AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 9 సందేశం Textbook Questions and Answers.
AP State Syllabus 8th Class Telugu Solutions 9th Lesson సందేశం
8th Class Telugu 9th Lesson జసందేశం Textbook Questions and Answers
చదవండి – ఆలోచించండి – చెప్పండి
స్వంత లాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
పాడిపంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటుపడవోయ్;
తిండి కలిగితే కండగలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని దే
శస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్
– గురజాడ అప్పారావు
ప్రశ్నలు జవాబులు
ప్రశ్న 1.
పై పంక్తులు ఏ గేయంలోవి ? ఆ గేయాన్ని ఎవరు రాసారు?
జవాబు:
పై పంక్తులు దేశభక్తి గేయంలోవి. ఆ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాసారు.
ప్రశ్న 2.
ఈ గేయంలో ఉన్న విషయాలేమిటి?
జవాబు:
- స్వంత లాభం కొంచెం వదులుకొని, తోటివాడికి సాయం చేయాలి.
- దేశమంటే మట్టికాదు మనుషులు.
- దేశంలో పాడి పంటలు అభివృద్ధి అయ్యేటట్లు శ్రమించాలి.
- కండ బలం ఉన్నవాడే మనిషి.
- దేశ ప్రజలు కలసిమెలసి జీవించాలి.
- జాతిమత భేదాలు విడచి, ప్రజలు సోదరులవలె మెలగాలి.
ప్రశ్న 3.
గేయ సందేశం ఏమిటి ?
జవాబు:
పరోపకారం, దేశభక్తి, ఐకమత్యం అనేవి అందరూ కలిగి ఉండాలనేదే ఈ గేయ సందేశం.
ప్రశ్న 4.
దేశభక్తిని గురించిన గేయాలు, కవితలు, పద్యాలను కవులు ఎందుకు రాస్తారు?
జవాబు:
దేశభక్తిని గురించిన గేయాలను, కవితలను, పద్యాలను కవులు ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి రాస్తారు.
ఇవి చేయండి
I. వినడం – మాట్లాడడం
ప్రశ్న 1.
ఈ పాఠంలోని పద్యాల్లో మనదేశం గొప్పతనం గురించి చదివినపుడు మీకేమనిపించింది?
జవాబు:
ఈ పాఠంలోని పద్యాల్లో మన భారతదేశం తపోభూమి అని, బంగారు పంటలకు నిలయమని, శాంతి వెన్నెలలో,
కురిపించిన దేశమని, గంగ, గోదావరి వంటి పవిత్ర నదులు ప్రవహించిన దేశమని చదివినప్పుడు, నేను ఇటువంటి గొప్ప దేశంలో పుట్టాను కదా ! అని గర్వంగా తల ఎత్తుకొని తిరగాలనిపించింది. జన్మభూమి స్వర్గం కంటే గొప్పది కదా.
మరింతగా మన దేశ సౌభాగ్యం వర్ధిల్లేలా పాటుపడాలని అనిపించింది. మన దేశంలో అన్యాయాలు, దౌర్జన్యాలు, కుల మత హింసలు లేకుండా చూడాలని అనిపించింది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు, పేదరికం లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. ప్రపంచ దేశాల్లో నేను జన్మించిన నా భారతమాత చాలా గొప్పది అనిపించింది.
ప్రశ్న 2.
ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మనం చట్టసభలకు ఎన్నుకొనేవారే ప్రజా ప్రతినిధులు. అనగా ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు మొదలైనవాళ్ళు ప్రజల కష్టాల్ని చట్టసభల్లో ప్రతిధ్వనింపచేసేవారు కావాలి. ప్రజల సమస్యల్ని, కష్టాల్ని ప్రభుత్వానికి తెలిపి, వాటిని పరిష్కరించేవారు. కావాలి. అవినీతి, లంచగొండితనం, దుర్మార్గం అన్న వాటికి వారు దూరంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోవాలి. వాటికి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపించగలగాలి. ప్రతినిధుల ఎప్పుడూ ప్రజల పక్షంలోనే నిలబడాలి. అన్యాయానికీ, అధికారానికి బానిసలు కారాదు. సచ్ఛీలత కలిగి, సత్కార్యాలు: చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆదర్శప్రాయ జీవనం సాగించాలి.
ప్రశ్న 3.
లంచగొండితనం మన దేశ ప్రగతి గౌరవాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో చర్చించండి.
జవాబు:
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మూడవ, నాలుగవ సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులలో అవినీతి బాగా ఎక్కువైంది. రాజకీయ నాయకులలో, మంత్రులలో అవినీతి ఎక్కువైనపుడు అధికారులకి అది అనుకూలంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలలో గల సిబ్బంది ప్రతి చిన్నపనికీ లంచం తీసుకొంటున్నారు. ప్రతిపనికీ “ఒక రేటు” ఉంటోంది. చివరికి జీతాలు ఇవ్వడానికీ, పింఛను చెల్లించడానికి మాత్రమే కాదు – మరణించిన వాళ్ళకి “సర్టిఫికేట్” ఇవ్వడంలోనూ లంచం తప్పని పరిస్థితులున్నాయంటే అవినీతి ఎంతగా విలయతాండవం చేస్తోందో గ్రహించవచ్చు.
ఈ రోజు మన దేశంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఈ లంచగొండితనం చిన్న ఉద్యోగుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు మంత్రుల నుండి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ల దాకా ఈ లంచగొండితనం విస్తరించింది.
లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో ఏ పనీ కావట్లేదు. ప్రపంచంలో లంచగొండితనం ఎక్కువ ఉన్న దేశాల్లో మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ముఖ్యమంత్రులూ, వారి పుత్రులూ, అల్లుళ్ళూ వేల కోట్ల రూపాయలు లంచాలుగా మేసేస్తున్నారు.
ఇందువల్ల మన దేశంలో అభివృద్ధి జరుగడం లేదు. ప్రభుత్వం ఒక రూపాయి ఖర్చు పెడితే పది పైసల పని కూడా కావట్లేదు. ఏ పనీ సక్రమంగా సాగటంలేదు. కట్టిన ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమలు కొద్ది రోజుల్లోనే పాడయిపోతున్నాయి. దేశాన్ని రక్షింపవలసిన మిలటరీ, పోలీసు వ్యవస్థలు సైతం లంచగొండితనాన్ని మరిగి బాధితులకు అన్యాయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు లంచగొండితనానికి అలవాటుపడి జైళ్ళలో మగ్గుతున్నారు.
అవినీతి, లంచగొండితనంల కారణంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. కనుక ప్రజలు యువత అవినీతి నిర్మూలనకు నడుంకట్టి ఈ దుష్ట జాడ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలి.
II. చదవడం – రాయడం
1. కింది పద్యం చదవండి. దాని భావంలోని ఖాళీలలో సరైన పదాలు రాయండి.
“దేశభక్తి మరియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమి యగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము”.
భావం :
దేశభక్తి, ………… అనే భావాలు ప్రజల్లోని నరనరాల్లో …………. కర్మభూమి అయిన మన ……….. దేశం ప్రగతి ……………….. రెపరెపలాడుతోంది.
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించి కర్మభూమి అయిన మన అఖండ భారతదేశం ప్రగతి జెండా రెపరెపలాడుతుంది.
