AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Samasalu సమాసాలు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలసి, ఏకపదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు.

గమనిక :
అర్థవంతమైన రెండు పదాలు కలిసి, కొత్త పదం ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు.
ఉదా :
‘రామ బాణము’ అనే సమాసంలో, ‘రామ’ అనేది పూర్వ పదం. ‘బాణము’ అనేది ఉత్తర పదం.

1. ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని, “ద్వంద్వ సమాసం” అంటారు.

ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.

1) ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు,
జవాబు:
అన్నదమ్ములు

2) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

3) ప్రమాదంలో నా కాలుసేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలుసేతులు

అభ్యాసం:

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

I. ఈ కింది ద్వంద్వ సమాసాలకు విగ్రహవాక్యాలు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) ఎండవానలు ఎండయు, వానయు ద్వంద్వ సమాసాలు
2) తల్లిదండ్రులు తల్లియు, తండ్రియు
3) గంగాయమునలు గంగయు, యమునయు

II. ఈ కింది విగ్రహవాక్యాలను సమాసపదాలుగా మార్చండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) కుజనుడూ, సజ్జనుడూ కుజనసజ్జనులు
2) మంచి, చెడూ మంచిచెడులు
3) కష్టమూ, సుఖమూ కష్టసుఖములు

2. ద్విగు సమాసం :
సమాసంలో మొదటి (పూర్వ) పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.

అభ్యాసం :
కింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా : నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు
1) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల జడలు
2) దశావతారాలు – దశ (10) సంఖ్య గల అవతారాలు
3) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల రోజులు
4) నాలుగువేదాలు – నాలుగు (4) సంఖ్య గల వేదాలు

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు ద్విగు సమాసాలు.

3. తత్పురుష సమాసం :
విభక్తి ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు “తత్పురుష సమాసాలు.” అభ్యాసము : కింది పదాలను చదివి, విగ్రహవాక్యాలు రాయండి.

సమాసపదం విగ్రహవాక్యం
1) రాజభటుడు రాజు యొక్క భటుడు
2) తిండి గింజలు తిండి కొఱకు గింజలు
3) పాపభీతి పాపము వల్ల భీతి

గమనిక :
‘రాజభటుడు’ అనే సమాసంలో ‘రాజు’ పూర్వ పదం. ‘భటుడు’ అనే పదం ఉత్తర పదం. ‘రాజభటుడు’ కు విగ్రహవాక్యం రాస్తే ‘రాజు యొక్క భటుడు’ అవుతుంది. దీంట్లో యొక్క అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయం. భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పడానికి షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని వాడారు. ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహవాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు.

గమనిక :
పూర్వ పదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి.

తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ, విగ్రహవాక్యం
1) ప్రథమా తత్పురుష సమాసం డు, ము, వు, లు మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య
2) ద్వితీయా తత్పురుష సమాసం ని, ను, ల, కూర్చి, గురించి జలధరం – జలమును ధరించినది
3) తృతీయా తత్పురుష సమాసం చేత, చే, తోడ, తో బుద్ధిహీనుడు – బుద్ధిచేత హీనుడు
4) చతుర్డీ తత్పురుష సమాసం కొఱకు, కై వంట కట్టెలు – వంట కోఱకు కట్టెలు
5) పంచమీ తత్పురుష సమాసం వలన (వల్ల), కంటె, పట్టి దొంగ భయం – దొంగ వల్ల భయం
6) షష్ఠీ తత్పురుష సమాసం కి, కు, యొక్క, లో, లోపల రామబాణం – రాముని యొక్క బాణం
7) సప్తమీ తత్పురుష సమాసం అందు, న దేశభక్తి – దేశము నందు భక్తి

 

8) నఞ్ తత్పురుష సమాసం నఞ్ అంటే వ్యతిరేకము అసత్యం – సత్యం కానిది

అభ్యాసం :
కింది సమాసాలు చదివి, విగ్రహవాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో తెలపండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) రాజ పూజితుడు రాజుచే పూజితుడు తృతీయా తత్పురుషం
2) ధనాశ ధనము నందు ఆశ సప్తమీ తత్పురుషం
3) పురజనులు పురమందు జనులు సప్తమీ తత్పురుషం
4) జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయా తత్పురుషం
5) భుజబలం భుజముల యొక్క బలం షష్ఠీ తత్పురుషం
6) అగ్నిభయం అగ్ని వల్ల భయం పంచమీ తత్పురుషం
7) అన్యాయం న్యాయం కానిది తత్పురుష సమాసం

తత్పురుష సమాసాలు :
విభక్తులు ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాసాలను గూర్చి తెలిసికొన్నారు. కింది వాటిని కూడా పరిశీలించండి.
1) మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్యము (మధ్య భాగం)
2) పూర్వకాలము – కాలము యొక్క పూర్వము (పూర్వ భాగం)

గమనిక :
పై వాటిలో మొదటి పదాలైన మధ్య, పూర్వ అనే పదాలకు ‘ము’ అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరడం వల్ల
‘మధ్యము’, ‘పూర్వము’గా మారతాయి. ఇలా పూర్వపదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావడాన్ని ‘ప్రథమా తత్పురుష సమాసం’ అంటాము. కింది వాటిని పరిశీలించండి.
1) నఞ్ + సత్యం = అసత్యం – సత్యం కానిది
2) నఞ్ + భయం = అభయం – భయం కానిది
3) నఞ్ + అంతము = అనంతము – అంతము కానిది
4) నఞ్ + ఉచితం = అనుచితం – ఉచితము కానిది

గమనిక :
సంస్కృతంలో ‘నఞ్’ అనే అవ్యయం, వ్యతిరేకార్థక బోధకం. దీనికి బదులు తెలుగులో అ, అన్, అనే ప్రత్యయాలు వాడతారు. పై ఉదాహరణల్లో వాడిన ‘నం’ అనే అవ్యయాన్ని బట్టి, దీన్ని “నః తత్పురుష సమాసం” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

అభ్యాసము :
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామము పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) అర్థరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమా తత్పురుషం
2) అనూహ్యము ఊహ్యము కానిది నఞ్ తత్పురుషం
3) అక్రమం క్రమము కానిది నఞ్ తత్పురుషం
4) అవినయం వీనయం కానిది నఞ్ తత్పురుషం

4. కర్మధారయ సమాసం :
‘నల్లకలువ’ అనే సమాస పదంలో ‘నల్ల’, ‘కలువ’ అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం ‘నల్ల’ అనేది, విశేషణం. రెండో పదం ‘కలువ’ అనేది నామవాచకం. ఇలా విశేషణానికీ, సామవాచకానికీ (విశేష్యానికీ) సమాసం జరిగితే, దాన్ని కర్మధారయ సమాసం అంటారు.

4. అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం :
విశేషణం పూర్వపదంగా (మొదటి పదంగా) ఉంటే, ఆ సమాసాన్ని “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ అంటారు.
ఉదా :
1) తెల్ల గుర్రం – తెల్లదైన గుర్రం.
తెలుపు (విశేషణం) (పూర్వపదం) – (మొదటి పదం) గుర్రం – (నామవాచకం) (ఉత్తరపదం)- (రెండవ పదం)

ఆ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం :
మామిడి గున్న’ అనే సమాసంలో మామిడి, గున్న అనే రెండు పదాలున్నాయి. మొదటి పదం (పూర్వపదం) ‘మామిడి’ సోమవాచకం, రెండో పదం (ఉత్తరపదం) గున్న అనేది విశేషణం. ఇందులో విశేషణమైన ‘గున్న’ అనే పదం ఉత్తరపదంగా – అంటే రెండో పదంగా ఉండడం వల్ల, దీన్ని ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’ అంటారు. అభ్యాసము : కింది పదాలను చదివి, విగ్రహవాక్యాలు రాసి, ఏ సమాసమో రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) పుణ్యభూమి పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) మంచిరాజు మంచి వాడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3) కొతపుస్తకం కొత్తదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4) పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఇ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం :
‘తమ్మివిరులు’ అనే సమాసంలో, మొదటి పదమైన ‘తమ్మి’, ఏ రకం విరులో తెలియజేస్తుంది. ఇలా పూర్వపదం, నదులు, వృక్షాలు, ప్రాంతాలు మొదలైన వాటి పేర్లను సూచిస్తే దాన్ని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.
ఉదా : మట్టి చెట్టు – మట్టి అనే పేరు గల చెట్టు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
గంగానది – గంగ యనే పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
భారతదేశం – ‘భారతం’ అనే పేరు గల దేశం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

ఈ) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం :
‘కలువ కనులు’ అనే సమాసంలో కలువ, కనులు అనే రెండు పదాలున్నాయి. దీనికి ‘కలువల వంటి కన్నులు’ అని అర్థం. అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది. సమాసంలోని మొదటి పదం (పూర్వపదం) ఇక్కడ ‘ఉపమానం’ కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు.

ఉ) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం :
‘పదాబ్దము’ అనే సమాసంలో పద (పాదం) మరియు, అబ్జము (పద్మం) అనే రెండు పదాలున్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని. ఇక్కడ పాదాన్ని పద్మం (తామరపూవు)తో పోల్చడం జరిగింది. కాబట్టి పాదం ఉపమేయం. పద్మం ఉపమానం. ఉపమానమైన అబ్జము అనే పదం, ఉత్తరపదంగా (రెండవపదం) ఉండడం వల్ల దీన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు.

అభ్యాసం :
కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామాలు పేర్కొనండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) తేనెమాట తేనె వంటి మాట
తేనె – ఉపమానం, మాట – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
2) తనూలత లత వంటి తనువు
తనువు – ఉపమేయం, లత – ఉపమానం
ఉపమాన ఉత్తరపద కర్మధారయం
3) చిగురుకేలు చిగురు వంటి కేలు
చిగురు – ఉపమానం, కేలు – ఉపమేయం
ఉపమాన పూర్వపద కర్మధారయం
4) కరకమలములు కమలముల వంటి కరములు
కరములు – ఉపమేయం
కమలములు – ఉపమానం
ఉపమాన పూర్వపద కర్మధారయం

5. రూపక సమాసం :
‘విద్యాధనం’ – అనే సమాసంలో విద్య, ధనం అనే రెండు పదాలున్నాయి. పూర్వపదమైన విద్య, ధనంతో పోల్చబడింది. కాని ‘విద్య అనెడి ధనం’ అని దీని అర్థం కనుక, ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది. ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది ‘రూపక సమాసం’.

సమాస పదం విగ్రహవాక్యం
ఉదా : 1) హృదయ సారసం హృదయం అనెడి సారసం
2) సంసార సాగరం సంసారం అనెడి సాగరం
3) జ్ఞాన జ్యోతి జ్ఞానము అనెడి జ్యోతి
4) అజ్ఞాన తిమిరం అజ్ఞానము అనెడి తిమిరం
5) సాహితీ జగత్తు సాహిత్యమనెడి జగతు – రూపక సమాసం

6. బహుప్రీహి సమాసం :
అన్య పదార్థ ప్రాధాన్యం కలది. కింది ఉదాహరణను గమనించండి. ”
చక్రపాణి – చక్రం పాణియందు (చేతిలో) కలవాడు. ‘విష్ణువు’ అని దీని అర్థం. దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా “చక్రానికి” కాని “పాణికి” కాని ప్రాధాన్యం లేకుండా, ఆ రెండూ మరో అర్థం ద్వారా “విష్ణువును” సూచిస్తున్నాయి. ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యం లేకుండా, అన్యపదముల అర్థాన్ని స్ఫురింపజేసే దాన్ని బహుప్రీహి సమాసం అంటారు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది. ‘బహుబ్లి హి సమాసం’. అభ్యాసం : కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) నీలవేణి నల్లని వేణి కలది బహుబీహి సమాసం
2) నీలాంబరి నల్లని అంబరము కలది బహుబీహి సమాసం
3) ముక్కంటి మూడు కన్నులు గలవాడు బహుథీహి సమాసం
4) గరుడవాహనుడు గరుత్మంతుడు వాహనంగా కలవాడు బహుబీహి సమాసం
5) దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు బహుప్రీహి సమాసం
6) చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బహుప్రీహి సమాసం

7. అవ్యయీభావ సమాసం :
అవ్యయం పూర్వపదముగా ఉన్న సమాసాలను, “అవ్యయీభావ సమాసాలు” అంటారు.

అవ్యయం :
అవ్యయాలు అనగా లింగ, వచన, విభక్తి లేని పదాలు. ఈ విధమైన భావంతో ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసాలు అంటారు. ఈ క్రింది సమాస పదాలను, వాటికి రాయబడిన విగ్రహవాక్యాలను పరిశీలించండి.

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) ప్రతిదినము దినము దినము అవ్యయీభావ సమాసం
ఆ) యథాశక్తి శక్తి ఎంతో అంత (శక్తిననుసరించి) అవ్యయీభావ సమాసం
ఇ) ఆబాలగోపాలం బాలుడి నుండి గోపాలుడి వరకు అవ్యయీభావ సమాసం
ఈ) మధ్యాహ్నం అహ్నం మధ్యభాగం అవ్యయీభావ సమాసం
ఉ) అనువర్షం వర్షముననుసరించి అవ్యయీభావ సమాసం

గమనిక : ‘మధ్యాహ్నము” అనే సమాస పదానికి, విగ్రహం ‘మధ్యము – అహ్నము’ అని చెప్పాలి. ఇది ‘ప్రథమా తత్పురుష సమాసం’ అవుతుంది. అవ్యయీభావ సమాసం కాదు.

AP SSC 10th Class Telugu Grammar Samasalu సమాసాలు

పాఠ్యపుస్తకంలోని ముఖ్య సమాసాలు – విగ్రహవాక్యాలు :

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1)  నలుదెసలు నాలుగైన దెసలు ద్విగు సమాసం
2) సూర్యచంద్రులు సూర్యుడును,చంద్రుడును ద్వంద్వ సమాసం
3) చంపకవతి పట్టణం ‘చంపకవతి’ అనే పేరు గల పట్టణం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
4) మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయం సమాసం
5) సేవావృత్తి సేవ అనెడి వృత్తి రూపక సమాసం
6) పదాబ్దములు పద్మముల వంటి పదములు ఉపమాన ఉత్తరపద కర్మధారయం
7) కలువ కన్నులు కలువల వంటి కన్నులు ఉపమాన పూర్వపద కర్మధారయం
8) మామిడి గున్న గున్నయైన మామిడి విశేషణ ఉత్తరపద కర్మధారయం
9) మృదుమధురము మృదువును, మధురమును విశేషణ ఉభయపద కర్మధారయం
10) సత్యదూరము సత్యమునకు దూరము షష్ఠీ తత్పురుష సమాసం
11) అమెరికా రాయబారి అమెరికా యొక్క రాయబారి షష్ఠీ తత్పురుష సమాసం
12) వాదనాపటిమ వాదన యందు పటిమ సప్తమీ తత్పురుష సమాసం
13) అసాధ్యం సాధ్యము కానిది నఞ్ తత్పురుష సమాసం
14) నెలతాల్పు నెలను తాల్చువాడు ద్వితీయా తత్పురుష సమాసం
15) గురుదక్షిణ గురువు కొఱకు దక్షిణ చతుర్డీ తత్పురుష సమాసం
16) వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయా తత్పురుష
17) దొంగభయము దొంగ వలన భయము పంచమీ తత్పురుష సమాసం
18) ధూపదీపములు ధూపమును, దీపమును ద్వంద్వ సమాసం
19) శివభక్తి శివుని యందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం
20) రుద్రాక్షభూషలు ‘రుద్రాక్షలు’ అనే పేరు గల భూషలు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
21) వితంతు వివాహం వితంతువు యొక్క వివాహం షష్ఠీ తత్పురుష సమాసం
22) విద్యాధికులు విద్యచేత అధికులు తృతీయా తత్పురుష సమాసం
23) భారతదేశం భారతం అనే పేరు గల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
24) ముప్పయి సంవత్సరాలు ముప్ఫై సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం
25) స్త్రీ పురుషులు స్త్రీయును, పురుషుడును ద్వంద్వ సమాసం
26) ప్రముఖదినం ప్రముఖమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయం
27) నాలుగు గీతలు నాలుగు సంఖ్య గల గీతలు ద్విగు సమాసం
28) అసాధారణం సాధారణం కానిది నఞ్ తత్పురుష సమాసం
29) మానవచరిత మానవుల యొక్క చరిత షష్ఠీ తత్పురుష సమాసం

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Sandhulu సంధులు Notes, Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు, లేదా రాయవలసినప్పుడు “సంధి పదం” ఏర్పడుతుంది.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

సంధి కార్యం : రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

పర స్వరం :
సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.

ఉదా :
రామ + అయ్య : ‘రామ’ లోని ‘మ’ లో ‘అ’ పూర్వ స్వరం, ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

1. అత్వ సంధి సూత్రం
అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.

ఉదా : మేనల్లుడు = మేన + ‘అల్లుడు – (న్ +) అ + అ = అ) = (అత్వ సంధి)
1) ఒకప్పుడు : ఒక అప్పుడు = (అత్వ సంధి)
2) వచ్చినందుకు – వచ్చిన అందుకు : (అత్వ సంధి)
3) రాకుంటే ఉంటే (అత్వ సంధి)
4) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = (అత్వ సంధి)
5) పోవుటెట్లు : పోవుట + ఎట్లు = (అ + ఎ (అత్వ సంధి)
6) కొండంత = కొండ + అంత = (అ + ఎ (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే, పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. పై ఉదాహరణలలో ‘అ’ లోపించింది కాబట్టి ఇది ‘అత్వ సంధి’.

దీనిని అత్వ సంధి లేక ‘అకార సంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి, అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

2. ఇత్వ సంధి సూత్రం
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
ఏమ్యాదులు = ఏమి మొదలగునవి.

ఏమి, మణి, కి (షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. (కి షష్ఠి అంటే ‘కిన్’)

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య” కారం ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = ఇ + (య్ + అ) = య (ఇకార సంధి రాని యడాగమ రూపం)

గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారానికి, సంధి వైకల్పికంగా జరుగుతుంది.

వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) = (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణలలో హ్రస్వ ‘ఇ’ కారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వ సంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.

అభ్యాసం :
ఉదా : 1) ఏమంటివి = ఏమి + అంటివి : (మ్ + ఇ + అ = మ) : ఇత్వ సంధి
2) పైకెత్తినారు : పైకి + ఎత్తినారు : (ఇ + ఎ = ఎ) : ఇత్వ సంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు – (ఇ + అ = అ) – ఇత్వ సంధి

3. ఉత్వ సంధి సూత్రం
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా : రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) : (ఉత్వ సంధి)
1) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (A + ఎ = ఎ) : (ఉత్వ సంధి)
2) మనమున్నాము = మనము + ఉన్నాము : (ఉ + ఉ = ఉ) : (ఉత్వ సంధి)
3) మనసైన . మనసు + ఐన = (A + ఐ = ఐ) : . (ఉత్వ సంధి)

గమనిక :
హ్రస్వ ఉ కారానికి, అనగా ఉత్తునకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ‘ఉ’ కారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

నిత్యం :
నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం.

4. యడాగమ సంధి సూత్రం
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ – మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు
గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.

అ) మా + య్ + అమ్మ : మా ‘య’ మ్మ
ఆ) మా + య్ . + ఇల్లు : మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

5. ఆమ్రేడిత సంధి సూత్రం
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే, రెండోసారి ఉచ్చరింపబడిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఉదా :
1) ఆహాహా = ఆహా + ఆహా – ‘ఆహా’ అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2) అరెరె : అరె అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3) ఔరౌర – ఔర + . ఔర = రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణలలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = (ఔర్ + అ)
ఆహా + ఆహా = (ఆహ్ + ఆ)
ఓహో + ఓహో = (ఓహ్ + ఓ)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా = (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె = (ఎ + అ = ఎ)

గమనిక :
ఆమ్రేడిత సంధి, ఈ కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. వీటిని గమనిస్తే, సంధి జరిగిన రూపం ఒకటి, సంధిరాని రూపము మరొకటి కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు – ఎబ్లెట్లు, ఎట్లుయెట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి సూత్రం
ఆమ్రేడితం పరమైనపుడు, కడాదుల తొలి యచ్చు మీది వర్ణాల కెల్ల అదంతమైన ద్విరుక్తటకారం వస్తుంది.
కడాదులు (కడ + ఆదులు) = కడ, ఎదురు, కొన, చివర, తుద, తెన్ను, తెరువు, నడుము, పగలు, పిడుగు, బయలు, మొదలు, మొదలైనవి కడాదులు.

కింది ఉదాహరణలను గమనించండి.
1) పగలు + పగలు = పట్టపగలు
2) చివర + చివర = చిట్టచివర
3) కడ + కడ = కట్టకడ

గమనిక :
1) పగలు + పగలు – పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ఋ’ వచ్చింది. ‘మీ’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.
2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘జ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3) కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘జ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
కొన + కొన = కొట్టకొన
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్టబయలు
తుద + తుద : తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల మొదటి అచ్చు మీద ఉన్న అన్ని అక్షరాలకు, ‘ఋ’ (ద్విరుక్తటకారం) వస్తుండడం గమనించాం.

7. ద్రుతప్రకృతిక సంధి సరళాదేశ సంధి
ద్రుతప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.

ఈ కింది పదాలు చదివి, పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చేసెన్ 5) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, న్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివర గల పదాలను, “ద్రుతప్రకృతికాలు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చేసెన్, ఉండెన్ – అనేవి ద్రుతప్రకృతికాలు

కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా:
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప : పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : ‘ ‘ చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి : దెసను + జూసి

గమనిక :
ద్రుతప్రకృతికానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ట’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1) క – ‘గ’ గా
2) చ – ‘జ’ గా
3) ట – ‘డ’ గా
4) త – ‘ద’ గా
5) ప – ‘బి’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చ ట త ప’ లకు, ‘పరుషాలు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళాలు’ అని పేరు.

దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

ద్రుత ప్రకృతిక సంధి సూత్రం (1):
ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు, సరళాలు వస్తాయి.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు (ద్రుతం అరసున్నగా మారింది)
1) పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది)
2) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది)
3) పూచెను గలువలు. (ద్రుతం మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

ద్రుత ప్రకృతిక సంధి సూత్రం (2) : ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

8. గసడదవాదేశ సంధి సూత్రం
ప్రథమ మీది పరుషాలకు గ,స,డ,ద,వ లు బహుళంబుగా వస్తాయి.

కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1) గొప్పవాడు = గదా – గొప్పవాడు + కదా (డు + క)
2) కొలువుసేసి = కొలువు + చేసి (వు + చే)
3) వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4) నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + తె)
5) పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక : పై ఉదాహరణలలో పూర్వపదం చివర, ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, చ, ట, త, ప, లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద ప్రత్యయాలు, క, చ, ట, త, ప లు పరమైతే, వాటి స్థానంలో గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి. అంటే
1) క – గ గా మారుతుంది.
2) చ – స గా మారుతుంది.
3) ట – డ గా మారుతుంది.
4) త – ద గా మారుతుంది.
5) ప – వ గా మారుతుంది.

అంటే క, చ, ట, త, ప లకు గ, స, డ, ద, వ లు ఆదేశంగా వస్తాయి.

ద్వంద్వ సమాసంలో : గసడదవాదేశ సంధి

కింది పదాలను గమనించండి.

కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు : ఊరు + పల్లె + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చట త ప లకు, గసడదవ లు వచ్చాయి. దీన్నే గసడదవా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి సూత్రం:
ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క చట త ప లకు గసడదవలు క్రమంగా వస్తాయి.

కింది పదాలను కలపండి.
1) అక్క , చెల్లి : అక్కసెల్లెండ్రు
2) అన్న తమ్ముడు – అన్నదమ్ములు

9. టుగాగమ సంధి సూత్రం
కర్మధారయములందు ఉత్తునకు, అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది.

ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం అదనంగా వచ్చే సంధిని, ‘టుగాగమ సంధి’ అంటారు. అలాగే కింది పదాలు కూడా గమనించండి. తేనె, పల్లె అనే పదాల చివర ‘ఉ’ లేక పోయినా, టుగాగమం వచ్చింది.
1) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2) పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు

గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.

సూత్రం :
కర్మధారయమునందు పేర్వాది శబ్దాలకు అచ్చు పరమైనపుడు, టుగాగమం విభాషగా వస్తుంది.
ఉదా :
1) పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2) చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3) పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

10. లులన సంధి సూత్రం
లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ‘ము’ గాగమానికి లోపమూ, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ విభాషగా వస్తాయి.

ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1) పుస్తకములు – పుస్తకాలు
2) దేశముల – దేశాల
3) జీవితమున – జీవితాన
4) గ్రంథములు – గ్రంథాలు
5) రాష్ట్రముల – రాష్ట్రాల
6) వక్షమున – వృక్షాన

పై పదాల్లో మార్పును గమనించండి.

పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.

గమనిక :
ఈ మార్పులో, లు,ల, న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.

11. పడ్వాది సూత్రం
పడ్వాదులు పరమైనపుడు ‘ము’ వర్ణకానికి లోప పూర్ణబిందువులు విభాషగా వస్తాయి.

ఈ కింది ఉదాహరణలు గమనించండి.
1) భయము + పడు = భయంపడు, భయపడు

విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.

గమనిక :
పడ్వాదులు = పడు, పట్టె, పాటు అనేవి.

12. త్రిక సంధి సూత్రం
1. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికం అనబడతాయి.
2. త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్వితం బహుళంగా వస్తుంది.
3. ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు, ఆచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది.

ఈ కింది ఉదాహరణ చూడండి.
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుండు = అనే దానిలో, ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.

అలాగే ఈ, ఏ లు అనే త్రికములు కూడా, ఇ, ఎ లుగా మారతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు = ఎవ్వాడు

త్రిక సంధి సూత్రం (1):
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు

త్రిక సంధి సూత్రం (2) : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు అచ్ఛిక దీరానికి హ్రస్వం అవుతుంది.
ఉదా : 1) ఇక్కాలము 2) ఎవ్వాడు

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేదాదులు = (పేద + ఆదులు) పేద మొదలైనవి.

పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, అయిదువ, మనుమ, గొడ్డు మొదలైనవి పేదాదులు.
ఉదా : పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు

పై రెండు పదాలకు మధ్య ‘5’ అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలెంత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం’ అంటే ‘5’ వస్తుంది. ఆగమం : రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.

మనుమ + ఆలు = మనుమరాలు
బాలెంత + ఆలు = బాలెంతరాలు

రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమమూ వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు

14. పుంప్వాదేశ సంధి సూత్రం
కర్మధారయ సమాసాల్లో “ము” వర్ణకానికి బదులు “పుంపులు” ఆదేశంగా వస్తాయి.

గమనిక :
“ము” అనే వర్ణకానికి బదులుగా “పు” కాని, “ఎపు” కాని వస్తుంది. దీన్ని వ్యాకరణ దృష్టిలో “ఆదేశం” అని పిలుస్తారు. కింది పదాలు విడదీసి చూడండి. మార్పును గమనించండి.
ఉదా :
అచ్చపు పూలతోట = అచ్చము + పూలతోట

అ) నీలపుఁగండ్లు = నీలము + కండ్లు
ఆ) ముత్తెపుసరులు = ముత్తెము + సరులు
ఇ) సరసపుమాట = సరసము + మాట

గమనిక :
పైన పేర్కొన్న ఉదాహరణలలో రెండు మార్పులను మనం గమనించవచ్చు.

అ) మొదటి పదాల్లో ‘ము’ వర్ణకం లోపించింది.
ఆ) ప్రతి సంధి పదంలోనూ మొదటి పదం విశేషణాన్ని తెలుపుతుంది.

గమనిక :
సమాసంలో మొదటి పదం విశేషణం, రెండవ పదం విశేష్యం అయితే, ఆ సమాసాలను “విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారని మనకు తెలుసు. అంటే ఈ పుంప్వాదేశ సంధి, కర్మధారయ సమాసాల్లో ఏర్పడుతుందని గ్రహించాలి.

అభ్యాసం :
కింది పదాలను విడదీసి, సంధి సూత్రాన్ని సరిచూడండి.

అ) సింగపు కొదమ
జవాబు:
సింగపుకొదమ : సింగము + ‘కొదమ = పుంప్వాదేశ సంధి

గమనిక :
ఇక్కడ సింగము అనే మొదటి పదం చివర ఉన్న “ము” వర్ణకం పోయి, “పు” ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది “పుంప్వాదేశ సంధి.”

ఆ) ముత్యపుచిప్ప
జవాబు:
ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప + పుంప్వాదేశ సంధి
గమనిక :
ఇక్కడ ముత్యము అనే మొదటి పదం చివర ఉన్న “ము” వర్ణకం పోయి, “పు” ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది “పుంప్వాదేశ సంధి.”

ఇ) కొంచెపు నరుడు
జవాబు:
కొంచెపునరుడు = కొంచెము + నరుడు = పుంప్వాదేశ సంధి
గమనిక :
ఇక్కడ కొంచెము అనే పూర్వపదం చివర ఉన్న “ము” వర్ణకం పోయి, “పు” ఆదేశంగా వచ్చింది. కాబట్టి ఇది పుంప్వాదేశ సంధి.

15. ప్రాతాది సంధి సూత్రం
సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్ల లోపం బహుళంగా వస్తుంది.

కింద గీత గీసిన పదాలను విడదీయండి. మార్పులు గమనించండి.

అ. పూరెమ్మ అందంగా ఉన్నది.
జవాబు:
పూరెమ్మ : పూవు + రెమ్మ – ప్రాతాది సంధి

ఆ. గురుశిష్యులు పూదోటలో విహరిస్తున్నారు.జవాబు:
పూదోట : పూవు + తోట = ప్రాతాది సంధి

ఇ) కొలనులో కెందామరలు కొత్త శోభను వెదజల్లుతున్నాయి.
జవాబు:
కెందామరలు – కెంపు + తామరలు = ప్రాతాది సంధి

ఈ) ఆ ముసలివానిలాగే అతని ప్రాయిల్లు జీర్ణమైయున్నది.
జవాబు:
ప్రాయిల్లు : పాత + ఇల్లు = ప్రాతాది సంధి

పై సంధి పదాల విభజనను సరిచూడండి. వచ్చిన మార్పు గమనించండి.
అ) పూవు + రెమ్మ = పూరెమ్మ = ప్రాతాది సంధి
ఆ) పూవు + తోట = పూఁదోట = ప్రాతాది సంధి
ఇ) కెంపు + తామరలు = కెందామరలు = ప్రాతాది సంధి
ఈ) ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు = ప్రాతాది సంధి
ఉ) మీదు + కడ = మీఁగడ = ప్రాతాది సంధి

గమనిక :
1) ఈ ఐదు సందర్భాలలోనూ మొదటి పదంలోని మొదటి అక్షరం తరువాత ఉన్న వర్ణాలన్నీ లోపిస్తాయి.
2) రెండవ పదం మొదట ఉన్న పరుషా (త, క) లు, సరళా (ద, గ) లుగా మారాయి.

పై మార్పులను బట్టి, ప్రాతాది సంధి నియమాలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు.

ప్రాతాది సంధి

ప్రాతాది సంధి సూత్రము (1):
సమాసాలలో ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణాలకెల్ల లోపం బహుళంగా వస్తుంది.
1) పూవు + తోట = పూ + తోట
2) కెంపు + తామర = కెల + తామర
3) మీదు + కడ = మీ + కడ

ప్రాతాది సంధి సూత్రము (2) :
లోపింపగా మిగిలిన (సంధిలోని) మొదటి అక్షరానికి పరుషాలు పరమైతే నుగాగమం (‘న్’ ఆగమంగా) వస్తుంది.
1) పూ + న్ + తోట = పూదోట
2) కె +న్ + తామర = కెందామర
3) మీ + 5 + కడ = మీగడ

గమనిక :
నుగాగమంలోని ‘స్’ అనేది, పూర్ణబిందువుగా గాని, అర్థబిందువుగా గాని, సరళాదేశ సంధి వల్ల మారుతుంది.
ఉదా : 1) పూఁదోట
2) కెందామర
3) మీఁగడ

గమనిక :
ప్రాతాదులు అంటే ‘పాత’ మొదలయిన కొన్ని మాటలు. అవి
1) ప్రాత
2) లేత
3) క్రొత్త
4) క్రిందు
5) కెంపు
6) చెన్ను మొ||నవి.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

16. నుగాగమ సంధి సూత్రం
ఉదంతమగు తద్ధర్మార్థక విశేషణానికి అచ్చు పరమైనపుడు నుగాగమం వస్తుంది.

అభ్యాసం :
కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.

అ) నుగాగమ సంధి:

అ) చేయునతడు = చేయు + అతడు
ఆ) వచ్చునపుడు = వచ్చు + అపుడు

గమనిక :
చేయు, వచ్చు వంటి క్రియలు చివర ‘ఉత్తు’ను, అనగా హ్రస్వ ఉకారాన్ని కల్గి ఉంటాయి. కాబట్టి వీటిని ‘ఉదంతాలు’ అంటారు. ఇవి తద్ధర్మార్థక క్రియలు. అంటే ఏ కాలానికైనా వర్తించే క్రియలు. ఈ ఉదంత, తద్ధర్మార్థక క్రియలకు అచ్చు కలిసింది. అప్పుడు ‘న్’ అనే అక్షరం కొత్తగా వస్తుంది. ‘న్’ ఆగమంగా అనగా ఉన్న అక్షరాలను కొట్టి వేయకుండా వస్తుంది. కాబట్టి ఇది “నుగాగమ సంధి’.
ఉదా :
చేయు + అతడు = చేయు +న్ + అతడు = చేయునతడు
వచ్చు + అప్పుడు = వచ్చు + న్ + అప్పుడు = వచ్చునప్పుడు

గమనిక :
అతడు, అప్పుడు అనే పదాలలోని ‘అ’ అనే అచ్చు పరంకాగా, కొత్తగా ‘న్’ ఆగమంగా వచ్చి, నుగాగమం అయింది.

ఉదా :
1) వచ్చునప్పుడు
2) చేయునతడు

ఆ. నుగాగమ సంధి:

గమనిక :
ఈ పై సందర్భాలలోనే కాక, మరికొన్ని చోట్ల కూడా నుగాగమం వస్తుంది. కింది పదాలు విడదీసి, పరిశీలించండి.
అ) తళుకుం గజ్జెలు
ఆ) సింగపుం గొదమ

పై సంధి పదాలను విడదీస్తే
అ) తళుకుం గజ్జెలు – తళుకు + గజ్జెలు
ఆ) సింగపుం గొదమ = సింగము + కొదమ

గమనిక :
‘తళుకు గజ్జెలు’ అనే సంధి పదంలో ‘తళుకు’ అనే పదం, ఉత్తు చివర గల స్త్రీ సమశబ్దం. ఇటువంటి ఉదంత స్త్రీ సమపదాలకు, పరుషాలుగాని, సరళాలుగాని పరమైతే నుగాగమం వస్తుంది.
ఉదా :
తళుకు + 5 + గజ్జెలు = ద్రుతానికి సరళ స్థిరాలు పరమైతే పూర్ణబిందువు వస్తుంది. తళుకుం గజ్జెలు అవుతుంది.

అలాగే పుంపులకు, పరుష సరళాలు పరమైతే, నుగాగమం వస్తుంది.

గమనిక :
సింగపు + కొదమ అనే చోట ‘సింగపు’ అన్న చోట చివర ‘పు’ ఉంది. దానికి ‘కొదమ’ లో మొదటి అక్షరం ‘అ’ అనేది పరుషం పరమైంది. పుంపులకు పరుషం పరమైంది. కాబట్టి ‘నుగాగమం’ అనగా ‘5’ వస్తుంది.
ఉదా :
సింగపు + 5 + కొదమ సరళాదేశం రాగా సింగపుఁగొదమ అవుతుంది.

అభ్యాసం :
కింది ఉదాహరణలు పరిశీలించి, లక్షణ సమన్వయం చేయండి.
ఉదా :
తళుకుంగయిదువు – తళుకు + 5 + కయిదువు = సరళాదేశ సంధి రాగా, తళుకుం గయిదువు అవుతుంది.

గమనిక :
తళుకు అన్నది (ఉదంత స్త్రీ సమం); ‘కయిదువు’ పదంలో మొదట ‘క’ అనే పరుషము ఉంది. కాబట్టి నుగాగమం వస్తుంది.

1. చిగురుం గయిదువు
జవాబు:
చిగురుం గయిదువు = చిగురు + కయిదువు
గమనిక :
‘చిగురు’ అనేది ఉదంత స్త్రీ సమశబ్దం. దానికి కయిదువు అనే పదం పరమయ్యింది. కయిదువులో ‘క’ అనే పరుషం పరమైంది.

ఉదంత స్త్రీ సమశబ్దాలకు పరుషం పరమయింది కాబట్టి ‘నుగాగమం’ వచ్చింది.
ఉదా :
చిగురు + న్ + కయిదువు , తరువాత సరళాదేశం రాగా చిగురుఁగయిదువు అవుతుంది.

2. సరసపుఁదనము
జవాబు:
సరసము + తనము
గమనిక :
‘సరసముతనము’ అనేది కర్మధారయ సమాసం. అందువల్ల కర్మధారయాలలోని ‘ము’ వర్ణకానికి పు, ంపులు వస్తాయి.
ఉదా : సరసపు + తనము

ఇక్కడ పుంపులకు పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది. ‘సరసపు’ లోని పుంపులకు ‘తనము’లోని ‘త’ పరుషం పరమైంది. కాబట్టి నుగాగమం (న్) వచ్చింది.
ఉదా :
సరసపు + న్ + తనము – చివరకు సరళాదేశం రాగా ‘సరసపుఁదనము’ అవుతుంది.

ఇ) నుగాగమ సంధి:
గమనిక :
ఇంకా మరికొన్ని సందర్భాల్లోనూ నుగాగమం వస్తుంది. కింది పదాలను విడదీయండి.

అ) విధాతృనానతి = విధాతృ + ఆనతి
ఆ) రాజునాజ్ఞ = రాజు + ఆజ్ఞ
విధాతృ + ఆనతి = విధాత యొక్క ఆనతి
రాజు + ఆజ్ఞ = రాజు యొక్క ఆజ్ఞ

విగ్రహవాక్యాలను అనుసరించి, పై సంధి పదాలు షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినవి.

పూర్వపదం చివర స్వరాలు అనగా అచ్చులు “ఋ” కారం, “ఉత్తు” ఉన్నాయి.

గమనిక :
ఈ విధంగా షష్ఠీ తత్పురుష సమాసపదాల్లో, “A” కార, “ఋ” కారములకు అచ్చుపరమైతే నుగాగమం (5) వస్తుంది.
ఉదా :
1) విధాతృ + ఆనతి (విధాత యొక్క ఆనతి) = విధాతృ + న్ + ఆనతి
2) రాజు + ఆజ్ఞ (రాజు యొక్క ఆజ్ఞ = రాజు + న్ + ఆజ్ఞ

ఈ) నుగాగమ సంధి సూత్రం :
షష్ఠీ తత్పురుష సమాసంలో “ఉ” కార, “బు” కారాలకు అచ్చుపరమైనపుడు నుగాగమం వస్తుంది.
ఉదా :
విధాతృ + న్ + ఆనతి = విధాతృనానతి
రాము + న్ + ఆజ్ఞ = రామునాజ్ఞ

షష్ఠీ తత్పురుషంలో నుగాగమ సంధి సూత్రం :
షష్ఠీ సమాసమందు “ఉ” కార, ‘ఋ” కారాలకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన తెలుగు సంధులు

సంధి పదము విడదీత సంధి పేరు
1) వంటాముదము = వంట + ఆముదము = అత్వ సంధి
2) ఏమనిరి = ఏమి + అనిరి = ఇత్వ సంధి
3) అవ్విధంబున = ఆ + విధంబున = త్రిక సంధి
4) సింగపుకొదమ = సింగము + కొదమ = పుంప్వాదేశ సంధి
5) ముత్యపుచిప్ప = ముత్యము + చిప్ప = పుంప్వాదేశ సంధి
6) కొంచేపునరుడు = కొంచెము + నరుడు = పుంప్వాదేశ సంధి
7) బంధమూడ్చి = బంధము + ఊడ్చి = ఉత్వ సంధి
8) అవ్వారల = ఆ + వారల = త్రిక సంధి
9) భక్తురాలు = భక్త + ఆలు = రుగాగమ సంధి
10) బాలెంతరాలు = బాలెంత + ఆలు = రుగాగమ సంధి
11) గుణవంతురాలు = గుణవంత + ఆలు = రుగాగమ సంధి
12) దేశాలలో = దేశము + లలో = లులన సంధి
13) పుస్తకాలు = పుస్తకము + లు = లులన సంధి
14) సమయాన = సమయము + న = లులన సంధి
15) చిగురుంగయిదువు = చిగురు + కయిదువు = నుగాగమ సంధి
16) సరసపుఁదనము = సరసము + తనము = నుగాగమ సంధి
17) ఆనందాన్నిచ్చిన = ఆనందాన్ని + ఇచ్చిన = ఇత్వ సంధి
18) మేమంత = మేము + అంత = ఉత్వ సంధి
19) ఇవ్వీటిమీద = ఈ + వీటిమీద = త్రిక సంధి
20) భిక్షయిడదయ్యే = భిక్ష + ఇడదయ్యె = యడాగమ సంధి
21) ఆగ్రహముదగునె = ఆగ్రహము + తగునె = గసడదవాదేశ సంధి
22) ఉన్నయూరు = ఉన్న + ఊరు = యడాగమ సంధి
23) అందుఁ జూడాకర్ణుడు = అందున్ + చూడాకర్ణుడు = సరళాదేశ సంధి
24) చూడాకర్ణుడను = చూడాకర్ణుడు + అను = ఉత్వ సంధి
25) పరివ్రాజకుడు గలడు = పరివ్రాజకుడు + కలడు = గసడదవాదేశ సంధి

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

గమనిక :
‘అ’ వర్ణానికి – ‘అ’, ‘ఆ’ లు సవర్ణాలు
‘ఇ’ వర్గానికి – ‘ఇ’, ‘ఈ’ లు సవర్ణాలు
‘ఉ’ వర్గానికి – ‘ఉ’, ‘ఊ’ లు సవర్ణాలు
‘ఋ’ వర్గానికి – ‘ఋ’, ‘బూ’ లు సవర్ణాలు

1. ఉదా :
1) రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రామాలయం = రామ + ఆలయం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) గంగాంబ = గంగ + అంబ = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

2. ఉదా :
4) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు – (ఇ’ + ఇ = ఈ), = సవర్ణదీర్ఘ సంధి
5) శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తి + ఈశ్వర – (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

3. ఉదా :
6) భానూదయం . = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
7) వధూపేతుడు : వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి

4. ఉదా :
8) పిత్రణం : పితృ + ఋణం = (ఋ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
9) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ – ఋ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి సూత్రం
అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైతే, ఏ, ఓ, అర్ లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు = (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు – నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి
రామేశ్వర = రామ + ఈశ్వర (అ + ఇ = ఏ) = గుణ సంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = (అ + ఉ = ఓ) = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి = (అ + ఋ = అర్) = గుణ సంధి
మహర్షి = మహా + ఋషి = (అ + ఋ = అర్) = గుణ సంధి

పై ఉదాహరణలు పరిశీలిస్తే
1) అ, ఆ లకు ఇ, ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2) అ, ఆ లకు ఉ, ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3) అ, ఆ లకు ఋ, ౠలు కలిసి ‘అర్’ గా మారడం – గమనించగలం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి వీడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చులు, అ, ఆ లుగానూ, పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, ఉ, ఋ – లుగానూ ఉన్నాయి.

గమనిక :
1) అ, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2) అ, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3) అ, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.
ఏ, ఓ, అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

3. యణాదేశ సంధి సూత్రం
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే, య, వ, రలు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
1. ఉదా :
అ) అత్యానందం = అతి + ఆనందం – (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1) అత్యంతం = అతి + అంతం = (త్ + ఇ + అ = య) = యణాదేశ సంధి
2) అభ్యంతరం = అ + అంతరం = (త్ + ఇ + అ = య) = యణాదేశ సంధి

2. ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2) గుర్వాజ్ఞ = (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

3. ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
3) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = ర) = యణాదేశ సంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ -రలు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని ‘యణాదేశ సంధి అంటారు. యణాదేశ సంధిలో ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ప్’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.

4. వృద్ధి సంధి సూత్రం
అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారమూ వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక = వసుధా + ఏక = = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. ఉదా :
సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం =దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. ఉదా :
పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి

4. ఉదా :
రనౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ – ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ – ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశోన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ – ఔ) = వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది
1. వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’.వచ్చింది.
2. పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, ఏ, ఐ, ఔలు ఉన్నాయి.
3. అకారానికి ఏ, ఐలు కలిపినపుడు ‘బి’ వచ్చింది.
4. అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘&’ వచ్చింది.

వృద్ధులు = ఐ, ఔలను ‘వృద్ధులు’ అంటారు.

5. జశ్వ సంధి సూత్రం
పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ, పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు

పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో, ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.

గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, క, చ, ట, త, ప (పరుషాలు),లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, జ, డ, ద, బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.

కింది పదాలను విడదీయండి.
1) దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి (క్ – గ్ గా మారింది)
2) మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి (త్ -ద్ గా మారింది)
3) ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జత్త్వ సంధి (త్ -ద్ గా మారింది)
4) వాగీశుడు = వాక్ ఈశుడు = జత్త్వ సంధి (క్ – గ్ గా మారింది)
5) వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జశ్వ సంధి (క్ – గ్ గా మారింది)
6) వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి (క్ – గ్ గా మారింది)
7) తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి (త్ -ద్ గా మారింది)

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

6. అనునాసిక సంధి సూత్రం
వర్గ ప్రథమాక్షరాలకు (కటతలకు) ‘న’ గాని, ‘మ’ గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంగా వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
అ) వాజ్మయం = వాక్ + మయం = అనునాసిక సంధి
ఆ) రాణ్మహేంద్రవరం = రాట్ + మహేంద్రవరం = అనునాసిక సంధి
ఇ) జగన్నాథుడు = జగత్ + నాథుడు = అనునాసిక సంధి

గమనిక :
పై సంధులు జరిగిన తీరు గమనించండి.
అ) వాక్ + మయం = వాజ్మయం = ‘క్’ స్థానంలో ‘జ’ వచ్చింది.
ఆ) రాట్ + మణి = రాణ్మణి = ‘ట్’ స్థానంలో ‘ణ’ వచ్చింది.
ఇ) జగత్ + నాథుడు = జగన్నాథుడు = ‘త్’ స్థానంలో ‘న’ వచ్చింది.

గమనిక :
1) పై మూడు సంధి పదాలలోనూ మొదటి పదం చివర వరుసగా క, ట, త, లు ఉన్నాయి.
2) వాటికి ‘మ’ గాని, ‘న’ గాని పరమయినాయి. అంటే తరువాత కలిశాయి.
3) 1) అప్పుడు పూర్వపదం చివర గల ‘క’ కారం, ‘క’ వర్గకు అనునాసికమైన ‘జ’ గా మారుతుంది. (క, ఖ, గ, ఘ, ఙ)
2) అప్పుడు పూర్వపదం చివర గల ‘ట’ కారం, ‘ట’ వర్గకు అనునాసికమైన ‘ణ’ గా మారింది. (ట, ఠ, డ, ఢ, ణ)
3) అప్పుడు పూర్వపదం చివర గల ‘త’ కారం, దాని అనునాసికమైన ‘న’ (త థ ద ధ న) గా ఆదేశం అవుతాయి.
దీనినే ‘అనునాసిక సంధి’ అంటారు.

అభ్యాసము :
1) తన్మయము = తత్ + మయము = అనునాసిక సంధి
2) రాణ్మణి = రాట్ + మణి , – అనునాసిక సంధి
3) వాజ్మయము = వాక్ + మయము = అనునాసిక సంధి
4) మరున్నందనుడు = మరుత్ + నందనుడు = అనునాసిక సంధి

7.అ) విసర్గ సంధి సూత్రం
అకారాంత పదాల మీద ఉన్న విసర్గకు, వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు (క, చ, ట, త, ప, ఖ, ఛ, ఠ, థ, ఫ, శ, ష, సలు కాక, మిగతా అక్షరాలు) కలిసినపుడు, విసర్గ లోపించి “అ” కారం ‘ఓ’ కారంగా మారుతుంది.

ఉదాహరణలు చూడండి :
అ) నమోనమః = నమః + నమః
ఆ) మనోహరం : మనః + హరం
ఇ) పయోనిధి : పయః + నిధి
ఈ) వచోనియమం = వచః + నియమం

గమనిక :
ఈ నాలుగు ఉదాహరణలలో అకారాంత పదాల మీద ఉన్న విసర్గ లోపించి, ‘అ’ కారం ‘ఓ’ కారంగా మారింది.

ఆ) విసర్గ సంధి సూత్రం
విసర్గకు శ,ష,సలు కలిసినపుడు, విసర్గ శ,ష,స,లుగా మారి శ,ష,సలు ద్విత్వాలుగా మారుతాయి.
ఉదాహరణలు :
అ) మనశ్శాంతి : మనః + శాంతి
ఆ) చతుషష్టి : చతుః + షష్టి
ఇ) నభస్సుమం : నభః + సుమం

గమనిక :
విసర్గము, ప్రక్కనున్న శ, ష, స లుగా మారి, ద్విత్వాలుగా అయ్యింది. ఆయా పదాలను కలుపగా, వరుసగా మనశ్శాంతి, చతుషష్టి, నభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి.

ఇ) విసర్గ సంధి సూత్రం
విసర్గకు క,ఖ,ప,ఫ,లు కలిస్తే విసర్గమారదు. (సంధి ఏర్పడదు.)
ఉదాహరణలు :
అ) ప్రాతఃకాలము = ప్రాతః + కాలము = విసర్గ సంధి
ఆ) తపఃసలము = తపః + ఫలము = విసర్గ సంధి

గమనిక :
పై ఉదాహరణలలో విసర్గకు క, ఫ లు పరం అయ్యాయి. కాబట్టి విసర్గ మారకుండా యథాప్రకారంగానే ఉంది.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

ఈ) విసర్గ సంధి సూత్రం
అంతః, దుః, చతుః, ఆశీః, పునః మొదలయిన పదాల తరువాత ఉండే విసర్గ, రేఫ (‘ర్’)గా మారుతుంది.
ఉదా :
అంతః + ఆత్మ : అంతర్ – + ఆత్మ = అంతరాత్మ
అ) దుః + అభిమానం = దుర్ + అభిమానం = దురభిమానం
ఆ) చతుః + దిశలు = చతుర్ + దిశలు = చతుర్దశలు
ఇ) ఆశీః + వాదము = ఆశీర్ + వాదము = ఆశీర్వాదము
ఈ) పునః + ఆగమనం = పునర్ + ఆగమనం = పునరాగమనం
ఉ) అంతః + మథనం = అంతర్ + మథనం = అంతర్మథనం

ఉ) విసర్గ సంధి సూత్రం
ఇస్, ఉర్ల విసర్గకు, క, ఖ, ప, ఫ, లు కలిస్తే, విసర్గ ‘ష’ కారంగా మారుతుంది.\
ఉదా :
ధనుష్కోటి : ధనుస్ట్ + కోటి = ధనుష్ + కోటి = ధనుష్కోటి
అ) నిష్ఫలము = నిస్ + ఫలము = నిష్, + ఫలము = నిష్ఫలము
ఆ) దుష్కరము = దుస్ + కరము – దుష్ – + కరము = దుష్కరము

గమనిక :
ఇస్ (ఇజి), ఉస్ (43) ల విసర్గలకు క,ఖ,ప,ఫ లు కలిసినపుడు, విసర్గ అనగా ‘స్’ కారము ‘ష’ కారంగా మారుతుంది.

ఊ) విసర్గ సంధి సూత్రం
విసర్గకు (అనగా ‘స్’ కు) చ ఛ లు పరమైతే ‘శ’ కారం, ట ఠలు పరమైతే ‘ష’ కారం, త థ
లు పరమైతే ‘స’ కారం వస్తాయి.
ఉదా :
అ) దుశ్చేష్టితము = దుః + చేష్టితము (విసర్గము – శ్ గా మారింది)
ఆ) ధనుష్టంకారం = ధనుః + టంకారము (విసర్గము ష్ గా మారింది)
ఇ) మనస్తాపము = మనః + తాపము (విసర్గము ‘స’గా మారింది)
ఈ) నిస్తేజము = నిః + తేజము (విసర్గము ‘స’గా మారింది)

గమనిక :
పై ఉదాహరణలలో విసర్గకు చ ఛలు పరమైతే ‘శ’ కారం, ట ఠలు పరమైతే ‘ష’ కారం త థలు పరమైతే ‘స’ కారం వస్తుంది.

పై ఉదాహరణలు గమనిస్తే విసర్గ సంధి ఆరు విధాలుగా ఏర్పడుతోందని తెలుస్తోంది.

8. శ్చుత్వ సంధి సూత్రం
‘స’ కార, ‘త’ వర్గాలకు, ‘శ’ కార ‘చ’ వర్గా (చ ఛ జ ఝ) లు పరమైతే, ‘శ’ కార ‘చ’ వర్గాలే వస్తాయి.

కింది ఉదాహరణలను పరిశీలించండి.
అ) తప + శక్తి → తపస్ + శక్తి → తపశ్శక్తి
ఆ) నిః + శంక → నిస్ + శంక → నిశ్శంక
ఇ) మనః + శాంతి → మనస్ + శాంతి → మనశ్శాంతి

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదాలలో ఉన్న విసర్గ సంధి కార్యంలో విసర్గను ‘స’ గా తీసుకుంటున్నాం. విసర్గకు ‘స్’ కారం వస్తుంది. అలా విసర్గ స కారం కాగా, ఆ ‘స’ కారానికి ‘శ’ వర్ణం పరం అవుతుంది. ఇలా పరం అయినపుడు ఆ ‘స’ కారం, ‘శ’ కారంగా మారుతుంది. అనగా ‘శవర్ణ ద్విత్వం వస్తుంది.
ఆ) నిస్ + చింత → నిశ్చింత
సత్ + ఛాత్రుడు → సచ్ఛాత్రుడు
శరత్ + చంద్రికలు → శరచ్చంద్రికలు
జగత్ + జనని → జగజ్జనని
శార్జిన్ + జయః → శారిఞ్జయః

గమనిక :
పై పదాల్లో ‘స’ కార, ‘త’ వర్గాలు పూర్వపదాంతంగా ఉన్నాయి. ‘శ’ కార, ‘చ’ వర్గాలు (త, న) పరమైనాయి. అలా పరమైనప్పుడు ‘శ’ కార, చ వర్గాలుగా మారుతాయి.

అనగా

1) స్ + చి = శ్చి
2) త్ + జ = జ్జ
3) త్ + శా = చ్చా
4) న్ + జ = ఞ్జ
5) త్ + చ = చ్చ

ఈ విధంగా ‘స’ కార ‘త’ వర్గాలకు (తథదధన) లకు, ‘శ’ కార, ‘చ’ వర్గాలు వస్తే అది “శ్చుత్వ సంధి” అవుతుంది.

AP SSC 10th Class Telugu Grammar Sandhulu సంధులు

పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన సంస్కృత సంధులు

1) అత్యంత = అతి + అంత = యణాదేశ సంధి
2) పుణ్యవాసము = పుణ్య + ఆవాసము = సవర్ణదీర్ఘ సంధి
3) స్నిగ్గాంబుదము = స్నిగ్ధ + అంబుదము = సవర్ణదీర్ఘ సంధి
4) పురాతనాపాదితము = పురాతన + ఆపాదితము = సవర్ణదీర్ఘ సంధి
5) సహస్రాబ్దం = సహస్ర + అబ్దం = సవర్ణదీర్ఘ సంధి
6) వేదోక్తము = వేద + ఉక్తము = గుణ సంధి
7) మదోన్మాదము = మద + ఉన్మాదము = గుణ సంధి
8) సరభసోత్సాహం = సరభస + ఉత్సాహం = గుణ సంధి
9) జీవనోపాధి = జీవన + ఉపాధి = గుణ సంధి
10) మహోపకారం = మహా + ఉపకారం = గుణ సంధి
11) గుణౌద్ధత్యం = గుణ + ఔద్ధత్యం = వృద్ధి సంధి
12) రసైకస్థితి = రస + ఏకస్థితి = వృద్ధి సంధి
13) తన్మయము = తత్ + మయము = అనునాసిక సంధి
14) వాజ్మయము = వాక్ + మయము = అనునాసిక సంధి
15) రాణ్మణి = రాట్ + మణి = అనునాసిక సంధి
16) మరున్నందనుడు = మరుత్ + నందనుడు = అనునాసిక సంధి
17) రాణ్మహేంద్రపురం = రాట్ + మహేంద్రపురం = అనునాసిక సంధి
18) జగన్నాథుడు = జగత్ + నాథుడు = అనునాసిక సంధి
19) నమోనమః = నమః . + నమః = విసర్గ సంధి
20) మనోహరం = మనః . + హరం = విసర్గ సంధి
21) పయోనిధి = పయః + నిధి = విసర్గ సంధి
22) వచోనిచయం = వచః + నిచయం = విసర్గ సంధి
23) ప్రాతఃకాలము = ప్రాతః + కాలము = విసర్గ సంధి
24) తపఃఫలము = తపః + ఫలము = విసర్గ సంధి
25) నిష్ఫలము = నిస్ + ఫలము = విసర్గ సంధి
26) దుష్కరము = దుస్ + కరము = విసర్గ సంధి
27) ధనుష్టంకారము = ధనుః + టంకారము = విసర్గ సంధి
28) మనస్తాపము = మనః + తాపము = విసర్గ సంధి
29) దురభిమానం = దుః + అభిమానం = విసర్గ సంధి
30) నిరాడంబరం = ఆడంబరం = విసర్గ సంధి
31) దుర్భేద్యము = దుః + భేద్యము = విసర్గ సంధి
32) తపోధనుడు = తపః + ధనుడు = విసర్గ సంధి
33) నిరాశ = నిస్ + ఆశ = విసర్గ సంధి
34) దుశ్చేష్టితము = దుస్ + చేష్టితము = శ్చుత్వ సంధి
35) నిశ్చింత = నిస్ + చింత = శ్చుత్వ సంధి
36) సచ్ఛాత్రుడు = సత్ + ఛాత్రుడు = శ్చుత్వ సంధి
37) శరచ్చంద్రికలు = శరత్ + చంద్రికలు = శ్చుత్వ సంధి
38) జగజ్జనని = జగత్ + జనని = శ్చుత్వ సంధి
39) శారిజ్జయః = శార్జిన్ + జయః = శ్చుత్వ సంధి

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ

10th Class Telugu ఉపవాచకం 6th Lesson యుద్ధకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఇ) విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
ఇ) విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు.
అ) వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.

2. అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
ఇ) అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్ఛపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.
జవాబులు
ఆ) సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు.
అ) లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు.
ఇ) అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రామలక్ష్మణులను మూర్చపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

3. అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
జవాబులు
ఇ) ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు.
ఈ) ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు.
అ) సుషేణుని సూచన మేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్లాడు.
ఆ) ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది.

4. అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని’ శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
జవాబులు
ఇ) ‘నా వంశ ప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన . ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చు’నని శ్రీరాముడు అన్నాడు.
ఈ) శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే శరణ్యమని భావించింది.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు.
అ) ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు.

5. అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
జవాబులు
ఆ) పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు.
ఈ) శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్లీ బతికించాడు.
ఇ) పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
అ) అంగరంగ వైభవంగా శ్రీరామపట్టాభిషేక మహోత్సవం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

6. అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు.
జవాబులు
ఇ) సముద్రుడిని ప్రార్థించడం వల్ల అది సాధ్యపడదన్నాడు విభీషణుడు.
ఆ) అంగదుని చేతిలో రావణుని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు.
ఈ) రావణుడి బాణ శక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు.
అ) రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుడి గుండెలో నాటుకుంది.

7. అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్తానికి బలైనాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
జవాబులు
ఇ) అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు.
ఆ) విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు.
ఈ) విభీషణుని లంకారాజుగా లక్ష్మణుడు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.
అ) యజ్ఞయాగాది క్రతువులను శ్రీరాముడు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.

8. అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
ఆ) శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు.
ఇ) రావణుని వద్దకు అంగదుడిని రాయబారిగా పంపాడు రాముడు.
అ) కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

9. అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
జవాబులు
ఈ) ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరు సముద్రతీరాన్ని చేరుకున్నారు.
అ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుడిని ఉపాసించాడు.
ఇ) వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తి అయింది.
ఆ) సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించాడు.

10. అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొని వచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడు హనుమంతుని సాహసాన్ని ప్రశంసించాడు.
ఈ) లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు.
ఆ) అగ్నిదేవుడు స్వయంగా సీతను తీసుకొనివచ్చి ఆమె గొప్పతనాన్ని కొనియాడాడు.
అ) పుష్పక విమానంలో సీతా రామలక్ష్మణులు నందిగ్రామం చేరుకున్నారు.

పాత్ర స్వభావాలు

1. రావణుడు :
కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకా నగరానికి అధిపతి. వేదాధ్యాయనం చేసినవాడు. శివభక్తుడు. కోపం ఎక్కువ. మూర్ఖత్వం ఎక్కువ. మంచి చెబితే వినడు. చెప్పిన వారిపై కక్ష కడతాడు. సీతాపహరణ చేశాడు. స్త్రీ వ్యా మోహం ఎక్కువ. శ్రీరాముని ఆగ్రహానికి గురి అయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు.

2. విభీషణుడు :
రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకుని వచ్చినపుడు అది తప్పని చెప్పేవాడు. సీతాదేవిని అపహరించడం తప్పని చెప్పిన ధర్మాత్ముడు. అనేక ధర్మసూక్ష్మాలు తెలిసినవాడు. రావణునిచేత అనేక అవమానాలు పడ్డాడు. ధర్మ రక్షణకోసం శ్రీరాముని పక్షంలో చేరాడు. రాక్షస నాశనానికి కారకుడయ్యాడు. రావణ సంహారం తర్వాత లంకా నగరానికి రాజయ్యాడు.

3. ఇంద్రజిత్తు :
రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది.

రావణుడు తన తమ్ముడైన కుంభకర్ణుణ్ణి, కొడుకైన అతికేయుని పోగొట్టుకొని తల్లడిల్లుతుంటే ఇంద్రజిత్తు ఆయనను ఓదార్చాడు. తాను యుద్ధ రంగానికి వచ్చి రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్ళు స్పృహ కోల్పోయినట్లు నటిస్తే మరణించారని భావించి ఆ వార్తను తన తండ్రికి తెలియచేశాడు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనే ఆలోచన కలవాడు ఇంద్రజిత్తు. అందుకే మాయ సీతను సృష్టించి ఆమెను సంహరించాడు. చివరికి లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడు.” అన్న శ్రీరాముని మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
రావణుడు ప్రయోగించిన “శక్తి” అనే ఆయుధం కారణంగా నేలకూలిన లక్ష్మణుడిని చూసి విలవిలలాడిపోతూ శ్రీరాముడు అన్న మాటలివి.

ఈ మాటలు రామలక్ష్మణులకు గల అనుబంధాన్ని సోదరప్రేమను చాటుతున్నాయి. అన్నకోసం అన్ని సుఖాలు . వదులుకొని అడవులకు వచ్చినవాడు లక్ష్మణుడు. అతడు లేనిచో తాను జీవించలేనని భావించినందున రాముడు ఈ మాటలు అన్నాడు. ఇవి రాముడికి లక్ష్మణునిపై గల ప్రేమాభిమానాలను సూచిస్తున్నాయి. శ్రీరామునికి లక్ష్మణుడు తలలోని నాలుకలాంటివాడని, ఆరోప్రాణమని ఈ మాటల ద్వారా నేను గ్రహించాను. లక్ష్మణుడి వంటి సోదరుడు ఎవరికీ దొరకడని గ్రహించాను.

ప్రశ్న 2.
“వ్యక్తులు జీవించి వున్నంత వరకే వైరముండాలి. తరువాత దానిని వదలి వేయాలి” అని విభీషణుడితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి మీరేం గ్రహించారు?
జవాబు:
1. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరముండాలి, తరువాత దానిని వదిలివేయాలి అని విభీషణునితో శ్రీరాముడు పలికిన మాటలను బట్టి రాముడు గొప్ప వ్యక్తిత్వం కలవాడని నేను గ్రహించాను.
2. ఏ వ్యక్తి అయినా మరణించిన తర్వాత అతనితో పూర్వము ఉన్న వైరము మరచిపోవాలని, మరణముతోనే వైరము పోవాలని గ్రహించాను.
3. రావణుని మరణానంతరము శ్రీరాముడు విభీషణునితో “రావణుడు నీకు ఎటువంటి వాడో నాకు కూడా అటువంటివాడే” అని చెప్పి తన విశాల హృదయాన్ని చాటుకొన్నాడని గ్రహించాను.
4. రాముడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, మరణించిన శత్రువు పట్ల గౌరవ భావం కలవాడని గ్రహించాను.

ప్రశ్న 3.
“నీవు యుద్ధంలో అలసిపోయావు. సేద దీర్చుకొనిరా” అని రాముడు రావణాసురునితో చెప్పిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామరావణుల యుద్ధం మహాఘోరంగా సాగుతోంది. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలపై పడింది. అప్పుడు కావాలంటే రాముడు రావణుని సంహరింపవచ్చు. కాని ధర్మాత్ముడయిన, కరుణా సముద్రుడయిన రాముడు రావణుడు తనకు శత్రువయినా అతనిపై దయతలచాడు. రావణునితో రాముడు “నీవు యుద్ధంలో అలసిపోయావు, విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్దానికి రా” అని చెప్పి రావణుని దయతలచి విడిచిపెట్టాడు.

దీనిని బట్టి రాముడు శత్రువుపట్ల కూడా దయచూపే కరుణాంతరంగుడని గ్రహించాను. ధనుస్సు చేతపట్టిన ఆయుధం చేతిలో ఉన్న వీరునితోనే రాముడు యుద్ధం చేసేవాడని, రాముడు మహావీరుడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 4.
“వానరా! భళా, నాకు శత్రువువే అయినా, నీ శక్తిని మెచ్చుకుంటున్నాను” అని రావణుడు హనుమంతునితో అన్న – మాటలను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
యుద్ధంలో హనుమంతుడిని రావణుడు తన అరచేతితో చరచాడు. హనుమంతుడు తిరిగి కోపంతో రావణుడిని తన అరచేతితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు రావణుడు కంపించి పోయి, హనుమంతుడి బలపరాక్రమాలనూ, శక్తినీ, మెచ్చుకుంటూ పై విధంగా మాట్లాడాడు.

ఈ రావణుని మాటలను బట్టి, హనుమంతుడు మహాబలశాలి, ధైర్యశాలి, శక్తివంతుడు అనీ, రావణుడంతటి వీరునిచే ప్రశంసలు పొందిన గొప్ప బలపరాక్రమ సంపన్నుడనీ, నేను గ్రహించాను. శత్రువుచే మెచ్చుకోబడిన హనుమంతుడే నిజమైన వీరుడని నేను అభిప్రాయపడ్డాను.

ప్రశ్న 5.
“సీతను శ్రీరామునికి అప్పగించడమే, అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? శ్రీరాముని పంటి మహావీరునితో యుద్ధం తగదు” అని విభీషణుడు అన్న రావణునకు చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విభీషణుడు రావణాసురునికి తమ్ముడయినా, రాక్షసుడయినా, అతడు ధర్మాత్ముడనీ, విభీషణునికి రావణుడు చేసిన సీతాపహరణం ఇష్టం లేదనీ, సీతమ్మను రామునికి తిరిగి అప్పగించడం శ్రేయస్కరమని విభీషణుడు భావించాడనీ గ్రహించాను. శ్రీరాముడు మహావీరుడని గ్రహించాను. పరస్త్రీహరణం పాపకార్యం అనీ, అది ఎంత బలవంతునికైనా చేటు తెస్తుందనీ గ్రహించాను. విభీషణుడు రాక్షస జాతిలో పుట్టిన రత్నమాణిక్యం వంటివాడని, బుద్ధిమంతుడనీ గ్రహించాను. విభీషణుడు ధైర్యవంతుడనీ, అందుకే అన్నకు ఇష్టం లేకపోయినా, అన్నకు హితమైన మాటను ధైర్యం చేసి చెప్పాడనీ గ్రహించాను.

ప్రశ్న 6.
“సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తథ్యం” అని అంగదుడు పలికిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకను చేరాడు. అంగదుడిని రావణుని వద్దకు రాయబారిగా పంపించాడు. అంగదుడు రావణుని సమీపించి హితోపదేశం చేశాడు. సీతను శ్రీరామునికి అప్పగించకపోతే మరణం తప్పదని రావణుని హెచ్చరించాడు.

అంగదుని మాటల వల్ల శ్రీరాముడి పరాక్రమం, ధైర్యం, సాహసం అసమానమైనదని గ్రహించాను. అంగదుడిని రాయబారిగా రాముడు పంపించడం వల్ల శ్రీరాముడు రాజనీతిజ్ఞుడని గ్రహించాడు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచన శ్రీరామునికి ఉందని గ్రహించాను. అంతేగాదు శ్రీరాముని యుద్ధనీతిని కూడా గ్రహించాను.

ప్రశ్న 7.
యుద్ధరంగంలో అగస్త్యుడు శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామరావణ యుద్ధం భీకరంగా సాగుతున్నది. ఆ సమయంలో అగస్త్యుడు శ్రీరాముడిని సమీపించాడు. ఆ మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. రామునిలో విజయకాంక్షను పెంచాడు. చక్కని విజయాన్ని అందించాడు. అగస్త్యుడు చేసిన ఉపదేశం ద్వారా ఆదిత్య హృదయం సర్వ విజయప్రదమని, శత్రువులను జయించు సామర్థ్యాన్ని అందించగలదని, యుద్ధరంగంలో శక్తిని సమకూర్చగలదని గ్రహించాను. ఆదిత్య హృదయాన్ని చదివితే ఆరోగ్యం కూడా కలుగుతుందని, అందువల్లనే శ్రీరాముడు రావణుని జయించగలిగాడని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
సముద్రానికి వారధిని ఎవరు కట్టారు? ఎలా?
జవాబు:
విశ్వకర్మ కుమారుడు నలుడు. శిల్పకళా నిపుణుడు. ఉత్సాహవంతుడు. శక్తియుక్తులున్నవాడు. సేతువును భరిస్తానని శ్రీరామునకు సముద్రుడు మాట ఇచ్చాడు. నలుడు నిర్మిస్తానన్నాడు. వానరుల సహకారంతో నలుడి సూచనలననుసరించి సేతువు నిర్మాణం 5 రోజులలో పూర్తయింది. అది వంద యోజనాల పొడవు. పది యోజనాల వెడల్పు కలది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రావణ మరణాన్ని వర్ణించండి.
జవాబు:
ఇంద్రుడు పంపిన రథాన్ని శ్రీరాముడు అధిరోహించాడు. రాముడు యుద్ధ నైపుణ్యం ముందు రావణుడు ఆగలేకపోతున్నాడు. అగస్త్యుడు రామునికి ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించాడు. రామబాణ ధాటికి రావణ శిరస్సులు నేలరాలుతున్నాయి. మళ్ళీ మొలుస్తున్నాయి. మాతలి సూచనతో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు శ్రీరాముడు. రావణుడు అంతమయ్యాడు.

ప్రశ్న 3.
శ్రీరామ పట్టాభిషేకాన్ని వివరించండి.
జవాబు:
రావణ మరణానంతరం శ్రీరామ విజయం సీతకు హనుమ చెప్పాడు. అగ్ని ప్రవేశానంతరం సీతాదేవి శ్రీరాముని చేరింది. పుష్పక విమానంలో అయోధ్యకు చేరారు. పౌరులు ఘనస్వాగతం పలికారు. గురువులకు, పెద్దలకు నమస్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. రామరాజ్యం ఏర్పడింది. ప్రజలకు శ్రీరామరక్ష కలిగింది.

ప్రశ్న 4.
శ్రీరాముడు శరణుకోరిన విభీషణుని ఆదరించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
శ్రీరాముడు శరణుకోరిన విభీషణునితో “నేను రావణుణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమారుస్తాను. నిన్ను రాజును చేస్తా” నని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. రాముని ఆజ్ఞపై లక్ష్మణుడు సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయటం జరిగింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు సముద్రునిపై అస్త్ర ప్రయోగానికి సిద్ధపడటానికి కారణం ఏమిటి? దాని పర్యవసానమేమిటి?
జవాబు:
లంకకు వెళ్ళాలంటే రాముడు సముద్రం దాటాలి. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుడిని రాముడు అడిగాడు. సముద్రుడిని ప్రార్థించమని విభీషణుడు సలహా చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుడిని ప్రార్థించాడు. మూడు రాత్రులు గడచినా సముద్రుడు ఎదుట కనబడలేదు.

కోపముతో శ్రీరాముడి కళ్ళు ఎరుపు ఎక్కాయి. సముద్రుడి అహంకారాన్ని పోగొట్టాలనీ, సముద్రంలో నీటిని ఇంకిపోయేటట్లు చేయాలనీ రాముడు అనుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు బ్రహ్మాస్తమును స్మరించాడు.

దానితో ప్రకృతి అంతా అల్లకల్లోలమయ్యింది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తేవాడిపై బాణం ప్రయోగించరాదని, శ్రీరాముడు ఆగాడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి తాను దారి ఇస్తానన్నాడు.

ఎక్కుపెట్టిన బాణం వృథాకారాదని, రాముడు సముద్రుడి మాటపై పాపాత్ములు ఉండే ద్రుమకుల్యంపై దాన్ని ప్రయోగించాడు. సేతువు నిర్మించడానికి నలుడు సమర్థుడనీ, సేతువును తాను భరిస్తాననీ, సముద్రుడు రామునికి చెప్పాడు. సేతు నిర్మాణం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
అంగద రాయబారాన్ని వివరించండి.
జవాబు:
అంగదుడు వాలి కుమారుడు. మహాశక్తిమంతుడు. రావణుడితో యుద్ధానికి దిగేముందు, రాముడు రావణుని దగ్గరకు అంగదుని రాయబారిగా పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వెళ్ళి, సీతను రామునికి అప్పగించకపోతే, శ్రీరాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమనీ, లంకకు విభీషణుడు రాజు కాగలడనీ, రావణుడిని హెచ్చరించాడు.

దానితో రావణుని సభ అంతా అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు. అంగదుడు ఆ రాక్షసులను తన చంకలో ఇరికించుకొని, మేడపైకి ఎగిరాడు. అంగదుడు మేడపై నుండి ఆ రాక్షసులను నేలపైకి విసిరాడు.

తరువాత అంగదుడు సింహనాదం చేసి, ఆకాశమార్గంలో శ్రీరాముడిని చేరాడు. ఈ విధంగా శ్రీరాముడు రావణుని భావాన్ని గ్రహించాడు. ఇక రావణుడితో యుద్ధం చేయక తప్పదని రాముడు నిశ్చయించాడు.

ప్రశ్న 3.
రావణుని శక్తి ఆయుధ ప్రయోగం వలన కలిగిన పరిణామాలను వివరించండి.
జవాబు:
రావణుడు తనతో యుద్ధం చేస్తున్న లక్ష్మణుడి పై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం, లక్ష్మణుడి హృదయంలో గుచ్చుకుంది. దానితో లక్ష్మణుడు స్పృహ తప్పాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని వెళ్ళాలని అనేక విధాల ప్రయత్నించాడు. కాని రావణుడు లక్ష్మణుడిని పైకి ఎత్తలేకపోయాడు.

అప్పుడు ఆంజనేయుడు రావణుడి మీద దాడి చేశాడు. హనుమంతుడు రావణుడి వక్షఃస్థలం మీద తన పిడికిలితో గట్టిగా గుద్దాడు. దానితో రావణుడు కూలిపోయాడు. హనుమంతుడు లక్ష్మణుడిని శ్రీరాముడి వద్దకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముడి పరాక్రమం ముందు, రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది. రావణుని కిరీటం నేలకూలింది.

శ్రీరాముడు రావణునిపై దయతలచి “రావణా ! నీవు యుద్ధంలో అలసిపోయావు.. విశ్రాంతి తీసుకొనిరా” అని చెప్పాడు. రావణుడు యుద్ధం నుండి తిరుగుముఖం పట్టాడు.

ప్రశ్న 4.
రామరావణ సంగ్రామాన్ని వివరించండి.
జవాబు:
రాముడు హనుమంతుడి భుజాలపై కూర్చుండి, రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమంతో రావణుని ధనుస్సు ముక్కలయ్యింది. రావణుడి కిరీటం నేలకూలింది. రాముడు రావణునిపై దయతలచి అప్పటికి విడిచి పెట్టాడు.

తరువాత రామలక్ష్మణులతో రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. రావణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై వేశాడు. రాముడు శక్తిని వేడుకున్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుడికి తగిలింది. రాముడు శక్తిని విరిచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

హనుమ తెచ్చిన ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు తన సారధి మాతలిని, తన దివ్యరథాన్ని, రాముని కోసం పంపాడు. రాముడు ఇంద్ర రథం ఎక్కి రావణుడితో యుద్ధం చేశాడు. రామరావణులు సమానంగా పోరాడారు.

రాముడు విజృంభించడంతో, రావణుడి రథసారధి రావణుని రథాన్ని ప్రక్కకు మరలించాడు. రావణుడు తన సారధిని మందలించాడు. తిరిగి రావణ రథం, రాముని ముందు నిలిచింది. అగస్త్య మహర్షి దేవతలతో వచ్చి, రామునికి ఆదిత్యహృదయ మంత్రం ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలపై రాలి తిరిగి మొలుస్తున్నాయి. అప్పుడు మాతలి రావణునికై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని రామునికి చెప్పాడు. రాముని బ్రహ్మాస్త్రంతో, రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
శ్రీరాముడు సైన్యంతో లంకానగరాన్ని చేరిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతాదేవిని చూసి వచ్చి కుశల వార్తను అందించిన హనుమను శ్రీరాముడు ఆలింగనం చేసికొన్నాడు. మహోపకారం చేసిన హనుమకు తాను ఇయ్యగల సత్కారం అదే అన్నాడు. రాముడికి దుఃఖం వచ్చింది. సుగ్రీవుడు రాముడిని ఓదార్చాడు. క్రోధం చూపించాలి అని రామునికి సుగ్రీవుడు సలహా ఇచ్చాడు. సముద్రానికి సేతువు కడితేకాని, లంకను జయించలేము అన్నాడు. హనుమ లంకానగర రక్షణ వ్యవస్థను గూర్చి తెలిపాడు.

విజయ ముహూర్తంలో లంకకు బయలుదేరాలని రాముడు అన్నాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపించాలని, రాముడు హనుమంతుని భుజం మీద, లక్ష్మణుడు అంగదుని భుజం మీద కూర్చొని వెళ్ళాలని, సుగ్రీవుడు పల్లకిపై రావాలని, రాముడు నిర్ణయించాడు. అందరూ సముద్రతీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడు ధర్మం విడిచిన రావణుని విడిచి పెట్టి, తన నలుగురు అనుచరులతో రామలక్ష్మణులు ఉన్న చోటికు చేరాడు. విభీషణుడు రాముని శరణు కోరగా, రాముడు అంగీకరించాడు. రాముడు రావణుని చంపి విభీషణుణ్ణి రాజును చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ పనిలో రామునికి తాను సహాయం చేస్తానని విభీషణుడన్నాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేయమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు ఆ పని చేశాడు. సముద్రుణ్ణి ప్రార్థిస్తే సముద్రాన్ని దాటగలవని విభీషణుడు రామునికు చెప్పాడు. శ్రీరాముడు సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రోజులు అయినా, సముద్రుడు ప్రసన్నుడు కాలేదు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగుపెట్టాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానని సముద్రుడు చెప్పాడు. రాముడు ఎక్కుపెట్టి అస్త్రం వ్యర్థం కాకుండా, పాపాత్ములు ఉండే “ద్రుమకుల్యం” పై ప్రయోగించాడు. నలుడు సేతువు నిర్మించడానికి తగినవాడని సముద్రుడు చెప్పాడు. సేతువును భరిస్తానని సముద్రుడు మాట ఇచ్చాడు.

రాముడు సేతువు నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వానరులు వృక్షాలు తెచ్చి సముద్రంలో పడవేశారు. 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు గల సేతువు 5 రోజుల్లో కట్టబడింది. రామలక్ష్మణ సుగ్రీవులు ముందు నడుస్తున్నారు. సైన్యం వారి వెంట నడిచింది. వానరులు కొందరు సముద్రంలో దూకి ఈదుతూ వచ్చారు.

ఈ విధంగా శ్రీరాముడు, సుగ్రీవుడు మొదలయిన వానర నాయకులతో లంకా నగరానికి చేరాడు.

ప్రశ్న 6.
వానర సైన్యానికీ, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం వివరాలను తెలపండి.
జవాబు:
రాముడు సైన్యాన్ని విభాగించి, ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. రావణుని మంత్రులైన శుకసారణులు రాముని బలం తెలిసికోడానికి గూఢచారులుగా వచ్చి వానరులలో చేరారు. విభీషణుడు వారిని గుర్తించి, రాముని ముందు పెట్టాడు. రాముడు వారిని క్షమించి, సీతను అప్పగించకపోతే రావణుడి మరణం తప్పదని హెచ్చరించాడు. శుకసారణులు రావణునికి ఆ విషయం తెలిపారు.

రావణుడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో మరణించాడని సీతకు అబద్దం చెప్పాడు. విద్యుజిహ్వుడిచే రామునివి అనిపించే మాయా శిరస్సునూ, ధనుర్భాణాలనూ తెప్పించి, సీతకు చూపించాడు. సీతను తన్ను ఆశ్రయించమని కోరాడు. సీత విచారించింది. విభీషణుడి భార్య “సరమ” సీతను ఊరడించి రాముడు క్షేమంగా ఉన్నాడనీ, అదంతా రాక్షసమాయ అనీ సీతకు తెలిపింది.

శ్రీరామ చంద్రాదులు సువేల పర్వతానికి చేరారు. లంకానగర శోభను చూశారు. రావణుడు ఠీవిగా మేడపై ఉన్నాడు. సుగ్రీవుడు రావణునిపై కోపంతో ఎగిరి రావణ భవనంపై వాలాడు. తన నుండి రావణుడు తప్పించుకోలేడని, రావణుడి కిరీటాన్ని తీసి నేలపై కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ఇద్దరికీ బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడిని ముప్పుతిప్పలు పెట్టి, తిరిగి సువేల పర్వతం చేరాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి మందలించాడు.

అంగదుడిని రాముడు రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. రాముడి చేతిలో రావణుడు మరణిస్తాడని, విభీషణుడు రాజు అవుతాడని రాముని వాక్యంగా, అంగదుడు రావణునికి తెలిపాడు. అంగదుడిని నలుగురు రాక్షసులు చంపబోయారు. అంగదుడు వారిని చంపి వచ్చాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు.

లంకపై దండయాత్ర :
వానరసైన్యం లంకను నాల్గువైపుల నుండి ముట్టడించింది. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుడి చేతిలో విద్యున్మాలి మరణించారు. అంగదుడి చేతిలో ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దానితో ఇంద్రజిత్తు కపట యుద్దానికి దిగాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రంతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు రావణుడితో చెప్పాడు. రావణుడు ఆజ్ఞాపించగా “త్రిజట మొదలయిన రాక్షస స్త్రీలు సీతను పుష్పక విమానంలో యుద్ధభూమికి తీసుకువచ్చి, నేలపై ఉన్న రామలక్ష్మణులను చూపించారు. సీత ఏడ్చింది. త్రిజట సీతను ఓదార్చింది. రామలక్షణులు బతికి ఉన్నారని ఆమె సీతకు ఆధారాలు చూపింది. సీత మనస్సు కుదుట పడింది.

గరుత్మంతుడి రాకతో నాగాస్త్ర ప్రభావం నుండి రామలక్ష్మణులు విముక్తి పొందారు. హనుమంతుడు అకంపనుణ్ణి, ధూమ్రాక్షుణ్ణి చంపాడు. అంగదుడు వజ్రదంష్ట్రుడిని, నీలుడు ప్రహస్తుడిని చంపాడు. రావణుడి చేతిలో సుగ్రీవుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు రావణుడిని ఎదిరించాడు. రావణుడు బాణవర్షం కురిపించాడు. హనుమ అడ్డుకున్నాడు. రావణుడి అరచేతి దెబ్బకు హనుమ చలించి, తిరిగి తేరుకొని, రావణుడిని అరచేతితో కొట్టాడు. దశగ్రీవుడు కంపించిపోయి, ‘భళా! వానరా’ అని హనుమశక్తిని మెచ్చుకున్నాడు.

రావణుడు ‘శక్తి’ అనే ఆయుధాన్ని లక్ష్మణుడి పై వేశాడు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. రావణుడు లక్ష్మణుడిని ఎత్తుకొని పోవడానికి విఫలయత్నం చేశాడు. ఆంజనేయుడు పిడికిలితో పొడిచి రావణుడిని కూలగొట్టి, లక్ష్మణుడిని రాముని దగ్గరకు చేర్చాడు. శ్రీరాముడు హనుమంతుని భుజాలపై కూర్చుండి రావణునితో యుద్ధం చేశాడు. రావణుని కిరీటం, ధనుస్సు నేలపై పడ్డాయి. రాముడు కరుణించి, అలసిపోయిన రావణుడిని విశ్రాంతి తీసుకొని తిరిగి యుద్ధానికి రమ్మన్నాడు.

ప్రశ్న 7.
రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి.
జవాబు:
హనుమంతుని భుజాలపై కూర్చుండి, రాముడు రావణునితో యుద్ధం చేశాడు. రాముని పరాక్రమం ముందు, రావణుని ధనుస్సు, కిరీటం దాసోహం అన్నాయి. రాముడు రావణునిపై దయతలచి, “నీవు యుద్ధంలో అలసిపోయావు. విశ్రాంతి తీసుకొని రేపురా, నా బలం తెలుస్తుంది” అన్నాడు.

రావణుడు అంతఃపురానికి వెళ్ళి తమ్ముడు కుంభకర్ణుని నిద్ర నుండి లేపించాడు. కుంభకర్ణుడు ఆరునెలలు నిద్రపోయి, ఒకరోజు భోజనం చేస్తూ ఉంటాడు. రావణుడు కుంభకర్ణుడికి విషయం వివరించాడు. కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయి, వానరులను చావగొడుతున్నాడు. వానరులు తలో దారి పట్టారు. రాముడు కుంభకర్ణుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు. కుంభకర్ణుని తల, లంకలో పడి రాజవీధులలోని భవనాల, ఇంటి కప్పులు, ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త విని రావణుడు విచారించాడు.

రావణ పుత్రుడైన “అతికాయుడు” లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. ఇంద్రజిత్తు తండ్రిని ఓదార్చాడు. ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వచ్చి, రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రామలక్ష్మణులు స్పృహ కోల్పోయినట్లు పడియున్నారు. అదిచూసి రామలక్ష్మణులు మరణించారని ఇంద్రజిత్తు తండ్రికి చెప్పాడు.

వానరులు అలజడి చెందడంతో, విభీషణుడు వారికి ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులు బ్రహ్మపై గౌరవంతో అస్త్ర బాధను అనుభవించారని విభీషణుడు వానరులకు చెప్పాడు. బ్రహ్మాస్త ప్రభావంతో 67 కోట్ల మంది మరణించారు. హనుమ, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు ధ్వనిని బట్టి విభీషణుడిని గుర్తించాడు. హనుమ క్షేమమా ? అని జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. హనుమ జీవిస్తే వానరులంతా జీవించినట్లే అన్నాడు. హనుమ సర్వౌషధి పర్వతాన్ని పెల్లగించి తెచ్చాడు. ఓషధుల వాసనకు రామలక్ష్మణుల గాయాలు మాయం అయ్యాయి. వానరులు లేచి కూర్చున్నారు. వానరులు లంకకు నిప్పు పెట్టారు.

ఇంద్రజిత్తు మాయా. సీతను సంహరించాడు. అందరూ చనిపోయింది నిజం సీత అనుకున్నారు. ఈ వార్త తెలిసి రాముడు విచారించాడు. అది ఇంద్రజిత్తు మాయ అని విభీషణుడు తెలిపాడు. శత్రువుల సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచార హోమాన్ని తలపెట్టాడు. ఇంద్రజిత్తు యజ్ఞాన్ని భంగం చేయడానికి లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణ ఇంద్రజిత్తులు ఘోరయుద్ధం చేశారు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు తలను ఐంద్రాస్త్రంతో నేల రాల్చాడు.

రావణుని యుద్ధం :
రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు. వానరులు పారిపోతున్నారు. సుగ్రీవుడు విరూపాక్షుడిని, మహోదరుడిని సంహరించాడు. రామలక్ష్మణులతో రావణుడి యుద్ధం భయంకరంగా సాగుతోంది. రావణుడు విభీషణుడిని చంపడానికి బల్లెము ఎత్తాడు. అప్పుడు లక్ష్మణుడు రావణునిపై బాణాలను వేశాడు. రావణుడు లక్ష్మణునిపై ‘శక్తి’ అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. శ్రీరాముడు ‘శక్తి’ని వేడుకొన్నాడు. శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. శక్తి లక్ష్మణుని మాత్రం తాకింది. అతడు నేలపై పడ్డాడు. రాముడు ఆ శక్తిని లాగి విరచివేశాడు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడు పరుగుపెట్టాడు.

పడిపోయిన లక్ష్మణుడిని చూసి, రాముడు విలవిలలాడాడు. సుషేణుడు లక్ష్మణుడు చనిపోలేదని చెప్పాడు. సుషేణుడి సూచన ప్రకారంగా హనుమ ఓషధులు తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. ఇంద్రుడు మాతలితో పాటు తన దివ్య రథాన్ని రాముని కోసం పంపాడు. రాముడు రథం ఎక్కాడు. రామరావణులు సమంగా యుద్ధం చేశారు. రాముడు విజృంభించాడు. దానితో రావణుడి రథసారథి రావణుడి రథాన్ని పక్కకు మరలించాడు. రావణుడు సారథిని మందలించాడు. తిరిగి రావణరథం రాముని ముందు నిలిచింది. అగస్త్యుడు దేవతలతో అక్కడకు వచ్చి, రాముడికి ‘ఆదిత్య హృదయ మంత్రం’ ఉపదేశించాడు.

రాముని బాణానికి రావణుడి తలలు నేలరాలి తిరిగి మొలుస్తున్నాయి. రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని వేయమని మాతలి రామునికి చెప్పాడు. రాముడి బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 8.
రావణుని చంపి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించిన విధానాన్ని తెలపండి.
జవాబు:
మాతలి సూచనతో శ్రీరాముడు రావణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ సంహారం జరిగింది. రాముడి ఆదేశం మేరకు విభీషణుడు తన అన్న రావణునికి ఉత్తర క్రియలను నిర్వహించాడు. రాముని ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం చేశాడు. హనుమ సీతమ్మకు రావణసంహారం గురించి చెప్పాడు. సీతను బాధించిన స్త్రీలను చంపుతానన్న హనుమను, సీతమ్మ వారించింది.

విభీషణుడు సీతను పల్లకిలో రాముని వద్దకు తీసుకువచ్చాడు. సీత భర్తను చేరుకుంది. రాముడు సీతతో తన వంశ ప్రతిష్ఠను నిలుపుకోడానికి రావణుడి చెర నుండి సీతను విడిపించాననీ, సీత పరుల పంచన ఉన్నందువల్ల తనకు ఆమెపై సందేహం ఉందనీ, ఆమె ఇష్టం వచ్చినచోటుకు వెళ్ళవచ్చునని అన్నాడు. శ్రీరాముడి మాటలు సీతకు బాణాల్లా గుచ్చుకున్నాయి. రాముడికి తనపై విశ్వాసం కల్గించడానికి ‘అగ్నిప్రవేశం’ ఒక్కటే దిక్కని సీత భావించింది. లక్ష్మణుడు చితిని సిద్ధం చేశాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతను స్వయంగా తీసుకువచ్చి ఆమెను స్వీకరించమని రాముని కోరాడు.

సీత శీలాన్ని ముల్లోకాలకూ చాటడానికే, సీత అగ్ని ప్రవేశం చేస్తున్నప్పటికీ, తాను ఊరుకున్నానన్నాడు. సీతను రాముడు స్వీకరించాడు. శివుడు రాముని ప్రశంసించాడు. ఇంద్రుడు చనిపోయిన వానరులను బ్రతికించాడు. విభీషణుడు రాముడిని మరికొంతకాలం లంకలో ఉండమన్నాడు. కాని భరతుని కోసం రాముడు పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. రాముడు తాను తిరిగి వస్తున్న విషయాన్ని భరతుడికి హనుమ ద్వారా కబురంపాడు.

పుష్పకవిమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు, భరతాదులు స్వాగతం చెప్పారు. సీతారాములు తల్లులకూ, వశిష్ఠుడికి నమస్కరించారు. భరతుణ్ణి రాముడు దగ్గరకు తీసుకొన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. రాముడు లక్ష్మణుడిని యువరాజుగా ఉండమన్నాడు. లక్ష్మణుడు అంగీకరించలేదు. భరతుణ్ణి యువరాజుగా చేశాడు.

రాముడు ప్రజలను కన్నబిడ్డలవలె చూశాడు. ప్రజలు ధర్మబద్ధంగా నడచుకున్నారు. రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు. ప్రజలకు ఈతిబాధలు లేవు. అందుకే రామరాజ్యం ‘ అనేమాట ప్రసిద్ధం అయ్యింది.

ప్రశ్న 9.
సేతువు నిర్మాణం గురించి రాయండి.
జవాబు:
శ్రీరాముడు సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందని విభీషణుడు చెప్పాడు. శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువలేదు. శ్రీరాముడికి కోపం వచ్చింది. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. సముద్రుడు పరుగెత్తాడు. లంకకు వెళ్ళడానికి దారి ఇస్తానన్నాడు.

విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. సేతువు (వంతెన)ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాళ్ళను మోసుకువచ్చారు. సముద్రంలో పడేశారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడింది. నీలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరిగింది. వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదురోజుల్లో పూర్తయింది.

అదనపు ప్రశ్నలు

ప్రశ్న 1.
‘రామాయణం” ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో వివరించండి. –
జవాబు:
రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకొనే అవకాశం ఉంది.

  1. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్య ఉండే అనుబంధం ఆదర్శప్రాయమైనది. ఆప్యాయతానురాగాలకు నిలయమైనది.
  2. వనవాసంలో అన్న సేవకు అడ్డు కాకూడదని ఊర్మిళను అయోధ్యలోనే విడిచి వచ్చిన లక్ష్మణుడు సోదరప్రేమకు, త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. శ్రీరామ సేవాభాగ్యము ముందు “త్రిలోకాధిపత్యం” కూడా చిన్నదేనని భావించి, వనవాసంలో సకలోపచారాలు చేసే అవకాశం తన కిమ్మని శ్రీరాముణ్ణి కోరిన ఆదర్శమూర్తి లక్ష్మణుడు.
  3. లక్ష్మణుడు రామునికి ఆరోప్రాణం. యుద్ధరంగంలో నేలమీద పడిపోయిన లక్ష్మణుడిని చూచి శ్రీరాముడు విలవిల లాడిపోవటం అతనికి తమ్మునిపై గల ప్రేమానురాగాలను చాటుతోంది.
  4. భరతుడు కూడా ఆదర్శ సోదరుడే. రామునివలే తానూ వనవాస నియమాలు పాటించి 14 ఏళ్ళు శ్రీరామ పాదుకలపై పాలనాభారం ఉంచి, రాజభోగాలకు దూరంగా నగరం వెలుపల గడిపిన ఆదర్శమూర్తి.
  5. వాలి సుగ్రీవుల అనుబంధం ఆదర్శవంతమైనది కాదు. అపోహలకు, అపార్థాలకు, అధర్మానికి నిలయమైనట్టిది.
  6. రావణ కుంభకర్ణ విభీషణుల అనుబంధం కూడ ఆదర్శనీయమైనది కాదు. రావణుని అధర్మమును పూర్తిగా తెలిసికొని కూడ సహాయపడిన వ్యక్తి కుంభకర్ణుడు. ధర్మం వీడిన రావణుని, వీడినవాడు విభీషణుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 2.
రామ లక్ష్మణులు సిద్ధాశ్రమం చేరుకొన్న ప్రయాణ విశేషాలు వివరించండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. ‘వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 3.
రామాయణం ఎందుకు చదవాలి?
(లేదా)
‘రామాయణం వంటి ఆదర్శకావ్యం న భూతో న భవిష్యతి” దీనిని సమర్థిస్తూ రామాయణం గొప్పదనాన్ని రాయండి.
జవాబు:
మానవ జీవన మూలాలకు రామాయణం మణిదర్పణం. అందువల్లనే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణము లోకంలో ఉంటుందని బ్రహ్మగారు చెప్పారు. రామాయణం శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న కావ్యము.

రామాయణం’ అంటే రాముని మార్గము. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై ధర్మమార్గంలో ప్రజారంజకంగా పరిపాలించాడు. శ్రీరాముడు నడచిన నడత ధర్మబద్దం.

మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎన్నటికీ చెరగని కథ రామాయణం. , ఇందులో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి, శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవిత సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.

వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవనకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణిదర్పణం.

రామాయణం ఆచరణ ప్రధానమైన కావ్యం. సీతారాముల వంటి ఆదర్శనాయికానాయకుల చరిత్ర ఇది. “రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి దుష్ట రాక్షసుని నోటి నుండి మహర్షి వాల్మీకి పలికించాడు. రామాయణం ఆదికావ్యం. ఇటువంటి కావ్యం ప్రపంచ సాహిత్యంలో “నభూతో నభవిష్యతి”.

ప్రశ్న 4.
రామాయణములోని స్నేహాల గురించి రాయండి.
జవాబు:
రామాయణంలో రామసుగ్రీవుల స్నేహం, రామవిభీషణుల స్నేహాలు, సుప్రసిద్ధమైనవి. సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు. సుగ్రీవుడికీ అతని అన్న వాలికీ విరోధం ఉంది. వాలి, కిష్కింధకు రాజు. సుగ్రీవుడు రామునితో స్నేహం చేసి, రామునిచేత తన అన్న వాలిని చంపించి, తాను కిష్కింధకు రాజు అయ్యాడు. రాముడే సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణుని చంపి, సీతను తిరిగి తెచ్చుకోడానికి సుగ్రీవుడు తన వానర సైన్యంతో రామునికి సాయపడ్డాడు. ఈ విధంగా రామసుగ్రీవుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

రామాయణంలో రామవిభీషణుల స్నేహం కూడా ప్రసిద్ధమైనది. విభీషణుడు. లంకా నగరాధిపతి, రావణుడికి తమ్ముడు. రావణుడు సీతను అపహరించి తీసుకురావడం, విభీషణుడికి ఇష్టం లేదు. అందుకే విభీషణుడు తన అన్న రావణుని విడిచి, రాముని స్నేహాన్ని ఆశ్రయించాడు. రాముడు విభీషణుని ఆదరించాడు. రామ విభీషణుల స్నేహం గొప్పది.

విభీషణుని మాట సాయంతో రాముడు రావణుని జయించాడు. విభీషణుని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు సీతను రామునకు అప్పగించాడు. ఈ విధంగా రామవిభీషణులు స్నేహం వల్ల ఒకరికి ఒకరు మేలు చేసుకున్నారు. రామవిభీషణుల స్నేహం వల్ల వారిద్దరికీ మేలు జరిగింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 6 యుద్ధకాండ

ప్రశ్న 5.
రామాయణంలో సీత – కైకల పాత్రల భేదాలను విశ్లేషించండి.
జవాబు:
సీత, శ్రీరామచంద్రునికి ధర్మపత్ని. ఈమె మహాపతివ్రత. మహా సౌందర్యవతి. ఈమె జనకమహారాజు కుమార్తె. రామునితో పాటు సీత కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో బాధలు పడింది. రావణుడు ఈమెను అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. రాముడు సీతాదేవి జాడను తెలిసికోడానికి హనుమంతుడిని దూతగా పంపాడు. హనుమ సీతను కలిసి, రాముని ఉంగరాన్ని ఆమెకు ఇచ్చాడు. సీత ఇచ్చిన చూడామణిని తెచ్చి రామునకు ఇచ్చాడు.

రాముడు సీత కోసం సముద్రానికి వారధిని కట్టి యుద్ధంలో రావణుని సంహరించి సీతను తీసుకువచ్చాడు. రామాయణంలోని పాత్రలలో రాముని తరువాత సీత పాత్ర ప్రధానమైనది.

కైక దశరథ మహారాజునకు ముద్దుల భార్య. ఈమెకు రాముడంటే మంచి ప్రేమ. మంథర చెప్పిన చెప్పుడు మాటలు విని, కైక తన మనస్సును మార్చుకొని దుష్టురాలయ్యింది. పుత్ర ప్రేమతో భరతుడిని రాజును చేయ్యమనీ, రాముడిని అడవులకు పంపమనీ ఈమె పట్టుపట్టింది. దశరథుడు బ్రతిమాలి చెప్పినా ఈమె వినలేదు. కైక మొండిది.

కైక పట్టుదల వల్లనే దశరథుడు రాముడిని వనవాసానికి పంపవలసి వచ్చింది. రామునిపై బెంగతో దశరథుడు మరణించాడు. రాముని వనవాసానికి, దశరథుని మరణానికి కైక యొక్క మూర్ఖపు పట్టుదలయే కారణము.

‘సీత’ భర్త రామునికి తోడుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది. కైక, భర్త దశరథుని మరణానికి కారణం అయ్యింది. సీత మహాపతివ్రత కాగా, కైక గయ్యాళి భార్య. కైక భర్త మాటను లెక్కచేయలేదు. సీత రాముని కోసం, తన ప్రాణాలను కూడా ఇవ్వగల ఉత్తమ సతి.

రామాయణ కావ్యంలో సీత – కైక పాత్రలు రెండూ ప్రధానమైనవే. రామాయణ కథ, ఈ రెండు పాత్రల వల్లనే సాగింది. సీత మహాసాధ్వి. కైక గయ్యాళి గంప.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 5 సుందరకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 5th Lesson సుందరకాండ

10th Class Telugu ఉపవాచకం 5th Lesson సుందరకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడు అదే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఆ) హనుమంతుడు (రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఈ) అందుకే తనపేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
జవాబులు
అ) సీతాన్వేషణను సఫలం చేయగల సమర్ధుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే.
ఈ) అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు. సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు.
ఇ) సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఆ) హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు.

2. అ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు.
ఆ) హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణి పై ఒకదెబ్బవేశాడు.
ఇ) హనుమంతుని పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
జవాబులు
ఈ) శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు.
ఇ) హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన ‘సురస’ అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.
ఆ) హనుమంతుడు. మహనాదం చేస్తూ ఎడమ చేతితో లంకిణిపై ఒక్కదెబ్బవేశాడు.
అ) ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

3. అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలల గడువు విధించాడు.
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
జవాబులు
ఇ) రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు.
ఈ) సీత దగ్గరకి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు.
అ) శ్రీరాముడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది.
ఆ) రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గడువు విధించాడు.

4. అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్యచూడామణిని హనుమంతునికిచ్చింది.
జవాబులు
ఆ) సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు.
ఇ) హనుమంతుడు శ్రీరాముడి రూపగుణాలను వివరించాడు. శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు.
ఈ) కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది.
అ) శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.

5. అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు.
ఇ) హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగివస్తున్నాడని ప్రకటించాడు.
జవాబులు
అ) ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు.
ఇ) హనుమంతుణి తోకకు నిప్పంటించి లంకంతా కలియదిప్పమన్నాడు రావణుడు.
ఆ) విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పు పెట్టాడు.
ఈ) మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగి వస్తున్నాడని ప్రకటించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

6. అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఈ) సముద్రంపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
జవాబులు
ఈ) సముద్రం పై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు.
ఇ) రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
అ) అంగద హనుమదాదాలు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు.

7. అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది సీత.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
జవాబులు
ఆ) శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది.
ఈ) ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీత కోరికపైన హనుమంతుడు రాముడి గుణరూపాలను వివరించాడు.
అ) వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారు.

8. అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
జవాబులు
ఈ) అంతఃపురంలో ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా నిద్రపోవడం హనుమంతుడు చూశాడు.
అ) రావణుని తేజస్సును చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
ఆ) శ్రీరామునికి దూరమై బ్రతకడం కన్నా శరీరాన్ని విడవడం మంచిదని సీత తలచింది.
ఇ) హనుమంతుడు సీతతో తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు.

9. అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
జవాబులు
ఇ) హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఈ) హనుమంతుని తోకకు నిప్పు అంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు.
అ) లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో చల్లార్చుకున్నాడు.
ఆ) హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

10. అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
జవాబులు
ఈ) హనుమ లంకిణిని చంపి లంకలో ప్రవేశించాడు.
అ) హనుమంతుడు లంకలో చిత్రవిచిత్రమైన ఇళ్ళను చూశాడు.
ఆ) అంతవరకు వెతకని అశోకవనాన్ని వెతకాలనుకున్నాడు హనుమంతుడు.
ఇ) సీత హనుమంతునితో వెళ్ళడానికి నిరాకరించింది.

11. అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
జవాబులు
ఈ) త్రికూట పర్వతంపై ఉన్న లంకను చేరాడు హనుమంతుడు.
అ) హనుమంతుడు మందహాసం చేస్తూ లంకిణిపై బలంగా కొట్టాడు.
ఇ) హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు.
ఆ) హనుమంతుడు అశోకవనంలో ప్రవేశించాడు.

12. అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
జవాబులు
ఇ) సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళల్లో ఆనందాశ్రువులు వచ్చాయి.
అ) నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు.
ఈ) రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఆ) ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీతకు శుభశకునాలు తోచాయి.

పాత్ర స్వభావాలు

1. త్రిజట :
త్రిజట విభీషణుని కూతురు. రాక్షస స్త్రీలను అదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. ‘వేయి హంసలతో కూడిన పల్లకిమీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చునట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతంమీద సీత కూర్చోవడం చూశాను. నూనెపూసిన శరీరంతో రావణుడు నేలమీద పడి ఉండటం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రములు కట్టి, రావణుని మెడకు తాడుకట్టి దక్షిణంవైపుగా ఈడ్చుకువెళ్ళడం చూశాను. వరాహం మీద రావణుడు, మొసలిమీద ఇంద్రజిత్తూ, ఒంటిమీద కుంభకర్ణుడు దక్షిణదిశగా వెళ్ళడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను’ అన్నది. స్వప్నంలో విమానదర్శనం కావడాన్ని బట్టి సీత సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందనీ చెప్పింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘దూతను చంపడం రాజనీతి కాదు’ అని పలికిన విభీషణుని మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు రావణునికి హితోపదేశం చేశాడు. అది రావణునికి నచ్చలేదు. హనుమంతుడిని సంహరించమని ఆదేశించాడు. అది విని విభీషణుడు దూతను చంపడం రాజనీతి కాదని, రావణునికి సూచించాడు.

ఈ విభీషణుని మాటల ద్వారా విభీషణుడు రాక్షస వంశంలో జన్మించినా గొప్ప రాజనీతి కలవాడని గ్రహించాను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకోవాలని గ్రహించాను. రాజు ఎల్లప్పుడు రాజనీతిని అనుసరించి పాలించాలని, మంచి మాటలు చెప్పే మంత్రులు రాజుకు అవసరమని గ్రహించాను.

ప్రశ్న 2.
త్రిజట సీతను ఓదార్చిన విధానం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రావణుడు అశోకవనంలో ఉన్న సీతను సమీపించాడు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టాడు. తీవ్రంగా భయపెట్టాడు. చంపుతానని బెదిరించాడు. ఆ సమయంలో దుఃఖిస్తున్న సీతను విభీషణుని కుమార్తె అయిన త్రిజట ఓదార్చింది. ఆమెలో ధైర్యాన్ని నింపింది.

త్రిజట సీతను ఓదార్చడం ద్వారా ఎన్నో విషయాలను గ్రహించాను. త్రిజట రాక్షస వంశంలో జన్మించినా ఉత్తమ గుణములు కల మహిళగా గుర్తించాను. ఆపదల్లోను, దుఃఖంలో ఉన్నవారిని ఆదుకోవాలని, వారిలో ధైర్యం నింపాలనిగ్రహించాను. త్రిజట మాటల వల్లనే సీత ధైర్యంగా జీవించగలిగిందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
మైనాకుడు హనుమంతుడిని విశ్రాంతి తీసుకొనమని ప్రార్థించిన తీరును బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
మైనాకుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల సముద్రంలో దాగియున్నాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించాడు. మార్గమధ్యలో మైనాకుడు హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నించాడు. హనుమంతుడు మైనాకుడిని స్పృశించి ముందుకు వెళ్ళాడు.

ఈ సన్నివేశం ద్వారా చేసిన ఉపకారాన్ని మరువకూడదని, దూరప్రయాణం చేసేవారికి విశ్రాంతిని ఇచ్చి, అతిథి మర్యాదలతో సత్కరించాలని గ్రహించాను. అంతేగాక కార్యరంగంలో దిగినవాడు అవిశ్రాంతంగా పనిచేయాలని, మార్గమధ్యలో కలిగే అంతరాలకు లోనుకాకూడదని కూడా గ్రహించాను.

ప్రశ్న 4.
ఆత్మహత్య కన్నా బతికి యుండటమే ఎన్నో విధాల మంచిదని, బాధల్లో నిరుత్సాహ పడకూడదనే విషయం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు లంకలో సీతను అన్వేషించాడు. ఎక్కడా కనిపించలేదు. నిరాశతో హనుమంతుడు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా అనుకొని తరువాత మనసు మార్చుకున్నాడు. ఆత్మహత్య కన్నా బతికి యుండటమే మంచిదని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు.

ఈ సన్నివేశం ద్వారా ఆత్మహత్య ఎన్నటికీ మంచిదికాదనీ గ్రహించాను. మానవుడు ఆలోచనాపరుడు, వివేకవంతుడు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలని, సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాలని గ్రహించాను. కష్టాలకు, దుఃఖాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని గ్రహించాను.

ప్రశ్న 5.
హనుమంతుడుపిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని కుదించుకుని ఎడమకాలును పెట్టి లంకలో ప్రవేశించిన హనుమంతుని ప్రవర్తన ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించాడు. ఎడమకాలిని ముందుగా లంకలో పెట్టి ప్రవేశించాడు.

దీని ద్వారా హనుమంతుని సమయస్ఫూర్తిని గుర్తించాను. పిల్లి అపశకునానికి ప్రతీక అని, ఎడమకాలు ముందుగా పెడితే ఆ ప్రాంతానికి అనర్థం కలుగుతుందని గ్రహించాను. హనుమంతుని రాక లంకా నగర వినాశనానికి కారణమైందని గ్రహించాను. శత్రువుల ప్రాంతంలోనికి వెళ్ళేముందు ఎడమకాలు ముందుగా పెట్టడం శ్రేష్ఠమని కూడా గ్రహించాను.

ప్రశ్న 6.
హనుమంతుడు రావణునితో “ఓయీ ! సీతను రామునికి అప్పగించు లేనిచో అనర్ధం తప్పదు” అని హెచ్చరించాడు. దీని ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. చివరకు హనుమంతుడు రావణుని సమీపానికి వచ్చాడు. సీతను రామునికి అప్పగించి క్షేమంగా ఉండమని హెచ్చరించాడు. లేకపోతే అనర్హం కలుగుతుందని హెచ్చరించాడు.

ఈ హనుమంతుని మాటలనుబట్టి శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, శ్రీరామునితో వైరం అన్ని విధాలుగా అనర్ధం కలుగుతుందని గ్రహించాను. రామదూతగా చక్కగా వ్యవహరించాడని కూడా గ్రహించాను. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంటే యుద్ధాలు తప్పుతాయని కూడా గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి.

ప్రశ్న 1.
హనుమంతుడు మొట్టమొదట చూసినప్పుడు సీతాదేవి ఎలా ఉంది?
జవాబు:
హనుమంతుడు లంకంతా వెదికాడు. సీత కనబడలేదు. శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలినమైన వస్త్రాలతో సీత ఉంది. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె ఆభరణాలను బట్టి హనుమ ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరామ కార్యం నిమిత్తం హనుమంతుడు లంకకు యే విధంగా చేరాడు?
జవాబు:

  1. సుగ్రీవుని ఆజ్ఞమేరకు హనుమంతుడు మిగిలిన వానర వీరులతో దక్షిణ దిక్కుకు శ్రీరామ కార్యం నిమిత్తం బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరాడు.
  2. జాంబవంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖుల ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడు.
  3. హనుమంతుడు దేవతలందరికి నమస్కరించి తన శరీరాన్ని పెంచి, తోకను ఆకాశము పైకి రిక్కించి నడుం మీద చేతులు ఆనించి, గట్టిగా గర్జించి, పాదాలతో పర్వతాన్ని తొక్కి పైకి లంఘించాడు.
  4. హనుమంతుడు ఆ విధంగా సముద్రం మీద ఎగురుతుండగా సముద్ర గర్భంలోనున్న మైనాకుడు హనుమకు సాయం చేయాలన్న కోరికతో పైకి వచ్చి హనుమంతుని మార్గానికి అడ్డము వచ్చాడు.
  5. హనుమంతుడు మైనాకుణ్ణి చేతితో తాకి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు.
  6. హనుమంతుణ్ణి పరీక్షించాలని “సురస” అనే నాగమాత ప్రయత్నించి అతని సూక్ష్మబుద్ధిని మెచ్చుకుంది.
  7. “సింహిక” అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసి అతని చేతిలో మరణించింది.
  8. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి, లంకలో కాలుపెట్టాడు.
  9. రాత్రివేళ అన్వేషణకు అనువయిన సమయమని చీకటి పడేదాకా వేచియున్నాడు.
  10. చీకటి పడగానే లంకలో ప్రవేశించబోగా లంకిణి అడ్డగించింది.
  11. లంకిణిని ఒక దెబ్బతో నేలకూల్చాడు.
  12. లంకిణి హనుమంతుని చేతిలో ఓడింపబడి అతనికి దారి వదిలింది.
  13. ఈ విధంగా హనుమంతుడు సీత కొరకు అన్వేషించాలని లంకకు చేరాడు.

ప్రశ్న 2.
హనుమ సముద్రలంఘనం చేసిన విధానం వివరించండి.
జవాబు:
మహాబలవంతుడైన హనుమ, సముద్రం దాటడానికి ముందు దేవతలు అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్దగా గర్జించాడు. చేతులు నడుముపై పెట్టాడు. అంగదాది వీరులతో తాను రామబాణంలా లంకకు వెడతానన్నాడు.

సముద్రం పై నుండి వెడుతున్న హనుమంతుడికి సాయం చేద్దామని సముద్రుడు అనుకున్నాడు. రామకార్యం మీద వెడుతున్న హనుమకు శ్రమ కలుగకూడదని, సముద్రంలోని మైనాకుణ్ణి సముద్రుడు బయటకు రమ్మన్నాడు. మైనాకుడి శిఖరాలపై హనుమ కొంచెం విశ్రాంతి తీసికొంటాడని సముద్రుడు అనుకున్నాడు.

మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు తనకు అడ్డు వస్తున్నాడని హనుమ అనుకొని, తన వక్షంతో అతడిని గెంటివేశాడు. మైనాకుడు మానవరూపంతో పర్వత శిఖరంపై నిలబడి, సముద్రుడి కోరికను హనుమకు చెప్పాడు. హనుమ, సంతోషించాడు. తనకు సమయం లేదని, చేతితో మైనాకుణ్ణి హనుమ తాకి వెళ్ళాడు.

తరువాత హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, హనుమ సూక్ష్మబుద్ధిని మెచ్చుకొని, అతడిని ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి, హనుమను మ్రింగాలని చూసింది. కాని హనుమంతుడు గోళ్ళతో సింహికను చీల్చివేశాడు.

ఇలా హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
సీతాదేవిని హనుమంతుడు తొలిసారి సందర్శించినపుడు అతడు పొందిన ఆనందాన్ని విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీతను వెతుకుతూ, రావణుడి అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుడి భార్య మండోదరిని చూసి, సీత అని భ్రాంతిపడ్డాడు. తాను సీతను చూశానని హనుమ ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పు అనుకున్నాడు.

తరువాత హనుమ అశోకవనం అంతా, సీతకోసం వెతికాడు. శింశుపా వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు క్రింద మాసిన బట్టలు కట్టుకొన్న ఒక స్త్రీని హనుమ చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయే అని, హనుమ అనుకున్నాడు.

అతడు ఆమె ధరించిన ఆభరణాలు చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయాయి. దానితో ఆమె సీతయే అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించాడు.

సీతాదేవిని చూడగానే హనుమంతుడి కళ్ళ నుండి ఆనందభాష్పాలు జారాయి. శ్రీరాముడిని మనస్సులో స్మరించుకొని, హనుమంతుడు నమస్కరించాడు.

ప్రశ్న 4.
త్రిజటా స్వప్నం గురించి రాయండి.
జవాబు:
‘త్రిజట’ విభీషణుని కూతురు. రావణుడు సీతను అశోకవనంలో ఉంచి, రాక్షస స్త్రీలను ఆమెకు కాపలాగ పెట్టాడు. వారిలో ‘త్రిజట’ కూడ ఉంది. రావణుని భర్తగా అంగీకరించడానికి సీతను ఒప్పించమని రావణుడు రాక్షస స్త్రీలకు చెప్పాడు. రాక్షస స్త్రీలు సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. లేకపోతే చంపుతామని వారు సీతను బెదిరించారు. సీత ఎంతో ఏడ్చింది.

అంత వరకూ నిద్రపోతున్న త్రిజట లేచి తనకు కల వచ్చిందని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పింది. కలలో వేయి హంసల పల్లకిపై రామలక్ష్మణులు కనబడ్డారని, సీత తెల్లని పర్వతం మీద కూర్చుందనీ వారికి చెప్పింది. రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని, ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడ్చుకువెడుతోందని కూడా చెప్పింది. రావణుడు పందిమీద దక్షిణ దిశగా వెళ్ళడం తాను కలలో చూశానని, లంకానగరం చిన్నాభిన్నం కావడం తాను చూశానని త్రిజట తోడి రాక్షస స్త్రీలకు చెప్పింది.

తనకు కలలో విమానం కనబడింది. కాబట్టి సీత కోరిక సిద్ధిస్తుందనీ, రావణుడికి వినాశం, రాముడికి జయం కలుగుతుందనీ త్రిజట చెప్పింది. త్రిజట ఉత్తమురాలు.

ప్రశ్న 5.
లంక దహనానికి అసలు కారకులెవరు? ఎలా? విశ్లేషించండి.
జవాబు:
హనుమంతుడు సీత జాడను తెలుసుకున్నాక, రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడు పంపిన రాక్షస వీరులను అందరినీ హనుమ చంపాడు. చివరకు ఇంద్రజిత్తు హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి, రావణుడి వద్దకు తీసుకువెళ్ళాడు.

రావణుడు హనుమంతుడిని చంపమని ఆజ్ఞాపించాడు. దూతను చంపడం భావ్యం కాదని, ఇతర పద్ధతులలో దండింపవచ్చునని విభీషణుడు అన్న రావణునికి చెప్పాడు.

హనుమంతుడి తోకకు నిప్పు అంటించి, లంక అంతా తిప్పమని రాక్షసులకు రావణుడు చెప్పాడు. వారు బట్టలు హనుమంతుడి తోకకు చుట్టారు. దానిని నూనెతో తడిపారు. హనుమ తోకకు నిప్పు అంటించి, వారు లంక అంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుడి భవనం తప్ప, లంకనంతా కాల్చాడు. ఈ విధంగా రాముడు సీతను చూసి రమ్మని హనుమంతుడిని పంపితే, హనుమ లంకను కాల్చి వచ్చాడు.

దీనినిబట్టి లంకను కాల్చడానికి అసలు కారకుడు రావణుడు అని మనకు తెలుస్తుంది. హనుమంతుడు రాముడి పరాక్రమాన్ని గుర్తుచేసి, సీతను రాముడి వద్దకు పంపమని రావణుడికి చెప్పడానికే వెళ్ళాడు. కాని రావణుడు, తెలివి తక్కువగా హనుమ తోకకు నిప్పు పెట్టించాడు. కాబట్టి లంకా దహనానికి రావణుడే అసలు కారకుడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను చూసి మాట్లాడిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
హనుమంతుడు దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. పెద్ద ధ్వని చేస్తూ, చేతులను నడుం మీద ఉంచి, తోకను విదల్చాడు. సీతను చూసి వస్తానని, అంతరిక్షంలోకి ఎగిరాడు. హనుమ సముద్రంపై వెడుతుండగా, సముద్రుడు హనుమకు సాయం చేద్దామని తనలో దాగిన మైనాకుణ్ణి పైకి రమ్మన్నాడు. హనుమ ఆ గిరిశిఖరాలపై విశ్రాంతి తీసికొంటాడని సాగరుడు అనుకున్నాడు. పైకి లేచిన మైనాకుణ్ణి చూసి తనకు అడ్డంగా ఉన్నాడని, హనుమ తన వక్షస్థలంతో నెట్టివేశాడు. మైనాకుడు మనిషి రూపంలో గిరి శిఖరంపై నిలిచి, సముద్రుడి కోరికను హనుమకు తెలిపాడు. హనుమ తనకు మధ్యలో ఆగడం కుదరదని, మైనాకుని చేతితో తాకి ముందుకు సాగాడు.

హనుమను పరీక్షించాలని ‘సురస’ అనే నాగమాత యత్నించి హనుమ సూక్ష్మబుద్దిని మెచ్చుకుంది. ‘సింహిక’ అనే రాక్షసి హనుమను మింగాలని చూసి, తానే హనుమ చేతిలో మరణించింది. హనుమ లంకను చూశాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకొని, లంకలో ప్రవేశించాడు. లంకాధిదేవత (లంకిణి) లంకలోకి వెళ్ళడానికి హనుమంతుని అడ్డగించింది. హనుమ లంకను చూసి వస్తానన్నాడు. లంకిణి హనుమను అరచేతితో కొట్టింది. హనుమ లంకిణిని ఒక్క దెబ్బ వేశాడు. లంకిణి కూలిపోయింది. వానరుడు వచ్చి లంకిణిని జయించినపుడు రాక్షసులకు కీడు కల్గుతుందని బ్రహ్మ చెప్పాడని హనుమకు లంకిణి చెప్పింది. హనుమను లంకలోకి వెళ్ళమంది.

హనుమ ప్రాకారం నుండి లంకలోకి దూకాడు. లంకలో ఎడమపాదం పెట్టాడు. హనుమ లంకలో రాక్షస భవనాలన్నీ వెదికాడు. రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రమపడ్డాడు. తరువాత ఆమె సీత కాదని నిశ్చయించాడు. చివరకు సీత చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. హనుమ తాను కూడా మరణిద్దాం అనుకున్నాడు. చివరకు బతికి ఉంటే శుభాలు పొందవచ్చుననుకున్నాడు.

హనుమ అశోకవనంలోకి వెళ్ళాడు. సీతారాములకు నమస్కరించాడు. హనుమ ఆ వనంలో శింశుపావృక్షం ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె సీత అయి ఉంటుందని నిశ్చయించాడు. హనుమ చెట్టుమీదే ఉన్నాడు. తెల్లవారుతోంది. రావణుడు వచ్చి, సీత మనస్సును మార్చబోయాడు. సీత లొంగలేదు. రావణుడు సీతకు రెండు నెలలు గడువు ఇచ్చి, సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలకు చెప్పాడు. రావణుడు వెళ్ళిపోయాక, రాక్షస స్త్రీలు సీత మనస్సు మార్చడానికి యత్నించారు. సీత రాముడిని విడిచి ఉండలేక చనిపోదామనుకుంది.

విభీషణుడి కూతురు త్రిజట నిద్ర నుండి లేచింది. త్రిజట తనకు కల వచ్చిందనీ ఆ కలలో వేయి హంసల పల్లకిలో రాముడూ, తెల్లని పర్వతంపై సీత కనబడ్డారని, రావణుడు నూనె పూసిన శరీరంతో నేలపై పడి ఉన్నాడని లంక చిన్నాభిన్నం అయ్యిందని, రాముడికి జయం కల్గుతుందని చెప్పింది.

సీతకు శుభశకునాలు కనబడ్డాయి. హనుమంతుడు రామకథను గానం చేశాడు. సీత చెట్టు మీద హనుమను చూసి ఆశ్చర్యపడింది. హనుమ చెట్టుదిగి, ఆ స్త్రీని “నీ వెవరవు ? నీవు సీతవైతే నీకు శుభం అవుతుంది” అన్నాడు. తన పేరు సీత అని, ఆ స్త్రీ చెప్పింది. హనుమ తాను శ్రీరామ దూతనని చెప్పాడు. హనుమను చూసి సీత మొదట రాక్షసుడు అనుకుంది. రామదూతవయితే రాముణ్ణి గురించి చెప్పు అన్నది. హనుమ రాముని రూపాన్ని వర్ణించాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీత గుర్తుగా ఇచ్చాడు.

రాముణ్ణి త్వరగా లంకకు తీసుకురమ్మని హనుమకు సీతమ్మ చెప్పింది. వెంటనే సీతను రాముని వద్దకు తీసుకు వెడతాననీ, తన వీపుపై కూర్చోమనీ, హనుమ చెప్పాడు. అందుకు సీత నిరాకరించింది. తాను పరపురుషుడిని తాకననీ, రాముడు రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అనీ చెప్పింది. హనుమంతుడు రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని సీతను అడిగాడు. సీత కాకాసురుని కథ చెప్పింది. ఆమె తన దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది. ఈ విధంగా హనుమ లంకలో సీతను కలిసి వెళ్ళాడు.

ప్రశ్న 7.
సీతాన్వేషణ వృత్తాంతం రాయండి.
(లేదా)
హనుమ లంకను కాల్చి వచ్చి, సీత జాడను రామునికి నివేదించిన వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
సీతాదేవిని దర్శించడంతో హనుమకు ఒక ముఖ్యకార్యం పూర్తి అయ్యింది. రావణుడి శక్తిసామర్థ్యాలు హనుమ తెలుసుకుందామనుకున్నాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అశోక వన ధ్వంసం గురించి రాక్షస స్త్రీలు, రావణునకు చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది రాక్షసులను పంపాడు. హనుమ వాళ్ళను చంపాడు. రావణుడు పంపిన జంబుమాలిని, ఏడుగురు మంత్రి పుత్రులను, ఐదుగురు సేనాపతులను, అక్షకుమారుణ్ణి హనుమ చంపాడు. చివరకు రావణుడు తన కుమారుణ్ణి ఇంద్రజిత్తును పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించాడు. అది హనుమపై స్వల్పకాలమే పని చేసింది.

రాక్షసులు హనుమను రావణుని ముందు ప్రవేశపెట్టారు. హనుమ తాను రామదూతనని చెప్పి, రాముని పరాక్రమాన్ని చాటాడు. దూతను చంపడం తగదని రావణుని తమ్ముడు విభీషణుడు చెప్పడంతో, రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పమన్నాడు. రాక్షసులు రావణుని తోకకు బట్టలు చుట్టి, నూనెతో తడిపి, నిప్పు ముట్టించి ” లంకానగరంలో ఊరేగించారు. హనుమ ఆకాశంలోకి ఎగిరి, విభీషణుని భవనం తప్పించి, మిగిలిన లంకంతా తగులబెట్టాడు.

తరువాత హనుమ లంకను అంటించి తాను తప్పు చేశానని, సీతామాత ఆ మంటలలో కాలిపోయిందేమో అని, సందేహించాడు. తన తోకను కాల్చని అగ్ని, సీతను దహింపదని చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు. సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని సంతోషించాడు. హనుమ సీత వద్దకు వెళ్ళి ఆమెను నమస్కరించి తిరుగు ప్రయాణం అయ్యాడు.

హనుమ ‘అరిష్టం’ అనే పర్వతాన్నుండి ఆకాశంలోకి ఎగిరాడు. మహేంద్రగిరికి చేరుతూ మహానాదం చేశాడు. జాంబవంతుడు ఆ ధ్వనిని విని హనుమ విజయం సాధించి వస్తున్నాడని వానరులకు చెప్పాడు.

హనుమ మహేంద్రగిరి చేరాడు. పెద్దలకు నమస్కరించాడు. ‘చూశాను సీతమ్మను’ అని చెప్పాడు. ప్రయాణ విషయాలు వారికి చెప్పాడు. అంగదుడు లంకకు వెళ్ళి, రావణుని చంపి సీతను తీసుకొని వచ్చి రాముని వద్దకు వెడదాం అన్నాడు. జాంబవంతుడు, అది సరికాదన్నాడు. రామసుగ్రీవులు సీతమ్మను చూసి రమ్మన్నారు. రాముడు రావణుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రామునికి విషయం తెలుపుదాం అన్నాడు.

దారిలో మధువనాన్ని వానరులు ధ్వంసం చేశారు. మధువనాన్ని రక్షిస్తున్న దధిముఖుడు, వానరుల చేతిలో దెబ్బతిని, ఆ విషయం సుగ్రీవుడికి చెప్పాడు. సుగ్రీవుడు ఇదంతా శుభసూచకంగా భావించాడు. అంగద హనుమదాదులు సుగ్రీవుల దగ్గరకు వెళ్ళారు. హనుమ, రాముడికి నమస్కరించి ‘చూశాను సీతమ్మను’ అని చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడికి ఇచ్చి సీతాన్వేషణ వృత్తాంతాన్ని రామునకు వివరించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
లంకా దహనం వర్ణించండి.
జవాబు:
సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు, అతని సైన్యపు. శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు. ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగుపరుగున వెళ్ళి లంకేశునికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను ఈ పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని, మంత్రిపుత్రులేడుగురిని రావణుడి సేనాపతులైదుగురిని, అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరంచేత అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు. రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడడుగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమమెలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు.

హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకంతా నిప్పుపెట్టాడు. అందుకే ‘(సీతను) చూసిరమ్మంటే (లంకను) కాల్చివచ్చాడని’ సామెత
పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ

10th Class Telugu ఉపవాచకం 4th Lesson కిష్కింధ కాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
జవాబులు
అ) ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు.
ఇ) సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు.
ఈ) హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది.
ఆ) ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు.

2. అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమకన్ను ఒక్కసారిగా అదిరింది.
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన
వాలిని తప్పక వధిస్తాన’ని మాట ఇచ్చాడు.
జవాబులు
ఆ) శ్రీరామ, సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు.
ఈ) శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ ‘సుగ్రీవా! ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వదిస్తాన’ని మాట ఇచ్చాడు.
అ) శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది.
ఇ) సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు.

3. అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.
జవాబులు
ఆ) శ్రీరాముడు కాలి బొటనవేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థిపంజరాన్ని పదియోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు మద్దిచెట్లను చీల్చాడు.
ఇ) విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు.
అ) తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు.
ఈ) వానరుడివి గనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

4. అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారసు హనుమంతుడు ఓదార్చాడు.
ఆ) ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు.
ఇ) సంపాతి తన సోదరుని మరణానికి ఎంతో విలపించాడు.
ఆ) ఒకనాటి అర్థరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
అ) ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు.

5. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) సుగ్రీవుని ఆనతితో హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు.
ఆ) శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. అ) శ్రీరాముని బలమెంతో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు.
ఇ) లక్ష్మణ హనుమాదులతో కలిసి సుగ్రీవుడిని సమీపించాడు శ్రీరాముడు.

6. అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
జవాబులు
ఆ) భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది.
ఈ) సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకు వెళ్ళారు.
ఇ) సీతాన్వేషణ కార్యభారాన్ని గుర్తుచేశాడు హనుమంతుడు.
అ) సుగ్రీవుడు రామునితో సమావేశమై వానరుల రాకను చెప్పాడు.

7. అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
జవాబులు
అ) హనుమంతుడు దక్షిణ దిక్కుకు ప్రయాణమయ్యాడు.
ఆ) హనుమంతుడు నమస్కరించి రామ ముద్రికను గ్రహించాడు.
ఈ) ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కల్గిస్తున్నది.
ఇ) హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

8. అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిదికాదని తార బోధించింది.
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
జవాబులు
ఇ) హనుమంతుని మాటతీరు రాముడిని ఆకట్టుకుంది.
ఈ) వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుపమన్నాడు శ్రీరాముడు.
అ) సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు.
ఆ) యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదని తార బోధించింది.

9. అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
జవాబులు
ఇ) వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నది.
అ) రక్తపు మడుగులో పడియున్న వాలి కొంత సేపటికి తేరుకున్నాడు.
ఈ) శ్రీరాముని మాటలు విని వాలి తన తప్పు తెలుసుకున్నాడు.
ఆ) శ్రీరాముని తమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సుగ్రీవుడు చెప్పాడు.

10. అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
జవాబులు
ఈ) హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణులను సమీపించాడు.
అ) హనుమంతుని అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ రామలక్ష్మణులు తమ వృత్తాంతాన్ని చెప్పారు.
ఆ) అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులయ్యారు.
ఇ) వాలి భయంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం చేరాడు.

పాత్ర స్వభావాలు

1. సుగ్రీవుడు :
వాలి యొక్క తమ్ముడు. రాజనీతి బాగా తెలిసినవాడు. వారిని ఓడించడానికి శ్రీరామునితో స్నేహం చేశాడు. ఓడించాడు. శ్రీరామునకు సీతాదేవి జాడను తన మంత్రి అయిన హనుమంతుని ద్వారా కనుగొన్నాడు. రామరావణ సంగ్రామంలో తన బలగాలను వినియోగించాడు. శ్రీరాముని విజయానికి కారకుడయ్యాడు.

2. హనుమంతుడు :
అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. సుగ్రీవుని మంత్రి, సుగ్రీవునకు రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సీత ఉన్న అశోకవనం తప్ప లంకంతా కాల్చాడు. సీత జాడ రామునకు చెప్పాడు. సీతకు ధైర్యం చెప్పాడు. తన బలం తనకు తెలియదు. ఎవరైనా తన బలాన్ని గుర్తు చేయాలి. మహాబలవంతుడు. శ్రీరాముని బంటు. చక్కగా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు.

3. వాలి :
ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ. మహాబలవంతుడు. బలగర్వం ఎక్కువ. తమ్ముడైన సుగ్రీవుని బాధించాడు. భయపెట్టాడు. అతని భార్యను అపహరించాడు. శ్రీరాముని చేతిలో మరణించాడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“కాలి అందెలు మాత్రం, మా వదినెగారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల గుర్తుపట్టాను” అని రామునికి లక్ష్మణుడు చెప్పిన మాటను బట్టి, మీరేమి గ్రహించారో తెల్పండి.
జవాబు:
ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశానని, ఆమె రామా ! లక్ష్మణా ! అని అరిచిందనీ, ఒక నగల మూటను విసిరిందనీ చెప్పి సుగ్రీవుడు ఆ నగలను రామునికి చూపించాడు. శ్రీరాముడు సీత నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలను చూసి తాను ఆ నగల మూటలోని కేయురాలను, కుండలాలను గుర్తుపట్టలేనని అందులోని కాలి అందెలు మాత్రం సీతాదేవివని చెప్పాడు.

ఈ మాటలను బట్టి లక్ష్మణుడు తన వదిన సీతను, ఆ 14 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తలపైకి ఎత్తి ఆమె ముఖాన్ని చూడలేదని గ్రహించాను. లక్ష్మణుడు మహాభక్తుడని వదినకు నిత్యం నమస్కరించే వాడనీ గ్రహించాను. లక్ష్మణుని వంటి సుగుణవంతుడు, సచ్చీలుడు మరొకరుండరని గ్రహించాను.

ప్రశ్న 2.
‘లక్ష్మణా ! ఈ హనుమంతుని మాటల్లో ఒక్క వ్యాకరణ దోషం లేదు’ అని రాముడు పలికిన మాటల వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణులను సమీపించాడు. సుగ్రీవుని దూతగా వచ్చాడు. హనుమంతుని మాటల తీరు రామునికి నచ్చింది. హనుమంతుని మాటల్లో వ్యాకరణ దోషాలు లేవని లక్ష్మణుడితో చెప్పాడు.

శ్రీరాముని మాటల తీరును బట్టి హనుమంతుడు మంచి వాక్చాతుర్యం కలవాడని, ఉచ్ఛారణపరమైన, భాషాపరమైన, వ్యాకరణపరమైన దోషాలు లేకుండా మాట్లాడగలిగే సామర్థ్యం కలవాడని గ్రహించాను. మాటల్లో ఎలాంటి దోషాలు లేకుండా మాట్లాడాలని, అది అందరిని ఆకట్టుకుంటుందని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
“తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని రాముడు పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
శ్రీరాముడు వాలిని సంహరించాడు. వాలి రామునితో “నన్ను ఎందుకు సంహరించావు?” అని అడిగాడు. దానికి సమాధానంగా రాముడు “తమ్ముని భార్యను చెరబెట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించాను” అని చెప్పాడు.

శ్రీరాముని మాటల వల్ల పరస్త్రీని చెరబెట్టడం అన్యాయమని గ్రహించాను. సోదరుని భార్యను కూతురుగా భావించాలని, ధర్మాన్ని అతిక్రమించకూడదని గ్రహించాను. శ్రీరాముడు ధర్మాత్ముడు కాబట్టి అధర్మపరుడైన వాలిని సంహరించాడని గ్రహించాను. అధర్మపరులను శిక్షించడమే ధర్మాత్ముల లక్షణంగా గ్రహించాను.

ప్రశ్న 4.
శ్రీరాముడు తన కాలిబొటనవేలితో దుందుభి కళేబరాన్ని దూరంగా పడవేయడం, ఒకే బాణంతో మద్దిచెట్లను చీల్చడం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపించారు. పరస్పరం స్నేహం చేసుకోవాలనుకున్నారు. శ్రీరాముడు సుగ్రీవునికి తన పరాక్రమంపై నమ్మకాన్ని కల్గించడానికి దుందుభి కళేబరాన్ని కాలిబొటనవేలితో దూరంగా పడవేశాడు. ఒకే బాణంతో మద్ది చెట్లను చీల్చాడు.

దీనివల్ల శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడని, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయగల సమర్థుడని గ్రహించాను. దీనివల్ల శ్రీరాముని బలపరాక్రమాలపై సుగ్రీవునికి నమ్మకం కల్గియుంటుందని గ్రహించాను. విశ్వాసంతోనే మైత్రి చిరకాలం నిలుస్తుందని గ్రహించాను.

ప్రశ్న 5.
“సుగ్రీవా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు” అని రాముడు పలకడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు సుగ్రీవుడిని సమీపిరచారు. పరస్పరం సహకారం అందించుకోవాలనుకున్నారు. అగ్నిసాక్షిగా స్నేహం చేశారు. రాముడు సుగ్రీవుని బాధలను విని ‘మిత్రమా ! ఆపదలో ఆదుకున్నవాడే గదా మిత్రుడు’ అని మిత్ర ధర్మాన్ని గురించి పలికాడు.

శ్రీరాముని మాటల ద్వారా ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడని గ్రహించాను. మిత్రుని కోసం అవసరమైతే ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. మిత్రుని యొక్క సుఖాల్లోనే కాదు, అతనికి అనుకోని ఆపదలు వచ్చినప్పుడు కూడా. ఆదుకోవాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
సంపాతి తన సోదరుడైన జటాయువు మరణవార్త విని బాధపడి వానరులకు సీత జాడను తెలియజేశాడు. దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
సంపాతి జటాయువు సోదరుడు. వానరుల ద్వారా జటాయువు మరణవార్త విని దుఃఖించాడు. ఆ దుఃఖంలోనే వానరులకు సీత జాడను తెలిపాడు. లంకకు వెళ్ళే మార్గాన్ని చెప్పాడు. తరువాత రెక్కలు రావడంతో సంపాతి గగనమార్గంలో వెళ్ళాడు.

జటాయువులాగే ఇతడు కూడా పరోపకారబుద్ధి కలవాడని, శ్రీరాముని సేవలో పరోక్షంగా సహకరించాడని గ్రహించాను. అతని పరోపకారబుద్ధి వల్లే రెక్కలు వచ్చాయని గ్రహించాను. శ్రీరాముని సేవలో తరించిన సంపాతి నిజంగా ధన్యజీవి అని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
ఒకడు సన్యాసి రూపంలో వచ్చిచెడు చేశాడు. మరొకడు సన్యాసి రూపంలోనే వచ్చి మంచి చేశాడు. వారెవరు? అవేమిటి?
జవాబు:
రావణుడు సన్యాసి రూపంలో వచ్చి, సీతాదేవిని ఎత్తుకెళ్లాడు. సీతారాములకు ఎడబాటు కలిగించి వారి దుఃఖానికి కారకుడయ్యాడు. తన వంశ నాశనానికి కారకుడయ్యాడు. –
హనుమంతుడు సన్యాసి వేషంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. సుగ్రీవునితో స్నేహం కుదిర్చాడు. సీతారాముల కలయికకు మార్గం చూపించాడు. తన జన్మ ధన్యం చేసుకొన్నాడు.

ప్రశ్న 2.
వాలి వధలో అధర్మం ఉందా? లేదా? ఎందుకు?
జవాబు:
వాలి వధలో అధర్మం లేదు. వాలి తన తమ్ముని భార్యను అపహరించాడు. అధర్మంగా ప్రవర్తించాడు. ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు అధర్మాన్ని సహించలేడు. అధర్మంగా ప్రవర్తిస్తే ఎవరినైనా శిక్షిస్తాడు. అందుకే మరణదండన విధించాడు. వాలి వానరుడు కనుక జంతువులను చెట్ల చాటు నుండి వేటాడడం వేట ధర్మం, కనుక వాలి వధలో అధర్మం లేదు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 3.
‘సుగ్రీవాజ్ఞ’ అంటే మీకు ఏమి అర్థమైంది?
జవాబు:
‘సుగ్రీవాజ్ఞ’ అంటే తిరుగులేని ఉత్తరువు (శాసనం) అని అర్థం. ఆయన చెప్పింది తలవంచి చేయాల్సిందే. సుగ్రీవుడు సీతాన్వేషణ విషయంలో శ్రీరాముడికి సహాయపడాలనుకున్నాడు. ఆయన వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్ళకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకూ వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లమంది వానరయోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వాలి సుగ్రీవుల విరోధం గురించి రాయండి.
(లేదా)
వాలి, సుగ్రీవుల మధ్య విరోధానికి గల కారణాలను తెలపండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. తండ్రి తరువాత ‘కిష్కింధ’ కు వాలి రాజు అయ్యాడు. మాయావి రాక్షసుడికీ, వాలికీ విరోధం ఉంది. మాయావి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలిసుగ్రీవులు మాయావి వెంటబడ్డారు. మాయావి గుహలో ప్రవేశించాడు. వాలి, సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర ఉండమని చెప్పి, తాను బిలంలోకి వెళ్ళి మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహలోంచి రక్తం బయటకు వచ్చింది. గుహలోపల రాక్షసుడివి, వాలివి అరుపులు వినబడ్డాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని భావించి, రాక్షసుడు పైకి రాకుండా గుహద్వారం మూసివేసి, కిష్కింధకు వచ్చాడు. మంత్రులు సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి వచ్చి, సుగ్రీవుడు రాజుగా ఉన్నందున కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి, సుగ్రీవుని భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభీతితో పారిపోయి భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతం చేరుకున్నాడు. మతంగముని శాపం వల్ల వాలి ఆ పర్వతానికి రాలేడు. వాలి ఋష్యమూకంపై కాలుపెడితే మరణిస్తాడని మతంగ మహర్షి శపించాడు.

రామలక్ష్మణులు’ సీతాదేవిని వెదకుతూ, ఋష్యమూక పర్వత సమీపానికి వచ్చారు. ధనుర్భాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి, వారు వాలి పంపితే తన్ను చంపడానికి వచ్చారని అనుకున్నాడు. హనుమంతుడు సుగ్రీవుని మంత్రి. హనుమ రామలక్ష్మణులను కలిసి, సుగ్రీవుని వృత్తాంతాన్ని వారికి చెప్పాడు. లక్ష్మణుడు సీతాపహరణం గురించి చెప్పాడు. హనుమ, రామలక్ష్మణులకూ, సుగ్రీవునికీ మైత్రిని చేకూర్చాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. వానరులను పంపి, సీతను వెదికిస్తానని సుగ్రీవుడు మాట ఇచ్చాడు.

రాముని మాటపై సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకే పోలిక. అందువల్ల రాముడు సుగ్రీవుని మెడలో “నాగకేసరపులత”ను వేయించాడు. ఓడిపోయిన సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి పిలిచాడు. రాముడు విషసర్పం వంటి బాణాన్ని వాలిపై వేశాడు. వాలి తన మెడలోని సువర్ణమాలను సుగ్రీవుడికి ఇచ్చాడు. తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునికి అప్పచెప్పి వాలి మరణించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 2.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి.
జవాబు:

  1. సీతాన్వేషణలో భాగంగా ఋష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకొన్న రామలక్ష్మణులను చూసి వాలి పంపిన వీరులని భయపడిన సుగ్రీవుడు హనుమంతుడిని పంపి వివరాలు తెలుసుకొమ్మని కోరాడు.
  2. సన్యాసిరూపంలో వెళ్ళిన హనుమంతుడు రామలక్ష్మణుల రూపలావణ్యాలను పొగిడి పరిచయం కోరాడు. మౌనముద్ర దాల్చిన రామలక్ష్మణులకు తన వివరాలు తెల్పి సుగ్రీవుడు పంపగా వచ్చినట్లు చెప్పాడు.
  3. సుగ్రీవుని గుణగణాలు తెల్పి, అన్నయైన వాలి అతడికి చేసిన అన్యాయాన్ని చెప్పి, రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు.
  4. సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడని చాకచాక్యంగా చెప్పాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముడిని ఎంతగానో ఆకట్టుకొంది.
  5. శ్రీరాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతం చెప్పవలసినదిగా లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెల్పి సుగ్రీవుని సహాయం కావాలని కోరాడు.
  6. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరిన హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు.

ప్రశ్న 3.
ఒకడు సన్యాసి వేషంలో వచ్చి అపకారం చేశాడు. మరొకడు ఉపకారం చేశాడు. వారెవరు? వాటి ఫలితాలేమిటి?
జవాబు:
రావణుడు అనే రాక్షసుడు, సన్యాసి వేషంలో వచ్చి పంచవటిలో పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా అపహరించి లంకకు తీసుకుపోయాడు. ఈ విధంగా సస్యాసి వేషంలో వచ్చిన రావణుడు రామలక్ష్మణులకు అపకారం చేశాడు.

రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేయాలని సుగ్రీవుడు ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి అన్న వాలి పంపిన వీరులని సుగ్రీవుడు భయపడ్డాడు. రామలక్ష్మణుల వివరాలు తెలిసికోమని, అంజనేయుడు అనే తన మంత్రిని సన్యాసి వేషంలో సుగ్రీవుడు పంపాడు. హనుమంతుడు సన్యాసి రూపంలో వచ్చి, రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని, రామసుగ్రీవులకు మైత్రిని కల్పించాడు. వానర సహాయంతో రాముడు రావణుడిని చంపి, సీతను తీసుకువచ్చాడు.

ఈ విధంగా సన్యాసి రూపంలో వచ్చి ఉపకారం చేసినవాడు హనుమంతుడు. హనుమంతుని సాయంతోనే సీతను అపహరించిన రావణుడిని సంహరించి, రాముడు సీతను తిరిగి తీసుకువచ్చాడు.

ప్రశ్న 4.
రామసుగ్రీవుల స్నేహం గూర్చి విశ్లేషించండి.
జవాబు:
వాలిసుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమి, సుగ్రీవుని భార్య రుమను వాలి చేపట్టాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు. హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి. సుగ్రీవుడితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు ధనుర్ధారులయిన రామలక్ష్మణులను చూసి వారు తన్ను చంపడానికి వాలి పంపించిన వీరులని, భయపడ్డాడు. రామలక్ష్మణులను గూర్చి తెలిసికొని రమ్మని తన మంత్రి హనుమంతుడిని సుగ్రీవుడు పంపాడు.

హనుమంతుడు సన్యాసి రూపంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు సుగ్రీవుడిని గూర్చి చెప్పి తాను సుగ్రీవుని మంత్రిననీ, పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమంతుని మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలన్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చాడు. అక్కడ శ్రీరామ సుగ్రీవులు, అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో ప్రాణమిత్రులుగా ఉందామని చెప్పి తనకు వాలి నుండి అభయం కావాలని కోరాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు సీత విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రామునికి సాయం చేస్తానన్నాడు. రాముడు తన కాలి బొటనవ్రేలితో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం విసరివేశాడు. ఒక బాణంతో ఏడు తాడిచెట్లను పడగొట్టాడు. దానితో సుగ్రీవునికి రాముడి బలంపై నమ్మకం కుదిరింది. రామసుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు.

ప్రశ్న 5.
వాలి సుగ్రీవుల యుద్దానికి కారణాలను విశ్లేషించండి.
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి మహాబలశాలి. వాలి, తండ్రి తర్వాత కిష్కింధకు రాజు అయ్యాడు. మాయావి అనే రాక్షసుడు, వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు మాయావి వెంటపడ్డారు. మాయావి ఒక గుహలో ప్రవేశించాడు. వాలి, తన తమ్ముడు సుగ్రీవుడిని బిలద్వారం దగ్గర కాపలా ఉండమని, తాను బిలంలోకి వెళ్ళి, మాయావితో సంవత్సర కాలం పోరాడాడు.

ఆ గుహాద్వారం నుండి రక్తం బయటకు వచ్చింది. గుహలో వాలి, మాయావి యొక్క అరపులు వినిపించాయి. సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకొని, మాయావి పైకి రాకుండా గుహాద్వారం మూసివేసి, కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రులు వాలి చచ్చిపోయాడనుకొని, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశారు. తర్వాత వాలి మాయావిని చంపి, గుహాద్వారాన్ని తెరిచి, కిష్కింధకు వచ్చాడు. సుగ్రీవుడు రాజుగా ఉన్నందుకు వాలి కోపించి, సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య రుమను తాను అపహరించాడు.

సుగ్రీవుడు ప్రాణభయంతో పారిపోయి, భూమండలం అంతా తిరిగి, ఋష్యమూక పర్వతంపై ఉన్నాడు. మతంగముని శాపం వల్ల వాలి, ఆ పర్వతానికి రాలేడని, సుగ్రీవుడు ఆ పర్వతంపై ఉన్నాడు. ఈ విధంగా అన్నదమ్ములయిన వాలి సుగ్రీవులకు విరోధం వచ్చింది. సుగ్రీవుడు రాముని సహాయంతో వెళ్ళి, వాలితో యుద్ధం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 6.
శ్రీరాముడు వాలిని చంపడం ధర్మమా? కాదా? చర్చించండి.
జవాబు:
రామ సుగ్రీవులకు స్నేహం కుదిరింది. సుగ్రీవుడు తనకు తన అన్న వాలి వల్ల భయం ఉందనీ, రాముడి అభయం కావాలనీ రాముడిని అడిగాడు. రాముడు సుగ్రీవుని భార్యను అపహరించిన వాలిని, తప్పక వధిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు.

వాలిసుగ్రీవుల యుద్ధం భయంకరంగా సాగింది. సుగ్రీవుడి శక్తి తగ్గిపోయింది. అప్పుడు రాముడు వాలి మీదికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి వాలి తెలివి తప్పాడు. తరువాత వాలి తెలివి తెచ్చుకుని రాముడు అధర్మంగా ప్రవర్తించాడని తప్పు పట్టాడు.

రామునికి కాని, రాముని దేశానికి కాని వాలి అపచారం చేయలేదు. అదీగాక వాలి సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు వాలిపై దొంగదెబ్బ తీశాడు. అందువల్ల రాముడు వాలిని చంపడం అధర్మమని, వాలి రాముడిని తప్పు పట్టాడు.

వాలి మాటలకు రాముడు జవాబు చెష్పాడు. తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలు చేయడం వల్ల తాను వాలికి మరణదండన విధించానన్నాడు. వాలి, వానరుడు కాబట్టి తాను చాటున ఉండి కొట్టడం, తప్పు కాదన్నాడు.

రాముడు మహారాజు కాబట్టి, తప్పు చేసిన వాలిని చంపడం ధర్మమే అవుతుంది.

ప్రశ్న 7.
శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది?
జవాబు:
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేయాలని సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి, వాలి తన్ను చంపడానికి పంపిన వీరులని భయపడ్డాడు. రామలక్ష్మణులను గురించి తెలుసుకోమని తనమంత్రి హనుమంతుని సుగ్రీవుడు పంపాడు.

హనుమ సన్న్యాసి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు సుగ్రీవుని గూర్చి రామలక్ష్మణులకు చెప్పి, తాను సుగ్రీవుని మంత్రిననీ, తన పేరు హనుమంతుడనీ చెప్పాడు. హనుమ మాటల్లోని నేర్పును రాముడు మెచ్చుకున్నాడు. హనుమతో లక్ష్మణుడు తమకు సుగ్రీవుని సాయం కావాలని చెప్పాడు. హనుమ రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని, సుగ్రీవుని వద్దకు తీసుకువచ్చాడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు.

సుగ్రీవుడు రామునితో “ప్రాణమిత్రులుగా ఉందాం” అని చెప్పి, తనకు వాలి భయం లేకుండా అభయం కావాలి అన్నాడు. వాలిని చంపుతానని రాముడు మాట ఇచ్చాడు. సుగ్రీవుడు రామునితో “ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం తాను చూశాననీ, ఆమె “రామా! లక్ష్మణా!” అని గట్టిగా అరుస్తుండగా తాను విన్నానని చెప్పి ఆమె జారవిడిచిన నగల మూటను తెప్పించి రాముడికి చూపించాడు. రాముడు ఆ నగలను చూసి ఏడ్చాడు. లక్ష్మణుడు ఆ నగలలోని కాలి అందెలు తన వదిన సీతమ్మవే అన్నాడు.

సుగ్రీవుడు సీతను వెదికించడానికీ, రావణుని చంపడానికీ, రాముడికి సాయం చేస్తానన్నాడు. రామ సుగ్రీవులు ప్రాణమిత్రులు అయ్యారు. శ్రీరాముడు కాలి బొటన వ్రేలుతో దుందుభి శరీరాన్ని 10 యోజనాల దూరం చిమ్మివేశాడు. ఒక్క బాణంతో ఏడు తాడిచెట్లను కూల్చి రాముడు సుగ్రీవుడికి తన బలంపై నమ్మకం కల్గించాడు.

సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్దానికి పిలిచాడు. వాలి సుగ్రీవులు ఒకే పోలికగా ఉన్నారు. అందువల్ల రాముడు వారిని గుర్తించలేక, బాణం వేయలేదు. సుగ్రీవుడు ఓడిపోయాడు.

రాముడు, సుగ్రీవుడి మెడలో “నాగకేసరపులత”ను గుర్తుగా వేయించాడు. సుగ్రీవుడు తిరిగి వాలిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. రాముని సాయంతో సుగ్రీవుడు వచ్చాడనీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ, వాలికి అతడి భార్య తార చెప్పింది. వాలి సుగ్రీవులకు భయంకర యుద్ధం జరిగింది. రాముడు విషసర్పం వంటి బాణం వేసి, వాలిని సంహరించాడు.

సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుడు సీతను వెదికించడానికి వానరవీరులను పిలిచాడు. అన్ని దిక్కులకూ వానరులను సీతాన్వేషణ కోసం పంపాడు. దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన వానరులను పంపాడు.

దక్షిణ దిశకు వెళ్ళిన వానరులకు ‘సంపాతి’ పక్షి కనబడింది. సంపాతి పక్షి, దివ్యజ్ఞానంతో రావణుని వృత్తాంతాన్ని వానరులకు చెప్పింది. జాంబవంతుడు హనుమంతునికి ఉత్సాహం కలిగించాడు. హనుమ తాను సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలోని సీత జాడను తెలుసుకుంటానని మహేంద్రగిరిపైకి చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 4 కిష్కింధ కాండ

ప్రశ్న 8.
హనుమంతుడు సీతాన్వేషణకై బయలుదేరిన విధమెట్టిది?
జవాబు:
సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను అన్ని దిశలకూ పంపాడు. అంగదుని నాయకత్వంలో హనుమ, జాంబవంతుడు మొదలయిన వీరులను దక్షిణ దిక్కుకు పంపాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన వానరులు, వట్టి చేతులతో తిరిగివచ్చారు.

అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు బయలుదేరి వచ్చిన వానర వీరులు అణువణువూ వెదకుతున్నారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు నెలపూర్తి అయ్యింది. అంగదుడు ఉత్సాహంతో ముందుకు కదలుదాము అన్నాడు. వారు ‘ఋక్షబిలము’ అనే గుహ దగ్గరికి వచ్చారు. వానరులకు ఆకలి, దాహము పట్టుకొంది. అక్కడ ‘స్వయంప్రభ’ అనే యోగిని దయతో, వానరులు ఆకలిదప్పులు తీర్చుకొన్నారు. ఆమె ప్రభావంతో, వారు సముద్రతీరానికి చేరారు. వానరులు సీత జాడ తెలిశాకే సుగ్రీవుని కలుద్దాం అనుకున్నారు.

వానరుల మాటలో ‘జటాయువు’ మాట వచ్చింది. ఈ జటాయువు సోదరుడు ‘సంపాతి’. సంపాతి తన దివ్యదృష్టితో లంకను గురించి వానరులకు చెప్పాడు. లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది ఎవరివల్ల ఔతుందో అని వానరులు చర్చించుకున్నారు. హనుమంతుడు ఒక్కడే సముద్రాన్ని దాటగలడని చివరకు వారు నిశ్చయించారు.

జాంబవంతుడు హనుమంతుడికి, అతని శక్తియుక్తులను గురించి తెలిపాడు. హనుమ బలాన్ని పుంజుకున్నాడు. దానితో హనుమ వానరులతో “నేను వేయి పర్యాయాలు మేరు పర్వతాన్ని చుట్టి రాగలను. సముద్రాలను దాటగలను” అని చెప్పాడు.

హనుమ మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. “నీ ధైర్యోత్సాహాలకు తగు విధంగా మాట్లాడావు. నీవు ఋషులు, గురువుల అనుగ్రహంతో సముద్రాన్ని దాటు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మన వానరుల ప్రాణాలన్ని నీపై ఆధారపడి యున్నాయి” అని జాంబవంతుడు హనుమకు చెప్పాడు.

హనుమ, తాను ఎగరడానికి ‘మహేంద్రగిరి’ తగినదని, నిశ్చయించి అక్కడకు చేరాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ

10th Class Telugu ఉపవాచకం 3rd Lesson అరణ్యకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం.

1. అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం. ప్రశాంత ప్రదేశం.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు శ్రీరాముడు.
ఇ) పక్షులు, మృగాలు – సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
జవాబులు
అ) దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం.
ఇ) పక్షులు, మృగాలు, సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది.
ఈ) అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి.
ఆ) ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరుచేశాడు.

2. అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు. శ్రీరాముడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం.సాహసమని అభినందించాడు.
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
జవాబులు
ఇ) శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్యసమేతంగా ఎదురువెళ్లాడు.
ఈ) అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు.
ఆ) కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం సాహసమని అభినందించాడు.
అ) తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీత రక్షణ బాధ్యత అప్పగించాడు శ్రీరాముడు.

3. అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
జవాబులు
ఆ) ఇంతలో ‘శూర్పణఖ’ అనే రాక్షసి అక్కడికి వచ్చింది.
ఈ) శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది శూర్పణఖ.
అ) సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
ఇ) ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిని చేయమన్నాడు శ్రీరాముడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

4. అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షసవీరులు రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది. .
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
జవాబులు
అ) ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేల మంది రాక్షస వీరులు .రాముడి ధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ.
ఇ) ‘సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవే’నని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది.
ఈ) శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు రావణుడు.
ఆ) రావణుడు మళ్లీ మారీచుని వద్దకు వెళ్లాడు. సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు.

5. అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
జవాబులు
ఆ) మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు.
ఈ) తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది సీత.
ఇ) సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు.
అ) మారీచుని కంఠధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది.

6. అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశమార్గం పట్టాడు.
జవాబులు
ఇ) యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనంమీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత.
ఆ) సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు.
అ) చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్లను నరికివేశాడు.
ఈ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

7. అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
జవాబులు
ఈ) లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు.
ఆ) రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు.
ఇ) జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు.
అ) మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు.

8. అ) మారీచుడు బంగారు లేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
జవాబులు
ఈ) విరాధుని మాట ప్రకారం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి బయల్దేరాడు.
ఆ) శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురువెళ్ళాడు.
ఇ) ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు.
అ) మారీచుడు బంగారులేడిగా మారి సీత నివాసం ఉండే ప్రాంతానికి వచ్చాడు.

9. అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
జవాబులు
ఈ) సీతారామలక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు.
ఇ) పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది.
ఆ) లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు.
అ) రావణుడు సీతను తీసుకొని ఆకాశమార్గంలో వెళ్ళాడు.

పాత్ర స్వభావాలు

1. శరభంగ మహర్షి :
శరభంగుడు మహాతపస్వి. దైవసాక్షాత్కారం పొందినవాడు. శ్రీరాముని చూసి శ్రీరామదర్శనం కోసమే తాను వేచివున్నానన్నాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

2. అగస్త్యుడు :
అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. ‘అగమ్ స్తంభయతీతి అగస్త్యః’ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు.

3. జటాయువు :
ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఇతనికి సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెడుతుంటే నిరోధించాడు. గాయాల పాలయ్యాడు. శ్రీరామునికి విషయాన్ని వివరించాడు. శ్రీరాముని చేతిలో కన్నుమూశాడు.

4. కబంధుడు :
ఒక రాక్షసుడు. ఇతని చేతిలో చిక్కితే ఎవ్వరూ తప్పించుకోలేరు. రావణుడు అపహరించిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునకు చెప్పాడు.

5. మారీచుడు :
మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడి యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు.

సీతాపహరణకై తనకు సాయం చేయమని రావణుడు మారీచుని కోరాడు. రాముడు సింహం వంటివాడని రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగోక్కోడం వంటిదని, రావణునికి మారీచుడు హితవు చెప్పాడు.

రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచుని బెదిరించాడు.

రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు.

6. శబరి :
శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానవయోవృద్ధురాలు. శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
“అన్నా! ఈ దైన్యాన్ని వదులు. అదే మనకు మేలుచేస్తుంది” అను లక్ష్మణుని మాటలను బట్టి, మీరేం గ్రహించారో తెలుపండి.
జవాబు:
రావణుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతావియోగంతో బాధపడుతున్నాడు. రామలక్ష్మణులు సీతను వెదకుతూ, అందమైన పంపాసరస్సు దగ్గరకు వచ్చారు. ఆ అందమైన ప్రకృతిని చూచి, శ్రీరాముడు మరింతగా విరహ బాధపడ్డాడు.

అప్పుడు రాముడు దైన్యాన్ని విడిచిపెడితే, మేలు కలుగుతుందని చెప్పి, లక్ష్మణుడు రాముని ఊరడించాడు. లక్ష్మణుడు చెప్పినట్లు, కష్టాలు వచ్చినపుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ, ఉత్సాహం ఉన్న వాడికి అసాధ్యం ఏమీ ఉండదనీ, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎలాంటి కష్టాలు వచ్చినా, వెనుకడుగు వేయరనీ, నేను గ్రహించాను.

ప్రశ్న 2.
‘నీ చేతిలో చావడం కన్నా, శ్రీరాముని చేతిలో చావడమే నయం’ అన్న మారీచుని మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రావణుడు మారీచుని దగ్గరకు వచ్చి, సీతను అపహరించడానికి తనకు సాయం చేయుమని కోరాడు. రాముడి జోలికి వెళ్ళడం మంచిది కాదని, మారీచుడు రావణునికి హితువు చెప్పి పంపాడు.

కాని రావణుడు మళ్ళీ మారీచుడి దగ్గరకు వచ్చి, బంగారు లేడి రూపం ధరించి, సీతాపహరణానికి తనకు సాయం చెయ్యమని కోరాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే, మారీచుని చంపుతానని రావణుడు చెప్పాడు.

రావణుడు చెప్పినట్లు చేసినా చెయ్యకపోయినా, మారీచుడికి మరణం తప్పని పరిస్థితి వచ్చింది.

అందుకే మారీచుడు మూర్ఖుడయిన రావణుడి చేతిలో చావడం కన్నా, ధర్మాత్ముడూ, మహావీరుడూ అయిన రాముడి చేతిలో చావడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. రాముడి చేతిలో మరణిస్తే తన జన్మ తరిస్తుందని, మారీచుడు అనుకున్నాడు. దీనిని బట్టి దుర్మార్గుని చేతిలో చావడం కన్న, మంచివాడి చేతిలో మరణం పొందడం మంచిదని నేను గ్రహించాను. మారీచుడు రాక్షసుడయినా, మంచి చెడ్డలు తెలిసిన వాడని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికి రాదు’ అని శూర్పణఖ విషయంలో రాముడు పలికిన దానిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
క్రూరులు అత్యంత ప్రమాదకారులు. వారితో పరిహాసం ఎన్నటికీ పనికిరాదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. వారు ఎదుటివారిని చులకనగా చూస్తారు. చనువుగా ప్రవర్తిస్తారు. మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు.

క్రూరులతో సహవాసం చేయడం వల్ల వ్యక్తిత్వం నశిస్తుంది. సమాజంలో గౌరవం. అందువల్ల రాముడు చెప్పినట్లుగా క్రూరులతో సహవాసం పనికిరాదు.

ప్రశ్న 4.
“మహాత్ములారా! మీరు నన్ను ప్రార్థించడం తగదు. ఆజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను” అని రాముడు మునులతో అన్న మాటను బట్టి, మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
శ్రీరాముడు వనవాస కాలంలో సుతీక్ష మహర్షిని కలిశాడు. తరువాత అక్కడి మునులు అందరూ రాముడిని కలిసి, రాక్షసులు చేసే అకృత్యాలను గూర్చి చెప్పారు. రాక్షసుల బారినుండి తమ్ము రక్షింపుమని వారు రాముని ప్రార్థించారు.

అప్పుడు రాముడు ఆ మునులతో తన్ను ప్రార్థించడం తగదనీ, ఆజ్ఞాపించమనీ మునులు చెప్పినట్లు రాక్షసులను తాను సంహరిస్తాననీ, మునులకు అభయం ఇచ్చాడు.

దీనిని బట్టి శ్రీరాముడు మునుల మాటలను చాలా గౌరవించేవాడని, మునుల మాటలను ఆజ్ఞగా గ్రహించి వారు చెప్పినట్లు చేసేవాడని గ్రహించాను.

శ్రీరామునకు మునీశ్వరులపై భక్తి గౌరవములు హెచ్చుగా ఉండేవని గ్రహించాను. రాముడు మహావీరుడని గ్రహించాను.

ప్రశ్న 5.
“నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు” అని సీత, రావణుని హెచ్చరించిన మాటలను బట్టి, నీవేమి గ్రహించావో చెప్పు.
జవాబు:
రావణుడు సన్న్యాసి వేషంతో సీతవద్దకు వచ్చి, తనను భర్తగా స్వీకరిస్తే, గొప్ప భోగభాగ్యాలు అనుభవించవచ్చునని సీతకు ఆశచూపాడు.

రావణుని మాటలకు, సీత మండిపడింది. సీత మహా పతివ్రత. రావణుడు సీతను అపహరించి తీసుకొని వెడితే, అతడు తన చావును తాను కోరి తెచ్చుకున్నట్లే అని, సీత నిజాన్ని చెప్పిందని గ్రహించాను. రావణుడు సీతాపహరణం చేయకపోతే అతనికి మరణమే లేదని గ్రహించాను.

సీత మాటలను బట్టి ఆమె మహా ధైర్యం కలదనీ, నిర్భయంగా రావణుని వంటి రాక్షసుణ్ణి తిరస్కరించి మాట్లాడగలదనీ, , సత్యమూ హితమూ ఆమె బోధించిందనీ, నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 6.
రావణుడు సీతను అపహరించే సందర్భంలో జటాయువు చేసిన ప్రయత్నం నుండి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు సన్యాసి వేషంలో సీతాదేవి సమీపానికి వచ్చాడు. నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు. లొంగిపొమ్మని బెదిరించాడు. కోపంతో రావణుడు సీతను తీసికొని రథంలో కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు.

అది గమనించిన జటాయువు రావణుని ఎదిరించాడు. వారిద్దరి మధ్య పోరాటం జరిగింది. చివరకు రావణుని చేతిలో మరణించాడు. మిత్రధర్మం కోసం అవసరమైతే ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడాలని గ్రహించాను. ఆపదల్లో ఉన్న వారిని, ముఖ్యంగా స్త్రీలను తప్పక రక్షించాలని గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 7.
శ్రీరాముడిని భక్తితో సేవించి తరించిన శబరి వ్యక్తిత్వం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అరణ్యమార్గంలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో శబరి ఆశ్రమానికి వచ్చారు. శబరి శ్రీరాముని రాకకై ఎదురుచూస్తున్నది. శ్రీరాముని దర్శనంతో ఆనందాన్ని పొందింది. ఫలాలతో శ్రీరాముడిని సేవించింది. పండ్లను పరిశుభ్రం చేసి అందించింది. అగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకొంది. ఊర్ధ్వ లోకాలకు వెళ్ళింది. శబరి వ్యక్తిత్వం వల్ల దైవాన్ని భక్తి, శ్రద్ధలతో సేవించాలని, ఇంటికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో సేవించాలని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి. .

ప్రశ్న 1.
‘క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు’ ఈ మాట ఎవరు ఎవరితో ఎప్పుడు అన్నారు?
జవాబు:
పంచవటిలో శూర్పణఖ విషయంలో శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు. ఆమె రావణుడి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమంది. తమకు అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు. లక్ష్మణుడు కూడా పరిహాసం చేశాడు. సీతపై దాడికి దిగింది.

అప్పుడు క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. శూర్పణఖను విరూపిని చేయమని లక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞను అమలుపరిచాడు.

ప్రశ్న 2.
మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’గా ఎందుకు మారింది?
జవాబు:
సీతాపహరణం చేయాలనుకొన్నాడు రావణుడు. మారీచుని బంగారులేడిగా మారమన్నాడు. రామబాణం రుచి తెలిసిన మారీచుడు తిరస్కరించాడు. రావణుడు చంపుతానన్నాడు. బంగారులేడిగా మారితే రాముడు చంపుతాడు. మారకపోతే రావణుడు చంపుతాడు. అప్పుడు మారీచుని పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’గా మారింది. శ్రీరాముని చేతిలో మరణిస్తే జన్మ ధన్యమవుతుందని భావించి బంగారు లేడిగా మారడానికి అంగీకరించాడు. అతని కోరిక తీరింది.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 3.
‘ఉత్సాహమున్న వానికి అసాధ్యం లేదు’ అని ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు?
జవాబు:
సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఆమె జాడ తెలియక రామలక్ష్మణులు వెతుకుతున్నారు. వెతుకుతూ, వెతుకుతూ పంపా సరోవర ప్రాంతాన్ని చేరుకొన్నారు. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. దానితో శ్రీరాముని బాధ పెరిగింది. అప్పుడు లక్ష్మణుడు అన్నగారి దైన్యాన్ని పోగొట్టడానికి పలికిన వాక్యమిది.

ప్రశ్న 4.
శూర్పణఖ ఎవరు? ఆమె అవమానం పొందడానికి కారణమేమిటో తెల్పండి.
జవాబు:
శూర్పణఖ ఒక రాక్షసి. ఈమె రావణునికి చెల్లెలు. శ్రీరాముని అందానికి మురిసిపోయి తనను పెళ్ళి చేసుకోమన్నది. అందుకు అడ్డంగా ఉన్న సీతను, లక్ష్మణుని చంపితింటానన్నది. రాముడు ఆమెను పరిహాసంగా లక్ష్మణుని వద్దకు పంపించాడు. లక్ష్మణుడు తాను అన్నగారి సేవకుణ్ణని, తనను పెళ్ళాడితే ఆమెకూడా తనతోబాటే అన్నకు దాస్యం చేయాల్సి వస్తుందని చెప్పి రాముణే పెళ్ళాడమని పంపాడు. సీత ఉండటం వల్లే రాముడు తనను నిరాకరించాడనుకొని సీతను చంపడానికి దాడి చేసింది. ప్రమాదాన్ని గుర్తించిన లక్ష్మణుడు అన్న ఆదేశంపై శూర్పణఖ ముక్కు, చెవులు కోసి ఆమెను విరూపిని చేశాడు. అలా తన రాక్షసత్వం వలన శూర్పణఖ రామలక్ష్మణులను కోరి అవమానం పొందింది.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పంచవటిలో సీతారామలక్ష్మణుల జీవితం ఎలా సాగిందో వివరించండి.
జవాబు:
అగస్త్య మహర్షి మాటపై, సీతారామలక్ష్మణులు, పంచవటికి చేరారు. లక్ష్మణుడు పంచవటిలో పర్ణశాలను నిర్మించాడు. సీత రక్షణ బాధ్యతను రాముడు, జటాయువుకు అప్పగించాడు. పంచవటిలో వారి జీవితం సుఖంగా సాగుతోంది. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి, రాముడిని తనను చేపట్టమంది. లక్ష్మణుడు అన్న ఆజ్ఞతో శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ సోదరుడైన ఖరుడి వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరుడు 14 వేల మంది రాక్షసులతో రాముడి చేతిలో యుద్ధంలో మరణించాడు.

అకంపనుడు అనే గూఢచారి ఖరుడి మరణవార్త రావణుడికి అందించి రాముని భార్య సీతను అపహరించమని రావణుడికి సలహా చెప్పాడు. శూర్పణఖ వెళ్ళి రావణుడిని రెచ్చగొట్టింది.

రావణుడు మారీచుడిని మాయలేడిగా సీతారాములు ఉన్న పర్ణశాల వద్దకు పంపాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని రాముడిని కోరింది. రాముడు వెళ్ళి మాయలేడిని చంపాడు. మాయలేడి ‘సీతా! లక్ష్మణా! అంటూ అరచి రాముడి చేతిలో మరణించింది.

రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని రాముని వద్దకు పంపింది. అదే సమయంలో సన్యాసి వేషంలో రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను బలాత్కారంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకువెడుతున్నాడు. సీత, ‘రామా, రామా’ అని కేకలు వేసింది. జటాయువు రావణుడిని ఎదిరించి, అతడి చేతిలో దెబ్బతింది. రావణుడు సీతను తన లంకా నగరానికి తీసుకువెళ్ళాడు.

రామలక్ష్మణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియక వారు దుఃఖించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 2.
మాయలేడి వలన సీతారాములకు కష్టాలు వచ్చాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రావణుడు పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరించాలనుకున్నాడు. రావణుడు మారీచుడిని బెదరించి, బంగారులేడి రూపంలో అతడిని రాముడి ఆశ్రమ ప్రాంతానికి పంపాడు. సీత ఆ జింకను చూసి ఇష్టపడింది. లక్ష్మణుడు అది మాయా మృగం అని చెప్పాడు. సీత ఆ లేడిని తెచ్చి ఇమ్మని పట్టుపట్టింది.

సీత ఇష్టాన్ని కాదనలేక, ఆ మాయలేడిని చంపి అయినా తేడానికి రాముడు వెళ్ళాడు. రాముడు ఎంత ప్రయత్నించినా లేడి అందకుండా పరుగుదీసింది. దానితో రాముడు లేడిపై బాణాన్ని వేశాడు. ఆ లేడి ‘సీతా! లక్షణా!’ అని అరుస్తూ చచ్చింది.

మాయలేడి కంఠ ధ్వని రాముడిది అని, సీత కంగారుపడి, రాముడికి సాయంగా లక్ష్మణుడిని పంపింది. లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులలో సీతను విడిచి, రాముడి దగ్గరకు వెళ్ళాడు.

అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో పర్ణశాలకు వచ్చి సీతను బలవంతంగా తీసుకుపోయాడు. కాబట్టి సీతారాముల కష్టానికి మాయలేడియే కారణం అని చెప్పగలము.

ప్రశ్న 3.
కబంధుడు అనే రాక్షసుడు శ్రీరామునకు ఉపకారం చేశాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
కబంధుడు క్రౌంచారణ్యంలో ఉన్న ఒక రాక్షసుడు. ఇతడికి తల, మెడ లేవు. ఇతడి కడుపు భాగంలో ముఖం ఉండేది. రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండేది. ఇతనికి యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఉండేవి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తినేవాడు.

కంబంధుడు రామలక్ష్మణులను తన చేతులతో పట్టుకొని తినబోయాడు. కబంధుడి చేతులకు చిక్కితే, ఎవరూ తప్పించుకోలేరు. కాని రామలక్ష్మణులు ఖడ్గాలతో కబంధుడి చేతులు నరికారు. అప్పుడు కబంధుడు తనకు శాపం వల్ల రాక్షసరూపం వచ్చిందనీ, తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని దహనం చేశారు….ఆ జ్వాలల నుండి కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీత దొరికే ఉపాయాన్ని రామలక్ష్మణులకు చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని వారికి చెప్పాడు. సుగ్రీవుని స్నేహంతో రాముడు సీతను తిరిగి తెచ్చుకున్నాడు. దీనినిబట్టి కబంధుడు రామలక్ష్మణులకు ఉపకారం చేశాడని చెప్పగలం.

ప్రశ్న 4.
సీతారాముల దండకారణ్యవాస వృత్తాంతాన్ని తెలపండి. (సీతారాములు పంచవటిని చేరిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎన్నో మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. మునులు వీరికి స్వాగతం పలికారు.

వీరు దండకవనం మధ్యకు చేరారు. ‘విరాధుడు’ అనే రాక్షసుడు సీతారామలక్ష్మణులపై పడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని వాడు తీసుకుపోతున్నాడు. సీత ఏడ్చింది. రామలక్ష్మణులు విరాధుని భుజాలు నరికివేశారు. విరాధుడు కుప్పకూలాడు. విరాధుణ్ణి గోతిలో పాతిపెడదామని వారు అనుకున్నారు. విరాధుడు తాను తుంబురుడిననీ, శాపంవల్ల రాక్షసుడుగా అయ్యానని చెప్పి, శరభంగమహర్షిని దర్శించమనీ, తనను గోతిలో పూడ్చమనీ రామలక్ష్మణులకు చెప్పాడు.

రామలక్ష్మణులు విరాధుణ్ణి పూడ్చి, శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగ మహర్షి రామదర్శనం కోసం వేచి చూస్తున్నాడు. తన తపః ఫలాన్ని రాముడికి ధారపోశాడు. సుతీక్ష మహర్షిని దర్శించమని ఆయన చెప్పాడు.

సీతారామలక్ష్మణులు సుతీక్ష మహర్షిని దర్శించారు. ఆయన రామదర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మహర్షి తన తపస్సును రామునికి ధారపోశాడు. ఈ విధంగా దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను దర్శిస్తూ, సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాలు వనవాసం చేశారు. వారు తిరిగి సుతీక్ష.. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అగస్త్యుని సోదరునీ, అగస్త్య మహర్షినీ దర్శనం చేసుకోమని రామలక్ష్మణులకు చెప్పాడు.

సీతారామలక్ష్మణులు అగస్త్య భ్రాత (సోదరుడు) ఆశ్రమాన్ని దర్శించారు. తరువాత అగస్త్యుని దర్శించారు. అగస్త్య మహర్షి శిష్యులతో రామునికి స్వాగతం పలికాడు. ఆయన రామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గమును ఇచ్చాడు. రామునకు జయం కల్గుతుందని ఆశీర్వదించాడు.

రాముడు తాము నివసించడానికి తగిన ప్రదేశాన్ని సూచించమని అగస్త్యుణ్ణి కోరాడు. ఆ మహర్షి గోదావరీ తీరంలో ఉన్న ‘పంచవటి’ లో ఉండమని వారికి సూచించాడు. రామలక్ష్మణులకు మార్గమధ్యంలో ‘జటాయువు’ కనబడింది. దానికి సీత రక్షణ బాధ్యతను వారు అప్పగించారు. పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని వారు అక్కడ నివసించారు.

ప్రశ్న 5.
సీతాపహరణం గురించి రాయండి.
(లేదా)
రావణుడు మారీచుని సాయంతో సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
‘సీతారాములు పంచవటిలో సుఖంగా జీవిస్తున్నారు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముడి అందానికి మోహపడి తన్ను భార్యగా స్వీకరించమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. శూర్పణఖ దండాకారణ్యంలో ఉన్న సోదరుడు ఖరుడికి ఆ విషయం చెప్పింది. ఖరుడు పంపిన యోధులనూ, ఖరదూషణులనూ మొత్తం 14 వేల మంది రాక్షసులను రాముడు గడియలో చంపాడు.

‘అకంపనుడు’ అనే గూఢచారి దండకలో రాక్షససంహారం జరిగిందని రావణునకు వార్త చేర్చాడు. రావణుడు రాముణ్ణి చంపుతానన్నాడు. రాముణ్ణి చంపడం దేవాసురులకు కూడా అసాధ్యం అని అకంపనుడు చెప్పాడు. సీతను అపహరించమని సూచించాడు. రావణుడు మారీచుని సాయం అడిగాడు. మారీచుడు రాముణ్ణి కవ్వించవద్దని రావణునికి సలహా చెప్పాడు. శూర్పణఖ, తన అన్న రావణుడికి, సీతను అపహరించమని చెప్పింది.

రావణుడు తిరిగి మారీచుడి దగ్గరకు వెళ్ళి, సీతాపహరణకు బంగారు లేడిగా మారి తనకు సాయం చెయ్యమని అడిగాడు. మారీచుడు హితం చెప్పినా, రావణుడు వినలేదు. తనకు సాయపడకపోతే మారీచుని చంపుతానన్నాడు రావణుడు.

దానితో మారీచుడు బంగారు లేడిగా మారి రాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు. సీత బంగారు లేడిని చూసి ముచ్చటపడింది.

ఆ బంగారు లేడిని పట్టి తెమ్మని, సీత రాముని కోరింది. అది మాయలేడి అని లక్ష్మణుడు చెప్పాడు. రాముడు, సీత మాట కాదన లేక లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉంచి, తాను లేడి కోసం వెళ్ళాడు. మాయలేడి రామునికి దొరకలేదు. రాముడు దానిపై బాణం వేశాడు. మాయలేడి చస్తూ “హా సీతా ! హా లక్ష్మణా !” అని అరిచింది.

ఆ ధ్వని విని సీత రాముడు ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడిని రామునికి సాయంగా వెళ్ళమని చెప్పింది. లక్ష్మణుడు కాదంటే, అతణ్ణి సీత నిందించింది. లక్ష్మణుడు సీతను విడిచి వెళ్ళాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో సీత ఉన్న ఆశ్రమానికి వచ్చి, తాను రావణుడిని అని చెప్పి సీతను బలవంతంగా తన లంకా నగరానికి తీసుకుపోయాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 3 అరణ్యకాండ

ప్రశ్న 6.
రామలక్ష్మణులు సీతను అన్వేషిస్తూ పంపా సరస్సు తీరానికి చేరిన వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
మారీచుణ్ణి చంపి, శ్రీరాముడు వెనుకకు ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో లక్ష్మణుడు కనబడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటని రాముడు అడిగాడు. లక్ష్మణుడు జరిగిన విషయం చెప్పాడు. రామలక్ష్మణులు ఆశ్రమానికి వెళ్ళి, సీతను వెదికారు. వనమంతా వెదికారు. సీత జాడ కనబడలేదు. సీత జాడ చెప్పమని రాముడు ప్రకృతిని ప్రార్థించాడు. శ్రీరాముడు సీతా వియోగాన్ని భరించలేక ఏడ్చాడు. లక్ష్మణుడు రాముడిని ఓదార్చాడు.

రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు. అతడిని చూసి గద్ద రూపంలో ఉన్న రాక్షసుడనీ, అతడే సీతను తిని ఉంటాడని వారు భ్రాంతి పడ్డారు. జటాయువు జరిగినది చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడనీ, రావణుడే తనను దెబ్బ తీశాడనీ, జటాయువు వారికి చెప్పాడు. జటాయువు మరణించాడు. రాముడు జటాయువుకు అంత్యక్రియలు చేశాడు.

రామలక్ష్మణులు “క్రౌంచారణ్యం” చేరుకున్నారు. అక్కడ వారికి ఒక రాక్షసుడు కనబడ్డాడు. వాడికి తల, మెడ లేదు. వాడి ముఖం వాడి కడుపులో ఉంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. వాడి చేతులు యోజనం పొడుగున్నాయి. ఆ చేతులతో వాడు పక్షులను, మృగాలను పట్టి తింటాడు. అతడి పేరు ‘కబంధుడు’.

‘కబంధుడు’ రామలక్ష్మణులను చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతుల్లో చిక్కితే, ఎవడూ తప్పించుకోలేడు. వాడు రామలక్ష్మణుల్ని తినడానికి నోరు తెరచాడు. వారు కబంధుని భుజాలు నరికిపారవేశారు. కబంధుడు కుప్పకూలాడు. శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చిందని కబంధుడు వారికి చెప్పాడు.

రామలక్ష్మణులు రావణుని గురించి కబంధుణ్ణి అడిగారు. కబంధుడు తన శరీరాన్ని దహిస్తే తనకు దివ్యజ్ఞానం వస్తుందనీ, అప్పుడు రావణుడి గురించి చెప్పగలననీ చెప్పాడు. రామలక్ష్మణులు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. కబంధుడు దివ్యదేహంతో వచ్చి, సీతాదేవి దొరికే ఉపాయాన్ని వారికి చెప్పాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమన్నాడు. కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు.

రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి రాముడికి పండ్లు పెట్టింది. తరువాత శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఊర్థ్వలోకాలకు వెళ్ళింది. రామలక్ష్మణులు ఈ విధంగా పంపా సరస్సుకు చేరారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం రామాయణం

10th Class Telugu ఉపవాచకం రామాయణం Textbook Questions and Answers

రామాయణం – కొన్ని వివరణలు

రామాయణం : సంస్కృతంలో వాల్మీకి మహర్షిచే రచింపబడింది. ఆదికావ్యం.

వాల్మీకి మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.

రామాయణానికి గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.

దశరథ మహారాజు : కోసలదేశానికి రాజు.

కోసలదేశం : సరయూ నదీ తీరంలో ఉంది.

అయోధ్య : కోసలదేశ రాజధాని

దశరథ మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).

రాముడు : కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

లక్ష్మణుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

భరతుడు : కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

శత్రుఘ్నుడు : సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.

రామాయణంలోని శ్లోకాల సంఖ్య : 24 వేలు

రామాయణంలోని కాండములు : 1. బాలకాండ, 2. అయోధ్యాకాండ, 3. అరణ్యకాండ, 4. కిష్కింధ కాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ, 7. ఉత్తరకాండ

నారదుడు : దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు.

వాల్మీకి ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.

వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”

ఋష్యశృంగుడు : విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.

మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగించేవాళ్ళు.

మారీచుడు : ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.

బల, అతిబల : విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రూపకాంతులు తగ్గవు.

తాటక : యక్షిణి

సిద్ధాశ్రమం : వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.

జనక మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.

కుశధ్వజుడు : జనకమహారాజు తమ్ముడు.

అహల్య : గౌతమ మహర్షి భార్య.

శతానందుడు : అహల్యా గౌతముల కుమారుడు.

సీత (జానకి) : శ్రీరాముని భార్య

ఊర్మిళ : లక్ష్మణుని భార్య

మాండవి : భరతుని భార్య

శ్రుతకీర్తి : శత్రుఘ్నుని భార్య

పరశురాముడు : రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు.

కార్తవీర్యార్జునుడు : పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు.

మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.

సుమంత్రుడు : దశరథుని మంత్రులలో ఒకడు. దశరథుని రథం తోలేవాడు. ఇతడే శ్రీరాముని రథసారథి.

గుహుడు : శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు.

భరద్వాజుడు : సప్త ఋషులలో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు.

భరద్వాజాశ్రమం : గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది.

చిత్రకూటం : ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.

అత్రిమహర్షి : సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు.

అనసూయ : అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది.

దండకారణ్యం : ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం. దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది.

విరాధుడు : తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాపంవల్ల రాక్షసుడిగా మారాడు. శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు.

శరభంగ మహర్షి : మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు.

సుతీక్ష్య మహర్షి : సీతారామలక్ష్మణులు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు. ఈయన తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారపోశాడు.

విశ్వామిత్రుడు : గాధి కుమారుడు. యాగరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళాడు.

అగస్త్య భ్రాత : అగస్త్యుని సోదరుడు. ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు. అందుకే పేరు తెలియని వారిని ‘అగస్త్య భ్రాత’ అంటారు.

అగస్త్య మహర్షి : వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. ఈయన శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు.

పంచవటి : గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం. వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు.

జటాయువు : ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. ఈ జటాయువు దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే.

శూర్పణఖ : ఒక రాక్షసి. రావణాసురుని చెల్లెలు, లక్ష్మణుడు ఈమె ముక్కు, చెవులను కోసి విరూపినిగా చేశాడు.

ఖరదూషణులు : శూర్పణఖ సోదరులు.

అకంపనుడు : రావణాసురుడి గూఢచారులలో ఒకడు.

రావణుడు : కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు.

లంకానగరం : త్రికూట పర్వతం మీద ఉంది.

కబంధుడు : ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రావణునిచేత అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేసినవాడు ఇతడే.

శబరి : ఒక బోయకాంత. తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది. శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది.

ఋష్యమూక పర్వతం : కిష్కింధకు దగ్గరలో గల ఒక పర్వతం. సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైనే.

వాలి సుగ్రీవులు : వనరులు. అన్నదమ్ములు. వాలి సుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు.

హనుమంతుడు : అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.

తార : వాలి భార్య.

రుమ : సుగ్రీవుని భార్య. అంగదుడు : వాలి కుమారుడు.

నీలుడు : ఒక వానరుడు. సుగ్రీవుని సేనలోనివాడు.

నలుడు : ఒక వానరుడు. విశ్వకర్మ యొక్క పుత్రుడు. సుగ్రీవుని సేనలోనివాడు. సముద్రానికి వారథి కట్టడానికి ఇతడే ప్రారంభించాడు.

జాంబవంతుడు : భల్లూకరాజు.

సుషేణుడు : వానరరాజు, తారతండ్రి.

సంపాతి : పక్షిరాజు. జటాయువుకు అన్న. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు.

మైనాకుడు : ఒక పర్వతం. మేనకా హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు. హనుమంతుడు కొంతసేపు విశ్రమించాడు.

సురస : నాగమాత. హనుమంతుని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది.

సింహిక : ఒక రాక్షసి. హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.

లంకిణి : లంకాధిదేవత.

కుంభకర్ణుడు : రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో ఇతని శిరస్సును ఖండించాడు.

మహాపార్శ్వుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

వీభీషణుడు : రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని బోధించాడు. ఇతడు రాముని పక్షంలో చేరాడు.

మహూదరుడు : ఒక రాక్షసుడు. రావణుని సేనలోనివాడు.

విరూపాక్షుడు : మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షాన పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు సంహరించాడు.

విద్యుజిహ్వుడు : ఒక రాక్షసుడు. శూర్పణఖ భర్త.

త్రిజట : విభీషణుని కూతురు. లంకలో సీతకు కావలి ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి సీత కోరిక నెరవేరుతుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది.

ఇంద్రజిత్తు : రావణుని పెద్ద కుమారుడు. ఇతని పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు. అని పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి బంధించాడు

ప్రహస్తుడు : రావణుని సేనానాయకులలో ఒకడు.

శుకసారణులు : రావణాసురుని మంత్రులు.

సరమ : విభీషణుని భార్య.

జంబుమాలి : ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనలోనివాడు

అతికాయుడు : రావణుని కుమారుడు. ఇతనిని లక్ష్మణుడు సంహరించాడు.

మాతలి : ఇంద్రుని రథ సారథి.

పుష్పక విమానం : ఇది కుబేరుని విమానం. దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు బలాత్కారంగా కుబేరుని వద్ద నుంచి తీసుకున్నాడు. రావణుని చంపిన తరువాత శ్రీరాముడు దీన్ని ఎక్కి లంక నుండి వచ్చాడు. తరువాత దీన్ని కుబేరునకు ఇచ్చాడు.

త్రికూట పర్వతం : లంకానగరం ఈ పర్వతం మీద ఉన్నది.

వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
రామాయణ ప్రాశస్త్యమును గురించి రాయండి.
(లేదా)
రామాయణాన్ని ఎందుకు చదవాలి?
(లేదా)
“రామాయణం భారతీయులకు ఒక ఆచరణీయ గ్రంథం” వివరించండి.
(లేదా)
మానవ సంబంధాల గొప్పతనాన్ని వివరించిన రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని విశ్లేషించండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుండి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది.

రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యాను రక్తి, స్నేహఫలం ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వా లు ఎన్నో కనబడతాయి.

రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. ‘రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది.

రామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్పమాటను పలికించాడు.

రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి!” అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు” మనిషి ఉన్నంత వరకూ రామాయణం ఉంటుంది.

రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకి మహర్షి సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం, రామాయణాన్ని తప్పక చదవాలి.

ప్రశ్న 2.
‘రామాయణం’ ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం. అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంత వరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి, రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశ విదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.

సంస్కృత సాహిత్యం – రామకథ :
రామకథ వివిధ పురాణాల్లో కనబడుతుంది.

  1. ఆధ్యాత్మ రామాయణం
  2. కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతోపాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది.
  3. చంపూ రామాయణం – భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు.
  4. “రావణవధ” దీనిని భట్టి కవి రాశాడు.
  5. “ప్రతిమా నాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు.
  6. ఉత్తర రామచరితం : భవభూతి నాటకంగా దీనిని రాశాడు.
  7. రాఘవ పాండవీయం : రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనంజయుడు దీనిని రాశాడు.

కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధచరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్’, ‘మంత్ర రామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి” మంచి పేరుంది. తమిళ భాషలో ‘కంబ రామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “అధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం’ చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్ర రామాయణం” రాశాడు.

తెలుగు భాషలో రామాయణాలు:
గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యుల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలో సాగాయి.

తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్ర వేసింది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కర రామాయణం” రాశారు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథ రామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు.

కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం’ రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంద్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావుగారు “ఆంధ్రవాల్మీకి రామాయణం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి “శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి.

విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవకవి. ‘యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. కేశవయ్య “దాశరథి చరిత్ర” పేరుతో నిరోష్ఠ్యరామాయణం రాశాడు.

ఇవి కాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చా యి.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ

10th Class Telugu ఉపవాచకం 2nd Lesson అయోధ్యాకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం

1. అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.
ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి.
ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
జనాబులు
అ) గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర.
ఇ) శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపసవృత్తిలో పదునాలుగు సంవత్సరాలు ఉండాలి.
ఈ) శ్రీరాముణ్ణి చూడాలనుంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
ఆ) కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది.

2. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు.
ఈ) భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
జవాబులు
ఆ) మహర్షి సూచననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.
ఇ) మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. అ) భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు.
ఈ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

3. అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది. ,
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది.
ఇ) కైక తన రెండు వరాలను గురించి చెప్పింది.
ఆ) పుత్ర వ్యా మోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది.
అ) శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు.

4. అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
జవాబులు
ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.
అ) శ్రీరాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.
ఇ) అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.
ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.

5. అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.
ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
జవాబులు
ఈ) శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు.
అ) కాలినడకన వస్తున్న శ్రీరాముడిని చూచి ప్రజలు బావురుమన్నారు.
ఇ) శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు.
ఆ) భరతుడు అయోధ్య వాసులతో అరణ్యానికి బయలుదేరాడు.

6. అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.
ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
జవాబులు
ఈ) సీత రాముని వెంట అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది.
ఇ) ప్రజలు చేసేది లేక అయోధ్యకు వెనుతిరిగి వెళ్ళారు.
అ) శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది.
ఆ) దశరథుని మృతదేహాన్ని తైలద్రోణిలో ఉంచారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

7. అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.
ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్ధిస్తూ హర్షధ్వానాలు చేశారు.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు.
ఆ) కైక వరాలను విన్న రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు.
అ) గుహుని ద్వారా సుమంత్రుడు శ్రీరాముని విషయాలను గ్రహించాడు.
ఇ) శ్రీరామ వనవాస సమయంలో భరతుడు తల్లిని తప్పు బట్టాడు.

8. అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
జవాబులు
ఈ) శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది.
ఆ) రాముడిని తీసుకొని రావలసిందిగా కైక సుమంత్రుడిని ఆజ్ఞాపించింది.
అ) సీతారామలక్ష్మణులు దశరథుని దర్శనానికి బయలుదేరారు.
ఇ) శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

9. అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.
ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
జవాబులు
ఈ) వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు.
ఆ) శ్రీరాముడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు.
ఇ) శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని గుహుడు రాముని వద్దకు వచ్చాడు.
అ) అద్రి అనసూయలు సీతారామలక్ష్మణులకు మర్యాదలు చేశారు.

10. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు.
జవాబులు
ఆ) గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు.
ఇ) భరతుడు అయోధ్యావాసులతో కలిసి శృంగిబేరిపురం చేరాడు.
ఈ) శత్రుఘ్నుడు శ్రీరాముని పాదాలపై పడ్డాడు. అ) భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

పాత్ర స్వభావాలు

1. శ్రీరాముడు :
రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. శరణన్నవారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్లా, గురువుల పట్లా నిశ్చలభక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

2. మంథర :
కైకేయి అత్తవారింటికి వచ్చినపుడు వెంట వచ్చిన అరణపు దాసి మంథర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మంథర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనస్సును మార్చింది.

రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని చూచించింది.

3. గుహుడు :
శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి వెడుతున్న సీతారామలక్ష్మణులను గంగా నదిని దాటించాడు. ధర్మాత్ముడు.

సంఘటన ద్వారా గ్రహించుట

ప్రశ్న 1.
‘పతిని అనుసరించుటయే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదం’. అన్న సీత మాటల ద్వారా మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
సీతాదేవి పతివ్రత. పతిని సేవించనిదే జీవించలేదు. తన భర్తను మించిన లోకం లేదు. తన భర్తతోటే సకల సౌఖ్యాలు అనుకొనే ఉత్తమ ఇల్లాలు సీత అని గ్రహించాను.

ప్రశ్న 2.
“అమ్మా! నువ్వు చెప్పినట్లే చేస్తా” అని కైకేయితో రాముడు పలికిన సన్నివేశాన్ని బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
రామునికి రాజ్యకాంక్ష లేదని, తండ్రి ఆజ్ఞను పాటించడం కన్న గొప్ప ధర్మం మరొకటి లేదని, రాముడు భావించేవాడనీ నేను గ్రహించాను.

రామునకు తల్లుల మాటపై పెద్ద గౌరవం అనీ, రామునికి తల్లులందరూ సమానమేననీ, వారి మాటను రాముడు బాగా గౌరవించేవాడని గ్రహించాను. అందుకే తనకు సవతి తల్లియైన కైక చెప్పగానే, తండ్రి స్వయంగా చెప్పకపోయినా, పినతల్లి కైక మాటను తండ్రి మాటగానే గౌరవించి రాముడు అడవికి ప్రయాణమాయ్యడు.

రాముడు మాతా పితృభక్తుడనీ, వారి మాటలకు జవదాటడనీ, రాజ్యకాంక్ష లేనివాడనీ పై మాటను బట్టి గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
“కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు”. కవి చెప్పిన ఈ మాటలను బట్టి, కైక మనః ప్రవృత్తిని నీవు ఏమి గ్రహించావో వివరించుము.
జవాబు:
కైక మంథర దుష్టబోధలను విని, రాముని 14 ఏండ్లు వనవాసానికి పంపమనీ, తన కుమారుడు భరతునికి రాజ్యపట్టాభిషేకం చేయమనీ దశరథుని కోరింది.

కైక మాటలు విని, దశరథుడు స్పృహ కోల్పోయాడు. కొంత సేపటికి తేరుకొని, దశరథుడు రాముని అడవులకు పంపవద్దని, కైకను బ్రతిమాలాడు. రాముణ్ణి విడిచి తాను ఒక్కక్షణమైనా బతకలేనని, చేతులు జోడించి కైకను ప్రార్థించాడు. కైక పాదాలను పట్టుకుంటానన్నాడు. రాముణ్ణి తనకు దూరం చేయవద్దని కైకను దశరథుడు బ్రతిమాలాడు.

కాని కైక మనస్సు కఠినమైన రాయి వంటిది. అందుకే భర్త బ్రతిమాలినా, ఆమె మనస్సు మార్చుకోలేదు. తన పట్టుదలను విడవలేదు. కైక మొండిదని, అందుకే భర్త తన కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా, తన మొండి పట్టు ఆమె విడిచి పెట్టలేదనీ గ్రహించాను.

ప్రశ్న 4.
“మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా, ఇష్టపడను” అని సీత రామునితో చెప్పిన మాటలను బట్టి, సీత స్వభావాన్ని గూర్చి నీవేమి గ్రహించావు?
జవాబు:
శ్రీరాముడు పితృవాక్య పాలనకై అడవికి వెడుతున్నాడు. రాముడు సీతకు ఆ విషయం చెప్పి, అయోధ్యలో సీత ఎలా మసలుకోవాలో ఆమెకు తెలిపాడు. సీత రాముని మాటలను కాదని, తాను రాముని వెంట వనవాసానికి వెళ్ళడానికే ఇష్టపడింది. అయోధ్యలో ఉంటే సుఖంగా ఉండవచ్చు. రాముని వెంట వెడితే అరణ్యాలలో బాధలు పడాలి.

సీత మహా పతివ్రత కాబట్టి, అయోధ్యలో రాముడు లేకుండా స్వర్గసుఖాలు తనకు లభించినా తనకు అవి అక్కరలేదనీ, భర్తను అనుసరించడమే భార్యకు ధర్మం అనీ, శుభప్రదం అనీ చెప్పింది.

దీనిని బట్టి సీత మహా పతివ్రత అని, ధర్మజ్ఞురాలని, ఉత్తమ స్త్రీయని, నేను గ్రహించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 5.
“రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే, అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది? అని కైక, మంథరతో అన్న మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక మొదటిలో రాముడిని ఎంతో ప్రేమతో చూసేదనీ, తన పుత్రుడైన భరతునితో సమంగా ఆమె రాముని ప్రేమించేదనీ గ్రహించాను. అలాగే రాముడు కూడా తల్లులందరి దగ్గరా సమానమైన ఆదరాన్ని పొందేవాడనీ తెలుసుకున్నాను.

తన దాసి మంథర చేసిన దుష్టమైన ఉపదేశం వల్లనే కైక బుద్ధి మారిపోయిందనీ, రాముడిని ఆమె పట్టుపట్టి అడవులకు పంపిందనీ, నేను గ్రహించాను. చెడు మాటలు వింటే, మంచివారు సైతం పాడయిపోతారని గ్రహించాను.

ప్రశ్న 6.
“నా తండ్రే, నాకు పాలకుడు. గురువు. హితుడు. ఆయన ఆదేశించాలే కాని, విషాన్ని తాగడానికైనా, సముద్రంలో దూకడానికైనా నేను సిద్ధమే” అని రాముడు కైకతో పలికిన మాటలను బట్టి, మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
రాముడు గొప్ప పితృభక్తి కలవాడని గ్రహించాను. తండ్రియే తనకు గురువనీ, పరిపాలకుడనీ రాముడు భావించేవాడని గ్రహించాను. అంతేకాదు. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు, విషమును సైతం శంకలేకుండా త్రాగుతాడని గ్రహించాను. తండ్రి ఆజ్ఞాపిస్తే శ్రీరాముడు సముద్రంలోనైనా దూకుతాడని గ్రహించాను.

రాముడు, పితృవాక్యపరిపాలకుడనీ, తండ్రి యంటే ఆయనకు గొప్ప భక్తి గౌరవములు ఉన్నాయని గ్రహించాను. రాముని వంటి పితృవాక్య పరిపాలకుడు చరిత్రలో మరొకడు ఉండడని తెలుసుకున్నాను.

ప్రశ్న 7.
“అన్నా ఈ పాదుకల మీదనే రాజ్యపాలనాభారాన్ని ఉంచుతాను. పదునాల్గవ సంవత్సరం కాగానే, నీ దర్శనం కాకుంటే, అగ్ని ప్రవేశం చేస్తాను” అని భరతుడు రామునితో చెప్పిన మాటలను బట్టి, నీవేమి తెలుసుకున్నావు?
జవాబు:
భరతుడు గొప్ప సోదర భక్తుడు. అతడు తనకు రాజ్యం లభించినా కాదని, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి, అన్నకు సేవకునిగా తాను రాజ్యం పాలించాడు. అన్నగారు 14 సంవత్సరాల తర్వాత తనకు మాట ఇచ్చిన ప్రకారము అయోధ్యకు తిరిగి రాకపోతే, అగ్నిలో దూకి ప్రాణాలు వదలడానికి భరతుడు సిద్ధమైనాడని గ్రహించాను.

తల్లి తనకు రాజ్యం ఇప్పించినా కాదని, అన్న రామునిపై భక్తి గౌరవములు చూపించిన గొప్ప సోదర భక్తుడు, సోదర వాత్సల్యం కలవాడు, భరతుడని నేను గ్రహించాను.

ప్రశ్న 8.
శ్రీరాముని పాదుకలను తీసుకుని, నందిగ్రామం వెళ్ళి వాటికి పట్టాభిషేకం చేసిన భరతుని చర్యను బట్టి మీరు ఏమి గ్రహించారు?
జవాబు:
కైక కోరిన రెండు వరాల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు. పుత్రశోకంతో దశరథుడు మరణించాడు. భరతుడు తన తల్లిని దూషించాడు. అరణ్యంలోకి వెళ్ళి శ్రీరాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవాలని గ్రహించాడు. చివరకు భరతుడు రాముడు ఇచ్చిన పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామం వెళ్ళి శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

దీనివల్ల భరతునికి శ్రీరాముని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని గ్రహించాడు. అన్నలేని అయోధ్యకు వెళ్ళకూడదని, నిశ్చయించుకున్నాడని గ్రహించాను. భరతునికి రాజ్యాధికారం పట్ల వ్యామోహం లేదని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

ప్రశ్న 2.
కైకేయికి దశరథుడిచ్చిన వరాల వలన ఏమయింది?
జవాబు:
దేవాసుర సంగ్రామంలో కైకకు దశరథుడు వరాలిస్తానన్నాడు. సమయం వచ్చినపుడు అడుగుతానంది. శ్రీరామ పట్టాభిషేకం ఏర్పాట్లలో ఉన్నపుడు ఆ వరాలను అడిగింది. ఒకటి శ్రీరామునికి బదులుగా భరతునికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముని వనవాసానికి పంపాలనేది రెండవ వరం. ఈ వరాలు ఇవ్వడం వలన దశరథుడు మరణించాడు. సీతారాములు అడవుల పాలయ్యారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
పాదుకా పట్టాభిషేకం గురించి వ్రాయండి.
జవాబు:
తండ్రికి అంత్యక్రియలు జరిపాడు భరతుడు. తర్వాత చిత్రకూటం వైపు వెళ్లి శ్రీరాముని దర్శించాడు. అయోధ్యకు రమ్మన్నాడు. రాజువు కమ్మని వినయంగా ప్రార్ధించాడు. శ్రీరాముడు ఒప్పుకోలేదు. కనీసం పాదుకలనైనా ఇమ్మన్నాడు. రాముడు అనుగ్రహించాడు. పాదుకలతో నందిగ్రామం చేరాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేశాడు. ఆ పాదుకలకు ప్రతినిధి తాను సేవకుడిగా రాజ్య వ్యవహారాలు చూశాడు.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చెప్పుడు మాటలు చేటుకు కారణమని రామాయణం ఆధారంగా ఎలా సమర్థిస్తావు?
జవాబు:
రాముడికి పట్టాభిషేకం చేస్తారని కైక అరణపుదాసి అయిన మంథరకు తెలిసింది. ఆమె, ఆ విషయం కైకతో చెప్పింది. కైకకు రాముడంటే చాల ఇష్టం. అందుకే ఆ వార్త తెచ్చిన మంథరకు, ఆనందంతో కైక మంచి బహుమతిని ఇచ్చింది. కైక ప్రవర్తనకు మంథర ఆశ్చర్యపోయింది. ఏడ్వవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని మంథర కైకను అడిగింది. తనకు రామభరతులు ఇద్దరూ సమానమే అని కైక చెప్పింది.

అప్పుడు మంథర కైకకు దుష్టబోధ చేసింది. “రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. కైక దాసి అవుతుంది. రాముడికి భరతుడు దాస్యం చేయవలసి వస్తుంది. తరువాత రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. భరతుడి సంతానానికి రాజ్యం రాదు. కాబట్టి భరతుడికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలు అయ్యేటట్లు చూడు” అని మంథర కైకకు చెప్పుడు మాటలు చెప్పింది. ఆ చెప్పుడు మాటలు విని, కైక మనస్సు మార్చుకుంది. రాముడిని అడవులకు పంపింది. అందుకే చెప్పుడు మాటలు, చేటుకు కారణం అని చెప్పాలి.

ప్రశ్న 2.
సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
శ్రీరాముడు అంటే ప్రజలకు ఇష్టం. ప్రజల కోరిక మేరకు దశరథుడు రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. రాజాజ్ఞతో మంత్రులు, అధికారులూ రాముని యౌవరాజ్య పట్టాభిషేకానికి, ఏర్పాట్లు చేస్తున్నారు. దశరథుడు రాముని పిలిచి, పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు పట్టాభిషేకానికి ఉపవాస దీక్ష చేపట్టారు.

రాముడి పట్టాభిషేకం వార్త కైక దాసి మంథరకు తెలిసింది. ఆ వార్తను మంథర కైకకు చెప్పింది. కైక సంతోషించింది. కాని మంథర దుర్బోధతో, కైక మనస్సు మారింది. భరతుడికి పట్టాభిషేకం జరగడానికి, దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన రెండు వరాలనూ ఉపయోగించుకోమని మంథర సలహా చెప్పింది. కైక కోపగృహానికి చేరింది. దశరథుడు కైకను బ్రతిమాలాడు. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం 2) రాముడి వనవాసం. దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కాని కైక మనస్సు మారలేదు.

కైక రామునికి కబురంపింది. తండ్రిగారి విచారానికి కారణం ఏమిటని రాముడు అడిగాడు. కైక రాముడికి తాను కోరిన వరాలు గురించి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానని రాముడు చెప్పాడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు. దశరథుడు దుఃఖించాడు. రాముడు తండ్రికీ, కైకకూ నమస్కరించాడు. రాముడు తల్లి కౌసల్యను దర్శించాడు. రాముని వనవాసం గూర్చి విని కౌసల్య దుఃఖించింది. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లి, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

కౌసల్య రాముని వెంట వనవాసానికి వస్తానంది. అది ధర్మం కాదు, తండ్రిగారి సేవ చేయాలని రాముడు తల్లికి చెప్పాడు. సీత కూడా వనవాసానికి వస్తానంది. లక్ష్మణుడు కూడా రాముని వెంట వస్తానన్నాడు. సీతారామలక్ష్మణులు దశరథుని వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు. సుమిత్ర లక్ష్మణుడితో సీతారాములను తల్లిదండ్రులవలె సేవింపుమని చెప్పింది.
సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. పౌరులు వెంట బయలుదేరారు. ఈ విధంగా రాముడు భార్యాసోదరులతో అడవికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 3.
శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణమేమి?
(లేదా)
సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి, చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. (వనవాసానికి వెళ్ళిన వృత్తాంతం)
జవాబు:
సీతారామలక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడిని విడిచిపెట్టలేక, కొందరు పౌరులు రథానికి ప్రక్కలనూ, వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది.

రాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళిపొండని రాముడు వారికి ఎంతగానో చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మనీ లేక తమను వెంటరానిమ్మనీ ప్రజలు రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసానది దగ్గరకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే ప్రజలు నిందించుకొని అయోధ్యకు తిరిగి వెళ్ళారు.

రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్యవైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగాతీరానికి చేరారు. ఆ తీరంలో ‘శృంగిబేరపురం’ ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు రాముని వద్దకు వచ్చాడు. రాముడు గుహుడికి ఎదురేగివెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు.

గుహుడు గంగను దాటడానికి నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకూ, తమ్మునికీ జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆ వెనుక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. ముని, సీతారామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరాడు.

జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమ వాసానికి తగిన ప్రదేశాన్ని సూచించండని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. పది కోసుల దూరంలోని ‘చిత్రకూటం’ పవిత్రమైనదనీ, అది మహర్షుల నివాస స్థానం అనీ, భరద్వాజుడు చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి ‘చిత్రకూటం’ చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం, అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు.

ప్రశ్న 4.
“భరతుని పాదుకా పట్టాభిషేకం” గురించి రాయండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథరను చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని భరతుడు అయోధ్యాపురవాసులతో కలసి అడవికి బయలుదేరాడు.

భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు.

భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు.

భరత శత్రుఘ్నులు రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు. రాముడు భరతునికి రాజనీతులు చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం కాగానే, రామదర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు చెప్పాడు.

భరతుడు నందిగ్రామం చేరి రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 5.
శ్రీరామ పట్టాభిషేకాన్ని ప్రజలు ఎందుకు సమర్థించారు? విశ్లేషించండి.
జవాబు:
శ్రీరాముడు సకల గుణాభిరాముడు. శ్రీరాముడు సద్గుణాల రాశి. రాముడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడు. : . , రాముడు మహావీరుడు. రాముడు మృదువుగా మాట్లాడతాడు. శరణు అన్నవారిని రాముడు కాపాడతాడు.

శ్రీరాముడు కోపమూ, గర్వమూ లేనివాడు. సత్యమును పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. శ్రీరాముడు వినయము కలవాడు.

శ్రీరాముడు తల్లిదండ్రులపట్ల, గురువులపట్ల నిశ్చలభక్తి కలవాడు. రాముడు సోమరితనం, ఏమరుపాటు లేనివాడు. అన్ని కళలలోనూ ఆరితేరినవాడు. అసూయ, మాత్సర్యం లేనివాడు. ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు.

శ్రీరాముడు ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టి తల్లిదండ్రులతోపాటు, ప్రజలు కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థించారు.

ప్రశ్న 6.
శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు?
జవాబు:
ప్రజల కోరిక మేరకు దశరథుడు, శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం గూర్చి చెప్పి, రాజధర్మాలు బోధించాడు. సీతారాములు ఉపవాసదీక్ష చేపట్టారు.

రాముని పట్టాభిషేకం వార్త మంథరకు తెలిసింది. మంథర కైకకు చెప్పి, ఆమె మనస్సును మార్చింది. దశరథుడు వెనుక కైకకు ఇచ్చిన వరాలను ఉపయోగించుకోమని మంథర కైకకు దుర్బోద చేసింది. కైక కోపగృహానికి చేరింది. కైక దశరథుణ్ణి రెండు వరాలు కోరింది. 1) భరతుడికి పట్టాభిషేకం, 2) రాముడి వనవాసం.

దశరథుడు రాముణ్ణి అడవులకు పంపవద్దని కైకను బ్రతిమాలాడు. కైక మనస్సు మారలేదు. కైక భర్త అనుమతితో రామునికి కబురు చేసింది. రాముడు వచ్చి తండ్రి విచారానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. కైక, తాను కోరిన వరాలను గూర్చి రాముడికి చెప్పింది. తండ్రి మాటను పాటిస్తానన్నాడు రాముడు. కైక మాటపై రాముడు దండకారణ్యానికి వెడతానన్నాడు.

రాముడు తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. రాముడిని అడవికి వెళ్ళవద్దని తల్లీ, లక్ష్మణుడు చెప్పారు. కాని రాముడు తండ్రి మాటనే గౌరవిస్తానన్నాడు.

రాముని వెంట సీతాలక్ష్మణులు వనవాసానికి వస్తానన్నారు. సీతారామలక్ష్మణులు తండ్రి వద్దకు వెళ్ళారు. కైకేయి వారికి నారచీరలను ఇచ్చింది. వారు నారచీరలు ధరించారు.

సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతరామలక్ష్మణులు రథం ఎక్కారు. ఈ విధంగా రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 2 అయోధ్యాకాండ

ప్రశ్న 7.
దశరథుని మరణవార్త విని, భరతుడెలా స్పందించాడు?
జవాబు:
రాముడు అడవికి వెళ్ళాడని దశరథుడు దుఃఖంతో మరణించాడు. దూతలు వెళ్ళి మేనమామ ఇంట్లో ఉన్న భరతుడిని అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు, తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

భరతుడు కైకను తప్పు పట్టాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలనీ, తాను రాముణ్ణి తీసుకు వస్తాననీ, భరతుడు అడవికి బయలుదేరాడు.

భరత శత్రుఘ్నులు అడవిలో రాముడిని కలిసి, ఆయన పాదాలపై పడ్డారు. రాముడు కన్నీరు పెట్టాడు. రాముడిని అయోధ్యకు తిరిగి వచ్చి రాజువు కమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటయే తనకు శిరోధార్యం అన్నాడు.

చివరకు భరతుడు కోరగా, రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. రాముని పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, భరతుడు నారచీరలు ధరించి, తాను అయోధ్యా నగరం బయట ఉంటానన్నాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions ఉపవాచకం 1st Lesson బాలకాండ

10th Class Telugu ఉపవాచకం 1st Lesson బాలకాండ Textbook Questions and Answers

I. అవగాహన – ప్రతిస్పందన

సంఘటనా క్రమం

సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం
1. అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
జవాబులు
ఈ) నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు.
ఆ) మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు.
ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.

2. అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబులు
ఆ) శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
అ) రామాయణగాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
ఇ) ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

3. అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
ఆ) ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు.
ఇ) హృదయవిదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
జవాబులు
ఈ) రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
అ) భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు.
ఆ) ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంటను చూశాడు.
ఇ) హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి.

4. అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు.
ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.
ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
జవాబులు
అ) సరయూ నదీతీరంలో ‘కోసల’ అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే ‘అయోధ్య’ అనే మహానగరం.
ఆ) కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తునాడు.
ఈ) ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు.
ఇ) ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.

5. అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
జవాబులు
ఆ) ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని క్రుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది.
ఈ) సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది.
అ) మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు.
ఇ) అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.

6. అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు.
ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.
ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
జవాబులు
ఆ) దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు.
ఈ) హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
అ) రావణాసురుడు బ్రహ్మ వరప్రభావంచేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.
ఇ) అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి, అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు.

7. అ) దేవతలు వరగర్వముచేత కన్నూమిన్నూగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.
ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాధారియై వచ్చాడు.
జవాబులు
ఆ) బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు.
ఇ) కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు.
ఈ) ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాథారియై వచ్చాడు.
అ) దేవతలు వరగర్వము చేత కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

8. అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.
ఆ) ‘ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
ఇ) దశరథుడు పుత్రకామేష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది.
జవాబులు
ఇ) దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు.
ఈ) చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో, దివ్యపాయసముంది.
ఆ) ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నింటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద’న్నాడు.
అ) చైత్రశుద్ధ నవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు.

9. అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.
ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే.
జవాబులు
ఆ) రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు.
అ) వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు.
ఈ) ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివే..
ఇ) రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు.

10. అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
ఈ) తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.
జవాబులు
అ) సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి.
ఇ) అతిథి దేవోభవ అతిథి మనకు దేవుడితో సమానం.
ఆ) ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు.
ఈ) తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు.

11. అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్ర మహర్షి.
ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు.
ఇ) వీటి ప్రభావం వల్ల, అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.
జవాబులు
ఆ) విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు.
అ) రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ విద్యలనుపదేశించాడు విశ్వామిత్రుడు.
ఇ) వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు.
ఈ) విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.

12. అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆ) శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.
జవాబులు
ఇ) తాటక వధతో దుష్టసంహారానికి పూనుకొన్నాడు రాముడు.
అ) జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు.
ఆ) శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు.
ఈ) ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది.

పాత్ర స్వభావాలు

1. నారద మహర్షి :
దేవఋషి. రామాయణగాథను వాల్మీకికి ఉపదేశించినవాడు. బ్రహ్మయొక్క మానసపుత్రుడు. త్రిలోక సంచారి. నిరంతరం నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు. లోకకల్యాణం కోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. ఋషులకు మార్గదర్శకుడు. రామాయణ కథారచనకు మూలపురుషుడు.

2. వాల్మీకి :
మునిశ్రేష్టుడు. జిజ్ఞాసకలవాడు. ప్రకృతి అందాలకు పరవశించేవాడు. క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి, అప్రయత్నంగా కవిత్వాన్ని వ్రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్టుడు.

3. దశరథ మహారాజు :
కోసల దేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్ఠిని చేసి నలుగురు పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు. ధర్మాత్ముడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పుత్రవ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు.

4. వశిష్ఠుడు :
దశరథుని ఇంటి పురోహితుడు. బ్రహ్మర్షి. దశరథునికి అనేక ధర్మసందేహాలను తీర్చేవాడు. శ్రీరామునకు కర్తవ్యబోధ చేసినవాడు.

5. కౌసల్య :
దశరథ మహారాజు భార్య. శ్రీరాముని తల్లి. ఏనాడూ భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరాముడు అరణ్యవాసానికి బయల్దేరేటప్పుడు శ్రీరాముని వనవాస ప్రయత్నం విరమింపజేయాలనుకుంది. ఫలించలేదు. పుత్రవ్యామోహంతో వనవాసానికి తానూ వస్తానంది. రాముడు ఒప్పుకోలేదు. శ్రీరాముడికి ధర్మబోధ చేసింది. ధైర్యం చెప్పిన వీరనారి. ధర్మాన్ని విడిచి పెట్టవద్దని చెప్పిన మహారాణి కౌసల్య.

6. సుమిత్ర :
దశరథ మహారాజుకు రెండవ భార్య. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈమె సంతానం. కౌసల్యాదేవి అడుగుజాడలలో నడిచింది. భర్త మాటకు ఎదురు చెప్పని మహాపతివ్రత. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందర్నీ సమానంగా చూసిన మాతృమూర్తి.

7. కైక :
కేకయరాజు కూతురు. పరాక్రమవంతురాలు. యుద్ధవిద్యలు కూడా తెలుసు. చెప్పుడు మాటలకు లొంగిపోయే స్వభావం కలది. మంథర చెప్పిన చెప్పుడు మాటలతో శ్రీరామ వనవాసానికి కారకురాలైంది. అందరి నిందలను పడింది. దశరథుని మరణానికి కూడా కారకురాలైంది. ఒక దుష్ట స్త్రీ పాత్రగా మిగిలిపోయింది.

8. ఋష్యశృంగుడు :
విభాండక మహర్షి కొడుకు. దశరథుని కుమార్తె శాంతను వివాహం చేసుకున్నాడు. పుత్రకామేష్ఠి యాగం దశరథుని చేత చేయించాడు. ఋష్యశృంగుడు సాక్షాత్తు దైవస్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. భూమి సస్యశ్యామలంగా ఉంటుంది.

9. శ్రీరాముడు :
ఎవరికీ లేనన్ని మంచి గుణాలు కలవాడు. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. సీతాపతి. ధర్మమూర్తి. ఆదర్శవంతమైన కొడుకు. ఆదర్శమూర్తియైన, మర్యాద పురుషుడైన భర్త. శత్రువైన మారీచుని చేత కూడా పొగడబడినవాడు.

10. లక్ష్మణుడు :
దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు. అన్నావదినల సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నావదినలకు నీడలా ఉన్నాడు. సీతారాములలోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి. రామరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధానకారకుడు. ధర్మస్వరూపుడు.

11. భరతుడు :
కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు. కైక రాజ్యా ధికారం చేపట్టమని కోరినా శ్రీరామ పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. తల్లిని కూడా దూషించాడు. రాజ్యంపై కోరిక లేనివాడు. కేవలం శ్రీరాముని సేవించడానికే జన్మించాననుకొనే పుణ్యపురుషుడు.

12. శత్రుఘ్నుడు :
సుమిత్రయందు దశరథునకు జన్మించాడు. లక్ష్మణుని స్వభావం శత్రుఘ్నుని స్వభావం ఒక్కటే. అన్నగార్లపై అమితమైన గౌరవం కలవాడు.

13. విశ్వామిత్రుడు :
గాధి యొక్క కుమారుడు. శ్రీరామలక్ష్మణుల యాగ సంరక్షణార్థం తీసుకొని వెళ్ళాడు. వారికి బల, అతిబల, విద్యలను ఉపదేశించాడు. వాటి వలన రామలక్ష్మణులకు అలసట, ఆకలిదప్పులు ఉండవు. ధనుర్విద్యలో రామలక్ష్మణులను తీర్చిదిద్దాడు. అనేక అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్పాడు. రామలక్ష్మణుల ధనుర్విద్యా గురువు.

14. భగీరథుడు :
దృఢ సంకల్పం కలిగినవాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి ప్రక్కకు తప్పుకోకుండా, సంకల్పాన్ని నెరవేర్చుకోగల ధీశాలి. పట్టుదల కలవాడు. పట్టుదల విషయంలో ‘భగీరథ ప్రయత్నం’ అన్న జాతీయం ఏర్పడటానికి నెరవేర్చుకోగల ధీశా కలిగినవాడు.

15. జనక మహారాజు :
మిథిలానగరపు రాజు. సీతాదేవికి తండ్రి. రాజర్షి. ధర్మశాస్త్రాలు తెలిసినవాడు. ఋషులకు కూడా సందేహాలు తీర్చగలవాడు. మహాజ్ఞాని.

16. పరశురాముడు :
రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షణం చేసి, క్షత్రియులను సంహరించాడు. చాలా కోపం ఎక్కువ. అధర్మాన్ని సహించడు. అధికార గర్వాన్ని అంతం చేస్తాడు. వేదాధ్యయనం చేసినవాడు. తన శక్తిని కూడా శ్రీరామునకు ఇచ్చినవాడు. పరశురాముడంటే రాజులకు సింహస్వప్నం.

సంఘటన ద్వారా గ్రహించుట )

ప్రశ్న 1.
“మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యము” అని – శ్రీరాముడు తాటకను చంపడం విషయంలో విశ్వామిత్ర మహర్షితో చెప్పిన మాటలను బట్టి, మీరేం గ్రహించారు?
జవాబు:
పై మాటలను బట్టి శ్రీరాముడు గొప్ప పితృవాక్య పరిపాలకుడని, గ్రహించాను. గురువైన విశ్వామిత్రుడు చెప్పినట్లు నడుచుకోవడం, ఆయన ఆజ్ఞను పాలించడం, శిష్యుని ధర్మమని రాముడు భావించాడనీ, అతడు గురువు చెప్పినట్లే తాటకను వధించాడనీ గ్రహించాను.

తాటక స్త్రీ అయినా, ఆమె దుష్టురాలు కాబట్టి ఆమెను చంపడం తన కర్తవ్యమని రాముడు భావించాడని నేను – గ్రహించాను. అదీగాక విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని, తన తండ్రి దశరథుడు చెప్పిన మాటను, రాముడు వేదవాక్యంగా భావించి, స్త్రీవధ అని శంకించకుండా గురువు చెప్పినట్లు తాటకను సంహరించాడని గుర్తించాను.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 2.
‘రాముణ్ణి వదలి నేను ఒక క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు’ అని దశరథుడు విశ్వామిత్రునితో చెప్పిన మాటలను బట్టి, మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు తాను చేయబోయే యజ్ఞరక్షణకై శ్రీరాముడిని తనతో పంపమని, దశరథుడిని అడిగాడు. అప్పుడు దశరథుడు పై మాటలను విశ్వామిత్రుడితో అన్నాడు.

దశరథమహారాజుకు, రాముడు అంటే ప్రాణమనీ, రాముడు ఆయనకు లేక లేక పుట్టిన సంతానమనీ నేను గ్రహించాను. దశరథుడు పుత్రకామేష్టి చేయగా ఆయన నోములు పండి, రాముడు జన్మించాడనీ, రాముడిని వదలి దశరథుడు ఉండలేడనీ, రాముడు అంటే దశరథునకు బాగా ప్రేమ అనీ, పై దశరథుని మాటల వల్ల నేను అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 3.
రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అని పలికిన మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మమార్గంలో ఉంటారని, సత్యం, నీతి, భక్తి, గౌరవం మొదలైన భావాలను కల్గి ఉంటారని గ్రహించాను. దశరథుడు, శ్రీరాముడు వంటి రాజులు ధర్మాత్ములు, సత్యకంధులు. ఆడినమాట తప్పనివారు. అట్టివారు రాజులుగా ఉన్నారు కాబట్టే ప్రజలు కూడా వారి మార్గంలోనే నడిచారని గ్రహించాను.

రాజులు ఎల్లప్పుడు ధర్మమార్గంలో ఉండాలని, ప్రజలను రక్షించాలని, వారి యోగక్షేమాలను చూడాలని, ఆ విధంగా చేస్తే ప్రజలు కూడా నీతిమార్గంలో నడిచే అవకాశం ఉంటుందని గ్రహించాను.

ప్రశ్న 4.
ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు?
జవాబు:
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూలకారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలను గ్రహించాను.

  1. దృఢసంకల్పానికి అసాధ్యమైనది ఏదీలేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే, జయం వస్తుందని తెలిసింది.
  2. భగీరథుడు రాముని వంశంవాడే. భగీరథుని గురించి చెప్పడం వల్ల రామునికి తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియచేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం ఆంతర్యం.
  3. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే.

ప్రశ్న 5.
గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏమిటి? శిష్యుడు పొందలేనిదేమిటి? అని కవి చెప్పడం వల్ల మీరేమి గ్రహించారు?
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగరక్షణ కోసం తన వెంట తీసుకొని వెళ్ళాడు. రామలక్ష్మణులకు ఆకలి దప్పికలు కలుగకుండా ఉండటానికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశించాడు. శ్రీరామునికి విద్యాస్త్రాలను అనుగ్రహించాడు.

ఆ శక్తితో రాముడు తాటకి వంటి రాక్షసులను సంహరించాడు. యాగాన్ని రక్షించాడు. రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాడు. అందువల్ల గురువు ప్రేమతో శిష్యునికి అనుగ్రహిస్తే అతడు పొందలేనిది ఏమీ లేదని గ్రహించాను.

ప్రశ్న 6.
” జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం” అని చెప్పిన కవి మాటలను బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
గురువుల నుండి విద్యను అర్థించువారు విద్యార్థులు. విద్యార్థులు చక్కని విద్యను పొందడానికి గురువులను భక్తి, శ్రద్ధలతో సేవించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని గ్రహించాను. రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని సేవించారు. అతని మాటలను వేదవాక్కుగా భావించారు. అప్రమత్తులై సేవించారు. అందువల్లనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.

విద్యార్థులు విద్యార్జనలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సోమరితనం, గర్వం మొదలైన దుర్గుణాలను విడిచి పెట్టాలని, అదే ఉత్తమ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణమని గ్రహించాను.

విషయాత్మక ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
వాల్మీకి చెప్పిన మొదటి శ్లోకానికి కారణాలేమిటి?
జవాబు:
ఒకసారి వాల్మీకి తన శిష్యులతో తమసా నదిలోకి స్నానానికి దిగాడు. అక్కడ ఒక కొమ్మపై క్రౌంచపక్షుల జంటను చూశాడు. ఆనందించాడు. ఇంతలో ఒక వేటగాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు. అది నెత్తురోడుతూ, విలవిలలాడుతూ మరణించింది. అది తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది.

హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని వాల్మీకి చూశాడు. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ఆయన నోటి వెంట అప్రయత్నంగా ‘మానిషాదప్రతిష్టాంత్వ..’ అనే శ్లోకం వచ్చింది.

ప్రశ్న 2.
అయోధ్యను వివరించండి.
జవాబు:
సరయూ నదీతీరంలో ‘కోసల’ దేశం ఉంది. దానిలోనిది అయోధ్యా నగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. దీనిని మనువు నిర్మించాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 3.
దశరథునికి ఎన్ని ఉన్నా ఒక చింత కుంగదీసింది కదా ! ఆ చింతను ఎలా అధిగమించాడు?
జవాబు:
దశరథునికి ఎన్ని ఉన్నా సంతానం లేదనే చింత కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం ఋషీశ్వరుల అనుజ్ఞతో అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత ‘పుత్రకామేష్ఠి’ చేశాడు. సంతానం కలిగింది. శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు.

ప్రశ్న 4.
దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. ఎందుకు?
జవాబు:
తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానని విశ్వామిత్రుడికి దశరథుడు చెప్పాడు. విశ్వామిత్రుడు తన యాగానికి మారీ సుబాహులనే రాక్షసుల వలన కలుగుతున్న బాధను చెప్పాడు. యాగ సంరక్షణకు శ్రీరాముని తనతో పది రోజులు పంపమన్నాడు. రావణుడు ఈ రాక్షసుల వెనుక ఉన్నాడు కనుక పంపలేనన్నాడు. కావాలంటే తాను వస్తానన్నాడు దశరథుడు. దానితో విశ్వా మిత్రుడికి కోపం వచ్చింది. అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

ప్రశ్న 5.
బల, అతిబల విద్యల గురించి వ్రాయండి.
జవాబు:
ఈ విద్యలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఉపదేశించాడు. వీటి ప్రభావం వలన అలసట ఉండదు. ఆకలి ఉండదు. దాహం ఉండదు. శరీరం కాంతి తగ్గదు. నిద్రలో ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాలలో ఎవ్వరూ ఎదురొడ్డి నిలబడలేరు.

ప్రశ్న 6.
తాటక వధ న్యా యమా?
జవాబు:
తాటక యక్షిణి. వేయి ఏనుగుల బలం కలది. విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడుచేస్తోంది. ఒక స్త్రీని వధించడం మహా పాతకమని రాముడు అనుకొన్నాడు. మౌనంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు తాటకను చంపమన్నాడు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదన్నాడు. తన తండ్రి తనను విశ్వామిత్ర మహర్షి చెప్పినట్లు నడుచుకోమన్న విషయం శ్రీరాముడు గుర్తుచేసుకొన్నాడు. పితృవాక్య పరిపాలకుడు కనుక విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను శిరసావహించాడు. తాటకను చంపాడు. ఇది న్యాయమే.

ప్రశ్న 7.
‘భగీరథ ప్రయత్నం’ అనే జాతీయం ఎందుకు ఏర్పడింది?
జవాబు:
పాతాళంలో కపిల మహర్షి కోపాగ్నికి సగరపుత్రులు బూడిద కుప్పలయ్యారు. గంగా ప్రవాహంతో వారికి ఉత్తమగతులు కల్పించాలని సంకల్పించారు. భగీరథుడు తపస్సు చేసి, బ్రహ్మను, విష్ణువును, శివుని మెప్పించి గంగను భూమికి దింపాడు. జహ్ను మహర్షిని ప్రార్థించి ఆటంకం తొలగించాడు. అనేక కష్టాలను ఓర్పుతో అధిగమించాడు. గంగను ప్రవహింపజేశాడు. అందుకే భగీరథ ప్రయత్నం జాతీయం ఏర్పడింది. చాలా కష్టపడి సాధించిన వాటి విషయంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
శివధనుర్భంగాన్ని వివరించండి.
జవాబు:
మహాబలవంతులు ఐదువేల మంది శి వధనుస్సుతో ఉన్న పేటికను తెచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ధనుస్సు మధ్య భాగాన్ని శ్రీరాముడు అవలీలగా పట్టుకొన్నాడు. ధనుర్విద్యలో ఆరితేరిన శ్రీరాముని చేయి సోకగానే ధనువు వంగింది. వింటి నారిని సంధించాడు. అల్లెత్రాడును ఆకర్ణాంతం లాగాడు. భయంకరమైన శబ్దం చేస్తూ విల్లు ఫెళ్లున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప సభలోని వారంతా ఆ ధ్వనికి మూర్ఛపోయారు. సీతారాముల కల్యాణానికి అంకురార్పణ జరిగింది.

ప్రశ్న 9.
శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజలందరికీ పరమ ప్రీతి ఎందుకు?
జవాబు:
శ్రీరాముడు సద్గుణాల రాశి. రూపంలోనూ, గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. కోపం లేదు. గర్వం లేదు. సత్యం పలికేవాడు. పరుల సంపద ఆశించడు. దీనులను ఆదుకుంటాడు. కాలాన్ని వృధా చేయడు. వినయశీలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల భక్తి కలవాడు. సోమరితనం లేనివాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 10.
‘అతిథిదేవోభవ’ అతిథి మనకు దేవునితో సమానం – వివరించండి.
జవాబు:
తిథి నియమములు లేకుండా వచ్చేవాడు అతిథి. తల్లి, తండ్రి తర్వాత స్థానం అతిథిదే. మనవల్ల ఇతరులకు సంతోషం కలుగుతున్నప్పుడు మన జీవితానికి సార్ధకత ఏర్పడుతుంది. ఆ సార్థకత మనం అతిథులను ఆదరించినపుడే కలుగుతుంది. అందుకే పెద్దలు ‘అతిథి దేవోభవ’ అన్నారు. భగవత్స్వరూపంగా అతిథిని భావించాలి. సాయం కోరి మన వద్దకు వచ్చిన వ్యక్తిని నిరుత్సాహపరచకుండా కోరిన సాయం చేయటం ఉత్తమ లక్షణంగా పెద్దలు పేర్కొన్నారు. రామాయణంలోను విశ్వామిత్రుడు వచ్చినపుడు దశరథుడు అతిథి మర్యాదలు చేశాడు. విశ్వామిత్రుని ద్వారా రామలక్ష్మణులు ఎన్నో విద్యలను కూడా పొందారు. కనుక అతిథి మనకు దేవునితో సమానం.

వ్యాసరూప ప్రశ్నలు

ఈ క్రింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
సీతారామ కళ్యాణమును రాయండి.
(లేదా)
సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
(లేదా)
సీతారామ కళ్యాణమును మీ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో “జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం” అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గూర్చి, గంగ వృత్తాంతాన్ని గూర్చి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు.

మిథిలా నగరం సమీపంలో, వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్యాగౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి, అహల్యకు శాపవిముక్తి కల్పించాడు.

మిథిలలో జనకమహారాజు వీరిని ఆదరించాడు. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు, రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో “వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సును చూద్దామని వచ్చారు. చూపించు శుభం కలుగుతుంది” అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందనీ, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. చాలామంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని చెప్పాడు.

విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. ఐదువేలమంది శివధనుస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది.

జనకుడు సీతారాములకు పెండ్లి చేయడానికి సిద్ధం అయ్యాడు. దశరథునికి కబురుపెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా, ఊర్మిళలను, రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శ్రుతకీర్తిని భరతశత్రుఘ్నులకు ఇచ్చి పెండ్లి చేశాడు.

దశరథుడు అయోధ్యకు తిరిగి వెడుతుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి, మహేంద్రపర్వతానికి వెళ్ళాడు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 2.
వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి.
(లేదా)
వాల్మీకి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి.
జవాబు:
నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. “అన్ని మంచిగుణాలు కలవాడూ, మాట తప్పనివాడూ, ధర్మం తెలిసినవాడూ మొదలయిన శుభలక్షణాలు గలవాడు” ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ? అని, వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. “సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు. కాని శ్రీరాముడు ఒక్కడు అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి, నారదుడు వాల్మీకికి రామకథను చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ, శిష్యులతో తమసానదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణ రసం పొంగింది. “మానిషాద” అనే శ్లోకం చెప్పాడు. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

సృష్టికర్త అయిన బ్రహ్మ, వాల్మీకిని చూడడానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ, వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో ‘మానిషాద’ శ్లోకం, మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వు నవ్వి వాల్మీకితో “నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలూ, నదులూ ఉన్నంతకాలం, ప్రజలు రామాయణగాథను కీర్తిస్తూనే ఉంటారు” అని చెప్పాడు.

ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం, వాల్మీకి మహర్షి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు.

ప్రశ్న 3.
భగీరథుడు గంగను భూమికి తీసుకురావడంలో ఎలా సఫలమయ్యాడోమీసొంతమాటల్లో వివరించండి.
జవాబు:

  1. పాతాళంలో బూడిద కుప్పలుగా పడివున్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సురగంగను అక్కడ ప్రవహింపజేయాలని సంకల్పించాడు భగీరథుడు.
  2. బ్రహ్మను గూర్చి, శివుణ్ణి గూర్చి ఘోర తపమాచరించి గంగను భూమి పైకి వదలడానికి బ్రహ్మను, గంగను భరించడానికి శివుణ్ణి ఒప్పించాడు.
  3. గంగ యొక్క అహంకారానికి కోపించి శివుడు గంగను బంధించగా మరల శివుణ్ణి ప్రార్థించి గంగను విడిపించాడు.
  4. గంగా ప్రవాహ వేగానికి కోపించిన జహ్ను మహర్షిని శాంతింపజేసి గంగను మరల ప్రవహించేలా చేశాడు.
  5. ఈ విధంగా గంగను తీసుకురావడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భగీరథుడు వాటిని ఎదుర్కొని గంగను భూమి పైకి తీసుకురావడంలో కృతకృత్యుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో “భగీరథ ప్రయత్నం” అన్న జాతీయం వాడుకలోకి వచ్చింది.

ప్రశ్న 4.
దశరథునికి పుత్రజననం గురించి రాయండి.
(లేదా)
రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం.
జవాబు:
సరయూనదీ తీరంలో “కోసల” దేశం ఉంది. దాని ముఖ్యనగరం ‘అయోధ్య’. దాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో విలసిల్లేది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథునకు సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేథయాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు అందుకు ఋష్యశృంగమహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు ఉన్నచోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు మూడు రోజులు అశ్వమేథయాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు, ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నాడని బ్రహ్మకు చెప్పారు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని, దేవతలు బ్రహ్మను కోరారు.

బ్రహ్మ, దేవతలతో రావణాసురునికి మానవులవల్లనే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరారు. దశరథ మహారాజు ముగ్గురు భార్యలకూ నాలుగురూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడి పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి, బ్రహ్మ పంపించగా ఒక దివ్యపురుషుడు బంగారు పాత్రతో దివ్యపాయసం తీసుకొని వచ్చాడు. ఆ పాయసపాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 5.
రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహిః ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామనుకుంటున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు.

విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలుగజేస్తున్నారనీ, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదనీ, యజ్ఞరక్షణకు శ్రీరాముణ్ణి తనతో 10 రోజులు పంపమనీ దశరథుని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదనీ రాముడికి యుద్ధం తెలియదనీ, రాముణ్ణి విడిచి తాను ఉండలేననీ, తానే యజ్ఞరక్షణకు వస్తానని చెప్పాడు.

తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ సుబాహులు విఘ్నాలు కల్గిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి పంపనని చెప్పగా, విశ్వామిత్రునకు కోపం వచ్చింది. వశిష్ట మహర్షి దశరథునికి నచ్చచెప్పి, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ‘బల’, ‘అతిబల’ అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమవల్ల అలసట, ఆకలిదప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో ‘మలద’ , ‘కరూశ’ గ్రామాలకు చేరారు. అక్కడ తాటక అనే యక్షిణి విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వాడి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు చెవులు కోశాడు. రాముడు శబ్దవేధి విద్యతో, బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి, అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి, యజ్ఞదీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం, ఆరురోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచ సుబాహులు అనే రాక్షసులు, యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడి పై రాముడు ‘శీతేషువు’ అనే మానవాస్త్రాన్ని వేసాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. మిగిలిన వారిని, ‘వాయవ్యాస్త్రం’తో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయ్యింది.

ప్రశ్న 6.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన విధం రాయండి.
జవాబు:
అయోధ్యను రాజధానిగా చేసుకొని, కోసల దేశాన్ని దశరథుడు పాలించేవాడు. దశరథునికి సంతానం లేదు. సంతానం కోసం దశరథుడు అశ్వమేధయాగాన్ని చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంత్రుడు యాగాన్ని చేయించడానికి ఋష్యశృంగ మహర్షిని పిలవమన్నాడు.

ఋష్యశృంగుడు అశమేధయాగం చేయించా. పుత్రుల కోసం యజ్ఞం చేయించండని దశరథుడు ఋష్యశృంగుడిని కోరాడు. ఇంతలో దేవతలు విష్ణుమూర్తిని మానవుడిగా పుట్టి రావణాసురుడిని సంహరింపమని కోరారు. దశరథుని ముగ్గురు భార్యలకూ నాలుగు రూపాలలో పుత్రుడిగా పుట్టమని, దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు సరే అని వారికి అభయం ఇచ్చాడు.

దశరథుడు పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించిన ఒక దివ్యపురుషుడు, బంగారుపాత్రతో దివ్యపాయసం తెచ్చి దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు.

AP SSC 10th Class Telugu Solutions ఉపవాచకం Chapter 1 బాలకాండ

ప్రశ్న 7.
ఉత్తమ విద్యార్థుల లక్షణాలేమిటి? రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని ఎలా చెప్పగలవు?
జవాబు:
జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం, ఉత్తమ విద్యార్థుల లక్షణం. గురువుగారికి సేవ చేయడం, కూడా ఉత్తమ విద్యార్థి లక్షణం.

రామలక్షణులు ఉత్తమ విద్యార్థులు : వారు తమ గురువైన విశ్వామిత్రుడి పాదాలు ఒత్తారు. వారు గురువు వెంట వెళ్ళి, సకాలంలో లేచి, నిత్యకర్మలు చేసేవారు. గంగాసరయూ నదుల సంగమం వంటి వాటి గురించి గురువుగారిని అడిగి వివరంగా తెలిసికొన్నారు. గురువు ఆజ్ఞను పాటించడం శిష్యుడి కర్తవ్యమని గ్రహించి, విశ్వామిత్రుడు చెప్పినట్లుగా వారు తాటకను వధించారు.

వారు సిద్ధాశ్రమం చేరి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడారు. మారీచ సుబాహులను తరిమి కొట్టారు. మిథిలా నగరానికి గురువుగారితో వెడుతూ, గంగ మొదలయిన వాటిని గురించి గురువుగారిని అడిగి తెలిసికొన్నారు. గురువుగారి అనుగ్రహంతో ఎన్నో అస్త్రాలను ప్రయోగ, ఉపసంహారాలతో నేర్చుకున్నారు.

దీనినిబట్టి రామలక్ష్మణులు ఉత్తమ విద్యార్థులని చెప్పగలము.

ప్రశ్న 8.
రాముడు తొలిసారిగా తాటక అనే సీని సంహరించడాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:
తాటక, ఒక యక్షిణి. ఆమె వేయి ఏనుగుల బలం కలది. తాటక, ఆమె కుమారుడు మారీచుడు, కలసి మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేశారు. దుష్టురాలు తాటకను వధించమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు కొంచెం సేపు మాట్లాడలేదు.

అప్పుడు విశ్వామిత్రుడు “స్త్రీని చంపడం ఎలా అని, నీకు అనుమానం వద్దు. అధర్మపరురాలయిన తాటకను చంపితే దోషం రాదు” అని రాముడికి కర్తవ్యం ఉపదేశించాడు.

విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయమని దశరథుడు రాముడికి వచ్చేటప్పుడు చెప్పాడు. తండ్రిగారి ఆజ్ఞ రామునకు శిరోధార్యము. అలాగే గురువుగారయిన విశ్వామిత్రుడి ఆజ్ఞను పాటించడం శిష్యుడిగా రాముడి కర్తవ్యం. అందువల్లనే తాటక స్త్రీ అయినప్పటికీ, తండ్రి, గురువుల ఆజ్ఞలను శిరసావహించి, రాముడు తాటకను చంపాడు. అందులో తప్పు లేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం

10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

రక్తాలు ఓడుతూన్న మా రాస్పెలదార్ గబగబా ఏదో రాసి ఆ కాగితాన్ని నా కాలికి కట్టారు. కట్టి నన్ను వంజరం లోంచి వదలిపెట్టారు. అతని కళ్లల్లో కనిపించిన ఆందోళనను బట్టి, వాళ్ళంతా తీవ్రమైన ఆపదలో ఉన్నారనీ, ముఖ్యస్థావరం నుంచి సత్వర సహాయం ఆశిస్తున్నారనీ అర్థమయింది. వెంటనే కాలికి కట్టిన సమాచార పత్రంతో సహాగాలిలోకి ఎగిరాను. ఎలాగైనా సరే ఘోండ్”వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తవన. ‘చేరాలి. చేరి తరాలి’ అని మనసులో పదేవదే అనుకొన్నాను. పలికిన ప్రతీసారీ ఆ మాటలు విష్యమంత్రాల్లా నా మనసులో బాగా నాటుకొనిపోయి నాకు నూతన జవసత్త్వాలను అందించసాగాయి. అప్పటికే బాగా పైకి చేరుకొన్నాను. కాబట్టి ఒక్కసారి నాలుగు దిక్కులా కలయజూసి, పడమట దిశను గుర్తుపట్టి ఆ దిశగా ఎగర నారంభించాను. వంకర టింకర మార్గాల్లో పిచ్చిగా ఎగిరి, చిట్టచివరకు గమ్యంచేరి ఘోండ్ చేతిమీద వాలాను. రస్సెల్దార్ అందించిన ఆ సమాచారాన్ని ఘోండ్ గబగబా చదివి, సంతోషంతో దుక్కిటెద్దులా రంకె పెట్టారు. ప్రేమగా నా తల నిమిరారు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరాలోని మాటలు ఎవరు చెబుతున్నారు?
జవాబు:
ఈ పేరాలోని మాటలు, ఒక పక్షి చెపుతున్నది.

ప్రశ్న 2.
సమాచారాన్ని ఎవరి దగ్గర నుండి ఎవరికి ఆ పక్షి చేర్చింది.
జవాబు:
సమాచారాన్ని రాస్సెల్ దార్ నుండి ఊండకు చేర్చింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
సమాచారాన్ని చేరవేయడానికి ఏ పక్షిని ఉపయోగించి ఉంటారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని చేరవేయడానికి పావురాన్ని ఉపయోగించి ఉంటారు. పావురానికి దిశాపరిజ్ఞానం ఉంది. అందువల్ల పావురాన్ని ఉపయోగించి ఉంటారు.

ప్రశ్న 4.
సమాచారాన్ని చేరవేసిన పక్షిలోని గొప్ప లక్షణాలు ఏవి?
జవాబు:
ఎలాగైనా సరే, ఘోండ్ వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తపన ఆ పక్షిలో ఉంది. ఈ పక్షి రాస్సెల్ దార్ కళ్ళలోని ఆందోళనను గుర్తించింది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“మనుషుల్లాగే పక్షులకు, జంతువులకు కూడా తమ పిల్లలను పెంచడం ఎలాగో తెలుసు” దీనిమీద మీ అభిప్రాయాన్ని తెల్పండి. కారణాలను వివరిస్తూ మాట్లాడండి.
జవాబు:
మనం చదివిన “చిత్రగ్రీవం” కథలో తల్లి పక్షి, తండ్రి పక్షి పిల్ల పక్షికి (చిత్రగ్రీవానికి) ఆహారాన్ని పెట్టాయి. తండ్రి పక్షి, దాని బద్ధకాన్ని పోగొట్టి, ఎగిరేలా చేసింది. ఎగిరేటప్పుడు చిత్రగ్రీవానికి తల్లి సాయపడింది. చిత్రగ్రీవానికి ఆయాసం వచ్చింది. అప్పుడు తల్లి పక్షి, దాన్ని దగ్గరకు తీసుకొని లాలించింది.

లోకంలో పక్షులు తమ పిల్లల రక్షణ కోసం గూళ్లను నిర్మిస్తున్నాయి. పిల్లలు ఎగిరి వాటి ఆహారం తెచ్చుకోనే వరకూ, అవే ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాయి. జంతువులు తమ పిల్లలకు తాము పాలిచ్చి పెంచుతున్నాయి.

తల్లి కుక్క తన పిల్లలకు పరుగుపెట్టడం, కరవడం, వగైరా నేర్పుతుంది. తమ పిల్లల జోలికి ఇతరులు రాకుండా తల్లి జంతువులు కాపాడతాయి. తమ పిల్లల జోలికి వస్తే ఆవు, గేదె వగైరా జంతువులు తమ కొమ్ములతో పొడుస్తాయి. తమ దూడలు తమ దగ్గరకు రాగానే, అని పొదుగులను చేపి పాలిస్తాయి.

ఇందువల్ల పక్షులకూ, జంతువులకూ తమ పిల్లల్ని పెంచడం తెలుసునని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి. పేరా సంఖ్య

పేరా సంఖ్య పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు పేరాకు తగిన శీర్షిక
1వ పేరా :
2వ పేరా :
10వ పేరా:
15వ పేరా :
16వ పేరా :

జవాబు:

పేరా సంఖ్య పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు పేరాకు తగిన శీర్షిక
1వ పేరా : 1) కోల్ కతా నగరంలో పిల్లలు పావురాలను బాగా పెంచుతారు.
2) ఎన్నో శతాబ్దాల నుంచి రాజులూ, రాజులూ పావురాలను పెంచుతున్నారు. సామాన్యులు సైతం రంగురంగుల పావురాలను పెంచుతున్నారు.
భారతదేశం – పావురాల పెంపకం
2వ పేరా : మన దేశంలో పావురాలు ఎగురుతూ, కనువిందు చేస్తూ ఉంటాయి. పావురాలు బృందాలుగా ఎగురుతూ ఉంటాయి. అవి ఎంతదూరం ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ యజమాని ఇంటికి చేరతాయి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది.
పావురాలకు దిశా జ్ఞానం ఉంది. పావురాలు తమ యజమానులు అంటే ప్రాణం పెడతాయి. వాటికి ఉన్న అంతఃప్రేరణతో అవి యజమాని ఇంటికి చేరతాయి.
పావురాల దిశా పరిజ్ఞానం
10వ పేరా: తల్లి పక్షి గుడ్డులోని శబ్దం వింటుంది. తల్లి పక్షి శరీరంలో స్పందన కనిపిస్తుంది. తల్లి పక్షిలో దివ్యస్పందన కలిగి, రెండు ముక్కుపోట్లతో అది గుడ్డును పగులకొట్టింది. పిల్ల పక్షి బలహీనంగా ఉంటుంది. తల్లి పిల్లను తన రొమ్ములో దాచుకుంటుంది. పావురం గుడ్లను పొదగడం
15వ పేరా : చిత్రగ్రీవం గూటి అంచున కూర్చుంది. అది చీమను ముక్కుతో పొడిచి, దాన్ని రెండు ముక్కలు చేసింది. పావురం చీమను తినే వస్తువు అనుకుంది. నిజానికి చీమ పావురాలకు మిత్రుడు. అందుకే పావురం పశ్చాత్తాపపడింది. పావురం తిరిగి ఆ తప్పు చేయలేదు. పావురం చీమను చంపడం
16వ పేరా : చిత్రగ్రీవానికి వయస్సు ఐదు వారాలు. అది గూటి దగ్గర మూకుడు నుండి నీళ్ళు తాగడం నేర్చుకొంది. ఆహారం కోసం తల్లిదండ్రులమీదే ఆధారపడుతోంది. యాజమాని పెట్టే గింజల్ని గొంతులో పైకి, కిందికీ ఆడిస్తూ తినేది. తాను గొప్పగా తినగలుగుతున్నానని దానికి గర్వంగా ఉండేది. తన చురుకుదనాన్ని తన తల్లిదండ్రులకు చెప్పమన్నట్లు, అది యజమానివైపు చూచేది. కానీ చిత్రగ్రీవం మిగిలిన పావురాలన్నింటి కన్నా మందకొడి. చిత్రగ్రీవం చదువు

3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) చిత్రగ్రీవం ఏ వయస్సులో ఏమేం చేయగలిగిందో రాయండి.
జవాబు:

  1. చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుండే, దాని తల్లిదండ్రులు గూటి వద్దకు వచ్చినప్పుడల్లా అది తన ముక్కు తెరచి, తన గులాబీ రంగు శరీరాన్ని బంతివలె ఉబ్బించేది.
  2. చిత్రగ్రీవం, తన మూడు వారాల వయసులో దాని గూటిలోకి వచ్చిన చీమను చూసి తినే వస్తువు అనుకొని తన ముక్కుతో దానిని పొడిచి రెండు ముక్కలు చేసింది.
  3. ఐదోవారంలో చిత్రగ్రీవం తను పుట్టిన గూడు నుండి బయటకు గెంతి, పావురాళ్ల గూళ్ల దగ్గర పెట్టిన మట్టి మూకుడులో నీటిని, తాగగల్గింది.
  4. అదే వయసులో యజమాని ముంజేయి మీద కూర్చుని అరచేతిలో గింజల్ని పొడుచుకు తినేది. చిత్రగ్రీవం గింజలను తన గొంతులో పైకి కిందికి ఆడించి, తర్వాత టక్కున మింగేది.
  5. గాలిదుమారం వచ్చినపుడూ, సూర్యుని కిరణాలు కంటిలో పడినపుడూ, చిత్రగ్రీవం తన కళ్లమీదకు దాని కనురెప్పల పక్కనున్న చర్మపు పొరను సాగదీసి కప్పేది.
  6. చిత్రగ్రీవం ఏడవ వారంలో ఎగరడం నేర్చుకుంది.

ఆ) చిత్రగ్రీవానికి దాని తల్లిపక్షి, తండ్రిపక్షి నుండి ఏమేమి సంక్రమించాయి?
జవాబు:
చిత్రగ్రీవం తల్లి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రి పక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం ‘ సంపాదించుకుంది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడంలో సాయపడింది.

ఇ) చిత్రగ్రీవం గురించి వివరిస్తూ అది సుందరమైనదని, మందకొడిదని, ఏపుగా ఎదిగిందని రచయిత ఎందుకన్నాడు?
జవాబు:
చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండడం వల్ల, ఆహారం అందించడంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది.

చిత్రగ్రీవానికి ఐదోవారం వచ్చింది. అయినా చిత్రగ్రీవం తన ఆహారం కోసం ఇంకా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంది. అందువల్లే శక్తియుక్తులు పెంపొందించుకోడంలో పావురాలు అన్నింట్లోనూ చిత్రగ్రీవమే మందకొడి అని రచయిత అన్నాడు.

చిత్రగ్రీవం పుట్టిన తర్వాత వారాలు గడిచేకొద్దీ దానికి ఈకలు పెరిగాయి. దానికి ఒక్కసారిగా నిండుగా ఈకలు పెరిగాక, ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాక, అందంలో చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదని స్పష్టమయ్యింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ఈ) చిత్రగ్రీవం గురించి మనకు వివరిస్తున్నది ఎవరు? తాను చేసిన పనికిమాలిన పని అని దేన్ని గురించి చెప్పాడు?
జవాబు:
చిత్రగ్రీవం గురించి మనకు ధనగోపాల్ ముఖర్జీ గారు వివరించారు. ధనగోపాల్ ముఖర్జీ గారు, పావురాల గూళ్లను శుభ్రం చేస్తూ, గూటిలో ఉన్న రెండు గుడ్లనూ పక్క గూట్లో పెట్టారు. మొదటి గూడు శుభ్రం చేయడం పూర్తి అయ్యాక తిరిగి ఒక గుడ్డును గూట్లో పెట్టారు. రెండవ గుడ్డును కూడా ఆ గూట్లో పెడుతుండగా, తండ్రి పావురం ధనగోపాల్ ముఖర్జీ గారి ముఖంపై దాడిచేసింది. ఆయన గుడ్లను దొంగిలిస్తున్నాడని తండ్రి పావురం అనుకుంది. అప్పుడు ముఖర్జీ గారు రెండవ గుడ్డును నేలపై జారవిడిచారు.

పావురం గూడును బాగుచేసేటప్పుడు పావురాలు తనపై దాడిచేస్తాయని ఊహించకపోవడమే ముఖర్జీగారు చేసిన ‘పనికిమాలిన పని’.

ముందే పక్షిదాడి గూర్చి ఊహించి ఉంటే, రెండవ గుడ్డు పగిలిపోయేది కాదు.

ఉ) పిల్లపక్షి నిస్సహాయంగా ఉన్నప్పుడు, గాభరాపడినప్పుడు తల్లిపక్షి ఏం చేసింది?
జవాబు:
తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పడం కోసం చిత్రగ్రీవాన్ని పిట్టగోడమీద నుండి కిందికి గెంటింది. అప్పుడు చిత్రగ్రీవం నిస్సహాయంగా, రెక్కలు విప్పి గాలిలో తేలింది. అది చూసిన తల్లి పక్షి, చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఆ రెండూ ఆకాశంలో పదినిమిషాలు ఎగిరి, గిరికీలు కొట్టి కిందికి వాలాయి. తల్లి పక్షి రెక్కలు ముడుచుకొని శుభ్రంగా కిందికి వాలింది. చిత్రగ్రీవం మాత్రం నేలను రాసుకుంటూ వెళ్లి, రెక్కల్ని టపటపలాడిస్తూ, బాలన్సు చేసుకుంటూ, ముందుకు సాగి ఆగింది.

అప్పుడు తల్లి పక్షి చిత్రగ్రీవం పక్కకు చేరి, దాన్ని ముక్కుతో నిమిరింది. చిత్రగ్రీవం రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్నపిల్లాడిని లాలించినట్లు చిత్రగ్రీవాన్ని అది లాలించింది.

ఊ) “ధనగోపాల్ ముఖర్జీ” చేసిన సాహితీసేవ ఏమిటి?
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీ గారు జంతువులకు సంబంధించిన తొమ్మిది పిల్లల పుస్తకాలు రాశారు. వీటిలో 1922లో ఆయన రాసిన “కరి ది ఎలిఫెంట్”, 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” 1928లో రాసిన “గోండ్ ది హంటర్”, పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈయన రాసిన చిత్రగ్రీవం పుస్తకం 1928లో న్యూ బెరీ మెడల్‌ను గెల్చుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి “అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్” వారు ఇచ్చే విశిష్ట పురస్కారమే ఈ “న్యూ బెరీ మెడల్”. ఈ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత మన ముఖర్జీ గారే.

4. కింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.

చాతకపక్షుల ముక్కులు చాలా చిన్నవి. తాము ఎగురుతూనే గాలిలోని కీటకాలను పట్టుకోగలవు. నోరు బార్లా తెరచి తమవైపుకు వచ్చే చాతకపక్షుల బారి నుండి కీటకాలు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చాతకపక్షులు పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులెత్తే సామర్థ్యం కూడా తక్కువే! అందుకే అవి వాటి గూళ్ళ నిర్మాణంలో గడ్డీగాదం, పీచూపత్తి, సన్నపాటి చెట్టురెమ్మలు… వంటి తేలికపాటి వస్తువులనే వాడతాయి. వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి. పొడవాటి కాళ్ళున్న పక్షుల్లో ఉండే చురుకుదనం వీటి కాళ్ళల్లో కనిపించదు. అందుకని ఇవి గెంతడం, దభీమని దూకడం వంటి పనులు చెయ్యలేవు. ఐతే వాటి కొక్కేల్లాంటి కాలివేళ్ళ పుణ్యమా అని అవి తమ గోళ్ళతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోయి ఉండిపోగలవు. కాబట్టి అవి అనితరసాధ్యమైన నైపుణ్యంతో, కుశలతతో పాలరాతి వంటి నున్నటి గోడల్ని, ప్రదేశాలను పట్టుకొని వెళ్ళగలవు. తమ గూళ్ళను నిర్మించుకోవడానికి ఇళ్ళ చూరుల దిగువన గోడల్లోని తొర్రలను ఎన్నుకొంటాయి. రాలిన ఆకుల్నీ, గాలిలో ఎగిరే గడ్డిపోచల్ని ముక్కున కరచుకొని గూట్లోకి చేరుస్తాయి. వాటిని తమ లాలాజలాన్ని జిగురులా వాడి గూటి ఉపరితలం మీద అతికిస్తాయి. వాటి లాలాజలం ఓ అద్భుత పదార్థం. అది ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు. ఇదీ చాతకపక్షుల వాస్తుకళానైపుణ్యం.

అ) చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే …………………….
జవాబు:
చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే వాటికి బరువులెత్తే సామర్థ్యం తక్కువ.

ఆ) చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు. ఎందుకంటే ……………………………
జవాబు:
చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం కూడా చెయ్యలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి.

ఇ) నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం ………………….
జవాబు:
నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం వాటికి ఉన్న కొక్కేల్లాంటి కాలివేళ్ళు.

ఈ) చాతకపక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ………………
జవాబు:
చాతకపక్షుల లాలాజలం, వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వాటి లాలాజలం ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు.

ఉ) వాస్తు కళా నైపుణ్యం అంటే …………..
జవాబు:
వాస్తు కళానైపుణ్యం అంటే ఇళ్ళను నిర్మించే విద్యలో నేర్పరిదనం.

II. వ్యక్తి కరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడు వారాల వయస్సు ఉన్నప్పుడు తన గూట్లోకి వచ్చిన నల్ల చీమను ముక్కుతో పొడిచి రెండు ముక్కలు చేసింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికిరానిది. ఆ విషయం గ్రహించిన చిత్రగ్రీవం తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మరో చీమను చంపలేదు.

తాను చేసిన పని పొరపాటు అని గ్రహించిన పావురం తిరిగి ఆ తప్పును తిరిగి చేయకపోవడం, నాకు ఆశ్చర్యం కల్గించింది.

ఆ) మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
“ఏనుగులు, పావురాలు తమ తమ యజమానుల పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వీటిని మించి యజమాని పై విశ్వాసాన్ని ప్రదర్శించే ప్రాణిని తాను చూడలేదని రచయిత చెప్పాడు.

అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. అవి రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ ఆకాశ సీమలో ఎగిరినా, చివరకు అవి వాటికి ఉన్న అద్భుతమైన ‘అంతఃప్రేరణాబలం’తో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకే చేరుతాయి”.

అందువల్లనే రచయిత, మానవులను పావురాలకు మిత్రులు, సహచరులు అని అన్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంతమాటల్లో వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లి పక్షి, తండ్రి పక్షి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. దానికి గులాబీరంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్లు దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.

పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీళ్ళు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది.. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదు.

ఆ) శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
(లేదా)
పిల్లల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్యగల పోలికలను వివరంగా సొంతమాటలలో పాఠ్యభాగం ఆధారంగా రాయండి.
జవాబు:
చంటిపిల్లల నోటికి తల్లి తన పాలను అందించినట్లే, పక్షిపిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. పిల్లలకు తల్లి మంచి పక్కను ఏర్పాటు చేసినట్లే, పక్షి పిల్లలకు, తల్లి పక్షి, తండ్రి పక్షి ఆచితూచి గూట్లో వస్తువులను ఉంచి, పిల్లపక్షికి సుఖసౌకర్యాలను కల్పిస్తాయి.

తల్లి పిల్లలకు పదార్థాలను ఉడకపెట్టి, మెత్తగా చేసి, నోట్లో పెడుతుంది. అలాగే తల్లి పక్షి, తండ్రి పక్షి గింజల్నీ, విత్తనాల్నీ కాసేపు తమ నోటిలో నాననిచ్చి, మెత్తపరచి ఆ తర్వాతనే పక్షిపిల్లల నోట్లో పెడతాయి.

తల్లిదండ్రులు పిల్లలకు పాకడం, లేచి నిలబడడం, నడవడం నేర్పుతారు. వారు పిల్లల చేతులను పట్టుకొని జాగ్రత్తగా వారికి నడపడం నేర్పుతారు. అప్పుడప్పుడు పిల్లలు నడుస్తూ పరుగు పెడుతూ పడిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు.

చిత్రగ్రీవానికి తండ్రి ఎగరడాన్ని అలాగే నేర్పింది. బలవంతంగా చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, ఆకాశంలోకి తోసింది. దానితో అప్రయత్నంగా రెక్కలు విప్పి చిత్రగ్రీవం ఎగిరింది. ఎగరడంలో అది అలిసిపోగా, తల్లి పక్షి చిత్రగ్రీవాన్ని లాలించింది.

ఈ విధంగా చిత్రగ్రీవం పెంపకానికీ, పిల్లల పెంపకానికి పోలికలు ఉన్నాయి.

3. సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.

అ) ‘చిత్రగ్రీవం’ అనే పావురంపిల్ల ఎలా పుట్టిందీ ఎలా ఎగరడం నేర్చుకొన్నదీ తెలుసుకున్నారు కదా! అట్లాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి / జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి. (ఈ పాఠంలాగా).
జవాబు:

“ధోనీ” (కుక్కపిల్ల)

మా పక్క ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ’. తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.

వాళ్ళింట్లో ఒక కుక్క గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.

ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి తల్లి కుక్క కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీధిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.

ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపై దూకి అతని పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.

ఆ) ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే వేడిమికి కొన్ని పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అలాగే ఎండాకాలంలో తీవ్రమైన వేడికి తాళలేక, తాగడానికి నీరు అందక, మృత్యువాతపడుతున్నాయి. పక్షులు ఇందుకోసం తమను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టమని తమ తోటకు వచ్చిన పిల్లలతో సంభాషించాయి అనుకోండి. ఆ పిల్లలకూ, పక్షులకూ మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
“తోటలో మిత్రులు – పక్షులతో సంభాషణ”
రాము : ఓరేయ్ గోపాల్! పూలమీద తూనీగలు ఎగిరేవి కదా! ఇప్పుడు కనబడడం లేదేం?

గోపాల్ : ఈ మధ్య పక్షి జాతులు అనేక రకాలుగా నశిస్తున్నాయని అంటున్నారు కదా!

పిచ్చుక : బాబుల్లారా! మీ దృష్టి మా మీద పడింది. సంతోషము. మా పక్షులు ఎలక్ట్రిక్ తీగల మీద వాలితే చచ్చిపోతున్నాయి. రోజూ ఎన్ని కాకులూ, చిలుకలూ, గోరింకలూ అలా చస్తున్నాయో ! మీకు తెలుసా?

రాము : నిజమే. పక్షులు అంతరిస్తే, మన పర్యావరణం దెబ్బ తింటుంది కదా! మరేం చేయాలి?

చిలుక : నాయనా ! మీ పెరళ్ళలో జామ చెట్లు లేవు. మామిడి చెట్లు, సపోటాలు, సీతాఫలాల చెట్లూ లేవు. మేము ఏమి తిని బ్రతకాలి?

గువ్వ : నాయనా! మాకు తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. మీరు చెరువులు పూడ్చివేస్తున్నారు. నూతులు కప్పివేస్తున్నారు. గ్రామాలలో మేము బతికే దారే లేదు.

గోరింక : గాలిలో హాయిగా ఎగురుదామంటే, ఈ సెల్ ఫోను టవర్లు, టి.వి. టవర్లు అడ్డుగా ఉంటున్నాయి. ఆ తరంగాల ప్రభావంతో మేము చస్తున్నాము.

గోపాల్ : మీరు చెప్పే మాటలు వింటూంటే భయంగా ఉంది. ఇంక మేము మీ పక్షులను టి.వి.ల్లోనే చూడాలేమో!

పక్షులు : మేము హాయిగా తిరగడానికి మీ గ్రామాల్లో చెట్లు పాతండి. చెరువులు, కాలువలూ పూడ్చి వేయకండి. మీ మీ పెరళ్లలో పూలమొక్కలూ, పండ్ల మొక్కలు పెంచండి.

రాము, గోపాల్: సరే. మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. తప్పకుండా పక్షులను రక్షించే కేంద్రాలను గురించి మా పెద్దలతో మాట్లాడతాం.

పక్షులు : మంచిది. కృతజ్ఞతలు.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

1. “ధనగోపాల్ ముఖర్జీ” రాసిన “చిత్రగ్రీవం ఓ పావురం కథ” అనే పుస్తకాన్ని లేదా పక్షుల గురించి తెలిపే ఏదైనా ఒక పుస్తకాన్ని గ్రంథాలయం నుండి చదవండి. మీరు తెలుసుకున్న వివరాలు రాసి ప్రదర్శించండి.
(లేదా)
అంతర్జాలం ద్వారా ఏవైనా రెండు పక్షుల వివరాలు, వాటి చిత్రాలు సేకరించి, రాసి ప్రదర్శించండి.
జవాబు:
అ) చిలుక: ఇది అందంగా ఉంటుంది. దీనిని పెంచుకుంటారు. ఇవి రెండు రకాలు.
1) చిలుకలు
2) కాక్కటూ
చిలుకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. కొన్ని పంచరంగుల చిలుకలు ఉంటాయి. ఇవి పరిమాణంలో 3.2 నుండి 10 అం|| పొడవు వరకూ ఉంటాయి. ఇవి గింజలు, పండ్లు మొగ్గలు, చిన్న మొక్కలను తింటాయి. కొన్ని జాతుల చిలుకలు పురుగుల్ని తింటాయి. చిలుకలు చెట్టు తొట్టెలలో గూళ్లు కట్టుకుంటాయి.

ఇవి తెలివైన పక్షులు. ఇవి మనుష్యుల గొంతును పోలి మాట్లాడతాయి. పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ, కారణాల వల్ల ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి. జ్యోతిషంలో చిలుక ప్రధాన పాత్ర వహిస్తుంది. పల్లెలలో సైతం చిలుక జోస్యం చెప్పేవారు కనిపిస్తారు.

ఆ) పిచ్చుక :
ఇది చిన్న పక్షి. ఇవి చిన్నగా, బొద్దుగా గోధుమ – ఊదా రంగుల్లో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలలో పెద్దగా తేడాలుండవు. ఇవి గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటాయి. కొండపిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి. ఇది 4.5′ నుండి 7′ వరకు పొడవు ఉంటుంది. పిచ్చుకలు శరీర నిర్మాణంలో గింజలను తినే పక్షులలాగే ఉంటాయి. నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.

ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. జీవనశైలిలో పెద్దవేగంగా వచ్చిన మార్పు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. పచ్చదనం అంతరించిపోవడం, రసాయనాలతో పళ్ళు, ఆహారధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలు అంతరిస్తున్నాయి. సెల్యూలర్ టవర్ల నుండి వచ్చే అయస్కాంత కిరణాలు, ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

2. “చిత్రగ్రీవం” అనే పక్షి పేరు పంచతంత్ర కథలో కూడా ఉంది. పంచతంత్రం కథల పుస్తకం చదవండి. మీరు చదివిన కథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
పంచతంత్ర కథల్లో చిత్రగ్రీవుడి కథ
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు, అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.

ఆ చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు చెప్పాడు. ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.

పావురాలు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు. మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదబంధాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) శ్రద్ధాసక్తులు
జవాబు:
వాక్యం : విజయం సాధించాలంటే పనిలో శ్రద్ధాసక్తులు చూపించాలి.

ఆ) ప్రేమ ఆప్యాయతలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలి.

ఇ) వన్నెచిన్నెలు
జవాబు:
వాక్యం : మా ఆవుదూడ వన్నెచిన్నెలు చూసి నేను మురిసిపోతాను.

ఈ) సమయసందర్భాలు :
జవాబు:
వాక్యం : సమయసందర్భాలు లేకుండా హాస్యంగా మాట్లాడడం నాకు నచ్చదు.

ఉ) హాయిసౌఖ్యాలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు, బిడ్డల హాయిసౌఖ్యాల గురించి శ్రద్ధ పెట్టాలి.

2. కింది పదాలను వివరించి రాయండి.

అ) విజయవంతం కావడం అంటే
జవాబు:
విజయవంతం కావడం అంటే తాను ప్రారంభించిన పని ఏ విఘ్నమూ లేకుండా పూర్తి అవడం.

ఆ) ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే
ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే ఎవరు ఏమి మాట్లాడినా, తన మనస్సులో ఏమి ఉన్నా, పైకి మాత్రం మాట్లాడకుండా, నోరు మూసుకు కూర్చోడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

3. కింద తెలిపిన వాటిని గురించి పాఠంలో ఏఏ పదాలతో వర్ణించారు?
అ) గద్దింపులు : కువకువ కూయడం
ఆ) పావురాలు : రకరకాల రంగురంగుల పావురాలు
ఇ) గువ్వలు : నీలికళ్లతో కువకువలాడడం
ఈ) పావురాల గుంపు : పెనుమేఘాలు
ఉ) పావురం మెడ : హరివిల్లు
ఊ) పుట్టిన పిల్లపక్షి : బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన
ఋ) చిత్రగ్రీవం ముక్కు : పొడవాటి, గట్టిపాటి, సూదిలాంటి బలమైన
ఎ) చిత్రగ్రీవం ఒళ్ళు : సముద్రపు నీలిరంగు
ఏ) చిత్రగ్రీవం మెడ ప్రాంతం : ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా

వ్యాకరణాంశాలు

1. కింది అలంకారాల లక్షణాలు రాయండి. అ) శ్లేష
జవాబు:
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే ‘శ్లేష’ అనబడుతుంది.
ఉదా :
1) రాజు కువలయానందకరుడు
2) మానవ జీవనం సుకుమారం

ఆ) అర్ధాంతరన్యాసం :
జవాబు:
లక్షణం : విశేష విషయాన్ని, సామాన్య విషయంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించి చెప్పడం. దీన్ని “అర్థాంతరన్యాసాలంకారం’ అంటారు.
ఉదా :
1) హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
2) మేఘుడు అంబుధికి పోయి జలం తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజగుణం.

2. కింది ఛందోరీతుల లక్షణాలు రాయండి.
అ) సీసం
జవాబు:
సీసం – (లక్షణం ) :
1) సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది. పాదంలోని రెండు భాగాల్లోనూ, ఒక్కొక్క భాగంలో 4 గణాల చొప్పున ఉంటాయి. మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
2) యతి పాదంలోని రెండు భాగాల్లోనూ మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
3) సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా :
సీ|| “హరిహర బ్రహ్మలఁ బురిటి బిడ్డలఁజేసి జోలఁ బాడిన పురంద్రీలలామ”

గమనిక :
పై పద్యంలో రెండు చోట్ల ప్రాస యతులు.

ఆ) ఆటవెలది
జవాబు:
ఆటవెలది – (లక్షణం ) :

  1. ఇది ‘ఉపజాతి’ పద్యం.
  2. ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
  3. 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. .
  4. 2, 4 పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి.
  5. ప్రతిపాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరంతో యతి. యతిలేని చోట “ప్రాసయతి” ఉంటుంది.
  6. ప్రాసనియమం పాటించనవసరంలేదు.
    ఉదా :
    ఆ||వె : “పొదలి పొదలి చదల బొంగారి పొంగారి
    మించి మించి దిశల ముంచి ముంచి”

ఇ) తేటగీతి
జవాబు:
తేటగీతి – (లక్షణం ) :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) ప్రతి పాదానికి వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు ఉంటాయి.
4) నాలుగవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస యతి కూడా వేయవచ్చు.
5) ప్రాసనియమం లేదు.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 1

3. కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.

అ) శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది. ఈ

ఉపమాలంకార లక్షణం :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ‘ఉపమాలంకారం’.

సమన్వయం : ఇందులో 1) ఉపమానం, 2) ఉపమేయం, 3) ఉపమావాచకం, 4) సమానధర్యం ఉంటాయి.

పై ఉదాహరణలో
1) మల్లెపూవు (ఉపమానం)
2) చొక్కా (ఉపమేయం)
3) వలె (ఉపమావాచకం)
4) తెల్లగా ఉంది (సమానధర్మం )

4. కింది పద్యపాదాలు పరిశీలించండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 2
గమనిక :
పై పద్యంలో గగ, భ, జ, స, అనే గణాలు వాడబడ్డాయి. ఒకటవ, మూడవ పాదాల్లో మూడేసి గణాలు ఉన్నాయి. రెండవ, నాల్గవ పాదాల్లో ఐదేసి గణాలున్నాయి.
ఒకటి, రెండు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
రెండు, నాల్గు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
ఒకటి, రెండు పాదాలు కలిపిన | రెండు, నాల్గు పాదాలు కలిపిన | గణాలలో,| 8 గణాలలో, ఆరవ గణం ‘జగణం’ ఉంది.
రెండు, నాల్గు పాదాల చివరి అక్షరం ‘గురువు’ ఉంది.
ఇలాంటి లక్షణాలు కల పద్యాన్ని “కందపద్యం” అంటారు.

కందము :
పద్య నియమాలు తెలిసికొందాం.

  1. ఈ పద్యంలో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
  2. మొదటి పాదం లఘువుతో మొదలయితే, అన్ని పాదాల్లో మొదటి అక్షరం లఘువు ఉండాలి. గురువుతో మొదటి పాదం మొదలయితే, అన్ని పాదాల మొదటి అక్షరం గురువు ఉండాలి.
  3. రెండు, నాల్గవ పాదాలలోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది.
  4. 1, 2 పాదాల్లో (3 + 5 = 8 గణాలు); 3, 4 పాదాల్లో (3 + 5 = 8) గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో ఆరవ గణం తప్పక నలం కాని, జగణం కాని కావాలి.
  5. 2, 4 పాదాల్లో యతి ఉంటుంది. నాల్గవ గణం మొదటి అక్షరానికి, ఏడవ గణం మొదటి అక్షరానికి యతి ఉండాలి.
  6. ప్రాస నియమం ఉండాలి. (4 పాదాల్లో) 7) పద్యంలోని 1 + 2 పాదాలు కలిపిన 8 గణాల్లో బేసిగణం ‘జగణం’ ఉండరాదు.

అబ్యాసం
“వినదగు నెవ్వరు జెప్పిన” అనే పద్యానికి లక్షణ సమన్వయం చేయండి.
AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం 3

సమన్వయం :

  1. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉన్నాయి. ఈ పాదాలలో గగ, భ, జ, స, నల అనే గణాలే ఉన్నాయి.
  2. మొత్తం (1 + 2) పాదాలకు ఉన్న 8 గణాలలో ఆరవ గణం ‘నలం’ ఉంది. రెండవ పాదం చివర గురువు ఉంది.
  3. యతి 4, 7 గణాల మొదటి అక్షరాలకు సరిపోయింది. (వి – వి)
  4. ప్రాస నియమం ఉంది.
  5. బేసి గణంగా ‘జగణం’ లేదు.
    కాబట్టి ఇవి కంద పద్యపాదాలు.

అదనపు సమాచారము

సంధులు

1) ప్రపంచపు వెలుగు = ప్రపంచము + వెలుగు – పుంప్వాదేశ సంధి
2) ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
3) ఉత్తరపు గాలి = ఉత్తరము + గాలి – పుంప్వాదేశ సంధి
4) నీలివర్ణపు ఈకలు = నీలివర్ణము + ఈకలు – పుంప్వాదేశ సంధి
5) సముద్రపు నీలిరంగు = సముద్రము + నీలిరంగు – పుంప్వాదేశ సంధి
6) చర్మపు పొర = చర్మము + పొర – పుంప్వాదేశ సంధి
7) జ్ఞానపు పావురాలు = జ్ఞానము + పావురాలు – పుంప్వాదేశ సంధి
8) అమాయకపు నల్లచీమ = అమాయకము + నల్లచీమ – పుంప్వాదేశ సంధి
9) మందిరాలు = మందిరము + లు – లులనల సంధి
10) వర్షాలు = వర్షము + లు – లులనల సంధి
11) మండుటెండ = మండు + ఎండ – టుగాగమ సంధి
12) నీలాకాశము = నీల + ఆకాశము – సవర్ణదీర్ఘ సంధి
13) శ్రద్ధాసక్తులు = శ్రద్ధా + ఆసక్తులు – సవర్ణదీర్ఘ సంధి
14) బాగోగులు = బాగు + ఓగులు – ఉత్వ సంధి
15) నాలుగంతస్తులు = నాలుగు + అంతస్తులు – ఉత్వసంధి
16) జలకాలాడు = జలకాలు + ఆడు – ఉత్వసంధి
17) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
18) మొట్టమొదలు = మొదలు + మొదలు – ఆమ్రేడిత సంధి
19) పూరిల్లు = పూరి + ఇల్లు – ఇత్వ సంధి
20) నిస్సహాయము = నిః + సహాయము – విసర్గ సంధి
21) మనోహరం = మనః + హరము – విసర్గ సంధి
22) ముంజేయి = ముందు + చేయి – ప్రాతాది సంధి
23) పూఁదోట = పూవు + తోట – ప్రాతాది సంధి
24) తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మూడు వారాలు మూడు సంఖ్యగల వారాలు ద్విగు సమాసం
2) మూడు గంటలు మూడు సంఖ్యగల గంటలు ద్విగు సమాసం
3) మూడు నెలలు మూడు సంఖ్యగల నెలలు ద్విగు సమాసం
4) నాలుగడుగులు నాలుగు సంఖ్యగల అడుగులు ద్విగు సమాసం
5) రెండు ముక్కలు రెండు సంఖ్యగల ముక్కులు ద్విగు సమాసం
6) రెండు గుడ్లు రెండు సంఖ్యగల గుడ్లు ద్విగు సమాసం
7) ఇరవై నిమిషాలు ఇరవై సంఖ్యగల నిమిషాలు ద్విగు సమాసం
8) ఇరవై లక్షలు ఇరవై సంఖ్యగల లక్షలు ద్విగు సమాసం
9) పది లక్షలు పది సంఖ్యగల లక్షలు ద్విగు సమాసం
10) శ్రద్ధాసక్తులు శ్రద్ధయు, ఆసక్తియు ద్వంద్వ సమాసం
11) వన్నెచిన్నెలు వన్నెయు, చిన్నెయు ద్వంద్వ సమాసం
12) శక్తియుక్తులు శక్తియు, యుక్తియు ద్వంద్వ సమాసం
13) సుఖసౌకర్యాలు సుఖమును, సౌకర్యమును ద్వంద్వ సమాసం
14) అసంఖ్యాకం సంఖ్యలేనిది నఞ్ తత్పురుష సమాసం
15) అసంకల్పితం సంకల్పితం కానిది నఞ్ తత్పురుష సమాసం
16) అసాధ్యం సాధ్యం కానిది నఞ్ తత్పురుష సమాసం
17) అప్రయత్నం ప్రయత్నం కానిది నఞ్ తత్పురుష సమాసం
18) మహానగరం గొప్పనగరం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
19) యువరాజు యువకుడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
20) యువరాణి యువతియైన రాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
21) పెంపుడు పావురాలు పెంచుకొంటున్న పావురాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
22) తెల్లజెండాలు తెల్లవైన జెండాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
23) నీలాకాశం నీలమైన ఆకాశం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
24) చిన్ని బృందాలు చిన్నవైన బృందాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
25) కులీన వంశము కులీనమైన వంశము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
26) దివ్య సంకల్పం దివ్యమైన సంకల్పము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
27) పెద్ద పక్షులు పెద్దవైన పక్షులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
28) మండుటెండ మండుతున్న ఎండ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
29) యథాస్థానం స్థానమును అతిక్రమింపక అవ్యయీభావ సమాసం
30) అతిసుందరం మిక్కిలి సుందరం అవ్యయీభావ సమాసం
31) వెలుగు వెల్లువ వెలుగుల యొక్క వెల్లువ షష్ఠీ తత్పురుష సమాసం
32) పావురాల బృందాలు పావురాల యొక్క బృందాలు షష్ఠీ తత్పురుష సమాసం
33) హరివిల్లు హరియొక్క విల్లు షష్ఠీ తత్పురుష సమాసం
34) దిశాపరిజ్ఞానం దిశల యొక్క పరిజ్ఞానం షష్ఠీ తత్పురుష సమాసం
35) చిత్రగ్రీవం చిత్రమైన గ్రీవము కలది బహుహ్రీహి సమాసం
36) భారతదేశం భారతము అనే పేరుగల దేశం సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
37) బాగోగులు బాగును, ఓగును ద్వంద్వ సమాసం

నానార్థాలు

1. మిత్రుడు : స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
2. పుణ్యము : ధర్మము, నీరు, బంగారము

ప్రకృతి – వికృతులు

రాజ్ఞి – రాణి
విశ్వాసము – విసువాసము
ఆశ్చర్యం – అచ్చెరువు
ప్రాణం – పానం
దిశ – దెస
వంశము – వంగడము
పుణ్యము – పున్నెము
పక్షి – పక్కి
పిత్స – పిట్ట
కుడ్యం – గోడ
శక్తి – సత్తి
యుక్తి – ఉత్తి
సుఖం – సుకం
స్వతంత్రమ్ – సొంతము
ఆకాశము – ఆకసము
నిమేషము – నిముసము
ఆహారము – ఓగిరము
అద్భుతము – అబ్బురము
ముహూర్తము – మూర్తము
చిత్రం – చిత్తరువు

పర్యాయపదాలు

1. నగరము : పురము, పట్టణము, పురి, పత్తనము
2. ఏనుగు : కరి, హస్తి, వారణము, ఇభము
3. అద్భుతము : అబ్బురము, అచ్చెరువు, వింత
4. ఆకాశము : గగనము, అంబరము, నభము, మిన్ను
5. గింజ : బీజము, విత్తు, విత్తనము
6. ముఖము : మొహం, ఆస్యము, వక్రము, ఆననము, మోము
7. తల్లి : జనని, జనయిత్రి, మాత, అమ్మ
8. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, పిత
9. కన్ను : అక్షి, నేత్రము, నయనం, చక్షువు

వ్యుత్పత్యర్థాలు

1. చిత్రగ్రీవము : చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది (పావురం)
2. పక్షి : పక్షములు (తెక్కలు) కలిది (పిట్ట)

రచయిత పరిచయం

పాఠ్యం పేరు : ‘చిత్రగ్రీవం’
పాఠ్య రచయిత : ధనగోపాల్ ముఖర్జీ (మూలం)
దాసరి అమరేంద్ర (అనువాద రచయిత)

దేని నుండి గ్రహింపబడింది : “చిత్రగ్రీవం” పుస్తకం నుండి

న్యూబెరీ మెడల్ : 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని ‘ధనగోపాల్ ముఖర్జీ’కి ఇచ్చారు.

న్యూ బెరీ మెడల్ బహుమతిని ఎవరికి ఇస్తారు? : అమెరికాలో బాలసాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ఇస్తారు.

ధనగోపాల్ ముఖర్జీ విశిష్టత : ఈయన ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత.

ముఖర్జీ పుట్టుక : 1890లో కోల్ కతాలో

విద్యాభ్యాసం : ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి, కాలిఫోర్నియా’, ‘స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.

ముఖ్య వ్యాపకాలు : రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం.

రచనలు : జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.

ప్రాచుర్యం పొందిన రచనలు :
1) 1922లో రాసిన “కరి ది ఎలిఫెంట్”
2) 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” చాలా ప్రసిద్ధములు.
3) 1928లో రాసిన ‘గోండ్ ది హంటర్’

పుట్టుక

కోల్‌కతా = కలకత్తా (పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని.)
మహానగరం = పెద్ద పట్టణం
డజను = పన్నెండు
గిరిక్ ల పావురాలు = గిరికీలు కొట్టే పావురాలు
మచ్చిక చెయ్యడం = ప్రేమించడం (దగ్గరకు, తియ్యడం)
అలరించే = సంతోషపెట్టే
విశిష్టమైన = మిక్కిలి శ్రేష్ఠమైన
శతాబ్దాలు (శత + అజ్ఞాలు) = నూర్ల సంవత్సరాలు
నిరుపేదలు = మిక్కిలి బీదవారు
పూరిల్లు (పూరి + ఇళ్లు) = గడ్డితో నేసిన ఇళ్లు
ఆప్యాయత = ప్రీతి
ఆసక్తి = ఆపేక్ష
పూదోటలు (పూవు + తోటలు) = పూలతోటలు
ఫౌంటెన్లు = నీటిని పైకి వెదజల్లే యంత్రాలు
ఉండడం కద్దు = ఉండడం ఉంది
ఉల్లాసకరమైన = సంతోషాన్ని ఇచ్చే
గిరికీలు కొట్టు = గిరికీలు తిరిగే (గాలిలో చక్కర్లు కొట్టే)
సంకేతాలు = సంజ్ఞలు
అసంఖ్యాకమైన = లెక్కపెట్టలేనన్ని
నీలాకాశం (నీల + ఆకాశం) = నీలంరంగు ఆకాశం
పెనుమేఘాలు = పెద్ద మేఘాలు
బృందాలు = గుంపులు
చెక్కర్లు కొడతాయి = తిరుగుతాయి
బృహత్తర సమూహం = మిక్కిలి పెద్ద గుంపు
రూపొందుతాయి = రూపం సంతరించుకుంటాయి (తయారవుతాయి)
స్థూలంగా = దాదాపుగా
పరిమాణం = సైజు
ఆకృతి = ఆకారం
దిశా పరిజ్ఞానం = దిక్కుల యొక్క జ్ఞానం
విశ్వాసం = నమ్మకం
సన్నిహిత పరిచయం = దగ్గరి పరిచయం
వనసీమ = అరణ్యసీమ
గజరాజులు = శ్రేష్ఠమైన ఏనుగులు
ప్రాణం పెడతాయి = ప్రాణం ఇస్తాయి (బాగా ప్రేమిస్తాయి.)
అంతఃప్రేరణాబలం = మనస్సు కలిగించే ప్రేరణ యొక్క బలం
సహచరుడు = చెలికాడు
పంచకు = వసారాకు
చిత్రగ్రీవం = పావురం (చిత్రమైన కంఠం గలది)
విచిత్రవర్ణభరితం = విచిత్రమైన రంగులతో నిండినది
హరివిల్లు మెడగాడు = ఇంద్రధనుస్సు వంటి మెడ కలవాడు
ఉట్టిపడలేదు = స్పష్టంగా కనబడలేదు
వన్నెచిన్నెలు = విలాసాలు
ఆచూకీయే = జాడయే
అతిసుందరమైన = మిక్కిలి అందమైన

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
కోల్ కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జవాబు:
కలకత్తా నగరంలో ప్రతి మూడవ కుర్రాడి వద్ద కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్స్ పావురాలు, పిగిలిపిట్టలు, బంతి పావురాలూ ఉంటాయి. కాబట్టి కోల్ కతా నగరం పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పగలం.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటి కోసం మీరేం చేస్తున్నారు?
జవాబు:
మా ప్రాంతంలో కాకులూ, చిలుకలూ ఎక్కువగా ఉంటాయి. రోజూ మధ్యాహ్నం నేను భోజనం తినే ముందు మా ఇంట్లో వండిన పదార్థాలు అన్నీ కలిపి ఒక ముద్ద చేసి, కాకికి పెట్టిన తరువాత నేను తింటాను. మా పెరడులోని జామచెట్టు కాయలు అన్నీ చిలుకలకే వదలి పెడతాను.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అట్లే మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి?
జవాబు:
కాకులకు మంచి స్నేహభావం ఉంటుంది. ఏదైనా ఒక కాకికి ప్రమాదం వస్తే మిగతా కాకులన్నీ అక్కడ చేరి, తమ బాధను అరుపుల ద్వారా తెలుపుతాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, ఆ కాకి మిగతా వాటిని కూడా పిలుచుకు వచ్చి, ఆ ఆహారాన్ని తినేటట్లు చేస్తుంది.

ప్రశ్న 4.
విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
విశ్వాసం ప్రదర్శించడం అంటే యజమాని యందు ప్రేమను చూపించడం. యజమానికి ఏ కష్టమూ రాకుండా చూడడం. అవసరమైతే యజమాని కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం.

ప్రశ్న 5.
‘అంతః ప్రేరణాబలం’ అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జవాబు:
‘అంతః ప్రేరణాబలం అంటే మనస్సు గట్టిగా ప్రేరేపించడం వల్ల చేసే కార్యం. ఒక్కొక్కప్పుడు మనకు అక్కడ పదిమందీ ఉన్నా, అందులో ఒక వ్యక్తిపైనే మక్కువ ఏర్పడుతుంది. అతడితోనే ప్రేమగా ఉంటాం. దానికి కారణం ఏమిటో తెలియదు. దానికి కారణం బహుశః అంతః ప్రేరణాబలం కావచ్చు. అంటే మన మనస్సు యొక్క ప్రేరణ.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

మొదలెడతాను = ప్రారంభిస్తాను
కులీన వంశానికి = శ్రేష్ఠమైన వంశానికి
అమోఘంగా = ఫలవంతంగా
వార్తాహరి = వార్తలను మోసుకువెళ్ళేది
రూపొందింది = రూపాన్ని పొందింది (తయారయ్యింది)
సంతరించుకుంది = సంపాదించుకుంది
త్రుటిలో = కొద్ది సేపట్లో
దుర్ఘటన = చెడ్డ సంఘటన
ఆకూ అలములు = ఆకులూ, తీగలు
యథాస్థానం = ఉన్నచోటున
దృఢంగా = బలిష్టంగా
తాకింది = తగిలింది
దారుణం = భయంకరం
ఛిన్నాభిన్నము = ముక్కలు ముక్కలు
సంగ్రహించడానికి = అపహరించడానికి
సంఘటన = పరిస్థితి
అడపాదడపా = అప్పుడప్పుడు
నిర్వహించేది = నెరవేర్చేది
పరిజ్ఞానం = పూర్ణజ్ఞానం
రూపొంది = ఏర్పడి
క్షుణ్ణంగా = బాగా (సంపూర్తిగా)
ఆహ్వానించడం = పిలవడం
తారాడటం = కదలియాడడం (తిరగడం)
నెట్టేసేది = గెంటేసేది
మహా ఆత్రంగా = మిక్కిలి వేగిరపాటుగా (తొందరగా)
స్పందన = కదలిక
దివ్యసంకల్పం = గొప్ప సంకల్పం
తల నిక్కించి = తల పైకెత్తి
నిస్సహాయమైన = ఏ సహాయమూలేని
అర్భకమైన = బలంలేని
నిస్సహాయత = శక్తిహీనత
మరుక్షణం = తరువాతి క్షణం
పొదవుకుంది = దాచుకుంది (కప్పుకుంది)

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జవాబు:
మా నాన్నగారు నాకు చేతి గడియారం, సైకిలు కొని ఇచ్చిన రోజును నేను ఎప్పటికీ మరువలేను.

ప్రశ్న 2.
తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జవాబు:
తెలివిలేని మూర్ఖులు చేసే పనులను, తెలివిమాలిన పనులు అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మీ మీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జవాబు:
మా అమ్మగారు నన్ను సినిమాకు వెళ్ళవద్దన్నారు. మరునాటి పరీక్షకు చదువుకొమ్మన్నారు. అన్నీ చదివాను కదా అని, నా అభిమాన హీరో సినిమా కదా అని, సినిమాకు వెళ్ళాను. మరునాడు పరీక్షలో బాగా రాయలేక పోయాను. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది.

ప్రశ్న 4.
పావురం గూడు ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జవాబు:
మా పెరటిలో కరివేపచెట్టుకు పిచ్చుక గూడు పెట్టింది. అది సన్నటి దారాల వంటి పీచుతో గూడు కడుతుంది. ఎండిన బీరకాయలా వేలాడుతూ ఉంటుంది. కొన్ని పక్షులు పుల్లముక్కలతోనూ, కొన్ని ఈత, కొబ్బరి వగైరా ఆకులతోనూ గూళ్లు కడతాయి. కాబట్టి అన్ని పక్షిగూళ్లు ఒకేలా ఉండవు.

ప్రశ్న 5.
‘దివ్య సంకల్పం చోటు చేసుకోవడం’ అంటే ఏమిటి?
జవాబు:
ఒకప్పుడు ఎందుకు చేస్తామో తెలియకుండానే కొన్ని, పనులు మనం చేస్తాం. సరిగ్గా ఆ సమయానికి చేయడం వల్ల ఆ పని చక్కగా పూర్తి అవుతుంది. చేసిన పని జయప్రదం అవుతుంది.

ఏదో దేవతల సంకల్పం ఉండడం వల్లనే ఆ పనిని సరిగ్గా అదే సమయంలో మొదలు పెట్టి ఉంటాం. దానినే దివ్య సంకల్పం చోటు చేసుకోవడం అంటారు.

చిత్రగ్రీవం చదువు

దృశ్యాలు = కనబడే వస్తువులు
వెలుగు వెల్లువ = కాంతి ప్రవాహం
అనురాగం = ప్రేమ
లాలిస్తే = బుజ్జగిస్తే
మోతాదు = హెచ్చుతగ్గూకాని పదార్థం
అరకొరజ్ఞానం = మిడిమిడి జ్ఞానం
దోహదం చేస్తాయి = ప్రోత్సహిస్తాయి
ఉత్పత్తి చేసిన – = పుట్టించిన
బాగోగులు (బాగు + ఓగులు)= మంచి చెడ్డలు
ఆహార సేకరణ = ఆహారం సంపాదన
నిమగ్నము = మునిగినది
ఏపుగా = సమృద్ధిగా
బొడిపెలు = చెట్టునందలి బుడిపులు
ఏకఖండంగా = ఒకే ముక్కగా
తునకలు = ముక్కలు
ఘనకార్యం = గొప్పపని
సందేహం = అనుమానం
స్టూలంగా = సుమారుగా (దాదాపుగా)
మందకొడి = మెల్లగా నడవడం (చురుకు లేకపోవడం)
నిరాటంకంగా = ఆటంకం లేకుండా
మండుటెండ = మండే ఎండ
పిల్లగాళ్లకు = పిల్లలకు
సంకోచం = మోమాటం
నిమ్మకు నీరెత్తినట్లు = గుట్టుచప్పుడు కానట్లు

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
పిల్లపక్షిని దానితల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా! మరి మిమ్మల్ని ఎవరు, ఎలా పెంచారో చెప్పండి.
జవాబు:
నేను మా అమ్మగారికి ఆమె 16వ సంవత్సరంలో పుట్టానట. నా చెల్లికీ, నాకూ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉంది. మా చెల్లిని మా అమ్మ పెంచితే, నన్ను మా అమ్మమ్మ గారు పెంచి పెద్ద చేశారు.

ప్రశ్న 2.
“ఘనకార్యం చేయడం” అనే వాక్యం నుండి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
మనం ఒక పనిని చేస్తాం. ఆ పనివల్ల నష్టం వస్తుంది. అప్పుడు పక్కవారు ‘చేశావులే పెద్ద ఘనకార్యం’ అని మనల్ని పరిహాసం చేస్తారు. ఏదైనా చాలా మంచి పని చేసినపుడు కూడా వారు ఘనకార్యం చేశారు అని పొగిడే సందర్భాల్లో కూడా దీన్ని వాడతారు.

ప్రశ్న 3.
“ఏ మాటకామాటే” అని ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
“ఏ మాటకామాటే చెప్పుకోవాలి అని నిజం చెప్పేటప్పుడు చెపుతారు. ఒక వ్యక్తిలోని మంచి చెడ్డలను ఉన్నవి ఉన్నట్లు పైకి చెప్పేటప్పుడు, “ఏ మాటకామాటే” అనుకోవాలి అంటూ ప్రారంభిస్తారు.
ఉదా : ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, మా అమ్మాయికి “అంత తెలివి లేదు.

ప్రశ్న 4.
‘పావురం’ కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువుల పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జవాబు:
చీమలు పదార్థాలను కూడబెడతాయి. తేనెటీగలు తేనెను జాగ్రత్త చేస్తాయి. కుక్కలు వాసనను బట్టి వస్తువును గ్రహిస్తాయి. అందుకే కుక్కల సాయంతో నేరగాళ్లను పోలీసులు పట్టుకుంటున్నారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

పచార్లు చెయ్యడం = తిరగడం
నిరాశాభరితము = నిరాశతో నిండినది
చిట్టచివరకు (చివరకు + చివరకు) = ఆఖరుకు
సంకోచాన్ని = మిక్కిలి కలతను (మిక్కుటమైన సంతాపాన్ని)
అధిగమించి = దాటి
బాలెన్సు = సరితూగేలా చెయ్యడం
ప్రక్రియ = పని
అప్రయత్నంగా = ప్రయత్నం లేకుండా
శోభిల్లసాగింది = ప్రకాశింపసాగింది
మహత్తరమైన = మిక్కిలి గొప్పదైన
తతంగం = వ్యవహారం
పరిధిలో = పరిమితిలో
అసాధ్యం = సాధ్యం కానిది
మంద్రంగా = గంభీరంగా
నిర్మలంగా = ప్రశాంతంగా
బడుద్దాయ్ = బద్దకస్తుడు
ఉలుకూపలుకూ = మాటామంతీ
చిర్రెత్తుకొచ్చింది = కోపం వచ్చింది
ఫక్కీ = తీరు
గద్దించసాగింది = అదలించసాగింది (బెదరింప సాగింది)
స్వీయరక్షణ = తన రక్షణ
అసంకల్పితంగా = సంకల్పం లేకుండానే (అనుకోకుండా)
అవధులు = హద్దులు
జలకాలాడుతున్న = స్నానం చేస్తున్న
యథాలాపంగా = ఆకస్మికంగా
రొప్పసాగింది = అరవడం మొదలు పెట్టింది
ఉత్తేజంతో = గొప్ప తేజస్సుతో

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘నిమ్మకు నీరెత్తడం’ అని ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
ఒక వ్యక్తి నవనవలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడంటారు.

ఒక వ్యక్తి విషయాన్ని కప్పిపుచ్చి, ఎవరికీ తెలియకుండా, మాట్లాడకుండా ఉన్నప్పుడు, నిమ్మకు నీరెత్తినట్లు మాట్లాడకుండా ఉన్నాడంటారు.

తనలో లోపమున్నా, అది పైకి తెలియకుండా కప్పిపెట్టి ఉంచినపుడు, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడంటారు.

ప్రశ్న 2.
‘మహత్తర ఘట్టానికి చేరుకోడం’ అంటే ఏమిటి ? దీనికి కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
ఏదైనా గొప్పపనిని చేయడానికి ప్రయత్నిస్తాం. అది చివరికి ఫలించి పూర్తికావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ పని “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.

  1. గ్రామంలో దేవాలయం కట్టిద్దామని ప్రయత్నం చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ దానిలో జరుగుబోతూ ఉంటే “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.
  2. ప్రాజెక్టు నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవానికి సిద్ధమైనపుడు మహత్తర ఘట్టానికి చేరుకొంది అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 12 చిత్రగ్రీవం

ప్రశ్న 3.
మే నెల చివరి రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో మీ మాటల్లో వర్ణించండి.
జవాబు:
అది డిసెంబరు నెల. సాయంత్రం అయ్యేటప్పటికి చలి ప్రారంభం అవుతుంది. పిల్లలు, పెద్దలూ స్వెట్టర్లు వేసుకుంటారు. మంచినీళ్ళు కూడా తాగబుద్ధి పుట్టదు. రగ్గు కప్పినా చలి ఆగదు. చెట్లమీది నుండి పొగమంచు బొట్లు బొట్లుగా పడుతుంది. వర్షం వచ్చిందేమో అనిపిస్తుంది. పొగమంచు మూసివేయడంతో రోడ్డుమీద ప్రయాణాలు చేసేవారికి దారి కనబడదు. నీళ్ళపొయ్యి దగ్గరకు చిన్నా పెద్దా అంతా చేరతారు.

ప్రశ్న 4.
చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రిపక్షి ఏం చేసింది? తల్లిపక్షి ఏం చేసింది ? అట్లాగే చిన్న పిల్లలు నడక నేర్చుకోవడం ఎలా జరుగుతుందో చెప్పండి.
జవాబు:
చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి గద్దించింది. ఆ గద్దింపుల నుండి తప్పించుకోడానికి చిత్రగ్రీవం పక్క పక్కకు జరిగింది. చిత్రగ్రీవం మీద తండ్రి పక్షి, తన భారాన్ని అంతా మోపింది. చిత్రగ్రీవం కాలుజారింది. చిత్రగ్రీవం తన రక్షణకోసం, అప్రయత్నంగా రెక్కలు విప్పి గాలిలో ఎగిరింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఎగరడం వల్ల రొప్పుతున్న చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.

చిన్న పిల్లలు నడక నేర్చుకోడానికి వీలుగా పెద్దవారు చిన్న పిల్లల వేళ్లు పట్టుకొని దగ్గరుండి నడిపిస్తారు. గోడసాయం ఇచ్చి పిల్లల్ని నడిపిస్తారు. పిల్లలు పడిపోతే, వారిని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 11th Lesson భిక్ష Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 11th Lesson భిక్ష

10th Class Telugu 11th Lesson భిక్ష Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

తం. తన కోపమే తన శత్రువు ,
తన శాంతమె తనకు రక్ష దయచుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేన్ని పేర్కొన్నాడు? ఎందుకు?
జవాబు:
ఈ పద్యంలో కోపాన్ని శత్రువుగా పేర్కొన్నాడు. శత్రువు ఎలా మనకు నష్టం కల్గిస్తాడో, కష్టం కల్గిస్తాడో, అలాగే కోపం కూడా మనకు కష్ట నష్టాలను కల్గిస్తుంది.

ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి?
జవాబు:
‘శాంతి’ అంటే కోపం వంటివి లేకపోవడం. శాంతగుణం ఉంటే, అదే మనలను రక్షిస్తుంది. శాంతం ఉంటే ఎవరితోనూ – మనకు తగవు రాదు. శాంతి మనకు రక్షణను కల్పిస్తుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
జవాబు:
‘స్వర్గం’ అంటే దేవతల లోకం. స్వర్గ లోకంలో ఉండే వారికి దుఃఖాలు ఉండవు. సంతోషమే ఉంటుంది. కాబట్టి మన సంతోషమే మనకు స్వర్గం వంటిదని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
కోపం వల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా? చెప్పండి.
జవాబు:
1) కోషం వస్తే అనర్థాలు కలుగుతాయి. ఒక రోజున మా పక్క ఇంటివారు తమ వీధిని అంతా తుడిచి, ఆ తుక్కును మా ఇంటిముందు పోశారు. నేను వారిపై కోపపడి తిట్టాను. వాళ్ళు నన్ను కొట్టబోయారు. మా అమ్మగారు ఎలాగో సర్దిచెప్పారు.

2) నేను సైకిలు మీద వెడుతూ ఒకరోజు కాలు జారి, పక్కవారి బండి కింద పడ్డాను. నాకు దెబ్బలు తగిలాయి. అన్ని పక్కవారు నన్ను పట్టించుకోలేదు. నేను కోపంతో తగవుకు వెళ్ళాను. చివరకు ఒకరిపై ఒకరు పోలీసు కేసు పెట్టుకొన్నాం. మాకు వైద్యానికి, కేసులకు చాలా ఖర్చు అయ్యింది. కాబట్టి కోపం వల్ల అనర్థాలు కలుగుతాయి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది పద్యం చదవండి. శ్రీనాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడో తెల్పండి.
సీ॥ వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండ లీల నొక్కొక్కమాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయ వాక్రౌఢి నొక్కొక్కమాటు
వాకృత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ
సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు

తే॥గీ॥ నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పదొడంగిన యీ ప్రబంధ
మంకితము సేయు వీరభద్రయ్య పేర
(కాశీ || 1 – 18)
జవాబు:
ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.

  1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె ఒక్కొక్కసారి ఉద్దండ లీలగా కవిత్వం చెపుతాడు.
  2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె ‘ఉభయ వాడ్రైఢి’తో కవిత్వం రాస్తాడు.
  3. ఒకసారి తిక్కన గారి వలె, రసాభ్యుచిత బంధముగా రాస్తాడు.
  4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె ‘సూక్తి వైచిత్రి’ని చూపిస్తాడు.
  5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.
  6. రెడ్డిరాజులను ఆశ్రయించాడు.

ప్రశ్న 2.
‘అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.
జవాబు:
‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి.

దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది. ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది.

అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం.

ప్రశ్న 3.
శ్రీనాథ కవి గురించి వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో పేరు పొందిన పెద్దకవి. ఈయన తల్లిదండ్రులు భీమాంబ, మారయ్యలు. ఈయన కొండవీడును పాలించిన పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.

విజయనగరం చక్రవర్తి ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ‘గౌడడిండిమభట్టు’ను ఓడించి రాయలచే కనకాభిషేకమును, ‘కవి సార్వభౌమ’ అనే బిరుదును అందుకున్నాడు.

ఈయన శృంగార నైషథం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి కావ్యాలు రచించాడు. ఈయన జీవిత విధానాన్ని, చమత్కారాన్ని తెలిపే పెక్కు చాటు పద్యాలు రచించాడు.

శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి పొందాడు. ఈయన రాజమహేంద్రవరం రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవిగా ఉన్నప్పుడు కాశీఖండ, భీమఖండములు రచించాడు. ఉద్దండ లీల, ఉభయ వాతైఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి అనేవి శ్రీనాథుని కవితా లక్షణాలు.

ఈయన 15వ శతాబ్దివాడు. శ్రీనాథుడు చివరి రోజులలో రాజుల ఆశ్రయం లేక బాధలు పడ్డాడు. శ్రీనాథుడు ఆ బాల్య కవి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 4.
‘అకంఠంబుగ …………. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!’ పద్యానికి ప్రతి పదార్థం రాయండి.
జవాబు:
ఇప్డు = ఇప్పుడు
ఆకంఠంబుగన్ : కంఠము దాకా (గొంతు దాకా)
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నాన్ని
భక్షింపగాన్ = తినడానికి
లేకున్నన్ = లేకపోయేసరికి
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = అంగలు వేస్తున్నావు (గంతులు వేస్తున్నావు)
మేలే = మంచిపని యేనా?
లేస్స = బాగున్నదా?
శాంతుండవే = నీవు శాంత గుణం కలవాడవేనా !
నీవార ముష్టింపచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని తినేవారూ
శాకాహారులు = కాయ కూరలు మాత్రమే తినేవారూ
కందభోజులు = దుంపలు మాత్రమే తినేవారూ
శిలోంఛ ప్రక్రముల్; శిల = కోత కోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారూ
ఉంఛ ప్రక్రముల్ = రచ్చరోళ్ళ వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారూ అయిన
తాపసుల్ = తపస్సు చేసుకొనేవారూ కటకటా అక్కట కటా ! (అయిన మునులు)
నీకంటెన్ = నీ కన్న
మతిహీనులే = తెలివి తక్కువ వారా ? (చెప్పు)

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) వ్యాసుని పాత్ర స్వభావాన్ని వివరించండి.
జవాబు:
వ్యాసుడు అఖిల విద్యలకూ గురువు. ఈయనకు పదివేలమంది శిష్యులు ఉండేవారు. ఈయన కాశీ నగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ, భిక్షాటన చేసుకొంటూ జీవించేవాడు.

ఉదయమే లేచి పాపాత్ముడి ముఖం చూడడం వల్లనే తనకు భిక్ష దొరకలేదని వ్యాసుడు అనుకున్నాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత, ఆయన ఆ రోజుకు తినేవాడు కాదు. బ్రాహ్మణ గృహాల వద్ద మాధుకర భిక్షతో జీవించేవాడు.

వ్యాసుడు సులభ కోపి. తనకు రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. ఈయన శిష్యులు లేకుండా తాను ఒక్కడూ భుజించననే వ్రతం పట్టిన శిష్య ప్రేమికుడు. నిత్యం పవిత్ర గంగాస్నానం చేసేవాడు.

పార్వతీదేవిచేత మందలింపబడి, తన తప్పును గ్రహించిన ఉత్తముడు వ్యాసుడు.

ఆ) “నేడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” ఈ మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్థమేమిటి?
జవాబు:
‘నేడు నిన్నటి మఱునాడు నిక్కువంబు” అన్న మాటలు, వేదవ్యాసుడు సామాన్య స్త్రీ రూపంలో కనబడిన పార్వతీదేవితో అన్నాడు. పార్వతీదేవి సామాన్య స్త్రీ రూపంలో కనబడి వేదవ్యాసుని మందలించి, తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. అప్పుడు వ్యాసుడు ఆమెతో పై మాటలను అన్నాడు.

అంతరార్థం :
“ఈ రోజు నిన్నటి రోజుకు తరువాతి రోజు అన్నది నిజము” అని ఈ మాటకు అర్థం. అంటే నిన్న ఎలాగైతే భోజనం లేక పస్తు ఉన్నామో అలాగే ఈ రోజు కూడా, నిన్నటిలాగే పస్తు ఉంటామని దీని అంతరార్థం.

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ, వ్యాసుడు నిశ్చయించాడు.

ఈశ్వరుడి మాయవల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్షా పాత్రను నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు మూడు తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు.

ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది.

అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తినను. ఈ రోజు కూడా నిన్నటి లాగే పస్తుంటాను” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి నవ్వి “నీవు శిష్యులందరినీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలు పెడతాను” అని చెప్పింది.

వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ఆ) కోపం కారణంగా వ్యాసుడు కాశీ నగరాన్నే శపించాలనుకున్నాడు కదా ! “కోపం- మనిషి విచక్షణను నశింపజేస్తుంది”. అనే అంశం గురించి రాయండి.
జవాబు:
“కోపం వస్తే నేను మనిషిని కాను” అని అంటూ ఉంటారు. అది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి, మనిషి రాక్షసుడు అవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో, తెలిసికోలేడు. కోపంలోనే అన్నదమ్ములనూ, అక్క చెల్లెండ్రనూ, చివరకు కట్టుకొన్న భార్యనూ, కన్నపిల్లల్నీ కూడా చంపుతూ ఉంటారు. కాబట్టి కోపం మంచిది కాదు.

ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని, రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. భర్తృహరి నీతి శతకంలో “క్షమ కవచంబు క్రోధమది శత్రువు” అంటాడు. అంటే ఓర్పు కవచం లాంటిది.
కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులాంటి కోపాన్ని విడిచిపెట్టాలి.

దుర్యోధనుడికి పాండవులపైన, భీముడి మీద కోపం. అందుకే వారితో తగవు పెట్టుకొని యుద్ధంలో తాను మరణించాడు. దేవతలపై కోపంతోనే, రాక్షసులు అందరూ మరణించారు. “కోపమునను ఘనత కొంచెమైపోవును” అని వేమన కవి చెప్పాడు. కాబట్టి మనిషి కోపాన్ని అణచుకోవాలి. కోపము మనిషికి శత్రువు వంటిది. “తన కోపమే తన శత్రువు” అంటాడు సుమతీ శతక కర్త. కాబట్టి కోపం విడిచిపెట్టాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.

అ) “కోపం తగ్గించుకోడం మంచిది !” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

విజయవాడ,
x x x x x

మిత్రుడు రఘునందను,
నీ లేఖ అందింది. నేనూ మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు.

నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతక కర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు.

కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవు పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామూ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
అవసరాల వెంకట్రావు,
10వ తరగతి,
మునిసిపల్ హైస్కూలు,
విజయవాడ.

చిరునామా:
కె. రఘునందన్,
S/O కె. రాజారావు గారు,
ఇంటి నెం. 4.1.104, మహారాణీ పేట,
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్,

ఆ) భిక్ష, రక్ష పరీక్ష, సమీక్ష, వివక్ష – వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత రాయండి.
జవాబు:
వచన కవిత :
ఉపదేశం
నేనిస్తా మిత్రమా సలహాలు నీకు లక్ష
తోడివారిపై పెంచుకోకు నీవు కక్ష
ఉండాలి మరి మనకు సది తితిక్ష
మంచి చెడ్డలు మనం చెయ్యాలి సమీక్ష
చెడ్డపనులు చేస్తే తప్పదు శిక్ష
ఉంటుంది మనపై దైవం పరీక్ష
ఉండాలి యోగ్యుడు కావాలనే దీక్ష
మనందరికి దేవుడే శ్రీరామరక్ష
ఎందుకు మనలో మనకు ఈ వివక్ష
పుట్టించిన దేవుడే చేస్తాడంత శిక్ష

III. భాషాంశాలు

పదజాలం

1) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె.
జవాబు:
1) ద్వాఃకవాటంబు : 1) ద్వారబంధము
2) ద్వారం తలుపు

2) వనిత : 1) స్త్రీ 2) పురంధీ 3) అంగన 4) పడతి 5) నారి

ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
జవాబు:
పసిడి : 1) బంగారము 2) సువర్ణము 3) కనకము 4) హిరణ్యము 5) పైడి

ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ దలంచెను.
జవాబు:
పారాశర్యుండు : 1) వ్యాసుడు 2) బాదరాయణుడు 3) సాత్యవతేయుడు

ఈ) ఇవ్వీటి మీద నాగ్రహము తగునె?
జవాబు:
ఆగ్రహము : 1) కోపము 2) క్రోధము 3) రోషము 4) కినుక

ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
జవాబు:
అహిమకరుడు : 1) సూర్యుడు 2) రవి 3) ఆదిత్యుడు 4) భాస్కరుడు

ఊ) భుక్తిశాల : భోజనశాల
జవాబు:
భుక్తిశాల : పెళ్ళివారు భుకిశాలలో ఫలహారాలు తింటున్నారు.

2. కింది పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించి రాయండి.
అ) ద్వాఃకవాటము : ద్వారము తలుపు
జవాబు:
ద్వాఃకవాటము : దొంగలకు భయపడి, మా ఊళ్ళో అందరూ, రాత్రి తొందరగానే ద్వాఃకవాటములు బిగిస్తున్నారు.

ఆ) వీక్షించు : చూచు
జ. వీక్షించు : నేటి కాలంలో బాలురు సినిమాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

ఇ) అంగన : స్త్రీ
జవాబు:
అంగన : ప్రతి పురుషుడి విజయము వెనుక, ఒక అంగన తప్పక ఉంటుంది.

ఈ) మచ్చెకంటి : చక్కని ఆడది
జవాబు:
మచ్చెకంటి : తెలుగు సినీ నటీమణులలో శ్రీదేవి చక్కని మచ్చెకంటి.

ఉ) కుందాడుట : నిందించుట
జవాబు:
కుందాడుట : గురువులు, శిష్యుల తప్పులను ఎత్తిచూపి, కుందాడుట మంచిది కాదు.

3) కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.
అ) వీడు ఏ వీడు వాడో గాని దుష్కార్యములను వీడు చున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
1. వీడు (నానార్థాలు) : 1) ఈ మనుష్యుడు 2) పట్టణము 3) వదలుట

ఆ) దేశ భాషలందు తెలుగు లెస్సయని రాయలు లెస్స గా బలికెను.
జవాబు:
ఈ వాక్యంలో ‘లెస్స’ అనే పదం రెండు అర్థాల్లో వాడబడింది.
2. లెస్స (నానార్థాలు) : 1) మేలు 2) చక్కన 3) మంచిది

ఇ) గురుని మాటలు విన్న ఇంద్రుడు కర్ణుని గురుడైన సూర్యుని గలిసి గురుయోజన చేయసాగినాడు.
జవాబు:
పై వాక్యంలో ‘గురుడు’ అనే మాట మూడు అర్థాలలో వాడబడింది.
3. గురుడు (నానార్థాలు) : 1) ఉపాధ్యాయుడు 2) తండ్రి 3) బలీయం

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

4. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
అ) విద్య
క) విదియ
చ) విజ్ఞ
ట) విద్దె
త) విధ్య
జవాబు:
ట) విద్దె

ఆ) భిక్షము
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
జవాబు:
త) బిచ్చము

ఇ) యాత్ర
క) యతర
చ) జాతర
ట) జైత్ర.
త) యతనము
జవాబు:
చ) జాతర

ఈ) మత్స్యము
క) మచ్చీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
జవాబు:
ట) మచ్చెము

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలను రాయండి.

అ) గురుడు – అజ్ఞానమనెడి అంధకారమును తొలగించువాడు. (ఉపాధ్యాయుడు)
ఆ) వనజము – వనము(నీరు) నందు పుట్టినది. (పద్మము)
ఇ) అర్ఘ్యము – పూజకు తగిన నీరు.
ఈ) పాద్యము – పాదములు కడుగుకొనుటకు ఉపయోగించే నీరు.
ఉ) పారాశర్యుడు – పరాశర మహర్షి యొక్క కుమారుడు (వ్యాసుడు)

వ్యాకరణాంశాలు

1. కింది పాదాల్లోని సంధులను గుర్తించి, సంధి సూత్రాలను రాయండి.
అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
జవాబు:
1. పుణ్యాంగన = పుణ్య + అంగన = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. భిక్షయిడదయ్యె = భిక్ష + ఇడదయ్యె = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చు కంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

3. ఇడదయ్యె = ఇడదు + అయ్యె ఉత్వ సంధి

ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

4. ఇడదయ్యెఁగటా = ఇడదయ్యెన్ + కడ = (సరళాదేశ సంధి) లేక (ద్రుత ప్రకృతిక సంధి)

సరళాదేశ సంధి
సూత్రం 1 : ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఉదా : ఇడదయ్యెన్ + గటా

సూత్రం 2 : ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.
ఉదా : ఇడదయ్యెఁగటా

ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.
1. కాశి; యివ్వీటి మీద
కాశి; + ఇవ్వీటి మీద = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
ఉదా : కాశియివ్వీటి మీద
2. ఇవ్వీటి మీద – ఈ + వీటి మీద = త్రిక సంధి

త్రిక సంధి
సూత్రం 1 : త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీరానికి హ్రస్వం వస్తుంది.
ఉదా : ఇవ్వీటి మీద
3. ఆగ్రహము దగునె – ఆగ్రహము + తగునే = గసడదవాదేశ సంధి

గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గ స డ ద వలు బహుళంగా వస్తాయి.

4. అగునె – అగును . + ఏ = ఉత్వ సంధి

ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య యున్నయూరు.
1. మునీశ్వర – ముని + ఈశ్వర = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

2. వినవయ్య యున్నయూరు – వినవయ్య + ఉన్న = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

3. ఉన్నయూరు – ఉన్న + ఊరు = యడాగమ సంధి

యడాగమ సంధి
సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.

2. కింది పద్యపాదాల్లో ఏయే ఛందస్సులున్నాయో గుర్తించి సమన్వయం చేయండి.

అ) మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యనరమ్మ విశ్వనా
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 1 AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 2
1. పై పద్యపాదంలో “న జ భ జ జ జ ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది “చంపకమాల” పద్యపాదం.
2. మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి యతిస్థానం. “ము – ముం”.

ఆ) య్యాదిమశక్తి సంయమివరా ! యిటురమ్మని పిల్చెహస్త సం
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 2
1. పై పద్యపాదంలో “భ ర న భ భ ర వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది “ఉత్పలమాల” పద్యపాదం.
2. మొదటి అక్షరం ‘య్యా’ కు, 10వ అక్షరం ‘రా’ కు, యతిస్థానం. (రా = ర్ + ఆ)

ఇ) నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష 3
1. ఇది ‘తేటగీతి’ పద్యపాదం
2. దీనిలో ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
3. మొదటి గణంలో మొదటి అక్షరానికి, నాలుగో గణ మొదటి అక్షరానికి యతిమైత్రి (న – క్షా)

3. కింది వాక్యాలను చదవండి.
అర్థాంతరన్యాసాలంకారం
అ) శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు.
వీరులకు సాధ్యము కానిది లేదు కదా !

ఆ) గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు.
పూవులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు.

గమనిక :
ఈ రెండు వాక్యాల్లో ఒక విషయాన్ని మరో విషయంతో సమర్థిస్తున్నాం కదూ”!

మొదటి వాక్యంలో : శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించడం – (విశేష విషయం)
వీరులకు సాధ్యం కానిది లేదు కదా ! – (సామాన్య విషయం )
అంటే విశేష విషయాన్ని, సామాన్య విషయంతో సమర్థించాం.

ఇక రెండవ వాక్యంలో
గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవించడం – (సామాన్య విషయం)
పూవులతో పాటు దారం సిగనెక్కటం – (విశేష విషయం)
అంటే దీంట్లో సామాన్య విషయాన్ని విశేష విషయంతో సమర్థించాం.

ఇలా విశేష సామాన్య విషయాలను పరస్పరం సమర్థించి చెప్పినట్లయితే, అటువంటి అలంకారాన్ని “అర్థాంతర న్యాసాలంకారం” అంటారు.

అర్ధాంతరన్యాసాలంకారం
లక్షణం :
విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని’ విశేష విషయంతో గాని సమర్థించి చెప్పడమే ‘అర్థాంతరన్యాసాలంకారం’.

1. కింది లక్ష్యాలకు సమన్వయం రాయండి.

అ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
జవాబు:
సమన్వయం :
పై వాక్యాలలో “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది. ఇందులో “హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు” అన్నది విశేష విషయం. “మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా” అన్న వాక్యం సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్య వాక్యంచే, విశేష వాక్యం సమర్థింపబడింది. కాబట్టి ఈ వాక్యాలలో “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది.

ఆ) మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి ఇస్తాడు.
లోకోపకర్తలకిది సహజగుణము.
జవాబు:
సమన్వయం : పై వాక్యాలలో ‘అర్థాంతరన్యాసాలంకారం’ ఉంది. ఇందులో “మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చిఇస్తాడు” అన్నది విశేష వాక్యం. “లోకోపకర్తలకిది సహజ గుణము” అనేది సామాన్య వాక్యం. ఇక్కడ సామాన్యముచే విశేష విషయం సమర్థింపబడింది. కాబట్టి ఇక్కడ “అర్థాంతరన్యాసాలంకారం” ఉంది.

అదనపు సమాచారము

సంధులు

1) బీఱెండ = బీఱు + ఎండ – ఉత్వ సంధి
2) రమ్మని = రమ్ము + అని – ఉత్వ సంధి
3) పట్టపగలు = పగలు + పగలు – ద్విరుక్తటకారాదేశ సంధి
4) నట్టనడుము = నడుము + నడుము – ద్విరుక్తటకారాదేశ సంధి
5) కట్టనుగు = కడు + అనుగు – ద్విరుక్తటకారాదేశ సంధి
6) భిక్షాటనంబు = భిక్షా + అటనంబు – సవర్ణదీర్ఘ సంధి
7) పాయసాపూపములు = పాయస + అపూపములు – సవర్ణదీర్ఘ సంధి
8) బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ + అంగలు – సవర్ణదీర్ఘ సంధి
9) పుణ్యాంగన = పుణ్య + అంగన – సవర్ణదీర్ఘ సంధి
10) పాపాత్ముని = పాప + ఆత్ముని – సవర్ణదీర్ఘ సంధి
11) కోపావేశము = కోప + ఆవేశము – సవర్ణదీర్ఘ సంధి
12) శాకాహారులు = శాక + ఆహారులు – సవర్ణదీర్ఘ సంధి
13) మునీశ్వర = ముని + ఈశ్వర – సవర్ణదీర్ఘ సంధి
14) కమలానన = కమల + ఆనన – సవర్ణదీర్ఘ సంధి
15) అభీప్సితాన్నము = అభీప్పిత + అన్నము – సవర్ణదీర్ఘ సంధి
16) బింబాస్య = బింబ + ఆస్య – సవర్ణదీర్ఘ సంధి
17) శాలాంతరము = శాలా + అంతరము – సవర్ణదీర్ఘ సంధి
18) సంజ్ఞాదరలీల = సంజ్ఞా + ఆదరలీల – సవర్ణదీర్ఘ సంధి
19) శిఖాధిరూఢ = శిఖా + అధిరూఢ – సవర్ణదీర్ఘ సంధి
20) కటకాభరణంబులు = కటక + ఆభరణంబులు – సవర్ణదీర్ఘ సంధి
21) శిలోంఛప్రక్రముల్ = శిల + ఉంఛప్రక్రముల్ – గుణసంధి
22) కబ్జవెట్టి = కట్ట + పెట్టి – గసడదవాదేశ సంధి
23) పూజచేసి = పూజ + చేసి – గసడదవాదేశ సంధి
24) అమ్మహాసాధ్వి = ఆ + మహాసాధ్వి – త్రిక సంధి
25) అయ్యా దిమశక్తి = ఆ + ఆదిమశక్తి – యడాగమ త్రిక సంధులు
26) ముత్తైదువ = ముత్త + ఐదువ – అత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) మతిహీనులు మతిచేత హీనులు తృతీయా తత్పురుషం
2) భిక్షాపాత్రంబు భిక్ష కొఱకైన పాత్రము చతుర్థి తత్పురుష
3) భిక్షాటనము భిక్ష కొఱకు అటనము చతుర్థి తత్పురుష
4) భోజనశాల భోజనము కొఱకు శాల చతుర్దీ తత్పురుష
5) విప్రగృహవాటికలు విప్రగృహముల యొక్క వాటికలు షష్ఠీ తత్పురుష
6) విద్యాగురుడు విద్యలకు గురుడు షష్ఠీ తత్పురుష
7) ద్వాఃకవాటము ద్వారము యొక్క కవాటము షష్ఠీ తత్పురుష
8) బ్రాహ్మణాంగనలు బ్రాహ్మణుల యొక్క అంగనలు షష్ఠీ తత్పురుష
9) బ్రాహ్మణ మందిరములు బ్రాహ్మణుల యొక్క మందిరములు షష్ఠీ తత్పురుష
10) కోపావేశము కోపము యొక్క ఆవేశము షష్ఠీ తత్పురుష
11) శాలాంతరాళము శాల యొక్క అంతరాళము షష్ఠీ తత్పురుష
12) బీఱెండ బీఱు అయిన ఎండ విశేషణ పూర్వపద కర్మధారయం
13) అనుగుజెలులు ప్రియమైన చెలులు విశేషణ పూర్వపద కర్మధారయం
14) పుణ్యాంగన పుణ్యమైన అంగన విశేషణ పూర్వపద కర్మధారయం
15) అభీప్సితాన్నములు అభీప్సితమైన అన్నములు విశేషణ పూర్వపద కర్మధారయం
16) వనజనేత్ర వనజముల వంటి నేత్రములు గలది బహుపద సమాసం
17) లేదీగె బోడి లేదీగె వంటి శరీరము కలది బహువ్రీహి సమాసం
18) అహిమభానుడు వేడి కిరణములు గలవాడు బహువ్రీహి సమాసం
19) ముక్కంటి మూడు కన్నులు గలవాడు బహువ్రీహి సమాసం
20) మచ్చెకంటె మత్య్సము వంటి కన్నులు గలది బహువ్రీహి సమాసం
21) శాకాహారులు శాకములు ఆహారముగా గలవారు బహువ్రీహి సమాసం
22) కందభోజులు కందములు భోజనంగా కలవారు బహువ్రీహి సమాసం
23) చిగురుబోడి చిగురు వంటి శరీరము గలది బహువ్రీహి సమాసం
24) కమలానన కమలము వంటి ఆననము కలది బహువ్రీహి సమాసం
25) కాశికానగరము ‘కాశి’ అనే పేరు గల నగరము సంభావనా పూర్వపద కర్మధారయం
26) వేదపురాణ శాస్త్రములు వేదములును, పురాణములును, శాస్త్రములును బహుపద ద్వంద్వము
27) ఇందు బింబాస్య ఇందు బింబము వంటి ఆస్యము కలది బహువ్రీహి సమాసం
28) అర్ఘ్యపాద్యములు అర్ఘ్యమును, పాద్యమును ద్వంద్వ సమాసం
29) పుష్ప గంధంబులు పుష్పమును, గంధమును ద్వంద్వ సమాసం
30) క్షుత్పిపాసలు క్షుత్తు, పిపాస ద్వంద్వ సమాసం
31) మధ్యాహ్నము అహ్నము యొక్క మధ్యము ప్రథమా తత్పురుషం
32) మోక్షలక్ష్మి మోక్షము అనెడి లక్ష్మీ రూపక సమాసం
33) మూడుతరములు మూడైన తరములు ద్విగు సమాసం
34) కాశికా పట్టణము ‘కాశి’ అనే పేరు గల పట్టణం సంభావనా పూర్వపద కర్మధారయం

ప్రకృతి – వికృతి

శిష్యుడు – సిసువుడు
గృహము – గీము
విద్య – విద్దె
కార్యము – కర్జము
పుష్పము – పూవు, పువ్వు
గందము
స్వర్ణము – సొన్నము
పాయసము – పాసెము
బహు – పెక్కు
భక్తి – బత్తి
విశ్వాసము – విసువాసము
ముఖము – మొగము
బ్రాహ్మణుడు – బాపడు
రాత్రి – రాతిరి
లక్ష్మి – లచ్చి
పట్టణము – పట్నము
వేషము – వేసము
ఆహారము – ఓగిరము
తపస్వి – తపసి, తబిసి
రూపము – రూపు
పంక్తి – బంతి
శాల – సాల
ఛాత్రుడు – చట్టు

నానార్థాలు

1) కాయ : 1) చెట్టుకాయ 2) బిడ్డ 3) అరచేతిలో రాపిడివల్ల ఏర్పడిన పొక్కు
2) ఇల్లు : 1) గృహము 2) కుటుంబము 3) స్థానము
3) గృహము : 1) ఇల్లు 2) భార్య 3) రాశి
4) గురుడు : 1) తండ్రి 2) ఉపాధ్యాయుడు 3) బృహస్పతి
5) ముఖము : 1) మోము 2) ఉపాయము 3) ముఖ్యమైనది
6) బంతి : 1) కందుకము 2) ఒక జాతి పువ్వులచెట్టు 3) పంక్తి
7) రూపు : 1) ఆకారము 2) దేహము 3) కన్నెమెడలో బంగారు నాణెము
8) గంధము : 1) చందనము 2) గంధకము 3) సువాసన
9) కరము : 1) చేయి 2) తొండము 3) కిరణము
10) ఫలము : 1) పండు 2) ప్రయోజనం 3) లాభం
11) వీధి : 1) త్రోవ 2) వాడ 3) నాటక భేదము
12) లక్ష్మి : 1) రమ 2) సిరి 3) మెట్టదామర

పర్యాయపదాలు

1) అంగన : 1) వనిత 2)స్త్రీ 3) మహిళ
2) ఇల్లు : 1) గృహము 2) భవనము 3) మందిరము
3) పుష్పము : 1) పువ్వు 2) కుసుమము 3) ప్రసూనము
4) గంధము : 1) చందనము 2) మలయజము 3) గంధసారము
5) నెయ్యి : 1) ఆజ్యము 2) ఘృతము 3) నేయి
6) ముఖము : 1) వదనము 2) ఆననము 3) మొగము
7) గొడుగు : 1) ఛత్రము 2) ఆతపత్రము 3) ఖర్పరము
8) బ్రాహ్మణుడు : 1) భూసురుడు 2) విప్రుడు 3) ద్విజుడు

వ్యుత్పత్యర్థాలు

1) వనజనేత్ర : పద్మముల వంటి కన్నులు కలది. (స్త్రీ)
2) లేందీగె బోడి : లేత తీగ వంటి శరీరం కలది. (స్త్రీ)
3) అతిథి : తిథి, వార, నియమములు లేకుండా వచ్చేవాడు. (అతిథి)
4) పురం : గృహమును ధరించునది (గృహిణి)
5) అహిమభానుడు : చల్లనివి కాని కిరణములు గలవాడు. (సూర్యుడు)
6) ముక్కంటి : మూడు కన్నులు కలవాడు. (శివుడు)
7) పంచజనుడు : ఐదు భూతములచే పుట్టబడేవాడు. (మనిషి)
8) పార్వతి : పర్వతము యొక్క పుత్రిక. (గౌరి)
9) పారాశర్యుడు : పరాశర మహర్షి యొక్క కుమారుడు. (వ్యాసుడు)
10) వ్యాసుడు : వేదములను విభజించి ఇచ్చినవాడు. (వ్యాసమహర్షి)

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని గురు

* శ్రీనాథుడు సీస పద్య రచనకు ప్రసిద్ధి. శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు వేర్వేరు గ్రంథాల నుండి సేకరించండి. వాటిని రాయండి. తరగతిలో చదివి వినిపించండి. గోడ పత్రికలో ప్రదర్శించండి. ”
(శ్రీనాథుని సీస పద్యాలు )
జవాబు:
1. గుణనిధికి తల్లి చెప్పిన హిత వచనాలు శ్రీనాథుని “కాశీఖండము” నుండి.

సీ|| సచ్చో త్రియులు ననూచానులు సీమసీ థులునైన కులము పెద్దలఁ దలంచి
రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలా చారవంతుండు నైన జనకు దలచి
భాగ్యసంపదఁ బుణ్యపతి దేవతల లోన నెన్నంగఁ దగియెడు నన్నుదలచి
వేదశాస్త్ర పురాణ విద్యా నిరూఢులై వాసికెక్కిన తోడివారిఁ దలచి

తే|| చెడ్డయింటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్ను దలచి
పదియు నార్వత్సరంబుల భార్యఁదలచి గోరతనములు మానురా ! గొడుకుఁగుఱ ! (కాశీ|| 4. ఆ. 91 ప)

2. పార్వతీదేవి చిరుతొండనంబి భార్య తిరువేంగనాంబి
వద్దకు, పచ్చిబాలెంతరాలు వేషంలో వచ్చుట
సీ|| ఫాల పట్టిక యందు భస్మత్రిపుండ్రంబుఁ గర్ణంబులను రాగి కమ్మదోయి
కంఠమందిత్తడి కంబంపుఁ గంటియ ఘన కుచంబుల మీదఁ గావిగంత
కటి మండలంబునఁ గరకంచుఁ బుట్టంబు కుడి సంది గిరి పెండ్లికొడుకుఁ గుఱ్ఱ
కేలు దామరయందుఁ గేదారవలయంబు జడకుచ్చుమీదఁ బచ్చడపుఁ గండ

తే|| సంతరించి పదాఱు వర్షముల వయసుఁ బచ్చి బాలెంతరాలు తాపసపురంధి
నంబి భామినిఁ దిరువెంగనాంబిఁ జేరి పాలు వోయింపు డమ్మ పాపనికి ననియె. (హర విలాసం – 2 ఆ. 94 ప)

3. భీమేశ్వర పురాణములోని పద్యం.
సీ|| శ్రీ భీమనాయక శివనామధేయంబు చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటి పురాధ్యక్షమోహన మూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావన కీర్తి చే నింపనేర్చిన చెవులు చెవులు
తారక బ్రహ్మ విద్యాదాత య్దల విరులు పూన్సగ నేర్చు కరము కరము

గీ॥ ధవళకర శేఖరునకు ప్రదక్షిణంబు నర్గిఁదిరుగంగనేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడి మనసు మనసు. (భీమఖండం – 3 ఆ. 198 ప)

4. శృంగార నైషధం 2వ ఆశ్వాసం – 49 పద్యం.
(హంస, నల మహారాజుకు తన వృత్తాంతం చెప్పడం.)
సీ|| నవిన సంభవు సాహిణము వారువంబులు కులము సాములు మాకుఁ గువలయాక్షి
చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు మాకుఁ బువ్వు బోణి
సత్యలోకము దాక సకల లోకంబులు నాటపట్టులు మాకు నబ్జవదన
మధురాక్షరములైన మామాటలు వినంగ నమృతాంధసులే యోగ్యులనుంపమాంగి

తే|| భారతీదేవి ముంజేతి పలుకు జిలుక సమదగజయాన సబ్రహ్మచారిమాకు
వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల దరుణి ! నీయాన ఘంటాపథంబు మాకు. (శృంగార నైషధం – 2 ఆ. 49 ప)

5. శ్రీనాథుడు మరణించే సమయంలో చెప్పిన చాటు పద్యం
సీ|| కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా పురవీధి నెదురెండఁ బొగడదండ
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు
ఆంధ్ర నైషధకర్త యంఘి యుగ్మంబునఁ దగిలి యుండెను గదా నిగళయుగము
వీరాభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురు గొడియ

తే|| కృష్ణవేణమ్మ’ కొనిపోయె నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయెఁదిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేటి మోసపోతి నెట్లు చెల్లింతు డంకంబు లేడు నూర్లు. (చాటువు)

కవి పరిచయం

పాఠ్యభాగం పేరు : భిక్ష

ఏ గ్రంథం మండి గ్రహింపబడింది. ఆ సం : “కాశీఖండం” కావ్యంలోని సప్తమాశ్వాసం నుండి

కవి : శ్రీనాథుడు

కాలం : 1380-1470 (15వ శతాబ్దము)

ఎవరి ఆస్థాన కవి – : రాజమహేంద్రవరం రెడ్డిరాజుల కొలువులో ఆస్థాన కవి

తల్లిదండ్రులు : శ్రీనాథుడు ‘మారయ – భీమాంబ’ల ముద్దుబిడ్డడు.

బిరుదం : ‘కవి సార్వభౌమ’

ప్రతిభా పాండిత్యం : ఆంధ్ర కవులలో కవిత్రయం తరువాత, అంతటి ప్రతిభావంతుడైన కవి. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో “విద్యాధికారి”గా ఉండేవాడు.

గౌడడిండిముని కంచుఢక్క పగులగొట్టడం : ప్రాధదేవరాయల ఆస్థానంలో ‘గౌడడిండిమభట్టు’ అనే గొప్ప పండితునితో వాదించి, ఆయనను ఓడించి కనకాభిషేకాన్ని, కవిసార్వభౌమ బిరుదును పొందాడు.

శ్రీనాథుని రచనలు : 1) మరుత్తరాట్చరిత్ర 2) శాలివాహన సప్తశతి 3) పండితారాధ్య చరిత్ర 4) కాశీఖండం 5) శృంగార నైషధం 6) హరవిలాసం 7) ధనంజయ విజయం 8) క్రీడాభిరామం 9) శివరాత్రి మహాత్మ్యం 10) పల్నాటి వీరచరిత్ర 11) నందనందన చరిత్ర అనేవి శ్రీనాథుడి రచనలు.

శ్రీనాథుని చాటువులు : శ్రీనాథుని చమత్కారానికీ, లోకానుశీలనకూ, రసజ్ఞతకూ, జీవన విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి.

కవితా లక్షణాలు : ఉదందలీల, ఉభయవాతొడి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి

పద్యాలు – ప్రతిపదార్థాలు – బావాలు

I. అవగాహన – ప్రతిస్పందన

పద్యం -1

తే॥గీ॥ నెట్టుకొని కాయ బీఎండ పట్టపగలు
తాము శిష్యులు నిల్లిల్లు దపుకుండఁ
గాఠిగా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.
ప్రతిపదార్థం :
అఖిల విద్యాగురుండు : అఖిల = సమస్తములయిన
విద్యా = విద్యలకునూ
గురుండు = గురువు అయిన వేదవ్యాస మునీంద్రుడు
తానున్ = తానునూ
శిష్యులున్ = శిష్యులునూ
పట్టపగలు : (పగలు + పగలు = పట్టపగలు) = పట్టపగటి యందు
బీజెండ (బీఱు + ఎండ) = తీక్షణమయిన ఎండ
నెట్టుకొని = అతిశయించి
కాయన్ = కాయుచుండగా
కాశికా విప్రగృహవాటికలన్ : కాశికా = కాశికా నగరము నందలి
విప్రగృహ = బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన
వాటికలన్ = వాడలయందు (వీథుల యందు)
ఇల్లిల్లు = ప్రతి గృహాన్నీ
తప్పకుండన్ = విడువకుండా (ఏ ఇల్లునూ విడిచిపెట్టకుండా)
భిక్షాటనంబు (భిక్షా + అటనంబు) = భిక్ష కొఱకైన సంచారాన్ని
ఒనర్చున్ = చేయును (చేస్తూ ఉంటాడు)

భావం :
చతుర్దశ విద్యలకును గురువయిన వేదవ్యాస మునీంద్రుడు, శిష్యులతో కలిసి, పట్టపగలు పెరిగిన తీక్షణమైన ఎండలో, కాశీ నగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ఏ ఇల్లూ విడిచిపెట్టకుండా, ప్రతి గృహానికి తిరుగుతున్నాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

పద్యం – 2

తే॥గీ॥ వండుచున్నారమనే నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మమ వొక్క లేఁదీగెఁ బోఁడి
దేవకార్యంబు వేఁడమఁ దెఱవ యోర్తు
ద్వా: కవాటంబుఁ దెజవదు సవిత యొకతె
ప్రతిపదార్థం :
ఒక్క వనజనేత్ర = ఒక పద్మాక్షి; (వనజనేత్ర (వ్వు) పద్మముల వంటి కన్నులు కలది)
వండుచున్నారము = వంట చేస్తున్నాము
అనున్ = అన్నది
ఒక్క లేందీఁగె బోఁడి; ఒక్క = ఒక
లేదీగె బోడి – లేత తీగ వంటి శరీరము గల స్త్రీ
తిరిగి = మరల
రమ్మనున్; (రమ్ము + అనున్) = రమ్మని అన్నది
తెఱవయోర్తు; తెఱవ = స్త్రీ
ఓర్తు = ఒకామె
నేడు = ఆనాడు
దేవకార్యంబు = దేవతల పూజాకార్యం
అనున్ = అన్నది (పితృదేవతల కార్యము నాడు పితృదేవతలకు పెట్టకుండా భిక్ష వేయరాదు)
వనిత యొకతే = ఒక ఇల్లాలు
ద్వాః కవాటంబున్; ద్వాః = ద్వారము యొక్క
కవాటంబున్ = తలుపును
తెఱవదు = తెరవనే తెరవలేదు

భావం :
ఒక ఇల్లాలు “వండుతున్నాము” అన్నది. మరొక స్త్రీ “మరల రండి” అన్నది. ఇంకొక ఇల్లాలు ఈ రోజు దేవవ్రతం (దేవకార్యము) అని చెప్పింది. మరియొక ఇల్లాలు అసలు ద్వారబంధం యొక్క తలుపులు తెరవనేలేదు.

పద్యం -3

సీ॥ ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ ముగ్గుకట్టు పెట్టి,
యతిథి వచ్చేవిల్పి యర్ఘ్యపాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజు చేసి,
ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువమున
వన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయపాపూప బహుపదార్థములతో
భక్తి విశ్వాస తాత్పర్యగరిమఁ

తే॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో పూడిగములు రాయఁ
గద్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టమఁగుఁ జెలులు
ప్రతిపదార్థం :
ముంగిటన్ (ముంగల + ఇల్లు = ముంగిలి) = ఇంటి ముందు భాగంలో
గోమయంబునన్ = ఆవు పేడతో
గోముఖము తీర్చి = అలికి
కడలు = అంచులు
నాలుగన్ = నాలుగు అయ్యేటట్లుగా (చతురస్రముగా)
ముగ్గు కట్టు పెట్టి, (మ్రుగ్గు కట్టు + పెట్టి) = ముగ్గు పెట్టి
అతిథిన్ = వచ్చిన అతిథిని
అచ్చోన్ = ఆ రంగవల్లి మధ్యంలో (ఆ చతురస్రంగా వేసిన ముగ్గు మధ్యలో)
నిల్పి = నిలిపి
అర్ఘ్యపాద్యములు = కాళ్ళు, చేతులు కడుగుకోడానికి నీళ్ళు (హస్తముల యందు అర్హ్యమును, పాదముల యందు పాద్యమును)
ఇచ్చి = ఇచ్చి
పుష్పగంధంబులన్ = పువ్వులతో, గంధముతో
పూజచేసి (పూజ + చేసి) = పూజించి
ప్రక్షాళితంబైన (ప్రక్షాళితంబు + ఐన) = బాగుగా కడుగబడిన
పసిడి, చట్టువమునన్ = బంగారు గరిటెతో
అన్నంబు మీదన్ = అన్నము పైన
నెయ్యి = నేతిని
అఘరించి = కొంచెం వేసి (అభిషరము చేసి అనగా కొద్దిగా చల్లి)
ఫలపాయసాపూప బహుపదార్దములతోన్; ఫల = పండ్లు
పాయస = పరమాన్నం
అపూప = పిండి వంటకాలు మొదలయిన
బహు = అనేకములైన
పదార్థములతోన్ = పదార్థాలతో
భక్తి విశ్వాస తాత్పర్యగరిమన్, భక్తి = పూజ్య భావము యొక్క
విశ్వాస = నమ్మకము యొక్క
తాత్పర్య = తత్పర భావము యొక్క (మక్కువ యొక్క)
గరిమన్ = పెంపుతో
కమ్రకరములన్ = ఇంపైన చేతులయందు
కంకణంబులతోన్ = ముత్యాలు, పగడాలు మొదలయిన వానిని గుచ్చి చేతికి కట్టుకొనే తోరాలతో
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసి కొనుచుండగా
కాశిన్ = కాశీ నగరమందు
అన్నపూర్ణ భవాని కట్టనుగు జెలులు; అన్నపూర్ణ = అన్నపూర్ణ అనే పేరుగల
భవాని = భవుని భార్యయైన పార్వతీ దేవి యొక్క
కట్టనుగు (కడు + అనుగు) = మిక్కిలి ప్రియురాండ్రైన
చెలులు = చెలికత్తెలయిన (స్నేహితురాండైన)
బ్రాహ్మణాంగనలు (బ్రాహ్మణ + అంగనలు) = బ్రాహ్మణ స్త్రీలు
భిక్షుకులకున్ = యతులకు; (భిక్ష అడిగేవారికి)
మాధుకర, భిక్షన్ = తేనెటీగను పోలిన, భిక్షను; (మాధుకరము అనే భిక్షను)
పెట్టుదురు = పెడతారు (వడ్డిస్తారు)

భావం :
వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగు అంచులూ కలిసే విధంగా దానిపై ముగ్గుపెట్టి, ఆ ముగ్గు మధ్యలో, వచ్చిన అతిథిని నిలబెట్టి, వారికి కాళ్ళూ చేతులూ కడుగుకోడానికి నీళ్ళు ఇచ్చి, (అర్ఘ్య పాద్యములు ఇచ్చి), వారిని పూవులతో, గంధముతో పూజచేసి, కడిగిన బంగారు గరిటెతో అన్నంపై ఆవునేతిని అభిషరించి (చల్లి), పండ్లతో, పరమాన్నముతో, పలు రకాల పిండివంటలతో, భక్తి విశ్వాసాలు ఉట్టిపడే రీతిగా, చేతి తోరాలతో గాజులు ఒరసికొని ధ్వని చేస్తుండగా, తమ ఇంపయిన చేతులతో, కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు, యతీశ్వరులకు మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. ఆ ఇల్లాండ్రు అన్నపూర్ణా భవానికి ప్రియమైన స్నేహితురాండ్రుగా పేరు పొందారు.
విశేషాంశాలు:
1. అతిథి : (వ్యుత్పత్తి) = తిథి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు.

2. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) = పూజకు తగినది
అష్టార్ధ్యములు : అర్ఘ్యములు ఎనిమిది రకములు. 1) పెరుగు 2) తేనె 3) నెయ్యి 4) అక్షతలు 5) గణిక 6) నువ్వులు 7) దర్భ 8) పుష్పము

3. పాద్యము : (వ్యుత్పత్తి) = పాదములకు అర్హమైనది (కాళ్ళు కడుగుకొనుటకు అర్హమైన నీరు)

4. మాధుకర భిక్ష : (వ్యుత్పత్తి) = మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద వివిధ పుష్పాలపై వ్రాలి, తేనెను గ్రహించి నట్లు, సన్న్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్న్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

పద్యం -4

కం॥ ఆ పరమ పురంధ్రులయం
దే పుణ్యాంగవయు భిక్ష యిడదయ్యెఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు వీక్షించితివో?
ప్రతిపదార్థం :
ఆ, పరమ, పురంధ్రుల యందున్ ; ఆ = అటువంటి
పరమ = ముఖ్య మైన
పురంధ్రుల యందున్ = కుటుంబినులలో (మగడునూ, బిడ్డలునూ కల స్త్రీని ‘పురంధి’ అంటారు.)
ఏ పుణ్యాంగనయున్, (ఏ, పుణ్య + అంగనయున్) = ఏ పుణ్యవతియును
భిక్ష = భిక్షాన్నమును
ఇడదయ్యెన్ = పెట్టదాయెను (పెట్టలేదు)
కటా = అక్కటా !
ఏను = నేను
రేపాడి = తెల్లవారు జాముననే మేలుకొని
ఏ పాపాత్ముని = ఎటువంటి పాపి యొక్క
మోమును = ముఖాన్ని
ఈక్షించితినో; (ఈక్షించితిని + ఓ) = చూశానో

భావం :
అటువంటి పరమ పురంధ్రులలో ఏ యొక్క పుణ్య స్త్రీ కూడా నాకు భిక్ష పెట్టడానికి రాలేదు. నేను ఈనాడు ఉదయం నిద్రలేచి, ఎటువంటి పాపాత్ముని ముఖాన్ని చూశానో కదా !

విశేషాంశాలు:
1. పాపాత్ముని ముఖం చూడడం : దుర్మార్గుల ముఖం చూస్తే, చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు, కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై, నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.

పద్యం – 5
తే॥గీ॥ ఉపవసింతుముగాక వేఁడుడిగి మడిగి
యస్తమించుచు మన్నవాఁ డమామ భామం
డెల్లి పారణకైవ లేదెట్లు మనకు?
మాధుకరభిక్ష బ్రాహ్మణ మందిరముల
ప్రతిపదార్థం :
ఉడిగి = (భిక్ష కోసం తిరగడం) మాని
మడిగి = అణగి యుండి
నేడు = ఈరోజు
ఉపవసింతుముగాక; (ఉపవసింతుము + కాక) = ఉపవాసం ఉందుము గాక !
అహిమభానుడు = వేడి కిరణములు గలవాడైన సూర్యుడు
ఆస్తమించుచునున్నవాడు; (అస్తమించుచున్ + ఉన్నవాడు) = అస్తమిస్తున్నాడు
ఎల్లి = రేపు
మనకున్ = మనకు
బ్రాహ్మణ మందిరములన్ = బ్రాహ్మణ గృహాలలో
మాధుకర భిక్ష – మాధుకర రూపమైన భిక్ష
పారణకైనన్ = ఉపవాసం ఉండి మరునాడు చేయు భోజనానికి అయినా
లేదెట్లు (లేదు + ఎట్లు) = లేకుండా ఎలా ఉంటుంది? (తప్పక లభిస్తుంది)

భావం :
ఇంక భిక్ష కోసం తిరగడం కట్టిపెట్టి, కడుపులో కాళ్ళు పెట్టుకొని మడిగి ఉండి, ఉపవాసం చేద్దాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ మందిరాలలో ఉపవాసం తర్వాత చేసే పారణ భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
‘అతిథి దేవోభవ’ అంటే ఏమిటి?
జవాబు:
‘అతిథి దేవోభవ’ అంటే అతిథి దేవుడుగా గలవాడవు అగుము అని భావం. అంటే అతిథిని దేవునిగా భావించి పూజించుము అని సారాంశం.

ప్రశ్న 2.
ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు?
జవాబు:
సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాసమహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి. సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం, వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ, శాస్త్రాలు చెపుతున్నాయి. భిక్ష పెట్టినవారికి పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా భావించేవారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
భిక్ష సమర్పించేటప్పుడు నాటికీ నేటికీ ఉన్న తేడాలేమిటి?
జవాబు:
భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు, తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్ప గంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘారం చేసి, పిండివంటలతో భక్తి విశ్వాసాలతో అతిథులకు పెట్టేవారు.

ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొంతమంది మాత్రం, ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోడం, కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దాన ధర్మాలు తగ్గిపోయాయి.

వచనం -6

అవి యారాత్రి గడపి మజువాఁడు మధ్యాహ్న కాలంబున ఆ శిష్యులుం దాను
వేటువేటు విప్రభవన వాటికల భిక్షాటవంబొనర్పంబోయి,
తొలువాఁటియట్ల ముక్కంటేమాయ వేమచ్చెకంటియు వంటకంబు
పెట్టకున్నఁ గటకటంబడి భిక్షాపాత్రంబు నట్టనడు వీధిం బగులవైచి కోపావేశంబున
ప్రతిపదార్థం :
అని = అట్లు చెప్పి
ఆ రాత్రి, గడపి = ఆ రాత్రి ఎలాగో వెళ్ళదీసి
మఱునాడు = తరువాతి రోజు
మధ్యాహ్నకాలంబునన్ = మధ్యాహ్న వేళయందు
శిష్యులున్ = శిష్యులునూ
తానున్ = తానునూ (వేద వ్యాసుడునూ)
వేఱువేఱన్ = విడివిడిగా
వేదవ్యాసుండు = వేద వ్యా సమహర్షి
విప్రభవన వాటికలన్; విప్ర భవన = బ్రాహ్మణ మందిరములు ఉన్న
వాటికలన్ = వాడలలో (వీథులలో)
భిక్షాటనంబు; (భిక్షా + ఆటనంబు) = భిక్ష కోసం సంచారం
ఒనర్పంబోయి (ఒనరన్ + పోయి) = చేయబోయి
తొలునాటియట్ల (తొలునాటి + అట్ల) – ముందురోజులాగే
ముక్కంటి మాయన్ = శివుని మాయచేత
ఏ మచ్చెకంటియున్ = ఏమీన నేత్రయును,
(మచ్చె కంటి : (వ్వు)) = చేపల వంటి కన్నులు కలది (స్త్రీ)
వంటకము = అన్నం
పెట్టకున్నన్ (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా
కటకటంబడి = బాధపడి
భిక్షాపాత్రంబు = భిక్షా పాత్రను
నట్టనడు వీధిన్ = వీధి నట్టనడుమ (మధ్యలో)
పగులవైచి = పగులకొట్టి
కోపావేశంబునన్ (కోప + ఆవేశంబునన్)= కోపము యొక్క ఆవేశంతో

భావం :
అని వేదవ్యాసుడు, శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులునూ, తానూ వేర్వేరుగా బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం చేయసాగారు. కాని అంతకు ముందు రోజులాగే, విశ్వనాథుడి మాయవల్ల, ఏ ఇల్లాలు వారికి భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు బాధపడి, కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీధిలో ముక్కలు ముక్కలయ్యేటట్లు పగులకొట్టాడు. అంతటితో కోపావేశం దిగక.

పద్యం -7

తే॥ ( ధనములేకుండెదరు మూఁడు తరములందు
మూడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూడు తరముల వెడలవలయుఁ
పంచజనులకుఁ గారి పట్టణమున
ప్రతిపదార్థం :
కాశికాపట్టణమునన్ = కాశీ పట్టణము నందు
పంచ జనులకున్ = మనుష్యులకు (పంచభూత ములచే పుట్టువారు మనుష్యులు)
మూడు తరములన్ = మూడు తరముల పాటు
మోక్షలక్ష్మి = కైవల్య లక్ష్మి
చెడుఁగాక = చెడిపోవుగాక
మూడు తరములన్ = మూడు తరముల పాటు
విద్యయును = విద్య కూడా
వెడలవలయున్ – పోవాలి (నిష్క్రమించాలి)
మూడు తరముల యందున్ = మూడు తరముల పాటు
ధనము లేకుండెదరు. = ధనము లేకుండా ఉంటారు (పేదవారై ఉంటారు)

భావం :
కాశీ నివాసులకు ముదిరిన ఈ ధన మదం దిగిపోయే వరకు, “వీరు మూడు తరాల వఱకూ నిరుపేదలై ఉండాలి. మూడు తరాల వఱకూ వీరికి ముక్తి లక్ష్మి చెడిపోవాలి. మూడు తరాల వణుకూ వీరు చదువులేనివారు కావాలి.” అని వ్యాసుడు కాశీ నగరాన్ని శపించడానికి సిద్ధమయ్యాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

వచనం – 8

అవి పారాశర్యుండు పుత్పిపాసా పరవశుండై శపియింపం దలంచు
వనసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం
బార్వతి ప్రాకృత వేషంబున
ప్రతిపదార్థం :
అని = ఈ విధంగా
పారాశర్యుండు = వ్యాసుడు (వ్య) పరాశర మహర్షి కుమారుడు (వేదవ్యాసుడు)
క్షుత్పిపాసాపరవశుండై; క్షుత్ = ఆకలితోనూ
పిపాసా = దప్పికతోనూ (నీరు త్రాగాలనే కోరికతోనూ)
పరవశుండై; (పరవశుండు + ఐ) = పరాధీనుడై (లొంగినవాడై)
శపియింపన్ = శపించడానికి
తలచు = ఊహించే
అవసరంబునన్ = సమయంలో
ఒక్క విప్రభవనంబు వాకిటన్; ఒక్క = ఒక
విప్రభవనంబు = బ్రాహ్మణ మందిరము యొక్క
వాకిటన్ = వాకిలి యందు (గృహ ద్వారమునందు)
పార్వతి = పార్వతీ దేవి
ప్రాకృత వేషంబునన్ = సామాన్య స్త్రీ వేషంలో

భావం :
అని ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు శపించాలని ఆలోచిస్తున్న సమయంలో, ఒక బ్రాహ్మణ భవనం ద్వారము దగ్గర పార్వతీ దేవి సామాన్య స్త్రీ వేషంలో మందలించింది.

విశేషాంశాలు:
1. పారాశర్యుడు (వ్వ) : పరాశర మహర్షి కుమారుడు (వ్యాసుడు)

పద్యం – 9 : కంఠస్థ పద్యం

ఉ॥ వేదపురాణశాస్త్ర పదవి వదవీయసియైన పెద్దము
ఆదున కాళికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదను శక్తి సంయమివరా ! యిటు రమ్మని పిల్చి హస్తనం
జాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లవన్
ప్రతిపదార్థం :
వేదపురాణ శాస్త్ర పదవీ నదవీయసి యైన; వేద = వేదముల యందు
పురాణ = పురాణముల యందు
శాస్త్ర = శాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన
పదవీ = జ్ఞానమునకు
నదవీయసియైన (న + దవీయసి + ఐన) = మిక్కిలి దూరము నందు లేని
పెద్ద ముత్తైదువ = పెద్దదైన పురంధి
కాశికా నగర హాటిక పీఠ శిఖాధిరూఢ; కాశికా నగర = కాశికా నగరము అనెడి
హాటక పీఠ = స్వర్ణ పీఠము యొక్క
శిఖా = శిఖరమందు
అధిరూఢ = అధిరోహించియున్న
అయ్యాదిమ శక్తి (ఆ + ఆదిమ శక్తి) : ఆ మొదటి శక్తి స్వరూపిణి
హస్త సంజ్ఞాదర లీలన్; హస్త సంజ్ఞా = చేతి సంజ్ఞ యందు వెల్లడి యవుతున్న
ఆదర = ఆదరముతో కూడిన
లీలన్ = విధముతో
రత్న ఖచితా భరణంబులు: రత్న = రత్నములతో
ఖచిత = పొదుగబడిన (కూడిన)
ఆభరణంబులు = నగలు
ఘల్లు ఘల్లనన్ = గల్లు గల్లుమని శబ్దము చేయు చుండగా
సంయమివరా = ఓ మునీశ్వరా !
ఇటురమ్ము + అని = ఇటు రమ్మని
పిల్చెన్ = పిలిచింది

భావం :
సకల వేదాలు, సకల పురాణాలు, సకల శాస్త్రములు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదువ, కాశీనగరం. అనే బంగారు పీఠంపై అధిరోహించిన ఆ ఆదిమశక్తి, తన చేతితో సంజ్ఞ చేసింది. ఆ సంజ్ఞలో ఆదరం కనబడింది. అప్పుడు ఆమె రత్నఖచితమైన ఆభరణాలు ఘల్లు ఘల్లుమని చప్పు డయ్యాయి. అలా ఘల్లుమంటుండగా, ఆమె ‘ఓ మునీశ్వరా ! ఇటు రమ్ము’ అని వ్యాసుని పిలిచింది.

పద్యం – 10: కంఠస్థ పద్యం

శా॥ ఆకంఠంబుగ విష్ణు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు వంగలార్చెదవు మేలే ? లెప్ప ! శాంతుండవే !
నీ కంటెన్ మతిహీమలే కటకటా ! నీవార ముస్లించచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలాంఛప్రక్రముల్ తాపసుల్!
ప్రతిపదార్థం :
ఇప్డు= ఇప్పుడు
ఆకంఠంబుగన్ = కంఠము దాకా (గొంతు దాకా)
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నమును
భక్షింపగాన్ = తినడానికి
లేకున్నన్ (లేక + ఉన్నన్) = లేకపోయేసరికి
కడున్ = మిక్కిలి
అంగలార్చెదవు = అంగలు వేస్తున్నావు (తొట్రు పడుతున్నావు) (దుఃఖిస్తున్నావు)
మేలే (మేలు + ఏ) : నీవు చేసే పని మంచిదా?
లెస్స = బాగున్నదా?
శాంతుండవే (శాంతుండవు + ఏ) = నీవు శాంత గుణం కలవాడవేనా !
కటకటా = అక్కట కటా !
నీవార ముష్టింపచుల్ = ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండి తినేవారునూ
శాకాహారులు (శాక + ఆహారులు) : కాయ కూరలు మాత్రమే తినేవారునూ
కందభోజులు = దుంపలు మాత్రమే తినేవారునూ
శిలోంఛ ప్రక్రముల్; శిల = కోతకోసిన వరిమళ్ళలో జారీ పడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారునూ
ఉంఛ ప్రక్రముల్ = రచ్చరోళ్ళ వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరుకొనడమే జీవనంగా కలవారునూ అయిన
తాపసుల్ = తపస్సు చేసుకొనేవారు; (మునులు)
నీకంటెన్ = నీ కన్న
మతిహీనులే (మతిహీనులు + ఏ) = బుద్ధితక్కువ వారా? (తెలివి తక్కువ వారా?)

భావం :
ఇప్పుడు గొంతు దాకా తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ! ఇది
మంచి పనియేనా ? బాగున్నది. నిజంగా నీవు శాంత | స్వభావుడవేనా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారూ, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకొనే వాళ్ళూ, వరి మళ్ళలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళూ, రోళ్ళ వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించే వాళ్ళూ అయిన మునులు, నీ కంటె తెలివి తక్కువ వారా?

పద్యం – 11

తే॥గీ॥ మువీశ్వర ! వివవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు వొక్క రూపన్న రీతి
యటు విశ్లేషించి శివుని యర్థాంగలక్ష్మి
కాశి; యివ్విటి మీద వాగ్రహము దగునె?
ప్రతిపదార్థం :
ఓ మునీశ్వర (ముని + ఈశ్వరా) : ఓ మునీశ్వరుఁడా ! = (వేదవ్యాస మహర్షి !)
ఉన్నయూరున్ (ఉన్న + ఊరున్) = తాను ఉన్న ఊరును
కన్న తల్లియున్ = తనను కనిన తల్లియును
ఒక్కరూపు = ఒకే మాదిరి
అన్న రీతి = అనే రీతిని
వినవయ్య = నీవు వినలేదా?
అటు విశేషించి = అంతకంటెను విశేషించి
కాశి = కాశీ పట్టణం
శివుని = ఈశ్వరుని యొక్క
అర్థాంగ లక్ష్మి = భార్య
ఇవ్వీటిమీదన్ (ఈ + వీటిమీదన్) = ఈ కాశీనగరం మీద
ఆగ్రహము = కోపం
తగునె (తగును + ఎ) = తగునా?

భావం :
పెద్ద ముత్తైదువు రూపంలో ఉన్న పార్వతీ దేవి, వ్యాసుని “ఉన్న ఊరు కన్నతల్లితో సమానం” అనే రీతిని నీవు వినలేదా? అంతకంటెను విశేషించి శివుని అర్థాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవు ఇంత కోపం చూపించడం తగునా?” అని మందలించింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

వచనం – 12

ఇట్టి కాళికావగరంబుమీద భిక్షలేకుండుట
కారణంబుగా వీయంత వాడు కటకటంబడి
శపియింపందలంచువే? విశేషించి యాఁకొన్న వాఁడవు
గావున నీ యవపరంబున నిన్ను హెచ్చు గుందాడుట
మము బోఁటి గృహిణులకు మెచ్చుగాదు. మా
యింటికిం గుడువ రమ్ము! కుడిచి కూర్చున్న
పిమ్మటం గొన్ని మాటలు నీతో వాడఁగలవనివ
నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె –
ప్రతిపదార్ధం :
ఇట్టి కాశికా నగరంబు మీదన్ = ఇటువంటి కాశీ పట్టణం పైన;
భిక్ష లేకుండుట కారణంబుగాన్ = భిక్ష దొరకలేదన్న కారణంగా
నీయంతవాడు = నీ యంతటివాడు
కటకటంబడి = కోపగించుకొని
శపియింపన్ = శపించాలని
తలంచునే = అనుకుంటాడా?
బ్రాహ్మణుండవు గదా ! = నీవు బ్రాహ్మణుడవు గదా !
నీవేమన్ననున్ (నీవు + ఏమి + అన్నన్) = నీవు ఏమన్నా
చెల్లున్ = చెల్లుబడి అవుతుంది
అటు విశేషించి = అంతకంటెను విశేషంగా
ఆకొన్నవాడవు = ఆకలితో ఉన్నావు
కావునన్ = కాబట్టి
ఈ యవసరంబునన్ = ఈ సందర్భంలో
నిన్నున్ = నిన్ను
హెచ్చుకుందాడుట = నిందించడం; (నీతో వాదులాడటం )
మముబోటి = మా వంటి
గృహిణులకున్ – ఇల్లాండ్రకు
మెచ్చుగాదు = మెప్పు కలిగించదు
మా యింటికిన్ (మా + ఇంటికిన్) = మా ఇంటికి
కుడువన్ = తినడానికి
రమ్ము = రావయ్యా !
కొన్ని మాటలు = కొన్ని మాటలు
నీతోన్ = నీతో
ఆడన్ = పలుకవలసినవి
కలవు = ఉన్నాయి
అనినన్ = అనగా
అమ్మహాసాధ్విన్ (ఆ + మహాసాధ్విన్) = ఆ గొప్ప పతివ్రతను
కని = చూచి
పారాశర్యుండు = వేదవ్యాసుడు (పరాశరుని కుమారుడు)
ఇట్టులనియె (ఇట్టులు + అనియె) = ఈ విధంగా అన్నాడు

భావం :
“ఇటువంటి కాశీ నగరం మీద, కేవలం భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు, బాధపడి శపించాలని అనుకోవచ్చా ; నీవు బ్రాహ్మణుడవు కాబట్టి, నీవు ఏమన్నా నీకు చెల్లుతుంది. పైగా నీవు ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా నిందించడం, మాలాంటి గృహిణులకు మర్యాద కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనమైన తరువాత నీతో కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నది.” అని పార్వతీ దేవి వ్యాసునితో చెప్పుగా, ఆ మహాసాధ్విని చూచి, వ్యాసుడు ఈ విధంగా అన్నాడు.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు.

వ్యాసుడు కోపించడం, ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు. కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
‘కోపం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. దీన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
కోపం వస్తే మనిషికి ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే విచక్షణ శక్తి పోతుంది. ఈ మాటలో సత్యం ఉంది. విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి మహర్షులు ఈ విధంగానే కోపంతో విచక్షణ కోల్పోయి, ఎన్నో చిక్కులకు లోనయ్యారని పురాణాలు చెపుతున్నాయి.

దుర్యోధనుడు పాండవుల పై కోపంతోనే విచక్షణ కోల్పోయి, నిండు సభలో ద్రౌపదిని అవమానించాడు. దుర్వాసుడు కోపంతోనే అంబరీషుని, ధర్మరాజును పరీక్షించబోయి, తానే కష్టపడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠునిపై కోపంతో తానే భంగపడ్డాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 3.
ఉన్న ఊరును కన్న తల్లితో సమానమని ఎందుకు అంటారు?
జవాబు:
కన్నతల్లి మనకు కావలసిన దానిని, తాను గుర్తించి మన కడుపు నింపుతుంది. కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.

అలాగే మనం ఉన్న ఊరు కూడా, మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది. మనం ఉన్న ఊరిలో మనకు ప్రజలు అందరూ తెలిసిన వారు ఉంటారు. వారు తన తోడి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే “జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అన్నారు.

కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు సమానం.

పద్యం – 13

తే॥గీ॥ | అస్తమింపగఁ జేరినాఁ డహిమకరుడు.
శిష్యులేగాక యయుతంబు చిగురుఁబోడి
వ్రతము తప్పి భుజింపంగ వలమగాడు
వేఁడు విన్నటి మజువాఁడు విక్కువంబు
ప్రతిపదార్థం :
అహిమకరుడు = సూర్యుడు (చల్లనివి కాని కిరణములు కలవాడు)
అస్తమింపగన్ = అస్తమించడానికి
చేరినాడు = సమీపించాడు
ఏఁగాక (ఏన్ + కాక) = నేను కాకుండ
శిష్యులు = శిష్యులు
అయుతంబు = పదివేలమంది ఉన్నారు
వ్రతము తప్పి = వ్రతం విడిచిపెట్టి
భుజియింపన్ = భుజించడానికి
వలను కాదు = యుక్తం కాదు; (ఒప్పిదం కాదు)
చిగురుబోడి = చిగురు వంటి శరీరం గల దానా !
నేడున్ = నేడు కూడా
నిన్నటి = నిన్నటి రోజునకు
మఱునాడు = మరుసటి రోజే (అనగా నిన్న లాగే నేడూ పస్తు ఉండటమే)
నిక్కువంబు = నిజం

భావం :
తల్లీ ! పల్లవగాత్రీ ! సూర్యుడు అస్తమించడానికి సమీపించాడు. (సూర్యాస్తమయం కాబోతుంది). నేను కాక ఇంకా పదివేలమంది శిష్యులు ఉన్నారు. అందరితో కలిసి భుజించే వ్రతం ఉన్న నేను, నా వ్రతాన్ని విడిచి పెట్టి మీ ఇంట్లో ఒక్కడినీ భుజించలేను. ఈ రోజు కూడా నిన్నటి రోజుకు మరుసటి రోజే. (అంటే నిన్నటి లాగే ఈ రోజు కూడా ఉపవాసం నాకు తప్పదు. అని ధ్వ ని)

పద్యం – 14: కంఠస్థ పద్యం

చం॥ అనవుడు నల్లవవ్వి కమలానవ యిట్లము, లెప్పగాక, యో
మునివర! నీవు శిష్యగణముంగొని చయ్యవ రమ్ము విశ్వనా
థునికృప పేర్మి వెందట తిథుల్ చమబెంచినఁ గామధేనువుం
ఐవి గొనునట్లు పెట్టుదు వపారములైన యభిప్పితాన్నముల్
ప్రతిపదార్థం :
అనవుడున్ = వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా
కమలానన (కమల + ఆనన) = పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ
అల్ల = కొంచెం
నవ్వి = నవ్వి
ఇట్లనున్ (ఇట్లు + అనున్) = ఇలా చెప్పింది
లెస్సగాక = మేలు అగునుకాక !
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణమున్ = శిష్యులందరినీ
కొని = తీసుకొని
చయ్యనన్ = శీఘ్రంగా
రమ్ము = రమ్ము (మా ఇంటికి భోజనానికి రా)
విశ్వనాథుని = విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క
కృపపేర్మిన్ = దయాతిశయం చేత (అధికమైన దయచేత)
ఎందరతిథుల్ (ఎందరు + అతిథుల్) = ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ
కామధేనువున్ = దేవతల కామధేనువును
పనిగొనునట్లు – స్వాధీనం చేసికొన్న విధంగా
అపారములైన (అపారములు + ఐన) = అంతులేని;
అభీప్సితాన్నముల్ (అభీప్సిత + అన్నముల్) = కోరిన పదార్థాలను
పెట్టుదున్ = పెడతాను

భావం :
వేదవ్యాసుడు ఇలా చెప్పగా, పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ చిఱునవ్వు నవ్వి “మంచిది. సరేలే. విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, కామధేనువును కలిగియున్న యజమానురాలు రీతిగా, కోరిన పదార్థాలన్నీ నేను అనంతంగా పెట్టగలను. కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా” అన్నది.

వచనం – 15

అనిన వట్లకాక మహాప్రపాదంబని వేదవ్యాసుండు
శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యువస్పర్శం
బాచరించి యేతెంచిన –
ప్రతిపదార్థం :
అనినన్ = అట్లు ముత్తైదువ చెప్పగా
అట్లకాక = అట్లే అగుకాక (అలాగే చేస్తాను)
మహాప్రసాదంబు + అని = మహానుగ్రహమని
వేదవ్యాసుండు = వేదవ్యాసుడు
శిష్యులన్ = శిష్యులను
కూర్చుకొని = కలుపుకొని (తన వెంటబెట్టుకొని)
చని = వెళ్ళి (గంగకు వెళ్ళి)
ఉపస్పర్శంబు = స్నానమును, ఆచమనమును
ఆచరించి = చేసి
ఏతెంచినన్= రాగా

భావం :
ఆ ముత్తైదువ అట్లు చెప్పగా “సరే మహాప్రసాదం” అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి స్నానం, ఆచమనం, పూర్తిచేసుకొని రాగా,

పద్యం – 16

తే॥గీ॥ గొడుగు పాగల గిలకలు గులకరింప
విందుబింబాస్య యెదురుగా వేగు దెంచి
ఛాత్ర సహితంబుగాఁ బరాశరతనూజు
బంతిపాగించే భుక్తిశాలాంతరమున
ప్రతిపదార్థం :
గొడుగు పాగల గిలకలు = గొడుగు పావకోళ్ల యొక్క గిలకలు (గొడుగుల వలెనుండు గుబ్బలు గల పావకోళ్ళు)
గులకరింపన్ = మ్రోగుతుండగా
ఇందు బింబాస్య (ఇందు బింబ + ఆస్య) = చంద్రబింబము వంటి ముఖం కల ఆ ఇల్లాలు
ఎదురుగాన్ = వ్యాసునకు ఎదురుగా
ఏగుదెంచి = వచ్చి (మునీశ్వరునకు ఎదురేగి)
ఛాత్ర సహితంబుగాన్ = శిష్య సమేతంగా
పరాశరతనూజు బంతి = పరాశరుని కుమారుడైన వ్యాసుడు మొదట కూర్చున్న బంతిని; (పంక్తిని)
భుక్తి శాలాంతరబునన్ (భుక్తిశాలా + అంతరమునన్) = భోజనశాల లోపల
సాగించెన్ = వడ్డన సాగించింది

భావం :
తాను ధరించిన గొడుగు పావుకోళ్ళ గిలకలు మ్రోగుతుండగా, చంద్రముఖియైన ఆ ముత్తైదువ, వారికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పింది. శిష్య సమేతంగా వేదవ్యాస మునీంద్రుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె ఆ పంక్తికి వడ్డన సాగించింది.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది?
జవాబు:
వ్యాసుడు తన శిష్యులతో కూడా భిక్షాటనం చేసి, వాళ్ళతో కలసి భుజించేవాడని అర్థమయ్యింది. ఒకవేళ పగటి సమయంలో భిక్ష దొరక్కపోతే ఉపవాసం ఉండేవాళ్ళని అర్థమయింది.

వ్యాసుడు తన శిష్యులతో కలసి భుజించాలనే వ్రతం కలవాడని అర్థమయింది. శిష్యులను విడిచి పెట్టి తానొక్కడే భుజించాలనే స్వార్థపు ఆలోచన లేనివాడని అర్థమయింది. తనను ఆశ్రయించిన శిష్యుల బాగోగులను పట్టించుకొనేవాడని అర్థమయింది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 11 భిక్ష

ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధం గురించి వివరించండి.
జవాబు:
ఈ పాఠం ఆధారంగా చూస్తే నాటి గురుశిష్య సంబంధం విడదీయరానిదని తెలుస్తోంది. శిష్యులు ఎల్లప్పుడూ గురువుని ఆశ్రయించి ఉండేవారు. గురువులతో పాటు శిష్యులు కూడా భిక్షాటనం చేసి లభించిన ఆహారాన్ని అందరూ కలసి భుజించేవారు. ఒకవేళ సూర్యాస్తమయం లోపల భిక్ష లభించకపోతే ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు. గురువు మాటను శిష్యులు అతిక్రమించే వారు కాదు. గురువు తనకంటే ముందుగా శిష్యుల బాగోగులను గురించి పట్టించుకొనేవాడు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Telugu Solutions 10th Lesson గోరంత దీపాలు

10th Class Telugu 10th Lesson గోరంత దీపాలు Textbook Questions and Answers

ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి

జడ్డ ఆకలి అమ్మకి తెలుస్తుంది. ఈ తల్లులకు తమ ఆకలేకాదు, అనాథల క్షుద్బాధా తెలుసు. ఇంత తెలిసిన వీరంతా గొప్ప స్థితిమంతులేం కాదు. అలాంటప్పుడు లేనివారికి గుప్పెడు మెతుకులు పంచేదెలా? ఆలోచించగా ఆలోచించగా వారికొక దారి దొరికింది. రోజూ పిడికెడు గింజలు దాచాలన్న ఊహ కలిగింది. పిడికిలి జగిస్తే ఉద్యమం అవుతుంది. ఆ ఊళ్లో జనం పిడికిలి తెరిచారు. తమ దగ్గరున్న గింజల నుంచి ప్రతిరోజూ పిడికెడు పంచడం నేర్పారు. ఇవ్వడం సాయం, పంచడం మానవత్వం. సాటి మనుషుల ఆకలి తీర్చడం దైవత్వం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు?
జవాబు:
సాటి మనుషుల ఆకలి తీర్చాలి అని తెలుసుకొన్నాం.

ప్రశ్న 2.
మానవత్వంతో చేసే పనులు ఏవి?
జవాబు:
మన దగ్గరున్న సంపదను ఇతరులకు పంచడం మానవత్వం. అనాథలను, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం
మానవత్వంతో చేసేపని.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
సహాయపడే గుణం, మానవత్వం కలిగిన వారి వల్ల సమాజానికి కలిగే మేలు ఏమిటి?
జవాబు:
సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా సహాయపడతారు. వారి వలన బలహీనులు రక్షించబడతారు. అందరికీ మేలు
జరుగుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. ఎంతోమంది జీవితాలలో వారు వెలుగులు నింపుతారు.

ప్రశ్న 4.
మీరు ఇతరులకు ఎప్పుడైనా సాయం చేశారా? ఎప్పుడు? ఎందుకు?
జవాబు:
నేను, ఇతరులకు చాలాసార్లు సాయం చేశాను. ఒకసారి మా స్నేహితుడు టిఫిను చేయకుండా పాఠశాలకు వచ్చాడు. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాడు. వెంటనే మాష్టారికి చెప్పాను. వెంటనే మాష్టారు బిస్కెట్లు, టీ తెప్పించి ఇచ్చారు. నీరసం తగ్గింది.
(గమనిక : తరగతిలోని ప్రతి విద్యార్థి తన అనుభవాన్ని చెప్పాలి.)

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
“గోరంత దీపాలు” అనే శీర్షిక ఈ పాఠానికి తగిన విధంగా ఉందా? ఎందుకు? సకారణంగా చర్చించండి.
జవాబు:
(గమనిక : విద్యార్థి తనకు శీర్షిక నచ్చితే నచ్చిందని సకారణంగా నిరూపించవచ్చును. నచ్చకపోతే ‘శీర్షిక తగదు’ అని సకారణంగా నిరూపించవచ్చును. రెండు అభిప్రాయాలను ఇస్తున్నాం. ఒక దానిని మాత్రమే గ్రహించండి.)

1) శీర్షిక తగినదే :
గోరంత దీపాలు పాఠంలో అనాథ శిశువులను వృద్దుడు చేరదీసి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నాడు. చాలామంది బాలబాలికలు ఆయన వద్ద ఆశ్రయం పొందుతున్నారు. వారందరు ఆయన ప్రేమాప్యాయతలతో పాటు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆ పిల్లలంతా అనాథలే ? రైలు పెట్టెలు శుభ్రం చేసేవారు కొందరు, యాచన, చిన్న చిన్న దొంగతనాలు చేసిన వారు కూడా ఆ పిల్లల్లో ఉంటారు. వాళ్ళు ఈ విశాల ప్రపంచంలో దిక్కుమొక్కు లేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే చేరదీసి అక్కున చేర్చుకున్నాడా వృద్ధుడు. ఆ పసి పిల్లలందరు చిఱుగాలికి రెపరెపలాడే గోరంత దీపాల్లాంటివారు. ఆ గోరంత దీపాలకు కొండంత అండగా నిలబడ్డాడు వృద్ధుడు. వారికి ఆశ్రయం కల్పించి తీర్చిదిద్దుతున్నాడు వృద్ధుడు. ఈ కథలోని వృద్ధుడు చదువుతున్న వారపత్రికలోని కథ కూడా అనాథబాలుని కథే. అందుచేత ఈ పాఠానికి గోరంత దీపాలనే శీర్షిక తగిన విధంగా ఉంది.

2) శీర్షిక తగినది కాదు :
గోరంత దీపాలు పాఠంలో అనాథబాలలు కంటే వృద్ధుని ఔదార్యం ప్రధానమైనది. ఆ వృద్ధుని ఔదార్యాన్ని పదిమంది ఆదర్శంగా స్వీకరించాలి. ఈ శీర్షికలలో వృద్ధుని ఔదార్యం ఎక్కడా ధ్వనించదు. శీర్షిక ఎప్పుడు అంశంలోని ప్రధాన విషయాన్ని ధ్వనించేదిగా ఉండాలి. గోరంత దీపాలు అనేది అనాథ బాలల దీనస్థితిని తెలియజేస్తోంది తప్ప ఇక దేనిని తెలియచేయటం లేదు. అంతేకాక ఆ గోరంతదీపాలకే కొండంత అండగా నిలబడి తీర్చిదిద్దిన త్యాగమూర్తిని పట్టించుకోలేదు. పెరిగి పెద్దయ్యాక ఆ గోరంత దీపాలే ఆ వృద్ధుని పాదాలకు కృతజ్ఞతతో కన్నీటి అభిషేకాలు చేసారు. ఇంతటి మహోన్నతమైన త్యాగనిరతిని బాధ్యతను, మానవత్వాన్ని, శీర్షిక విస్మరించడం విజ్ఞులను ఆశ్చర్యపరుస్తుంది. శీర్షికను చూచిన మరుక్షణం ఉత్తేజం కలగాలి. కథలోని ఆశయం తెలియాలి. దీనికి మానవత్వపు పరిమళం అనే శీర్షిక పెట్టి ఉంటే సార్థకత చేకూరి ఉండేది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
పాఠం చదవండి. “వేపచెట్టు” గురించి వివరించిన, వర్ణించిన వాక్యాలు ఏమేమి ఉన్నాయి? వాటిని గుర్తించి చదవండి.
జవాబు:
పాఠ్యాంశం మొదటి ఐదు వాక్యాలు వేపచెట్టుని వర్ణించాయి. వేపచెట్టును తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే చెట్టుగా వర్ణించారు. ఆ చెట్ల కొమ్మలను దరిద్రుడి గుండెల్లో నుండి పుట్టిన అంతులేని ఆశల్లా అభివర్ణించారు. నాలుగు కొమ్మలు నాలుగు దిక్కుల్లా బాగా విస్తరించాయని చెప్పారు. కలిగిన వాడికి బాగా కండపట్టినట్లు ఆ కొమ్మలు పూతా పిందెలతో నిండుగా ఉన్నాయని వర్ణించారు.

మధ్యలో ఎక్కడా వేపచెట్టు వర్ణన లేదు. చివరి నుండి రెండవ పేరాలో వేపచెట్టు వర్ణన ఉంది. అది ఆ వృద్ధుడు వచ్చిన మనిషితో వేపచెట్టు గురించి చెప్పాడు. వేపచెట్టు అనగానే చేదు అనే భావన మనసులో మొదలవుతుంది. కానీ వేపచెట్టుని ఆశ్రయిస్తే చల్లని నీడ నిస్తుంది.

కనీసం ప్రతీరోజు ఒక వేపకాయని నమిలిన అనేక దీర్ఘరోగాలు తగ్గుతాయి. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు, నోటి జబ్బులు రావు. (పిప్పిపళ్ళు) (పుచ్చుపళ్ళు) ఉండవు.

ప్రశ్న 3.
పాఠంలోని కింది పేరాలు చదవండి. ఆ పేరాలలో వేటి గురించి వివరించారో తెల్పండి. ఆ పేరాల్లోని వివరణ/వర్ణనకు సంబంధించిన కీలక పదాలను రాయండి.
జవాబు:
AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు 1

ప్రశ్న 4.
క్రింది వాక్యాలు చదవండి. ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు?

అ) అవును బాబూ ! నిజంగా అతడు అదృష్టవంతుడే!
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని ఎప్పుడు వచ్చావని వృద్ధుడు అడిగితే అదృష్టవంతుడికి (వృద్ధుడికి) కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు అని అతను చెప్పిన సందర్భంలో తన పాదాలను కన్నీటితో అభిషేకం చేసిన వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని చెప్తున్న సందర్భంలోని వాక్యమిది.

భావం:
వృద్ధుని ఆశ్రయంలో చక్కగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడిన అనాథ చాలా అదృష్టవంతుడు అని వృద్ధుని భావం.

ఆ). “పెట్టమన్న చోటల్లా కండ్లు మూసుకొని సంతకాలు పెడుతున్నాను. అనాథలయిన పిల్లలు, వాళ్ళ అధోగతికి దారితీస్తే పుట్టగతులుండవు” ఇది మాత్రం మనసులో పెట్టుకోండి !”
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
తన గుమాస్తా తెచ్చిన చిట్టా పుస్తకంలో వృద్ధుడు సంతకాలు పెడుతూ, అతనితో మాట్లాడిన మాటలివి.

భావం:
అనాథ బాలల ఆశ్రమ చిట్టా పుస్తకాలలో వృద్ధుడు పరిశీలించకుండా సంతకాలు పెడుతున్నాడు. ఆ అనాథ పిల్లలకు సంబంధించిన ఖర్చులు దానిలో ఉంటాయి. ఆ లెక్కలలో తేడాపాడాలుంటే మహాపాపం. అందుచేత పాపభీతితో పనిచేయాలి అని వృద్ధుని మాటల సారాంశం.

ఇ) “అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు!”
జవాబు:
పరిచయం:
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథా రచయితను వృద్ధుడు ఎప్పుడు వచ్చావు బాబు, అని అడిగినపుడు రచయిత చెప్పిన సమాధానమిది.

భావం:
అనాథను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించి అతని జీవితంలో కొండంత వెలుగును నింపి అతని కృతజ్ఞతకు పాత్రుడైన వృద్ధునికి అతడు కన్నీటితో నమస్కరించాడు అని భావం.

ఈ) “మీరెక్కడున్నా, నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మహా అదృష్టంగా భావిస్తాను”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
వృద్ధుని ఆశ్రయంలో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొన్న వ్యక్తి బదిలీపై వేరే ఊరికి వెళుతూ 3 . వృద్ధుని పాదాలకు నమస్కరించి కృతజ్ఞతతో పలికిన వాక్యమిది.

భావం:
వృద్ధుడంటే ఆ వ్యక్తికి దైవంతో సమానం అని భావం.

ఉ) “అవి గోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఒక నాటికి, అవి కొండంత వెలుగునిస్తాయి”.
జవాబు:
పరిచయం :
ఈ వాక్యం పులికంటి కృష్ణారెడ్డి రచించిన “కథావాహిని” నుండి గ్రహింపబడిన “గోరంత దీపాలు” అను పాఠంలోనిది.

సందర్భం :
కథకుని ప్రశ్నకు సమాధానంగా వృద్ధుడు పలికిన వాక్యమిది. అనాథలను, వీథి బాలలను, కొడిగట్టిన దీపాలతో, వేపచెట్టుతో పోల్చి చెప్పుచున్న సందర్భములోని వాక్యమిది.

భావం:
అనాథలైన బాలలు గోరంత దీపాల వంటివారు. వారిని ఆదరించి కాపాడితే ఉన్నతులై కొండంత వెలుగును ఇస్తారు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 5.
పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

బతకడానికి ఉద్యోగం వెతుక్కుంటారు కొందరు. జీవితానికి అర్థం వెతుక్కుంటారు మరికొందరు ….. లక్ష్మీకాంతం రెండో కోవకు చెందుతారు. ఒక బిడ్డ కన్నీరు తుడవడమే భాగ్యం. ఒక బిడ్డకు తల్లి కావడం ఇంకా భాగ్యం. అలాంటిది లక్ష్మీకాంతం అరవై ఎనిమిది మంది అనాథలకు అమ్మలా మారారు. వాళ్ళకు కంటిపాప అయ్యారు. పైపైన చేస్తే ఉద్యోగం అవుతుంది. హృదయంలో నుంచి చేస్తే మానవత్వం అవుతుంది. లక్ష్మీకాంతం మానవీయ మూర్తి. వీధి బాలలుగా ముద్రపడిన అనాథలకు విశాఖ వాకిట నేడొక అమృతహస్తం దొరికింది. కన్నతల్లి ఒడి దక్కినట్టయింది. వీళ్ళ జీవితాలకు అండగా నేనుంటానంటూ పోడూరి లక్ష్మీకాంతం ముందుకు వచ్చింది. మాటలు కాదు – గత పదేళ్ళుగా ఆప్యాయతానురాగాలను చేతల్లో చూపుతోంది. అరవై ఎనిమిది మంది వీధి బాలల (స్ట్రీట్ చిల్డ్రన్) కు అమ్మగా
అవతరించింది. కన్నబిడ్డల కంటే వీధి బాలలనే ఎక్కువగా చూసుకుంది.
ప్రశ్నలు:
అ) పై పేరా దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
పోడూరి లక్ష్మీకాంతం గారి ఔదార్యం గురించి తెలియజేస్తోంది. అనాథ బాలలను ఆమె ఆదుకొంటున్న విధానం గూర్చి తెలియజేస్తోంది.

ఆ) పై పేరాలోని కీలకపదాలను ఏరి రాయండి.
జవాబు:
(గమనిక : కీలకపదాలు అంటే ముఖ్యమైన పదాలు. పేరాలోని విషయం సూటిగా తెలియజేసే పదాలు అని గ్రహించండి.)
ఉద్యోగం వెతుక్కోవడం, అర్థం వెతుక్కోవడం, రెండో కోవ, కన్నీరు తుడవడం, తల్లి కావడం, అనాథ, కంటి పాప, మానవత్వం, మానవీయమూర్తి, వీధి బాలలు, ముద్రపడడం, అమృతహస్తం, తల్లి ఒడి, అండ, ఆప్యాయతానురాగాలు, అవతరించడం, కన్నబిడ్డలు.

ఇ) ‘అమృతహస్తం’ అనే పదానికి అర్థమేమిటి?
జవాబు:
‘అమృతం’ బాధలను రూపుమాపుతుంది. అలాగే అమృతం లాంటి చెయ్యిగల వారు అంటే పదిమందికి సహాయం చేసేవారు అని అర్థం. ఇతరుల కష్టాలను నివారించి, ఆదుకొనే వారని అర్థం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 6.
పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) వృద్ధుడి వద్దకు వచ్చిన కుర్రాడు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? రచయిత అతని ప్రవర్తనను ఏఏ వాక్యాలతో వివరించాడు.
జవాబు:
వృద్ధుని వద్దకు వచ్చిన కుర్రవాడు నిలబడి ఉన్నాడు. అతను నిలబడటంలో వినయం ఉట్టిపడుతోంది. అతని వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.

ఆ కుర్రవాడు వినయానికి మారుపేరుగా ఉన్నాడు. సంస్కారవంతంగా ప్రవర్తించాడు. వృద్ధుడు ఆశీర్వదిస్తుంటే కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అతనికి ఆనంద భాష్పాలు వచ్చాయి. వృద్ధుని పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. పైకి లేచి మళ్ళీ నమస్కరించాడు. అలా నమస్కరిస్తూనే నాలుగు అడుగులు వెనక్కు వేసి, శిరసువంచి నమస్కరించి హుందాగా వెళ్ళి పోయాడు. ఈ ప్రవర్తనను బట్టి ఆ కుర్రవాడు కృతజ్ఞత కలవాడని తెలుస్తోంది. ఆదర్శవంతమైన ప్రవర్తన కలవాడు. ఉపకారం పొందినవారెవరయినా, ఉపకారం చేసిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆ కుర్రవాని ప్రవర్తన బట్టి తెలుసుకోవచ్చును.

రచయిత అతని ప్రవర్తనను చక్కటి పదాలతో భావస్పూరకంగా వర్ణించాడు. ఆ కుర్రవాడు నిలబడి ఉండడంలో వినయం ఉట్టిపడుతూ ఉంది. వేషంలో సంస్కారం ఉంది. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంది అని వర్ణించాడు. అతని కనుకొలుకుల్లో నిలచిన నీళ్ళు సంజెవెలుగులో ముత్యాలలా మెరుస్తున్నాయి. అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావం అతని ముఖంలో దోబూచులాడుతూ ఉంది. ఆనందానుభూతిలో తడుస్తూ మూగబోయాడు. తనివితీరనట్లు మళ్ళీ ఒకసారి ఆ కుర్రవాడు అతని పాదాలను ఒడిసిపట్టుకున్నాడు. పాదాల మీద తలను ఆనించాడు. కన్నీటితోనే అతని పాదాలను కడుగుతున్నాడేమో అనే వాక్యాలతో అతని ప్రవర్తనను వివరించాడు.

కన్నీటితో నిండిన కండ్లను జేబురుమాలుతో వత్తుకున్నాడు. మళ్ళీ ఒకసారి రెండు చేతులు జోడించాడు. జోడించిన చేతులు జోడించుకున్నట్లే ఉంచుకుని అలాగే నాలుగు అడుగులు వెనక్కు వేశాడు. అక్కడ నిలబడి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కరించాడు. గిరుక్కున వెనక్కు తిరిగి హుందాగా ముందుకు సాగిపోతున్నాడనే వాక్యాలతో అతని ప్రవర్తనను వర్ణించాడు.

ఆ) విద్యానగరం ఒక విద్యాలయం కదా! దాని ఆవరణ, వాతావరణం ఎలా ఉంది?
జవాబు:
విద్యానగరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అది దాదాపు రెండు, మూడు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. అక్కడ ఒక వేపచెట్టు, అంత కంటే పెద్దవైన రావి చెట్లున్నాయి. మట్టిమానులున్నాయి. జువ్వి చెట్లున్నాయి. రకరకాల పూల మొక్కలున్నాయి. కూరల తోటలున్నాయి. పాలపిట్టలు పరవశంగా పాడుకొంటుంటాయి.

ఆ ఆవరణలో బాలబాలికలకు వసతి గృహాలున్నాయి. అతిథులకు ప్రత్యేక సదుపాయాలతో గదులున్నాయి. వయోవృద్ధులకు వసతులు ఉన్నాయి. గ్రంథాలయం ఉంది. సాయంసమయాలలో పూజకు ప్రార్థనాలయం ఉంది. వేలాది మంది అనాథలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని వందలమంది ఉపాధ్యాయులు ఆ అనాథలకు విద్య నేర్పుతున్నారు.

ఇ) వృద్దుడు చేస్తున్న సేవాకార్యక్రమం గురించి లోకం ఏమనుకునేది ? దానికి వృద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది?
జవాబు:
పరులకు సేవ చేస్తున్నాననే పేరుతో స్వార్థం పెంచుకొన్న మనిషిగా వృద్ధుడిని లోకం నిందించింది, నోరు లేని పిల్లలకు అర్థాకలిగా అన్నం పెడుతున్నాడు. వాళ్ళ నోళ్ళు కొడుతున్నాడని కూడా ఆడిపోసుకొంది.

అయినా వృద్దుడు పట్టించుకోలేదు. పుండు మీద మాత్రమే కారం చల్లినా, ఉప్పు చల్లినా మంట పుడుతుంది. పుండ్లులేని దేహానికి మండదు కదా ! అలాగే తప్పు చేస్తుంటే లోకం అనే మాటలకు బాధపడాలి. తన తప్పేమీలేనపుడు ఆ మాటలు గాలిలో కలిసి పోతాయి. కాబట్టి లోకానికి భయపడి, మంచి లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అలా విడిచి పెడితే అది చేతగానితనమే అవుతుంది.

ఈ) వారపత్రికలో చదివిన కథ ఏమిటి?
జవాబు:
వృద్ధుడు చదివిన కథలో దొరైరాజ్ పదేండ్ల కుర్రవాడు. అతడు రైలు పెట్టెలు తుడుస్తాడు. ప్రయాణీకులు దయతలచి ఇచ్చిన డబ్బులతో జీవితం గడుపుతాడు. ఇచ్చిన వారికి నమస్కారం చేస్తాడు. ఇవ్వకపోతే పట్టించుకోడు. అలాగే ఒక వ్యక్తి ముందు చేయి ఊపుతాడు. ఆ వ్యక్తి, దొరైరాజ్ ను ఆప్యాయంగా దగ్గరికి పిలుస్తాడు. పేరు అడుగుతాడు. నిర్లక్ష్యంగా తన పేరు చెబుతాడు దొరైరాజ్, చేతిలో చిల్లర పైసల్ని ఎగరేసుకొంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న దొరైరాజ్ న్ను చూసి, ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి. ఇది ఆ కథ, అంటే జీవితం గడవక పోయినా, గడిచినా ఎవరి ధోరణి వారిది. ఎవ్వరూ తమ ధోరణిని మార్చుకోరు. ఆప్యాయతలు, అనురాగాలతో పనిలేదు. తమ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టరు. అలాగ అనాథలైన పిల్లలను చేరదీయాలి. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని ఉన్నా ఆ అనాథలు రావాలి కదా! మారాలి కదా ! అవకాశాలు వినియోగించుకోవాలి కదా !

ఉ) రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడి గురించి వృద్ధుడు ఏం చేశాడు?
జవాబు:
రైలు పెట్టెలో ఊడుస్తున్న బాలుడిని పరీక్షించాలనుకొన్నాడు. నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ పిల్లవానిని గమనించాడు. పనిలో శ్రద్ధను పరిశీలించాడు. ఆనందించాడు. ఐదు రూపాయిల కాగితం జారవిడిచాడు. దానిని ఆ కుర్రవాడు ఆ కాగితాన్ని తీసి, వృద్ధుని లేపి ఇచ్చేశాడు. అతని నిజాయితీ వృదుని ఆనంద సంభ్రమాలలో ముంచింది. ఒక పావలా ఇచ్చాడు. ఆ కుర్రవాడు అది అందుకొని, నమస్కరించాడు. తర్వాత తన పనిలో లీనమయ్యాడు. తర్వాత ఆ పిల్లవానిని పిలిచి, కుశలప్రశ్నలు వేశాడు. తనతో రమ్మన్నాడు. ఆలనాపాలనా చూశాడు. చదువు చెప్పించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. వాడు జీవితంలో స్థిరపడ్డాడు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.

అ) “గోరంత దీపం” కథానిక ద్వారా మీరు గ్రహించిన ముఖ్యమైన ఐదు విషయాలు రాయండి.
జవాబు:
గోరంత దీపం కథానికలో వృద్ధుని ద్వారా అనాథలను అక్కున చేర్చుకొని, ఆదుకోవాలి అని తెలుసుకొన్నాము. ఆదుకొంటే ఆ గోరంత దీపాలే సమాజానికి కొండంత వెలుగునిస్తాయి అని తెలుసుకొన్నాము. కుర్రవాని పాత్ర ద్వారా, నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలి అని తెలుసుకొన్నాం. మనకు ఉపకారం చేసిన వారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి అని తెలుసుకొన్నాం. పెద్దలతో స్నేహంగా ఉండాలి. వారి అనుభవాలను వినాలి, వారు చెప్పే విషయాలు విని, ఆచరిస్తే జీవితంలో ఉన్నతులుగా గుర్తించబడతామని తెలుసుకొన్నాం, వేపచెట్టులోని ఔషధ గుణాలు కూడా తెలిసాయి.

ఆ) “ఆ కుర్రవాడి బతుకుమీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను.” అన్న వృద్ధుడు ఏం ప్రయత్నం చేశాడు? దాని ఫలితం ఎలా ఉంది?
జవాబు:
వృద్ధుడు రైలు పెట్టెలోని అనాథబాలుని గమనించాడు. అతనికి పనిపై ఉన్న శ్రద్ధను గమనించాడు. తను చదివిన కథ దీనికి బలం చేకూర్చింది, ఆ పిల్లవాడి నిజాయితీ పరీక్షించాలనుకొన్నాడు. ఐదు రూపాయిలనోటు జారవిడిచి, నిద్రపోతున్నట్లు నటించాడు. ఆ కుర్రవాడు ఆ నోటును తీసి, వృద్ధుని నిద్రలేపి ఇచ్చేశాడు. కుర్రవాడికి ఒక పావలా ఇచ్చాడు. నమస్కరించి, తనపనిలో లీనమయ్యాడు కుర్రవాడు.
అతనికి ఉన్న పనిపట్ల శ్రద్ధ, కష్టపడే స్వభావం, నిజాయితీ వృద్ధునికి నచ్చాయి, చేరదీసి చదివించాడు. కష్టపడి చదువుకొన్నాడు. మంచి ఉద్యోగి అయ్యాడు. ఆ బాలుడి జీవితం స్థిరపడింది. వృద్ధుని ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

ఇ) “బాబూ! ఈ వయస్సులో చదువుకొంటే, ఆ వయస్సులో సంపాదించుకోవచ్చు”ఈ వాక్యం గురించి మీ అభిప్రాయాల్ని రాయండి.
జవాబు:
ఎవరైనా చిన్నతనంలో చదువుకోవాలి. బాల్యం జీవితానికి పునాది వంటిది. బాల్యంలోని ప్రవర్తనను బట్టి ఆ మనిషి
జీవితం ఉంటుంది. బాల్యంలో బాగా చదువుకొంటే, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. డబ్బు సంపాదించుకొని జీవిత మంతా సుఖపడవచ్చును. 100 సంవత్సరాల జీవితంలో మొదటి ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొంటే మిగిలిన 80 సంవత్సరాలూ సుఖపడవచ్చు. మొదటి ఇరవై సంవత్సరాలు చదువుకోకుండా, డబ్బులు సంపాదించుకొంటూ సుఖపడితే, మిగిలిన 80 సంవత్సరాలూ కష్టపడాలి. అందుకే ‘పిల్లలు బడికి – పెద్దలు పనికి’, ‘పనికెందుకు తొందర ? చదువుకో
ముందర’ అని ప్రభుత్వం నినాదిస్తోంది.

ఈ) ‘ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలే మన నేస్తాలు’ అనే వాక్యంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు?
జవాబు:
ఒంటరిగా ఉన్నప్పుడు తప్పని సరిగా పుస్తకాలే మన నేస్తాలు అనే వాక్యంతో ఎవరైనా ఏకీభవించాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. వాటిలో చెడు ఆలోచనలు కూడా రావచ్చును. ఏదైనా పుస్తకం చదువుకొంటే అటువంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉండదు. సమయం కూడా తెలియదు. జ్ఞానం పెంపొందుతుంది. పుస్తకాలలో కూడా మంచి ఉన్నత విలువలతో కూడిన వాటిని మాత్రమే చదవాలి. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఒంటరితనం మరచిపోతాం. “ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం” అని ఆర్యోక్తి. అందుచేత పుస్తకాలే మన నేస్తాలుగా చేసుకొంటే, ప్రపంచమంతా మన కుటుంబమవుతుంది.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) “గోరంతదీపాలు” కథానికలోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
గమనిక :
ఏ పాత్ర స్వభావం రాయాలన్నా కథలోని ఆ పాత్ర ప్రవర్తన, మాటల తీరును గమనించాలి. ఆ విషయాన్నే సొంతమాటలలో రాయాలి.

వృద్ధుడు :
నేస్తాలు లేనపుడు పుస్తకాలే మన నేస్తాలని భావించే స్వభావం కలవాడు. కేవలం పుస్తకాలలో చదవడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టే స్వభావం కలవాడు. పరోపకారి. ముఖ్యంగా అనాథలను, వృద్ధులను ఆదరిస్తాడు, అతిథులను గౌరవిస్తాడు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తాడు. దైవభక్తి కలవాడు, నీతి నిజాయితీలు కలవారిని, నిబద్ధతతో, శ్రద్ధతో పనిచేసే వారిని ఇష్టపడతాడు. పచ్చటి ప్రకృతిలో జీవించడమంటే ఇష్టపడతాడు.

గొప్పతనం :
ఒక అనాథను పరీక్షించాడు. అతని నీతి నిజాయితీలను తెలుసుకొన్నాడు, పనిపట్ల శ్రద్ధను గమనించాడు, చదివించాడు. పెళ్ళి చేశాడు. ఉద్యోగం వచ్చింది. అతను స్థిరపడ్డాడు. అనాథలోని మంచి గుణాలను గుర్తించి, తీర్చిదిద్దిన మహోన్నతుడు, ఒక్కడినే కాదు వేలాది మంది బాలబాలికలను తీర్చిదిద్దాడు. వందల మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించిన మహానుభావుడు వృద్ధుడు.

ఆ) వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వారి మధ్య ఉన్న సంబంధాన్ని, అనురాగాన్ని మీ సొంతమాటల్లో వివరించండి.
(లేదా)
‘గోరంతదీపం’ కథానిక ద్వారా వృద్ధుడు, ప్రయోజకుడైన యువకుని మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో విశ్లేషిస్తూ సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
వృద్ధునికి, యువకునికి మధ్య ఉన్న సంబంధం తల్లీ పిల్లల అనుబంధం కంటె గొప్పది. తండ్రీ తనయుల సంబంధం కంటే మిన్న, భగవంతునికి భక్తునికీ మధ్య ఉన్న సంబంధం వంటిది అని చెప్పవచ్చును. ఇద్దరు సత్పురుషుల మధ్య సంబంధం ఏర్పడితే అలాగే ఉంటుంది.

ప్రయోజకుడైన యువకుడు వృద్ధుని వద్ద నిలబడిన తీరు, అతని వేషం గమనిస్తే ఇది బోధపడుతుంది. భగవంతుడు ప్రత్యక్షమైతే, భక్తుడు ఎంత పరవశిస్తాడో అంతగా పరవశించాడు వృద్ధుని చూసిన యువకుడు. ఆ వృద్ధుని పాదాలకు కన్నీటితో అభిషేకం చేసిన తీరును గమనిస్తే అతనికి గల గౌరవభావన తెలుస్తుంది. అతనిని ఆశీర్వదిస్తున్న వృద్ధుని కళ్ళలోని ఆనందభాష్పాలు చూస్తే అతని పట్ల గల వాత్సల్యం తెలుస్తుంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వృద్ధుడికి తనకంటే కూడా ఆ కుర్రవాడంటేనే ఇష్టం. అలాగే ఆ కుర్రవానికీ, వారిద్దరి అనురాగాన్ని గమనిస్తే ఒకే ప్రాణం రెండు శరీరాలలో ఉందేమో అనిపిస్తుంది.

ఇద్దరూ అదృష్టవంతులే. అనాథ కుర్రవాడు అదృష్టవంతుడు కనుకనే వృద్ధుడు రైలు పెట్టెలో కనిపించాడు. చేరదీశాడు, ఆలనాపాలనా చూశాడు, చదువు చెప్పించాడు, పెండ్లి చేశాడు. ఉద్యోగం సంపాదించుకొందుకు దారి చూపాడు. ఎటో పోవలసిన జీవితం గౌరవంగా స్థిరపడింది.

వృద్ధుడు కూడా అదృష్టవంతుడే తన అంచనా తప్పు కాలేదు. తను పడిన శ్రమ ఫలించింది. అతని జీవితం బాగుపడింది. ప్రయోజకుడయ్యాక కూడా తనపట్ల కృతజ్ఞతతో ఉన్నాడు. జీవితాంతం ఉంటాడు. అటువంటి భక్తిప్రపత్తులు కలవాడు దొరకడం వృద్ధుని అదృష్టం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ‘విద్యాలయం’ ఆవరణ ఎలా ఉందో పాఠంలో వర్ణించిన విధానం చదివారు కదా! దీని ఆధారంగా, మీరు మీ పాఠశాల గురించి లేదా ఒక పర్యాటక క్షేత్రాన్ని గురించి వర్ణించి రాయండి.
జవాబు:
పాఠశాల : మా పాఠశాల చాలా బాగుంటుంది. మా పాఠశాల సరస్వతీ మాత నిలయం. మా పాఠశాల ఆవరణచుట్టూ పచ్చటి చెట్లతో నిండి ఉంటుంది. పూల మొక్కలు వరుసలలో ఉంటాయి. క్రోటన్సు మొక్కలు పూల మొక్కలకు రక్షక భటులుగా ఉంటాయి. రకరకాల పళ్ళనిచ్చే చెట్లు కూడా ఉన్నాయి. దానిమ్మ, జామ, కమలా, బత్తాయి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు కూడా ఉన్నాయి.

మా పాఠశాలలో 20 తరగతి గదులున్నాయి. అన్ని గదులూ అందంగా అలకరించి ఉంటాయి. మచ్చుకైనా ఎక్కడా చెత్త కనబడదు. తరగతి గదులలోని గోడలకు పిల్లలు వేసిన బొమ్మల చార్టులు, కవితలు, కథల చార్టులు ఉంటాయి. మా పాఠశాల గోడ పత్రికలలో రోజూ ఏవేవో కథలూ, కవితలూ, కార్టూన్లూ, సూక్తులూ వచ్చి చేరుతుంటాయి. మా ఉపాధ్యాయులు జ్ఞాన జ్యోతులు. చిరునవ్వుతో పాఠాలు చెబుతారు. కథలు కూడా చెబుతారు. ఎన్నో మంచి విషయాలు చెబుతారు. మమ్మల్ని చెప్పమంటారు. ఆలోచించమంటారు.

మా పాఠశాల ఆటస్థలం 500 చదరపు గజాలు ఉంటుంది. అన్ని రకాల ఆటలు ఆడతాము. అనేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. పెద్ద గ్రంథాలయం కూడా ఉంది. 6 బీరువాల పుస్తకాలు ఉన్నాయి. నాకు మా పాఠశాల అంటే చాలా ఇష్టం.

పర్యాటక క్షేత్రం :
తిరుపతి మంచి పర్యాటక క్షేత్రం. ఎంతో మంది భక్తులు రోజూ తిరుమలకు వస్తారు. తిరుమల కొండ నడిచి ఎక్కేటపుడు చాలా బాగుంటుంది. ఎంత దూరం నడిచినా తరగదు. కొండదారి, చుట్టూ అడవి. జింకలు కనబడతాయి. అవి భలే గంతులువేస్తూ పరుగెడతాయి. మోకాటి పర్వతం మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. ఆకాశంలో చందమామలాగా ఎక్కడో పైన గోవిందనామాలు కనిపిస్తుంటాయి. చుట్టూ అడవులలో దట్టమైన పొదలు, పెద్ద పెద్ద చెట్లు, తీగలు కనిపిస్తాయి. మా సైన్సు టీచర్లనడిగి వాటి పేర్లు, లక్షణాలు తెలుసుకొన్నాం. గుడిలోకి వెడితే శ్రమంతా మరచిపోతాం. అంత ప్రశాంతత. నాకైతే తిరుమల అంటే చాలా ఇష్టం. సువర్ణ ముఖీ నదిలో స్నానం చాలా బాగుంటుంది.
(గమనిక : విద్యార్థులు ఏ క్షేత్రాన్నినా వర్ణించవచ్చు. )

అ) పాఠంలో “దాదాపు రెండు, మూడు ……… పరవశంతో పాడుతున్నారు” పేరా చదవండి. దీనికి సంబంధించిన చిత్రం ీయండి. రంగులు వేయండి. కవిత రాయండి.
జవాబు:
(గమనిక : డ్రాయింగు మాష్టారు వద్ద చిత్రం నేర్చుకొని గీయాలి. రంగులు వేయాలి.)
కవిత :
విస్తీర్ణం చూడండి రెండు, మూడు చదరపు మైళ్ళూ
వేపచెట్టు, రావిచెట్లు, జవ్విచెట్లు, మర్రిచెట్లి పిట్టల లోగిళ్ళూ
పూల బాల పాదులలో కిలకిల లాడాలి
కూరల సుకుమారం తోటలలో కలకలలాడాలి.
సంజవెలుగు కెంజాయకు బంగారం తళతళలూ
అనుభూతుల హృదయాలకు అనురాగపు స్నానాలూ
నక్కినక్కి చక్కనైన చిలకమ్మా, కోకిలమ్మా
పాలపిట్ట, పరవశించి పాటలందుకొన్నాయి.

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని

మీ పాఠశాల గ్రంథాలయంలోని ఏదైనా కథల పుస్తకం నుంచి గాని లేదా ఏదైనా పత్రిక నుంచి గాని సామాజిక సేవ, మానవ సంబంధాలు, గురుశిష్య సంబంధం మొదలైన విషయాలకు సంబంధించిన మంచి కథను చదివి ఎంపిక చేయండి. దాన్ని రాసి ప్రదర్శించండి. అది మీకు ఎందుకు నచ్చిందో, దాంట్లోని గొప్పతనమేమిటో నివేదిక రాయండి.
జవాబు:
(గమనిక : కనీసం 10 వాక్యాలలో రాస్తే చాలును)

III. భాషాంశాలు

పదజాలం

1) ఈ కింద ఇచ్చిన రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.

అ) వినయం – విధేయత
జవాబు:
సొంతవాక్యం : వినయం – విధేయత నేర్పని చదువుల వలన ప్రయోజనం లేదు.

ఆ) రాజు – మకుటం
జవాబు:
సొంతవాక్యం : ధరణికి వెలుగు రాజు – మకుటం కాంతిని బట్టి ఉంటుంది.

ఇ) ప్రదేశం – ప్రశాంతత
జవాబు:
సొంతవాక్యం : నివాస ప్రదేశం – ప్రశాంతత కలిగినదైతే అన్ని సౌఖ్యాలూ ఉన్నట్లే.

ఈ) గుడిసె – దీపం
జవాబు:
సొంతవాక్యం : కనీసం గుడిసె – దీపం లేని బతుకులెన్నో దేశంలో ఉన్నాయి.

ఉ) ప్రయాణం – సౌకర్యం
జవాబు:
సొంతవాక్యం : ఈ రోజులలో ప్రయాణం – సౌకర్యంలేని ఊరులేదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సంజవెలుగులో తటాకంలోని నీరు కొత్త అందం సంతరించుకుంది.
సంజవెలుగు = సంధ్యా సమయంలో వెలువడే కాంతి.

అ) నా పుట్టిన రోజున మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను.
జవాబు:
ఆశీర్వాదం : దీవెన

ఆ) రాజు ప్రకృతి అందాల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు.
జవాబు:
తదేకంగా = అది ఒకటే (పని) అన్నట్లుగా

ఇ) శివ పుస్తకాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
జవాబు:
కాలక్షేపం – సమయం గడపడం

ఈ) రాణి ముఖం నిండా పసుపు పులుముకుంది.
జవాబు:
పులుము = పూసు

ఉ) లత పాఠాన్ని చక్కగా ఆకళింపు చేసుకొంది.
జవాబు:
ఆకళింపు. – అవగాహన

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
ఆ) సమయం – బుద్ధి, సంకేతము, ప్రతిజ్ఞ
ఇ) కృషి – స్త్రీ, సేద్యము, కరిసనము
ఈ) కన్ను ‘ – ఏరు, వలిపము, తీరు
ఉ) కొమ్మ – శాఖ, ఆడుది, కోటకొమ్మ
ఊ) ఆశ – దిక్కు కోరిక

4. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) పక్షి – నీడజము, ద్విజము, పతగము
ఆ) నేత్రం – అక్షి, చక్షువు, నయనం
ఇ) శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకము
ఈ) సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
ఉ) చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షము
ఊ) కొండ – అచలము, శైల్యము, ఆహార్యము

5. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.
అ) అతిథి – తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనమునకు వచ్చువాడు.
ఆ) అక్షరం – నాశనము పొందనిది (వర్ణము)
ఇ) పక్షి – పక్షములు కలది (విహంగము)
ఈ) మౌని – మౌనము దాల్చియుండువాడు (ఋషి)

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

6. అనాథలను చేరదీసే సంస్థలను అనాథ శరణాలయాలు అంటారు కదా ! ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని రాయండి.

అ) పక్షులను రక్షించే సంస్థ :
జవాబు:
పక్షి సంరక్షణ కేంద్రం

ఆ) జంతువులను రక్షించే సంస్థ :
జవాబు:
జంతు ప్రదర్శనశాల

ఇ) వృద్ధులను చేరదీసే సంస్థ :
జవాబు:
వృద్ధాశ్రమం

ఈ) మనోవైకల్యం గలవాళ్ళకు చేయూతనిచ్చే సంస్థ :
జవాబు:
మనోపునర్వ్యవస్థీకరణ సంస్థ

ఉ) కుష్ఠురోగుల పునరావాస కేంద్రం :
జవాబు:
కుష్టువ్యాధి నిరోధక మరియు ఆరోగ్య సంస్థ

వ్యాకరణాంశాలు

1) కింది పదాల్లోని పుంప్వాదేశ సంధి, టుగాగమ సంధి, అత్వ సంధి, ద్విరుక్తటకార సంధుల పదాలను గుర్తించి, విడదీసి సూత్రాలను రాయండి.
సరసంపుమాట, కట్టెదుట, చింతాకు, తూగుటుయ్యేల, నట్టడవి, ముద్దుటుంగరము, మధురంపుకావ్యం, పల్లెటూరు, రామయ్య

పుంప్వాదేశ సంధి : 2
1) సరసము + మాట = సరసంపుమాట
2) మధురము + కావ్యం – మధురంపు కావ్యం
సూత్రం :
కర్మధారయము నందు “ము” వర్ణకములకు పుంపులగు.

టుగాగమ సంధి :
1) తూగు + ఉయ్యేల = తూగుటుయ్యేల
2) పల్లె + ఊరు = పల్లెటూరు
3) ముద్దు + ఉంగరము = ముద్దుటుంగరము
సూత్రం :
కర్మధారయములందు ఉత్తున కచ్చు పరమగునపుడు టుగాగమంబగు.

అత్వసంధి :
1) రామ + అయ్య = రామయ్య
2) చింత + ఆకు = చింతాకు
సూత్రం : అత్తునకు సంధి బహుళంబుగానగు.

ద్విరుక్తటకారాదేశ సంధి :
1) కడు + ఎదుట = కట్టెదుట
2) నడు + అడవి = నట్టడవి
సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఐ, డ లకు అచ్చు పరమగునపుడు ద్విరుక్తటకారంబగు.

సకార త వర్గం శకార చ వర్గం
ఝు

శ్చుత్వ సంధి :
క్రింది ఉదాహరణలు పరిశీలించండి.
నిస్ + చింత = నిశ్చింత
సత్ + ఛాత్రుడు = సచ్చాత్రుడు
శరత్ + చంద్రికలు = శరచ్చంద్రికలు
జగత్ + జనని = జగజ్జనని
శార్జ్గిన్ + జయః – శార్జ్గియః

పై ఉదాహరణలలో మొదటి పదాల (నిస్, సత్, శరత్, జగత్, శార్జిన్) లో దాంతాలుగా ‘స’ కారం కాని, ‘త’ వర్గ కాని ఉంది. వాటికి ‘శ’ కారం కాని, ‘చ’ వర్గ (చ, ఛ, జ, ఝు, ఞ) కాని పరమైంది. శాంతి, ఛాత్రుడు, చంద్రిక, జనని, జయః లలో మొదటి అక్షరాలైన శ,చ,ఛ,జ పరమయ్యా యి. అప్పుడు వరుసగా “శ, ఛ, చ, జ, ఞ” లు ఆదేశమయ్యా యి కదా ! దీనిని సూత్రీకరిస్తే : ‘స’ కార ‘త’ వర్గ అక్షరాలకు ‘శ’ వర్ణ ‘చ’వర్గాలతో సంధి కలిస్తే ‘శ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అభ్యాసం:
సత్ + జనుడు = సజ్జనుడు
సత్ + చరిత్రము = సచ్చరిత్రము

సూత్రం :
‘స’ కార ‘త’ వర్గ అక్షరాల (త, థ, ద, ధ, న) కు ‘శ’ వర్ణ, ‘చ’ వర్గాక్షరాలతో సంధి కలిస్తే ‘శ’ వర్ణ ‘చ’ వర్గాలే ఆదేశంగా వస్తాయి.

అదనపు సమాచారము

సంధులు

1) గ్రంథాలయం గ్రంథ + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
2) ప్రార్థనాలయం = ప్రార్థన + ఆలయం – సవర్ణదీర్ఘ సంధి
3) ఆనందానుభూతి = ఆనంద + అనుభూతి – సవర్ణదీర్ఘ సంధి
4) జీవితానుభవం = జీవిత + అనుభవం – సవర్ణదీర్ఘ సంధి
5) పరహితార్థం = పరహిత + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
6) స్వార్థం = స్వ + అర్థం – సవర్ణదీర్ఘ సంధి
7) వయోవృద్ధులు = వయః + వృద్ధులు – విసర్గ సంధి
8) అహరహం = అహః + అహం – విసర్గ సంధి (విసర్గ రేఫగా మారడం)
9) ఏమంటావు = ఏమి + అంటావు – ఇత్వ సంధి
10) ఏమనుకున్నావు = ఏమి + అనుకున్నావు – ఇత్వ సంధి
11) చేయెత్తి = చేయి + ఎత్తి – ఇత్వ సంధి
12) – కొండంత = కొండ + అంత – అత్వ సంధి
13) గొంతెత్తి = గొంతు + ఎత్తి – ఉత్వ సంధి –
14) పాదాలు = పాదము = లు – లులన సంధి
15) ముత్యాలు = ముత్యము + లు – లులన సంధి
16) అడ్డం పెట్టు = అడ్డము + పెట్టు – పడ్వాది సంధి
17) ఆశ్చర్యపడు = ఆశ్చర్యము + పడు – పడ్వాది సంధి
18) తదేకంగా = తత్ + ఏకంగా – జత్త్వ సంధి
19) భవిష్యజ్జీవితం = భవిష్యత్ + జీవితం – శ్చుత్వ సంధి

సమాసాలు

సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
1) వేపచెట్టు ‘వేము’ అనే పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
2) రావి చెట్టు ‘రావి’ అనే పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
3) నాలుగుదిక్కులు నాలుగైన దిక్కులు ద్విగు సమాసం
4) నాలుగు బారలు నాలుగైన బారలు ద్విగు సమాసం
5) రెండు చేతులు రెండైన చేతులు ద్విగు సమాసం
6) నాలుగడుగులు నాలుగయిన అడుగులు ద్విగు సమాసం
7) ఏడు గంటలు ఏడు సంఖ్య గల గంటలు ద్విగు సమాసం
8) రెండు రోజులు రెండు సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
9) నికృష్ట జీవితం నికృష్టమైన జీవితం విశేషణ పూర్వపద కర్మధారయం
10) మహాయోగి గొప్పవాడయిన యోగి విశేషణ పూర్వపద కర్మధారయం
11) మహా మెరుపు గొప్పదయిన మెరుపు విశేషణ పూర్వపద కర్మధారయం
12) అరమోడ్పు కనులు అరమోడ్పయిన కనులు విశేషణ పూర్వపద కర్మధారయం
13) చిరునవ్వు చిన్నదయిన నవ్వు విశేషణ పూర్వపద కర్మధారయం
14) ముగ్గమనోహరం ముగ్ధము, మనోహరము విశేషణ ఉభయపద కర్మధారయం
15) సంజ వెలుగు సంజ యొక్క వెలుగు షష్ఠీ తత్పురుష సమాసం
16) గ్రంథాలయం గ్రంథములకు ఆలయం షష్ఠీ తత్పురుష సమాసం
17) కనుల పండువు కనులకు పండువు షష్ఠీ తత్పురుష సమాసం
18) మబ్బు తునకలు మబ్బు యొక్క తునకలు షష్ఠీ తత్పురుష సమాసం
19) చేతి చలువ చేతి యొక్క చలువ షష్ఠీ తత్పురుష సమాసం
20) జీవితానుభవం జీవితమందలి అనుభవం సప్తమీ తత్పురుష సమాసం
21) వయోవృద్ధులు వయస్సు చేత వృద్ధులు తృతీయా తత్పురుష సమాసం
22) ప్రార్థనాలయం ప్రార్థన కొఱకు ఆలయం చతుర్డీ తత్పురుషం
23) అనిర్వచనీయం నిర్వచనీయం కానిది నఞ్ తత్పురుషం
24) బాలబాలికలు బాలురును, బాలికలును ద్వంద్వ సమాసం
25) నిమీలిత నేత్రుడు నిమీలితములయిన నేత్రములు గలవాడు బహువ్రీహి సమాసం

ప్రకృతి – వికృతి

వేషము – వేసము
ఆశ – ఆస
ముఖం – మొగం
సంధ్య – సంజ
పుష్పము – పూవు, పువ్వు
దీపము – దివ్వె
సంధి – సంది
కథ – కత
మౌక్తికము – ముత్యము, ముత్తియము
భృంగారము – బంగారము
నిమిషము – నిముసము
పీఠము – పీట
శక్తి – సత్తి
భారము – బరువు
భంగము – బన్నము
స్నేహము – నెయ్యము
పేటిక – పెట్టె

పర్యాయపదాలు

1) చెట్టు : 1) వృక్షము 2) తరువు 3) మహీరుహము
2) ముత్యము : 1) మౌక్తికము 2) ముక్తాఫలము 3) ఆణి
3) కన్నీరు : 1) అశ్రువు 2) బాష్పము 3) అస్రము
4) కన్ను : 1) నేత్రము 2) నయనము 3) చక్షువు
5) ఓర్పు : 1) తాల్మి 2) సహనము 3) ఓరిమి

నానార్థాలు

1. ఆశ : కోరిక, దిక్కు
2. మాను : విడుచు, చెట్టు
3. పాదము : అడుగు, కాలు, పద్యపాదము, పాతిక
4. చిత్రము : చిత్తరువు, చమత్కారం, ఆట, ఆశ్చర్యము
5. సమయము : కాలము, శపథము, ఆజ్ఞ
6. కథ : కత, చెప్పడం, గౌరి
7. కద : దిక్కు, మరణము, ప్రక్క
8. అక్షరము : పరబ్రహ్మము, అక్కరము, నీరు, తపస్సు

రచయిత పరిచయం

కృష్ణారెడ్డి జననం :
పులికంటి కృష్ణారెడ్డి క్రీ.శ. 1931లో జన్మించారు. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని జక్కదన్న గ్రామం వీరి స్వగ్రామం. పులికంటి పాపమ్మ, గోవిందరెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరిది వ్యవసాయ కుటుంబం. మధ్యతరగతి కుటుంబం.

పులికంటి నటజీవితం:
పులికంటి కృష్ణారెడ్డి మంచి నటుడు, బెల్లంకొండ రామదాసు రచించిన ‘పునర్జన్మ’ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఆయన నటజీవితం ప్రారంభమైనది. నటునిగా చాలామందిచేత ప్రశంస లందుకొన్నాడు. మంచినటుడే కాక మంచి రచయిత కూడా.

రచనా వ్యాసంగం :
పులికంటి కృష్ణారెడ్డి పేరు వినగానే గుర్తు వచ్చేది కథా సాహిత్యం . 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడిన “గూడుకోసం గువ్వలు” ఆయన రచించిన మొదటి కథ. ‘నాలుగ్గాళ్ళ మండపం’ ఆయన మరో రచన. సుమారు 150 కథలు రచించారు.

అవీ – ఇవీ :
పులికంటి కృష్ణారెడ్డి మంచి బుర్రకథా కళాకారుడు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు మొదలైన అంశాల మీద సుమారు 100 బుర్రకథలను రచించాడు. వాటిని ప్రదర్శించి, అందరి మెప్పును పొందాడు. జనజీవనాన్ని ‘కళ్ళకు కట్టినట్టు రచనలు చేసిన దిట్ట. అంతేకాక, ఆయన జానపద కళాకారుడు, కవి. ప్రతిభాశాలియైన పులికంటి కృష్ణారెడ్డి గారు క్రీ.శ. 2007లో స్వర్గస్తులైనారు.

కఠిన పదాలకు అర్థాలు

బోదె = ప్రకాండము
కండ = మాంసము
కృతజ్ఞత = చేసిన మేలు మరచిపోకపోవడం
కనుకొలుకులు = కనుల చివరలు
యోగి = యోగాభ్యాసం చేయువాడు
మైలపరచడం = అశుచి చేయడం
బార = రెండుచేతులు పొడవుగా చాచిన మధ్యదూరం
తటస్థస్థితి = ఎటూకాని స్థితి
ఒడిసి = నేర్పుతో
మేరువు = బంగారు పర్వతం, దీనిపై దేవతలు విహరిస్తారు
విస్తీర్ణం = వ్యాపించిన ప్రాంతం
సంజ = సంధ్య
పరవశం = పరాధీనం
జోడించడం = జతచేయడం
చేతులు జోడించడం = నమస్కరించడం
హుందా = దర్జా
అతిథి = తిథితో నిమిత్తం లేకుండా వచ్చేవాడు
సదుపాయం = సౌకర్యం నివాసం
వసతి = ఉండే చోటు
మకుటం = కిరీటం
మారుపేరు = మరొక పేరు
లీనము = కలసిపోవడం, తన్మయం కావడం
గోరంత = చిన్నది
నిర్వర్తించడం = చేయడం
కొండంత = చాలా ఎక్కువ
అనుభూతి = అనుభవం
తేలిపోవడం = లీనమవడం
చెవిని పడడం = వినబడడం
బిలబిలా = అతి త్వరితముగా
గుమి = సమూహం
తెగిన గాలిపటం = తాడు విడిచిన
బొంగరం = ఎవరూ పట్టించుకోని అనాథ
మనిషి = విద్వాంసుడు
అక్షరసత్యం = కచ్చితమైన నిజం
స్మృతి = జ్ఞాపకం
వడదెబ్బ = వేడి తాకిడి
గుడ్డివెలుగు = తక్కువ వెలుగు
బుడ్డి దీపం = చిన్న దీపం
ఓనమాలు = అక్షరమాల
ధ్యేయం = లక్ష్యం
అహరహం = ప్రతిరోజు, నిరంతరం
పరహితం = ఇతరులకు మంచి
స్వార్థం = తన గురించి
గాలిలో కలిసిపోవడం = నాశనమైపోవడం, మిగలక పోవడం
కాచి వడబోయడం = బాగా అవగాహన చేసుకోవడం
పరమసత్యం = కచ్చితమైన నిజం
గాలివాటం = గాలి వీలు
నిదర్శనం = ఉదాహరణ
పరామర్శ = చక్కగా విచారించుట
ఏకాగ్రత = ఒకే విషయంపై దృష్టి నిలపడం

అలోచించండి- చెప్పండి

ప్రశ్న 1.
తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? వివరించండి.
జవాబు:
తల్లి ప్రేమ నిర్మలంగా ఉంటుంది. తల్లి, తన బిడ్డలకు తనకు ఉన్నదంతా పెట్టాలని కోరుకుంటుంది. బిడ్డలకు తన పాలను ఇచ్చి పెంచుతుంది. తన కడుపు కూడా కట్టుకొని, బిడ్డలకు పెడుతుంది. తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు.

ప్రశ్న 2.
వినయంతో నిలబడడం, వేషంలో సంస్కారం అంటే మీకేమర్థమైంది?
జవాబు:
వినయంతో నిలబడడంలో, ఎదుటి వ్యక్తి యందు, ఆ వ్యక్తికి గల గౌరవం, ప్రేమ, ఆదరం వెల్లడవుతాయి. వేషంలో సంస్కారం అంటే నిండుగా బట్టలు వేసుకోడం, చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని మర్యాదస్తులు ధరించే దుస్తులు ధరించడం.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అనిర్వచనీయమైన కృతజ్ఞతాభావాన్ని ఎవరి పట్ల, ఎందుకు ప్రదర్శిస్తారు?
జవాబు:
మన జీవితాన్ని మంచి దారిలో పెట్టినవారిపై కృతజ్ఞత ప్రదర్శిస్తాము. ఎదుటి వ్యక్తి తమకు చేసిన గొప్ప మేలునకు ప్రతిగా, ఆ వ్యక్తి యందు వ్యక్తులు కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. మనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం, వారి యందు పూజ్యభావం కలిగి యుండడం అన్నవి, మానవుని సంస్కారానికి గుర్తులు.

ప్రశ్న 4.
మీ బడి, మీ ఇల్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండా లంటే ఏం చేయాలి ? ఏం చేయకూడదు?
జవాబు:
బడిలో పిల్లలు అల్లరి చేయరాదు. క్రమశిక్షణతో మెలగాలి. పిల్లలు గురువుల యందు గౌరవం కలిగి ఉండాలి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల యందు గౌరవాదరాలు కలిగి ఉండాలి. అల్లరి పనులు, కొంటె పనులు చేయకూడదు. ఇంట్లో టి.వి ధ్వనిని బాగా పెంచరాదు. కోపంతో పరుష వాక్యాలు మాట్లాడరాదు. అప్పుడు ఇల్లు, బడి కూడా ప్రశాంతంగా ఉంటాయి.

ప్రశ్న 5.
విద్యాలయావరణం కనులపండువుగా ఉంది కదా? మీ కంటికి కనులపండువుగా ఏమేమి గోచరిస్తాయి?
జవాబు:
1) పద్మాలతో నిండిన చెరువును చూసినపుడు.
2) మా చెల్లి మంచి అందమైన గౌను వేసుకొని నగలు పెట్టుకున్నప్పుడు.
3) ఆగస్టు 15వ తేదీకి పాఠశాలను రంగు రంగు కాగితాలతో అలంకరించినపుడు.
4) సినిమాలలో అందమైన పార్కులలో, నటీనటులు నాట్యాలు చేస్తున్నప్పుడు, నాకు కనులపండువుగా ఉంటుంది.
(గమనిక : గ్రామం, బడి, ఇల్లు మొ|| వాటి గురించి విద్యార్థులంతా సొంతంగా మాట్లాడాలి.)

ప్రశ్న 6.
పెద్దల మాటలు, జీవితానుభవాలు అక్షరసత్యాలు ఎందుకో వివరించండి.
జవాబు:
పెద్దలు ఏది మాట్లాడినా తమ అనుభవాల నుండో, తాము చదివిన గ్రంథాల నుండో ఉదాహరిస్తారు. అవి వారి జీవితాన్ని ప్రభావితం చేసినవై ఉంటాయి. అవి పిల్లలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ‘పెద్దలమాట – చద్దిమూట’ అన్నారు పెద్దలు. పెద్దల మాటలు విని, ఆచరిస్తే కష్టాలు దరిదాపులకు రావు. వారి జీవితానుభవాలు కూడా పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. అవి పిల్లల జీవితాలకు దిక్సూచిల వంటివి. పెద్దలు తమ జీవితానుభవాలను పిల్లలకు చెప్పాలి. అందువల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి.

పరాకాష్ఠ = అత్యున్నత స్థితి
కుతూహలం = ఆత్రుత
వాయిదా = గడువు
గతాన్ని నెమరువేయడం = జరిగిన దానిని తలచుకోవడం
సందర్శనం = చూడడం
పుంగవము = ఎద్దు
పుంగవుడు = శ్రేష్ఠమైనవాడు
తలపు = ఆలోచన
ముగ్ధమనోహరం = అమాయకపు అందం
శ్రుతి = వినికిడి
నేస్తాలు = స్నేహితులు
అదిరిపడడం = భయపడడం
నివ్వెరపడు = ఆశ్చర్యపడడం
నిర్దాక్షిణ్యం = దయలేకపోవడం
పరధ్యానం = ఇతర ఆలోచన
నడివయస్సు = మధ్యవయస్సు (40-50 సం||లు)
పొదివి = జాగ్రత్తగా, అపురూపంగా
అథోగతి = హీనమైన స్థితి
పుట్టగతులుండవు = సర్వనాశనం
పొంతన = పోలిక
వేళకాని వేళ = అనువుకాని సమయం
మునుపు = పూర్వం
కుతూహలం = ఆత్రుత
నికృష్టం = అధమము
బుడతడు = చిన్నవాడు
నిర్లక్ష్యం = లక్ష్యం లేకపోవడం
ఉడాయించడం = పారిపోవడం
ధోరణి = విధానం
క్లుప్తం = సంక్షిప్తం, తగ్గించడం
ఏమరుపాటు = అకస్మాత్తుగా

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
సమయం, సందర్భం కలిసి రావడమంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
సమయం, సందర్భం కలిసి రావడమంటే, కాలమూ దానికి తగిన సంఘటన కలిసిరావడం. ఉదాహరణకు చదువుకొందుకు సరియైన సమయం ఉదయకాలం. ఉదయం 4 గంటల నుండి చదువుకొందుకు సరియైన సమయం. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏరకమైన అలజడులూ ఉండవు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అటువంటి సమయంలో చదువు కొంటే చదువు బాగా వస్తుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి.

ఆ సమయంలో చదవాలంటే మెలుకువ రాదు. మెలుకువగా ఉండాలంటే కొంచెం కష్టం. కనుక ఉదయం 4 గంటలకు ఎవరైనా ప్రయాణమై వెడుతుంటే, ఎలాగూ నిద్రలేస్తాం. ఆ ప్రయాణ సందర్భంగా నిద్రలేస్తాం. కనుక మంచి సమయం, సందర్భం కలిసివచ్చాయి. అప్పుడు చదువుకోవడం మంచిది.

అలాగే, కంచి దైవదర్శనానికి వెడతాం. అది మంచి సమయం కనుక అక్కడ ఉన్న చూడదగిన ప్రదేశాలన్నీ చూస్తాం. దేవాలయాలు కూడా చూస్తాం. కంచిలో పట్టుబట్టలు నాణ్యమైనవి. చౌకగా దొరుకుతాయి. అంతదూరం వెళ్ళాం. పట్టుబట్టల దుకాణాలు చూశాం. ఆ సందర్భంలో నచ్చిన బట్టలు కూడా కొనుక్కొంటే సమయం, సందర్భం కలిసి వస్తాయి.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 2.
“తెలుగు వారికి తెలుగంటే బోలెడంత అభిమానం” దీన్ని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
ఎవరి భాషపైన వారికి అభిమానం ఉంటుంది. ఈ విషయంలో తమిళనాడు వారే ఆదర్శవంతులు. వారు తమిళానికి ఇచ్చినంత గౌరవం ఏ భాషకూ ఇవ్వరు. వారు సాధ్యమైనంత వరకు తమిళంలోనే మాట్లాడతారు.

తెలుగు వారికీ తెలుగంటే అభిమానమే కాని, అంతేకాదు, మన వారికి పరభాషా వ్యా మోహం ఎక్కువ. తెలుగులో మాట్లాడడం నామోషీగా భావిస్తారు. పరభాషలలో మాట్లాడడం గొప్పతనంగా భావిస్తారు. తెలుగులో కూడా పరభాషా పదాలను ఎక్కువగా చేర్చి, మాట్లాడతారు. అది కొంతమంది తెలుగువారి పద్దతి.

తెలుగంటే ఎడతెగని అభిమానం కలవారు కూడా చాలామంది ఉన్నారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, కళాకారులు మొదలైనవారు. వారు తెలుగులోనే ఎంతో చమత్కారం కల పదాలు ప్రయోగిస్తూ చక్కగా మాట్లాడతారు. ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది. తెలుగులోని తియ్యదనం చవిచూస్తే జన్మ ధన్యమౌతుంది. తెలుగు పలుకుల వెలదికి తేనెచినుకుల చిలకరింపులకు మనసు పులకరిస్తుంది.

ప్రశ్న 3.
పిల్లలు ఎందుకోసం వచ్చి ఉంటారు? ఆయన వారితో ఏం మాట్లాడి ఉంటారు? ఊహించండి.
జవాబు:
పిల్లలు తమకు కావలసిన అవసరాలను ఆ వృద్ధునికి చెప్పాలని ఆయన దగ్గరికి వారు వచ్చి ఉంటారు. వారు తమకు పుస్తకాలు కావాలనో, వారు బడిలో ఫీజు కట్టాలనో, వారికి దుస్తులు కావాలనో ఆయనను అడిగి ఉంటారు.

ప్రశ్న 4.
కథల పుస్తకాలు లేదా ఇతర పుస్తకాల్లో బొమ్మలు ఎందుకు వేస్తారు?
జవాబు:
పుస్తకంలోని విషయం దేని గురించి ఉందో అట్లపై బొమ్మ చెబుతుంది. కథలోని విషయం కళ్ళకు కట్టినట్లు తెలియజెప్పడానికే బొమ్మలు వేస్తారు. బొమ్మను చూపి కథ ఊహించుకోవచ్చు. కాని, కథ పూర్తిగా అవగాహనకు రాదు. అదేమిటో తెలుసుకోవాలనే తపన బయలు దేరుతుంది. ఆ తపన తీరాలంటే ఆ కథ తెలియాలి. ఆ కథ తెలియాలంటే చదవాలి. అందుచేత బొమ్మ చూస్తే, అది ఆ కథను చదివిస్తుంది.

క్రింది తరగతులలోని పాఠ్యపుస్తకాలలోని బొమ్మలు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రేరేపించాయి. పాఠ్యపుస్తకం చేతికి రాగానే బొమ్మలు చూసేవాళ్ళం. ఆ బొమ్మలను బట్టి కథ ఊహించుకొని, ఆ పాఠం చదివేసేవాళ్ళం. పద్యాలైతే అర్థంగావు, కాని పాఠాలంటే భలే ఇష్టం. బొమ్మలు లేని పుస్తకం అలంకారాలు లేని మనిషిలా ఉంటుంది. సరిగ్గా సర్దుకోని ఇల్లులా ఉంటుంది. ఒక లక్ష్యం లేని జీవితంలా ఉంటుంది. బొమ్మలు పుస్తకాలకి ప్రాణం.

ప్రశ్న 5.
వృద్ధుడిని ఆకట్టుకొన్న బొమ్మ ఏమిటి? ఆ బొమ్మను చూసి ఎలాంటి అనుభూతిని పొందాడు?
జవాబు:
వృద్ధుడిని ఆకట్టుకొన్నది. రైలు పెట్టెలో యాచిస్తున్న కుర్రవాడి బొమ్మ, ఆ బొమ్మలోని కుర్రవాడిని చూడగానే రైలు పెట్టె తుడుస్తున్న కుర్రవాడిని తీసుకొనివచ్చి, చదివించి, ప్రయోజకుడిని చేయాలి అనిపించింది. అప్పుడు తన ఎదుట ఆ బొమ్మలోని కుర్రవాని వలె అనాథగా నిలుచున్నవాడే ఈ రోజు సంఘంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకొంటూ బ్రతుకుతున్నాడు.

చాలామంది కథలలోను, నవలలలోనూ ఆదర్శ వంతమైన ఊహలు రాస్తారు. ఉపన్యాసాలలో కూడా ఆదర్శవంతమైన మాటలు చెబుతారు. కాని, ఆచరణలో శూన్యం. కొందరు మాత్రం ఆ కథలు విని, ఉపన్యాసాలు విని అలా చేస్తారు. కాని, ఈ వృద్దుడు చేసిన ఆదర్శ వంతమైన పనికి మూలం కథ. అందుచేత వృద్ధుడు తాను చేసిన పనికి చాలా ఆనందానుభూతిని పొందాడు. మాటలలో వర్ణించలేనంత సంతృప్తిని పొందాడు.

ప్రశ్న 6.
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ ఏమై ఉంటుంది?
జవాబు:
వారపత్రికలో వృద్ధుడు చదివిన కథ బహుశః “రైలు పెట్టెల్లో చిక్కుకొన్న అనాథ బ్రతుకు” అనే కథ అయి ఉండవచ్చు.

స్వభావం = తనయొక్క భావం
తటాలున = అకస్మాత్తుగా
ఇంటివాడవ్వడం = పెళ్ళి చేసుకోవడం
గాద్గదికం = బొంగురు
పూడుకపోవడం = మూసుకొనిపోవడం
దీర్ఘవ్యాధి = చాలాకాలం ఉండే వ్యాధి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ణ జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనదే. ఎందుకంటే గృహహింస తట్టుకోలేక చాలామంది బాలలు ఇళ్ళలో నుండి పారిపోతారు. పిల్లల అభిప్రాయాలను పెద్దలు పట్టించుకోకపోయినా, వారికి ఇష్టంలేని పనులు చేయమని బలవంత పెట్టినా, కోప్పడినా పిల్లలు పారిపోతారు. తర్వాత వారు ఏ ముఠాలకో దొరుకుతారు. వారు, రైలు పెట్టెలు తుడిచే పనులు, భిక్షాటన, దొంగతనాలు మొదలైన వాటిలో ప్రవేశపెడతారు. ఇక ఆ పిల్లల జీవితాలు నికృష్టంగా తయారౌతాయి. తల్లి తండ్రులెవరో తెలియని అనాథ పిల్లల జీవితాలు కూడా ఇంతే, కొంతమంది పిల్లలను దొంగలు ఎత్తుకొనిపోయి కూడా ఇలాంటి పనులు చేయిస్తారు. అందుచేత వృద్ధుడి భావన సరైనది. సరైనది కాదు : రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి, ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారో అని వృద్ధుడు భావించడం సరైనది కాదు. ఎందుకంటే తను సుదీర్ఘమైన జీవితాన్ని చూసినవాడు, అనుభవం గడించిన వాడు. ఆ పిల్లలు అలాగ తయారు కావటానికి కారణం పెద్దలే. తమ పిల్లలను అపు రూపంగా చూసుకొంటే ఇలాంటి పరిస్థితులు రావు. దుర్వ్యసనాల పాలైన పెద్దలు పెట్టే బాధలను పిల్లలు భరించలేరు. కనీసం సమాజంలోని వాళ్ళు ఆ పిల్లలను పట్టించుకొని ఇళ్ళకు చేరిస్తే ఈ బాధలుండవు. కౌన్సిలింగ్ ద్వారా పిల్లల పెంపకంపై అవగాహన కలిగించాలి. లేదా చట్టప్రకారం చర్యలు తీసుకొనేలా చేయాలి. అన్నిటిపైనా అవగాహన గల ఆ వృద్ధుడు చేతగానివాడిలా బాధపడడం సమర్థనీయం కాదు. (సూచన : పై వానిలో ఒక అభిప్రాయమే గ్రహించాలి.
రెండూ గ్రహించకూడదు.)

ప్రశ్న 2.
“ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగు తుంది” దీంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
ఏ ప్రయత్నమూ లేకుండా కలిగే ఫలితం ఆనందం కలిగించదు. కష్టపడి పనిచేసి ఫలితాన్ని పొందితే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో చేసిన ప్రయత్నానికి ఫలితాన్ని మనం అనుభవించడమే దోపిడి అంటే అది మోసం, దగా, నయవంచన. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దానిలో కష్టాలు ఎదురుకావచ్చును. నష్టాలు రావచ్చును. బాధలు కలగవచ్చును. శ్రమ కలగవచ్చు. కొన్ని మాటలు కూడా పడవలసిరావచ్చును. కాని, ఫలితం అందుకోగానే అవన్నీ మరచిపోతాం. చాలా ఆనందం పొందుతాం. చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా గర్వంగా ఉంటుంది. ఉప్పొంగి పోతాం. పడిన శ్రమంతా మరచిపోతాం. గంతులు వేస్తాం, ఇంత హడావుడికి కారణం? మన ప్రయత్నంతో సాధించుకోవడం. అందుకే దేనినైనా సాధించుకోవాలి తప్ప దక్కించుకోకూడదు. యాచించకూడదు.

AP SSC 10th Class Telugu Solutions Chapter 10 గోరంత దీపాలు

ప్రశ్న 3.
అందరు పిల్లలూ తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా ! మరి అలా ఎందుకు జరగడం లేదు?
జవాబు:
మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. బీదల సంఖ్య ఎక్కువ. చిన్న చిన్న వృత్తులతో పొట్టపోసుకొనేవారు చాలామంది ఉన్నారు. కుటుంబంలోని వారంతా కష్టపడి డబ్బు సంపాదించకపోతే రోజు గడవదు. అందుచేత పిల్లలను కూడా డబ్బు కోసం పనులకు పంపుతారు. సంపాదనలో పెడతారు. సంచార జాతులవారు తమ పిల్లలను తమ కూడా తిప్పుకొంటారు. అందుచేత వారి పిల్లలు కూడా బడులకు రాలేరు.

కొంతమంది పిల్లలు మొండితనం, అల్లరి, అతిగారాబం వలన బడులకు వెళ్ళరు. వెళ్ళినా అక్కడ అందరితోటి కలవలేక బడి మానివేస్తారు. చిన్నతనం నుండీ పెద్దలు సరిగా పట్టించుకోక దురలవాట్లకు బానిసలౌతారు.

కొన్ని కుటుంబాలలోని ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహాలు చేసేస్తారు. అది కూడా బాలల విద్యాభ్యాసానికి ఆటంకంగా ఉంది. నిరక్షరాస్యత, నిరక్షరాస్యులకు అక్షరాల విలువ తెలియదు. తమకు చదువు లేకపోయినా చక్కగా గడుస్తోంది కదా ! దేనికీ లోటులేదు. అలాగే తమ పిల్లలకూ గడుస్తుంది అనే ఆలోచన. ఎంత చదువు చదివినా ఉద్యోగాలు రావు. అంతకంటే పని నేర్చుకొంటే నయం అనే భావన కూడా కారణం. బాలలు తప్పనిసరిగా బడికి రావాలంటే వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించాలి.

ప్రశ్న 4.
“గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావడం” అంటే, మీకేమి అర్థమైంది ? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది ? మీ అనుభవాలు తెల్పండి.
జవాబు:
కన్నుల వెంట నీరు రెండు సందర్భాల్లో వస్తుంది. దుఃఖం కలిగితే వస్తుంది. అలాకాక ఆనందం ఎక్కువగా వస్తే కన్నుల వెంట నీటి బిందువులు ముత్యాల్లా రాలుతాయి. వాటినే ఆనందబాష్పాలు అంటారు.
మనం ఊహించని మంచి మేలు జరిగితే, మనకు ఆనందబాష్పాలు వస్తాయి. అలాగే మనం విజయం సాధిస్తే ఆనందబాష్పాలు వస్తాయి.

నా అనుభవాలు :

  1. నాకు 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు వచ్చింది. అప్పుడు నాకు ఆనందబాష్పాలు వచ్చా యి.
  2. నాకు పాటల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ బహుమతి ఇచ్చే సందర్భంలో ఆనాడు పాఠశాలకు వచ్చిన ముఖ్యమంత్రి గారి ఎదుట నాచే ఆపాట పాడించారు. ఆ బహుమతిని నాకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు ఆనందబాష్పాలు వచ్చాయి.

ప్రశ్న 5.
“ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో ?” అనే ఆవేదన సరైందేనా? ఎందుకు?
జవాబు:
సరైనది :
వ్యక్తి బాధ్యతను సమాజం స్వీకరించాలి. ఒక వ్యక్తిని రక్షించి, తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారు తమ బాధ్యతను విస్మరిస్తే, ఆ బాధ్యతను సమాజం స్వీకరించాలి. వారికి రక్షణ కల్పించాలి. వారికి విద్యాబుద్ధులు నేర్పాలి. అప్పుడు వారు ప్రయోజకు లౌతారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడతారు. ఆ విధంగా ఆదుకొందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ధనవంతులు కొన్ని ‘ఆశ్రయ భవనాలను’ నిర్మించాలి. కొంతమంది ఉద్యోగులను కూడా నియమించాలి. అప్పుడే ఈ సమాజంలో అనాథలు, నిర్భాగ్యులు, నికృష్టజీవనులు ఉండరు. ముఖ్యంగా భావిభారత పౌరుల జీవితాలు ఆనందమయం అవుతాయి.

సరైనదికాదు :
పదిమంది వ్యక్తులు కలిస్తేనే సమాజం. అనేకమంది ఊహలకు రూపకల్పన సమాజం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. రకరకాల అవసరాలు ఉన్నవారు ఉంటారు, అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరి బాధలు వారివి. ఎవరి ఆనందాలు వారివి. ఒకరికి బాధకలిగితే, సమాజం ఓదార్చాలి. ధైర్యం చెప్పాలి. సహాయం చేయాలి. వెన్నుదన్నుగా నిలబడాలి. కాని, బాధ్యతలను స్వీకరించకూడదు. అది బద్ధకాన్ని నేర్పుతుంది. ఎవరి పిల్లలను వారు పెంచుకోవాలి. తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికంగా కాని, సామాజికంగా కాని సహాయం కావాలంటే సమాజం ఇవ్వాలి అంతేకాని, పిల్లలను పెంచే బాధ్యత కూడా సమాజమే స్వీకరిస్తే, వారు సోమరులుగా తయారౌతారు. పిల్లలను పట్టించుకోని పెద్దలను శిక్షించాలి. పిల్లల సంరక్షణకు చట్టాలు చేయాలి. కఠినంగా అమలుపరచాలి. అప్పుడే భావి భారతం ఆనందమయం అవుతుంది. పెద్దలకు బాధ్యత తెలుస్తుంది.
( గమనిక : పై వాటిలో ఏ అభిప్రాయమైనా చెప్ప వచ్చును. రెండూ చెప్పకూడదు.)