AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు Notes, Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Grammar Chandassu ఛందస్సు
కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.
1) లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు.” ఇవి హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.
2) గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె, ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు.”
గురులఘువుల గుర్తులు
లఘువు అని తెలుపడానికి గుర్తు : I ‘ల’
గురువు అని తెలుపడానికి గుర్తు : U ‘గ’
గురులఘువుల నిర్ణయం
ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధానము.
బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం:
గమనిక : గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు
1) ఋ కారంతో కూడిన అక్షరం సంయుక్తాక్షరం కాదు. ‘ఋ’ అనేది అచ్చు. అందువల్ల అది లఘువు. దానికి ముందు అక్షరం కూడా లఘువే.
2) సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే, అది గురువు అవుతుంది. లేకపోతే లఘువు అవుతుంది.
3) ఏకపదంలోనూ, సమాసంలోనూ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది. కాబట్టి అది గురువు అవుతుంది.
గణ విభజన
1) ఒకే అక్షరం గణాలు : ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
2) రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి. ఇవి నాలుగు రకాలు.
అభ్యాసము : రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
మూడక్షరాల గణాలు
మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గము :
య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణం పేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ గురు లఘువులు ఏ క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.
ఉదా : మీకు ‘య’ గణం యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
ఆ) మూడక్షరాల గణముల నిర్ణయంలో మరో పద్ధతి :
అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణం పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువులు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
ఉదా :
1) య గణం = యమాతా = I U U = ఆది లఘువు
2) మ గణం = మాతారా = U U U = సర్వ గురువు
3) త గణం= తారాజ = U U I = అంత్య లఘువు
4) ర గణం = రాజభా = U I U = మధ్య లఘువు
5) జ గణం = జభాన = I U I = భాన మధ్య గురువు
6) భ గణం = భానస = U I I = ఆది గురువు
7) న గణం = నసల = I I I = సర్వ లఘువులు
8) లగము (లేక ‘వ’ గణం) = I U (లఘువు, గురువు)
నాలుగు అక్షరాల గణాలు
సూర్య గణాలు – ఇంద్ర గణాలు
యతి – ప్రాసలు
I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికి, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ — సౌకర్యం కలుగుతుంది.
3. యతిమైత్రి :
పద్యపాదం యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.
1. ఉత్పలమాల
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
గమనిక :
పై పాదాల్లో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.
యతి :
పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గానీ ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతిమైత్రి’ లేదా యతిస్థానం అంటారు.
పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – అని జే – సి) యతి.
ప్రాస :
పై పద్యపాదాల్లో రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘య’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.
ఉత్పలమాల పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
2. చంపకమాల
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
చంపకమాల పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో అ – య).
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.
3. శార్దూలం
కింది పద్యపాదాన్ని పరిశీలించండి.
శార్దూల పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ఆ – యం).
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.
4. మత్తేభం:
కింది పద్య పాదాన్ని పరిశీలించండి.
మత్తేభ పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
- ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
- ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (ఈ పాదంలో ప – పా).
- ప్రాస నియమం ఉంటుంది.
- ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
5. తేటగీతి
తేటగీతి పద్య లక్షణాలు :
- ఇది ‘ఉపజాతి’ పద్యం.
- ఈ పద్యానికి నాలుగు పాదాలుంటాయి.
- ప్రతి పాదానికి ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
- నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం.
- ప్రాస యతి చెల్లుతుంది.
- ప్రాస నియమం లేదు.
ఉదా :
పై పద్యంలో 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
ఇక్కడ ‘ప్రాసయతి’ వాడబడింది.
6. ఆటవెలది
ఆటవెలది పద్య లక్షణాలు :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్య గణాలు, రెండు ఇంద్ర గణాల చొప్పున ఉంటాయి.
4) 2, 4 పాదాల్లో ఐదూ సూర్య గణాలే ఉంటాయి.
5) ప్రతి పాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరం యతి. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
6) ప్రాస నియమం పాటింపనవసరం లేదు.
ఉదా :
7. సీసం : (ఉపజాతి పద్యాలంటే తేటగీతి, ఆటవెలది, సీసం)
సీసము పద్య లక్షణాలు :
- సీస పద్యంలో నాలు పెద్ద పాదాలు ఉంటాయి. ఈ పెద్ద పాదం రెండు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలోనూ నాలుగేసి గణాల చొప్పున, ఒక్కొక్క పెద్ద పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో మొదట ఆరు ఇంద్ర గణాలు, చివర రెండు సూర్య గణాలు ఉంటాయి.
- సీస పద్యపాదంలోని రెండు భాగాల్లోనూ, ప్రతి భాగంలోనూ మూడవ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి ఉండాలి. యతిలేని చోట ప్రాసయతి ఉండవచ్చు.
- సీస పద్యంలో నాల్గు పెద్ద పాదాల తరువాత ఒక తేటగీతి గాని, ఆటవెలది గాని చేర్చాలి.
ఉదా :
8. ద్విపద
ద్విపద పద్య లక్షణాలు:
- ‘ద్విపద’ పద్యంలో రెండు పాదాలు ఉంటాయి.
- ప్రతి పాదంలోనూ వరుసగా మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణం ఉంటాయి.
- మూడవ గణం మొదటి అక్షరంతో యతి.
- ప్రాసయతి చెల్లుతుంది.
- ప్రాస నియమం పాటింపబడుతుంది.
గమనిక :
ప్రాస నియమం లేని ద్విపదను ‘మంజరీ ద్విపద’ అంటారు.
ఉదా :
9. కందం
కందం పద్య లక్షణాలు :
- ఈ ‘కందం’ పద్యములో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
- మొదటి పాదం ‘లఘువు’తో మొదలయితే అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం లఘువుగానే ఉండాలి. మొదటి . పాదము ‘గురువు’తో మొదలయితే, అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం గురువుగానే ఉండాలి. 3) రెండవ, నాల్గవ పాదాల్లోని చివరి అక్షరం గురువుగా ఉండాలి.
- 1, 2 పాదాలలో (3 + 5) 8 గణాలు; 3, 4 పాదాల్లో (3 + 5) = 8 గణాలు ఉంటాయి.
- 1, 2 పాదాలు, 3, 4 పాదాలు కలిసిన మొత్తం 8 గణాల్లో 6వ గణం “నలము” గాని ‘జగణం’ కాని కావాలి.
- బేసి గణం జగణం ఉండరాదు.
- ప్రాస నియమం ఉండాలి.
ఉదా :
వృత్తాలు – లక్షణాలు – సులభంగా గుర్తు పట్టడం
పద్యపాదాలను గుర్తించి, గణ విభజన చేయడం
ఈ క్రింది పద్యపాదాలకు గణ విభజన చేసి, అవి ఏ పద్యపాదాలో గుర్తించి, యతిని పేర్కొనండి.
1) వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేక దనంబున బేర్చి దిక్కులన్
జవాబు:
గమనిక : పై పద్యపాదంలో “భ, ర, న, భ, భ, ర, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్య పాదం. యతిస్థానం 10వ అక్షరం (వె – వే).
2) దెసలను కొమ్మ లొయ్యనతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం
జవాబు:
పై పద్యపాదంలో “న, జ, భ, జ, జ, జ, ర” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం. యతి స్థానం 11వ అక్షరం (దె – దీ)
3) ఆ యేమీ యొక రాణి వాసమును బుణ్యవాసమున్ దెచ్చినా
జవాబు:
పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది శార్దూల పద్యపాదం.. యతి స్థానము 13వ అక్షరం (ఆ – ణ్యా)
4) శివరాజంతట మేల్ము సుంగుఁదెరలో స్నిగ్దాంబుద చ్చాయలో
జవాబు:
పై పద్యపాదంలో “స, భ, ర, న, మ, య, వ” అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది మత్తేభ పద్యపాదం. యతి స్థానం 14వ అక్షరం (శి – స్ని).
ఛందస్సుపై ప్రశ్నలు
1) ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు, ఏ పద్యానికి చెందినవి ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
A) ఉత్పలమాల
2) ‘న జ భ జ జ జ ర’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
D) చంపకమాల
3) ‘మసజసతతగ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
D) శార్దూలం
4) ‘సభరనమయవ’ గణాలు ఏ పద్యానికి చెందినవి?
A) ఉత్పలమాల
B) మత్తేభము
C) శార్దూలము
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభము
5) 14వ అక్షరంతో యతి గల పద్యము
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
జవాబు:
D) మత్తేభము
6) ఉత్పలమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 11వ అక్షరం
B) 10వ అక్షరం
C) 13వ అక్షరం
D) 14వ అక్షరం
జవాబు:
B) 10వ అక్షరం
7) చంపకమాల పద్యానికి ఈ అక్షరంతో యతి
A) 10వ అక్షరం
B) 13వ అక్షరం
C) 14వ అక్షరం
D) 11వ అక్షరం
జవాబు:
D) 11వ అక్షరం
8) 13వ అక్షరంతో యతి గల పద్యం ఇది
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
A) శార్దూలము
9) ‘అతడు’ – ఇది ఏ గణమో గర్తించండి?
A)త గణం
B) ర గణం
C) భ గణం
D) య గణం
జవాబు:
C) భ గణం
10) ‘మీయయ్య’ – ఇది ఏ గణమో గుర్తించండి?
A) ర గణం
B) త గణం
C) న గణం
D) మ గణం
జవాబు:
B) త గణం
11) ‘శ్రీరామా’ అనే పదం ఈ గణానికి చెందింది.
A) మ గణం
B) న గణం
C) ర గణం
D) స గణం
జవాబు:
A) మ గణం
12) ‘సీస పద్యం ‘ మీద చేరే పద్యాలలో ఇది ఒకటి
A) కందము
B) తేటగీతి
C) ఉత్పలమాల
D) ద్విపద
జవాబు:
B) తేటగీతి
13) ‘తేటగీతి’ పద్యంలో యతి ఏది?
A) 3వ గణాద్యక్షరం
B) రెండవ గణాద్యక్షరం
C) నాల్గవ గణాద్యక్షరం
D) ఐదవ గణాద్యక్షరం
జవాబు:
C) నాల్గవ గణాద్యక్షరం
14) పద్యంలో ప్రాసాక్షరము ఏది?
A) 4
B) 2
C) 3
D) 1
జవాబు:
B) 2
15) ‘యతి’ అంటే ఎన్నవ అక్షరము?
A) మూడవ
B) రెండవ
C) ఒకటవ
D) నాల్గువ
జవాబు:
C) ఒకటవ
16) ‘ఆటవెలది’ పద్యానికి గల పాదాలు
A) 2
B) 4
C) 5
D) 6
జవాబు:
B) 4
17) “అనయము దోషమే పరులయందు కనుంగొనునట్టియా’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదము.
18 ‘పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో’ – ఈ పాదంలో గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి.
జవాబు:
ఇది ఉత్పలమాల పద్యపాదము.
19) సురుచిర తారకా కుసుమ శోభి నభోంగణ భూమిఁ గాలమన్’ – ఈ పాదానికి గురులఘువులు గుర్తించి, ఏ పద్యపాదమో పేర్కొనండి. పేర్కొనండి.
జవాబు:
ఇది చంపకమాల పద్యపాదము.