These AP 10th Class Social Studies Important Questions 6th Lesson ప్రజలు will help students prepare well for the exams.
AP Board 10th Class Social 6th Lesson Important Questions and Answers ప్రజలు
10th Class Social 6th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ఎంత?
జవాబు:
2 లక్షలు.
2. జనాభా గణన ప్రకారం పనిచేసే వయస్సు అంటే ఎంత?
జవాబు:
15 – 59 సంవత్సరాలు.
3. నిర్ధిష్ట వైశాల్యంలో గల జనాభాను ఏమంటారు?
జవాబు:
జనసాంద్రత.
4. స్త్రీలను అసమానంగా చూడటంను ఏమంటారు?
జవాబు:
లింగ వివక్షత.
5. భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో జనగణన జరిగింది?
జవాబు:
2011.
6. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో మార్పుని ఏమంటారు?
జవాబు:
జనాభా మార్పు.
7. భారత దేశంలో లింగ వివక్షత తక్కువగా (అత్యల్పంగా) ఉన్న రాష్ట్రమేది?
జవాబు:
కేరళ.
8. జనసాంద్రతను ప్రభావితం చేసే అంశాలేవి?
జవాబు:
వైశాల్యం, జనసంఖ్య.
9. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
74.04 %.
10. ఒక దేశం యొక్క అక్షరాస్యతను లెక్కించడానికి ఏ వయస్సు పైబడిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు?
7 సంవత్సరాలు.
11. భారతదేశంలో జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగును?
జవాబు:
10 సంవత్సరాలు.
12. లింగ వివక్షతను తగ్గించడానికి దోహదపడే ప్రధాన అంశం ఏది?
జవాబు:
విద్య.
13. ఉత్తర మైదానాలలో అధిక జనసాంద్రతకు గల ఏదైనా ఒక కారణం తెల్పండి.
జవాబు:
సారవంతమైన నేలలు, అభివృద్ధి చెందిన నగరాలు, రవాణా సౌకర్యాలు మొ||వి.
14. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా జన గణన చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
1872.
15. భారతదేశంలో మొదటి సంపూర్ణ జన గణన చేపట్టిన సంవత్సరం ఏది?
జవాబు:
1881.
16. మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి దేనిని నిందిస్తుంటాము?
జవాబు:
జనాభా పెరుగుదలను.
17. దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వయో వర్గాలుగా విభజించారు?
జవాబు:
మూడు.
18. జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది ఏది?
జవాబు:
లింగ నిష్పత్తి.
19. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినపుడు జనాభా ఎంత శాతం మంది అక్షరాస్యులున్నారు?
జవాబు:
12%.
20. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
64.84%.
21. 2011 జనాభా గణన ప్రకారం స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
65.46%.
22. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత శాతం ఎంత?
జవాబు:
82.14%.
23. ఒక సంవత్సరంలో వెయ్యిమంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలియజేయునది ఏది?
జవాబు:
జననాల రేటు.
24. భారతదేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం ఎంత?
జవాబు:
2.7%.
25. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం ఎంత?
జవాబు:
1.9%.
26. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలో మీటరుకి ఎంతమంది ఉన్నారు.?
జవాబు:
382.
27. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కల రాష్ట్రమేది?
జవాబు:
ఉత్తరప్రదేశ్.
28. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కల రాష్ట్రమేది?
జవాబు:
సిక్కిం
29. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రమేది?
జవాబు:
బీహార్.
30. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రమేది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్.
31. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి గల రాష్ట్రమేది?
జవాబు:
కేరళ.
32. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రమేది?
జవాబు:
హర్యా నా.
33. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత || గల రాష్ట్రమేది?
జవాబు:
కేరళ.
34. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు జనాభా సమాచార సేకరణ, నమోదులను నిర్వహించు సంస్థ ఏది?
జవాబు:
సెన్సెస్ ఆఫ్ ఇండియా.
35. భారతదేశ జనాభా ఏ సంవత్సరం తరువాత నిరంత రాయంగా పెరుగుతుంది?
జవాబు:
1921.
36. గొప్ప విభాజక లేదా గొప్ప విస్పోటక సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పిలుస్తారు?
జవాబు:
1921.
37. ప్రతి దశాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్యను సూచించునది ఏది?
జవాబు:
జనాభా పెరుగుదల.
38. జనాభా వృద్ధి శాతాన్ని ……… శాతం అని కూడా అంటారు?
జవాబు:
వార్షిక వృద్ధి.
39. జనాభా అంశాలు ఏ ప్రక్రియల ప్రభావం వల్ల మారుతూ ఉంటాయి?
జవాబు:
జననాలు, మరణాలు, వలసలు.
40. తరువాతి కాలంనాటి జనాభా – ముందు కాలం నాటి జనాభా =?
జవాబు:
జనాభా మార్పు,
41. సాంఘిక శాస్త్రంలో దేని గురించిన అధ్యయనం చాలా కీలకమైన అంశం?
జవాబు:
జనాభా.
42. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంత మంది స్త్రీలు కలరు?
జవాబు:
940.
43. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో ఎంత?
జవాబు:
1210 (121 కోట్లు),
44. పిల్లలు అని సహజంగా ఏ వయస్సు వారిని పేర్కొంటారు?
జవాబు:
0 – 15 సంవత్సరములు.
45. కేరళ రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు, ఎంత మంది స్త్రీలు కలరు?
జవాబు:
1040.
46. అమెరికాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు, ఎంత మంది స్త్రీలు కలరు?
జవాబు:
1050.
47. 2011 లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత?
జవాబు:
17.
48. 2011 లెక్కల ప్రకారం బీహార్ జనసాంద్రత ఎంత?
జవాబు:
1106.
49. (జననాల సంఖ్య + వలస వచ్చిన వారి సంఖ్య) – (మరణాల సంఖ్య + వలస వెళ్ళినవారి సంఖ్య) = ?
జవాబు:
ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు,
50. “ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి, ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను” ఏమంటారు?
జవాబు:
ఫెర్టిలిటీ శాతం
51. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష జనాభా ఎంత?
జవాబు:
62,37,24,248
52. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ జనాభా ఎంత?
జవాబు:
58,64,69,174.
53. జనాభా ఎక్కువై ……. తక్కువ అవ్వటం వల్ల ఇతరులు ప్రయోజనం పొందలేకపోతున్నారు.
జవాబు:
వనరులు.
54. భారతదేశంలో ప్రతి వంద మంది మగపిల్లలకు ఎంత మంది ఆడపిల్లలు పుడుతున్నారు?
జవాబు:
103.
55. ఏ సంవత్సరం నుంచి జననాల శాతం క్రమేపీ తగ్గుతుంది?
జవాబు:
1981.
56. జనాభా ఆధారంగా ముంబయి, ఢిల్లీ, కోలకతా నగరాలను అవరోహణ క్రమంలో రాయండి?
జవాబు:
ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా.
57. జనసాంద్రత ఆధారంగా శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను అవరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం.
58. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లా జనాభా జనసాంద్రత ఎంత?
జ. 192. 59. కింది వానిని సరిగా జతపరచండి.
i) 2001లో అక్షరాస్యత శాతం ( ) a) 64.84
ii) 2011లో అక్షరాస్యత శాతం ( ) b) 74.0410 63.
iii) 2011లో పురుష అక్షరాస్యత శాతం ( ) c) 82.14%
iv) 2011లో స్త్రీ అక్షరాస్యత శాతం ( ) d) 65.46%
జవాబు:
i-a, ii – b, ill – c, iv.de
60. జనాభా సంఖ్య, విస్తరణ అంశాలు వంటివి నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే ఈ క్రింది వానిలో ఏ ప్రక్రియ ప్రభావం వల్ల జనాభా అంశాలు మారవు?
జననాలు, మరణాలు, జన సాంద్రత, వలసలు.
జవాబు:
జనసాంద్రత.
61. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రము హర్యానా.
ii) అత్యధిక జన సాంద్రత గల రాష్ట్రము బీహార్.
పై వానిలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు.
జవాబు:
C (i) & (ii)
62. క్రింది వానిని సరిగా జతపరచండి.
1) అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ( ) a) సిక్కిం
ii) అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ( ) b) ఉత్తరప్రదేశ్
iii) అత్యధిక గల రాష్ట్రం ( ) c) అరుణాచల్ ప్రదేశ్
iv) అత్యల్ప జనాభా గల రాష్ట్రం ( ) d) బీహార్,
జవాబు:
i-d, ii-c, iii-b, iv-a
63. ఇవ్వబడిన రేఖాచిత్రంను పరిశీలించి ప్రశ్నకు సమాధానము రాయండి.
ప్ర. భారతదేశ ఫెర్టిలిటీ రేటు ధోరణి ఎలా ఉంది?
జవాబు:
తగ్గుతూ ఉంది.
10th Class Social 6th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
లింగ నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు?
జవాబు:
ప్రతి 1000 మంది పురుష జనాభాకు ఉండే స్త్రీల జనాభా ఆధారంగా లింగ నిష్పత్తిని లెక్కిస్తారు.
ప్రశ్న 2.
మన దేశంలో గత దశాబ్ద కాలంలో మరణాల శాతం తగ్గడానికి గల ప్రధాన కారణమేమిటి?
జవాబు:
- మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించడం వలన
- వైద్య విధానములో ఆధునిక సౌకర్యాల వినియోగం వలన
- విద్య మరియు సెన్సు మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రజలు తమచుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుని వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచుకుంటున్నారు.
ప్రశ్న 3.
శ్రామిక జనాభా అని ఎవరిని పిలుస్తారు?
జవాబు:
15 నుండి 39 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు.
ప్రశ్న 4.
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే దాని అర్థం ఏమిటి ?
జవాబు:
ప్రతి మహిళ సగటున ఇద్దరు పిల్లలకు జన్మనిస్తోందని అర్థం.
→ క్రింది బార్ గ్రాఫ్ ను పరిశీలించి 5, 6, 7, 8 ప్రశ్నలకు సమాధానములు రాయుము.
ప్రశ్న 5.
పై గ్రాఫ్ దీని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పై గ్రాఫ్ భారతదేశ జనాభా : స్త్రీ, పురుష నిష్పత్తి (1951-2011) గురించి తెలియచేస్తుంది.
ప్రశ్న 6.
1991 సంవత్సరంతో 2011 సంవత్సరంను పోల్చినపుడు లింగ నిష్పత్తిలో మార్పు దేనిని సూచిస్తుంది?
జవాబు:
స్త్రీ, పురుష నిష్పత్తిలో పెరుగుదల (929 నుంచి 940)ను సూచిస్తుంది.
ప్రశ్న 7.
లింగ నిష్పత్తి అంటే ఏమిటి?
జవాబు:
ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియచేసేది లింగ నిష్పత్తి.
ప్రశ్న 8.
భారతదేశంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి?
జవాబు:
ఎ) లింగ వివక్షత
బి) నిరక్షరాస్యత
సి) వైద్య సౌకర్యాల లేమి
డి) పోషకాహారం ఇవ్వకపోవడం
ఇ) తల్లిదండ్రుల వైఖరి
ప్రశ్న 9.
2011 జనాభా గణన ప్రకారం దేశ జనాభా సుమారు 121 కోట్లకు చేరింది. దానికి గల రెండు కారణాలను తెల్పండి.
జవాబు:
- బాల్య వివాహాలు
- నిరక్షరాస్యత
- మూఢ నమ్మకాలు
- వైద్యశాస్త్రంలో అభివృద్ధి
ప్రశ్న 10.
జనాభా పెరుగుదల నియంత్రణకు రెండు నినాదాలు తయారుచేయండి.
జవాబు:
జనాభా పెరుగుదల నియంత్రణకు నినాదాలు :
- ఒక్కరు ముద్దు – ఇద్దరు వద్దు
- అధిక జనాభా – అనర్థాలకు హేతువు
- జనాభాను నియంత్రించండి – ప్రకృతిని ఆస్వాదించండి.
క్రింది పట్టికను పరిశీలించి 11, 12 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
జనగణన-2011, కేరళ-బీహార్ అక్షరాస్యతా రేటుకు సంబంధించిన దత్తాంశం
ప్రశ్న 11.
పై పట్టిక దేని గురించి తెలుపుతోంది?
జవాబు:
పై పట్టిక జనగణన 2011 ప్రకారం కేరళ – బీహార్ అక్షరాస్యతా రేటుకు సంబంధించిన దత్తాంశం గురించి తెలుపుతుంది.
ప్రశ్న 12.
స్త్రీలలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉండడానికి గల ఒక కారణము పేర్కొనుము.
జవాబు:
- సాంప్రదాయాలు పాటించడం
- బాలికల విద్యకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం
ప్రశ్న 13.
జనాభా మార్పుకు దోహదపడే ప్రక్రియలు ఏవి?
జవాబు:
జనాభా మార్పుకు దోహదపడే ప్రక్రియలు :
- జననాలు
- మరణాలు
- వలసలు
ప్రశ్న 14.
దిగువ గ్రాఫ్ ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానం వ్రాయండి.
a) ఏ రాష్ట్రంలో ఎక్కువ జనసాంద్రత ఉంది?
b) అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత ఎందుకు తక్కువగా ఉంది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత తక్కువగా ఉండటానికి గల కారణం : అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగం కొండలు, రాళ్ళతో ఉండడం.
ప్రశ్న 15.
సూచన : ఇవ్వబడిన గ్రాఫును పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
a) 2011లో నమోదయిన ఫెర్టిలిటీ రేటు ఎంత?
జవాబు:
2011లో నమోదయిన ఫెర్టిలిటీ రేటు – 2.7.
b) 1961-2011 మధ్య కాలంలో ఫెర్టిలిటీ రేటుకు సంబంధించి మీరు గమనించిన ధోరణి (Trend) ను తెల్పండి.
జవాబు:
1961-2011 మధ్య కాలంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతుంది.
ప్రశ్న 16.
“మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికి జనాభా పెరుగుదలనే నిందిస్తూ ఉంటాము.” – వ్యాఖ్యానించండి.
జవాబు:
- అధిక జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
- ఆహార, స్థల, భూమి, వృత్తి (ఉద్యోగ, ఉపాధి) అవసరాలను తీర్చడం కష్టతరమవుతుంది.
- విద్య, ఆరోగ్య మొదలైన అవసరమైన సదుపాయాల కల్పన కష్టతరం అవుతాయి. వీటన్నింటికి కారణం అధిక జనాభానే.
ప్రశ్న 17.
అభివృద్ధి అంచులలో నెట్టివేయబడ్డవారు అంటే ఎవరు?
జవాబు:
అభివృద్ధికి నోచుకోని వారిని అంచులకు నెట్టివేయబడ్డవారు అంటారు.
ప్రశ్న 18.
మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సాధారణంగా ఎవరిని నిందిస్తాం?
జవాబు:
మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సాధారణంగా జనాభా పెరుగుదలను నిందిస్తాం.
ప్రశ్న 19.
భారతదేశంలో జనగణనను ఎవరు నిర్వహిస్తారు?
జవాబు:
సెన్సెస్ ఆఫ్ ఇండియా అనే కేంద్రప్రభుత్వ సంస్థ జన గణన, సేకరణ, నమోదు, విశ్లేషణ మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ప్రశ్న 20.
అమెరికాలో పురుష : స్త్రీ నిష్పత్తి ఎంత?
జవాబు:
అమెరికాలో పురుష : స్త్రీ నిష్పత్తి 1000 : 1050.
ప్రశ్న 21.
భారతదేశ అక్షరాస్యత ఎంత?
జవాబు:
భారతదేశ అక్షరాస్యత 74.04%.
పురుషుల అక్షరాస్యత 82.14%, స్త్రీ అక్షరాస్యత 66.46%.
ప్రశ్న 22.
జనాభా మార్పును ప్రభావితం చేసే అంశాలు ఏవి?
జవాబు:
జనాభా మార్పును ప్రభావితం చేసే అంశాలు :
- జననాలు
- మరణాలు
- వలసలు
ప్రశ్న 23.
2011లో భారతదేశ జనాభా వృద్ధిశాతం ఎంత?
జవాబు:
2011లో భారతదేశ జనాభా వృద్ధిశాతం 17.58%.
ప్రశ్న 24.
2001-11లో భారతదేశ ఫెర్టిలిటీ రేటు?
జవాబు:
2001-11లో భారతదేశ ఫెర్టిలిటీ రేటు 2.7%.
ప్రశ్న 25.
2001-11లో ఆంధ్రప్రదేశ్ లో ఫెర్టిలిటీ రేటు.?
జవాబు:
2001-11లో ఆంధ్రప్రదేశ్ లో ఫెర్టిలిటీ రేటు 1.9%.
ప్రశ్న 26.
భారతదేశ జనసాంద్రత ఎంత?
జవాబు:
భారతదేశ జనసాంద్రత 382.
ప్రశ్న 27.
భారతదేశంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది?
జవాబు:
భారతదేశంలో అత్యధిక జనసాంద్రత పశ్చిమ బెంగాల్ (904).
ప్రశ్న 28.
భారతదేశంలో అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్ (13)
ప్రశ్న 29.
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది?
జవాబు:
కృష్ణా (519)
ప్రశ్న 30.
ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది?
జవాబు:
వై.ఎస్.ఆర్. కడప (188)
ప్రశ్న 31.
అవ్యవస్థీకృత రంగంలో గల ప్రజల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
భారతదేశంలో శ్రామికులలో 92 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. వారికి సరిగా పని దొరకదు. వాళ్ల కుటుంబాలు మినహా వారికి ఎటువంటి సామాజిక భద్రత లేదు.
ప్రశ్న 32.
జనాభా వృద్ధి శాతం అంటే ఏమిటి?
జవాబు:
జనాభా వృది శాతం చాలా ముఖ్యమైన అంశం. దీనిని సంవత్సరానికి శాతంలో లెక్కగడతారు. ఉదాహరణకు సంవత్సరానికి 2 శాతం వృద్ధి అంటే అంతకు ముందు సంవత్సరంలో ఉన్న ప్రతి వంద మందికి ఇద్దరు చొప్పున జనాభా పెరిగిందన్నమాట. ఇది చక్రవడ్డీ లాగా ఉంటుంది. దీనిని వార్షిక వృద్ధి శాతం అంటారు.
10th Class Social 6th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
కింది పేరాగ్రాఫ్ ను చదివి సమాధానం రాయండి.
జవాబు:
“ఆడపిల్ల కంటే మగ పిల్లవాడు పుట్టాలని కోరుకునే లింగవివక్షత భారతదేశంలో ఇప్పట్లో పోయే సూచనలు | కనపడుట లేదు. మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా వుంది. అనేక కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తాయి. మహిళల పట్ల ఈ వివక్షతను తగ్గించటానికి బలమైన శక్తిగా మహిళల చదువు ఉపయోగపడుతుంది.”
ప్రశ్న : లింగ నిష్పత్తిలోని తేడాల కారణంగా సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
- ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది.
- మగ పిల్లలందరికి వివాహాలు జరిగే అవకాశాలు భవిష్యత్తులో తగ్గుతాయి.
- కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది.
- లింగ వివక్షత సమాజంలో పెరిగిపోతుంది.
- సమాజంలో నేర స్వభావం పెరిగిపోతుంది.
ప్రశ్న 2.
గ్రాఫ్ ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
1) పైన ఇచ్చిన గ్రాఫ్ ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
పైన ఇచ్చిన గ్రాఫ్ 1951 నుండి 2011 వరకూ గల స్త్రీ, పురుష లింగ నిష్పత్తిని తెలియజేస్తుంది.
2) అతి తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి ఏ సంవత్సరంలో నమోదు అయినది?
జవాబు:
స్త్రీ, పురుష నిష్పత్తి మరీ తక్కువగా ఉన్న సం||ము 1991.
3) ప్రస్తుతం భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి ఎలా ఉంది?
జవాబు:
ప్రస్తుత భారతదేశ స్త్రీ, పురుష నిష్పత్తి 1000 : 940.
4) స్త్రీల సంఖ్య 935 కంటే ఎక్కువగా ఎన్ని సార్లు నమోదు అయింది?
జవాబు:
స్త్రీల సంఖ్య 935 కంటే ఎక్కువగా 3 సార్లు నమోదు అయింది.
ప్రశ్న 3.
ఈ క్రింది పేరా చదివి ప్రశ్నకు సమాధానము వ్రాయండి.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాలలో భారతదేశం ఒకటి. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 382 వ్యక్తులు. ఈ సాంద్రతలో తేడాలు పశ్చిమ బెంగాల్ లో 904 నుండి అరుణాచల్ ప్రదేశ్ లో 13 వరకు ఉన్నాయి.
Q. పశ్చిమ బెంగాల్ లో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి, అరుణాచల్ ప్రదేశ్ లో జనసాంద్రత తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సారవంతమైన గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉంది.
- ఈ ప్రాంతం వ్యవసాయానికి, పరిశ్రమలకు అనుకూలంగా ఉండటం వల్ల నివాసయోగ్యంగా ఉన్నది.
- అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ భాగం పర్వత ప్రాంతం మరియు మంచుతో కప్పబడి ఉన్నది.
- కావున అరుణాచల్ ప్రదేశ్ అధిక జనాభాకు అనుకూలంగా లేదు.
ప్రశ్న 4.
క్రింది బార్ గ్రాఫ్ ని పరిశీలించి, వాటిని విశ్లేషిస్తూ నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
- బార్ గ్రాఫ్ 1991 నుండి 2011 వరకు భారతదేశ జనాభాలో లింగ నిష్పత్తిని తెలుపుతుంది.
- 1991 లో లింగ నిష్పత్తి 929 గాను, 2001 లో 933 గాను, 2011 లో 940గాను ఉన్నది.
- 1991 లో లింగ నిష్పత్తి మరీ తక్కువగా ఉంది. 2011 లో కొంత పెరుగుదల ఉన్నది. అంటే భారతదేశంలో లింగ నిష్పత్తి ఆందోళన కలిగిస్తుంది.
- ఈ సమస్యను పరిష్కరించాలంటే
i) స్త్రీల పట్ల వివక్షత ఉండకూడదు.
ii) ఆడశిశువుల భ్రూణహత్యలను ఆపాలి.
iii) సంరక్షణ, శ్రద్ధలలో, ఆరోగ్య రక్షణలలో బాలురతో సమానమైన ప్రాధాన్యతను బాలికలకు ఇవ్వాలి.
ప్రశ్న 5.
దిగువనీయబడిన (ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) ఏ సంవత్సరంలో స్త్రీ, పురుష నిష్పత్తి అత్యధికంగా ఉంది?
జవాబు:
1951
b) భారతదేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉండటానికి గల కారణాలు పేర్కొనండి.
జవాబు:
1. లింగ వివక్ష
2. మూఢనమ్మకాలు
ప్రశ్న 6.
క్రింది సమాచారం ఆధారంగా ఒక పట్టికను తయారుచేయండి.
“ప్రతీ 1000 మంది పురుషులకుగాను ఉన్న స్త్రీల సంఖ్యను లింగ నిష్పత్తి అంటారు. ప్రతీ 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్య 1951లో 946 గాను, 1991లో 929 గాను, 2001లో 933 మరియు 2011లో 940గాను ఉన్నది.”
జవాబు:
సంవత్సరం | లింగ నిష్పత్తి |
1. 1951 | 946 |
2. 1991 | 929 |
3. 2001 | 933 |
4. 2011 | 940 |
ప్రశ్న 7.
1990 తరువాత మరణశాతం తగ్గటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
1990 తరువాత మరణశాతం తగటానికి కారణాలు :
- కరువు సాయాన్ని అందించడం.
- ఆహార ధాన్యాల తరలింపు చేయడం.
- చౌకధరల దుకాణాలు తెరవడం.
- అంటు రోగాలను నియంత్రించడం.
- మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించడం.
- శుభ్రమైన నీరు సరఫరా చేయడం.
- పోషకాహారం లభించడం.
- టీకాలు, యాంటీబయోటిక్స్ అందుబాటులోకి రావడం.
ప్రశ్న 8.
భారతదేశంలో పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉంది? దాని వలన కలిగే లాభాలేవి?
జవాబు:
పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉండటం వలన కలిగే లాభాలు :
- 15-59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు.
- వీరు వ్యవసాయరంగం, పరిశ్రమలు, సేవల రంగాలలో ఉత్పత్తికి దోహదపడతారు. దేశాభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తారు.
- దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) పెరగడంలో కీలక పాత్ర పోషించేది ఈ సమూహం వారే.
- దేశ శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారు.
- వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడతారు.
ప్రశ్న 9.
భారతదేశంలో 103 శాతం మంది ఆడపిల్లలు పుడుతున్నారు? భారతదేశంలో పురుష, స్త్రీ నిష్పత్తి 1000 : 970 ఈ – పరస్పర విరుద్ధ భావనలను ఎలా సమర్ధిస్తావు?
జవాబు:
పైన యిచ్చిన రెండు వాక్యాలు సరియైనవే. ఎందుకనగా భారతదేశంలో ప్రతి వేయిమందికి బాలురకు 103 మంది బాలికలు జన్మిస్తున్నారు. అయితే పుట్టిన ఆడపిల్లల పోషణ, సంరక్షణలలో గల వివక్షతల వలన 0-5 వయస్సులో బ్రతుకుతున్న మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది. అందుచే పుట్టిన ఆడపిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి 100 మంది బాలురకు 103 మంది బాలికలు జన్మించినా 97 మందే జీవిస్తున్నారు. అందుకే పురుష, స్త్రీ నిష్పత్తి 1000 : 970 గా ఉంది.
ప్రశ్న 10.
దేశ జనాభాను వయస్సుల వారీగా వర్గీకరించి వివరించండి.
జవాబు:
భారతదేశ జనాభాను ప్రధానంగా మూడు వయస్సు వర్గాలుగా విభజించారు. అవి :
- పిల్లలు (సాధారణంగా 15 సం||ల లోపువారు వీరి సంరక్షణను కుటుంబం చూసుకుంటుంది.
- పనిచేసే వయస్సు (15-59 సం||) సాధారణంగా సమాజంలో పనిచేసే జనాభా ఇది. వీరు పునరుత్పత్తి వయస్సులో కూడా ఉంటారు.
- వృద్ధులు (59 సం|| పైబడినవారు) వృద్ధాప్యంలో మద్దతు కోసం ఈ వయస్సువారు తమ కుటుంబాలపై ఆధారపడి ఉంటారు.
ప్రశ్న 11.
జన గణన ద్వారా ఏం తెలుసుకుంటాం?
జవాబు:
దశాబ్దానికోసారి నిర్వహించే జనాభా గణన ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. వీటిలో ముఖ్యమైనవి. దేశం మొత్తం జనాభా, జనాభా విస్తరణ, జన సాంద్రత, జనాభా పెరుగుదల ఫెర్టిలిటీ రేటు వంటి అంశాలు తెలుస్తాయి. పురుషులు, స్త్రీల సంఖ్య, లింగ నిష్పత్తి తెలుసుకుంటాం. వయస్సుల వర్గీకరణ ప్రకారం ఏ వయస్సు గ్రూపులో ఎందరెందరున్నారో తెలుస్తుంది. శారీరక లోపాలు గల వారి వివరాలు, మతాలు, కులాలు, వృత్తులు వంటి అనేకాంశాలు జన గణనలో చోటు చేసుకుంటాయి.
ప్రశ్న 12.
సమాజంలో స్త్రీ వివక్ష పోవాలంటే ఏం చేయాలి?
జవాబు:
సమాజంలో ప్రతి ఒక్కరిలో మార్పు వస్తే గానీ ఈ సమస్య పరిష్కారం కాదు. మహిళలపట్ల వివక్షతను తగ్గించటానికి బలమైన శక్తిగా మహిళల చదువు ఉపయోగపడుతుంది. మహిళల అక్షరాస్యత, విద్య వల్ల బాలికలలో మరణాల శాతం తక్కువగా ఉంటుందనేందుకు, ఆడపిల్లల ఆరోగ్యం పట్ల చూపే వివక్షత తగ్గుతుంది.
ప్రశ్న 13.
భారతదేశ జనసాంద్రత హెచ్చు తగ్గులకు కారణాలేంటి?
జవాబు:
2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకి 382 వ్యక్తులు. ఈ సాంద్రతలో తేడాలు పశ్చిమబెంగాల్ లో 904 నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో 13 వరకు ఉన్నాయి. అసోం, ద్వీపకల్ప ప్రాంత అనేక
రాష్ట్రాలలో జన సాంద్రత ఒక మాదిరిగా ఉంది. భూభాగం కొండలు, రాళ్లతో ఉండడం, ఒక మోస్తరు నుంచి తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతంకాని నేలలు ఈ ప్రాంతంలోని జన సాంద్రతను ప్రభావితం చేశాయి. ఉత్తర మైదానాలు, కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా అధిక నుంచి చాలా అధిక జనసాంద్రత ఉంది.
ప్రశ్న 14.
భారతదేశ జనాభా (1901 – 2011)
అ) ఏ సంవత్సరం నుండి భారతదేశ జనాభా నిరంతరాయంగా పెరుగుతుంది? ఎందువలన?
ఆ) 1901లో భారతదేశ జనాభా ఎంత? 2001లో జనాభా ఎంత? ఈ శతాబ్ద కాలంలో ఎన్నిరెట్లు పెరిగింది?
జవాబు:
అ) 1921 సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతోంది.
ఆ) 1901లో భారత జనాభా : 238.40 మిలియన్లు.
2001లో భారత జనాభా : 1028.74 మిలియన్లు.
శతాబ్దకాలంలో 4.3 రెట్లు పెరిగింది.
ప్రశ్న 15.
ప్రశ్న : జనాభా ఆధారంగా మనం ప్రపంచ పటాన్ని తయారుచేస్తే అది ఇలా ఉంటుంది. దీనికి, మిగిలిన పటాలకు తేడా ఏమిటి? చర్చించండి.
జవాబు:
- జనాభా ఎక్కువగా ఉన్న దేశాలను ఎక్కువ విస్తీర్ణంలో గుర్తించడం జరుగుతుంది.
- జనాభా తక్కువగా ఉన్న దేశాలు పెద్దవైనా తక్కువ విస్తీర్ణంలో గుర్తిస్తాము.
- కావున సాధారణ ప్రపంచ పటంతో పోలిస్తే జనాభా ఆధారంగా తయారుచేసిన ప్రపంచపటం వేరుగా కన్పిస్తుంది.
ప్రశ్న 16.
భారతదేశంలోని కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగనిష్పత్తి మెరుగుగా ఉంది. దీనిని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
- భారతదేశంలోని కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది.
- లింగ నిష్పత్తి మెరుగుగా ఉండటానికి ప్రజలు, ప్రభుత్వాలు చేసే కృషి ప్రశంసనీయం.
- దీని వల్ల సామాజిక మార్పు సంభవిస్తుంది.
- ఇది సంపద పంపిణీని, అధికార హోదాలను, జననరేటు తదితర అంశాలను ప్రభావితం చేస్తుంది.
ప్రశ్న 17.
అధిక జనాభా సమస్యపై కొన్ని నినాదాలు వ్రాయండి.
జవాబు:
- భూమిపై పుట్టే ప్రతి బిడ్డా ఆర్థిక నరకం సృష్టిస్తాడు – T.R. మాల్టస్.
- కుటుంబంలో ప్రతి జననం ఒక శుభఘడియ. కానీ ఈ జననాలు అధికమైతే దేశం, కుటుంబం భరిస్తుందా ? అన్నదే ప్రశ్న – మాలిని బాలసింగం.
ప్రశ్న 18.
“అధిక జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుంది” దీనిని సమర్థిస్తూ నీ సొంత మాటలలో వ్రాయుము.
జవాబు:
- జనాభా అధికంగా పెరగడాన్ని ‘జనాభా విస్ఫోటనం’ అంటాం. ఇది అనేక అనర్థాలకు దారితీస్తుంది.
- పెరిగే జనాభాకు సంబంధించి ఆహార, స్థల, భూమి, వృత్తి అవసరాలను తీర్చాల్సిరావడం వల్ల భూమిపై ఒత్తిడి, నిరుద్యోగం పెరుగుతాయి.
- అందరికీ విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి కల్పనలు కష్టతరం అవుతాయి.
- ఈ పెరుగుదల జల, వాయు, భూమి, గాలి తదితర కాలుష్యాలకు చోదకశక్తి అవుతుంది.
ప్రశ్న 19.
1) కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు ఏమిటి?
2) 100 నుండి 200 జనసాంద్రత అనగా అల్పజనసాంద్రత గల జిల్లాలేవి? కారణాలు తెలపండి.
జవాబు:
1) కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు:
ఎ) కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వలన వ్యవసాయానికి అనుకూలత.
బి) వ్యవసాయాధారిత పరిశ్రమలు వృద్ధి.
సి) వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు.
2) 100 నుంచి 200లోపు జనసాంద్రత గల జిల్లాలు : ప్రకాశం మరియు వై.ఎస్.ఆర్. కడప.
కారణాలు : భౌగోళికంగా కొండలు, గుట్టలు, నీటిపారుదల సౌకర్యాల లేమి మొ||.
10th Class Social 6th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
a) ఏ సంవత్సరంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది?
b) స్త్రీ, పురుష నిష్పత్తి అనగానేమి?
c) లింగ నిష్పత్తిలో 1951 నుండి నీవు ఎలాంటి మార్పులు గమనించావు?
d) స్త్రీల సంఖ్య తగ్గడాన్ని నివారించడానికి ఏమి చేయాలి?
జవాబు:
a) 1991వ సంవత్సరంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది.
b) జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసే నిష్పత్తే స్త్రీ, పురుష నిష్పత్తి.
c)
- 1951 నుండి 1971 వరకు స్త్రీ, పురుష నిష్పత్తి తగ్గుతూ వచ్చి, 1991 నుండి క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
1951 లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్నప్పటికిని స్త్రీ, పురుష నిష్పత్తి ఎక్కువగా ఉండటం గమనార్హం.
d)
- ప్రకృతిలో స్త్రీ, పురుషులు సమానమే అనే భావన ప్రచారం చేయాలి.
- లింగ నిర్ధారణ పరీక్షల చట్టాలను కఠినతరం చేయాలి. సక్రమ అమలుకు చర్యలు తీసుకోవాలి.
ప్రశ్న 2.
ఒక ప్రాంత జనసాంద్రత, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులకు మధ్య గల సంబంధాన్ని విశ్లేషించుము.
జవాబు:
- భూమి సహజ స్వరూపాన్ని భౌగోళిక స్వరూపం అంటాం. చదరపు కిలోమీటరుకు సగటున నివసించే ప్రజలను జనసాంద్రత అంటాం.
- బాగా పంటలు పండే ప్రాంతాలు, పారిశ్రామికవాడలైన ‘గంగా-సింధు మైదానం’ లో జనసాంద్రత ఎక్కువ.
- థార్ ఎడారి ప్రాంతం ప్రజల జీవనానికి ఏమాత్రం అనుకూలంగా లేనందున అచ్చట జనసాంద్రత అత్యల్పం.
- తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. పంటలు బాగుగా పండును. అందుచే ఈ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ.
- హిమాలయ పర్వత ప్రాంతం సుందరమైనదైనప్పటికీ ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుచే కప్పబడియుండుటచే జన జీవనానికి అనుకూలంగా ఉండదు. అందుచే ఇచ్చట జనసాంద్రత తక్కువ.
- ఈశాన్య భారతదేశం కొండలతో నిండియున్నందున జనసాంద్రత తక్కువ.
ప్రశ్న 3.
ఈ క్రింది పేరా చదివి నీ అభిప్రాయం రాయుము.
భారతదేశంలో ప్రతీ వంద మందికి 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. కానీ మగపిల్లల కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు చనిపోతున్నారు. 0-5 వయస్సులో బతికి బట్ట కట్టిన మగపిల్లల సంఖ్య కంటే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని సెన్సెస్ చెపుతోంది. ఆడపిల్లలు బతకటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ ఇలా జరుగుతోందంటే వారి పోషణ సంరక్షణలలో ఏదో వివక్ష ఉండి ఉండాలి.
జవాబు:
0-5 సంవత్సరాల వయస్సులో ఆడపిల్లలు ఎక్కువ సంఖ్యలో పుడుతున్నప్పటికి, ఎక్కువమంది ఆడపిల్లలు చనిపోతున్నారు. దీనికి గల కారణాలు:
- ఆడవాళ్ళలో ఎక్కువమంది నిరక్షరాస్యులు, వారికి ఆడపిల్లల ప్రాముఖ్యత తెలియదు.
- భారతదేశంలో పితృస్వామిక కుటుంబాలు ఎక్కువ. కావున స్త్రీలను ఆడపిల్లలకు జన్మను ఇవ్వకుండా అబార్షను చేయించడం జరుగుతుంది.
- వారి జాతిని, తెగను పెంచుకోవడానికి మగపిల్లలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది.
- తల్లిదండ్రులకు ఆదాయం పెరిగినా, వారు మాత్రం ఆడపిల్లల విషయంలో చిన్నచూపు చూస్తున్నారు.
ప్రశ్న 4.
స్త్రీ, పురుష నిష్పత్తిలో స్త్రీ నిష్పత్తి తగ్గుతూ పోతే సమాజంపై ఎలాంటి ప్రభావితం ఉంటుంది.
జవాబు:
లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, తక్కువగాని ఉంటే సామాజికంగా చాలా తేడా వస్తుంది.
ఉదా : కాలేజీల విద్యార్థుల సంఖ్య
స్త్రీ నిష్పత్తి తగ్గతూపోతే సమాజంపై పడే ప్రభావం :
- స్త్రీ లింగ నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల స్త్రీల పట్ల సమాజానికి గల వివక్షను తెలియచేస్తుంది.
- లింగ నిష్పత్తి సమాజంలోని స్త్రీ, పురుషుల మధ్య గల అసమానత్వాన్ని తెలియజేస్తుంది.
- సమాజంలో లింగనిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు స్త్రీల పై అది పురుషుల ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది.
- లింగనిష్పత్తి తక్కువగా ఉండడం వల్ల బాలికలకు చాలా చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది.
- బాలికలు చాలామంది పాఠశాలకు దూరమై ఇళ్ళలోనే పనిచేసుకుంటూ ఉంటారు. దీనివల్ల బాలికా అక్షరాస్యతా శాతం తగ్గుతుంది.
- ఈ నిష్పత్తి నేర రేటును కూడా ప్రభావితం చేస్తుంది.
- స్త్రీల సంఖ్య మరీ తక్కువగా ఉంటే సాధారణ పురుషులకు వివాహం జరగటం కష్టం అవుతుంది. అన్ని రకాలుగా ముందున్న వారినే స్త్రీలు భర్తలుగా ఎంచుకొనే అవకాశం ఉంటుంది.
- లింగ నిష్పత్తిలో అసమానతలు జననరేటును ప్రభావితం చేస్తాయి.
ప్రశ్న 5.
ఈ క్రింది గ్రాఫ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) ఏ సంవత్సరం నుండి జనాభా నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది?
b) ప్రస్తుత భారతదేశ జనాభా ఎంత?
c) ఏ దశాబ్ద కాలంలో జనాభాలో తగ్గుదల కనబడింది?
d) భారతదేశంలో జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు?
జవాబు:
a) 1931 సంవత్సరం
b) 121 కోట్లు
c) 1921 సంవత్సరం
d) 10 సంవత్సరాలు
ప్రశ్న 6.
ఈ క్రింది పట్టికను చదివి (a), (b), (C) మరియు (d) ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
భారతదేశ స్త్రీ, పురుష అక్షరాస్యత శాతము
a) 2011 సం||లో స్త్రీల అక్షరాస్యత కంటే పురుషుల అక్షరాస్యత ఎంత ఎక్కువ?
b) పై పట్టిక ఏ సమాచారాన్ని తెలుపుతుంది?
c) ఏ కాలంలో అక్షరాస్యత రేటు పెరుగుదల ఎక్కువగా ఉన్నది?
d) స్త్రీల అక్షరాస్యతను నీవు ఎలా అర్ధం చేసుకున్నావు?
జవాబు:
a) 2011 సం||లో స్త్రీల అక్షరాస్యత కంటే పురుషుల అక్షరాస్యత 16, 68% ఎక్కువ.
b) భారతదేశ స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం 1961-2011గా ఉందని పై పట్టిక తెలుపుతుంది.
c) అక్షరాస్యత రేటు పెరుగుదల ఎక్కువగా ఉన్న కాలం 1991-2001.
d) 1) పురుషుల అక్షరాస్యతతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువ.
2) 1961లో స్త్రీల అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నది. ఇది ప్రతి దశాబ్దంలో పెరుగుతూ ఉన్నది. 1991-2001 దశాబ్దంలో స్త్రీల అక్షరాస్యతా రేటు పెరుగుదల ఎక్కువగా ఉన్నది.
ప్రశ్న 7.
క్రింద ఇవ్వబడిన గ్రాఫ్ ఆధారంగా దిగువనివ్వబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
a) స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎన్ని పర్యాయములు జనగణన జరిగినది?
జవాబు:
7 సార్లు
b) ‘స్త్రీ, పురుష నిష్పత్తి’ అనగా నీవు ఏమి అర్థం చేసుకున్నావు?
జవాబు:
జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది తింగ నిష్పత్తి.
C) లింగ నిష్పత్తి తక్కువగా ఉండటానికి ఏవైనా రెండు కారణాలు తెలపండి.
జవాబు:
1) సాంప్రదాయకంగా మనది పురుషాధిక్య సమాజం కావడం.
2) స్త్రీలకు విద్య, అభివృద్ధిలో సమాన అవకాశాలు లభించకపోవడం.
d) మెరుగైన లింగ నిష్పత్తి ఏ సంవత్సరంలో నమోదు అయింది?
జవాబు:
1951
ప్రశ్న 8.
ఇచ్చిన గ్రాఫెను చదివి క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
1) ఏ సంవత్సరంలో జనాభా పెరుగుదల తగ్గింది?
జవాబు:
1921
2) ఎన్ని సంవత్సరాల కొకసారి జనగణన క్రమం తప్పకుండా చేపడతారు?
జవాబు:
10 సం||
3) స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో జనాభా పెరుగుతూనే ఉందుటకు గల కారణాలేవి?
జవాబు:
అభివృద్ధి చెందిన వైద్య సదుపాయాలు, కరవుల ప్రభావం తగ్గిపోవడం మొదలైనవి.
4) జనాభా విస్ఫోటనం వల్ల కలిగే సమస్యలేవి?
జవాబు:
పర్యావరణంపై ఒత్తిడి, నిరుద్యోగం మొదలైనవి.
ప్రశ్న 9.
క్రింది ఇవ్వబడిన సమాచారం ఆధారంగా కమ్మీ చిత్రం గీసి మీ పరిశీలనను వ్రాయండి.
పట్టిక : భారతదేశ జనాభా – స్త్రీ పురుష నిష్పత్తి
సంవత్సరం | లింగ నిష్పత్తి |
1. 1951 | 946 |
2. 1961 | 941 |
3. 1971 | 930 |
4. 1981 | 934 |
5. 1991 | 929 |
6. 2001 | 933 |
7. 2011 | 943 |
జవాబు:
పరిశీలన:
- అతి తక్కువ లింగనిష్పత్తి 1991వ సంవత్సరంలో నమోదయింది.
- అతి ఎక్కువ లింగనిష్పత్తి 1951వ సంవత్సరంలో నమోదయింది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి 943.
ప్రశ్న 10.
భారతదేశ జన గణన గూర్చి వివరింపుము.
జవాబు:
దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన అందిస్తుంది. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి, నమోదు చేయటాన్నే జనగణన అంటారు. పదేళ్లకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ పనిచేసేవాళ్లు ప్రతి ఊరు, పట్టణం, నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ల వివరాలు సేకరిస్తారు. ప్రజల వయసు, వృత్తి, ఇంటి రకం, చదువు, మతం వంటి అనేక వివరాలను జన గణన అందిస్తుంది. సెన్సెస్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సమాచార సేకరణ, నమోదులను నిర్వహిస్తుంది.
భారతదేశంలో జన గణన :
భారతదేశంలో మొదటి జన గణన 1872లో జరిగింది. అయితే మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జన గణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121,01,93,422 ఈ 121 కోట్ల జనాభాలో 62,37,24,248 మంది పురుషులు 58,64,69,174 మంది స్త్రీలు.
ప్రశ్న 11.
పై పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
1) అత్యల్ప జనసాంద్రత గల ప్రాంతాలేవి? కారణాలు తెలపండి.
జవాబు:
అత్యల్ప జనసాంద్రత గల ప్రాంతాలు : జమ్ము, కాశ్మీర్ మరియు అరుణాచల్ ప్రదేశ్. కారణం : పర్వతాలు, అడవులతో కూడిన స్వరూపాలు.
2) అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాలు ఏవి? కారణాలు తెలపండి.
జవాబు:
అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాలు : కోల్ కత, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్ మొ||. కారణం : మైదాన ప్రాంతాలు, వ్యవసాయకంగా మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం.
3) అధిక జనసాంద్రత (250 – 999) గల ప్రాంతాలు ఏవి? కారణాలు తెలపండి.
జవాబు:
అధిక జనసాంద్రత గల ప్రాంతాలు : ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ మరియు తమిళనాడు మొ||.
కారణాలు : మైదాన ప్రాంతాలు, వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం.
4) ద్వీపకల్ప పీఠభూమిలో సాధారణ జనసాంద్రత ఉండటానికి గల కారణాలు తెలపండి.
జవాబు:
ద్వీపకల్ప పీఠభూమిలో సాధారణ జనసాంద్రతకు కారణం : వ్యవసాయానికి సంపూర్ణ నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండకపోవడం.
ప్రశ్న 12.
లింగ నిష్పత్తి అనగా నేమి? జనాభాలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణాలేంటి?
జవాబు:
జనాభాలో ప్రతి వేయిమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. ఒక సమాజంలో, ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచి యిది. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడూ స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు స్త్రీలు 1951లో 946, 1961లో 941, 1971లో 930, 1981లో 934, 1991లో 929, 2001లో 933, 2011లో 940 మంది నమోదయ్యారు. ఈ గణాంకాలు సమాజంలో స్త్రీ పట్ల గల వివక్షతను వెల్లడిచేస్తున్నాయి. విద్య, పోషకాహారం, శిశు సంరక్షణ, వైద్య రంగాలలో సేవలు మగపిల్లలకందినంతగా ఆడపిల్లలకు అందడం లేదు.
ఆడపిల్ల కంటే మగపిల్లవాడు పుట్టాలనే కోరుకొనే లింగ వివక్షత భారతదేశంలో ఇప్పట్లో పోయేటట్లులేదు. మగ పిల్లల్లో కంటే ఆడపిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంది. మగపిల్లవాడు కావాలని కోరుకొనేవారు గర్భంలో ఉంది ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యకు పాల్పడుతున్నారు. వైద్య విషయంలో గల ఈ వివక్షత పెద్దయిన తరువాత కూడా కొనసాగుతుంది, అందుకే పురుషుల కంటే స్త్రీలలో మరణాల శాతం ఎక్కువని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రశ్న 13.
భారతదేశ జనగణన శ్రామిక జనాభాను ఎన్ని వర్గాలుగా విభజించింది. అవి ఏవి?
జవాబు:
15 నుండి 59 సంవత్సరాల వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. వారు పూర్తి సంవత్సరం లేదా సంవత్సరంలో కొంతభాగం పనిచేస్తారు. ఇది పని అందుబాటుపై ఆధారపడుతుంది. గృహిణులు చేసే ఇంటిపని దీంట్లో భాగం అవదు. భారత జనాభా గణ వీరిని నాలుగు భాగాలుగా వర్గీకరిస్తుంది : (1) సొంతభూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగుచేస్తున్న రైతులు, (2) ఇతరుల వ్యవసాయ భూములలో కూలికి పనిచేసే వ్యవసాయ కూలీలు, (3) గృహ సంబంధ పరిశ్రమలలోను, రైస్ మిల్లులలోను, బీడీలు చుట్టేవారిగాను, కుండలు తయారుచేయడం, బుట్టలు, బట్టలు అల్లడం, పాదరక్షలు తయారుచేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ మొదలైన చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసేవారు, (4) ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజుకూలీలు, ఇతర వృత్తుల వారు.
ప్రాజెక్టు
→జన సాంద్రతకు చెందిన కింది రెండు పటాలను, జనాభా పెరుగుదలకు సంబంధించిన రేఖా పటాన్ని చూడండి. ఈ అధ్యాయంలో మీరు జనాభాకి సంబంధించి తెలుసుకున్న వివిధ అంశాల ఆధారంగా వాటిని వివరించండి.
జవాబు:
బంగ్లాదేశ్ :
ఈ దేశంలో ఎడారులు లేదా శుష్క జనసాంద్రత గల ప్రాంతాలు లేవు. ఆగ్నేయ, నైఋతి ప్రాంతాల్లో కొద్ది ప్రాంతం మాత్రం నివాసయోగ్యం కాదు. ఈ ప్రాంతాల్లో జనసాంద్రత 1-4 మాత్రమే కలదు. గంగ, బ్రహ్మపుత్ర (పద్మానది) పరీవాహ ప్రాంతంలో జనాభా అధికంగా ఉంది. రాజధాని ఢాకా కూడా అధిక జనసాంద్రత గల ప్రాంతంలోనే ఉంది.
అల్జీరియా :
ఈ దేశం ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రాంతంలో ఉంది. అత్యధిక ప్రాంతం అత్యల్ప జనసాంద్రత (1-4) కలిగి ఉంది. రాజధాని అల్జీర్స్ పరిసర ప్రాంతాల్లో అత్యధిక జనసాంద్రత (1000+) కలదు.
మద్యధరా సముద్రతీర ప్రాంతాలు సాధారణ జనసాంద్రత (25-49) కలిగి ఉన్నాయి. సాధారణ జనసాంద్రత గల ప్రాంతాలకు ఆనుకొని కొద్ది ప్రాంతం (5-24) అల్ప జనసాంద్రత కలిగి ఉంది. మొత్తం మీద సహారా ఎడారి ప్రభావం అల్జీరియా జనాభాపై ఎక్కువగా ఉంది.
వివిధ ఖండాలలో 1990 నుండి అటవీ నష్టంపై జనాభా పెరుగుదల ప్రభావం :
జనాభా పెరుగుదల, అటవీ విస్తరణ సాధారణంగా విలోమనిష్పత్తిలో ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో 1990 నుండి అటవీ నష్టంపై జనాభా పెరుగుదల ప్రభావాన్ని పై గ్రాఫ్ తెలియజేస్తుంది. ఆఫ్రికా ఖండంలో జనాభా పెరుగుదల కంటే అటవీ నష్టం తక్కువగా ఉండటం విశేషం. ఈ ఖండంలో జనాభా పెరుగుదల 9.2 శాతం ఉంది. అటవీ నష్టం 8.8 శాతం మాత్రమే.
యూరప్లో విశేషంగా అటవీ నష్టం నామమాత్రం కాగా, జనాభా తగ్గుతుండటం దీని ప్రత్యేకత. ఉత్తర అమెరికా ఖండం వంటి అభివృద్ధి చెందిన ప్రాంతంలో కూడా జనాభా పెరుగుదల నామమాత్రంగా ఉంటే అటవీ నష్టం మాత్రం 23.5 శాతం ఉంది. ఓషియానియాలో జనాభా 13 శాతం పెరిగితే అటవీ నష్టం మాత్రం 21 శాతం ఉండటం ఆందోళన కలిగించే విషయం.
లాటిన్ అమెరికా ప్రాంతంలో మాత్రం జనాభా పెరుగుదల 35 శాతం ఉండగా అటవీ నష్టం మాత్రం 27 శాతం. కాబట్టి ఉత్తర అమెరికా, ఓషియానియా, ఆసియాలలో పెరిగిన జనాభా శాతం కంటే అటవీనష్టం ఎక్కువ.
లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలో జనాభా పెరుగుదల శాతం కంటే అటవీనష్టం శాతం తక్కువ.