AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 6th Lesson శతక మధురిమ

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
పరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి వేటిని పేర్కొన్నారు? (March 2018)
జవాబు:
జాతకాలు చెప్పడం, రాజులకు సేవలు చేయడం, అబద్దాలు కల్పించడం, ధర్మాన్ని తప్పడం, చాడీలు చెప్పడం, హింసలు చేయడం, ఉన్నవీ లేనివి పలకడం, మొదలగు వాటిని ఇతరుల ధనాన్ని ఆశించి చేసే పనులుగా ధూర్జటి కవి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి వేటిని పేర్కొన్నాడో తెలపండి. (March 2019)
జవాబు:
వరదలు వస్తే మునిగిపోయే పొలమును దున్నడం, కఱవు వచ్చినప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, రహస్యాన్ని ఇతరులకు చెప్పడం, పిటికివాడికి సేనానాయకత్వమును ఇవ్వడం వంటివి ఒక వ్యక్తి చేయకూడని పనులుగా బద్దెన కవి పేర్కొన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు అనే విషయాన్ని మారదవెంకయ్య ఏ ఉపమానంతో చెప్పాడు?
జవాబు:
‘ధర్మం ఆచరించే వాడిని నీచుడు నిందించినా నష్టం ఏమీ లేదు’ అనే విషయాన్ని మారద వెంకయ్య అమృత సముద్రంలో రెట్టవేసే కాకితో పోల్చాడు.

అమృత సముద్రముపై నుండి కాకి ప్రయాణం చేస్తూ ఆ సముద్రంలో ఆ కాకి రెట్ట వేస్తుంది. అంతమాత్రం చేత, ఆ సముద్రానికి ఏమీ లోటు రాదు. అలాగే ధర్మాత్ముడిని నీచుడు నిందించినా, ఆ ధర్మమూర్తికి లోటు రాదు.

ప్రశ్న 4.
‘శతకం’ అనే ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ‘శతకం’ అనే ప్రక్రియ ప్రముఖమైనది. ఇందులో నూరు పద్యాలు ఉంటాయి. కొన్నింటిలో నూరుకు పైగా పద్యాలు ఉంటాయి. శతకంలో మకుటం ప్రధానంగా ఉంటుంది. శతకపద్యాలు నీతిని, ధర్మాన్ని, భక్తిని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. శతక పద్యాలు నైతిక విలువలను ప్రబోధిస్తాయి. శతకపద్యాలు జగతిని జాగృతం చేస్తాయి.

ప్రశ్న 5.
మీకు తెలిసిన ఒక దాతను గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
మా ఊళ్ళో సోమయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన గొప్పదాత. తన వ్యాపారంలో వచ్చిన లాభాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తాడు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనిపెట్టడం, స్కూలు యూనిఫారం కుట్టించడం మొదలగు పనులు చేస్తుంటాడు. వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తాడు.

ఎవరైనా పేదవారు పెళ్ళిళ్ల సమయంలో వచ్చి యాచిస్తే వారికి ధన సహాయం చేస్తాడు. బంగారు మంగళసూత్రాలు దానం చేస్తాడు. ఆయన దేవాలయాలకు, ధర్మసత్రాలకు, అన్నసత్రాలకు, విద్యాలయాలకు విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇరుగుపొరుగు ప్రాంతాలవారు వచ్చి యాచించినా ‘లేదు’ అనకుండా అందరికీ తన శక్తికొద్దీ దానం చేస్తుంటాడు. మా ప్రాంతంలో ఆయన ‘దాత’గా మంచి కీర్తి సంపాదించాడు.

ప్రశ్న 6.
సంపద ఎవరి వద్దకు వచ్చి చేరుతుంది?
జవాబు:
దైవం మనపై దయతో సంపదలు ప్రసాదిస్తాడు. కలిగినంతలో పేదలకు పెట్టాలి. నిందించకుండా, ఆదరణతో పెట్టాలి. ఆ విధంగా పెట్టినవారు ఏ ప్రయత్నం చేయకపోయినా సంపద వారిని చేరుతుంది.

దీనిలో విశేషమేమిటంటే విష్ణువుకు (దరిద్ర) నారాయణుడు, (దరిద్ర) దామోదరుడు అని పేర్లు. అంటే దరిద్రులలో నారాయణుడు ఉంటాడు. నారాయణుని భార్య లక్ష్మీదేవి. తన భర్తను ఆదరించిన వారి దగ్గరకే భార్య కూడా వెడుతుంది. కానీ, ఆదరించని వారి దగ్గరకు వెళ్ళదు కదా ! అందుచేత పేదలను (నారాయణుని) ఆదరించే వారి దగ్గరకు లక్ష్మి వెడుతుంది. సంపదలు ప్రసాదిస్తుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 7.
ఎవరిని ఆశ్రయిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించండి.
జవాబు:
మనిషి అధముడిని ఆశ్రయిస్తే, అతడు కూడా అధముడై పేరు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే తాను కూడా ఉత్తముడు అవుతాడు.

భర్తృహరి ఈ విషయాన్ని చక్కగా సోదాహరణంగా ఇలా వివరించాడు. నీళ్ళు కాల్చిన ఇనుముమీద పడితే, అవి ఆవిరి అయిపోయి పేరులేకుండాపోతాయి. ఆ నీళ్ళు తామరాకు మీద పడితే ముత్యములవలె ప్రకాశిస్తాయి. ఆ నీళ్ళే, ముత్యపుచిప్పలలో పడితే, ముత్యములవలె మారతాయి. నీటి బిందువు తాను ఆశ్రయించిన స్థానాన్ని బట్టి ప్రకాశించింది. అలాగే మనిషి తాను పొందిన ఆశ్రయాన్ని బట్టి రాణిస్తాడని మనం గ్రహించాలి.

ప్రశ్న 8.
ధర్మవర్తనులు పాలసముద్రం వంటివారని ఎలా చెప్పగలవు?
జవాబు:
ధర్మప్రవర్తన గల మనుష్యులు పాలసముద్రం వంటివారు. ధర్మప్రవర్తనతో పేరుపడిన మానవుడిని, ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో నిందించినా, తిరస్కరించినా, ఆ ధర్మాత్ముడికి ఎటువంటి లోపమూ కలుగదు. దీనికి భర్తృహరి ఒక మంచి దృష్టాంతం ఇలా చెప్పాడు.

పాలసముద్రం మీదుగా ఎగిరివెళ్ళే కాకి, ఆ పాలసముద్రములో రెట్టవేస్తుంది. అంతమాత్రంచేత ఆ పాలసముద్రానికి ఏమి లోపము రాదు.

అలాగే పాలసముద్రం వంటి ధర్మవర్తనులను నీచులు నిందించినా, ధర్మవర్తనులకు లోటురాదు. దీనిని బట్టి ధర్మవర్తనులు పాలసముద్రం వంటి వారని మనము చెప్పగలము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 9.
ధర్మవర్తనులకు, ముష్కరులకు గల తేడా ఏమిటో చర్చించండి.
జవాబు:
ధర్మవర్తనులు అనగా ధర్మబద్ధంగా నడుచుకొనే మానవులు. ధర్మవర్తనులు పాలసముద్రము వంటివారు. ముష్కరులు అంటే నీచులు. ఈ నీచులు కాకులవంటివారు. ధర్మబద్ధంగా జీవించేవారిని చూసి కొందరు నీచులు మిక్కిలి హీనమైన నీచవాక్యాలతో నిందిస్తూ మాట్లాడతారు. ఆ నీచుల తిరస్కారవాక్యాల వల్ల ఆ ధర్మవర్తనులకు ఏమి లోపము రాదు.

ఈ విషయంలో భాస్కరశతకకర్త, చక్కని దృష్టాంతం ఇచ్చాడు. పాలసముద్రము నిర్మలంగా ఉంటుంది. ఆ సముద్రం మీది నుండి కాకి ఎగిరివెడుతూ, ఆ పాలసముద్రంలో రేట్ట వేస్తుంది. అంతమాత్రం చేత ఆ పాలసముద్రానికి ఎలా లోటు కల్గదో, అలాగే నీచులు మాట్లాడిన నీచవాక్యాల వల్ల కూడా, ధర్మవర్తనులకు ఎటువంటి లోటు, లోపము రాదని ఆయన చెప్పాడు.

ప్రశ్న 10.
మంచివాని లక్షణములేవి?
జవాబు:
మంచివారు, ఇతరులు తమకు అపకారము చేసినా, తాము మాత్రం ఇతరులకు ఉపకారమే చేస్తూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలలోనూ, మంచివారు తమ ధనమాన ప్రాణాలను పరుల మేలు కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మంచివారు ప్రత్యుపకారాన్ని కూడా కోరుకోరు.

పై విషయాన్ని సమర్థిస్తూ భాస్కర శతకకర్త మంచి దృష్టాంతము చెప్పాడు. పెరుగును మానవులు కవ్వమును చేతపట్టి ఎంత గట్టిగా చిలుకుతున్నా, పెరుగు ఆ బాధను ఓర్చుకొని, చిలుకుతున్న వారికి వెన్ననే ఇస్తుంది.

అలాగే మంచివాడు. తనకు ఇతరులు కీడు చేస్తున్నా తాను మాత్రం వారికి అపకారము చేయడు. అంతేకాదు మంచివాడు తనకు కీడు చేసినవారికి సైతం ఉపకారము చేస్తాడు.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘సుభాషిత రత్నావళి’ ని రచించిన ఏనుగు లక్ష్మణ కవిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి.
జవాబు:
కవి పేరు : ఏనుగు లక్ష్మణకవి

రచించిన శతకం : సుభాషిత రత్నావళి

అనువాద శతకం : ఇది సంస్కృతము నుండి తెలుగులోకి అనువదింపబడిన శతకము. భర్తృహరి మహాకవి సంస్కృత భాషలో ‘సుభాషిత త్రిశతి’ అనే పేరున మూడు శతకాలు రచించాడు. వాటినే
ఏనుగు లక్ష్మణకవి ‘సుభాషిత రత్నావళి’ అనే పేరున తెనిగించాడు.

కాలము : క్రీ.శ. 1720 – 1780 మధ్యకాలము.

నివాసము : ఈయన తూర్పు గోదావరి జిల్లా ‘పెద్దాడ’ గ్రామంలో నివసించారు.

ఇతర గ్రంథాలు :

  1. రామేశ్వర మాహాత్మ్యం,
  2. విశ్వామిత్ర చరిత్ర,
  3. గంగా మాహాత్మ్యం,
  4. రామవిలాసం
    అనేవి వీరి ప్రసిద్ధ రచనలు.

ప్రశ్న 2.
శతక మధురిమలో కొన్ని నీతి పద్యాల నుండి నీతులను గ్రహించావు కదా ! మంచి విద్యార్థికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాజంలో విద్యార్థుల పాత్ర తిరుగులేనిది. విద్యార్థులు నవసమాజ నిర్మాతలని ఎందరో మహాకవులు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక దశనుండి వినయ విధేయతలు కలిగియుండాలి. గురువుల పట్ల శ్రద్ధాసక్తులు కలిగియుండాలి.

విద్యార్థులు తోటివారితో స్నేహభావంతో ఉండాలి. చదువుపట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలి. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. దేశభక్తిని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. మంచి మాటలతో సమాజంలో గౌరవాన్ని పొందాలి. క్రమశిక్షణతో కూడిన జీవనసరళిని అలవరచుకోవాలి.

విద్యార్థులు కొన్ని దురలవాట్లను కూడా దూరం చేసుకోవాలి. తిరస్కారంగా మాట్లాడడం, ఇతరులపై చాడీలు చెప్పడం, ఎదిరించి మాట్లాడడం, క్రమశిక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులతోను, తోటి విద్యార్థులతోను గొడవలు పడడం మొదలైన దుర్గుణాలను దూరం చేసుకోవాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. ఇతరులకు ఆదర్శంగా మెలగాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
శతకపద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి – వివరించండి.
జవాబు:
ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు వివిధ అంశాలపై చక్కని పద్యాలను రచించారు. సమాజంలో నైతిక విలువల్ని పెంచడానికి ప్రయత్నించారు. శతకపద్యాలు జనాన్ని జాగృతం చేస్తాయి.

శతక కవులు తమ అనుభవ సారాన్ని మధించి తేట తెలుగు పద్యాలను రచించారు. వేమన వంటి ప్రజాకవులు ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించారు. కొంతమంది శతక కవులు సంఘసంస్కరణోద్యమానికి ఆయుధంగా చేసుకున్నారు. మారద వెంకయ్య వంటి శతక కవులు చక్కని దృష్టాంతాలతో శతక పద్యాలను రచించారు. తెలుగుబాల, సుమతీశతక పద్యాలు పిల్లలలో నీతి వర్తనను కల్గించాయి. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం వంటి శతకాలు ప్రజల్లో భక్తితత్పరతను కల్గించాయి. రాజుల దురహంకారాన్ని ధూర్జటి కళ్ళకు కట్టినట్లుగా శతక పద్యాల్లో చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు సమకాలీన రుగ్మతలను తేటతెల్లం చేశారు. ప్రజల కళ్ళు తెరిపించారు.

ప్రశ్న 4.
సమాజానికి మార్గనిర్దేశకత్వం చేసేవాళ్ళు శతక కవులు – ఈ విషయాన్ని వివరించండి..
జవాబు:
తెలుగు సాహిత్యంలో శతక వాజ్మయానికి సమున్నతమైన స్థానం ఉంది. శతక కవులు తమ అనుభవసారాన్ని మధించి చక్కని నీతి పద్యాలను రచించారు. వేమన, సుమతి, కృష్ణ, దాశరథి మొదలైన శతకాలు ప్రజల్లో నీతివర్తనను కలుగజేస్తాయి.

అక్కరకు రాని చుట్టము, వినదగునెవ్వరు చెప్పిన, పుత్రోత్సాహము మొదలైన పద్యాలు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. సమాజంలోని అసమానతలను, కుళ్ళు, కుతంత్రాలను లోకానికి చాటాడు. భూర్జటి రాజాశ్రయం పొందినా రాజుల దురహంకారాన్ని నిర్భయంగా చాటిచెప్పాడు. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి వంటివారు తేటతెలుగు పద్యాల్లో రచించారు. కరుణశ్రీ గారి తెలుగుబాల శతకంలోని పద్యాలు బాలల్లో ఆలోచనాశక్తిని పెంచుతాయి. శతక పద్యాలు తెలుగు పలుకుబడులను, సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తేటతెల్లం చేస్తున్నాయి

ప్రశ్న 5.
ఆశ్రయించిన వారిని బట్టి పొందే గౌరవంలో మార్పు వస్తుందనే విషయాన్ని సోదాహరణంగా వివరించండి.
జవాబు:
వ్యక్తులు మంచివారిని ఆశ్రయిస్తే, మంచి గౌరవం పొందుతారు. అధముడిని ఆశ్రయిస్తే వారు నశిస్తారు. భర్తృహరి సుభాషితాలలో ఈ విషయాన్ని సోదాహరణంగా ఇలా వివరించారు.

  1. నీరు కాల్చిన ఇనుము మీదపడితే, ఆ నీరు ఆవిరైపోతుంది. నీరు యొక్క రూపమే నశిస్తుంది.
  2. అదే, నీరు తామరాకుపై పడితే, ముత్యమువలె అందంగా మెరుస్తుంది.
  3. అదే నీరు ముత్యపుచిప్పలలో పడితే, మణులవలె మారుతుంది.

దీనిని బట్టి ఈ క్రింది విషయం మనకు తెలుస్తుంది. మనిషి ఒక అధముడిని ఆశ్రయిస్తే తాను కూడా అధముడు అవుతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే, తాను కూడా మధ్యముడు అవుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే, తాను కూడా ఉత్తముడు ఔతాడు.

మనిషి అధముడిని ఆశ్రయిస్తే కాల్చిన ఇనుము మీద నీరువలె నామరూపాలు లేకుండా పోతాడు. మనిషి మధ్యముడిని ఆశ్రయిస్తే రామరాకుపై నీరువలె మెరుస్తాడు. మనిషి ఉత్తముడిని ఆశ్రయిస్తే ముత్యపుచిప్పలో నీరువలె మణిగా మారుతాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 6.
మూర్యులకు నీతులు చెప్పడం ఎటువంటిది?
జవాబు:
మూర్చులకు నీతులు చెప్పడం వ్యర్ధము. అందువల్ల కొంచెము కూడా ప్రయోజనం ఉండదని భర్తృహరి సుభాషిత పద్యాల్లో క్రింది ఉదాహరణములు ఇచ్చాడు.

మూర్సులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, మదించిన ఏనుగును తామరతూడులోని దారములతో బంధించాలని ఆలోచించడం వంటిది. ఏనుగువంటి బలమైన జంతువును సన్నని, బలహీనమైన తారతూడులోని దారాలతో బంధించలేము. అలాగే మూర్చులకు నీతులు బోధించడం వల్ల ప్రయోజనం ఉండదు.

మూర్చులకు నీతులు చెప్పాలని ప్రయత్నించడం, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని బద్దలు కొట్టాలని చూడడం వంటిది. మెత్తని దిరిసెనపువ్వుతో కఠినమైన వజ్రాన్ని భేదించలేనట్లే, మూర్యుడికి నీతులు బోధించడం అసాధ్యం. అది వ్యర్థమైన పని.

మూరులకు నీతులు చెప్పవలెనని అనుకోవడం, ఒక- తేనె బొట్టుతో ఉప్పు సముద్రంలోని నీటిని తియ్యగా మార్చాలనుకోవడం వంటిది. ఒక్క తేనె బిందువుతో ఉప్పు సముద్రాన్ని తియ్యగా మార్చడం అసాధ్యం. అలాగే మూర్ఖుడికి నీతులు బోధించడం కూడా అసాధ్యం అని, భర్తృహరి చెప్పాడు.

ప్రశ్న 7.
పరద్రవ్యము నాశించిన వాని ప్రవర్తనను విశ్లేషించండి.
జవాబు:
ఇతరుల నుండి ధనాన్ని ఆశించి కొందరు అనేకరకాలుగా జీవిస్తూ ఉంటారు. పరద్రష్యం కోసం అలాంటి తప్పుడు పనులు చేయడం వ్యర్థమని ఆ ద్రవ్యము వారివద్ద ఎన్నాళ్ళో ఉండదనీ, వారు కూడా శాశ్వతంగా జీవించరనీ, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇలా చెప్పాడు.

కొందరు పరధనాన్ని ఆశించి, జాతకములు చెపుతారు. మరికొందరు రాజులకు సేవలు చేస్తారు. కొందరు అన్యాయ ప్రవర్తన ద్వారా చెడ్డపేరు తెచ్చుకుంటారు. కొందరు చాడీలు చెపుతూ ఉంటారు. కొందరు ఇతరులను హింసిస్తూ ఉంటారు. కొందరు ఉన్నవీ లేనివీ మాట్లాడుతూ ఉంటారు. ఈ పైన చెప్పిన పనులన్నీ, వారు ఇతరుల నుండి ధనాన్ని ఆశించి చేస్తూ ఉంటారు.

కాని నిజానికి ఆ ద్రవ్యము వారి వద్ద ఎన్నాళ్ళో ఉండదు. అలా చెడుపనులు చేసేవారు కూడా, శాశ్వతంగా ఈ లోకంలో బ్రతికియుండరు. అందువల్ల పైన చెప్పినటువంటి చెడుపనులు చేసి డబ్బు సంపాదించడం వ్యర్థం అని గుర్తించాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 8.
నైతిక విలువల వలన ప్రయోజనములేవి?
జవాబు:
నైతిక విలువలు అంటే నీతి, ధర్మము, సహనము, సజ్జనత్వము, ఓర్మి, సత్యము, స్నేహము వంటి మంచి గుణాల వల్ల కలిగే ప్రయోజనాలు.

సంఘంలో మనుషులు ఎలా నడుచుకోవాలో, ఎలా నడిస్తే తనకూ, ఇతరులకూ కూడా మేలు జరుగుతుందో, ఈ నైతిక విలువలు పాటించడం వల్ల మనకు తెలుస్తుంది.

మన శతకకవులు చక్కని నీతి శతకాలు చెప్పారు. ‘ అందులో ఎన్నో నీతులను వారు మనకు తెలిపారు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో బోధించాడు. సుమతీ శతకకర్త, భర్తృహరి, ధూర్జటి వంటి పూర్వ కవులు సైతం మనకు ఎన్నో నీతివాక్యాలు చెప్పారు.

ఈ పద్యాల్లోని నీతివాక్యాలను పాటించి నడచుకుంటే మనుషులు ధర్మవర్తనులు అవుతారు. ఆ నైతిక విలువలు, నేటి తరం వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ నీతులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి.

ఈ నైతిక విలువలను పాటిస్తే సంఘంలో మానవులు ధర్మమూర్తులు అవుతారు. చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మానవులు తమ జీవితాన్ని హాయిగా నడుపుకోగల్గుతారు.

శాంతి, సత్యము, దయ, ప్రేమ వంటి సద్గుణాలు వారికి అలవడుతాయి. నైతిక విలువలు పాటించడం వల్ల సంఘం చక్కగా పురోగతి చెందుతుంది. అందుకే నీతి శతకపద్యాలను పిల్లలకు నేర్పించాలి.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన శతక కవిని గూర్చినీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

అమలాపురం,
x x x x x x x

ప్రియమైన మిత్రుడు రాకేష్ కు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది తెలుగు సాహిత్యంలో ఎంతోమంది శతక కవులు ఉన్నారు. వారిలో వేమన కవి నాకు బాగా నచ్చిన కవి. ఈ మహాకవి తన జీవిత అనుభవసారాన్ని తేట తెలుగు పద్యాల్లో అందించాడు. జీవిత సత్యాలను. అలనాటి సామాజిక రుగ్మతలను చక్కగా తెలియజేశాడు. తన పద్యాలను అంటరానితనం వంటి అసమానతలపై ఆయుధంగా వాడుకున్నాడు. అందుకే నాకు వేమన అంటే బాగా ఇష్టం. నీకు నచ్చిన కవిని గురించి వివరంగా తెలియజేయి. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
x x x x x x x

చిరునామా :
వి. రాకేష్, 10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
మీరు సందర్శించిన పర్యాటక ప్రదేశాన్ని వర్ణిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

ప్రియమైన కృష్ణకు,
నీ మిత్రుడు మాధుర్ వ్రాయులేఖ.

నేనీ మధ్య అమరావతి వెళ్ళాను. అమరావతి చాలా విశాలమైన నగరం. చాలా అందమైన నగరం. కృష్ణానది పరవళ్ళతో ఆ అందం రెట్టింపయింది.

చక్కటి ఉద్యానవనాలున్నాయి. కొత్త కొత్త భవనాలు కట్టారు. ఏ విభాగానికి ఆ విభాగం చక్కగా ఉంది. చూపరులను కట్టిపడేసే అందాలతో విరాజిల్లుతున్న అమరావతి మన నవ్యాంధ్ర రాజధాని కావడం మన అదృష్టం. అమరావతిలో విశేషమైన శిల్ప సంపద ఉంది. మానవ శరీర ధర్మ శాస్త్రాననుసరించి చెక్కిన ఆ శిల్పాలను చూడవలసింది.
ఉంటాను మరి

ఇట్లు,
మాధుర్ వ్రాలు

చిరునామా:
చింత. శివరామకృష్ణ,
10వ తరగతి – ఎ,
మునిసిపల్ హైస్కూల్, పవర్ పేట, ఏలూరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

ప్రశ్న 3.
అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, అనాథలకు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను, వదాన్యతను లోకానికి చాటించుకోవాలని కోరుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ఆపన్నహస్తం ఇవ్వండి

ఆదుకుందాం ! ఆదరిద్దాం !

వదాన్యులారా ! ధనవంతులారా ! ఒక్క మనవి ఆలకించండి. మన సమాజంలో ఎందరో అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వారందరిని ఆదుకోవాల్సిన ధర్మం అందరిపైనా ఉంది. ముఖ్యంగా సంపన్నుల పైన ఎక్కువగా ఉంది. ఎంతో మంది అనాథలు చదువులకు దూరంగా ఉన్నారు. వృద్ధులు నిరాదరణకు లోనవుతున్నారు.

స్వార్థం కొంత మానుకొని తోటి సమాజశ్రేయస్సుకై పాటుపడాలి. అనాథలపై కనికరం చూపండి. పేదలకు భోజన వసతులను కల్పించండి. అనాథాశ్రమాలను పోషించండి. పేద విద్యార్థుల చదువుకు ధన సహాయం చేయండి. గ్రామాలను, పాఠశాలలను దత్తత తీసుకోండి. మీలోని మానవీయతను చూపండి. అందరికి ఆదర్శంగా నిలవండి. సమాజ శ్రేయస్సునే మీ శ్రేయస్సుగా భావించండి. పేదలు లేని నవసమాజాన్ని నిర్మించడానికి కృషిచేయండి. ఈ మహాయజ్ఞంలో మీ వంటి ధనవంతుల భాగస్వామ్యం తప్పక ఉండాలి.

ఇట్లు,
నిర్వాసిత బాలల సంరక్షణ సమితి,
కనిగిరి.

ప్రశ్న 4.
శతకాలను చదవమని ప్రేరేపిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

కరపత్రం

శతక పద్యాలు, శతకకర్తల అనుభవసారాలు. వారు జీవితాన్ని కాచివడపోసిన అనుభవంతో, గమనించిన సత్యాలతో శతకాలు రచించారు. శతకంలో సుమారు వందపద్యాలు ఉంటాయి. ప్రతి శతకంలోనూ మకుటం ఉంటుంది. శతకాలలో నీతి, భక్తి, వైరాగ్య శతకాలు ఉన్నాయి.

ఈనాడు సంఘంలో ఎన్నో అవకతవకలు, అధర్మ ప్రవర్తనలు, తెలివితక్కువ పనులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్ది సంఘాన్ని మంచిదారిలో నడపాలంటే చిన్నప్పటి నుండే మంచి నీతులు నేర్చుకొని తెలివిగా బ్రతకాలి. ధర్మబద్ధంగా, ఇతరులకు ఆటంకాలు లేకుండా న్యాయబద్ధంగా, నీతి మార్గంలో నడవాలి.

అందుకు మనకు ఉన్నది ఒక్కటే మార్గం. మన కవులు మనకు అందించిన శతక పద్యాలను కంఠస్థం చేసి, వాటిలో చెప్పిన నీతిమార్గాన్ని పాటించి, నైతిక విలువలను కాపాడాలి. అందుకే మా పాఠ్యపుస్తకాల్లో ప్రతి తరగతిలోనూ నీతి శతక పద్యాలను పాఠాలుగా పెడుతున్నారు.

మనం అంతా శతకాలు చదువుదాం. మన పిల్లలచే శతకాలు చదివిద్దాం. శతక పద్యాలు చదివి, వాటిలో వేమన, సుమతీ శతకకర్త, భాస్కర శతకకర్త, భర్తృహరి వంటి వారు చెప్పిన శతకపద్యాలలోని విలువలను నేర్చుకుందాం. మన జీవితాన్ని బంగారుబాట పట్టిద్దాం. మన పిల్లలను మేలిమి రత్నాలుగా తీర్చిదిద్దుకుందాం. అందుకే మనం అంతా దీక్షగా శతక పద్యాలు చదువుదాం, కదలండి.

దివి, x x x x x

ఇట్లు,
ఆంధ్రభాషా ప్రవర్థక సమితి,
అమరావతి.

ప్రశ్న 5.
శతకాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:

శతకములు – ప్రయోజనములు

‘శతకము’ అంటే నూరు పద్యాల గ్రంథము. శతకాలలో నూరు నుండి. నూట ఎనిమిది వరకు పద్యాలు ఉంటాయి. శతకాలలో మకుటం ఉంటుంది. మకుటం లేని శతకాలూ ఉన్నాయి. మన తెలుగు భాషలో ఎందరో కవులు శతకాలు వ్రాశారు. వీటిలో నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకాలను మూడింటినీ రచించి, ‘సుభాషిత త్రిశతి’ అని పేరు పెట్టాడు.

శతకములలో వేమన రచించిన వేమన శతకము, కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకము, సుమతీ శతకము, భాస్కర శతకము, ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకము వంటివి బాగా ప్రసిద్ధి పొందాయి.

శతకములు చదవడం వల్ల ముఖ్యంగా ప్రజలలో నీతివర్తనం, భక్తి పొందుతుంది. నీతి శతకాలు మానవులకు జీవిత మార్గాన్ని ఉపదేశిస్తాయి. నీతి శతకాలవల్ల నైతిక విలువలు పెంపొందుతాయి. ముఖ్యంగా పిల్లలచే నీతి శతక పద్యాలు చదివిస్తే, వారు మంచి పౌరులుగా తయారు అవుతారు. ఏది మంచో, ఏది చెడో వారికి తెలుస్తుంది. వేమన నీతులను దృష్టాంతాలతో సులభంగా చెప్పాడు. భాస్కర శతకకర్త నీతులను దృష్టాంతాలతో చెప్పాడు. వీటిని చదవడం వల్ల సులభంగా మనకు నీతులు పట్టుపడతాయి.

భక్తి శతకాల ద్వారా దైవభక్తి పెరుగుతుంది. మొత్తంపై శతకాల వల్ల మానవులు భక్తి, నీతి కలవారై యోగ్యులైన ధర్మమూర్తులు అవుతారు. అందుకే మనం శతకాలు చదువుదాం. మన పిల్లలచే చదివిద్దాం.

10th Class Telugu 6th Lesson శతక మధురిమ 1 Mark Bits

1. కులం కంటె గుణం ప్రదానం – గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.
A) కాలము
B) కొలం
C) కలము
D) కన్నం
జవాబు:
B) కొలం

2. గగ, భ, జ, స, నల గణములు మాత్రమే వచ్చే పద్యమేది? (June 2017)
A) సీసము
B) కందము
C) ద్విపద
D) తరువోజ
జవాబు:
B) కందము

3. సృష్టి మర్మమును ఎవరు తెలుసుకోగలరు? – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) పుట్టుక
B) నడవడిక
C) రహస్యం
D) ఆచరణ
జవాబు:
C) రహస్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

4. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2018)
A) చంపకమాల
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) శార్దూలము
జవాబు:
C) ఉత్పలమాల

5. సిరి సంపదలకన్నా ప్రవర్తన గొప్పగా ఉండాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. (June 2018)
A) శ్రీశ్రీ
B) శ్రీ
C) శ్రీకారం
D) సాకారం
జవాబు:
B) శ్రీ

6. మహనీయులు వారు చేసిన పనుల వలన ఉత్తములుగా కీర్తి పొందారు. (అర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) స్నేహితులు
B) గొప్పవారు.
C) మధ్యములు
D) పేదవారు
జవాబు:
B) గొప్పవారు.

7. కరి రాజును తామరతూడులతో బంధించలేము. (పర్యాయ పదములు గుర్తించండి) (S.A. I – 2018-19)
A) కరము, కిరణము
B) గజము, ఏనుగు
C) హస్తి, హస్తము
D) గజము, సింహము
జవాబు:
B) గజము, ఏనుగు

8. మనదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప గొప్ప నాయకులు అమరులుగా నిలిచారు. (వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) మరణం పొందినవారు
B) మరణం లేనివారు
C) మరణం లెక్కచేయని వారు
D) మరణానికి భయపడనివారు
జవాబు:
B) మరణం లేనివారు

9. దేశాల మధ్య శాంతి కాపాడుకోవాలి. (విడదీసిన సరియైన రూపం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) దే + శాల
B) దేశ + అల
C) దేశము + ల
D) దేశా + ల
జవాబు:
C) దేశము + ల

AP SSC 10th Class Telugu Important Questions Chapter 6 శతక మధురిమ

10. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. (అలంకారాన్ని గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంత్యానుప్రాసము
B) లాటానుప్రాసము
C) ఛేకానుప్రాసము
D) వృత్త్యనుప్రాసము
జవాబు:
D) వృత్త్యనుప్రాసము

11. పరధనాపహరణము కంటె దిరియుట మంచిది – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018 )
A) ఇతరుల డబ్బు దొంగతనం చేయకూడదు.
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.
C) ఇతరుల సొమ్ము దొంగిలించకుండా అడుక్కోవాలి.
D) పరుల నగదు అడిగి తీసుకోవడం మంచిది.
జవాబు:
B) పరుల సొమ్ము దొంగిలించడం కంటె బిచ్చమెత్తుకోవడం మంచిది.

12. సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (March 2018)
A) నిషేధాకం
B) విధ్యర్థకం
C) నిశ్చయార్థకం
D) ప్రశ్నార్థకం
జవాబు:
B) విధ్యర్థకం

చదవండి – తెలుసుకోండి

మహాత్మాగాంధీ బోధలు

సత్యం :
ప్రపంచానికి బోధించటానికి నా వద్ద కొత్తది ఏమీ లేదు. సత్యాహింసలు పర్వతాలంతటి ప్రాచీనమైనవి.

సత్యాహింసలే నా మతం. సత్యం నా భగవంతుడు. ఆయనను ప్రసన్నం చేసుకోవటానికి అహింస మార్గం.

సత్యమనేది, నీవు ఎంత ఎక్కువగా పోషిస్తే అంత ఎక్కువగా ఫలాలిచ్చే విశాల వృక్షం వంటిది. సత్యమనే గనిలో ఎంత లోతుగా అన్వేషిస్తే అక్కడ నిక్షిప్తమైవుండి దొరికే వజ్రం అంత విలువైనదిగా ఉంటుంది. ఇతోధిక సేవా మార్గాలకు దారులు కనిపించవచ్చు.

నా జీవితమంతటా, సత్యంపై దృఢంగా నిలబడటం రాజీ తాలూకు సౌందర్యాన్ని మెచ్చుకోవటం నాకు నేర్పింది. ఈ భావన సత్యాగ్రహం (అహింసాత్మక ప్రతిఘటన)లో తప్పనిసరి భాగమని ఉత్తరోత్తరా జీవితంలో నేను చూడగలిగాను.

నిలకడవున్న వ్యక్తిగా కనిపించేందుకు నేనెప్పుడూ శ్రద్ధచూపలేదు. నా సత్యాన్వేషణ ప్రయత్నంలో అనేక భావాలను విడనాడాను. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. నా వయోభారం పెరిగే కొద్దీ నా అంతర్గత వృద్ధి ఆగిపోతుందని గాని లేదా మాంసం కరిగిపోవటంతో నా వృద్ధి ఆగిపోతుందనే భావన గాని నాకు లేదు. నేను ఆలోచిస్తున్నదల్లా సత్యం. నా భగవంతుడు క్షణక్షణానికి యిచ్చే పిలుపును శిరసావహించేందుకు నా సంసిద్ధత గూర్చే.

సత్యం స్వభావరీత్యా స్వయం ప్రదర్శితం. దానిని ఆవహించివున్న అజ్ఞానమనే సాలెగూళ్ళను నీవు తొలగించగలిగితే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది.

అహింస:
నేను నాలో ఉన్నట్లు చెప్పుకునే ఒకే ఒక సుగుణం సత్యం, అహింస. మానవాతీత శక్తులున్నట్లు నేను చెప్పుకోజాలను. అటువంటివాటిని నేను కోరుకోను. నా తోటి మానవులలో దురలుని శరీరముకున్న దుష్టమాంసఖండములే నా శరీరమునకూ ఉన్నవి. అందువల్ల అందరిలాగే నేనూ తప్పు చేయవచ్చును. నా సేవలకు అనేక పరిమితులున్నవి.

అహింస మానవాళికి అందుబాటులో ఉన్న గొప్ప శక్తి, అహింస రూపుదిద్దుకోవలసిన లేదా పాటించమని ఆదేశించవలసిన గుణం కాదు. అది అంతర్గతంగా వృద్ధి చెందేది. ఒక వ్యక్తి చేసే తీవ్రమైన ప్రయత్నంపై దాని మనుగడ ఆధారపడి ఉంటుంది.

మన సూత్రాలను ఇతరులు గౌరవించాలని మనం ఎలా ఆశిస్తామో తమ సూత్రాల పట్ల అదే పరిగణనకు ప్రత్యర్థి కూడా పాత్రుడు. ప్రత్యర్థులను గెలుచుకోవటానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అహింస కోరుతుంది.

క్రమశిక్షణ – విధి నిర్వహణ:
జీవిత ముఖ్య ప్రయోజనం సక్రమంగా జీవించడం, సక్రమంగా ఆలోచించడం, సక్రమంగా వ్యవహరించడం.

మనం ఏదైనా గొప్పదైన, శాశ్వతమైనదాన్ని సాధించే ముందు కఠినమైన, ఉక్కు క్రమశిక్షణ ఉండి తీరాలి. ఆ క్రమశిక్షణ కేవలం విద్యాసంబంధమైన వాదన నుండి, హేతువుకు, తర్కానికి విజ్ఞప్తి చేయటం ద్వారా రాదు. క్రమశిక్షణను ప్రతికూలత అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి.

సంతృప్తి ప్రయత్నంలో ఉంటుంది గాని సాధించటంలో ఉండదు. సంపూర్ణ కృషి సంపూర్ణ విజయాన్నిస్తుంది.

నిరంతర అభివృద్ధి జీవిత సూత్రం. నిలకడగా ఉన్నట్లు కనిపించే నిమిత్తం తన పిడివాదాలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నించే మనిషి తనను తాను బూటకపు స్థితిలోకి నెట్టుకుంటున్నాడు.

హక్కులకు సిసలైన మూలం విధి. ‘మనందరం గనుక మన విధులను నిర్వర్తించినట్లయితే హక్కును పొందటం దూరం కాజాలదు. విధులు నిర్వర్తించకుండా హక్కుల వెంట మనం పరుగెడితే అవి అగమ్య గోచరంగా మన నుండి తప్పించుకుంటాయి. మనం ఎంతగా వాటి వెంట పడితే అవి అంతగా దూరం ఎగిరిపోతాయి.

తన విధులు సష్యంగా నిర్వర్తించే వ్యక్తికి హక్కులు వాటంతట అవే సమకూరుతాయి.

ధైర్యం – దృఢ విశ్వాసం:
ధైర్యం అనేది కండర సంబంధమైన పదార్థంగా ఎవ్వరూ ఎన్నడూ చెప్పలేదు, అది హృదయానికి సంబంధించింది. అతి గట్టి కండరం కూడా ఊహాజనితమైన భయం ముందు వణికిపోతుందని మనకు తెలుసు. కండరాన్ని వణికించేది హృదయం.

శారీరక దారుఢ్యం నుండి బలం చేకూరదు. అది మొక్కవోని సంకల్పం నుండి వస్తుంది. బలానికి సంయమనాన్ని, మర్యాదను జత చేసినపుడు అది ప్రబలమవుతుంది.
ప్రపంచంలో చూడాలని నీవు కోరుకుంటున్న మార్పు నీలో రావాలి.

నమ్రత:
అహింసా స్ఫూర్తి విధిగా నమ్రతకు దారి తీస్తుంది.

నమ్రత అనేది ప్రత్యేకించి పాటించేది కాదు. ఎందుకంటే, అది ఉద్దేశపూర్వకంగా ఆచరించటానికి ఉద్దేశించింది కాదు. అయితే అది ‘అహింసకు తప్పనిసరి పరీక్ష, ఎవరిలోనైతే ‘అహింస’ ఉంటుందో వినయం అతని స్వభావంలో భాగమవుతుంది.

తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు – దైవాంశ సంభూతులైనా సరే. తప్పిదాలు లేకపోవటం వల్ల వారు దైవాంశ సంభూతులు కాలేదు. తమ తప్పులను తాము తెలుసుకోవటం వల్ల, వాటిని దిద్దుకోవటానికి కృషిచేయటం వల్ల, వాటిని దాచుకోకపోవటం వల్ల, తమను తాము దిద్దుకోవటానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా వుండటం వల్ల వారు దైవాంశ సంభూతులైనారు.

మరో వ్యక్తి ఆలోచనలు చెడ్డవని, మనవి మాత్రమే మంచి ఆలోచనలని చెప్పటం, మన అభిప్రాయాలకు భిన్నమైన వాటిని కలిగి వున్నవారు దేశానికి శత్రువులని చెప్పటం దురలవాటు.

సహనశీలత – అస్పృశ్యత:
అసహనం అనేది కూడా ఒక హింసారూపం. నిజమైన ప్రజాస్వామిక భావన వృద్ధిచెందటానికి ప్రతిబంధకం. మనం నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవరచుకోవాలంటే మనం అసహనపరులుగా వుండకూడదు. అసహనం ఒకని లక్ష్యంలోగల విశ్వాస వాంఛను దెబ్బతీస్తుంది.

ఇతరులు మనలను చూస్తునట్లుగా మనల్ని మనం చూసుకోటం మంచిది. మనం ప్రయత్నించినా, మనల్ని మనం సంపూర్ణంగా ఎన్నడూ తెలుసుకోలేము. ముఖ్యంగా మనలోని దుష్టపార్శ్వాన్ని అసలు తెలుసుకోలేము. మనలను విమర్శించేవారిపట్ల ఆగ్రహం చెందకుండా వున్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. వారు ఏమి చెప్పినప్పటికీ సహృదయంతో స్వీకరించాలి.

స్వేచ్ఛ – ప్రజాస్వామ్యం:
అంతర్గత ప్రమాదాలు లేనటువంటి మానవ వ్యవస్థ ఉండదు. వ్యవస్థ ఎంత పెద్దదైతే దుర్వినియోగ అవకాశాలు అంత హెచ్చుగా వుంటాయి. ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ. అందువల్ల అది ఎక్కువగా దుర్వినియోగానికి గురి అయ్యే అవకాశముంది. కనుక దానికి పరిష్కారం ప్రజాస్వామ్యాన్ని తప్పించటం కాదు, దుర్వినియోగ అవకాశాన్ని కనీస స్థాయికి తగ్గించటమే.

ప్రజాస్వామ్యం సారాంశం ఏమంటే, అందరి సమష్టి ప్రయోజనానికి సేవచేయటంలో అన్ని విభాగాల ప్రజల ఉద్యం యావత్ భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక వనరులను సమీకరించే కళ, శాస్త్రం అని అర్థం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 5th Lesson ధన్యుడు

10th Class Telugu 5th Lesson ధన్యుడు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ధన్యుడు పాఠం నేపధ్యాన్ని వివరించండి.
జవాబు:
మంచి స్నేహితులను మనం కలిస్తే, ఆ కలయిక, మన జీవితాన్ని ఒక చక్కని దారివైపునకు తిప్పుతుంది. అందుకే మనము ఎప్పుడూ మంచి స్నేహితులను కలిగియుండాలని, మన పెద్దవాళ్లు మనకు చెపుతారు. మంచి స్నేహితులతో స్నేహం మనకు మేలు చేస్తుందనీ, సత్పురుషులతో కలయిక ఎప్పటికీ మంచిది అనీ, చెప్పడమే ఈ పాఠం నేపథ్యం.

ప్రశ్న 2.
ధన్యుడు పాఠంలో నిజమైన ధన్యుడు ఎవరు? ఎట్లు చెప్పగలవు? (March 2017)
(లేదా)
నిజంగా “ధన్యుడు” ఎవరో “ధన్యుడు” పాఠ్యభాగం ఆధారంగా తెల్పండి. (June 2019)
జవాబు:
ధన్యుడు పాఠంలో నిజంగా ధన్యుడు “హిరణ్యకుడు” అనే పేరు గల ఎలుక.

హిరణ్యకుడు అనే ఎలుక, మొదట ధనలోభంతో సంచరించింది. తరువాత తెలివి తెచ్చుకొని ధనలోభాన్ని విడిచి ఉన్నదానితో తృప్తి పడ్డవాడే ధన్యుడు అని నిశ్చయించి, నిర్జనారణ్యంలో నివసించింది.

అక్కడ హిరణ్యకుడికి లఘుపతనకం అనే కాకితో మైత్రి కల్గింది. లఘుపతనకం ద్వారా మంథరుడు అనే తాబేలుతో మైత్రి కల్గింది. మంథరుడి అమృతం వంటి మాటలు, హిరణ్యకుడి తాపాన్ని చల్లార్చి, అతణ్ణి మరింతగా ధన్యుణ్ణి చేశాయి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 3.
ధన్యుడు పాఠం ఎవరు వ్రాశారు? ఆయన గురించి వ్రాయండి.
(లేదా)
“ధన్యుడు” పాఠ్యభాగ రచయితను గూర్చి రాయండి. (S.N. I – 2019-207)
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ఆయన 1809వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని, పెరంబుదూరులో జన్మించాడు. చిన్నయసూరి తండ్రి వేంకట రంగ రామానుజా చార్యులుగారు. తల్లి శ్రీనివాసాంబ. ఆయన నీతిచంద్రిక, బాలవ్యాకరణం, సూత్రాంధ్ర వ్యాకరణం మొదలైన గ్రంథాలు రాశారు.

ప్రశ్న 4.
ధన్యుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆయన పాండిత్యం, రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
ధన్యుడు పాఠమును పరవస్తు చిన్నయసూరిగారు రచించారు. ‘సూరి’ అనగా పండితుడు. ఆయన తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పండితుడు.

ఆయన అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహము మొదలైన గ్రంథాలు రాశారు.

చిన్నయసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకొనేలా ఉంటుంది. ఆయన ప్రాచీన కావ్య భాషలో రచించారు.
ఆయన పచ్చయ్యప్పకళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.

ప్రశ్న 5.
చిన్నయసూరి గురించి, ఆయన విశిష్ట రచనల గురించి వివరింపుము.
జవాబు:

  1. పరవస్తు చిన్నయసూరి తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో “శ్రీ పెరంబుదూర్”లో జన్మించాడు. ఈయన మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.
  2. ఈయన తమిళం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి పండితుడు. ‘సూరి’ అనేది ఈయన బిరుదు.
  3. చిన్నయసూరి బాలవ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్దలక్షణసంగ్రహం వంటి గ్రంథాలు రాశాడు.

ఈయన రాసిన బాలవ్యాకరణం నేటికీ ప్రామాణిక గ్రంథం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా ధనలోభం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో నాలుగైదు వాక్యాల్లో రాయండి.
జవాబు:
ధన లోభం అంటే ధనం సంపాదించాలనే దురాశ, అత్యాశ. ధనలోభం ఆపదలు అన్నింటికీ మూలం. ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటె, గొప్ప సుఖం ఉండదు.

కడుపుకోసం ఇతరులను యాచించకుండా లభించిన దానితో తృప్తిపడేవాడు. లోకంలో ధన్యుడు. అటువంటి వాడే సుఖవంతుడు.

ధనలోభం వల్ల మోహం కలుగుతుంది. మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం అగ్నిలా తన స్థానానికి నాశం – కల్గిస్తుంది. కాబట్టి ధనలోభం పనికి రాదు.

ప్రశ్న 7.
ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుక కొయ్య? అనడంలో అంతరార్థం ఏమిటి?
జవాబు:
సాధారణంగా అంతరం ఎక్కువ ఉండేవాటి పట్ల ఈ విధంగా ప్రయోగిస్తారు. ఎలుక నేలపైనా, రంధ్రాలలోనూ ఉంటుంది. గోడను నిలువుగా ఎక్కువ దూరం ఎలుక ప్రాకలేదు. చిలుకకొయ్య గోడకి మధ్యలో ఉంటుంది. అటువంటి , చిలుకకొయ్య పైకి ఎలుక చేరడం అసంభవం. అది సాధ్యం కానిది ఎలాగ సాధ్యమైంది అనేది దీనిలో అంతరార్థం. అలాగే ‘నక్క ఎక్కడ ? నాగ లోకము (స్వర్గం) ఎక్కడ?” అని కూడా అంటారు.

ప్రశ్న 8.
“ధనము సర్వశ్రేయములకు నిదానము” మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
ఏ శుభకార్యం చేయాలన్నా ధనం కావాలి. ధనం లేకపోతే ఏ పనీ చేయలేము. అందుకే ప్రతి పుణ్యకార్యానికి అసలు కారణం ధనమే. అన్నదానం, భూదానం, గృహదానం మొదలైన ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. చెరువు త్రవ్వించడం, దేవాలయాలు నిర్మించడం, పాఠశాల, ఆసుపత్రి మొదలైనవి నిర్మించడం ధర్మకార్యాలు. కాని ధనం లేకపోతే ఏ ధర్మకార్యాలు చేయలేము. అందుకే సర్వశ్రేయాలకు అసలు కారణం ధనం. మన ఉన్నతత్వానికి, గౌరవానికి, మర్యాదకు మన ధనమే అసలు కారణం.

ప్రశ్న 9.
‘దారిద్యము సర్వశూన్యము” అనే మాటను వ్యాఖ్యానించండి.
జవాబు:
దారిద్ర్యము అంటే బీదతనము: సర్వశూన్యము అంటే ఏమి లేనిది. అంటే ఇంటిలో పదార్థములు లేకుండా పోతాయి. అందువల్ల సుఖసంతోషాలు పోతాయి. దుఃఖము కలుగుతుంది. భార్యాబిడ్డలకు, కడుపునిండా తిండి పెట్టలేము. కాబట్టి దారిద్ర్యము అన్నింటినీ లేకుండా చేస్తుందని భావము.

ప్రశ్న 10.
‘ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు’ – ఎట్లు?
జవాబు:
ఆశ అన్ని అనర్థాలకు మూలం. ఆశ పడినది దొరకకపోతే కోపం వస్తుంది. కోపంలో విచక్షణ కోల్పోతాము. పిసినిగొట్టుతనం పెరుగుతుంది. ఆశ మితిమీరితే అజ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానం వలన గర్వం పెరుగుతుంది. గర్వం పెరిగితే ఎవ్వరితోటి స్నేహం చేయలేము. అందుచేత ఆశను విడిచిపెడితే సత్పురుషుడౌతాడు. మితిమీరిన ఆశ పనికి రాదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 11.
‘ధనహీనుడై నలుగురిలో ఉండరాదు. ఎందుకు?
జవాబు:
ధనహీనుడు అంటే ధనం లేనివాడు. ధనం ఉన్నప్పుడు సమాజంలో గౌరవం ఉంటుంది. హోదా ఉంటుంది. స్నేహితులు ఉంటారు. బంధువులు చేరతారు. అందరూ పలకరిస్తారు. నలుగురూ చేరతారు. కాని, ధనం లేకపోతే ఎవ్వరూ మాట్లాడరు. స్నేహితులు, బంధువులు కూడా పలకరించరు. గౌరవం, హోదా ఉండవు. ఇటువంటి అవహేళనలకు గురి అవుతూ నలుగురిలో ఉండకూడదు. ఎవరూ తెలియని ప్రదేశంలో ఉంటే ధనము లేనివాని ఆత్మాభిమానం దెబ్బ తినదు.

ప్రశ్న 12.
‘మనస్సు గట్టిపరచుకోవటం’ అంటే ఏమిటి?
జవాబు:
మనస్సు చంచలమైనది. అది ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది. గట్టి పరచుకోవడం అంటే మనస్సును దృఢం చేసికోవడం, నిశ్చయం చేసుకోవడం అని అర్థం.

ప్రశ్న 13.
‘చచ్చిన తరి వెంట రాబోదు’ అనడంలో మీకేమి అర్థమయ్యింది?
జవాబు:
మనిషి చచ్చిపోయే సమయంలో అతడు సంపాదించిన ధనం వగైరా అతడి వెంట వెళ్ళదు. కాబట్టి తాను ధనాన్ని హాయిగా వెచ్చించి, కడుపు నిండా తినాలి. ఇతరులకు ఇంత పెట్టాలి. ఇతరులకు ఇవ్వక, తాను తినక, దాచిన డబ్బు చచ్చిపోయేటప్పుడు ఆ వ్యక్తి వెంట వెళ్ళదు అని నాకు తెలిసింది.

ప్రశ్న 14.
చూడాకర్ణుని స్వభావం గురించి వ్రాయండి.
జవాబు:
చూడాకర్ణుడు అమాయకపు సన్యాసి, చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. తాను తినగా మిగిలిన భోజనం భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. దానిని ప్రతిరోజూ ఒక ఎలుక తినేసేది.

తన ఎదురుగానే ఎలుక చిలుకకొయ్యపైకి ఎగురుతుంటే, చప్పుడు చేస్తే బెదిరించాడు. అంతేకాని, ఆ ఎలుకకు అంత బలం, ధైర్యం కలగడానికి కారణం ఆలోచించలేదు. దాని బలాన్ని, బలగాన్ని కొల్లగొట్టాలని ఆలోచించలేదు. తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని పీడ వదిలించుకొన్నాడు. సలహా చెబితే పాటించే స్వభావం కలవాడు చూడాకర్ణుడు.

ప్రశ్న 15.
వీణాకర్లుని స్వభావం వ్రాయండి.
జవాబు:
వీణాకర్ణుడు ఒకసారి చూడాకర్ణుని దగ్గరకు వచ్చాడు. అతని ఆహారాన్ని ఎలుక దొంగిలిస్తున్న విధానం గమనించాడు. వీణాకర్ణుడు చాలా తెలివైనవాడు. కనుకనే ఎలుక బలానికి కారణాన్ని అన్వేషించాడు. తన స్నేహితునికి ఆ ఎలుక నివాసాన్ని కొల్లగొట్టమని చక్కని సలహా ఇచ్చాడు. స్నేహితునకు ఉపకారం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల బాధలను తన బాధలుగా భావించి, నివారిస్తాడు. అతని సలహాతో చూడాకర్ణునికి ఎలుకబాధ పూర్తిగా తొలగిపోయింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 16.
హిరణ్యకుని స్వభావం వ్రాయండి.
జవాబు:
హిరణ్యకుడు, చూడాకర్ణుని భిక్షాన్నం దొంగిలించి బ్రతికేవాడు. కాని, చూడాకర్ణునిచేత సంపదంతా కొల్లగొట్టబడి తరమబడ్డాడు. ఇంకక్కడ ఉండకూడదనుకొన్నాడు. అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక జ్ఞానోదయమయింది. సంపద ఉన్నపుడు తనకు ఎవరూ సాటి లేరనుకొని విర్రవీగాడు. సంపదపోగానే, పట్టుదల పెరిగింది. కాని, సన్న్యాసి విసిరిన కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాక నిజమైన జ్ఞానం కలిగింది. అప్పుడే లోభం వలన కలిగే ప్రమాదం తెలుసుకొన్నాడు. లోభం విడిచి పెట్టాడు. అడవికి వెళ్ళాడు. ధన్యుడయ్యాడు.

ప్రశ్న 17.
మంథరుని స్వభావం వ్రాయండి.
జవాబు:
అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా అడవికి వచ్చిన హిరణ్యకుని ఆదరించిన స్నేహశీలి మంథరుడు. తన స్నేహంతో అతనికి పునర్జన్మను ప్రసాదించాడు. తన మంచి మాటలతో జ్ఞానోదయం కల్గించాడు. అతి సంచయేచ్ఛ తగదని బోధించింది. మనోధైర్యాన్ని ప్రసాదించింది. లఘుపతనకునితో సమానంగా ఆదరించిన స్నేహశీలి.

ప్రశ్న 18.
వివేకహీనుడిని ఎందుకు సేవించకూడదు?
జవాబు:
వివేకహీనుడిని సేవించడం కంటే, వనవాసం ఉత్తమం అని హిరణ్యకుడు అనుకుంటాడు. వివేకము అంటే మంచి చెడులు సరిగా తెలిసికొనే జ్ఞానము. వివేకము లేనివాడిని అవివేకి అని, వివేకహీనుడని అంటారు.

మంచి చెడ్డలు తెలియని ప్రభువును సేవిస్తే అతడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడు. ప్రభువు మేలుకోరి పనిచేసేవాడిని కూడా వాడు నిందిస్తాడు. ఇతరుల చెప్పుడుమాటలు విని, తన దగ్గర పనిచేసే సేవకుడిని తప్పు పడతాడు. అకారణంగా శిక్షిస్తాడు. తన కోసం కష్టపడే సేవకుడి మంచితనాన్ని, కష్టాన్ని వివేకహీనుడయిన ప్రభువు గుర్తించలేడు. అకారణంగా, అన్యాయంగా తన తెలివితక్కువతనంతో తనవద్ద పనిచేసే సేవకుడి కష్టాన్ని గుర్తించడు. సేవకుడి మంచితనాన్ని పట్టించుకోడు. కాబట్టి వివేకహీనుడిని సేవించకూడదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 19.
బాలవ్యాకరణాన్ని గూర్చి రాయండి.
జవాబు:
బాలవ్యాకరణాన్ని చిన్నయసూరి రచించాడు. ఈయన బాలవ్యాకరణము, నీతిచంద్రిక, అక్షరగుచ్ఛము, ఆంధ్రకాదంబరి, సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము అనే గ్రంథాలు రచించాడు. ఈయన రచించిన ‘బాలవ్యాకరణం’
కావ్యభాషకు మంచి ప్రామాణిక గ్రంథము. నీతిచంద్రిక – బాల వ్యాకరణాలు లక్ష్య – లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధిపొందాయి.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సంసార విషవృక్షమునకు అమృతతుల్యమైనవి ఏమిటో వివరించండి. (S.A.I – 2018-19 June 2016)
జవాబు:
‘సంసారం’ అంటే మనుషుల చావు పుట్టుకలు. ఈ సంసారం విషవృక్షము వంటిది. వృక్షమునకు పళ్ళు పుడతాయి. అలాగే సంసారం అనేది విషవృక్షం అనుకుంటే, ఆ సంసార విషవృక్షానికి రెండు అమృతము వంటి పళ్ళు పుడతాయని కవి చెప్పాడు.

అందులో ‘కావ్యామృత రసపానము’ మొదటి అమృత ఫలము, సత్పురుషులతో సహవాసము రెండవ అమృత ఫలము. అంటే మనుషులుగా పుట్టిన వారికి, రెండు ప్రయోజనాలు కలుగుతాయి. హాయిగా మహాకవులు రాసిన కావ్యాలలోని అమృతం వంటి రసాన్ని గ్రహించి ఆనందించవచ్చు. అలాగే సత్పురుషులతో స్నేహం చేసి దాని ద్వారా అమృతం వంటి ఆనందం పొందవచ్చునని కవి చెప్పాడు.

నిజంగానే రామాయణము, భారతము వంటి కావ్యాలలోని సారాన్ని గ్రహిస్తే, అది అమృతములా ఉంటుంది. అలాగే సత్పురుషులతో స్నేహం చేస్తే అందువల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చు. అందుకే రచయిత సంసారం చేస్తున్న మానవులకు, కావ్యాలను చదివి ఆనందం పొందే అదృష్టము, మంచివారితో సహవాసం చేసే అదృష్టమూ లభిస్తాయని చెప్పాడు.

ప్రశ్న 2.
హిరణ్యకుడు అడవులపాలు కావటానికి లోభమే ప్రధాన కారణమని తెల్పిన మంథరుని మాటలను సమర్థించండి. (Jure 2018)
జవాబు:
1) హిరణ్యకుడు లోభం కారణంగా అడవులపాలైన తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మిత్రుడైన మంథరునికి వినిపించాడు.
2) ఆ మాటలు విన్న మంథరుడు “సంపదలు శాశ్వతమైనవి కావని, యవ్వనం ప్రవాహవేగంలాంటిదని, జీవితం నీటి బుడగతో సమానమైనదని చెప్పాడు.
3) కావున బుద్ధిమంతుడు సత్వరమే (వెంటనే) ఈ నిజాన్ని గుర్తించి ధర్మకార్యాలు చక్కగా ఆచరించాలని, అలా ఆచరించని వారు పశ్చాత్తాపంతో దుఃఖమనే అగ్నిలో కాలిపోతారని చెప్పాడు.
4) “నీవు కావలసిన దానికన్నా ఎక్కువగా కూడబెట్టావు. నీ లోభ బుద్ధియే నిన్నిలా అడవుల పాలు చేసింది. ఎక్కువగా కూడబెట్టాలనే కోరిక తగదు. ఇతరులకిచ్చి మనం భుజించినదే మన సొత్తు. పరులకివ్వకుండా తాను తినకుండా దాచిన సొమ్ము చనిపోయినపుడు వెంటరాదు. బ్రతకడం కోసం ఇన్ని తిప్పలు పడనవసరం లేదు. ధర్మాలన్నీ తెల్సిన నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదు.” అంటాడు.
5) ఈ అంశాలన్నీ సమర్థింపదగినవేనని నేను భావిస్తున్నాను. సంపదల స్వభావం గురించి యవ్వనం గురించి, జీవితం గురించి, ముఖ్యంగా లోభగుణం గురించి, ధర్మకార్యాలను ఆచరించవలసిన అవసరం గురించి మంథరుడు చెప్పిన మాటలు అందరూ అనుసరించదగినవని, ఆమోదించదగినవనీ నేను భావిస్తున్నాను.

ప్రశ్న 3.
ఈ క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. చూడాకర్ణుడు :
చంపకవతి అనే పట్టణంలోని సన్యాసి. తను భోజనము చేయగా మిగిలిన వంటకం చిలుక కొయ్య మీద దాచుకొనేవాడు. ఒక ఎలుక ప్రతిరోజూ దానిని తినేసేది. ఎలుకను బెదిరించాడు తప్ప దానిని భయపెట్టి తరిమేసే ప్రయత్నం చేయలేదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించే స్వభావం కాదు. వీణాకర్ణుని సలహాతో హిరణ్యకుని పీడను వదిలించుకొన్నాడు. అతని మాటతీరును బట్టి చాలా గ్రంథాలు చదివిన వాడని తెలుస్తుంది. స్నేహితులు చెప్పే మంచి సలహాలను వింటాడు. ఆచరిస్తాడు. తెలివైనవాడు.

2. వీణాకర్ణుడు :
చూడాకర్ణుని స్నేహితుడు. ఒక సమస్య యొక్క మూలాలను వెతికి పట్టుకొంటాడు. పరిష్కారం సూచిస్తాడు. చూడాకర్ణునికి హిరణ్యకుని పీడ వదలడానికి కారణం వీణాకర్ణుని సలహాయే. ఆపదలో ఉన్న స్నేహితులకు మంచి సలహాలు చెప్పే స్వభావం కలవాడు.

3. హిరణ్యకుడు :
ఇతడు ఒక ఎలుక. అవకాశం ఉన్నంతకాలం చూడాకర్ణుని దోచుకొన్నాడు. అతని వలన ప్రమాదం ఏర్పడ్డాక జ్ఞానం కలిగింది. ధన వ్యామోహం తగ్గింది. అది తనకు తగిన ప్రదేశం కాదని గుర్తించాడు. భగవంతుని దయామయత్వం అవగాహన చేసుకొన్నాడు. అడవికి చేరాడు. ధన్యుడయ్యాడు. పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.

4. మంథరుడు :
మంథరుడు ఒక తాబేలు పేరు. స్నేహశీలము కలిగినవాడు. హిరణ్యకునికి ఆశ్రయం ఇచ్చాడు. ధనం అశాశ్వతమని, యౌవనం తొందరగా గడిచిపోతుందని తెలుసుకొన్న జ్ఞాని. ధర్మమును ఆచరించాలని చెప్పిన ధర్మాత్ముడు. జీవితం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నవాడు. తన స్నేహితులను కూడా మంచి మార్గంలో నడిపించే ఉత్తముడు మంథరుడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 4.
“యాచక వృత్తి సమస్త గౌరవాన్ని హరిస్తుంది”. విశ్లేషిస్తూ రాయండి.
జవాబు:
యాచక వృత్తి వలన సమస్త గౌరవం పోతుంది. ప్రపంచంలో అనేక రకాల వృత్తులున్నాయి. ఏ వృత్తిని చూసినా కొంతపని చేసి దానికి ప్రతిఫలం పొందడం కనిపిస్తుంది. పనిచేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు. తప్పు చేస్తే గౌరవం తగ్గడం సహజం. యాచక వృత్తి అంటే ఇతరులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా వారి నుంచి ధనం, వస్తువులు మొదలగునవి ఆశించడం. అలా ఎప్పుడైతే ఆశించామో అదే మన గౌరవానికి భంగం కలిగిస్తుంది. యాచక వృత్తిని చేసే వారిని తనవారు కానీ, పైవారు కానీ ఎవరూ గౌరవించరు. చిన్న పనైనా, పెద్ద పనైనా కష్టపడి పనిచేస్తూ సంపాదించుకుని బతుకుతుంటే గౌరవానికి భంగం కలుగదు.

ప్రశ్న 5.
‘ధన్యుడు’ అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి ఎలా సరిపోయిందో సమర్థించండి.
జవాబు:
ఉదరముకయి పరులగోఁజక, ప్రాప్తి లాభానికి సంతోషించేవాడు ఒక్కడే లోకమందు ధన్యుడు అని హిరణ్యకుడు నిశ్చయించుకొని నిర్జనారణ్యంలో నివాసం చేశాడు.

పొట్టకోసం ఇతరులను పీడించకుండా, తనకు లభించిన దానితో తృప్తిపడి, సంతోషపడేవాడు ధన్యుడని హిరణ్యకుడి అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయం. భగవంతుడే మనకు కావలసినవి ఇస్తాడు. అందుచేత పోషణ కోసం ఇతరుల కాళ్ళమీద పడి వారిని యాచించనక్కరలేదు.

రాతిలోని కప్పను దయామయుడైన భగవంతుడు రక్షిస్తున్నాడు. మనం చేసుకొన్న కర్మలను బట్టి మనకు దుఃఖాలు వచ్చినట్లే, కోరకుండానే సుఖాలు వస్తాయి.

హిరణక్యుడు అనే ఎలుక మొదట ధనలోభంతో సంచరించింది. చివరకు సన్యాసి కర్రదెబ్బ తగిలి, తెలివి తెచ్చుకొంది. మనుష్యులు లేని అడవిలో నివసించింది. చివరకు లఘుపతనకం సహాయంతో మంథరుడనే కూర్మరాజు మైత్రి పొందింది. తమకు దొరికిన దానితో ముగ్గురమూ కలసి సుఖంగా ఉందామని మంథరుడు హిరణ్యకునకు నచ్చ చెప్పాడు.

మంథరుడు అమృతం వంటి మాటల వలన తన తాపం పోయిందనీ, తాను ధన్యుడనయ్యానని హిరణ్యకుడు అనుకొన్నాడు. కనుక ధన్యుడు అనే పేరు హిరణ్యకుని వృత్తాంతానికి సరిపోయింది.

ప్రశ్న 6.
హిరణ్యకునిలో ఆలోచనను రేకెత్తించినదెవరు? ఎలా?
జవాబు:
చూడాకర్ణుడు తన స్నేహితుని సలహాతో హిరణ్యకుని కలుగును త్రవ్వాడు. దాని సంపదనంతా కొల్లగొట్టాడు. తర్వాత హిరణ్యకునికి బలం తగ్గింది. ఉత్సాహం కూడా తగ్గింది. ఆహారం కూడా సంపాదించుకొనలేనంతగా నీరసపడింది. నడకలో వేగం తగ్గింది. సంపద పోవడంతో ఆలోచించే అవకాశాన్ని చూడాకర్ణుడు తన చేష్టల ద్వారా కలిగించాడు. ధనము కలవాడే పండితుడు, అతడే బలవంతుడు. ధనమే అన్నింటికీ మూలమన్నాడు చూడాకర్ణుడు.

మూషికం తన సంపదతోపాటు బలాన్ని కూడా కోల్పోయిందని ఆక్షేపించాడు. ధనం లేనివాడికి ఎల్లప్పుడూ బాధగానే ఉంటుంది. నిరంతరం బాధపడడం వలన తెలివి మందగిస్తుంది. తెలివి తగ్గితే అన్ని పనులూ పాడవుతాయి అని దెప్పి పొడిచాడు.

ధనవంతుడికే పౌరుషం చెల్లుతుంది. మేథాసంపద, బంధుమిత్రులు ధనాన్ని బట్టే చేరతారు. భార్యాబిడ్డలు లేని ఇల్లు, మూర్ఖుడి మనసు శూన్యంగా ఉంటాయి. దరిద్రం వలన అంతా శూన్యంగా కనిపిస్తుంది. దరిద్రం కంటె మరణం మంచిది. మరణం చాలా బాధాకరం. జీవితమంతా దరిద్రం అనుభవించడం చాలా కష్టం. డబ్బు లేకుంటే సొంతవాళ్ళే పరాయివాళ్ళు అవుతారు. ఇలా అనేక విధాల తన మాటల ద్వారా హిరణ్యకుని చిత్రవధ చేశాడు.

చూడాకర్ణుని మాటలు, చేష్టలు హిరణ్యకునిలో ఆలోచనలను రేకెత్తించాయి. తనలో తాను ఆలోచించడం ప్రారంభించాడు. ఆ ఆత్మపరిశీలనే జ్ఞానోదయానికి కారణమయ్యింది.

ప్రశ్న 7.
హిరణ్యకుని ఆలోచనా ధోరణిని వివరించండి.
జవాబు:
చూడాకర్ణుడు హిరణ్యకుని సంపదనంతా కొల్లగొట్టాడు. ధనం యొక్క ప్రాధాన్యతని వివరిస్తూ హిరణ్యకుని చాలా కించపరిచాడు. అప్పుడు హిరణ్యకునిలో ఆలోచన మొదలైంది.

అక్కడింక నివసించకూడదనుకొన్నాడు. తనకు జరిగిన అవమానం ఇతరులకు చెప్పుకోవడం మంచిదికాదనే సుభాషితం గుర్తు చేసుకొన్నాడు. దైవం అనుకూలించనపుడు తన పౌరుషం వలన ప్రయోజనం లేదని గుర్తించాడు. వనవాసం మంచిదని తలపోసాడు.

యాచించి బ్రతకడం కంటె వనవాసం మేలనుకొన్నాడు. బ్రతికితే పువ్వులా బ్రతకాలనుకొన్నాడు. యాచన అవమానకరం అనుకొన్నాడు. ఎన్ని విధాల ఆలోచించినా లోభం వదలలేదు. అక్కడే ఉండి మళ్ళీ ధనార్జన చేయాలని సంకల్పించాడు.

కాని, లోభం వలన మోహం పుడుతుంది. మోహం వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన ఆశ్రయం కోల్పోతారు. ఇవేవీ ఆలోచించలేదు. ఇంతలో చూడాకర్ణుడు హిరణ్యకుని పైకి కర్రను విసిరాడు. దైవికంగా ఆ కర్ర దెబ్బ నుండి తప్పించుకొన్నాడు.

అపుడు అతని ఆలోచనలో పరిణతి వచ్చింది. అన్ని ఆపదలకు ధనలోభమే మూలమని గ్రహించాడు. లోభమును విసర్జించినవాడే అన్నీ తెలిసినవాడని తెలుసుకొన్నాడు. వాడు మాత్రమే సుఖపడగలవాడని గ్రహించాడు.

అక్కడి నుండి హిరణ్యకుని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. అదేమి తన తాతముత్తాతల స్థలం కాదని గ్రహించాడు. అడవికిపోయి బ్రతకవచ్చనుకొన్నాడు.

ఈ విధంగా హిరణ్యకుని ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.

ప్రశ్న 8.
కావ్యామృత రసపానము, సజ్జ సంగతులను అమృతతుల్యములు అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
సంసారము అనే విషవృక్షమునకు, రెండు ఫలములు అమృతముతో సమానమైనవి ఉన్నాయి. అందులో ‘కావ్యామృత రసపానము’ ఒకటి. ‘సజ్జన సంగతి’ రెండవది అని, హిరణ్యకుడు అనే ఎలుక, మంథరుడు అనే తాబేలుతో చెప్పాడు.

సంసారము అంటే మానవుల చావు పుట్టుకలు. మనిషి పుడతాడు, తిరిగి చస్తాడు. తిరిగి పుడతాడు. దీన్నే ‘సంసారము’ అంటారు. ఈ సంసారం, విషవృక్షము వంటిది. వృక్షాలకు కాయలు, పళ్ళు కాస్తాయి. అలాగే సంసారం అనేది విషవృక్షము అనుకుంటే, దానికి రెండు పళ్ళు పుడతాయట. అందులో మొదటిది ‘కావ్యామృత రసపానము’. అనగా మహాకవులు రాసిన మంచి కావ్యాలను చదివి, దానిలోని అమృతం వంటి రసాన్ని ఆస్వాదించడం. రెండవది ‘సజ్జన సంగతి’ అంటే మంచివారితో స్నేహము.

మనిషి పుట్టడం, చావడం అనే సంసారం విషవృక్షము వంటిదయినా, ఆ పుట్టుక వల్ల మనిషికి రెండు ప్రయోజనాలు, అమృతము వంటివి సిద్ధిస్తాయట. అంటే మనిషిగా పుట్టినవాడు, చక్కగా అమృతం వంటి రసం గల మహా కావ్యాలు చదివి ఆనందం పొందవచ్చు. అలాగే మనిషిగా పుట్టి సంసారం చేసేవాడు, మంచివారితో స్నేహం చేసి, దానివల్ల అమృతం వంటి ఆనందం పొందవచ్చునని రచయిత ఉద్దేశ్యము.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 9.
‘అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము’. వీటిని గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారో సోదాహరణంగా రాయండి.
(లేదా)
అర్థములు నిత్యములు కావంటూ – మంధరుడు అన్న మాటలను మీరు ఏవిధంగా సమర్థిస్తారు? (S.A. I – 2019-20)
జవాబు:
‘అర్థములు నిత్యములు కావు’ అంటే ధనము శాశ్వతంగా ఉండదని అర్థము. డబ్బులు సంపాదించినా అది శాశ్వతంగా వాడి వద్ద ఉండవు. ఈ రోజు ధనవంతుడయినవాడు, మరునాటికి బీదవాడు కావచ్చు. పెద్ద పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టిన ధనవంతుడికి, పెద్ద నష్టం రావచ్చు. ఫ్యాక్టరీకి ప్రమాదం రావచ్చు.

బ్యాంకులో డబ్బు పెడితే, ఆ బ్యాంకు దివాలా తీయవచ్చు. లేదా అతడి ధనాన్ని దొంగలు అపహరింపవచ్చు. కాబట్టి అర్థములు నిత్యములు కావని రచయిత చెప్పాడు.

‘యౌవనము ఝరీవేగతుల్యము’ అంటే మంచి యౌవన వయస్సు, ప్రవాహవేగం వంటిది. ‘ఝరి’ అంటే సెలయేరు. సెలయేరు వర్షాలు వస్తే పొంగుతుంది. ఆ నీరు కొండ నుండి కిందికి దిగి పోగానే అది ఎండిపోతుంది. యౌవనము కూడా సెలయేరు వంటిది.

రోజు ఉన్న యౌవనం, శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజుల్లో మనం అంతా ముసలివాళ్ళం అవుతాము. తరువాత మరణిస్తాము. వయస్సు వేగంగా వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే యువకులు వృద్ధులు అవుతారు. సెలయేరు ఎంత వేగంగా వెడుతుందో, వయస్సు కూడా అంతవేగంగా ముందుకుపోతుంది. కాబట్టి మనిషి ధనాన్ని, యౌవనాన్ని నమ్మి ఉండరాదు. అవి వేగంగా పోయేవని గ్రహించి డబ్బు, యౌవనము ఉన్నపుడే మంచిపనులు చేయాలని నేను గ్రహించాను.

ప్రశ్న 10.
చిత్రాంగుని హిరణ్యకుని జీవితచరిత్ర ఆధారంగా దాని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
గమనిక : చిత్రాంగుడి గూర్చి మనకు పాఠములో లేదు. హిరణ్యకుడి గురించి ఉంది (అందుకే హిరణ్యకుడి గురించి ఇవ్వడం జరిగింది.)
జవాబు:
హిరణ్యకుని లోభము :
హిరణ్యకుడు ఒక ఎలుక. అది చూడకర్ణుడనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు దాచిన వంటకాన్ని దొంగిలించి బాగా సంపాదించింది. ఆ సన్న్యాసి, ఈ ఎలుక కన్నాన్ని తవ్వి, అది దాచిన సర్వస్వాన్నీ తీసుకున్నాడు. దానితో హిరణ్యకం దిగులుపడింది. కాని ధనలోభంతో ఆ చోటును విడిచిపెట్టలేదు.

జ్ఞానము – వివేకము :
హిరణ్యకం, అభిమానం కలవాడికి, వనవాసం మంచిదని గ్రహించింది. వివేకం లేనివాడిని సేవించరాదనుకొంది. యాచనా వృత్తి దోషం అనుకుంది. అడవికి వెళ్ళిపోదామని నిశ్చయించింది. కాని ధనలోభం వల్ల దానికి మోహం కలిగి, అక్కడే ఉండి తిరిగి సంపాదిద్దామనుకుంది.

వనవాసము – వైరాగ్యము :
ఒక రోజున హిరణ్యకుడిపై సన్న్యాసి కజ్జును విసిరాడు. దైవవశం వల్ల ఆ దెబ్బ నుండి హిరణ్యకం రక్షించబడింది. దానితో ధనలోభము వల్ల ఆపదలు వస్తాయని అది గ్రహించింది. దొరికిన దానితో సంతోషించేవాడే ధన్యుడని, సుఖవంతుడు అని హిరణ్యకం గుర్తించింది. కోరకుండానే ప్రాణికి దుఃఖాల వలె సుఖాలు కూడా వస్తాయని హిరణ్యకం గుర్తించి, నిర్జనారణ్యంలోకి వెళ్ళింది.

ఈ విధంగా హిరణ్యకుడు మొదట ధనలోభంతో సంచరించాడు. తరువాత తెలివి తెచ్చుకొని, లోభమోహాలను విడిచి, దొరికిన దానితో తృప్తి పడదామని నిర్జనారణ్యంలో నివసించాడు. కాబట్టి హిరణ్యకుడు ధన్యజీవి.

ప్రశ్న 11.
హిరణ్యకుడు మొదట ఎందుకు బలవంతుడు? తరువాత ఎందుకు బలహీనుడయ్యాడో విశ్లేషించండి.
జవాబు:
హిరణ్యకుడు అనే ఎలుక చూడాకర్ణుడు అనే సన్న్యాసి ఇంట్లో కన్నంలో ఉండేది. ఆ సన్న్యాసి తాను తినగా మిగిలిన వంటకాన్ని భిక్షాపాత్రలో పెట్టి చిలుకకొయ్యకు తగిలించేవాడు. హిరణ్యకుడు ఆ వంటకాన్ని భక్షించేవాడు. ఆ విధంగా హిరణ్యకుడు ఎంతో ఆహారాన్ని దాచాడు. దానితో మొదట్లో హిరణ్యకుడు బలవంతుడుగా ఉండేవాడు.

తరువాత ఒకరోజున చూడకర్ణుడు మిత్రుని సలహాపై హిరణ్యకుడి కన్నమును తవ్వి అతడు దాచుకున్న సర్వస్వాన్నీ గ్రహించాడు. దానితో హిరణ్యకుడు బలహీనుడయ్యాడు. అయినా హిరణ్యకుడు ఆ సన్న్యాసి ఇంట్లోనే తిరిగేవాడు. ఒక రోజున సన్న్యాసి హిరణ్యకుడి పై చేతి కణ్ణను విసిరాడు. దానితో హిరణ్యకుడు నిర్జనారణ్యంలోకి నివాసం మార్చాడు. ఈ విధంగా హిరణ్యకుడు బలహీనుడయ్యాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 12.
సజ్జన సాంగత్యము లభించి ధన్యుడైన హిరణ్యకుని వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో వ్రాయండి. (March 2019)
జవాబు:
హిరణ్యకుడు ఒక ఎలుక. ఆ ఎలుక చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంటిలో కన్నంలో నివాసము ఉండేది. ఆ సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన అన్నాన్ని భిక్షాపాత్రలో పెట్టి దాన్ని చిలుక కొయ్యకు తగిలించేవాడు. ఎలుక చిలుక కొయ్య పైకి ఎగిరి, ఆ అన్నాన్ని తినివేసేది. ఆ ఎలుక ఈ విధంగా ఎంతో సంపాదించింది.

ఒకరోజు చూడాకర్ణుడి ఇంటికి వీణాకర్ణుడు అనే సన్యాసి వచ్చాడు. చూడాకర్ణుడు ఎలుకను తన కజ్జుతో బెదరిస్తున్నాడు. ఎలుక సంగతి చూడాకర్ణుడు, వీణాకర్ణుడికి చెప్పాడు. వీణాకర్ణుడి సలహాపై, చూడాకర్ణుడు ఎలుక కన్నాన్ని తవ్వి, ఎలుక దాచుకున్న దాన్ని తీసుకున్నాడు. దానితో ఎలుక ఆహారము లేక ఇంటిలో తిరుగుతోంది. సన్యాసి ఎలుకపై తన కజ్జను విసిరాడు. అదృష్టవశాత్తు ఎలుక తప్పించుకొని, ఆ ఇంటిపై విరక్తి పెంచుకొని, అడవిలోకి వెళ్ళిపోయింది. మనుష్యులు లేని ఆ అడవిలో ఆ ఎలుకకు కాకితో స్నేహము కుదిరింది. ఆ అడవిలో తినడానికి ఎలుకకు ఏమీ దొరకలేదు. దానితో ఎలుక, తన మిత్రుడైన కాకితోపాటు, కాకికి స్నేహితుడైన మంథరుడి వద్దకు వచ్చింది. కాకి, ఎలుక, మంథరుడు స్నేహితులయ్యారు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు Important Questions and Answers

ప్రశ్న 1.
ధన్యుడు కథను చిన్ననాటికగా మలచండి.
జవాబు:
ఏకాంకిక : పాత్రలు 1) హిరణ్యకుడు 2) మంథరుడు

మంథరుడు : మనమంతా సుఖంగా కలసి ఉందాము. దొరికిన దాంతో కాలం గడిపేద్దాం. అది సరే కాని నీవు అడవిలో ఎందుకు ఉన్నావు హిరణ్యకా!

హిరణ్యకుడు : మిత్రమా! మంథరా ! నేను ఒకప్పుడు చూడాకర్ణుడు అనే సన్యాసి ఇంట్లో కన్నంలో ఉండి, అతడు చిలుక కొయ్యమీద దాచుకొన్న వంటకాన్ని తినేదాన్ని.

మంథరుడు : మరి ఏమైంది?

హిరణ్యకుడు : ఇక్కడ ఒకసారి ఆ సన్న్యాసి ఇంటికి వీణాళుడనే సన్న్యాసి వచ్చాడు. చూడాకర్ణుడిచే నా కన్నం త్రవ్వించాడు.

మంథరుడు : అప్పుడు నువ్వు అడవిలో మకాం పెట్టావా?

హిరణ్యకుడు : లేదు. నేను సన్న్యాసి ఇంట్లోనే తిరుగుతున్నా. ఒకరోజు సన్న్యాసి నాపై కర్ర విసిరాడు. అప్పుడు ఉన్న దానితో తృప్తి పడదామని అడవికి వచ్చా. అక్కడే మన మిత్రుడు లఘుపతనకుడితో స్నేహం అయ్యింది.

మంథరుడు : అడవిలో మీ ఇద్దరికీ ఆహారం సరిగ్గా దొరికిందా!

హిరణ్యకుడు : లేదు మిశ్రమా! అందుకే లఘుపతనకం నీ దగ్గరకు నన్ను కూడా తీసుకువచ్చింది.

మంథరుడు : మిత్రమా! హిరణ్యకా! డబ్బు శాశ్వతం కాదు. దాచిన డబ్బు మనతో రాదు. ప్రక్కవాడికి పెట్టి మనం హాయిగా తినాలి. మనం ముగ్గురమూ ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతికేద్దాం.

హిరణ్యకుడు : మిత్రమా! నీ మాటలు విని నేను ధన్యుణ్ణి అయ్యాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 2.
చిన్నయసూరి కథను చెప్పే విధానాన్ని, రచయిత రచనా విధానాన్ని ప్రశంసిస్తూ మీ గ్రంథాలయంలో చిన్నయసూరి రచనలు పెట్టవలసిన అవసరాన్ని వివరిస్తూ మీ ప్రధానోపాధ్యాయునకు లేఖ వ్రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x

గౌరవనీయులైన కర్నూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి,
తమ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న 8. వెంకట్ వ్రాయు లేఖ,

అయ్యా !

విషయము : పాఠశాల గ్రంథాలయంలో – చిన్నయసూరి రచనల గూర్చి – విజ్ఞప్తి.

మాకు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘ధన్యుడు’ పాఠం ఉన్నది. దానిని పరవస్తు చిన్నయసూరిగారు రచించారు.

అది కావ్యభాషలో ఉంది. చిన్నయసూరి రచనా శైలి చాలా బాగుంది. మమ్మల్ని ఆ శైలి ఆకట్టుకొంది. కథను చెప్పడంలో చక్కని వేగం ఉంది. ఆ వాక్య నిర్మాణం కూడా చాలా బాగుంది. పదాల ఎన్నికలో అర్థానికి తగినవి ఎన్నుకొన్నారు.

పరివ్రాజకుడు, కాణాచి, పాతకాపు, చెడగరపు బోడవంటి పాతపదాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కథలోని పాత్రలు అన్నీ జంతువులు. జంతువుల ద్వారా నీతులు చెప్పించడం చిన్నయసూరి ప్రత్యేకత. సంభాషణలలో కూడా నాటకీయత ఉంది.

చిన్నయసూరి ఇలాంటి కథలు ఇంకా చాలా వ్రాశారని మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పారు. ఆ కథలన్నీ చదవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది.

కనుక మాయందు దయతో చిన్నయసూరి రచనలన్నింటినీ మన పాఠశాల గ్రంథాలయానికి కొనిపించండి.

నమస్కారములు.

ఇట్లు,
తమ విద్యార్థి,
కె. వెంకట్, 10వ తరగతి.

ప్రశ్న 3.
చిన్నయసూరి రచనలను చదవవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, అవి చదవమని పాఠకులను కోరుతూ కరపత్రం రూపొందించండి.
జవాబు:

కరపత్రం

పాఠకులారా! తెలుగు పాఠకులారా! చదవండి.

ఈ రోజు టీ.వీ.లను చూడడానికి ఇచ్చిన ప్రాధాన్యం చదవడానికి ఇవ్వటల్లేదు. క్రమంగా పుస్తకాలు చదివే అలవాటుకు దూరమవుతున్నాం. కొన్ని పాత పదాలు మనకు తెలియటం లేదు.

చిలుకకొయ్య, నిదాఘ నదీపూరము, పరివ్రాజకుడు, ఝురీవేగతుల్యము మొదలైన ఎన్నో పాత పదాలు తెలియాలంటే ప్రాచీన రచనలు చదవాలి. చిన్నయసూరి రచనలు చదివితే ఇలాంటి పదాలు తెలుస్తాయి. కథాకథన విధానం తెలుస్తుంది. పాండిత్యం పెరుగుతుంది. మన సంభాషణా చాతుర్యం పెరుగుతుంది.

అందుకే చిన్నయ రచనలు చదవండి. చదివించండి.

ఇట్లు,
పాఠక సమాజం

ప్రశ్న 4.
పరవస్తు చిన్నయసూరి రచనల గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
సూరి రచనల మాధుర్యం

‘చిన్నయ రచనలు పూర్తిగా చదివినవాడే తెలుగు భాషలో సూరి’ అని పెద్దల మాట. తెలుగు భాష సుష్టుగా నేర్చుకొన్నవాడు, సూరి రచనలను వదలలేడు.

పరవస్తు చిన్నయసూరి 1809వ సంవత్సరంలో పెరంబుదూరులో జన్మించాడు. శ్రీనివాసాంబ, వేంకట రంగ రామానుజాచార్యులు వారి తల్లిదండ్రులు.

తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో సూరి పండితుడు. అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణం, నీతిచంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణం, శబ్ద లక్షణ సంగ్రహం మొదలైనవి ఆయన రచనలు.

పాఠకులను ఆకట్టుకొనే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రచనలు ప్రాచీన కావ్య భాషలో ఉంటాయి. సూరి రచనల్లో చక్కటి నీతులు ఉంటాయి. లోకజ్ఞానం ఉంటుంది. మంచి పదబంధాలుంటాయి. వ్యాకరణ సూత్రాలకి అనుగుణమైన పదప్రయోగాలు మాత్రమే ఉంటాయి. జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణం ఈనాటికే కాదు ఏనాటికైనా ప్రామాణిక వ్యాకరణ గ్రంథమే.

చిన్నయసూరి రచనలు చదివితే, ఇంక ఏ గ్రంథాలు చదవకపోయినా, అపారమైన జ్ఞానం కలుగుతుంది. తెలుగు భాషపై మంచి పట్టు సాధించవచ్చును. అందుకే కనీసం చిన్నయసూరిది ‘నీతిచంద్రిక’నైనా ప్రతి తెలుగువాడూ చదవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

ప్రశ్న 5.
హిరణ్యకుడు – ఏకపాత్రాభినయం రాయండి.
జవాబు:
నేను హిరణ్యకుడిని. ఈ చూడకర్ణుడి ఇంట్లో వంటకము బాగా దొరుకుతోంది. బాగా సంపాదించా. నేను ఈ చోటును విడిచిపెట్టను. హాయిగా ఉంటాను.

అరే! ఈ సన్యాసి నా కన్నం తవ్వి నేను దాచినదంతా తీసుకున్నాడు. ఏమి చేయను ? నేను ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. అభిమానవంతుడు, ఉంటే ఉన్నతంగా బతకాలి లేదా అడవిలో నివాసం ఉండాలి. అడుక్కు తినడం కంటే చావడం మంచిది. అయినా మరికొంత కాలం ఇక్కడే ఉండి చూస్తా.

అబ్బా! ఎంత దెబ్బ కొట్టాడు ఈ సన్న్యాసి నన్ను. నేను ధనలోభం వల్ల ఈ స్థితి తెచ్చుకున్నా. ధనలోభమే అన్ని ఆపదలనూ తెస్తుంది. ప్రాణికి దుఃఖాలులాగే, సుఖాలు కూడా కోరకుండానే వస్తాయి. ఈ స్థలము నా తాతముత్తాతల కాణాచి కాదు. ఈ సన్న్యాసి దెబ్బలు తినడం కన్న, హాయిగా అడవిలో ఉండడం మంచిది. రాతిలో కప్పను పోషించే దేవుడు, నన్ను రక్షించకుండా ఉండడు.

సరే! నిర్జనారణ్యంలోకి పోతా ! వస్తా?

ప్రశ్న 6.
ధన్యుడు పాఠం ఆధారంగా సూక్తులు తయారుచేయండి.
జవాబు:

  1. ధనము కలవాడే బలవంతుడు – పండితుడు.
  2. ధనము సర్వశ్రేయములకు నిదానము.
  3. దారిద్ర్యము కంటే మరణము మేలు. దారిద్ర్యము సర్వశూన్యము.
  4. మానవంతునికి వనవాసము కంటె సుఖము లేదు.
  5. ఒక మ్రుక్కడిని యాచించుటకంటె, నిప్పులోపడి శరీరము విడుచుట మేలు.
  6. వివేకహీనుడయిన ప్రభువును సేవించుటకంటె, వనవాసము ఉత్తమము.
  7. యాచించుకొని బ్రతుకుటకంటే, మరణము శ్రేయము.
  8. సేవా వృత్తి మానమునువలె యాచనా వృత్తి సమస్త గౌరవమునూ హరిస్తుంది.
  9. ధనలోభము సర్వాపదలకూ మూలము.
  10. ఆశ దిగనాడినవాడే సత్పురుషుడు.
  11. అర్థములు నిత్యములు కావు. యౌవనము ఝరీవేగతుల్యము.
  12. జీవనము బుద్బుదప్రాయము.
  13. అతిసంచయేచ్ఛ తగదు.

10th Class Telugu 5th Lesson ధన్యుడు 1 Mark Bits

1. జ్వలనం అన్ని దిక్కులా వ్యాపించింది – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) మంట
B) సువాసన
C) దుఃఖం
D) సంతోషం
జవాబు:
A) మంట

2. నా స్నేహితుడు ఉదయం వెళ్లి, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంటికి వచ్చాడు – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) చంద్రుడు
B) మిత్రుడు
C) పగతుడు
D) ఫలం
జవాబు:
B) మిత్రుడు

3. దేవతలు, రాక్షసులు, పాల కడలి నుండి అమృతమును సాధించారు – గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్థాన్ని గుర్తించండి. (June 2017)
A) జీవితాన్నిచ్చేది
B) మరణాన్నిచ్చేది
C) బలాన్నిచ్చేది
D) మరణం పొందింపనిది
జవాబు:
D) మరణం పొందింపనిది

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

4. శివుని మూర్ఖమున గంగ కొలువైనది – (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) (March 2017)
A) తల, నెల
B) నెల, శిరస్సు
C) శిరస్సు, చేయి
D) శిరస్సు, తల
జవాబు:
D) శిరస్సు, తల

5. ధీరులు కర్ణము పూర్తి చేసేవరకు విశ్రమించరు – (గీత గీసిన పదమునకు ప్రకృతిని గుర్తించండి.) (March 2017)
A) కార్యము
B) కార్యక్రమం
C) కష్టం
D) కారణం
జవాబు:
A) కార్యము

6. శాస్త్రము అందరికీ సమ్మతమైనది. అందుకే మనం దానిని గౌరవించాలి – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (June 2018)
A) చుట్టము
B) నష్టము
C) చట్టము
D) కష్టము
జవాబు:
C) చట్టము

7. వివరములోని పాము ఆహారం కోసం బయటకు వచ్చింది – అర్థాన్ని గుర్తించండి. (S.A. I – 2018-19)
A) రంధ్రము
B) విషయము
C) పుట్ట
D) నీరు
జవాబు:
A) రంధ్రము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

8. అనృతమును పలుకుట కంటే మౌనము మేలు – పర్యాయ పదాలు గుర్తించండి. ( S.A. I – 2018-19)
A) అసత్యము, అబద్ధము
B) సత్యము, యథార్థము
C) నిజము, కారణము
D) అసత్యము, అకారణము
జవాబు:
A) అసత్యము, అబద్ధము

9. కింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ గుర్తించుము. (S.A. I – 2018-19)
A) తల్లిదండ్రులు
B) ఏడు రోజులు
C) చంపకవతి పట్టణం
D) దైవ ప్రార్థన
జవాబు:
C) చంపకవతి పట్టణం

10. అందుఁ జూడా కర్ణుడను పరివ్రాజకుడు గలడు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (June 2017)
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.
B) అక్కడ చూడాకర్ణుడనే వ్యక్తి ఉన్నాడు.
C) అక్కడ చూడాకర్ణుడనే స్వామి గలడు.
D) అందు చూడాకర్ణుడనే సన్యాసి గలడు.
జవాబు:
A) అక్కడ చూడాకరుడు అనే సన్యాసి ఉన్నాడు.

11. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయితిని – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2017)
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.
B) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని ఖిన్నుడనయ్యానా?
C) ఆ పరివ్రాజకుడు చెప్పగా విని బాధపడలేదు.
D) ఆ సన్యాసి చెప్పగా విని ఖిన్నుడను కాలేదు.
జవాబు:
A) ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

12. జీవనము బుద్బుద ప్రాయము – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. – (June 2018)
A) జీవనము బుద్బుదంతో సమానం కాదు.
B) జీవనం బుద్బుద ప్రాయం.
C) బుద్బుద ప్రాయం జీవనమే.
D) జీవితం బుద్బుదప్రాయమే.
జవాబు:
B) జీవనం బుద్బుద ప్రాయం.

13. అనృతమాడుట కంటె మౌనము మేలు. (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) అనృతమాడుట కంటెను మౌనమ్ము మేలు.
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.
C) అనృతంబాడుట కంటె మౌనము మేలు.
D) అనృతమ్మాడుట కంటె మౌనంబు మేలు.
జవాబు:
B) అనృతం ఆడడం కంటే మౌనం మేలు.

14. ప్రత్యక్ష ఫలం ప్రజాసముదాయం చేత కోరబడదు. (కర్తరి వాక్యం గుర్తించండి) (S.A. I – 2018-19)
A) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరింది.
B) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలమును కోరుతోంది.
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.
D) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలం కోరగలదు.
జవాబు:
C) ప్రజా సముదాయం ప్రత్యక్ష ఫలాన్ని కోరదు.

15. “నాకు వసింప తగదు”, అని హిరణ్యకుడన్నాడు. (పరోక్ష కథనం గుర్తించండి) (S.I. I – 2018-19)
A) తను వసించనని హిరణ్యకుడన్నాడు.
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.
C) తనకు వసించడం తగవని హిరణ్యకుడన్నాడు.
D) తనకు వసించుట ఇష్టం లేదని హిరణ్యకుడన్నాడు.
జవాబు:
B) తనకు వసింప తగదని హిరణ్యకుడన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 5 ధన్యుడు

16. చంపకవతి అను పట్టణము గలదు. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.A. I – 2018-19)
A) సంయుక్త వాక్యం
B) చేదర్థక వాక్యం
C) సామాన్య వాక్యం
D) సామార్థ్యార్థక వాక్యం
జవాబు:
D) సామార్థ్యార్థక వాక్యం

చదవండి – తెలుసుకోండి

భారతదేశం కథా సాహిత్యానికి ప్రసిద్ధిపొందింది. ప్రాచీన కాలం నుండే భారతీయ సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. విష్ణుశర్మ అనే పండితుడు అమరశక్తి అనే రాజు కొడుకులను వివేకవంతులను చేయడానికి పంచతంత్ర కథలను బోధిస్తాడు. అవే కథా రూపంలో వ్యాప్తి చెందాయి. వీటిని దాదాపు 200 భాషల్లోకి అనువదించారు.

ఈ పంచతంత్ర కథలు మిత్రలాభం, మిత్రభేదం, కారోలూకీయం (సంధి, విగ్రహం), లబ్దప్రణాశం, అపరీక్షితకారకం (అసంప్రేక్షకారిత్వం) అనే భాగాలుగా ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించినవారిలో ముఖ్యులు చిన్నయసూరితో పాటు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగం పంతులు సంధి, విగ్రహం అనే భాగాలను తెలుగులోకి అనువదించారు. ఈయన వీటితో పాటు రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్ర అభాగ్యోపాఖ్యానం మొదలైన గ్రంథాలను, శతకాలను, నాటకాలను రాసి గద్య తిక్కనగా ప్రసిద్ధికెక్కాడు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. సంఘసంస్కర్తగా పేరు పొందాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 4th Lesson వెన్నెల

10th Class Telugu 4th Lesson వెన్నెల 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
రాత్రి అనే ఆలోచన రానీక చీకటి అనే పేరు విననీక ‘వెన్నెల’ ను వర్ణించిన కవిని గురించి తెల్పండి. (March 2017)
(లేదా)
చంద్రోదయాన్ని అత్యంత మనోహరంగా వర్ణించిన “వెన్నెల” పాఠ్యభాగ ‘కవి పరిచయం’ వ్రాయండి. (March 2019)
జవాబు:
వెన్నెల పాఠ్యభాగం ఎఱ్ఱన గారు రచించారు. ఆయన తల్లి పేరు పోతమాంబిక, తండ్రి పేరు సూరనార్యుడు. ఆయన 14వ శతాబ్దం ప్రథమార్ధంలో జీవించారు. ఎఱ్ఱన గురువుగారి పేరు శంకరస్వామి. ఎఱ్ఱనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు కలవు.

ప్రశ్న 2.
ఎఱ్ఱన రచనల గురించి వ్రాయండి.
జవాబు:
ఎఱ్ఱన ఆంధ్రమహాభారతంలోని అరణ్యపర్వశేషం రచించాడు. హరివంశం, నృసింహపురాణం, రామాయణం మొ||నవి రచించాడు.

ఆంధ్రమహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితమిచ్చాడు. హరివంశం, రామాయణాలను ప్రోలయవేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహపురాణమును అహోబిల నృసింహస్వామికి అంకితమిచ్చాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 3.
ఎఱ్ఱన రచనా వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
ఎఱ్ఱన రచనలలో వర్ణనలు అధికంగా కనిపిస్తాయి. ఆయన రచించిన నృసింహపురాణంలో ‘అష్టాదశ (18) వర్ణనలు’ ఉన్నాయి. తరువాతి కాలంలో వర్ణనాత్మక కావ్యాలు రావడానికి ఎఱ్ఱన వర్ణనలే కారణం. అందుచేతనే ఎఱ్ఱనను ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అని సాహితీలోకం గౌరవించింది.

ఎఱ్ఱన నృసింహపురాణం యొక్క ప్రభావం బమ్మెర పోతన భాగవతంపై ఎక్కువగా కనిపిస్తుంది. పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో ఎఱ్ఱన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పరిశోధకులు నిరూపించారు.

ప్రశ్న 4.
‘కాటుక గ్రుక్కినట్టి కరవటంబున జగదండ ఖండమమెరె’ ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి. ఈ పోలికను విశ్లేషించండి.
జవాబు:
సంధ్యా సమయం తర్వాత విశ్వమంతా చీకటి వ్యాపించిందని చెబుతున్న సందర్భంలో కవి ఈ మాటలను పేర్కొన్నాడు.

చీకటిలో భూమి, ఆకాశం, దిక్కులూ అన్నీ కలిసి పోయాయి. అప్పుడు బ్రహ్మాండ ఖండం కాటుక నింపిన పెద్ద భరిణెలా ఉందన్నాడు. బ్రహ్మాండంలో 14 లోకాలుంటాయి. పై లోకాలు 7. క్రింది లోకాలు 7. మధ్యలోనిది భూలోకం. చీకటి కేవలం భూగోళానికి మాత్రమే ఏర్పడింది. అందుకే పైన, క్రింద సమానమైన మూతలు గల భరిణెతో భూగోళాన్ని పోల్చాడు. దీనిద్వారా ఎఱ్ఱనగారి పరిశీలనా దృష్టి, లోకజ్ఞానం వ్యక్తమౌతున్నాయి.

ప్రశ్న 5.
ఈ పాఠంలో కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాలను ఎన్నుకొన్నాడు?
జవాబు:
ఆకాశమనే చెట్టు దిక్కులనే కొమ్మలతో, వెలుగులీనే నక్షత్రాలనే పూలతో ప్రకాశిస్తోందన్నాడు. అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు తన కిరణములనే చేతులతో ఆ ఆకాశపు చెట్టుకున్న నక్షత్రాలనే పూలను కోయడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ పద్యంలో వెన్నెలను వర్ణించడానికి చెట్టు, కొమ్మలు, పూలు, బాల్యచేష్టలు అనే అంశాలను కవి ఎన్నుకొన్నాడు.

‘వెన్నెల వెల్లి ….’ అనే పద్యంలో వెన్నెల ప్రవాహాన్ని పాలసముద్రంతో పోల్చాడు. చంద్రుడిని ఆదిశేషువుతో పోల్చాడు. చంద్రునిలోని మచ్చను శ్రీమహావిష్ణువుతో పోల్చాడు.

ఈ పద్యంలో తెల్లని వెన్నెలను తెల్లటి పాలసముద్రం ఎన్నుకొని పోల్చాడు. అలాగే తెల్లని చందమామను పోల్చడానికి నల్లటి మచ్చను పోల్చడానికి నల్లని విష్ణువును ఎన్నుకొన్నాడు.

ప్రశ్న 6.
పతిభక్తికి ఆదర్శం పద్మిని అని ఎలా చెప్పగలవు?
జవాబు:
మహా తేజస్సంపన్నుడైన సూర్యుని చూసిన కంటితో అల్పమైన తేజస్సు గల ఇతరులను చూడడానికి మనస్సు అంగీకరించదు. అందుకే కదిలెడి తుమ్మెదలనెడు కనుగ్రుడ్లు గల గొప్పదైన పద్మము అనెడు తన కంటిని వెంటనే మూసుకొన్నది.

ఎంతటి మహా పతివ్రతయైన పరపురుషుని కనీసం చూడనైనా చూస్తుంది. కానీ, పద్మిని మాత్రం కనీసం పరపురుషుని చూడడానికి కూడా అంగీకరించలేదు. అందుకే పద్మిని పతిభక్తికి ఆదర్శం. సూర్యోదయంకాగానే కమలాలు వికసిస్తాయి. సూర్యాస్తమయం కాగానే పద్మాలు ముడుచుకొంటాయి. ఇది లోక సహజం.

ప్రశ్న 7.
బాలచంద్రుడెలా ఉన్నాడు?
జవాబు:
పిల్లలకు ప్రాకడం సహజ లక్షణం. ఎక్కడైనా మెరుస్తున్నవి కనిపిస్తే, అవి లాగడం కూడా సహజమే.

అలాగే ఆకాశంలోని చంద్రుడు కూడా ఉన్నాడు. ఆకాశమే పెద్ద చెట్టులాగ ఉంది. దిక్కులు దానికి కొమ్మలులా ఉన్నాయి. నక్షత్రాలు కొమ్మల చివర పువ్వులులా ఉన్నాయి. అప్పుడే ఉదయించిన బాలచంద్రుడు తన పొడవైన కరములతో ఆ నక్షత్రాలనే పువ్వులు కోయడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 8.
వెన్నెలెలా ఉంది?
జవాబు:
వెన్నెల పాలసముద్రంలాగా తెల్లగా ఉంది. అది విజృంభించి దిక్కులన్నీ ముంచుతోంది. రజనీకరబింబం ఆదిశేషువులాగా తెల్లగా ఉంది. చంద్రునిలోని నల్లని మచ్చ ఆదిశేషునిపై పవ్వళించిన శ్రీమహావిష్ణువులా ఉంది.

పాలసముద్రంలో శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవ్వళిస్తాడు. ఈ సందర్భాన్ని వెన్నెలతో సమన్వయం చేస్తూ ఎఱ్ఱనగారు అద్భుతమైన కల్పన చేశారు.

ప్రశ్న 9.
పడమటి దిక్కును ఎఱ్ఱని తెరతో పోల్చడం సరైనదేనా? ఎందుకు?
జవాబు:
సాయం సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు. సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు పడమటి దిక్కుకు వెడతాడు. అప్పుడు సూర్యబింబం చాలా ఎర్రగా ఉంటుంది. అప్పుడు సూర్యుని కాంతి కిరణాలు కూడా ఎరుపురంగులో ఉంటాయి. ఆ సూర్యకాంతికి పడమటి దిక్కంతా ఎర్రగా అవుతుంది. .

సాధారణంగా తెరలు తెలుపురంగులో ఉంటాయి. ఆయా సన్నివేశాలకు తగినట్లు తెరపైకి కాంతిని ప్రసరింపచేస్తూ, రంగులు మార్చడం నాటకాలలో సహజం. ఇక్కడ కూడా నాట్యం చేసే నిశాసతికి తగినట్లుగా పడమటి దిక్కు అనే తెర ఎరుపురంగులో ఉంది అనడం’ అద్భుతమైన ఊహ.

ప్రశ్న 10.
లోకంలో చీకటి అలుముకున్న సందర్భాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
కవి ఎట్టా ప్రెగ్గడ ‘వెన్నెల’ పాఠంలో చీకటి యొక్క వ్యాప్తిని ఇలా వర్ణించాడు. సంధ్యాకాలం తరువాత చీకట్లు లోకమంతా వ్యాపించాయి. ఆ చీకటిలో భూమి, ఆకాశం, దిక్కులు అన్నీ ఒకటిగా కలిసిపోయాయి. అప్పుడు బ్రహ్మాండ ఖండము, కాటుక నింపిన పెద్ద బరిణె ఏమో అన్నట్లు ఉంది. అంటే అధికమైన చీకట్ల రాశీ వల్ల, దిక్కులు, భూమి, ఆకాశం ఒకదానిలో ఒకటి కలిసి పోయాయి. విశ్వము బాగా కాటుక నింపిన బరిణె ఏమో అన్నట్లు నల్లగా కనిపించిందని కవి వర్ణించాడు.

10th Class Telugu 4th Lesson వెన్నెల 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాత్రి అనే ఆలోచన రానీయక, చీకటి అనే పేరును విననీయక ఆనంద తరంగంలా విస్తరించిన వెన్నెల విజృంభణను మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది. చంద్రబింబం ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యలా, చంద్రుడిలోని మచ్చ ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువులా కనబడింది.

ఆ వెన్నెలలో కలువల రేకులు విచ్చుకున్నాయి. కలువ పూలలో తేనెలు పొంగి కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు బయలుదేరాయి.

చంద్రకాంత శిలల వానలతో, చకోరాల రెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటినీ ముంచెత్తి వెన్నెల సముద్రంలా వ్యాపించింది. ఆ వెన్నెల అనే సముద్రపు నీటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు.

ఆ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

అది రాత్రి అనే ఆలోచనను రానీయలేదు. చీకటి అనే పేరు విననీయలేదు. అవ్యక్తం అనే అనుమానాన్ని కలిగించలేదు. ఆ వెన్నెల కళ్ళకు అమృతపు జల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృంభించింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 2.
పద్యభావాలను ఆధారంగా చేసుకొని పాఠ్యభాగ సారాంశాన్ని ఇరవై వాక్యాలకు కుదించి రాయండి.
జవాబు:

  1. సాటిలేని కాంతి గల సూర్యుని చూచినట్లుగా అల్ప తేజస్సు కలవానిని చూడలేనని సాయంసంధ్యలో కమలం కళ్లు (రేకులు) మూసుకొన్నది.
  2. నక్షత్రాలనే పూలతో అలంకరింపబడిన ఆకాశమనే వేదికపై నాట్యం చేయడానికి రాత్రి అనే స్త్రీకి ఏర్పరచిన ఎఱ్ఱని పరదా వలె పడమటి దిక్కు శోభించింది.
  3. ఇంతలో ఆకాశం, భూమి, దిక్కులు ఒక్కటి చేస్తూ చీకటి, ప్రపంచాన్ని కాటుక భరిణిగా మార్చింది.
  4. అంతలో తూర్పున చంద్రుడు ఉదయించాడు. అప్పుడు చంద్రబింబం చీకటి అనే పిశాచపు బాధా నివారణకు ముల్లోకాలనెడు స్త్రీ ధరించిన ఎఱ్ఱని బొట్టువలె ఉంది.
  5. రాత్రి అనెడు స్త్రీ తూర్పు దిక్కుకు ఇచ్చిన ఎఱ్ఱని గురువింద పూసల దండవలే శశిబింబం ఉంది.
  6. ఐరావతం మూపురంపై ఉన్న ఎఱ్ఱని అలంకారంలా, ఇంద్రసభలోని మాణిక్యదీపంలా నెలవంక గోచరించింది.
  7. తెల్లకలువ అనురాగ రసంతో నింపిన మాత్రవలె కన్పించింది.
  8. స్త్రీలకు ఉత్సాహం పెంచే ఔషధపు ముద్దలా మెరిసింది.
  9. అలా అలా చంద్రుడు పెరుగుతూ ఉన్నాడు.
  10. ఆకాశమనే వృక్షానికి గల దిక్కులనే కొమ్మలలోని నక్షత్రాలనే పూలు కోయడానికి తన కరములతో ఉత్సాహంగా ఆకాశంలో పాకుతున్నాడు.
  11. వెన్నెలనే పాల సముద్రంతో దిశలు, ఆకాశం ముంచుతున్న నెలవంక శేషపాన్పులా కనువిందు చేసింది.
  12. చంద్రునిలోని మచ్చ విష్ణువువలె కన్పించింది.
  13. ఆ పండు వెన్నెలలో కలువలు బాగా వికసించి, వెన్నెలకు పరవశిస్తూ కొంట్రొత్త సువాసనలు వెదజల్లుతూ నేత్రపర్వం చేస్తున్నాయి.
  14. వెన్నెల అనే సముద్రం చంద్రకాంత శిలలను తడుపుతూ, చక్రవాకపక్షుల రెక్కల వేగం పెంచుతూ, విరబూసిన కలువలను ఆకర్షిస్తూ, అనేక విధాల అందగించింది.
  15. అందంతో రాత్రి అనే ఆలోచన రానివ్వక వెన్నెల చూచేవారి కళ్లకు అమృతాభిషేకం చేస్తోంది.
  16. వెన్నెల తన గంభీరతతో చీకటి అనే పేరు విననివ్వక శరీరానికి గంధపు వర్షం అవుతోంది.
  17. ధీరమైన వెన్నెలను చూస్తే పరమాత్మ కూడా గుర్తుకు రాడు.
  18. ఎందుకంటే వెన్నెలను చూస్తుంటే అంతరాత్మకు బ్రహ్మానందం కలుగుతుంది.
  19. ఈ విధంగా కళ్లకు, శరీరానికి, ఆత్మకు ఆనందకారకమైంది వెన్నెల.
  20. ఈ వర్ణన ఎఱ్ఱన కవిత్వంలో కలికితురాయి.

ప్రశ్న 3.
సాయం సంధ్యా సమయంలో ఆకాశం ఎలా ఉందని కవి వర్ణించాడు? అది ఎంతవరకు సమంజసం?
జవాబు:
సూర్యుడు అస్తమించేటపుడు ప్రకృతిని పరిశీలిస్తే మొదట జరిగేది కమలాలు ముడుచుకొంటాయి. అస్తమించే సూర్యునికాంతి వన్నె తగ్గుతుంది. ఆ కాంతిలో వెచ్చదనం తగ్గుతుంది. అందుకే కమలాలు ముడుచుకొంటాయి.

ప్రకృతి సహజమైన దీనిని కవిగారు భార్యాభర్తల సంబంధంతో పోల్చారు. మహా తేజోవంతుడైన సూర్యుని చూసిన కంటితో అల్పతేజస్కులను చూడడానికి అంగీకరించదన్నట్లు పద్మిని తన కమలపు కంటిని మూసుకొన్నది అని చక్కగా వర్ణించారు.

సూర్యుడు పూర్తిగా పడమటి దిక్కుకు చేరి క్రిందకు అస్తమిస్తుంటే పడమటి దిక్కు ఎర్రబారుతుంది. పడమటి దిక్కు ఒక ఎర్రని తెరలా కవిగారు ఊహించారు. ఆ తేర వద్ద నటించడానికి రాత్రి అనే స్త్రీకి ఆకాశమనే వేదిక అలంకరించబడింది. కాలపురుషుడే సూత్రధారి, దిక్పాలకులే ప్రేక్షకులు.

అంటే సూర్యాస్తమయంతో ఒక అంకం ముగిసిపోయింది. క్రొత్త అంకానికి తెరలేచింది. ఇది ఒక అత్యద్భుతమైన నాటక రంగంగా కవి కల్పించాడు. సూర్యుడి అస్తమయంతో ఒక పెద్ద వెలుగు ఆకాశమనే రంగస్థలం నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయింది.

రంగస్థలంపై ఎవరైనా కళాకారుడు ఉండాలి తప్ప, వేదిక ఖాళీగా ఉండకూడదు. వెలుగు ఖాళీ చేస్తే ఆ ప్రదేశాన్ని చీకటి ఆక్రమించడం సహజం.

క్రమేణా చీకటి దట్టంగా అలుముకొంది. ఆకాశం, నేల, దిక్కులు అన్నీ చీకటితో నిండిపోయాయి. బ్రహ్మాండంలో , భాగమైన భూగోళం ఒక కాటుక నిండిన భరిణెలా ఉందని ఎఱ్ఱనగారు ఊహించారు.

కవిగారి ఊహ చాలా సమంజసంగా ఉంది.

ప్రశ్న 4.
వెన్నెల వ్యాపించిన విధానాన్ని విశ్లేషించండి.
జవాబు:
వెన్నెల వ్యాపించిన విధానాన్ని ఎఱ్ఱనగారు చక్కగా వర్ణించారు. చంద్రుని ఒక చిన్నబాలుడుగా వర్ణించాడు. చిన్న పిల్లలకు చెట్లెక్కడం సరదా. పూలు, పళ్ళు కోయాలని చేతులు చాపడం సహజం. అది బాల్య చాపల్యం.

ఇక్కడ చంద్రుడు కూడా పుట్టి కొద్దికాలమే అయింది. అందుచే ఆకాశమనే చెట్టు పైకి ప్రాకాడు. దిక్కులనే కొమ్మలకు పూసిన నక్షత్రాలనే చుక్కలను కోయడానికి తన కరములు చాపాడు అని ఎర్రనగారు వర్ణించారు.

చీకటి పడగానే నక్షత్రాలు ఆకాశంలో రావడం సహజం. ఆ తరువాత చంద్రకిరణాలు ఆకాశంలోకి వ్యాపిస్తాయి. చంద్రకిరణాలు వ్యాపించే కొద్దీ వెన్నెల కాంతి పెరుగుతూ ఉంటుంది. వెన్నెల కాంతి పెరుగుతుంటే నక్షత్రాల కాంతి మసకబారుతూ ఉంటుంది. ఇది సహజం. దీనినే ఎర్రనగారు తన ఊహాబలంతో చాలా చక్కగా వర్ణించారు.

తరువాత పద్యంలో వెన్నెలను పాల సముద్రంతో పోల్చారు. చంద్రుడిని ఆదిశేషువుతో పోల్చారు. చంద్రుడిలోని నల్లని మచ్చను శ్రీమహావిష్ణువుతో పోల్చారు.

నిజానికి చంద్రుడి వలన వెన్నెల వ్యాపించింది. అది చంద్రుడిని మించిపోతుంది. చంద్రుడు ఆకాశంలో మాత్రమే కనిపిస్తాడు. వెన్నెల ప్రపపంచమంతా నిండిపోతుంది. దేనికైనా ఆవలి ఒడ్డు, ఈవలి ఒడ్డు ఉంటుంది. కాని అనంతమైనది సముద్రం. సముద్రంలో ఎటుచూసినా నీరే కనిపిస్తుంది. పాలసముద్రంలో ఎటుచూసినా తెల్లదనమే కనిపిస్తుంది. అలాగే ప్రపంచమంతా తెల్లటి వెన్నెలతో నిండిపోయింది.

పాలసముద్రంలో ఆదిశేషుడులా చంద్రుడు కనిపించాడు. ఆదిశేషువు తెలుపు. చంద్రుడు తెలుపే. కాని, చంద్రునిలో నల్లటి మచ్చను కూడా కవి వదలలేదు. అదే మహాకవుల లక్షణం. ఆ మచ్చను శ్రీమహావిష్ణువుతో పోల్చి తన చతురత నిరూపించారు ఎఱ్ఱనగారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 5.
వెన్నెల పాఠ్యాంశం ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలిని విశ్లేషించండి.
జవాబు:
ఎఱ్ఱన వర్ణనలకు గీటురాయి వంటిది వెన్నెల పాఠం. సూర్యాస్తమయం జరిగినపుడు పద్మాలు ముడుచుకోవడం ప్రకృతిలో సాధారణమైన విషయం. కాని, అసమానమైన సూర్యుని చూసిన కంటితో ఇతరులను చూడడానికి అంగీకరించని పద్మిని తన పద్మమనే కంటిని మూసుకొన్నదని చక్కటి వర్ణన చేశాడు. పద్మాన్ని పద్మినీ జాతి స్త్రీతో పోల్చాడు. భార్యాభర్తల సంబంధాన్ని చక్కగా వర్ణించాడు.

‘సురుచిర తారకాకుసుమ శోభి’ అనే పద్యంలో సంధ్యాసమయంలో ఎఱ్ఱబడిన పడమటి దిక్కును పెద్ద తెరతో పోల్చాడు. ఆకాశాన్ని వేదికగా ఊహించాడు. నక్షత్రాలను పుష్పాలుగా ఊహించాడు. కాలమును సూత్రధారిగా భావించాడు. దిక్పాలకులను ప్రేక్షకులను చేశాడు. రాత్రిని నాట్యకత్తెగా మార్చాడు. ఈ పద్యంలో కూడా ఎఱ్ఱన వర్ణనాత్మక శైలిని ప్రదర్శించాడు.

‘దట్టమైన చీకటిని కాటుక భరిణెతో పోల్చి తన పరిశీలనాదృష్టిని ప్రదర్శించాడు.

అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు తన కరములతో ఆకాశమనే వృక్షమునకు గల దిక్కులనే కొమ్మలకు ప్రాకుతూ నక్షత్రాలనే పూలను కోయడానికి ప్రయత్నిస్తున్నాడని వెన్నెల రావడాన్ని చక్కగా వర్ణించాడు.

ఇదే విధంగా ప్రతి పద్యంలోనూ ఎఱ్ఱనగారు తన ప్రత్యేకతను నిరూపించుకొన్నారు.

ప్రశ్న 6.
సూర్యాస్తమయానికి, చంద్రోదయానికి మధ్య కాలాన్ని కవి ఎలా వర్ణించాడు?
జవాబు:
“పద్మిని, తన ప్రియుడయిన గొప్ప తేజస్సు కల సూర్యుడిని చూసిన తన కళ్ళతో, అల్ప కాంతికల పరపురుషులను చూడడం తగదన్నట్లుగా, కదలుతున్న తుమ్మెద అనే నల్లగ్రుడ్డు కల పద్మం వంటి తన కన్నును మూసుకుందని” కవి వర్ణించాడు. అంటే సూర్యాస్తమయం కాగానే పద్మాలు ముడుచుకున్నాయని పద్మాలలో తుమ్మెదలు చిక్కుకున్నాయని భావం. పద్మాలు ముడుచుకోవడం, అవి తమ పతి భక్తిని ప్రదర్శించడానికా అన్నట్లు ఉందని కవి వర్ణించాడు.

  1. రాత్రి అనే స్త్రీ చేయబోయే నాట్యానికి, రంగస్థలం మీద కట్టిన ఎఱ్ఱరంగు తోపు తెరవలె, పడమటి దిక్కున ఆకాశంలో సంధ్యారాగం కనబడింది.
  2. చుక్కలతో కూడిన ఆకాశం, పువ్వులతో అలంకరించిన నాట్య రంగస్థలం వలె కన్పడింది.
  3. రాత్రి అనే స్త్రీ ‘నర్తకి’ వలె ఉంది.
  4. కాలము అనేది నాటక సూత్రధారుడు వలె ఉంది. అంటే సంధ్యాకాలమయ్యింది. పడమటి దిక్కున ఆకాశం ఎఱుపురంగులో కనబడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. రాత్రి వస్తోంది. రాత్రి తన చీకటిని అంతా వ్యాపింప చేస్తుందని కవి తెలిపాడు.

ప్రశ్న 7.
చంద్రోదయానికి ముందు ప్రకృతి ఎలా ఉందో వివరించండి.
జవాబు:
1) చంద్రుడు, దిక్కులు అనే కొమ్మలను, తన పొడవైన కిరణాలు అనే చేతులతో పట్టుకొని, పైకి లేచి, ఆకాశము అనే చెట్టు యొక్క నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమేమో అన్నట్టు ఆకాశంలోకి పాకాడు. అంటే చంద్రుడి , కాంతి, ఆకాశం అంతా వ్యాపించిందని భావము.

2) వెన్నెల ప్రవాహం పాలసముద్రంలా పొంగి అన్ని దిక్కులనూ, ఆకాశాన్ని ముంచెత్తింది. అప్పుడు చంద్రబింబం, ఆ పాలసముద్రంలో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి శయ్యను ఏర్పాటు చేసినట్లు ఉంది. చంద్రుడిలోని నల్లని మచ్చ ఆదిశేషువు శయ్యపై మధ్యలో ఉన్న విష్ణుమూర్తివలె కనబడింది.

అంటే చంద్రుడి వెన్నెల పాలసముద్రంలా కనబడింది. చంద్రబింబం, పాలసముద్రంలో విష్ణుమూర్తి నిద్రించే శేషుని పానుపు వలె కనిపించింది. చంద్రుడిలోని నల్లని మచ్చ, ఆదిశేషువుపై నిద్రించిన నీలవర్ణుడైన విష్ణువువలె కన్పించిందన్న మాట.

ప్రశ్న 8.
కవి వెన్నెలను ఏయే అంశాల ఆధారంగా వర్ణించాడు?
జవాబు:
కవి ఎట్టి ప్రెగ్గడ, వెన్నెలను వర్ణించడానికి క్రింది వస్తువులను ఎన్నుకొన్నాడు.

  1. వెన్నెల పాలసముద్రంలా తెల్లగా వ్యాపించిందన్నాడు.
  2. నిండు వెన్నెలలో కలువ పువ్వురేకులు విచ్చుకున్నాయని చెప్పాడు.
  3. వెన్నెలకు చంద్రకాంత శిలలు కరిగి, జడివానలు కురిశాయన్నాడు.
  4. చకోరపక్షులు, తమ రెక్కలతో వెన్నలను స్పృశించాయన్నాడు.
  5. వెన్నెల, స్త్రీల అందమైన చిఱునవ్వుల కాంతి వలే ఉందన్నాడు.
  6. వెన్నెల, సముద్రజలంలా వ్యాపించిందన్నాడు.
  7. చూసే వారి కళ్ళకు వెన్నెల, అమృతపు జల్లులా, శరీరానికి పూసిన మంచిగంధపు పూతలా ఉందన్నాడు.
  8. వెన్నెల చూసే వారి మనస్సులకు ఆనంద తరంగము వలె ఉందన్నాడు.

ప్రశ్న 9.
వెన్నెల వ్యాపించినపుడు ప్రకృతిలో కలిగిన మార్పులేమి?
జవాబు:
చంద్రోదయము :

  1. చంద్రుడు ఉదయించాడు. వెన్నెల ప్రవాహం, పాలసముద్రంలా పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది.
  2. చంద్రబింబం, ఆ పాలసముద్రములో గుండ్రంగా చుట్టుకొన్న ఆదిశేషుడి పానుపులా, చంద్రుడిలోని మచ్చ, ఆ శయ్యపై ఉన్న విష్ణువులా కనబడింది.
  3. ఆ వెన్నెలలో కలువటేకులు విచ్చుకున్నాయి. కలువపూలలో తేనెలు పొంగి, కెరటాలుగా విజృంభించాయి. తుమ్మెదలకు విందు చేస్తూ పూల పరిమళాలు వ్యాపించాయి.
  4. చంద్రకాంత శిలలు కరిగిన జడివానలతో, చకోరాల టెక్కల స్పర్శలతో, స్త్రీల చిఱునవ్వుల కాంతులతో అతిశయించి, దిక్కులన్నింటిలో ముంచెత్తి, వెన్నెల సముద్రంలా వ్యాపించింది. ఈ విధంగా అందంగా, గంభీరంగా, నిండుగా చంద్రుని వెన్నెల వ్యాపించింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 10.
చంద్రోదయానికి ముందు, తరువాత జరిగిన మార్పులను వివరించండి.
జవాబు:
చంద్రోదయానికి ముందు మార్పులు :

  1. సూర్యుడు అస్తమించాడు.
  2. పద్మములు ముడచుకున్నాయి.
  3. తుమ్మెదలు ఆ పద్మాలలో చిక్కుపడ్డాయి.
  4. పడమటి దిక్కున సంధ్యారాగం కనబడింది.
  5. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి.
  6. చీకటి బాగా పెరిగి, దిక్కులూ, భూమ్యాకాశాలు దానిలో కలిసి పోయాయి.
  7. విశ్వం, కాటుక నింపిన బరిణెయా అన్నట్లు కనబడింది.

చంద్రోదయము తరువాత జరిగిన మార్పులు :

  1. చంద్రుడు ఉదయించగానే, వెన్నెల ప్రవాహం పాలసముద్రం వలె పొంగి ఆకాశాన్ని ముంచెత్తింది.
  2. చంద్రబింబం, ఆ పాలసముద్రంలో చుట్టచుట్టుకొన్న ఆదిశేషువు శయ్యవలె కనిపించింది.
  3. చంద్రుడిలోని మచ్చ, ఆ శయ్య మధ్యన ఉన్న విష్ణువువలె కనబడింది.
  4. వెన్నెలలో కలువరేకులు విచ్చుకున్నాయి. కలువలలో తేనెలు ఉప్పొంగాయి.
  5. పువ్వుల పరిమళాలు వ్యాపించాయి. 6) చంద్రకాంత శిలలు కరిగి జడివానలు కురిశాయి.
  6. చకోరాల లెక్కల స్పర్శలతో, స్త్రీల చిరునవ్వుల కాంతులతో అతిశయించి, వెన్నెల దిక్కులన్నింటినీ ముంచెత్తి, సముద్రంలా వ్యాపించింది.

10th Class Telugu 4th Lesson వెన్నెల Important Questions and Answers

ప్రశ్న 1.
నీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ ఒక కవిత రాయండి.
జవాబు:
చంద్రోదయము
1) “చెరువులో నీరు గాలికి తిరుగుచుండె
కలువపుష్పాలు వికసించి కనులు తెరిచె
పూల గంధాల మధుపాలు మురియుచుండె
చంద్రకాంతులు వ్యాపించే జగము నిండ”

2) దివిని చుక్కల పూవులు తేజరిల్లె
రాత్రి సతికట్టె నల్లని రంగు చీర
చంద్రుని రాకకు జగమంత సంతసించె
విశ్వమంతకు వెన్నెల విందు చేసె

ప్రశ్న 2.
మీ పాఠం (వెన్నెల) ఆధారంగా ఎఱ్ఱన రచనా శైలిని వివరిస్తూ మీ తండ్రిగారికి లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణము,
x x x x x.

పియ్రమైన నాన్నగార్కి,

నమస్కారములు. ఉభయకుశలోపరి. అమ్మకు నమస్కారాలు చెప్పండి. ఈ మధ్య మాకు ఎఱ్ఱన కవి రచించిన నృసింహపురాణంలోని వెన్నెల పాఠాన్ని చెప్పారు. వెన్నెల పాఠంలో అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. ఈ పద్యాలలో ఎఱ్ఱా ప్రెగ్గడ కవి, సంధ్యాకాలాన్ని, చంద్రోదయాన్ని బాగా వర్ణించాడు. మీకు కవిత్వం అంటే ఇష్టమని ఇది రాస్తున్నా.

సూర్యుడిని చూసిన కళ్ళతో పరపురుషులను చూడ్డానికి ఇష్టపడని పద్మిని, కళ్ళు మూసుకుందని పద్మము, సాయంత్రం వేళ ముడుచుకోవడాన్ని చక్కగా ఎఱ్ఱన వర్ణించాడు.

మరో పద్యంలో ఆకాశాన్ని రంగస్థలంతో పోల్చాడు. కాలాన్ని నాటకంలో సూత్రధారిగా చెప్పాడు. దిక్పాలకులను నాటక ప్రేక్షకులుగా వర్ణించాడు. సంధ్యాకాలంలోని ఆకాశాన్ని తోపురంగు నాటకం తెరగా వర్ణించాడు.

ఎఱ్ఱన గారి వర్ణన శైలి అద్భుతము. అందుకే ఎఱ్ఱన గారిని ‘ప్రబంధ పరమేశ్వరుడు’ అంటారు. వర్ణనలు చేయడంలో ఎఱ్ఱన కవికి సాటి మరి లేరని నా నమ్మకం. మీరు కూడా చదవండి. లేఖ రాయండి. ఉంటా.

మీ ప్రియపుత్రుడు, / పుత్రిక,
రంగనాథ్. / శ్యామల.

చిరునామా:
కె. రమణగారు,
ఇంటినెంబరు 3. 216,
గాంధీనగర్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 3.
వెన్నెలను వర్ణిస్తూ కవిత వ్రాయండి.
జవాబు:
“వెన్నెలా ! కన్నెపిల్లల చిన్నారి ముద్దుల చెల్లెలా !
వెన్నెలా ! ప్రేమికుల మనసుల మల్లెచెండులా
వెన్నెలా ! చంద్రుని చిరునవ్వుల పన్నీరులా
వెన్నెలా ! పసిపాపల ముద్దుల బోసి నవ్వులా
వెన్నెలా ! కన్నతల్లుల కమనీయ రాగవెల్లిలా
వెన్నెలా ! మా చిన్నారి పొన్నారి చెల్లెలా
వెన్నెలా ! కలువల చుట్టపు చూపులా
వెన్నెలా ఉన్నావు, చల్లావు చంద్రికలు
నయనారవిందాల నయగార మధురిమలు”

ప్రశ్న 4.
వర్ణన ఎలా ఉంటుందో తెలిసింది కదా! ఉషోదయ కాలం నుండి రాత్రి నిండుపున్నమి వెన్నెల వచ్చే వరకు రోజంతా ఆకాశంలో జరిగే మార్పుల్ని గురించి వర్ణిస్తూ రాయండి.
జవాబు:
ఉషోదయ కాలంలో ఆకాశంలో వేగుచుక్క కనిపిస్తుంది. అక్కడక్కడ చుక్కలు కనబడతాయి. క్రమంగా తూర్పు దిక్కున సూర్యబింబం ఎఱ్ఱని పెద్ద బంతిలా కనబడుతుంది. తెల్లవారేక సూర్యోదయం తూర్పుదిశలో జరుగుతుంది.

ఎండ ఎక్కిన కొద్దీ సూర్యకిరణాలు కరకరలాడుతాయి. మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తిమీదికి వస్తాడు. క్రమంగా సూర్యుడు పడమటి దిశకు జారుతాడు. అక్షాశంలో పడమటి దిశలో పేదరాశి పెద్దమ్మ కుంకుమ ఆరబోసుకున్నట్లు ఆకాశం ఎరుపెక్కుతుంది. సూర్యబింబం ఎరుపు ఎక్కుతుంది.

సాయంత్రం 7 గంటలకు ఆకాశంలోని నక్షత్రాలు ఉదయిస్తాయి. చంద్రబింబం ఎఱుపుగా కనబడుతుంది. చంద్రోదయం కాగానే చల్లదనం ప్రాణాలకు హాయిని ఇస్తుంది. మేఘాల కదలికలో చంద్రబింబం ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

ప్రశ్న 5.
ఎఱ్ఱన రచించిన వెన్నెల పాఠంలోని వర్ణనలు నీకెందుకు నచ్చిందో వివరిస్తూ నీ మిత్రునికి లేఖ వ్రాయి.
జవాబు:

అమలాపురం,
x x x x x

ప్రియమిత్రుడు శేఖర్ కు,
నీ మిత్రుడు రాజేష్ వ్రాయులేఖ.

నేను బాగా చదువుచున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావనుకొంటున్నాను. నేను ఈ లేఖలో ‘వెన్నెల’ పాఠం గురించి వ్రాస్తున్నాను.

వెన్నెల పాఠంలోని ఎఱ్ఱన గారి వర్ణనలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా మొదటి పద్యంలో సూర్యుడిని చూసిన కళ్ళతో ఇతరులను చూడడానికి ఇష్టం లేని పద్మిని తన కమలపు కన్నును మూసుకొందని వర్ణించిన తీరు నాకు చాలా నచ్చింది. సూర్యస్తమయం అయినపుడు కమలాలు ముడుచుకోవడం సహజం. దానిని చక్కగా భార్యాభర్తల అనురాగంతో పోల్చిన ఎఱ్ఱనగారి చతురత నాకు నచ్చింది.

రెండవ పద్యంలో ఆకాశాన్ని రంగస్థలంతో పోల్చారు. కాలమును సూత్రధారిగా ఊహించారు. దిక్పాలకులను ప్రేక్షకులను చేశారు. రాత్రిని నాట్యకత్తెగా భావించారు. ఎఱ్ఱబారిన పడమటి దిక్కును పెద్ద తెరగా ఊహించారు.

సాయంకాలపు సంధ్యా సమయాన్ని ఇంత బాగా ఊహించిన కవి మరొకరు లేరేమో అనిపిస్తుంది.

నాకు మాత్రం వెన్నెల పాఠంలోని ప్రతి పద్యం చాలా సచ్చింది. ఆ అద్భుతమైన వర్ణనలు ఎవరికైనా నచ్చుతాయిలే.

అందుకే ఎఱ్ఱనను ప్రబంధ పరమేశ్వరుడన్నారని మా గురువుగారు చెప్పారు.

నీకు ఏ పాఠం నచ్చిందో వ్రాయి. ఎందుకు నచ్చిందో వివరంగా వ్రాయి. ఇక ఉంటా మరి.

ఇట్లు
నీ స్నేహితుడు,
పి. రాజేష్,

చిరునామా:
కె. శేఖర్, నెం. 8,
బి. సెక్షన్, 10వ తరగతి,
జి.ప. ఉ. పాఠశాల,
సత్తెనపల్లి, గుంటూరు జిల్లా.

10th Class Telugu 4th Lesson వెన్నెల 1 Mark Bits

1. దేవతలు దివి నుండి భువికి దిగి వచ్చారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. (June 2017).
A) సముద్రం
B) పాతాళం
C) ఆకాశం
D) చీకటి
జవాబు:
C) ఆకాశం

2. నెమలి ఎగిరి వచ్చి పామును పట్టి చంపింది – గీత గీసిన పదాలకు నానార్థ పదాన్ని గుర్తించండి. (June 2017)
A) వనం
B) ఫలం
C) కులం
D) కుండలి
జవాబు:
D) కుండలి

3. వెన్నెల అన్ని దెసలకు వ్యాపించింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. (June 2017)
A) దిశ
B) దేశం
C) దివాణం
D) దిక్కు
జవాబు:
A) దిశ

4. ‘UUU’ గుర్తులు గల గణమేది ? (June 2017)
A) య గణం
B) ర గణం
C) మ గణం
D) త గణం
జవాబు:
C) మ గణం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

5. రజనీకర బింబమును చూస్తే పిల్లలు ఆనందిస్తారు – (గీత గీసిన పదమునకు అర్థమును గుర్తించుము.) (March 2017)
A) సూర్యబింబము
B) చంద్రబింబము
C) ప్రతిబింబము
D) ఆకాశం
జవాబు:
B) చంద్రబింబము

6. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధాసక్తులు కల్గియుండాలి – (గీత గీసిన పదము ఏ సమాసమో గుర్తించుము. ) (March 2017)
A) కర్మధారయం
B) బహుబ్లిహి
C) తత్పురుషం
D) ద్వంద్వము
జవాబు:
D) ద్వంద్వము

7. ఉత్పలమాల పద్యంలో యతిస్థానం గుర్తించండి. (March 2017)
A) 14వ అక్షరం
B) 10వ అక్షరం
C) 13వ అక్షరం
D) 11వ అక్షరం
జవాబు:
B) 10వ అక్షరం

8. దెసలను కొమ్మ లొయ్య నతిదీర్ఘములైన కరంబులన్ బ్రియం – ఏ పద్యపాదమో గుర్తించండి. (March 2017)
A) ఉత్పలమాల
B) శార్దూలం
C) చంపకమాల
D) మత్తేభం
జవాబు:
C) చంపకమాల

9. భూరుహములు జీవులకు ప్రాణవాయువును ఇస్తున్నాయి – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి. (June 2018)
A) నదులు
B) సముద్రాలు
C) చెట్లు
D) పర్వతాలు
జవాబు:
C) చెట్లు

10. కష్టాలు మిక్కుటమైనందున, రైతులు ప్రభుత్వ సహాయం కొరకు ఎదురుచూస్తున్నారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (June 2018)
A) అధికం, సమానం
B) క్షామం, మితం
C) ఎక్కువ, అధికం
D) తక్కువ, పరిమితం
జవాబు:
C) ఎక్కువ, అధికం

11. దినకరుడు రాగానే లోకమంతా చైతన్యమౌతుంది. అందుకే సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం – గీత గీసిన పదాలకు పర్యాయపదాన్ని గుర్తించండి. (June 2018)
A) స్నేహితుడు
B) చంద్రుడు
C) ధనికుడు
D) ఇనుడు
జవాబు:
D) ఇనుడు

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

12. ప్రతి పాదంలో ఒక సూర్యగణం + రెండు ఇంద్రగణములు + రెండు సూర్యగణములు క్రమముగా ఉండే పద్యము పేరు గుర్తించండి. (June 2018)
A) కందం
B) సీసము
C) తేటగీతి
D) ఆటవెలది
జవాబు:
C) తేటగీతి

13. వెన్నెల పిండారబోసినట్లుండటం శరత్కాలపు లక్షణం – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (March 2018)
A) కౌముది, జ్యోత్స్న
B) చీకటి, తమస్సు
C) కోరిక, కాంక్ష
D) నిశి, నుసి
జవాబు:
A) కౌముది, జ్యోత్స్న

14. ఎటువంటి పరిస్థితిలోనైన ధర్మం వీడరాదు. (వికృతి గుర్తించండి) (S.N. I – 2018-19)
A) దమ్మం
B) దరమం
C) దరుమం
D) దరువుం
జవాబు:
A) దమ్మం

15. మానవునిచే ప్రకృతి ఒడి పాఠశాలగా చేసుకోబడింది. (కర్తరి వాక్యం గుర్తించండి.) (June 2017)
A) మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకున్నాడు.
B) మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకోలేదు.
C) మానవునిచే ప్రకృతి,పాఠశాలగా చేసుకోబడింది.
D) మానవుడు ప్రకృతిలో పాఠశాల నిర్మించాడు.
జవాబు:
A) మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకున్నాడు.

16. చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగ కనిపిస్తూ అలరింపబడుతున్నది – కర్తరి వాక్యం గుర్తించండి. (June 2018)
A) చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తున్నది.
B) చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగ అలరించడం లేదు.
C) చంద్రుడిలోని మచ్చ శివునిలాగ కనిపిస్తోంది.
D) చంద్రుడిలోని మచ్చ విష్ణువనే భ్రాంతి కలిగిస్తోంది.
జవాబు:
A) చంద్రుడిలోని మచ్చ విష్ణువులాగా కనిపిస్తూ అలరిస్తున్నది.

17. వెన్నెల రాత్రిని పగలుగా మారుస్తున్నది – వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. (June 2018)
A) చీకటి రాత్రిని పగలుగా మారుస్తున్నది.
B) వెన్నెల రాత్రిని పగలుగా మార్చడం లేదు.
C) వెన్నెల పగలును రాత్రిగా మారుస్తున్నది.
D) వెన్నెల రాత్రిని రాత్రిగానే ఉంచుతుంది.
జవాబు:
B) వెన్నెల రాత్రిని పగలుగా మార్చడం లేదు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 4 వెన్నెల

18. వెన్నెల కాలంలో రాత్రింబవళ్లు వెలుగుంటుంది. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.N. I – 2018-19)
A) చేదగ్ధక వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) నిషేధార్థక వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

19. వానలు వస్తే పంటలు పండుతాయి. (ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి) (S.I. I – 2018 -19)
A) సంయుక్తం
B) చేదర్థకం
C) సామర్థ్యార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
B) చేదర్థకం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 3rd Lesson జానపదుని జాబు

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
జానపదుని జాబు రచయిత గురించి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురులో జన్మించారు. వారు 1911 నుండి 2005 వరకు జీవించారు.

వీరు కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. 1940-45 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వీరు డిశంబరు 16వ తేదీ, 2005న మరణించారు.

ప్రశ్న 2.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన రచనా వ్యాసంగాన్ని గూర్చి వ్రాయండి.
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా॥ బోయి భీమన్న గారు రచించారు.

ఆయన తన 11వ ఏట నుండే రచనలు చేశారు. “గుడిసెలు కాలిపోతున్నాయి”, పాలేరు, జానపదుని జాబు, పిల్లీ శతకం, ఉశారులు, ధర్మం కోసం పోరాటం, రాగవైశాఖి మొదలైన 70 రచనలు చేశారు.

ఆయన రచించిన పాలేరు నాటకం ప్రభావంతో ఎంతోమంది పేదలు, దళితులు తమ పిల్లలను పాలేరు వృత్తి మాన్పించి పాఠశాలలో చేర్పించారు. ఈ నాటకం స్ఫూర్తితో ఎంతోమంది ఉన్నత విద్యావంతులయ్యారు. ఉన్నతోద్యోగులు అయ్యారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 3.
జానపదుని జాబు రచయిత ఎవరు? ఆయన అందుకొన్న పురస్కారాలేవి?
జవాబు:
జానపదుని జాబు పాఠమును డా|| బోయి భీమన్నగారు రచించారు. ఆయన రచించిన గుడిసెలు కాలిపోతున్నాయ్ రచనకు 1975లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం 1973లో పద్మశ్రీ బిరుదునిచ్చింది. 2001లో పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది.

1978+84 మధ్య రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి సభ్యత్వం ఇచ్చి బోయి భీమన్న గారిని గౌరవించింది. 1991లో . రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ వారు రాజ్యలక్ష్మీ అవార్డును ఇచ్చి సత్కరించారు.

ప్రశ్న 4.
పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో తెలపండి.
జవాబు:
పల్లెటూరి జీవితం ఎంతో మనోహరంగా ఉంటుంది. అక్కడ చక్కని గాలి, ఎండ, నీరు దొరుకుతుంది. పాలు, కూరగాయలు దొరుకుతాయి. మంచి అందమైన చేలూ, కాలువలూ ఉంటాయి. అక్కడ ప్రకృతి మనోహరంగా ఉంటుంది. కాని, ఆధునిక సదుపాయాలు ఏవీ అక్కడ ఉండవు. అక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారు. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.

ప్రశ్న 5.
రచయిత పాత్ర స్వభావాన్ని రాయండి.
జవాబు:
గ్రామీణ నేపథ్యాన్ని ఇష్టపడతాడు. పేద కుటుంబీకుడు. తన కుటుంబంతో చాలా అనుబంధం గలవాడు. పట్నవాసులంతా సుఖంగా ఉంటారనే అపోహ కలవాడు. రైతు కుటుంబం. తోటి రైతుల కష్టాలలో పాలుపంచుకొనే స్వభావం కలవాడు. పల్లెటూరి ప్రజలపై ప్రేమ కలవాడు. పల్లెటూరిపై మమకారం కలవాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 6.
జానపదుని జాబు” పాఠ్యభాగ నేపథ్యం గురించి రాయండి.
జవాబు:
చదువుకొని బీదతనం వలన చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనులలో మునిగిపోయిన ‘జానపదుడు’ శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాలలోని పరిస్థితులను లేఖల రూపంలో తెలుపుటయే జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యము.

ప్రశ్న 7.
సమాచార సాధనమైన ‘లేఖ’ను గురించి వివరించండి. (March 2018)
జవాబు:

  1. సమాచారాన్ని చేరవేసే సాధనం లేఖ.
  2. కొన్ని సందర్భాలలో ప్రత్యేక సాహితీ లక్షణాలను, విలువలను కలిగి ఉంటుంది.
  3. లేఖలు ఆయాకాలాలకు సంబంధించినవే అయినా, కొన్నిసార్లు అందులోని విషయాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి.
  4. లేఖలు వ్యక్తిగత లేఖలు, అధికారిక లేఖలు, వ్యాపారాత్మక లేఖలు అని ప్రధానంగా మూడు విధాలుగా ఉంటాయి.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘బద్దకం’ గురించి మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పనిచేయడానికి వెనుకాడడం. అంటే మాంద్యము. సోమరిపోతులయిన వారు ఏ పని చేయడానికీ ముందుకు రారు. వారికి పనిచేయడానికి బద్దకం. తగిన పని, చేతిలో లేకపోతే పనిమంతులకు కూడా బద్దకం వస్తుంది.

నగరాలలో వారికి చేతిలో ఏదో పని ఉంటుంది. గ్రామాలలో రైతులకు కొన్ని రోజుల్లోనే పని ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల్లో ఏ పనీ ఉండదు. అప్పుడు వారు ముడుచుకొని మంచము ఎక్కి పడుకుంటారు. లేదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

కాని ‘బద్దకం’ మంచి లక్షణం కాదు. పిల్లలు బడికి వెళ్ళడానికి, పాఠం చదవటానికి, ఇంటి పని చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యాలి. బద్దకం విడిచి చురుకుగా పనులు చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. బద్దకం, సంజ నిద్ర, పనికిరాదని సుమతీ శతకం చెపుతోంది. ముఖ్యంగా యువత, బద్దకం, విడిచి తమ పనులు సకాలంలో సాగిస్తే దేశం సౌభాగ్యవంతం అవుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
బద్దకం వదలాలంటే ఏమి చేయాలో వివరించండి.
జవాబు:
‘బద్దకం’ అంటే పని చేయడానికి ముందుకు రాకపోవడం. పని బద్ధకులకు అభివృద్ధి ఉండదు. బద్దకం వదలాలంటే రాత్రి పెందలకడనే నిద్రపోవాలి. ఉదయం సూర్యోదయం కాకుండానే లేవాలి. నడక, పరుగు, వంటి వ్యాయామాలు చేయాలి. పిల్లలు, పెద్దలకు ఇంటి పనుల్లో సాయం చేయాలి. చక్కగా స్నానం చేయాలి. పిల్లలు సాయం సమయంలో ఆటలు ఆడాలి. హాయిగా గొంతువిప్పి పాటలు పాడాలి.

పిల్లలు బద్దకంగా టి.విల ముందు కూర్చుండి, సీరియల్సు చూస్తూ ఉండరాదు. ఆడపిల్లలు తల్లుల పనిలో సాయం చేయాలి. మగపిల్లలు తండ్రికి పనిలో సాయం చేయాలి. అలా చేస్తే తండ్రి చేసే వృత్తి పనులు వారికి అలవాటు అవుతాయి.

పిల్లలు బద్దకం విడిచి చక్కగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వారు యోగా, వ్యాయామము వంటి వాటిలో పాల్గొంటూ, ఆటపాటలలో పాల్గొంటూ మంచి చురుకుగా, ఉత్సాహంగా ఉండాలి. అటువంటి చురుకైన యువతవల్లే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి అవుతుంది.

ప్రశ్న 3.
కాలం ఎలా విలువైందో నిరూపించు.
జవాబు:
‘కాలము’ విలువ అయింది. గడచిన క్షణం, తిరిగి రాదు. ప్రతి వ్యక్తి తాను చేయవలసిన పనిని సకాలంలో చేయాలి. రేపు . చేద్దాం అనుకుంటే, ఒక రోజు అతడి జీవితంలో వ్యర్థం అయినట్లే.

మన ఆయుర్దాయం చాలా పరిమితంగా ఉంటుంది. మనం ఎంత కాలం బ్రతుకుతామో మనకు తెలియదు. దేవుడిని ప్రార్థించేందుకు తిరిగి మనకు సమయం దొరకదు. బ్రతికి ఉండగానే దైవపూజ చేయాలి. చేయవలసిన పనులు పూర్తి చేయాలి. ఒక పరీక్షకు సిద్ధపడే వ్యక్తి ఏ రోజుకు ఆ రోజు చదివి సిద్ధం కావాలి. రేపు అనే మాట ఉండరాదు. అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడుపుకోవాలి. ఆడవలసిన కాలంలో ఆడాలి. వ్యాయామం చేయవలసిన కాలంలో వ్యాయామం చేయాలి.

డాక్టరుగారు నిత్యం వ్యాయామం చేసి ఉన్నట్లయితే గుండె రోగం వచ్చి ఉండేది కాదంటారు. అప్పుడు మనం పశ్చాత్తాప పడతాం. కాని జరిగి పోయిన కాలాన్ని మనం వెనుకకు తీసుకురాలేము. ఎంత డబ్బు ఇచ్చినా, జరిగిపోయిన కాలాన్ని ఒక్క నిమిషం కూడా తిరిగి తీసుకురాలేము.

కాబట్టి కాలం ప్రాధాన్యాన్ని గుర్తించి, సకాలంలో ప్రతి పనినీ పూర్తి చేసి జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. గ్రామాల్లో రైతులు సకాలంలో పొలం పనులు చేపట్టాలి. సకాలంలో పురుగుమందులు చల్లాలి. లేకపోతే పొలంలో పంట, నాశనం అవుతుంది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 4.
పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని భావిస్తున్నారా?
జవాబు:
పల్లెలు నిజానికి సౌఖ్యనిలయాలు. పల్లెల్లో మంచి పాడిపంటలు ఉంటాయి. తాజాకూరగాయలు, చల్లని, కలుషితం కాని గాలి లభిస్తుంది. ప్రతి ఇల్లు ముగ్గులతో, పూల తోరణాలతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రామాలలో ఆవులు, గేదెలు ఇచ్చే తాజా పాలు లభిస్తాయి. అక్కడ కల్మషం లేని ప్రజల పలకరింపులు దొరుకుతాయి. పల్లె ప్రజలు పరస్పరం ఒకరికి , మరొకరు సాయం చేసుకుంటారు. పల్లెల్లో మంచి తాజాపళ్ళు, కూరలు లభిస్తాయి.

కాని గ్రామాలలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ముఖ్యంగా వాటికి రోడ్లు, ప్రయాణసౌకర్యాలు ఉండవు. విద్య, వైద్య సదుపాయాలు ఉండవు. కావలసిన వస్తువులు అన్నీ అక్కడ దొరకవు. సరుకులకై నగరాలకు వెళ్ళాలి. చదువులకు నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే మంచి డాక్టర్లు పల్లెల్లో ఉండరు. విద్యుచ్ఛక్తి కూడా 24 గంటలూ అక్కడ లభించదు. కొత్త బట్టలు వగైరా కావాలంటే నగరాలకు పల్లెవాసులు వెళ్ళాలి.

కాబట్టి పల్లెల్లో నివసించే వారందరూ నిజంగా సుఖపడుతున్నారని మనం భావించకూడదు. పల్లె ప్రజల కష్టాలు పల్లెవాసులకు ఉన్నాయి. పల్లె ప్రజలకు తగిన విశ్రాంతి ఉండదు. 24 గంటలు శ్రమిస్తేనే కాని వారికి కూడు, గుడ్డ దొరకదు.

ప్రశ్న 5.
పల్లెటూరి జీవితం హాయిగా ఉంటుందని ఎలా చెప్పగలవు?
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతోముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.

పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.

గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 6.
శ్రమదోపిడి గురించి రచయిత ఉద్దేశ్యమేమిటి?
జవాబు:
సామాన్యంగా గ్రామాల్లో భూకామందులు, తమకున్న పొలాలను తాము సేద్యం చేసుకోకుండా గ్రామాల్లోని బీద రైతులకు కౌలుకు ఇస్తుంటారు. ఆ బీద రైతులు ధనికుల పొలాలను కౌలుకు తీసుకొని, కష్టపడి సేద్యం చేస్తుంటారు. రాత్రింబగళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని భూకామందులకు వారు కౌలుగా వారికి చెల్లిస్తారు. మిగిలిన ధాన్యాన్ని వారు తింటారు. కాని సామాన్యంగా కౌలు రైతులకు ఏమీ మిగలదు. భూకామందులు, బీద రైతుల శ్రమను దోపిడీ చేయడం క్రింద వస్తుంది.

బీదరైతులు శ్రమపడి పండించిన ఫలసాయాన్ని భూకామందులు దోచుకుంటున్నారన్నమాట నిజానికి శ్రమపడేవానికి ఫలాన్ని తినే హక్కు ఉంటుంది. కాని ఇక్కడ శ్రమ ఒకరిది, ఫలం మరొకరిది అవుతోంది.
దీనినే దృష్టిలో ఉంచుకొని రైతులు కష్టపడుతున్నారని, కాని దాని ఫలితం ఇనాందారుకు లభిస్తోందని చెప్పడమే ఇక్కడ రచయిత ఉద్దేశ్యమై ఉంటుంది.

ప్రశ్న 7.
పల్లె ప్రజల కష్టాలను వివరించండి.
జవాబు:
పల్లెలలో ప్రజలు కష్టపడి పంటలు పండిస్తారు. ఒకప్పుడు వర్షాలు ఉండవు. చేలకు నీళ్ళను తోడాలి. ఒకప్పుడు తోడుకోవడానికి సైతం వారికి నీళ్ళు దొరకవు. ఒక్కొక్కసారి అతివృష్టి, ఒక్కొక్కసారి అనావృష్టి సంభవిస్తుంది.

వారి మోటర్లకు రాత్రింబవళ్ళు విద్యుచ్ఛక్తి ఉండదు. పాడిపశువులకు మేత లభించదు. రాత్రివేళల్లో కూడ చేనుకు నీరు పెట్టడానికి వారు వెళ్ళాల్సివస్తుంది. చీడపీడలకు పురుగుమందులు చల్లాలి. ఒకప్పుడు వారికి అవి ప్రమాదాన్ని తీసుకువస్తాయి.

చక్కగా పండిన పంట, ఒక్కరోజు పురుగు పట్టి తినేస్తుంది. ఇనాందార్లకు కౌలు చెల్లించాక రైతుకు ఫలసాయం మిగలదు. ఒక్కొక్కసారి కాలం కలసివస్తే పంట మిగులుతుంది. కాని రైతుకు దానికి తగిన ధర లభించదు.

రైతు పండించిన పంటలను వర్తకులు చౌకగా కొంటారు. కాని రైతుకు కావలసిన ఎరువులు వగైరా ఎక్కువ ధరకు కాని దొరకవు. పల్లె ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు ఉండవు. వారికి రోడ్డు, బస్సు సౌకర్యాలు ఉండవు. ప్రతి వస్తువు కోసం నగరాలకు వెళ్ళాలి. రోగం వస్తే వారు నగరాలకు బళ్ళ పై రోగులను తీసుకువెళ్ళాలి. ఒకప్పుడు మోసుకు వెళ్ళాల్సివస్తుంది.

ఈ విధంగా పల్లెల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 8.
పల్లెల ప్రగతికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏవి?
జవాబు:
పల్లెలు బాగుపడాలంటే రైతులకు కావలసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు చౌకగా వారికి అందించాలి. గ్రామాల్లో వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి. రైతులకు ప్రభుత్వం విత్తనాలు మంచివి చౌకధరలకు ఇవ్వాలి. తక్కువ వడ్డీకి బ్యాంకులు వారికి ఋణాలు ఇవ్వాలి.

రైతులు తోటల్లో పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. వారు పాడి పశువులను పెంచి, పాల ఉత్పత్తులను మంచి ధరలకు అమ్ముకోవాలి. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించాలి. రైతులు కూరగాయలను పెంచాలి.

గ్రామాల్లో ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్పించాలి. ప్రతి గ్రామానికి మంచినీటి కుళాయిలు, రోడ్లు, విద్యుచ్ఛక్తి సదుపాయం ఉండాలి. ప్రతి గ్రామానికి నగరాలకు పోవడానికి బస్సులు ఉండాలి. పల్లె ప్రజలు సంఘాలుగా ఏర్పడి గ్రామాలలో చెరువులు బాగు చేసుకోవాలి. మురికి నీరు దిగే కాలువలు బాగు చేసుకోవాలి. ప్రభుత్వ సహాయంతో గ్రామాలకు రోడ్లు వేసుకోవాలి. గ్రామీణ స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి, లఘు పరిశ్రమలను చేపట్టాలి.

పల్లెలలోని ప్రజలు తమ పిల్లలను తప్పక చదివించాలి. పిల్లలందరికీ టీకాలు వేయించాలి. పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పల్లె ప్రజలు తీరిక సమయాల్లో చేతి వృత్తులు చేపట్టి దాని ద్వారా ధనం సంపాదించాలి.

రైతులు పండించే ఉత్పత్తులకు న్యాయమైన మంచి ధరలు లభించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామాల్లోని పోరంబోకు పొలాల్లో రైతులు సమిష్టిగా సహకార వ్యవసాయం చేపట్టాలి.

ప్రశ్న 9.
పల్లెటూళ్ళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాలను వివరించండి.
జవాబు:
పల్లెటూళ్ళలో ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా అక్కా, బావా అంటూ పలకరించుకుంటారు. పల్లెలలో పండుగలు, ఉత్సవాలు, వేడుకగా జరుగుతాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, గ్రామాలు చక్కగా అలంకరింపబడతాయి. ప్రతి ఇంటికి రంగుల పూలతోరణాలు కడతారు. వివిధ వాయిద్యాలు మ్రోగిస్తారు. గంగిరెద్దులు, గరగలు, విచిత్రవేషాలు తోలుబొమ్మలాటలు, హరికథలు వగైరా ఉంటాయి. ఈ కళలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నాయి.

భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి ఉంటాయి. వీటివల్ల మన ప్రజలకు ప్రాచీన సంస్కృతీ వైభవం తెలుస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భోగిమంటల వల్ల, ముగ్గుల వల్ల దోమలు వగైరా దూరం అవుతాయి. మనుష్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు.

పల్లెటూళ్ళు మన ప్రాచీన సంస్కృతీ వైభావాన్ని వెల్లడించే కేంద్రాలు. ఈ సంస్కృతీ సంప్రదాయాలను మనం కాపాడుకుంటే మన భారతదేశ ప్రాచీన నాగరికతా వైభవం కాపాడబడుతుంది.

ప్రశ్న 10.
‘పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది’ – సమర్థించండి. (March 2017)
జవాబు:
పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చక్కని గాలి, ఎండ, నీరు, ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది. పచ్చని పొలాలు కలకలలాడుతూ, గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి. పొయ్యి కిందికీ, పొయ్యి మీదికీ, వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి. గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు, అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు.

పల్లెల్లో ఒకరి ఇంట్లో పెళ్ళయితే, ఊరందరికీ అది పండుగ. పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటివేషధారులూ, వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి.

గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ, కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు. గ్రామాలు పాడిపంటలకు నిలయాలు. అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 11.
“పల్లెటూళ్ళలో ప్రజలు పడే కష్టాలు తొలగిపోతే మానవ సంఘానికి పల్లెటూళ్ళు ఆనందాన్ని ఇవ్వగలవు”. దీనిని ‘ సమర్థిస్తూ వివరించండి.
జవాబు:
భారతావనికి పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ బోధించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పల్లెలు ప్రధాన కారణాలుగా , పేర్కొనవచ్చు. ఒకప్పుడు పల్లెలు ప్రశాంత వాతావరణానికి ఆనవాలుగా ఉండేవి. చుట్టూ పంటపొలాలు, పచ్చని చెట్లు కనువిందు చేస్తుంటాయి. స్వచ్ఛమైన గాలి, జలం దొరుకుతాయి. కలుషితమైన వాతావరణం కన్పించదు.

ప్రజల మధ్య సోదరభావం, సమత్వం కన్పిస్తాయి. కష్ట సుఖాలను సమంగా పంచుకుంటారు. కాని ఈనాడు పల్లెల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. దళారీల పోరు ఎక్కువైంది. కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా పల్లెల్లో కన్పించడంలేదు. ఉపాధి అవకాశాలు లేక ఎంతోమంది పట్టణాలకు వలస పోతున్నారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో పల్లె ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే పల్లె ప్రజలు ఆనందోత్సాహాలతో సుఖంగా ఉంటారు. పల్లె ప్రజలంతా ఆనందంతో సుఖంగా తమ జీవనాన్ని గడుపగలుగుతారు.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు Important Questions and Answers

ప్రశ్న 1.
అన్నదాత అవస్థ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
( అన్నదాత అవస్థ )

అన్నదాతగా గర్వంగా పిలిపించుకొనే రైతుకు అన్నీ అవస్థలే. ఎప్పుడు వర్షపు చినుకులు నేలపై పడతాయా? అని ఆత్రుతగా, ఆశగా ఆకాశంవైపు చూడడంతో వ్యవసాయంలో రైతుకు అవస్థలు ప్రారంభమౌతాయి. కాలువ నీటి కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాడు.

దుక్కి దున్నుతాడు. విత్తనాలు చల్లుతాడు. కూలీల కొరకు పోటీపడి ఆకుమడి తయారు చేస్తాడు. బాడీబందా, వానా – వరదా పట్టించుకోకుండా వరి నాట్లు వేస్తాడు.

ఆకుమళ్ళను పశువులు తినేయకుండా తొక్కి పాడు చేయకుండా రాత్రింబవళ్ళు రైతు కాపలా కాస్తాడు. ఆ చేలగట్లపై జెర్రీలు, తేళ్ళు, పాములూ ఉంటాయి. అవి కరుస్తుంటాయి. అయినా అన్నదాత పట్టించుకోడు. పురిటిబిడ్డను బాలెంతరాలు కాపాడుకొన్నట్లు పంటను కాపాడతాడు.

ఎరువు చల్లి, పంటను కోసి, పనలు కట్టి కుప్ప వేస్తాడు. నూరుస్తాడు. ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బులు చేసిన అప్పులకు సరిపోవు. అయినా వ్యవసాయం మానడు.

అందుకే అన్నదాత అయ్యాడు. అమ్మకే అన్నం పెట్టే అన్నదాతకు భూమాత కూడా కన్న కూతురే.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 2.
వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:
వ్యవసాయం మన జీవనాధారం

ఆంధ్రులారా ! సోదరులారా !
కల్లాకపటం తెలియని పల్లెటూరి జనాల్లారా !
కంప్యూటరు విద్య నేర్చిన పట్నవాసపు నిరుద్యోగులారా !
రండి! వ్యవసాయం చేద్దాం ! పట్టెడన్నం పదిమందికీ పెడదాం !

ఉద్యోగం చేస్తే ఎవరికో సలాం చేస్తూ బతకాలి. మన బంగారు భూమిని మనమే సాగు చేసుకొంటూ ఏడాదికి మూడు పంటలు పండిద్దాం. ఆకలి మంటలను ఆర్పేద్దాం. కరవు కాటకాలను తరిమేద్దాం. ఆత్మాభిమానంతో జీవిద్దాం. ఎవ్వరికీ తల వంచకుండా బతుకుదాం. ఆంధ్రమాతను భారతదేశపు ధాన్యాగారంగా మారుద్దాం. మన తాత ముత్తాతల దారికి ఆధునికత జోడించి అద్భుతాలు సాధిద్దాం.

భూసారానికి మన తెలివి జతచేసి కలిమిని సృష్టిద్దాం. జై కిసాన్.
ఇట్లు,
భూమి పుత్రులు.

ప్రశ్న 3.
నీ చుట్టూ ఉన్న ప్రకృతిని వర్ణిస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి.
జవాబు:
(‘మా ఇంటి తోట’ వచన కవిత)
మా ఇంటితోట మాకు నచ్చిన పాట
అందమైన మల్లె తీగ, విందు లిచ్చు మొల్లపూలు
రంగు రంగుల గుత్తిపూలు, శృంగారాల విరిజల్లు
దొడ్డిలోన జామచెట్టు, చెట్టుమీద చిలుక గూడు
చిలుక కొట్టిన జామపండు అబ్బో ఎంతో తియ్యగుండు
చెట్లమీద పక్షి గూళ్ళు, చెవులు మెచ్చెడి సంగీతాలు
పెరడులోన పనసచెట్టు, దాని పక్క నిమ్మ మొక్క
గుమ్మం ముందు తులసి తల్లి, చేస్తుంది పూజ మాదుతల్లి
కూరగాయ మొక్కలెన్నో – బీరకాయ పాదులెన్నో
వీధి గుమ్మం వెనుక తట్టు – ఉన్న దొక్కరావి చెట్టు
వేపచెట్టు పిల్లగాలి – అది యిచ్చును మాకు హేళి
పూలమొక్కల మీది గాలి – మొక్కలన్న నాకు జాలి

ప్రశ్న 4.
‘పల్లె సంరక్షణ – మన బాధ్యత’ అని వివరిస్తూ కరపత్రం రూపొందించండి.
జవాబు:
పల్లెటూళ్ళు మన దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. మనదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్న పల్లె ప్రజలు పంటలు పండిస్తేనే నగరవాసులకు ఇంత తిండి దొరుకుతుంది. పల్లెల్లో ప్రజలు పశువులను మేపి పాలను నగరాలకు అందిస్తేనే నగరవాసులకు టీ, కాఫీలు దొరుకుతాయి. పల్లెల్లో రైతులు కూరగాయలు పండిస్తేనే, నగరాల కూరగాయల దుకాణానికి కూరగాయలు వస్తాయి.

గ్రామాల్లో చేతి వృత్తులవారు పనిచేస్తేనే కత్తి, చాకు, కొడవలి, మంచాలు, కుర్చీలు, వగైరా పనిముట్లు నగరవాసులకు లభిస్తాయి. గ్రామాల్లో రైతులు పత్తి పండిస్తేనే నగరవాసులకు బట్టలు లభిస్తాయి. నగరాలు ప్రతి దానికి గ్రామాలపైనే ఆధారపడాలి. కాబట్టి ప్రతి దేశ పౌరుడు గ్రామాభివృద్ధికి కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు చౌకగా ఋణాలు, ఎరువులు, పురుగు మందులు వగైరా అందించాలి. రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధరలను ప్రభుత్వం ఇవ్వాలి. ‘పల్లెల సంరక్షణ బాధ్యత’ ప్రతి పౌరుడు తీసికోవాలి. పల్లెలను రక్షించవలసిన బాధ్యత నగరవాసులదే అని అందరూ గుర్తించాలి. పల్లెలకు రోడ్డు సదుపాయాలు కల్పించాలి. పల్లెల్లో విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి. పల్లెలు పచ్చగా ఉంటేనే నగరాలు తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, నగరాల్లోని ప్రజలు, పల్లెల ఉత్పత్తులను ఉపయోగించుకుంటున్న అందరూ ముందుకు రావాలి. పల్లెలను, పల్లె ప్రజలను రక్షించాలి. పల్లెలు పచ్చగా ఉండేలా అందరూ చూడాలి.

పల్లెల సంరక్షణకు కంకణం కట్టుకుందాం. కదలి రండి. ఆలస్యం వద్దు. మనదేశ సౌభాగ్యం పల్లెల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. గమనించండి.

దివి. x x x x x

ఇట్లు,
అఖిల భారత యువజన సంఘం,
విజయవాడ.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

ప్రశ్న 5.
కిలకిలలాడే పక్షులతో కలకలలాడే పల్లెటూరిలో మీకు నచ్చిన ఒక ప్రకృతి దృశ్యాన్ని వర్ణించండి. (S.A. I – 2018-19)
జవాబు:
పల్లెల్లో పచ్చని చేలు, తలలాడిస్తూ మనల్ని ఆహ్వానిస్తాయి. చెట్లపై చిలుకలూ, పిచ్చుకలూ దోబూచులాడుకుంటూ ఉంటాయి. వృక్షాలపై పక్షులు గొంతెత్తి పాటలు కమ్మగా పాడుతాయి. పక్షుల మధురనినాదాల ముందు సుశీలమ్మ పాటలు ఏమి హాయి? బాటలన్నీ ముత్యాల ముగ్గులతో, ముసి ముసి నవ్వులు నవ్వుతాయి. పొలాల్లో ఆవులు మేతలు మేస్తూ, అంభారవాలు చేస్తూ ఉంటాయి. పశువుల కాపర్ల జానపద గీతాలు జోరుజోరుగా వినిపిస్తాయి. మామిళ్ళు, పనసలు చెట్లపై కాయలతో నిండు ముత్తదువుల్లా ఉంటాయి. కాల్వ గట్ల నుండి పోతూ ఉంటే పిల్లకాల్వలు సన్నగా సాగుతూంటాయి. పచ్చగా ఈనిన వరిచేలు, బుక్కా చల్లుకొన్న పడుచుకన్నెల్లా ఉంటాయి. పల్లెల్లోని ప్రకృతి దృశ్యాలు అతిథుల నేత్రాలకు విందు చేస్తాయి.

10th Class Telugu 3rd Lesson జానపదుని జాబు 1 Mark Bits

1. గురుశిష్యులు పూదోటకు వెళ్ళారు – (గీత గీసిన పదమును విడదీసిన రూపమును గుర్తించండి.) (March 2017)
A) పూన్ + తోట
B) పూవు + తోట
C) పూ + తోట
D) పూవు + తోట
జవాబు:
B, D

2. కాలం ఎంతో విలువైనది – గీత గీసిన పదానికి నానార్ధములు గుర్తించండి. (S.A. I – 2018-19 June 2018)
A) నలుపు, కళ
B) సమయం, నలుపు
C) చావు, జీవనం
D) జీవనం, సంతోషం
జవాబు:
B) సమయం, నలుపు

3. సీత సంగీతం, నృత్యం నేర్చుకుంటున్నది. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) సామాన్య వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) కర్మణీ వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

4. రామారావు మెట్లు ఎక్కుతూ, దిక్కులు చూస్తున్నాడు. (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) కర్మణీ వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) సంయుక్త వాక్యం
D) సామాన్య వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

5. తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2017)
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి
B) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడలేదు
C) తాత పిల్లలకు నీతి కథలు చెప్పాడా ?
D) తాత పిల్లలకు నీతి కథలు చెప్పలేదు
జవాబు:
A) తాత చేత పిల్లలకు నీతి కథలు చెప్పబడ్డాయి

6. రైతుల చేత పంటలు పండించబడ్డాయి – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి. (March 2017)
A) రైతులు పంటలను పండించలేదు
B) రైతులు చేత పంటలు పండించబడలేదు
C) రైతుల చేత పంటలు పండించబడ్డాయి
D) రైతులు పంటలను పండించారు.
జవాబు:
D) రైతులు పంటలను పండించారు.

7. తాత భారతం చదివి నిద్రపోయాడు – ఏ వాక్యమో గుర్తించండి. June 2018
A) చేదర్థకము
B) సంయుక్త వాక్యము
C) సంక్లిష్ట వాక్యము
D) నిషేధార్థకము
జవాబు:
C) సంక్లిష్ట వాక్యము

AP SSC 10th Class Telugu Important Questions Chapter 3 జానపదుని జాబు

8. రామకృష్ణ వివేకానందులు గురుశిష్యులు – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి. (June 2018)
A) సామాన్య వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) సంయుక్త వాక్యం
జవాబు:
D) సంయుక్త వాక్యం

9. పురిటిలోనే సంధి కొట్టడం : సంధివాక్యంలో వస్తుంది. ఇది పురిటిలోనే వస్తే తప్పక మరణిస్తారు. అలాగే ఏదైనా పని ప్రారంభంలోనే నాశనమైన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. (June 2017)

10. అడుగున పడిపోవుట : క్రొత్త సమస్యలు వస్తే పాత సమస్యలు అడుగున పడిపోతాయి. (June 2017)

11. కష్టఫలం : నేడు రైతులకు బొత్తిగా కష్టఫలం దక్కడం లేదు. (June 2018)

12. పొద్దస్తమానం : అన్నదాతలు పొద్దస్తమానం పొలాల్లో పనిచేస్తారు. (June 2018)

13. చమత్కారం : రఘురామ్ మాటలలో చమత్కారం తొణికిసలాడుతుంటుంది. (June 2018)

14. తునాతునకలు : ముక్కలు ముక్కలగుట / ఛిన్నాభిన్నమగుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. (S.A.I -2018-19 March 2018)

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 2nd Lesson అమరావతి

10th Class Telugu 2nd Lesson అమరావతి 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడంలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు?
జవాబు:
అమరావతిని శాతవాహనులు తొలి రాజధానిగా చేసుకొని అభివృద్ధి పరిచారు. ఇక్ష్వాకులు కూడా అమరావతిని మెరుగుపరిచారు. పల్లవులు తమ శాయశక్తులా అభివృద్ధి చేశారు. చాళుక్యులు, విష్ణుకుండినులు కూడా అభివృద్ధి చేశారు. కోటబేతరాజు వంశీయులు కూడా అభివృద్ధి చేశారు.

ప్రశ్న 2.
అనేక రాజవంశాలు అమరావతిని ఎందుకు అభివృద్ధి పరిచారు?
జవాబు:
రాజవంశాలు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాయి. వారి అభిలాషలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దుకొన్నారు. వారి అవసరాలకు తగినట్లుగా అమరావతిని మలచుకొన్నారు. వారి కళా పిపాస తీర్చుకోవడానికి అందమైన నిర్మాణాలు చేయించారు. ఆ పాలకుల మతాలకు, సంప్రదాయాలకు తగినట్లు రాజధాని ఉండాలి కనుక అభివృద్ధి పరిచారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
శరీరధర్మశాస్త్రాన్ననుసరించి శిల్పాలు రూపొందించడంలోని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
శరీరంలో కొన్ని కొలతలతో అవయవాలుంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా కొలతలు గల అవయవ నిర్మాణం, రంగు, ఒడ్డు, పొడుగు ఉంటేనే అందంగా పరిగణించబడుతుంది. అటువంటి లక్షణాలను కల్పించడం దైవానికి మాత్రమే సాధ్యం.

శిలతో చెక్కిన శిల్పంలో మానవ శరీరం యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబింపచేయడం నిపుణులైన కళాకారులకు మాత్రమే సాధ్యం. అటువంటి శిల్పాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. అదే వాటి ప్రత్యేకత. అటువంటి శిల్పాలు ఉన్నచోట సంపదలు వృద్ధి చెందుతాయనే విశ్వాసం కూడా ఉంది.

ప్రశ్న 4.
శాతవాహనుల కులగురువు యొక్క స్వభావాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘నాగార్జునుడు’ అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన రాజులకు కుల గురువు. ఈయన ధరణికోటలోనూ, నందికొండ ప్రాంతంలోనూ ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు. ఆ రోజుల్లో అక్కడ గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము ఉండేది. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధభిక్షువులు ఉండేవారు. ఆ విశ్వవిద్యాలయములో ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి వంటి తత్త్వవేత్తలు బోధించేవారని, క్రీ.శ. 640లో ఈ ప్రాంతాన్ని దర్శించిన చైనా యాత్రికుడు, హ్యూయత్సాంగ్ తెలియపరచాడు.

10th Class Telugu 2nd Lesson అమరావతి 4 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అమరావతి నగర సాంస్కృతిక వైభవాన్ని శిల్పకళా సంపదనుగురించి సొంతమాటల్లో వివరించండి. (June 2018)
జవాబు:

  1. శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకమే కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది.
  2. శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, విష్ణుకుండిన మొదలగు వంశాలకు చెందిన రాజుల పరిపాలనాకాలంలో అమరావతి ఎంతో అభివృద్ధి చెందింది.
  3. విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది.
  4. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు.
  5. కాలానుగుణంగా ఆయా రాజుల పరిపాలనలో మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతి మీద ప్రభావం చూపినందున ఇక్కడ బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాలు, సంస్కృతులు విలసిల్లి; నాటి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతున్నాయి.
  6. అమరావతి అద్భుత శిల్పకళకు కాణాచి. ఇక్కడి శిల్పాలు శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి రూపొందాయి. చిత్రకళలో మాత్రమే వీలైన హావభావ ప్రకటనలు శిల్పకళలో కూడా ప్రదర్శితం కావడం ఈ శిల్పాల విశిష్టత. క్రోధం, కరుణ, ప్రేమ, విషాదం, ఆరాధన వంటి భావాలు. ఈ శిల్పాలలో చక్కగా కనిపిస్తాయి.

ప్రశ్న 2.
ఏయే రాజవంశాలు అమరావతిని అభివృద్ధిపరచాయో తెల్పండి. (March 2018)
జవాబు:

  1. అమరావతిని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని సమగోప, గోబధ, నరన, కంవాయల వంశాలకు చెందిన రాజులు శాతవాహనుల కంటే ముందు పాలించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
  2. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు అమరావతిని పాలించారు. అభివృద్ధిపథంలో నడిపించారు.
  3. కోట బేతరాజు వంశస్థులు పాలించారు.
  4. విజయనగర ప్రభువులు సైతం అమరావతిని పాలించారు.
  5. క్రీ.శ. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని అత్యంత వైభవోపేతమైన నగరంగా తీర్చిదిద్దారు.

ప్రశ్న 3.
ఒక మామూలు నగరం రాజధానిగా ఉండడానికి పనికి వస్తుందా? రాదా? విశ్లేషించండి.
జవాబు:
ఒక మామూలు నగరం, రాష్ట్రమునకు రాజధానిగా ఉండడానికి పనికిరాదు. రాష్ట్ర రాజధాని నగరంలో మంత్రుల పరిపాలనకు సెక్రటేరియట్, డైరెక్టర్ల కార్యాలయాలు, అసెంబ్లీ భవనములు, హైకోర్టు భవనాలు ఉండాలి. మంత్రులకు, శాసనసభ్యులకు నివాస భవనాలు ఉండాలి. ఉద్యోగులకు నివాస భవనాలు ఉండాలి.

రాష్ట్ర రాజధాని నగరానికి రాకపోకలకు విశాలమైన రోడ్డుమార్గాలు ఉండాలి. రాష్ట్ర, కేంద్ర మంత్రుల రాకపోకలకు, విమాన సౌకర్యం ఉండాలి. రైలుమార్గాలు ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. పెద్ద వర్తక కేంద్రాలు ఉండాలి. కేంద్రమునకు సంబంధించిన కార్యాలయాలకు భవనాలు ఉండాలి. క్రీడా సదుపాయాలు ఉండాలి.

కాబట్టి ఒక మామూలు నగరం, రాష్ట్ర రాజధానిగా ఉండడానికి ఎంత మాత్రం పనికిరాదు. రాజధానికి కావలసిన అన్ని హంగులతో రాజధాని నగరాన్ని వేరుగా నిర్మించుకోవాలి.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 4.
ఒక మామూలు నగరం రాజధానిగా మారాలంటే రావలసిన మార్పులేమిటి?
జవాబు:
మామూలు నగరం రాజధానిగా మారాలంటే, ముఖ్యంగా అక్కడ పరిపాలనకు సెక్రటేరియట్ భవనాలు రావాలి. అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కావాలి. పోలీసుశాఖకు తగిన భవనాలు నిర్మించాలి.

మంత్రులకు, గవర్నరు గారికి, శాసనసభ్యులకు నివాస భవనాలు నిర్మించాలి. సెక్రటేరియట్ ఉద్యోగులకు నివాస భవనాలు కావాలి. రాజధానిలో నివసించేవారికి సరిపడ మంచినీటి సౌకర్యం ఉండాలి. విద్యా, వైద్య సదుపాయాలు ఉండాలి. చక్కని రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, విమాన ప్రయాణ సౌకర్యములు ఉండాలి. విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద వైద్యశాలలు ఉండాలి.

క్రీడలకు సదుపాయాలు ఉండాలి. ఉద్యానవనాలు, సరస్సులు ఉండాలి. పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు నిర్మించాలి. పెద్ద పెద్ద వర్తక కేంద్రాలు, అత్యాధునిక హంగులతో కూడిన అన్ని సదుపాయాలు కావాలి. మంచి విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండాలి. ప్రజలు సులభంగా రాజధానికి రావడానికి, పోవడానికి ప్రయాణ సౌకర్యాలు కావాలి.

ప్రశ్న 5.
అమరావతి భిన్న సంస్కృతుల నెలవు కావడానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
అమరావతి రాజధానిగా ఒకటవ శతాబ్దంలోనే, శాతవాహన చక్రవర్తులు దీనిని పాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతిని మంచి రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు.

ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, అమరావతిపై గట్టి ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ బుద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల, సంస్కృతుల ప్రభావాలు కన్పిస్తాయి.

క్రీ.పూ. 5వ శతాబ్దిలోనే గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. అమరావతిలో బుద్ధుని ధాతువుల భరిణను ఉంచి, దానిపై మహా చైత్యం నిర్మించారు. నాగార్జునుడనే బౌద్ధమత గురువు, శాతవాహన రాజులకు కుల గురువు. ఆ రోజుల్లో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయము, దానిలో 7,700 మంది బౌద్ధ భిక్షువులూ ఉండేవారు.

ఆ కాలంలో అమరావతి కేంద్రంగా, జైనమతం కూడా విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, జైనమత వికాసానికి సాక్షీభూతంగా నేటికీ ఉంది.

12, 13 శతాబ్దాల్లో శైవమతం ఇక్కడ విస్తరించింది. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠ చేశాడట. అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం, పంచారామాలలో ఒకటి.

రాజా వేంకటాద్రినాయుడు అమరావతికి దగ్గరలో, వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. తరువాత ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా ఇక్కడ వ్యాప్తి చెందాయి.

ఈ విధంగా అమరావతీ నగరం భిన్న సంస్కృతులకు నెలవు అయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 6.
“ఆచార్య నాగార్జునుడు విద్యాప్రదాత” అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధమతాచార్యుడు, శాతవాహన, రాజులకు కుల గురువు. ఈయన కాలంలో ధరణికోటలో గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. దీనికి ధాన్యకటక విశ్వవిద్యాలయం, శ్రీ పర్వత విద్యాపీఠం అనే పేర్లు కూడా ఉండేవి.

అనేక దేశాల విద్యార్థులు వచ్చి, అక్కడ విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయములో 7700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఈ విశ్వవిద్యాలయంలో ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రస, రసాయన, వృక్ష, లోహ శాస్త్రములను బోధించేవారు.

నందికొండలో 1500 గదుల ఆరామాలలో వివిధ శాస్త్ర గ్రంథాలు నిండి ఉండేవనీ, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్త్వవేత్తలు, అక్కడ బోధించేవారనీ, చైనా యాత్రికుడు హ్యూయత్సాంగ్ తన రచనల్లో తెలిపాడు.

దీనిని బట్టి ఆచార్య నాగార్జునుడు విద్యా ప్రదాత అని మనం చెప్పగలము.

ప్రశ్న 7.
అమరావతి శిల్పకళలకు కాణాచి అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు ఇక్కడ మహా బౌద్ధస్తూపం నిర్మించాడు. దానికి ఆచార్య నాగార్జునుడు మహా ప్రాకారాన్ని నిర్మించాడు. శిల్పులు ఈ చైత్యం చుట్టూ, అద్భుతమైన శిల్పకళా ఖండాలను అమర్చారు. శిల్పులు అక్కడ నలుచదరము శిలా ఫలకాల మీద బుద్ధుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. మెకంజీ 1779లో అమరావతి శివారులో ఉన్న దీపాల దిన్నె దిబ్బ దగ్గర ఉన్న శిల్ప సంపదను గుర్తించాడు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని, అక్కడ చెక్కించి, ఆ శిల్పాల గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలిపాడు.

దంతగిరి, నేలకొండ పల్లి, ధూళికట్ట, భట్టిప్రోలులలో లభించిన శిల్పాలను, “అమరావతి స్కూలు ఆఫ్ ఆర్ట్” అంటారు. ఇక్కడి శిల్పాలు, ఎన్నో కాలగర్భంలో కలిసాయి. కొన్ని విదేశాలకు వెళ్ళిపోయాయి. పల్నాడు పాలరాయిపై చెక్కిన 120కి పైగా అమరావతి శిల్పాలు, బ్రిటిష్ మ్యూజియంలో నేటికీ ఉన్నాయి. అవి అమరావతి శిల్పకళ గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. మరికొన్ని అమరావతి శిల్పాలు, మద్రాసు, కలకత్తా మ్యూజియంలలోనూ, కొన్ని నాగార్జున కొండ మ్యూజియంలోనూ దాచారు. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు చాలా గొప్పవని, గొప్ప శిల్పకళా పరిశోధకుడైన ఫెర్గూసన్ చెప్పాడు. దీనిని బట్టి అమరావతి శిల్ప కళలకు కాణాచి అని చెప్పవచ్చు.

ప్రశ్న 8.
సాంస్కృతిక వైభవానికి అమరావతి నెలవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
అమరావతి అనేకమంది రాజుల కాలంలో కాలానుగుణంగా అనేకమార్పులు పొందింది. ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సంప్రదాయాలు అమరావతిపై ప్రభావం చూపించాయి. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్ కు సాంస్కృతిక రాజధాని అయ్యింది. ఇక్కడ జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ మత సంప్రదాయాల సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి.

బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో అమరావతిలోని అమరారామంలో కాలు పెట్టాడు. అందువల్ల అమరారామం, పవిత్రమయ్యింది. 2006లో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర పరివర్తనం నిర్వహించాడు. అశోకుడు బుద్ధుని అస్థికలపై ఇక్కడ మహా చైత్యం నిర్మించాడు. నాగార్జునాచార్యుడు దానికి ప్రాకారం కట్టించాడు. ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది.

తరువాత అమరావతి కేంద్రంగా జైనమతం విస్తరించింది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం, ఇక్కడ జైనమత వికాసానికి సాక్షి. 12, 13 శతాబ్దాలలో అమరావతిలో శైవమతం వ్యాప్తి చెందింది. అమరావతిలోని అమరారామం మందార యం పంచారామాలలో ఒకటి.

రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు అమరావతి దగ్గరలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు.

ఈ పై కారణాల వల్ల, అమరావతి సాంస్కృతిక వైభవానికి నెలవు అని చెప్పవచ్చు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 9.
“అమరావతి గొప్ప రాజధాని” – నిరూపించండి.
జవాబు:
అమరావతి రాజధానికి 22. 10.2015న మన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మన కొత్త రాజధానికి మంచి పేరు తెచ్చేందుకు శ్రమిస్తానని మన ముఖ్యమంత్రిగారు ప్రతిజ్ఞ చేశారు.

మన రాజధానిని ఐదు అంచెల్లో పూర్తి చేస్తారు. మొత్తం మూడు దశల్లో 35 సంవత్సరాలలో అమరావతిని నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. దీనికి ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. దీనితో ఇది వెనిస్ నగరంలా ఉండబోతోంది.

సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో తొమ్మిది నగరాలు నిర్మిస్తారు.

అందులో పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యా నగరంగా అయినవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అభివృద్ధి అవుతాయి.

ఈ విధంగా అమరావతి చాలా గొప్ప రాజధాని అవుతుంది. 2016 జూలై నుండి అమరావతి కేంద్రంగా మన రాష్ట్ర పాలన సాగుతుంది.

ప్రశ్న 10.
నాటి – నేటి అమరావతిని విశ్లేషించండి.
జవాబు:
నాటి అమరావతి :
ఒకటవ శతాబ్ది నాటికే అమరావతి మహా నగరంగా విరాజిల్లేది. అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో అమరావతిని గుర్తించి రాశాడు. అశోకుడికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉండేదని తెలుస్తోంది.

శాతవాహన రాజులు అమరావతిని రాజధానిగా చేసుకొని క్రీ.పూ. 220 వరకు పరిపాలించారు. తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు దీనిని పాలించారు. తరువాత కోట బేతరాజు వంశస్థులు పాలించారు. 1798లో అమరావతిని గొప్ప రాజధానిగా జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తీర్చిదిద్దాడు.

నేటి అమరావతి :
ఇప్పుడు అమరావతి నగరం ఐదుకోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. ఈ రాజధానికి 22.10.2015న మన ప్రధాని శంకుస్థాపన చేశారు. మొత్తం మూడు దశల్లో ఈ రాజధాని 35 సంవత్సరాలలో సంపూర్ణ అమరావతి నగరంగా రూపొందుతుంది.

అమరావతికి రైలు, రోడ్డు సదుపాయాలు ఏర్పాటు అవుతాయి. సింగపూర్, జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం అవుతాయి. అమరావతి నగరం, అత్యాధునిక హంగులతో ప్రజా రాజధానిగా అభివృద్ధి అవుతుంది. 2016 జూలై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఇక్కడి నుండే సాగుతుంది.

10th Class Telugu 2nd Lesson అమరావతి Important Questions and Answers

ప్రశ్న 1.
అమరావతి పర్యాటకులను ఆహ్వానిస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
(ఆహ్వానము)

దేశ విదేశ పర్యాటకులకు ఇదే మా ఆహ్వానము. మీరు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, అమరావతిని గురించి వినే ఉంటారు. ఇది గొప్ప సాంస్కృతిక రాజధాని. అందాల కృష్ణమ్మ ఒంపులు తిరుగుతూ దీని పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది. “అమరావతీ నగర అపురూప శిల్పాలు, తప్పక చూడదగినవి. ప్రపంచ ప్రసిద్ధ శిల్పకళా పరిశోధకుడు ఫెర్గూసన్ ప్రపంచ శిల్పకళా సంపదలో అమరావతీ శిల్పాలు మిక్కిలి గొప్పవని మెచ్చుకున్నాడు.

అమరావతిలో అశోకుడు కట్టించిన మహా బౌద్ధస్తూపం ఉంది. దానికి నాగార్జునుడు కట్టించిన మహా ప్రాకారం ఉంది. పంచారామాలలో ప్రసిద్ధమైన అమరారామం ఇక్కడే ఉంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించిన వేంకటేశ్వరాలయం ఇక్కడ ఉంది. ఇవన్నీ చూడ ముచ్చటగా ఉంటాయి.

అమరావతిలో జైనమత వికాసానికి సాక్షిగా పార్శ్వనాథుని దేవాలయం ఉంది. అమరావతి నగరం, గొప్ప సాంస్కృతిక రాజధాని. ఇక్కడ అనేక మతాలు అభివృద్ధి చెందాయి. అమరావతిలో క్రీ.పూ. మొదటి శతాబ్దిలోనే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన గొప్ప శిల్ప సంపద ఉంది.

అమరావతి అద్భుతమైన శిల్ప కళలకు కాణాచి. అమరావతి శిల్పాలు, నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆ శిల్పాలు అమరావతీ శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి.

ఇంత అందమైన శిల్పకళా లక్ష్మికి నిలయమైన రాజధాని అమరావతిని మీరు తప్పక దర్శించండి. మీకు ఇదే మా సుస్వాగతం. ఇదే మా ఆహ్వానం, పర్యాటకులకు అమరావతి కనులపండువగా ఉంటుంది. ఈ ప్రదేశాలు చూడడానికి బస్సులు ఉన్నాయి. రండి అమరావతిని దర్శించండి.
దివి. x x x x x

ఇట్లు,
అమరావతీ పర్యాటక సంస్థ,
అమరావతి,

ప్రశ్న 2.
“అమరావతి” ఆత్మకథ రాయండి.
జవాబు:
నేను ‘అమరావతి’ నగరాన్ని. తొలి తెలుగు రాజులు శాతవాహనులు నన్నే రాజధానిగా చేసుకొని సుమారు 220 సంవత్సరాలు పాలించారు. నా ప్రక్కనే కృష్ణానది గలగలా ప్రవహిస్తూ ఉంటుంది. నన్నే రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, కోట బేతరాజ వంశస్థులు పాలించారు. 1798లో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నన్ను అందమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దాడు – నా గడ్డపై బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలు వ్యాప్తి చెందాయి.

గౌతమబుద్ధుడు క్రీ.శ. 5వ శతాబ్దిలోనే నా నేలపై అడుగుపెట్టాడు. ఆ మహాత్ముడి పాద స్పర్శతో నేను పునీతం అయ్యాను. నా ఈ నగరంలోనే మహా బౌద్ధస్తూపం, దానికి ప్రాకారాలు ఉన్నాయి. నా నగరంలోనే నాగార్జునుడు ఒకనాడు బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పరచాడు.

నా అమరావతీ నగరంలో వెలిసిన శిల్పం, ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నా నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు నేను ఐదుకోట్ల ఆంధ్రులకు అందాల రాజధానిని అయ్యాను. ఇక్కడ తొమ్మిది నగరాలు అత్యాధునిక హంగులతో ఏర్పాటు అవుతున్నాయి. మనదేశ ప్రధాని ఇక్కడ నూతన రాజధానికి శంకుస్థాపన చేశారు. మూడు దశల్లో 35 ఏళ్ళలో నేను తెలుగువారికి గొప్ప రాజధాని నగరంగా అభివృద్ధి అవుతాను. నన్ను సర్వహంగులతో తీర్చిదిద్దుకోవడం, ఐదు కోట్ల తెలుగు ప్రజల కర్తవ్యం. ఉంటా…..

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

ప్రశ్న 3.
అమరావతిని సందర్శించిన ఇద్దరు పర్యాటకుల సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
(రాజయ్య, వీరారెడ్డి అనే పర్యాటకుల సంభాషణ).

రాజయ్య : ఏవండీ ! మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీ పేరేమిటి?

వీరారెడ్డి : నేను అనంతపురం నుండి వచ్చా. నా పేరు వీరారెడ్డి. మీరు ఎక్కడివారు? మీ పేరేమిటి?

రాజయ్య : నేను శ్రీకాకుళం నుండి వచ్చా. నా పేరు రాజయ్య. మీరు ఇక్కడ ఏమి చూశారు?

వీరారెడ్డి : నేను అశోకుడు నిర్మించిన మహా బౌద్ధ స్తూపాన్ని, నాగార్జునాచార్యుడు దానికి కట్టించిన మహా ప్రాకారాన్ని చూశాను. అది ఎంత గొప్ప శిల్పం అండీ ! చాలా బాగుంది.

రాజయ్య : నేనూ అవి చూశాను. నిజంగా అమరావతి శిల్పం, అత్యద్భుతంగా ఉంది.

వీరారెడ్డి : నేను అమరారామం చూశా ! రాజయ్యగారూ ! శివలింగం, పై అంతస్థులో ఉంది.

రాజయ్య : అవునండి. శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని, దేవరాజు ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేశాడటండీ ! ఇది గొప్ప మహా పుణ్యక్షేత్రం.

వీరారెడ్డి : నేను కృష్ణానదిలో స్నానం చేసి, ఆ నీళ్ళతో అమరలింగేశ్వరునికి అభిషేకం చేశానండి.

రాజయ్య : రెడ్డిగారూ ! మీరు పుణ్యాత్ములు. నాకు నదీస్నానం అంటే భయం. మీరు దీపాల దిన్నె వెళ్ళారా?

వీరారెడ్డి : లేదండి. ఏమిటి అక్కడ విశేషం?

రాజయ్య : పూర్వం ప్రతిరోజూ అక్కడ బౌద్ధ భిక్షువులు దీపాలు వెలిగించేవారట. అందుకే దాన్ని దీపాల దిన్నె అంటారట. అక్కడ ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని చక్కగా చెక్కించాడు.

వీరారెడ్డి : నేనూ చూడాలి. నేను మొన్న ప్రధాని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్ళా. పరిసరాలు బాగున్నాయి. అక్కడ తొమ్మిది నగరాలు నిర్మిస్తారట.

రాజయ్య : బాగుంది. మొత్తం పై మన ముఖ్యమంత్రిగారు మంచి ప్రదేశాన్ని మన రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఏర్పాటు చేశారు. భేష్.

వీరారెడ్డి : సరే ఉంటానండి. ఇంకా నేను ఎన్నో చూడాలి.

రాజయ్య : సరేనండి. నేనూ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ప్రదేశం చూస్తా.

10th Class Telugu 2nd Lesson అమరావతి 1 Mark Bits

1. అమరావతి శిల్పకళకు కాణాచి. – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (June 2018)
A) వలయము
B) నిలయము
C) ప్రధానము
D) సంకేతము
జవాబు:
B) నిలయము

2. మంచి మార్కులు రాలేదని నిరాశ చెందకుండా కష్టపడి చదవాలి – గీత గీసిన పదంలో గల సంధి పేరు గుర్తించండి. (June 2018)
A) గుణసంధి
B) అనునాసిక సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) పడ్వాది సంధి
జవాబు:
D) పడ్వాది సంధి

3. ఒకనాటికీ, నేటికీ ఎన్నో విషయాలలో అంతరం ఉంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి. (March 2018)
A) పోలిక, సమానం
B) న్యాయం, ధర్మం
C) నీతి, నిజాయితీ
D) భేదము, తేడా
జవాబు:
D) భేదము, తేడా

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

4. స్వభావముచేత ఐశ్వర్యము కలవాడు పార్వతీ దేవిని వివాహమాడెను. (వ్యుత్పత్తి పదమును గుర్తించండి.) (S.A. I – 2018-19)
A) రుద్రుడు
B) మహేశ్వరుడు
C) ఈశ్వరుడు
D) శివుడు
జవాబు:
C) ఈశ్వరుడు

5. “దేవాలయ గోపురాలు ఆకాశాన్నందుతున్నాయి” అలంకారం గుర్తించండి. (S.A. I – 2018-19)
A) స్వభావోక్తి
B) అర్థాంతరన్యాసం
C) అతిశయోక్త
D) ఉత్ప్రేక్ష
జవాబు:
C) అతిశయోక్త

6. అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. (కర్మణివాక్యం గుర్తించండి.) (June 2017)
A) అమరావతి శిల్పాలు నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరచలేదు.
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.
C) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో మ్యూజియంలో దాచారు.
D) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి.
జవాబు:
B) అమరావతి శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరచబడినవి.

7. ‘ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది’ అని అందరనుకుంటున్నారు. (పరోక్ష కథనం గుర్తించండి.) (June 2017)
A) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడదని అందరనుకుంటున్నారు.
B) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడుతుందని ఎవరూ అనలేదు.
C) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడలేదని అందరనుకుంటున్నారు.
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.
జవాబు:
D) ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరనుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

8. తనకు పల్లెలంటే ఇష్టమని సోము అన్నాడు. (ప్రత్యక్ష కథనం గుర్తించండి.) (June 2017 )
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
B) “నేను పల్లెలంటే ఇష్టపడతాను” అని సోము అన్నాడు.
C) “వానికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
D) “అతనికి పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.
జవాబు:
A) “నాకు పల్లెలంటే ఇష్టం” అని సోము అన్నాడు.

9. అమరావతీ ! నీ కీర్తి చిరకాలం వర్ధిల్లుగాక ! (ఏ వాక్యమో గుర్తించండి.) (June 2017)
A) ఆశీరర్థకం
B) నిశ్చయార్థకం
C) సందేహార్థకం
D) ఆశ్చర్యార్థకం
జవాబు:
A) ఆశీరర్థకం

10. “నేను తిరుపతికి వెళతాను” అని అమ్మ అన్నది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది.
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.
C) నేను తిరుపతికి వెళ్ళను అని అమ్మ అన్నది.
D) నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అనలేదు.
జవాబు:
B) తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది.

11. చెప్పుడు మాటలు వినవద్దని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2017)
A) “చెప్పుడు మాటలు వినవచ్చు” అని రచయిత అన్నాడు.
B) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అనలేదు.
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.
D) “చెప్పుడు మాటలు వినమని” రచయిత అన్నాడు.
జవాబు:
C) “చెప్పుడు మాటలు వినవద్దు” అని రచయిత అన్నాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 2 అమరావతి

12. “నేటి సినిమాలు నేను చూడలేకపోతున్నాను” అని అమ్మతో అన్నాను – పరోక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) తాను ఈనాటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
B) తాను ఈనాటి సినిమాలను చూడలేనని అమ్మతో అన్నాను.
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
D) నాటి సినిమాలను తాను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.
జవాబు:
C) నేటి సినిమాలను నేను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను.

13. తన రచనలో తన జీవితముందని రచయిత అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి. (June 2018)
A) “మా రచనలో నీ జీవితముంది” అని రచయిత అన్నాడు.
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.
C) “తన రచనలో అతని జీవితముంది” అని రచయిత అన్నాడు.
D) “నా రచనలో ఎవరి జీవితం లేదు” అని రచయిత అన్నాడు.
జవాబు:
B) “నా రచనలో నా జీవితముంది” అని రచయిత అన్నాడు.

14. తనకు అమరావతి నిర్మాణం ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు – దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి. (March 2018)
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
B) “మీకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.
C) అమరావతి నిర్మాణం వారికి ముఖ్యమని ముఖ్యమంత్రి అన్నాడు.
D) ముఖ్యమంత్రి అన్నాడు “తమకు అమరావతి నిర్మాణం అవసరం.”
జవాబు:
A) “నాకు అమరావతి నిర్మాణం ముఖ్యము” అని ముఖ్యమంత్రి అన్నాడు.

15. రాజులు కూడా జైన మతాన్ని ఆవలంబించారు. (కర్మణి వాక్యం గుర్తించండి) (S.I. 1 – 2018-19)
A) రాజులచేత కూడా జైన మతం అవలంబించారు.
B) జైన మతం కూడా రాజులు అవలంబించారు.
C) జైన మతంచేత రాజులు అవలంబించబడ్డారు.
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.
జవాబు:
D) జైన మతం రాజులచేత కూడా అవలంబించబడింది.

16. పునీతం : గంగానదీ జలంతో భారతావని పునీతం అయ్యింది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన.

AP State Syllabus SSC 10th Class Telugu Important Questions 1st Lesson మాతృభావన

10th Class Telugu 1st Lesson మాతృభావన 2 Marks Important Questions and Answers

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
స్త్రీలను గౌరవించాలనే ఉదాత్త సందేశాన్నిచ్చిన ‘మాతృభావన’ పాఠ్యభాగ కవి పరిచయం రాయండి. (March 2015)
జవాబు:
1. కవి, కాలము : కీ.శే. గడియారం వెంకట శేషశాస్త్రిగారు, (1894-1980) ఆధునిక కాలము, కడపజిల్లా, జమ్మల మడుగు తాలూకా, “నెమళ్ళ దిన్నె” గ్రామ వాస్తవ్యులు.
2. రచనలు : మురారి, పుష్పబాణ విలాసము మొ||నవి.
3. బిరుదు : కవితా వతంస / కవిసింహ | అవధాన పంచానన
4. ఆధునిక తెలుగు కవులలో ప్రముఖులు, శతావధాని, బానిసత్వాన్ని నిరసించారు.

ప్రశ్న 2.
మాతృభావన నేపథ్యం వ్రాయండి.
జవాబు:
కళ్యాణి దుర్గంపై దండయాత్ర చేసి అబ్బాజీసో దేవుడు విజయం సాధించాడు. విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చాడు. శివాజీ ఆజ్ఞతో దుర్గం జయించి దాని సర్దారు ‘మౌలానా అహ్మద్’ను పట్టి బంధించాడు. అతని రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చినట్లు శివాజీకి చెప్పాడు. అది విన్న శివాజీకి చాలా కోపం వచ్చింది. తరువాత పాఠ్యభాగం మొదలవుతుంది.

ప్రశ్న 3.
మాతృభావన రచయిత గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శ్రీ శివభారతంలోని తృతీయాశ్వాసంలోనిది ప్రస్తుత పాఠ్యాంశం.

శాస్త్రిగారు కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలోని నెమళ్ళ దిన్నె గ్రామానికి చెందిన వారు. వారి తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్యగార్లు, శాస్త్రిగారు ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులుగా పనిచేశారు. శాస్త్రిగారు శతావధాని. వీరు మరొక శతావధానియైన రాజశేఖర శతావధాని గారితో కలిసి, కావ్యనాటకాలు రచించారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
మాతృభావన రచయిత ఎవరు? ఆయన రచనల గూర్చి వ్రాయండి.
జవాబు:
మాతృభావన పాఠం గడియారం వేంకటశేషశాస్త్రి గారు రచించారు. ఆయన రచించిన శివభారతంలోని తృతీయాశ్వాసం నుండి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహించబడింది.

గడియారం వారి పేరు చెప్పగానే “శ్రీ శివభారతం” గుర్తుకు వస్తుంది. బానిసత్వాన్ని నిరసించి, స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన మహాకావ్యం శ్రీ శివభారతం.

మురారి, పుష్పబాణ విలాసం, మల్లికామారుతం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, రఘునాథీయం మొదలైన అనేక గ్రంథాలు శాస్త్రిగారు రచించారు.

శాస్త్రిగారికి కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనే బిరుదులను సాహితీ విమర్శకులు ఇచ్చారు.

ప్రశ్న 5.
‘స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు’ అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
గడియారము వేంకటశేషశాస్త్రి కవిగారు ‘మాతృభావన’ అనే పాఠంలో, భారతదేశంలో అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలున్నారని వారు పుట్టింటిని, మెట్టింటిని తమ పాతివ్రత్యంతో రక్షించారని చెప్పారు.

‘కల్పలత అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరిన కోరికలను ఇచ్చే దేవతల వృక్షం. స్త్రీలు భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించే కల్పవృక్షాల వంటి వారని కవి ఉద్దేశ్యం.

స్త్రీలను గౌరవిస్తే భారతదేశం సౌభాగ్యముగా సర్వసంపదలతో సుఖంగా ఉంటుందని కవి ఉద్దేశ్యం.

ప్రశ్న 6.
శివాజీ స్త్రీలపట్ల చూపిన గౌరవభావం నీకు తెలిసిన వారిలో ఎవరికైనా ఉంటే వారిని గురించి నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
శివాజీ స్త్రీల పట్ల గౌరవభావం చూపినట్లే, మా గ్రామ సర్పంచి కూడా స్త్రీలను ఎంతో గౌరవంగా చూసేవాడు. వారు ఎదురు పడితే మాతృభావంతో మెలిగేవాడు. గ్రామంలోని స్త్రీలను ఎవరైనా ఏమన్నా వేధించడానికి చూస్తే ఊరుకొనేవాడుకాదు. వాళ్ళకు తగినబుద్ధి చెప్పేవాడు. ఇతర స్త్రీలను మన తల్లిలాగా, సోదరిలాగా భావించి గౌరవించాలని బోధించేవాడు.

ప్రశ్న 7.
“స్త్రీలు పూజ్యనీయులు” అన్న శివాజీ మాటల వెనుక ఆంతర్యమును సొంత మాటల్లో వివరించండి.
జవాబు:
సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీని కూడా, ఆ సర్దారుతో పాటు బంధించి తెచ్చాడు. అది చూసి శివాజీ కోపంతో ఉగ్రుడైనాడు. స్త్రీలను తల్లులలాగా, తోబుట్టువుల్లాగా గౌరవించాలనేది శివాజీ అభిప్రాయం.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు ఈ భరతమాత కన్నబిడ్డలు. అగ్నిజ్వాలల వంటి స్త్రీలకు అపచారం చేసేవారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానమూ చేయకూడదనేది శివాజీ మాటల వెనుక ఆంతర్యం.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 8.
క్రింది పాత్రల స్వభావాలను రాయండి.
జవాబు:
1. శివాజీ :
శివాజీ మరాఠా వీరుడు. ఆదర్శవాది. మహాబల పరాక్రమవంతుడు. పరస్త్రీని తన తల్లిగా భావిస్తాడు. స్త్రీలకు అవమానం జరిగితే సహించడు. స్త్రీలకు కష్టాన్ని కల్గించే వారెవరినైనా శిక్షిస్తాడు. స్త్రీలను అవమానించే వారిని సహించడు.

2. సోన్ దేవుడు :
శివాజీ సేనాని. బలగర్వం ఎక్కువ. మితిమీరిన ఉత్సాహం, శివాజీ పట్ల భయభక్తులు కలవాడు. ‘కళ్యాణి’ దుర్గం జయించాడు. రాణివాసాన్ని కూడా బంధించి తెచ్చాడు. శివాజీ కోప్పడ్డాడు. క్షమార్పణ చెప్పి శాంతింపజేశాడు. తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడే స్వభావం కలవాడు.

ప్రశ్న 9.
మీ తోడి బాలికల పట్ల ఏ విధమైన గౌరవభావాన్ని వ్యక్తపరుస్తావు?
జవాబు:
మేము మా తోడి బాలికలను అక్కలుగా, చెల్లెళ్ళుగా భావించి, వారిని ప్రేమాదరాలతో గౌరవిస్తాము. వారికి ఏ సహాయం కావలసినా, మేము మాతోడి బాలురతో కలిసి సాయం చేస్తాము. మా తోడి బాలికలు బడికి వచ్చేటప్పుడు లేక వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వారికి ఏ విధమైన కష్టం కలుగకుండా చూస్తాము. ఎవరైనా ఆకతాయి, అల్లరి పిల్లలు, వారిని అల్లరి పెడితే, మేము ఆ పిల్లలను బెదరించి వారిని తరిమి వేస్తాము. అవసరం అయినప్పుడు మా నోట్సులు వారికి ఇస్తాము. మా తోడి బాలికలకు స్వంత అన్నదమ్ములవలె మేము చేదోడు వాదోడుగా నిలబడతాము.

అవసరం అయితే వారి కోసం మేము మా ప్రాణాలు కూడా ఇచ్చి సాయం చేస్తాము. వారికి రక్షణ సైన్యంగా నిలబడతాము .

ప్రశ్న 10.
పుట్టినిల్లు, మెట్టినిల్లు గౌరవాన్ని నిలబెట్టిన కొందరు స్త్రీలను గురించి వివరించండి.
జవాబు:
అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి తన పాతివ్రత్యంతో, త్రిమూర్తులను చంటిబిడ్డలుగా చేసి, వారికి జోలపాట పాడింది. సావిత్రి అనే ఇల్లాలు యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకొంది. సీతా మహాదేవి, భగభగమండే అగ్ని గుండంలో దూకి, పూలరాశిలో తిరిగినట్లు బయటకు సురక్షితంగా వచ్చింది. సుమతి అనే పతివ్రత తన భర్త ప్రాణాలను రక్షించడం కోసం, సూర్యుడు ఉదయించకుండా సూర్యోదయాన్ని నిలిపి వేసింది. ఈ ఇలా ఎందరో భారతీయ స్త్రీలు, తమ పాతివ్రత్య భాగ్యంతో, తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చి,
గౌరవాన్ని నిలబెట్టారు. ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

10th Class Telugu 1st Lesson మాతృభావన 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“స్త్రీలు పూజింపదగినవారు వారికి ఏ అవమానం చేయకూడదు” అని చాటి చెప్పిన శివాజీ వ్యక్తిత్వాన్ని “మాతృభావన” పాఠం ద్వారా విశ్లేషించండి. (S.A. I – 2018-19)
జవాబు:
వ్యక్తిత్వం అంటే మాటకూ, చేతకూ తేడా లేనితనం. శివాజీ పరస్త్రీలను సైతం కన్నతల్లులవలె, సోదరీమణులవలె చూసి గౌరవించేవాడు. శివాజీ ధర్మప్రభువు. శత్రు దుర్గాలపై దండెత్తినపుడు అక్కడ ఉండే స్త్రీలకూ, బ్రాహ్మణులకూ అపకారం తల పెట్టవద్దని, తన సర్దారులను హెచ్చరించేవాడు.

తన సర్దారు సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించినా, అతడు యవనకాంతను బంధించి తెచ్చినందుకు అతడిపై శివాజీ కోపపడ్డాడు. వెంటనే ఆ యవనకాంతను విడిపించి, తన సర్దారు తొందరలో తప్పు చేశాడనీ, తనను క్షమించమనీ ఆమెను కోరాడు. ఆమెను సత్కరించి తనవారిని తోడిచ్చి, ఆమెను ఆమె ఇంటికి తిరిగి పంపాడు.

శివాజీ క్షమామూర్తి, తప్పు చేశానని అంగీకరించిన సో దేవుడిని క్షమించాడు. శివాజీ స్త్రీలపై అత్యధిక గౌరవం కలవాడు. పతివ్రతలు భారత భాగ్య కల్పలతలని, వారు అగ్నిజ్వాలల వంటివారని, స్త్రీలకు అపచారం చేస్తే నశిస్తారనీ, వారి సంపదలు నశిస్తాయనీ శివాజీ తలంచేవాడు. శివాజీ శత్రువులను సైతం అవమానించని ధర్మమూర్తి. శివాజీది మహోన్నత వ్యక్తిత్వం.

ప్రశ్న 2.
‘మాతృభావన’ పాఠ్యాంశం ఆధారంగా దానిని రచించిన కవి వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
మాతృభావన పాఠం ‘శివభారతము’ అనే కావ్యంలోనిది. ఈ కావ్యాన్ని గడియారం వేంకటశేషశాస్త్రి గారు రాశారు. శివభారతము బానిసత్వాన్ని నిరసించి, భారతీయులలో స్వాతంత్ర్య కాంక్షను రగుల్కొల్పిన కావ్యం.

శివాజీ హిందూమత ధర్మంపై గొప్పభక్తి గౌరవాలు కలవాడు. స్త్రీలందరినీ, కన్నతల్లుల వలె శివాజీ గౌరవించాడు.

గడియారంవారు కూడా, గొప్ప దేశభక్తులు. శివాజీ వంటి దేశభక్తులైన చారిత్రక పురుషులపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు. గడియారంవారు శివభారతము రచించే రోజుల్లో మన దేశానికి స్వాతంత్ర్యము రాలేదు. అందుకే మన భారతీయులలో స్వాతంత్ర్యంపై కోరికను ఉద్దీపింపజేయడానికి శివభారతాన్ని గడియారం వారు వ్రాశారు.

ఈ పాఠాన్ని బట్టి గడియారంవారు, గొప్ప దేశభక్తులని, హిందూమతంపై భక్తి గౌరవాలు కలవారని, గొప్ప స్వాతంత్ర్య వీరులనీ, మహాకవులనీ మనం గ్రహించగలము. వీరు స్త్రీల పై గౌరవం కలవారు.

అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలపై గొప్ప భక్తి విశ్వాసాలు కలవారు గడియారం వారు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 3.
సోన్ దేవుని రాజభక్తిని విశ్లేషించండి.
జవాబు:
అబ్బాజీసో దేవుడు, శివాజీ మహారాజు వద్ద పనిచేసే ఒక సైన్యాధిపతి. సో దేవుడు, శివాజీ ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తాడు. శివాజీ, సో దేవుడిని కళ్యాణి దుర్గముపై దండయాత్రకు పంపాడు. మహావీరుడైన సో దేవుడు, శివాజీ ఆజ్ఞ ప్రకారం కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారులను పట్టి బంధించి తెచ్చాడు. అంతేకాకుండా ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి వెంట తెచ్చాడు. రాణివాస స్త్రీలను బంధించి తెచ్చాడని విని, శివాజీ కోపంతో సోన్ దేవునిపై మండిపడ్డాడు.

వెంటనే రాణివాస స్త్రీల బంధాన్ని తొలగించి సభలోకి తీసుకొని రమ్మని శివాజీ సో దేవుడిని ఆజ్ఞాపించాడు. రాజభక్తి గల సో దేవుడు, వెంటనే రాణివాస స్త్రీల బంధాలు తొలగించి వారిని సభలోకి తీసుకువచ్చాడు. తనను మన్నింపుమని సో దేవుడు, శివాజీ మహారాజును కోరాడు. కోటను జయించిన ఉత్సాహంతో, అలా స్త్రీలను బంధించి తెచ్చాననీ, తనకు చెడు ఆలోచన లేదనీ, శివాజీ మహారాజును బ్రతిమాలాడు. శివాజీ సోన్ దేవుడి రాజభక్తిని గుర్తించి అతడిని మన్నించాడు. సోన్ దేవుడు గొప్ప రాజభక్తి కల సర్దారు.

ప్రశ్న 4.
సోన్ దేవుడు తప్పు చేసినా సరిదిద్దుకొనే స్వభావం కలవాడు అని నిరూపించండి.
జవాబు:
సోన్ దేవుడు శివాజీ మహారాజు యొక్క సైన్యాధిపతి. శివాజీ సోన్ దేవుడిని కళ్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. సోన్ దేవుడు కల్యాణి దుర్గాన్ని జయించి, దాని సర్దారును పట్టి బంధించి, ఆ దుర్గంలోని రాణివాస స్త్రీలను కూడా బంధించి శివాజీ వద్దకు తీసుకువచ్చాడు.

పుణ్యానికి నిలయమైన అంతఃపురకాంతను బందీగా తీసుకురావడం తప్పని, తన ఆజ్ఞను అతడు అతిక్రమించాడనీ శివాజీ మహారాజు సోన్ దేవునిపై ఉగ్రుడయ్యాడు. వెంటనే రాణివాస స్త్రీలను బంధవిముక్తుల్ని చేసి తీసుకురమ్మని శివాజీ సోన్ దేవుడిని ఆజ్ఞాపించాడు.

సోన్ దేవుడు తాను చేసిన తప్పును దిద్దుకొనే స్వభావం కలవాడు. అందువల్లనే సోన్ దేవుడు మరో మాట మాట్లాడకుండా, తాను బంధించి తెచ్చిన అంతఃపుర స్త్రీల బంధాలు విడిపించి, రాజు వద్దకు వారిని తెచ్చి, తనను క్షమించమని శివాజీని బ్రతిమాలాడు. విజయోత్సాహంతో తాను తప్పు చేశాననీ, తనలో చెడు ఆలోచన లేదనీ, శివాజీకి విన్నవించాడు. దీనిని బట్టి సోన్ దేవుడు తప్పుచేసినా, సరిదిద్దుకొనే స్వభావం కలవాడని తెలుస్తోంది.

ప్రశ్న 5.
శివాజీకి స్త్రీల పట్ల ఉండే గౌరవభావాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
శివాజీ మహారాజుకు స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉంది. అంతఃపురకాంతలు పుణ్యమునకు నిలయమైనవారనీ, వారిని బంధించడం కానీ, అవమానించడం కానీ, ఏ భారతీయుడు చేయరాదనీ, శివాజీ అభిప్రాయము. అందుకే కళ్యాణి దుర్గంలోని అంతఃపురకాంతను బంధించి తెచ్చిన తన సైన్యాధిపతి సో దేవుడి పై శివాజీ మండిపడ్డాడు. వెంటనే ఆమెను విడిపించి, ఆమెను గౌరవించి తన సైన్యాన్ని తోడిచ్చి ఆమెను వారి కోటకు పంపాడు. ఆమెను శివాజీ తన తల్లిగా గౌరవిస్తానన్నాడు.

స్త్రీలు భారతభూమిపై తిరిగే పుణ్యదేవతలని, శివాజీ చెప్పాడు. మనదేశంలో పుట్టిన అనసూయ, సావిత్రి, సీత, సుమతి వంటి పతివ్రతలు, తమ పాతివ్రత్యంతో తమ పుట్టింటికీ, అత్తవారింటికీ కీర్తిని తెచ్చారని, శివాజీ మెచ్చుకున్నాడు.

పతివ్రతల పట్ల అపచారం చేసేవారు నశిస్తారనీ, వారి వంశం నిలవదనీ, రావణాసురుడు అలాగే నశించాడనీ శివాజీ చెప్పాడు. స్త్రీలు రత్నముల వంటివారనీ, వారు పూజింపదగినవారనీ, శివాజీ అభిప్రాయపడ్డాడు.

ప్రశ్న 6.
శివాజీ యవనకాంతను ఎందుకు క్షమాపణ కోరాడో వివరించండి.
జవాబు:
శివాజీ, సో దేవుడు అనే సైన్యాధిపతిని కల్యాణి దుర్గంపై దండయాత్రకు పంపాడు. శివాజీ దండయాత్రకు తన సైన్యాన్ని పంపేటప్పుడు, పతివ్రతలయిన స్త్రీలకు ఎటువంటి అపచారము చేయవద్దని వారిని హెచ్చరించేవాడు.

కాని సో దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించిన ఉత్సాహంతో, దాని సర్దారునూ, అచటి అంతఃపురకాంతలనూ బంధించి తెచ్చాడు. అంతఃపుర స్త్రీలను బంధించి తీసుకురావడం తప్పని శివాజీ అభిప్రాయము.

పతివ్రతలయిన స్త్రీలు అగ్నిజ్వాలల వంటివారని, వారిపట్ల అపచారం చేసేవారు, సంపదలు పోగొట్టుకొని సర్వనాశనం అవుతారనీ, వారి వంశం కూడా నిలువదనీ, శివాజీ అభిప్రాయము. పతివ్రతలు భారతదేశపు భాగ్య కల్పలతలని శివాజీ, నమ్మకము.

అందుకే శివాజీ తన సర్దారు తొందరపడి తప్పు చేశాడనీ, ఆ దోషానికి బాధపడవద్దనీ, తన తప్పును క్షమించమనీ యవనకాంతను కోరాడు. ఆమెను తన తల్లిగా, చెల్లెలుగా భావించి, తన చేతులపై ఆమెను నడిపిస్తాననీ, ఓర్పు చూపించి, తనను సహించి క్షమించమనీ శివాజీ ఆమెను కోరాడు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
సమాజంలో స్త్రీలను ఎలా గౌరవించాలి?
జవాబు:
సమాజంలో స్త్రీలను తన కన్న తల్లులుగా, తన సోదరీమణులయిన అక్కాచెల్లెండ్రుగా గౌరవించాలి. స్త్రీలను కామ ప్రవృత్తితో చూడకూడదు. తన ఇంటిలో తన తల్లినీ, చెల్లినీ, అక్కనూ ఎలా ప్రేమాదరములతో చూస్తారో, అలాగే పరస్త్రీలను కూడా గౌరవంగా చూడాలి.

ముఖ్యంగా మనతో చదువుకొనే తోడి బాలికలను, మన స్వంత సోదరీమణులుగా చూడాలి. వారికి ఏ విధమైన కీడు . చేయరాదు. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని చూసి సహించరాదు. మన శక్తికొద్దీ స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించి, పోరాడాలి. అవసరం అయితే పోలీసులకు తెలియజేయాలి.

స్త్రీలు అందరూ మనకు తల్లులవంటివారు. స్త్రీలు, పుట్టింటికీ, అత్తింటికీ గౌరవాన్ని తీసుకువస్తారు. స్త్రీ, ఒక వ్యక్తికి భార్యగా, ఇంకొకరికి కన్నబిడ్డగా, మరొకరికి కన్నతల్లిగా ఉండి, సమాజానికి ఎంతో సేవ చేస్తోంది. స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. వారు అనల జ్యోతుల వంటివారు. స్త్రీల పట్ల పాపం చేస్తే, వారి వంశమూ, సంపదలూ నశిస్తాయి. కాబట్టి స్త్రీలను దేవతామూర్తులవలె, మాతృమూర్తులవలె గౌరవించాలి.

ప్రశ్న 8.
నిజ జీవితంలో స్త్రీలను ఎప్పుడు ఎలా గౌరవించాలో వివరించుము.
జవాబు:
స్త్రీలు భారతదేశపు భాగ్య కల్పలతలు. స్త్రీలలో చిన్న పిల్లలను మనం ప్రేమగా చూడాలి. బాలికలను మనం కన్నబిడ్డల వలె ఆదరించాలి. తోడి బాలికలను మన స్వంత అక్కాచెల్లెళ్ళ వలె ప్రేమతో ఆదరంగా చూడాలి. మనకంటే పెద్దవారైన ఆడవారిని, మన కన్నతల్లులుగా చూసి గౌరవించాలి..

సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న స్త్రీలను దేవతా మూర్తులుగా గౌరవించాలి. ప్రహ్లాదుడు పరస్త్రీలను మాతృమూర్తులుగా భావించి గౌరవించేవాడు. స్త్రీలు ఆపదలో ఉంటే, మన శక్తియుక్తులను అన్నింటినీ ధారపోసి, వారికి మనం సహాయం చెయ్యాలి. మన బడిలో మనతో చదువుకొనే బాలికలను, మన చెల్లెళ్ళవలె వాత్సల్య భావంతో చూడాలి. వారికి కావలసిన సహాయం చేయాలి. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు. స్త్రీలు శక్తి స్వరూపిణులు. స్త్రీల పట్ల సర్వకాల సర్వావస్థలలోనూ గౌరవమూ, ప్రేమ, వాత్సల్యమూ, ఆదరమూ కలిగి ఉండాలి. స్త్రీలను గౌరవిస్తే సకల సంపదలను లక్ష్మీదేవి ఇస్తుంది. అన్ని విద్యలను సరస్వతి ఇస్తుంది.

10th Class Telugu 1st Lesson మాతృభావన Important Questions and Answers

ప్రశ్న 1.
స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో, మన బాధ్యతలు ఏమిటో, వివరిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

రాజమహేంద్రవరం,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీ లేఖ అందింది. సమాజంలోని స్త్రీల పట్ల మనం ఎలా నడచుకోవాలో ఈ లేఖలో నీకు రాస్తున్నా.

స్త్రీలు దేశ సౌభాగ్యానికి కల్పలతల వంటివారు. స్త్రీలు, కన్నబిడ్డలు, కన్నతల్లులుగా, సోదరీమణులుగా మనకు ప్రేమాదరములను పంచిపెడుతున్నారు. నేడు సంఘంలో స్త్రీల పట్ల అపచారాలు పెరుగుతున్నాయి. స్త్రీలపట్ల అపచారం చేసేవారిని నిర్భయ చట్టంతో శిక్షించాలి.

మనము తోటి స్త్రీలను మన అక్కాచెల్లెళ్ళుగా చూడాలి. మన తోటి చిన్నవారైన బాలికలను ప్రేమగా లాలనగా చూడాలి. పెద్దవారైన స్త్రీలను మన తల్లులవలె చూసి వారిని గౌరవించాలి. స్త్రీలను గౌరవిద్దాం. సంఘాన్ని కాపాడుదాం.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, మునిసిపల్ హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 2.
స్త్రీలకు ధైర్యాన్ని పురికొల్పుతూ, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
సోదరీమణులారా ! ఈ రోజుల్లో మీ పై జరుగుతున్న అత్యాచారాలను చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ అరాచకాలను చూసి మీలో కొందరు పాఠశాలలు, కళాశాలలు మాని, ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. సంఘంలో స్త్రీలు కూడా పురుషులతో అన్ని విధాల సమం. దేశంలో మీరు ఇంచుమించుగా 50% మంది ఉన్నారు. మీరు నిర్భయంగా ముందుకు వచ్చి మీ స్నేహహస్తాన్ని అందించకపోతే, సంఘాభివృద్ధి కుంటుపడుతుంది.

మీరు నిర్భయంగా ముందుకు రండి. మీకు మేము తోడుగా ఉంటాం. పోలీసులు తోడుగా ఉంటారు. నిర్భయ చట్టం వచ్చింది. ఆకతాయి వారిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఫోటో కెమేరాలు వచ్చాయి. దుండగులు ఎంతటి వారైనా దొరుకుతారు. శిక్ష పడుతుంది. మీరు శక్తి స్వరూపిణులు. ధైర్యమే మీ ఆయుధం.

మేము మీకు రామదండులా తోడు ఉంటాము. నేరస్తులను పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెపుతాము. మేము అంతా మీ అన్నదమ్ముల్లా మీకు సాయం చేస్తాము. నిర్భయంగా మీరు సంఘంలో తిరిగి హాయిగా మీ చదువులు సాగించండి. దేశాభివృద్ధికి మీ చేయూత నివ్వండి. రండి. సాహసించండి.

ఇట్లు,
గాంధీ ‘యువజన సంఘం,
కాకినాడ.

ప్రశ్న 3.
స్త్రీల వలన సమాజానికి కలుగు ప్రయోజనాలను వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
స్త్రీలు, సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర వహిస్తారు. స్త్రీ, ఒక పురుషునికి భార్యగా బిడ్డలను కని, వారిని చక్కగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. ఆమె భర్తకు తోడు నీడగా ఉండి, వంటా వార్పూ చేసి, భర్తకూ, పిల్లలకూ కడుపు నింపుతుంది. బిడ్డలను కని వారికి పాలిచ్చి పెంచుతుంది. భర్తకూ, బిడ్డలకూ, తన ప్రేమామృతాన్ని పంచి పెడుతుంది. కుటుంబంలో ఒడిదుడుకులు లేకుండా దాని సమత్వాన్ని కాపాడుతుంది.

దేశంలో స్త్రీలు, పురుషులతో అన్ని విధాలా సమానులు. అంతేకాదు, పురుషుల కంటే స్త్రీలే దేశ సౌభాగ్యానికీ, కుటుంబ రక్షణకూ ఎక్కువగా తోడ్పడుతున్నారు. స్త్రీ, భర్త సంపాదించి తెచ్చిన దానిని పొదుపుచేసి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెస్తుంది. అంతేకాదు. నేటి స్త్రీలు, తాము కూడా తమ భర్తలతో పాటు సంపాదించి కుటుంబాన్ని చక్కగా పోషిస్తున్నారు. నేడు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కష్టపడుతున్నారు. స్త్రీలను పురుషులు కన్నతల్లులుగా, అక్కాచెల్లెళ్ళుగా గౌరవించాలి.

స్త్రీలు పిల్లలను కని, వారికి పాలిచ్చి పెంచి, వారికి మంచిబుద్ధులు నేర్పిస్తారు. పిల్లలకు, కన్నతల్లులే మొదటి గురువులు. స్త్రీలు విద్యావంతులయితే, దేశం పురోగతి చెందుతుంది. నేడు స్త్రీలు విద్యావంతులై డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, MLA లుగా, MP లుగా ముఖ్యమంత్రులుగా దేశ సేవ చేస్తున్నారు.

స్త్రీలు డ్వా క్రా సంఘాలలో చేరి తమ తెలివితేటలతో సంపాదిస్తున్నారు. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో స్త్రీలు చేయూత నిస్తున్నారు. స్త్రీలు ఏ దేశాభివృద్ధికైనా మూలస్తంభాల వంటివారు. స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. శక్తి స్వరూపిణులు. మహిళలు మంచి కళాకారిణులు. వారు దేనినైనా అందంగా మలచి మంచి రూపాన్ని ఇవ్వగలరు.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 4.
‘స్త్రీ గౌరవం’ అనే అంశంపై ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
స్త్రీ గౌరవం,

‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అన్నారు పెద్దలు. అంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం చేస్తారని అర్థం. కాబట్టి స్త్రీలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు. దేవతలు అంటే లక్ష్మి, సరస్వతి, గాయత్రి, శివుడు, విష్ణువు మొదలైనవారు. వారంతా కొలువై ఉంటే డబ్బుకు, చదువుకు, ఆనందానికి, ఆరోగ్యానికి లోటుండదు.

మనకు జన్మనిచ్చిన స్త్రీని తల్లిలా పూజించాలి. గౌరవించాలి. తల్లి ఆలన పాలన చూడకపోతే శ్రీ రామచంద్రుడైనా లేడు కదా! 9 నెలలు తన కడుపులో మోసి, కని, పాలిచ్చి పెంచిన తల్లిఋణం తీర్చుకోవటం మగజన్మకు సాధ్యంకాదు. కాని సమాజంలోని ప్రతి స్త్రీలోను తల్లిని దర్శించడం ద్వారా కొంత ఋణం తీరుతుంది.

‘స్త్రీలను గౌరవించాలి. వారి మనసుకు బాధ కలిగేలా ప్రవర్తించకూడదు. స్త్రీల మనసు సుకుమారమైనది. స్త్రీకి కోపం కలిగేలా ప్రవర్తిస్తే నాశనం తప్పదు. రావణుడు, దుర్యోధనుడు మొదలైనవారు అలాగే నశించారు.

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు’ అన్నారు పెద్దలు. ఎక్కడైతే స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ కరవు, కాటకాలు, దరిద్రం వస్తాయి.

అందుకే శివాజీ వంటి గొప్పవారు స్త్రీలను గౌరవించారు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు చదివిన వారెవ్వరూ స్త్రీని బాధపెట్టే సాహసం చేయరు. ఇది భారతీయతత్వం.

ఇవేవీ నమ్మని వారు కూడా గుర్తుపెట్టుకోవలసినది మన చట్టాలు. చట్ట ప్రకారం స్త్రీని బాధిస్తే చాలా కఠిన శిక్షలకు గురి అవుతారు. సమాజంలో వెలివేయబడతారు. అందుచేత స్త్రీలను గౌరవించడమంటే మనను మనం గౌరవించుకోవడం అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రశ్న 5.
స్త్రీల చైతన్యంపై 10 నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. అబలలన్నది పాతమాట – సబలలన్నది నేటిమాట
  2. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  3. స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు – స్త్రీలు పూజ్యార్హలు
  4. ఆడది చదువుకుంటే – ఆ ఇంట్లో సంస్కారం ఉంటుంది
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానిస్తే – శ్రీదేవిని కాలదన్నినట్లే
  7. చదివిస్తే స్త్రీలు – నేర్వలేని విద్యలేదు
  8. ఆడవాళ్ళను – అగ్రస్థానంలో ఉంచండి
  9. మహిళలు – మన జాతి మాణిక్యాలు
  10. వనితలన్న – నీవు ఎపుడు తల్లి చెల్లిలాగ చూడు

ప్రశ్న 6.
“మహిళల రక్షణ మన కర్తవ్యం” అనే అంశంపై కరపత్రం రాయండి.
జవాబు:
(“మహిళల రక్షణ మన కర్తవ్యం “)

సోదర సోదరీ మణులారా ! చెప్పడానికి, సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ మన మహిళలకు అవమానం నిత్యం జరుగుతూనే ఉంది. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. యాసిడ్, దాడులు, ఈవ్ టీజింగ్లు, హింసాకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

మన ఇంట్లో మన తల్లిని, అక్క చెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాము. అలాగే మన ప్రక్క మహిళలను సైతం, మనమే రక్షించుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే, లోకం సహించదు అనే విషయం దుర్మార్గులకు తెలియాలి.

మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే, మీరు సహించకండి. ఉగ్రనరసింహరూపం ఎత్తి అన్యాయాన్ని అరికట్టండి. అవసరం అనుకుంటే ప్రక్కవారి సాయం తీసుకోండి. పోలీసుల సాయం కోరండి. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

మనం అంతా ఉద్యమిస్తేనే, మన మహిళకు రక్షణ దొరుకుతుంది. మనం మహిళలను గౌరవించి, మన పవిత్ర భారతమాత ఖ్యాతిని నిలుపుకుందాం. మన మహిళలను మనమే రక్షించుకుందాం.

జైహింద్

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 7.
మానవ జీవితాన్ని గురించిన విశ్లేషణను 8, 10 పంక్తులకు తగ్గని కవిత ద్వారా తెల్పండి.
జవాబు:
(“మనిషి మాయం అయ్యాడు” (కవిత) ,

“మాయమవుతున్నాడు మనిషన్నవాడు
మానవత్వమ్ము మరి మచ్చుకైనా లేదు
నూటికో కోటికో ఒక్కడున్నాడేమో
కంటికీ కనరాని కమలాక్షుడతడు” ||మాయ ||

“నిలువెత్తు స్వార్థమ్ము నిజాయితీ శూన్యమ్ము
అన్నదమ్ముల బంధ మావిరయ్యిందమ్మ
ఇరుగు పొరుగుల మైత్రి ఇగిరిపోయిందమ్మ
అవినీతి బంధాలు అతికించుకున్నాడు.
రూపాయి చుట్టునా ప్రదక్షిణం చేస్తాడు” ||మాయ ||

“చీమలకు పాములకు పంచదారా పాలు
తోడబుట్టిన వార్కి గంజైన పోయడు
మతము పేరున లోకహితము గుర్తుకు రాదు
ముసలి తల్లీతండ్రి విషము అయిపోతారు.
పెళ్ళాము బెల్లమ్ము అత్తమామలు ముద్దు
చెల్లితల్లీ లేదు చెడునడత వనీతన్న
మాయమయి పోయాడు మనిషన్నవాడు” ||మాయ ||

ప్రశ్న 8.
శివాజీకి, సోన్ దేవుడికి మధ్య జరిగిన సంభాషణను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
శివాజీ : సోన్ దేవా ! ఏంటీ ! రాణివాసాన్ని బంధించి తెచ్చావా? హిందువు అన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? నా ఆజ్ఞ నీకు గుర్తులేదా? అర్థం కాలేదా? చావాలని అనుకుంటున్నావా? నీ గర్వాన్ని ఎంతమాత్రం
సహించను. తక్షణం వెళ్ళి వారి బంధాలు విడిపించి తీసుకురా! వెళ్ళు.

సోన్ దేవుడు : చిత్తం మహారాజా !

శివాజీ : వెంటనే వెళ్ళు

సోన్ దేవుడు : (అంతఃపుర కాంతను తీసుకువచ్చి) అయ్యా (ప్రభూ!) నన్ను క్షమించండి. విజయోత్సాహంతో నా కళ్ళు మూసుకుపోయాయి. చెడ్డ చేయాలనే ఆలోచన నాకులేదు. మీ ఆజ్ఞ అతిక్రమించాలనే సాహసం లేదు. మీ పాదాలపై ఒట్టు.

శివాజీ : సోన్ దేవా! తప్పు చేశావు. స్త్రీలను పూజించాలి. వారిని అవమానించకూడదు. నా సైన్యాధిపతులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సరేలే నీ మనస్సు నేను గ్రహించాను. నీలో తప్పులేదు. ఇక ముందు జాగ్రత్త. వెళ్ళు.

ప్రశ్న 9.
స్త్రీలను దేవతలుగా భావించి పూజించాలి’ అనే మాటలను సమర్ధించండి.
జవాబు:
గడియారం వేంకటశేష శాస్త్రిగారు చెప్పినట్లు స్త్రీలు భారతావని భాగ్యకల్పలతలు. అనసూయ పాతివ్రత్యంతో త్రిమూర్తులను పురుటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడింది. సావిత్రి యమధర్మరాజుతో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. సీతాదేవి పూలరాశిలో దూకినట్లు అగ్నిగుండంలో దూకింది. సుమతి తన భర్తను బ్రతికించుకోడం కోసం సూర్యోదయాన్ని నిలిపివేసింది.

స్త్రీలు అందరూ దేవతామూర్తులే. స్త్రీలను గౌరవించిన చోటనే దేవతలు విహరిస్తారని పెద్దలంటారు. స్త్రీలు మనకు జన్మనిచ్చే మాతృమూర్తులు. మనకు పాలిచ్చి పెంచే సహనమూర్తులు. వంటవండి మనకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టే దేవతలు. ఆ దేవతల వంటి స్త్రీలపై దౌర్జన్యాలు, మానభంగాలు చేయడం మహాపాపం.

స్త్రీలను గుడిలో దేవతామూర్తుల వలె పూజించాలి. గౌరవించాలి. స్త్రీలను తల్లులుగా, సోదరీమణులుగా, మాతృమూర్తులుగా గౌరవించాలి.

మనదేశంలో అరుంధతి, అనసూయ వంటి పతివ్రతలు ఎందరో ఉన్నారు. నేటి కాలంలో కూడా ఇందిర, దుర్గాబాయి, మీరాకుమారి, మహాజన్, సరోజినీనాయుడు, మాంటిసోరీ వంటి దేవతాస్వరూపిణులు ఎందరినో మనం చూస్తున్నాం.

ప్రశ్న 10.
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారిని గౌరవించాలని తెలుపుతూ, ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:
స్త్రీలపై అత్యాచారాలను అరికట్టండి’ సోదరులారా ! మీకు ఒక విన్నపం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. పేపరు తెరిస్తే, టివి పెడితే, ఎక్కడో ఒకచోట మన కన్నతల్లులకు, మనకు పాలిచ్చి పెంచిన స్త్రీ మూర్తులకు అవమానం జరిగిందని వార్త చూస్తాం. మనం మానవులం. రాక్షసులం కాదు.

పసిపాపలపై అత్యాచారాలు, వృద్ధ స్త్రీలపై అత్యాచారాలు, తోటి విద్యార్థినులపై, పొరుగున ఉన్న ఇల్లాలిపై అత్యాచారాలు. వెంటనే అత్యాచారాలను అరికట్టండి.

దేవతలవంటి స్త్రీలపై అత్యాచారం చేయడం రాక్షసత్వం. స్త్రీలందరూ నీకు కన్నతల్లుల వంటివారు, అక్కచెల్లెళ్ళవంటి వారు. స్త్రీలను గౌరవించాలి, పూజించాలి.

నిర్భయ చట్టం వచ్చింది. జాగ్రత్త. స్త్రీలను అగౌరవపరిస్తే నడిరోడ్డుపైననే మిమ్మల్ని కాల్చి చంపుతారు. చట్టం పదును ఎక్కింది. జాగ్రత్త.

స్త్రీమూర్తులను పవిత్రభావంతో చూడండి. వారిని గౌరవించండి. వారికి సాయపడండి. అన్యాయం మీ కంట పడితే ఉగ్రనరసింహునిలా భయంకరంగా శిక్షించండి.
మీరు తోటి స్త్రీలను గౌరవిస్తే, దుర్గాదేవికి లక్ష కుంకుమపూజ చేసినట్లే. లలితాసహస్రం పారాయణ చేసినట్లే. గుర్తుంచుకోండి. స్త్రీలు భారత భాగ్య కల్పలతలు.
ఇట్లు,
x x x x.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

ప్రశ్న 11.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియ మిత్రుడు అఖిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ లేఖలో తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ రాస్తున్నాను.

స్త్రీలు భూమి మీద తిరిగే పుణ్యదేవతలు. వారికి అపచారం చేసే వారు ధ్వంసమైపోతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. వారికి ఎటువంటి అవమానం జరుగకుండా చూడాలి. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని తెలియజేస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి, యం.వి.ఆర్. హైస్కూలు,
కుప్పం, చిత్తూరు జిల్లా.

ప్రశ్న 12.
స్త్రీలను గౌరవించడాన్ని ప్రోత్సహిస్తూ పది సూక్తులు రాయండి.
జవాబు:

  1. స్త్రీలు అబలలు కాదు – సబలలు
  2. మహిళలు – మనజాతి మాణిక్యాలు
  3. స్త్రీలను గౌరవించు – శ్రీదేవిని ఇంటికి రప్పించు
  4. స్త్రీలే జాతిరత్నాలు – స్త్రీలే ఆణిముత్యాలు
  5. స్త్రీలను గౌరవిస్తే – మీ అమ్మను గౌరవించినట్లే
  6. స్త్రీలను అవమానపరిస్తే – జాతిని అవమానపరిచినట్లే
  7. స్త్రీలను గౌరవిస్తే – దేవతలు ఆనందిస్తారు
  8. వనితలేని ఇల్లు – వనంతో సమానం
  9. స్త్రీ లక్ష్మీ స్వరూపిణి – స్త్రీ పూజ్యురాలు
  10. స్త్రీని గౌరవించు – మాతృమూర్తిగా ఆదరించు

10th Class Telugu 1st Lesson మాతృభావన 1 Mark Bits

1. వారు మదోన్మాదముతో ప్రవర్తించారు – గీత గీసిన పదంలో గల సంధి ఏది? (S.A. I – 2018-19, June – 17)
A) గుణసంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) గుణసంధి

2. చిత్తశుద్ధితో జేసెడి సేవ సేవ – ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) లాటానుప్రాసం
B) యమకం
C) ఛేకానుప్రాసం
D) వృత్యానుప్రాసం
జవాబు:
A) లాటానుప్రాసం

3. ధర్మసామ్యము చేత ఉపమేయమును ఉపమానంగా ఊహించుట – ఈ లక్షణం గల అలంకారాన్ని గుర్తించండి. (June 2017)
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) శ్లేష
జవాబు:
B) ఉత్ప్రేక్ష

4. అనసూయ పతివ్రతలలో శిరోమణి – గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థం గుర్తించుము. (March 2017)
A) మంచి అవయవములు గలది.
B) చిత్రమైన వర్ణములు గల మెడ గలది.
C) నీటియందు పుట్టినది.
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.
జవాబు:
D) పతిని సేవించుటయే వ్రతముగా గలది.

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

5. పురాణ వాజ్మయమును చదివి అవగాహన చేసుకోవాలి – గీత గీసిన పదానికి సంధి పేరు గుర్తించండి. (March 2017)
A) యణాదేశ సంధి
B) వృద్ధి సంధి
C) జశ్వసంధి
D) అనునాసిక సంధి
జవాబు:
D) అనునాసిక సంధి

6. ‘స, భ, ర, న, మ, య, వ’ ఏ పద్యానికి చెందిన గణాలు? (March 2017)
A) శార్దూలం
B) మత్తేభం
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
B) మత్తేభం

7. జననికి, జన్మభూమికి గౌరవమివ్వడం ఉత్తముల లక్షణం – గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని గుర్తించుము. (March 2018)
A) చెల్లి
B) తల్లి
C) నల్లి
D) వల్లి
జవాబు:
B) తల్లి

8. రాజులు యుద్ధములందు ఏనుగులను ఎక్కువగా ఉపయోగించేవారు – గీత గీసిన పదానికి వికృతి రూపం గుర్తించండి. (March 2018)
A) ఏడు
B) రోజు
C) టేడు
D) రాట్టు
జవాబు:
C) టేడు

9. వాన బాగా పడేసరికి ఇల్లు తడిసిన వస్త్రములతో నిండింది – గీత గీసిన పదాలకు నానార్థపదమును గుర్తించుము. (S.A. I – 2018-19, June – ’18)
A) వాసం
B) మోసం
C) సహవాసం
D) వేషం
జవాబు:
A) వాసం

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

10. ఆ యేమీ యొక రాణివాసమును …….. అనే పద్యపాదంలో గీత గీసిన పదం ఏ గణమో గుర్తించండి. (June 2018)
A) మ గణం
B) త గణం
C) భ గణం
D) న గణం
జవాబు:
A) మ గణం

11. జాతి, గుణ, క్రియాదులను ఉన్నది ఉన్నట్లు వర్ణించినచో అది ఏ అలంకారమో గుర్తించండి. (S.A. I – 2018-19)
A) సమాసోక్తి
B) స్వభావోక్తి
C) శ్లేష
D) రూపకము
జవాబు:
B) స్వభావోక్తి

12. ఎప్పుడూ అమ్మను కష్టపెట్టకూడదు. (ప్రకృతి గుర్తించండి) (S.A. I – 2018-19)
A) అంభ
B) అంబ
C) అమ్మమ్మ
D) అమ్మవారు
జవాబు:
B) అంబ

13. “అనల జ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైడా యంభూ” ఏ పద్యపాదమో గుర్తించండి. (S.I. I – 2018-19)
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

14. చంపకమాల పద్యపాదంలో యతి స్థానం (S.A. I – 2018-19)
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
B) 11

15. మాతా ! తప్పు సైరింపుమీ – ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి. (June 2018)
A) తల్లీ ! తప్పును సైరింపకుము.
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !
C) తల్లీ ! ఈ దోషమును సైరింపుము.
D) తల్లీ ! అందరి దోషంబులు సైరింపుము.
జవాబు:
B) తల్లీ ! తప్పును క్షమించుమమ్మా !

AP SSC 10th Class Telugu Important Questions Chapter 1 మాతృభావన

16. వనితా రత్నంబులీ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (March 2018)
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.
B) స్త్రీలు ఈ హిందూ భూమిపై సంచరించే పుణ్యదేవతలు కారు.
C) స్త్రీ రత్నాలు హైందవ భూమిపై తిరిగే జంగమదేవతలా?
D) హిందూ భూమిపై తిరిగే స్త్రీలు పుణ్యదేవతలు కావచ్చును.
జవాబు:
A) స్త్రీ రత్నాలు ఈ గొప్ప హైందవ భూమిపై తిరిగే పుణ్యదేవతలు.

17. శివాజీ యవనదేశ స్త్రీని తల్లిగా భావించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (March 2011)
A) శివాజీ యవన స్త్రీని తల్లిగా భావించలేదు.
B) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడలేదు.
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.
D) యవన దేశ స్త్రీ శివాజీ తల్లిగా భావించబడింది.
జవాబు:
C) శివాజీచే యవన దేశ స్త్రీ తల్లిగా భావించబడింది.

18. మా యాజ్ఞన్ గమనింపవో? (ఆధునిక వచన వాక్యాన్ని గుర్తించండి) (S.I. I – 2018-19)
A) మా ఆజ్ఞని గమనింపవా?
B) మా యాజ్ఞ గమనింపవే?
C) మా యాజ్ఞను గమనింపుమా !
D) మా యాజ్ఞ గమనింపుడు !
జవాబు:
A) మా ఆజ్ఞని గమనింపవా?

19. క్రింది వానిలో ‘శత్రర్థకం’ గుర్తించండి.
A) విని
B) వినగలడు
C) వింటూ
D) వినక
జవాబు:
C) వింటూ

AP SSC 10th Class Telugu Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 10th Class Telugu Important Questions and Answers are part of AP SSC 10th Class Textbook Solutions.

Students can also read AP SSC 10th Class Telugu Solutions for board exams.

AP State Board Syllabus 10th Class Telugu Important Questions and Answers

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.

1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు.” ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.

2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె, ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు.”

గురులఘువుల గుర్తులు

లఘువు అని తెలుపడానికి గుర్తు : I ‘ల’
గురువు అని తెలుపడానికి గుర్తు : U ‘గ’

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

గురులఘువుల నిర్ణయం

ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధానము.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 1

బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 2

గమనిక : గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు

1) ఋ కారంతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు. ‘ఋ’ అనేది అచ్చు. అందువల్ల అది లఘువు. దానికి ముందు అక్షరం కూడా లఘువే.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 3

2) సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే, అది గురువు అవుతుంది. లేకపోతే లఘువు అవుతుంది.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 4

3) ఏకపదంలోనూ, సమాసంలోనూ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది. కాబట్టి అది గురువు అవుతుంది.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 5

గణ విభజన

1) ఒకే అక్షరం గణాలు : ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 6

2) రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 7

అభ్యాసము : రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 8

మూడక్షరాల గణాలు

మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 9
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 10

అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గము :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 11

య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.

ఉదా : మీకు ‘య’ గణం యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 12

ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 13

అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణం = యమాతా = I U U = ఆది లఘువు
2) మ గణం = మాతారా = U U U = సర్వ గురువు
3) త గణం= తారాజ = U U I = అంత్య లఘువు
4) ర గణం = రాజభా = U I U = మధ్య లఘువు
5) జ గణం = జభాన = I U I = భాన మధ్య గురువు
6) భ గణం = భానస = U I I = ఆది గురువు
7) న గణం = నసల = I I I = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణం) = I U (లఘువు, గురువు)

నాలుగు అక్షరాల గణాలు
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 14

సూర్య గణాలు – ఇంద్ర గణాలు
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 15

యతి – ప్రాసలు

I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ — సౌకర్యం కలుగుతుంది.

3. యతిమైత్రి :
పద్యపాదం యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.

1. ఉత్పలమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 16 AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 17

గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.

యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గానీ ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతిమైత్రి’ లేదా యతిస్థానం అంటారు.

పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – అని జే – సి) యతి.

ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.

ఉత్పలమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  4. ప్రాస నియమం ఉంటుంది.
  5. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 18

చంపకమాల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో అ – య).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. శార్దూలం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 19

శార్దూల పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ఆ – యం).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.

4. మత్తేభం:
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 1

మత్తేభ పద్య లక్షణాలు :

  1. ఇది వృత్తపద్యం.
  2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  4. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ప – పా).
  5. ప్రాస నియమం ఉంటుంది.
  6. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.

5. తేటగీతి

తేటగీతి పద్య లక్షణాలు :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
  3. ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
  4. నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
  5. ప్రాస యతి చెల్లుతుంది.
  6. ప్రాస నియమం లేదు.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 2
పై పద్యంలో 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. ఆటవెలది

ఆటవెలది పద్య లక్షణాలు :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాల చొప్పున ఉంటాయి.
4) 2, 4 పాదాల్లో ఐదూ సూర్య గణాలే ఉంటాయి.
5) ప్రతి పాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
6) ప్రాస నియమం పాటింపనవసరం లేదు.
ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు 3

7. సీసం : (ఉపజాతి పద్యాలంటే తేటగీతి, ఆటవెలది, సీసం)
సీసము పద్య లక్షణాలు :

  1. సీస పద్యంలో నాలు పెద్ద పాదాలు ఉంటాయి. ఈ పెద్ద పాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలోనూ నాలుగేసి గణాల చొప్పున, ఒక్కొక్క పెద్ద పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో మొదట ఆరు ఇంద్ర గణాలు, చివర రెండు సూర్య గణాలు ఉంటాయి.
  2. సీస పద్యపాదంలోని రెండు భాగాల్లోనూ, ప్రతి భాగంలోనూ మూడవ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. యతిలేని చోట ప్రాసయతి ఉండవచ్చు.
  3. సీస పద్యంలో నాల్గు పెద్ద పాదాల తరువాత ఒక తేటగీతి గాని, ఆటవెలది గాని చేర్చాలి.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 20

8. ద్విపద
ద్విపద పద్య లక్షణాలు:

  1. ‘ద్విపద’ పద్యంలో రెండు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదంలోనూ వరుసగా మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం ఉంటాయి.
  3. మూడవ గణం మొదటి అక్షరంతో యతి.
  4. ప్రాసయతి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం పాటింపబడుతుంది.

గమనిక :
ప్రాస నియమం లేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.
ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 21

9. కందం
కందం పద్య లక్షణాలు :

  1. ఈ ‘కందం’ పద్యములో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం ‘లఘువు’తో మొదలయితే అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం లఘువుగానే ఉండాలి. మొదటి . పాదము ‘గురువు’తో మొదలయితే, అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం గురువుగానే ఉండాలి. 3) రెండవ, నాల్గవ పాదాల్లోని చివరి అక్షరం గురువుగా ఉండాలి.
  3. 1, 2 పాదాలలో (3 + 5) 8 గణాలు; 3, 4 పాదాల్లో (3 + 5) = 8 గణాలు ఉంటాయి.
  4. 1, 2 పాదాలు, 3, 4 పాదాలు కలిసిన మొత్తం 8 గణాల్లో 6వ గణం “నలము” గాని ‘జగణం’ కాని కావాలి.
  5. బేసి గణం జగణం ఉండరాదు.
  6. ప్రాస నియమం ఉండాలి.

ఉదా :
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 22

వృత్తాలు – లక్షణాలు – సులభంగా గుర్తు పట్టడం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 23

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

పద్యపాదాలను గుర్తించి, గణ విభజన చేయడం

ఈ క్రింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో గుర్తించి, యతిని పేర్కొనండి.
1) వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక దనంబున బేర్చి దిక్కులన్
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 24
గమనిక : పై పద్యపాదంలో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్య పాదం. యతిస్థానం 10వ అక్షరం (వె – వే).

2) దెసలను కొమ్మ లొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 25
పై పద్యపాదంలో “న, జ, భ, జ, జ, జ, ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం. యతి స్థానం 11వ అక్షరం (దె – దీ)

3) ఆ యేమీ యొక రాణి వాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 26

పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది శార్దూల పద్యపాదం.. యతి స్థానము 13వ అక్షరం (ఆ – ణ్యా)

4) శివరాజంతట మేల్ము సుంగుఁదెరలో స్నిగ్దాంబుద చ్చాయలో
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 27

పై పద్యపాదంలో “స, భ, ర, న, మ, య, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది మత్తేభ పద్యపాదం. యతి స్థానం 14వ అక్షరం (శి – స్ని).

ఛందస్సుపై ప్రశ్నలు

1) ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు, ఏ పద్యానికి చెందినవి ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
A) ఉత్పలమాల

2) ‘న జ భ జ జ జ ర’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3) ‘మసజసతతగ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
D) శార్దూలం

4) ‘సభరనమయవ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) మత్తేభము
C) శార్దూలము
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభము

5) 14వ అక్షరంతో యతి గల పద్యము
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము

6) ఉత్పలమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 11వ అక్షరం
B) 10వ అక్షరం
C) 13వ అక్షరం
D) 14వ అక్షరం
జవాబు:
B) 10వ అక్షరం

7) చంపకమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 10వ అక్షరం
B) 13వ అక్షరం
C) 14వ అక్షరం
D) 11వ అక్షరం
జవాబు:
D) 11వ అక్షరం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8) 13వ అక్షరంతో యతి గల పద్యం ఇది
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
A) శార్దూలము

9) ‘అతడు’ – ఇది ఏ గణమో గర్తించండి?
A)త గణం
B) ర గణం
C) భ గణం
D) య గణం
జవాబు:
C) భ గణం

10) ‘మీయయ్య’ – ఇది ఏ గణమో గుర్తించండి?
A) ర గణం
B) త గణం
C) న గణం
D) మ గణం
జవాబు:
B) త గణం

11) ‘శ్రీరామా’ అనే పదం ఈ గణానికి చెందింది.
A) మ గణం
B) న గణం
C) ర గణం
D) స గణం
జవాబు:
A) మ గణం

12) ‘సీస పద్యం ‘ మీద చేరే పద్యాలలో ఇది ఒకటి
A) కందము
B) తేటగీతి
C) ఉత్పలమాల
D) ద్విపద
జవాబు:
B) తేటగీతి

13) ‘తేటగీతి’ పద్యంలో యతి ఏది?
A) 3వ గణాద్యక్షరం
B) రెండవ గణాద్యక్షరం
C) నాల్గవ గణాద్యక్షరం
D) ఐదవ గణాద్యక్షరం
జవాబు:
C) నాల్గవ గణాద్యక్షరం

AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు

14) పద్యంలో ప్రాసాక్షరము ఏది?
A) 4
B) 2
C) 3
D) 1
జవాబు:
B) 2

15) ‘యతి’ అంటే ఎన్నవ అక్షరము?
A) మూడవ
B) రెండవ
C) ఒకటవ
D) నాల్గువ
జవాబు:
C) ఒకటవ

16) ‘ఆటవెలది’ పద్యానికి గల పాదాలు
A) 2
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4

17) “అనయము దోషమే పరులయందు కనుంగొనునట్టియా’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 28
ఇది చంపకమాల పద్యపాదము.

18 ‘పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 29
ఇది ఉత్పలమాల పద్యపాదము.

19) సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమన్’ – ఈ పాదానికి గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి. పేర్కొనండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు 30
ఇది చంపకమాల పద్యపాదము.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు : –
అ) శబ్దాలంకారాలు
ఆ) అర్థాలంకారాలు

అ) “శబ్దాలంకారాలు” :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి “శబ్దాలంకారాలు.”
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడకున్నది గో
గోడ పక్కని నీ
నీడలో కోడె దూ
దూడ వేసింది పే

పై కవితలో ప్రతివాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది) ఇది ఆ కవితకు అందం తెచ్చింది. వినడానికి సొంపుగా తయారయ్యింది. ఈ అందం, వినసొంపు ‘డ’ అనే శబ్దం మళ్ళీ మళ్ళీ ప్రయోగించడం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని “శబ్దాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

1) అంత్యానుప్రాసాలంకారం :
ఒకే అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు, వాక్యం చివర మాటి మాటికి వస్తే దాన్ని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.
ఉదా :
1) భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ

గమనిక :
పై కవితలో ప్రతివాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ ‘కవితలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.
2) గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము

పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం ప్రతి పాదం చివరా వచ్చింది. కాబట్టి దీనిలో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

అంత్యానుప్రాసాలంకారం : (లక్షణం) :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

కింది గేయాలు గమనించండి :
1) వేదశాఖలు వెలసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట

గమనిక :
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర, ‘ఇచ్చట’ అనీ, అలాగే రెండవ పాదం చివర కూడా ‘ఇచ్చట’ అనీ ఉంది. కాబట్టి “అంత్యానుప్రాసాలంకారం” దీనిలో ఉంది.
2) తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం

పై మూడు పాదాల్లోనూ చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి దీనిలో కూడా ‘అంత్యానుప్రాసాలంకారం’ ఉంది.

2) వృత్త్యనుప్రాసాలంకారం :
అక్షరం అనేకసార్లు తిరిగి రావడాన్ని ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. ‘వృత్తి’ అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం.
ఉదా :
నాయనా ! నేను నిన్నే మన్నా అన్నానా ? నీవు నన్నే మన్నా అన్నావా ?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం, అనేకమార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :

  1. కా కి కో కికా దు దా !
  2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది.

వృత్త్యనుప్రాసాలంకారం (లక్షణం) :
మొదటి వాక్యంలో ‘క’, రెండో వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”.

ఈ కింది వాక్యాలు చూడండి.

  1. ఆమె కడవతో వడి వడి అడుగులతో గడపను దాటింది.
  2. చిట పట చినుకులు టపటపమని పడుతున్నవేళ

గమనిక :
మొదటివాక్యంలో ‘డ’ అనే హల్లు, రెండవ వాక్యంలో ‘ఓ’ అనే హల్లు చాలాసార్లు వచ్చాయి.

ఈ క్రింది ఉదాహరణలు కూడా చూడండి.
అ) బాబు జిలేబి పట్టుకొని డాబా పైకి ఎక్కాడు.
ఆ) గట్టు మీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు.
ఇ) లక్ష భక్ష్యాలు తినేవాడికి, ఒక భక్ష్యం లక్ష్యమా.

లక్షణం :
ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే, దాన్ని ‘వృత్త్యనుప్రాస అలంకారం’ అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. ఛేకానుప్రాసాలంకారం : కింది వాక్యం చదవండి.
ఉదా :
“నీకు వంద వందనాలు”.

పై వాక్యంలో వంద అనే హల్లుల జంట, వెంట వెంటనే అర్థ భేదంతో వచ్చింది. ఇక్కడ మొదట వచ్చిన ‘వంద’ – నూరుసంఖ్యను తెలుపుతుంది. రెండోసారి వచ్చిన ‘వంద’, వందనాలు అంటే నమస్కారాలు అని తెలుపుతోంది.

ఛేకానుప్రాస (లక్షణం) :
హల్లుల జంట అర్థ భేదంతో వెంట వెంటనే వస్తే, దానిని ‘ఛేకానుప్రాస’ అలంకారం అంటారు.

ఛేకానుప్రాసకు మరికొన్ని ఉదాహరణలు :
1) పాప సంహరుడు హరుడు
2) మహా మహీభారము

4. ముక్తపదగ్రస్త అలంకారం : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒక పద్యపాదం గాని, వాక్యం కాని ఏ పదముతో పూర్తి అవుతుందో, అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.
ఉదా :
జనకుడుండెడి యనుష్ఠాన వేదిక జూచు
చూచి క్రమ్మర బోయి జూడవచ్చు

గమనిక :
మొదటి పాదం చివర ‘చూచు’ అనే పదం ఉంది. రెండవ పాదం ‘చూచి’ అని ‘చూచు’తో మొదలయ్యింది. కాబట్టి ఇది ‘ముక్తపదగ్రస్త అలంకారం.
అ) ఉదా :
అది గదిగో మేడ
మేడ పక్కన నీడ
నీడలో ఉన్నది దూడ
దూడ వేసింది పేడ

గమనిక :

  1. మొదటి పాదం చివర ఉన్నది ‘మేడ’ అనే పదం. రెండవ పాదం మొదట తిరిగి ‘మేడ’ అనే అదే పదం వచ్చింది.
  2. అలాగే రెండవ పాదం చివర ‘నీడ’ అనే పదం ఉంది. మూడవ పాదం మొదటలో తిరిగి ‘నీడ’ అనే పదం వచ్చింది.
  3. మూడవ పాదం చివర ‘దూడ’ అనే పదం వచ్చింది. నాల్గవ పాదం మొదట్లో తిరిగి ‘దూడ’ అనే పదమే వచ్చింది.

వివరణ :
పాదం చివర విడిచిన పదం తిరిగి తరువాత పాదం మొదట్లో రావడం జరిగింది. కాబట్టి. ఇది “ముక్తపదగ్రస్త అలంకారం.”

అభ్యాసం :
కింది ఉదాహరణలు ఏయే అలంకారాలకు చెందినవో గుర్తించండి. సమన్వయం రాయండి.

ఆ) సుదతీ నూతన మదనా
మదనా గతురంగ పూర్ణమణిమయ సదనా
సదనామయ గజరదనా!
రదనాగేంద్ర నిభకీర్తిరస నరసింహా!

సమన్వయం :
పై పద్యంలో “ముక్తపదగ్రస్తం” అనే అలంకారం ఉంది.

ముక్తపదగ్రస్తాలంకారం (లక్షణం) :
ఒక పద్యపాదం గాని, వాక్యంకాని ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం / వాక్యం మొదలవుతుంది. దీన్ని “ముక్తపదగ్రస్త అలంకారం” అంటారు.

గమనిక : పై పద్యంలో

  1. మొదటి పాదం చివర ‘మదనా’ అని ఉంది. రెండవ పాదం మొదట్లో తిరిగి ‘మదనా’ అని మొదలయ్యింది.
  2. రెండవ పాదం చివర ‘సదనా’ అని ఉంది. మూడవ పాదం మొదట్లో ‘సదనా’ అని మొదలయ్యింది.
  3. మూడవ పాదం చివర ‘రదనా’ అని ఉంది. నాల్గవ పాదం తిరిగి ‘రదనా’ తో మొదలయ్యింది. ఈ విధంగా పాదం చివర ఉన్న శబ్దంతోనే, తిరిగి తరువాతి పాదం మొదలవుతోంది. కాబట్టి ఇది “ముక్తపదగ్రస్త అలంకారం”.

5. యమకం : ఇది శబ్దాలంకారం.
లక్షణం : ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని ‘యమకాలంకారం’ అంటారు.
ఉదా :
మన సైనిక కాయము కాయము మరచి పోరాడుతున్నది.

గమనిక :
పై ఉదాహరణలో ‘కాయము’ అనే పదం, రెండుసార్లు వచ్చింది. ‘కాయము’ అనే శబ్దం ఇక్కడ అర్థభేదంతో ప్రయోగింపబడింది.

మొదటి ‘కాయము’ అనేది ‘నికాయము’ = బృందము అనే పదంలోని భాగం. రెండవ ‘కాయము’ అనగా ‘శరీరం’ అని అర్థం.

సమన్వయం :
ఇక్కడ ‘కాయము’ అనే శబ్దం అర్థభేదంతో తిరిగి ప్రయోగింపబడింది. కాబట్టి ఇది “యమకం” అనే శబ్దాలంకారం.

అభ్యాసం :
ఈ కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించి సమన్వయించండి.

ఆ) ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది.
సమన్వయం :
‘తోరణం’ అనే శబ్దం, ఈ వాక్యంలో రెండు సార్లు వచ్చింది. మొదటి ‘తోరణం’ అనే శబ్దానికి ద్వారానికి కట్టే అలంకారం అని అర్థం. రెండవ తోరణ శబ్దంలోని ‘రణం’, అంటే యుద్ధం అని అర్థం. ఈ విధంగా తోరణ శబ్దం అర్థం భేదంతో రెండుసార్లు వచ్చింది. కాబట్టి ‘యమకం’ అనే శబ్దాలంకారం పై వాక్యంలో ఉంది.

యమకం (లక్షణం) :
ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించడాన్ని “యమకాలంకారం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

6. లాటానుప్రాస : ఇది శబ్దాలంకారం.
లక్షణం :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ‘లాటానుప్రాసాలంకారం’ అంటారు.
ఉదా :

  1. హరి భజియించు చేయు హస్తములు హస్తములు
  2. దీనమానవులకు సేవ సేవ

గమనిక :
పై వాక్యాలలో హస్తములు, హస్తములు, సేవ, సేవ అని ఒకే పదం. అర్థంలో తేడా లేకున్నా, భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు.

వివరణ :

  1. ‘హస్తములు’ అనగా చేతులు, రెండవ సారి వచ్చిన ‘హస్తములు’ అనగా సార్థకమైన ‘హస్తములు’ అని అర్థం.
  2. ‘సేవ’ అనగా సేవ చేయడం . రెండవసారి వచ్చిన ‘సేవ’ అనగా ‘నిజమైన సేవ’ అని భావం.

అభ్యాసం :
ఈ కింది వాక్యంలో అలంకారాన్ని పేర్కొని సమన్వయించండి.
1) కమలాక్షునర్చించు కరములు కరములు.

సమన్వయం :
పై వాక్యంలో ‘కరములు’ అనే పదం రెండుసార్లు వచ్చింది. అర్థంలో భేదం లేదు. తాత్పర్యం మాత్రమే భేదం. కాబట్టి ఈ వాక్యంలోని శబ్దాలంకారం “లాటానుప్రాసం”.

లాటానుప్రాస అలంకారం (లక్షణం) :
ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని “లాటానుప్రాస అలంకారం” అంటారు.

అర్థాలంకారాలు :
అర్థ చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి “అర్థాలంకారాలు.”

1. ఉపమాలంకారం :

  1. ఆమె ముఖం అందంగా ఉంది.
  2. అమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉన్నది.

గమనిక :
పై వాక్యాలలోని తేడాను గమనించండి. ఆమె ముఖం చంద్రబింబంలాగా అందంగా ఉంది, అనే వాక్యం మనలను ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికిగాను అందమైన పోలికను చెప్పడాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.
ఉదా :
సోముడు భీముడివలె బలవంతుడు.

గమనిక :
ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1) సోముడు – ఉపమేయం – (అంటే ఎవరిని గురించి చెప్పుతున్నామో ఆ పదం)
2) భీముడు – ఉపమానం – (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3) బలవంతుడు – సమానధర్మం – (పోల్చడానికి వీలయిన సమాన గుణం)
4) వలె – ఉపమావాచకం – (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

ఉపమాలంకారం :
ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం.”

2. ఉత్ప్రేక్షాలంకారం :
ఉపమేయాన్ని మరొక దానిలా ఊహించి చెప్పడం, “ఉత్ప్రేక్షాలంకారం.”
ఉదా :
ఆమె ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహం ఏమో అని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం లేదా ఊహించుకోవడం కూడా అలంకారమే. ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేనిదాన్ని ఉన్నట్లుగా ఊహించి చెప్పడాన్ని ‘ఉత్ప్రేక్షాలంకారం’ అంటారు.
ఉదా :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయో అన్నట్లు ఉన్నవి.
  2. ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది.

పై వాక్యంలో 1) ఉపమేయం – ఏనుగు
2) ఉపమానం – నడకొండ (నడిచే కొండ)
అంటే ఏనుగును, నడిచే కొండలా ఊహించాము. కాబట్టి “ఉత్ప్రేక్షాలంకారం.”

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

3. రూపకాలంకారం :
ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెంటికీ అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే, ‘రూపకాలంకారం’ అంటారు.
ఉదా :
‘ఆయన మాట కఠినమైనా మనసు వెన్న’ ఇందులో
1) ‘మనస్సు’ – అనేది ఉపమేయం.
2) వెన్న – ఉపమానం (పోల్చినది)

ఉపమానమైన ‘వెన్న’ లక్షణాలను, ఉపమేయమైన ‘మనస్సు’తో భేదం లేకుండా పోల్చడం జరిగింది. అంటే వెన్నకూ, మనస్సుకూ భేదం లేదు. రెండూ ఒకటే అనే భావాన్ని ఇస్తోంది.

అభ్యాసం :
కింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి.

  1. మా అన్న చేసే వంట నలభీమపాకం
  2. కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం

గమనిక :
మొదటి వాక్యంలో అన్న చేసే వంటకూ, నలభీమపాకానికి భేదం లేనట్లు చెప్పబడింది. అలాగే రెండవ వాక్యంలో కుటుంబంలోని తండ్రికీ, హిమగిరి శిఖరానికి భేదం లేనట్లు చెప్పబడింది. కాబట్టి పై రెండు వాక్యాలలో ‘రూపకాలంకారాలు’ ఉన్నాయి.

ఈ కింది ఉదాహరణలు కూడా చూడండి.

  1. లతాలలనలు రాజు పై కుసుమాక్షతలు చల్లారు.
  2. రుద్రమ్మ చండీశ్వరీదేవి జలజలా పారించే శాత్రవుల రక్తమ్ము.
  3. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.
  4. మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు.
  5. మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.

గమనిక : పై పాదాల్లో రూపకాలంకారాలు ఉన్నాయి.

4. స్వభావోక్తి అలంకారం :
ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే దాన్ని “స్వభావోక్తి” అలంకారం అంటారు.
ఉదా :
జింకలు బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి చెంగుచెంగున గెంతుతున్నాయి.

స్వభావోక్తికి మరియొక ఉదాహరణం :
1) ఆ లేళ్లు బెదురుచూపులతో నిక్కపొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటూ ఇటూ చూస్తున్నాయి.

సమన్వయం :
ఇక్కడ లేళ్ల యొక్క సహజ గుణాన్ని ఉన్నది, ఉన్నట్లుగా, కళ్లకు కట్టినట్లుగా వర్ణించడం వల్ల ఇది స్వభావోక్తి’ అలంకారం.

5. “అతిశయోక్తి” అలంకారం.
లక్షణం :
ఉన్న విషయాన్ని, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పటాన్ని ‘అతిశయోక్తి’ అలంకారం అంటారు.
ఉదా :

  1. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవుంది.
  2. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి.
  3. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

సమన్వయం :
పై వాక్యాలలో చెల్లెలు ఎత్తును, గోపురం ఎత్తును, ఉన్న ఎత్తుకంటె ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారంతో చెప్పడం అంటారు.

భవనాలు ఎంత ఎత్తుగా ఉన్నా, ఆకాశాన్ని తాకడం అసంభవం. అంటే మామూలు విషయాన్ని అతిగా చేసి చెప్పడం పై మూడవ వాక్యంలో గమనిస్తున్నాము.

అభ్యాసం :
ఈ కింది లక్ష్యాలను పరిశీలించండి. అలంకారం గుర్తించండి.
1) కం|| “చుక్కలు తలపూవులుగా
అక్కజముగ మేను పెంచి యంబరవీధిన్
వెక్కసమై చూపట్టిన
అక్కోమలి ముదము నొందె ఆత్మస్థితికిన్”

సమన్వయం :
పై పద్యంలో ‘అతిశయోక్తి’ అనే అలంకారం ఉంది.

భావం :
నక్షత్రాలు తన తలపై ధరించే పువ్వులుగా ఉండేటట్లు ఆశ్చర్యంగా హనుమంతుడు శరీరాన్ని పెంచాడు.

ఎంత ఎత్తు పెరిగినా ఆకాశంలో నక్షత్రాలను తాకేటట్లు పెరగడం జరగదు. కాబట్టి ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

2) మా పొలంలో బంగారం పండింది.
సమన్వయం :
పై వాక్యంలో ‘అతిశయోక్తి’ అలంకారం ఉంది.

భావం :
పొలంలో బాగా పంట పండింది అని చెప్పడానికి, ‘బంగారం’ పండిందని అతిశయోక్తిగా చెప్పబడింది. కాబట్టి పై వాక్యంలో “అతిశయోక్తి” అనే అర్థాలంకారం ఉంది.

6. శ్లేషాలంకారం :

అ) 1) మిమ్ము మాధవుడు (విష్ణువు) రక్షించుగాక !
2) మిమ్ము ఉమాధవుడు (శివుడు) రక్షించుగాక !

ఆ) మానవ జీవనం సుకుమారం
అర్థం :
1)మానవ (ఆధునిక) జీవితం సుకుమారమైనది.
2) మానవ (మనిషి) జీవితం సుకుమారమైనది.

పై అర్థాలను గమనించారు కదా ! ఒకే శబ్దం, రెండు వేరు వేరు అర్థాలను ఇస్తుంది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే ‘శ్లేషాలంకారం’ అంటారు.

శ్లేషాలంకారం (లక్షణం) :
నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష..

అభ్యాసం :
కింది అలంకారాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి.
1) రాజు కువలయానందకరుడు
అర్థం :

  1. చంద్రుడు కలువలకు ఆనందాన్ని ఇస్తాడు.
  2. రాజు భూమండలానికి సంతోషాన్ని ఇస్తాడు.

ఇక్కడ నానార్థాలు వచ్చాయి కాబట్టి ఈ వాక్యంలో శ్లేషాలంకారముంది.

2) నీవేల వచ్చెదవు?
అర్థం :
1) నీవు ఎందుకు వస్తావు?
2) నీవు ఏలడానికి వస్తావు.
ఇక్కడ నానార్థాలు వచ్చాయి. కాబట్టి శ్లేషాలంకారం ఉంది.

అలంకారములపై ప్రశ్నలు

1) ‘కుముదినీ రాగ రసబద్ద గుళిక యనగ చంద్రుడు దయించె’ ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకము
D) స్వభావోక్తి
జవాబు:
B) ఉత్ప్రేక్ష

2) “అనుచున్ జేవురు మీఱు కన్నుగవతో, నాస్పందదోష్ణంబుతో, ఘనహుంకారముతో, నటద్ర్భుకుటితో గర్జిల్లు నా ఫోన్ సలేశుని” ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్తి
D) వృత్త్యనుప్రాస
జవాబు:
C) స్వభావోక్తి

3) ‘నగారా మోగిందా, నయాగరా దుమికిందా’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) అంత్యానుప్రాస
B) వృత్త్యనుప్రాస
C) ఛేకానుప్రాస
D) యమకము
జవాబు:
A) అంత్యానుప్రాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

4) ‘హరిభజియించు హస్తములు హస్తములు’ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి.
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) లాటానుప్రాస
D) ముక్తపదగ్రస్తము
జవాబు:
C) లాటానుప్రాస

5) ‘ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది’ ఈ వాక్యంలో గల అలంకారం గుర్తించండి. (B)
A) శ్లేష
B) యమకము
C) ఛేకానుప్రాస
D) ఉపమ
జవాబు:
B) యమకము

6) ‘మా పొలంలో బంగారం పండింది’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి.
A) స్వభావోక్తి
B) ఉపమ.
C) అతిశయోక్తి
D) రూపకము
జవాబు:
C) అతిశయోక్తి

7) ‘హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదుకదా’ ఈ వాక్యాలలో అలంకారం గుర్తించండి.
A) అర్ధాంతరన్యాస
B) ఉపమ
C) స్వభావోక్తి
D) యమకము
జవాబు:
A) అర్ధాంతరన్యాస

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

8) ‘నీ కరుణాకటాక్షవీక్షణములకై నిరీక్షించుచున్నారము’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాస’ అలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరము పలుమార్లు ఆ వృత్తియగుట వృత్త్యనుప్రాస.

9) “లేమా! దనుజుల గెలువగ లేమా?” ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : లక్షణం : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకము.

10) ‘దేవాలయ గోపురాలు ఆకాశాని కంటుతున్నాయి. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అతిశయోక్తి : విషయాన్ని ఉన్నదానికంటె ఎక్కువ చేసి చెప్పడం.

11) ‘మానవా? నీ ప్రయత్నం మానవా?’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
యమకము : ఒకే పదం, అర్థభేదంతో ప్రయోగించడం యమకం.

12) ‘మిమ్ము మాధవుడు రక్షించుగాక!’ ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
శ్లేష : నానార్ధములను కలిగి ఉండే అలంకారం శ్లేష.

13) “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యము కానిది లోకమున లేదు కదా” ఈ వాక్యాలలో గల అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అర్ధాంతర న్యాసాలంకారము : సామాన్యమును విశేషముచే కాని, విశేషమును సామాన్యముచే కాని సమరించుట.

14) ‘వాడు తాటిచెట్టంత పొడవున్నాడు’ ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అతిశయోక్తి అలంకారం.
లక్షణం : విషయాన్ని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం.

15) అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు నీట నిట్టలముగ నిట్టవొడిచె – అలంకారాన్ని గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : రూపకాలంకారము.
లక్షణం : ఉపమానోపమేయములకు, భేదము లేదని చెప్పడం రూపకము.

AP SSC 10th Class Telugu Grammar Alankaralu అలంకారాలు

16) ‘అడిగెదనని కడువడి జను, నడిగినఁదను మగుడ నుడుగడని నడయుడుగున్’, ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

17) ‘మకరందబిందు బృందరసస్యందన మందరమగు మాతృభాషయే’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : వృత్త్యనుప్రాసాలంకారం.
లక్షణం : ఒకే అక్షరం, పలుమార్లు ఆవృత్తి అవడం.

18) ‘తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : ఈ పద్యంలో లాటానుప్రాసాలంకారము ఉంది.
లక్షణం : ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా, తాత్పర్య భేదంతో ప్రయోగించడం.

19) 1. ‘రాజు కవలయానందకరుడు’
2. నీవేల వచ్చెదవు- ఈ వాక్యాలలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : శ్లేషాలంకారం
లక్షణం : నానార్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేష.

20) ‘హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లోకమున లేదుకదా’ – ఈ వాక్యంలో అలంకారం గుర్తించి, లక్షణం రాయండి.
జవాబు:
అలంకారము : అర్థాంతరన్యాసాలంకారం.
లక్షణం : విశేష విషయాన్ని సామాన్యంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించడం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 1.
ఒక ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మీ పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొనడానికి వస్తున్నారు. వారిని మీరు ఏమి ప్రశ్నించుతున్నారో ఆ ప్రశ్నల జాబితా వ్రాయండి.
జవాబు:

  1. స్త్రీ వాదము యొక్క ప్రాముఖ్యం ఏమిటి?
  2. స్త్రీలకు నేడు నిజంగానే స్వాతంత్ర్యం లేదా?
  3. స్త్రీలు నేడు సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలేమిటి?
  4. స్త్రీలకు పార్లమెంటులో రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉందా?
  5. ‘స్త్రీలను స్త్రీలే కించపరుస్తున్నారు’ అంటే మీరు అంగీకరిస్తారా?
  6. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వస్తే స్త్రీల సమస్యలు పోతాయా?
  7. స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీల వేషభాషలు కారణమా?
  8. పురుషులు వంటగరిట చేతబడితే సమస్య పరిష్కారం అవుతుందా?
  9. స్త్రీలకు ఎటువంటి స్వాతంత్ర్యం కావాలి?
  10. స్త్రీలను భారతీయులు అనాదికాలం నుండి గౌరవిస్తున్నారని మీరు అంగీకరిస్తారా?

ప్రశ్న 2.
అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమలను నివారించాలని తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి.
జవాబు:

దోమలపై దండయాత్ర
యువతీ యువకులారా ! ఆలోచించండి !

ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. దోమలను నివారిద్దాం. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. మురుగునీరు దోమలకు నిలయం. మురుగునీరు నిలవ ఉండకుండా చూద్దాం. నీటిలో కుళ్లిన ఆకులు, చెత్తా చెదారం వలన దోమలు వృద్ధి అవుతాయి. రోగాలు వ్యాపిస్తాయి. క్యూలెక్స్ జాతికి చెందిన ఆడదోమ వలన ఫైలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వలన మలేరియా వ్యాపిస్తుంది. డెంగ్యూ కూడా దోమల వలన వస్తుంది. అందుచేత దోమల నివారణకు నడుం బిగిద్దాం – రండి – తరలిరండి.

ఇట్లు,
ఆరోగ్య శాఖ

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 3.
స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలను గూర్చి వివరిస్తూ “కరపత్రం” తయారు యండి.
జవాబు:

మహిళాభ్యుదయం – కర్తవ్యం

సోదరులారా ! ఒక్కమాట ! –
మన సమాజంలో అనాది నుండి మహిళలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలను దేవతలగా భావిస్తాం. కాని రోజులు మారాయి. మనుషుల మనసులు మారాయి. పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు తగిన గుర్తింపు దొరకడం లేదు. అన్ని విధాలుగా వారిని అణగదొక్కడానికి పురుషులు ప్రయత్నిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం స్త్రీల అభ్యున్నతికి కృషి చేయాలి. వాని కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి అవి :

  • స్త్రీలను అక్షరాస్యులుగా చేయాలి.
  • ఉద్యోగాల్లోను, రాజకీయ పదవుల్లోను తగిన రిజర్వేషన్ కల్పించాలి.
  • వృత్తి విద్యల శిక్షణను అందించాలి. సాంకేతిక విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలి.
  • స్త్రీలను చులకనగా చూడటం మానుకోవాలి.

ఇట్లు,
మహిళా రక్షణ సమితి,
కర్నూలు.

ప్రశ్న 4.
మరుగుదొడ్లు నిర్మించి, వినియోగించాలని కోరుతూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

మరుగుదొడ్లు నిర్మిద్దాం – రోగాలు నివారిద్దాం

సోదరీసోదరీమణులారా !
మన గ్రామంలో మరుగుదొడ్ల వసతి లేక ఎంతోమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దానిపై ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు వాలతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఆ ఆహారం తినడం వల్ల మన ” ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. అవి ప్రజలను బాగా చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తుంది. కాబట్టి అందరు తమ ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరుతున్నాం. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొన్నవారమవుతాం. ‘మరుగుదొడ్లు నిర్మించుకొందాం – మంచి ఆరోగ్యంగా బ్రతుకుదాం’.
తేది : x x x x x

ఇట్లు,
ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి,
పాములపాడు.

ప్రశ్న 5.
బాలికల విద్య ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం రాయండి.
జవాబు:

బాలికల విద్య – సమాజానికి ప్రగతి

తల్లిదండ్రులారా !
బాలికలు విద్యావంతులైనచో సమాజం వివేకవంతమవుతుంది. బాలికలు విద్యావంతులైనచో ప్రయోజనం ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేదు.

ఇటీవలి కాలంలో రాజకీయ దాస్యంతోను, భావ దాస్యంతోను సంఘం మునిగి ఉంది. అందువల్ల బాలికల విద్య , చాలావరకు వెనుకబడి ఉంది.

‘ మనదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుటకు గాంధీ ‘మహాత్ముడు తన నిర్మాణ కార్యక్రమంలో మహిళాభ్యుదయం: ప్రధానంగా చేర్చారు. బాలికల విద్యకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆధునిక కాలంలో వీరేశలింగం పంతులుగారు స్త్రీ విద్యక మొట్టమొదటిగా ఒక పాఠశాలను పెట్టి కృషి చేశారు.

సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుటకై బాలికలకు ప్రత్యేకంగా ‘పాలిటెక్నిక్’ కళాశాలను ఏర్పరిచారు. కనుక స్త్రీలు గృహకృత్యాలను నిర్వహించుటలో విద్యావంతులైనచో బహుముఖ ప్రజ్ఞను వెల్లడించి దేశ సేవలోను, సంఘసేవలోను రాణించగలడు. తమ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పుటలో శ్రద్ధ వహించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దుతారు. కనుక బాలికల విద్యను ఇతోధికంగా ప్రోత్సహించినచో దేశానికి, సమాజానికి శ్రేయస్సు కల్గుతుంది.

ఇట్లు,
బాలికల విద్యా ప్రోత్సాహక సంఘము
శ్రీకాకుళం.

ప్రశ్న 6.
వందేమాతరానికి వందేళ్ళు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“వందేమాతరం” కరపత్రం

సోదర భారతీయులారా ! మనమందరం, పవిత్ర భారతమాత కన్నబిడ్డలం. మన దేశ స్వాతంత్ర్య పరిరక్షణకై మనమంతా మన ప్రాణాల్ని సైతం ధారపోయడానికి సిద్ధం కావాలి.

మన భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికై జరిగిన స్వాతంత్ర్య పోరాటానికి ‘వందేమాతరం’ గీతం శంఖారావం చేసింది. బంకించంద్ర ఛటర్జీ ఆ వందేమాతరం గీతం రాసి నేటికి నూరు సంవత్సరాలు అయ్యింది. ఆనాడు దేశమంతా ఆ గీతాన్ని అంది పుచ్చుకొని, “వందేమాతరం మందే రాజ్యం” అంటూ గొంతెత్తి నినాదం చేసింది. బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టింది.

ఆనాడు గాంధీజీ, నెహ్రూ, తిలక్, పటేలు వంటి నాయకులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్ర్యం భిక్ష పెట్టారు. ఈనాడు మనం హాయిగా వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా గొంతెత్తి పాడుకుంటున్నాము. ఆనాడు ‘వందేమాతరం’ అంటే నేరం.

మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టిన ‘వందేమాతరం గేయం యొక్క స్ఫూర్తిని కాపాడుకుందాం” మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా, పాకిస్తాన్ దేశాల పొగరును అణచివేద్దాం. మనమంతా ఒక్కొక్క సైనికునిలా ‘కదంతొక్కుదాం. దేశభక్తియే మనకు జీవం. మరువకండి. మనమంతా భరతమాత వీరపుత్రులం. వీర పుత్రికలం.

‘జైహింద్’.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 7.
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మానవాళి నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవలసిన అవసరం ఉంది. నీటిని దుర్వినియోగం చేయకుండా తీసికోవలసిన జాగ్రత్తలు, ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

నీటి పొదుపు – తీసుకోవలసిన జాగ్రత్తలు (కరపత్రం)

సోదర సోదరీమణులారా!
నేడు మన దేశంలో జనాభా పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం వల్ల, వర్షాల రాక తగ్గింది. ప్రతి నీటి బిందువును మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

అడవులు తగ్గిపోతున్నాయి. వర్షాలు బాగా తగ్గాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నదీ జలాలు సముద్రాల పాలవుతున్నాయి. మనం నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి.

వ్యవసాయదారులు బిందు సేద్యాన్ని చేయాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు కుంటలు ఏర్పాటు చేయాలి. వృథాగా కారిపోతున్న కుళాయిలను కట్టివేయాలి. నదులు, చెరువులు, కుంటలు లోని నీటిని కలుషితం చేయరాదు. వర్షపు నీటిని సైతం నేలలో ఇంకేటట్లు చేయాలి.

ఒక నీటి చుక్కను పొదుపు చేస్తే, అది మరో ప్రాణి ప్రాణాన్ని నిలుపుతుంది. అనవసరంగా నీటిని వదలి పెట్టరాదు. స్నానం చేసిన నీటిని, మొక్కలకు పోయాలి. ఆ నీటితో అంట్లు తోముకొని, శుభ్రం చేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయవద్దు. మరువకండి.

ఇట్లు,
యువజన విద్యార్థి సంఘం.

ప్రశ్న 8.
మీ పాఠశాల వార్షికోత్సవానికి ప్రముఖులు వస్తున్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని తయారు చేయండి
(లేదా )
మీ పాఠశాలను సందర్శించిన కవి/ కవయిత్రిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:
‘ప్రశ్నావళి’ – ప్రముఖులతో ఇంటర్వ్యూ : –

  1. పూజ్యులయిన మీకు వందనాలు. సుస్వాగతము.
  2. నేటి పాఠశాల విద్యపై మీ అభిప్రాయం చెప్పండి.
  3. నేటి పాఠశాల విద్యలో మీరు గమనించిన లోపాలను చెప్పండి.
  4. నేటి బాలబాలికల విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచనలు చెప్పండి.
  5. మా విద్యార్థులలో మంచి అలవాట్లు పెంపొందడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  6. నిరుద్యోగ సమస్య పై మీ అభిప్రాయాలు చెప్పండి.
  7. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను సూచించండి.
  8. మీరు నేడు గొప్ప వారయ్యారు. మీ అభివృద్ధికి కారణమైన సంఘటనలు తెల్పండి.
  9. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందడానికి, మీరిచ్చే సూచనలు తెలపండి.
  10. విద్యార్థులను ఆశీర్వదిస్తూ రెండు మాటలు చెప్పండి.

ప్రశ్న 9.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వస్తున్నారు. వారి ద్వారా శతకాల గురించి, వారి రచనల గురించి, తెలిసికోడానికి పిల్లలు ఇంటర్వూ చేయాలనుకున్నారు. మీరైతే ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ప్రశ్నావళి రూపొందించండి. ..
జవాబు:
ఇంటర్వ్యూ ప్రశ్నావళి

  1. శతక కవులకు స్వాగతం. ‘శతకాలు’ ఎన్ని రకాలు?
  2. తెలుగులో మొదటి శతకకర్త ఎవరు?
  3. శతకాల్లో ఎన్ని రకాలున్నాయి?
  4. మకుటం లేని శతకాలు ఏమైనా ఉన్నాయా?
  5. నీతి శతకాల ప్రాముఖ్యత ఏమిటి?
  6. భక్తి శతకాలు మీరు ఏమైనా రాశారా?
  7. ‘కాళహస్తీశ్వర శతకం’లో భక్తి ఎక్కువగా ఉందా? రాజదూషణ ఉందా?
  8. ‘సుమతి శతకం’ ప్రత్యేకత ఎటువంటిది?
  9. వసురాయకవి గారి భక్త చింతామణి శతకం గూర్చి చెప్పండి.
  10. మీకు నచ్చిన శతకం ఏమిటి?
  11. మీరు మాకు ఇచ్చే సందేశం ఏమిటి?
  12. ఛందోబద్దం కాని శతకాలు ఏమైనా ఉన్నాయా?

ప్రశ్న 10.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంగా మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళామణులారా! ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం, పైపైకి’ అన్న శ్రీశ్రీ మాట మరచిపోకండి. ఈనాడు మనపట్ల సంఘం ఎంతో వివక్షత చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందని తెలిస్తే, తల్లిదండ్రులు విలవిల లాడుతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు.

తండ్రి ఆస్తిలో స్త్రీలకు మగవారితో సమాన వాటాలు ఇవ్వడం లేదు. పేపరు తిరగవేస్తే, స్త్రీల మానభంగాల వార్తలు, టి.వి. పెడితే స్త్రీలకు జరిగిన అన్యాయాలు, అత్తవారింట స్త్రీల కష్టాలు, వరకట్నాల చావులు కనబడతాయి. వినబడతాయి. — పసిపిల్లల నుండి పండు ముదుసళ్ళు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు.

స్త్రీలంతా కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేసే మగవారి చెంపలు పగుల కొట్టాలి. నిర్భయంగా పోలీసు వారికి రిపోర్టు చెయ్యాలి. మీరు పొరపాటున అన్యాయానికి గురి అయితే, సిగ్గుతో చితికిపోవద్దు. ధైర్యంగా నిలవండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి. బాగా చదవండి. ఉద్యోగాలు చేయండి. మనం ఈ దురాచారాల్ని ఖండిద్దాం.

అన్యాయం జరిగిన తోటి స్త్రీలకు, మనం అండగా నిలవాలి. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని, ఆనందించే రోజు రావాలి. అందుకు మనమంతా చేయి చేయి కలిపి పోరాడుదాం. ఝాన్సీ లక్ష్మీబాయిలా, సరోజినీ దేవిలా దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలుద్దాం. ధైర్యమే మనకు శ్రీరామరక్ష.

ఇట్లు,
వనితా సంఘం.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 11.
‘మహిళల రక్షణ మన కర్తవ్యం’ అనే అంశముపై కరపత్రం రాయండి..
జవాబు:

‘మహిళల రక్షణ – మన కర్తవ్యం’

సోదర సోదరీమణులారా ! చెప్పడానికి సిగ్గువేస్తోంది. దేశంలో ఎక్కడో అక్కడ రోజూ స్త్రీలపట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపాపలపై, యువతులపై, ముసలి స్త్రీలపై సైతం అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలపై యాసిడ్ దాడులు, ఈవ్ టీజింగ్, మానభంగాలు, హింసాకృత్యాలు నిత్యం జరుగుతున్నాయి.

మన ఇంట్లో మన తల్లిని అక్కచెల్లెళ్ళను మనం కాపాడుకుంటున్నాం. అలాగే ప్రతి స్త్రీని మనం కాపాడాలి. మహిళలకులు అన్యాయం జరిగితే ఎవరూ సహించరు అనే విషయం దుండగులకు గట్టిగా తెలియపరచాలి.

మహిళలపట్ల అకృత్యం జరిగితే మీరు ఉగ్రనరసింహరూపం ధరించి దుండగులను చీల్చిచెండాడండి. పోలీసువారికి కబురు అందించండి. ప్రక్కవారి సాయం తీసుకోండి. మన సోదరీమణులను మనమే రక్షించుకుందాం.

స్త్రీలు భారతదేశ భాగ్య కల్పలతలు. ప్రతి ఒక్కడూ స్త్రీల రక్షణకు ఉద్యమిస్తే ఎవరూ వారిపట్ల దుర్మార్గానికి సిద్ధం కారు. లెండి ఉద్యమించండి. దుర్మార్గులను చీల్చి చెండాడండి. మన అక్క చెల్లెండ్రను మనమే కాపాడుకుందాం.

ఇట్లు,
యువజన సంఘం.

12. ఉపాధ్యాయులను గౌరవించాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రాన్ని సిద్ధం చేయండి.
జవాబు:

“ఆచార్య దేవో భవ”

సంఘములో మానవుల అభివృద్ధికి తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రధానపాత్ర వహిస్తారు. అందుకే మన ఉపనిషత్తులు ‘ఆచార్య దేవోభవ’ అని గురువును దైవంగా సేవించమని చెప్పాయి.

గురువులు తమకు అప్పగించిన విద్యార్థులకు ఎంతో కష్టపడి విద్యను బోధించి, వారిని విజ్ఞానవంతులుగా తీర్చి దిద్దుతారు. అందువల్ల విద్యార్థులు, వారి తల్లితండ్రులూ గురువులను గౌరవించాలి. అందుకే సర్.యస్. రాధాకృష్ణన్ గారు తన పుట్టిన రోజును, అధ్యాపక దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు. ఆనాడు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానిస్తాయి.

ఉపాధ్యాయులను ఆ రోజు ప్రతి గ్రామంలో, నగరంలో పెద్దలు సన్మానించాలి. విద్యార్థులు సైతం కృతజ్ఞతా పూర్వకంగా గురువులను అభినందించి సత్కరించాలి. పూర్వకాలంలో సైతం మహారాజులు గురువులకు ఈనాములిచ్చి పెద్ద గౌరవమిచ్చి, వారిని పోషించేవారు. మనది ప్రజా ప్రభుత్వము. అందువల్ల ప్రజలే అధ్యాపకులను “గురుభ్యోనమః” అని వారిని సత్కరించాలి.

ప్రశ్న 13.
‘మొక్కల పెంపకం’ ఆవశ్యకతను వివరిస్తూ ఒక కరపత్రం తయారు చేయండి.
జవాబు:

“వృక్షముల పెంపకం”

చెట్లు జీవన సౌభాగ్యానికి మెట్లు. నేడు నగరాలు, గ్రామాలు కూడా, పర్యావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రజలంతా రోగాలతో డాక్టర్ల వెంట తిరుగుతున్నారు. దీనికి కారణం దేశంలో పచ్చని చెట్లు తక్కువ కావడమే.

చెట్లు బొగ్గుపులుసు వాయువును పీల్చి, ప్రాణవాయువును మనకు అందిస్తాయి. పూలను, పండ్లను ఇస్తాయి. చల్లని నీడను, గాలిని ఇస్తాయి. పర్యావరణ కాలుష్యం నుండి మనలను కాపాడతాయి.

కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్కొక్క చెట్టును పాతి పెంచాలి. ప్రభుత్వము మంచి మొక్కలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వాటిని పాతించాలి. మొక్కలను పెంచి, వాటికి రక్షణ కల్పించాలి. దేశంలో సహితం అడవుల విస్తీర్ణం నేడు తగ్గిపోయింది. అందుకే మనకు వర్షాలు లేవు.

ప్రతి పంచాయితీ వారు మునిసిపాలిటీ వారు, మొక్కలను ఖాళీ ప్రదేశాల్లో పెంచాలి. మొక్కలను పెంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గిరిజనులను ప్రోత్సహించి అడవులలో మొక్కలు పెంచాలి. మనమంతా మొక్కలను పెంచుదాం. మన దేశాన్ని సస్యశ్యామలం చేద్దాం.

ఇట్లు,
నగర రక్షణ సమితి.

ప్రశ్న 14.
అనాథ బాలబాలికలను ఆదుకోవాలని ప్రబోధిస్తూ ఒక కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

“అనాథ రక్షణ”

మిత్రులారా ! దిక్కులేని వారిని మనం అనాథలు అంటున్నాము. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఈనాడు ఎన్నో కారణాల వల్ల కొంతమంది, అనాథలు అవుతున్నారు. తల్లిదండ్రులు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. భయంకర వ్యాధుల వల్ల తల్లిదండ్రులు మరణించవచ్చు.

మానవ సేవయే మాధవ సేవ. మనకు భగవంతుడే సంపదలు ఇస్తున్నాడు. మనకు ఉన్నదానిలో కొంత మొత్తం దీన జన సేవకు వినియోగిద్దాం. మన నగర ప్రజలంతా అనాథ రక్షణ సంఘంగా ఏర్పడదాం.

మనం అన్నం వండుకునే ముందు, రెండు గుప్పిళ్ళు బియ్యం వేరే పాత్రలో ఉంచుదాం. ఆ బియ్యాన్ని పోగుచేసి అనాథలకు భోజనాలు పెడదాం. వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం. డబ్బున్న వారి నుండి చందాలు వసూలు చేద్దాం. మన నగరం చైర్మెన్ గారి సాయం తీసుకుందాం. అనాథలకు చదువులు చెప్పిదాం. వారికి పుస్తకాలు, బట్టలు ఇద్దాం.

మనం అనాథలను ఆదుకుంటే, భగవంతుడు మనలను రక్షిస్తాడు. సిరిసంపదలిస్తాడు. అనాథలకు మనమంతా తల్లిదండ్రులు అవుదాం. కదలండి. ఒక మంచి పని చేద్దాం.
విజయవాడ,
x x x x x

ఇట్లు,
అనాథ పరిరక్షణ సమితి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 15.
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
జవాబు:

‘చెట్టు – నీరు పథకం’

ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు చాలాకాలంగా మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు.

ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయిపోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్రమవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొవాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

ప్రశ్న 16.
మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారిమీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మహిళలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

“ధైర్యే సాహసే లక్ష్మీ”

మహిళలారా! “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అన్న శ్రీశ్రీ మాట మనం మరచి పోకూడదు. ఈనాడు స్త్రీల విషయంలో సంఘం ఎంతో వివక్ష చూపిస్తోంది. ఆడపిల్ల గర్భాన పడిందంటేనే తల్లిదండ్రులు అతలాకుతలం అయిపోతున్నారు. కొందరు భ్రూణహత్యలకు దిగుతున్నారు. ‘స్త్రీలను గౌరవిద్దాం’ అనే బోర్డులు మాత్రమే కాని, బస్సుల్లో సహితం ఆడవాళ్ళకు సీట్లు దొరకడం లేదు.

స్త్రీలకు ఉద్యోగాల్లోనూ, చదువుకోడానికి సీట్లు ఇవ్వడంలోనూ రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదు ‘అభయ’ చట్టం వచ్చినా పసిపిల్లలు సహితం అత్యాచారాలకు గురి అవుతున్నారు.

ఆడపిల్లలందరూ కరాటే నేర్చుకోవాలి. అల్లరి చేస్తున్న మగవాడి చెంప పగులకొట్టండి. అవమానం జరిగితే నిర్భయంగా అధికారులకు రిపోర్టు ఇవ్వండి. పొరపాటున అన్యాయానికి గురయితే సిగ్గుతో చితికిపోకండి. ధైర్యంగా నిలబడండి. అన్యాయాన్ని ఎదిరించి పోరాడండి.

ఒక స్త్రీ అన్యాయానికి గురయితే, మిగిలిన ఆడవాళ్ళంతా ఆమెకు అండగా నిలవండి. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు అని తల్లిదండ్రులు ఆనందించేలా చేయండి. ఉద్యోగం సంపాదించండి. తల్లిదండ్రులకు అండగా నిలవండి. సంఘబలం కూడగట్టి, దుర్మార్గులను శిక్షించండి. ప్రభుత్వం ఆదుకోకపోతే, వనితా సంఘాల, స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోండి. ఝాన్సీలక్ష్మీబాయిలా, రాణి రుద్రమలా, సరోజినీ దేవిలా, దుర్గాబాయమ్మలా తలలెత్తి నిలవండి.

దివి. x x x x x

ఇట్లు,
గుంటూరు వనితా సంఘం.

ప్రశ్న 17.
మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణిస్తూ కరపత్రం రాయండి.
జవాబు:

మా పాఠశాల

మా పాఠశాల ఐదు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. పాఠశాల భవనంలో 12 గదులున్నాయి. గదులన్నింటిలో పంఖాలు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. పిల్లలకు కావలసిన బెంచీలున్నాయి. ప్రతి తరగతి గదిలో గోడమీద నల్లబల్లలు ఉన్నాయి. మా అధ్యాపకులకు వేరుగా ఒక గది ఉంది. అక్కడ మంచినీటి ఫిల్టరు ఉంది. దాని ప్రక్క గదిలో మా ప్రధానోపాధ్యాయులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుల గదిలో దేశనాయకుల, దేవుళ్ళ చిత్రపటాలు ఉన్నాయి.

పాఠశాల ఆఫీసు వారికి వేరే గది ఉంది. అక్కడ గుమాస్తాలు కూర్చుంటారు. పిల్లలందరికీ మంచినీటి సదుపాయం, పాయిఖానా ఏర్పాట్లు ఉన్నాయి. తూర్పు వైపున మంచి పూలతోట ఉంది. ఆ తోటలో మల్లి, మొల్ల, కనకాంబరం, చేమంతి పూలచెట్లున్నాయి. ఈ మధ్యనే గులాబీ మొక్కలు కూడా నాటారు.

ఆటస్థలంలో అన్నిరకాల కోర్టులూ ఉన్నాయి. క్రికెట్ ఆడుకొనే సదుపాయాలు ఉన్నాయి. పాఠశాలకు వేరుగా గ్రంథాలయం ఉంది. అక్కడకు రోజూ 2, 3 పత్రికలు వస్తాయి. విశ్రాంతి సమయంలో మేము అక్కడ కూర్చుని వాటిని చదువుతాము.

మా గ్రామ ప్రజలు పాఠశాల అభివృద్ధికి బాగా సాయం చేస్తారు. మేము పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాం. ఆ పాఠశాల మాకు రెండవ తల్లి వంటిది.

ప్రశ్న 18.
మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి/ జంతువు గురించి మీరు ఒక కథనాన్ని రాయండి.
జవాబు:

“ధోని” (కుక్కపిల్ల)

మా పక్క ‘ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ. ‘తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క, గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి, దాని తల్లి కుక్క, కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీథిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపైకి దూకి వాడి పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 19.
‘శాంతి’ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక కరపత్రం రాయండి. .
జవాబు:

ప్రపంచశాంతి

మిత్రులారా ! ఈ విషయాన్ని గూర్చి ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న విషయాలకోసం దెబ్బలాటలకు దిగి, తలలు బద్దలుకొట్టుకోకండి. న్యాయస్థానాలకు వెళ్ళి డబ్బు తగులబెట్టకండి. మనది గాంధీ, బుద్ధుడు, జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంతి బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి. ఇంకా ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులంతా సోదరుల వలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం మనకు మంచిదారిని చూపిస్తాయి. శాంతి మంత్రాన్ని అంతా జపిద్దాం. సరేనా?

ఇట్లు
ప్రపంచ బాలబాలికల సంఘం.

ప్రశ్న 20.
ధనము ఉన్నవాళ్ళు దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అనాథశరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, బీదలకు విరాళాలు ప్రకటించమని ధనవంతులకూ, వదాన్యులకూ ఒక కరపత్రం ద్వారా విజ్ఞప్తి చేయండి.
జవాబు:

విజ్ఞప్తి

సోదర సోదరీమణులారా ! మనం అందరం భగవంతుని బిడ్డలం. మనలో కొందరు బీదవారుగా, దిక్కులేనివారుగా ఉన్నారు. వారికి మనతోపాటు బతికే హక్కు ఉంది. మనలో డబ్బు ఉన్నవారు ఉన్నారు. మనం పుట్టినపుడు ఈ డబ్బును మన వెంట తేలేదు. రేపు చనిపోయినపుడు ఈ ధనాన్ని మనం వెంట తీసికొని పోలేము.

మనం ఎంత లక్షాధికారులమైనా బంగారాన్ని తినము. డబ్బున్నవారమని గర్వపడడమే కాని, కూడబెట్టిన దాన్ని అంతా మనం తినలేము – ఎవరికీ దానధర్మాలు చేయకుండా బ్యాంకుల్లో దాస్తే ఆదాయం పన్ను వాళ్ళు తీసుకుపోతారు.

కాబట్టి మనతోటి దరిద్రనారాయణులకూ, దిక్కులేని ముసలివారికీ తోడ్పడండి. మీ డబ్బును విరివిగా వృద్ధాశ్రమాలకు చందాలుగా ఇవ్వండి. లేదా మీరే అనాథశరణాలయాలు స్థాపించండి.

‘మానవసేవయే మాధవసేవ’ అని గుర్తించండి. తోటివారికి మనం డబ్బు ఇచ్చి తోడ్పడితే, దైవకృప మనకు తప్పక లభిస్తుంది. లోభిత్వం విడువండి. వదాన్యులై విరివిగా విరాళాలు ప్రకటించండి. భగవంతుడు నాకు మంచిబుద్ధిని ప్రసాదించాలి.

ఇట్లు,
మీ తోడి సోదరసోదరీమణులు.

ప్రశ్న 21.
వివాహాల్లో చేయవలసిన సంస్కరణల గూర్చి కరపత్రం తయారుచేయండి.
జవాబు:

వివాహాలలో చేయవలసిన సంస్కరణలు

మిత్రులారా ! ఈ రోజుల్లో పెండ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. వేలమందికి విందులు చేస్తున్నారు. కల్యాణ మండపాల అలంకరణలకు, దీపాల అమరికకు, చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. కట్నాలు, . బహుమతులు పెరిగిపోయాయి. వధూవరులను వెతకడం, జాతకాలు చూపించడం వంటి వాటికి, ఖర్చులు పెరిగిపోయాయి.

  1. పెండ్లిళ్ళు దేవుని మందిరాలలో అలంకరణల ఖర్చు లేకుండా చేయాలి.
  2. ఎవరింట వారు భోజనాలు చేసి ముహూర్తానికి గుడికి వచ్చి పెళ్ళి పూర్తి చేయాలి. విందులు ఏర్పాటు చేయరాదు.
  3. కట్నాలూ, బహుమతులూ పూర్తిగా మానివేయాలి. ఊరేగింపులు మానుకోవాలి.
  4. విలాసాలకు ఖర్చు చేయరాదు. పెళ్ళికి మంగళసూత్రం, వధూవరులు ముఖ్యం అని గుర్తించాలి.
  5. రిజిష్టర్డు వివాహాలు చేసుకుంటే మరింత కలిసి వస్తుంది. వధూవరులూ వారి తల్లిదండ్రులూ రిజిస్ట్రార్ వద్దకు చేరి, అవసరమైన ఏర్పాట్లతో పెండ్లి తంతు ముగించాలి. పెళ్ళి పేర దుర్వ్యయం చేయకండి.

ఇట్లు,
మిత్ర సమాజం.

ప్రశ్న 22.
మీ పాఠశాలలో ప్రపంచ శాంతి అనే అంశంపై మండలస్థాయి వ్యాసరచన పోటీ, నిర్వహణకు, విద్యార్థులను ఆహ్వానిస్తూ – కరపత్రం తయారుచేయండి.
జవాబు:

ప్రపంచశాంతి మిత్రులారా !

“తన సొంతమె తనకు రక్ష’ అని సుమతీశతకకారుడు చెప్పాడు. ఇది వ్యక్తులకే కాదు దేశాలకు అంటే దేశ ప్రజలకు కూడా వర్తిస్తుంది.

మనది గాంధీ, బుద్ధుడు, జవహర్ లాల్ నెహ్రూ వంటి శాంతమూర్తులు పుట్టిన దేశం. ఎందరో మహర్షులు, ప్రవక్తలు పుట్టిన దేశం. వారి శాంత బోధలు తలకు ఎక్కించుకోండి.

ప్రపంచంలో ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇంకా దేశాల మధ్య ఎన్నో చిన్న చిన్న తగవులు జరిగాయి. యుద్ధాలవల్ల ఎంతో ధనవ్యయం, ప్రాణనష్టం జరుగుతుంది. యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు అభివృద్ధి లేకుండా వెనుకబడతాయి.

కాబట్టి యుద్ధాలు వద్దు. శాంతి మనకు ముద్దు. ప్రపంచ పౌరులందరం సోదరులవలె మెలగుదాం. స్నేహం, ప్రేమ, కరుణ, వాత్సల్యం కలిగి ప్రజలందరం శాంతియుత జీవనం సాగిద్దాం. అందరం ప్రపంచ శాంతికై పాటుపడదాం.

ఇట్లు,
ప్రపంచ శాంతి మండలి.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 23.
ఆదర్శ రైతు రామయ్యను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారుచేయండి.
జవాబు:

అభినందన పత్రం

అభ్యుదయ రైతురాజు రామయ్య మహాశయా !
మీకు అభినందన మందారాలు. భారతదేశ సౌభాగ్యం పల్లెలపై ఆధారపడియుంది. పల్లెల్లో రైతులు పండించే పంటలపైనే మన వర్తక పరిశ్రమలు ఆధారపడియున్నాయి. మేం కడుపునిండా అన్నం తింటున్నామంటే అది మీ వంటి కర్షకోత్తముల హస్తవాసి అనే చెప్పాలి.

కర్షకోత్తమా !
మీరు మన ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు సూచించిన సూచనలను అందిపుచ్చుకొని, మీ పొలాల్లో ఈ సంవత్సరం ఎకరానికి 60 బస్తాల ధాన్యం పండించారు. చేల గట్లపై కంది మొక్కలు పాతి 20 బస్తాల కందులు పండించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల జోలికి పోకుండా, మీ తోటలో 10 గేదెలను పెంచి, పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, ఆ పశువుల పేడతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి వాటినే ఉపయోగించి మంచి పంటలు పండించారు. మీ కృషికి ప్రభుత్వ పక్షాన అభినందనలు అందిస్తున్నాము.

రైతురత్న రామయ్య గారూ!
నమస్కారం. ప్రభుత్వం మీకు ‘రైతురత్న’ అనే బిరుదునిచ్చి సత్కరిస్తోంది. మీరే ఈ జిల్లాలో రైతులకు ఆదర్శం. మీరు వ్యవసాయంలో మరిన్ని నూతన పద్ధతులు పాటించి, మన జిల్లాలో, రాష్ట్రంలో రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీకు మన ముఖ్యమంత్రిగారి తరపున రూ. 25,000లు బహుమతి ఇస్తున్నాము. మీకు మా శుభాకాంక్షలు. మా నమస్సులు.
అభినందనములు.

ఇట్లు,
జిల్లా వ్యవసాయాధికారి,
ఏలూరు,
ప|గో|| జిల్లా,

ప్రశ్న 24.
ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూ కరపత్రాన్ని తయారుచేయండి.
జవాబు:
తల్లిదండ్రులారా !
మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏ విధమైన ఫీజు కట్టనవసరం లేదు. పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. అక్కడ పాఠం చెప్పే ఉపాధ్యాయులు, మెరిట్ ప్రాతిపదికపై ఎన్నిక చేయబడినవారు. చక్కని అర్హతలు కలవారు. మధ్యాహ్నం మీ పిల్లలకు భోజన సదుపాయం ఉంటుంది. హాస్టలు సదుపాయం ఉంటుంది. హాస్టలులో మీ పిల్లలకు కావలసిన సదుపాయాలు ఉచితంగా సమకూరుస్తారు.

ప్రభుత్వ పాఠశాలలకు మంచి భవనాలు ఉంటాయి. ఆటలు ఆడుకొనే ఆటస్థలము, పరికరాలు ఉంటాయి. ఆటలు ఆడించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలు మంచి అనుభవజ్ఞులయిన ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నడుస్తాయి. ప్రభుత్వము అక్కడి ఉపాధ్యాయులకు చక్కని జీతాలు ఇస్తోంది. అందువల్ల ప్రభుత్వం కల్పించే సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి. అక్రమంగా ఫీజులు పిండే ప్రయివేటు కాన్వెంటులలో చేర్చకండి. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాలను మీరు పొందండి. ప్రెయివేటు పాఠశాలల్లో పై సదుపాయాలు ఏమీ ఉండవు. దయతో మేల్కోండి.. జాగ్రత్త పడండి.
దివి. x x x x x

ఇట్లు,
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం.

ప్రశ్న 25.
స్వచ్ఛభారత్ లో అందరూ పాల్గొనాలని ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

‘స్వచ్ఛభారత్’

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మన పెద్దలు ఏనాడో మనకు ఉపదేశించారు. భారతదేశ స్వచ్చతయే, దేశ సౌభాగ్యానికి మొదటిమెట్టు. స్వచ్ఛమైన ప్రదేశంలోనే లక్ష్మీదేవి నిలుస్తుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. దేశమంతా స్వచ్ఛంగా ఉంటే, దేశంలో మహాలక్ష్మి వెల్లివిరుస్తుంది. అందుకే మన దేశాన్నీ నదులనూ, పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో సుఖ సంపదలతో మనం వర్ధిల్లుదాం.

మన ప్రధాని నరేంద్రమోడీ గారు భారతదేశాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నీ ఇంటితో పాటు, నీ పరిసరాలను, నీ గ్రామాన్ని, నగరాన్ని, దేశాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకోండని మనదేశ ప్రజలకు ఆయన పిలుపును ఇచ్చారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దేశాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలము ప్రభుత్వం వల్ల కాదు. దేశంలోని 130 కోట్ల ప్రజానీకం ఇందుకు నడుం కట్టుకోవాలి. దీని కోసం . ప్రభుత్వం, ఎంతో ధన సహాయం చేస్తోంది. ఉపయోగించుకుందాం.

ముఖ్యంగా ప్రతి విద్యార్థి, విద్యార్థిని, యువకుడు, యువతి, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని, ఎక్కడా దేశంలో చెత్త లేకుండా అందంగా ఆరోగ్యవంతంగా మనదేశాన్ని తీర్చిదిద్దుకొందాం. కదలిరండి. నడుం బిగించండి. లేవండి. మనదేశం “స్వచ్ఛభారత్” అయ్యేదాకా, పట్టు విడువకండి. మరువకండి.
దివి. x x x x x

ఇట్లు,
పట్టణ విద్యార్థినీ, విద్యార్థుల సంఘం,
కర్నూలు.

ప్రశ్న 26.
‘ప్రసార మాధ్యమాలు (టి.వి., సినిమాలు) నేటి సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి’ అనే విషయం గూర్చి ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
జవాబు:
రవి : ఏరా ! ఈ రోజు సెలవు కదా ! ఏం చేద్దాం?
కృష్ణ : చక్కగా చదువుకుందాం ! ప్రాజెక్టువర్కులు పూర్తి చేద్దాం.
హరి : కాదురా ! ఈ రోజు సెలవు కదా ! మంచి సినిమాకు వెళ్లాం.
కృష్ణ : వద్దురా ! ఈనాటి సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి.
ప్రసాద్ : కనీసం టీ.వీ. నైనా చూద్దాం.
కృష్ణ : ఈనాడు టీ.వీలో వచ్చే కార్యక్రమాలు బాగుండటంలేదు.
రవి : ఎందుకలా చెప్తున్నావు? సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయి?
కృష్ణ : ఈనాడు టీ.వీ.లు గాని, సినిమాలు గాని జనానికి ఉపయోగకరంగా లేవు. టీవీల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉపదేశాత్మకంగా లేవు.
ప్రసాద్ : మరి సినిమాల సంగతేమిటి?
కృష్ణ : ఈనాడు సినిమాలు కూడా హింసను, అకృత్యాలను చూపిస్తున్నాయి.
రవి : నీవు చెప్పింది నిజమేరా ! నీవు చెప్పినట్లుగానే చక్కగా చదువుకుందాం.
ప్రసాద్ : మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి కదా ! సరే మనకు సినిమాలు వద్దు, టీ.వీ.లు వద్దు. చదువే ముద్దు.

AP SSC 10th Class Telugu కరపత్రాలు, ఇంటర్వ్యూలు

ప్రశ్న 27.
మీ చుట్టూ ఉండే పరిసరాలను వర్ణిస్తూ పది పంక్తులు మించకుండా ఒక కవిత రాయండి.
జవాబు:
మా చుట్టూ ఉండే పరిసరాలు
మా పల్లెవాసులకు ఆనంద నిలయాలు
ఎటు చూసినా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు
చెట్లపై పక్షుల కిలకిలారావాలు
కొండ కోనల్లో
నవ్వుతూ, తుళ్ళుతూ
పరుగెడుతున్న సెలయేటి గలగలలు
చెఱువులలో విరబూసిన అరవిందాలు
తలలాడిస్తూ ఆహ్వానించే పచ్చని పైరులు
జోరుజోరుగా వినిపించే
పశుకాపర్ల జానపద గీతాలు
ప్రకృతి శోభతో కళకళలాడుతుంది మా పరిసరం.

AP SSC 10th Class Telugu లేఖలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu లేఖలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 1.
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

విశాఖపట్టణం,
x x x x x.

మిత్రుడు ప్రసాద్ కు,

మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. మాకు ఈ మధ్యనే మా తెలుగు పండితులు ఈ పాఠం చెప్పారు. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా” వర్ణించాడు.

రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి. రఘునాథ్ బాబు,
మునిసిపల్ ఉన్నత పాఠశాల.

చిరునామా :
టి. ప్రసాద్,
S/o టి. రామయ్యగారు,
ఇంటి నెం. 4-1-3/A, గాంధీపురం,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా,

ప్రశ్న 2.
మీ పాఠశాలను గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

తెనాలి,
x x x x x.

పి. రామచంద్ర,
10వ తరగతి, శారదా కాన్వెంట్,
రాజావీధి, తెనాలి,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

మిత్రుడు రవికాంత్ కు,

నేను కొత్తగా చేరిన శారదా కాన్వెంట్ అందాల బృందావనంలా ఉంది. మా కాన్వెంట్ 5 ఎకరాల స్థలంలో ఉంది. ఎత్తైన భవనాలు ఉన్నాయి. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మా సైన్సు ప్రయోగశాలలు చక్కగా అన్ని పరికరాలతో అందంగా తీర్చిదిద్దినట్లుంటాయి.

నిత్యం అసెంబ్లీ జరిగేచోట సరస్వతీ దేవి విగ్రహం రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. మా కాన్వెంటు అందం అంతా క్రీడా మైదానంలో ఉంది. అన్ని ఆటలకూ కోర్సులు ఉన్నాయి. మైదానం అంతా శుభ్రంగా ఉంటుంది.

కాన్వెంటులో పూలతోట ఉంది. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. కుళాయి నీరు 24 గంటలు వస్తుంది. బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి.

మా ప్రధానోపాధ్యాయుల గది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాన్వెంట్ లో చేరినందులకు సంతోషంగా ఉంది. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.రామచంద్ర.

చిరునామా:
యస్. రవికాంత్,
C/O. యస్. వెంకట్రావుగారు,
తాశీల్దార్, అమలాపురం,
తూ. గో. జిల్లా, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 3.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

అమలాపురం
ది. x x x x x.

 

ప్రియమైన మిత్రుడు అనంత్ కు,

నీకు శుభాక్షాంక్షలు – నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుచున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావనతో మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు బాగుంటేనే మనదేశం ఆదర్శంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుంది. దాని కోసం మనమంతా పచ్చని చెట్లను నాటాలి. ఇంటిని, గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారానే మనం దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాం. మన పాఠశాలల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపడదాం. మనం దీని కోసం సంకల్పం తీసుకుందాం ! పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
x x x x x.

చిరునామా:
వి. అనంత్, 10వ తరగతి,
వివేకానంద బాలుర ఉన్నత పాఠశాల,
వినుకొండ, గుంటూరు జిల్లా.

ప్రశ్న 4.
పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు / మిత్రురాలికి ఒక లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x.

మిత్రుడు రంగారావుకు / మిత్రురాలు కవితకు,

నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్ళికి ‘కొమరగిరి పట్టణం’ అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరిలో సుమారు 16 వేల మంది జనాభా ఉన్నారట. సుమారు 20 వేల ఎకరాలలో వరిపంట, ఐదు-ఆరు వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట.

ఊళ్ళో అన్ని కులాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. ఆ పెళ్ళి చేయించే పురోహితుణ్ణి, ఆ ఊరి కాపుగారు “బాబయ్యగారూ” అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టికాక, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క బావ, మొదలయిన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలలో అందమైన శివాలయాలు ఉన్నాయి.

ఆ పల్లెటూరిలో ప్రకృతి శోభ, మహాద్భుతం. ఊళ్ళో పంటకాలువలూ, చెరువులూ ఉన్నాయి. ఫంటచేలు గాలికి తలలాడిస్తూ, మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు, నిండుగా గెలలతో కలకలలాడుతుంటాయి. కొబ్బరిచెట్టు, కల్పవృక్షం లాంటిది. పెళ్ళిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు.

అదీగాక ఈ ఊరి ప్రక్కనే కౌశికీ నది, దాని పక్కగా బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్రతీరాన సరుగుడు తోటలు, ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనలను రమ్మని పిలుస్తూ ఉంటాయి.

పల్లెలు, దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను. లేఖ రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
గోపాలరావు. / రాధ.

చిరునామా :
పి. రంగారావు, / పి. కవిత,
S/o/ D/o పి. వరప్రసాద్,
గాంధీరోడ్డు, వరంగల్లు (ఆంధ్రప్రదేశ్).
పామర్రు, కృష్ణా జిల్లా.

ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

గుంటూరు,
x x x x x.

ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు,

గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! ఆ రోజు ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవాన్ని ప్రారంభించాం. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
జయరాజ్.

చిరునామా :
ఎస్. పుష్పరాజ్, 10వ తరగతి,
నవోదయ హైస్కూలు,
నాయుడుపేట,
నెల్లూరు.

ప్రశ్న 6.
మీ పాఠశాలలో గ్రంథాలయ వసతి కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఏలూరు,
x x x x x

చింతా రవిశంకర్,
పదవ తరగతి, ‘ఏ’ సెక్షన్,
మునిసిపల్ హైస్కూలు,
పవర్ పేట, ఏలూరు.

ఆర్యా ,
విషయము : గ్రంథాలయ వసతి కల్పించమని వినతి.

నమస్కారములు. మా పాఠశాలలో సుమారు 2 వేలమంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. మా పాఠశాలలో మంచి గ్రంథాలయము లేదు. ఈ సంవత్సరము పాఠ్యప్రణాళికలు బాగా మారిపోయాయి. గ్రంథాలయంలోని పుస్తకాలు – చదివితే కానీ, పరీక్షలలో సరయిన జవాబులు వ్రాయలేము. నిత్యమూ వచ్చే రోజువారీ పత్రికలు చదివితే, మాకు దేశకాల పరిస్థితులు అర్థం అవుతాయి.

కాబట్టి మీరు తప్పక మా మునిసిపల్ కమిషనర్ గారికి చెప్పి, మీరు కూడా మంచి గ్రాంటు ఇచ్చి, మా పాఠశాలలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మా విద్యార్థుల తరుపున ప్రార్థిస్తున్నాను.

నమస్కారాలతో,

ఇట్లు,
తమ విధేయుడు,
చింతా రవిశంకర్,
పదవ తరగతి, ఎ. సెక్షన్ నెంబర్ : 26.

చిరునామా :
జిల్లా విద్యాశాఖాధికారి గార్కి,
పశ్చిమగోదావరి జిల్లా,
ఏలూరు.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 7.
‘ఎదుటి వారిలో తప్పులు వెతకటం కన్నా, వారి నుండి మంచిని స్వీకరించడం మేలు’ అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

చిత్తూరు,
x x x x x

స్నేహితుడు రంగనాకు,
స్నేహితురాలు శారదకు,

నీ లేఖ చేరింది. మీ నగరంలోని “సాయీ సేవామండలి” వారు మీ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్సు పుస్తకాలు, వగైరా ఉచితంగా పంచి పెట్టారని రాశావు. ఆ సంస్థవారు నగరంలో చందాలు బాగా వసూలు చేస్తున్నారనీ, వాటికి రశీదులు మాత్రం ఇవ్వడం లేదని రాశావు. నీవు సేవామండలి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించాలి. వారి తప్పులు వెదకరాదు.

ఆ సేవామండలి వారు దేవాలయాల వద్ద నిలబడి భక్తులను క్యూ లైన్లలో పంపడం, వారి చెప్పులను కాపాడి, తిరిగి వారికి అప్పగించడం, మజ్జిగ, మంచినీరు అందించడం వగైరాలు చేస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా కాపాడుతున్నారు.

వారు బీదపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. పండుగరోజుల్లో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. రోగులకు పాలు పండ్లు ఇస్తున్నారు.

నీవు ఆ సేవామండలి వారు చేస్తున్న పరోపకారం, మానవసేవ, ధర్మకార్యాలు మెచ్చుకోవాలి. వారిని అభినందించాలి. అంతేకాని వారు వసూలు చేసే చందాలకు రశీదులు ఇవ్వడం లేదని వారిని తప్పు పట్టరాదు. రశీదు పొరపాటున ఇచ్చి ఉండకపోవచ్చు గదా !

మనం ఎదుటివారి తప్పులను వెతికి చూపిస్తాము. దానికంటే వారు చేసే మంచిని గ్రహించి, వారిని అభినందించడం మంచిది. వారు చేసే పనిలోని లోపాలను వారి దృష్టికి తేవాలి.

మంచిపని చేసేవారిని ప్రశంసించడం, మన ధర్మం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
నీ స్నేహితురాలు,
కె. జయ / కె. జయరాజు.

చిరునామా :
కె. రంగనాధ్, / యస్. శారద,
గాంధీ మునిసిపల్ హైస్కూలు,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 8.
నాటితో పోలిస్తే నేటి వివాహ వేడుకల్లో వచ్చిన మార్పులను గురించి విమర్శనాత్మకంగా మిత్రులకు లేఖ రాయండి.
జవాబు:

తిరుపతి,
x x x x x

మిత్రుడు ప్రసాద్ కు,

శుభాభినందనలు. మీ అక్క పెళ్ళి శుభలేఖను నీవు నాకు పంపించావు. సంతోషం. ఈ మధ్య మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పూర్వపు పెళ్ళిళ్ళకూ, ఇప్పటి పెళ్ళిళ్ళకూ ఎన్నో తేడాలున్నాయి.

కోపం వల్ల చాలా అనర్దాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1. 104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 9.
నీ సైకిలు పోయిందని తెలుపుతూ,వెతికించమని కోరుతూ పోలీసు అధికారికి లేఖ రాయండి.
జవాబు:

కర్నూలు,
x x x x x x

కె. జవహర్ రెడ్డి,
పదవ తరగతి, సెక్షన్ ‘ఎ’
మునిసిపల్ హైస్కూల్,
గాంధీనగర్, కర్నూలు.
గాంధీనగర్ పోలీసు ఇన్ స్పెక్టర్ గారికి, కర్నూలు,

అయ్యా ,

విషయము : సైకిలు దొంగతనం – చర్య తీసుకోవలసిందిగా విజ్ఞప్తి.

నమస్కారములు,
నిన్న అనగా 9 – 4 – 2016 నాడు, నేను మిత్రులతో కలసి గవర్నమెంటు హాస్పిటల్ కు, నా మిత్రుని పలకరించుటకు వెళ్ళాను. మా మిత్రులము అందరమూ, మా సైకిళ్ళను గేటు వద్ద చెట్టు క్రింద తాళం వేసి ఉంచి లోపలకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పటికి నా సైకిలు కనబడలేదు. మిగిలిన వారి సైకిళ్ళు మాత్రం ఉన్నాయి. నా సైకిలు వివరాలు క్రింద ఇస్తున్నాను.

హీరో కొత్త సైకిలు, 24, నెంబరు హెచ్ 26723. దయచేసి నా సైకిలు వెతికించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
కె. జవహర్ రెడ్డి,
10వ తరగతి, సెక్షన్ – ‘ఎ’.

ప్రశ్న 10.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

రాజమండ్రి,
x x x x x

ప్రియమైన అభిలేష్ కు,

నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను.

మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమిమీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీలపట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు.

స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
రాజేష్.

చిరునామా :
పి. అఖిలేష్,
10వ తరగతి , జె.పి. హైస్కూల్,
కుప్పం, చిత్తూరు జిల్లా,

ప్రశ్న 11.
మీ ఊరికి బస్సు సదుపాయం కల్పించమని కోరుతూ సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారికి లేఖ రాయండి.
జవాబు:

చామర్రు,
x x x x x

ఆర్.టి.సి. జనరల్ మేనేజర్ గారికి,
చామర్రు నివాసియైన అగ్గరాజు శ్రీరామమూర్తి వ్రాయు విన్నపము.

అయ్యా ,

మాది అచ్చంపేట మండలంలోని చామర్రు అనే గ్రామం. మా గ్రామ జనాభా ఎనిమిదివందలు. ఇచ్చటి ప్రజలు నిత్యావసర సరకులు అచ్చెంపేట వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు హైస్కూలు చదువుకు అచ్చెంపేట, కాలేజి చదువుకు సత్తెనపల్లి వెళ్ళి రావలసియున్నది. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మండల కేంద్రానికి వెళ్ళటానికి నానా బాధలు పడుతున్నారు. కారణం మా ఊరికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడమే. ‘ప్రజా సేవయే కర్తవ్యం’గా భావించే మీరు మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కలిగించి మా కష్టాలను గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
తమ విధేయుడు,
ఎ.ఎస్.ఆర్. మూర్తి.

చిరునామా :
జనరల్ మేనేజర్,
ఆర్.టి.సి. ఆఫీసు,
గుంటూరు రేంజి, గుంటూరు.

ప్రశ్న 12.
ఉపకార వేతనాన్ని మంజూరు చేయమని కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ రాయండి.
జవాబు:

ఉపకార వేతనం కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ.

పటమట,
x x x x x

కృష్ణాజిల్లా సంక్షేమశాఖాధికారి గారి దివ్య సముఖమునకు,

ఆర్యా !
నేను పటమట జిల్లా పరిషత్ హైస్కూలులో పదవ తరగతి చదువుచున్నాను. నేను ఆర్థికముగా వెనుకబడిన కుటుంబమునకు చెందినవాడను. 9వ తరగతి పరీక్షలలో నాకు 600 మార్కులకు 530 మార్కులు వచ్చినవి. పై చదువులు చదువుటకు ఆర్థికశక్తి లేకపోవుటచే మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చుచున్నది. కనుక తమరు నా యందు దయయుంచి ఉపకార వేతనమును మంజూరు చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను.

జతపరచినవి :

  1. ఆదాయ ధృవీకరణ పత్రం,
  2. మార్కుల ధృవీకరణ పత్రం,
  3. కుల ధృవీకరణ పత్రం.

ఇట్లు,
తమ విధేయుడు,
అగ్గిరాజు శ్రీహర్ష,
10వ తరగతి, జిల్లా పరిషత్ హైస్కూలు,
పటమట, కృష్ణాజిల్లా.

చిరునామా :
జిల్లా సంక్షేమశాఖాధికారి గారికి,
జిల్లా సంక్షేమశాఖాధికారి కార్యాలయం,
మచిలీపట్నం, కృష్ణాజిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 13.
మీ పాఠశాలలో జరిగిన ఒక ఉత్సవాన్ని గూర్చి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
x x x x x

ప్రియ స్నేహితురాలు,
మధుప్రియకు శుభాకాంక్షలు,

గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం గం. 8 – 00 లకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణ కావించబడింది. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి ముఖ్య అతిథిగారు చక్కని సందేశమిచ్చారు. కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆ రోజు గొప్పతనాన్ని గురించి ఉపన్యాసమిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. తరువాత విద్యార్థులకు స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ‘జనగణమన’ జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగిసింది.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
టి. హరిప్రియ.

చిరునామా :
కె. మధుప్రియ,
10వ తరగతి,
మున్సిపల్ గరల్స్ హైస్కూలు,
రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.

ప్రశ్న 14.
అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు శిల్పులను అభినందిస్తూ లేఖ

విజయవాడ,
x x x x x

మిత్రుడు శ్రీకాంత్ కు, / మిత్రురాలు రాధకు,

మిత్రమా ! శుభాకాంక్షలు. ఈ మధ్య నేను మన నవ్యాంధ్ర రాజధాని నగరం, అమరావతికి వెళ్ళి అక్కడి శిల్ప సంపదను చూసి, ఆ శిల్పాలను చెక్కిన కళా తపస్వులయిన శిల్పులకు జోహార్లు సమర్పించాను. అక్కడ బుద్ధ విగ్రహాలు, జైన మందిరము, అమరేశ్వరాలయము, స్తూపాలు అన్నీ చూశాను. ఆ శిల్పాలు చెక్కిన శిల్పులకు అభినందనలు అందించాను. ఆ శిల్పాలు ప్రపంచ శిల్ప సంపదలోనే అగ్రశ్రేణివని డా|| ఫెర్గూసన్ పొగిడాడు.

జాషువా మహాకవి చెప్పినట్లు శిల్పి చేతి సుత్తె నుండి ఎన్నో దేవాలయాలు వెలిశాయి. అర్థం లేని బండరాయికి శిల్పి జీవం పోస్తాడు. రాళ్ళను దేవుళ్ళుగా మార్చి, వాటికి మనచే పూజలు చేయిస్తాడు. శిల్పి శాశ్వతుడు. రాళ్ళలో నిద్రపోయే బొమ్మల్ని ఉలి తగిలించి అతడు లేపుతాడు. శిల్పి చిరంజీవి. పుణ్యాత్ముడు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మహాశిల్పులకు మనం అభినందనలు అందించాలి. నీవు కూడా అమరావతి వచ్చి, మత తెలుగు శిల్పుల కళానైపుణ్యానికి జోహార్లు అందిస్తావని విశ్వసిస్తున్నాను.

‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’ అని మనం నిత్యం తెలుగుతల్లి పాటలో పాడుతున్నాము. ఆ శిల్పులకు జోహార్లు అందించడం మన విధి. ఉంటా.

ఇట్లు,
నీ మిత్రుడు, / మిత్రురాలు,
శ్రీహర్ష. / రజని.

చిరునామా :
పి.శ్రీకాంత్, / పి.రాధ,
S/o/ D/o పి.వరప్రసాద్,
విశాఖపట్టణం,
అక్కయ్యపాలెం, ఆంధ్రప్రదేశ్.

ప్రశ్న 15.
పేదలకు దానం చేయుట వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రుడికి లేఖ

తిరుపతి,
x x x x x

మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు,

ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం.

ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి.

పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను.

నీవు కూడా చెయ్యి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు, / మిత్రురాలు,
సాయికుమార్. / శశికళ.

చిరునామా:
కె. శశిభూషణ్, / కె. కమల,
S/o వెంకటేష్, | D/o వెంకటేష్,
ఆర్యాపురం, రాజమహేంద్రవరం,
తూర్పుగోదావరి జిల్లా.

AP SSC 10th Class Telugu లేఖలు

ప్రశ్న 16.
విద్వాన్ విశ్వం కవితను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునకు లేఖ

గుంటూరు,
x x x x x

మిత్రుడు రామారావునకు,

శుభాభినందనలు. నీ లేఖ అందింది. నేను ఈ మధ్య విద్వాన్ విశ్వంగారి ‘మాణిక్యవీణ’ వచన కవిత చదివాను. విశ్వంగారు గొప్ప కవి పండితుడు. ఆయన ‘విశ్వరూపి నా హృదయం’ అని ప్రకటించుకున్నాడు. ఈ కవితలో చక్కని అభ్యుదయ భావాలు వెలిబుచ్చాడు.

మానవులు కేన్సరుతో బాధపడుతూ ఉంటే, దానికి మందులు కనుక్కోకుండా, రోదసిలోకి ఉపగ్రహాలు పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని శాస్త్రజ్ఞులను ప్రశ్నించాడు.

తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావని హెచ్చరించాడు. శాస్త్రజ్ఞులు నిప్పునూ, చక్రాన్ని కనిపెట్టినరోజు నిజంగా, మానవ చరిత్రలో పండుగరోజు అని గుర్తు చేశాడు.

మానవ జీవితాన్ని కళలూ, కవిత్వం, విజ్ఞానం నడిపిస్తాయన్న యథార్థాన్ని విశ్వంగారు చెప్పాడు.

వచన కవితా రచనలో ఆయన చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను తేలికగా అందించాడు.

విశ్వంగారు మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాల్ని పలికించాడు. చక్కని లలిత పదాలతో, అనుప్రాసలతో కవిత మనోహరంగా చెప్పాడు.

తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
యన్. శ్రీకాంత్.

చిరునామా :
యస్. రామారావు,
S/o యస్: కృష్ణారావుగారు,
రామారావు పేట,
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.

ప్రశ్న 17.
వ్యక్తిత్వ బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు లేఖ రాయండి.
జవాబు:

ప్రధానోపాధ్యాయులకు లేఖ

విజయవాడ,
x x x x x

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులవారికి,
మహాత్మాగాంధీ మునిసిపల్ ఉన్నత పాఠశాల,
గాంధీనగరం, విజయవాడ.

ఆర్యా !
విషయం : వ్యక్తిత్వ విద్యా, దిలీ ధృవీకరణ పత్రాలకై విజ్ఞప్తి.

నేను మీ పాఠశాలలో 10వ తరగతి చదివి, మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణుడను అయ్యాను. దయచేసి నేను ఇంటర్‌లో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా ప్రార్ధన.
నమస్కారాలతో,

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
x x x
10వ తరగతి – 24వ నెంబరు.

ప్రశ్న 18.
కోపం తగ్గించుకోవడం మంచిదని తెలుపుతూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

విశాఖపట్టణం,
x x x x x

మిత్రుడు రఘునందన్ కు,

నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతకకర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది.. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104,
మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu వ్యాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 1.
‘ఆరుబయట మలవిసర్జన’ ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
అత్యంత ప్రమాదం

మలవిసర్జన అంటే మన శరీరంలోని మలినాలను బయటకు వదలడం.

మలవిసర్జన వలన వచ్చే మలినాలు చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటాయి. అంతేకాకుండా వాటిపై అత్యంత ప్రమాదకరమయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు వ్యాపించినట్లయితే కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి వృద్ధులకు, బలహీనులకు, చిన్న పిల్లలకు, అనారోగ్యవంతులకు, గర్భిణీలకు, బాలింతలు మొదలైన వారికి తొందరగా వ్యాపిస్తాయి.

బహిరంగ మలవిసర్జన చేసినపుడు దానిపై ఈగలు, దోమలు వాలతాయి. వాటిపైకి అక్కడి సూక్ష్మజీవులు చేరతాయి. ఆ ఈగలు, దోమలు మనం తినే ఆహారంపై వాలతాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారంతోబాటు మనలోపలికి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

అందుకే బహిరంగ మలవిసర్జన వద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకొందుకు ప్రభుత్వం కూడా మినహాయింపుతో కూడిన ఋణం మంజూరు చేస్తోంది.
బహిరంగ మలవిసర్జన మానేద్దాం – నాగరికతను చాటుదాం.
మరుగుదొడ్డి వాడదాం – రోగాలు నివారిద్దాం.
పరిశుభ్రత పాటిద్దాం – పదికాలాలు చల్లగా ఉందాం.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 2.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగ, గోదావరి వంటి నదుల జలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శనా వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 3.
అధిక జనాభా వల్ల మన పర్యావరణం దెబ్బ తింటోంది. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కాబట్టి పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది.

ప్రాణులు నివసించేది నేలపైన గదా ! ఆ నేలతల్లిని సరిగా చూసుకోవాలి. భూమిపై చెత్త, చెదారమేకాదు ఓషధులుంటాయి. చెట్లుంటాయి. జంతువులుంటాయి. మనం జీవించటానికి ఆహారం లభించేది భూమి వల్లనే గదా ! రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమిని ఆరోగ్యంగా ఉంచాలి. భూమి సమతౌల్యాన్ని పోషించాలి.

జలకాలుష్యం మిక్కిలి భయంకరమైనది. రసాయనిక పదార్థాలు, పరిశ్రమల వల్ల విడుదలయ్యే ద్రవపదార్థాలు సాగునీటిని, త్రాగేనీటిని కాలుష్యపరుస్తాయి. మురుగునీరు, త్రాగేనీరు అనే భేదం లేకుండా పోతోంది. డ్రైనేజి వ్యవస్థ అరొకరగా వుంది. దీనివల్ల కలరా, మలేరియా, ఫ్లోరోసిస్, విషజ్వరం, టైఫాయిడ్ వంటివేకాక వైద్యులకి అంతుపట్టని కొత్త రోగాలు కూడా బయలుదేరాయి.

ఇక వాయు కాలుష్యం, గాలివల్లనే మనం జీవిస్తున్నాం. అటువంటి గాలి స్వచ్ఛంగా వుండాలి. కాని ఆధునిక పారిశ్రామికత పేరుతో గాలి కూడా కలుషితమైపోతోంది. విషపూరితమైన గాలి పీల్చటం వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, గుండెకాయ, కళ్ళు అనారోగ్యానికి గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవితం రోగాలమయం అవుతోంది.

యంత్రాలవల్ల, వాహనాలవల్ల ధ్వనికాలుష్యం వ్యాపిస్తోంది. అణుశక్తి పరీక్షల వల్ల కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.

1970లో అమెరికాలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమం బయలుదేరింది. వాటి నుంచి శాస్త్రజ్ఞులు పర్యావరణ కాలుష్యనివారణకు విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలోని సమతౌల్యాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

ప్రశ్న 4.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ “వ్యాసం” రాయండి.
జవాబు:
పవిత్ర భారతదేశంలో స్త్రీలకు సమున్నతమైన గౌరవం ఉంది. స్త్రీలు భూమిపై కదిలే దేవతామూర్తులుగా భావిస్తాము. స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలు ఆనందిస్తారని మనం భావిస్తాము. కాని వర్తమాన సమాజంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. స్త్రీల ప్రగతి నానాటికి దిగజారుతున్నది. స్త్రీలు ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు.

స్త్రీలు ఇప్పటికీ స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కొందరు స్త్రీలను పైకి రానీయకుండా అడ్డుపడుతున్నారు. రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. చట్టసభల్లో మహిళా సభ్యులను చులకనగా చూస్తున్నారు.

ప్రేమ పేరుతో స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి. అకృత్యాలు జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న మహిళలపై వివక్షను చూపిస్తున్నారు. పరువు కోసం తండ్రులు కన్న కూతుర్లనే చంపడం మనం చూస్తున్నాం. దీన్ని నాగరిక సమాజం హర్షించదు. దీన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి.

గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. కొందరు కట్నాల పేరుతో మహిళలను వేధిస్తున్నారు. ఆరోగ్యపరంగా స్త్రీలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతలకు తగిన పౌష్టికాహారం దొరకడం లేదు. ఈ రకంగా స్త్రీలు సమాజంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని మన ప్రభుత్వాలు పరిష్కరించాలి. స్త్రీల జీవితాల్లో వెలుగులను నింపాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 5.
మీకు నచ్చిన సన్నివేశాన్ని లేదా ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
సూర్యోదయం
తూర్పువైపు ఆకాశంలోకి ఉదయమే చూస్తే ఎర్రగా కనిపిస్తుంది. అప్పటి వరకూ కోళ్ళు కూస్తూ ఉంటాయి. నక్షత్రాలు ఆకాశంలో వెలవెలపోతాయి. అప్పుడు పక్షులు తమ గూళ్ళ నుండి బయలుదేరి ఆహారం కోసం బారులు కట్టి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పక్షులు రెక్కలు ఆడిస్తూ నేరుగా దూసుకుపోతూ ఉంటే, ఆ దృశ్యం చూడ్డానికి కళ్ళకు పండుగలా కనిపిస్తుంది.

అదే సమయానికి సూర్యకిరణాలు నేరుగా వచ్చి నేలకు తాకుతాయి. మా ఇంటి పక్క గుళ్ళో గంటలు మోగుతూ ఉంటాయి. గుడి పక్క చెరువులో సూర్యకిరణాలు పడి, తామర పూలు విచ్చుకుంటాయి. తుమ్మెదలు ఆ పద్మాలపై ఏదో రొద చేస్తూ తిరుగుతూ ఉంటాయి.. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్యోదయం కాగానే ప్రకృతి అంతా మేలుకొని తమ తమ పనుల్లో మునిగిపోతుంది.

ప్రశ్న 6.
‘నవ సమాజంలో విద్యార్థుల పాత్ర అనే అంశం మీద వ్యాసము వ్రాయండి.
జవాబు:
విద్యార్థులు అంటే విద్యను కోరి వచ్చినవారు. విద్యార్థుల ముఖ్య కర్తవ్యం, శ్రద్ధగా చదివి, మంచి మార్కులు సాధించడం. ఈనాడు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి దేశ నాయకులతో పాటు, ప్రజలు కూడా బాబాధ్యత వహించాలి. విద్యార్థులు చదువుకుంటున్న దేశ పౌరులు. కాబట్టే భావి భారత పౌరులయిన విద్యార్థులు కూడా, నవ సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, అపరిశుభ్రత, దురాగతాలు, రాజకీయ నాయకుల వాగ్దాన భంగాలు వంటి వాటిపై తప్పక తిరుగబడాలి.

విద్యార్థులు ‘స్వచ్ఛభారత్’ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటువ్యాధుల నిర్మూలనకు దీక్ష చేపట్టాలి. అవినీతి ఎక్కడ కనబడినా, సామూహికంగా. ఎదిరించాలి. విద్యార్థులు నీతినియమాలు పాటించాలి. వృద్ధులను గౌరవించాలి. తోడి వారికి సాయం చేయాలి.

విద్యార్థినీ విద్యార్థులు, క్రమశిక్షణను పాటించాలి. దేశభక్తిని కలిగియుండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. గురువులనూ, తల్లిదండ్రులనూ గౌరవించాలి. బాగా ఆటలు ఆడి, వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేయాలి.

విద్యార్థులు రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనరాదు. కాని దేశం కోసం తమ శక్తియుక్తులనన్నింటినీ ధారపొయ్యాలి.

ప్రశ్న 7.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
జవాబు:
కవి అలిశెట్టి ప్రభాకర్ “నగరం అర్థంకాని రసాయనశాల” అన్నమాట యదార్థము. నేడు పల్లెలను వీడి ప్రజలంతా పట్టణాలకు వలస పోతున్నారు. నగరాలు అన్నీ మురికివాడలుగా మారి పోయాయి.

నగరాల్లో జనాభా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల వాడకం పెరిగింది. ప్రజలు పారవేసే చెత్త, వాడి పారవేసిన ఇంజక్షను సూదులు, ఫ్యాక్టరీలవారు విడిచిపెట్టే రసాయనిక వ్యర్థాలు , పందులు, కుక్కలు వంటి జంతువుల మాలిన్యాలు, నగరంలో పోగుపడుతున్నాయి.

నగరాలలో ప్రజలకు త్రాగడానికి సరిపడ మంచినీరు దొరకడం లేదు. నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్న దీక్ష, ప్రజలకు ఉండడం లేదు. నగరంలో తిరిగే వాహనాలు ఎంతో కాలుష్యాన్ని గాలిలోకి విడిచిపెడుతున్నాయి. నదులలో కాలువలలో, చెరువులలో మురికినీరు వదలుతున్నారు. జలాశయాల్లో బట్టలు ఉతుకుతున్నారు. చెత్త దూరంగా పారవేసేందుకు నగరాల్లో చోటు దొరకడం లేదు. అందువల్ల నగరాలు కాలుష్య నిలయాలుగా, రోగాలకు పుట్టుక స్థలాలుగా మారుతున్నాయి.

నివారణ :
ప్రతి నగర పౌరుడు తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మొక్కలు నాటాలి. జలాశయాల్లోకి మురికినీరు విడువరాదు. పరిశుభ్రతకూ, మంచి నీటికి మంచి వాతావరణానికి నగరాధికారులతో పాటు అందరూ కృషి చేయాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 8.
నగర జీవనంలోని అనుకూల అంశాలపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నగర జీవనం – అనుకూల అంశాలు :
‘నగరం’ అంటే పట్టణము. పల్లెలలో కన్న నగరాలలో ప్రజలకు అవసరమయ్యే సదుపాయాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. అందువల్ల ప్రజలు గ్రామాల నుండి నగరాలకు వలసపోతున్నారు.

నగరాలలో ప్రజలకు విద్యా, వైద్య, ప్రయాణ సౌకర్యాలు హెచ్చుగా దొరుకుతాయి. ప్రజలకు మంచి విద్య నగరాల్లో లభిస్తుంది. కార్పొరేట్ కళాశాలలు, వైద్యశాలలు నగరాల్లో ఉంటాయి. నగరాల్లో పరిశ్రమలు ఉంటాయి. అందువల్ల ప్రజలకు ఉద్యోగ వసతి లభిస్తుంది. నగరాల్లో ప్రయాణాలకు సిటీ బస్సులు, రైళ్ళు, ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి.

చేతి వృత్తుల వారికి సైతము, నగరాల్లో వారికి తగ్గ పని లభిస్తుంది. ప్రజలు ఏదోరకంగా నగరాల్లో బ్రతుకగలరు. వారికి కావలసిన పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు నగరాల్లో దొరుకుతాయి. కుళాయిల ద్వారా మంచి నీరు దొరుకుతుంది. రైతు బజార్లలో చౌకగా కావలసిన వస్తువులు దొరుకుతాయి. రోగం వస్తే, చిన్న పెద్ద వైద్యశాలలు నగరంలో ఉంటాయి. నగరాల్లో 24 గంటలు విద్యుచ్ఛక్తి సరఫరా అవుతుంది.

ఈ విధమైన అనుకూలములు ఉన్నందు వల్లే ప్రజలు పల్లెలను వదలి నగరాలకు వలసపోతున్నారు.

ప్రశ్న 9.
మాతృభాషా ప్రాముఖ్యాన్ని గూర్చి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మాతృభాష అంటే తల్లి భాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికే చాలా ప్రయాస పడాల్సివస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాషరాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థం కాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

ప్రశ్న 10.
‘వాతావరణ కాలుష్యం’ లేదా ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న విషయంపై వ్యాసం రాయండి.
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం. వాతావరణం పరిశుభ్రంగా ఉంటే, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అతడి జీవితం, ఆనందంగా సాగుతుంది. మానవుల ఆరోగ్యానికి హానిని కల్గించే హానికారక పదార్థాలు వాతావరణంలో కలిసిపోతే, దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

మన చుట్టూ ఉండే గాలి, నీరు, భూమి వంటి వాటిని పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.

వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు, మొ||నవి. వాతావరణ కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల, నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జలకాలుష్యం ఏర్పడుతోంది. మోటారు వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది.

వాతావరణ కాలుష్యం వల్ల, మానవుని మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. దీనివల్ల ఉదరకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కేన్సర్ రోగాలు, గుండె జబ్బులు వస్తున్నాయి.

వాతావరణ కాలుష్య నివారణకూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అమలు పరచాలి. కర్మాగారములు పరిశుభ్రము చేసిన తరువాతే వ్యర్థాలను విడిచి పెట్టాలి. ఫ్యాక్టరీల వారు మొక్కలు బాగా పెంచాలి. అవకాశం ఉన్న చోట ప్రజలు మొక్కలను బాగా పెంచాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనలు చేసి, వాతావరణ కాలుష్య నివారణకు తగు సూచనలు అందించాలి.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 11.
నీకు నచ్చిన మహిళ గుణగణాలు (శ్రీమతి ఇందిరాగాంధీ) గురించి వ్యాసం రాయండి.
జవాబు:
నాకు నచ్చిన మహిళ (శ్రీమతి ఇందిరా గాంధీ) :
భరత మాత ముద్దుబిడ్డలలో, ఇందిరాగాంధీ ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహిళామణులలో, ఇందిర సుప్రసిద్ధురాలు. ఈమె 1917వ సంవత్సరము నవంబరు 19వ తేదీన ఆమె అలహాబాదులో జవహర్ లాల్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది.

ఇందిర శాంతినికేతన్లో రవీంద్రుని వద్ద చదివింది. ఈమె గొప్ప దేశ భక్తురాలు.. ఈమె భర్త ఫిరోజ్ గాంధీ, మహమ్మదీయుడు. ఆ వివాహం ఈమెకు మత సహనాన్ని నేర్పింది. ఈమె తండ్రితో పాటు దేశ విదేశాలు పర్యటించి, రాజనీతి చతురజ్ఞ అయ్యింది.

ఈమె భారతదేశ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాలు పనిచేసింది. ఆ కాలంలో ఈమె బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. భూ సంస్కరణలను చేపట్టింది. ‘గరీబీ హఠావో’ అని ఈమె ఇచ్చిన నినాదం భారతదేశం అంతటా మారుమ్రోగింది.

ఈమె బడుగువర్గాల ఆశాజ్యోతిగా, దళిత వర్గాల కన్నతల్లిగా పేరు తెచ్చుకొంది. ఈమె గొప్ప సాహసురాలు. గొప్ప రాజనీతిజ్ఞురాలు.

ప్రశ్న 12.
నీకు నచ్చిన జాతీయ నాయకుని గూర్చి వ్యాసం రాయండి.
జవాబు:
మహాత్మాగాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. కానీ భారత ప్రజలు ఆత్మీయంగా ‘బాపూజీ’ అని పిలిచేవారు. ‘మహాత్మా’ అని గౌరవించేవారు. భారత జాతి మహాత్మాగాంధీని ‘జాతిపిత’ గా గౌరవించి కృతజ్ఞత ప్రకటించుకుంది.

గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడున్న భారతీయుల దాస్య వృత్తిని చూసి చలించిపోయాడు. ఆంగ్లేయుల ప్రవర్తన సహించలేక ఎదురుతిరిగాడు. ఎన్నో కష్టాలకు లోనయ్యాడు.

స్వదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ భారతీయుల బానిస బ్రతుకుల్ని చూసి సహించలేకపోయాడు. భారతమాత పరాయి పాలకుల సంకెళ్ళలో బందీగా ఉన్నందుకు గాంధీ తల్లడిల్లాడు. ఆంగ్లేయులపై స్వాతంత్ర్య సమరం ప్రకటించాడు. శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమరం చేపట్టాడు. స్వరాజ్య ఉద్యమానికి కాంగ్రెసు సంఘం స్థాపించాడు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, ఖద్దరు ఉద్యమాలను చేపట్టి ఆంగ్లేయులను గుక్క తిప్పుకోనీకుండా గడగడలాడించాడు. సత్యాగ్రహం, నిరాహారదీక్షల ద్వారా భారత జాతిని జాగృతం చేసి ఆంగ్లేయుల గుండెలు దద్దరిల్లజేశాడు.

అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు గల దేశ ప్రజల్ని ఒకే త్రాటి మీద నడిపించి, సమైక్యంగా పోరాటం సాగించాడు. గాంధీ నడిపించిన ఉద్యమం వల్ల 1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. దుడ్డు కర్ర, అంగవస్త్రం, కిర్రు చెప్పులు గల గాంధీ ప్రపంచ దేశాల చేత జేజేలు అందుకున్నాడు.

ప్రశ్న 13.
ప్రశాంతతకు, పచ్చదనానికి నిలయమైన పల్లెల గొప్పదనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
జవాబు:
గ్రామాలు దేశ సౌభాగ్యానికి మూలకందములు. పల్లెలలో జీవితం ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. చక్కని ఎండ, గాలి, ప్రతి ఒక్కరికీ పల్లెలలో లభిస్తుంది. పల్లెలు ప్రకృతి రమణీయతకు నిలయాలు. పల్లెలలో పచ్చని చెట్లు, పొలాలు, ఆ చెట్టుపై పక్షుల కలకూజితాలు మనోహరంగా ఉంటాయి. చెట్లు చల్లని గాలిని ఇస్తూ, గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి.

ప్రజలందరికీ పల్లెలలో పాడిపంటలు ఉంటాయి. తాజా కూరగాయలు, పళ్ళు, పూలు వారికి దొరుకుతాయి. గ్రామాలలో ప్రజలందరూ ఒకరితో నొకరు అన్నదమ్ముల్లాగా మెలగుతారు. వారు “అక్కా! బావా” అంటూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కష్టసుఖాల్లో అందరూ కలిసి పాలుపంచుకుంటారు. గ్రామాలలో తీర్థాలు, సంబరాలు మహావేడుకగా జరుగుతాయి.

పల్లెలలో ఒకరింట్లో పెండ్లి అంటే, గ్రామంలో అందరికీ వేడుకే. పల్లెలలో సంక్రాంతికి ముగ్గులు, పూలతోరణాలు, గొబ్బిళ్ళు, భోగిమంటలు, సంక్రాంతి ప్రభలు మహావైభవంగా ఉంటాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పగటి వేషధారులు, వారి చక్కని పాటలు ఆనందంగా ఉంటాయి. గ్రామాల్లో పంటలు పండి ఇంటికి వస్తే, ఇళ్ళు కలకలలాడుతాయి. అందమైన పాడి పశువులు, దుక్కిటెడ్లు, ఎడ్ల బళ్ళు మహావైభవంగా ఉంటాయి.

అందుకే పల్లెలు ప్రకృతి రమణీయతకు నట్టిళ్ళు. ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు అని చెప్పగలము.

ప్రశ్న 14.
అవినీతి నిర్మూలనమునకు మీరిచ్చే సలహాలేమిటి?
జవాబు:
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అనేక రంగాలలో దేశం ముందంజ వేసింది. దురదృష్టవశాత్తూ మనదేశంలో అవినీతి కూడ పెచ్చుపెరిగింది. అక్రమ సంపాదన ప్రజల లక్ష్యమయిపోయింది. ఏదోరకంగా తప్పుచేసి అయినా డబ్బు సంపాదించడం, తన పని పూర్తిచేసుకోవడం, ఆశ్రితులకు మేలు చేయడం, నీతికి సమాధి కట్టడం జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజకీయ నాయకులలో ఈ అవినీతి జాడ్యము విస్తరించిపోతోంది. చిన్న పంచాయతీ మెంబరు నుండి దేశ ప్రధాని వరకు అందరూ అవినీతి ఆరోపణలకు గురియగుచున్నారు. ఇది దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీనిని అరికట్టడంలో భావిభారత పౌరులైన యువతీయువకులు ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ముందడుగు వేయాలి.

ముందుగా దేశంలో జరిగే అవినీతి కార్యాలను గూర్చి చూద్దాము. వర్తకులు సరకులలో కలీ చేయడం, ప్రభుత్వము పంపిణీ చేసిన నిత్యావసర వస్తువులను దాచి, బ్లాక్ మార్కెట్లో అమ్మడం, ధరలు పెంచివేయడం, ప్రభుత్వానికి పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే సదుపాయాలు ప్రజలకు లభించేలా చూడ్డానికి భారీగా లంచాలు మింగుతున్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి, ఇళ్ళ స్థలాలు మొదలైనవి పంచడానికి లంచాలు తీసికొంటూ అర్హులయిన వారికి అన్యాయం చేసి వారికి ఇష్టమైన వారికి ఇస్తున్నారు. చౌకధరల దుకాణంలో సరుకులను దాచివేసి అక్రమ లాభాలు ఆర్జిస్తున్నారు. బ్యాంకుల అప్పులకు లంచాలు తీసికొంటున్నారు. విద్యాలయాలలో సీట్లకు లంచాలు, పాస్ చేయించడానికి లంచాలు ముట్టచెప్పవలసివస్తోంది. ఇట్లా దేశంలో అవినీతి అన్ని రంగాలలో తాండవిస్తోంది.

ఈ అవినీతిని అరికట్టడానికి యువతీయువకులు ముందుకు రావాలి. పత్రికలకు లేఖలు వ్రాసి లంచగొండుల గూర్చి అవినీతి శాఖ వారికి తెలియజేయాలి. అవినీతి శాఖ ఉద్యోగులు కూడా మరింత చురుకుగా పనిచేసి లంచగొండులను నిర్బంధించాలి.

రోజుకొక లంచగొండిని, కలీ వ్యాపారిని, దుష్ట రాజకీయవేత్తను ప్రభుత్వానికి యువత అప్పగిస్తే, కొద్దిరోజులలో దేశములో అవినీతి దానంతట అదే అంతరిస్తుంది. అవినీతిపరులకు ప్రభుత్వం కూడ గట్టి శిక్షలు విధించాలి. వారి ఉద్యోగాలు తీసివేయాలి. కలీ వ్యాపారులకు జరిమానాలు, జైలు శిక్షలు వేయాలి.

అవినీతి నిర్మూలన ప్రజలందరి లక్ష్యం కావాలి. లేనిచో ఈ అవినీతి చెదపురుగు దేశాన్నే కొరికి తినివేస్తుంది.

AP SSC 10th Class Telugu వ్యాసాలు

ప్రశ్న 15.
‘స్వచ్ఛభారత్’ గురించి ఒక వ్యాసం వ్రాయండి.
జవాబు:
‘స్వచ్ఛభారత్’ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మనదేశ ప్రధాని నరేంద్రమోడీ గారు, దేశంలోని కాలుష్యమును గమనించి, నదీజలములు అన్నీ కలుషితం కావడం చూసి, ఈ ‘స్వచ్ఛభారత్’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులయిన వ్యక్తులను మోడీ గారు నియమించారు. అమితాబ్ బచ్చన్, రామోజీరావు వంటి వారు, ఈ కార్యక్రమానికి చేయూత నిస్తున్నారు. మన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికి పేటలు, గంగా, గోదావరి వంటి నదులజలాలు నేడు కాలుష్యంతో నిండిపోతున్నాయి. విద్యార్థులూ, ఆఫీసులలో ఉద్యోగులూ తమ పాఠశాలలనూ, కార్యాలయాలనూ “పరిశుభ్రంగా ఉంచుకోవాలి.” ప్రజలు తమ గృహాలనూ, పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలి.

నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. ఈ కాలుష్యం వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే, దేశం ఆరోగ్యవంతం అవుతుంది. ప్రజలకు కావలసిన మంచినీరు లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. దీన్ని ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పత్రికల వారు, దూరదర్శన్ వారు స్వచ్ఛభారత్ గురించి మంచి ప్రచారం చేయాలి. దానివల్ల దేశం సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రశ్న 16.
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై ఒక వ్యాసం రాయండి.
జవాబు:
నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాల కార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి. .

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళలోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళు చదువుకొనే అవకాశం కల్పించాలి.

బాల కార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.