Practice the AP 10th Class Social Bits with Answers 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. ఎరిక్ హబ్స్ బామ్ 20వ శతాబ్దాన్ని ఇలా వర్ణించాడు.
A) తీవ్ర సంచలనాల యుగం
B) ప్రజాస్వామ్య యుగం
C) సిద్ధాంతాల యుగం
D) మేధావుల యుగం
జవాబు:
A) తీవ్ర సంచలనాల యుగం
2. రెండవ ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం
A) తీవ్ర జాతీయవాదం
B) హిట్లర్ పోలెండ్ పై దండెత్తడం
C) సైనిక వాదం
D) ఫెర్డినాండ్ మరియు సోఫియా మరణం
జవాబు:
B) హిట్లర్ పోలెండ్ పై దండెత్తడం
3. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంధి ………..
A) వర్సెయిల్స్ సంధి
B) పారిస్ సంధి
C) ఫ్రాంక్ ఫర్డ్ సంధి
D) ప్రేగ్ సంధి
జవాబు:
A) వర్సెయిల్స్ సంధి
4. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు?
A) జెనీవా
B) స్విట్జర్‌ల్యాండ్
C) న్యూయార్క్
D) ఫ్రాన్స్
జవాబు:
C) న్యూయార్క్
5. క్రింద పేర్కొన్న సంస్థలలో నానాజాతి సమితిలో ఏర్పడిన సంస్థలు ఈ నాటికీ పనిచేస్తున్నాయి.
A) అంతర్జాతీయ కార్మికుల సంఘం
B) అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ
C) అంతర్జాతీయ న్యాయస్థానం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
6. మిత్ర రాజ్య కూటమిలో సభ్యదేశం కానిది?
A) ఫ్రాన్స్
B) రష్యా
C) జర్మనీ
D) బ్రిటన్
జవాబు:
C) జర్మనీ
7. హిట్లర్ పోలెండను ఆక్రమించిన సంవత్సరం ……
A) 1939
B) 1940
C) 1945
D) 1950
జవాబు:
A) 1939
8. “ఐక్యరాజ్యసమితిలో అయిన శాశ్వత సభ్యదేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు అప్రజాస్వామికం” ఎందువల్లనంటే
A) ప్రత్యేకాధికారాలు గల ఈ ఐదు దేశాలతో శాంతి స్థాపన సాధ్యం కాదు
B) ప్రజాస్వామ్య దేశాల మనుగడ ఈ దేశాల నిర్ణయం మీద ఆధారపడి ఉంది
C) తమ ఆదేశాలను పాటించేలా ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి చేస్తాయి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
9. ప్రపంచ శాంతిని నెలకొల్పుటకు స్థాపించబడి కొనసాగుతున్న సంస్థ …………..
A) నాటో
B) నానాజాతి సమితి
C) ఐక్యరాజ్య సమితి
D) అంతర్జాతీయ కార్మిక సంస్థ
జవాబు:
C) ఐక్యరాజ్య సమితి
10. త్రైపాక్షిక కూటమిలో లేని దేశం …………
A) జర్మనీ
B) ఫ్రాన్స్
C) ఆస్ట్రియా
D) ఇటలీ
జవాబు:
B) ఫ్రాన్స్
11. క్రింది వానిలో స్టాలినక్కు సంబంధము లేని అంశము
A) వ్యవసాయంలో భూముల ఏకీకరణ
B) ‘కొత్త ఒప్పందము (న్యూడీల్)’ను ప్రకటించుట
C) పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టుట
D) వేగవంతమైన పారిశ్రామికీకరణ
జవాబు:
B) ‘కొత్త ఒప్పందము (న్యూడీల్)’ను ప్రకటించుట
12. యుద్ధాన్ని నివారించవలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారత జాతీయ నాయకుడు
A) సర్దార్ వల్లభాయ్ పటేల్
B) సుభాష్ చంద్రబోస్
C) మహాత్మా గాంధీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
C) మహాత్మా గాంధీ
13. నానాజాతి సమితి ఉద్దేశాన్ని కొనసాగించడానికి ఏర్పడిన సంస్థ
A) ఐక్యరాజ్యసమితి
B) ప్రపంచ బ్యాంకు
C) పెట్టుబడిదారీ కూటమి
D) సామ్యవాద కూటమి
జవాబు:
A) ఐక్యరాజ్యసమితి
14. గొప్ప ఆర్థిక మాంధ్యం ప్రారంభమైన సంవత్సరం ……………..
A) 1927
B) 1929
C) 1921
D) 1939
జవాబు:
B) 1929
15. డాంజింగ్ రేవు ఏ దేశమునకు చెందినది?
A) జర్మనీ
B) పోలాండ్
C) డెన్మార్క్
D) బెల్జియం
జవాబు:
B) పోలాండ్
16. క్రింది వానిలో రెండవ ప్రపంచ యుద్ధమునకు తక్షణ కారణము.
A) దురహంకార పూరిత జాతీయవాదము
B) రహస్య ఒప్పందాలు
C) ఫెర్డినాండ్ హత్య
D) హిట్లర్ పోలాండ్ పై దాడి
జవాబు:
D) హిట్లర్ పోలాండ్ పై దాడి
17. క్రింది వానిలో రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికాని వాక్యము.
A) తీవ్రంగా నష్టపోయినవి ఐరోపాదేశాలు
B) అమెరికా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి
C) వలసపాలక శక్తులు తమ వలస పాలనను ఇక సమర్థించుకోలేక పోయాయి
D) వలస మాత్రిక పోరాటాలకు రష్యా పెద్ద దిక్కుగా అవతరించింది.
జవాబు:
B) అమెరికా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి
18. ప్రపంచశాంతి కోసం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటయిన సంస్థ.
A) ఐక్యరాజ్యసమితి
B) అలీనోద్యమము
C) నానాజాతి సమితి
D) కొమ్మిన్ టర్న్
జవాబు:
C) నానాజాతి సమితి
19. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం
A) జపాన్, పెరల్ హార్బర్ పై దాడి చేయటం
B) ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయటం
C) హిట్లర్ పోలండ్ పై దాడి చేయటం
D) ఆస్ట్రియా యువరాజును హత్య చేయటం
జవాబు:
D) ఆస్ట్రియా యువరాజును హత్య చేయటం
20. ఈ క్రింది వానిలో విద్య మరియు సాంస్కృతిక అంశాలకు సంబంధించినది.
A) ILO
B) UNICEF
C) UNESCO
D) WHO
జవాబు:
C) UNESCO
21. ఫాసిజం దీనికి ప్రాధాన్యత ఇచ్చింది.
A) జాతీయ ఐక్యత
B) ప్రజాస్వామ్యం
C) స్వేచ్ఛ
D) సమానత్వం
జవాబు:
A) జాతీయ ఐక్యత
22. బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది?
A) 1915
B) 1918
C) 1946
D) 1948
జవాబు:
B) 1918
23. 1870 లో బిస్మార్క్ ఈ దేశాన్ని ఒంటరిని చేయాలని చూశాడు.
A) రష్యా
B) ఇంగ్లాండు
C) ఫ్రాన్సు
D) జపాన్.
జవాబు:
C) ఫ్రాన్సు
24. నానాజాతి సమితిలో చేరడానికి ఆహ్వానించబడని దేశాలు.
A) ఇంగ్లండ్, ఫ్రాన్సు
B) చైనా, రష్యా
C) జర్మనీ, రష్యా
D) ఫ్రాన్సు, జర్మనీ
జవాబు:
C) జర్మనీ, రష్యా
25. మొదటి ప్రపంచ యుద్ధంలో శకి కూటములకు సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి.
A) బ్రిటన్
B) ఆస్ట్రియా
C) ఫ్రాన్స్
D) రష్యా
జవాబు:
B) ఆస్ట్రియా