AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు

8th Class Telugu ఉపవాచకం 1st Lesson హద్దులు-హద్దులు Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

కింది పరిచిత గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1. సంక్రాంతి పండక్కి వచ్చిన అల్లుడు ఇడ్డెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్న పొత్తులు, తాలింపు శనగలు ఇలా తెగ చిరుతిళ్ళు లాగించి కడుపునొప్పంటుంటే డాక్టరుకు కబురు చేశారు మామగారు. డాక్టరుగారు అల్లుడికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయ్యాక, అల్లుడిగారు జబ్బేమిటంటూ మామగారు డాక్టర్ని అడిగాడు. డాక్టరుగారు ఒక పళ్ళెంలో ఉన్న గారెలు, బొబ్బట్లు, వేరుశనగ పప్పులు, ఐదూ, పది పైసల నాణేలూ చూపించాడు. ఆ డబ్బులెక్కడివో అని అత్తగారు అయోమయంగా చూసింది. మెంతుల డబ్బాలోను, పప్పుల డబ్బాలోను అత్తగారు దాచుకున్న డబ్బులు శనగపప్పుతో పాటు బొబ్బట్లలో కలిసి అల్లుడిగారు పొట్టలోకి వెళ్ళి పోయుంటాయన్నారు మామగారు.
ప్రశ్నలు :
1. అల్లుడి కడుపునొప్పికి కారణమేంటి?
జవాబు:
ఇద్దెన్లు, బొబ్బట్లు, గారెలు, మొక్కజొన్నలు, తాలింపు శనగలు బాగా తినడంతో కడుపునొప్పి వచ్చింది.

2. అల్లుడికి ఆపరేషన్ చేసి తీసిన వాటిలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
గారెలు, బొబ్బట్లు, వేరుశనగపప్పులు, ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలు.

3. సంక్రాంతి పండక్కి కాక, ఇంకా ఏయే సందర్భాలలో అల్లుళ్ళను మామగారు ఇంటికి ఆహ్వానిస్తారు?
జవాబు:
గృహప్రవేశాలకు, దీపావళి, ఉగాది వంటి పండు గలకు, ఇంట్లో వేడుకలకు మావగారు అల్లుళ్ళని ఆహ్వానిస్తారు.

4. పై గద్యంలో మీకు నవ్వు తెప్పించిన విషయమేంటి?
జవాబు:
బొబ్బట్లు, గారెలు, వేరుశనగపప్పులతో పాటు అల్లుడిగారి పొట్టలోంచి ఐదు పైసల నాణేలు, పది పైసల నాణేలను డాక్టరుగారు బయటకు తీసి అందరికీ ఆదర్శంగా నిలవాలి.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

2. పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు. బావమరిది బావగారిని హద్దు మీరి వేళాకోళం చేస్తున్నాడు. అందుకు మామగారు కొడుకును మందలించాడు. మామగారు – అతిగా ఫలహారాలు పెట్టకు, అల్లుడి ఆరోగ్యం పాడవుతుంది అని భార్యతో చెప్పాడు. ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోయాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిది పై కోపపడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతోపాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారు పడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.
ప్రశ్నలు:
1. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు.

2. అల్లుడు ఎవరిపై కోపపడతాడు?
జవాబు:
అల్లుడు మరిది పై కోపపడతాడు.

3. అత్తగారు ఎవరిని తీసుకురమ్మని భర్తతో అంటుంది?
జవాబు:
అత్తగారు డాక్టరును తీసుకొని రమ్మని భర్తతో అంటుంది.

4. బావమరిది ఎవరిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు?
జవాబు:
బావమరిది బావగారిని హద్దుమీరి వేళాకోళం చేస్తున్నాడు.

3. ‘హద్దులు హద్దులు’ నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

డాక్టరు నర్సును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్సు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

ఆ తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు. ఈ ఘట్టం మంచి నవ్వును తెప్పించింది.
ప్రశ్నలు:
1. ‘హద్దులు హద్దులు’ అనే నాటకంలో హాస్యఘట్టం ఏది?
జవాబు:
హద్దులు హద్దులు అనే నాటకంలో అల్లుడు పొట్టకు డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం మంచి హాస్యఘట్టం.

2. డాక్టరు ఎవరిని మందలించాడు?
జవాబు:
డాక్టరు అల్లుడిని మందలించాడు.

3. ప్రేక్షకులకు కనబడనిది ఎవరు?
జవాబు:
ప్రేక్షకులకు కనబడనిది పేషంటు.

4. కంగారు పడినది ఎవరు?
జవాబు:
కంగారు పడినది అల్లుడు.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

4. హద్దులు హద్దులు నాటిక ద్వారా, తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు – హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, ఖర్చుకు హద్దులు – ఉండాలని రచయిత సందేశం ఇచ్చాడు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్న వారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వారని మరిది అతిగా వేళాకోళం చేశాడు.
ప్రశ్నలు:
1. ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది ఎవరు?
జవాబు:
ప్రతీదానికి హద్దులు ఉండాలని సందేశం ఇచ్చింది రచయిత.

2. పండుగకు వచ్చింది ఎవరు?
జవాబు:
పండుగకు వచ్చింది కొత్త అల్లుడు.

3. చిరుతిళ్ళు అతిగా తింటే ఏమి వస్తుంది?
జవాబు:
చిరుతిళ్ళు అతిగా తింటే రోగం వస్తుంది.

4. ఎవరు ఎవరిని వేళాకోళం చేయడం సహజం?
జవాబు:
బావమరిది బావను వేళాకోళం చేయడం సహజం.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఈ నాటిక సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
కొత్త అల్లుడు తన అత్తవారింటికి పండుగకి వస్తాడు. కొత్త అల్లుడు వచ్చాడనే సంబరంతో వాళ్ళు రకరకాల పిండివంటలు చేసి అల్లుడికి విందుభోజనం తినిపిస్తారు. తమ ఇంటికి వచ్చిన బావగారిని మరిది హద్దుమీరి వేళాకోళం చేస్తుంటాడు. అది చూచిన మామగారు తన కొడుకుని అలా చేయకూడదని మందలిస్తాడు. అత్తగారు కూడా ఎంత బావయినా అలా చేయకూడదని కొడుకుని కోప్పడుతుంది. అల్లుడుగారు కూడా కొంత బెట్టుగా ఉంటే బాగుంటుంది అంటుంది.

ఇంతలో అల్లుడు కడుపునొప్పితో మెలితిరిగిపోతాడు. బావగారితో మరిది వేరుశనగకాయలు కావాలా ? అని వేళాకోళం చేస్తాడు. అల్లుడు మరిదిపై కోప్పడతాడు.

అత్తగారు డాక్టరును తీసుకురమ్మని భర్తతో అంటుంది. పండుగ ఖర్చుతో పాటు, డాక్టరు ఖర్చూ వచ్చిందని మామగారు మూలుగుతాడు. చివరకు డాక్టరు పరీక్షించి అల్లుడి పొట్టకు ఆపరేషన్ చేయాలన్నాడు. వేయిరూపాయలు ఖర్చవుతుందన్నాడు. అల్లుడు తన ప్రాణం పోతుందని కంగారుపడ్డాడు. తప్పనిసరయి, మామగారు ఆపరేషను చేయించాడు.

అల్లుడు పొట్టలో అతడు తిన్న గారెలు, బూరెలతోపాటు చెంచాలు, అణాలు, నాణేలు ఉన్నాయి. వాటిని తీసి డాక్టరు అందరికీ చూపించాడు. అత్తగారు పోపులడబ్బాలో దాచిన నాణేలు శనగపప్పుతో కలిసి అల్లుడి పొట్టలోకి వెళ్ళాయి.

అన్ని పనులకూ హద్దులు ఉండాలి అని ఈ నాటిక సందేశం ఇస్తుంది.

ప్రశ్న 2.
ఈ నాటికలో మీకు నచ్చిన హాస్య సంఘటనను రాయండి. “హద్దులు – హద్దులు” నాటికలోని మీకు నచ్చిన హాస్య సన్నివేశాన్ని రాయండి.
(లేదా)
హద్దులు – హద్దులు నాటిక ద్వారా మీరు పొందిన ‘హాస్యానుభూతి’ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
ప్రతిదానికి హద్దులుండాలంటూ హాస్యస్పోరకంగా సాగిన ఈ నాటకం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అయితే నాకు ఈ నాటకంలో అల్లుడి పొట్టను డాక్టరు రంపంతో కోసి ఆపరేషను చేసినట్లు చూపించిన ఘట్టం కడుపు ఉబ్బేలా నవ్వు తెప్పించింది.

డాక్టరు నర్పును ఆపరేషనుకు సిద్ధం చేయమంటాడు. నర్పు రంపం తీసుకువస్తుంది. “ఈ రంపమేమిటి ? దీనితో కోస్తారా ?” అని అల్లుడు కంగారుపడతాడు. “దేనితో కోస్తే నీకెందుకు ? మాట్లాడకుండా బల్లమీద పడుకో” అని డాక్టరు అల్లుడిని మందలిస్తాడు.

తర్వాత ప్రేక్షకులకు పేషంటు కనబడడు. కానీ డాక్టరు రంపంతో కోసినట్లు నటించి పొట్టలో నుంచి, బొబ్బట్లు, గారెలు, చెంచాలు వగైరా ఒక్కొక్కటీ తీసి, ప్రేక్షకులకు చూపించి, పక్కన పెడుతూ ఉంటాడు.

డాక్టరు ఆపరేషను పూర్తి చేసి, “పెద్దవాళ్ళెవరో ఒకసారి ఇలా రండి” అని పిలిస్తాడు. అత్తగారు, “ఆపరేషన్ పూర్తయ్యిందా ! మా అల్లుడు కులాసాగా ఉన్నాడా ?” అని డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు డాక్టరు “ఏమల్లుడు ? నా మొఖం అల్లుడు” అంటాడు. అప్పుడు అత్తగారు గుండెలు బాదుకొని, “అయ్యో అయిపోయిందా, అయ్యో నా తల్లీ ! ఓ నా కూతురా ! చిన్నతనంలోనే నీకీ…..” అంటూ ఏడుస్తుంది.

“ఛా. ఛా ! ఊరుకోండి. మీ అల్లుడు నిక్షేపంలా ఉన్నాడు” అని డాక్టరు ఆవిడను మందలిస్తాడు.

ఈ హాస్య ఘట్టం నాకు ఎంతగానో నచ్చింది.

AP Board 8th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 హద్దులు-హద్దులు

ప్రశ్న 3.
హద్దులు – హద్దులు నాటిక ద్వారా రచయిత ఇచ్చిన సందేశాన్ని వివరంగా చర్చించండి.
జవాబు:
దేనికైనా హద్దులుండాలని రచయిత ఈ నాటకం ద్వారా సందేశమిచ్చారు.

పండుగకు కొత్త అల్లుడు వచ్చాడు గదా అని, అతిగా ఫలహారాలూ, పిండివంటలూ, చిరుతిళ్ళు పెడితే, అవి తిన్నవారికి రోగం వస్తుందని ఈ నాటిక సందేశం ఇస్తోంది. బావమరిది బావగారిని వేళాకోళం చేయడం సహజం. కానీ అల్లరి అతిగా ఉండరాదని ఈ నాటిక సందేశం ఇచ్చింది. “అల్లం రసం పట్టే సందే ఉంటే, మరి రెండు బొబ్బట్లు బావగారు లాగించేసే వార”ని మరిది అతిగా వేళాకోళం చేశాడు.

అల్లుడు అజీర్ణం చేసి, గిలగిలలాడుతూ ఉంటే, డాక్టరు దగ్గరకు వెళ్ళడానికి ఖర్చు అవుతుందని మామగారు వెనకాడతాడు. ఆలస్యానికి హద్దులుండరాదని ఈ ఘట్టం చెపుతోంది.

అల్లుడికి అజీర్ణం చేయడానికి నీవే కారణం అని మామగారూ, మీరే కారణం అని అత్తగారూ డాక్టరు దగ్గరే పోట్లాటకు దిగారు. పోట్లాటకు హద్దులుండాలి అని ఈ నాటిక సూచిస్తోంది.

డాక్టరు ఆపరేషనుకు ఫీజు వేయి రూపాయలు కావాలన్నాడు. ఫీజుకు హద్దులుండాలని ఈ నాటిక తెలుపుతోంది. అల్లుళ్ళు అత్తవారింట్లో అతి చనువుగా ఉండరాదనీ, మరీ ముంగిగా కూడా ఉండరాదనీ ఈ నాటిక తెలిపింది.

రచయిత ఈ నాటకం ద్వారా తినడానికి హద్దులు, నవ్వడానికి హద్దులు, ఆలస్యానికి హద్దులు, తొందరకు హద్దులు, చాదస్తానికి హద్దులు, అల్లరికి హద్దులు, పిసినారితనానికి హద్దులు, ఖర్చుకు హద్దులు ….. మొత్తానికి అన్నింటికీ హద్దులుండాలని సందేశమిచ్చారు.