2. కింది ఖాళీలకు సరైన సమాధానాన్ని గుర్తించండి.
అ) మధురమైన ధర్మా నికి ………………… తగలరాదు. (రాయి / దెబ్బ)
జవాబు:
మధురమైన ధర్మానికి దెబ్బ తగలరాదు.
ఆ) భరత జాతి …………… ఆశయాలకు అనుగుణంగా లేదు. (మహాత్ముడి / బుద్ధుడి)
జవాబు:
భరత జాతి మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా లేదు.
ఇ) సకల జగతికి ………. నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి. (అశాంతి / శాంతి)
జవాబు:
సకల జగతికి శాంతి నేర్పినట్టి మన భరతమాతను పూజించాలి.
ఈ) అఖండ భారతావనిలో ………….. కేతనం ఎగురవేయాలి. (ప్రగతి / తిరోగతి)
జవాబు:
అఖండ భారతావనిలో ప్రగతి కేతనం ఎగురవేయాలి.
3. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి.
అ) భారతీయులు ఏమని ప్రతిజ్ఞ చేయాలి?
జవాబు:
“ఇది నా దేశం, ఇది నన్ను కన్నతల్లి. నాదేశ సౌభాగ్య సంపదలు, అభివృద్ధి చెందడానికి నేను సహాయపడతాను. ప్రపంచమంతా దీన్ని పూజించేటట్లుగా గొప్ప ప్రగతిని నెలకొల్పుతాను” అంటూ భారతీయులు ప్రతిజ్ఞ చేయాలి.
ఆ) మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు ఏవి?
జవాబు:
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నర్మద అనే జీవనదులు మనదేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు.
ఇ) ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” ఎవరు ? ఆయన గొప్పతనం ఏమిటి?
జవాబు:
ఈ పాఠంలో కవి చెప్పిన “మహామౌని” మహాత్మాగాంధీ. భారతమాత ముద్దుబిడ్డలలో మహాత్మాగాంధీ అగ్రగణ్యుడు. సత్యం, శాంతి, అహింస అనే సూత్రాలను పాటించి, రవి అస్తమింపని బ్రిటిషు సామ్రాజ్యం పునాదులను కదలించి, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు. మన జాతిపిత అయిన గాంధీజీ తన బోసి నోటితో పలికిన శాంతి సందేశానికి ప్రపంచమంతా జేజేలు పలికింది. అది మన భారతదేశానికి కీర్తిని తెచ్చింది.
ఈ) మనదేశ ప్రగతి కేతనం ఎప్పుడు రెపరెపలాడుతుంది?
జవాబు:
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు ప్రజల నరనరాల్లో వ్యాపించినపుడు, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి కేతనం రెపరెపలాడుతుంది.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) పాఠంలో కవి చెప్పిన విషయాలే గాక, మనదేశ కీర్తిని పెంచిన ఇతర విషయాలు రాయండి.
జవాబు:
- మన దేశంలో బుద్ధుడు జన్మించి ప్రపంచంలోని చాలా దేశాల్లో బౌద్ధమతం విస్తరించేలా తన సందేశాన్ని అందించాడు.
- వివేకానందుడు ప్రపంచ మత మహాసభలో పాల్గొని సర్వమత సమానత్వాన్ని చాటాడు.
- రవీంద్రనాథ్ ఠాగూర్ తన కవితల ద్వారా, సర్ సి.వి. రామన్ శాస్త్ర పరిశోధనల ద్వారా మన దేశ కీర్తిని పెంచారు.
- మన ఇతిహాసాలైన భారత రామాయణాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మన మహర్షులు, వేదాలు, ధర్మ ప్రచారా మన దేశ కీర్తిని విస్తరించాయి.
- నెహ్రూ, ఇందిర వంటి మన నాయకులు ప్రపంచ ఖ్యాతిని సంపాదించారు.
- మన రోదసీ విజ్ఞానం ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది.
- మన పారిశ్రామికవేత్తలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
- మన క్రికెట్టు ఆటగాడు టెండూల్కర్ ప్రపంచ ఖ్యాతి పొందాడు.
ఆ) మన జీవనదులు దేశానికి ఎటువంటి పరిపుష్టిని కలిగిస్తున్నాయి?
జవాబు:
మనదేశంలో కవి చెప్పినట్లు గంగ, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణానది, గోదావరి, కావేరి వంటి జీవనదులు ఉన్నాయి. నదులపై భాక్రానంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి ఎన్నో బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించారు. వాటి నుఁ కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఆ నీటితో బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వ విద్యుదుత్పత్తి కూడా జరుగుతోంది.
మన ప్రభుత్వాలు నదులలోని పవిత్రమైన జీవజలాలను పూర్తిగా వినియోగించుకుంటే దేశం పాడిపంటల సస్యశ్యామలంగా ఉంటుంది.
ఇ) భారతీయ సంస్కృతిలో నీకు బాగా నచ్చిన విషయాలు ఏమిటి? అవి ఎందుకు బాగా నచ్చాయి?
జవాబు:
ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది. ప్రజా జీవితం ప్రశాంతం సాగాలంటే సంస్కృతి ఇచ్చే సంస్కారమే మూలాధారం అవుతుంది. ఆత్మ సంస్కారాన్ని నేర్పి, మానవుడు సంఘజీవి అ. మానవసేవే మాధవ సేవ అని బోధించేది సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎంతో విశిష్టమైనది.
భారతీయ సంస్కృతిలో దేవాలయాలు, పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత వం భక్తి గ్రంథాలు, జీవనదులైన గంగ, గోదావరుల వంటి నదులు, మన ఋషులు, వారు బోధించిన ధర్మ ప్రబోధాలు నా బాగా నచ్చాయి.
మన దేశంలోని ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రులను, గురువులను పిల్లలు గౌరవించడం, పెద్దల పట్ల, ఆచార్యు పట్ల ప్రజలకు గౌరవాదరాలు ఉండడం వంటి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే నాకు గౌరవం.
మనకు ఉన్న దేవాలయాల వంటి గొప్ప దేవాలయాలు, పుణ్యనదులు మరి ఏ దేశానికీ లేవు. మన రామాయః భారత భాగవతాల వంటి పుణ్య గ్రంథాలు ఏ దేశానికీ లేవు. మనకు ఉన్న తత్త్వశాస్త్ర గ్రంథాలు, వేదాంత గ్రంథాల భగవద్గీత, వేదాలు వంటివి మనకే సొంతం. అవి ఏ దేశానికీ లేవు. ఇంత గొప్ప సంస్కృతి గల దేశంలో జన్మించడ నాకు గర్వకారణం.
ఈ) నీవే ప్రజాప్రతినిధివి అయితే దేశం కోసం ఏం చేస్తావు?
జవాబు:
నేనే ప్రజాప్రతినిధిని అయితే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిం వాటిని పరిష్కరించేటట్లు చేస్తాను. దేశానికి హాని కలిగించే పనిని ఏదైనా జరుగకుండా అడ్డుకుంటాను. అలాగే నా పాటు ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తాను. అంటే నేను ప్రజలపట్ల చూపుతున్న సమస్యా పరిష్కారాల వారు కూడా తీర్చేటట్లు ఆదర్శంగా ఉంటాను.
2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) మనదేశాన్ని గురించి ప్రపంచం పొగడాలంటే, దేశంలో ఏమేమి ఉండగూడదని కవి చెప్పాడు?
జవాబు:
ఘనత గన్న మన పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కుల, మత హింసలనే పిశాచాలను తల ఎత్తనీయకు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టులు, మోసగాళ్ళ గూండాయిజం నిలువకూడదు. బలిష్టమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలనే జలగలు పట్టి పీల్చకూడదు. ప్రతినిధులైన వాళ్ళు పగలు, సెగలు రగిలించే మాటలు మాట్లాడకూడదు. “మనమంతా అన్నదమ్ములము” అనే తీయని ధర్మానికి దెబ్బ తగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యత అనే ఢంకా మోగుతుంది. మన భారతదేశాన్ని ప్రపంచం పొగడుతుంది.
ఆ) “భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను” ఈ వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“భారతదేశం జీవనదులకు, పాడి పంటలకు నిలయమైయున్న దేశం. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను.” – ఈ వాక్యాన్ని మీ మాటల్లో రాయండి.
జవాబు:
మన భారతదేశం వేదాలు పుట్టిన దేశం. వ్యాస వాల్మీకాది మహర్షులు జన్మించిన దేశం. మన దేశం శ్రీలు పొంగిన జీవగడ్డ. పాడిపంటలు పొంగిపొర్లిన భాగ్యసీమ. ఇది వేదాంగాలూ, రామాయణం పుట్టిన దేశం. భారత భాగవతాలు పుట్టిన దేశం. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇది పవిత్ర భూమి. ఇక్కడ విస్తారమైన వృక్షసంపద ఉంది. లక్ష్మీబాయి, రుద్రమ్మ వంటి వీరవనితలకు ఇది జన్మభూమి. ప్రచండ పరాక్రమం ఉన్న రాజులు ఇక్కడ పుట్టారు. కాళిదాసు, తిక్కన వంటి మహాకవులు ఇక్కడ పుట్టారు. గాంధీ, బుద్ధుడు వంటి శాంతిదూతలు ఇక్కడే పుట్టారు. గంగా, సింధు, గోదావరి, కృష్ణా వంటి పవిత్ర నదులు ఇక్కడే పుట్టి, దేశాన్ని తమ జలాలతో సిరుల సీమగా మార్చాయి. ఇక్కడ నెహ్రూజీ, ఇందిర వంటి జాతీయ నాయకులూ, అబ్దుల్ కలామ్ వంటి శాస్త్రజ్ఞులూ ఇక్కడే పుట్టారు. ఇది కర్మభూమి. ఇది పవిత్రభూమి. అందుకే భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను.
IV. పదజాలం
1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాసి ఆ వాక్యాలను తిరిగి రాయండి.
అ) మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ కేతనాన్ని ఎగురవేస్తాం.
జవాబు:
కేతనాన్ని = జెండాను
వాక్యం : మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేస్తాం.
ఆ) ప్రతి వ్యక్తికీ మనోదార్డ్యుం ఉండాలి.
జవాబు:
మనోదార్యుం = దృఢమైన మనస్సు
వాక్యం : ప్రతి వ్యక్తికి దృఢమైన మనస్సు ఉండాలి.
ఇ) ఇతరుల సంపదలు చూసి మచ్చరికించకూడదు.
జవాబు:
మచ్చరికించ = అసూయ
వాక్యం : ఇతరుల సంపదలు చూసి అసూయపడరాదు.
ఈ) రవి చేతిరాతను చూసి అందరూ అబ్బురపడతారు.
జవాబు:
అబ్బురపడు = ఆశ్చర్యపోవు
వాక్యం : రవి చేతిరాతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
2. కింద గీత గీసిన పదాలకు వికృతి పదాలతో తిరిగి వాక్యాలు రాయండి.
అ) నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్ర) – ప్రతిన (వి)
నాదేశ సమగ్రతను కాపాడతానని ప్రతిన చేస్తున్నాను.
ఆ) నాది తెలుగుజాతి. నాది తెలుగు భాష.
జవాబు:
భాష (ప్ర) – బాస (వి)
నాది తెలుగు జాతి. నాది తెలుగు బాస.
ఇ) మనకు దేశంపై భక్తి ఎక్కువగా ఉండాలి.
జవాబు:
భక్తి (ప్ర) – బత్తి (వి)
మనకు దేశంపై బత్తి ఎక్కువగా ఉండాలి.
ఈ) మన కీర్తి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.
జవాబు:
కీర్తి (ప్ర) – కీరితి (వి)
మన కీరితి ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది.
3. పాఠానికి సంబంధించిన మాటలను కింది గళ్ళ నుండి వెతికి పక్క గళ్ళల్లో రాయండి. వాటితో వాక్యాలు తయారుచేయండి.
వాక్యములు :
- భారత ప్రభుత్వం జ్ఞానానంద కవిని పద్మశ్రీతో సత్కరించింది.
- హిందూదేశము జీవనదులకు పుట్టినిల్లు.
- దేశ యువత, దేశభక్తిని పెంపొందించుకోవాలి.
- ఇది నా దేశము, అనే ప్రేమ భావము దేశ పౌరులలో కలగాలి.
- హనుమంతుడు సీతమ్మకు సందేశమును తీసుకువెళ్ళాడు.
- గంగానదిని భారతీయులు మహా పుణ్యనదిగా భావించి సేవిస్తారు.
- బాపూజీ శాంతి సందేశానికి ప్రపంచం జోహార్లు ఆర్పించింది.
- గాంధీజీ, హింసను విడనాడండని దేశ ప్రజలకు సందేశం అందించాడు.
- సింధునది హిమాలయాల్లో పుట్టిన జీవనది.
- నెహ్రూ శాంతిదూత.
V. సృజనాత్మకత
* పాఠంలో మనదేశం గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా ! మన దేశ గొప్పతనాన్ని వర్ణిస్తూ భారతీయ విలువలు కాపాడటానికి అందరూ బాధ్యత తీసుకోవాలని ఒక “కరపత్రం” తయారుచేసి ప్రదర్శించండి.
జవాబు:
భారతీయ విలువలను కాపాడదాం
సోదర సోదరీమణులారా ! మన భారతదేశం తపోభూమి. ఇది బంగారు పంటలకు నిలయం. శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధుడు, గాంధీజీ జన్మించిన పవిత్రదేశం మనది. గంగా, గోదావరి, కృష్ణానది, సింధు, * బ్రహ్మపుత్ర వంటి పవిత్ర నదులు ప్రవహిస్తున్న పవిత్ర భాగ్యసీమ మనది.
ఇది వేద వేదాంగాలు పుట్టిన కర్మభూమి. భారత, భాగవత, రామాయణాలు, వేదవ్యాస, వాల్మీకి, కాళిదాసుల వంటి కవులు పుట్టిన దేశం ఇది. కృష్ణదేవరాయలు వంటి మహా సాహితీ సమరాంగణ చక్రవర్తులు జన్మించిన పవిత్రభూమి ఇది. ఝాన్సీలక్ష్మీబాయి, రాణిరుద్రమ్మ వంటి వీరనారులకు జన్మభూమి ఇది. గాంధీజీ, నెహ్రూ, ఇందిర వంటి రాజకీయ దురంధరులకు ఇది పుట్టినిల్లు. శంకరాచార్యులు వంటి అద్వైతమత ప్రవక్త నడయాడిన కర్మభూమి ఇది.
మన భారతీయులందరూ న్యాయానికీ, ధర్మానికీ, శాంతికీ, సత్యాహింసలకూ ప్రాధాన్యం ఇచ్చారు. మనం పైన చెప్పిన పుణ్యాత్ములకు వారసులం. మన భారతీయ విలువలను కాపాడదాం. నిజమైన భారతీయులం అనిపించుకుందాం. భారతీయులారా ! మన భారతభూమి గౌరవాన్ని రక్షించుకుందాం.
ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడదాం. మన దేశ గౌరవాన్ని నిలబెడదాం.
VI. ప్రశంస
*మనదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందటానికి ఎంతో మంది కృషి చేశారు. నేటికీ విద్య, వ్యాపారం, క్రీడలు, సాంస్కృతికం, రాజకీయం మొదలైన రంగాలలో ఎంతో మంది కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తులలో మీకు తెలిసిన వ్యక్తిని గూర్చి వారి కృషిని గూర్చి ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
అబ్దుల్ కలామ్ ఆజాద్
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆదర్శ భారతీయుడు. ప్రముఖ శాస్త్రజ్ఞుడు. భారతదేశాన్ని స్వర్ణభారతం చేయాలని శ్రమించే నిరంతర శ్రామికుడు. వివాహానికి, వివాదానికి జీవితంలో చోటివ్వని వ్యక్తి. నేటి బాలలకు ఈయన ప్రచోదక శక్తి. ఈయన ప్రజాస్వామ్యహితైషి.
అబ్దుల్ కలామ్ ఆజాద్ తమిళనాడులోని రామేశ్వరంలో జైనులబ్లీన్, ఆషియమ్మ దంపతులకు 1931, అక్టోబరు 15న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం రామేశ్వరం, రామనాథపురం, తిరుచురాపల్లి, మద్రాసులలో కొనసాగింది. మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ‘ఏరో ఇంజనీరింగులో డి.ఎం. ఈ.టీ’ చేసి తరువాత సైన్సులో డిప్లొమా (ఆనర్సు) చేశాడు.
ఈయన 1958వ సంవత్సరంలో డీ.ఆర్.డి.ఓ. లో జూనియర్ సైంటిస్టుగా చేరాడు. తరువాత కొద్దికాలానికే ఆ సంస్థకే డైరెక్టరు జనరల్ అయ్యాడు. మధ్యలో ఇస్రోలో సైంటిస్టుగా, డీ. ఆర్.డి.ఎల్. డైరెక్టరుగా పనిచేశాడు. 1999లో భారత ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టాడు.
అబ్దుల్ కలాంకు ‘పద్మవిభూషణ్’ వంటి పురస్కారాలతోపాటు, భారతదేశ అత్యున్నత పురస్కారమయిన ‘భారతరత్న’ లభించింది. ఈయన అగ్ని, పృథ్వి, త్రిశూల్, ఆకాశ్, నాగ్ మొదలైన క్షిపణుల రూపకల్పనకు సారథ్యం వహించి భారతదేశ క్షిపణి పితామహుడిగా పేరు పొందాడు. 1998 అణుపరీక్షలలో కలాం ముఖ్య పాత్ర పోషించాడు. అంతేగాక తేలికపాటి యుద్ధ విమానం, ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్’ ప్రాజెక్టుల రూపకల్పనకు నాయకత్వం వహించి అనేక మైలురాళ్ళను అధిగమించాడు.
అబ్దుల్ కలాం వ్యక్తిత్వం విశిష్టమయినది. ఈయన సమష్టితత్వం కలవాడు. ఈయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా అందరినీ కలుపుకొని పనిచేసే మనస్తత్వం కలవాడు. కల్మషం లేని వ్యక్తిత్వం ఈయన సొంతం. ఈయన దేశం కోసం అనునిత్యం తపిస్తాడు. ఈయన ఒక శాస్త్రవేత్తగా ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం మొదలుకొని, అణుపరిజ్ఞానం ఉపయోగించడం దాకా అనేక రంగాలలో పని చేశాడు.
ఈయన ఆచరణ భగవద్గీత, ఖురాన్లు. అభిరుచి కర్ణాటక సంగీతం. ఈయన స్వప్నం అభివృద్ధి చెందిన భారతదేశం. ఈయన భారత దేశాభివృద్ధికి కలలు కనమని భారతీయులకు సందేశం ఇస్తాడు.
రాజకీయానుభవం లేకపోయినా గత రాష్ట్రపతులకు ధీటుగా ప్రత్యేక శైలిలో రాష్ట్రపతిగా పనిచేయడం కలాం విలక్షణతకు మచ్చుతునక. ఏ బాధ్యతనైనా ఈయన చక్కగా నెరవేర్చగలడు. ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళే విధానాలకు రూపకల్పన చేయగల సమర్థుడు.
కలాం గొప్ప ఆదర్శ పురుషుడు. ఎన్నికలలో ఓటువేసి, అన్ని పనులూ ప్రభుత్వమే చేయాలని అనుకోడం పొరపాటని, దేశాన్ని నిందించడం కాక దేశ వ్యవస్థను పటిష్ఠం చేసే మార్గం గురించి అందరూ ఆలోచించాలని ఈయన పలికే పలుకులు భారతీయులందరికీ ఆదర్శం.
అబ్దుల్ కలామ్ అజాద్ కు మంచితనంలో తల్లిదండ్రులు, క్రమశిక్షణలో బంధువులైన శంషుద్దీన్, అహ్మద్ జలాలుద్దీన్స్ స్ఫూర్తి. అజాద్ వంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం భారతీయులందరికీ గర్వకారణము.
ప్రాజెక్టు పని
* ప్రపంచస్థాయిలో మన దేశ గౌరవం పెరగాలంటే కింద ఇవ్వబడిన అంశాలకు సంబంధించి మనమేం చేయాలో తరగతి గదిలో సమగ్రంగా చర్చించి వ్యక్తిగత నివేదిక (రిపోర్టు) ను తయారుచేయండి.
1) క్రీడలు – కళలు
2) వైజ్ఞానిక ప్రగతి
3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం
4) భాషా సంస్కృతీ పరిరక్షణ
జవాబు:
1) క్రీడలు – కళలు :
121 కోట్ల జనాభా గల మన దేశం ఒలింపిక్ క్రీడల వంటి ఆటల్లో ప్రపంచస్థాయిలో ఒక్క బంగారు పతకం కూడా గెల్చుకోలేకపోతున్నది. అందుకని పాఠశాల స్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆటలలో నైపుణ్యం చూపిన వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించాలి. నగరాలన్నింటిలో మంచి క్రీడా మైదానాలు ఉండాలి. సంగీతము, చిత్రలేఖనము వంటి లలిత కళలలో ప్రతిభ చూపిన బాలురకు పోటీలు నిర్వహించి బహుమతులివ్వాలి. ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించాలి.
2) వైజ్ఞానిక ప్రగతి :
మన దేశంలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు బాగా వ్యయం చేయాలి. అందులో ప్రతిభ చూపిన వారికి స్కాలర్ షిప్పులు ఇవ్వాలి. అవసరం అయితే విదేశాలలో శిక్షణను ఇప్పించాలి. ప్రతిభకు పట్టం కట్టాలి.
3) అవినీతి, లంచగొండితనం లేని సమాజం :
ప్రపంచంలో మనదేశం లంచగొండి, అవినీతి దేశంగా చెడ్డ పేరు తెచ్చుకొంటోంది. నిత్యం పత్రికలు ఆ విషయాలు రాస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణ వచ్చిన నాయకుణ్ణి ప్రజలు ఎన్నుకోరాదు. అటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలి. సజ్జనులను ప్రోత్సహించాలి. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
4) భాషా సంస్కృతీ పరిరక్షణ :
మాతృభాషను ఆదరించాలి. మన సంస్కృతిని కాపాడాలి. ప్రభుత్వం దీనికి ప్రత్యేక శాఖను ఏర్పరచి, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రజలు ఈ సంస్కృతిని కాపాడుకోవాలి.
అనంత కాలం ఇంకా ఆర్థిక పరిస్థను ఆస్ట్రేలు జరగా అను
VII. భాషను గురించి తెలుసుకుందాం
1) కింది పదాలకు గురువులను, లఘువులను గుర్తించండి.
UTI దేశము
2) కింది వాటిలో తప్పుగా ఉన్న గణాలను గుర్తించి సరి చేయండి.
3) ఛందస్సులో గణాల విభజన తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం.
అ) కింది పద్యపాదాలను పరిశీలించండి.
పై పాదాల్లో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు ఒకే వరుసలో వచ్చాయి కదా ! ఇలా పద్యంలో నాలుగు పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్తిపద్యం’ అంటారు.
పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరంగానీ, దాని వర్ణమైత్రి అక్షరంగానీ ఆపాదంలో నియమిత స్థానంలో రావటాన్ని “యతిమైత్రి” లేదా “యతిస్థానం” అంటారు.
ఈ పద్య పాదాల్లో ఆ-అ; జే (ఏ) – సి (ఇ)లకు యతిమైత్రి చెల్లింది.
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాలలో ‘య’ అను అక్షరం వచ్చింది. ఇలా పద్య పాదాలన్నింటిలోను రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని “ప్రాసనియమం” అంటారు.
పై పద్యపాదాలు ‘ఉత్పలమాల’ పద్యానివి. పై ఉదాహరణననుసరించి ‘ఉత్పలమాల’ పద్య లక్షణాలను ఈ విధంగా పేర్కొనవచ్చు.
ఇలాంటి లక్షణాలు గల పద్యాన్ని “ఉత్పలమాల” పద్యం అంటారు. పై విషయాల ఆధారంగా ఉత్పలమాల పద్య లక్షణాలను ఎలా రాయాలో గమనించండి.
ఉత్పలమాల:
- ఇది వృత్తపద్యం.
- ఇందు నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
- ప్రతిపాదంలో 10వ అక్షరం యతిస్థానం.
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతిపాదంలోను 20 అక్షరాలుంటాయి.
ఈ లక్షణాలు గల పద్యపాదమే ఉత్పలమాల పద్యపాదం.
ఆ) ఉత్పలమాల పద్య లక్షణాలు తెలుసుకున్నారు కదా ! ఈ పద్య లక్షణాల ఆధారంగా కింద ఇవ్వబడిన చంపకమాల పద్యానికి గురులఘువులు గుర్తించి, గణ విభజన చేసి పద్యం కిందగల లక్షణాలు పూరించండి.
‘అమిత పరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో
త్తముడవు, నీవు, నీదయిన దాస్యము వాపికొనంగ నీకు జి
త్తము గలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతము దెచ్చియి మ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్
చంపకమాల :
- ఇది వృత్త పద్యం.
- పద్యంలో నాలుగు పాదాలు ఉన్నాయి.
- ప్రతి పాదంలోను ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలు ఉన్నాయి.
- ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.
(అ – య) (త – దా) (త్త – ద) (క – న) వీటికి యతి మైత్రి. - ప్రాస నియమం ఉంది.
- ప్రతి పాదంలోను 21 అక్షరాలు ఉంటాయి.
ఇ) కింది పాదాలు ఏ వృత్తాలకు సంబంధించినవో గుర్తించండి.
గమనిక :
పై పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి. కాబట్టి పై పద్యపాదము ‘చంపకమాల’ వృత్తమునకు సంబంధించినది.
గమనిక :
పై పాదంలో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ వృత్తము.
ఈ)కింద సూచించిన పద్యపాదాలను పూరించి గణవిభజన చేసి అవి ఏ పద్యపాదములో గుర్తించండి.
గమనిక : పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి (ప – బం) ‘చంపకమాల’ పద్యము. యతి 11వ అక్షరము.
వ్యాకరణంపై అదనపు సమాచారం
పర్యాయపదాలు
భూమి – వసుధ, ధరణి, అవని
కేతనం – జెండా, పతాకము
వికారి – ముని, తాపసి
గంగ – భాగీరథి, త్రిపథగ
ఖ్యాతి – కీర్తి, యశము
బ్రహ్మ – విధాత, ధాత, సృష్టికర్త
వ్యుత్పత్యర్థాలు
ధరణి – సమస్తాన్ని ధరించునది (భూమి)
బ్రహ్మ – ప్రజలను వర్థిల్ల చేయువాడు (విధాత)
నానార్థాలు
ధర్మము = పుణ్యం, న్యాయం, ఆచారం
జలం = నీరు, ఎర్రతామర
భావము = పుట్టుక, ప్రపంచం, సంసారం
సంధులు
సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
మహాభ్యుదయమ్ము = మహా + అభ్యుదయమ్ము – సవర్ణదీర్ఘ సంధి
కుమారాగ్రణి = కుమార + అగ్రణి – సవర్ణదీర్ఘ సంధి
నయవంచకాళి = నయవంచక + ఆళి – సవర్ణదీర్ఘ సంధి
గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
భరతోర్వర = భరత + ఉర్వర – గుణసంధి
సహోదరా = సహ + ఉదరా – గుణసంధి
నవ్యోజ్జ్వల = నవ్య + ఉజ్జ్వ ల – గుణసంధి
యణాదేశ సంధి
సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమముగా య, వ, రలు ఆదేశమగును.
అభ్యుదయము = అభి + ఉదయము – యణాదేశ సంధి
అత్వసంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
సంపాదించుకొన్నట్టి = సంపాదించుకొన్న + అట్టి – అత్వసంధి
నేర్పినట్టి = నేర్పిన + అట్టి – అత్వసంధి
మొలకెత్తు = మొలక + ఎత్తు – అత్వసంధి
నాడులందు = నాడుల + అందు – అత్వసంధి
ఇత్వసంధి
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.
ఏదైనను = ఏది + ఐనను – ఇత్వ సంధి
ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
శిరమెత్తగా = శిరము + ఎత్తరా – ఉత్వసంధి
జోతలర్పించే = జోతలు + అర్పించె – ఉత్వసంధి
పాడయ్యె = పాడు + అయ్యె – ఉత్వసంధి
తరుణమ్మిదే = తరుణమ్ము + ఇదే – ఉత్వసంధి
గసడదవాదేశ సంధి (అ)
సూత్రం (అ) : ప్రథమమీది పురుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.
పట్టుగొమ్మ = పట్టు + కొమ్మ – గసడదవాదేశ సంధి
గసడదవాదేశ సంధి సూత్రం (ఆ) : ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న కచటతపలకు గసడదవలు క్రమంగా వస్తాయి.
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు – గసడదవాదేశ సంధి
యడాగమ సంధి
సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.
కన్నయది = కన్న + అది – యడాగమ సంధి
నీళాదేశము = నీ + ఈదేశము – యడాగమ సంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
జాతి శిరస్సు | జాతి యొక్క శిరస్సు | షష్ఠీ తత్పురుష సమాసం |
శాంతి చంద్రికలు | శాంతి అనెడి చంద్రికలు | రూపక సమాసం |
గంగా నది | గంగ అనే పేరుగల నది | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
నా దేశము | నా యొక్క దేశము | షష్ఠీ తత్పురుష సమాసం |
ప్రపంచ చరిత్ర | ప్రపంచము యొక్క చరిత్ర | షష్ఠీ తత్పురుష సమాసం |
నిఖిల ధరణి | నిఖిలమైన ధరణి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
నవ్యభారతము | నవ్యమైన భారతము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
మహామౌని | గొప్పవాడైన మౌని | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
నీ తల్లి | నీ యొక్క తల్లి | షష్ఠీ తత్పురుష సమాసం |
దేశభక్తి | దేశము నందు భక్తి | సప్తమీ తత్పురుష సమాసం |
ప్రజలనాడులు | ప్రజల యొక్క నాడులు | షష్ఠీ తత్పురుష సమాసం |
అఖండ భారతం | అఖండమైన భారతం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
గట్టి ప్రతిజ్ఞ | గట్టిదైన ప్రతిజ్ఞ | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
హింసా పిశాచి | హింస అనెడి పిశాచి | రూపక సమాసం |
అన్నదమ్ములు | అన్నయును, తమ్ముడును | ద్వంద్వ సమాసం |
– సకల ప్రపంచము | సకలమైన ప్రపంచము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
ధాన్యాగారాలు | ధాన్యమునకు ఆగారాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
ప్రకృతి – వికృతులు
ప్రతిజ్ఞ – ప్రతిన
భూమి – బూమి
భాష – బాస
గౌరవం – గారవం
కీర్తి – కీరితి
భక్తి – బత్తి
హృదయం – ఎద
అద్భుతం – అబ్బురం
భృంగారం – బంగారం
మత్సరం – మచ్చరం
కవి పరిచయం
కవి : సురగాలి తిమోతి జ్ఞానానందకవి
జన్మస్థలం : బొబ్బిలి తాలూకా, ‘పెద పెంకి’ గ్రామంలో జన్మించారు.
జీవిత కాలం : 1922 – 2011
ఉద్యోగం : కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.
ప్రతిభ : ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నప్పుడే ఆశువుగా సీసపద్యాలు చెపుతూ “దీనబంధు శతకాన్ని” రాశారు.
రచనలు : 1) ఆమ్రపాలి 2) పాంచజన్యం 3) క్రీస్తు శతకం 4) నా జీవితగాథ 5) కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు 6) పర్జన్యం 7) గోల్కొండ మొ||నవి.
రచనా శైలి : సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించిన కవి.
అవార్డు : ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును 1975లో పొందారు.
పురస్కారం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “ఉత్తమ ఉపాధ్యాయ” పురస్కారం ఇచ్చింది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.
పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు
1వ పద్యము (కంఠస్థ పద్యం)
*చం. పరమ తపోనివేశనము బంగరుపంటలకు న్నివాస మ
బ్బురమగు శాంతిచంద్రికల భూమి ప్రపంచచరిత్రలోన బం
ధురతర కీర్తి గొన్న భరతోర్వర నా జనయిత్రియంచు పా
డర! శిరమెత్తరా! విజయఢంకను గొట్టుమురా! సహైదరా!
ప్రతిపదార్థాలు :
సహోదరా (సహ + ఉదరా) = ఓ సోదరా !
పరమ తపోనివేశనము ; పరమ = మేలైన (అధికమైన)
తపః + నివేశనము = తపస్సునకు ఉనికి పట్టు (తపో భూమి).
బంగరుపంటలకున్ = బంగారు పంటలకు
నివాసము = నిలయము
అబ్బురము + అగు = అసాధారణమైన
శాంతిచంద్రికల = శాంతివెన్నెలలు కురిసే
భూమి = ప్రదేశము
ప్రపంచచరిత్రలోనన్ = ప్రపంచదేశముల చరిత్రలో
బంధురతరకీర్తి ; బంధురతర = మిక్కిలి రమ్యమైన
కీర్తి = కీర్తిని
భరతోర్వరభ (రత + ఉర్వర) = భారత భూమి
నా జనయిత్రి + అంచు = నా తల్లియని
పాడర = కీర్తించు
శిరము + ఎత్తరా = తల ఎత్తుకోరా !
కైకొనుమురా = తీసికొనుము
భావం :
ఓ భారతకుమార శ్రేష్ఠుడా ! “ఇది నా దేశం. ఈమె నన్ను కన్నతల్లి. నా దేశ సౌభాగ్య సంపదలు అభివృద్ధి చెందడానికి నేను సహాయమందిస్తాను. ప్రపంచమంతటా దీన్ని పూజించేటట్లుగా గొప్ప అభివృద్ధిని నెలకొల్పుతాను” అంటూ నీవు నీ మనస్సులో గట్టిగా ప్రతిజ్ఞ చెయ్యి (చేయుము).
2వ పద్యము
మ. ఇది నాదేశము నన్నుఁ గన్నయది నా యీ దేశ సౌభాగ్య సం
పదలీ విశ్వమునందు వర్ధిలగఁ దోడ్పాటున్ బొనర్తున్ మహా
భ్యుదయమ్మున్ నెలకొల్పుదున్ భువనముల్ పూజింపనంచీవు నీ
యెదలో గట్టి ప్రతిజ్ఞఁ గైకొనుమురా! హిందూకుమారాగ్రణీ!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార + అగ్రణీ = శ్రేష్ఠుడైన ఓ భారత కుమారా!
ఇది నా దేశము – ఇది నా దేశము
నన్నున్ = నన్ను
కన్నయది (కన్న + అది) = కన్నది (కనిన తల్లి)
నా, ఈ = ఈ నా యొక్క
దేశ సౌభాగ్య సంపదలు; దేశ = దేశము యొక్క
సౌభాగ్య = వైభవపు
సంపదలు = ఐశ్వర్యములు
ఈ విశ్వమునందు = ఈ ప్రపంచంలో
వర్దిలగన్ = వృద్ధి పొందడానికి
తోడ్పాటున్ = సాయమును
పొనర్తున్ = చేస్తాను
భువనముల్ = లోకములు (ప్రపంచములు)
పూజింపన్ = పూజించేటట్లుగా
మహాభ్యుదయమున్ (మహా + అభ్యుదయమున్) = గొప్ప అభివృద్ధిని = పొందిన
నెలకొల్పుదున్ = నిలబెడతాను
అంచున్ = అంటూ
ఈ వు = నీవు
నీ + ఎదలోన్ = నీ మనస్సులో
గట్టి = దృఢమైన ప్రతిజ్ఞను
విజయఢంకను = విజయఢంకాను
కొట్టుమురా – మ్రోగించరా ! (చాటింపుము)
భావం :
ఓ సోదరా ! మన దేశం తపోభూమి. బంగారు పంటలకు నిలయం. శాంతి వెన్నెలలు కురిసే పుణ్యభూమి. ప్రపంచంలో మనోహరమైన కీర్తిని పొందిన ఈ భరతభూమి నా తల్లి అని గర్వంగా తల ఎత్తుకొని చాటిస్తూ, విజయఢంకాను మ్రోగిస్తూ నీ దేశం గురించి కీర్తించు.
3వ పద్యము (కంఠస్థ పద్యం )
*ఉ. జాతి శిరస్సు నెత్తికొని క్ష్మాతలవీధిని గౌరవాన హుం
తన మొప్పగాఁ దిరిగినన్ గలుగున్ గడుకీర్తి భారత
క్ష్మాతలి కట్టి భాగ్యమును గల్గగ శాంతి సముద్ధరింప లే
రా ! తరుణమ్మిదే మరల రాదు సుమీ! గతకాల మెన్నడున్
ప్రతిపదార్థాలు :
జాతి = భారతజాతి
శిరస్సున్ + ఎత్తి = తల ఎత్తుకొని
క్ష్మాతల వీధిని . = భూమండలంలో (ప్రపంచంలో)
గౌరవాన = గౌరవంగా
హుందాతనము + ఒప్పగాన్ = హుందాగా
తిర్గినన్ = తిరిగితే
కడు = మిక్కిలి
కీర్తి = కీర్తి
కలుగున్ = కలుగుతుంది
అట్టి భాగ్యమును = అటువంటి సౌభాగ్యము
కల్గగన్ = కలిగే విధంగా
శాంతిన్ = శాంతిని
సముద్ధరింపన్ = పైకి తేవడానికి (లేవనెత్తడానికి)
లేరా = లెమ్ము
తరుణము + ఇదే = ఇదే తగిన సమయము
ఎన్నడున్ = ఎప్పుడునూ
గతకాలము = జరిగిపోయిన కాలం
మరల రాదు సుమీ = తిరిగి రాదు సుమా !
భావం :
భారత జాతి తల ఎత్తుకొని ప్రపంచ వీధిలో సగౌరవంగా, హుందాగా తిరిగినప్పుడే గొప్ప కీర్తి కలుగుతుంది. మన దేశానికి అటువంటి సౌభాగ్యం కలిగే విధంగా శాంతిని పెంపొందించడానికి ఇదే సరైన సమయము. అందుకు సిద్ధం కండి. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు కదా !
4వ పద్యము
మ. మతమేదైనను భాషయేదయిన సంపాదించుకొన్నట్టి సం
స్కృతి యేదైనను నిండు నీ తనువులో జీర్ణించు జాతీయతా
హితనవ్యోజ్జ్వల భావబంధురత లీ హింసా ప్రపంచాన క
ద్భుత రీతిన్ గనిపింపగా వలయు బాబూ! శాంతి దీక్షారతా!
ప్రతిపదార్థాలు :
(ప్రపంచానికి) శాంతి దీక్షారతా = శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా !
మతము = నీ మతము
ఏదయినను (ఏది + అయినను) ఏమయినప్పటికీ
భాషయేదయిన = నీ భాష ఏదయినా
సంపాదించుకున్నట్టి (సంపాదించుకున్న + అట్టి) = ఆర్జించినట్టి
సంస్కృతి – నాగరికత (సంస్కారము)
ఏదైనను (ఏది + ఐనను) = ఏదయినా
నిండు = నిండైన
నీ తనువులో = నీ శరీరములో (నీ నరనరాల్లో)
జీర్ణించు = నిండిన
జాతీయతా = భారత జాతీయత అనే
హిత = మేలయిన
నవ = కొత్తయైన
ఉజ్జ్వల = ప్రకాశించే
భావబంధురతలు = ఇంపైన భావములు
ఈ హింసా ప్రపంచానకున్ = ఈ హింసతో నిండిన ప్రపంచానికి
అద్భుత రీతిన్ = అద్భుతంగా
కనిపింపగా వలయున్ = కనిపించాల్సిన అవసరం ఉంది
భావం :
శాంతి దీక్షయందు ఆసక్తి గలవాడా ! నీ మతం, భాష, సంస్కృతి ఏవయినప్పటికీ, నీ నరనరాల్లో నిండిన భారతీయ భావన హింసతో నిండిన ఈ ప్రపంచానికి అద్భుతంగా కనిపించాలి.
5వ పద్యము
తే.గీ. నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి
భరత భువనమ్ము నీ తల్లి ప్రథితయశము
నిలువఁబెట్టుట నీవంతు నిశ్చయముగ
నీకుఁ గలదు బాధ్యతయు హిందూకుమార!
ప్రతిపదార్థాలు :
హిందూకుమార ! = ఓ భారత కుమారా !
నిఖిల ధరణికిన్ = సమస్త భూమండలానికీ
శాంతిని = శాంతి మార్గాన్ని ముందు
నేర్పినట్టి (నేర్పిన + అట్టి) = నేర్పించినట్టి
భరత భువనమ్ము = భారత భూమి (భారతదేశం)
నీ తల్లి = నీకు తల్లి
ప్రథిత యశము = ప్రసిద్ధి పొందిన కీర్తి
నిలువబెట్టుట = నిలబెట్టడం
నిశ్చయముగ = తప్పక
నీ వంతు = నీ వాటా
నీకున్ = నీకు
బాధ్యతయు = పూచీయూ
కలదు = ఉంది
భావం :
ఓ భారత కుమారా ! సమస్త భూమండలానికి శాంతిని నేర్పినది భారతదేశం. నీ తల్లియైన ఈ భారతదేశం యొక్క సముజ్జ్వల కీర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత నీమీద ఉంది.
6వ పద్యము
సీ. శిరమెత్తరాదు మచ్చరికించి విషపు దౌ
ర్జన్య కులమత హింసాపిశాచి
నిలవఁగారాదు పెన్ బలిసిపోయిన దుష్ట
నయవంచకాళి గూండాయిజమ్ము
తొలచఁగారాదు విద్రోహాన దేశ భా
గ్యాల దార్యతను లంచాల జలగ
వచియింపఁగారాదు ప్రతినిధి యగువాడు
పగ ననల్ మొలకెత్త పలుకుబడుల
ఆ.వె. అంద అన్నదమ్ములన్న మధురమైన
ధర్మమునకు దెబ్బతగులరాదు
నాడురా ! సమేకతా డిండిమము మ్రోగు
వసుధ పొగడ నవ్యభారతమున
ప్రతిపదార్థాలు :
మచ్చరికించి = పట్టు పట్టి
విషపు = తీవ్రంగా వ్యాపించే
దౌర్జన్య కులమత హింసాపిశాచి;
దౌర్జన్య = దుండగములు (దౌర్జన్యములు)
కులమత = కులానికి, మతానికి చెందిన
హింసా పిశాచి = హింస అనే భూతము
శిరము + ఎత్తరాదు = తల ఎత్తరాదు (చెలరేగరాదు)
పెన్ = పెద్దగా
బలిసిపోయిన = పెరిగిపోయిన
దుష్ట = దుష్టులు
నయవంచక + ఆళి = నయవంచకుల సమూహం యొక్క (మోసగాండ్ర యొక్క)
గూండాయిజమ్ము = గూండాయిజం
నిలువగా రాదు = నిలువకూడదు
దేశభాగ్యాల = దేశ సౌభాగ్యముల
దాద్యతను = సత్తువను
లంచాల జలగ = లంచములు అనే జలగ
తొలచగా రాదు = పీల్చరాదు
ప్రతినిధి + అగువాడు = ప్రజా ప్రతినిధులయిన వారు (శాసనసభ్యులు)
పగ = శత్రుత్వము
ననల్ = చివుళ్ళు
మొలకెత్తన్ = అంకురించేలా
పలుకుబడులు = మాటలు
వచియింపగారాదు = మాట్లాడరాదు
అందరు = దేశప్రజలు అందరూ
అన్నదమ్ములు = సోదరులు
అన్న = అనిన
మధురమైన = తీయని
ధర్మమునకున్ = ‘ధర్మానికి
దెబ్బ తగులనీయరాదు = దెబ్బ తగలకూడదు
నవ్య భారతమున = నూతన భారతదేశంలో
వసుధ పొగడన్ = ప్రజలు పొగిడేలా
సమేకతా = సమైక్యము అనే
డిండిమము = ఢక్కా
నాడు = ఆనాడే
మ్రోగున్ రా = ధ్వనిస్తుందిరా !
భావం :
ఇటువంటి పుణ్యదేశంలో అసూయలు, దౌర్జన్యాలు, కులమత హింసలు అనే పిశాచాలను తలయెత్తనీయకూడదు. నానాటికీ పెరిగిపోతున్న దుష్టుల, మోసగాళ్ళ యొక్క గూండాయిజం నిలువకూడదు. బలిష్ఠమైన దేశ సౌభాగ్యాన్ని లంచాలు అనే జలగలు పట్టి పీల్చకూడదు. పగలు, సెగలు రగిలించే మాటలు ప్రజా ప్రతినిధులైన వారు మాట్లాడకూడదు. మనమంతా అన్నదమ్ములం అన్న తీయనైన ధర్మానికి దెబ్బతగులనీయకూడదు. అలా జరిగినప్పుడు సమైక్యము అనే ఢక్కా నవ్యభారతంలో ప్రజలు పొగిడేలా మోగుతుంది.
7వ పద్యము (కంఠస్థ పద్యం)
*శా. ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్
ఈ గోదావరి సింధు నర్మదలు నీ యీదేశ సౌభాగ్య ధా
న్యాగారాలకు పట్టుగొమ్మలు నఖండంబైన నీ ధారుణీ
భాగ్యమ్మీ సకల ప్రపంచమునకున్ స్వామిత్వముం బూనెడిన్
ప్రతిపదార్థాలు:
ఈ గంగానది = ఈ గంగానది
బ్రహ్మపుత్రయునున్ = బ్రహ్మపుత్రా నదియును
ఈ కృష్ణమ్మ = ఈ కృష్ణా నదియు
కావేరియున్ = కావేరీ నదియు
ఈ గోదావరి = ఈ గోదావరి నదియు
సింధు నర్మదలు = సింధు నదియు, నర్మదా నదియు
నీ + ఈ దేశ = నీ యొక్క ఈ భారతదేశపు
సౌభాగ్య ధాన్యాగారాలకు = సౌభాగ్యానికీ, ధాన్యాగారాలకు
పట్టుగొమ్మలు (పట్టు + కొమ్మలు) = ఆధారములు
అఖండంబయిన = సంపూర్ణమైన
ఈ ధారుణీ భాగమ్ము = ఈ భూభాగము
ఈ సకల ప్రపంచమునకున్ = ఈ సమస్త ప్రపంచానికి
స్వామిత్వమున్ = ఆధిపత్యమును
పూనెడిన్ = వహిస్తుంది
భావం :
గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, గోదావరి, సింధు, నార్మద అనే జీవనదులు ఈ దేశ సౌభాగ్యమైన ధాన్యాగారాలకు ముఖ్యమైన ఆధారం. అఖండమైన సౌభాగ్య సంపదలు గలిగిన ఈ దేశం ప్రపంచానికి అధిపతి అయ్యింది.
8వ పద్యము
తే.గీ. ముసలి సన్న్యాసి బాపూజీ బోసినోరు
విప్పిపలికిన పలుకుకే విశ్వజగతి
జోతలర్పించె జాతికి ఖ్యాతి యదియ
ఆ మహామౌని నేల పాడయ్యె నేడు
ప్రతిపదార్థాలు :
ముసలి సన్న్యాసి = ముసలివాడైన సన్న్యాసి వంటివాడైన
బాపూజీ = గాంధీజీ యొక్క
బోసినోరు = పళ్ళులేని నోరు
విప్పి = విప్పి
పలికిన = మాట్లాడిన
పలుకుకే = మాటకే
విశ్వజగతి = ప్రపంచము
జోతలు + అర్పించే = జోహార్లు సమర్పించింది
అదియ = అది ప్రపంచం, గాంధీజీకి జోహార్లు సమర్పించడం అన్నది
జాతికి= భారత జాతికి
ఖ్యాతి = కీర్తినిచ్చేది ఖ్యాతి
ఆ మహామౌని = ఆ గొప్ప మునివంటి గాంధీజీ పుట్టిన
నేల = భూమి (భారతదేశం)
నేడు = ఈనాడు
పాడయ్యె = చెడిపోయింది (గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు)
భావం :
గొప్ప ముసలి సన్యాసి వంటి గాంధీజీ తన బోసి నోరు విప్పి పలికిన పలుకులకు (శాంతి సందేశానికి) ప్రపంచ మంతా జేజేలు పలికింది. అందువల్ల మన భారత జాతికి ఖ్యాతి వచ్చింది. అటువంటి మహాత్ముని కన్న భూమి, నేడు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నడవడం లేదు.
9వ పద్యము
ఆ.వె. దేశభక్తి మఱియు దేశసమగ్రత
ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి
కర్మభూమియగు నఖండ భారతమహా
క్షితిని నెగురు ప్రగతి కేతనమ్ము
ప్రతిపదార్థాలు :
దేశభక్తి = దేశమునందు భక్తి
మఱియున్ = మఱియు
దేశసమగ్రత = దేశము యొక్క సమగ్రత అనే భావాలు
ప్రజల నాడులందు = ప్రజల నరనరాలలో
ప్రబలి, ప్రబలి = బాగా వ్యాపించి
కర్మ భూమి + అగు = పుణ్యభూమియైన
అఖండ భారత మహాక్షితిని ;
అఖండ = సంపూర్ణమైన
భారత = భారతము అనే
మహాక్షితినిన్ = గొప్ప నేలపై
ప్రగతి కేతనమ్ము = అభివృద్ధి అనే జెండా
ఎగురు = ఎగురుతుంది
భావం :
దేశభక్తి, దేశసమగ్రత అనే భావాలు, ప్రజల నరనరాల్లో వ్యాపించి, పుణ్యభూమియైన అఖండ భారతదేశంలో ప్రగతి జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది.