These AP 9th Biology Important Questions and Answers 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు will help students prepare well for the exams.
AP Board 9th Class Biology 8th Lesson Important Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు
9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
స్థూల పోషకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మొక్కలకు అధిక పరిమాణంలో అవసరం అయ్యే ఖనిజ లవణాలను స్థూల పోషకాలు అంటారు.
ఉదా : నత్రజని, భాస్వరం, పొటాషియం , సోడియం మొదలగునవి.
ప్రశ్న 2.
సూక్ష్మ పోషకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరం అయ్యే ఖనిజ లవణాలను సూక్ష్మ పోషకాలు అంటారు.
ఉదా : ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, కాపర్, మాలిబ్డినమ్, క్లోరిన్ మొదలగునవి.
ప్రశ్న 3.
సేంద్రీయ సేద్యం అనగానేమి? దాని వలన ఉపయోగాలేవి?
జవాబు:
- నేల స్వభావాన్ని, సారవంతాన్ని పెంచడానికిగాను ఉపయోగపడే వ్యవసాయ విధానాన్ని సేంద్రీయ సేద్యం అంటారు.
- సేంద్రీయ సేద్యంలో అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తారు.
- సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టే పద్ధతులను ఉపయోగిస్తారు.
- పంట మార్పిడి, మిశ్రమ పంటలను పండించడం వంటి పద్ధతులను కూడా అవలంబిస్తారు.
ప్రశ్న 4.
పంచగవ్య ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి?
జవాబు:
ఇది కూడా సహజ ఎరువు. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం.
ప్రశ్న 5.
‘కలుపు మొక్కలు’ అనగానేమి?
జవాబు:
పంట మొక్కలతో పాటు ఇతర మొక్కలు కూడా నేలలో పెరగడం తరచుగా మనం చూస్తుంటాం. వీటినే ‘కలుపు మొక్కలు’ అంటారు.
9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సంకరణము గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
- జన్యుపరంగా వేరు వేరు లక్షణాలు ఉన్న రెండు మొక్కల నుండి మనం కోరుకున్న లక్షణాలతో కూడిన కొత్త మొక్కను ఉత్పత్తి చేయడాన్ని సంకరణం అంటారు.
- సంకరణం ద్వారా అభివృద్ధి చెందిన వంగడాలు అధిక దిగుబడిని ఇవ్వడం, వ్యాధులకు నిరోధకత కలిగి ఉండడం, తక్కువ నీటి వసతితో కూడా, ఆమ్లయుత నేలల్లో కూడా పెరగగలగడం వంటి ఉపయోగకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి.
ప్రశ్న 2.
పంట మార్పిడిలోని కొన్ని పద్ధతులను రాయండి.
జవాబు:
పంట మార్పిడిలో కొన్ని పద్ధతులు:
ఎ) వరి పండిన తర్వాత మినుములు, వేరుశనగ సాగుచేయడం.
బి) పొగాకు పండించిన తర్వాత మిరప పంట సాగుచేయడం.
సి) కందులు, మొక్కజొన్న పండించిన తర్వాత వరి సాగుచేయడం.
ప్రశ్న 3.
పచ్చిరొట్ట ఎరువులు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు:
- కొన్ని రకాల పంటలను పండించిన తరువాత వాటిని అలాగే నీళ్ళలో కలిపి దున్నుతారు. ఇటువంటి వాటిని పచ్చి రొట్ట ఎరువులు అంటారు.
- వెంపలి, ఉలవ, పిల్లి పెసర, అలసంద, పెసర వంటి పంటలు పచ్చిరొట్ట ఎరువులకు ఉదాహరణలు.
ప్రశ్న 4.
పంట దిగుబడి అధికం చేయడానికి అవసరమయ్యే కారకాలు ఏవి?
జవాబు:
- పంట దిగుబడి అనేది ఏదో ఒక కారకంపైన ఆధారపడి ఉండదు.
- అనేక కారకాలు కలసి పనిచేయడం వల్ల మాత్రమే దిగుబడి పెరుగుతుంది.
- నాటిన విత్తన రకం, నేల స్వభావం, నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు, వాతావరణం, పంటపై క్రిమికీటకాల దాడి, కలుపు మొక్కల పెరుగుదలను అదుపుచేయడం వంటి వాటిని అధిక దిగుబడికి కారకాలుగా గుర్తిస్తాం.
ప్రశ్న 5.
అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు అవలంబించే పద్ధతులు ఏవి?
జవాబు:
అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు 3 పద్ధతులు ఉపయోగిస్తారు. అవి :
- అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
- అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులను పాటించడం.
- పంటలను పరిరక్షించే పద్ధతులు పాటించడం.
ప్రశ్న 6.
ఆహార ఉత్పత్తిని ఏ విధంగా పెంచవచ్చు?
జవాబు:
- సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం వలన ఆహార ఉత్పత్తి పెంచవచ్చు.
- ప్రస్తుతం సాగుచేయుచున్న భూమిలో ఉత్పత్తి పెంచడం.
- ఎక్కువ దిగుబడినిచ్చే సంకర జాతులను అభివృద్ధి చేయడం.
- పంట మార్పిడి పద్ధతులు.
- మిశ్రమ పంట విధానము.
- దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్ల అధిక ధాన్యం ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 7.
పంటమార్పిడి అనగానేమి? దీనివలన ఉపయోగమేమిటి?
జవాబు:
- వేరు వేరు కాలాల్లో వేరు వేరు పంటలను పండించే విధానమును పంటమార్పిడి అంటారు.
- ఆహార ధాన్యాలు పండించినపుడు నేల నుండి అధిక పరిమాణంలో పోషక పదార్థాలు గ్రహిస్తాయి.
- కాని లెగ్యూమినేసి పంటలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి.
- ఇవి నేల నుండి పోషక పదార్థాలను తీసుకున్నప్పటికి నేలలోకి కొన్ని పోషక పదార్థాలను విడుదల చేస్తాయి.
- లెగ్యూమినేసి పంటలను పండించడం వల్ల నేలలో నత్రజని సంబంధిత లవణాల స్థాయి పెరుగుతుంది.
ప్రశ్న 8.
మిశ్రమ పంటలు అనగానేమి? వాటి వలన ఉపయోగమేమిటి?
జవాబు:
ఒక పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలను పండిస్తే దానిని మిశ్రమ పంటలు అంటారు.
ఉపయోగాలు :
- మిశ్రమ పంటలను పండించడం వల్ల నేల సారవంతం అవుతుంది.
- నేల నుండి ఒక పంట తీసుకున్న పోషక పదార్థాలను మరొక పంట పోషక పదార్థాలను పునరుత్పత్తి చేయగలదు.
ఉదా : సోయా చిక్కుళ్ళతో బఠాణీలు, బఠాణీతో పెసలు, మొక్కజొన్నతో మినుములు మొదలగునవి.
9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
సేంద్రీయ ఎరువులను గురించి వివరించండి.
జవాబు:
- మొక్కలు, జంతువుల విసర్జితాలు కుళ్ళింప చేసినప్పుడు సేంద్రీయ ఎరువులు ఏర్పడతాయి.
- సేంద్రీయ ఎరువులు వాడడం వలన నేలలో హ్యూమస్ చేరి నీటిని నిల్వ చేసుకునే శక్తి నేలకు పెరుగుతుంది.
- సేంద్రీయ ఎరువు మంచి పోషక పదార్థములను నేలకు అందిస్తుంది.
- సహజ సేంద్రీయ ఎరువులు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి.
ఎ) అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువులు.
బి) స్థూల జీవ ఎరువులు. - వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, వేప, జట్రోపా వంటి విత్తనాల పొడి అధిక సాంద్రత గల జీవ ఎరువులకు ఉదాహరణ.
- జంతు సంబంధ విసర్జక పదార్థాలు, కుళ్ళిన పదార్థాలు, చెత్త వంటివి స్థూల జీవ ఎరువులకు ఉదాహరణ.
- స్థూల సేంద్రియ ఎరువుల కంటే అధిక సాంద్రత గల సేంద్రీయ ఎరువుల్లోనే పోషకాలు అధికంగా ఉంటాయి.
- పొలాల్లో ఎండిపోయిన మొక్కల వ్యర్థాలైన కాండం, వేళ్ళు, ఆవు పేడ, మూత్రం మొదలగు వాటిని మనం సాధారణంగా సేంద్రీయ ఎరువులు అంటాం.
ప్రశ్న 2.
భూసార పరీక్షా కేంద్రాల ఉపయోగం ఏమిటి?
జవాబు:
- భూసార పరీక్షా నిపుణులు పొలంలో అక్కడక్కడ నేలను తవ్వి మట్టి నమూనాలు సేకరిస్తారు.
- వీటిని పరీక్షించి ఇవి ఎంతవరకు సారవంతమైనవో పరీక్షిస్తారు.
- ఇలా చేయడం వలన నేలకు సంబంధించిన అన్ని విషయాలు మనకు తెలుస్తాయి.
- దీనివల్ల రైతులు ఏ పంటలు పండించాలి, ఎలాంటి ఎరువు వేయాలి, ఎంత పరిమాణంలో ఎరువులు వాడాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- ఇందువల్ల ఎరువుల వాడకంలో వృథాను అరికట్టడమే కాకుండా పెట్టుబడి కూడా తగ్గిపోతుంది.
ప్రశ్న 3.
సహజ ఎరువు పంచగవ్యను ఏ విధముగా తయారుచేస్తారు?
జవాబు:
- పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం.
- ఆవు పేడను నెయ్యిలో కలిపి నాలుగు రోజులు అలాగే ఉంచాలి.
- 5వ రోజు దీనికి మూత్రం, పాలు, పెరుగు, కల్లు, కొబ్బరి నీరు, చెరకు రసం వంటివి కలపాలి.
- దీనికి అరటి పండ్ల గుజ్జును కలిపి 10 రోజులు అలాగే ఉంచాలి.
- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీనిని కలియబెట్టాలి.
- ఇలా చేస్తే పొలాల్లో ప్లేయర్ల ద్వారా చల్లడానికి వీలైన పంచగవ్య తయారవుతుంది.
- 3% పంచగవ్య పంట బాగా పెరగడానికి, అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతుంది.
- దీన్ని కోళ్ళకు, చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
ప్రశ్న 4.
స్థూల పోషకాలయిన నత్రజని, భాస్వరము మరియు పొటాషియం యొక్క ఉపయోగాలు ఏవి?
జవాబు:
నత్రజని, భాస్వరము మరియు పొటాషియంల ఉపయోగాలు :
పోషక పదార్థం | ఉపయోగం |
నత్రజని | కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా వస్తాయి. |
భాస్వరము (ఫాస్పరస్) | వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి |
పొటాషియం | క్రిమికీటకాల నుండి రోగ నిరోధకశక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడం. |
ప్రశ్న 5.
జీవ ఎరువులు అనగానేమి? ఉదాహరణలివ్వంది.
జవాబు:
- వాతావరణం నుండి పోషకాలను నేలకు తద్వారా మొక్కలకు అందించడానికి ఉపయోగపడే కొన్ని రకాలైన సూక్ష్మజీవులను జీవ ఎరువులు లేదా ‘మైక్రోబియల్ కల్చర్’ అంటారు.
- సాధారణంగా జీవ ఎరువులు రెండు రకాలు. అవి : ఎ) నత్రజని స్థాపన చేసేవి బి) భాస్వరాన్ని (పాస్ఫరస్) నేలలోనికి కరిగింపచేసేవి.
ప్రశ్న 6.
వర్మి కంపోస్టు తయారుచేయు విధమును రాయండి.
జవాబు:
- వర్మి కంపోస్టు కోసం 10 × 1 × 1/2 మీటర్ కొలతలతో వర్మీ కంపోస్టు బెడదను ఏర్పాటు చేసుకోవాలి.
- ఎండ తగలకుండా, వర్షానికి గురికాకుండా పైన కప్పు వేయాలి.
- కొబ్బరి, అరటి, చెరకు ఆకులను, కొబ్బరి పీచు, ఎండిన మినుము మొక్కలను సేకరించాలి.
- వీటిని 3 లేదా 4 అంగుళాల పొరగా వేసి నీటితో తడపాలి.
- ఇళ్ళలో లభించే వ్యర్థాలు, గ్రామంలో లభించే ఎండిన పేడను సేకరించి బెడ్లను నింపాలి.
- బెడ్ తయారుచేసుకున్న 2 వారాల తర్వాత వీటిలో చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములను వదలి దానిపై గోనె సంచులతో కప్పి ఉంచాలి.
- వాటిపై నీరు చిలకరిస్తూ 30 నుంచి 40% తేమ ఉండేలా చేయాలి.
- 60 రోజుల తరువాత మొదటిసారి ఎరువును సేకరించవచ్చు.
- రెండవసారి 45 రోజులకే ఎరువును సేకరించాలి.
- ఇలా ప్రతి సంవత్సరం ఈ బెడ్ నుండి 6 సార్లు ఎరువును పొందవచ్చు.
- 3 టన్నుల జీవ వ్యర్థాలతో ఒక టన్ను వర్మీ కంపోస్టు ఎరువును పొందవచ్చు.
ప్రశ్న 7.
శ్రీ వరి సాగు విధమును వివరించండి.
జవాబు:
- శ్రీ వరి సాగు అనేది సేద్యంలో ఒక విధానం.
- శ్రీ వరి సాగు అంటే తక్కువ విత్తనం, తక్కువ నీటితో ఆరుతడి పంటగా పండించే పంట అని అర్థం.
- యథార్థానికి SRI అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని అర్థం.
- ఏ వరి విత్తనాన్నైనా తీసుకొని ఈ పద్ధతిలో పండించవచ్చు.
- శ్రీ వరిలో నీరు పెట్టే విధానం, నాటే విధానం, కలుపు నివారణ విధానం భిన్నంగా ఉంటుంది.
- సాధారణంగా ఎకరాకు 30 కిలోల విత్తనాలు వాడితే శ్రీ వరి సాగులో కేవలం 2 కిలోల విత్తనం సరిపోతుంది.
- సాధారణ వరి సేద్యంలో ఒక కిలో ధాన్యం పండించడానికి సుమారు 5000 లీటర్లు నీరు కావాలి. శ్రీ వరికి 2500 నుండి 3000 లీటర్ల నీరు సరిపోతుంది.
- శ్రీ వరి విధానం వల్ల విత్తన కొరతని నివారించవచ్చు. నీటిని పొదుపు చేయవచ్చు.
- శ్రీ వరి విధానంలో తెగుళ్ళు అదుపులో ఉంటాయి, పురుగు మందుల అవసరం తక్కువ.
9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Important Questions and Answers
ప్రశ్న 1.
పోషక పదార్థం | ఉపయోగం |
నత్రజని | కొత్త ఆకులు, పుష్పాలు వేగంగా వస్తాయి. |
భాస్వరము (ఫాస్పరస్) | వేళ్ళు నేలలోకి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి |
పొటాషియం | క్రిమికీటకాల నుండి రోగ నిరోధకశక్తిని పెంపొందించడం, వాసన, రంగు, రుచి వంటివి పెంచడం. |
ఎ) ఏ పంటలో ఆకులు త్వరగా ఏర్పడతాయి? ఎందుకు?
జవాబు:
చెరుకుపంట. ఎందుకంటే అది 90% నత్రజనిని వినియోగించుకుంటుంది. నత్రజని కొత్త ఆకులు ఏర్పడటానికి తోడ్పడుతుంది.
బి) ఏ పంటలో వేర్లు లోతుగా చొచ్చుకొని పోవు?
జవాబు:
తృణధాన్యాలు
సి) ఏ పంట చీడలను ఎక్కువ ప్రతి రోధకతను కలిగి వుంటుంది?
జవాబు:
చెరుకు పంట
డి) పై పట్టికను బట్టి ఏ పంటను పండించుట వలన రైతు ఎక్కువ దిగుబడి పొందుతాడు.
జవాబు:
చెరుకుపంట
ప్రశ్న 2.
రైతులకు సహాయం చేయుటలో వానపాముల పాత్రను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు.
జవాబు:
- వానపామును ‘కర్షకమిత్రుడు’ అంటారు.
- నేలను గుల్లపరచి, నేలలోనికి గాలి ప్రవేశాన్ని కల్పిస్తుంది.
- వానపాము తమ సేంద్రియ వ్యర్థాల ద్వారా నేలను సారవంతం చేసి రైతుకు ఎరువులు వాడవలసిన పనిలేకుండా చేస్తాయి. రైతుకు అధిక పంట దిగుబడిని ఇస్తాయి.
ప్రశ్న 3.
రైతులు ఒకే విధమైన పంటనే పండిస్తే ఏమౌతుంది?
జవాబు:
a) రైతులు ఒకే విధమైన పంటను పండిస్తుంటే పంట దిగుబడి తగ్గిపోతుంది.
b) భూసారం తగ్గిపోతుంది.
c) పంటలను ఆశించే చీడపీడలు ఎక్కువ అవుతాయి.
ప్రశ్న 4.
క్రింది సమాచారం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు. వీటితోపాటు కొన్ని సహజ కీటకనాశన పద్దతులను కూడా ఉపయోగిస్తారు.
1. పై సమాచారం వ్యవసాయంలోని ఏ అంశమును తెలియజేస్తుంది?
2. కృత్రిమంగా తయారుచేసిన కొన్ని ఎరువులను, కీటకనాశనులను పేర్కొనండి.
3. కృత్రిమ కీటకనాశనులకు, సహజ కీటకనాశనులకు గల తేడాలేమిటి?
4. ఏవైనా రెండు సహజ కీటకనాశన పద్దతులను గూర్చి రాయండి.
జవాబు:
1) పంటలను పరిరక్షించే పద్ధతులను పాటించడం
2) D.A.P సూపర్ ఫాస్ఫేట్ D.D.T, హెప్టాక్లోర్
3) కృత్రిమ కీటక నాశనులు విషపూరిత రసాయన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి “మిత్ర కీటకాలను” కూడా చంపివేస్తాయి. సహజ కీటక నాశనులు అంటే పంటలకు నష్టాన్ని కలిగించే అనేక కీటకాలను ఆహారంగా చేసుకొనే సాలెపురుగులు, క్రిసోపా, మిరిబ్స్, లేడీబర్డ్, బీటిల్, డ్రాగన్ఎ మొదలగునవి. ఇవి మిత్ర కీటకాలను నాశనం చేయవు. ఎటువంటి దుష్ఫలితాలను ఇవి పంటలపై చూపించవు.
4) ఎ) “బాసిల్లస్ తురింజెనెసిస్” వంటి బాక్టీరియాలు కొన్ని రకాల హానికారక కీటకాలను నాశనం చేస్తాయి.
బి) మిశ్రమ పంటల సాగు వలన కొన్ని రకాల కీటకాల నుండి పంటలను కాపాడుకోవచ్చు.
ఉదా : వరి సాగు తర్వాత మినుము లేక వేరుశనగ సాగుచేస్తే వరిలో వచ్చే “టుందొ” వైరసను అదుపులో ఉంచవచ్చు.
9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1 Mark Bits Questions and Answers
లక్ష్యాత్మక నియోజనము
1. పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమయ్యే కారకము
A) నాటిన విత్తన రకం
B) నేల స్వభావం, లక్షణాలు
C) నీటి లభ్యత, ఎరువులు, పోషక పదార్థాల అందుబాటు
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు
2. ఆహార ఉత్పత్తిని ఈ విధంగా పెంచవచ్చు.
A) సాగుభూమి విస్తీర్ణం పెంచడం ద్వారా
B) ఎక్కువ దిగుబడి ఇచ్చు సంకర రకాల అభివృద్ధి ద్వారా
C) పంట మార్పిడి ద్వారా
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు
3. పంట మార్పిడి దీనిని పరిరక్షిస్తుంది.
A) నేల సారాన్ని
B) ఎక్కువ దిగుబడినిచ్చే సంకర రకాలు
C) నేల యాజమాన్యము
D) పంట యాజమాన్యము
జవాబు:
A) నేల సారాన్ని
4. స్టార్ట్ అనునది
A) క్రొవ్వు
B) కార్బోహైడ్రేటు
C) ప్రోటీను
D) విటమిన్
జవాబు:
B) కార్బోహైడ్రేటు
5. 100 గ్రాముల నీరు, 200 గ్రాముల కార్బన్ డయాక్సెడ్‌తో చర్య జరిపి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేటును ఏర్పరుస్తుంది?
A) 280 గ్రాములు
B) 360 గ్రాములు
C) 180 గ్రాములు
D) 380 గ్రాములు
జవాబు:
C) 180 గ్రాములు
6. మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరి అవుతుంది.
A) బాహ్యచర్మము
B) పత్రాంతర కణజాలం
C) పత్ర రంధ్రాలు
D) దారువు
జవాబు:
C) పత్ర రంధ్రాలు
7. ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి.
A) వరి
B) మినుము
C) వేరుశనగ
D) సజ్జ
జవాబు:
A) వరి
8. నీటిని పరిరక్షించే నీటి పారుదల పద్ధతి
A) కాలువ నీటి వ్యవస్థ
B) చెరువు నీటి వ్యవస్థ
C) డ్రిప్ ఇరిగేషన్
D) ఏదీకాదు
జవాబు:
C) డ్రిప్ ఇరిగేషన్
9. ఈ క్రింది వాటిలో స్థూల పోషకము ఏది?
A) ఇనుము
B) నత్రజని
C) రాగి
D) మాంగనీసు
జవాబు:
B) నత్రజని
10. నేలకు పోషకాలను చేర్చేది
A) పంట మార్పిడి
B) సేంద్రియ ఎరువు
C) రసాయన ఎరువులు
D) అన్నియు
జవాబు:
D) అన్నియు
11. నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి ……….
A) ప్రధాన ధాన్యాలు
B) చిరు ధాన్యాలు
C) దుంపలు
D) అన్నియు
జవాబు:
A) ప్రధాన ధాన్యాలు
12. చిక్కుడు జాతి పంట ఒక హెక్టారుకు అందించే నత్రజని
A) 150 నుండి 200 కి.గ్రా.
B) 50 నుండి 150 కి.గ్రా.
C) 100 నుండి 150 గ్రా.
D) 25 నుండి 100 కి.గ్రా.
జవాబు:
B) 50 నుండి 150 కి.గ్రా.
13. నీలి ఆకుపచ్చ శైవల వర్గనమును ఈ పంటకు వినియోగిస్తారు.
A) బంగాళాదుంప పంట
B) ములగకాయ పంట
C) వేరుశనగ పంట
D) వరి పంట
జవాబు:
D) వరి పంట
14. పొలమును పరిశీలించి సరియైన పంటను పండించడానికి సలహాలిచ్చేది
A) వ్యవసాయ అధికారి
B) భూసార పరీక్షా కేంద్ర నిపుణుడు
C) A మరియు B
D) గ్రామ అభివృద్ధి అధికారి
జవాబు:
C) A మరియు B
15. పంచగవ్యలో ఉండే ముఖ్య పదార్థాలు
A) పాలు, పెరుగు
B) నెయ్యి, పేడ
C) ఆవు మూత్రం
D) పైవి అన్నియు
జవాబు:
B) నెయ్యి, పేడ
16. నేల ఎక్కువకాలం అధిక దిగుబడి ఇవ్వడం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది.
A) నేలలో పోషక పదార్థాల లభ్యత
B) నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు
C) A మరియు B
D) వర్షము
జవాబు:
B) నేల యొక్క సరియైన భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలు
17. సేంద్రీయ సేద్య విధానములో రైతు
A) సహజ ఎరువులను వాడతాడు.
B) సహజ కీటకనాశ పద్ధతులను అవలంబిస్తాడు
C) పంట మార్పిడి మరియు మిశ్రమ పంట విధానము పాటిస్తాడు
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు
18. యూరియాలో నత్రజని శాతం
A) 36%
B) 46%
C) 56%
D) 44%
జవాబు:
B) 46%
19. కీటకనాశనులు వీటిని సంహరించడానికి వాడతారు.
A) సూక్ష్మజీవులు
B) పురుగులు
C) కీటకాలు
D) శిలీంధ్రాలు
జవాబు:
C) కీటకాలు
20. మన రాష్ట్రంలో అధిక పరిమాణంలో క్రిమి సంహారక మందులను ఉపయోగించే జిల్లాలు
A) గుంటూరు
B) ప్రకాశం
C) నెల్లూరు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C
21. మిత్ర కీటకమును గుర్తించుము.
A) సాలెపురుగు, డ్రాగన్ ప్లే
B) క్రిసోపా, మిరిబ్స్
C) లేడీ బర్డ్ బిడిల్
D) పై అన్నియు
జవాబు:
D) పై అన్నియు
22. కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించేది
A) బాసిల్లస్
B) ట్రాకోడర్మా
C) రైజోబియం
D) ఎజటోబాక్టర్
జవాబు:
B) ట్రాకోడర్మా
23. కీటకాలను నాశనం చేసే బాక్టీరియా
A) బాసిల్లస్ తురంజెనెసిస్
B) రైజోబియం
C) ఎజటోబాక్టర్
D) బాసిల్లస్ సూడోమోనాస్
జవాబు:
A) బాసిల్లస్ తురంజెనెసిస్
24. వరి సాగు చేసిన తరువాత మినుములను సాగు చేస్తే దీనిని అదుపులో ఉంచవచ్చు.
A) టుంగ్రోవైరస్
B) ధాన్యాన్ని తినే గొంగళిపురుగు
C) కాండం తొలుచు పురుగు
D) పైవి అన్నియు
జవాబు:
A) టుంగ్రోవైరస్
25. నత్రజనిని స్థాపించు బాక్టీరియా
A) రైజోబియం
B) బాసిల్లస్
C) మైకోరైజా
D) పెన్సిలియమ్
జవాబు:
A) రైజోబియం
26. 600 Kgల ధాన్యాన్ని పండించటానికి అవసరమయ్యే నేల
A) 1.4 చ.కి.మీ.
B) 2.4 చ.కి.మీ.
C) 3.4 చ.కి.మీ.
D) 4.4 చ.కి.మీ.
జవాబు:
A) 1.4 చ.కి.మీ.
27. అధిక దిగుబడి సాధించటానికి వ్యవసాయదారులు ఉపయోగించు పద్ధతి
A) అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి
B) అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు
C) పంటలను పరిరక్షించే పద్ధతులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
28. పూలసాగునేమంటారు?
A) హార్టికల్చర్
B) ఫ్లోరీకల్చర్
C) ఎగ్రికల్చర్
D) ఓలరీకల్చర్
జవాబు:
B) ఫ్లోరీకల్చర్
29. ఒక మొక్క ఒక లీటర్ నీటిని శోషించుకుంటే అందులో కార్బోహైడ్రేడ్ల తయారీకి ఉపయోగపడేది.
A) 1 మి.లీ.
B) 10 మి.లీ.
C) 20 మి.లీ.
D) 50 మి.లీ.
జవాబు:
A) 1 మి.లీ.
30. ఈ క్రింది వానిలో తక్కువ నీరు ఉన్నచోట పండే పంట
A) వరి
B) మొక్కజొన్న
C) గోధుమ
D) చెరకు
జవాబు:
B) మొక్కజొన్న
31. బిందు సేద్యం ద్వారా
A) నీటి వృథా అరికట్టవచ్చు
B) పంట దిగుబడి పెరుగుతుంది
C) ఎరువుల వాడకం తక్కువ
D) పురుగులు ఆశించవు
జవాబు:
A) నీటి వృథా అరికట్టవచ్చు
32. ఈ క్రింది వానిలో సూక్ష్మ పోషకం
A) నత్రజని
B) ఇనుము
C) భాస్వరం
D) పొటాషియం
జవాబు:
B) ఇనుము
33. ఈ క్రింది వానిలో స్థూల పోషకం
A) మాంగనీసు
B) భాస్వరం
C) బోరాన్
D) జింక్
జవాబు:
B) భాస్వరం
34. పంట మార్పిడికి ఉపయోగించేవి ఏకుటుంబపు మొక్కలు?
A) మీలియేసి
B) విలియేసి
C) లెగ్యుమినేసి
D) ఆస్టరేసి
జవాబు:
C) లెగ్యుమినేసి
35. క్రింది వానిలో మిశ్రమ పంటకు సంబంధించి సత్య వాక్యం
A) పప్పుధాన్యాలు, గింజ ధాన్యాలు కలిపి పండిస్తారు.
B) స్వల్పకాలికాలు, దీర్ఘకాలికాలు కలిపి పండిస్తారు.
C) మామూలు పంటలు, ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు.
D) పండ్లతోటల్లో కందులు, మినుములు పండిస్తారు.
జవాబు:
C) మామూలు పంటలు, ఆరుతడి పంటలు కలిపి పండిస్తారు.
36. క్రింది వానిలో అధిక సాంద్రత గల జీవ ఎరువు
A) జట్రోపా విత్తనం పొడి
B) వేప విత్తనం పొడి,
C) కొబ్బరి విత్తనం పొడి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
37. స్థూల సేంద్రీయ ఎరువు
A) జంతు విసర్జకాలు
B) క్రుళ్ళిన పదార్థాలు
C) చెత్త
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
38. పచ్చిరొట్ట ఎరువు కానిది
A) మినుము
B) పెసర
C) పిల్లి పెసర
D) వెంపలి
జవాబు:
A) మినుము
39. ఒక హెక్టారులో 8 నుండి 25 టన్నుల పచ్చిరొట్ట ఎరువును పండించి నేలలో కలియ దున్నినపుడు ఎంత నేలలోకి పునరుద్ధరింపబడుతుంది?
A) 50 – 60 కేజీలు
B) 60 – 80 కేజీలు
C) 70 – 90 కేజీలు
D) 50 – 75 కేజీలు
జవాబు:
C) 70 – 90 కేజీలు
40. వర్మీకంపోస్టు బెడ్ లోపల ఉండకూడనివి
A) పచ్చిపేడ
B) గాజుముక్కలు
C) ఇనుపముక్కలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
41. క్రింది వానిలో ఫాస్ఫరసను కరిగించే బాక్టీరియా
A) రైజోబియం
B) అజటోబాక్టర్
C) అజోస్పైరిల్లమ్
D) బాసిల్లస్
జవాబు:
D) బాసిల్లస్
42. కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట
A) వరి
B) కంది
C) వేరుశనగ
D) ప్రొద్దుతిరుగుడు
జవాబు:
D) ప్రొద్దుతిరుగుడు
43. ఈ క్రింది వానిలో మిత్రకీటకం కానిది
A) మిడత
B) సాలెపురుగు
C) గొల్లభామ
D) కందిరీగ
జవాబు:
A) మిడత
44. కీటకాలను నాశనం చేసే బాక్టీరియా
A) బాసిల్లస్ థురింజెనిసిస్
B) రైజోబియం
C) సూడోమోనాస్
D) అజోస్పెరిల్లమ్
జవాబు:
A) బాసిల్లస్ థురింజెనిసిస్
45. వరి సాగు చేసిన తర్వాత ఏ పంటను పండించటం ద్వారా వరిలో వచ్చే టుంగ్రో వైరసీని అదుపులో ఉంచవచ్చు?
A) మినుములు
B) శనగ
C) A & B
D) పైవేవీ కావు
జవాబు:
C) A & B
46. ప్రత్తి పండించిన తర్వాత ఈ పంటలు పండిస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగుల్ని అదుపు చేస్తాయి.
A) పెసర, పిల్లిపెసర
B) జొన్న, మొక్కజొన్న
C) జనుము, నువ్వులు
D) మొక్కజొన్న, నువ్వులు
జవాబు:
D) మొక్కజొన్న, నువ్వులు
47. కందులు పండించిన తర్వాత ఈ పంటలు పండించటం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఎండు తెగులును నివారించవచ్చు.
A) పెసర, పిల్లి పెసర
B) జొన్న, మొక్కజొన్న
C) జనుము, నువ్వులు
D) మొక్కజొన్న, నువ్వులు
జవాబు:
B) జొన్న, మొక్కజొన్న
48. ఒక పంట పండించటం ద్వారా రెండవ పంటలో తెగుళ్ళను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు?
A) ఆరుతడి పంటలు
B) ఆకర్షక పంటలు
C) వికర్షక పంటలు
D) లింగాకర్షక పంటలు
జవాబు:
B) ఆకర్షక పంటలు
49. విచక్షణారహితంగా ఎరువులు వాడటం వలన
A) నేల కలుషితమవుతుంది.
B) నీరు కలుషితమవుతుంది.
C) జీవవైవిధ్యం దెబ్బతింటుంది.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
50. విత్తనాలు లేని సంకర జాతి వంగడాలు ఏ మొక్కల్లో ఉత్పత్తి చేసారు?
A) ద్రాక్ష
B) బొప్పాయి
C) దానిమ్మ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
51. సంకరణం ద్వారా వచ్చే మొక్కల్లో ఉండనిది
A) అధిక దిగుబడినిస్తాయి.
B) వ్యాధులకు ప్రతిరోధకత కల్గి ఉంటాయి.
C) ఎక్కువ నీటితో పండుతాయి.
D) ఆమ్ల నేలల్లో కూడా పండుతాయి.
జవాబు:
C) ఎక్కువ నీటితో పండుతాయి.
52. 1950 నాటికి మనదేశంలో ఉన్న వరి వంగడాల సంఖ్య
A) 225
B) 335
C) 445
D) 555
జవాబు:
C) 445
53. బంగాళదుంప, టమాట రెండింటిని సంకరం చేయటం ద్వారా వచ్చినటువంటి క్రొత్త పంట
A) టొటాటో
B) పొమాటో
C) బటాటా
D) వాటి మధ్య సంకరం జరగదు
జవాబు:
B) పొమాటో
54. GMS అనగా
A) జెనరల్లి మాడిఫైడ్ సీడ్స్
B) జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్
C) జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ సీడ్స్
D) జెనెటిక్ మాటర్ ఆఫ్ సీడ్స్
జవాబు:
B) జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్
55. శ్రీవరి పద్దతిలో SRI అనగా
A) సిస్టమాటిక్ రైస్ ఇంటిగ్రేషన్
B) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
C) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంప్రూవ్మెంట్
D) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇరిగేషన్
జవాబు:
B) సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
56. సాధారణ పదతిలో ఎకరాకు 30 కిలోల విత్తనం నాటటానికి అవసరమయితే శ్రీవరి పద్దతిలో, ఎంత అవసరమవుతుంది?
A) 2 కిలోలు
B) 4 కిలోలు
C) 20 కిలోలు
D) 15 కిలోలు
జవాబు:
A) 2 కిలోలు
57. సాధారణ వరి సేద్యంలో ఒక కిలో వరిధాన్యం పండించటానికి 5,000 లీటర్లు నీరు అవసరమయితే శ్రీ వరి పద్దతిలో అవసరమయ్యే నీరు
A) 1000 లీటర్లు
B) 1500 లీటర్లు
C) 2000 లీటర్లు
D) 2,500 లీటర్లు
జవాబు:
D) 2,500 లీటర్లు
58. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) రబీ పంట – ఆవాలు
2) ఖరీఫ్ పంట – ప్రత్తి
3) మిశ్రమ పంట – చెరకు
A) 1,2
B) 2, 3
C) 1 మాత్రమే
D) 3 మాత్రమే
జవాబు:
D) 3 మాత్రమే
59. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) డ్రాగన్ ఫై – సహజ కీటక నాశనులు
2) కొబ్బరి నీరు – పంచగవ్వ
3) కులీ – మిశ్రమపంట
A) 1, 2
B) 2, 3
C) 1 మాత్రమే
D) 3మాత్రమే
జవాబు:
D) 3మాత్రమే
60. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) బాక్టీరియా – రైజోబియం
2) ఆల్గే – నీలి ఆకుపచ్చ శైవలాలు
3) ఫంగై – సూడోమోనాస్
A) 1, 2
B) 2, 3
C) 2 మాత్రమే
D) 3 మాత్రమే
జవాబు:
D) 3 మాత్రమే
61. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడని జతను ఎన్నుకోండి.
1) వరి – వాంజా
2) పొగాకు – గడ్డి చామంతి
3) వేరుశనగ – పొగాకు మల్లె
A) 1 మాత్రమే
B) 1,2
C) 2,3
D) 3 మాత్రమే
జవాబు:
C) 2,3
పంట రకం | పంటపై పెరిగే కలుపు మొక్కలు |
వరి | గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి |
వేరుశనగ | గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస. |
మినుములు | గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ. |
మొక్కజొన్న | పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ |
పెసలు | ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర |
పై పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నకు సమాధానం రాయండి.
62. అన్ని పంటలలో పెరిగే కలుపు మొక్క
a) గరిక b) సార్వీనియా మొలస్కా c) తుంగ d) పావలికూర
A) a, b మరియు C
B) a, c మరియు d
C) bమరియు d మాత్రమే
D) a మరియు c మాత్రమే
జవాబు:
D) a మరియు c మాత్రమే
63. క్రింది పటాలలో మిశ్రమ పంటను సూచించే చిత్రం ఏది?
A) a, b
B) b, c
C) c, d
D) a, b, c, d
జవాబు:
A) a, b
64. ఈ క్రిందివానిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి.
1) నైట్రోజన్ ( ) a) వేళ్ళు నేల లోనికి చొచ్చుకొని పోవడానికి
2) ఫాస్ఫరస్ ( ) b) క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం
3) పొటాషియం ( ) c) పుష్పాలు వేగంగా రావడం
A) 1 – a, 2 – c, 3 – b
B) 1 – c, 2 – b, 3 – a
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b
65. ఈ క్రిందివానిలో సరిగా గుర్తించిన జతను ఎన్నుకోండి.
1) అజటో బాక్టర్ ( ) a) G.M. విత్తనం
2) B.T ప్రత్తి ( ) b) మిశ్రమ పంట
3) మిర్చి పంటలో పొద్దు తిరుగుడు పువ్వు ( ) c) సేంద్రీయ ఎరువు
A) 1 – c, 2 – b, 3 – a
B) 1 – a, 2 – c, 3 – b
C) 1 – a, 2 – b, 3 – c
D) 1 – c, 2 – a, 3 – b
జవాబు:
D) 1 – c, 2 – a, 3 – b
66. బాసిల్లస్ తురింజెనిసిస్ అనునది
A) పంటలను నాశనం చేస్తుంది.
B) కలుపు నాశనం చేస్తుంది.
C) చీడలను నాశనం చేస్తుంది.
D) మొక్కలకు నత్రజనిని సరఫరా చేస్తుంది
జవాబు:
C) చీడలను నాశనం చేస్తుంది.
67. స్థూల జీవ ఎరువులకు ఉదా||
A) జంతు సంబంధ విసర్జక పదార్థాలు
B) ప్లాస్టిక్ వ్యర్థాలు
C) జట్రోఫా విత్తన పొడి
D) కంపోస్ట్
జవాబు:
A or D
68. బంతిపూల చెట్లను మిర్చి పంటలో సాగు చేయడం
A) తెగుళ్ళ నివారణకు జీవనియంత్రణ
B) పంట మార్పిడి
C) సహజీవన పద్దతి
D) ఏదీకాదు
జవాబు:
A) తెగుళ్ళ నివారణకు జీవనియంత్రణ
69. రైతులకు మిత్రులైన కీటకములు
A) సాలెపురుగు
B) డ్రాగన్ ఫ్లె
C) మిరియడ్లు
D) పైవన్ని
జవాబు:
D) పైవన్ని
70. వరి, పొగాకు వంటి పంటల్లో కనిపించే లార్వాలను గుడ్ల దశలోనే నాశనం చేసే బ్యాక్టీరియా
A) లాక్టోబాసిల్లస్
B) బాసిల్లస్ తురంజియెన్సిస్
C) రైజోబియం
D) అజటోబాక్టర్
జవాబు:
B) బాసిల్లస్ తురంజియెన్సిస్
71. కింది వాటిలో తక్కువ మోతాదులో మొక్కలకు అవసరమయ్యేవి
A) నత్రజని, పొటాషియం
B) పొటాషియం , భాస్వరం
C) బోరాన్, నత్రజని
D) బోరాన్, జింక్
జవాబు:
D) బోరాన్, జింక్
72. ఇతర కీటకాలను ఆహారంగా తీసుకొని రైతుకు సహాయపడే కీటకాలు
A) పరభక్షకులు
B) మిత్రకీటకాలు
C) కీటకనాశనులు
D) ఆకర్షక కీటకాలు
జవాబు:
B) మిత్రకీటకాలు
73. పంచగవ్య తయారుచేయడానికి ఉపయోగపడేవి
1) ఆవుపేడ, ఆవునెయ్యి
2) కొబ్బరినీరు, కల్లు
3) చెరుకురసం
4) ఆవుమూత్రం
A) 1 మాత్రమే
B) 2, 3
C) 3, 4
D) పైవన్నీ
జవాబు:
C) 3, 4
74. జీవసేద్యానికి సరైన సూచన
A) జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట
B) వర్మీకంపోస్ట్ ఉపయోగించుటకు నిరుత్సాహపర్చుట
C) ఎక్కువ మోతాదులో యూరియా వాడుట.
D) ఎక్కువ మోతాదులో క్రిమిసంహారక మందులు వాడుట
జవాబు:
A) జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించుట
పునరాలోచన