SCERT AP 9th Class Biology Study Material Pdf Download 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 7th Lesson Questions and Answers జంతువులలో ప్రవర్తన
9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
ప్రతిచర్య ఉపయోగం ఏమిటి? (AS 1)
ఎ) ఇది నేర్చుకోవలసి ఉంటుంది
బి) ప్రతిసారి వేరువేరుగా జరుగుతుంది
సి) ఇది నేర్చుకోవలసిన అవసరం లేదు
డి) ఏదీ కాదు
జవాబు:
సి) ఇది నేర్చుకోవలసిన అవసరం లేదు
ప్రశ్న 2.
బోనులో ఉన్న ఎలుకను బోనులోని ప్రత్యేక భాగానికి వెళ్ళినప్పుడు తక్కువ విద్యుత్ సరఫరా చేసి షాక్ కు గురిచేసిన, అది ఆ భాగము వైపు వెళ్ళడం మానివేస్తుంది. ఇది …. (AS 1)
ఎ) సహజాత ప్రవృత్తి బి) నిబంధన సి) అనుకరణ డి) ముద్రవేయడం
జవాబు:
బి) నిబంధన
ప్రశ్న 3.
భేదాలు తెలపండి.
ఎ) అనుకరణ మరియు అనుసరణ బి) సహజాత ప్రవృత్తి మరియు నిబంధన. (AS 1)
ఎ) అనుకరణ మరియు అనుసరణ
జవాబు:
అనుకరణ | అనుసరణ |
1) మనుష్యులు, జంతువులయందు అనుకరణను చూస్తాము. | 1) జంతువులలో మాత్రం అనుసరణను చూస్తాము. |
2) అనుకరణలో ఒక జంతువు లేదా మానవుడు మరొక జంతువు లేదా మానవుని ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. | 2) అనుసరణ ద్వారా కోడి పిల్లలు, బాతు పిల్లలు చిన్నతనంలోనే తల్లిని గుర్తిస్తాయి. |
3) కోప్లెర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తిమీద ప్రయోగాలు చేశాడు. | 3) కోనార్డ్ లోరెంజ్ తెల్ల బాతులను స్వయంగా పెంచి అనుసరణను అధ్యయనం చేశాడు. |
బి) సహజాత ప్రవృత్తి మరియు నిబంధన
సహజాత ప్రవృత్తి | నిబంధన |
1) ఇది పుట్టుకతో వచ్చే ప్రవర్తన. | 1) ఇది పుట్టుకతో వచ్చే ప్రవర్తన కాదు. |
2) ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదు. | 2) ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన. |
3) పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తికోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం ఉదాహరణలు. | 3) పెద్దవాళ్ళు రాగానే గౌరవంగా లేచి నిలబడడం, పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం నిబంధనకు ఉదాహరణలు. |
ప్రశ్న 4.
మనుషుల ప్రవర్తన జంతువుల ప్రవర్తన కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఒక ఉదాహరణతో వివరించండి. (AS 1)
జవాబు:
- మానవులు కూడా ఇతరత్రా జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు.
- కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది.
- ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు, ఆలోచించగల శక్తి కలిగినవారు.
- మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు.
- ఉదాహరణకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది. కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తరువాతే భోజనం చేయడం మొదలు పెడతాం.
- కానీ జంతువులు తమకు ఆహారం దొరకగానే వెంటనే తింటాయి.
ప్రశ్న 5.
వరుసగా వెళ్తున్న చీమలను గమనించండి. కొన్నిసార్లు రెండు చీమలు మాట్లాడుకున్నట్లు మీకు అనిపిస్తుంది కదా ! మీ ఉపాధ్యాయున్ని అడిగి చీమలు ఎలా భావప్రసారం చేసుకుంటాయో మీ నోట్‌బుక్ లో రాయండి. (AS 3)
జవాబు:
- చీమలు వెదకులాడడం లేదా సమాచారం అందించడం అనేవి అవి విడుదల చేసే ఫెర్మెనుల వలన జరుగుతుంది.
- చీమలు రసాయన సంకేతాలయిన ఫెర్మెనులను స్పర్శకాలతో గుర్తించడం ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. స్పర్శకాలను వాసనలు గ్రహించడానికి ఉపయోగిస్తాయి.
- ఒక జత స్పర్శకాలు చీమలకు అవి ఎటువైపు వెళ్ళాలి, వాసన తీవ్రత గురించిన సమాచారాన్ని అందిస్తాయి.
- చీమలు నేలమీద జీవిస్తాయి కనుక ఫెర్సె నులను విడుదల చేయుట ద్వారా మిగతా చీమలు దానిని అనుసరిస్తాయి.
- కొన్ని చీమలు వాటి యొక్క హనువులు (మాండిబుల్స్) ద్వారా శబ్దములను ఉత్పత్తి చేస్తాయి.
- శబ్దములను సమూహమునందలి ఇతర చీమలతో భావ ప్రసారానికి వినియోగిస్తాయి.
- ప్రమాదము ఉందనే విషయాన్ని మరియు ఆహారం ఉన్న ప్రదేశమును చీమలు ఫెర్మెనుల ఉత్పత్తి ద్వారా తెలుసుకుంటాయి.
ప్రశ్న 6.
నాగమ్మ తన వద్ద ఉన్న బాతుగుడ్లను, కోడిగుడ్లతో కలిపి పొదగేసింది. పొదిగిన తరువాత బాతు పిల్లలు కూడా కోడినే తమ తల్లిగా భావించాయి. దాని వెంటే తిరుగుతున్నాయి. దీనిని ఎలా వివరిస్తావు? (AS 3)
జవాబు:
- బాతు పిల్లలు, కోడి పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి.
- బాతు పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే కదులుతున్నది ఏదైనా కనిపిస్తే దాని వెనకే పోతాయి.
- బాతు పిల్లలు ఆ జీవితో గడుపుతూ దానినే తల్లిగా భావిస్తాయి.
- అనుసరణ అనే లక్షణం వలన బాతుపిల్లలు చిన్న వయసులోనే ఆ బాతుని తమ తల్లిగా భావించాయి.
ప్రశ్న 7.
“జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం వలన జంతువుల పట్ల సానుకూల దృక్పథం జనిస్తుంది” దీనిని నీవు ఎలా సమరిస్తావు? సరియైన ఉదాహరణలతో వివరించండి. (AS 6)
జవాబు:
- జంతువులు వివిధ సందర్భాలలో ప్రదర్శించే ప్రవర్తనను అర్థం చేసుకోవడం వలన వాటిపట్ల సానుకూల దృక్పథం జనిస్తుంది. దీనిని నేను సమర్థిస్తాను.
- జంతువులు వాటి అవసరాలకు అనుగుణంగా అరవడం, ఘీంకరించడం చేస్తాయి. వివిధ రకాల హావ భావాలను ప్రదర్శిస్తాయి.
- ఉదాహరణకు పశువులు అరుస్తాయి. ఆ అరుపు పాటికి అవసరమైన నీరు, ఆహారం గురించి అయి ఉంటుంది.
- వాటికి కావలసిన నీరు, ఆహారం ఇచ్చిన తరువాత అవి ప్రశాంతంగా ఉంటాయి.
- కాకి చనిపోతే మిగిలిన కాకులు అన్నీ గుమిగూడి అరిచే అరుపులను మనము అవి వ్యక్తపరచే బాధగా గుర్తించాలి.
- చీమలు అన్నీ ఆహార సేకరణ కోసం బారులు తీరినప్పుడు మనం వాటిలో ఉన్న సమైక్య శక్తిని, సహకార స్వభావాన్ని గుర్తించాలి.
- కుక్కలు రాత్రి సమయములో మొరుగునప్పుడు అవి మనకు దొంగలు రాకుండా సహాయం చేస్తున్నాయని భావించాలి. కాని మనకు నిద్రాభంగం చేస్తున్నాయని భావించకూడదు.
- మనకు తోడూ నీడగా ఉండే జంతువుల యొక్క ప్రవర్తన పట్ల సానుభూతి దృక్పథం కలిగి వాటి యొక్క అవసరాలను తీర్చాలి. ‘నీవు జీవించు, జీవించనివ్వు’ అనే సూత్రాన్ని మనం పాటించాలి.
ప్రశ్న 8.
పాఠ్యాంశములో చర్చించిన అనేక రకాల జంతువుల ప్రవర్తనలను ఉదాహరణలతో వివరించండి. (AS 7)
(లేదా)
జంతువులలో సాధారణంగా ఏయే రకాలైన ప్రవర్తనలను గమనించవచ్చు ? వీటిని గూర్చి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జంతువుల ప్రవర్తనలు నాలుగు రకములు. అవి :
- సహజాత ప్రవృత్తి
- అనుసరణ
- నిబంధన
- అనుకరణ.
1) సహజాత ప్రవృత్తి :
పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు. వీటిని నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి.
ఉదా : పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం.
2) అనుసరణ :
కోళ్ళు, బాతులు గుడ్లు పొదిగి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని అనుసరణ అంటారు. అనుసరణ అనే లక్షణం వలన కోడి, బాతు పిల్లలు తమ తల్లిని గుర్తించి, అనుసరించి ఆహారాన్ని, రక్షణను పొందుతాయి.
3) నిబంధన :
సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతి చర్య చూపే ఒక రకమైన ప్రవర్తన నిబంధన. ఇది నేర్చుకోవలసినది. పుట్టుకతో రాని ప్రవర్తన.
ఉదాహరణకి, విద్యుత్ సరఫరా అవుతున్న కంచెలు కట్టి ఉన్న పొలంలో జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టారు. గొర్రెలు కంచె వైపునకు పోగానే వాటికి చిన్నపాటి విద్యుత్ ఘాతం తగిలింది. అది అలవాటైన తరువాత విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా ఆ జంతువులు అటువైపు పోకపోవడం నిబంధన.
4) అనుకరణ:
- ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను ‘అనుకరణ’ అంటారు.
- ఉదాహరణకు కోఫ్టర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేశాడు.
- ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కోయడానికి ప్రయత్నించింది. అది అందలేదు. కర్రపుల్లలు ఉపయోగించి పండు కోసింది. పుల్లతో గుచ్చి పండ్లను తినసాగింది.
- మిగతా చింపాంజీలు కూడా అలానే చేస్తాయి. ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలు నేర్చుకుంటాయి.
ప్రశ్న 9.
ఈ చిత్రం చూడండి. జంతువులు పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటున్నాయి. ఇది వీటి సహజ లక్షణం. దీని గురించి నీ భావన ఏమిటి? ఇటువంటి దృశ్యాలను మీ పరిసరాలలో గమనించావా? నీ సొంత మాటల్లో వర్ణించండి. (AS 7)
జవాబు:
- జంతువులు పిల్లల్ని సంరక్షించడం అనేది వాటి సహజ లక్షణం. ప్రతి జంతువు తన పిల్లలను తమ కాళ్ళ మీద అవి నిలబడేవరకు రక్షించి కాపాడుతుంది.
- ఇటువంటి దృశ్యాలను మా పరిసరాలలో గమనించాను.
- గుడ్ల నుండి బయటకు వచ్చిన కోడి పిల్లలను కోడి తన వెంట తిప్పుకుంటూ ఆహారాన్ని సంపాదించి ఇస్తుంది.
- కోడి పిల్లలకు ఆపద ఎదురైనప్పుడు కోడి తన రెక్కల క్రింద దాచి రక్షణ కలుగచేస్తుంది.
- తన పిల్లలను గ్రద్ద తన్నుకుపోవడానికి ప్రయత్నించినపుడు తను వాటి వెంటపడి తరుముతుంది.
- కోడి తన పిల్లలు తమ కాళ్ళమీద నిలబడి ఆహారం సంపాదించేవరకు తన పిల్లలను సంరక్షిస్తుంది.
- పుట్టిన 10 నుండి 12 రోజులవరకు కళ్ళు కనపడని తన పిల్లలకు పిల్లి పాలు తాగటాన్ని అలవాటు చేస్తుంది.
- పిల్లి తన పిల్లలను శత్రువుల బారి నుండి రక్షణ కల్పించడానికి తరచూ వాటిని ఉంచే ప్రదేశాన్ని మారుస్తుంది.
9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Activities (కృత్యములు)
ప్రయోగశాల కృత్యము
ప్రశ్న 1.
బొద్దింక ప్రవర్తన అధ్యయనం : దీని కోసం ఒక పరిశోధన పెట్టి, కాల్షియం క్లోరైడ్ కావాలి.
పరిశోధన పెట్టె తయారీ సోపానాలు :
- ఒక చతురస్రాకారపు పెట్టె తీసుకొని దానిని కార్డుబోర్డు సహాయంతో 4 గదులుగా విభజించాలి.
- రెండు గదులకు చిన్న రంధ్రాలు చేయాలి. వీటి ద్వారా కాంతి ఉన్న భాగం ఉన్న భాగం ప్రసరించేలా చేయాలి.
- మిగతా రెండు గదులలో చీకటిని అలానే ఉండనీయాలి.
- వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో దూదిని తడిపి తడి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
- వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో కొంచెం కాల్సియం క్లోరైడును ఉంచి పొడి వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి.
- నాలుగు గదులలో వేరువేరు స్థితులు ఉన్నాయి. అవి వెలుగు మరియు పొడి, వెలుగు మరియు తడి, చీకటి మరియు పొడి, చీకటి మరియు తడి.
- తరగతి విద్యార్థులను 4 జట్లుగా చేయాలి. ఒక్కొక్క జట్టు కొన్ని బొద్దింకలను వారికిష్టమైన వేరువేరు స్థితులున్న గదిలో ఉంచాలి.
- పెట్టి పై భాగంలో మూతతో కప్పి ఉంచాలి. మొత్తం అమరికను 15-20 నిమిషాలు వదలివేయాలి.
- తరువాత ప్రతి గదిలో ఉన్న బొద్దింకలను లెక్కించాలి.
బొద్దింక ప్రవర్తన – నివసించే పరిస్థితులు – పరిశీలన :
బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి మరియు తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అందుచేతనే తడి మరియు చీకటి అరలో ఎక్కువ లేదా మొత్తం బొద్దింకలు చేరతాయి.
కృత్యం – 1
ప్రశ్న 2.
కింద పేర్కొనిన జంతువులలో వివిధ రకాల ప్రవర్తనలు పరిశీలించండి. అది సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన అనుకరణ దేనికి చెందుతుందో గుర్తించండి.
– మన పెంపుడు కుక్క కొత్త వారిని చూస్తే మొరుగుతుంది, మీరు మీ కుక్కలను వంటగదిలోకి రాకుండా అలవాటు చేస్తే అవి ఎప్పటికైనా వంటింటిలోకి వస్తాయా?
జవాబు:
నిబంధన
డబ్బాలో పెట్టిన స్వీట్ ను చేరుకోవడానికి చీమలు వరుసలో వెళ్తాయి. చీమలకు డబ్బా దగ్గరకు చేరుకోవడానికి దారి ఎలా తెలుసు?
జవాబు:
నిబంధన.
రాత్రి మాత్రమే దోమలు, బొద్దింకలు తమ స్థానాలలో నుండి బయటకు వస్తాయి. వెలుతురుకు, చీకటికి తేడా వాటికి ఎలా తెలుస్తుంది?
జవాబు:
సహజాత ప్రవృత్తి
కేవలం రాత్రివేళల్లో మాత్రమే గుడ్లగూబ తిరుగుతుంది. ఆహారం వెతుకుతుంది. వాటికి రాత్రి, పగలుకు తేడా ఎలా తెలుస్తుంది?
జవాబు:
సహజాత ప్రవృత్తి
ఎద్దు మెడకి ఉన్న తాడు తీయగానే ఏ సూచనలు చేయనప్పటికీ అరక దున్నే సమయం కాగానే అరక దగ్గరికి వెళ్తుంది. నీరు తాగే సమయం కాగానే తొట్టివైపు వెళ్తుంది. ఎద్దులు ఎలా ఇట్లా ప్రతిస్పందిస్తాయి?
జవాబు:
నిబంధన
పక్షులు గూడు అల్లడానికి బలంగా ఉన్న మెత్తటి పదార్థాన్ని సేకరిస్తాయి. సేకరించే పదార్థము యొక్క నాణ్యత వాటికి ఎలా తెలుసు?
జవాబు:
సహజాత ప్రవృత్తి
కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు గుడ్డముక్కను చూడగానే ఒకదానితో ఒకటి పోట్లాడి దానిని చింపుతాయి.
జవాబు:
అనుకరణ
కొన్ని ప్రత్యేక కాలాల్లో కొన్ని పక్షులు చాలా దూరం నుండి మన చుట్టుప్రక్కల ప్రాంతాలకు వలస వస్తాయి. వాటికి ఇక్కడికి రావడానికి దారి ఎలా తెలుసు?
జవాబు:
సహజాత ప్రవృత్తి
కృత్యం – 2
ప్రశ్న 3.
మీ పరిసరాలలో ఏదేని ఒక జంతువును ఎన్నుకొని అది కింద ఇవ్వబడిన పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తుందో పరిశీలించండి.
1) జంతువు పేరు : కాకి
2) అది నివసించే ప్రదేశం :
ఎత్తైన చెట్లపై గూడు నిర్మించుకుంటుంది.
3) అది నివాసాన్ని ఎలా కట్టుకుంది :
సాధారణంగా చెట్ల యొక్క కొమ్మలు, ఆకులు, మాస్ మొక్కలు, గడ్డి పరకలతో నివాసాన్ని కడుతుంది.
4) ఆహార సేకరణ :
ఎ) కాకి నివసించే ప్రదేశం చుట్టుప్రక్కల కొద్ది దూరం ప్రయాణించి ఆహారాన్ని సేకరిస్తుంది.
బి) కాకి సర్వభక్షకం, దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలను తింటుంది.
5) బాహ్య లక్షణాలు :
ఎ) కాకులు సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి.
బి) కొన్నిసార్లు తెల్లని లేదా ఊదారంగు ఈకలు శరీరంపై అక్కడక్కడ ఉంటాయి.
6) భావ వ్యక్తీకరణలు (సంతోషం, విచారం, భయం, ప్రాణభీతి, కోట్లాట, స్వీయరక్షణ / పిల్లల సంరక్షణ) :
ఎ) కాకులు సాధారణంగా రకరకాల కంఠ ధ్వనులను పలుకుతాయి.
బి) చుట్టుప్రక్కల జరిగే వివిధ రకాల ప్రేరణలకు అనుగుణంగా కాకులు శబ్దములను చేస్తాయి. వెళ్ళునప్పుడు, వచ్చేటప్పుడు కాకులు అరిచే సంజ్ఞలలో తేడా ఉంటుంది.
సి) కాకులు సంతోషము, విచారము, భయం, ప్రాణభీతి సమయములందు ‘కావ్ కావ్’ అను ధ్వనులను వ్యక్తపరుస్తాయి.
7) జట్టుతో దాని ప్రవర్తన :
ఎ) ఒక కాకికి ఆహారం దొరికితే ఇతర కాకులను అరుస్తూ పిలుస్తుంది.
బి) ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ గుమిగూడి అరుపుల ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తాయి.