AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

SCERT AP 8th Class Social Study Material Pdf 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
శాసనసభలో చట్టాలు చేసేటప్పుడు దానిపై వివిధ దృష్టి కోణాల నుంచి ఎంతో చర్చ జరుగుతుంది. 1950లలో భూసంస్కరణల చట్టంపై వివిధ అభిప్రాయాలు ఏమై ఉంటాయి ? ఏ దృష్టి కోణం బలంగా ఉండి ఉంటుంది? (AS1)
జవాబు:
వివిధ అభిప్రాయాలు :

  1. జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలి.
  2. నష్టపరిహారంగా వీరికి ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించాలి.
  3. పేదలకు భూమిని పంచాలి.
  4. కౌలుదార్లను స్వంతదారులుగా మార్చాలి.
  5. వెట్టి / బేగారను రూపుమాపాలి.
  6. అటవీ, బంజరు భూములపై నియంత్రణ సాధించి పేదలకు పంచాలి.
  7. శిస్తు వసూలు అధికారం ప్రభుత్వానికి ఉండాలి.
  8. భూస్వామ్య దోపిడీ నుండి సామాన్య రైతులను రక్షించాలి.

బలమైన దృష్టికోణం :
గ్రామీణ పేదరిక నిర్మూలన అనే దృష్టి కోణం బలీయంగా ఉండి ఉంటుంది.

ప్రశ్న 2.
1970లలో భూ పరిమితి చట్టాలు చేసినప్పుడు ఎటువంటి అభిప్రాయాలు ఉండి ఉంటాయి? (AS1)
జవాబు:

  1. దేశంలోని సంపద ఒక చోటే కేంద్రీకృతమై ఉంది.
  2. చాలామంది రైతులు చిన్నచిన్న కమతాలను కలిగియున్నారు.
  3. దళితులు భూమిలేని వారై ఉన్నారు.
  4. పశువుల కొట్టాలు, భవనాలు మొదలైనవన్నీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి.
  5. జమీందారులు భూస్వాములుగానూ, భూస్వాములు పారిశ్రామికవేత్తలుగానూ మారారు.
  6. ఈ అవకతవకలన్నింటినీ సరిచేయాలనే భావన ఉండి ఉంటుంది.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
ఈ సంస్కరణల వల్ల రైతాంగ మహిళలు ఏమైనా లబ్ది పొందారా ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
రైతాంగ మహిళలు కొంతవరకు లబ్ధి పొందారని చెప్పవచ్చు.

కారణాలు:

  1. కొంతమంది మిగులు భూములను భార్యల, కూతుళ్ళ, కోడళ్ళ పేరు మీదకు బదిలీ చేసి వారిని ఆస్తిదారులను చేశారు.
  2. ఉత్తుత్తి విడాకులు ఇచ్చుకుని భార్యాభర్తలు రెండు కుటుంబాలుగా మారిపోయారు. ఈ రకంగా కూడా మహిళలు ఆస్తి పరులయ్యారు.
  3. మహిళలు కూడా తమ భర్తలతో పాటు యజమానుల పొలాలలో పనిచేసేవారు. ఈ చట్టాల వలన స్వంత పొలాలలో పని, వాటిపై అజమాయిషీ చేయగలుగుతున్నారు.

ప్రశ్న 4.
అన్ని వర్గాల రైతాంగానికి పెట్టి ఎందుకు సమస్యగా ఉంది? భూస్వాములు తమ భూములను సాగుచేయడానికి ప్రస్తుతం ఏం చేస్తూ ఉండి ఉంటారు? (AS6)
జవాబు:
‘వెట్టి’ మానవత్వానికి మాయని మచ్చ వంటిది. దీనికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగాయి. కాబట్టి ఇది అన్ని రకాల రైతాంగానికి ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం పూర్వకాలం నాటి భూస్వాములు లేరు. ఉన్నవారు పాలేర్లను, కూలీలను నియమించుకుని భూములను సాగు చేస్తున్నారు.

ప్రశ్న 5.
మీరు ఒక కౌలుదారు. భూ సంస్కరణ చట్టాల వల్ల మీకు భూమి లభించింది. అప్పుడు మీ అనుభవాలను గురించి వ్రాయండి. (AS4)
జవాబు:
“నాకు ఈ చట్టం వలన 4 ఎకరాలు భూమి లభించింది. దీనికోసం నేను కొద్ది మొత్తం చెల్లించాను. ఇప్పటి వరకు నేను, నా భార్యా, పిల్లలు అందరూ మా దొరగారి పొలంలో పని చేయాల్సి వచ్చేది. కానీ నేటి నుండి ఈ పొలానికి నేనే యజమానిని. నా కుటుంబం అంతా ఈ పొలంలోనే చెమటోడ్చి, శ్రమించి పండిస్తాము. మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాము. స్వేచ్ఛా వాయువులు మమ్మల్ని పరవశింపచేస్తున్నాయి.”

ప్రశ్న 6.
భూసంస్కరణల చట్టం సమయంలో మీరు ఒక భూస్వామి అని ఊహించుకోండి. అప్పుడు మీ భావాలు, చర్యలు ఎలా ఉంటాయో రాయండి. (AS4)
జవాబు:
“అయ్యో ! ఈనాడు ఎంత దుర్దినం. నా 4000 ఎకరాల భూమిని కోల్పోవలసివచ్చింది. నేటి వరకు నా యిల్లు ధాన్యం తోటి నౌకర్లు, చాకర్లు, వెట్టివారితోటి కళకళలాడుతూ ఉండేది. ఇవ్వాళ ఎన్నో అబద్దాలాడి కేవలం 150 ఎకరాలు . మిగుల్చుకోగలిగాను. నా దేశానికి స్వాతంత్ర్యం రావడం ఆనందమే అయినా, నేను మాత్రం చాలా నష్టపోయాను. అధికారమూ, ఆస్తులు లేకుండా మేమెలా జీవించాలి?”

ప్రశ్న 7.
రైతులు ఇష్టం వచ్చినప్పుడు తొలగించగల కౌలుదార్లకు భూసంస్కరణల వల్ల వాస్తవానికి నష్టం జరిగిందని చాలామంది అభిప్రాయపడతారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు తెల్పండి. (AS1)
జవాబు:
ఇది కొంతవరకు ఏకీభవించదగ్గ విషయమే. కారణాలు:

  1. ప్రభుత్వం చెల్లించమని నిర్ణయించిన వెలను చెల్లించి కొంతమంది కౌలుదారులు భూయజమానులయ్యారు.
  2. చట్టబద్ద గుర్తింపు లేని వారు ఎటువంటి ప్రయోజనం పొందలేదు.
  3. జమీందారులు ‘ఖుదా కాస్తే’ను అడ్డం పెట్టుకుని, చాలావరకు భూమిని సొంత సాగులోనే చూపించారు.
  4. కౌలుదార్లను పెద్ద ఎత్తున తొలగించి భూమిని జమీందారులు తమ సొంత సాగులోనికి తెచ్చుకున్నారు.

ప్రశ్న 8.
ప్రభుత్వం సమర్థవంతమైన చట్టాలు చేసినా భూ పరిమితి చట్టాన్ని సమర్థంగా ఎందుకు అమలు చేయలేకపోతుంది? (AS1)
జవాబు:
ప్రభుత్వం సమర్ధవంతమైన చట్టాలు చేసినా, భూస్వాముల పన్నాగాల వల్ల, ప్రభుత్వానికి అంతగా రాజకీయ నిబద్ధత లేనందువల్ల ఈ చట్టం సరిగా అమలు కాలేదు.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 9.
భూదాన ఉద్యమస్ఫూర్తి “భూస్వామ్యాన్ని అంతం చేయడం”లో, “దున్నేవానికే భూమి ఇవ్వటం”లో ఎందుకు విఫలమైంది? (AS1)
జవాబు:
ఈ ఉద్యమంలో భూస్వాములు తమంతట తామే భూములను దానంగా ఇవ్వాలి. అంతటి ఔదార్యం అందరికీ ఉండదు. ఇచ్చినవారు కూడా బంజరు, బీడు భూముల్నే ఇచ్చారు కానీ, సారవంతమైన వాటిని ఇవ్వలేదు. సారవంతమైనవి ఎక్కువ భూస్వాముల దగ్గరే ఉండటం మూలాన ఇది భూస్వామ్యాన్ని అంతం చేయలేకపోయింది. దున్నేవానికి భూమి ఇవ్వలేక పోయింది.

ప్రశ్న 10.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పటంలో (నల్గొండ) యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి గ్రామాన్ని గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1

ప్రశ్న 11.
“స్వాతంత్ర్యం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం” అనే శీర్షిక కింద మొదటి పేరా చదివి ఈ కింది ప్రశ్నకు సమాధానం రాయండి. (AS2)

స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడు పేదరికం ఒకటి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ. గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది (65 శాతం), అంటే 18:6 కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా. వాళ్లకు భూమి వంటి వనరులు ఏవీ అందుబాటులో లేవు, కనీస ఉపాధి పొందటానికి ఉపయోగపడే చదువు లేదు. వాస్తవానికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. చాలా తక్కువ కూలీ దొరికే వ్యవసాయ పని మాత్రమే వాళ్లకు దొరికేది. వ్యవసాయదారుల్లో అధిక శాతానికి ఎటువంటి సొంత భూమిలేదు. వాళ్లలో కొంతమంది భూస్వాములకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేవారు. భూస్వాముల పొలాల్లో వీళ్లు కూలీ లేకుండా పని చేయాల్సి వచ్చేది. కరవు కాటకాలు, రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి. ఆకలి ఎప్పుడూ వాళ్లని వెంటాడుతూనే ఉండేది.
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయా? ఎలా?
జవాబు:
ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. వీరు వ్యవసాయ పనులకే కాక ఇతర పనులకు కూడా వెళుతున్నారు.
ఉదా :
పారిశ్రామిక పనులు, రోడ్డు పనులు, అనేక రకాలైన చేతివృత్తులు మొదలైనవి. వీరు ప్రస్తుతం విద్యను కూడా అభ్యసిస్తున్నారు. నేడు వ్యవసాయ కూలీలకు మంచి డిమాండు ఉన్నది. కాబట్టి వీరి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పవచ్చును.

8th Class Social Studies 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు InText Questions and Answers

8th Class Social Textbook Page No.185

ప్రశ్న 1.
“దున్నేవానికి భూమి” అన్న నినాదంతో కౌలుదారులకు భూమి లభిస్తుంది. మరి కూలికి పనిచేసే వ్యవసాయ కూలీల . పరిస్థితి ఏమిటి?
జవాబు:
కౌలుదార్ల పరిస్థితి కొంత బాగవుతుంది. కాని వ్యవసాయ కూలీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు ఉంటుంది. వారి పరిస్థితి నేటికీ అలాగే ఉందని మనం భావించవచ్చు.

ప్రశ్న 2.
గ్రామీణ పేదలకు ఆదాయం వచ్చే ఉపాధి కల్పించడానికి ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయని నీవు భావిస్తున్నారా?
జవాబు:
నేటికాలంలో అయితే అనేక మార్గాలున్నాయి. కానీ నాటి కాలంలో ఉపాధి మార్గాలు తక్కువగానే ఉన్నాయి. బ్రిటిషు వారు మనదేశంలో వృత్తి, ఉపాధుల మీద దెబ్బకొట్టారు. ఉన్న కొన్ని అవకాశాలు కూడా చేయిజారి పోయాయి. కాబట్టి ఇంక వేరే ఏ మార్గాలు లేవని నేను భావిస్తున్నాను.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపటానికి ఎన్ని ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది?
జవాబు:
మా ప్రాంతంలో నలుగురు వ్యక్తులున్న ఒక కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపడానికి 8 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 30 ఎకరాలు నీటి వసతి లేని భూమి ఉంటే సరిపోతుంది.

8th Class Social Textbook Page No.186

ప్రశ్న 4.
భూ సంస్కరణ చట్టాలు భూస్వాములకు సహాయం చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
నేను వారితో ఏకీభవిస్తాను. జమీందారులకు నష్టపరిహారం చెల్లించడం, ఖుద్ కాస్త లకు వారినే యజమానులుగా కొనసాగించడం మొదలైనవి ఈ వాదనను బలపరుస్తున్నాయి.

ప్రశ్న 5.
భూ సంస్కరణ చట్టాలు భూమినీ, అధికారాన్ని సంపన్న కౌలు రైతులకు మాత్రమే బదిలీ చేయటానికి ప్రయత్నించాయని కొంతమంది అంటారు. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వారితో ఏకీభవిస్తాను.

ప్రభుత్వం కౌలుదారులకు భూమిని ఇవ్వడానికి కొంత మొత్తాన్ని వెలగా నిర్ణయించింది. ఇది చెల్లించిన వారు మాత్రమే వీరు తాము సాగుచేసే భూమిని పొందగలిగారు. చెల్లించలేని పేదవారు కూలీలుగానే మిగిలిపోయారు.

ప్రశ్న 6.
వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించటానికి అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
ఈ చట్టాల వల్ల ఎవరు ఎక్కువ లాభపడ్డారు? ఎవరు అస్సలు లాభపడలేదు ? భూస్వాములు చాలా నష్టపోయారని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
ఈ చట్టాల వలన జమీందారులు ఎక్కువ లాభపడ్డారు. కారణం

  1. వీరికి ఆదాయం పోయినా, అంతకు 20, 30 రెట్లు నష్టపరిహార రూపంలో లభించింది.
  2. ఖుదా కాలు కూడా వీరి ఆధీనంలోనే ఉన్నాయి.
  3. చట్టంలోని లొసుగులను ఉపయోగించి ఎక్కువ భూములను నియంత్రణలోనికి తెచ్చుకున్నారు.
    ఈ చట్టాల వల్ల అస్సలు లాభపడని వారు పేద వ్యవసాయ కూలీలు.

కారణం :
వీరు గుర్తింపు లేక వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు.

8th Class Social Textbook Page No.189

ప్రశ్న 8.
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో ఏ వర్గాల రైతాంగం లబ్ధి పొందింది? ఏ రకంగా లబ్ధి పొందింది?
జవాబు:
వివిధ సంస్కరణల వల్ల తెలంగాణలో భూస్వామ్య, ఆధిపత్య కులాల రైతాంగం లబ్ది పొందింది.

  1. జాగీర్దారీ రద్దు వల్ల ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఈ భూముల మీద పట్టాలు లభించాయి.
  2. జాగీర్దార్లు నష్టపరిహారంగా కొట్లు సంపాదించారు.
  3. పెద్ద పెద్ద భవనాలు, పశువుల కొట్టాలు, వ్యవసాయ పరికరాలు భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయి.
  4. వేలాది ఎకరాలు ఖుద్ కాఫ్ కింద ఉండిపోయాయి.
    ఈ రకంగా భూస్వామ్య వ్యవస్థ లబ్ధి పొందిందని చెప్పవచ్చు.

AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 9.
భూమిలేని వృత్తి కులాలవారికి ఈ సంస్కరణల వల్ల ఏ మేరకు ప్రయోజనం కలిగింది?
జవాబు:
ఈ సంస్కరణల వలన వీరికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు.

ప్రశ్న 10.
భూస్వాములు ఎంత నష్టపోయారు? తమ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడుకోగలిగారు?
జవాబు:
భూస్వాములు ఏమీ నష్టపోలేదని చెప్పవచ్చును. అనేక చట్టాలను సరిగా అమలుచేయలేదు. వీటి అమలులో జాప్యం వల్ల భూస్వాములు వీటిని తమ ప్రయోజనానికి వాడుకున్నారు. కౌలుదారీ చట్టాలలోని లొసుగులను ఆధారంగా చేసుకుని జమీందారులు కౌలుదారుల నుంచి భూములను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జమీందారీల రద్దు తరువాత వాళ్లు ఆ భూములన్నీ తమవేనంటూ పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు. ఈ భూములను పరిశ్రమలు నెలకొల్పటానికి మళ్లించారు. ఉదాహరణకు చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు. కాలక్రమంలో వీళ్లు ఆంధ్రలో పారిశ్రామికవేత్తలుగా మారారు. తెలంగాణలో వీళ్లు 21వ శతాబ్దంలో సైతం తమ పెత్తనాన్ని కొనసాగించారు.

ప్రశ్న 11.
కింది పట్టికను గమనించి ఖాళీలను పూరింపుము.
AP Board 8th Class Social Solutions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 2

పట్టికను చదవటం :
1955-56కు సంబంధించిన గణాంకాలను జాగ్రత్తగా చదవండి. భూ సంస్కరణల తరవాత 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న సన్నకారు రైతులు 58 శాతంగా ఉన్నారు. రైతుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ల కింద 20 శాతం కంటే తక్కువ సాగుభూమి ఉంది. ఇంకొకవైపున 10 శాతంగా ఉన్న పెద్ద రైతులు, భూస్వాముల కింద మొత్తం సాగుభూమిలో 38 శాతం ఉంది.

భూ సంస్కరణలు అమలు జరిపిన తరువాత 1970 దశకంలో చాలా మార్పులు వచ్చాయి. సన్నకారు రైతులు 58% నుండి 83% వరకు పెరిగారు. చిన్న రైతులు 32% నుండి 16% కు తగ్గారు. కాని వారు గతం కంటే కొంచెం ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. పెద్ద రైతులు 10% నుండి 1% కు తగ్గారు. వారి ఆధీనంలోని భూమి కూడా 38% నుండి 6% కి తగ్గింది.

8th Class Social Textbook Page No.190

ప్రశ్న 12.
ఈ చట్టాన్ని 1950లలోనే అమలు చేసి ఉండాల్సిందని చాలామంది భావిస్తారు. అయితే దీనివల్ల చాలా వ్యతిరేకత వచ్చి ఉండేదని కొంతమంది అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల గురించి తరగతిలో చర్చించండి. మీరు దేనితో ఏకీభవిస్తారు?
జవాబు:
1950లో అమలుచేయటం నిజంగానే కష్ట సాధ్యం అయ్యేది. ఒకేసారిగా అందరి నుండి అంతంత భూమిని తీసుకున్నట్లయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలోనే దేశ అంతర్గత పరిస్థితి అస్తవ్యస్తమయ్యేది. దీనివల్ల వ్యతిరేకత కూడా వచ్చి ఉండేది. కాని నాడు ‘ఉక్కు మనిషి’ అని పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి నాయకులున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలను త్వరలోనే అధిగమించగలిగేది. కాబట్టి అప్పుడు అమలుచేసి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 13.
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లోనూ, పశ్చిమ బెంగాల్ లోనూ అమలు అయిన విధానాన్ని పోల్చండి. చట్టాన్ని సమర్ధవంతంగా ఎలా అమలు చేయాలో చర్చించండి.
జవాబు:
భూ పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ లో చాలా అధ్వాన్నంగా అమలు అయిందని చెప్పవచ్చు. అనేకమంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ప్రకటనలు చేసి, అదనపు భూమిని వెల్లడి చేయలేదు. చట్టం వస్తుందని ముందుగానే తెలిసిన అనేకమంది భూస్వాములు తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ళ పేరు మీద కూడా బదిలీ చేశారు. భార్యాభర్తలను వేరువేరు కుటుంబాలుగా చూపించటానికి కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చట్టం ప్రకారం అదనపు భూమి ఉన్న రైతులు కూడా తమ భూములను కాపాడుకుని మిగులు భూమిని చూపించలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమిలో చాలా వరకు సాగుకు పనికిరానిదిగా ఉంది. భూపరిమితి చట్టాలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్ ఒకటి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించి సన్నకారు రైతులు, భూమిలేని పేదలను సమీకరించి భూ పరిమితి చట్టాలు అమలు అయ్యేలా చూసింది. ఇది సరిగా అమలు కావాలంటే రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రజానీకానికీ కూడా నిబద్ధత ఉండాలి.

ప్రశ్న 14.
భూ పరిమితి చట్ట అవసరం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
1950 నుండి ఎన్ని రకాల చట్టాలు చేసినా అవి భారతదేశంలోని భూమి యాజమాన్య పరిస్థితులను మార్చలేకపోయాయి. జమీందారులను భూస్వాములు గాను, భూస్వాములు పెద్ద రైతులు గాను మారారు తప్ప సామాన్య ప్రజానీకానికి, పేదవారికి ఒరిగినదేమీ లేదు. భూమి అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది. అందువలన భూ పరిమితి చట్టం అవసరం ఏర్పడింది.

ప్రాజెక్టు

అయిదుగురు విద్యార్ధుల చొప్పున బృందాలుగా ఏర్పడి, మీ ప్రాంతంలోని కొంతమంది పెద్దలతో భూ సంస్కరణల అమలులో వాళ్ల అనుభవాల గురించి అడగండి. ఈ పాఠంలో పేర్కొన్న అంశాలు మీ ఊల్లో కూడా జరిగాయేమో తెలుసుకోండి. దీనిపై ఒక నివేదిక తయారుచేసి తరగతిలో చర్చించండి.
జవాబు:

నివేదిక

మా ప్రాంతంలో దాదాపు 15 మంది పెద్దలను మేము అనుభవాలు అడిగి తెలుసుకున్నాము. ఈ భూ సంస్కరణల అమలులో కొద్దిమంది. బికారులు అయిపోయారట. కొద్దిమంది తప్పించుకున్నారట. రాత్రికి రాత్రి చట్టం గురించి తెలిసిన వారు ఆస్తిని బంధువులు, పాలేర్లు అందరి పేర్ల మీద మార్చి తమ భూములను కాపాడుకున్నారు. విషయం తెలియని వారు వారి భూమిని, ఆస్తిని పోగొట్టుకున్నారని వాపోయారు. మొత్తం మీద ఇది కొంతమందికి ఉపశమనాన్ని, కొంతమందికి దుఃఖాన్ని మిగిల్చింది.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

SCERT AP 8th Class Social Study Material Pdf 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 20th Lesson లౌకికత్వం – అవగాహన

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ పరిసర ప్రాంతాలలో వివిధ మత ఆచారాల జాబితా తయారుచేయండి – రకరకాల ప్రార్థనలు, దేవుడిని కొలిచే విధానాలు, పవిత్ర స్థలాలు, భక్తి పాటలు, సంగీతం మొదలైనవి. మత ఆచరణ స్వేచ్ఛను ఇది సూచిస్తోందా? (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన 1

ప్రశ్న 2.
మా మతం శిశుహత్యలను అనుమతిస్తుంది అని ఒక మత ప్రజలు అంటే ప్రభుత్వం అందులో జోక్యం చేసుకుంటుందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
చేసుకుంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
కారణాలు :

  1. భారతదేశ లౌకికవిధానం మతాలలో జోక్యం చేసుకుంటుంది.
  2. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రశ్న 3.
ఒకే మతంలో భిన్న దృక్పథాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను సేకరించండి. (AS1)
జవాబు:
మనం దీనికి ఉదాహరణగా బౌద్ధమతంను తీసుకుందాము.

బుద్ధుని బోధనలను అనుసరించేవారిని బౌద్ధులు అని అంటాము. వీరు ఆచరించే విధానాలను బౌద్ధమతం అని చెప్పుకుంటాము. అయితే దీనిలో 3 రకాల దృక్పథాలు ఉన్నాయి.

  1. తేరవాదం
  2. మహాయానం
  3. వజ్రయానం

1) తేరవాదం :
తేరవాదులు ఎవరికి వారే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నమ్ముతారు.

2) మహాయానం :
వీరు ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నిస్తూనే ఇతరులకు కూడా ఆ స్థాయి రావడానికి సహాయం చేయాలని భావిస్తారు.

3) వజ్రయానం :
ఇతరులకు సహాయం చేయటమేకాక వారిని ఆ స్థాయికి తేవడానికి తగిన శక్తిని కలిగి ఉండాలని భావిస్తారు.

ఈ విధంగా ఒకే మతంలో విభిన్న దృక్పథాలు ఉంటాయి.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

ప్రశ్న 4.
భారత రాజ్యం మతానికి దూరంగా ఉంటుంది. మతంలో జోక్యం చేసుకుంటుంది. ఈ భావన గందరగోళం సృష్టించవచ్చు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణలతో పాటు మీకు అనుభవంలోకి వచ్చిన / తెలిసిన ఇతర ఉదాహరణలతో దీనిని మరోసారి చర్చించండి. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగం లౌకిక విధానాన్ని అవలంబిస్తూనే మత విధానాలలో జోక్యం చేసుకుంటుంది. ఈ జోక్యం రాజ్యాంగంలోని ఆదర్శాలకు అనుగుణంగా ఉంటుంది.
ఉదా :

  1. హిందూమతంలోని ‘అంటరానితనాన్ని’ నిషేధించింది.
  2. భారతదేశ ముస్లిం మహిళలు వారి మతధర్మం ప్రకారం విడాకులు పొందినా, భారతదేశంలో కోర్టుకు వెళ్ళినట్లయితే వారికి భరణం ఇవ్వాల్సిందిగా నిర్దేశించినది. (షాబానోకేసు)
  3. శిశు విద్యా మందిరం, ఆర్.సి.యం పాఠశాలలు, ఉర్దూ పాఠశాలలు మొదలగునవి మతపరమైన విద్యాలయాలు అయినా వాటికి ప్రభుత్వం ఆర్ధిక మద్దతు అందిస్తుంది.
  4. అదే విధంగా వారసత్వంలో సమాన ఆస్తిహక్కును కాపాడటానికి ప్రజల మత ఆధారిత పౌర చట్టాలలో రాజ్యం జోక్యం చేసుకోవలసిరావచ్చు.
  5. మన ప్రభుత్వం తరఫున ఒంటిమిట్ట రాములవారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముత్యాలు, పట్టువస్త్రాలు మొదలైనవి పంపుతారు. వీటిని ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రిస్థాయిలోని వారు తీసుకుని వెళతారు.
  6. రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖలలో పనిచేసే ముస్లింలకు నమాజుకు ప్రభుత్వం సమయం కేటాయిస్తూ పనివేళలు మారుస్తుంది.

ఈ విధంగా మన రాజ్యాంగం లౌకికంగానే ఉంటూ మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటుంది.

ప్రశ్న 5.
లౌకికవాదం అంటే ఏమిటి ? అన్న భాగం చదివి దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వంలో మతవరమైన జోక్యం లేకపోవడాన్ని లౌకికవాదం అంటారు.
  2. భారతదేశం లౌకికంగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
  3. అందుచే అది మతానికి దూరంగా ఉంటుంది.
  4. ఆధిపత్య నివారణకు, జోక్యం చేసుకోకుండా ఉండటం అన్న విధానాన్ని అనుసరిస్తుంది.
  5. అవసరమైతే భారత రాజ్యం మతంలో జోక్యం చేసుకుంటుంది.

8th Class Social Studies 20th Lesson లౌకికత్వం – అవగాహన InText Questions and Answers

8th Class Social Textbook Page No.223

ప్రశ్న 1.
ఈ అధ్యాయానికి పైన ఉన్న పరిచయాన్ని మరొకసారి చదవండి. ఈ సమస్యకు ప్రతీకార చర్య సరైనది ఎందుకు కాదు? వివిధ బృందాలు ఈ పద్ధతిని అనుసరిస్తే ఏమవుతుంది?
జవాబు:
పై పేరాను చదివిన తర్వాత ప్రతీకార చర్య సరైనది కాదు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక, లౌకికవాద దేశం. సంస్కృతి, సాంప్రదాయాలకు, మత సామరస్యానికి ప్రతీక. అలా చేయడం వలన మత విద్వేషాలు పెరుగుతాయి. అధికులు ఎక్కువగా ఉన్న మతవాదులు, అల్పజన మతంపై దాడులు చేస్తే మత స్వేచ్ఛకు భంగం కలిగి, భారతదేశం లాంటి శాంతి కాముక దేశ ఆదర్శవాదం దెబ్బతింటుంది.

8th Class Social Textbook Page No.224

ప్రశ్న 2.
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చా ? తరగతిలో చర్చించండి.
జవాబు:
ఒకే మతంలో భిన్న దృక్పథాలు ఉండవచ్చు. ప్రపంచంలో చాలా మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నవే ఉన్నాయి.
ఉదా :
వీటినన్నింటిని పరిశీలించినట్లయితే అన్ని ముఖ్యమైన మతాలలో భిన్న దృక్పథాలు ఉన్నాయని తెలుస్తోంది.

8th Class Social Textbook Page No.225

ప్రశ్న 3.
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే ప్రభుత్వాలు మతంతో ఏమాత్రం జోక్యం చేసుకోవు. కానీ భారత లౌకిక విధానం మతాలతో జోక్యం చేసుకుంటుంది. ఈ విధంగా ఇది ఇతర ప్రజాస్వామిక దేశాలతో భిన్నమైనది.

AP Board 8th Class Social Solutions Chapter 20 లౌకికత్వం – అవగాహన

8th Class Social Textbook Page No.226

ప్రశ్న 4.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా, రాజ్యాంగంలోని లౌకిక ఆదర్శాలు ఉల్లంఘింపబడిన ఘటనలు విన్నారా? మతం కారణంగా వ్యక్తులు వేధింపబడి, చంపబడిన ఘటనలు విన్నారా?
జవాబు:
ఇటీవల కాలంలో అంటే 11 సంవత్సరాల క్రితం 2002 లో ఇటువంటి ఘటనలు జరిగాయని మా పెద్దలు చెప్పుకోగా విన్నాము.

ఫిబ్రవరి 22వ తేదీ, 2002 ….

కొంతమంది రామభక్తులు అయోధ్య వెళ్ళి తిరిగి వస్తున్నారు. గుజరాత్ లో ‘గోద్రా’ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే వీరి భోగీలపై ఒక ముస్లింల గుంపు దాడిచేసి కంపార్టుమెంటును తగులబెట్టారు.

ఇందులో 58 మంది హిందువులు ఉన్నారు. వీరిలో 25 మంది స్త్రీలు, 15 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ మరణించారు. ఇది ముందే ప్లాన్ చేయబడినదని తరువాత జరిగిన విచారణలు తెలియచేశాయి.

దీని కారణంగా హిందూ – ముస్లింల మధ్య అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. వీటి మూలంగా 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు చనిపోగా ఎంతోమంది ఇళ్ళనూ, ఆస్తులనూ కోల్పోయారు.

అయితే ఈ సంఘటనలో చెప్పుకోదగిన విశేషమేమిటంటే రాజ్యాంగంలోని ఆదర్శాలను గౌరవించాల్సిన మునిసిపల్ కౌన్సిలర్, మునిసిపల్ ప్రెసిడెంట్ ఇరువురూ కూడా ఈ గుంపు మధ్యలో ఉండి ఈ మారణకాండను నడిపించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ సంగతి విని మేము చాలా బాధపడ్డాము. ఇది మనదేశ లౌకికత్వానికి మాయని మచ్చ.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 10th Lesson పని మరియు శక్తి Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 10th Lesson Questions and Answers పని మరియు శక్తి

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
పనిని నిర్వచించి, ప్రమాణాలు తెలపండి. (AS 1)
జవాబు:
ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించిన ఆ వస్తువు స్థానభ్రంశములో మార్పు వచ్చినట్లయితే వస్తువు విషయంలో పని జరిగినది అని అంటారు.
(లేదా)
ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలము (F) మరియు బలప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరం (S)ల లబ్దాన్ని పని అంటారు.
∴ పని = బలము × స్థానభ్రంశం
W: F × s
ప్రమాణాలు : పనికి ప్రమాణాలు : న్యూటన్ – మీటర్ (లేదా) జెల్.

ప్రశ్న 2.
వస్తువు స్థానభ్రంశం దానిపై ప్రయోగింపబడిన బలానికి వ్యతిరేక దిశలో ఉండే సందర్భాలకు కొన్ని ఉదాహరణలివ్వండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 1

  1. ఒక కొలనులో ఈత వేయుచున్న బాలుడి చేతుల కదలికల వలన ప్రయోగించబడిన బలం అతని శరీరాన్ని వ్యతిరేక దిశలో స్థానభ్రంశాన్ని కలిగిస్తుంది.
  2. ఒక బంతిని మనము పైకి విసిరిన బంతి స్థానభ్రంశము పైకి ఉండును. గురుత్వ బలము దిశ క్రిందకు పనిచేయును.

ప్రశ్న 3.
క్రింది వాక్యాలలో తప్పు వాక్యాలను గుర్తించి సరిచేసి రాయండి. (AS 1)
ఎ) పనికి, శక్తికి ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి.
బి) విమానం పైకెగిరినపుడు దాని ‘భారం’ చేసిన పని ధనాత్మకం.
సి) స్ప్రింగ్ ను సాగదీసినపుడు దాని స్థితిశక్తి పెరుగుతుంది. మరియు స్ప్రింగ్ ను దగ్గరగా అదిమినపుడు దాని స్థితిశక్తి తగ్గుతుంది.
డి) ఒక వ్యవస్థపై బాహ్యబలం వలన జరిగిన పని ఋణాత్మకమైతే ఆ వ్యవస్థ యొక్క శక్తి తగ్గుతుంది.
ఇ) కొంత ఎత్తు నుండి స్వేచ్ఛగా కిందపడే వస్తువుకు గతిశక్తి స్థిరంగా ఉంటుంది.
ఎఫ్) సామర్థ్యానికి ప్రమాణం వాటి.
జవాబు:
ఎ) పనికి, శక్తికి ప్రమాణాలు “ఒకే విధంగా” ఉంటాయి.
బి) విమానం పైకి ఎగిరినప్పుడు దాని భారం చేసిన పని “ఋణాత్మకం”.
సి) స్ప్రింగ్ ను సాగదీసినప్పుడు దాని స్థితిశక్తి తగ్గుతుంది మరియు స్ప్రింగును దగ్గరగా అదిమినపుడు దాని స్థితిశక్తి పెరుగుతుంది.
డి) ఒక వ్యవస్థపై బాహ్యబలం వలన జరిగిన పని ఋణాత్మకమైతే ఆ వ్యవస్థ యొక్క శక్తి తగ్గుతుంది.
ఇ) కొంత ఎత్తు నుండి స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు గతిశక్తి క్రమేపి పెరుగుతుంది.
ఎఫ్) సామర్థ్యానికి ప్రమాణము వాట్.

ప్రశ్న 4.
యాంత్రిక శక్తి అంటే ఏమిటి? (AS 1)
జవాబు:
యాంత్రిక శక్తి :
ఒక వస్తువు యొక్క స్థితిశక్తి మరియు గతిశక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 5.
శక్తి నిత్యత్వ సూత్రాన్ని తెలపండి. (AS 1)
జవాబు:
శక్తి నిత్యత్వ సూత్రం :
శక్తి సృష్టించబడదు, నాశనము కాదు. కాని అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుచుండును. దీనినే శక్తి నిత్యత్వ నియమం అంటారు.

ప్రశ్న 6.
కింద తెలుపబడిన సందర్భాలలో పని ధనాత్మకమా? ఋణాత్మకమా? శూన్యమా? తెలపంది. (AS 1)
ఎ) ఒక సూట్‌కేసును నేలపై నుండి ఎత్తి తన తలపై పెట్టుకోవడానికి ‘కూలీ’ ప్రయోగించిన బలం చేసిన పని
బి) కూలీ తలపై నుండి సూటికేస్ పడిపోవడానికి గురుత్వాకర్షణ బలం వల్ల సూట్‌కేస్ పై జరిగిన పని
సి) సూట్ కేసను తలపై పెట్టుకుని నిలుచున్న కూలీచేసే పని
డి) నిట్టనిలువుగా పైకి విసరబడిన బంతిపై గురుత్వాకర్షణ బలం చేసే పని
ఇ) ఈత కొట్టే వ్యక్తి చేతులతో ప్రయోగింపబడిన బలం చేసే పని
జవాబు:
ఎ) ధనాత్మకము
బి) ధనాత్మకము
సి) శూన్యము
డి) ఋణాత్మకము
ఇ) ఋణాత్మకము

ప్రశ్న 7.
స్థితిశక్తి అంటే ఏమిటి? ‘h’ ఎత్తులో ఉన్న, ‘m’ ద్రవ్యరాశి గల వస్తువు యొక్క గురుత్వాకర్షణ ‘g’ అయితే స్థితిశక్తికి సూత్రాన్ని ఉత్పాదించండి. (AS 1)
(లేదా)
P. E. = mgh ను ఉత్పాదించండి.
జవాబు:
స్థితిశక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి :
ఒక వస్తువును కొంత ఎత్తు వరకు ఎత్తినప్పుడు, గురుత్వాకర్షణ బలమునకు వ్యతిరేకముగా ఆ వస్తువుపై పని జరగడం వలన కలిగిన మార్పునే గురుత్వాకర్షణ శక్తి లేదా స్థితిశక్తి అంటాము.
(లేదా)
ఒక వస్తువుకి దాని స్థితి వలన, ఆకారము వలన పొందే శక్తిని స్థితిశక్తి అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 2

సూత్ర ఉత్పాదన :
1) ‘m’ ద్రవ్యరాశి గల ఒక వస్తువును నేల నుండి ‘h’ ఎత్తు వరకు తీసుకెళ్ళడానికి కావల్సిన కనీస బలము ఆ వస్తున్న బరువు (mg) కు సమానం.

2) వస్తువుపై జరిగిన పనికి సమానమైన ఆ వస్తువు పొందినది అనుకొనుము.

3) వస్తువుపై గురుత్వాకర్షణ బలానికి వ్యతేరేకంగా జరిగిన పని (W) అనుకొనిన
వస్తువుపై జరిగిన పని = బలము × స్థానభ్రంశము
= mg × h = mgh
దీనినే ఎత్తు వద్ద వస్తువు యొక్క స్థితి శక్తి (PE) అంటాము.
∴ P. E = mgh

ప్రశ్న 8.
గతిశక్తి అంటే ఏమిటి? ‘v’ వేగంతో ప్రయాణిస్తున్న ‘m’ ద్రవ్యరాశి గల వస్తువు యొక్క గతిశక్తికి సూత్రాన్ని ఉత్పాదించండి. (AS 1)
(లేదా)
‘m’ ద్రవ్యరాశి కలిగిన వస్తువు ‘v’ వేగంతో ప్రయాణించుచున్న దాని యొక్క గతిశక్తి K.E. = \(\frac{1}{2}\) mv² ను ఉత్పాదించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 3
ఒక వస్తువుకు దాని గమనం వలన కలిగే శక్తిని గతిశక్తి అంటాం.
1) ‘m’ ద్రవ్యరాశి గల ఒక వస్తువు నునుపైన సమతలంపై నిశ్చలస్థితిలో ఉందనుకొనుము.

2) ఆ వస్తువుపై ‘F బలాన్ని ప్రయోగించిన ఆ వస్తువు బలప్రయోగ దిశలో ‘జై’ దూరంను అనగా ‘A’ బిందువు నుండి ‘B’ వరకు కదిలినది అనుకొనుము.

3) ఆ సందర్భంలో వస్తువుపై జరిగిన పని W = Fnet . S = Fs ………….. (1)

4) వస్తువు పై పని జరగడం వల్ల దాని వేగము ‘u’ నుండి ‘v’ కి మారి, త్వరణము ‘a’ ను పొందినది అనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 4
6) ఈ జరిగిన పని వస్తువునకు గతిశక్తిగా మారును.
∴ K.E. = \(\frac{1}{2}\) mv²

ప్రశ్న 9.
స్వేచ్ఛాపతన వస్తువు భూమిని చేరి వెంటనే ఆగితే దాని గతిశక్తి ఏమవుతుంది? (AS 1)
జవాబు:
స్వేచ్ఛాపతన వస్తువు భూమిని చేరిన వెంటనే దాని గతిశక్తి, శక్తి నిత్యత్వ నియమం ప్రకారం గురుత్వ స్థితిశక్తిగా మారును.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 10.
25 కి.గ్రా. ద్రవ్యరాశి గల సంచిని మోస్తూ ఒక వ్యక్తి 50 సి. కాలంలో 10 మీ. ఎత్తుకు చేరుకున్నాడు. ఆ వ్యక్తి ఆ సంచిపై వినియోగించిన సామర్యం ఎంత? (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి (m) = 25 కి.గ్రా. ; కాలం (t) = 50 సెకనులు ; ఎత్తు (b) = 10 మీ
గురుత్వత్వరణం (g) = 9.8 మీ/సె².
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 5

ప్రశ్న 11.
20 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల ఒక వస్తువును 1 మీ. ఎత్తులో గల బల్లపై పెట్టడానికి ఒక వ్యక్తి చేయవలసిన పని ఎంత? (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి (m) = 20 కి.గ్రా, ; ఎత్తు (b) = 1 మీ.
పని = బలం × స్థానభ్రంశము = mgh = 20 × 9.8 × 1 = 196 J

ప్రశ్న 12.
2 మీ/సె. వేగంతో కదులుతున్న వస్తువు యొక్క గతిశక్తి 5 జొళ్ళు అయిన దాని ద్రవ్యరాశి ఎంత? (AS 1)
జవాబు:
వస్తువు వేగము (v) = 2 m/s; గతిశక్తి (K.E.) = 5 J; ద్రవ్యరాశి (m) = ?
K.E. = \(\frac{1}{2}\) mv²
⇒ 5 = \(\frac{1}{2}\) × m × (2)²
⇒ 5 = \(\frac{1}{2}\) × m × 4
ద్రవ్యరాశి (m) = 5/2 = 2.5 kg

ప్రశ్న 13.
ఐంతి వడి రెట్టింపైన దాని గతిశక్తి (AS 1)
A) మారదు
B) రెట్టింపగును
C) సగమవుతుంది
D) నాలుగురెట్లగును
జవాబు:
D) నాలుగురెట్లగును

ప్రశ్న 14.
ఒకే ద్రవ్యరాశి గల రెండు వస్తువులు ఒకే ఎత్తు నుండి వదిలివేయబడ్డాయి. కింద తెలిపిన వాటిలో ఏది రెండు వస్తువులకూ ఏ సమయంలోనైనా సమానంగా ఉంటుంది? (AS 1, AS 2)
A)వడి
B) గురుత్వాకర్షణ బలం
C) స్థితిశక్తి
D) గతిశక్తి
జవాబు:
B) గురుత్వాకర్షణ బలం

ప్రశ్న 15.
ఒక వ్యక్తి తలపై సూట్‌కేస్‌తో నిచ్చెన ఎక్కుతున్నాడు. ఆ వ్యక్తి ఆ పెట్టెపై చేసిన పని (AS 1)
A) ధనాత్మకం
B) ఋణాత్మకం
C) శూన్యం
D) నిర్వచించలేము
జవాబు:
A) ధనాత్మకం

ప్రశ్న 16.
ఒక వ్యక్తి తలపై సూట్ కేస్ పెట్టుకుని మెట్లెక్కుతున్నాడు. ఆ సూట్ కేస్ పై ‘ఆ సూట్ కేస్ బరువు’ చేసే పని (AS 1)
A) ధనాత్మకం
B) ఋణాత్మకం
C) శూన్యం
D) నిర్వచించలేము
జవాబు:
B) ఋణాత్మకం

ప్రశ్న 17.
స్వేచ్ఛాపతన వస్తువులలో యాంత్రిక శక్తి నిత్యత్వంను చూపే పటం గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 7
∴ ఈ విధంగా స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో స్థితిశక్తి తగ్గుచూ, గతిశక్తి పెరుగుచూ ఉంటుంది. కాని వ్యవస్థలోని యాంత్రిక శక్తిలో ఎట్టి మార్పుండదు.

ప్రశ్న 18.
సైకిల్ ను నడుపుతున్నప్పుడు సైకిల్ ను వాలు తలం పైకి నెడుతూ పోతే సైకిల్ మరియు మీకు ఉండే స్థితిశక్తి పెరుగుతుంది. ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? (AS 7)
జవాబు:
సైకిలు చలనంలో ఉన్నది. సైకిలు యొక్క గతిశక్తి, రోడ్డు యొక్క ఘర్షణ బలం వలన స్థితిశక్తిగా మారును. కనుక నాకు మరియు సైకిల్‌కు స్థితిశక్తి పెరుగుతుంది. ఈ స్థితిశక్తి సైకిలు యొక్క గతిశక్తి నుండి లభిస్తుంది.

ప్రశ్న 19.
ఒక వ్యక్తి ఏ పనీ చేయక ఎక్కువ సేపు నిలుచున్నా ఎందుకు అలసిపోతాడు? (AS 7)
(లేదా)
ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఎక్కువ సేపు నిలుచున్నా అలసిపోతాడు. ఎందుకో మీకు తెలుసా? సమాచారంను సేకరించండి.
జవాబు:

  1. నిలుచున్న వ్యక్తి పనిచేస్తున్నట్లు మనకు కనిపించకపోయినా అతని శరీరంలో అనేక పనులు జరుగుతాయి.
  2. అతను ఎక్కువ సేపు నిలుచున్నప్పుడు అతని శరీరంలో కండరాలు సంకోచ, వ్యాకోచాలు చెందుతాయి.
  3. అదే విధంగా గుండె వివిధ అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  4. ఇటువంటి అనేక పనుల వలన శరీరంలోని శక్తి తరిగిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి అలసిపోతాడు.

ప్రశ్న 20.
అలమరాపై ఉంచబడిన ఒక పుస్తకం యొక్క స్థితిశక్తి 20 ఔళ్లని ఒక వ్యక్తి, 30 ఔళ్లని మరొక వ్యక్తి అన్నారు. వారిద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేసినట్లేనా? కారణాలు తెలపండి. (AS 2, AS 1)
జవాబు:
ఎవరూ తప్పు చేసినట్లు కాదు. ఎందుకనగా రెండు సందర్భాలలో పుస్తకమునకు స్థితిశక్తి కలదు కాబట్టి.

ప్రశ్న 21.
10 కి.గ్రా. ద్రవ్యరాశి గల బంతి 10 మీ. ఎత్తు నుండి వదిలివేయబడింది. అయిన (AS 1)
ఎ) బంతి తొలి స్థితిశక్తి ఎంత?
బి) బంతి భూమిని చేరే సమయానికి దాని గతిశక్తి ఎంత?
సి) బంతి భూమిని చేరే సమయానికి దాని వేగమెంత?
జవాబు:
బంతి ద్రవ్యరాశి (m) = 10 కి.గ్రా. ; ఎత్తు (b) = 10 మీ ; గురుత్వత్వరణం (g) = 9.8 మీ/సె².
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 8

ప్రశ్న 22.
సైకిల్ తో సహా సైకిల్ పైనున్న వ్యక్తి ద్రవ్యరాశి 100 కి.గ్రా. అయిన ఆ సైకిల్ 3 మీ/సె. వేగంతో కడలాలంటే అతను ఎంత పని చేయాలి?
జవాబు:
వ్యక్తి ద్రవ్యరాశి (m) = 100 కి.గ్రా. ; సైకిల్ వేగం (v) = 3 మీ/సె.
చేయవలసిన పని = గతిశక్తి = \(\frac{1}{2}\) × mv² – \(\frac{1}{2}\) × 100 × (3)² = \(\frac{1}{2}\) × 100 × 9 = 450 J

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 23.
మీరొక సూటికేస్ ను నేలపై నుండి ఎత్తి బల్లపై పెట్టారనుకుందాం. మీరు చేసిన పని కింది వాటిలో వేటిపై ఆధారపడుతుంది? వేటిపై ఆధారపడదు? ఎందుకు? (AS 2)
ఎ) సూటికేస్ కదిలిన మార్గం
బి) పనిచేయడానికి మీరు తీసుకున్న సమయం
సి) సూటికేస్ యొక్క బరువు
డి) మీ బరువు
జవాబు:
ఎ) జరిగిన పని సూట్కేస్ కదిలిన మార్గముపై ఆధారపడును.
బి) పని (W) = mgh కావున ఇది కాలముపై ఆధారపడదు.
సి) పని (W) = mgh కావున పని సూట్కే స్ పై ఆధారపడును.
డి) పని విషయంలో నా యొక్క బరువు లెక్కలోనికి తీసుకోదగినది కాదు.

ప్రశ్న 24.
ఒక వస్తువు దాని స్థితి వలన, స్థానము వలన పొందే స్థితిశక్తి చూపే సందర్భాలకు చిత్రపటాలను సేకరించి స్క్రిప్ బుక్ తయారు చేయండి. (AS 4)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 9

ప్రశ్న 25.
ప్రకృతి సిద్ధంగా జరిగే వివిధ శక్తి రూపాంతరాలు ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో నిర్వహించే పాత్రను నీవెలా అభినందిస్తావు? (AS 6)
జవాబు:
ఈ ప్రకృతిలో అనేక రకాల శక్తి రూపాంతరాలను మనము గమనిస్తుంటాము.

ఉదాహరణకు పర్వతాలపై ఉన్నటువంటి మంచు కరిగి నీరుగా మారి, నదులుగా ప్రవహించును. ఈ విధముగా స్థితిశక్తి, గతిశక్తిగా మారును. జల విద్యుత్ కేంద్రాలలో నీటి గతిశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాము.

ప్రశ్న 26.
ఒక పెట్టెను నేలపై నుండి ఎత్తి ఒక బీరువాపై పెడితే దాని స్థితిశక్తి పెరుగుతుంది. కానీ దాని గతిశక్తిలో మార్పురాదు. మరి ఇది శక్తి నిత్యత్వ నియమానికి విరుద్ధం కాదా? వివరించండి. (AS 7)
జవాబు:

  1. ఇది శక్తి నిత్యత్వ నియమమునకు విరుద్ధము కాదు. ఎందుకనగా పెట్టె నేలపై ఉన్నప్పుడు దాని స్థితిశక్తి శూన్యము (కారణము h = 0). కాని వ్యవస్థ యొక్క మొత్తం శక్తి శూన్యము కాదు.
  2. పెట్టెను బీరువాపై పెట్టిన గతిశక్తి శూన్యము. కాని వ్యవస్థ యొక్క మొత్తం శక్తి శూన్యము కాదు. ఈ విధముగా శక్తి నిత్యత్వము కాబడినది.

ప్రశ్న 27.
చెట్టు నుండి రాలిన ఆపిల్ పండు భూమికి చేరువగా ఉన్నప్పుడు దాని గురుత్వ స్థితిశక్తి ఏమవుతుంది? భూమికి తగలగానే దాని స్థితిశక్తి ఏమవుతుంది? (AS 7)
జవాబు:

  1. ఆపిల్పండు భూమికి చేరువగా ఉన్నప్పుడు దాని గురుత్వ స్థితిశక్తి తగ్గును. ఎందుకనగా దాని ‘h’ విలువ తక్కువగా ఉన్నది కావున.
  2. పండు భూమికి తగలగానే దాని స్థితిశక్తి పెరుగును. ఎందుకనగా దాని ‘h’ విలువ పెరుగును కనుక.

ప్రశ్న 28.
అంతర్జాతీయ శాంతి, సహకారం మరియు భద్రతలపై పెరుగుతున్న శక్తి అవసరాలు మరియు శక్తి నిత్యత్వంపై చర్చించండి. (AS 7)
జవాబు:
మానవ మనుగడకు శక్తి అధికముగా అవసరము. శక్తి లేని మానవ జీవితము, గాలి లేని బుడగ లాంటిది. ఈ ప్రకృతి శక్తి బదిలీకి వీలు కల్పించకపోయినట్లైతే మానవాళి మనుగడ ప్రశ్నారకమయ్యేది. ప్రపంచంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న జనాభాకు ఎల్లప్పుడు శక్తి, శక్తి నిత్యత్వము అవసరము.

ఒక దేశము యొక్క శక్తి వనరులు అధికముగా ఉన్నట్లయితే, ఆ దేశము అభివృద్ధి పథములో పయనించును.

ఉదా :
అమెరికా, చైనా మరియు భారతదేశాలు. ఒక దేశము దాని యొక్క శక్తి వనరులను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. తన తోటి దేశాలతో స్నేహసంబంధాలను, భద్రతా ఒప్పందాలను పాటించాలి. ఉదాహరణకు మనము కేంద్రక సంలీనంలో లేదా కేంద్రక విచ్ఛిత్తిలో వాడు యురేనియం థోరియం వంటి అధిక విలువైన వనరులను మానవాళికి ఉపయోగపడు పద్ధతిలో వాడాలి. అనగా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయుటలో వాడాలి. కాని వాటిని అణుబాంబు తయారీలో వాడి ప్రపంచ జనాభా మనుగడను ప్రశ్నార్థకముగా చేయకూడదు. ఈ ప్రక్రియ వలన ప్రపంచశాంతి ప్రశ్నార్థకమగును.

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 167

ప్రశ్న 1.
ఒక చెక్క కుర్చీని సమాంతర తలంపై వివిధ దిశలలో లాగి, దానిని తిరిగి యధాస్థానానికి తీసుకొచ్చారు. దానిపై తలం ప్రయోగించిన ఘర్షణ బలం (f) మరియు అది కదిలిన దూరం (s) అయిన ఆ ఘర్షణ బలం చేసిన పని ఎంత?
జవాబు:
ఘర్షణ బలం చేసిన పని శూన్యం, ఎందుకనగా వస్తువు స్థానభ్రంశములో మార్పు లేదు గనుక,

9th Class Physical Science Textbook Page No. 168

ప్రశ్న 2.
ఒక వస్తువును నేలపై నుండి కొంత ఎత్తుకు ఎత్తండి. మీరు ఉపయోగించిన బలం ఆ వస్తువును పై దిశలోకి కదిలించింది. అదే సమయంలో ఆ వస్తువుపై గురుత్వాకర్షణ బలం కూడా పని చేస్తున్నది కదా ! మరి
ఎ) వీటిలో ఏ బలం ధనాత్మకమైన పని చేసింది?
బి) ఏ బలం ఋణాత్మకమైన పని చేసింది? కారణాలను వివరించండి.
జవాబు:
ఎ) వస్తువును నేలపై నుండి పైకి ఎత్తినపుడు దానిపై పనిచేసిన బలం ధనాత్మకము. ఎందుకనగా వస్తువు అదే దిశలో పైకి స్థానభ్రంశం చెందినది కనుక.
బి) వస్తువుపై పనిచేసే గురుత్వ బలం ఋణాత్మకము. ఎందుకనగా అది వస్తువుకి వ్యతిరేక దిశలో క్రిందకి పనిచేయును కనుక.

9th Class Physical Science Textbook Page No. 171

ప్రశ్న 3.
శక్తి బదిలీకి ప్రకృతి వీలు కల్పించకపోతే ఏమి జరుగుతుంది? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
శక్తి బదిలీకి ప్రకృతి వీలు కల్పించకపోతే మానవ జీవితం శూన్యమగును. మన నిత్యజీవితంలో వివిధ పనులు చేయడానికి మనము వివిధ రూపాలలో ఉన్న శక్తిని ఉపయోగిస్తుంటాము.
ఉదాహరణ :
కండర శక్తి, ఉష్ణశక్తి, కాంతి శక్తి, విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తి, ధ్వని శక్తి, అయస్కాంత శక్తి, సౌరశక్తి, రసాయనిక శక్తి మొదలగునవి.

మనము సౌరశక్తి నుండి ఉష్ణశక్తిని, ఉష్ణశక్తి నుండి విద్యుత్ శక్తిని వినియోగించుకుంటున్నాము. ఇది అంతయూ ప్రకృతి శక్తి బదిలీకి వీలు కల్పించుటయే, లేనిచో ఏ జీవరసాయనిక చర్యలు జరగవు.

9th Class Physical Science Textbook Page No. 174

ప్రశ్న 4.
ఒకే వడితో ప్రయాణిస్తున్న రెండు లారీలలో తక్కువలోడ్ తో ఉన్న లారీని ఎక్కువ లోడ్ తో ఉన్న లారీతో పోల్చినపుడు సులభంగా ఆపగలం. ఎందుకు?
జవాబు:
తక్కువలోడ్ ఉన్న లారీ తక్కువ బరువుతో ఉంటుంది. అందువలన దానిని ఆపుటకు దానిపై పని చేయవలసిన నిరోధక బలం తక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 5.
ఒక కారు యొక్క వడి ఒక సందర్భంలో 10 మీ/సె. నుండి 20 మీ/సె. కు మారింది. మరొక సందర్భంలో 20 మీ/సె నుండి 30 మీ/సె. లోనికి మారింది. దాని గతిశక్తి మార్పు ఏ సందర్భంలో ఎక్కువ ఉంటుంది?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 10

ప్రశ్న 6.
ఒక వ్యక్తి నేలపై నిశ్చలస్థితి నుండి పరుగెత్తడం ప్రారంభించాడు. అతడు తన ద్రవ్యవేగాన్ని కొంత పెంచుకుంటే నేల యొక్క ద్రవ్యవేగంలో ఏ మార్పు వస్తుంది? అతడు తన గతిశక్తిని కొంతమేర పెంచుకుంటే నేల యొక్క గతిశక్తిలో ఏ మార్పు వస్తుంది?
జవాబు:
ఇక్కడ రెండు సందర్భాలుంటాయి.

సందర్భం – 1 :
పరిశీలకుడి దృష్టిలో నేలకు ఎలాంటి వేగం లేదు. కనుక నేల యొక్క ద్రవ్యవేగం, గతిశక్తులు శూన్యము.

సందర్భం – 2 :
పరుగెత్తే వ్యక్తి దృష్టిలో నేల వేగం, అతని వేగం సమానం. నేల యొక్క ద్రవ్యవేగం మరియు గతిశక్తి, పరుగెత్తేవాని ద్రవ్యవేగం మరియు గతిశక్తులు సమానంగా ఉండి, వ్యతిరేక దిశలలో ఉంటాయి.

9th Class Physical Science Textbook Page No. 177

ప్రశ్న 7.
అంతరిక్షంలో ఉండే అంతర్జాతీయ అంతర కేంద్రానికి (Space station) గురుత్వ స్థితిశక్తి ఉంటుందా?
జవాబు:
అంతరిక్షంలో ఉండే అంతర్జాతీయ అంతర కేంద్రానికి గురుత్వ శక్తి ఉండదు.

9th Class Physical Science Textbook Page No. 180

ప్రశ్న 8.
బంతులను అమ్ముకొనే ఒక వ్యక్తి తన వద్ద ఒక అద్భుత బంతి ఉందని, దానిని ఒక ఎత్తు నుండి క్రిందికి జారవిడిస్తే, మనం జారవిడిచిన ఎత్తుకంటె ఎక్కువ ఎత్తుకు ఎగురుతుందని చెప్పాడు. మీరు ఆ బంతి అద్భుతమైనదని నమ్ముతారా? ఎందుకు? వివరించండి.
జవాబు:
నేను నమ్మను. ఎందుకనగా అది అసాధ్యము కనుక.

ప్రశ్న 9.
ఏటవాలుగా ఉండే ఒక ఎత్తైన ప్రదేశం వద్ద నిశ్చలస్థితి నుండి వదిలిన బంతి కింద దొర్లుతూ భూమిపైకి చేరేటప్పటికి 4 మీ/సె. వడిని కలిగి ఉంది. ఇదే బంతి తిరిగి అదే ఎత్తు నుండి 3 మీ/సె. వడితో వదిలితే భూమికి చేరేటప్పటికి దాని వేగం ఎంత?
జవాబు:
ఏటవాలుగా ఉండే ఒక ఎత్తైన ప్రదేశం నుండి బయలుదేరిన బంతి యొక్క u1 = 0 మీ./సె.; v1 = 4 మీ./సె.
త్వరణము ‘a’ మరియు దూరము ‘S’ అయిన
v1² – u1² = 2as ………………. (1)
తరువాత బంతి యొక్క వేగములు
u2 = 3 మీ./సె. ; v2 = ?
v2² – u2² = 2as
(1), (2) లను సాధించగా
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 11

9th Class Physical Science Textbook Page No. 181

ప్రశ్న 10.
F1 బలం చేసిన పని F2 బలం చేసిన పని కన్నా ఎక్కువ. అయితే F1 యొక్క సామర్థ్యం F2 యొక్క సామర్థ్యం కన్నా ఎక్కువని కచ్చితంగా చెప్పగలమా? కారణం తెలపండి.
జవాబు:
అవును చెప్పగలము. ఎందుకనగా సామర్థ్యము, పనికి అనులోమానుపాతంలో ఉంటుంది కావున.

9th Class Physical Science Textbook Page No. 167

ప్రశ్న 11.
i) వస్తువు పై ప్రయోగింపబడిన బలం శూన్యం (0) అయితే, అప్పుడు ఎంత పని జరిగినట్లు?
ii) వస్తువు కదిలిన దూరం శూన్యం (1) అయినపుడు వస్తువులో స్థాన మార్పు జరగకపోతే అపుడు ఎంత పని జరిగినట్లు?
జవాబు:
i) ప్రయోగించిన బలం శూన్యం కావున జరిగిన పని శూన్యం.
ii) దూరం శూన్యం కావున ఏ పని జరగనట్లే.

9th Class Physical Science Textbook Page No. 168

ప్రశ్న 12.
ప్రక్కన ఇవ్వబడిన పటంను పరిశీలించి, దానిపై మూడు వాక్యాలను వ్రాయుము.
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 12
జవాబు:

  1. ప్రక్క పటంలో ఒక బంతిని పైకి విసిరితే దాని గమనం ఏ దిశలో ఉంటుందో ఇవ్వబడినది.
  2. బంతి పైకి వెళుతున్న కొద్ది దానిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం వ్యతిరేక దిశలో పనిచేస్తుంది.
  3. బంతి పైకి వెళుతుంటే వడి క్రమేపి తగ్గును. గరిష ఎత్తు వద్ద దాని వడి శూన్యము. బంతి తిరిగి కిందకు వస్తుంటే దాని వడి క్రమేపి పెరుగును.

9th Class Physical Science Textbook Page No. 169

ప్రశ్న 13.
శక్తి అంటే ఏమిటి? వివిధ రకాల శక్తి రూపాలను రాయుము.
జవాబు:
శక్తి :
పనిచేయు సామర్థ్యాన్నే శక్తి అంటారు.

శక్తి రూపాలు :
యాంత్రిక శక్తి, ఉష్ణశక్తి, కాంతి శక్తి, ధ్వని శక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, కేంద్రక శక్తి మొదలగునవి శక్తి యొక్క అనేక రూపాలు.

9th Class Physical Science Textbook Page No. 170

ప్రశ్న 14.
పని చేయడానికి శక్తి అవసరమని, ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు శక్తి ఖర్చు చేస్తాడని అంటే శక్తిని కోల్పోతున్నాడని తెలుసుకున్నాం.
ఎ) మరి ఈ శక్తి ఎక్కడకు పోతుంది?
బి) పనిచేయడానికి అవసరమైన బలాన్ని ప్రయోగించే వస్తువుకు, పనిచేయబడిన వస్తువుకు మధ్య శక్తి బదిలీ అవుతుందా?
సి) శక్తి బదిలీ కాకుండా ఏ బలమైనా ఒక పనిని చేయడం సాధ్యమేనా?
జవాబు:
ఎ) ఈ శక్తి పని జరగడానికి ఉపయోగపడుతుంది.
బి) శక్తి మార్పిడి జరుగుతుంది.
సి) శక్తి బదిలీ కాకుండా పనిచేయడం జరుగదు.

9th Class Physical Science Textbook Page No. 171

ప్రశ్న 15.
మనకు శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది?
జవాబు:
సూర్యుడు మనకు అతి పెద్ద సహజ శక్తి వనరు. మనకు అవసరమైన అనేక ఇతర శక్తి వనరులన్నీ సూర్యునిపై ఆధారపడి ఉంటాయి.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 16.
ఇతర శక్తి వనరుల గురించి రాయుము.
(లేదా)
సూర్యునిపై ఆధారపడని శక్తి జనకాలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:
ప్రకృతిలో మనకు ముఖ్య శక్తి భాండాగారము సౌరశక్తి, ఈ సౌరశక్తిపై ఆధారపడని శక్తి వనరులు కొన్ని గలవు. అవి

  1. భూ అంతర్భాగం నుండి వచ్చు శక్తి
  2. సముద్ర అలల నుండి వచ్చు శక్తి
  3. కేంద్రక శక్తి
  4. రసాయనిక శక్తి
  5. విద్యుత్ శక్తి నుండి ఉష్ణశక్తి ఏర్పడటం
  6. ఇంధన శక్తి
  7. బొగ్గు శక్తి
  8. బయోగ్యాస్

9th Class Physical Science Textbook Page No. 178

ప్రశ్న 17.
ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని ఎలా తయారుచేసుకుంటాయి?
జవాబు:
ఆకుపచ్చని మొక్కల యొక్క ఆకులు సౌరశక్తిని వినియోగించుకుని, వాటి ఆకులలో గల క్లోరోఫిల్ ను, ప్రకృతిలోని CO2 తో కలిసి రసాయన చర్య (కిరణజన్య సంయోగ క్రియ)ను జరిపి పిండిపదార్థాలు మరియు O2. ను తయారుచేసుకుంటాయి.

ప్రశ్న 18.
బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు ఎలా ఏర్పడ్డాయి?
జవాబు:
భూ అంతర్భాగంలోకి చేరిన వృక్ష కళేబరాలు కొన్ని వేల సంవత్సరాల తర్వాత రసాయన శక్తి రూపాలైన బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలుగా మారతాయి.

ప్రశ్న 19.
ప్రకృతిలో జలచక్రం ఏర్పడడానికి ఏయే శక్తి రూపాంతరాలు దోహదపడతాయి?
జవాబు:
మనము ప్రకృతిలో వివిధ రకాల శక్తి రూపాంతరాలను చూస్తుంటాము.

  1. పర్వతాలపై ఉన్న మంచు కరిగి నీరుగా మారి నదులుగా ప్రవహిస్తుంది.
  2. ఈ క్రమంలో మంచు యొక్క స్థితిశక్తి గతిశక్తిగా మారుతుంది.
  3. జల విద్యుత్ కేంద్రాలలో నీటి యొక్క గతిశక్తిని విద్యుత్ శక్తిగా మారుతుంది.
    ఈ విధంగా స్థితిశక్తి → గతిశక్తి → విద్యుత్ శక్తి → కాంతిశక్తి

9th Class Physical Science Textbook Page No. 180

ప్రశ్న 20.
ఒక రిక్షా కూలీ నిర్ణీత మార్గాన్ని తోటి రిక్షా కూలీ కంటే త్వరగా చేరుకోగలవచ్చు. అదే విధంగా 1 కి.గ్రా. పిండి రుబ్బడానికి మన ఇంట్లోని గైండర్ పక్కింటి వారి గైండర్ కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు.
ఎ) ఒక పనిని ప్రతివారూ ఒకే కాలవ్యవధిలో చేయగలరా?
బి) ఒక పనిని చేసే ప్రతిసారి ఆ పనిని చేసే, బలం చేత సమాన శక్తి వినియోగించబడుతుందా?
సి) ఒక నిర్ణీత పనిని చేసే ప్రతిసారి వివిధ యంత్రాలు సమానమైన శక్తిని ఖర్చు చేస్తాయా?
జవాబు:
ఎ) ఒక పనిని ప్రతివారూ ఒకే కాలవ్యవధిలో చేయలేరు.
బి) సమాన శక్తి వినియోగించబడదు.
సి) నిర్ణీత పనిని చేసే ప్రతిసారి వివిధ యంత్రాలు సమానమైన శక్తిని ఖర్చు చేస్తాయి.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 21.
రహీమ్ తన ఇంటిలోని ఒకటో అంతస్తులో కొన్ని రిపేర్లు చేయించాలనుకున్నాడు. సుతారి మేస్త్రి సలహా మేరకు అతను 100 ఇటుకలు తెప్పించి ఒక కూలీతో మొదటి అంతస్తుకు మోయించాడు. కూలీ ఒక గంటలో 100 ఇటుకలను మొదటి అంతస్తుకు మోసినందుకుగాను రూ. 150/- లను కూలీగా తీసుకున్నాడు. సుతారి మేన్ సూచన మేరకు రహీమ్ రెండవ రోజు కూడా మళ్ళీ 100 ఇటుకలు తెప్పించి మరొక కూలీతో మొదటి అంతస్తుకు మోయించాడు. అతను రెండు గంటల్లో ఇటుకలన్నీ పైకి మోసి రూ. 300/- కూలీ అడిగాడు. నిన్నటి కూలీకి రూ. 150/- మాత్రమే ఇచ్చానని రహీమ్ అన్నాడు. నేను ఎక్కువ గంటలు పని చేశాను. కాబట్టి నాకు ఎక్కువ కూలీ ఇవ్వాలని వాదించాడు.
ఎ) ఎవరి వాదన సరియైనది?
బి) ఇద్దరు కూలీలు చేసిన పని సమానమేనా?
సి) పని జరిగిన రేటులో తేడాకు కారణమేమిటి?
జవాబు:
ఎ) రహీమ్ వాదన సరియైనది.
బి) ఇద్దరు కూలీలు చేసిన పని సమానమే.
సి) పట్టిన కాలవ్యవధి సమానం కాకపోడమే.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 167

ప్రశ్న 1.
ఒక పిల్లవాడు బల్లపై ఉన్న పుస్తకంపై 4.5 న్యూటన్ల బలాన్ని ప్రయోగించి ఆ పుస్తకాన్ని బలప్రయోగ దిశలో 30 సెం.మీ. దూరం కదిలించినట్లయితే జరిగిన పని ఎంత?
సాధన:
పుస్తకంపై ప్రయోగించబడిన బలం (F) = 4.5 న్యూ
స్థానభ్రంశము (s) = 30 సెం.మీ = \(\frac{30}{100}\) మీ. = 0.3 మీ.
జరిగిన పని (W) = Fs = 4.5 న్యూ × 0.3 మీ. = 1.35 న్యూటన్ – మీ (లేదా) 1.35 బౌల్ (J)

ప్రశ్న 2.
ఒక విద్యార్థి 0.5 కి.గ్రా.ల బరువున్న పుస్తకాన్ని నేలపై నుండి ఎత్తి 1.5 మీ. ఎత్తు గల అలమరా పైకి చేర్చితే జరిగిన పని ఎంత?
సాధన:
పుస్తకం ద్రవ్యరాశి = 0.5 కి.గ్రా, ఈ పుస్తకంపై గురుత్వాకర్షణ బలం ‘mg’ అవుతుంది.
F = mg = 0.5 కి.గ్రా. × 9.8 మీ/సె² = 4.9 న్యూటన్లు
అంతే బలాన్ని ఆ విద్యార్థి పుస్తకాన్ని పైకి ఎత్తడానికి ప్రయోగించవలసి ఉంటుంది.
పుస్తకంపై విద్యార్థి ప్రయోగించిన బలం (F) = 4.9 న్యూటన్లు
బలప్రయోగ దిశలో వస్తువు స్థానభ్రంశం (s) = 1.5 మీ.
జరిగిని పని (W) = Fs = 4.9 న్యూటన్లు × 1.5 మీ. = 7.35 న్యూటన్ – మీటరు లేదా 7.35 జెల్

9th Class Physical Science Textbook Page No. 168

ప్రశ్న 3.
100 న్యూటన్ల ఘర్షణ బలం కలిగించే తలంపై ఒక పెట్టె 4 మీ. దూరం నెట్టబడితే ఘర్షణ బలం చేసిన పని ఎంత?
సాధన:
పెట్టెపై కలుగజేయబడిన ఘర్షణ బలం (F) = 100 న్యూటన్లు
పెట్టెలో జరిగిన స్థానభ్రంశం (s) = 4 m

బలం, వస్తువు స్థానభ్రంశం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నాయి. కాబట్టి పెట్టెపై జరిగిన పని ఋణాత్మకం.
W= – Fs (F ఘర్షణబలం)
= -(100 న్యూటన్లు × 4 మీ) = – 400 న్యూటను – మీటరు (లేదా) – 400 జాల్

9th Class Physical Science Textbook Page No. 169

ప్రశ్న 4.
0.5 కి.గ్రా. ద్రవ్యరాశి గల ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది 5 మీ. ఎత్తుకు చేరుకుంది. బంతి పై దిశలో కదులుతున్నప్పుడు దానిపై గురుత్వాకర్షణ బలం వల్ల జరిగిన పని ఎంత? (g = 10 మీ/సె²)
సాధన:
బంతిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం (F) = mg = (0.5 కి.గ్రా) × (10 మీ/సె²) = 5 న్యూటన్లు
బంతి స్థానభ్రంశం = 5 మీ.
బంతిపై ప్రయోగింపబడిన బలం, బంతి స్థానభ్రంశం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నందున పనిని ఋణాత్మకంగా పరిగణిస్తాం.
W = -F × s = – (5 న్యూటన్లు) × (5 మీటర్లు) = – 25 న్యూటన్ – మీటర్లు (లేదా) – 26 జౌల్

9th Class Physical Science Textbook Page No. 174

ప్రశ్న 5.
250 గ్రా. ద్రవ్యరాశి గల ఒక బంతి 40 సెం.మీ./సె. వేగంతో కదులుతుంటే, దాని కుండే గతిశక్తి ఎంత?
సాధన:
బంతి ద్రవ్యరాశి (m) = 250 గ్రా. = 0.25 కి.గ్రా. ,
బంతి వేగం (v) = 40 సెం.మీ/సె. = 0.4 మీ/సె.
బంతి గతిశక్తి K.E. = ½ (0.25) (0.4)² = 0.02 జెల్

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

ప్రశ్న 6.
సైకిల్ తొక్కే వ్యక్తి ద్రవ్యరాశి సైకిల్ ద్రవ్యరాశితో కలిపి 90 కి.గ్రా. సైకిల్ యొక్క వేగం 6 కి.మీ./గం. నుండి 12 కి.మీ/గం. కు పెరిగితే అతను చేసిన పని ఎంత?
సాధన:
సైకిల్ తో సహా వ్యక్తి యొక్క ద్రవ్యరాశి = 90 కి.గ్రా.
సైకిల్ తొలివేగం (u) = 6 కి.మీ./గం. = 6 × ( 5/18) = 5/3 మీ/సె.
సైకిల్ తుది వేగం (v) = 12 కి.మీ./గం. = 12 × (5/18) = 10/3 మీ./సె.
సైకిల్ యొక్క తొలి గతిశక్తి K.E(i) = ½mu² = ½(90) (5/3)² = ½(90) (5/3) (5/3) = 125 జౌళ్ళు
సైకిల్ యొక్క తుది గతిశక్తి K.E(f) = ½mv² = ½ (90) (10/3)² = ½(90) (10/3) (10/3) = 500 జౌళ్ళు
సైకిల్ తొక్కే వ్యక్తి చేసిన పని = గతిశక్తిలో కలిగిన మార్పు = K.E(f) – K.E(i)
= 500 జౌళ్ళు – 125 జౌళ్ళు = 375 జౌళ్ళు

9th Class Physical Science Textbook Page No. 177

ప్రశ్న 7.
2 కి.గ్రా. ద్రవ్యరాశి గల దిమ్మ భూమి నుండి 2 మీ. ఎత్తు వరకు ఎత్తబడింది. ఆ ఎత్తు వద్ద దిమ్మ యొక్క స్థితిశక్తిని లెక్కించండి. (గురుత్వత్వరణం (g) = 9.8 మీ/సె²).
సాధన:
దీమ్మ యొక్క ద్రవ్యరాశి (m) = 2 కి.గ్రా. ; దిమ్మ చేరుకున్న ఎత్తు (h) = 2 మీ.
గురుత్వత్వరణం (g) = 9.8 మీ/సె²
దిమ్మ యొక్క స్థితిశక్తి P.E. = mgh = (2) (9.8) (2) = 39.2 జౌళ్ళు

ప్రశ్న 8.
1 కి.గ్రా. ద్రవ్యరాశి గల పుస్తకం h ఎత్తు వరకు ఎత్తబడింది, ఆ పుస్తకం స్థితిశక్తి 49 జౌళ్ళు, అయిన అది ఎంత ఎత్తుకు ఎత్తబడిందో కనుక్కోండి.
సాధన:
పుస్తకం యొక్క స్థితిశక్తి = mgh
mgh = 49 జౌళ్ళు ⇒ (1) (9.8)h = 49 జౌళ్ళు
పుస్తకం ఎత్తబడిన ఎత్తు, h = (49)/(1 × 9.8) = 5 మీ.

9th Class Physical Science Textbook Page No. 181

ప్రశ్న 9.
ఒక వ్యక్తి 5 నిమిషాలలో 420 ఔళ్ల పని చేయగలిగితే అతని సామర్థ్యం ఎంత?
సాధన:
జరిగిన పని (W) = 420 జౌళ్లు ;
పనిచేయడానికి తీసుకున్న కాలం (t) = 5 నిమిషాలు = 5 × 60 సెకన్లు = 300 సెకన్లు
సామర్థ్యం (p) = W/t = 420/300 = 1.4 వాట్లు

ప్రశ్న 10.
ఒక స్త్రీ 10 సెకన్లలో 250 ళ్ల పని చేయగలదు. ఒక బాలుడు 4 సెకన్లలో 100 జోళ్ల పని చేయగలడు. వారిలో ఎవరి సామర్థ్యం ఎక్కువ?
సాధన:
సామర్థ్యం , P = W/U
స్త్రీ సామర్థ్యము = 250 / 10 = 25 వాట్లు
బాలుని సామర్థ్యము = 100/4 = 25 వాట్లు
ఇద్దరి సామర్థ్యమూ సమానమే. అంటే ఇద్దరూ పనిని సమాన వేగంతో చేయగలుగుతారు.

పరికరాల జాబితా

పింగాణి పాత్ర, లోహపు గోళం, కీ ఇచ్చే బొమ్మ కారు, స్ప్రింగ్, పొడవాటి స్థూపాకారపు గొట్టం, రబ్బరు బెలూను, అద్దం ముక్క లేజర్ లైట్, శక్తి వనరులను ప్రదర్శించే చార్టు, గతి శక్తి, స్థితి శక్తి ఉదాహరణలను చూపే చారు

9th Class Physical Science 10th Lesson పని మరియు శక్తి Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

విజ్ఞానశాస్త్ర ప్రకారం ‘పని’కి గల అర్థాన్ని అవగాహన చేసుకుందాం :

ప్రశ్న 1.
కింద ఇవ్వబడిన ఉదాహరణలలో విజ్ఞానశాస్త్ర ప్రకారం పని జరిగిందో, లేదో మీ స్నేహితులతో చర్చించి, ఏ కారణం ఆధారంగా పని జరిగిందని చెప్పారు? ఆ కారణాన్ని నమోదు చేయు విధంగా ఒక పట్టిక నమూనాను తయారు చేయండి.
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 13 AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 14 AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 15 AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 16
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 17

కృత్యం – 2

ఒక వస్తువు యొక్క శక్తిలో పెరుగుదల లేదా తగ్గుదలను అవగాహన చేసుకుందాం :

ప్రశ్న 2.
ఒక వస్తువు యొక్క శక్తిలో పెరుగుదల (లేదా) తగ్గుదలను ఏ విధంగా అవగాహన చేసుకోగలమో ప్రయోగపూర్వకంగా వ్రాయండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 18

  1. పటంలో చూపినట్లు ఒక గట్టి స్ప్రింగును బల్లపై ఉంచండి.
  2. మీ చేతితో ఆ స్ప్రింగు పై భాగము నుండి గట్టిగా అదిమి కొద్దిసేపటి తర్వాత వదిలేయండి.
  3. స్ప్రింగును అదిమి పట్టినప్పుడు, వదిలిన తర్వాత స్ప్రింగ్ లో జరిగిన మార్పులను పరిశీలించండి.
  4. పని జరిగేందుకు బలాన్ని ప్రయోగించిన వస్తువు శక్తిని కోల్పోతుందని, ఏ వస్తువుపై అయితే పని జరిగిందో ఆ వస్తువు శక్తిని గ్రహిస్తుందని తెలుస్తుంది.

ఈ విధంగా ఒక వస్తువుపై బలం ప్రయోగించబడటం వలన దాని శక్తి పెరుగుదల లేదా తగుదల ఏ విధంగా ఉంటుందో అవగాహన చేసుకోవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

కృత్యం – 3

శక్తి వనరుల జాబితా తయారుచేయడం :

ప్రశ్న 3.
శక్తి వనరుల జాబితాను తయారుచేయండి. అందులో ఏవి సూర్యునిపై ఆధారపడి ఉన్నాయో గుర్తించండి. అవి సూర్యునిపై ఆధారపడ్డాయని ఎలా చెప్పగలమో వ్రాయండి.
జవాబు:
శక్తి వనరులు :
సౌరశక్తి, వాయుశక్తి, జలశక్తి, బయోమాస్ శక్తి, నేలబొగ్గు, చమురు, సహజ వాయువులు, అలల శక్తి, సముద్ర ఉష్ణ మార్పిడి శక్తి, భూ ఉష్ణ శక్తి, గార్బేజి శక్తి, కేంద్రక శక్తి, మూలకాల శక్తి, మొదలగునవి.

ఈ శక్తి వనరులు కొన్ని సూర్యునిపై ఆధారపడతాయి. వాటిని ఒక శక్తి పరివర్తన ఛార్టు ద్వారా చూపడం జరుగుచున్నది.
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 19

కృత్యం – 4

కదిలే వస్తువులకు గల శక్తిని తెలుసుకుందాం :

ప్రశ్న 4.
గతిశక్తిని నిరూపించు ప్రయోగాలను వ్రాయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 20

  1. పటం (i)లో చూపినట్లు ఒక బల్లపై ఒక లోహపు గోళాన్ని, ఒక బోలుగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాను పక్కపక్కనే ఉంచండి.
  2. పటం (ii)లో చూపినట్లు లోహపు గోళాన్ని బల్ల అంచువరకు జరిపి, డబ్బావైపు ‘v’ వేగంతో దొర్లించండి.
  3. గోళాన్ని దొర్లించినపుడు అది ‘v’ వేగంతో కదలడం ప్రారంభించి ప్లాస్టిక్ డబ్బాను ఢీకొన్నది.
  4. డీకొనడం వల్ల పటం (ii)లో చూపినట్లు డబ్బా స్థానం ‘A’ నుండి ‘B’ కు మారింది.
  5. దీని ఆధారంగా నిశ్చలస్థితిలో ఉన్న గోళం కంటే కదిలే గోళం శక్తివంతమైనదని చెప్పవచ్చును.
  6. ఎందుకనగా నిశ్చలస్థితిలో ఉన్న గోళం ఎటువంటి పని చేయలేదు.
  7. కానీ కదిలే గోళం ప్లాస్టిక్ డబ్బాను ముందుకు కదిలించింది.
  8. దీనిని బట్టి నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు కంటే కదిలే వస్తువుకు అధిక శక్తి గలదని తెలుసుకోవచ్చును.

కృత్యం – 5

స్థితిశక్తిని గురించి తెలుసుకుందాం :

ప్రశ్న 5.
స్థితిశక్తిని గురించి తెలుపు కృత్యాలను వ్రాయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 21

  1. ఒక వెదురు కర్రను తీసుకుని ‘విల్లు’ తయారుచేయండి.
  2. ఒక కర్ర పుల్లతో బాణాన్ని తయారుచేసి పటం (1)లో చూపినట్లు బాణం ఒక కొనను వింటినారికి ఆనించి కొద్దిగా లాగి బాణాన్ని వదలండి.
  3. ఆ బాణం విల్లు నుంచి వేరుపడి, కొద్ది దూరంలో కిందపడిపోవడం గమనించవచ్చును.
  4. ఇప్పుడు మరొక బాణాన్ని పటం (ii)లో చూపినట్లు అధిక బలాన్ని ఉపయోగించి బాగా లాగి వదలండి.
  5. ఈ సందర్భంలో బాణం అతివేగంగా గాలిలో దూసుకుపోవడం గమనించవచ్చును.
  6. రెండవ సందర్భంలో అధిక బలంను ప్రయోగించడం వలన విల్లుపై చేసిన పని, విల్లు ఆకారాన్ని మార్చడం వల్ల అధిక శక్తిని పొందింది.
  7. ఇటువంటి శక్తిని స్థితిశక్తి అంటారు. ఈ శక్తి బాణాన్ని గాలిలో అతివేగంగా కదిలేట్లు చేసింది.

కృత్యం – 6

సాగదీయబడిన రబ్బరు బ్యాండ్ లోని శక్తిని పరిశీలిద్దాం :

ప్రశ్న 6.
సాగదీయబడిన రబ్బరు బ్యాండ్ లోని శక్తిని పరిశీలించు ప్రయోగాలను వ్రాయుము.
జవాబు:

  1. ఒక రబ్బరు బ్యాండును తీసుకొనుము.
  2. దాని రెండు చివరలా రెండు చేతులతో పట్టుకుని సాగదీయుము.
  3. ఒక చేతి నుండి రబ్బరు బ్యాండను వదిలేయండి.
  4. మీరు ఏమి జరిగిందో గమనించగా దాని ఆకారం పూర్వస్థితికి వచ్చింది. అనగా మారినది.
  5. స్వతహాగా మీ ఫలితమేమనగా అది మీ చేతిపై శక్తిని ప్రయోగిస్తుంది.
  6. దీనిని బట్టి వస్తువులు ఆకారం మారడం వల్ల శక్తిని పొందుతాయి అని గమనించవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

కృత్యం – 7

కొంత ఎత్తులో ఉన్న వస్తువుకు ఉండే శక్తిని పరిశీలిద్దాం :

ప్రశ్న 7.
కొంత ఎత్తులో ఉన్న వస్తువుకు ఉండే శక్తిని గూర్చి ప్రయోగ పూర్వకంగా తెల్పుము.
జవాబు:

  1. ఒక బరువైన లోహపు బంతిని తీసుకుని తడిమట్టి ఉన్న ప్రదేశంలో కొంత ఎత్తు నుండి వదలండి.
  2. ఇదే విధముగా ఈ ప్రక్రియను వివిధ ఎత్తుల నుండి లోహపు బంతిని వదిలేస్తూ తడిమట్టిలో ఏర్పడే గుంతలను పరిశీలించండి.
  3. ఆ గుంతలను పరిశీలించగా ఎత్తు పెరిగే కొలది దాని శక్తిలో మార్పును గమనించవచ్చును.
  4. దీనిని బట్టి వస్తువుల స్థానం మారటం వల్ల కూడా అవి శక్తిని పొందుతాయని గమనించవచ్చును.

కృత్యం – 8

ప్రశ్న 8.
ప్రకృతిలో సహజమైన శక్తి మార్పులు, నిత్య జీవిత కార్యకలాపాలలో శక్తి మార్పుల జాబితా తయారు చేద్దాం
ఎ) ప్రకృతిలో సహజమైన శక్తి రూపాంతరాల యొక్క జాబితాను తయారుచేయండి.
జవాబు:

క్రమసంఖ్య ప్రకృతిలో సహజంగా శక్తి రూపాంతరం చెందే సందర్భాలు
1. చెట్లు ఆహారం తయారుచేసుకునే సందర్భంలో సౌరశక్తి రసాయన శక్తిగా మారుట.
2. ఇస్త్రీ పెట్టెలో విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారడం.
3. మొక్కల నుండి, మొక్కలను తినే జంతువుల నుండి మనకు ఆహారం వస్తుంది. వివిధ రసాయనచర్యల వల్ల ఆహారంలో రసాయన శక్తి రూపంలో దాగి ఉన్న శక్తి మనకు అవసరమైన రూపాలలోకి మారుతుంది.
4. భూభ్రమణం జరగటం వలన నీటి అలలు ఏర్పడి తద్వారా వాటికి శక్తి వస్తుంది.
5. పవనాలు అధికముగా రావటం వలన గాలి మరలు తిరిగి యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది.

బి) మన నిత్య జీవిత కార్యకలాపాలలో శక్తి రూపాంతరాల జాబితాను తయారుచేయండి.
జవాబు:

శక్తి రూపాంతరం జరిగే సందర్భాలు శక్తి రూపాంతరానికి కారణమైన పరికరాలు
1. విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తిగా మారుట ఫ్యాన్
2. ధ్వనిశక్తి, విద్యుత్ శక్తిగా మారుట మైక్రోఫోన్
3. యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తిగా మారుట జలవిద్యుత్ కేంద్రం
4. సౌరశక్తి, విద్యుత్ శక్తిగా మారుట సోలార్ బ్యాటరీ
5. రసాయనిక శక్తి, విద్యుత్ శక్తిగా మారుట విద్యుత్ బ్యాటరీ
6. ఉష్ణశక్తి, యాంత్రిక శక్తిగా మారుట ఆవిరి యంత్రము

కృత్యం – 9

యాంత్రిక శక్తి నిత్యత్వ నియమం :

ప్రశ్న 9.
యాంత్రిక శక్తి నిత్యత్వ నియమంను తెల్పు ప్రయోగాన్ని వ్రాయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 22

  1. 50 – 60 సెం||మీల పొడవు గల సన్నని దారాన్ని తీసుకోండి.
  2. ఆ దారపు ఒక చివర చిన్న లోహపుగోళాన్ని కట్టండి.
  3. దారం రెండవ కొనను పటంలో చూపినట్లు గోడకు స్థిరముగా కట్టుము.
  4. ఇప్పుడు లోలకపు లోహపుగోళాన్ని కొంచెం (A1 వైపుకు) లాగి వదలండి.
  5. ఆ గోళం కంపిస్తూ వ్యతిరేకదిశకు అనగా A2 స్థానానికి చేరును.
  6. ఈ విధంగా ఆ గోళం A1 , A2 స్థానాల మధ్య కంపిస్తుండును.
  7. గోళం యొక్క స్థితిశక్తి ‘A’ స్థానం వద్ద తక్కువ. ఎందుకనగా A1, A2 లతో పోల్చగా భూమి నుండి ఎత్తు తక్కువ కనుక.
  8. గోళం A1 నుండి బయలుదేరిన గోళానికి స్థితిశక్తి తగ్గుతూ గతిశక్తి పెరుగును.
  9. గోళం A స్థానంకు చేరిన దాని స్థితిశక్తి – గతిశక్తి అగును.
  10. గోళం A1 నుండి A2 కు కదులుతున్నపుడు దాని స్థితిశక్తి పెరుగుతూ, A2 వద్ద గరిష్టానికి చేరుకుంటుంది.
  11. గాలి నిరోధంను లెక్కలోనికి తీసుకొనకపోతే, లోలకం కంపించే మార్గంలోని ప్రతీ బిందువు వద్ద దాని స్థితిశక్తి మరియు గతిశక్తి ల మొత్తం స్థిరముగా ఉంటుంది.

ఈ విధంగా యాంత్రిక శక్తి నిత్యత్వమయినదని చెప్పవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి

కృత్యం – 10

వివిధ ఎత్తుల వద్ద స్వేచ్ఛాపతన వస్తువు యొక్క మొత్తం శక్తిని లెక్కించుట :

ప్రశ్న 10.
వివిధ ఎత్తుల వద్ద స్వేచ్ఛాపతన వస్తువు యొక్క మొత్తం శక్తిని లెక్కించే కృత్యంను వ్రాయుము.
జవాబు:
20 కి.గ్రా. ద్రవ్యరాశి గల ఒక వస్తువు 4 మీ. ఎత్తు నుండి స్వేచ్ఛగా వదిలి వేయబడింది. కింది పట్టికలో ఇవ్వబడిన వివిధ సందర్భాలలో దాని స్థితిశక్తి, గతిశక్తి మరియు ఆ రెండు శక్తుల మొత్తం కనుగొని పట్టికలో రాయండి. (g విలువ 10 మీ/సె². గా తీసుకోండి)
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 23
AP Board 9th Class Physical Science Solutions 10th Lesson పని మరియు శక్తి 24

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 8th Lesson గురుత్వాకర్షణ Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 8th Lesson Questions and Answers గురుత్వాకర్షణ

9th Class Physical Science 7th Lesson గురుత్వాకర్షణ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
10 మీ. వ్యాసార్ధం గల వృత్తమార్గంలో 1000 కే.జీల కారు 10 మీ/సె. వడితో చలిస్తున్నది. దానికి కావలసిన అభికేంద్రబలాన్ని సమకూర్చేదెవరు? ఆ విలువ ఎంత? (AS 1)
జవాబు:
కారుకు కావలసిన అభికేంద్ర బలాన్ని వృత్తాకార మార్గములోని కేంద్రము సమకూరుస్తుంది.
విలువ:
కారు ద్రవ్యరాశి = m = 1000 కే.జీలు. ; వ్యాసారము = r = 10 మీ. ; కారు వడి = v = 10 మీ/సె.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 1

ప్రశ్న 2.
భూ ఉపరితలం నుండి 40 మీ/సె వడితో ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరితే, అది చేరే గరిష్ట ఎత్తు, పలాయన కాలంలను కనుగొనండి. పైకి విసిరిన 55 తర్వాత ఆ వస్తువేగం ఎంతుంటుంది? (g = 10 మీ/సె²) (AS 1)
జవాబు:
వస్తువు వడి = 1 = 40 మీ/సె ; గురుత్వ త్వరణం = g = 10 మీ/సె ; ఇచ్చిన కాలము = t = 5 సె||
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 2

ప్రశ్న 3.
50 మీ/సె.తో ఒక బంతిని నిట్టనిలువుగా పైకి విసిరాం. అది చేరే గరిష్ఠ ఎత్తు, ఆ ఎత్తు చేరడానికి పట్టే కాలం మరియు గరిష్ఠ ఎత్తు వద్ద దాని వేగాలను కనుక్కోండి. (g = 10 మీ/సె²) (AS 1)
జవాబు:
వస్తువు తొలి వేగం = 1 = 50 మీ/సె
గురుత్వ త్వరణం = g =10 మీ/సె²
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 3
గరిష్ఠ ఎత్తు వద్ద బంతి వేగము శూన్యముగా వుండును.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 4.
m1 మరియు m2 ద్రవ్యరాశులు గల రెండు కారులు వరుసగా r1 మరియు r2 వ్యాసార్థాలు గల వృత్తాకార మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. ఒక భ్రమణాన్ని పూర్తి చేయటానికి పట్టే సమయం రెండు కార్లకు సమానం. ఐతే వాటి వడులు మరియు అభికేంద్రత్వరణాల నిష్పత్తి ఎంత? (AS 1)
జవాబు:
కార్ల ద్రవ్యరాశులు వరుసగా m1 మరియు m2 ; వృత్తాకార మార్గాల వ్యాసార్ధాలు r1 మరియు r2.
ఒక భ్రమణాన్ని పూర్తి చేయుటకు పట్టు సమయం రెండు కార్లకు సమానము.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 4

ప్రశ్న 5.
10 కిలో గ్రాముల ద్రవ్యరాశి గల రెండు గోళాకార వస్తుకేంద్రాల మధ్య దూరం 10 సెం.మీ. వాటి మధ్యగల గురుత్వాకర్షణ బలం ఎంత? (AS 1)
జవాబు:
రెండు గోళాకార వస్తువుల ద్రవ్యరాశులు వరుసగా 10కి.గ్రా. మరియు 10 కి.గ్రా.
గోళాల మధ్య దూరము = d = 10 సెం.మీ
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 5
∴ వాటి మధ్య గల గురుత్వాకర్షణ బలము = 10G

ప్రశ్న 6.
ఏ ఏ సందర్భాల్లో మనిషి గురుత్వ కేంద్రం తన నుండి బయటకు వస్తుందో కొన్ని ఉదాహరణలతో వివరించంది. (AS 1)
జవాబు:
ఒక అథ్లెట్ ‘హైజంప్ చేయు సందర్భంలో, కొంత ఎత్తునుండి పారాచూట్ సహాయంతో విమానం నుండి దూకు సందర్భంలో గురుత్వ కేంద్రం బయటకు వచ్చును. ఎందుకనగా ఈ స్థితిలో వస్తువు అస్థిరత్వం మరియు భారరహితంగా ఉంటుంది కావున.

ప్రశ్న 7.
భూమి మరియు చంద్రుని మధ్య గురుత్వాకర్షణ బలం పనిచేయకపోతే చంద్రుని గమన మార్గం ఎలా ఉంటుంది? (AS 2)
జవాబు:
భూమి మరియు చంద్రునికి మధ్య గురుత్వాకర్షణ బలం పనిచేయకపోతే చంద్రుని గమన మార్గం భూమివైపు ఉండును.
(లేదా)
అసమరీతిలో చలన మార్గం ఉండును.

ప్రశ్న 8.
రెండు కణాల మధ్య గురుత్వాకర్షణ బలం పనిచేయని సందర్భం ఉంటుందా? ఎందుకు? (AS 2)
జవాబు:
రెండు కణాల మధ్య గురుత్వాకర్షణ బలం పనిచేయని సందర్భాలు ఉంటాయి. ఎందుకనగా ఆ వస్తువులు కాంతివేగంతో ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ప్రయాణించినపుడు గానీ, వాటి మధ్య లెక్కింపలేని దూరము ఉన్నపుడుగానీ సాధ్యపడును.

ప్రశ్న 9.
భూ వాతావరణం యొక్క గురుత్వకేంద్రం ఎక్కడ ఉంటుంది? (AS 2)
జవాబు:
భూ వాతారణపు మందం ఎంత ఉన్నప్పటికినీ, ఆ వాతావరణపు మందము యొక్క లక్షణము భూ ఉపరితలం నుండి 11 కి.మీ వరకు ఉండును. కావున భూ వాతావరణం యొక్క గురుత్వకేంద్రము భూ కేంద్రం వద్ద ఉండును. దీనికి కారణం భూమి గోళాకారంగా ఉండటమే.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 10.
స్టీలు ప్లేటుతో తయారుచేసిన భారతదేశ పట గురుత్వ కేంద్రం ఎలా కనుగొంటారు? వివరించండి. భారతదేశ పటం యొక్క గురుత్వ కేంద్రాన్ని నిర్ణయించడానికి ఏదైనా కృత్యాన్ని వివరింపుము. (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం :
స్టీలు ప్లేటుతో తయారుచేసిన భారతదేశ పట గురుత్వ కేంద్రంను కనుగొనుట.

కావలసిన పరికరాలు :
స్టాండు, స్టీలుతో చేసిన భారతదేశ పటము, సన్నని పురిలేని త్రాడు.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 6

పద్దతి :

  1. ఒక రిటార్డు స్టాండును తీసుకొనుము.
  2. స్టాండుకు స్టీలు ప్లేటుతో చేసిన భారతదేశ పటం యొక్క ఒక బిందువు (దాదాపు మధ్య బిందువు)ను గుర్తించుము.
  3. త్రాడును ఈ బిందువు నుండి వ్రేలాడదీయుము.
  4. ఈ బిందువు ద్వారా ఒక వడంబకంను వ్రేలాడదీయుము.
  5. వడంబకపు త్రాడు వెంట ఒక సరళరేఖను ప్లేటుపై గుర్తించుము.
  6. ఈ విధముగా ప్లేటుపై రెండు లేక మూడు స్థానాలను పరీక్షించి సరళరేఖలను గీసిన అవి ఖండించుకొను బిందువు ఆ ప్లేటు యొక్క గురుత్వ కేంద్రం అగును.
  7. ఈ విధముగా స్టీలు ప్లేటుపై గల భారతదేశ పటంను కనుగొనవచ్చును.

ప్రశ్న 11.
తాడుపై నడిచే వ్యక్తి పొడవైన, వంపు గల కర్రను ఎందుకు ఉపయోగిస్తాడు? వివరించండి. (AS 7)
జవాబు:
తాడుపై నడిచే వ్యక్తి పొడవైన కర్రను ఉపయోగించుటకు గల కారణము అతడు తాడుపై నడుచునపుడు ఆ కర్రను ఉపయోగించి అతని మొత్తం బరువు యొక్క చర్యారేఖను, తాడు ద్వారా పొవునట్లు జాగ్రత్త పడతాడు. ఈ ఫలితముగా అతడు పడిపోకుండా త్రాడుపై నడవగలుగుతాడు.

ప్రశ్న 12.
నీటితో నింపిన ఒక బకెట్ ను మోయటం కంటే నీటితో నింపిన రెండు బకెట్లను రెండు చేతులతో మోయటం సులభం ఎందుకు? (AS 7)
జవాబు:
నీటితో నింపిన ఒక బకెట్ ను మోయటం వలన మనిషి శరీరపు గురుత్వ కేంద్రంలో మార్పు వచ్చి అతను ప్రక్కకు వంగవలసి వచ్చును. కాని అదే మనిషి రెండు బకెట్లను రెండు చేతులతో పట్టుకోవడం వలన గురుత్వ కేంద్రంలో ఎట్టి మార్పు రాక స్థిరముగా ఉండుట వలన సులభముగా అనిపిస్తుంది.

ప్రశ్న 13.
ఒక వ్యక్తి తన కుడి భుజం మరియు కుడికాలు గోడకు ఆనించి ఉన్నాడు. ఈ స్థితిలో అతను గోడకు ఆనించకుండా ఉన్న తన ఎడమ కాలుని పైకి లేపగలదా? ఎందుకు? వివరించండి. (AS 7)
జవాబు:
పైకి లేపలేడు. ఎందుకనగా మనిషి యొక్క గురుత్వకేంద్రము అతని శరీరము మధ్యన ఉండును. ఒకవేళ అతను తన ఎడమకాలును పైకి లేపినట్లయితే అతని గురుత్వ కేంద్ర స్థానంలో మార్పు వచ్చి శరీరము స్థానంలో మార్పు వచ్చును.

ప్రశ్న 14.
మీరు గుంజీలు తీస్తున్నప్పుడు మీ శరీర గురుత్వ కేంద్రం ఏ విధంగా మారుతుందో వివరించండి. (AS 7)
జవాబు:
గురుత్వ కేంద్రము, వస్తు భారాల కేంద్రీకృత బిందువు కావున మన శరీరము యొక్క గరిమనాభి, గుంజీలు తీస్తున్నప్పుడు భూమి నుండి ఎత్తు మారినపుడల్లా మారును.

ప్రశ్న 15.
ఒక చెట్టుపై నుండి స్వేచ్ఛగా జారిపడిన ఆపిల్ 1.5 సెకనుల తర్వాత ఎంత వడిని కల్గి ఉంటుంది? మరియు ఈ కాలంలో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది? (g = 10 మీ/సె² గా తీసుకోండి.) (AS 1)
జవాబు:
జారిపడిన కాలము = 1 = 1.5 సెకనులు ; గురుత్వత్వరణము = 9 = 10 మీ/సె²
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 7

ప్రశ్న 16.
ఒక బంతిని కొంత ఎత్తు నుండి జారవిడిచాం. అది నేలను తాకే ముందు చివరి 6మీ. దూరాన్ని 0.2 సెకనుల్లో దాటితే ఆ బంతిని ఎంత ఎత్తు నుండి జారవిడిచామో కనుక్కోండి. (g = 10 మీ/సె గా తీసుకొనండి.) (AS 1)
జవాబు:
ప్రయాణించిన దూరము S = 6 మీ ; కాలము = t = 0.2 sec ; తొలివేగం = u అనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 8
S = ut + ½at² నుండి
6 = u × 0.2 + 12 × 10 × (0.2)²
6 = u × 0.2 + 5 × 0.04
u = \(\frac{5.8}{0.2}\) = 29 మీ/సె.
ఈ వేగము ‘x’ దూరాన్ని ప్రయాణించేటప్పుడు తుది వేగం అవుతుంది.
∴ s = x ; v = 29 మీ/సె. ; a = g = 10 మీ/సె² ; u = 0
v² – u² = 2as ⇒ v² = u² + 2as
v² = 841 + 2 × 10 × 6 = 841 + 120 = 961
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 9
మొత్తం దూరం = x + 6 = 42.05 + 6 = 48.05 మీ.

ప్రశ్న 17.
చంద్రుని వ్యాసార్థం మరియు ద్రవ్యరాశులు వరుసగా 1740 కి.మీ. మరియు 7.4 × 1022 కే.జీలు అయిన చంద్రునిపై గురుత్వత్వరణం ఎంత? (AS 1)
జవాబు:
చంద్రుని వ్యాసార్ధం = r = 1740 కి.మీ. ; చంద్రుని ద్రవ్యరాశి = m = 7.4 × 1022 కే.జీలు
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 10

ప్రశ్న 18.
30 మీ. వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో 36కి.మీ./గంట వడితో ఒక వ్యక్తి స్కూటర్ పై చలిస్తుంటే కావలసిన అభికేంద్రబలాన్ని సమకూర్చేదెవరు? ఆ బలమెంత? స్కూటరు మరియు వ్యక్తి యొక్క మొత్తం ద్రవ్యరాశి 150 కే.జీలు.
జవాబు:
వృత్త వ్యాసార్ధం = r = 30 మీ ; స్కూటర్ వడి = v = 10 కి.మీ/ గం.
స్కూటర్ మరియు వ్యక్తి ద్రవ్యరాశి = m = 150 కే.జీలు
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 11

ప్రశ్న 19.
1 మీ. పొడవు లఘులోలకంనకు గల గోళం యొక్క ద్రవ్యరాశి 100 గ్రా. దాని మార్గంలో సమతాస్థితి వద్ద గోళం 1.4 మీ/సె. వడితో చలిస్తుంటే లోలకం తాడులో గల తన్యత ఎంత? (g = 9.8 మీ/సె²) (AS 1)
జవాబు:
గోళం ద్రవ్యరాశి = 100 గ్రా. = 0.1 కేజి; లోలకం పొడవు = l = 1 మీ. ; గోళం యొక్క వడి (v) = 1.4 మీ/సె.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 12
తాడులో గల తన్యత = T అనుకొనుము.
గోళంలో పనిచేసే బలాలు :
1) గోళము బరువు mg (క్రింది దిశలో), 2) తాడులో తన్యత T (పై దిశలో)
గోళము బరువు = \(\frac{\mathrm{mv}^{2}}{l}\) ; తాడులో తన్యత = T = g cos θ
∴ న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 13

ప్రశ్న 20.
R వ్యాసార్థం గల అర్ధగోళాకార పాత్రపై ఒక బిందువు వద్ద పటంలో చూపినట్లు ఒక చిన్న వాషర్‌ను ఉంచబడింది. ఆ బిందువు వద్ద నుండి వాషర్ అర్ధగోళాన్ని విడిచి ప్రయాణించాలంటే ఆ వాషర్‌కు అందించవలసిన కనీస వేగం ఎంత? (AS 7)
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 14
జవాబు:
అర్ధగోళపు వ్యాసార్ధము = R
వాషర్ చలనము వృత్తాకార చలనము కావున వాషర్ పై కేంద్రము ప్రయోగించు బలం అభికేంద్రబలం అగును.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 15

ప్రశ్న 21.
ఒక బాలుడు రెండు బంతులను గాలిలోకి నిట్టనిలువుగా విసిరి ఆడుకొనుచున్నాడు. మొదట విసరిన బంతి దాని గరిష్ట ఎత్తు వద్ద ఉన్నప్పుడు రెండవ బంతిని పైకి విసురుతున్నాడు. అతను ఒక సెకనుకు రెండు బంతులను విసురుతున్నట్లయితే ఆ బంతులు చేరే గరిష్ట ఎత్తు ఎంత? (AS 7)
జవాబు:
అతడు ఒక సెకనుకు రెండు బంతులను విసురుతున్నాడు.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 16

ప్రశ్న 22.
5మీ/సె. స్థిరవదితో పైకి వెళ్లే బెలూన్ నుండి అది 60 మీ. ఎత్తు వద్ద ఉన్నప్పుడు ఒక రాయిని జారవిడిచిన, అది ఎంత కాలంలో భూమిని చేరును?
జవాబు:
పైకి వెళ్ళే బెలూన్ వడి = 5 మీ/సె ; భూమి నుండి బెలూను గల దూరము = 60 మీ
కొంత ఎత్తు వద్ద వస్తువు వున్న సమీకరణం
h = – ut + ½gt²
60 = – 5t + ½ . 10. f²
5t² – 5t – 60 = 0
5(t² – 1 – 12) = 0
t² – t – 12 = 0
t² – 4t + 3t – 12 = 0
t(t – 4) + 3(t – 4) = 0
(t- 4) (t + 3) = 0
t = 4 sec
60 మీ|| ఎత్తు వద్ద నుండి ఒక రాయిని జారవిడిచిన అది భూమిని చేరుటకు 4 సెకనుల కాలం పట్టును.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 23.
ఒక చెట్టు నుండి ఆపిల్ జారిపడింది. ఆపిల్ పై నున్న ఒక చిన్న చీమ, భూమి తనవైపు ్వ త్వరణంతో చలిస్తుందని గమనించింది. భూమి నిజంగా చలిస్తుందా? ఒకవేళ చలిస్తే భూమికి ఈ త్వరణం పొందడానికి దానిపై పనిచేసే బిలం ఏమిటి? (AS 7)
జవాబు:
పై ప్రశ్నలో భూమి చలించుట జరుగదు. పండులో మాత్రమే చలనం గమనించగలము. ఒకవేళ భూమి గాని చలిస్తే న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం ఆ పండుపై భూమి యొక్క గురుత్వాకర్షణ బలం పనిచేస్తూ ఉంటుంది.

9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 130

ప్రశ్న 1.
ఒక వస్తువుపై ఏ బలం పనిచేయకపోతే ఆ వస్తువు వక్రమారంలో చలించగలదా?
జవాబు:
వస్తువుపై ఏ బలం పనిచేయకపోతే వస్తువు వక్రమార్గంలో చలించదు.

ప్రశ్న 2.
వక్రమార్గంలో ప్రయాణించే సందర్భంలో కారు వడి పెరిగినట్లయితే దాని అభికేంద్రత్వరణం పెరుగుతుందా?
(మీ సమాధానాన్ని a = \(\frac{\mathrm{V}^{2}}{R}\) సమీకరణ సహాయంతో సమర్థించుకోండి).
జవాబు:
అభికేంద్ర త్వరణం (ac) = \(\frac{\mathrm{V}^{2}}{R}\)
a ∝ V² కావున కారు వడి పెరిగినట్లయితే దాని అభికేంద్రత్వరణం పెరుగును.

ప్రశ్న 3.
1 మీ. పొడవు గల తాడు చివర 1 కి.గ్రా॥ ద్రవ్యరాశి గల బొమ్మను కట్టి క్షితిజ సమాంతరతలంలో 3 మీ./సె. వడితో త్రిప్పిన తాదులో ఉండే తన్యత ఎంత?
జవాబు:
బొమ్మ ద్రవ్యరాశి = m = 1 కి.గ్రా. ; వృత్త వ్యాసార్థం = తాడు పొడవు = R = 1 మీ. ; వడి = v = 3 మీ./సె.
తాడు క్షితిజ సమాంతర తలంలో తిరుగుచున్నది. కావున దానికి కావలసిన అభికేంద్రబలమే తాడు తన్యత అవుతుంది.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 17

9th Class Physical Science Textbook Page No. 133

ప్రశ్న 4.
పటంలో చూపినట్లు చంద్రుడు భూమిచుట్టూ వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటాడు. ఒకవేళ చంద్రుని వేగం శూన్యమయితే, చంద్రుడు చలనం ఏ విధంగా ఉంటుంది?
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 18
జవాబు:
చంద్రుని వేగం శూన్యమయితే, చంద్రుని యొక్క చలన దిశ భూమి వైపుకు ఉంటుంది.

ప్రశ్న 5.
రెండు వస్తువుల్లో ఒకదాని ద్రవ్యరాశి రెట్టింపయిన, వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఎంతుంటుంది?
జవాబు:
గురుత్వాకర్షణ బలం ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉండును. కావున గురుత్వాకర్షణ బలం రెట్టింపగును.

ప్రశ్న 6.
విశ్వంలో అన్ని వస్తువుల మధ్య గురుత్వాకర్వణ బలం ఉంటుందని మనకు తెలుసు. మరి మనం పెద్ద భవంతుల దగరగా నిలుచున్నప్పుడు వాటి వల్ల మనపై ప్రయోగింపబడే గురుత్వాకర్షణ బల ప్రభావాన్ని అనుభూతి పొందకపోవడానికి గల కారణమేమి?
జవాబు:

  1. పెద్ద భవంతులతో పోల్చినపుడు మన ద్రవ్యరాశి లెక్కించదగినది కాదు.
  2. భవంతుల ఎత్తుల మధ్య అధిక తేడా ఉంటుంది.
  3. అందువలన మనం పెద్ద భవంతుల దగ్గరగా నిల్చున్నప్పుడు వాటివల్ల మనపై ప్రయోగింపబడే గురుత్వాకర్షణ బల ప్రభావ అనుభూతిని పొందలేము.

ప్రశ్న 7.
ఒకే ద్రవ్యరాశి గల చెక్కముక్క మరియు ఇనుప ముక్కలపై పనిచేసే భూమ్యాకర్షణ బలాల్లో దేనిపై పనిచేసే బలం అధికంగా ఉండును?
జవాబు:
ఒకే ద్రవ్యరాశి గల చెక్కముక్క మరియు ఇనుపముక్కలపై పనిచేసే భూమ్యాకర్షణ బాలాలు రెండింటిపైన సమానంగా ఉంటాయి. ఎందుకంటే అవి ఒకే ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి కనుక.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 8.
భూమి గురుత్వాకర్షణబలంతో ఆపిలను ఆకర్షించడం వలన అది భూమిపై పడుతుందని మనకు తెలుసు. ఆపిల్ కూడా భూమిని ఆకర్షిస్తుందా? ఒకవేళ ఆకర్షిస్తే అది ఎంత బలంతో భూమిని ఆకర్షిస్తుంది?
జవాబు:
ఆపిల్ కూడా భూమిని ఆకర్షించును. భూమి, ఆపిల్ పై ఎంత బలంను ప్రయోగించునో దానికి సమానమైన బలంతో వ్యతిరేక దిశలో ఆపిల్ భూమిపై బలాన్ని ప్రయోగించును.

9th Class Physical Science Textbook Page No. 135

ప్రశ్న 9.
వడి లేకుండా, త్వరణాన్ని కలిగి ఉండే వస్తు గమనాన్ని తెలిపే సందర్భానికి ఉదాహరణ యివ్వండి.
జవాబు:
నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు వడి క్రమేపి తగ్గి శూన్యమై, గరిష్ఠ ఎత్తుకు చేరును. ఆ గరిష్ట ఎత్తు వద్ద వస్తువుకు వడి ఉండదు కానీ, గురుత్వత్వరణాన్ని కలిగి ఉండును.

ప్రశ్న 10.
20 మీ/సె. మరియు 40 మీ/సె. వేగాలతో గాలిలోనికి విసిరిన రెండు వస్తువుల యొక్క త్వరణాలను పోల్చండి.
జవాబు:
రెండు వస్తువులకు ఒకే త్వరణముండును.

9th Class Physical Science Textbook Page No. 137

ప్రశ్న 11.
నీ భారం ఎప్పుడు “mg” కు సమానం?
జవాబు:
మనము భూమి ఉపరితలముపై ఉన్నప్పుడు, మన భారం “mg” కు సమానమౌతుంది.

ప్రశ్న 12.
నీ భారం శూన్యమయ్యే సందర్భాలకు ఉదాహరణను ఇవ్వండి.
జవాబు:

  1. స్విమ్మింగ్ పూల్ లో ఈతకొట్టేందుకు కొంత ఎత్తు నుండి దూకిన సందర్భంలో భారము శూన్యమగును.
  2. పారాచూట్ సహాయంతో కొంత ఎత్తున గల విమానం నుండి దూకిన సందర్భంలో భారము శూన్యమగును.

9th Class Physical Science Textbook Page No. 140

ప్రశ్న 13.
పలుచని సమతల త్రిభుజాకార వస్తువు మరియు గోళాకార వస్తువుల గురుత్వ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి?
జవాబు:

  1. సమతల త్రిభుజాకార వస్తువు గురుత్వ కేంద్రము, ఆ వస్తువు భుజాల మధ్యగతరేఖల ఖండన బిందువు వద్ద ఉండును.
  2. గోళాకార వస్తువుల విషయంలో దాని వ్యాసాల ఖండన బిందువు వద్ద గురుత్వ కేంద్రం ఉండును.

ప్రశ్న 14.
వస్తువుకి ఒకటి కంటే ఎక్కువ గురుత్వ కేంద్రాలు ఉండవచ్చా?
జవాబు:
ఉండవు, వస్తువుకి ఒకే ఒక్క గురుత్వకేంద్రం ఉండును.

ప్రశ్న 15.
“వీసా” అనే పట్టణంలో ఒక టవర్ కొంచెం వాలి ఉంటుంది. అయినా అది పడిపోవడం లేదు. ఎందుకు?
జవాబు:
గురుత్వ కేంద్రం స్థానంలో మార్పిడి, ఆ వస్తువు యొక్క స్థిరత్వంను పెంచును. కావున పీసా గోపురం పడిపోవడం లేదు.

ప్రశ్న 16.
వీపు పై అధిక భారాన్ని మోసే వ్యక్తి ఎందుకు కొంచెం ముందుకు వంగుతాడు?
జవాబు:
వీపుపై అధిక భారాన్ని మోసే వ్యక్తి స్థిరత్వం కొరకు కొంచెం ముందుకు వంగుతాడు.

9th Class Physical Science Textbook Page No. 129

ప్రశ్న 17.
సమవృత్తాకార చలనంను నిర్వచించుము. ఆ చలనంలో గల వస్తువు వేగం మారుతుందా? ఆ వస్తువుకు త్వరణం వుంటుందా? ఒకవేళ ఉంటే ఏ దిశలో ఉండును?
జవాబు:
నిర్వచనం : ఏదైనా ఒక వస్తువు స్థిరవడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే ఆ వస్తువు చలనాన్ని “సమవృత్తాకార చలనము” అందురు.

  1. సమవృత్తాకార చలనంలో గల వస్తువు వేగం మారును.
  2. ఆ వస్తువుకు త్వరణం ఉండును.
  3. దాని దిశ వస్తువేగ దిశలో ఉండును.

9th Class Physical Science Textbook Page No. 131

ప్రశ్న 18.
సర్ ఐజాక్ న్యూటన్ ఆపిల్ చెట్టు క్రింద కూర్చుని ఉన్నపుడు ఆపిల్, చెట్టు నుండి పడిందనే విషయం ద్వారా అతను గురుత్వాకర్షణ అనే భావనను కనుగొన్నాడని మనందరికీ సుపరిచితమే కదా ! ఈ సందర్భంలో న్యూటన్ మదిలో మెదిలిన ప్రశ్నలేమిటో మీకు తెలుసా?
జవాబు:

  1. ఆపిల్ మాత్రమే భూమిపై పడింది. ఎందుకు?
  2. ఆపిలను ఎవరో లాగి ఉంటారు (ఆకర్పించి)?
  3. ఒకవేళ భూమి ఆపిల్ను లాగి ఉంటే ఆ బలం ఏమై ఉంటుంది?
  4. ఈ నియమం ఆపిల్ కు మాత్రమేనా? ఏ వస్తువులకైనా వర్తిస్తుందా?

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 133

ప్రశ్న 19.
భూ ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ భ్రమించే ఉపగ్రహ ఆవర్తన కాలమెంత? (భూ ఉపరితలం నుండి ఉపగ్రహ కక్ష్యకు గల ఎత్తు విస్మరించంది. భూమి ద్రవ్యరాశి, వ్యాసార్ధాలు వరుసగా 6 × 10-24 కి.గ్రా. మరియు 6.4 × 106 మీ.గా తీసుకోండి).
సాధన:
భూ ద్రవ్యరాశి మరియు వ్యాసార్ధాలు వరుసగా M మరియు R లు తీసుకుందాం. ఉపగ్రహ ద్రవ్యరాశి IT అనుకుందాం.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 19
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 20
పై సమీకరణంలో M, R మరియు G లు ప్రతిక్షేపించగా T = 84.75 ని. వచ్చును.

అనగా భూమి ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం ఒక పూర్తి భ్రమణం చేయడానికి 1 గంట 24.7 నిముషాల సమయం (సుమారుగా) తీసుకుంటుంది.

9th Class Physical Science Textbook Page No. 135

ప్రశ్న 20.
ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరారు. అది ఊర్ద్పదిశలో చలించేటప్పుడు ఆఖరి సెకనులో ప్రయాణించే దూరమెంత? S= 10 మీ/సె² గా తీసుకోండి.
సాధన:
ఊర్ధ్వ దిశలో చలించే వస్తువు ఆఖరి సెకనులో ప్రయాణించిన దూరం, అదే దిశలో మొదటి సెకనులో ప్రయాణించిన
దూరానికి సమానం.
కనుక u = 0 మరియు s = ut + \(\frac{1}{2}\)at², నుండి
వస్తువు ఊర్ధ్వ దిశలో ఆఖరి సెకనులో ప్రయాణించిన దూరం s = \(\frac{1}{2}\)gt² = \(\frac{1}{2}\) × 10 × 1 = 5 మీ.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

ప్రశ్న 21.
వివిధ ఎత్తుల నుండి జారవిడిచిన రెండు స్వేచ్ఛా పతన వస్తువులు భూమికి ఒకేసారి చేరుకున్నవి. రెండు వస్తువుల ప్రయాణ కాలాలు వరుసగా 2సె. మరియు 1సె. అయిన 1సె. ప్రయాణించిన వస్తువును పతనం చెందడం ప్రారంభించేటప్పటికి 18 = 10 మీ/సె² గా తీసుకోండి). 2సె. ప్రయాణించిన వస్తువు ఏ ఎత్తులో ఉంటుంది?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 21
2సె|| ప్రయాణ కాలం గల వస్తువును మొదటిదని, 1 సె॥ ప్రయాణ కాలం గల వస్తువును రెండవదని అనుకుందాం. రెండవ వస్తువు 1 సెకను కాలంలో ప్రయాణించే దూరం
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 22
కావున రెండవ వస్తువు జారవిడిచే సమయంలో, మొదటి వస్తువు భూ ఉపరితలం నుండి 15 మీ. ఎత్తులో ఉంటుంది.

ప్రశ్న 22.
25మీ. ఎత్తు గల భవనం నుండి నిట్టనిలువుగా 20 మీ/సె వడితో ఒకరాయిని పైకి విసిరారు. ఆ రాయి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? (g= 10 మీ/సె² గా తీసుకోండి.)
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 23
ఈ లెక్కను సాధించడంలో ప్రక్క పటంలో చూపిన విధంగా సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాలి.

రాయిని పైకి ఏ బిందువువద్ద నుంచైతే విసిరారో ఆ బిందువును నిర్దేశిత బిందువు (point of reference) గా తీసుకోండి. ఈ బిందువు నుండి పై దిశను ధనాత్మకం గాను, క్రింది దిశను ఋణాత్మకంగాను తీసుకుందాం. ఇచ్చిన విలువలు u = 20మీ/సె.
a = g = – 10 మీ/సె²
S = h = – 25 మీ. అవుతాయి.
చలన సమీకరణం, s = ut + \(\frac{1}{2}\) at²
– 25 = 20t – \(\frac{1}{2}\) × 10 × t²
– 25 = 20t – 5t²
– 5 = 4t – t²
⇒ t² – 4t – 5 = 0
దీనిని సాధించగా, (t- 5) (t + 1) = 0
కనుక t = 5 లేదా -1
కావున రాయి భూమిని చేరడానికి 5 సె|| సమయం పట్టును.

9th Class Physical Science Textbook Page No. 136

ప్రశ్న 23.
వడితో నిట్టనిలువుగా భూ ఉపరితలం నుండి పైకి విసిరిన వస్తువు భూమికి తిరిగిరావడానికి ఎంత సమయం పట్టును?
సాధన:
పైకి విసిరిన వస్తువు తిరిగి విసిరిన స్థానంకు చేరుకొనును. కావున స్థానభ్రంశం S = 0 అగును.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 24
తొలి వేగం u = u మరియు a = – g
చలన సమీకరణం, s = ut + \(\frac{1}{2}\) at² నుండి
0 = ut – \(\frac{1}{2}\)gt²
⇒ \(\frac{1}{2}\) gt² = ut
⇒ t = \(\frac{2u}{g}\)

పరికరాల జాబితా

చెక్కదిమ్మె, చెక్క స్టాండు, వడంబం, దారము, స్టీలు ప్లేటు, విద్యుత్ మోటారు, బ్యాటరీ, స్ప్రింగ్ త్రాసు, సమతాస్థితిని ప్రదర్శించే బొమ్మలు, నమూనాలు, మీటరు స్కేలు, అక్రమాకారపు వస్తువులు, రింగు

9th Class Physical Science 8th Lesson గురుత్వాకర్షణ Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

వృత్తాకార చలనంలో ఉన్న వస్తువును గమనించుట :

ప్రశ్న 1.
వృత్తాకార చలనంలో గల వస్తువును గమనించు కృత్యంను సోదాహరణంగా వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 25

  1. ఒక విద్యుత్ మోటారు యొక్క కడ్డీకి ఒక వృత్తాకార ప్లేటును బిగించుము.
  2. పటంలో చూపిన విధంగా ప్లేటు అంచు వద్ద చిన్న చెక్కదిమ్మను ఉంచుము.
  3. ఇప్పుడు విద్యుత్ మోటారు స్విచ్ ను ఆన్ చేయుము.
  4. కొంతసేపు తర్వాత చెక్కదిమ్మ పది భ్రమణాలు చేయుటకు పట్టే కాలాన్ని లెక్కించుము.
  5. ఈ విధముగా రెండు లేక మూడు సార్లు చేయుము.

పై కృత్యం ద్వారా చెక్కదిమ్మ వృత్తాకార మార్గంలో స్థిర వడి, స్థిర భ్రమణ కాలములో తిరుగుచున్నది అని గమనించవచ్చును.

కృత్యం – 2

సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తు వేగ సదిశలను గీయటం :

ప్రశ్న 2.
సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తు వేగ సదిశలను గీయుటను వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 26

  1. స్థిరవడి, స్థిరవేగంతో వృత్తాకార మార్గంలో ఒక చెక్కదిమ్మ భ్రమణం చేయుచున్నదనుకొనుము.
  2. పటంలో చూపిన విధంగా చెక్కదిమ్మ చలించే మార్గాన్ని గీయుము.
  3. ఈ మార్గంకు నిర్దిష్ట కాలవ్యవధుల వద్ద వేగ సదిశలను పటంలో చూపిన విధముగా గీయుము.
  4. వేగ సదిశల తొలి బిందువులను ఒక బిందువు వద్దకు చేర్చుము.
  5. ఈ వేగ సదిశలన్నీ వృత్తాకార మార్గం యొక్క కేంద్రం దగ్గర కలిసి వివిధ దిశల్లో ఉన్న వృత్త వ్యాసార్ధాలు కన్పిస్తాయి.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

కృత్యం – 3

స్వేచ్ఛా పతన వస్తు త్వరణం దాని ద్రవ్యరాశిపై ఆధారపడదు

ప్రశ్న 3.
స్వేచ్ఛా పతన వస్తు త్వరణం దాని ద్రవ్యరాశిపై ఆధారపడదను చూపు కృత్యాన్ని రాయుము.
జవాబు:

  1. పుస్తకంపై ఒక చిన్న కాగితాన్ని ఉంచి కొంత ఎత్తు నుండి రెండింటిని కలిపి ఒకేసారి వదలవలెను.
  2. తర్వాత పుస్తకాన్ని మరియు కాగితాన్ని విడివిడిగా ఒకే ఎత్తు నుండి ఒకేసారి జారవిడవవలెను.

మొదటి సందర్భంలో కాగితం, పుస్తకంపైనున్నచో రెండునూ ఒకేసారి భూమి చేరినవి. రెండవ సందర్భంలో పుస్తకం ముందు భూమిని చేరి, కాగితం కొద్ది తేడాతో భూమిని చేరినది. దీనికి కారణం గాలి నిరోధక బలం కాగితంపై ఎక్కువగా పనిచేయటమే.

కృత్యం – 4

ప్రశ్న 4.
గురుత్వత్వరణం (g) ఏ దిశలో పనిచేస్తుంది?
జవాబు:
ఒక రాయిని నిట్టనిలువుగా పైకి విసరండి. అది భూమికి, తిరిగి చేరడానికి పట్టే సమయాన్ని లెక్కించండి.
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 27
రాయి పైకి చలించేటప్పుడు దాని వడి తగ్గుతూ ఉంటుంది. క్రిందకు చలించేటప్పుడు దాని వడి పెరుగుతూ ఉంటుంది. కనుక స్వేచ్చా పతన వస్తువు యొక్క త్వరణదిశ భూ ఉపరితలానికి లంబంగా పనిచేస్తుంది. వస్తువులను ఏవిధంగా విసిరినా వాటి గురుత్వత్వరణం ఎల్లప్పుడూ క్రిందకి పటంలో చూపిన విధంగా ఉంటుంది.

కృత్యం – 5

స్వేచ్ఛాపతన వస్తు భారంను కొలవగలమా?

ప్రశ్న 5.
స్వేచ్ఛాపతన వస్తు భారంను కొలిచే విధానాన్ని వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 28

  1. ఒక స్ప్రింగ్ త్రాసును తీసుకొనుము.
  2. ఆ త్రాసును పటంలో చూపిన విధంగా ఏదైనా ఆధారంకు వ్రేలాడదీయుము.
  3. ఆ త్రాసు కొనకు కొంత భారాన్ని తగిలించుము.
  4. ఈ సందర్భంలో త్రాసు రీడింగును గుర్తించుము.
  5. భారం తగిలించి వున్న ఆ త్రాసును దాని ఆధారం నుండి వేరుచేసి స్వేచ్చగా వదిలివేయుము.
  6. ఈ సందర్భంలో సూచీ సున్నా రీడింగును చూపుతుంది.
  7. అనగా వస్తువు భార రహిత స్థితిలో కలదని గమనించవచ్చును.

కృత్యం – 6

స్వేచ్ఛాపతన వస్తువు – జరిగే మార్పులు :

ప్రశ్న 6.
స్వేచ్ఛాపతన వస్తువు విషయంలో జరిగే మార్పులను తెల్పు కృత్యంను వ్రాయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 29

  1. ఒక పారదర్శక టీ లాంటి పాత్రను తీసుకొనుము.
  2. ఆ బ్రేకు ఎదురెదురు భుజాలపై రంధ్రాలను చేయుము.
  3. 2 లేక 3 రబ్బరు బ్యాండ్లను తీసుకుని రంధ్రాల మధ్య బిగుతుగా బిగించుము.
  4. ఆ రబ్బరు బ్యాండ్లపై ఒక రాయిని పటం(ఎ)లో చూపిన విధంగా ఉంచండి.
  5. రబ్బరు బ్యాండ్లలో వంపును గమనించవచ్చును.
  6. ఈ స్థితిలో రాయితో సహా మొత్తం పాత్రను స్వేచ్చగా వదులుము.
  7. పాత్రను స్వేచ్ఛగా వదిలినపుడు రాయి వలన రబ్బరు బ్యాండ్లలో ఏర్పడిన వంపు ఉండదు.
  8. ఈ కృత్యం వలన వస్తుభారం శూన్యం కనుక భారం, ఆధారిత బలానికి సమానమైనదని తెలుసుకోవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

కృత్యం – 7

ప్రశ్న 7.
కొన్ని వస్తువులను సమతాస్థితిలో (Balancing) ఉంచడం :
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 30
ఒక స్పూన్, ఒక ఫోర్క్ మరియు భారయుత కడ్డీలను ఒక గ్లాసు అంచుపై పటంలో చూపిన
విధంగా మొత్తం వ్యవస్థ సమతుల్య స్థితిలో ఉండేట్లు చేయండి. కొన్ని ప్రయత్నాల తర్వాత పటంలో చూపిన విధంగా సమతుల్య స్థితిలో ఉండిపోతాయి.

కృత్యం – 8

వంగకుండా మీరు పైకి లేవగలరా?

ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా కుర్చీలో కూర్చోండి. కాళ్లను మరియు వీపును, నడుము భాగాలను వంచకుండా పటంలో చూపిన స్థితిలోనే ఉండి పైకి లేవడానికి ప్రయత్నించండి.
పైన తెలిపిన విధంగా చేయగలరా? లేకపోతే ఎందుకు చేయలేరు?
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 31
జవాబు:
1) ఆ విధంగా పైకి లేవలేము.

కారణములు:

  1. కుర్చీలో కూర్చున్నప్పుడు మనము భారరహిత స్థితిలో ఉంటాము.
  2. ఆ స్థితిలో మనము కుర్చీ నుండి బలమును పొందవలసి ఉంటుంది.
  3. దాని కొరకు మనము కాళ్ళను మరియు వీపును, నడుము భాగాలను వంచవలసి ఉంటుంది.

కృత్యం – 9

ప్రశ్న 9.
నిచ్చెనను సమతుల్య స్థితిలో ఉంచడం :
జవాబు:
నిచ్చెనను లేదా పొడుగాటి కర్రను నీ భుజంపై సమతాస్థితినందు ఉంచుటకు ప్రయత్నించండి. అతి కష్టం మీద సమతాస్థితి యందు ఉంచగలం.

కృత్యం – 10

ప్రశ్న 10.
గురుత్వ కేంద్రాన్ని కనుగొనుట :
ఎ) క్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రంను కనుగొనుటను ఒక కృత్యం ద్వారా తెలుపుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 32

  1. ఒక మీటరు పొడవుగల కొలబద్దను తీసుకొనుము.
  2. ఆ బద్దపై వేర్వేరు బిందువుల వద్ద, దానిని వ్రేలాడదీయుము.
  3. కొలబద్ద స్థిరముగా ఉండదు.
  4. ఆ కొలబద్ద యొక్క మధ్యబిందువు నుండి వేలాడదీయుము.
  5. ఈ బిందువు వద్ద కొలబద్ద క్షితిజ సమాంతరంగా ఉండును.
  6. అనగా ఈ బిందువు వద్ద కొలబద్ద మొత్తంకు ఆధారము ఏర్పడింది. కావున ఈ బిందువునే ఆ వస్తువు యొక్క గురుత్వకేంద్రము అంటారు.
  7. ఈ విధముగా క్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రంను కనుగొనవచ్చును.

బి) ఒక అక్రమాకార వస్తువు యొక్క గురుత్వ కేంద్రంను ఏ విధముగా నిర్ణయించగలము?
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 33

  1. స్వేచ్ఛగా వ్రేలాడదీసిన ఏ వస్తువు గురుత్వ కేంద్రమైననూ, ఈ వ్రేలాడదీసిన బిందువు నుండి గీయబడిన క్షితిజ లంబముపై ఉండును.
  2. ఆ వస్తువు యొక్క వేరొక బిందువు గుండా మరలా వ్రేలాడదీయుము.
  3. ఈ బిందువు నుండి క్షితిజ లంబాన్ని ఊహించుకొనుము.
  4. ఈ రెండు రేఖల ఖండన బిందువును గురుత్వ కేంద్రముగా లెక్కించవచ్చును.

కృత్యం – 11

ఒక రింగు గురుత్వ కేంద్రాన్ని కనుగొనుట :

ప్రశ్న 11.
ఒక రింగు యొక్క గురుత్వ కేంద్రమును ఎట్లు కనుగొంటావో ప్రయోగపూర్వకంగా వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 34

  1. ఒక దళసరి కార్డుబోర్డు తీసుకొని, వేర్వేరు వ్యాసార్థాలతో ఏక కేంద్ర వృత్తాలు గీయుము.
  2. వృత్తాకార రేఖల వెంబడి కార్డుబోర్డును కత్తిరించాలి. పటంలో చూపినట్లు రింగు ఆకారము ఏర్పడుతుంది.
  3. AB అనే సన్నని తీగపై దీనిని ఉంచి దాని స్థానం సవరిస్తూ, అదిక్షితిజ సమాంతరంగా ఉండునట్లు చేయాలి.
  4. ఆ తీగను టేపుతో ఆ స్థానంలో స్థిరంగా ఉండునట్లు చేయాలి.
  5. మరల ఇదే ప్రయోగాన్ని CD అనే తీగపై చేయాలి.
  6. AB మరియు CD తీగల ఖండన బిందువు ‘G’ గా గుర్తించుము.
  7. ‘G’ వద్ద త్రాడు సహాయముతో రింగును ‘G’ బిందువు నుండి వ్రేలాడదీసిన అది క్షితిజ సమాంతరంగా ఉంటుంది.
  8. ఈ బిందువే గురుత్వ కేంద్రము లేక గరిమనాభి అవుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ

కృత్యం – 12

ప్రశ్న 12.
గురుత్వ కేంద్రం స్థానంలో మార్పు – దాని ఫలితం :
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 8th Lesson గురుత్వాకర్షణ 35
మీరు నిటారుగా నిలబడినారనుకోండి. మీ శరీరం యొక్క గురుత్వ కేంద్రం మీ శరరము యొక్క మధ్యభాగము (గరిమినాభి).

మీరు నిలబడిన స్థానంలో ముందుకు వంగి పటం(ఎ)లో చూపినట్లు, మీ కాలివ్రేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఒక గోడకు అనుకొని పటం(బి)లో చూపిన విధంగా కాళ్ళు గోడకు ఆనించి ఉంచి నడుము పై భాగంను ముందుకు వంచి మీ కాలివ్రేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి.

  1. పటం(ఎ)లో వ్యక్తి ముందుకు వంగి కాలి వేళ్ళను పట్టుకోగలిగాడు. కారణం అతను తన శరీర గురుత్వ కేంద్రం వద్ద వంగాడు కాబట్టి.
  2. పటం(బి)లో వ్యక్తి ముందుకు వంగి కాలివ్రేళ్ళను పట్టుకోలేకపోయాడు. కారణం అతను తన శరీర గురుత్వకేంద్రం వద్ద వంగలేదు కాబట్టి.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

SCERT AP 9th Class Physical Science Guide Pdf 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 6th Lesson Questions and Answers రసాయన చర్యలు – సమీకరణాలు

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
తుల్య రసాయన సమీకరణం అంటే ఏమిటి ? ఎందుకు రసాయన సమీకరణాలను తుల్యం చేయాలి? (AS 1)
(లేదా)
శుల్య సమీకరణంను నిర్వచించి, దాని ఆవశ్యకతను తెలుపుము.
జవాబు:
ఏ సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపుగల మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల వైపు గల మూలక పరనూణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అటువంటి సమీకరణాన్ని తుల్య సమీకరణం అంటారు.

ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు, లేదా నాశనం చెయ్యబడవు. అనగా చర్యకు ముందు మరియు చర్య జరిగిన తరువాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. దీనినే ద్రవ్యనిత్యత్వ నియమం అంటారు.

కాబట్టి ఒక రసాయన సమీకరణం ఖచ్చితంగా తుల్యం చేయబడాలి.

ప్రశ్న 2.
కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి. (AS 1)
a) NaOH + H2SO4 → Na2SO4 + H2O
b) Hg(NO3)2 + KI → HgI2 + KNO3
c) H2 + O2 → H2O
d) KClO3 → KCl + O2
e) C3H8 + O2 → CO2 + H2O
జవాబు:
a) 2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O
b) Hg(NO3)2 + 2KI → HgI2 + 2KNO3
c) H2 + Cl2 → 2HCl
d) 2KClO3 → 2KCl + 3O2
e) C3H8 + 5O2 → 3CO2 + 4H2O

ప్రశ్న 3.
ఈ క్రింది రసాయన చర్యలకు తుల్య రసాయన సమీకరణాలు రాయండి. (AS 1)
a) జింక్ + సిల్వర్ నైట్రేట్ → జింక్ నైట్రేట్ + సిల్వర్
b) అల్యూమినియం + కాపర్ క్లోరైడ్ → అల్యూమినియం క్లోరైడ్ + కాపర్
c) హైడ్రోజన్ + క్లోరిన్ → హైడ్రోజన్ క్లోరైడ్
d) అమ్మోనియం నైట్రేట్ → నైట్రస్ ఆక్సైడ్ + నీరు
జవాబు:
a) Zn + 2AgNO3 → Zn(NO3)2 + 2Ag
b) 2Al + 3CuCl2 → 2AlCl3 + 3Cu
c) H2 + Cl2 → 2HCl
d) 2NH4NO3 → 2N2O + 4H2O

ప్రశ్న 4.
క్రింది వాటికి తుల్య రసాయన సమీకరణం రాసి, అవి ఎలాంటి రకమైన చర్యలో తెలపంది. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 1
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 2
జవాబు:
ఎ)
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 3
పై చర్య ద్వంద్వ వియోగానికి చెందిన రసాయన సమీకరణం.
ఆమ్లము, క్షారము కలిసినపుడు లవణము, నీరు ఏర్పడు తటస్థీకరణ చర్య ద్వంద్వ వియోగానికి ఒక ఉదాహరణ.

బి)
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 4
పై చర్య రసాయన సంయోగంకు చెందిన సమీకరణం. క్రియాజనకాలు = 2, క్రియాజన్యం = 1 అయితే ఇది ఎల్లప్పుడు రసాయన సంయోగచర్య అగును.

సి)
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 5
పై చర్య రసాయన స్థానభ్రంశానికి చెందిన సమీకరణం. మెగ్నీషియం లోహం హైడ్రోజన్ కంటే చర్యాశీలత ఎక్కువ. కాబట్టి Mg, H2ను స్థానభ్రంశం చెందించగలదు.

డి)
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 6
జింక్ లోహం కంటే చర్యాశీలత కాల్షియం లోహానికి ఎక్కువ. కాబట్టి జింక్ లోహం, కాల్షియం లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు. కాబట్టి వీటి మధ్య రసాయనిక చర్య జరగదు.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 5.
ఒక రసాయన చర్యలో వేడి / కాంతి/విద్యుత్ గ్రహించబడే చర్య మరియు వియోగ చర్య అయిన దానికి ఒక ఉదాహరణ రాయండి. (AS 1)
జవాబు:
1) ఒక సమ్మేళనం ఉష్ణం పంపించుట వలన వియోగం చెందితే దానిని ఉష్ణవియోగం అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 7

2) ఒక సమ్మేళనం కాంతి పంపించుట వలన వియోగం చెందితే దానిని కాంతి వియోగం లేదా కాంతి రసాయన చర్యలు అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 8

3) ఒక సమ్మేళనంలోకి విద్యుత్ పంపించుట వలన వియోగం చెందితే ఆ చర్యను విద్యుత్ విశ్లేషణ అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 9

ప్రశ్న 6.
అవక్షేప చర్యలు అనగానేమి? (AS 1)
(లేదా)
అవక్షేప చర్యను నిర్వచించి, ఉదహరించుము.
జవాబు:
రెండు సంయోగ పదార్ధాల జలద్రావణాలు ఒకదానితో ఒకటి చర్య జరిపినపుడు ధన, ఋణ ప్రాతిపదికలు మార్పు చెంది నీటిలో కరగని లవణాలు ఏర్పడును. దీనినే అవక్షేపం అంటారు. అవక్షేపాలు ఏర్పడే చర్యలను అవక్షేప చర్యలు అంటారు. అవక్షేపాన్ని రసాయన సమీకరణంలో క్రిందవైపు చూపిస్తున్న బాణం గుర్తుతో సూచిస్తారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 10

ప్రశ్న 7.
రసాయన స్థానభ్రంశ చర్య, రసాయన వియోగ చర్యకు మధ్య తేడాలు ఏమిటి? ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 11

ప్రశ్న 8.
సూర్యకాంతి సమక్షంలో జరిగే చర్యలను ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
సూర్యకాంతి సమక్షంలో జరిగే చర్యలు రెండు రకాలు :

  1. కాంతి వియోగ చర్య (Photolysis)
  2. కాంతి సంశ్లేషణ చర్య (Photosynthesis)

1) కాంతి వియోగ చర్య లేదా కాంతి రసాయన చర్య :
కాంతి సమక్షంలో ఒక సమ్మేళనం వియోగం చెందితే ఆ చర్యను కాంతి వియోగ చర్య లేదా కాంతి రసాయన చర్య అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 12

2) కాంతి సంశ్లేషణ చర్య : కాంతి సమక్షంలో రెండు సమ్మేళనాలు కలిసి క్రొత్త పదార్ధం ఏర్పడటాన్ని కాంతి సంశ్లేషణ చర్య అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 13

ప్రశ్న 9.
ఎందుకు శ్వాసక్రియను ఉష్ణమోచక చర్యగా పరిగణిస్తాం? వివరించండి. (AS 1)
(లేదా)
మనోభిరామ్ కు అతని ఉపాధ్యాయుడు శ్వాసక్రియ ఒక ఉష్ణమోచక చర్య అని. చెప్పెను. నీవు ఉపాధ్యాయుని ఏ విధముగా సమర్థిస్తావు?
జవాబు:

  1. మనం ఆక్సిజన్ తో కూడిన వాయువులను శ్వాసించడం ద్వారా ఆక్సిజన్ ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది.
  2. ఆక్సిజన్ రక్తంలోనికి వ్యాపనం చెంది ఎర్రరక్త కణాల ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేరుతుంది.
  3. కణాల వద్ద ఉన్న గ్లూకోజ్ అణువులు ఆక్సిజన్ తో చర్య జరిపి CO2. నీటిని, శక్తిని విడుదల చేస్తాయి.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 14
  4. ఈ చర్య ద్వారా శక్తి బయటకు విడుదలగును. కాబట్టి ఈ చర్యను ఉష్ణమోచక, చర్య అంటారు.
  5. ఈ విడుదలైన శక్తితో శరీరంలోని ముఖ్య అవయవాలైన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు మొదలైనవి పనిచేస్తాయి.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 10.
రసాయన స్థానభ్రంశ చర్యకు, ద్వంద్వ వియోగ చర్యకు తేడాలు రాయండి. ఈ చర్యలను తెలిపే సమీకరణాలు రాయండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 15
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 16

ప్రశ్న 11.
MnO2 + 4HCl → MnCl2 + 2H2O + Cl2 ఈ సమీకరణంలో ఏ పదార్థం ఆక్సీకరణం చెందుతుంది? ఏది క్షయకరణం చెందుతుంది? (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 17

  1. క్రియాజనకంలో HCl, క్రియాజన్యంలో క్లోరిన్ మాత్రమే మిగిలింది. అనగా హైడ్రోజన్ తొలగించబడినది కావున HCl ఆక్సీకరణం చెంది క్లోరిన్ వాయువుగా మిగిలింది.
  2. క్రియాజనకంలో MnO2, క్రియాజన్యంలో ఆక్సిజన్ మూలకాన్ని తొలగించుకొని MnCl2గా మారింది అనగా ఆక్సిజన్ కోల్పోవుటను క్షయకరణం అంటారు. కాబట్టి MnO2 క్షయకరణం చెంది MnCl2 గా మారింది.

ప్రశ్న 12.
ఆక్సీకరణ క్షయకరణ చర్యలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి. (AS 1)
జవాబు:
1) ఆక్సీకరణం :
1) ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలుపుటను ఆక్సీకరణం అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 18
2) ఒక సమ్మేళనం నుండి హైడ్రోజన్‌ను తొలగించుటను ఆక్సీకరణం అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 19
H2S సమ్మేళనం, హైడ్రోజనను తొలగించుకొని సల్ఫర్ విడుదలైంది. ఇది ఆక్సీకరణ చర్య.

3) కొన్ని మూలకాలు ఎలక్ట్రాన్లను పోగొట్టుకొనుట వలన ఆక్సీకరణం చెందును.
Na → Na+ + e
సోడియం ఎలక్ట్రాన్లను పోగొట్టుకొని సోడియం అయాన్ గా మారింది. దీనిని ఆక్సీకరణ చర్య అంటారు.

2) క్షయకరణం :
1) ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ కలుపుటను క్షయకరణం అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 20
ఇక్కడ బ్రోమిన్, హైడ్రోజనను కలుపుకొంది కాబట్టి ఇది క్షయకరణ చర్య.

2) ఒక సమ్మేళనం నుండి ఆక్సిజనను తొలగించుటను క్షయకరణం అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 21
క్రియాజనకంలోని కాపర్ ఆక్సెడ్ కాపర్‌గా క్షయకరణం చెందింది.

3) ఒక సమ్మేళనం ఎలక్ట్రాన్లను గ్రహించుటను క్షయకరణం అంటారు.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 22
క్లోరిన్ అదనంగా ఎలక్ట్రానును గ్రహించింది కాబట్టి క్షయకరణం జరిగినది.

ప్రశ్న 13.
వెండిని శుద్ధి చేసేటప్పుడు సిల్వర్ నైట్రేట్ నుండి వెండి (సిల్వర్) ను సంగ్రహించుటలో కాపర్ లోహ స్థానభ్రంశానికి గురవుతుంది. ఈ ప్రక్రియలో జరిగే చర్యను రాయండి. (AS 1)
జవాబు:
కాపర్ ముక్కను AgNO3 ద్రావణంలో ముంచగా కాపర్ మాయమగును. కానీ తెల్లని మెరిసే పదార్థం పాత్ర అడుగుకు చేరును. ఈ చర్యను ఈ విధంగా తెలియజేయవచ్చు.
Cu + 2AgNO3 → Cu (NO3)2 + 2Ag ↓

  • పై చర్యలో కాపర్ వెండిని స్థానభ్రంశం చెందించింది.
  • కాపర్ చర్యాశీలత వెండి కంటే ఎక్కువ అనగా కాపరకు ఎలక్ట్రానులను ఇచ్చే గుణం వెండి కంటే ఎక్కువ.
  • కాపర్ వెండిని స్థానభ్రంశం చెందించుట వలన Cu(NO3)2 లవణం, మరియు వెండి లోహం ఏర్పడినది.

ప్రశ్న 14.
క్షయం (Corrosion) అంటే ఏమిటి? దానిని ఎలా అరికడతారు? (AS 1)
జవాబు:
కొన్ని లోహాలు తేమగాలికి లేదా కొన్ని ఆమ్లాల సమక్షంలో ఉంచినపుడు లోహ ఆక్సెడులను ఏర్పరచడం ద్వారా వాటి మెరుపుదనాన్ని కోల్పోతాయి. ఈ చర్యనే క్షయము చెందడం లేదా కరోజన్ అంటారు.
ఉదా : 1) వెండి వస్తువులపై నల్లని పూత ఏర్పడును.
4Ag + 2H2S + O2 → 2 Ag2S + 2H2O
2) రాగి వస్తువులు చిలుముపట్టడం. 2Cu + O2 → 2CuO

నివారణ : ఈ సమస్యకు ప్రధాన కారణం గాలిలోని తేమ మరియు ఆక్సిజన్.

  • లోహతలంపై రంగు వేయటం, నూనె పూయడం, గ్రీజు, క్రోమియం పూతగా వేయుట వలన కరోజనను అరికట్టవచ్చు.
  • మిశ్రమ లోహాలను తయారుచేయుట వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.

ప్రశ్న 15.
ముక్కిపోవడం (Rancidity) అంటే ఏమిటి? (AS 1)
జవాబు:
నూనెలు లేదా క్రొవ్వు పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచి, వాసన మారిపోతాయి. దీనినే ముక్కిపోవటం లేదా ర్యాన్సిడిటీ అంటారు.

  • నూనెలతో చేసిన ఆహారపదార్థాలలో ఆక్సిజన్ కలుస్తుంది. కాబట్టి ఇది ఒక ఆక్సీకరణ చర్య.
  • ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచుటకు లేదా ముక్కిపోకుండా ఉండుటకు విటమిన్ C మరియు విటమిన్ E లను కలుపుతారు.
  • సాధారణంగా నూనెలు లేదా క్రొవ్వులతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండుటకు యాంటీ ఆక్సిడెంట్లు కలుపుతారు.

ప్రశ్న 16.
ఈ క్రింది రసాయన సమీకరణాలను, వాని భౌతిక స్థితులను తెల్పుతూ తుల్యం చేయండి. (AS 1)
a) CH2O → C2H5OH + CO2
b) Fe + O2 → Fe2O3
c) NH3 + Cl2 → N2 + NH4Cl
d) Na + H2O → NaOH + H2
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 23
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 24

ప్రశ్న 17.
ఈ క్రింది రసాయన చర్యలకు వాటి భౌతిక స్థితులను చూపుతూ సమీకరణాలను రాసి, తుల్యం చేయండి. (AS 1)
a) బేరియం క్లోరైడ్ మరియు ద్రవ సోడియం సల్ఫేట్ చర్యనొంది బేరియం సల్ఫేట్ అవక్షేపంను మరియు ద్రవ సోడియం క్లోరైడ్ లను ఏర్పరుస్తుంది.
b) సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనొంది సోడియం క్లోరైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది.
c) విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో జింక్ చర్యనొంది హైడ్రోజన్ మరియు జింక్ క్లోరైడ్లను ఏర్పరుస్తుంది.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 25

ప్రశ్న 18.
బ్రౌన్ రంగులో మెరుస్తూ ఉండే ‘X’ అనే మూలకమును గాలిలో వేడి చేసినపుడు నలుపు రంగులోకి మారుసు. X ఏ మూలకమై ఉంటుందో, ఏర్పడిన నలుపు రంగు పదార్థం ఏమిటో మీరు ఊహించగలరా? మీ ఊహ సరియైనదని ఎలా సమర్థించుకుంటారు? (AS 2)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 26
X = కాపర్ (Cu) ; నలుపు రంగు పదార్ధం = కాపర్ ఆక్సెడ్ (CuO)

బ్రౌన్ రంగులో మెరుస్తూ ఉండే రాగి, గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో రసాయన సంయోగం జరిగి నలుపు రంగులోని CuO ఏర్పడును.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 19.
ఇనుప వస్తువులకు మనం ఎందుకు రంగు వేస్తాం? (AS 7)
(లేదా)
ఇనుప వస్తువులకు రంగు వేయవలసిన ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
ఇనుప వస్తువులు గాలిలోని తేమతోనూ మరియు ఆక్సిజన్‌నూ చర్య జరిపి ఆక్సీకరణం చెందుతాయి. దీనినే తుప్పు పట్టడం అంటారు. ఈ చర్యను ఈ విధంగా తెలియజేస్తాం.
4Fe + 6H2O + 3O2 → 2Fe2O3 . 3H2O

ఈ తుప్పు వలన కారు భాగాలు, బ్రిడ్జిలు, ఇనుప పట్టాలు, ఓడలు మొదలైనవి పాడైపోతాయి. ఈ సమస్యను నివారించటానికి ఆక్సిజన్, తేమ తగలకుండా లోహతలంపై రంగులు వేయటం, నూనె, గ్రీజు, క్రోమియం పూత గానీ, మిశ్రమ లోహాల తయారీ ద్వారా గానీ వస్తువులను కాపాడుకోవచ్చు.

ప్రశ్న 20.
ఆహార పదార్థాలను కొన్నింటిని గాలి చొరబడని డబ్బాలలో ఉంచమంటారు. ఎందుకు? (AS 7)
(లేదా)
పెద్ద పెద్ద కంపెనీలు తయారుచేసిన తినుబండారాలను గాలి ప్రవేశించని ప్యాకెట్లలో ఉంచుతారు. దానికి గల కారణం ఏమిటి?
జవాబు:
సాధారణంగా నూనెలతో గానీ, కొవ్వులతో తయారుచేసే ఆహారపదార్థాలు గాలిలోని తేమతోనూ, ఆక్సిజన్తోనూ కలిసి ఆక్సీకరణం చెందుతాయి. దీనినే ముక్కిపోవటం అంటారు.

ఆహార పదార్థాలు ముక్కిపోవటం వలన రుచి, వాసన మారిపోతుంది. పిల్లలు ఇష్టంగా తినే కుర్ కురే, లేస్, బిస్కెట్లు వంటివి కరకరలాడకుండా మెత్తబడిపోతాయి.

ఇటువంటి ఆక్సీకరణాలను అరికట్టడానికి ఆహార పదార్థాలను గాలి సోకని డబ్బాలలోనూ, కుర్ కురే, లేస్ వంటివి నైట్రోజన్ వాయువు నింపిన ప్యాకెట్లలోనూ నిల్వ చేస్తారు.

ఖాళీలను పూరించండి

1. కూరగాయలు కంపోస్టుగా వియోగం చెందడం ………………. కు ఉదాహరణ. (ఆక్సీకరణం)
2. ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి క్రొత్త పదార్ధం ఏర్పడటాన్ని …………… అంటారు. (ఉష్ణగ్రాహక చర్య)
3. 2N2O → 2N2 + O2 ………………. చర్యకు ఉదాహరణ. (రసాయన వియోగం)
4. Ca + 2H2O → Ca(OH)2 + H2 ↑ అనేది ………………. చర్యకు ఉదాహరణ. (స్థానభ్రంశం)
5. రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపు ఉన్న పదార్థాలను ……………. అంటారు. (క్రియాజనకాలు)
6. ఒక రసాయన చర్యలో సంయోగ పదార్థాలు, ఉత్పన్నాల మధ్య గీచిన బాణం గుర్తు ఆ రసాయన చర్య ………… గురించి తెలుపును. (దిశను)

7. కింది వాటిని జతపరచండి.
1. 2AgNO3 + Na2CrO4 → Ag2CrO4 + 2NaNO3 ( ) ఎ) రసాయన సంయోగం
2. 2NH3 → N2 + 3H2 ( ) బి) రసాయన వియోగం
3. C2H4 + H2O → C2H6O ( ) సి) రసాయన స్థానభ్రంశం
4. Fe2O3 + 3CO → 2Fe + 3CO2 ( ) డి) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
1-డి, 2-బి, 3-ఎ, 4-సి

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. Fe2O3 + 2Al → Al2O3 + 2 Fe. ఈ చర్య దేనికి ఉదాహరణ?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం

2. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఇనుపరజను కలిపితే ఏం జరుగుతుంది? సరైన సమాధానం ఎన్నుకోండి.
A) ఐరన్ క్లోరైడ్ ఏర్పడి, హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
B) ఐరన్ ఆక్సైడ్ ఏర్పడి, క్లోరిన్ వాయువు వెలువడుతుంది.
C) ఎలాంటి చర్య జరగదు.
D) ఐరన్ లవణం మరియు నీరు ఏర్పడును.
జవాబు:
A) ఐరన్ క్లోరైడ్ ఏర్పడి, హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.

3. 2PbO(ఘ) + C(ఘ) → 2Pb(ఘ) + CO2(వా) పై సమీకరణముననుసరించి కిందివానిలో ఏది సరైనది?
i) లెడ్ ఆక్సైడ్ క్షయకరణానికి గురవుతుంది.
ii) కార్బన్ డై ఆక్సైడ్ ఆక్సీకరణం చెందుతుంది
iii) కార్బన్ ఆక్సీకరణం చెందుతుంది
iv) లెడ్ క్షయకరణానికి గురవుతుంది.
A) i మరియు ii
B) i మరియు iii a
C) i, ii మరియు iii
D) అన్నీ
జవాబు:
B) i మరియు iii a

4. BaCl2 + Na2SO4 → BaSO4 + 2NaCl అనే సమీకరణం ఈ రకం చర్యను సూచిస్తుంది.
A) స్థానభ్రంశం
B) వియోగం
C) సంయోగం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
D) ద్వంద్వ వియోగం

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

5. హైడ్రోజన్ మరియు క్లోరిన్ నుండి హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడటం ఈ రకం రసాయనిక చర్య
A) వియోగం
B) స్థానభ్రంశం
C) సంయోగం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
C) సంయోగం

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 1.
రసాయన చర్య జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది?
జవాబు:
రసాయన చర్య జరిగినపుడు

  1. క్రొత్త పదార్థాలు ఏర్పడతాయి.
  2. సంఘటనంలో మార్పు వస్తుంది.
  3. ఉష్ణోగ్రతలో మార్పు అధికంగా ఉండును.
  4. ఏర్పడిన క్రొత్త పదార్థాల రసాయన ధర్మాలు మారతాయి.
  5. తిరిగి పాత పదార్థాన్ని మనం పొందలేం.

ఏదైనా రసాయన చర్యలో పై మార్పులు జరిగితే, రసాయన చర్య జరిగిందని మనకు తెలుస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 92

ప్రశ్న 2.
Na2SO4 + BaCl2 → BaSO4 + NaCl సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపున ఉన్న ప్రతి మూలక పరమాణువుల సంఖ్య, కుడివైపున ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉన్నదా?
జవాబు:
పై చర్యను తుల్యం చేస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది.
Na2SO4 + BaCl2 → BaSO4 + 2 NaCl
ఇప్పుడు క్రియాజనకాలలోని మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాలలోని మూలక పరమాణువుల సంఖ్యకు సమానమగును.

ప్రశ్న 3.
క్రియాజనకాలవైపు గల అన్ని మూలకాలకు చెందిన పరమాణువులు, క్రియాజన్యాల వైపు కూడా ఉన్నాయా?
జవాబు:
క్రియాజనకాలవైపు గల అన్ని మూలక పరమాణువులు, క్రియాజన్యాల వైపు కూడా ఉన్నవి.

9th Class Physical Science Textbook Page No. 95

ప్రశ్న 4.
2C3H8 + 10O2 → 6CO2 + 8H2O సమీకరణం నియమాల ప్రకారం తుల్య సమీకరణమేనా? నీవు ఎలా చెప్పగలవు?
జవాబు:
సమీకరణాన్ని తుల్యం చేసే నియమాల ప్రకారం గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి. కానీ పై సమీకరణంలో పూర్ణాంకాలు గరిష్ట సంఖ్యలను కలిగి ఉన్నాయి. కావున ఇది తుల్య సమీకరణం కాదు. దీనిని తుల్య సమీకరణంగా మార్చటానికి గుణకాలను సమీప పూర్ణాంకాలకు తగ్గించాలి.
C3H8 + 5O2 → 3CO2 + 4H2O
ఈ సమీకరణం తుల్య సమీకరణం అవుతుంది.

9th Class Physical Science Textbook Page No. 106

ప్రశ్న 5.
వెండి, రాగి వస్తువులపై రంగుపూత (చిలుము) ఏర్పడటం మీరెప్పుడైనా గమనించారా?
జవాబు:
వెండిపై నల్లటిపూత ఏర్పడటం, రాగిపై ఆకుపచ్చ రంగులో పదార్ధం పూతగా ఏర్పడటం చూశాను. దీనిని వాడుక భాషలో చిలుము పట్టడం అంటారు.

9th Class Physical Science Textbook Page No. 107

ప్రశ్న 6.
నూనెతో చేసిన ఆహారపదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?
జవాబు:
నూనెతో చేసిన ఆహారపదార్థాలు పాడవకుండా నిల్వ ఉండాలంటే దానికి విటమిన్-సి, విటమిన్-ఇ లాంటివి కలపాలి. లేదా యాంటీ ఆక్సిడెంట్ పదార్ధాలను కలపాలి.

ఉదాహరణ సమస్యలు

ప్రశ్న 1.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 27
ఉదాహరణకు 1120 కి.గ్రా. ఇనుమును రాబట్టేందుకు ఎంత పరిమాణం గల అల్యూమినియం అవసరమవుతుందో పై సమీకరణం ఆధారంగా లెక్కించండి.
సాధన:
తుల్య సమీకరణం ప్రకారం,
అల్యూమినియం → ఇనుము
54 గ్రా. → 112 గ్రా.
x గ్రా. → (1120 x 1000) గ్రా.
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 28
∴ 1120 కి.గ్రా, ఇనుము రాబట్టేందుకు 540 కి.గ్రా. అల్యూమినియం అవసరమవుతుందన్నమాట.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

ప్రశ్న 2.
STP వద్ద 230 గ్రా. సోడియం అధిక నీటితో చర్య పొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ఘనపరిమాణం, ద్రవ్యరాశి మరియు అణుసంఖ్యను గణించండి. (Na పరమాణు ద్రవ్యరాశి 230, 0 పరమాణు ద్రవ్యరాశి 160, మరియు H పరమాణు ద్రవ్యరాశి 10)
పై చర్యకు తుల్య సమీకరణం,
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 29
సాధన:
తుల్య సమీకరణం ప్రకారం,
46 గ్రా. సోడియం 2 గ్రా. హైడ్రోజన్‌ను ఇస్తుంది.
230 గ్రా. సోడియం …………….. ?
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 30
స్థిర ఉష్ణోగ్రతా పీడనాలు అనగా 273 K, 1 బార్ పీడనం వద్ద 1 గ్రాము మోలార్ ద్రవ్యరాశి గల ఏదైనా వాయువు 22.4 లీ. ఘనపరిమాణం కలిగి ఉంటుంది. దీనిని ‘గ్రామ్ మోలార్ ఘనపరిమాణం’ (Gram molar volume) అంటారు.

∴ 2.0 గ్రా. హైడ్రోజనను 22.4 లీ. ఆక్రమిస్తుంది. (STP వద్ద)
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 31

పరికరాల జాబితా

సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్, శాంకవకుప్పె, పరీక్ష నాళికలు, జింక్ ముక్కలు, అగ్గిపుల్ల, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మెగ్నీషియం రిబ్బన్, నీరు, కాల్షియం ఆక్సైడ్, సున్నపురాయి, బున్సెన్ బర్నర్, లెడ్ నైట్రేట్, 9వోల్ట్ బ్యాటరీ, గ్రాఫైట్ కడ్డీలు, ప్లాస్టిక్ మగ్, రబ్బరు కార్కులు, సిల్వర్ బ్రోమైడ్, కాపర్ సల్ఫేట్, ఇనుపమేకులు, బెలూన్, పొటాషియం అయోడైడ్, రాగిపొడి, చైనా డిష్

9th Class Physical Science 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
కాల్షియం ఆక్సెడ్, నీటి అణువుల మధ్య రసాయన మార్పు జరిగిందని కృత్యం ద్వారా నిరూపించుము.
(లేదా)
ఇది (కాల్ఫియం ఆక్సెడ్, నీటి అణువుల మధ్య రసాయన మార్పు) ఏ రకపు రసాయన చర్య? ఈ చర్యకు తుల్య సమీకరణంను వ్రాయుము.
జవాబు:

  1. ఒక గ్రాము పొడి సున్నాన్ని (CaO) ఒక బీకరులో తీసుకోండి.
  2. దీనికి 10 మి.లీ. నీటిని కలపండి.
  3. బీకరు అడుగును చేతితో తాకినపుడు వేడిని గమనించండి.
  4. దీనికి కారణం కాల్షియం ఆక్సైడ్, నీటితో చర్య ఉష్ణమోచక చర్య కాబట్టి ఉష్ణాన్ని విడుదల చేసింది.
  5. ఈ చర్యలో Ca(OH), అనే రంగులేని ద్రావణం ఏర్పడింది.
  6. రసాయన చర్యలో క్రొత్త పదార్ధం ఏర్పడింది కాబట్టి ఇది రసాయన మార్పు అని నిర్ధారించబడినది.
  7. ఈ ద్రావణంలో ఎర్ర లిట్మస్ పేపర్ ను ముంచినపుడు నీలి రంగుకు మారింది.
  8. కావున క్రొత్తగా ఏర్పడిన Ca(OH), ఒక క్షార స్వభావాన్ని కలిగి ఉందని నిర్ధారించవచ్చు.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 32

కృత్యం – 2

ప్రశ్న 2.
సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ మధ్య రసాయన చర్య జరిగిందని కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
Na2SO4 మరియు BaCl2 లను కలిపినపుడు ఆ మిశ్రమంలో ఏర్పడు రసాయన చర్యను మరియు రసాయన చర్యారకంను, తుల్యసమీకరణంను, కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 33

  1. ఒక బీకరులో 100 మి.లీ. నీటిని తీసుకొని దానిలో కొద్దిగా సోడియం సల్ఫేట్ (Na2SO4)ను కలిపి ద్రావణాన్ని తయారుచేయండి.
  2. మరొక బీకరులో మరలా 100 మి.లీ. నీటిని తీసుకొని దానిలో NS కొద్దిగా బేరియం క్లోరైడను కలిపి ద్రావణాన్ని తయారుచేయండి.
  3. రెండు బీకర్లలోని ద్రావణాల రంగును పరిశీలించండి.
  4. రెండు ద్రావణాలను ఒకదానితో మరొకటి కలపండి.
  5. ఇపుడు సోడియం క్లోరైడ్ ద్రావణం ఏర్పడి అందులో బేరియం సల్ఫేట్ (BaSO4) అవక్షేపం ఏర్పడింది.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 34
  6. ఈ చర్యలో BaSO4 అనే క్రొత్త పదార్థం ఏర్పడింది. ఫార్ములా మారింది.
    కాబట్టి ఇది ఒక రసాయన మార్పు అని నిర్ధారించబడినది.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

కృత్యం – 3

ప్రశ్న 3.
జింక్ లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మధ్య రసాయన చర్య జరిగిందని కృత్యం ద్వారా నిరూపించుము.
(లేదా)
సజల HCl మరియు 29 ముక్కల మధ్య చర్య జరిగినపుడు H2 వాయువు ఏర్పడుటను మరియు చర్యా రకంను, తుల్యసమీకరణంను కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 35

  1. ఒక శాంకవకుప్పెలో కొన్ని జింకు ముక్కలను తీసుకోండి.
  2. దానికి 5 మి.లీ. సజల HCl ను కలపండి.
  3. ఈ రెండింటి మధ్య రసాయన చర్య జరుగును.
    Zn + 2 HCl → ZnCl2 + H2
  4. ఇప్పుడు కుప్పె వద్దకు మండుతున్న అగ్గిపుల్లను ఉంచండి.
  5. అగ్గిపుల్ల టప్ మని శబ్దం చేస్తూ ఆరిపోవటం గమనించండి.
  6. Zn, HClల మధ్య రసాయన చర్య జరిగి హైడ్రోజన్ వాయువు జింక్ ముక్కలతో సజల HCl చర్యలో విడుదలైంది.
  7. క్రొత్త పదార్ధం ఏర్పడింది కాబట్టి ఇది రసాయన మార్పు అని నిర్ధారించవచ్చు.

కృత్యం – 4

ప్రశ్న 4.
రసాయన సంయోగాన్ని కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
మెగ్నీషియం రిబ్బన్ ను గాలిలో మండించినపుడు ఏర్పడు పదార్థాలను, చర్యారకంను, తుల్యసమీకరణంలను తెలుపు కృత్యంను వ్రాయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 36

  1. 3 సెం||మీ. పొడవు గల మెగ్నీషియం రిబ్బనన్ను తీసుకొని దానిని గరుకు కాగితంతో బాగా రుద్దండి.
  2. పట్టకారు సహాయంతో ఒక చివర పట్టుకొని సారాయి దీపం పైన ఉంచి మండించండి.
  3. మెగ్నీషియం రిబ్బను ఆక్సిజన్ సమక్షంలో మిరుమిట్లు గొలిపే కాంతితో మండి తెల్లని బూడిదను ఏర్పరుచును. దీనిని MgO అంటారు.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 37
  4. ఈ చర్యలో మెగ్నీషియం, ఆక్సిజన్ సంయోగం చెంది మెగ్నీషియం ఆక్సెడ్ అనే క్రొత్త పదార్ధం ఏర్పడింది.
  5. దీనినే రసాయన సంయోగం అంటారు.

కృత్యం – 5

ప్రశ్న 5.
రసాయన వియోగాన్ని కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
CaCO3 ని వేడి చేయుట వలన విడుదలగు వాయువు సున్నపు తేటను పాలవలె మార్చును. దీనికి సరిపడు కృత్యంను వ్రాసి, చర్యారకం, తుల్య సమీకరణంను వ్రాయుము.
(లేదా)
రసాయన వియోగంను ఒక కృత్యం ద్వారా వివరించి, ఆ చర్యలో ఏదైనా వాయువు వెలువడిన ఆ వాయువు ఉనికి పరీక్షను, తుల్యసమీకరణంను, వాయువు చర్యారకంను వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 38

  1. 2 గ్రా|| కాల్షియం కార్బొనేట్ ను ఒక పరీక్ష నాళికలో తీసుకోండి.
  2. బున్ సెన్ లేదా సారా దీపంతో పరీక్షనాళికను వేడి చేయండి.
  3. ఇపుడు మండుతున్న అగ్గిపుల్లను ఆ పరీక్షనాళిక మూతి దగ్గర ఉంచండి.
  4. అగ్గిపుల్ల టప్ మని శబ్దం చేస్తూ ఆరిపోతుంది.
  5. పై చర్యలో విడుదలైన వాయువు CO2. ఇది మండుచున్న అగ్గిపుల్లను ‘టప్’ మని శబ్దం చేస్తూ ఆర్పివేస్తుంది.
  6. AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 39
  7. కాబట్టి కాల్షియం కార్బొనేట్ ను వేడిచేసినపుడు అది కాల్షియం ఆక్సైడ్ గానూ, కార్బన్ డై ఆక్సెడ్ గానూ విడిపోతుంది.
  8. వేడి చేస్తే పదార్థాలు వియోగం చెందినట్లయితే అట్టి చర్యలను ఉష్ణ వియోగ చర్యలు అంటారు.

కృత్యం – 6

ప్రశ్న 6.
ఉష్ణ వియోగ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
లెడ్ నైట్రేట్‌ను వేడిచేసిన విడుదలగు వాయువు ఏది? దాని రంగును, తుల్యసమీకరణంను, చర్యారకంను వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 40

  1. సుమారు 0.5 గ్రా|| లెడ్ నైట్రేట్ పౌడరను గట్టి పరీక్షనాళికలో తీసుకోండి.
  2. పరీక్ష నాళికను బున్సెన్ బర్నర్ మంట మీద వేడి చేయండి.
  3. లెడ్ నైట్రేట్ ను వేడిచేసినపుడు అది లెడ్ ఆక్సేడ్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ డై ఆక్సైడ్లుగా విడిపోయింది.
  4. పరీక్షనాళిక వెంబడి గోధుమ రంగులో వాయువువెలువడటం గమనించవచ్చు. ఈ వాయువు నైట్రోజన్ డై ఆక్సైడ్ వాయువు.
  5. AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 41
  6. ఉష్ణం వలన లెడ్ నైట్రేట్ వియోగం చెందింది కాబట్టి దీనిని ఉష్ణ వియోగ చర్య అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

కృత్యం – 7

ప్రశ్న 7.
విద్యుత్ విశ్లేషణ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
ఒక సమ్మేళనమును విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఏ విధంగా వియోగం చెందిస్తారు?
(లేదా)
నీటి విద్యుత్ విశ్లేషణ చర్యను కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
నీటియందు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు 2 : 1 నిష్పత్తిలో ఉండునని నీవు ఏవిధంగా నిరూపిస్తావు?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 42

  1. ఒక ప్లాస్టిక్ మగ్గును తీసుకొని, దాని అడుగున రెండు రంధ్రాలు చేయండి.
  2. ఆ రెండు రంధ్రాలలో రెండు రబ్బరు కార్కులను బిగించండి.
  3. ఈ రబ్బరు కార్కులలో రెండు కార్బను ఎలక్ట్రోడులను గుచ్చండి.
  4. రెండు ఎలక్ట్రోడులను పటంలో చూపినట్లుగా 9V బ్యాటరీకి కలపండి.
  5. ఎలక్ట్రోడులు మునిగే వరకు నీటితో నింపండి.
  6. దీనిలోకి కొద్దిగా సజల H2SO4 ఆమ్లం కలపండి.
  7. నీటితో నింపిన రెండు పరీక్ష నాళికలు తీసుకొని వాటిని నిదానంగా రెండు కార్బన్ ఎలక్ట్రోడులపై బోర్లించండి.
  8. స్వీచ్ ఆన్ చేసి విద్యుత్ వెళ్ళేలా చేయండి. ఈ అమరికను కొంతసేపు కదపకుండా ఉంచండి.
  9. పరీక్షనాళికలో ఎలక్రోడుల నుండి బుడగలు వెలువడడాన్ని మీరు గమనించి ఉంటారు.
  10. ఈ బుడగలలోని వాయువులు పైకి చేరుతూ పరీక్షనాళికలలోని నీటిని స్థానభ్రంశం చెందిస్తాయి.
  11. రెండు పరీక్షనాళికలలో చేరిన వాయువుల ఘనపరిమాణాలు వేరువేరుగా ఉండుటను గమనించండి.
  12. ఇప్పుడు ఎక్కువ వాయు ఘనపరిమాణం ఉన్న పరీక్షనాళికను వేరు చేసి అగ్గిపుల్లను వెలిగించి దాని మూతివద్ద ఉంచండి.
  13. అగ్గిపుల్ల టమని శబ్దం చేస్తూ ఆరిపోయింది.
  14. దీనినిబట్టి పరీక్షనాళికలో ఉన్న వాయువు హైడ్రోజన్.
  15. తర్వాత రెండవ పరీక్షనాళికను వేరు చేసి దాని అంచు వద్ద మండుతున్న అగ్గిపుల్లను ఉంచండి. ఇది ప్రకాశవంతంగా మండుతుంది.
  16. దీనినిబట్టి రెండవ పరీక్షనాళికలో ఉన్న వాయువు ఆక్సిజన్.
  17. నీటి ద్వారా విద్యుత్ను పంపించినపుడు రెండు వంతుల హైడ్రోజన్ వాయువు, ఒక వంతు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది.
  18. విద్యుత్ ను పంపించుట వలన H2 గాను, O2 గాను వియోగం చెందింది కాబట్టి దీనినే విద్యుత్ విశ్లేషణ అంటారు.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 43

కృత్యం – 8

ప్రశ్న 8.
కాంతి వియోగ చర్యలను లేదా కాంతి రసాయన చర్యలను ఒక కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
సిల్వర్ బ్రోమైడు సూర్యరశ్మి సమక్షంలో ఉంచిన జరుగు రసాయన చర్యారకంను, ఏర్పడు పదార్థరకమును, తుల్య సమీకరణంను వ్రాయుము.

  1. 2 గ్రా|| సిల్వర్ బ్రోమైడ్ (AgBr) ను ఒక వాచ్ గ్లాస్ లోకి తీసుకోండి.
  2. సిల్వర్ బ్రోమైడ్ పసుపు రంగులో ఉండుట గమనించండి.
  3. AgBr ను కొంత సేపు ఎండలో ఉంచండి.
  4. తరువాత AgBr రంగు బూడిద రంగులోకి మారటం గమనించండి.
  5. వాగ్లాస్లోని సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో సిల్వర్, బ్రోమిన్లుగా విడిపోయింది.
  6. AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 44
  7. ఈ చర్య కాంతి సమక్షంలో జరిగింది. ఇటువంటి చర్యలను ‘కాంతి రసాయన చర్యలు’ అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 45 AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 46

కృత్యం – 9

ప్రశ్న 9.
రసాయన స్థానభ్రంశాన్ని కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 47

  1. 1 గ్రా, జింకపొడిని ఒక చిన్న నాజిల్ కలిగిన శాంకవకుప్పెలో తీసుకోండి.
  2. దానికి నిదానంగా సజల HCl ను కలపండి.
  3. రబ్బరు బెలూను తీసుకొని ఆ శాంకవకుప్పై మూతికి పటంలో చూపిన విధంగా తగిలించండి.
  4. శాంకవకుప్పెలో మరియు రబ్బరు బెలూన్లోని మార్పులను నిశితంగా పరిశీలించండి.
  5. శాంకవకుప్పెలోని ద్రావణంలో బుడగలు రావడం మరియు బెలూన్ పెద్దగా ఉబ్బడాన్ని మీరు గమనించండి.
  6. జింక్ ముక్కలు సజల HClతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది.
  7. AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 48
  8. జింక్ మూలకం హైడ్రోజనను HCl నుండి స్థానభ్రంశం చెందించింది. దీనినే ‘స్థానభ్రంశ చర్య’ అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

కృత్యం – 10

ప్రశ్న 10.
ఇనుము కాపర్ ను స్థానభ్రంశం చెందించగలదు. దీనిని ఒక కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
అధిక చర్యాశీలత గల లోహాలు, అల్ప చర్యాశీలత గల లోహాలను వాటి సంయోగ పదార్థాల నుండి స్థానభ్రంశం చెందిస్తాయి అని తెలుపుటకు మీరు ఏ ప్రయోగాన్ని నిర్వహిస్తారో వివరించుము.
(లేదా)
ఇనుప మేకును CuSO4 ద్రావణం నందు ఉంచగా అది గోధుమరంగులోనికి మారినది, ఈ కృత్యంను వివరించుము.
జవాబు:

  1. రెండు ఇనుప సీలలను (మేకులు) తీసుకొని వాటిని గరుకు కాగితంతో రుద్దండి.
  2. రెండు పరీక్షనాళికలలో సుమారు 10 మి.లీ. CuSO4 ద్రావణాన్ని తీసుకోండి.
  3. ఒక ఇనుప సీలను ఒక పరీక్షనాళికలోని CuSO4 ద్రావణంలో వేసి 20 నిమిషాలు కదల్చకుండా ఉంచండి.
  4. రెండవ ఇనుప సీలను పరిశీలన కోసం ఒక ప్రక్కన ఉంచండి.
  5. ఇపుడు ఇనుప సీలను CuSO4 ద్రావణం నుండి బయటకు తీయండి.
  6. రెండు ఇనుప సీలలను ఒకదాని ప్రక్కన మరొకటి ఉంచి పరిశీలించండి.
  7. ఇపుడు రెండు పరీక్షనాళికల ద్రావణాల రంగును పరిశీలించండి.
  8. CuSO4 ద్రావణంలో ముంచిన సీల గోధుమ రంగులోకి మారుతుంది.
  9. అదే విధంగా నీలిరంగులో ఉన్న CuSO4 రంగును కోల్పోతుంది.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 50 AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 51
  10. ఈ చర్యను ఈ విధంగా తెలియజేస్తాం,
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 49
  11. కాపర్ చర్యాశీలత ఇనుముకంటే తక్కువ కాబట్టి ఇనుము-కాపర్‌ను స్థానభ్రంశం చెందించింది.

కృత్యం – 11

ప్రశ్న 11.
ద్వంద్వ వియోగ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
(లేదా)
రాజు మరియు రాము ఇద్దరు స్నేహితులు. రాజుకు రసాయన ద్వంద్వ వియోగంపై కొన్ని సందేహాలు కలవు. వాటి నివృత్తికి రాము ఏ కృత్యం ద్వారా సందేహాలు తీర్చి ఉంటాడో వివరించుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 52

  1. 2 గ్రాముల లెడ్ నైట్రేట్ Ph(NO.), ను ఒక పరీక్షనాళికలో తీసుకొని దానికి సుమారు 5 మి.లీ. నీటిని కలపండి.
  2. మరొక పరీక్షనాళికలో 1 గ్రాము పొటాషియం అయొడైడ్ తీసుకొని కొంచెం నీటిలో కరిగించండి.
  3. పొటాషియం అయొడైడ్ ద్రావణానికి, లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని కలపండి.
  4. నీటిలో కరగని పసుపురంగు పదారం ఏర్పడింది. ఇలా నీటిలో కరగకుండా మిగిలిన పదార్థాన్ని అవక్షేపం అంటారు.
  5. AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 53
  6. పై చర్యలో లెడ్ అయాన్ మరియు పొటాషియం అయాను స్థానాలు C టెడ్ అయొడైడ్ పరస్పరం మార్చుకున్నాయి.
  7. లెడ్ అయాన్ (Pb+2), అయొడెడ్ అయాన్ (I) కలిసి లెడ్ అయొడైడ్ (PbI2) ఏర్పడింది.
  8. పొటాషియం అయాన్ (K+), నైట్రేట్ అయాన్ (NO3) కలిసి పొటాషియం
  9. ఇటువంటి చర్యలను ద్వంద్వ వియోగ చర్యలు అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు

కృత్యం – 12

ప్రశ్న 12.
ఆక్సీకరణ, క్షయకరణ చర్యలను ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 54 AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 55

  1. సుమారు 1 గ్రాము కాపర్ పొడిని చైనా డిలో తీసుకోవాలి.
  2. ఒక త్రిపాది స్టాండుపైన తీగ వలను ఉంచి దానిపై చైనా డిష్‌ను ఉంచాలి.
  3. సారాదీపం లేదా బుస్సేన్ బర్నర్తో దీనిని వేడి చేయాలి.
  4. కాపరను వేడి చేయగానే అది వాతావరణంలో గల ఆక్సిజన్తో చర్య జరిపి నల్లటి CuO గా మారింది.
  5. ఈ చర్యను ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 56
  6. ఈ చర్యలో కాపర్ ఆక్సిజన్ తో కలిసి కాపర్ ఆక్సెడ్ ఏర్పడింది.
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 57
  7. ఈ చర్యలో ఆక్సిజన్ గ్రహించబడినది కావున ఇటువంటి చర్యలను ఆక్సీకరణ చర్యలు అంటారు.
  8. ఇపుడు CuO మీదుగా హైడ్రోజన్ వాయువును పంపండి.
  9. ఇపుడు CuO నల్లటి రంగు నుంచి, గోధుమ రంగులోకి మారటం గమనించండి.
  10. కారణం CuO ఆక్సిజన్‌ను కోల్పోయి కాపర్‌గా మారింది.
  11. ఈ చర్యను ఈ విధంగా
    AP Board 9th Class Physical Science Solutions 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు 58
  12. ఇలా ఆక్సిజన్ కోల్పోయే చర్యలను క్షయకరణ చర్యలు అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 4th Lesson Questions and Answers పరమాణువులు-అణువులు

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగ పద్ధతి మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించండి. (ప్రయోగశాల కృత్యం) (AS 1)
(లేదా)
“ఒక రసాయన చర్య జరిగినపుడు ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం కాదు” అని నిరూపించు విధానమును వివరించండి.
జవాబు:
ఉద్దేశ్యం : ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుట.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 1

కావలసిన పరికరాలు :
లెడ్ నైట్రేట్, పొటాషియం అయొడైడ్, స్వేదన జలం, రెండు బీకర్లు, కొలజాడి, శాంఖవ కుప్పై, (స్ప్రింగ్ త్రాసు, పరీక్ష నాళికలు, స్టాండ్, రబ్బరు బిరడా, దారం మొదలగునవి.

ప్రయోగ విధానం :

  1. 100 మి.లీ. స్వేదన జలములో సుమారు 2 గ్రా. లెడ్సెట్రేట్ కలిపి ద్రావణం తయారు చేయండి.
  2. 100 మి.లీ. స్వేదన జలములో సుమారు 2 గ్రా. పొటాషియం అయొడైడ్ కలిపి వేరొక ద్రావణం తయారు చేయండి.
  3. 250 మి.లీ. శాంభవ కుప్పెలో 100 మి.లీ. లెడ్నై ట్రేట్ ద్రావణాన్ని తీసుకోండి.
  4. చిన్న పరీక్షనాళికలో 4 మి.లీ పొటాషియం అయొడైడ్ ద్రావణాన్ని తీసుకోండి.
  5. కుప్పెలో పరీక్షనాళికను జాగ్రత్తగా వ్రేలాడదీయండి. రెండు ద్రావణాలు కలవకుండా జాగ్రత్త తీసుకోండి. కుప్పెకు రబ్బరు బిరడాను బిగించండి.
  6. స్ప్రింగు త్రాసునుపయోగించి, కుప్పె భారాన్ని దానిలో ఉండే పదార్థంతోపాటు తూచండి.
  7. రెండు ద్రావణాలూ కలిసిపోయేటట్లు కుప్పెను కదపండి.
  8. అదే విధంగా స్పింగుత్రాసుతో మళ్ళీ కుప్పె భారాన్ని తూచండి.

పరిశీలనలు:

  1. రసాయన పదార్థాలు కలవకముందు కుప్పె భారం = m1 గ్రా.
  2. రసాయన పదార్థాలు కలిసిన తరువాత కుప్పె భారం = m2 గ్రా.

నిర్ధారణ :

  1. m1, m2 లు రెండూ సమానమని గమనిస్తాము.
  2. ఇది ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపిస్తుంది.

జాగ్రత్తలు:

  1. రసాయన పదార్థాలు వాడేటప్పుడు వాటిని నేరుగా చేతితో తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  2. గాజు పరికరాలు క్రిందపడి పగిలిపోకుండా జాగ్రత్త వహించాలి.
  3. మొదటిసారి బరువు తూచడానికి ముందు కుప్పెలోని పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించాలి.
  4. శాంఖవ కుప్పెను స్ప్రింగు త్రాసుకు వేలాడదీయుటకై గట్టి దారాన్ని వాడాలి.

ప్రశ్న 2.
0.24 గ్రా. సంయోగపదార్థంలో 10, 144 గ్రా. ఆక్సిజన్, 0.096 గ్రా. బోరాన్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సంఘటన శాతాలను భారం పరంగా కనుక్కోండి. (AS 1)
జవాబు:
విశ్లేషణ ప్రకారం ఆక్సిజన్, బోరాన్ల సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి = 0.24 గ్రా.
ఆక్సిజన్ ద్రవ్యరాశి = 0. 144 గ్రా, ; భోరాన్ ద్రవ్యరాశి = 0.096 గ్రా.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 2

ప్రశ్న 3.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణుసాంకేతికం రాయమని ఉపాధ్యాయుడు చెబితే షమిత (0), గాను, ప్రియాంక ‘O’ గాను రాసారు. నీవు ఎవరి జవాబును సమర్థిస్తావు? ఎందుకు? (AS 1, AS 2)
జవాబు:
షమిత రాసిన జవాబు సరియైనది.
కారణం:

  1. ఆక్సిజన్ ద్విపరమాణుక అణువు.
  2. రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఆక్సిజన్ అణువును ఏర్పరుస్తాయి.
  3. కావున ఆక్సిజన్ అణుఫార్ములా O2

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 4.
“H2 మరియు 2Hలు భిన్నమైనవి” అని మోహిత్ చెప్పాడు. ఈ వాక్యము తప్పో, ఒప్పో సకారణముగా తెలుపండి. (AS 1)
జవాబు:

  1. H2 అనేది హైడ్రోజన్ అణువు. ఇది రెండు హైడ్రోజన్ పరమాణువుల కలయిక వలన ఏర్పడినది.
  2. 2H అనేది ‘హైడ్రోజన్ పరమాణువు. దీనిలో రెండు హైడ్రోజన్ పరమాణువులు రసాయన చర్యలో పాల్గొనుటకు సిద్ధంగా వున్నాయి. కనుక మోహిత్ చెప్పిన వాక్యము సరియైనదే.

ప్రశ్న 5.
“CO మరియు Co రెండూ మూలకాలను తెలియజేస్తాయి.” అని లక్ష్మి చెప్పింది. మీరేమంటారు? కారణం చెప్పండి. (AS 1, AS 2)
జవాబు:
లక్ష్మి చెప్పిన విషయం సరియైనది కాదు.

  1. CO అనేది ‘కార్బన్ మోనాక్సైడ్’ యొక్క ఫార్ములా.
  2. ‘C’ పెద్ద అక్షరం (Capital letter) మరియు ‘O’ కూడా పెద్ద అక్షరం (Capital letter) వల్ల ఈ విషయం తెలుస్తుంది.
  3. Co అనేది ‘కోబాల్ట్’ అనే మూలక సంకేతం.
  4. ‘C’ పెద్ద అక్షరం (Capital letter), ‘0’ చిన్న అక్షరం (Small letter) వల్ల ఈ విషయం తెలుస్తుంది.

ప్రశ్న 6.
నీటి అణువు యొక్క సాంకేతికం H2O. ఈ సాంకేతికం మనకేం సమాచారాన్ని తెల్పుతుంది? (AS 1)
జవాబు:

  1. నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల కలయిక వలన ఏర్పడుతుంది.
  2. ఒక ఆక్సిజన్ పరమాణువు, రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక నీటి అణువును ఏర్పరుస్తాయి.
  3. నీటి అణువు యొక్క అణుద్రవ్యరాశి 18. [హైడ్రోజన్ – 1, ఆక్సిజన్ – 16, H2O ⇒ 2 × 1 + 16 = 18]
  4. 18 గ్రా. నీటి అణువులో 6.022 × 1023 కణాలు వుంటాయి.
  5. హైడ్రోజన్ సంయోజకత 1, ఆక్సిజన్ సంయోజకత 2.

ప్రశ్న 7.
రెండు అణువుల ఆక్సిజన్, ఐదు అణువుల నైట్రోజనను సాంకేతికంగా మీరు ఎలా రాస్తారు? (AS 1)
జవాబు:
a) రెండు అణువుల ఆక్సిజన్ 2O2.

కారణం:

  1. ఆక్సిజన్ ద్విపరమాణుక మూలకము.
  2. రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఒక ఆక్సిజన్ అణువును ఏర్పరచును.
  3. ఆక్సిజన్ సాంకేతికం O2

b) ఐదు అణువుల నైట్రోజన్ 5N2

కారణం :

  1. నైట్రోజన్ ద్విపరమాణుక మూలకము.
  2. రెండు నైట్రోజన్ పరమాణువులు కలిసి ఒక నైట్రోజన్ అణువును ఏర్పరచును.
  3. నైట్రోజన్ సాంకేతికం N2

ప్రశ్న 8.
ఒక లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అయిన ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికంను రాయండి. (AS 1)
జవాబు:

  1. ఆక్సైడ్ యొక్క సంయోజకత ‘2’ అనగా O2- అవుతుంది.
  2. లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అని ఇవ్వబడినది.
  3. కావున ఇవ్వబడిన లోహం యొక్క సంయోజకత 2 అనగా M2+ అవుతుంది.
  4. క్లోరైడ్ యొక్క సంయోజకత 1 అనగా Cl.
  5. క్రిస్క్రాస్ పద్ధతి ప్రకారం ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికం MCl2 అవుతుంది.

ప్రశ్న 9.
కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం Ca(OH)2 మరియు జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం Zn3 (PO4)2 అయిన కాల్షియం ఫాస్పేట్ యొక్క సాంకేతికాన్ని రాయండి. (AS 1)
జవాబు:

  1. కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం Ca(OH)2
  2. కావున కాల్షియం సంయోజకత 2 అనగా Ca2+ మరియు హైడ్రాక్సైడ్ సంయోజకత 1 అనగా (OH).
  3. జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం Zn3 (PO4)2.
  4. జింక్ సంయోజకత 2 అనగా Zn2+, ఫాస్పేట్ సంయోజకత 3 అనగా (PO4)3-.
  5. క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సాంకేతికం Ca3 (PO4)2.

ప్రశ్న 10.
మన ఇండ్లలో సాధారణంగా వాడే క్రింది పదార్థాల రసాయన నామాలు (Chemical Names), సాంకేతికాలను తెలుసుకోండి. (AS 1)
a) సాధారణ ఉప్పు (Common Salt)
b) వంట సోడా (Baking Soda)
c) ఉతికే సోడా (Washing Soda)
d) వెనిగర్ (Vinegar)
జవాబు:

పదార్ధం రసాయన నామం ఫార్ములా
a) సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ NaCl
b) వంట సోడా సోడియం బై కార్బొనేట్ NaHCO3
c) ఉతికే సోడా సోడియం కార్బోనేట్ Na2CO3
d) వెనిగర్ సజల ఎసిటిక్ ఆమ్లం CH3COOH

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 11.
క్రింది వాటి ద్రవ్యరాశులను లెక్కించండి. (AS 1)
a) 0.5 మోల్‌ల N2 వాయువు
b) 0.5 మోల్‌ల N పరమాణువులు
c) 3.011 × 1023 N పరమాణువులు
d) 6.022 × 1023 N2 అణువులు
జవాబు:
a) 0.5 మోల్‌ల N2 వాయువు
1 మోల్‌ N2 వాయువు ద్రవ్యరాశి = 28 గ్రా. (∵ N యొక్క అణు ద్రవ్యరాశి = 28 గ్రా.)
0.5 మోల్‌ల N2 వాయువు ద్రవ్యరాశి = 28 × 0.5 = 14 గ్రా.

b) 0.5 మోల్‌ల N పరమాణువులు
1 మోల్ N పరమాణువుల ద్రవ్యరాశి = 14 గ్రా. (∵ N యొక్క అణు ద్రవ్యరాశి = 14 గ్రా. )
0.5 మోల్‌ల N పరమాణువుల ద్రవ్యరాశి = 14 × 0.5 = 7 గ్రా.

c) 3.011 × 1023 N పరమాణువులు
6.022 × 1023 N పరమాణువుల ద్రవ్యరాశి = 14 గ్రా.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 3

d) 6.022 × 1023 N2 అణువులు
6.022 × 1023 N2 అణువుల ద్రవ్యరాశి = 28 గ్రా.

ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన వాటిలో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి. (AS 1)
a) 46 గ్రా. Na పరమాణువులు
b) 8 గ్రా. O2 అణువులు
c) 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు
జవాబు:
a) 46 గ్రా. Na పరమాణువులు
Na పరమాణు ద్రవ్యరాశి = 23
23 గ్రా. Na పరమాణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022 × 1023
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 4

b) 8 గ్రా. O2 అణువులు
O2 అణు ద్రవ్యరాశి = 32
32 గ్రా. O2 అణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022× 1023
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 5

c) 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు
హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి = 1
∴ 1 మోల్ హైడ్రోజన్ పరమాణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022 × 1023
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 6

ప్రశ్న 13.
‘మోల్’లలోకి మార్చండి. (AS 1)
a) 12 గ్రా. ఆక్సిజన్ వాయువు
b) 20 గ్రా. నీరు
C) 22 గ్రా. కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
a) 12 గ్రా. ఆక్సిజన్ వాయువు
O2 అణుభారం = 32
∴ 32 గ్రా. O2 లో ఉండే మెల్ల సంఖ్య = 1
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 7

b) 20 గ్రా. నీరు
నీరు (H2O) అణుభారం = 18
∴ 18 గ్రా. నీటిలోని మోల్ల సంఖ్య = 1
20 గ్రా. నీటిలోని మోల్ల సంఖ్య = \(\frac{20}{18}\) × 1 = 1.11

c) 22 గ్రా, కార్బన్ డై ఆక్సైడ్
కార్బన్ డై ఆక్సైడ్ (CO2) అణుభారం = 44
∴ 44 గ్రా. CO2 లోని మోల్ల సంఖ్య = 1
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 8

ప్రశ్న 14.
FeCl2 మరియు FeCl3 లలో Fe యొక్క సంయోజకతలు రాయండి. (AS 1)
జవాబు:
FeCl2 లో Fe యొక్క సంయోజకత = 2
FeCl3 లో Fe యొక్క సంయోజకత = 3

ప్రశ్న 15.
సల్ఫ్యూరిక్ ఆమ్లం(H2SO4) గ్లూకోజ్ (C6H12O6)ల మోలార్ ద్రవ్యరాశులు లెక్కించండి. (AS 1)
జవాబు:
a) సల్ఫ్యూరిక్ ఆమ్లం : H2SO4
H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి = (2 × 1) + (1 × 32) + (4 × 16)
= 2 + 32 + 64 = 98 యూనిట్లు
∴ H2SO4 యొక్క మోలార్ ద్రవ్యరాశి : 98 గ్రా.

b) గ్లూకోజ్ : C6H12O6
C6H12O6 యొక్క అణు ద్రవ్యరాశి = (6 × 12) + (12 × 1) + (6 × 16)
= 72 + 12 + 96 = 180 యూనిట్లు
∴ C6H12O6 యొక్క మోలార్ ద్రవ్యరాశి : 180 గ్రా.

ప్రశ్న 16.
100 గ్రా. సోడియం, 100 గ్రా. ఇనుములలో ఎక్కువ సంఖ్యలో పరమాణువులు కలిగియున్న లోహమేది? వివరించండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 9

ప్రశ్న 17.
కింది పట్టికను పూరించండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 10
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 12

ప్రశ్న 18.
కింది పట్టికలోని ఖాళీలను పూరించండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 11
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 13

ప్రశ్న 19.
15.9 గ్రా. కాపర్ సల్ఫేట్ మరియు 10.6 గ్రా. సోడియం కార్బొనేట్ చర్య పొంది 14.2 గ్రా. సోడియం సల్ఫేట్ మరియు 12.3 గ్రా. కాపర్ కార్బోనేటను ఏర్పరుస్తున్నాయి. దీనిలో ఇమిడి ఉన్న రసాయన సంయోగ నియమాన్ని తెలిపి, నిరూపించండి. (AS 2)
జవాబు:
క్రియాజనకాలు :
కాపర్ సల్ఫేట్ ద్రవ్యరాశి = 15.9 గ్రా.
సోడియం కార్బోనేట్ ద్రవ్యరాశి = 10.6 గ్రా.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = 15.9 + 10.6 = 26.5 గ్రా.

క్రియాజన్యాలు :
సోడియం సల్ఫేట్ ద్రవ్యరాశి = 14.2 గ్రా.
కాపర్ కార్బోనేట్ ద్రవ్యరాశి = 12.3 గ్రా.
క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి : 14.2 + 12.3 = 26.5 గ్రా.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి
ఇదియే ద్రవ్యనిత్యత్వ నియమము.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 20.
112 గ్రా|| కాల్షియం ఆక్సైడ్ కు కార్బన్ డై ఆక్సైడును కలిపితే 200 గ్రా. కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది. ఈ చర్యలో వాడిన కార్బన్ డై ఆక్సైడ్ ద్రవ్యరాశిని కనుక్కోండి. మీ జవాబుకు ఏ రసాయన సంయోగ నియమం తోడ్పడింది. (AS 2)
జవాబు:

  1. x గ్రా. కార్బన్ డై ఆక్సైడ్ ను 112 గ్రా. కాల్షియం ఆక్సెడ్ కు కలిపారనుకొనుము. (క్రియాజనకాలు)
  2. క్రియాజన్యమైన కాల్షియం కార్బొనేట్ ద్రవ్యరాశి – 200 గ్రా.
  3. ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం,
    క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి
    x + 112 = 200 ⇒ x = 200 – 112 ⇒ x = 88
    ∴ 88 గ్రా. కార్బన్ డై ఆక్సైడు కలిపారు.

ప్రశ్న 21.
మూలకాలకు ప్రామాణిక గుర్తులు (సంకేతాలు) నిర్ణయించి ఉండకపోతే ఎలా ఉండేదో ఊహించి రాయండి. (AS 2)
జవాబు:

  1. ప్రపంచంలో చాలా భాషలు వాడుకలో ఉన్నాయి.
  2. ఒక మూలకాన్ని రకరకాల భాషలలో రకరకాల పేర్లుతో పిలిస్తే సమస్యగా మారుతుంది.
  3. ఒక ప్రాంతం వారు పిలిచే ఒక మూలకము, మరొక ప్రాంతం వారు అవగాహన చేసుకోలేక తికమకపడతారు. ఆ పదార్థం బదులుగా వేరొక పదార్థంగా భావించిన ఫలితాలు వేరుగా వస్తాయి.
  4. కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి అన్ని దేశాల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల వారికి సౌలభ్యంగా ఉండటం కోసం మూలకాలకు ఒక స్థిరమైన పేరును కేటాయించడం జరిగింది.

ప్రశ్న 22.
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగాన్ని చూపే పటం గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 1

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 58

ప్రశ్న 1.
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి పై ప్రయోగాన్ని చేసినపుడు ఇదే ఫలితం వస్తుందా?
జవాబు:
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి ప్రయోగాన్ని చేస్తే అదే ఫలితం రాదు. ద్రవ్యనిత్యత్వ నియమం నిరూపణ అవదు.

శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి ప్రయోగాన్ని చేస్తే కొన్ని వాయువులు బయటకుపోయి ప్రయోగం ఫలితం తేడాగా వస్తుంది.

ప్రశ్న 2.
మెగ్నీషియం తీగను మండించడాన్ని గుర్తుకు తెచ్చుకోంది. ఈ చర్యలో కూడా ద్రవ్యరాశిలో మార్పు జరగలేదని నీవు భావిస్తున్నావా? మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:

  1. ద్రవ్యరాశిలో మార్పు జరగదు. కాని దానిని మనం గమనించలేము. కారణం మెగ్నీషియం తీగ మండేటప్పుడు తన చుట్టూ ఉన్న ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.
  2. ఒకవేళ మనం తీసుకున్న మెగ్నీషియం తీగ మండడానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించగల మూసివున్న సీసాలో, గాలి బయటకు పోకుండా చేసి ప్రయోగాన్ని నిర్వహిస్తే ద్రవ్యనిత్యత్వ నియమం నిరూపించవచ్చు.

9th Class Physical Science Textbook Page No. 59

ప్రశ్న 3.
100 గ్రా. పాదరసపు ఆక్సెడ్ వియోగం చెంది 92.6 గ్రా. పాదరసం 7.4 గ్రా. ఆక్సిజన్లను ఏర్పరుస్తుంది. ఒకవేళ 10 గ్రా. ఆక్సిజన్ 125 గ్రా. పాదరసంతో పూర్తిగా చర్యనొంది పాదరసపు ఆక్సెడు ఏర్పరిచినది అనుకొంటే, ఈ ద్రవ్యరాశి విలువలు స్థిరానుపాత నియమానికి అనుగుణంగా ఉంటుందా?
జవాబు:
ఆక్సిజన్ నిష్పత్తి = 7.4 : 10
పాదరసం నిష్పత్తి = 92.6 : 125 ⇒ \(\frac{7.4}{10}=\frac{92.6}{125}\) ⇒ 0.74 = 0.74
∴ ఇవ్వబడిన ద్రవ్యరాశులు స్థిరానుపాత నియమానికి అనుగుణంగా ఉన్నాయి.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 4.
మీరు శ్వాసించేటప్పుడు బయటకు విడిచిన ర్బన్ డై ఆక్సైడ్ కు, మీ స్నేహితులు బయటకు విడిచిన కార్బన్ డై ఆక్సైడక్కు మధ్య ఏమైనా తేడా ఉంటుందా? స్నేహితులతో చర్చించండి. వివిధ పద్ధతుల ద్వారా తయారైన కార్బన్‌డయాక్సెయ్ సంఘటనం స్థిరంగా ఉంటుందా?
జవాబు:
స్థిరానుపాత నియమం ప్రకారం, ఒక పదార్థం ఎక్కడి నుండి సేకరించాం, ఏ విధంగా తయారు చేశాం అనే వాటితో సంబంధం లేకుండా ఒక సంయోగ పదార్థంలోని మూలకాల స్థిరభార నిష్పత్తి ఎల్లప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కావున మేము విడిచిన కార్బన్ డై ఆక్సైడ్ కు, మా స్నేహితులు విడిచిన కార్బన్‌డయాక్సెడు ఏమి తేడా ఉండదు.

9th Class Physical Science Textbook Page No. 60

ప్రశ్న 5.
డాల్టన్ సిద్ధాంతములోని ఏ ప్రతిపాదన ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం?
జవాబు:
డాల్టన్ సిద్ధాంతం యొక్క మొదటి ప్రతిపాదన “పదార్థం విభజింప వీలుకాని పరమాణువులను కలిగి ఉంటుంది” అనేది ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం.

ప్రశ్న 6.
డాల్టన్ సిద్ధాంతములోని ఏ ప్రతిపాదన స్టిరానుపాత నియమంను వివరిస్తుంది?
జవాబు:
డాల్టన్ సిద్ధాంతములోని మూడవ ప్రతిపాదనయైన “ఒకే మూలక పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. కాని వేర్వేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి” అనేది స్థిరానుపాత నియమాన్ని వివరిస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 56

ప్రశ్న 7.
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం పెరుగుతుందా? తగ్గుతుందా?
జవాబు:
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం తగ్గుతుంది.

ప్రశ్న 8.
కట్టి బొగ్గు పూర్తిగా మండిన తరువాత అందులో ఉండే పదార్థం ఎక్కడకెళ్ళింది?
జవాబు:
కట్టె బొగ్గు పూర్తిగా మండి, CO2, వాయువును విడుదల చేయును. బూడిద అవక్షేపముగా మిగులును.

ప్రశ్న 9.
తడిబట్టలారితే పొడిగా మారతాయి. తడి బట్టలో ఉన్న నీరు ఏమైంది?
జవాబు:
తడి బట్టలోనున్న నీరు బాష్పీభవనం చెంది వాతావరణంలో కలిసిపోతుంది.

ప్రశ్న 10.
మెగ్నీషియం తీగను గాలిలో మండిస్తే ఏమవుతుంది?
జవాబు:
మెగ్నీషియం తీగను గాలిలో మండించినపుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతితో మండును. బూడిద అవక్షేపముగా మిగులును. ఈ అవక్షేపమే మెగ్నీషియం ఆక్సెడ్.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 11.
గంధకం (Sulphur)ను గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
గంధకంను గాలిలో మండించినపుడు దాని స్థితిలోను, రంగులోను మార్పు వస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 60

ప్రశ్న 12.
మూలకాలు కూడా పరమాణువులతోనే నిర్మితమవుతాయా?
జవాబు:
ఒక పదార్థం ఒకే రకమైన పరమాణువులను కలిగియుంటే దానిని ‘మూలకం’ అని అంటాం. మూలకాలలో పరమాణువులు లేదా అణువులు అనే సూక్ష్మ కణాలు ఉంటాయి.

9th Class Physical Science Textbook Page No. 62

ప్రశ్న 13.
మనకు తెలిసిన మూలకాలు 115కు పైగా ఉన్నాయి. కాని ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే కదా ! కాల్షియం, కోరిన్, క్రోమియంల సంకేతాలను ఎలా రాస్తాం?
జవాబు:
ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే అయినప్పటికీ కాల్షియం, క్లోరిన్, క్రోమియం వంటి వాటికి ఒకే సంకేతాన్ని రాయలేము. అందుకే వాటి పేరులోని రెండు అక్షరాలు అనగా Ca, CI, Cr లను సంకేతాలుగా రాస్తాము.

9th Class Physical Science Textbook Page No. 63

ప్రశ్న 14.
లాటిన్ పేర్ల ఆధారంగా సంకేతాలు రాయబడిన మూలకాలను గుర్తించగలరా? అవి ఏవి?
జవాబు:
లాటిన్ పేరు ఆధారంగా సంకేతం రాయబడిన మూలకాలు : ఇనుము (Fe), బంగారం(Au), సోడియం(Na), పొటాషియం (K).

9th Class Physical Science Textbook Page No. 64

ప్రశ్న 15.
కొన్ని మూలకాలు ఎందుకు ఏక పరమాణుక అణువులుగా వుంటాయి?
జవాబు:
కొన్ని మూలకాల అణువులు ఏర్పడాలంటే, అవి ఒకే ఒక పరమాణువులతో ఏర్పడతాయి. ఇటువంటివి ఏక పరమాణుక అణువులుగా ఉంటాయి.
ఉదా : Ar, Na, Fe మొ||వి.

ప్రశ్న 16.
కింది పట్టికను గమనించి వివిధ మూలక అణువుల సాంకేతికాలను రాయండి.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 14
జవాబు:

మూలకము పేరు సాంకేతికము పరమాణుకత
ఆర్గాన్ Ar ఏకపరమాణుక
హీలియం He ఏకపరమాణుక
సోడియం Na ఏకపరమాణుక
ఐరన్ Fe ఏకపరమాణుక
అల్యూమినియం Al ఏకపరమాణుక
కాపర్ Cu ఏకపరమాణుక
హైడ్రోజన్ H2 ద్విపరమాణుక
ఆక్సిజన్ O2 ద్విపరమాణుక
నైట్రోజన్ N2 ద్విపరమాణుక
క్లోరిన్ Cl2 ద్విపరమాణుక
ఓజోన్ O3 త్రిపరమాణుక
పాస్ఫరస్ P4 చతుఃపరమాణుక
సల్ఫర్ S8 అష్టపరమాణుక

ప్రశ్న 17.
కొన్ని మూలకాలు ఎందుకు ద్విపరమాణుక లేదా త్రిపరమాణుక అణువులుగా ఉంటాయి?
జవాబు:
రెండు లేదా మూడు పరమాణువులు కలిసి ఒక మూలక అణువు ఏర్పడితే అటువంటి వాటిని ద్విపరమాణుక లేదా త్రిపరమాణుక అణువులు అంటారు.
ఉదా : ద్విపరమాణుక అణువులు : O2, H2 మొ||వి.
త్రిపరమాణుక అణువులు : O3 మొ||వి.

ప్రశ్న 18.
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణమేమి?
జవాబు:
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణం వాటి సంయోజకత.

AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు

ప్రశ్న 19.
సంయోజకత అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలక పరమాణువులు వేరొక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యాన్నే ఆ మూలక పరమాణువు యొక్క సంయోజకత అంటాం.

9th Class Physical Science Textbook Page No. 66

ప్రశ్న 20.
కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైకు సాంకేతికాలను రాయండి. నీటి అణువుకు సాంకేతికం రాసినట్టే వీటికి కూడా ప్రయత్నించండి.
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ :

  1. కార్బన్ డై ఆక్సైడ్లో కార్బన్, ఆక్సిజన్లు ఉన్నాయి.
  2. ఒక కార్బన్ పరమాణువు, రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి కార్బన్ డై ఆక్సైడ్ అణువును ఏర్పరుస్తాయి.
  3. కావున కార్బన్ డై ఆక్సైడ్ సాంకేతికం CO2.

కార్బన్ మోనాక్సైడ్:

  1. కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్, ఆక్సిజన్లు ఉన్నాయి.
  2. ఒక కార్బన్ పరమాణువు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి కార్బన్‌ మోనాక్సైడ్ ను ఏర్పరుస్తాయి.
  3. కావున కార్బన్ మోనాక్సైడ్ సాంకేతికం CO.

9th Class Physical Science Textbook Page No. 69

ప్రశ్న 21.
18 గ్రా. నీటిలో ఎన్ని అణువులు ఉంటాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
18 గ్రా. నీటిలో 6.022 × 1023 అణువులు ఉంటాయి.

ప్రశ్న 22.
12 గ్రా. కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి?
జవాబు:
12 గ్రా. కార్బన్లో 6.022 × 1023 పరమాణువులు ఉంటాయి.

పరికరాల జాబితా

బీకరులు, శాంఖవకు ప్పె, స్టాండు, స్ప్రింగ్ త్రాసు, రబ్బరు బిరడా, మూలకాల సంకేతాలను సూచించే చార్టు లేదా కార్డు, పొటాషియం అయోడైడ్, స్వేదన జలం

9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కింది పట్టికలో కొన్ని మూలకాలకు గుర్తులు ఉన్నాయి. వాటిని సరిచేసి రాసి, కారణాలను వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 15

కృత్యం – 2

2. మీ పాఠశాల ప్రయోగశాలలో ఉండే మూలకాల ఆవర్తన పట్టికను చూసి క్రింద ఇచ్చిన మూలకాలకు సంకేతాలను రాయండి.
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 16
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 4th Lesson పరమాణువులు-అణువులు 17

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
“పాశ్చాత్య విద్య, క్రైస్తవ మత ప్రచారాలు భారతదేశంలోని సామాజిక మత సంస్కరణ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి” – దీనితో నీవు ఏకీభవిస్తావా? ఎందుకు? (AS2)
జవాబు:
ఏకీభవిస్తున్నాను ఎందుకనగా :
యూరోపియన్ కంపెనీలతో పాటు అనేకమంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించటానికి వచ్చారు. అప్పటి స్థానిక మత ఆచరణలను, నమ్మకాలను వాళ్లు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వాళ్లు అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలకు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వపనులు చేపట్టారు. ఇది ప్రజలలో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది.

అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకూ, హిందూ, ఇస్లాం మతనాయకులకూ మధ్య తమతమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలియటమే కాకుండా తమ తమ మతాలలోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదివారు. పురాతన సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది.

ప్రశ్న 2.
సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి? (AS1)
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
అనేక దేవుళ్లను ఆరాధించటం, విగ్రహారాధన, సంక్లిష్ట సంప్రదాయాలు వంటి వాటిని మాన్పించటానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి. ఈ సంస్కరణలను ప్రజలు ఆమోదించారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి. (AS2)
జవాబు:
అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాలను ఆరాధించటం, బ్రాహ్మణ పూజారులను పూజించటం, బలులు ఇవ్వటం, హిందూమతంలోని మౌడ్యం, మూఢాచారాలను వదలి పెట్టడానికి మతసంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి. సనాతన, సాంప్రదాయ ఆచారాలు, పద్ధతులు వదలి పెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు. ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక, సనాతన మతాచారాలు కొనసాగించారు. ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌఖ్యాలు తిరస్కరించారు.

కాని తదనంతర కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నాక, యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళలపట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం, ఆంగ్లవిద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు.

ప్రశ్న 4.
రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు? (AS1)
జవాబు:
రమాబాయి, సావిత్రీబాయి ఫూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి జీవితాలను అంకితం చేసారు. వితంతు మహిళలపై సమాజం చాలా చిన్న చూపు చూసింది. సమాజంలో అపశకునంగా, దుశ్శకునంగా భావించి, బయట తిరగనిచ్చేవారు కాదు. తెల్లచీర కట్టి, గుండు చేయించి, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు సుమంగళులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు. భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం. ఆమె నుదుట మీద అనేక కష్టాలు ఉన్నాయి, ఇంకా ఈ కట్టుబాట్లు పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంస్కర్తలు ప్రతిఘటించారు. ఆత్మస్టెర్యం పెంచి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు వితంతువులు బ్రతికేందుకుగాను వృత్తి విద్యలు, స్వయం ఉపాధి పథకాలు అందించారు. వితంతువులు విద్యావంతులైతే మార్పు వస్తుందని భావించి, బొంబాయి లాంటి పట్టణాలలో “శారదాసదన్” వంటి పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పరిచి, ఆత్మ విశ్వాసం పెంచేటట్లు కృషి చేసారు.

ప్రశ్న 5.
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర వివరించండి. (AS1)
జవాబు:
భారతదేశంలో, 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్తగా రాజా రాంమోహన్ రాయ్ పాత్ర :

  1. రాజారాంమోహన్ రాయ్ బెంగాల్ లో 1772లో జన్మించాడు.
  2. అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అన్నింటిలోని సారం ఒకటేనని గ్రహించాడు.
  3. ఇతరుల మతాలను విమర్శించవద్దన్నాడు.
  4. హేతు బద్ధంగా ఉన్న, ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు.
  5. అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు.
  6. ‘బ్రహ్మసమాజం’ను స్థాపించాడు.
  7. ‘సతి’ ని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు.
  8. స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు.

ప్రశ్న 6.
ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించటంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్’ ముస్లింలకు, బ్రిటిషు వారికి మధ్య నున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
  2. ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందాలని భావించాడు.
  3. ఆధునిక విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావించారు. అందుకే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహించారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 7.
‘అంటరాని’ కులాలను మిగిలిన వాటితో సమానంగా చేయటానికి వివిధ నాయకులు వివిధ పద్ధతులను అనుసరించారు. ఫూలే, భాగ్యరెడ్డి వర్మ, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీజీ వంటి నాయకులు సూచించిన చర్యల జాబితాను తయారు చేయండి. (AS3)
జవాబు:
అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా, అంటరాని వాళ్ళుగా చూపేవారు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వాళ్ళు, వీళ్ళను దేవాలయములోనికి ప్రవేశం కల్పించలేదు. అందరిలా నీళ్ళు తోడుకోవడానికి, చదవటం, రాయటం నేర్చుకోనిచ్చే వాళ్ళు కాదు. మత గ్రంథాలను చదవనివ్వలేదు. గ్రామాలలో రెండు గ్లాసుల పద్ధతి అమలయ్యేది. ఉన్నత కులాలకు ! సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు. ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిబాపూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్, గాంధీజీ, నారాయణగురు వంటివారు పోరాడారు. వీళ్ళకై జీవితాలను అంకితం చేసారు.

జ్యోతిబాపూలే :
ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు. శూద్రులు (శ్రామిక కులాలు), అతిశూద్రులు (అంటరానివాళ్ళు) కలసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయటానికి “సత్యశోధక సమాజ్” అన్న సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన వాళ్ళకొరకు పాఠశాలను స్థాపించి, తాను తన భార్య సావిత్రి పూలే కృషి చేసారు.

డా||బి. ఆర్. అంబేద్కర్ :
బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కొరకు, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకొనే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. “భారతదేశ రాజకీయ భవిష్యత్తు” సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి, దళితులకు రిజర్వేషన్లు సాధించాడు. దళితుల సంక్షేమానికి “ఇండిపెండెంట్ లేబర్ పార్టీని” స్థాపించాడు. రాజ్యాంగ రచనలో, కూడా అంటరానితనాన్ని రూపు మాపడానికి అనేక అధికరణలు పొందుపరిచారు.

మహాత్మాగాంధీ :
మహాత్మాగాంధీ అంటరానితనం నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేసారు. అంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ ‘హరిజనులు’ అని నామకరణం చేసాడు. అంటే “దేవుడి ప్రజలు” అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.

నారాయణగురు :
మనుషులందరిదీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు. ఈయన కులవివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. బ్రాహ్మణపూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు. “గుడులు కట్టటం కంటే బాలలకు బడులు కట్టటం ఎంతో ముఖ్యమని చెప్పాడు.

భాగ్యరెడ్డి వర్మ :
దళితుల సంక్షేమం, హక్కుల కొరకు విశేషంగా కృషి చేసినవాడు భాగ్యరెడ్డి వర్మ. దళితులే ఈ ప్రాంత , మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను అణచివేసారని చెప్పాడు. కాబట్టి దళితులు “ఆది ఆంధ్రులు” అని పిలుచుకోవాలని చెప్పాడు. దళితులలో చైతన్యం నింపడానికి, 1906లో “జగన్ మిత్రమండలి భాగ్యరెడ్డి, ప్రారంభించాడు. దళిత బాలికలను దేవదాసీలు లేదా జోగినులుగా మార్చడాన్ని వ్యతిరేకించాడు.

ప్రశ్న 8.
ఈనాటికి కూడా కులం ఎందుకు వివాదాస్పద విషయంగా ఉంది? వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమం ఏది? (AS4)
జవాబు:
‘కులం’ అనేది వాస్తవానికి వ్యక్తిగతమయిన ఆచారం. ఇది వారి వారి ఆచార, వ్యవహారాల వరకు పాటించుకోవాలి. అంతేకాక ఎవరి కులం వారికే గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన కుటుంబ కార్యక్రమాల్లో ‘కులం’ అనేది ఇప్పటికే పునాదిగా నిలబడి ఉంది. దీన్ని దాటడానికి అగ్ర వర్ణాలుగా పిలువబడేవాళ్ళు, నిమ్న కులాలుగా పిలువబడే వాళ్ళు, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఈ ‘కులాన్ని’ సంఘపరమైన విషయాలలోకి తేవడం మూలంగా ఇది వివాదాస్పద విషయంగా ఉంటోంది.
ఉదా :
ఇరువురు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తే అది రెండు కులాల మధ్య వివాదం తెచ్చి పెడుతోంది.

వలస పాలనలో కులానికి వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన ఉద్యమంగా ‘సత్యశోధక్ సమాజ్’ జరిపిన ఉద్యమం ముఖ్యమైన ఉద్యమంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న 9.
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కర్ ఏమి సాధించదలుచుకున్నాడు? (AS1)
జవాబు:
ఆలయ ప్రవేశ ఉద్యమం ద్వారా అంబేద్కరు మానవులందరూ భగవంతుడి దగ్గర ఒక్కటేనని, భగవంతుడిపై అందరికీ సమాన హక్కులుంటాయని చెప్పదలచుకున్నాడు.

ప్రశ్న 10.
భారత సమాజంలోని సామాజిక మూఢాచారాలు లేకుండా చేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా దోహదపడ్డాయి? ఈనాడు ఎటువంటి సామాజిక మూఢాచారాలు ఉన్నాయి? వీటిని ఎదుర్కోటానికి ఎటువంటి సంఘ సంస్కరణలు చేపట్టాలి? (AS4)
జవాబు:
భారత సమాజంలో పూర్వకాలం నుండి కూడా అనేక సామాజిక మూఢాచారలు కులవివక్ష, మతోన్మాదం, స్త్రీలపట్ల వివక్షత బాల్యవివాహాలు, సతీసహగమనం, పరదాపద్ధతి, వితంతు స్త్రీల జీవనం వంటి సామాజిక మూఢాచారలు ఉండేవి. అయితే రాజారామ్మోహన్ రాయ్ సనాతన ఆచారాలను తిరస్కరించడమే కాకుండా “సతీ” సతీసహగమనం లాంటి సాంఘిక దురాచారాలను దూరం చేసాడు. బ్రహ్మసమాజం ద్వారా విరివిగా కృషి చేసి, ప్రజలలో చైతన్యం తేవడానికి కంకణం కట్టుకున్నాడు. దయానంద సరస్వతి ఆర్యసమాజం ద్వారా అనేక దేవుళ్ళు, దేవతలను గుడిలో, విగ్రహారాధన, కుల వ్యవస్థను ఖండించాడు “సత్యార్థ ప్రకాష్” గ్రంథం ద్వారా ప్రజలను మేల్కొలిపాడు. ముస్లిం సమాజంలోని సనాతన మత దురాచారాలను రూపు మాపడానికి, ఆంగ్ల విద్య ద్వారా సంస్కరణ చేయాలని, పరదా పద్దతి వంటి దురాచారాలను దూరం చేయడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ “విజ్ఞాన శాస్త్ర సంఘం” ద్వారా కృషి చేసాడు. జ్యోతిబాపూలే, నారాయణగురు, కందుకూరి, రమాబాయి సరస్వతి వంటి సంస్కర్తలు అనేక ఉద్యమాలు ద్వారా కులవివక్ష, బాల్యవివాహాల నిషేదం, వితంతు పునర్వివాహం, వంటి వాటిని అణచడానికి కృషి చేసాడు.

ఈనాటికి కూడా మతోన్మాదం, కులవివక్ష స్త్రీలపై దాడులు, బాలికలకు విద్య లేకపోవడం వంటి సామాజిక నేరాలు మనం గమనించవచ్చు. వీటిని దూరం చేయడానికి ప్రజలలో మార్పు రావాలి. విద్యావంతులు కావాలి. చైతన్యవంతులు కావాలి. చట్టాలు, హక్కులు, న్యాయస్థానాలను గౌరవించాలి. స్త్రీలకు సమాన హోదా, కల్పించి, ప్రోత్సహించాలి. కులవివక్షతను రూపు మాపడానికి విద్యార్థి దశనుండే సమగ్రత భావాలు పెంపొందించాలి. అన్ని మతాల సారం ఒక్కటేనని వివరించి జాతీయ సమగ్రతను పెంచాలి.

ప్రశ్న 11.
బాలికల విద్య ప్రాధాన్యతను తెలిపే ఒక కరపత్రం తయారుచేయండి. (AS6)
జవాబు:
కరపత్రం
ఈనాడు సమాజంలో బాలురుతో పాటుగా బాలికలకు విద్య తక్కువగా అందిస్తున్నారు. కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు పేరిట బాలికల విద్యను మధ్యలో మాన్పిస్తున్నారు. బయటకు తిరగనీయకుండా, పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్నారు. కాని ఇటీవల కాలంలో తల్లిదండ్రులలో కూడా మార్పు కన్పిస్తుంది. బాలురతో పాటుగా బాలికలను కూడా ప్రోత్సహిస్తూ విద్యను అందిస్తున్నారు.

బాల్యవివాహాలు, కులవివక్షతను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అక్కడక్కడ కులవివక్షత కన్పిస్తుంటే ప్రజలలో చైతన్యం కొరకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపట్ల చట్టాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ‘యువతీయువకులలో సామాజిక అవగాహన కొరకు కృషిచేస్తున్నారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 12.
సంఘ సంస్కర్తల్లో నీకు నచ్చిన గుణాలు ఏవి? అవి ఎందుకు నచ్చాయి? (AS6)
జవాబు:
సంఘ సంస్కర్తలలో నాకు నచ్చిన గుణాలు – కారణాలు :

  1. సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేస్తారు. దీనివలన చాలాకాలంగా దురాచారాలతో వెనుకబడిన మనం ముందంజ వేయగలం.
  2. దురాచారాలను రూపుమాపే దిశగా ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. తద్వారా ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
  3. వీటిలో భాగంగా వీరు అనేక సంస్థలను నెలకొల్పుతారు. ఉదా : బాలికల విద్య కొరకు పోరాటం జరిగినపుడు బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు.
  4. అవసరమైతే సనాతనవాదులనెదురొడ్డి పోరాడుతారు.
  5. ఉద్యమం ప్రారంభంలో సమాజం వెలివేసినంత పనిచేసినా, ధైర్యంగా ముందుకు సాగుతారు.
  6. నవసమాజాన్ని నిర్మిస్తారు.

8th Class Social Studies 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.213

ప్రశ్న 1.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానందల దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరిరువురూ హిందూ ధర్మశాస్త్రాలను చదివారు.
  2. అన్ని మతాలలోని సారం ఒకటేనని విశ్వసించారు.
  3. వీరిరువురూ సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ, దీనజనుల ఉద్ధరణకు, సంఘసేవకు ప్రాధాన్యత నిచ్చారు.

తేడాలు :

రామ్మోహన్ రాయ్ స్వామి వివేకానందుడు
అన్ని మతాలు ఒకటేనని నమ్మాడు. హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదన్నాడు.
బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. రామకృష్ణ మిషను స్థాపించాడు.
ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమన్నాడు. మూఢాచారాలు వదలి మత ధర్మాన్ని పాటించమన్నాడు.

ప్రశ్న 2.
యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల తొలితరం సంస్కర్తలు ఏవిధంగా ప్రభావితులయ్యారు?
జవాబు:

  1. ఆంగ్ల సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటితో వీరు ప్రభావితులయ్యారు. అందువలన వీరు బాల్య వివాహాల నిషేధం, వితంతు పునర్వివాహాల ప్రోత్సాహం మొదలైన వాటిని అమలులోకి తెచ్చారు.
  2. వీరి మత బోధనలచే ప్రభావితులైన వారు ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు.
  3. వీరు ఆంగ్ల విద్యను అభ్యసించారు. ఈ భాషతో అనేక గ్రంథాలను చదివి జ్ఞానార్జన చేశారు. అలా అందరూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆంగ్ల విద్యను, పాఠశాలలను ప్రోత్సహించారు.

ఈ విధంగా తొలితరం సంస్కర్తలు అనేక విషయాలలో యూరోపియన్ సంస్కృతి, క్రైస్తవ మతం వల్ల ప్రభావితులయ్యారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 3.
రాంమోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానందల మత దృక్పథాలలో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. వీరు ముగ్గురూ హిందూ ధర్మశాస్త్రాలను విశ్వసించారు.
  2. ఇతర మతాలలోని మంచిని స్వీకరించి ఆచరించాలని చెప్పారు. ‘
  3. ముగ్గురూ సమాజసేవను ఆదర్శంగా తీసుకున్నారు.

తేడాలు :

దయానందుడు రాంమోహన్ రాయ్ వివేకానందుడు
1) సనాతన సాంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించాడు. 1) అన్ని మతాలు ఒకటేనని భావించాడు. 1) హిందూమతం అన్ని మతాలలోకి గొప్పదని విశ్వసించాడు.
2) ఆర్యసమాజాన్ని స్థాపించాడు. 2) బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 2) రామకృష్ణ మిషను స్థాపించాడు.
3) అన్ని మతాలను తప్పు మతాలుగా తిరస్కరించి వేదాల ఆధారిత హిందూ మతంలోకి తిరిగి రావాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. 3) ఒకే ఒక్క దేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండమని చెప్పాడు. 3) మౌఢ్యాన్ని, మూఢాచారాల్ని వదిలి పెట్టి హిందు మత ధర్మాన్ని పాటించాలని చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషలలో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఈ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రజలలో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. పత్రికలు, పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా కొత్త భావాల వ్యాప్తిలో ముద్రణ ఉపయోగపడింది.

ప్రశ్న 5.
మీరు DAV పాఠశాల, గురుకుల పాఠశాల, ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తే దేనిని ఎంచుకుంటారు? కారణాలు తెల్పండి.
జవాబు:
నేను ప్రభుత్వం నడిపే పాఠశాలలను ఎంచుకుంటాను.
కారణాలు:

  1. ఇక్కడ లౌకిక దృక్పథంతో బోధన జరుగుతుంది.
  2. అందరు విద్యార్థుల్నీ సమాన దృష్టితో చూస్తారు.

8th Class Social Textbook Page No.214

ప్రశ్న 6.
1857 తరువాత ముస్లింలు – బ్రిటిష్ మధ్య శత్రుత్వం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
సంస్కరణవాద హిందువులు సనాతన వాదులతో ఘర్షణపడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆధునిక విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఇంగ్లీషు విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు.

ప్రశ్న 7.
DAV పాఠశాలలు, MAO కళాశాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?
జవాబు:

DAV పాఠశాల MAO కళాశాల
1) దీనిని స్వామి దయానంద్ అనుచరులు స్థాపించారు. 1) దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు.
2) దీని ద్వారా ఆంగ్ల బోధనతో పాటు హిందూమతాన్ని, దాని సంస్కృతిని పునరుద్ధరించాలని భావించారు. 2) ఇది ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీషు, విజ్ఞాన శాస్త్రాలను బోధించటానికి ప్రయత్నించింది.
3) చివరలో ఇది వేదమతాన్ని మాత్రమే బోధించేలా మారింది. హరిద్వార్‌లో గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. 3) ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 8.
తమ సంస్కరణ’ భావాలను సమర్ధించుకోవటానికి సంస్కర్తలందరూ తమ తమ ప్రాచీన మత గ్రంథాలను కొత్త కోణంలో చూడటానికి ప్రయత్నించారన్న విషయాన్ని మీరు గమనించి ఉంటారు. ప్రముఖ సంస్కర్తల ఉదాహరణలను చూసి దీనిని వాళ్లు ఎలా చేశారో తెలుసుకోండి.
జవాబు:
1) రాజారాంమోహన్ రాయ్ :
ఇతడు హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫి వంటి అనేక మత సిద్ధాంతాలను చదివాడు. అనేక పుస్తకాలు చదవటం వల్ల అతడికి దేవుడు ఒక్కడే అన్న నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదని ఇతడికి అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగి ఉన్నాయని, ఇతరుల మతాలను . విమర్శించటం సరికాదని అతడు భావించాడు. హేతుబద్దంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనలను అంగీకరించాలని కూడా అతడు భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను అతడు కోరాడు. ముద్రణలోని కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధిక సంఖ్యలో ప్రజలకు చేరటానికి అతడు తన భావాలను పత్రికల్లో, పుస్తకాలుగా ప్రచురించాడు.

2) స్వామి వివేకానంద :
హిందూమతం ఇతర మతాలకంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఇతడు ఉపనిషత్తుల – బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇవి అనువాదం అయ్యి, పెద్ద సంఖ్యలో ముద్రింపబడ్డాయి.

3) స్వామి దయానంద సరస్వతి :
అతడు వేదాలను చదివి నిజమైన మతం వాటిల్లోనే ఉందని సమ్మాడు. ఆ తరవాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళను, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుడిని పూజించాలని అతడు ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాలను అతడు తప్పు మతాలుగా తిరస్కరించి, ఇతర మతాలకు మారిన హిందువులను షేధాల ఆధారంగా ఉన్న హిందూమతంలోకి తిరిగి రావాలని భావించాడు.

ప్రశ్న 9.
భక్తి ఉద్యమంలో భాగంకాని మత భావనలను సంస్కర్తలు ప్రచారం చేశారా?
జవాబు:
లేదు. సంస్కర్తలు అందరూ భక్తి ఉద్యమంలోని మత భావనలనే ఎక్కువగా ప్రచారం చేశారు.

8th Class Social Textbook Page No.215

ప్రశ్న 10.
సంఘసంస్కరణ కోసం ప్రభుత్వం చట్టాలు చేయటం ఎందుకు ముఖ్యమైంది?
జవాబు:
19వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రిటిష్ అధికారులలో చాలామంది కూడా భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను, విమర్శించసాగారు. రాజా రామ్మోహన్‌రాయ్ వాదాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆలకించారు. ఆవిధంగా 1829లో ‘సతి’ ని నిషేధించారు. వితంతు పునర్వివాహా చట్టాన్ని 1855లో చేసారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ అనేక చట్టాలు అవసరమని భావించారు.

ప్రశ్న 11.
వితంతు పునర్వివాహాన్ని సమర్ధించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళ మధ్య సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
1856 సం॥రం – మొదటి వితంతు పునర్వివాహం జరిగిన సందర్భం – ఊరు కలకత్తా.

శ్రీకాంత్ ఛటర్జీ :
వాహ్వా ! ఈ రోజు ఈ దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. భారతదేశంలో మహిళల కష్టాలు కడతేరిన రోజు. ఆ భగవంతుని కృప వీరిపై సదా వర్పించుగాక.

ముఖేశ్ బందోపాధ్యాయ :
ఎంత నీచంగా మాట్లాడుతున్నావు శ్రీకాంత్ బాబూ ! ఇది మనని పరలోకంలో శిక్షలనుభవించేలా చేస్తుంది. విధవకు మళ్ళీ పెళ్ళి ! ఆమె వివాహం ద్వారా ఒక ఇంటికి గృహిణిగా వెళ్ళి అక్కడ వంశవృద్ధికి తోడ్పడుతుంది. అలాంటిది మరోసారి మరో ఇంటికా ! అయ్యో ! భగవంతుడా రక్షించు నా దేశాన్నీ, దేశవాసులనూ.

రాజ్యలక్ష్మి:
ఇది నిజంగా సుదినం శ్రీకాంత్ బాబూ ! మా ఆడవారికి చిన్నవయసులో వృద్దులతో వివాహం, వారి మరణంతో వీరు విధవలై, జీవితాంతం అత్త వారిళ్ళలో ఉచితంగా ఊడిగం చేయటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇది మంచి ఆరంభం. ఆ భగవంతునికి శతకోటి కృతజ్ఞతలు.

8th Class Social Textbook Page No.217

ప్రశ్న 12.
బాలుర మాదిరిగా బాలికల చదువులకు ఈనాడు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారా? లేక బాలికలు వివక్షతకు, ‘గురవుతున్నారా?
జవాబు:
ఈనాడు బాలుర మాదిరిగా బాలికల చదువుకు సమాన ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో బాలికల నమోదే ఎక్కువగా ఉంటోంది అని చెప్పవచ్చు. కానీ ఎక్కడో కొన్ని కుటుంబాల్లో మాత్రం బాలికలు వివక్షకు గురి అవుతున్నారని చెప్పవచ్చు. అంతేకాక కొన్ని వెనుకబడిన రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి కనబడుతోంది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 13.
చదువుకోటానికి బాలురు ఎదుర్కోనే ఏ కష్టాలను బాలికలు ఎదుర్కొంటున్నారు?
జవాబు:

  1. బాలికలు సాధారణంగా ఉన్నత విద్యను తక్కువగా అందుకుంటున్నారు.
  2. బాలురు చదువుకోసం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నారు. కానీ బాలికలకు అన్నిచోట్లకి అనుమతి దొరకటం లేదు.
  3. కొన్ని కోర్సులలో బాలికలకు అవకాశం ఉండటం లేదు.

ప్రశ్న 14.
వితంతువుల పట్ల వ్యవహరించే తీరు ఈనాడు ఎంతవరకు మారింది?
జవాబు:
వితంతువుల పట్ల ఈనాడు సమాజ దృక్పథం మారింది అని స్పష్టంగా చెప్పవచ్చును. నేటి సమాజంలో చాలావరకు – వీరిని అందరు ఇతర మహిళల లాగానే గుర్తిస్తున్నారు. వీరికి పెద్దలే మరలా వివాహాలు చేస్తున్నారు. చేసుకోవటానికి పురుషులు కూడా వారంతటవారే ముందుకు వస్తున్నారు. కొన్ని మతపరమైన ఆచారాలలో తప్ప వీరిని అన్నింటా ఇతరులతో సమానంగానే గౌరవిస్తున్నారు.

ప్రశ్న 15.
ఈనాటికీ దళిత బాలికలు, ముస్లిం బాలికలు చదువుకోటానికి ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారా?
జవాబు:
దళిత బాలికలు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఇతర సమాజం నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని అప్పుడప్పుడు వార్తా పత్రికలలో వార్తలు వింటున్నాం. వీరు కూడా అందరితోపాటు సమానంగానే తరగతి గదుల్లో విద్యనభ్యసిస్తున్నారు. ముస్లిం బాలికలకు కూడా ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి. వీరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా చదువుకుంటున్నారు.

8th Class Social Textbook Page No.218

ప్రశ్న 16.
అంటరాని ప్రజలు అసలు చదువులేకుండా ఉండడం కంటే ఇది మెరుగని కొంతమంది భావించారు. మీరు వీళ్లతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. నేను వాళ్ళతో ఏకీభవిస్తాను. జ్యోతిబా పూలే, అంబేద్కర్లు అటువంటి కష్టనష్టాల కోర్చి విద్యనభ్యసించారు కాబట్టే వారు భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. లేకుంటే ఇప్పటికీ అదే పరిస్థితి ఉండి ఉండేది.

8th Class Social Textbook Page No.219

ప్రశ్న 17.
ఈనాటికీ జ్యోతిబా పూలే భావాలు అవసరమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి నిమ్నకులాల అభివృద్ధి కొరకు మన ప్రభుత్వాలు ‘రిజర్వేషన్లు’ అన్నిటా అమలు చేస్తున్నాయి. ఈ కులాల వారందరూ మిగతా అన్ని కులాల వారితో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ భావాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 18.
నిమ్నకులాల విద్యార్థులకు ఆ కులాల ఉపాధ్యాయులే చదువు చెప్పాలని అతడు ఎందుకు అన్నాడు?
జవాబు:
శూద్రులు, అతిశూద్రులు కుల వివక్షతకు గురై పాఠశాలల్లో, కళాశాలల్లో అనేక అవమానాలకు గురౌతున్నారని అంతే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయులు, నిమ్నకులాల విద్యార్థులకు చదువు చెప్పకుండా వెలివేసే విధానంలో చదువు నేర్పిస్తున్నారని, కులవ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ అతడు దీనికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి పుస్తకాలతో పాటు నిమ్నకులాల పిల్లలకోసం నిమ్న కులాల టీచర్లే చదువు చెప్పాలని తలంచాడు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మ స్టైర్యం పెరుగుతుందని భావించాడు.

ప్రశ్న 19.
నారాయణ గురు, జ్యోతిబా పూలేల కృషిని పోల్చండి. వాళ్ళ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ కులవ్యవస్థను ఖండించారు.
  2. ఇరువురూ అనేక పాఠశాలలను స్థాపించారు.
  3. ఇరువురూ బ్రాహ్మణాధిక్యతను తోసిరాజన్నారు.

తేడాలు :

నారాయణ గురు జ్యోతిబా పూలే
1) ఈయన ఒక మత గురువు. 1) ఈయన ఒక సంఘసంస్కర్త.
2) కుల వివక్షత లేని దేవాలయాలను స్థాపించి, బ్రాహ్మణ పూజారులు లేని సామాన్య పూజా విధానాన్ని ప్రోత్సహించాడు. 2) నిమ్న కులాల వారికి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. వీటిలో నిమ్న కులాల ఉపాధ్యాయులే బోధించాలని చెప్పాడు.
3) కుల వివక్షతను ఖండించాడు. అన్ని రకాల కుల వివక్షతలకు స్వస్తి చెప్పాలని చెప్పారు. 3) నిమ్న కులాలవారు బ్రాహ్మలు లేకుండా పెళ్ళిళ్ళు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు.

8th Class Social Textbook Page No.220

ప్రశ్న 20
కులవ్యవస్థకు సంబంధించి బుద్ధుని బోధనలను గుర్తుకు తెచ్చుకోండి.
జవాబు:
బుద్ధుడు సర్వమానవ సమానత్వాన్ని చాటాడు. కుల,మత భేదాలను వ్యతిరేకించాడు. అందరినీ కలిసి ఉండమని బోధించాడు. తన పంథాను అనుసరించిన వారందరినీ సమానంగా చూశాడు.

ప్రశ్న 21.
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏవిధంగా దోహదపడింది?
జవాబు:
ఆంధ్ర ప్రాంతంలో దళితులు మూలవాసులు అన్న భావన దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిందనే చెప్పాలి. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులనీ, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను బలంతో అణచివేసారని చెబుతారు. జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో ‘జగన్‌మిత్ర మండలి’ని
భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించి ఆత్మస్టైర్యం పెంచారు. దళితులకు ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా కూడా వాళ్ళలో చైతన్యం వెల్లివిరిసింది.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 22.
స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికీ ఓటుహక్కు లభించిందా?
జవాబు:
సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ఆశించి, ప్రోత్సహించారు. ఉప్పుసత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొని విజయవంతం చేయడం వల్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలందరికు ఓటుహక్కు లభించింది.

ప్రశ్న 23.
స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యమైన మహిళా నాయకుల గురించి తెలుసుకోండి – కల్పనాదత్, అరుణ అసఫ్ అలీ, కెప్టెన్ లక్ష్మీ సెహగల్, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ మొదలగువారు.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1
1) కల్పనాదత్ :
ఈమెను తరువాత కాలంలో కల్పనాజోషి అని పిలిచేవారు. ఈమె చిటగాంగ్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యురాలు. పేరొందిన చిటగాంగ్ ఆయుధాల దోపిడీ కేసులో ఈమె కూడా పాల్గొన్నారు. తరువాత ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 2
2) అరుణా అసఫ్ అలీ :
ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కాలంలో అరుణ గొవాలియా మైదానంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి యువతి గుండెల్లో స్ఫూర్తిని నింపారు. ఆమె ఈ కింది అవార్డులను పొందారు.
లెనిన్ ప్రైజ్ ఫర్ పీస్ – 1975
జవహర్లాల్ నెహ్రూ అవార్డు – 1991
భారతరత్న – 1998

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 3
3) కెప్టెన్ లక్ష్మీ సెహగల్ :
ఈమె 1943లో నేతాజీని సింగపూర్ లో కలిసే వరకు డాక్టరు వృత్తిలో కొనసాగారు. నేతాజీతో కలిసి మహిళా రెజిమెంట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వెంటనే ‘ఝాన్సీరాణి రెజిమెంట్’ను స్థాపించి కెప్టెన్‌గా మారారు. 1945 మేలో బ్రిటిషు వారు ఆమెను అరెస్టు చేశారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 4
4) సరోజినీనాయుడు :
భారత జాతీయ కాంగ్రెస్ కు ద్వితీయ మహిళాధ్యక్షురాలు. ఆమెను నైటింగేలు ఆఫ్ ఇండియా అని పిలిచారు. ఆమె బెంగాలు విభజన కాలంలో ఉద్యమంలో చేరారు. అనేక కవితలు రాశారు. ఈమె జన్మదినాన్ని భారతదేశంలో మహిళా దినోత్సవంగా జరుపుతారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 5
5) కమలాదేవి ఛటోపాధ్యాయ :
ఈమె స్వాతంత్ర్య పోరాటంలో 1923లో సహాయ నిరాకరణోద్యమంలో చేరారు. భారతదేశంలో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళ.

8th Class Social Textbook Page No.221

ప్రశ్న 24.
దళితుల పట్ల తమ దృక్పథంలో గాంధీజీ, అంబేద్కర్ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు:

  1. ఇరువురూ దళితుల కోసం పాటుపడ్డారు.
  2. ఇరువురూ కాంగ్రెస్ వాదులే.

తేడాలు :

గాంధీజీ అంబేద్కర్
1) ఈయన అగ్రవర్ణస్తుడై దళితుల కోసం పోరాడారు. 1) ఈయన దళితుడిగా దళితుల కోసం పోరాడారు.
2) ఈయన దళిత అభ్యర్థులకు ఎన్నికలలో సీట్లు రిజర్వు చేయించారు. 2) ఈయన దళితులకు, దళితులే వేరుగా ఓట్లు వేయాలని భావించారు.
3) ఈయన కాంగ్రెసులో ఉండే వారికోసం పనిచేశారు. ఈ పోరాటాన్ని కాంగ్రెస్ లో భాగంగా చేశారు. 3) ఈయన దళితుల కోసం ఇండిఫెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు.
4) ఈయన చివరి వరకు హిందూ మతంలోనే ఉండి దళితుల కోసం పోరాడారు. 4) ఈయన హిందూమతాన్ని విశ్వసించలేక చివరలో బౌద్ధ మతానికి మారారు.

AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

ప్రశ్న 25.
ఈనాడు దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలల్లో దళితులకు సమాన హక్కులు ఉన్నాయా? వాళ్లు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి?
జవాబు:
నేడు దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం లభ్యమే. నీటి వనరులు, పాఠశాలల్లో చెప్పుకోవాలంటే దళితులకు సమానహక్కులే కాక, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. అంటే అందరితో పాటు సమానంగా అన్ని ప్రభుత్వం వీరికి అందిస్తోంది. అంతేకాక కొన్ని వీరి కొరకు రిజర్వు చేసి అవి వారికి మాత్రమే అందిస్తుంది. వీరు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు ఏమీ లేవనే చెప్పవచ్చు.

పట నైపుణ్యాలు

ప్రశ్న 26.
ఈ క్రింది బొమ్మలలో మత సంస్శలు సంఘ సంస్కర్తలను గుర్తించి, మీ ఉపాధ్యాయుల సహకారంతో వారి పేర్లు వ్రాయుము.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 6

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 12th Lesson Questions and Answers ప్రమాణాలు మరియు గ్రాఫులు

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

9th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 1.
లీటరు అనేది ప్రాథమిక ప్రమాణమా లేక ఉత్పన్న ప్రమాణమా?
జవాబు:
1) లీటరు అనగా 10 సెం.మీ. భుజం గల ఘనం యొక్క ఘనపరిమాణం.
2) 1 లీ. = 10 సెం.మీ. X 10 సెం.మీ. X 10 సెం.మీ.
1లీ. = 10 సెం.మీ. ” 3) లీటరు అనేది ఉత్పన్న రాశి.

9th Class Physical Science Textbook Page No. 207

ప్రశ్న 2.
2 కిలోగ్రాములు మరియు 100 గ్రాములలో ఏది అధిక పరిమాణం కలిగి ఉంటుంది?
జవాబు:
2 కిలోగ్రాములు.

ప్రశ్న 3.
దానికి రషీద సమాధానం ఏమై ఉంటుంది?
జవాబు:
2 కిలోగ్రాములు అధిక పరిమాణం కలిగి ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 4.
ఒక వేళ రషీద షాపు వానిని 2 పంచదార మరియు 100 టీపొడి ఇమ్మని అడిగితే, అతను తూచి ఇవ్వగలదా? కారణం తెలపండి.
జవాబు:
ఇవ్వలేదు. ఎందుకనగా కొలత ప్రమాణాలతో పదార్ల పరిమాణాలను చెప్పలేదు.

ప్రశ్న 5.
కాలానికి ప్రమాణాలు చెప్పగలవా? అవి ఏమిటి?
జవాబు:
సెకను, నిమిషం, గంట మొదలైనవి.

ప్రశ్న 6.
వేరు వేరు ప్రమాణాలు ఎందుకు అవసరమవుతాయి?
జవాబు:
ఒక పదార్థం పరిమాణాలను బట్టి వేరు వేరు ప్రమాణాలు అవసరమవుతాయి.

9th Class Physical Science Textbook Page No. 208

ప్రశ్న 7.
ఎందుకు మనం వివిధ వస్తువులకు వివిధ ప్రమాణాలను వినియోగిస్తున్నాం?
జవాబు:
పదార్థ పరిమాణాలను బట్టి వాటి ప్రమాణాలను వినియోగించాలి.

ప్రశ్న 8.
సుద్దముక్క ద్రవ్యరాశి కిలోగ్రాములలో వ్యక్తపరచగలమా?
జవాబు:
సాధారణంగా సుద్దముక్క ద్రవ్యరాశిని కిలోగ్రాములలో వ్యక్తపరచము.

ప్రశ్న 9.
వీటినే ప్రాథమిక రాశులని ఎందుకు అంటారు?
జవాబు:
పై రాశులు (పొడవు, ద్రవ్యరాశి, కాలం)లను మరే ఇతర పరిమాణాలలోనూ వ్యక్తపరచడానికి వీలులేని భౌతిక రాశులు. కావున ప్రాథమిక రాశులు.

ప్రశ్న 10.
పై పట్టికలో ప్రాథమిక రాశులేవి?
జవాబు:
పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్, కాంతి తీవ్రత, పదార్ధ పరిమాణం, ఉష్ణం, సమతల కోణం.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 11.
MKS మరియు SI పద్ధతులలో సారూప్యాలు ఏమిటి?
జవాబు:
MKS పద్ధతి మరియు SI పద్ధతిలోనూ పొడవు, ద్రవ్యరాశి మరియు కాలంలు ఉన్నాయి.

ప్రశ్న 12.
వైశాల్యాన్ని ఎలా కనుగొంటావు?
జవాబు:
పొడవు, వెడల్పులను గుణించి కనుగొంటాము.

ప్రశ్న 13.
దీనికి కావలసిన కొలతలు ఏవి?
జవాబు:
పొడవు, వెడల్పు

9th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 14.
వైశాల్యం ప్రాథమిక ప్రమాణమేనా?
జవాబు:
కాదు.

ప్రశ్న 15.
వైశాల్యం లెక్కించడానికి మనం ఉపయోగించిన ప్రాథమిక రాశి ఏది?
జవాబు:
పొడవు.

9th Class Physical Science Textbook Page No. 213

ప్రశ్న 16.
ప్రతి భుజం పొడవు ఎంత?
జవాబు:
1 సెం.మీ.

ప్రశ్న 17.
సన్నని గళ్ళ మధ్య దూరం ఎంత?
జవాబు:
1 మి.మీ.

9th Class Physical Science Textbook Page No. 215

ప్రశ్న 18.
గ్రాఫ్-1లో రేఖ ఆకారం ఎలా ఉంది?
జవాబు:
వక్రరేఖ.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

ప్రశ్న 19.
అన్ని సందర్భాలలో గ్రాఫు వక్రరేఖగానే వస్తుందా?
జవాబు:
రాదు.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 1.
పుస్తకం పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత?
సాధన:
వైశాల్యం = పొడవు ” వెడల్పు
= 20 సెం.మీ. × 12 సెం.మీ.
= 20 × 12 సెం.మీ. × సెం.మీ.
= 240 (సెం.మీ.)²
= 240 చదరపు సెం.మీ.

9th Class Physical Science Textbook Page No. 210

ప్రశ్న 2.
రవి ప్రతిరోజు 1.5 కి.మీ. దూరం నడిచి పాఠశాలకి చేరుకుంటాడు. రమ్య రోజూ 1250 మీ. దూరం నడిచి పాఠశాలకి చేరుకుంటుంది. ఎవరి ఇల్లు పాఠశాలకి ఎక్కువ దూరంలో ఉంది?
సాధన:
రవి నడుస్తున్న దూరం = 1.5 కి.మీ.
రమ్య నడుస్తున్న దూరం = 1250 మీ.
ఈ దూరాలను పోల్చడానికి రెండూ తప్పనిసరిగా ఉమ్మడి ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఇక్కడ కి.మీ. లను మీటర్లలోకి మార్చాలి.
1కి.మీ. = 1000 మీ.
1.5 కి.మీ. = 1.5 × 1000 మీ.
= 1500 మీ.

కావున రవి నడుస్తున్న దూరం = 1.5 కి.మీ. = 1500 మీ.
దీనిని బట్టి రవి ఇల్లు, రమ్య ఇల్లు కన్నా పాఠశాలకి ఎక్కువ దూరంలో ఉంది.

9th Class Physical Science Textbook Page No. 210

ప్రశ్న 3.
పట్టికను పరిశీలించి క్రింది వానికి జవాబులిమ్ము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 2

ఖాళీలను పూరింపుము.

1. 6 నానో మీటర్లు = …………….
జవాబు:
6 × 10-9 మీ.

2. 5 గిగాబైట్లు = …………………………. బైట్లు.
జవాబు:
5 × 109

3. ………….. = 4 × 10³g.
జవాబు:
4 కిలోగ్రాములు

4. ………. = 11 × 106 వాట్లు .
జవాబు:
11 మెగావాట్లు

5. 2 సెం.మీ. = 2 × ……
జవాబు:
2 × 10-2 మీటర్లు.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

9th Class Physical Science Textbook Page No. 211

జేమ్స్ మరియు శరలు నడక పోటీలో పాల్గొన్నారు. జేమ్స్ గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. శరత్ సెకనుకు 2.5 మీటర్ల వేగంతో నడిచాడు. ఇద్దరూ ఒకే సమయానికి బయలుదేరి ఒకే దారిలో నడిస్తే ఎవరు ముందుగా గమ్య స్థలానికి చేరి ఉంటారు?
సాధన:

  1. జేమ్స్ నడక వేగం కిలోమీటర్లలో, శరత్ నడక వేగం మీటర్లలో తెలుపబడింది.
  2. ఇక్కడ దూరానికి కిలోమీటరు, మీటరు అనే ప్రమాణాలను కాలానికి గంట, సెకను అనే ప్రమాణాలను వినియోగించారు.
  3. ఏవైనా రెండు రాశులను పోల్చాలంటే వాటి ప్రమాణాలు తప్పనిసరిగా ఒకే ప్రమాణాలు అయి ఉండాలి.
  4. గంటకు కిలోమీటర్ల (కి.మీ./గం.) ను, సెకనుకు మీటర్ల (మీ./సె.) లోకి మార్చాలి.
  5. జేమ్స్ వేగం = 9 కి.మీ. / గం.
    9 కి.మీ./గం. = 9 × \(\frac{5}{18}\) = 2.5 మీ./సె.
  6. శరత్ వేగం = 2.5 మీ./సె.
  7. కావున ఇద్దరూ ఒకేసారి గమ్యస్థానానికి చేరుతారు.

9th Class Physical Science 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
నీ గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని పట్టికలోని వస్తువులను సాధారణంగా ఏ ప్రమాణంతో కొలుస్తారో టిక్ (✓) గుర్తు పెట్టండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 3

కృత్యం – 2

2. ఒక పుస్తకం తీసుకొని దాని ఉపరితల వైశాల్యం ఎట్లా కనుగొంటావో రాయుము.
జవాబు:
1) పుస్తకం యొక్క పొడవు, వెడల్పులను కొలవండి.
2) పొడవు, వెడల్పులను గుణిస్తే వైశాల్యం వస్తుంది.
3) పొడవు = ………….
4) వెడల్పు = ………….
5) వైశాల్యం = పొడవు × వెడల్పు = ………….

→ వైశాల్యం ప్రాథమిక రాశియేనా?
జవాబు:
కాదు.

→ వైశాల్యం లెక్కించడానికి మనం ఉపయోగించే ప్రాథమిక రాశి ఏది?
జవాబు:
పొడవు.

3. క్రింది పట్టికను పరిశీలించండి. మీ పరిశీలన ఆధారంగా ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 4
1. ప్రాథమిక రాశులను గుణిండం ద్వారా వచ్చిన ఉత్పన్న రాశులు ఏవి?
జవాబు:
వైశాల్యం, ఘన పరిమాణం.

2. ప్రాథమిక రాశి పొడవును మాత్రమే గుణించడం ద్వారా వచ్చిన ఉత్పన్న రాశులేవి?
జవాబు:
వైశాల్యం , ఘన పరిమాణం.

3. ఏ ఉత్పన్న రాశికి ప్రమాణాలు లేవు? ఎందుకు?
జవాబు:

  1. సాపేక్ష సాంద్రతకి ప్రమాణాలు లేవు.
  2. ఇది రెండు సాంద్రతల నిష్పత్తి, కావున ప్రమాణాలు లేవు.

4. ఘన పరిమాణానికి ప్రమాణాలేవి?
జవాబు:
m³(మీ³)

5. కాలం, త్వరణంతో సంబంధం ఉన్న ఉత్పన్న ప్రమాణాలేవి?
జవాబు:
i) కాలంతో సంబంధం ఉన్న ఉత్పన్న ప్రమాణాలు

  1. వేగం (m/s)
  2. త్వరణం (m/s²)
  3. బలం (kg.m/s²)
  4. పీడనం (kg/m.s²)

ii) త్వరణంతో సంబంధం ఉన్న ఉత్పన్న ప్రమాణాలు
1) బలం (kg.m/s²)

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

కృత్యం – 4

4. క్రింది ఇవ్వబడిన పట్టికలోని దత్తాంశానికి గ్రాఫును గీయుము.
(లేదా)
దూరం – కాలం గ్రాఫును గీయుము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 5
జవాబు:
పట్టికలోని సమాచారం ఆధారంగా స్వతంత్ర రాశిగా ‘కాలం’ను, ఆధారిత రాశిగా ‘దూరం’ ను తీసుకోవాలి.
గ్రాఫుని గీయడంలో సోపానాలు :
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 6

1) అక్షాలు :
→ కాలం ఏ అక్షం మీద ఉంది?
జవాబు:
X – అక్షం మీద.

→ దూరం ఏ అక్షం మీద ఉంది?
జవాబు:
Y- అక్షం మీద.

2) వ్యాప్తి :
i) ముందుగా X – అక్షంపై విలువలను తీసుకుందాం
అవి : 5, 10, 15, 20, 25, 30, 35, 40
ii) వీటిలో అతి పెద్ద విలువ – 40; అతి చిన్న విలువ – 5

→ అతి పెద్ద విలువకి, అతి చిన్న విలువకి మధ్య వ్యత్యాసం ఎంత?
జవాబు:
40 – 5 – 35

iii) దీనినే వ్యాప్తి అంటారు.
iv) Y- అక్షం పై వ్యాప్తి = పెద్ద విలువ – చిన్న విలువ = 33 – 3 = 30

3) స్కేలు :
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 7

→ పట్టికలోని దూరం విలువలలో ఏఏ విలువలు Y – అక్షంపై గుర్తించిన విలువలకు సమానంగా ఉన్నాయి?
జవాబు:
3, 12, 24, 30, 33

4) అక్షాల పేర్లు :
i) X- అక్షంపై ‘కాలం’ తీసుకున్నాం కాబట్టి X – అక్షం దగ్గర కాలం (నిమిషాలలో) అని రాయాలి.
ii) Y – అక్షంపై ‘దూరం’ తీసుకున్నాం కాబట్టి Y – అక్షం దగ్గర దూరం (కి.మీ.లలో) అని రాయాలి.

5) దత్తాంశ బిందువులు :
i) పట్టికలోని విలువలను దత్తాంశ బిందువులుగా రాయాలి.
ii) (5,3), (10,8), (15, 12), (20, 19), (25, 24), (30, 24), (35, 30), (40, 33)

6) దత్తాంశ బిందువులను గుర్తించడం :
i) పై బిందువులను X – అక్షం, Y – అక్షంపై ఉన్న స్కేలు ఆధారంగా నిలువు, అడ్డు రేఖల ఖండన బిందువుల వద్ద గుర్తించాలి.
ii) గుర్తించిన బిందువులను కలుపుతూ గీసిన రేఖయే గ్రాఫ్. దీనినే మనం ‘దూరం – కాలం గ్రాపు’ అని అంటాము.

→ గ్రాఫు ఎలా ఉంది?
జవాబు:
గ్రాఫు వక్రరేఖా గ్రాఫు.

కృత్యం – 5

5. సరళరేఖా గ్రాఫును గీయండి.
(లేదా)
హుక్ సూత్రం నిరూపించే ప్రయోగ విలువలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. గ్రాఫు ద్వారా సూత్రాన్ని నిరూపించుము.
(లేదా )
రెండు రాశుల మధ్య అనులోమానుపాతం సంబంధాన్ని చూపే గ్రాఫు గీయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 8
1) ఒక స్ప్రింగ్ ను గాని, రబ్బరు బ్యాండ్ ను గాని తీసుకొనుము.
2) స్టాండ్ కి స్ప్రింగ్ ను బిగించుము.
3) స్ప్రింగ్ పొడవును స్కేలుతో కొలువుము.
4) స్ప్రింగ్ రెండవ కొనకు బరువును వేలాడదీయుము.
5) సాగిన స్ప్రింగ్ పొడవును కొలువుము.
6) స్ప్రింగ్ లో సాగుదలను లెక్కించుము.
7) ఈ విధంగా బరువులను పెంచుతూ, స్ప్రింగ్ సాగుదలను ప్రతిసారి లెక్కించుము.
8) పట్టికలో ద్రవ్యరాశి (g), సాగుదల (mm) లను నమోదు చేయుము.
9) వివరాలు నమోదు చేయబడిన పైన ఇచ్చిన పట్టికకు గ్రాఫు గీయుము.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 9 AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 10
10) గ్రాఫు (0, 0) గుండా పోవు సరళరేఖ గ్రాఫు. ద్రవ్యరాశికి స్ప్రింగ్ సాగుదల అనులోమానుపాతంలో ఉంటుందని తెలుస్తుంది.

i) X – అక్షంపై తీసుకున్న రాశి ఏది? దీనిని ఏ ప్రమాణాలలో వ్యక్తం చేస్తారు? దానిని ఎందుకు X – అక్షంపై తీసుకున్నారు?
జవాబు:

  1. X – అక్షంపై తీసుకున్న రాశి ద్రవ్యరాశి.
  2. ద్రవ్యరాశిని ‘గ్రాములు’ ప్రమాణాలలో వ్యక్తపరుస్తారు.
  3. ద్రవ్యరాశి స్వతంత్ర రాశి. కావున X – అక్షంపై తీసుకున్నారు.

ii) Y – అక్షంపై తీసుకున్న రాశి ఏది? దీనిని ఏ ప్రమాణాలలో వ్యక్తం చేస్తారు? దీనిని స్వతంత్ర రాశి అనవచ్చా? ఎందుకు?
జవాబు:

  1. Y- అక్షంపై తీసుకున్న రాశి సాగుదల.
  2. సాగుదలని మి.మీ.లలో వ్యక్తం చేస్తారు.
  3. సాగుదల స్వతంత్ర రాశి కాదు. ద్రవ్యరాశి మార్పునకు అనుగుణంగా సాగుదల రీడింగులు వస్తాయి. అనగా స్వతంత్ర రాశి కాదు. ఆధారిత రాశి.

iii) X – అక్షంపై వ్యాప్తి విలువ ఎంత?
జవాబు:
వ్యాప్తి – 50 – 0 = 50

iv) Y- అక్షంపై వ్యాప్తి విలువ ఎంత?
జవాబు:
వ్యాప్తి = 10 – 0 = 10

v) X – అక్షంపై స్కేలు ఎంత?
జవాబు:
1 సెం.మీ. – 10 గ్రా.

vi) Y- అక్షంపై స్కేలు ఎంత?
జవాబు:
1 సెం.మీ. = 2 మి.మీ.

vii) X – అక్షంపై గల దత్తాంశ విలువలు
జవాబు:
0, 10, 20, 30, 40, 50.

viii) Y- అక్షంపై గల దత్తాంశ విలువలు
జవాబు:
1, 2, 4, 6, 8, 10.

ix) ఖండన బిందువులను కలుపుతూ గీసిన రేఖ ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
సరళ రేఖ.

x) రేఖవాలు దేనిని సూచిస్తుంది?
జవాబు:
ద్రవ్యరాశి – స్ప్రింగు సాగుదల మధ్య సంబంధం అనులోమానుపాతంలో ఉందని సూచిస్తుంది.

xi) స్పింగ్ సాగుదలకు కారణం ఏమిటి?
జవాబు:
ద్రవ్యరాశిని స్ప్రింగ్ కి వేలాడదీయడం వలన.

xii) ద్రవ్యరాశి – స్ప్రింగ్ లో సాగుదల మధ్య ఏమి సంబంధం గుర్తించారు?
జవాబు:
అనులోమానుపాతం.

xiii) గ్రాఫ్ సరళరేఖగా ఉన్నప్పుడు రెండు రాశుల మధ్య ఏ విధమైన సంబంధం ఉందని చెప్పవచ్చు?
జవాబు:
అనులోమానుపాతం.

xiv) పై గ్రాఫు ప్రకారం క్రింది వాక్యా లలో ఏది సరైనది?
ఎ) ద్రవ్యరాశి పెరిగితే స్ప్రింగ్ సాగుదల పెరుగుతుంది.
బి) ద్రవ్యరాశి తగ్గితే స్ప్రింగ్ సాగుదల పెరుగుతుంది.
సి) ద్రవ్యరాశి పెరిగినా, తగ్గినా స్ప్రింగ్ సాగుదలలో మార్పు ఉండదు.
జవాబు:
ఎ) సరైనది.

AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు

కృత్యం – 6

6. విలోమానుపాత సంబంధాన్ని సూచించే ఏదైనా ఒక గ్రాఫు గీయుము.
(లేదా)
పీడనానికి, ఘనపరిమాణానికి మధ్య సంబంధాన్ని సూచించే గ్రాఫును గీయండి.
(లేదా)
క్రింది పట్టికకు గ్రాఫు గీయండి.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 11
జవాబు:

  1. ఒక 50 మి.లీ. సిరంజిని తీసుకోండి.
  2. ప్లంజర్‌ను లాగి సిరంజిని గాలితో నింపండి.
  3. గాలి సిరంజి నుండి బయటకు పోకుండా వేలితో మూయండి.
  4. సిరంజిలోని గాలి స్తంభం యొక్క ఎత్తు గాలి ఘనపరిమాణాన్ని సూచిస్తుంది.
  5. ఇపుడు ప్లంజర్‌ను నెమ్మదిగా ముందుకు నొక్కండి.

→ ఏ స్థానం వద్ద ప్లంజరు ముందుకు కదలలేదు?
జవాబు:
గరిష్ట పీడనం వద్ద ప్లంజరు ముందుకు కదలలేదు.

→ గాలి ఒత్తిడిని కలిగిస్తుందని నీకు అనిపిస్తుందా?
జవాబు:
అనిపిస్తుంది.

6) ప్లంబర్‌ను ముందుకు నొక్కే కొద్ది సిరంజిలో గాలి ఘనపరిమాణం తగ్గుతుంది. లోపలి గాలిపీడనం పెరుగుతుంది.

7) ఇచ్చిన పట్టికలోని విలువలకు గ్రాఫును గీద్దాం.
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 12
→ X- అక్షంపై తీసుకున్న భౌతికరాశి ఏది?
జవాబు:
పీడనం

→ Y – అక్షంపై తీసుకున్న భౌతికరాశి ఏది?
జవాబు:
ఘనపరిమాణం

→ గ్రాఫులో స్వతంత్రరాశి ఏది?
జవాబు:
పీడనం

→ గ్రాఫులో ఆధారిత రాశి ఏది?
జవాబు:
ఘనపరిమాణం

→ నిలువు అక్షంపై తీసుకున్న రాశి యొక్క వ్యాప్తి ఎంత?
జవాబు:
50 – 18.7 = 31.3

→ క్షితిజ సమాంతర అక్షంపై తీసుకున్న రాశి యొక్క వ్యాప్తి ఎంత?
జవాబు:
3.2 – 1.2 = 2

→ గ్రాఫు ఆకారం ఏమిటి?
జవాబు:
పరావలయం (వక్రరేఖా గ్రాపు)

→ ఆ గ్రాఫులో ఉన్న దత్తాంశ బిందువుల ఆధారంగా అక్షాలపై ఉన్న భౌతికరాశుల మధ్య నీవు ఏమి సంబంధాన్ని గుర్తించావు?
జవాబు:
విలోమానుపాతం

కృత్యం – 7

7. క్రింది గ్రాఫులు పరిశీలించి ఇచ్చిన పట్టికను నింపుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 13 AP Board 9th Class Physical Science Solutions 12th Lesson ప్రమాణాలు మరియు గ్రాఫులు 14

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

SCERT AP 8th Class Social Study Material Pdf 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 24th Lesson విపత్తులు – నిర్వహణ

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సంభవించిన లేదా టీవీలో చూసిన ప్రకృతి వైపరీత్యాలను, జరిగిన నష్టాన్ని చెప్పండి. నష్టాన్ని తగ్గించాలంటే ఏ ఏ చర్యలు చేపట్టాలో తెల్పండి. (AS4)
జవాబు:
ఇటీవల మా ప్రాంతంలో విపరీతమైన వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. మా ఇళ్ళు, పొలాలు అన్నీ నీట మునిగాయి. మా ప్రాంతంలో 8 మంది వరద ఉధృతికి నీట మునిగి కొట్టుకుపోయారు. చేలు మునగటం వలన వరి పంట మొత్తం నాశనమయ్యింది. పశువులు మేతలేక, నీట మునిగి మరణించాయి.

కృష్ణానదికి అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళిస్తే ఈ వరదను అరికట్టవచ్చు. లోతట్టు ప్రాంతాల వారిని వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాతలను ప్రోత్సహించి వారికి ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు.

ప్రశ్న 2.
వైపరీత్యాలను ఎలా నివారించవచ్చు? ఎలా ఎదుర్కోవచ్చు? (AS1)
జవాబు:
సృష్టిలో మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. ఇలాకాక మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అంతేకాక మడచెట్ల పెంపకం, భద్రమైన ప్రదేశాలలోకి గ్రామాలను మార్చటం, తుపానులను, భూకంపాలను తట్టుకునే విధంగా భవన నిర్మాణాలను ప్రోత్సహించడం మొదలైన వాటితో నష్టాలను నివారించవచ్చు.

వైపరీత్య బృందాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వటం, షెల్టర్లు, దిబ్బలు ఏర్పాటు చేయడం మొదలైన వాటితో వీటిని ఎదుర్కోవచ్చు.

ప్రశ్న 3.
వైపరీత్యాలకు సంబంధించి పెద్దవాళ్ల అనుభవాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని వాటి గురించి రాయండి. (AS3)
జవాబు:
ఒకసారి హైదరాబాదులో భూకంపం వచ్చిందట. వేసవికాలం రాత్రిపూట అందరూ ఆరు బయట పడుకుని ఉండగా వచ్చిందట. ముందు మా బామ్మగారు ఏదో కుక్క మంచాన్ని కదుపుతోంది అనుకున్నారట. ఈలోగా చుట్టు ప్రక్కల వాళ్లు ‘భూకంపం’ అని కేకలు వేయడం వినిపించిందట. అంతే అందరూ ఒక్క ఉదుటున లేచి వీధిలోకి పరిగెత్తారట. చూస్తుండగానే రోడ్డు చివర ఒక ఎత్తైన భవనం కూలిపోయిందట. ఇళ్ళల్లోని సామానులన్నీ క్రిందపడిపోయాయట. చాలామంది ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చాయట. ఆ రాత్రి నుంచి తెల్లారే వరకు 5, 6 సార్లు భూమి కంపించిందట. మా వాళ్ళు అలాగే రోడ్ల మీద కూర్చుని ఉన్నారట కానీ ఇళ్ళల్లోకి వెళ్ళలేదట. తెల్లారాక భయం లేదని నమ్మకం కలిగాక ఇళ్ళలోకి వెళ్లి పని పాటలు మొదలు పెట్టారట.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
ప్రజలు విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించండి. (AS4)
జవాబు:
ప్రకృతి విపత్తులను ముందే ఊహించి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. సులువుగా తప్పించుకునే మార్గం ముందే ఆలోచించి ఉంచుకోవాలి.
  2. అవసరమైన సామగ్రిని ఒక బ్యాగులో సర్దుకుని ఉంచుకోవాలి.
  3. నీటికి సంబంధించిన విపత్తు అయితే ఎత్తైన ప్రాంతాలకు ముందే చేరుకోవాలి.
  4. నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను సేకరించి ఉంచుకోవాలి.
  5. అత్యవసరమైన మందులను దగ్గరుంచుకోవాలి.
  6. ఇతరులకు అవకాశమున్నంతమేర సాయం చేయాలి.

ప్రశ్న 5.
కరవు ప్రభావాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
కరవు ప్రభావం :
కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

  1. భూగర్భజల నీటిమట్టం పడిపోవటం, తాగునీటి కొరత.
  2. పంటల విస్తీర్ణం తగ్గటం.
  3. వ్యవసాయం కుంటు పడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాలలోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం.
  5. ఆహారధాన్యాల కొరత.
  6. పశుగ్రాస కొరత.
  7. పశువులు చనిపోవటం.
  8. పోషకాహార లోపం, ప్రత్యేకించి చిన్న పిల్లల్లో
  9. అతిసారం, విరేచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించటం, ఆకలికి గురికావటం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడటం.
  10. నగలు, ఆస్తులు వంటివి తప్పనిసరయ్యి తాకట్టు పెట్టటం లేదా అమ్మటం.
  11. పని కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం.

ప్రశ్న 6.
నీటి వృథా జరిగే సందర్భాలను పేర్కొని, దాని నివారణకు మార్గాలను సూచించండి. (AS6)
జవాబు:
నీరు వృథా జరిగే సందర్భాలు దాని నివారణకు మార్గాలు :

  1. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిలకు హెడ్లు సరిగ్గా లేకపోవడం- దీనిని ఎప్పటికప్పుడు సరిచేయాలి.
  2. టూత్ బ్రష్, షేవింగ్ చేయునపుడు కొలాయిని వృథాగా వదలరాదు.
  3. మంచినీటి పైపుల లీకేజీని నివారించాలి.
  4. కాలువల ద్వారా పంటపొలాలకు నీటిని అవసరం మేరకు వదలాలి.
  5. నీటికొరత సమయాలలో గృహ అవసరాల కొరకు పరిమితంగా నీరు వాడాలి.
  6. బిందు సేద్యం వంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి.
  7. వర్షపు నీరు వృథాకాకుండా చెరువులకు మళ్ళించాలి.
  8. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యి త్రవ్వి వర్షపునీటి భూమిలో ఇంకేటట్లు చూడాలి.

ప్రశ్న 7.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన చిత్రాలతో ఆల్బమ్ తయారు చేయండి. (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.254

ప్రశ్న 1.
విపత్తులలో రకాలు ఏవి? వాటిని వివరించండి.
జవాబు:
విపత్తులలో రకాలు :
విపత్తులు ఏర్పడటానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
1. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండుగా విభజించవచ్చు.

ఎ) నిదానంగా సంభవించే విపత్తులు :
అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలపాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

బి) వేగంగా సంభవించే విపత్తులు :
తృటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురి చేస్తుంది. ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుపాను, ఆకస్మిక వరదలు, అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

2. కారణాలను బట్టి ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రకృతి విపత్తులు :
ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్ధిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తులలో రకాలు :
అ) భూకంపాలు
ఆ) తుపానులు
ఇ) వరదలు
ఈ) కరవు
ఉ) సునామీ
ఊ) కొండ చరియలు విరిగి పడటం
ఋ) అగ్నిపర్వతాలు, మొ||నవి

బి) మానవ నిర్మిత విపత్తులు :
మానవ కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాహాలులో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటం, 2003లో కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లు వంటివి దీనికి ఉదాహరణలు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 2.
విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి?
జవాబు:
విపత్తులపై / అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం, విపత్తుల ప్రభావాన్ని నివారించటానికి, తగ్గించటానికి, లేదా వాటి నుంచి కోలుకోవటానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అంటారు. ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించటానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోటానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.

8th Class Social Textbook Page No.256

ప్రశ్న 3.
సునామీలు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడతాయి? వాటిని ముందుగా ఎలా ఊహించవచ్చు? రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నట్లయితే సునామీ సంభవించినపుడు మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారు?
జవాబు:
జపాన్ భాషలో ‘సు’ అంటే రేవు’, ‘నామె’ అంటే ‘అలలు’ అని అర్థం. ఈ రెండూ కలిసి ‘సునామీ’ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని ‘సునామీ’ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువలోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా పదుల అడుగుల ఎత్తు పైకెగసి తీరప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తరువాత సునామీ ముప్పు చాలా గంటలపాటు ఉండవచ్చు.

ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సునామీలను పసికట్టవచ్చు. సునామీలు వచ్చినపుడు వాతావరణశాఖ హెచ్చరికల ద్వారా తెలుసుకుని, ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకుని మమ్మల్ని మేము రక్షించుకుంటాము.

ప్రశ్న 4.
సునామీ ముందు ఏం చేయాలి?
జవాబు:

  1. సునామీ ముప్పుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచు సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
  2. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకుని ఉండాలి.
  3. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోటాన్ని సాధన చేస్తూ ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవలసిన సామగ్రితో సిద్ధంగా ఉండాలి.
  5. సునామీ గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండాలి.

ప్రశ్న 5.
సునామీ గురించి రాయండి.
జవాబు:

  1. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తరవాత అనేక గంటలపాటు పెద్ద అలలు తాకే ప్రమాదముంటుంది.
  2. మైదాన ప్రాంతంలో సునామీ మనిషికంటే వేగంగా, అంటే గంటకి 50 కి.మీ. వేగంతో పయనించగలదు.
  3. సునామీ పగలు కానీ, రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

ప్రశ్న 6.
సునామీ పై మరింత సమాచారం, చిత్రాలు సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. సమాచారంను నోటీస్ బోర్డులో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 3
విద్యార్థులు స్వయంగా చర్చ నిర్వహించి, సమాచారంను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

  1. తేదీ : 00.58.83 26.12.2004.
  2. మాగ్నిట్యూడ్ : 9.1 – 9.3 mw
  3. లోతు : 30 km (19 mi)
  4. భూకంప నాభి : 3.316°N-95.854°E
  5. రకం : సముద్రంలో
  6. దేశాలు లేదా ప్రాంతాలు : ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మాల్దీవులు, ఆఫ్రికా తూ|| తీరం (సోమాలియా)
  7. మరణాలు : 230,210 – 280,000

8th Class Social Textbook Page No.259

ప్రశ్న 7.
కరవు గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
కరువు అన్నది వర్మపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్వం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని అనావృష్టి (Meteorological drought) అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీనిని వ్యవసాయ కరువు (Agricultural drought) అంటారు. కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది.

అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది (70-100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు.
అధిక + సగటు వర్షపాతం కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
సాధారణ + సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
తక్కువ – సగటు వర్షపాతం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వరకు,
బాగా తక్కువ – సగటు వర్షపాతం కంటే 60 శాతం కంటే తక్కువ.

కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరవు పీడిత’ ప్రాంతాలు అంటారు.

8th Class Social Textbook Page No.260

ప్రశ్న 8.
వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అంటే ఏమిటి? దీని ఉద్దేశ్యమేమి?
జవాబు:
కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి ప్రకృతి వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయటం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవటం ద్వారా నేల, నీటి వనరులను బాగా వినియోగించుకోవచ్చు. వాటి దురుపయోగాన్ని అరికట్టవచ్చు. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 9.
కరవును ఎదుర్కోవటం ఎలా?
జవాబు:
ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధతగా ఉండటానికి, ప్రతిస్పందించటానికి, దాని ప్రభావాన్ని తగ్గించటానికి తగినంత సమయం ఉంటుంది. పర్యవేక్షణ, ముందుగా జారీచేసే హెచ్చరికలవల్ల అన్నిస్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పందించవచ్చు. కరవుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణా విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

ప్రశ్న 10.
వర్షపు నీటిని పట్టణ ప్రాంతాలలో ఎలా నిల్వ చేయాలి?
జవాబు:
వర్షపు నీటి నిల్వ :
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలువ చేయాలి. ఈ వాన నీటినంతా ఇంకుడు గుంతలలోకి మళ్లించటం అన్నింటికంటే తేలికైన పని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపు (sump)ల లోకి వాన నీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగటానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.

8th Class Social Textbook Page No.261

ప్రశ్న 11.
మీరు నీటిని ఆదా చేసేవారా, వృథా చేసేవారా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 2
మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి, మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి.
– 200 లీటర్ల కంటే తక్కువ – పర్యావరణ హీరో
– 201 – 400 లీటర్లు – నీటి పొదుపరి
– 401 – 600 లీటర్లు – నీటి ఖర్చుదారు
– 600 లీటర్ల కంటే ఎక్కువ – నీటి విలన్
జవాబు:
నేను పర్యావరణ హీరో స్థానంలో ఉన్నాను.

ప్రశ్న 12.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 14.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

ప్రశ్న 15.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 16.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

పట నైపుణ్యాలు

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 4
ప్రశ్న 17.
సునామీ ఏయే ప్రాంతాలను తాకింది?
జవాబు:
అలప్పుజా, కొల్లం, కన్యాకుమారి, కడలూర్, నాగపట్నం, చైన్నై, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులు.

ప్రశ్న 18.
ఇవి ఏ తీరంలో ఉన్నాయి?
జవాబు:
ఎక్కువ ప్రదేశాలు తూర్పు తీరంలో, కొన్ని దక్షిణ తీరంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 19.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 20.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

SCERT AP 8th Class Social Study Material Pdf 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం

8th Class Social Studies 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి : (AS1)
1. తమ పాలనలో ఉన్న దేశాల మధ్య పోటీలు నిర్వహించటానికి క్రికెట్ ను వలస పాలకులు ప్రోత్సహించారు.
2. పాశ్చాత్యీకరణ చెందటానికి ప్రజలు ఈ ఆటను నేర్చుకోసాగారు.
3. భారతీయ గ్రామస్తులు క్రికెట్ ఆడేవాళ్లు.
4. మంచి నడవడిక అలవాటు చేయటానికి ఈ ఆటను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు.
జవాబు:
2. ఈ ఆటను అభిమానించి ప్రజలు నేర్చుకోసాగారు.
3. ఇంగ్లాండు గ్రామస్థులు క్రికెట్టు ఆడేవాళ్లు.

ప్రశ్న 2.
క్రికెట్టు, ఇతర ఆటలపై గాంధీజీ దృక్పథం గురించి కొన్ని వాక్యాలు రాయండి. (AS1)
జవాబు:
శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమని మహాత్మాగాంధి నమ్మాడు. అయితే క్రికెట్, హాకీ వంటి ఆటలు బ్రిటిషు వాళ్ల ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడి సంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని అతడు తరచు విమర్శించేవాడు. ఇది వలస పాలిత మనస్తత్వాన్ని చూపిస్తోంది. చేనులో పనిచేయడం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే ఈ ఆటల వల్ల విద్యాప్రయోజనం చాలా తక్కువ.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 3.
కింది వాటిని కుషంగా వివరించండి. (AS2)
• భారతదేశంలో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయటంలో పార్శీలు మొదటివాళ్లు.
• ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి దుబాయికి మారటంలోని ప్రాముఖ్యత.
జవాబు:
భారతీయ క్రికెట్ అంటే భారతీయులు ఆడిన క్రికెట్టు బొంబాయిలో పుట్టింది. ఈ ఆటను మొదట చేపట్టిన వాళ్లు తక్కువ సంఖ్యలో ఉన్న పార్శీలు. తమ వ్యాపారాల వల్ల బ్రిటిషువాళ్లతో మొదట పరిచయం అయింది పార్శీ సమాజానికి, మొదట పాశ్చాత్యీకరణ చెందింది వీళ్లే. భారతదేశ మొదటి క్రికెట్టు క్లబ్బును వీళ్లు 1848లో బొంబాయిలో స్థాపించారు, దాని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్. పార్శీ వ్యాపారస్తులైన టాటాలు, వాడియాలు పార్శీ క్రికెట్ క్లబ్బులకు నిధులు సమకూర్చారు, వాటికి ప్రాయోజకులుగా ఉన్నారు. అయితే భారతదేశంలోని శ్వేతజాతీయ కులీనులు ఈ ఆటలో ఆసక్తి కనబరుస్తున్న పార్శీలకు ఏ విధంగానూ సహాయపడలేదు. వాస్తవానికి తెల్లజాతివాళ్లకే పరిమితమైన బాంబే – జింఖానాలో పార్కింగ్ ప్రదేశం వినియోగించుకోవటంలో పార్శీ క్రికెటర్లతో తెల్లజాతి వాళ్లు గొడవపడ్డారు.

వలస పాలకులు శ్వేత జాతీయుల పట్ల పక్షపాతం వహిస్తారని నిర్ధారణ కావటంతో క్రికెట్టు ఆడటానికి పార్శీలు తమ సొంత జింఖానా ఏర్పాటు చేసుకున్నారు. పార్శీలకు, జాతి వివక్షత ప్రదర్శించిన బాంబే జింఖానాకు మధ్య వైరుధ్యంలో భారతీయ తొలి క్రికెట్టు ఆటగాళ్లకు తీయని విజయం లభించింది. 1885లో భారత జాతీయ కాంగ్రెసు ఏర్పడిన నాలుగు సంవత్సరాలకు అంటే 1889లో క్రికెట్టులో బాంబే జింఖానాని ఒక పార్శీ బృందం ఓడించింది.

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్‌కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

ప్రశ్న 4.
ఏదైనా ఒక స్థానిక ఆట చరిత్ర తెలుసుకోండి. మీ తల్లిదండ్రులను, తాతా, అవ్వలను వాళ్ల బాల్యంలో ఈ ఆటను ఎలా ఆడేవాల్లో అడగండి. ఇప్పుడు కూడా ఆ ఆటను అలాగే ఆడుతున్నారా? మార్పులకు కారణమైన చారిత్రక శక్తులు ఏమై ఉంటాయో ఆలోచించండి. (AS3)
జవాబు:
‘కబడ్డీ’ అంటే ‘కూత’ అని అర్థం. ఇది కౌరవులు, పాండవుల కాలం నాటి నుండి మన దేశంలో ఉన్నది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘చిక్ చిక్’ అని, కొన్ని ప్రాంతాల్లో ‘చెడుగుడు’ అని అంటారు. మా ప్రాంతంలో దీనిని ‘కబడ్డీ – కబడ్డీ! అంటారు. ఇది రెండు జట్ల మధ్య జరిగే పోటీ. జట్టుకు 12 మంది సభ్యులుంటారు. కాని జట్టుకు 7 మంది మాత్రమే ఆటలో పాల్గొంటారు.

ఈ ఆటలో కొన్ని నియమాలు :

  1. నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట.
    15 నిమిషాలు – 5 నిమిషాలు విశ్రాంతి – 15 నిమిషాలు.
  2. ‘అవుట్’ అయిన వాళ్లు బరి నుండి బయటకు వెళ్ళాలి.
  3. ‘పాయింట్’ వచ్చినపుడు లోపలికి రావాలి.
  4. ‘7 గురు’ అవుట్ అయితే ‘లోనా’ అంటారు.
  5. ‘లోనా’కి అదనంగా 2 పాయింట్లు వస్తాయి.

దీని యొక్క నియమాలు ‘కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ వారు రూపొందిస్తారు. రాష్ట్రస్థాయిలో కూడా ఈ సంస్థ ఉన్నది.

ఈ ఆట అనేక మార్పులకు, చేర్పులకు లోనయింది. ఇటీవలి కాలంలో ‘బోనస్ లైన్ పాయింట్’ ను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 6 లేదా 7 గురు క్రీడాకారులు బరిలో ఉండగా వారి బోనస్ లైన్ ను తాకి వచ్చిన వారికి ఒక పాయింట్ అదనంగా వస్తుంది. అయితే ఆటలో కూత మాత్రం ఆపరాదు.

ప్రశ్న 5.
సాంకేతిక విజ్ఞానంలో, ప్రత్యేకించి టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ఏ రకంగా ప్రభావితం చేసాయి? (AS4)
జవాబు:
రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీప కాంతులలో క్రికెట్టు వంటివి పాకర్ అనంతర ఆటలో ప్రామాణికంగా మారాయి. అన్నిటికీమించి క్రికెట్టును సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా పాకర్ దానికి గుర్తింపు తెచ్చాడు. టెలివిజన్ కంపెనీలకు ప్రసార హక్కులు అమ్ముకోవటం ద్వారా క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి. టీ.వీకి అతుక్కుపోయిన క్రికెట్టు అభిమానులకు వాణిజ్య ప్రకటనలు జారీ చేయటానికి వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయసాగాయి. టెలివిజన్లో నిరంతర ప్రసారాల వల్ల క్రికెట్టు ఆటగాళ్లు హీరోలైపోయారు. క్రికెట్టు బోర్డు వీళ్లకి చెల్లించే మొత్తం గణనీయంగా పెరిగింది. అంతేకాదు టైర్ల నుంచి శీతల పానీయాల వరకు వివిధ వస్తువులకు వాణిజ్య ప్రకటనలలో పాల్గొనటం ద్వారా క్రికెట్టు ఆటగాళ్లు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించసాగారు. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్ ఆటను మార్చివేశాయి. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలో సైతం ప్రసారం చేయటం ద్వారా క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రికెట్ ఆడే వాళ్ల సామాజిక నేపథ్యాన్ని కూడా విస్తరింపచేసింది. పెద్ద పట్టణాల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచు చూసే అవకాశం లేని పిల్లలు ఇప్పుడు తమ అభిమాన క్రీడాకారులను అనుకరించి, ఆట నేర్చుకోగలిగారు. ఉపగ్రహ టెలివిజన్ సాంకేతిక విజ్ఞానం వల్ల, బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల, క్రికెట్ కి అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

ఈ రకంగా టెలివిజన్ సాంకేతిక విజ్ఞానంలో మార్పులు ప్రస్తుత క్రికెట్ ను ప్రభావితం చేసాయి.

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 6.
క్రికెట్టు వాణిజ్య క్రీడగా మారటం వల్ల సంభవించిన పరిణామాలపై ఒక కరపత్రం తయారు చేయండి. (AS6)
జవాబు:
కరపత్రం

సిడ్నీలో జరిగే మ్యాచులు నేడు సూరత్ లో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు. ఈ చిన్న వాస్తవం క్రికెట్ అధిపత్యంలోని సమీకరణలను మార్చివేసింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతరించిపోవటంతో మొదలైన ప్రక్రియ ప్రపంచీకరణతో దాని తార్కిక ముగింపుకి చేరుకుంది. క్రికెట్టు ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు భారతదేశంలో ఉన్నందువల్ల, క్రికెట్ కు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఉన్నందువల్ల దీని కేంద్రం దక్షిణాసియాకు మారింది. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుంచి పన్నులు లేని దుబాయికి మారటం ఈ మార్పును సంకేతంగా సూచిస్తోంది.

పాత ఆంగ్ల-ఆస్ట్రేలియా, అక్షం నుంచి క్రికెట్టు కేంద్రం మారిందనటానికి మరొక ముఖ్య సంకేతంగా చెప్పవచ్చు: క్రికెట్ పద్ధతుల్లో వినూత్న ప్రయోగాలు ఉపఖండ దేశాలైన భారత, పాకిస్తాన్, శ్రీలంక వంటి క్రికెట్లు దేశాల నుంచి వచ్చాయి. బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు పాకిస్తాన్ బీజం వేసింది : ‘దూస్‌రా’, ‘రివర్స్ స్వింగ్’. ఈ రెండు నైపుణ్యాలు కూడా ఉపఖండంలోని స్థితులకు అనుగుణంగా రూపొందాయి. బరువైన ఆధునిక బ్యాటులతో దుందుడుకు ఆటగాళ్ళు ‘ఫింగర్ స్పిన్’కి చరమగీతం పాడుతున్న పరిస్థితుల్లో ‘దూరా’ ముందుకొచ్చింది. నిర్మలమైన ఆకాశం కింధ, వికెట్టుపడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించటానికి ‘రివర్స్ స్వింగ్’ వచ్చింది. మొదట్లో ఈ రెండు పద్ధతులను బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుమానంతో చూశాయి. క్రికెట్టు నియమాలను అక్రమంగా మారుస్తున్నారని ఇవి ఆరోపించాయి. బ్రిటిషు, ఆస్ట్రేలియాలోని ఆట పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే క్రికెట్లు నియమాలను రూపొందించటం సాధ్యం కాదని కాలక్రమంలో రుజువయ్యింది, ప్రపంచవ్యాప్తంగా బౌలర్లు అందరూ ఉపయోగించే పద్ధతిగా ఇవి మారాయి.

నూటయాభై సంవత్సరాల క్రితం భారతదేశంలో మొదటి క్రికెట్టు ఆటగాళ్లిన పార్టీలు ఆడటానికి ఖాళీ ప్రదేశం కోసం పోరాడవలసి వచ్చింది. ఈనాడు ప్రపంచమార్కెటు ఫలితంగా భారతీయ ఆటగాళ్లకు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తున్నారు, అత్యధిక ప్రజాదరణ కూడా వీళ్లకే ఉంది. ప్రపంచమంతా వీళ్లకి వేదికగా మారింది. ఎన్నో చిన్న చిన్న మార్పుల కారణంగా ఈ చారిత్రక మార్పులు సంభవించాయి. సరదా కోసం ఆడే పెద్దమనుషుల స్థానాన్ని, వృత్తిగా డబ్బు కోసం ఆడే క్రీడాకారులు తీసుకున్నారు. ప్రజాదరణలో టెస్టు మ్యాచ్ స్థానాన్ని ఒక రోజు మ్యాచు ఆక్రమించాయి. సాంకేతిక విజ్ఞానంలో, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మారుతున్న కాలంతో మారటమే వ్యాపార చరిత్ర అవుతుంది.

ప్రశ్న 7.
ప్రపంచ పటంలో క్రికెట్ ఆడే ఐదు దేశాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 1

8th Class Social Studies 23rd Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు InText Questions and Answers

8th Class Social Textbook Page No.246

ప్రశ్న 1.
మీకు ఆటలు ఆడటం అంటే ఇష్టమా?
జవాబు:
అవును

– ఏ ఆటలు ఆడతారు?
జవాబు:
ఖో ఖో, వాలీబాల్, బాడ్మింటన్

– ఏ ఆట అంటే మీకు ఎక్కువ ఇష్టం?
జవాబు:
బాడ్మింటన్

– కేవలం ఆడపిల్లలు లేదా కేవలం మగపిల్లలు ఆడే ఆటలు పేర్కొనండి.
జవాబు:
కేవలం ఆడపిల్లలు ఆడే ఆట : తొక్కుడు బిళ్ళ
కేవలం మగపిల్లలు ఆడే ఆట : గోళీలు.

– కొన్ని ఆటలను కేవలం పల్లెల్లోనే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : చెడుగుడు

– కొన్ని ఆటలను కేవలం బాగా డబ్బు ఉన్న వాళ్లే ఆడతారా?
జవాబు:
అవును. ఉదా : గోల్ఫ్

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 2.
మీరు ఎందుకు ఆడతారు?
కింద ఇచ్చిన కారణంతో మీరు అంగీకరిస్తే (✓) టిక్కు పెట్టండి. అంగీకరించకపోతే (✗) గుర్తు పెట్టండి. మీకు అదనంగా తోచిన కారణాలను జాబితాకు చేర్చండి.

ఆటలు ఆడటం తేలిక.
ఆటలు ఆడటం సరదాగా ఉంటుంది.
తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు మెచ్చుకుంటారు.
ఆటలు సవాళ్లను విసురుతాయి.
ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సచిన్, సానియా వంటి అభిమాన క్రీడాకారులను అనుకరించే అవకాశం.
చదువుల కంటే ఆటలు తేలిక.
టెలివిజన్లో కనపడతాం.
ఆటలలో రాత పరీక్షలు, ఇతర పరీక్షలు ఉండవు.
అంతర్జాతీయ పోటీలలో పతకాలు పొందవచ్చు.
దేశానికి ఖ్యాతి తీసుకురావటానికి
పేరు, డబ్బు, ఖ్యాతి గడించటానికి

ప్రశ్న 3.
తరగతిలోని విద్యార్థులందరి అభిప్రాయలను క్రోడీకరించి ఏ కారణాన్ని వారు ముఖ్యమైనదిగా భావిస్తున్నారో తెలుసుకోండి.
జవాబు:
మా తరగతిలో అందరూ ఆటల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రశ్న 4.
వెండీస్ అన్న పేరు గల ఒక దేశం ఏదీ లేదన్న విషయం గుర్తించారా? బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ఏ. దీవులలో ఏ దీవి నుంచి వచ్చాడో గుర్తించండి.
జవాబు:
వెస్టండీస్ అనేవి కరేబియన్ దీవులు. ఇవి ఈ పేరు మీద 1958 నుండి 1962 వరకు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కొన్ని సార్వభౌమ దీవులుగాను, కొన్ని సెయింట్ కిట్స్, నివీలో భాగాలుగానూ, యు.కే. మీద ఆధారపడి కొన్ని, – డచ్ ఆధారితాలుగా కొన్ని, యు.యస్. మీద ఆధారపడి ఒకటి ఉన్నాయి. కాబట్టి ఈ పేరుమీద ఏ దేశం లేదు.

ఈ దీవులలో బాగా వేగంగా పరిగెత్తే క్రీడాకారుడు ‘ఉసియన్ బోల్ట్’ జమైకా దీవుల నుండి వచ్చాడు.

8th Class Social Textbook Page No.249

ప్రశ్న 5.
క్రికెట్టుకీ, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించటానికీ మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
క్రికెట్టు ఇంగ్లాండులో పుట్టింది, పెరిగింది. ఇది ఇంగ్లాండు వలస దేశాలలో రాణించింది. మార్పులు, చేర్పులు అన్నీ వీరి స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి క్రికెట్టుని ప్రోత్సహించడం అంటే పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడమే. ఇదే వాటి మధ్యనున్న సంబంధం.

ప్రశ్న 6.
ఇక్కడ ఆటలు ఆడటానికి వివిధ క్రీడా పరికరాలు ఉన్నాయి. మీకు స్థానికంగా దొరికే వాటితో పోలిస్తే వీటి నాణ్యత తేడాగా ఉందని మీరు గమనించి ఉంటారు. డబ్బుకోసం వృత్తి క్రీడాకారులు ఉపయోగించే ఈ పరికరాలను సరదా కోసం ఆదుకునే పిల్లలు కొనగలుగుతారా?
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 2
జవాబు:
ఇవి చాలా ఖరీదైన ఆట వస్తువులు. వీటిని మామూలు స్థాయివారు కొనలేరు. సరదా కోసం ఆడేవారు అసలే కొనలేరు. వృత్తి క్రీడాకారులు డబ్బు సంపాదిస్తారు, అదీగాక వీరిని పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. కాబట్టి కొనగలుగుతారు.

8th Class Social Textbook Page No.250

ప్రశ్న 7.
టెస్టు క్రికెట్టు ప్రాముఖ్యత అంతరించటం వల్ల సంభవించిన మార్పుల జాబితా తయారు చేయండి.
జవాబు:

  1. 1970వ దశకంలో క్రికెట్ మారుతున్న ప్రపంచానికి అనువుగా మారటం మొదలెట్టింది.
  2. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత తగ్గి ఒకరోజు అంతర్జాతీయ పోటీ మొదలయ్యింది. ఇది జనాదరణ పొందింది.
  3. రెండు సంవత్సరాలు పాకర్ ‘సర్కస్’ అద్భుతంగా నిర్వహించబడింది.
  4. రంగు రంగుల బట్టలు, రక్షణ హెల్మెట్లు, క్షేత్ర రక్షణలో పరిమితులు, దీపకాంతులలో క్రికెట్టు మొదలగునవి ప్రామాణికంగా మారాయి.
  5. క్రికెట్టు సొమ్ము చేసుకోగల ఆటగా మారింది.
  6. క్రికెట్టు బోర్డులు విపరీతంగా డబ్బును సంపాదించాయి.
  7. వాణిజ్య ప్రకటనలకు వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేసాయి.
  8. క్రికెట్ ఆటగాళ్ళు హీరోలైపోయారు. వీరు అనేక మార్గాలలో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.
  9. టెలివిజన్ ప్రసారాలు క్రికెట్టు ఆటను మార్చేశాయి. పల్లెల్లో సైతం ప్రేక్షకులు పెరిగారు.
  10. పట్టణాల్లో పిల్లలు తమ అభిమాన ఆటగాళ్ళ .ఆటను అనుకరించి, ఆట నేర్చుకుంటున్నారు.
  11. క్రికెట్టుకు అంతర్జాతీయ మార్కెట్టు ఏర్పడింది.

8th Class Social Textbook Page No.251

ప్రశ్న 8.
క్రికెట్టు గురించి కొంచెం సేపు ఆలోచించిన తరవాత వినాయక్ ఇంగ్లీషులోనే ఉన్న పదాలను కొన్నింటిని రాశాడు – ‘బౌండరీ’, ‘ఓవరు’, ‘వికెట్’. వీటికి తెలుగు పదాలు ఎందుకు లేవో అతడికి వివరించండి.
జవాబు:
క్రికెట్ అచ్చంగా ఇంగ్లీషు దేశంలో పుట్టింది. కాబట్టి దానికి సంబంధించిన పదాలన్నీ ఆ భాషలోనే ఉన్నాయి. వాటికి తెలుగు అనువాదాలు చేయటం కుదరదు. అందువలన అవి తెలుగులో లేవు.
ఉదా :
‘కబడ్డీ’ని అన్ని భాషలలో మనం కబడ్డీ అనే అంటాము. అనువాదం చేయలేము.

పట నైపుణ్యాలు

ప్రశ్న 11.
మీ అట్లా లో క్రికెట్ ఆడే దేశాలను గుర్తించండి. /Page No.247)

ప్రశ్న 12.
ప్రపంచ పటంలో ఈ క్రింది వాటిని గుర్తించండి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్ఎండీస్.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు జాతీయత, వాణిజ్యం 3

ప్రశ్న 13.
క్రీడలను, వాటిని ప్రోత్సహించే వారిని ప్రశంసించండి.
జవాబు:
క్రీడలు మానసిక వికాసంతోపాటు శారీరకాభివృద్ధిని పెంపొందిస్తాయి. పాఠశాల స్థాయి నుండే పిల్లల్లోని క్రీడాసక్తిని, అభిరుచిని గుర్తించి, ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వం వ్యవస్థాపరంగా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధ్వర్యంలో క్రీడాశాఖ దేశంలో క్రీడారంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పాఠశాల స్థాయి నుండే ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి క్రీడామండలుల ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పరుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడలతోపాటు స్థానిక క్రీడాంశాలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విజేతలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రీడలు, క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతోపాటు అంతర్జాతీయంగా సాంస్కృతిక వికాసానికి, అవగాహనకు తోడ్పడి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. భిన్న సంస్కృతులు కలిగిన మన దేశానికి జాతీయ సమైక్యతను పెంపొందించడానికి క్రీడలు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

ప్రశ్న 14.
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్నీలు ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు?
జవాబు:
భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు 1848లో బొంబాయిలో స్థాపించారు.

ప్రశ్న 15.
రంజీ ట్రోఫీ దేనికి సంబంధించిన పోటీ?
జవాబు:
రంజీ ట్రోఫీ క్రికెట్ కు సంబంధించిన పోటీ.

ప్రశ్న 16.
భారతదేశానికి టెస్ట్వ్య లో అవకాశం ఎప్పటిదాకా రాలేదు?
జవాబు:
భారతదేశానికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం 1952 దాకా రాలేదు.

ప్రశ్న 17.
ఏ దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది.
జవాబు:
1970 దశకంలో క్రికెట్ మార్పులకు గురయ్యింది?

AP Board 8th Class Social Solutions Chapter 23 క్రీడలు : జాతీయత, వాణిజ్యం

ప్రశ్న 18.
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ఏ దేశానిది పైచేయి?
జవాబు:
1980ల వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో భారత్ దే పైచేయి.

ప్రాజెకు

ఏదైనా ఒక క్రీడ గురించి సమాచారాన్ని సేకరించి, ఆ క్రీడా చరిత్రను నివేదిక రూపంలో రాయండి.
జవాబు:
కబడ్డీ :
మన భారతదేశానికి చెందిన ఒక సాంప్రదాయ క్రీడ – కబడ్డీ. ఈ కబడ్డీ మొదట దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఒక గ్రూపు వాళ్ళు వేటాడుతుంటే మిగతావారు వారిని కాపాడుకోవడం అనే దాని నుండి ఆవిర్భవించింది.

మనదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఇది. ఈ క్రీడను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు.
బంగ్లాదేశ్ లో – హుదుదు అని
మాల్దీవులలో – బైబాల అని
ఆంధ్రప్రదేశ్ లో – చెడుగుడు అని
తమిళనాడులో – సడుగుడు అని
మహారాష్ట్రలో – హుటుటు అని. ప్రాంతీయ పేర్లతో పిలుస్తారు.

ఇది భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబు రాష్ట్రాలకు రాష్ట్ర క్రీడగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 1936లో జరిగిన బెర్లిన్ ఒలంపిక్స్ లో ఈ ఆటకు అంతర్జాతీయ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1938లో కలకత్తాలో జరిగిన భారతదేశ జాతీయ క్రీడలలో దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

1950లో All India కబడ్డీ ఫెడరేషన్ అనే దానిని స్థాపించి ఈ క్రీడకు నియమ నిబంధనలను రూపొందించడం జరిగింది.

ప్రస్తుతం స్త్రీల కబడ్డీ పోటీలు కూడా జరుగుతున్నాయి. భారతదేశంలో ప్రో కబడ్డీ పేరిట ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల ‘జట్ల మధ్య పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడను ఆసియా క్రీడలలో కూడా చేర్చడం జరిగింది.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

SCERT AP 8th Class Social Study Material Pdf 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 18th Lesson హక్కులు – అభివృద్ధి

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిదిద్దండి. (AS1)
అ) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి.
ఆ) పథకాల అమలును కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించేలా ప్రజలు చూడాలి.
ఇ) సమాచార అధికారులు ఇష్టం వచ్చినంత కాలం సమాచారాన్ని వెల్లడి చేయకుండా ఉండవచ్చు.
ఈ) వివిధ పత్రాలు చూడటం ద్వారా కార్యక్రమాలు అవినీతి లేకుండా జరుగుతున్నాయని గుర్తించవచ్చు.
జవాబు:
ఆ) పథకాల అమలును ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా పర్యవేక్షించాలి.
ఇ) అడిగిన సమాచారాన్ని అధికారులు నిర్దేశిత సమయంలో వెల్లడి చేయాలి.

ప్రశ్న 2.
“అవినీతిని ఎదుర్కోవడానికి సమాచారం అవసరం” శీర్షిక కింద గల పేరా చదివి దిగువ ప్రశ్నకు జవాబివ్వండి. (AS2)

ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది, సంక్లిష్టమయినది. విధానాలు, పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా చూడటం చాలా కష్టం. పేదల ప్రయోజనాల కోసం, పేదరికం నిర్మూలన కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధరణంగా వాళ్లకు చేరవు, నిధులు మళ్లింపబడతాయి. దీనికి ప్రధాన కారణం అవినీతి. ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు గురించి ప్రజలకు సరైన సమాచారం లేకపోవటం అవినీతి ప్రబలటానికి ఒక ప్రధాన కారణమవుతోంది.
మీ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యక్రమం అమలు తీరును పరిశీలించి నివేదికను తయారుచేయండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం వారు వికలాంగులకు, వృద్ధులకు ఫించన్లు ఇస్తున్నారు. ప్రతినెలకు వృద్ధులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500లు ఇస్తారు. ఈ నిధులు 2, 3 నెలలకు ఒకసారి విడుదల అవుతాయి. వీటిని స్థానిక సంస్థల ద్వారా వీరికి అందచేస్తారు.

అయితే వీటిని బట్వాడా చేయటానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అందరినీ అక్కడికి రమ్మని చెబుతారు. దాదాపు ఒక్కో ప్రదేశంలో 400, 500 మంది వరకు 2, 3 రోజులు బట్వాడా జరుగుతుంది. పాపం వృద్ధులు, వికలాంగులు అంతంత సేపు ఎండలో, వానలో వరుసలో ఉండాల్సి వస్తుంది. ఒక్క రోజు సాయంత్రం వరకూ ఉన్నా వారికి రావాల్సిన సొమ్ము అందదు. మరలా మరుసటి రోజు రావాల్సి వస్తుంది. ఇదంతా చూడటానికి మాకు ఎంతో ఇబ్బందిగా, బాధగా అనిపించింది. ప్రభుత్వం ఆలోచించి వీరి లాంటి వారికి సొమ్మును నేరుగా ఇంటికే అందచేయవచ్చుగా అనిపించింది. ఇలాంటి విషయాలలో అధికారులు, నాయకులు మానవీయ కోణంలో ఆలోచించాలని మా ప్రార్థన.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 3.
సమాచార హక్కు చట్టం (స.హ.చ) ద్వారా సాధించిన విజయాలను వార్తాపత్రికల నుండి సేకరించి మీ తరగతిలో చెప్పండి. (AS3)
జవాబు:
వార్త – 1, న్యూఢిల్లీ :
హర్యానాకు చెందిన 70 సం||ల వృద్ధురాలు లక్ష్మి సింగ్ తన కుమారుడు అనూప్ సింగ్ ను ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుంది. అనూప్ సింగ్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. అతను మరణించిన తరువాత అతని భార్యకు ఫించను ఇచ్చారు. కాని ఆమె కొద్ది సం||ల తరువాత ద్వితీయ వివాహం చేసుకుంది. లక్ష్మి దిక్కులేనిదయింది. అప్పుడు ఆమె స.హ. చట్టం ద్వారా పిటీషను పెట్టుకోగా ప్రభుత్వం వారు ఫించను మార్చి ఆమెకు ఇచ్చారు.

వార్త -2:
క్షేత్రమణి భువనేశ్వర్ లో ఒక చిన్న స్థలం కొనుక్కుంది. అమ్మకందారు, ఆమె రిజిష్ట్రార్ ఆఫీసులో రిజిష్టరు చేసుకున్నారు. కాని అక్కడి గుమాస్తా 1½ సం||రం అయినా ఆమెకు డాక్యుమెంట్లు ఇవ్వలేదు. దానితో స.హ. చట్టం ఆఫీసును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఇచ్చిన కొద్ది సేపటికే ఆమె కాగితాలు ఆమెకు తెచ్చి ఇచ్చాడు ఆ గుమాస్తా.

వార్త -3:
లక్నోలో నివసిస్తున్న ఆషియానా 13 సం||ల బాలిక. మే 2005లో ఆమె ఆరుగురుచే సామూహిక అత్యాచారానికి గురి అయింది. అయితే అందులో ప్రథమ నిందితుడు తాను మైనరనని సాక్ష్యాలు చూపించి జువెనైల్ కోర్టుకు కేసును మరల్చాడు.

ఆషియానా తండ్రి స.హ. చట్టం ద్వారా అతని డ్రైవింగ్ లైసెన్సును, తుపాకీ లైసెన్సును పొందిన వివరాలను సేకరించి వాటిని కోర్టుకు సమర్పించాడు. అప్పుడు కోర్టు అతనిని ‘ఆ సంఘటన జరిగినప్పుడు అతను మేజరే’ అని తేల్చింది.

వార్త – 4:
‘నాకాబందీ’ సమయంలో మోటారు వాహనాలలో కూర్చుని కనబడకుండా కొంతమంది తప్పించుకుంటున్నారని స.హ. చట్టం ద్వారా అప్పీలు చేయటం మూలంగా ప్రభుత్వం ఈ క్రింది రూలు విధించింది.

మోటారు కార్ల అద్దాలకు డార్క్ ఫిల్ములుగానీ, ఏ ఇతరాలు కానీ అంటించరాదు. ఇది 4.5.2012 నుండి అమలులోనికి వచ్చింది.

ప్రశ్న 4.
విద్యాహక్కు చట్టం బాలలకు వరం వంటిది. వివరించండి: (AS1)
జవాబు:
6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ ఉచిత విద్యకు హక్కు ఉందనీ విద్యాహక్కు చట్టం తెలియచేస్తుంది. పిల్లల పరిసర ప్రాంతాలలో తగినన్ని పాఠశాలలు నిర్మించటం, సరైన అర్హతలున్న టీచర్లను నియమించటం, అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించటం వంటి పనులను ప్రభుత్వం చేయాలి. విద్య పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని, చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని కృత్యాల ద్వారా, పరిశోధన, ఆవిష్కరణ పద్ధతుల ద్వారా సాగాలని చట్టం చెబుతోంది. పిల్లలు మాతృభాషలో చదువు నేర్చుకోవాలని, వాళ్ళు భయం, ఆందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని కూడా చట్టం చెబుతోంది.

పరిసర ప్రాంతాలలో పాఠశాలలు అందుబాటులో లేకపోయినా, పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినా, బోధన – అభ్యసన పరికరాలు తగినన్ని అందుబాటులో లేకపోయినా, పిల్లలను కొట్టినా, భయభ్రాంతుల్ని చేసినా అటువంటి సందర్భాలలో అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఫిర్యాదు చేయవచ్చు.

కాబట్టి ఇది బాలలకు వరం.

ప్రశ్న 5.
మీకు ఇంకా ఏమైనా హక్కులు అవసరమని భావిస్తున్నారా? అవి ఏమిటి? ఎందుకు? (AS4)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత ఈ హక్కులు బాధ్యతతో కూడినవి అని అర్ధం చేసుకున్నాను. నాకు ఏమి కావాలో అన్నీ నా దేశం చూసుకుంటోంది. కాబట్టి నాకు కొత్త హక్కులు అవసరం లేదు. ఉన్న హక్కులను పొందటానికి, కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను.

ప్రశ్న 6.
సమాచార హక్కు చట్టం ప్రకారం మీ పాఠశాల గురించి ప్రధానోపాధ్యాయుడిని ఏ సమాచారం అడుగుతారు? (AS4)
జవాబు:
సమాచార చట్టం హక్కు ప్రకారం పాఠశాల గూర్చి ప్రధానోపాధ్యాయునికి అడిగే సమాచారం.

  1. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం యిచ్చిన నిధులెంత?
  2. ఆ నిధులను దేనికొరకు ఖర్చు చేసారు?
  3. పాఠశాల మరమ్మతులు, నిర్మాణం కోసం నిధులు వచ్చాయా? వస్తే ఎంత వచ్చాయి? వేటికొరకు ఎంత ఖర్చు చేస్తారు?
  4. బడిపిల్లలందరికీ పాఠ్యపుస్తకాలు ఉచితంగా సరఫరా చేసారా?

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 7.
అవినీతిని ఎదుర్కోవడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని ఎలా చెప్పగలవు? (AS6)
జవాబు:
అవినీతిని ఎదుర్కొనడంలో సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా పొందే హక్కు ప్రజలకు లభించింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసిన పథకాలు, ఖర్చు, లబ్దిదారుల వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో వాస్తవంగా అమలుజరిగిన దానితో పోల్చడం ద్వారా అవినీతి జరిగితే తెలుసుకొని పోరాడవచ్చు.

8th Class Social Studies 18th Lesson హక్కులు – అభివృద్ధి InText Questions and Answers

8th Class Social Textbook Page No.204

ప్రశ్న 1.
పేజి నెం. 204 లో ఉన్న ఉదాహరణలోని పవన్, అతడి తల్లి గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారా?
జవాబు:
ఎవరైనా సరే చట్ట, ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా జీవనం సాగిస్తే అది గౌరవప్రదమైన జీవనమే అవుతుంది. పవన్ తల్లి వేరొకరింట్లో కష్టపడి పనిచేయటం గౌరవకరమే. కానీ పవన్ గుడి దగ్గర అడుక్కోవడం మాత్రం సరియైనది కాదు అని నా భావన.

ప్రశ్న 2.
దేని ద్వారా వాళ్లకి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది?
జవాబు:
కష్టించి పనిచేసి జీవనం గడపటం ద్వారా మాత్రమే వారికి గౌరవప్రదమైన జీవనం దొరుకుతుంది.

ప్రశ్న 3.
తమకు కావలసింది చేసే స్వేచ్ఛ పవన్‌కు కానీ, అతడి తల్లికి కానీ ఉందా?
జవాబు:
ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, అధికారులైనా పనిలో స్వతంత్రంగా వ్యవహరించరాదు, వ్యవహరించలేరు. అలాగే వీరు కూడా పని వ్యవహారంలో యజమానిని అనుసరించి పోవాలి. స్వంత విషయాలలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించ వచ్చు.
ఉదా :
పవన్ తల్లి ఇష్టం లేకపోతే వారింట పని మానేయవచ్చు. వేరే చోట చేరవచ్చు.

ప్రశ్న 4.
పవన్, అతడి తల్లి ఈ విధమైన జీవితం గడపటానికి ఎవరు కారణం? వాళ్ల పరిస్థితికి వాళ్లనే నిందించాలా?
జవాబు:
వీరి పరిస్థితికి తరతరాలుగా వస్తున్న వ్యవస్థ కారణం అని చెప్పాలి. సమాజంలో ధనికులు ఇంకా ధనికులుగాను, పేదవారు కటిక పేదవారుగానూ మారతారు. వీరు కూడా అంతే. భారతదేశంలో ‘కర్మ’ అని ఎవరికి వారే నిందించుకోవడం అలవాటు. అలాగే వారినే నిందించుకోవాలి లేదా వ్యవస్థ తీరును నిందించాలి.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 5.
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
జవాబు:
గౌరవప్రదమైన, స్వేచ్ఛతో కూడిన జీవితం పవన్, అతడి తల్లి జీవించగలిగేలా చూడాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది.

8th Class Social Textbook Page No.206

ప్రశ్న 6.
ఒక రోడ్డు లేదా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని గుత్తేదారులు ఎలా నిర్వహిస్తున్నారో చర్చించండి.
జవాబు:
ఏదైన ఒక రోడ్డు లేదా ఇల్లు నిర్మించాలంటే ప్రభుత్వ సంస్థలు లేదా పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలు ముందు గుత్తేదారుల నుండి టెండర్లు స్వీకరిస్తారు. టెండర్లలో ఆ కట్టడాన్ని వారు కోరిన విధంగా నిర్మించడానికి ఎవరు అతితక్కువ ధరని ‘కోట్’ చేస్తారో వారికి మాత్రమే కాంట్రాక్టు ఇస్తారు. పని మొదలు పెట్టిన తరువాత గుత్తేదారులు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి. ఏ సిమెంటు వాడారు? సిమెంటు, ఇసుక ఏ నిష్పత్తిలో కలిపారు, ఇటుక మందం ఎంత, కొలతలు మొదలైనవి అన్నింటిని ఒక పుస్తకంలో నమోదు చేసి ఉంచుతారు. ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు పని చేశారు? వారి కూలిరేట్లు ఎంత? ఎంత చెల్లించారు? మొదలైనవన్నీ దీంట్లో నమోదు చేసి ఉంటాయి. నిర్మాణం తాలూకు యజమాని (ప్రభుత్వం / ప్రైవేటు సంస్థ) వీటిని చూసి, నాణ్యతను పరీక్షించి, వీరికి వాయిదాలలో సొమ్ము చెల్లిస్తారు. ప్రభుత్వం వారయితే సంబంధించిన ఇంజనీరుతో పర్యవేక్షింపచేస్తారు.

ప్రశ్న 7.
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా, జవాబుదారీతనాన్ని ఎలా పెంచవచ్చు?
జవాబు:
ఈ సమాచారాన్ని సరిచూడటం ద్వారా పనిచేసేవారికి, దానిని పర్యవేక్షించేవారికి కూడా కొంత భయం, తప్పనిసరి నిజాయితీ అలవడతాయి. దాని మూలంగా జవాబుదారీతనం పెరుగుతుంది.

8th Class Social Textbook Page No.208

ప్రశ్న 8.
గత సంవత్సర కాలంలో మీ ఉపాధ్యాయులకు విద్యాశాఖనుంచి వచ్చిన ఆదేశాలు, నివేదికలు, సలహాలు, లాగ్ పుస్తకాల వంటి వాటి జాబితా తయారుచేయండి. విద్యాశాఖకు అందచేయటానికి పాఠశాల ఎటువంటి రికార్డులు నిర్వహిస్తుంది? మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు ఎలా నిర్వహిస్తారు?
జవాబు:
విద్యాశాఖ నుండి ఆదేశాలు, నివేదికలు, సలహాల జాబితా :

  1. బడి ఈడు బాలబాలికలు పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  2. డ్రాపవుట్సును తిరిగి పాఠశాలకు రప్పించాలి.
  3. విద్యార్థులందరికీ ఉచిత యూనిఫాం, టెక్స్ట్ పుస్తకాలు అందచేయాలి.
  4. పదవ తరగతి విద్యార్ధులకు అదనపు తరగతులు నిర్వహించాలి.
  5. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి.
  6. విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించాలి.
  7. విద్యార్థులకు Deworming మాత్రలు వేయాలి.
  8. విద్యార్థుల హాజరు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  9. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి.

పాఠశాల నిర్వహించే రికార్డులు :

  1. అడ్మిషను రిజిస్టరు
  2. టి.సీ.ల పుస్తకం
  3. హాజరు పట్టీలు
  4. మధ్యాహ్న భోజన వివరాల రిజిస్టరు.
  5. జీతాల రిజిస్టరు, బిల్లులు
  6. విజిటర్సు రిజిస్టరు
  7. మార్కుల రిజిస్టరు మొదలైనవి

మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రికార్డులు :
1. బియ్యం రిజిస్టరు
2. తేదీ
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 1
3. రోజువారీ మెనూ పుస్తకం
4. నెలవారీ లెక్కల రిజిస్టరు మొ||నవి.

ప్రశ్న 9.
రాష్ట్ర సమాచార కమిషన్ సందర్భంలో ‘స్వతంత్ర’ అన్న పదం ఎందుకు కీలకమైంది?
జవాబు:
రాష్ట్ర సమాచార కమిషన్ పాలనా యంత్రాంగానికో, కార్యనిర్వాహక వర్గానికి అనుబంధమైతే అది అవినీతిని ప్రశ్నించలేదు, అరికట్టలేదు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించలేదు. కాబట్టి అది ‘స్వతంత్రం’గానే వ్యవహరించాలి, ఉండాలి. – అందువలన ‘స్వతంత్ర’ అన్న పదం కీలకమైంది.

AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 10.
ఆరోగ్యశాఖలో, సమాచార అధికారిని అడగటానికి ప్రశ్నల జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. విపత్కర సమయాలలో రోగులను ఆదుకోవటానికి అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయి?
  2. ప్రాంతీయ ఆసుపత్రులలో సౌకర్యాలు ఏమి ఉన్నాయి?
  3. గ్రామీణ ప్రాంతాలలో వైద్యులు కొనసాగటానికి ఏమి చర్యలు తీసుకుంటున్నారు?
  4. ‘పిచ్చి కుక్కలు వంటివి కరిచినప్పుడు ఉపయోగించాల్సిన మందులు అన్ని చోట్లా ఉన్నాయా?
  5. ‘ఆరోగ్యశ్రీ’లో ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణకు ఎందుకు ఉపయోగించడం లేదు?

8th Class Social Textbook Page No.210

ప్రశ్న 11.
మీ బడి ఈ ప్రామాణికాలకనుగుణంగా ఉందా?
జవాబు:
అవును. మా బడి ఈ ప్రామాణికాలకు అనుగుణంగానే ఉన్నది.

  1. మా పాఠశాలలో సరైన అర్హతలున్న టీచర్లు ఉన్నారు.
  2. అవసరమైన సౌకర్యాలున్నాయి.
  3. పారాలు ల్యాబ్ లో, LCD రూములలో బోధించబడుతున్నాయి.
  4. మేము పాఠశాలలో బాధ్యతతో కూడిన స్వేచ్ఛను అనుభవిస్తాము.
  5. మా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు.

ప్రశ్న 12.
అవసరమైతే మీ బడి పనితీరుపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకోంది.
జవాబు:
అవసరమైతే బడి తీరుపై జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారికి, రాష్ట్రస్థాయిలో డైరెక్టరు, పాఠశాల విద్యకు ఫిర్యాదు చేయాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

SCERT AP 8th Class Social Study Material Pdf 22st Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సినిమాలకు, నాటకాలకు ఉన్న మూడు తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

సినిమాలు నాటకాలు
1. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. 1. తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
2. ఒకేసారి అనేక చోట్ల ప్రదర్శించబడతాయి. 2. ఒక్కసారీ ఒక్కచోట మాత్రమే ప్రదర్శించగలుగుతారు.
3. అనేక ప్రాంతాలలో చిత్రీకరిస్తారు. 3. ఒక్క స్టేజీపైనే అన్నీ చూపించటానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఏదైనా కథను లేదా పాటను చిన్న సినిమాగా తీయవచ్చా? దీని ఆధారంగా సినిమా తీయటానికి ఎవరెవరు అవసరమో జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
తీయవచ్చును. దీనికి నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, కెమెరామెన్, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, గాయకులు, మ్యూజీషియన్లు ఇంకా ఇతర పనివారు కావాలి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
“సమాజాన్ని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం,” అని కొంతమంది వాదిస్తారు, “సినిమా ప్రభావం చెడుగా ఉంటుంది,” అని మరికొంతమంది అంటారు. మీరు ఎవరితో ఏకీభవిస్తారు? ఎందుకు? (AS4)
జవాబు:
“సమాజాన్ని మంచిగా కాని, చెడుగా కాని మార్చటానికి సినిమా ఒక బలమైన ఆయుధం” – అని నేను భావిస్తాను. అంటే మార్పు ఎటువంటిదైనాకాని, సినిమాకు ఆ శక్తి ఉన్నది.

కారణం :
సినిమా ఒక విలువైన మాధ్యమం. వినోదం కోసం వీటిని చూసినా కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయి. చిన్న చిన్న విషయాలే మనుషుల ప్రవర్తనను మారుస్తుంటాయి.

ఉదా :

  1. ‘పోకిరి’ సినిమా చూసిన తరువాత మగ పిల్లలందరూ రెండు షర్టులు ధరించడం మొదలు పెట్టారు.
  2. పూర్వం కొన్ని సినిమాలలో హీరోకు కాన్సర్ వ్యాధి రావటం, రక్తం కక్కుకుని మరణించటం తరుచుగా జరిగేవి. కాని “గీతాంజలి’ అనే సినిమాలో కాన్సరు వచ్చిన హీరో తనలాంటి మరో రకం వ్యాధిగ్రస్తురాలిని ప్రేమిస్తాడు. తరువాత కాన్సరు వ్యాధితో హీరో మరణించిన సినిమాలు రాలేదు. అంటే ప్రేక్షకులు వాటిని ఆశించలేదు అని అర్ధం.

ఈ విధంగా సినిమా నిజంగా ఒక బలమైన ఆయుధం అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
ముందుకాలం సినిమాల్లోని అంశాలు ఏమిటి? మీరు చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
ముందుకాలం నాటి సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలుగా ఉండేవి. కొన్ని సమాజానికి సందేశాత్మకంగా ఉండే చిత్రాలు ఉండేవి. మరికొన్ని పౌరాణికాలు ఉండేవి. నేను చూసిన సినిమాలు, గతంలోని సినిమాలలోని అంశాలకు పోలికలు.

  1. రెండు ఎక్కువగా కుటుంబ ప్రధాన చిత్రాలు.
  2. రెంటిలోనూ పౌరాణికాలు ఉన్నాయి.
  3. రెంటిలోనూ మంచి నటీనట వర్గం ఉంది.

తేడాలు :

నేను చూసిన సినిమాలు గతంలోని సినిమాలు
1. ఇవి ఎక్కువ పాటల ప్రధానమైనవి. 1. ఇవి ఎక్కువ ఫైటింగున్నవి.
2. ఇవి ఎక్కువ బడ్జెట్ చిత్రాలు.   2. ఇవి తక్కువ బడ్జెట్ చిత్రాలు.
3. ఇవి ప్రేమ ప్రధానమైనవి. 3. ఇవి విలువలు ప్రధానమైనవి.
4. ఇవి కొంచెం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. 4. ఇవి అందరిచే ఆమోద యోగ్యాలు.
5. హాస్యం అపహాస్యం అవుతోంది. 5. హాస్యం సున్నితంగా ఉండేది.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? (AS6)
జవాబు:
సాంస్కృతిక చైతన్యం, జాతీయోద్యమంలో దిన పత్రికల పాత్ర :
బ్రిటీషు పాలనలో సంఘ సంస్కర్తలు సమాజంలో మార్పుల కోసం ఉద్యమించారు. హిందూమతంలో సంస్కరణలు, ‘సతి’ని నిషేధించటం, విధవా పునర్ వివాహాన్ని ప్రోత్సహించటం వంటివి ముఖ్యమైన సంస్కరణలు. ఈ సంస్కర్తలతో ప్రేరణ పొంది దేశ వివిధ ప్రాంతాల నుంచి పలు పత్రికలు ప్రచురితం కాసాగాయి.

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన అనేకమంది నాయకులు పత్రికా సంపాదకులు. ‘అమృత్ బజార్ పత్రిక’ (1868లో మొదలయ్యింది) సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్, ‘బెంగాలీ’ (1833లో మొదలు) సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ, ‘ది హిందూ’ (1878లో మొదలు) సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్, ‘కేసరి’ (1881లో మొదలు) సంపాదకుడు బాలగంగాధర తిలక్ ఇందులో చెప్పుకోదగిన వాళ్లు. ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేసేవారు. భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించటంలో వార్తా పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కృష్ణా పత్రిక నిర్వహించబడింది.

మహాత్మా గాంధీ 1918లో ‘యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యత చేపట్టాడు. ఆ తరువాత గుజరాతీలో ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని ‘హరిజన్’ అనే పత్రికకు విరివిగా వ్యాసాలు రాసేవాడు. ఇలా గాంధీగారు పత్రికలకు బాగా విస్తృతంగా రాసేవాడు.

ఈ విధంగా స్వాతంత్ర్యోద్యమంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 6.
తాజా అంశాలను తెలియచేసే వార్తలను దినపత్రికల నుంచి సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. (AS1)
జవాబు:
తాజా అంశం: నేడు ఎంసెట్ ఫలితాలు

సాయంత్రం 4.30 గంటలకు విడుదలు

ఈనాడు-హైదరాబాద్ : ఎంసెట్-2013 ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వీటిని విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్జ్ విశ్వవిద్యాలయ ఆవరణలో జరగనుంది. ఫలితాల్లో మార్కులతో సహా ర్యాంకులను కూడా ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణారావు మంగళవారం వెల్లడించారు. ఫలితాలు విడుదలైన వెంటనే వాటిని విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు తెలియజేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఫలితాలు వెల్లడించే వెబ్ సైట్లు : Www.eenadu.net, apeamcet.org, educationandhra.com, vidyavision.com, manabadi.com, schools9.com, nettlinxresults.net, iitjeefoum.com, aksharam.in., resumedropbox.com etc.
ఈ ఉదాహరణ ప్రకారం తాజా వార్తలను సేకరించండి.

8th Class Social Studies 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు InText Questions and Answers

8th Class Social Textbook Page No.239

ప్రశ్న 1.
మీ తల్లిదండ్రులను వారి బాల్యంలోని నాటకాల గురించి అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల కాలంలో భువన విజయం, చింతామణి, కన్యాశుల్కం, రక్త కన్నీరు మొదలైన నాటకాలు బాగావేసేవారు.

ప్రశ్న 2.
కాలక్రమంలో నాటకాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి?
జవాబు:
పూర్వకాలం నాటకాలు ఎక్కువగా పౌరాణికాలు ఉండేవి. నేడు సాంఘిక నాటకాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆనాటి వేదిక అలంకరణ నేడు ఆధునికంగా మారింది. నాడు నటుల గాత్రానికి చాలా విలువనిచ్చేవారు. నేడు వారు గట్టిగా మాట్లాడలేకపోయినా, మైకు వారికి సహకరిస్తున్నాయి. నాడు ఉన్న ఆదరణ నేడు లేదనే చెప్పవచ్చు.

8th Class Social Textbook Page No.240

ప్రశ్న 3.
నాటక ప్రదర్శనకు, సినిమాకు మధ్య తేడాలు ఏమిటి? పోలికలు, తేడాలతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:

పోలికలు :

  1. రెండూ వినోద మాధ్యమాలే.
  2. రెంటిలోనూ నటులే నటిస్తారు.
  3. రెండూ ప్రజాదరణ పొందాయి.

తేడాలు :

నాటకాలు :
ఇవి వేదికపై సజీవంగా ప్రదర్శించబడతాయి. ప్రదర్శన సమయంలో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. నటులు తమ స్వరాన్ని, ముఖ కవళికల్ని, ప్రేక్షకులు గ్రహించేలా అభినయించాలి. నటులు కొన్ని నెలలు ఈ నాటకాలని రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో నటించడానికి నటీనటులకు ఆడిషన్ టెస్టులు కేవలం రెండు వారాలలో పూర్తి అవుతాయి.

సినిమాలు :
ఇవి రికార్డు చేయబడినవి. చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉంది. సినిమా తీసేముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రం రిహార్సల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని చిత్రీకరించడానికి నెలలు, సంవత్సరాలు పట్టవచ్చు. ఆడిషన్ టెస్టు నెలలు పడతాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 4.
నాటకాల నుండి సినిమాలకు మారటం వల్ల కళాకారులు జీవనోపాధి పొందే అవకాశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయో మీ టీచరు సహాయంతో చర్చించండి.
జవాబు:
నాటకాలకు ఎక్కువగా మంచి వాక్కు ఉన్నవాళ్ళను నటులుగా ఆదరించేవారు. వీరు సినిమాలకు మారటం వలన వీరి హావభావ ప్రదర్శన, శారీరకమైన అందచందాలు కూడా పరిగణనలోనికి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం రంగస్థల కళాకారులు స్టూడియోల చుట్టూ తిరగటం ప్రారంభించారు. అదృష్టంతోనో, అండదండలతోనో ఈ రంగంలో రాణించినవారు మంచి జీవనోపాధిని, ఆదాయాన్ని పొందారు. లేనివారు కొంతమంది బికారులైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.

ప్రశ్న 5.
అయిదు నిమిషాలపాటు ఎటువంటి మాటలు లేకుండా మూకాభినయం చేయండి. ఒక అయిదు నిమిషాల నాటకం వేయండి. ఈ రెండింటిలో నటనలో సౌలభ్యం, ఎంచుకోగల అంశాలు, ప్రేక్షకులకు అర్థం కావటం వంటి విషయాలను పోల్చండి. Page No.240
జవాబు:
విద్యార్థులు ఎవరికి వారుగా మూకాభినయం చేయండి. గ్రూపులవారీగా నాటకాలు వేయండి.
పోల్చుట

అంశాలు మూకాభినయం నాటకం
1. నటనలో సౌలభ్యం ఇది నటించడం కష్టం. ప్రయత్నిస్తే తేలిక.
2. ఎంచుకోగల అంశాలు చిన్న, చిన్న అంశాలు, సామాజికమైనవి ఎంచుకోవాలి. సామాజికమైన విషయాలు, పౌరాణిక , అంశాలు, హాస్యభరితమైనవి ఎంచుకోవాలి.
3. ప్రేక్షకులకు అర్ధం కావటం ప్రేక్షకులు మొదలైన కొద్ది సేపటికి అర్థం చేసుకోగలుగుతారు. డైలాగ్ చెప్పిన తరువాత అర్థం అవుతుంది.

8th Class Social Textbook Page No.241

ప్రశ్న 6.
మీ ఊళ్లో, పట్టణంలో గల వినోద సాధనాల జాబితా తయారుచేయండి. వాటి జనాదరణను ఎలా అంచనా వేస్తారు? కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులు ఏమిటి?
జవాబు:
మా ఊళ్ళో సినిమా హాళ్ళు, కళాక్షేత్రం మరియు రాజీవ్ గాంధీ పార్కు ఉన్నాయి. వీటిలో సినిమాహాళ్ళు సినిమాలు బాగుంటే లాంటివి ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. కళాక్షేత్రంలో మంచి మంచి నాటకాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. వాటికి హాలు సగం, సగానికి పైన నిండుతుంది. రాజీవ్ గాంధీ పార్కుకు ఆదివారాలు, శెలవు దినాలు, వేసవి సాయంకాలాలు జనులు ఎక్కువగా వస్తారు.

ఈ మధ్యకాలంలో వీటన్నిటి కన్నా టీవీలకు, క్రికెట్ మ్యాచ్ లకు ఎక్కువ ఆదరణ పెరిగింది. పెద్దవాళ్ళు, ఆడపిల్లలు టీవీల ముందు, మగపిల్లలు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ లీనమై ఉంటున్నారు.

8th Class Social Textbook Page No.242

ప్రశ్న 7.
జాతీయోద్యమానికి సంబంధించి తీసిన మరో రెండు సినిమాలు చెప్పండి.
జవాబు:
భగత్ సింగ్, మంగళ్ పాండే.

ప్రశ్న 8.
తెలుగు సినిమాలలోని దేశభక్తి గీతాలను సేకరించండి.
జవాబు:
1. “భారతయువతా కదలిరా ||
నవయువ భారత విధాయకా.
“భారతయువతా కదలిరా ||”

2. “మేరీ దేశ్ కీ ధరతీ
సోనా ఉగలే ఉగలే హిరీమోతీ ||

3. “నా జన్మభూమి ఎంత అందమైన దేశము.
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము.”

4. “పుణ్యభూమి నా దేశం నమోనమామి
ధన్యభూమి నా దేశం సదాస్మరామి”

8th Class Social Textbook Page No.243

ప్రశ్న 9.
రెండు బృందాలుగా ఏర్పడి అభిమాన సంఘాల వల్ల ప్రయోజనాలు, సమస్యల గురించి చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు : అభిమాన సంఘాలు వారి అభిమాన హీరోలు, హీరోయిన్లను ఆకాశానికెత్తుతాయి. వారికి ఉచితంగా అడ్వర్టయిజ్ మెంటు ఇస్తారు. సినిమా 100 రోజులు ఆడటానికి విశ్వప్రయత్నం చేస్తారు. అంతేకాక వారు సంఘపరంగా సేవాకార్యక్రమాలను చేపడతారు.
ఉదా :
రక్తదాన శిబిరాలు, ఐ క్యాంపులు మొదలగునవి.

సమస్యలు :
విపరీతమైన అభిమానం వలన సంఘాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తీవ్రమైతే అనారోగ్యకరమైన పోటీ అవుతుంది. ఒకోసారి, వీరు సినిమా గురించి అబద్దపు అభిప్రాయాలను వెలిబుచ్చుతారు. ఇవి సినీ అభిమానులను నిరాశపరుస్తాయి.

AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 10.
మీరు ఇటీవల చూసిన సినిమాలోని కథ, సన్నివేశాలు మీబోటి పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో విశ్లేషించండి. Page No.243)
జవాబు:
నేను ఇటీవల ‘బాషా’ సినిమా చూశాను. ఈ సినిమాలో హీరో ఒక పోలీసు ఆఫీసరు. కానీ అతను అండర్ కవర్ లో ఉంటాడు. ఇందులో సన్నివేశాలు ఒక పోలీసు ఆఫీసరు యిలా ఉంటారా అనిపించేటట్లు ఉన్నాయి. ఇవి మా బోటి పిల్లలకు పోలీసులపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయి.

కేవలం ‘బాషా’ మాత్రమే కాదు. అన్ని సినిమాలు యిదే రీతిగా ఎవరినో ఒకరిని కించపరిచే విధంగా ఉంటున్నాయి.

ప్రశ్న 11.
గత నెలలో వివిధ విద్యార్థులు చూసిన సినిమాల జాబితా తయారు చేయండి. వీటిల్లో హింసను బట్టి 0-5 మార్కులు వేయండి. ఏ మాత్రం హింసలేని సినిమాలకు 5 మార్కులు, ఏహ్యత పుట్టించే తీవ్ర హింస ఉన్న సినిమాలకు 0 మార్కులు వేయాలి.
జవాబు:
ఉదా : 1. శతమానం భవతి – 5
2. గౌతమీపుత్ర శాతకర్ణి – 3
3. ఖైదీ నెంబర్ – 150 – 3
4. …………………..
5. …………………..
6. …………………..

8th Class Social Textbook Page No.244

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో దొరికే వివిధ రకాల దిన పత్రికలను తరగతికి తీసుకురండి. ఎన్ని పత్రికలు ఉన్నాయో అన్ని బృందాలుగా ఏర్పడండి. వార్తలు, విశేషాలు ఎలా పొందుపరిచారో (ఏ పేజీలో ఏముంది) విశ్లేషించండి.
జవాబు:
మా గ్రామంలోకి ఈనాడు, సాక్షి అనే రెండు పత్రికలు వస్తాయి. –

మా తరగతిలోని వారందరమూ 2 బృందాలుగా ఏర్పడ్డాము.

ఈనాడు బృందం :
దేశానికి సంబంధించిన ముఖ్య వార్త. తరువాత పేజీల వార్తలు సంక్షిప్తంగా మొదటి పేజీలో, సంపాదకీయం. 4 పేజీలకు వసుంధర అనే పేరుతో స్త్రీలకు సంబంధించిన విషయాలు. ఆటలకు ఒక పేజీ, బిజినెస్ గురించి, అన్ని ప్రకటనలు, సినిమాల గురించి వెండితెర గురించి, టీ.వీ గురించి వివరాలు.

జిల్లా పేపర్ :
దీనిలో జిల్లాకు సంబంధించిన అన్ని రకాల వార్తలు ఉంటాయి.

సాక్షి బృందం : సాక్షి పేపర్ 14 పేజీలు + జిల్లా పేపర్…

మొదటి పేజీలోనే దాదాపుగా ఆ రోజుకు ముఖ్యమైన వార్త అది దేశవ్యాప్తమైనది అవుతుంది. తరువాత పేజీల్లో వచ్చే ముఖ్య వార్తల్ని మొదటి పేజీలో చిన్న చిన్న వ్యాఖ్యలతో ఇచ్చి పేజీ నెంబరు ఇస్తారు. అది ఒక ఉపయోగం. తరువాత ఆ వార్తల్ని వివరంగా ఇస్తారు. టెండర్ల గురించి ప్రకటనలు. ఇక తరువాత ఫ్యామిలీ అనే పేరుతో 4 పేజీల పేపర్ ఉంటుంది. దానిలో ఒక గొప్ప వ్యక్తితో (ఏ రంగమైన) పరిచయం లేదా ఏదైనా మంచిపని చేసేవాళ్ళతో పరిచయం. పిల్లలకు కథలు, అన్నీ అంటే సోషల్ సైన్స్ మొ|| వాటిలో పిల్లలకు తెలియని విషయాలు, భక్తికి సంబంధించిన సందేశాలు, సినిమా కబుర్లు ఉంటాయి.

ఉద్యోగ అవకాశాలు, ఇంకా సంక్షిప్త వార్తలు, బిజినెస్ కు ఒక పేజీ, సెన్సెక్స్. తరువాత ఆటలకు ఒక పేజీ, చివరలో మిగిలిన అన్ని వార్తలు చాలాసార్లు ఫోటోలతో సహా జిల్లా పేపర్ లో మొదటి ముఖ్యవార్త, టెండర్, క్రైమ్, వెండితెర (సినిమా) – బుల్లితెర (ఆరోజు ప్రసారాలు) తరువాత మూడు పేజీల్లో స్థానిక వార్తలు, క్లాసిఫైడ్ (ప్రకటనలు) తరువాత విద్య (ఎంసెట్, బి.ఎడ్ మొ||) తరువాత స్థానిక వార్తలు 2 పేజీల్లో ఉంటాయి.

ప్రశ్న 13.
పైన పేర్కొన్న దిన పత్రికల సంచికలను వరుసగా వారం రోజులపాటు సేకరించండి. పై బృందాలలో ఒక్కొక్క పత్రికలో ఏ ఏరోజున ఏ ప్రత్యేక అంశాలు ప్రచురితమౌతాయో తెలుసుకోండి. ఆ వివరాలను తరగతి గదిలో పంఛుకోండి. దినపత్రికలలో ఇటువంటి అంశాలు ఎందుకు ప్రచురిస్తున్నారో కారణాలను పేర్కొనండి.