Practice the AP 10th Class Social Bits with Answers 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
1. ఊటీ ఈ క్రింది పర్వతాలలో ఉంది.
A) మహదేవ్ కొండలు
B) నీలగిరి
C) ఆరావళి
D) అన్నామలై
జవాబు:
B) నీలగిరి
2. జర్మన్ పదము “ట్రేడ్” యొక్క అర్థము
A) వాణిజ్యం
B) ట్రాక్
C) బుతుపవనం
D) జెట్ స్ట్రీమ్
జవాబు:
B) ట్రాక్
3. క్రింది వాటిలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతము ……
A) ఢిల్లీ
B) జైపూర్
C) చెన్నై
D) లేహ్
జవాబు:
B) జైపూర్
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “తొలకరి జల్లులను” ఈ పేరుతో పిలుస్తారు.
A) కొబ్బరి జల్లులు
B) నారింజ జల్లులు
C) మామిడి జల్లులు
D) సీతాఫలం జల్లులు
జవాబు:
C) మామిడి జల్లులు
5. క్రింద ఇచ్చిన నగరాలలో మే నెలలో కూడా చల్లని వాతావరణం కలిగినది.
A) సిమ్లా
B) ముంబయి
C) లక్నో
D) కోల్ కతా
జవాబు:
A) సిమ్లా
6. వాయవ్య, మధ్యభారతంలో వేసవి కాలంలో నమోదవు తున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలు
A) 39°- 42°C
B) 41 – 42°C
C) 43 – 46°C
D) 36-39°C
జవాబు:
B) 41 – 42°C
7. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడిన ప్రధాన ఉద్దేశ్యం
A) భూగోళం వేడెక్కడం తగ్గించడం
B) కలుషిత జలాల నివారణ
C) అణు ఆయుధాల నివారణ
D) సరిహద్దు వివాదాల నివారణ
జవాబు:
A) భూగోళం వేడెక్కడం తగ్గించడం
8. మనదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని ‘మాన్సూన్’ అని పేరు పెట్టినవారు …………. .
A) ఆంగ్లేయులు
B) ఫ్రెంచివారు
C) డచ్చివారు
D) అరబ్బులు
జవాబు:
D) అరబ్బులు
9. భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్ళుచున్న ఉష్ణోగ్రతలు …………
A) పెరుగుతాయి
B) తగ్గుతాయి
C) మార్పు ఉండదు
D) ఏదీకాదు
జవాబు:
B) తగ్గుతాయి
10. తిరోగమన ఋతుపవన కాలంలో దేశంలో ఏ తీరంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది?
A) కోరమండల్
B) సర్కార్
C) మలబార్
D) ఉత్కల్
జవాబు:
C) మలబార్
11. క్రింది ప్రాంతాలలో అతి తక్కువ వర్షపాతం, ఉష్ణోగ్రతలు నమోదు కాబడే ప్రాంతం …………..
A) లేహ్
B) ఢిల్లీ
C) చెన్నై
D) జైపూర్
జవాబు:
A) లేహ్
12. భారతదేశానికి అత్యధిక వర్షపాతాన్ని కలుగజేసేవి.
A) నైఋతి ఋతుపవనాలు
B) ఈశాన్య ఋతుపవనాలు
C) స్థానిక పవనాలు
D) పైవన్నీ
జవాబు:
A) నైఋతి ఋతుపవనాలు
13. క్రింది వాటిలో దేని కొరకు IPCC సంఘం ఏర్పడింది?
A) హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపు
B) వాతావరణ మార్పు వేగం తగ్గించడం
C) మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
14. ఋతుపవనారంభం ఇక్కడ జరుగుతుంది.
A) గోవా
B) చెన్నై
C) కేరళ
D) కర్ణాటక
జవాబు:
C) కేరళ
15. భారతదేశ శీతోష్ణస్థితి విషయంలో క్రింది వానిలో సరియైనది.
i) కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా పోతుంది.
ii) దక్షిణ భారతదేశం ఉష్ణ మండలంలో కలదు
iii) ఉత్తర భారతదేశం ధృవ మండలంలో కలదు.
