Practice the AP 10th Class Social Bits with Answers 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

1. క్రింది వారిలో సమాచార హక్కు చట్టానికి జవాబు దారీగా ఉండేవారు ………..
A) పౌర సమాచార అధికారులు
B) ఎన్నికల అధికారి
C) జనరల్ సెక్రటరీ
D) మేయర్
జవాబు:
A) పౌర సమాచార అధికారులు

2. సమాచార హక్కు చట్టానికి సవరణలు ఎవరు చేస్తారు?
A) పార్లమెంటు
B) సుప్రీం కోర్టు
C) ప్రధానమంత్రి
D) రాష్ట్ర శాసనసభ
జవాబు:
A) పార్లమెంటు

AP 10th Class Social Bits Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

3. ఏ రకమైన సమాచారం ప్రజలకు అందుబాటులో వుంచుటలో మినహాయింపు వుంది?
A) సంస్థ వివరాలు, విధులు, బాధ్యతలు
B) సంస్థలోని అధికారాలు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు
C) సబ్సిడీ పథకాల అమలు విధానం, దానికి కేటాయించిన నిధులు
D) వ్యక్తి జీవితానికి, భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
జవాబు:
D) వ్యక్తి జీవితానికి, భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.

4. న్యాయసేవా పీఠాలు వీరి గురించి ఏర్పాటు చేశారు.
A) సైనికులు
B) ప్రభుత్వ ఉద్యోగులు
C) బలహీన, పేదవర్గాలు
D) ధనికులు
జవాబు:
C) బలహీన, పేదవర్గాలు

5. ప్రతి జవాబుకు మార్కులు సరిగా వేశారో లేదో చూసుకునే వీలు కల్పిస్తూ జవాబు పత్రం పొందే హక్కును విద్యార్థులకు కల్పించే చట్టం
A) సమాచార హక్కు చట్టం
B) బాలల హక్కు చట్టం
C) స్టాంప్స్ రిజిస్ట్రేషన్ చట్టం
D) న్యాయ సేవల చట్టం
జవాబు:
A) సమాచార హక్కు చట్టం

6. క్రింది వర్గానికి చెందిన ప్రజలలో ఎవరు సమాచారం పొందుటకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరము లేదు?
A) దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారు
B) దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు
C) ప్రభుత్వ ఉద్యోగస్తులు
D) రాజకీయ నాయకులు
జవాబు:
B) దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు

7. లోక్ అదాలల యొక్క ప్రయోజనం
A) సామాన్య ప్రజలకు, న్యాయవ్యవస్థకు మధ్య దూరం తగ్గించుట
B) తక్కువ ఖర్చు, సత్వర న్యాయం
C) ఉచిత న్యాయ సహాయం
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

8. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం పొందటానికి ఈ క్రింది వారు రుసుము చెల్లించాలి
1) ప్రభుత్వ ఉద్యోగులు
2) దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వ్యక్తులు
3) మంత్రులు మరియు వైద్యులు
A) (1) మాత్రమే
B) (2) మాత్రమే
C) (1) మరియు (2)
D) (1) మరియు (3)
జవాబు:
D) (1) మరియు (3)

AP 10th Class Social Bits Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

9. సమాచార హక్కు చట్టంను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంవత్సరం
A) 2003
B) 2005
C) 2007
D) 2009
జవాబు:
B) 2005