AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 10th Class Telugu లేఖలు Notes, Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu లేఖలు
ప్రశ్న 1.
మీ పాఠంలో హనుమంతుని శక్తి యుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ, అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
మిత్రునికి లేఖ విశాఖపట్టణం, మిత్రుడు ప్రసాద్ కు, మిత్రమా ! నీవు మన పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠం ‘సముద్రలంఘనం’ చదివావని అనుకుంటున్నాను. మాకు ఈ మధ్యనే మా తెలుగు పండితులు ఈ పాఠం చెప్పారు. ఈ పాఠం ‘అయ్యలరాజు రామభద్రుడు’ అనే మహాకవి రచించిన “రామాభ్యుదయము” అనే గ్రంథంలోనిది. రామాభ్యుదయంలోని కథ, సీతారామ కథయే. మన పాఠంలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టమును కవి “అద్భుతంగా” వర్ణించాడు. రామభద్రుడు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామాయణము ఒక తియ్యని కావ్యము. ఈ రామాభ్యుదయంలో కవి హనుమంతుని శక్తిని, పరాక్రమాన్ని గొప్పగా వర్ణించాడు. ఈ కవి ‘సకల కథాసార సంగ్రహం’ అనే మరో గ్రంథం కూడా రచించాడట. నేను ఈ రోజే “రామాభ్యుదయం” కావ్యం కొన్నాను. నీవు కూడా రామభద్రుని రచనలు తప్పక చదువు. ఆ కవిని గూర్చి, నీ అభిప్రాయం నాకు రాయి. ఉంటా. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 2.
మీ పాఠశాలను గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
తెనాలి, పి. రామచంద్ర, మిత్రుడు రవికాంత్ కు, నేను కొత్తగా చేరిన శారదా కాన్వెంట్ అందాల బృందావనంలా ఉంది. మా కాన్వెంట్ 5 ఎకరాల స్థలంలో ఉంది. ఎత్తైన భవనాలు ఉన్నాయి. ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఉన్నాయి. ముఖ్యంగా మా సైన్సు ప్రయోగశాలలు చక్కగా అన్ని పరికరాలతో అందంగా తీర్చిదిద్దినట్లుంటాయి. నిత్యం అసెంబ్లీ జరిగేచోట సరస్వతీ దేవి విగ్రహం రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ఉంటుంది. మా కాన్వెంటు అందం అంతా క్రీడా మైదానంలో ఉంది. అన్ని ఆటలకూ కోర్సులు ఉన్నాయి. మైదానం అంతా శుభ్రంగా ఉంటుంది. కాన్వెంటులో పూలతోట ఉంది. అక్కడ అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. కుళాయి నీరు 24 గంటలు వస్తుంది. బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు ఉన్నాయి. మా ప్రధానోపాధ్యాయుల గది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాన్వెంట్ లో చేరినందులకు సంతోషంగా ఉంది. ఉంటా. ఇట్లు, చిరునామా: |
ప్రశ్న 3.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
అమలాపురం
ప్రియమైన మిత్రుడు అనంత్ కు, నీకు శుభాక్షాంక్షలు – నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుచున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావనతో మన ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలు బాగుంటేనే మనదేశం ఆదర్శంగాను, ఆరోగ్యవంతంగాను ఉంటుంది. దాని కోసం మనమంతా పచ్చని చెట్లను నాటాలి. ఇంటిని, గ్రామాలను, నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారానే మనం దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాం. మన పాఠశాలల్లో ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపడదాం. మనం దీని కోసం సంకల్పం తీసుకుందాం ! పెద్దలకు నమస్కారాలు తెలుపగలవు. ఇట్లు, చిరునామా: |
ప్రశ్న 4.
పల్లెటూరులోని ప్రకృతి అందాలను, మానవ సంబంధాలను వివరిస్తూ మీ మిత్రుడు / మిత్రురాలికి ఒక లేఖ రాయండి.
జవాబు:
రాజమండ్రి, మిత్రుడు రంగారావుకు / మిత్రురాలు కవితకు, నీ లేఖ అందింది. ఈ మధ్య నేను మా అన్న పెళ్ళికి ‘కొమరగిరి పట్టణం’ అనే తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని ఒక పల్లెటూరికి వెళ్ళాను. ఆ పల్లెటూరిలో సుమారు 16 వేల మంది జనాభా ఉన్నారట. సుమారు 20 వేల ఎకరాలలో వరిపంట, ఐదు-ఆరు వేల ఎకరాలలో కొబ్బరి తోటలు ఆ ఊరిలో ఉన్నాయట. ఊళ్ళో అన్ని కులాల వారూ, అన్ని వృత్తుల వారూ ఉన్నారు. ఆ పెళ్ళి చేయించే పురోహితుణ్ణి, ఆ ఊరి కాపుగారు “బాబయ్యగారూ” అని ప్రేమగా పిలిచేవాడు. ప్రజలు ఎక్కువగా పేర్లు పెట్టికాక, పెద్దమ్మ, పిన్నమ్మ, అక్క బావ, మొదలయిన వరుసలు పెట్టి ప్రేమగా పిలుచుకున్నారు. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే ఆనందం వేసింది. రామేశ్వరం, లక్ష్మణేశ్వరంలలో అందమైన శివాలయాలు ఉన్నాయి. ఆ పల్లెటూరిలో ప్రకృతి శోభ, మహాద్భుతం. ఊళ్ళో పంటకాలువలూ, చెరువులూ ఉన్నాయి. ఫంటచేలు గాలికి తలలాడిస్తూ, మనల్ని పిలుస్తున్నట్లుంటాయి. కొబ్బరి తోటల్లో చెట్లు, నిండుగా గెలలతో కలకలలాడుతుంటాయి. కొబ్బరిచెట్టు, కల్పవృక్షం లాంటిది. పెళ్ళిలో అతిథులందరికీ చల్లని కొబ్బరి బొండాలు ఇచ్చారు. అదీగాక ఈ ఊరి ప్రక్కనే కౌశికీ నది, దాని పక్కగా బంగాళాఖాతం ఉంది. ఆ సముద్ర కెరటాల శోభ వర్ణించడం అసాధ్యం. సముద్రతీరాన సరుగుడు తోటలు, ఏవో పాటలు పాడుతూ తలలు ఊపుతూ మనలను రమ్మని పిలుస్తూ ఉంటాయి. పల్లెలు, దేశ సౌభాగ్యానికి పుట్టిళ్ళు. ప్రశాంత జీవితానికి నట్టిళ్ళు. ఉంటాను. లేఖ రాయి. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 5.
మీ పాఠశాలలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
గుంటూరు, ప్రియమిత్రుడు పుష్పరాజ్ కు, గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవం దినంగా ప్రకటించింది కదా ! ఆ రోజు ఉదయం 8 గంటలకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణతో ఉత్సవాన్ని ప్రారంభించాం. మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరిని ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 6.
మీ పాఠశాలలో గ్రంథాలయ వసతి కల్పించమని కోరుతూ సంబంధిత అధికారికి లేఖ రాయండి.
జవాబు:
ఏలూరు, చింతా రవిశంకర్, ఆర్యా , నమస్కారములు. మా పాఠశాలలో సుమారు 2 వేలమంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. మా పాఠశాలలో మంచి గ్రంథాలయము లేదు. ఈ సంవత్సరము పాఠ్యప్రణాళికలు బాగా మారిపోయాయి. గ్రంథాలయంలోని పుస్తకాలు – చదివితే కానీ, పరీక్షలలో సరయిన జవాబులు వ్రాయలేము. నిత్యమూ వచ్చే రోజువారీ పత్రికలు చదివితే, మాకు దేశకాల పరిస్థితులు అర్థం అవుతాయి. కాబట్టి మీరు తప్పక మా మునిసిపల్ కమిషనర్ గారికి చెప్పి, మీరు కూడా మంచి గ్రాంటు ఇచ్చి, మా పాఠశాలలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మా విద్యార్థుల తరుపున ప్రార్థిస్తున్నాను. నమస్కారాలతో, ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 7.
‘ఎదుటి వారిలో తప్పులు వెతకటం కన్నా, వారి నుండి మంచిని స్వీకరించడం మేలు’ అని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
చిత్తూరు, స్నేహితుడు రంగనాకు, నీ లేఖ చేరింది. మీ నగరంలోని “సాయీ సేవామండలి” వారు మీ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్సు పుస్తకాలు, వగైరా ఉచితంగా పంచి పెట్టారని రాశావు. ఆ సంస్థవారు నగరంలో చందాలు బాగా వసూలు చేస్తున్నారనీ, వాటికి రశీదులు మాత్రం ఇవ్వడం లేదని రాశావు. నీవు సేవామండలి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసించాలి. వారి తప్పులు వెదకరాదు. ఆ సేవామండలి వారు దేవాలయాల వద్ద నిలబడి భక్తులను క్యూ లైన్లలో పంపడం, వారి చెప్పులను కాపాడి, తిరిగి వారికి అప్పగించడం, మజ్జిగ, మంచినీరు అందించడం వగైరాలు చేస్తున్నారు. దొంగతనాలు జరుగకుండా కాపాడుతున్నారు. వారు బీదపిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. పండుగరోజుల్లో బీదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారు. రోగులకు పాలు పండ్లు ఇస్తున్నారు. నీవు ఆ సేవామండలి వారు చేస్తున్న పరోపకారం, మానవసేవ, ధర్మకార్యాలు మెచ్చుకోవాలి. వారిని అభినందించాలి. అంతేకాని వారు వసూలు చేసే చందాలకు రశీదులు ఇవ్వడం లేదని వారిని తప్పు పట్టరాదు. రశీదు పొరపాటున ఇచ్చి ఉండకపోవచ్చు గదా ! మనం ఎదుటివారి తప్పులను వెతికి చూపిస్తాము. దానికంటే వారు చేసే మంచిని గ్రహించి, వారిని అభినందించడం మంచిది. వారు చేసే పనిలోని లోపాలను వారి దృష్టికి తేవాలి. మంచిపని చేసేవారిని ప్రశంసించడం, మన ధర్మం. ఉంటా. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 8.
నాటితో పోలిస్తే నేటి వివాహ వేడుకల్లో వచ్చిన మార్పులను గురించి విమర్శనాత్మకంగా మిత్రులకు లేఖ రాయండి.
జవాబు:
తిరుపతి, మిత్రుడు ప్రసాద్ కు, శుభాభినందనలు. మీ అక్క పెళ్ళి శుభలేఖను నీవు నాకు పంపించావు. సంతోషం. ఈ మధ్య మా అన్నయ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. పూర్వపు పెళ్ళిళ్ళకూ, ఇప్పటి పెళ్ళిళ్ళకూ ఎన్నో తేడాలున్నాయి. కోపం వల్ల చాలా అనర్దాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా. ఇట్లు, చిరునామా: |
ప్రశ్న 9.
నీ సైకిలు పోయిందని తెలుపుతూ,వెతికించమని కోరుతూ పోలీసు అధికారికి లేఖ రాయండి.
జవాబు:
కర్నూలు, కె. జవహర్ రెడ్డి, అయ్యా , విషయము : సైకిలు దొంగతనం – చర్య తీసుకోవలసిందిగా విజ్ఞప్తి. నమస్కారములు, హీరో కొత్త సైకిలు, 24, నెంబరు హెచ్ 26723. దయచేసి నా సైకిలు వెతికించవలసినదిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇట్లు, |
ప్రశ్న 10.
తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
రాజమండ్రి, ప్రియమైన అభిలేష్ కు, నేను బాగా చదువుతున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తాను. ఈ మధ్య నేను చిన్న సాహసం చేశాను. మా పాఠశాలలో నాతో చదివే జలజను ఒక దుర్మార్గుడు నిత్యం తన్ను ప్రేమించమని ఏడిపిస్తూ ఉండేవాడు. నేను వాడితో తగువు పెట్టుకొని వాడిని తన్నాను. పోలీసులకు వాణ్ణి అప్పగించాను. మనం మనతోటి స్త్రీలను మన అక్కా చెల్లెళ్ళలా, మన తల్లుల్లా భావించి వారికి రక్షణగా నిలబడాలి. నిజానికి స్త్రీలు ఈ భూమిమీద తిరిగే పుణ్యదేవతలు. స్త్రీలపట్ల అపచారం చేస్తే వారు నాశనం అవుతారు. సమూలంగా వారి వంశం నశిస్తుంది. స్త్రీలు పూజింపదగినవారు. స్త్రీలకు ఎటువంటి అవమానం జరుగకుండా, మనం చూడాలి. తోటి స్త్రీలను కన్నతల్లుల్లా, మన సోదరీమణుల్లా చూడాలి. నేను చేసిన సాహసాన్ని నీవు తప్పక అభినందిస్తావని నమ్ముతున్నా. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 11.
మీ ఊరికి బస్సు సదుపాయం కల్పించమని కోరుతూ సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారికి లేఖ రాయండి.
జవాబు:
చామర్రు, ఆర్.టి.సి. జనరల్ మేనేజర్ గారికి, అయ్యా , మాది అచ్చంపేట మండలంలోని చామర్రు అనే గ్రామం. మా గ్రామ జనాభా ఎనిమిదివందలు. ఇచ్చటి ప్రజలు నిత్యావసర సరకులు అచ్చెంపేట వెళ్ళి తెచ్చుకోవాలి. అలాగే విద్యార్థులు హైస్కూలు చదువుకు అచ్చెంపేట, కాలేజి చదువుకు సత్తెనపల్లి వెళ్ళి రావలసియున్నది. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు అందరూ కూడా మండల కేంద్రానికి వెళ్ళటానికి నానా బాధలు పడుతున్నారు. కారణం మా ఊరికి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడమే. ‘ప్రజా సేవయే కర్తవ్యం’గా భావించే మీరు మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కలిగించి మా కష్టాలను గట్టెక్కించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 12.
ఉపకార వేతనాన్ని మంజూరు చేయమని కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ రాయండి.
జవాబు:
ఉపకార వేతనం కోరుతూ జిల్లా సంక్షేమశాఖాధికారికి లేఖ. పటమట, కృష్ణాజిల్లా సంక్షేమశాఖాధికారి గారి దివ్య సముఖమునకు, ఆర్యా ! జతపరచినవి :
ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 13.
మీ పాఠశాలలో జరిగిన ఒక ఉత్సవాన్ని గూర్చి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
శ్రీకాకుళం, ప్రియ స్నేహితురాలు, గడచిన జనవరి 26న మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి. మా జిల్లా విద్యాశాఖాధికారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆ రోజు ఉదయం గం. 8 – 00 లకు ముఖ్య అతిథిగారిచే జాతీయ పతాకావిష్కరణ కావించబడింది. రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి ముఖ్య అతిథిగారు చక్కని సందేశమిచ్చారు. కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఆ రోజు గొప్పతనాన్ని గురించి ఉపన్యాసమిచ్చారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. తరువాత విద్యార్థులకు స్వీట్సు పంచిపెట్టబడ్డాయి. ‘జనగణమన’ జాతీయ గీతంతో నాటి కార్యక్రమం ముగిసింది. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 14.
అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి.
జవాబు:
మిత్రునకు శిల్పులను అభినందిస్తూ లేఖ విజయవాడ, మిత్రుడు శ్రీకాంత్ కు, / మిత్రురాలు రాధకు, మిత్రమా ! శుభాకాంక్షలు. ఈ మధ్య నేను మన నవ్యాంధ్ర రాజధాని నగరం, అమరావతికి వెళ్ళి అక్కడి శిల్ప సంపదను చూసి, ఆ శిల్పాలను చెక్కిన కళా తపస్వులయిన శిల్పులకు జోహార్లు సమర్పించాను. అక్కడ బుద్ధ విగ్రహాలు, జైన మందిరము, అమరేశ్వరాలయము, స్తూపాలు అన్నీ చూశాను. ఆ శిల్పాలు చెక్కిన శిల్పులకు అభినందనలు అందించాను. ఆ శిల్పాలు ప్రపంచ శిల్ప సంపదలోనే అగ్రశ్రేణివని డా|| ఫెర్గూసన్ పొగిడాడు. జాషువా మహాకవి చెప్పినట్లు శిల్పి చేతి సుత్తె నుండి ఎన్నో దేవాలయాలు వెలిశాయి. అర్థం లేని బండరాయికి శిల్పి జీవం పోస్తాడు. రాళ్ళను దేవుళ్ళుగా మార్చి, వాటికి మనచే పూజలు చేయిస్తాడు. శిల్పి శాశ్వతుడు. రాళ్ళలో నిద్రపోయే బొమ్మల్ని ఉలి తగిలించి అతడు లేపుతాడు. శిల్పి చిరంజీవి. పుణ్యాత్ముడు. ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన మహాశిల్పులకు మనం అభినందనలు అందించాలి. నీవు కూడా అమరావతి వచ్చి, మత తెలుగు శిల్పుల కళానైపుణ్యానికి జోహార్లు అందిస్తావని విశ్వసిస్తున్నాను. ‘అమరావతీ నగర అపురూప శిల్పాలు’ అని మనం నిత్యం తెలుగుతల్లి పాటలో పాడుతున్నాము. ఆ శిల్పులకు జోహార్లు అందించడం మన విధి. ఉంటా. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 15.
పేదలకు దానం చేయుట వలన మనం పొందే మేలును గురించి తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
మిత్రుడికి లేఖ తిరుపతి, మిత్రుడు శశిభూషణకు, / మిత్రురాలు కమలకు, ఉభయ కుశలోపరి. నీవు రాసిన లేఖ చేరింది. మనం నైతిక విలువలను పాటించాలని రాశావు. సంతోషము. మన ఇరుగు పొరుగువారిలో ఎందరో పేదలు ఉంటారు. భగవంతుడు మానవులు అందరిలోనూ ఉంటాడు. కాబట్టి మనుషులు అంతా దైవంతో సమానం. ముఖ్యంగా పేదవారికి, మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చెయ్యాలి. పరీక్ష ఫీజులు కట్టడానికి వారికి డబ్బు సాయం చెయ్యాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగే వారికి తప్పక ఇవ్వాలి. పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే, మన జీవితాలు సుఖసంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను. నీవు కూడా చెయ్యి. ఇట్లు, చిరునామా: |
ప్రశ్న 16.
విద్వాన్ విశ్వం కవితను ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
మిత్రునకు లేఖ గుంటూరు, మిత్రుడు రామారావునకు, శుభాభినందనలు. నీ లేఖ అందింది. నేను ఈ మధ్య విద్వాన్ విశ్వంగారి ‘మాణిక్యవీణ’ వచన కవిత చదివాను. విశ్వంగారు గొప్ప కవి పండితుడు. ఆయన ‘విశ్వరూపి నా హృదయం’ అని ప్రకటించుకున్నాడు. ఈ కవితలో చక్కని అభ్యుదయ భావాలు వెలిబుచ్చాడు. మానవులు కేన్సరుతో బాధపడుతూ ఉంటే, దానికి మందులు కనుక్కోకుండా, రోదసిలోకి ఉపగ్రహాలు పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని శాస్త్రజ్ఞులను ప్రశ్నించాడు. తంత్రాలతో సమాజ సమస్యలు దారికి రావని హెచ్చరించాడు. శాస్త్రజ్ఞులు నిప్పునూ, చక్రాన్ని కనిపెట్టినరోజు నిజంగా, మానవ చరిత్రలో పండుగరోజు అని గుర్తు చేశాడు. మానవ జీవితాన్ని కళలూ, కవిత్వం, విజ్ఞానం నడిపిస్తాయన్న యథార్థాన్ని విశ్వంగారు చెప్పాడు. వచన కవితా రచనలో ఆయన చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను తేలికగా అందించాడు. విశ్వంగారు మాణిక్యవీణను మీటి, మానవీయ రాగాల్ని పలికించాడు. చక్కని లలిత పదాలతో, అనుప్రాసలతో కవిత మనోహరంగా చెప్పాడు. తప్పక నీవు ఈ కవిత చదువు. ఉంటా. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 17.
వ్యక్తిత్వ బదిలీ ధృవీకరణ పత్రాలను ఇప్పించవలసినదిగా ప్రధానోపాధ్యాయులకు లేఖ రాయండి.
జవాబు:
ప్రధానోపాధ్యాయులకు లేఖ విజయవాడ, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులవారికి, ఆర్యా ! నేను మీ పాఠశాలలో 10వ తరగతి చదివి, మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణుడను అయ్యాను. దయచేసి నేను ఇంటర్‌లో చేరేందుకు వీలుగా నా వ్యక్తిత్వ, విద్యా, బదిలీ ధృవీకరణ పత్రములు ఇప్పించవలసినదిగా ప్రార్ధన. ఇట్లు, |
ప్రశ్న 18.
కోపం తగ్గించుకోవడం మంచిదని తెలుపుతూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
విశాఖపట్టణం, మిత్రుడు రఘునందన్ కు, నీ లేఖ అందింది. నేనూ, మా తల్లిదండ్రులూ క్షేమంగా ఉన్నాము. నీ లేఖలో, నీకు ప్రియ మిత్రుడైన సీతారామ్ తో నీకు తగవు వచ్చిందనీ, మీరిద్దరూ దెబ్బలాడుకున్నారని రాశావు. మీ ఇద్దరికీ దెబ్బలు తగిలాయని కూడా రాశావు. నీ ఉత్తరం చూసి నేను చాలా బాధపడ్డాను. సహజంగా నీవు శాంత స్వభావుడవు. నీకు కోపం ఎందుకు వచ్చిందో రాశావు. అయినా దెబ్బలు తగిలే వరకూ మీరు తగవు లాడడం బాగోలేదు. ‘తన కోపమె, తన శత్రువు’ అని సుమతీ శతకకర్త రాశాడు. క్రోధం మనకు శత్రువని భర్తృహరి కూడా చెప్పాడు. అయినా నీకు అన్ని విషయాలు తెలుసు. కోపం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. కోపంతో మనకు వివేకం నశిస్తుంది.. సీతారామ్ తో నీకు వచ్చిన తగవు విషయం, మీ పెద్దలతో చెప్పు. వారు మీ తగవును పరిష్కరిస్తారు. కోపం తగ్గించుకొని శాంతంగా ఉండమని నిన్ను కోరుతున్నాను. త్వరలో నీవూ, సీతారామ్ మిత్రులుగా మారుతారని ఆశిస్తున్నా. ఇట్లు, చిరునామా: |