A) (i) మాత్రమే
B) (i) మరియు (ii)
C) (iii) మాత్రమే
D) (i), (ii) మరియు (iii)
జవాబు:
B) (i) మరియు (ii)
16. ఉత్తర మైదానాలలో పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలు TS |June 2017 )
A) మిస్టాల్
B) చినూక్
C) లూ
D) బోరా
జవాబు:
C) లూ
17. భారతదేశంలో తిరోగమన ఋతుపవన కాలం ఎపుడు?
A) నవంబర్ – డిసెంబర్ వరకు
B) మే మధ్య నుంచి – ఆగష్టు మధ్య వరకు
C) జూన్ మధ్య నుంచి – సెప్టెంబర్ మధ్య వరకు
D) ఏప్రిల్ – జూన్ వరకు
జవాబు:
A) నవంబర్ – డిసెంబర్ వరకు
18. కిందివానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.
A) ఉష్ణమండల ప్రాంతాలు భూమధ్యరేఖకు సమీపంలో ఉంటాయి.
B) ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది.
C) ఉష్ణోగ్రత తీవ్రత అక్షాంశాలపై ఆధారపడి ఉంటుంది.
D) భూమధ్యరేఖ నుండి ధృవాలవైపుకు వెళ్ళేకొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది.
జవాబు:
B) ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది.
19. క్రిందివానిలో భూగోళం వేడెక్కడాన్ని నియంత్రించడానికి ఒక ఉపయోగపడే చర్య
A) చెట్లు పెంచడం
B) సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరించడం
C) ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
20. ఉష్ణోగ్రత యొక్క తీవ్రత దీనిపై ఆధారపడుతుంది
A) అక్షాంశము
B) రేఖాంశము
C) భూమి యొక్క అక్షం
D) అక్షం వంగి యుండడం
జవాబు:
A) అక్షాంశము
21. క్రింది వానిలో ‘క్లెమోగ్రాఫ్’ సూచించునది.
A) ఉష్ణోగ్రత మరియు వర్షపాతం
B) ఉష్ణోగ్రత మరియు ఆర్ధత
C) పీడనము మరియు వర్షపాతం
D) ఆర్థత మరియు పీడనము ఉంటాయి.
జవాబు:
A) ఉష్ణోగ్రత మరియు వర్షపాతం
22. నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే తీరం
A) సర్కార్ తీరం
B) కోరమాండల్ తీరం
C) ఉత్కళ తీరం
D) కెనరా తీరం
జవాబు:
B) కోరమాండల్ తీరం
23. క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిగణించండి.
1) భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు కారణం.
2) వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగు తుంది.
పై వ్యాఖ్యలలో సత్యము
A) (1) మాత్రమే
B) (2) మాత్రమే
C) (1) మరియు (2)
D) రెండింటిలో ఏవీకావు
జవాబు:
C) (1) మరియు (2)
24. పశ్చిమ విక్షోభాలు దీనికి కారణం
A) అరేబియా సముద్రంలో తుఫాన్లకు
B) ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి
C) కోరమాండల్ తీరంలో అధిక వర్షపాతానికి
D) భారతదేశ పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతల మార్పునకు
జవాబు:
B) ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి
ప్రాజెక్టు
1. మీ ప్రాంతానికి సంబంధించిన శీతోష్ణస్థితి, వాతావరణంలపై సామెతలను, నానుడిలను సేకరించండి.
– ఉదయం పూట ఇంద్రధనస్సు నావికులకు హెచ్చరిక.
– రాత్రి పూట ఇంద్రధనస్సు నావికులకు ఆహ్లాదకరం.
– పచ్చికమీద పొగమంచు ఉంటే ఇక వానరాదు.
జవాబు:
- రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతుతాయి.
- ప్రొద్దున్నే వచ్చిన వర్షం, ప్రొద్దుగూకి వచ్చిన చుట్టం తొందరగా వెళ్ళవు.
- వాన రాకడ, ప్రాణం పోకడ తెలియవు.
- ఉరుములు, మెరుపులతో గాలి ఉంటే ఇక వాన రానట్టే.
- ఉత్తరాన మెరిస్తే ఊరికే పోదు.