AP State Syllabus AP Board 8th Class Telugu Textbook Solutions Chapter 8 జీవన భాష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Telugu Solutions 8th Lesson జీవన భాష్యం

8th Class Telugu 8th Lesson జీవన భాష్యం Textbook Questions and Answers

చదవండి – ఆలోచించండి – చెప్పండి

“శ్రద్ధగలవాడే జ్ఞానాన్ని పొందుతాడు”.
“కటిని తిడుతూ కూర్చోడం కన్నా చిన్న దీపం వెలిగించు”.
“అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న”.
“త్యాగగుణానికి తరువులే గురువులు”.

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై వాక్యాల ద్వారా మీరేం గ్రహించారు?
జవాబు:
పై వాక్యాల ద్వారా కొన్ని సూక్తులను తెలుసుకున్నాము. కొన్ని సందేశాలను, ఉపదేశాలను గ్రహించాము.

ప్రశ్న 2.
ఇలాంటి వాక్యాలనేమంటారు?
జవాబు:
ఇలాంటి వాక్యాలను సుభాషితములని, సూక్తులని అంటారు. మంచి మాటలు, సందేశాలు అని కూడా అంటారు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

ప్రశ్న 3.
ఇలాంటి సందేశాలు, మంచిమాటలు ఇంకా ఏ ఏ రూపాలలో ఉంటాయి?
జవాబు:
ఇలాంటి సందేశాలు, మంచి మాటలు పద్యాలు, శ్లోకాలు, గేయాలు, మినీ కవితలు, గజళ్ళు మొదలైన రూపాలలో ఉంటాయి.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘జీవన భాష్యం’ గజలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడండి.
జవాబు:
పాడడం, మీ ఉపాధ్యాయుల సాయంతో నేర్చుకోండి.

ప్రశ్న 2.
‘జీవన భాష్యం’ అనే పేరు ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? చర్చించండి.
జవాబు:
‘జీవన భాష్యం’ అంటే బ్రతుకు పై వ్యాఖ్యానం. జీవితం ఎలా నడిపించుకోవాలో వివరంగా చెప్పడమే ‘జీవన భాష్యం’. ఈ గజల్ లో నారాయణరెడ్డి గారు జీవితమును గూర్చి కొన్ని సత్యాలు చెప్పారు. మనసుకు దిగులు మబ్బు ముసిరితే కన్నీళ్ళు వస్తాయన్నారు. ఆటంకాలు వస్తాయనీ, జంకకుండా అడుగులు వేయాలనీ చెప్పారు. బీడు భూములు దున్ని విత్తితే పంటలు పండుతాయని చెప్పారు. మనుషులు అందరూ కలిసి ఉండాలని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జీవితంలో పరీక్షలు తప్పవన్నారు. కేవలం బిదుదులు పొందినంత మాత్రాన విలువలేదనీ, మంచి త్యాగం చేస్తేనే మనిషి పేరు నిలబడుతుందని చెప్పారు. ఈ విధంగా జీవితం గూర్చి వివరించి చెప్పినందువల్ల ‘జీవనభాష్యం’ అన్న పేరు ఈ పాఠానికి తగియుంది.

ప్రశ్న 3.
ఈ “గజల్స్” ద్వారా “సినారె” ఏం సందేశమిస్తున్నారు?
జవాబు:
లక్ష్యసాధనలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయనీ, అయినా జంకకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుందనీ, ఆ స్ఫూర్తె నలుగురూ అనుసరించే దారి అవుతుందని సినారె చెప్పారు.

  • ఎడారి దిబ్బలను దున్నితే ఏమి ఫలితం ఉండదని అనుకోక, వాటిని దున్నితే పంటలు పండుతాయని చెప్పారు.
  • మనుషులు తమలో తాము భేదాలు ఎంచుకోకుండా కలసిమెలిసి జీవించాలని చెప్పారు.
  • మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా పరీక్ష ఉంటుందని గుర్తు చేశారు.
  • బిరుదులు, సత్కారాలు పొందడంలో విలువ, గుర్తింపు లేవని, మానవాళికి పనికివచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని సినారె సందేశమిచ్చారు.

II. చదవడం, అవగాహన చేసుకోవడం

1. అ) కరిగితే, ముసిరితే, మమత, దేవత, పెరిగి, మరిగి వంటి పదాలు గజల్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి, వాటి కింద గీత గీయండి. ఆ పాదాలు రాయండి.
జవాబు:

  1. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది.
  2. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది.
  3. నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు
  4. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు
  5. విరిగినపుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో
  6. మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో

ఆ) గజళ్ళలో కవి తన గురించి ప్రస్తావించిన పంక్తులు ఏవి? వాటిని రాసి భావాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బిరుదులు పొందే వ్యాప్తికీ విలువేమి “సినారే”. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది – అనే పంక్తులు కవి తన గురించి ప్రస్తావించినవి.

భావం :
ఓ సినారే! గొప్ప బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి పనికొచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది పేరాను చదివి, ఐదేసి ప్రశ్నలు తయారుచేయండి.

చైనా తత్త్వవేత్త కన్ఫ్యూషియస్. ఆయన చాలా తెలివైనవాడు. ఒక రాజుగారు అతణ్ణి గురించి విని తన సభకు పిలిపించుకున్నాడు. మూడు పంజరాలు చూపించాడు. మొదటి పంజరంలో ఒక ఎలుక, దాని ఎదురుగా తినే పదార్థాలు ఉన్నాయి. రెండో పంజరంలో పిల్లి ఉంది. దాని ఎదురుగా పళ్ళెంలో పాలు ఉన్నాయి. మూడో పంజరంలో ఒక గద్ద ఉంది. దాని ఎదురుగా తాజా మాంసం ఉంది. కానీ ఎలుక ఏ పదార్థం తినటం లేదు; పిల్లి పాలు ముట్టుకోవడం లేదు; గద్ద కూడా మాంసం ముట్టడం లేదు. దీనికి కారణమేమిటి? అని అడిగాడు రాజు. తత్త్వవేత్త ఇలా సమాధానం ఇచ్చాడు- “పిల్లిని చూసి భయపడి ఎలుక ఆహారం తీసుకోలేదు. పిల్లి ఎలుకమీద ఆశతో పాలు ముట్టుకోలేదు. పిల్లిని, ఎలుకను ఒకేసారి తినాలనే ఆశతో గద్ద మాంసం ముట్టుకోలేదు. అలాగే భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు. సుఖానికి దూరమవుతున్నారు. ఈ సమాధానానికి సంతృప్తిపడి రాజు కన్ఫ్యూషియకు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు.
జవాబు:
ప్రశ్నలు:

  1. కన్ఫ్యూషియస్ ఎవరు? ఆయన ఎలాంటివాడు?
  2. మొదటి, రెండు, మూడు పంజరాలలో ఏమేమి ఉన్నాయి?
  3. మూడో పంజరం ఎదురుగా ఏమి ఉంది?
  4. రాజు ఏమని ప్రశ్నించాడు?
  5. రాజు అడిగిన ప్రశ్నకు తత్త్వవేత్త ఏమి సమాధానమిచ్చాడు?

3) కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేమి గ్రహించారు?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు. సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచి పెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరుపంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

ఆ) నిలువెల్లా మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అంటే మీకేమి అర్థమైంది?
జవాబు:
సి. నారాయణరెడ్డిగారు తల్లిని చక్కగా అభివర్ణించారు. మాతృత్వ మధురిమలను సుమనోహరంగా ఆవిష్కరించారు. మానవునికి తొలి గురువు తల్లి. చేతులను పట్టుకొని నడిపిస్తుంది. అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. మమతానురాగాలను అందిస్తుంది. మూర్తీభవించిన శాంతమూర్తి తల్లి. మమతను అందిస్తుంది. మనలో దుఃఖాన్ని తొలగిస్తుంది. సుఖాన్ని కల్గిస్తుంది. వెలుగులా దారి చూపిస్తుంది. అందుకే సి.నా.రె. గారు తల్లిని ఉద్దేశించి, నిలువెల్ల మమతల వెలుగై నిలిచిందో అమ్మరూపు – అని ప్రశంసాత్మకంగా అన్నాడు.

ఇ) సమైక్య సంఘర్షణ అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు:
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్థిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని కవి వ్యక్తపరిచారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) ఈ పాఠంలో గజల్ ప్రక్రియను గూర్చి తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియల పేర తెలపండి. వాటిని గురించి రాయండి.
జవాబు:
నాకు తెలిసిన నాలుగు సాహిత్య ప్రక్రియలు :
1. ప్రబంధం
2. కథానిక
3. ఆత్మకథ
4. ఇతిహాసం

1. ప్రబంధం :
పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా వ్రాస్తే దాన్ని “ప్రబంధం” అంటారు. మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద మొ||నవి ప్రబంధాలు.

2. కథానిక :
ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్నీ, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించ సాహిత్య ప్రక్రియను “కథానిక” అంటారు. ఇది వచన ప్రక్రియ. మరీ చిన్నదిగాను, మరీ పెద్దది గాను లేకుండా ఉండటం కథానిక లక్షణం.

3. ఆత్మకథ :
ఆత్మకథ అంటే తనను గురించి తాను రాసుకొన్న కథ. ఎవరైనా తమ ఆత్మకథను రాసుకోవచ్చు. అవి ఆత్మకథలే అయినా సమాజ జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ప్రముఖ వ్యక్తులు తమ జీవితాల గురించి రాసుకొన్న విషయాలు సమకాలిక సమాజానికి వ్యాఖ్యానాలుగా ఉపయోగపడతాయి.

4. ఇతిహాసం :
ఇతిహాసం అంటే పూర్వ కథ అని అర్థం. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం మొ||నవి ఇతిహాసాలు.

ఆ) మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి.
(లేదా)
విరామము లేకుండా శ్రమిస్తూ మనకు అన్నం పెడుతున్న కర్షకుల శ్రమను గురించి వివరించండి.
జవాబు:
మంచి పంటలు పండించాలంటే రైతులు పొలాల్ని చక్కగా దున్నాలి. తరువాత నీరు పెట్టాలి. మంచి విత్తనాలు తెచ్చి, నారుమళ్ళు వేయాలి. సేంద్రియ ఎరువుల్ని వేయాలి. పశువుల పేడను ఎరువులుగా వేస్తే మంచిది. పురుగుమందులు ఎక్కువగా వాడరాదు. సకాలంలో చేనుకు నీరు పెట్టాలి. కలుపు మొక్కలను తీసిపారవేయాలి. చేనును ఆరబెట్టి, సకాలంలో చేనుకు నీరందించాలి. ఎలుకల బెడద లేకుండా చూసుకోవాలి. రైతులు నిత్యం చేనును గమనించాలి. ఏదైనా పురుగుపడితే వేప పిండి వగైరా చల్లి వాటిని అరికట్టాలి. వర్షాధారంగా పండే పంట అయితే, నీరు కావలసినపుడు ఇంజన్ల ద్వారా తోడి నీరు పెట్టాలి. రైతు ఇంతగా శ్రమిస్తేనే మంచిపంటలు పండుతాయి.

ఇ) ఓటమి కలిగినపుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
సాధారణంగా ఓటమి మానవుని కుంగదీస్తుంది. నీరసింపజేస్తుంది. శూన్యుడిగా మారుస్తుంది. అయితే మానవుడు ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని బోధించాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలని ఉపదేశించాడు.

పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనుక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

ఈ) అమ్మను జ్ఞానపీఠంగా కవి ఎందుకు వర్ణించాడు?
జవాబు:
‘జీవన భాష్యం’ అనే పాఠ్యభాగంలో నారాయణరెడ్డిగారు మాతృత్వాన్ని, అమ్మ గొప్పతనాన్ని చక్కని మాటలతో ఆవిష్కరించారు. అమ్మ గొప్పతనాన్ని చక్కగా తెలియజేశారు. అమ్మ మనకందరికి తొలి గురువు.

పెరిగే సినారె బ్రతుకులో దొరికింది అమ్మ ప్రాపు.

చిన్నప్పుడు ఆ బొమ్మ కావాలి ! ఈ మిఠాయి కావాలి ! అని మొండికేసి ఇప్పుడే కొని పెట్టమని మంకుపట్టు పట్టి అమ్మ చంకనెక్కి ఇదుగో ఈ బండి చూడు ఎంత బాగుందీ అదుగో ఆ గుర్రం చూడు అది నీకే అంటూ బుజ్జగించినా అమ్మ చంక దిగలేదు. నేనెంత అల్లరి చేసినా, చిరునవ్వుతో భరించింది. దెబ్బతగిలి ఏడుస్తున్నప్పుడు ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినపుడు సర్దుకోవడం నేర్చుకోవాలనీ జ్ఞాన బోధచేస్తూ నా బాల్యమంతా వేలుపట్టి నడిపించింది. చీకటిలో ఏమీ కనిపించనపుడు తన వెన్నెల వెలుగులతో దారిని చూపే చంద్రునిలా, ఆకలైనపుడు ఆకలికి తీర్చే నిండుకుండలా తన ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది అమ్మ. మెరిసే సూర్యోదయకాలపు సూర్యకిరణంలా వసంత ఋతువులో పూచే పూవులా పెరిగిన నాకు అమ్మ అండ దొరికిందని ఈ గజల్ ద్వారా కవి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) సంతకం యొక్క ప్రాధాన్యం ఏమిటి ? సంతకం గురించి సినారె ఏమి చెప్పారు?
జవాబు:
ఆధునిక సమాజంలో సంతకానికి తరగని విలువ ఉంది. సంతకం లేని ఏ ఉత్తరువు చెల్లనేరదు. ఒక్క సంతకం జీవితాన్నే మారుస్తుంది. కవి సంతకం యొక్క గొప్పదనాన్ని తన పరిభాషలో చక్కగా వ్యక్తపరిచారు.
పచ్చదనమంటే అది వృక్ష సంపదకు చిరునామా. చినుకులు కురవాలంటే మేఘం రూపుదిద్దుకోవాలి. కేవలం ప్రభుత్వాలు, చట్టాల వలన సమాజం బాగుపడదు. ఎవరికి వారు స్వీయక్రమశిక్షణను, నైతిక
నియమాలను అలవరచుకోవాలి. రాశికన్నా వాసి ముఖ్యం. పుక్కిటి పురాణాలు ఎన్ని రాసినా ప్రయోజనం శూన్యం. సమైక్యతతోనే సంఘం వర్ధిల్లుతుంది గానీ, వ్యక్తిగతంగా పోరాడి సాధించేది ఏమీ ఉండదు. మానవతను మేలుకొలిపేదే నిజమైన సాహిత్యమవుతుంది. అలాగే తోటి
మనిషికి సేవచేసే దయగల మనుషుల్లోనే దైవం దాగి ఉందనే భావాన్ని ఈ గజల్ ద్వారా కవి వ్యక్తపరిచారు.

ఆ) తెలుసుకోడం వల్ల ప్రయోజనం ఏమిటి ? కవి ఏమేమి తెలుసుకోమన్నాడు?
(లేదా)
సి.నా.రె గారు గజల్ అనే ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలు చెప్పారు. అవి మీ మాటల్లో రాయండి.
జవాబు:
పరమాణువులో దాగిన లక్షణాలను విశ్లేషించడం ద్వారా భూమి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలోతు తెలియాలంటే కారే కన్నీటి బిందువుల వెనక దాగున్న కష్టాల కడలిని అర్థం చేసుకోవాలి. సంతృప్తి గురించి తెలియాలంటే, ఎంత సంపద ఉన్నా సంపన్నులు పొందలేకపోతున్న సంతృప్తిని తమ కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండెలోతుల్లో నుండి ప్రేమతో పలకరించే వారూ, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారూ ఉంటారు. ఎవరి మాట వెనుక ఏ ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం. పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా కిందపడినా పైకి లేవగలగాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. అనాయాసంగా ఏదీ పట్టుబడదు. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరొక దొడ్డిదారి ఏదీ లేదు. దాని మూలాలను బాగా శోధించి తెలుసుకోవాలనే భావనను ఈ గజల్ ద్వారా సి.నా.రె గారు తెలిపారు.

IV. పదజాలం

1. కింది పదాలకు అర్థాలు తెలుసుకోండి. ఆ పదాల్ని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) ముసరడం = క్రమ్ముకోవడం, చుట్టుముట్టడం, వ్యాపించడం
సొంతవాక్యం : ఆకాశంలో నీలిమేఘాలు ముసరడంతో చీకటిగా ఉంది.

ఆ) అలవోకగా = అతి సులువుగా, తేలికగా
సొంతవాక్యం : కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో అలవోకగా బరువును ఎత్తింది.

ఇ) పూర్ణకుంభం = నిండినది, సమస్తము
సొంతవాక్యం : అధికారులకు దేవాలయాలలో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.

ఈ)హృదయం = మనసు, ఎద
సొంతవాక్యం : సజ్జనుల హృదయం ఎప్పుడూ మంచి ఆలోచనతోనే ఉంటుంది.

V. సృజనాత్మకత

* ‘జీవన భాష్యం’ గజల్ లోని అంత్యప్రాసల ఆధారంగా సొంతగా ఒక వచన కవితను రాయండి.
జవాబు:
……………. నీరవుతుంది.
…………….దారవుతుంది.
……………. పైరవుతుంది.
……………. ఊరవుతుంది.
……………. ఏరవుతుంది.
……………. పేరవుతుంది.
జవాబు:
సొంత వచన కవిత :
1) శాంతి, మంచు కూడితే కోపాగ్ని నీరవుతుంది.
2) పదిమందీ అట్లానే నడిస్తే అదే నీ దారవుతుంది.
3) సకాలంలో విత్తులు చల్లితే ఆ విత్తే పైరవుతుంది.
4) కులమత భేదాలే కూలితే ఉన్నదే ఊరవుతుంది.
5) శక్తికి మించని త్యాగం నీ ఈవికి ఏరవుతుంది.
6) పదిమందీ నిను పొగిడితే నీ కీర్తికి పేరవుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

(లేదా)

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి దగ్గర ఏం తెలుసుకోవాలనుకొంటున్నా! ప్రశ్నలు రాయండి.
జవాబు:
ప్రశ్నలు : 1) సినారె గారూ ! మీరు సాహిత్య రచనలు ఎప్పటి నుంచి ప్రారంభించారు?
2) మీరు వ్రాసిన సినిమా పాటలు మీరు వింటున్నపుడు మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది?
3) మీరు ఇంత గొప్ప రచయితగా మారటానికి ప్రేరణ ఎవరు?
4) మీరు “పద్మభూషణ్” బిరుదును పొందినపుడు మీరు ఎలా స్పందించారు?
5) సినీ గేయ రచయితగా మీకు నచ్చిన సినిమా పాట ఏది?
6) వేటూరిని గొప్ప సినీ గేయ రచయిత అంటారు కదా ! వారి రచనలపై మీ అభిప్రాయం ఏమిటి?
7) తెలుగులో పాండిత్యం రావాలంటే ఏమి చేయాలి?

VI. ప్రశంస

* చదువులో వెనకబడిన ఒక విద్యార్థి తనలో కలిగిన మార్పు వల్ల కొద్దికాలంలోనే గతంలో కన్నా మెరుగైన ఫలితాల: పొందాడు. అతనిలో వచ్చిన మార్పును గురించి తెలుపుతూ వాళ్ళ అమ్మానాన్నలకి ఉత్తరం రాయండి.
జవాబు:

లేఖ

ప్రొద్దుటూరు,
x x x x x x x x

పూజ్యులు, ఆనందరావు గారికి,

మీకు నమస్కారములు. నేను మీ అబ్బాయి సురేష్ సహ విద్యార్థిని. మేము కూడా ప్రొద్దుటూరు జి పరిషత్ ఉన్నత పాఠశాలలోనే చదువుతున్నాము. ఈ మధ్య మీ సురేష్ అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడ తరగతిలో శ్రద్ధగా పాఠాలు వింటున్నాడు. సాయంత్రం మాతో ఆటలు కూడా ఆడుతున్నాడు.

రాత్రివేళ హాస్టలులో 10 గంటల వరకూ చదువుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి, 6 గంటల వరక చదువుతున్నాడు. ఏ రోజు ఇంటిపని ఆ రోజే పూర్తిచేస్తున్నాడు. రోజూ ఉదయం పండ్లరసం, సాయంత్రం హార్లి! తాగుతున్నాడు. అందువల్ల సురేష్ అలసిపోకుండా చదువుపై మంచి దృష్టి పెడుతున్నాడు. ప్రత్యేకంగా లెదులు, సామాన్యశాస్త్రములలో మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. సురేశ్, ప్రతిభకు కారణం అతను చూపే శ్రద్ధ, ఆహారపు .. అలవాట్లలో మార్పు, చదువుతో పాటు ఆటలపై చూపే ఆదరము అని నా అభిప్రాయం.

నా సహవిద్యార్థి, మీ అబ్బాయి సురేష్ కు మా తరగతి విద్యార్థుల తరఫున అభినందనలు. మీకు మా నమస్కారాలు. సెలవు.

ఇట్లు,
మీ విశ్వసనీయురాలు,
x x x x x x,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రొద్దుటూరు.

చిరునామా :
బి. ఆనందరావుగారు,
8/23-6, సంతబజార్,
శివాలయం వీధి,
బద్వేలు.

ప్రాజెక్టు పని

*ఆచార్య సి.నారాయణరెడ్డిగారి రచనలు, పాటల వివరాలను సేకరించి ఒక పట్టికను తయారుచేయండి. దాన్ని తరగతిలో చదివి వినిపించండి. ప్రదర్శించండి.
జవాబు:
రచనలు:

1) ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు 2) ‘విశ్వంభర’ (జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది)
3) నాగార్జున సాగరం 4) కర్పూర వసంతరాయలు
5) మధ్యతరగతి మందహాసం 6) ప్రపంచపదులు
7) విశ్వనాథనాయకుడు 8) నారాయణరెడ్డి గేయాలు
9) దివ్వెల మువ్వలు 10) అజంతా సుందరి
11) రామప్ప 12) నవ్వని పువ్వు
13) వెన్నెలవాడ 14) ఋతుచిత్రం
15) స్వప్నభంగం 16) విశ్వగీతి
17) జలపాతం 18) సినీగేయాలు
19) జాతిరత్నం 20) తరతరాల వెలుగు (గేయ రూపకాలు)
21) అక్షరాల గవాక్షాలు 22) మంటలు – మానవుడు
23) ఉదయం నా హృదయం 24) మార్పు నా తీర్పు
25) ఇంటిపేరు చైతన్యం 26) రెక్కలు
27) నడక నా తల్లి 28) కాలం అంచుమీద
29) కవిత నా చిరునామా 30) కలం సాక్షిగా
31) భూమిక, మట్టీ – మనిషి (దీర్ఘ కావ్యాలు) 32) తెలుగు గజళ్ళు
33) వ్యాసవాహిని, సమీక్షణం 34) పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్యం)
35) పాటలో ఏముంది – నా మాటలో ఏముంది (సినిమా పాటల విశ్లేషణ)

ఈ పాఠం ‘జీవన భాష్యం’ వలెనే సినారే గారి ‘ప్రపంచ పదులు’ కావ్యం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి, మానవ జీవితానికి ఉపకరించే అమూల్యమైన సందేశాలను అందిస్తుంది.

ప్రపంచ పదులు

1. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది?
ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది?
నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి
ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది?
ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది?

2. చీకటికి చురకపెడుతుందిలే చిన్న మిణుగురు పురుగు
మొండివానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు
మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే
దూరాన్ని చెరిపివేస్తుందిలే బారుచీమల పరుగు
పాపాన్ని కడిగివేస్తుందిలే పాలనవ్వుల నురుగు

3. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది?
చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది?
ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే సుమా
మరగనిదే నీరు ఎలా మబ్బురూపు కడుతుంది?
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది?

4. ఒక్క చినుకు చాలు మట్టి గుక్కను పలికించాలంటే
ఒక్క చెణుకు చాలు నవ్వు చుక్కలు మొలిపించాలంటే
ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువేముంది?
ఒక్క మెరుపు చాలు నింగి పక్కను దొరలించాలంటే
ఒక్క చరుపు చాలు పుడమి రెక్క ఎగిరించాలంటే

మరికొన్ని సినారె విరచిత గేయాలు :
1) “నా పేరు కవి
ఇంటి పేరు చైతన్యం
ఊరు సహజీవనం
తీరు సమభావనం.”

2) “నా వచనం బహువచనం
నా వాదం సామ్యవాదం
కవిత్వం నా మాతృభాష
ఇతివృత్తం మానవత్వం”

3) “ఊపిరాడడం లేదు
ఉక్కపోస్తుంది, ఎ.సీ గదిలో
కారణం తెలిసిపోయింది.
కవిత రాయలేదు ఇవాళ”.

VII. భాషను గురించి తెలుసుకుందాం

1. క్వార్థకం
భాషాభాగాల్లో ఒకటైన ‘క్రియ’ను గురించి కింది తరగతుల్లో తెలుసుకున్నారు. క్రియలను బట్టి వచ్చే వాక్య భేదాలను కొన్నింటిని చూద్దాం.

కింది వాక్యం చదవండి.

భాస్కర్ ఆటలు ఆడి ఆలసిపోయి ఇంటికి వచ్చాడు.
భాస్కర్ – కర్త
వచ్చాడు – కర్తృవాచక పదానికి సంబంధించిన ప్రధాన క్రియ.
ఆడి, అలసి – కర్తృవాచక పదానికి సంబంధించిన ఇతర క్రియలు.
ఆడి, అలసిపోయి అనే పదాలు క్రియలే కానీ, వాటితో పూర్తిభావం తెలియడం లేదు.
‘ఆడి’ అనే క్రియకు ‘ఆడి’ తర్వాత ఏం చేశాడు ? ఏం జరిగింది ? అనే ప్రశ్న ఉదయిస్తోంది.
పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇంకా, జరిగిపోయిన విషయాన్ని అంటే భూతకాలంలోని పనిని సూచిస్తుంది.
‘ఆలసిపోయి’ అనే క్రియ కూడా అలాంటిదే.

వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, క్వార్థం అనీ అంటారు.

ఈ క్రియలన్నీ కూడా ‘ఇ’ కారంతో అంతమవుతాయి. అంటే భూతకాలిక అసమాపక క్రియ అయి, చివర ‘ఇ’ అనే ప్రత్యయం చేరిన క్రియారూపం క్వార్థక క్రియ అన్నమాట.

కొన్ని ఉదాహరణలు చూడండి. కింది వాక్యాల్లోని క్త్వార్థక క్రియలను గుర్తించండి.

1. రాముడు లంకకు వెళ్ళి, రావణునితో యుద్ధం చేసి, జయించి, సీతను తీసుకొని అయోధ్యకు వచ్చాడు.
2. పుష్ప అన్నం తిని, నిద్రపోయింది.

2. శత్రర్థకం
కింది వాక్యం చదవండి.

“అఖిలేశ్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు”.
ఈ వాక్యంలో –
‘నడుస్తున్నాడు’ అనే ప్రధాన క్రియకు ‘మాట్లాడుతూ’ అనే ఉపక్రియ వర్తమానకాలంలో ఉండి అసమాపక క్రియను సూచిస్తున్నది.

ఈ విధంగా,
‘మాట్లాడు’ అనే ధాతువుకు ‘-తూ’ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరడం వల్ల, వర్తమానకాలిక అసమాపక క్రియగా మారుతున్నది. వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రర్థకం’ అంటారు.

కింది వాక్యాలు చదవండి. వీటిలో ‘శత్రర్థకం’ పదాల కింద గీత గీయండి.

అ) జ్యోతిర్మయి కంప్యూటర్ లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది.
ఆ) సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది.
ఇ) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది.
ఈ) ఫల్గుణ్ పేపరు చదువుతూ టీ.వి చూస్తున్నాడు.
ఉ) సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది.

పైన తెలిపిన విధంగా మరికొన్ని వాక్యాలు రాయండి.

1. లత అన్నం తింటూ చదువుతున్నది.
2. రవి పాఠం వింటూ రాస్తున్నాడు.
3. అమ్మ వంట చేస్తూ పాటలు వింటున్నది.
4. పరీక్ష రాస్తూ, ఆలోచిస్తున్నాడు.

3. చేదర్థకం
కింది వాక్యం చదవండి.

“కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది”.
కింది ప్రశ్నకున్న జవాబు గురించి ఆలోచించండి.
ప్ర|| ఫలితం దానంతటదే ఎప్పుడు వస్తుంది?
జవాబు:
కష్టపడి పనిచేస్తే –
కష్టపడడం – కారణం
ఫలితం – కార్యం

కార్యం ఫలించడానికి కారణం అవసరం. కార్యకారణ సంబంధ వాక్యమే చేదర్థక వాక్యం.

అంటే పై వాక్యం కార్యకారణ సంబంధాన్ని సూచిస్తున్నది. ఇలా కార్యకారణ సంబంధాలను సూచించే వాక్యాల్లో తే/ ఇతే| ఐతే/ అనే ప్రత్యయాలు చేరుతాయి. (ప్రాచీన వ్యాకరణం ప్రకారం ఇన / ఇనన్ అనే ప్రత్యయాలు). దీన్ని బట్టి వీటిని ‘చేత్’ అనే అర్థం ఇచ్చే ప్రత్యయాలు అని అంటాం. (ఇదే చేతే అనే ఇచ్చేవి)

సంక్లిష్ట వాక్యాల్లో చేత్ అనే ప్రత్యయం చేరి కార్యకారణ సంబంధం తెలిపే వాక్యాలను చేదర్థక వాక్యాలని అంటాం.

కింది వాక్యాలు పరిశీలించండి. చేదర్థక పదాల కింద గీత గీయండి.

అ) మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి.
ఆ) జీవ వైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతి సమతులితమవుతుంది.
ఇ) మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది.

1. కింది పదాలు విడదీసి, సంధుల పేర్లను పేర్కొనండి.
అ) బాల్యమంతా – బాల్యము + అంతా – ఉత్వసంధి
ఆ) దేవతలంతా = దేవతలు + అంతా – ఉత్వసంధి
ఇ) దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి
ఈ) విరిగినప్పుడు = విరిగిన + అప్పుడు – అత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

2. రూపకాలంకారం :
కింది వాక్యాన్ని చదవండి.
“ఆయన మాట కఠినమైనా మనసు వెన్న”.
పై వాక్యంలో
మనసు – ఉపమేయం (పోల్చబడేది)
వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనసు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది.

అంటే, వెన్నకు, మనసుకు భేదం లేదు. రెండూ ఒకటే (మెత్తనివే) అనే భావాన్ని ఇస్తున్నది.

ఇలా,
ఉపమానానికి ఉపమేయానికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడాన్ని “రూపకాలంకారం” అంటారు.
ఉదా :
(అ) లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు.

సమన్వయం :
ఉపమానమైన లతలను, ఉపమేయమైన లలనలను, అట్లే ఉపమానమైన కుసుమములను, ఉపమేయమైన అక్షతలకు అభేదం తెలుపుతుంది. అందువల్ల ఇది రూపకాలంకారం.

(ఆ) మౌనిక తేనెపలుకులు అందరికీ ఇష్టమే.
సమన్వయం :
ఇక్కడ ఉపమానమైన తేనెకు, ఉపమేయమైన పలుకులకు అభేదం తెల్పబడింది. అందువల్ల ఇది రూపకాలంకారం.

3. కింది వాక్యాలను పరిశీలించండి. అలంకారాన్ని గుర్తించండి.
అ) మా అన్నచేసే వంట నలభీమపాకం.
అన్న చేసే వంట – ఉపమేయం (పోల్చబడేది)
నలభీమపాకం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ‘అన్న చేసే వంట’ అనే ఉపమేయానికి, ‘నలభీమపాకం’ అనే ఉపమానానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఆ) కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం.
తండ్రి – ఉపమేయం (పోల్చబడేది)
హిమగిరి శిఖరం – ఉపమానం (పోల్చినది)

ఇక్కడ ఉపమేయమైన తండ్రికి, ఉపమానమైన హిమగిరి శిఖరానికి అభేదం చెప్పినందున రూపకాలంకారము.

ఇ) నందనందనుడు ఆనందంగా నర్తించెను.
ఈ వాక్యంలో నంద అనే హల్లుల జంట అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగింపబడింది. అందునల్ల ఇది ఛేకానుప్రాసాలంకారం.

ఈ) నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది.
ఈ పై ఉదాహరణలో ‘ల్ల’ కారం పలుమార్లు ఆవృత్తం అయ్యింది. అందువల్ల ఇది వృత్త్యనుప్రాసాలంకారం.

వ్యాకరణంపై అదనపు సమాచారం

పర్యాయపదాలు

అడుగు : పాదము, చరణము
మనసు : చిత్తము, ఉల్లము, హృదయము
నేస్తము : మిత్రుడు, స్నేహితుడు
గిరి : పర్వతం, అది
కన్ను : చక్షువు, నయనం, అక్షి
హిమగిరి : హిమాలయం, శీతాద్రి, తుహినాద్రి
మనిషి : మానవుడు, నరుడు
దారి : బాట, మార్గము, పథము

వ్యుత్పత్తరాలు

పక్షి – పక్షములు గలది (పిట్ట)
ధరణి – విశ్వాన్ని ధరించునది (భూమి)
భూజము – భూమి నుండి పుట్టినది (చెట్టు)

నానార్థాలు

ఫలము – పండు, ప్రయోజనం
గుణం – స్వభావం, వింటినారి
కన్ను – నేత్రం, బండిచక్రం

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సంధులు

అ) సంధి పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది – ఉత్వసంధి
దారవుతుంది = దారి + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి
ఎత్తులకెగిరినా = ఎత్తులకు + ఎగిరినా – ఉత్వసంధి
విలువేమి = విలువ + ఏమి – ఉత్వసంధి

ఆ) సంధికార్యాలు.
అవ్వసంది
సూత్రం : అత్తునకు సంధి బహుళము.
విలువేమి = విలువ + ఏమి – అత్వసంధి

ఇత్వసంధి
సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
దారవుతుంది = దారి + అవుతుంది – ఇత్వసంధి

ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగును.
నీరవుతుంది = నీరు + అవుతుంది – ఉత్వసంధి
ఫలమేమి = ఫలము + ఏమి – ఉత్వసంధి

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
ఇసుక గుండెలు ఇసుక యొక్క గుండెలు షష్ఠీ తత్పురుష సమాసం
కన్నీరు కంటి యొక్క నీరు షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరసు హిమగిరి యొక్క శిరసు షష్ఠీ తత్పురుష సమాసం
ఎడారి దిబ్బలు ఎడారి యందలి దిబ్బలు షష్ఠీ తత్పురుష సమాసం

ప్రకృతి – వికృతులు

హృదయం – ఎద, ఎడద
త్యాగం – చాగం
మనిషి – మనిసి
సుఖం – సుకం
నీరము – నీరు
మృగము – మెకము

కవి పరిచయం

కవి : ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి

జననం : 1931

స్థలం : కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామం.

నిర్వహించిన పదవులు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ, తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు.

రచనలు : నాగార్జునసాగరం, కర్పూరవసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర, ప్రపంచపదులు మొ॥న నలభైకి పైగా కావ్యాలు, అద్భుతమైన సినిమా పాటలు రాశారు. ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ అనే సిద్ధాంత గ్రంథం ! ప్రసిద్ధి పొందింది.

పురస్కారాలు : జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ’ అవార్డు, భారత ప్రభుత్వ ‘పద్మభూషణ్’ అవార్డు.

గజల్ పాదాలు – భావాలు

1, 2 పాదాలు :
మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది
మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది

భావం : నీటితో నింపుకున్న మబ్బులు తడితో బరువెక్కిపోతే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకు ఆందోళనలు, బాధలు, చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది. అది కన్నీరుగా మారుతుంది. భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు అడుగులు

3, 4 పాదాలు:
వంకలు దొంకలు కలవని జడిపించకు నేస్తం
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.

భావం :
ఓ నేస్తమా ! మనం ఒక లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరినపుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు, అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు వేస్తే నీవు అనుకున్న విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తె నలుగురు అనుసరించే దారిగా మారుతుంది.

AP Board 8th Class Telugu Solutions Chapter 8 జీవన భాష్యం

5, 6 పాదాలు :
ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది

భావం :
నేల అంతా బీటలు పడి, ఎందుకూ పనికి రాకుండా ఉన్నదని, ఏ పంటలూ పండవనీ, ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడకూడదు. కష్టపడి శ్రమతో ఆ నేలనే దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి.

7, 8 పాదాలు :
మృగమూ ఒకటనే అనుకుంటే వ్యర్థం
మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది

భావం :
మనం మనిషీ, మృగమూ ఒకటి అని భావించ కూడదు. మృగం ఏ అరణ్య ప్రాంతంలోనైనా ఒంటరిగా నివసించగలదు. కానీ మనిషి అలాకాదు. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం అవుతుంది. సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథం ఉండాలి. అప్పుడే అందరూ కలసిమెలసి ఆనందంగా జీవించ గలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది.

9, 10 పాదాలు :
ఎంతటి ఎత్తుల కెదిగినా ఉంటుంది పరీక్ష
హిమగిరి శిరసే మాడితే అది యేరవుతుంది

భావం :
మనం ఎంత సమర్థులం అయినా, అధికారం, సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా. ఇక మనకు ఎలాంటి కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే. ఉన్నతమైన హిమాలయ శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషికైనా గర్వం నీరు కారిపోవలసిందే.

11,12 పాదాలు :
బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి “సినారే”
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.

భావం :
మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ, గుర్తింపు లేదు. మానవాళికి మనిషీ పనికి వచ్చే గొప్ప పని, నిస్వార్థ త్యాగం చేస్తే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది.