Practice the AP 10th Class Social Bits with Answers 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. భారత్, పాకిస్తాన్ల మధ్య మొదటిసారి యుద్ధం జరిగిన సంవత్సరము ……
A) 1962
B) 1947
C) 1971
D) 1991
జవాబు:
B) 1947
2. అత్యవసర పరిస్థితి ఫలితంగా …………
A) ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.
B) పేదరికం తొలగింపబడింది.
C) అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందింది.
D) స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన.
జవాబు:
A) ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.
3. భారతదేశంలో …..
A) 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు
B) 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు
C) 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు
D) 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు
జవాబు:
C) 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు
4. రైతాంగ ఉద్యమాలతో సంబంధం గల పార్టీ ………………..
A) జస్టిస్ పార్టీ
B) రిపబ్లికన్ పార్టీ
C) కమ్యూనిస్టు పార్టీ
D) జనసంఘ్
జవాబు:
5. మొట్టమొదటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘము ఏర్పాటు చేసిన సం||రము …………
A) 1952
B) 1956
C) 1953
D) 1950
జవాబు:
C) 1953
6. ఈ ఒప్పందంతో హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రాలు విలీనమయ్యి ఆంధ్రప్రదేశ్ గా అవతరించాయి
A) శ్రీకృష్ణ ఒప్పందం
B) ముల్కీ ఒప్పందం
C) పెద్దమనుషుల ఒప్పందం
D) ముఖ్యమంత్రుల ఒప్పందం
జవాబు:
C) పెద్దమనుషుల ఒప్పందం
7. స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 30 సం||ములలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ
A) భారత జాతీయ కాంగ్రెస్
B) భారతీయ జనతా పార్టీ
C) జన సంఘ్ పార్టీ
D) భారత కమ్యూనిస్టు పార్టీ
జవాబు:
A) భారత జాతీయ కాంగ్రెస్
8. ఈ సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం ఎన్నికలలో ‘గుర్తు’ లను ప్రారంభించినది
A) పేదరికం
B) నిరక్షరాస్యత
C) నిరుద్యోగం
D) అవినీతి
జవాబు:
B) నిరక్షరాస్యత
9. తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడిన దేశం
A) భూటాన్
B) బర్మా
C) బమ్రోయిన్
D) బంగ్లాదేశ్
జవాబు:
D) బంగ్లాదేశ్
10. 1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ నినాదం …..
A) జై జవాన్
B) జై కిసాన్
C) జై హింద్
D) గరీబీ హఠావో
జవాబు:
D) గరీబీ హఠావో
11. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనుసంధాన భాష ………
A) తెలుగు
B) సంస్కృతం
C) ఇంగ్లీషు
D) హిందీ
జవాబు:
C) ఇంగ్లీషు
12. క్రింది వాక్యములలో తప్పుగా పేర్కొనబడినది.
A) 1956లో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టాన్ని (SRC) పార్లమెంట్ ఆమోదించింది.
B) SRC లో B.R. అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ మరియు వల్లభాయ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు.
C) భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశాన్ని బలహీన పరచలేదు.
D) SRC నివేదిక ఆధారంగా తొలుత 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
జవాబు:
B) SRC లో B.R. అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ మరియు వల్లభాయ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు.
13. క్రిందనీయబడిన ప్రకటవలలో సరియైన వాటిని కనుగొనండి.
1. మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి.
2. 16వ సార్వత్రిక ఎన్నికలు 2014లో జరిగాయి.
3. మొదటి సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది.
4. 16వ సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ
అఖండ విజయం సాధించింది.
A) 1, 3, మరియు 4
B) 2, 3 మరియు 4
C) 1, 4 మరియు 2
D) 1, 2, 3 మరియు 4
జవాబు:
D) 1, 2, 3 మరియు 4
14. భారతదేశ విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే ……..
A) అందరినీ ఏదో ఒక రాజకీయ పారీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం
B) వయోజనులందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం.
C) అందరినీ ఒకే పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం.
D) క్రమం తప్పకుండా స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగటం.
జవాబు:
B) వయోజనులందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం.
15. దేశ ఐక్యత, సమగ్రతలనే ప్రశ్నార్థకంగా మార్చివేసే పరిస్థితులు ……..
A) రాజకీయ ఉద్దేశాలకు మతాన్ని వాడుకోవటం
B) ప్రభుత్వ పక్షపాత ధోరణి
C) ప్రజా ఉద్యమాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
16. 1969లో అస్సాంలోని గిరిజన ప్రాంతాలతో ఏర్పాటు చేసిన కొత్త రాష్ట్రము
A) త్రిపుర
B) మణిపూర్
C) మిజోరం
D) మేఘాలయ
జవాబు:
D) మేఘాలయ
17. నెహ్రూ ఉద్దేశంలో ప్రణాళికా రచన అనేది ……………..
A) కేవలం ‘మంచి ఆర్థిక విధానము’
B) కేవలం ‘మంచి రాజకీయాలు’
C) మంచి ఆర్థిక విధానం మాత్రమే కాక మంచి రాజకీయాలు కూడా
D) ఒక కష్టమైన కార్యక్రమము
జవాబు:
C) మంచి ఆర్థిక విధానం మాత్రమే కాక మంచి రాజకీయాలు కూడా
18. హిందీ వ్యతిరేక ఉద్యమం ఈ క్రింది రాష్ట్రంలో ప్రారంభమయింది.
A) కేరళ
B) కర్ణాటక
C) తమిళనాడు
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
C) తమిళనాడు
19. భారతదేశ రాజకీయ పార్టీ విధానము
A) ఏక పార్టీ విధానము
B) బహుళ పార్టీ విధానము
C) ద్విపార్టీ విధానము
D) పార్టీ రహిత విధానము
జవాబు:
B) బహుళ పార్టీ విధానము
20. ‘గరీబీ హఠావో’ నినాదాన్నిచ్చినది………………..
A) జవహర్‌లాల్ నెహ్రూ
B) ఇందిరా గాంధీ
C) రాజీవ్ గాంధీ
D) నరేంద్ర మోడి
జవాబు:
B) ఇందిరా గాంధీ
21. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత సంతరించు కున్న రంగం ………….
A) వ్యవసాయము
B) పరిశ్రమలు
C) విద్యుచ్ఛక్తి
D) రవాణా
జవాబు:
A) వ్యవసాయము
22. భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలతో సంబంధం లేనిది?
A) గుర్తులు ప్రవేశపెట్టడం
B) ప్రతి అభ్యర్థికి ఒక ప్రత్యేక బ్యాలట్ బాక్సు
C) ఓటర్లను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున ప్రచారం
D) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగించడం
జవాబు:
D) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగించడం
23. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన సమయములో ఏఏ భాషలను విస్మరించారు?
A) గోండి
B) సంతాలి
C) ఒరావన్
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
24. భారతదేశ అధికార భాష
A) తెలుగు
B) హిందీ
C) ఇంగ్లీషు
D) ఉర్దూ
జవాబు:
B) హిందీ
25. ఆంధ్రప్రదేశ్ ఈ అంశం ఆధారంగా అవతరించిన మొదటి రాష్ట్రం
A) భాష
B) ఆత్మ గౌరవం
C) చారిత్రక నేపథ్యం
D) భౌగోళిక కారణాలు
జవాబు:
A) భాష
26. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యము
A) ఉపాధి
B) పేదరిక నిర్మూలన
C) పరిశ్రమలు
D) వ్యవసాయం
జవాబు:
C) పరిశ్రమలు
27. భారతదేశంలో 1967 ఎన్నికల పరిణామం
A) ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యాయి.
B) కాంగ్రెస్ చాలా రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.
C) బహుళ పార్టీ వ్యవస్థ విచ్ఛిన్నం.
D) కేంద్రంలో కమ్యూనిస్టు అధికారంలోకి రావడం.
జవాబు:
B) కాంగ్రెస్ చాలా రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.
28. దీని ఫలితంగా 1971 సం||లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది
A) అమీరీ హటావో
B) బేటీ బచావో – బేటీ పఢావో
C) బీమారీ హటావో
D) గరీబీ హటావో
జవాబు:
D) గరీబీ హటావో