SCERT AP 8th Class Social Study Material Pdf 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers.

AP State Syllabus 8th Class Social Solutions 24th Lesson విపత్తులు – నిర్వహణ

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీ ప్రాంతంలో సంభవించిన లేదా టీవీలో చూసిన ప్రకృతి వైపరీత్యాలను, జరిగిన నష్టాన్ని చెప్పండి. నష్టాన్ని తగ్గించాలంటే ఏ ఏ చర్యలు చేపట్టాలో తెల్పండి. (AS4)
జవాబు:
ఇటీవల మా ప్రాంతంలో విపరీతమైన వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. మా ఇళ్ళు, పొలాలు అన్నీ నీట మునిగాయి. మా ప్రాంతంలో 8 మంది వరద ఉధృతికి నీట మునిగి కొట్టుకుపోయారు. చేలు మునగటం వలన వరి పంట మొత్తం నాశనమయ్యింది. పశువులు మేతలేక, నీట మునిగి మరణించాయి.

కృష్ణానదికి అడ్డుకట్ట వేసి నీటిని మళ్ళిస్తే ఈ వరదను అరికట్టవచ్చు. లోతట్టు ప్రాంతాల వారిని వర్షం ఉధృతంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దాతలను ప్రోత్సహించి వారికి ఉచిత ఆహార, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల నష్టాన్ని తగ్గించవచ్చు.

ప్రశ్న 2.
వైపరీత్యాలను ఎలా నివారించవచ్చు? ఎలా ఎదుర్కోవచ్చు? (AS1)
జవాబు:
సృష్టిలో మనిషి తప్ప మిగతా ప్రాణులన్నీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మనిషి మాత్రం ప్రకృతిని తనకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. ఇలాకాక మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అంతేకాక మడచెట్ల పెంపకం, భద్రమైన ప్రదేశాలలోకి గ్రామాలను మార్చటం, తుపానులను, భూకంపాలను తట్టుకునే విధంగా భవన నిర్మాణాలను ప్రోత్సహించడం మొదలైన వాటితో నష్టాలను నివారించవచ్చు.

వైపరీత్య బృందాలను ఏర్పాటు చేసి శిక్షణనివ్వటం, షెల్టర్లు, దిబ్బలు ఏర్పాటు చేయడం మొదలైన వాటితో వీటిని ఎదుర్కోవచ్చు.

ప్రశ్న 3.
వైపరీత్యాలకు సంబంధించి పెద్దవాళ్ల అనుభవాలు, వాటిని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుని వాటి గురించి రాయండి. (AS3)
జవాబు:
ఒకసారి హైదరాబాదులో భూకంపం వచ్చిందట. వేసవికాలం రాత్రిపూట అందరూ ఆరు బయట పడుకుని ఉండగా వచ్చిందట. ముందు మా బామ్మగారు ఏదో కుక్క మంచాన్ని కదుపుతోంది అనుకున్నారట. ఈలోగా చుట్టు ప్రక్కల వాళ్లు ‘భూకంపం’ అని కేకలు వేయడం వినిపించిందట. అంతే అందరూ ఒక్క ఉదుటున లేచి వీధిలోకి పరిగెత్తారట. చూస్తుండగానే రోడ్డు చివర ఒక ఎత్తైన భవనం కూలిపోయిందట. ఇళ్ళల్లోని సామానులన్నీ క్రిందపడిపోయాయట. చాలామంది ఇళ్ళ గోడలు పగుళ్లు వచ్చాయట. ఆ రాత్రి నుంచి తెల్లారే వరకు 5, 6 సార్లు భూమి కంపించిందట. మా వాళ్ళు అలాగే రోడ్ల మీద కూర్చుని ఉన్నారట కానీ ఇళ్ళల్లోకి వెళ్ళలేదట. తెల్లారాక భయం లేదని నమ్మకం కలిగాక ఇళ్ళలోకి వెళ్లి పని పాటలు మొదలు పెట్టారట.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
ప్రజలు విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించండి. (AS4)
జవాబు:
ప్రకృతి విపత్తులను ముందే ఊహించి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

  1. సులువుగా తప్పించుకునే మార్గం ముందే ఆలోచించి ఉంచుకోవాలి.
  2. అవసరమైన సామగ్రిని ఒక బ్యాగులో సర్దుకుని ఉంచుకోవాలి.
  3. నీటికి సంబంధించిన విపత్తు అయితే ఎత్తైన ప్రాంతాలకు ముందే చేరుకోవాలి.
  4. నిల్వ చేసుకునే ఆహార పదార్థాలను సేకరించి ఉంచుకోవాలి.
  5. అత్యవసరమైన మందులను దగ్గరుంచుకోవాలి.
  6. ఇతరులకు అవకాశమున్నంతమేర సాయం చేయాలి.

ప్రశ్న 5.
కరవు ప్రభావాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
కరవు ప్రభావం :
కరవు ప్రభావం మెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

  1. భూగర్భజల నీటిమట్టం పడిపోవటం, తాగునీటి కొరత.
  2. పంటల విస్తీర్ణం తగ్గటం.
  3. వ్యవసాయం కుంటు పడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవటం.
  4. వ్యవసాయ, అనుబంధ రంగాలలోని ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం.
  5. ఆహారధాన్యాల కొరత.
  6. పశుగ్రాస కొరత.
  7. పశువులు చనిపోవటం.
  8. పోషకాహార లోపం, ప్రత్యేకించి చిన్న పిల్లల్లో
  9. అతిసారం, విరేచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించటం, ఆకలికి గురికావటం వల్ల కంటి చూపులో లోపం ఏర్పడటం.
  10. నగలు, ఆస్తులు వంటివి తప్పనిసరయ్యి తాకట్టు పెట్టటం లేదా అమ్మటం.
  11. పని కోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లటం.

ప్రశ్న 6.
నీటి వృథా జరిగే సందర్భాలను పేర్కొని, దాని నివారణకు మార్గాలను సూచించండి. (AS6)
జవాబు:
నీరు వృథా జరిగే సందర్భాలు దాని నివారణకు మార్గాలు :

  1. పట్టణ, గ్రామ ప్రాంతాలలోని మంచినీటి కుళాయిలకు హెడ్లు సరిగ్గా లేకపోవడం- దీనిని ఎప్పటికప్పుడు సరిచేయాలి.
  2. టూత్ బ్రష్, షేవింగ్ చేయునపుడు కొలాయిని వృథాగా వదలరాదు.
  3. మంచినీటి పైపుల లీకేజీని నివారించాలి.
  4. కాలువల ద్వారా పంటపొలాలకు నీటిని అవసరం మేరకు వదలాలి.
  5. నీటికొరత సమయాలలో గృహ అవసరాల కొరకు పరిమితంగా నీరు వాడాలి.
  6. బిందు సేద్యం వంటి వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి.
  7. వర్షపు నీరు వృథాకాకుండా చెరువులకు మళ్ళించాలి.
  8. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గొయ్యి త్రవ్వి వర్షపునీటి భూమిలో ఇంకేటట్లు చూడాలి.

ప్రశ్న 7.
ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన చిత్రాలతో ఆల్బమ్ తయారు చేయండి. (AS3)
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 1

8th Class Social Studies 24th Lesson విపత్తులు – నిర్వహణ InText Questions and Answers

8th Class Social Textbook Page No.254

ప్రశ్న 1.
విపత్తులలో రకాలు ఏవి? వాటిని వివరించండి.
జవాబు:
విపత్తులలో రకాలు :
విపత్తులు ఏర్పడటానికి గల కారణాలను బట్టి, అది సంభవించే వేగాన్ని బట్టి వీటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
1. సంభవించే వేగాన్ని బట్టి నిదానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండుగా విభజించవచ్చు.

ఎ) నిదానంగా సంభవించే విపత్తులు :
అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలపాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, పురుగుల తాకిడి, కాటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

బి) వేగంగా సంభవించే విపత్తులు :
తృటి కాలంలో సంభవించే విపత్తు విభ్రాంతికి గురి చేస్తుంది. ఇటువంటి విపత్తుల ప్రభావం కొద్ది కాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుపాను, ఆకస్మిక వరదలు, అగ్ని పర్వతాలు బద్దలవటం వంటివి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.

2. కారణాలను బట్టి ప్రకృతి, సహజ, మానవ నిర్మిత విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ) ప్రకృతి విపత్తులు :
ప్రకృతి సహజ కారణాల వల్ల ఇటువంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్ధిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి. ప్రకృతి విపత్తులలో రకాలు :
అ) భూకంపాలు
ఆ) తుపానులు
ఇ) వరదలు
ఈ) కరవు
ఉ) సునామీ
ఊ) కొండ చరియలు విరిగి పడటం
ఋ) అగ్నిపర్వతాలు, మొ||నవి

బి) మానవ నిర్మిత విపత్తులు :
మానవ కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ప్రాణ, ఆస్తి, ఆర్థిక, పర్యావరణ నష్టం కలుగుతుంది. వీటికి గురయ్యే ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కోగల స్థితిలో ఉండరు. 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమాహాలులో అగ్ని ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పటం, 2003లో కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాలలో అగ్ని ప్రమాదం, 2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లు వంటివి దీనికి ఉదాహరణలు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 2.
విపత్తుల యాజమాన్యం అంటే ఏమిటి?
జవాబు:
విపత్తులపై / అత్యవసర పరిస్థితులపై నియంత్రణ సాధించటం, విపత్తుల ప్రభావాన్ని నివారించటానికి, తగ్గించటానికి, లేదా వాటి నుంచి కోలుకోవటానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల యాజమాన్యం అంటారు. ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించటానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోటానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.

8th Class Social Textbook Page No.256

ప్రశ్న 3.
సునామీలు అంటే ఏమిటో మీకు తెలుసా? అవి ఎలా ఏర్పడతాయి? వాటిని ముందుగా ఎలా ఊహించవచ్చు? రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో నివసిస్తున్నట్లయితే సునామీ సంభవించినపుడు మిమ్మల్ని ఎలా రక్షించుకుంటారు?
జవాబు:
జపాన్ భాషలో ‘సు’ అంటే రేవు’, ‘నామె’ అంటే ‘అలలు’ అని అర్థం. ఈ రెండూ కలిసి ‘సునామీ’ అన్న పదం ఏర్పడింది. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండచరియలు విరిగి పడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటాన్ని ‘సునామీ’ అంటారు. దగ్గరలోని భూకంపాల వల్ల ఉత్పన్నమైన సునామీ అలలు కొద్ది నిమిషాలలోనే తీరాన్ని తాకుతాయి. ఈ అలలు తక్కువలోతు నీటిని చేరినప్పుడు చాలా అడుగుల ఎత్తు, అరుదుగా పదుల అడుగుల ఎత్తు పైకెగసి తీరప్రాంతాన్ని విధ్వంసకర శక్తితో తాకుతాయి. ఒక పెద్ద భూకంపం తరువాత సునామీ ముప్పు చాలా గంటలపాటు ఉండవచ్చు.

ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సునామీలను పసికట్టవచ్చు. సునామీలు వచ్చినపుడు వాతావరణశాఖ హెచ్చరికల ద్వారా తెలుసుకుని, ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకుని మమ్మల్ని మేము రక్షించుకుంటాము.

ప్రశ్న 4.
సునామీ ముందు ఏం చేయాలి?
జవాబు:

  1. సునామీ ముప్పుకి గురయ్యే ప్రాంతంలో మీ ఇల్లు, బడి, పని ప్రదేశం, తరచు సందర్శించే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
  2. సునామీ సంభవించినప్పుడు మీరు ఉండటానికి అవకాశం ఉన్న ఇల్లు, బడి, పని ప్రదేశం, ఇతర ప్రదేశాల నుంచి తప్పించుకునే మార్గం గురించి ముందే తెలుసుకుని ఉండాలి.
  3. తప్పించుకునే మార్గాల ద్వారా క్షేమంగా ఉండే ప్రాంతాలను చేరుకోటాన్ని సాధన చేస్తూ ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితుల్లో ఉంచుకోవలసిన సామగ్రితో సిద్ధంగా ఉండాలి.
  5. సునామీ గురించి మీ కుటుంబంతో చర్చిస్తూ ఉండాలి.

ప్రశ్న 5.
సునామీ గురించి రాయండి.
జవాబు:

  1. సునామీలో అనేక అలలు ఉంటాయి. మొదటి అల అన్నిటికంటే పెద్దది కాకపోవచ్చు. మొదటి అల తరవాత అనేక గంటలపాటు పెద్ద అలలు తాకే ప్రమాదముంటుంది.
  2. మైదాన ప్రాంతంలో సునామీ మనిషికంటే వేగంగా, అంటే గంటకి 50 కి.మీ. వేగంతో పయనించగలదు.
  3. సునామీ పగలు కానీ, రాత్రి కానీ ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

ప్రశ్న 6.
సునామీ పై మరింత సమాచారం, చిత్రాలు సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. సమాచారంను నోటీస్ బోర్డులో ప్రదర్శించండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 3
విద్యార్థులు స్వయంగా చర్చ నిర్వహించి, సమాచారంను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.

  1. తేదీ : 00.58.83 26.12.2004.
  2. మాగ్నిట్యూడ్ : 9.1 – 9.3 mw
  3. లోతు : 30 km (19 mi)
  4. భూకంప నాభి : 3.316°N-95.854°E
  5. రకం : సముద్రంలో
  6. దేశాలు లేదా ప్రాంతాలు : ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మాల్దీవులు, ఆఫ్రికా తూ|| తీరం (సోమాలియా)
  7. మరణాలు : 230,210 – 280,000

8th Class Social Textbook Page No.259

ప్రశ్న 7.
కరవు గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
కరువు అన్నది వర్మపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్వం. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని అనావృష్టి (Meteorological drought) అంటారు. ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీనిని వ్యవసాయ కరువు (Agricultural drought) అంటారు. కాబట్టి ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది.

అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది (70-100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి ఈ విధంగా చెబుతారు.
అధిక + సగటు వర్షపాతం కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
సాధారణ + సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
తక్కువ – సగటు వర్షపాతం కంటే 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వరకు,
బాగా తక్కువ – సగటు వర్షపాతం కంటే 60 శాతం కంటే తక్కువ.

కొన్ని ప్రాంతాలు అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరవు పీడిత’ ప్రాంతాలు అంటారు.

8th Class Social Textbook Page No.260

ప్రశ్న 8.
వాటర్ షెడ్ అభివృద్ధి పథకం అంటే ఏమిటి? దీని ఉద్దేశ్యమేమి?
జవాబు:
కరవు ప్రభావాలను తగ్గించటానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో నైపుణ్యాలను పెంపొందించి ప్రకృతి వనరులను సమర్థంగా ఉపయోగించుకునేలా చేయటం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవటం ద్వారా నేల, నీటి వనరులను బాగా వినియోగించుకోవచ్చు. వాటి దురుపయోగాన్ని అరికట్టవచ్చు. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 9.
కరవును ఎదుర్కోవటం ఎలా?
జవాబు:
ఒక్కసారిగా సంభవించే ప్రమాదం మాదిరి కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది కాబట్టి మనం దానికి సంసిద్ధతగా ఉండటానికి, ప్రతిస్పందించటానికి, దాని ప్రభావాన్ని తగ్గించటానికి తగినంత సమయం ఉంటుంది. పర్యవేక్షణ, ముందుగా జారీచేసే హెచ్చరికలవల్ల అన్నిస్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పందించవచ్చు. కరవుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణా విధానాలు వంటి అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

ప్రశ్న 10.
వర్షపు నీటిని పట్టణ ప్రాంతాలలో ఎలా నిల్వ చేయాలి?
జవాబు:
వర్షపు నీటి నిల్వ :
పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలువ చేయాలి. ఈ వాన నీటినంతా ఇంకుడు గుంతలలోకి మళ్లించటం అన్నింటికంటే తేలికైన పని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపు (sump)ల లోకి వాన నీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగటానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.

8th Class Social Textbook Page No.261

ప్రశ్న 11.
మీరు నీటిని ఆదా చేసేవారా, వృథా చేసేవారా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 2
మీరు వాడుతున్న నీటిని పట్టికలో నింపి మొత్తం కూడండి, మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి.
– 200 లీటర్ల కంటే తక్కువ – పర్యావరణ హీరో
– 201 – 400 లీటర్లు – నీటి పొదుపరి
– 401 – 600 లీటర్లు – నీటి ఖర్చుదారు
– 600 లీటర్ల కంటే ఎక్కువ – నీటి విలన్
జవాబు:
నేను పర్యావరణ హీరో స్థానంలో ఉన్నాను.

ప్రశ్న 12.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 13.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 14.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

ప్రశ్న 15.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 16.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

  1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
  2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

పట నైపుణ్యాలు

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ 4
ప్రశ్న 17.
సునామీ ఏయే ప్రాంతాలను తాకింది?
జవాబు:
అలప్పుజా, కొల్లం, కన్యాకుమారి, కడలూర్, నాగపట్నం, చైన్నై, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులు.

ప్రశ్న 18.
ఇవి ఏ తీరంలో ఉన్నాయి?
జవాబు:
ఎక్కువ ప్రదేశాలు తూర్పు తీరంలో, కొన్ని దక్షిణ తీరంలోనూ ఉన్నాయి.

ప్రశ్న 19.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP Board 8th Class Social Solutions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 20.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

  1. భూకంపాలు
  2. తుపానులు
  3. వరదలు
  4. కరవు
  5. సునామి
  6. కొండచరియలు విరిగిపడటం
  7. అగ్నిపర్వతాలు
    బ్రద్దలవటం మొదలైనవి.