SCERT AP 9th Class Physical Science Guide Pdf Download 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Physical Science 4th Lesson Questions and Answers పరమాణువులు-అణువులు
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగ పద్ధతి మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించండి. (ప్రయోగశాల కృత్యం) (AS 1)
(లేదా)
“ఒక రసాయన చర్య జరిగినపుడు ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం కాదు” అని నిరూపించు విధానమును వివరించండి.
జవాబు:
ఉద్దేశ్యం : ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుట.
కావలసిన పరికరాలు :
లెడ్ నైట్రేట్, పొటాషియం అయొడైడ్, స్వేదన జలం, రెండు బీకర్లు, కొలజాడి, శాంఖవ కుప్పై, (స్ప్రింగ్ త్రాసు, పరీక్ష నాళికలు, స్టాండ్, రబ్బరు బిరడా, దారం మొదలగునవి.
ప్రయోగ విధానం :
- 100 మి.లీ. స్వేదన జలములో సుమారు 2 గ్రా. లెడ్సెట్రేట్ కలిపి ద్రావణం తయారు చేయండి.
- 100 మి.లీ. స్వేదన జలములో సుమారు 2 గ్రా. పొటాషియం అయొడైడ్ కలిపి వేరొక ద్రావణం తయారు చేయండి.
- 250 మి.లీ. శాంభవ కుప్పెలో 100 మి.లీ. లెడ్నై ట్రేట్ ద్రావణాన్ని తీసుకోండి.
- చిన్న పరీక్షనాళికలో 4 మి.లీ పొటాషియం అయొడైడ్ ద్రావణాన్ని తీసుకోండి.
- కుప్పెలో పరీక్షనాళికను జాగ్రత్తగా వ్రేలాడదీయండి. రెండు ద్రావణాలు కలవకుండా జాగ్రత్త తీసుకోండి. కుప్పెకు రబ్బరు బిరడాను బిగించండి.
- స్ప్రింగు త్రాసునుపయోగించి, కుప్పె భారాన్ని దానిలో ఉండే పదార్థంతోపాటు తూచండి.
- రెండు ద్రావణాలూ కలిసిపోయేటట్లు కుప్పెను కదపండి.
- అదే విధంగా స్పింగుత్రాసుతో మళ్ళీ కుప్పె భారాన్ని తూచండి.
పరిశీలనలు:
- రసాయన పదార్థాలు కలవకముందు కుప్పె భారం = m1 గ్రా.
- రసాయన పదార్థాలు కలిసిన తరువాత కుప్పె భారం = m2 గ్రా.
నిర్ధారణ :
- m1, m2 లు రెండూ సమానమని గమనిస్తాము.
- ఇది ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపిస్తుంది.
జాగ్రత్తలు:
- రసాయన పదార్థాలు వాడేటప్పుడు వాటిని నేరుగా చేతితో తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- గాజు పరికరాలు క్రిందపడి పగిలిపోకుండా జాగ్రత్త వహించాలి.
- మొదటిసారి బరువు తూచడానికి ముందు కుప్పెలోని పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించాలి.
- శాంఖవ కుప్పెను స్ప్రింగు త్రాసుకు వేలాడదీయుటకై గట్టి దారాన్ని వాడాలి.
ప్రశ్న 2.
0.24 గ్రా. సంయోగపదార్థంలో 10, 144 గ్రా. ఆక్సిజన్, 0.096 గ్రా. బోరాన్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సంఘటన శాతాలను భారం పరంగా కనుక్కోండి. (AS 1)
జవాబు:
విశ్లేషణ ప్రకారం ఆక్సిజన్, బోరాన్ల సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి = 0.24 గ్రా.
ఆక్సిజన్ ద్రవ్యరాశి = 0. 144 గ్రా, ; భోరాన్ ద్రవ్యరాశి = 0.096 గ్రా.
ప్రశ్న 3.
ఒక తరగతిలో ఆక్సిజన్ యొక్క అణుసాంకేతికం రాయమని ఉపాధ్యాయుడు చెబితే షమిత (0), గాను, ప్రియాంక ‘O’ గాను రాసారు. నీవు ఎవరి జవాబును సమర్థిస్తావు? ఎందుకు? (AS 1, AS 2)
జవాబు:
షమిత రాసిన జవాబు సరియైనది.
కారణం:
- ఆక్సిజన్ ద్విపరమాణుక అణువు.
- రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఆక్సిజన్ అణువును ఏర్పరుస్తాయి.
- కావున ఆక్సిజన్ అణుఫార్ములా O2
ప్రశ్న 4.
“H2 మరియు 2Hలు భిన్నమైనవి” అని మోహిత్ చెప్పాడు. ఈ వాక్యము తప్పో, ఒప్పో సకారణముగా తెలుపండి. (AS 1)
జవాబు:
- H2 అనేది హైడ్రోజన్ అణువు. ఇది రెండు హైడ్రోజన్ పరమాణువుల కలయిక వలన ఏర్పడినది.
- 2H అనేది ‘హైడ్రోజన్ పరమాణువు. దీనిలో రెండు హైడ్రోజన్ పరమాణువులు రసాయన చర్యలో పాల్గొనుటకు సిద్ధంగా వున్నాయి. కనుక మోహిత్ చెప్పిన వాక్యము సరియైనదే.
ప్రశ్న 5.
“CO మరియు Co రెండూ మూలకాలను తెలియజేస్తాయి.” అని లక్ష్మి చెప్పింది. మీరేమంటారు? కారణం చెప్పండి. (AS 1, AS 2)
జవాబు:
లక్ష్మి చెప్పిన విషయం సరియైనది కాదు.
- CO అనేది ‘కార్బన్ మోనాక్సైడ్’ యొక్క ఫార్ములా.
- ‘C’ పెద్ద అక్షరం (Capital letter) మరియు ‘O’ కూడా పెద్ద అక్షరం (Capital letter) వల్ల ఈ విషయం తెలుస్తుంది.
- Co అనేది ‘కోబాల్ట్’ అనే మూలక సంకేతం.
- ‘C’ పెద్ద అక్షరం (Capital letter), ‘0’ చిన్న అక్షరం (Small letter) వల్ల ఈ విషయం తెలుస్తుంది.
ప్రశ్న 6.
నీటి అణువు యొక్క సాంకేతికం H2O. ఈ సాంకేతికం మనకేం సమాచారాన్ని తెల్పుతుంది? (AS 1)
జవాబు:
- నీరు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల కలయిక వలన ఏర్పడుతుంది.
- ఒక ఆక్సిజన్ పరమాణువు, రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక నీటి అణువును ఏర్పరుస్తాయి.
- నీటి అణువు యొక్క అణుద్రవ్యరాశి 18. [హైడ్రోజన్ – 1, ఆక్సిజన్ – 16, H2O ⇒ 2 × 1 + 16 = 18]
- 18 గ్రా. నీటి అణువులో 6.022 × 1023 కణాలు వుంటాయి.
- హైడ్రోజన్ సంయోజకత 1, ఆక్సిజన్ సంయోజకత 2.
ప్రశ్న 7.
రెండు అణువుల ఆక్సిజన్, ఐదు అణువుల నైట్రోజనను సాంకేతికంగా మీరు ఎలా రాస్తారు? (AS 1)
జవాబు:
a) రెండు అణువుల ఆక్సిజన్ 2O2.
కారణం:
- ఆక్సిజన్ ద్విపరమాణుక మూలకము.
- రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఒక ఆక్సిజన్ అణువును ఏర్పరచును.
- ఆక్సిజన్ సాంకేతికం O2
b) ఐదు అణువుల నైట్రోజన్ 5N2
కారణం :
- నైట్రోజన్ ద్విపరమాణుక మూలకము.
- రెండు నైట్రోజన్ పరమాణువులు కలిసి ఒక నైట్రోజన్ అణువును ఏర్పరచును.
- నైట్రోజన్ సాంకేతికం N2
ప్రశ్న 8.
ఒక లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అయిన ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికంను రాయండి. (AS 1)
జవాబు:
- ఆక్సైడ్ యొక్క సంయోజకత ‘2’ అనగా O2- అవుతుంది.
- లోహ ఆక్సైడ్ యొక్క సాంకేతికం MO అని ఇవ్వబడినది.
- కావున ఇవ్వబడిన లోహం యొక్క సంయోజకత 2 అనగా M2+ అవుతుంది.
- క్లోరైడ్ యొక్క సంయోజకత 1 అనగా Cl–.
- క్రిస్క్రాస్ పద్ధతి ప్రకారం ఆ లోహ క్లోరైడ్ యొక్క సాంకేతికం MCl2 అవుతుంది.
ప్రశ్న 9.
కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం Ca(OH)2 మరియు జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం Zn3 (PO4)2 అయిన కాల్షియం ఫాస్పేట్ యొక్క సాంకేతికాన్ని రాయండి. (AS 1)
జవాబు:
- కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం Ca(OH)2
- కావున కాల్షియం సంయోజకత 2 అనగా Ca2+ మరియు హైడ్రాక్సైడ్ సంయోజకత 1 అనగా (OH)–.
- జింక్ ఫాస్ఫేట్ సాంకేతికం Zn3 (PO4)2.
- జింక్ సంయోజకత 2 అనగా Zn2+, ఫాస్పేట్ సంయోజకత 3 అనగా (PO4)3-.
- క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సాంకేతికం Ca3 (PO4)2.
ప్రశ్న 10.
మన ఇండ్లలో సాధారణంగా వాడే క్రింది పదార్థాల రసాయన నామాలు (Chemical Names), సాంకేతికాలను తెలుసుకోండి. (AS 1)
a) సాధారణ ఉప్పు (Common Salt)
b) వంట సోడా (Baking Soda)
c) ఉతికే సోడా (Washing Soda)
d) వెనిగర్ (Vinegar)
జవాబు:
పదార్ధం | రసాయన నామం | ఫార్ములా |
a) సాధారణ ఉప్పు | సోడియం క్లోరైడ్ | NaCl |
b) వంట సోడా | సోడియం బై కార్బొనేట్ | NaHCO3 |
c) ఉతికే సోడా | సోడియం కార్బోనేట్ | Na2CO3 |
d) వెనిగర్ | సజల ఎసిటిక్ ఆమ్లం | CH3COOH |
ప్రశ్న 11.
క్రింది వాటి ద్రవ్యరాశులను లెక్కించండి. (AS 1)
a) 0.5 మోల్‌ల N2 వాయువు
b) 0.5 మోల్‌ల N పరమాణువులు
c) 3.011 × 1023 N పరమాణువులు
d) 6.022 × 1023 N2 అణువులు
జవాబు:
a) 0.5 మోల్‌ల N2 వాయువు
1 మోల్ N2 వాయువు ద్రవ్యరాశి = 28 గ్రా. (∵ N యొక్క అణు ద్రవ్యరాశి = 28 గ్రా.)
0.5 మోల్‌ల N2 వాయువు ద్రవ్యరాశి = 28 × 0.5 = 14 గ్రా.
b) 0.5 మోల్‌ల N పరమాణువులు
1 మోల్ N పరమాణువుల ద్రవ్యరాశి = 14 గ్రా. (∵ N యొక్క అణు ద్రవ్యరాశి = 14 గ్రా. )
0.5 మోల్‌ల N పరమాణువుల ద్రవ్యరాశి = 14 × 0.5 = 7 గ్రా.
c) 3.011 × 1023 N పరమాణువులు
6.022 × 1023 N పరమాణువుల ద్రవ్యరాశి = 14 గ్రా.
d) 6.022 × 1023 N2 అణువులు
6.022 × 1023 N2 అణువుల ద్రవ్యరాశి = 28 గ్రా.
ప్రశ్న 12.
కింద ఇవ్వబడిన వాటిలో ఉండే కణాల సంఖ్యను లెక్కించండి. (AS 1)
a) 46 గ్రా. Na పరమాణువులు
b) 8 గ్రా. O2 అణువులు
c) 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు
జవాబు:
a) 46 గ్రా. Na పరమాణువులు
Na పరమాణు ద్రవ్యరాశి = 23
23 గ్రా. Na పరమాణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022 × 1023
b) 8 గ్రా. O2 అణువులు
O2 అణు ద్రవ్యరాశి = 32
32 గ్రా. O2 అణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022× 1023
c) 0.1 మోల్ హైడ్రోజన్ పరమాణువులు
హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి = 1
∴ 1 మోల్ హైడ్రోజన్ పరమాణువులలో ఉండే కణాల సంఖ్య = 6.022 × 1023
ప్రశ్న 13.
‘మోల్’లలోకి మార్చండి. (AS 1)
a) 12 గ్రా. ఆక్సిజన్ వాయువు
b) 20 గ్రా. నీరు
C) 22 గ్రా. కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
a) 12 గ్రా. ఆక్సిజన్ వాయువు
O2 అణుభారం = 32
∴ 32 గ్రా. O2 లో ఉండే మెల్ల సంఖ్య = 1
b) 20 గ్రా. నీరు
నీరు (H2O) అణుభారం = 18
∴ 18 గ్రా. నీటిలోని మోల్ల సంఖ్య = 1
20 గ్రా. నీటిలోని మోల్ల సంఖ్య = \(\frac{20}{18}\) × 1 = 1.11
c) 22 గ్రా, కార్బన్ డై ఆక్సైడ్
కార్బన్ డై ఆక్సైడ్ (CO2) అణుభారం = 44
∴ 44 గ్రా. CO2 లోని మోల్ల సంఖ్య = 1
ప్రశ్న 14.
FeCl2 మరియు FeCl3 లలో Fe యొక్క సంయోజకతలు రాయండి. (AS 1)
జవాబు:
FeCl2 లో Fe యొక్క సంయోజకత = 2
FeCl3 లో Fe యొక్క సంయోజకత = 3
ప్రశ్న 15.
సల్ఫ్యూరిక్ ఆమ్లం(H2SO4) గ్లూకోజ్ (C6H12O6)ల మోలార్ ద్రవ్యరాశులు లెక్కించండి. (AS 1)
జవాబు:
a) సల్ఫ్యూరిక్ ఆమ్లం : H2SO4
H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి = (2 × 1) + (1 × 32) + (4 × 16)
= 2 + 32 + 64 = 98 యూనిట్లు
∴ H2SO4 యొక్క మోలార్ ద్రవ్యరాశి : 98 గ్రా.
b) గ్లూకోజ్ : C6H12O6
C6H12O6 యొక్క అణు ద్రవ్యరాశి = (6 × 12) + (12 × 1) + (6 × 16)
= 72 + 12 + 96 = 180 యూనిట్లు
∴ C6H12O6 యొక్క మోలార్ ద్రవ్యరాశి : 180 గ్రా.
ప్రశ్న 16.
100 గ్రా. సోడియం, 100 గ్రా. ఇనుములలో ఎక్కువ సంఖ్యలో పరమాణువులు కలిగియున్న లోహమేది? వివరించండి. (AS 1)
జవాబు:
ప్రశ్న 17.
కింది పట్టికను పూరించండి. (AS 1)
జవాబు:
ప్రశ్న 18.
కింది పట్టికలోని ఖాళీలను పూరించండి. (AS 1)
జవాబు:
ప్రశ్న 19.
15.9 గ్రా. కాపర్ సల్ఫేట్ మరియు 10.6 గ్రా. సోడియం కార్బొనేట్ చర్య పొంది 14.2 గ్రా. సోడియం సల్ఫేట్ మరియు 12.3 గ్రా. కాపర్ కార్బోనేటను ఏర్పరుస్తున్నాయి. దీనిలో ఇమిడి ఉన్న రసాయన సంయోగ నియమాన్ని తెలిపి, నిరూపించండి. (AS 2)
జవాబు:
క్రియాజనకాలు :
కాపర్ సల్ఫేట్ ద్రవ్యరాశి = 15.9 గ్రా.
సోడియం కార్బోనేట్ ద్రవ్యరాశి = 10.6 గ్రా.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = 15.9 + 10.6 = 26.5 గ్రా.
క్రియాజన్యాలు :
సోడియం సల్ఫేట్ ద్రవ్యరాశి = 14.2 గ్రా.
కాపర్ కార్బోనేట్ ద్రవ్యరాశి = 12.3 గ్రా.
క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి : 14.2 + 12.3 = 26.5 గ్రా.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి
ఇదియే ద్రవ్యనిత్యత్వ నియమము.
ప్రశ్న 20.
112 గ్రా|| కాల్షియం ఆక్సైడ్ కు కార్బన్ డై ఆక్సైడును కలిపితే 200 గ్రా. కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది. ఈ చర్యలో వాడిన కార్బన్ డై ఆక్సైడ్ ద్రవ్యరాశిని కనుక్కోండి. మీ జవాబుకు ఏ రసాయన సంయోగ నియమం తోడ్పడింది. (AS 2)
జవాబు:
- x గ్రా. కార్బన్ డై ఆక్సైడ్ ను 112 గ్రా. కాల్షియం ఆక్సెడ్ కు కలిపారనుకొనుము. (క్రియాజనకాలు)
- క్రియాజన్యమైన కాల్షియం కార్బొనేట్ ద్రవ్యరాశి – 200 గ్రా.
- ద్రవ్యనిత్యత్వ నియమం ప్రకారం,
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి = క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి
x + 112 = 200 ⇒ x = 200 – 112 ⇒ x = 88
∴ 88 గ్రా. కార్బన్ డై ఆక్సైడు కలిపారు.
ప్రశ్న 21.
మూలకాలకు ప్రామాణిక గుర్తులు (సంకేతాలు) నిర్ణయించి ఉండకపోతే ఎలా ఉండేదో ఊహించి రాయండి. (AS 2)
జవాబు:
- ప్రపంచంలో చాలా భాషలు వాడుకలో ఉన్నాయి.
- ఒక మూలకాన్ని రకరకాల భాషలలో రకరకాల పేర్లుతో పిలిస్తే సమస్యగా మారుతుంది.
- ఒక ప్రాంతం వారు పిలిచే ఒక మూలకము, మరొక ప్రాంతం వారు అవగాహన చేసుకోలేక తికమకపడతారు. ఆ పదార్థం బదులుగా వేరొక పదార్థంగా భావించిన ఫలితాలు వేరుగా వస్తాయి.
- కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి అన్ని దేశాల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల వారికి సౌలభ్యంగా ఉండటం కోసం మూలకాలకు ఒక స్థిరమైన పేరును కేటాయించడం జరిగింది.
ప్రశ్న 22.
ద్రవ్యనిత్యత్వ నియమాన్ని నిరూపించుటకు చేసే ప్రయోగాన్ని చూపే పటం గీయండి. (AS 5)
జవాబు:
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook InText Questions and Answers
9th Class Physical Science Textbook Page No. 58
ప్రశ్న 1.
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి పై ప్రయోగాన్ని చేసినపుడు ఇదే ఫలితం వస్తుందా?
జవాబు:
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి ప్రయోగాన్ని చేస్తే అదే ఫలితం రాదు. ద్రవ్యనిత్యత్వ నియమం నిరూపణ అవదు.
శాంకువ కుప్పెకు రబ్బరు బిరడాను తొలగించి ప్రయోగాన్ని చేస్తే కొన్ని వాయువులు బయటకుపోయి ప్రయోగం ఫలితం తేడాగా వస్తుంది.
ప్రశ్న 2.
మెగ్నీషియం తీగను మండించడాన్ని గుర్తుకు తెచ్చుకోంది. ఈ చర్యలో కూడా ద్రవ్యరాశిలో మార్పు జరగలేదని నీవు భావిస్తున్నావా? మీ స్నేహితులతో చర్చించండి.
జవాబు:
- ద్రవ్యరాశిలో మార్పు జరగదు. కాని దానిని మనం గమనించలేము. కారణం మెగ్నీషియం తీగ మండేటప్పుడు తన చుట్టూ ఉన్న ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.
- ఒకవేళ మనం తీసుకున్న మెగ్నీషియం తీగ మండడానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించగల మూసివున్న సీసాలో, గాలి బయటకు పోకుండా చేసి ప్రయోగాన్ని నిర్వహిస్తే ద్రవ్యనిత్యత్వ నియమం నిరూపించవచ్చు.
9th Class Physical Science Textbook Page No. 59
ప్రశ్న 3.
100 గ్రా. పాదరసపు ఆక్సెడ్ వియోగం చెంది 92.6 గ్రా. పాదరసం 7.4 గ్రా. ఆక్సిజన్లను ఏర్పరుస్తుంది. ఒకవేళ 10 గ్రా. ఆక్సిజన్ 125 గ్రా. పాదరసంతో పూర్తిగా చర్యనొంది పాదరసపు ఆక్సెడు ఏర్పరిచినది అనుకొంటే, ఈ ద్రవ్యరాశి విలువలు స్థిరానుపాత నియమానికి అనుగుణంగా ఉంటుందా?
జవాబు:
ఆక్సిజన్ నిష్పత్తి = 7.4 : 10
పాదరసం నిష్పత్తి = 92.6 : 125 ⇒ \(\frac{7.4}{10}=\frac{92.6}{125}\) ⇒ 0.74 = 0.74
∴ ఇవ్వబడిన ద్రవ్యరాశులు స్థిరానుపాత నియమానికి అనుగుణంగా ఉన్నాయి.
ప్రశ్న 4.
మీరు శ్వాసించేటప్పుడు బయటకు విడిచిన ర్బన్ డై ఆక్సైడ్ కు, మీ స్నేహితులు బయటకు విడిచిన కార్బన్ డై ఆక్సైడక్కు మధ్య ఏమైనా తేడా ఉంటుందా? స్నేహితులతో చర్చించండి. వివిధ పద్ధతుల ద్వారా తయారైన కార్బన్‌డయాక్సెయ్ సంఘటనం స్థిరంగా ఉంటుందా?
జవాబు:
స్థిరానుపాత నియమం ప్రకారం, ఒక పదార్థం ఎక్కడి నుండి సేకరించాం, ఏ విధంగా తయారు చేశాం అనే వాటితో సంబంధం లేకుండా ఒక సంయోగ పదార్థంలోని మూలకాల స్థిరభార నిష్పత్తి ఎల్లప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కావున మేము విడిచిన కార్బన్ డై ఆక్సైడ్ కు, మా స్నేహితులు విడిచిన కార్బన్‌డయాక్సెడు ఏమి తేడా ఉండదు.
9th Class Physical Science Textbook Page No. 60
ప్రశ్న 5.
డాల్టన్ సిద్ధాంతములోని ఏ ప్రతిపాదన ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం?
జవాబు:
డాల్టన్ సిద్ధాంతం యొక్క మొదటి ప్రతిపాదన “పదార్థం విభజింప వీలుకాని పరమాణువులను కలిగి ఉంటుంది” అనేది ద్రవ్యనిత్యత్వ నియమం యొక్క ఫలితం.
ప్రశ్న 6.
డాల్టన్ సిద్ధాంతములోని ఏ ప్రతిపాదన స్టిరానుపాత నియమంను వివరిస్తుంది?
జవాబు:
డాల్టన్ సిద్ధాంతములోని మూడవ ప్రతిపాదనయైన “ఒకే మూలక పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. కాని వేర్వేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి” అనేది స్థిరానుపాత నియమాన్ని వివరిస్తుంది.
9th Class Physical Science Textbook Page No. 56
ప్రశ్న 7.
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం పెరుగుతుందా? తగ్గుతుందా?
జవాబు:
తుప్పు పట్టిన ఇనుప ముక్క భారం తగ్గుతుంది.
ప్రశ్న 8.
కట్టి బొగ్గు పూర్తిగా మండిన తరువాత అందులో ఉండే పదార్థం ఎక్కడకెళ్ళింది?
జవాబు:
కట్టె బొగ్గు పూర్తిగా మండి, CO2, వాయువును విడుదల చేయును. బూడిద అవక్షేపముగా మిగులును.
ప్రశ్న 9.
తడిబట్టలారితే పొడిగా మారతాయి. తడి బట్టలో ఉన్న నీరు ఏమైంది?
జవాబు:
తడి బట్టలోనున్న నీరు బాష్పీభవనం చెంది వాతావరణంలో కలిసిపోతుంది.
ప్రశ్న 10.
మెగ్నీషియం తీగను గాలిలో మండిస్తే ఏమవుతుంది?
జవాబు:
మెగ్నీషియం తీగను గాలిలో మండించినపుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతితో మండును. బూడిద అవక్షేపముగా మిగులును. ఈ అవక్షేపమే మెగ్నీషియం ఆక్సెడ్.
ప్రశ్న 11.
గంధకం (Sulphur)ను గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
గంధకంను గాలిలో మండించినపుడు దాని స్థితిలోను, రంగులోను మార్పు వస్తుంది.
9th Class Physical Science Textbook Page No. 60
ప్రశ్న 12.
మూలకాలు కూడా పరమాణువులతోనే నిర్మితమవుతాయా?
జవాబు:
ఒక పదార్థం ఒకే రకమైన పరమాణువులను కలిగియుంటే దానిని ‘మూలకం’ అని అంటాం. మూలకాలలో పరమాణువులు లేదా అణువులు అనే సూక్ష్మ కణాలు ఉంటాయి.
9th Class Physical Science Textbook Page No. 62
ప్రశ్న 13.
మనకు తెలిసిన మూలకాలు 115కు పైగా ఉన్నాయి. కాని ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే కదా ! కాల్షియం, కోరిన్, క్రోమియంల సంకేతాలను ఎలా రాస్తాం?
జవాబు:
ఇంగ్లీషులో ఉన్న అక్షరాలు 26 మాత్రమే అయినప్పటికీ కాల్షియం, క్లోరిన్, క్రోమియం వంటి వాటికి ఒకే సంకేతాన్ని రాయలేము. అందుకే వాటి పేరులోని రెండు అక్షరాలు అనగా Ca, CI, Cr లను సంకేతాలుగా రాస్తాము.
9th Class Physical Science Textbook Page No. 63
ప్రశ్న 14.
లాటిన్ పేర్ల ఆధారంగా సంకేతాలు రాయబడిన మూలకాలను గుర్తించగలరా? అవి ఏవి?
జవాబు:
లాటిన్ పేరు ఆధారంగా సంకేతం రాయబడిన మూలకాలు : ఇనుము (Fe), బంగారం(Au), సోడియం(Na), పొటాషియం (K).
9th Class Physical Science Textbook Page No. 64
ప్రశ్న 15.
కొన్ని మూలకాలు ఎందుకు ఏక పరమాణుక అణువులుగా వుంటాయి?
జవాబు:
కొన్ని మూలకాల అణువులు ఏర్పడాలంటే, అవి ఒకే ఒక పరమాణువులతో ఏర్పడతాయి. ఇటువంటివి ఏక పరమాణుక అణువులుగా ఉంటాయి.
ఉదా : Ar, Na, Fe మొ||వి.
ప్రశ్న 16.
కింది పట్టికను గమనించి వివిధ మూలక అణువుల సాంకేతికాలను రాయండి.
జవాబు:
మూలకము పేరు | సాంకేతికము | పరమాణుకత |
ఆర్గాన్ | Ar | ఏకపరమాణుక |
హీలియం | He | ఏకపరమాణుక |
సోడియం | Na | ఏకపరమాణుక |
ఐరన్ | Fe | ఏకపరమాణుక |
అల్యూమినియం | Al | ఏకపరమాణుక |
కాపర్ | Cu | ఏకపరమాణుక |
హైడ్రోజన్ | H2 | ద్విపరమాణుక |
ఆక్సిజన్ | O2 | ద్విపరమాణుక |
నైట్రోజన్ | N2 | ద్విపరమాణుక |
క్లోరిన్ | Cl2 | ద్విపరమాణుక |
ఓజోన్ | O3 | త్రిపరమాణుక |
పాస్ఫరస్ | P4 | చతుఃపరమాణుక |
సల్ఫర్ | S8 | అష్టపరమాణుక |
ప్రశ్న 17.
కొన్ని మూలకాలు ఎందుకు ద్విపరమాణుక లేదా త్రిపరమాణుక అణువులుగా ఉంటాయి?
జవాబు:
రెండు లేదా మూడు పరమాణువులు కలిసి ఒక మూలక అణువు ఏర్పడితే అటువంటి వాటిని ద్విపరమాణుక లేదా త్రిపరమాణుక అణువులు అంటారు.
ఉదా : ద్విపరమాణుక అణువులు : O2, H2 మొ||వి.
త్రిపరమాణుక అణువులు : O3 మొ||వి.
ప్రశ్న 18.
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణమేమి?
జవాబు:
పరమాణుకతలో మూలకానికి, మూలకానికి మధ్య భేదం ఉండడానికి కారణం వాటి సంయోజకత.
ప్రశ్న 19.
సంయోజకత అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలక పరమాణువులు వేరొక మూలక పరమాణువులతో సంయోగం చెందే సామర్థ్యాన్నే ఆ మూలక పరమాణువు యొక్క సంయోజకత అంటాం.
9th Class Physical Science Textbook Page No. 66
ప్రశ్న 20.
కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైకు సాంకేతికాలను రాయండి. నీటి అణువుకు సాంకేతికం రాసినట్టే వీటికి కూడా ప్రయత్నించండి.
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ :
- కార్బన్ డై ఆక్సైడ్లో కార్బన్, ఆక్సిజన్లు ఉన్నాయి.
- ఒక కార్బన్ పరమాణువు, రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి కార్బన్ డై ఆక్సైడ్ అణువును ఏర్పరుస్తాయి.
- కావున కార్బన్ డై ఆక్సైడ్ సాంకేతికం CO2.
కార్బన్ మోనాక్సైడ్:
- కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్, ఆక్సిజన్లు ఉన్నాయి.
- ఒక కార్బన్ పరమాణువు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి కార్బన్ మోనాక్సైడ్ ను ఏర్పరుస్తాయి.
- కావున కార్బన్ మోనాక్సైడ్ సాంకేతికం CO.
9th Class Physical Science Textbook Page No. 69
ప్రశ్న 21.
18 గ్రా. నీటిలో ఎన్ని అణువులు ఉంటాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
18 గ్రా. నీటిలో 6.022 × 1023 అణువులు ఉంటాయి.
ప్రశ్న 22.
12 గ్రా. కార్బన్లో ఎన్ని పరమాణువులు ఉంటాయి?
జవాబు:
12 గ్రా. కార్బన్లో 6.022 × 1023 పరమాణువులు ఉంటాయి.
పరికరాల జాబితా
బీకరులు, శాంఖవకు ప్పె, స్టాండు, స్ప్రింగ్ త్రాసు, రబ్బరు బిరడా, మూలకాల సంకేతాలను సూచించే చార్టు లేదా కార్డు, పొటాషియం అయోడైడ్, స్వేదన జలం
9th Class Physical Science 4th Lesson పరమాణువులు-అణువులు Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
1. కింది పట్టికలో కొన్ని మూలకాలకు గుర్తులు ఉన్నాయి. వాటిని సరిచేసి రాసి, కారణాలను వివరించండి.
జవాబు:
కృత్యం – 2
2. మీ పాఠశాల ప్రయోగశాలలో ఉండే మూలకాల ఆవర్తన పట్టికను చూసి క్రింద ఇచ్చిన మూలకాలకు సంకేతాలను రాయండి.
జవాబు: