Practice the AP 10th Class Social Bits with Answers 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. టెలికాం రంగ విప్లవాన్ని తీసుకువచ్చినవారు
A) ఇందిరా గాంధీ
B) పి.వి. నరసింహారావు
C) ఎ.బి. వాజ్ పాయ్
D) రాజీవ్ గాంధీ
జవాబు:
D) రాజీవ్ గాంధీ

2. భారతదేశంలో అమలులో వున్న ప్రభుత్వ విధానం …….
A) అధ్యక్ష తరహా విధానం
B) రాజరికం
C) కేంద్ర విధానం
D) పార్లమెంటరీ విధానం
జవాబు:
D) పార్లమెంటరీ విధానం

AP 10th Class Social Bits Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

3. ఈ క్రింది వాక్యాలను చూడండి.
1) ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష తరువాత 1952 అక్టోబరులో చనిపోయాడు.
2) యన్.టి. రామారావు 1982లో తన 60వ పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ (తెదేపా) ని స్థాపించాడు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అతడు చెప్పాడు.
A) 1 మరియు 2 సత్యము
B) 1 సత్యము, 2 అసత్యము
C) 1 అసత్యము, 2 సత్యము
D) 1 మరియు 2 అసత్యము
జవాబు:
C) 1 అసత్యము, 2 సత్యము

4. ఈ క్రింది వానిలో ఓటుహక్కు వినియోగానికి సంబంధించిన నినాదం కానిది
A) ఓటరు చేతికి బ్రహ్మాస్త్రం – ఓటుహక్కు
B) అవినీతి పరులకు ఓటు, దేశానికి చేటు
C) ఓటుకు నోటు
D) ప్రలోభాలకు లోనుకావద్దు – స్వేచ్చగా ఓటెయ్యండి
జవాబు:
C) ఓటుకు నోటు

5. మొదటి సంకీర్ణ పార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించినది ……..
A) ఇందిరాగాంధీ
B) వాజ్ పేయి
C) మొరార్జీ దేశాయి
D)వి.పి.సింగ్
జవాబు:
C) మొరార్జీ దేశాయి

6. క్రింద పేర్కొన్న చర్యల వల్ల లెఫ్ట్ పార్టీ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ గ్రామీణ జనాభాలో గణనీయమైన మద్దతు లభించింది ………….
A) ఆపరేషన్ బర్గా
B) పంచాయత్ రాజ్ వ్యవస్థ అమలు
C) ధరల నియంత్రణ
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

7. అత్యవసర పరిస్థితి తర్వాత వెంటనే కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన పార్టీ
A) కాంగ్రెస్ పార్టీ
B) శిరోమణి అకాళీదళ్
C) భారత కమ్యూనిస్టు పార్టీ
D) జనతా పార్టీ
జవాబు:
D) జనతా పార్టీ

8. ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ బర్గా’ను చేపట్టింది?
A) పంజాబ్
B) హర్యా నా
C) పశ్చిమ బెంగాల్
D) కేరళ
జవాబు:
C) పశ్చిమ బెంగాల్

9. ప్రస్తుతం భారతదేశంలో లేని పార్టీ
A) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ)
B) భారతీయ జనతా పార్టీ
C) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
D) ముస్లిం లీగ్
జవాబు:
D) ముస్లిం లీగ్

AP 10th Class Social Bits Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10. ఇండో-చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి చెందినది.
A) ఇండియా
B) నైజీరియా
C) చైనా
D) వియతాం
జవాబు:
D) వియతాం

11. పేదలపై ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే వారిని చేరుతున్నదని అభిప్రాయపడిన ప్రధాని ………….
A) ఇందిరా గాంధీ
B) లాల్ బహదూర్ శాస్త్రి
C) రాజీవ్ గాంధీ
D) వి.పి.సింగ్
జవాబు:
C) రాజీవ్ గాంధీ

12. భారత ప్రజాస్వామ్యంలో 1977 ఎన్నికలు చరిత్రాత్మక మైనవి. ఎందుకనగా ………
A) జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఈ ఎన్నికలలోనే ఓడిపోయింది.
B) ఇవి మొట్టమొదటి బహుళపార్టీ ఎన్నికలు.
C) ఇవి స్వేచ్చగా, స్వతంత్రంగా జరిగిన తొలి ఎన్నికలు.
D) ఈ ఎన్నికలలోనే మొట్టమొదటగా ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను వాడారు.
జవాబు:
A) జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఈ ఎన్నికలలోనే ఓడిపోయింది.

13. మండల్ కమిషన్ 0.B.C వారికి ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిపార్సు చేసింది?
A) 31%
B) 40%
C) 25%
D) 27%
జవాబు:
D) 27%

14. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ……….
A) నసీమ్ జైదీ
B) V.S. సంపత్
C) T.N.శేషన్
D) H.S. బ్రహ్మ
జవాబు:
A) నసీమ్ జైదీ

AP 10th Class Social Bits Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

15. భారతదేశం లౌకిక రాజ్యం , ఎందుకనగా
A) రాజ్యమతం అంటూ లేదు
B) పౌరుడు ఏ మతాన్నైనా ఆవలంబించి అనుసరించవచ్చు
C) పౌరుల మధ్య మత వివక్షత లేదు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. క్రింది వాటిలో సరియైనది.
A) AGP రాజకీయ పార్టీ అసోంలో ప్రారంభమైంది.
B) DMK పార్టీ కేరళలో హిందీ వ్యతిరేక ఉద్యమం
C) ఆపరేషన్ బ్లూ స్టార్’ బంగ్లాదేశ్ లో ప్రారంభమయ్యింది.
D) P.V. నరసింహారావు భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి.
జవాబు:
A) AGP రాజకీయ పార్టీ అసోంలో ప్రారంభమైంది.

17. రాజీవ్ గాంధీతో సంబంధం గల అంశం
A) దేశంలో టెలికాం విప్లవమును ప్రారంభించడం
B) దేశంలో విజ్ఞాన శాస్త్రము, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమును ప్రోత్సహించడం
C) A మరియు B
D) అత్యవసర పరిస్థితిని విధించడం
జవాబు:
C) A మరియు B

18. సరళీకృత ఆర్థిక విధానానికి చెందనిది
A) ప్రభుత్వ ఖర్చును తీవ్రంగా తగ్గించుకోవడం
B) విదేశీ పెట్టుబడులపై పరిమితులు తగ్గించుకోవడం
C) ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం
D) ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం
జవాబు:
D) ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం

19. ‘అసోం ఉద్యమం’ ప్రధానంగా దీనికోసం జరిగింది
A) బయటి వాళ్ళను తొలగించడం కోసం
B) టీ తోటలు విస్తరించుటకు
C) అసోం స్వాతంత్ర్యం కోసం ప్రారంభించింది.
D) రాజకీయ అధికారం కోసం
జవాబు:
A) బయటి వాళ్ళను తొలగించడం కోసం

AP 10th Class Social Bits Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

20. సంకీర్ణ ప్రభుత్వాలు
A) అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉండేవి.
B) ఒకే జాతీయ పార్టీ మాత్రమే ఉండేది.
C) ఒకే ప్రాంతీయ పార్టీ మాత్రమే ఉండేది.
D) గవర్నర్ తో పాలించబడేవి.
జవాబు:
A) అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉండేవి.