Practice the AP 10th Class Social Bits with Answers 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినది ……
A) రైల్వేలు
B) ప్రభుత్వ పాఠశాల
C) చిన్న రైతు వ్యవసాయము
D) బ్యాంకులు
జవాబు:
C) చిన్న రైతు వ్యవసాయము
2. ఈ క్రింది వాటిలో ఏది అవ్యవస్థీకృత రంగానికి చెందినది కాదో గుర్తించుము.
A) భవన నిర్మాణం
B) చిన్నతరహా పరిశ్రమ
C) వ్యవసాయ కార్మికులు
D) ప్రభుత్వ రంగం
జవాబు:
D) ప్రభుత్వ రంగం
3. అందరికీ వ్యవస్థీకృత రంగంలో పని దొరకకపోవుటకు కారణం
A) పోటీ తీవ్రంగా ఉండటం
B) అవ్యవస్థీకృత రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండటం
C) వ్యవస్థీకృత రంగంలో వేతనాల రేటు ఎక్కువగా ఉండటం
D) పైవేవీ కావు
జవాబు:
A) పోటీ తీవ్రంగా ఉండటం
4. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెటు విలువను ఇది నమోదు చేస్తుంది ………
A) స్థూల జాతీయోత్పత్తి (G.D.P)
B) జాతీయ సర్వే సంస్థ (N.S.I)
C) భారత ఆహార సంస్థ (F.C.I)
D) నికర జాతీయోత్పత్తి (N.N.P)
జవాబు:
A) స్థూల జాతీయోత్పత్తి (G.D.P)
5. క్రింది వానిలో మాధ్యమిక వస్తువు కానిది
A) ఇడ్లీ
B) వడ్లు
C) ఊక
D) బియ్యం
జవాబు:
A) ఇడ్లీ
6. ఆర్థిక సంవత్సరమనగా ……
A) జూన్ 12 నుండి ఏప్రిల్ 23
B) జనవరి 1 నుండి డిసెంబర్ 31
C) జులై 1 నుండి జూన్ 30
D) ఏప్రిల్ 1 నుండి మార్చి 31
జవాబు:
D) ఏప్రిల్ 1 నుండి మార్చి 31
7. భారతదేశంలో అత్యధిక జనాభాకు ఉపాధిని అందించే రంగం?
A) ప్రాథమిక
B) ద్వితీయ
C) సేవా
D) వ్యవస్థీకృత
జవాబు:
A) ప్రాథమిక
8. దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల మరియు సేవల విలువను సూచించేది
A) H.D.I.
B) G.D.P.
C) G.N.P.
D) U.N. D.P.
జవాబు:
B) G.D.P.
9. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్న వారి శాతము ……….
A) 65
B) 75
C) 83
D) 92
జవాబు:
D) 92
10. క్రింది వారిలో వ్యవస్థీకృత రంగానికి చెందని వారు
A) తహశీల్దార్
B) కమ్మరి
C) బ్యాంక్ ఉద్యోగి
D) సాఫ్ట్వే ర్ ఇంజనీర్
జవాబు:
B) కమ్మరి
11. స్థూల దేశీయోత్పత్తి అనగా ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన ……….
A) అన్ని వస్తువుల, సేవల విలువ
B) అన్ని అంత్య వస్తువుల, సేవల విలువ
C) అన్ని మధ్యంతర వస్తువుల, సేవల విలువ
D) అన్ని మధ్యంతర, అంత్య వస్తువుల సేవల విలువ
జవాబు:
B) అన్ని అంత్య వస్తువుల, సేవల విలువ
12. GDP అనగా వీటి మొత్తం విలువ
A) అన్ని సేవలు
B) అన్ని మాధ్యమిక వస్తువులు
C) అన్ని అంతిమ వస్తు సేవలు
D) A మరియు B
జవాబు:
C) అన్ని అంతిమ వస్తు సేవలు
13. క్రింది వారిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినవారు?
A) బ్యాంకు ఉద్యోగులు
B) ప్రభుత్వ ఉపాధ్యాయులు
C) వ్యవసాయ కూలీలు
D) రైల్వే ఉద్యోగులు
జవాబు:
C) వ్యవసాయ కూలీలు
14. దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తు సేవల విలువ
A) GDP
B) NDP
C) GNP
D) NNP
జవాబు:
A) GDP
15. భారతదేశంలో సేవా రంగమునకు సంబంధించిన వ్యాఖ్యలలో సత్యము.
A) సేవా రంగం అభివృద్ధి చెందుతుండగా ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి.
B) సేవా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటి ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు.
C) సేవా రంగం ఉన్నత విద్యావంతులకు మాత్రమే ఉపాధిని కల్పిస్తున్నది.
D) G.D.P. లో సేవా రంగం యొక్క వాటా చాలా తక్కువగా ఉంది.
జవాబు:
B) సేవా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటి ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు.
16. ప్రాథమిక రంగంలో లేని అంశం
A) వ్యవసాయం
B) అడవులు
C) రవాణా
D) గనుల తవ్వకం
జవాబు:
C) రవాణా
17. ఈ క్రింది వానిలో ఏది స్థూల దేశీయోత్పత్తి గణనలో పరిగణనలోకి తీసుకొనబడడం లేదు?
A) పోస్టుమేన్ సేవలు
B) మహిళ చేసే ఇంటిపనుల సేవలు
C) డాక్టర్ సేవలు
D) ఉపాధ్యాయుల సేవలు
జవాబు:
B) మహిళ చేసే ఇంటిపనుల సేవలు
18. వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది
A) వేతనంతో కూడిన సెలవు
B) ఆరోగ్య సౌకర్యాలు
C) ఉద్యోగ భద్రత లేకపోవడం
D) నిర్ణీత పనిగంటలు
జవాబు:
C) ఉద్యోగ భద్రత లేకపోవడం
19. 1972 నుండి స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం యొక్క వాటా క్రమేణా తగ్గుతున్నది.
A) తృతీయ
B) పరిశ్రమ
C) వ్యవసాయం
D) సేవా
జవాబు:
C) వ్యవసాయం
20. ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు.
A) నిర్ధారిత పనిగంటలు ఉంటాయి.
B) శ్రమ దోపిడి ఉంటుంది.
C) నిరారిత జీతాలు ఉంటాయి.
D) వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి.
జవాబు:
B) శ్రమ దోపిడి ఉంటుంది.
21. క్రింది వానిలో ఆర్థిక కార్యకలాపాన్ని గుర్తించండి.
A) శాంతి తన కుటుంబం కోసం వంట చేయడం
B) శాంతి తన ఇంటి అవసరాల కోసం కూరగాయలు పండించడం
C) శాంతి కూరగాయలను పండించి మార్కెట్ నందు అమ్ముకుంటుంది
D) శాంతి తన కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తుంది
జవాబు:
C) శాంతి కూరగాయలను పండించి మార్కెట్ నందు అమ్ముకుంటుంది