AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

SCERT AP 9th Class Biology Guide Pdf Download 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 4th Lesson Questions and Answers ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కణాలలోని, బయటకు పదార్థాల కదలికలను నియంత్రించే నిర్మాణం (AS 1)
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
బి) కణత్వచం

ప్రశ్న 2.
ఖాళీలను పూరించండి. (AS 1)
ఎ) పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ …………..
బి) భోపాల్ విషాధంలో MIC అను వాయువు నగరమంతా వ్యాపించిన పద్ధతి
సి) పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ………………. పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది.
డి) తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృశించుటకు కారణం. ………………
జవాబు:
ఎ) వ్యాపనం
బి) వ్యాపనం
సి) ద్రవాభిసరణం
డి) ద్రవాభిసరణం

ప్రశ్న 3.
త్వచానికి ఉండే పారగమ్య స్వభావం అంటే ఏమిటి? సరైన ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
ద్రావితాలు, ద్రావణిని తమ గుండా ప్రసరింపనీయడాన్ని పారగమ్యత అంటారు.

ఉదాహరణ :

  1. ప్లాస్మాపొర తన గుండా కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు క్రొవ్వులో కరిగే ఆల్కహాలు, ఈథర్ మరియు క్లోరోఫామ్ లను తన గుండా పోవటానికి అనుమతి ఇస్తుంది.
  2. ప్లాస్మాపొర తన గుండా పాలిసాకరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ప్రోటీనులను తనగుండా పోవడానికి అనుమతి ఇవ్వదు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 4.
ఎండిన కూరగాయలు మంచినీటిలో ఉంచినపుడు తాజాగా తయారవుతాయి. కారణమేమి? (AS 1)
జవాబు:

  1. ఎండిన కూరగాయలందు నీరు తక్కువగా ఉంటుంది మరియు లవణాల గాఢత ఎక్కువగా ఉంటుంది.
  2. ఎండిన కూరగాయలను మంచినీటిలో ఉంచినపుడు అవి నీటిని గ్రహించి తాజాగా మారతాయి.
  3. మంచినీటిలో కూరగాయలను ఉంచినపుడు ద్రవాభిసరణ ప్రక్రియ జరిగి కూరగాయలలోనికి నీరు ప్రవేశిస్తుంది.

ప్రశ్న 5.
సముద్రపు నీటి నుండి మంచి నీటిని పొందే విధానం ఏది? (AS 1)
జవాబు:
వ్యతిరేక ద్రవాభిసరణము ద్వారా సముద్రపు నీటి నుండి మంచినీటిని పొందుతాము.

ప్రశ్న 6.
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే ఏమవుతుంది? (AS 2)
జవాబు:
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే చనిపోతుంది.

కారణాలు :

  1. సముద్రపు చేప శరీరము నందు లవణాలు ఎక్కువ గాఢతలో ఉంటాయి.
  2. సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచినపుడు చేప శరీరములోనికి నీరు ద్రవాభిసరణము ద్వారా ప్రవేశిస్తుంది.
  3. ఎక్కువ మొత్తంలో నీరు చేప శరీరంలోనికి ప్రవేశించడం వలన కణములు ఉబ్బి పగిలిపోతాయి. చేప చనిపోతుంది.

ప్రశ్న 7.
డాక్టర్లు (ఉప్పునీటి ద్రావణం) సెలైనను మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు. మంచినీరు కాదు. ఎందుకో రాయండి. (AS 2)
జవాబు:

  1. మంచి నీటిని సిరలోనికి ఎక్కించినపుడు దాని వలన కొద్దిమేర ‘కణముల విచ్ఛిన్నము జరుగుతుంది.
  2. ఎర్ర రక్తకణములు సాధారణముగా నీటిచేరిక వలన విచ్చిన్నం చెందుతాయి.
  3. ఎక్కువ మొతంలో శరీరంలోనికి మంచినీటిని ఎక్కించినపుడు ఎర్రరక్త కణములు విచ్చిన్నం అవటం మాత్రమే కాకుండా మెదడుకు నష్టం జరగటం, గుండె ఆగిపోవటం జరిగి మనిషి చనిపోవచ్చు.
  4. అందువలన డాక్టర్లు సరిపోయినంత మొత్తంలో గల ద్రవపదార్ధములు అనగా సెలైనును మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు.

ప్రశ్న 8.
మన రక్తంలోకి అంతర సిరల ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. 50% గ్లూకోజ్ ద్రావణాన్ని డెక్టోజ్ అంటారు. దీనిని మెదడు, వెన్నెముక సంబంధం గల ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీర అంతరభాగాలలో ద్రవపదార్థం చేరికను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  2. అంతర సిరల’ ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే కొంతమందిలో ఇది వేదనాత్మకతను (ఎలర్జీ) కలిగిస్తుంది.
  3. వేదనాత్మక చర్యలు అనగా నాడులు ఉత్తేజం చెందడం, కీళ్ళ వద్ద వ్యాధి సోకటం, అవయవాలలోని కణజాలములు చనిపోవటం, వ్యాధిసోకిన భాగము వరకు సిరలందు రక్తం గడ్డకట్టడం మొదలైనవి.
  4. అందువలన గాఢత గల 50% గ్లూకోజ్ (డెక్టోజ్) ద్రావణాన్ని నీటికి కలిపి పలుచగా చేసిన తరువాత సిరగుండా ఎక్కించాలి.

ప్రశ్న 9.
పారగమ్యత సామర్థ్యం కణాలకి లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే, అవి ముఖ్యమైన జీవక్రియలను నిర్వహించలేవు.
  2. ఆక్సిజన్, గ్లూకోజ్, విటమినులు, క్రొవ్వులు కణమునకు అందకపోయినట్లయితే కణములు జీవక్రియలను జరపలేవు.
  3. పరిపక్వం చెందిన కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే విషపదార్ధములు పేరుకొనిపోతాయి. తద్వారా కణం నశించిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 10.
వ్యాపనం గురించి తెలుసుకోవడానికి నీవు చేసిన ప్రయోగంలో నీవు గమనించిన దేమిటి? (AS 3)
జవాబు:
గమనించిన విషయాలు :

  1. ద్రవ, వాయుపదార్థాలలో వ్యాపనం జరుగుతుంది.
  2. ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతకు పదార్థాలు కదలడం వలన వ్యాపనం జరుగుతుంది.
  3. వ్యాపనమనేది భౌతిక చర్య.
  4. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం (diffussion) అంటారు.

ప్రశ్న 11.
మీ స్నేహితులతో చర్చించి వ్యాపనం జరిగే సందర్భాల జాబితా రాయండి. (AS 4)
జవాబు:

  1. మా స్నేహితుడు రాసుకొచ్చిన సెంటు వాసన తరగతి గది అంతయూ వ్యాపిస్తుంది.
  2. మధ్యాహ్న భోజన సమయంలో మా స్నేహితురాలి క్యారేజిలో నుండి వచ్చిన మసాలా కూరవాసనను మేమందరం ఆస్వాదించాము.
  3. సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో మురికి కాలువ నుండి వచ్చిన దుర్గంధమును పీల్చలేకపోయాము.
  4. రాత్రికి మా ఇంటిలో దేవుని వద్ద వెలిగించిన అగరుబత్తి వాసన ఇల్లంతా వ్యాపించినది.
  5. మా వీధిలో వెళుతున్న పెళ్ళి ఊరేగింపునకు ముందు కాల్చిన బాణాసంచా వాసన మా వీధి అంతయూ వ్యాపించినది.

ప్రశ్న 12.
మీరు కోడిగుడ్డును ఉపయోగించి చేసిన ప్రయోగాన్ని వివరించే దశలను తెలిపే ఫ్లోచార్ట్ గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1

ప్రశ్న 13.
మీరు ఒక కొబ్బరికాయను కొన్నారు. దానిని ఊపినప్పుడు నీరు నిండుగా లేదని తెలిసింది. కొబ్బరికాయలోనికి రంధ్రం చేయకుండా నీరు నింపగలరా? ఎలా? (AS 6)
జవాబు:

  1. రంధ్రము చేయకుండా కొబ్బరికాయలోనికి నీరును నింపలేము.
  2. కొబ్బరికాయను నీళ్ళలో ఉంచినప్పటికి ద్రవాభిసరణం ద్వారా నీరు దానిలోనికి ప్రవేశించదు.
  3. కొబ్బరికాయ పెంకు నిర్జీవ కణములయిన దృఢ కణజాలముతో నిర్మితమైనది.
  4. నిర్జీవ కణాలలో ద్రవాభిసరణక్రియ జరుగదు.
  5. అందువలన కొబ్బరికాయకు రంధ్రము చేయకుండా నీరు నింపలేము.

ప్రశ్న 14.
నిత్య జీవితంలో వ్యాపనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు? (AS 7)
జవాబు:

  1. గదిలో సిగరెట్ తాగినపుడు పొగ అణువులు గది అంతా వ్యాపించి వాసన కలుగచేస్తాయి.
  2. పంచదార స్ఫటికములను నీరు కలిగిన గ్లాసులో ఉంచిన పంచదార అణువులు వ్యాపనం ద్వారా నీరు అంతా వ్యాపిస్తాయి.
  3. బేకింగ్ పదార్థములను వండుతున్నప్పుడు ఇల్లంతా వాసన రావటానికి కారణం వ్యాపనం.
  4. తేయాకు సంచినందలి వర్ణద్రవ్యములు వ్యాపనం ద్వారా కరిగి నీటికి రంగును, రుచిని ఇస్తాయి.
  5. గాలిని శుభ్రపరిచే డియోడరెంట్ నందలి అణువులు వ్యాపనము ద్వారా గాలిలోనికి ప్రవేశిస్తాయి.
  6. వంటచేయడానికి ఉపయోగించే వాయువు సిలిండర్ నుండి బయటకు వచ్చిన గది నిండా వ్యాపనం ద్వారా చేరుతుంది.
  7. సోడానందలి కార్బన్ డై ఆక్సెడ్ వ్యాపనము ద్వారా బయటకు రావటం వలన సోడా నీరు కదలకుండా ఉంటుంది.
  8. అగర్బత్తీ, దోమల నివారణ మందులు వ్యాపన సూత్రంపై పనిచేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 15.
నిత్యజీవితంలో ద్రవాభిసరణ జరిగే 3 సన్నివేశాలను తెలపంది. (AS 7)
జవాబు:

  1. మొక్కల వేర్లలోనికి నీరు ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది.
  2. కణాల మధ్య నీరు ప్రవహించడానికి కారణం ద్రవాభిసరణం.
  3. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం ద్రవాభిసరణ వల్ల జరుగుతుంది.
  4. ద్రవాభిసరణం మొక్కలలో నీరు, లవణాల కదలికలకు సహాయపడుతుంది.
  5. రక్తంలో మలినాలు వడపోయడానికి ద్రవాభిసరణం అవసరం.
  6. మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణం ఉపయోగపడుతుంది.
  7. వాడిపోయిన క్యారెట్ ను నీటిలో ఉంచిన, ద్రవాభిసరణ ద్వారా నీరు ప్రవేశించి క్యారెట్ తాజాగా అవుతుంది.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కణంలోకి వచ్చేవి బయటకు పోయేవి.
పట్టికలో ఇచ్చిన పదార్థాల జాబితాను చూచి కణం లోపలికి ప్రవేశించే పదార్థాలను, కణం బయటకు వెళ్ళే పదార్థాలను (✓) తో గుర్తించండి.
జవాబు:

పదార్థంకణంలోకి ప్రవేశిస్తుందికణం బయటకు వెళుతుంది
ఆక్సిజన్
గ్లూకోజ్
ప్రోటీన్లు
కొవ్వులు
విటమిన్లు
ఖనిజ లవణాలు
కార్బన్ డై ఆక్సైడ్
వ్యర్థాలు

ప్రయోగశాల కృత్యము

2. గాఢతల పరిశీలన :
వివిధ ద్రావణాల గాఢతను పరిశీలించు విధమును రాయండి.
(లేదా)
మీకు బీకరు, ఎండుద్రాక్ష, చక్కెర, నీరు అందిస్తే వీటితో ద్రవాభిసరణను ఎలా చూపిస్తావు?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 2
ఎ) ఉద్దేశం : నీటిలో వేసిన ఎండు ద్రాక్షను పరిశీలించుట
పదార్థాలు / పరికరాలు : 1) బీకరు 2) కుళాయి నీరు 3) ఎండు ద్రాక్ష

విధానం:

  1. ఒక బీకరులో 100 మి.లీ నీరు తీసుకొని దానిలో ఎండు ద్రాక్ష వేయాలి.
  2. ఒక గంట తరువాత ఎండు ద్రాక్షను బయటకు తీసి మామూలు ఎండు ద్రాక్షతో పోల్చాలి.

పోలిక :
మామూలు ఎండు ద్రాక్ష కంటె నీటి నుండి బయటకు తీసిన ద్రాక్ష పరిమాణము పెద్దదిగా ఉన్నది.

బి) ఉద్దేశం : సంతృప్త చక్కెర ద్రావణంలో ఉంచిన తాజాద్రాక్షను పరిశీలించుట.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 3

పదార్థాలు / పరికరాలు :
1) బీకరు 2) కుళాయి నీరు 3) చక్కెర 4) తాజా ద్రాక్ష.

విధానం:

  1. 100 మి.లీ. చక్కెర ద్రావణాన్ని బీకరులో తీసుకొని అందులో తాజా ద్రాక్ష పండును వేయాలి.
  2. ఒక రాత్రి అంతా ఉంచి తెల్లవారగానే ద్రాక్షను తీసి పరిశీలించాలి.

గమనిక : తాజా ద్రాక్ష పరిమాణము తగ్గి ముడుచుకుపోయినది.

పరిశీలనలు:

  1. మొదటి ప్రయోగములో నీరు బీకరులో నుండి ఎండుద్రాక్షలోనికి ప్రవేశించినది.
  2. రెండవ ప్రయోగములో తాజా ద్రాక్ష నుండి నీరు బీకరులోనికి వెళ్తుంది.

నిర్ధారణ :
పై రెండు ప్రయోగములలో ద్రాక్ష త్వచంలోని కణాలు నీటిని లోపలికి మరియు బయటకు వెళ్ళడానికి సహకరించినవి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రయోగశాల కృత్యము

3. ద్రవాభిసరణం (Osmosis) :
ద్రవాభిసరణను నిరూపించుటకు ఒక ప్రయోగమును వివరింపుము.
(లేదా)
ద్రవాభిసరణంను నిరూపించడానికి మీరు ప్రయోగశాలలో కృత్యం నిర్వహించారుగదా! క్రింది అంశాలను వివరించండి.
a) కావలసిన పదార్థాలు
b) తీసుకోవలసిన జాగ్రత్తలు
c) ప్రయోగ విధానం
d) ఫలితం
జవాబు:
ఉద్దేశం : బంగాళాదుంపను ఉపయోగించి ద్రవాభిసరణను నిరూపించుట.

కావల్సిన పదార్థాలు :
1) తాజా బంగాళాదుంప 2) ఉడికించిన బంగాళాదుంప 3) రెండు బీకర్లు లేదా కప్పులు 4) రెండు గుండు సూదులు 5) నీరు 6) పదునైన కత్తి 7) చక్కెర ద్రావణం.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 4
ప్రయోగ విధానం (లేదా) పద్ధతి :

  1. తాజా దుంపను తీసికొని పై పొట్టును తొలగించి దానిని తొట్టి లేదా కప్పు గిన్నె మాదిరిగా తయారుచేయాలి.
  2. తయారుచేసిన చక్కెర ద్రావణాన్ని బంగాళాదుంప కప్పు లేదా తొట్టియందు పోయాలి.
  3. చక్కెర ద్రావణ మట్టమును సూచిస్తూ గుండుసూది గుచ్చాలి.
  4. బంగాళాదుంప కప్పు లేక తొట్టిని బీకరులో ఉంచాలి.
  5. బీకరులో బంగాళాదుంప తొట్టి లేదా కప్పు సగం వరకు వచ్చేటట్లు నీరు నింపి అది మునగకుండా, తేలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  6. ఈ అమరికను ఒక అరగంట పాటు కదిలించకుండా ఉంచి పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 5
పరిశీలన:
బంగాళాదుంప కప్పు లేదా గిన్నెలోనికి బీకరులోని నీరు ప్రవేశించుట వలన చక్కెర ద్రావణమట్టం పెరుగుతుంది. పద్దతి : తరువాత బంగాళాదుంప కప్పులోనికి నీటిని, చక్కెర ద్రావణమును చక్కెర ద్రావణంలో బంగాళాదుంప గిన్నె బీకరులో ఉంచి అరగంట తరువాత పరిశీలించాలి. పరిశీలన : బంగాళాదుంప కప్పులోని నీరు బీకరులోనికి ప్రవేశించడం వల్ల క్రమేపి నీటిమట్టము తగ్గుతుంది.

నిర్ధారణ:

  1. పై రెండు సందర్భాలలోను నీరు చక్కెర ద్రావణం వైపు ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియను ద్రవాభిసరణం అంటారు.
  2. ఈ ప్రక్రియలో నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ చక్కెర గాఢతవైపు బంగాళాదుంప పొర ద్వారా ప్రయాణిస్తుంది.

కృత్యం – 2

4. వడపోత:
వడపోత ప్రక్రియను ప్రయోగం ద్వారా వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : వడపోత జరిగే విధానమును నిరూపించుట.

కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు బీకర్లు, ఒక గరాటు, వడపోత కాగితం, రిటార్ట్ స్టాండు, చక్కెర, అయోడిన్, గోధుమపిండి లేదా వరిపిండి.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 6

ప్రయోగ విధానం:

  1. ఒక రిటార్టు స్టాండునకు వడపోత కాగితమును అమర్చిన గరాటును బిగించాలి.
  2. గరాటు కింద బీకరును ఉంచాలి.
  3. 100 మి.లీ. నీటికి ఒక చెంచాడు గోధుమపిండి లేదా వరిపిండి కలిపి ద్రావణం తయారుచేయాలి.
  4. ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయోడినను కలిపి వడపోయాలి.

పరిశీలన :

  1. వడపోత ద్వారా నీరు మరియు నీటిలో కరిగిన పిండి గరాటు కింద గల బీకరులోనికి చేరుతుంది.
  2. వడపోత కాగితం నీటిలో కరగని పిండిని తనగుండా ప్రయాణించడానికి అనుమతి ఇవ్వలేదు. పిండి అవక్షేపము వడపోత కాగితము మీద ఏర్పడినది.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 3

5. బాహ్య ద్రవాభిసరణం మరియు అంతర ద్రవాభిసరణ ప్రక్రియలను ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
జవాబు:
ఉద్దేశం : బాహ్య మరియు అంతర ద్రవాభిసరణలను నిరూపించుట.

కావలసిన పదార్థాలు : మూడు బీకర్లు, పెట్రెడిష్, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, రెండు సమాన పరిమాణంలో ఉన్న పచ్చి గుడ్లు, తుడవడానికి గుడ్డ, గుడ్డు చుట్టుకొలత కొలవడానికి సన్నని పొడవైన కాగితం, ఒక చెమ్చా.

పద్ధతి / ప్రయోగ విధానం :

  1. గుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల పాటు ఉంచాలి.
  2. గుడ్లను చెమ్చాతో బయటకు తీయాలి. గుడ్డుపైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారైన పెంకు కరిగిపోతుంది.
  3. గుడ్లను కుళాయి కింద నీటిలో కడగాలి.
  4. గుడు చుట్టు సన్నని కాగితం చీలికను చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో గుర్తించి గుడ్ల చుట్టుకొలతను కొలవాలి.
  5. ఒక బీకరులో గాఢమైన ఉప్పునీటి ద్రావణాన్ని తయారు నీటితో కడగడం చేయాలి.
  6. రెండు గుడ్లలో ఒకదాన్ని మంచినీరు ఉన్న బీకరులోను, HCl లో ఉంచిన గుడ్డు రెండవ దాన్ని ఉప్పునీటి ద్రావణంలోను ఉంచాలి.
  7. బీకర్లను రెండు నుండి నాలుగు గంటల పాటు కదపకుండా అలాగే ఉంచాలి.
  8. గుడ్లను బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలతను కాగితంతో కొలవాలి. దానిని నమోదుచేయాలి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 7 AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 8
పరిశీలన :
ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గుడ్డు కృశించుకుపోయినది. మంచినీటిలో ఉంచిన గుడు ఉబ్బియున్నది.

నిర్ధారణ :

  1. ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గ్రుడు నుండి నీరు బాహ్యద్రవాభిసరణం వలన బయటకు పోతుంది.
  2. మంచి నీటిలో ఉంచిన గుడ్డు లోపలికి నీరు అంతర ద్రవాభిసరణ వలన వస్తుంది.

ప్రయోగశాల కృత్యము

6. పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేద్దాం :

పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేసి దాని సహాయముతో ద్రవాభిసరణమును నిరూపించండి.
(లేదా)
ఉడకబెట్టని కోడిగుడ్డు నుండి పాక్షిక పారగమ్య త్వచాన్ని ఎలా తయారుచేస్తావు?
జవాబు:
పాక్షిక పారగమ్య త్వచమును తయారుచేయుట :

  1. రెండు గుడ్లను తీసికొని వాటిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల సేపు ఉంచాలి.
  2. గుడ్ల పైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారయిన ‘పెంకు కరిగిపోతుంది.
  3. గుడ్లను బయటకు తీసి కుళాయి నీటితో కడగాలి.
  4. పెంకు కరిగిన గుడ్లకు జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థం అంతటినీ రంధ్రం ద్వారా నెమ్మదిగా బయటకు తీసివేయాలి.
  5. సంచిలాగా కనిపించే గుడ్ల పొర లోపలి భాగాన్ని నీటితో శుభ్రంగా కడగాలి.
  6. పారగమ్య త్వచాలు వాడటానికి సిద్ధంగా ఉన్నవి. ఇవి పాక్షిక పారగమ్యత్వచాలు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 9
కోడిగుడ్డు పారగమ్య త్వచంతో ద్రవాభిసరణ ప్రయోగము :

ఉద్దేశం : పారగమ్య త్వచం ఉపయోగించి ద్రవాభిసరణమును నిరూపించుట.

కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు గుడ్లు పొరలు, మూడు బీకర్లు, చక్కెర, నీరు, దారం, కొలజాడి, సిరంజి.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 10AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 11

ప్రయోగ విధానం :

  1. గుడ్డు పొర సంచిని తీసుకొని సిరంజి సహాయంతో 10 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణంతో నింపాలి.
  2. పొరకు ఉన్న రంధ్రాన్ని దారంతో కట్టాలి. 100 మి.లీ. నీటిని ఒక బీకరులో పోయాలి.
  3. చక్కెర ద్రావణం ఉన్న గుడ్డు పొర సంచిని బేకరులో ఉంచాలి.
  4. ఒక రాత్రి పూర్తిగా దానిని అలాగే వదలివేయాలి.
  5. సిరంజి సహాయంతో 10 మి.లీ. మంచినీటిని రెండవ గుడ్లు పొర సంచిలో నింపాలి.
  6. 100 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణాన్ని కొలజాడీతో కొలిచి బీకర్లో పోయాలి.
  7. ఈ అమరికను ఒక రాత్రి పూర్తిగా కదలించకుండా వదలివేయాలి.
  8. రెండవ రోజు గుడ్ల పొర సంచులను బయటకు తీసి వాటిలోపలి ద్రవాలను కొలిచి పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. మొదటి కృత్యములో చక్కెర ద్రావణం నింపిన కోడిగుడ్డు త్వచములోనికి నీరు ప్రవేశించుట వలన నీటి పరిమాణము పెరిగినది.
  2. రెండవ కృత్యములో గుడ్డు పొర సంచి నుండి నీరు బీకరులోనికి ప్రవేశించుట వలన సంచి నందు నీటి పరిమాణం తగ్గినది.

నిర్ధారణ :
కోడిగుడ్డు త్వచం ద్వారా నీరు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ద్రవంలోనికి ప్రయాణించినది. ఈ పద్ధతిని ద్రవాభిసరణం అంటారు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 4

7. కాఫీ పొడితో వ్యాపనం

కాఫీ పొడిని ఉపయోగించి వ్యాపనమును పరిశీలించుము. పరిశీలనలను రాయుము.
జవాబు:

  1. చిన్న గిన్నెలో నీరు తీసుకోవాలి.
  2. కాఫీ పొడిని చిన్న ఉండగా తయారుచేయాలి.
  3. కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారవేయాలి.
  4. కాఫీ పొడి ఉండ బీకరు అడుగుకు చేరిన తర్వాత బీకరును కదపకుండా ఉంచి పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. కాఫీ పొడి అణువులు నీటిలో కరగడం మొదలవుతాయి.
  2. స్ఫటికాల చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది. వ్యాపనము ద్వారా కాఫీ పొడి అణువులు నీరు అంతా ప్రసరించి చివరికి ఒకే రంగులోకి మారుతుంది.

కృత్యం – 5

8. నీటిలో పొటాషియం పర్మాంగనేటు స్పటికం వ్యాపనం చెందు విధమును రాయండి.
జవాబు:

  1. పొటాషియం పర్మాంగనేటు స్ఫటికం ఒకదాన్ని శ్రావణం సహాయంతో పెట్రెడిష్ మధ్యలో ఉంచాలి.
  2. జాగ్రత్తగా పెట్రిడిలో నీళ్ళు పోయాలి.
  3. నీటిలో పర్మాంగనేటు పింక్ రంగు విస్తరించడం ప్రతి నిమిషానికీ గమనించాలి.
  4. పెట్రెడిష్ మధ్య నుండి అంచుల వరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. పొటాషియం పర్మాంగనేటు స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
  2. స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.

విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి పొటాషియం పర్మాంగనేటు అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా వ్యాపించే ప్రక్రియ విసరణము.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 6

9. కాపర్ సల్ఫేటు స్ఫటికంను నీటిలో ఉంచినపుడు విసరణ జరుగు ప్రక్రియను వివరించుము.
జవాబు:

  1. కాపర్ సల్ఫేట్ స్పటికం ఒక దానిని శ్రావణం సహాయంతో పెట్రేడిష్ మధ్యలో ఉంచాలి.
  2. జాగ్రత్తగా పెట్టాడిలో నీరు పోయాలి.
  3. నీటిలో కాపర్ సల్ఫేట్ నీలం రంగు విస్తరించడం ప్రతి నిమిషానికి గమనించాలి.
  4. పెట్రెడిష్ మధ్య నుండి అంచులవరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. కాపర్ సల్ఫేట్ స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
  2. స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.

విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి కాపర్ సల్ఫేట్ అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా విస్తరించే ప్రక్రియ.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 3rd Lesson Questions and Answers జంతు కణజాలం

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కణజాలం అనగానేమి? (AS 1)
జవాబు:
కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.

ప్రశ్న 2.
హృదయ కండరం చేసే ప్రత్యేకమైన విధి ఏమిటి? (AS 1)
జవాబు:
హృదయకండరం చేసే ప్రత్యేకమైన విధి : హృదయ కండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయంలో సంకోచ వ్యాకోచాలను కలిగిస్తూ రక్త ప్రసరణలో పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 3.
ఉండే స్థానం, ఆకారాన్ని అనుసరించి రేఖిత, అరేఖిత కండరాల మధ్య భేదాన్ని రాయండి. (AS 1)
జవాబు:

రేఖిత కందరంఅరేఖిత కండరం
నిర్మాణం:
1) ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖా రహితమైన తంతువులను పోలిన కణములను కలిగి ఉంటుంది. కణం స్థూపాకారంలో అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది.
1) కండర కణాలు పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి. కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది.
2) కండరము పొడవుగా అనేక అడ్డుచారలు కలిగి ఉంటుంది.2) అడ్డుచారలు ఉండవు.
స్థానం :
3) కాళ్ళు, చేతులందు మరియు అస్థిపంజరములోని ఎముకలకు అతికి ఉంటాయి.
3) ఆహారనాళం, రక్తనాళాలు, ఐరిస్, గర్భాశయం మరియు వాయునాళాల్లో ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 4.
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి. (AS 1)
ఎ) మన నోటి లోపలి పొరలలో ఉండే కణజాలం
బి) మానవుల శరీరపు ఎముకలతో కలిసి ఉండే కండరం
సి) జంతువులలో ఆహారపదార్థం రవాణా చేసే కణజాలం
డి) మన శరీరంలో కొవ్వు నిల్వచేసే కణజాలం
ఇ) మెదడులో ఉండే సంయోజక కణజాలం
జవాబు:
ఎ) స్తంభాకార ఉపకళా కణజాలము
బి) స్నాయుబంధనం
సి) రక్తకణజాలం
డి) ఎడిపోజ్ కణజాలం
ఇ) నాడీ కణజాలం

ప్రశ్న 5.
ఈ క్రింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? (AS 1)
చర్మం, ఎముక, మూత్రపిండ నాళాల అంతర భాగం.
జవాబు:
చర్మం : సరిత ఉపకళా కణజాలము.
ఎముక : సంయోజక కణజాలము.
మూత్రపిండనాళాల అంతర్భాగం : ఘనాకార ఉపకళా కణజాలము.

ప్రశ్న 6.
ఒక్కొక్కసారి మోచేతిని గట్టిగా కొట్టినప్పుడు విద్యుత్ ఘాతం తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకు? (AS 1)
జవాబు:

  1. మానవులలో ముంజేటి లోపల ఎముక అయిన మూర ఎముకతో ఉన్న: నరము లేదా నాడి భుజము నుండి చేయి వరకు వ్యాపిస్తుంది.
  2. ఈ నరము మోచేయి దగ్గర ఉపరితలమునకు వస్తుంది.
  3. ఉపరితలమునకు వచ్చిన నరమునకు కండరముగాని, క్రొవ్వుగాని, ఏ ఇతర మెత్తటి కణజాలము గాని రక్షణ ఇవ్వదు.
  4. చిన్న ప్రేరణలకు కూడా ఈ నరము చాలా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది.
  5. అందువలన మనకు మోచేతి పై దెబ్బ తగిలినపుడు విద్యుత్ తం తగిలినట్టు అనిపిస్తుంది.

ప్రశ్న 7.
రక్తాన్ని ద్రవరూప కణజాలమని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. రక్తం అన్ని అవయవాల గుండా ప్రవహించుట ద్వారా శరీరములోని రకరకాల కణజాలములను, అవయవములను కలుపుతుంది. అందువలన రక్తమును కదలాడే ద్రవరూప సంయోజక కణజాలం అంటారు.
  2. ఇది మిగతా సంయోజక కణజాలముల కంటే భిన్నమైనది.
  3. రక్తములో రకరకాల కణములు ఉన్నాయి. ప్రతి కణమునకు నిర్దిష్టమైన పని ఉన్నది.
  4. కణేతర మాత్రిక ద్రవరూప ప్లాస్మాతో నిండియుంది. దీనిలో రక్తకణములు స్వేచ్చగా తేలియాడతాయి.
  5. అందువలన రక్తమును ద్రవరూప కణజాలం అంటారు.

ప్రశ్న 8.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:

  1. రక్తఫలకికలు రక్తాన్ని గడ్డకట్టించడంలో సహాయపడతాయి.
  2. రక్తఫలకికలు లేకపోతే రక్తము గడ్డ కట్టదు. తద్వారా గాయము నుండి రక్తము కారిపోతూనే ఉంటుంది.
  3. ఎక్కువ మొత్తంలో రక్త నష్టం జరిగితే గాయపడిన వ్యక్తి చివరకు చనిపోతాడు.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 9.
మూడు రకాల కండర కణజాలాలలో గల భేదాలను పటం సహాయంతో వివరించండి. (AS 3)
జవాబు:
కండరాలు మూడు రకాలు. అవి : రేఖిత, అరేఖిత మరియు హృదయ కండరాలు.
1) రేఖిత కండరాలు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 4

  • ఇవి అస్థిపంజరంలో ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమవుతాయి.
  • ఇవి మన అధీనంలో ఉంటాయి. కాబట్టి వీటిని నియంత్రిత కండరములు అంటారు.
  • ప్రతి కండరం అనేక పొడవాటి శాఖారహితమైన కణాలను కలిగి ఉండును.
  • ప్రతి కణం కండరం పొడవునా ఉండును.
  • కండరం పొడవునా అనేక అడ్డుచారలు కలిగి ఉంటాయి. కావున వీటిని రేఖిత కండరాలంటారు. వీటిలో అనేక కేంద్రకాలుంటాయి.

2) అరేఖిత కండరాలు :
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 5

  • ఇవి అన్నవాహిక, రక్తనాళాలలో ఉండి సంకోచ వ్యాకోచాలను కలిగిస్తాయి.
  • ఈ కండరాల కదలికలు మన అధీనంలో ఉండవు. కాబట్టి వాటిని అనియంత్రిత కండరాలు అంటారు.
  • ఇవి పొడవుగా సాగదీయబడి, కుదురు ఆకారంలో ఉంటాయి.
  • వీటిలో అడ్డుచారలుండవు. కాబట్టి వీటిని అరేఖిత కండరాలంటారు.
  • ఈ కణాలలో ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. (ఏక కేంద్రకం).

3) హృదయ కండరాలు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 6

  • ఈ కండరాలు గుండెలో ఉంటాయి. ఇవి రక్తప్రసరణలో సహాయపడతాయి.
  • ఈ కణాలు శాఖలు కలిగి, పొడవుగా ఉంటాయి.
  • హృదయ కండరంలోని కణాలన్నీ చారలు కలిగి, ఉంటాయి.
  • దీనిలో కదలికలు మన అధీనంలో ఉండవు.
  • నిర్మాణంలో ఇది రేఖిత కండరాన్ని పోలి ఉన్న అనియంత్రిత చర్యలు చూపిస్తుంది.

ప్రశ్న 10.
కిట్ ను ఉపయోగించి మీ రక్తవర్గాన్ని కనుగొనడంలో మీరు అనుసరించిన విధానాన్ని రాయంది. (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.

కావలసిన పరికరాలు : రక్త పరీక్ష కిట్, స్లెడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.

కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటిపుల్లలు.

ప్రయోగ విధానం:
1) ఒక తెల్ల పింగాణి పలక. తీసుకొని తుడిచి ఆరబెట్టాలి.
2) తెల్ల పింగాణి పలక మీద సమానదూరంలో మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలను గీయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 1
3) ప్రతి వృత్తంలో ఒక్కొక్క సీరంను అంచులు తాకకుండా ఒక చుక్క వేయాలి. (ఉదా : మొదటి వృత్తంలో యాంటీ సీరం ‘A’ను, రెండవదానిలో యాంటీ సీరం ‘B’ ను, మూడవ వృత్తంలో ‘RhD’ సీరంను వేయాలి).
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 2
4) ఎడమచేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్లో ముంచిన దూదితో తుడిచి, వేలు మీద సూదిని మెల్లగా గుచ్చి రక్తాన్ని బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తుట వలన రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటనవేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తపు చుక్కలను సీరం ఎ, బి, RhD లకు కలపాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తర్వాత వేలి మీద సూదితో గుచ్చినచోట ఇంతకుముందు ఉంచిన దూదితో అణచి పెట్టాలి.
8) మూడు వేరు వేరు పంటి పుల్లలను తీసుకొని రక్తం, సీరంలను బాగా కలపాలి.
9) ఏ వృత్తములోనైనా రక్తం గడ్డ కట్టిందేమో పరిశీలించాలి. పారదర్శక ద్రవంలో చిన్న చిన్న తునకలుగా రక్తం గడ్డకట్టి తేలి ఉండేటట్లు ఉందేమో గమనించాలి.
10) ‘Rh’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

ఫలిత నిర్ధారణ :
ఫలితాల అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. ఇందుకోసం కింది పట్టిక సహాయం తీసుకోవాలి.

యాంటి – ఎయాంటి – బిరకం
రక్తం గడ్డకట్టిందిరక్తం గడ్డకట్టలేదు
రక్తం గడ్డకట్టలేదురక్తం గడ్డకట్టిందిబి
రక్తం గడ్డకట్టిందిరక్తం గడ్డకట్టిందిఎబి
రక్తం గడ్డకట్టలేదురక్తం గడ్డకట్టలేదు

అలాగే RhD కారకంలో రక్తం గడ్డకట్టితే Rh* రక్తం, రక్తం గడ్డకట్టకపోతే Rh” అవుతుందని గమనించాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 11.
మీ దగ్గర బంధువు/స్నేహితుల పాత రక్తనమూనాలను సేకరించి అందులోని అంశాల ఆధారంగా ఒక ప్రాజెక్టు నివేదికను తయారుచేయండి. (AS 4)
జవాబు:
నేను నా స్నేహితుని పాత రక్త నమూనాను పరిశీలించాను. అది క్రింది విధంగా ఉంది.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 7

Random blood sugar 115 mg/dl (80 – 140 mg/dl)
Microscopic -2 – 4 puscells / Hp of seen Malaria – Negative (-ve)
దీని ఆధారంగా తెల్లరక్త కణాల సంఖ్య సరైన మోతాదులో ఉందని గుర్తించాను. చీము కణాలు కణించటం వలన స్వల్పంగా ఇన్ ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవచ్చు మలేరియా పరీక్ష ఋణాత్మకం కావున, రక్తంలో మలేరియా పరాన్నజీవి లేదని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 12.
నాడీకణం పటం గీచి, భాగాలు రాయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8

ప్రశ్న 13.
రాము బలహీనంగా కనిపించడం చేత, వాళ్ళ నాన్న అతడిని ఆసుపత్రికి తీసుకుపోయాడు. డాక్టర్ రక్తపరీక్ష చేయించి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే పరిణామాలను చర్చించి వ్రాయండి. (AS 6)
జవాబు:
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండుట వలన కలిగే దుష్ఫలితాలు :

  1. రక్తము ఎర్రగా ఉండటానికి కారణం ఎరుపు వర్ణపు ప్రోటీను హిమోగ్లోబిన్.
  2. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సెడులను రవాణా చేయటంలో సహాయపడుతుంది.
  3. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది రక్తహీనతకు దారితీస్తుంది.
  4. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వలన తక్కువగా ఊపిరి ఆడటం జరుగుతుంది.
  5. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి గుండెకు సంబంధించిన సమస్యలను ఎక్కువ చేస్తుంది.
  6. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి వలన మనుష్యులు ఎక్కువగా నీరసించిపోతారు. కణములు క్రియలను నిర్వహించడానికి కావలసిన ఆమ్లజని సరఫరా లేకపోవడం ప్రధాన కారణం.

ప్రశ్న 14.
రోగనిర్ధారణలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకతను నిజజీవిత సన్నివేశంలో వివరించండి. (AS 7)
జవాబు:
నా పేరు వివేక్. రెండు నెలల క్రితం నాకు జ్వరం వచ్చింది. మా నాన్న దగ్గరలో ఉన్న ఆర్.ఎం.పి వైద్యుని వద్దకు తీసుకెళ్ళాడు. అతను పరీక్షించి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చాడు. అవి వాడినప్పటికి జ్వరం తగ్గలేదు. ఐదు రోజుల గడచిపోయాయి. నేను బాగా నీరసించిపోయాను. అప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి రక్తపరీక్ష చేయించమన్నాడు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల కొరకు రక్తపరీక్ష నిర్వహించారు.

రక్తపరీక్షలో టైఫాయిడ్ అని తేలింది. డాక్టర్ ధైర్యం చెప్పి మందులను కోర్స్ గా పదిహేను రోజుల పాటు వాడారు. నేను వ్యాధి నుండి , కోలుకున్నాను. వ్యాధిని నిర్ధారించటంలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకత నాకు అర్థమైంది. రక్తపరీక్ష ద్వారా అనేక వ్యాధులను నిర్ధారిస్తారని తెలుసుకొన్నాను. వ్యాధిని సరిగా నిర్ధారించకుండా చికిత్స చేయటం కూడా ప్రమాదకరమని తెలుసుకొన్నాను.

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము – 1

ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్,

ప్రయోగ విధానం :

  1. మీ దగ్గరలో ఉండే మాంసం అమ్మే చోటికి వెళ్ళి చిన్న కోడి మాంసం ముక్కని ఎముకతో సహా సేకరించాలి.
  2. మాంసం ముక్కను రెండు గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచాలి. దాని నుండి పలుచని చర్మ భాగాన్ని తీసుకోవాలి.
  3. దాంట్లోని చిన్న భాగాన్ని శ్రావణం సహాయంతో ఒక స్లెడ్ పైన ఉంచాలి.
  4. మరొక సైడ్ ను దానిమీద ఉంచి రెండు స్లెట్లను గట్టిగా అణచి నొక్కాలి. చర్మపు పొర మరింత పలుచగా స్లెడ్ మీద పరుచుకుంటుంది.
  5. ఈ సైడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి. మీ ల్యాబ్ రికార్డులో దాని పటాన్ని గీయాలి.
  6. ఇచ్చిన పటంతో మీరు గీసిన పటాన్ని పోల్చండి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 9

ప్రశ్నలు:
1. రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయా?
జవాబు:
ఒకే మాదిరిగా ఉన్నాయి.

2. అన్ని కణాలు ఒకేలా ఉన్నాయా?
జవాబు:
అన్ని కణాలు ఒకేలా ఉన్నాయి.

3. వాటి అమరిక ఏ విధంగా ఉంది?
జవాబు:
కణాలు వరుసలలో పొరలాగా అమరి ఉన్నాయి.

4. ఈ కణాలన్నీ దగ్గర దగ్గరగా అమరి ఉన్నాయా? ఒక త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయా?
జవాబు:
కణాలు దగ్గర దగ్గరగా అమరి త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయి.

5. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేదా కణాంతర అవకాశం ఉన్నదా?
జవాబు:
ఖాళీ ప్రదేశాలు లేవు.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

కృత్యం – 1

1. ఒక శుభ్రమైన స్పూనిగాని, ఐస్క్రీం పుల్లగాని తీసుకొని మీ బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరని గీకాలి.
2. ఒక పలుచని పొరను స్పూన్ నుండి సేకరించి ఒక సైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
3. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 10

ప్రశ్నలు :
1. కణాలన్నీ ఏ విధంగా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలు అన్ని పలుచగా, బల్లపరుపుగా అమరి ఉన్నాయి.

2. కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
కణాల మధ్య కణాంతర అవకాశాలు లేవు.

3. చర్మంలో ఇవి ఎందుకు అనేక వరుసలలో అమరియుంటాయో ఒకసారి ఆలోచించండి?
జవాబు:
చర్మము మన శరీరానికి రక్షణ ఇస్తుంది. అందువలన ఇవి అనేక వరుసలలో అమరి ఉంటాయి.

4. మీరు వేడి టీ/ కాఫీగాని, చల్లని పానీయం గానీ తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
వేడి టీగాని, కాఫీగాని తాగినపుడు నోరు కాలుతుంది. బయటకు ఊస్తాము. చల్లని పానీయం తాగినపుడు నోటిలోపలి పొరలు చల్లదనాన్ని భరించలేవు.

5. ఒకవేళ చర్మం కాలిపోయినట్లయితే ఏ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది?
జవాబు:
ఉపకళా కణజాలం.

కృత్యం – 2

ఘనాకార ఉపకళ కణజాలాన్ని పరిశీలిద్దాం.

1. మీ పాఠశాలలో ఉన్న సైడ్ పెట్టి నుండి ఘనాకార ఉపకళా శాశ్వత సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో జాగ్రత్తగా పరిశీలించాలి.
2. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 11

1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
ఘనాకారపు కణాలు దగ్గర దగ్గరగా, కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము -2

ఉద్దేశ్యం :
సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, రక్త నమూనా, సిరంజి, దూది.

ప్రయోగ విధానం :

  1. ఒక క్రిమిరహితం చేసిన సిరంజి మరియు సూదిని తీసుకోవాలి.
  2. ఉపాధ్యాయుని సహాయంతో మీ వేలినుండి ఒక చుక్క రక్తం తీసుకోవాలి.
  3. జాగ్రత్తగా రక్తపు బొట్టును ఒక సైడ్ పైన రుద్దాలి.
  4. వేరొక సైడ్ సహాయంతో ఒక పలుచని పొర ఏర్పడేటట్లు అడ్డంగా రుద్దాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో సైడ్ ను పరిశీలించాలి.
  6. మీరు పరిశీలించిన అంశాల పటం గీచి, దానిని ఇవ్వబడిన పటంతో పోల్చాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 12

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. సైట్లో ఏమి పరిశీలించావు?
జవాబు:
రక్తములో ప్లాస్మాను, రక్తకణములను పరిశీలించాను.

2. ఏమైనా కణాలు కనబడుతున్నాయా?
జవాబు:
కనబడుతున్నాయి.

3. దానిలోని అన్ని కణాలు ఒకే రకంగా ఉన్నాయా?
జవాబు:
లేవు.

4. ద్రవరూపంలో ఉన్న పదార్థం ఏమైనా ఉన్నదా?
జవాబు:
ద్రవరూప ప్లాస్మా ఉన్నది.

15. రక్తం కూడా ఒక కణజాలమే అని ఒప్పుకుంటావా?
జవాబు:
అవును. రక్తం కూడా ఒక ద్రవరూప కణజాలమే.

కృత్యం – 3

1. పాఠశాల ప్రయోగశాల నుండి స్తంభాకార ఉపకళా కణజాలం యొక్క సైడ్ ను తీసుకుని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయాలి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 13

ప్రశ్నలు :
1. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

2. మీరు పరిశీలించిన కణాల్లో చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయా?
జవాబు:
అవును కనిపిస్తున్నాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము – 3

ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, సైడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్

ప్రయోగ విధానం :

  1. సేకరించిన మాంసం ముక్క నుండి కొంచెం కండరం తీసుకోవాలి.
  2. దీనిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లో గాని రెండు గంటల పాటు నానబెట్టాలి.
  3. దానిలో నుండి ఒక పలుచని ముక్కని శ్రావణం ద్వారా తీసుకొని ఒక స్లెడ్ పైన ఉంచాలి.
  4. దానిపైన ఇంకో సైడ్ పెట్టి నెమ్మదిగా నొక్కాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించిన దాని పటం గీయాలి.
  6. రెండు పటాలను పోల్చాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 14

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలన్నీ వరుసలలో ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి.

2. త్వచకణజాలానికి, కండరకణజాలానికి మధ్య ఏమైనా తేడాలున్నాయా?
జవాబు:
కండర కణాలు పొడవుగా, సాగదీయబడి కేంద్రకమును కలిగి ఉన్నాయి.

ఎముకను పరిశీలించుట :
మాంసం ముక్క నుండి ఎముకను వేరుచేసి దాదాపు ఒక రోజంతా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లోగాని ఉంచి నానబెట్టాలి. ఒక కత్తి సహాయంతో ఎముక నుంచి పలుచని ముక్కను కోయాలి. రెండు స్లె మధ్య అణచి పెట్టాలి. ఎముక ఉన్న సైడ్ ని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.

3. ఇంతకు ముందు చూసిన కణజాలానికి, ఇప్పుడు చూసిన దానికి ఏమైనా సంబంధాలున్నాయా?
జవాబు:
సాధారణంగా ఎముక కండరముతో కలుపబడి ఉంటుంది.

4. ఈ కణజాలాలు చలనానికి సహాయపడతాయా?
జవాబు:
సహాయపడతాయి.

5. అన్ని రకాల కణజాలాలు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తాయా?
జవాబు:
లేదు. వేరు వేరు కణజాలాలు రకరకాల విధులు నిర్వహిస్తాయి.

కృత్యం – 4

రక్తకణజాలం

1. మీ గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలను లేదా రోగ నిర్ధారణ చేసే నిపుణుడిని మీ తరగతికి ఆహ్వానించాలి.
2. అతనితో రక్తం యొక్క నిర్మాణం, విధులపై ఒక ముఖాముఖి ఏర్పాటు చేయాలి.
3. ముఖాముఖి ఏర్పాటు చేసే ముందు ఒక ప్రశ్నావళి తయారుచేయాలి.
4. ముఖాముఖి పూర్తి అయిన తరువాత రక్తంపై ఒక చిన్న పుస్తకం తయారు చేయాలి.
5. ఆ చిన్న పుస్తకాన్ని గ్రంథాలయంలో ఉంచాలి. బులెటిన్ బోర్డుపై ప్రదర్శించాలి.
జవాబు:
రక్తం గురించిన చిన్న పుస్తకం :

  1. రక్తం ద్రవరూప కణజాలం.
  2. రక్తంలో వివిధ రకాలయిన కణజాలాలున్నాయి. ప్రతీది భిన్నమైన నిర్దిష్టమైన పనిని నిర్వహిస్తుంది.
  3. ఈ కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి.
  4. కణబాహ్య ప్రదేశం ద్రవపదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. రక్తం సంధాయక కణజాలమైనప్పటికీ రక్తంలో తంతువులు ఉండవు.
  5. ఒక ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఒక అంశం అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది.
  6. నీటితో పాటు ఇందులో గ్లూకోజు, ఎమినో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి.
  7. రక్తం గడ్డకట్టడానికి కావలసిన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా హిపారిన్ అనే పదార్థం ఉపయోగపడుతుంది.
  8. రక్త కణాలు మూడు రకాలు 1. ఎర్ర రక్తకణాలు 2. తెల్ల రక్తకణాలు. 3. రక్తఫలకికలు.
    AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 12
  9. ఎర్ర రక్తకణాలను ఎరిత్రోసైటులు అంటారు. హిమోగ్లోబిన్ ఉండుట వలన ఇవి ఎర్రగా ఉంటాయి.
  10. హిమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సెల రవాణాలో ,సహాయపడుతుంది.
  11. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు కాలేయం మరియు పిత్తాశయంలో తయారవుతాయి. ప్రౌఢ మానవులలో ఎముకలలో ఉండే మజ్జలో తయారవుతాయి.
  12. ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తాయి.
  13. రక్తంలో గల రెండవ రకపు కణాలు తెల్ల రక్తకణాలు. వీటిల్లో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి. వీటిని ల్యూకోసైటులు అంటారు.
  14. తెల్లరక్తకణాలు రెండు రకాలు – కణికాభకణాలు, కణికరహిత కణాలు.
  15. కణికాభ కణాలలో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్ అని మూడు రకాలు ఉన్నాయి.
  16. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి.
  17. కణిక రహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు.
  18. లింఫోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొని ప్రతిదేహాలను తయారు చేస్తాయి. లింఫోసైటులను సూక్ష్మరక్షక భటులంటారు.
  19. మోనోసైటులు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
  20. రక్తఫలకికలకు కేంద్రకం ఉండదు. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము – 4

రక్త వర్గాన్ని కనుగొనటానికి నీవు చేసిన ప్రయోగాన్ని వివరింపుము.

ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.

కావలసిన పరికరాలు : రక్త పరీక్ష, కిట్, సైడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.

కిట్లో ఉండవలసిన పరికరాలు :
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 15

కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటి పుల్లలు.

ప్రయోగ విధానం :
1) ఒక తెల్ల పింగాణి పలక తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 1
2) పటంలో చూపినట్లు తెల్ల పింగాణి పలక మీద ఒక మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలు గీయాలి. వృత్తాలను వేరుచేస్తూ అడ్డగీతలు గీయాలి.
3) ప్రతి వృత్తంలో పైన పేర్కొనిన మూడు సీరమ్ లు తీసుకొని ఒక్కొక్క చుక్క పటంలో చూపిన విధంగా అంచులలో వేయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 2
4) ఎడమ చేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ ముంచిన దూదితో తుడిచి, సూదిని మెల్లగా గుచ్చి బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తాలి – రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటన వేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తం చుక్కలను సీరంలు ఎ, బి, RhDని ఒక చొప్పున కలపాలి.
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తరువాత వేలిమీద సూదితో గుచ్చిన చోట ఇంతకు ముందు ఉంచిన దూదితో అణచిపెట్టాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
8) ఒక పంటి పుల్లను తీసుకొని సీరమ్ ను, రక్తాన్ని జాగ్రత్తగా కలపండి. వేరు వేరు వృత్తాలకు వేరు వేరు పంటి పుల్లలను ఉపయోగించి కలపాలి.
9) ఏ వృత్తాలలోనైనా రక్తం గడ్డకట్టిందేమో పరిశీలించాలి. ‘ఆర్ హెచ్’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

ఫలిత నిర్ధారణ :
ఫలితాలకు అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. కింది పట్టిక సహాయం తీసుకోవాలి.

రక్తం వర్గం నిర్ధారించటం.

యాంటి – ఎయాంటి – బిరకం
రక్తం గడ్డకట్టిందిరక్తం గడ్డకట్టలేదు
రక్తం గడ్డకట్టలేదురక్తం గడ్డకట్టిందిబి
రక్తం గడ్డకట్టిందిరక్తం గడ్డకట్టిందిఎబి
రక్తం గడ్డకట్టలేదురక్తం గడ్డకట్టలేదు

అలాగే ఆర్ హెడ్ కారకంలో గాని రక్తం గడ్డకడితే Rh+ రక్తం గడ్డకట్టకపోతే Rh అవుతుంది.

గమనించిన ఫలితాలు పట్టికలో నమోదు

విద్యార్థి పేరురక్తవర్గం
1. పి. ప్రణయO
2. పి. ప్రబంధO
3. పి. ప్రమోదA
4. వి. ఉమాదేవిA
5. కె. అనసూయAB
6. యమ్. రాముB
7. ఎస్. రవి.A
8. ఎల్. లక్ష్మీకాంత్AB
9. కె. గోపాల్B
10. జి. ఉదయకిరణ్B

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

కృత్యం – 5

5. మీ పాఠశాల ప్రయోగశాల నుండి మూడు రకాల కండరాల సైడ్ తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. పరిశీలించిన అంశాలు క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

రేఖిత కండరాల లక్షణాలుఅరేఖిత కండరాల లక్షణాలుహృదయ కండర లక్షణాలు
1. నియంత్రిత కండరాలుఅనియంత్రిత కండరాలుఅనియంత్రిత కండరాలు
2. కండరాల పొడవుగా అనేక అడ్డు చారలు కలిగి ఉంటాయి.పొడవుగా ఉంటాయి. అడ్డు చారలు ఉండవు.కణాలు చారలతో ఉంటాయి.
3. ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులు పోలిన కణాలు ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి.కండరాలు పొడవుగా సాగదీయబడిన కుదురు ఆకారంలో ఉంటాయి. ఒకే కేంద్రకం ఉంటుంది.కణాలు పొడవుగా, శాఖలు కలిగి ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి.
4. ఈ కండరాలు కాళ్ళు, చేతులతో ఉంటాయి.ఆహార వాహిక, రక్తనాళాలు ఐరిస్, గర్భాశయంలో ఉంటాయి.హృదయంనందు ఉంటాయి.

కృత్యం – 6

1. పాఠశాల ప్రయోగశాల నుండి నాడీకణం సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. పరిశీలించిన అంశాలు నోటు పుస్తకంలో రాయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8
జవాబు:

  1. నాడీ కణాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. కణదేహం, 2. ఆక్టాన్, 3. డెండ్రైటులు.
  2. నాడీ కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథిరూప కణాలుంటాయి. వీటిని నిస్సల్ కణికలు అంటారు.
  3. కణదేహం నుండి బయటకు వచ్చిన నిర్మాణాలను డెండ్రైటులు అంటారు. ఇది శాఖలు కలిగి మొనదేలి ఉంటాయి.
  4. కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని తంత్రిరాక్షం లేదా ఆక్లాస్ అంటారు.
  5. ఆక్టాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్నే మెయిలిన్ త్వచం అంటారు.
  6. ఆక్టాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని రాన్ వియర్ సంధులు అంటారు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

SCERT AP 9th Class Biology Guide Pdf Download 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 2nd Lesson Questions and Answers వృక్ష కణజాలం

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఈ పదాలను నిర్వచించండి. (AS 1)
ఎ) కణజాలం
బి) విభాజ్య కణజాలం
సి) త్వచ కణజాలం
జవాబు:
ఎ) కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.

బి) విభాజ్య కణజాలం :
పెరుగుతున్న భాగాల్లో ఉండే, విభజన చెందగలిగే కణజాలంను విభాజ్య కణజాలం అంటారు.

సి) త్వచ కణజాలం :
మొక్క భాగాలను వెలుపల కప్పి ఉంచే కణజాలంను త్వచ కణజాలం అంటారు. మొక్కకు రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 2.
కింది వాటి మధ్య భేదములను తెల్పండి. (AS 1)
జవాబు:
ఎ) విభాజ్య కణజాలం, సంధాయక కణజాలం

విభాజ్య కణజాలంసంధాయక కణజాలం
1. ఎప్పుడూ విభజన చెందగలిగిన కణాలు ఉంటాయి.1. విభజన చెందలేని కణాలు ఉంటాయి.
2. ఇది సరళ కణజాలం.2. ఇది సరళ లేదా సంక్లిష్ట కణజాలం.
3. దీని యందు సజీవ కణాలు ఉంటాయి.3. దీని యందు సజీవ (లేదా) నిర్జీవ కణములు ఉండవచ్చు.
4. చిక్కని జీవపదార్థము కణమునందు ఉంటుంది.4. పలుచని జీవపదార్ధము కణము నందు ఉంటుంది.

బి) అగ్ర విజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం

అగ్ర విభాజ్య కణజాలంపార్శ్వ విభాజ్య కణజాలం
1. వేరు, కాండం శాఖల అగ్రభాగాలలో ఉంటుంది.1. మొక్క దేహం యొక్క పార్శ్వ అంచుల వద్ద ఉంటుంది.
2. వేరు, కాండములు పొడవుగా పెరగటానికి తోడ్పడతాయి.2. కాండాలు, వేర్లు మందంలో పెరుగుదల చెందడానికి తోడ్పడతాయి.

సి) మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం

మృదు కణజాలంస్థూలకోణ కణజాలం
1. మృదు కణజాల కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి, వదులుగా అమరి ఉంటాయి.1. స్థూలకోణ కణజాల కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలు కలిగి ఉంటాయి.
2. మృదు కణజాల కణాలు ఆహారనిల్వ చేస్తాయి. హరితరేణువులు మరియు పెద్దగాలి గదులను కలిగి ఉంటాయి.2. ఇది కాండపు లేత కణజాలమునకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
3. కణకవచాలు, అసమాన మందంలో ఉంటాయి.3. సెల్యులోజ్ తయారయిన కణకవచము ఉంటుంది.
4. కణాలు అండాకారంగా, గోళాకారంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి.4. కణములు సాగి గుండ్రంగా గాని, గోళాకారంలోగాని ఉంటాయి.

డి) దృఢ కణజాలం, మృదు కణజాలం

దృఢ కణజాలంమృదు కణజాలం
1. ఇది నిర్జీవ కణజాలం.1. ఇది సజీవ కణజాలం.
2. కణకవచాలు మందంగా ఉంటాయి.2. కణకవచాలు పలుచగా ఉంటాయి.
3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండవు.3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి.
4. ఇది మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.4. ఇది ఆహారనిల్వకు, కిరణజన్య సంయోగక్రియ జరుపుటకు మరియు మొక్కలు నీటిలో . తేలుటకు ఉపయోగపడుతుంది.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ఇ) దారువు, పోషక కణజాలం

దారువుపోషక కణజాలం
1. నీరు-పోషకాలను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.1. ఆకు నుండి ఆహారపదార్ధములను మొక్క పెరుగుదల భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారువు నందు దారు కణములు, దారునాళములు, దారునారలు మరియు దారుమృదు కణజాలం ఉంటాయి.2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారు మృదుకణజాలం సజీవ కణజాలం.3. పోషక కణజాల నారలు నిర్జీవ కణాలు.

ఎఫ్) బాహ్యచర్మం, బెరదు

బాహ్య చర్మంబెరడు
1. కాండము, వేరు, ఆకునందు వెలుపల ఉండు పొర.1. బాహ్య చర్మం మీద అనేక వరుసలలో ఏర్పడినది బెరడు.
2. బాహ్య చర్మం సజీవ కణజాలం.2. బెరడు నిర్జీవ కణజాలం.

ప్రశ్న 3.
నా పేరేంటో చెప్పండి. (AS 1)
ఎ) నేను మొక్క పొడవులో పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
బి) నేను మొక్కలలో వర్తులంగా పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
సి) నేను నీటి మొక్కల్లో పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
డి) నేను ఆహారపదార్థాన్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
ఇ) నేను వాయు మార్పిడికి, బాష్పోత్సేకానికి అత్యవసరమైన రంధ్రాన్ని
జవాబు:
ఎ) అగ్ర విభాజ్య కణజాలం
బి) పార్శ్వ విభాజ్య కణజాలం
సి) వాయుగత కణజాలం
డి) నిల్వచేసే కణజాలం
ఇ) పత్రరంధ్రం

ప్రశ్న 4.
కింది వాటి మధ్య పోలికలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు, పోషక కణజాలం

దారువుపోషక కణజాలము
1. దారువు నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.1. ఇది ఆకుల నుండి ఆహార పదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారుకణాలు, దారునాళాలు, దారునారలు మరియు దారు మృదుకణజాలంలు దీనియందు ఉంటాయి.2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారు మృదుకణజాలం మాత్రమే సజీవ కణజాలం.3. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక మృదుకణజాలంలు సజీవ కణజాలాలు.
4. దారుకణాలు, దారునాళాలు, దారునారలు నిర్జీవ కణజాలంలు.4. పోషక కణజాల నారలు మాత్రమే నిర్జీవ కణజాలం.
5. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.5. మొక్కకు యాంత్రిక బలమును ఇవ్వదు.
6. దారువు నీటి సరఫరాను ఏకమార్గములో నిర్వహిస్తుంది. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది.6. ఆహార పదార్థాల సరఫరా ద్విమార్గముల ద్వారా నిర్వహిస్తుంది. ఆకుల నుండి నిల్వ అంగాలు లేదా పెరుగుదల నిల్వ అంగాల నుండి పెరుగుదల ప్రదేశాలకు సరఫరా చేస్తుంది.

బి) విభాజ్య కణజాలం, త్వచ కణజాలం

విభాజ్య కణజాలంత్వచ కణజాలం
1. కణములు చిన్నవిగా పలుచని కణకవచములు కలిగి ఉంటాయి.1. దీనియందలి కణముల కణకవచములు దళసరిగా ఉంటాయి.
2. విభజన చెందగలిగే కణాలు ఉంటాయి.2. విభజన చెందలేని కణాలు ఉంటాయి.
3. ఇది వేరు, కాండము, కొనలు మరియు శాఖలు వచ్చే ప్రదేశములలో ఉంటుంది.3. త్వచకణజాలం బాహ్యస్వచం, మధ్యస్త్వచం మరియు. అంతస్త్వచములుగా ఉంటుంది.
4. మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది.4. మొక్క భాగాలకు రక్షణ ఇస్తుంది. బాష్పోత్సేకము ద్వారా కలిగే నీటి నష్టాన్ని నివారిస్తుంది.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 5.
కింది వాక్యాలు చదివి కారణాలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు ప్రసరణ కణజాలం :

  1. దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్థములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
  2. వేర్ల నుండి పదార్థములను దూరభాగములకు రవాణా చేస్తుంది.
  3. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.

బి) బాహ్య చర్మం రక్షణనిస్తుంది.

  1. బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
  2. బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
  3. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.

ప్రశ్న 6.
కింది వాటి విధులను వివరించండి. (AS 1)
1) విభాజ్య కణజాలం 2) దారువు 3) పోషక కణజాలం
జవాబు:
1) విభాజ్య కణజాలం విధులు :

  1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించేది విభాజ్య కణజాలం.
  2. దీని నుండి ఏర్పడిన కణములు మొక్క దేహంలో వివిధరకాల కణజాలాలుగా ఏర్పడతాయి.

2) దారువు విధులు :

  1. నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
  2. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
  3. పోషక కణజాలం విధులు : ఆకులలో తయారయిన ఆహారపదార్థములు మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.

ప్రశ్న 7.
మొక్కల్లోని కణజాలాల గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి, మీరు ఎటువంటి ప్రశ్నలను అడుగుతారు? జాబితా రాయండి. (AS 2)
జవాబు:

  1. మొక్కలకు యాంత్రిక బలాన్ని, వంగే గుణాన్ని కలిగించే కణజాలమేది? (స్థూలకోణ కణజాలం)
  2. మొక్క దేహంలోనికి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను రానీయకుండా అడ్డుకునే కణజాలం? (బాహ్య చర్మం)
  3. అగ్రవిభాజ్య కణజాలం పాడైనా లేదా తెగిన ఏమి జరుగుతుంది? (మొక్క పొడవు అవడం ఆగిపోతుంది)
  4. కొబ్బరికాయపై తొక్కునందు ఉండు కణజాలం పేరేమిటి? (దృఢ కణజాలం)
  5. మొక్కలకు రకరకాల కణజాలాలు ఎందుకు కావాలి? (వివిధ రకముల పనుల నిర్వహణకు)

ప్రశ్న 8.
“బెరడు కణాలు వాయువులను, నీటిని లోనికి పోనీయవు” ఈ వాక్యాన్ని వివరించడానికి నీవు ఏ ప్రయోగం చేస్తావు? (AS 3)
జవాబు:

  1. వేప చెట్టు నుండి బెరడు వలచి పడవ (దోనె) ఆకారంలో తయారు చేసుకొన్నాను.
  2. ఒక పలుచటి వేప చెక్కను బెరడు లేకుండా తీసుకొన్నాను.
  3. వేపచెక్కను, బెరడును, నీటిలో పడవేశాను. రెండూ నీటి మీద తేలాయి.
  4. బెరడు వెలుపలి భాగం నీటిని తాకుతూ, లోపలిభాగం నీటిని తాకకుండా జాగ్రత్త పడ్డాను.
  5. ఒక రోజు ఆగిన తరువాత రెండింటినీ పరిశీలించాను.
  6. వేపచెక్క పైభాగం తడిగా కనిపించింది. వేపచెక్క నీటిని పీల్చటం వలన పైభాగం తడిగా మారిందని గ్రహించాను.
  7. బెరడు లోపలి భాగంలో ఎటువంటి మార్పు గాని, తేమ గాని కనిపించలేదు.
  8. అంటే బెరడు ద్వారా నీరు లోపలికి ప్రసరించలేదు.
  9. దీనిని బట్టి బెరడు నీటిని లోపలికి పోనివ్వదని నిరూపించాను.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 9.
మొక్కల్లోని త్వచకణజాలం, వాటికి ఎలా సహాయపడుతుందో తెలిపే సమాచారాన్ని సేకరించండి. గోడపత్రికలో ప్రదర్శించండి. (AS 4)
జవాబు:

  1. త్వచ కణజాలంనందు సాధారణముగా ఒక పొర ఉంటుంది. దీనిలోని కణములు వేరువేరు విధముగా ఉంటాయి.
  2. వాటి విధులు, స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి బాహ్యచర్మం లేక బహిస్త్వచం (వెలుపలి పొర), మధ్యస్వచం (మధ్య పొర), అంతస్త్వచం (లోపలి పొర).
  3. ఆకు బాహ్య చర్మంలో చిన్నరంధ్రాలు కనిపిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు అంటారు.
  4. వేరులో అయితే కణాలు పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.
  5. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.
  6. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది త్వచ కణజాలం.

ప్రశ్న 10.
కాండం-అడ్డుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 1

ప్రశ్న 11.
హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం – ఈ మూడూ మృదుకణజాలాలే. అయినా వాటికి ప్రత్యేకమైన పేర్లు ఎందుకున్నాయి? (AS 6)
జవాబు:

  1. హరితకణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం ఇవి అన్నియు మృదు కణజాలంలే.
  2. ఈ మృదు కణజాలాలన్ని వివిధ రకాల పనుల నిర్వహణకై రూపాంతరం చెందాయి.
  3. హరిత రేణువులు కలిగి ఉండే మృదుకణజాలం హరిత కణజాలం. ఇది కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు ఉపయోగపడుతుంది.
  4. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. ఇది మొక్కలు నీటిలో తేలుటకు సహాయపడుతుంది.
  5. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడే కణజాలాన్ని నిల్వచేసే కణజాలం అంటారు.

ప్రశ్న 12.
మొక్కల అంతర్భాగములను పరిశీలించేటప్పుడు వాటి నిర్మాణం, విధులు గురించి మీరెలా అనుభూతిని పొందారు? (AS 6)
జవాబు:

  1. మొక్క భాగాల అంతర్నిర్మాణమును పరిశీలించినపుడు కణములు రకరకములని అందువలన వాటి యొక్క విధులు నిర్దిష్టంగా ఉన్నాయని భావించాను.
  2. ఉదాహరణకు కాండములో దారువు, పోషక కణజాలం మరియు ఆకునందు వెలుపలి పొరనందు ఉండే పత్రరంధ్రములు వివిధ పనుల నిర్వహణకు ఉన్నాయి.
  3. కణములు కణజాలములుగా ఏర్పడి వివిధరకాల క్రియల నిర్వహణ ద్వారా మొక్క జీవించి ఉండడానికి కారణమవుతున్నాయని భావించాను.

ప్రశ్న 13.
మొక్క పెరుగుదలలో వివిధ రకాల కణజాలాలు ఎలా దోహదం చేస్తాయో మీ పరిసరాలలోని ఒక చెట్టును పరిశీలించి అన్వయించండి. (AS 7)
జవాబు:

  1. చెట్టు యొక్క గ్రీవ భాగాలలోనూ, అగ్రభాగంలోనూ మొగ్గలు ఉన్నాయి. ఇవి విభాజ్య కణజాలాన్ని కలిగి వేగంగా పెరుగుదల చూపుతున్నాయి.
  2. ఈ మొగ్గలు (కోరకాలు) కొత్త ఆకులను ఏర్పర్చి చెట్టు ఆకారాన్ని, పరిమాణాన్ని నియంత్రిస్తున్నాయి.
  3. ఆకులు, కాండము, కొమ్మలు పై భాగాన పలుచని పొరవంటి కణజాలం కప్పి ఉంది. దీనిని త్వచకణజాలం అంటారు. ఇది మొక్క భాగాలకు రక్షణ కల్పిస్తుంది.
  4. వృక్ష దేహాన్ని ఏర్పర్చుతూ ఇతర కణజాలాన్ని సరైన స్థితిలో ఉంచటానికి సంధాయక కణజాలం ఉంది. ఇది అధికంగా విస్తరించి ఎక్కువ మోతాదులో ఉంది.
  5. పదార్థాల రవాణాకు, కాండము నుండి కొమ్మల ద్వారా పత్రాలలోనికి విస్తరించిన నాళాల వంటి కణజాలం ఉంది. దీనిని ప్రసరణ కణజాలం అంటారు.
  6. ప్రసరణ కణజాలంలోని దారువు ద్వారా నీరు సరఫరా చేయబడితే పోషకకణజాలం ద్వారా ఆహారపదార్థాల రవాణా జరుగుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. మొక్కలోని భాగాలు – వాటి విధులు :

మొక్కల్లోని వివిధ భాగాల పనులను గురించి కింది తరగతుల్లో చదువుకున్నారు. కింది పట్టికలోని విధుల జాబితా చదవంది. ఆ విధుల నిర్వహణలో పాల్గొనే మొక్క భాగాల పేర్లు రాయండి.
జవాబు:

విధిభాగాల పేర్లు
1. నీటి సంగ్రహణవేరు వ్యవస్థలోని దారువు
2. వాయువుల (గాలి) మార్పిడిఆకులలోని పత్రరంధ్రాలు
3. కిరణజన్య సంయోగక్రియఆకులలోని పత్ర హరితం
4. బాష్పోత్సేకంఆకులలోని పత్రరంధ్రాలు
5. ప్రత్యుత్పత్తివేర్లు, కాండం, పత్రం, విత్తనాలు

1. మొక్కలు అన్ని రకాల జీవ క్రియలను ఎలా జరుపుకోగలుగుతున్నాయి?
జవాబు:
మొక్కలలో అమరియున్న వివిధ కణజాలముల ద్వారా మొక్కలు అన్ని రకాల జీవక్రియలు జరుపుకోగలుగుతున్నాయి.

2. ఈ క్రియల నిర్వహణలో సహాయపడటానికి మొక్కల్లో ప్రత్యేకమైన కణాల అమరిక ఏమైన ఉందా?
జవాబు:

  1. ఒకే రకమైన నిర్మాణం మరియు విధులను నిర్వహించే కణములన్ని సమూహములుగా ఉండి కణజాలములు ఏర్పడినాయి.
  2. కణజాలాలు అన్ని నిర్దిష్టమైన అమరిక కలిగియుండి మొక్కలకు జీవక్రియ నిర్వహణలో తోడ్పడతాయి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 2

ఉల్లిపొరలోని కణాలు :

2. సూక్ష్మదర్శిని సహాయముతో ఉల్లిగడ్డ పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలు గుర్తించి, నీ పరిశీలనలను రాయుము.
జవాబు:
ఉల్లిగడ్డ పొర పరిశీలన :

  1. ఒక ఉల్లిపొర ముక్కని తీసుకోవాలి.
  2. దానిని గాజుపలక మీద ఉంచాలి.
  3. దీని పైన ఒక చుక్కనీరు, ఆ తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
  4. దానిపై కవర్‌పను నెమ్మదిగా ఉంచాలి.
  5. సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 2
పరిశీలనలు :

  1. కణములన్నియు ఒకే ఆకారం, నిర్మాణము కలిగి ఉన్నాయి.
  2. కణముల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి.
  3. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  4. ప్రతి కణమునకు కణకవచము, కేంద్రకము మరియు కణజీవ పదార్ధము ఉన్నాయి.

కృత్యం – 3

ఆకు – పై పొరలోని కణాలు :

3. సూక్ష్మదర్శిని సహాయంతో తమలపాకును ఏ విధంగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలను గుర్తించి, నీ పరిశీలనలను వ్రాయుము.
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 3
కృత్యం :

  1. తమలపాకును గానీ, గోలగొండి ఆకును గానీ తీసుకొనవలెను.
  2. ఆకును మధ్యకు మడిచి చింపవలెను. చినిగిన చోట సన్నటి అంచు కనిపిస్తుంది.
  3. ఈ అంచును, ఉల్లిపొరను పరిశీలించినట్లే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించవలెను.
  4. పరిశీలించిన దాని పటాన్ని గీయవలెను. పటంతో పోల్చవలెను.

పరిశీలనలు :

  1. పరిశీలించిన కణాలు అన్ని ఒకే మాదిరిగా లేవు. కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి.
  2. కణాల అమరికలో తేడా ఉంది. అవి దగ్గర దగ్గరగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.
  3. కణాలు సమూహాలుగా ఉండి, నిర్దిష్టంగా అమరి ఉండటాన్ని పరిశీలించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 4

వేరు మూలలోని కణాలు :

4. ఉల్లిగడ్డ వేరుమూలంను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? సూక్ష్మదర్శిని సహాయముతో బొమ్మ గీయుము. నీ యొక్క పరిశీలనలను నమోదు చేయుము.
జవాబు:
వేరు మూలంలోని కణాల పరిశీలన :

  1. ఒక పారదర్శకమైన సీసాను తీసుకొని నీటితో నింపాలి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. ఉల్లిగడ్డను సీసా మూతిపై ఉంచాలి.
  2. వేర్లు దాదాపు ఒక అంగుళం పొడవు పెరిగే వరకు కొద్దిరోజుల పాటు వేర్ల పెరుగుదలను గమనించాలి.
  3. ఉల్లిగడ్డను తీసుకొని కొన్ని వేర్ల కొనలను కత్తిరించాలి.
  4. ఒక వేరుకొనను తీసుకోవాలి. దాన్ని గాజుపలకపై ఉంచాలి.
  5. దానిపై ఒక చుక్క నీటిని, తరువాత ఒక చుక్క గ్లిజరినను వేయాలి.
  6. కవర్‌స్లితో కప్పి కవర్‌ స్లిప్ పై 2, 3 అదుడు కాగితాలను ఉంచాలి.
  7. నీడిల్ లేదా బ్రష్ వెనుకవైపు కొనతో కవర్ స్లిప్ పై సున్నితంగా కొట్టి పదార్థం పరచుకునేలా చేయాలి.
  8. కణాల నిర్మాణాన్ని, అమరికను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 4 AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 5

పరిశీలనలు :

  1. కణములన్నియు ఆకారపరంగా, నిర్మాణపరంగా ఒకే విధముగా లేవు.
  2. కణములన్నీ వివిధ వరుసలలో అమరి ఉన్నాయి.
  3. అగ్రవిభాజ్య కణజాలం వేరు తొడుగునకు క్రింద ఉన్నది.

కృత్యం – 5

పెరుగుతున్న వేర్లు :

5. ఉల్లిగడ్డ యొక్క కత్తిరించిన కొనలను సూక్ష్మదర్శినితో పరిశీలించుము. బొమ్మను గీచి పరిశీలనలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 6

  1. ఉల్లిగడ్డను తీసికొని వేర్లను కత్తిరించాలి.
  2. కత్తిరించిన వేరు కొనలకు కొంచెం పైగా మార్కర్ పెతో గుర్తించాలి.
  3. ఉల్లిగడ్డను సీసామూత మీద ఉంచాలి.
  4. నాలుగు, ఐదు రోజులపాటు అలాగే ఉంచాలి.
  5. వేర్లు కొంచెం మునిగేలా, చాలినంత నీరు ఉండేలా తగు జాగ్రత్త తీసుకోవాలి.

పరిశీలనలు :

  1. నిర్దిష్ట రూపములో కణములు అమరియుండిన వేరుకొనను తొలగించిన వేరు పొడవు పెరుగుదల ఆగిపోతుంది.
  2. కణములు సమూహములుగా ఉన్నాయి.

కృత్యం – 6

కాండంకొన, వేరు కొనలో ఉన్న విభాజ్య కణజాలాన్ని సరిపోల్చడం.

6. కాండం కొన, వేరుభాగాలను పరిశీలించి కణాల అమరికను క్రింది పట్టిక నందు రాయండి.
జవాబు:

కణాల అమరిక (కణజాలాలు)కాండం కొనవేరుకొన
కొనభాగంలోఅగ్ర విభాజ్య కణజాలంవేరు తొడుగునకు
వెనుక అగ్ర విభాజ్య కణజాలం
పార్శ్వ భాగంలోపార్శ్వ విభాజ్య కణజాలంపార్శ్వ విభాజ్య కణజాలం
శాఖలు వచ్చేచోటమధ్యస్థ విభాజ్య కణజాలంమధ్యస్థ విభాజ్య కణజాలం లేదు

కృత్యం – 7

ద్విదళబీజ కాండంలోని కణజాలాలు :

7. ద్విదళ బీజకాండము అడ్డుకోత తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించి, బొమ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ యొక్క పరిశీలనలను రాయుము.
జవాబు:
ద్విదళ బీజకాండము అడ్డుకోత సైడ్ ను తయారుచేసి సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాలి.
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 7

పరిశీలనలు:

  1. ద్విదళ బీకాండపు అడ్డుకోతనందు విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం, త్వచకణజాలం మరియు సంధాయక కణజాలాలు ఉన్నాయి.
  2. కణములన్నియు ఒకేవిధమైన ఆకారము, నిర్మాణమును కలిగి యుండలేదు.

కృత్యం – 8

రియో ఆకు – ఉపరితల కణజాలం :

8. రియో ఆకును సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించుము. మ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ పరిశీలనలను రాయుము.
జవాబు:

  1. తాజాగా ఉన్న రియో ఆకును తీసుకోవాలి.
  2. ఒక్కసారిగా మధ్యలో చీల్చండి. చినిగిన అంచు వద్ద తెల్లటి పొర కనిపిస్తుంది.
  3. ఆ పొరను జాగ్రత్తగా తీసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 8
పరిశీలనలు :

  1. నిర్మాణపరంగా కణములన్నీ ఒకే విధముగా ఉన్నాయి.
  2. కణముల మధ్య ఖాళీ ప్రదేశములు లేకుండా దగ్గరగా అమరి ఉన్నాయి.
  3. ఇది మొక్క యొక్క త్వచ కణజాలం.
  4. దీనియందు పత్రరంధ్రము కలదు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 9

కణజాలాల పరిశీలన :

9. మీ ప్రయోగశాల నుండి హరిత కణజాలం, వాతయుత కణజాలం, నిల్వచేసే కణజాలాల సైట్లను సేకరించండి. మైక్రోస్కోపీతో పరిశీలించండి. మీరు గమనించిన లక్షణాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 9
గమనించిన లక్షణాలు:
i) హరిత కణజాలం :
ఈ కణజాలం హరిత రేణువులను కలిగి ఉంటుంది. అందువలన దీనిని హరిత కణజాలం అంటారు.

ii) వాతయుత కణజాలం :
ఈ కణజాలం మృదుకణజాలం. పెద్ద గాలిగదుల్ని కలిగి ఉంటుంది. అందువలన దీనిని వాయుగత మృదుకణజాలం లేదా వాతయుత కణజాలం అంటారు.

iii) నిల్వజేసే కణజాలం :
ఈ మృదు కణజాలం నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది. అందువలన దీనిని నిల్వచేసే కణజాలం అంటారు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 1st Lesson Questions and Answers కణ నిర్మాణం – విధులు

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటిలో భేదాలను గుర్తించండి. (AS 1)
A) వృక్ష కణం మరియు జంతు కణం
B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం
జవాబు:
A) వృక్ష కణం మరియు జంతు కణం :

వృక్ష కణముజంతు కణము
1. సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉంటుంది.1. సాధారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది.
2. కణకవచము ఉంటుంది.2. కణకవచము ఉండదు.
3. ప్లాస్టిడ్లు (క్రోమోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు) ఉంటాయి.3. ప్లాస్టిడ్లు ఉండవు.
4. సెంట్రియోల్స్ ఉండవు.4. సెంట్రియోల్స్ ఉంటాయి.
5. రిక్తికలు పెద్దవిగా ఉంటాయి.5. రిక్తికలు చిన్నవిగా ఉంటాయి.

B) కేంద్రక పూర్వకణం మరియు నిజకేంద్రక కణం

కేంద్రక పూర్వకణంనిజకేంద్రక కణం
1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు.1. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది.
2. త్వచముతో కూడిన కణాంగాలు ఉండవు.2. త్వచముతో కూడిన కణాంగాలు ఉంటాయి.
3. కేంద్రక పూర్వకణాలు ఎక్కువగా ఏకకణజీవులలో ఉంటాయి.3. నిజకేంద్రక కణాలు బహుకణజీవులలో ఉంటాయి.
4. దీనిలో ఒకే క్రోమోసోము ఉంటుంది.4. దీనిలో ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి.
5. కేంద్రకాంశము ఉండదు.5. కేంద్రకాంశము ఉంటుంది.
6. కణవిభజన సమవిభజన ద్వారా జరుగుతుంది.6. కణవిభజన సమవిభజన మరియు క్షయకరణ విభజనల ద్వారా జరుగుతుంది.
7. కణపరిమాణము చిన్నగా ఉంటుంది.7. కణ పరిమాణము పెద్దగా ఉంటుంది.
8. కేంద్రక పూర్వకణాలు బాక్టీరియా మరియు సయానో బాక్టీరియాలలో ఉంటాయి.8. నిజకేంద్రక కణాలు శిలీంధ్రాలు, మొక్కలు మరియు జంతు కణాలలో ఉంటాయి.

ప్రశ్న 2.
కణం నుండి కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుంది? మీ జవాబులను బలోపేతం చేయడానికి రెండు కారణాలు రాయండి. (AS 1)
జవాబు:

  1. కణాంగాలలో కేంద్రకము అతిముఖ్యమైనది.
  2. కేంద్రకము కణవిధులను అన్నింటిని నియంత్రిస్తుంది.
  3. కేంద్రకము అన్ని కణాంగాలను మరియు కేంద్రకాంశమును కూడా నియంత్రిస్తుంది.
  4. కణ మెదడు అయిన కేంద్రకమును తొలగించినట్లయితే కణము ఆ వెంటనే చనిపోతుంది.
  5. కనుక కేంద్రకమును తొలగించినట్లయితే కేంద్రక నియంత్రణలో పనిచేసే కణాంగాలు చనిపోతాయి. తద్వారా ఆ జీవి చనిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. లైసోజోములు విచ్ఛిన్నకర ఎంజైములను కలిగి ఉంటాయి.
  2. విచ్ఛిన్నం చేయవలసిన పదార్థములు లైసోజోమ్ నకు రవాణా చేయబడతాయి.
  3. కొన్ని సందర్భాలలో లైసోజోముల విచ్ఛిన్నం ద్వారా విడుదలైన ఎంజైములు కణమును జీర్ణం చేస్తాయి.
  4. అందువలన లైసోజోమ్ ను స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు.

ప్రశ్న 4.
వృక్ష కణంలో పెద్ద రిక్తికలు ఎందుకు ఉంటాయి? (AS 1)
జవాబు:

  1. మొక్కల రిక్తికలు నీటి నిలువకు, ద్రవాభిసరణ క్రమతకు, వ్యర్థ పదార్థాల సంగ్రహణకు ఉపయోగపడుట ద్వారా ఆకులు, రక్షకపత్రాల కణముల యొక్క నిర్మాణాత్మక రూపమును నియంత్రిస్తాయి.
  2. కణము మధ్యన గల రిక్తిక, కణకవచముపై కలిగించే ఒత్తిడి ద్వారా కణము యొక్క ఆకారము స్థిరంగా ఉంచబడుతుంది.
  3. నియంత్రిత పెరుగుదలలో భాగంగా మొక్కలు కణము పొడవుగా అగుటకు కణము అంతర్గతశక్తిని ఉపయోగించుకుంటాయి.
  4. జంతువుల రిక్తిక కంటె వృక్షము యందు ఉండు రిక్తిక క్లిష్టమైన విధులను నిర్వహిస్తుంది.
  5. అందువలన వృక్ష కణములలో పెద్ద రిక్తికలు ఉంటాయి.

ప్రశ్న 5.
“జీవుల మౌళిక ప్రమాణం కణం” వివరించండి. (AS 1)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం, జీవులు కణ నిర్మితాలు మరియు కణములన్నీ ముందుతరం కణం నుంచి ఏర్పడతాయి.
  2. జీవి జీవించడానికి అవసరమయ్యే జీవక్రియలన్నీ కణస్థాయిలోనే జరుగుతాయి.
  3. అందువలన కణమును జీవుల మౌళిక ప్రమాణం అని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
కణ సిద్ధాంతమును ఎవరు, ఎప్పుడు ప్రతిపాదించారు ? దీనిలోని ముఖ్యమైన అంశాలు ఏవి? (AS 1)
జవాబు:
ప్రతిపాదించినవారు :
ఎమ్.జె. ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్ 1838-39 సంవత్సరంలో కణ సిద్ధాంతమును

ప్రతిపాదించారు. ముఖ్యమైన అంశములు :

  1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
  2. కణాలన్నీ ముందు తరం కణం నుంచే ఏర్పడతాయి.
  3. అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి, ఒకే రకమైన జీవక్రియలు నెరవేరుస్తాయి.
  4. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వర్తించే విధులను బట్టి, ఆ జీవిలో వివిధ కణముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 7.
ప్లాస్మా పొర పగిలిపోతే/ విరిగితే కణానికి ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:
ప్లాస్మా పొర పగిలిపోతే / విరిగితే :

  1. విసరణ లేదా ద్రవాభిసరణ ద్వారా కణము లోపలకు, బయటకు జరిగే పదార్థాల రవాణాను ప్లాస్మా పొర నియంత్రిస్తుంది.
  2. అందువలన ప్లాస్మాపొర పగిలిపోతే కణము, దాని లోపలి అంశములను బయటకు విడుదల చేయవచ్చు.
  3. అందువలన కణము చనిపోతుంది.

ప్రశ్న 8.
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే కణానికి ఏమవుతుంది? (AS 2)
జవాబు:
గాల్జీ సంక్లిష్టాలు లేకపోతే :

  1. వీటి ద్వారా జరుగవలసిన కార్యకలాపాలు జరుగవు.
  2. వివిధ రకాల పదార్థములను మార్పుచేయడం కణము నందు జరుగదు.
  3. గాల్జీ సంక్లిష్టము నుండి పదార్థాలన్నీ ప్లాస్మాపొర వైపు కాని లేదా మరొక కణాంగమైన లైసోజోమ్స్ వైపు కాని పంపబడవు.
  4. రైబోజోములచే తయారుచేయబడిన ప్రోటీనులు మరియు ఇతర పదార్థములు లైసోజోమ్ లకు రవాణా చేయబడవు.
  5. పదార్ధముల రవాణా జరుగకపోయినట్లయితే ప్లాస్మా పొరకు మరమ్మత్తులు జరుగక కణం చనిపోతుంది.
  6. గాల్జీ సంక్లిష్టము నుండి విషపదార్థములు లైసోజోమ్స్ నకు పంపబడనట్లయితే విషపదార్ధములు కణము నందు నిల్వచేయబడి కణము చనిపోతుంది.

ప్రశ్న 9.
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి నీవు ప్రయోగశాలలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నావు? (AS 3)
జవాబు:
బుగ్గకణంలో కేంద్రకాన్ని చూడడానికి ప్రయోగశాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకకూడదు. ఎక్కువగా గీకితే గాయమయ్యే అవకాశం ఉంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే దానిని తొలగించవలెను.

ప్రశ్న 10.
ప్రస్తుత పాఠాన్ని పూర్తిగా, క్షుణ్ణంగా చదివి వివిధ రకాల కణాంగాల విధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రమసంఖ్య, కణాంగాలు, విధులు అనే అంశాలను పట్టికలో నమోదు చేయండి. నమోదు చేసేటపుడు నూతన ప్రత్యేక అంశాలు ఉన్నట్లయితే పట్టిక క్రింద నమోదు చేయండి. (AS 4)
జవాబు:

కణాంగమువిధులు
1. కేంద్రకముకణవిధుల క్రమబద్దీకరణ మరియు నియంత్రణ, జీవుల లక్షణాల నిర్ధారణ.
2. అంతర్జీవ ద్రవ్యజాలముకణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా, జీవరసాయన చర్యలకు వేదిక.
3. గాల్జీ సంక్లిష్టముప్రోటీనుల రూపమును మార్చుట, అనేక పదార్థములను ఒకటిగా చేయుట.
4. లైసోజోములుకణాంతర జీర్ణక్రియ, కణభాగములను నాశనం చేయుట.
5. మైటోకాండ్రియాకణ శ్వాసక్రియ ద్వారా కణమునందు శక్తి ఉత్పాదన.
6. ప్లాస్టిడ్లుమొక్కల కణాలకు రంగులను ఇస్తుంది.
A) క్రోమోప్లాస్టులురకరకాల పూలు, పండ్లకు రంగునిచ్చుట.
B) క్లోరోప్లాస్టులుకిరణజన్య సంయోగక్రియలో కాంతి శక్తిని రసాయనశక్తిగా మార్చుట.
C) ల్యూకోప్లాస్టులురంగులేని ప్లాస్టిడ్లు, పిండిపదార్ధాలు, నూనెలు మరియు ప్రోటీనుల నిల్వ.

ప్రత్యేక అంశాలు :

  1. కేంద్రకము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది.
  2. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లను సంశ్లేషణ చేస్తుంది.
  3. గాల్టీ సంక్లిష్టము రైబోజోములు తయారు చేసిన ప్రోటీనులను ఒకటిగా చేర్చుటకు సహాయం చేస్తుంది.
  4. కణ వినాశమునకు కారణమగుట వలన లైసోజోములను స్వయంవిచ్చిత్తి సంచులు అంటారు.
  5. కణ శ్వాసక్రియ ద్వారా కణము శక్తిని ఉత్పాదన చేయుట వలన మైటోకాండ్రియాలను కణ శక్త్యా గారాలు అంటారు.
  6. క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు, క్రోమోప్లాస్టులు మొక్కలలో ఉండే ప్లాస్టిడ్లు.

ప్రశ్న 11.
వృక్ష కణం లేదా జంతు కణం నమూనాను పరిసరాలలో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేయండి. (AS 15)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

ప్రశ్న 12.
మీరు సేకరించిన పత్రం పొరతో తాత్కాలిక స్లెడను తయారుచేసి పత్రరంధ్రాలను పరిశీలించి పటమును గీయండి. వాటి గురించి రాయండి. (AS 5)
జవాబు:
పెద్దదిగా చూపబడిన పత్రరంధ్రము ఈ క్రింది కణాలను చూపిస్తుంది.
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 2

  1. పత్రరంధ్రము రెండు రక్షక కణములచే ఆవరించబడినది.
  2. రక్షక కణములు మూత్రపిండాకారములో ఉన్నాయి.
  3. రక్షక కణమందు కేంద్రకము, క్లోరోప్లాస్టులు కలవు.
  4. రెండు రక్షక కణముల మధ్య చిన్న పత్రరంధ్రము కలదు.
  5. ఆకునందలి పత్రరంధ్రముల ద్వారా వాయువుల మార్పిడి జరుగును.
  6. ఆకు వైశాల్యం నందు పత్రరంధ్రములు సుమారు 1 నుండి 2 శాతం ఆక్రమించి ఉన్నాయి.

ప్రశ్న 13.
నమూనా జంతు కణం పటము గీచి భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 3

ప్రశ్న 14.
కింది కార్టూనును చూడండి. కణాంగాల విధులను గురించి రాయండి. (AS 5)
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 4
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు అనగా అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టీ సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, – ప్లాస్టిడ్స్ మరియు రిక్తికలు.

కణాంగాలు, విధులు :
1) అంతర్జీవ ద్రవ్యజాలం :
కణ ద్రవ్యంలో వల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది ప్రోటీన్ల వంటి పదార్థాలను కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి కేంద్రకానికి రవాణా మార్గంగా పని చేస్తుంది. క్రొవ్వు మరియు లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.

2) గాల్జీ సంక్లిష్టాలు :
ఇవి వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు పంపే ముందు, తమలో నిల్వ చేసుకుని, అక్కడ నుండి ప్లాస్మాపొర వైపు లేదా లైసోసోమ్స్ వైపు పంపిస్తాయి.

3) లైసోజోములు :
వినాశకర పదార్థాలను ఇవి ఎంజైముల ద్వారా వినాశనం చేస్తాయి.

4) మైటోకాండ్రియా :
కణానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేసి కణ శ్వాసక్రియను జరుపుతాయి.

5) ప్లాస్టిడ్లు :
కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా మార్చటమే వీటి యొక్క ముఖ్య

6) రిక్తికలు :
రిక్తికలు కార్బోహైడ్రేటులు, అమైనో ఆమ్లాలు, ప్రోటీనులు, వర్ణద్రవ్యాలు విసర్జన పదార్థాలను నిల్వ చేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 15.
సజీవులలో కణ వ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. జీవులలో ఐదు రకాల స్థాయిలను గమనిస్తాను. కణము-కణజాలము-అవయవము-అవయవ వ్యవస్థ – జీవి.
  2. జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైంది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.
  3. మౌలికమైన మరియు ప్రాథమికమైన కణము ఏకకణ జీవులను, బహుకణ జీవులను ఏర్పరుస్తుంది.
  4. జీవులు తరువాత క్రమంలో జనాభాలను, సంఘాలను, ఆవరణ వ్యవస్థలను మరియు జీవావరణంగాను వ్యవస్థీకృతమైనవి.

ప్రశ్న 16.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది? (AS 6)
జవాబు:

  1. జీవమునకు ప్రమాణమైన కణము, జీవక్రియలన్నింటిని నిర్వహించగల సామర్యము కలిగినది.
  2. భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణవ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.

ప్రశ్న 17.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు? (AS 6)
జవాబు:

  1. కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నియూ కణనిర్మితాలు.
  2. జీవమునకు ప్రమాణమైన చిన్నకణము అన్ని జీవక్రియలను నిర్వహించగల సామర్థ్యం గలది.
  3. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి.
  4. కణములు జీవనిర్మాణ సౌధములు.
  5. అందువలన కణములను జీవమునకు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము అంటారు.
  6. కణములు ఆకారములోను, పరిమాణములోను మరియు క్రియలపరంగా వేరుగా ఉంటాయి.
  7. ఒక కణము యొక్క పరిమాణము కచ్చితంగా ఆ కణము నిర్వహించే పని మీద ఆధారపడి ఉంటుంది.
  8. జీవిలోని కణములు సక్రమముగా విధులను నిర్వహించినట్లయితే జీవి శరీరము విధులను సక్రమముగా నిర్వహిస్తుంది.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 1

ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాలు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే, బుగ్గ కణాలు గుండ్రంగా ఉంటాయని తెలుసుకున్నాం. ఇలాగే కణం గురించి మీరు గుర్తించిన మరికొన్ని ముఖ్యాంశాలు రాయండి.
జవాబు:

  1. జీవులన్నిటికి కణం ప్రధానమైన మూలం.
  2. కణాలలో కేంద్రకం ఉంటుంది.
  3. వృక్ష కణాలలో కణకవచం ఉంటుంది. కానీ జంతు కణాలలో కణకవచం ఉండదు.
  4. కణమును నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు.
  5. బహుకణజీవులలో ఈ కణాల ఆకారంలో వైవిధ్యం కనపడుతుంది.

9th Class Biology Textbook Page No. 2

ప్రశ్న 2.
ఈ క్రింది కణాలను పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 1

a) పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు ఏవి?
జవాబు:
పై రెండు కణాలలో కనబడే సాధారణ లక్షణాలు : పై రెండు కణాలు మైటోకాండ్రియా, గాల్టీ సంక్లిష్టం, కేంద్రకం, అంతర్జీవ ద్రవ్యజాలం అనే కణాంగాలను కలిగి ఉన్నాయి.

b) వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలేవి?
జవాబు:
వృక్ష కణంలో మాత్రమే కనబడే కణాంగాలు : రిక్తికలు, ప్లాస్టిడ్లు, కణకవచం మొదలగునవి.

c) వృక్ష కణంలోని రిక్తకలు జంతుకణంలోని రిక్తికలను పోల్చండి. రెండింటి మధ్య మీరు గమనించిన భేదాలను రాయండి.
జవాబు:
వృక్ష కణంలో రిక్తికలు ఉంటాయి. జంతుకణంలో రిక్తికలు ఉండవు.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

ప్రశ్న 3.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:

  1. కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలిగిస్తుంది.
  2. అందువల్ల పరిసరాలలో జరిగే మార్పులను జంతుకణం కంటే వృక్షకణం తట్టుకునే అవకాశం ఎక్కువ.

9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. ప్లాస్మా పొర పరిశీలన :
a) సూక్ష్మదర్శినితో పత్రంనందలి ప్లాస్మా పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ పరిశీలనలు రాయుము.
జవాబు:

  1. రియో పత్రాన్ని తీసుకొని ఒక్కసారిగా మధ్యకు చించాలి.
  2. చించిన భాగాన్ని వెలుతురులో ఉంచి పరిశీలించాలి. పత్రంలోని లేతరంగులో ఉన్న భాగాన్ని తీసుకొని స్లెడ్ పైన పెట్టాలి.
  3. నీటి చుక్కను వేసి కవర్ స్లితో కప్పాలి. తరువాత స్లెడ్ ను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 5
పరిశీలనలు :

  1. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  2. ప్లాస్మా పొర స్పష్టముగా కనిపిస్తుంది.
  3. కణము నందు కేంద్రకము కలదు.

b) రియో పత్రపు పొరపై 1 లేదా 2 చుక్కల సజల ఉప్పు ద్రావణము వేసిన ఏమి జరుగుతుంది? సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి బొమ్మను గీయుము. కేంద్రకముతో కూడిన జీవపదార్థము కుదించుకుపోవడానికి కారణములు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 6
పరిశీలనలు :

  1. రియో పత్రపు పొరపై జల ఉప్పు ద్రావణము వేసినప్పుడు రియో పత్రము నందలి కణముల నుండి నీరు బయటకు ప్లాస్మాపొర వచ్చును.
  2. నీరు బయటకు రావడము వలన కణద్రవ్యం, కణత్వచంతో పాటు కుదించబడుతుంది.
  3. మనకు కనబడే రంగుభాగపు బాహ్య అంచును కణత్వచం అంటారు. ఆ భాగం కణకవచం నుంచి వేరైపోతుంది.

2. కేంద్రక పరిశీలన :
జవాబు:
ఉద్దేశ్యం : చెంప (బు) కణంలో కేంద్రకం పరిశీలించుట.

కావాల్సిన పదార్థాలు :
టూత్ పిక్, స్లెడ్, కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, నీడిల్, బ్లాటింగ్ పేపర్, 1% మిథిలీన్ బ్లూ, ఉప్పు ద్రావణం, గ్లిజరిన్, సూక్ష్మదర్శిని మొదలైనవి.

విధానం :

  1. ముందుగా నోటిని శుభ్రంగా కడగవలెను. టూత్ పిక్ తో గాని లేదా ఐస్ క్రీమ్ చెంచాతో గాని నోటిలోపలి చెంప (బుగ్గ)లోని భాగాన్ని కొద్దిగా గీకవలెను.
  2. గీకిన భాగాన్ని ఉప్పు ద్రావణం కలిగి ఉన్న వాచ్ గ్లాసులో పెట్టవలెను. (పదార్థం ఉప్పు ద్రావణంలో కలిసిపోకుండా జాగ్రత్త పడండి).
  3. తరువాత స్లెడ్ పైన పెట్టవలెను.
  4. ఒక చుక్క మిథిలీన్ బ్లూ ద్రావణాన్ని వేసి రెండు నిమిషాల సేపు కదపకుండా ఉండవలెను.
  5. అద్దుడు కాగితం ఉపయోగించి ఎక్కువగా ఉన్న రంగును తొలగించవలెను.
  6. ఒక చుక్క గ్లిజరిన్ వేయవలెను.
  7. కవర్ స్లితో కప్పి నీడిల్ లో కవర్ స్లిప్ ని కొద్దిగా తట్టవలెను. దాని వలన కణాలన్నీ వ్యాపిస్తాయి.

జాగ్రత్తలు:

  1. చెంప (బుగ్గ) లోపలి భాగాన్ని ఎక్కువగా గీకవద్దు. గాయమయ్యే అవకాశముంటుంది.
  2. గీకిన భాగాన్ని స్లెడ్ పైన వ్యాపించేటట్లు చేయవలెను.
  3. ఎక్కువగా రంగు ఉన్నట్లయితే తొలగించవలెను.

ఈ విధముగా తయారుచేసిన తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని ఎక్కువ, తక్కువగా కాంతిని వర్ధనం చేస్తూ పరిశీలించవలెను.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 7
పరిశీలనలు:

  1. కణాల ఆకారంను పరిశీలించగా కణాలు వివిధ ఆకారాలలో ఉన్నవి.
  2. కణ మధ్య భాగంలో రంగుతో కూడిన గుండ్రటి చుక్క కనబడుతుంది. అదే కణ కేంద్రకం.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 2

3. మైటోకాండ్రియా పరిశీలన :
ఉల్లిపొర కణాలతో మైటోకాండ్రియాను నీవు ఏ విధంగా పరిశీలిస్తావు?
(లేదా)
నిర్మల ఉల్లిపొరలోని కణాలను పరిశీలించాలనుకుంటుంది. అందుకు కావలసిన పరికరాలను, ప్రయోగ విధానాన్ని ఆమెకు వివరించండి.
జవాబు:
పరికరాలు :
ఉల్లిపొర, బ్లేడ్, జానస్ గ్రీన్ – B ద్రావణం కవర్‌ స్లిప్, వాచ్ గ్లాస్, సూక్ష్మదర్శిని

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 8
మైటోకాండ్రియా పరిశీలన :

  1. బీకరులో జానస్ గ్రీన్-బి ద్రావణాన్ని తయారుచేయాలి.
  2. 200 మి.గ్రా. జానస్ గ్రీన్-‘బి’ ను 100 మి.లీ. నీటిలో కలపాలి.
  3. ఒక వాచ్ గ్లాలో ఈ ద్రావణం కొంత తీసుకుని దానిలో ఉల్లిపొరను దాదాపు అరగంటసేపు ఉంచాలి.
  4. ఉల్లిపొరను వాచ్ గ్లాస్ నుండి తీసి స్లెడ్ పైన పెట్టి నెమ్మదిగా నీటితో కడగాలి.
  5. కవర్ స్లిప్ నుంచి ఉల్లిపొరను సూక్ష్మదర్శినిలో (ఎక్కువ మాగ్నిఫికేషన్) పరిశీలించాలి.
  6. పరిశీలించిన అంశాన్ని బొమ్మ గీయాలి.

పరిశీలనలు :
ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కాని పొడవుగా ఉండే రేణువులు కణద్రవ్యంలో వెదజల్లినట్లు కనబడే నిర్మాణాలు మైటోకాండ్రియా.

కృత్యం – 3

4. రియో పత్రంలో హరితరేణువులను (Chloroplast) పరిశీలిద్దాం.
సూక్ష్మదర్శిని సహాయముతో రియో పత్రమునందలి క్లోరోప్లాస్టు (హరితరేణువులు)లను పరిశీలించుము. బొమ్మను గీచి, పరిశీలనలు రాయుము.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 9
క్లోరోప్లాస్టులను పరిశీలించుట :

  1. రియో పత్రం పొరను తీసుకొని స్లెడ్ పైన ఉంచి నీటి చుక్క వేయాలి.
  2. ఎక్కువ మాగ్నిఫికేషన్ గల సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. స్లెడ్ రియో పత్రమునందు ఆకుపచ్చని చిన్నటి రేణువులు కనబడుతున్నాయి. వీటిని హరితరేణువులు అంటారు.
  2. హరితరేణువులు పత్రహరిత వర్ణద్రవ్యమును కలిగి ఉంటాయి.

కృత్యం – 4

5. శైవలాలలో హరితరేణువులు పరిశీలిదాం :
శైవలములందలి హరితరేణువులను నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తావు ? పరిశీలించిన బొమ్మను గీచి, నీవు కనుగొనిన విషయమును రాయుము.
జవాబు:
శైవల హరితరేణువులను పరిశీలించుట :

  1. నీటి కొలను నుండి ఆకుపచ్చని శైవలాలను సేకరించాలి.
  2. వాటి సన్నని తంతువులను వేరుచేయాలి.
  3. కొన్ని తంతువులను స్లెడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు 10

పరిశీలనలు:

  1. శైవలాలలో హరితరేణువులు నిచ్చెన ఆకారంలో గాని, నక్షత్ర ఆకారంలో గాని, సర్పిలాకారంలో గాని, జాలాకారంలో గాని ఉంటాయి.
  2. కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా హరితరేణువులు మార్చుతాయి.

AP Board 9th Class Biology Solutions 1st Lesson కణ నిర్మాణం – విధులు

కృత్యం – 5

6. రిక్తికలను పరిశీలిద్దాం :
కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని నీవు ఏ విధముగా సూక్ష్మదర్శినితో పరిశీలిస్తావు?
జవాబు:
రిక్తికల పరిశీలన చేయు విధం :

  1. కలబంద వంటి రసభరిత మొక్క కాండం లేదా పత్రాన్ని తీసుకోవాలి.
  2. కాండం నుండి పల్చటి భాగాన్ని తీసుకొని నీరు ఉన్న వాగ్లాలో ఉంచాలి.
  3. స్లెడ్ మీద ఉంచి సజల సాఫ్రనిలో రంజనం చేయాలి.
  4. స్లెడు సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. కణంలో పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని రిక్తికలు అంటారు.
  2. ఇవి రసభరితంగా ఉండే సంచుల వంటి నిర్మాణాలు.

AP Board 9th Class Biology Study Material Guide Solutions Pdf Download State Syllabus

Telangana & Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Biology Study Material, 9th Class Biology Guide Pdf free download, TS AP 9th Class Biology Textbook Questions and Answers Solutions in English Medium and Telugu Medium are part of AP Board 9th Class Textbook Solutions.

Students can also go through AP Board 9th Class Biology Notes to understand and remember the concepts easily. Students can also read AP 9th Class Biology Important Questions for exam preparation.

AP State Syllabus 9th Class Biology Guide Study Material Pdf Free Download

AP 9th Class Biology Study Material Pdf | 9th Class Biology Guide Pdf | AP State 9th Class Biology Textbook Pdf Download

AP 9th Class Biology Study Material English Medium Pdf

AP 9th Class Biology Study Material Pdf in Telugu Medium

AP Board Solutions Class 9 Biology | 9th Class Biology Question Bank Pdf | 9th Class Biology Textbook Questions and Answers Solutions

AP Board 9th Class Biology Important Questions and Answers English & Telugu Medium

Andhra Pradesh SCERT AP State Board Syllabus 9th Class Biology Chapter Wise Important Questions and Answers in English Medium and Telugu Medium are part of AP Board 9th Class Textbook Solutions.

Students can also read AP Board 9th Class Biology Solutions for exam preparation.

AP State Syllabus 9th Class Biology Important Questions and Answers English & Telugu Medium

AP 9th Class Biology Important Questions and Answers in English Medium

AP 9th Class Biology Important Questions and Answers in Telugu Medium

AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

Practice the AP 9th Class Maths Bits with Answers 11th Lesson వైశాల్యాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

I. ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యముల లబ్ధము …………………
A) వరుస భుజాల
B) ఎదుటి భుజాల
C) భూమి మరియు ఎత్తు
D) కర్ణాల
జవాబు:
C) భూమి మరియు ఎత్తు

ప్రశ్న 2.
ఒక త్రిభుజం మరియు సమాంతర చతుర్భుజాలు ఒకే భూమి ఒకే జత సమాంతరాల మధ్యనున్నట్లయితే త్రిభుజ వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యమునకు ………….. ఉండును.
A) రెట్టింపు
B) సమానంగా
C) సగం
D) చెప్పలేము
జవాబు:
C) సగం

ప్రశ్న 3.
రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి సరూపాలు
A) సత్యము
B) అసత్యము
C) చెప్పలేము
D) ఏదీకాదు
జవాబు:
C) చెప్పలేము

AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

ప్రశ్న 4.
వైశాల్యంను ….. యూనిట్లలో తెలియజేస్తారు.
A) చదరపు
B) ఘనపు
C) వృత్తపు
D) చెప్పలేము
జవాబు:
A) చదరపు

ప్రశ్న 5.
పటం A రెండు సమతల పటాలు Bమరియు C లచే ఆవరించబడిన పటం A వైశాల్యము
A) B వైశాల్యం + C వైశాల్యం
B) B వైశాల్యం – C వైశాల్యం
C) 2 (B వైశాల్యం + C వైశాల్యం)
D) 1/2 (B వైశాల్యం + C వైశాల్యం)
జవాబు:
A) B వైశాల్యం + C వైశాల్యం

ప్రశ్న 6.
రెండు సర్వసమాన పటాల వైశాల్యములు …….
A) అసమానాలు
B) సమానాలు
C) చెప్పలేము
D) ఏదీకాదు
జవాబు:
B) సమానాలు

ప్రశ్న 7.
ఒక సెం.మీ. 2.5 మీ. లను తెలియచేసిన, ఒక చతురస్రపు వైశాల్యము 10 మీ². అయిన దానిని సూచించు సెం.మీ. విలువ …………
A) 10 సెం.మీ².
B) 4 సెం.మీ².
C) 2.5 సెం.మీ².
D) 1 సెం.మీ².
జవాబు:
B) 4 సెం.మీ².

AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

ప్రశ్న 8.
పటం నుంది ∆ABC వైశాల్యం ………
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 1
A) 24 సెం.మీ².
B) 48 సెం.మీ².
C) 10 సెం.మీ².
D) 12 సెం.మీ².
జవాబు:
D) 12 సెం.మీ².

ప్రశ్న 9.
8వ ప్రశ్నలోని పటంలో D, AC మధ్య బిందువు అయిన ∆BCD యొక్క వైశాల్యం
A) 24 సెం.మీ².
B) 48 సెం.మీ².
C) 12 సెం.మీ².
D) 6 సెం.మీ².
జవాబు:
D) 6 సెం.మీ².

ప్రశ్న 10.
పటం ABCDE యొక్క వైశాల్యము
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 2
A) 66 సెం.మీ².
B) 24 సెం.మీ².
C) 18 సెం.మీ².
D) 42 సెం.మీ².
జవాబు:
D) 42 సెం.మీ².

ప్రశ్న 11.
సమాంతర చతుర్భుజం పటం ABCD లో ∆AOD వైశాల్యము
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 3
A) ∆AOB
B) ∆BOC
C) ∆DOC
D) పై అన్నియూ
జవాబు:
D) పై అన్నియూ

ప్రశ్న 12.
పటంలో AB // CF అయిన JABCD =
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 4
A) □ABED
B) □ABEF
C) □ABCF
D) □ABCE
జవాబు:
B) □ABEF

ప్రశ్న 13.
కింది పటంలో ∆ADE వైశాల్యం 24 సెం.మీ². అయిన □ABCD వైశాల్యము
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 5
A) 24 సెం.మీ².
B) 34 సెం.మీ².
C) 48 సెం.మీ².
D) 12 సెం.మీ².
జవాబు:
C) 48 సెం.మీ².

ప్రశ్న 14.
కింది పటంలో □ABCD, 36 సెం.మీ². వైశాల్యము గల సమాంతర చతుర్భుజం అయిన ∆ADE వై|| + ∆BCE వై|| =
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 6
A) 18 సెం.మీ².
B) 9 సెం.మీ².
C) 72 సెం.మీ².
D) 45 సెం.మీ².
జవాబు:
A) 18 సెం.మీ².

AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

ప్రశ్న 15.
□ABCD సమాంతర చతుర్భుజపు భుజాల మధ్య బిందువులు E, F, G మరియు H అయిన
∆AEH + ∆BEF + ∆CGF + ∆DGH
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 7
A) □ABCD
B) □EFGH
C) 1/2□EFGH
D) 2 □EFGH
జవాబు:
B) □EFGH

ప్రశ్న 16.
కింది పటంలో ∆PQR వైశాల్యము = 16 చ.సెం.మీ. అయిన ∆PQS వైశాల్యము =
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 8
A) 7.5 సెం.మీ².
B) 15 సెం.మీ².
C) 30 సెం.మీ².
D) 10 సెం.మీ².
జవాబు:
B) 15 సెం.మీ².

ప్రశ్న 17.
పై పటంలో ∆PTS వైశాల్యము ………..
A) ∆PQT
B) ∆QRT
C) 2∆TSR
D) ½∆PQT
జవాబు:
B) ∆QRT

ప్రశ్న 18.
∆PQR లో A, B మరియు C లు భుజాల మధ్య బిందువులైన □AQRC =
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 9
A) \(\frac{1}{2}\)∆PQR
B) \(\frac{1}{4}\)∆PQR
C) \(\frac{3}{4}\)∆PQR
D) \(\frac{2}{3}\)∆PQR
జవాబు:
C) \(\frac{3}{4}\)∆PQR

ప్రశ్న 19.
□PQRS వైశాల్యము = 30 సెం.మీ. 7 అయిన PM =
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 10
A) 6 సెం.మీ.
B) 3 సెం.మీ.
C) 20 సెం.మీ.
D) ఏదీకాదు
జవాబు:
B) 3 సెం.మీ.

AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

ప్రశ్న 20.
ఒక బహుభుజిని విభజించిన ఏర్పడు ప్రాంతము ఆకారం ……
A) చతురస్రం
B) దీర్ఘచతురస్రం
C) వృత్తాకారం
D) త్రిభుజాకారం
జవాబు:
D) త్రిభుజాకారం

II. క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
ఒకే భూమిపై గల రెండు త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి …………….. మధ్య ఉంటాయి.
జవాబు:
సమాంతర రేఖల

ప్రశ్న 2.
ఒకే భూమిపై రెండు సమాంతర రేఖల జత మధ్యన వున్న సమాంతర చతుర్భుజాల ……….. సమానం.
జవాబు:
వైశాల్యాలు

ప్రశ్న 3.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 11
□PQRS సమాంతర చతుర్భుజంలో ∆PQR వైశాల్యం = ………………..
జవాబు:
½□PQRS

ప్రశ్న 4.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 12
పై పటంలో D మరియు E లు త్రిభుజ భుజాలు AB మరియు AC ల మధ్య బిందువులైన ∆ADE =
జవాబు:
¼∆ABC

ప్రశ్న 5.
పై పటంలో ΔABC వైశాల్యం 24 చ. సెం.మీ. అయిన □BCED వైశాల్యము ………..
జవాబు:
18 సెం.మీ.²

AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు

ప్రశ్న 6.
రాంబస్ వైశాల్యముకు సూత్రము …………….
జవాబు:
½ d1d2

ప్రశ్న 7.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 13
పై పటం PQRS యొక్క వైశాల్యం 20 చ.సెం.మీ. A, B, C, D లు మధ్య బిందువులైన. ABCD వైశాల్యము = ………..
జవాబు:
10 సెం.మీ².

ప్రశ్న 8.
ఒక రాంబస్ కర్ణాలు 4 సెం.మీ. మరియు 6 సెం.మీ. అయిన దాని వైశాల్యము ……….
జవాబు:
12 సెం.మీ².

ప్రశ్న 9.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 14
పై పటం యొక్క వైశాల్యము ………….
జవాబు:
18 సెం.మీ².

ప్రశ్న 10.
1 మీ² = …………….. సెం.మీ².
జవాబు:
10,000

ప్రశ్న 11.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 15
□ABCD వైశాల్యం = 72 సెం.మీ². అయిన
□ABEF వైశాల్యం = …………….
జవాబు:
72 సెం.మీ².

ప్రశ్న 12.
ఒక సమాంతర చతుర్భుజము యొక్క భూమి 16 సెం.మీ. మరియు వైశాల్యం 64 చ.సెం.మీ. అయిన దాని ఎత్తు ………………
జవాబు:
4 సెం.మీ.

ప్రశ్న 13.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 16
పై పటంలో చూపబడిన ట్రెపీజియం వైశాల్యం …………. చ.యూ.
జవాబు:
½ (p+q)d

ప్రశ్న 14.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 17
∆ADC వైశాల్యము = 14.5 సెం.మీ². మరియు BC పై AD మధ్యగతరేఖ అయిన ∆ABC వై|| = …………
జవాబు:
29 సెం.మీ².

ప్రశ్న 15.
పై పటంలో ∆ABD వైశాల్యము = …………
జవాబు:
14.5 సెం.మీ².

ప్రశ్న 16.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 18
పై పటంలో AB // DC అయిన ∆ABC = ……
జవాబు:
∆ABD

ప్రశ్న 17.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 19
పై పటంలో AC // DE అయిన ∆ABE = ….. …
జవాబు:
□ABCD

ప్రశ్న 18.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 20
∆ABC లో LB లంబకోణం అయిన □BFG + □BEDC = ………..
జవాబు:
□ACIH

ప్రశ్న 19.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 21
∆ABC ≅ ∆DEF అగునా ? ………….
జవాబు:
కాదు

ప్రశ్న 20.
AP 9th Class Maths Bits 11th Lesson వైశాల్యాలు 22
రాంబస్ ABCD యొక్క వైశాల్యం 27 చ.యూ. కర్ణము BD = 6 సెం.మీ. అయిన మరొక కర్ణము AC విలువ
జవాబు:
9 సెం.మీ.

III. జతపర్చుము

i)

గ్రూపు – Aగ్రూపు – B
1. రాంబస్ వైశాల్యముA) భూమి, ఎత్తుల లబ్ధము
2. దీర్ఘచతురస్ర వైశాల్యము.B) పొడవు, వెడల్పుల లబ్ధము
3. సమాంతర చతుర్భుజ వైశాల్యముC) ½(a+b)h
4. త్రిభుజ వైశాల్యముD) కర్ణాల లబ్ధంలో సగము కాంతం
5. ట్రెపీజియమ్ వైశాల్యముE) భూమి, ఎత్తుల లబ్ధంలో సగము

జవాబు:

గ్రూపు – Aగ్రూపు – B
1. రాంబస్ వైశాల్యముD) కర్ణాల లబ్ధంలో సగము కాంతం
2. దీర్ఘచతురస్ర వైశాల్యము.B) పొడవు, వెడల్పుల లబ్ధము
3. సమాంతర చతుర్భుజ వైశాల్యముA) భూమి, ఎత్తుల లబ్ధము
4. త్రిభుజ వైశాల్యముE) భూమి, ఎత్తుల లబ్ధంలో సగము
5. ట్రెపీజియమ్ వైశాల్యముC) ½(a+b)h

 

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

Practice the AP 9th Class Maths Bits with Answers 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

I. ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 10 సెం.మీ., 8 సెం.మీ. మరియు 8 సెం.మీ.లుగా గల దీర్ఘఘనపు ఉపరితల వైశాల్యం ?
A) 640 సెం.మీ².
B) 224 సెం.మీ².
C) 448 సెం.మీ².
D) 288 సెం.మీ².
జవాబు:
C) 448 సెం.మీ².

ప్రశ్న 2.
భుజం పొడవు 3.5 సెం.మీ.లుగా గల ఘనపు ప్రక్కతల వైశాల్యము.
A) 12.25 సెం.మీ².
B) 42.875 సెం.మీ².
C) 73.5 సెం.మీ².
D) 49 సెం.మీ².
జవాబు:
D) 49 సెం.మీ².

ప్రశ్న 3.
క్రమ పట్టకపు ఘనపరిమాణము శాతము ………
A) Ibh
B) భూ చుట్టుకొలత × ఎత్తు
C) 2 (lb + bh + lh)
D) l + b + h
జవాబు:
A) Ibh

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 4.
భుజం 8 సెం.మీలుగా గల ఘనపు ఘనపరిమాణం
A) 144 సెం.మీ³.
B) 216 సెం.మీ³.
C) 512 సెం.మీ³.
D) 384 సెం.మీ³.
జవాబు:
C) 512 సెం.మీ³.

ప్రశ్న 5.
పిరమిడ్ యొక్క ఘనపరిమాణము
A) 1/3 × భూ వైశాల్యం × ఎత్తు
B) ½ × భూ వైశాల్యం × ఎత్తు
C) భూ వైశాల్యం × ఎత్తు
D) భూ చుట్టుకొలత × ఎత్తు
జవాబు:
A) 1/3 × భూ వైశాల్యం × ఎత్తు

ప్రశ్న 6.
లంబకోణ సమద్విబాహు త్రిభుజాకార పట్టకపు సమాన భుజాల పొడవులు 6 సెం.మీ, మరియు 6 సెం.మీ. మరియు ఎత్తు 4 సెం.మీ. అయిన పట్టకపు ఘనపరిమాణం
A) 144 సెం.మీ³.
B) 48 సెం.మీ³.
C) 72 సెం.మీ³.
D) 60 సెం.మీ³.
జవాబు:
C) 72 సెం.మీ³.

ప్రశ్న 7.
ఒక స్థూపాకార పాత్ర యొక్క భూ వైశాల్యం 16 సెం.మీ. మరియు ఎత్తు 8 సెం.మీ. అయిన దాని ఘనపరిమాణము
A) 128 సెం.మీ³.
B) 144 సెం.మీ³.
C) 64 సెం.మీ³.
D) 256 సెం.మీ³.
జవాబు:
A) 128 సెం.మీ³.

ప్రశ్న 8.
ఒక సమఘనపు ఘనపరిమాణము 729 సెం.మీ. ఆ అయిన దాని భుజము
A) 27 సెం.మీ.
B) 9 సెం.మీ.
C) 7 సెం.మీ.
D) 36 సెం.మీ.
జవాబు:
B) 9 సెం.మీ.

ప్రశ్న 9.
ఒక దీర్ఘఘనపు పొడవు మరియు వెడల్పులు వరుసగా 5 సెం.మీ., 4 సెం.మీ. మరియు దాని ఘనపరిమాణము 60 సెం.మీ³. అయిన దాని ఎత్తు ……….
A) 3 సెం.మీ.
B) 4 సెం.మీ.
C) 5 సెం.మీ.
D) 1.5 సెం.మీ.
జవాబు:
A) 3 సెం.మీ.

ప్రశ్న 10.
ఒక దీర్ఘఘనపు ప్రతి భుజము పొడవును 4 రెట్లు పెరిగిన, దాని సంపూర్ణతల వైశాల్యములో పెరుగుదల శాతము ……………….
A) 4
B) 8
C) 12
D) 16
జవాబు:
D) 16

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 11.
ఒక పట్టకపు భూమి, 5 సెం.మీ., 12 సెం.మీ., 13 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజమైన, దాని ఎత్తు 6 సెం.మీలుగా వున్నప్పుడు పట్టకపు ఘనపరిమాణము
A) 180 సెం.మీ³.
B) 60 సెం.మీ³.
C) 360 సెం.మీ³.
D) ఏదీకాదు
జవాబు:
A) 180 సెం.మీ³.

ప్రశ్న 12.
r= 21 సెం.మీ. మరియు h = 7 సెం.మీ. అయిన వృత్తాకార స్థూపము యొక్క వక్రతల వైశాల్యం
A) 924 సెం.మీ².
B) 6468 సెం.మీ².
C) 9702 సెం.మీ.
D) 67914 సెం.మీ².
జవాబు:
A) 924 సెం.మీ².

ప్రశ్న 13.
వ్యాసార్థం 14 సెం.మీ. మరియు ఎత్తు 7 సెం.మీ.లుగా గల స్థూపము యొక్క సంపూర్ణతల వైశాల్యము
A) 1848 సెం.మీ².
B) 1884 సెం.మీ².
C) 1488 సెం.మీ².
D) 392 సెం.మీ².
జవాబు:
A) 1848 సెం.మీ².

ప్రశ్న 14.
d = 7 సెం.మీ. మరియు h= 3 సెం.మీ.లుగా గల సూపము యొక్క ఘనపరిమాణము
A) 118 సెం.మీ³.
B) 115.5 సెం.మీ³.
C) 155.5 సెం.మీ³.
D) 808.5 సెం.మీ³.
జవాబు:
B) 115.5 సెం.మీ³.

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 15.
12 సెం.మీ. పొడవు మరియు 4 సెం.మీ. వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకారపు ముక్కను స్థూపముగా మార్చగా స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం
A) 16 సెం.మీ².
B) 192 సెం.మీ².
C) 48 సెం.మీ².
D) 576 సెం.మీ².
జవాబు:
C) 48 సెం.మీ².

ప్రశ్న 16.
శంఖువు యొక్క వక్రతల వైశాల్యం
A) 1/3πr²h
B) πr²l.
C) πrh
D) πrl
జవాబు:
D) πrl

ప్రశ్న 17.
ఒక శంఖువు యొక్క భూ వ్యాసార్ధం మరియు ఎత్తులు వరుసగా 5 సెం.మీ. మరియు 12 సెం.మీ.లయిన దాని ఏటవాలు ఎత్తు ………
A) 17 సెం.మీ.
B) 7 సెం.మీ.
C) 13 సెం.మీ.
D) 6 సెం.మీ.
జవాబు:
C) 13 సెం.మీ.

ప్రశ్న 18.
d = 7 సెం.మీ., I = 4 సెం.మీ.లుగా గల శంఖువు యొక్క వక్రతల వైశాల్యం
A) 34 సెం.మీ².
B) 24 సెం.మీ².
C) 54 సెం.మీ².
D) 44 సెం.మీ².
జవాబు:
D) 44 సెం.మీ².

ప్రశ్న 19.
d = 14 సెం.మీ., h = 24 సెం.మీ.లుగా గల శంఖువు యొక్క సంపూర్ణతల వైశాల్యం
A) 504 సెం.మీ².
B) 3696 సెం.మీ².
C) 704 సెం.మీ².
D) 528 సెం.మీ².
జవాబు:
C) 704 సెం.మీ².

ప్రశ్న 20.
శంఖువు భూ వ్యాసార్ధము 4.2 సెం.మీ.. మరియు ఎత్తు 4 సెం.మీ. అయిన శంఖువు ఘనపరిమాణము
A) 73.92 సెం.మీ².
B) 52.8 సెం.మీ².
C) 48.6 సెం.మీ².
D) 40.8 సెం.మీ².
జవాబు:
A) 73.92 సెం.మీ².

ప్రశ్న 21.
గోళము యొక్క ఉపరితల వైశాల్యము
A) 4πr²
B) 3πr²
C) 2πr²
D) 5πr²
జవాబు:
A) 4πr²

ప్రశ్న 22.
గోళము యొక్క ఘనపరిమాణము
A) \(\frac{2}{3}\)πr³
B) \(\frac{4}{3}\)πr³
C) πr³
D) \(\frac{5}{6}\)πr³
జవాబు:
B) \(\frac{4}{3}\)πr³

ప్రశ్న 23.
అర్ధగోళము యొక్క సంపూర్ణతల వైశాల్యం
A) 2πr²
B) 3πr²
C) 4πr²
D) 5πr²
జవాబు:
B) 3πr²

ప్రశ్న 24.
వ్యాసార్ధం 7 సెం.మీ.లుగా గల గోళపు ఘనపరిమాణం
A) 1437.3 సెం.మీ³.
B) 4337 సెం.మీ³.
C) 2588 సెం.మీ³.
D) 4678 సెం.మీ³.
జవాబు:
A) 1437.3 సెం.మీ³.

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 25.
వ్యాసార్థం 14 సెం.మీ.లుగా గల అర్ధ గోళపు సంపూర్ణతల వైశాల్యము
A) 2156 సెం.మీ².
B) 616 సెం.మీ².
C) 1258 సెం.మీ².
D) 1848 సెం.మీ².
జవాబు:
D) 1848 సెం.మీ².

II. క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
l = 6 సెం.మీ., b = 4 సెం.మీ. మరియు h = 4 సెం.మీ.లుగా గల దీర్ఘఘనపు ప్రక్కతల వైశాల్యము …………
జవాబు:
80 సెం.మీ².

ప్రశ్న 2.
ఒక ఘనము యొక్క ఘనపరిమాణము 216 సెం.మీ³. అయిన దాని సంపూర్ణతల వైశాల్యము ……….
జవాబు:
216 సెం.మీ².

ప్రశ్న 3.
ఒక ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యం 100 సెం.మీ². అయిన దాని ఘనపరిమాణము ……………
జవాబు:
125 సెం.మీ³.

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 4.
ఒక ఘనపు సంపూర్ణతల వైశాల్యముకు సూత్రము
జవాబు:
6l²

ప్రశ్న 5.
l = 10 సెం.మీ., b = 9 సెం.మీ., h = 8 సెం.మీ.లుగా గల దీర్ఘఘనపు ఘనపరిమాణము ………..
జవాబు:
720 సెం.మీ³.

ప్రశ్న 6.
భుజము \(3 \sqrt{3}\) సెం.మీ.లుగా గల ఒక సమబాహు త్రిభుజము యొక్క వైశాల్యము ………….. సెం.మీ .
జవాబు:
\(\frac{27 \sqrt{3}}{4}\)

ప్రశ్న 7.
భూ వైశాల్యము 18 సెం.మీ². మరియు ఎత్తు 8 సెం.మీ.లుగా గల పిరమిడ్ యొక్క ఘనపరిమాణము
జవాబు:
48 సెం.మీ³.

ప్రశ్న 8.
ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 20 మీ, 12 మీ మరియు 5 మీ. అయిన ఆ గది నాలుగు గోడల వైశాల్యము ………….
జవాబు:
320 సెం.మీ².

ప్రశ్న 9.
ఒక క్రమ చతురస్రాకార పిరమిడ్ యొక్క భుజము 6 సెం.మీ. మరియు ఎత్తు 6 సెం.మీ. అయిన దాని ఘనపరిమాణము ……………….
జవాబు:
72 సెం.మీ³.

ప్రశ్న 10.
ఒక స్తూపము యొక్క వ్యాసార్లము 14 సెం.మీ. మరియు ప్రక్కతల వైశాల్యం 704 సెం.మీ . అయిన దాని ఎత్తు ………………..
జవాబు:
8 సెం.మీ.

ప్రశ్న 11.
r = 2.5 సెం.మీ., h = 1.4 సెం.మీ. . అయిన ఆ స్థూపపు ప్రక్కతల వైశాల్యము. …….
జవాబు:
22 సెం.మీ².

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 12.
పక్క పటంలోని స్థూపపు సంపూర్ణతల వైశాల్యము ……….
AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు 1
జవాబు:
123.2 సెం.మీ².

ప్రశ్న 13.
AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు 2
పటంలో చూపబడిన షీట్ తో ఏర్పడు స్థూపము యొక్క ఘనపరిమాణము ………….
జవాబు:
231 సెం.మీ³.

ప్రశ్న 14.
ఒక స్థూపము యొక్క వ్యాసార్ధము రెట్టింపైన దాని ప్రక్కతల వైశాల్యం ……………. గా మారును.
జవాబు:
రెట్టింపు

ప్రశ్న 15.
ఒక శంఖువు యొక్క భూ వ్యాసార్ధము రెట్టింపైన దాని వక్రతల వైశాల్యం ……….. గా మారును.
జవాబు:
రెట్టింపు

ప్రశ్న 16.
ఒక గోళము యొక్క వ్యాసార్ధం రెట్టింపయిన దాని ఉపరితల వైశాల్యము ………. గా మారును.
జవాబు:
నాలుగు సార్లు

ప్రశ్న 17.
ఒక ఘనము యొక్క భుజము రెట్టింపైన దాని ఘనపరిమాణము ………. గా మారును.
జవాబు:
8 సార్లు

ప్రశ్న 18.
ఒక శంఖువును దాని ఏటవాలుపరంగా తెరచినపుడు ఏర్పడు ఆకారం ………… .
జవాబు:
సెక్టరు

ప్రశ్న 19.
వ్యాసార్ధం 4.9 సెం.మీ.లుగా గల ఒక అర్ధగోళపు వక్రతల వైశాల్యం ………..
జవాబు:
1509.2 సెం.మీ².

AP 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు

ప్రశ్న 20.
వ్యాసార్ధం 6.3 సెం.మీ.లుగా గల ఒక అర్ధగోళపు సంపూర్ణతల వైశాల్యం ……………..
జవాబు:
374.22 సెం.మీ².

III. జతపర్చుము
i)

గ్రూపు – Aగ్రూపు – B
1. శంఖువు యొక్క వక్రతల వైశాల్యంA) 2πr²
2. స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యంB) 2h (l + b)
3. దీర్ఘఘనపు ప్రక్కతల వైశాల్యంC) 2πrh
4. ఘనపు ప్రక్కతల వైశాల్యంD) πrl
5. అర్ధగోళపు వక్రతల వైశాల్యంE) 4l2

జవాబు:

గ్రూపు – Aగ్రూపు – B
1. శంఖువు యొక్క వక్రతల వైశాల్యంD) πrl
2. స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యంC) 2πrh
3. దీర్ఘఘనపు ప్రక్కతల వైశాల్యంB) 2h (l + b)
4. ఘనపు ప్రక్కతల వైశాల్యంE) 4l2
5. అర్ధగోళపు వక్రతల వైశాల్యంA) 2πr²

ii)

గ్రూపు – Aగ్రూపు – B
1. ఘనం యొక్క ఘనపరిమాణంA) \(\frac{4}{3}\)πr3
2. దీర్ఘఘనపు ఘనపరిమాణంB) \(\frac{1}{3}\) πr2h
3. శంఖువు ఘనపరిమాణంC) l3
4. గోళపు ఘనపరిమాణంD) lbh
5. స్థూపపు ఘనపరిమాణంE) πr²h

జవాబు:

గ్రూపు – Aగ్రూపు – B
1. ఘనం యొక్క ఘనపరిమాణంC) l3
2. దీర్ఘఘనపు ఘనపరిమాణంD) lbh
3. శంఖువు ఘనపరిమాణంB) \(\frac{1}{3}\) πr2h
4. గోళపు ఘనపరిమాణంA) \(\frac{4}{3}\)πr3
5. స్థూపపు ఘనపరిమాణంE) πr²h

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

Practice the AP 9th Class Maths Bits with Answers 9th Lesson సాంఖ్యక శాస్త్రము on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

I. ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
యదార్థ సంఘటనల రూపంలో, సంఖ్యాత్మక రూపంలో, పట రూపములో, పట్టిక రూపంలో, గ్రాఫుల రూపంలో సేకరించబడిన సమాచారము
A) సగటు
B) మధ్యగతము
C) బాహుళకము
D) దత్తాంశము
జవాబు:
D) దత్తాంశము

ప్రశ్న 2.
ముందుగానే సేకరింపబడివున్న దత్తాంశమును …….. దత్తాంశము అంటారు.
A) ప్రాథమిక
B) గౌణ
C) పట
D) బారు
జవాబు:
B) గౌణ

ప్రశ్న 3.
18, 24, 15, 17, 33, 16, 29, 45, 12, 3, 33, 21 ల వ్యాప్తి
A) 33
B) 42
C) 48
D) 30
జవాబు:
B) 42

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

ప్రశ్న 4.
0 – 10, 11 – 20, 21 – 30, 31 – 40 ల నందు, 21 – 30 యొక్క వాస్తవ దిగువ హద్దు
A) 21
B) 30
C) 20.5
D) 21.5
జవాబు:
C) 20.5

ప్రశ్న 5.
పై సమస్యలోని తరగతులను …… తరగతులు అంటారు.
A) సమ్మిళిత
B) మినహాయింపు
C) వర్గీకృత
D) ఏదీకాదు
జవాబు:
A) సమ్మిళిత

ప్రశ్న 6.
ఒక పట్టణంలో వారం రోజుల పాటు నమోదైన ఉష్ణోగ్రతలు వరుసగా 42°, 359, 449, 339, 45° మరియు, 42°. సగటు ఉష్ణోగ్రత
A) 42°
B) 35°
C) 39°
D) 40°
జవాబు:
D) 40°

ప్రశ్న 7.
AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము 1
యొక్క సగటు విలువ
A) 2.9
B) 3.9
C) 4.9
D) 3.7
జవాబు:
B) 3.9

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

ప్రశ్న 8.
విచలన సమస్యలో ∑f1d1 = – 12 మరియు A = 15; ∑f = 20 అయిన x\(\overline{\mathbf{x}}\) =
A) 15.6
B) 14.6
C) 14.4
D) 12.4
జవాబు:
C) 14.4

ప్రశ్న 9.
3, 7, 4, 6 మరియు 12 యొక్క మధ్యగతం
A) 7
B) 6
C) 4
D) 12
జవాబు:
B) 6

ప్రశ్న 10.
ఆరోహణ క్రమంలో ఉన్న 5, 8, 9, x, 11, 13ల యొక్క మధ్యగతము 9.5 అయిన x విలువ
A) 8
B) 9.5
C) 10
D) 10.5
జవాబు:
C) 10

ప్రశ్న 11.
వర్గీకృత దత్తాంశము యొక్క సగటు కనుగొనుటకు సూత్రం
A) \(\mathrm{A}+\frac{\Sigma \mathrm{f}_{1} \mathrm{~d}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
B) \(\mathrm{A}+\frac{\Sigma \mathrm{f}_{1} \mathrm{~d}_{\mathrm{l}}}{\mathrm{C}}\)
C) \(A+\frac{\Sigma f_{1} d_{i}}{f_{i}} \times C\)
D) ఏదీకాదు
జవాబు:
A)

ప్రశ్న 12.
3, 7, 8, 8, 7, 6, 8, 4, 3, 11 ల బాహుళకము
A) 3
B) 7
C) 8
D) 11
జవాబు:
C) 8

ప్రశ్న 13.
x1, x2, x3, x4, x5 ల యొక్క సగటు 15. ప్రతి పరిశీలనాంశమును ‘3’ చే గుణించగా ఏర్పడు నూతన సగటు
A) 5
B) 45
C) 18
D) 12
జవాబు:
B) 45

ప్రశ్న 14.
12, 8, 6, 3, 9 ల యొక్క సగటు 7.6 ప్రతి పరిశీలనాంశముకు 5 కలుపగా ఏర్పడు నూతన సగటు
A) 2.6
B) 32.6
C) 12.6
D) 13.6
జవాబు:
C) 12.6

ప్రశ్న 15.
8, 7, 6, 14, 12, 10, 10, 20, 16, 15 మరియు 14 ల సగటు 12.2. ప్రతి పరిశీలనాంశమును 2 చే గుణించి, 3 కలుపగా ఏర్పడు నూతన సగటు
A) 38.6
B) 61
C) 27
D) 27.4
జవాబు:
D) 27.4

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

ప్రశ్న 16.
పై సమస్యలో ఏర్పడు నూతన మధ్యగతము
A) 27
B) 41
C) 40
D) 28
జవాబు:
A) 27

ప్రశ్న 17.
n అంశాలను ఆరోహణ క్రమంలో అమర్చిన వాటి మధ్యగతము ( n సరిసంఖ్య ………
A) \(\frac{n}{2}\) అంశము
B) \(\frac{\mathrm{n}}{2}+1\) అంశము
C) [\(\frac{n}{2}\) మరియు \(\frac{\mathrm{n}}{2}+1\)] వ అంశము
D) ఏదీకాదు
జవాబు:
C) [\(\frac{n}{2}\) మరియు \(\frac{\mathrm{n}}{2}+1\)] వ అంశము

ప్రశ్న 18.
ఒక దత్తాంశమునకు రెండు బాహుళకములున్న అది …………. బాహుళక దత్తాంశము.
A) ఏక
B) ద్వి
C) త్రి
D) ఏదీకాదు
జవాబు:
B) ద్వి

ప్రశ్న 19.
8, 5, 3, 8, 3, 6, 5, 3, 7, 5 మరియు 11 ల బాహుళక దత్తాంశము
A) 5
B) 8
C) 3
D) 5 మరియు 3
జవాబు:
D) 5 మరియు 3

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

ప్రశ్న 20.
రెండు వరుస తరగతుల దిగువ హద్దుల భేదము
A) తరగతి పొడవు
B) వ్యాప్తి
C) పౌనఃపున్యము
D) ఎగువ హద్దు
జవాబు:
A) తరగతి పొడవు

II. క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
x-1, x మరియు x + 4 ల సగటు ………
జవాబు:
x+1

ప్రశ్న 2.
మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతము ………..
జవాబు:
5.5

ప్రశ్న 3.
98.6, 92.1, 94.3, 49.8, 68.3 మరియు 97.8ల వ్యా ప్తి ……………
జవాబు:
48.8

ప్రశ్న 4.
20 – 30, 30 – 40, 40 – 50, ……….. తరగతులను ……………. తరగతులు అంటారు.
జవాబు:
మినహాయింపు

ప్రశ్న 5.
1-5, 6-10, 11-15, 16-20, …….. తరగతులను తరగతులు అంటారు.
జవాబు:
సమ్మిళిత

ప్రశ్న 6.
AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము 2
పై పట్టిక నుండి 6 – 10 తరగతిలో గల మార్కులను చూపు గణన చిహ్నాలు …………..
జవాబు:
AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము 3

ప్రశ్న 7.
ఒక విద్యార్థి యొక్క 4 సబ్జెక్టులలో వచ్చిన మార్కుల సగటు 16. అతనికి ఒక సబ్జెక్టు నందు 2 మార్కులు ఎక్కువ వచ్చిన ఏర్పడు నూతన సగటు …….
జవాబు:
18

ప్రశ్న 8.
ఒక తరగతిలోని ముగ్గురు విద్యార్థుల యొక్క 6 సబ్జెక్టులలో వచ్చిన మార్కుల సగటును కనుగొను పద్ధతి ……….
జవాబు:
సగటు

ప్రశ్న 9.
5 పరిశీలనాంశాల సగటు 16.5 అయిన వాటి మొత్తము …………………
జవాబు:
82.5

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

ప్రశ్న 10.
విచలన పద్ధతిలో ∑fidi = 24 మరియు ∑fi = 30 అయిన సగటు విలువ ……….
జవాబు:
0.8

ప్రశ్న 11.
42, 84, 63, 81 మరియు 19 ల యొక్క మధ్యగతము
జవాబు:
63

ప్రశ్న 12.
ఆరోహణ క్రమంలో అమర్చబడిన 3, 7, 5, 15, 16ల మధ్యగతము 10 అయిన x విలువ
జవాబు:
10

ప్రశ్న 13.
ఆరోహణ క్రమంలో వున్న 10, 18, 24, x, y, 30, 32 మరియు 40 ల మధ్యగతము 27 అయిన x + y విలువ = …………..
జవాబు:
54

ప్రశ్న 14.
x1, x2, x3 మరియు 14 ల సగటు 15. ప్రతి అంశంనకు 3 కలిపిన నూతనంగా ఏర్పడు సగటు …………..
జవాబు:
18

ప్రశ్న 15.
ఒక షూ వర్తకుడు వివిధ రకాల సైజుల స్టాకును పెట్టేందుకు పాటించు కేంద్రీయ స్థానపు కొలత …………
జవాబు:
బాహుళకము

ప్రశ్న 16.
6, 3, 8, 8, 7, 4, 8, 6, 6, 4, 6, 11 ల బాహుళకము …………………
జవాబు:
6

ప్రశ్న 17.
కొన్ని పరిశీలనాంశాలను 2 చే గుణించగా ఏర్పడు నూతన సగటు 9 అయిన అసలు సగటు
జవాబు:
4.5

ప్రశ్న 18.
మొదటి 25 సహజ సంఖ్యల మధ్యగతము ………….
జవాబు:
13

ప్రశ్న 19.
మొదటి 25 సహజ సంఖ్యల సగటు ……………
జవాబు:
13

AP 9th Class Maths Bits 9th Lesson సాంఖ్యక శాస్త్రము

ప్రశ్న 20.
ఇచ్చిన పరిశీలనాంశాలలో ఉండు కేంద్రీయ స్థానపు కొలత …………………..
జవాబు:
బాహుళకము

III. జతపర్చుము
i)

గ్రూపు – Aగ్రూపు – B
1. 10, 11, 12 ల సగటుA) సగటు
2. 10, 12, 14 ల మధ్యగతముB) 12
3. 10, 14, 14 ల బాహుళకంC) 11
4. \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)D) 14
5. \(\frac{\mathrm{N}}{2}\) మరియు \(\frac{\mathrm{N}+1}{2}\)E) మధ్యగతము

జవాబు:

గ్రూపు – Aగ్రూపు – B
1. 10, 11, 12 ల సగటుC) 11
2. 10, 12, 14 ల మధ్యగతముB) 12
3. 10, 14, 14 ల బాహుళకంD) 14
4. \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)A) సగటు
5. \(\frac{\mathrm{N}}{2}\) మరియు \(\frac{\mathrm{N}+1}{2}\)E) మధ్యగతము

ii)

గ్రూపు – Aగ్రూపు – B
1. x1 x2 x3 ల సగటు 10 అయిన
x1 + 1, x2 + 1, x3 + 1 ల సగటు
A) 40
2. x1, x2, x3 ల మధ్యగతం 10 అయిన
x1 – 1, x2 – 1, x3 – 1 ల మధ్యగతం
B) 30
3. x1, x2, x3ల బాహుళకం 10 అయిన
2x1, 2x22x3ల బాహుళకం
C) 11
4. x1 > x2 > x<sub>3</sub> ల వ్యాప్తి 25 మరియు x1 = 5 అయిన x3 = ?D) 9
5. x1 > x2 > x3 ల వ్యాప్తి 20. x1 = 60 అయిన x3= ?E) 20

జవాబు:

గ్రూపు – Aగ్రూపు – B
1. x1 x2 x3 ల సగటు 10 అయిన
x1 + 1, x2 + 1, x3 + 1 ల సగటు
C) 11
2. x1, x2, x3 ల మధ్యగతం 10 అయిన
x1 – 1, x2 – 1, x3 – 1 ల మధ్యగతం
D) 9
3. x1, x2, x3ల బాహుళకం 10 అయిన
2x1, 2x22x3ల బాహుళకం
E) 20
4. x1 > x2 > x<sub>3</sub> ల వ్యాప్తి 25 మరియు x1 = 5 అయిన x3 = ?B) 30
5. x1 > x2 > x3 ల వ్యాప్తి 20. x1 = 60 అయిన x3= ?A) 40

 

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

Practice the AP 9th Class Maths Bits with Answers 8th Lesson చతుర్భుజాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

I. ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
చతుర్భుజం యొక్క నాలుగు అంతరకోణాల మొత్తము
A) 360 లంబకోణాలు
B) 4 లంబకోణాలు
C) 2 లంబకోణాలు
D) లంబకోణము
జవాబు:
B) 4 లంబకోణాలు

ప్రశ్న 2.
ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజము …………
A) సమాంతర చతుర్భుజము
B) గాలి పటం
C) ట్రెపీజియం
D) రాంబస్
జవాబు:
C) ట్రెపీజియం

ప్రశ్న 3.
కింది పటంలో ∠D =
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 1
A) 110°
B) 70°
C) 60°
D) 120°
జవాబు:
D) 120°

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

ప్రశ్న 4.
AB//CD గా గల ABCD ట్రెపీజియంలో ∠A = 45° అయిన ∠D =
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 2
A) 45°
B) 55°
C) 135°
D) 125°
జవాబు:
C) 135°

ప్రశ్న 5.
ABCD సమాంతర చతుర్భుజంలో, ∠D = 80° అయిన ∠A, ∠B, ∠C ల విలువలు వరుసగా
A) 80°, 100°, 100°
B) 100°, 80°, 100°
C) 80°, 100°, 80°
D) 100°, 80°, 80°
జవాబు:
B) 100°, 80°, 100°

ప్రశ్న 6.
ABCD సమాంతర చతుర్భుజంలో BC ని పొడిగించగా ∠A = 40° అయిన ∠DCE =
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 3
A) 40°
B) 140°
C) 50°
D) 60°
జవాబు:
A) 40°

ప్రశ్న 7.
ఒక రాంబస్ యొక్క ఏవైనా రెండు అంతరకోణ సమద్విఖండన రేఖల మిళిత బిందువు వద్ద ఏర్పడు కోణము
A) అల్పకోణము
B) లంబకోణము
C) అధికకోణము
D) ఏదీకాదు
జవాబు:
B) లంబకోణము

ప్రశ్న 8.
కర్ణాల పొడవులు దీనిలో సమానము.
A) రాంబస్
B) చతుర్భుజము
C) సమాంతర చతుర్భుజము
D) దీర్ఘచతురస్రం
జవాబు:
D) దీర్ఘచతురస్రం

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

ప్రశ్న 9.
రాంబస్ యొక్క కర్ణాల మధ్య కోణము
A) అల్ప
B) అధిక
C) లంబ
D) ఏదీకాదు
జవాబు:
C) లంబ

ప్రశ్న 10.
ABCD సమాంతర చతుర్భుజంలో ∠BAD = 65° అయిన ∠ADC =
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 4
A) 25°
B) 115°
C) 65°
D) 35°
జవాబు:
C) 65°

ప్రశ్న 11.
దీర్ఘచతురస్రం యొక్క ప్రతి కోణము
A) లంబకోణము
B) అల్ప కోణము
C) అధిక కోణము
D) పరావర్తన కోణము
జవాబు:
A) లంబకోణము

ప్రశ్న 12.
సమాంతర చతుర్భుజం ABCD లో ∠A మరియు ∠B ల కోణసమద్విఖండన రేఖల ఖండన బిందువు ‘O’ అయిన x° యొక్క విలువ ….
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 5
A) 180°
B) 90°
C) 60°
D) కనుగొనలేము
జవాబు:
B) 90°

ప్రశ్న 13.
∆ABC లో BC = 8 సెం.మీ. మరియు D, E లు AB మరియు AC ల యొక్క మధ్య బిందువులు మరియు AF = 1/2 AD మరియు AG = 1/2 AE అయిన FG =
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 6
A) 4 సెం.మీ.
B) 32 సెం.మీ.
C) 3 సెం.మీ.
D) 2 సెం.మీ.
జవాబు:
D) 2 సెం.మీ.

ప్రశ్న 14.
∆ABC లో D, E మరియు F లు భుజాల మధ్య బిందువులైన ∆DEF = ……..
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 7
A) \(\frac{1}{3}\)∆ABC
B) \(\frac{1}{2}\)∆ABC
C) \(\frac{1}{4}\)∆ABC
D) 3∆ABC
జవాబు:
C) \(\frac{1}{4}\)∆ABC

ప్రశ్న 15.
ఒక చతుర్భుజంలో కర్ణాలు ఒకదానికొకటి సమద్విఖండన చేసుకొనిన ఆ చతుర్భుజం …..
A) రాంబస్
B) సమాంతర చతుర్భుజం
C) చతురస్రము
D) ట్రెపీజియం
జవాబు:
B) సమాంతర చతుర్భుజం

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

ప్రశ్న 16.
ఒక సమాంతర చతుర్భుజం యొక్క రెండు ఆసన్న భుజాల కొలతలు వరుసగా 4.7 సెం.మీ. మరియు 6.3 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత
A) 11 సెం.మీ.
B) 5.5 సెం.మీ.
C) 22 సెం.మీ.
D) 29.51 సెం.మీ.
జవాబు:
C) 22 సెం.మీ.

ప్రశ్న 17.
ఎదుటి కోణాల జతలు సమానంగా గల చతుర్భుజము
A) దీర్ఘచతురస్రము
B) చతురస్రం
C) ట్రెపీజియం
D) సమాంతర చతుర్భుజం
జవాబు:
D) సమాంతర చతుర్భుజం

ప్రశ్న 18.
చతుర్భుజము ABCD లో AB // DC మరియు AD // BC మరియు A = 90° అయిన ABCD ఒక ….. .
A) దీర్ఘచతురస్రము
B) చతురస్రము
C) సమాంతర చతుర్భుజం
D) రాంబస్
జవాబు:
A) దీర్ఘచతురస్రము

ప్రశ్న 19.
ఒక దీర్ఘచతురస్రము యొక్క భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడు పటము
A) చతురస్రము
B) రాంబస్
C) దీర్ఘచతురస్రము
D) సమాంతర చతుర్భుజం
జవాబు:
B) రాంబస్

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

ప్రశ్న 20.
రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడు పటము
A) రాంబస్
B) దీర్ఘచతురస్రము
C) సమాంతర చతుర్భుజము
D) చతురస్రము
జవాబు:
B) దీర్ఘచతురస్రము

II. క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
…….. మరియు …… నందు కర్ణాలు సమానము.
జవాబు:
దీర్ఘచతురస్రం, చతురస్రం

ప్రశ్న 2.
…… మరియు …… నందు కర్ణాలు పరస్పరం లంబాలు.
జవాబు:
చతురస్రం, రాంబస్

ప్రశ్న 3.
సమాంతర చతుర్భుజము యొక్క కర్ణము దానిని రెండు …………. త్రిభుజాలుగా విభజించును.
జవాబు:
సర్వసమాన

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

ప్రశ్న 4.
సమాంతర చతుర్భుజపు భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడు పటము …………
జవాబు:
దీర్ఘచతురస్రం

ప్రశ్న 5.
చతురస్రపు భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడు పటము ……….
జవాబు:
చతురస్రం

ప్రశ్న 6.
ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాలు 6 సెం.మీ. మరియు 9 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత. ………… .
జవాబు:
30 సెం.మీ.

ప్రశ్న 7.
ఒక సమాంతర చతుర్భుజపు రెండు ఆసన్న కోణాల సమద్విఖండన రేఖల ఖండన బిందువు వద్ద ఏర్పడు కోణము ……….
జవాబు:
90°

ప్రశ్న 8.
ఒక సమాంతర చతుర్భుజపు ఆసన్న కోణాలు వరుసగా (2x – 5)° మరియు (4x-1)° అయిన x° = …..
జవాబు:
31°

ప్రశ్న 9.
ఒక సమాంతర చతుర్భుజంలో ఒక కోణము 90° ‘అయిన అది ఒక ………..
జవాబు:
దీర్ఘచతురస్రం

ప్రశ్న 10.
ఆసన్న భుజాలు సమానముగా గల ,సమాంతర చతుర్భుజము ………….
జవాబు:
రాంబస్

ప్రశ్న 11.
ఒక సమాంతర చతుర్భుజంలో, ఒక కోణము 70° అయిన దాని ఎదుటి కోణము విలువ ………..
జవాబు:
70°

ప్రశ్న 12.
ఒక సమాంతర చతుర్భుజపు ఆసన్న కోణాలు 2 : 3 నిష్పత్తిలోనున్న అతి పెద్ద కోణము విలువ …………
జవాబు:
108°

ప్రశ్న 13.
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 8
పై పటంలో x° విలువ = ……….
జవాబు:
125°

ప్రశ్న 14.
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 9
ABCD రాంబస్ లో, ∠OBC = 32° అయిన ∠OCB =
జవాబు:
58°

ప్రశ్న 15.
ఒక చతుర్భుజంలో కర్ణాలు ఖండించుకోవటం వలన ఏర్పడు త్రిభుజాలు సర్వసమానాలైన ఆ చతుర్భుజము ………….
జవాబు:
రాంబస్

AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు

ప్రశ్న 16.
సమాంతర చతుర్భుజంలో ప్రతికోణం 90° అయిన అది ఒక …….
జవాబు:
దీర్ఘచతురస్రం

ప్రశ్న 17.
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 10
ABCD ఒక రాంబస్ అయిన ∠AOD విలువ ……….
జవాబు:
లంబకోణము

ప్రశ్న 18.
PQRS సమాంతర చతుర్భుజంలో
\(\frac{1}{2} \angle \mathrm{P}+\frac{1}{2} \angle \mathrm{Q}=\)……………
జవాబు:
90°

ప్రశ్న 19.
∆PEN లో T, V లు PE మరియు PN ల మధ్య బిందువులైన EN = 4.8 సెం.మీ. అయిన TV =
జవాబు:
2.4 సెం.మీ.

ప్రశ్న 20.
AP 9th Class Maths Bits 8th Lesson చతుర్భుజాలు 11
∆ABC ఒక సమబాహు త్రిభుజమైన D, E లు AB మరియు AC ల మధ్య బిందువులు. DE = 3 సెం.మీ. అయితే AC =
జవాబు:
6 సెం.మీ.

III. జతపర్చుము

గ్రూపు – Aగ్రూపు – B
1. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలుA) దీర్ఘచతురస్రం
2. కర్ణాలు సమానము కాని లంబాలు కావుB) చతురస్రం
3. కర్ణాలు అసమానము కాని లంబాలుC) సమాంతర చతుర్భుజం
4. కర్ణాలు సమానము కావు మరియు లంబాలు కావుD) రాంబస్
5. కర్ణాలు సమానము మరియు లంబాలుE) ట్రెపీజియం

జవాబు:

గ్రూపు – Aగ్రూపు – B
1. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలుE) ట్రెపీజియం
2. కర్ణాలు సమానము కాని లంబాలు కావుA) దీర్ఘచతురస్రం
3. కర్ణాలు అసమానము కాని లంబాలుD) రాంబస్
4. కర్ణాలు సమానము కావు మరియు లంబాలు కావుC) సమాంతర చతుర్భుజం
5. కర్ణాలు సమానము మరియు లంబాలుB) చతురస్రం

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

AP SCERT 9th Class Maths Textbook Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 8th Lesson చతుర్భుజాలు InText Questions

ప్రయత్నించండి

1. AB ని E వరకు పొడిగించండి. \(\angle \mathrm{CBE}\) ని కనుగొనండి. మీరు ఏమి గమనించారు ? \(\angle \mathrm{ABC}\) మరియు \(\angle \mathrm{CBE}\) లు ఎటువంటి కోణాలు ? (పేజీ నెం. 177)
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 1
సాధన.
ABCD ఒక సమాంతర చతుర్భుజము మరియు
\(\angle \mathrm{A}\) = 40°
∴ ABC = 180° – 409
= 140 CBE = 40° (: A మరియు CBE లు
సదృశ కోణాలు) మరియు 2CBE మరియు LABC లు రేఖీయద్వయాలు.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

2. ∆ABC త్రిభుజం గీయండి. \(\overline{\mathrm{AB}}\) మరియు \(\overline{\mathrm{AC}}\) మధ్య బిందువులుగా E మరియు F లుగా గుర్తించండి. E, F లను పటంలో చూపిన విధంగా కలపండి. త్రిభుజంలో EF కొలతను, మూడవ భుజం BC కొలతను కొలవండి. అదే విధంగా \(\angle \mathrm{AEF}\) మరియు \(\angle \mathrm{ABC}\) కోణాలను కలపండి.
మనకు \(\angle \mathrm{AEF}=\angle \mathrm{ABC}\) మరియు \(\overline{\mathrm{EF}}\) = \(\frac {1}{2}\) \(\overline{\mathrm{BC}}\) అని వస్తుంది.
ఈ కోణాలు EF, BC రేఖలపై తిర్యగ్రేఖ AB తో ఏర్పడిన సదృశకోణాలు కావున మనం EF//BC అని చెప్పవచ్చు. మరికొన్ని త్రిభుజాలు గీచి, ఫలితాలను సరిచూడండి. (పేజీ నెం. 188)
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 2
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 3

ఆలోచించి, చర్చించి రాయండి

1. చతురస్రంలో కర్ణాలు సమానమని, అవి పరస్పరం లంబ సమద్విఖందన చేసుకుంటాయని చూపండి. (పేజీ నెం. 185)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 4
ABCD ఒక చతురస్రము అనుకొనుము.
AB = BC = CD = DA అగును.
∆ABC మరియు ∆BAD లలో
AB = AB (ఉమ్మడి భూమి)
\(\angle \mathrm{B} = \angle \mathrm{A}\) (ప్రతికోణం 90°)
BC = AD (సమాన భుజాలు)
∴ ∆ABC ≅ ∆BAD (భు.కో. భు నియమము నుండి)
⇒ AC = BD (CPCT)
అదే విధముగా ∆AOB మరియు ∆COD లలో
\(\angle \mathrm{OAB}=\angle \mathrm{OCD}\) [∵ ఏకాంతర కోణాలు]
\(\angle \mathrm{OBA}=\angle \mathrm{ODC}\) [∵ ఏకాంతర కోణాలు]
AB = DC (చతురస్ర భుజాలు)
∴ ∆AOB ≅ ∆COD (కో.భు. కో, నియమం)
కావున AO = OC (CPCT) ⇒ AC మధ్య బిందువు O
BO = OD (CPCT) ⇒ BD మధ్య బిందువు O
∴ AC మరియు BDల మధ్య బిందువు O.
∴ కర్ణాలు సమద్విఖండన చేసుకొనును.
∆AOB మరియు ∆COB లలో
AB = BC (దత్తాంశము)
OB = OB (ఉమ్మడి భుజము)
AO = OC (నిరూపించబడినది)
∴ ∆AOB ≅ ∆COB
(భు. భు, భు. నియమం ప్రకారం)
⇒ \(\angle \mathrm{AOB}=\angle \mathrm{COB}\) (CPCT)
కాని \(\angle \mathrm{AOB}=\angle \mathrm{COB}\) = 180° (∵ రేఖీయద్వయము)
∴ \(\angle \mathrm{AOB}=\angle \mathrm{COB}\) = \(\frac {180°}{2}\) = 90°
అదే విధముగా \(\angle \mathrm{AOB}=\angle \mathrm{COD}\) (∵ శీర్షాభిముఖ కోణాలు)
\(\angle \mathrm{BOC}=\angle \mathrm{AOD}\)
(∵ శీర్షాభిముఖ కోణాలు)
∴ AC ⊥ BD
చతురస్రంలోని కర్ణాలు లంబసమద్విఖండన చేసుకొనును.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

2. రాంబలో కర్ణాలు దానిని నాలుగు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయని చూపండి. (పేజీ నెం. 185)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 5
ABCD ఒక రాంబస్
AC మరియు BD లు ‘O’ బిందువు వద్ద ఖండించ
∆AOB మరియు ∆COD లలో
\(\angle \mathrm{OAB}=\angle \mathrm{OCD}\) (ఏకాంతర కోణాలు)
AB = CD (రాంబస్ నిర్వచనం)
\(\angle \mathrm{OBA}=\angle \mathrm{ODC}\) (ఏకాంతర కోణాలు)
∴ ∆AOB ≅ ∆COD ……. (1) (కో.భు. కో. నియమం ద్వారా)
⇒ AO = OC (CPCT)
అదే విధముగా ∆AOD ≅ ∆COD ……… (2) [∵ AO = OC; AD = CD; OD = OD భు.భు. భు. నియమం ప్రకారం]
ఇదే విధముగా ∆AOD ≅ ∆COB ……….. (3) అని నిరూపించవచ్చును.
(1), (2) మరియు (3) ల గుండి,
∆AOB ≅ ∆BOC ≅ ∆COD ≅ ∆AOD
∴ రాంబస్ యొక్క కర్ణాలు దానిని నాలుగు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయి.

ఇవి చేయండి

ఒక సమాంతర చతుర్భుజాకారంలో కాగితాన్ని కత్తిరించండి. దాని కర్ణం వెంబడి మరలా కత్తిరించండి. ఎటువంటి ఆకారాలు ఏర్పడ్డాయి ? ఈ రెండు త్రిభుజాలను గూర్చి మీరు ఏమి చెబుతారు ? (పేజీ నెం. 179)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 7
కాగితాన్ని కర్ణం వెంబడి కత్తిరించగా రెండు సర్వసమాన త్రిభుజాలు ఏర్పడ్డాయి.

సిద్ధాంతాలు

1. సమాంతర చతుర్భుజమును కర్ణము రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. (పేజీ నెం. 179)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 8
ABCD సమాంతర చతుర్భుజంను తీసుకోండి.
A, C లను కలపండి. సమాంతర చతుర్భుజానికి AC కర్ణం అవుతుంది.
AB || DC మరియు తిర్యగ్రేఖ కావున
\(\angle \mathrm{DCA}=\angle \mathrm{CAB}\) (ఏకాంతర కోణాలు)
ఇదే విధంగా DA || CB మరియు AC తిర్యగ్రేఖ.
కావున \(\angle \mathrm{DAC}=\angle \mathrm{BCA}\) అయినది.
ఇప్పుడు ∆ACD మరియు ∆CAB లలో
\(\angle \mathrm{DCA}=\angle \mathrm{CAB}\) మరియు \(\angle \mathrm{DAC}=\angle \mathrm{BCA}\)
అలాగే AC = CA(ఉమ్మడి భుజం)
అందువలన ∆ABC ≅ ∆CDA అయినది.
దీని అర్థం ఈ రెండు త్రిభుజాలు కో.భు.కో నియమము (కోణం, భుజం మరియు కోణం) ప్రకారం సర్వసమానాలు. అందుచే కర్ణం AC సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వసమాన పటాలుగా విభజించిందని చెప్పవచ్చు.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

2. సమాంతర చతుర్భుజము ఎదుటి భుజాలు సమానము. (పేజీ నెం. 180)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 9
కర్ణం, సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుందని మనం నిరూపించాం.
పటంలో ∆ACD ≅ ∆CAB అయినది.
అందువలన AB = DC మరియు \(\angle \mathrm{CBA}=\angle \mathrm{ADC}\) అగును.
అలాగే AD = BC మరియు \(\angle \mathrm{DAC}=\angle \mathrm{ACB}\)\(\angle \mathrm{CAB}=\angle \mathrm{DCA}\)
∴ \(\angle \mathrm{ACB}+\angle \mathrm{DCA}=\angle \mathrm{DAC}+\angle \mathrm{CAB}\) అందుచే \(\angle \mathrm{DCB}=\angle \mathrm{DAB}\)
దీని నుండి సమాంతర చతుర్భుజంలో
(i) ఎదుటి భుజాలు సమానమని
(ii) ఎదుటి కోణాలు సమానమని చెప్పవచ్చు.

3. ఒక చతుర్భుజములో ప్రతి ఇత ఎదుటి భుజాలు సమానము అయితే, అది సమాంతర చతుర్భుజమగును. (పేజీ నెం. 180)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 10
ABCD చతుర్భుజము AB = DC మరియు BC = AD అని తీసుకోండి. కర్ణం AC ను గీయండి.
త్రిభుజాలు ∆ABC మరియు ∆CDA పరిశీలించండి.
మనకు BC = AD, AB = DC మరియు AC = CA (ఉమ్మడి భుజం)
కావున ∆ABC ≅ ∆CDA
అందువలన \(\angle \mathrm{BCA}=\angle \mathrm{DAC}\), AC తిర్యగ్రేఖతో కలసి ఉన్నందున AB || DC అగును. ……. (1)
ఇదే విధంగా \(\angle \mathrm{ACD}=\angle \mathrm{CAB}\), CA తిర్యగ్రేఖలో కలిసి ఉన్నందున BC || AD అయినది. …….. (2)
(1), (2) లను బట్టి ABCD ఒక సమాంతర చతుర్భుజము అయినది.

4. ఒక చతుర్భుజములో ప్రతి జత ఎదుటి కోణాలు సమానము అయితే అది సమాంతర చతుర్భుజము. (పేజీ నెం.181)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 11
ABCD చతుర్భుజములో \(\angle \mathrm{A}=\angle \mathrm{C}\) మరియు \(\angle \mathrm{B}=\angle \mathrm{D}\) అయిన ABCD సమాంతర చతుర్భుజమని నిరూపించాలి.
\(\angle \mathrm{A} + \angle \mathrm{B} + \angle \mathrm{C} + \angle \mathrm{D}\) = 360° అని మనకు తెలుసు.
∴ \(\angle \mathrm{A} + \angle \mathrm{B} + \angle \mathrm{C} + \angle \mathrm{D}\) = \(\frac {360°}{2}\)
అదే విధంగా, \(\angle \mathrm{A} + \angle \mathrm{B}\) = 180°
DC ని E వైపు పొడిగించగా,
\(\angle \mathrm{C} + \angle \mathrm{BCE}\) = 180° కావున \(\angle \mathrm{BCE}=\angle \mathrm{ADC}\) అగును.
\(\angle \mathrm{BCE}=\angle \mathrm{D}\) అయితే AD || BC (ఎందుకు ?)
DC ని తిర్యగ్రేఖగా తీసుకో అదే విధంగా AB || DC అని నిరూపించవచ్చు.
కావున ABCD సమాంతర చతుర్భుజము అయినది.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

5. సమాంతర చతుర్భుజములో కర్ణాలు పరస్పరము సమద్విఖండన చేసుకుంటాయి. (పేజీ నెం. 181)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 12
ABCD సమాంతర చతుర్భుజము గీయాలి.
రెండు కర్ణాలు AC మరియు BD లు ‘O’ వద్ద ఖండించుకున్నట్లు గీయాలి.
∆OAB మరియు ∆OCD లలో
పటంలో ఏర్పడిన కోణాలను \(\angle 1, \angle 2, \angle 3, \angle 4\)గా గుర్తించాలి.
\(\angle 1=\angle 3\) (AB || CD మరియు AC తిర్యగ్రేఖ చేసిన ఏకాంతర కోణాలు)
\(\angle 2=\angle 4\) (ఎలా ?) (ఏకాంతర కోణాలు)
మరియు AB = CD (సమాంతర చతుర్భుజ ధర్మం)
కావున కో.భు.కో. త్రిభుజ సర్వసమానత్వ నియమం ప్రకారం
∆OCD ≅ ∆OAB అగును.
అందువలన CO = OA, DO = OB అయినవి. అంటే కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకున్నవి. మనం ఇప్పుడు దీని విపర్యయం కూడా సత్యమో, కాదో పరిశీలిద్దాం. అంటే దీని విపర్యయం “ఒక చతుర్భుజము కర్ణములు పరస్పరము సమద్విఖండన చేసుకుంటే, ఆది సమాంతర చతుర్భుజం” అవుతుంది.

6. ఒక చతుర్భుజంలో కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటే అది సమాంతర చతుర్భుజము అగును. (పేజీ నెం. 182)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 13
ABCD ఒక చతుర్భుజం.
AC, BD కర్ణాలు ‘O’ వద్ద ఖండించుకున్నాయి.
OA = OC, OB = OD అగునట్లు
మనం ABCD ని ఒక సమాంతర చతుర్భుజమని చూపాలి.

7. ఒక త్రిభుజములో రెండు భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన రేఖ, మూడవ భుజానికి సమాంతరముగానూ, మరియు దానిలో సగము ఉంటుంది. (పేజీ నెం. 188)
సాధన.
∆ABC లో AB మధ్యబిందువు E మరియు AC మధ్య బిందువు F.
సారాంశం:
(i) EF || BC
(ii) EF = \(\frac {1}{2}\)BC
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 14
ఉపపత్తి : EF ను ని కలిపి పొడిగించి BAకు సమాంతరంగా C నుండి ఒక రేఖను గీస్తే, అది పొడిగించిన EF రేఖను D వద్ద ఖండిస్తుంది. ∆AEF మరియు ∆CDF
AF = CF (AC మధ్యబిందువు)
\(\angle \mathrm{AFE}=\angle \mathrm{CFD}\) (శీర్షాభిముఖ కోణాలు)
మరియు \(\angle \mathrm{AEF}=\angle \mathrm{CDF}\) (CD || BA తో ED తిర్యగ్రేఖ చేసిన ఏకాంతర కోణాలు)
కో. భు, కో, సర్వసమానత్వ నియమము ప్రకారం
∴ ∆AEF ≅ ∆CDF అయినది.
కావున AE = CD మరియు EF = DF (సర్వసమాన త్రిభుజాల సరూపభాగాలు)
AE = BE అని మనకు ఇవ్వబడింది.
కనుక BE = CD అయింది.
BE || CD మరియు BE = CD కావున BCDE ఒక సమాంతర చతుర్భుజము అయినది.
అందుచే ED || BC
⇒ EF || BC
BCDE సమాంతర చతుర్భుజము కావున ED = BC (ఎలా ?) (∵ DF = EF)
FD = EF అని చూపినందున
∴ 2EF = BC అగును. అందువలన EF = \(\frac {1}{2}\)BC అయినది.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

8. ఒక త్రిభుజములో ఒక భుజము యొక్క మధ్య బిందువు నుండి వేరొక భుజానికి సమాంతరముగా గీయబడిన రేఖ, మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది. (పేజీ నెం. 189)
సాధన.
∆ABC గీయాలి. AB మధ్య బిందువుగా Eని గుర్తించాలి. E గుండా BC కి సమాంతరముగా ‘l’ అనే రేఖను గీయాలి. ఇది AC ని F వద్ద ఖండించిందని అనుకుందాము.
CD || BA ను నిర్మించాలి. మనం AF = CF అని చూపాలి.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 15
అందుచే ∆AEF మరియు ∆CFD లను తీసుకోండి.
\(\angle \mathrm{EAF}=\angle \mathrm{DCF}\) (BA || CD మరియు AC తిర్యగ్రేఖ) (ఎలా ?)
\(\angle \mathrm{AEF}=\angle \mathrm{D}\)
(BA || CD మరియు ED తిర్యగ్రేఖ) (ఎలా ?)
కాని ఏవైనా రెండు భుజాలను సమానంగా చూపలేదు. కావున మనం వీటిని సర్వసమాన . త్రిభుజాలని చెప్పలేము.
అందువలన EB || DC మరియు ED || BC తీసుకోండి. కావున EDCB ఒక సమాంతర చతుర్భుజము అయినది. దీని నుండి BE = DC అయినది.
కాని BE = AE కావున మనకు AE = DC అని వచ్చింది. అందుచే కో.భు. కో. నియమం ప్రకారము
∆AEF ≅ ∆CFD అయినది.
∴ AF = CF అగును.

ఉప సిద్ధాంతాలు

1. దీర్ఘచతురస్రంలో ప్రతీకోణము లంబకోణము అని నిరూపించండి. (పేజీ నెం. 182)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 15
దీర్ఘచతురస్రమనేది ఒక సమాంతర చతుర్భుజము మరియు ఒక కోణము లంబకోణము.
ABCD ఒక దీర్ఘచతురస్రము.
ఒక కోణం \(\angle \mathrm{A}\) = 90° అనుకోండి.
మనం \(\angle \mathrm{B}=\angle \mathrm{C}=\angle \mathrm{D}\) = 90° అని చూపాలి.
ABCD సమాంతర చతుర్భుజము.
కావున AD || BC మరియు AB తిర్యగ్రేఖ
కావున \(\angle \mathrm{A}+\angle \mathrm{B}\) = 180° (తిర్యగ్రేఖకు ఒకే వైపునగల అంతరకోణాల మొత్తం) కాని \(\angle \mathrm{A}\) = 90° (తీసుకోబడింది)
∴ \(\angle \mathrm{B}\) = 180° – \(\angle \mathrm{A}\)
= 180° – 90° = 90°
ఇప్పుడు \(\angle \mathrm{C}=\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{D}=\angle \mathrm{B}\) (సమాంతర చతుర్భుజంలో)
కావున \(\angle \mathrm{C}\) = 90° మరియు \(\angle \mathrm{D}\) = 90° అయింది. అందుచే దీర్ఘచతురస్రములో ప్రతికోణం లంబకోణము అగును.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

2. రాంబలో కర్ణాలు పరస్పరం లంబాలుగా ఉంటాయని చూపండి. (పేజీ నెం.183)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 17
అన్ని భుజాలు సమానంగా గల సమాంతర చతుర్భుజమును రాంబస్ అంటారని మీకు తెలుసు. ABCD ఒక రాంబస్ AC మరియు BD .కరాలు O వద్ద ఖండించుకున్నాయనుకొనండి.
మనం AC కర్ణం, BD కర్ణానికి లంబంగా ఉంటుందని చూపాలి.
∆AOB మరియు ∆BOC లను తీసుకొండి
OA = OC (సమాంతర చతుర్భుజము కర్ణాలు పరస్పరం)
OB = OB(∆AOB మరియు ∆BOC ఉమ్మడి భుజం)
AB = BC (రాంబన్లో భుజాలు)
అందువలన ∆AOB ≅ ∆BOC (డు.భు.భు. నియమము)
కావున \(\angle \mathrm{AOB}=\angle \mathrm{BOC}\)
కాని \(\angle \mathrm{AOB}+\angle \mathrm{BOC}\) = 180° (రేఖీయద్వయం)
అందుచే 2\(\angle \mathrm{AOB}\) = 180°
లేదా \(\angle \mathrm{AOB}\) = \(\frac {180°}{2}\) = 90°
ఈ విధంగా \(\angle \mathrm{BOC}=\angle \mathrm{COD}=\angle \mathrm{AOD}\) = 90° అయినది.
కావున AC కర్ణం, BD కర్ణానికి లంబం అని తెలిసింది.
అందుచే రాంబస్ లో కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి.

3. ABCD సమాంతర చతుర్భుజములో AC కర్ణం \(\angle \mathrm{A}\)ను సమద్విఖండన చేస్తే ABCD ఒక రాంబస్ అవుతుందని నిరూపించండి. (పేజీ నెం. 183)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 18
ABCD ఒక సమాంతర చతుర్భుజము.
అందుచే AB || DC. AC తిర్యగ్రేఖ \(\angle \mathrm{A}\), \(\angle \mathrm{C}\) లను ఖండించింది.
ఈ కావున \(\angle \mathrm{BAC}=\angle \mathrm{DCA}\) (ఏకాంతర కోణాలు) …………. (1)
\(\angle \mathrm{BAC}=\angle \mathrm{DAC}\) …………. (2)
కాని AC కర్ణం, \(\angle \mathrm{A}\)ను సమద్విఖండన చేసింది. కనుక \(\angle \mathrm{BAC}=\angle \mathrm{DAC}\)
∴ \(\angle \mathrm{DCA}=\angle \mathrm{DAC}\) ………. (3)
అందుచే AC కర్ణం \(\angle \mathrm{C}\) ని కూడా సమద్విఖండన చేసింది.
(1), (2) మరియు (3) లను బట్టి, మనకు
\(\angle \mathrm{BAC}=\angle \mathrm{BCA}\)
ΔABCలో \(\angle \mathrm{BCA}\) అంటే BC = AB (సమద్విబాహు త్రిభుజము)
కాని AB = DC మరియు BC = AD (సమాంతర చతుర్భుజము ABCD లో ఎదుటి భుజాలు)
∴ AB = BC = CD = DA
ఈ విధంగా ABCD రాంబస్ అయినది.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

4. దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానమని నిరూపించండి. (పేజీ నెం. 184)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 19
ABCD ఒక దీర్ఘచతురస్రము AC మరియు BD లు వాని కర్ణాలు. మనకు AC = BD అని తెలియాలి.
ABCD దీర్ఘచతురస్రమంటే ABCD ఒక సమాంతర చతుర్భుజము మరియు దానిలో ప్రతీ కోణము ఒక లంబకోణము.
ΔABC మరియు ΔBAD లను తీసుకోండి.
AB = BA (ఉమ్మడి భుజం)
\(\angle \mathrm{B}\) = \(\angle \mathrm{A}\) = 90° (దీర్ఘచతురస్రములో ప్రతీ కోణం )
BC = AD (దీర్ఘచతురస్రములో ఎదుటి భుజాలు)
అందువలన ΔABC ≅ ΔBAD (యు.కో. భు, నియమం) అగును.
దీని నుండి, AC = BD లేదా దీర్ఘచతురస్రములో కర్ణాలు సమానమని చెప్పవచ్చు.

5. సమాంతర చతుర్భుజములో కోణ సమద్విఖండన రేఖలు దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తాయని చూపండి. (పేజీ నెం. 184)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 20
ABCD ఒక సమాంతర చతుర్భుజము \(\angle \mathrm{A},\angle \mathrm{B},\angle \mathrm{C}\) మరియు \(\angle \mathrm{A}\) యొక్క కోణ సమద్విఖండన రేఖలు P, Q, R, S ల వద్ద ఖండించుకొని చతుర్భుజాన్ని ఏర్పరిచాయి. (పటం చూడండి)
ABCD సమాంతర చతుర్భుజములో AD || BC, AB ని తిర్యగ్రేఖగా తీసుకుంటే,
\(\angle \mathrm{A}+\angle \mathrm{B}\) = 180° (సమాంతర చతుర్భుజములో పక్క కోణాలు)
కాని \(\angle \mathrm{BAP}\) = \(\frac {1}{2}\)\(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{ABP}\) = \(\frac {1}{2}\)\(\angle \mathrm{B}\)(AP, BP లు \(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{B}\) యొక్క సమద్విఖండన రేఖలు)
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 21
కావున PQRS లో నాలుగు కోణాలు 90° కు సమానము. అందుచే PQRS ను దీర్ఘచతురస్రమని చెప్పవచ్చు.

ఉదాహరణలు

1. ABCD సమాంతర చతుర్భుజము మరియు \(\angle \mathrm{A}\) = 60° మిగిలిన కోణాల కొలతలు కనుగొనండి. (పేజీ నెం.176)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 22
సమాంతర చతుర్భుజములో ఎదుటి కోణాలు సమానము. కావున ABCD సమాంతర చతుర్భుజము
\(\angle \mathrm{C}=\angle \mathrm{A}\) = 60° మరియు \(\angle \mathrm{B}=\angle \mathrm{D}\)
సమాంతర చతుర్భుజములో పక్క కోణాల మొత్తం 180°
\(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{B}\) లు పక్క కోణాలు కావున
\(\angle \mathrm{D}=\angle \mathrm{B}\) = 180° – \(\angle \mathrm{A}\)
= 180° – 60°
= 120°
అందుచే మిగిలిన కోణాలు 120°, 60°, 120° అవుతాయి.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

2. ABCD సమాంతర చతుర్భుజము \(\angle \mathrm{DAB}\) = 40° అయిన మిగిలిన కోణాలను కనుగొనండి. (పేజీ నెం. 177)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 23
ABCD సమాంతర చతుర్భుజము కావున
\(\angle \mathrm{DAB}=\angle \mathrm{BCD}\) = 40° మరియు AC || BC ప్రక్క కోణాల మొత్తము
\(\angle \mathrm{CBA}=\angle \mathrm{DAB}\) = 180°
∴ \(\angle \mathrm{CBA} = 180 – 40° = 140°
దీనిద్వారా [latex]\angle \mathrm{ADC}\) = 140° అయితే \(\angle \mathrm{BCD}\) = 40°

3. సమాంతర చతుర్భుజములో రెండు ఆసన్నభుజాలు వరుసగా 4.5 సెం.మీ. మరియు 3 సెం.మీ. దాని చుట్టుకొలత కనుగొనుము. (పేజీ నెం. 177)
సాధన.
సమాంతర చతుర్భుజము ఎదుటి భుజాల కొలతలు – సమానము.
కావున మిగిలిన రెండు భుజాలు 4.5 సెం.మీ. మరియు 3 సెం.మీ. కలిగి ఉంటాయి.
కావున, దీని చుట్టుకొలత = 4.5 + 3 + 4.5 + 3
= 15 సెం.మీ.

4. ABCD సమాంతర చతుర్భుజములో పక్కకోణాలు \(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{B}\) యొక్క సమద్విఖందన రేఖలు P వద్ద ఖండించుకున్నాయి. ఆయిన \(\angle \mathrm{APB}\) = 90° అని చూపండి. (పేజీ నెం. 177)
సాధన.
ABCD ఒక సమాంతర చతుర్భుజము పక్క కోణాలు \(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{B}\) యొక్క సమద్విఖండన రేఖలు \(\overline{\mathrm{AP}}\) మరియు \(\overline{\mathrm{BP}}\) లు సమాంతర చతుర్భుజములో పక్క కోణాలు సంపూరకాలు కావున
\(\angle \mathrm{A}\) + \(\angle \mathrm{B}\) = 180°
\(\frac {1}{2}\)\(\angle \mathrm{A}\) + \(\frac {1}{2}\)\(\angle \mathrm{B}\) = \(\frac {180°}{2}\)
⇒ \(\angle \mathrm{PAB}\) + \(\angle \mathrm{PBA}\) = 90°
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 24
∆APB లో
\(\angle \mathrm{PAB}\) + APB + \(\angle \mathrm{PBA}\) = 180°
(త్రిభుజము మూడు కోణాల మొత్తము)
\(\angle \mathrm{APB}\) = 180° – (\(\angle \mathrm{PAB}\) + \(\angle \mathrm{PBA}\))
= 180° – 90°
= 90°
నిరూపించబడినది.

5. \(\overline{\mathrm{AB}}\) మరియు \(\overline{\mathrm{DC}}\) రెండు సమాంతర రేఖలు. తిర్యగ్రేఖ l, \(\overline{\mathrm{AB}}\) ని P వద్ద \(\overline{\mathrm{DC}}\) ని R వద్ద ఖండించింది. అయిన అంతరకోణాల సమద్విఖందన రేఖలు దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తాయని చూపండి.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 25
(పేజీ నెం. 185)
సాధన.
\(\overline{\mathrm{AB}}\) || \(\overline{\mathrm{DC}}\), తిర్యగ్రేఖ l \(\overline{\mathrm{AB}}\) ని P వద్ద \(\overline{\mathrm{DC}}\) ని R వద్ద ఖండించింది.
\(\overline{\mathrm{PQ}}\), \(\overline{\mathrm{RQ}}\), \(\overline{\mathrm{RS}}\) మరియు \(\overline{\mathrm{PS}}\) లు \(\angle \mathrm{RPB},\angle \mathrm{CRP},\angle \mathrm{DRP}\) మరియు \(\angle \mathrm{APR}\)ల యొక్క సమద్విఖండన రేఖలు అనుకొనండి.
\(\angle \mathrm{BPR}=\angle \mathrm{DRP}\) (ఏకాంతర కోణాలు) ……. (1)

కాని \(\angle \mathrm{RPQ}\) = \(\frac {1}{2}\) \(\angle \mathrm{BPR}\)
(∵ \(\overline{\mathrm{PQ}}\), \(\angle \mathrm{BPR}\) యొక్క సమద్విఖండన రేఖ)
అలాగే \(\angle \mathrm{PRS}\) = \(\frac {1}{2}\)\(\angle \mathrm{DRP}\) (∵ \(\overline{\mathrm{RS}}\), \(\angle \mathrm{DRP}\) యొక్క సమద్విఖండన రేఖ) …………….. (2)
(1), (2) లను బట్టి
\(\angle \mathrm{RPQ}=\angle \mathrm{PRS}\)
ఇవి \(\overline{\mathrm{PR}}\) తిర్యగ్రేఖగా \(\overline{\mathrm{PQ}}\) మరియు \(\overline{\mathrm{RS}}\) రేఖలపై ఏర్పరచిన ఏకాంతర కోణాలు, కావున
∴ \(\overline{\mathrm{PQ}}\) || \(\overline{\mathrm{RS}}\)
ఇదేవిధంగా \(\angle \mathrm{PRQ}=\angle \mathrm{RPS}\) కావున \(\overline{\mathrm{PS}}\) || \(\overline{\mathrm{RQ}}\)
అందువలన PQRS ఒక సమాంతర చతుర్భుజం అయినది …………… (3)
మనకు \(\angle \mathrm{BPR}=\angle \mathrm{CRP}\) = 180° (తిర్యగ్రేఖ (l) ఒకే వైపున ఏర్పరచిన అంతరకోణాలు కావున \(\overline{\mathrm{AB}}\) || \(\overline{\mathrm{DC}}\))
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 26
(3), (4) లను బట్టి PQRS సమాంతర చతుర్భుజము మరియు
ప్రతీకోణము లంబకోణము అయినది. కావున PQRS ఒక దీర్ఘచతురస్రము.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

6. ∆ABC లో BC భుజం మీదకు మధ్యగతం AD గీయబడినది. AD = ED అగునట్లు 5 వరకు పొదిగించబడినది. ఆయిన ABEC ఒక సమాంతర చతుర్భుజాన్ని నిరూపించండి. (పేజీ నెం. 186)
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 27
∆ABC త్రిభుజములో AD మధ్యగతం.
AD = ED అగునట్లు AD ని E వరకు పొడిగించబడింది.
BE మరియు CE లను కలపండి.
∆ABD మరియు ECD లలో
BD = DC (BC మధ్య బిందువు D)
\(\angle \mathrm{ADB}=\angle \mathrm{EDC}\) (శీర్షాభిముఖ కోణాలు)
AD = ED (ఇవ్వబడినది)
కావున ∆ABD ≅ ∆EDC అయినది. (భు.కో.భు. నియమము)
అందువలన AB = CE (సర్వసమాన త్రిభుజాలలో సరూప భాగాలు)
అలాగే \(\angle \mathrm{ABD}=\angle \mathrm{ECD}\)
ఇవి \(\overline{\mathrm{AB}}\) మరియు \(\overline{\mathrm{BC}}\) రేఖలతో \(\overline{\mathrm{CE}}\) తిర్యగ్రేఖ చేసిన ఏకాంతర కోణాలు.
∴ \(\overline{\mathrm{AB}}\) || \(\overline{\mathrm{CE}}\)
ABEC చతుర్భుజంలో
AB || CE మరియు AB = CE
అయినందున ABEC ఒక సమాంతర చతుర్భుజము అయినది.

7. ∆ABC లో D, E మరియు F లు వరుసగా AB, BC మరియు CA భుజాల మధ్యబిందువులు. వీటిని ఒకదానితో మరొకటి కలుపగా ఏర్పడిన నాలుగు త్రిభుజాలు సర్వసమానాలని చూపండి. (పేజీ నెం. 190)
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 28
సాధన.
∆ABC లో D, E లు వరుసగా \(\overline{\mathrm{AB}}\), \(\overline{\mathrm{BC}}\) భుజాల మధ్యబిందువులు.
కావున మధ్యబిందువు సిద్ధాంతం ప్రకారము DE || AC
ఇదే విధంగా DF || BC మరియు EF || AB అగును.
అందువలన ADEF, BEFD మరియు CFDE లు సమాంతర చతుర్భుజాలు.
ఇప్పుడు ADEF సమాంతర చతుర్భుజములో DF కర్ణం.
కావున ∆ADF ≅ ∆DEF
(కర్ణం, సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా చేసింది)
ఇదే విధంగా ∆BDE ≅ ∆DEF మరియు ∆CEF ≅ ∆DEF అగును.
కనుక నాలుగు త్రిభుజాలు సర్వసమానములు అయినవి. దీని నుండి “త్రిభుజ భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడిన నాలుగు భుజాలు సర్వసమానములని” నిరూపించాము.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

8. l, m మరియు n అనే మూడు సమాంతర రేఖలను ని మరియు qఅనే రెండు తిర్యగ్రేఖలు A, B, C మరియు D, E, F ల వద్ద ఖండించాయి. తిర్యగ్రేఖ p. ఈ సమాంతర రేఖలను రెండు సమాన అంతరఖండాలు AB, BC లుగా విభజిస్తే q తిర్యగ్రేఖ కూడా సమాన ఆంతరఖండాలు DE మరియు EF లుగా విభజిస్తుందని చూపండి. (పేజీ నెం. 191)
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 29
సాధన.
AB, BC మరియు DE, EF ల మధ్య సమానత్వ భావనతో సమన్వయ పరచాలి. A నుండి Fకు రేఖను గీయగా అది ‘m’ రేఖను G వద్ద ఖండించిందనుకొనండి.
∆ACF లో AB = BC (దత్తాంశము)
కావున AC మధ్యబిందువు B మరియు BG || CF (ఎలా ?) అందుచే AF యొక్క మధ్యబిందువు G అయినది (త్రిభుజ మధ్య బిందువు సిద్ధాంతం) , ఇప్పుడు ∆AFD ఇదే రీతిలో పరిశీలించగా G అనేది AF కు మధ్యబిందువు మరియు GE || AD కావున DF మధ్యబిందువు E ఆగును.
ఇందు మూలంగా DE = EF అయినది.
ఈ విధంగా I, m మరియు n రేఖలు q తిర్యగ్రేఖపై కూడా సమాన అంతర ఖండాలు చేసాయి.

9. ∆ABC లో AD మరియు BE లు రెండు మధ్యగత రేఖలు మరియు BE || DF (పటంలో చూడండి). అయిన CF = \(\frac {1}{4}\)AC అని చూపండి. (పేజీ నెం. 191)
సాధన.
∆ABC లో BC మధ్యబిందువు D మరియు BE || DF. మధ్యబిందువు సిద్ధాంతం ప్రకారము CE మధ్యబిందువు F అగును.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 30
∴ CF = \(\frac {1}{2}\)CE
= \(\frac {1}{2}\) (\(\frac {1}{2}\)AC) (ఏలా ?
కావున CF = \(\frac {1}{4}\) AC అయినది.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions

10. ABCత్రిభుజంలో BC, CA మరియు AB భుజాలకు సమాంతరంగా A, B మరియు Cల గుండా సమాంతర రేఖలు గీస్తే అవి P,Q మరియు Rల వద్ద ఖండించు కున్నాయి. ∆PQR త్రిభుజము చుట్టుకొలత AABC త్రిభుజము చుట్టుకొలతకు రెట్టింపు ఉంటుందని చూపండి.
(పేజీ నెం.191)
సాధన.
AB || QP మరియు BC || RQ కావున ABCQ ఒక సమాంతర చతుర్భుజము.
ఇదే విధంగా BCAR, ABPC లు కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు InText Questions 31
∴ BC = AQ మరియు BC = RA
⇒ QR మధ్యబిందువు A అగును.
ఇదేవిధంగా B, C లు వరుసగా PR మరియు PQల మధ్య బిందువులు అవుతాయి.
∴ AB = \(\frac {1}{2}\)PQ; BC = \(\frac {1}{2}\)QR మరియు
CA = \(\frac {1}{2}\) PR (ఎలా?) (సంబంధిత సిద్ధాంతం చెప్పండి)
ఇప్పుడు ∆PQR చుట్టుకొలత = PQ + QR + PR
= 2AB + 2BC + 2CA
= 2(AB + BC + CA)
= 2 (∆ABC యొక్క చుట్టుకొలత).

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4

AP SCERT 9th Class Maths Textbook Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 8th Lesson చతుర్భుజాలు Exercise 8.4

ప్రశ్న 1.
ABC త్రిభుజంలో AB పై D ఒక బిందువు మరియు AD = \(\frac {1}{4}\) AB. ఇదే విధంగా AC పై బిందువు E మరియు AE = \(\frac {1}{4}\)AC, DE = 2 సెం.మీ. అయిన BC ఎంత?
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 1
∆ABC లో D మరియు E లు AB మరియు AC లపై గల బిందువులు.
ఈ బిందువులు AD = \(\frac {1}{4}\) AB మరియు AE = \(\frac {1}{4}\) AC.
X, Yలు AB మరియు AC ల మధ్య బిందువులు అనుకొనుము.
D, E మరియు X, Y లను కలుపుము.
∆AXY, D, E E AX మరియు AY ల మధ్య బిందువులు.
∴ DE // XY మరియు DE = \(\frac {1}{2}\)XY
DE = 2 సెం.మీ. కావున
⇒ 2 = \(\frac {1}{2}\)XY
⇒ XY = 2 × 2 = 4 సెం.మీ.
అదే విధంగా ∆ABC లో X, Y లు AB మరియు AC ల మధ్య బిందువులు.
∴ XY // BC మరియు XY = \(\frac {1}{2}\)BC
XY = 4 సెం.మీ.
కావున BC = 4 × 2 = 8 సెం.మీ

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4

ప్రశ్న 2.
ABCD చతుర్భుజములో AB, BC, CD మరియు DA ల మధ్య బిందువులు E, F, G మరియు H లు అయిన EFGH సమాంతర చతుర్భుజమని నిరూపించుము.
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 2
ABCD చతుర్భుజములో భుజాల యొక్క మధ్య బిందువులు E, F, G మరియు H లు.
∆ABC లో AB మరియు BC ల యొక్క మధ్య బిందువులు E మరియు F అనుకొనుము.
∴ EF // AC మరియు EF – – AC . అట్లాగే AACD లో HG // AC
మరియు HG = \(\frac {1}{2}\) AC
∴ EF // HG మరియు EF = HG
చతుర్భుజము EFGH లో EF = HG మరియు EF // HG.
∴ EFGH ఒక సమాంతర చతుర్భుజము.

ప్రశ్న 3.
రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులను వరుసగా కలిపితే ఏర్పడే పటం దీర్ఘచతురస్రమని చూపండి.
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 3
☐ABCD ఒక రాంబస్.
P, Q, R మరియు వీలు రాంబస్ ☐ABCD యొక్క భుజాల మధ్య బిందువులు,
∆ABC లో P, Qలు AB మరియు BCల యొక్క మధ్య బిందువులు.
∴ PQ // AC మరియు PQ = \(\frac {1}{2}\)AC ……… (1)
అదే విధంగా ∆ADC లో S, R లు AD మరియు CDల యొక్క మధ్య బిందువులు.
∴ SR // AC మరియు SR = \(\frac {1}{2}\)AC …….. (2)
(1) మరియు (2) ల నుండి
PQ // SR మరియు PQ = SR
అదే విధముగా QR // PS మరియు QR = PS
∴ ☐PQRS ఒక సమాంతర చతుర్భుజము.
రాంబన్ యొక్క కర్ణాలు లంబనమద్విఖండన చేసుకొనును కావున \(\angle \mathrm{AOB}\) = 90°
∴ \(\angle \mathrm{P}=\angle \mathrm{AOB}\) = 90°
[//gm PYOX యొక్క ఎదుటి కోణాలు]
∴ PQRS ఒక దీర్ఘచతురస్రము. ఎందుకనగా రెండు జతల ఎదుటి భుజాలు సమానము మరియు సమాంతరాలు, ఒక కోణము 90° కాబట్టి.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4

ప్రశ్న 4.
ABCD సమాంతర చతుర్భుజములో AB, DCE మధ్య బిందువులు వరుసగా E మరియు F అయిన AF మరియు EC రేఖాఖండాలు కర్ణము BD ని త్రిథాకరిస్తాయని చూపండి.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 4
సాధన.
ABCD ఒక సమాంతర చతుర్భుజము. E మరియు Fలు AB మరియు CD భుజాల మధ్య బిందువులు.
∴ AE = \(\frac {1}{2}\)AB మరియు CF = \(\frac {1}{2}\)CD
అదే విధముగా AE = CF [∵ AB = CD]
చతుర్భుజము AECF లో AE = CF మరియు
AE // CF కావున AECF ఒక సమాంతర చతుర్భుజము.
∆EQB మరియు ∆FDP లలో
EB = FD [//gm యొక్క సగ భుజాలు సమానము]
\(\angle \mathrm{EBQ}=\angle \mathrm{FDP}\) [EB // FD కావున ఏకాంతర కోణాలు]
\(\angle \mathrm{QEB}=\angle \mathrm{PFD}\)
[∵ \(\angle \mathrm{QED}=\angle \mathrm{QCF}=\angle \mathrm{PFD}\)]
∴ ∆EQB ≅ ∆FPD (తో. భు. తో. నియమం)
∴ BQ = DP [∵ CPCT] ………. (1)
∆DQC లో; PF // QC మరియు F, DC భుజపు మధ్య బిందువు
DQ మధ్య బిందువు P కావున
DP PQ …………. (2)
(1) మరియు (2) ల నుండి, DP = PQ = QB.
∴ కర్ణము BD ని AF మరియు CE లు త్రిథాకరిస్తాయి.

ప్రశ్న 5.
చతుర్భుజములో ఎదుటి భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన రేఖాఖండాలు సమద్విఖండన చేసుకుంటాయని చూపండి.
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 5
ABCD ఒక చతుర్భుజము అనుకొనుము.
P, Q, R, S లు చతుర్భుజము ABCD యొక్క భుజాల మధ్య బిందువులు.
(P, Q), (Q, R), (R, S) మరియు (S, P) లను కలుపుము.
∆ABC లో P, Qలు AB మరియు BC ల మధ్య బిందువులు.
∴ PQ // AC మరియు PQ = \(\frac {1}{2}\)AC ……… (1)
∆ADC నుండి, S, Rలు AD మరియు CDల మధ్య బిందువులు.
∴ SR // AC మరియు SR = \(\frac {1}{2}\)AC …….. (2)
∴ (1) మరియు (2) ల నుండి,
PQ = SR మరియు PQ // SR
∴ PQRS ఒక సమాంతర చతుర్భుజము.
PQRS సమాంతర చతుర్భుజములో PR మరియు QSలు కర్ణాలు.
∴ PR మరియు QS లు సమద్విఖండన చేసుకొనును.

AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4

ప్రశ్న 6.
ABC లంబకోణ త్రిభుజములో C లంబకోణం. కర్ణము ABమధ్యబిందువు M గుందా BCకు సమాంతరముగా గీచిన రేఖ AC ని D వద్ద ఖండిస్తే కింది వానిని నిరూపించండి.
(i) AC మధ్య బిందువు D
(ii) MD ⊥ AC
(iii) CM = MA = \(\frac {1}{2}\)AB
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 6
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 8 చతుర్భుజాలు Ex 8.4 7
∆ABC లో \(\angle \mathrm{C}\) = 90° మరియు AB యొక్క మధ్యబిందువు M.
(i) AC పై D ఒక బిందువు అనుకొనుము. AC యొక్క మధ్య బిందువు D’ అనుకొనుము.
∴ AD’ = D’C
BC కి సమాంతరంగా గల రేఖ D’M.
కాని దత్తాంశం ప్రకారము DM, BC కి సమాంతర రేఖ. దీనిని బట్టి ఒక బిందువు M గుండా పోవు రెండు రేఖలు ఒక రేఖకు సమాంతరము అని నిరూపితమైనది. ఇది అసంభవము.
∴ D’ అనునది Dతో ఏకీభవిస్తుంది.
∴ AC మధ్య బిందువు ‘D’ అగును.

(ii) సమస్య (i) నుండి DM // BC అదే విధముగా \(\angle \mathrm{ADM}=\angle \mathrm{ACB}\) = 90° (సదృశ్యకోణాలు)
⇒ MD ⊥ AC

(iii) ΔADM మరియు ΔCDM లలో
AD = CD [∵ సమస్య (i) నుండి AC మధ్య బిందువు D]
\(\angle \mathrm{ADM}=\angle \mathrm{MDC}\) (∵ ప్రతీ కోణము 90°)
DM = DM (ఉమ్మడి భుజము)
∴ ∆ADM ≅ ∆CDM (భు.కో.భు. నియమం ప్రకారం)
⇒ CM = MA (CPCT)
⇒ CM = \(\frac {1}{2}\) AB (∵ AB మధ్య బిందువు M)
∴ CM = MA = \(\frac {1}{2}\) AB