AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

SCERT AP 6th Class Social Study Material Pdf 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 10th Lesson స్థానిక స్వపరిపాలన

6th Class Social 10th Lesson స్థానిక స్వపరిపాలన Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గ్రామసభ మరియు గ్రామ పంచాయితీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

గ్రామసభగ్రామపంచాయితీ
1. గ్రామ స్థాయిలో సాధారణ సభ.1. గ్రామ స్థాయి అసెంబ్లీ లాంటిది.
2. దీనిలో గ్రామంలోని ఓటర్లు అందరూ సభ్యులే.2. దీనిలో ఎన్నుకోబడిన వార్డు సభ్యులే సభ్యులు.
3. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం.3. ఇది పరోక్ష (ప్రాతినిధ్య) ప్రజాస్వామ్యానికి నిదర్శనం
4. గ్రామ పంచాయితీ పనితీరును సమీక్షిస్తుంది.4. గ్రామ సభ పనితీరును సమీక్షించలేదు.
5. దీనికి ఎన్నికలుండవు.5. దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు.

ప్రశ్న 2.
మీరు మీ స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే మీరు ఏ సమస్యలు ప్రస్తావిస్తారు?
జవాబు:
నేను మా స్థానిక ప్రభుత్వ సంస్థలో ప్రతినిధి అయితే ఈ క్రింది సమస్యలు ప్రస్తావిస్తాను.

  • ప్రజా సౌకర్యాలైన త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, మురుగు నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణ, చెత్త సేకరించుట, నిర్వహణ గురించి
  • ప్రభుత్వ పాఠశాలలో నమోదు, హాజరు పెంచుట గురించి మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు (నిర్వహణ), నాడు – నేడు అమలు గురించి ప్రస్తావిస్తాను.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 3.
మీ పంచాయితీ / మున్సిపాలిటీలో సామాన్య ప్రజలు ఏ సమస్యపైన అయినా నిర్ణయం తీసుకోవడంలో పాలుపంచుకొంటున్నారా? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
మా మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో సామాన్య ప్రజలు నిర్ణయం తీసుకోవడంలో పాలు పంచుకుంటున్నారు.
ఉదాహరణలు :

  • మా వారులో పాఠశాల దగ్గర ఒక మద్యం షాపు పెట్టారు. దానితో పాఠశాల నడపటం కష్టంగా ఉండేది. దానితో ప్రజలందరూ కలిసి వార్డు సభ్యునికి తెలియపరిచారు. వార్డు సభ్యుడు చైర్మన్, కమిషనర్ తో మాట్లాడి ఆ షాపును అక్కడి నుంచి తీయించేశారు.
  • మా వార్డులో వర్షం పడితే మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. కాబట్టి ప్రజలు చాలామంది మున్సిపాలిటీ సమావేశాలు జరిగే సమయంలో అక్కడికి వెళ్ళి వారికి సమస్యను కాగితం రూపంలో సమర్పించాము. వారు సమావేశంలో చర్చించి ‘భూగర్భ మురికి కాలువలను’ మా వార్డుకు శాంక్షన్ చేశారు.

ప్రశ్న 4.
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచాలా, లేదా ప్రభుత్వ నిధుల మీద ఆధారపడాలా? మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి పంచాయితీలు పన్నులు పెంచితే అది ప్రజలకు భారమవుతుంది. ప్రభుత్వ నిధుల మీద ఆధారపడితే అది కూడా పరోక్షంగా ప్రజలకు భారమౌతుంది. కాబట్టి పంచాయితీలు కొన్ని స్వావలంబనా కార్యక్రమాలు జరపాలి. పోరంబోకు స్థలాల్లో గడ్డి పెంచడం, చెరువుగట్లపై కొబ్బరి, ఈతచెట్లు పెంచడం, వాటిని వినియోగించేవారికి వేలంపాట నిర్వహించి ఆ సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించాలి.

ప్రశ్న 5.
అంకితభావంతో పనిచేసే సర్పంచులు ఎదుర్కొనే సవాళ్ళను వివరించండి.
జవాబు:
నేడు అంకితభావంతో పనిచేసేవారు అతికొద్దిమందే ఉన్నారు. వారికి అడ్డత్రోవలో పనిచేయించుకునే వారు ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. ఉదా : గ్రామంలో ఇందిరా ఆవాస్ యోజన, దీపం పథకం, అన్నపూర్ణ పథకం, పనికి ఆహార పథకం, వికలాంగ, వృద్ధాప్య, వితంతు పింఛనులు మొదలైనవి అనేకం ఉన్నాయి. వీటిని అర్హులు కానివారికి ఇప్పించాలని సర్పంచ్ పై పేరు, పలుకుబడి ఉన్నవారు ఒత్తిడి తీసుకువస్తారు. ఈ సవాళ్ళను అన్నింటినీ అధిగమించి గ్రామాన్ని ముందుకు నడిపించడం సర్పంచ్ కు కత్తిమీద నడకలాంటిది.

ప్రశ్న 6.
పురపాలక సంఘం కల్పిస్తున్న ఏయే పౌర సౌకర్యాలను గ్రామ పంచాయితీ కల్పించటం లేదు?
జవాబు:
విద్యుత్తు, రవాణా, ఉన్నత విద్య, చెత్త సేకరణ (వ్యర్థ పదార్థాల నిర్వహణ), భూగర్భ డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్, పార్కులు మెరుగైన ఆరోగ్య సేవలు మొదలైన పౌర సౌకర్యాలను పురపాలక సంఘం కల్పిస్తుంది. గ్రామ పంచాయితీలు కల్పించడం లేదు.

ప్రశ్న 7.
గీతిక ఉన్న వీధిలో కొళాయి నుంచి నీరు అరగంట కూడా రాదు. అందువల్ల చాలామంది బకెట్లు నింపుకోవడానికి వరుసలో నిలుచుంటారు. ఆమె సమస్య పరిష్కారం కావటానికి మీరు గీతికకు ఏ విధమైన సలహా ఇస్తారు?
జవాబు:
తన యొక్క వార్డు కౌన్సిలర్ ని కలిసి సమస్యను అతనితో చెప్పవలసినదిగా సలహా ఇస్తాను. అపుడు ఆ సమస్యను కౌన్సిల్ ముందు వుంచుతారు. అధికారులు నిర్ణయం తీసుకుని సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటారు. ఈ అప్పటివరకు బోరింగు పంపు నుండి నీరు పట్టుకుంటుంది.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 8.
స్థానిక కార్పోరేటర్/కౌన్సిలర్‌ను కలిసి పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికి గాను కొన్ని ప్రశ్నలను తయారు చేయండి.
జవాబు:
నేను మాకు దగ్గరలో ఉన్న కార్పొరేటర్ ను కలిసి, పురపాలక సంఘం చేసే పనుల గురించి తెలుసుకోవడానికిగాను ఈ క్రింది ప్రశ్నలను తయారుచేశాను.

ప్రశ్నలు :
1. పురపాలక సంఘం, చెత్తను ఉపయోగించి ఏమైనా వ్యాపారం చేస్తుందా?
2. రోడ్డును శుభ్రంచేసే స్త్రీలకు, పురుషులకు ఏమైనా పేర్లు ఉన్నాయా?
3. మంచినీటి శుద్ధీకరణ ఏ విధంగా చేస్తారు?
4. వీధి లైట్లు నిర్వహణ కొరకు ఏదైనా కంట్రోల్ యూనిట్ ఉంటుందా?
5. ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బును పురపాలక సంఘం దేనికి ఖర్చు చేస్తుంది?

ప్రశ్న 9.
దిగువ ఇవ్వబడిన పురపాలక సంఘాలను, మున్సిపల్ కార్పొరేషన్లను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి.
i) విశాఖపట్నం
ii) విజయవాడ
iii) భీమునిపట్నం
iv) కడప
v) అనంతపురం
vi) తిరుపతి
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన 1

6th Class Social Studies 10th Lesson స్థానిక స్వపరిపాలన InText Questions and Answers

6th Class Social Textbook Page No.111

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో కల్పించే ప్రజా సౌకర్యాలను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • ఆ భూగర్భ డ్రైనేజి ఆ మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మతు) నిర్వహణ
  • ఉద్యానవనాల ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

ప్రశ్న 2.
మీరు గ్రామంలో నివసిస్తుంటే మీ గ్రామసభను సందర్శించి నివేదిక రూపొందించండి.
జవాబు:
విద్యార్థి స్వయంగా చేయగలరు. (ఈ క్రింది వానిని ఆధారంగా ఉదాహరణగా తీసుకోగలరు)

మా గ్రామంలోని గ్రామసభను సందర్శించాను. అక్కడ – రేషన్‌కార్డు కోసం కూపన్లు ఇస్తున్నారని తెలిసి కనకమ్మ గ్రామసభకు హాజరైంది. కాని ఆమెకు గ్రామసభ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ గ్రామసభలో దాదాపు 70 మంది ప్రజలు వస్తే అందులో 20 మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కనకమ్మ లాగే కూపన్లు ఇస్తున్నారని వచ్చారు. సమావేశంలో సర్పంచ్ గత సంవత్సరంలో జరిగిన పనుల గురించి వివరిస్తూ, ఈ సంవత్సరం జరిగే పనుల గురించి గ్రామసభ ముందుంచగా గ్రామసభకు వచ్చిన జనం చప్పట్లు కొడుతూ సర్పంచ్ చేసిన పనిని అభినందించారు. తరువాత ఆయన దారిద్ర్యరేఖకు దిగువన (BPL) గల ప్రజల వివరాలు వెల్లడించాడు. ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి వీరు లబ్దిదారులవుతారని తెలియజేశాడు.

ఆయన మాట్లాడడం ఆపగానే కనకమ్మ నిలబడి నా పేరు కూడా లబ్దిదారుల జాబితాలో ఉంచాలని, నాకు ఉద్యోగం గాని, భూమి గాని వేరే ఏ ఆధారంగాని లేదని తెలిపింది. సర్పంచ్, ఆమె పేరు తప్పకుండా ఈ జాబితాలో ఉండేటట్లు చూస్తానని చెప్పగ కనకమ్మ సంతోషిస్తూ గ్రామసభ నుంచి వెళ్ళింది. చివరిగా రేషన్‌కార్డు కోసం కూపన్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడంతో గ్రామసభ ముగిసింది.

6th Class Social Textbook Page No.112

ప్రశ్న 3.
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలను రాయండి.
జవాబు:
గ్రామ పంచాయితీ, గ్రామ సభల మధ్య పోలికలు :

  • రెండూ కూడాను గ్రామ సంక్షేమం గురించి నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొంటాయి.
  • రెండింటికి ‘సర్పంచ్’ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు.
  • అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • రెండూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. (మెజారిటీ సభ్యుల అభిప్రాయం).

6th Class Social Textbook Page No.113

ప్రశ్న 4.
ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేయడం, తీసివేయడం ఎందుకు అవసరమో చెప్పగలరా?
జవాబు:
కొత్తగా 18 సం|| నిండిన వారిని, ఆ ప్రాంతానికి కొత్తగా బదిలీ పైగాని, ఇల్లు మారిగాని వచ్చిన వారిని, వివాహమై కొత్తగా వచ్చిన వారిని ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదు చేస్తారు.

ఇటీవల మరణించిన వారిని, బదిలీపై లేదా ఇల్లు మారి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన వారిని, వివాహమై ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.

6th Class Social Textbook Page No.115

ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయులు/తల్లిదండ్రుల సహాయంతో గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
గ్రామ వాలంటీర్లు అందించే సౌకర్యాలు :

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి తెలియజెప్పటమే కాకుండా మన ఇంటి దగ్గరకు (అందుబాటులోకి) తీసుకు వస్తారు.
  • వృద్ధాప్య పింఛన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • రేషన్ సరుకులను ఇంటి వద్దనే అందిస్తున్నారు.
  • ప్రభుత్వ పథకాల దరఖాస్తులను అందివ్వడం, ఆ దరఖాస్తులను అధికారులకు పంపిణీ చేయటం జరుగుతుంది.
  • గ్రామ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్నారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 6.
మీ మండల ప్రాదేశిక నియోజక వర్గ (MPTC) సభ్యులు మరియు జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ (ZPTC) సభ్యులు ఎవరు?
జవాబు:
సౌవిద్యార్థులు స్వయంగా రాయగలరు :
ఉదా : మా MPTC – …………….
మా ZPTC – …………………..

ప్రశ్న 7.
మీ జిల్లాలో ఎన్ని మండలాలు కలవు?
జవాబు:
విద్యార్థులు మీ మీ జిల్లాలను అనుసరించి రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా మా జిల్లాలో 57 మండలాలు కలవు.

6th Class Social Textbook Page No.116

ప్రశ్న 8.
మీ ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాల జాబితాను రాయండి.
జవాబు:
మా ప్రాంతంలో స్థానిక సంస్థలు కల్పించే ప్రజా సదుపాయాలు :

  • రక్షిత మంచినీటి సౌకర్యం.
  • భూగర్భ డ్రైనేజి
  • మురుగు కాల్వల నిర్మాణం, నిర్వహణ
  • రహదారుల నిర్మాణం, నిర్వహణ
  • వీధి దీపాల ఏర్పాటు (మరమ్మత్తు) నిర్వహణ
  • ఉచిత విద్యా సౌకర్యం
  • ఉద్యనవనాలు ఏర్పాటు నిర్వహణ
  • ఉచిత వైద్య సదుపాయాలు
  • గ్రంథాలయాలు, పఠనాలయాలు
  • కూరగాయల, పండ్ల, చేపల మార్కెట్ల నిర్వహణ

6th Class Social Textbook Page No.117

ప్రశ్న 9.
మీ జిల్లాలో నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పోరేషన్లు ఎన్ని కలవు?
జవాబు:
విద్యార్థులు మీ జిల్లా గురించి తెలుసుకుని రాయగలరు.
ఉదా : మాది గుంటూరు జిల్లా, మా జిల్లాలో
కార్పోరేషన్లు : 01 (గుంటూరు)
పురపాలక సంఘాలు : 12 (1. మంగళగిరి 2. సత్తెనపల్లి 3. తాడేపల్లి 4. తెనాలి 5. పొన్నూరు 6. బాపట్ల 7. రేపల్లె 8. నర్సరావుపేట 9. చిలకలూరి పేట 10. మాచర్ల 11. వినుకొండ 12. పిడుగురాళ్ళ
నగర పంచాయితీలు : 02 (దాచేపల్లి, గురజాల)

6th Class Social Textbook Page No.118

ప్రశ్న 10.
గ్రామ పంచాయితీ దాని పనితీరులో మున్సిపాలిటీకి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:

గ్రామ పంచాయితీలుపురపాలక సంఘాలు
1. పంచాయితీలు గ్రామ స్వపరిపాలన సంస్థలు తక్కువ సంఖ్యలో జనాభా వుంటారు.1. పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇక్కడ ఎక్కువ జనాభా వుంటారు.
2. రోడ్లను నిర్వహించడం, రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, చౌక, ధరల షాపులు నిర్వహించడం మొ||న పనులు పంచాయితీ చేస్తుంది. చెత్తను ఎత్తివేయడం లాంటి పనులు చాలా గ్రామాలలో కనబడదు.2. గ్రామ పంచాయితీలు చేసే పనులతో పాటు అదనంగా చెత్తను ఎత్తి వేయడం, మురుగు కాలువల నిర్మాణం నిర్వహణ లాంటి బాధ్యతలను పురపాలక సంఘాలు నిర్వహిస్తాయి.
3. పంచాయితీ విధులను సర్పంచ్ పర్యవేక్షిస్తాడు.3. పురపాలక సంఘ పనులను కమీషనర్ మరియు ఇతర కమిటీలు పర్యవేక్షిస్తారు.
4. ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేదు.4. పెద్ద మొత్తంలో ఉద్యోగులు అవసరం అవుతారు.
5. కాంట్రాక్ట్ కార్మికులు మనకు కనబడరు.5. పురపాలక సంఘాలలో కాంటాక్ట్ కార్మికులు చాలామంది ఉంటారు.

AP Board 6th Class Social Solutions Chapter 10 స్థానిక స్వపరిపాలన

ప్రశ్న 11.
మీ ఉపాధ్యాయుని సహాయంతో దిగువ పట్టికను పూర్తి చేయండి.
జవాబు:

హోదాఎవరు ఎన్నుకుంటారుప్రత్యక్ష / పరోక్ష ఎన్నిక
వార్డు మెంబర్గ్రామవార్డులోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
సర్పంచ్గ్రామంలోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
ఉప సర్పంచ్వార్డు మెంబర్స్పరోక్ష ఎన్నిక
MPTCగ్రామంలోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
ZPTCమండలంలోని ఓటర్లుప్రత్యక్ష ఎన్నిక
మండల అధ్యక్షులుMPTC సభ్యులుపరోక్ష ఎన్నిక
జిల్లా పరిషత్ చైర్మన్ZPTC సభ్యులుపరోక్ష ఎన్నిక
పురపాలక సంఘం ఛైర్మన్మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు(కౌన్సిలర్)పరోక్ష ఎన్నిక
మేయర్కార్పోరేటర్స్ & ఇతర సభ్యులుపరోక్ష ఎన్నిక

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

SCERT AP 6th Class Social Study Material Pdf 3rd Lesson పటములు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 3rd Lesson పటములు

6th Class Social 3rd Lesson పటములు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పటంలోని ముఖ్యమైన అంశాలేవి?
జవాబు:
పటంలోని ముఖ్య అంశాలు :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 1

ప్రశ్న 2.
భూమిపై కల వాస్తవ దూరాన్ని పటంలో ఎందుకు తగ్గించి చూపాలి?
జవాబు:
ఒక ప్రదేశము యొక్క మొత్తము వైశాల్యమును కాగితంపై చూపించవలెనన్న అంతే వైశాల్యము కాగితము అవసరమగును అంటే భారతదేశ పటం గీయవలెనన్న అంతే వైశాల్యముకల కాగితము కావలెను మరియు భూమిపై ఉన్న వాస్తవ దూరము చాలా పెద్దదిగా ఉంటుంది. అంత పెద్ద వైశాల్యం గల ప్రదేశాలను వాటి మధ్య దూరాలను మానచిత్రంలో చూపించటము అసాధ్యము. కావున పటంలో తగ్గించి చూపాలి.

ప్రశ్న 3.
పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి.
జవాబు:
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలుమార్గాలు బావులు మొదలైనటువంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.

ప్రశ్న 4.
మీ జిల్లా పటంలో మీ మండలం కేంద్ర కార్యాలయానికి, జిల్లా కేంద్ర కార్యాలయానికీ కల దూరాన్ని కొలవండి. వాస్తవ దూరానికి, దానికి కల నిష్పత్తి సహాయంతో పటంలో ఉపయోగించిన స్కేలు కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు తమతమ జిల్లా, మండల కేంద్రాల నుండి క్రింద ఉదాహరణలో చూపిన విధంగా లెక్కించండి.

మా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయానికి మా ‘టెక్కలి’ మండల కేంద్ర కార్యాలయానికి పటంలో
దూరం = 5 సెం.మీ,
వాస్తవ దూరం = 50 కి.మీ.
స్కేల్ : ఒక సెం.మీ. = 10 కి.మీ.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 2

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 5.
రాజకీయ పటాలకీ, భౌతిక పటాలకీ కల వ్యత్యాసమేమి?
జవాబు:
రాజకీయ పటాలు :
గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను (అంటే రాజకీయ విభాగాలను) మాత్రమే చూపిస్తాయి.

భౌతిక పటాలు :
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి వివరిస్తాయి.

ప్రశ్న 6.
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
విషయ నిర్దేశిత పటాల యొక్క ప్రాముఖ్యత :

  • ఒక నిర్ధిష్ట (నిర్ణీత) అంశాన్ని గూర్చి సవివరంగా తెలియజేస్తాయి.
  • ఏదైనా ఒక ప్రాంతం గూర్చి వివరంగా తెలుసుకోవచ్చు.
  • భూవినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలుమార్గాలు, జనాభా వంటి నిర్ధిష్ట అంశాలను గురించి వివరిస్తాయి.

ప్రశ్న 7.
నిత్య జీవితంలో పటాల యొక్క ఉపయోగమేమి?
జవాబు:
పటాల వలన ఉపయోగాలు :

  • పటాలు దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకి చాలా ఉపయోగకరం.
  • పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాల వంటి భూస్వరూపాలను చూడవచ్చును.
  • ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
  • పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగకరం.
  • పటాలు పర్యాటకులు మరియు ప్రయాణీకులకు వారి గమ్య చేరడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

ప్రశ్న 8.
ఇవ్వబడిన ప్రపంచ పటంలో ఖండాలు, మహాసముద్రాలు గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 3
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 4

→ సరియైన సమాధానాన్ని ఎంచుకుని బ్రాకెట్లో రాయండి.

1. అడవులు విస్తరణని తెలిపే పటాలు ………..
అ) భౌతిక పటము
ఆ) విషయ నిర్దేశిత పటం
ఇ) రాజకీయ పటం
ఈ) పైవేవీ కావు
జవాబు:
ఆ) విషయ నిర్దేశిత పటం

2. నీలిరంగు ……….. ని సూచించడానికి ఉపయోగిస్తాము.
అ) జలభాగములు
ఆ) పర్వతాలు
ఇ) భూభాగం
ఈ) మైదానాలు
జవాబు:
అ) జలభాగములు

3. స్కేల్ దీనిలోని ఒక ఆవశ్యకమైన భాగము …………
అ) పటము
ఆ) చిత్తుచిత్రము
ఇ) ప్రణాళిక
ఈ) ఏదీకాదు
జవాబు:
అ) పటము

4. దిక్సూచిని దీని కొరకు ఉపయోగిస్తారు.
అ) చిహ్నాలను చూపుటకు
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి
ఇ) దూరాన్ని కొలవడానికి
ఈ) ఎత్తుని తెలుసుకోవడానికి
జవాబు:
ఆ) ప్రధాన దిక్కులను గుర్తించడానికి

5. ఉత్తరం మరియు తూర్పుకి మధ్యగల దిక్కుని ఇలా పిలుస్తారు.
అ) ఈశాన్యము
ఆ) ఆగ్నేయము
ఇ) వాయవ్యము
ఈ) నైరుతి
జవాబు:
అ) ఈశాన్యము

6th Class Social Studies 3rd Lesson పటములు InText Questions and Answers

6th Class Social Textbook Page No.30

ప్రశ్న 1.
మృదుల పై చిత్తుచిత్రం సహాయంతో ఎందుకు తను వెళ్ళవలసిన చోటికి చేరుకోలేదు? Page No. 30)
జవాబు:
మృదుల చిత్తుచిత్రం సహాయంతో తను వెళ్ళవలసిన చోటికి చేరలేకపోవడానికి కారణాలు :

  • చిత్తు చిత్రంలో ప్రధానంగా దిక్కులు చూపలేదు. స్కేల్ చూపలేదు.
  • చిత్తుచిత్రంలో ఏ విధమైన కొండ గుర్తులు, చిహ్నాలు చూపలేదు.

6th Class Social Textbook Page No.31

ప్రశ్న 2.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 5
పైన ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 6
జవాబు:

దిక్కువస్తువులు
ఉత్తరంచెట్లు
ఈశాన్యంగుడి
దక్షిణంబావి
నైరుతిమసీదు
తూర్పుసూర్యోదయము
ఆగ్నేయంపాఠశాల
పడమరఇల్లు
వాయువ్యంచర్చి

6th Class Social Textbook Page No.32

ప్రశ్న 3.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7
చిత్రము పరిశీలించి స్కేల్ ని ఉపయోగించి కింద చూపిన ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించండి.
i) పోస్ట్ ఆఫీస్ మరియు రాజు ఇంటి మధ్య దూరం
ii) రాజు మరియు పూజ ఇంటి మధ్య దూరం
iii) చిరు ఇల్లు మరియు పాఠశాల మధ్య దూరం
జవాబు:
i) 60 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 6 సెం.మీ. × 10 మీ. = 60 మీ॥)
ii) 10 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 1 సెం.మీ. × 10 మీ. = 10 మీ॥)
iii) 50 మీటర్లు (1 సెం.మీ. = 10 మీటర్లు ; 5 సెం.మీ. × 10 మీ. = 50 మీ॥)

AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు

ప్రశ్న 4.
చిహ్నాలు మనకు సమాచారాన్ని ఎలా ఇస్తాయి?
జవాబు:
స్కేల్ పటంలోని ముఖ్యమైన అంశం. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు గీతలతో సూచిస్తారు. ఈ చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించుట వలన పటాలను గీయడం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతలో మనకు భాష , తెలియకపోయినా ఎవరినీ సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

6th Class Social Textbook Page No.35

ప్రశ్న 5.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి పట్టికను తయారు చేయండి.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 8
జవాబు:
మనదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. అవి :

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంరాజధాని
1. ఆంధ్రప్రదేశ్అమరావతి
2. ఒడిశాభువనేశ్వర్
3. పశ్చిమబెంగాల్కోల్‌కతా
4. జార్ఖండ్రాంచి
5. బీహార్పాట్నా
6. ఉత్తరప్రదేశ్లక్నో
7. ఉత్తరాఖండ్డెహ్రాడూన్
8. హిమాచల్ ప్రదేశ్సిమ్లా
9. పంజాబ్ఛండీఘర్
10. హరియాణాఛండీఘర్
11. రాజస్థాన్జైపూర్
12. గుజరాత్గాంధీనగర్
13. మహారాష్ట్రముంబయి
14. మధ్యప్రదేశ్భోపాల్
15. ఛత్తీస్ ఘడ్రాయపూర్
16. కర్ణాటకబెంగళూర్
17. తెలంగాణహైద్రాబాద్
18. కేరళతిరువనంతపురం
19.  తమిళనాడుచెన్నెై
20. గోవాపనాజి
21. సిక్కింగాంగ్‌టాక్
22. అరుణాచల్ ప్రదేశ్ఇటానగర్
23. అస్సాండిస్పూర్
24. మేఘాలయషిల్లాంగ్
25. నాగాలాండ్కోహిమా
26. మణిపూర్ఇంఫాల్
27. మిజోరాంఐజ్వా ల్
28. త్రిపురఅగర్తల
కేంద్రపాలిత ప్రాంతాలు
1. అండమాన్ & నికోబార్ దీవులుపోర్టుబ్లెయిర్
2. పుదుచ్చేరి (పాండిచ్చేరి)పుదుచ్చేరి
3. లక్ష ద్వీపు(ప్)కవరత్తి
4. దాద్రానగర్ హవేలిసిల్వాస్సా
5. డామన్ & డయ్యూడామన్
6. ఛండీగర్ఛండీగర్
7. న్యూఢిల్లీన్యూఢిల్లీ
8. జమ్ము & కాశ్మీర్శ్రీనగర్ & జమ్ము
9. లడక్లెహ్

ప్రశ్న 6.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 9
ఈ భౌతిక పటాన్ని పరిశీలించి భారతదేశం యొక్క కొన్ని భౌగోళిక స్వరూపాలను గురించి రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 10

6th Class Social Textbook Page No.36

ప్రశ్న 7.
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 11
భారతదేశం – ముఖ్య పంటలు (విషయ నిర్దేశిత పటం)
i) ఈ పటం ఏమి సూచిస్తోంది?
జవాబు:
భారతదేశంలో పండే ముఖ్య పంటలను సూచిస్తోంది.

ii) దీనిని విషయ నిర్దేశిత పటం అని ఎందుకు పిలుస్తారు?
జవాబు:
ఏదైనా ఒక నిర్దిష్ట అంశాన్ని తెలియజేసే పటం విషయ నిర్దేశిత పటం అంటారు. ఈ పటంలో ‘భారతదేశం – ముఖ్య పంటలు’ అనే నిర్దిష్ట అంశాన్ని తెలియజేస్తుంది, కనుక దీనిని విషయ నిర్దేశిత పటం అని పిలుస్తారు.

ప్రాజెక్టు పని

మీ పాఠశాల చిత్తు చిత్రం గీయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

వివిధ రకాల పటాలను సేకరించి ఒక స్క్రిప్ పుస్తకం తయారుచేయండి.
జవాబు:
స్వయం చేయగలరు.

సరియైన చిహ్నాలను ఉపయోగించి మీ ఇంటినుంచి పాఠశాలకి వెళ్ళే దారి యొక్క చిత్తు చిత్రాన్ని గీయండి.
జ. ఉదా :
AP Board 6th Class Social Solutions Chapter 3 పటములు 7

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

SCERT AP 6th Class Social Study Material Pdf 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 9th Lesson ప్రభుత్వం

6th Class Social 9th Lesson ప్రభుత్వం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పార్లమెంటరీ మరియు అధ్యక్ష ప్రజాస్వామ్యాల మధ్య వ్యత్యాసాలను రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 1

ప్రశ్న 2.
ప్రభుత్వం అంటే ఏమిటి? వివిధ రకాల ప్రభుత్వాలు ఏవి?
జవాబు:
ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ, వాటికొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ప్రభుత్వం’ అంటారు. ప్రభుత్వాలు రెండు రకాలు, అవి

  1. రాచరిక ప్రభుత్వం
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రశ్న 3.
నేడు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏవైనా నాలుగు కార్యకలాపాలను రాయండి.
జవాబు:

  • ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా ఉంటుంది.
  • అలాగే తపాలా సర్వీసులు నిర్వహించడం, రైల్వే వ్యవస్థ నిర్వహణ వంటి పనులను కూడా ప్రభుత్వం చూస్తుంది.
  • ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, సరిహద్దులను రక్షిస్తుంది. ప్రజలందరికీ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
  • ఎపుడైనా ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకవసరమైన సహాయం అందిస్తుంది.
  • ప్రజలకు న్యాయస్థానాల ద్వారా వివాద పరిష్కారం చేస్తుంది.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 4.
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం సాధ్యమేనా? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనే వారందరి అభిప్రాయాలను పరిగణించడం చాలావరకు సాధ్యం కాకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఏకాభిప్రాయం కుదురుతుంది, అయితే ఇది అన్ని వేళల సాధ్యం కాదు. అందుకనే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఉదాహరణకు మున్సిపల్ కౌన్సిల్ లోని (20) సభ్యులు పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న పారిశుధ్య కార్మికుల కాంట్రాక్ట్ విషయంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. అనేకమైన అభిప్రాయాలు వచ్చాయి. మరి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేరు, కనుక మెజారిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.

ప్రశ్న 5.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కలసి పాఠశాలను నడిపిస్తే ఎలా ఉంటుంది? పాఠశాలను నడపటానికి అందరూ భాగస్వాములు కావాలని మీరు అనుకుంటున్నారా? లేక ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారా? కారణాలు తెలపండి.
జవాబు:

  • విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల నడిపిస్తే అది ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది.
  • పాఠశాల నడపడానికి ప్రతినిధులను ఎన్నుకొని వారితో నడపాలని కోరుకుంటున్నారు.
  • కారణాలు : అందరూ నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ సమయం వృథా అవుతుంది. అమలు చేసేవారుండరు. అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి మేధావంతులై, అంకితభావం కలిగి, ఇతరుల మేలు కోరేవారిని ప్రతినిధులుగా ఎన్నుకుంటే పాఠశాల చక్కగా నడుస్తుంది.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయా? ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారా?
జవాబు:
మా పాఠశాలలో నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరం మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాము. అయితే ఎక్కువమంది ఏ అభిప్రాయం వెళ్ళబుచ్చారో దానినే అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధివిధానాలను అనుసరించి మా అభిప్రాయం పరిగణలోకి తీసుకుంటున్నారు.

ప్రశ్న 7.
సాత్విక్ తండ్రి ఒక దుకాణం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగాడు. ప్రతి ఒక్కరు భిన్నమైన అభిప్రాయాలను తెలిపారు. కానీ చివరకు, అతను దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాడని మీరు అనుకుంటున్నారా?
జవాబు:

  • సాత్విక్ తండ్రి ప్రజాస్వామ్య బద్దంగానే వ్యవహరించాడని నేను అనుకుంటున్నాను.
  • ఎందుకంటే తను కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలను అడిగాడు.
  • కుటుంబ సభ్యులందరికి దుకాణం యొక్క లాభనష్టాల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. ఈయనకు సరైన అవగాహన ఉంది కాబట్టి దుకాణం ప్రారంభించి ఉండవచ్చు.

ప్రశ్న 8.
పద్మ తల్లి, తన పిల్లలను ఆదివారం ఎక్కడికి వెళ్తాం అని అడిగింది. ఇద్దరు పిల్లలు సినిమాకు వెళ్తామని, ముగ్గురు పార్కుకు వెళ్లాని అన్నారు. మీరు పద్మ స్థానంలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటారు? కారణాలు చెప్పండి.
జవాబు:

  • నేను పద్మని అయితే (ఆమె స్థానంలో ఉంటే) నేను పిల్లలను పార్కుకి తీసుకువెళ్ళే దానిని.
  • ఎందుకంటే ఎక్కువమంది (మెజారిటి) పిల్లలు పార్కుకి వెళ్తామని చెప్పారు కాబట్టి.

ప్రశ్న 9.
ప్రజాస్వా మ్యానికి పుట్టినిల్లు……….
ఎ) చైనా
బి) భారతదేశం
సి) గ్రీస్
డి) రోమ్
జవాబు:
సి) గ్రీస్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 10.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది?
ఎ) పురుషులు
బి) మహిళలు
సి) ప్రతినిధులు
డి) అర్హత కలిగిన ఓటర్లు
జవాబు:
డి) అర్హత కలిగిన ఓటర్లు

ప్రశ్న 11.
భారతదేశంలో…… సంవత్సరాలు నిండినవారు విశ్వజనీన వయోజన ఓటు హక్కుకు అర్హులు.
ఎ) 18 సం||
బి) 21 సం||
సి) 20 సం||
డి) 19 సం||
జవాబు:
ఎ) 18 సం||

ప్రశ్న 12.
భారతదేశంలో ప్రతి రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని నగరం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యస్థానాలు అయిన కింది రాష్ట్ర రాజధానులను దిగువ ఇచ్చిన భారతదేశ పటంలో గుర్తించండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 2
జవాబు:

  1. మహారాష్ట్ర – ముంబయి
  2. తమిళనాడు – చెన్నై
  3. ఆంధ్రప్రదేశ్ – అమరావతి
  4. కర్ణాటక – బెంగుళూరు
  5. పశ్చిమ బెంగాల్ – కొల్‌కతా
  6. తెలంగాణ – హైద్రాబాద్
  7. లడఖ్/జమ్మూకాశ్మీర్-లెహ్, శ్రీనగర్
  8. పంజాబ్ – చంఢీఘర్
  9. కేరళ – తిరువనంతపురం
  10. అరుణాచల్ ప్రదేశ్ – ఇటానగర్
  11. మధ్య ప్రదేశ్ – భోపాల్
  12. జార్ఖండ్ – రాంచి
  13. ఛత్తీస్ – రాయపూర్
  14. ఉత్తరాఖండ్ – డెహ్రాడూన్
  15. గుజరాత్ – గాంధీనగర్
  16. ఒడిశా – భువనేశ్వర్

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 3

6th Class Social Studies 9th Lesson ప్రభుత్వం InText Questions and Answers

6th Class Social Textbook Page No.100

ప్రశ్న 1.
శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వహక శాఖకు ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:

  • శాసన నిర్మాణ శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను చేస్తుంది.
  • కార్యనిర్వాహక శాఖ శాసనాలను (చట్టాలను) లేదా నిర్ణయాలను అమలుపరుస్తుంది.
  • ఈ రెండు శాఖలకు వేటికవే అధికారాలు కల్గి ఉన్నాయి. ఒకదానిలో మరొకటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. కాని శాసనశాఖ, కార్యనిర్వాహకశాఖను నియంత్రిస్తుంది.

ప్రశ్న 2.
న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏమిటి?
జవాబు:
న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడం, రాజ్యాంగ పరిరక్షణ చేయడం ప్రధాన విధిగా చెప్పవచ్చు.

6th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
దిగువ వార్తా పత్రికల శీర్షికలను పరిశీలించి, వాటి ఆధారంగా ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితాను రాయండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 4
జవాబు:
ప్రభుత్వ వివిధ కార్యకలాపాల జాబితా :

  • అందరికి ఉచిత నాణ్యమైన విద్యనందించడం.
  • మార్కెట్ ధరలను నియంత్రించడం (అదుపులో ఉంచడం).
  • అందరికి వైద్య సదుపాయాన్ని కల్పించడం (ఉచితంగా)
  • ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొవడం. ఉదా : వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులో సహాయమందించడం.
  • వివిధ శాఖాధిపతులను, నియమించటం మొదలైనవి.

6th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 5
మీ ఉపాధ్యాయుని సహాయంతో, పై లోగోలు మరియు ప్రభుత్వ కార్యకలాపాల చిత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కింది మైండ్ మ్యాప్ నింపండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 6

ప్రశ్న 5.
ప్రభుత్వానికి సంబంధించిన మరికొన్ని పనులను రాయండి.
జవాబు:
ప్రభుత్వానికి సంబంధించిన పనులు :

  • రోడ్ల నిర్మాణం చేపట్టడం
  • రైల్వే, విమాన, నౌకాయానం చేపట్టడం
  • పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు నిర్మించడం , తంతి, తపాల సౌకర్యాల ఏర్పాటు, నిర్వహణ
  • ఆనకట్టలు నిర్మించడం
  • దేశ రక్షణ (అంతర్గత, బహిర్గత)
  • శాంతి, భద్రతల పరిరక్షణ
  • ప్రజలందరికి న్యాయం అందించటం
  • పన్ను వసూలు చేయటం
  • అనేక రకాల సంక్షేమ పథకాలు చేపట్టడం
  • సమర్థవంతంగా పాలన చేయడం
  • అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలు నెలకొల్పడం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 6.
మీరు ప్రభుత్వం నుండి ఏ రకమైన సౌకర్యాలను ఆశిస్తున్నారు?
జవాబు:

  • ఉచిత గృహ వసతి
  • 24 గం||లు రక్షిత మంచినీటి సౌకర్యం
  • KG to PG ఉచిత విద్య,
  • పరిశుభ్రతకై పారిశుధ్య సౌకర్యం.
  • మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయం
  • పర్యావరణ పరిరక్షణకై వన సంరక్షణ.
  • మా గ్రామం/పట్టణంలో నాణ్యమైన, మంచిరోడ్లు
  • అందరికి ఉద్యోగ, ఉపాధి కల్పించడం.

ప్రశ్న 7.
మీ ఉపాధ్యాయుని సహాయంతో ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశాలలోనైనా రాచరికాలు అమలులో ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
ప్రస్తుత ప్రపంచంలో పూర్తిస్థాయి రాచరికాలు లేకపోయినప్పటికీ, రాజరికం అనేది (రాజు రాణి అధ్యక్షులు ఉండటం) నామమాత్రంగా నైనా కొన్ని దేశాలలో కలదు. అవి :

  • యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)
  • బ్రూనై
  • నెదర్లాండ్
  • రోమెనియా
  • జోర్డాన్
  • బెహ్రయిన్
  • మొరాకో
  • కాంబోడియా
  • UAE
  • మొనాకో
  • కువైట్
  • భూటాన్
  • టోంగా
  • వాటికన్ సిటీ
  • కత్తార్
  • బెల్జియం
  • సౌదీ అరేబియా
  • థాయ్ లాండ్
  • మలేసియా
  • జపాన్
  • ఓమన్ మొదలైనవి.

6th Class Social Textbook Page No.103

ప్రశ్న 8.
మీకు ఏ రకమైన ప్రభుత్వం ఇష్టం? ఎందుకు?
జవాబు:
నాకు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకొనబడుతుంది. ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది.

ప్రశ్న 9.
ప్రజల అభిప్రాయాన్ని ఏ ప్రభుత్వం గౌరవిస్తుంది?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుంది.

ప్రశ్న 10.
కింది చిత్రాలను గమనించండి. ప్రభుత్వ పేరును సంబంధిత బాక్సులలో రాయండి.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 7

6th Class Social Textbook Page No.104

ప్రశ్న 11.
రాచరికం మరియు ప్రజాస్వామ్యం మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

రాచరికంప్రజాస్వామ్యం
1. వంశపారంపర్యంగా నియమింపబడిన పాలకుడు ఉంటాడు.1. దేశంలోని ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఉంటాడు.
2. రాజుకి అపరిమిత అధికారాలుంటాయి.2. ప్రభుత్వ అధికారానికి పరిమితులుంటాయి.
3. ఎన్నికలు ఉండవు, పారదర్శకత ఉండదు. పాలకులపై నియంత్రణ ఉండదు.3. పాలన, ఎన్నిక విధానం పారదర్శకంగా ఉంటుంది. నాయకులపై నియంత్రణ ఉంటుంది.
4. రాచరికంలో హక్కులు రాజు ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి.4. ప్రజలందరికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఇవి రాజ్యాంగబద్దంగా అందరికీ ఇవ్వబడతాయి.
5. రాచరికంలో రాజు నియంత్రణలోనే (కనుసనల్లోనే) సమాచార, ప్రసార సాధనాలుంటాయి. ప్రభుత్వ పాలనను విమర్శిస్తే శిక్షార్హులే.5. సమాచార, ప్రసార సాధనాలు (వార్తా పత్రికలు, దూరదర్శన్, సినిమా) ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా ఉండి, ప్రభుత్వాలను విమర్శిస్తూ, నియంత్రిస్తుంటాయి.
6. ఇది నిరంకుశ పాలన కావచ్చు, సమానత్వం కన్పించదు.6. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వంలో అందరూ సమానులే.

ప్రశ్న 12.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యమేనా? కారణాలు తెల్పండి.
జవాబు:

  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం భారతదేశంలో సాధ్యం కాదు, కారణం
  • భారతదేశంలో అధికంగా దాదాపు (135 కోట్లు) జనాభా ఉండటం వల్ల సాధ్యం కాదు.

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 13.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యానికి ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులు ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారు.

6th Class Social Textbook Page No.105

ప్రశ్న 14.
పై సందర్భంలో మెజారిటీ పాలనను మీరు ఎలా అర్ధం చేసుకున్నారు? మరొక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ప్రాతినిధ్య సూత్రంతోపాటు, ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ (simple majority) ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతారు. ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా ఎన్నిక జరగవచ్చు. అటువంటప్పుడు వేరే అభ్యర్థికి ఓటువేసిన వారు కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకోవలసిందే. ఆ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు.

ఉదాహరణకు : ఒక మున్సిపల్ కౌన్సిల్ లో 45 మంది కౌన్సిలర్స్ ఉంటే 23 మంది ఒక ప్రతిపాదనను సమరిస్తే అది ఆమోదం పొందుతుంది. మిగతా 22 మంది అభిప్రాయాలకు విలువ ఉండదు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

ప్రశ్న 15.
మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.

ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఓటు చేసే వారి శాతం చాలా తక్కువగా ఉండటం యింకా పెద్ద సమస్య. ఇవి లేకుండా ఉండాలంటే ప్రజలు వివేకవంతులై ధన, కుల ప్రలోభాలకు లొంగకుండా, ఓటు చేయాలి. సరియైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.

6th Class Social Textbook Page No.106

ప్రశ్న 16.
కింద ఇవ్వబడిన ప్రపంచ పటాన్ని గమనించండి. పార్లమెంటరీ వ్యవస్థ మరియు అధ్యక్ష వ్యవస్థను విడిగా అనుసరిస్తున్న దేశాల జాబితా చేయండి. (మీ ఉపాధ్యాయుని సహాయంతో) ఈ పుస్తకం యొక్క వెనుక పేజీలలో ప్రపంచ పటాన్ని చూడండి.
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం 9

6th Class Social Textbook Page No.107

ప్రశ్న 17.
మీ ఉపాధ్యాయుని సహాయంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం :
ప్రధానమంత్రి, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఉద్యోగ బృందం

రాష్ట్ర ప్రభుత్వం :
ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండలి) సభ్యులు, గవర్నర్, రాష్ట్రమంత్రులు, ఉద్యోగ బృందం

AP Board 6th Class Social Solutions Chapter 9 ప్రభుత్వం

ప్రశ్న 18.
వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి?
జవాబు:
నేడు అన్ని దేశాలు (ఉదా: భారతదేశం) అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. కాబట్టి దేశ వ్యాప్తంగా ప్రజల అవసరాలు మరియు సమస్యలను గుర్తించడం కష్టం. కాబట్టి వివిధ సమస్యలను పరిష్కరించటానికి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకుగాను ప్రభుత్వం వివిధ స్థాయిలలో పనిచేస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను మీరు సమర్థిస్తారా? మీ సమాధానాన్ని సమర్థించడానికి పేజీ నెం. 114 లోని సమాచారాన్ని ఉపయోగించండి. (AS3)
(లేదా)
భారతదేశంలో నియత, అనియత రుణదాతలు రుణాన్ని అందించే విషయంలో చాలా తేడా ఉంది. నియత రుణ సంస్థలు ప్రభుత్వం, ఆర్.బి.ఐ. రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలను పాటింపచేస్తారు. కాని అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా తమ స్వంత పద్ధతులను పాటిస్తారు. రుణగ్రహీతలు తీసుకున్న అప్పును చెల్లించలేకపోయిన పక్షములో నియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యనైనా చేపడతారు. కాని అనియత రుణదాతలు అప్పును తిరిగి రాబట్టడానికి చట్టవ్యతిరేక మరియు ఎటువంటి చర్యనైనా చేపడతారు. ఈ కారణాల వలన అప్పుడప్పుడు రుణగ్రహీతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నియత రుణ సంస్థలతో పోలిస్తే అనియత రుణదాతలు అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు.

బ్యాంకులు, సహకార సంస్థలు అధికంగా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కువ మంది తక్కువ వడ్డీకి రుణాలు పొంది “అధిక ఆదాయాన్ని పొందగల్గుతారు. వారు పంటలను పండించగల్గడం, వ్యాపారం చేయడం, చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం మొదలగునవి చేయగలుగుతారు. ప్రతి ఒక్కరికి తక్కువ వడ్డీ రేటు, అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం వంటివి కల్గించడం దేశాభివృద్ధికి ప్రధాన అంశాలుగా పనిచేస్తాయి.
ప్రశ్న : “ధనిక కుటుంబాల వారు నియత రుణదాతల నుండి స్వల్ప వడ్డీకి రుణాలు పొందుతుండగా, పేదకుటుంబాల వారు అనియత రుణదాతలకు అధిక వడ్డీ చెల్లించవలసి వస్తున్నది” వ్యాఖ్యానించండి.
జవాబు:
నియత రుణాలు :
1. బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు :
అనియత రుణాలు :
1. వడ్డీ వ్యాపారస్థులు, వర్తకులు, యజమానులు – బంధువులు, స్నేహితులు ద్వారా పొందే రుణాలు. పేద కుటుంబాలలో చాలా కుటుంబాలు అనియత వనరుల నుండి రుణాలు పొందుతాయి. అనియత రుణాలపై ధనిక కుటుంబాలు చాలా తక్కువగా ఆధారపడతాయి. ఈ వాక్యాలను నేను సమర్థిస్తాను.

కారణం :
పేద కుటుంబాల వారికి బ్యాంకుల గురించిన సమాచారం అంతగా తెలియదు. బ్యాంకులలో జరిగే లావాదేవీలు కూడా పేద కుటుంబాల వారికి తెలియదు. బ్యాంకులు అంటే ధనికులకు
చెందినవి వారి అపోహ.

పైగా బ్యాంకుల ద్వారా ఋణాలు ఇవ్వడానికి పుచీకత్తులు’ అడుగుతారు అవి పేద కుటుంబాల వారి వద్ద ఉండవు. అందువలన ప్రైవేటు వ్యాపారస్తులను నమ్ముకుని వారి వద్ద మోసపోతారు.

పట్టిక – 1 ను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.
బ్యాంకులను ఎవరు వినియోగించుకుంటున్నారంటే…..
జీతం తీసుకునే ఉద్యోగులు,
పంటలు బాగా పండించే పెద్ద రైతులు,
వ్యాపారం చేసే వ్యాపారస్థులు,
బ్యాంకులలో డబ్బులు దాచుకుంటూ ఉండగా

బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న వారు, కార్లు కొనుక్కునేవారు. ట్రాక్టర్లు కొనుక్కునేవారు, ఎరువులను కొనుగోలు చేసేవారు, ఇళ్లు కట్టుకునేవారు. వీరంతా ధనికులు. అందువలన బ్యాంకులావాదేవీలు అన్నియు నిర్వహించేవారు ఎక్కువగా ధనికులు మాత్రమే.

పేదవారు బ్యాంకులు వద్దకు వెళ్ళకుండానే ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందుతూ ఉంటారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
రుణాలపై అధిక వడ్డీరేట్లు ఎందుకు హానికరం? (AS1)
జవాబు:
రుణాలపై అధిక వడ్డీరేట్లు హానికరం ఎందుకు అనగా –

  1. ఒక్కొక్కసారి మనం తీసుకున్న దానికన్నా వడ్డీ అధికం అవుతుంది.
  2. మొత్తం తిరిగి చెల్లించాలంటే అది రుణగ్రహీతలకు భారం అవుతుంది.
  3. రుణం ద్వారా పొందిన ప్రయోజనం కన్నా రుణగ్రహీతలకు వడ్డీ చెల్లించే భారం అధికం అవుతుంది.
  4. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వలన రైతులు తమ పంటలు పాడైపోతున్నా చూస్తూ ఉంటారు. కానీ రుణాలు తీసుకుని వాటికి తగిన చర్యలు చేపడదాము అని అనుకోరు. అందువలన వడ్డీరేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటే ధనాన్ని వడ్డీకి తీసుకుని అభివృద్ధికరమైన పనులు చేయడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
పేదల కోసం గల స్వయం సహాయక బృందాల ప్రధాన ఉద్దేశం ఏది? మీ సొంత వాక్యాల్లో వివరించండి. (AS4)
జవాబు:
పేదవారికి రుణాలు అందజేయడానికి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు.

  1. పేదవారిని సమీకృతం చేయడం
  2. ముఖ్యంగా స్త్రీలకోసం, వారు పొదుపు చేసే డబ్బును సేకరించడం.
  3. దీనికోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి నిర్వహించడం.
  4. ప్రతి స్వయం సహాయక బృందంలో 15 నుండి 20 మంది ఒకే ప్రాంతానికి చెందినవారు సభ్యులుగా ఉంటూ నిరంతరం కలుస్తూ, వారి డబ్బును పొదుపు చేస్తారు.
  5. ప్రతి ఒక్కరూ 25 రూ||ల నుండి 100 లేదా అంతకన్నా ఎక్కువ వారి వారి సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు.
  6. సభ్యుల్లో ఎవరికైనా రుణం అవసరమైతే తమ బృందం నుండి అందరూ కలసి దాచుకున్న సొమ్ము నుండి అప్పుగా పొందవచ్చు.
  7. బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి నుండి వడ్డీ వసూలు చేస్తారు.
  8. ఈ వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీలకన్నా తక్కువగా ఉంటుంది.
  9. 1 లేదా 2 సం||రాల పాటు బృందంలోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వారికి రుణం పొందే అర్హత వస్తుంది.
  10. బ్యాంకులతో ఉండే ఈ సంబంధం అందరికీ ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
  11. బృందం పేరుమీద బ్యాంకులు రుణాలను అందజేస్తాయి.
  12. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  13. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  14. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. ఈ ఏర్పాట్ల వలన పేద మహిళలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

ప్రశ్న 4.
బ్యాంకర్ తో మాట్లాడి పట్టణ ప్రాంత ప్రజలలో ఎవరు ఎక్కువ రుణాలు ఎందుకోసం పొందుతారో తెలుసుకోండి. (AS3)
జవాబు:
బ్యాంకుల నుండి పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ రుణాలు పొందుతున్న వారు:

  1. వ్యాపారస్థులు
  2. పారిశ్రామికవేత్తలు
  3. ప్రభుత్వ ఉద్యోగస్థులు
  4. ఆర్థికవేత్తలు

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 5.
స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణానికి, బ్యాంక్ ద్వారా వచ్చే రుణానికి తేడాలేమిటి? (AS1)
జవాబు:

  1. స్వయం సహాయక బృందాల ద్వారా వచ్చే రుణాలు సమష్టిగా ఉంటాయి. అదే విధంగా బృందాలు తీసుకున్న అప్పును అందరు కలిసి తిరిగి చెల్లించే హామీని బ్యాంకులకు ఇస్తాయి.
  2. రుణాలను పొందడం, డబ్బును పొదుపు చేయడం వంటి విషయాలను బృందం చర్చించి నిర్ణయిస్తుంది.
  3. రుణాలు షరతులను బృందమే నిర్ణయిస్తుంది.
  4. అప్పును తిరిగి చెల్లించడం బృందం సభ్యులందరి సమిష్టి బాధ్యత.
  5. ఎవరైనా సభ్యులు అప్పును సరిగా చెల్లించకపోతే ఆ విషయాన్ని బృందమే పర్యవేక్షిస్తుంది. అదే బ్యాంకు ద్వారా వచ్చే రుణాలు బృందాలతో సంబంధం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు. లేదా చెల్లించాల్సి వచ్చినప్పుడు చెల్లించవచ్చు. అనగా వ్యక్తిగత రుణాలు ఆ వ్యక్తి యొక్క అవసరాలను బట్టి ఉంటాయి.

ప్రశ్న 6.
పేజీ నెం. 115 లోని స్వయం సహాయక బృందాల ……. గురించి ఉన్న మూడవ పేరా చదివి ఈ కింది ప్రశ్నకు జవాబు రాయండి. (AS2)
మీ ప్రాంతంలో స్వయం సహాయక బృందాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి?
(లేదా)
“స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి. మహిళలు స్వయంకృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.” పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ జవాబును వివరించండి.
జవాబు:
మా ప్రాంతంలోని స్వయం సహాయక బృందాలు పనిచేసే విధానం :

  1. స్వయం సహాయక బృందాలలోని సభ్యులు రుణాలను పొంది స్వయం ఉపాధిని పొంది స్వయం ఉపాధిని ఏర్పరచుకుంటున్నారు.
  2. బృంద సభ్యులు చిన్న చిన్న మొత్తాలను రుణాలుగా పొందుతారు.
  3. ఉదా:- పూచీకత్తుగా ఉంచిన భూమిని తిరిగి పొందడం, పెట్టుబడులను సంపాదించడం. (ఉదా: విత్తనాలు, ఎరువులు, ముడిసరుకులు, బట్టలు, నగలు కొనుగోలు మొదలైన వాటికి)
  4. గృహోపకరణాల కొనుగోలు నిమిత్తం, కుట్టుమిషన్, మగ్గం, పశువులు మొదలగు ఆస్తుల సంపాదన కోసం రుణాలు పొందుతారు.
  5. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  6. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమేకాక వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం, పోషణ, గృహహింస – మొదలయిన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే విధంగా కూడా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రశ్న 7.
రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ఏమిటి?
జవాబు:
రైతుల అవసరాలను తీర్చడంలో బ్యాంకులు అందజేసే సేవలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. పూర్వ కాలంలో అవసరాలకి, ప్రస్తుత కాల వ్యవసాయ అవసరాలకి చాలా తేడా కన్పిస్తుంది. పూర్వ కాలంలో వ్యవసాయానికి కావలసిన ఉత్పాదకాలలో చాలా వాటిని రైతులే స్వయంగా సమకూర్చుకునే వారు. సొంత పశువులనే పొలం దున్నడానికి, ఇంటి మనుషులే వ్యవసాయ కూలీలుగా తమ పొలంలో పండిన పంటనే విత్తనాలుగా, తమ పశువుల కొట్టం నుండే ఎరువులను తయారు చేసుకోవడం మొదలైన పనులు చేసేవారు. నవీన వ్యవసాయ పద్ధతులకు అధికమైన ధనం అవసరం.

విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనడం కోసం అలాగే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, పంటకోత కోయడం మొదలైన వ్యవసాయ పనులు చేసే యంత్రాల కోసం, కూలీల జీతాల కోసం ఎక్కువ డబ్బు అవసరం. దీనికి అనుగుణంగా బ్యాంకులు, రైతుల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ఋణాలు అందించి, వ్యవసాయ పురోభివృద్ధికి, రైతుల అవసరాలు తీర్చడంలో బ్యాంకులు ముందుంటున్నాయి.

9th Class Social Studies 9th Lesson ద్రవ్య వ్యవస్థ – ఋణం InText Questions and Answers

9th Class Social Textbook Page No.105

ప్రశ్న 1.
డిమాండ్ డిపాజిట్లను నగదుగా ఎందుకు పరిగణిస్తారు?
జవాబు:

  1. డిమాండ్ డిపాజిట్లు నగదు, యొక్క వివిధ లక్షణాలకు దారితీస్తుంది.
  2. నగదుకు బదులుగా చెక్కుల రూపంలో లేదా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా చెల్లింపులు జరుగుతాయి.
  3. కరెన్సీ నోట్లు మొదలైన వివిధ నగదు రూపాల లాగానే ఈ డిపాజిట్ల ద్వారా జమచేసిన డబ్బును తిరిగి తీసుకోవడం లేదా చెల్లింపులు జరపటం లాంటి విషయాలను నగదు రూపంలో గాని, చెక్కుల రూపంలోగాని చేయవచ్చు.
  4. చెల్లింపులు జరపడంలో డిమాండ్ డిపాజిట్లు అధిక ,వినియోగం వలన అధునిక ఆర్థిక వ్యవస్థలో ఇవి కరెన్సీ, నగదుకు ప్రతిరూపంలో ఉన్నాయి. ప్రస్తుత కాలంలోని డబ్బు యొక్క వివిధ రూపాలైన కరెన్సీ, డిపాజిట్లు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 2.
బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది. వివరాలు సేకరించండి.
జవాబు:
ప్రతి బ్యాంక్ తన డిపాజిట్ దారుల తరఫున “డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్” కు ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితులలో బ్యాంకు మూసివేయవలసి వస్తే ఒక లక్ష రూపాయలవరకు డిపాజిట్ దారులకు బీమా లభిస్తుంది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలుగచేయుటకొరకు బ్యాంక్ డిపాజిట్లను కూడా ప్రభుత్వం బీమా చేస్తుంది.

ప్రశ్న 3.
బ్యాంకులలో జమ చేసే ఫిక్స్ డిపాజిట్లు నగదు లాగా పనిచేస్తాయి. చర్చించండి.
జవాబు:

  1. బ్యాంకులలో దాచుకొనే డబ్బుకు, ఫిక్స్ డిపాజిట్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.
  2. వివిధ లావాదేవీలపై అనుమతిస్తూ, ప్రజలకు బ్యాంకులపై నమ్మకం కలిగిస్తుంది.
  3. ఫిక్స్ డిపాజిట్లపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఋణాలను వెంటనే పొందవచ్చు. వాటిని తిరిగి చెల్లించవచ్చు. లేక నిర్ణీతకాలం అయిన తరువాత రుణమును మినహాయించి తిరిగి మొత్తం సొమ్మును పొందవచ్చును. అందువలన ఫిక్స్ డిపాజిట్లు కూడా నగదు లాగా పనిచేస్తాయి.

9th Class Social Textbook Page No.107

ప్రశ్న 4.
డిపాజిట్ దారులందరు ఒకేసారి బ్యాంకు నుండి తమ డబ్బును తిరిగి ఇవ్వవలసినదిగా కోరితే ఏమౌతుంది?
జవాబు:

  1. ఏమీ జరగదు. కారణం బ్యాంకు స్థాపించబోయే ముందు కొంత పైకమును రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియాకు డిపాజిట్ గా చెల్లించాలి. మరియు బ్యాంకులు వ్యాపారం చేస్తూ ఉంటాయి కాబట్టి లాభాల బాటలోనే నడుస్తాయి.
  2. బ్యాంకులు డిపాజిట్ చేసిన మొత్తం కన్నా ఎక్కువగా డిపాజిట్లను సేకరించరాదు.
  3. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన షరతులను అంగీకరించి డిపాజిట్ల పరిధి ఎక్కువగా ఉండరాదు.
  4. అందువలన డిపాజిట్ దారులు ఒకేసారి డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తము అడిగినా బ్యాంకులు ఇవ్వగలవు.

ప్రశ్న 5.
బ్యాంకు నుండి రుణం తీసుకున్న వ్యక్తితో మాట్లాడండి. రుణాన్ని ఏ అవసరానికి తీసుకున్నాడో బ్యాంకు వారిని ఏ విధంగా కలిసాడో తెలుసుకోండి?
జవాబు:

  1. బ్యాంకు నుండి రుణం తీసుకున్న సుమ అనే వ్యక్తితో మాట్లాడాను.
  2. ఆమె రుణాన్ని ఇల్లు నిర్మించడానికి తీసుకున్నది.
  3. ఆమె ఎలా రుణాన్ని తీసుకుంది అనగా ముందుగా బ్యాంకు మేనేజర్ గారి వద్దకు వెళ్ళి నేను ఇల్లు నిర్మించదలచాను. నేను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పి రుణం ఇవ్వమని అడిగాను అంది.
  4. ఆ తరువాత ఆమెను డిఫ్యూటి మేనేజర్ హోదాలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరకు పంపగా ఆయన రుణం ఇవ్వడానికి ఏమి కావాలో చెప్పారు.
  5. కావలసినవి :
    1. జీతమునకు సంబంధించిన వివరాలతో కూడిన సర్టిఫికెట్
    2. ఇంటి స్థలమునకు చెందిన రిజిస్ట్రేషన్ పత్రం.
    3. న్యాయపరమైన అర్హత గల పత్రము.
    4. ఆ స్థలమును ఎవరికీ అన్యాక్రాంతము చేయలేదని రుజువు చేసే పత్రం.
    5. సంబంధిత అధికారుల చేత ఇల్లు నిర్మించుకోవటానికి కావలసిన అనుమతి పత్రం.
    6. ఇంజనీరు చేత రూపొందించబడిన ఇంటి నిర్మాణం యొక్క ఆకృతి పత్రము వంటివి తీసుకువచ్చి బ్యాంకువారికి అప్పగించిన తరువాత పై అధికారులు వాటిని పరిశీలించిన తరువాత రుణమును పొందవచ్చును అని చెప్పారని ఆమె తెలియపరిచినది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 6.
బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారు ఏ ఏ రుణాలు ఇచ్చారో ఏ ఏ వాటికి రుణాలు ఇవ్వకూడదో చర్చించండి.
జవాబు:
1. బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే ఆయన ఇవ్వవలసిన రుణాలను గురించి, ఇవ్వకూడని రుణాలను గురించి వివరించి చెప్పారు.

ఇవ్వవలసిన రుణాలు :

  1. వ్యక్తిగత రుణాలు,
  2. ఇళ్లు నిర్మించడానికి రుణాలు,
  3. కార్లు కొనుగోలు చేయడానికి రుణాలు,
  4. గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి,
  5. చదువుకోడానికి,
  6. రైతులకు సంబంధించినవి,
  7. వ్యాపారులకు సంబంధించినవి,
  8. పారిశ్రామికవేత్తలకు సంబంధించినవి.

ఇవ్వకూడని రుణాలు :

  1. ఒకసారి తనఖా పెట్టిన తరువాత మరల తనఖా పెట్టవలసి వస్తే వాటిని పరిశీలించాలి.
  2. దివాళా తీసిన వారికి
  3. స్థిర నివాసం లేనివారికి ఋణాలను ఇవ్వరాదు.

ప్రశ్న 7.
ప్రజలు వారి డబ్బును బ్యాంకులలోనే కాకుండా ఇతర సంస్థలైన గృహ సముదాయ సంస్థలు, కంపెనీలు పోస్టాఫీసు పథకాలు మొదలైన వాటిలో కూడా జమ చేస్తారు. బ్యాంక్ డిపాజిట్ల కన్నా ఇవి ఏ విధంగా విభిన్నమో చర్చించండి.
జవాబు:

  1. బ్యాంక్ డిపాజిట్లలో కరెంట్ డిపాజిట్లు, ఫిక్స్ డిపాజిట్లు వంటి రకరకాల డిపాజిట్లు ఉంటాయి.
  2. ఇతర సంస్థలలో నిర్ణీత కాలపరిమితి ననుసరించి డిపాజిట్లు ఉంటాయి.
  3. వడ్డీ రేట్లలలో కూడా తేడాలుంటాయి.
  4. వాటిని బ్యాంకులలో హామీగా చూపించి రుణాలు పొందవచ్చును.
  5. ఇతర సంస్థల యందు లావాదేవీలు సులభంగా ఉంటాయి. చిన్న చిన్న మొత్తాలలో కూడా పొదుపు చేయవచ్చును. ఆ విధంగా పొదుపుచేసిన మొత్తం ఒకేసారి పొందవచ్చును.
  6. బీమా సంస్థలలో పొదుపు చేసేటప్పుడు పొదుపు చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే తదుపరి పొదుపు చేయవలసిన అవసరం లేకుండానే ఆ మొత్తం పొదుపు డబ్బును పొందవచ్చును.
  7. బ్యాంకులలో అయితే ఆ విధంగా ఉండదు. అందువలన బ్యాంక్ కార్యకలాపాలకు, ఇతర బీమా, గృహ సముదాయ పోస్టాఫీసు పథకాలకు కొంత వ్యత్యాసం ఉంది.

9th Class Social Textbook Page No.108

ప్రశ్న 8.
కింది పట్టికను పూరించండి.
జవాబు:

అలీషాస్వప్న
రుణాలు ఎందుకవసరం?చెప్పులు తయారీదారుడు. పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు నెలరోజుల సమయంలో 3 వేల జతల షూస్ తయారుచేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చాడు. గడువు లోపల ఇచ్చిన పని పూర్తి చేయడానికి పేస్టింగ్ గ్రీజు పూయడం, స్టిచ్చింగ్ (చెప్పులు కుట్టడం) మొ||న పనుల కోసం, మరి కొంత మంది పని వారికి నియమించుకోవాలి. ఇంకా చెప్పుల తయారీకి కావలసిన ముడి సరుకులు కొనాలి అందువలన అప్పు చేశాడు.స్వప్న ఒక చిన్న రైతు. తన 3 ఎకరాల భూమిలో వేరుశనగను పండిస్తుంది. పంట పండిన తరువాత వచ్చే డబ్బుతో తను అప్పును తీర్చవచ్చు అనే ఆశతో పంటకయ్యే ఖర్చును వ్యాపారస్థుని నుండి అప్పుగా పొందింది.
రుణం తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగవచ్చు?అలీషా అనుకున్న సమయంలో చెప్పులుకుట్టి వ్యాపారస్థునికి ఇచ్చాడు. కాబట్టి లాభం పొందాడు.వేసిన పంట చీడకు గురైనందువలన ఏ విధమైన ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి వృథా అయినది. అందువలన నష్టపోయి అప్పు తీర్చలేని పరిస్థితి ఎదురైంది.
ఫలితమేమిటి?లాభం పొందడంనష్టాలలో చిక్కుకోవడం, కష్టాలలో పడిపోవడం జరిగింది.

ప్రశ్న 9.
అలీషాకు వరుసగా ప్రతి సంవత్సరం ఆర్డర్లు వస్తే ఆరు సంవత్సరాల తరువాత అతను ఎటువంటి స్థితికి చేరుతాడు?
జవాబు:

  1. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు.
  2. తరువాత ఆర్డర్లు వచ్చిన అప్పు తీసుకునే అవకాశం ఉండదు.
  3. చిన్న కుటీర పరిశ్రమ లాంటి దానిని స్థాపించడానికి అవకాశం ఉంటుంది.
  4. దానిలో అతను మాత్రమే ఉపాధి పొందడం కాక ఇతరులకు ఉపాధి కల్పిస్తాడు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 10.
స్వప్న నష్టాల స్థితికి చేరడానికి కారణాలు ఏవి? కింది అంశాలను చర్చించండి.
క్రిమి సంహారక మందులు, వడ్డీవ్యాపారుల పాత్ర, శీతోష్ణస్థితి.
జవాబు:
1. క్రిమిసంహారక మందులు :
ఉపయోగించిన ఈ మందుల వల్ల చీడపోవడం లేదు – కారణం నాణ్యత లోపం, కలీ మందుల వ్యాపారం వంటివి. అందువలన రైతు నష్టపోవడం జరుగుతుంది.

2. వడ్డీ వ్యాపారుల పాత్ర :
రైతులకు అధిక వడ్డీలకు రుణాలను ఇచ్చి పంటలు పండిన తరువాత తమకు అమ్మమనే షరతు పెడతారు. తక్కువ రేటుకు కొంటారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఆ విధంగా వారు రెండు విధాలుగా లబ్ధి పొందుతారు.

3. శీతోష్ణస్థితి :
పంటలు పండటానికి వాతావరణం అనుకూలించాలి. అందుకే భారతీయ రైతు ఋతుపవనాలతో జూదం ఆడతాడు అంటారు. సకాలంలో వర్షాలు పడి పంటలు పండితే రైతు గెలిచినట్లు, పడవలసిన సమయంలో వర్షాలు పడక పడరాని సమయంలో వర్షాలు పడి అనావృష్టి, అతివృష్టి వంటి పరిస్థితులు ఏర్పడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువలన రైతులపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా క్రిమిసంహారక మందులను, వడ్డీ వ్యాపారులను, శీతోష్ణస్థితి వంటి అంశాలను పేర్కొనవచ్చు.

9th Class Social Textbook Page No.109

ప్రశ్న 11.
ప్రజలు అనేక సామాజిక, సాంస్కృతిక విషయాల కోసం రుణాలు తీసుకుంటారు. వివాహ సమయాలలో చేసే అధిక ఖర్చుల కోసం వధూవరుల ఇద్దరి కుటుంబాలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ప్రాంతంలోని ప్రజలు చేసే అప్పులకు ఇతర కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీ పెద్దలు, ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని సేకరించి తరగతిలో చర్చించండి.
జవాబు:
ఇతర కారణాలు ఉన్నాయి. అవి :

  1. అప్పటికే అప్పులలో ఉండటం,
  2. పంటలు సరిగా పండక అప్పులు తీర్చకపోవడం,
  3. ఆభరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం,
  4. కట్న, కానుకలకు అప్పులు చేయడం,
  5. తామే గొప్పగా కనిపించాలి అని అనుకోవడం,
  6. అనారోగ్య పరిస్థితులకు లోనుకావడం వంటి అంశాల వలన కూడా అప్పులు చేస్తారు.

9th Class Social Textbook Page No.110

ప్రశ్న 12.
రుణదాతలు అప్పు ఇవ్వడానికి ఎందుకు పూచీకత్తును అడుగుతారు?
జవాబు:

  1. అప్పు తీసుకునేవారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశుసంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలైన వాటిని పూచీకత్తుగా చూపిస్తారు.
  2. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి.

ప్రశ్న 13.
అప్పు తీసుకోవడంలో పూచీకత్తు పేదవారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. అప్పు తీసుకోవడంలో పూచీకత్తు ప్రధానపాత్ర పోషిస్తుంది.
  2. పూచీకత్తు లేకపోతే ఎవరూ వడ్డీకి ఇవ్వడానికి ముందుకు రారు.
  3. ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.
  4. పేదవారిని తమ వద్ద పనిచేయమని ఒత్తిడి చేస్తారు.
  5. తక్కువ కూలీ ఇస్తారు. తప్పనిసరి పరిస్థితులలో వారు చెప్పే షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 14.
సరియైన సమాధానమును ఎంచుకొని ఖాళీలను పూరించండి.
అప్పు తీసుకునేటప్పుడు రుణగ్రహీతలు సులభమైన షరతుల కోసం ఎదురుచూస్తారు. దీని అర్థం ……….. (అధిక / అత్యల్ప) వడ్డీరేటు, ………….. (సులభమైన / కష్టమైన) షరతులతో కూడిన చెల్లింపులు, ……………….. (తక్కువ / ఎక్కువ) సంఖ్యలో చూపాల్సిన పూచీకత్తుగా ఉపయోగపడే ఆస్తులు.
జవాబు:
అత్యల్ప, సులభమైన, తక్కువ.

9th Class Social Textbook Page No.111

ప్రశ్న 15.
పై ఉదాహరణలలో రుణం పొందడానికి ఉపయోగపడే వనరుల జాబితాను రాయండి.
జవాబు:

  1. భూమికి సంబంధించిన వివరాల పత్రం.
  2. పండిన పంటను దాచినట్లు చూపే పత్రం.

ప్రశ్న 16.
అందరికీ రుణం తక్కువ వడ్డీ రేటుతో లభిస్తుందా? ఎవరెవరికి లభిస్తుంది?
జవాబు:
అందరికీ రుణం తక్కువ వడ్డీకి లభించదు.

ఎవరికి లభిస్తుంది అనగా : పంట పొలాలున్న రైతులకు, వ్యాపారస్థులకు, పారిశ్రామికవేత్తలకు, ఇటీవలికాలంలో ఏర్పడిన స్వయం సహాయక బృందాలకు, పండిన పంటలను గోదాములలో దాచినట్లు చూపే హామీపత్రాలు ఉన్న రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలు అందిస్తాయి.
సరియైన సమాధానం వద్ద (✓) గుర్తును ఉంచండి.
అ. కాలం గడిచే కొద్దీ రమ చేసిన అప్పు
– పెరుగుతుంది. (✓)
– స్థిరంగా ఉంటుంది.
– తగ్గుతుంది.

ఆ. బ్యాంకు నుండి రుణం పొందిన కొద్ది మందిలో అరుణ్ కూడా ఒకడు. దీనికి కారణం
– అతను విద్యావంతుడు.
– బ్యాంకు అడిగే పూచీకత్తును ప్రతి ఒక్కరూ సమర్పించలేరు. (✓)
– వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు విధించే వడ్డీరేటు ఒక్కటే.
– బ్యాంకు రుణం పొందుటకు ఎటువంటి దస్తావేజులు (పత్రాలు) అవసరం లేదు.

ప్రశ్న 17.
మీ ప్రాంతంలోని కొందరిని కలిసి మీ దగ్గర ఉన్న రుణ ఏర్పాట్ల వివరాలు సేకరించండి. రుణ షరతులలో ఉన్న తేడాలను నమోదు చేయండి.
జవాబు:
నమ్మకం కలిగిన వ్యాపారస్థుల నుండి, భూస్వాముల నుండి బ్యాంకులు ఏ విధమైన హామీలు లేకపోయినా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి.

అదే పేదవారు అయితే బ్యాంకులకు నమ్మకం ఉండదు. అందువలన వారినీ పూచీకత్తులు అడుగుతాయి.

పూచీకత్తులు చూపించిన తదుపరి రుణాలను అందజేస్తాయి.

ప్రశ్న 18.
శివకామి, అరుణ్, రమ, వాసులకు సంబంధించిన కింది వివరాలు పట్టికలో నింపండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం 1

9th Class Social Textbook Page No.114

ప్రశ్న 19.
నియత, అనియత వనరుల నుండి పొందే రుణాలలో గల భేదాలు ఏవి?
జవాబు:

  1. ధనిక కుటుంబాలు తక్కువ వడ్డీతో నియత రుణాలను పొందుతూ ఉంటే పేద కుటుంబాలు అధిక వడ్డీతో అనియత రుణాలను పొందుతున్నారు.
  2. అనగా నియత వనరులు ధనికులకు అందుబాటులో ఉన్నాయి. పేదలకు అందుబాటులో లేవు.
  3. నియత వనరులు తక్కువ వడ్డీరేటుకు లభిస్తాయి. అనియత వనరులకు ఎక్కువ వడ్డీరేటు ఉంటుంది.
  4. నియత వనరులు బ్యాంకులు ద్వారా, సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు.
  5. అనియత వనరులు వడ్డీ వ్యాపారస్థుల ద్వారా, వర్తకుల ద్వారా, యజమానుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా పొందే రుణాలు.

ప్రశ్న 20.
ప్రతి ఒక్కరికి సముచితమైన వడ్డీ రేట్లతో ఉన్న రుణాలు ఎందుకు అందుబాటులో ఉండాలి?
జవాబు:

  1. పేదవారు అనియత రుణాలపై ఆధారపడటం వలన ఒక్కొక్కసారి తీసుకున్న మొత్తం సొమ్ము కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
  2. దానితో వారు తిరిగి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడతారు. అందువలన వడ్డీరేటు ఎల్లప్పుడు తక్కువగా ఉండాలి.
  3. వడ్డీరేటు తక్కువగా ఉండే రుణాలు నియత రుణాలు. అనగా బ్యాంకులు, సహకార సంస్థలు ఇచ్చేవి.
  4. అందువలన నియత వనరుల రుణాలు మరిన్ని ప్రదేశాలకు విస్తరించి ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలి.
  5. దానితో పేదప్రజలు తక్కువ వడ్డీపై రుణాలను పొందగలుగుతారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 21.
ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలా? ఈ పని ఎందుకు కష్టతరం?
జవాబు:

  1. ఆర్.బి.ఐ లాగానే అనియత రుణాలకు పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ చాలా కష్టం.
  2. ఎందుకంటే అనియత రుణాలు ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? అనేది వివాదాస్పదం అయితే తప్ప ఎవరికీ తెలియదు.
  3. ఏ వడ్డీ వ్యాపారస్థుడైనా లేదా ఏ ధనవంతుడైనా మేము ఇంత పైకము వడ్డీకి ఇచ్చాము అని సమాచారాన్ని ఎవరికీ చెప్పరు.
  4. అంతేకాక ఆ లావాదేవీలన్నీ అనధికారికంగా జరుగుతాయి. అధికారికంగా వెల్లడి చేయరు.
    అందువలన పర్యవేక్షణాధికారి ఉండలేరు.

ప్రశ్న 22.
ఆంధ్రప్రదేశ్ రైతుల నిస్పృహకు పేదవారికి నియత రుణాలు తక్కువగా అందడం కూడా ఒక కారణమా? చర్చించండి.
జవాబు:

  1. అవును, అదీ ఒక కారణమే ఎందుకో మన ప్రభుత్వం చెప్పినంతగా బ్యాంకులు వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడం లేదు.
  2. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండటం, వారికి యజమాన్యపు హక్కు లేకపోవడం వలన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు.
  3. దానితో వారు నిరాశ నిస్పృహలతో ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి రుణాలను పొందవలసి వస్తున్నది.

9th Class Social Textbook Page No.115

ప్రశ్న 23.
బ్యాంకు నుండి పొందే రుణానికి స్వయం సహాయక బృంద సభ్యురాలిగా పొందే రుణానికి గల భేదాలు ఏమిటి?
జవాబు:

  1. బ్యాంకు నుండి పొందే రుణం వ్యక్తిగతం. :
  2. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సమష్టిది.
  3. బ్యాంకు నుండి రుణాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు.
  4. స్వయం సహాయక బృంద సభ్యురాలుగా పొందే రుణం సభ్యులందరితో కలసి సమష్టిగా చెల్లించాలి.
  5. బ్యాంకు నుండి పొందేది వ్యక్తిగత బాధ్యత. 6. స్వయం సహాయక బృందం పొందేది సమష్టి బాధ్యత.

ప్రశ్న 24.
కొన్ని స్వయం సహాయక బృందాలు’ వారి సభ్యులు తీసుకునే రుణాలకు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. ఈ చర్య సరియైనదేనా? చర్చించండి.
జవాబు:

  1. సరియైనది కాదు ఎందువలననగా అన్ని స్వయం సహాయక బృందాలూ ఒకే రకమైన వడ్డీలు వసూలు చేయాలి.
  2. అందరీ పట్లా సమానత పాటించాలి.
  3. ఏ విధమైన వ్యత్యాసం చూపించరాదు.
  4. దానితో వారిలో ఆత్మస్టెర్యం పెరిగి ధైర్యంతో కొత్త కొత్త పనులు చేయడానికి, నూతన ఉత్పత్తులు చేయడానికి ముందుకు వస్తారు.

AP Board 9th Class Social Solutions Chapter 9 ద్రవ్య వ్యవస్థ – ఋణం

ప్రశ్న 25.
స్వయం సహాయక బృందాల సమాఖ్య యొక్క పాత్ర ఏమిటి?
జవాబు:

  1. స్వయం సహాయక బృందాలు గ్రామీణ, పట్టణ పేదప్రజలకు కేంద్రంగా పనిచేస్తాయి.
  2. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ సామాజిక సమస్యలైన ఆరోగ్యం , పోషణ, గృహ హింస మొదలైన వాటిని చర్చించి సరియైన చర్యలు తీసుకునే వేదికగా కూడా స్వయం సహాయక బృందాల సమావేశాలు తోడ్పడతాయి.

ప్రాజెక్టు

మీ ప్రాంతంలో ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకున్నాడా? అయితే దానికి కారణాలను తెల్సుకొని ఒక రిపోర్టు తయారు చేసి, వార్తాపత్రికలలో దీనికి సంబంధించిన వార్తలను సేకరించి మీ తరగతి గదిలో చర్చించండి.

మా ప్రాంతంలో ఒకప్పుడు రామయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అప్పట్లో అనావృష్టి పరిస్థితి ఏర్పడి ఆరుగాలం శ్రమించి కష్టపడి వేసుకున్న పంట చేతికి రాక ఎండిపోతే దానికి పెట్టిన పెట్టుబడి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

రిపోర్టు :

అయ్యా,
న్యూస్ పేపర్ మేనేజర్ గారికి
మా ప్రాంతంలో ఒకప్పుడు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నది. వర్షాలు లేక నదులు ఎండిపోయి కాలువల ద్వారా నీరు రాక బావులలో సైతం ఊటలేక ‘చెరువులు ఎండిపోయి తత్ఫలితంగా పొలాలలో వేసిన పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన పెట్టుబడి రాక కుమార్తె పెండ్లి కుదుర్చుకొని పంట పండితే వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో కుమార్తెకు కట్నకానుకలు ఇచ్చి వివాహం చేద్దామనికొని నిర్ణయించుకున్న రామయ్య అనే రైతు చివరికి పెట్టిన పెట్టుబడి కూడా రాక వేసిన పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి మేనేజర్ గారు దీనిని వార్తా పత్రికలయందు ప్రచురించి ఇలాంటి నిర్ణయాలు ఎవరిని తీసుకోవద్దు, బ్రతికి ఉంటే ఈ సంవత్సరం పంట పండకపోయిన వచ్చే సంవత్సరం పండుతుంది. ప్రభుత్వం ‘ఈసారి ముందుగానే పరిస్థితిని అంచనావేసి తగిన నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకుంటుంది, ప్రకృతి సహకరిస్తుంది’ అని రైతులకు తెలియజేయండి. వారిలో మనో ధైర్యాన్ని నింపండి.

ఇట్లు,
రామతేజ,
9వ తరగతి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
………………….., …………….. ల కోసం బ్రిటను ఇతర దేశాలపై ఆధారపడలేదు. (శ్రామికులు, ముడి సరుకులు, పెట్టుబడి, . ఆవిష్కరణలు) (AS1)
జవాబు:
పెట్టుబడి, శ్రామికులు.

ప్రశ్న 2.
పారిశ్రామిక విప్లవకాలంలో ప్రధానమైన రెండు రవాణా మార్గాలు ………… (రోడ్డు, వాయు, జల, రైలు) (AS1)
జవాబు:
జల, రైలు.

ప్రశ్న 3.
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి. (AS1)
అ) సాంకేతిక విజ్ఞానం
ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు
ఇ) వ్యవసాయిక విప్లవం
డి) రవాణా వ్యవస్థలు
జవాబు:
అ) సాంకేతిక విజ్ఞానం :
పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో సాంకేతిక విజ్ఞానం ప్రధాన పాత్ర పోషించింది. చేతివృత్తులు, చేతి యంత్రాలు వల్ల పెద్ద ఎత్తున సరుకులు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. వాణిజ్య కార్యకలాపాలకు పేరు గడించడానికి అనేక పరిశ్రమలు స్థాపించి, ప్రపంచ కర్మాగారంగా ఇంగ్లాండ్ పిలువబడడానికి కారణం సాంకేతిక విజ్ఞానమే.

ఆ) ఆర్థిక వనరులు సమకూర్చడం, డబ్బులు :
కొత్త యంత్రాలు, సాంకేతిక విజ్ఞానంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఇంగ్లాండ్ లో సంపద అనంతంగా ఉండడం వల్ల పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడలేదు. ప్రపంచ దేశాలతో వాణిజ్య కార్యకలాపాల వలన అధికంగా ఆర్థిక వనరులు సంపాదించింది. ఈ ఆర్థిక వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించారు. డబ్బును అధికం చేయడంలో ఇంగ్లాండ్ బ్యాంక్ ప్రధానపాత్ర పోషించింది. లండన్ విత్తమార్కెట్, ఉమ్మడి స్టాక్ బ్యాంకు, ఉమ్మడి స్టాక్ కార్పొరేషన్ ఏర్పడడంతో ఆర్థిక వనరులు, డబ్బు. పుష్కలంగా సమకూరాయి. సరుకులు, ఆదాయాలు, సేవలు, జ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం వంటి రూపాలలో ఆర్థిక వనరులు వృద్ధి చెందాయి.

ఇ) వ్యవసాయిక విప్లవం :
బ్రిటిష్ జనాభా పారిశ్రామికీకరణ వల్ల పెరిగింది. లాభసాటికాని, పాతకాల వ్యవసాయ పద్ధతుల స్థానంలో కొత్త సాగు పద్ధతులు అంటే శాస్త్రీయంగా పంటలమార్పిడి వంటివి అనుసరించసాగారు. దీనివల్ల అధికంగా ఆహార ఉత్పత్తి పెరిగింది.

ఈ) రవాణా వ్యవస్థలు :
ముడి సరుకులు, ఉత్పత్తి అయిన వస్తువులను ప్రపంచ నలుమూలలకు చేర్చడానికి, లాభసాటి వ్యాపారాలు చేయడానికి రవాణా వ్యవస్థ ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా, రైలు, జల మార్గాలు పట్టణాలకు ఇనుము, బొగ్గును సమీప పట్టణాలకు ప్రయాణీకులను, సరుకులను వేగంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేయడానికి తోడ్పాటు నందించాయి.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
పారిశ్రామిక విప్లవ సమయంలో జరిగిన ఆవిష్కరణల ప్రత్యేకత ఏమిటి? (AS1)
జవాబు:
యాంత్రీకరణకు అవసరమైన ప్రధాన ముడి సరుకులైన బొగ్గు, ఇనుప ఖనిజాలతో పాటు పరిశ్రమలలో వినియోగించే సీసం, రాగి, తగరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఇంగ్లాండ్లో లభించేవి. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ (స్మెల్టింగ్) ద్వారా స్వచ్ఛమైన ఇనుమును ద్రవరూపంలో తీస్తారు. కొన్ని శతాబ్దాల పాటు కలపను కాల్చటం నుంచి బొగ్గుతో ఇనుమును కరిగించేవారు. తద్వారా అడవులు మొత్తం నాశనమయ్యాయి. ఇటువంటి తరుణంలో ‘కమ్మరం” పనిచేసే ప్రాప్ షైర్ కి చెందిన డర్బీలు 3 తరాలు ద్వారా కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించే ఈ బట్టీలో అధిక ఉష్ణోగ్రతలు సాధించగలిగారు. ఈ ఆవిష్కరణల కారణంగా కలప, బొగ్గుపై బట్టీలు ఆధారపడటం తప్పిపోయింది. బొగ్గు, లోహాలను లోతైన గనుల నుంచి వెలికి తీసే క్రమంలో గనులు తరుచు నీటి ముంపునకు గురయ్యేవి. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంతో ఈ సమస్య పరిష్కారమైంది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో “మెడం” ద్వారా పక్కా రోడ్లు తయారుచేసే విధానం మరింత ప్రాధాన్యత పెంచింది. స్టీఫెన్సన్ యొక్క ఆవిరి రైలింజన్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిగ పురోభివృద్ధి సాధించడంలో ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషించాయి.

ప్రశ్న 5.
పారిశ్రామిక విప్లవం వల్ల బ్రిటిష్ మహిళలలోని వివిధ వర్గాలు ఏవిధంగా ప్రభావితమయ్యా యి? (AS1)
(లేదా)
“పారిశ్రామిక విప్లవం వలన బ్రిటిష్ సమాజంలోని అన్ని తరగతుల మహిళలూ ప్రభావితమయ్యారు” – వ్యాఖ్యానించండి.
జవాబు:
పారిశ్రామిక విప్లవం వల్ల మహిళల జీవన విధానంలో అనేక మార్పులు సంభవించాయి. ముందుగా – మహిళలు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, పశుపాలన చేస్తూ, కట్టెపుల్లలు తెచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర రాట్నం మీద నూలు వడికే వాళ్ళు. అయితే కర్మాగారాలలో పని పూర్తిగా మారిపోయింది. వ్యవసాయ విప్లవంతో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల జీవన గమనంలో అనేక మార్పులు సంభవించాయి. విరామం లేకుండా చాలా గంటల సేపు ఒకే పని చేస్తూ ఉండేవారు. ఆ పనిపై పర్యవేక్షణ, తప్పులకు శిక్షలు కఠినంగా ఉండేవి. పురుషుల కంటే తక్కువ కూలీకి పనిచేయడానికి సిద్దపడే మహిళలను పనిలో పెట్టుకొనేవాళ్ళు. లాంక్ షైర్, యార్క్ షెర్లలోని నూలు వస్త్ర పరిశ్రమల్లో మహిళలను పెద్ద సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. పట్టు, లేసు తయారీ అల్లిక పరిశ్రమల్లో, బర్మింగ్ హాంలోని లోహ పరిశ్రమల్లో మహిళలే ప్రధాన కార్మికులుగా ఉండేవారు.

ప్రశ్న 6.
కాలువల ద్వారా, రైళ్ళ ద్వారా రవాణాలలోని లాభాలు ఏమిటి? (AS1)
జవాబు:
పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచ దేశాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకొని ప్రపంచ దేశాలను ఆకర్పించడానికి పటిష్టమైన రవాణా వ్యవస్థ బాగా ఉపయోగపడింది. రవాణా రంగంలో ప్రధానంగా కాలువలు, రైళ్ళు ముఖ్యమైనవి. కాలువల ద్వారా అనేక ప్రయోజనాలను గమనించవచ్చు. ముడి సరుకులను, ఉత్పత్తి అయిన వస్తువులను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు, చేర్చడానికి ముఖ్యమైనది. కాలువల ద్వారా, బొగ్గు, ఇనుము వంటి వాటిని సమీప పట్టణాలకు చేరవేయవచ్చును. కాలువల ద్వారా ప్రయాణ దూరం కూడా సగానికి “పైగా తగ్గుతుంది. కాలువల వలన. వ్యవసాయ భూమి విలువ పెరగడమేగాక సారవంతమవుతుంది. ఎక్కువ దిగుబడితో ఉత్పత్తులు పెరగడానికి కాలువలు దోహదపడతాయి.

రైళ్ళ ద్వారా సుఖవంతమైన, విలాసవంతమైన ప్రయాణం సాధ్యం. అధిక లోడు, అధిక టన్నుల ఉత్పత్తులు గమ్యస్థానాలకు చేరడానికి రైలు రవాణా ముఖ్యమైనది. సరుకులను, ప్రయాణీకులను, ముడి పదార్థాలను వేగవంతంగా గమ్యస్థానాలకు చేర్చగలదు. కరవు, వరదలు, నీళ్ళు గడ్డకట్టడం, క్షామం , తుపానులు వంటి సందర్భాలలో అత్యవసర సేవలకు రైళ్ళు ముఖ్య మైనవి.

ప్రశ్న 7.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ లో వస్త్ర, ఇనుము పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్న ప్రదేశాలను పటంలో గుర్తించండి. (AS5)
జవాబు:
1. ఇంగ్లాండ్ లో ఇనుము పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 1

2. బ్రిటన్ లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రాంతాలు :
AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు 2

ప్రశ్న 8.
పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిష్కరణలకు సంబంధించిన పట్టికను తయారుచేయండి.
జవాబు:

  • జేమ్స్ వాట్ – ఆవిరి యంత్రం
  • స్టీఫెన్సన్ – ఆవిరి రైల్వే ఇంజన్
  • మెక్కం – పక్కా రోడ్లు తయారుచేసే విధానం
  • హార్ గ్రీవ్స్ – నూలు వడికే యంత్రం
  • మొదటి అబ్రహాం డర్బీ – కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది)
  • రెండవ డర్బీ – ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేయుట.
  • హెన్రీ కోర్ట్ – కలబోత బట్టీ (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు.)
  • క్రుప్ కుటుంబం – క్షేత్ర ఫిరంగుల కర్మాగారం. రైలు పెట్టెలు, ఆయుధ తయారీ.
  • వెర్నెర్ సీమెన్స్ – విద్యుత్ డైనమో కనుగొన్నాడు.
  • ఎడ్మండ్ కార్డ్ రైట్ – నీటి సహాయంతో నడిచే మరమగ్గం
  • సామ్యుల్ క్రాంప్టన్ – మ్యూల్ అనే మెరుగైన యంత్రం (దీని వలన నాణ్యమైన నూలు ఉత్పత్తి పెరిగెను).
  • ఆర్కిరైట్ – జలశక్తితో మెరుగైన మగ్గాన్ని కనుగొనెను.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 9.
ఓ నెం. 191లోని “కార్మికులు” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి వ్యాఖ్యానించండి?
జవాబు:
పారిశ్రామికీకరణ, సామాజిక మార్పులో భాగంగా కార్మికులు తమ జీవనాన్ని దుర్భరంగా గడిపారు. కార్మికుల సగటు జీవితకాలం చాలా తక్కువ. బర్మింగ్ హాంలో 15 సంవత్సరాలు, మాంచెస్టర్ లో 17, డర్బీలో 21 సంవత్సరాలుగా ఉండేది. చిన్న వయసులో మరణాలు అధికంగా ఉండడమే కాకుండా, చిన్న పిల్లల్లో 50 సంవత్సరాల లోపు మరణాలు సంభవిస్తుండేవి. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే కలరా, టైఫాయిడ్, గాలి కాలుష్యం వల్ల క్షయ వంటి అంటువ్యాధుల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. కలరా వ్యాపించడం వలన 1832లో 31,000 పైగా ప్రజలు చనిపోయారు. ఆ రోజుల్లో ప్రజలు అనుభవిస్తున్న రోగాలకు తగిన వైద్య సహాయం, వైద్య విజ్ఞానం అందకపోవడం, లేకపోవడం కూడా కార్మికులు, దీన స్థితిలో బ్రతకడానికి దోహదపడ్డాయి.

9th Class Social Studies 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు InText Questions and Answers

9th Class Social Textbook Page No.186

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవకాలంలో మహిళలు, పిల్లలు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక విప్లవ కాలంలో మహిళలు, పిల్లలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పేద ప్రజల పిల్లలు ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేస్తుండేవాళ్ళు. పగటిపూట ఎక్కువ పనిగంటలు చేస్తుండేవారు. లోహ పరిశ్రమల్లో పిల్లలు కూడా పని చేసేవాళ్ళు. బొగ్గు గనుల వంటి ప్రమాదకర పనులు సైతం పిల్లలు చేసేవారు. మహిళలు తక్కువ కూలీకి పనిచేయటానికి సిద్ధపడేవారు. విరామం లేకుండా మహిళలు పని చేసేవారు. తక్కువ కూలీ అందించేవారు. పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో, లోహపరిశ్రమల్లో పని చేస్తూ మహిళలు అనేక కష్టాలు అనుభవించేవారు.

9th Class Social Textbook Page No.187

ప్రశ్న 2.
బ్రిటిష్ లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించిన 18వ శతాబ్దం నాటి బ్రిటన్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పరిణామాలను చర్చించండి.
జవాబు:
ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం బ్రిటన్. బ్రిటన్ యూరప్ దేశాలన్నింటికంటే ముందే ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించి, దాని ఫలితంగా ప్రపంచ కర్మాగారంగా గౌరవించబడింది. పరిశ్రమలు స్థాపించబడి అభివృద్ధి చెందటానికి బ్రిటన్‌కు ఎన్నో సానుకూల పరిస్థితులే కాకుండా అందుకు కావలసిన వనరులన్నీ ఉన్నాయి. ఇతర దేశాలు, ప్రపంచంలోని, దేశాలు ఈ మార్పులను తరువాత చవిచూశాయి.

9th Class Social Textbook Page No.188

ప్రశ్న 3.
పారిశ్రామికీకరణకు నాణ్యమైన ఇనుము, ఉక్కు ఎందుకు కావాలి? తరగతిలో చర్చించండి.
జవాబు:
యాంత్రీకరణకు, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన ముడిసరుకు ఇనుము, ఉక్కు. ఇనుప ఖనిజం నుంచి దానిని కరిగించే ప్రక్రియ ద్వారా స్వచ్చమైన ఇనుమును ద్రవరూపంలో తీయవచ్చు. ఇనుము, ఉక్కుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయవచ్చు. రోజువారీ వస్తువులలో కలపతో చేసిన భాగాలతో పోలిస్తే ఇనుముతో చేసిన వస్తువులు ఎక్కువ కాలం మనగలుగుతాయి. కలపతో చేసిన వస్తువులు కాలిపోయి, ముక్కలు అయ్యే ప్రమాదముంది. ఇనుము నాశనం కాకుండా, దాని యొక్క భౌతిక రసాయనిక, గుణాలను నియంత్రించవచ్చు.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 4.
ఇనుప ఖనిజం, బొగ్గు తవ్వకాలకు సమాన ప్రాధాన్యత ఎందుకు లభించింది?
జవాబు:
పారిశ్రామికీకరణకు ముఖ్యమైనవి బొగ్గు, ఇనుము. ఇనుము, బొగ్గు పరిశ్రమల ఆధారంగా నాగరికతను ప్రపంచమంతా అనుకరించింది. బొగ్గును ఇనుమును కరిగించే ప్రక్రియలో ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్కసారి ఒకే గనిలో నాణ్యమైన . బొగ్గు, ఇనుప ఖనిజాలు లభించేవి. ముడిసరుకులకు, వస్తూత్పత్తికి, బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత ఉండేది. ముడి ఇనుము తయారు చేయటానికి టన్నుల కొద్దీ బొగ్గు అవసరమయ్యేది. ఈ విధంగా బొగ్గు, ఇనుముకు సమాన ప్రాధాన్యత లభించింది.

ప్రశ్న 5.
తొలినాటి పారిశ్రామిక కేంద్రాలు ఇనుము, బొగ్గు గనుల దగ్గర ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
యాంత్రీకరణకు ప్రధానమైనవి ఇనుము, బొగ్గు. వస్తువుల ఉత్పత్తికి, బొగ్గు, ఇనుము ద్వారా తయారీకి ఆయా దేశాలు ప్రాధాన్యతనందించేవి. సులభంగా రవాణాకు, సమీప పట్టణాలకు తరలించటానికి, ప్రపంచ వ్యాప్తంగా తయారైన వస్తువులకు మార్కెట్ కల్పించడానికి,. బహుళ ప్రచారం చేయడానికి గాను ఇనుము, బొగ్గు గనుల దగ్గర పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడ్డాయి.

ప్రశ్న 6.
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలు పేర్కొనండి.
జవాబు:
వస్త్ర పరిశ్రమను విప్లవాత్మక మార్పులకు గురిచేసిన రెండు ముఖ్యమైన ఆవిష్కరణలలో జేమ్స్ వాట్ 1769లో కనిపెట్టిన ఆవిరి యంత్రం ఒకటి.. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. అదే విధంగా రెండోది 1770లో జేమ్స్ హార్ గ్రీవ్స్ కనిపెట్టిన “స్పిన్నింగ్ జెన్ని” (నూలు వడికే యంత్రం). దీనివలన నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి అయ్యాయి.

9th Class Social Textbook Page No.193

ప్రశ్న 7.
మహిళలు, పిల్లలపై పారిశ్రామికీకరణ చూపిన రెండు ముఖ్యమైన ప్రభావాలను పేర్కొనండి.
జవాబు:
నూలువడికే జెన్ని’ వంటి చిన్న యంత్రాలు తయారుచేసి పిల్లలను పనిలో నియమించేవారు. దీర్ఘకాల పనిగంటలు, ఆదివారాల నాడు యంత్రాలను శుభ్రం చేయటం వంటి పనుల వల్ల పిల్లలకు తాజా గాలి, తగినంత వ్యాయామం ఉండేవి కావు. పిల్లలు నిద్రలోకి జారుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహిళలు కూడా పనిచేస్తూ ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం పెంచుకున్నా వారి జీవితాలు దుర్భరంగా ఉండేవి. ప్రసవ సమయంలో లేదా చాలా చిన్న వయసులోనే పిల్లలు చనిపోయేవాళ్ళు. లోహ పరిశ్రమల్లో పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమల్లో ఎక్కువగా మహిళలు పని చేసేవాళ్ళు.

9th Class Social Textbook Page No.194

ప్రశ్న 8.
తొలి పారిశ్రామికీకరణ వల్ల బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై ప్రభావాలను, భారతదేశంలో అదే పరిస్థితులలోని ప్రభావాలతో పోల్చండి.
జవాబు:
తొలి పారిశ్రామికీకరణ బ్రిటిష్ పల్లెలు, పట్టణాలపై చాలా ప్రభావాన్ని చూపింది. అనేక సమస్యలకు లోనై, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. జనాభా పెరుగుదలకు దీటుగా గృహవసతి, తాగటానికి శుభ్రమైన నీళ్ళు, పారిశుద్ధ్యం వంటివి పెరగలేదు. మురికివాడలలో నివసిస్తూ, కలరా, టైఫాయిడ్, క్షయ వంటి అంటు వ్యాధుల వలన అనేక వేలమంది చనిపోయారు.

భారతదేశంలో కూడా వలస పాలన వలన చేతివృత్తులు, కులవృత్తులు నశించి, వ్యవసాయరంగంలో ఆహార పదార్థాల • ఉత్పత్తి తగ్గిపోయి, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత నిచ్చారు. అనేక ప్రాంతాలలో కరువు కాటకాలు, మలేరియా, టైఫాయిడ్, క్షయవంటి జబ్బులు కమ్ముకున్నాయి. స్వచ్ఛమైన గాలి, మంచినీరు దొరకక ప్రజలు అల్లాడిపోయారు. వైద్యశాస్త్రం నిర్లక్ష్యం
చేయబడింది.

9th Class Social Textbook Page No.195

ప్రశ్న 9.
జర్మనీ, ఫ్రాన్లలో పారిశ్రామికీకరణలను పోల్చండి. పోలికలు, తేడాలను గుర్తించండి.
జవాబు:
పోలికలు :
జర్మనీ, ఫ్రాన్స్ రెండు దేశాలు, ఇంగ్లాండ్ బాటలో నడవడానికి ప్రయత్నించాయి. ఇవి పారిశ్రామికీకరణ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తలంచాయి. రోడ్డు, రైలు మార్గాలు పారిశ్రామికీకరణకు రెండు దేశాలు ప్రాధాన్యతనిచ్చాయి.

తేడాలు :

జర్మనీ :
కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని జర్మనీ పరిశ్రమలు దిగుమతి చేసుకున్నాయి. పారిశ్రామికీకరణకు కావలసిన డబ్బులను పెద్ద పెద్ద బ్యాంకులు సమకూర్చాయి. జర్మనీ కొత్తతరం పరిశ్రమలైన ఇనుము – ఉక్కు రసాయనిక, విద్యుత్ పరిశ్రమలను అభివృద్ధి చేసింది. బ్రిటనను మించిపోయింది. బలమైన పారిశ్రామిక శక్తిగా జర్మనీ వెలుగొందింది.

ఫ్రాన్స్ :
ఫ్రాన్స్ ఇందుకు విరుద్ధంగా పారిశ్రామికీకరణను నిదానంగా కొనసాగించింది. 19వ శతాబ్దం చివరకు కూడా ఫ్రాన్స్ లో అధిక శాతం ప్రజలు చిన్న చిన్న కమతాలు సాగుచేసే దేశంగానే ఉంది. యాంత్రీకరణ కంటే మానవశక్తికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. ఫ్రాన్స్ లో ఆర్థిక కష్టాలు అధికంగా ఉండేవి. జర్మనీ అంత సాంకేతిక విజ్ఞానాన్ని, యాంత్రీకరణను ఫ్రాన్స్ దిగుమతి చేసుకోలేకపోయింది.

AP Board 9th Class Social Solutions Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

ప్రశ్న 10.
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక అభివృద్ధిలో ఫ్రాన్స్ వెనుకబడటానికి కారణాలు :

  1. నిధుల సమస్య.
  2. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఫ్రాన్స్ అందుకోలేకపోయింది.
  3. గ్రామీణ శ్రామికులకు పని ఇవ్వటం వలన ఉత్పత్తి తగ్గుముఖం.
  4. బొగ్గు గనులు లేమి, దిగుమతులపై ఎక్కువ ఖర్చు.
  5. బట్టలు వంటి చిన్న పరిశ్రమలపై దృష్టి.
  6. ఎక్కువ పెట్టుబడిని ఇవ్వగల పెద్ద బ్యాంకులు ఫ్రాన్స్ లో లేకపోవడం.
  7. మానవ మేధస్సు తక్కువ.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను అధిగమించటానికి జర్మనీకి దోహదం చేసిన అంశాలు ఏమిటి?
జవాబు:
పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంగ్లాండ్, ఫ్రాన్లను జర్మనీ అధిగమించటానికి దోహదం చేసిన అంశాలు :

  1. బ్రిటన్, అమెరికా సాధించిన సాంకేతిక అభివృద్ధి వల్ల జర్మన్ పరిశ్రమల ప్రయోజనం.
  2. ప్రపంచ దేశాల సాంకేతిక విజ్ఞానం దిగుమతి చేసుకోవడం.
  3. పెద్ద పెద్ద పెట్టుబడుల్ని సమకూర్చగల బ్యాంకుల సహకారం.
  4. కొత్తతరం పరిశ్రమలైన రసాయనిక, విద్యుత్ పరిశ్రమల అభివృద్ధి.
  5. నూతన ఆలోచనా విధానం.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
పారిశ్రామిక విప్లవ పరిణామాలు ఆర్థిక రంగంపై ఎలా ప్రభావం చూపాయో పేర్కొనండి. ఒక నివేదిక రాసి మీ తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం, కొత్త యంత్రాల వినియోగంతో పారిశ్రామిక విప్లవం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలలో పారిశ్రామికీకరణ వలన – సంపద అనంతంగా ఉండటంతో వస్తు ఉత్పత్తికి, ముడి పదార్థాల వినియోగానికి, రవాణా వ్యవస్థను వృద్ధి చేసుకోవడానికి పెట్టుబడి సమకూర్చుకోవడం తేలిక అయింది. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు చేసి తద్వారా పెద్ద ఎత్తున లాభాలు గడించాయి.

పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆర్థిక వనరులతో పెట్టుబడిని రెండింతలు చేసి నిధులు మరింత పెంచుకోవడానికి దేశాలు బ్యాంకులలో ఆదా చేశాయి. అంతేకాకుండా సముద్రయానం చేసే పారిశ్రామికవేత్తలకు అధిక మొత్తంలో అధికవడ్డీకి డబ్బులు ఇచ్చి లాభాన్ని గడించాయి. విత్తమార్కెట్, స్టాక్ బ్యాంకు, స్టాక్ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక పరిపుష్టి పెరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక చర్యలు వలన అధికంగా నిధులు సమకూరి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

SCERT AP 6th Class Social Study Material Pdf 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నిర్ణయాలు ప్రపంచ శాంతిని పెంపొందిస్తాయని అనుకుంటున్నావా? ఎలా?
జవాబు:
అవును. భావిస్తున్నాను. ఎందుకనగా ……..

  • ప్రజలకు మరియు ఇతర రాజులకు యుద్ధ భయం ఉండదు.
  • యుద్దాలు లేనపుడు ఆయుధాల కొరకు ఎక్కువ మొత్తంలో సంపదను వెచ్చించనవసరం లేదు.
  • యుద్ధ భయం లేకపోతే ప్రజలందరు మనశ్శాంతితో, ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తారు.
  • యుద్దాల అవసరం లేనపుడు రాజు తన దృష్టిని ప్రజా సంక్షేమం వైపు మళ్లించవచ్చు.

ప్రశ్న 2.
నేటికాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. అశోకధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణింపుము.
జవాబు:
నేటి కాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది.

అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలు :

  • జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి.
  • తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి.
  • పేదల పట్ల సానుభూమి కలిగి ఉండాలి.
  • పెద్దలను గౌరవించవలెను.
  • ఇతర మతాలను విస్మరించరాదు.
  • మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి.
  • అశోకుని ధర్మం ప్రజలకు అనుకూలము ఆచరణీయము అయిన నైతిక సూత్రాలను కల్గి ఉంది.
  • ఉన్నతమైన జీవన విధానాన్ని అందించటమే అశోకుని ధమ్మ ఉద్దేశము.
  • ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి, సామర్థ్యము లేకపోతే ఇహపరలోక సుఖాలను పొందలేరని బోధించాడు.
  • నేటి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న ‘హింసకు’ అశోకుని (అహింస) ధర్మము చక్కని పరిష్కారం.
  • అలాగే ‘పరమత సహనం’ అనే సూత్రం నేడు ఎంతో అవసరం. అనేక అల్లర్లకు, హింసకు, యుద్ధాలకు మత మౌఢ్యమే కారణం.
  • ఈ విధంగా అశోకుని క్క గొప్ప ధర్మం నేటికాలంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 3.
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు మరియు భేదాలు తెలుపుము?
జవాబు:
అశోకుని యొక్క ప్రజాపనులకు నేటికాలంలో ప్రజాప్రభుత్వాలు చేస్తున్న ప్రజా పనులకు పోలికలు :

  • అశోకుడు, నేటి ప్రభుత్వాలు ప్రజాక్షేమమే తమ ప్రధాన ఆశయంగా భావించి వారి సంక్షేమము కొరకు అనేక చర్యలు చేపడుతున్నారు.
    నీరు, ఆహారం తమ ప్రజలందరికీ అందాలని అశోకుడు సంకల్పించాడు, నేటి ప్రభుత్వాలు కూడా సాగు, త్రాగు నీరు మరియు ఆహారం (రేషన్ షాపుల ద్వారా) ప్రజలందరికీ అందిస్తున్నాయి.
  • అశోకుడు దేశ వ్యాప్తముగా అనేక రహదారులను నిర్మించి, వాటి కిరువైపులా చెట్లు నాటించెను. నేటి ప్రభుత్వాలు కూడా దేశాభివృద్ధికై జాతీయ, రాష్ట్ర మొ||న రహదారులను నిర్మిస్తున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున చెట్లను (వన సంరక్షణ) నాటుట, సంరక్షించుట మొ||న చర్యలు చేపడుతున్నాయి.
  • అశోకుడు మానవులకే కాక జంతువుల కొరకై ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పను. నేటి ప్రభుత్వాలు కూడా దేశ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేసినాయి.

భేదాలు :

  • అశోకుని కాలంకంటే నేటి (ప్రభుత్వాల) కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందటం వలన ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. ఉదా : డిజిటల్ సేవలు, రవాణా రంగంలోని సేవలు (రైలు విమానం మొ||నవి.)
  • నేటి కాలంలో ప్రజా పనులు చాలా విస్తృతంగా, ఖర్చుతో కూడుకుని ఉన్నాయి.

ప్రశ్న 4.
అశోకుడు తన సైన్యాన్ని యుద్ధం కోసం కాకుండా ప్రజాసేవకు వినియోగించాడు. ప్రస్తుత కాలంలో భారత సైన్యం యుద్ధాలలోనే కాకుండా పాల్గొనే ఇతర సహాయ కార్యక్రమాలేవి?
జవాబు:
భారత సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలు :

  • ప్రకృతి విలయాల సందర్భంలో, తుఫానులు, భూకంపాలు, వరదలు మొ||న ప్రకృతి భీభత్సాలలో సాధారణ పౌరులను ఆదుకోవటానికి సైన్యం ఎంతో సహాయం చేస్తుంది.
  • పర్వతలోయల్లో, కొండల్లో ఎవరైనా అపాయంలో ఉన్నా, ప్రమాదాలు జరిగిన సైన్యం వారికి సహాయం అందిస్తుంది.
  • NCC (National Cadet Corps) లాంటి వానిద్వారా విద్యార్థులలో దేశభక్తిని, సైనిక శిక్షణను అందిస్తుంది.
  • ‘ఆపరేషన్ సద్భావన’ కార్యక్రమం ద్వారా భరత సైన్యం పౌరులకు అనేక రకాలుగా సేవలు అందిస్తుంది.
  • అంతర్గత కలహాలు, బాంబు ప్రేలుళ్ళు, హైజాకింగ్ మొ||న సందర్భాలలో సైన్యం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 5.
గుప్తుల కాలంలో కళలు, సాహిత్యం మరియు వాస్తు నిర్మాణ రంగాలలో సాధించిన విజయాలేవి?
జవాబు:
గుప్తుల కాలంలో వివిధ రంగాలలో సాధించిన విజయాలు :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్య శాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. అనేక కొత్త విషయాలు ఆవిష్కరించబడినవి. అందులో చెప్పబడిన జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం పేరుతో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే ‘నవరత్నాలు’ అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 2

NAVARATNAS నవరత్నాలు
కాళిదాసుసంస్కృత కవి, రచయిత
అమరసింహుడునిఘంటుకర్త
శంకుభవన నిర్మాణ ఇంజనీరు
ధన్వంతరిఫిజీషియన్, ఆయుర్వేద వైద్యుడు
క్షేపకుడుజ్యోతిష్య శాస్త్రవేత్త
ఘటకర్షకుడుసంస్కృత కవి, రచయిత, కవి
భేతాళబట్టుమంత్రశాస్త్ర కోవిదుడు
వరరుచీగణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు
వరాహమిహురుడుఖగోళ శాస్త్రవేత్త

అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారి కాలంలో పెయింటింగ్ కు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
భారతదేశంలో గుప్తుల కాలాన్ని “స్వర్ణయుగమని” ఎందుకు అంటారు?
జవాబు:
భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలము ఒక మహోజ్వలమైన అధ్యాయము. శాస్త్ర విజ్ఞానం, జోతిష్య శాస్త్రం, గణితం మరియు సాహిత్య రంగాలలో గుప్తుల కాలంలో అనేక కొత్త విషయాలు కనుగొనుట జరిగినది. అందువలన గుప్తకాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అంటారు.

సాహిత్యరంగంలో అభివృద్ధి :
గుప్తుల కాలంలో సారస్వతం, గణితం, వైద్యశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి. రెండవ చంద్రగుప్తుని కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు కలరు. వీరినే నవరత్నాలు అంటారు. నవరత్నాలలో కాళిదాసు ప్రసిద్ధ కవి.

గణితశాస్త్రంలో ఆవిష్కరణలు :
ఆర్యభట్టు ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. బీజగణితాన్ని వీరి కాలంలో ఉపయోగించారు. భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్న’ భావనను అభివృద్ధి చేశారు. ‘సున్న’ కు గుర్తును కూడా తయారు చేశారు. 1-9 సంఖ్యలకు గుర్తులను గుప్తుల కాలంలోనే కనుగొన్నారు. వీరు కనుగొన్న ‘ఆల్గారిథమ్స్’ను నేడు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తున్నారు. బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు కచ్చితంగా లెక్కించగల్గినాడు.

వైద్యశాస్త్ర ప్రగతి :
చరకుడు, సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. ప్లాస్టిక్ సర్జరీ, ‘ విరిగిన ఎముకలను సరిచేసి ఆపరేషన్ కూడా ఆనాటి వైద్యులు చేసినారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు.

ఖగోళశాస్త్రంలో అన్వేషణలు :
ఖగోళశాస్త్రం మరియు శాస్త్ర విజ్ఞానాలలో భారతీయ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనుగొన్నారు. నక్షత్రాలు మరియు గ్రహాల కదలికలను గమనించారు. భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నారు. భూమికి సూర్యునికీ మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని వారు భావించేవారు. గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా వీరికి తెలుసు.

భారతీయ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగశాలలు మరియు ప్రయోగాలు లేకుండానే పై విషయాలన్నియు కనుగొన్నారు. పై విషయాలన్నింటికి కేవలం ఊహించుట ద్వారానే చెప్పగలిగారు. ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనలు ద్వారా పై విషయాలన్నీ ఖచ్చితమైనవని నిరూపించబడినవి.

కళలు, వాస్తు శిల్పకళ :
అద్భుతమైన రాతి గుహలకు గుప్తుల కాలం ప్రసిద్ధి. వారికాలంలో పెయింటింగ్లు, వాస్తుశిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

లోహ విజ్ఞానం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు, లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణెలను పోలి ఉండే వాటిని కూడా వీరికాలంలో ముద్రించుట జరిగినది.

ప్రశ్న 7.
వైద్య మరియు లోహ విజ్ఞానశాస్త్ర రంగాలలో గుప్తుల కాలంలో సాధించిన విజయాలేవి?
జవాబు:
వైద్యశాస్త్రం :
చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. గుప్తుల కాలంలోని వైద్యులు విరిగిపోయిన ఎముకలను సరిచేసి ఆపరేషన్లు కూడా చేసేవారు. ఔషధంతో కూడిన మొక్కలను వ్యాధులను నయం చేయడంలో ఉపయోగించేవారు. వ్యాధి కంటే వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించేవారు.

లోహ విజ్ఞాన శాస్త్రం :
గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు. ఇనుము మరియు ఉక్కుతో ఆయుధాలు తయారు చేసేవారు. ఆధునిక బంగారు నాణేలను పోలి ఉండే వాటిని కూడా వీరి కాలంలో ముద్రించుట జరిగినది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 8.
పల్లవులు వాస్తు శిల్పకళకు చేసిన సేవను వివరింపుము.
జవాబు:
దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి పల్లవ రాజులు ఎంతో సేవ చేశారు. వారి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది. తొలి పల్లవ రాజులలో మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందిన రాజు, అతడు గొప్ప వాస్తు శిల్పకళాభిమాని అతను ప్రవేశ పెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను ‘మహేంద్రుని రీతి’ శిల్పకళ అంటారు. గుహాలయాల యొక్క ప్రభావం శిల్పకళపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

మొదటి నరసింహ వర్మ తదుపరి ముఖ్యమైన పల్లవరాజు. ఇతను మహేంద్రవర్మ యొక్క కుమారుడు. ఇతనిని ‘మహామల్లుడు’ అని కూడా పిలుస్తారు. మహాబలిపురం రేవు పట్టణాన్ని ఇతను మంచి వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించాడు. ఇతని కాలంలో అభివృద్ధి చేయబడిన వాస్తుశిల్పకళ ‘మహామల్లుని వాస్తు శిల్పకళారీతి’గా ప్రసిద్ధి చెందినది. మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించారు. ఇవి పంచపాండవ రథాలుగా పేరొందాయి. ఒక్కో రథాన్ని ఒక్కో పెద్ద బండరాయిని తొలిచి నిర్మించారు. కావున వీటిని ‘ఏకశిలా రథాలు’ అంటారు.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 1

రెండవ నరసింహ వర్మ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. అతను ‘రాజసింహుడు’ అను పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. అతని కాలంలో నూతన వాస్తుశిల్ప కళారీతి అభివృద్ధి చెందినది. దేవాలయాలు మెత్తని మట్టి, రాయితో నిర్మించుట జరిగినది. దీనిని ‘రాజసింహుని వాస్తు శిల్పకళారీతి’ అంటారు. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.

ప్రశ్న 9.
భారతదేశపటంలో క్రింది వానిని గుర్తింపుము.
1. పాటలీపుత్రం
2. ఉజ్జయిని
3. నర్మదానది
4. కాంచీపురం
5. మహాబలిపురం
6. ధాన్య కటకం
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 3

ప్రశ్న 10.
నేను ఎవరు? (కనుక్కోండి చూద్దాం)
అ. ‘నేను అశోకుని నాలుగు సింహాల గుర్తులో ఉన్నాను. నేను జాతీయ పతాకం మధ్యలో కూడా ఉన్నాను. నేను ఎవరిని?
జవాబు:
అశోక ధర్మ చక్రము.

ఆ. నేను గుప్తుల వంశానికి చెందిన రాజును. దేశంలో ఉన్న అందరి రాజులను ఓడించాను. నా పేరేమి?
జవాబు:
సముద్రగుప్తుడు.

ఇ. నేను శాతవాహనుల రాజధానిని, కృష్ణానది ఒడ్డున ఉన్నాను. నా ‘పేరేమి?
జవాబు:
ధాన్య కటకం.

ఈ. మహాబలిపురంలోని రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలను పూర్తి చేశాను. నేను మొదటి మహేంద్రవర్మ, కుమారుడిని నా పేరు ఏమిటి?
జవాబు:
మొదటి నరసింహ వర్మ

6th Class Social Studies 8th Lesson రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు InText Questions and Answers

6th Class Social Textbook Page No.88

ప్రశ్న 1.
అశోకుడు కళింగ రాజ్యాన్ని ఎందుకు ఆక్రమించాలనుకున్నాడు?
జవాబు:
అశోకుడు మరింత విశాలమైన రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించాడు. అందుకోసం చాలా యుద్ధాలు చేశాడు. అందులో కళింగ యుద్ధము ప్రముఖమైనది. కళింగ రాజ్యం భారతదేశానికి తూర్పు తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం. మౌర్యవంశానికి చెందిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. అందుకని అశోకుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 2.
కళింగ యుద్ధంలో విజయం తర్వాత అశోకుడు ఎందుకు సంతోషంగా లేడు?
జవాబు:
అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. ఈ కళింగ యుద్ధం అత్యంత భయంకరమైనది మరియు రక్తసిక్తమైనది. అశోక చక్రవర్తి కళింగ యుద్ధభూమిలోకి స్వయంగా నడచి వెళ్ళాడు. అనేకమంది గాయపడిన మరియు చనిపోయిన సైనికులను స్వయంగా చూస్తాడు. యుద్ధంలో గెలిచినప్పటికీ అశోకచక్రవర్తి ఏ మాత్రం సంతోషంగా లేడు. భవిష్యత్తులో అతని జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని గట్టిగా నిర్ణ యించుకుంటాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయముగా భావిస్తాడు. తన శేష జీవితంలో అహింసకు ప్రాధాన్యత ఇస్తాడు. అహింసను ప్రబోధించే బౌద్ధమతం పట్ల ఆకర్షితుడవుతాడు.

6th Class Social Textbook Page No.89

ప్రశ్న 3.
ప్రస్తుత భారతదేశపటంలో అప్పటి కళింగ రాజ్య ప్రాంతాన్ని మీ ఉపాధ్యాయుని సహాయంతో గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 4

ప్రశ్న 4.
కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తారు?
జవాబు:
ఒడిషాగా పిలుస్తున్నారు.

6th Class Social Textbook Page No.90

ప్రశ్న 5.
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది ఎలా సాధ్యమని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
అశోకుని శిలాశాసనాలు నిరక్షరాస్యులు కూడా ఎలా అర్థం చేసుకోగలిగినారంటే :

  • ‘అశోకుడు’ ధర్మమహామాత్రులు’ అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు ధర్మప్రచారం చేసేవారు.
  • అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించాడు.
  • చదువు రానివారికి వాటి పైనున్న సందేశాలను చదివి వినిపించాలని అధికారులను ఆదేశించాడు.
  • అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయటానికి రాయబారులను పంపించాడు.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

ప్రశ్న 6.
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతున్నది?
జవాబు:
ప్రస్తుత రోజులలో ప్రభుత్వం యొక్క సందేశం ప్రజలకు ఎలా చేరుతుందంటే :

  • పత్రికల ద్వారా
  • దూరదర్శన్ (టి.వి.) ద్వారా
  • సోషల్ మీడియా ద్వారా
  • ప్రభుత్వ శాఖల ప్రకటనల ద్వారా
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తల ద్వారా
  • వివిధ గ్రంథాలు,
  • ప్రముఖుల ఉపన్యాసాల ద్వారా

ప్రశ్న 7.
మౌర్య చక్రవర్తుల కాలక్రమ చార్టును తయారు చేయండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు, ఉదాహరణకు
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 5

ప్రశ్న 8.
అశోక చక్రవర్తి యొక్క వ్యక్తిత్వాన్ని తరగతిగదిలో చర్చించుము.
జవాబు:
మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. అనేక శాసనాలను వ్రాయించాడు. ఆనాటి పరిస్థితులను నేటికి తెలిసేలా చేశాడు. ప్రపంచ చలత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది, యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. కళింగ యుద్ధం తరువాత ధర్మ ప్రచారం చేశాడు. అంతేకాక రోడ్లను నిర్మించాడు. బావులను త్రవ్వించాడు. సత్రాలను కట్టించాడు. మనుష్యులకే కాక జంతువులకు కూడా వైద్యాలయాలను కట్టించాడు. ఈ కారణాల వలన అశోకుడు విశిష్ట పాలకుడని నేననుకుంటున్నాను.

ప్రశ్న 9.
జాతీయ చిహ్నం యొక్క ప్రాధాన్యతను తరగతి గదిలో చర్చించుము.
జవాబు:
సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలోని నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ, చిహ్నంగా స్వీకరించింది.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 6

జాతీయ చిహ్నం అనేది ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. 1950 జనవరి 26 నుంచి దీనిని అధికారికంగా జాతీయచిహ్నంగా గుర్తించారు. ఇందులో మూడు సింహాలు పైకి కనపడతాయి. నాల్గవసింహం మాత్రం అదృశ్యంగా దాగి ఉంటుంది. మూడు సింహాలు అధికారం, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలకు ప్రతీకలు నాల్గవ సింహం భారతజాతి యొక్క గౌరవానికి ప్రతీక. ఎబాకు మధ్యలో చక్రం ఉంటుంది. అందులో కుడివైపున ఎద్దు మరియు ఎడమవైపున గెంతుతూ ఉన్న గుర్రం ఉంటుంది. ఎద్దు కష్టపడే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అశ్వము వేగాన్ని మరియు శక్తిని తెలియజేస్తుంది. ఎబాక్కు దిగువవైపున ‘సత్యం జయిస్తుంది’ అని లిఖించబడి ఉంటుంది. ఇది మండూకోపనిషత్ నుంచి గ్రహింపబడింది.

6th Class Social Textbook Page No.91

ప్రశ్న 10.
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? నీ సమాధానాన్ని సమర్థింపుము.
జవాబు:
రవాణా మరియు వాణిజ్యాల మధ్య సంబంధం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను.

  • వ్యాపారులకు, చేతి వృత్తుల వారికి రవాణా మార్గాలు చాలా ముఖ్యమైనవి. ఈ రవాణా మార్గాలు పెద్ద పట్టణాలను, ఓడరేవులను మరియు ఇతర దేశాలను కలుపుతాయి.
  • అభివృద్ధి చెందిన రవాణా మార్గాల వల్లనే (విదేశీ) వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది.
  • రవాణా సౌకర్యాలు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే వ్యవసాయ, వివిధ పరిశ్రమల ఉత్పత్తులను అంత ఎక్కువగా ప్రజలకు చేరువ చేయవచ్చు (వాణిజ్యం ద్వారా) ఉదా : విదేశాలలో తయారైన ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లు స్థానిక మార్కెట్లో లభ్యమవ్వడం.

6th Class Social Textbook Page No.92

ప్రశ్న 11.
AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు 7
పై భారతదేశ పటంలో గుప్త సామ్రాజ్యంలోని నాలుగు ముఖ్యమైన నగరాల పేర్లను రాయుము.
జవాబు:

  1. పాటలీపుత్ర
  2. ఉజ్జయిని
  3. సాంచి
  4. బరుకచ్చా

6th Class Social Textbook Page No.93

ప్రశ్న 12.
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నీవు భావిస్తున్నావా? సమాధానాన్ని సమర్ధింపుము.
జవాబు:
సముద్రగుప్తుడు గొప్ప విజేత అని నేను భావిస్తున్నాను.

  • మొదటి చంద్ర గుప్తుని తర్వాత సముద్రగుప్తుడు రాజైనాడు.
  • ఇతని కాలంలో సామ్రాజ్యము ఉత్తర భారతదేశం అంతటా విస్తరించినది. సముద్రగుప్తుడు అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత.
  • ఇతని తర్వాత రెండవ చంద్రగుప్తుడు పరిపాలకుడయ్యాడు. పశ్చిమ భారతదేశంలోని శకరాజులను కూడా ఇతను జయించగలిగినాడు.
  • సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలోని తొమ్మిది మంది ప్రముఖ రాజులను ఓడించి వారి రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకున్నాడు.
  • దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
  • తమిళనాడులోని కంచి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు.

6th Class Social Textbook Page No.95

ప్రశ్న 13.
శాతవాహనులలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడని ఎట్లు చెప్పగలవు ? అలా అయితే ఎందువలన?
జవాబు:

  • శాతవాహన రాజులలో ముఖ్యమైన రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్ట పుత్ర పులోమాని మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు 300 సంవత్సరాలు పరిపాలించారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
  • అతను శకులను, యవ్వనులను, పహ్లావులను ఓడించాడు.
  • దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు.
  • అందువలన అతనికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు వచ్చింది.

AP Board 6th Class Social Solutions Chapter 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6th Class Social Textbook Page No.96

ప్రశ్న 14.
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు. నీవు దీనిని అంగీకరిస్తావా లేదా విభేదిస్తావా ? అవును అయితే వారు ఏయే పద్ధతులను ఉపయోగించారు?
జవాబు:
ఇక్ష్వాకులు అన్ని తెగల వారిని ఏకం చేయగలిగారు, నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఏ పద్దతులు ఉపయోగించారు అంటే,

  • ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొనుట ద్వారా
  • యజ్ఞ, యాగాదులు (అశ్వమేథ యాగం మొ||) చేయటం ద్వారా
  • రామాయణంలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకొనుట ద్వారా

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన వాటిని ఎంచుకోండి. (AS1)
ఎ) ఒక దేశానికి …………… ఉండాలని ప్రజాస్వామిక, జాతీయతావాద ఉద్యమాలు భావించాయి. (ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ, పైవన్నీ, పైవి ఏవీకావు)
జవాబు:
ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి ‘ఆర్థిక వ్యవస్థ.

బి) వివిధ దేశాలలో జాకోబిన్ క్లబ్బులను ………. ఏర్పాటు చేసింది. (రైతాంగం, రాచరికం, మధ్యతరగతి, సైన్యం)
జవాబు:
మధ్యతరగతి

సి) 18వ శతాబ్దం మధ్యకాలంలో భూమి ……………. కింద ఉండేది. దానిని ……………… ‘సాగు చేసేవాళ్ళు. (మధ్యతరగతి, సైన్యం, రాచరిక కుటుంబాలు, కౌలుదారులు)
జవాబు:
రాచరిక కుటుంబాలు, కౌలుదారులు.

ప్రశ్న 2.
18వ శతాబ్దపు మధ్యకాలం నాటి యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు, వాణిజ్య పద్ధతులలో గల పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
18వ శతాబ్దపు మధ్యకాలంలో యూరప్ లోని ప్రజలలో భాష, జాతి మూలాలు వాణిజ్య పద్ధతులలో పోలికలు, తేడాలు కూడా మనకు కనిపిస్తాయి.

పోలికలు :

  1. ప్రధానంగా ఈ ప్రాంతాలలో నియంతృత్వ రాచరికాలు ఉండేవి.
  2. కులీన, మధ్యతరగతి, సంపన్న వర్గాల అధీనంలో భూములు, ఎస్టేట్స్ ఉండేవి.
  3. ఈ ప్రాంతాలలో ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉండేది.
  4. పశ్చిమ ప్రాంతాలు, మధ్య యూరప్ లు మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వాణిజ్య వర్గాలు ఏర్పడ్డాయి.
  5. శ్రామిక వర్గ ప్రజలు, మధ్యతరగతి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులు, వృత్తి నిపుణులు ఏర్పడ్డారు.

తేడాలు :

  1. వీరంతా (యూరప్ లోని వారు) వేరు వేరు భాషలు మాట్లాడేవారు. టైరాల్, ఆస్ట్రియా, సుడెటె లాండ్, బొహీమియాలలో, ఆల్ఫైన్ ప్రాంతాలలో జర్మన్ భాష మాట్లాడేవారు.
  2. హంగరీలో సగం మంది జనాభా. మగ్యార్ మాట్లాడేవారు.
  3. గాలిసియాలో కులీనవర్గం వారు పోలిష్ భాష మాట్లాడేవారు.

వీరి మూలాలు కూడా వేరుగా ఉండేవి. సామ్రాజ్య పరిధిలో రైతాంగ ప్రజలు ఉండేవాళ్ళు. ఉత్తరానికి బొహీమియన్లు, స్లోవాకు, కార్నియోలాలో స్లోవీన్లు, దక్షిణానికి క్రొయాట్లు, తూర్పున ట్రాన్సిల్వేనియాలో రౌమన్లు ఈ తేడాల వల్ల రాజకీయ ఐక్యత అంత తేలికగా ఏర్పడదు.

వాణిజ్య పద్ధతులలో కూడా తేడా ఉంది. 18వ శతాబ్దంలో రెండవ భాగంలో ముందుగా ఇంగ్లాండ్ లో పారిశ్రామికీకరణ మొదలై వివిధ వాణిజ్య, వ్యాపారస్తులు లాభపడ్డారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్ లో 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ వల్ల అంత ప్రగతి సాధించబడలేదు.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
“జాతీయ రాజ్యాలు ఏర్పడటంతో రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగింది” అన్న వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలు ఇవ్వండి. (AS2)
జవాబు:
జాతీయ రాజ్యాలు ఏర్పడటం వల్ల రాచరిక వర్గాల ఆధిపత్యం తగ్గి మధ్య తరగతి ప్రాభవం పెరిగిందని నేను ఏకీభవిస్తాను.

రాచరిక వర్గాల వల్ల రైతాంగం పన్నులు కట్టలేక, చర్చి అధీనంలో పని చేయలేక, వారికి సేవలు చేయలేక నలిగి పోతుండేవారు. ఒక సం|| పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోతుంది.

కొత్తగా ఏర్పడిన, మధ్య తరగతులు విదేశీ సముద్ర ప్రయాణం, వర్తక, వాణిజ్యాల ద్వారా అధికంగా ఆస్తులు సంపాదించారు. వీళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులుగా ఉండటం అన్న వాటికి ఉదారవాదం ప్రతీకగా నిలిచింది.

మధ్య తరగతి వర్గం ఫ్రెంచి విప్లవం నాటి నుంచి నియంత పాలనకు అంతం, చర్చి ప్రత్యేక హక్కులకు అంతం, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడసాగింది. మధ్యతరగతిలో మేధావి వర్గానికి చెందిన ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, రచయితలు, వాణిజ్యవేత్తలు, వారి వారి స్థాయిలలో రాచరిక ప్రాధాన్యత తగ్గించి ప్రజా చైతన్యం, విప్లవాలు ద్వారా మధ్య తరగతి ప్రాతినిధ్యం పెరిగింది.

ప్రశ్న 4.
మీరు చదివిన ఒక భారతదేశ జాతీయతావాదికి, మాజినికి మధ్య సంభాషణను ఊహించి రాయండి. (AS6)
జవాబు:
సంభాషణ

మాజిని : మాటలు, ఉపన్యాసాలు, చర్చల ద్వారా జాతీయ రాజ్యం ఏర్పరచలేము. ఏదో ఒకటి చేయాలి.

రూసో : విప్లవాలు, ఉద్యమ హింసల ద్వారా స్వాతంత్ర్యం పొందలేం ……… జాతి ఐక్యతను సాధించలేం ……. కాలమే నిర్ణయిస్తుంది.

మాజిని : ఎంతకాలమో కాలయాపన. ఏదో విప్లవ సంఘాలు, రహస్య పోరాటాల ద్వారానే ఐక్యత సాధించగలం.

రూసో : ప్రజా చైతన్యం రావడానికి కాలం పడుతుంది. ప్రజలలో మార్పు ద్వారా జాతీయతావాదం బలపడుతుంది. ముందుగా ప్రజలలో చైతన్య బావుటా ఎగురవేయాలి.

మాజిని : ఎంతకాలమో ఎగురలాటలు, గంతులు, జిమ్మిక్కులు, యుద్ధ వాతావరణం కల్పించాలి. రాచరిక, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి.

రూసో : దానికో మార్గం ఉంది ……………… ఆగాలి.

మాజిని : ఇంకా ఆగితే అధోగతే ……………….

రూసో : ఫ్రెంచి విప్లవం ఎలా సాధ్యమయ్యిందో, ఎలా ఫలితాలు సాధించాయో తెలుసు కదా!

మాజిని : అప్పటి పరిస్థితులు వేరు.

రూసో : ఉద్రేకాల వల్ల, యుద్ధాలు పరిష్కారం కావు.

మాజిని : ఇంకా ఏదో తేల్చుకోవాలి. వేలకొలది యువకులతో విప్లవ జ్వా లలు రగిలించాలి …….. విప్లవ జ్వాలలు రగిలించాలి …… రగిలించాలి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
సాంప్రదాయవాదులు, ఉదారవాదుల గురించి వివరించే వాక్యాలను గుర్తించండి. మన ప్రస్తుత నేపథ్యంలో వీటికి ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
1815లో నెపోలియన్ ఓడిపోయిన తరువాత యూరోపియన్ ప్రభుత్వాలలో సంప్రదాయవాదం చోటుచేసుకుంది. రాచరికం, చర్చి, సామాజిక తారతమ్యాలు, ఆస్తి, కుటుంబం వంటి సంప్రదాయ వ్యవస్థలను కాపాడాలని భావించారు. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనా వ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, ఫ్యూడలిజం, బానిసత్వాల రద్దు ద్వారా యూరపులో నిరంకుశ రాచరికాలను బలోపేతం చేయవచ్చు అని వాళ్ళు భావించారు.
ఉదా : కుటుంబ సంప్రదాయం, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు.

ఉదారవాదం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అన్న వాటికి ప్రతీకగా నిలిచింది. నియంత పాలనకు స్వస్తి చెప్పి, చర్చి ప్రత్యేక హక్కులను అంతం చేసి, రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా పరిగణింపబడింది. సాంప్రదాయ వాదులు నియంత్రించిన, పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యత నిచ్చింది.

ఉదా : వాక్ స్వాతంత్ర్యం, సమన్యాయపాలన.

ప్రశ్న 6.
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలలో జాతీయ రాజ్యాలు ఏర్పడటంలో తేడాలు, పోలికలు చూపించే పట్టికను తయారుచేయండి. (AS1)
జవాబు:
తేడాలు :

ఫ్రాన్స్జర్మనీఇటలీ
ఫ్రాన్స్ లో నిరంకుశ పాలనకు వ్యతి రేకంగా, అధిక పన్నులు, అభద్రతా భావం వల్ల, మధ్యతరగతి వర్గం చైత న్యంతో జాతీయ రాజ్యం ఏర్పడింది.జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం, రాజ్యస్థాపనకు కృషి.ఇటాలియన్ స్రామాజ్యం చెల్లాచెదురుగా ఉండేవి.
చదువుకున్న మధ్యతరగతి సంపన్న వర్గాలకు చెందిన ఉదారవాద జాతీయతాఉదారవాదుల ప్రయత్నాన్ని రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి.ఇటాలియన్ ప్రజలు అధిక శాతం నిరక్షరాస్యులు.
వాదం విప్లవ భావాలతో కలవసాగాయి. జాకోబిన్ క్లబ్, రాబిన్ స్పియర్.బ్లెడ్ అండ్ ఐరన్ బిస్మార్క్,యంగ్ ఇటలీ మాజిని.
ఫ్రాన్స్ లో, జాతీయ రాజ్యం ప్రారంభం.ఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా

పోలికలు :

ఫ్రాన్స్జర్మనీఇటలీ
తిరుగుబాట్ల ద్వారా, ఉద్యమాలు ద్వారా రాజ్యస్థాపన.ఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా
రాచరికం, గణతంత్రం.ఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా
ఆకలి, కష్టాలు, ఆవేదనలు, ఆక్రందనల నుంచిఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా
జాతీయ రాజ్యాలు ఏర్పాటుఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా
స్త్రీలకు ప్రాధాన్యంఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా
యువకులలో రాజకీయ చైతన్యంఫ్రాన్స్ అడుగుజాడల్లోఫ్రాన్స్ విధానంలో కాకుండా

ప్రశ్న 7.
1848 ఉదారవాదుల తిరుగుబాటు అంటే ఏమిటో వివరించండి. ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
చార్లెన్ X తదుపరి వరుసకి సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. 1830లో లాగానే 1848లో కూడా తిరుగుబాటు ఫ్రాన్స్ లో మొదలైంది. రాజ్యాంగబద్ద రాచరికంలో భాగంగా లూయీ ఫిలిప్ పరిపాలించాలి. సింహాసనాన్ని అధిష్టిస్తున్నప్పుడు అతడిని “పౌర రాజుగా” పేర్కొన్నారు. అతడి పట్టాభిషేకం దేవుని దయతోను, “జాతి కోరిక ప్రకారం” జరిగిందని అన్నారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫిలిప్ తిరోగామి పంథా అవలంబించడం వల్ల 1848 నాటికి అతడి పాలనకు తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజలు తిరగబడ్డారు. పలాయనం తప్పించి లూయీ ఫిలిప్ కి మరో దారి లేకుండా పోయింది. “గణతంత్రం వర్ధిల్లాలి” అన్న నినాదాలు వీధులలో మిన్నుముట్టాయి. ఫిలిప్ భయపడి ఇంగ్లాండ్ కు పారిపోయాడు. ఆ తదుపరి హింస కొనసాగింది. తిరుగుబాటుదారులను అంతిమంగా ప్రభుత్వ సైన్యాలు ఓడించి తీవ్ర శిక్షలు విధించాయి. ఉదారవాద ఉద్యమంలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.

ఉదారవాదులు సమర్థించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు :

  • వ్యక్తిగత స్వేచ్ఛ, చట్ట సమానత్వం.
  • రాజకీయంగా ప్రజామోదంతో ప్రభుత్వం అన్న భావన.
  • వ్యక్తిగత ఆస్తి హక్కుకు ప్రాధాన్యత.
  • రాజ్యాంగం, పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వం.
  • సరుకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు.
  • సుంకాల సమాఖ్య లేదా జోల్వెరిన్ ఏర్పాటు.
  • రైలు మార్గాల అభివృద్ధితో ప్రగతి అధికం.
  • దేశ ఐక్యతకు తగ్గట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కల్పన.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
జర్మనీ ఏకీకృతమైన ప్రక్రియను క్లుప్తంగా వివరించండి. (AS1)
(లేదా)
జర్మనీ ఏకీకరణను వివరించండి.
జవాబు:
జర్మనీ మధ్యతరగతి వర్గాలలో జాతీయభావం అధికం. 1848లో వీళ్ళు జర్మనీలోని వివిధ ప్రాంతాలను సమాఖ్యగా ఏర్పరచి, ఎన్నికైన పార్లమెంట్ పాలనలో జాతీయ రాజ్యాంగం మలచటానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలను రాచరిక, సైనిక శక్తులు అణచివేశాయి. ఇందులో సైన్యానికి జంకర్లు అనే ప్రష్యా బడా, భూస్వాములు కూడా సహకరించారు. అప్పటి నుంచి జాతిని ఏకం చేసే ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించింది. ప్రష్యా సైన్యం, పాలనా యంత్రాంగం సహాయంతో ప్రష్యా ప్రధానమంత్రి ఒట్టోవాన్ బిస్మార్క్ ఈ ప్రక్రియకు సూత్రాధారిగా వ్యవహరించాడు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్ పై జరిగిన మూడు యుద్ధాలలో ప్రష్యా విజయం సాధించడంతో ఏకీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రష్యా రాజైన విలియం-I జర్మన్ చక్రవర్తిగా 1871లో ప్రకటింపబడ్డారు.

ప్రశ్న 9.
వియన్నా సమావేశం చేసిన మార్పులను యూరపు పటంలో చూపించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
పేజీ నెం. 177లోని ‘ఆకలి కష్టాలు, ప్రజా తిరుగుబాటు’ శీర్షిక కింద ఉన్న మొదటి పేరాను చదివి, వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
యూరపులో 1830లలో ఆకలి, కష్టాలు తత్ఫలితంగా ప్రజా తిరుగుబాటు .జరిగి ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 194|| మొదటి సగంలో యూరప్ అంతటా జనాభా గణనీయంగా పెరిగింది. చాలా దేశాలలో పనుల కంటే పనిచేసే వాళ్లు ఎక్కువైనారు. పల్లె ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్లి, మురికి వాడలలో నివసించి, దుర్భర జీవితం అనుభవించారు. పంటలు సరిగా పండకపోయినా, లేదా ఆహార ధరలు పెరిగినా పల్లెల్లో, పట్టణాల్లో పేదరికం పెరిగిపోయింది. తత్ఫలితంగా నిరసనలు పెల్లుబికి తిరుగుబాటుకు దారి తీసింది.

9th Class Social Studies 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.174

ప్రశ్న 1.
ఆయా దేశాలలో జాతీయతాభావం ఏర్పడడానికి నెపోలియన్ దాడులు ఎలా దోహదపడి ఉంటాయి?
జవాబు:
నెపోలియన్ దాడుల తర్వాత 1815లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయా దేశాలలో ప్రభుత్వాలలో నెపోలియన్ ద్వారా పదవీచ్యుతులైన రాచరికాలకు తిరిగి అధికారం కట్టబెట్టి యూరపులో కొత్త సంప్రదాయవాదాన్ని నెలకొల్పటం ప్రధాన ఉద్దేశ్యంగా వియన్నా సమావేశం ఏర్పాటైంది. నెపోలియన్ చేపట్టిన మార్పుల ద్వారా రాజ్యాధికారం మరింత బలోపేతం అయి, ఆయన దాడుల వలన జాతీయతాభావం పెరిగింది. ఆధునిక సైన్యం, సమర్థ పరిపాలనావ్యవస్థ, వృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి, బానిసత్వాల రద్దు యూరప్లో రాచరికం తగ్గి, జాతీయతా భావాలు పెరిగాయి.

ప్రశ్న 2.
జాతీయతావాదం, జాతీయ రాజ్యాలు అన్న భావనలు ఎలా ఆవిర్భవించాయి?
జవాబు:
ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం పంచుకుందామన్న భావం కలిగిన పౌరుల క్రియాశీల భాగస్వామ్యంపై ఆధారపడిన బలమైన దేశాలను ఏర్పాటు చేయటానికి జాతీయతావాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఈ ప్రయత్నాల ఫలితంగా పలు దేశాలతో కూడిన వంశపారంపర్య రాచరిక స్థానంలో యూరపులో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
జాతీయతాభావం ఏర్పడటంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి చర్చించండి.
జవాబు:
జాతీయతాభావం ఏర్పడడంలో భాష, జనాదరణ పొందిన సంప్రదాయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. యూరపు ప్రాంతాలు నియంతృత్వ రాచరికాల కింద ఉండేవి. వాళ్ళ పాలనలో వివిధ రకాల ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు తమకు ఒక ఉమ్మడి సంస్కృతి, లేదా సామూహిక గుర్తింపు ఉందని భావించే వాళ్ళు కాదు. వాళ్ళు తరచు వేరు వేరు భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. జాతీయతాభావం ఏర్పడడానికి అంతా ఒకటై ముందుకు సాగారు. అదే విధంగా జనాదరణ పొందిన కుటుంబ సాంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి సాంప్రదాయాల వల్ల కూడా జాతీయతా భావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతా భావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

9th Class Social Textbook Page No.176

ప్రశ్న 4.
పాత రాజ్యాలు వ్యాపార, పరిశ్రమల ప్రగతిని ఏ విధంగా అడ్డుకున్నాయి?
జవాబు:
ఆర్థికరంగంలో స్వేచ్ఛా మార్కెట్లనూ, సరుకునూ, పెట్టుబడి కదలికలపై పాత రాజ్యాలు, వ్యాపార, పరిశ్రమల ప్రగతిని అడ్డుకున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి తనదైన ద్రవ్య విధానం, తూనికలు, కొలతలూ ఉండేవి. చాలా ప్రదేశాలలో తనిఖీలు, అధికంగా సుంకాలు వసూలు చేసేవారు. ప్రతీ ప్రాంతానికీ తనదైన తూనికలు, కొలతలు ఉండడం వల్ల సుంకం లెక్కించటానికి చాలా సమయం పట్టేది. తద్వారా వ్యాపార, పరిశ్రమల ప్రగతికి నిరోధకమయ్యెను.

ప్రశ్న 5.
ఆ దేశాలలో ఉదారవాద ప్రజాస్వామ్యం వ్యాపార, పరిశ్రమలకు ఏ విధంగా దోహదం చేసింది?
జవాబు:
ఉదారవాద ప్రజాస్వామ్యాలు వ్యాపార పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత నిచ్చాయి. కొత్తగా ఏర్పడిన మధ్య తరగతి వర్గం వర్తక, వాణిజ్యాల ద్వారా, సముద్రయానం ద్వారా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాయి. రాచరిక వ్యవస్థలో గల ఇబ్బందులు తొలగించడానికి ఇవి కృషి చేశాయి. వస్తువులు, సరుకుల పెట్టుబడిపై ప్రభుత్వ పరిమితులను రద్దు చేశాయి. సరకులు, ప్రజలు, పెట్టుబడి ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలింపబడేలా ఏకీకృత ఆర్థిక ప్రాంతం ఏర్పాటు చేయాలని ఈ వర్గాలు కోరాయి. తనిఖీ కేంద్రాలు రద్దు చేసి ద్రవ్య విధానాలను రెండుకి కుదించాయి. రైలు మార్గాలు అభివృద్ధి చేసి పరిశ్రమలను ప్రోత్సహించాయి.

ప్రశ్న 6.
మన దేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉందా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
మనదేశంలో ఉదారవాద, ప్రజాస్వామిక రాజకీయ విధానం ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమన్యాయ పాలనతో పాటు, 18 సం||లు నిండిన స్త్రీ, పురుషులు కుల, మత, లింగ, పేద, ధనిక భేదం లేకుండా వయోజన ఓటు హక్కు కల్పించబడింది. 21 సం||లు నిండినవారు ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు. నిరంకుశ, నియంత పాలన మనదేశంలో లేదు. రాజ్యాంగం, పార్లమెంటు ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వంగా మనదేశం పరిగణించబడింది.

ప్రశ్న 7.
మన ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంప్రదాయవాదం మంచిదనే వాళ్ళకీ, ఉదారవాద ప్రజాస్వామ్యం మంచిదనే వాళ్ళకీ మధ్య చర్చ నిర్వహించండి.
జవాబు:
సంప్రదాయవాదులు :
రాచరికమే మంచిది. రాజే ఉన్నతుడు, సామాజిక తారతమ్యాలే దేశాన్ని నడిపిస్తాయి.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
ప్రజలే ప్రభువులు. రాజ్యమంటే ప్రజలే…. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం మేం పని చేస్తున్నాం.

సంప్రదాయవాదులు :
చర్చి అధీనంలో హక్కులు ఉండి, పరిపాలనలో మేటిగా ఉంటాం. ఆస్తి, కుటుంబ సంప్రదాయాలకు విలువిస్తాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
చట్టం ముందు అందరూ సమానులే. వయోజనులకు ఓటు హక్కు కల్పించాము. వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అందించాం.

సంప్రదాయవాదులు :
మధ్య తరగతి వారు ధనవంతులు కాకుండా, వాణిజ్య వ్యాపారాలను నివేదించాం. పత్రికల స్వేచ్ఛ, అభివృద్ధి నిరోధకం దానిని రూపుమాపాం.

ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు :
నిరంకుశ భావాలు సహించం. ఉద్యమాలు, విప్లవాల ద్వారా చైతన్యం తెస్తాం. సంప్రదాయ చీకటి దారుల్ని తెరిపించి, వెలుగునందిస్తాం.

AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 8.
అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శలకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను సంప్రదాయవాదం ఎందుకు హరిస్తుంది?
జవాబు:
సంప్రదాయవాదం అభిప్రాయ వ్యక్తీకరణకు వ్యక్తికి ఉన్న స్వేచ్ఛలను అడ్డుకుంటుంది. అభిప్రాయ వ్యక్తీకరణ, విమర్శల వలన సంప్రదాయవాదుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, వ్యక్తికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల వలన అభివృద్ధి కుంటుపడుతుందని, పత్రికా స్వేచ్చ వలన కూడా ప్రజలు చెడు మార్గంలో పయనిస్తారని భావించింది. కుటుంబ సాంప్రదాయాలు, సామాజిక తారతమ్యాలు దెబ్బతిని పరిపాలకుల మనుగడ దెబ్బ తింటుందని తలంచాయి.

9th Class Social Textbook Page No.178

ప్రశ్న 9.
ఎనిమిదవ తరగతిలో భారతీయ జాతీయతావాదులు దేశంలోని సాంప్రదాయ, జానపద కళల పునరుద్ధరణకు ప్రాధాన్యత నిచ్చారని మీరు చదివారు. ఇది ముఖ్యమని వాళ్ళు ఎందుకు భావించారు?
జవాబు:
ప్రజలలో ఐక్యత, విజ్ఞానం, అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల తరతరాలుగా బానిసత్వ బతుకుల్లా సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆచారాల పరిరక్షణకు వారు తలంచారు. ప్రజలలో ఉన్న అమాయకత్వం, మూఢ నమ్మకాలు, అవగాహనాలేమి, అవినీతి, వారసత్వ రాజకీయాలలో ప్రజలను చైతన్యపరచడానికి ప్రభుత్వాలు అందించు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి పథకాలు సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి చేరవేయటానికి, సాంప్రదాయ, జానపద ‘కళల పునరుద్దరణకు ప్రాధాన్యతనిచ్చారు. మన కళలు, సాంప్రదాయాలు, మన సంస్కృతికి, మన వారసత్వానికి ప్రతిబింబాలు. జానపద కళలు, సాంప్రదాయాలు మన జీవన ఆధారాలు కాబట్టి ముఖ్యమని తలంచారు.

9th Class Social Textbook Page No.180

ప్రశ్న 10.
చార్లెస్ X, లూయీ ఫిలిట్లు ఫ్రాన్స్ వదిలి ఎందుకు పారిపోవలసి వచ్చిందో వివరించండి.
జవాబు:
చార్లెస్ X :

  1. చార్లెస్ X విప్లవాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
  2. కులీనులకు, మత గురువులకు ప్రత్యేక హక్కులను పునరుద్ధరించటానికి ప్రయత్నించాడు.
  3. 1814 చార్టర్ ని పక్కకు పెట్టి తన ఇష్టమొచ్చినట్లు పరిపాలించసాగాడు.
  4. తిరుగుబాట్లు, విప్లవంతో వచ్చిన నిరసనలు ద్వారా ఇక ప్రాణం కాపాడుకోవడానికి ఫ్రాన్స్ ను వదలి పారిపోయాడు.

లూయీ ఫిలిప్ :
చార్లెస్ X కి వరుసకు సోదరుడైన లూయీ ఫిలిప్ రాజు అయ్యాడు. ప్రారంభంలో పౌర రాజుగా కీర్తింపబడినా, ఆ తరువాత

  1. గడుస్తున్న కొద్దీ అతడి ప్రభుత్వం తిరోగామి పంథాను అవలంబించింది.
  2. 1848 నాటికి అతడి పాలనపై తీవ్ర వ్యతిరేకత.
  3. శత్రువులు పెరిగిపోయారు.
  4. అతడు నియమించిన ముఖ్యమంత్రి ప్రజాదరణ కోల్పోవటంతో అతడిని తొలగించారు.
  5. రాజు సైనికులు జరిపిన కాల్పులలో ఇరవై ముగ్గురు చనిపోయారు.
  6. దాంతో ప్రజలు తిరగబడ్డారు.
  7. గణతంత్రం వర్ధిల్లాలి, అన్న నినాదాలు మిన్నంటాయి.
  8. దాంతో భయపడి ఫిలిప్ ఇంగ్లాండుకు పారిపోయాడు.

9th Class Social Textbook Page No.181

ప్రశ్న 11.
ఈ వ్యంగ్య చిత్రాన్ని వివరించండి. బిస్మార్క్ కి ఎన్నికైన పార్లమెంటు డిప్యూటీలకీ మధ్య సంబంధాన్ని ఇది ఎలా చూపిస్తోంది? ప్రజాస్వామిక ప్రక్రియల గురించి చిత్రకారుడు ఏం వ్యాఖ్యానించదలుచుకున్నాడు?
AP Board 9th Class Social Solutions Chapter 14 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2
జవాబు:
ఈ చిత్రం బిస్మార్క్ వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. బిస్మార్క్ విధానం క్రూరమైన బలప్రయోగం మీద ఆధారపడింది. జర్మనీ ఏకీకరణ ప్రసంగాలతోనూ, ఉత్సవాలతోను, పాటలతోను సాధ్యం కాదని, క్రూరమైన బలప్రయోగం ద్వారానే ఇది సాధ్యమవుతుందని బిస్మార్క్ నమ్మాడని చిత్రకారుడు వ్యంగ్యంగా చిత్రీకరించాడు.

బిస్మార్క్ విధానాలు ప్రజాస్వామిక ప్రక్రియలను అణచివేయడానికి దోహదపడ్డాయని చిత్రకారుని వ్యాఖ్యానం.

9th Class Social Textbook Page No.183

ప్రశ్న 12.
రాజు ఇమాన్యుయెల్-II కింద ఏకీకృతమైన ఇటలీ నిజమైన జాతీయ రాజ్యంగా మారిందా? మీ సమాధానానికి కారణాలు తెలపండి.
జవాబు:
ఇటలీ దీర్ఘకాలంగా రాజకీయంగా ముక్కలై ఉంది. అనేక వంశపారంపర్య రాజ్యాలలో, అనేక జాతులతో కూడిన హాట్స్ బర్గ్ సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురై ఉన్నారు. 1831, 1848లోని విప్లవాలు విఫలం అవ్వటంతో యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాలను ఒకటిగా చేసే బాధ్యత సార్డీనియా, పీడ్మాంట్ రాజు విక్టర్ ఇమాన్యుయెల్-II మీద పడింది. మాజిని, కవూర్, గారి బాల్డి నేతృత్వాలలో సాయుధ వలంటీర్ల తిరుగుబాటుతో, 1860లో వీళ్ళు దక్షిణ ఇటలీ నుండి సిసిలీస్ రాజ్యంలోకి చొచ్చుకుపోయి స్పానిష్ పాలకులను తరిమి కొట్టడానికి స్థానిక రైతాంగం మద్దతు కూడగట్టారు. 1861లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమాన్యుయెల్-II రాజుగా ప్రకటించారు.

కాని ఇటాలియన్ ప్రజానీకంలో అధిక శాతం నిరక్షరాస్యులు. వారికి ఉదారవాద, జాతీయతా భావజాలం తెలియకుండా ఉండిపోయారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
18వ శతాబ్దపు మధ్యకాలపు (1815) పటాన్ని, ప్రస్తుత యూరపు పటంతో పోల్చి మీరు గమనించిన తేడాలను మీ నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:

  1. అప్పటి యూరప్ పటము నందు కనిపించెడి హనోవర్, బొహేమియా, బలేరియా ప్రాంతాలు నేడు జర్మనీలో అంతర్భాగాలు.
  2. ఆనాటి ప్రష్యా కూడా నేడు జర్మనీలో అంతర్భాగమే.
  3. సెర్బియా నేటి యుగోస్లావియాలో అంతర్భాగం.
  4. బల్గేరియా, రుమేనియా దేశాలు ప్రస్తుతం వేరు వేరు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి.
  5. పోలెండ్ స్వతంత్ర దేశంగా అవతరించినది.
  6. రష్యా కూడా ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా, బెలారస్ యుక్రయిన్ జార్జియా, ఆర్మేనియా, అజీత్ బైజాన్ వంటి స్వతంత్ర రిపబ్లిలుగా అవతరించినది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
1. ‘సేవా కార్యకలాపాలు’ అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి.
  2. సేవా కార్యకలాపాలు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.
  3. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.
  4. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.
    ఉదా : ఆసుపత్రిలో వైద్యులు చేసేది సేవ
    కిరాణాషాపులో వ్యాపారి చేసేది సేవ
    సంస్థలో అకౌంటెంట్ చేసేది సేవ
    వ్యా న్ డ్రైవర్ చేసేది సేవ
    బ్యాంకులు, రవాణా రంగాలు చేసేవి సేవలు.

ప్రశ్న 2.
ఏవైనా ఐదు సేవా కార్యకలాపాలమ రాసి, అవి ఎందుకు వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాల కిందికి రావో కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
ఐదు సేవా కార్యకలాపాలు
1. వైద్యం :
వైద్యులు ఆసుపత్రిలో రోగులను పరీక్షించి, మందులను సూచించి వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తారు.

2. వ్యాపారం :
వస్తువులను సూల్ సేల్ దుకాణాల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించడం.

3. అకౌంటెంట్ :
ఖాతాలను పరిశీలించడం, చెల్లింపులను రశీదులను సరిచూసుకుంటూ ఆ బిల్లులు, ఖాతాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో సరిచూడటం. ప్రతి యొక్క వ్యాపార సంస్థకు ఖాతాలను రాయడం, నిర్వహించడం.

4. డ్రైవర్ :
ఆటోలలో, వ్యా న్లలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం. సరకులను కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేయడం.

5. ప్రభుత్వ పరిపాలన :
గ్రామాలు, నగర పంచాయతీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ పరిపాలన వర్గానికి చెందుతాయి.
ఉదా : పోలీసులు, గ్రామ పరిపాలనాధికారులు మొదలయినవారు.

పైన పేర్కొన్న వారు అందిస్తున్న సేవలు రైతులు, వ్యవసాయ కూలీలు, పరిశ్రమలలో పనిచేసే వారి పనులకు భిన్నంగా ఉన్నాయని మనం గమనించవచ్చు.
6. వీరు ఉత్పత్తి చేసే సేవలు వరి లేక వస్త్రం లాగా కంటికి కనిపించవు.

7. అయినప్పటికి వీరు ఒక ప్రత్యేకమైన సేవలను తమ పనుల ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు అందిస్తారు.

8. ఇక్కడ సేవ అనేది చేసిన పని స్వభావాన్ని తెలుపుతుంది.

9. సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైనది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 3.
దేశ సమగ్రాభివృద్ధికి సేవా కార్యకలాపాలు ఎలా తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం లేదా పరిశ్రమలలో తయారవుతున్నట్లు వస్తువును ఉత్పత్తి చేయవు.
  2. ఇవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకవసరమైన ఎన్నో సేవలను చేస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయం చలాయి.
  3. రవాణ సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన రంగాలు అభివృద్ధి చెందడం వలన వ్యవసాయక ఉత్పత్తులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు ఉపయోగించడం మాత్రమేకాక వస్తువుల సరఫరాకు తగిన ఆర్థిక వనరులు అందించుటకు తద్వారా వాటి అభివృద్ధికి కారకాలు అవుతాయి.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  5. వారు ఎక్కువగా సేవాసంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. అభివృద్ధికి అది ఒక చిహ్నం.

ప్రశ్న 4.
వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు సేవలతో ఎలా ముడిపడి ఉన్నాయి? (AS1)
జవాబు:

  1. సేవలు అనేవి వ్యవసాయానికి, పరిశ్రమలకు, ప్రజలకు అనేకానేక అవసరాలకు ఒక ప్రత్యేకమైన రీతిలో సహాయపడతాయి.
  2. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడంలో, వీటిని కొంతమంది వ్యక్తుల సమూహం కొని వినియోగదారులకు నేరుగా లేదా రైస్ మిల్లులు, నూనె మిల్లులు వంటి ఇతర ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుంది.
  3. ఇవి అన్నీ సేవాసంస్థలైన రవాణా, వాణిజ్య, కార్యకలాపాల ద్వారా జరుగుతాయి.
  4. పారిశ్రామిక కార్యకలాపాలకు పట్టణాలలో, నగరాలలోని సిమెంట్ వ్యాపారులకు రైల్వేల ద్వారా సిమెంట్ కర్మాగారాల నుండి సిమెంట్ సంచులు రవాణా కాకపోతే భవన నిర్మాణాలు ఎలా జరుగుతాయి?
  5. కావున వ్యవసాయక, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి.

ప్రశ్న 5.
సేవారంగం పెరుగుదల సుస్థిరమైనది మరియు అది భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుంది. ఈ వ్యాఖ్యతో నీవు ఏకీభవిస్తావా? విశదీకరించండి. (AS2)
జవాబు:

  1. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధికి ప్రోత్సాహమనేది ఎన్నో వ్యవస్థాపక సౌకర్యాలతో ముడిపడి ఉంటుంది.
  2. ఇది అవస్థాపన సౌకర్యాలు, ఇతర సేవల విస్తరణను కలిగి ఉంటుంది.
  3. రవాణా సమాచార సాధనాలు, బ్యాంకులు మొదలైన విలువైన సేవల తరహాలోనే సేవా కార్యకలాపాల విలువ కూడా – పెరగాలని ఆశించడం సహజం.
  4. భారతదేశంలో ఉద్యోగాలు చేసే వారిలో 1/4వ వంతు సేవాకార్యకలాపాలే కలిగి ఉన్నారు.
  5. సేవాకలాపాల ఉద్యోగాలు ప్రజల జీవన స్థాయిలో పురోభివృద్ధికి ఒక కారణం.
  6. ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినపుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి.
  7. వారు ఎక్కువగా సేవా సంబంధమైన కార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం పైన ఎక్కువ ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.

అందువలన సేవారంగం సుస్థిర వృద్ధి భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 6.
సేవారంగం కార్యకలాపాలు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి? (AS1)
జవాబు:
సేవారంగ కార్యకలాపాలు ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణాలు :

  1. మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాచార, సాంకేతిక విజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
  2. మానవ జీవితం యాంత్రికమైనది.
  3. రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
  4. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరడానికి గాను, ఇంటర్నెట్, గ్లోబల్ విలేజ్ వంటి వాటి ద్వారా మానవ సమాజం చేరువైనది.
  5. అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోనికి వచ్చాయి.
  6. అనేక రకాలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

ప్రశ్న 7.
వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా సేవా కార్యకలాపాలను ఒక స్థాయిని దాటి విస్తరించలేం. వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం, ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే తృతీయ రంగం సత్వర, సుస్థిర ప్రగతిని సాధిస్తుంది.
  2. ఆర్థిక వ్యవస్థ అనే ఇరుసుకు రెండు చక్రాల వంటివి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు. వీటి వలన ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది.
  3. ఉత్పాదక సామర్థ్యం. ఉన్న చోట సేవారంగం సుస్థిర ప్రగతి సాధిస్తుంది.
  4. ప్రజలు మెరుగైన ఆదాయాలు పొందాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. అప్పుడు వారి వినియోగ వ్యయంలో మార్పులు వచ్చి సేవాకార్యకలాపాలైన విద్య, వినోదం, ఆహారం, పర్యాటకం వంటి వాటిపై ” ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు.
  5. అందువల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందడం వల్ల సేవాకార్యకలాపాలు ఒకస్థాయిని దాటి విస్తరించగలవు.

ప్రశ్న 8.
భారతదేశంలో చదువుకున్నవారి నిరుద్యోగితను సేవారంగం ఎలా తగ్గించగలదు? (AS1)
జవాబు:

  1. సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు ,సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది.
  2. వ్యాపార నిర్వహణలో పొరుగు సేవల ద్వారా కొత్త తరహా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువతకు కల్పిస్తోంది.
  3. టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగించుకొని ఉద్యోగులు తాము ఉన్న చోటునుండి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా తమ సేవలను అందిస్తున్నారు.
  4. ప్రధాన నగరాలలో స్థాపించబడిన ఎన్నో ఐ.టి. సంస్థలు అత్యంత నిపుణులైన ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు అందిస్తున్నాయి. వారికి ఇతర దేశాల నుండి ప్రాజెక్టులు వస్తాయి.
  5. వినోద పరిశ్రమ, వార్తా ప్రసార సంస్థలు, కేబుల్ టెలివిజన్ ఛానల్ లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.
  6. పట్టణాలలో, నగరాలలో ఇంటర్ నేట్ కేఫీలు, పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు సర్వసాధారణంగా కన్పిస్తాయి.
  7. సాధారణంగా వాణిజ్య ప్రకటనల రంగం కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చింది.

ప్రశ్న 9.
మీ ప్రాంతం నుండి ఎవరైనా పనివారు వలస వెళ్లారా? వారు ఎందుకు వలస వెళ్లారో కారణాలు తెలుసుకోండి. (AS3)
జవాబు:

  1. మా ప్రాంతం నుండి వలస వెళ్ళినవారు ఉన్నారు.
  2. వారు వివిధ రకాల పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  3. ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినారు.
  4. అలాగే పనిపాటలు చేసుకునే వివిధ రకాల పనులు కోసం వలస వెళ్ళినారు.
  5. కూలి పనులు చేసుకునేవారు మా ప్రాంతంలో పని ఉన్నప్పుడు ఉండి పని లేని సమయంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి పనులు పూర్తయిన తదుపరి ప్రాంతానికి వస్తారు.

ప్రశ్న 10.
ఈ పాఠంలోని 9వ పేరా చదవండి (సేవా కార్యకలాపాలనేవి వ్యవసాయం….) ఈ కింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి. వ్యవసాయం, పరిశ్రమలకు అవసరమైన, సేవా కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:

  1. రోడ్లు, రైలు, జల, వాయు మార్గాలు అనగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.
  2. వైద్య, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం
  3. గిడ్డంగి సౌకర్యాలను కల్పించడం.
  4. రుణ సదుపాయాలను కల్పించడం.
  5. వ్యాపార సౌకర్యాలను ఏర్పాటుచేయడం.

ప్రశ్న 11.
పేజీ నెం. 104లోని పటాన్ని పరిశీలించి భారతదేశ అవుట్ లైన్ పటంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు గల నగరాలను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 2

9th Class Social Studies 8th Lesson భారతదేశంలో సేవా కార్యకలాపాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.97

ప్రశ్న 1.
ఈ కింద ఎనిమిది రకాల సేవా కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి. కొన్ని వివరాలు నింపి మిగిలినవి వదిలేయబడ్డాయి. మీ ఉపాధ్యాయుడితో చర్చించి ఆ ఖాళీలను పూరించండి.
జవాబు:
1. విద్య : సంస్థలు :
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు ఈ కోవకు చెందుతాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరిపాలన సిబ్బంది, వారి కార్యకలాపాలు సేవలను అందిస్తాయి.

2. ఆరోగ్య, వైద్య సేవలు :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా జనరల్ ఆసుపత్రులు, వివిధ రకాలైన వైద్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు మొ||నవి.

3. వర్తకం :
మన చుట్టూ చూస్తున్న వివిధ రకాల టోకు (సూల్ సేల్) చిల్లర వ్యాపార కార్యకలాపాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారం మొదలైనవి.

4. ప్రభుత్వ పరిపాలన :
గ్రామీణ, నగర పంచాయితీలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలన్నీ ఈ . వర్గానికి చెందుతాయి. ఉదా: పోలీస్ స్టేషన్లో పనిచేసే వ్యక్తులు, వివిధ ప్రభుత్వ విభాగాలలో చేస్తున్న వ్యక్తులు అంటే గ్రామ పరిపాలనాధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, తహసీల్దార్లు అన్ని రకాల న్యాయస్థానాలలో పనిచేయువారు, . అసిస్టెంట్లు, క్లలు, అకౌంటెంట్లు, టైపిస్టులు, ఫ్యూన్లు, డ్రైవర్లు మొదలగువారు.

5. రక్షణ రంగం :
త్రివిధ దళాలకు చెందిన సైనిక,నావిక, వైమానిక దళాలలో పనిచేయు వ్యక్తులు, వారి కార్యకలాపాలు ఈ కోవకు చెందుతాయి. బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పోలీసుల సేవల వంటివి కూడా వస్తాయి.

6. విత్త కార్యకలాపాలు :
బ్యాంకులు, వివిధ పొదుపు పథకాలు, తపాలా తంతి – వ్యవస్థ, జీవిత బీమా సంస్థ మొ||నవి.

7. వ్యక్తిగత సేవలు :
ఇళ్లలో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు, అద్దకం సేవలు, క్షురకులు, బ్యూటీపార్లర్ నడిపేవారు, టైలరింగ్ పనివారు, ఫోటో, వీడియో స్టూడియోలో పనిచేయువారు.

8. ఇతర రకాల కార్యకలాలు :
వినోదం, సమాచార సాంకేతిక పరిశ్రమలు – చిత్ర నిర్మాణం, టీవీ సీరియళ్లలో పని చేయువారు. వార్తాపత్రికలు, టివి ఛానళ్లలో, వాణిజ్య ప్రకటన సంస్థలు, మీడియాలో పనిచేసేవారి పనులు కూడా సేవలకు చెందుతాయి.

9th Class Social Textbook Page No.100

ప్రశ్న 2.
1991 నుండి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యకలాపాలలో పనిచేసే వారి సంఖ్యను (లక్షలలో) ఈ కింది పట్టిక చూపుతుంది. ఈ పట్టికను జాగ్రత్తగా చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు 1
1) 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యకలాపం అత్యధిక ఉద్యోగితను కల్పించింది?
జవాబు:
సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు.

2) గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాలంలో ఏ రకమైన ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది?
జవాబు:
గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గింది. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి మాత్రం 11.9 నుంచి 14.1 కి పెరిగాయి.

3) ప్రైవేటు సేవాకార్యకలాపాల్లో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలిగారు?
జవాబు:
ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.

టోకు వర్తకం, చిల్లర వర్తకం, రవాణా గిడ్డంగులు, సమాచార రంగం, విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపారం మొదలైన వాటిల్లోనూ,

సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు వంటి అంశాలలో ఉద్యోగాలు పెరిగాయి.

4) ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో కల్పిస్తున్న ఉద్యోగాలకు మధ్య ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:

  1. టోకు వర్తకం, చిల్లర వర్తకం వంటి అంశాలలో ‘ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా
  2. రవాణా గిడ్డంగులు, సమాచార రంగం వంటి అంశాలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉండి, ప్రైవేట్ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి.
  3. విత్త, బీమా సంస్థలు, స్థిరాస్తి వ్యాపార రంగాలలో ఒకప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా తక్కువగా ఉండగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైయివేట్ ఉద్యోగాల సంఖ్య పెరిగింది.
  4. సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవల రంగాలలో ప్రైవేట్ ఉద్యోగాలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.

9th Class Social Textbook Page No.101

ప్రశ్న 3.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా?
జవాబు:

  1. మా అభిప్రాయం ఏమనగా వీటి వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి.
  2. మొత్తం మీద చూస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ అని అంటారు.
  3. అంతేకాక కాలక్రమంలో మొదట్లో నష్టపోయిన వాళ్లు కూడా లాభపడతారు.
  4. పెద్ద, మధ్యతరగతి రైతులు ప్రారంభంలో ఎక్కువ లాభపడతారని, చిన్న రైతులు లేదా భూమి లేని కూలీలు నష్టపోతారని పేర్కొంటారు.
  5. అయితే పెద్ద సూపర్ మార్కెట్ల కొనుగోళ్ల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది.
  6. దీని వల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.

ఈ సమస్యను చక్కదిద్దడానికి ప్రభుత్వం చేపట్టే అంశాలు :

  1. ఆధునిక నిల్వ సౌకర్యాలను ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది.
  2. మార్కెట్ కొద్ది చేతులలో కేంద్రీకృతం కాకుండా చూస్తుంది.
  3. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎప్పటికప్పుడు తన పర్యవేక్షణలో పెడుతుంది.

9th Class Social Textbook Page No.102

ప్రశ్న 4.
భారతదేశంలో విదేశీ కంపెనీలు చిల్లర దుకాణాలను ఏర్పరచడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అవి భారతదేశంలో ఉపాధి కల్పనకు ఏ విధంగా దోహదం చేస్తాయి?
జవాబు:
భారతదేశంలో విదేశీ కంపెనీలు సరకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ప్రారంభించడం జరిగింది.

  1. కాలక్రమంలో ఈ విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
  2. సరైన నిల్వ సౌకర్యాలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తులలో 20 – 40% వృథా అవుతున్నాయి.
  3. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తుల కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.
  4. మెరుగైన నిల్వ సౌకర్యాల కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
  5. వీటి వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాన్ని ఏర్పరచుతాయి.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 5.
మీ ప్రాంతంలోని కొంతమంది చిల్లర వ్యాపారస్తులతో మాట్లాడండి. విదేశీ చిల్లర దుకాణాలపై వాళ్ల అభిప్రాయాలు గురించి తరగతిలో చర్చించండి.
జవాబు:

  1. బహుళజాతి సంస్థలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వలన వారు తక్కువ రేటుకు అమ్మినప్పటికి వారికి నష్టాలు రావు.
  2. అందువల్ల చిన్న దుకాణదారులు అమ్మే రేట్లతో పోలిస్తే తక్కువ రేట్లకు అమ్ముతారు.
  3. దానితో వినియోగదారులు చిన్న దుకాణాదారుల వద్దకు వెళ్ళకుండా చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల షాపులకు వెళ్తారు.
  4. దానితో చిల్లర దుకాణదారులు తమ షాపులను మూసివేయాల్సి వస్తుంది.
  5. వాటిపై ఆధారపడినవారు ఉపాధిని కోల్పోతారు.
  6. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు.
  7. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.

ప్రశ్న 6.
రెండు నిలువు వరుసలతో ఒక పట్టిక తయారు చేసి అందులో భారతదేశంలో విదేశీ కంపెనీల చిల్లర దుకాణాల వల్ల కలిగే లాభాలను, నష్టాలను పేర్కొనండి.
జవాబు:

లాభాలునష్టాలు
1. పెద్ద సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ళ వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తత్ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కూలీలకు గిరాకీ పెరిగి క్రమంగా వ్యవసాయ కూలీ రేట్లు పెరుగుతాయి.1. నిల్వ సౌకర్యాల్లో పెద్ద పెద్ద చిల్లర వ్యాపారస్తులు ఆశించినంతగా పెట్టుబడులు పెట్టలేదు. అందువల్ల సంప్రదాయ చిల్లర వర్తకులు ఉపాది కోల్పోతారు. దీనివల్ల మార్కెట్ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.
2. విదేశీ చిల్లర వ్యాపారస్తులు కూడా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వడ్డీ వ్యాపారస్తులు కంటే తక్కువ వడ్డీకి అప్పులు సమకూర్చవచ్చు.2. విదేశీ పెట్టుబడి కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తక్కువ ధరలకు తమ సరుకును అమ్మే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తాయి.
3. మెరుగైన నిల్వ సౌకర్యం కారణంగా బహుళజాతి కంపెనీలు పెద్ద మొత్తంలో సరకు కొనుగోలు చేయడంతో రైతులకు వడ్డీ వ్యాపారస్తులతో పోలిస్తే ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.3. నిల్వ సౌకర్యాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా వృథా అయ్యే శాతాన్ని సూపర్ మార్కెట్లు తగ్గిస్తాయనడంలో వాస్తవం లేదు.

ప్రశ్న 7.
భారతదేశంలో మరిన్ని వైద్య విద్యాసంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:

  1. భారతదేశం ఆరోగ్య రంగంలో 64 లక్షల వృత్తి సేవానిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది.
  2. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 10 లక్షల ఆరోగ్య సంబంధ వృత్తి సేవానిపుణుల కొరత ఉంది.
  3. 2011 లో భారతదేశంలో ప్రతి 10 వేల జనాభాకు ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.
  4. అదే నర్సులు, మంత్రసానుల విషయానికొస్తే ప్రతి 10 వేలమందికి 13 మంది ఉన్నారు.
  5. డాక్టరు, జనాభా నిష్పత్తి భారతదేశంలో 0.5 : 1000 కాగా, థాయ్ లాండ్లో 0.3, శ్రీలంకలో 0.4, చైనాలో 1.6, ఇంగ్లాండ్లో 5.4, అమెరికాలో 5.5 గా ఉంది.
  6. దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో 20 లక్షల మంది నిపుణుల కొరత ఉంది.
  7. పునరావాస వృత్తి సంబంధిత వృత్తినిపుణులలో 18 లక్షల మంది కొరత ఉంది.
  8. ఆపరేషన్లో మత్తుమందుకు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  9. వివిధ ఆరోగ్య కార్యకర్తలు సంబంధించిన నిపుణులు 9 లక్షలమంది కొరత ఉంది.
  10. వైద్య పరీక్షల సాంకేతిక నిపుణులు 2.4 లక్షల మంది కొరత ఉంది.
  11. ఆపరేషన్ సంబంధిత ఆరోగ్య నిపుణులు – 2 లక్షల మంది కొరత ఉంది.
  12. కంటికి సంబంధించిన కార్యకర్తలు 1.3 లక్షల మంది కొరత ఉంది.

వృత్తి, విద్యా కళాశాలలు, పాఠశాలల కేటాయింపుల్లో అసమానతల వల్ల అన్ని ప్రాంతాలలో సమానంగా లేరు.

అందువల్ల వైద్య, విద్యా సంస్థలను నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

AP Board 9th Class Social Solutions Chapter 8 భారతదేశంలో సేవా కార్యకలాపాలు

ప్రశ్న 8.
కొత్త వైద్య విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పవచ్చా లేక ప్రైవేట్ రంగంలోనా? ఎందుకు?
జవాబు:
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను స్థాపించవచ్చు.

ఎందుకనగా :

  1. ప్రభుత్వరంగంలో స్థాపించడం వలన పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభగల విద్యార్థినీ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది.
  2. ప్రైవేట్ రంగంలో స్థాపించినప్పటికి కొన్ని సీట్లను ప్రతిభగల పేద విద్యార్థులకు కేటాయించడం వల్ల వారికి న్యాయం చేకూరుతుంది.
  3. ప్రభుత్వం పైన నిర్వహణ ఖర్చు ఉండదు. ఆర్థిక భారమూ పడదు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
ఎవరైనా ఏడుగురు వ్యక్తులను కలసి వారి ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోండి. వారి పని గురించి సంక్షిప్తంగా వ్రాయండి. లేదా పోస్టరు తయారుచేయండి. వారి నివాస ప్రాంతానికి వారి పనికి మధ్య ఎలాంటి సంబంధాన్ని చూసారు.
జవాబు:

వ్యక్తి పేరుచేసే పని యొక్క స్వభావంవ్యవసాయం/పరిశ్రమ/సేవలు
1. రామారావుప్రభుత్వ డాక్టరుసేవలు
2. కార్తికేయప్రభుత్వ సీనియర్ అసిస్టెంట్సేవలు
3. వేణుగోపాలరావుప్రైవేటు డాక్టర్సేవలు
4. ముకుందరావుప్రైవేటు డాక్టర్సేవలు
5. మీరాబాయిప్రభుత్వ సీనియర్ నర్సుసేవలు
6. పాపారావురైతువ్యవసాయం
7. బుచ్చమ్మకార్మికురాలుపరిశ్రమ

వైద్య నిపుణుల కొరత గురించి ప్రభుత్వ ప్రయివేటు వైద్యశాలలయందు పైన పేర్కొన్న వ్యక్తులతో మాట్లాడగా వారు క్రింది విషయాలను వెల్లడి చేశారు.
అవి :

  1. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో వైద్య నిపుణుల కొరత ఎంతైనా ఉంది.
  2. అనేక గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ఇంకా డాక్టర్ అందుబాటులో లేడంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

SCERT AP 6th Class Social Study Material Pdf 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers.

AP State Syllabus 6th Class Social Solutions 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

6th Class Social 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
గణ అంటే ఏమిటి? రాజులు పాలించిన రాజ్యాలకు వీటికి తేడాలు ఏమిటి?
జవాబు:
గిరిజన సమూహాలు పాలించిన ప్రాంతాన్ని ‘గణ’ అంటారు. సాధారణంగా గణ పరిపాలనా కొంతమంది సభ్యుల చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను ‘రాజ’ అని పిలుచుకునేవారు. ఉదా : వజ్జి
రాజ్యాలను రాజులు పరిపాలించేవారు. రాజువంశ పారంపర్యంగా వచ్చేవాడు. దీనినే రాజరికం అంటారు. పరిపాలనకు రాజు సర్వాధికారి. రాజుకి స్వంత సైన్యం ఉంటుంది. వీరు రాజు ఆజ్ఞలను పాటిస్తారు.

ప్రశ్న 2.
మహా జనపదాలలో రాజులు కోటలు ఎందుకు నిర్మించారు.?
జవాబు:
మహా జనపదాలలో రాజులు పెద్ద పెద్ద కోటలు నిర్మించారు. ఎందుకంటే :

  • శత్రు రాజ్యాల దాడుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకోటానికి
  • తమ సంపదను, అధికారాన్ని ప్రదర్శించడానికి
  • తమ ఖజానాను, (ధాన్యాగారాలను) రక్షించుకోవడానికి
  • తమ ప్రాంతమంతా సులభంగా, అందుబాటులో ఉండేందుకు.

ప్రశ్న 3.
నాటి మహాజన పదాల కాలంలో గ్రామ నిర్వహణకు, నేటి గ్రామాల నిర్వహణకు మధ్యగల తేడాలను తెలపండి.
జవాబు:
నాడు, నేడు కూడా గ్రామాల నిర్వహణ ఎన్నికైన వారిచే నిర్వహించబడింది, నిర్వహించబడుతోంది. అయితే ఆనాడు గ్రామానికి అధికారి రాజు. నేడు సర్పంచ్. నేడు గ్రామాలకు కావలసిన అవసరాలైన త్రాగునీరు, వీధిలైట్లు, లైబ్రరీ మొదలైన సౌకర్యాలు కలుగచేస్తారు. ఇంటి పన్ను మొదలైనవి వసూళ్ళు చేస్తారు. గ్రామానికి కావలసిన వసతుల కోసం పైస్థాయి వారితో మాట్లాడుతారు. కానీ నాటి గ్రామాల యొక్క నిర్వహణ, వీటితో పాటుగా గ్రామరక్షణ కూడా వారే చేసేవారు. గ్రామాధికారి పొలంలో సంవత్సరానికి ఒక రోజు గ్రామస్తులు ఉచితంగా పనిచేసేవారు. పన్నును ధన, వస్తు, జంతు రూపంలో కట్టేవారు. చివరగా చెప్పాలంటే నేటి నిర్వహణ ప్రజాస్వామికం, నాటి నిర్వహణ రాచరికం.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 4.
ప్రస్తుతం ప్రభుత్వం వృత్తి పనులవారి మీద ఏవిధంగా పన్నులు వేస్తుంది? మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ ఒకటేనా?
జవాబు:
ప్రస్తుతం ప్రభుత్వం స్వంతగా చేతివృత్తులవారి మీద ఎటువంటి పన్నులు వేయడం లేదు. కొన్ని కొన్ని వృత్తులు చేసేటువంటి (ఉదా : ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు) వారి మీద వృత్తి పన్ను ప్రతినెలా కొద్దిమొత్తం వారి జీతం నుండి మినహాయిస్తుంది. మహాజనపదాలలోని పన్నుల విధానం, ఇదీ వేరు వేరు.

ప్రశ్న 5.
ఏ ఆధారాల సహాయంతో నీవు మహాజనపదాల గురించి తెలుసుకున్నావు?
జవాబు:

  • మహాజనపదాల గ్రామాలు, పట్టణాల గురించి రెండు రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించారు.
  • హస్తినాపుర (నేటి ఢిల్లీ), అత్రంజీ ఖేరా, కోశాంబి (అలహాబాద్ దగ్గర), పాటలీపుత్ర మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు.
  • ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకూ మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ ‘ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి.
  • కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలయిన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి.
  • ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరిడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు.

ప్రశ్న 6.
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాల గురించి రాయండి.
జవాబు:
మహాజన పదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పడిన వ్యవసాయ విధానాలు :

  • ఇనుప నాగలిని వినియోగించటం.
  • వరి నారు పోసే పద్ధతిని ప్రారంభించటం.
  • అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు మొ||నవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 7.
“మహాజనపదాలు పది తరాలలో అభివృద్ధి చెందాయి.” ఈ వ్యాఖ్యలతో నీవు ఏకీభవిస్తావా? నీ జవాబును సమర్థించుము.
జవాబు:
మహాజనపదాలు పదితరాలలో అభివృద్ధి చెందాయనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీ లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.

ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికి వేసి, భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలూ ఈ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాలలో వేర్వేరు తెగలకు చెందిన చాలామంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను “మహాజనపదాలు” లేదా ‘పెద్ద జనపదాలు’ పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి.

ప్రశ్న 8.
జనపదాల కాలం నాటి వృత్తి పనివారి పనితనాన్ని నీవెలా ప్రశంసిస్తావు?
జవాబు:
చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు (నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి)ను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలవ ఉంచే పాత్రలను కుమ్మరి , బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామగ్రిని వడ్రంగులు, దుస్తులను నేతపనివారు తయారు చేసేవారు.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 1

మహాజనపదం కాలంలో వృత్తి కార్మికులు నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని “పెయింటెడ్ గ్రేవేర్” అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖా గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి.

ప్రశ్న 9.
మహా జనపదాల కాలంలో పరిపాలకులచే వసూలు చేయబడిన పన్నులేవి?
జవాబు:

  • వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
  • ప్రతీనెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు.
  • వ్యాపారస్థులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు.
  • వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు.
  • ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి.
  • ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మహా జనపదాల కాలంలో పాలకుల ఎన్నిక, ప్రస్తుత రోజులలో ఎన్నికల విధానం కన్నా ఏ విధంగా భిన్నమైనది?
జవాబు:
మహా జనపదాల కాలంలో పాలకులు (రాజులు) ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలాకాలంపాటు పాలించేవారు. అంటె ఎక్కువ జనపదాలలో రాచరికం అమల్లో ఉంది. కొన్ని గణ రాజ్యాలలో మాత్రమే ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేలమంది కలసి పాలన చేసేవారు.

ప్రస్తుత రోజులలో పాలకుల ఎన్నిక విధానం ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరుగుతుంది. అంటే వయోజనులైన (18 సం||లు పైబడినవారు) వారు తమ ఓటుహక్కు ద్వారా పాలకులను ఎన్నుకుంటున్నారు.

ప్రశ్న 11.
ప్రస్తుత కాలంలో పంటలు పండించే విధానాలు మహాజనపదాల కాలంలో విధానాలతో ఏ విధంగా సరిపోతాయి?
జవాబు:

  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో ఇనప నాగలి వినియోగించడం జరిగింది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో వరి నారు పోసే పద్దతి. ఒకే విధంగా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో సాగునీటి సౌకర్యాల కల్పన ఒకేలా ఉంది.
  • ప్రస్తుతం, మహాజనపదాల కాలంలో పాలకులు వ్యవసాయాభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
మగధ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడిన సహజ వనరుల పాత్రను ప్రశంసించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 2
మగధ రాజ్యం గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు, భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకొనేవారు. నదుల మీద సరకు రవాణా చేసేవారు. సైనికులను తరిలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాత శత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ రాజు కోట నుండి విధంగా సహజ వనరులు మగధను బలమైన రాజ్యంగా ఆవిర్భవించటానికి బయలుదేరుట తోడ్పడినాయి.

ప్రశ్న 13.
భారతదేశ అవుట్ లైన్ పటములో పదహారు మహాజనపదాలను, వాటి రాజధానులను గుర్తించుము.
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 3

ప్రశ్న 14.
ఈ పాఠ్యాంశంలో నేర్చుకున్న కొత్త పదాలతో కింది పదబంధ ప్రహేళికను పూరించండి. మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 4
అడ్డం :
1. మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం.
2. వారణాసికి మరొక పేరు.
3. కౌశాంబి ఈ మహాజన పదానికి రాజధాని.
4. మహాభారతం ఈ మహాజనపదానికి చెందిన రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది.
5. రైతులు పంట దిగుబడిలో 1/6 వంతుగా చెల్లించే పన్ను.
6. యజ్ఞాలు మరియు కుల వ్యవస్థని ఇవి ఖండిస్తున్నాయి.
7. ‘వజ్ర’లో ఈ రకమైన ప్రభుత్వం ఉన్నది.

నిలువు :
1. తూర్పు దిక్కున చిట్టచివరి మహాజనపదం
2. అవంతి రాజధాని నగరం.
3. నాగళ్ళు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం.
4. గోదావరీ నదీ తీరంలో కల మహాజనపదం.
5. గహపతులు నియమించుకున్న బానిసలు.
6. కుశివార ఈ రాజ్యానికి రాజధాని.
7. సూరసేనకి రాజధాని
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 5

6th Class Social Studies 7th Lesson సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం InText Questions and Answers

6th Class Social Textbook Page No.75

ప్రశ్న 1.
1) భారతదేశ పటంలో గంగా, యుమునా నదులు ఏమైదానాల గుండా ప్రవహిస్తున్నాయో గుర్తించండి.
2) భారతదేశ పటంలో నవీన నగరాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, పాట్నాలను గుర్తించండి.
3) ఈ ప్రాంతం మీ గ్రామాలను పోలి ఉందా? కారణాలు తెల్పండి.
జవాబు:
1.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 6
2.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 7
3. ఈ ప్రాంతం మా గ్రామాలను పోలి లేదు. కారణం మా గ్రామం పీఠభూమి ప్రాంతంలో ఉంది. పై ప్రాంతం మైదాన ప్రాంతంలో ఉంది.

ప్రశ్న 2.
గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ తెగల పేర్లను మీ ఉపాధ్యాయుల సహాయంతో తెలుసుకోండి.
జవాబు:
గంగా, సింధు మైదానంలో భరత, పురు, కురు, పాంచాల, యదు, తుర్వాస, శాక్య, లిచ్ఛవీ, మల్ల, వైదేహీ మొ॥న తెగలు మొదట్లో స్థిరపడ్డ తెగలు.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 3.
‘జనపదం’ అంటే అర్థం ఏమిటి? మహాజనపదాలకు, వీటికి గల తేడా ఏమిటి?
జవాబు:
మొదట్లో వివిధ తెగలు గంగా – సింధూ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. ఈ తెగలనే సంస్కృతంలో “జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలిచేవారు.

గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహా జనపదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.

6th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలను ఒక పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
గంగ నదీ పరీవాహక ప్రాంతంలో గల మహాజన పదాలు మరియు పట్టణాలు :
మహాజనపదాలు – పట్టణాలు
1. కురు – ఇంద్రప్రస్తము
2. కోసల – శ్రీవస్తి
3. వజ్జి – వైశాలి
4. వత్స – కౌశోంబి
5. కాశి – వారణాశి
6. మగధ – రాజ గృహ
7. అంగ – చంప
8. మల్ల – కుశీనగరం
9. ఛేది – శోతిమతి
10. సూరసేన – మధుర
11. పాంచాల – అహిచ్ఛత్ర

6th Class Social Textbook Page No.77

ప్రశ్న 5.
క్రింది పటంలో నాటి ముఖ్యమైన జనపదాలు చూపబడ్డాయి. పటాన్ని చూసి కింది ఖాళీలను పూరించండి.
1. యమునానదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ……….. (కురు)
2. పాంచాల జనపదం ……………. నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. (గోమతి (ఉత్తర గంగా)
3. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ………. (మధుర)
4. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం …….. (కాంభోజ)
5. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ……….. (అస్మక)
6. గాంధార జనపదం ………….. నదీ తీరాన నెలకొంది. (జీలం)

ప్రశ్న 6.
ఒక ప్రసిద్ధి చెందిన ఇతిహాసంలో ఈ జనపదాల గురించి ప్రస్తావన ఉంది. దాని గురించి తెలుసుకోండి.
జవాబు:
భారతదేశ ప్రసిద్ది ఇతిహాసమైన ‘మహాభారతంలో’ ఈ జనపదాల ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ‘కురు’ (హస్తినాపురం) మహాజనపదం ప్రధాన కేంద్రంగా ఉంది.

6th Class Social Textbook Page No.78

ప్రశ్న 7.
నేడు వరిని ఏ విధంగా సేద్యం చేస్తున్నారు?
జవాబు:
నేడు వరిని క్రింది విధంగా సేద్యం చేస్తున్నారు.

  • మొదటగా భూమిని చదును చేసి, గట్లు కడతారు.
  • తర్వాత నీరు పెట్టి, దమ్ము చేస్తారు. (మెత్తగా చేస్తారు)
  • తర్వాత నాట్లు వేస్తారు (కొన్ని ప్రాంతాలలో వెద పెట్టడం జరుగుతుంది)
  • తర్వాత కలుపు తీయటం, పంటకు అవసరమైన ఎరువులు వేయటం జరుగుతుంది.
  • అవసరమనుకుంటే పురుగు మందులు చల్లటం జరుగుతుంది.
  • తర్వాత వరి కంకులు రావడం జరుగుతుంది. కంకులు ముదిరిన తర్వాత పొలంలోని నీరు తీసేస్తారు.
  • తర్వాత వరికోతలు చేపట్టి, కుప్ప పోస్తారు. తర్వాత నూర్పిడి చేస్తారు.
  • తూర్పార బట్టి వడ్లను వేరు చేస్తారు. (కొన్ని ప్రాంతాలలో వరికోత యంత్రం ద్వారానే ఇవన్నీ చేస్తున్నారు.)

6th Class Social Textbook Page No.79

ప్రశ్న 8.
నాటి గ్రామాలలో గృహపతులకు మరియు వృత్తి పనివారికి మధ్యగల సంబంధం గురించి వివరించండి.
జవాబు:
గృహపతికి అవసరమైన పనిముట్లను వృత్తిపనివారు తయారుచేసి ఇచ్చేవారు. ఈ ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పనివారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీసాయి.

6th Class Social Textbook Page No.80

ప్రశ్న 9.
నగరాలలోని ప్రజలకు ధాన్యం, పాలు, మాంసం మొదలైనవి అవసరం. నగరంలో వ్యవసాయం లేకుండా అంతమంది ప్రజలు వాటిని ఎలా పొందగలిగేవారు?
జవాబు:
నగరాలకు చుట్టుప్రక్కల గ్రామాలుంటాయి. ధాన్యం అక్కడి నుండి నగరాలలోని రైస్ మిల్లర్లు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతారు. డైరీ ఫారాల ద్వారా పాలు సేకరించి, పాశ్చురైజేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధిచేసి, శీతలీకరించి ప్రజలకు సరఫరా జరుపుతారు. నగరాలలో కూడా పశువుల పెంపకం జరుగుతుంది. కాబట్టి మాంసం కూడా సులభంగానే లభ్యమవుతుంది.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 10.
మీరు ఎప్పుడైనా టీవిలో కాని, ఆ ప్రాంతాన్ని సందర్శించి కానీ ఒక కోటను చూసారా?
జవాబు:
చూసాను. టీవిలో రాజస్థాన్లోని (జైపూర్) కోటలను, హైదరాబాద్ లోని గోల్కొండ కోటను చూసాను. ప్రత్యక్షంగా కొండవీడు కోటను, వరంగల్ కోటను సందర్శించాను.

ప్రశ్న 11.
కోట చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు ఉంటాయి ? అవి వేటితో నిర్మింపబడి ఉంటాయి? వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ఎలా పొందేవారు?
జవాబు:

  • శత్రు దేశాల దాడుల నుండి రక్షణకై కోటచుట్టూ పెద్ద గోడలు ఉంటాయి. .
  • వీటిని పెద్ద పెద్ద కొండ రాళ్ళతో నిర్మింపబడి ఉంటాయి.
  • వీటంతటికి అవసరమైన ధనాన్ని రాజులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసేవారు.

ప్రశ్న 12.
మహాజన పదాలలో రాజులకు సైన్యం ఎందుకు అవసరం?
జవాబు:
మహాజన పదాల రాజులు వారి తెగను, రాజ్యాన్ని కాపాడాల్సి వచ్చేది. ఇతరుల దండయాత్రల నుండి వారిని రక్షించాల్సి వచ్చేది. అంతేగాక పన్నులు చెల్లించడానికి నిరాకరించేవారిని శిక్షించడానికి, ప్రజలు రాజు ఆజ్ఞలను పాటించేలా చూడటానికి కూడా సైనికులు అవసరం.

6th Class Social Textbook Page No.81

ప్రశ్న 13.
వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకు ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు?
జవాబు:
వేటాడేవారు, సేకరణ చేసేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి ఇచ్చేవారు. అలాగే అటవీ ఉత్పత్తులైన కాయలు, పండ్లు, తేనె మొ|| న వాటిని కూడా బహుమతిగా ఇచ్చేవారు.

ప్రశ్న 14.
ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించినదానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వాళ్ళ జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
జవాబు:
ప్రతి ఒక్కరూ రాజ్యంలో తమ రక్షణ కొరకు ప్రభుత్వం తమకు కల్పించే సౌకర్యాలకు కొంత సొమ్మును చెల్లించాల్సి వస్తే అది సమంజసంగానే ఉంటుంది. కాని కష్టపడి సంపాదించిన దానిలో కొంత చెల్లించాల్సి వస్తే అది వారి జీవితాలపై దుష్ప్రభావాల్ని చూపిస్తుంది. దీనిని తప్పించుకోవడానికి ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

ప్రశ్న 15.
వాళ్ళు పన్నులు చెల్లించటానికి ఎందుకు అంగీకరించి ఉంటారు? కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు ఏరకంగా ప్రయోజనం పొందారు?
జవాబు:
తమ జీవితాల రక్షణ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం, తెగ వృద్ధి కోసం పన్నులు చెల్లించడానికి అంగీకరించి ఉంటారు. కొత్త ఏర్పాట్ల వల్ల వాళ్ళు తమ దృష్టిని పూర్తిగా తమ వ్యవసాయంపైన, వ్యాపారం పైనా పెట్టి ఉంటారు. తద్వారా వారు మంచి ఆదాయం పొంది ఉంటారు.

ప్రశ్న 16.
‘భాగ’ అంటే ఏమిటి? రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇలా తీసుకుంటుందా?
జవాబు:
రాజులు వ్యవసాయం చేసే గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనినే ‘భాగ’ అనేవారు. రైతుల ఉత్పత్తి నుంచి ఇప్పటి ప్రభుత్వం ఇలా తీసుకోదు.

6th Class Social Textbook Page No.82

ప్రశ్న 17.
వృత్తి ఉత్పత్తులను, వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి మహాజవపదాల రాజులు ఎందుకు ఆసక్తి చూపారు?
జవాబు:
రాజ్యంలో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవడానికి రాజులు మహాజనపదాలలోని వ్యాపారులను దూరదేశాలతో వ్యాపారం చేయవలసినదిగా ప్రోత్సహించారు. అలాగే చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులు పెంచాలని, స్వయం సమృద్ధి కొరకే కాక ఎక్కువ పన్నులు వారి నుండి వసూలు చేయుటకుగాను – (రాజులు) ప్రోత్సహించిరి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 18.
రాజులు విధించే పన్నుల వల్ల గ్రామపెద్దలు ఏ విధంగా లాభపడేవారు?
జవాబు:
వ్యాపారస్తుల నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. ఈ పన్నులు వసూలు చేసినందుకు గాను రాజు వీరికి కొంత శాతం ముట్టచెప్పేవారు. ఈ విధంగా రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు తమ అధికారం, సంపద పెంచుకుని లాభపడేవారు.

6th Class Social Textbook Page No.83

ప్రశ్న 19.
అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ గంగానదికి రెండువైపులా విస్తరించి ఉన్నది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని వచ్చి యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు. వీటి కారణంగా మగధ రాజ్యంను బలమైన రాజ్యంగా మగధ రాజులు నిర్మించారు.

ప్రశ్న 20.
ప్రతి సహజ వనరులను గురించి, వాటిని ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాలు ఎలా నిర్మించారు?
జవాబు:
మగధ రాజులు ఆ ప్రాంతంలోని సహజ వనరులను చక్కగా వినియోగించుకుని తమ సంపదను అధికారాన్ని పెంచుకున్నారు.

నదులు :
ఇచట ప్రవహించే నదులు ఈ ప్రాంతాన్ని సారవంతం చేసినవి. గృహపతులు తమ పంటలకు సమృద్ధిగా నీరు లభించుటవలన పంటలు బాగా పండించిరి. వస్తువులు మరియు సైన్యాన్ని రవాణా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడినవి.

అడవులు :
మగధ చుట్టూ అడవులు గలవు. వీటిలోనుండి ఏనుగులను బంధించి తెచ్చి యుద్ధాలలో ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చేవారు. అడవులలో లభించే కలపనుపయోగించి కోటలను, రాజభవనాలను మరియు రథాలను నిర్మించేవారు.

ఇనుప ఖనిజం :
ఇనుప ఖనిజం నిల్వలు ఉండుట వలన వీటితో రాజులు యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను మరియు వ్యవసాయ పనిముట్లు అయిన నాగటి కొర్రులు, కొడవళ్ళు మొదలగువాటిని తయారుచేశారు.

ఈ సహజ వనరులు మగధకు శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి ఉపయోగపడినవి.

AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం

ప్రశ్న 21.
వజ్జి మహాజనపదంలోని గణతంత్ర ప్రభుత్వాన్ని (పాల్గొనే అవకాశం లేని వారిని) ప్రస్తుత గణతంత్ర రాజ్య అసెంబ్లీతో పోల్చండి.
జవాబు:

  • వట్టి మహాజన పదంలో ప్రస్తుత గణతంత్ర రాజ్యంలో వలే ఒకే పరిపాలకుడు ఒక పరిపాలకుల బృందం ఉండేది. అయితే మహిళలకు,
  • బానిసలకు, సేవకులకు ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
  • కాని ప్రస్తుత గణతంత్ర వ్యవస్థలో ఇటువంటి తారతమ్యాలు లేవు. అసలు బానిస వ్యవస్థీ లేదు.

ప్రాజెక్టు పని

పదహారు మహాజనపదాలకు సంబంధించిన సమాచారం సేకరించండి. భారతదేశ రాజకీయ పటం సహాయంతో అవి ప్రస్తుతం ఏయే రాష్ట్రాల పరిధిలో ఉన్నవో గుర్తించండి. ఆ వివరాలతో ఈ కింది పట్టికను నింపండి.
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 8
జవాబు:
AP Board 6th Class Social Solutions Chapter 7 సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం 9

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

SCERT AP 9th Class Social Studies Guide Pdf 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింద పేర్కొన్న వాక్యాలు ఏ దేశానికి సంబంధించినవో గుర్తించండి. (బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్) (AS1)
జవాబు:

  1. విప్లవం ద్వారా పార్లమెంటరీ వ్యవస్థ నెలకొల్పబడింది. – బ్రిటన్
  2. విప్లవం తరువాత కూడా రాజుకి పాలనలో కొంత పాత్ర ఉన్న దేశం – ఫ్రాన్స్
  3. ప్రజాస్వామ్యాన్ని స్థాపించటానికి మరొక దేశంతో యుద్ధం చేయవలసి వచ్చిన దేశం – అమెరికా
  4. హక్కుల చట్టాన్ని ఆమోదించారు. – అమెరికా
  5. రాచరికాన్ని కూలదోయటానికి రైతాంగం నాయకత్వం వహించింది. – ఫ్రాన్స్
  6. మానవ పౌరహక్కుల ప్రకటనను ఆమోదించారు. – ఫ్రాన్స్

ప్రశ్న 2.
కొత్త రూపాలలో ప్రభుత్వాలు ఏర్పడటం వెనుక సామాజిక మేధావుల ప్రధాన ఆలోచనలు ఏమిటి? అవి ప్రజాదరణను ఎలా పొందాయి? (AS1)
జవాబు:
అధిక పన్నులు, నిరంకుశ పాలనలతో ప్రజలు విసిగిపోయారు. ఆహార పదార్థాల కొరత, నిరంతరం కరవుకాటకాలు, సమాజంలో కొందరికే అధికారం, వారికే పాలనా బాధ్యతలు, అత్యున్నత అధికారం రాచవర్గీయులకు చెందడం, వారు ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకపోవడం, ఓటు హక్కు కల్పించకుండా చూడడం, చర్చి, మతాధికారులు, కులీనులు, ఆధ్వర్యంలో భూములు కేటాయించబడి ఉండడం, సమాజంలో 3 వ వర్గంగా లేదా మూడవ ఎస్టేట్ లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులు, ఉపాధ్యాయులు, న్యాయస్థాన అధికారులు, కళాకారులు, రచయితలు ఆలోచించి, సామాజిక హోదా గలవారే దేశాన్ని మార్చగలరని, దేశాన్ని నడిపించగలరని తలంచారు. 90 శాతం ప్రజలు రైతాంగం మరియు సామాజిక మేథావి వర్గానికి చెందినవారు, వెనుకబడినవారు మరియు మహిళలున్నారు. వీరు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలరని, ప్రజల అవసరాలు, సంక్షేమం చూడగలరని ఆలోచించారు.

ప్రజలు కూడా రాజ్యా ధికారాలతో స్వేచ్ఛా, సమానత్వాలు, తగిన అవకాశాలు లేక పోవడం వల్ల సామాజిక మేధావుల ఆలోచనలతో వస్తున్న ప్రజా ప్రభుత్వాలు, పన్నులు లేని ప్రభుత్వాలు, సంక్షేమం చూసే నూతన అధికారం చూసి ఆనందించారు. ఆ విధంగా ప్రజాదరణ పొందింది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 3.
ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటులకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. (AS1)
జవాబు:
1774లో ఫ్రాన్సు XVI లూయీ రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో ఖజానా ఖాళీగా ఉంది. నిరంతర యుద్ధాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఆర్థిక వనరులు తగ్గాయి. విద్య, సైన్యం, న్యాయవ్యవస్థ ప్రభుత్వ కార్యాలయాల ఖర్చులు పెరిగాయి. దీనిని ఆసరాగా చేసుకొని అధిక పన్నులు విధించారు. ఫ్రాన్స్ లో మూడు ఎస్టేట్లు ఉండగా, మొదటి ఎస్టేట్ సభ్యులకు పన్ను విధించకుండా 90% ప్రాతినిధ్యం గల మూడవ ఎస్టేట్ పై పన్నులు విధించారు. రైతాంగం జీవనం దుర్భరంగా ఉండేది. వాళ్ళు ప్రభువుల పొలాల్లో, ఇళ్ళలో పనిచేయవలసి వచ్చేది. ఆహార కొరత వల్ల చాలామంది చనిపోయారు. దీనికి తోడు రూసో, జాక్వెస్, మాంటెస్క్యూ రచనలు ద్వారా సామాజిక చైతన్యం కల్గించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పత్రికలు, పుస్తకాలు ప్రజలను మేల్కొలిపాయి. దీనికితోడు ఎస్టేట్స్ జనరల్ సమావేశంలో 3 వ ఎస్టేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించకపోవడం తదితర కారణాలతో ఫ్రాన్స్ లో విప్లవ తిరుగుబాటుకు కారణమైంది.

ప్రశ్న 4.
విప్లవం వల్ల ఫ్రెంచి సమాజంలో ఏ వర్గాలు ప్రయోజనం పొందాయి? ఏ బృందాలు. అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది? విప్లవానంతర పరిణామాల వల్ల ఏ సామాజిక వర్గాలు నిరాశకు గురై ఉంటాయి? (AS1)
జవాబు:
ఫ్రెంచి విప్లవం వల్ల సమాజంలో చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు, రైతాంగం, చేతివృత్తుల కళాకారులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు వీరు కాకుండా 18 వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించారు. విదేశీ సముద్ర వాణిజ్యం, సముద్ర వ్యాపారం, పట్టు, ఉన్ని వ్యాపారస్తులు మొదలగువారు, మహిళలు ప్రయోజనం పొందారు. మొదటి, రెండవ ఎస్టేట్‌ సభ్యులు మతాధిపతులు, కులీన వర్గంవారు అధికారాన్ని వదులుకున్నారు. విప్లవానంతర పరిణామం వల్ల మతగురువులు, చర్చి నిర్వాహకులు, రాజవంశీయులు, వంశపారంపర్య రాజులు, మతాధిపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సంపన్న వర్గాలకు చెందినవారు, విలాసవంతమైన జీవితాలు కొనసాగించినవారు.

ప్రశ్న 5.
ప్రాథమిక హక్కుల అధ్యాయం పూర్తి చేసిన తరువాత, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఏ ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయో జాబితా తయారుచేయండి.
జవాబు:
ప్రపంచంలోని అనేక రాజకీయ ఉద్యమాలకు, ఆదర్శాలకు, ప్రాథమిక హక్కులకు ఫ్రెంచి విప్లవ కాలంలో గల హక్కులు అనుసరణీయమైనాయి. వాటిలో ప్రధానంగా

  1. సమానత్వం హక్కు
  2. స్వేచ్ఛా, స్వాతంత్ర్యం హక్కు
  3. సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలు
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని నెరవేర్చేదని, దానిముందు పౌరులందరు సమానమనే విధానం. అదే మన దేశంలో గల సమ న్యాయపాలన.
  5. వాక్ స్వాతంత్ర్యం, జీవించే హక్కు.
  6. మానవులు స్వేచ్ఛాజీవులు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మొదలగు ప్రజాస్వామిక హక్కుల మూలాలు ఫ్రెంచి విప్లవంలో ఉన్నాయి.

ప్రశ్న 6.
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? వివరించండి. (AS4)
జవాబు:
సార్వజనీన హక్కుల ప్రకటన వైరుధ్యాలతో కూడుకుని ఉంది. పరిపాలనా వ్యవస్థ ఖర్చులకి, ప్రజా సైన్యం నిర్వహించడానికి, పన్నులు విధించడం తప్పనిసరి చేయడం. ఆస్తుల నిష్పత్తిలో పౌరులందరకు వర్తింపజేయడం వైరుధ్యాలకు తావిస్తుంది. ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించగూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదని, అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలనే దానికి వ్యతిరేకిస్తాను.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 7.
‘ప్రాతినిధ్యం లేకుండా పన్నులు లేవు’ అన్న నినాదాన్ని అమెరికా వలస రాష్ట్రాలు లేవనెత్తటానికి కారణాలు ఏమిటి? (AS1)
(లేదా)
“ప్రాతినిధ్యం లేనిదే పన్నులు లేవు” అనే నినాదాన్ని మీరు ఎలా అర్థం చేసుకొన్నారు?
జవాబు:
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలోని ప్రముఖ నినాదమేమనగా “ప్రాతినిధ్యం’ లేకుండా పన్ను చెల్లింపులేదు”.

ఇంగ్లాండ్ దేశం ఉత్తర అమెరికా తూర్పు తీరంలో 13 వలస రాష్ట్రాలను ఏర్పరిచింది. ఇంగ్లాండ్ నుంచి వ్యవసాయం, చిన్న కర్మాగారాలు, వ్యాపారం కోసం ఇంగ్లాండు నుంచి అధికులు వచ్చి వలస
రాష్ట్రాలలో లాభాలు ఆర్జించి స్థిరపడ్డారు. వలస రాష్ట్రాలకు సైతం చట్టాలు చేసే అధికారం, ప్రజలను నియంత్రించే అధికారం ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ తీసుకుంది. కాని అక్కడి ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళు కాదు. వలస రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇంగ్లీషు వ్యాపారస్థులు, కర్మాగారాలకు లాభం కలిగించే చట్టాలను పార్లమెంట్ తరుచు చేస్తుండేది. దాంతో విసిగిపోయిన అమెరికా వలస ప్రాంతాలు “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు” అన్న నినాదాన్ని లేవదీశారు.

ప్రశ్న 8.
మధ్య తరగతి అంటే మీరు ఏమి అర్థం చేసుకున్నారు? అది యూరప్ లో ఎలా ఏర్పడింది? (AS1)
(లేదా)
“18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నిటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలుపెట్టారు” – యూరప్లో మధ్యతరగతి ఆవిర్భావం గూర్చి వివరించండి.
జవాబు:
యూరప్లో 13 వ శతాబ్దం ప్రారంభంలో మధ్య తరగతి అంటే ప్రజలు సొంతనిర్ణయాలు తీసుకోక, స్వయంగా ఆలోచించక, మతగురువులు, చర్చి ఆధిపత్యంలో జీవనం సాగించేవారు. అత్యధిక రైతాంగం కట్టుబానిసలుగా జీవనం సాగించేవారు. యజమానుల ఆధీనంలో బందీగా వాళ్ళ పొలాల్లో, కర్మాగారాల్లో పనిచేయవలసి వచ్చేది. కాని 18వ శతాబ్దంలో కొత్త సామాజిక బృందాలు ఏర్పడ్డాయి. వీటన్నింటిని కలిపి మధ్యతరగతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. రాను రాను విదేశీ సముద్ర వాణిజ్యం, ఉన్ని, పట్టువస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వాళ్ళు సంపన్నులయ్యారు. వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులే కాకుండా మూడవ ఎస్టేట్లో న్యాయవాదులు, పాలన యంత్రాంగ అధికారులు, వృత్తినిపుణులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ విద్యావంతులు.

ప్రశ్న 9.
యూరప్ పటంలో ఇంగ్లాండు, ఫ్రాన్స్, ప్రష్యా, స్పెయిన్, ఆస్ట్రియాలను గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1

ప్రశ్న 10.
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు నిర్వహించిన పాత్రను ఎలా అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
ఫ్రెంచి విప్లవం నందు మహిళలు ప్రధాన పాత్రను పోషించారు. ఫ్రెంచి సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని ఘటనలలో మహిళలు మొదటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. తాము భాగస్వాములు కావటం ద్వారా తమ జీవితాలను మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా వత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. పురుషులకు ఉన్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలన్నది వాళ్ళ ప్రధాన కోరికలలో ఒకటి. తమను ప్రేక్షక పౌరులుగా చేయటంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని మహిళల పోరాటాలు ఫ్రెంచి విప్లవానికి నాంది అయింది.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 11.
పేజి నెం. 168లోని “భీతావహ పాలన” అనే శీర్షిక కింద ఉన్న పేరాను చదివి, దానిపై వ్యాఖ్యానించండి. (AS2)
జవాబు:
ఫ్రెంచి పరిపాలనా కాలంలో విప్లవం అనంతరం ఫ్రాన్స్ లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టం భీతావహ పాలన. ఇది 1793-1794 మధ్యలో జరిగింది. ఈ కాలంలో రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని ఈయన అనుసరించాడు. రిపబ్లిక్ కి శత్రువులుగా గుర్తించబడిన మతగురువులు, కులీనులు, రాజకీయ పార్టీ సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా వివిచారణలో నేరం రుజువైనచో “గిల్లెటిన్” ద్వారా చంపేసేవాళ్లు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి, ప్రభు నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండి (మైదా) వాడటాన్ని నిషేధించారు. చర్చిలను – “సివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వం కార్యాలయాలకు ఇచ్చారు. రాబిస్పియర్‌ను 1794 జులైలో దోషిగా తేల్చి, మరునాడే గిల్లెటిన్ ద్వారా చంపేశారు.

9th Class Social Studies 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు InText Questions and Answers

9th Class Social Textbook Page No.161

ప్రశ్న 1.
మన. నేపథ్యంలో రాజుల పార్టీ, పార్లమెంటరీ పార్టీల వ్యక్తుల మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
సంభాషణ

రాజుల పార్టీ : ఈ దేశాన్ని , ఈ సామ్రాజ్యాన్ని కాపాడేది, రక్షించేది మేమే. మేము లేకపోతే ఈ ప్రపంచ మనుగడే లేదు తెలుసా?

పార్లమెంటరీ పార్టీ : ప్రజల కోరికలను నెరవేర్చేది, ప్రజాభీష్టం మేరకు పాలన చేసేది మేమే. మేము ప్రజలను, కన్నబిడ్డలవలే పాలిస్తాము.

రాజుల పార్టీ : మా పార్టీ దేవుని కృషితో, సృష్టిలో భాగం. మేము దైవాంశ సంభూతులం. మేము దేవునికి మారుగా పరిపాలన చేస్తున్నాం.

పార్లమెంటరీ పార్టీ : ప్రజలకు మాట్లాడే హక్కులు ఇచ్చాము. . స్వేచ్ఛగా బ్రతికే హక్కులు అందించాము. నచ్చిన మతాన్ని స్వీకరించామని చెప్పాము. అందరికీ అన్ని సౌకర్యాలు అందించాము.

రాజుల పార్టీ : ఈ విశాల సామ్రాజ్యంలో హాయిగా బ్రతుకుతున్నాం. ఏ బాధలు వచ్చినా రమ్మన్నాం. మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటామన్నాం.

పార్లమెంటరీ పార్టీ : ప్రజాస్వామ్యంలో మేమే మీకు అధిక అధికారాలు మేమిచ్చాము. కులమతాలు లేవన్నాము. చట్టం ముందు అందరూ సమానులే నన్నాం. మీ క్షేమమే మా భాగ్యం. మీ” సేవే ఆ దేవుని సేవ.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 2.
పౌరయుద్ధం వల్ల ఇంగ్లాండు ప్రజలపై, రాజుపై ఎటువంటి ప్రభావం పడింది?
జవాబు:
పౌరయుద్ధం అంటే ఒక దేశంలో జరిగే అంతర్యుద్ధం. పౌరయుద్ధం వల్ల పరిపాలన కుంటుపడింది. అధిక పన్నుల భారం మోయవలసి వచ్చింది. ప్రజల క్షేమ సమాచారం, సంక్షేమం మరచిపోవడం వల్ల తరుచుగా అంతర్యుద్ధం వల్ల ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆకలితో, రోగాలు, జబ్బులతో ఆహార సమస్యలతో అనేకులు మరణించారు. . పౌర యుద్ధం వల్ల రాజులు తమ ఉనికినే కోల్పోయే దుస్థితి దాపురించింది. పదవులు కోల్పోయి, అధికారం దూరం అయి, బలవంతపు చావులు దాపురించాయి. విలాసవంతమైన జీవనం కాకుండా ప్రజల ఆగ్రహానికి బలై కోరి చావులు తెచ్చుకున్నారు.

9th Class Social Textbook Page No.163

ప్రశ్న 3.
కింద ఉన్న పటంలోని ఖాళీ డబ్బాలను వీటినుంచి అనువైన పదంతో నింపండి :
ఆహారం కోసం అల్లర్లు, మరణాల సంఖ్య పెరగటం, పెరుగుతున్న ఆహార ధరలు, చిక్కిన శరీరాలు, సామాజిక అశాంతి.
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2

9th Class Social Textbook Page No.168

ప్రశ్న 4.
(165 పేజీలోని చార్టుని చూడండి) 1791 రాజ్యాంగంలో ఫ్రెంచ్ సమాజంలో ఏ వర్గ ప్రజలు లాభపడి ఉంటారు? ఏ వర్గాలు అసంతృప్తి చెందడానికి అవకాశముంది?
జవాబు:
ఫ్రెంచి సమాజంలో లాభపడిన వర్గం ఓటు హక్కు కలిగిన సుమారు 50,000 మంది వీరి ద్వారా జాతీయ శాసనసభకు 745 మంది ఎన్నికై ఫ్రెంచ్ సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. రాజు, మంత్రులపై వీరికి నియంత్రణ ఉంటుంది. ప్రధానంగా మధ్య తరగతి వర్గం లాభపడింది. ఈ అదే విధంగా ఓటు హక్కు లేనివారు, అధికంగా పన్నులు చెల్లించలేనివారు, 25 సం||లు నిండని పౌరులు బాధపడ్డారు. దీని ద్వారా తక్కువ జనాభాగల ప్రాంతంలోని వారు ఎక్కువ లాభాన్ని పొందారు. అదే విధంగా ఎక్కువ జనాభా గలదే అయినా ఓటు లేకపోవడం వలన వారు చాలా నష్టపోయారు.

AP Board 9th Class Social Solutions Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

ప్రశ్న 5.
ఫ్రాన్స్ లోని ఘటనల ప్రభావం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగర్తీ లేదా స్పెయిన్ వంటి పక్క దేశాలపై ఎలా ఉండి ఉంటుంది? ఫ్రాన్స్ లో జరుగుతున్న దానికి సంబంధించి వస్తున్న వార్తలకు ఆయాదేశాలలోని రాజులు, వ్యాపారస్తులు, రైతాంగం, కులీన వర్గాలు, మతనాయకుల స్పందన ఎలా ఉండి ఉంటుంది?
జవాబు:
ఫ్రాన్స్ లోని ఘటనలు, విప్లవ ప్రభావం, దాని నేపథ్యం రాచరిక వ్యవస్థలైన ప్రష్యా, ఆస్ట్రియా – హంగేరి, లేదా స్పెయిన్ వంటి ప్రక్కదేశాలు ఉలిక్కిపడేలా చేసింది. కులీన పాలనలతో, నిరంకుశ అధికారాలతో, మతాధికారుల నియంత్రణ గల రాచరిక రాజ్యాలు ఆందోళనలకు గురయ్యాయి. ప్రజాభీష్టం మేరకు, ప్రజల సంక్షేమ అవసరాల మేరకు, పరిపాలన జరగకపోతే ప్రజల ఆగ్రహానికి గురైతే రాజ్యాలు, పదవులు పోవడమే కాకుండా, ప్రజల చేతిలో మరణాలు సంభవించడం భయాందోళనలకు గురయ్యారు. రాజులు, కులీన వర్గాల మతనాయకుడు భయపడి తమ విధానంలో మార్పు అవసరం అని భావించగా, రైతాంగం, వ్యాపారస్థులు మాత్రం రాజులు, పరిపాలకులలో మార్పు తేవడానికి ఉద్యమాలు, విప్లవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావించారు.

ప్రాజెక్టు

ప్రశ్న 1.
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల గురించి మరిన్ని వివరాలు సేకరించండి. వాళ్ళలో మీకు ఎవరు ఎక్కువగా నచ్చారు, ఎందుకు? ఆ వ్యక్తిపై ఒక పేరా రాయండి.
జవాబు:
అమెరికా, ఫ్రెంచి విప్లవాలలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులలో ప్రధానమైన వాళ్ళలో 13 వలస రాష్ట్రాలలో బ్రిటన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 1776 జూలై 4 న ఫిలడెల్ఫియాలో జరిగిన మూడవ కాంగ్రెస్ సమావేశంలో థామస్ జెఫర్సన్ రూపొందించిన స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించారు. “మానవులందరూ సమానులుగా సృష్టింపబడ్డారని” సృష్టికర్త ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్ని అన్వేషించే హక్కులు వంటి కొన్ని హక్కులను ఇచ్చాడని పేర్కొంది. అమెరికా ప్రజలలో చైతన్యం నింపిన వారిలో థామస్ జెఫర్‌సన్ ఒకరు.

అదేవిధంగా ఫ్రెంచి విప్లవానికి నాంది పలికి అవినీతి, విలాసకర ప్రభువులు, చర్చి, మతాధికారులు, కులీనులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, 90 శాతం గల రైతులు, చేతి వృత్తి కళాకారులు, కళాకారులు, మహిళలు, తత్వవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు.

వీళ్ళలో నాకు బాగా నచ్చినవారు రూసో. సమజంలో ఏ వ్యక్తి పుట్టుకతో సామాజిక హోదా, హక్కులు కలిగిలేరని, స్వేచ్ఛాజీవిగా పుట్టిన మానవుడు అనేక సంకెళ్ళతో బ్రతుకుతున్నాడన్నారు. అందరికీ స్వాతంత్ర్యం, సమాన చట్టాలు, సమాన అవకాశాలు ఆధారంగా ఏర్పడిన సమాజం కోసం కలలుకన్నాడు. రూసో ప్రజలు, వాళ్ళ ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఆధారపడిన ప్రభుత్వాన్ని ప్రతిపాదించాడు.

రూసో అభిప్రాయాలు, ఆలోచనలు పుస్తకాలు, వార్తా పత్రికల ద్వారా ఫ్రెంచి విప్లవంలో చైతన్య స్ఫూర్తిని రగిలించింది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

SCERT AP 9th Class Social Studies Guide Pdf 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Social Solutions 10th Lesson ధరలు – జీవనవ్యయం

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
ధరలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఏమిటి? (AS1)
జవాబు:

  1. ధరలను నియంత్రించకపోతే స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతి పనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేటు ఉద్యోగులు నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు.
  2. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఈ వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికే వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వారి జీవన ప్రమాణాన్ని మరింత తగ్గించింది. ఇది వారిని ఇంకా పేదరికంలోనికి నెడుతుంది. అందువలన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న 2.
వస్తువులను ఉత్పత్తి చేసేవారు, అమ్మేవారు ధరలను ఎలా నిర్ణయిస్తారు? (AS1)
జవాబు:
వస్తువులను ఉత్పత్తి చేసేవారు తమ వస్తువుల ఉత్పత్తికయ్యే వ్యయాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు. మరియు వారి లాభాలను కొంత మేర కలుపుకుంటారు. ఆ వస్తువులను అమ్మేవారు వారి యొక్క లాభాలను కూడా కలుపుకుని వస్తువుల యొక్క ధరలను నిర్ణయిస్తారు.

పై విధంగా వస్తువులను ఉత్పత్తిదారులు, అమ్మకందారుల యొక్క లాభాలు మరియు ఉత్పత్తికయ్యే ఖర్చులను పరిగణన లోనికి తీసుకుని ధరలను నిర్ణయించడం జరుగుతుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 3.
జీవన వ్యయం, జీవన ప్రమాణానికి మధ్యగల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన ప్రమాణం అనగా మానవుల కొనుగోలు శక్తి.
  2. జీవన వ్యయం అనగా మానవులు చేసే ఖర్చులు. 3. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు, రోజువారి వేతనదారులు, చేతిపనివారు, చిన్న అమ్మకందారులు, చిన్న పరిశ్రమలలోని కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రైవేట్ ఉద్యోగులు, నిరంతరం పెరిగే ధరల వలన దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావానికి గురవుతారు. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
  3. ఈ ద్రవ్యోల్బణ కాలంలో కూడా వ్యక్తుల ఆదాయం మారదు.
  4. కాబట్టి వారు తమ వినియోగాన్ని బలవంతంగా తగ్గించుకోవాలి.
  5. అప్పటికీ వారి జీవన ప్రమాణం తక్కువ. ఇప్పుడు ద్రవ్యోల్బణం వలన వారి జీవన వ్యయం పెరిగి వారిని పేదరికంలోనికి నెట్టింది.

ప్రశ్న 4.
జీవన వ్యయంలో పెరుగుదల ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఎందుకు? (AS4)
జవాబు:
జీవన వ్యయంలో పెరుగుదల ఈ క్రింది వారిపై ప్రభావం చూపుతుంది :

  1. స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షనర్లు
  2. రోజువారి వేతనదారులు
  3. చేతి పనివారు
  4. చిన్న అమ్మకందారులు
  5. చిన్న పరిశ్రమలలోని కార్మికులు
  6. తక్కువ ఆదాయం కలిగిన ప్రయివేట్ ఉద్యోగులు.

వీరి ఆదాయంలో మార్పు లేకపోవడం వలన జీవన వ్యయం పెరగడం వలన అప్పుల పాలవుతారు.

ప్రశ్న 5.
ద్రవ్యోల్బణ కాలంలో ఏ సమూహాలు ఎక్కువ ఆదాయాన్ని పొందుతాయి? (AS4)
జవాబు:

  1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో, కొన్ని సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కరవు భత్యం (డి.ఎ)ను అదనంగా పొందుతారు.
  2. ధరలు ఒక శాతం వరకు పెరిగినప్పుడు వారి వేతనం కూడా పెరుగుతుంది.
  3. ఎందుకంటే ప్రభుత్వం వారికి డి.ఎ.ను చెల్లిస్తుంది.
  4. తద్వారా ద్రవ్యోల్బణంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది.
  5. వ్యాపార కార్యకలాపాలు చేసే ప్రజలు వారు అమ్మే వస్తువుల ధరలు పెంచడం ద్వారా అధిక జీవన వ్యయంను రాబట్టుకుంటారు.
    ఉదా : పంచదార ధర పెరిగితే స్వీట్సు అమ్మేవారు ధరలను పెంచుతారు. టీ అమ్మేవారు కప్పు టీ – ధరను పెంచుతారు.
  6. డైక్లీనర్లు, కర్షకులు, లాయర్లు, డాక్టర్లు మొదలగు వివిధ సేవలను అందించే ప్రజలు ధరలు పెరిగినప్పుడు వారి ఫీజును కూడా పెంచుతారు.
  7. అధిక ధనవంతులు, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపైన పెరిగిన ధరలు ప్రభావం చూపలేవు.

ప్రశ్న 6.
టోకు ధరల సూచిక (WPI), వినియోగదారుల ధరల సూచిక (CPI) కంటే ఏవిధంగా భిన్నమైనది? (AS1)
జవాబు:

  1. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు (ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు) వస్తాయి.
  2. వినియోగదారుల ధరల సూచికలో వినియోగదారుల వస్తువుల ధరలు, చిల్లర ధరలు వస్తాయి.
  3. కావున ప్రధాన తేడా టోకు ధరల సూచికలోనే ఇమిడియున్నది. వినియోగదారుల ధరల సూచికలో ఆ తేడా లేదు.

ప్రశ్న 7.
ఆహార ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచికల మధ్యగల భేదమేమి? (AS1)
జవాబు:
ఆహార ధరల సూచికను.ఆహార పదార్థాల ధరలలో పెరుగుదలను అంచనా వేయుటకు ఉపయోగిస్తారు. దీనినే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. ఆహార ధరల సూచికలో బియ్యం, గోధుమ, కూరగాయలు, పంచదార, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగపడే వంటనూనెల టోకు ధరలు ఉంటాయి.

కొన్నిసార్లు లాభార్జన ప్రధాన ఆశయంగా గల వ్యాపారస్తులు చాలా వస్తువులు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు అక్రమంగా పెంచుతారు.

వినియోగదారులైన శ్రామికుల వేతనంలో పెరుగుదల లేకుంటే వారు మార్కెట్లో వస్తువులను కొనలేరు. నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం, పాలు మొదలైన వాటి విషయంలో కొరత సంభవిస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 8.
వినియోగదారుల ధరల సూచిక యొక్క ఉపయోగాలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీవన వ్యయంలో పెరుగుదలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది.
  2. వినియోగదారులు ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగితే వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుంది.
  3. ప్రభుత్వం ఎగుమతి దిగుమతుల విధానం ద్వారా ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువుల ఎగుమతిని పూర్తిగా నిషేధిస్తుంది లేదా కొంత పరిమితిని విధిస్తుంది.
  4. ఏవైనా వస్తువులు కొరతగా ఉంటే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి తెప్పించి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.

ప్రశ్న 9.
వినియోగదారుల ధరల సూచికను లెక్కించుటకు ఐదు అంశాలను రాయండి. (AS1)
జవాబు:

  1. తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువు యొక్క ధరలను వ్రాయుట.
  2. ప్రతి నెల అంతే మొత్తంలో కొన్నారని ఊహించుకొంటే, కాని ఈ నెల ధరలు పెరగడం వలన అంతే మొత్తంలో వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి.
  3. అంటే రోజువారీ వినియోగంలో రిటైల్ స్థాయిలోను లేదా చిల్లర వ్యాపారుల స్థాయిలోను ధరల తీరుతెన్నులను తెలిపే వినియోగదారుల సూచి.
  4. ఆర్థిక – గణాంకాల డైరెక్టరేట్ వివిధ మార్కెట్లలో ధరలను సేకరిస్తుంది.
  5. ఒక కుటుంబ బడ్జెట్ లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చును లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికను కూడా లెక్కిస్తారు.
  6. గత నెలలో నాలుగు వస్తువుల సరాసరి ధరల స్థాయి 100. అది ఇప్పుడు 123. 3కి పెరిగింది. అంటే దీని అర్థం గత నెలతో పోలిస్తే ఇంట్లో వినియోగించుకొనే ఈ నాలుగు వస్తువుల ధరల స్థాయి ఈ నెలలో 23.3% పెరిగింది.

ప్రశ్న 10.
ధరల పాలనా యంత్రాంగం (APM), కనీస మద్దతు ధర (MSP) కంటే ఎలా భిన్నమైనది? (AS1)
జవాబు:
ధరల పాలనా యంత్రాంగం :
వస్తువులకు ధరలు పెరగకుండా నియంత్రిస్తుంది. వినియోగదారులకు వినియోగ వస్తువుల యొక్క ధరలను అందుబాటులో ఉంచుతుంది. అనగా వారి కొనుగోలు శక్తికి అనుకూలంగా వ్యవహరిస్తుంది.

కనీస మద్దతు ధర :
రైతులు పంటలు పండించటానికి అయిన ఖర్చులను వారి యొక్క శ్రమను పరిగణనలోకి తీసుకుని రైతులు నష్టపోకుండా వారు పండించిన ధాన్యానికి, ఇతర ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుంది.

ఆ విధంగా రెండు విభిన్న ధోరణులను కలిగి ఉంటుంది.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 11.
‘ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ పాత్ర’ అనే శీర్షిక కింద గల 6వ పేరాను చదివి ఈ ప్రశ్నకు జవాబు రాయండి. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం (APM) ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి. (AS2)
జవాబు:

  1. ప్రభుత్వ రాబడిని ధరల పాలనా యంత్రాంగం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభావితం చేస్తున్నది.
  2. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే వస్తువుల ధరలు మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా ఉంటాయి.
  3. వీటి ధరలలో తేడా లేదా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.
  4. చౌక ధరల దుకాణాల నుండి పేద ప్రజలు వస్తువులను కొనడానికి వీలు కల్పించడమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలు మార్కెట్లో విచక్షణారహితంగా పెరగకుండా నియంత్రిస్తుంది.
  5. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను నిరోధించి, వాటి ధరలను సహేతుకమైన స్థాయిలలో ఉంచడం, వాటి లభ్యతను సులభతరం చేయడం కోసం ప్రభుత్వమే ధరలను నిర్ణయించి, అవే ధరలకు మార్కెట్లో వస్తువులను విక్రయించాలని వ్యాపారస్తులను అదేశిస్తుంది.
  6. ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఎవరైతే పాటించరో వారిపై వివిధ చట్టాల ద్వారా జరిమానా విధిస్తుంది.
  7. కిరోసిన్, డీజిల్, LPG, CNG, PNG మొదలగు వాటికి ప్రభుత్వం కొంతమేర లేదా మొత్తంగా సబ్సిడీ ఇచ్చి ధరల పాలనా యంత్రాంగం ద్వారా విక్రయిస్తుంది.

ప్రశ్న 12.
మీ కుటుంబం వినియోగించే ఐదు రకాల వస్తువులను లేదా సేవలను తీసుకొని మీ కుటుంబానికి సంబంధించిన వినియోగదారుల ధరల సూచికను తయారుచేయండి. (AS3)
జవాబు:
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 1
వినియోగదారుల ధరల సూచికలను రాయండి. ………………. 100%
గత నెలతో పోలిస్తే మీ కుటుంబం మొత్తం ఖర్చులో ఎంత మార్పు వచ్చింది?
గత నెలలో 1630 రూపాయల వ్యయం జరగగా ఈ నెల 2020 వ్యయం జరిగింది.
అనగా 2020 – 1630 = 390 రూపాయలు తేడా వచ్చింది.
అనగా అవే వస్తువులకు అదే పరిమాణానికి అదనంగా 390 రూపాయలు చెల్లించవలసి వచ్చింది.

ప్రశ్న 13.
ఈ కింది వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (AS1)
జవాబు:
అ. ద్రవ్యోల్బణం ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది. (తప్పు)
ఆ. ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలోని మార్పు ఆ ద్రవ్యం విలువను తెలుపుతుంది. (ఒప్పు)
ఇ. జీవన వ్యయంలో వచ్చిన మార్పు పెన్షనర్ల జీవన ప్రమాణంపై ఎటువంటి ప్రభావం చూపదు. (తప్పు)
ఈ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఎ. ను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం నుండి వారు మినహాయింపు పొందుతారు. (ఒప్పు)
ఉ. వినియోగ వస్తువుల ధరలలో వచ్చిన మార్పులను మాత్రమే టోకు ధరల సూచిక లెక్కిస్తుంది. (ఒప్పు)

ప్రశ్న 14.
పారిశ్రామిక వస్తువుల టోకు ధరల సూచికలు ఈ కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వీటి ద్వారా రేఖాపటం గీసి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. (AS3)
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 2
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 3
అ. గత కొన్ని సంవత్సరాలుగా ఏ వస్తువుల ధరలు నిలకడగా పెరుగుతున్నాయి?
జవాబు:
ఎరువులు, సిమెంట్, ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.

ఆ. నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరగడానికి గల కారణాలు :

  1. నూలు వస్త్రం, ఎరువుల వాడకంలో ఒక్కసారిగా వేగవంతంగా మార్పురాదు.
  2. నూలు వస్త్రం, ఎరువుల ఉత్పత్తి కూడా ఒక్కసారిగా పడిపోదు.
  3. అందువలన నూలు వస్త్రం, ఎరువుల ధరలు నెమ్మదిగా పెరుగుతాయి.

ఇ. పై వస్తువుల విషయంలో ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుందా? ఎలా?
జవాబు:

  1. వస్తువుల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
  2. వస్తువుల కొరత ఏర్పడినపుడు విదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సహకార సంఘాల ద్వారా అందిస్తుంది.
  3. ఎప్పుడైనా వ్యాపారులు అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

ప్రశ్న 15.
ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై సలహాలను సూచిస్తూ మీ తహశీల్దారుకు ఒక లేఖ రాయండి. (AS6)
జవాబు:

తహశీల్దారుకు ఉత్తరం

To:
తహశీల్దార్ వార్కి
సాలూరు.
విజయనగరం.

From:
టి. అప్పారావు
సాలూరు.
అయ్యా

విషయం : ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకై తమ సహకారానికై సూచనలు.

పేద ప్రజల ఆహార భద్రతకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS – Public Distribution System). ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులైన గోధుమలు, బియ్యం , పంచదార, వంట నూనెలు సకాలంలో మాకు అందడం లేదు. ప్రతి నెల 1వ తేదీ నాటికి సరకులు డీలర్ల ద్వారా అందించేందుకు ముందు నెలాఖరు. నాటికి డి.డి.లు పూర్తి చేసి మొదటి వారానికి పంపిణీ జరిగేటట్లు చేయవలెను. చాలా మంది డీలర్లు అక్రమ నిల్వలను చీకటి మార్కెట్లో విక్రయిస్తున్నారు, నిరోధించగలరు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయు సరకులు నాణ్యతగా ఉండడం లేదు. కొన్ని సందర్భాలలో అవి అనారోగ్యం తెచ్చి పెడుతున్నాయి.

పై సూచనలు, సలహాలు ప్రజలందరివిగా భావించి, వాటిని సరిదిద్ది ప్రజా పంపిణీ వ్యవస్థను దిగ్విజయం చేయ ప్రార్థన.

ఇట్లు
టి. అప్పారావు.

9th Class Social Studies 10th Lesson ధరలు – జీవనవ్యయం InText Questions and Answers

9th Class Social Textbook Page No.121

ప్రశ్న 1.
రేపు ఉపాధ్యాయ దినోత్సవం అనుకోండి. మీ తరగతిలోని విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుటకు, నీకు రూ. 200 ఇచ్చి స్వీట్లు, బిస్కెట్లు తెమ్మని మార్కెట్ కు పంపించారు అని అనుకుందాం. మార్కెట్లో ధరలను చూస్తే ఒక స్వీట్ ప్యాకెట్ ధర రూ. 60, బిస్కట్ ప్యాకెట్ ధర రూ. 20 ఉంది. నీవు రెండు స్వీట్ ప్యాకెట్లు కొన్నచో, మిగతా డబ్బులతో ఎన్ని బిస్కట్ ప్యాకెట్లు కొనగలవు? వాటికి ఎంత చెల్లించావు?
జవాబు:
మొత్తం తీసుకెళ్ళినది – రూ. 200
ఒక స్వీట్ ప్యాకెట్ ధర – రూ. 60
రెండు స్వీట్ ప్యాకెట్ల ధర – 2 × 60 = రూ. 120
బిస్కెట్ ప్యాకెట్ ధర – రూ. 20
రెండు స్వీట్ ప్యాకెట్లు కొనగా మిగిలినది – 200 – 120 = 80 రూపాయలు
80 రూపాయలకు ప్యాకెట్ 20 రూ. చొప్పున కొనగా నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. అనగా
4 × 20 = 80 రూపాయలు
కావున 200 రూపాయలకు కొని తెచ్చినది.
AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం 4

ప్రశ్న 2.
నీవు పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత, మీ తరగతి విద్యార్థులు “ఎందుకు ఇన్ని తక్కువ ప్యాకెట్లు కొని తెచ్చావు ? ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావల్సింది.” అని అన్నారు.
జవాబు:
అప్పుడు నేను ప్రతిది ఐదు ప్యాకెట్లు తీసుకురావడానికి నేను తీసుకెళ్ళిన 200 రూపాయలకు 2 స్వీట్ ప్యాకెట్లు మరియు 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి.
రేట్లు పెరిగాయి అని నేను పై వివరాలు తెలిపాను.

ప్రశ్న 3.
అందుకుగాను, నీవు స్వీట్లు బిస్కెట్ ప్యాకెట్ల ధరల గురించి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. మీ తరగతిలో ఒకరు ఈ విధంగా అన్నారు. “గత సంవత్సరం మనం స్వీటు ప్యాకెట్‌కు రూ. 30, బిస్కెట్ ప్యాకెట్‌కు రూ. 10 చెల్లించాం కదా.”
జవాబు:
గత సంవత్సరం ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు రెట్టింపు అయ్యాయి. అందువలన 2 స్వీట్ ప్యాకెట్లు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. కారణం రేట్లు రెట్టింపు కావడమే.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 4.
గత సంవత్సర కాలంలో ఏమి జరిగింది? రెండు వస్తువుల ధరలు పెరిగాయి. కావున రూ. 200 తో అవే వస్తువులను తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
జవాబు:
గత సంవత్సరంలో వస్తువుల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఈ సంవత్సరం వస్తువుల రేట్లు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.
అందువలన తక్కువ మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చింది.

ప్రశ్న 5.
ఒకవేళ మీ ఉపాధ్యాయులు, ఈ సంవత్సరం 5 స్వీట్స్, 5 బిస్కెట్ ప్యాకెట్లు కొనమంటే, వాటి కోసం మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది?
జవాబు:

  1. 5 ప్యాకెట్ల స్వీట్స్ కోసం = రూ. 5 × 60 = 300 రూపాయలు
  2. 5 ప్యాకెట్ల బిస్కెట్స్ కోసం = రూ. 5 × 20 = 100 రూపాయలు
  3. నీవు చెల్లించాల్సిన మొత్తం = రూ. 400 రూపాయలు
  4. గత సంవత్సరంతో పోలిస్తే ఎంత ఎక్కువ మీరు చెల్లించాల్సి ఉంటుంది?

గత సంవత్సరం చెల్లించినది :
5 స్వీట్ ప్యాకెట్ల రేటు = 5 × 30 = 150 రూపాయలు
5 బిస్కెట్ ప్యాకెట్ల రేటు = 5 × 10 = 50 రూపాయలు
మొత్తం = 200 రూపాయలు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 200 రూపాయలు
అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

డబ్బుతో మనం వాస్తవంగా కొనగలిగిన వస్తుసేవల సంఖ్యను ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి అంటారు. ద్రవ్యోల్బణ కాలంలో వాస్తవ ఆదాయం, ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది. పై ఉదాహరణను బట్టి గత సంవత్సరం ఇవే వస్తువులు ఐదు చొప్పున కేవలం రూ. 200 మాత్రమే చెల్లించారు. కాని ఇప్పుడు మీరు అదే వస్తువులను కొనడానికి . ‘ ఎక్కువ చెల్లించాలి, కాబట్టి మీరు ఈ రెండు రకాల వస్తువులను తక్కువగా కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది.

  • గత సంవత్సరం రూ. 200 = 5 స్వీట్ ప్యాకెట్లు + 5 బిస్కెట్ ప్యాకెట్లు
  • ఈ సంవత్సరం రూ. 200 = 2 స్వీట్ ప్యాకెట్లు + 4 బిస్కెట్ ప్యాకెట్లు
  • మరో రకంగా చెప్పాలంటే రూ. 200 లతో చేసే కొనుగోలు శక్తి లేదా డబ్బు విలువ పడిపోయింది. కాబట్టి మీరు అదే డబ్బుతో తక్కువ వస్తువులనే కొనగలిగారు. ఎందుకంటే వాటి ధరలు పెరిగాయి.

9th Class Social Textbook Page No.123

* ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ కుటుంబం ఉపయోగించే కొన్ని వస్తువుల లేదా సేవల పేర్లను రాయండి.
ప్రస్తుతం వాటి ధరలను, గత సంవత్సరం అవే వస్తువుల ధరలను పరిశీలించండి. వాటి మధ్య గల తేడా ఏమిటి? . దీనికిగాను మీ తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి.

వాటి మధ్యగల తేడా :
వస్తువుల రేటు గత సంవత్సరపు రేట్లతో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని వస్తువుల రేట్లు పెరిగాయి.

కారణం :
ద్రవ్యం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం రేటు పెరగడం, జనాభా పెరగడం, వస్తూత్పత్తి వనరులు జనాభా పెరిగినంత వేగంగా పెరగక పోవడం.

9th Class Social Textbook Page No.126

ప్రశ్న 1.
2005-06లో వరి ధర రూ. 20 కిలో కొంటే 2011లో ఎంత చెల్లించాలి?
2005-06లో కిలో వరి. బియ్యం – 20 రూపాయలు.
2011లో కిలో వరి బియ్యం – 40 రూపాయలు.

AP Board 9th Class Social Solutions Chapter 10 ధరలు – జీవనవ్యయం

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి?
జవాబు:
2006-07 సంవత్సరంలో పప్పుదినుసుల ధరలు అధికంగా పెరిగాయి.

ప్రశ్న 3.
ప్రత్తి ధరలో ఎంత శాతం పెరుగుదల ఉంది?
జవాబు:
100 శాతం పెరుగుదల ఉంది.

ప్రశ్న 4.
ఏ వస్తువు ధర హెచ్చు, తగ్గులు లేకుండా నిలకడగా ఉంది?
జవాబు:
వంటనూనెలు

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

SCERT AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Physical Science 4th Lesson Questions and Answers కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కొన్ని దారాలను మాత్రమే మనము కృత్రిమ దారాలు అని ఎందుకంటాం? వివరించండి. (AS1)
జవాబు:

  1. నైలాన్, రేయాన్, అక్టోలిక్ మరియు పాలిస్టర్ వంటి కొన్ని దారాలను కృత్రిమ దారాలు అంటారు.
  2. పెట్రో రసాయనాలను ఎన్నో రసాయనిక ప్రక్రియలకు గురిచేయడం ద్వారా ఏర్పడే దారాలను కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారాలు అన్నీ పాలిమర్లు.
  3. నైలాన్ అనేది బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడిన కృత్రిమ దారం.
  4. రేయాన్ సెల్యులోజ్ తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
  5. అక్టోలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.

ప్రశ్న 2.
వివిధ పదార్థాలను నిలువ చేయడానికి ప్లాస్టిక్ పాత్రలను వాడడానికి గల కారణాలు చెప్పండి. (AS1)
(లేదా)
ప్లాస్టిక్ లను వాడటం వల్ల అనేక హానికర ప్రభావాలు ఉన్నప్పటికీ మనం ప్లాస్టిక్ లను వినియోగిస్తున్నాము. ఆ ప్లాస్టిక్స్ వలన లాభాలేమిటి ?
జవాబు:

  1. ప్లాస్టిక్ నీరు మరియు ఇతర రసాయనాలతో చర్య జరుపదు.
  2. పదార్థాలను క్షయం చేయదు.
  3. ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
  4. ప్లాస్టిక్ పరిమాణంలోను, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
  5. ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
  6. ప్లాస్టికు ఉష్ణబంధక మరియు విద్యుత్ బంధక పదార్థాలు.
  7. ప్లాస్టిక్ లను వివిధ రంగులలో తయారుచేసుకోవచ్చును.
    పై కారణాల వలన ప్లాస్టిక్ పాత్రలను వస్తువులను భద్రపరచుకొనేందుకు వాడుతారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో ఏ ఏ పదార్థాలను రీసైక్లింగ్ చేయగలమో, వేటిని చేయలేమో వీడదీయండి. (AS1)
ప్లాస్టిక్ బొమ్మలు, విద్యుత్ స్విచ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, బాల్‌ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు, కుక్కర్ పిడులు, ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ సంచులు, పాత్రలు, పళ్ళుతోముకునే బ్రష్ లు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బకెట్లు మొదలగునవి.
జవాబు:

రీసైక్లింగ్ చేయగల పదార్థాలురీసైక్లింగ్ చేయలేని పదార్థాలు
ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ చెప్పులు, ప్లాస్టిక్ బకెట్లువిద్యుత్ స్విచ్ లు, బాల్ పాయింట్ పెన్నులు, టెలిఫోన్ వస్తువులు, కుక్కర్ పిడులు, పళ్ళుతోముకునే  బ్రష్ లు, ప్లాస్టిక్ ప్లేట్లు, పాలిథీన్ సంచులు.

ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ స్విచ్ లు థర్మోప్లాస్టిక్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది? (AS1)
జవాబు:
విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గుల వలన ఎలక్ట్రిక్ స్వి లో ఉష్ణం ఏర్పడుతుంది. థర్మోప్లాస్టిక్ తో తయారుచేసిన ఎలక్ట్రిక్ స్వి లు అయితే ఈ ఉష్ణానికి కరిగిపోతాయి.

ప్రశ్న 5.
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కన్నా “ధర్మోప్లాస్టిక్ కు ప్రకృతి నేస్తాలు”. నీవేమి చెబుతావు? ఎందుకు? (AS1)
జవాబు:
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ల కన్నా “థర్మోప్లాస్టికు ప్రకృతి నేస్తాలు” ఈ వాక్యాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే

  1. విరిగిపోయిన, వాడలేని, పాతబడిన థర్మోప్లాస్టిక్ ను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయవచ్చును.
  2. థర్మోప్లాస్టిక్ వస్తువులను ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ (Reuse) వాడటం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం.
  3. పట్టణాలలోని ఘన వ్యర్థాలలో ఎక్కువ భాగం థర్మోప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. వాటినుండి సేకరించిన వ్యర్థాలను వివిధ పద్ధతుల ద్వారా విద్యుత్, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాల వంటి వివిధ రూపాలలోనికి మార్చి, ఈ వ్యర్థాలను తిరిగి వనరులుగా ఉపయోగిస్తాం.

ప్రశ్న 6.
కింది వాటిని వివరించండి. (AS1)
ఎ) మిశ్రణం
బి) జీవ విచ్ఛిన్నం చెందడం
సి) రీసైక్లింగ్
డి) వియోగం చెందడం
జవాబు:
ఎ) మిశ్రణం :

  1. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
  2. టెర్లిన్ ను, నూలుతో మిశ్రణం చేస్తే టెరికాట్ ఏర్పడుతుంది. ఇది సౌకర్యవంతంగా, నలిగిపోనిదిగా ఉంటుంది.
  3. టెర్లిన్, ఊన్నితో మిశ్రణం చెందితే టెరిడోల్ ఏర్పడుతుంది.
  4. టెర్లిన్, సిల్క్ తో మిశ్రణం చెందితే టెరిసిల్క్ ఏర్పడుతుంది.

బి) జీవ విచ్చిన్నం చెందడం :

  1. సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం చెందడం అంటారు.
  2. పండ్లు, కూరగాయలు, చనిపోయిన జీవులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి.

సి) రీసైక్లింగ్ :

  1. విరిగిపోయి వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి, తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
  2. PET (కోడ్-1), PS (కోడ్-6) మరియు HDPE (కోడ్-B) లను రీసైకిల్ చేస్తారు.

డి) వియోగం చెందడం :

  1. కొన్ని పదార్థాలు నీరు, సూర్య కాంతి, ఆక్సిజన్ సమక్షంలో ఉంచినపుడు సూక్ష్మభాగాలుగా విడగొట్టబడతాయి. ఈ సూక్ష్మభాగాలు బ్యాక్టీరియా చేత మరల విభజింపబడే ప్రక్రియనే వియోగం చెందడం అంటారు.
  2. వియోగం చెందడానికి కావలసిన సమయాన్ని బట్టి ఆ పదార్థం జీవ విచ్ఛినం చెందిందా, చెందలేదా నిర్ణయించవచ్చును.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

7. జతపరచండి. (AS1)

1) పాలిస్టర్ఎ) వంటసామాగ్రి
2) PETబి) కృత్రిమ పట్టు
3) రేయాన్సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
4) నైలాన్డి) ఎలక్ట్రిక్ స్వి చు
5) మెలమిన్ఇ) చిహ్నం
6) పాలిథీన్ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
7) బేకలైట్జి) అన్ని దారాలకన్నా దృఢమైనది

జవాబు:

1) పాలిస్టర్ఎఫ్) ప్రసిద్ధిగాంచిన దుస్తుల సామాగ్రి
2) PETఇ) చిహ్నం
3) రేయాన్బి) కృత్రిమ పట్టు
4) నైలాన్జి) అన్ని దారాలకన్నా దృఢమైనది
5) మెలమిన్ఎ) వంటసామాగ్రి
6) పాలిథీన్సి) ఎక్కువ సంఖ్యలో మోనోమర్లు
7) బేకలైట్డి) ఎలక్ట్రిక్ స్వి చు

8. ఖాళీలను పూరించండి. (AS1)

i) కృత్రిమ దారాలను …………………….. అని కూడా పిలుస్తాం.
జవాబు:
మానవ నిర్మిత దారాలు

ii) కృత్రిమ దారాలను ………………… పదార్థాల నుండి సంశ్లేషిస్తారు.
జవాబు:
పెట్రోలియం ముడి

iii) కృత్రిమ దారం లాగే ప్లాస్టిక్ కూడా ………
జవాబు:
పాలిమర్

iv) బట్టలపై లేబిళ్లు ……….
ఎ) చట్ట ప్రకారం అవసరం
బి) దారము రకాన్ని గుర్తించడానికి
సి) ఎ, బి లు రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎ, బి లు రెండూ

v) రేయావ్ దీనితో తయారవుతుంది.
ఎ) నేలబొగ్గు
బి) ఆక్సిజన్
సి) నార
డి) సెల్యులోజ్
జవాబు:
డి) సెల్యులోజ్

vi) పట్టుదారము యొక్క నునుపైన తలము కాంతిని శోషిస్తుంది.
ఎ) అవును
బి) కాదు
సి) చెప్పలేము
జవాబు:
ఎ) అవును

ప్రశ్న 9.
రీసైక్లింగ్ ప్రక్రియను మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఇది ఎలా ఉపయోగకరమైనదో ఉదాహరణతో తెల్పండి. (AS1)
జవాబు:
రీసైక్లింగ్ ప్రక్రియను ప్లాస్టిక్ లో మరియు లోహాలలో ఉపయోగిస్తారు.

ఉదాహరణలు :

  1. (PET చిహ్నం-1 గలవి) వాడిన లేదా పాడయిన శీతలపానీయాలు, నీటి మరియు పండ్ల రసాల సీసాలు మరియు ట్రేలను రీసైక్లింగ్ చేసి వాహనాల పరికరాలను, ఫ్యూజ్ బాక్స్ లను, బంపరను, తలుపుల ఫ్రేములను, కుర్చీలను మరియు టేబులను తయారు చేస్తారు.
  2. HDPE చిహ్నం -2 గలవి) వాడిన లేదా పాడయిన బొమ్మలు, విద్యుత్ బంధక పరికరాలు, పాత్రలు, కుర్చీలు, సీసాలు మొదలగునవి రీసైక్లింగ్ చేసి పెన్నులు, పాటైల్స్, డ్రైనేజి పైపులు మొదలగునవి తయారు చేస్తారు.
  3. (PP చిహ్నం-6 గలవి) వాడినవి లేదా పాడయిపోయిన దువ్వెనలు, ఇంటికప్పులు, TV క్యారి కంటైనర్లు, CD కేసులు, డిస్పోజబుల్ ప్లేట్స్, కప్పులు, కోడిగ్రుడ్డు కేసులు మొదలగునవి రీసైక్లింగ్ చేసి విద్యుత్ బంధకాలు, ఎలక్ట్రికల్ స్విలు, గ్రుడ్ల పెట్టెలు, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్లు, ఫోమ్ ప్యాకింగ్ న్లు, క్యారి అవుట్ కంటైనర్లు మొదలగునవి తయారు చేస్తారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 10.
రకరకాల కృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు వివరించేటట్లు ఒక పట్టిక తయారు చేయండి. (AS4)
జవాబు:

కృత్రిమ దారంకృత్రిమ దారాలతో తయారుచేసే గృహోపకరణాలు
1. నైలాన్బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలవేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు (Socks), బెల్టులు, దిండ్లు (Sleeping bags), డోర్ కర్టన్స్, పారాచూట్లు, ఈతదుస్తులు, లో దుస్తులు (Sheer hosiery), తెరచాపలు, గొడుగులకు వాడే గుడ్డ, బట్టలు, కారు టైర్లు మొదలగునవి.
2. రేయాన్దుస్తులు, దుప్పట్లు, తివాచీలు, లంగోటాలు (Diapers), బ్యాండేజీలు మొదలగునవి.
3. అక్రలిక్స్వెటర్లు, శాలువాలు, దుప్పట్లు, రగ్గులు, కాళ్ళకు వేసుకొనే మేజోళ్ళు (Socks), క్రీడా దుస్తులు, ప్రయాణ సామగ్రి మరియు వాహనాల కవర్లు మొదలగునవి.
4. పాలిస్టర్దుస్తులు, చీరలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, జాడీలు, సీసాలు, ఫిల్మ్ లు, తీగలు, ప్లాస్టిక్ వస్తువులు, పరికరాలు మొదలగునవి.

ప్రశ్న 11.
థర్మోప్లాస్టిక్ లకు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లకు మోనోమర్ అమరిక విషయంలో ఉండే భేదాలను పట సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:

థర్మో ప్లాస్టిక్లుథర్మోసెట్టింగ్ ప్లాస్టికు
1. వేడి చేసినప్పుడు మృదువుగాను, చల్లబరచినప్పుడు కఠినంగాను మారే ధర్మం గల ప్లాస్టికన్ను థర్మోప్లాస్టిక్ అంటారు.1. ఒకసారి ఒక రూపంలోనికి మలచి, చల్లబరచిన తర్వాత దాని రూపాన్ని మరలా వేడిచేసినా సరే మార్చలేని ప్లాస్టిక్ ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు.
2. థర్మోప్లాస్టిక్ లోని మోనోమర్లు రేఖీయ అమరికను కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 1
మోనోమర్ల రేఖీయ అమరిక
2. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లోని మోనోమర్లు అడ్డంగా అనుసంధా నించబడిన అమరిక కలిగి ఉంటాయి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 2
మోనోమర్లు అడ్డంగా అనుసంధానించబడిన అమరిక
3. వీటిని వేడి చేసినపుడు ద్రవస్థితిలోనికి, తగినంత చల్లబరిస్తే గాజు స్థితిలోకి ఘనీభవిస్తుంది.3. వీటిని వేడి చేసినపుడు నల్ల బొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది.
4. వీటిని రీసైక్లింగ్ చేయవచ్చును.4. వీటిని రీసైక్లింగ్ చేయలేము.

ప్రశ్న 12.
“వస్త్ర పరిశ్రమలో కృత్రిమ దారాల పరిచయం వస్త్రధారణ విషయంలో ప్రపంచమంతటా సంస్కృతి, సాంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది”. దీనిని మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
జవాబు:
వస్త్ర పరిశ్రమలో సహజ దారాలు సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండేవి. సహజ దారాల స్థానంలో వచ్చిన కృత్రిమ దారాలు సహజ దారాలకంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయి. పాలిస్టర్ అనే కృత్రిమ దారాన్ని కనుగొన్న తరువాత, పాలిస్టర్ దారాలు వస్త్ర పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వస్త్రము సులభంగా ముడుచుకుపోదు. ఇది ఎక్కువ మన్నికగాను, సులువుగా ఉతుక్కోవడానికి వీలుగాను మరియు తక్కువ ధరలో ఉంటుంది. అందుకే దుస్తులు తయారుచేయడానికి ఈ దారాలు సరిగ్గా సరిపోతాయి. పాలిస్టర్ మిగిలిన దారాల వలె నేయడానికి కూడా వాడవచ్చును. పాలిస్టర్ దారాన్ని సహజదారాలతో కలిపి మిశ్రణం చెందించడం వల్ల సహజ దారాల మరియు కృత్రిమ దారాల లక్షణాలు గల వస్త్రం తయారగును.

వివిధ వృత్తుల వారికి కావలసిన లక్షణాలు గల వస్త్రాలను కృత్రిమ మరియు మిశ్రణం చెందించగా ఏర్పడే వస్త్రాల నుండి పొందవచ్చును. ఈ వస్త్రాలు ప్రపంచమంతటా సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయని చెప్పవచ్చును.

ప్రశ్న 13.
కృత్రిమ దారాలు మన రోజువారీ జీవితాన్ని ఏ విధంగా మార్చివేసినవి? (AS7)
జవాబు:

  1. కృత్రిమ దారాలతో తయారైన గృహోపకరణాల జాబితా చాలా పెద్దది. ఇవన్నీ మన రోజువారీ కృత్యాలతో ముడిపడి ఉంటాయి.
  2. కృత్రిమ దారాలు పట్టు వస్త్రాల కంటే ఎక్కువ మెరుపుగల దుస్తులు తయారు చేయడానికి సహాయపడతాయి.
  3. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ దుస్తులు త్వరగా చిరిగిపోవు.
  4. తక్కువ నీటిని ఉపయోగించి తేలికగా ఉతకవచ్చు.
  5. తివాచీలు తయారుచేయడానికి ప్రస్తుతం ఉన్నికి బదులు నైలాన్ వాడుతున్నారు.
  6. ఈత కొట్టేటప్పుడు ధరించే దుస్తులు, లోదుస్తులు, గొడుగులు, తెరచాపలు, చేపలు పట్టే వలలు, కార్ల టైర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులెన్నో తయారుచేస్తున్నారు.
  7. కనుక మన జీవిత విధానం ఈ కృత్రిమ దారాల వినియోగం వలన పూర్తిగా మారిపోయింది.

ప్రశ్న 14.
సుజాత తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులు కొనాలని అనుకొంది. నీవు ఏ రకమైన బట్టలను కొనమని సలహా ఇస్తావు? కారణాలు చెప్పండి. (AS7, AS1))
జవాబు:

  1. సుజాత, తన తల్లిదండ్రులకు శీతాకాలంలో వేసుకొనే దుస్తులను కొనాలని అనుకుంది.
  2. నేనైతే నిభాకు ఈ క్రింది దుస్తులను కొనమని సలహా ఇస్తాను.
  3. సహజమైన ఉన్నితో తయారైన స్వెట్టర్లూ, శాలువాలూ, దుప్పట్లూ మొదలైనవి. కాని ఇవి చాలా ఖరీదైనవి.
  4. శీతాకాలంలో వేసుకొనే దుస్తులలో చాలా వాటిని ప్రస్తుతం అక్రలిక్ అనే కృత్రిమ దారంతో తయారుచేస్తున్నారు.
  5. ఈ అక్రలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది.
  6. దీనిని కృత్రిమ ఉన్ని అనవచ్చు లేదా నకిలీ ఉన్ని అని కూడా అనవచ్చు.
  7. అక్టోలిక ను తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో మెలి పెట్టి పురి పెడతారు.
  8. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి.
  9. అజోలిక్ తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి.
  10. కనుక నిభా తన తల్లిదండ్రులకు అక్రలిక్ తో చేసిన దుస్తులను కొనడం మంచిది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 15.
వాడిన ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే (Dispose) వచ్చే అనర్థాలేమిటి? (AS7)
జవాబు:
ప్లాస్టిక్ ను తగిన రీతిలో త్యజించకపోతే వచ్చే అనర్థాలు :

  1. ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి కావున ప్లాస్టిక్ వలన భూమి కలుషితం అవుతుంది.
  2. వాడి విసిరేసిన పాలిథీన్ సంచులు డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడి, డ్రైనేజి నీరు రోడ్లపై ప్రవహించుట మరియు కాల్వలో డ్రైనేజి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి వివిధ రోగాలకు కారణమౌతాయి.
  3. ఆవులు, మేకలు మొదలగు జంతువులు పాలిథీన్ సంచుల్లోని ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ, శ్వాసక్రియలు చెడిపోవడం ద్వారా జంతువులు చనిపోతున్నాయి.
  4. ప్లాస్టిక్ వ్యర్థాలు చెరువులు, సరస్సులు, నదులు మరియు సముద్రాలలో చేరడం వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో చేరడం వలన వర్షం నీరు భూమిలోకి చేరక భూ జలవనరులు క్రమంగా తగ్గిపోతాయి.
  6. ప్లాస్టిక్ వ్యర్థాలను మండిస్తే, వాతావరణంలో విషవాయువులు విడుదలవడం వలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
“ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం జీవ వైవిధ్యానికి ప్రమాదకర హెచ్చరిక” దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తీసుకొంటున్న చర్యలేమిటి? (AS7)
జవాబు:

  1. ప్లాస్టిక్ విచక్షణారహిత వాడకం వలన ప్రకృతిలో కాలుష్యం ఎక్కువైపోతుంది.
  2. ఈ వస్తువులు త్వరగా జీవ విచ్ఛిన్నం చెందవు.
  3. అందుచేత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి “4R” సూత్రాన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాల
    మేరకు విధిగా పాటిస్తున్నాయి.
  4. ఈ “4R” లు ఏమంటే
    i) తగ్గించడం (Reduce) : మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
    ii) మరల ఉపయోగించడం (Reuse) : ప్రతి సారి కొత్త క్యారీ బ్యాగులాంటి వాటిని కొనకుండా వీలైనన్ని ఎక్కువసార్లు మరల మరల తిరిగి వాడాలి.
    iii) తిరిగి ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయడం (Recycle) : పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను వదలివేయకుండ. పాత సామానులు కొనేవాడికి ఇవ్వాలి.
    iv) తిరిగి పొందడం (Recover) : సేకరించిన ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను విద్యుత్, ఉష్ణం వంటి రూపాలలోకి మార్చే పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పించాలి.
  5. ప్రభుత్వ సంస్థలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, “మేజిమెంట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్” కొరకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

పరికరాల జాబితా

పట్టుచీర, నూలు చీర, స్వెటర్, కార్పెట్, బ్రష్, నైలాన్ తాడు, పూసల దండ, పేపర్ క్లిట్ల దండ, వివిధ దారాలు, దారాల ‘మిశ్రణానికి సంబంధించిన లేబుల్స్, రీసైక్లింగ్ చిహ్నాలు గల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల నమూనాలు, థర్మో ప్లాస్టిక్ వస్తువులు (పివిసి పైపు ముక్క పాలిథీన్ కవర్, బొమ్మలు, దువ్వెన) థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తువులు (బేకలైట్ స్విచ్, వంటపాత్ర పిడి, మెలమిన్ (కీబోర్డు, ఫైబర్ ప్లేటు) టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ కప్పు, కూరగాయలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన పదార్థాలు, కాగితం, నూలు బట్ట, ప్లాస్టిక్ సంచి, ఇనుప స్టాండ్, బరువులు వేయడానికి అనువైన పళ్లెములు, బరువులు, లాండ్రీ లేబుల్ కోడ్స్ చార్టు, పట్టుకారు, సారాయి దీపం, రీసైక్లింగ్ చిహ్నాలు చార్టు.

ప్రయత్నించండి

ప్రశ్న 17.
జుట్టు, ఉన్ని, పట్టు, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క మొదలగునవి తీసుకొని జాగ్రత్తగా జ్వాల పరీక్ష (Flame test) ను నిర్వహించండి. వాసన, కరిగే విధానాన్ని బట్టి వాటిని సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించండి. (AS1)
జవాబు:
జ్వా ల పరీక్ష:
ఉద్దేశ్యము :
జ్వాల పరీక్ష ద్వారా నమూనాలను సహజ, కృత్రిమ దారాలుగా వర్గీకరించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయిదీపం, నమూనాలు (జుట్టు, ఉన్ని, పట్టు, కాగితం, నూలుదారం, ప్లాస్టిక్ ముక్క, స్వెటర్ దారం, తాడుముక్క)

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో నమూనాలను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు వాసన, కరిగే మార్పులను గమనించండి.
  4. మిగిలిన నమూనాలతో ఇదే విధంగా మరలా చేయండి. ఫలితాలను పట్టికలో నమోదు చేయండి.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 3

ప్రశ్న 18.
ప్లాస్టిక్ రీసైక్లింగ్ చిహ్నాలు, వాటి పూర్తి పేరు, మరియు దాని సంక్షిప్త నామం, గృహ అవసరాలలో వాటి వినియోగం, రీసైక్లింగ్ అవుతుందా లేదా ఒకవేళ రీసైక్లింగ్ అయితే వాటి నుండి ఏమి తయారు అవుతాయో వీటన్నింటినీ వివరించే ఒక చార్టను తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 4
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 5

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook InText Questions and Answers

ఆలోచించండి – చర్చించండి

8th Class Physical Science Textbook Page No. 46

ప్రశ్న 1.
సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణమేమిటి?
జవాబు:

  1. సహజ దారాల ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవకపోవడం.
  2. వీటికి మన్నిక తక్కువ.
  3. ఇవి అధిక ఉష్ణం మరియు పీడనాలకు తట్టుకోలేవు.
  4. ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.
  5. వీటితో తయారుచేయబడిన వస్త్రాలు త్వరగా ఆరవు.
  6. వీటిని ఎక్కువగా వాష్ చేస్తే పాడవుతాయి. కారణం సంపీడనాలను ఇవి తట్టుకోలేవు.
  7. ఇవి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి.
  8. ఇవి ముడులుగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇస్త్రీ చేయాలి.
  9. ఇవి మెరుపును కలిగి ఉండవు.
  10. వీటికి గట్టితనం తక్కువ.
    పై కారణాల వల్ల మానవులు సహజదారాలకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 2.
ఏ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
సహజ దారపు వనరులు తరిగిపోకుండా ఉంటాయి. ఎందుకంటే సహజ దారములు వృక్ష మరియు జంతువుల నుండి తయారవుతాయి.

8th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ప్రస్తుత స్థానానికి కృత్రిమ దారాల పరిణామం ఎలా జరిగింది?
జవాబు:
సహజ దారాలు మానవ అవసరాల కన్నా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. సహజ దారాలకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ దారాల కొరకు అన్వేషించవలసిన అవసరం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొట్టమొదట నైలాన్ అనే కృత్రిమ దారాన్ని కనుగొనడం జరిగింది. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్ తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ, తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉండడం మరియు త్వరగా ఆరే గుణం ఉండడం వల్ల కృత్రిమ దారాల వాడకం పెరిగింది.

8th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
పారాచూట్ తయారుచేయడానికి నూలుగుడ్డ, నూలు తాడులను వాడితే ఏం జరుగుతుంది?
జవాబు:
నూలుగుడ్డ, నూలు తాడులను పారాచూట్లో వాడితే కింద పడిపోవడం జరుగుతుంది.

కారణాలు :

  1. నూలు గుడ్డ, నూలు తాడులు అధిక పీడన, సంపీడనాలను తట్టుకోలేవు.
  2. నూలు గుడ్డలో సన్నని రంధ్రాలు ఉండడం వలన గాలి సన్నని రంధ్రాల గుండా సులభంగా ప్రయాణిస్తుంది.
  3. నూలు తాడు అధిక బరువులకు తెగిపోతుంది.

ప్రశ్న 5.
పూర్వకాలంలో చేపలు పట్టేవారు నూలు వలలను వాడేవారు. ప్రస్తుతం వారు నైలాన్ వలలను వాడుతున్నారు. నైలాన్ వలల వాడకం వలన లాభాలు ఏమిటి?
జవాబు:

  1. నైలాన్ దారాలు అధిక బరువులను తట్టుకోగలవు. కావున వలలు తెగిపోవు.
  2. ఇవి గట్టిగా, దృఢంగా ఉండడం వలన చేపలు కొరికినా తెగిపోవు.
  3. ఈ దారాలు తడిసినా పాడుకావు.
  4. ఇవి అధిక పీడనాన్ని తట్టుకోగలవు.
  5. ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకోవు. నీటిలో వీటి బరువు ఎక్కువగా ఉండదు.

ప్రశ్న 6.
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
నైలాన్ చీరలు నూలు చీరల కంటే మెరుగైనవి. ఎందుకంటే

  1. తేలికగా ఉంటాయి.
  2. మెరుపును కలిగి ఉంటాయి.
  3. ఎక్కువ కాలం మన్నికగా, ఉంటాయి.
  4. సులభంగా ఉతకవచ్చును.
  5. నీటిని ఎక్కువగా పీల్చవు.
  6. త్వరగా ఆరతాయి.
  7. ముడుతలు పడవు. ఇస్త్రీ చేయవలసిన అవసరం ఉండదు.
  8. కీటకాలు తినవు.
  9. పీడన, సంపీడనాలను తట్టుకుంటాయి.
  10. తక్కువ ఖరీదుకు లభిస్తాయి.

8th Class Physical Science Textbook Page No. 50

ప్రశ్న 7.
సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనదిగా తయారు కావడానికి ఏ లక్షణాలు తోడ్పడతాయి?
జవాబు:

  1. రేయాన్ సహజ పట్టు కన్నా చవకైనది.
    చెమటను పీల్చుకొనే స్వభావం ఉండడం.
    స్పర్శకు మృదువుగా మరియు సిల్కీగా ఉండడం.
    కాంతి మరియు మెరుపును కలిగి ఉండడం.
    పై లక్షణాలు సహజ పట్టుకంటే కృత్రిమ రేయాన్ మెరుగైనది అనడానికి తోడ్పడుతున్నాయి.

ప్రశ్న 8.
కృత్రిమ దారముతో తయారైన ఇంటి గడప ముందు కాళ్లు తుడుచుకునే గుడ్డ (Door mat) ను కొనాలని భావిస్తే ఎలాంటి దానితో తయారైన కృత్రిమ దారంను ఎన్నుకుంటావు? ఎందుకు?
జవాబు:
రేయాన్ దారముతో తయారైన కాళ్లు తుడుచుకొను (Door mat) గుడ్డను ఎన్నుకుంటాను. ఎందుకంటే రేయాన్ కి నీరు, తేమను పీల్చుకునే స్వభావం ఉన్నది కనుక.

ప్రశ్న 9.
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు (Diapers) మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే ఏమి జరుగుతుంది?
జవాబు:
ఆరోగ్య రక్షణకై వాడే లంగోటీలు మరియు బ్యాండేజ్ లను నైలాన్ తో తయారుచేస్తే నీటిని, చెమటను పీల్చుకొనదు.

8th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 10.
శీతాకాలంలో ఏ రకపు మిశ్రణం దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి? ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో టెర్లిన్, ఉన్నితో మిశ్రణం చేసిన టెరిడోల్ దుస్తులు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఇది సహజదారాలు మరియు కృత్రిమ దారాల ధర్మాలను కలిగి ఉంటుంది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రశ్న 11.
సహజ, కృత్రిమ, మిశ్రణం దుస్తులు మనకు లభ్యమవుతున్నాయి కదా! శుభకార్యాలు, పండుగల సమయంలో ఏ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు? ఎందుకు?
జవాబు:
శుభకార్యాలు, పండుగల సమయంలో సహజ దారాలతో తయారైన పట్టు దుస్తులను ధరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే

  1. శరీరానికి ఎక్కువ గాలిని తగిలేటట్లు చేస్తాయి.
  2. చెమటను పీల్చుకుంటాయి.
  3. శరీరానికి చిరాకును కలిగించే రసాయనాలు ఉండవు.
  4. వేడికి కరగవు కావున శరీరానికి అంటుకుపోవు.
  5. సహజ దారాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి.

8th Class Physical Science Textbook Page No. 52

ప్రశ్న 12.
సహజ లేదా కృత్రిమ దుస్తులలో వేటిని మీరు ఇష్టపడతారు? ఎందుకు? ఈ రెండింటి మధ్య భేదాలను వ్రాయండి.
జవాబు:
కృత్రిమ దుస్తులు ఇష్టపడతాను. ఎందుకంటే కృత్రిమ దుస్తులు మన్నికైనవి, కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి. అన్ని కాలాలకు అణుగుణమైన కృత్రిమ దుస్తులు లభిస్తాయి.

సహజ దుస్తులుకృత్రిమ దుస్తులు
1) సహజ దారాలు ఎక్కువ ఖరీదైనవి.1) కృత్రిమ దారాలు చౌకైనవి.
2) సహజ దుస్తులు ముడతలు పడతాయి.2) కృత్రిమ దుస్తులు ముడతలు పడవు.
3) ఇవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి.3) ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి.
4) ఇవి త్వరగా ఆరవు.4) ఇవి త్వరగా ఆరుతాయి.
5) ఇవి మన్నికైనవి కావు.5) ఇవి మన్నికైనవి.
6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉండవు.6) ఇవి కాంతిని, మెరుపును కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
మన దుస్తులను ఇంట్లో ఉతకడానికి, లాండీల్లో డ్రైక్లీనింగ్ చేయడానికి తేడా ఏమిటి?
జవాబు:

ఇంట్లో ఉతకడండ్రైక్లీనింగ్
1. దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్లను ఉపయోగిస్తారు.డ్రైక్లీనింగ్ లో కర్బన ద్రావణులను ఉపయోగిస్తారు.
2. దుస్తులు అధిక ఉష్ణోగ్రత మరియు ఒత్తిడికి లోనౌతాయి.2. దుస్తులు అధిక ఒత్తిడికి లోను కావు.
3. రక్తం, గ్రీజు, నూనె, , పెయింట్ల వంటి మరకలు పోవు.3. రక్తం, గ్రీజు, నూనె, పెయింట్ల వంటి మరకలు పోతాయి.

8th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 14.
కొన్ని వేపుడు పెనాలకు (Fry Pans) ఆహార పదార్థాలు అంటుకోవు ఎందుకు?
జవాబు:
కొన్ని వేపుడు పెనాలకు ఆహార పదార్థాలు అంటుకోవు. ఎందుకంటే టెఫ్లాతో వేపుడు పెనాలపై పూత పూయబడి ఉంటుంది.

ప్రశ్న 15.
అగ్నిమాపకదళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు. ఎందుకు?
జవాబు:
అగ్నిమాపక దళ సిబ్బంది ధరించే దుస్తులు మంటలకు అంటుకోవు, ఎందుకంటే అవి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన దుస్తులు కాబట్టి.

8th Class Physical Science 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
మీ ఇంటిలో సహజ మరియు కృత్రిమ దారాలతో తయారైన వస్తువులను గుర్తించండి. మీ పాఠశాల, ఇల్లు మరియు మీ పరిసరాలలో ఉన్న వివిధ వస్తువులను, గృహోపకరణాలను గుర్తించి ఆ జాబితాను పట్టికలోని సరియైన గడిలో పొందుపరచండి.
జవాబు:

వనరుగృహోపకరణాలు
మొక్కల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి.నూలు చీర, ఖాదీ బట్టలు, దుప్పట్లు, డోర్ కర్టన్లు, బ్యాండేజీలు మొదలగునవి.
జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారయ్యేవి.పట్టు చీర, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టన్లు, రగ్గులు మొదలగునవి.
కృత్రిమ దారాలతో తయారయ్యేవి.బ్రష్ యొక్క కుంచె, తాళ్లు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్లు, బెల్ట్ లు, దిండ్లు, తివాచీలు, ఈత దుస్తులు, గొడుగుకు వాడే గుడ్డ, బ్యాండేజీలు, లంగోటీలు మొదలగునవి.

కృత్యం – 2 పూసలు మరియు పేపర్ క్లిక్స్ అమరిక :

ప్రశ్న 2.
కొన్ని పేపర్ క్లిప్ ను తీసుకొని వాటిని పటంలో చూపినట్లు ఒకదానితో ఒకటి కలపండి. క్లిక్స్ అమరిక పద్ధతిని గమనించండి. పూసల దండకు, పేపర్ క్లిక్స్ గొలుసుకు మధ్య ఏమైనా పోలికలు గుర్తు పట్టగలరా?
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 6
జవాబు:
పూసల దండలోనూ, పేపర్ క్లిప్ ల గొలుసులోనూ ఒక్కొక్క పేపర్ క్లిప్ పేపర్ క్లి గొలుసు పూస లేక ఒక్కొక్క పేపర్ క్లిప్ రెండవ దానితో కలిసి ఒక పెద్ద గొలుసులాగా ఏర్పడినాయి.

కృత్యం – 3 దారాలను గుర్తించడం – మండించే పరీక్ష :

ప్రశ్న 3.
వివిధ సహజ, కృత్రిమ దారాలను మండించి వాటి లక్షణాలను ఒక పట్టికలో నమోదు చేయండి.
(లేదా)
వివిధ రకాల దారాలను కాల్చినపుడు జరిగే మార్పుల ఆధారంగా దారాలను గుర్తించి పట్టికలో నింపుము.
జవాబు:
పరీక్షించవలసిన వివిధ సహజ, కృత్రిమ దారాలను ఒక్కొక్కటిగా తీసుకొని దాని పురిని, ముడులను విప్పి సారాయి దీపముపై మండించితిని. మండినపుడు పరిశీలించి వాటి లక్షణాలను పట్టికలో వ్రాసితిని.

దారంలక్షణాలు (మండించినపుడు)
1. నూలు (పత్తి)వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
2. ఉన్నినెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
3. పట్టునెమ్మదిగా మండింది. వెంట్రుకలు కాలిన వాసన వచ్చింది.
4. రేయాన్వేగంగా మండింది. కాగితం కాలిన వాసన వచ్చింది.
5. నైలాన్నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.
6. అక్రలిక్నెమ్మదిగా మండింది. దారము జ్వాలలో కరిగింది.

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 4

ప్రశ్న 4.
నైలాన్ ఎంత బలమైనది ? వివిధ దారాల బలాలను తెలుసుకొను కృత్యమును వివరించండి.
జవాబు:
క్లాంపుతో ఉన్న ఒక ఇనుపస్టాండును తీసుకోండి. 50 సెం. మీ. పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టుదారాలను తీసుకోండి. కింది పటంలో చూపిన విధంగా నూలు దారాన్ని కట్టండి. దారం మరొక చివర బరువులు వేయడానికి వీలుగా ఉండే పళ్లెమును వేలాడదీయండి. ఆ పళ్లెములో మొదట 10గ్రా.ల బరువుతో ప్రారంభించి బరువును దారం తెగేంత వరకు పెంచండి. దారం తెగగానే దాని బరువును పట్టికలో నమోదు చేయండి. ఈ విధంగా వివిధ దారాలతో చేసి బరువులను పట్టికలో నమోదు చేయండి. తీసుకున్న అన్ని దారాలు ఒకే పొడవు, దాదాపు ఒకే మందము ఉండేటట్లు చూడండి.

దారపు రకందారం తెగిపోవడానికి అవసరమైన భారం సంఖ్య  (గ్రాములలో)
1. నూలు250
2. ఉన్ని500
3. పట్టు550
4. నైలాన్1200

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 7

పై కృత్యంలో దారాల బలాలు పెరిగే క్రమం : నూలు < ఉన్ని < పట్టు < నైలాన్

కృత్యం – 6

ప్రశ్న 5.
ఇచ్చిన సీసా (Bottle) PET సీసా అని ఎలా చెప్పగలవు?

మీ తరగతి స్నేహితుల నుండి వేర్వేరు నీటి సీసాలను సేకరించి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సీసాల అడుగున త్రిభుజాకారములో ఏదైనా గుర్తు ఉన్నదా? లేదా బ్రాండ్ లేబుల్ స్టిక్కర్ (brand label sticker) పైన ఆ గుర్తు ఉందా? ఆ త్రిభుజంలో ఏ అంకె ఉన్నది? కింది పటంను పరిశీలించండి. చాలా బాటిళ్లకు త్రిభుజాకోరం మధ్యలో 1 అనే అంకె ఉండడం గమనిస్తావు. ఇలా ‘1’ ఉన్నట్లైతే అది PET బాటిల్ అవుతుంది.
రెసినను గుర్తించేందుకు చిహ్నములు :
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 8

చిహ్నముల సంఖ్యలు (Code Numbers)

  1. పాలీఎథిలీన్ టెరిఫాల్ట్ (PET, PETE)
  2. అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్ (HDPE)
  3. పాలీవినైల్ క్లోరైడ్ (PVC)
  4. అల్ప సాంద్రత గల పాలీ ఎథిలీన్ (LDPE)
  5. పాలీ ప్రొపిలీన్ (PP)
  6. పాలీ స్టెరీన్ (PS)
  7. ఇతరము (1, 2, 3, 4, 5 లేక 6 అని స్పష్టంగా లేని వాటిని లేదా ఒకటి కంటే ఎక్కువ రెసిన్ కలయిక ద్వారా ఏర్పడిన వాటిని ఈ కోడ్తో సూచిస్తారు.)

కృత్యం – 7

ప్రశ్న 6.
వివిధ రకాల వస్తువులను వాటికి గల రీసైక్లింగ్ చిహ్నం ద్వారా గుర్తించండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 9

కృత్యం – 8

ప్రశ్న 7.
ప్లాస్టిక్ రకాలు :
ప్లాస్టిక్ తో తయారైన ఒక PP బాటిల్, మరొక సాధారణమైన బాటిల్ (PET)ను తీసుకొని వేడి నీటిని రెండింటిలో పోయండి.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 10

a) ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
సాధారణమైన బాటిల్ ముడుచుకొనిపోయింది. తద్వారా దాని ఆకృతి మారినది.

b) రూపం మారిన సీసా యొక్క చిహ్నము (Code) ను చూడండి.
జవాబు:
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 11

c) టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఏ రకమైనదో నీవు చెప్పగలవా?
జవాబు:
థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
మీకు ఇచ్చిన ప్లాస్టిక్ థర్మో ప్లాస్టిక్లు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించండి.
(లేదా)
ప్లాస్టిక్ దువ్వెన, పళ్ళుతోముకునే బ్రష్, ప్లాస్టిక్ బకెట్, కుక్కర్ పిడిలు, ఎలక్ట్రిక్ స్విచ్, ప్లాస్టిక్ ప్లేటు, కాఫీ మగ్లను నీకు ఇచ్చినపుడు ఏ కృత్యం చేయడం ద్వారా ఏది థర్మోప్లాస్టిక్, ఏది థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తించగలవో ఆ కృత్యమును వివరింపుము.
ఉద్దేశము :
జ్వాల పరీక్షను ఉపయోగించి థర్మోప్లాస్టికు మరియు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లను గుర్తించుట.

కావలసిన పరికరాలు :
పట్టుకారు, సారాయి దీపం, ఇచ్చిన ప్లాస్టిక్ నమూనాలు.
AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు 12

పద్ధతి :

  1. సారాయి దీపమును తీసుకొని దానిని వెలిగించండి.
  2. పట్టుకారు సహాయంతో ప్లాస్టిక్ నమూనాను పట్టుకోండి.
  3. సారాయి దీపపు మంటపై ఈ నమూనాను పెట్టండి. మండుతున్నప్పుడు జరుగుతున్న మార్పులను గమనించండి.
  4. ఈ విధంగా అన్ని నమూనాలను పరీక్షించండి. మీ పరిశీలనలను పట్టికలో నమోదు చేయండి.
  5. వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే వాటిని థర్మోప్లాస్టిక్ అంటారు.
  6. ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ప్లాస్టిక్ నమూనామెత్తబడడం/కాలిన వాసనతో మండడం/తర్వాత గట్టిపడడంథర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
1. టూత్ బ్రష్ కుంచెనెమ్మదిగా మండి మెత్తబడడం, కాలిన వాసనతో మండడంథర్మోప్లాస్టిక్
2. దువ్వెనమెత్తబడడం, కాలినవాసనతో మండడంథర్మోప్లాస్టిక్
3. బకెట్ చిన్నముక్కమెత్తబడడం, కాలిన వాసనతో మండడంథర్మోప్లాస్టిక్
4. వంటపాత్ర పిడితర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
5. విద్యుత్ స్విచ్తర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
6. పళ్లెంతర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్
7. కాఫీకప్పుతర్వాత గట్టిపడడంథర్మోసెట్టింగ్ ప్లాస్టిక్

AP Board 8th Class Physical Science Solutions 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు

కృత్యం – 9 జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి :

ప్రశ్న 9.
ఇచ్చిన పదార్థాలలో జీవ విచ్ఛిన్నం చెందేవి, జీవ విచ్ఛిన్నం చెందనివి గుర్తించి, జీవ విచ్ఛిన్నం చెందుటకు పట్టేకాలాన్ని కనుగొనండి.
జవాబు:
ఒక గుంతను తవ్వి, ఇచ్చిన పదార్థాలను గుంతలో వేయండి. కొన్ని రోజుల తర్వాత గుంతను మరల తవ్వి ఏ పదార్థాలు భూమిలో కలిసిపోయాయో, ఏవి మిగిలిపోయాయో పరిశీలించండి. వివరాలను పట్టికలో వ్రాయండి.

వ్యర్థం పేరుభూమిలో కలిసిపోవడానికి పట్టేకాలంమార్పు
1. కూరగాయలు, పండ్ల తొక్కలు10 – 20 రోజులుజీవ విచ్ఛిన్నం చెందును.
2. తినగా మిగిలిన పదార్థాలు10-20 రోజులుజీవ విచ్ఛిన్నం చెందును.
3. కాగితం10-30 రోజులుజీవ విచ్ఛిన్నం చెందును.
4. నూలు బట్ట2-6 నెలలుజీవ విచ్ఛిన్నం చెందును.
5. ప్లాస్టిక్ సంచి100 సం||ల కన్నా ఎక్కువజీవ విచ్ఛిన్నం చెందదు.