AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 1.
ఒక లంబకోణ త్రిభుజం ABCలో భుజాలు AB, BC మరియు CA ల పొడవులు వరుసగా 8 సెం.మీ., 15 సెం.మీ మరియు 17 సెం.మీ అయిన sinA, cos A మరియు tan A ల విలువలు కనుగొనుము.
సాధన.
∆ABC ఒక లంబకోణ త్రిభుజము.
భుజాల కొలతలు AB = 8 సెం.మీ. BC = 15 సెం.మీ. మరియు CA = 17 సెం.మీ.
ఇచ్చిన కొలతలలో [latex]\overline{\mathrm{CA}}[/latex] పొడవైన భుజము కావున ∆ABC యొక్క కర్ణము CA అగును.

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 1

∠A పరంగా ఎదుటి భుజం = BC = 15 సెం.మీ.
ఆసన్న భుజము = AB = 8 సెం.మీ. మరియు కర్ణము = AC = 17 సెం.మీ.
A కు ఎదుటి భుజము = BC = 15

sin A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 22 =[latex]\frac{\mathrm{BC}}{\mathrm{AC}}=\frac{15}{17}[/latex]

cos A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 23 =[latex]\frac{\mathrm{AB}}{\mathrm{AC}}=\frac{8}{17}[/latex]

tan A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 24 =[latex]\frac{\mathrm{BC}}{\mathrm{AB}}=\frac{15}{8}[/latex]
∴ sin A = [latex]\frac{15}{17}[/latex]; cos A = [latex]\frac{8}{17}[/latex] మరియు tan A = [latex]\frac{15}{8}[/latex]

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 2.
లంబకోణ త్రిభుజం POR యొక్క భుజాలు PQ = 7 సెం.మీ., QR = 25 సెం.మీ. మరియు ∠P = 90° అయిన tanQ – tan R విలువ కనుగొనుము.
సాధన.
దత్తాంశము ప్రకారం PORఒక లంబకోణ త్రిభుజము మరియు PQ = 7 సెం.మీ, PR = 25 సెం.మీ, మరియు ∠Q = 90°.

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 2

పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము . PQ2 + PR2 = QR2
(7)2 + PR2 = (25)2
PR2 = 625 – 49
PR2 = 576
⇒ PR = √576 = 24
∴ tan Q = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 3
= [latex]\frac{P R}{P Q}=\frac{24}{7}[/latex]

tan R = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 3
= [latex]\frac{P Q}{P R}=\frac{7}{24}[/latex]

tan Q – tan R = [latex]\frac{24}{7}-\frac{7}{24}=\frac{(24)^{2}-(7)^{2}}{24 \times 7}[/latex]
= [latex]\frac{576-49}{168}=\frac{527}{168}[/latex]

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 3.
B వద్ద లంబకోణం కల్గిన లంబకోణ త్రిభుజం ABCలో ‘ a = 24 యూనిట్లు, b = 25 యూనిట్లు మరియు ∠BAC = θ అయిన cos 6 మరియు tan 6 ల విలువలను కనుగొనుము.
సాధన.
దత్తాంశము ప్రకారం త్రిభుజం ABC లో B వద్ద లంబకోణం కలదు. మరియు a = BC = 24 యూనిట్లు, b = CA = 25 యూనిట్లు మరియు ∠BAC = θ అనుకొనిన

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 4

Bb 24 Ac పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం
AC2 = AB2 + BC2
(25)2 = AB2 + 242
AB2 = 252 – 242
= 625 – 576
AB2 = 49
AB = √49 = 7
∠BAC = θ ప్రకారము
θకు ఎదుటి భుజము = BC = 24 యూనిట్లు
θకు ఆసన్న భుజము = AB = 7 యూనిట్లు
కర్ణము = AC = 25 యూనిట్లు

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 5

= [latex]\frac{\mathrm{AB}}{\mathrm{AC}}=\frac{7^{\mathrm{\kappa}}}{25}[/latex]

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 6

= [latex]\frac{\mathrm{BC}}{\mathrm{AB}}=\frac{24^{\mathrm{\kappa}}}{7}[/latex]
∴ cos θ = [latex]\frac{7}{25}[/latex] మరియు tan θ = [latex]\frac{24}{7}[/latex].

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 4.
cos A = [latex]\frac{12}{13}[/latex] అయిన sin A మరియు tan A ల విలువలను కనుగొనుము.
సాధన.
దత్తాంశము ప్రకారం Cos A = [latex]\frac{12}{13}[/latex]
Cos A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 7 = [latex]\frac{12}{13}[/latex]
∴ఆసన్న భుజము : కర్ణము = 12 : 13.

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 8

కోణం ‘A’ పరంగా, ఆసన్నభుజము = AB = 12k మరియు కర్ణము = AC = 13 k(‘k’ ఒక ధన సంఖ్య)
∆ABC నుండి
AC2 = AB2 + BC2
⇒ (13k)2 = (12.k)2 + BC2
⇒ 169 k2 = 144 k2 + BC2
⇒ BC2 = 169 k2 – 144 k2
⇒ (169 – 144) k2 = 25 k2
⇒ BC = √(25k2)
⇒ 5k = ఎదుటి భుజము
ఇప్పుడు, మిగిలిన త్రికోణమితి నిష్పత్తులు
sin A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 9
= [latex]\frac{\mathrm{BC}}{\mathrm{AC}}=\frac{5 \mathrm{k}}{13 \mathrm{k}}=\frac{5}{13}[/latex]

tan A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 10
= [latex]\frac{B C}{A B}=\frac{5 k}{12 k}=\frac{5}{12}[/latex]
ఆ విధముగా sinA = [latex]\frac{5}{13}[/latex], tanA = [latex]\frac{5}{12}[/latex] అగును.

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 5.
3 tan A = 4 అయిన sin A మరియు Cos A ల విలువలను కనుగొనుము.
సాధన.
దత్తాంశము ప్రకారం 3 tan A = 4 ⇒ tan A = [latex]\frac{4}{3}[/latex]
కాని tan A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 11 = [latex]\frac{4}{3}[/latex]
∠A కు ఎదుటి భుజము = 4k మరియు ∠A కు ఆసన్న భుజం = 3k.
ఈ విలువలను ∆ABC లో చూపగా

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 12

∆ABC ఒక లంబకోణ త్రిభుజము కావున AC2 = AB2 + BC2 (∵ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం)
= (3k)2 + (4k)2 = 9k2 + 16k2
AC2 = 25k2
AC = √(25 k2) = 5k
sin A = [latex]\frac{B C}{A C}=\frac{4 k}{5 k}=\frac{4}{5}[/latex]

cos A = [latex]\frac{\mathrm{AB}}{\mathrm{AC}}=\frac{3 \mathrm{k}}{5 \mathrm{k}}=\frac{3}{5}[/latex]

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 6.
∆ABC, ∆XYZలలో cos A = cos X అయ్యేటట్లు 4A మరియు ∠Xలు లఘు కోణాలయిన ∠A = ∠X అని చూపుము.
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 13

∆ABC లో
cos A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 14
= [latex]\frac{\mathrm{AB}}{\mathrm{AC}}[/latex]

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 15

అలాగే ∆XYZ లో 2
cos X = [latex]\frac{\mathrm{XY}}{\mathrm{XZ}}[/latex]
లెక్క ప్రకారం, cosA = cos X
∴ [latex]\frac{\mathrm{AB}}{\mathrm{AC}}=\frac{\mathrm{XY}}{\mathrm{XZ}}[/latex] = k అను
⇒ [latex]\frac{\mathrm{AB}}{\mathrm{XY}}=\frac{\mathrm{AC}}{\mathrm{XZ}}[/latex] ………………(1)
∴ AB = kAC మరియు XY = kXZ
ఇప్పుడు
AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 16
(1) మరియు (2) ల నుండి,
[latex]\frac{\mathrm{AB}}{\mathrm{XY}}=\frac{\mathrm{AC}}{\mathrm{XZ}}=\frac{\mathrm{BC}}{\mathrm{YZ}}[/latex]
∴ రెండు త్రిభుజ భుజాలకు అనుపాతంలో కలవు.
∴ ∆ABC ~ ∆XYZ
⇒ ∠A = ∠X (∵ సరూప త్రిభుజాలలో అనురూప కోణాలు సమానాలు)

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 7.
cot θ = [latex]\frac{7}{8}[/latex] అయిన
(i) [latex]\frac{(1+\sin \theta)(1-\sin \theta)}{(1+\cos \theta)(1-\cos \theta)}[/latex]
(ii) [latex]\frac{(1+\sin \theta)}{\cos \theta}[/latex] లను కనుగొనుము.
సాధన.
దత్తాంశము ప్రకారం cot θ = [latex]\frac{7}{8}[/latex]
AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 17
AB = 7k మరియు BC = 8k అనుకొనిన లంబకోణ త్రిభుజములో
AC2 = AB2 + BC2 (పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం)
= (7k)2 + (8k)2
AC2 = 49k2 + 64k2
AC2 = 113 k2
⇒ AC = √113k
ఇప్పుడు, sin θ = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 18
= [latex]\frac{8 k}{\sqrt{113} k}=\frac{8}{\sqrt{113}}[/latex]
cos θ = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 19
= [latex]\frac{7 k}{\sqrt{113} k}=\frac{7}{\sqrt{113}}[/latex]

(i) [latex]\frac{(1+\sin \theta)(1-\sin \theta)}{(1+\cos \theta)(1-\cos \theta)}[/latex]
= [latex]\frac{1^{2}-\sin ^{2} \theta}{1^{2}-\cos ^{2} \theta}[/latex] [∵ (a + b) (a – b) = a2 – b<sup.2)

= [latex]\frac{1-\left(\frac{8}{\sqrt{113}}\right)^{2}}{1-\left(\frac{7}{\sqrt{113}}\right)^{2}}=\frac{1-\frac{64}{113}}{1-\frac{49}{113}}=\frac{\frac{113-64}{113}}{\frac{113-49}{113}}=\frac{49}{64}[/latex]

(ii) [latex]\frac{(1+\sin \theta)}{\cos \theta}[/latex]
= [latex]\frac{1+\frac{8}{\sqrt{113}}}{\frac{7}{\sqrt{113}}}[/latex]

= [latex]\frac{\frac{\sqrt{113}+8}{\sqrt{113}}}{\frac{7}{\sqrt{113}}}=\frac{\sqrt{113}+8}{7}[/latex]

AP Board 10th Class Maths Solutions 11th Lesson త్రికోణమితి Exercise 11.1

ప్రశ్న 8.
B వద్ద లంబకోణం కల్గిన, త్రిభుజం ABC లో tan A = √3 అయిన
(i) sin A cos.C + cos A sin C
(ii) cos A cos C-sin Asin C ల విలువలను కనుగొనుము.
సాధన.
దత్తాంశము : tan A = [latex]\frac{\sqrt{3}}{1}\[/latex]
కాని tan A = AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 20 = [latex]\frac{\sqrt{3}}{1}\[/latex]
ఎదుటి భుజం = √3k మరియు ఆసన్న భుజం = 1k

AP Board 10th Class Maths Solutions Chapter 11 త్రికోణమితి Exercise 11.1 21

∆ABC లంబకోణ త్రిభుజములో
AC2 = AB2 + BC2 (పైథాగరస్ సిద్ధాంతము ప్రకారం)
⇒ AC2 = (1k)2 + (J3k)2
⇒ AC2 = 1k2 + 3k2
⇒ AC2 = 4k2
∴ AC = √4k2 = 2k
BC
sin A = [latex]\frac{\mathrm{BC}}{\mathrm{AC}}=\frac{\sqrt{3} \mathrm{k}}{2 \mathrm{k}}=\frac{\sqrt{3}}{2}[/latex]
cos A = [latex]=\frac{A B}{A C}=\frac{1 k}{2 k}=\frac{1}{2}[/latex]
sin C = [latex]\frac{\mathrm{AB}}{\mathrm{AC}}=\frac{1 \mathrm{k}}{2 \mathrm{k}}=\frac{1}{2}[/latex]
cos C = [latex]\frac{B C}{A C}=\frac{\sqrt{3} k}{2 k}=\frac{\sqrt{3}}{2}[/latex]

(i) sin A . cos C + cos A . sin C
= [latex]\frac{\sqrt{3}}{2} \cdot \frac{\sqrt{3}}{2}+\frac{1}{2} \cdot \frac{1}{2}=\frac{(\sqrt{3})^{2}}{4}+\frac{(1)^{2}}{4}[/latex]
= [latex]\frac{3}{4}+\frac{1}{4}=\frac{3+1}{4}=\frac{4}{4}[/latex] = 1

(ii) cos A. cos C-sin A. sin C
= [latex]\frac{1}{2} \cdot \frac{\sqrt{3}}{2}-\frac{\sqrt{3}}{2} \cdot \frac{1}{2}[/latex]
= [latex]\frac{\sqrt{3}}{4}-\frac{\sqrt{3}}{4}[/latex] = 0

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రయత్నించండి:

ప్రశ్న 1.
ఈ క్రింది వాటిని పరిశీలించి ప్రతి సందర్భములో ఘనాకు ఘనపరిమాణము మరియు వైశాల్యములలో ఏది పట అవసరమవుతుందో ? ఎందుచేతో వివరించండి.
సాధన.
(i) ఒక సీసాలో గల నీటి పరిమాణం
(ii) గుడారము తయారుచేయడానికి కావలసిన గుడ్డ పరిమాణము
(iii) ఒక లారీలో గల సంచుల సంఖ్య
(iv) సిలిండర్ లో నింపబడిన గ్యాస్ పరిమాణం
(v) ఒక అగ్గిపెట్టెలో నింపగల్గిన అగ్గిపుల్లల సంఖ్య (పేజీ నెం. 245)
సాధన.
(i) ఘనపరిమాణం – 3 – D ఆకారం
(ii) వైశాల్యం – ఉపరితల ప్రక్కతల మరియు సంపూర్ణతల వైశాల్యములు
(iii) ఘనపరిమాణం – 3 – D ఆకారం
(iv) ఘనపరిమాణం – 3 – D ఆకారం
(v) ఘనపరిమాణం – 3 – D ఆకారం

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 2.
పైన ఉదహరించిన విధముగా మరో 5 సందర్భములను నీవు తెలిపి మీ స్నేహితులను – ఘనపరిమాణము, వైశాల్యములలో ఏది అవసరమో ? చెప్పమని అడగండి. (పేజీ నెం. 245)
సాధన.
ప్రాజెక్ట్ వర్క్

ప్రశ్న 3.
ఇయ్యబడిన ఘనాకృతుల పటములను మీకు తెలిసిన ఘనాకృతులుగా విడదీయండి. (పేజీ నెం. 246)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 8

ప్రశ్న 4.
మీ చుట్టూ ఉన్న పరిసరాలలో మీరు గమనించిన 6 వివిధ ఆకృతుల సమ్మేళనముగా ఉన్న వస్తువులు పటములను గూర్చి ఆలోచించండి. (పేజీ నెం. 246)
సాధన.
ప్రాజెక్ట్ వర్క్.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రయతించండి:

ప్రశ్న 1.
మీకు తెలిసిన కొన్ని ఘనాకార వస్తువులను తీసుకొని రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను కలిపి మీ నిత్యజీవితంలో కనిపించే ఆకారాలను – వీలయినన్ని తయారు చేయండి. – – ASL, (సూచన : బంకమట్టి, బంతులు, పైపులు, కాగితపు శంఖాలు, ఘన, దీర్ఘఘనాకార పెట్టెలు మొదలగునవి) (పేజీ నెం. 252)
సాధన.
ప్రాజెక్ట్ వర్క్.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ఆలోచించి, చర్చించి, రాయండి:

ప్రశ్న 1.
స్థూపాకార పాత్రలో ఒక ఈ గోళము. అంతర్లీనపరచబడినది. అయినచో గోళము యొక్క ఉపరితల వైశాల్యము, స్థూపము యొక్క వక్రతల వైశాల్యమునకు సమానమవుతుందా ? మీ సమాధానము ‘అవును’ అయితే అది ఏవిధముగా సాధ్యమో సహేతుకముగా వివరింపుము. (పేజీ నెం. 252)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 11

అవును.
గోళం యొక్క ఉపరితల వైశాల్యం స్థూపం యొక్క వక్రతల వైశాల్యానికి సమానం అగును. స్థూపం యొక్క వ్యాసార్ధం = r
దాని ఎత్తు = h అనుకొనిన
వక్రతల స్థూపం ప్రక్కతల వైశాల్యము = 2πrh
మనం = 2πr (r + r) [∵ ఎత్తు = 2 × వ్యాసార్ధం = 2r]
= 2πr.(2r)
= 4πr2
∴ గోళం ఉపరితల వైశాల్యము = 4πr2.
∴ స్థూపం ప్రక్కతల వైశాల్యం = గోళం ఉపరితల వైశాల్యం .

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రయత్నించండి:

ప్రశ్న 1.
ఒక తీగ యొక్క మధ్యచ్ఛేద వ్యాసమును 5 శాతము తగ్గిస్తే’ దాని ఘనపరిమాణములో మార్పు లేకుండా ఉండటానికి దాని పొడవును, ఎంత శాతము పెంచాలో లెక్కింపుము. (పేజీ నెం. 257)
సాధన.
తీగ వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{5 \%}{2} \times \mathrm{x}[/latex]
∴ వ్యాసార్ధం = [latex]\frac{5 x}{2} \%[/latex]. [∵ r = x అనుకొనుము]
πr12h1 = πr22h2
⇒ r12h1 = r22h2
⇒ x2h1 = [latex]\left[x-\frac{5 x}{2 \times 100}\right]^{2}[/latex] × h2
= [latex]\left[x-\frac{x}{40}\right]^{2}[/latex] × h2
= [latex]\left(\frac{40 x-x}{40}\right)^{2}[/latex] × h2 = [latex]\left(\frac{39 x}{40}\right)^{2}[/latex] × h2
x2h1 = [latex]\frac{1521}{1600}[/latex] x2 × h2
h1 = [latex]\frac{1521}{16}[/latex]% × h2
∴ h1 = [latex]\frac{1521}{16}[/latex]% × h2
అనగా దాని ఘనపరిమాణం స్థిరంగా .మారకుండా ఉండవలెనంటే దాని పొడవు (ఎత్తు) [latex]\frac{1521}{16}[/latex]% పెంచాలి.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 2.
గోళము, ఘనము యొక్క ఉపరితల వైశాల్యములు సమానము. అయినచో వాటి ఘనపరిమాణముల నిష్పత్తిని కనుక్కోండి. (పేజీ నెం. 257)
సాధన.
సమఘనం భుజం = ‘a’ యూనిట్లు.
దాని సంపూర్ణతల వైశాల్యము = 6a2
లెక్క ప్రకారము, గోళం యొక్క ఉపరితల వైశాల్యము (4πr2) = ఘనం యొక్క ఉపరితల వైశాల్యము (6a2)
⇒ r2 = [latex]\frac{6 a^{2}}{4 \pi}[/latex]
r = [latex]\sqrt{\frac{6 \mathrm{a}^{2}}{4 \pi}}=\sqrt{\frac{3}{2 \pi}} \times \mathrm{a}[/latex]
ఘనం ఘనపరిమాణం (V) = a3
గోళం ఘనపరిమాణం (V) = [latex]\frac{4}{3}[/latex] πr3
= [latex]\frac{4}{3} \pi\left(\sqrt{\frac{3}{2 \pi}} \cdot a \times \sqrt{\frac{3}{2 \pi}} \cdot a \times \sqrt{\frac{3}{2 \pi}} \times a\right)[/latex]

= [latex]\frac{4}{3} \times \pi \times \frac{3 \sqrt{3}}{2 \pi \sqrt{2 \pi}} \times a^{3}[/latex]

= [latex]\frac{2 \sqrt{3}}{\sqrt{2 \pi}} a^{3}=\frac{\sqrt{6}}{\sqrt{\pi}} a^{3}[/latex]
∴ వాని ఘనపరిమాణాల నిష్పత్తి = a3 : [latex]\frac{\sqrt{6}}{\sqrt{\pi}}[/latex]a3
= 1 : [latex]\frac{\sqrt{6}}{\sqrt{\pi}}[/latex]
= √π : √6.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ఇవి చేయండి:

ప్రశ్న 1.
1 సెం.మీ. వ్యాసము, 8 సెం.మీ. పొడవు కల్గిన ఒక రాగి కడ్డీ 18 మీటర్లు పొడవు కల్గిన ఏక మందము గల తీగగా మలచబడినది. అయినచో తీగ యొక్క మందమును కనుగొనుము. (పేజీ నెం. 263)
సాధన.
రాగి కడ్డీ ఘనపరిమాణం = స్థూపం ఘనపరిమాణం = πr2h
= [latex]\frac{22}{7}[/latex] × [latex]\frac{1}{2}[/latex] × [latex]\frac{1}{2}[/latex] × 8 (∵ r = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{1}{2}[/latex] సెం.మీ.)
ఎత్తు (h) = 8 సెం.మీ.)
= [latex]\frac{44}{7}[/latex] సెం.మీ2
18 మీ. పొడవు గల సన్నని తీగగా రాగి కడ్డీని మలచగా దాని మందం (వ్యాసం)
⇒ πr2h = [latex]\frac{44}{7}[/latex]
⇒ [latex]\frac{22}{7}[/latex] × r2 × 18 = [latex]\frac{44}{7}[/latex]
⇒ r2 = [latex]\frac{{ }^{2} 44 \times 7}{7 \times 22 \times 18_{9}}[/latex]
⇒ r2 = [latex]\frac{1}{9}[/latex]
⇒ r = [latex]\sqrt{\frac{1}{9}}=\frac{1}{3}[/latex]= 0.3 సెం.మీ.
∴ రాగి కడ్డీ మందం (d) = 2 × r = 2 × 0.3
∴ d = 0.6 సెం.మీ.

ప్రశ్న 2.
ప్రవల్లిక ఇంటి పై కప్పుపై వాటర్ ట్యాంక్ స్థూపాకార.ఆకృతిలో నిర్మించబడింది. భూగర్భములో దీర్ఘ ఘనాకారములో యున్న సంప్ నుండి నీరు మోటారు సహాయముతో వాటర్ టాంకు పంపబడుతుంది. సంప్ యొక్క కొలతలు 1.57 మీటర్లు × 1.44 మీటర్లు × 9.5 సెం.మీ. వాటర్ ట్యాంక్ యొక్క వ్యాసార్ధము 60 సెం.మీ. మరియు ఎత్తు 95 సెం.మీ. నీటితో నిండుగా యున్న సంప్ నుండి నీటిని వాటర్ ట్యాంక్ నిండుగా నింపితే అందులో మిగిలి వున్న నీటి మట్టము యొక్క ఎత్తు ఎంత ? సంప్ మరియు వాటర్ ట్యాంకుల యొక్క నీటి నిల్వ సామర్థ్యములను పోల్చుము. (π = 3.14) (పేజీ నెం. 263) .
సాధన.
సంలోని నీటి ఘనపరిమాణం
V1 = 1.57 × 1.44 × 10.95 [∵ V = lbh]
= 2.14776 మీ3
V1 = 2147760 సెం.మీ.3
స్థూపాకార నీటి ట్యాంక్ ఘనపరిమాణం V2 = πr2h
= 44 × 60 × 60 × 95
V2 = 1073880 సెం.మీ3
ట్యాంకును నీటితో నింపిన తరువాత సం లో గల నీటి పరిమాణం = V1 – V2
= 2147760 – 1073880
= 1073880 సెం.మీ3
ట్యాంక్ లోని నీటి మట్టం ఎత్తు, h అనుకొనుము.
⇒ 157 × 144h = 1073880
h = [latex]\frac{1073880}{157 \times 144}[/latex]
= 47.5 సెం.మీ.
157 × 144 = 47.5
∴ సంస్లోని నీటి పరిమాణానికి మరియు ట్యాంక్ లోని నీటి పరిమాణానికి గల నిష్పత్తి = 2147760 : 1073880 = 2 : 1.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ఆలోచించి, చర్చించి, రాయండి:

ప్రశ్న 1.
ఏ పాత్ర ఎక్కువ నీటిని తనలో నింపుకొనగలదు ? మీ స్నేహితులతో చర్చించండి. (పేజీ నెం. 262)

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 22

సాధన.
(i) వ పటం నుండి వ్యాసార్ధం = r1
= 1 = 0.5 సెం.మీ.
ఎత్తు (h1) = 4 సెం.మీ.
V1 = మొదటి పాత్ర ఘనపరిమాణం = πr2h
= [latex]\frac{22}{7}[/latex] × 0.5 × 0.5 × 4
= 3.142 సెం.మీ3

(ii) వ పటంనుండి,
r = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{4}{2}[/latex] = 2 సెం.మీ.
ఎత్తు (h) = 1 సెం.మీ.
V2 = రెండవ పాత్ర ఘనపరిమాణం = πr2h
[latex]\frac{22}{7}[/latex] × 2 × 2 × 1
= 12.57 సెం.మీ3
∴ రెండవ పాత్ర ఘనపరిమాణం మొదటి పాత్ర ఘనపరిమాణం కంటే ఎక్కువ. [∵ V1 > V2]

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ఉదాహరణలు:

ప్రశ్న 1.
10 మీ. ఎత్తుగల శంఖాకారములో యున్న గుడారము యొక్క భూవ్యాసార్ధం 7 మీటర్లు. గుడారము నిర్మించ డానికి కావలసిన గుడ్డ పొడవును గుడ్డ యొక్క వెడల్పు 2 మీటర్లగా ఉన్నప్పుడు కనుగొనండి. (π = [latex]\frac{22}{7}[/latex] గా తీసుకొనుము) (పేజీ నెం. 247)
సాధన.
గుడారము యొక్క భూవ్యాసార్ధం (r) = 7 మీటర్లు.
ఎత్తు (h) = 10 మీటర్లు.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 1

∴ శంఖువు ఏటవాలు ఎత్తు (l) = [latex]\sqrt{\mathrm{r}^{2}+\mathrm{h}^{2}}[/latex]
(∵ l2 = r2 + h2)
= √49 + 100 = √149
= 12.2 మీటర్లు.
గుడారము యొక్క ఉపరితలవైశాల్యం = πrl
= [latex]\frac{22}{7}[/latex] × 7 × 12.2 చ.మీ.
= 268.4 చ.మీ. ఉపయోగించిన గుడ్డ యొక్క వైశాల్యం = 268.4 చ.మీ.
గుడ్డ యొక్క వెడల్పు = 2 మీ.
∴ గుడ్డ యుక్క పొడవు వెడల్పు = వైశాల్యం / వెడల్పు
= [latex]\frac{268.4}{2}[/latex]
= 134.2 మీ.

ప్రశ్న 2.
స్థూపాకృతిలోనున్న నూనె పీపా 2 మీటర్ల భూవ్యాసం మరియు 7 మీటర్ల ఎత్తును కల్గియున్నది. పీపాకు రంగు వేయడానికి పెయింటర్ 1 చదరపు మీటరునకు ₹ 3 లను తీసుకొంటుంటే, 10 నూనె పీపాలకు రంగు వేయడానికి ఎంత ఖర్చవుతుంది? (పేజీ నెం. 247)
సాధన.
స్థూపాకార నూనె పీపా యొక్క భూవ్యాసము (d) = 2 మీటర్లు
d 2 స్థూపము వ్యాసార్ధము (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{2}{2}[/latex] = 1 మీటరు.
స్థూపాకార ఎత్తు (b) = 7 మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 2

స్థూపాకార నూనె పీపా యొక్క సంపూర్ణతల వైశాల్యము = 2 × πr (r + h)
= 2 × [latex]\frac{22}{7}[/latex] × 1 (1 + 7)
= 2 × [latex]\frac{22}{7}[/latex] × 8
= 50.28 (మీటరు)2
అందుచే పీపా యొక్క సంపూర్ణతల వైశాల్యం = 50.28 (మీటరు)2
1చ.మీ.కు రంగు వేయడానికి అయ్యే ఖర్చు = ₹ 3
10 పీపాలకు రంగు వేయడానికయ్యే మొత్తం ఖర్చు = 50.28 × 3 × 10
= ₹ 1508.4.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 3.
ఒక గోళం, ఒక స్థూపం, ఒక శంఖువు ఒకే ఎత్తు, ఒకే .వ్యాసార్ధంలను కల్గియున్నాయి. అయినచో వాటి యొక్క వక్రతల వైశాల్యముల నిష్పత్తి ఎంత ? (పేజీ నెం. 248)
సాధన.
గోళం, స్థూపం మరియు శంఖువు యొక్క భూవ్యాసార్ధం ‘r’ అనుకొందాం.
గోళము ఎత్తు = వ్యాసం = 2r
∴ శంఖువు ఎత్తు = స్థూపము ఎత్తు = గోళము ఎత్తు = 2r.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 3

శంఖువు ఏటవాలు ఎత్తు = [latex]\sqrt{\mathrm{r}^{2}+\mathrm{h}^{2}}[/latex]
= [latex]\sqrt{r^{2}+(2 r)^{2}}=\sqrt{5} r[/latex]
S1 = గోళం ఉపరితల వైశాల్యం = 4πr2
S2 = స్థూపము ఉపరితల వైశాల్యం = 2πrh
= 2πr × πr = 4πr2
S3 = శంఖువు ఉపరితల వైశాల్యం = πrl
= πr × √5r
= √5πr2
∴ ఉపరితల వైశాల్యముల నిష్పత్తి = S1 : S2 : S3
S1 : S2 : S3 = 4πr2 : 4πr2 : √5 πr2
= 4 : 4 : √5.

ప్రశ్న 4.
ఒక కంపెనీ దళసరి ఉక్కుషీట్ నుపయోగించి 1000 అర్ధగోళాకారంలో ఉన్న బేసిన్లను తయారు చేయాలని అనుకొంది. అర్ధగోళాకార బేసిన్ వ్యాసార్థం 21 సెం.మీ ఉండే విధముగా 1000 బేసిన్లు తయారు చేయడానికి కావలసిన ఉక్కుషీట్ యొక్క వైశాల్యము ఎంత ? (పేజీ నెం. 248)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 4

అర్ధగోళాకార బేసిన్ వ్యాసార్ధం (r) = 21 సెం.మీ
ఉపరితల వైశాల్యం = 2πr2
= 2 × [latex]\frac{22}{7}[/latex] × 21 × 21
= 2772 (సెం.మీ)2.
అందుచే అర్ధగోళాకార బేసిన్ యొక్క ఉపరితల వైశాల్యం = 2772 (సెం.మీ)2.
1 బేసిన్ తయారీకి కావలసిన ఉక్కుషీట్ వైశాల్యం = 2772 (సెం.మీ)2
1000 బేసిన్ల తయారీకి కావలసిన మొత్తం ఉక్కుషీట్ వైశాల్యం = 2772 × 1000
= 2772000 సెం.మీ2 = 277.2 మీ2.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 5.
ఒక క్రమ వృత్తాకార స్థూపము .యొక్క భూవ్యాసార్ధం 14 సెం.మీ. మరియు ఎత్తు 21 సెం.మీ. అయిన ఈ క్రింది వాటిని కనుగొనుము.
(i) భూతల వైశాల్యం
(ii) వక్రతల వైశాల్యం
(iii) సంపూర్ణతల వైశాల్యం
(iv) క్రమ వృత్తాకార స్థూపము యొక్క ఘనపరిమాణం (పేజీ నెం. 249)
సాధన.
స్థూపపు భూవ్యాసార్ధం (r) = 14 సెం.మీ.
స్థూపపు ఎత్తు (h) = 21 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 5

(i) భూ వైశాల్యం = πr2
= [latex]\frac{22}{7}[/latex] (14)2
= 616 (సెం.మీ.)

(ii) వక్రతల వైశాల్యం = 2πrh
= 2 × [latex]\frac{22}{7}[/latex] × 14 × 21
= 1848 (సెం.మీ.)2.

(iii) సంపూర్ణతల వైశాల్యం = 2 × భూవైశాల్యం + వక్రతల వైశాల్యం
= 2 × 616 + 1848 = 3080 (సెం.మీ)2

(iv) స్థూపపు ఘనపరిమాణం = πr2h
= భూవైశాల్యం × ఎత్తు
= 616 × 21 = 12936 (సెం.మీ)2.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 6.
2.1 సెం.మీ. వ్యాసార్ధము కలిగిన గోళము యొక్క – ఉపరితల వైశాల్యం, ఘనపరిమాణములను కనుగొనుము. (π = [latex]\frac{22}{7}[/latex]గా తీసుకొనుము) పేజీ నెం. 249)
సాధన.
గోళ వ్యాసార్ధం (r) = 2.1 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 6

గోళం ఉపరితల వైశాల్యం = 4πr2
= 4 × [latex]\frac{22}{7} \times \frac{21}{10} \times \frac{21}{10}[/latex]
= [latex]\frac{1386}{25}[/latex]
= 55.44 (సెం.మీ)2
∴ గోళము ఘనపరిమాణము = [latex]\frac{4}{3}[/latex] πr3
= [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × (2.1)3
= [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 2.1 × 2.1 × 2.1
= 38.808 (సెం.మీ)3.

ప్రశ్న 7.
3.5 సెం.మీ. వ్యాసార్ధము కల్గిన అర్ధగోళము యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణములను కనుగొనుము. (π = [latex]\frac{22}{7}[/latex]) (పేజీ నెం. 150)
(లేదా) 7 సెం.మీ. వ్యాసముగా కలిగిన అర్ధ గోళం ఘనపరిమాణం మరియు సంపూర్ణతల వైశాల్యంలను కనుగొనండి. (π = [latex]\frac{22}{7}[/latex] గా తీసుకొనుము)
సాధన.
అర్ధగోళ వ్యాసార్ధము (r) = 3.5 సెం.మీ. = 1 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 7

∴ అర్ధగోళ ఘనపరిమాణము = [latex]\frac{2}{3}[/latex] πr3.
= [latex]\frac{2}{3} \times \frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2} \times \frac{7}{2}[/latex]
= [latex]\frac{539}{6}[/latex] = 89.88 (సెం.మీ)3.
∴ సంపూర్ణతల వైశాల్యం = 3πr2

ప్రశ్న 8.
ఒక లంబకోణ త్రిభుజము యొక్క భూమి 15 సెం.మీ మరియు ఎత్తు 20 సెం.మీ. దానిని కర్ణము వెంబడి భ్రమణము చేయగా ఏర్పడే ద్విశంఖువు ఆకారము యొక్క ఘనపరిమాణము మరియు ఉపరితల వైశాల్యము కనుక్కోండి. (π = 3.14) AS, (పేజీ నెం. 252)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 9

ABC లంబకోణ త్రిభుజం. AB = 15 సెం.మీ మరియు AC = 20 సెం.మీ.
పైథాగరస్ సిద్ధాంతము ప్రకారము ∆ABC లో
BC2 = AB2 + AC2
BC2 = 152 + 202
BC2 = 225 + 400 = 625
BC = √625 = 25
OA = x మరియు OB = y అనుకొందాం.
∆ABO మరియు ∆ABCలలో ∠BOA = ∠BAC మరియు ∠ABO = ∠ABC
అందుచే, ∆BOA ~ ∆BAC (∵ కోణము – కోణము సరూపకత)
అందుచే [latex]\frac{\mathrm{BO}}{\mathrm{BA}}=\frac{\mathrm{OA}}{\mathrm{AC}}=\frac{\mathrm{BA}}{\mathrm{BC}}[/latex]
⇒ [latex]\frac{y}{15}=\frac{x}{20}=\frac{15}{25}[/latex]

⇒ [latex]\frac{y}{15}=\frac{x}{20}=\frac{3}{5}[/latex]

⇒ [latex]\frac{y}{15}=\frac{3}{5}[/latex] మరియు [latex]\frac{x}{20}=\frac{3}{5}[/latex]

⇒ y = [latex]\frac{3}{5}[/latex] × 15 మరియు x = [latex]\frac{3}{5}[/latex] × 20

⇒ y = 9 మరియు x = 12
అందుచే, OA = 12 సెం.మీ మరియు OB = 9 సెం.మీ
ద్విశంఖువు ఘనపరిమాణము = శంఖువు CAA’ ఘనపరిమాణము + శంఖువు BAA’ ఘనపరిమాణము
= [latex]\frac{1}{3}[/latex] π(OA)2 OC + [latex]\frac{1}{3}[/latex] π (OA)2 OB
= [latex]\frac{1}{3}[/latex] × π × 122 × 16 + [latex]\frac{1}{3}[/latex] × π × 122 × 9
= [latex]\frac{1}{3}[/latex] × π × 144(16 + 9) (సెం.మీ)3
= [latex]\frac{1}{3}[/latex] × 3.14 × 144 × 25 (సెం.మీ)3
= 3768 (సెం.మీ)3.

సూచన :
= [latex]\frac{1}{3}[/latex] × π(OA)2 [OC + OB]
= [latex]\frac{1}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 122 × [16 + 9]
= [latex]\frac{1}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 144 × 25
ద్విశంఖువు ఉపరితల వైశాల్యము = 0 శంఖువు CAA’ వక్రతల వైశాల్యము + శంఖువు BAA’ వక్రతల వైశాల్యము.
= (π × OA × AC) + (π × OA × AB)
= (π × 12 × 20) + (π × 12 × 15) (సెం.మీ)2
= 420 π (సెం.మీ)2
= 420 × 3.14 (సెం.మీ)2
= 1318.8 (సెం.మీ)2

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 9.
ఇచ్చిన పటంలో చూపిన విధముగా కర్రతో చేసిన రాకెట్ బొమ్మ స్థూపముపై నిలిపిన శంఖువు వలే ఉన్నది. రాకెట్ యొక్క ఎత్తు 26 సెం.మీ, శంఖువు ఆకారములో యున్న భాగము ఎత్తు 6 సెం.మీ, శంఖువు, ఆకారము భాగము భూవ్యాసము 5 సెం.మీ మరియు స్థూపాకార భాగము యొక్క భూవ్యాసము 3 సెం.మీ. శంఖాకృతి భాగముకు నారింజరంగు, స్థూపాకార
భాగముకు పసుపు రంగు వేస్తే, ఈ రంగులు వేయడానికి కావలసిన రాకెట్ వైశాల్యమును విడివిడిగా కనుగొనుము. (ప్రశ్న = 3.14) (పేజీ నెం.254)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 10

శంఖువు (ఆకారము యొక్క భూవ్యాసార్ధము (r) మరియు ఏటవాలు ఎత్తు ‘l’ అనుకొందాం. స్థూపాకార భాగము యొక్క భూవ్యసార్ధము r1 మరియు ఎత్తు h1 అనుకొందాం.
r = 2.5 సెం.మీ; h = 6 సెం.మీ r1 = 1.5 సెం.మీ. h1 = 20 సెం.మీ
ఇపుడు, l = [latex]\sqrt{\mathrm{r}^{2}+\mathrm{h}^{2}}[/latex]
⇒ l = [latex]\sqrt{(2.5)^{2}+6^{2}}[/latex]
l = [latex]\sqrt{6.25+36}[/latex]
l = [latex]\sqrt{42.25}[/latex] = 6.5
నారింజ రంగు వేయబడిన భాగము వైశాల్యము .
∴ శంఖువు యొక్క వక్రతల వైశాల్యము = πrl
= 3.14 {2.5 × 6.5} = 51.025 (సెం.మీ)2
పసుపురంగు వేయబడిన భాగము వైశాల్యం = స్థూపము యొక్క వక్రతల వైశాల్యం + మన స్థూపం యొక్క భూవైశాల్యం
= 2πr1h1 + πr12 = πr1 (2h1 + r1)
= 3.14 × 1.5 (2 × 20 + 1.5) సెం.మీ2
= 3.14 × 11.5 × 41.5 (సెం.మీ)2
= 4.71 × 41.5 (సెం.మీ)2 .
= 195.465 (సెం.మీ).
అందుచే పసుపురంగు వేయబడిన భాగము వైశాల్యము = 195.465 (సెం.మీ) .

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 10.
‘ఒక చివర ‘ అర్ధగోళాకారంను మరో చివర క్రమ వృత్తాకార శంఖువు ఆకారమును కల్గిన క్రమ వృత్తాకార స్థూపాకార ఘనాకృతి ఆట వస్తువు యొక్క ఉమ్మడి వ్యాసము 4.2 సెం.మీ, స్థూపాకార, శంఖువు ఆకార భాగముల యొక్క ఎత్తులు వరుసగా 12 సెం.మీ మరియు 7 సెం.మీ అయితే ఘనాకార ఆటవస్తువు యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి. (π = [latex]\frac{22}{7}[/latex] గా తీసుకొనుము). (పేజీ నెం. 257)
సాధన.
శంఖువు ఆకార భాగము యొక్క ఎత్తు h1 = 7 సెం.మీ.
స్థూపాకార భాగము యొక్క ఎత్తు h2 = 12 సెం.మీ.
వ్యాసార్ధము (r) = [latex]\frac{4.2}{2}[/latex] = 2.1 = [latex]\frac{21}{10}[/latex] సెం.మీ.
ఆటవస్తువు యొక్క ఘనపరిమాణము = శంఖువు ఆకార భాగ ఘనపరిమాణం – + స్థూపాకార ఆకార భాగ ఘనపరిమాణం + అర్ధగోళాకార భాగ ఘనపరిమాణం

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 12

= [latex]\frac{1}{3}[/latex] πr2h1 + πr2h2 + [latex]\frac{2}{3}[/latex] πr3
= πr2[[latex]\frac{1}{3}[/latex] h1 + h2 + [latex]\frac{2}{3}[/latex]r]
= [latex]\frac{22}{7} \times\left(\frac{21}{10}\right)^{2} \times[/latex] [latex]\left[\frac{1}{3} \times 7+12+\frac{2}{3} \times \frac{21}{10}\right][/latex]

= [latex]\frac{22}{7} \times \frac{441}{100} \times\left[\frac{7}{3}+\frac{12}{1}+\frac{7}{5}\right][/latex]

= [latex]\frac{22}{7} \times \frac{441}{100} \times\left[\frac{35+180+21}{15}\right][/latex]

= [latex]\frac{22}{7} \times \frac{441}{100} \times \frac{236}{15}[/latex]

= [latex]\frac{27258}{125}[/latex] = 218.064 (సెం.మీ.)3

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 11.
12 సెం.మీ వ్యాసము మరియు 15 సెం.మీ. ఎత్తు కలిగిన ఒక స్థూపాకార పాత్ర ఐస్ క్రీంతో నింపబడినది. ఈ ఐస్ క్రీంను పై తలం అర్ధగోళాకారంలో ఉన్న శంఖువులలో సమానముగా నింపి 10 మంది పిల్లలకు పంచబడినది. శంఖువు ఆకారభాగపు ఎత్తు, భువ్యాసమునకు రెట్టింపు ఉన్నచో ఐస్ క్రీంకోన్ యొక్క వ్యాసమును కనుగొనుము. (పేజీ నెం. 258)
సాధన.
శంఖువు ఆకార ఐస్ క్రీం యొక్క భూవ్యాసార్ధము (r) = x సెం.మీ అనుకొందాం.
వ్యాసం = 25 సెం.మీ.;
అప్పుడు దాని ఎత్తు = 2(భూవ్యా సము) = 2(2x) = 4x సెం.మీ.
ఐస్ క్రీం కోన్ యొక్క ఘనపరిమాణం = శంఖువు ఆకార భాగము ఘనపరిమాణం + అర్ధగోళాకృతి భాగం ఘనపరిమాణం

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 13

= [latex]\frac{1}{3}[/latex] πr2h + [latex]\frac{2}{3}[/latex] πr3
= [latex]\frac{1}{3}[/latex] πx2(4x) + [latex]\frac{1}{3}[/latex] πx3 (∵ r = x)
= [latex]\frac{4 \pi x^{3}+2 \pi x^{3}}{3}=\frac{6 \pi x^{3}}{3}[/latex]
= 2πx3 (సెం.మీ)3
స్థూపాకార పాత్ర యొక్క వ్యాసము = 12 సెం.మీ
దాని ఎత్తు (h) = 15 సెం.మీ .
∴ స్థూపాకార పాత్ర యొక్క ఘనపరిమాణం = πr2 h = π(6)2 15 = 5407 (సెం.మీ)3
ఐస్ క్రీం పంచబడిన విద్యార్థుల సంఖ్య = 10
(స్థూపాకార పాత్ర యొక్క ఘనపరిమాణం) / (ఒక ఐస్ క్రీం కోన్ యొక్క ఘనపరిమాణం) = 10
⇒ [latex]\frac{540 \pi}{2 \pi \mathrm{x}^{3}}[/latex] = 10
⇒ 2πx3 × 10 = 540π
⇒ x3 = [latex]\frac{540}{2 \times 10}[/latex] = 27
⇒ x3 = 33
⇒ x = 3
∴ ఐస్ క్రీం కోన్ యొక్క వ్యాసం = 2x = 2(3) = 6 సెం.మీ.

ప్రశ్న 12.
క్రింది పటములో చూపిన విధముగా అర్ధగోళాకృతిపై నిటారుగా క్రమ వృత్తాకార శంఖువును నిలిపినట్లు ఉన్న ఘనాకార వస్తువును నీటితో పూర్తిగా నింపబడి ఉన్న ఒక క్రమ వృత్తాకార స్థూపాకృతి వస్తువులో దాని అడుగుభాగమును తాకేటట్లుగా ముంచబడినది. స్థూపము యొక్క భూవ్యాసార్ధము 3 సెం.మీ మరియు ఎత్తు 6సెం.మీ, అర్ధగోళము యొక్క వ్యాసార్ధము 2 సెం.మీ, శంఖువు ఎత్తు 4 సెం.మీ.గా ఉంటే స్థూపంలో మిగిలియున్న నీటి యొక్క ఘనపరిమాణం ఎంత ? (π = [latex]\frac{22}{7}[/latex] గా తీసుకొనుము). (పేజీ నెం. 259)
సాధన.
ABCD స్థూపము, LMN అర్ధగోళము, OLM శంఖువు అర్ధగోళముపై నిలుపబడిన క్రమ వృత్తాకార శంఖువు ఆకార వస్తువును స్థూపముతో ముంచబడితే తొలగింపబడిన నీటి ఘనపరిమాణము వస్తువు యొక్క ఘనపరిమాణమునకు సమానము. స్టూపము యొక్క ఘనపరిమాణం = πr2h
π × 32 × 6 = 54π (సెం.మీ)3
అర్ధగోళము యొక్క ఘనపరిమాణం

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 14

= [latex]\frac{2}{3}[/latex] πr3
= [latex]\frac{2}{3}[/latex] × π × 23
= [latex]\frac{16}{3}[/latex] π (సెం.మీ)3
శంఖువు యొక్క ఘనపరిమాణం = [latex]\frac{1}{3}[/latex] πr2h
= [latex]\frac{1}{3}[/latex] × π × 22 × 4
= [latex]\frac{16}{3}[/latex] π (సెం.మీ.)3
శంఖువు మరియు అర్ధగోళము యొక్క ఘనపరిమాణం = [latex]\frac{16}{3}[/latex] π + [latex]\frac{16}{3}[/latex] π
= [latex]\frac{32}{3}[/latex] π
స్థూపాకార వస్తువు నుండి తొలగింపబడిన నీటి ఘనపరిమాణం = (స్తూపము ఘనపరిమాణం) – (శంఖువు మరియు అర్ధగోళము యొక్క ఘనపరిమాణం)
= 54 π – [latex]\frac{32 \pi}{3}[/latex]
= [latex]\frac{162 \pi-32 \pi}{3}=\frac{130 \pi}{3}[/latex]
= [latex]\frac{130}{3} \times \frac{22}{7}=\frac{2860}{21}[/latex]
= 136. 19 (సెం.మీ)2

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 13.
స్థూపాకారముగానున్న పెన్సిల్ ను ఒక చివర చెక్కి ఆ చివరను ఒక శంఖువు ఆకృతిలో మారిస్తే దాని పొడవులో మార్పులేకుండా), పెన్సిల్ యొక్క వ్యాసము 1 సెం.మీ|| మరియు శంఖువు ఆకృతి భాగము యొక్క ఎత్తు 2 సెం.మీ అయినపుడు చెక్కబడిన భాగము యొక్క ఘనపరిమాణము ఎంత ? (π = [latex]\frac{355}{113}[/latex] గా తీసుకొనుము). (పేజీ నెం. 260)

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 15

సాధన.
పెన్సిల్ యొక్క వ్యాసము = 1 సెం.మీ .
పెన్సిల్ యొక్క వ్యాసార్ధము (r) = 0.5 సెం.మీ
శంఖువు ఆకార భాగము యొక్క పొడవు (ఎత్తు) = h
= 2 సెం.మీ
చెక్కబడిన భాగము ఘనపరిమాణం = 2 సెం.మీ
పొడవు, 0.5 సెం.మీ
భూవ్యాసార్ధము గల స్థూపాకృతి ఘనపరిమాణం – ఈ స్థూపముచే ఏర్పడిన శంఖువు ఘనపరిమాణం
= πr2h – [latex]\frac{1}{3}[/latex] πr2h = [latex]\frac{2}{3}[/latex] πr2h
= [latex]\frac{2}{3}[/latex] × [latex]\frac{355}{113}[/latex] × (0.5)2 × 2 సెం.మీ3
= 1.05 సెం.మీ3.

ప్రశ్న 14.
24 సెం.మీ ఎత్తు, 6 సెం.మీ భూవ్యాసార్ధము కల్గిన శంఖువు ఆకార మట్టి ముద్ద ఉన్నది. ఒక బాలుడు దానిని ఒక గోళముగా మారిస్తే, ఆ గోళము యొక్క వ్యాసార్ధము ఎంత ? (పేజీ నెం. 262)
సాధన.
శంఖువు ఘనపరిమాణం = [latex]\frac{1}{3}[/latex] × π × 6 × 6 × 24 (సెం.మీ)
గోళము యొక్క వ్యాసార్ధము r అయితే దాని ఘనపరిమాణం, = [latex]\frac{4}{3}[/latex] πr3
3 . శంఖువు ఆకారములో ఉన్న మట్టి ముద్ద గోళాకృతిలో మార్చబడినది కనుక ఘనపరిమాణములో మార్పు ఉండదు. కనుక ,
[latex]\frac{4}{3}[/latex] πr3 = [latex]\frac{1}{3}[/latex] × π × 6 × 6 × 24
r3 = 3 × 3 × 24 = 3 × 3 × 3 × 8
r = 33 × 2
r = 3 × 2 = 6
∴ గోళము వ్యాసార్ధము = 6 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 15.
ఒక బోలు అర్ధగోళము యొక్క అంతర, బాహ్య వ్యాసములు వరుసగా 6 సెం.మీ. మరియు 10 సెం.మీ. దానిని 14 సెం.మీ. వ్యాసముగా గల ఒక స్థూపాకార ఘనముగా మలిస్తే, దాని యొక్క ఎత్తు ఎంత ? (పేజీ నెం. 263)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 16

బోలు అర్ధగోళం యొక్క వ్యాసార్ధము = [latex]\frac{10}{2}[/latex] = 5 సెం.మీ. = R
అంతర వ్యాసార్ధము = [latex]\frac{6}{2}[/latex] = 3 సెం.మీ. = r
బోలు అర్ధగోళ పాత్ర యొక్క ఘనపరిమాణం = బాహ్య ఘనపరిమాణం – అంతర ఘనపరిమాణం
= [latex]\frac{2}{3}[/latex]πR3 – [latex]\frac{2}{3}[/latex]πr3
= [latex]\frac{2}{3}[/latex]π (R3 – r3)

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 17

= [latex]\frac{2}{3}[/latex]π (53 – 33)
= [latex]\frac{2}{3}[/latex]π (125 – 27)
= [latex]\frac{2}{3}[/latex]π × 98 (సెం.మీ.)3
= [latex]\frac{196 \pi}{3}[/latex] (సెం.మీ)3 ……….. (1)
బోలు ఘనపు అర్ధగోళము, స్థూపాకార ఘనముగా మలచబడినది .
కనుక రెండింటి ఘనపరిమాణము సమానం.
స్థూపాకార ఘనము యొక్క వ్యాసం = 14 సెం.మీ. (ఇచ్చినది)
అందుచే స్థూపాకార ఘనము వ్యాసార్ధము = 7 సెం.మీ.
స్థూపము యొక్క ఎత్తు = h అనుకొందాం.
∴ స్థూపము యొక్క ఘనపరిమాణం = πr2h
= π × 7 × 7 × h (సెం.మీ)3
= 49πh (సెం.మీ)3 ………. (2)
సమస్యలో ఇచ్చిన దత్తాంశము ప్రకారం, బోలు అర్ధగోళాకార పాత్ర యొక్క ఘనపరిమాణం = ఘనస్థూపము యొక్క ఘనపరిమాణం
[latex]\frac{196}{3}[/latex] π = 49 πh
(1), (2) సమీకరణముల నుండి)
⇒ h = [latex]=\frac{196}{3 \times 49}=\frac{4}{3}[/latex] సెం.మీ.
∴ స్థూపము యొక్క ఎత్తు = 1.33 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 16.
15 సెం.మీ. అంతర వ్యాసార్ధముగా గల అర్ధగోళాకార పాత్రలో ద్రవము నింపబడినది. ఆ ద్రవమును 5 సెం.మీ. వ్యాసము మరియు 6 సెం.మీ. ఎత్తు కల్గిన స్థూపాకార సీసాలో నింపారు. పాత్రలోని ద్రవమును నింపడానికి ఎన్ని సీసాలు అవసరం ? (పేజీ నెం. 264)
సాధన.
అర్ధగోళము ఘనపరిమాణం = [latex]\frac{2}{3}[/latex] πr3
అర్ధగోళ అంతర వ్యాసార్ధం (r) = 15 సెం.మీ.
∴ అర్ధగోళాకార పాత్రలో నింపబడిన ద్రవ ఘనపరిమాణం = [latex]\frac{2}{3}[/latex]π(15)3 (సెం.మీ)3
= 22507 (సెం.మీ) స్థూపాకార సీసా యొక్క ఎత్తు (h) = 6 సెం.మీ.
స్థూపాకార సీసా యొక్క వ్యాసార్ధం (R) = [latex]\frac{5}{2}[/latex] సెం.మీ3.
∴ స్థూపాకార సీసా ఘనపరిమాణం = πR2h
= π × ([latex]\frac{5}{2}[/latex])2 × 6 (సెం.మీ)3
= [latex]\frac{75}{2}[/latex]π (సెం.మీ)3
ద్రవమును నింపడానికి కావలసిన సీసాల సంఖ్య = (అర్ధగోళాకార పాత్ర యొక్క ఘనపరిమాణం) / (స్థూపాకార సీసా యొక్క ఘనపరిమాణం)
= [latex]\frac{2250 \pi}{\frac{75}{2} \pi}=\frac{2 \times 2250}{75}[/latex]
= 60

ప్రశ్న 17.
6 సెం.మీ. వ్యాసము కలిగిన ఒక ఘనపు గోళమును కరిగించి 0.2 సెం.మీ. మధ్యచ్ఛేద వ్యాసము కల్గిన తీగగా మలిస్తే ఆ తీగ పొడవు ఎంత ? (పేజీ నెం. 265)
సాధన.
ఘనపు గోళము వ్యాసం = 6 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 18

స్థూపాకార తీగ యొక్క మధ్యచ్ఛేద వ్యాసం = 0.2 సెం.మీ.
వ్యాసార్ధం = 0.1 సెం.మీ.
తీగ యొక్క పొడవు l సెం.మీ. అనుకొందాం.
ఘనపు గోళము స్థూపకార తీగగా మలచబడినది కనుక తీగ పొడవును స్థూపాకార తీగ ఎత్తుగా పరిగణించవచ్చు.
తీగలో ఉపయోగించబడిన లోహ ఘనపరిమాణం = గోళ ఘనపరిమాణం
π × (0.1)2 × l = [latex]\frac{4}{3}[/latex] × π × 33
π × ([latex]\frac{1}{10}[/latex])2 × 1= [latex]\frac{4}{3}[/latex] × π × 27
l = [latex]\frac{36 \pi \times 100}{\pi}[/latex] సెం.మీ.
= 3600 సెం.మీ. = 36 మీటర్లు
∴ తీగ యొక్క పొడవు (l)= 36 మీటర్లు.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 18.
44 సెం.మీ. భుజము కొలతగా గల ఒక సీసపు ఘనమును 4 సెం.మీ. వ్యాసము కల్గిన ఎన్ని గోళాకార బంతులుగా మార్చవచ్చు? (పేజీ నెం. 266)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 20

సీసపు ఘనభుజము = 44 సెం.మీ.
గోళము వ్యాసార్ధము = [latex]\frac{4}{2}[/latex] మీ. = 2 సెం.మీ.
గోళము ఘనపరిమాణం = [latex]\frac{4}{3}[/latex] πr3
= [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 23 (సెం.మీ.)
= [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 8 (సెం.మీ.)3
∴ సీసపు ఘనమును × గోళములుగా తయారుచేస్తే, × గోళముల మొత్తము ఘనపరిమాణం = [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 8 × x (సెం.మీ.)3
∴ x గోళముల మొత్తము ఘనపరిమాణం = సీసపు ఘనము యొక్క ఘనపరిమాణం
⇒ [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 8 × x = (44)3
⇒ [latex]\frac{4}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 8 × x = 44 × 44 × 44
⇒ x = [latex]\frac{44 \times 44 \times 44 \times 3 \times 7}{4 \times 22 \times 8}[/latex]
x= 2541
అందుచే తయారుచేయబడిన గోళముల సంఖ్య = 2541.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి InText Questions

ప్రశ్న 19.
ఒక స్వయం సహాయక బృందం (డ్వాక్రా) దీర్ఘఘనాకృతిలో ఉన్న 66 సెం.మీ., 42 సెం.మీ., 21 సెం.మీ. కొలతలు కలిగిన మైనపు దిమ్మను ఉపయోగించి 4.2 సెం.మీ. వ్యాసం, 2.8 సెం.మీ. ఎత్తు కలిగిన స్థూపాకార కొవ్వొత్తులను తయారు చేయాలనుకొన్నారు. వారు తయారు చేయగల్గే కొవ్వొత్తుల సంఖ్యను కనుగొనండి. (పేజీ నెం. 266)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి InText Questions 21

దీర్ఘఘనాకార మైనపు దిమ్మ యొక్క ఘనపరిమాణం = lbh = (66 × 42 × 21) సెం.మీ3.
స్థూపాకార కొవ్వొత్తి యొక్క వ్యాసార్థం = [latex]\frac{4.2}{2}[/latex] సెం.మీ. = 2.1 సెం.మీ.
స్థూపాకార కొవ్వొత్తి యొక్క ఎత్తు = 2.8 సెం.మీ.
కొవ్వొత్తి ఘనపరిమాణం = πr2h
= [latex]\frac{22}{7}[/latex] × (2.1)2 × 2.8
స్థూపాకార కొవ్వొత్తుల యొక్క మొత్తము ఘనపరిమాణం = [latex]\frac{22}{7}[/latex] × 2.1 × 2.1 × 2.8
∵ స్థూపాకార కొవ్వొత్తుల యొక్క ఘనపరిమాణం = దీర్ఘఘనాకృతిలో యున్న మైనపు దిమ్మ ఘనపరిమాణం
∴ [latex]\frac{22}{7}[/latex] × 2.1 × 2.1 × 2.8 × x = 66 × 42 × 21
x = [latex]\frac{66 \times 42 \times 21 \times 7}{22 \times 2.1 \times 2.1 \times 2.8}[/latex] = 1500
∴ తయారుచేయబడిన స్థూపాకార కొవ్వొత్తుల సంఖ్య = 1500.

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

SCERT AP 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 4th Lesson సరళ రేఖలు మరియు కోణములు Exercise 4.4

ప్రశ్న 1.
ఇచ్చిన త్రిభుజంలో x, y మరియు z ల విలువలను కనుగొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 1
సాధన.
పటం (i) లో
x° = 50° + 60°
(∵ ఒక త్రిభుజంలో బాహ్య కోణము, అంతరాభిముఖ కోణాల మొత్తంకు సమానము)
∴ x = 110°

పటం (ii) లో
° = 60° + 70°
(∵ ఒక త్రిభుజంలో బాహ్య కోణము, అంతరాభిముఖ కోణాల మొత్తంకు సమానము)
∴ z = 130°

పటం (iii) లో
y° = 35° + 45° = 80°
∴ y° = 80°
(∵ ఒక త్రిభుజంలో బాహ్య కోణము, అంతరాభిముఖ కోణాల మొత్తంకు సమానము)

ప్రశ్న 2.
ఇచ్చిన పటంలో AS // BT; ∠4 = ∠5, ∠ASTని [latex]\overline{\mathrm{SB}}[/latex] కోణసమద్విఖండన చేస్తుంది. అయిన ∠1 విలువను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 2
సాధన.
దత్తాంశము AS // BT.
∠4 = ∠5 మరియు [latex]\overline{\mathrm{SB}}[/latex], ∠AST ను కోణసమద్వి ఖండన చేయును.
∴ లెక్క ప్రకారము ∠2 = ∠3 ………….. (1)
AS // BT రేఖల నుండి ∠2 = ∠5 (∵ ఏకాంతర కోణాలు)
∴ ΔBST లో ∠3 = ∠5 = ∠4 కావున
ΔBST ఒక సమబాహు త్రిభుజము మరియు ప్రతి కోణము 60° లుగా వుండును.
∴ ∠3 = ∠2 = 60° [సమీకరణము (1) నుండి]
ఇప్పుడు ∠1 + ∠2 + ∠3 = 180°
∴ ∠1 + 60° + 60° = 180°
[∵ ఒక రేఖ పై గల బిందువు వద్ద కోణములు]
∴ ∠1 = 180° – 120° = 60°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

ప్రశ్న 3.
ఇచ్చిన పటంలో AB // CD; BC // DE అయిన x, y ల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 3
సాధన.
దత్తాంశము నుండి AB // CD మరియు BC // DE.
∴ 3x = 105°
(∵ AB // CD కావున సమాంతర కోణములు)
x = [latex]\frac{105^{\circ}}{3}[/latex] = 35°
అదే విధముగా BC // DE
∴ ∠D = 105° (∵ ఏకాంతర కోణములు)
ఇప్పుడు ΔCDE లో
24° + 105° + y = 180° (∵ కోణముల మొత్తము)
∴ y = 180° – 129° = 51°

ప్రశ్న 4.
కింద పటంలో BE ⊥ DA మరియు CD ⊥ DA అని ఇవ్వబడినది. అయిన ∠1 ≅ ∠3 అని చూపండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 4
సాధన.
దత్తాంశము ప్రకారము
BE ⊥ DA మరియు CD ⊥ DA.
⇒ CD మరియు BE లు DA రేఖకు లంబాలు.
⇒ CD // BE (లేక) ∠D = ∠E ⇒ CD // BE
(∵ CD, BE రేఖలకు DA తిర్యగ్రేఖ అయిన ఆసన్న కోణాలు సమానము)
ఇప్పుడు ∠1 = ∠3 అని (∵ ఏకాంతర కోణాలు) నిరూపించబడినది.

ప్రశ్న 5.
x, y ల ఏ విలువలకు, AD, BC రేఖలు సమాంతర రేఖలు అవుతాయి ?
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 5
సాధన.
AD, BC రేఖలు సమాంతరాలు.
x – y = 30° …….. (1) (∵ ఆసన్న కోణాలు)
2x = 8y …………….. (2) (∵ ఏకాంతర కోణాలు)
(1) & (2) లను సాధించగా,
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 6
y = 10° ను సమీకరణము (1) లో ప్రతిక్షేపించగా,
x – 10° = 30° ⇒ x = 40°
∴ x = 40° మరియు y = 10°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

ప్రశ్న 6.
పటంలో x, y ల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 7
సాధన.
పటం నుండి y + 140° = 180° (∵ రేఖీయద్వయం)
∴ y = 180° – 140° = 40°
మరియు x° = 30° + y°
(∵ బాహ్యకోణము = అంతరాభిముఖ కోణాల మొత్తం)
x° = 30° + 40° = 70°

ప్రశ్న 7.
కింది పటంలో, బాణం గుర్తులచే సూచింపబడిన రేఖాఖండములు సమాంతరములు అయిన x, y ల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 8
సాధన.
పటం నుండి
x° = 30° (∵ ఏకాంతర కోణాలు)
y° = 45° + x° (∵ బాహ్యకోణం = అంతరాభిముఖ కోణాల మొత్తము)
y = 45° + 30° = 75°

ప్రశ్న 8.
ఇచ్చిన పటంలో ∠PQR భుజాలు వరుసగా QP మరియు RQ, S మరియు T బిందువుల వద్దకు పొడిగించ బడ్డాయి. ∠SPR = 135°, ∠PQT = 110° అయిన ∠PRQ కొలతలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 9
సాధన.
దత్తాశం నుండి ∠SPR = 135° మరియు ∠PQT = 110°
పటము నుండి,
∠SPR + ∠RPQ = 180°
∠PQT + ∠PQR = 180° [∵ రేఖీయద్వయం]
⇒ ∠RPQ = 180° – ∠SPR
= 180° – 135° = 45°
⇒ ∠PQR = 180° – ∠PQT.
= 180° – 110° = 70°
ΔPQRలో ∠RPQ + ∠PQR + ∠PRQ = 180°
∴ 45° + 70° + ∠PRQ = 180°
∴ ∠PRQ = 180° – 115° = 65°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

ప్రశ్న 9.
ఇచ్చిన పటంలో ∠X = 62°; ∠XYZ = 54°. ΔXYZ లో ∠XYZ మరియు ∠XZY ల కోణ సమద్విఖండన రేఖలు వరుసగా YO మరియు ZO అయిన ∠OZY మరియు ∠YOZ ల కొలతలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 10
సాధన.
దత్తాంశం నుండి ∠X = 62° మరియు ∠Y = 54°
∠XYZల కోణ సమద్విఖండన రేఖలు వరుసగా YO మరియు ZO లు అగును.
ΔXYZలో
∠X + ∠XYZ + ∠XZY = 180°
62° + 54° + ∠XZY = 180°
⇒ ∠XZY = 180° – 116° = 64°
ΔOYZ లో
∠OYZ = [latex]\frac {1}{2}[/latex]∠XYZ = [latex]\frac {1}{2}[/latex] × 54° = 27
(∵ ∠XYZ యొక్క కోణ సమద్విఖండన రేఖ YO)
∠OZY = [latex]\frac {1}{2}[/latex]∠XZY = [latex]\frac {1}{2}[/latex] × 64° = 32°
(∵ ∠XYZ యొక్క కోణ సమద్విఖండన రేఖ OZ)
మరియు ∠OYZ + ∠OZY + ∠YOZ = 180°
⇒ 27° + 32° + ∠YOZ = 180°
⇒ ∠YOZ = 180° – 59° = 121°

ప్రశ్న 10.
ఇచ్చిన పటంలో AB || DE, ∠BAC = 35° మరియు ∠CDE = 53° అయిన ∠DCE కొలతలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 11
సాధన.
దత్తాంశం ప్రకారం AB || DE, ∠BAC = 35° మరియు ∠CDE = 53°
∠BAC = ∠E = 35° (∵ ఏకాంతర కోణాలు)
ΔCDE లో
∠C + ∠D + ∠E = 180°
∴ ∠DCE + 53° + 35° = 180°
⇒ ∠DCE = 180° – 88° = 92°

ప్రశ్న 11.
ఇచ్చిన పటంలో PQ, RS లు T బిందువు వద్ద ఖండించు కొంటాయి. ∠PRT = 40°, ∠RPT = 95° మరియు ∠TSQ = 75° అయిన కొలతలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 12
సాధన.
దత్తాంశం నుండి ∠PRT = 40°; ∠RPT = 95%; మరియు ∠TSQ = 75°
ΔPRT లో ∠P + ∠R + ∠PTR = 180° (∵ త్రిభుజ కోణాల ధర్మం )
95° + 40° + ∠PTR = 180°
⇒ ∠PTR = 180° – 135° = 45°
∴ ∠PTR = ∠STQ (∵ శీర్షాభిముఖ కోణాలు)
ΔSTQ లో ∠S + ∠Q + ∠STQ = 180° (∵ త్రిభుజ కోణాల ధర్మం)
75° + ∠SQT + 45° = 180°
∴ ∠SQT = 180° – 120° = 60°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

ప్రశ్న 12.
కింది పటంలో ΔABC లో ∠B = 50° మరియు ∠C = 70°. AB, AC భుజాలు పొడిగించగా ఏర్పడిన బాహ్యకోణాల కోణసమద్విఖండన రేఖలు ఖండించుకొనగా ‘z’ ఏర్పడినది. ‘z’ విలువను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 13
సాధన.
దత్తాంశం నుండి ΔABC లో ∠B = 50° మరియు ∠C = 70°
AB, AC లను పొడిగించగా ఏర్పడిన, బాహ్యకోణాల కోణ సమద్విఖండన రేఖలు ఖండించుకొనగా z ఏర్పడినది.
పటం నుండి 50° + 2x = 180°
70° + 2y = 180
∴ 2x = 180° – 50
2x = 130°
x = [latex]\frac{130^{\circ}}{2}[/latex]
= 65°

2y = 180° – 70°
2y = 110°
y = [latex]\frac{110^{\circ}}{2}[/latex]
= 55°

ΔBOC లో x + y + z = 180°
65° + 55° + z = 180°
z = 180° – 120° = 60°

ప్రశ్న 13.
ఇచ్చిన పటంలో PQ ⊥ PS, PQ // SR, ∠SQR = 28° మరియు ∠QRT = 65° అయిన x, y విలువలు కనుగొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 14
సాధన.
దత్తాంశం నుండి PQ ⊥ PS; PQ // SR
∠SQR = 28°, ∠QRT = 65°
పటం నుండి ∠QSR = x° (∵ PQ // SR రేఖల ఏకాంతర కోణాలు)
65° = x + 28° (∵ బాహ్యకోణం = అంతరాభిముఖ కోణాల మొత్తం)
∴ x° = 65° – 28° = 37°
మరియు x° + y° = 90°
[∵ PQ ⊥ PS మరియు PQ // SR ⇒ ∠P = ∠S]
37° + y = 90°
∴ y = 90° – 37° = 53°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

ప్రశ్న 14.
ఇచ్చిన పటంలో ΔABC భుజం AC బిందువు D వరకు పొడిగించబడినది. ∠BCD = 125° అయిన ∠A : ∠B = 2 : 3 అయిన m ∠A, m ∠B లను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 15
సాధన.
దత్తాంశం నుండి, ∠BCD = 125°
ΔABC లో భుజం AC బిందువు D వరకు పొడిగించబడినది.
∠A : ∠B = 2 : 3
నిష్పత్తిలో పదాల మొత్తము = 2 + 3 = 5
ఒక త్రిభుజంలో బాహ్యకోణము = అంతరాభిముఖ కోణాల మొత్తము
∠BCD = ∠A + ∠B
∠A = [latex]\frac {2}{5}[/latex] × 125° = 50°
∠B = [latex]\frac {3}{5}[/latex] × 125° = 75°

ప్రశ్న 15.
కింది పటంలో. BC // DE, ∠BAC = 35° మరియు ∠BCE = 102° అని ఇవ్వబడినది. అయిన i) ∠BCA ii) ∠ADE మరియు iii) ∠CED ల కొలతలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 16
సాధన.
దత్తాంశము నుండి BC // DE ; ∠BAC = 35° మరియు ∠BCE = 102°
i) పటం నుండి
102° + ∠BCA = 180° (∵ రేఖీయద్వయం)
∴ ∠BCA = 180° – 102° = 78°

ii) ∠ADE + ∠CBD = 180°
(∵ తిర్యగ్రేఖకు ఒకే వైపున్న అంతరకోణాలు)
∠ADE + (78° + 35°) = 180°
(∵ ∠CBD = ∠BAC + ∠BCA)
∴ ∠ADE = 180° – 113° = 67°

iii) పటముల నుండి
∠CED = ∠BCA = 78° (∵ ఏక అంతర కోణాలు)

ప్రశ్న 16.
కింది పటంలో AB = AC; ∠BAC = 36%; ∠ADB = 45° మరియు ∠AEC = 40° అని ఇవ్వబడినది. అయిన i) ∠ABC ii) ∠ACB iii) ∠DAB iv) ∠EACల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 17
సాధన.
దత్తాంశం నుండి AB = AC, ∠BAC = 36°,
∠ADB = 45°, ∠AEC = 40°
(i) & (ii)
ΔABC లో AB = AC
⇒ ∠ABC = ∠ACB
మరియు త్రిభుజ కోణాల ధర్మం ప్రకారం
36° + ∠ABC + ∠ACB = 180°
∴ ∠ABC = [latex]\frac{180^{\circ}-36^{\circ}}{2}=\frac{144^{\circ}}{2}[/latex] = 72°
∠ACB = 72°

iii) పటం నుండి
∠ABD + ∠ABC = 180°
∠ABD = 180° – 72° = 108°
ΔABD లో ∠DAB + ∠ABD + ∠D = 180°
∠DAB + 108° + 45° = 180°
∠DAB = 180° – 153° = 27°

iv) ΔADE లో
∠D + ∠A + ∠E = 180°
45° + ∠A + 40° = 180°
⇒ ∠A = 180° – 85° = 95°
∠A = ∠DAB + 36° + ∠EAC
95° = 27° + 36° + ∠EAC
∴ ∠EAC = 95° – 63° = 32°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4

ప్రశ్న 17.
ఇచ్చిన పటములోని సమాచారము ఆధారంగా x, y విలువలు కనుగొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.4 18
సాధన.
పటం నుండి ΔACB లో
34° + 62° + ∠ACB = 180°
∴ ∠ACB = 180° – 96° = 84°
మరియు x + ∠ACB = 180° (∵ రేఖీయద్వయం)
x + 84° = 180°
x = 180° – 84° = 96°
(లేదా)
x = 34° + 62° = 96° (∵ ΔABC లో x బాహ్య కోణము)
y = 24° + x°
= 24° + 96° = 120°
(∵ ΔDCE లో y బాహ్య కోణము)

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

SCERT AP 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 4th Lesson సరళ రేఖలు మరియు కోణములు Exercise 4.3

ప్రశ్న 1.
l || m అయిన ∠1 మరియు ∠8 లు సంపూరక కోణాలని చూపుటలో ప్రతి ప్రవచనానికి కావలసిన కారణాలను రాయండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 1
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 2
సాధన.

ప్రవచనం కారణాలు
i) l // m తిర్యగ్రేఖకు ఒకే వైపున బాహ్య కోణాలు
∠1 + ∠8 = 180°
ii) ∠1 = ∠5 ఆసన్న కోణాలు
iii) ∠5 + ∠8 = 180° రేఖీయద్వయం
iv) ∠1 + ∠8 = 180° తిర్యగ్రేఖకు ఒకే వైపున్న బాహ్యకోణాలు
v) ∠1, ∠8 సంపూరక కోణాలు తిర్యగ్రేఖకు ఒకే వైపున్న బాహ్యకోణాలు

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

ప్రశ్న 2.
కింద పటంలో AB || CD; CD || EF మరియు y : z = 3 : 7 అయిన x విలువను కనుగొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 3
సాధన.
దత్తాంశము : AB || CD; CD || EF
⇒ AB || EF మరియు y : z = 3 : 7
పటం నుండి x + y = 180° ……….. (1)
[∵ తిర్యగ్రేఖకు ఒకే వైపున గల అంతరకోణాలు మొత్తం 180°]
అదే విధంగా y + z = 180 ………… (2)
y : z నిష్పత్తి యొక్క పదాల మొత్తము = 3 + 7 = 10
∴ y = [latex]\frac {1}{2}[/latex] × 180° = 54°
z = [latex]\frac {7}{10}[/latex] × 180° = 126°
(1), (2) ల నుండి,
x + y = y + z
⇒ x = z = 126°

ప్రశ్న 3.
కింది పటంలో AB || CD; EF ⊥ CD ఇంకనూ ∠GED = 126°. అయిన ∠AGE, ∠GEF మరియు ∠FGE కొలతలను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 4
సాధన.
దత్తాంశము : AB || CD; EF ⊥ CD మరియు
∠GED = 126°, ∠FED = 90° మరియు
∠GEF = ∠GED – ∠FED.
∠GEF = 126° – 90° = 36°
ΔGFE లో, ∠GEF + ∠FGE + ∠EFG = 180°
36 + ∠FGE + 90° = 180°
∠FGE = 180° – 126° = 54°
∠AGE = ∠GFE + ∠GEF
(∵ ΔGFE లో ∠AGE బాహ్యకోణం)
= 90° + 36° = 126°

ప్రశ్న 4.
కింది పటంలో PQ || ST, ∠PQR = 110° మరియు ∠RST = 130° అయిన ∠QRS ను కనుగొనండి.
(సూచన : బిందువు R గుండా ST రేఖకు సమాంతరంగా ఒక సరళరేఖను గీయండి.)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 5
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 6
ఇచ్చిన పటంలో PQ || ST
STకి సమాంతరంగా ‘l’ అను రేఖను R ద్వారా గీయుము.
పటం నుండి, a + 110° = 180° [∵ c + 130° = 180° తిర్యగ్రేఖకు ఒకే వైపు అంతరకోణాల మొత్తం]
∴ a = 180° – 110° = 70°
c = 180° – 130° = 50°
అదే విధంగా a + b + c = 180°
(రేఖపై ఒక బిందువు వద్ద గల కోణములు)
70° + b + 50° = 180°
b = 180° – 120° = 60°
∴ ∠QRS = 60°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

ప్రశ్న 5.
కింద పటంలో m || n సరళరేఖలు m, n లపై ఏవైనా రెండు బిందువులు వరుసగా A మరియు B. m, n రేఖల అంతరంలో C ఏదైనా ఒక బిందువు అయిన ∠ACB ని కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 7
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 8
C అను బిందువుగుండా m మరియు n లకు ఒక సమాంతర రేఖ ‘l’ ను గీయుము.
పటం నుండి, x = a [∵ l మరియు m లకు ఏకాంతర కోణాలు]
y = b [∵ l మరియు n లకు ఏకాంతర కోణాలు]
∴ z = a + b = x + y

ప్రశ్న 6.
కింది పటంలో p || q మరియు r || s అయిన a, bల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 9
సాధన.
దత్తాంశము p || q మరియు r || s.
∴ పటం నుండి 2a = 80° (∵ ఆసన్న కోణాలు)
a = [latex]\frac{80^{\circ}}{2}[/latex] = 40°
అదే విధంగా 80° + b = 180° (∵ తిర్యగ్రేఖకు ఒకే వైపున వున్న అంతరకోణాలు)
∴ b = 180° – 80° = 100°

ప్రశ్న 7.
ఇచ్చిన పటంలో a || b మరియు c || d అయిన (i) ∠1, (ii) ∠2 లకు సర్వసమాన కోణాల పేర్లను రాయండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 10
సాధన.
దత్తాంశం a || b మరియు c || d.
∠1 = ∠3 (∵ శీర్షాభిముఖ కోణాలు)
∠1 = ∠5 (∵ ఆసన్న కోణాలు)
∠1 = ∠9 (∵ ఆసన్న కోణాలు)
అదే విధముగా ∠1 = ∠3 = ∠5 = ∠7;
∠1 = ∠11 = ∠9 = ∠13 = ∠15
అదే విధముగా ∠2 = ∠4 = ∠6 = ∠8 మరియు
∠2 = ∠10 = ∠12 = ∠14 = ∠16

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

ప్రశ్న 8.
ఇచ్చిన పటంలో, బాణం గుర్తులున్న రేఖాఖండాలు సమాంతరాలు అయిన x, y విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 11
సాధన.
పటం నుండి
y = 59° (∵ ఏకాంతర కోణాలు సమానం)
x = 60° (∵ సదృశ కోణాలు సమానం)

ప్రశ్న 9.
కింది పటంలో బాణం గుర్తులున్న రేఖాఖండాలు సమాంతరాలు అయిన x, y విలువలను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 12
సాధన.
పటం నుండి 35° + 105° + y = 180°
∴ y = 180° – 140° = 40°
∴ x = 40° (∵ x, y లు ఆసన్న కోణాలు)

ప్రశ్న 10.
పటం మండి x, y విలువలను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 13
సాధన.
పటం నుండి 120° + x = 180°
(∵ తిర్యగ్రేఖకు ఒకే వైపున్న బాహ్య కోణాలు)
∴ x = 180° – 120°
x = 60°
x = (3y + 6) (∵ ఆసన్న కోణాలు)
3y + 6 = 60°
⇒ 3y = 60° – 6° = 54°
y = [latex]\frac {54}{3}[/latex] = 18°
∴ x = 60° మరియు y = 18°

ప్రశ్న 11.
పటం నుండి x, y విలువలను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 14
సాధన.
పటం నుండి 52° + 90° + (3y + 5)° = 180°
(∵ త్రిభుజపు అంతర కోణాలు)
∴ 3y + 147 = 180° ⇒ 3y = 33°
y = [latex]\frac {33}{3}[/latex] = 11°
అదే విధముగా x + 65° + 52° = 180°
(∵ తిర్యగ్రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు)
∴ x = 180° – 117° = 63°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

ప్రశ్న 12.
కింది ప్రవచనానికి తగిన పటాన్ని గీయండి.
ఒక కోణము యొక్క రెండు భుజాలు వరుసగా వేరొక కోణము యొక్క రెండు భుజాలకు లంబరేఖలైన ఆ రెండు కోణములు సమానము లేదా సంపూరకాలు.
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 15
AO ⊥ PQ, OB ⊥ QR
కోణాలు అన్నీ సంపూరకాలు.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 16
AO ⊥ PQ, OB ⊥ QR
కోణాలు సమానములు.

ప్రశ్న 13.
ఇచ్చిన పటంలో AB || CD; ∠APQ = 50° మరియు ∠PRD = 127° అయిన x, y విలువలను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 17
సాధన.
దత్తాంశము AB || CD మరియు
∠PRD = 127°
పటం నుండి x = 50° (∵ ఏకాంతర కోణాలు)
అదే విధంగా y + 50° = 127°(∵ ఏకాంతర కోణాలు)
∴ y = 127 – 50 = 77°

ప్రశ్న 14.
క్రింది పటంలో PQ మరియు RSలు సమాంతరంగా ఉంచబడిన రెండు దర్పణాలు. పతన కిరణము [latex]\overline{\mathrm{AB}}[/latex] దర్పణము PQ ని బిందువు B వద్ద తాకును. పరావర్తనకిరణము [latex]\overline{\mathrm{BC}}[/latex] దర్పణము RSను Cబిందువు వద్ద తాకి మరల [latex]\overline{\mathrm{CD}}[/latex] గుండా పరావర్తనము చెందును. అయిన AB || CD అని చూపుము.
(సూచన : సమాంతర రేఖలకు గీసిన లంబరేఖలు కూడా సమాంతర రేఖలు అవుతాయి.)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 18
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 19
ఇచ్చిన పటంకు B మరియు Cల వద్ద లంబాలను గీయుము.
∠x = ∠y (పతన మరియు పరావర్తన కోణాలు సమానము)
∠y = ∠w (ఏకాంతర కోణాలు)
∠w = ∠z (పతన మరియు పరావర్తన కోణాలు సమానము)
∴ x + y = y + Z
([latex]\overline{\mathrm{AB}}[/latex], [latex]\overline{\mathrm{CD}}[/latex] ల ఏకాంతర అంతరకోణాలు)
∴ AB || CD.

ప్రశ్న 15.
ఇచ్చిన పటాలలో AB || CD తిర్యగ్రేఖ EF సరళరేఖలు AB, CD లను వరుసగా G, H బిందువుల వద్ద ఖండించును. అయిన x, y విలువలు కనుగొనండి. కారణములను తెల్పుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 20
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 21
సాధన.
పటం (i)
3x = y (∵ ఏకాంతర కోణాలు)
2x + y = 180° (∵ రేఖీయద్వయం)
∴ 2x + 3x = 180°
5x = 180° ⇒ x = [latex]\frac {180}{5}[/latex] = 36°
మరియు y = 3x = 3 × 36 = 108°

పటం (ii)
2x + 15 = 3x – 20° (∵ ఒకే వైపున్న శీర్షకోణాలు)
2x – 3x = – 20 – 15
– x = – 35
x = 35°

పటం (iii)
(4x – 23) + 3x = 180° (∵ తిర్యగ్రేఖకు ఒకే వైపున గల అభిముఖ అంతర కోణాలు)
7x – 23 = 180°
7x = 203 ⇒ x = [latex]\frac {203}{7}[/latex] = 29°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

ప్రశ్న 16.
ఇచ్చిన పటంలో AB || CD, ‘t’ అనే తిర్యగ్రేఖ వీటిని వరుసగా E మరియు F బిందువుల వద్ద ఖండించును. ∠2 : ∠1 = 5 : 4 అయిన మిగిలిన కోణాల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 22
సాధన.
దత్తాంశము AB || CD మరియు ∠2 : ∠1 = 5 : 4
∠1 + ∠2 = 180° (∵ రేఖీయద్వయం)
∠2 : ∠1 ల నిష్పత్తుల మొత్తము = 5 + 4 = 9
∠1 = [latex]\frac {4}{9}[/latex] × 180° = 80°
∠2 = [latex]\frac {5}{9}[/latex] × 180° = 100
∠1, ∠3, ∠5, ∠7 ల విలువ 80°.
అదే విధంగా ∠2, ∠4, ∠6, ∠8ల విలువ 100°.

ప్రశ్న 17.
కింద ఇచ్చిన పటంలో AB || CD అయిన x, y, z ల విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 23
సాధన.
దత్తాంశము AB || CD.
పటం నుండి (2x + 3x) + 80° = 180°
(∵ తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న కోణాల మొత్తము)
∴ 5x = 180° – 80° = 100°
x = [latex]\frac{100^{\circ}}{5}[/latex] = 20°
ఇప్పుడు 3x = y (∵ ఏకాంతర కోణాలు)
∴ y = 3 × 20° = 60°
మరియు y + z = 180° (∵ రేఖీయద్వయం)
∴ z = 180° – 60° = 120°

ప్రశ్న 18.
కింద ఇచ్చిన పటంలో AB || CD అయిన x, y, z విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 24
సాధన.
దత్తాంశం AB || CD.
పటం నుండి x° + 70° + x° = 180°
(∵ రేఖపై ఒక బిందువు వద్ద గల కోణాలు)
∴ 2x = 180° – 70°
x = [latex]\frac{110^{\circ}}{2}[/latex] = 55°
Δ ABC లో 90° + x° + y° = 180°
⇒ x + y = 180° – 90° = 90°
90° + 55° + y = 180°
y = 180° – 145° = 35°
మరియు x° + z° = 180°
[∵ తిర్యగ్రేఖకు ఒకే వైపునవున్న అంతరకోణాలు]
55° + z = 180°
⇒ z = 180° – 55° = 125°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3

ప్రశ్న 19.
కింద ఇచ్చిన పటాలలో ప్రతి పటంలో AB || CD అయిన ప్రతీ సందర్భంలో X విలువను కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 25
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.3 26
ప్రతి సందర్భంలోనూ ‘l’ అను రేఖను AB మరియు CD లకు సమాంతరంగా E గుండా గీయుము.

పటం (i)
a + 104° = 180° ⇒ a = 180° – 104° = 76°
b + 116° = 180° ⇒ b = 180° – 116° = 64°
[∵ ఒకే వైపునున్న అంతరకోణాలు]
∴ a + b = x = 76° + 64° = 140°

పటం (ii) a = 35°, b = 65° [∵ ఏకాంతరంగా వున్న అంతర కోణాలు]
x = a + b = 35° + 65° = 100°

పటం (iii)
a + 35° = 180° ⇒ a = 145°
b + 75° = 180° ⇒ b = 105°
[∵ ఒకే వైపునున్న అంతర కోణాలు]
∴ x = a + b = 145° + 105° = 250°

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Optional Exercise

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 10 క్షేత్రమితి Optional Exercise Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Optional Exercise

ప్రశ్న 1.
4.1 సెం.మీ. వ్యాసము కల్గిన ఒక గోల్ఫ్ బంతి ఉపరితలముపై 2 మి.మీ వ్యాసార్ధం కలిగిన 150 బొడిపెలు (డింపుల్స్) ఉన్నవి. డింపుల్స్ అర్ధ గోళాకారంలో ఉన్నవి అని భావిస్తే వాటి మొత్తము ఉపరితల వైశాల్యము ఎంత? [π = [latex]\frac{22}{7}[/latex]]
సాధన.
మొత్తం బొడిపెల వైశాల్యం = బంతి యొక్క ఉపరితల వైశాల్యము – 2 మి.మీల – వ్యాసార్ధం గల 150 వృత్తాల వైశాల్యం
= 4πr12 – 150 x πr22
= 4 × [latex]\frac{22}{7} \times \frac{4.1}{2} \times \frac{4.1}{2}[/latex] – 150 × [latex]\frac{22}{7} \times \frac{2}{10} \times \frac{2}{10}[/latex]
(∵ గోల్ఫ్ బంతి యొక్క వ్యాసార్థం (r) = [latex]\frac{\mathrm{d}}{2}[/latex]
= [latex]\frac{4.1}{2}[/latex] సెం.మీ.
బుడిపె ఒకొక్క వ్యాసార్థం (r) = [latex]\frac{\mathrm{d}}{2}[/latex] = 2 మి.మీ.
= [latex]\frac{2}{10}[/latex] సెం.మీ.)
= 58.831 – 18.57 = 40.261 సెం.మీ2.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Optional Exercise

ప్రశ్న 2.
12 సెం.మీ. వ్యాసార్ధము కల్గిన ఒక స్థూపాకార పాత్రలో 20 సెం.మీ. లోతు మేరకు నీరు నింపబడియున్నది. ఒక ఇనుప గోళమును దానిలో విడిస్తే నీటి మట్టము 6.75 సెం.మీ. పెరిగినది. అయినచో విడువబడిన గోళము యొక్క వ్యాసార్ధము ఎంత ? [π = [latex]\frac{22}{7}[/latex]]
సాధన.
స్థూపాకార పాత్ర వ్యాసార్ధం (r) = 12 సెం.మీ.
ఎత్తు (h) = 6.75 సెం.మీ.
పెరిగిన నీటి మట్టం యొక్క ఘనపరిమాణం = నీటిలో జారవిడిచిన గోళాల(సంఖ్య) ఘనపరిమాణం
⇒ πr12h = [latex]\frac{4}{3}[/latex] πr23
⇒ r12h = [latex]\frac{4}{3}[/latex] r23
⇒ 12 × 12 × 6.75 = [latex]\frac{4}{3}[/latex] × r23
r23 = [latex]\frac{3}{4}[/latex] × 12 × 12 × 6.75 = 9 × 12 × 6.75
⇒ r23 = 729 = 93
∴ r2 = 9 సెం.మీ.
∴ ఒక్కొక్క గోళం వ్యాసార్ధం = 9 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Optional Exercise

ప్రశ్న 3.
ఒక ఘనపు ఆట వస్తువు స్థూపాకృతిలో ఉండి ఒక చివర అర్ధగోళాకారాన్ని మరో చివర శంఖువు ఆకారాన్ని కలిగి ఉంది. వాటి ఉమ్మడి వ్యాసము 4.2 సెం.మీ. స్థూపాకార భాగము, శంఖువాకార భాగముల ఎత్తులు వరుసగా 12 సెం.మీ. మరియు 7 సెం.మీ. అనుకొంటే ఆ ఘనపు ఆటవస్తువు యొక్క ఘనపరిమాణము ఎంత ? [π = [latex]\frac{22}{7}[/latex]]
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Optional Exercise 1

ఆట వస్తువు యొక్క ఘనపరిమాణం = అర్ధగోళ ఘనపరిమాణం + స్థూపం ఘనపరిమాణం + శంఖువు ఆకార ఘనపరిమాణం
= [latex]\frac{2}{3}[/latex] πr3 + πr2h1 + [latex]\frac{1}{3}[/latex] πr2h2
= πr2 ([latex]\frac{2}{3}[/latex] + h1 + [latex]\frac{\mathrm{h}_{2}}{3}[/latex])
= [latex]\frac{22}{7} \times \frac{4.2}{2} \times \frac{4.2}{2}\left[\frac{2}{3} \times \frac{4.2}{2}+12+\frac{7}{3}\right][/latex]
[∵ r = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{4.2}{2}[/latex]]
[∵ h = 12 సెం.మీ]
= 11 × 0.6 × 2.1 [1.4 + 12 + [latex]\frac{7}{3}[/latex]]
= 13.86 [13.4 + 3]
= 13.86 × [latex]\frac{47.2}{3}[/latex] = 218.064 సెం.మీ3.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Optional Exercise

ప్రశ్న 4.
15 సెం.మీ., 12 సెం.మీ. మరియు 9 సెం.మీ. భుజములుగా గల మూడు లోహపు ఘనములను కరిగించి ఒక ఘనముగా మారిస్తే, ఏర్పడిన ఘనము యొక్క కర్ణము పొడవు ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Optional Exercise 2

మూడు లోహ సమఘనాల భుజాలు వరుసగా l1 = 15 సెం.మీ.; l2 = 12 సెం.మీ. l3 = 9 సెం.మీ.
పై మూడు సమఘనాలను కరిగించిన ఒక పెద్ద సమఘనం తయారు చేయగా దాని ఘనపరిమాణం
l3 = l13 + l23 + l33
= 153 + 123 + 93
= 3375 + 1728 + 729
= 5832 = 18 x 18 x 18
⇒ l3 = 183
⇒ l = 18 సెం.మీ.
∴ నూతన సమఘనం యొక్క కర్ణం పొడవు = √3l = √3 × 18
= 1.732 × 18 = 31.176 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Optional Exercise

ప్రశ్న 5.
36 సెం.మీ. అంతర వ్యాసార్థం కల్గిన ఒక అర్ధ గోళాకార పాత్ర ద్రవముతో నింపబడి యున్నది. ఆ ద్రవమును 3 సెం.మీ. వ్యాసార్ధము మరియు 6 సెం.మీ. ఎత్తు కల్గిన స్థూపాకార సీసాలలో నింపితే, మొత్తం ద్రవముగా నింపడానికి అవసరమయ్యే సీసాల సంఖ్య ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Optional Exercise 3

అర్ధగోళాకార పాత్ర యొక్క వ్యాసార్ధం = r1 = 36 సెం.మీ.
అర్ధగోళాకార పాత్రలో నింపబడిన ద్రవం ఘ॥ప = [latex]\frac{2}{3}[/latex] πr13
n సీసాలలో నింపబడే ద్రవం ఘ||ప = (n) πr22h
ఇక్కడ r2 అనగా స్థూపాకార సీసా వ్యాసార్ధం = 3 సెం.మీ.
h అనగా స్తూపాకార సీసా వ్యాసార్ధం = 6 సెం.మీ.
∴ అర్ధగోళాకార పాత్ర ఘ॥ప = n సీసాలలోని ద్రవం ఘ॥
[latex]\frac{2}{3}[/latex] πr13 = (n) πr22h
విలువలు ప్రతిక్షేపించగా
[latex]\frac{2}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 36 × 36 × 36 = n × [latex]\frac{22}{7}[/latex] × 3 × 3 × 6
∴ n = [latex]\frac{2 \times 12 \times 22 \times 36 \times 6}{22 \times 9}[/latex] = 576
అనగా 576 సీసాలు అవసరమగును.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 1.
4.2 సెం.మీ. వ్యాసార్ధము కల్గిన ఒక లోహపు గోళంను – కరిగించి 6 సెం.మీ. వ్యాసార్ధము కల్గిన స్టూపముగా . మలిస్తే, ఆ స్థూపము యొక్క ఎత్తు ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 1

లెక్క ప్రకారం, గోళం యొక్క ఘనపరిమాణం = స్థూపం యొక్క ఘనపరిమాణం
⇒ [latex]\frac{4}{3}[/latex] πr3 = πr12h
⇒ [latex]\frac{4}{3}[/latex] r3 = r12h
⇒ [latex]\frac{4}{3}[/latex] × 4.2 × 4.2 × 4.2 = 6 × 6 × h
⇒ h = [latex]\frac{98.784}{36}[/latex] = 2.744
∴ స్థూపం యొక్క ఎత్తు = 2.744 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 2.
6 సెం.మీ., 8 సెం.మీ. మరియు 10 సెం.మీ. వ్యాసార్ధములు కల్గిన లోహపు గోళములను కరిగించి ఒక పెద్ద లోహపు గోళముగా మలిస్తే దాని యొక్క వ్యాసార్ధము ఎంత ? –
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 2

లెక్క ప్రకారం, 6 సెం.మీ., 8 సెం.మీ., 10 సెం.మీ.లు వ్యాసార్ధాలుగా గల గోళాల ఘనపరిమాణముల మొత్తం = పెద్ద గోళం ఘనపరిమాణం
⇒ [latex]\frac{4}{3}[/latex] πr13 + [latex]\frac{4}{3}[/latex] πr23 + [latex]\frac{4}{3}[/latex] πr33 = [latex]\frac{4}{3}[/latex] πR3

⇒ [latex]\frac{4}{3}[/latex] π[r13 + r23+ r33] = [latex]\frac{4}{3}[/latex] × π × R3

⇒ r13 + r23 + r33 = R3

⇒ 63 + 83 + 103 = R3
⇒ 216 + 512 + 100 = R3
⇒ R3 = 1728
⇒ R = 123
∴ R = 12 (∵ ఘాతాంకాలు సమానమైన భూములు కూడా సమానాలే)
∴ పెద్ద గోళం వ్యాసార్ధం (R) = 12 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 3.
20 మీటర్లు లోతు, 7 మీటర్ల వ్యాసము గల ఒక గొయ్యిని త్రవ్వగా వచ్చిన మట్టిని 22 మీటర్లు × 14 మీటర్లు కొలతలుగా ఒక ప్లాట్ ఫాంగా ఏర్పరిస్తే దాని యొక్క ఎత్తు ఎంత ?
సాధన.
త్రవ్విన భూమి యొక్క ఘనపరిమాణం = πr2h
= [latex]\frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2}[/latex] × 20 = 770 m
ప్లాట్ ఫాం ఎత్తు = h m అనుకొనుము
∴ 22 × 14 × h = [latex]\frac{22}{7} \times \frac{7}{2} \times \frac{7}{2}[/latex] × 20
h = [latex]\frac{35}{14}=\frac{5}{2}=2 \frac{1}{2}[/latex] m
∴ ప్లాట్ ఫారమ్ ఎత్తు 2[latex]\frac{1}{2}[/latex] m.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 4.
14 మీటర్లు వ్యాసము, 15 మీటర్ల లోతు కల్గిన ఒక బావిని త్రవ్వగా వచ్చిన మట్టిని 7 మీటర్ల వెడల్పు కల్గిన ఒక వృత్తాకార కంకణముగా ఏర్పరిస్తే దాని యొక్క
ఎత్తు ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 3

లెక్క ప్రకారం, స్థూపాకార బావి నుండి తీసిన మట్టి ఘనపరిమాణం = వృత్తాకార కంకణంగా ఏర్పర్చిన ఆ మట్టి ఘనపరిమాణం.
స్థూపాకార బావి వ్యాసార్ధం r = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{14}{2}[/latex] = 7 మీ.
బావి లోతు/ఎత్తు (h) = 15 మీ.
∴ స్థూపాకార బావి నుండి త్రవ్విన మట్టి ఘనపరిమాణం V1 = πr2h
= [latex]\frac{22}{7}[/latex] × 7 × 7 × 15
బావి నుండి త్రవ్వి తీసిన మట్టిని వృత్తాకార కంకణంగా ఏర్పర్చిన దాని వెడల్పు (w) = R – r = 7 మీ.
దాని ఎత్తు (h) = ?
∴ కంకణాకార మట్టి ఘనపరిమాణం (V2) = π
V2 = [latex]\frac{22}{7}[/latex] × (R + r) (R – r) × h
= [latex]\frac{22}{7}[/latex] × (14 + 7) × 7 × h
(∵ బావి వ్యాసార్ధం కంకణం యొక్క లోపలి వ్యాసార్ధం (r) = 7 మీ.)
(∵ R = W + r = 7 + 7 = 14 మీ.)
లెక్క ప్రకారం, V1 = V2
⇒ [latex]\frac{22}{7}[/latex] × 7 × 7 × 15 = [latex]\frac{22}{7}[/latex] × (14 + 7) × 7 × h
⇒ 7 × 15 = 21 × h
⇒ h = 5 మీ.
∴ వృత్తాకార కంకణంగా ఏర్పర్చిన మట్టి దిబ్బ ఎత్తు (b) = 5 మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 5.
12 సెం.మీ. వ్యాసము, 15 సెం.మీ. ఎత్తు కల్గిన ఒక క్రమవృత్తాకార స్థూపాకృతి పాత్రలో నిండుగా ఐస్ క్రీం ఉన్నది. దానిని 12 సెం.మీ. ఎత్తు, 6 సెం.మీ. భూవ్యాసముగా కల్గిన శంఖువు ఆకార వస్తువు (కోన్)లో పైభాగము అర్ధగోళాకారంలో ఉండే విధముగా ఐస్ క్రీంను నింపితే, ఆ మొత్తం ఐస్ క్రీంను నింపడానికి కావలసిన కోన్ల సంఖ్య ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 4

ఇచ్చినవి :
క్రమవృత్తాకార స్థూపాకృతి యొక్క వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{12}{2}[/latex] = 6 సెం.మీ.
ఎత్తు (h) = 15 సెం.మీ.
అర్ధగోళం/శంఖువు యొక్క వ్యాసార్ధాలు (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{6}{2}[/latex] = 3 సెం.మీ.
శంఖువు ఎత్తు (h) = 12 సెం.మీ.
శంఖువు పైభాగం అర్ధగోళాకారంలో ఉండే విధంగా ఐస్ క్రీంను నింపితే, మొత్తం స్థూపాకృతిని ఐస్ క్రీంతో నింపుటకు కావలసిన కోన్ల సంఖ్య –

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 5

కావలసిన, కోన్ల సంఖ్య = 10.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 6.
5.5 సెం.మీ. × 10 సెం.మీ. × 3.5 సెం.మీ. కొలతలు కలిగిన దీర్ఘఘనముగా మార్చడానికి 1.75 సెం.మీ. వ్యాసము, 2 మి.మీ. మందము కల్గిన ఎన్ని వెండి నాణెములు అవసరమవుతాయి ?
సాధన.
కరిగించవలసిన వెండి నాణేల సంఖ్య = n అనుకొనుము.
‘n’ సంఖ్యగల వెండి నాణేల ఘనపరిమాణం = దీర్ఘఘనాకారం యొక్క ఘనపరిమాణం
⇒ n × πr2h = lbh
⇒ n × [latex]\frac{22}{7} \times\left(\frac{1.75}{2}\right)^{2} \times \frac{2}{10}[/latex]
= 5.5 × 10 × 3.5 (∵ మందంఎత్తు (h) = 2 మి.మీ. = [latex]\frac{2}{10}[/latex] సెం.మీ.)
⇒ n × [latex]\frac{22}{7} \times \frac{1.75}{2} \times \frac{1.75}{2} \times \frac{2}{10}[/latex] = 55 × 3.5
n = [latex]\frac{7 \times 35 \times 5}{1.75 \times 1.75}[/latex]

= [latex]\frac{175 \times 7}{1.75 \times 1.75}=\frac{100}{0.25}[/latex] = 400
∴ n = 400
∴ కావలసిన వెండి నాణేల సంఖ్య = 400.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 7.
ఒక పాత్ర తిరగబడిన శంఖువు ఆకారంలో ఉన్నది. దాని ఎత్తు 8 సెం.మీ. పై భాగము వా త , 5 సెం.మీ. పాత్ర పూర్తిగా నీటితో నింపబడి యున్నలు. దానిలో 0.5 సెం.మీ. వ్యాసార్ధము కల్గిన ఘనగోళమును వేస్తే పాత్రలో యున్న నీటిలో 7వ వంతు పొర్లి బయటికి .. వస్తుంది. అయినచో పాత్రలో వేయగల్గిన మొత్తము ఘనపు గోళముల సంఖ్య ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 6

ఇవ్వబడినవి : పై పటం నుండి,
శంఖువు ఆకార పాత్ర వ్యాసార్ధం (r) = 5 సెం.మీ.
ఎత్తు (h) = 8 సెం.మీ.
గోళం వ్యాసార్ధం (r) = 0.5 సెం.మీ. = [latex]\frac{1}{2}[/latex] సెం.మీ.
శంఖువాకార పాత్రలో ఘనగోళమును వేస్తే దానిలోని నీరు [latex]\frac{1}{4}[/latex] వంతు పొర్లి బయటకు వచ్చినది అంటే గోళముల ఘనపరిమాణాల మొత్తం శంఖువు ఘనపరి మాణంలో [latex]\frac{1}{4}[/latex] వ వంతు అని అర్థం.
∴ శంఖువాకార పాత్రలో వేయదగు గోళముల సంఖ్య

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.4 7

కావలసిన ఘనపు గోళముల సంఖ్య = 100.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.4

ప్రశ్న 8.
28 సెం.మీ. వ్యాసము కల్గిన ఒక ఘనపు గోళమును కరిగించి 45 సెం.మీ. వ్యాసం, 8 సెం.మీ. ఎత్తు కల్గిన శంఖువులుగా మారిస్తే ఏర్పడే శంఖువుల సంఖ్య ఎంత ?
సాధన.
చిన్న శంఖువుల సంఖ్య = ‘n’ అనుకొనుము.
లెక్క ప్రకారము .
⇒ ‘n’ శంఖువుల ఘనపరిమాణం = గోళం యొక్క ఘనపరిమాణం
శంఖువు : వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}[/latex]
= [latex]\frac{4 \frac{2}{3}}{2}[/latex]
= [latex]\frac{\frac{14}{3}}{2}=\frac{7}{3}[/latex] సెం.మీ.
ఎత్తు (h) = 3 సెం.మీ.
గోళం : వ్యాసార్థం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{28}{2}[/latex] = 14 సెం.మీ
∴ లెక్క ప్రకారం
⇒ n × [latex]\frac{1}{3}[/latex] πr12h = [latex]\frac{4}{3}[/latex] πr22
⇒ n × [latex]\frac{1}{3} \times \frac{22}{7} \times \frac{7}{3} \times \frac{7}{3} \times 3[/latex] = [latex][/latex] × (14)3
⇒ n × [latex]\frac{7}{3}[/latex] × 7 = 4 × 14 × 14 × 14
⇒ n = 3 × 4 × 14 × 2 × 2
∴ n = 672
∴ కావలసిన శంఖువుల సంఖ్య (n) = 672.

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2

SCERT AP 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 4th Lesson సరళ రేఖలు మరియు కోణములు Exercise 4.2

ప్రశ్న1.
ఇచ్చిన పటంలో [latex]\overline{\mathrm{AB}}[/latex], [latex]\overline{\mathrm{CD}}[/latex] మరియు [latex]\overline{\mathrm{EF}}[/latex] సరళరేఖలు ‘O’ వద్ద ఖండించుకొనును. x : y : z = 2 : 3 : 5 అయిన x, y మరియు z విలువలు కనుగొనండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 1
సాధన.
పటము నుండి
2x + 2y + 2z = 360°
2 [x + y + z] = 360°
x + y + z = [latex]\frac{360}{2}[/latex] = 180°
దత్తాంశము x : y : z = 2 : 3 : 5
నిష్పత్తిలోని పదాల మొత్తము
x + y + z = 2 + 3 + 5 = 10
∴ x = [latex]\frac{2}{10}[/latex] × 180° = 36°
y = [latex]\frac{3}{10}[/latex] × 180° = 54°
z = [latex]\frac{5}{10}[/latex] × 180° = 90°
x, y మరియు z ల విలువలు వరుసగా
36°, 54°, 90°

ప్రశ్న2.
కింద ఇచ్చిన పటములలో x విలువను కనుగొనుము.
i)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 2
సాధన.
పటము నుండి 3x + 18+ 93° = 180° (∵ రేఖీయద్వయం)
3x + 111° = 180°
3x = 180 – 111° = 69°
∴ x = [latex]\frac{69}{3}[/latex] = 23°

ii)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 3
సాధన.
పటము నుండి (x – 24)° + 29° + 296° = 360°
(∵ సంపూర్ణకోణము కనుక)
x + 301° = 360°
∴ x = 360° – 301° = 59°

iii)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 4
సాధన.
పటము నుండి (2 + 3x)° = 62°
(∵ శీర్షాభిముఖ కోణాలు కనుక)
∴ 3x = 62 – 2
3x = 60° ⇒ x = [latex]\frac{60^{\circ}}{3}[/latex] = 20°
∴ x = 20°

iv)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 5
సాధన.
పటము నుండి 40 + (6x + 2) = 90°
6x + 42 = 90° (∵ పూరక కోణాలు కనుక)
6x = 90° – 42°
6x = 48 ⇒ x = [latex]\frac {48}{6}[/latex] = 8°

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2

ప్రశ్న3.
కింద పటంలో సరళరేఖలు [latex]\overline{\mathrm{AB}}[/latex] మరియు [latex]\overline{\mathrm{CD}}[/latex] లు బిందువు ‘O’ వద్ద ఖండించుకొనును. ∠AOC + ∠BOE = 70° మరియు ∠BOD = 40. అయిన ∠BOE మరియు పరావర్తనకోణం ∠COE ల కొలతలు కనుగొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 6
సాధన.
దత్తాంశము ∠AOC + ∠BOE = 70°
∠BOD = 40°
∴ ∠AOC = 40°
(∵ ∠AOC, ∠BODలు శీర్షాభిముఖ కోణాలు)
∴ 40° + ∠BOE = 70°
⇒ ∠BOE = 70° – 40° = 30°
∠AOC + ∠COE + ∠BOE = 180°
(∵ AB ఒక రేఖ)
⇒ 40° + ∠COE + 30° = 180°
⇒ ∠COE = 180° – 70° = 110°
∴ పరావర్తన కోణం ∠COE = 110°

ప్రశ్న4.
కింద పటంలో సరళరేఖలు [latex]\overline{\mathrm{XY}}[/latex] మరియు [latex]\overline{\mathrm{MN}}[/latex] లు బిందువు O వద్ద ఖండించుకొనును. ∠POY = 90°.
a : b = 2 : 3. అయిన కోణము c కొలతలు కనుగొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 7
సాధన.
XY మరియు MN లు సరళరేఖలు.
∠POY = 90° మరియు a : b = 2 : 3 పటం నుండి a + b = 90°
a : bయొక్క పదాల మొత్తము = 2 + 3 = 5
∴ b = [latex]\frac{3}{5}[/latex] × 90° = 54°
పటం నుండి b + c = 180° (∵ రేఖీయద్వయం)
54° + c = 180° ⇒ c = 180° – 54° = 126°

ప్రశ్న5.
కింద పటంలో ∠PQR = ∠PRQ అయిన ∠PQS = ∠PRT అని నిరూపించుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 8
సాధన.
దత్తాంశము ∠PQR = ∠PRQ
పటం నుండి,
∠PQR + ∠PQS = 180° ……………. (1)
∠PRQ + ∠PRT = 180° …….. (2)
(1), (2) ల నుండి,
∠PQR + ∠PQS = ∠PRQ + ∠PRT
కాని ∠PQR = ∠PRQ
కావున ∠PQS = ∠PRT నిరూపించబడింది.

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2

ప్రశ్న6.
ఇచ్చిన పటంలో x + y = w + z అయిన AOB ఒక సరళరేఖ అని నిరూపించండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 9
సాధన.
దత్తాంశము x + y = w + z = k అనుకొనుము.
పటం నుండి, x + y + z + w = 360°
(∵ బిందువు చుట్టూ గల బిందువు)
x + y = z + w కావున
∴ x + y = z + z = [latex]\frac{360^{\circ}}{2}[/latex]
∴ x + y = z + w = 180°
లేక
k + k = 360°
2k = 360° ⇒ k = [latex]\frac{360^{\circ}}{2}[/latex] = 180°
(x, y) మరియు (z, w) లు ఆసన్న కోణాల జతలు వాటి మొత్తము 180°.
(x, y) మరియు (z, w) లు రేఖీయద్వయం అగును.
కావున AOB ఒక రేఖను సూచించును.

ప్రశ్న7.
కింద పటంలో [latex]\overline{\mathrm{PQ}}[/latex] ఒక సరళరేఖ. కిరణము [latex]\overline{\mathrm{OR}}[/latex], [latex]\overline{\mathrm{PQ}}[/latex] సరళరేఖకు లంబముగానున్నది. [latex]\overline{\mathrm{OS}}[/latex] అనేది [latex]\overline{\mathrm{OP}}[/latex] మరియు [latex]\overline{\mathrm{OR}}[/latex] ల మధ్యనున్న వేరొక కిరణము అయిన ∠ROS = [latex]\frac {1}{2}[/latex](∠QOS – ∠POS) అని నిరూపించండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 10
సాధన.
దత్తాంశము : [latex]\overline{\mathrm{OR}}[/latex] ⊥ [latex]\overline{\mathrm{PQ}}[/latex] ⇒ ∠ROQ = 90°
[latex]\overline{\mathrm{OS}}[/latex] అనునది [latex]\overline{\mathrm{OP}}[/latex] మరియు [latex]\overline{\mathrm{OR}}[/latex] ల మధ్యన గల వేరొక కిరణము.
సారాంశము :
∠ROS = [latex]\frac {1}{2}[/latex](∠QOS – ∠POS)
ఉపపత్తి : పటం నుండి,
∠ROS = ∠QOS – ∠QOR ………….. (1)
∠ROS = ∠ROP – ∠POS ………….. (2)
(1) మరియు (2) లను కూడగా,
∠ROS + ∠ROS = ∠QOS – ∠QOR + ∠ROP – ∠POS
[∵ ∠QOR = ∠ROP = 90°]
⇒2∠ROS = ∠QOS – ∠POS
⇒ ∠ROS = [latex]\frac {1}{2}[/latex] [∠QOS – ∠POS]
అని నిరూపించబడినది.

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2

ప్రశ్న8.
∠XYZ = 64°. XY ని P బిందువు వరకు పొడిగించినారు. ∠ZYP ని కిరణము [latex]\overline{\mathrm{YQ}}[/latex] సమద్వి ఖండన చేయును. ఈ సమాచారమును పటరూపములో చూపండి. అదేవిధంగా ∠XYQ మరియు పరావర్తన కోణము ∠QYP ల కొలతలు కనుగొనండి.
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.2 11
∠XYQ = 32° ; ∠QYP = 32°

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 1.
ఒక ఇనుప స్థూపాకార స్థంభము 2.8. మీటర్ల ఎత్తు, 20 సెం.మీ వ్యాసము కల్గియున్నది. దానిపై 42 సెం.మీ. ఎత్తు గల శంఖువు ఆకార భాగమున్నది. ఒక ఘనపు సెం.మీ. ఇనుము యొక్క బరువు 7.5 గ్రాములు అయితే ఆ ఇనుప స్థంభము యొక్క బరువు ఎంత?
సాధన.
ఇచ్చినవి : స్థూపం యొక్క వ్యాసార్ధం (r) = [latex]\frac{d}{2}[/latex]
⇒ r = [latex]\frac{20}{2}[/latex] = 10 సెం.మీ. ఎత్తు (h) = 2.8 మీ.
= 2.8 × 100 సెం.మీ. = 280 సెం.మీ.
శంఖువు యొక్క వ్యాసార్ధం r = [latex]\frac{d}{2}[/latex]
= [latex]\frac{20}{2}[/latex] = 10 సెం.మీ.
ఎత్తు (h) = 42 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 1

∴ ఇనుప స్థూపాకార స్థంభం యొక్క ఘనపరిమాణం = స్థూపం యొక్క ఘనపరిమాణం + శంఖువు ఆకార ఘనపరిమాణం
= πr2h + [latex]\frac{1}{3}[/latex] πr2h
= ([latex]\frac{22}{7}[/latex] × 10 × 10 × 280) + ([latex]\frac{1}{3}[/latex] x [latex]\frac{22}{7}[/latex] × 10 × 10 × 42)
= 88000 + 4400 = 92400 సెం.మీ3.
∴ 1 సెం.మీ3కు 7.5 గ్రా. చొప్పున ఇనుప స్థూపాకార స్థంభం యొక్క బరువు = 92400 × 7.5 = 693000 గ్రా.లు.
= [latex]\frac{69300}{1000}[/latex] కి.గ్రా.
= 693 కి.గ్రాలు.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 2.
ఒక అర్ధగోళము యొక్క సమతల ఉపరితలముపై క్రమవృత్తాకార శంఖువు ఆకార భాగము యొక్క వృత్తాకార భూభాగము కలుపబడి యున్నట్లు ఒక ఆటవస్తువు ఉన్నది. శంఖువు ఆకార భాగము యొక్క భూవ్యాసార్ధము 7 సెం.మీ. మరియు దాని ఘన పరిమాణము అర్ధగోళాకార భాగము యొక్క ఘన 3 పరిమాణమునకు, రెట్లు ఉన్నది. శంఖువు ఆకార భాగము యొక్క ఎత్తు, మరియు ఆటవస్తువు యొక్క ఉపరితల వైశాల్యమును రెండు దశాంశ స్థానములకు సవరించి కనుగొనుము. (π = 3[latex]\frac{1}{7}[/latex])
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 2

ఇచ్చినవి :
శంఖువు ఆకార పాదభాగ / అర్ధగోళం
యొక్క వ్యాసార్ధం = 7 సెం.మీ.
లెక్క ప్రకారం,
శంఖువు ఘనపరిమాణం = [latex]\frac{3}{2}[/latex] × అర్ధగోళ ఘనపరిమాణం
⇒ [latex]\frac{1}{3}[/latex] πr2h = [latex]\frac{3}{2}[/latex] × [latex]\frac{2}{3}[/latex] πr3
⇒ [latex]\frac{h}{3}[/latex] = r (లేదా) [latex]\frac{h}{3}[/latex] = 7
⇒ h = 21 సెం.మీ.
∴ శంఖువు ఆకార భాగం ఎత్తు (h) = 21 సెం.మీ.
ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం = శంఖువు ఉపరితల/వక్ర వైశాల్యం + అర్ధగోళం ఉపరితల/వక్ర వైశాల్యం
= πrl + 2πr2
[∵ l = [latex]\sqrt{\mathrm{r}^{2}+\mathrm{h}^{2}}=\sqrt{7^{2}+21^{2}}=\sqrt{490}[/latex] = 7√10]
= πr (l + 2r)
= [latex]\frac{22}{7}[/latex] × 7 (7√10 + 2 × 7)
= 22 (7 × 3.162 + 14) [∵ √10 = 3.162]
= 22[22.134 + 14] = 22 × 36.134
= 794.948 చ.సెం.మీ. = 795 చ.సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 3.
7 సెం.మీ భుజముగా గల ఘనము నుండి ఏర్పరచ గలిగే క్రమవృత్తాకార శంఖువు ఆకార వస్తువు యొక్క గరిష్ఠ ఘనపరిమాణము ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 3

ఇచ్చినవి :
ఘనం యొక్క భుజం పొడవు = శంఖువు యొక్క ఎత్తు (h) = 7 సెం.మీ.
శంఖువు వ్యాసార్ధం (r) = 3.5 సెం.మీ.
[∵ r = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{7}{2}[/latex] = 3.5]
∴ ఘనంలో ఏర్పర్చగలిగే క్రమ వృత్తాకార శంఖువు ఆకార వస్తువు యొక్క గరిష్ఠ పరిమాణం (V) = [latex]\frac{1}{3}[/latex] πr2h
= [latex]\frac{1}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 3.5 × 3.5 × 7
= [latex]\frac{22 \times 12.25}{3}=\frac{269.5}{3}[/latex]
= [latex] 89.8 \overline{3}[/latex]
V = 89.83 ఘ. సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 4.
ఒక స్థూపాకార తొట్టె 5 సెం.మీ. వ్యాసార్ధము మరియు 9.8 సెం.మీ. పొడవును కల్గి నీటితో పూర్తిగా నింపబడి యున్నది. అర్ధగోళముపై నిటారుగా నిలుపబడిన క్రమ వృత్తాకార శంఖువు ఆకారములో యున్న ఘనాకార వస్తువు దానిలో ముంచబడినది. అర్ధగోళము యొక్క వ్యాసార్ధము 3.5 సెం.మీ. అర్ధగోళము బయట ఉన్న శంఖువు ఎత్తు 5 సెం.మీ. అయినచో తోట్టెలో మిగిలియున్న నీటి ఘనపరిమాణమును కనుగొనుము. (π = [latex]\frac{22}{7}[/latex] గా తీసుకొనుము).
సాధన:

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 4

ఇచ్చినవి :
పై పటం నుండి స్థూపాకార తొట్టె యొక్క వ్యాసార్ధం = 5 సెం.మీ.
ఎత్తు = 9.8 సెం.మీ.
అర్ధగోళంపై నిటారుగా నిలబడిన శంఖువు ఎత్తు (b) = 5 సెం.మీ.
వ్యాసార్ధం (r) = 3.5 సెం.మీ.
స్థూపాకార తొట్టెలో మిగిలియున్న నీటి ఘనపరిమాణం = స్థూపాకార తొట్టె ఘనపరిమాణం – (శంఖువు ఆకార మరియు అర్ధగోళాకారాల ఘనపరిమాణాల మొత్తం)
= πr2h – [[latex]\frac{1}{3}[/latex] πr12h1 – [latex]\frac{2}{3}[/latex] πr22h2]
= ([latex]\frac{22}{7}[/latex] × 5 × 5 × 9.8) – ([latex]\frac{2}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 3.5 × 3.5 × 5 + × × (3.5)3)
= 770 – [64.16 + 89.83]
= 770 – (153.9)
= 770 – 154 [∵ 153.9 = 154]
= 616 ఘ. సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 5.
ప్రక్క పటములో చూపిన విధముగా ఒక ఘనాకార 4 సెం.మీ. స్థూపము యొక్క రెండు చివరల నుండి 3 సెం.మీ శ్రీ వ్యాసార్ధము, 4 సెం.మీ ఎత్తు కల్గిన సమానముగా ఉన్న రెండు శంఖాకార భాగములు తొలగించబడినవి. స్థూపము యొక్క ఎత్తు 10 సెం.మీ., దాని వ్యాసం 7 సెం.మీ. అయినచో మిగిలిన భాగము యొక్క ఘనపరిమాణము ఎంత ?

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 5

సాధన.
ఇచ్చినవి :
పై పటం నుండి ఘనాకార స్థూపం యొక్క ఎత్తు (h) = 10 సెం.మీ.
వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{7}{2}[/latex] = 3.5 సెం.మీ.
ఘనాకార స్థూపం నుండి తొలగింపబడిన శంఖువుల వ్యాసార్ధం (r) = 3 సెం.మీ.
ఎత్తు (h) = 4 సెం.మీ.
∴ ఘనాకార స్థూపం రెండు చివరల నుండి రెండు సమాన ఘనపరిమాణం గల రెండు శంఖువులను తోలగించగా మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం = ఘనాకార స్థూప ఘనపరిమాణం – 2 x శంఖువు ఘనపరిమాణం
= πr2h – [2 × [latex]\frac{1}{3}[/latex] πr12h1]
= [latex]\frac{22}{7}[/latex] × 3.5 × 3.5 × 10 – [2 × [latex]\frac{1}{3}[/latex] × [latex]\frac{22}{7}[/latex] × 3 × 3 × 4]
= 110 × 3.5 – [latex]\frac{528}{7}[/latex]
= 385 – 75.4 = 309.571 ఘ. సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 6.
స్థూపాకార బీకరులో కొంత భాగము నీటితో నింపబడినది. బీకరు వ్యాసము 7 సెం.మీ. దానిలో 1.4 సెం.మీ. వ్యాసము కల్గిన గోళాకార చలువరాళ్ళు ఎన్ని వేస్తే దానిలో నీటి మట్టము 5.6 సెం.మీ. మేరకు పెరుగును ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 6

ఇచ్చినవి :
పై పటం నుండి స్థూపాకార బీకరు వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{7}{2}[/latex] = 3.5 సెం.మీ.
బీకరులో గోళాకార చలువరాళ్ళు వేస్తే దానిలోని నీటి మట్టం (h) = 5.6 సెం.మీ.
గోళాకార చలువరాళ్ళ వ్యాసార్ధం = [latex]\frac{\mathrm{d}}{2}[/latex]
= [latex]\frac{1.4}{2}[/latex] = 0.7 సెం.మీ.
∴ నీటి మట్టం బీకరులో 5.6 సెం.మీ.లు పెరగవలెనంటే దానిలో వేయవలసిన గోళాకార చలువరాళ్ళ సంఖ్య = (నీటి ఘనపరిమాణం) / (గోళం ఘనపరిమాణం)
= [latex]\frac{\pi r^{2} h}{\frac{4}{3} \pi r_{1}^{3}}[/latex]
(‘.. నీరు పోసిన బీకరు స్థూపాకారంలో ఉంది)
= [latex]\frac{r^{2} h}{\frac{4}{3} r_{1}^{3}}=\frac{3.5 \times 3.5 \times 5.6}{\frac{4}{3} \times 0.7 \times 0.7 \times 0.7}[/latex]

= [latex]\frac{\frac{35}{10} \times \frac{35}{10} \times \frac{56}{10} \times 3}{4 \times \frac{7}{10} \times \frac{7}{10} \times \frac{7}{10}}[/latex]
4×7 x 10:17
= 5 × 5 × 2 × 3 = 25 × 6 = 150.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.3

ప్రశ్న 7.
15 సెం.మీ. × 10 సెం.మీ. × 3.5 సెం.మీ కొలతలు కల్గిన దీర్ఘఘనములో 0.5 సెం.మీ. వ్యాసార్ధము మరియు 1.4 సెం.మీ. లోతుతో శంఖువు ఆకారం గల మూడు గోతులు తీసి పెన్ను స్టాండుగా మార్చారు. పెస్టాండ్ లోని కొయ్య ఘనపరిమాణము ఎంత ?

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.3 7

సాధన.
ఇచ్చినవి : 15 సెం.మీ. × 10 సెం.మీ. × 3.5
సెం.మీ.లు కొలతలు గల దీర్ఘఘనం ఘనపరిమాణం (V1) = l × b × h (పొడవు × వెడల్పు × ఎత్తు)
= 15 × 10 × 3.5 = 525 ఘ. సెం.మీ.
శంఖువు ఆకార గోతుల వ్యాసార్థం (r) = 0.5 సెం.మీ.
లోతు (ఎత్తు) (h) = 1.4 సెం.మీ.
∴ 3 శంఖువు ఆకార గోతుల ఘనపరిమాణాల మొత్తం (V2) = 3 × [latex]\frac{1}{3}[/latex] πr2h
= πr2h
= [latex]\frac{22}{7}[/latex] × 0.5 × 0.5 × 1.4
= 4.4 × 0.25
= 1.1 ఘ. సెం.మీ.
∴ పెన్ను స్టాండులోని కొయ్య ఘనపరిమాణం = మొత్తం కొయ్య ఘనపరిమాణం – 3 శంఖువుల గోతుల ఘనపరిమాణాల మొత్తం
= V1 – V2
= 525 – 1.1
= 523.9 ఘ. సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 1.
ఒక ఆటవస్తువు అర్ధగోళము పై నిటారుగా నిలుపబడిన శంఖువువలె ఉన్నది. శంఖువు యొక్క భూవ్యాసం 6 సెం.మీ మరియు. ఎత్తు 4 సెం.మీ అయినచో – ఆటవస్తువు యొక్క ఉపరితల వైశాల్యము ఎంత ? (π = 3.14 గా తీసుకొనుము.)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 1

ఇచ్చినవి : శంఖువు యొక్క భూవ్యాసార్థం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{6}{2}[/latex] = 3 సెం.మీ.
ఎత్తు (h) = 4 సెం.మీ.
శంఖువు ఏటవాలు ఎత్తు = l = [latex]\sqrt{\mathrm{r}^{2}+\mathrm{h}^{2}}[/latex]
= [latex]\sqrt{3^{2}+4^{2}}=\sqrt{9+16}=\sqrt{25}[/latex]
= 5 సెం.మీ.
∴ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం = శంఖువు వక్రతల వైశాల్యము + అర్ధగోళం ఉపరితల వైశాల్యము
= πrl + 2πr2
= πr (l + 2r)
= [latex]\frac{22}{7}[/latex] × 3(5 + 2 × 3)
= 3.14 × 3 × 11 = 103.62 చ.సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 2.
ఒక ఘనాకార వస్తువు ఒక చివర అర్ధగోళము మరో చివర శంఖువు ఆకార భాగము కల్గిన స్థూపము వలే యున్నది. రెండింటి యొక్క ఉమ్మడి భూవ్యాసార్ధం 8 సెం.మీ మరియు స్థూపము, శంఖువు ఆకారముల ఎత్తులు వరుసగా 10 సెం.మీ మరియు 6 సెం.మీ అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము. (π = 3.14గా తీసుకొనుము)
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 2

ఇచ్చినవి :
శంఖువు/స్థూపం వ్యాసార్ధం (r) = 8 సె.మీ.
శంఖువు ఎత్తు (h) = 6 సెం.మీ.
స్థూపాకారం యొక్క ఎత్తు = 10 సెం.మీ.
శంఖువు ఏటవాలు ఎత్తు l = [latex]\sqrt{r^{2}+h^{2}}[/latex]
= [latex]\sqrt{6^{2}+8^{2}}=\sqrt{100}[/latex] = 10.
వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం = శంఖువు యొక్క వక్రతల వై. + స్థూపం యొక్క వక్రతల వై. + అర్ధగోళం యొక్క వక్రతల వై.
= πrl+ 2πrh + 2πr2
= ([latex]\frac{22}{7}[/latex] × 8 × 10) + (2 × [latex]\frac{22}{7}[/latex] × 8 × 10) + (2 × [latex]\frac{22}{7}[/latex] × 8 × 8)
= [latex]\frac{22}{7}[/latex] × 8 [10 + 2 × 10 + 2 × 8]
= [latex]\frac{22}{7}[/latex] × 8 [10 + 20 + 16]
= [latex]\frac{22}{7}[/latex] × 8 × 46
= 3.14 × 368 = 1155.52 చ|| సెం.మీ.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 3.
ఒక మందుబిళ్ళ రెండు చివరల అర్ధగోళాకారంలో “నున్న స్థూపము వలె ఉన్నది. మందుబిళ్ళ యొక్క పొడవు .14 మి.మీ మరియు వెడల్పు 5 మి.మీ అయితే దాని ఉపరితల వైశాల్యము ఎంత ?

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 3

సాధన.
మందుబిళ్ళ యొక్క ఉపరితల వైశ్యాలం = 2 × అర్ధగోళం వక్రతల వైశాల్యం + స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం
ఇచ్చినవి :
అర్ధగోళ వైశాల్యం :
వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{5}{2}[/latex] = 2.5 మి.మీ.
రెండు అర్ధగోళాల ఉపరితల వైశాల్యం = 2πr2 = 4πr2
= 4 × [latex]\frac{22}{7}[/latex] × 2.5 × 2.5
= [latex]\frac{550}{7}[/latex] సెం.మీ2
= 78.57 మి.మీ2 .

స్థూపం వైశాల్యం :
d5 స్థూపం యొక్క వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{5}{2}[/latex] = 2.5 మీ
ఎత్తు (h) = 14 మి.మీ.
∴ ప్రక్కతల వైశాల్యం = 2πrh
= 2 × [latex]\frac{22}{7}[/latex] × 2.5 × 14
= 220 మి.మీ2.
∴ మందుబిళ్ళ యొక్క ఉపరితల వైశాల్యం = 78.57 + 220 = 298.57 మి.మీ2.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 4.
64 ఘనపు సెం.మీ ఘనపరిమాణము గల రెండు సమ ఘనములు కలుపబడినవి. అయిన ఏర్పడిన క్రొత్త ఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఎంత ?
సాధన.
ఇచ్చినవి :
ఒక ఘనం యొక్క ఘనపరిమాణం (V) = 64 సెం.మీ3
∴ s3 = 4 × 4 × 4 = 43
⇒ V = 3 = 64
⇒ ఘనం యొక్క భుజాలు (s) = ?
⇒ s = 64 = 43
∴ s = 4 సెం.మీ.
∴ రెండు సమఘనాలను కలుపగా వాని పొడవు (l) = 4 + 4 = 8 సెం.మీ.
వెడల్పు (b) = 4 సెం.మీ.; ఎత్తు (h) = 4 సెం.మీ.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 4

∴ ఏర్పడిన కొత్త ఘనము ఉపరితల వైశాల్యం = 2h(l + b)
= 2 × 4 (8 + 4)
= 8 × 12 = 96 సెం.మీ

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 5.
ఒక నీటి ట్యాంకు రెండు చివరలు అర్ధగోళాకారముగా ఉన్న స్థూపము – వలె ఉన్నది. స్థూపము యొక్క బాహ్యవ్యాసము 1.4 మీటర్లు మరియు దాని పొడవు 8 మీటర్లు. నీటి ట్యాంకు బయట రంగు వేయడానికి చదరపు మీటరుకు రూ. 20 వంతున ఎంత ఖర్చు అగును ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 5

నీటి ట్యాంకు యొక్క ఉపరితల వైశాల్యము = 2 × అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము + స్థూపం యొక్క ఉపరితల వైశాల్యము
= 2 × 2πr2 + 2πrh
= 2 × (2 × [latex]\frac{22}{7}[/latex] × 0.7 × 0.7) – (2 × 11 × 0.7 × 8)
[∵ వ్యాసార్ధం (r) = [latex]\frac{\mathrm{d}}{2}=\frac{1.4}{2}[/latex] = 0.7 మీ.]
= 6.16 + 35.2 = 41.36 మీ2
ట్యాంకు యొక్క ఉపరితల వైశాల్యం = 41.36 మీ2
1 చ.మీ.కు ₹ 20 వంతున ట్యాంకుకు రంగు వేయుటకు
అగు ఖర్చు = 41.36 × 20 = ₹ 827.2.

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 6.
ఒక సమ ఘనాకార చెక్క దిమ్మ. నుండి దాని భుజము పొడవునకు సమాన పొడవు కల్గిన వ్యాసము కల్గిన అర్ధగోళాకారము కత్తిరించబడినది. అయినచో మిగిలిన చెక్క దిమ్మ యొక్క ఉపరితల వైశాల్యమును కనుగొనుము.
సాధన.
సమఘనం యొక్క భుజం పొడవు s = a యూనిట్లు అనుకొనుము.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 6

ఇచ్చిన సమఘనం యొక్క ఉపరితల వైశాల్యం = 5 × ప్రతి తలం యొక్క వైశాల్యము + అర్ధగోళ ఉపరితల వైశాల్యము
= 5 × (s)2 + 2πr2
= 5 × (a)2 + 2 x +([latex]\frac{a}{2}[/latex])2 [∵ r = [latex]\frac{s}{2}=\frac{a}{2}[/latex]]
= 5 a2 + 2π[latex]\frac{a^{2}}{4}[/latex]
= 5a2 + [latex]\frac{\pi \mathrm{a}^{2}}{2}[/latex]
= a2 (5 + [latex]\frac{\pi}{2}[/latex]) చ. యూ

AP Board 10th Class Maths Solutions 10th Lesson క్షేత్రమితి Exercise 10.2

ప్రశ్న 7.
పటములో చూపిన విధముగా ఒక చెక్కతో చేసిన వస్తువు రెండు చివరల నుండి అర్ధగోళాకార భాగములు తొలగించబడిన స్థూపము వలె యున్నది. స్థూపము యొక్క ఎత్తు 10 సెం.మీ దాని , భూవ్యాసార్ధము 3.5 సెం.మీ అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యము ఎంత ?
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 10 క్షేత్రమితి Exercise 10.2 7

ఇచ్చినవి :
స్థూపము ఎత్తు (h) = 10 సెం.మీ.,
భూ వ్యాసార్ధం (r) = 3.5 సెం.మీ.
చెక్కతో చేయబడిన వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యము = స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము + 2 × అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము
= 2πrrh + 2 × 2πr2
= 2πrh + 4πr2
= 2 × [latex]\frac{22}{7}[/latex] × 3.5 × 10 + 4 × [latex]\frac{22}{7}[/latex] × 3.5 × 3.5
= 220 + 2 (77)
= 220 + 154 = 374 సెం.మీ.2

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1

SCERT AP 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 4th Lesson సరళ రేఖలు మరియు కోణములు Exercise 4.1

ప్రశ్న1.
ఇచ్చిన పటంలో కింది వానిని గుర్తించి రాయుము.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1 1
i) ఏవైనా ఆరు బిందువులు
సాధన. A, B, C, D, P, Q, M, N …….. మొ॥నవి.

ii) ఏవైనా ఐదు రేఖాఖండములు
సాధన.
[latex]\overline{\mathrm{AX}}[/latex], [latex]\overline{\mathrm{XM}}[/latex], [latex]\overline{\mathrm{MP}}[/latex], [latex]\overline{\mathrm{PB}}[/latex], [latex]\overline{\mathrm{MN}}[/latex], [latex]\overline{\mathrm{PQ}}[/latex], [latex]\overline{\mathrm{AB}}[/latex] ……. మొ॥నవి.

iii) ఏవైనా నాలుగు కిరణములు.
సాధన.
[latex]\overline{\mathrm{MA}}[/latex], [latex]\overline{\mathrm{PA}}[/latex], [latex]\overline{\mathrm{PB}}[/latex], [latex]\overline{\mathrm{NC}}[/latex], [latex]\overline{\mathrm{QD}}[/latex] ……. మొ॥నవి.

iv) ఏవైనా నాలుగు సరళరేఖలు
సాధన.
[latex]\overline{\mathrm{AB}}[/latex], [latex]\overline{\mathrm{CD}}[/latex], [latex]\overline{\mathrm{EF}}[/latex], [latex]\overline{\mathrm{GH}}[/latex].

v) ఏవైనా నాలుగు సరేఖీయ బిందువులు
సాధన.
A, X, M, P మరియు B బిందువులు [latex]\overline{\mathrm{AB}}[/latex] లో గలవు.
కావున అవి సరేఖీయాలు.

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1

ప్రశ్న2.
కింది పటాలను పరిశీలించి వాటిలోని కోణములు ఏరకమైనవో గుర్తించండి.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1 2
సాధన.
∠A – పరావర్తన కోణము
∠B – లంబ కోణము
∠C – అల్ప కోణము

ప్రశ్న3.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి.
i) ఒక కిరణమునకు అంత్యబిందువు లేడు.
ii) సరళరేఖ [latex]\overline{\mathrm{AB}}[/latex] మరియు సరళరేఖ [latex]\overline{\mathrm{BA}}[/latex] లు ఒక్కటే.
iii) కిరణము [latex]\overline{\mathrm{AB}}[/latex] మరియు కిరణము [latex]\overline{\mathrm{BA}}[/latex] లు ఒక్కటే.
iv) ఒక సరళరేఖకు పరిమిత పొడవు ఉండును.
v) ఒక తలమునకు పొడవు, వెడల్పులు ఉంటాయి. కాని మందము ఉండదు.
vi) రెండు వేరు వేరు బిందువుల గుండా ఒకే ఒక సరళరేఖను గీయగలము.
vii) రెండు సరళరేఖలు రెండు బిందువుల వద్ద ఖండించుకొనును.
viii) రెండు ఖండనరేఖలు, ఒకే రేఖకు సమాంతర రేఖలు కాలేవు.
సాధన.
i) ఒక కిరణమునకు అంత్యబిందువు లేడు. – అసత్యం
ii) సరళరేఖ [latex]\overline{\mathrm{AB}}[/latex] మరియు సరళరేఖ [latex]\overline{\mathrm{BA}}[/latex] లు ఒక్కటే. – సత్యం
iii) కిరణము [latex]\overline{\mathrm{AB}}[/latex] మరియు కిరణము [latex]\overline{\mathrm{BA}}[/latex] లు ఒక్కటే. – అసత్యం
iv) ఒక సరళరేఖకు పరిమిత పొడవు ఉండును. – అసత్యం
v) ఒక తలమునకు పొడవు, వెడల్పులు ఉంటాయి. కాని మందము ఉండదు. – సత్యం
vi) రెండు వేరు వేరు బిందువుల గుండా ఒకే ఒక సరళరేఖను గీయగలము. – సత్యం
vii) రెండు సరళరేఖలు రెండు బిందువుల వద్ద ఖండించుకొనును. – అసత్యం
viii) రెండు ఖండనరేఖలు, ఒకే రేఖకు సమాంతర రేఖలు కాలేవు. – సత్యం

AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1

ప్రశ్న4.
ఒక గడియారములో కింద ఇచ్చిన కాలము సూచింపబడునపుడు ఆ రెండు గడియారపు ముళ్ల మధ్య ఏర్పడు కోణము ఎంత ?
a) 9 : 00 గంటలు
b) 6 : 00 గంటలు
c) సా॥ 7 : 00 గంటలు
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1 3
a) 12 గంటలు = 360°
1 గంట = [latex]\frac{360^{\circ}}{12}[/latex] = 30°
∴ 9 గంటలపుడు గడియారపు ముళ్ల మధ్య కోణము = 3 × 30 = 90°

b)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1 4
6 గంటలు గడియారపు ముళ్ల మధ్య కోణము = 6 × 30° = 180°

c)
AP Board 9th Class Maths Solutions Chapter 4 సరళ రేఖలు మరియు కోణములు Ex 4.1 5
సా॥ 7 : 00 గంటలు
గడియారపు ముళ్ల మధ్య కోణము = 7 × 30° = 210°

AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions

SCERT AP 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 3rd Lesson జ్యామితీయ మూలాలు InText Questions

ఉదాహరణలు

1. A, B మరియు Cలు ఒకే సరళరేఖపై గల బిందువులు, B బిందువు A మరియు C ల మధ్య ఉన్నచో AC – AB = BC అని నిరూపించుము. (పేజీ నెం. 66)
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions 1
సాధన.
AC మరియు AB + BC లు ఏకీభవిస్తాయి.
యూక్లిడ్ – 4 వ సాధారణ భావం ద్వారా “ఒక దానితో మరొకటి ఏకీభవించునవి సమానాలు” కావున AB + BC = AC అని చెప్పవచ్చు.
దీనిని AC లో ప్రతిక్షేపించగా AC – AB = BC
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions 2
ఇక్కడ మనం రెండు బిందువుల గుండా ఒకే ఒక రేఖ ఉంటుందని తీసుకొనుటను గమనించండి.

2. ఇచ్చిన ఏ రేఖాఖండము పైన అయినా సమబాహు త్రిభుజం నిర్మించవచ్చు అని నిరూపించండి. (పేజీ నెం. 66)
సాధన.
ఏదేని పొడవు గల ఒక రేఖాఖండము PQ ఇవ్వబడినది.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions 3
యూక్లిడ్ మూడవ స్వీకృతం భావన నుండి “ఇచ్చిన కేంద్రం, వ్యాసార్ధాలతో వృత్తాన్ని నిర్మించగలం”. కావున P కేంద్రంగా మరియు PQ వ్యాసార్ధం ఒక వృత్తాన్ని గీయండి. అదే విధంగా Q కేంద్రంగా QP వ్యాసార్ధంతో మరొక వృత్తాన్ని గీయండి. ఈ రెండు వృత్తాలు R వద్ద ఖండించుకొంటాయి. ‘R’ ను P మరియు Q లతో కలుపగా Δ PQR ఏర్పడుతుంది.

ఇప్పుడు ఈ విధంగా ఏర్పడిన త్రిభుజం సమబాహు త్రిభుజమని నిరూపించాలి. అంటే PQ = QR = RP అని చూపాలి.
PQ = PR (P కేంద్రంగా గల వృత్త వ్యాసార్ధాలు).
PQ = QR (Q కేంద్రంగా ‘గల వృత్త వ్యాసార్ధాలు)
యూక్లిడ్ సామాన్య భావనల నుండి “ఒకే రాశులకు సమానమైన రాశులు ఒకదానికి మరొకటి సమానాలు” కావున PQ = QR = RP. అందువలన Δ PQR ఒక సమబాహు త్రిభుజం P మరియు Q కేంద్రాలుగా గల వృత్తాలు ఒక బిందువు వద్ద ఖండించుకొంటాయి అనే విషయాన్ని ప్రస్తావించకుండా యూక్లిడ్ తన నిరూపణలో వినియోగించడం గమనించండి.

AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions

3. రెండు వేర్వేరు రేఖలు ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి బిందువులను కలిగియుండవు. (పేజీ నెం. 67)
సాధన.
దత్తాంశం : దత్తరేఖలు l మరియు m.
సారాంశం (నిరూపించవలసినది) : l మరియు m రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటుంది.
నిరూపణ : ఆ రెండు రేఖలు రెండు వేర్వేరు బిందువులు A మరియు B వద్ద ఖండించుకొనును అని అనుకొనుము.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions 4
ఇప్పుడు మనకు A మరియు B బిందువుల గుండా పోయే రేఖలు రెండు కలవు. ఇది యూక్లిడ్ స్వీకృతం “రెండు వేర్వేరు బిందువుల గుండా పోయే సరళరేఖ ఒకే ఒకటి ఉంటుంది” కి విరుద్ధంగా ఉంది. ఈ విరుద్ధత “రెండు బిందువుల గుండా రెండు వేర్వేరు రేఖలు కలవు” అని మనం అనుకొన్న ఊహ వలన వచ్చింది. కావున రెండు వేర్వేరు రేఖలు ఒకటి కన్నా మించి ఉమ్మడి బిందువులను కలిగియుండవు.

4. ప్రక్క పటంలో AC = XD; C మరియు D లు AB మరియు XY ల మధ్య బిందువులు. అయిన AB = XY చూపుము. (పేజీ నెం. 67)
సాధన.
AB = 2 AC
(AB మధ్యబిందువు C)
XY = 2 XD
(XY మధ్యబిందువు D)
మరియు AC = XD (దత్తాంశం)
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు InText Questions 5
∴ AB = XY
ఎందుకంటే “సమాన రాశుల రెట్టింపులు కూడా సమానమే” – యూక్లిడ్ సామాన్య భావన.

AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1

SCERT AP 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 9th Class Maths Solutions 3rd Lesson జ్యామితీయ మూలాలు Exercise 3.1

ప్రశ్న1.
కింది వానికి జవాబులు ఇవ్వండి.
i) ఘనాలకు ఎన్ని కొలతలు ఉంటాయి ?
సాధన.
ఘనము త్రిమితీయ ఆకారము కావున దీనికి పొడవు, వెడల్పు మరియు ఎత్తు (లేక) లోతు అను మూడు కొలతలు ఉంటాయి.

ii) “యూక్లిడ్ ఎలిమెంట్స్” అనే గ్రంథంలో ఎన్ని పుస్తకములు ఉన్నాయి ?
సాధన.
“యూక్లిడ్ ఎలిమెంట్స్” అను గ్రంథంలో 13 పుస్తకాలు ఉన్నాయి.

iii) ఘనము మరియు దీర్ఘఘనములకు ఎన్ని తలములు ఉన్నాయి ?
సాధన.
ఘనము మరియు దీర్ఘ ఘనములకు ‘6’ తలాలు ఉండును.

iv) త్రిభుజ అంతర కోణాల మొత్తం ఎంత ?
సాధన.
త్రిభుజ అంతరకోణాల మొత్తము 180°.

v) జ్యామితిలోని మూడు అనిర్వచిత పదాలు రాయండి.
సాధన.
బిందువు, రేఖ మరియు తలము అను పదాలను అనిర్వచిత పదాలంటారు.

AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1

ప్రశ్న2.
కింది ప్రవచనాలు సత్యమో కాదో చెప్పండి. కారణాలు వివరించండి.
a) దత్త బిందువు గుండా పోవు ఒకే ఒక రేఖ ఉంటుంది.
b) అన్ని లంబకోణాలు సమానం.
c) సమాన వ్యాసార్ధాలు గల వృత్తాలు సమానం.
d) రేఖను ఇరువైపులా నిరంతరంగా పొడిగించి ‘రేఖ’ను పొందగలం.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 1
e) పై పటం 2(d) నుండి AB > AC
సాధన.
a) అసత్యము
b) సత్యము
c) సత్యము
d) సత్యము
e) సత్యము

ప్రశ్న3.
పటం నుండి AH > AB + BC + CD అని చూపండి.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 2
సాధన.
ఇచ్చిన రేఖ [latex]\overleftrightarrow{\mathrm{AH}}[/latex]
పటము నుండి AB + BC + CD = AD
[latex]\overline{\mathrm{AD}}[/latex] అనునది [latex]\overline{\mathrm{AH}}[/latex] లో ఒక భాగము.
యూక్లిడ్ స్వీకృతము ప్రకారము కొంతభాగము అనునది మొత్తము కన్నా చిన్నది.
∴ AH > AD ⇒ AH > AB + BC + CD

ప్రశ్న4.
Q బిందువు P మరియు R బిందువుల మధ్య PQ = QR అగునట్లు ఉంటే PQ = [latex]\frac {1}{2}[/latex]PR అని నిరూపించుము.
సాధన.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 3
ఇచ్చిన రేఖ PR
PQ = QR
PR మీద Q ఒక బిందువు.
∴ PQ + QR = PR
మరియు PQ + PQ = PR [∵ PQ = QR]
2PQ = PR
∴ PQ = [latex]\frac {1}{2}[/latex]PR

AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1

ప్రశ్న5.
5.2 సెం.మీ. భుజముగా గల ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి.
సాధన.
సోపానం – 1: AB = 5.2 సెం.మీ. పొడవుతో ఒక రేఖాఖండము గీయుము.
సోపానం – 2: A కేంద్రంగా 5.2 సెం.మీ.లతో ఒక చాపమును గీయుము.
సోపానం – 3: B కేంద్రంగా 5.2 సెం.మీ.లతో మరొక చాపమును గీయుము.
సోపానం – 4: రెండు చాపముల ఖండన బిందువును C గా గుర్తింపుము. ABమరియు AC లను కలుపుము.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 4
∴ మనకు కావలసిన 5.2 సెం.మీ. భుజంగా గల సమబాహు త్రిభుజము ABC ఏర్పడింది.

ప్రశ్న6.
పరికల్పన అంటే ఏమిటి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
సాధన.
కొన్ని ప్రవచనాలను పరిశీలనల ద్వారా, వివేచనతో సత్యమని భావించి ఊహాత్మకంగా నిర్ణయిస్తాము. ఈ విధముగా సత్యం గానీ, అసత్యం గానీ నిరూపించబడని ప్రవచనాలను పరికల్పనలు అంటారు.
ఉదా : నాలుగు లేక అంతకన్నా పెద్దదైన ప్రతి సరిసంఖ్యను కూడా రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చును. దీనిని “గోల్డ్ బాక్ పరికల్పన” అంటారు.

ప్రశ్న7.
P మరియు Q బిందువులను గుర్తించండి. P మరియు Q ల గుండా పోయే రేఖను గీయండి. PQ రేఖకు ఎన్ని సమాంతర రేఖలు గీయగలరు ?
సాధన.
PQ రేఖకు సమాంతరంగా, అనంత రేఖలను గీయగలము.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 5

ప్రశ్న8.
పటంలో రెండు రేఖలు l మరియు m లపై మరొక రేఖ n కలదు. అంతరకోణాలు ∠1 మరియు ∠2ల మొత్తం 180° కన్నా తక్కువ అయిన l మరియు m రేఖల గురించి నీవేమి చెప్పగలవు ?
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 6
సాధన.
దత్తాంశము : lమరియు mలు ఏవైనా రెండు రేఖలు. n వాటి యొక్క తిర్యగ్రేఖ.
∠1 మరియు ∠2 ల మొత్తం 180° కన్నా తక్కువ అనగా ∠1 <90° మరియు ∠2 < 90° అగును.
ఈ కోణాల వైపు రేఖలను పొడిగించగా అవి ఖండించుకుంటాయి.

AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1

ప్రశ్న9.
కింది పటంలో ∠1 = ∠3, ∠2 = ∠4 మరియు ∠3 = ∠4 అయిన యూక్లిడ్ సామాన్య భావనలను అనుసరించి ∠1 మరియు ∠2ల మధ్య సంబంధాన్ని రాయండి.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 7
సాధన.
దత్తాంశము : ∠1 = ∠3
∠3 = ∠4
∠2 = ∠4
∠1 = ∠2
∠1 మరియు ∠2 లు, ∠3 మరియు ∠4 లకు సమానము.
(∵ ఒకే రాశులకు సమానమైన రాశులు సమానమను యూక్లిడ్ సామాన్య భావనను అనుసరించి)

ప్రశ్న10.
కింది పటములో, BX = [latex]\frac {1}{2}[/latex] AB, BY = [latex]\frac {1}{2}[/latex] BC మరియు AB = BC అయిన BX = BY అని చూపండి.
AP Board 9th Class Maths Solutions Chapter 3 జ్యామితీయ మూలాలు Ex 3.1 8
సాధన.
దత్తాంశము :
BX = [latex]\frac {1}{2}[/latex]AB
BY = [latex]\frac {1}{2}[/latex]BC
AB = BC
సారాంశము :
BX = BY
ఉపపత్తి : AB = BC [∵ యూక్లిడ్ స్వీకృతము]
[latex]\frac {1}{2}[/latex]AB = [latex]\frac {1}{2}[/latex]BC [యూక్లిడ్ భావన అయిన సమాన రాశులలో సగాలు సమానం]
BX = BY