These AP 10th Class Social Studies Important Questions 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి will help students prepare well for the exams.
AP Board 10th Class Social 4th Lesson Important Questions and Answers భారతదేశ శీతోష్ణస్థితి
10th Class Social 4th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. ఊటి ఏ పర్వతాలలో ఉంది?
జవాబు:
నీలగిరి పర్వతాలు
2. ‘ట్రేడ్’ అను జర్మన్ పదము యొక్క అర్థమేమిటి?
జవాబు:
ట్రాక్
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలకరి జల్లులను ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
మామిడి జల్లులు
4. వాయువు, మధ్య భారతంలో వేసవి కాలంలో నమోదవుతున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలు ఎంత?
జవాబు:
410 – 42°C
5. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడిన ప్రధాన ఉద్దేశ్యం ఏమి?
జవాబు:
భూగోళం వేడెక్కడం తగ్గించడం
6. ‘మానసూన్స్’ కు ఆ పేరు పెట్టిన వారు ఎవరు?
జవాబు:
అరబ్బులు
7. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపునకు వెళుచున్నట్లయితే ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు చూడవచ్చు?
జవాబు:
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
8. తిరోగమన ఋతుపవన కాలంలో మన దేశంలోని ఏ తీరం (రాష్ట్రం)లో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది?
జవాబు:
కోరమండల్ (తమిళనాడు)
9. భారతదేశానికి అత్యధిక వర్షపాతాన్ని కలుగజేసే (ఋతు) పవనాలు ఏవి?
జవాబు:
నైఋతి ఋతుపవనాలు
10. ఋతుపవనారంభం ఎక్కడ (ఏ రాష్ట్రంలో) (ఏ తీరంలో) జరుగుతుంది?
జవాబు:
కేరళ
11. ఉత్తర మైదానాలలో పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలనేమంటారు?
జవాబు:
‘లూ’
12. భారతదేశంలో తిరోగమన (ఈశాన్య) ఋతుపవన కాలం ఎప్పుడు?
జవాబు:
అక్టోబరు – డిసెంబరు.
13. భారతదేశంలో నైరుతి (పురోగమన) ఋతుపవన కాలం ఎప్పుడు?
జవాబు:
జూన్ – సెప్టెంబరు.
14. “క్లోమోగ్రాఫ్’ వేటిని గూర్చి తెలుపును?
జవాబు:
ఉష్ణోగ్రత, వర్షపాతం
15. నైరుతి ఋతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం పొందే తీరం (రాష్ట్రం) ఏది?
జవాబు:
కోరమండల్ (తమిళనాడు)
16. ఒక ప్రాంత శీతోష్ణస్థితిని లెక్కించటానికి ఆధారపడే సమయం కనీసం ఎన్ని సం||రాలు?
జవాబు:
30
17. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఏది?
జవాబు:
ఉష్ణమండల ప్రాంతం
18. భారతదేశంలోని ఏ ప్రాంతం పొడవైన తీర రేఖను కలిగి ఉంది?
జవాబు:
దక్షిణ
19. ఉపరితల వాయు ప్రవాహాలను ఏమంటారు?
జవాబు:
జెట్ ప్రవాహాలు
20. సాంప్రదాయ భారతీయ కాలాలు ఎన్ని?
జవాబు:
‘6’
21. ఏ సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయు గుండాలను పశ్చిమ విక్షోబాలు అంటారు?
జవాబు:
మధ్యధరా సముద్రం
22. వార్సా ఏ దేశ రాజధాని?
జవాబు:
పోలెండ్
23. నైరుతి ఋతుపవన కాలంలో (భారతదేశంలో) వర్షచ్చాయ ప్రాంతం ఏది?
జవాబు:
దక్కన్ పీఠభూమి తూర్పు అంచు
24. నైరుతి ఋతుపవనాలు భారతదేశం దాటి వెళ్ళకుండా అడ్డుకునేవి ఏవి?
జవాబు:
హిమాలయాలు
25. తుఫాన్ నెల అని ఏ నెలను పిలుస్తారు?
జవాబు:
నవంబర్
26. భారతదేశం సుమారుగా ఏ రేఖాంశాల మధ్య ఉంది?
జవాబు:
68° తూ – 97° తూ
27. భారతదేశాన్ని రెండు సమభాగాలుగా చేస్తున్న రేఖ (అక్షాంశం) ఏది?
జవాబు:
కర్కట రేఖ
28. కర్కటరేఖకు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు వరసగా ఏ మండలాల్లో ఉన్నాయి?
జవాబు:
సమశీతోష్ణ, ఉష్ణ మండలాలు
29. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు వస్తుంది?
జవాబు:
ఉష్ణోగ్రత తగ్గుతుంది
30. కొడైకెనాల్, ఉదగ మండలంలు …….. లో ఉన్నాయి.
జవాబు:
పశ్చిమ కనుమల్లో
31. తిరోగమన ఋతుపవనాల సమయంలో అధిక ఉష్ణోగ్రత, చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనినే సాధారణంగా ఏమంటారు?
జవాబు:
అక్టోబరు వేడిమి.
32. నైరుతి ఋతువవనాలను రెండు శాఖలుగా విభజించునది ఏది?
జవాబు:భారత ద్వీపకల్పం
33. జెట్ ప్రవాహాలు నేల నుంచి ఎన్ని మీటర్ల ఎత్తులో వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి?
జవాబు:
12,000 mts.
34. ఏ అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది?
జవాబు:
250 ఉ. అ
35. భారతదేశ భూభాగంపై ఏ నెల నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి?
జవాబు:
నవంబరు
36. భారతదేశం ఉత్తరార్ధ గోళంలోని ఏ పవనాల మేఖలలో ఉంది?
జవాబు:
వ్యాపార పవనాలు
37. పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది?
జవాబు:
9
38. భారతదేశంలో ఋతుపవనాల ఆరంభం ఏ నెలలో మొదలవుతుంది?
జవాబు:
జూన్
39. వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఏ నెలలను సంధికాలంగా పేర్కొంటారు?
జవాబు:
అక్టోబరు, నవంబరు
40. తిరోగమన రుతుపవన కాలంలో ఏ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి?
జవాబు:
అండమాన్
41. ఏ తీర ప్రాంతంలో అధిక శాతం వర్షం, తుఫానులు వాయు గుండాల వల్ల సంభవిస్తుంది?
జవాబు:
కోరమండల్ తీరం
42. సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే వాతావరణంలోని పొర ఏది?
జవాబు:
ఓజోన్
43. టండ్రాలో మంచు క్రింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు?
జవాబు:
మీథేన్
44. AGW లు అనగా?
జవాబు:
మానవ కారణంగా భూగోళం వేడెక్కడం
45. హరిత గృహ వాయువుల ఉద్గాలను తగ్గించటానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రభుత్వ సంఘం ఏది ?
జవాబు:
IPCC
46. అభివృద్ధి చెందిన దేశాలు ఏ ఇంధనాల వాడకం ద్వారా అభివృద్ధి చెందియున్నవని, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన?
జవాబు:
శిలాజ ఇంధనాలు
47. ‘ఐలా తుఫాను కారణంగా 2009లో ఏ ప్రాంతం అతలాకుతలమయ్యింది?
జవాబు:
సుందర్ బన్ ప్రాంతం
48. సగటు ఉష్ణోగ్రతలు 2°C పెరగటం వలన (వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి) సముద్ర మట్టం ఎంత మేర పెరుగుతుంది?
జవాబు:
1 మీటరు
49. క్రింది వానిలో శిలాజ ఇంధనానికి ఉదాహరణ
సౌరవిద్యుత్, నేలబొగ్గు, పవన శక్తి, జలశక్తి
జవాబు:
నేలబొగ్గు
50. 2013లో IPCC సమావేశం ఏ నగరంలో జరిగింది.
జవాబు:
వార్సా
51. ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఏమి అంటారు?
జవాబు:
వాతావరణం (వెదర్)
52. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను ఏమంటారు?
జవాబు:
శీతోష్ణస్థితి (క్లైమేట్)
53. క్రింది వానిలో శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశం కానిది ఏది?
అక్షాంశం, భౌగోళిక స్వరూపం, మైదానం, ఉపరితల గాలి ప్రసరణ, భూమికి-నీటికి గల సంబంధం
జవాబు:
మైదానం
54. ఉత్తరార్ధగోళంలో ఉపఅయనరేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే పవనాలు ఏవి?
జవాబు:
శాశ్వత పవనాలు (వ్యాపార పవనాలు)
55. ఏ రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఉష్ణ ప్రాంతాలు అంటారు?
జవాబు:
భూమధ్య రేఖకు
56. జనవరి సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత ఎంతకంటే తక్కువ ఉంటుంది?
జవాబు:
10°c
57. వేసవికాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకి వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉంటుంది?
జవాబు:
ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
58. భారతదేశంలో కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మొదటగా గుర్తించువారు ఎవరు?
జవాబు:
అరబ్ వర్తకులు
59. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరంతోపాటు ఏ తీర ప్రాంతాన్ని తాకుతుంది?
జవాబు:
షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖంను.
60. అరేబియా సముద్రంలో పుట్టే ఉష్ణ తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉండి, ఏ నది డెల్టా ప్రాంతాలపై వీటి ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:
గోదావరి, కృష్ణా, కావేరి.
61. జనవరి – ఫిబ్రవరి నెలలందు ఉండే ఋతువు ఏది?
జవాబు:
శిశిరం.
62. మొక్కలు వినియోగించుకుని మాంసకృత్తులు తయారు చేయటానికి పనికివచ్చే వాయువు ఏది?
జవాబు:
నత్రజని
63. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి.
i) భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు ఒక కారణం
ii)వాతావరణ మార్పు ప్రపంచ స్థాయిలో జరుగుతుంది.
పై వ్యాఖ్యలలో సరైనది ఏది?
A) (i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) రెండూ కావు.
జవాబు:
C) (i) మరియు (ii)
64. భారతదేశ శీతోష్ణస్థితి విషయంలో క్రింది వానిలో సరైనది గుర్తించి రాయండి.
(i) కర్కటరేఖ భారతదేశం మధ్యగుండా పోతుంది.
(ii) దక్షిణ భారతదేశం ఉష్ణ మండలంలో కలదు.
(iii) ఉత్తర భారతదేశం ధృవ మండలంలో కలదు.
A) (i) మాత్రమే
B) (i) మరియు (ii)
C) (iii) మాత్రమే
D) (1), (ii) మరియు (iii)
జవాబు:
B) (1) మరియు (ii)
65. క్రింది వానిలో భూగోళం వేడెక్కటాన్ని నియంత్రించే చర్య కానిది.
→ చెట్లు పెంచడం.
→ సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరించటం.
→ ప్రజా రవాణాను ఉపయోగించడం.
→ శిలాజ ఇంధనాల వాడకం పెంచటం.
జవాబు:
శిలాజ ఇంధనాల వాడకం పెంచడం.
66. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) వసంత ఋతువు ( ) a) మార్చి – ఏప్రిల్
ii) గ్రీష్మ ఋతువు ( ) ( b) మే – జూన్
iii) వర్ష ఋతువు ( ) c) జులై – ఆగష్టు
iv) శరద్ ఋతువు ( ) d) సెప్టెంబర్ – అక్టోబరు
జవాబు:
i- a, ii-b, iii – c, iv-d
67. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) క్లైమోట్రోగ్రాఫ్ ( ) a) అధిక వర్షపాతం
ii) జె స్ట్రీం ( ) b) స్థానిక పవనం
iii) లూ ( ) c) ఉపరితల వాయుప్రసరణ
iv) నైరుతి ( ) (d) వర్షపాత చిత్రం
జవాబు:
i-d, ii-c, iii – b, iv-a
68. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మామిడి జల్లులు ( ) a) పెట్రోల్
ii) మీథేన్ ( ) b) అతి నీలలోహిత కిరణాలు
iii) ఓజోన్ ( ) c) టంద్రాలు
iv) శిలాజ ఇంధనం ( ) d) తొలకరి వాన
జవాబు:
i-d, ii-c, iii-b, iv-a
69. సిమ్లా, ఊటి మొ||న వేసవి విడిదులలో చాలా చల్లగా ఉండటానికి గల కారణమేమి?
జవాబు:
సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం.
70. ‘జెట్ ప్రవాహాల వేగం దాదాపుగా ఎంత ఉంటుంది?
జవాబు:
వేసవిలో 110 కి.మీ. / గంటకు, శీతాకాలంలో 184 కి.మీ. / గంటకు.
71. పశ్చిమ విక్షోభాల వల్ల ఏ పంటకు ప్రయోజనం కల్గుతుంది?
జవాబు:
గోధుమ.
72. ఋతుపవనాలు ఏ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి?
జవాబు:
20° ఉ.అ – 20°ద.అ
73. వేసవిలో ఢిల్లీతో పోలిస్తే సిమ్లాలో వాతావరణం చల్లగా ఉండటానికి కారణమేమి?
జవాబు:
సిమ్లా, ఢిల్లీ కన్నా ఎత్తులో ఉండటం.
74. క్రింది వానిలో సరికాని జతను గుర్తించి, రాయండి..
→ అతి ఎత్తైన ప్రాంతం – లెహ్
→ సముద్ర సామీప్య శీతోష్ణస్థితి – ముంబయి
→ ఖండాంతర్గత శీతోష్ణస్థితి – చెన్నై
→ అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతం – జైపూర్
జవాబు:
ఖండాంతర్గత శీతోష్ణస్థితి – చెన్నై
75. పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో, అదే విధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో తేడాని ఉండని శీతోష్ణస్థితిని ఏమంటారు ?
జవాబు:
సమశీతోష్ణస్థితి (సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి)
76. IPCCని విస్తరింపుము.
జవాబు:
శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచదేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం. (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లెమేట్ ఛేంజ్)
77. AGWని విస్తరింపుము :
జవాబు:
మానవ కారణంగా భూగోళం వేడెక్కటం. (ఆంత్రోపో జెనిక్ గ్లోబల్ వార్మింగ్)
78. భూమధ్య రేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే నగరానికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గ్యాంగ్ టక్, ఈటానగర్.
79. భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాని, సముద్రానికి దగ్గరగా లేదు, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతానికి ఉదాహరణ.
జవాబు:
అనంతపురం (రాయలసీమ ప్రాంతం)
10th Class Social 4th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
అడవుల నరికివేత భూగోళం వేడెక్కడాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
- చెట్లు తగ్గిపోవటం.
- కిరణజన్య సంయోగక్రియకు ఆస్కారం లేకపోవడం లేక ఆక్సిజన్ మోతాదు తగ్గటం
- వాతావరణంలో కర్బన వాయువులు పెరగటం
ప్రశ్న 2.
భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే ఏవేని రెండు మానవ కార్యకలాపాలను వ్రాయండి.
జవాబు:
- అడవుల నరికివేత
- పారిశ్రామికీకరణ
ప్రశ్న 3.
కోరమండల్ తీరంలో ఏ ఋతుపవన కాలంలో వర్షపాతం తక్కువ?
జవాబు:
నైరుతి ఋతుపవన కాలంలో.
ప్రశ్న 4.
పటాన్ని పరిశీలించి క్రిందనివ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
a) ఋతుపవనాలు మహారాష్ట్రలో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జవాబు:
జూన్ 10న మహారాష్ట్రలో ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.
b) ఋతుపవనాలు కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జవాబు:
జూన్ 1న కేరళలో ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.
c) భారతదేశంలో మొదటిగా ఏ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి?
జవాబు:
కేరళ
d) ఋతుపవనాలు గుజరాత్ లో ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జవాబు:
జూన్ 15న
ప్రశ్న 5.
‘అక్టోబరు వేడిమి’కి కారణాలేవి?
జవాబు:
అక్టోబర్ వేడిమికి గల కారణాలు : అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ.
ప్రశ్న 6.
కింది పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పవనాలు ఎల్లప్పుడు అల్ప పీడనం వైపే ఎందుకు వీస్తాయి?
జవాబు:
- అల్పపీడన ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువ మరియు నీరు ఆవిరిగావడం ఎక్కువ.
- వెచ్చని గాలి పైకి పోవడం వల్ల చల్లని గాలి ఆ స్థలాన్ని ఆక్రమిస్తుంది.
బి) భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వీస్తాయి?
జవాబు:
భారతదేశంలో జూన్ మాస ప్రారంభంలో, జూలైలో నైరుతి ఋతుపవనాలు వీస్తాయి.
ప్రశ్న 7.
ఢిల్లీ, చెన్నై నగరాల శీతోష్ణ పరిస్థితులను పోల్చండి.
జవాబు:
- చెన్నై సముద్రతీరంలో ఉండుట వలన ఉష్ణోగ్రత వ్యత్యాసం తక్కువ.
- ఢిల్లీ దేశ అంతర్భాగంలో ఉండడం మరియు సముద్ర ప్రభావం లేకపోవడం వల్ల సాంవత్సరిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువ.
ప్రశ్న 8.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
ప్రశ్న : జనవరి నెలలో సగటు 10°C ఉష్ణోగ్రత గల ఏవైనా రెండు రాష్ట్రాల పేర్లు పేర్కొనండి.
జవాబు:
- జమ్ము కాశ్మీర్
- హిమాచల్ ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- ఉత్తరప్రదేశ్
- సిక్కిం
- అరుణాచల్ ప్రదేశ్
ప్రశ్న 9.
పశ్చిమ విక్షోభాలు అంటే ఏమిటి?
జవాబు:
మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అంటారు.
ప్రశ్న 10.
శీతోష్ణస్థితి, వాతావరణాలను ప్రభావితం చేసే ఏవైనా రెండు కారకాలను పేర్కొనండి.
జవాబు:
శీతోష్ణస్థితి, వాతావరణాలను ప్రభావితం చేసే కారకాలు :
- అక్షాంశము,
- భూమికి, నీటికి గల సంబంధం
- భౌగోళిక స్వరూపం,
- ఉపరితల గాలి ప్రసరణ
ప్రశ్న 11.
వాతావరణమని దేనిని అంటారు?
జవాబు:
ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను “వాతావరణం” అని అంటారు. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటాయి.
ప్రశ్న 12.
శీతోష్ణస్థితి అని దేనిని అంటారు?
జవాబు:
ఒక విశాలప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులను “శీతోష్ణస్థితి” అంటారు.
ప్రశ్న 13.
‘ఆ ప్రాంత శీతోష్ణస్థితి’ అని దేనిని అంటారు?
జవాబు:
ప్రతి సంవత్సరం ఒక ముప్పై సంవత్సరాల పాటు కనపడిన పరిస్థితులను “ఆ ప్రాంత శీతోష్ణస్థితి” అంటారు.
ప్రశ్న 14.
వాతావరణంలోని అంశాలు ఏవి?
జవాబు:
- ఉష్ణోగ్రత
- వాతావరణ పీడనం
- గాలి వేగం
- గాలిలో తేమ
- వర్షపాతం
ప్రశ్న 15.
శీతోష్ణస్థితి కారకాలు అంటే ఏమిటి? అవి ఏవి?
జవాబు:
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను “శీతోష్ణస్థితి కారకాలు” అంటారు.
- అక్షాంశం
- భూమికి – నీటికి గల సంబంధం
- భౌగోళిక స్వరూపం
- ఉపరితల గాలి ప్రసరణ.
ప్రశ్న 16.
అక్షాంశాల రీత్యా భూమిపై ఉన్న మూడు ప్రాంతాలేవి?
జవాబు:
- ఉషప్రాంతాలు, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి.
- ధృవ ప్రాంతాలు, ధృవాలకు దగ్గరగా ఉన్నవి.
- సమశీతోష్ణ ప్రాంతాలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నవి.
ప్రశ్న 17.
సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఎక్కడ తగ్గుతున్నాయి?
జవాబు:
భూమధ్య రేఖ వైపు నుండి ధృవాలవైపుకి వెళుతున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి.
ప్రశ్న 18.
భారతదేశంలో ఉత్తర, దక్షిణ భాగాలలో శీతోష్ణస్థితికి ఎందుకు భిన్నంగా ఉంటుంది?
జవాబు:
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోషస్థితికంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం.
ప్రశ్న 19.
అక్షాంశ, రేఖాంశాల మధ్య భారతదేశ విస్తృతిని తెలియచేయండి.
జవాబు:
భారతదేశం సుమారుగా 8 ఉ – 37° ఉ రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కటరేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కటరేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కటరేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.
ప్రశ్న 20.
సమశీతోష్ణస్థితి అంటే ఏమిటి?
జవాబు:
దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదేవిధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని “సమ శీతోష్ణస్థితి” అంటారు.
ప్రశ్న 21.
కొన్ని వేసవి విడుదుల పేర్లు తెలపండి.
జవాబు:
- సిమ్లా
- గుల్బార్గ్
- నైనిటాల్
- డార్జిలింగ్
- కొడైకెనాల్
- ఊటీ మొదలగునవి.
ప్రశ్న 22.
పశ్చిమ విక్షోభాలు అంటే ఏమిటి?
జవాబు:
శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం, గాలిలో తక్కువ తేమ శాతం, చల్లటిగాలులలో మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుపాను వాయుగుండాలనే “పశ్చిమ విక్షోభాలు” అంటారు.
ప్రశ్న 23.
‘లూ’ పవనాల గురించి రాయండి.
జవాబు:
ఉత్తరాది మైదానాలలో పొడిపొడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటినే “లూ పవనాలు” అంటారు.
ప్రశ్న 24.
ఋతుపవనాల ఆరంభంగా దేనిని పేర్కొంటారు?
జవాబు:
నైఋతి ఋతుపవనాలు. భారతదేశానికి జూన్ మొదటివారంలో చేరుకుంటాయి. దీనినే “ఋతుపవనారంభం” అంటారు.
ప్రశ్న 25.
IPCC ని విస్తరించండి.
జవాబు:
Inter – governmental Panel on Climate Change (ప్రపంచదేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం).
ప్రశ్న 26.
శిలాజ ఇంధనానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
బొగ్గు, పెట్రోలియం
ప్రశ్న 27.
AGWని విస్తరించుము.
జవాబు:
AGW : Anthropogenic Global Warming (మానవకారణంగా భూగోళం వేడెక్కటం)
10th Class Social 4th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
సాంప్రదాయ భారతీయ కాలాలను వర్గీకరించి, మాసవారిగా రాయండి.
జవాబు:
సాంప్రదాయ భారతీయ కాలాలు :
ఋతువులు | తెలుగు నెలలు |
వసంతం | చైత్రం – వైశాఖం |
గ్రీష్మం | జ్యేష్ఠం – ఆషాఢం |
వర్ష | శ్రావణం – భాద్రపదం |
శరత్ | ఆశ్వీయుజం – కార్తీకం |
హేమంత | మార్గశిరం – పుష్యం |
శిశిరం | మాఘం – ఫాల్గుణం |
ప్రశ్న 2.
సగటు ఉష్ణోగ్రతలు 2°C పెరగడం వలన వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి సముద్రమట్టం ఒక మీటరు పెరుగుతుంది. భూతాపాన్ని తగ్గించే చర్యలను సూచించే రెండు నినాదాలను రాయండి.
(లేదా)
భూగోళం వేడెక్కటాన్ని నివారించుటపై రెండు నినాదాలు తయారు చేయండి.
జవాబు:
- చెట్లను పెంచండి దండిగ – ఎసి (AC) లు ఎందుకు దండగ.
- భూమాతను నువ్వు రక్షిస్తే – భూమాత నిన్ను రక్షిస్తుంది.
- చెట్లను పెంచండి – భూమిని కాపాడండి.
- ప్లాస్టిక్ సంచులు మానండి – గుడ్డ సంచులు వాడండి.
ప్రశ్న 3.
నైరుతి ఋతుపవనాల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
- వేసవిలో భారత ఉపఖండం మీద తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది.
- అదే సమయంలో హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఉంటుంది.
- ఈ అధిక పీడన ప్రాంతం నుండి పైన పేర్కొన్న అల్పపీడన ప్రాంతం వైపు వీచే గాలులే నైఋతి ఋతుపవనాలు.
- నైఋతి భుతుపవనాలు అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ అనే రెండు శాఖలుగా విడిపోతాయి.
- ఈ ఋతుపవనాలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. 6) ఇవి నాలుగు నుండి ఐదు వారాలలో క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయి.
- భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది.
ప్రశ్న 4.
దిగువ పటమును పరిశీలించి (a), (b) ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
a) రాజస్థాన్లో నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి?
b) ఋతుపవనాల ఆరంభం అనగానేమి?
జవాబు:
a) రాజస్థాన్లో నైఋతి’ ఋతుపవనాలు ప్రవేశించే సమయం : 15 జూలై
b) ఋతుపవనాల ఆరంభం అనగా
- వేసవిలో భారత ఉపఖండంలో అల్పపీడనం ఏర్పడుతుంది.
- అదే సమయంలో హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఉంటుంది.
- జూన్ ప్రారంభంలో ఈ అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఋతుపవనాలు ప్రవేశించడాన్ని ఋతుపవనాల ఆరంభం అంటారు.
ప్రశ్న 5.
మ్యాపును పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబిమ్ము.
i) జనవరి నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న రెండు రాష్ట్రాల పేర్లు రాయండి.
జవాబు:
జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్.
ii) మధ్యప్రదేశ్ గుండా పోవుచున్న సమోష్ణోగ్రత రేఖ చూపు ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
20°C
ప్రశ్న 6.
ట్రేడ్ విండ్స్ గురించి రాయండి.
జవాబు:
ఉత్తరార్ధ గోళంలో ఉప అయనరేఖా అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్యరేఖ వద్ద ఉండే అల్ప పీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు (ఇంగ్లీషులో “ట్రేడ్ విండ్స్”) అంటారు. ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్’ అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం.
ప్రశ్న 7.
మామిడి జల్లుల గురించి రాయండి.
జవాబు:
సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో ‘తొలకరి జల్లులు’ పడతాయి. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి ఈ వానలో దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్ లో స్థానికంగా “మామిడి జల్లులు” అని అంటారు.
ప్రశ్న 8.
ఋతుపవనాలు అని వేటిని పిలుస్తారు?
జవాబు:
భారతదేశంలోని శీతోష్ణస్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితమౌతుంది. గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండటాన్ని గమనించారు. ఈ గాలుల సహాయంతో వాళ్లు భారతదేశ తీరం వైపుకి ప్రయాణించేవాళ్లు. ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మరడాన్ని అరబ్ వర్తకులు “మాన్సూన్” అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం.
ప్రశ్న 9.
అక్టోబరు వేడిమి అంటే ఏమిటి?
జవాబు:
వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబరు, నవంబరు నెలలు సంధికాలంగా ఉంటాయి. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా “అక్టోబర్ వేడిమి” అంటారు.
ప్రశ్న 10.
సాంప్రదాయ భారతీయ కాలాలను గూర్చి ఒక పట్టిక తయారు చేయంది.
జవాబు:
సాంప్రదాయ భారతీయ కాలాలు
ఋతువులు | తెలుగు నెలలు (చాంద్రమాన సంవత్సరం) |
ఇంగ్లీషు నెలలు (సూర్యమాన సంవత్సరం) |
వసంతం | చైత్రం – వైశాఖం | మార్చి – ఏప్రిల్ |
గ్రీష్మం | జ్యేష్ఠ – ఆషాఢం | మే – జూన్ |
వర్ష | శ్రావణం – భాద్రపదం | జులై – ఆగస్టు |
శరత్ | ఆశ్వీయుజం – కార్తీకం | సెప్టెంబరు – అక్టోబరు |
హేమంత | మార్గశిర — పుష్యం | నవంబరు – డిసెంబరు |
శిశిరం | మాఘం – ఫాల్గుణం | జనవరి – ఫిబ్రవరి |
ప్రశ్న 11.
హరిత గృహ ప్రభావం అంటే ఏమిటి?
జవాబు:
వాతావరణం చేసే ముఖ్యమైన పనులలో మనల్ని వెచ్చగా ఉంచటం ఒకటి. ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి, బాగా పనిచేసే దుప్పటిలాంటిది. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుుంది. దీనిని “హరిత గృహప్రభావం” అంటాం. భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది.
ప్రశ్న 12.
భూగోళం వేడెక్కడం అంటే ఏమిటి?
జవాబు:
ఇంతకుముందు భూమి వేడెక్కటానికి లేదా చల్లబడటానికి చాలా సమయం పట్టింది. దీనివల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారటానికి సమయం దొరికింది. ఇప్పుడు భూమి చాలా తొందరగా వేడెక్కుతోంది, ఇది వినాశకర మార్పులకు దారి తీయవచ్చు. పారిశ్రామిక విప్లవం తరువాత భూమి వేడెక్కటానికి కారణం మానవ చర్యలే. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కటాన్ని మానవ కారణంగా “భూగోళం వేడెక్కటం” అంటారు.
ప్రశ్న 13.
టంద్రాల వద్ద నున్న మంచు కరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గల గడ్డ కట్టిన టండ్రాల కింద (ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద) పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు ఉందని కనుక్కున్నారు. భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ టండ్రాలలో గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఇది. ఒక విషవలయంగా మారుతుంది. హరితగృహ వాయువుగా (Green house gas) కార్బన్ డై ఆక్సైడ్ మిథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది.
ప్రశ్న 14.
సగటు ఉష్ణోగ్రతలు 2°C పెరగడం ప్రమాదమా?
జవాబు:
సగటు ఉష్ణోగ్రతలు 2 సెంటీగ్రేడులు పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్రమట్టం ఒక మీటరు పెరుగుతుంది. మన తీరప్రాంతాలలో చాలావరకు దీనివల్ల ప్రభావితం అవుతాయి, కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీళ్లు తమ జీవనోపాధిని కోల్పోతారు.
ప్రశ్న 15.
వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాలలోని సిమ్లా, గుల్మార్, నైనితాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడిదిలలో చాలా చల్లగా ఉంటుందని మీరు విని ఉంటారు. అదే విధంగా పశ్చిమ కనుమలలోని కొడైకెనాల్, ఉదగమండలం (ఊటీ) వంటి ప్రాంతాలలో తీర ప్రాంతాలలో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
పై పేరాను చదివి, క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయుము.
ప్రశ్న : వేసవిలో కోల్ కతా కన్నా డార్జిలింగ్ లో ఆహ్లాదకర వాతావరణం ఎందుకు ఉంటుంది?
జవాబు:
- సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- కావున మైదాన ప్రాంతాల కంటే కొండ, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
- ప్రదేశ శీతోష్ణస్థితి ఎత్తుతో కూడా ప్రభావితం అవుతుంది. ఎత్తైన ప్రాంతంలో ఉండటం వలన డార్జిలింగ్ వాతావరణం వేసవికాలంలో కోల్ కతాతో పోలిస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.
ప్రశ్న 16.
క్రింది పట్టికను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఋతువులు | తెలుగు నెలలు (చాంద్రమాన సంవత్సరం) |
ఇంగ్లీషు నెలలు (సూర్యమాన సంవత్సరం) |
వసంతం | చైత్రం – వైశాఖం | మార్చి – ఏప్రిల్ |
గ్రీష్మం | జ్యేష్ఠ – ఆషాఢం | మే – జూన్ |
వర్ష | శ్రావణం – భాద్రపదం | జులై – ఆగస్టు |
శరత్ | ఆశ్వీయుజం – కార్తీకం | సెప్టెంబరు – అక్టోబరు |
హేమంత | మార్గశిర — పుష్యం | నవంబరు – డిసెంబరు |
శిశిరం | మాఘం – ఫాల్గుణం | జనవరి – ఫిబ్రవరి |
1) వసంత ఋతువు ఏ ఏ మాసాలలో వస్తుంది?
జవాబు:
చైత్రం, వైశాఖం
2) గ్రీష్మ ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది?
జవాబు:
చాలా ఎండగా, వేడిగా ఉంటుంది.
3) తెలుగు నెలలలో నెల ఎప్పుడు మొదలవుతుంది?
జవాబు:
అమావాస్య తరువాత పాడ్యమి నుండి మొదలవుతుంది.
4) చలిగా ఉండే ఋతువు ఏది?
జవాబు:
చలిగా ఉండే ఋతువు హేమంత ఋతువు.
5) ఆకురాలు కాలం ఏది?
జవాబు:
ఆకురాలు కాలం శిశిర ఋతువు.
ప్రశ్న 17.
వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబరు, నవంబరు నెలలు సంధి కాలంగా ఉంటాయి. తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే.కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా ‘అక్టోబర్ వేడిమి’ అంటారు.
ప్రశ్న : తిరోగమన ఋతుపవనాల ముఖ్య లక్షణాలను తెలపండి.
జవాబు:
- తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
- నేల తేమగా ఉండి, అధిక ఉష్ణోగ్రత, అధిక తేమల కారణంగా వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. అదే అక్టోబర్ వేడిమి.
- ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.
- కోరమండల్ ప్రాంతంలో అధికశాతం వర్షం, తుపానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది.
ప్రశ్న 18.
సాంప్రదాయ భారతీయ కాలాలు
ఋతువులు | తెలుగు నెలలు (చాంద్రమాన సంవత్సరం) |
ఇంగ్లీషు నెలలు (సూర్యమాన సంవత్సరం) |
వసంతం | చైత్రం – వైశాఖం | మార్చి – ఏప్రిల్ |
గ్రీష్మం | జ్యేష్ఠ – ఆషాఢం | మే – జూన్ |
వర్ష | శ్రావణం – భాద్రపదం | జులై – ఆగస్టు |
శరత్ | ఆశ్వీయుజం – కార్తీకం | సెప్టెంబరు – అక్టోబరు |
హేమంత | మార్గశిర — పుష్యం | నవంబరు – డిసెంబరు |
శిశిరం | మాఘం – ఫాల్గుణం | జనవరి – ఫిబ్రవరి |
అ) మన దేశానికి వర్షాకాలం ఏ ఏ ఋతువులలో ఉంటుంది?
అ) వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో ఏ కాలం ఉంటుంది?
ఇ) నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఏ కాలం ఉంటుంది?
ఈ) జనవరి, ఫిబ్రవరిలలో ఏ ఋతువు ఉంటుంది?
జవాబు:
అ) మన దేశానికి వర్షాకాలం వర్ష మరియు శరత్ ఋతువులలో ఉంటుంది.
ఆ) వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో వేసవికాలం ఉంటుంది.
ఇ) నవంబరు నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది.
ఈ) జనవరి, ఫిబ్రవరి నెలలలో శిశిర ఋతువు ఉంటుంది.
ప్రశ్న 19.
మే నెలలో భారతదేశ సగటు ఉష్ణోగ్రతలు చూపే క్రింది పటాన్ని పరిశీలించి, క్రింది పట్టిక పూరించండి.
జవాబు:
ప్రాంతము | సగటు ఉష్ణోగ్రత (దాదాపు) |
సిమ్లా | 25°C |
జైపూర్ | 30°C |
బెంగళూరు | 20°C |
చెన్నై | 30°C |
10th Class Social 4th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి.
ప్రపంచ వ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
జవాబు:
- భూమి మీద (వాతావరణం, జలావరణం) సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోవటాన్నే భూగోళం వేడెక్కడం అంటున్నారు.
- అనేక మానవజనిత (మానవ కార్యకలాపాల) కారణాల వలన భూమి వేడెక్కడం, భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది.
భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలు :
- భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణాలలో ‘అడవులను నరికివేయడం’ ప్రధానమైనది.
- ‘పారిశ్రామిక కాలుష్యం’ – ఇది పారిశ్రామిక విప్లవం తర్వాత ఎక్కువైంది.
- విపరీతంగా పెరిగిన ‘శిలాజ ఇంధనాల’ వినియోగం.
- ఎయిర్ కూలర్స్, ఎ.సి.లు, రిఫ్రిజిరేటర్ల (CFC, IFC ల) వాడకం ఎక్కువ కావడం.
- జనాభా విపరీతంగా పెరిగిపోవడం వలన, ఆధునిక వ్యవసాయ, పారిశ్రామిక పద్దతులు గ్రీన్ హౌస్ వాయువుల (CO<sub>2</sub>, మీథేన్ మొదలైన) విడుదలకు కారణమవుతున్నాయి.
- గనుల తవ్వకం, అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు.
భూగోళం వేడెక్కడం వలన కలిగే దుష్ప్రభావాలు :
- భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఆవరణ సమతౌల్యం దెబ్బతింటుంది.
- ధృవ ప్రాంతాలలోని మంచు కరిగి, సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోయి నీటి ప్రళయం సంభవించవచ్చు.
- కాలాలు నిర్ణీత ఋతువులలో రావు.
- వరాలు (ఋతుపవనాలు) తక్కువగా పడటం లేదా అసలు పడకపోవటం లేదా క్రమం తప్పి పడటం లాంటివి సంభవిస్తాయి.
భూగోళం వేడెక్కడాన్ని తగ్గించటానికి కొన్ని చర్యలు / సూచనలు :
- చెట్లను చక్కగా సంరక్షించాలి. అటవీ నిర్మూలనను నిరోధించాలి.
- శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి, సౌరశక్తి, పవనశక్తి లాంటి పునర్వినియోగ సామర్థ్యం గల ఇంధనాల్ని వాడాలి.
- వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజారవాణా వ్వవస (R.T.C., Metro Road) ను ఉపయోగించాలి.
- ఏ.సి.లు, రిఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించాలి.
- రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను వాడాలి.
- పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని నివారించుటకు ప్రజలు, ప్రభుత్వం నిధులు కేటాయించి, చిత్తశుద్ధితో పనిచేయాలి.
ప్రశ్న 2.
భారత వ్యవసాయరంగానికి ఋతుపవనాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఋతుపవనాల క్రమాన్ని వివరించండి.
జవాబు:
- భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు ప్రాణమైన వ్యవసాయం ఋతుపవన వర్చాలపై అత్యధికంగా ఆధారపడి ఉంది.
- భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య ఋతువులను అనుసరించి మార్చి మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు గల ఆరుమాసాల పాటు నైరుతి దిశ నుండి, మరో ఆరు నెలల పాటు సెప్టెంబర్ మధ్య నుండి మార్చి వరకు ఈశాన్య దిశ నుండి వీస్తాయి.
- ఉష్ణోగ్రతలలోని వైవిధ్యం అంతర అయన రేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పై భాగంలో వాయు ప్రసరణం వంటి అనేక కారణాల వల్ల ఈ ఋతుపవనాలు ఏర్పడుతున్నాయి.
- వేసవిలో భారత భూభాగం పై తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది. అదే సమయంలో భూ భాగాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది.
- ఈ అధిక పీడన ప్రాంతం నుండి పైన పేర్కొన్న అల్పపీడన ప్రాంతం వైపు గాలులు వీయడాన్నే నైరుతి ఋతుపవనాలు అంటారు.
- శీతాకాలంలో పైన పేర్కొన్న పీడన వ్యవస్థలు వ్యతిరేకంగా అవడంతో పవనాలు కూడా వ్యతిక్రమము అవుతాయి. , అనగా పవనాలు భూభాగం నుండి సముద్రభాగం వైపు ఈశాన్యదిశ నుండి వీస్తాయి. కాబట్టి వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు.
ప్రశ్న 3.
క్రింది స్లైమోగ్రాఫీలను పరిశీలించి, తగిన సమాధానములను వ్రాయండి.
a) చెన్నై వర్షాకాలానికి, జైపూర్ వర్షాకాలానికి మధ్య తేడా ఎందుకు ఉంది?
b) జైపూర్ లో అత్యధిక ఉష్ణోగ్రత ఏ నెలలో నమోదు అయినది?
c) ఈ రెండింటిలో ఏ ప్రాంతము అత్యధిక వర్షపాతమును పొందును?
d) పై రెండు ప్రాంతాలు వర్షచ్ఛాయా ప్రాంతాలేనా? ఏ విధంగా దీనిని సమర్థిస్తావు?
జవాబు:
a) నైఋతి ఋతుపవనాల వలన జైపూర్ లోనూ, ఈశాన్య ఋతుపవనాల వలన చెన్నైలోనూ వర్షపాతం పడుతుంది. కనుక చెన్నై వర్షాకాలానికి, జైపూర్ వర్షాకాలానికి మధ్య తేడా ఉంది.
b) మే
c) చెన్నై
d) అవును. నైఋతీ ఋతుపవన కాలంలో జైపూర్ మరియు చెన్నై వర్షచ్చాయా ప్రాంతాలే.
(లేదా)
ఈశాన్య ఋతుపవన కాలంలో చెన్నై వర్షచ్ఛాయా ప్రాంతం కాదు.
ప్రశ్న 4.
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో అడవిని నరికివెయ్యటం ఒకటి.
ప్రశ్న : పై అంశాన్ని చదివి, ‘శీతోష్ణస్థితి మార్పు’ గురించి వ్యాఖ్యానించండి.
జవాబు:
- శీతోష్ణస్థితిలో అతివేగంగా జరిగే మార్పులు భూమిపై జీవుల మనుగడని ప్రభావితం చేస్తాయి.
- సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వలన సముద్ర మట్టాలు పెరుగుతాయి.
- తీరప్రాంతాలలో జనావాసాలు ముంపునకు గురవుతాయి.
- ప్రజలు తమ జీవనోపాధులు కోల్పోతారు.
- వర్షపాతంలో ఊహించని మార్పులు వస్తాయి.
- వరదలు, కరవులూ రావచ్చు.
- వ్యవసాయం ప్రభావితమవుతుంది.
- వాతావరణ మార్పు అన్నది ప్రపంచస్థాయిలో జరుగుతుంది. కాబట్టి దానివల్ల మనమందరం ప్రభావితమవుతాం.
ప్రశ్న 5.
దిగువ ను పరిశీలించి, విశ్లేషించండి.
జవాబు:
ఈ పైన ఇవ్వబడిన గ్రాఫ్ క్లైమోగ్రాఫ్. ఈ గ్రాఫ్ మనకు చెన్నై నగరం యొక్క ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలను తెలియచేస్తుంది. ఈ గ్రాఫ్ మనకు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతాలను తెలియచేస్తుంది. ఈ గ్రాఫ్ లోని గణాంకాలను గమనించినట్లయితే నవంబర్ నెలలో వర్షపాతం అత్యధికంగా అంటే 350 మి.మీ.గా ఉన్నది. మే, జూన్ నెలలలో ఉష్ణోగ్రత అత్యధికంగా అంటే 37°C, 38°C. అతి తక్కువ ఉష్ణోగ్రతలు డిసెంబరు మరియు జనవరి నెలలలో 21°C, 22°C గా నమోదయ్యాయి. చెన్నై నగరం తూర్పు తీరప్రాంతంలో ఉన్నది. భారతదేశంలో నైఋతి ఋతుపవనాల వలన ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. కానీ ఈ సమయంలో చెన్నెలో వర్షపాతం సంభవించదు. తిరోగమన ఋతుపవన కాలంలో చెన్నైలో నవంబరు, డిసెంబరు మాసాలలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది.
నవంబరు మరియు డిసెంబరు నెలలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలతోపాటు ఎక్కువ వర్షపాతం నమోదు అవడంతో ఎక్కువ చలిగా ఉంటుంది.
ప్రశ్న 6.
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే కారకాలను పేర్కొని, ఏవైనా రెండింటిని వివరించండి.
జవాబు:
శీతోష్ణస్థితిని ప్రభావితం చేయు అంశాలు :
- అక్షాంశము
- భూమికి నీటికి గల సంబంధం
- భౌగోళిక స్వరూపం
- ఉపరితల గాలి ప్రసరణ
1) అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం :
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం. భారతదేశం సుమారుగా 8° ఉత్తర –37″ ఉత్తర రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కటరేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది.. కర్కటరేఖ ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.
2) భూమికి – నీటికి గల సంబంధం : దక్షిణ ప్రాంతంలోని అధికభాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదే విధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని “సమ శీతోష్ణస్థితి” అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది.
ప్రశ్న 7.
“శిలాజ ఇంధనాలు – ప్రధానంగా బొగ్గు – వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతున్నదని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి.” ఒక దేశ అభివృద్ధికి శిలాజ ఇంధనాల వినియోగం తప్పనిసరియేనా? వ్యాఖ్యానించుము.
జవాబు:
- ఒక దేశ అభివృద్ధికి శిలాజ ఇంధనాల వినియోగం కొంతమేర తప్పనిసరి, కొంతమేర అభివృద్ధి సాధించిన తర్వాత వాటి వినియోగం తగ్గించాలి అని అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన సమర్ధనీయమే.
- నేడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఒకప్పుడు శిలా ఇంధనాల వినియోగం ద్వారానే అభివృద్ధి చెందాయని గుర్తు చేసుకోవాలి.
- శిలాజ ఇంధనాలు వినియోగించకపోతే ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆందోళన పడుతున్నాయి.
- ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించటానికి ప్రత్యామ్నాయాలను (సంప్రదాయ ఇంధన వనరులను) చూపడంతో అభివృద్ధి చెందిన దేశాలు తోడ్పాటు అందివ్వాల్సి ఉంది.
ప్రశ్న 8.
జెట్ ప్రవాహం – భారతదేశం గురించి రాయండి.
జవాబు:
భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది, ఈ ప్రవాహాలను ‘జెట్ ప్రవాహం’ అంటారు. నేలనుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించేగాలులు ఇవి. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్లు మధ్య ఉంటుంది. 25° ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్లీం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.
ప్రశ్న 9.
“ఓజోను మనకు రక్షక కవచం” – వివరించండి.
జవాబు:
మండుతున్న బంతినుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేదు. భూమ్యాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం పీల్చుకునే ప్రాణవాయువు (ఆక్సీజన్), సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర, మనకు అవసరమైన మాంసకృత్తులు తయారుచేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి. అంతేకాకుండా ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది, నీటి చక్రం కూడా దీనిగుండా ఏర్పడుతుంది. (తొమ్మిదవ తరగతిలోని 4వ అధ్యాయంలోని చిత్రం చూడండి.)
ప్రశ్న 10.
భారతదేశంలో ఋతుపవన విధానాన్ని వివరించండి.
జవాబు:
- ఉష్ణప్రాంతంలో సుమారుగా 20°ఉ – 20°ద అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి.
- నైఋతి ఋతుపవనాలు అరేబియా సముద్రశాఖ, బంగాళాఖాతం శాఖలుగా జూన్ మొదట్లో ‘ఋతుపవనారంభం’ కలుగజేస్తాయి.
- భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైఋతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది.
- ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం కురవదు.
- తిరోగమన ఋతుపవన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
- ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపానులు, వాయుగుండాలు ఏర్పడతాయి.
- ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఉండదు.
- ఈ కాలంలో కోరమండల్ తీరప్రాంతంలో అధికశాతం వర్షం, తుపానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది.
ప్రశ్న 11.
సాంప్రదాయ భారతీయ కాలాలు
ఋతువులు | తెలుగు నెలలు (చాంద్రమాన సంవత్సరం) |
ఇంగ్లీషు నెలలు (సూర్యమాన సంవత్సరం) |
వసంతం | చైత్రం – వైశాఖం | మార్చి – ఏప్రిల్ |
గ్రీష్మం | జ్యేష్ఠ – ఆషాఢం | మే – జూన్ |
వర్ష | శ్రావణం – భాద్రపదం | జులై – ఆగస్టు |
శరత్ | ఆశ్వీయుజం – కార్తీకం | సెప్టెంబరు – అక్టోబరు |
హేమంత | మార్గశిర — పుష్యం | నవంబరు – డిసెంబరు |
శిశిరం | మాఘం – ఫాల్గుణం | జనవరి – ఫిబ్రవరి |
పై పట్టిక చదివి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
1) మన దేశానికి వర్షాకాలం ఏ ఏ ఋతువులలో ఉంటుంది?
జవాబు:
మన దేశానికి వర్షాకాలం వర్ష మరియు శరత్ ఋతువులలో ఉంటుంది.
2) వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో ఏ కాలం ఉంటుంది?
జవాబు:
వసంత, గ్రీష్మ ఋతువులలో మనదేశంలో వేసవికాలం ఉంటుంది.
3) నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఏ కాలం ఉంటుంది?
జవాబు:
నవంబరు నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది.
4) జనవరి, ఫిబ్రవరిలలో ఏ ఋతువు ఉంటుంది?
జవాబు:
జనవరి, ఫిబ్రవరి నెలలలో శిశిర ఋతువు ఉంటుంది.
ప్రశ్న 12.
పై పటం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
1) 157 సెం.గ్రే. ఉష్ణోగ్రత నమోదయ్యే కొన్ని ప్రాంతాలను పేర్కొనుము.
జవాబు:
15° సెం, గ్రే, ఉష్ణోగ్రత నమోదయ్యే కొన్ని ప్రాంతాలు : మధ్య రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, డార్జిలింగ్ మరియు ఉత్తర అసోం మొదలైనవి.
2) తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని మైదానాలలో ఎంత ఉష్ణోగ్రత నమోదు అవుతుంది?
జవాబు:
తమిళనాడు, కేరళ, కర్ణాటక మైదానాలలో 20° సెం.గ్రే. ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
3) మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రత 200 సెం.గ్రే. ఉంటుంది.
4) సగటు ఉష్ణోగ్రతలు 250 సెం.గ్రే. ఉండే ప్రాంతాలకు దగ్గరగా 200 సెం.గ్రే. ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతం ఉంది. ఇది ఎలా సాధ్యం?
జవాబు:
సముద్రతీర ప్రాంతాలలో సముద్రం నుంచి వీచే వేడి గాలుల వలన 25°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే తీరం నుంచి దూరం వెళ్ళేకొద్దీ ఈ వేడిగాలుల ప్రభావం ఉండకపోవడం వలన ఉష్ణోగ్రత 20°C మాత్రమే ఉంటుంది.
ప్రశ్న 13.
“భారతదేశ నైరుతి ఋతుపవనాల ప్రవేశం” పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
భారతదేశం – నైరుతి ఋతుపవనాల ప్రవేశం
పై పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.
1) నైరుతి ఋతుపవనాలు ముందుగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
జవాబు:
నైరుతి ఋతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి.
2) దేశరాజధాని (ఢిల్లీ) ప్రాంతానికి ఋతుపవనాలు ఎప్పుడు చేరుతాయి?
జవాబు:
జూలై 1 నాటికి ఋతుపవనాలు ఢిల్లీ ప్రాంతానికి చేరుతాయి.
3) గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లకు ఏ తేదికి చేరుకుంటాయి?
జవాబు:
జూన్ 15 నాటికి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లకు చేరుకుంటాయి.
4) జూన్ 5వ తేదీకి ఋతుపవనాలు ఏ ఏ రాష్ట్రాలకు విస్తరిస్తాయి?
జవాబు:
జూన్ 5వ తేదీ నాటికి ఋతుపవనాలు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లకు విస్తరిస్తాయి.
ప్రశ్న 14.
భారతదేశ భౌగోళిక పటంలో కింది వానిని గుర్తించండి.
i) 40 సెం.గ్రే. కన్నా ఎక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
ii) 100 సెం.గ్రే. కన్నా తక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
iii) భారతదేశంపై వీచే నైరుతి ఋతుపవనాల దిశామార్గం.
జవాబు: