These AP 10th Class Social Studies Important Questions 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు will help students prepare well for the exams.
AP Board 10th Class Social 15th Lesson Important Questions and Answers వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు
10th Class Social 15th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. 20వ శతాబ్దం ఆరంభంలో చైనాని పాలిస్తున్న చక్రవర్తులు ఏ వంశానికి చెందినవారు?
జవాబు:
మంచూ.
2. చైనా ప్రజల గణతంత్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1949.
3. ఏ సమావేశంలోని నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే, 4న బీజింగ్ లో ప్రఖ్యాత ‘మే, 4’ నిరసన ప్రదర్శన చేపట్టారు?
జవాబు:
వర్సయిల్స్ శాంతి సమావేశం.
4. ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సాంప్రదాయం ఏ దేశంలో ఉండేది?
జ. చైనాలో.
5. ‘కలిసి పనిచేసే’ సహజాతం అలవాటుని పెంపొందించు, కోవాలని కోరినవాడు?
జవాబు:
చియాంగ్ కై షేక్.
6. చైనా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన లాంగ్ మార్చ్ ను నిర్వహించినవారు ఎవరు?
జవాబు:
మావోజెడాంగ్.
7. 19 శతాబ్ది మధ్యకాలం నాటికి వియత్నాం ఎవరి ప్రత్యక్ష పాలనలోకి వచ్చింది?
జవాబు:
ఫ్రాన్స్ (ఫ్రెంచి)వారి
8. స్థానికులను నాగరికులుగా చెయ్యటానికి ఒక మార్గంగా వలస వాదులు దేనిని భావించారు?
జవాబు:
విద్యను.
9. ఉత్తర వియత్నాం మొదటి అధ్యక్షుడు ఎవరు?
జవాబు:
హె – చి – మిన్.
10. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నెజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP)ని స్థాపించింది ఎవరు?
జవాబు:
హెర్బార్ట్ మకాలే
11. 1936లో నైజీరియా యువ ఉద్యమంను (NYM) స్థాపించినది ఎవరు?
జవాబు:
ఎన్ నంది. అజికివే
12. నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘాన్ని (NCNC) ఏర్పరచిన సంవత్సరం?
జవాబు:
1944.
13. నైజీరియా ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
జవాబు:
1963, అక్బోర్ 1 న.
14, ఏ ప్రాంతంలోని ప్రజలు జాతీయ విముక్తి సమాఖ్య (NLR) పేరుతో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు?
జవాబు:
దక్షిణ వియత్నాం
15. వియత్నాంలో కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతోందన్న ఆందోళనకు గురైన దేశం ఏది?
జవాబు:
అమెరికా.
16. నైజర్ డెల్టాలో ఏ సంవత్సరంలో ముడి చమురు నిల్వలు కనుగొన్నారు?
జ. 1950.
17. నైజర్ డెల్టాలోని చమురు వెలికితీసే హక్కులను పొందిన బహుళజాతి సంస్థ ఏది?
జవాబు:
డచ్ షెల్ కంపెనీ.
18. ఎజెంట్ ఆరెంజ్ లోని రసాయనిక పదార్థం ఏమి?
జవాబు:
డై ఆక్సిన్.
19. ఎవరి కార్యక్రమాన్ని మూడు సిద్దాంతాలు అంటారు?
జవాబు:
సన్ యెట్ సెన్
20. NYM ని విస్తరింపుము.
జవాబు:
నైజీరియా యువ ఉద్యమం.
21. NCNC ని విస్తరింపుము.
జవాబు:
నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘం.
22. NNDPని విస్తరింపుము.
జవాబు:
నైజీరియా, జాతీయ ప్రజాస్వామిక పార్టీ.
23. నైజీరియా ఏ దేశపు వలస?
జవాబు:
బ్రిటన్.
24. సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా ఏదేశం 1940లో వియత్నాంను ఆక్రమించింది?
జవాబు:
జపాన్.
25. వియత్నాం స్వాతంత్ర్య సమితిని ఏమని పిలుస్తారు?
జవాబు:
వియత్ మిన్.
26. NLF ని విస్తరింపుము.
జవాబు:
జాతీయ విముక్తి సమాఖ్య.
27. ఘానా స్వాతంత్ర్య యోధుడు, ఖండాంతర ఆఫ్రికా వాదంలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు?
జవాబు:
క్వామెన్ క్రూమా.
28. ఆస్ట్రేలియా ఏ దేశానికి చెందిన వలస రాజ్యం?
జవాబు:
బ్రిటన్.
29. చైనాను సైనిక దేశంగా మార్చినది ఎవరు?
జవాబు:
చియాంగ్ కై షేక్.
30. చైనాలోని మధ్య తరగతి పట్టణ వాసులను ఏమంటారు?
జవాబు:
సియావోషిమిన్.
31. వియత్నాంను పరిపాలించిన రాజవంశం ఏది?
జవాబు:
ఎన్ గుయెన్.
32. ఉత్తర నైజీరియాలో అధికంగా నివసిస్తున్న గిరిజన తెగ ఏది?
జవాబు:
హౌసా – ఫులాని.
33. ‘కెన్నరో వివా’ ఒక ………..
జవాబు:
పర్యావరణవాది.
34. ఆగ్నేయ నైజీరియాలో ఏ తెగ ప్రజలున్నారు?
జవాబు:
ఈబో.
35. నైరుతి నైజీరియాలో ఏ తెగ ప్రజలున్నారు?
జవాబు:
యెరుబా.
36. నైజీరియాలోని అడవులు ప్రముఖంగా ఏ విధమైన అడవులు?
జవాబు:
మడ అడవులు.
37. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన పునాది వేసిన అంశం ఏది?
జవాబు:
భూ సంస్కరణలు & జాతీయీకరణ.
38. క్రింది సంఘటనలను సరియైన కాలక్రమంలో రాయండి.
i) పెకింగ్ యూనివర్సిటి ఏర్పాటు
ii) జపాన్ చైనాపై దాడి
iii)చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన
iv)లాంగ్ మార్చ్
జవాబు:
i, iii, iv, ii
39. ఆధునిక చైనా నిర్మాత ఎవరు?
జవాబు:
సన్ యెట్ – సెన్
40. సన్ యెట్ – సెన్ యొక్క మూడు సిద్ధాంతాలు సన్, మిన్, చుయిలలో ‘మిన్’ అనగానేమి?
జవాబు:
ప్రజాస్వామ్యం.
41. చియాంగ్ జైషేక్, (చైనా) మహిళలు ఏ నాల్గు సుగుణాల పై శ్రద్ధ పెట్టాలని భావించాడు?
జవాబు:
పాతివ్రత్యం, రూపం, మాట, పని.
42. వియత్నాం యుద్ధంలో అమెరికా ‘ఏజెంట్ ఆరెంజ్’ను ఉపయోగించటానికి కారణమేమి?
జవాబు:
ప్రజలను అడవుల్లో దాక్కోకుండా, సులభంగా చంపడం కోసం.
43. తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకున్న చైనా కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు?
జవాబు:
మావో జెడాంగ్.
44. వియత్నాం దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆసియా
45. నైజీరియా దేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆఫ్రికా.
46. సన్ యెట్ – సెన్ గణతంత్ర రాజ్యం ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
జవాబు:
1911
47. చైనాలో ఏ విప్లవం తరువాత దేశం సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది?
జవాబు:
గణతంత్ర విప్లవం.
48. గుయోమింగ్ డాంగ్ పార్టీ గుర్తించిన నాలుగు ప్రధాన అవసరాలు ఏవి?
జవాబు:
కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా.
49. గుయోమింగ్ డాంగ్ పార్టీ నాయకుడెవరు?
జవాబు:
చియాంగ్ కైషేక్.
50. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఆవిర్భ వించింది?
జవాబు:
1921లో
51. 1937లో చైనాపై దండెత్తిన దేశమేది?
జవాబు:
జపాన్.
52. 1931 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద బియ్యం ఎగుమతి చేసే దేశమేది?
జవాబు:
వియత్నాం
53. NNDP ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది?
జవాబు:
1923లో.
54. వియత్నాంలో విద్యార్థులు ‘యువఅన్నాం’ పార్టీ స్థాపన?
జవాబు:
1920.
55. వియత్ మిస్, వియత్నాంలో భూమి కౌలును ఎంతశాతం తగ్గించింది?
జవాబు:
25%
56. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు ఎవరు?
జవాబు:
హూచి మిన్.
57. చైనా ఏ స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో ఉండేది?
జవాబు:
యుద్ధ ప్రభువులు.
58. చైనాలో సంప్రదాయవాద నాయకుడు ఎవరు?
జవాబు:
చియాంగ్ కై షేక్.
59. ‘ప్రజాస్వామ్య గణతంత్ర వియత్నాం ఛైర్మన్ ఎవరు?
జవాబు:
హెచిమిన్.
60. వియత్నాంలో ముఖ్యమైన పంటలు ఏవైనా రెండింటిని రాయండి.
జవాబు:
వరి, రబ్బరు.
61. ఏ సంవత్సరంలో పారిలో శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి?
జవాబు:
1974.
62. 1930 లలో వియత్నాంలో ఎవరు రాసిన నవలలో ఒక మహిళ బలవంతపు పెళ్ళి కథ ఉంది?
జవాబు:
నాపిన్.
63. ఏ సంవత్సరంలో చైనాలో భూ సంస్కరణల అమలు మొదలు పెట్టారు?
జవాబు:
1950 – 51.
64. సన్ యెట్ – సెన్ భావనలతో ఏర్పడిన పార్టీ?
జవాబు:
గుయెమిండాంగ్
65. పెకింగ్ విశ్వ విద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1902
66. చైనాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించింది ఎవరు?
జవాబు:
మావో జెడాంగ్.
67. చైనాలో భూ సంస్కరణలతోపాటు రాజకీయ విద్య, అక్షరాస్యతలను వ్యాపింప చెయ్యటానికి పెద్ద ఎత్తున ప్రారంభించిన పాఠశాలలు ఏవి?
జవాబు:
వయోజన రైతాంగ పాఠశాలలు.
68. వియత్నాంను ఏ పంటను ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చెయ్యాలని ఫ్రెంచ్ చాలా ఆసక్తి కనపరచింది?
జవాబు:
వరి.
69. వియత్నాంలోని అన్నాం ప్రాంతంలో భూమి అసలు లేని కుటుంబాలు సుమారు ఎంత శాతం ఉన్నాయి?
జవాబు:
53%
70. 20వ శతాబ్ది ఆరంభంలో ఆధునిక విద్యకోసం వియత్నాం విద్యార్థులు ఏ దేశానికి వెళ్ళేవారు?
జవాబు:
జపాన్.
71. జపాన్ వియత్నాంను ఏ సంవత్సరంలో ఆక్రమించింది?
జవాబు:
1940లో
72. వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రంగా ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
1945 లో
73. 1954లో డీన్ బీన్ ఫు వద్ద వియత్నాం చేతిలో ఓడిపోయినది ఎవరు?
జవాబు:
ఫ్రెంచి వలస పాలకులు.
74. దక్షిణ వియత్నాంలో పురాతన చక్రవర్తినీ పడదోసి అధికారంలోకి వచ్చినది ఎవరు?
జవాబు:
ఎన్ గో డిన్ డీం.
75. ఉత్తర వియత్నాంలో భూ సంస్కరణలతో కొత్త యుగం మొదలైన సంవత్సరం ఏది?
జవాబు:
1954.
76. జాతీయ విముక్తి సమాఖ్య ఎప్పుడు సైగాన్లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఉత్తర, దక్షిణ వియత్నాంలు ఒకటి అయ్యాయి?
జవాబు:
1975 ఏప్రిల్ 30 న.
77. 16వ శతాబ్దం నాటి నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చెయ్యటంలో ఏ దేశం ప్రధాన కేంద్రంగా ఉండింది?
జవాబు:
నైజీరియా.
78. పశ్చిమ ఆఫ్రికాలోని ఏ నగరాన్ని విద్యా, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్ రూపుదిద్దింది?
జవాబు:
లాగోస్.
79. NYM ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
జవాబు:
1936.
80. ఏ సంవత్సరంలో అతివాద జాతీయవాద కార్మిక సంఘ నాయకులు ఆధ్వర్యంలో నైజీరియాలో జాతీయ సాధారణ సమ్మె నిర్వహించారు?
జవాబు:
1945
81. NPC ని విస్తరింపుము.
జవాబు:
ఉత్తర ప్రజల కాంగ్రెస్.
82. నైజీరియా ఏ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు (AG) ఏర్పడింది?
జవాబు:
పశ్చిమ ప్రాంతంలో.
83. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తరువాత నైజీరియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకున్న సంవత్సరం ఏది?
జవాబు:
1999.
83.ఎ) ఏజెంట్ ఆరెంజ్ అనునది ఏమిటి?
జవాబు:
మొక్కల నాశిని
84. క్రింది వానిని సరిగా జతపరచంది.
i) NNDP ( ) a) హెచిమిన్
ii) NYM ( ) b) మావో జెడాంగ్
iii)లాంగ్ మార్చ్ ( ) c) ఎన్ నంది అజికివే
iv) వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రం ( ) d) హెర్బార్ట్ మెకాలే
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a.
85. క్రింది వాక్యాలను పరిగణించండి.
i) చాలా మంది అమెరికా పౌరులు వియత్నాంతో యుద్దాన్ని వ్యతిరేకించారు.
ii) గొప్పదైన అమెరికా సైన్యాన్ని ఓడించటంలో పేద వియత్నాం రైతాంగం కీలక పాత్ర పోషించింది.
పై వాక్యా లలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు
జవాబు:
C (I) మరియు (ii)
86. అమెరికా ఉత్తర వియత్నాంతో ప్రత్యక్ష జోక్యం చేసుకొని యుద్దం చేయటానికి ప్రధాన కారణం.
→ ఫ్రెంచి వారికి మద్దతుగా
→ జాతీయతా భావానికి వ్యతిరేకంగా
→ నియంత పాలనకి వ్యతిరేకంగా
→ కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతుందనే భయం చేత
జవాబు:
కమ్యూనిస్ట్ ప్రాబల్యం పెరుగుతుందనే భయం చేత.
87. ఏవి చైనా భవిష్యత్తు ప్రగతికి పునాదిగా నిలిచాయని మేథావులంతా సాధారణంగా ఏకీభవిస్తారు?
జవాబు:
భూ సంస్కరణలు, అందరికీ ప్రాథమిక విద్య నందించటం.
క్రింద ఇచ్చిన పటంను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
88. పై పటం ఏ దేశానికి సంబంధించింది?
జవాబు:
నైజీరియా
89. ఈ దేశాన్ని వలస రాజ్యంగా చేసుకొన్న దేశమేది?
జవాబు:
బ్రిటన్.
90. నైజీరియాలో ఉన్న మూడు ముఖ్య గిరిజన తెగలు ఏవి?
జవాబు:
హౌసా – ఫులాని, ఈబో, యెరుబా.
91. పటంలో ‘A’ ప్రాంతంలో నివసిస్తున్న తెగ పేరేమి?
జవాబు:
హౌసా – ఫులాని.
92. నైరుతి ప్రాంతంలో నివసిస్తున్న తెగ పేరేమి?
జవాబు:
యెరుబా
93. ఈ దేశంలోని ప్రధాన ఖనిజ వనరు ఏది?
జవాబు:
ముడి చమురు.
క్రింద ఇచ్చిన పటంను పరిశీలించిఇచ్చిన ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.
94. ఈ దేశాన్ని వలసీకరించిన దేశం ఏది?
జవాబు:
ఫ్రాన్స్
95, ఈ దేశంలోని ప్రముఖ డెల్లా ప్రాంతం ఏది?
జవాబు:
మెకాంగ్ డెల్టా.
96. ఈ దేశ జాతీయోద్యమ నాయకుడు ఎవరు?
జవాబు:
హాచిమిన్
97. ఇండో – చైనీస్ కమ్యూనిస్ట్ ఏ దేశానికి చెందింది?
జవాబు:
వియత్నాం
98. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) చియాంగ్ కైషేక్ ( ) a) రైతాంగ విప్లవం
ii) మావో జెడాంగ్ ( ) b) సన్-మిన్-చుయి
iii) కెన్నరో వివా ( ) c) సైనిక పాలన
iv)సన్ యెట్ – సెన్ ( ) d) పర్యావరణ విప్లవం
జవాబు:
i – c, ii – a, iii – d, iv – b
10th Class Social 15th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ఖండాంతర్గత ఆఫ్రికా వాదం అనగానేమి?
జవాబు:
- దేశ, తెగ తేడా లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడమే ఖండాంతర్గత ఆఫ్రికా వాదం.
- ఘనా స్వతంత్ర యోధుడు క్యామెన్ క్రుమా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు.
ప్రశ్న 2.
నైజీరియా డెల్టాలో యథేచ్ఛగా సాగుతున్న చమురు వెలికితీత వల్ల ఉత్పన్నమయిన సమస్యలు ఏవి?
(లేదా)
నైజీరియాలో వ్యవసాయ రంగం మీద చమురు వెలికితీత ఎలాంటి ప్రభావం చూపింది?
జవాబు:
- పర్యావరణం కలుషితమయ్యింది.
- మడ అడవులు నాశనమయ్యా యి.
- నేలలు, భూగర్భజలాలు కలుషితం కావడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి.
- స్థానికంగా చేపల ఉత్పత్తి తగ్గిపోయింది.
ప్రశ్న 3.
నైజీరియాలో పౌరయుద్ధం ఎందుకు మొదలయ్యింది?
జవాబు:
నైజీరియాలో ప్రజాస్వామిక, న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవటం వల్ల పౌరయుద్ధం మొదలయ్యింది.
ప్రశ్న 4.
వియత్నాం యుద్ధంలో అమెరికా ఎందుకు జోక్యం చేసుకొన్నది?
జవాబు:
వియత్నాం యుద్ధంలో అమెరికా జోక్యము : కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారేమోననే భయం వల్ల వియత్నాం యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నది.
ప్రశ్న 5.
నైజీరియా జాతీయతావాదం ముందు ఉన్న రెండు కరవ్యాలు ఏవి?
జవాబు:
నైజీరియా జాతీయతావాదం ముందు ఉన్న రెండు కర్తవ్యాలు :
- బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడడం.
- ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐక్యమత్యం సాధించడం.
ప్రశ్న 6.
ఇవ్వబడిన మ్యాపు ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) ఆగ్నేయ ప్రాంతంలో నివసిస్తున్న తెగ పేరేమి?
ii) ఈ దేశాన్ని వలసీకరించిన దేశం ఏది?
జవాబు:
i) ఈబో తెగ.
ii) బ్రిటన్.
ప్రశ్న 7.
20వ శతాబ్దం ఆరంభంలో ఏ వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు?
జవాబు:
20వ శతాబ్దం ఆరంభంలో మంచూ వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు.
ప్రశ్న 8.
మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసిన వారెవరు?
జవాబు:
మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి సన్యెట్-సెన్ 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
ప్రశ్న 9.
బీజింగ్ లో నిరసన ప్రదర్శన ఎందుకు చేపట్టారు?
జవాబు:
వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనినే “మే . నాలుగు ఉద్యమం” అని కూడా అంటారు.
ప్రశ్న 10.
చియాంగ్ మహిళలు వేటిపై శ్రద్ధ పెట్టాలన్నారు?
జవాబు:
మహిళలు “పాతివ్రత్యం, రూపం, మాట, పని” అన్న నాలుగు సుగుణాలపై శ్రద్ధ పెట్టాలన్నారు.
ప్రశ్న 11.
చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
రష్యా విప్లవం తరువాత 1921లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.
ప్రశ్న 12.
నైజీరియాలో చమురు వల్ల ఉత్పన్నమైన పర్యావరణ సమస్యలపై పోరాటం చేసినవారెవరు?
జవాబు:
నైజీరియాలో చమురు వల్ల ఉత్పన్నమైన పర్యావరణ సమస్యలపై పోరాటం చేసినవారు “కెన్ సారో వివా”.
ప్రశ్న 13.
నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నుకుంది?
జవాబు:
నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని 1999లో ఎన్నుకుంది.
ప్రశ్న 14.
ఏజెంట్ ఆరెంజ్ అనగా ఏమిటి?
జవాబు:
ఏజెంట్ ఆరెంజ్ అంటే చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సంవత్సరాల పాటు బీడుగా మార్చే విషం.
ప్రశ్న 15.
ఉత్తర వియత్నాంలో భూసంస్కరణలలో కొత్త యుగం ఎప్పుడు మొదలైంది?
జవాబు:
1954 తరువాత ఉత్తర వియత్నాంలో భూసంస్కరణలలో కొత్త యుగం మొదలైంది.
ప్రశ్న 16.
వియత్నాం కమ్యూనిస్టు పార్టీని స్థాపించినదెవరు?
జవాబు:
పరస్పరం పోటీపడుతున్న జాతీయతా బృందాలను కలిపి 1930 ఫిబ్రవరిలో “సూచిమిన్” వియత్నాం కమ్యూనిస్టు పార్టీని స్థాపించాడు.
ప్రశ్న 17.
చైనా ప్రజల గణతంత్రం ఎప్పుడు ఏర్పడింది?
జవాబు:
1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది.
ప్రశ్న 18.
గుయోమిందాంగ్ పార్టీ రెండు ఆశయాలు ఏమిటి?
జవాబు:
గుయోమిండాంగ్ పార్టీ రెండు ఆశయాలు :
- భూసంస్కరణలు
- జాతీయకరణ
ప్రశ్న 19.
ఏ సం||లో భూసంస్కరణల అమలు మొదలు పెట్టారు?
జవాబు:
1950-51లో భూసంస్కరణల అమలు మొదలు పెట్టారు.
ప్రశ్న 20.
ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాష నేర్పినప్పటికీ ఉన్నత విద్య ఏ భాషలో ఉండేది?
జవాబు:
ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాష నేర్పినప్పటికీ ఉన్నత విద్య ఫ్రెంచి భాషలో ఉండేది.
ప్రశ్న 21.
భారతదేశాన్ని బ్రిటన్ ప్రభావితం చేసినట్లే వియత్నామీయుల జీవితాలలో అన్ని అంశాలను ఎవరు ప్రభావితం చేశారు?
జవాబు:
భారతదేశాన్ని బ్రిటన్ ప్రభావితం చేసినట్లే వియత్నామీయుల జీవితాలలో అన్ని అంశాలను ఫ్రెంచి వాళ్ళు ప్రభావితం చేసారు.
ప్రశ్న 22.
వియత్నాం వలసపాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా దేనిమీద ఆధారపడి ఉంది?
జవాబు:
వియత్నాం వలసపాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా ఫ్రెంచి, సంపన్న వియత్నామీయుల అధీనంలో ఉన్న వరి ఉత్పత్తి, రబ్బరు సాగుపై ఆధారపడి ఉంది.
ప్రశ్న 23.
యువ అన్నాం అనే పార్టీ స్థాపకులెవరు?
జవాబు:
యువ అన్నాం అనే పార్టీని విద్యార్థులు ఏర్పాటు చేశారు.
ప్రశ్న 24.
వియత్నాంలో నూతన గణతంత్ర వ్యవస్థ ఎవరు చక్రవర్తిగా ఉండగా ఏర్పడింది?
జవాబు:
వియత్నాంలో నూతన గణతంత్ర వ్యవస్థ “బావోదాయిని” చక్రవర్తిగా ఉండగా ఏర్పడింది.
ప్రశ్న 25.
ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని ఎవరు ఏర్పరచారు?
జవాబు:
ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరచారు.
ప్రశ్న 26.
ఆఫ్రికాలో అధిక జనాభా సాంద్రత గల దేశాలలో ఏ ప్రాంతం ఒకటి?
జవాబు:
నైజర్ నదీ ప్రాంతం
ప్రశ్న 27.
నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ స్థాపకులెవరు?
జవాబు:
నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ స్థాపకులు “హెర్బెర్ట్ మకాలే”.
ప్రశ్న 28.
సామ్యవాదం యొక్క రెండు ముఖ్య లక్షణాలు పేర్కొనండి.
జవాబు:
1) వస్తు ఉత్పత్తి, పంపిణీ ప్రభుత్వ అధీనంలో ఉండటం, ప్రైవేటు వ్యక్తులకు అవకాశం లేకపోవడం.
2) అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటం.
ప్రశ్న 29.
‘NCNC’ ని విస్తరించుము.
జవాబు:
NCNC : National Council of Nigeria and Cameron (నైజీరియా, కామెరూన్ల జాతీయ సంఘం).
ప్రశ్న 30.
గణతంత్ర విప్లవం తర్వాత చైనాలో ఆవిర్భవించిన రాజకీయ పక్షాలు ఏవి?
జవాబు:
గణతంత్ర విప్లవం తర్వాత ఏర్పాటైన రాజకీయ పార్టీలు (చైనాలో) : గుయోమిండాంగ్ (KMT – జాతీయ ప్రజాపార్టీ) మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ (CCP).
ప్రశ్న 31.
వియతమిన్ అని దేనిని పిలిచారు?
జవాబు:
వియత్నాం స్వాతంత్ర్య సమితి (వియత్నాం డాక్ లాప్ డాంగ్ మిన్) – దీనిని ‘వియత్ మిన్’ అని పిలుస్తారు.
10th Class Social 15th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను యువ చైనీయులు వ్యతిరేకించసాగడానికి గల కారణాలుగా వేటిని అనుకుంటున్నావు?
జవాబు:
- పాత సాంప్రదాయాలు, విదేశీ శక్తులు చైనా అభివృద్ధికి నిరోధకాలని యువ చైనీయులు భావించారు.
- ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్లాలని ఒక తరం ఉద్యమించింది.
- సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళల పరాధీనత, ఆడపిల్లల పాదాలు కట్టివెయ్యడం వంటి వాటిని వ్యతిరేకించటం, వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చెయ్యడానికి ఆర్థిక అభివృద్ధి వంటి సంస్కరణలను వారు ప్రతిపాదించారు.
- దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివెయ్యాలని యువ చైనీయులు భావించారు.
ప్రశ్న 2.
అధికంగా చమురును వెలికి తీయడం వల్ల నైజీరియాపై ఎలాంటి ప్రభావం పడింది?
జవాబు:
- మడ అడవులు చమురును తట్టుకోలేక అంతరించిపోయాయి.
- దాని వలన జీవావరణ వ్యవస్థ దెబ్బతినడం జరిగింది.
- ఈ చమురు వల్ల నేలలు కలుషితం అయ్యాయి.
- అందువలన ఎంతో విస్తీర్ణంలో పంటలు నాశనం అయ్యాయి.
- త్రాగునీరు కలుషితం కావడం జరుగుతుంది.
- చేపల పెంపకం దెబ్బతిని, చేపల ఉత్పత్తి పడిపోయింది.
- త్రాగునీరు కలుషితం కావడంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది.
ప్రశ్న 3.
మే నాలుగు ఉద్యమం గూర్చి క్లుప్తంగా రాయుము.
(లేదా)
చైనాలో జరిగిన ‘మే 4 ఉద్యమం’ గురించి రాయండి.
జవాబు:
చైనా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన పోరాడి గెలిచినా జపాన్ ఆక్రమిత ప్రాంతాలు ఇవ్వనందుకు నిరసనగా 1919 మే 4న ఈ ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమాన్ని యువత నడిపించి, పాత సంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకెళ్లాలని తలచారు.
ప్రశ్న 4.
ఇచ్చిన పటాన్ని పరిశీలించి దిగువ ఇవ్వబడిన ప్రశ్నకు జవాబు రాయండి.
ప్రశ్న : బ్రిటిష్ పాలకులు తమ ‘విభజించి పాలించు’ అనే సిద్ధాంతాన్ని నైజీరియాలో ఏ విధంగా అమలుపరచగలిగారు?
జవాబు:
1) నైజీరియాలో ప్రధానంగా మూడు గిరిజన తెగలు కలవు. అవి :
1. హౌసా-పులాని,
2. యొరుబా
3. ఈబో
2) ఈ తెగల మధ్య ఘర్షణ మరియు పోటీని ప్రోత్సహించడం ద్వారా బ్రిటిష్ వారు “విభజించి పాలించు” సిద్ధాంతాన్ని అమలుపరిచారు.
ప్రశ్న 5.
వియత్నాంలోని విద్యావిధానం అక్కడ జాతీయవాద భావాల ఆవిర్భావానికి ఏ విధంగా దోహదపడింది ?
జవాబు:
- వియత్నాంలో ఫ్రెంచివారు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు, విద్యార్థులు గుడ్డిగా అనుసరించలేదు.
- పాఠాలు చెప్పేటప్పుడు వియత్నాం టీచర్లు పాఠాలలో ఉన్న అంశాలను మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు.
- దేశభక్తి భావనలతో విద్యార్థులు ప్రేరణ పొందారు.
- ఆధునిక విద్యకోసం జపాన్ వెళ్ళసాగిన విద్యార్థుల ప్రధాన ఉద్దేశ్యం వియత్నాం నుండి ఫ్రెంచివారిని తరిమివెయ్యడమే.
ప్రశ్న 6.
ఖండాంతర ఆఫ్రికా వాదం గురించి వివరించండి.
జవాబు:
- దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరిని ఒకటిగా చెయ్యడం.
- వలస పాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించడం.
- సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా అన్ని తెగల, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించడం.
- ఖండాంతర ఆఫ్రికా వాదం పెంపొందించటంలో క్వామెన్ క్రుమా ప్రముఖ పాత్ర పోషించాడు.
ప్రశ్న 7.
క్రింది పటమును పరిశీలించి యిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
1) నైజీరియాను వలసీకరించిన దేశం ఏది?
జవాబు:
నైజీరియాను వలసీకరించిన దేశం : బ్రిటన్
2) ఆగ్నేయ నైజీరియాలో అధికంగా యున్న ప్రజలు ఏ తెగకు చెందినవారు?
జవాబు:
ఆగ్నేయ నైజీరియాలోని తెగ : ఈబో
ప్రశ్న 8.
గ్రామీణ చైనా ఎదుర్కొన్న సంక్షోభాలను తెల్పండి.
జవాబు:
గ్రామీణ చైనా ఎదుర్కొంటున్న సమస్యలు :
- నేలలు నిస్సారం కావడం,
- అడవులు నరికి వేయడం.
- వరదలు రావడం.
- దోపిడీపూరిత భూమి కౌలు విధానం అమలులో ఉండటం.
- ఋణభారం పెరగడం.
- గ్రామీణులు పురాతన సాంకేతిక విజ్ఞానాన్ని కలిగి ఉండటం.
- గ్రామాలలో అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలు ఉండటం.
ప్రశ్న 9.
సన్-యెట్-సెలో నీకు నచ్చిన గుణాలేవి? ఎందుకు?
జవాబు:
సన్-యెట్-సెన్లో నాకు నచ్చిన గుణాలు :
i) గణతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుట.
ii) మంచూ వంశాన్ని, సామ్రాజ్యవాద శక్తులను పారద్రోలి ఆధునిక చైనా నిర్మాతగా ప్రసిద్ధి చెందడం.
iii)నూతన కార్యాచరణ పథకాన్ని రూపొందించి పరిశ్రమలపై నియంత్రణ, భూ సంస్కరణలను చేపట్టడం.
ప్రశ్న 10.
సయెట్-సెన్ 3 సిద్ధాంతాలేవి?
జవాబు:
సట్-సెస్ 3 సిద్ధాంతాలు సన్, మిన్, చుయి. ఇవి ఏమనగా జాతీయతావాదం అనగా విదేశీ శక్తులుగా భావింపబడుతున్న మంచూ వంశాన్ని, సామ్రాజ్యవాద శక్తులను పారదోలడం. ప్రజాస్వామ్యం అనగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూసంస్కరణలు.
ప్రశ్న 11.
భూసంస్కరణ వలన చైనాలో కలిగే పరిణామాలేవి?
జవాబు:
చైనా సాగుభూమిలో 43 శాతాన్ని గ్రామీణ ప్రజలలో 60 శాతానికి పంచి పెట్టడంలో భూసంస్కరణలు విజయం సాధించాయి. పేద రైతుల కింద భూమి గణనీయంగా పెరిగింది. పాత సంపన్న వర్గానికి చెందిన అధికారం, ఆర్థిక వనరులను తీసేసుకోగా ఇంకో వైపున సిసిపి ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన పేద, మధ్యతరగతికి చెందిన గ్రామ కార్యకర్తల . నుంచి కొత్త కులీనవర్గం ఏర్పడసాగింది.
ప్రశ్న 12.
వియత్నాం వలసపాలిత రైతాంగ జీవనప్రమాణం ఎందుకు పడిపోయింది?
జవాబు:
వియత్నాం వలసపాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా ఫ్రెంచి, కొంతమంది సంపన్న వియత్నామీయుల ఆధీనంలో ఉన్న వరి ఉత్పత్తి, రబ్బరు సాగుపై ఆధారపడి ఉంది. రబ్బరు తోటలలో వెట్టి కార్మికులను ఉపయోగించుకునేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్యం పెరిగి, పెద్ద పెద్ద భూస్వాములు చెన్న రైతుల భూములను చేజిక్కించుకుని వారితో కౌలు రైతులుగా పనిచేయించుకునేవాళ్ళు. ఫలితంగా రైతాంగ జీవనప్రమాణం పడిపోయింది.
ప్రశ్న 13.
అమెరికా, వియత్నాం యుద్ధ ఫలితాలు ఏమి?
జవాబు:
అమెరికా, వియత్నాం యుద్ధం కారణంగా అమెరికాకే కాకుండా వియత్నాంకు కూడా చాలా భారంగా పరిణమించింది. 1965 – 1972 మధ్యకాలంలో వియత్నాం యుద్ధంలో 34,00,000 అమెరికా సైనికులు పాల్గొన్నారు. ఈ యుద్ధంలో 47,244 మంది సైనికులు చనిపోగా, 3,03,704 మంది గాయపడ్డారు. సైనికులు శక్తిమంతమైన ఆయుధాలు, బాంబులతో విధ్వంసం సృష్టించారు. అమెరికా నాపాలం వంటి బాంబులు, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనాల వలన వియత్నాం విచ్చిన్నమైంది.
ప్రశ్న 14.
ఖండాంతర ఆఫ్రికావాదం గురించి వ్రాయండి.
జవాబు:
- దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చెయ్యడానికి ఖండాంతర ఆఫ్రికావాదం ప్రయత్నిస్తుంది.
- ఈ ఐకమత్యంతో వలసపాలనను, జాతి వివక్షను వ్యతిరేకించడమే కాక సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగల, ప్రజల, సమూహాల మధ్య ఐకమత్యం సాధించడానికి ప్రయత్నించింది.
- ఘనా స్వాతంత్ర్య యోధుడు క్వామె క్రుమా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు.
ప్రశ్న 15.
వియత్నాంపై అమెరికా చేసిన యుద్ధం ప్రపంచ శాంతికి భంగం కలిగించేదిగా ఉందని నీవు భావిస్తున్నావా? అభిప్రాయం తెల్పండి.
జవాబు:
- వియత్నాంపై అమెరికా యుద్ధం తప్పనిసరిగా ప్రపంచ శాంతికి భంగం కల్గించేదే.
- వలసపీడిత దేశ పోరాటంలో వియత్నాంకు సహకరించాల్సిన అమెరికా, కమ్యూనిస్టు వ్యతిరేక భావనతో వియత్నాంపై యుద్ధానికి తెగించింది.
- అమెరికాతో ఏ విధమైన సంబంధం లేని వియత్నాం పై యుద్ధంతో అది తన కపట ప్రపంచ పోలీస్ ముసుగును బయట పెట్టుకుంది.
- జీవ రసాయన ఆయుధాలు, బాంబులు, విరివిగా వైమానిక దాడులతో వియత్నాం ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తించి స్వదేశ ప్రజల నుంచే తిరస్కారాన్ని పొందింది.
ప్రశ్న 16.
ప్రపంచ పటం నందు ఈ క్రింది ప్రాంతాలను గుర్తించుము.
1. నైజీరియా
2. చైనా
3. ఫ్రాన్స్
4. రష్యా
5. జపాన్
6. అమెరికా
7. ఇంగ్లాండు
జవాబు:
10th Class Social 15th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
క్రింది అంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
ఏజెంట్ ఆరెంజ్ – అత్యంత విష పదార్థము
ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం. నారింజ పట్టి ఉన్న డ్రమ్ములలో నిల్వ చెయ్యటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. 1961 – 1971 మధ్య కాలంలో అమెరికా కార్గో యుద్ధ విమానాలు వియత్నాంపై 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయనాన్ని చల్లాయి. అడవులను, పొలాలను నిర్మూలించటం ద్వారా ప్రజలు దాక్కోటానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళని తేలికగా చంపొచ్చన్నది అమెరికా ప్రణాళిక. దేశంలోని 14 శాతం సాగుభూమి ఈ విషపూరిత రసాయనం వల్ల ప్రభావితం అయ్యింది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈనాటికి కూడా ప్రజలపై దాని ప్రభావం ఉంది. ఏజెంట్ ఆరెంజ్ లోని రసాయనిక అంశమైన డై ఆక్సిన్ పిల్లల మెదడు దెబ్బ తినటానికి, క్యాన్సర్ కి కారకం. ఈ మందు పిచికారీ చేసిన ప్రాంతాలలో పిల్లలలో అవయవ లోపాలు అధికంగా ఉండటానికి ఈ విషమే కారణమని ఒక అధ్యయనం వెల్లడి చేసింది.
రసాయనిక ఆయుధాలతో సహా అమెరికా జోక్యంలో భాగంగా (ప్రధానంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని) వియత్నాంపై వేసిన బాంబుల మొత్తం బరువు రెండవ ప్రపంచ యుద్ధకాలం మొత్తంలో కంటే ఎక్కువ.
ప్రశ్నలు:
1) ఏజెంట్ ఆరెంజ్ అనగానేమి?
2) ఏజెంట్ ఆరెంజ్ పిల్లలపై ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది?
3) అడవులను, సాగుభూమి పొలాలను రసాయనాలు చల్లటం ద్వారా ఎందుకు నిర్మూలించారు?
4) అమెరికా దేశము పైరులపైన, అడవుల పైన కాలుష్య రసాయనాలను ప్రయోగించడం సమర్థనీయమని నీవు భావిస్తావా?
జవాబు:
- ఏజెంట్ ఆరెంజ్ అనగా ఆకులు రాలిపోయేలా చేసి మొక్కలను చంపే విషపదార్థము.
- పిల్లల మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ వ్యాప్తికి మరియు అవయవలోపాలకు ఏజెంట్ ఆరెంజ్ కారణమౌతుంది.
- అడవులను, పొలాలను నిర్మూలించడము ద్వారా ప్రజలు దాక్కోవడానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళను తేలికగా చంపడానికి.
- సమర్థనీయము కాదు.
ప్రశ్న 2.
నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని ఈబూలు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు న్యాయ పూరితమైన పరిష్కారం, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.
జవాబు:
- ఈబూల కోరిక సమంజసం కాదు.
- దేశంలోని సహజవనరులు దేశ ప్రజలందరికీ చెందుతాయి.
- నైజీరియా ఉత్తర భాగం సామాజికంగాను, ఆర్ధికంగానూ వెనుకబడి ఉంది.
- ప్రభుత్వం పెట్రోలియం వనరులను దేశ ప్రజలందరి అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది.
- ఈబూ ప్రజలకు అధికభాగం వనరులను, ఖనిజాలను కేటాయించి వారిని శాంతపరచవచ్చు.
ప్రశ్న 3.
‘నేడు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యమైనది పర్యావరణ కాలుష్యం.’ నైజీరియాలోని నైజర్ డెల్టాను ఉదాహరణగా తీసుకొని, పర్యావరణ కాలుష్యానికి కారణాలు నాల్గింటిని మరియు కాలుష్య ఫలితాలు నాల్గింటిని పేర్కొనండి.
జవాబు:
పర్యావరణ కాలుష్యానికి కారణాలు :
ఉదా : నైజీరియన్ డెల్టా నైజీరియాలో చమురు వెలికితీత వలన అక్కడి చమురు సముద్రపు నీటిలో కలిసి జీవావరణ – వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది.
పర్యావరణ కాలుష్యానికి కారణాలు :
- విచక్షణా రహితంగా అడవుల నరికివేత.
- విషపూరితాలైన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను మానవ నివాస ప్రాంతాలు, కాలువలు, నదులు, గాలిలోకి విడుదల చేయడం.
- అణుపరీక్షల వల్ల ఉత్పన్నమయ్యే రేడియో ధార్మికత.
- యంత్ర చోదిత వాహనాల నుండి కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోకార్బన్లు పరిమితిని మించి వెలువడటం.
- C.E.C వల్ల ఓజోన్ పొర దెబ్బతినడం.
- అశాస్త్రీయ పద్ధతుల ద్వారా చమురు వెలికితీత.
ఫలితాలు :
- చమురు వెలికితీత వల్ల నేలలు, భూగర్భజలాల కలుషితం అయి త్రాగునీరు కలుషితం అయి దీర్ఘకాలంలో కాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. చేపల ఉత్పత్తి తగ్గుతుంది.
- చెట్లు లేకపోతే వరదలు, కరవులు, ఎడారులు ఏర్పడటం మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం.
- జీవావరణం సమతౌల్యత కోల్పోయి జీవనం అపాయానికి లోనవటం.
- మానవుల ఆరోగ్యానికి హానికరంగా పర్యావరణం మారుచున్నది. వీటన్నింటికి మానవుడు చేపట్టే కార్యక్రమాలే ప్రధాన కారణం.
ప్రశ్న 4.
చైనాలో ప్రజాస్వామ్యం ఏర్పడిన తరువాత ప్రవేశ పెట్టిన సంస్కరణలేవి?
జవాబు:
- చైనా ప్రజల గణతంత్రం నూతన ప్రజాస్వామ్యం అన్న సిద్ధాంతంపై ఏర్పడింది. భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి.
- ఆర్థిక విధానంలోని కీలకాంశాలను ప్రభుత్వ అధీనంలో ఉంచారు.
- పెద్ద ఎత్తున భూ సంస్కరణలు అమలు చేశారు.
- భూస్వాముల భూమిని జప్తు చేసి పేద రైతాంగానికి పంచి పెట్టారు.
- మహిళల రక్షణకు, వాళ్ళ హక్కులకు, బహు భార్యత్వ నిషేధానికి కూడా చర్యలు చేపట్టారు.
- మహిళలు వివిధ రంగాలలో పురుషులతో సమానహోదా పొందగలిగారు.
ప్రశ్న 5.
అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి.
జవాబు:
- గిరిజనులు, పేద, రైతులు, భూమిలేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అందరికంటే ఎక్కువగా నష్టపోయారు.
- వీళ్ళకు మంచి చదువు, వైపుణ్యాలు వంటివి అందుబాటులో లేవు.
- అందువలన మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కానీ, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిహారాలు కానీ వీళ్ళకు – అందుబాటులో లేవు.
- గనుల త్రవ్వకం, ఆనకట్టల పథకాల వంటి వాటివల్ల అనేకమంది గిరిజనులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.
ప్రశ్న 6.
వియత్నాం జాతీయ ఉద్యమంలో పాఠశాల విద్య పాత్రను వివరింపుము.
జవాబు:
వియత్నాం జాతీయ ఉద్యమంలో పాఠశాల విద్య పాత్ర :
- ఫ్రెంచివాళ్ళు ఇచ్చిన పాఠ్యాంశాలను టీచర్లు గుడ్డిగా అనుసరించలేదు.
- పాఠాలు చెప్పేటప్పుడు వియత్నాం టీచర్లు పాఠాలలో ఉన్న దానిని మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు.
- కార్యాలయాలలో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హులుగా చేసే విధంగా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించసాగారు.
- దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం, విద్యావంతుల విధి అను నమ్మకంతో వారు ప్రేరణ పొందారు.
ప్రశ్న 7.
ఈ క్రింది పేరాగ్రాను చదివి, నీ అభిప్రాయం వ్రాయండి.
“19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాత్యహంకారం తిరిగి చోటు చేసికొంది. విద్యావంతులైన ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు. ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపేవాళ్ళు. అదే సమయంలో ప్రజలపై మరింత నియంత్రణను సాధించడానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నెరిపారు.”
జవాబు:
నైజీరియా ఒక ఆఫ్రికా దేశం. ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిషువారు ఏర్పరిచారు. నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరు వేరు ప్రాంతాలను ఒకటిగా చెయ్యడం ద్వారా దానిని ఏర్పరిచారు. నైజీరియాలో 3 తెగలవారు ఉన్నారు. ఉత్తర ప్రాంతంలో హౌసా-ఫులాని ప్రజలు, ఆగ్నేయ ప్రాంతంలో ఈబో తెగ, నైరుతి భాగంలో యెరూబా తెగల ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలో బ్రిటిషువారు విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అనుసరించారు. ఎందుకంటే వారు విద్యావంతులైతే బ్రిటిషు వారికి నైజీరియాలో మనుగడ ఉండదు. కనుక బ్రిటిషువారు నైజీరియాలో జాత్యాహంకారాన్ని ప్రదర్శించారు. విద్యావంతులైన ఆఫ్రికన్ వాసులను సివిల్ సేవలకు అనుమతి చూపలేదు. వ్యాపారుల పట్ల వివక్షత చూపారు. ప్రజలపై నియంత్రణ కోసం వీరు గిరిజన తెగ నాయకులతో సంపన్నులతో సంబంధాలు కలిగి ఉన్నారు. దానిని వ్యతిరేకించిన కొంతమంది విద్యావేత్తలు ఉమ్మడి నైజీరియా అనే భావన కలిగించి బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాడసాగారు. చివరకు వారు విజయం సాధించారు.
ప్రస్తుతం అన్ని దేశాలలో సమానత్వం అనే భావన ఉంది. జాత్యాహంకారం అనే భావనను రూపుమాపటం జరిగింది.
ప్రశ్న 8.
వియత్నాంలో ఫ్రెంచివాళ్ళు అనుసరించిన విధానాలేవి?
జవాబు:
- ఫ్రెంచి వలస పాలన వియత్నామీయుల జీవితాలలో అన్ని అంశాలను ప్రభావితం చేసింది.
- వియత్నాంని వరి ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచివారు చాలా ఆసక్తి కనబరిచారు.
- కాలువలు నిర్మించి సాగునీరు అందించారు.
- భూస్వాములను ప్రోత్సహించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు సహకరించారు.
- ఆర్ధిక వ్యవస్థ పారిశ్రామికీకరణ చెందడానికి ఫ్రెంచివారు ఏమీ చేయలేదు.
- వియత్నాం రైతాంగం అప్పుల విషవలయంలో చిక్కుకుపోయింది.
- మంచి విద్యను పొందడానికి అందరికీ అవకాశాలు లేవు.
- ఉన్నత విద్య అంతా ఫ్రెంచి భాషలోనే ఉండేది.
ప్రశ్న 9.
మీకివ్వబడిన డేటా ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
మంచూ రాజవంశ పతనం | 1911 |
సన్-యెట్-సెన్ మూడు సిద్ధాంతాలు | సన్-మిన్-చుయి |
చైనా ప్రజల గణతంత్ర రాజ్యం అవతరణ | 1949 |
నాపాలం | ప్రాణాంతకమైన బాంబు |
ఏజెంట్ ఆరెంజ్ | మొక్కల వినాశకారీ |
ఐక్య వియత్నాం | 1975 |
ఖండాంతర ఆఫ్రికా వాదం | క్యామెన్ క్రూమా |
నైజీరియా పర్యావరణ వాది | కెన్నోరో వివా |
ప్రజాస్వామ్య నైజీరియా ప్రభుత్వం | 1999 |
ప్రశ్నలు :
a) మంచూ రాజవంశ పాలన కలిగిన దేశం ఏది?
b) ఆధునిక చైనా నిర్మాతగా ఎవరిని పరిగణిస్తారు?
c) నైజీరియాకు చెందిన ప్రముఖ మానవహక్కుల కార్యకర్త, పర్యావరణవాది ఎవరు?
d) ఖండాంతర ఆఫ్రికా వాదం అనగా నేమి?
జవాబు:
a) మంచూ రాజవంశ పాలన కలిగిన దేశం : చైనా
b) ఆధునిక చైనా నిర్మాత : సన్ యెట్ సెన్
c) నైజీరియా మానవహక్కుల కార్యకర్త, పర్యావరణ వాది : కెన్ సారో వివా
d) ఖండాంతర ఆఫ్రికావాదం : దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడమే ఖండాంతర ఆఫ్రికావాదం.
ప్రశ్న 10.
గణతంత్రం ఏర్పాటులో సయెట్-సెన్ పాత్రను విపులీకరించుము.
జవాబు:
సయెట్-సెన్ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణించవచ్చు. ఆయన పేద కుటుంబానికి చెందినవాడు. అతడు చదివిన మిషనరీ పాఠశాలల్లో క్రైస్తవ మతంతోటి, ప్రజాస్వామ్య భావాలతోటి ప్రభావితం అయ్యాడు. వైద్యశాస్త్రం అభ్యసించినా చైనా భవిష్యత్తు పట్ల, అభివృద్ధి పట్ల ఆందోళన చెందాడు. చైనా సమస్యలను అధ్యయనం చేసి కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. చైనా అభివృద్ధికై 3 సిదాంతాలు రూపొందించాడు. ఇవి (సన్, మిన్, చుయి) ‘జాతీయతావాదం’ అంటే విదేశీ పాలకులుగా భావింపబడుతున్న మంచూ వంశాన్ని, విదేశీ సామ్రాజ్యవాద శక్తులను పారదోలటం. ‘ప్రజాస్వామ్యం’ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. “సామ్యవాదం” అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమిలేని రైతాంగానికి భూమిని పంచటానికి భూసంస్కరణలు వంటి వాటి ద్వారా ఆధునిక నిర్మాతగా వెలుగొందాడు.
ప్రశ్న 11.
చైనా అభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ కృషిని వివరించుము.
జవాబు:
రష్యా విప్లవం తరువాత కొద్ది కాలానికి 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. దోపిడీని అంతం చేసి, సాధారణ ప్రజల జీవితాలను సుఖమయం చేయడానికి సిసిపి అవిరళ కృషి చేసింది. గ్రామీణ చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంది. మొదటిది నేలలు నిస్సారం కావటం, అడవులను నరికి వెయ్యటం, వరదల వంటి జీవావరణ పరమైనవి. రెండోది దోపిడీ పూరిత భూమి కౌలు విధానాలు, ఋణభారం, పురాతన సాంకేతిక విజ్ఞానం, అభివృద్ధి చెందని ప్రసారమాద్యమాలతో కూడిన సామాజిక – ఆర్థికపరమైనవి.
పై సవాళ్ళను అధిగమించడానికి మావోజెడాంగ్ (1893 – 1976) తన విప్లవ కార్యక్రమాన్ని రైతాంగాన్ని ఆధారంగా చేసుకుని భిన్నమైన పంథాను అనుసరించాడు. భూస్వామ్యాన్ని అంతం చెయ్యడానికి గాను పోరాడేలా చైనా రైతాంగాన్ని సైన్యంగా మార్చాడు. ఇతర నాయకులలా కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రభుత్వ సైన్యాలను మావో నిర్మించాడు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ. కొత్త వివాహ చట్టాన్ని చేశారు.
ప్రశ్న 12.
చైనాలో భూసంస్కరణలు అమలు జరిగిన విధానాన్ని విపులీకరించండి.
జవాబు:
చైనా భూసంస్కరణలు అమలు చెయ్యటంలో సాధించిన విజయాలు, చైనా భవిషత్తుకు బలమైన పునాదిగా నిలిచాయని మేధావులంతా సాధారణంగా ఏకీభవిస్తారు. “గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకోవడం”, రైతాంగ సంఘాల నిర్మాణం వంటి వాటితో రెండు సంవత్సరాలు శాంతియుతంగా గడచిన పిదప 1950-51లో భూసంస్కరణల అమలు మొదలుపెట్టారు. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించటం, తరువాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి ఫంచటం వంటివి ఇందులో ముఖ్యమైన దశలు. ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను “ప్రాంతస్థాయి భూసంస్కరణల సంఘం” పంపించిన పని బృందాలు పోషించాయి. రైతాంగ సంఘాలను ఏర్పాటుచేయడం, స్థానిక నాయకత్వ స్థానాలను వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చెయ్యడం వీటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేది. చైనా సాగుభూమిలో 43 శాతాన్ని గ్రామీణ ప్రజలలో 60 శాతానికి పంచి పెట్టడంలో భూసంస్కరణలు విజయం సాధించాయి. పేద రైతుల కింద ఉన్న భూమి గణనీయంగా పెరిగింది. మధ్య తరగతి రైతాంగం బలమైన స్థితిలో ఉన్నందువల్ల అది ఎక్కువ ప్రయోజనం పొందింది.
ప్రశ్న 13.
అమెరికా ఉపయోగించిన ఏజెంట్ ఆరెంజ్ గూర్చి వివరింపుము.
జవాబు:
ఏజెంట్ ఆరెంజ్ ఆకులు రాలిపోయేలా చేసి మొక్కల్ని చంపే విషం. నారింజ పట్టి ఉన్న డ్రమ్ములలో నిల్వ చెయ్యడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. 1961-71 మధ్యకాలంలో అమెరికా కార్లో యుద్ధ విమానాలు వియత్నాంపై 500 లక్షల లీటర్ల ఈ విషపూరిత రసాయసాన్ని చల్లాయి. అడవులను, పొలాలను నిర్మూలించటం ద్వారా ప్రజలు దాక్కోటానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళని తేలికగా చంపొచ్చన్నది అమెరికా ప్రణాళిక. దేశంలోని 14 శాతం సాగుభూమి ఈ విషపూరిత రసాయనం వల్ల ప్రభావితం అయింది. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈనాటికీ కూడా ప్రజలపై దాని ప్రభావం ఉంది. ఏజెంట్ ఆరెంజ్ లోని రసాయనిక అంశమైన డై ఆక్సిన్ పిల్లల్లో మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ కి కారకం. ఈ మందు పిచికారీ చేసిన ప్రాంతాల్లో పిల్లలలో అవయవలోపాలు అధికంగా ఉండడానికి ఈ విషమే కారణమని ఒక అధ్యయనం వెల్లడి చేసింది.
ప్రశ్న 14.
నైజీరియాలో చమురు నిల్వల వలన పర్యావరణ సమస్యలు ఎలా ఉత్పన్నమయ్యా యి?
జవాబు:
నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికితీసే హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. ప్రస్తుతం ఇది నైజీరియాకు ముఖ్యమైన వనరు. విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా చమురును వెలికితీయటం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రత్యేకించి మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. చమురు వల్ల నేలలు, భూగర్భజలాలు కలుషితమయ్యి పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీళ్ళు కూడా కలుషితమయ్యాయి. తాగునీళ్ళు కలుషితం కావడం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపింది. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడ్డాయి. సముద్రజలాల్లో చమురు ఊటలు చాలా ఎక్కువగా ఉండి, తీరప్రాంత పర్యావరణం ప్రభావితమయ్యి, స్థానికంగా చేపల ఉత్పత్తి పడిపోయింది. పర్యావరణ పరిరక్షణకై కెన్ సారో వివా పర్యావరణ ఉద్యమాన్ని నడిపించి కొంత విజయం సాధించాడు.
ప్రశ్న 15.
“చమురు, పర్యావరణం, రాజకీయాలు” గురించి రాయండి.
జవాబు:
నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికితీసే హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. ప్రస్తుతం ఇది నైజీరియాకి ముఖ్యమైన వనరు. చమురు బావులలో అనేకం బహుళజాతి సంస్థల అధీనంలో ఉన్నాయి. ఇవి చమురుని వెలికితీసి తమ లాభాల్లో కొంత శాతాన్ని సైనిక పాలకులతో పంచుకున్నాయి. సాధారణ ప్రజలకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనమూ ఒనగూడలేదు. అంతేకాదు విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యధేచ్చగా చమురును వెలికి తీయటం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యింది. ప్రత్యేకించి మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. ఈ చమురు నేలలోకి ఇంకి ప్రతి సంవత్సరం ముంపుకి గురైనప్పుడు తిరిగి నీటిపైకి రావటం వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి. నెజీరియాలోని మడ అడవులు జీవావరణ వ్యవసలో 5-10 శాతం వరకు నరికివెయ్యబడటం వల్లగానీ, చమురు ఊటల వల్లగానీ నష్టపోయాయని అంచనా, ఈ చమురు వల్ల నేలలు, భూగర్భజలాలు కలుషితమయ్యి పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీళ్లు కూడా తరచు కలుషితమవుతున్నాయి. స్థానిక నీటి మడుగులలో పలచటి నూనె జిడ్డు కనపడుతుంది. తాగునీళ్లు కలుషితం కావటంతో ఆరోగ్యంపై వెంటనే ప్రభావం కనపడకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. సముద్ర జలాల్లో చమురు ఊటలు చాలా ఎక్కువగా ఉండి, తీరప్రాంత పర్యావరణం – ప్రభావితమయ్యి స్థానికంగా చేపల ఉత్పత్తి పడిపోతుంది.
1990ల కాలంలో ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతంలో ప్రజల ఆందోళన క్రమేపీ పెరగసాగింది. స్థానిక గిరిజన తెగలు సంవత్సరాల తరబడి జరిగిన జీవావరణ నష్టానికి పరిహారం చెల్లించాలని, తమ ప్రాంతంలోని చమురు వనరులపై తమకు నియంత్రణ కావాలని పోరాడసాగాయి. ఈ ఆందోళన మొదట జాతి ఆధారంగా సభ్యులలో ఐకమత్యం సాధించి శాంతియుతంగా ఉన్నది. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త,’ పర్యావరణవాది అయిన కెన్ సారో వివాని అంతర్జాతీయ నిరసనల మధ్య మిలటరీ ప్రభుత్వం మరణశిక్ష వెయ్యటంతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి.
ఒక జాతిగా ఏర్పడటానికి, సుస్థిర ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించటానికి, తన భౌతిక వనరులపై నియంత్రణను – సాధించటానికి నైజీరియా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ప్రశ్న 16.
“నైజీరియాలోని చమురును యథేచ్చగా వెలికి తీయటం వల్ల అక్కడి పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందనే వాదనతో మీరు ఏకీభవిస్తారా”? మీ అభిప్రాయాలను చెప్పండి.
జవాబు:
పై వాదనతో నేను ఏకీభవిస్తాను. కారణాలు….
విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యధేచ్ఛగా చమురును వెలికి తీయటం వల్ల తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు వచ్చాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అంతేకాక నైజీరియాలోని మడ అడవులు చమురును తట్టుకోలేక చాలా విస్తీర్ణంలో అంతరించిపోయాయి. ఈ మడ అడవులు జీవావరణ వ్యవస్థలో 5-10శాతం వరకు నరికి వెయ్యబడటం వల్లగానీ, చమురు ఊటల వల్ల గానీ నష్టపోయాయని అంచనా వేయబడింది.
ఈ చమురు వల్ల నేలలు, భూగర్భజలాలు కలుషితమయ్యి ఎంతో విస్తీర్ణంలో పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. త్రాగే నీరు కూడా కలుషితమవుతున్నాయి. త్రాగు నీళ్ళు కలుషితం కావటంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి జబ్బులు రావటానికి అవకాశం ఉంది. నైజీరియా నీటి మడుగులలో ఎల్లప్పుడు పల్చటి నూనె జిడ్డు కనిపిస్తుంది.
సముద్ర జలాల్లో చమురు ఊటలు ఎక్కువగా ఉండి, తీరప్రాంత పర్యావరణం ప్రభావితమయ్యి స్థానికంగా చేపల ఉత్పత్తి కూడా పడిపోతుంది.
కావున చమురు మూలంగా నైజీరియా పర్యావరణం చాలా దెబ్బతింటుందనే అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను.