These AP 10th Class Social Studies Important Questions 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు will help students prepare well for the exams.

AP Board 10th Class Social 5th Lesson Important Questions and Answers భారతదేశ నదులు, నీటి వనరులు

10th Class Social 5th Lesson ½ Mark Important Questions and Answers in Telugu Medium

1. క్రింది వానిలో సింధు నదికి ఉపనది కానిది.
చీనాబ్, రావి, టీస్టా, సట్లెజ్.
జవాబు:
టీస్టా

2. క్రింది వానిలో గంగానది ఉపనది.
జీలం, చీనాబ్, కోసి, బియాస్
జవాబు:
కోసి

3. క్రింది వానిలో తుంగభద్రానది ఏ నదికి ఉపనది.
మహానది, గోదావరి, కృష్ణా, పెన్న
జవాబు:
కృష్ణా

4. క్రింది వానిలో ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టే గంగానదీ వ్యవస్థకు చెందిన ఉపనది కానిది ఏది?
చంబల్, బేత్వా, కేన్, గండక్
జవాబు:
గండక్

5. క్రింది వానిలో బ్రహ్మపుత్ర నది ఉపనది ఏది?
చంబల్, లోహిత్, చీనాబ్, సట్లేజ్.
జవాబు:
లోహిత్.

6. రెండు నదుల కలయిక వల్ల ఏర్పడిన నది ఏది?
జవాబు:
గంగానది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

7. 50 సం||రాల క్రితం తుంగభద్రానదీ జలాల నిల్వ సామర్థ్యము ఎన్ని మి॥క్యుబిక్ మీటర్లు.
జవాబు:
3,766 (లేదా) 376.6 కోట్ల ఘనపు మీటర్లు.

8. ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏది?
జవాబు:
గోదావరి

9. భారతదేశంలోని నదులలో పెద్ద నది ఏది?
జవాబు:
గంగానది.

10. క్రింది వానిలో హిమాలయ నది కానిది.
గంగా, సింధు, బ్రహ్మపుత్ర, మహానది. గండక్,
జవాబు:
మహానది.

11. అంతస్థలీయ ప్రవాహంనకు సంబంధించిన దానికి ఉదాహరణ.
జవాబు:
లూనీ నది.

12. నీటిని అధికంగా తీసుకునే పంటకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చెరకు.

13. ‘V’ ఆకారపు లోయలు ఏర్పడుటకు కారణం ఏమిటి?
జవాబు:
నదీ ప్రవాహాలు.

14. దక్షిణ భారతదేశ నదులు తూర్పువైపుకు ప్రవహించుటకు గల కారణమేమి?
జవాబు:
దక్కన్ పీఠభూమి తూర్పుకు వాలి ఉండటం.

15. హిమాలయ నదులను జీవనదులు అని పిలవడానికి కారణమేమిటి?
జవాబు:
సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి కాబట్టి.

16. ‘ఆదర్శ గ్రామ పథకం’ కింద హివారే బజారును ఎంపిక చేసిన రాష్ట్రం ఏది?
జవాబు:
మహారాష్ట్ర.

17. బంగ్లాదేశ్ లో పద్మానదిగా పిలువబడుతున్న నది ఏది?
జవాబు:
గంగానది.

18. క్రింది వానిలో ద్వీపకల్ప నదికి ఉదాహరణ కానిది.
గోదావరి, మహానది, కృష్ణా, సింధు.
జవాబు:
సింధు.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

19. అలకనంద, భాగీరథి ఎక్కడ కలుస్తాయి?
జవాబు:
దేవ ప్రయాగ వద్ద.

20. బ్రహ్మపుత్రా నది మనదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్ లో

21. నీరు ఆవిరిగా మారటాన్ని ఏమంటారు?
జవాబు:
భాష్పీభవనం.

22. కేరళలోని ఏ గ్రామమందు గ్రామ పంచాయతీకి, కోకాకోలా కంపెనీకి మధ్య వివాదం తలెత్తింది?
జవాబు:
పెరు మట్టి.

23. భూగర్భ జలంపై నియంత్రణ ఏ హక్కుకు సంబంధించినది?
జవాబు:
భూమి హక్కు

24. తుంగభద్రానది ఏ రాష్ట్రానికి సంబంధించిన వనరు కాదు?
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్
జవాబు:
మహారాష్ట్ర,

25. అరుణాచల్ ప్రదేశ్ లో దిహంగ్, సియాంగ్ అని పిలువబడే నది ఏది?
జవాబు:
బ్రహ్మపుత్రా నది.

26. సింధు నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
మానస సరోవరం.

27. భగీరథి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
గంగోత్రి.

28. అలకనంద నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
సతపనాథ్

29. బ్రహ్మపుత్రా నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
మానస సరోవరం.

30. గోదావరి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
త్రయంబకం.

31. మహానది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
సిహావా

32. కృష్ణానది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
మహాబలేశ్వరం.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

33. నర్మదానది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
అమర్ కంఠక్.

34. తపతి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
ములాయి.

35. కావేరి నది యొక్క జన్మస్థానం ఏది?
జవాబు:
కూర్గ్ కొండలు.

36. దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు ఏ రాష్ట్రంలో బ్రహ్మపుత్రలో కలుస్తాయి?
జవాబు:
అస్సోం

37. అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్భ ప్రవాహం =?
జవాబు:
అంతర్గత ప్రవాహాలు.

38. ఉపరితల ప్రవాహాలకు ఒక ఉదాహరణ నివ్వండి.
జవాబు:
వాగులు, కాలువలు, నదులు, చెరువులు .

39. తుంగభద్ర నది ఎగువ, మధ్య పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
కర్ణాటక.

40. తుంగభద్రా నది యొక్క పరివాహక ప్రాంతం మొత్తం ఎన్ని చ.కి.మీ. ఉంది?
జవాబు:
71, 417 km

41. భూగర్భ జలాల వినియోగం పై ఏ సంస్థలకు నియంత్రణ ఉండాలి?
జవాబు:
ప్రభుత్వ

42. శాండూరు వద్ద గనులు ఏవి?
జవాబు:
మాంగనీసు.

48. కుద్రేముఖ్ వద్ద గనులు ఏవి?
జవాబు:
ఇనుము.

44. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థలు ఎన్ని?
జవాబు:
రెండు.

45. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు?
జవాబు:
సాంగ్ పో.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

46. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్ లో ఏమని పిలుస్తారు?
జవాబు:
సియాంగ్, దిహంగ్

47. బ్రహ్మపుత్ర నది ఏ హిమానీనదం నుండి పుట్టింది?
జవాబు:
చెమయుంగ్ డంగ్.

48. పశ్చిమంగా ప్రవహించి, అరేబియా సముద్రంలో కలిసే నదులు ఏవి ?
జవాబు:
నర్మద, తపతి.

49. వక్రతలు ఉండనీ నదులకు ఉదాహరణ నిమ్ము.
జవాబు:
గోదావరి, కృష్ణా, కావేరి, మహానది మొ||వి.

50. హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి.
I. సింధూ నదీ వ్యవస్థ II. గంగానదీ వ్యవస్థ III. ?
ప్ర. మూడవ వ్యవస్థ పేరు రాయండి.
జవాబు:
బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

51. భారతదేశ నదీ జల వ్యవస్థ మూడు భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది.
I. హిమాలయాలు II. ద్వీపకల్ప పీఠభూమి III. ?
ప్ర. మూడవ అంశం పేరు రాయండి
జవాబు:
సింధూ – గంగా మైదానం.

52. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకు సంబంధించి సరియైన వాక్యం కానిది.
→ టిబెట్లో దీనిని ‘సాంపో’ అంటారు.
→ బంగ్లాదేశ్ లో “జమున’ అంటారు.
→ అరుణాచల్ ప్రదేశ్ లో “దిహంగ్’ అంటారు.
→ అస్సాంలో “సియాంగ్’ అంటారు.
జవాబు:
అస్సాంలో “సియాంగ్’ అంటారు.

53. హిమాలయాల్లో జన్మించి, మన దేశం గుండా ప్రయాణించి, మన పొరుగు దేశాలలో సముద్రంలో కలిసే ఒక నది పేరు రాయండి.
జవాబు:
సింధూనది, బ్రహ్మపుత్రానది, గంగానది.

54. గంగానదీ వ్యవస్థకు సంబంధించిన సరియైన వాక్యం / లు ఏది / ఏవి?
i) ఇది రెండు నదుల కలయిక.
ii) గంగానది ఉపనదులు హిమాలయాల్లో, ద్వీపకల్ప పీఠభూమిలోను పుడతాయి.
iii) బదరీనాథ్ వద్ద పర్వతాలను వదలి మైదానాల్లోకి ప్రవహిస్తుంది.
iv) దేవ ప్రయాగ వద్ద రెండు నదుల కలయికతో గంగానదిగా మారుతుంది.
జవాబు:
(i), (ii) మరియు (iv)

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

55. క్రింది వానిలో’ సింధూనది ప్రవహించే రాష్ట్రం కానిది ఏది?
జమ్ము కాశ్మీర్, పంజాబు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర
జవాబు:
ఉత్తర ప్రదేశ్.

56. అస్సోం లోయలో వరదలకు కారణమైన నది ఏది?
జవాబు:
బ్రహ్మపుత్ర.

57. ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది ఏది?
జవాబు:
కృష్ణానది.

58. క్రింది వానిలో హివారే బజారులోని నిషేధాలు ఏవి?
i) చెట్లు నరకడం నిషేధం.
ii) పశువులను స్వేచ్ఛగా మేపడం నిషేధం.
iii) మత్తు పానీయాలు నిషేధం.
iv) అధిక సంతానం నిషేధం.
జవాబు:
(i), (ii), (iii) or (iv)

59. క్రింది వానిని సరిగా జతపరచండి.
i) మహానది ( ) a) సిహెూవా
ii) గోదావరి ( ) b) నాసికా త్రయంబక్
iii) కృష్ణ ( ) c) మహాబలేశ్వర్
iv) తపతి ( ) d) ముట్టాయి
జవాబు:
i-a, ii – b, iii-c, iv-d.

60. భూగర్భ జలాల చట్టాలలోని ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
భూమిపై హక్కుకీ, భూగర్భ జలాలపై హక్కుకీ సంబంధం కల్పించడం.

61. నీటి హేతుబద్ద వినియోగానికి ఉదహరించిన గ్రామం ఏది?
జవాబు:
హివారే బజార్.

62. నీటి సంరక్షణకై AP WALTA చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
జవాబు:
2002.

63. క్రింది వానిలో జల సంరక్షణకు తోడ్పడే చర్య /లు ఏది /ఏవి?
i) అనుమతి లేనిదే సాగునీటి కోసం బోరుబావులు త్రవ్వరాదు.
ii) నీరు అధికంగా అవసరమయ్యే చెరుకు వంటి పంటలు పండించరాదు.
iii) త్రాగు, సాగు నీటిని పొదుపుగా వాడాలి.
iv) ఇంకుడు గుంతలు ఖచ్చితంగా తియ్యాలి.
జవాబు:
(i), (ii), (iii) & (iv).

64. సింధూనది భారత దేశంలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
జవాబు:
జమ్ము కాశ్మీర్లో.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

65. పరిశ్రమలు ఎటువంటి జలాలను మాత్రమే నదిలోకి ప్రదేశ్, వదలాలని చట్టం చేశారు?
జవాబు:
శుద్ధి చేసిన జలం.

10th Class Social 5th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎలా విభజించవచ్చు?
జవాబు:
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చును. అవి :

  1. 1హిమాలయ నదులు
  2. ద్వీపకల్ప నదులు.

ప్రశ్న 2.
సింధూనది ఉపనదులు ఏవి?
(లేదా)
సింధు నది యొక్క రెండు ఉపనదులను పేర్కొనండి.
జవాబు:

i) జీలం,
ii) చినాబ్,
iii) రావి,
iv) బియాస్,
v) సట్లెజ్.

ప్రశ్న 3.
‘గంగా’ నది ఏ రెండు నదుల కలయిక వలన ఏర్పడినది?
జవాబు:
భగీరథీ మరియు అలకనంద నదుల కలయిక వలన గంగానది ఏర్పడినది.

ప్రశ్న 4.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామ ఎంపికకు పెట్టిన షరతులు ఏవి?
జవాబు:

  1. కృహత్ బంది అనగా చెట్లను నరకడం నిషేధం.
  2. చెరాయి బంది అనగా పశువులను స్వేచ్చగా మేయడానికి వదలడం నిషేధం.
  3. నన్బంది అనగా అధిక సంతానం నిషేధం.
  4. నషా బంది అనగా మత్తుపానీయాల నిషేధం.
  5. శ్రమదానం చేయడం.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 5.
హిమాలయ నదులు ఎందువల్ల జీవనదులుగా పిలువబడుతున్నాయి?
జవాబు:
నిరంతరం నీరు ప్రవహిస్తుండఖం వల్ల హిమాలయ నదులు జీవనదులుగా పిలువబడుతున్నాయి.

ప్రశ్న 6.
భారతదేశానికి వర్షాలను తెచ్చే నైఋతి ఋతుపవనాల రెండు శాఖలు ఏవి?
జవాబు:
భారతదేశానికి వర్షాలను తెచ్చే నైఋతి ఋతుపవనాల రెండు శాఖలు

  1. అరేబియా సముద్రశాఖ
  2. బంగాళాఖాతం శాఖ

ప్రశ్న 7.
ఇవ్వబడిన పటమును పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 1
a) అరేబియా సముద్రంలోనికి ప్రవహించే రెండు నదుల పేర్లు రాయండి.
జవాబు:
అరేబియా సముద్రంలోనికి ప్రవహించే రెండు నదుల పేర్లు

  1. సబర్మతి
  2. మహినది
  3. నర్మద
  4. తపతి

b) తుంగభద్ర నది ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ?
జవాబు:
తుంగభద్రా నది ప్రవహించే రాష్ట్రాలు – కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ప్రశ్న 7.
భారత నదీవ్యవస్థ ఏ అంశాలకు అనుగుణంగా రూపొందింది?
జవాబు:
భారతదేశ నదీ జలవ్యవస్థ భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది. ఇవి :

  1. హిమాలయాలు,
  2. ద్వీపకల్పం – పీఠభూమి,
  3. సింధూ-గంగా మైదానం.

ప్రశ్న 8.
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎలా విభజించవచ్చు?
జవాబు:
పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చును :

  1. హిమాలయ నదులు
  2. ద్వీపకల్ప నదులు.

ప్రశ్న 9.
హిమాలయ నదులను జీవనదులని ఎందుకు పిలుస్తున్నారు?
జవాబు:
హిమాలయ నదులు జీవనదులు. అంటే సంవత్సరమంతా వీటిలో నీరు ఉంటుంది. వర్షపాతం, కరుగుతున్న మంచుతో నీరు అందటం వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు.

ప్రశ్న 10.
అంతర్గత ప్రవాహం, ఉపరితల ప్రవాహం అంటే ఏమిటి?
జవాబు:
ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు = అవపాతం + ఉపరితల ప్రవాహం + భూగర్బ ప్రవాహం. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం.

ప్రశ్న 11.
నీటిని ఎలా కొలుస్తారు?
జవాబు:
నీటిని నిమిషానికి లీటర్లలో కొలుస్తారు.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 12.
తుంగభద్రానదీ జలాలను ఏయే రాష్ట్రాలు పంచుకుంటాయి?
జవాబు:
తుంగభద్రానదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పంచుకుంటాయి.

ప్రశ్న 13.
తుంగభద్రానది పరీవాహక ప్రాంతాన్ని ఎలా విభజిస్తారు?
జవాబు:
తుంగభద్రానది పరీవాహక ప్రాంతాన్ని మూడుగా విభజిస్తారు.

  1. కర్ణాటకలోని ఎగువ, మధ్య పరీవాహక ప్రాంతాలు,
  2. ఆంధ్రదేశ్ లోని దిగువ పరీవాహక ప్రాంతం,
  3. తెలంగాణ పరీవాహక ప్రాంతం.

ప్రశ్న 14.
తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ప్రధాన పంటలు ఏవి?
జవాబు:
వరి, జొన్న, చెరకు, పత్తి, రాగులు ఇక్కడి ప్రధాన పంటలు.

ప్రశ్న 15.
హివారే బజారులో సన్న, చిన్నకారు రైతులు ఎలా ప్రయోజనం పొందారు?
జవాబు:
పశుపోషణ రంగం వృద్ధి చెందడం వల్ల సన్న, చిన్నకారు రైతులు గణనీయంగా ప్రయోజనం పొందారు.

ప్రశ్న 16.
భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు ఎందుకు ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు?
జవాబు:
ఈ చట్టాలు భూగర్భజలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో రూపొందించబడ్డాయి. కాబట్టి నేటి కాలానికి ఇవి అనువైనవి కావు.

ప్రశ్న 17.
భూగర్భ జల వినియోగ చట్టాలలో ఉన్న లోపం ఏది?
జవాబు:
భూమి హక్కుకీ, భూగర్భ జలాలపై హక్కుకీ సంబంధం కలపటం అన్నది ఈ నియమాలలో ఉన్న లోపం.

ప్రశ్న 18.
ప్రస్తుతం మనముందున్న తీవ్ర సమస్య ఏది?
జవాబు:
ఇతరుల కంటే ముందు తాను నీళ్లు వాడుకోవటానికి ప్రతి ఒక్కరూ పోటీపడటంతో ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మనముందున్న తీవ్ర సమస్య ఇదే.

10th Class Social 5th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
పుట్టుక ఆధారంగా మన దేశ నదీ జలవ్యవస్థను వర్గీకరించండి.
జవాబు:
పుట్టుక ఆధారంగా మనదేశ నదీ జలవ్యవస్థను రెండుగా విభజించవచ్చు. అవి :

  1. హిమాలయ నదులు
  2. ద్వీపకల్ప నదులు

హిమాలయ నదులు :
ఇవి జీవనదులు అంటే సంవత్సరమంతా వీటిల్లో నీళ్ళు ఉంటాయి. వర్షపాతం కరుగుతున్న మంచుతో నీళ్ళు అందంట వల్ల జీవనదులుగా పిలుస్తున్నారు.
ఉదా :
గంగ, సింధు, బ్రహ్మపుత్ర మొ||నవి.

ద్వీపకల్ప నదులు :
ద్వీపకల్ప నదులలో సంవత్సరమంతా నీరు ఉండదు. ఇవి వర్షం మీద ఆధారపడి ఉంటాయి.
ఉదా :
గోదావరి, కృష్ణా, కావేరి, మహానది మొ||నవి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 2.
హిమాలయ నదులు జీవనదులు, అంటే సంవత్సరమంతా వీటిల్లో నీళ్ళు ఉంటాయి. ఏ రెండు కారణాల వల్ల ఇవి జీవనదులుగా పిలువబడుతున్నాయి?
జవాబు:

  1. హిమాలయ నదులు జీవ నదులు, అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లు ఉంటాయి.
  2. వర్షపాతం, మంచు కరగటం ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుండడం వలన వీటిని జీవనదులుగా పిలుస్తున్నారు.

ప్రశ్న 3.
నీటి వినియోగంలో పొదుపు ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడానికి రెండు నినాదాలు రాయండి.
జవాబు:
నీటి పొదుపుకు సంబంధించిన నినాదాలు :

  1. ఇంటింటా ఇంకుడు గుంత – భవిష్యత్తుకు నిశ్చింత.
  2. చుక్క నీటి పొదుపు – భవిష్యత్తుకు మదుపు.
  3. నీటిని మిగుల్చు – జీవనాన్ని రక్షించు.

ప్రశ్న 4.
క్రింది పటాన్ని పరిశీలించి, దిగువ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2
a) గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు?
జవాబు:
పద్మా నది

b) కోల్‌కతా ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
హుగ్లీనది

c) టిబెట్లో సాంగ్ పోగా పిలువబడుతున్న నది ఏది?
జవాబు:
బ్రహ్మపుత్రా నది

d) గౌహతి ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
బ్రహ్మపుత్రా నది

ప్రశ్న 5.
“కొన్ని సంవత్సరాలు వరుసగా తక్కువ వర్షపాతం ఉన్నా హివారే బజారులో తాగునీటి కొరత ఏర్పడలేదు.” కారణాలు తెల్పండి.
జవాబు:
హివారే బజారులో తాగునీటి కొరత ఏర్పడకపోవడానికి గల కారణాలు :

  1. చెట్లను నరకడంపై నిషేధం విధించడం.
  2. పశువులను స్వేచ్చగా మేతకు వదలడంపై నిషేధం విధించడం.
  3. సాగునీటికి బోరుబావులు తవ్వటంపై నిషేధం విధించడం.
  4. అధిక నీటిని వాడుకునే పంటలపై నిషేధం విధించడం.

ప్రశ్న 6.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో భూగర్భజల మట్టం మెరుగు పరచడానికి కొన్ని సలహాలను ఇవ్వండి.
జవాబు:

  • చెక్ డ్యా ముల నిర్మాణం
  • ఇంకుడు గుంతల నిర్వహణ
  • లోతైన అవిచ్ఛిన్న సమతల కందకాల (CCTS) నిర్వహణ
  • చెరువులలో పూడిక వెలికితీత
  • అడవుల పెంపకం
  • లోతైన బోరుబావుల తవ్వకంపై నియంత్రణ

ప్రశ్న 7.
నీటి సంరక్షణకు తీసుకోవలసిన చర్యలను సూచించండి.
జవాబు:
నీటి సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు

  1. చెక్ డ్యాములు
  2. ఊట కుంటలు
  3. రాతి కట్టడాలు
  4. చెట్లు నాటడం

ప్రశ్న 8.
హిమాలయ నదుల గురించి తెలుపండి.
జవాబు:
హిమాలయ నదులు మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తాయి. అవి గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు. ఈ నదులు దాదాపు ఒకే ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల వ్యత్యాసంతో పుట్టి పర్వతశ్రేణుల వల్ల వేరుచేయబడతాయి. అవి మొదట పర్వతాల ప్రధాన అర్గానికి సమాంతరంగా ప్రవహిస్తాయి. తరువాత ఒక్కసారిగా అవి దక్షిణానికి మలుపు తిరిగి ఎత్తైన పర్వత శృంఖలాలను కోసుకుంటూ ఉత్తర భారత మైదానాలను చేరుకుంటాయి. ఈ క్రమంలో ఇవి లోతైన ‘V’ ఆకారపు లోయలను ఏర్పరిచాయి. ఇది సింధూ, బ్రహ్మపుత్ర నదులలో బాగా కనపడుతుంది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 9.
అవపాతం అంటే ఏమిటి?
జవాబు:
అవపాతం అంటే వాన ఒక్కటే కాకుండా వడగళ్లు, హిమము, పొగమంచు కూడా ఉంటాయి. అవపాతం అన్ని సంవత్సరాలు ఒకేలాగ కాకుండా ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటుంది. అందువలన అవపాతాన్ని లెక్కించడానికి కొన్ని సంవత్సరాల అవపాతం యొక్క సగటును పరిగణలోనికి తీసుకుంటారు.

ప్రశ్న 10.
బాష్పోత్సేకం గురించి రాయండి.
జవాబు:
బాష్పోత్సేకం :
అన్ని నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంటుంది. చెరువులు, నదులు, సముద్రాలు వంటి అన్ని ఉపరితల నీటి వనరుల నుంచి నీరు ఆవిరి అవుతుంది. అన్ని జీవులు శ్వాస ప్రక్రియ ద్వారా గాలిలోకి నీటిని విడుదల చేస్తాయి.

ప్రశ్న 11.
వరదలు కరవుల వల్ల మొక్కలకు ఏమి జరుగుతుంది?
జవాబు:
పంటల వేళ్లు ఉండే ప్రాంతంలోకి నీరు వర్షపాతం ద్వారాగానీ, సాగునీటి ద్వారాగానీ చేరుతుంది. నేలకి తేమని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వరద వంటి పరిస్థితుల్లో ఎక్కువ నీళ్లు ఉండి, అది నేల లోపలి పొరల్లోకి ఇంకకపోతే మొక్కల వేళ్లు దెబ్బతింటాయి. ఇంకొకవైపు కరవు పరిస్థితులలో వేళ్ల ప్రాంతంలో తగినంత తేమ లేకపోతే పంటలు వడిలిపోతాయి.

ప్రశ్న 12.
హివారే బజార్ ఎక్కడ ఉంది? ఇది ఎందుకు కరవు పీడిత ప్రాంతం?
జవాబు:
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో హివారే బజార్ ఉంది. మహారాష్ట్ర నుంచి కోస్తా కొంకణ తీర ప్రాంతాన్ని వేరుచేస్తూ ఉత్తర-దక్షిణంగా ఉన్న సహ్యాద్రి పర్వతశ్రేణికి (వర్షచ్చాయ ప్రాంతంలో) తూర్పువైపున గల వరచ్చాయా ప్రాంతంలో ఈ జిల్లా ఉంది. అందుకే అహ్మదాబాద్ జిల్లా 400 మి.మీ. వర్షపాతంతో కరవు పీడిత ప్రాంతంగా ఉంది.

ప్రశ్న 13.
హివారే బజారులో ఏయే చర్యలు చేపట్టారు?
జవాబు:
హివారే బజారులోని ఉమ్మడి భూములు, వ్యక్తిగత పచ్చిక భూములలో నేల, నీటి సంరక్షణ పనులను అమలు చేశారు. కొండవాలుల్లో వరస సమతల కందకాలు తవ్వి నేలకోతకు గురి కాకుండా చేశారు. ఇవి వాన నీటిని నిల్వచేస్తాయి. ఫలితంగా పచ్చగడ్డి బాగా పెరుగుతుంది. నీటిని నిల్వచేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలుచేశారు – చెక్ డ్యాములు, ఊట కుంటలు, రాతి కట్టడాలు, కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన, అటవీ భూములలో చెట్లు నాటారు.

ప్రశ్న 14.
హివారే బజారులో నాలుగు ముఖ్యమైన నిషేధాలు ఏవి?
జవాబు:
మహారాష్ట్రలో ఆదర్శ గ్రామ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు గ్రామాల ఎంపికకు కొన్ని షరతులు పెట్టారు. దీంట్లో ముఖ్యమైన నాలుగు నిషేధాలు ఉన్నాయి. రాలేగావ్ సిద్ధి సాధించిన విజయంతో అవి చాలా ప్రఖ్యాతిగాంచాయి. అవి : చెట్లను నరకడం నిషేధం, పశువులను స్వేచ్చగా మేయడానికి వదలడం నిషేధం, మత్తు పానీయాల నిషేధం, అధిక సంతానం నిషేషం. అంతేకాకుండా ప్రజలు కొంత శ్రమదానం కూడా చెయ్యాలి, భూమిలేని పేదలకు దీని నుంచి మినహాయింపు ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 15.
హివారే బజార్ గ్రామంలోని మరికొన్ని నిషేధాలు ఏవి?
జవాబు:
సాగునీటికి బోరు బావులు తవ్వటం, చెరకు, అరటి సాగుచేయటం, బయటివాళ్లకు భూమి అమ్మటం. నీటి వినియోగంలో దీర్ఘకాలిక సుస్థిరత సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యం. ఈ నిషేధాలు కేవలం ప్రకటనలు కాదు, ప్రజలు ఉమ్మడి ప్రయోజనాలను సాధించటానికి దోహదపడే ప్రజా నిర్మాణం. అయితే ఏదీ అంత తేలికగా జరగలేదు.

ప్రశ్న 16.
పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 3
1. నదుల పుట్టుకకు అనువుగా ఉండే రెండు పర్వతశ్రేణులు ఏవి?
2. పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహించే నదులేవి?
3. పశ్చిమంగా ప్రవహించే నదులేవి?
4. సింధూనదికి గల ఉపనదులేవి?
జవాబు:
1) నదుల పుట్టుకకు అనువుగా ఉండే పర్వతశ్రేణులు :
హిమాలయాలు మరియు పశ్చిమ కనుమలు.

2) పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పుగా ప్రవహించే నదులు :
1) కృష్ణా, 2) గోదావరి, 3) కావేరి మొ||.

3) పశ్చిమంగా ప్రవహించే నదులు :
నర్మద మరియు తపతి.

4) సింధూనది ఉపనదులు :
రావి, సట్లెజ్, బియాస్, జీలం, చీనాబ్.

ప్రశ్న 17.
పటాన్ని పరిశీలించి, క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 2
1. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులు ఏవి?
2. హిమాలయాలలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులేవి?
3. గంగానది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
4. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:

  1. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులు : చంబల్, బేత్వా, థమ్స, సోన్ మొ॥
  2. హిమాలయాలలో పుట్టి గంగానదిలో కలిసే ఉపనదులు : గోమతి, గండక్, కోసి, ఘగ్గర్ మొ||.
  3. గంగానది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలగుండా ప్రవహిస్తుంది.
  4. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్ నది అంటారు.

10th Class Social 5th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఏ ఏ కారణాల వల్ల ఇలా జరిగిందని నీవు భావిస్తున్నావు?
జవాబు:

  1. భూగర్భ జలం ప్రధాన జలవనరుగా ఉంది.
  2. భూగర్భ జలాలు అక్కడికి చేరుకునే వాటి కంటే ఎక్కువ మొత్తంలో వాటిని తోడి తీస్తున్నారు.
  3. పర్యవసానంగా ఎక్కువ లోతుకు బోరుబావులను త్రవ్వుతున్నారు.
  4. భూగర్భ జలాలను వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
  5. పారిశ్రామిక, గృహ అవసరాలకు కూడా భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
  6. అడవులను నరకడం వల్ల కూడా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం తగ్గుతుంది.
  7. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా భూమి మీద వదలడం వల్ల భూమిలోనికి నీరు ఇంకే స్థాయి తగ్గిపోయి భూగర్భ జల మట్టాలు తగ్గుతున్నాయి.
  8. ఇంకుడు గుంతలను సక్రమంగా వినియోగించకపోవడం మొదలగు కారణాల వలన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, దానిపై మీ అభిప్రాయం రాయండి.
నీళ్ళు అన్నవి ప్రవహించే ఉమ్మడి వనరు అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం. తాగునీళ్ళకు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు పొందడం అనేది మానవ హక్కు కూడ భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థలకు నియంత్రణ ఉండాలి.
జవాబు:

  1. ఇవ్వబడిన పేరా ప్రకారం చట్టాలు, నియమాలు నీటిని ప్రవహించే ఉమ్మడి వనరుగా గుర్తించాలి.
  2. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్దమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  3. ఈ నియమాలు, చట్టాలు నీటిని తాగు అవసరాల కోసం మొదటిస్థానంలో ఉంచాలి.
  4. భూగర్భ జలాల వినియోగంపై పంచాయతీరాజ్ సంస్థల నియంత్రణ ఉండాలి.
  5. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  6. నీరు అందరికీ చెందిన వనరుగా గుర్తించబడాలి.
  7. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  8. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 3.
హివారే బజారులాగానే భూగర్భ జలాల నియంత్రణ ప్రధానంగా ప్రజలే చేయాలా? మీ అభిప్రాయాన్ని తెలపండి.
జవాబు:

  1. హివారే బజారులో భూగర్భజలాల నియంత్రణ చాలా విజయవంతం అయింది. దీనికి కారణం ప్రజల సహకారమే. కావున ప్రజలు పూనుకుని భూగర్భజలాల నియంత్రణ చేయటమే సరియైన పని.
  2. భూగర్భ జలాలపై వ్యక్తిగత హక్కు వలన ఎవరికి వారు అధిక లోతు నుండి నీటిని తోడుకుంటున్నారు.
  3. నీరు వాడుకొనుటకు ప్రతి ఒక్కరూ పోటీపడుట వలన ఈ ఉమ్మడి వనరు త్వరితంగా అంతరించే ప్రమాదం ఉంది.
  4. భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ అనేది అవసరం. ఎందుకంటే ఒక ప్రాంతం లోపలికి, బయటకు వెళ్ళే ప్రవాహలను లెక్కించి నీటిని వినియోగించుకోవాలి.
  5. చిన్న ప్రాంతాలలో కూడా సామాజిక చొరవ, నియంత్రణ ప్రణాళికల ద్వారా అందరికీ నీటిని అందించటం సాధ్యమేనని హివారే బజారు అనుభవం తెలుపుతుంది.

ప్రశ్న 4.
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.
“భూగర్భజలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరు. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను ప్రభావితం చేస్తుంది కాబట్టి భూయజమానులు తమకు యిష్టమొచ్చినట్లు నీటిని తోడుకునే హక్కు లేదు. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి. భూమి ” యాజమాన్యానికీ, భూమి మీద బోరుబావుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు ఆమోదయోగ్యంగా ఉంటాయి.”
జవాబు:

  1. నీటి వనరులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ అసంబద్ధమైనవి, చెల్లనివి అని చెప్పుకోవచ్చు.
  2. భూమిపై యాజమాన్యానికి ఆ నేలలో లభ్యమయ్యే నీటి వనరులకు మధ్య సరియైన సంబంధం లేదు. భూమి యజమాని నీరు తోడటంపై ఎటువంటి నియంత్రణ లేదు.
  3. నీరు అందరికి చెందిన వనరుగా గుర్తించబడాలి.
  4. ఇలా గుర్తించి నియంత్రించడానికి సరియైన చట్టాలు, నియమాలు రూపొందించాలి.
  5. నీటి వనరుల వినియోగ నియంత్రణకు స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ చట్టాలను చేయాలి.

ప్రశ్న 5.
“అనేక రాష్ట్రాలలో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి, ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. భూగర్భ జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజులలో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి. ఈనాడు బోరుబావులు వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితిలో ఉన్నాయి.”
ప్రశ్న : భూగర్భ జలాల సక్రమ వినియోగం సమపంపిణీ గురించి వ్యాఖ్యానిస్తూ ఈ అంశంపై నీవు సూచించు మార్గాలు కొన్నింటిని పేర్కొనండి.
జవాబు:

  1. ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటివనరుగా ఉన్నాయి.
  2. వీనిని అధికంగా తోడివేస్తే భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
  3. కాబట్టి భూ యజమానులకు తమ ఇష్టం వచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వరాదు. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి.
  4. భూయాజమాన్యానికి, ఆ భూమిలోని బోరుబావుల నుండి భూగర్భ జలాలను తోడుకోవడానికి మధ్య సంబంధం లేకుండా చేస్తే ఈ పరిమితులు అమలవుతాయి.

ప్రశ్న 6.
తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం గురించి వివరింపుము.
జవాబు:
తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం :

  1. తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంచుకుంటాయి.
  2. వ్యవసాయానికి ఉపయోగించబడుతున్నాయి.
  3. కొన్ని ప్రాంతాలలో చెరువుల ద్వారా నీటి నిల్వ జరుగుతోంది.
  4. మిగిలిన ప్రాంతాలు కాలువల ద్వారా వచ్చే ఉపరితల నీటిపై ఆధారపడినాయి.
  5. అటవీ విస్తీర్ణం తగ్గి, సాగుభూమి పెరిగింది.
  6. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించబడుతున్నాయి.
  7. త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగించబడుతున్నాయి.
  8. కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి.
  9. రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొంటున్నాయి.

ప్రశ్న 7.
ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి. ఈ నీటిని అధికంగా తోడేసే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం. దీనిపై కొన్ని పరిమితులుండాలి.
ప్రశ్న : దీనిని నీవు అంగీకరిస్తావా? నీ అభిప్రాయాన్ని తెలుపుము.
జవాబు:
అవును. ఈ వాక్యంతో నేను అంగీకరిస్తాను.

  1. నీటిని ఉమ్మడి వనరుగా పరిగణించాలి.
  2. భూగర్భంలో ప్రవహించే నీటికి ఎటువంటి సరిహద్దులూ ఉండవు.
  3. భూ యాజమాన్యం అనేది భూగర్భ జలాలకు వర్తించరాదు.
  4. తాగునీటికి మొదటి స్థానం ఇవ్వాలి. అది మానవ హక్కు.
  5. పంచాయతీరాజ్ సంస్థలకు భూగర్భ జలాలపై నియంత్రణ ఉండాలి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 8.
హిమాలయ నదీ వ్యవస్థల గురించి వివరించుము.
జవాబు:
హిమాలయ నదీ వ్యవస్థలు :
హిమాలయ నదీ వ్యవస్థ మూడు ముఖ్యమైన వ్యవస్థల కిందకు వస్తుంది. అవి గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు.

1) సింధునదీ వ్యవస్థ :
టిబెట్లోని మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధూనది మొదలవుతుంది. ఇది టిబెట్ గుండా వాయవ్య దిశగా పయనిస్తుంది. భారతదేశంలోకి జమ్ము-కాశ్మీర్‌లో ప్రవేశిస్తుంది. సింధూనదికి భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెట్లు ప్రధానమైన ఉపనదులు. భారతదేశంలో జమ్మూ& కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఇది ప్రవహిస్తుంది.

2) గంగానదీ వ్యవస్థ :
గంగానది రెండు నదుల కలయిక. ఒకటి గంగోత్రి హిమానీనదం దగ్గర పుట్టే భగీరథి. రెండవది బదరీనాథ్ కి వాయవ్య దిశలో సతహెనాథ్ దగ్గర పుట్టే అలకనంద. ఈ రెండూ దేవప్రయాగ వద్ద కలిసి గంగానదిగా మారుతుంది. ఇది హరిద్వార్ వద్ద పర్వతాలను వదలి మైదానాలలోనికి ప్రవహిస్తుంది. గంగానదిలో అనేక ఉపనదులు వచ్చి చేరతాయి. వీటిల్లో అనేకం హిమాలయపర్వతాల్లో పుడతాయి, కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి.

3) బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ :
బ్రహ్మపుత్ర (టిబెట్ లో దీనిని సాంగ్ పో అంటారు) మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయుంగ్ డంగ్ హిమానీనదం నుండి పుడుతుంది. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పునకు ప్రవహిస్తుంది. లోట్సే త్సాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తరవాత అనేక జలపాతాల ద్వారా అది పాయలుగా మారుతుంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ దీనిని సియంగ్ అనీ, దిహంగ్ అనీ అంటారు. అస్సోం లోయలోకి వచ్చినప్పుడు దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు దీంట్లో కలుస్తాయి. ఇక్కడి నుంచి దీనిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు.

ప్రశ్న 9.
‘భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకోకుండా నీటిని అధికంగా తోడేస్తే భవిష్యత్ తరాలకు భూగర్భజలాలు లభించని పరిస్థితి ఏర్పడుతుంది’. వ్యాఖ్యానించండి.
జవాబు:

  1. ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరుగా ఉన్నాయి.
  2. ఈ నీటిని అధికంగా తోడేస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి.
  3. భవిష్యత్తు తరాలకు అందాల్సిన నీటి నిల్వలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
  4. కాబట్టి భూమి యజమానులకు తమకు ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం.
  5. దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి.
  6. భూమి యజమాన్యానికీ, భూగర్భ జలాలను తోడడానికి మధ్య సంబంధం ఉండరాదు.
  7. అప్పుడు మాత్రమే ఈ పరిమితులు సక్రమంగా అమలౌతాయి.
  8. భూగర్భ జలాలను ఉమ్మడి వనరుగా భావించాలి.

ప్రశ్న 10.
క్రింది పేరాగ్రాఫ్ ను చదివి, వ్యాఖ్యానించండి.
నీటి వినియోగ యాజమాన్యంలో సామాజిక – ఆర్థిక అంశాలు ఎంతో ముఖ్యమైనవి. ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య వ్యవసాయం, పరిశ్రమలు, తాగు నీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి.
జవాబు:
పైన ఇవ్వబడిన పేరాలో నీటి వినియోగం మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించబడింది: నీటి వినియోగంలో చాలా సందర్భాలలో రాష్ట్రాల మధ్య గొడవలు కూడా సంభవించాయి.
ఉదా :

  1. కావేరి జలాల సమస్య – కర్ణాటక, తమిళనాడు
  2. తెలుగు గంగ సమస్య – ఆంధ్ర, తమిళనాడు
  3. బాబ్లీ ప్రాజెక్టు సమస్య – ఆంధ్ర, మహారాష్ట్ర
  4. తుంగభద్ర ప్రాజెక్టు నీటి సమస్య – ఆంధ్ర, కర్ణాటక
  5. నాగార్జునసాగర్ జలాల సమస్య – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలగునవి

ఇలా వివరిస్తూ పోతే మన దేశంలో రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకనగా నీరు ప్రధాన వనరు. నీరు లేకపోతే మన మనుగడలేదు. కొన్ని ప్రాంతాలవారు ఎక్కువగా వాడుకుంటున్నారని, మరికొన్ని ప్రాంతాలవారికి త్రాగునీరు కూడా లేదని మనం గమనిస్తున్నాం. దీని వలన కొన్ని ప్రాంతాలు వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. అంతేకాకుండా భూగర్భ నీటి వనరులు ఉపయోగించే విషయంలో చాలాసార్లు మనం కోర్టులో కేసులు పెట్టడం జరిగింది.

ఉదా :
కేరళలోని పెరుమట్టి గ్రామ పంచాయితి మరియు కోకోకోలా కంపెనీలు : ఈ పైవన్నీ గమనించినట్లయితే రాబోయే కాలంలో నీటి వనరుల కోసం యుద్ధాలు కూడా జరుగవచ్చు.

దీనిపై నా సలహా మరియు సూచనలు ఏమిటంటే ముందుగా ప్రతి ఒక్కరు నీటి ఆవశ్యకతను గురించి, దానిని ప్రతి ఒక్కరూ సమానంగా పొందాలి అనే అంశాన్ని గమనిస్తూ, ప్రస్తుతం మాత్రమే కాకుండా మన రాబోయే తరాల వారికి కూడా ఇబ్బంది లేకుండా మనం నీటిని వారికి అందించవలసిన ఆవశ్యకత చాలా ఉంది.

కావున ప్రభుత్వం నీటి వినియోగం యాజమాన్యం మీద అనుగుణమైన చట్టాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు కాలం చెల్లిపోయినవి. జనాభా అధికంగా పెరిగిపోయినారు.

వ్యవసాయదారులలో కూడా నీటి వినియోగం గురించి అవగాహన కల్పించాలి. వారి ప్రాంతంలో ఉన్న నేలను గురించి దానికి ఎంత నీరు అవసరం, ఎలాంటి పంటలు పండించాలి. ఎలా చేస్తే మనం నీటిని పొదుపుగా వాడవచ్చు అనే దానిని వివరించాలి.

అలాగే చివరిగా ప్రతి ఒక్కరు భూగర్భ నీటి మట్టాన్ని పెంచే విధానాన్ని అవలంబించాలి.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 11.
“భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది ముఖ్యమైన విషయం.” – ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:

  • ఆ భూగర్భ జలాల వెలికితీత, వినియోగంపై సామాజిక నియంత్రణ అన్నది ముఖ్యమైన విషయం, ఈ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. కారణం
  • ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటివనరు, వీటిని అధికంగా వినియోగం చేస్తే భవిష్యత్తు తరాల వారిపై దీని ప్రభావం ఉంటుంది.
  • భూ యజమానులకు తమ ఇష్టం వచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వరాదు, దీనిపై కొన్ని పరిమితులు ఉండాలి.
    నీటిని ఉమ్మడి వనరుగా పరిగణించాలి, సామాజిక నియంత్రణ ఉండాలి.
  • భూగర్భంలో ప్రవహించే నీటికి ఎటువంటి సరిహద్దులూ ఉండవు కాబట్టి భూమి యజమానికీ, భూగర్భ జలాలను తోడడానికి మధ్య సంబంధం ఉండరాదు.
  • ప్రభుత్వం కూడా నీటి వినియోగం యాజమాన్యం మీద అనుగుణమైన చట్టాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రశ్న 12.
ద్వీపకల్ప నదుల గురించి రాయండి.
జవాబు:
బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమకనుమలు కలవు. నర్మదా, తపతి నదులు కాకుండ, ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పువైపుకు ప్రవహిస్తాయి. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తరభాగంలో పుట్టే చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు గంగా నదీ వ్యవస్థకు చెందుతాయి. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, ద్వీపకల్ప నదుల ప్రవాహమార్గం మారదు, వక్రతలు (meanders) ఉండవు. వీటిల్లో సంవత్సరమంతా నీళ్లు ఉండవు.

ద్వీపకల్ప నదులలో గోదావరి నది పెద్దది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం పీఠభూమిలో ఇది పుడుతుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది.

ప్రశ్న 13.
తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం ఎందుకు తగ్గుతోంది?
జవాబు:
గత కొద్ది దశాబ్దాల నుండి తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. 50 సంవత్సరాల క్రితం ఆనకట్ట సామర్థ్యం 376.6 కోట్ల ఘనపు మీటర్లు కాగా గనుల తవ్వకం, దుమ్ము, నేలకోత, వ్యర్థపదార్థాల వంటి వాటివల్ల రిజర్వాయరు మేటవేసి నీటి నిల్వ సామర్థ్యం 84.9 కోట్ల ఘనపు మీటర్ల మేర తగ్గిపోయింది. “ఇనుప ఖనిజ తవ్వకంలో సరైన ప్రామాణికాలు పాటించడం లేదు. కుద్రేములో ఇనుప ఖనిజం, శాండూర్ వద్ద మాంగనీసు తవ్వకాల వల్ల పరీవాహక ప్రాంతంలో నేల కోత ఎక్కువయ్యి సాంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయం పూడికకు గురవుతున్నాయి.” అని ఒక అధ్యయనం పేర్కొంది.

ప్రశ్న 14.
‘జలచక్రాన్ని’ చిత్రించండి.
జవాబు:
AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు 4

ప్రశ్న 15.
తుంగభద్ర కాలుష్యానికి కారణాలను వివరించండి.
జవాబు:
గత రెండు దశాబ్దాలలో చిన్న పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలు బాగా పెరిగాయి. దీంతో నీటికి పరస్పర విరుద్ధ అవసరాలు మరింత సంక్లిష్ట రూపం దాల్చాయి. పారిశ్రామికీకరణ, పట్టణ ప్రాంతాల పెరుగుదల వల్ల కొంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ వీటివల్ల, ప్రత్యేకించి పారిశ్రామిక సంస్థల వల్ల కాలుష్యం పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతంలో పనిచేస్తున్న 27 భారీ, 2543 చిన్న పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. ఇవి రోజుకు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయి. నదిలోకి కలుషిత జలాలను వదలటానికి పరిశ్రమలను అనుమతించారు. అయితే 1984లో నదిలోకి వదిలిన బెల్లపు మడ్డి వల్ల పెద్ద ఎత్తున చేపలు చనిపోవటంతో ప్రజలు ఆందోళన చేశారు. అప్పటి నుంచి పరిశ్రమలు శుద్ధి చేసిన జలాలను మాత్రమే నదిలోకి వదలాలి. అయితే ఈ చట్టాలను సమర్థంగా అమలు చేయటం లేదు. దాంతో ! నదీవ్యవస్థ తీవ్ర కాలుష్యానికి గురి అవుతూనే ఉంది.

AP 10th Class Social Important Questions Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

ప్రశ్న 16.
హివారే బజారులో జరిగిన మార్పులను వివరించండి.
జవాబు:
వేసవిలో నీళ్లు అందే భూమి 7 హెక్టార్ల నుంచి 72 హెక్టార్లకు పెరిగింది. సగటు వర్షపాతం కురిసిన సంవత్సరంలో ఖరీఫ్ లో సజ్జ పంట, రబీలో జొన్న పంటకే కాకుండా జయా లో కొంత కూరగాయల సాగుకి కూడా నీళ్లు లభిస్తాయి. సాగునీటి సదుపాయంలేని భూములలో కూడా నేలలో తేమ శాతం పెరిగినందువల్ల ఉత్పాదకత పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు పంటల వైవిధ్యత పెరిగింది. ఇప్పుడు బంగాళాదుంప, ఉల్లి, పళ్లు (ద్రాక్ష, దానిమ్మ), పూలు వంటి వాణిజ్య పంటలు, గోధుమ కూడా సాగుచేస్తున్నారు. అన్నిటికంటే చెప్పుకోదగ్గ పరిణామం ఏమిటంటే నీటి అందుబాటు పెరిగి, రెండవ పంట కూడా సాధ్యం కావటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం తగ్గింది. చిన్న, సన్నకారు రైతులు తమ భూముల ద్వారా పూర్తి జీవనోపాధి పొందలేక పోతున్నప్పటికీ వాళ్ల భూముల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. కూలిరేట్లు ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ అవి కొంతైనా పెరిగినందువల్ల కూలీ చేసుకునే వాళ్ల పరిస్థితి కూడా మెరుగుపడింది.