Practice the AP 10th Class Social Bits with Answers 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. మహ్మద్ అలీ జిన్నా క్రియాశీలకంగా పాల్గొన్న సంస్థ
A) భారత జాతీయ కాంగ్రెస్
B) స్వరాజ్య పార్టీ
C) ముస్లిం లీగ్
D) రిపబ్లికన్ పార్టీ
జవాబు:
C) ముస్లిం లీగ్
2. ‘చేయండి లేదా చావండి’ అనే నినాదం దీనికి సంబంధించింది
A) సహాయ నిరాకరణ ఉద్యమం
B) క్విట్ ఇండియా ఉద్యమం
C) ఖిలాఫత్ ఉద్యమం
D) శాసనోల్లంఘనోద్యమం
జవాబు:
B) క్విట్ ఇండియా ఉద్యమం
3. ఆగస్టు 1942లో ప్రారంభమైన ఉద్యమం ……
A) క్విట్ ఇండియా
B) సహాయ నిరాకరణ
C) శాసనోల్లంఘన
D) ఏదీకాదు
జవాబు:
A) క్విట్ ఇండియా
4. భారతదేశ విభజనకు నాందిగా వాయవ్య ముస్లిం రాష ఆవశ్యకత గురించి మాట్లాడిందెవరు?
A) మొహ్మద్ ఇక్బాల్
B) మొహ్మద్ ఆలీ జిన్నా
C) రెహ్మత్ ఆలి
D) ముజ్బర్ రెహ్మాన్
జవాబు:
A) మొహ్మద్ ఇక్బాల్
5. రాయల్ నౌకా దళం సమ్మెకు సంబంధం లేని డిమాండ్లు …………….
A) అన్ని సభలలోనూ ముస్లింలకు ప్రత్యేక స్థానాలు
B) కేంద్ర కార్య నిర్వాహకవర్గ ముస్లిం సభ్యులను ఎంపిక చేసేందుకు ముస్లింలీగుకే సంపూర్ణ అధికారము
C) పాకిస్తాన్ పేరిట ప్రత్యేక జాతీయ రాజ్యము
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
6. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు నడిపారు?
A) సుభాష్ చంద్రబోస్
B) గాంధీజీ
C) జవహర్‌లాల్ నెహ్రు
D) డా. బి. ఆర్. అంబేద్కర్
జవాబు:
B) గాంధీజీ
7. ఈ క్రింద పేర్కొన్న కారణాల కారణంగా 1939 లో కాంగ్రెసు ప్రభుత్వాలు రాజీనామా చేశాయి …….
A) బ్రిటన్ సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వటానికి తిరస్కరించటం
B) క్యాబినెట్ మిషన్ ఏర్పాటు
C) భారతీయులను ప్రపంచ యుద్ధంలో పాల్గొనమని బ్రిటన్ బలవంతపెట్టడం
D) కాంగ్రెసు నాయకుల మధ్య సంఘర్షణ
జవాబు:
A) బ్రిటన్ సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వటానికి తిరస్కరించటం
8. రాయల్ నౌకాదళం తిరుగుబాటు ప్రారంభమయిన సంవత్సరము ……
A) 1943
B) 1945
C) 1942
D) 1946
జవాబు:
D) 1946
9. హైదరాబాదులో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ
A) కాంగ్రెస్ పార్టీ
B) కమ్యూనిస్టు పార్టీ
C) భారతీయ జనతా పార్టీ
D) కిసాన్ సభ
జవాబు:
B) కమ్యూనిస్టు పార్టీ
10. 1947లో సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను వీరికి అప్పగించడం జరిగింది
A) మహాత్మా గాంధీ
B) సర్దార్ వల్లభాయ్ పటేల్
C) అంబేద్కర్
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
B) సర్దార్ వల్లభాయ్ పటేల్
11. ‘తెభాగ’ ఉద్యమానికి నేతృత్వం వహించినది ………..
A) కాంగ్రెస్
B) కిసాన్ సభ
C) RSS
D) ముస్లిం లీగ్
జవాబు:
B) కిసాన్ సభ
12. క్రింది ఈ కోరికను సాధించుకోవడానికి ముస్లిం లీగు ‘ప్రత్యక్ష కార్యాచరణ’ను ప్రకటించింది.
A) నాసిరక ఆహారం
B) బ్రిటిష్ అధికారుల ప్రవర్తన
C) భారత జాతీయ సైనికుల (INA) విడుదల
D) పదోన్నతులు
జవాబు:
C) భారత జాతీయ సైనికుల (INA) విడుదల
13. సంస్థానాల విలీన బాధ్యతను వీరికి అప్పగించారు
A) మహాత్మా గాంధీ
B) రాజేంద్రప్రసాద్
C) అంబేద్కర్
D) సర్దార్ వల్లభాయ్ పటేల్
జవాబు:
D) సర్దార్ వల్లభాయ్ పటేల్
14. కులం, వర్గాలను అధిగమించి, హిందువులందరినీ
ఏకంచేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకు రావాలని ఆశించే సంఘం
A) భారత జాతీయ సైన్యం
B) కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్
C) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
D) యువజన కాంగ్రెస్
జవాబు:
C) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
15. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క గొప్ప కృషి
A) స్వదేశీ రాజ్యా లను భారత యూనియన్లో చేర్చడం
B) క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం
C) హోం రూల్ ఉద్యమ నాయకత్వం
D) భారత స్వాతంత్ర్య ప్రకటన
జవాబు:
A) స్వదేశీ రాజ్యా లను భారత యూనియన్లో చేర్చడం
16. 1930 వరకు ముస్లిం లీగ్ వీటికి ప్రాతినిధ్యం వహించింది.
A) ముస్లిం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు
B) సిక్కు భూస్వాముల ప్రయోజనాలకు
C) ముస్లిం మహిళల ప్రయోజనాలకు
D) ఉత్తర ప్రదేశ్ ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు
జవాబు:
D) ఉత్తర ప్రదేశ్ ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు
17. క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం
A) పూనా ఒడంబడిక విఫలం అగుట
B) మితవాదుల ఒత్తిడి
C) క్రిప్స్ దౌత్యం విఫలం అవ్వడం
D) అతివాదుల ఒత్తిడి
జవాబు:
C) క్రిప్స్ దౌత్యం విఫలం అవ్వడం
18. ‘రాజాభరణం’ దీని కోసం మంజూరు చేశారు.
A) సంస్థానాల ప్రజల సంక్షేమం కొరకు
B) సంస్థానాలలో ఉద్యమాలను ప్రోత్సహించుటకు
C) సంస్థానాలపై యుద్ధం చేయుటకు
D) రాచరిక కుటుంబాల వ్యక్తిగత ఖర్చులకు
జవాబు:
D) రాచరిక కుటుంబాల వ్యక్తిగత ఖర్చులకు
19. ‘తెభాగ’ ఉద్యమం ఇచ్చట ప్రారంభించబడినది.
A) బెంగాల్
B) ఒడిషా
C) కేరళ
D) హైదరాబాదు
జవాబు:
A) బెంగాల్
20. ‘తెభాగ ఉద్యమం’ చేసినవారు
A) చిన్న, పేద రైతులు
B) జమీందారులు, భూస్వాములు
C) ప్రభుత్వ ఉద్యోగులు
D) సిపాయిలు
జవాబు:
A) చిన్న, పేద రైతులు
21. భారతదేశపు చివరి వైస్రాయ్
A) వావెల్
B) హార్డింజ్
C) మౌంట్ బాటెన్
D) హేస్టింగ్స్
జవాబు:
C) మౌంట్ బాటెన్
22. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం పట్ల సానుభూతి ప్రదర్శించిన బ్రిటీష్ రాజకీయ పార్టీ
A) కన్జర్వేటివ్ పార్టీ
B) లేబర్ పార్టీ
C) రిపబ్లికన్ పార్టీ
D) డెమొక్రటిక్ పార్టీ
జవాబు:
B) లేబర్ పార్టీ
23. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు నిరాహార దీక్ష చేసిన నాయకుడు
A) జవహర్‌లాల్ నెహ్రూ
B) వల్లభభాయ్ పటేల్
C) అంబేద్కర్
D) గాంధీజీ
జవాబు:
D) గాంధీజీ
24. బ్రిటీష్ మంత్రివర్గం ముగ్గురు సభ్యుల బృందాన్ని 1946 మార్చిలో దీనికోసం ఢిల్లీకి పంపింది.
A) భారతదేశ స్వాతంత్ర్యానికి అనువైన రాజకీయ చట్రం చేయడానికి
B) భారతదేశాన్ని విడగొట్టడానికి
C) భారతదేశాన్ని సమైక్యపరచడానికి
D) భూసంస్కరణలు అమలుపరచడానికి
జవాబు:
A) భారతదేశ స్వాతంత్ర్యానికి అనువైన రాజకీయ చట్రం చేయడానికి
25. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా, మహాత్మాగాంధీ నడిపిన మూడవ పెద్ద ఉద్యమం
A) చంపారన్
B) వందేమాతర ఉద్యమం
C) క్విట్ ఇండియా
D) సహాయ నిరాకరణోద్యమం
జవాబు:
C) క్విట్ ఇండియా