These AP 10th Class Social Studies Important Questions 8th Lesson ప్రజలు – వలసలు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 8th Lesson Important Questions and Answers ప్రజలు – వలసలు

10th Class Social 8th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. మహిళలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
వివాహం

2. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి …… వ్యక్తి వలస వచ్చిన వాళ్ళు.
జవాబు:
నాల్గవ.

3. భారతదేశంలో పట్టణ జనాభా ఎంత శాతం?
జవాబు:
33%

4. ప్రతి సంవత్సరము భారతదేశము నుండి పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్ళుచున్న వారి సంఖ్య ఎంత?
జవాబు:
3 లక్షలు.

5. క్రింది వానిలో అంతర్జాతీయ వలసను గుర్తించి, రాయండి.
→ శ్రీకాకుళం నుండి ఢిల్లీకి.
→ తిరుపతి నుండి అమరావతికి.
→ విశాఖపట్టణం నుండి సౌదీ అరేబియాకి.
→ బెంగుళూరు నుండి ముంబైకి.
జవాబు:
విశాఖపట్టణం నుండి సౌదీ అరేబియాకి.

6. విదేశాలలో పని చేయు భారతీయుల ప్రయోజనాలను కాపాడే చట్టం ఏది?
జవాబు:
1983 వలసల చట్టం.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

7. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు ఉపయోగించే ప్రామాణికాలలో ప్రధానమైనది, మొదటిది ఏది?
జవాబు:
జన్మస్థలం.

8. విజయవాడ నుండి లండన్ వలస వెళ్ళినట్లయితే అది ఏవలస?
జవాబు:
అంతర్జాతీయ వలస.

9. ఉద్యోగ భద్రత ఉండే రంగం ఏది?
జవాబు:
వ్యవస్థీకృత రంగం.

10. గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వలస సహజంగా ఎంత కాలం ఉంటుంది?
జవాబు:
6 నెలలు.

11. ‘కొయినా’ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉన్నది?
జవాబు:
మహారాష్ట్ర

12. వలస వెళ్ళిన చెరుకుతోటలలో పనిచేసే కూలీలు వేసుకునే చిన్న గుడిసెల్లాంటి ఆవాసాలను ఏమంటారు?
జవాబు:
‘కోపి’లు.

13. ‘టైర్’ కేంద్ర నివాస ప్రాంతాలలో ఎన్ని కోపిలుంటాయి?
జవాబు:
200 – 500.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

14. 50 – 100 కోపీలు ఉండే కేంద్ర నివాస ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
‘గాడి’.

15. క్రింది వానిలో గిరిజన తెగ కాని వారిని గుర్తించి, రాయండి.
సంతాల్, సవర, ముండా, బలిజ.
జవాబు:
బలిజ.

16. వలస కార్మికులు సాధారణంగా ఏ రంగంలో పని చేస్తున్నారు?
జవాబు:
అవ్యవస్థీకృత.

17. వలస కార్మికుల పిల్లలు బడి మానటానికి ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
కుటుంబీకులు వలస వెళ్ళటం.

18. వలస వెళ్ళిన ప్రాంతంపై ఏ రకమైన వలస ప్రభావం చాలా ముఖ్యమైనది?
జవాబు:
అంతర్జాతీయ.

19. ఎక్కడికి వలస వెళుతున్న అంతర్జాతీయ వలస కార్మికులలో అయిదింట ముగ్గురు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు?
జవాబు:
పశ్చిమ ఆసియా.

20. భారతదేశంలోని వలస వెళ్ళిన వారిలో ఎంత శాతం మంది రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినవారు?
జవాబు:
84.2%

21. భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళినవారు ఎంతశాతం ఉన్నారు?
జవాబు:
13%

22. మహారాష్ట్రలోని చేపల ప్రోసెసింగ్ కర్మాగారాలలో పనిచేయుటకు ఏటా 50 వేల మంది మహిళలు ఏ రాష్ట్రం నుంచి వలస వెళుతున్నారు?
జవాబు:
కేరళ.

23. జన్మస్థానం అంటే?
జవాబు:
ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశం.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

24. పట్టణాలలో జనాభా పెరుగుదల ఎక్కువ శాతం దేనివల్ల సంభవిస్తుంది?
జవాబు:
సహజ పెరుగుదల వల్ల.

25. జాతీయ సర్వేలో ‘వలస వెళ్ళిన వ్యక్తి’ అన్న పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల ఏ వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది?
జవాబు:
తాత్కా లిక.

26. ముంద, సంతాల్ జాతి పురుషులు ఏ రాష్ట్రంలోని గనులలో పనిచేయటానికి వలస వెళతారు?
జవాబు:
ఒడిశా.

27. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళు సాధారణంగా ఏ ఆదాయ వర్గానికి చెందిన వారయి ఉంటారు?
జవాబు:
పేద వర్గం (BPL)

28. భారతదేశంలో పంచదార ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రమేది?
జవాబు:
మహారాష్ట్ర

29. అస్సోంలోని తోటలలో పనికి వలస వెళుచున్న గిరిజన తెగ ఏది?
జవాబు:
సవర.

30. జాతీయ కమీషన్ 1990 లలో ఇచ్చిన నివేదికలో గ్రామీణ కార్మికుల కాలానుగుణ వలసలకు ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ప్రాంతాల మధ్య అసమానతలు, (అసమాన అభివృద్ధి).

31. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఎన్నవ వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి?
జవాబు:
1/3 వంతు.

32. వలస కార్మికులు తమ సంపాదనలో ఎక్కువ మొత్తము దేనిపై ఖర్చు చేస్తున్నారు?
జవాబు:
ఆహారము పై.

33. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు వలస వెళ్ళువారు సాధారణంగా ఎటువంటి కార్మికులు?
జవాబు:
నైపుణ్యం కల్గిన కార్మికులు.

34. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్ళిన వారి సంఖ్య ఎంత?
జవాబు:
30.7 కోట్లు

35. క్రింది వానిలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పోవడానికి గల కారణం కానిది’ ఏది ?
→ విద్యకోసం → ఉపాధికోసం → మెరుగైన అవకాశాల కోసం → వివాహం
జవాబు:
వివాహం

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

36. ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వారు పాటించే ప్రమాణికాలు ఏవి?
జవాబు:
జన్మస్థానం, ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలం.

37. పట్టణాలలో ఉద్యోగాలు దొరకటానికి చాలా కీలకమైన అంశం ఏది?
జవాబు:
పరిచయాలు.

38. 2001 – 2011 మధ్యకాలంలో పెరిగిన పట్టణ జనాభా ఎంత?
జవాబు:
9.1 కోట్లు.

39. 2001 – 2011 మధ్యకాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో సహజ పెరుగుదల శాతం ఎంత?
జవాబు:
44%.

40. 2001 – 2011 మధ్యకాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో పట్టణ ప్రాంతాల విస్తరణ వల్ల పెరిగిన శాతం ఎంత?
జవాబు:
32%

41. 2001 – 2011 మధ్యకాలంలో పట్టణ జనాభా పెరుగుదలలో వలసల వల్ల పెరిగిన జనాభా శాతం ఎంత?
జవాబు:
24%

42. మహారాష్ట్రలో మొత్తం సహకార చక్కెర కర్మాగారాల సంఖ్య ఎంత?
జవాబు:
186.

43. మహారాష్ట్రలో ఏ ఆనకట్ట కట్టిన తర్వాత 1970 దశాబ్ద ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరకు సాగు చెయ్యటం మొదలు పెట్టారు?
జవాబు:
కొయనా.

44. మహారాష్ట్రలో చెరుకు నరకటానికి ప్రతి సంవత్సరం మధ్య మహారాష్ట్ర నుంచి ఏ మహారాష్ట్ర ప్రాంతంకు 6,50,000 కూలీలు వలస వెళతారు?
జవాబు:
పశ్చిమ మహారాష్ట్రకు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

45. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్ళగా, 1990లలో ఈ సంఖ్య ఎంతకి పెరిగింది?
జవాబు:
60,000

46. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రకారం 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో ఎన్ని కోట్ల కంటే తక్కువ మంది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళుతున్నారు?
జవాబు:
7 కోట్లు.

47. కేరళ మొత్తం ఆదాయంలో ఎన్నవ వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వాళ్ళు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది?
జవాబు:
1/5 వంతు.

48. బలహీన పడిన రూపాయి కారణంగా దేశమంతా సతమతమవుతుండగా, ఎవరు మాత్రం సంతోషంగా ఉన్నారు?
జవాబు:
ప్రవాస కేరళీయులు.

49. కేరళలో ప్రధానమైన పండగ ఏది?
జవాబు:
ఓనం.

50. 25 లక్షల దాకా ఉన్న ప్రవాస కేరళీయులు ఆ రాష్ట్ర GDP లో ఎంత శాతానికి దోహదం చేస్తున్నారు?
జవాబు:
35%

51. కేరళ రాష్ట్రానికి ప్రవాసుల ద్వారా వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉందని నివేదిక చెబుతుంది?
జవాబు:
1.6 రెట్లు.

52. మగవారిలో వలసలకు ప్రధాన కారణం ఏమిటి?
జవాబు:
ఉపాధి (ఉద్యోగం).

53. “పంచదార పట్టీగా” పిలువబడుతున్న ఏడు జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జవాబు:
మహారాష్ట్ర

54. గ్రామీణ ప్రాంత కార్మికులలో కనిపించే వలస రకం ఏది?
జవాబు:
తాత్కాలిక (లేదా) కాలానుగుణ వలస.

55. భారతదేశంలో కాలానుగుణ వలస దారులు ఎక్కువ శాతం ఏ సామాజిక వర్గంనకు చెందినవారు ఉన్నారు?
జవాబు:
షెడ్యూల్డ్ కులాల వాళ్ళు,

56. వలస పోయిన వారు సాధారణంగా ఏ ప్రాంతాలకు చెందిన వారుగా ఉంటారు?
జవాబు:
కరువు పీడిత.

57. UAE ని విస్తరింపుము.
జవాబు:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

58. జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అన్న పదానికి ఉన్న నిర్వచన పరిధి ఎన్ని నెలలు?
జవాబు:
‘6’ నెలలు.

59. ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్ళడాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్జాతీయ వలస.

60. ఒక దేశంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడాన్ని ఏమంటారు?
జవాబు:
అంతర్గత వలస.

61. ఆరు నెలలలోపు వలస ఉన్నట్లయితే అటువంటి వలస నేమంటారు?
జవాబు:
తాత్కాలిక / కాలానుగుణ వలస.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

62. క్రింది వానిలో అంతర్గత వలస కానిది ఏది?
A) రామాపురం నుండి కాకినాడ పట్టణానికి బ్రతుకు దెరువుకై వెళ్ళడం.
B) ఒడిశా నుండి అమరావతి నగర నిర్మాణానికి కూలీలు వలస రావడం.
C) ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలకు ఇంగ్లీషు నేర్పడానికి కేరళ టీచర్లు రావడం.
D) భారతీయ పిల్లలకు చైనీస్ నేర్పడానికి చైనా టీచర్లు రావడం.
జవాబు:
D) భారతీయ పిల్లలకు చైనీస్ నేర్పడానికి చైనా టీచర్లు రావడం.

63. ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళటానికి ప్రధాన కారణమేమి?
జవాబు:
ఉపాధి అవకాశాల కోసం.

64. వలసలు ప్రధానంగా ఎక్కడ నుంచి ఎక్కడకు జరుగుతాయి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు.

క్రింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానము రాయండి
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 4

65. 1961 – 71 నుండి 2001 – 2011 వరకు పట్టణ జనాభా సుమారు ఎన్ని రెట్లు పెరిగింది?
జవాబు:
3 రెట్లు.

66. 2001 – 2011 దశకంలో పట్టణ జనాభా ఎంతకు చేరింది?
జవాబు:
91 మిలియన్లు.

67. 1961 – 71 దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా ఎంత?
జవాబు:
31 మిలియన్లు.

68. పట్టణ జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి ?
జవాబు:
సహజ పెరుగుదల.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

69. NCRL విస్తరింపుము.
జవాబు:
National Commission for Rural Labour.

10th Class Social 8th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
‘కోపి’ అనగానేమి?
(లేదా)
మహారాష్ట్ర చెరుకు వలస కార్మికులు వేసుకునే గుడిసెలను ఏమంటారు?
జవాబు:
మహారాష్ట్రలో చెరకు నరుకుటకు వచ్చు కూలీలు బొంగులు, వెదురు తడికలతో వేసుకునే చిన్న గుడిసెలను “కోపి”లు అంటారు.

ప్రశ్న 2.
వలసలు వెళ్ళడానికి రెండు కారణాలు రాయండి.
(లేదా)
వలసలకు దారితీస్తున్న ఏవేని రెండు కారణాలను రాయండి.
జవాబు:

 1. వేరు, వేరు ప్రాంతాలలో వివాహాలు జరగడం
 2. ఉద్యోగాల కోసం వెళ్ళడం
 3. విద్య నిమిత్తం వెళ్ళడం
 4. ఒక ప్రాంతంలో కరువు కాటకాలు రావడం వలన వేరొక ప్రాంతానికి వెళ్ళడం.

ప్రశ్న 3.
అంతర్జాతీయ వలసలకు ఒక కారణాన్ని వ్రాయండి.
జవాబు:
అంతర్జాతీయ వలసలకు కారణాలు : విద్య, ఉపాధి మొదలైనవి.

ప్రశ్న 4.
ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశాన్ని ఏమంటాం?
జవాబు:
ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశాన్ని జన్మస్థలం అంటాం.

ప్రశ్న 5.
‘ఇంతకుముందు నివాసం ఉన్న స్థలం’ అనగానేమి?
జవాబు:
ఒక వ్యక్తి ఆరునెలలు లేదా అంతకుమించి ఎక్కువ కాలంపాటు ఉన్న ప్రదేశం.

ప్రశ్న 6.
మహారాష్ట్రలో సహకార రంగంలో చక్కెర పరిశ్రమలెన్ని ఉన్నాయి?
జవాబు:
సహకార రంగంలో 186 చక్కెర కర్మాగారాలు మహారాష్ట్రలో ఉన్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 7.
కొట్టిన చెరుకును కుప్పలుగా వేసే కార్మికులు ఎవరు?
జవాబు:
బాల కార్మికులు కొట్టిన చెరుకును కుప్పలుగా వేస్తారు.

ప్రశ్న 8.
అంతర్జాతీయంగా వలసలు పోతున్నవారి సంఖ్య ఎంత?
జవాబు:
ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా వలసలు పోతున్న వారి సంఖ్య 20 కోట్లు.

ప్రశ్న 9.
U.A.E. ని విస్తరింపుము.
జవాబు:
United Arab Emirates.

ప్రశ్న 10.
పశ్చిమాసియా దేశాలకు ఎక్కువగా ఏయే రాష్ట్రాల నుండి వలసలు పోతున్నారు?
జవాబు:
పశ్చిమాసియా దేశాలకు ఐదింటికి మూడవ వంతు మంది కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు వలస వెళుతున్నారు.

ప్రశ్న 11
భారతీయుల అంతర్జాతీయ వలసలను పర్యవేక్షించే చట్టం ఏది?
జవాబు:
భారతీయుల అంతర్జాతీయ వలసలను 1983 చట్టం పర్యవేక్షిస్తుంది.

ప్రశ్న 12.
వలసను నిర్వచించుము.
జవాబు:
ఏవైనా కారణాల వలన ఒక వ్యక్తి జన్మస్థానం నుంచి వేరొక ప్రదేశం వెళ్ళి (6 నెలల కంటే / అధిక కాలం) ఉండటాన్ని వలస అంటాం.

10th Class Social 8th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
వలస వెళ్ళిన వారు ఇబ్బందులు పెడతారా? నీ అభిప్రాయాన్ని సమర్థింపుము.
జవాబు:

 1. అవును. నా అభిప్రాయములో వలస వెళ్ళినవారు ఇబ్బందులు పెడతారు.
 2. వలసదారులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించలేదు.
 3. కొద్దికాలం తరువాత వలసదారుల సౌకర్యాలకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు.
 4. వలసదారులు వలస వెళ్ళిన ప్రాంతంలో వారి గుర్తింపుకై ఉద్యమాలు చేపట్టడం ద్వారా ఇబ్బందులు పెడతారు.
  ఉదా: శ్రీలంకలోని తమిళులు.

(లేక)

 1. లేదు. నా అభిప్రాయములో వలస వెళ్ళినవారు ఇబ్బందులు పెట్టరు.
 2. సాధారణంగా వలసదారులు జీవనోపాధి కొరకు ఎక్కువగా వలస వెళుతుంటారు.
 3. కనుక వారు ఆ ప్రాంతంలో ఆధిపత్యం కొరకు పోరాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
 4. గుర్తింపు కోసం, ఆధిపత్యం కోసం పోరాడరు. కనుక వలస వెళ్ళినవారు ఎవరినీ ఇబ్బంది పెట్టరు.
 5. వ్యవసాయ కార్మికులు ఉదాహరణకు మహారాష్ట్రలో చెరకు నరకడానికి వెళ్ళిన కార్మికులు కేవలం ఉపాధి కొరకే వెళతారు కనుక వారు ఎటువంటి ఇబ్బందులు సృష్టించరు.

ప్రశ్న 2.
ఈ కింది పేరా చదివి ప్రశ్నకు సమాధానం రాయండి.

కుటుంబంలో కేవలం మగవాళ్ళు వలసకి వెళ్ళినపుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఇటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్లు, చెల్లెళ్ళను చూసుకోవాల్సిన భారం ఉండి చివరికి చాలామంది బడి మానేస్తారు.

కుటుంబ పెద్ద వలసకి వెళితే ఆడపిల్లల మీద ఆ ప్రభావం ఏ విధంగా పడుతుంది?
జవాబు:

 1. వలస వెళ్ళిన కుటుంబంలోని ఆడపిల్లల మీద తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూసుకోవలసిన భారం పడుతుంది.
 2. ఆడపిల్లలు ఇంటిపనులు, వంటపనులు చేయవలసి వస్తుంది.
 3. వ్యవసాయ పనులకు కూడా బాలికలు వినియోగించబడతారు.
 4. కుటుంబ పెద్ద వలస వెళ్ళుట వలన ఆడపిల్లల మీద పని ఒత్తిడి పెరుగుతుంది. దీని ఫలితంగా వారు బడి మానివేస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 3.
విదేశాలకు వలస వెళ్లే భారత దేశీయుల కష్టాలకు నీవు సూచించే పరిష్కార మార్గాలేవి?
జవాబు:

 1. విదేశాలలో ఉన్న స్థానిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.
 2. వలస వెళ్ళే దేశాలలోని భౌగోళిక పరిస్థితులు మరియు శీతోష్ణస్థితుల పట్ల అవగాహన అవసరం.
 3. వీసా, పాస్పోర్ట్ చట్టబద్ధమైన పద్దతిలో కలిగి ఉండాలి.
 4. వలస వెళ్ళే దేశాలలో ఉగ్రవాదం, అలజడుల పట్ల అవగాహన కలిగి ఉండాలి.

ప్రశ్న 4.
‘వలసల నివారణ’ పై ఒక కరపత్రం రూపొందించంది.
జవాబు:

కరపత్రం
వలసల నివారణ

వలస అనగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతమునకు వెళ్ళుట. ఎక్కువగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. ఇది తరచుగా ఉపాధి కోసం జరుగుతుంది. ప్రజలు ఎక్కువగా పట్టణాలకు వలస వెళ్ళడం వలన అక్కడ వారు చాలా ఇబ్బందులకు గురికావలసి వస్తుంది.

 1. కాలనీలు ఎక్కువగా విస్తరించడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది.
 2. బోరుబావులు, నందనూతులు పెరగడంతో భూగర్భజలాలు త్వరితంగా అంతరించిపోతున్నాయి.
 3. ఎక్కువ మంది పారిశుద్ధ్యం లేని వాతావరణంలో నివశించడం వలన అనేక అనారోగ్యాలకు గురి అవుతారు.
 4. చాలామంది పిల్లలు మధ్యలోనే చదువును ఆపివేయడం జరుగుతుంది.
 5. వీరికి ఆరోగ్య, విద్య, విద్యుత్, మంచినీటి సదుపాయాలు కూడా సరిగా అందడం లేదు.
 6. అంతేకాకుండా వ్యవసాయ రంగం మీద ఆధారపడేవారి శాతం తగ్గి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం వలన ఆహార పదార్థాలు మరియు తిండి గింజల ధరలు బాగా పెరిగి పోయూలయి.

విజ్ఞప్తి : పై సమస్యలను రూపుమాపటం మనందరి యొక్క బాధ్యత. కావున ప్రజలకు ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాలలోనే కల్పించి వలసలను నివారించవలెను.

ప్రశ్న 5.
క్రింది పేరాగ్రాను చదివి, ప్రశ్నకు సమాధానం వ్రాయండి.
గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయము లేనందున, ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు.
ప్ర. గ్రామీణ ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్ళు పట్టణ ప్రాంతములో ఉపాధి పొందే ఆర్థిక రంగాలు ఏవి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
గ్రామీణ ప్రాంతం నుండి వలస వచ్చిన వారికి పట్టణాలలో సంఘటిత రంగాలలో అవకాశాలు ఉండవు. ఎందుకనగా సంఘటిత రంగంలో అవకాశాలు ఎక్కువగా విద్య నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువ మందికి అసంఘటిత రంగంలోనే అవకాశాలు ఉంటాయి.
ఉదా :
1) పరిశ్రమలలో కార్మికులు
2) రిక్షాలు తోలుట
3) బజారులలో తిరుగుతూ సరుకులు అమ్ముకొనుట.
4) భవన నిర్మాణ రంగాలలో కూలీలు

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 6.
గ్రామీణ ప్రాంతం నుంచి వలస వచ్చిన కార్మికులు ఏ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
జవాబు:
ఆదాయం పెంచుకోవటానికి, కుటుంబ అవకాశాలు మెరుగు పరచుకోవటానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలలో పరిశ్రమలు, సేవా రంగాలలో పని చేయటానికి వలస వచ్చిన కొంతమంది సహజ స్పందనగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియలో వాళ్లకు చదువుకొనటానికి, కొత్త ఉద్యోగాలు చెయ్యటానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకొనటానికి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా లింగ, కుల ఆధారిత వివక్షత పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉండి వాళ్లకు అధిక స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉంటాయి. అయితే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరి అయి పట్టణాలకు వలస వస్తారు. ఇటువంటి ప్రజలకు పట్టణాలు, నగరాలలోని మురికివాడలలో తగినంత చోటు లేక, తాగునీరు, పారిశు ద్యం వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇటువంటి వాళ్లకు ‘వ్యవస్థీకృత రంగం’లో పని దొరకటం కష్టం. కాబట్టి వీళ్లు ఆశించిన ఉద్యోగ భద్రత ఉండదు, మెరుగైన ఆదాయం ఉండదు. వాళ్లు రోజుకూలీలుగా బతుకులు ఈడుస్తుంటారు.
(లేదా)

 1. సరియైన నివాసం మరియు వసతుల కొరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది.
 2. ఉద్యోగాల కోసం పరిచయాలు అవసరం అవుతాయి.
 3. అసంఘటిత రంగంలో పని చేయవలసి రావడం వల్ల ఉద్యోగ భద్రత, ఇతర సదుపాయాలు ఉండవు.
 4. ఆహారం కొరకు ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 7.
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు ఇంటి బయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకు మధ్య గల సంబంధం ఎలా ఉందో వివరించండి.
జవాబు:
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళు ఇంటి బయట పనిచెయ్యటానికి, లింగ వివక్షతకు మధ్య గల సంబంధం :

 1. ఆర్థిక స్వాతంత్ర్యం
 2. ఆత్మ విశ్వాసం
 3. ఆడవాళ్ల మాటకు ప్రాధాన్యత
 4. సామాజిక, రాజకీయ రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరగడం
 5. పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కోవడం
 6. మగవారితో పోలిస్తే వేతనం తక్కువ
 7. గృహ హింస

ప్రశ్న 8.
ప్రక్క పటములో ఇచ్చిన సమాచారాన్ని చదివి మీ పరిశీలనను వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 1
జవాబు:
పరిశీలన :

 1. ఈ గ్రాఫు 2007-08లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యం గురించి తెలియచేస్తున్నది.
 2. స్వల్పకాల వలసదారులలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 19% కలరు.
 3. స్వల్పకాల వలసదారులలో షెడ్యూల్డ్ తెగలకు చేందినవారు 23% కలరు.
 4. స్వల్పకాల వలసదారులలో ఇతర వెనుకబడిన ఖలాలకు చెందినవారు 40% కలరు.
 5. స్వల్పకాల వలసదారులలో ఇతర వెనుకబడిన కులాలవారు అత్యధికంగా కలరు.

ప్రశ్న 9.
కాలానుగుణ వలసల గురించి క్లుప్తంగా వ్రాయండి.
జవాబు:
కాలానుగుణ వలసలు :

 1. గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళ్ళుతారు.
 2. ఇవి సాధారణంగా 6 నెలలలోపు ఉంటాయి.
 3. వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, ఆదివాసీలు, దళితులు ఎక్కువగా వలస వెళతారు.
 4. ఉదా : చెరుకు నరుకు వారు, ఇటుక బట్టీలలో పనిచేసేవారు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 10.
ప్రజల వలసలకు ప్రధాన కారణాలేమిటి?
జవాబు:
భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 30.7 కోట్లమంది వలస వెళ్లారు. అనేక కారణాల వల్ల వలసలు జరగవచ్చు. ఆడవాళ్లలో వలస వెళ్లటానికి వివాహం ప్రధాన కారణం కాగా మగవాళ్లలో ఉపాధి లేదా ఉపాధికోసం అన్వేషణ ప్రధాన కారణం. ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వంటివి జనగణన సర్వేలో ప్రజలు వలసకు కారణాలుగా పేర్కొన్నారు.

ప్రశ్న 11.
గ్రామీణ ప్రాంతం నుండి పట్టణానికి వలస వచ్చేవారు ఇరు ప్రాంతాలతో ఎటువంటి సంబంధాలు నిలుపుతారు?
జవాబు:
పట్టణాలలో ఉద్యోగాలు దొరకటానికి పరిచయాలు, సంబంధాలు చాలా కీలకమైనవి. ఒక్కొక్కసారి తమ పరిచయాలు, సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం దొరకబుచ్చుకున్న తరువాతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వస్తారు. అనేక కారణాల వల్ల వాళ్లు తమ గ్రామీణ ప్రాంతాలలో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు. వలస వెళ్లిన వాళ్లు పట్టణ అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేస్తుంటారు.

ప్రశ్న 12.
భారతదేశంలోని ముఖ్యమైన వలస ప్రాంతాలను – ప్రాముఖ్యతను రాయండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 5
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 6

ప్రశ్న 13.
గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ వలసలకు కారణం ఏమని చెప్పింది?
జవాబు:
గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లలో ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది. కొన్ని గిరిజన ప్రాంతాలలో బయటివాళ్లు రావటం వల్ల, ఆనకట్టలు కట్టటానికి, గనుల తవ్వకానికి తప్పనిసరిగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రశ్న 14.
చెరుకు నరికే కూలీల నివాసాల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
చెరుకు నరికివేతకు రోజులకు వలస వచ్చినవాళ్లు ఫ్యాక్టరీలు కేటాయించిన ఖాళీ ప్రదేశాలలో నివసిస్తారు. ఇవి చేలకు దగ్గరగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి కొన్ని బొంగులు, వెదురు తడిక ఇస్తారు. వీటితో వాళ్లు చిన్న గుడిసె వేసుకుంటారు. (దీనిని అక్కడ ‘కోపి’ అంటారు). టైర్ కేంద్ర నివాస ప్రాంతాలలో 200-500 కోపీలు ఉంటాయి, గాడి కేంద్ర నివాస ప్రాంతాలలో 50-100 కోపీలు ఉంటాయి. ఈ కోపీలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. వాటి ముందు పశువులు కట్టేసి ఉంటాయి. పశువులు, మనుషులు ఇరుకిరుకు పరిస్తితులలో నివసిస్తుంటారు.

ప్రశ్న 15.
అంతర్జాతీయ వలసలకు వెళుతున్న విద్యావంతులైన భారతీయులు గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళుతున్నారు. ఐటి నిపుణులు, డాక్టర్లు, మేనేజ్ మెంట్ నిపుణులు ఈ రకానికి ఉదాహరణ. 1950లు, 1960లలో కెనడా, ఇంగ్లాండునకు వలస వెళ్లిన భారతీయులలో ఎక్కువమంది ఏ నైపుణ్యమూ లేనివాళ్లు కాగా గత పది సంవత్సరాలలో ఎక్కువగా వృత్తి నిపుణులు ఈ దేశాలకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తినిపుణులు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళుతున్నారు. 1950లలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్లగా, 1990లలో ఈ సంఖ్య 60,000కి పెరిగింది.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 16.
అంతర్జాతీయ వలసలకు వెళ్తున్న నైపుణ్యం లేని కార్మికుల గూర్చి నీకేం తెలుసు?
జవాబు:
చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యంలేని, కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్లు, వలస వెళ్లిన దేశాలలోని పరిస్థితిని బట్టి కొంతకాలం తరువాత ఇలా వలస వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తారు. భారతదేశం నుంచి పశ్చిమ ఆసియాకి వెళుతున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువమంది సౌదీ అరేబియాకి, యు.ఏ.ఇ. (United Arab Emirates) కి వెళుతున్నారు. ప్రతి సంవత్సరం పశ్చిమ ఆసియాకి 3 లక్షల కార్మికులు వలస వెళుతున్నారు. పశ్చిమ ఆసియాకి వలస వెళుతున్న కార్మికులలో అయిదింట ముగ్గురు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. ఈ వలస కార్మికులలో అధిక శాతం భవన నిర్మాణం, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలలో పనిచేస్తుంటారు.

ప్రశ్న 17.
అంతర్జాతీయ వలసల ప్రభావం వలస వెళ్లిన వారి ప్రాంతంపై ఎలా ఉంటుంది?
జవాబు:
వలస వెళ్లిన ప్రాంతంపై అంతర్జాతీయ వలస ప్రభావం చాలా ముఖ్యమైనది. వలస వెళ్లిన వాళ్ల కుటుంబాలు అప్పులు తీర్చగలగటం, ఆస్తులు కొనటం, జీవనశైలిలో మార్పు వంటి వాటిలో ఈ ప్రభావం బాగా కనపడుతుంది. కేరళ మొత్తం ఆదాయంలో అయిదింట ఒక వంతు పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న వాళ్లు పంపించే డబ్బు ద్వారా సమకూరుతోందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. 1970లలో కేరళలో తలసరి సగటు వినియోగం దేశ సగటు కంటే తక్కువగా ఉండేది. కానీ 30 ఏళ్ల తరువాత ఇది దేశ సగటు కంటే 40 శాతం ఎక్కువగా ఉంది.

ప్రశ్న 18.
గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడానికి కారణాలేంటి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయాలు, మెరుగైన సేవలు ఉంటాయన్న ఆశతో ప్రజలు వలస వెళతారు.

ప్రశ్న 19.
తాత్కాలిక వలసల సంఖ్య తక్కువగా చూపబడుతుంది. ఎందుకు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస కూడా పెరిగింది. ఇలా వెళ్లే వలసలు సాధారణంగా ఆరు నెలలోపు ఉంటాయి. కాబట్టి దీనిని జనాభా గణన గణాంకాలు ప్రతిబింబించకపోవచ్చు. జాతీయ సర్వేలలో ‘వలస వెళ్లిన వ్యక్తి’ అన్న పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల తాత్కాలిక వలస వెళ్లే వాళ్ల సంఖ్య తక్కువగా చూపించబడుతోంది.

ప్రశ్న 20.
పట్టణ ప్రాంతాలలో ఉద్యోగాలు దొరకడానికి పరిచయాలు, సంబంధాలు ఎందుకు అవసరం?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో గల ప్రజలకు పట్టణాలలో ఎక్కడ, ఎటువంటి పని / ఉపాధి లభిస్తుందో తెలియదు. ఉపాధి లభించినా ఎచ్చట నివసించాలి వంటి అంశాలు అవగాహన ఉండదు. అందుచే గ్రామీణ ప్రాంతాల్లో గల వారికి పట్టణ ప్రాంతాలలోని వారితో పరిచయాలు, సంబంధాలు అవసరం.

ప్రశ్న 21.
వృత్తాకార చిత్రం : 2007 – 08లో భారతదేశంలో కాలానుగుణ వలసదారుల నేపథ్యంలో చిత్రాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
అ) 2007-08 సం||లో మొత్తం వలసలలో షెడ్యూల్డ్ తెగల వారి శాతం ఎంత?
ఆ) 2007-08 లోని వలస జనాభాలో ఏ వర్గ ప్రజలు ఎక్కువ?
ఇ) తక్కువ శాతం వలసలు ఏ వర్గాలలో ఉన్నాయి?
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 1
జవాబు:
అ) 2007-08 సం||లో మొత్తం వలసలలో షెడ్యూల్డ్ తెగల వారి శాతం : 23.
ఆ) 2007-08 లోని వలస జనాభాలో ఇతర వెనుకబడిన తరగతుల వారు ఎక్కువ.
ఇ) తక్కువ శాతం వలసలు ఇతరులు, షెడ్యూల్డ్ కులాల వారిలో ఉన్నాయి.

ప్రశ్న 22.
1961 – 2011ల మధ్య భారతదేశంలో పట్టణ జనాభా పెరుగుదల.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 4
పై గ్రాఫ్ ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
అ) 1961-71 దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా ఎంత?
ఆ) 2001-11 దశాబ్దంలో పట్టణ జనాభా ఎంతకు చేరింది?
ఇ) 1961-71 నుండి 2001-11 వరకు పట్టణ జనాభా సుమారు ఎన్నిరెట్లు పెరిగింది?
జవాబు:
అ) 1961-71 దశాబ్దంలో భారతదేశ పట్టణ జనాభా 31 మిలియన్లు.
ఆ) 2001-11 దశాబ్దానికి పట్టణ జనాభా 91 మిలియన్లకు చేరింది.
ఇ) 1961-71 నుంచి 2001-11 వరకు పట్టణ జనాభా సుమారుగా 3 రెట్లు పెరిగింది.

ప్రశ్న 23.
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 5-1
బీహార్ నుండి కోల్ కత, లక్నో, ఢిల్లీలకు వలస వెళ్ళిన వారి సంఖ్యను అంచనా వేయంది.
జవాబు:
బీహార్ నుండి కోల్ కతకి వలస వెళ్ళిన వారి సంఖ్య : 3 లక్షలు.
బీహార్ నుంచి లక్నోకు వలస వెళ్ళిన వారి సంఖ్య : 2 లక్షలు.
బీహార్ నుండి, ఢిల్లీకి వలస వెళ్లిన వారి సంఖ్య : 9 లక్షలు.

ప్రశ్న 24.
కింది పటం పరిశీలించి ఏ రాష్ట్రాల నుండి వలసలు ఎక్కువగా ఉన్నాయో తెలపండి. కారణాలు వివరించండి.
పటం : ప్రధాన అంతర రాష్ట్ర వలస మార్గాల అంచనా, 2001-2011
AP Board 10th Class Social Solutions Chapter 8 ప్రజలు – వలసలు 4
జవాబు:

 1. అధిక వలసలు బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి ఉన్నాయి.
 2. అధిక జనసాంద్రత గల మైదాన ప్రాంతాలైనప్పటికీ ఉపాధి అవకాశాల కోసం అంతర్గత వలసలు, పట్టణ వలసలు అధికంగా ఉంటున్నాయి.
 3. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వలసలు అధికంగా ఉన్నాయి.

10th Class Social 8th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పశ్చిమాసియా వెళ్ళిన భారత వలస కార్మికుల దుర్భర పరిస్థితులపై మీ స్పందన ఏమిటి?
జవాబు:

 1. కొన్ని సందర్భాలలో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు.
 2. కొన్నిసార్లు వలస వెళ్ళాలనుకుంటున్న కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తారు లేదా విదేశాలలో పని చూపించటానికి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు.
 3. ఒక్కొక్కసారి యజమానుల ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు. లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాన్ని మారుస్తారు.
 4. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు.
 5. యజమానులు తరచూ కార్మికులతో బలవంతంగా అదనపు పనిగంటలు పని చేయించుకుని, అందుకు అదనపు వేతనం చెల్లించరు.
 6. కార్మికులను వాళ్ళ పాస్పోర్టు వాళ్ళదగ్గర ఉంచుకోనివ్వరు.
 7. ఉద్యోగం పోతుందన్న భయంతో భారత వలస కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదులు నమోదు చెయ్యరు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 2.
వలస వెళ్ళినపుడు ప్రజలకు కలిగే లాభనష్టాలను వ్రాయుము.
జవాబు:
లాభాలు:

 1. ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపించడం.
 2. అప్పులు తీర్చడం.
 3. ఇల్లు, భూమి వంటి స్థిరాస్తులు కొనడం.
 4. వ్యవసాయ పరికరాలు, వినియోగ వస్తువులు కొనడం.
 5. మంచి ఉపాధి అవకాశాలు
 6. అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం.
 7. జీవనశైలిలో మార్పు

నష్టాలు :

 1. ఆహార ధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయడం.
 2. తీవ్రమైన పరిస్థితులలో నివసించడం.
 3. పారిశుద్ధ్యం లేని వాతావరణం.
 4. అనారోగ్య సమస్యలకు గురికావడం.
 5. శిశుసంరక్షణ కేంద్రాలు లేకపోవడం.
 6. పిల్లలకు చదువు కొనసాగించే వీలు లేకపోవడం.
 7. కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం ఆడవాళ్ల మీద పడడం.
 8. ఒత్తిడి

ప్రశ్న 3.
క్రింది పేరాను చదివి, వ్యాఖ్యానించండి.
ఉత్పత్తి కారకాలలో శ్రమ ప్రధాన కారణమైనందున కొత్త వ్యవసాయ పద్ధతులు ఎక్కువ శ్రమను ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇటువంటిది జరగలేదు. వ్యవసాయంలో శ్రమను మితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో శ్రామికులు అవకాశాల కోసం వెదుక్కుంటూ పక్క గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు వలస వెళుతున్నారు. కొంతమంది కార్మికులు గ్రామంలో వ్యవసాయేతర పనులు చేపడుతున్నారు.
జవాబు:
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. దేశంలో అధిక జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. అయితే వ్యవసాయాధారిత దేశాలు వెనుకబడి ఉంటాయి. భారతదేశంలాంటి దేశంలో ఇంతకన్నా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడలేరు. ఇప్పటికే ఆ రంగంలో కాలానుగుణ నిరుద్యోగిత ఉన్నది.

అయితే ప్రభుత్వం రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులను నేర్పి, పెద్ద కమతాలు చేసి, యంత్రాల ద్వారా వ్యవసాయం చేసే అవకాశాలు కల్పించి నాణ్యమైన ఉత్పత్తి సాధించి విదేశాలకు ఎగుమతులను పెంచినట్లయితే ఈ పరిస్థితిని కొంతవరకు మార్చవచ్చు. అప్పటి వరకు వలసలు, వ్యవసాయేతర వృత్తులు, పనులు తప్పవు.

ప్రశ్న 4.
అంతర్జాతీయ వలస అనగానేమి? అంతర్జాతీయ వలసకు దారితీసిన పరిస్థితులు, ప్రభావాలు తెలపండి.
జవాబు:
అంతర్జాతీయ వలస :
ప్రజలు వివిధ కారణాల వల్ల ఇతర దేశాలకు వలస వెళ్ళడాన్ని అంతర్జాతీయ వలస అంటారు.

క్రింది కారణాలతో అంతర్జాతీయ వలసలు జరుగుతున్నవి :

 • ఉన్నత విద్య కొరకు.
 • మెరుగైన ఉపాధి అవకాశాల కొరకు
 • వ్యాపార అవసరాల కొరకు

అంతర్జాతీయ వలసలు క్రింది విధంగా ప్రభావం చూపుతున్నాయి.

 • వలస వెళ్ళిన కుటుంబాల ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగవుతున్నది.
 • అప్పులు తీర్చడం, ఆస్తులు కొనడం వంటివి ఆ కుటుంబాలు చేయగలుగుతున్నాయి.
 • వారి జీవన శైలిలో మార్పు వస్తున్నది.
 • మేధో వలసలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 5.
ప్రజల కొనుగోలు శక్తిని వలసలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?
జవాబు:

 1. సాధారణంగా వలస వెళ్ళిన కుటుంబాలు మెరుగైన ఆదాయాలను పొందుతాయి.
 2. అందువలన వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది.
 3. సాధారణంగా ఆ కుటుంబాలు ఇల్లు, భూములు వంటి ఆస్తులను కొనుగోలు చేస్తాయి.
 4. వ్యవసాయ పరికరాలను సమకూర్చుకుంటాయి.
 5. వినియోగ వస్తువుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడాన్ని ప్రారంభిస్తాయి.

ప్రశ్న 6.
కింది ‘పై’ గ్రాఫ్ ను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరా రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 2
జవాబు:
గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతం తక్కువ కాలానికి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళతారు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గలవాళ్ళు, దళితులు, ఆదివాసీలు.

కొన్ని గిరిజన ప్రాంతాలలో బయటివాళ్ళు రావడం, ఆనకట్టలు కట్టడం, గనుల త్రవ్వకం వలన ప్రజలు నిర్వాసితులు కావటం వల్ల తాత్కాలికంగా తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి.

కానీ వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది ఇతర వెనుకబడిన తరగతులవారు ఉన్నారు. ఎక్కువ మంది వలస వెళ్ళినవారు అవ్యవస్థీకృత రంగంలో కార్మికులుగా ఉంటున్నారు.

ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్డు కులాలు, తెగలు మరియు వెనుకబడిన వారి కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను చేపట్టడం మరియు వారి అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించడంలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి వలస వెళ్ళడం మాని అక్కడే పని చేసుకుంటున్నారు.

ప్రశ్న 7.
‘కుటుంబాలు వలస వెళ్ళినపుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్నపిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీలు ఉండదు. వాళ్ళు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వాళ్ళని మళ్ళీ చేర్చుకోవు. చివరికి వాళ్ళు బడికి వెళ్ళటం మానేస్తారు. కుటుంబంలో కేవలం మగవాళ్ళే వలసకి వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. ఇటువంటి కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్ళు, చెల్లెళ్ళను చూసుకోవాల్సిన భారం ఉండి చివరకు చాలామంది బడి మానేస్తారు.
ప్రశ్న : “వలస కుటుంబాలలోని అధిక శాతం పిల్లలు బడి మధ్యలోనే మానేస్తున్నారు.” – వ్యాఖ్యానించండి.
జవాబు:

 1. అవును, నిజమే, కుటుంబాలు వలస వెళ్ళినపుడు అధికశాతం పిల్లలు మధ్యలోనే బడి మానేయవలసి వస్తున్నది.
 2. వారు వలస వెళ్ళిన దగ్గర పిల్లల కోసం శిశుసంరక్షణ కేంద్రాలు ఉండడం లేదు.
 3. ఒకవేళ ఉన్నా పేద కుటుంబాలు ఆ ఖర్చును భరించలేవు.
 4. కొన్నిసార్లు వలసవెళ్ళిన ప్రదేశాలలో పాఠశాలలు అందుబాటులో ఉండకపోవచ్చు.
 5. తిరిగి స్వగ్రామాలకు వచ్చినపుడు పాఠశాలలో చేరడం వీలుకాకపోవచ్చు.
 6. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి వారిని చేర్చుకుంటున్నాయి.
 7. అయినా వారు చదువులో వెనుకబడిపోతున్నారు.
 8. ఇది చదువు పట్ల వారి ఆసక్తిని దెబ్బతీస్తున్నది.
 9. వలసవెళ్ళిన కుటుంబాలలోని ఆడపిల్లల మీద తమ్ముళ్ళు, చెల్లెళ్ళను చూసుకోవలసిన బాధ్యత పడుతున్నది.

ప్రశ్న 8.
పట్టికలో ఇవ్వబడిన సమాచారమును పరిశీలించి విశ్లేషించండి.
AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు 3
జవాబు:

 1. 1991 జనాభాను జమ్ము & కాశ్మీర్ కాకుండా మరియు 2001 జనాభాను జమ్ము & కాశ్మీర్ కలుపుకొని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
 2. 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం జనాభా (జమ్ము & కాశ్మీర్ కాకుండా) 838.5 మిలియన్లు. 2001 జనాభా లెక్కల ప్రకారం (జమ్ము & కాశ్మీర్ కలుపుకొని) 1028.6 మిలియన్లు. పెరుగుదల వ్యత్యాసం – 21.5% గా ఉంది.
 3. 1991లో మొత్తం వలసలు 229.8 మిలియన్లు కాగా, 2001లో 307.1 మిలియన్లు ఉండి, పెరుగుదల వ్యత్యాసం 32.9%గా ఉంది.
 4. జిల్లాల్లోనే వలస వచ్చినవారు 1991లో 136.2 మిలియన్లు మరియు 2001లో 181.7 మిలియన్లు. వీరి పెరుగుదల వ్యత్యాసం 32.6 శాతం.
 5. రాష్ట్రంలోనే ఇతర జిల్లాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య 1991లో 59.1 మిలియన్లు మరియు 2001లో 76.8 మిలియన్లు. వీరి పెరుగుదల వ్యత్యాసం 29.5 శాతంగా ఉంది.
 6. భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల నుండి వలసవచ్చినవారి సంఖ్య 1991లో 27.2 మిలియన్లు కాగా, 2001లో 42.3 మిలియన్లు. పెరుగుదల వ్యత్యాసం 54.5%.
 7. ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య 1991లో 6.9 మిలియన్లు అయితే 2001లో వారి సంఖ్య 6.1గా నమోదయింది. తగ్గుదల వ్యత్యాస్యం – 11.6%.

పై సమాచారం ప్రకారం 1991 నుండి 2001 వరకు అన్ని రకాల వలసల సంఖ్య పెరిగింది. అయితే ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి సంఖ్య తగ్గింది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే, విదేశీయులు భారతదేశానికి వలస రావడానికి ఆసక్తి చూపడం లేదు. వనరుల కొరత, అరకొర ఉద్యోగావకాశాలు, తక్కువ జీతాలు వంటివి ఇందుకు కారణాలు. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి వలస వచ్చిన వారే. తాము నివసించే ప్రాంతాలలో ఉపాధి, విద్యావకాశాలు లేకపోవడం వల్ల ప్రజలు వలస వెళతారు. కుటుంబ సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధిక ఆదాయం , మెరుగైన సేవలు వంటివి కూడా వలసలకు కారణాలుగా పేర్కొనవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 9.
వలసల ఏర్పాటులో గుత్తేదారుల పాత్ర ఏమిటి?
జవాబు:
వ్యవసాయరంగంలో వలస వెళ్ళేవాళ్ల గ్రామాలకు రైతులు వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అదే కులానికి, వర్గానికి లేదా ప్రాంతానికి చెందిన గుత్తేదారులను (వీళ్లనే ఏజెంట్లని కూడా అంటారు), వ్యాపారస్తులను, ఢిల్లీలోని గనుల యజమానులు, కర్నాటకలోని కాఫీ తోటల యజమానులు వలస కార్మికులతో ఒప్పందాలు కుదుర్చుకోటానికి ఉపయోగించుకుంటారు. పంజాబ్లో వలస వచ్చిన కూలీల ద్వారా ఇతరులను కూడా పనులకు పిలిపించుకుంటారు. దీనికి యజమానుల నుంచి గుత్తేదారులకు కొంత ప్రతిఫలం అందటమే కాకుండా వలస కూలీలకు వచ్చే ఆదాయం నుంచి కూడా కొంత తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో గుత్తేదారులు పర్యవేక్షకులుగా కూడా పనిచేస్తారు.

ప్రశ్న 10.
వలస ప్రజల సమస్యలేంటి?
జవాబు:
వలస వెళ్లిన ప్రదేశంలో ఆ కార్మికులకు చౌకధరల దుకాణాల నుంచి సరుకులు దొరకవు కాబట్టి వాళ్లు ఆహారధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన పరిస్థితులలోనూ, పారిశుద్ధ్యం లేని వాతావరణంలోనూ నివసించాల్సి రావటం వల్ల వాళ్లు అనేక అనారోగ్యాలకు, రోగాలకు గురౌతారు. గనులు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులలో పని వల్ల వాళ్లు ఒళ్లు నొప్పులు, వడదెబ్బ, చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతారు. యజమానులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్ల పారిశ్రామిక ప్రదేశాలు, భవన నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదాలు తరచు సంభవిస్తూ ఉంటాయి. వలస కార్మికులు సంఘటిత రంగంలో లేనందు వల్ల వాళ్లకి వివిధ ఆరోగ్య, కుటుంబ సంరక్షణ కార్యక్రమాలు అందటం లేదు. వలస వచ్చిన మహిళా కూలీలకు ప్రసూతి సెలవలు ఉండవు. అంటే ప్రసవించిన కొద్ది రోజులకే వాళ్లు తిరిగి పనికి వెళ్లవలసి ఉంటుంది.

ప్రశ్న 11.
వలసల వలన కలిగే ప్రయోజనాలేవి?
జవాబు:
వలస వెళ్లే వాళ్లలో చాలామంది, ప్రత్యేకించి దీర్ఘకాలం వలస వెళ్లేవాళ్లు ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నాయి. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్లల్లో చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు, లేదా మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళతారు. వలస వెళ్లటం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చటానికి, ఇతర కార్యక్రమాలకు డబ్బు సమకూరుతుంది. వలస వెళ్లిన కుటుంబాలు ఇల్లు, భూమి వ్యవసాయం పరికరాలు, వినియోగ వస్తువులు కొనటం సాధారణంగా చూస్తూ ఉంటాం. వలస వెళ్లిన వాళ్లల్లో కొంతమంది వలస వెళ్లిన ప్రదేశంలో ఉద్యోగం పొందవచ్చు. అవసరమైన నైపుణ్యాలు అక్కడ పెంపొందించుకోవచ్చు. మంచి ఉద్యోగాల గురించి తెలుసుకుని క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస వెళ్లవచ్చు.

AP 10th Class Social Important Questions Chapter 8 ప్రజలు – వలసలు

ప్రశ్న 12.
అంతర్జాతీయ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? భారత వలసల చట్టం 1893 ఈ సమస్యల నుండి వారిని ఎలా కాపాడుతుంది?
జవాబు:
భారతదేశీయులు విదేశాలకు వలస వెళ్లి పనిచేయటాన్ని వలసల చట్టం, 1983 అన్న భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది. పని నిమిత్తం వెళ్లే వాళ్ల ప్రయోజనాలను కాపాడటానికి ఇది కొన్ని షరతులు విధిస్తుంది. వివిధ దేశాలలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య కార్యాలయాలు వలసల చట్టంలో పొందుపరిచిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వలస కార్మికులకు జీతాలు చెల్లించరు. కొన్నిసార్లు వలస వెళ్లాలనుకుంటున్న కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తారు. లేదా విదేశాలలో పని చూపించటానికి సిఫారసు చేసినదానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు. ఒక్కొక్కసారి యజమానుల ఒప్పంద కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు, లేదా వలస కార్మికులు నష్టపోయేలా ఒప్పంద పత్రాన్ని మారుస్తారు. ఇస్తామన్న దానికంటే తక్కువ జీతం ఇస్తారు. ఇతర ప్రయోజనాలు, ప్రోత్సాహకాలను నిలిపివేస్తారు. వాళ్లు తరచు కార్మికులతో బలవంతంగా అదనపు పని చేయించుకుని, అందుకు అదనపు వేతనం చెల్లించరు. కార్మికులను వాళ్ల దగ్గర ఉంచుకోనివ్వరు. ఉద్యోగం పోతుందన్న భయంతో భారత వలస కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశీ యజమానులపై ఫిర్యాదులు నమోదు చెయ్యరు.