SCERT AP 9th Class Social Studies Guide Pdf 21th Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. కింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కులలో భాగం కాదు? (AS1)
అ) బీహార్ కార్మికులు పంజాబ్ కి వెళ్ళి అక్కడ పనిచేయడం.
ఆ) అల్పసంఖ్యాక మత వర్గం బడులు నడపటం.
ఇ) ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ, పురుషులకు ఒకే జీతం లభించటం.
ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.
జవాబు:
(ఈ) తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించటం.

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏ స్వేచ్ఛ భారత పౌరులకు లేదు? (AS1)
అ) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ.
ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.
ఇ) ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని చేపట్టే స్వేచ్ఛ.
ఈ) రాజ్యాంగ మౌళిక విలువలను వ్యతిరేకించే స్వేచ్ఛ.
జవాబు:
(ఆ) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
ప్రజాస్వామ్యం, హక్కులకు మధ్యగల సంబంధాల గురించి కింద పేర్కొన్న వాటిల్లో ఏది సరైనది? మీ ఎంపికకు కారణాలు పేర్కొనండి.
అ) ప్రజాస్వామికమైన ప్రతిదేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.
ఆ) పౌరులకు హక్కులు ఇచ్చే ప్రతి దేశం ప్రజాస్వామిక దేశం అవుతుంది.
ఇ) హక్కులు ఇవ్వటం మంచిదే, కాని ప్రజాస్వామ్యానికి అవి తప్పనిసరి కాదు. (AS1)
జవాబు:
ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది :
మనదేశం శతాబ్దాల పాటు, రాజులు, రాణుల పాలనలో ఉండగా, బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, దేశ భవిష్యత్, ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకున్నాం. ప్రజలు తమకు తాము పరిపాలించుకోవాలని నిర్ణయం మొదట తీసుకున్నాం. రాజ్యాంగంలో సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఉండాలని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పౌరులందరికీ అందించబడింది. ప్రజాస్వామ్యంలో భాగాలే పౌరులకు కల్పించే హక్కులు: ప్రజాస్వామ్య ఫలాలు అనుభవించడానికి పౌరులకు అందించే హక్కులు మార్గదర్శకాలు. ప్రజాస్వామ్యంలో ఇతరులు తమ హక్కులను అనుభవించనిచ్చే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రజాస్వామికమైన ప్రతి దేశం తన పౌరులకు హక్కులను ఇస్తుంది.

ప్రశ్న 4.
స్వాతంత్ర్యపు హక్కుకు దిగువ పేర్కొన్న పరిమితులు విధించటం సరైనదేనా? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి.
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి.
ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు.
ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది. (AS2)
జవాబు:
అ) భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి కావాలి :
స్వాతంత్ర్యపు హక్కులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్యా, భద్రత దృష్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతి లేదు. కొన్ని సరిహద్దు ప్రాంతాలలో స్వేచ్ఛా సంచారం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే క్రమంలో పౌరులు సంచరించే వీలులేదు. సరిహద్దు ప్రాంతాలలో ఇరు ప్రాంతాలు, దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎదురవ్వవచ్చు. అటువంటి సమయాలలో ప్రజలు సంచరిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురవ్వవచ్చు. కాబట్టి సరిహద్దు ప్రాంతాలను సందర్శించటానికి భారతీయ పౌరులకు అనుమతిలేదు.

ఆ) స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనటాన్ని నిషేధించారు :
స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని ప్రాంతాలలో బయటవాళ్ళు ఆస్తులు కొనవచ్చును. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, అనైతికమైన, ప్రమాదకరమైన వ్యాపారం చేపట్టరాదు. రాజ్యాంగం పౌరులకు ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం ఏ ప్రాంతంలోనైనా చేపట్టవచ్చు. అయితే చేసే వ్యాపారం వల్ల ఇతరులకు ఇబ్బంది, అన్యాయం, అక్రమాలు చోటు చేసుకోకూడదు. ఆస్తులు (కొనాలన్నా, అమ్మాలన్నా) ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం క్రయ విక్రయాలు జరగాలి.

ఇ) రాబోయే ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించింది :
భారత రాజ్యాంగం స్వాతంత్ర్యపు హక్కు ద్వారా వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలకు అనుగుణంగా వివిధ ప్రచురణలకు, భావ వ్యక్తీకరణలకు అవకాశం కల్పించింది. తమ భావాలను, అభిప్రాయాలను, వాస్తవ విషయాలను పత్రికలు, ప్రచురణలు ద్వారా పాఠక లోకానికి తెలియజేయవచ్చు. అయితే ఆ ప్రచురణలో వ్యక్తిగత దూషణలు, అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు చేయకూడదు. ఒకవేళ ప్రచురణకు పూనుకుంటే దానికి తగిన రుజువులు, సాక్ష్యాలు పొందుపరచవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
ఈ అధ్యాయం, గత అధ్యాయం చూసి రాజ్యాంగం ఇచ్చిన ఆరు ప్రాథమిక హక్కుల జాబితాను తయారుచేయండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. అణచివేతకు పాల్పడే ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఈ హక్కులు రక్షణనిస్తాయి. వీటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ హక్కులు ఉల్లంఘించ బడినప్పుడు అత్యున్నత న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చును. ప్రాథమిక హక్కులు 6. అవి :

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్ర్యపు హక్కు
  3. మత స్వాతంత్ర్యపు హక్కు
  4. పీడనాన్ని నిరోధించే హక్కు
  5. సాంస్కృతిక, విద్యావిషయక హక్కు
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 6.
కింద పేర్కొన్న వాటిల్లో ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా? అలా అయితే ఏ హక్కు లేదా హక్కులు – ఉల్లంఘింపబడుతున్నాయి? తరగతిలో మీ తోటి విద్యార్థులతో చర్చించండి. (AS1)
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషనులో ఉంచారు.
ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం.
ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారర్ సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేయటానికి పంపిస్తున్నారు.
ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
జవాబు:
అ) ఏ చట్టాన్ని అతిక్రమించారో చెప్పకుండా ఒక వ్యక్తిని నాలుగు రోజులపాటు పోలీస్ స్టేషన్లో, ఉంచారు :
చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం , హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. చట్టరక్షణ సమానంగా వర్తిస్తుంది. అయితే చట్ట అతిక్రమణ జరిగినట్లు తెలిస్తే, ఫిర్యాదులు వస్తే, వాటికి సంబంధించిన వ్యక్తులకు ముందుగా తెలియజేసి అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో ఉంచవచ్చు. కాని 24 గంటలలోపు ఆ వ్యక్తులను కోర్టులకు అప్పగించాలి. అంతేగాని నేరం రుజువు కాకుండా, 4 రోజులు పోలీసుస్టేషన్లో ఉంచడం చట్టరీత్యా నేరం. అ కారణంగా అరెస్టు చేస్తే ఆ వ్యక్తి తను ఎంచుకున్న లాయర్ ద్వారా వాదించే హక్కు ఉంది.

ఆ) నీ ఆస్తిలో కొంతభాగం తనదని పక్క వ్యక్తి పేర్కొనటం :
ప్రజాస్వామ్యం పౌరులకు ప్రాథమిక హక్కులు అందించింది. వాటిని సక్రమంగా, హుందాగా అనుభవించాలని, అవసరమైతే చట్టాలు, న్యాయస్థానాలు ద్వారా లబ్ధిపొందాలని రాజ్యాంగం తలచింది. అయితే ఏ వ్యక్తి కూడా దురాక్రమణ పూర్వకంగా, ఇతరుల ఆస్తులను, సంపదలను ఆక్రమించటానికి అవకాశం లేదు. తాత తండ్రుల నుండి పౌరులు సంపాదించిన ఆస్తులకు సంబంధించి, రిజిష్టర్డ్ ‘ దస్త్రాలు, రుజువు పత్రాలు ఉంటాయి. వాటిని కాదని ఆస్తిలో సగభాగం తనదని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరం. అటువంటి సందర్భాలలో న్యాయస్థానాలు కఠినంగా శిక్షిస్తాయి.

ఇ) మీ తల్లిదండ్రులు నిన్ను బడికి వెళ్ళనివ్వటం లేదు. నీకు ఆహారం సరిగా పెట్టలేకపోతున్నారు కాబట్టి నిన్ను అగ్గిపెట్టెల కర్మాగారంలో పని చేయటానికి పంపిస్తున్నారు.
2002లో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైంది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందించాలి. తమ పిల్లలు క్రమం తప్పకుండా బడికి హాజరు అయ్యేలా చూసే బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలు అందుకొని, పిల్లలను పెంచి పోషించి తగిన ఆహారాన్ని అందించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. 14 సం||ల లోపు బాలలను కర్మాగారాలు, గనులు, అగ్గిపెట్టెలు, టపాకాయలు, అద్దకం వంటి ప్రమాదకరమైన పనులలో పెట్టడం నేరం. అలా చేస్తే తల్లిదండ్రులకు కూడా చట్టరీత్యా శిక్షలు అమలుచేస్తారు.

ఈ) మీ తండ్రి నుంచి వారసత్వంగా నువ్వు పొందిన ఆస్తిని నీ సోదరుడు నీకు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాడు.
ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును భారత రాజ్యాంగం తొలగించింది. అయితే ఆస్తి పంపకం విషయంలో తల్లిదండ్రుల ఆస్తులకు సంబంధించి, రుజువు పత్రాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి, పెద్ద మనుషుల ఒప్పందాలు చాలా ముఖ్యం. తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఆస్తిని నీ సోదరుడు ఇవ్వటానికి నిరాకరిస్తే, న్యాయస్థానాలను ఆశ్రయించి, వాటి ద్వారా వారికి రావలసిన ఆస్తి వాటాను పొందవచ్చును.

ప్రశ్న 7.
మీరు ఒక న్యాయవాది అనుకోండి. కొంతమంది ప్రజలు దిగువ పేర్కొన్న విన్నపంతో మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళ తరఫున మీరు ఏవిధంగా వాదిస్తారు?
“ఎగువన ఉన్న కర్మాగారాల వల్ల మా ప్రాంతంలోని నదీజలాలు బాగా కలుషితం అవుతున్నాయి. మాకు మంచినీళ్ళు ఈ నది నుంచే వస్తాయి. ఈ నీళ్ళు కలుషితం కావటం వల్ల మా ఊరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మేం ప్రభుత్వానికి ఫిర్యాదు . చేశాం. కాని వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.” (AS4)
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా సుఖంగా నివసించటానికి, ఆనందంగా బ్రతకడానికి, స్థిరపడడానికి హక్కుంది. తను జీవనం సాగించే ప్రదేశంలో తనకు నష్టం కలిగించే చర్యలు, అపాయం, హానికరం కలిగించే కార్యక్రమాలు ఎవరూ చేపట్టకూడదు. కర్మాగారాలు విడిచే హానికరమైన వ్యర్థాలు ద్వారా నదీజలాలు కలుషితమయ్యి, ప్రమాదకరమైన జబ్బులు, ప్రాణాపాయం కలగవచ్చు. తద్వారా మనిషి జీవనం దుర్భరమౌతుంది. అటువంటి సందర్భాలలో వ్యక్తులకు న్యాయస్థానాల ద్వారా, చట్టాల ద్వారా రక్షణ కల్పించాలి.

ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కర్మాగారాల యజమానులను అరెస్టులు చేస్తారు. దానికి నివారణా చర్యలు, ప్రతి చర్యలు ద్వారా, ఈ కలుషితాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. .. అవసరమైతే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించుటకు కృషి చేస్తాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడానికి ప్రయత్నిస్తాను.

ప్రశ్న 8.
“బిరుదుల రద్దు” అన్న శీర్షిక కింద ఉన్న వాక్యాలను చదివి ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి.
ఈ బహుమతులు పొందిన వ్యక్తి దానిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. ఎందుకు? (AS2)
జవాబు:
రాచరిక వర్గాన్ని, బూర్జువాలను ఇష్టమొచ్చినట్లు, అసమానంగా విభజించటాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం ఎటువంటి బిరుదులు ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధం విధించింది. భారతదేశ పౌరులు ఇతర దేశాల బిరుదులను తీసుకోకూడదు. అయితే భారతదేశ పౌరులు సైనిక, పౌర పతకాలు పొందవచ్చు. భారతరత్న, పరమవీరచక్ర, పద్మవిభూషణ్ వంటి పతకాలు పొందిన వాళ్ళు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. కాబట్టి, ఇవి రాజ్యాంగ నిషేధ పరిధిలోకి రావు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 9.
మీకు తెలిసిన ఒక హక్కుల ఉల్లంఘన సందర్భాన్ని విశ్లేషించండి. (AS6)
జవాబు:
రాజ్యాంగం మనకు అందించిన అద్భుతమైన గొప్ప అవకాశం ప్రాథమిక హక్కుల కల్పన. అయితే ఇటీవల సమానత్వపు హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం (అంటరానితనాన్ని) రాజ్యాంగం నిర్ద్వంద్వంగా రద్దు పరిచింది. ఎవరైనా అస్పృశ్యతను పాటిస్తే నేరం అవుతుంది. అందుకు పాల్పడిన వాళ్లు చట్టరీత్యా శిక్షార్హులు. జైలుశిక్ష కూడా పడుతుంది. కాని ఇటీవల గ్రామీణ ప్రాంతాలలో అంటరానితనం కొన్ని సందర్భాలలో మేం గమనిస్తున్నాం. గ్రామాలలో టీక్లబ్ వద్ద రెండు గ్లాసుల పద్ధతి అమలులో ఉంది. అంతేకాకుండా హరిజన కాలనీలు, గిరిజన కాలనీలని గ్రామాలకు దూరంగా ఇండ్లను కడుతున్నారు. – అదే విధంగా స్వాతంత్రపు హక్కులో భాగంగా జీవించే హక్కు ముఖ్యమైనది. జీవించే హక్కులో 2002లో విద్యాహక్కు కూడా భాగమైంది. దీని ప్రకారం 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. కాని ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ, అధిక ఫీజులు, భరించలేని శిక్షలు, ప్రభుత్వ సూచనలు పట్టించుకోని యాజమాన్యం, అధిక ఒత్తిడితో బాల్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా నేను హక్కుల ఉల్లంఘనలను గమనిస్తున్నాను.

9th Class Social Studies 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు InText Questions and Answers

9th Class Social Textbook Page No.255

ప్రశ్న 1.
గత సంవత్సరం మీరు చదివిన రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన కొన్ని అంశాలను రాయండి.
జవాబు:
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి. ఈ విలువలు భారత రాజ్యాంగ “పీఠిక”లో పొందుపరిచి ఉన్నాయి. రాజ్యాంగ ఉద్దేశాలను, మౌళిక సూత్రాలను ఈ పీఠిక తెలియజేస్తుంది. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేం ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం.”

9th Class Social Textbook Page No.259

ప్రశ్న 2.
ఏ రకమైన సమానత్వపు హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తోంది? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
భారత రాజ్యాంగం సమానత్వానికి హక్కు ఇస్తోంది. ఇందులో ఉన్న ముఖ్యమైన హక్కులు :

1. చట్టరక్షణలో సమానత్వం : ఉదా : చట్టరక్షణ సమానంగా లభిస్తుంది. భారతీయ పౌరుల కులం, వర్ణం, లింగ, మతం, హోదా వంటి వాటికి ప్రాధాన్యత లేదు. వివక్షత చూపరాదు. తప్పు చేస్తే ప్రధానమంత్రి అయినా శిక్షార్హుడే.

2. సామాజిక సమానత్వం : ఉదా : పౌరులు, దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు మరియు ప్రభుత్వం అందించు సదుపాయాలు ఉపయోగించుకోవడానికి అడ్డులేదు.

3. అవకాశాలలో సమానత్వం : ఉదా : మతం, జాతి, కులం, లింగ, వారసత్వం, జన్మస్థానం, నివాస స్థానం కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కాకూడదు. వివక్షతకు గురి కాకూడదు.

4. అస్పృశ్యత నిషేధం : ఉదా : అంటరానివాళ్ళుగా ఎవరినీ పరిగణించరాదు.

5. బిరుదులు రద్దు : ఉదా : రాచరికపు బిరుదులను రాజ్యాంగం నిషేధించింది.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 3.
సమానత్వపు ప్రాథమిక హక్కును కింద పేర్కొన్నవి ఉల్లంఘిస్తున్నాయేమో చర్చించండి. ఇలా చేయటం రాజ్యాంగ రీత్యా సరైనదో, కాదో చర్చించండి.
– వీధిలోని నల్లా (కుళాయి) నుండి నీళ్ళు పట్టుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి కుండ తనక కుండకు తగిలిందని ఒక వ్యక్తి గొడవ పెట్టుకున్నాడు.
– కొన్ని ప్రత్యేక కులాలకు చెందిన వారనే నెపంతో కొందరు పిల్లలను పాఠశాలల్లో మంచినీళ్లు ఇతరులకు పోయనివ్వరు.
– కొన్ని వర్గాల ప్రజలను ఊరిలో కాకుండా ఊరిబయట మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు.
– ప్రార్థనా స్థలాలకు వెళితే తమను అవమానిస్తారనీ, లేదా కొడతారనీ చాలా సమూహాల ప్రజలు అక్కడకు వెళ్ళరు.
జవాబు:
సమానత్వపు ప్రాథమిక హక్కులో భాగంగా అస్పృశ్యత నిషేధం పొందుపరిచారు. ఏ రూపంలోనైనా అంటరాని తనాన్ని రాజ్యాంగం రద్దు పరిచింది. అస్పృశ్యతను ఎవరైనా పాటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులు. వారికి జైలు శిక్ష కూడా పడవచ్చు. వీధులలో పబ్లిక్ కుళాయిలలో కులమతాలకు అతీతంగా నీటిని పొందవచ్చు. అక్కడ కులం ఆధారంగా వివక్షత చూపిస్తే, ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా నేరం. చాలా గ్రామాలలో కొన్ని వర్గాల ప్రజలను అంటరాని వాళ్ళుగా, తక్కువ కులాల వారిగా పరిగణించి, ఊరిలోకి రానీయకపోయినా, ఊరి బయట బహిష్కరణకు గురిచేసినా తీవ్ర శిక్షకు గురౌతారు. అంతేకాకుండా మన రాజ్యాంగం లౌకికతత్వానికి ప్రాధాన్యతనిస్తూ, అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తూ, అన్ని మతాలను గౌరవిస్తుంది. కాని కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేవాలయాలకు కొంతమందిని అనుమతించకపోవడం, ప్రవేశం నిషేధించడం చట్టరీత్యా నేరం. అటువంటి సంఘటనలు జరిగినచో వారు ఫిర్యాదు చేస్తే దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది.

ప్రశ్న 4.
రాజ్యాంగంలో సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే ఏమవుతుంది? చర్చించండి.
జవాబు:
రాజ్యాంగం ద్వారా సమానత్వపు ప్రాథమిక హక్కు లేకపోతే సమన్యాయపాలన దెబ్బతింటుంది. చట్టరక్షణ సమానంగా లభించదు. అస్పృశ్యత అధికమౌతుంది. సంపన్నులు, మేధావులే ఉన్నత ఉద్యోగాలు పొందుతారు. అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వారికి అవకాశాలు అందవు. దుకాణాలు, రెస్టారెంట్లు, బావులు, చెరువులు, రహదారులు, ప్రభుత్వ సదుపాయాలు అందరికీ అందవు. సామాజిక సాంప్రదాయం దెబ్బతింటుంది. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వెనుకబడినవారు అణగదొక్కబడతారు.

9th Class Social Textbook Page No.261

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో ఎటువంటి సంఘాలు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో మహిళా, డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వైద్య సంఘాలు, వ్యాపార సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు ఉన్నాయి.

ప్రశ్న 6.
కార్మిక సంఘాలు ఎందుకు ఏర్పడతాయి? అవి ఎదుర్కొనే సమస్యలు ఏమిటి?
జవాబు:
కర్మాగారాలలో కార్మిక సంఘాలు, తమ కోరికల సాధన కొరకు సంఘాలుగా ఏర్పడతాయి. తమ కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాల కొరకు, అధిక మొత్తంలో జీతాలు కొరకు, వసతి సదుపాయాలు కొరకు, ప్రమాదాల కాలంలో జరిగిన నష్టాలకు పరిహారం గూర్చి, కార్మిక సంఘాలు, కర్మాగారాల యజమానుల నుండి లబ్ది పొందడానికి సంఘాల అవసరం ఉంది.

సంఘాలు ఎదుర్కొనే సమస్యలు :

  1. లాకౌట్లు
  2. తక్కువ సదుపాయాలు
  3. ఎక్కువ పనిగంటలు
  4. ఆరోగ్య సమస్యలు
  5. ఆలస్య జీతాలు
  6. యజమానుల నిరంకుశత్వాలు
  7. ఏకపక్ష నిర్ణయాలు
  8. శాశ్వతం కాని ఉద్యోగాలు
  9. నిరంతరం ఇబ్బందులు

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 7.
ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు స్థిరపడాలనుకుంటారు?
జవాబు:

  1. రోజురోజుకూ అంతరించిపోతున్న కులవృత్తులు.
  2. లాభసాటిగా లేని వ్యవసాయ పనులు.
  3. ఉపాధి, అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాలు.
  4. గ్రామాలలో లభించే తక్కువ కూలిరేట్లు.
  5. నిరంతరం కరువు కాటకాలు, తుపానులు, వరద బీభత్సాలు.
  6. పట్టణాలలో, నగరాలలో విరివిగా లభించే ఉద్యోగాలు.
  7. తక్కువ పని గంటలు, ఎక్కువ జీతాలు.
  8. నగరాలు, ఇతర ప్రాంతాలలో మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వలన ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారు.

ప్రశ్న 8.
పట్టణంలో పని దొరికి, ఉండటానికి సరైన ఇల్లు లేని వాళ్ళపట్ల ప్రభుత్వ బాధ్యత ఏమిటి?
జవాబు:
దేశంలో ప్రజలు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ నగరాలలో నివసిస్తున్నప్పటికీ వారికి సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత. ఎప్పటికప్పుడు వివిధ ఆర్థిక, గణాంక సర్వేల ద్వారా ప్రజలకు అందుతున్న సదుపాయాలు, గృహవసతి, ఆరోగ్యం , విద్య సదుపాయాలు అందించవలసి ఉంది. వివిధ కారణాలతో ఉపాధి అవకాశాలకై పట్టణాలకు వచ్చి స్థిరపడిన వారికి ఇళ్ళు, రాజీవ్ గృహకల్పన ద్వారా వసతి సదుపాయాలు కల్పించాలి. దగ్గరలో గల ప్రభుత్వ అధికారుల ద్వారా వారికి చేయూతనందించాలి.

9th Class Social Textbook Page No.262

ప్రశ్న 9.
కింద పేర్కొన్న వాటిల్లో వాక్ స్వాతంత్ర్య నియంత్రణను దృష్టియందుంచుకొని చర్చ నిర్వహించండి.
1. ఒక కులం ప్రజల భావనలను గాయపరిచే ఉద్దేశంతో ఒక పుస్తకం రాశారు.
2. ప్రతి సినిమాకి విడుదలకు ముందు సెన్సారు బోర్డు నుంచి ఆమోదం పొందాలి.
3. రాత్రి 11 గంటలు దాటిన తరువాత పండుగలు, ప్రార్థనల రోజులలో ఎవరూ మైకు వాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది.
జవాబు:
వాక్ స్వాతంత్ర్యం వల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి వివిధ రూపాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. వాక్ స్వాతంత్ర్యం పరిమితమైన హక్కు. శాంతిభద్రతలు, ప్రభుత్వ భద్రత, నైతికత, ప్రజాహితం వంటి కారణాలతో ఈ హక్కుకు పరిమితులున్నాయి. వాక్ స్వాతంత్ర్యం ద్వారా ఒక కులాన్ని గాని, మతాన్ని గాని కించపరిచే వ్యాఖ్యలు, ప్రచురణలు చేయకూడదు. ఒకరి కుల సాంప్రదాయాలను, ఆచారాలను వక్రీకరించకూడదు. ఒకరి కుల మనోభావాలను కించపరచకూడదు. అవమాన పరచకూడదు మరియు ప్రజల శాంతిభద్రతలకు, వారి సుఖజీవనానికి ఆటంకం కలిగించకూడదు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి, సమావేశాలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు న్యాయస్థానాలు అనుమతి ఉంటుంది. మన వాక్ స్వాతంత్ర్యం మిగతా వారికి ఇబ్బందుల నుండి రక్షణకు కాల నిర్ణయం విధించారు.

సినిమాలు ప్రజలను, సమాజాన్ని, సక్రమ మార్గంలో నడిపించడానికి మార్గదర్శకాలు. “సినిమా” అనేది అనుకరణ మాధ్యమం. ఈ సినిమా మాధ్యమం ద్వారా, పిల్లలను, మహిళలను, ఉద్యోగస్థులను, కుల, మతాలను కించపరిచే సన్నివేశాలు, చిత్రాలు, పాటలు, మాటలు ఉండకూడదు. దాని ఫలితంగా సమాజంలో చెడు ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని, అశ్లీల దృశ్యాలు, బూతు సాహిత్యం ద్వంద్వార్థ పదాలను సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ముందు పరిశీలించి, సెన్సార్ చేసిన పిమ్మట ఆమోదిస్తూ మంజూరు పత్రం అందిస్తుంది.

ప్రశ్న 10.
ఎనిమిదవ తరగతిలో చదివిన పోలీసులు, న్యాయస్థానాల పాత్రలలో తేడాలు ఏమిటి?
జవాబు:
శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధానపాత్ర. నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ చేయడం పోలీసుల కర్తవ్యం. రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్ష్యులను విచారించి విషయాలు నమోదు చేస్తారు. ముందుగా తొలి సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్) తయారుచేస్తారు. సాక్ష్యాలు దోషి అని రుజువు చేస్తుంటే పోలీసులు న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయాలి.

నిందితుడు దోషో, కాదో అని వాదోపవాదాలు సాక్షుల ద్వారా నిర్ధారించుకొని, దోషి అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు, లేదా న్యాయవర్గం విధిస్తుంది. హత్య, లంచగొండి తనం, దోపిడీ వంటి నేరాలు మోపబడిన వ్యక్తికి బెయిలు పోలీసులు ఇవ్వరు. బెయిల్ మంజూరు చేయాలో వద్దా నిర్ధారించేది న్యాయమూర్తి. ఒకవేళ బెయిలు మంజూరు చేస్తే కొన్ని హామీలు సమర్పించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో ఏ ఏ రకాల పాఠశాలలు ఉన్నాయి? ఇన్ని రకాల పాఠశాలలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రయివేట్ పాఠశాలలు, బాలికల పాఠశాలలు, వికలాంగుల పాఠశాలలు, చెవిటి, మూగ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ముస్లిం పాఠశాలలు (ఉర్దూ), ఆంగ్ల పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వం నియమించు ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా సాధారణ, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో అనేక రకాల బిల్డింగ్లు, మధ్యాహ్న భోజన పథకాలు, ఉచితంగా బట్టలు, పుస్తకాలు అందించబడుతున్నాయి.

ప్రయివేట్ పాఠశాలలో ఉద్యోగస్తుల పిల్లలు, ఆర్థికస్ధమత గలవారు చదువుతున్నారు. ఇందులో శిక్షణ పొందని ఉపాధ్యాయులు కూడా పనిచేస్తుంటారు. వారికి ప్రభుత్వం అందించు సౌకర్యాలు ఉండవు.

బాలికలు వారి అవసరాలు, వారి జీవన విధానానికి అనుగుణంగా, ప్రత్యేక వాతావరణంలో చదువుకోవడానికిగాను బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

గిరిజన బాలబాలికల సంక్షేమం కొరకు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

చెవిటి, మూగ విద్యార్థులు, మామూలు విద్యార్థులతో కలిసి చదువుకోలేరు. కాబట్టి వారికి కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా బోధన చేయాలి. కాబట్టి చెవిటి, మూగ పాఠశాలలున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఉర్దూ పాఠశాలలున్నాయి.

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో ఈ రకమైన హక్కులు పిల్లలకు కల్పించబడుతున్నాయని నీవు భావిస్తున్నావా?
జవాబు:
మా ప్రాంతంలో 6-14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత, నిర్భంద విద్యను అందిస్తున్నారు. పిల్లల అవసరాలకు తగ్గట్లు. ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తున్నారు. క్రమం తప్పకుండా మా తల్లిదండ్రులు బడికి పంపిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, మధ్యాహ్న భోజన పథకం ద్వారా సమకూరుస్తున్నారు. ప్రమాదకరమైన పనులు చేయించటం లేదు. కర్మాగారాలు, హోటళ్ళు, బీడీ పరిశ్రమలు, అగ్గిపెట్టెల తయారీలో పిల్లలను చేర్చుకోవటం లేదు. మా ప్రాంతంలో బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి.

ప్రశ్న 13.
ఉపాధ్యాయుడి సహాయంతో రాష్ట్రంలోని కనీస వేతనాలను తెలుసుకోండి.
జవాబు:
రాష్ట్రంలో స్త్రీ, పురుషులకు, ఉద్యోగస్థులకు, వ్యవసాయ, ఉపాధి హామీ పథకం కూలీలకు వేరువేరుగా వేతనాలు అందిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో
పురుషులకు – రూ. 200 వరకు (రోజుకు) :
స్త్రీలకు – రూ. 150 వరకు (రోజుకు)
రోజువారి వ్యవసాయ కూలి (పురుషులకి) – రూ. 120 (రోజుకు)
రోజువారి కూలి (స్త్రీలకి) – రూ. 80 (రోజుకు)
తాపీ మేస్త్రీకి (ఇల్లు కట్టే సమయంలో) – రూ. 300 (రోజుకు)
సాయం చేసే స్త్రీలకు – రూ. 130
ఉపాధ్యాయులకు – రూ. 300 నుండి రూ. 2000 వరకు (రోజుకు)
వైద్యులకి (తనిఖీ రుసుం) – రూ. 100 నుండి 300 వరకు (రోజుకు)

9th Class Social Textbook Page No.263

ప్రశ్న 14.
సతీసహగమనాన్ని ఆచరించటం వల్ల ప్రాథమిక హక్కులకు ఏవిధంగా భంగం కలుగుతుంది?
జవాబు:
పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అవలంబించే హక్కు కలిగి ఉన్నారు. వ్యక్తిగా తన మత ఆచారాలను పాటించకుండా ఏ వ్యక్తినీ నిషేధించలేరు. అయితే మతం మాటున జరిగే ఘోరాలు, హత్యలను రాజ్యాంగం ప్రకారం అనుమతించరు. బలవంతంగా తమ అభిమతాలకు వ్యతిరేకంగా, ‘సతి’ సహగమనాన్ని ప్రోత్సహించడం, ‘ . మత స్వాతంత్ర్యపు హక్కుకు భంగం కలుగుతుంది. ‘సతి’ సహగమనం లౌకికవాద స్ఫూర్తికి విఘాతం. మతం పేరుతో బలవంతపు చావులను రాజ్యాంగం అనుమతించదు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 15.
ఒక వ్యక్తి అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చా?
జవాబు:
రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా తను అనుకుంటే ఏ మతమూ అవలంబించకుండా ఉండవచ్చు.

9th Class Social Textbook Page No.266

ప్రశ్న 16.
మన రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఉందా? దాని కార్యక్రమాల గురించి తెలుసుకోండి.
జవాబు:
1993లో ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులుంటారు. వీరందరినీ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. వీరిని నియమించే సమయంలో గవర్నర్ ఈ కింది వారిని సంప్రదించాలి.

  1. రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిటీకి అధ్యక్షుడు.
  2. రాష్ట్ర విధానసభ స్పీకరు
  3. రాష్ట్ర హోం మంత్రి
  4. రాష్ట్ర విధాన సభ స్పీకర్
  5. రాష్ట్ర విధాన సభ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం – 5 సం||రాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి.
మరొక సభ్యుడు మానవ హక్కుల రంగంలో నిష్ణాతుడై ఉండాలి.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికార విధానాలు :

  1. మానవ హక్కులు ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్యోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం.
  2. న్యాయస్థానాలు అనుమతితో మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరడం.
  3. జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం.
  4. మానవ హక్కుల పరిరక్షణలో రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలను, చట్టపరమైన నిబంధనలను’ నిరంతరం సమీక్షిస్తూ తగిన సూచనలివ్వడం.

ప్రశ్న 17.
మానవ హక్కులకు ఉల్లంఘనలను కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:

  1. పోలీసుల వేధింపులు
  2. ఇష్టమొచ్చినట్లు అరెస్టు చేయటం
  3. సమాచార హక్కును తిరస్కరించటం
  4. అవినీతి
  5. మహిళలపై లైంగిక వేధింపులు
  6. అత్యాచారాలు
  7. నేర విచారణలో ఆలస్యం
  8. స్త్రీ, శిశు హత్య
  9. డబ్బుకోసం కిడ్నాపింగ్
  10. మహిళలు, పిల్లలు, అట్టడుగు ప్రజల దారుణ జీవన పరిస్థితులు
  11. కుటుంబంలో మహిళల పట్ల వివక్షత
  12. ఇంటి పని చేసేవాళ్ళ పై హింస వంటివి మానవ హక్కుల ఉల్లంఘనలకు కొన్ని ఉదాహరణలు.

AP Board 9th Class Social Solutions Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

ప్రశ్న 18.
మీ ప్రాంతంలో ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిస్తే దానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఒక ఫిర్యాదు రాయండి.
జవాబు:

ఫిర్యాదు

విజయవాడ,
10 – 10 – 20xx.

సబ్జెక్టు : జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి మా ప్రాంతంలోని పోలీసుల వేధింపుల గురించి ఒక చిన్న విన్నపం.

To:
జాతీయ మానవ హక్కుల చైర్మన్,
డిల్లీ.

గౌరవనీయులైన జాతీయ మానవ హక్కుల చైర్మన్ గారికి,

అయ్యా,
మాది విజయవాడలోని లబ్బీపేట ప్రాంతం. మా ప్రాంతం నందు దినసరి కార్మికులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారికి చట్టం గురించి కాని, పోలీసుల గురించి కాని అంతగా తెలియదు.’ అయితే పోలీసులు లేనిపోని కారణాలు చెబుతూ తరచుగా మా ప్రాంతంలోని ప్రజలను బెదిరింపులతోను, వేధింపులతోను అనేక ఇబ్బందులకు గురిచేసి వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల మీరు ఈ విషయం నందు జోక్యం చేసుకుని మా ప్రాంతంలోని, ప్రజలను పోలీసుల వేధింపుల నుండి రక్షణ కల్పించవలసినదిగా ప్రార్థించుచున్నాము.

ఇట్లు
మీ విధేయుడు,
ఎం. భావసాయి,
9వ తరగతి.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఒక సీనియర్ న్యాయవాదిని మీ తరగతికి ఆహ్వానించి, ముఖాముఖి ద్వారా ఈ కింది విషయాలు తెలుసుకోండి :
– ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు
– బాలల హక్కుల ఉల్లంఘన
– ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు
– సంబంధిత ఇతర విషయాలు.
జవాబు:
ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వాటి పర్యవసానాలు :
ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి. థమిక హక్కుల ఉల్లంఘనకు గురైనప్పుడు వ్యక్తులు శిక్షార్హులు అవుతారు.

బాలల హక్కుల ఉల్లంఘన :
బాలల హక్కుల ఉల్లంఘించటం కూడా చట్టరీత్యా నేరం మరియు శిక్షార్హులు. న్యాయస్థానాలు బాలల హక్కులను పరిరక్షిస్తాయి. దానికితోడు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 2007 మార్చిలో ఏర్పాటుచేశారు.

ఈ సంస్థ 18 సం||రాల వయస్సు లోపల గల బాలలందరికి వర్తిస్తుంది.

బాలల కోసం అమలవుతున్న వివిధ రక్షణలను, సౌకర్యాలను పరిశీలించి సమీక్ష చేసి తగిన సిఫారసులు చేస్తుంది. బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, విచారించి తగిన చర్యలు చేపడుతుంది. తీవ్రవాదం, మత ఘర్షణలు, గృహహింస, లైంగిక దాడులు, వేధింపులు మొదలగు సమస్యలపై తగిన పరిష్కారాలను సూచిస్తుంది.

బాలల హక్కులకు సంబంధించిన ఒప్పందాలను, చట్టాలను, పథకాలను, కార్యక్రమాలను అధ్యయనం చేసి సమర్థవంతంగా అమలు చేయడానికి సిఫారసులు చేస్తుంది. బాలల హక్కులపైన పరిశోధన మరియు హక్కులపై అవగాహన కల్పించడానికి సెమినార్లు, చర్చావేదికలు నిర్వహిస్తుంది.

బాల నేరస్థుల జైళ్లను సందర్శించి వారికి కల్పిస్తున్న వసతులపై ప్రభుత్వానికి నివేదికలు ఇస్తుంది.

పై విధంగా బాలల హక్కులను ఒకవైపు న్యాయస్థానాలు మరోవైపు కమిషన్ కంటికి రెప్పలా కాపాడుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం పోరాడే విధానాలు :
శాంతియుతంగా, గాంధేయ మార్గంలో హక్కులకోసం .పోరాడాలి. ఏ విధమైన హింసాపూరిత వాతావరణానికి అవకాశం కల్పించరాదు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయరాదు. పౌరులు, తమ తమ విధులను పాటిస్తూనే శాంతియుత మార్గంలో న్యాయస్థానాలు ద్వారా లేదా సమస్యలను పరిష్కరించు కోవలయును.

సంబంధిత ఇతర విషయాలు :
మానవుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ న్యాయస్థానాలతో పాటు జాతీయ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పనిచేస్తున్నాయి. వీటిని 1993లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటుచేయడం జరిగింది.

జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులు ఉంటారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మను రాష్ట్రపతి నియమిస్తారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ను గవర్నర్ నియమిస్తారు.

ఈ కమిషన్లు చేసే విధులు :
మానవ హక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘనను నివారించటంలో ప్రభుత్వోద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానుగానే . లేదా ఫిర్యాదు ఆధారంగా కాని విచారణ జరపడం. న్యాయస్థానాల అనుమతితో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరటం.

జైళ్ళను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతుల కల్పనపై విచారించి అవసరమైన సూచనలివ్వడం వంటి విధులను నిర్వహించడం జరుగుతుంది.