SCERT AP 9th Class Biology Study Material Pdf Download 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 11th Lesson Questions and Answers జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రకృతిలో వివిధ జీవ భౌగోళిక రసాయనిక వలయాల ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. ఒక ఆవరణము నుండి మరియొక ఆవరణ వ్యవస్థకి పదార్థాల మార్పిడికి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు ఉపయోగపడతాయి.
  2. ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు అణువుల మార్పిడికి జీవభౌగోళిక రసాయనిక వలయాలు దోహదపడతాయి.
  3. వాతావరణములో అధిక గాఢతలో ఉన్న నైట్రోజనను నత్రజని వలయము ద్వారా నేలలో ఉండే బాక్టీరియాచే నేలలోకి చేర్చబడుతుంది.
  4. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు మూలకములను నిల్వచేయుటకు ఉపయోగపడతాయి.
  5. ఆవరణ వ్యవస్థ పనిచేయుటకు జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సహాయపడతాయి.
  6. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సజీవులను సజీవులతోను, సజీవులను నిర్జీవులతోను మరియు నిర్జీవులను నిర్జీవులతోను కలుపుతాయి.
  7. పదార్థముల ప్రసారమును జీవ భౌగోళిక రసాయనిక వలయాలు నియంత్రిస్తాయి.

ప్రశ్న 2.
ఓజోన్ పొర తగ్గిపోవటానికి కారణమైన మానవ కార్యకలాపాలేవి? స్ట్రాటోస్పియర్ లో మానవ ప్రమేయం వలన ఓజోన్ పొర తగ్గడాన్ని నివారించడానికి అనుసరించవలసిన ప్రధాన సోపానాలేవి?
జవాబు:

  1. కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు మరియు ఉత్పాదకాల వలన ఓజోను పొరను తగ్గించే పదార్థాలు వాతావరణంలోనికి విడుదల అవుతున్నాయి.
  2. ఈ పదార్థాలు బ్రోమిన్, క్లోరిన్ పరమాణువులను స్ట్రాటోస్పియర్‌లోకి చేరవేస్తున్నాయి.
  3. ఇవి అక్కడ జరిపే రసాయన చర్యల వలన ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి.
  4. ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ రిఫ్రిజిరేటర్లలో మరియు ఎయిర్ కండిషన్ వ్యవస్థలో వాడే క్లోరోఫ్లోరో కార్బనులు.
  5. క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి ఉత్పన్నాల వంటి ఓజోన్ పొరను తగ్గించే పదార్థాల ఉత్పత్తి మరియు సరఫరాను నియంత్రించినట్లయితే ఓజోన్ పొర తగ్గిపోవడాన్ని నివారించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 3.
జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని ఎలా చెప్పగలం?
జవాబు:

  1. నేల, నీరు మరియు వాతావరణములో వివిధ వాయువుల శాతం స్థిరంగా ఉండుట వలన మనం జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని చెప్పగలం.
  2. జీవ భౌగోళిక రసాయనిక వలయ పదార్థములు ఒక ఆవరణ వ్యవస్థ నుండి మరియొక ఆవరణ వ్యవస్థలోనికి మారినప్పటికి, అవి ఉండవలసిన పరిమాణము మారదు. ఇందువలన జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని చెప్పగలం.

ప్రశ్న 4.
జీవ భౌగోళిక రసాయనిక వలయాల సమతాస్థితిని మానవ కార్యకలాపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:

  1. భూమి వాతావరణ పరిస్థితులను నిర్ణయించే జీవ భౌగోళిక రసాయనిక వలయాలను మానవ కార్యకలాపాలు ప్రభావితం చేస్తున్నాయి.
  2. ఎరువుల వాడకం ఫాస్పరస్ మరియు నత్రజని వలయాలను ప్రభావితం చేశాయి.
  3. రైతులు ఉపయోగించిన ఫాస్ఫేటు ఎరువులు మొత్తం మొక్కలచే గ్రహించబడవు. ఎక్కువ మొత్తం వర్షపు నీటి ద్వారా నేల మరియు నీటి వనరులలోనికి చేరతాయి. నీటి వనరులు కాలుష్యం అవుతాయి.
  4. మానవుడు భూమి అంతర్భాగము నందు గల శిలాజ ఇంధనాలను వెలికితీయుట ద్వారా కార్బన్ వలయాన్ని ఆటంకపరిచాడు.
  5. వన నిర్మూలన ద్వారా మానవుడు వాతావరణములో CO2 పెరుగుదలకు కారణమయ్యాడు.
  6. పరిశ్రమల నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్ ను విడుదల చేయడం ద్వారా ‘సల్ఫర్ వలయం ప్రభావానికి గురి అయినది.
  7. సల్ఫర్ డై ఆక్సైడ్ ఆక్సీకరణం వలన నేలలోనికి చేరటం, క్షయకరణం ద్వారా వాతావరణంలోనికి చేరటం మరియు వాతావరణంలో సల్ఫేట్ నుండి సల్ఫ్యూరిక్ ఆమ్లము ఏర్పడుతుంది.
  8. ఎక్కువగా చిక్కుడు వంశ పంటలు పెంచడం, రసాయనిక ఎరువులను ఉత్పత్తి చేయడం, పరిశ్రమలు మరియు వాహనాల నుండి కాలుష్య కారకాలు వెదజల్లబడడం వలన మానవులు ఒక సంవత్సరంలో లభ్యమయ్యే నత్రజనిని రెండింతలు చేయడం జరిగింది.

ప్రశ్న 5.
మొక్కల జీవన విధానంలో CO2 పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:

  1. జీవ సంబంధ కార్బన్ వలయంలో నిరీంద్రియ వాతావరణ కార్బన్ ను జీవసంబంధ రూపంలో మార్చడం మొదటి మెట్టు.
  2. మొక్కలలోనూ ఇతర జీవులైన ఉత్పత్తిదారులలోనూ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవరూపంలో కార్బన్ స్థాపన చేయబడుతుంది.
  3. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు సంయోగం చెంది సరళమైన చక్కెర అణువులైన గ్లూకోజ్ (C6H12O6) ఏర్పడడానికి కాంతి శక్తి సహాయపడుతుంది.
  4. అన్ని మొక్కలకు, జంతువులకు కార్బోహైడ్రేట్లు శక్తినిచ్చే వనరులుగా మారతాయి.
  5. మొక్కలలో కొంత కార్బన్ తాత్కాలిక శక్తిని ఇవ్వడానికి అనువుగా సరళ గ్లూకోజ్ గా ఉండిపోతుంది.
  6. మిగిలిన కార్బన్ శాశ్వతంగా వాడడానికి అనువుగా సంక్లిష్ట అణువులతో కూడిన పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది.

ప్రశ్న 6.
కొలనులో మొక్కలన్నీ చనిపోయాయనుకోండి, వాటి ప్రభావం జంతువులపై ఎలా ఉంటుంది?
జవాబు:

  1. కొలనులో మొక్కలన్నీ చనిపోతే వాటిపై ఆధారపడి జీవించే జంతువులపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
  2. ఎందుకంటే జంతువులు తమ ఆహార అవసరాల కోసం మొక్కలపై ఆధారపడతాయి.
  3. మొక్కలు చనిపోవుట వలన ఆహారం దొరకక మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులన్నీ చనిపోతాయి.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 7.
ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌజ్ ప్రభావం ఎలా ఉంటుందో ప్రయోగపూర్వకంగా నిరూపించండి.
జవాబు:
ఉద్దేశం : ఉష్ణోగ్రత పై గ్రీన్‌హౌజ్ ప్రభావాన్ని పరీక్షించుట.

కావాల్సిన పరికరాలు : ప్లాస్టిక్ సీసా, (ఇనుప సీల), రెండు థర్మామీటర్లు, నోట్‌బుక్, పెన్సిల్.

విధానం :

  1. ఇనుప సీలతో ప్లాస్టిక్ సీసా పైభాగాన రంధ్రం చేయాలి.
  2. మొదటి థర్మామీటర్ ను రంధ్రంలో గుచ్చాలి.
  3. సీసా పక్కన రెండవ థర్మామీటరు ఉంచాలి.
  4. రెండు థర్మామీటర్లకు సమానంగా సూర్యరశ్మి సోకే విధంగా చూడాలి.
  5. 10 నిమిషాల తరువాత రెండు ధర్మామీటర్లలోని ఉష్ణోగ్రతలను నమోదు చేయాలి.
  6. ఉష్ణోగ్రత వివరాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి.
  7. పది నిమిషాల తరువాత మరియొకసారి ఉష్ణోగ్రతను నమోదుచేయాలి. ఇలా 2-3 సార్లు చేయాలి.

పరిశీలన :
సీసాలో ఉంచిన ధర్మామీటరులో అధిక ఉష్ణోగ్రత నమోదు అయింది.

వివరణ :
వేడెక్కిన సీసా లోపలి గాలి ప్రక్కలకు విస్తరించకుండా ప్లాస్టిక్ బాటిల్ నిరోధించింది. అందువలన ప్లాస్టిక్ బాటిల్ ఉష్ణోగ్రత పెరిగింది. ప్లాస్టిక్ బాటిల్ వలె, భూమిచుట్టూ గ్రీన్‌హౌజ్ వాయువులు ఉష్ణోగ్రతను బంధించుట వలన భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్నది.

నిరూపణ :
గ్రీన్‌హౌజ్ వాయువుల వలన భూ ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించడమైంది.

ప్రశ్న 8.
మీకు దగ్గరలో ఉన్న ఒక నీటి గుంటలోని జీవులను పరిశీలించండి. ఆ నీటిలో కలుస్తున్న కాలుష్య కారక పదార్థాలను గుర్తించండి. వాటి జాబితా రాయండి. అవి నీటిలోని జీవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించండి. మీ పరిశీలనలపై నివేదిక తయారు చేయండి.
జవాబు:
నీటిలో కలుస్తున్న కాలుష్యకారక పదార్థములు :
కాగితములు, మొక్కలు, ఆకులు, శాఖలు, పేపరు, పేడ, చెత్త, మురికినీరు మొదలైనవి.

కాలుష్య కారక పదార్ధములు నీటిలో నివసించే జీవులపై చూపే ప్రభావం :

  1. ఎక్కువ మొత్తంలో నేలలో కలసిపోయే చెత్త పదార్థాలు తక్కువ నీటి స్థలంలో వేసినట్లయితే అనేక పర్యవసానాలు కలుగుతాయి.
  2. చిన్న నీటి గుంటలో ఎక్కువ మొత్తంలో కలసిపోయే చెత్త వేసినట్లయితే అది నీటిలో ఆక్సిజన్ సమస్య ఏర్పడుటకు కారణమవుతుంది.
  3. జీవ సంబంధమైన వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా సూక్ష్మజీవులు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను వినియోగిస్తాయి.
  4. నీటి గుంటలో నివసించే జీవులకు తగినంత ఆక్సిజన్ లభించకపోవడం వలన ముఖ్యంగా చేపలు మరణిస్తాయి.
  5. ఈ విధముగా నేలలో కలసిపోయే చెత్త నీటి కాలుష్యానికి కారణమవుతుంది.

ప్రశ్న 9.
నత్రజని వలయాన్ని ఉదాహరణగా తీసుకొని సజీవ మరియు నిర్జీవ అంశాలు ఒకదానితో మరొకటి పరస్పరంగా ఎలా ఆధారపడతాయో వివరించండి.
జవాబు:
సజీవ, నిర్జీవ అంశాలు నత్రజని వలయంలో ఒకదానిపై ఒకటి ఆధారపడడం:
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1

  1. వాతావరణంలో ప్రాథమికంగా జడస్థితిలో ఉన్న నైట్రోజన్ ఉంటుంది. ఇది నిర్జీవ అంశము.
  2. నిర్జీవ అంశమైన వాతావరణం నుండి నేలలో ఉండే సజీవ అంశమైన నత్రజని స్థాపన బాక్టీరియా నత్రజనిని స్థాపించి తన శరీర కణములందు నిల్వ చేస్తుంది.
  3. నేలలోని వినత్రీకరణ బాక్టీరియా నైట్రేటులను అమ్మోనియాగా మారుస్తాయి.
  4. నిర్జీవ అంశమైన నేల నుండి సజీవ అంశాలైన మొక్కలు నైట్రేటులను మరియు అమ్మోనియం అయానులను గ్రహించి వాటిని ప్రోటీనులు మరియు కేంద్రకామ్లములుగా మారుస్తాయి.
  5. మొక్కలు మరియు జంతువులు మరణించినపుడు వాటి సేంద్రీయ పదార్థములో ఉన్న నత్రజని తిరిగి నేలకు, నీటిలోనికి చేరుతుంది.
  6. డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియా అమ్మోనియంను నేల మరియు నీటిలోనికి విడుదల చేస్తాయి.
  7. నిర్జీవ అంశమైన నేల నుండి సజీవ అంశమైన వాతావరణంలోనికి ప్రవేశిస్తుంది. ఇది డీనైట్రిఫికేషన్ వలన జరుగుతుంది. దీని ద్వారా ఘనరూప నైట్రేట్ వాయురూప నత్రజనిగా మారుతుంది.

ప్రశ్న 10.
ఆక్సిజన్ వలయం, నైట్రోజన్ వలయం, జలచక్రం తెలిపే ఫ్లోచార్టు గీయండి.
జవాబు:
1. ఆక్సిజన్ వలయం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2
2. నైట్రోజన్ వలయం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1
3. జలచక్రం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 3

ప్రశ్న 11.
ఓజోన్ పొర గురించి మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వక్తృత్వ పోటీకి, వ్యాసం రాయండి.
జవాబు:

  1. భూమిపైన వాతావరణం వివిధ పొరలుగా విభజింపబడింది.
  2. స్ట్రాటోస్ఫియర్ లో ఎక్కువ మొత్తం ఓజోన్‌ పూరిత వాతావరణం ఉంటుంది.
  3. ఇది భూమి ఉపరితలం నుండి 15-30 కి.మీ. దూరంలో వ్యాపించి ఉంటుంది.
  4. మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ అణువు ఏర్పడుతుంది.
  5. ఓజోన్ నీలిరంగులో ఉంటుంది, మరియు ఘాటైన వాసన కలిగి ఉంటుంది.

ఓజోన్ పొర ప్రాముఖ్యత :

  1. ఓజోన్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ వాతావరణంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
  2. సూర్యుని నుండి వచ్చే ప్రభావవంతమైన, శక్తివంతమైన వికిరణం కొంత భాగాన్ని శోషించుకుంటుంది.
  3. తద్వారా అది భూమిపై చేరకుండా కాపాడుతుంది.
  4. ఓజోన్ పొర ప్రధానంగా సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను శోషిస్తుంది.
  5. అతినీలలోహిత కిరణాలు జీవరాశులపై అనేక హానికరమైన ప్రభావాలను కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనది వివిధ రకాల చర్మ క్యాన్సర్.
  6. ఇంకా ఈ కిరణాల వలన పంటలకు, కొన్ని రకాల సముద్ర జీవులకు నష్టం వాటిల్లుతుంది.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 12.
మానవ కార్యకలాపాలు పర్యావరణ ప్రమాదం అనే అంశంపై మీ జిల్లాలోని పిల్లల పత్రికకు పంపడానికి ఒక వ్యాసం తయారుచేయండి.
జవాబు:
భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. మానవులు కూడా పర్యావరణంలో ఒక భాగమై ఉన్నారు. అయినప్పటికీ పర్యావరణానికి అనుకూలంగా తమ కార్యకలాపాలను మార్చుకోలేకపోతున్నారు. మానవుడు చేసే హానికరమైన కార్యకలాపాల వల్ల పర్యావరణం పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది.

మానవుడు నేల, నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలను తన యొక్క కార్యకలాపాల వలన కాలుష్యం చేస్తున్నాడు. దీని వలన అవి నేల పంటలు పండించడానికి, నీటి వనరుల వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయి.

వన నిర్మూలన వలన అనేక జీవరాసులు ఆవాసం కోల్పోతున్నాయి. ఈ భూగోళం నుండి అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఆనకట్టలు కట్టడం, పరిశ్రమలు స్థాపించడం, అటవీ భూములు గృహ నిర్మాణానికి వినియోగించడం కారణంగా అనేక మొక్క జంతుజాతులు అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇతర ప్రదేశాల నుండి స్థానిక పరిసరాలలో కొత్త జీవజాతులు ప్రవేశపెట్టడం వలన అవి అనేక వ్యాధులు కలుగజేస్తుండడంతో స్థానిక జీవజాతులు నశించిపోతున్నాయి. సహజంగా ప్రవహించే నీటి వనరుల మార్గాలను మళ్ళించుట వలన వరదలు సంభవిస్తున్నాయి. సహజ వనరులను ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నందున తక్కువ కాలంలో నిల్వలు తరిగిపోతున్నాయి. శిలాజ ఇంధనాలను మండించడం ఫలితంగా వాతావరణంలోకి వాయువులు విడుదల కావడంవల్ల పర్యావరణం కలుషితమవుతున్నది.

మానవుని కార్యకలాపాల వలన విడుదలయ్యే CO2 గ్రీన్‌హౌజ్ ఎఫెక్టుకు కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కావడం వలన భూగోళం వేడెక్కుతుంది. భూగోళం వేడెక్కుట వలన వరదలు, కరవు కాటకాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు కలుగుతున్నాయి. భూగోళం వేడెక్కుట వలన సముద్రమట్టాలు పెరిగి పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి.

విపరీతమైన వ్యవసాయ విధానాలు, గనుల తవ్వకం కారణంగా నేల క్రమక్షయానికి గురవుతుంది. గనుల తవ్వకం వలన వృక్షసముదాయం నశించడమే కాకుండా, నేలలో అస్థిర పరిస్థితులు కలుగుతాయి.

అందువలన మనమందరమూ పర్యావరణమును రక్షించుకోవాలి. మొక్కలు నాటడం, సక్రమమైన వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా మనం మన భూగోళాన్ని కాపాడుకోవచ్చు. మానవుని కార్యకలాపాలు సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పర్యావరణానికి మిత్రులుగా ఉంటాం.

ప్రశ్న 13.
పాఠశాల అసెంబ్లీ సమావేశంలో చదివి వినిపించడానికి గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ పై నినాదాలను తయారుచేయండి.
జవాబు:

  1. పచ్చదనం గురించి ఆలోచించండి. కానీ పచ్చగృహం కాదు.
  2. కాలుష్యాన్ని ఆపండి – భూగోళాన్ని కాపాడండి.
  3. మొక్కలు నాటండి – భూమిని కాపాడండి.
  4. గ్రీన్‌హౌజ్ వాయువులు మొక్కలకు మంచివి, కాని జంతు సముదాయమునకు కాదు.
  5. పచ్చగా ఉంచండి – భూమికి వాయువును చేర్చకండి. 6) పచ్చదనం గురించి ఆలోచించండి – చల్లగా ఉండండి.
  6. ప్రకృతిని కాపాడండి – అది మనలను కాపాడుతుంది.

ప్రశ్న 14.
ఇంధనాల దహనం శాస్త్రవేత్తలకు మరియు పర్యావరణవేత్తలకు ఎందుకు ఆందోళన కలుగచేస్తుంది?
జవాబు:

  1. ఇప్పుడు వాడుతున్న స్థాయిలో శిలాజ ఇంధనాలు దహనం చేస్తుంటే రాబోయే 50 నుండి 100 సంవత్సరాల కాలంలోపు అవి పూర్తిగా తరిగిపోతాయి.
  2. అది జరిగిన నాడు ప్రపంచంలో ఇంధనాలు ఎక్కడా దొరకక మానవ కార్యకలాపాలన్నీ స్తంభించిపోతాయి.
  3. శిలాజ ఇంధనాలను మండించినపుడు వాయురూపంలో వాతావరణంలోకి సల్ఫర్ డై ఆక్సైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డై ఆక్సైడ్లు విడుదల అవుతాయి.
  4. ఇవి వర్షపు నీటిలో గాని, వాతావరణంలో ఉండే తేమలో గాని కరిగి, ఆమ్లాలని ఏర్పరుస్తాయి.
  5. ఈ ఆమ్లాలు వర్షం ద్వారా భూమిని చేరతాయి. వీటిని ఆమ్లవర్షం అంటారు.
  6. ఇంధనాలు మండించినపుడు అధిక మొత్తంలో వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో పరారుణ కిరణాలను గ్రహించుట వలన భూగోళం వేడెక్కుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
  7. తద్వారా భూ ఉష్ణోగ్రతలు అధికమై సముద్రమట్టాలు పెరగడంతో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి.
  8. గ్లోబల్ వార్మింగ్ వలన అతివృష్టి, అనావృష్టి కలిగి కరువు కాటకాలు సంభవిస్తాయి.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 15.
జల సంచలన వలయాన్ని మనుషులుగా మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో వివరించండి.
జవాబు:

  1. మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులు మారకపోవచ్చు కాని మనము జల సంచలన వలయాన్ని మార్చవచ్చు. జనాభా పెరుగుట వలన మరియు జీవనస్థాయిలు పెరగడం వలన మనకు కావలసిన నీటి లభ్యత పెరగవచ్చు.
  2. నదులు, వాగులు, జలాశయములను కాలుష్యానికి గురిచేయుట ద్వారా మానవుడు జల సంచలన వలయాన్ని ప్రభావితం చేస్తున్నాడు.
  3. రసాయనిక పదార్థములను, అసహ్యకరమైన పదార్థములను నీటికి చేర్చుట ద్వారా నీటిని కలుషితం చేస్తున్నాము. సాంకేతికంగా మనం జల సంచలన వలయాన్ని మార్చలేము. .కానీ దానికి వ్యర్థ పదార్థములను చేర్చుట ద్వారా తారుమారు చేయగలం.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 185

ప్రశ్న 1.
గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే ఉపద్రవాలను గురించి రాయండి.
జవాబు:

  1. వాతావరణంలో అధిక మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు ఎక్కువగా విడుదల కావటం వలన అవి ఎక్కువ వేడిని నిల్వ చేస్తాయి.
  2. దీని ఫలితంగా భూమిపైన ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా భూమి వెచ్చబడటం జరుగుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
  3. గ్లోబల్ వార్మింగ్ అంటే అధిక మొత్తంలో భూమి, సముద్రాల ఉష్ణోగ్రత నమోదు కావటం.
  4. గ్లోబల్ వార్మింగ్ భూమిపై వాతావరణ మార్పును, శీతోష్ణస్థితి మార్పును కలుగచేయటం వలన సముద్ర నీటిమట్టం పెరగటం, అధిక వర్షపాతం, వరదలు, కరవు కాటకాలు సంభవిస్తాయి.

9th Class Biology Textbook Page No. 185

ప్రశ్న 2.
శీతోష్ణస్థితిలో మార్పు సంభవించినపుడు మానవులు మరియు జంతువులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? చర్చించి మీ నోటుబుక్ లో రాయండి.
జవాబు:

  1. శీతోష్ణస్థితిలో మార్పు మానవులు మరియు జంతువులపై ప్రభావం చూపుతుంది.
  2. వాతావరణం మారినపుడు, ఆ మార్పునకు తట్టుకోలేక చాలా జీవులు మరణిస్తాయి.
  3. మరికొన్ని జీవులు సురక్షిత ప్రాంతాలకు వలసపోతాయి.
  4. ఇంకొన్ని జీవులు సుప్తావస్థ వంటి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.
  5. శీతోష్ణస్థితి మార్పులకు మానవుడు అనారోగ్యం పాలౌతాడు.
  6. శీతోష్ణస్థితి మార్పులకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology Textbook Page No. 186

ప్రశ్న 3.
మురికి కాలువల దగ్గర వాసన రావటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. మురికి నీటిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.
  2. ఆక్సిజన్ దొరకనపుడు వాయుసహిత బాక్టీరియాలు మరణిస్తాయి.
  3. అప్పుడు అవాయు బాక్టీరియాలు వ్యర్థ పదార్థాలను హైడ్రోజన్ సల్ఫేడ్ (H2O) మరియు ఇతర విషపదార్థాలుగా మార్చుతాయి.
  4. ఈ పదార్థాలు దుర్గంధమైన వాసనను కలిగిస్తాయి.
  5. అందువలన మురికి కాలువల దగ్గర వాసన వస్తుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము

ఉద్దేశం : ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌజ్ ప్రభావాన్ని పరీక్షించుట.

కావాల్సిన పరికరాలు :
ప్లాస్టిక్ సీసా, (ఇనుప సీల), రెండు థర్మామీటర్లు, నోట్ బుక్, పెన్సిల్.

విధానం :

  1. ఇనుప సీలతో ప్లాస్టిక్ సీసా పైభాగాన రంధ్రం చేయాలి.
  2. మొదటి థర్మామీటరు రంధ్రంలో గుచ్చాలి.
  3. సీసా పక్కన రెండవ థర్మామీటర్‌ను ఉంచాలి.
  4. రెండు థర్మామీటర్లకు సమానంగా సూర్యరశ్మి సోకే విధంగా చూడాలి.
  5. 10 నిమిషాల తరువాత రెండు థర్మామీటర్లలోని ఉష్ణోగ్రతను నమోదు చేయాలి.
  6. ఉష్ణోగ్రత వివరాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి.
  7. పది నిమిషాల తరువాత మరియొకసారి ఉష్ణోగ్రతను నమోదుచేయాలి. ఇలా 2-3 సార్లు చేయాలి.

ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
1) రెండు ‘ థర్మామీటర్లు ఒకే ఉష్ణోగ్రతను నమోదు చేశాయా? లేకపోతే ఏ థర్మామీటరు అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది?
జవాబు:
సీసాలో గుచ్చిన థర్మామీటరు ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసింది.

2) రెండు ఉష్ణోగ్రతలు సమానంగా ఉండకపోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఎ) ప్లాస్టిక్ సీసా సూర్యరశ్మిని గ్రహించి నిల్వ చేయడం వలన వేడి బయటకు పోకుండా ఆపుతుంది.
బి) లోపలంతా వెచ్చగా ఉంటుంది.
సి) అందువలన సీసా నందు ఉంచిన థర్మామీటరు, సీసా బయట ఉంచిన థర్మామీటరు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది.