కాంతి, ఆక్సిజన్ సమక్షంలో ఉంచినపుడు సూక్ష్మభాగాలుగా విడగొట్టబడతాయి. ఈ సూక్ష్మభాగాలు బ్యాక్టీరియా చేత మరల విభజింపబడే ప్రక్రియనే వియోగం చెందడం అంటారు.
  2. వియోగం చెందడానికి కావలసిన సమయాన్ని బట్టి ఆ పదార్థం జీవ విచ్ఛినం చెందిందా, చెందలేదా నిర్ణయించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

7. జతపరచండి. (AS1)

1) పాలిస్టర్ ఎ) వంటసామాగ్రి
2) PET బి) కృత్రిమ పట్టు
3) రేయాన్ సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
4) నైలాన్ డి) ఎలక్ట్రిక్ స్వి చు
5) మెలమిన్ ఇ) చిహ్నం
6) పాలిథీన్ ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
7) బేకలైట్ జి) అన్ని దారాలకన్నా దృఢమైనది

జవాబు:

1) పాలిస్టర్ ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
2) PET ఇ) చిహ్నం
3) రేయాన్ బి) కృత్రిమ పట్టు
4) నైలాన్ జి) అన్ని దారాలకన్నా దృఢమైనది
5) మెలమిన్ ఎ) వంటసామాగ్రి
6) పాలిథీన్ సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
7) బేకలైట్ డి) ఎలక్ట్రిక్ స్వి చు

8. ఖాళీలను పూరించండి. (AS1)

i) కృత్రిమ దారాలను …………………….. అని కూడా పిలుస్తాం.
జవాబు:
మానవ నిర్మిత దారాలు

ii) కృత్రిమ దారాలను ………………… పదార్థాల నుండి సంశ్లేషిస్తారు.
జవాబు:
పెట్రోలియం ముడి

iii) కృత్రిమ దారం లాగే ప్లాస్టిక్ కూడా ………
జవాబు:
పాలిమర్

iv) బట్టలపై లేబిళ్లు ……….
ఎ) చట్ట ప్రకారం అవసరం
బి) దారము రకాన్ని గుర్తించడానికి
సి) ఎ, బి లు రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ, బి లు రెండూ

v) రేయావ్ దీనితో తయారవుతుంది.
ఎ) నేలబొగ్గు
బి) ఆక్సిజన్
సి) నార
డి) సెల్యులోజ్
జవాబు:
డి) సెల్యులోజ్

vi) పట్టుదారము యొక్క నునుపైన తలము కాంతిని శోషిస్తుంది.
ఎ) అవును
బి) కాదు
సి) చెప్పలేము
జవాబు:
ఎ) అవును

ప్రశ్న 9.
రీసైక్లింగ్ ప్రక్రియను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఎలా ఉపయోగకరమైనదో ఉదాహరణతో తెల్పండి. (AS1)
జవాబు:
రీసైక్లింగ్ ప్రక్రియను ప్లాస్టిక్ లో మరియు లోహాలలో ఉపయోగిస్తారు.

ఉదాహరణలు :

  1. (PET చిహ్నం-1 గలవి) వాడిన లేదా పాడయిన శీతలపానీయాలు, నీటి మరియు పండ్ల రసాల సీసాలు మరియు ట్రేలను రీసైక్లింగ్ చేసి వాహనాల పరికరాలను, ఫ్యూజ్ బాక్స్ లను, బంపరను, తలుపుల ఫ్రేములను, కుర్చీలను మరియు టేబులను తయారు చేస్తారు.
  2. HDPE చిహ్నం -2 గలవి) వాడిన లేదా పాడయిన బొమ్మలు, విద్యుత్ బంధక పరికరాలు, పాత్రలు, కుర్చీలు, సీసాలు మొదలగునవి రీసైక్లింగ్ చేసి పెన్నులు, పాటైల్స్, డ్రైనేజి పైపులు మొదలగునవి తయారు చేస్తారు.
  3. (PP చిహ్నం-6 గలవి) వాడినవి లేదా పాడయిపోయిన దువ్వెనలు, ఇంటికప్పులు, TV క్యారి కంటైనర్లు, CD కేసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్పులు, కోడిగ్రుడ్డు కేసులు మొదలగునవి రీసైక్లింగ్ చేసి విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ స్విలు, గ్రుడ్ల పెట్టెలు, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్లు, ఫోమ్ ప్యాకింగ్ న్లు, క్యారి అవుట్ కంటైనర్లు మొదలగునవి తయారు చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 10.
రకరకాల కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు వివరించేటట్లు ఒక పట్టిక తయారు చేయండి. (AS4)
జవాబు:

కృత్రిమ దారం కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు
1. నైలాన్ బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలవేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు (Socks), బెల్టులు, దిండ్లు (Sleeping bags), డోర్ కర్టన్స్, పారాచూట్లు, ఈతదుస్తులు, లో దుస్తులు (Sheer hosiery), తెరచాపలు, గొడుగులకు వాడే గుడ్డ, బట్టలు, కారు టైర్లు మొదలగునవి.
2. రేయాన్ దుస్తులు, దుప్పట్లు, తివాచీలు, లంగోటాలు (Diapers), బ్యాండేజీలు మొదలగునవి.
3. అక్రలిక్ స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు, రగ్గులు, కాళ్ళకు వేసుకొనే మేజోళ్ళు (Socks), క్రీడా దుస్తులు, ప్రయాణ సామగ్రి మరియు వాహనాల కవర్లు మొదలగునవి.
4. పాలిస్టర్ దుస్తులు, చీరలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, జాడీలు, సీసాలు, ఫిల్మ్ లు, తీగలు, ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు మొదలగునవి.

ప్రశ్న 11.
థర్మోప్లాస్టిక్ లకు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లకు మోనోమర్ అమరిక విషయంలో ఉండే భేదాలను పట సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:

థర్మో ప్లాస్టిక్లు థర్మోసెట్టింగ్ ప్లాస్టికు
1. వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరచినప్పుడు కఠినంగాను మారే ధర్మం గల ప్లాస్టికన్ను థర్మోప్లాస్టిక్ అంటారు. 1. ఒకసారి ఒక రూపంలోనికి మలచి, చల్లబరచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడిచేసినా సరే మార్చలేని ప్లాస్టిక్ ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు.
2. థర్మోప్లాస్టిక్ లోని మోనోమర్లు రేఖీయ అమరికను కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1
మోనోమర్ల రేఖీయ అమరిక
2. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లోని మోనోమర్లు అడ్డంగా అనుసంధా నించబడిన అమరిక కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 2
మోనోమర్లు అడ్డంగా అనుసంధానించబడిన అమరిక
3. వీటిని వేడి చేసినపుడు ద్రవస్థితిలోనికి, తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనీభవిస్తుంది. 3. వీటిని వేడి చేసినపుడు నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది.
4. వీటిని రీసైక్లింగ్ చేయవచ్చును. 4. వీటిని రీసైక్లింగ్ చేయలేము.

ప్రశ్న 12.
“వస్త్ర పరిశ్రమలో కృత్రిమ దారాల పరిచయం వస్త్రధారణ విషయంలో ప్రపంచమంతటా సంస్కృతి, సాంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది”. దీనిని మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
వస్త్ర పరిశ్రమలో సహజ దారాలు సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండేవి. సహజ దారాల స్థానంలో వచ్చిన కృత్రిమ దారాలు సహజ దారాలకంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయి. పాలిస్టర్ అనే కృత్రిమ దారాన్ని కనుగొన్న తరువాత, పాలిస్టర్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్త్రము సులభంగా ముడుచుకుపోదు. ఇది ఎక్కువ మన్నికగాను, సులువుగా ఉతుక్కోవడానికి వీలుగాను మరియు తక్కువ ధరలో ఉంటుంది. అందుకే దుస్తులు తయారుచేయడానికి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ మిగిలిన దారాల వలె నేయడానికి కూడా వాడవచ్చును. పాలిస్టర్ దారాన్ని సహజదారాలతో కలిపి మిశ్రణం చెందించడం వల్ల సహజ దారాల మరియు కృత్రిమ దారాల లక్షణాలు గల వస్త్రం తయారగును.

వివిధ వృత్తుల వారికి కావలసిన లక్షణాలు గల వస్త్రాలను కృత్రిమ మరియు మిశ్రణం చెందించగా ఏర్పడే వస్త్రాల నుండి పొందవచ్చును. ఈ వస్త్రాలు ప్రపంచమంతటా సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయని చెప్పవచ్చును.

ప్రశ్న 13.
కృత్రిమ దారాలు మన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసినవి? (AS7)
జవాబు:

  1. కృత్రిమ దారాలతో తయారైన గృహోపకరణాల జాబితా చాలా పెద్దది. ఇవన్నీ మన రోజువారీ కృత్యాలతో ముడిపడి ఉంటాయి.
  2. కృత్రిమ దారాలు పట్టు వస్త్రాల కంటే ఎక్కువ మెరుపుగల దుస్తులు తయారు చేయడానికి సహాయపడతాయి.
  3. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ దుస్తులు త్వరగా చిరిగిపోవు.
  4. తక్కువ నీటిని ఉపయోగించి తేలికగా ఉతకవచ్చు.
  5. తివాచీలు తయారుచేయడానికి ప్రస్తుతం ఉన్నికి బదులు నైలాన్ వాడుతున్నారు.
  6. ఈత కొట్టేటప్పుడు ధరించే దుస్తులు, లోదుస్తులు, గొడుగులు, తెరచాపలు, చేపలు పట్టే వలలు, కార్ల టైర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులెన్నో తయారుచేస్తున్నారు.
  7. కనుక మన జీవిత విధానం ఈ కృత్రిమ దారాల వినియోగం వలన పూర్తిగా మారిపోయింది.

ప్రశ్న 14.
సుజాత తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులు కొనాలని అనుకొంది. నీవు ఏ రకమైన బట్టలను కొనమని సలహా ఇస్తావు? కారణాలు చెప్పండి. (AS7, AS1))
జవాబు:

  1. సుజాత, తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులను కొనాలని అనుకుంది.
  2. నేనైతే నిభాకు ఈ క్రింది దుస్తులను కొనమని సలహా ఇస్తాను.
  3. సహజమైన ఉన్నితో తయారైన స్వెట్టర్లూ, శాలువాలూ, దుప్పట్లూ మొదలైనవి. కాని ఇవి చాలా ఖరీదైనవి.
  4. శీతాకాలంలో వేసుకొనే దుస్తులలో చాలా వాటిని ప్రస్తుతం అక్రలిక్ అనే కృత్రిమ దారంతో తయారుచేస్తున్నారు.
  5. ఈ అక్రలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది.
  6. దీనిని కృత్రిమ ఉన్ని అనవచ్చు లేదా నకిలీ ఉన్ని అని కూడా అనవచ్చు.
  7. అక్టోలిక ను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో మెలి పెట్టి పురి పెడతారు.
  8. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి.
  9. అజోలిక్ తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి.
  10. కనుక నిభా తన తల్లిదండ్రులకు అక్రలిక్ తో చేసిన దుస్తులను కొనడం మంచిది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 15.
వాడిన ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే (Dispose) వచ్చే అనర్థాలేమిటి? (AS7)
జవాబు:
ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే వచ్చే అనర్థాలు :

  1. ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి కావున ప్లాస్టిక్ వలన భూమి కలుషితం అవుతుంది.
  2. వాడి విసిరేసిన పాలిథీన్ సంచులు డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడి, డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహించుట మరియు కాల్వలో డ్రైనేజి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రోగాలకు కారణమౌతాయి.
  3. ఆవులు, మేకలు మొదలగు జంతువులు పాలిథీన్ సంచుల్లోని ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియలు చెడిపోవడం ద్వారా జంతువులు చనిపోతున్నాయి.
  4. ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, సరస్సులు, నదులు మరియు సముద్రాలలో చేరడం వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడం వలన వర్షం నీరు భూమిలోకి చేరక భూ జలవనరులు క్రమంగా తగ్గిపోతాయి.
  6. ప్లాస్టిక్ వ్యర్థాలను మండిస్తే, వాతావరణంలో విషవాయువులు విడుదలవడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
“ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం జీవ వైవిధ్యానికి ప్రమాదకర హెచ్చరిక” దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తీసుకొంటున్న చర్యలేమిటి? (AS7)
జవాబు:

  1. ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం వలన ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైపోతుంది.
  2. ఈ వస్తువులు త్వరగా జీవ విచ్ఛిన్నం చెందవు.
  3. అందుచేత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి “4R” సూత్రాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాల
    మేరకు విధిగా పాటిస్తున్నాయి.
  4. ఈ “4R” లు ఏమంటే
    i) తగ్గించడం (Reduce) : మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
    ii) మరల ఉపయోగించడం (Reuse) : ప్రతి సారి కొత్త క్యారీ బ్యాగులాంటి వాటిని కొనకుండా వీలైనన్ని ఎక్కువసార్లు మరల మరల తిరిగి వాడాలి.
    iii) తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం (Recycle) : పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను వదలివేయకుండ. పాత సామానులు కొనేవాడికి ఇవ్వాలి.
    iv) తిరిగి పొందడం (Recover) : సేకరించిన ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను విద్యుత్, ఉష్ణం వంటి రూపాలలోకి మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలి.
  5. ప్రభుత్వ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, “మేజిమెంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్” కొరకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

పరికరాల జాబితా

పట్టుచీర, నూలు చీర, స్వెటర్, కార్పెట్, బ్రష్, నైలాన్ తాడు, పూసల దండ, పేపర్ క్లిట్ల దండ, వివిధ దారాలు, దారాల ‘మిశ్రణానికి సంబంధించిన లేబుల్స్, రీసైక్లింగ్ చిహ్నాలు గల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల నమూనాలు, థర్మో ప్లాస్టిక్ వస్తువులు (పివిసి పైపు ముక్క పాలిథీన్ కవర్, బొమ్మలు, దువ్వెన) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తువులు (బేకలైట్ స్విచ్, వంటపాత్ర పిడి, మెలమిన్ (కీబోర్డు, ఫైబర్ ప్లేటు) టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ కప్పు, కూరగాయలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన పదార్థాలు, కాగితం, నూలు బట్ట, ప్లాస్టిక్ సంచి, ఇనుప స్టాండ్, బరువులు వేయడానికి అనువైన పళ్లెములు, బరువులు, లాండ్రీ లేబుల్ కోడ్స్ చార్టు, పట్టుకారు, సారాయి దీపం, రీసైక్లింగ్ చిహ్నాలు చార్టు.

ప్రయత్నించండి

ప్రశ్న 17.
జుట్టు, ఉన్ని, పట్టు, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క మొదలగునవి తీసుకొని జాగ్రత్తగా జ్వాల పరీక్ష (Flame test) ను నిర్వహించండి. వాసన, కరిగే విధానాన్ని బట్టి వాటిని సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించండి. (AS1)
జవాబు:
జ్వా ల పరీక్ష:
ఉద్దేశ్యము :
జ్వాల పరీక్ష ద్వారా నమూనాలను సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయిదీపం, నమూనాలు (జుట్టు, ఉన్ని, పట్టు, కాగితం, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క)

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో నమూనాలను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు వాసన, కరిగే మార్పులను గమనించండి.
  4. మిగిలిన నమూనాలతో ఇదే విధంగా మరలా చేయండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 3

ప్రశ్న 18.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చిహ్నాలు, వాటి పూర్తి పేరు, మరియు దాని సంక్షిప్త నామం, గృహ అవసరాలలో వాటి వినియోగం, రీసైక్లింగ్ అవుతుందా లేదా ఒకవేళ రీసైక్లింగ్ అయితే వాటి నుండి ఏమి తయారు అవుతాయో వీటన్నింటినీ వివరించే ఒక చార్టను తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 4
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 5

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 1.
సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణమేమిటి?
జవాబు:

  1. సహజ దారాల ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవకపోవడం.
  2. వీటికి మన్నిక తక్కువ.
  3. ఇవి అధిక ఉష్ణం మరియు పీడనాలకు తట్టుకోలేవు.
  4. ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.
  5. వీటితో తయారుచేయబడిన వస్త్రాలు త్వరగా ఆరవు.
  6. వీటిని ఎక్కువగా వాష్ చేస్తే పాడవుతాయి. కారణం సంపీడనాలను ఇవి తట్టుకోలేవు.
  7. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
  8. ఇవి ముడులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇస్త్రీ చేయాలి.
  9. ఇవి మెరుపును కలిగి ఉండవు.
  10. వీటికి గట్టితనం తక్కువ.
    పై కారణాల వల్ల మానవులు సహజదారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 2.
ఏ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
సహజ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే సహజ దారములు వృక్ష మరియు జంతువుల నుండి తయారవుతాయి.

8th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ప్రస్తుత స్థానానికి కృత్రిమ దారాల పరిణామం ఎలా జరిగింది?
జవాబు:
సహజ దారాలు మానవ అవసరాల కన్నా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. సహజ దారాలకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ దారాల కొరకు అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొట్టమొదట నైలాన్ అనే కృత్రిమ దారాన్ని కనుగొనడం జరిగింది. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్ తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ, తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉండడం మరియు త్వరగా ఆరే గుణం ఉండడం వల్ల కృత్రిమ దారాల వాడకం పెరిగింది.

8th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
పారాచూట్ తయారుచేయడానికి నూలుగుడ్డ, నూలు తాడులను వాడితే ఏం జరుగుతుంది?
జవాబు:
నూలుగుడ్డ, నూలు తాడులను పారాచూట్లో వాడితే కింద పడిపోవడం జరుగుతుంది.

కారణాలు :

  1. నూలు గుడ్డ, నూలు తాడులు అధిక పీడన, సంపీడనాలను తట్టుకోలేవు.
  2. నూలు గుడ్డలో సన్నని రంధ్రాలు ఉండడం వలన గాలి సన్నని రంధ్రాల గుండా సులభంగా ప్రయాణిస్తుంది.
  3. నూలు తాడు అధిక బరువులకు తెగిపోతుంది.

ప్రశ్న 5.
పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం వారు నైలాన్ వలలను వాడుతున్నారు. నైలాన్ వలల వాడకం వలన లాభాలు ఏమిటి?
జవాబు:

  1. నైలాన్ దారాలు అధిక బరువులను తట్టుకోగలవు. కావున వలలు తెగిపోవు.
  2. ఇవి గట్టిగా, దృఢంగా ఉండడం వలన చేపలు కొరికినా తెగిపోవు.
  3. ఈ దారాలు తడిసినా పాడుకావు.
  4. ఇవి అధిక పీడనాన్ని తట్టుకోగలవు.
  5. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. నీటిలో వీటి బరువు ఎక్కువగా ఉండదు.

ప్రశ్న 6.
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. ఎందుకంటే

  1. తేలికగా ఉంటాయి.
  2. మెరుపును కలిగి ఉంటాయి.
  3. ఎక్కువ కాలం మన్నికగా, ఉంటాయి.
  4. సులభంగా ఉతకవచ్చును.
  5. నీటిని ఎక్కువగా పీల్చవు.
  6. త్వరగా ఆరతాయి.
  7. ముడుతలు పడవు. ఇస్త్రీ చేయవలసిన అవసరం ఉండదు.
  8. కీటకాలు తినవు.
  9. పీడన, సంపీడనాలను తట్టుకుంటాయి.
  10. తక్కువ ఖరీదుకు లభిస్తాయి.

8th Class Physical Science Textbook Page No. 50

ప్రశ్న 7.
సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనదిగా తయారు కావడానికి ఏ లక్షణాలు తోడ్పడతాయి?
జవాబు:

  1. రేయాన్ సహజ పట్టు కన్నా చవకైనది.
    చెమటను పీల్చుకొనే స్వభావం ఉండడం.
    స్పర్శకు మృదువుగా మరియు సిల్కీగా ఉండడం.
    కాంతి మరియు మెరుపును కలిగి ఉండడం.
    పై లక్షణాలు సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనది అనడానికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 8.
కృత్రిమ దారముతో తయారైన ఇంటి గడప ముందు కాళ్లు తుడుచుకునే గుడ్డ (Door mat) ను కొనాలని భావిస్తే ఎలాంటి దానితో తయారైన కృత్రిమ దారంను ఎన్నుకుంటావు? ఎందుకు?
జవాబు:
రేయాన్ దారముతో తయారైన కాళ్లు తుడుచుకొను (Door mat) గుడ్డను ఎన్నుకుంటాను. ఎందుకంటే రేయాన్ కి నీరు, తేమను పీల్చుకునే స్వభావం ఉన్నది కనుక.

ప్రశ్న 9.
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు (Diapers) మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే నీటిని, చెమటను పీల్చుకొనదు.

8th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 10.
శీతాకాలంలో ఏ రకపు మిశ్రణం దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో టెర్లిన్, ఉన్నితో మిశ్రణం చేసిన టెరిడోల్ దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది సహజదారాలు మరియు కృత్రిమ దారాల ధర్మాలను కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 11.
సహజ, కృత్రిమ, మిశ్రణం దుస్తులు మనకు లభ్యమవుతున్నాయి కదా! శుభకార్యాలు, పండుగల సమయంలో ఏ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? ఎందుకు?
జవాబు:
శుభకార్యాలు, పండుగల సమయంలో సహజ దారాలతో తయారైన పట్టు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే

  1. శరీరానికి ఎక్కువ గాలిని తగిలేటట్లు చేస్తాయి.
  2. చెమటను పీల్చుకుంటాయి.
  3. శరీరానికి చిరాకును కలిగించే రసాయనాలు ఉండవు.
  4. వేడికి కరగవు కావున శరీరానికి అంటుకుపోవు.
  5. సహజ దారాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి.

8th Class Physical Science Textbook Page No. 52

ప్రశ్న 12.
సహజ లేదా కృత్రిమ దుస్తులలో వేటిని మీరు ఇష్టపడతారు? ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:
కృత్రిమ దుస్తులు ఇష్టపడతాను. ఎందుకంటే కృత్రిమ దుస్తులు మన్నికైనవి, కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. అన్ని కాలాలకు అణుగుణమైన కృత్రిమ దుస్తులు లభిస్తాయి.

సహజ దుస్తులు కృత్రిమ దుస్తులు
1) సహజ దారాలు ఎక్కువ ఖరీదైనవి. 1) కృత్రిమ దారాలు చౌకైనవి.
2) సహజ దుస్తులు ముడతలు పడతాయి. 2) కృత్రిమ దుస్తులు ముడతలు పడవు.
3) ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. 3) ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి.
4) ఇవి త్వరగా ఆరవు. 4) ఇవి త్వరగా ఆరుతాయి.
5) ఇవి మన్నికైనవి కావు. 5) ఇవి మన్నికైనవి.
6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉండవు. 6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
మన దుస్తులను ఇంట్లో ఉతకడానికి, లాండీల్లో డ్రైక్లీనింగ్ చేయడానికి తేడా ఏమిటి?
జవాబు:

ఇంట్లో ఉతకడం డ్రైక్లీనింగ్
1. దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లను ఉపయోగిస్తారు. డ్రైక్లీనింగ్ లో కర్బన ద్రావణులను ఉపయోగిస్తారు.
2. దుస్తులు అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడికి లోనౌతాయి. 2. దుస్తులు అధిక ఒత్తిడికి లోను కావు.
3. రక్తం, గ్రీజు, నూనె, , పెయింట్ల వంటి మరకలు పోవు. 3. రక్తం, గ్రీజు, నూనె, పెయింట్ల వంటి మరకలు పోతాయి.

8th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 14.
కొన్ని వేపుడు పెనాలకు (Fry Pans) ఆహార పదార్థాలు అంటుకోవు ఎందుకు?
జవాబు:
కొన్ని వేపుడు పెనాలకు ఆహార పదార్థాలు అంటుకోవు. ఎందుకంటే టెఫ్లాతో వేపుడు పెనాలపై పూత పూయబడి ఉంటుంది.

ప్రశ్న 15.
అగ్నిమాపకదళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు. ఎందుకు?
జవాబు:
అగ్నిమాపక దళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు, ఎందుకంటే అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన దుస్తులు కాబట్టి.

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ఇంటిలో సహజ మరియు కృత్రిమ దారాలతో తయారైన వస్తువులను గుర్తించండి. మీ పాఠశాల, ఇల్లు మరియు మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులను, గృహోపకరణాలను గుర్తించి ఆ జాబితాను పట్టికలోని సరియైన గడిలో పొందుపరచండి.
జవాబు:

వనరు గృహోపకరణాలు
మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. నూలు చీర, ఖాదీ బట్టలు, దుప్పట్లు, డోర్ కర్టన్లు, బ్యాండేజీలు మొదలగునవి.
జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి. పట్టు చీర, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టన్లు, రగ్గులు మొదలగునవి.
కృత్రిమ దారాలతో తయారయ్యేవి. బ్రష్ యొక్క కుంచె, తాళ్లు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్లు, బెల్ట్ లు, దిండ్లు, తివాచీలు, ఈత దుస్తులు, గొడుగుకు వాడే గుడ్డ, బ్యాండేజీలు, లంగోటీలు మొదలగునవి.

కృత్యం – 2 పూసలు మరియు పేపర్ క్లిక్స్ అమరిక :

ప్రశ్న 2.
కొన్ని పేపర్ క్లిప్ ను తీసుకొని వాటిని పటంలో చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. క్లిక్స్ అమరిక పద్ధతిని గమనించండి. పూసల దండకు, పేపర్ క్లిక్స్ గొలుసుకు మధ్య ఏమైనా పోలికలు గుర్తు పట్టగలరా?
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 6
జవాబు:
పూసల దండలోనూ, పేపర్ క్లిప్ ల గొలుసులోనూ ఒక్కొక్క పేపర్ క్లిప్ పేపర్ క్లి గొలుసు పూస లేక ఒక్కొక్క పేపర్ క్లిప్ రెండవ దానితో కలిసి ఒక పెద్ద గొలుసులాగా ఏర్పడినాయి.

కృత్యం – 3 దారాలను గుర్తించడం – మండించే పరీక్ష :

ప్రశ్న 3.
వివిధ సహజ, కృత్రిమ దారాలను మండించి వాటి లక్షణాలను ఒక పట్టికలో నమోదు చేయండి.
(లేదా)
వివిధ రకాల దారాలను కాల్చినపుడు జరిగే మార్పుల ఆధారంగా దారాలను గుర్తించి పట్టికలో నింపుము.
జవాబు:
పరీక్షించవలసిన వివిధ సహజ, కృత్రిమ దారాలను ఒక్కొక్కటిగా తీసుకొని దాని పురిని, ముడులను విప్పి సారాయి దీపముపై మండించితిని. మండినపుడు పరిశీలించి వాటి లక్షణాలను పట్టికలో వ్రాసితిని.

దారం లక్షణాలు (మండించినపుడు)
1. నూలు (పత్తి) వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
2. ఉన్ని నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
3. పట్టు నెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
4. రేయాన్ వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
5. నైలాన్ నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.
6. అక్రలిక్ నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 4

ప్రశ్న 4.
నైలాన్ ఎంత బలమైనది ? వివిధ దారాల బలాలను తెలుసుకొను కృత్యమును వివరించండి.
జవాబు:
క్లాంపుతో ఉన్న ఒక ఇనుపస్టాండును తీసుకోండి. 50 సెం. మీ. పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టుదారాలను తీసుకోండి. కింది పటంలో చూపిన విధంగా నూలు దారాన్ని కట్టండి. దారం మరొక చివర బరువులు వేయడానికి వీలుగా ఉండే పళ్లెమును వేలాడదీయండి. ఆ పళ్లెములో మొదట 10గ్రా.ల బరువుతో ప్రారంభించి బరువును దారం తెగేంత వరకు పెంచండి. దారం తెగగానే దాని బరువును పట్టికలో నమోదు చేయండి. ఈ విధంగా వివిధ దారాలతో చేసి బరువులను పట్టికలో నమోదు చేయండి. తీసుకున్న అన్ని దారాలు ఒకే పొడవు, దాదాపు ఒకే మందము ఉండేటట్లు చూడండి.

దారపు రకం దారం తెగిపోవడానికి అవసరమైన భారం సంఖ్య  (గ్రాములలో)
1. నూలు 250
2. ఉన్ని 500
3. పట్టు 550
4. నైలాన్ 1200

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 7

పై కృత్యంలో దారాల బలాలు పెరిగే క్రమం : నూలు < ఉన్ని < పట్టు < నైలాన్

కృత్యం – 6

ప్రశ్న 5.
ఇచ్చిన సీసా (Bottle) PET సీసా అని ఎలా చెప్పగలవు?

మీ తరగతి స్నేహితుల నుండి వేర్వేరు నీటి సీసాలను సేకరించి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సీసాల అడుగున త్రిభుజాకారములో ఏదైనా గుర్తు ఉన్నదా? లేదా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్ (brand label sticker) పైన ఆ గుర్తు ఉందా? ఆ త్రిభుజంలో ఏ అంకె ఉన్నది? కింది పటంను పరిశీలించండి. చాలా బాటిళ్లకు త్రిభుజాకోరం మధ్యలో 1 అనే అంకె ఉండడం గమనిస్తావు. ఇలా ‘1’ ఉన్నట్లైతే అది PET బాటిల్ అవుతుంది.
రెసినను గుర్తించేందుకు చిహ్నములు :
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 8

చిహ్నముల సంఖ్యలు (Code Numbers)

  1. పాలీఎథిలీన్ టెరిఫాల్ట్ (PET, PETE)
  2. అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE)
  3. పాలీవినైల్ క్లోరైడ్ (PVC)
  4. అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE)
  5. పాలీ ప్రొపిలీన్ (PP)
  6. పాలీ స్టెరీన్ (PS)
  7. ఇతరము (1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రెసిన్ కలయిక ద్వారా ఏర్పడిన వాటిని ఈ కోడ్తో సూచిస్తారు.)

కృత్యం – 7

ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వాటికి గల రీసైక్లింగ్ చిహ్నం ద్వారా గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 9

కృత్యం – 8

ప్రశ్న 7.
ప్లాస్టిక్ రకాలు :
ప్లాస్టిక్ తో తయారైన ఒక PP బాటిల్, మరొక సాధారణమైన బాటిల్ (PET)ను తీసుకొని వేడి నీటిని రెండింటిలో పోయండి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 10

a) ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
సాధారణమైన బాటిల్ ముడుచుకొనిపోయింది. తద్వారా దాని ఆకృతి మారినది.

b) రూపం మారిన సీసా యొక్క చిహ్నము (Code) ను చూడండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 11

c) టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఏ రకమైనదో నీవు చెప్పగలవా?
జవాబు:
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
మీకు ఇచ్చిన ప్లాస్టిక్ థర్మో ప్లాస్టిక్లు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించండి.
(లేదా)
ప్లాస్టిక్ దువ్వెన, పళ్ళుతోముకునే బ్రష్, ప్లాస్టిక్ బకెట్, కుక్కర్ పిడిలు, ఎలక్ట్రిక్ స్విచ్, ప్లాస్టిక్ ప్లేటు, కాఫీ మగ్లను నీకు ఇచ్చినపుడు ఏ కృత్యం చేయడం ద్వారా ఏది థర్మోప్లాస్టిక్, ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తించగలవో ఆ కృత్యమును వివరింపుము.
ఉద్దేశము :
జ్వాల పరీక్షను ఉపయోగించి థర్మోప్లాస్టికు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయి దీపం, ఇచ్చిన ప్లాస్టిక్ నమూనాలు.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 12

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని దానిని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో ప్లాస్టిక్ నమూనాను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై ఈ నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
  4. ఈ విధంగా అన్ని నమూనాలను పరీక్షించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
  5. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు.
  6. ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ప్లాస్టిక్ నమూనా మెత్తబడడం/కాలిన వాసనతో మండడం/తర్వాత గట్టిపడడం థర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
1. టూత్ బ్రష్ కుంచె నెమ్మదిగా మండి మెత్తబడడం, కాలిన వాసనతో మండడం థర్మోప్లాస్టిక్
2. దువ్వెన మెత్తబడడం, కాలినవాసనతో మండడం థర్మోప్లాస్టిక్
3. బకెట్ చిన్నముక్క మెత్తబడడం, కాలిన వాసనతో మండడం థర్మోప్లాస్టిక్
4. వంటపాత్ర పిడి తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
5. విద్యుత్ స్విచ్ తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
6. పళ్లెం తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
7. కాఫీకప్పు తర్వాత గట్టిపడడం థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 9 జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి :

ప్రశ్న 9.
ఇచ్చిన పదార్థాలలో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి గుర్తించి, జీవ విచ్ఛిన్నం చెందుటకు పట్టేకాలాన్ని కనుగొనండి.
జవాబు:
ఒక గుంతను తవ్వి, ఇచ్చిన పదార్థాలను గుంతలో వేయండి. కొన్ని రోజుల తర్వాత గుంతను మరల తవ్వి ఏ పదార్థాలు భూమిలో కలిసిపోయాయో, ఏవి మిగిలిపోయాయో పరిశీలించండి. వివరాలను పట్టికలో వ్రాయండి.

వ్యర్థం పేరు భూమిలో కలిసిపోవడానికి పట్టేకాలం మార్పు
1. కూరగాయలు, పండ్ల తొక్కలు 10 – 20 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
2. తినగా మిగిలిన పదార్థాలు 10-20 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
3. కాగితం 10-30 రోజులు జీవ విచ్ఛిన్నం చెందును.
4. నూలు బట్ట 2-6 నెలలు జీవ విచ్ఛిన్నం చెందును.
5. ప్లాస్టిక్ సంచి 100 సం||ల కన్నా ఎక్కువ జీవ విచ్ఛిన్నం చెందదు.