Practice the AP 10th Class Social Bits with Answers 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. క్రింది వారిలో కమ్యూనిజంతో ప్రేరణ పొందనివారు
A) ఎమ్.ఎన్. రాయ్
B) ఠాగూర్
C) జవహర్‌లాల్ నెహ్రు
D) సుభాష్ చంద్రబోస్
జవాబు:
D) సుభాష్ చంద్రబోస్

2. ఒక దేశం రెండవ దేశంతో దురహంకార పూరితంగా ప్రవర్తిస్తే రెండవ దేశం ఈ విధంగా స్పందించాలి.
A) తాను కూడా దురహంకార పూరితంగా వ్యవహరించాలి.
B) ఇచ్చి పుచ్చుకొనే ధోరణిని ప్రదర్శించాలి
C) రాజకీయ చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
D) సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని పెంచుకోవాలి
జవాబు:
C) రాజకీయ చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

AP 10th Class Social Bits Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

3. క్రింద పేర్కొన్న జర్మనీ నియంత హిట్లర్ చర్యలలో నీవు దేనిని ప్రశంసిస్తావు?
A) ఆర్యజాతి ఆధిపత్యం నెలకొల్పుతానని వాగ్దానం చేయడం
B) రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం
C) పొరుగు దేశాలతో యుద్ధాలు చేయడం
D) ప్రజలను కదిలించే అద్భుత ప్రసంగాలు ఇవ్వడం
జవాబు:
D) ప్రజలను కదిలించే అద్భుత ప్రసంగాలు ఇవ్వడం

4. రష్యాలో వచ్చిన ఫిబ్రవరి విప్లవం ముఖ్య ఫలితం ………
A) జార్ చక్రవర్తి పారిపోవడం
B) మహిళా సాధికారిత
C) మొదటి ప్రపంచ యుద్ధము ముగింపు
D) లెనిన్ అధికారంలోకి రావడం
జవాబు:
A) జార్ చక్రవర్తి పారిపోవడం

5. జర్మనీ రహస్య పోలీసు బృందం …………
A) కస్టాపో
B) గెస్టాపో
C) స్టార్మ్
D) ట్రూపర్స్
జవాబు:
B) గెస్టాపో

6. రష్యాలోని పౌర యుద్దం కాలం ………
A) 1918 నుండి 1925
B) 1918 నుండి 1923
C) 1917 నుండి 1920
D) 1917 నుండి 1924
జవాబు:
C) 1917 నుండి 1920

7. ఈ క్రింద తెల్పిన హిట్లర్ చర్యలు ప్రపంచ యుద్ధానికి దారితీశాయి
A) జాతి ఆధిపత్యం నెలకొల్పుతానని వాగ్దానం చేయడం
B) రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయడం
C) పొరుగు దేశాలపై దాడి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

8. 1917 లో రష్యాలో ఏర్పడిన మొదటి విప్లవం …….
A) ఆగష్టు విప్లవం
B) ఫిబ్రవరి విప్లవం
C) అక్టోబరు విప్లవం
D) డిసెంబరు విప్లవం
జవాబు:
B) ఫిబ్రవరి విప్లవం

9. జర్మనీలో పార్లమెంటును ………. అంటారు.
A) డ్యూమా
B) రిచ్ స్టాగ్
C) డైట్
D) కాంగ్రెస్
జవాబు:
B) రిచ్ స్టాగ్

10. జె.యమ్. కీన్స్ గొప్ప ……….
A) శాస్త్రవేత్త
B) రాజకీయవేత్త
C) ఆర్థిక వేత్త
D) పర్యావరణవాది
జవాబు:
C) ఆర్థిక వేత్త

11. తీవ్ర మాంద్యం యొక్క ప్రభావం కానిది
A) నిరుద్యోగం పెరుగుట
B) పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుట
C) యువత నేర కార్యకలాపాలకు పాల్పడడం
D) ఉపాధి పెరుగుదల
జవాబు:
D) ఉపాధి పెరుగుదల

AP 10th Class Social Bits Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

12. మార్చి 8, 1917న, రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ లో ఊరేగింపుగా వెళ్లిన సుమారు 10,000 మంది మహిళల డిమాండు ……..
A) భూమి
B) గృహ వసతి
C) రొట్టె, శాంతి
D) సరిపోయే వేతనాలు
జవాబు:
C) రొట్టె, శాంతి

13. ఈ క్రింది వానిలో సరికానిది.
A) బ్రిటన్ – చర్చిల్
B) అమెరికా – రూజ్వెల్ట్
C) ఇటలీ – హిట్లర్
D) రష్యా – లెనిన్
జవాబు:
C) ఇటలీ – హిట్లర్

14. యుఎస్ఎస్ఆర్లోని సోవియట్లు వీరికి సంబంధించిన కౌన్సిల్లు
A) అధికారులు, సైనికులు, వ్యాపారులు
B) రైతాంగం, కార్మికులు, సైనికులు
C) భూస్వాములు, కౌలుదారులు, ఉపాధ్యాయులు
D) కులీనులు, రాజులు, భూస్వాములు
జవాబు:
B) రైతాంగం, కార్మికులు, సైనికులు

15. “ఎనేబ్లింగ్ చట్టము” ద్వారా జర్మనీకి ఛాన్సలర్ అయిన వ్యక్తి ……….
A) లెనిన్
B) హిట్లర్
C) ముస్సోలిని
D) స్టాలిన్
జవాబు:
B) హిట్లర్

16. హిట్లర్ రచించిన ముఖ్య పుస్తకం పేరు …………….
A) ఏనిమల్ ఫారం
B) ప్రెజ్-ఆఫ్-పాలీ
C) మైన్ కాంఫ్
D) టెంపస్ట్
జవాబు:
C) మైన్ కాంఫ్

17. క్రింది వానిలో స్టాలినకు సంబంధము లేని అంశము
A) వ్యవసాయంలో భూముల ఏకీకరణ
B) ‘కొత్త ఒప్పందము (న్యూడీల్)ను ప్రకటించుట
C) పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టుట
D) వేగవంతమైన పారిశ్రామికీకరణ
జవాబు:
B) ‘కొత్త ఒప్పందము (న్యూడీల్)ను ప్రకటించుట

18. యుద్ధాన్ని నివారించవలసిందిగా హిట్లరుకు విన్నపాన్ని పంపిన భారత జాతీయ నాయకుడు
A) సర్దార్ వల్లభభాయ్ పటేల్
B) సుభాష్ చంద్రబోస్
C) మహాత్మా గాంధీ
D) జవహర్ లాల్ నెహ్రూ
జవాబు:
C) మహాత్మా గాంధీ

19. జార్జి ఆర్వెల్ అన్న రచయిత ‘యానిమల్ ఫాం’ అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో క్రింది ఏ అంశాన్ని చిత్రీకరించాడు?
A) ఆర్థిక మాంద్యం ప్రభావం నుండి రష్యా తప్పించుకో గలిగిన విధానము
B) రష్యా విప్లవ ఆదర్శాలను USSR లో నీరుకార్చిన విధానము
C) రష్యా తన పౌరులందరికీ పూర్తి ఉపాధిని కల్పించిన విధానము
D) రష్యా వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి చెందిన విధానము
జవాబు:
B) రష్యా విప్లవ ఆదర్శాలను USSR లో నీరుకార్చిన విధానము

AP 10th Class Social Bits Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

20. ప్రపంచములో కమ్యూనిజం వ్యాప్తి కొరకు స్థాపించబడిన కొమ్మి లో కీలకపాత్ర పోషించిన భారతీయుడు.
A) జవహర్‌లాల్ నెహ్రూ
B) భగత్ సింగ్
C) M.N. రాయ్
D) షాకత్ ఉస్మాని
జవాబు:
C) M.N. రాయ్

21. ఈ క్రింది జతలలో సరికానిది
A) జర్మనీ షార్లమెంటు-రీచ్ స్టాగ్
B) జర్మనీ రహస్య పోలీస్-గెస్టపో
C) ఆష్విట్జ్-హత్యా కేంద్రం
D) సామ్యవాదం-అడాల్ఫ్ హిట్లర్
జవాబు:
D) సామ్యవాదం-అడాల్ఫ్ హిట్లర్

22. ‘న్యూడీల్’ పాలసీ ఉద్దేశ్యము
A) ఆర్థిక మాంద్యం వలన నష్టపోయిన వారికి సహాయం చేయడం
B) ప్రపంచ యుద్ధాలలో నష్టపోయిన వారికి సహాయం చేయడం
C) యూదులకు సహాయం చేయడం
D) సైనికులకు సహాయం చేయడం
జవాబు:
A) ఆర్థిక మాంద్యం వలన నష్టపోయిన వారికి సహాయం చేయడం

23. USSR అవలంబించిన విధానం
1) వేగవంతమైన పారిశ్రామికీకరణ
2) ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు
A) 1
B) 2
C) 1 మరియు 2
D) ఏదీకాదు
జవాబు:
C) 1 మరియు 2

24. ‘ఎనేబ్లింగ్ చట్టం’ యొక్క ఫలితంగా
A) జర్మనీ స్వతంత్ర దేశమయింది.
B) జర్మనీలో వలస పాలన స్థాపించబడింది.
C) జర్మనీ ఆర్థిక మాంద్యానికి గురైంది.
D) జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది.
జవాబు:
D) జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది.

25. రష్వా ఆర్థిక మాంద్యం నుండి తప్పించుకోవడానికి దోహద పడిన అంశం
i) అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానం కాకపోవుట.
ii) ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం.
A)(i) మాత్రమే
B) (ii) మాత్రమే
C) (i) మరియు (ii)
D) ఏదీ కాదు
జవాబు:
C) (i) మరియు (ii)

26. తీవ్ర ఆర్థిక మాంద్యమునకు సంబంధించి సత్యము కానిది.
A) డిమాండ్ క్షీణత (గిరాకీ పడిపోవడం)
B) ధరలు పతనం
C) తీవ్ర నిరుద్యోగం
D) ఆదాయ స్థాయిల మెరుగుదల
జవాబు:
D) ఆదాయ స్థాయిల మెరుగుదల

27. రష్యాలో రొట్టె, శాంతి కోసం నిరసన ఊరేగింపు చేపట్టినవారు
A) పురుషులు
B) పిల్లలు
C) మహిళలు
D) రాజకీయ నాయకులు
జవాబు:
C) మహిళలు

28. చిట్టచివరి జార్
A) నికోలస్ – I
B) నికోలస్ – II
C) పీటర్ ద గ్రేట్
D) అలెగ్జాండర్ – II
జవాబు:
B) నికోలస్ – II

29. ఎనేల్లింగ్ యాక్ట్ చేయబడిన సంవత్సరం
A) 1931
B) 1933
C) 1935
D) 1937
జవాబు:
B) 1933

30. క్రింది వానిలో కొత్త ఒప్పందం (న్యూ డీల్) కు సంబంధించిన అంశము
A)మాంద్యానికి గురైనవారికి పునరావాసం కల్పించడం
B) ఆర్థిక సంస్థల సంస్కరణ
C) ఆర్ధిక పరిస్థితి కోలుకోవడానికి చర్యలు చేపట్టడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 10th Class Social Bits Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

31. మార్షల్ ప్రణాళికను అమెరికా ఈ దేశాల ఆర్థిక పునరుద్ధరణకు ఏర్పాటు చేసింది.
A) ఇటలీ మరియు ఫ్రాన్స్
B) ఆస్ట్రియా మరియు ఇంగ్లాండ్
C) జర్మనీ మరియు జపాన్
D) నార్వే మరియు స్వీడన్
జవాబు:
C) జర్మనీ మరియు జపాన్