These AP 10th Class Social Studies Important Questions 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు will help students prepare well for the exams.
AP Board 10th Class Social 21st Lesson Important Questions and Answers సమకాలీన సామాజిక ఉద్యమాలు
10th Class Social 21st Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium
1. “నాకొక కల ఉంది ……” అన్న చారిత్రాత్మక ఉపన్యాసం చేసినది ఎవరు?
జవాబు:
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.
2. అనేక మంది నలవాళ్ళు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించినది ఎవరు?
జవాబు:
మాల్కం ఎక్స్
3. అణు కర్మాగారంలో ప్రమాదం జరిగిన ‘చెర్నోబిల్’ ఉన్న దేశం ఏది?
జవాబు:
రష్యా
4. ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
జవాబు:
కేరళ.
5. మణిపూర్‌ను భారతదేశంలో ఏ సంవత్సరంలో విలీనం చేసినారు?
జవాబు:
1949.
6. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన కంపెనీ ఏది?
జవాబు:
యూనియన్ కార్బైడ్ కంపెనీ.
7. యూనియన్ కార్బైడ్ కంపెనీని తర్వాత ఏ కంపెనీ కొనుగోలు చేసింది?
జవాబు:
డౌ కంపెనీ (DOW)
8. 1980లో విజ్ఞాన శాస్త్రం, పర్యావరణ కేంద్రం అన్న సంస్థను స్థాపించిన దెవరు?
జవాబు:
అనిల్ అగర్వా ల్.
9. మైటై భాషలో మైరాపైబీ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కాగడాలు పట్టుకున్నవాళ్ళు.
10. ఆంధ్రప్రదేశ్ లో సారాను ఏ సంవత్సరంలో నిషేధించారు?
జవాబు:
1993
11. ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మధ్యపాన నిషేధం ఏ సంవత్సరంలో విధించారు?
జవాబు:
1995.
12. మణిపూర్ లో సైనిక నిర్బంధంలో మరణించిన మహిళ ఎవరు?
జవాబు:
తంగజం మనోరమ.
13. మణిపూర్‌లో సైనిక బలాల ప్రత్యేకాధికారాల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
మైరా పైబీ.
14. సైలెంట్ వ్యాలీలోని అరుదైన (అంతరించి పోతాయని భావించిన) జాతి కోతి ఏది?
జవాబు:
లయన్ టేల్డ్ మకాక్ (సింహపు తోక కోతి)
15. నందిగ్రాం సంఘటన (పోరాటం) ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
పశ్చిమ బెంగాల్.
16. 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడలను స్పాన్సరు చేసిన ఏ కంపెనీకి వ్యతిరేకంగా సంతకాలు చేసారు?
జవాబు:
డౌ కంపెనీ. (DOW)
17. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమేది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్ – NBA
18. ఎవరినీ అకారణంగా అరెస్ట్ చేయకూడదు, నిర్బంధించ కూడదు, బహిష్కరించకూడదు అని ఏ మానవ హక్కుల అధికరణ చెబుతుంది?
జవాబు:
అధికరణం తొమ్మిది (9).
19. గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో కలదు?
జవాబు:
ఆమ్ స్టర్డాం
20. SALT ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు
21. START ని విస్తరింపుము.
జవాబు:
వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.
22. నయా ఉదారవాదం, ప్రపంచీకరణ ఏ సంవత్సరం నుంచి మొదలయ్యాయి?
జవాబు:
1990 నుంచి.
23. అమెరికా బలగాలను ఎదుర్కోటానికి వియత్నాం ఏ యుద్ధ పంథాని అవలంభించింది.?
జవాబు:
గొరిల్లా యుద్ధ పంథా.
24. మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందినది ఎవరు?
జవాబు:
ఇరోం షర్మిలా
25. ‘దూబగుంట’ గ్రామం ఏ జిల్లాలో కలదు?
జవాబు:
నెల్లూరు.
26. ‘నర్మదా బచావో ఆందోళన్’ దీనికి సంబంధించిన ఉద్యమం.
A) నీటి ఉద్యమం
B) ప్రకృతి సేద్య ఉద్యమం
C) పర్యావరణ ఉద్యమం
D) సామాజిక ఉద్యమం
జవాబు:
C) పర్యావరణ ఉద్యమం
27. పడవ పేరునే ఉద్యమంగా మార్చుకున్న ఉద్యమమేది?
జవాబు:
గ్రీన్, పీస్ ఉద్యమం.
28. అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం తీవ్రదశకు చేరుకున్న సమయమేది?
జవాబు:
1960 లలో.
29. అమెరికాలోని నల్లజాతి వారు ఒక సంవత్సరం పాటు బస్సులను బహిష్కరించిన ప్రాంతమేది?
జవాబు:
మాంట్ గోమరి.
30. ప్రఖ్యాత వాషింగన్ ప్రదర్శన ఏ రోజున నిర్వహించారు?
జవాబు:
ఆగస్టు 28, 1963.
31. డా॥ మార్టిన్ లూథర్ కింగ్ యొక్క కల ఏమిటి?
జవాబు:
ప్రజలు చర్మ రంగు ఆధారంగా కాకుండా వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గౌరవించబడాలి.
32. సోవియట్ రష్యాలోని (USSR) మానవ హక్కుల ఉద్యమకారులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ్ నిత్సిన్ & ఆండ్రే సఖరోలు.
33. అమెరికా వియత్నంలో యుద్ధం నుండి ఏ సంవత్సరంలో విరమించుకుంది?
జవాబు:
1975.
34. గ్రీన్‌పీస్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు:
1971 లో.
35. గ్రీన్‌పీస్ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అనంత వైవిధ్యంతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం.
36. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల డిమాండ్/డిమాండ్లు ఏవి?
i) సరైన వైద్య సౌకర్యం
ii) అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
iii) యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం.
iv) భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడడం.
జవాబు:
i, ii, iii & iv.
37. ఏ విషయాన్ని పరిశీలించటానికి జస్టిస్ B.P. జీవన్ రెడ్డి 40 దేశాల్లో కమిటీ వేయబడింది?
జవాబు:
మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేసే అంశంపై.
38. NBAకు నాయకత్వం వహించింది ఎవరు?
జవాబు:
మేథా పాట్కర్.
39. సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రజలను సమీకరించిన సంస్థ ఏది?
జవాబు:
KSSP (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్)
40. సైలెంట్ వ్యాలీని ఏ సంవత్సరంలో జాతీయ పార్క్ గా మార్చారు?
జవాబు:
1985.
41. సామాజిక ఉద్యమాలన్నింటిలో ఉన్న సారూష్య అంశాలు ఏవో గుర్తించి రాయండి.
i) సమానత్వం
ii) మానవ హక్కులు
iii) ప్రజాస్వామ్యం
జవాబు:
i, ii & iii
42. అమెరికాలో నల్లజాతి అమెరికన్లు పట్ల క్రింది వానిలో ఏ విషయాలలో వివక్షత ఉండేది?
i) ఉద్యోగాలు
ii) గృహవసతి
iii) ఓటుహక్కు
జవాబు:
i, ii & iii
43. 1957 సెప్టెంబరు 4న లిటిల్ రాక్ స్కూల్ లో ప్రవేశించటానికి ప్రయత్నించిన నల్లజాతి అమ్మాయి ఎవరు?
జవాబు:
ఎలిజబెత్ ఎక్ఫోర్డ్.
44. USSR పెత్తనం నుంచి స్వేచ్ఛను కోరుకున్న దేశాలు ఏవి?
జవాబు:
హంగరీ, చెక్ స్లోవేకియా, పోలండ్.
45. USSRలో సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ఉద్యమించిన నాయకులు ఎవరు?
జవాబు:
అలెగ్జాండర్ సోల్డ నిత్సిన్ మరియు ఆండ్రే సఖరోవ్.
46. అమెరికా – వియత్నాం యుద్ధంలో వియత్నాం, లావోస్, అమెరికా, కాంబోడియా దేశాల్లో ఏ దేశ పౌరులు చనిపోలేదు?
జవాబు:
అమెరికా
47. START పై అమెరికా, USSR ఎప్పుడు సంతకాలు చేసాయి?
జవాబు:
1991 లో.
48. 1971లో అమెరికా అణుపరీక్షలను ఎక్కడ చేపట్టింది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్రగర్భంలో
49. ప్రస్తుతం గ్రీన్ పీస్ ఉద్యమం ఎన్ని దేశాలలో విస్తరించి ఉంది?
జవాబు:
40 దేశాలలో
50. “సుస్థిర అభివృద్ధి” అనే భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం ఏది?
జవాబు:
గ్రీన్ పీస్ ఉద్యమం.
51. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో సంభవించింది?
జవాబు:
1984 లో
52. సైలెంట్ వ్యాలీకి ఆపేరు ఎందుకు వచ్చింది?
జవాబు:
ఇక్కడ కీచురాళ్ళు లేవు అందుకే ఈ అడవి నిశబ్దంగా ఉంటుంది.
53. KSSP ని విస్తరించండి.
జవాబు:
కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్.
54. మణిపూర్‌పై బ్రిటిషువారు ఎప్పుడు నియంత్రణ సాధించారు?
జవాబు:
1891లో.
55. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనలోని ఏ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి?
జవాబు:
అధికరణం 13(2)
56. APSPA ని విస్తరింపుము.
జవాబు:
(Armed Forces Special Power Act.)
57. AFSPA చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసారు?
జవాబు:
1958 లో.
58. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) సైలెంట్ వ్యా లీ ఉద్యమం ( ) a) మధ్య ప్రదేశ్
ii) మైరా పైబీ ( ) b) ఉత్తరాఖండ్
iii)చిప్కో ( ) c) మణిపూర్
iv) నర్మదా బచావో ( ) d) కేరళ
జవాబు:
i – d, ii – c, iii – b, iv – a
59. సైలెంట్ వ్యాలీ ఉద్యమం, నర్మదా బచావో ఆందోళన్, మైరా పై బీ, గ్రీన్ పీస్ ఉద్యమాల్లో పర్యావరణ ఉద్యమం కానిది ఏది?
జవాబు:
మైరా పైబీ ఉద్యమం.
60. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మేథాపాట్కర్ ( ) a) నర్మదాబచావో
ii) మార్టిన్ లూథర్ కింగ్ (b) అమెరికాలో పౌరహక్కుల ఉద్యమం
iii)ఆండ్రే సఖరోవ్ ( c) USSR లో మానవ హక్కుల ఉద్యమం
iv) ఇరోం షర్మిలా ( ) d) మణిపూర్ లో మానవ హక్కుల
జవాబు:
i – a, ii – b, iii – c, iv – d
61. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మించబడిన రాష్ట్రం ఏది?
జవాబు:
గుజరాత్.
62. ఏ ఉద్దేశ్యంతో మైరాపైబీ ఉద్యమం మొదలయ్యింది?
జవాబు:
1970 ల కాలంలో, తాగి బజారుల్లో గొడవ చెయ్య కుండా నివారించటానికి
63. ఏ సంవత్సరంలో అమెరికాలోని బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి?
జవాబు:
1956 లో.
64. సూర్యుని హానికర (అతి నీలలోహిత) కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని పొర ఏది?
జవాబు:
ఓజోను పొర.
65. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణను అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీ ఏది?
జవాబు:
B.P. జీవన్ రెడ్డి కమిటి.
క్రింద నీయబడిన పటమును పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
66. పటంలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
1
67. పటంలో చిప్కో వ్యతిరేక ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
4
68. పటంలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
2
69. పటంలో మైరా పైజీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
5
70. పటంలో నర్మదాబచావో ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య ఏది?
జవాబు:
3
71. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఉత్తరాఖండ్.
72. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
కేరళ.
73. సారా వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్.
10th Class Social 21st Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
మీకీయబడిన భారతదేశ రాజకీయ పటంలో కింది సామాజిక ఉద్యమాలు జరిగిన ఏదేని ఒక్కొక్క రాష్ట్రాన్ని గుర్తించండి.
A) నర్మదా బచావో ఆందోళన్
B) చిప్కో ఉద్యమం
జవాబు:
ప్రశ్న 2.
క్రింది పటమును చదివి, ప్రశ్నకు సమాధానము ఇవ్వండి.
ప్రశ్న : ఇందిరా సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
ఇందిరా సాగర్ ప్రాజెక్టు నర్మదానదిపై, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
(లేదా)
ప్రశ్న 3.
పై పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
i) నర్మదా నది యొక్క ప్రవాహ దిశ ఏది?
జవాబు:
తూర్పు నుండి పడమర
ii) నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కారణాలు :
జవాబు:
ప్రజలు నిర్వాసితులు కావడం
సారవంతమైన భూభాగం కోల్పోవడం
అడవులు, పొలాలు, ప్రజలు, జంతువులు నివసించే ప్రాంతాలు మునిగిపోవడం.
ప్రశ్న 4.
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాల పేర్లు తెలపండి.
జవాబు:
‘నర్మదా బచావో’ ఉద్యమంతో ముడిపడి ఉన్న రెండు ఉద్యమాలు :
- మూలవాసీ ప్రజల ఉద్యమము.
- నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమము.
ప్రశ్న 5.
ఉద్యమాలలో ముఖ్యమైన ఉద్యమం ఏది?
జవాబు:
ఉద్యమాలలో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం.
ప్రశ్న 6.
‘పౌరనిరాకరణ’ అనగానేమి?
జవాబు:
వివక్షత కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం.
ప్రశ్న 7.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమ నాయకులు ఎవరు?
జవాబు:
ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్ నిత్సిన్, అణుశాస్త్రవేత్త ఆండ్రే సఖరోన్లు యుఎస్ఎస్ఆర్ లోని మానవ హక్కుల ఉద్యమ నాయకులు.
ప్రశ్న 8.
గోర్బచేవ్ ఎవరు?
జవాబు:
యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్. ఈయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి గ్లాస్ నోస్తే అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.
ప్రశ్న 9.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అమెరికా ఏ దేశం మీద అణుబాంబులను వేసింది?
జవాబు:
1945 ఆగష్టులో “జపాన్లోని హిరోషిమా, నాగసాకిల” పై అమెరికా అణుబాంబులను వేసింది.
ప్రశ్న 10.
వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన ఆయుధాలేమిటి?
జవాబు:
రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను అమెరికా కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేసింది.
ప్రశ్న 11.
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలేవి?
జవాబు:
ఆయుధ పోటీలో ప్రధాన దేశాలు 2. అవి :
- అమెరికా
- యుఎస్ఎస్ఆర్ (రష్యా).
ప్రశ్న 12.
చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఏది?
జవాబు:
START (ఎసీఏఆర్) స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం.
ప్రశ్న 13.
ప్రజలు ఈ మధ్య దేనివల్ల ముప్పును ఎదుర్కొంటున్నారు?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలలో వాణిజ్య రైతులు, గనుల తవ్వకం సంస్థలు, ఆనకట్టల పథకాలు వంటి వాటి నుంచి గిరిజనులు, నిర్వాసితులైన ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు.
ప్రశ్న 14.
గ్రీన్‌పీస్ అంటే ఏమిటి? ఇది ఎక్కడుంది?
జవాబు:
గ్రీన్ పీస్ అనేది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఈ ఉద్యమం 40 దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టర్ డాం (హాలెండ్)లో ఉంది.
ప్రశ్న 15.
భోపాల్ దుర్ఘటన దేనికి సంబంధించినది?
జవాబు:
భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కంపెనీ (ఔ) నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాది మంది చనిపోయారు, దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాదిమంది బాధపడుతున్నారు. ఈ దుర్ఘటన 1984లో జరిగింది.
ప్రశ్న 16.
పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా దేనికి సంబంధించినవి?
జవాబు:
ఈ పర్యావరణ ఉద్యమాలు ప్రధానంగా అడవుల రక్షణ కోసం ఆరంభమయ్యాయి.
ప్రశ్న 17.
కొన్ని బహుళార్థసాధక ఆనకట్టల పేర్లు తెలుపుము.
జవాబు:
- భాక్రానంగల్
- హీరాకుడ్
- నాగార్జునసాగర్
ప్రశ్న 18.
సారా వ్యతిరేకత ఎక్కడ ప్రారంభమైంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, దూబగుంట గ్రామంలో ఈ ‘సారా వ్యతిరేక’ ఉద్యమం ప్రారంభమైంది.
ప్రశ్న 19.
సారా నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు జరిగాయి?
జవాబు:
1993 అక్టోబరులో సారాని అధికారికంగా నిషేధించారు. 1995లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు.
ప్రశ్న 20.
‘మైరా పైబీ ఉద్యమం’ యొక్క ఆరోపణలు ఏమిటి?
జవాబు:
సాయుధ దళాల ప్రత్యేక చట్టం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.
ప్రశ్న 21.
మైరా పైబీ ఉద్యమకారులు నిరసనను ఏవిధంగా తెలియజేస్తున్నారు?
జవాబు:
గ్రామాలు, పట్టణాలలోని వార్డులలోని మహిళలు రోజూ పహారాలో పాల్గొంటారు. కాపలా కాస్తారు.
ప్రశ్న 22.
సారా వ్యతిరేక ఉద్యమంలో మహిళలు సమాజంలోని ఎవరిని ఎదుర్కొన్నారు?
జవాబు:
సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం, కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయి తయారీదారులు, అమ్మకందారులను ఎదుర్కోగలిగారు.
10th Class Social 21st Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
పర్యావరణ ప్రాముఖ్యతను తెల్పుతూ ఒక కరపత్రంను తయారు చేయండి.
జవాబు:
భూమి మనుగడకు పర్యావరణమే ప్రధానం భూమిపై ప్రతీ ప్రాణి తన అవసరాలను పర్యావరణం నుంచే తీర్చుకుంటుంది. పర్యావరణం క్షీణించితే మానవ మనుగడ, భూమి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. నేల, నీరు, గాలి, కాలుష్యాలు పర్యావరణానికి పెద్ద గాయాలు. వీటి మూలంగా సహజ వనరులను నష్టపోతున్నాము. దురదృష్టవశాత్తు ఇవన్నీ మానవ తప్పిదాలే. భవిష్యత్తులో ఇవే గనుక ఇదే విధంగా కొనసాగితే విశ్వంలో మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి, మానవులారా ! ప్రకృతిని గాయపరచికాక, ప్రకృతికి అనుగుణంగా జీవించండి. ప్రకృతో రక్షతి రక్షిత : |
ప్రశ్న 2.
అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి గల కారణాలేమిటి?
(లేదా)
నల్లజాతి అమెరికన్లు 1960లో పౌరహక్కుల ఉద్యమం ఎందుకు చేయవలసి వచ్చింది.
(లేదా)
అమెరికా పౌరహక్కుల ఉద్యమంను ఎవరు, ఎందుకొరకు చేశారు?
జవాబు:
ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం. పాఠశాలల్లో, బస్సులలో బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్లను వేరుగా ఉంచటానికి, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్లపట్ల వివక్షత చూపటానికి వ్యతిరేకంగా ఆఫ్రో-అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది.
ప్రశ్న 3.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి రెండు నినాదాలు రూపొందించండి. రణ పరిరక్షణకు సంబందించి రెండు నినాదాలు రూపొందించండి.
జవాబు:
- భూమి. కాలుష్యం – మన మనుగడకు ముప్పు.
- వృక్షో రక్షతి రక్షితః
ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి మీ అభిప్రాయం వ్రాయండి.
“పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు భావించసాగారు.”
జవాబు:
ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు. ఈయబడిన పేరా మరోసారి ఇదే అంశాన్ని తెలియచేస్తోంది. గృహపరమైన అంశాల నుండి దేశ రాజకీయాల వరకు మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సాధారణంగా వారు ఎన్ని పోరాటాలు సల్పినా శతాబ్దాల తరబడి వారి పరిస్థితి అలానే ఉన్నది. మానవ హక్కుల గురించి అనునిత్యం పాఠాలు చెప్పే అమెరికాలో పరిస్థితే ఇలా ఉంటే మిగతా దేశాల్లో ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విద్య, వృత్తి, ఉద్యోగాలలో మాత్రం మహిళలు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో మాత్రం తండ్రి లేదా భర్త లాంటి పురుషులు ఆ రంగంలో ఉంటేనే మహిళలు ఆ రంగంలో ఎదగగలుగుతున్నారు. గ్రామీణ స్థాయిలో మహిళల కోసం రిజర్వు చేయబడిన స్థానాలలో వారు నామమాత్రపు నాయకులుగా ఉంటే వారి భర్తలు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఈ పోరాటాలు పురుషులు కాక మహిళలే ముందుకొచ్చి చేయాలి. వారే వారికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. అపుడే మహిళలు ముందంజ వేయగలుగుతారు.
ప్రశ్న 5.
‘సారా నిషేధం’ సమస్యను పరిష్కరించడానికి, నీవైతే ఏం చేసియుండేవాడివి?
జవాబు:
- ప్రజలలో అవగాహనను కల్పించడం
- సారా నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలుపరచడం
- గ్రామ సంఘాలను ఏర్పరచడం
- మహిళలను ఉద్యమంలో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించేవాడిని.
ప్రశ్న 6.
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం రోజు రోజుకీ ఎందుకు పెరిగిపోతోంది?
జవాబు:
గత కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం పెరిగిపోవటానికి గల కారణాలు :
- పరిశ్రమలు పెరగడం
- వాహనాల సంఖ్య పెరగడం
- రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం పెరగడం
- అడవుల నరికివేత
ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ బాధితుల నాలుగు ముఖ్యమైన కోరికలేవి?
జవాబు:
భోపాల్ గ్యాస్ బాధితుల ముఖ్యమైన కోరికలు:
- ప్రభావితులైన వారికి సరైన వైద్య సౌకర్యం,
- అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం
- బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని నేరానికి బాధ్యులుగా చేయడం
- భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.
ప్రశ్న 8.
క్రింది పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
i) సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది?
జవాబు:
గుజరాత్
ii) నర్మదా నదిపై కట్టే ఆనకట్టలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?
జవాబు:
నర్మదా బచావో ఆందోళన్
iii) నర్మదా నది జన్మస్థానం ఏది?
జవాబు:
అమర్ కంఠక్.
iv) నర్మదా నది పరివాహక ప్రాంతంలోని ఏవేని రెండు జలవిద్యుత్ కేంద్రాల పేర్లు రాయండి.
జవాబు:
సర్దార్ సరోవర్, ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్.
ప్రశ్న 9.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల కలిగిన నష్టాలను రాయండి.
జవాబు:
భోపాల్ గ్యాస్ దురటన వల్ల కలిగిన నష్టాలు :
- వేలాదిమంది మరణాలు
- ప్రజలు నిరాశ్రయులు కావడం
- ఇప్పటికీ ఆ ప్రభావం కనిపించడం
- పర్యావరణం దెబ్బతినడం.
ప్రశ్న 10.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసిద్ధ ఉపన్యాసం “నాకొక కల ఉంది” యొక్క సందర్భం గురించి రాయండి.
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా॥ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా|| కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గుహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి. ఒక సంవత్సరం పాటు డా|| కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేజాతి, “నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా||కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.
ప్రశ్న 11.
వియత్నాం యుద్ధంలో ఎంత పౌరనష్టం జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులే కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకి ఎటువంటి పౌరనష్టం జరగలేదు. కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు, అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు.
ప్రశ్న 12.
ఆయుధ పోటీ ఏ విధంగా జరిగింది?
జవాబు:
వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడటంతో అణ్వాయుధ పోటీ తీవ్రరూపం దాల్చింది. ఈ ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు), ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.
ప్రశ్న 13.
ఏ ఒప్పందంతో ఆయుధ నియంత్రణ జరిగింది?
జవాబు:
1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి – ఎఎఆర్డ్) మీద సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద, సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2001లో ఇది అమలు అయినప్పుడు అప్పటికున్న అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలలో 80 శాతాన్ని తొలగించారు.
ప్రశ్న 14.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు నిర్వాసితులు కావడానికి కారణాలేమిటి?
జవాబు:
ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవటంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.
ప్రశ్న 15.
గ్రీన్ పీస్ ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా, ఈ ఉద్యమం మొదలయ్యింది. నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.
ప్రశ్న 16.
గ్రీన్ పీస్ ఉద్యమం ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
వాతావరణ మార్పుపై పలు దేశాలలో, గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధిని అది కోరుకుంటోంది.
ప్రశ్న 17.
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
ప్రభావితులైన వాళ్లకి సరైన వైద్య సౌకర్యం; ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్ట పరిహారం; బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చెయ్యటం; చివరిగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం.
ప్రశ్న 18.
“నర్మదా బచావో” ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజల కోరికలేమిటి?
జవాబు:
ఈ పథకం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్లకే కాకుండా, అక్కడ ఉంటున్న వాళ్లందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్లకి బదులుగా భూమి ఇవ్వాలని, సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు.
ప్రశ్న1 9.
భారత పర్యావరణ కేంద్రం ఎప్పుడు ఏర్పడింది? దాని ముఖ్య ఉద్దేశాలేమిటి?
జవాబు:
1980లో విజ్ఞానశాస్త్రం, పర్యావరణ కేంద్రం (సెంటర్ ఫర్ సైన్స్ & ఎన్విరాన్మెంట్) అన్నదానిని అనిల్ అగర్వాల్ స్థాపించాడు. భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చెయ్యటం దీని ఉద్దేశం.
ప్రశ్న 20.
సాయుధ దళాల ప్రత్యేక చట్టంలోని ముఖ్యాంశాలేమిటి?
జవాబు:
భారతదేశంలో విలీనం కావటానికి వ్యతిరేకించిన వాళ్లను నియంత్రించటానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది. శాంతి, భద్రతలను నెలకొల్పటానికి చేసిన చట్టాలలో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, 1958. దేశవిద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చెయ్యటానికి, లేదా కాల్చి చంపటానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది.
ప్రశ్న 21.
సాయుధ దళాల ప్రత్యేక చట్టం మీద ఉన్న ఆరోపణలేమిటి?
జవాబు:
ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగమయ్యాయని, అమాయకులైన వ్యక్తులు తరచు వేధింపులు, హింసకి గురయ్యారని, చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సాయుధ దళాలు మహిళలను దోపిడీ, అత్యాచారాలకు గురిచేశాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశ విద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానంతో తమ కొడుకులను, భర్తలను నిర్బంధించి, హింసిస్తారన్న భయం కూడా మహిళలుగా, తల్లులుగా వీళ్లకు ఉండేది. తల్లులు, కూతుళ్లు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. ఇలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ప్రశ్న 22.
మీకిచ్చిన ప్రపంచపటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
- అలస్కా
- గ్రీన్లాండ్
- ఇంగ్లాండ్
- క్యూబా
- చిలీ
- బ్రెజిల్
- కాంగో
- ఈజిప్టు
- దక్షిణాఫ్రికా
- రష్యా
- చైనా
- ఇండోనేషియా
- న్యూజిలాండ్
ప్రశ్న 23.
ఆనకట్టలు, పరిశ్రమలు వంటి నిర్మాణాల వల్ల రైతులకు, గిరిజనులకు కలిగే ఇబ్బందులను వ్రాయండి.
జవాబు:
- ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్ళు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు.
- దీంతో ప్రజలు కొత్త ప్రాంతాలలో చెల్లాచెదురై గిరిజన సంస్కృతి విధ్వంసమవుతోంది.
- రైతులు తమ వ్యవసాయ భూములు, జీవనాధారాలకు దూరమవుతున్నారు.
- ఈ ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులకు తీవ్ర ముప్పు ఏర్పడటంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు.
ప్రశ్న 24.
“అంటరానితనం నిషేధం వల్ల సామాజిక సమానత్వం సాధించవచ్చు” దీనిపై మీ స్పందనలు తెలియజేయండి.
జవాబు:
- అంటరానితనం నిషేధించడం ద్వారా సమానత్వాన్ని సాధించవచ్చు.
- అంటరానితనం తొలగాలంటే కులవివక్షను రూపుమాపాలి.
- రాజ్యాంగంలోని 17వ అధికరణం ద్వారా అంటరానితనాన్ని నిషేధించి దానికి చట్టబద్ధత కలుగజేసింది.
- ప్రభుత్వాలు సదరు చట్టాల్ని నిజస్పూర్తితో అమలుపరచాలి.
- ప్రజలు అందరూ సమానమని గుర్తెరిగి అంటరానితనాన్ని రూపుమాపగలరు.
ప్రశ్న 25.
బహుళార్థక సాధక ఆనకట్టల వల్ల దేశానికి లాభమా, నష్టమా? మీ అభిప్రాయాన్ని సమర్ధించండి.
జవాబు:
- బహుళార్థ సాధక ఆనకట్టల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్నారు.
- అయితే వాటి నిర్మాణాలకు విపరీతమైన ధనవ్యయం కావడం, అనుకున్న మేర విద్యుత్ ఉత్పాదన, జలాల అందుబాటు, సాగునీటి సరఫరా చేయలేకపోవడం వల్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు.
- వాటి వలన లక్షలమంది ప్రజలు నిర్వాసితులవడం, లక్షల ఎకరాల అటవీ, సాగుభూములు పోవడం, ప్రత్యామ్నాయంగా అందించడానికి ప్రభుత్వ భూములు చాలినన్ని లేకపోవడం, నష్టపరిహారం ప్రభుత్వాలు సరిగా అందించకపోవడం, అరుదైన వృక్ష, జంతురాశులు అంతరించిపోవడం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి.
- అయినప్పటికీ ఈ పథకాల నిర్మాణం తప్పనిసరి అవుతోంది.
ప్రశ్న 26.
పౌరహక్కుల ఉద్యమకారుల కోరికలేమిటి?
జవాబు:
పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యాసదుపాయాలు వంటివి వీళ్ల ప్రధాన కోరికలు.
10th Class Social 21st Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలేమిటి?
జవాబు:
- న్యాయం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులను కాపాడటం
- సంస్కృతిని కాపాడుకోవడం
- సామాజిక నిర్మాణం, విలువల పరిరక్షణ,
- ప్రజల ఆరోగ్యం , ప్రాణ రక్షణ
- సాంఘిక సమానత్వ సాధన
- మద్యపానము, మత్తు పదార్థాల నుండి రక్షణ పొందుట
- పర్యావరణ పరిరక్షణ
- పంట పొలాలను పరిరక్షించుకోవడం
ప్రశ్న 2.
క్రింది పట్టికను పరిశీలించి, విశ్లేషిస్తూ ఒక పేరాను వ్రాయుము.
జవాబు:
- పై పట్టిక మనకు కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో దేశాల ర్యాంకింగ్ మరియు ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నులను విడుదల చేస్తున్నాయో తెలియజేస్తుంది.
- మొత్తంగా గమనించినట్లయితే ఎక్కువగా తలసరి కార్బన్ డైయాక్సెడ్ ఉదారాలను విడుదల చేసేది అమెరికా.
- మొత్తంగా చైనా ఉన్నట్లయినా, తలసరిలో అమెరికానే ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.
- ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కార్బన్ డైయాక్సెడ్ ఉద్గారాల విడుదలలో భారతదేశం 4వ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ తలసరి విడుదలలో అన్ని దేశాల కన్న తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది.
- దానిని బట్టి మనం గమనించే విషయం ఏమిటంటే భారతదేశం శక్తి వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. అంతేకాకుండా పర్యావరణాన్ని కాలుష్యం చేయడంలో కూడా వెనుకస్థానంలో ఉన్నది.
- ఇలా ప్రతిదేశం కాలుష్యాన్ని పెంచుతూపోతే చివరకు మానవ జీవనం భూమి మీద అంతరించిపోతుంది. ముప్పు వాటిల్లుతుంది. మన వినాశనాన్ని మనమే కోరుకుంటున్నాం. కావున ప్రతిదేశం వారు విడుదల చేసే కర్బన సమ్మేళనాల శాతాన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ మరియు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి.
ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాల విశిష్టతను ప్రశంసిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:
సామాజిక ఉద్యమాలలో సాధారణ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనటం వలన అనుకూలత ఏర్పడి ఉద్యమం బలపడుతుంది. ఈ ఉద్యమాలు న్యాయం, ప్రజాస్వామ్యం పౌర హక్కులు అనే అంశాలతో సమ్మిళతమై ఉంటాయి. పర్యావరణం, మానవ హక్కులు అనే సరిహద్దులను చెరిపేస్తే ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం కలిగించే దిశగా ఉద్యమాలు ఉంటాయి. — ఈ ఉద్యమాలు అహింసాయుత పద్ధతులలో కొనసాగుతూ ప్రజల స్వేచ్ఛపూరిత భావనలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను రాజకీయ వ్యవస్థలు సరిచేయలేనప్పుడు వాళ్ళ ఆశయ సాధనం కోసం ఉద్యమిస్తాయి. ఈ ఉద్యమాలు ఏ ఒక్కరి ప్రయోజనం కోసం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి ఆశయ సాధన కోసం చేయడం జరుగుతుంది.
ఉదా :
1) గ్రీన్‌పీస్ ఉద్యమం,
2) పౌర హక్కులు,
3) మైరా పైబీ మొ||వి.
ప్రశ్న 4.
మైరా పైబీ ఉద్యమం గూర్చి వివరించండి.
జవాబు:
మైటీ భాషలో మైరాపైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం.
1970ల చివరి కాలంలో త్రాగి బజారుల్లో గొడవ చెయ్యకుండా నివారించడానికి మైరాపైబీ ఉద్యమం మొదలైంది.
సైనిక చర్యల వలన మానవహక్కులు దెబ్బ తింటున్నాయనే భావనతో ఈ ఉద్యమం అనుసంధానం అయినది. రాత్రిళ్ళు బజారులలో మైరాపైబీ పహరా కాయటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లోని మహిళలు రోజూ ఈ పహరాలో పాల్గొనేవారు. అయితే వాళ్ళ చేతులలో ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డ చుట్టి కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు వాటిల్లకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వారులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా కాసేవారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని కూడా మైరా పైబీ ఉద్యమం కోరుతుంది. వీరికి సహకారంగా ఇరోం షర్మిల అనే మహిళ 14 సం|| రాల నుండి గృహనిర్బంధంలో నిరాహారదీక్ష చేస్తుంది. ఈ ఉద్యమం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది.
ప్రశ్న 5.
అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి.
జవాబు:
- గిరిజనులు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వాళ్ళు అందరి కంటే ఎక్కువగా నష్టపోయారు.
- వీళ్ళకు మంచి చదువు, నైపుణ్యాలు వంటివి అందుబాటులో లేవు.
- అందువలన మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కానీ, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిహారాలు కానీ వీళ్ళకు అందుబాటులో లేవు.
- గనుల త్రవ్వకం, ఆనకట్టల పథకాల వంటి వాటివల్ల అనేకమంది గిరిజనులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.
ప్రశ్న 6.
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజలు ఎదుర్కొనే సమస్వలను వివరించండి.
జవాబు:
ప్రాజెక్టుల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు:
ప్రయోజనాలు :
- పెద్ద మొత్తంలో నీటి నిల్వ
- సాగునీరు
- విద్యుదుత్పత్తి
- వరదల నియంత్రణ
- కరవు నియంత్రణ
సమస్యలు :
- సారవంతమైన భూములు కోల్పోవడం
- అడవులు ముంపునకు గురికావడం
- జంతుజాలం నశించడం
- ప్రజలు నిర్వాసితులు కావడం
- ఖర్చు అధికం
ప్రశ్న 7.
బహుళార్థ సాధక పథకాల నిర్మాణం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేయండి.
జవాబు:
లాభాలు :
- పెద్దమొత్తంలో నీటిని నిల్వచేయడం.
- వ్యవసాయాభివృద్ధి.
- పెద్దమొత్తంలో విద్యుదుత్పత్తి చేయడం.
- వరదలు, కరువులను నియంత్రించడం.
- ఈ అసమానతలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరింపబడాలి.
నష్టాలు:
- స్థానిక ప్రజలు నిర్వాసితులవుతారు.
- నిర్వాసితులందరికీ సరైన పునరావాసం కల్పించడం కష్టతరం, నిజానికి అసాధ్యం.
- జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
- ఆశించిన స్థాయిలో నీటి నిల్వ, విద్యుదుత్పత్తి జరగలేదు.
ప్రశ్న 8.
ఈ క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
1990ల నుంచి ప్రపంచీకరణ’, ‘నయా ఉదారవాదం’ అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచ వ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు అందరి కంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేదు.
జవాబు:
ఈ పేరాగ్రాఫ్ ప్రపంచీకరణ యొక్క పరిణామాలను గురించి వివరిస్తోంది. అది ప్రధానంగా పేద ప్రజలను, గిరిజనులను ప్రభావితం చేస్తోంది. మరియు అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారిపై కూడా ప్రపంచీకరణ ప్రభావం ఉంది. నిరక్షరాస్యులు మరియు పోషకాహార లోపంతో బాధపడేవారు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
సాంకేతిక ప్రగతి కారణంగా అనేక రకాల యంత్రాలు కనుగొనబడ్డాయి. అభివృద్ధి చెందిన సాంకేతికత అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యవసాయంలో కంబైన్డ్ హార్వెస్టర్లు, నూర్పిడి యంత్రాలు (ధైషర్లు) ఉపయోగిస్తున్నారు. టాకరు మరియు టాన్ ప్లాంటేషన్ యంత్రాలను వినియోగిస్తున్నారు. కనుక కూలీలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. రైల్వేలు, ఆనకట్టల వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేల విస్తరణ పనులు చేపట్టినప్పుడు పట్టాల క్రింద పరచడానికి గాను అనేక చెట్లు నరకబడతాయి. కావున అటవీ ప్రాంత నివాసితులు తరలింపు సమస్యను ఎదుర్కొంటారు. నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి ఉద్దేశించినపుడు వాటిని అడవుల సమీపంలోనే నిర్మించడం తప్పనిసరి. ఈ పరిస్థితి గిరిజనుల తరలింపు సమస్యకు కారణమవుతుంది. గిరిజనులలో చాలామంది నిరక్షరాస్యులు. వారు తేనె, గింజలు, విత్తనాలు సేకరించడం వంటి తమ జీవనోపాధులను కోల్పోతారు. పట్టణాలు, నగరాల, పొలిమేరల సమీపంలో పారిశ్రామిక వాడలు కూడా పెరిగాయి. ఇది కాలుష్యానికి దారితీస్తుంది. కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, టెలికమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు పెరిగాయి మరియు పేద ప్రజలు, గిరిజనులపై దీని ప్రభావం పడుతోంది.
ప్రభుత్వానికి నా సూచన ఏమిటంటే ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరియు వారి పునరావాసం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సకాలంలో తగిన నష్టపరిహారం చెల్లించాలి. అధికారులు కూడా సంబంధిత చట్టాలను సరిగా అమలుచేయాలి.
ప్రశ్న 9.
“వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.” వ్యాఖ్యానించండి.
జవాబు:
వియత్నాం యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది :
- వియత్నాంపై యుద్ధంలో అమెరికా చాలా క్రూరంగా ప్రవర్తించింది.
- ఏజెంట్ ఆరంజ్ వంటి రసాయన ఆయుధాలను ఉపయోగించడం ఈ క్రూరత్వానికి సరియైన ఉదాహరణ.
- ఏజెంట్ ఆరంజ్ అనేది మొక్కలను చంపే ఒక విషరసాయనం.
- దాదాపు 11 మిలియన్ గాలన్ల ఈ రసాయనాన్ని అమెరికా విమానాలు వియత్నాంపై చల్లాయి.
- అడవులను, పొలాలను నాశనం చేయడం ద్వారా వియత్నామీయులను తేలికగా చంపవచ్చని భావించారు.
- ఈనాటికి కూడా వియత్నాంలో ప్రజలపై ఈ రసాయన ప్రభావం ఉంది.
- పిల్లలలో మెదడు దెబ్బతినడానికి, క్యాన్సర్ వ్యాధికి ఇది కారణమవుతున్నది.
- రెండవ ప్రపంచయుద్ధంలో వాడిన మొత్తం బాంబుల బరువు కంటే వియత్నాం యుద్ధంలో అమెరికా వాడిన బాంబుల బరువే ఎక్కువ.
ప్రశ్న 10.
ప్రస్తుత ప్రపంచంలో గ్రీన్ పీస్ వంటి పర్యావరణ ఉద్యమాల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
- అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది.
- నిరసన తెలియచెయ్యటానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు ‘గ్రీన్‌పీస్’, చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది.
- ప్రస్తుతం ఈ ఉద్యమం నలభై దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్ స్టడాం (హాలండ్)లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలలో ఒకటి.
- సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బ తింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
- దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
- సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేసియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమౌతారు.
- ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమౌతారు.
- ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమౌతాయి.
- వాతావరణ మార్పుపై పలు దేశాలలో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. “అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం” దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం ‘సుస్థిర అభివృద్ధి’ అన్న భావనను ముందుకు తెచ్చింది.
- మానవుని కారణంగా పెరిగిపోతున్న భూగోళం వేడక్కడంను నివారించాలంటే ఇలాంటి ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రశ్న 11.
యుఎస్ఎస్ఆర్ లో మానవ హక్కుల ఉద్యమం ఆవిర్భవించడానికి కారణాలేమిటి?
జవాబు:
ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ లోనూ, దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరపు దేశాలలోనూ స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలను, సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలను, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన, కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. ఈ ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రల గురించి నిత్యమూ భయపడుతూ ఉండి ప్రజల అన్ని కార్యకలాపాలపై నియంత్రణ, నిఘా ఉంచేవి. ఇటువంటి నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావప్రకటన, కదలికలకు స్వేచ్ఛ, స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్ లోని పలు ప్రాంతాల్లోనూ, తూర్పు యూరపులోనూ పలు ఉద్యమాలు చేపట్టారు.
ప్రశ్న 12.
వియత్నాం యుద్ధం మూలంగా అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా స్ఫూర్తిని ఇచ్చింది?
జవాబు:
అమెరికాకు ఏ మాత్రం ప్రమాదకరం కాని అమాయకమైన ప్రజలపై బాంబులు వెయ్యడం ఎంతవరకు న్యాయం అని 1970ల ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులలో సందేహం పెరగసాగింది. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లలని పంపించటానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయి. దీని వల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తిని ఇచ్చింది.
ప్రశ్న 13.
భూగోళం వేడెక్కడం మూలంగా జరిగే అనర్థాలేమిటి?
జవాబు:
సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బతింటోందని గత కొద్ది దశాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు (పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు) కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాలలో చేరటం వల్ల మహా సముద్రాలు, సముద్రాల నీటిమట్టం పెరిగి ప్రపంచమంతటా తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలలో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వఠదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమవుతారు. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల (అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరవులు), పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితమవుతారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయాధారిత ప్రజలు, దేశాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి.
ప్రశ్న 14.
అభివృద్ధి స్వభావం గురించి ఆలోచింపచేయటంలో “నర్మదా బచావో” ఉద్యమం ఏ విధంగా విజయం సాధించింది?
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపటంలో నర్మదా బచావో ఆందోళన విఫలమైనప్పటికీ అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చెయ్యటంలో అది విజయం సాధించింది – అది పేదవాళ్ల ప్రయోజనాల కోసమా, లేక ధనికులు, శక్తిమంతులకోసమా అని .ఆలోచింపచేసింది. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద పెద్ద కట్టడాల ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా చేసింది. ఇటువంటి అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన’ ప్రజలకు ” తగినంత, గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది.
ప్రశ్న 15.
మైరా పైబీ ఉద్యమంలోని మహిళల విధులేమిటి?
జవాబు:
రాత్రుళ్లు బజారులలో మైరా పైబీ పహరా తిరగటం మొదలు పెట్టింది. గ్రామాలు, పట్టణాలలోని వార్డులోని మహిళలు రోజూ ఈ పహారాలో పాల్గొనేవాళ్లు. అయితే వీళ్ల చేతుల్లో ఎటువంటి ఆయుధాలు కాకుండా కర్రకు గుడ్డచుట్టి, కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం, ముప్పు కలుగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి, ప్రతి వార్డులో, ప్రతి కూడలిలో కూర్చుంటాయి. కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం పహరా ఉంటారు. కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు.