AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

SCERT AP 10th Class Physics Study Material Pdf 9th Lesson విద్యుత్ ప్రవాహం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 9th Lesson Questions and Answers విద్యుత్ ప్రవాహం

10th Class Physical Science 9th Lesson విద్యుత్ ప్రవాహం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
లోరెంజ్ – డ్రూడ్ ఎలక్ట్రాన్ సిద్ధాంతం సహాయంతో విద్యుత్ ప్రవాహానికి ఎలక్ట్రానులు ఎలా కారణమో వివరించండి. (AS1)
జవాబు:
1) లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు, ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాలలో ఉంటాయని 19వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలైన డ్రూడ్ మరియు లోరెంజ్ ప్రతిపాదించారు. ఈ ధనాత్మక అయానుల అమరికను లాటిస్ అంటాము.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 1
2) వాహకాన్ని తెరచిన వలయంగా భావించిన, పటంలో చూపిన విధంగా వాహకంలో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ఏ దిశలో కదులుతాయో నిర్ణయించలేని విధముగా చలిస్తాయి. ఈ చలనమును క్రమరహిత చలనం అంటాము.

3) పటం (i) లో చూపినట్లు వాహకంలో ఏదైనా మధ్యచ్ఛేదాన్ని ఊహిస్తే, ఒక సెకను కాలంలో ఆ మధ్యచ్ఛేదాన్ని ఎడమ నుండి కుడికి దాటి వెళ్ళే ఎలక్ట్రానుల సంఖ్య, ఒక సెకను కాలంలో ఆ మధ్యచ్ఛేదాన్ని కుడి నుండి ఎడమకి దాటి వెళ్ళే ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం.

4) అనగా తెరచిన వలయం వంటి వాహకంలో ఏదేని మధ్యచ్ఛేదం వెంబడి కదిలే ఫలిత ఆవేశం శూన్యమవుతుంది.

5) ఒక బల్బ్ తో సహా వాహకం రెండు చివరలను బ్యాటరీకి కలిపితే, బ్యాటరీ నుండి బల్బ్ కు శక్తి సరఫరా జరగడం వల్ల బల్బ్ వెలుగుతుంది.

6) ఈ విధమైన శక్తి సరఫరాకు కారణము ఎలక్ట్రానులు.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 2
7) పటం (ii) లో చూపిన విధంగా ఎలక్ట్రాన్లు క్రమపద్ధతిలో చలిస్తే, వాహకంలోని ఏదేని మధ్యచ్ఛేదాన్ని దాటి వెళ్ళే ఫలిత ఆవేశం వ్యవస్థితమవుతుంది.

8) ఈ విధముగా ఎలక్ట్రానులు క్రమమైన పద్ధతిలో చలించడాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు.

9) కనుకనే ఆవేశాల క్రమ చలనాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు.

ప్రశ్న 2.
బ్యాటరీ ఎలా పని చేస్తుంది? వివరించండి. (AS1)
(లేదా)
ఒక బ్యాటరీనందు టెర్మినళ్ల మధ్య పొటెన్షియల్ భేదం ఏ విధముగా స్థిరంగా ఉండునో వివరింపుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 3 AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 4 AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 5

  1. బ్యాటరీలో రెండు లోహపు పలకలు (ఎలక్ట్రోడులు, ఒక రసాయనం (విద్యుత్ విశ్లేష్యం) ఉంటాయి.
  2. బ్యాటరీ యొక్క రెండు ఎలక్ట్రోడుల మధ్య ఉండే విద్యుద్విశ్లేష్యంలో పరస్పరం వ్యతిరేకదిశల్లో చలించే ధన, ఋణ అయాన్లు పటంలో చూపినట్లుగా ఉంటాయి.
  3. ఈ అయాన్లపై విద్యుద్విశ్లేష్యం కొంత బలాన్ని ప్రయోగించడం వల్ల అవి నిర్దిష్ట దిశలో చలిస్తాయి. ఈ బలాన్ని రసాయన బలం (Fc) అంటాము.
  4. రసాయన స్వభావమును బట్టి, ధన అయాన్లు బ్యాటరీలో ఏదో ఒక లోహపు పలకవైపు కదిలి, ఆ పలకపై పోగవుతాయి. దీని ఫలితంగా ఆ లోహపు పలక ధనావేశపూరితమవుతుంది. దీనిని ఆనోడ్ అంటాము.
  5. ధనావేశ అయాన్లకు వ్యతిరేకదిశలో ఋణావేశ అయాన్లు చలించి రెండవ లోహపు పలకపై పోగవుతాయి. ఆ పలక ఋణావేశపూరితమవుతుంది. దీనిని కాథోడ్ అంటాము.
  6. లోహపు పలకలపై ఆవేశం సంతృప్త స్థితిని చేరే వరకు, ఇలా ఆవేశాలు పోగవుతూనే ఉంటాయి.
  7. లోహపు పలకలపై ఆవేశం సంతృప్త స్థితికి చేరాక, కదిలే అయానులపై విద్యుత్ బలం (Fe) పని చేస్తుంది.
  8. విద్యుత్ బలదిశ రసాయన బలదిశకు వ్యతిరేకదిశలో ఉంటుంది.
  9. విద్యుత్ బలం పరిమాణం, లోహపు పలకలపై పోగైన ఆవేశంపై ఆధారపడును.
  10. విద్యుత్ బలం కన్నా రసాయన బలం ఎక్కువగా ఉంటే, ఆవేశాలు అవి చేరవలసిన పలకలవైపు పటంలో చూపినట్లుగా కదులుతాయి.
  11. విద్యుత్ బలం, రసాయన బలం సమానమైనపుడు ఆవేశాల చలనం పటంలో చూపినట్లుగా ఆగిపోవును.
  12. క్రొత్త బ్యాటరీ యొక్క రెండు ధృవాల మధ్య స్థిర పొటెన్షియల్ భేదం ఉంటుంది.
  13. ఒక వాహక తీగను బ్యాటరీ ధృవాలకు కలిపినప్పుడు వాహక తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది.
  14. ఈ పొటెన్షియల్ భేదం వల్ల వాహకం అంతటా విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది.
  15. బ్యాటరీ యొక్క ధన ధృవం దగ్గరలోని ఎలక్ట్రానులను ఆకర్షించడం వల్ల వాహకంలోని ఎలక్ట్రానులు ధన ధృవం వైపు కదులుతాయి. ఫలితంగా ధన ధృవం యొక్క ధనావేశ పరిమాణం తగ్గును. ఈ సందర్భంలో రసాయన బలం (Fc), కంటే విద్యుత్ బలం (Fe) తక్కువ అవుతుంది.
  16. అప్పుడు రసాయన బలం, ఋణావేశ అయానులను ధనావేశ పలక (ఆనోడు) నుండి బయటకు లాగి వాటిని ఋణావేశ పలక (కాథోడ్) వైపు కదిలేటట్లు చేస్తుంది.
  17. ఈ ఋణావేశ అయానులు (ఎలక్ట్రానులు), ఋణ ధృవం మధ్య ఉండే బలమైన వికర్షణ కారణంగా ఋణధృవం ( కాథోడ్) వాహకంలోనికి ఎలక్ట్రాను నెట్టును.
  18. కనుక విద్యుత్ ప్రవహిస్తున్నపుడు వాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది.
  19. రసాయన, విద్యుత్ బలాల మధ్య సమతాస్థితి ఏర్పడే వరకు పైన తెలిపిన ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 3.
విద్యుచ్ఛాలక బలము (emf), పొటెన్షియల్ భేదాల మధ్య తేడాలను రాయండి. (AS1)
(లేదా)
పొటెన్షియల్ భేదం మరియు విద్యుచ్ఛాలక బలముల మధ్యగల భేదాలను వ్రాయుము.
జవాబు:

విద్యుచ్ఛాలక బలముపొటెన్షియల్ భేదము
1) ఏకాంక ఋణావేశంను ధనధృవం నుండి ఋణ ధృవంకు కదిలించడానికి రసాయన బలం చేసిన పని.1) ఇది వాహకంలో ఒక బిందువు నుండి మరొక బిందువుకు ఏకాంక ధనావేశంను కదల్చటానికి చేసిన పని.
2) విద్యుచ్ఛాలక బలము \(\varepsilon=\frac{W}{q}=\frac{F_{e} d}{q}\).2) పొటెన్సియల్ భేదము \(\mathrm{V}=\frac{\mathrm{W}}{\mathrm{q}}=\frac{\mathrm{F}_{\mathrm{e}} l}{\mathrm{q}}\)
3) దీని SI ప్రమాణము “ఓల్ట్”.3) దీని SI ప్రమాణము “ఓల్ట్”.
4) ఇది విద్యుత్ ప్రవాహం, నిరోధాలపై ఆధారపడదు.4) ఇది విద్యుత్ ప్రవాహం, నిరోధాల మీద ఆధారపడును.
5) దీని విలువ ఎల్లప్పుడూ పొటెన్షియల్ భేదము కన్నా ఎక్కువగా ఉంటుంది.5) దీని విలువ ఎల్లప్పుడూ ఘటం యొక్క emf కన్నా తక్కువగా ఉండును.

ప్రశ్న 4.
ఎలక్ట్రిక్ షాక్ (విద్యుత్ ఘాతం) అంటే ఏమిటి? ఇది ఎలా సంభవిస్తుంది? (AS1)
(లేదా)
విద్యుత్ ఘాతం అర్థం ఏమిటో వ్రాయుము? ఇది ఏ విధంగా సంభవించునో వ్రాయుము.
జవాబు:

  1. మన శరీరంలోని ఏవేని రెండు అవయవాల మధ్య పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు మనం విద్యుత్ ఘాతానికి లోనైనట్లు చెప్పవచ్చును.
  2. మానవ శరీరం గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు తక్కువ నిరోధాన్ని కలిగించే మార్గాన్ని ఎన్నుకొంటుంది.
  3. మన శరీరం అంతటా నిరోధం ఒకే విధముగా ఉండదు.
  4. శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతున్న కొలదీ, శరీర నిరోధం, విద్యుత్ ప్రవాహ విలువలు పరస్పరం విలోమముగా మారుతుంటాయి.
  5. కాబట్టి విద్యుత్ ఘాతాన్ని విద్యుత్ పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహం మరియు శరీరం నిరోధాల ఫలిత ప్రభావంగా చెప్పవచ్చును.

ప్రశ్న 5.
\(\mathbf{R}=\frac{\rho l}{\mathbf{A}}\) ను ఉత్పాదించండి. (AS1)
జవాబు:
1) పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పుడు వాహకం నిరోధం (R), దాని పొడవు (l) కు అనులోమానుపాతంలో ఉంటుంది.
R ∝ l …………………….. (1)

2) వాహక ఉష్ణోగ్రత, పొడవు స్థిరంగా ఉన్నప్పుడు వాహక నిరోధం, వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది.
R ∝ \(\frac{l}{A}\) …………………….. (2)

3) సమీకరణాలు (1) మరియు (2) ల నుండి
R ∝ \(\frac{l}{A}\)ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు) R = ρ \(\frac{l}{A}\)
ఇక్కడ ρ = అనుపాత స్థిరాంకము, దీనిని విశిష్ట నిరోధం లేదా నిరోధకత అంటాము.

4) ఈ విశిష్ట నిరోధం ఉష్ణోగ్రత, పదార్థ స్వభావంలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
దీనికి ప్రమాణాలు ఓమ్ – మీటరు ( Ω – m).

ప్రశ్న 6.
స్థిర ఉష్ణోగ్రత, స్థిర మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహక నిరోధం, దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందని మీరెలా పరీక్షిస్తారు? (కృత్యం – 4) (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 6

  1. ఒకే మధ్యచ్చేద వైశాల్యం, వివిధ పొడవులు గల కొన్ని మాంగనిన్ తీగలను తీసుకొంటిని.
  2. పటంలో చూపినట్లు వలయాన్ని ఏర్పాటు చేసితిని.
  3. మాంగనిన్ తీగను ఒకదానిని P, Q ల మధ్య కలిపితిని.
  4. అమ్మీటర్ సహాయంతో వలయంలో ప్రవహించే విద్యుత్ ను కొలిచి నమోదు చేసితిని.
  5. మిగిలిన తీగలను ఉపయోగిస్తూ ఈ కృత్యాన్ని మరలా చేసితిని.
  6. ప్రతి సందర్భంలోని విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి క్రింది పట్టికలో నమోదు చేసితిని.
    AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 7
  7. మాంగనిన్ తీగ పొడవు పెరుగుతున్న కొలదీ వలయంలో ప్రవహించే విద్యుత్ విలువ తగ్గడం గమనించవచ్చును.
  8. పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పటికీ చువ్వ పొడవు పెరిగితే, నిరోధం పెరుగుతుంది.
  9. పై కృత్యాన్ని బట్టి పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పుడు వాహకం నిరోధం (R), దాని పొడవు (l)కు అనులోమానుపాతంలో ఉంటుంది. R ∝ l (ఉష్ణోగ్రత, మధ్యచ్ఛేద వైశాల్యం స్థిరంగా ఉన్నప్పుడు)

ప్రశ్న 7.
కిర్చాఫ్ నియమాలను తెలిపి, ఉదాహరణలతో వివరించండి. (AS1)
(లేదా)
ఏవైనా రెండు ఉదాహరణలతో కిర్ఛాఫ్ నియమాలను వివరించుము.
జవాబు:

  1. ఒక DC వలయంలో కొన్ని బ్యాటరీలు, నిరోధాలను ఏ విధంగా కలిపినా, దాని ఫలితంను అవగాహన చేసుకునేందుకు అవసరమగు సరళ నియమాలను కిర్ఛాఫ్ నియమాలంటారు.
  2. కిర్ఛాఫ్ నియమాలు రెండు రకాలు. అవి :
    a) జంక్షన్ నియమం, b) లూప్ నియమం.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 8

జంక్షన్ నియమం :
వలయంలో విద్యుత్ ప్రవాహం విభజించబడే ఏ జంక్షన్ వద్దనైనా, ఆ జంక్షన్‌కు చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం, ఆ బ్యాటరీ జంక్షన్ ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 9
ఉదాహరణ :
a) పటంలో చూపిన విధంగా మూడు లేదా అంతకంటే ఎక్కువ వాహక తీగలు కలిసే బిందువును జంక్షన్ ‘P’ అంటారు.
b) వలయంలో విద్యుత్ ప్రవాహం విభజించబడే ఏ జంక్షన్ వద్దనైనా, జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షన్ ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము.
c) అనగా వలయంలోని ఏ జంక్షన్ వద్దనైనా ఆవేశాలు పోగుకావడం అనేది జరుగదు.
అందుచే I1 + I4 + I6 = I2 + I3 + I5.

లూప్ నియమం :
ఒక మూసిన వలయంలోని పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యం.

ఉదాహరణ :
లూప్ నియమాన్ని ప్రక్క పటంలోని వలయానికి అన్వయించగా
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 10
ACDBA లూప్ నందు,
-V2 + I2R2 – I1R1 + V1 = 0

EFDCE లూప్ నందు,
– (I1 + I2) R3 – I1 R1 + V1 = 0

EFBAE లూప్ నందు,
– (I1 + I2) R3 – I1R1 + V1 = 0

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 8.
1 KWH విలువను ఔళ్ళలో తెలపండి. (AS1)
(లేదా)
1 KWH విలువను ఔళ్ళలో వ్రాయుము.
జవాబు:
1 KW = 1000 W = 1000 J/s
1 KWH = (1000 J/s) (60 × 60 సెకన్లు) = 3600 × 1000 J = 3.6 × 106 J.
సామర్థ్య వినియోగంనకు’ పెద్ద ప్రమాణం కిలోవాట్ (KW).

ప్రశ్న 9.
ఇంటిలోకి వచ్చే కరెంటు ఓవర్ లోడ్ కావడం గూర్చి వివరించండి. (AS1)
(లేదా)
ఓవర్ లోడ్ లేక షార్ట్ సర్క్యూట్లను ఉదాహరణతో వివరించుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 11

  1. మన ఇంటిలోకి విద్యుత్ రెండు తీగల ద్వారా వస్తుంది. వీటిని కరెంట్ లైన్ అంటాము.
  2. ఈ తీగల నిరోధం చాలా తక్కువ. వీటి మధ్య పొటెన్షియల్ భేదం దాదాపుగా 240 V ఉంటుంది.
  3. మన ఇంటిలోని విద్యుత్ సాధనాలన్నీ సమాంతర సంధానంలో వుంటాయి.
  4. కాబట్టి ప్రతీ సాధనం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 240V అవుతుంది.
  5. ప్రతి విద్యుత్ సాధనం దాని నిరోధాన్ని బట్టి, లైన్స్ నుండి కొంత విద్యుత్ ను వినియోగించుకుంటుంది.
  6. లైన్స్ నుండి వినియోగించుకున్న మొత్తం విద్యుత్, వివిధ సాధనాల గుండా ప్రవహించే విద్యుత్ ల మొత్తానికి సమానము.
  7. మన ఇంటిలో వాడే విద్యుత్ సాధనాల సంఖ్యను పెంచితే, అవి లైన్స్ నుండి వినియోగించుకునే విద్యుత్ కూడా పెరుగుతుంది.
  8. దీని వలన ఇంటిలోని వలయం బాగా వేడెక్కి మంటలు ఏర్పడే అవకాశం ఉంది. దీనినే ఓవర్ లోడ్ అంటాము.

ప్రశ్న 10.
మూడు నిరోధాలు శ్రేణిలో కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాన్ని ఉత్పాదించండి. (కృత్యం – 6) (AS1)
(లేదా)
మూడు నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధానికి సూత్రంను ఉత్పాదించి, వివరించుము.
జవాబు:
శ్రేణి సంధానం :
ఒక వలయంలో, చివరి నుండి – చివరికి కలిపిన నిరోధాల గుండా ఒకే విద్యుత్ ప్రవాహం ఒకే మార్గంలో ప్రవహిస్తున్నట్లయితే అవి శ్రేణి సంధానంలో ఉన్నాయంటాము.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 12

  1. ‘V’ పొటెన్షియల్ భేదం ఉన్న ఘటాన్ని తీసుకొని శ్రేణి సంధానంలో ఉన్న మూడు నిరోధాలను పటంలో చూపిన విధముగా కలుపుము.
  2. నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు విద్యుత్ ప్రవాహానికి ఒకటే మార్గం, కావున వలయంలో విద్యుత్ ప్రవాహం (I) ఒకటే ఉండును.
  3. శ్రేణిలో గల నిరోధాల వల్ల వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహానికి సమానమైన విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేసే మరొక నిరోధంను ఆ నిరోధాల ఫలిత నిరోధం (Req) అంటాము.
  4. శ్రేణి సంధానంలో గల ఫలిత నిరోధం విలువను ఓమ్ నియమం ద్వారా Req = \(\frac{V}{I}\) ⇒ V = IReq గా వ్రాయవచ్చును.
  5. R1, R2, R3 అను నిరోధాల చివరల యందు గల పొటెన్షియల్ భేదాలు వరుసగా V1, V2, V3 లు అయిన ఓమ్ నియమం ప్రకారము,
    V1 = IR1 ; V2 = IR2 మరియు V3 = IR3
  6. శ్రేణి సంధానంలో గల వేర్వేరు పొటెన్షియల్ భేదాల మొత్తం, వాటి ఫలిత పొటెన్షియల్ భేదానికి సమానం.
    V = V1 + V2 + V3 ………………. (1)
  7. V1, V2, V3 ల మరియు V విలువలను సమీకరణం (1) లో ప్రతిక్షేపించగా
    I Req = IR1 + IR2 + IR3        I Raeq = I (R1 + R2 + R3)
    Req = R1 + R2 + R3 + ……………. + Rn

పై సమీకరణాన్ని బట్టి శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం, ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానము.

ప్రశ్న 11.
మూడు నిరోధాలు సమాంతరంగా కలిపినప్పుడు వాటి ఫలిత నిరోధాన్ని ఉత్పాదించండి. (AS1)
(లేదా)
మూడు నిరోధాలను సమాంతరంగా సంధానం చేసినప్పుడు వాటి ఫలిత నిరోధమునకు సూత్రంను ఉత్పాదించి, వివరించుము. (కృత్యం – 7)
జవాబు:
సమాంతర సంధానం :
ఒక వలయంలో నిరోధాలు ఉమ్మడి టెర్మినల్ కి కలపబడి, వాటి మధ్య ఒకే పొటెన్షియల్ భేదం ఉంటే అవి సమాంతర సంధానంలో ఉన్నాయంటాము.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 13
1) ‘V’ పొటెన్షియల్ భేదం ఉన్న ఘటమును తీసుకుని సమాంతర సంధానంలో ఉన్న మూడు నిరోధాలను పటంలో చూపిన విధముగా కలుపుము.

2) వలయంలో ప్రవహించే ఫలిత విద్యుత్ ప్రవాహం విడివిడి నిరోధాల ద్వారా ప్రవహించు విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానము.
దీనిని బట్టి I = I1 + I2 + I3 అగును.

3) నిరోధాల సమాంతర సంధానంలో పొటెన్షియల్ భేదం ‘V’ మారదు, మూడు నిరోధాల ఫలిత నిరోధాన్ని ‘Req‘ తో సూచిస్తాము.

4) సమాంతర సంధానంలో ఫలిత నిరోధం ‘Req‘. ఓమ్ నియమం ప్రకారం,
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 14

పై సమీకరణం నుండి సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ, ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా తక్కువగా ఉంటుంది. (లేదా) సమాంతర సంధానంలో ఫలిత నిరోధం యొక్క వ్యుత్రమణం, విడి నిరోధాల వ్యుత్ర్కమణాల మొత్తానికి సమానము.

ప్రశ్న 12.
కాపర్ కంటే సిల్వర్ మంచి విద్యుత్ వాహకం. అయినా, విద్యుత్ తీగగా కాపర్‌ను వాడతాం ఎందుకు? (AS1)
(లేదా)
సిల్వర్‌ కు బదులుగా కాపర్‌ను ఎందుకు విద్యుత్ తీగగా వాడతారో కారణం వివరించుము.
జవాబు:

  1. సిల్వర్ యొక్క విశిష్ట నిరోధం విలువ 1.59 × 10-8 Ωm మరియు కాపర్ యొక్క విశిష్ట నిరోధం విలువ 1.68 × 10-8 Ωm.
  2. కాపర్ యొక్క విశిష్ట నిరోధం కన్నా సిల్వర్ విలువ తక్కువ.
  3. తక్కువ విశిష్ట నిరోధం గల లోహాలను మంచి వాహకాలుగా ఉపయోగిస్తారు. కాని, సిల్వర్ అత్యధిక ఖరీదైన లోహము కావటం చేత కాపర్‌ను వాడుతున్నాము.
  4. కాపర్ తీగ గుండా విద్యుత్ ప్రవహించునపుడు ఉష్ణరూపంలో కోల్పోయే శక్తి సిల్వర్ కన్నా చాలా తక్కువ.
  5. కాపర్ లోహంను చాలా సన్నని తీగలుగా మార్చవచ్చును. దీనికి పెళుసుతనం తక్కువ.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 13.
100 W, 220V మరియు 60 W, 220 V గల రెండు బల్బులున్నవి. దేని నిరోధం ఎక్కువ? (AS1)
జవాబు:
దత్తాంశము ప్రకారము,
మొదటి బల్బు యొక్క వివరాలు 100W, 220V
రెండవ బల్బు యొక్క వివరాలు 60W, 220V
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 15
∴ 60 W, 220 V ల విలువ గల బల్బు అనగా రెండవది అధిక నిరోధమును కలిగి ఉన్నది.

ప్రశ్న 14.
ఇండ్లలో విద్యుత్ పరికరాలను ఎందుకు శ్రేణిలో కలపము? (AS1)
(లేదా)
ఇండ్లలో వాడు విద్యుత్ పరికరాలను శ్రేణిలో కలుపకుండుటకు గల కారణంను వివరించుము.
జవాబు:

  1. మన నిత్య జీవితంలో ఉపయోగించే ఫ్యాన్, ఫ్రిజ్, హీటర్, కుక్కర్ వంటి విద్యుత్ సాధనాలను సమాంతర సంధానంలోనే కలుపుతారు.
  2. ఎందుకనగా, శ్రేణిలో కలిపిన విద్యుత్ పరికరాలలో ఏదైనా ఒకటి పని చేయకపోతే, వలయం తెరవబడి వలయంలో విద్యుత్ ప్రవాహం జరుగదు. దీనితో మిగిలినవి కూడా పని చేయవు.
  3. సమాంతర సంధానంలో కలుపుట వలన, పరికరాల మధ్య పొటెన్షియల్ భేదం సమానంగా ఉండి, వాటికి సరిపడేంత విద్యుతను వినియోగించుకుంటాయి.

ప్రశ్న 15.
1 మీ పొడవు, 0.1 మి.మీ. వ్యాసార్ధం గల వాహక నిరోధం 100 Ω అయిన దీని నిరోధకత ఎంత? (AS1)
జవాబు:
వాహక నిరోధము R = 100 Ω.
వాహక పొడవు l = 1 మీ. = 1000 మి.మీ.
వాహక వ్యాసార్ధము r = 0.1 మి.మీ.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 16

ప్రశ్న 16.
బల్బులోని ఫిలమెంట్ తయారీకి టంగ్ స్టనను వినియోగిస్తారు. ఎందుకు? (AS2)
(లేదా)
ఫిలమెంట్ తయారీకి టంగ్ స్టనను వాడుటకు గల కారణమేమిటో సవివరంగా తెలుపుము.
జవాబు:

  1. సాధారణంగా విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్ ను “టంగ్ స్టన్” తో తయారుచేస్తారు.
  2. దీనికి కారణం, టంగ్ స్టన్ విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ.
  3. విశిష్ట నిరోధం ఎక్కువగా గల లోహాలు మంచి విద్యుత్ నిరోధాలుగా పని చేస్తాయి. కనుకనే టంగ్ స్టన్ వంటి లోహాలను ఫిలమెంట్ల తయారీకి ఉపయోగిస్తాము.

ప్రశ్న 17.
కారు హెడ్ లైట్లను శ్రేణిలో కలుపుతారా? లేక సమాంతరంగా కలుపుతారా? ఎందుకు? (AS2)
(లేదా)
వాహనాలకు వాడు హెడ్ లైట్లను సమాంతరంగా అనుసంధానం చేయుటకు గల కారణంను వ్రాయుము.
జవాబు:

  1. కారు హెడ్ లైటు సమాంతరంగా కలుపుతారు.
  2. ఎందుకనగా సమాంతర సంధానంలో గల లైటులు సమాన విద్యుత్ సామర్థ్యంను పొందుతాయి.
  3. వాటిలో ఒక దానిలో ఏదైనా లోపము సంభవించి పని చేయకపోయినా మరొకటి పని చేయును.
  4. ఈ సౌలభ్యం శ్రేణి సంధానంలో ఉండదు.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 18.
ఇండ్లలో విద్యుత్ పరికరాలను సమాంతరంగా ఎందుకు కలుపుతారు? శ్రేణిలో కలిపితే ఏమి జరుగుతుంది? (AS2)
(లేదా)
ఇండ్లలోని విద్యుత్ పరికరాలను శ్రేణిలో ఎందుకు అనుసంధానం చేరో? ఎందుకు సమాంతరంగా అనుసంధానం చేస్తారో తెలుపుము.
జవాబు:

  1. మన ఇంటిలోని విద్యుత్ సాధనాలన్నీ కరెంట్ లైన్లకు వివిధ బిందువుల వద్ద సమాంతర సంధానంలో కలుపుతారు.
  2. ఎందుచేతనంటే శ్రేణిలో కలిపితే ఆ విద్యుత్ పరికరాలలో ఏదైనా ఒక పరికరాన్ని ఆపివేస్తే మిగతా పరికరాలు కూడా పని చేయటం ఆగిపోతాయి.
  3. ఇదియే కాకుండా ఆ పరికరాలలో మొత్తం పొటెన్షియల్ భేదం విభజించబడును. కానీ ఇండ్లలోని పరికరాలకు పొటెన్షియల్ భేదం సమానముగా ఉండాలి.

ప్రశ్న 19.
ఓమ్ నియమం తెల్పండి. దానిని సరిచూడడానికి ప్రయోగాన్ని తెల్పి, ప్రయోగ విధానాన్ని వివరించండి. (AS3)
(లేదా)
ఓమ్ నియమమును పరీక్షించుము. దీనికై ఒక కృత్యంను వ్రాయుము. (ప్రయోగశాల కృత్యం)
జవాబు:
ఓమ్ నియమము :
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

ఓమ్ నియమంను సరిచూచుట :
ఉద్దేశ్యం :
ఒక వాహకానికి సంబంధించిన V/I విలువ స్థిరమని చూపడము.

కావలసిన వస్తువులు :
6V బ్యాటరీ ఎలిమినేటర్, 0-1 A అమ్మీటర్, 0-67/1, మాంగనీస్ తీగ . ఓల్డ్ టరు, వాహక తీగలు (రాగి తీగలు), 50 సెం.మీ. పొడవు గల సర్పిలాకార మాంగనీస్ తీగ, రియోస్టాట్, స్విచ్ మరియు UV LED.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 17

నిర్వహణ పద్దతి :

  1. పటంలో చూపిన విధముగా వలయాన్ని కలపండి. (బ్యాటరీ ఎలిమినేటర్ లో గరిష్ఠంగా 4.5V దగ్గర నాబ్ ను ఉంచాలి.
  2. రియోస్టాట్ ను ఉపయోగించి మాంగనీస్ తీగ రెండు కొనల వద్ద పొటెన్షియల్ భేదమును OV నుంచి గరిష్ఠంగా 4.5V మధ్య వరకు మార్చాలి.
  3. రియోస్లాట్ ఉపయోగించి మాంగనీస్ తీగ రెండు కొనల వద్ద కనీసం 10 పొటెన్షియల్ భేదం ఉంచాలి.
  4. ఈ సందర్భానికి వలయంలో విద్యుత్ ప్రవాహంను అమ్మీటరు ద్వారా గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
  5. రియోస్టాట్ ను ఉపయోగించి పొటెన్షియల్ భేదం (V) 4.5V వరకు మార్చుతూ విద్యుత్ ప్రవాహం (I) విలువలను గుర్తించండి.
  6. ఈ విధంగా V మరియు I విలువలను కనీసం 5 రీడింగులను గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
  7. ప్రతి సందర్భానికి \(\frac{V}{I}\) విలువను కనుగొనండి.
  8. \(\frac{V}{I}\) విలువ స్థిరమని మనము గమనించవచ్చును. V ∝ I అయిన \(\frac{V}{I}\) = స్థిరము
  9. ఈ స్థిరాంకంను వాహక విద్యుత్ నిరోధం అంటాము. దీనిని ‘R’ తో సూచిస్తాము.
    \(\frac{V}{I}\) = R ⇒ V = IR
    ∴ ఓమ్ నియమము నిరూపించబడినది.

II. ఉద్దేశ్యం :
LED వంటి వాహకాలకు \(\frac{V}{I}\) స్థిరం కాదు అని చూపడం.

నిర్వహణ పద్దతి :
మాంగనిన్ తీగ బదులుగా 3V LED (Light Emitting diode) వాడి పై కృత్యాన్ని మరలా చేయండి.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 18

→ LED యొక్క పొడవైన ధృవాన్ని బ్యాటరీ ధన ధృవానికి, పొట్టి దానిని బ్యాటరీ ఋణ ధృవానికి కలపండి.
→ రియోస్టాట్ ను ఉపయోగించి పొటెన్షియల్ భేదాన్ని మార్చుతూ (గరిష్ఠంగా 39 వరకు) ప్రతి సందర్భంలోను విద్యుత్ ప్రవాహం (I) మరియు పొటెన్షియల్ భేదం (V) విలువలు గుర్తించి పట్టికలో పొందుపరచండి.
→ \(\frac{V}{I}\) విలువలు లెక్కించండి.
→ \(\frac{V}{I}\) విలువ స్థిరం కాదని గుర్తిస్తారు.

రియోస్టాట్ తయారీ :
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 19
30 సెం.మీ. ల పొడవు గల చెక్క స్కేలు తీసుకొని దానికి రెండు చివరల రెండు రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాల గుండా రెండు బోల్టులను నట్టుల సహాయంతో బిగించాలి. తరువాత విద్యుత్ ఇస్త్రీ పెట్టె ఫిలమెంట్ లోని పలుచని నిక్రోమ్ తీగ తీసుకొని, ఒక కొనను మొదటి బోల్టుకు బిగించి, స్కేలు చుట్టూ సమాన దూరాలలో తీగను వలయాకారంలో బిగుతుగా చుట్టి, రెండవ కొనను రెండవ బోలుకు | బిగించాలి. ఈ స్కేలును మరొక స్కేలుపై లంబంగా, పటంలో చూపిన విధంగా జిగురుతో అతికించాలి. మీ రియోస్టాట్ తయారైనది. విద్యుత్ వలయంలో రియోస్టాట్ ను ఎలా ఉపయోగించాలో మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి.

ప్రశ్న 20.
a) ఒక 30Ω బ్యాటరీని తీసుకొని, పొటెన్షియల్ భేదాన్ని కొలవండి. ఆ బ్యాటరీని ఏదైనా వలయంలో ఉంచి, పొటెన్షియల్ భేదాన్ని కొలవండి. మీ రీడింగులలో ఏమైనా తేడా ఉందా? ఎందుకు?
జవాబు:
ఘటమును వలయంలో సంధానం చేసినప్పుడు పొటెన్షియల్ భేదాన్ని గమనించలేము.

b) బల్బు విడిగా ఉన్నప్పుడు మల్టీమీటరు సహాయంతో దాని నిరోధాన్ని కొలవండి. ఈ బల్బ్ 12V బ్యాటరీ, స్విలను శ్రేణిలో కలిపి, స్విచ్ ఆన్ చేయండి. ప్రతి 30 సెకనులకొకసారి బల్పు యొక్క నిరోధాన్ని కొలవండి. సరైన పట్టికను గీసి దానిలో నమోదు చేయండి. పై పరిశీలనల నుండి ఏమి నిర్ధారిస్తారు? (AS4)
జవాబు:
బల్బును వలయంలో ఉంచి, ప్రతి 30 సెకనులకొకసారి బల్బు యొక్క నిరోధాన్ని కొలిచిన దాని విలువ పెరుగుచుండును.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 20

పై పట్టిక నుండి i) మూసిన, తెరిచిన వలయంలో బ్యాటరీ యొక్క పొటెన్షియల్ భేదంలో మార్పుండదు.
ii) ఉష్ణోగ్రత తగ్గిన, పెరిగిన వాహక నిరోధం తగ్గును.

ప్రశ్న 21.
ఇండ్లలో వాడే వివిధ విద్యుత్ పరికరాలు పాడవకుండా కాపాడడంలో వలయంలోని ఫ్యూజ్ పాత్రను ఎలా అభినందిస్తావు? (AS7)
జవాబు:

  1. ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాన్ని నివారించడానికి, మన ఇండ్లలోని వలయంలో ఫ్యూజ్ ని ఉపయోగిస్తాము.
  2. ఇంటి వలయంలో లైన్స్ ద్వారా వచ్చే మొత్తం విద్యుత్ ఫ్యూజ్ గుండా ప్రవహించవలసి ఉంటుంది.
  3. ఫ్యూజ్ అనేది అతి తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన ఒక సన్నని తీగ.
  4. పరిమితికి మించిన ఎక్కువ విద్యుత్ ఫ్యూజ్ ద్వారా ప్రవహించినపుడు సన్నని తీగ వేడెక్కి కరిగిపోతుంది.
  5. కరిగిపోయిన ఫ్యూజ్ వల్ల ఇంటిలోని మొత్తం వలయం తెరవబడి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది.
  6. ఆ విధముగా వలయంలో ఫ్యాన్, టి.వి., ఫ్రిజ్ వంటి విద్యుత్ సాధనాలకు ఇబ్బంది కలగకుండా ఉంచుటలో ఫ్యూజ్ పాత్ర ఎంతగానో అభినందనీయమైనది.

ప్రశ్న 22.
పటంను గమనించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు తెల్పండి.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 21
i) C, D నిరోధాలు శ్రేణిలో ఉన్నాయా?
ii) A, B నిరోధాలు శ్రేణిలో ఉన్నాయా?
iii) ఏదైనా నిరోధంతో బ్యాటరీ శ్రేణి సంధానంలో ఉందా?
iv) నిరోధం C పై పొటెన్షియల్ భేదం ఎంత?
v) నిరోధం A పై పొటెన్షియల్ భేదం 6V అయిన వలయంలో ఫలిత emf ఎంత?
జవాబు:
i) అవును, 3 మరియు 4 నిరోధాలు చివర – నుండి – చివరకు సంధానం చేసినందున అవి శ్రేణి సంధానంలో ఉన్నాయి.
ii) కాదు, 1 మరియు 2 నిరోధాలు చివర – నుండి – చివరకు సంధానం చేయలేనందున అవి శ్రేణిలో లేవు.
iii) అవును, V1 నిరోధంతో (A) బ్యాటరీ శ్రేణిలో సంధానం చేయబడి ఉంది.
iv) 3వ నిరోధం పై ఉన్న పొటెన్షియల్ భేదం 6 వోల్ట్లు . 3 మరియు 4 నిరోధాలు శ్రేణిలో ఉన్నాయి.
మొత్తం పొటెన్షియల్ V4 + V3 = 8 + V3
3 మరియు 4 నిరోధాలు రెండూ 2వ నిరోధానికి సమాంతరంగా ఉన్నాయి.
V2 = V3 + 8 ⇒ 14 = V3 + 8 ⇒ V3 = 6V
v) మొత్తం ఫలిత emf విలువ V = V1 + V2
V= 6 + 14 = 20V
V = 20V

(లేదా)
V = V1 + V2 + V4
= 6 + 6 + 18
V = 20V

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 23.
ఒక ఇంటిలో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు, ఒక టెలివిజన్‌ను వాడుతున్నారు. ప్రతి బల్బు 40 W విద్యుత్ ను వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ ను వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి బల్బును ఐదు గంటలు, ప్రతి ఫ్యానును 12 గంటలు, టెలివిజనను 5 గంటల చొప్పున ప్రతిరోజు వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ. చొప్పున విద్యుత్ ఛార్జీ వేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన సొమ్ము ఎంత? (AS7)
జవాబు:

  1. 40 W ల 3 బల్బులు రోజుకి 5 గం||ల చొప్పున వినియోగించు విద్యుత్ శక్తి = 3 × 40 × 5 = 600 WH
  2. 80 W ల 2 ఫ్యానులు రోజుకి 12 గం||ల చొప్పున వినియోగించు విద్యుత్ శక్తి = 2 × 80 × 12 = 1920 WH
  3. 60 W ల.టెలివిజన్ రోజుకు 5 గం||ల చొప్పున వినియోగించు విద్యుత్ శక్తి = 1 × 60 × 5 = 300 WH
    1 రోజుకు వినియోగించిన మొత్తం విద్యుత్ శక్తి = 600 + 300 + 1920 = 2,820 WH
    WH ను KWH లోకి మార్చగా
    \(\frac{2820}{1000}\) = 2.82 KWH

30 రోజులలో వాడిన విద్యుత్ శక్తి = 2.82 x 30 = 84.6 KWH
1 యూనిట్ (KWH) ధర = ₹ 3.00
84.6 యూనిట్లకు చెల్లించవలసిన సొమ్ము = 84.6 × 3 = ₹ 253.80

ప్రశ్న 24.
వాహక నిరోధం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుందని మీరెలా పరీక్షిస్తారు? (కృత్యం – 2) (AS1)
(లేదా)
వాహక నిరోధము ఉష్ణోగ్రతపై ఆధారపడునని నీవు ఏ విధముగా నిరూపించెదవో వ్రాయుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 22
1) పటంలో చూపిన విధంగా వలయం పూర్తి చేయండి.
2) బ్యాటరీ ఎలిమినేటర్ 1.5V పొటెన్షియల్ భేదం ఉండే విధంగా నాబ్ ను ఉంచండి.
3) స్విచ్ ఆన్ చేసి వలయంలో అమ్మీటర్ రీడింగ్ గుర్తించి పట్టికలో నమోదు చేయండి.
4) ఈ సందర్భంలో బల్బును తాకి ఉష్ణాన్ని గుర్తించండి.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 20
5) ఇదే విధంగా 3V, 4.5V, 6V లతో ప్రయోగం చేసి V మరియు I విలువలు కనుగొని పట్టికలో నమోదు చేయండి.
6) బల్బును తాకి విడుదల చేసే ఉష్ణాన్ని పరిశీలించండి.

పరిశీలనలు :

  1. ప్రతి సందర్భంలో బల్బు ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం సరాసరి పెరుగుదల తగ్గి విద్యుత్ నిరోధం పెరగడం గమనిస్తారు.
  2. పై కృత్యం నుంచి మీరు బల్బులోని టంగ్ స్టన్ తీగ (ఫిలమెంట్) ఉష్ణోగ్రత పెరిగే కొలదీ ఆ తీగ నిరోధం పెరగడం గమనించి ఉంటారు.

ఫలితం :
దీనిని బట్టి బల్బులోని తీగ నిరోధానికి మరియు దాని ఉష్ణోగ్రతకు సంబంధం ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఓమ్ నియమాన్ని ఎల్లప్పుడూ స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిశీలించాలి.

ప్రశ్న 25.
ఇండ్లలో ఫ్యూజ్ ఎందుకు వాడతాం? (AS1)
(లేదా)
ఇళ్ళలో విద్యుత్ సాధనాలు, సంధానాలు పాడవకుండా ప్యూజ్ కాపాడుతుంది. ప్యూజ్ పాత్రను ప్రశంసిస్తూ నాలుగు వాక్యాలు వ్రాయండి.
(లేదా)
ఇంటి పరికరాలను కలుపు వలయంలో ఫ్యూజ్ లను ఎందుకు వాడతారో వివరింపుము.
(లేదా)
ఫ్యూజ్ ల వలన ఉపయోగమేమి?
జవాబు:

  1. ఫ్యూజ్ అనునది అతి తక్కువ ద్రవీభవన స్థానం కల్గిన ఒక సన్నని తీగ.
  2. ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాన్ని నివారించడానికి మన ఇండ్లలోని వలయంలో ఫ్యూజ్ ని ఉపయోగిస్తాము.
  3. ఈ అమరికలో, లైన్స్ ద్వారా వచ్చే మొత్తం విద్యుత్ ఫ్యూజ్ గుండా ప్రవహించవలసి ఉంటుంది.
  4. ఫ్యూజ్ గుండా ప్రవహించే విద్యుత్ అధికం అయితే ఆ సన్నని తీగ వేడెక్కి కరిగిపోతుంది.
  5. అప్పుడు ఇంటిలోని మొత్తం వలయం తెరవబడి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది.
  6. దీని వలన ఇంటిలోని విద్యుత్ సాధనాలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

ప్రశ్న 26.
30 Ω నిరోధం గల మూడు నిరోధాలు నీ దగ్గర ఉన్నవి అనుకుందాం. ఈ మూడింటిని వాడి ఎన్ని రకాల నిరోధాలు పొందగలం ? వాటికి సంబంధించిన పటాలను గీయండి. (AS2)
జవాబు:
R1 R2 మరియు R3 లను మూడు నిరోధాలనుకొనుము.
ఇచ్చిన నిరోధాల విలువలు R1 = R2 = R3 = 30 Ω
ఈ మూడు నిరోధాలను క్రింది విధాలుగా సంధానం చేయవచ్చును.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 23
1) మూడు నిరోధాలను శ్రేణి సంధానం చేసిన,
2) మూడు నిరోధాలను సమాంతర సంధానం చేసిన,
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 24
3) రెండు నిరోధాలను సమాంతరంగానూ, ఒక నిరోధాన్ని శ్రేణిలో సంధానం చేసిన,
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 25
4) రెండు నిరోధాలను శ్రేణిలోను, ఒక నిరోధంను సమాంతరంగాను సంధానం చేసిన,
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 26

ప్రశ్న 27.
A, B అనే రెండు నిరోధాలు బ్యాటరీతో శ్రేణిలో కలపబడి ఉన్నాయి. A నిరోధంపై పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి వోల్టు మీటరు ఉంది. ఈ సందర్భాన్ని వివరించే పటాన్ని గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 27
A మరియు B లు రెండు నిరోధములు.

ప్రశ్న 28.
పటంలో B వద్ద పొటెన్షియల్ శూన్యమయిన A వద్ద పొటెన్షియల్ …..
(లేదా)
పటంలో A వద్ద ఎంత పొటెన్షియల్ వున్న B వద్ద పొటెన్షియల్ శూన్యమగును?
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 28
జవాబు:
ఇచ్చిన పటంకు కిర్ ఛాఫ్ లూప్ నియమంను అన్వయించగా,
VA – (5 × 1) – 2 – VB = 0 ⇒ VA – 5 – 2 – 0 = 0 ⇒ VA = 7
B వద్ద పొటెన్షియల్ శూన్యమయిన ‘A’ వద్ద పొటెన్షియల్ విలువ 7V ఉండును.

ప్రశ్న 29.
మీ శరీర నిరోధం 1,00,000 Ω అయిన మీరు 12V బ్యాటరీని ముట్టుకున్నప్పుడు మీ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత? (AS7)
జవాబు:
శరీరం యొక్క నిరోధము = R = 1,00,000 Ω
బ్యాటరీ యొక్క విద్యుత్ పొటెన్షియల్ (V) = 12V
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 29

ప్రశ్న 30.
100 Ω నిరోధం గల ఏకరీతి మందం గల వాహకం కరిగి, మొదటి వాహక పొడవుకు రెట్టింపు పొడవు గల దానిగా మారింది. క్రొత్తగా తయారైన వాహకం నిరోధం ఎంత? (AS7)
జవాబు:
వాహకము యొక్క తొలి పొడవు = l1 = l
వాహకము యొక్క తుది పొడవు = l2 = 2l
వాహకము యొక్క తొలి మధ్యచ్ఛేద వైశాల్యం = A1 = A
వాహకము యొక్క తుది మధ్యచ్ఛేద వైశాల్యం = A2 = ?
స్థూపము యొక్క వైశాల్యం A1l1 = A2l2 {∵ πr² =h = Al; πr² = a, h = l}
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 30
∴ వాహకపు పొడవు రెట్టింపైన, దాని నిరోధము 4 రెట్లుగా మారును.

ఖాళీలను పూరించండి

1. కిలోవాట్ అవర్ ………….. కు ప్రమాణం. అందుకు (విద్యుత్ శక్తి)
2. మందంగా ఉన్న వాహకం యొక్క నిరోధం, సన్నని వాహకం యొక్క నిరోధం కంటే …………….. (తక్కువ)
3. 12 V బ్యాటరీ 2 A విద్యుత్ ప్రవాహాన్ని ఒక వలయంలోకి పంపుతుంది. అయితే ఆ వలయ ఫలిత నిరోధం ……….. (6Ω)
4. పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం …….. (ఓల్ట్)
5. విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ……… (ఆంపియర్)
6. 22, 42, 692 నిరోధాలను శ్రేణిలో కలిపారు. ఆ వలయ ఫలిత నిరోధం …………… (12Ω)
7. 22, 42, 692 నిరోధాలను సమాంతరంగా కలిపారు. ఆ వలయం ఫలిత నిరోధం ……………. (11/12Ω)
8. 10 V బ్యాటరీ ఇచ్చే సామర్థ్యం 10 W బ్యాటరీ నుండి బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహం ……… (1 ఆంపియర్)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. 50 2 నిరోధం గల ఏకరీతి నిరోధాన్ని ఐదు సమాన భాగాలుగా విభజించారు. వీటిని సమాంతరంగా కలిపారు. దాని ఫలిత నిరోధం …..
A) 2 Ω
B) 12 Ω
C) 250 Ω
D) 6250 Ω
జవాబు:
A) 2 Ω

2. వాహకంలో ఒక ఆవేశాన్ని A నుండి B కు కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని ఆ బిందువుల మధ్య కదల్చడానికి విద్యుత్ బలాలు చేయవలసిన పనిని …… అంటాం.
A) A వద్ద పొటెన్షియల్
B) B వద్ద పొటెన్షియల్
C) A, B ల మధ్య పొటెన్షియల్ భేదం
D) A నుండి B కు ప్రవహించే విద్యుత్
జవాబు:
C) A, B ల మధ్య పొటెన్షియల్ భేదం

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

3. కౌలు / కూలుంబ్ … కు సమానం.
A) వాట్
B) వోల్ట్
C) ఆంపియర్
D) ఓమ్
జవాబు:
B) వోల్ట్

4. తీగలో విద్యుత్ ప్రవాహం ……… పై ఆధారపడుతుంది.
A) కేవలం తీగ కొనల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదం
B) కేవలం తీగ నిరోధం
C) A మరియు B
D) దేనిపై ఆధారపడదు
జవాబు:
C) A మరియు B

5. కింది వాక్యాలను గమనించండి.
a) శ్రేణి సంధానంలో, ప్రతి విద్యుత్ పరికరం నుండి ఒకే విద్యుత్ ప్రవహిస్తుంది.
b) సమాంతర సంధానంలో, ప్రతి విద్యుత్ పరికరంపై పొటెన్షియల్ భేదం ఒకేలా ఉంటుంది.
A) a, b లు సరైనవి
B) a సరైనది; b సరైనది కాదు
C) a సరైనది కాదు; b సరైనది
D) a, b లు రెండునూ సరైనవి కావు
జవాబు:
A) a, b లు సరైనవి

10th Class Physical Science 9th Lesson విద్యుత్ ప్రవాహం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 1.
లఘువలయం (short circuit) అంటే ఏమిటి?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 32

  1. పటంలో చూపినట్లుగా వలయంను ఏర్పాటు చేయుము.
  2. వలయంను మూసిన బల్బ్ వెలుగును.
  3. పటంలో చూపినట్లు C మరియు D ల మధ్య రాగి తీగను కల్పుము.
  4. వలయంను మూసిన బల్బ్ వెలగదు.
    పై సందర్భంలో అమ్మీటర్ మొదట రీడింగు కన్నా ఎక్కువ రీడింగును చూపును.
  5. రెండవ సందర్భంలో బల్బ్ ఫిలమెంట్ రాగి తీగకన్నా ఎక్కువ నిరోధంను ప్రదర్శించును.
  6. కావున కరెంటు CD మార్గంను ఎన్నుకొనును. కావున బల్బ్ వెలగదు.
  7. దీనిని బట్టి వలయంలో విద్యుత్ తక్కువ నిరోధము గల మార్గముకు ప్రాధాన్యతనిచ్చును.
  8. ఈ విధంగా C మరియు D ల మధ్య తీగను కలుపు పద్ధతిని లఘువలయం అంటారు.

ప్రశ్న 2.
షార్ట్ సర్క్యూట్ వలన ఇంటిలోని వలయం, సాధనాలు ఎందుకు పాడవుతాయి?
జవాబు:

  1. వలయంలో విద్యుత్ ప్రవాహం కనిష్ఠ నిరోధమార్గంను ఎంచుకొనును.
  2. లఘువలయం ఏర్పడిన తర్వాత వలయంలో అధిక విద్యుత్ ప్రవాహం ఏర్పడును.
  3. ఈ అధిక కరెంటు విద్యుత్ సాధనాలను పాడయ్యేటట్లుగా చేస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 185

ప్రశ్న 3.
విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి?
జవాబు:
ఆవేశాల క్రమచలనాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 4.
వలయంలో కలిపిన వాహకం గుండా ఏ ఆవేశం (ధనావేశం/ఋణావేశం) ప్రవహిస్తుంది?
జవాబు:
వలయంలో కలిపిన వాహకం గుండా ఋణావేశం ప్రవహించును.

ప్రశ్న 5.
ఆవేశాల చలనాన్ని స్పష్టం చేసే సందర్భాలు మన నిత్యజీవితంలో ఏవైనా ఉన్నాయా?
జవాబు:
మేఘాల మధ్య లేదా మేఘం, భూమి మధ్య ఆవేశాల ఉత్సర్గం వలన మెరుపులు రావటం ఒక ఉదాహరణ.

ప్రశ్న 6.
ఆవేశాల చలనం వల్ల, ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందా?
జవాబు:
ఏర్పడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 186

ప్రశ్న 7.
అన్ని పదార్థాలూ వాహకాలుగా ఎందుకు పని చేయలేవు?
జవాబు:
అన్ని పదార్థాలలో స్వేచ్ఛా వాహకాలు ఉండవు. కనుక వాహకాలుగా పనిచేయవు.

10th Class Physical Science Textbook Page No. 187

ప్రశ్న 8.
ఎలక్ట్రాన్లు ఏ దిశలో కదులుతాయి?
జవాబు:
విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేకదిశలో ఎలక్ట్రాన్లు కదులుతాయి.

ప్రశ్న 9.
ఎలక్ట్రాన్లు త్వరణాన్ని పొందుతాయా?
జవాబు:
ఎలక్ట్రాన్లు అభిఘాతాల వలన శక్తిని కోల్పోతాయి. తిరిగి విద్యుత్ క్షేత్రం వలన త్వరణాన్ని పొందుతాయి.

ప్రశ్న 10.
ఎలక్ట్రాన్లు స్థిరవేగంతో చలిస్తాయా?
జవాబు:
ఎలక్ట్రాన్లు స్థిరవేగంతో చలిస్తాయి. దానినే అపసర వేగం లేదా అపసర వడి అంటారు.

10th Class Physical Science Textbook Page No. 188

ప్రశ్న 11.
విద్యుత్ ప్రవాహ దిశను మనం ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:
దీనికి I = nqvdA ద్వారా సమాధానమివ్వచ్చు. ఆవేశం ‘q’, డ్రిప్ట్ వడి vd గుర్తులపై విద్యుత్ ప్రవాహదిశ ఆధారపడి ఉంటుంది.

1) ఋణావేశంకు :
q – ఋణాత్మకము, vd – ధనాత్మకము ఐతే I-ఋణాత్మకం అగును. అనగా ఋణావేశాల ప్రవాహదిశకు వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహం ఉండును.

2) ధనావేశంకు :
q- ధన్మాతకము, vd – ధనాత్మకము ఐతే I- ధనాత్మకం అగును. అనగా ధనావేశాల ప్రవాహదిశలోనే విద్యుత్ ప్రవాహం ఉండును.

10th Class Physical Science Textbook Page No. 189

ప్రశ్న 12.
విద్యుత్ ప్రవాహాన్ని మనం ఎలా కొలుస్తాం?
జవాబు:
వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటరుతో కొలుస్తాం.

10th Class Physical Science Textbook Page No. 190

ప్రశ్న 13.
పొటెన్షియల్ భేదం ప్రకారం విద్యుత్ ప్రవాహం ఏ దిశలో ఉంటుంది?
జవాబు:
పొటెన్షియల్ భేదం ప్రకారం విద్యుత్ ప్రవాహం ఎక్కువ పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ దిశలో ఉంటుంది.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 14.
వాహకంలో ధనావేశాలు కదులుతాయా? దీనికి మీరు ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
జవాబు:
ద్రవాల గుండా విద్యుత్ ప్రవహిస్తున్నపుడు ధన అయాన్లు, ఋణ అయాన్లు పరస్పరం వ్యతిరేకదిశలో చలిస్తాయి.

10th Class Physical Science Textbook Page No. 192

ప్రశ్న 15.
పొటెన్షియల్ భేదం లేదా emfను ఎలా కొలుస్తాం?
జవాబు:
ఓల్ట్ మీటర్ ను పయోగించి పొటెన్షియల్ భేదం లేదా emfను కొలుస్తాము.

10th Class Physical Science Textbook Page No. 194

ప్రశ్న 16.
LED విషయంలో V, I ల నిష్పత్తి ఎందుకు స్థిరంగా లేదో ఊహించగలరా?
జవాబు:
LED అనునది అర్ధవాహకము. అర్ధవాహకాలలో V మరియు I లు అనుపాతంలో ఉండవు మరియు ఓమ్ నియమంను పాటించవు కనుక.

ప్రశ్న 17.
అన్ని పదార్థాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయా?
జవాబు:
వాయువులు, అర్ధవాహకాలు ఓమ్ నియమమును పాటించవు.

ప్రశ్న 18.
ఓమ్ నియమం ఆధారంగా మనం పదార్థాలను వర్గీకరించగలమా?
జవాబు:
ఓమ్ నియమం ఆధారముగా పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. అవి :

  1. ఓమీయ వాహకాలు,
  2. అఓమీయ వాహకాలు

ప్రశ్న 19.
నిరోధం అంటే ఏమిటి?
జవాబు:
వాహకంలో ఎలక్ట్రాన్ల చలనానికి కలిగే ఆటంకాన్ని నిరోధం అంటాం.

10th Class Physical Science Textbook Page No. 185

ప్రశ్న 20.
మన నిత్యజీవితంలో ఓమ్ నియమం ఉపయోగమేమైనా ఉందా?
జవాబు:
పదార్థాల మధ్య వ్యత్యాసము, వాటి రకాలను తెలుసుకొనుటకు ఓమ్ నియమం ఉపయోగపడును.

ప్రశ్న 21.
మన శరీరానికి విద్యుత్ ఘాతం (electric shock) కలగడానికి కారణం విద్యుత్ ప్రవాహమా? లేక ఓల్టేజా?
జవాబు:
మన శరీరానికి విద్యుత్ ఘాతం కలగడానికి కారణం .విద్యుత్ ప్రవాహం, ఓల్టేజ్ మరియు మన శరీర నిరోధంలో కలిగే మార్పు.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 22.
మన ఇళ్లలో వాడే ఓల్టేజ్ ఎంతో మీకు తెలుసా?
జవాబు:
మన ఇళ్లలో 240 V ఓల్టేజ్ ను వాడతాము.

ప్రశ్న 23.
240 V తీగను తాకితే ఏం జరుగుతుంది?
జవాబు:
240 V తీగను తాకినపుడు, మన శరీరం గుండా 0.0024 A విద్యుత్తు ప్రవహించును. దీని వలన మన అవయవాలు నిర్వహించు పనులకు ఆటంకం కలుగును.

10th Class Physical Science Textbook Page No. 197

ప్రశ్న 24.
అధిక ఓల్టేజ్ తీగపై నిలుచున్న పక్షికి విద్యుత్ ఘాతం ఎందుకు కలుగదు?
జవాబు:
అధిక ఓల్టేజ్ తీగపై పక్షి నిలబడినప్పుడు, దాని కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం లేదు. ఎందుకంటే అది ఒకే తీగపై నిలబడింది. అందువల్ల పక్షి గుండా విద్యుత్ ప్రవాహం జరుగదు. కనుక పక్షికి విద్యుత్ ఘాతం కలుగదు.

10th Class Physical Science Textbook Page No. 200

ప్రశ్న 25.
విద్యుత్ పరికరాలను వలయంలో ఎలా కలుపుతాం?
జవాబు:
విద్యుత్ పరికరాలను వలయంలో సమాంతరంగా కానీ, శ్రేణిలో కానీ కలుపుతాము.

10th Class Physical Science Textbook Page No. 202

ప్రశ్న 26.
మన ఇళ్ళలోని విద్యుత్ పరికరాలను ఎలా కలుపుతారు?
జవాబు:
మన ఇండ్లలోని విద్యుత్ పరికరాలను సమాంతర సంధానం చేస్తారు.

10th Class Physical Science Textbook Page No. 207

ప్రశ్న 27.
“ఈ నెల మనం 100 యూనిట్ల విద్యుత్ (కరెంట్) వాడాము” వంటి మాటలు మీరు వినే ఉంటారు. దీని అర్థమేంటి?
జవాబు:
ఈ నెల మనము 100 KWHల విద్యుత్ శక్తిని వినియోగించామని అర్థము.

10th Class Physical Science Textbook Page No. 208

ప్రశ్న 28.
యూనిట్ అంటే ఏమిటి?
జవాబు:
ఒక యూనిట్ అంటే ఒక కిలోవాట్ (KWH) అవర్ అని అర్థము.

ప్రశ్న 29.
ఓవర్ లోడ్ అంటే ఏమిటి?
జవాబు:
విద్యుత్ వలయంలో పరిమితిని మించిన పరిమాణంలో విద్యుత్తు ప్రవహించు సందర్భము.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 30.
ఓవర్ లోడ్ వల్ల విద్యుత్ సాధనాలు ఎందుకు చెడిపోతాయి?
జవాబు:
పరిమితిని మించిన విద్యుత్తు ప్రవాహం వలన అధిక ఉష్ణం విడుదలై, తీగలు వేడెక్కడం వల్ల మంటలు సంభవిస్తాయి.

10th Class Physical Science Textbook Page No. 209

ప్రశ్న 31.
ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాన్ని మనం ఎలా నివారించగలం?
జవాబు:
ఓవర్ లోడ్ వల్ల కలిగే ప్రమాదాన్ని ఫ్యూజ్ ను వాడడం వల్ల నివారించవచ్చును.

పరికరాల జాబితా

బల్బు, ఘటము, స్విచ్, రాగి తీగలు, అమ్మీటరు, వోల్టుమీటరు, బ్యాటరీ ఎలిమినేటర్, బల్బు, మల్టీమీటరు, కీ, రాగి, అల్యూమినియం, మాంగనిన్ తీగలు, వివిధ పొడవులు గల మాంగనిన్ తీగలు, ఒకే పొడవు కలిగి వేరు వేరు మధ్యచ్ఛేద వైశాల్యాలు గల అల్యూమినియం తీగలు, గ్రాఫ్ కాగితాలు, నిరోధాలు.

10th Class Physical Science 9th Lesson విద్యుత్ ప్రవాహం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
విద్యుత్ ప్రవాహంకు జనకము మరియు వాహకము అవసరమని కృత్యం ద్వారా తెలుపుము.
(లేదా)
ఆవేశాల చలనం వలన విద్యుత్ ప్రవాహం ఏర్పడునని కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
సందర్భం -1:

  1. ఒక బల్బు, ఘటం (బ్యాటరీ), స్విచ్ మరియు ఉష్ణ బంధక పొర కలిగిన రాగి తీగలను కొన్నింటిని తీసుకొనుము.
  2. వీటిని వలయంలో కలిపి స్విచ్ ఆన్ చేయుము.
  3. బల్బును పరిశీలించుము. అది వెలుగును.

సందర్భం – 2:

  1. పైన తయారు చేయబడిన వలయం నుండి ఘటాన్ని తొలగించుము.
  2. మిగిలిన పరికరాలతో వలయం పూర్తి చేయుము.
  3. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయుము.
  4. బల్బు వెలగదు, దీనికి కారణము వలయంలో శక్తి జనకం (బ్యాటరీ) లేకపోవుటయే.

సందర్భం – 3:

  1. ఇప్పుడు వలయంలో రాగి తీగకు బదులుగా నైలాన్ తీగను తీసుకొనుము.
  2. నైలాన్ తీగను బల్బు, స్విచ్ ద్వారా బ్యాటరీ యొక్క రెండు చివరలకు కలుపుము.
  3. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి బల్బును పరిశీలించుము.
  4. బల్బు వెలగదు.
  5. వలయంలో సామర్థ్య జనకమైన ఘటమున్నప్పటికీ నైలాన్ తీగలు శక్తిని తీసుకోలేకపోవడం వలన బల్బ్ వెలగలేదు.

పరిశీలన :
దీనిని బట్టి పై సందర్భాల ద్వారా వలయంలో విద్యుత్తును సరఫరా చేయడంలో, వలయంలో బ్యాటరీ, వాహక తీగలు అవసరమని తెలుస్తుంది.

కృత్యం – 3

ప్రశ్న 2.
వాహక నిరోధం, ఆ వాహక స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఒక కృత్యం ద్వారా నిరూపించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 6

  1. రాగి, నిక్రోమ్, మాంగనిన్ (కనీసం 2మీ) వంటి వివిధ రకాల లోహపు తీగలను తీసుకోండి. వాటి పొడవులు, మధ్యచ్ఛేద వైశాల్యాలు సమానంగా ఉండేట్లు జాగ్రత్త వహించండి.
  2. పటంలో చూపినట్లు వలయాన్ని ఏర్పాటు చేయండి.
  3. లోహపు తీగలలో ఏదో ఒకదానిని P, Q ల మధ్య ఉంచండి.
  4. స్విచ్ ఆన్ చేసి, వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్ తో కొలిచి మీ నోట్ బుక్ లో రాసుకోండి.
  5. మిగిలిన లోహపు తీగలతో ఈ కృత్యాన్ని నిర్వహించి, ప్రతీ సందర్భంలో బ్యాటరీ విద్యుత్ ప్రవాహాన్ని కొలవండి.
  6. పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పటికీ విద్యుత్ ప్రవాహం విలువ వివిధ లోహపు తీగలకు వివిధ రకాలుగా ఉండడం మీరు గుర్తిస్తారు.
  7. ఈ కృత్యాన్ని బట్టి వాహక నిరోధం, ఆ వాహక స్వభావంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం

కృత్యం – 5

ప్రశ్న 3.
వాహక నిరోధము ఆ వాహక మధ్యచ్చేద వైశాల్యంకు విలోమానుపాతంలో ఉంటుందని ఒక కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 31

  1. ఒకే పొడవు, వివిధ మధ్యచ్ఛేద వైశాల్యాలు గల ఇనుప కడ్డీలను తీసుకొనుము.
  2. పటంలో చూపిన విధముగా వలయాన్ని ఏర్పాటు చేయుము.
  3. మనము ఎంచుకున్న కడ్డీలలో ఏదో ఒకదానిని P, Qల మధ్య ఉంచి వలయంను పూర్తిచేయుము.
  4. వలయంలో ఉంచిన అమ్మీటర్ సహాయంతో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి రీడింగ్ ను నమోదు చేయుము.
  5. మిగిలిన కడ్డీలతో ఈ కృత్యాన్ని మరలా చేయుము.
  6. ప్రతీ సందర్భంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి రీడింగ్ ను నమోదు చేయుము.
  7. ఇనుప కడ్డీ మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతున్న కొలదీ అందులో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుటను మనము గమనించవచ్చు.
  8. అంటే కడ్డీ మధ్యచ్ఛేద వైశాల్యం పెరిగే కొలదీ దాని నిరోధం తగ్గును.
  9. ఈ కృత్యాన్ని బట్టి వాహక నిరోధము, వాహక మధ్యచ్ఛేద వైశాల్యంకు విలోమానుపాతంలో ఉంటుందని చెప్పవచ్చును.
    i.e. R ∝ \(\frac{l}{A}\) (ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు)

AP 10th Class Physical Science Chapter Wise Important Questions | 10th Class Physics Important Questions and Answers

Telangana & Andhra Pradesh SCERT AP State Board Syllabus 10th Class Physical Science Physics Important Questions and Answers, TS AP 10th Class Physics Chapter Wise Important Questions 2022 Pdf in English Medium and Telugu Medium are part of AP Board 10th Class Textbook Solutions.

Students can also read AP Board 10th Class Physical Science Solutions (Physics & Chemistry) for exam preparation.

AP 10th Class Physics Chapter Wise Important Questions 2022-2023 | 10th Class Physical Science Important Questions Pdf

AP TS 10th Class Physics Chapter Wise Important Questions 2022 | Physics Important Questions Class 10

AP 10th Class Physics Important Questions and Answers

AP 10th Class Physical Science Chapter Wise Important Questions

Physics 10th Class Important Questions | AP 10th Physics Important Questions | 10th Class PS Important Questions

AP 10th Class Physics Important Questions 2022-2023

10th Class PS Important Questions in Telugu Medium

 

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

SCERT AP 10th Class Physical Science Guide 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 7th Lesson Questions and Answers మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

10th Class Physical Science 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని లోపాలు ఏవి ? నవీన ఆవర్తన పట్టిక, మెండలీవ్ పట్టికలోని చాలా లోపాలను ఎలా తొలగించగలిగింది? (AS1)
(లేదా)
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని లోపాలను నవీన ఆవర్తన పట్టిక ఏ విధముగా సవరించినవో వివరించుము.
జవాబు:
మెండలీవ్ ఆవర్తన పట్టిక – లోపాలు :

1. అసంగత మూలకాల జతలు :
అధిక పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలు, అల్ప పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలకు ముందు ఉన్నాయి.
ఉదా : Te (పరమాణు ద్రవ్యరాశి 127.64), I (పరమాణు ద్రవ్యరాశి 126.94) కన్నా ముందు చేర్చబడినది.

2. సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం :
విభిన్న ధర్మాలు గల మూలకాలను ఒకే గ్రూపులో ఉపగ్రూపు – A మరియు ఉపగ్రూపు – B లలో ఉంచారు.
ఉదా : IA గ్రూపుకు చెందిన Li, Na, K వంటి క్షారలోహాలు, IB గ్రూపుకు చెందిన Cu, Ag, Au వంటి మూలకాలతో చాలా తక్కువ సారూప్యతను కలిగి ఉంటాయి.

నవీన ఆవర్తన పట్టిక, మెండలీవ్ లోపాలను తొలగించిన విధానము :

  1. పరమాణు సంఖ్య ఆరోహణక్రమం ప్రకారం అసంగత మూలకాల జతలు ఉంచబడ్డాయి.
  2. సారూప్యత లేని మూలకాలను వేరువేరు గ్రూపులలో ఉంచడం జరిగింది.
  3. ఎలక్ట్రాన్ విన్యాసం పరంగా వేర్వేరు మూలకాలు వేర్వేరు గ్రూపులలో ఉంచడం జరిగినది.

ప్రశ్న 2.
నవీన ఆవర్తన నియమాన్ని నిర్వచించండి. విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి. (AS1)
(లేదా)
ఆధునిక ఆవర్తన పట్టిక యొక్క అంశాలను వివరించండి.
జవాబు:
నవీన ఆవర్తన నియమము : మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.

విస్తృత ఆవర్తన పట్టిక నిర్మాణము :

  1. ఆవర్తన నియమము ప్రకారం నిర్మించబడినది.
  2. దీనినే విస్తృత ఆవర్తన పట్టిక అంటారు.
  3. ఈ పట్టికలో 18 నిలువు వరుసలు (గ్రూపులు), 7 అడ్డు వరుసలు (పీరియడ్లు) ఉంటాయి.
  4. సాంప్రదాయబద్ధంగా గ్రూపులను I నుండి VIII వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి సూచిస్తూ వాటికి A, B అక్షరాలను జోడించి చూపుతారు.
  5. గ్రూపులలో ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకాలను అమర్చారు.
  6. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లను 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తారు.
  7. పీరియడ్ లో మూలకాలను పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చారు.
  8. మూలకం యొక్క పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్ష్యలో చేరుతుందో దానిని ఆధారంగా చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాకు మూలకాలుగా వర్గీకరించారు.
  9. మొదటి పీరియడ్ 2 మూలకాలను, 2వ మరియు 3వ పీరియడ్లు 8 మూలకాలను, 4వ మరియు 5వ పీరియడ్లు 18 మూలకాలను, 6వ పీరియడ్ 32 మూలకాలను మరియు 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటాయి.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 3.
మూలకాలు ఏ విధంగా s, p, d, f బ్లాకులుగా విభజించబడ్డాయి? ఈ రకమైన వర్గీకరణ వలన ఎటువంటి అనుకూలతలున్నాయి? (AS1)
జవాబు:
మూలకం యొక్క పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్, ఏ ఉపకక్ష్యలో చేరుతుందో దాని ఆధారముగా చేసుకుని మూలకాలను s, p, d, f బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు.

s – బ్లాకు మూలకాలు :

  1. ఇవి గ్రూపు IA మరియు IIA కు చెందిన మూలకాలు.
  2. వీటిలో భేదపరిచే ఎలక్ట్రాన్ s – ఆర్బిటాల్ లోకి
  3. హైడ్రోజన్ తప్ప, అన్ని s – బ్లాకు మూలకాలు లోహాలే.
  4. వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము ns¹ నుండి ns² గా ఉండును.

p – బ్లాకు మూలకాలు :

  1. ఇవి గ్రూపు IIIA నుండి VIIIA కు చెందిన మూలకాలు.
  2. వీటిలో భేదపరిచే ఎలక్ట్రాన్ p – ఆర్బిటాల్ లోనికి చేరును.
  3. వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము ns² np¹ నుండి ns² np6 గా ఉండును.
  4. p – బ్లాక్ మూలకాలలో లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలుంటాయి.
  5. p- బ్లాకు మూలకాలలో He లో మాత్రమే ఎలక్ట్రాన్ p – ఆర్బిటాల్ లోనికి చేరదు.

d – బ్లాకు మూలకాలు :

  1. ఇవి గ్రూపు IB నుండి. VIIIB లకు చెందిన మూలకాలు. చేరును.
  2. వీటిలో భేదపరిచే ఎలక్ట్రాన్ d – ఆర్బిటాల్ లోనికి చేరును.
  3. d – బ్లాకు మూలకాలన్నీ లోహాలే.
  4. వీటి ఎలక్ట్రాన్ విన్యాసము (n-1) d1-10, ns1లేక2

f – బ్లాకు మూలకాలు :

  1. ఆవర్తన పట్టికకు క్రిందన ఉన్న లాంథనైడులు మరియు ఆక్టివైడులను కలిపి f – బ్లాకు మూలకాలు అంటారు.
  2. భేదపరిచే ఎలక్ట్రాన్ f – ఆర్బిటాల్ లోనికి చేరును.
  3. వీటిని అంతర పరివర్తన మూలకాలంటారు.

అనుకూలతలు :

  1. ఈ విధముగా బ్లాకులుగా విభజించడం వలన మూలకాలను తేలికగా గుర్తించగలము.
  2. మూలకాలను తేలికగా గ్రూపులుగా విభజించగలము

ప్రశ్న 4.
A, B, C, D మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను క్రింద ఇవ్వడమైనది. వీటి ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులివ్వండి. (AS1)
A. 1s² 2s² – 1. ఒకే పీరియడ్ లో ఉండే మూలకాలు ఏవి?
B. 1s² 2s² 2p6 3s² – 2. ఒకే గ్రూపులో ఇమిడి ఉన్న మూలకాలేవి?
C. 1s² 2s² 2p6 3s² 3p³ – 3. జడవాయు మూలకాలేవి?
D. 1s² 2s² 2p6 – 4. ‘C’ అనే మూలకం ఏ గ్రూపు, ఏ పీరియడ్ కు చెందినది?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసము ప్రకారము
A) Be
B) Mg
C) P
D) Ne మూలకాలను కలిగి ఉన్నవి.

  1. B మరియు C లు ఒకే పీరియడ్ కు చెందుతాయి.
  2. A మరియు B లు ఒకే గ్రూపుకు చెండుతాయి.
  3. ‘D’ మూలకము జడవాయువుకు చెందును.
  4. ‘C’ మూలకము 3వ పీరియడ్ మరియు 15వ గ్రూపుకు చెందును.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 5.
పరమాణు సంఖ్య 17గా గల మూలకం యొక్క క్రింది లక్షణాలను రాయండి. (AS1)
ఎలక్ట్రాన్ విన్యాసం …………………
పీరియడ్ సంఖ్య …………………
గ్రూపు సంఖ్య …………………
మూలక కుటుంబం …………………
వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య …………………
సంయోజకత …………………
లోహం లేదా అలోహం …………………
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s² 3p5
పీరియడ్ సంఖ్య : 3
గ్రూపు సంఖ్య : VII A
మూలక కుటుంబం : హాలోజన్ కుటుంబం
వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య : 2 + 5 = 7
సంయోజకత : 1
లోహం లేదా అలోహం : అలోహము

ప్రశ్న 6.
గ్రూపులో ఉండే మూలకాలు సాధారణంగా ఒకే రకమైన ధర్మాలు కలిగి ఉంటాయి. కానీ పీరియడ్ లో మూలకాలు భిన్న ధర్మాలను కలిగి ఉంటాయి. ఈ వ్యాక్యాన్ని ఎలా వివరిస్తావు? (AS1)
(లేదా)
సాధారణంగా గ్రూపులో ఉండు మూలకాలు ఒకేరకమైన ధర్మాలు కలిగి ఉంటాయి, కానీ పీరియడ్లలో ఇది భిన్నము ఎందుకో వివరించుము.
జవాబు:

  1. విస్తృత ఆవర్తన పట్టిక నవీన ఆవర్తన నియమంపై ఆధారపడి తయారు చేయబడినది.
  2. నవీన ఆవర్తన నియమం ప్రకారం మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అనగా ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకాలు సారూప్యత కలిగి ఉంటాయి.
  3. గ్రూపులోని మూలకాల యొక్క పరమాణువులు ఒకే ఎలక్ట్రాన్ విన్యాసమును కలిగి ఉంటాయి. కావున మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి మరియు పై నుండి క్రిందకు ఒకే భౌతిక ధర్మాలను ప్రదర్శిస్తాయి.
  4. పీరియడ్లలోని మూలకాల యొక్క పరమాణువులు వేర్వేరు ఎలక్ట్రాన్ విన్యాసాలను కలిగి ఉంటాయి. కావున వేర్వేరు రసాయన మరియు భౌతిక ధర్మాలను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 7.
నవీన ఆవర్తన పట్టికను ఉపయోగించి కింది పట్టికను పూర్తి చేయండి. (AS1)
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 1
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 2

ప్రశ్న 8.
నవీన ఆవర్తన పట్టికను ఉపయోగించి కింది పట్టికను పూరించండి. (AS1)
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 3
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 4

ప్రశ్న 9.
X, Y, Z ల ఎలక్ట్రాను విన్యాసాలు కింది విధంగా ఉన్నాయి. (AS1)
X = 2 Y = 2, 6
Z = 2, 8, 2 వీనిలో ఏది
a) రెండవ పీరియడు చెందిన మూలకం?
b) రెండవ గ్రూపునకు చెందిన మూలకం?
c) 18వ గ్రూపునకు చెందిన మూలకం?
జవాబు:
a) ‘Y’ మూలకము రెండవ పీరియడకు చెందును.
కారణము : భేదిత ఎలక్ట్రాన్ రెండవ ఆర్బిటాల్ నందు ప్రవేశించినది కావున.

b) ‘Z’ మూలకము రెండవ గ్రూపుకు చెందును.
కారణము : దీని యొక్క సంయోజకత “2” కావున.

C) ‘X’ మూలకము 18వ గ్రూపుకు చెందును.
కారణము : ఇది పూర్తిగా నిండిన వేలన్సీ ఆర్బిటాల్ ను కలిగి ఉన్నది.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 10.
కింది జతలలో ఏ మూలకం యొక్క పరమాణు వ్యాసార్ధం ఎక్కువగా ఉండునో గుర్తించండి. (AS1)
(i) Mg లేదా Ca
(ii) Li లేదా Cs
(iii) N లేదా P
(iv) B లేదా Al (Each 1 Mark)
జవాబు:
ధర్మము : పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పరమాణు వ్యాసార్ధం తగ్గును.
గ్రూపులలో పై నుండి క్రిందకు పరమాణు వ్యాసార్ధం పెరుగును.

(i) Mg లేదా Ca : ఇవి రెండూ ఒకే గ్రూపుకు చెందును. Ca కు పరమాణు వ్యాసార్ధము ఎక్కువ.
(ii) Li లేదా CS : ఇవి ఒకే గ్రూపుకు చెందును. CS కు పరమాణు వ్యాసార్ధము ఎక్కువ.
(iii) N లేదా P : ఇవి ఒకే గ్రూపుకు చెందును. P కు పరమాణు వ్యాసార్ధము ఎక్కువ.
(iv) B లేదా Al : ఇవి కూడా ఒకే గ్రూపుకు చెందినవి. AL కు పరమాణు వ్యాసార్ధము ఎక్కువ.

ప్రశ్న 11.
కింది సందర్భాలలో లోహధర్మం ఎలా మారుతుంది? (AS1)
a) గ్రూపులో కిందికి వెళ్లే కొలది
b) పీరియడ్ లో ఎడమ నుండి కుడికి వెళ్లేటప్పుడు
(లేదా)
గ్రూపుల్లో మరియు పీరియడ్లలో లోహధర్మం ఏ విధంగా మారుతుంది? వివరించుము.
జవాబు:
a) గ్రూపులో కిందికి వెళ్ళేకొలది లోహధర్మం పెరుగును.
b) పీరియడ్ లో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలదీ లోహధర్మం తగ్గుతూ, అలోహధర్మం పెరుగును.

ప్రశ్న 12.
మూలకాల వర్గీకరణ నియమం పరమాణు ద్రవ్యరాశుల నుండి పరమాణు సంఖ్యలకు ఎందుకు మారింది? (AS1)
(లేదా)
మూలకాల వర్గీకరణ నియమం పరమాణు భారాల నుండి పరమాణు సంఖ్యలకు మారుటకు గల కారణమేమిటో, వ్రాయుము.
జవాబు:

  1. 18వ శతాబ్దంలో లూయీస్ ప్రాస్ట్ హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని తెలిపాడు.
  2. ప్రాస్ట్ కాలంలోనే అన్ని మూలకాల పరమాణుభారాలను పూర్ణాంక సంఖ్యలుగా తెలుపబడ్డాయి.
  3. క్రీ.శ. 1829లో డాబరీనర్ అను జర్మన్ రసాయన వేత్త పరమాణు భారాలను ఆధారముగా చేసుకొని త్రిక సిద్ధాంతంను ప్రతిపాదించెను.
  4. క్రీ.శ. 1865లో జాన్ న్యూలాండ్స్ పరమాణుభారాలను ఆధారముగా చేసుకుని అష్టక నియమమును ప్రతిపాదించెను.
  5. కానీ ఈ అష్టక నియమము కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు వర్తించలేదు.
  6. ఆ తర్వాత మెండలీవ్ అను రష్యన్ శాస్త్రవేత్త మూలకాల పరమాణు ద్రవ్యరాశులను ఆరోహణ క్రమంలో అమర్చి ఒక పట్టికను రూపొందించారు.
  7. మెండలీవ్ ఆవర్తన నియమమును పరమాణుభారాల ఆధారంగా ప్రతిపాదించాడు.
  8. ఆ తర్వాత క్రీ.శ. 1913లో బ్రిటీష్ శాస్త్రవేత్త అయిన మోస్లే x – కిరణ స్వభావాన్ని విశ్లేషించి, మూలక పరమాణువులలో ఉండే పరమాణు సంఖ్యను కనుగొన్నాడు.
  9. దీనినిబట్టి ఏదైనా మూలకానికి పరమాణువుల ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని మోస్లే ప్రతిపాదించాడు.
  10. పరమాణు సంఖ్యలను తెలుసుకున్న తర్వాత ఆవర్తన పట్టికలో పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను అమర్చడం జరిగినది.
  11. ఈ అమరిక ఇంతకు మునుపు అనుసరించిన పద్ధతి కన్నా మేలైనదిగా గుర్తించాడు.
  12. పరమాణుభారం అనే భావన నుండి పరమాణు సంఖ్య భావనకు ఆవర్తన నియమం మార్చబడి, నవీన ఆవర్తన నియమంగా పిలువబడుతుంది.

ప్రశ్న 13.
ఆవర్తన ధర్మమంటే ఏమిటి? క్రింది ధర్మాలు పీరియడ్, గ్రూపులలో ఏ విధంగా మార్పు చెందుతాయో వివరించండి. (AS1)
a) పరమాణు వ్యాసార్ధం b) అయనీకరణ శక్తి c) ఎలక్ట్రాన్ ఎఫినిటీ d) ఋణవిద్యుదాత్మకత
జవాబు:
ఆవర్తన ధర్మం : వేలన్సీ ఆర్బిటాల్ విన్యాసం ఆధారంగా మూలకాలను అమర్చినపుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధులలో పునరావృతమయ్యే ధర్మము.

a) పరమాణు వ్యాసార్ధము :
పరమాణు కేంద్రకం నుండి వేలన్సీస్థాయి ఎలక్ట్రానులకు మధ్య గల దూరంను పరమాణు వ్యాసార్ధము అంటారు.

  1. గ్రూపులలో : గ్రూపులలో పై నుండి కిందికి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్ధం పెరుగుతూ ఉంటుంది.
  2. పీరియలో : పీరియలో ఎడమ నుండి కుడికి వెళ్లే కొలదీ పరమాణు వ్యాసార్ధం తగ్గుతూ ఉంటుంది.

b) అయనీకరణ శక్తి :
వాయుస్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్న పరమాణువు యొక్క బాహ్య కక్ష్య నుండి ఒక ఎలక్ట్రాను తీసివేయడానికి కావలసిన కనీస శక్తిని అయనీకరణ శక్తి అంటారు.

  1. గ్రూపులలో పై నుండి కిందికి పోయేకొలదీ మూలకాల అయనీకరణ శక్తి తగ్గును.
  2. పీరియలో ఎడమ నుండి కుడికి పోయేకొలదీ మూలకాల అయనీకరణ శక్తి పెరుగును.

c) ఎలక్ట్రాన్ ఎఫినిటీ :
వాయుస్థితిలో ఒంటరి, తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ ను చేర్చగా విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.

  1. గ్రూపులలో పై నుండి కిందికి పోయేకొలదీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమముగా తగ్గుతాయి.
  2. పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయేకొలదీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమముగా పెరుగుతాయి.

d) ఋణవిద్యుదాత్మకత :
ఒక మూలకపు పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధములో ఉన్నపుడు ఎలక్ట్రాన్లను తనవైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక ఋణవిద్యుదాత్మకత అంటారు.

  1. గ్రూపులలో పై నుండి కిందికి పోయే కొలదీ మూలకాల ఋణవిద్యుదాత్మకతలు క్రమంగా తగ్గుతాయి.
  2. పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయేకొలదీ మూలకాల ఋణవిద్యుదాత్మకతలు క్రమంగా పెరుగుతాయి.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 14.
Mg ధర్మాలను పోలిన ఏవేని రెండు మూలకాలను పేర్కొనండి. ఏ ఏ అంశాల ఆధారంగా వాటిని ఊహించగలిగారు? (AS2)
జవాబు:
Mg ధర్మాలను పోలిన రెండు మూలకాలు కాల్షియం (Ca) మరియు బెరీలియం’ (Be). ఎందుకనగా,

  1. Be, Mg మరియు Ca లు ఒకే గ్రూపు (IIA)కు చెందిన మూలకాలు.
  2. ఈ మూడు మూలక పరమాణువుల బాహ్య కర్పరంలో ‘2’ ఎలక్ట్రాన్లు కలవు.
  3. ఈ మూడు ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 15.
ఆవర్తన పట్టికను ఉపయోగించి 18వ గ్రూపు మూలకమైన ‘X, 16వ గ్రూపు మూలకమైన ‘Y ల మధ్య ఏర్పడిన సమ్మేళనానికి ఫార్ములాను ఊహించండి. (AS2)
జవాబు:

  1. X – మూలకము 13వ గ్రూపులో కలదు, కావున X యొక్క సంయోజకత విలువ 3.
  2. Y – మూలకము 16వ గ్రూపులో కలదు, కావున Y యొక్క సంయోజకత విలువ 2.
  3. X మరియు Y ల మధ్య ఏర్పడిన సమ్మేళన ఫార్ములా X2 Y3
    AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 5

ప్రశ్న 16.
X అనే మూలకం మూడవ పీరియడ్ కు, రెండవ గ్రూపునకు చెందినది అనుకుందాం. అయితే ఈ క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి. (AS2)
a) వేలన్సీ ఎలక్ట్రానులు ఎన్ని ఉంటాయి?
b) సంయోజకత ఎంత?
c) ఇది లోహమా? అలోహమా?
జవాబు:
‘X’ అను మూలకము మూడవ పీరియడ్ కు రెండవ గ్రూపునకు, చెందినది. కావున ఇది గ్రూపు-II కు చెందిన Mg అగును.
a) వేలన్సీ ఎలక్ట్రానుల సంఖ్య = 2
b) సంయోజకత = 2
c) ఇది ఒక లోహము.
ఈ మూలకం IIA గ్రూపకు చెందినది.

ప్రశ్న 17.
ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య 19. అయితే ఆవర్తక పట్టికలో దీని స్థానం ఏది? దాని స్థానాన్ని ఎలా చెప్పగలరు? (AS2)
జవాబు:
మూలకపు పరమాణు సంఖ్య = 19
ఎలక్ట్రానుల అమరిక = 1s² 2s² 2p6 3s² 3p64s¹ ⇒ (2,8,8,1 )
భేదిత ఎలక్ట్రాను 4వ కర్పరంలో ప్రవేశించును. కనుక మూలకం 4వ పీరియడ్ కు చెందును.
వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య = 1, కావున ఇది 1వ గ్రూపుకు చెందును.
పరమాణు సంఖ్య 19కల మూలకము 4వ పీరియడ్ మరియు 1 గ్రూపుకు చెందును.

ప్రశ్న 18.
IA గ్రూపునకు చెందిన క్షార లోహాల యొక్క లోహ ధర్మాలు ఆ గ్రూపులో పై నుండి కిందికి వచ్చేటప్పుడు పెరుగుతుంది అనే అంశాన్ని బలపరచడానికి సరియైన సమాచారాన్ని సేకరించి, నివేదిక తయారు చేయండి. (AS4)
(లేదా)
IA గ్రూపు యొక్క లోహ ధర్మం గూర్చి సమాచారాన్నిమ్ము.
జవాబు:

  1. ఏదైనా మూలకము ఎలక్ట్రానులను కోల్పోయి ధనాత్మక అయానులుగా ఏర్పడే స్వభావంను లోహ స్వభావం అంటారు.
  2. IA గ్రూపు మూలకాలు Li, Na, K, Rb, Cs.
  3. ఆవర్తన పట్టికలో ఎడమవైపున ఉన్న మూలకాలు (IA గ్రూపు మూలకాలు) ఎలక్ట్రానులను కోల్పోయే తత్వం కలవి. అందుకనే వీటిని బలమైన లోహాలు అంటారు. వీటికి చర్యాశీలత ఎక్కువ.
  4. గ్రూపులలో పై నుండి కిందికి వెళ్లే కొలది పరమాణు పరిమాణం పెరుగును.
  5. బాహ్య కక్ష్యలో ఎలక్ట్రాన్లు తక్కువ కేంద్రక ఆకర్షణ కలిగి ఉండటం వలన అవి తేలికగా ఎలక్ట్రానులను కోల్పోతాయి. అందువలన లోహ స్వభావం పెరుగును.
  6. అయనీకరణ శక్తి Li నుండి CS వరకు తగ్గును.
  7. Li నుండి CS వరకు పరమాణు వ్యాసార్ధం పెరుగును. కనుక లోహ స్వభావం పెరుగును.

ప్రశ్న 19.
పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం గురించిన విషయాలు అప్పటివరకు ఇంకా కనుగొననప్పటికీ మెండలీవ్ తన ఆవర్తన పట్టికలో మూలకాలను దాదాపుగా విస్తృత ఆవర్తన పట్టికలోని అమరికకు దగ్గరగా అమర్చగలిగాడు. అతని కృషిని మీరెలా అభినందిస్తారు? (AS6)
(లేదా)
మూలకాల వర్గీకరణలో మెండలీవ్ యొక్క పాత్రను నీవెలా అభినందిస్తావు?
జవాబు:

  1. మెండలీవ్ మూలకాలను వాటి పరమాణుభారాల ఆధారంగా అమర్చాడు.
  2. మెండలీవ్ తన ఆవర్తన పట్టికలో, అప్పటి వరకు తెలిసిన మూలకాలను 8 నిలువు వరుసలలో అమర్చాడు. వీటిని గ్రూపులన్నాడు.
  3. ఈ గ్రూపులలోని మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను కలిగి ఉంటాయి.
  4. తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లని, వీటిలోని మూలకాలన్నింటిలోనూ ఒకే రకమైన ధర్మాలు పునరావృతమవుతూ ఉంటాయని తెలిపాడు.
  5. ఇతను తన పట్టికలో అప్పటికి లభ్యంకాని మూలకాల ధర్మాలను ముందే ఊహించి వాటికి తాత్కాలిక పేర్లు పెట్టాడు. వాటికి కొన్ని స్థానాలను కేటాయించాడు.
  6. మెండలీవ్ పట్టికలో మూలకాలను సరైన స్థానంలో ఉంచడం ద్వారా కొన్ని మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశిని సరిచేయుటకు వీలు కలిగింది.
  7. మెండలీవ్ పాటించిన ఇలాంటి అసాధారణ ఆలోచనా విధానం, మిగిలిన రసాయన శాస్త్రవేత్తలందరినీ మెండలీవ్ ఆవర్తన పట్టికను అంగీకరించేలా, గుర్తించేలా సహాయపడింది.
  8. మెండలీవ్ ఆవర్తన పట్టిక, ఆయన ప్రతిపాదించిన ఆవర్తన నియమానికి గొప్ప గుర్తింపు లభించింది.
  9. ఈ విధముగా, అప్పట్లో ఎలక్ట్రాను విన్యాసము తెలియకపోయినా మెండలీవ్ వేలన్సీ ఆధారంగా మూలకాలను అమర్చగలిగాడు. ఆ పట్టిక విస్తృత ఆవర్తన పట్టికను పోలి ఉంది. ఇంతటి కృషి చేసిన మెండలీవ్ ను అభినందించక . తప్పదు.

ప్రశ్న 20.
ఆవర్తన పట్టికలో హైడ్రోజన్ యొక్క స్థానంపై మీ వాదనను రాయండి. (AS7)
జవాబు:

  1. హైడ్రోజన్ మిగిలిన మూలకాల కన్నా తేలికైన పరమాణు నిర్మాణం గల మూలకము.
  2. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసము 1s¹. దీనిలో ఒక ప్రోటాను కేంద్రకంలో మరియు ఒక ఎలక్ట్రాను 1s ఆర్బిటాల్ లో ఉన్నది.
  3. ఈ ఎలక్ట్రాన్ విన్యాసముతో హైడ్రోజన్ యొక్క స్థానం ఆవర్తన పట్టికలో IA లేదా VIIA గ్రూపులో ఉండవచ్చును.
  4. హైడ్రోజన్ ధర్మాలు క్షారలోహాలు (IA) మరియు హాలోజన్ (VIIA) లతో పోలి ఉంటుంది.
  5. దీనికి కారణము అది క్షారలోహాల వలె ఎలక్ట్రానును కోల్పోగలదు, అలాగే హాలోజన్ వలె ఒక ఎలక్ట్రానును పొందగలదు.
  6. కానీ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం దీనిని IA గ్రూపులో ఉంచడం జరిగినది.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 21.
మూలకాల పరమాణువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు తెలియకుండానే మెండలీవ్, నవీన ఆవర్తన పట్టికలో మూలకాల – అమరికను పోలిన అమరికతో మూలకాలను తన ఆవర్తన పట్టికలో అమర్చగలిగాడు. దీనినెలా వివరిస్తారు?
(లేదా)
మెండలీవ్, నవీన ఆవర్తన పట్టికల మధ్య గల పోలికలను వివరించుము. (AS1)
జవాబు:

  1. మెండలీవ్ అప్పటివరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమములో ఒక క్రమపద్ధతిలో అమర్చి ఒక చార్టు రూపంలో తయారుచేశాడు.
  2. ఈ చార్టును 8 నిలువు వరుసలుగా విభజించాడు. ఆ నిలువు వరుసలు మరలా A, B అను ఉపభాగాలుగా విభజించబడి, రసాయన ధర్మాలలో సారూప్యత ఉన్న మూలకాలను కలిగి ఉన్నాయి.
  3. ఈ విధమైన నిలువు వరుసలకు గ్రూపులని పేరు పెట్టాడు.
  4. మొదటి గ్రూపులో గల మొదటి వరుస మూలకాలు ఒక సాధారణ ఫార్ములా కలిగిన సమ్మేళనాలను ఏర్పరుస్తాయని చెప్పాడు. ఆ ఫార్ములా R2O.
  5. మొదటి గ్రూపులో గల రెండవ వరుస మూలకాలకు ఒక సాధారణ ఫార్ములా (RO) ను ఏర్పరచాడు.
  6. ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెండలీవ్ కొన్ని మూలకాలు లభ్యం కాలేదని గుర్తించి, వాటికోసం పట్టికలో నిర్దిష్ట స్థానాలలో ఖాళీగడులను విడిచిపెట్టాడు.
  7. మెండలీవ్ తాను ఊహించిన కొత్త మూలకాలు భవిష్యత్ లో తప్పనిసరిగా కనుగొనబడతాయని నమ్మాడు. అతని పట్టిక ఆధారంగానే కొత్త మూలకాల ధర్మాలను ముందే ఊహించాడు.
  8. అతడు ఊహించిన ధర్మాలు ఆ తరువాత కాలంలో కొత్తగా కనుగొనబడిన మూలకాల ధర్మాలు ఒకేలా ఉన్నాయి.
  9. ఎలక్ట్రాన్ విన్యాసం తెలియకుండానే మూలకాలను నవీన ఆవర్తన పట్టికకు ధగ్గరగా అప్పటి వరకు తెలిసిన మూలకాలను మెండలీవ్ అమర్చగలిగాడు.

ప్రశ్న 22.
a) కింది పట్టికలో వివిధ మూలకాల వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య, గ్రూపు సంఖ్య, పీరియడ్ సంఖ్యలను వ్రాయండి. (AS1)
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 6
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 8

b) కింద ఇచ్చిన మూలకాల సమూహం ఏదైనా గ్రూపు మూలకాలైతే ‘G’ అని, పీరియడ్ మూలకాలైన (P) అని, ఏదీకాకపోతే (N) అని గుర్తించండి. (AS1)
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 7
జవాబు:

మూలకాలుG/P/N
Li,C,OP
Mg, Ca, BaG
Br, Cl, FG
C, S, BrN
AI, Si, ClP
Li, Na, KG
C,N,OP
K, Ca, BrP

ప్రశ్న 23.
ప్రకృతిలో వాని విస్తృత అందుబాటు ఆధారంగా s, p – బ్లాక్ మూలకాలను (18వ గ్రూపు తప్ప) కొన్నిసార్లు ప్రాతినిధ్య మూలకాలుగా పిలుస్తారు. ఇది సరైనదేనా? ఎందుకు? (AS1)
జవాబు:

  1. s మరియు p బ్లాకు మూలకాలు యొక్క పరమాణువులలో చిట్టచివరి ఆర్బిటాళ్లు అసంపూర్ణంగా ఉంటాయి.
  2. ఈ అమరిక వలన అవి అధిక చర్యాశీలతను కలిగి, జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం కొరకు చర్యలలో అధికంగా పాల్గొంటాయి.
  3. కావున ఇవి అధికంగా సమ్మేళన రూపంలో లభిస్తాయి.
  4. అందుకనే ప్రకృతిలో ఇవి విస్తృత అందుబాటులో ఉండుట వలన వీటిని ప్రాతినిధ్య మూలకాలుగా పిలుస్తారు.

ప్రశ్న 24.
కింది జతలలో ఏ మూలకం యొక్క అయనీకరణ శక్తి తక్కువగా ఉంటుందో గుర్తించండి. (AS1)
(i) Mg లేదా Na i i) Li లేదా 0 (iii) Br లేదా F (iv) K లేదా Br
జవాబు:
ధర్మము : పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయేకొలదీ అయనీకరణ శక్తి పెరుగును.
గ్రూపులలో పై నుండి క్రిందకు పోయేకొలదీ అయనీకరణ శక్తి తగ్గును.

(i) Mg లేదా Na :
Mg, Na లు ఒకే పీరియడ్ కు చెందినవి, Na కు అయనీకరణ శక్తి తక్కువ.

(ii) Li లేదా O :
Li, O లు ఒకే పీరియడ్ కు చెందినవి, Li కు తక్కువ అయనీకరణ శక్తి కలదు.

(iii) Br లేదా F :
Br, F లు ఒకే గ్రూపుకు చెందినవి. Br కు తక్కువ అయనీకరణ శక్తి ఉండును.

(iv) K లేదా Br :
K మరియు Br లు ఒకే పీరియడ్ కు చెందును. K యొక్క అయనీకరణ శక్తి తక్కువ.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 25.
ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్ లో ఉన్న ‘X’ అనే మూలకం ‘Y’ అనే మూలకానికి కుడివైపున ఉన్నది. అయితే వీనిలో ఏ మూలకం క్రింది ధర్మాన్ని కలిగి ఉంటుంది? (AS1)
a) అల్ప కేంద్రక ఆవేశం
b) తక్కువ పరమాణు పరిమాణం
c) అధిక అయనీకరణ శక్తి
d) అధిక ఋణవిద్యుదాత్మకత
e) అధిక లోహ స్వభావం
జవాబు:
a) Y కు X కంటే ఎక్కువ కేంద్రక ఆవేశం ఉండును.
b) Y కన్నా Xకు తక్కువ పరమాణు పరిమాణం ఉండును.
c) X కు Y కన్నా అధిక అయనీకరణ శక్తి ఉండును.
d) X కు Y కన్నా అధిక ఋణవిద్యుదాత్మకత ఉండును.
e) Y కు X కన్నా అధిక లోహ స్వభావం ఉండును.

ప్రశ్న 26.
9, 34, 46, 64 పరమాణు సంఖ్య గల మూలకాలు ఏ బ్లాకుకు చెందుతాయో ఊహించండి. (AS2)
(లేదా)
క్రింద ఇవ్వబడిన పరమాణు సంఖ్య గల మూలకాలు ఏ బ్లాకుకు సంబంధించినవో ఉదహరించుము. 9, 34, 46, 64
జవాబు:

  1. పరమాణు సంఖ్య ‘9’గా గల మూలకము ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p6 ఇది p – బ్లాకుకు చెందును. (VIIA) గ్రూపులో ఉండును.
  2. పరమాణు సంఖ్య ’34’గా గల మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p6 3s² 3p64s² 3d10 3p4 ఇది p – బ్లాకుకు చెందును. VIA గ్రూపుకు చెందును.
  3. పరమాణు సంఖ్య (46’గా గల మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p6 3s² 3p6 4s² 3d10 4p6 5s² 4d8 ఇది d – బ్లాకుకు చెందును. VIIB కు చెందును.
  4. పరమాణు సంఖ్య ’64’గా గల మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p6 3s² 3p6 4s² 3d10 3p6 5s² 4d10 5p6 6s² 4f8 ఇది f – బ్లాకుకు చెందును. ఇది లాంథనైడులలో ఉండును.

ప్రశ్న 27.
అల్యూమినియం, నీటితో గది ఉష్ణోగ్రత వద్ద చర్య జరపదు. కానీ సజల HCl, NaOH లతో చర్య జరుపుతుంది. వీటిని ప్రయోగం చేసి సరిచూడండి. మీ పరిశీలనలకు రసాయన సమీకరణాలు వ్రాయండి. ఈ పరిశీలనల ఆధారంగా Al ఒక అర్ధలోహం అని చెప్పగలరు? (AS3)
(లేదా)
అల్యూమినియం ఒక అర్ధలోహమని ఏ విధముగా వివరించెదవు?
జవాబు:

  1. అల్యూమినియం ఒక తెల్లని మెరిసే లోహము. అల్యూమినియం పైపొరను దీని ఆక్సైడ్ తో పూతవేస్తారు. ఎందుకనగా గాలి నుండి రక్షణ పొందుటకు. ఈ పొర పాడయిన, గాలి, నీరు కూడా Al ను పాడుచేస్తాయి.
  2. అల్యూమినియం సజల HCl తో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.
    2Al + 6HCl → 2AlCl3 + 3H2
  3. Al, NaOH తో చర్య జరిపిన H2 వాయువు విడుదలగును.
    Al + H2O + 2NaOH → 2Na[Al(OH)4] + 3H2
  4. ఈ చర్యలననుసరించి Al ఆమ్లము, క్షారము రెండింటితో చర్య జరుపును.
  5. ఇది ఒక సున్నిత లోహము కానీ అర్ధలోహము కాదు.

ప్రశ్న 28.
VIIIA గ్రూపు మూలకాల (జడవాయువులు) చర్యాశీలతకు సంబంధించిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం లేదా ఇంటర్నెట్ నుండి సేకరించండి. ఈ మూలకాలకు గల ప్రత్యేకతను ఆవర్తన పట్టికలో ఉన్న మిగిలిన మూలకాలతో పోల్చి ఒక నివేదికను తయారు చేయండి. (AS4)
జవాబు:

  1. VIIIA గ్రూపు మూలకాలకు రసాయనికముగా చర్యాశీలత తక్కువ, ఎందుకనగా ఇవన్నీ స్థిర అష్టక విన్యాసమును కలిగి ఉన్నాయి (He తప్ప).
  2. He కు బాహ్యకక్ష్యలలో రెండు ఎలక్ట్రానులు మాత్రమే ఉన్నా, కక్ష్య పూర్తిగా నిండి ఉన్నది. కనుక దీనికి చర్యాశీలత ఉండదు.
  3. జడ వాయువులకు అధిక అయొనైజేషన్ విలువ, శూన్య ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలుండుట వలన ఇవి ఎలక్ట్రాను కోల్పోవుట (లేక) గ్రహించుట జరుగదు.
  4. Ar, BF, తో కలిసి సమ్మేళనాలను ఏర్పరచును.
  5. జడవాయువుల మొదటి సమ్మేళనము జినాన్ ఫ్లోరో ప్లాటినేట్.
  6. జినాన్ ఒక ఎలక్ట్రాన ను పోగొట్టుకుని ధన ఆక్సీకరణ స్థాయిలో ఉంటుంది. కనుక జినాన్ అధిక ఋణ విద్యుదాత్మకత మూలకాలైన F2 మరియు O2లతో చర్య పొంది సమ్మేళనాలను ఏర్పరచును.

ప్రశ్న 29.
ఆవర్తన పట్టిక తయారీలో ఎలక్ట్రాన్ విన్యాసం పాత్రను మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS6)
(లేదా)
ఎలక్ట్రాన్ విన్యాసము, ఆవర్తన పట్టిక తయారీకి ఏ విధముగా సహాయపడినదో వివరింపుము.
(లేదా)
ఆవర్తన పట్టికలో అష్టక విన్యాసం పాత్రను నీవెలా అభినందిస్తావు?
జవాబు:

  1. కృత్రిమ మూలకాలతో సహా ప్రస్తుతం 115కు పైగా మూలకాలను కనుగొన్నారు.
  2. ఈ మూలకాల సంఖ్య పెరిగే కొద్దీ మూలకాలు, వాటి సమ్మేళనాల రసాయన సమాచారాన్ని గుర్తుంచుకోవడం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు చాలా కష్టముగా మారినది.
  3. అందువలన శాస్త్రీయంగా మూలకాలను వర్గీకరించవలసిన అవసరం ఏర్పడింది.
  4. అందుకే 1913లో బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన మోస్లే X-కిరణ స్వభావాన్ని విశ్లేషించి, మూలక పరమాణువులలో ఉండే ధనావేశిత కణాల సంఖ్యను లెక్కించగలిగాడు. వీటిని పరమాణు సంఖ్య (ఎలక్ట్రాన్ విన్యాసం)గా గుర్తించాడు.
  5. పరమాణు సంఖ్యలను తెలుసుకున్న తర్వాత ఆవర్తన పట్టికలో వీటి ఆధారంగా మూలకాలను అమర్చడం పాతపద్ధతి (పరమాణుభారాల పద్ధతి) కన్నా మేలైనదిగా గుర్తించాడు.
  6. ఈ పరమాణు సంఖ్యల అమరిక ద్వారా అసంగత మూలకాల సమస్యను సులువుగా అధిగమించారు.
  7. ఈ పరమాణు సంఖ్యల ఆధారంగా రూపొందిన ఆవర్తన నియమం ప్రకారం ప్రతిపాదించబడినది నవీన ఆవర్తన పట్టిక.
  8. పరమాణు సంఖ్య, ఒక మూలకం యొక్క ధనావేశిత కణాలను మాత్రమే కాక, ఆ మూలక తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా తెలుపును.
  9. మూలకాల యొక్క భౌతిక, రసాయన ధర్మాలు ఆ మూలక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యపై మాత్రమే కాక ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు వాటి విన్యాసాలపై కూడా ఆధారపడి ఉంటాయి.
  10. ఈ విధముగా మానవాళికి మూలకాల గురించి క్లుప్తంగా, తేలికగా గుర్తుంచుకునేందుకు ఉపయోగపడుతున్న నవీన ఆవర్తన పట్టిక తయారీకి ఆధారమైన ఎలక్ట్రాన్ విన్యాసం అభినందనీయమైనది.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 30.
నూతన ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాలు వాటి రసాయన ధర్మాలను గుర్తించడంలో ఎలా ఉపయోగించుకుంటారు? (AS7)
జవాబు:

  1. మూలక పరమాణువుల ఎలక్ట్రాను విన్యాసం ఆధారంగా పరమాణువుల భౌతిక మరియు రసాయన ధర్మాలు ఆధారపడి ఉంటాయి.
  2. ఆవర్తన పట్టికలో మూలకాలను ఎలక్ట్రాను విన్యాసం పెరిగే క్రమంలో అమర్చారు.
  3. ఆవర్తన పట్టికలో మూలకాల యొక్క స్థానం ఆధారముగా వాటి రసాయన ధర్మాలను అంచనా వేయవచ్చును.
  4. ఆవర్తన పట్టికలో వదిలి వేయబడిన మూలకాలు మరియు లోహాలకు చర్యాశీలత ఎక్కువ.
  5. కుడివైపున ఉన్న పట్టికలో కల మూలకాలు అలోహాలు మరియు వాయువులు.
  6. 18వ గ్రూపులో ఉన్న మూలకాలను జడవాయువులని, అవి చర్యాశీలత కలిగి ఉండవు, కావున రసాయన చర్యలలో పాల్గొనవు.
  7. ఆవర్తన పట్టికలో ఎడమవైపు ఉన్నవి లోహాలు మరియు కుడివైపున ఉన్నవి అలోహాలు.
  8. లోహస్వభావం ఎడమ నుండి కుడివైపుకు తగ్గును. ఈ విధముగా రసాయన ధర్మాలను గుర్తించుటకు మూలకాల స్థానాలు ఉపయోగపడతాయి.

ఖాళీలను పూరించండి

1. లిథియం, ……………. మా యు పొటాషియంలు డాబరీనర్ త్రికములు. (సోడియం)
2. డాబరీనర్, న్యూలాండ్స్, మెండలీవ్ లు ………. ఆధారంగా మూలకాల వర్గీకరణ చేసినారు. (పరమాణుభారము)
3. ఆవర్తన పట్టికలోని అసంపూర్తి పీరియడ్ ………. (‘0’ గ్రూపు)
4. జడవాయువులు ఆవర్తన పట్టికలో ………… గ్రూపునకు చెందుతాయి. (7వ పీరియడ్)
5. ఒక గ్రూపునందు పై నుండే మూలకాల కంటే కింది వైపు ఉండే మూలకాలు …….. లోహ ధర్మాలను కలిగి ఉంటాయి. (అధికము)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. నూతన ఆవర్తన పట్టిక 2వ పీరియడ్ లో ఉన్న మూలకాల సంఖ్య ………
A) 2
B) 8
C) 18
D) 32
జవాబు:
B) 8

2. VA కు చెందిన నైట్రోజన్ (N = 7) తరువాత ఆ గ్రూపులో ,వచ్చే మూలక పరమాణు సంఖ్య ………
A) 7
B) 14
C) 15
D) 17
జవాబు:
C) 15

3. 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకం రసాయనికంగా కింది ఇచ్చిన మూలకాలలో ఏ మూలకంతో పోలి ఉంటుంది?
A) నైట్రోజన్ (Z = 7)
B) ఫ్లోరిన్ (Z = 9)
C) ఫాస్ఫరస్ (Z =15)
D) ఆర్గాన్ (Z = 18)
జవాబు:
B) ఫ్లోరిన్ (Z = 9)

4. ఈ కింది వానిలో అత్యధిక చర్యాశీలత గల లోహం…
A) లిథియం
B) సోడియం
C) పొటాషియం
D) రుబీడియం
జవాబు:
D) రుబీడియం

10th Class Physical Science 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 133

ప్రశ్న 1.
డాబరీనర్ మూలకాల మధ్య ఏవిధమైన సంబంధాన్ని నెలకొల్పాలని ప్రయత్నించాడు?
జవాబు:
డాబరీనర్ మూలకాల పరమాణుభారానికి, వాటి ధర్మాలకు మధ్య సంబంధంను నెలకొల్పాలనుకొన్నాడు. ఈ ప్రయత్నమే మూలకాల వర్గీకరణకు మరియు ఆవర్తన పట్టికకు దారి తీసినది.

ప్రశ్న 2.
కాల్షియం (Ca), బేరియం (Ba)ల సాంద్రతలు వరుసగా 1.55, 3.51 గ్రా. సెం.మీ. డాబరీనర్ త్రికసిద్ధాంతంను ఆధారంగా చేసుకొని స్క్రీన్షియం (Sr) యొక్క సాంద్రతను సుమారుగా చెప్పగలరా?
జవాబు:
Ca యొక్క సాంద్రత = 1.55 గ్రా/సెం.మీ³
Ba యొక్క సాంద్రత = 3.51 గ్రా/సెం.మీ³
సగటు సాంద్రత = \(\frac{1.55 + 3.51}{2}=2.53\)
Sr యొక్క సాంద్రత = 2.64
Ca, Ba ల సగటు సాంద్రత Sr యొక్క సాంద్రతకు దాదాపు సమానము.

10th Class Physical Science Textbook Page No. 139

ప్రశ్న 3.
పట్టికలో ఉన్న Ea2O3, ESO2ల గురించి మీరేం అర్థం చేసుకున్నారు?
జవాబు:
Ea2O3 అనునది ఎకా అల్యూమినియం యొక్క ఆక్సైడ్.
EsO2 అనునది ఎకా సిలికాన్ యొక్క ఆక్సైడ్.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 4.
క్షార లోహాలన్నీ ఘనస్థితిలో ఉండగా ద్విపరమాణుక అణువు అయిన హైడ్రోజన్ మాత్రం వాయుస్థితిలో ఉంటుంది. దీనిని IA గ్రూప్ లో క్షార లోహాల వరుసలో చేర్చడాన్ని మీరు సమర్థిస్తారా?
జవాబు:

  1. ఆవర్తన పట్టికలో మూలకాలను ఎలక్ట్రాను విన్యాసం ఆధారంగా పొందుపరిచారు.
  2. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s¹. దీనిలో ఒక ఎలక్ట్రాను తక్కువగా జడవాయువు విన్యాసంను కలిగి ఉంది.
  3. నవీన ఆవర్తన నియమం ప్రకారం హైడ్రోజనను క్షార లోహాలపై ఉంచడం సరైనదే.

10th Class Physical Science Textbook Page No. 151

ప్రశ్న 5.
రెండవ పీరియడ్ మూలకమైన ‘F’ కన్నా అదే గ్రూపుకు చెందిన మూలకమైన ‘Cl’కు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ ఎక్కువ. ఎందుకు?
జవాబు:
F అనునది Cl కంటే ఎక్కువ ఋణ విద్యుదాత్మకత కలిగిన మూలకం. కావున F మూలకం Cl మూలకం కంటే తక్కువ శక్తిని .విడుదల చేయును. కనుక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ F కన్నా CI కు ఎక్కువ.

10th Class Physical Science Textbook Page No. 134

ప్రశ్న 6.
న్యూలాండ్స్ అష్టక నియమాన్ని ఎందుకు ప్రతిపాదించాడో మీకు తెలుసా? ఆధునిక పరమాణు నిర్మాణం పరంగా మీ జవాబును వివరించండి.
జవాబు:
1) న్యూలాండ్స్ మూలకాలను పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో అమర్చగా, మొదటి మరియు ఎనిమిదవ మూలకాలకు ఒకే రకమైన ధర్మాలు కలవు.
2) ఆధునిక ఆవర్తన పట్టికలో ప్రతి పీరియడ్ క్రొత్త కక్ష్యతో ప్రారంభమై అది నిండిన తర్వాత మరలా క్రొత్త కక్ష్య ప్రారంభమగును. కక్ష్యా నియమము అష్టక విన్యాసంను పాటించును.

ప్రశ్న 7.
న్యూలాండ్స్ ప్రతిపాదించిన అష్టక నియమం సరైనదేనని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
న్యూలాండ్స్ అష్టక నియమంలో కొన్ని లోపాలు కలవు.

  1. ఒకే గడిలో రెండు మూలకాలను పొందుపరుచుట.
  2. పూర్తిగా భిన్నమైన ధర్మాలు గల కొన్ని మూలకాలను ఒకే గ్రూపులో అమర్చుట.
  3. ఈ నియమం కాల్షియం వరకే పరిమితమవుట మొదలైనవి.

10th Class Physical Science Textbook Page No. 139

ప్రశ్న 8.
మెండలీవ్ కొన్ని ఖాళీలను తన ఆవర్తన పట్టికలో ఎందుకు విడిచిపెట్టాడు? దీనికి నీవిచ్చే వివరణ ఏమిటి?
జవాబు:

  1. ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెండలీవ్ కొన్ని మూలకాలు లభ్యం కావడం లేదని గుర్తించి, వాటి కోసం పట్టికలో నిర్దిష్ట స్థానాలలో ఖాళీ గడులను విడిచి పెట్టాడు.
  2. అతడు రూపొందించిన పట్టిక ఆధారముగా ఆ కొత్త మూలకాల ధర్మాలను ముందుగానే ఊహించాడు.
  3. అతడు ఊహించిన ధర్మాలు ఆ తర్వాత కాలంలో కొత్తగా కనుగొనబడిన మూలకాల ధర్మాలకు ఒకేలా ఉన్నాయి.

10th Class Physical Science Textbook Page No. 145

ప్రశ్న 9.
లాంథనై లు, ఆక్టిడ్ లను ప్రత్యేకంగా ఆవర్తనపట్టిక అడుగు భాగాన ఉంచడం ఎందుకు జరిగింది?
జవాబు:
లాంథనైలు, ఆక్టిన్ లను ఆవర్తన పట్టికలో పొందుపరచిన ఆవర్తన పట్టిక పరిమాణం మరింతగా పెరుగుతుంది. గ్రూపుల సంఖ్య మరొక 14 పెరుగుతుంది. అందుకే వీటిని ఆవర్తన పట్టిక అడుగున ఉంచడమైనది.

10th Class Physical Science Textbook Page No. 149

ప్రశ్న 10.
మొదటి అయనీకరణ శక్తి కన్నా రెండవ అయనీకరణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకు?
జవాబు:

  1. వేలన్సీ ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్ మీద కేంద్రక ఆకర్షణ, తటస్థ పరమాణువులో కంటే ధన అయాన్లో ఎక్కువ ఉంటుంది.
  2. అందువలన రెండవ ఎలక్ట్రాన్ తొలగించుటకు ఎక్కువ శక్తి అవసరము. కనుక రెండవ అయనీకరణ శక్తి, మొదటి అయనీకరణ శక్తి కంటే ఎక్కువ.

10th Class Physical Science Textbook Page No. 151

ప్రశ్న 11.
క్షారమృత్తిక లోహాలు, జడవాయువుల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ధనాత్మకంగా ఉంటాయి. ఎందుకు?
జవాబు:

  1. క్షార మృత్తిక లోహాల ఎలక్ట్రాన్ విన్యాసం (ns²) పరముగా అవి స్థిరంగా ఉంటాయి.
  2. ఈ లోహాల బాహ్య కక్ష్యలోకి ఎలక్ట్రానులను చేర్చడం కష్టము. కావున వీటి యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ ధనాత్మకము.
  3. అదే విధముగా జడ వాయువుల ఎలక్ట్రాన్ విన్యాసము స్థిర అష్టకమును కలిగి ఉంటాయి. కనుక వీటికి ఎలక్ట్రాను చేర్చుటకు అధిక శక్తి అవసరము. కావున వీటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ ధనాత్మకము.

10th Class Physical Science Textbook Page No. 139

ప్రశ్న 12.
పరమాణు సంఖ్య అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావేశిత కణాల సంఖ్యను ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

10th Class Physical Science Textbook Page No. 148

ప్రశ్న 13.
కింది జతలలో దేని పరిమాణం లేదా వ్యాసార్ధం ఎక్కువ? కారణాలు రాయండి.
a)Na, Al b) Na, Mg+2 c) S2-, Cl d) Fe2+, Fe3+ e) C4-, .
జవాబు:
a) Na కు పరిమాణం ఎక్కువ. కారణం : Na లో కంటే AI లో కేంద్రక ఆవేశం ఎక్కువ.
b) Na కు పరిమాణం ఎక్కువ. కారణం : Na లో 3 కక్ష్యలు ఉంటాయి. Mg+2 లో 2 కక్ష్యలే ఉంటాయి.
c) S2-కు పరిమాణం ఎక్కువ. కారణం : S-2 లో కంటే Cl లో కేంద్రక ఆవేశం ఎక్కువ.
d) Fe2+ కు పరిమాణం ఎక్కువ. కారణం : Fe+2, Fe+3 ల కేంద్రక ఆవేశం సమానమైననూ Fe+3 లో ఎలక్ట్రాన్ల
సంఖ్య తక్కువ కావున Fe+3 పరిమాణం తక్కువ
e) C4- కు పరిమాణం ఎక్కువ. కారణం : C4- లో కంటే F లో కేంద్రక ఆవేశం ఎక్కువ.

10th Class Physical Science Textbook Page No. 148

ప్రశ్న 13.
Na, Na+ లలో దేనికి ఎక్కువ వ్యాసార్ధం లేదా పరిమాణం ఉంటుంది. ఎందుకు?
జవాబు:

  1. సోడియం పరమాణువు ఒక ఎలక్ట్రాన్ ను కోల్పోయి సోడియం కాటయాన్ (Na+) ను ఏర్పరచును.
  2. సోడియం పరమాణు సంఖ్య 11. దీనిలో 11 ప్రోటాన్లు, 11 ఎలక్ట్రానులు ఉంటాయి. దీని బాహ్య విన్యాసం 3s¹.
  3. సోడియం కాటయాన్ (Na+) లో 11 ప్రోటాన్లు, 10 ఎలక్ట్రానులుంటాయి. దీని 3s ఉపకక్ష్యలో ఎలక్ట్రానులు ఉండవు. కావున దీని బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం 2s² 2p6 అగును.
  4. దీనినిబట్టి Na పరమాణు వ్యాసార్ధం కన్నా Na+ అయాన్ వ్యాసార్ధం తక్కువగా ఉంటుంది.

పరికరాల జాబితా

ఆవర్తన పట్టికకు సంబంధించిన చార్టు, ఫ్లాష్ కార్డులు

10th Class Physical Science 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
కింది పట్టికను పరిశీలించండి. ప్రతి అడ్డు వరుస ఒక త్రికాన్ని సూచిస్తుంది.
పట్టిక
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 9
జవాబు:
పై పట్టిక నుండి

  1. మిగిలిన అడ్డు వరుసల్లోని మూలకాల సమూహాల మధ్య కచ్చిత విలువ గల సంబంధంను చూపలేము.
  2. మొదటి, చివరి మూలకాల పరమాణుభారాల సగటు, మధ్య మూలకమునకు దాదాపుగా సమానము.
  3. మూలకాల ధర్మాలకు వాటి పరమాణు ద్రవ్యరాశులకు సహసంబంధము కలదని గమనించవచ్చును.

కృత్యం – 2

ప్రశ్న 2.
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 10
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 11

కృత్యం -3

ప్రశ్న 3.
(a) మొదటి 20 మూలకాల సంయోజకతలను లెక్కించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 12

b) పీరియలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ సంయోజకత ఏ విధంగా మార్పు చెందుతుంది?
జవాబు:
పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయే కొలదీ మూలకాల వేలన్సీ 1 నుండి 4 దాకా పెరిగి, ఆ తర్వాత క్రమేపీ తగ్గి ‘0’కు వచ్చి మరలా క్రమేపీ పెరుగుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

c) గ్రూపులో పై నుండి కిందికి పోయే కొద్దీ సంయోజకతలో ఎటువంటి మార్పు వస్తుంది?
జవాబు:
గ్రూపులలో పై నుండి కిందికి పోయేకొద్దీ సంయోజకతలో ఎటువంటి మార్పూ రాదు.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

SCERT AP 10th Class Physics Study Material Pdf 1st Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 3rd Lesson Questions and Answers సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physical Science 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. ఎందుకు? (AS1)
జవాబు:
నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. దీనికి కారణం కాంతి యొక్క వక్రీభవన లక్షణమే.

వివరణ :

  1. చేప, పరిశీలకుడు వేర్వేరు యానకాలలో ఉన్నారు. అనగా చేప నీరు అను సాంద్రతర యానకంలోనూ, పరిశీలకుడు గాలి అను విరళయానకంలోనూ కలరు.
  2. గమనించగా – నీరు, గాలి అనే యానకాలను వేరుచేసే తలం వద్ద చేప ఉపరితలం వైపునకు పైకి వచ్చినట్లుగా కనపడుతుంది.
  3. కావున తుపాకీని గురి పెట్టినపుడు దాని నిజమైన స్థానానికి బదులుగా స్థానభ్రంశం చెందిన స్థానం కనిపిస్తుంది. అందుకనే నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం.

ప్రశ్న 2.
శూన్యంలో కాంతివేగం 3,00,000 కి.మీ./సె., వజ్రంలో కాంతివేగం 1,24,000 కి.మీ./సె. అయిన, వజ్రం వక్రీభవన గుణకాన్ని కనుగొనండి. (AS1)
జవాబు:
వజ్రంలో కాంతివేగం (V) : 1,24,000 కి.మీ./సె.
శూన్యంలో కాంతివేగం (C) = 3,00,000 కి.మీ./సె.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1

ప్రశ్న 3.
నీటిపరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. గాజుపరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత? (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 2

ప్రశ్న 4.
బెంజీన్ యొక్క సందిగ్ధ కోణం 42°. అయిన బెంజీన్ వక్రీభవన గుణకం కనుగొనండి. (AS1)
(లేదా)
బెంజీన్ సందిగ్ధకోణం విలువ 42° అయిన దాని యొక్క వక్రీభవన గుణకం విలువ ఎంత?
జవాబు:
బెంజీన్ సందిగ్ధ కోణం (C) = 42°
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 3

ప్రశ్న 5.
ఎండమావులు ఏర్పడే విధానాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ఎండమావులు ఏ విధముగా ఏర్పడతాయో వివరించుము.
(లేదా)
వేసవిలో రోడ్డుపై ఏర్పడే మానవుని యొక్క దృక్ భ్రమను వివరించుము.
(లేదా)
రాజు రోడ్డుపై ప్రయాణించుచున్నాడు. అతనికి కొంతదూరంలో రోడ్డుపై నీటిగుంట వున్నట్లు కన్పించినది. అక్కడకు వెళ్ళి చూడగా నీటిగుంట లేదు. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? అది ఎలా సాధ్యపడినది? వివరింపుము.
(లేదా)
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం సమయంలో తారురోడ్డుపై కొన్ని సార్లు నీరు ఉన్నట్లు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఆ దృగ్విషయం ఏమిటి? అది ఎందుకు ఆ విధంగా జరుగుతుందో వివరించండి.
జవాబు:
ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్న సమయంలో తారు రోడ్డుపై కొన్నిసార్లు నీరు ఉన్నట్లు కన్పించును, కానీ అక్కడ నీరుండదు. ఈ దృగ్విషయాన్ని “ఎండమావి” అంటారు.

  1. ఎండమావులు దృఢమ వల్ల ఏర్పడు ఒక ఊహాత్మక చిత్రం.
  2. ఎండమావులు యానకపు వక్రీభవన గుణకాలలోని తేడాల వలన మరియు కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వలన ఏర్పడతాయి.
    ఏర్పడు విధానం :
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4
  3. వేసవికాలంలో రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలి వేడిగానూ, రోడ్డు ఉపరితలానికి చాలా ఎత్తులో ఉన్న గాలి వక్రీభవన గుణకం తగ్గుతుంటుంది. చల్లగానూ ఉండును.
  4. దీనినిబట్టి ఎత్తుపై ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివలన గాలి సాంద్రత పెరుగుతుంది.
  5. ఎత్తు పెరుగుతున్న కొలదీ గాలి వక్రీభవన గుణకం పెరుగును. కావున రోడ్డు ఉపరితలానికి దగ్గరగా ఉన్న వేడిగాలి కంటే పైన ఉన్న చల్లగాలి వక్రీభవన గుణకం ఎక్కువ.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 5
  6. కాబట్టి పైన ఉన్న చల్లని సాంద్రతర గాలికంటే, క్రింద ఉన్న వేడి విరళగాలిలో కాంతి వేగంగా ప్రయాణించును.
  7. కాంతి పై నుండి కిందకు, సాంద్రత మారుతున్నటువంటి గాలిగుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినపుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల పటంలో చూపిన విధంగా ప్రయాణిస్తుంది.
  8. ఈ విధంగా కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది.
  9. ఇలా జరగడం వల్లనే ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం పటంలో చూపినట్లు మనకు రోడ్డుపై నీళ్ళవలె కనబడుతుంది. దీనినే “ఎండమావి” అంటాం.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 6.
\(\frac{\sin i}{\sin r}\) విలువ స్థిరమని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు? (ప్రయోగశాల కృత్యం – 1) (AS1)
(లేదా)
పతన కోణము మరియు వక్రీభవన కోణంలకు మధ్యనగల సంబంధంను ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
(లేదా)
పటం ద్వారా పతన మరియు పరావర్తన కోణంల మధ్య సంబంధంను ప్రయోగ పూర్వకముగా వివరించుము.
జవాబు:
ఉద్దేశ్యం :
పతనకోణానికి, వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడం.

కావలసిన వస్తువులు :
ప్రొ సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీట్, స్కేలు, నలుపురంగు వేసిన చిన్న కార్డుబోర్డు ముక్క (10 సెం.మీ. X 10 సెం.మీ.), 2 సెం.మీ. మందం గల అర్ధవృత్తాకారపు గాజుపలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్.

ప్రొ సర్కిల్ తయారీ :
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 6

  1. కార్డుబోర్డు షీట్ పై తెల్ల డ్రాయింగ్ షీట్ ను అంటించుము.
  2. డ్రాయింగ్ షీట్ మధ్యలో రెండు లంబరేఖలను పటంలో చూపిన విధంగా గీయుము.
  3. ఆ లంబరేఖల ఖండన బిందువును ‘0’ గా గుర్తించుము.
  4. లంబరేఖలకు MM, NN అని పేర్లు పెట్టుము.
  5. ఈ రేఖలలో MM అనునది రెండు యానకాలను వేరుచేసే తలాన్ని సూచిస్తుంది.
  6. NN అనునది MM రేఖకు ‘O’ బిందువు వద్ద గీసిన లంబాన్ని సూచిస్తుంది.
  7. NN రేఖ వెంబడి ఒక కోణమానిని ఉంచి, దాని కేంద్రం బిందువు ‘O’ తో ఏకీభవించునట్లు చేయుము.
  8. పటంలో చూపిన విధంగా NN యొక్క రెండు చివరల నుండి అనగా 0-90° కోణాలను గుర్తించుము.
  9. ఈ విధంగా -NN కు రెండోవైపు కూడా కోణాలను గుర్తించుము.
  10. పటంలో చూపిన విధముగా ఈ కోణరేఖలన్నింటినీ ఒక వృత్తం పై వచ్చునట్లుగా గుర్తించుము.

ప్రయోగ నిర్వహణ పద్ధతి :
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 7

  1. క్రింది పటంలో చూపిన విధంగా అర్ధవృత్తాకారపు గాజు పలకను MM వెంబడి అమర్చుము.
  2. గాజుపలక వ్యాసం MM తో ఏకీభవించాలి. దాని కేంద్రం (0) బిందువుతో ఏకీభవించాలి.
  3. ఇప్పుడు లేజర్ లైట్ తో NN వెంబడి కాంతిని ప్రసరింపజేయుము.
    ఈ కాంతి మొదట గాలిలో ప్రయాణించి రెండు యానకాలను వేరుచేయు తలం అయిన MM గుండా ‘O’ బిందువు వద్ద గాజులోకి ప్రవేశిస్తుంది.
  4. పటంలో చూపినట్లుగా గాజు నుండి బయటకు వచ్చు కాంతి యొక్క మార్గాన్ని గమనించుము.
  5. ఇప్పుడు NN రేఖకు 15° కోణం (పతన కోణం) చేసే రేఖ వెంబడి లేజర్ కాంతిని ప్రసరింపజేసిన అది ‘O’ బిందువు గుండా పోయే విధంగా జాగ్రత్త తీసుకొనుము.
  6. ఈ కాంతి గాజుపలక యొక్క వక్రతలం గుండా బయటకు వచ్చు కాంతిని పరిశీలించి, దాని వక్రీభవన కోణమును కొలువుము.
  7. ఈ విధంగా వివిధ పతన కోణాలు 209, 30, 409, 50° మరియు 60° లతో ఈ ప్రయోగాన్ని చేసి, వాటి వక్రీభవన కోణాలను క్రింది పట్టికలో నమోదు చేయుము.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 8
  8. ప్రతీ i, r విలువలకు sini, sin r లను లెక్కించి, \(\frac{\sin i}{\sin r}\) విలువను గణించుము.
  9. ప్రతీ సందర్భంలో sin i, sin r నిష్పత్తి విలువ స్థిరము.

ప్రశ్న 7.
సంపూర్ణాంతర పరావర్తనాన్ని ఏదేని కృత్యంతో వివరించండి. (కృత్యం – 5) (AS1)
జవాబు:
ఉద్దేశ్యం : కాంతి సంపూర్ణాంతర పరావర్తనాన్ని వివరించుట.

కావలసిన వస్తువులు :
ప్రొ సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీట్, స్కేలు, నలుపురంగు వేసిన చిన్న కార్డుబోర్డు ముక్క (10 సెం.మీ. X 10 సెం.మీ.), 2 సెం.మీ. మందం గల అర్ధవృత్తాకారపు గాజుపలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్.

నిర్వహణ పద్ధతి :
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 9

  1. ప్రయోగశాల కృత్యం – 1 లో ఉంచినట్లుగానే అర్ధవృత్తాకార గాజుదిమ్మె వ్యాసం యానకాలను వేరుచేసే రేఖ MM తో ఏకీభవించేటట్లుగా అమర్చండి.
  2. MM మధ్య బిందువు ‘O’ తో గాజు దిమ్మె వ్యాసం యొక్క మధ్య – బిందువు ఏకీభవించాలి.
  3. గాజు దిమ్మె వక్రతలం వైపు నుండి కాంతిని పంపండి.
  4. మనం కాంతిని సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి పంపుతున్నాము.
  5. మొదటగా 0° పతన కోణంతో ప్రారంభించి గాజు దిమ్మె రెండోవైపు వక్రీభవన కిరణంను పరిశీలించుము.
  6. వక్రీభవన కిరణం తన మార్గాన్ని మార్చుకోలేదని మనము గమనించవచ్చును.
  7. ఇదే విధంగా 59, 10, 15-9, ….. పతన కోణాలతో కాంతిని పంపి వక్రీభవన కోణాలను లెక్కించుము.
  8. i, r విలువలను క్రింది పట్టికలో నమోదు చేయుము.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 10
  9. నిర్దిష్ట పతనకోణం వద్ద వక్రీభవన కిరణం గాజు, గాలి యానకాలను వేరుచేయు రేఖ వెంబడి ప్రయాణించడం గమనించవచ్చును.
  10. ఈ సందర్భంలో ఏర్పడు పతనకోణం సందిగ్ధ కోణం అగును.
  11. ఏదైనా పతన కోణం (i) కి పరావర్తన కోణం (r) అయినపుడు స్నెల్ నియమం ప్రకారం
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 11

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 12

15) సందిగ్ధ కోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేయు తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర ఆ యానకంలోకే పరావర్తనం చెందును.
16) అనగా కాంతికిరణం విరళయానకంలోకి ప్రవేశించదు. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటాం.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 8.
సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు, పతనకోణం కన్నా వక్రీభవన కోణం విలువ ఎక్కువని ప్రయోగపూర్వకంగా ఎలా సరిచూస్తారు? (AS1)
(లేదా)
సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించినపుడు లంబానికి దూరంగా వంగుతుందని r > i అని తెలిపే కృత్యాన్ని వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా వంగుతుందని లేదా r> i అగునని నిరూపించుట.

కావలసిన పరికరాలు :
కోణమాని, రెండు స్ట్రాలు, నీరు.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 13AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 14

నిర్వహణ పద్ధతి :

  1. ఒక వృత్తాకారపు కోణమానిని తీసుకొని దానిపై కేంద్రం వద్ద రెండు ‘స్ట్రా’లను, కేంద్రం చుట్టూ సులభంగా తిరిగేటట్లు అమర్చండి.
  2. ఒక స్ట్రాను 10° కోణరేఖ వెంబడి అమర్చుము.
  3. ఈ కోణమానిని పటం (బి) లో చూపినట్లు పారదర్శక పాత్రలో గల నీటిలో సగం వరకు ముంచుము.
  4. కోణమానిని నీటిలో ముంచినపుడు 10° కోణరేఖ వద్ద ఉంచిన స్ట్రా నీటిలో మునిగి ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
  5. పాత్ర పై భాగం నుండి నీటిలో మునిగి ఉన్న స్ట్రాను చూస్తూ, నీటి బయట – ఉన్న స్ట్రాను లోపల ఉన్న స్ట్రాతో సరళరేఖలో ఉండే విధంగా అమర్చుము.
  6. తరువాత కోణమానిని నీటి నుండి బయటకు తీసి రెండు స్ట్రాలను పరిశీలించుము.
  7. పరిశీలించగా రెండూ ఒకే సరళరేఖలో లేవని గుర్తించవచ్చును.
  8. రెండవ ‘కు, లంబానికి మధ్య కోణాన్ని కొలవండి.
  9. పట్టికలో i, r విలువలు నమోదు చేయండి.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 15
  10. ప్రయోగంలో పతనకోణం 48°లను మించకుండా i, r విలువలకు వక్రీభవన గుణకాలను కనుగొనుము.
  11. నీటి నుండి గాలిలోకి కాంతి ప్రయాణించేటపుడు ప్రతి సందర్భంలోనూ r విలువ 1 విలువ కన్నా ఎక్కువ ఉంటుందని గమనించవచ్చును.
  12. దీనినిబట్టి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా వంగుతుందని, r > i అని చెప్పవచ్చును.

ప్రశ్న 9.
ప్రకాశవంతమైన ఒక లోహపు గోళాన్ని తీసుకొని, కొవ్వొత్తి నుండి వచ్చే మసితో గోళాన్ని నల్లగా చేయండి. ఆ గోళాన్ని నీటిలో ముంచండి. ఆ గోళం ఎలా కనిపిస్తుంది? ఎందుకు? (AS2)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 16 AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 17

  1. ప్రకాశవంతమైన లోహపు గోళాన్ని కొవ్వొత్తి నుండి వచ్చు మసితో నల్లగా మార్చుము.
  2. ఈ లోహపు గోళాన్ని నీటిలో ఉన్న పాత్రలో ముంచుము.
  3. ఈ సందర్భంలో నీటికి, మసికి మధ్య ఒక ఖాళీ పటంలో చూపినట్లుగా, ఏర్పడును.
  4. ఇక్కడ ఏర్పడిన ఖాళీ విరళయానకంగానూ, నీరు సాంద్రతర యానకంగానూ పనిచేయును.
  5. కాంతికిరణం నీటి గుండా ఆ ఖాళీ వైపునకు ప్రయాణించును.
  6. ఏ సందర్భంలోనైతే పతనకిరణము కన్నా సందిగ్ధ కోణము ఎక్కువ అగునో అప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం జరుగును.
  7. ఈ సంపూర్ణాంతర పరావర్తనం వలన కాంతిగోళం మెరయును.
  8. అదే విధంగా కాంతి వక్రీభవనం వలన కూడా గోళం మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచి కొంత ఎత్తులో కనపడును. దాని అసలు పరిమాణం కన్నా ఎక్కువ పరిమాణంతో కూడా వక్రీభవనము కనపడును.

ప్రశ్న 10.
కృత్యం – 7ను మరలా చేయండి. నీటి సందిగ్ధ కోణాన్ని మీరు ఎలా కనుగొంటారు? కనుగొనే పద్ధతిని వివరించండి. (AS3)
జవాబు:

  1. ఒక స్థూపాకార పారదర్శక పాత్రను తీసుకొనుము.
  2. ఆ పాత్ర అడుగున ఒక నాణాన్ని ఉంచుము.
  3. పటంలో చూపిన విధంగా ఆ నాణెం ప్రతిబింబం నీటి ఉపరితలంపై కనబడేంత వరకు ఆ పాత్రలో నీరు పోయుము.
  4. బీకరు ప్రక్క భాగం నుండి నీటి ఉపరితలాన్ని చూడండి.
  5. నీరు పోయకముందు నాణెం కనిపించదు. కాని నీరు పోసిన తరువాత నాణెం కనిపిస్తుంది.
  6. దీనికి కారణము కాంతి సంపూర్ణాంతర పరావర్తనము.
  7. నీటి వక్రీభవన గుణకం = 1.33
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 19 AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 18

ప్రశ్న 11.
ఆప్టికల్ ఫైబర్స్ పనిచేసే విధానాన్ని వివరించే సమాచారాన్ని సేకరించండి. మన నిత్యజీవితంలో ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగాల గురించి ఒక నివేదిక తయారుచేయండి. (AS4)
(లేదా)
ఆప్టికల్ ఫైబర్స్ ఏ విధముగా పనిచేయునో, మనదైనందిన జీవితంలో వాటి ఉపయోగాలను తెలుపు సమాచారాన్ని సేకరించి, నివేదికను చూపుము.
(లేదా)
ఆప్టికల్ ఫైబర్స్ అంటే ఏమిటి ? దాని పనిచేయు విధానమును వర్ణించుము.
జవాబు:
పనిచేయు విధానము :
ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి.

  1. ఆప్టికల్ ఫైబర్ అనునది గాజు లేదా ప్లాస్టిక్ తో తయారు చేయబడిన అతి సన్నని తీగ.
  2. ఇటువంటి సన్నని తీగలు కొన్ని కలిసి లైట్ పైప్ గా ఏర్పడతాయి.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 20

పనిచేయు విధానం :

  1. ఆప్టికల్ ఫైబర్ లో కాంతి ప్రయాణించే విధానాన్ని పక్క పటం వివరిస్తుంది.
  2. ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్ధం వల్ల దానిలోకి ప్రవేశించు కాంతి, దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది.
  3. పతనకోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది.
  4. తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది.
  5. ఆ కాంతి పొట్ట లోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
  6. ఆ లోపలి కాంతి, లైట్ పైపులోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది.
  7. ఆ ఫైబర్స్ రెండవ చివర నుండి వచ్చు కాంతిని పరిశీలించడం ద్వారా పొట్ట లోపలి భాగాల చిత్రాన్ని పరిశీలకులు తెలుసుకుంటారు.

ఉపయోగాలు :

  1. మానవ శరీరంలోని కంటితో చూడలేని లోపలి అవయవాలను లేపరోస్కోపీ, ఎండోస్కోపీల ద్వారా పరీక్ష చేస్తారు.
  2. గుండెలోని రక్త ప్రసరణను కొలుచుటలో,
  3. పీడనాన్ని మరియు ఉష్ణోగ్రతను కొలవడంలో వాడే “సెన్సార్స్”లలో,
  4. వివిధ రకాల ద్రవాల యొక్క వక్రీభవన గుణకాలను కనుగొనుటలో,
  5. సమాచార సంకేతాలను ప్రసారం చేయుటకు ఈ ఆప్టికల్ ఫైబర్ లను విరివిగా వాడతారు.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 12.
గాజు దిమ్మెలో కాంతి వక్రీభవనం చెందే విధానాన్ని పటం గీసి, వివరించండి. (ప్రయోగశాల కృత్యం – 2) (AS5)
(లేదా)
గాజు దిమ్మె గుండా కాంతి పార్శ్వ విస్థాపనం కనుగొనే ప్రయోగశాల కృత్య విధానాన్ని వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
గాజుదిమ్మెను ఉపయోగించి పార్శ్వవిస్థాపనం అవగాహన చేసికొనుట.

కావలసిన వస్తువులు :
డ్రాయింగ్ బోర్డు, డ్రాయింగ్ చార్టు, క్లాంట్లు, స్కేలు, పెన్సిల్, పలుచని గాజుదిమ్మె మరియు గుండుసూదులు.

నిర్వహణ పద్దతి :

  1. డ్రాయింగ్ బోర్డుపై డ్రాయింగ్ చార్టును ఉంచి దానికి క్లాంట్లు పెట్టుము.
  2. డ్రాయింగ్ చార్టు మధ్య భాగంలో గాజు దిమ్మెను ఉంచి, చార్టుపై దిమ్మె దాని అంచువెంబడి ‘పెన్సిల్ లో గీత , గీయుము. ఇది దీర్ఘచతురస్రంలో ఉంటుంది.
  3. ఈ దీర్ఘచతురస్ర శీర్షాలకు A, B, C, D అని పేర్లు పెట్టుము.
    AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 21
  4. దీర్ఘచతురస్రం పొడవులలో ఒక దానికి (AB) ఏదైనా బిందువు వద్ద ఒక లంబరేఖను గీయుము.
  5. మరలా గాజు దిమ్మెను యథాస్థానంలో ఉంచుము.
  6. రెండు గుండుసూదులను మీరు గీసిన లంబంపై నిలువుగా ఒకే ఎత్తులో గుచ్చుము.
  7. మరో రెండు గుండుసూదులను తీసుకొని గాజు దిమ్మెకు రెండోవైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండుసూదులతో ఒకే సరళరేఖలో ఉండు విధంగా గుచ్చుము.
  8. గాజు దిమ్మెను, గుండుసూదులను తీసివేసి గుండుసూదుల వల్ల ఏర్పడిన గుర్తులను కలుపుతూ AB వరకు గీత గీయుము.
  9. గాజు దిమ్మె ఉపరితలంపై లంబంగా పతనమైన కాంతి కిరణం ఎటువంటి విచలనం పొందకుండా గాజు దిమ్మె రెండోవైపు నుండి బయటకు వస్తుంది.
  10. ఇప్పుడు మరొక డ్రాయింగ్ చార్టును కార్డుబోర్డు షీట్ పై ఉంచి అది కదలకుండా క్లాంట్లు పెట్టుము. పై విధంగానే గాజు దిమ్మె అంచును తెలిపే ABCD దీర్ఘచతురస్రాన్ని, AB లంబాన్ని గీయుము.
  11. ఈ లంబంతో 30° కోణం చేస్తూ, లంబం మరియు AB రేఖలు కలిసే బిందువును చేరే విధంగా మరొక రేఖను గీయుము. ఇది పతన కిరణాన్ని సూచిస్తుంది. లంబంతో ఈ రేఖ చేసే కోణం పతనకోణం అగును.
  12. ఇప్పుడు గాజు దిమ్మెను ABCD దీర్ఘచతురస్రంలో ఉంచుము. పతనకిరణంపై రెండు గుండుసూదులను నిలువుగా, ఒకే ఎత్తులో గుచ్చుము.
  13. గాజు దిమ్మె యొక్క రెండోవైపు నుండి చూస్తూ మొదటి రెండు గుండుసూదులతో సరళరేఖలో ఉండే విధంగా మరో . రెండు గుండుసూదులను దిమ్మెకు రెండోవైపు గుచ్చుము.
  14. ఈ గుండుసూదుల గుర్తులను కలుపుతూ CD వరకు రేఖను గీయుము. ఈ రేఖ బహిర్గత కాంతికిరణాన్ని తెలుపును.
  15. ఈ బహిరత కిరణం CD ని తాకే బిందువు వద్ద, CD రేఖకు ఒక లంబంను గీయుము.
  16. ఆ లంబానికి, బహిర్గత కిరణానికి మధ్య కోణాన్ని కొలువుము. దీనినే “బహిర్గత కోణం” అంటాము.
  17. ఈ పతన, బహిరత కోణాలు సమానము. ఈ పతన, బహిరత రేఖలు సమాంతరాలు. ఈ రెండు సమాంతర రేఖల మధ్య దూరాన్ని “పార్శ్వ విస్థాపనం” అంటాం.

ప్రశ్న 13.
వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి? ఇందులో ఇమిడి ఉన్న అంశాన్ని మీరెలా అభినందిస్తారు? (AS6)
(లేదా)
ఏ కారణం చేత వజ్రము ప్రకాశించును? దీని తయారీకి కారణమైన పదార్థ స్వభావంను నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:

  1. వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ చాలా తక్కువ (24.49).
  2. కావున వజ్రంలోనికి ప్రవేశించిన కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందును.
  3. ఈ లక్షణం వలన వజ్రం ప్రకాశించును.
  4. వజ్రమును కోసినపుడు పతనకోణం, సందిగ్ధకోణం కన్నా ఎక్కువై సంపూర్ణాంతర పరావర్తనం పదేపదే జరుగును.
  5. అనగా వజ్రంలోకి ప్రవేశించిన కాంతి సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం మిరుమిట్లు గొలిపే కాంతిలో ప్రకాశవంతంగా మెరయును.

ప్రశ్న 14.
కిరణ చిత్రాలను గీయడంలో ‘ఫెర్మాట్ సూత్రం’ ప్రాముఖ్యతను మీరెలా అభినందిస్తారు? (AS6)
(లేదా)
“ఫెర్మాట్ సూత్రంను ఆధారంగా చేసుకొని కిరణ చిత్రాలను గీయగలము”, ఈ విధముగా ఉపయోగపడు ఫెర్మాట్ సూత్రం ప్రాముఖ్యతను అభినందించుము.
జవాబు:

  1. కాంతి ఫెర్మాట్ సూత్రంపై ఆధారపడి ప్రసరించును.
  2. కాంతి యొక్క ఫలితాలను, దాని ధర్మాలను క్లుప్తంగా వివరించుటకు కిరణ చిత్రాలు ఉపయోగపడతాయి.
  3. కిరణ చిత్రాలను గీయడంలో ఫెర్మాట్ సూత్రం ఇమిడి ఉంటుంది.
  4. ఈ విధముగా కొన్ని దృక్ సాధనాల పనితీరును పూర్తిగా తెలుసుకొనుటకు ఫెర్మాట్ సూత్రం ఎంతో ఉపయోగపడినందున ఇది అభినందనీయమైంది.

ప్రశ్న 15.
మనం చలిమంట కాచుకుంటున్నప్పుడు మంట వెనుక భాగాన ఉన్న వస్తువులు స్వల్పంగా ఊగుతున్నట్లుగా కనిపిస్తాయి. కారణం ఏమిటి? (AS7)
(లేదా)
ఏదైనా మంట వద్ద ఉన్నప్పుడు మనకు అభిముఖంగా (వ్యతిరేకంగా లేదా మంట వెనుక) ఉన్న వస్తువులు కదులుతున్నట్లు
(లేదా) ఊగుతున్నట్లుగా కనిపించుటకు గల కారణంను వివరించుము.
జవాబు:

  1. చలిమంట కాచుకుంటున్నప్పుడు ఉష్ణం బహిర్గతమగును.
  2. ఈ బహిర్గతమైన ఉష్ణము చుట్టుప్రక్కల గల పరిసరాలలోనికి ప్రసారమగును.
  3. దీని ద్వారా గాలి యొక్క దృశ్య సాంద్రత పదేపదే మారుతూ ఉండును. కావున దాని యొక్క వక్రీభవన గుణకం కూడా మారును.
  4. ఈ విధమైన సాంద్రత మరియు వక్రీభవన గుణకాల నిరంతర మార్పు వలన పరావర్తన కోణము మరియు విస్థాపన విలువలు మారును.
  5. అందుకనే మంట వెనుక ఉన్న వస్తువులు స్వల్పంగా కదులుతున్నట్లు మన కంటికి కనిపించుచుండును.

ప్రశ్న 16.
నక్షత్రాలు ఎందుకు మిణుకుమిణుకుమంటాయి? (AS7)
(లేదా)
నక్షత్రాలు మిణుకు మిణుకుమనుటకు గల కారణంను వివరింపుము.
జవాబు:

  1. వాతావరణం యొక్క వక్రీభవనం వలన నక్షత్రాలు మిణుకు మిణుకుమంటాయి.
  2. వాతావరణం యొక్క వక్రీభవన గుణకపు మార్పుల వలన వక్రీభవనం జరుగును.
  3. నక్షత్రం నుండి వచ్చిన కాంతి విరళ యానకం లేక శూన్యం నుండి సాంద్రతర యానకం (వాతావరణం) లోనికి ప్రయాణించుట వలన, లంబానికి దూరంగా ప్రయాణించుట వలన దాని స్థానం నుండి కొద్దిగా దూరంగా గాని, దగ్గరగా గాని కనిపించును.
  4. అందువలన పరావర్తనం కొన్నిసార్లు సరిగా జరిగి, కొన్నిసార్లు సరిగా జరగక మిణుకుమిణుకుమని ప్రకాశిస్తాయి.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 17.
ఒకే ఆకారంలో తయారుచేయబడిన గాజుముక్క వజ్రాలలో వజ్రం ఎక్కువగా మెరుస్తుంది. ఎందుకు? (AS7)
(లేదా)
ఒకే ఆకృతిలో గల గాజు ముక్క వజ్రాలలో ఎక్కువగా వజ్రం మెరయుటకు గల కారణంను వివరింపుము.
జవాబు:

  1. వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ 24.4°. అనగా చాలా తక్కువ.
  2. వజ్రంలోకి ప్రవేశించిన అన్ని కాంతి కిరణములు సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా మెరయును.
  3. గాజు యొక్క సందిగ్ధ కోణం విలువ 42° అనగా వజ్రం విలువ కన్నా ఎక్కువ.
  4. వజ్ర రూపంలో కత్తిరించబడిన గాజులోనికి ప్రవేశించిన కాంతి కిరణాలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనం చెందుట వలన వజ్రం కంటే గాజు తక్కువగా మెరయును.

ప్రశ్న 18.
నీటి పరమ వక్రీభవన గుణకం 4/8. అయిన నీటి సందిగ్ధ కోణం ఎంత?
జవాబు:
నీటి పరమ వక్రీభవన గుణకం = 4/3
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 22

ప్రశ్న 19.
ఒక గాజు పాత్రలో సగం వరకు గ్లిజరిన్ పోయండి. తరువాత దాని నిండుగా నీరు నింపండి. ఈ పాత్రలో క్వార్ట్ గాజుకడ్డీని ఉంచండి. పాత్ర ప్రక్కభాగం నుండి గాజుకడ్డీని పరిశీలించండి.
ఎ) మీరు ఏం మార్పులు గమనించారు?
బి) ఈ మార్పులకు కారణాలేమై ఉంటాయి?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 23
ఎ) ఈ కృత్యంలో పాత్ర ప్రక్క భాగం నుండి గాజుకడ్డీని పరిశీలించిన, గ్లిజరిన్ లో మునిగిన గాజుకడ్డీ యొక్క భాగం కనిపించదు. అందువలన గాజుకడ్డీ నీటి పై తేలుతున్నట్లుగా కనిపించును. నీటిలోని గాజుకడ్డీ భాగము కనిపించును.
బి) గాజుకడ్డీ యొక్క భాగం మనకు కనిపించదు. దీనికి కారణం గాజుకడ్డీ మరియు గ్లిజరిన్స్ యొక్క వక్రీభవన గుణకాలు సమానం మరియు వాటిలో కాంతి గ్లిజరిన్ వేగాలు కూడా సమానం కావున కాంతి పరావర్తన ప్రక్రియ జరగదు.

ప్రశ్న 20.
కింది యానకాల వక్రీభవన గుణకాల విలువలను సేకరించండి.
నీరు, కొబ్బరినూనె, ఫ్లింట్ గాజు, వజ్రం, బెంజీన్, హైడ్రోజన్ వాయువు.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 24

ప్రశ్న 21.
థర్మాకోల్ షీట్ తో 2 సెం.మీ., 3 సెం.మీ., 4 సెం.మీ.,. 4.5 సెం.మీ, 5 సెం.మీ. మొదలగు వ్యాసార్ధాలు కలిగిన వృత్తాకార ముక్కలను తయారు చేయండి. ప్రతిదానికి కేంద్రాన్ని గుర్తించండి. అన్ని వృత్తాలకు కేంద్రం వద్ద 6 సెం.మీ. పొడవు గల సూదిని గుచ్చండి. ఒక వెడల్పాటి అపారదర్శక పాత్రలో నీటిని తీసుకొని, 2 సెం.మీ. వ్యాసార్ధం గల థర్మాకోల్ ముక్కను పటంలో చూపిన విధంగా సూది నీటిలో ఉండేటట్లుగా అమర్చండి. ఆ సూది రెండవ చివరను పాత్ర పై నుండే చూడడానికి ప్రయత్నించండి.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 25
1) సూది కొనను మీరు చూడగలిగారా? ఎందుకు?
వేర్వేరు వ్యాసార్ధాలను కలిగిన మిగతా థర్మాకోల్ వృత్తాలతో ఈ ప్రయోగాన్ని మళ్ళీ చేయండి. సూది కొనభాగాన్ని చూడడానికి ప్రయత్నించండి.
గమనిక : ప్రతి సందర్భంలోనూ థర్మాకోల్ వృత్తం యొక్క స్థానం, మీ కంటి స్థానం మారకుండా జాగ్రత్త వహించండి.
2) ఏయే వ్యాసార్ధాలు కలిగిన వృత్తాలకు ఉంచిన సూదుల కొనలను మీరు చూడలేకపోయారు? వాటిలో తక్కువ వ్యాసార్ధం విలువ ఎంత?
3) కొన్ని సూదుల కొనలను మీరు చూడలేకపోవడానికి కారణమేమిటి?
4) యానకం యొక్క సందిగ్ధ కోణాన్ని కనుగొనడానికి మీకు ఈ కృత్యం సహాయపడిందా?
5) వివిధ సందర్భాలలో సూది కొన నుండి కాంతి ప్రయాణాన్ని తెలిపే చిత్రాలను గీయండి.
జవాబు:
ఈ ప్రయోగంను సాధించుటకు కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఉపయోగపడును.

ఇచ్చిన వృత్తాకార ముక్కలనుపయోగించి సూది మొనను చూచుటకు ఆ ముక్కల వ్యాసార్ధంను కనుగొనవలెను.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 26

  1. అవును, సూదిమొనను చూడగలిగాను. ఎందుకనగా గరిష్ఠ వ్యాసార్ధం కన్నా ఇచ్చిన వ్యాసార్ధము తక్కువ కావటం చేత.
  2. గరిష్ఠ వ్యాసార్ధానికి సమానమైన వ్యాసార్ధం గల వృత్తంకు ఉంచిన సూదిమొనను చూడలేకపోయాను.
  3. కారణమేమనగా వస్తువు నుండి వచ్చు కాంతి కిరణాల పతనకోణం కన్నా సందిగ్ధకోణం విలువ ఎక్కువై సంపూర్ణాంతర పరావర్తనం చెందటం వలన సూదికొనను చూచుట సాధ్యపడలేదు.
  4. అవును, సందిగ్ధకోణంను కల్గొనగలము.
    గాలి యొక్క వక్రీభవన గుణకం విలువ = 1.003 = n2
    నీటి యొక్క వక్రీభవన గుణకం విలువ = 1.33 = n1

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 27

ప్రశ్న 22.
టేబుల్ పై ఒక వస్తువును ఉంచండి. దానిని ఒక గాజు దిమ్మెగుండా చూస్తే ఆ వస్తువు మీకు చేరువుగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో కాంతికిరణ ప్రయాణాన్ని వివరించే కిరణ చిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 28
పై పటంలో O – వస్తు స్థానం
O’ – ప్రతిబింబ స్థానం (లేదా) దృశ్యస్థానం
y- వస్తు, ప్రతిబింబ స్థానమార్పిడి

ప్రశ్న 23.
గాలి – ఒక ద్రవం వేరు చేయబడే తలం వద్ద కాంతి కిరణం 45° కోణంతో పతనమై 30° కోణంతో వక్రీభవనం పొందింది. ఆ ద్రవం వక్రీభవనగుణకం ఎంత? వక్రీభవన కిరణం, పరావర్తన కిరణం మధ్య కోణం 90° ఉండాలంటే కాంతి ఎంత కోణంతో పతనం చెందాలి?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 29

ప్రశ్న 24.
ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్ష నాళికను (పరీక్షనాళికలోకి నీరు చేరరాదు) ఒక ప్రత్యేక స్థానం నుండి చూసినప్పుడు, పరీక్షనాళిక గోడ అద్దం వలె కనిపిస్తుంది. దీనికి కారణమేమిటో వివరించగలరా?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 30

  1. పరీక్షనాళిక యొక్క ఉపరితలం నీటిని మరియు గాలిని వేరుచేస్తుంది.
  2. పరీక్షనాళికపై కాంతికిరణము పతనమైనపుడు అది సంపూర్ణాంతర పరావర్తనం చెంది వెనుదిరిగి అదే యానకంలోకి ప్రవేశించును.
  3. ఒక ప్రత్యేక స్థానం నుండి చూసినప్పుడు పరీక్షనాళిక గోడ అద్దంవలె కనిపించుటకు సంపూర్ణాంతర పరావర్తనమే కారణము.

ప్రశ్న 25.
ఏ సందర్భాల్లో కాంతి కిరణం యానకాలను వేరుచేసే తలం వద్ద విచలనం పొందదు?
(లేదా)
రెండు యానకాలను వేరు చేయు తలం వద్ద ఏ సందర్భాల్లో కాంతి కిరణం విచలనం చెందదు?
జవాబు:
కాంతి కిరణం క్రింది సందర్భాలలో ఎటువంటి విచలనం పొందదు.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 31

ఖాళీలను పూరించండి

1. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం విలువ ………… (90)
2. n1 sin i = n2 sin r ను ……………….. అంటాం. (స్నెల్ నియమం)
3. శూన్యంలో కాంతివడి విలువ ………… (3 × 108 మీ/సె)
4. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి కిరణం ……………….యానకం నుండి ……….. యానకంలోనికి ప్రయాణించాలి. (సాంద్రతర, విరళ)
5. ఒక పారదర్శక పదార్థ వక్రీభవన గుణకం 3/2. ఆ యానకంలో కాంతివడి ……………. (2 × 108 మీ/సె)
6. ఎండమావులు ……………………… కు ఒక ఉదాహరణ. (సంపూర్ణాంతర పరావర్తనం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. కింది వాటిలో స్నెల్ నియమం …..
(లేదా)
స్నెల్ నియమాన్ని తెలుపు సమీకరణం
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 32
జవాబు:
C

2. గాలి పరంగా గాజు వక్రీభవన గుణకం 2. గాజు – గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణం …
A) 0°
B) 45°
C) 30°
D) 60°
జవాబు:
C) 30°

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

3. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి …….. లోకి ప్రయాణించాలి.
A) విరళ యానకం నుండి సాంద్రతర యానకం
B) విరళ యానకం నుండి విరళ యానకం
C) సాంద్రతర యానకం నుండి విరళ యానకం
D) సాంద్రతర యానకం నుండి సాంద్రతర యానకం
జవాబు:
C) సాంద్రతర యానకం నుండి విరళ యానకం

4. గాజు దిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం …….. .
A) 0°
B) 20°
C) 90°
D) గాజు దిమ్మెతలానికి గీసిన లంబంతో కాంతికిరణం చేసే కోణంపై ఆధారపడి ఉంటుంది.
జవాబు:
D) గాజు దిమ్మెతలానికి గీసిన లంబంతో కాంతికిరణం చేసే కోణంపై ఆధారపడి ఉంటుంది.

పరికరాల జాబితా

పింగాణీ పాత్ర, ఐదు రూపాయిల నాణెం, నీరు, తెల్లని డ్రాయింగ్ ‘షీట్, కార్డు బోర్డు షీట్, కోణమానిని, అర్ధవృత్త ఆకారపు గాజు పలక, రెండు స్ట్రాలు, వృత్తాకారపు కోణమానిని, నీరు, 1 లీ. గాజు బీకరు, క్లాంపు, స్కేలు, పలుచని గాజు దిమ్మె, గుండు సూదులు.

10th Class Physical Science 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 60

ప్రశ్న 1.
ఎండమావి నిలిచి ఉన్న నీరులా ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4

  1. ఆకాశం నుండి లేదా ఎత్తైన చెట్టు నుండి వచ్చే కాంతి “పై నుండి క్రిందకు సాంద్రత మారుతున్నటువంటి గాలి” గుండా ప్రయాణిస్తూ రోడ్డుకు దగ్గరగా వచ్చినపుడు వక్రీభవనానికి లోనై సంపూర్ణాంతర పరావర్తనం వల్ల పటంలో చూపినట్లుగా వక్రమార్గంలో ప్రయాణిస్తుంది.
  2. ఈ వక్రీభవన కాంతి పటంలో చూపిన మార్గంలో పరిశీలకున్ని చేరుతుంది.
  3. ఆ కాంతి నేలపై పరావర్తనం చెంది వస్తున్నట్లుగా పరిశీలకునికి కనిపిస్తుంది.
  4. ఇలా జరగడం వల్లనే ఆకాశం యొక్క మిథ్యా ప్రతిబింబం, రోడ్డుపై నీళ్ళవలె కనబడుతుంది.

ప్రశ్న 2.
ఎండమావిని మీరు ఫోటో తీయగలరా?
జవాబు:
ఎండమావి ఒక మిథ్యా ప్రతిబింబం కావున దీనిని ఫోటో తీయలేము.

10th Class Physical Science Textbook Page No. 47

ప్రశ్న 3.
ఒక పాత్రలోని నీటిలో పడవేసిన నాణెం ఆ పాత్ర అడుగు భాగం నుండి పైకి కొంత ఎత్తులో కనబడటం మీరు గుర్తించి ఉంటారు కదా! అదేవిధంగా ఒక గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనబడుతుంది. కాగితంపై రాసిన అక్షరాలపై ఒక మందపాటి గాజుపలకనుంచి చూస్తే ఆ అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనబడతాయి. ఈ విధమైన మార్పులకు కారణమేమై ఉంటుంది?
జవాబు:
ఈ విధమైన మార్పులకు కారణము కాంతి యొక్క వక్రీభవన లక్షణమే.

10th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 4.
వక్రీభవన కిరణాల ప్రవర్తనకు, కాంతి వేగాలకు ఏదైనా సంబంధం ఉందా?
జవాబు:

  1. వక్రీభవన కాంతి వేగము యానకము నుండి యానకమునకు మారును.
  2. సాధారణ కాంతి వేగములో యానకము మారినప్పటికీ ఎట్టి మార్పుండదు.

10th Class Physical Science Textbook Page No. 51

ప్రశ్న 5.
వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు వేర్వేరుగా ఎందుకుంటాయి?
జవాబు:
వక్రీభవన గుణకము పదార్థ స్వభావంపై ఆధారపడును. అందుకనే వివిధ పదార్థాల యానకాల వక్రీభవన గుణకాలు వేర్వేరుగా ఉంటాయి.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 6.
ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఏ అంశాలపై ఆధారపడుతుంది?
జవాబు:
వక్రీ. “కం పదార్థ స్వభావం, ఉపయోగించిన కాంతి తరంగదైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది.

10th Class Physical Science Textbook Page No. 54

ప్రశ్న 7.
పతనకోణానికి, వక్రీభవన కోణానికి మధ్య సంబంధాన్ని తెలిపే సూత్రాన్ని మనం ఉత్పాదించగలమా?
జవాబు:
అవును ఉత్పాదించగలము. కాంతి పతన కోణానికి, వక్రీభవన కోణానికీ మధ్యగల సంబంధమును తెలుపు సూత్రము
n1 sin i = n2 sin r

10th Class Physical Science Textbook Page No. 56

ప్రశ్న 8.
వక్రీభవన కోణం 90° అయ్యే సందర్భం ఉంటుందా? అది ఎప్పుడు అవుతుంది?
జవాబు:
అవును, పతన కోణము, సందిగ్ధ కోణముకు సమానమైన సందర్భంలో వక్రీభవన కోణం 90° అగును.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physical Science Textbook Page No. 57

ప్రశ్న 9.
సందిగ్ధకోణం కంటే పతనకోణం ఎక్కువైనప్పుడు కాంతి కిరణం ఏమవుతుంది?
జవాబు:
సందిగ్ధకోణం కన్నా పతన కోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకే పరావర్తనం చెందును.

10th Class Physical Science Textbook Page No. 61

ప్రశ్న 10.
కాంతి ప్రసార మార్గంలో ఒక గాజుదిమ్మెను అడ్డుగా ఉంచితే ఏం జరుగుతుంది?
జవాబు:
కాంతి ప్రసారమార్గంలో గాజు దిమ్మెనుంచిన కాంతి రెండుసార్లు వక్రీభవనం చెందును.

10th Class Physical Science Textbook Page No. 49

ప్రశ్న 11.
పటం (ఎ), (బి) పటాలలోని వక్రీభవన కిరణాలలో మీరు ఏం తేడా గమనించారు?
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 35
జవాబు:
పటం – (ఎ) లో కాంతి కిరణము లంబము వైపుగా వంగినది.
పటం – (బి) లో కాంతి కిరణము లంబము నుండి దూరముగా వంగినది.

10th Class Physical Science 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

• ఒక గాజు గ్లాసులోని నీటిలో పెన్సిల్ ఉంచినపుడు నీ పరిశీలనలు వ్రాయుము.
జవాబు:

  1. ఒక గాజు గ్లాసులో కొంత నీటిని తీసుకొనుము.
  2. దీనిలో ఒక పెన్సిల్ ను ఉంచుము.
  3. గ్లాసు పై భాగం నుండి, ప్రక్క భాగం నుండి పెన్సిల్ ను గమనించగా దాని స్థానంలో మార్పు ఉండును.
  4. పెన్సిల్ ను పై భాగం నుండి గమనించగా అది వంగినట్లుగా కనబడును.

కృత్యం – 2

కాంతి వక్రీభవనాన్ని తెలిపే కృత్యాన్ని రాయండి.
జవాబు:

  1. సూర్యుని ఎండపడుతున్న ఒక పొడవైన గోడ వద్దకు మీరు, మీ స్నేహితుడు వెళ్ళండి.
  2. గోడ ఒక చివర వద్ద మీరు నిల్చొని, మరొక చివర వద్ద ప్రకాశవంతమైన ఒక లోహపు వస్తువును చేతిలో పట్టుకొనమని మీ స్నేహితునికి చెప్పండి.
  3. గోడకు కొద్ది అంగుళాల దూరంలో ఆ లోహపు వస్తువున్నప్పుడు వస్తువు మసకబారినట్లుగా కనబడుతుంది.
  4. గోడ అద్దం వలె ప్రవర్తిస్తున్నట్లుగా దానిపై లోహపు వస్తువు ప్రతిబింబము కనబడుతుంది.
  5. కాంతి వక్రీభవనం చెందడం వలన గోడపై ఆ లోహపు వస్తువు యొక్క ప్రతిబింబం కనబడును.

కృత్యం – 3

కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించునపుడు దాని దిశలో మార్పు ఏ రకంగా వస్తుందో కృత్యం ద్వారా వివరించుము.
(లేదా)
నీటి పాత్ర అడుగుభాగాన ఉన్న నాణెం పైకి కొంత ఎత్తులో కనబడుటను కిరణ చిత్రం ద్వారా చూపుము.
జవాబు:

  1. అపారదర్శక పదార్థంతో తయారు చేయబడిన, తక్కువ లోతు కలిగిన పాత్రను తీసుకొనుము.
  2. పాత్ర అడుగున నాణెమునుంచుము.
  3. ఆ నాణెము మీకు కనపడకుండాపోయే వరకు పాత్ర నుండి వెనుకకు జరుగుము.
  4. మీరు అక్కడే నిల్చుని మీ స్నేహితుడిని ఆ పాత్రను నీటితో నింపమనుము.
  5. పాత్రను నీటితో నింపితే నాణెం కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 33

పరిశీలన :

  1. కాంతి ఋజుమార్గంలో ప్రయాణిస్తుంది అనే అంశం ఆధారంగా నాణెం నుండి మీ కంటికి చేరే కాంతి కిరణ చిత్రం గీయుము.
  2. కాంతి కిరణాన్ని పరిశీలిస్తే నీరు, గాలి అనే యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతికిరణం తన దిశను మార్చుకుంటుంది.
  3. నాణెం నుండి కంటిని చేరడానికి అతి తక్కువ కాలం పట్టేందుకుగాను కాంతి కిరణం ఈ మార్గాన్ని ఎన్నుకుంది.
  4. అనగా వివిధ యానకాలలో కాంతి వేగం వేర్వేరుగా ఉంటుంది.
  5. ఈ రకంగా కాంతి వక్రీభవనం చెందిందని చెప్పవచ్చును.

కృత్యం – 6

ఒక గాజు గ్లాసు అడుగున ఒక నాణెము నుంచి, గ్లాసు పక్క భాగం నుండి పరిశీలించినపుడు నాణెం కనుమరుగవుతుంది. కారణం తెలపండి.
జవాబు:

  1. ఒక టేబుల్ పై నాణాన్ని ఉంచి దానిపై ఒక గాజు గ్లాసును పెట్టుము.
  2. గాజు ప్రక్క భాగం నుండి పరిశీలించుము.
  3. ఆ నాణెం యొక్క ప్రతిబింబం పూర్వంకన్నా పెద్దగా కనిపిస్తుంది.
  4. ఇపుడు ఆ గ్లాసును నీటితో నింపుము.
  5. మరల ఆ నాణాన్ని పరిశీలించుము.
  6. నాణెం మనకు కనపడదు.
  7. దీనికి గల కారణము సంపూర్ణాంతర పరావర్తనము.

AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

కృత్యం – 7

గాజుగ్లాసులోని నీటిలో ఉన్న నాణెం కొంచెం పైకి లేచినట్లు కనబడుతుంది. ఎందుకు?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 18

  1. ఒక స్థూపాకార పారదర్శక పాత్రను తీసుకొనుము.
  2. ఆ పాత్ర అడుగున ఒక నాణాన్ని ఉంచుము.
  3. ఆ నాణెం యొక్క ప్రతిబింబం నీటి ఉపరితలంపై కనబడేంత వరకు ఆ పాత్రలో నీరు పోయుము.
  4. సంపూర్ణాంతర పరావర్తనం వలన నాణెం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది.

కృత్యం – 8

గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనుటను కృత్యం ద్వారా చూపుము.
(లేదా)
కాంతి వక్రీభవననుపయోగించి ఒక గాజు దిమ్మె యొక్క వక్రీభవన గుణకంను ఏ విధంగా కనుగొనవచ్చునో ప్రయోగపూర్వకంగా తెల్పుము. గాజు దిమ్మె నిలువు విస్థాపనము ద్వారా వక్రీభవనంను కనుగొను ప్రయోగమును వివరింపుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 34

  1. గాజు దిమ్మె మందాన్ని కొలిచి మీ నోట్ బుక్ లో రాసుకొనుము.
  2. గాజు దిమ్మెను డ్రాయింగ్ చార్టుపై మధ్య భాగంలో ఉంచుము.
  3. గాజు దిమ్మె అంచు ABCD దీర్ఘచతురస్రాన్ని గీయుము.
  4. AB రేఖకు ఏదేని బిందువు వద్ద లంబాన్ని గీయుము.
  5. గాజు దిమ్మెను ABCD దీర్ఘ చతురస్రంలో ఉంచుము.
  6. ఒక గుండుసూదిని తీసుకొని, AB రేఖకు గీసిన లంబంపై గాజు దిమ్మె నుండి 15 సెం.మీ. దూరంలో P బిందువు వద్ద ఉంచుము.
  7. ఆ గుండుసూదిని గాజు దిమ్మె యొక్క రెండోవైపు నుండి చూస్తూ మరొక గుండుసూదిని మొదటిదానితో ఒకే సరళరేఖలో ఉండునట్లు అమర్చుము.
  8. గాజు దిమ్మెను తొలగించి గుండుసూదుల స్థానాన్ని పరిశీలించుము.
  9. రెండవ గుండుసూది కొన నుండి మొదటి గుండుసూది ఉంచిన రేఖ పైకి ఒక లంబాన్ని గీయుము.
  10. వాటి ఖండన బిందువు Q గా గుర్తించుము.
  11. P, Q ల మధ్య దూరాన్ని కొలిచిన, ఇది లంబ విస్థాపనం అగును.
  12. గాజు దిమ్మె నుండి గుండుసూది దూరాన్ని మార్చి ఈ ప్రయోగాన్ని మరలా చేయుము.
  13. లంబవిస్థాపనం మారదని మనము గుర్తించవచ్చును.
  14. గాజు వక్రీభవన గుణకాన్ని క్రింది సూత్రం ద్వారా కనుగొనవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

SCERT AP 10th Class Physical Science Guide 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 11th Lesson Questions and Answers లోహ సంగ్రహణ శాస్త్రం

10th Class Physical Science 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రకృతిలో ఆక్సెడ్ రూపంలో ఉండే ధాతువులుగా లభ్యమయ్యే మూడు లోహాలను వ్రాయండి. (AS1)
(లేదా)
ఆక్సెడ్ రూపంలో దొరుకు లోహ ధాతువులకు కొన్ని ఉదాహరణలిమ్ము.
జవాబు:
ప్రకృతిలో ఆక్సెడ్ రూపంలో ఉండి ధాతువులుగా లభ్యమయ్యే మూడు లోహాలు :

  1. బాక్సైట్ (Al2O3 • 2H2O)
  2. హెమటైట్ (Fe2O3)
  3. జింకైట్ (ZnO).

ప్రశ్న 2.
ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమయ్యే మూడు లోహాలు పేర్కొనండి. (AS1)
(లేదా)
ప్రకృతిలో మిశ్రమరూపం కాని స్థితిలో లభించు మూడు లోహధాతువులకు ఉదాహరణలిమ్ము.
జవాబు:

  1. బంగారం (AU)
  2. వెండి (Ag)
  3. ప్లాటినమ్ (P+)

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 3.
లోహ నిష్కర్షణలో ముడి ఖనిజాన్ని సాంద్రీకరించడంపై ఒక లఘు వ్యాఖ్య వ్రాయండి. (AS1)
(లేదా)
లోహ నిష్కర్షణలో ముడి ఖనిజంను సాంద్రీకరించడంను వివరించుము.
(లేదా)
ధాతువును గాధత చెందించుట అనగానేమి? భౌతిక పద్ధతులలో ధాతువును గాడత చెందించు పద్దతులేవి?
జవాబు:

  1. భూమి నుండి మైనింగ్ ద్వారా పొందిన ధాతువులో సాధారణంగా మట్టి, ఇసుక వంటి మలినాలు చాలా పెద్ద మొత్తంలో కలసి ఉంటాయి. ఈ మలినాలను ఖనిజ మాలిన్యం అంటాం.
  2. ఖనిజ మాలిన్యం అధిక పరిమాణంలో ఉన్న ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని తక్కువ ఖర్చుతో కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా ముందుగా వేరు చేస్తారు.
  3. ఇలా పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని ధాతువు నుంచి వేరుచేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటారు.
  4. ధాతువు, ఖనిజ మాల్యినాన్ని మధ్య భౌతిక ధర్మాలలో గల భేదంపై ఆధారపడి కొన్ని భౌతిక పద్ధతులను ధాతువును సాంద్రీకరణ చేయడానికి అవలంబిస్తారు. అవి :
    1) చేతితో ఏరివేయటం
    2) నీటితో కడగడం
    3) ప్లవన ప్రక్రియ
    4) అయస్కాంత వేర్పాటు పద్ధతి.

ప్రశ్న 4.
ముడిఖనిజం అంటే ఏమిటి ? ఖనిజాలలో వేటి ఆధారంగా ముడిఖనిజాన్ని ఎంపిక చేస్తారు? (AS1)
(లేదా)
ముడి ఖనిజంను నిర్వచించుము. దీనిని దేనిపై ఆధారపడి ఎంపిక చేస్తారు?
జవాబు:

  1. ఏ ఖనిజాలు చాలా ఎక్కువ శాతం లోహాన్ని కలిగి ఉండి, వాటి నుండి లాభదాయకంగా లోహాన్ని రాబట్టడానికి అనువుగా ఉంటాయో ఆ ఖనిజాలను ముడిఖనిజాలు లేక ధాతువులు అంటారు.
  2. ఉదాహరణకు, భూపటలంలో అతి సాధారణ మూలకం అల్యూమినియం (Al).
  3. ఇది చాలా ఖనిజాలలో ముఖ్య అనుఘటకం.
  4. అయినప్పటికీ దీని ఖనిజాలన్నింటి నుండీ అల్యూమినియాన్ని నిష్కర్షించడం అంత లాభదాయకం కాదు.
  5. సాధారణంగా అల్యూమినియం నిష్కర్షణకు అత్యంత లాభదాయకమైన ఖనిజము బాక్సెట్.
  6. అందుకే బాక్సైట్ ను అల్యూమినియం యొక్క ఖనిజ ధాతువు లేదా ముడిఖనిజంగా భావిస్తాం.
  7. దీనిలో 50 – 70% అల్యూమినియం ఆక్సెడ్ ఉంటుంది.

ప్రశ్న 5.
ఇనుము యొక్క ఏవైనా రెండు ధాతువుల పేర్లు వ్రాయండి. (AS1)
(లేదా)
ఇనుము ధాతువులైన హెమటైట్ మరియు మాగ్నటైట్ సాంకేతికాలను వ్రాయుము.
జవాబు:

  1. హెమటైట్ (Fe2O3),
  2. మాగ్నటైట్ (Fe3O4).

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 6.
ప్రకృతిలో లోహాలు ఎలా లభ్యమవుతాయి? ఏవైనా రెండు ఖనిజ రూపాలకు ఉదాహరణలివ్వండి. (AS1)
(లేదా)
ప్రకృతిలో లోహాల ఉనికిని, కొన్ని ఉదాహరణలతో వివరింపుము.
జవాబు:
ప్రకృతిలో లోహాలు ఏ విధంగా లభిస్తాయంటే

  1. లోహాల యొక్క ప్రధాన వనరు భూపటలం.
  2. సముద్రజలంలో కూడా కొన్ని సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ వంటి కరిగే లవణాలు ఉంటాయి.
  3. బంగారం (Au), వెండి (Ag), రాగి (Cu) వంటి కొన్ని లోహాల చర్యాశీలత తక్కువ కాబట్టి అవి ప్రకృతిలో స్వేచ్ఛాస్థితిలో లభ్యమవుతాయి.
  4. మిగిలిన లోహాలు వాటి అధిక చర్యాశీలత వలన ప్రకృతిలో సంయోగస్థితిలోనే ఉంటాయి.
  5. ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను లోహ ఖనిజాలు అంటారు.

ఖనిజ రూపాలకు ఉదా :

  1. ఎప్సమ్ లవణం (MgsO4 . 7H2O),
  2. సున్నపురాయి (CaCO3).

ప్రశ్న 7.
ప్లవన ప్రక్రియను గురించి లఘువ్యాఖ్య రాయండి. (AS1)
(లేదా)
సల్ఫైడ్ ధాతువుల నుండి ఖనిజమాలిన్యాన్ని తొలగించు పద్ధతి గూర్చి విపులంగా వ్రాయుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1

  1. ఈ పద్ధతి ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువుల నుండి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి అనువుగా ఉంటుంది.
  2. ఈ ప్రక్రియలో ఖనిజాన్ని మెత్తని చూర్ణంగా చేసి, నీటితో ఉన్న తొట్టెలో ఉంచుతారు.
  3. గాలిని ఈ తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపి నీటిలో నురుగు వచ్చేటట్లు చేస్తారు.
  4. ఏర్పడిన నురుగు ఖనిజ కణాలను పై తలానికి తీసుకు పోతుంది.
  5. తొట్టె అడుగు భాగానికి మాలిన్య కణాలు చేరుకుంటాయి.
  6. నురుగు తేలికగా ఉండడం వల్ల తెట్టులాగా ఏర్పడిన ఆ నురుగును దాని నుండి వేరుచేసి, ఆరబెట్టి ధాతుకణాలను పొందవచ్చు.

ప్రశ్న 8.
ముడిఖనిజాన్ని సాంద్రీకరించడంలో అయస్కాంతవేర్పాటు పద్ధతిని ఎప్పుడు వాడుతాం? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ముడిఖనిజం గానీ లేదా ‘ఖనిజ మాలిన్యం గానీ, ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే, వాటిని విద్యుదయస్కాంతాలను ఉపయోగించి వేరుచేస్తారు.
  2. ఉదాహరణ మాగ్నటైట్ (Fe3O4).

ప్రశ్న 9.
కింది వాటికి లఘు వ్యాఖ్యలు రాయండి. (AS1)
1) భర్జనం 2) భస్మీకరణం 3) ప్రగలనం
జవాబు:
1) భర్జనం :

  1. భర్జనం ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ.
  2. ఈ ప్రక్రియలో ధాతువును ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత (లోహ ద్రవీభవన స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత) వద్ద వేడిచేస్తారు.
  3. ఈ ప్రక్రియలో పొందిన ఉత్పన్నాలు (సల్ఫైడ్ ధాతువు నుండి పొందే లోహ ఆక్సెడ్ వంటివి) ఘన స్థితిలో ఉంటాయి.
  4. సాధారణంగా భర్జన ప్రక్రియకు రివర్బరేటరీ కొలిమిని వాడతారు.
  5. ఉదాహరణ : 2 ZnS + 3O2 → 2 ZnO + 2 SO2

2) భస్మీకరణం :

  1. భస్మీకరణం ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ.
  2. ఈ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటులో లేకుండా వేడిచేయడం వలన ధాతువు విఘటనం చెందుతుంది.
  3. ఉదాహరణ : MgCO3 → MgO + CO2 ; CaCO3 → Ca0 + CO2

3) ప్రగలనం :

  1. ప్రగలనం అనేది ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ.
  2. ఈ ప్రక్రియలో ఒక ధాతువును ద్రవవారితో కలిపి, ఇంధనంతో బాగా వేడిచేస్తారు.
  3. ఉష్ణశక్తి చాలా తీవ్రంగా ఉండటం వలన ధాతువు, లోహంగా క్షయీకరింపబడుతుంది.
  4. అలాగే లోహాన్ని ద్రవస్థితిలో పొందవచ్చు.
  5. ప్రగలన ప్రక్రియలో ధాతువులోని మలినాలు ద్రవకారితో చర్య పొంది, సులువుగా తొలగించగల లోహమలంగా ఏర్పడతాయి.
  6. హెమటైట్ (Fe2O3) ధాతువు విషయంలో కోకను ఇంధనంగాను, సున్నపురాయి (CacO3)ని ద్రవకారిగాను వాడతారు.
  7. ప్రగలన ప్రక్రియను బ్లాస్ట్ కొలిమి అనే ప్రత్యేకంగా నిర్మించబడిన కొలిమిలో చేస్తారు.

ప్రశ్న 10.
భర్తనము, భస్మీకరణం మధ్య భేదమేమిటి? ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క ఉదాహరణ యివ్వండి. (AS1)
(లేదా)
భర్జనము, భస్మీకరణముల మధ్య భేదాలను ఉదాహరణలతో వివరింపుము.
జవాబు:
1) భర్జన ప్రక్రియలో ధాతువును ఆక్సిజన్ లేదా గాలి సమక్షంలో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు.
2) భస్మీకరణ ప్రక్రియలో ధాతువును గాలి లేదా ఆక్సిజన్ అందుబాటులో లేకుండా వేడి చేస్తారు.
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 2

ప్రశ్న 11.
ఈ క్రింది పదాలను నిర్వచించండి. (AS1)
1) ఖనిజమాలిన్యం (gangue) 2) లోహమలం (slag)
(లేదా)
ఖనిజ మాలిన్యం, లోహ మలంలను వివరించుము.
జవాబు:
1) ఖనిజమాలిన్యం (gangue):
లోహ ధాతువుతో కలసి ఉన్న మలినాలను ఖనిజ మాలిన్యం (gangue) అంటాం.

2) లోహమలం (slag):
ప్రగలన ప్రక్రియలో ధాతువులోని మలినాలు ద్రవకారి (flux) తో చర్య పొంది, సులువుగా తొలగించగల పదార్ధంగా ఏర్పడతాయి. దీనినే లోహమలం (slag) అంటారు.

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 12.
మెగ్నీషియం ఒక చురుకైన మూలకం. ఇది ప్రకృతిలో క్లోరైడ్ రూపంలో లభిస్తే దాని నుండి ముడి మెగ్నీషియంను పొందడానికి ఏ క్షయకరణ పద్దతి సరిపోతుంది? (AS2)
(లేదా)
ప్రకృతిలో క్లోరైడ్ వలె మెగ్నీషియం అధిక చర్యాశీలత గల మూలకం, దీనిని పొందుటకు ఏ క్షయకరణ పద్ధతిని అనుసరించాలి?
జవాబు:
1) మెగ్నీషియం ఒక చురుకైన మూలకం.

2) ఇది ప్రకృతిలో క్లోరైడ్ రూపంలో లభిస్తే దాని నుండి ముడి మెగ్నీషియంను పొందటానికి విద్యుత్ విశ్లేషణ అనే క్షయకరణ పద్ధతి సరిపోతుంది.
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 3

3) MgCl2 ను విద్యుత్ విశ్లేషణ చేస్తే Mg లోహం కాథోడ్ వద్దకు, క్లోరిన్ వాయువు ఆనోడ్ వద్దకు చేరుతాయి.
కాథోడ్ వద్ద : Mg2+ + 2 e → Mg,
ఆనోడ్ వద్ద : 2 Cl → Cl2 + 2 e

ప్రశ్న 13.
శుద్ధ లోహాలను రాబట్టడానికి వాడే ఏవైనా రెండు పద్ధతులను వ్రాయండి. (AS2)
(లేదా)
శుద్ద లోహాలను సంగ్రహించుటకు ఉపయోగించు పద్ధతులను రెండింటిని వ్రాయుము.
జవాబు:

  1. స్వేదనం
  2. పోలింగ్
  3. గలనం చేయడం
  4. విద్యుత్ శోధనం

ప్రశ్న 14.
అధిక చర్యాశీలత గల లోహాల నిష్కర్షణకు ఏ పద్ధతిని సూచిస్తావు? ఎందుకు? (AS2)
జవాబు:

  1. అధిక చర్యాశీలతగల లోహాల నిష్కర్షణకు అత్యంత మేలైన పద్ధతి విద్యుత్ విశ్లేషణ.
  2. సాధారణ క్షయకరణ పద్ధతులైన వేడి చేయటం వంటి పద్ధతులలో, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే క్షయకరణం సాధ్యపడుతుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది.

ప్రశ్న 15.
లోహక్షయం (corrosion) నకు గాలి మరియు నీరు అవసరం అని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. దానిని ఎలా నిర్వహిస్తారో వివరించండి. (కృత్యం – 2) (AS3)
(లేదా)
ప్రయోగ పద్ధతిలో లోహక్షయానికి గాలి మరియు నీరు అవసరమని నిరూపించు’కృత్యంను వ్రాయుము.
జవాబు:
లోహక్షయానికి గాలి మరియు నీరు అవసరం అని నిరూపించుట :
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 4

ప్రయోగం :

  1. మూడు పరీక్ష నాళికలను తీసుకొని, వాటిని A, B, C లుగా గుర్తించండి. ఒక్కొక్క దానిలో శుభ్రంగా ఉన్న ఒక్క ఇనుపమేకును వేయండి.
  2. పరీక్ష నాళిక ‘A’ లో కొంతనీటిని తీసుకొని, దానిని రబ్బరు బిరడాతో బిగించండి.
  3. పరీక్షనాళిక ‘B’ లో మరిగించిన స్వేదన జలాన్ని ఇనుప మేకు మునిగేంతవరకు తీసుకొని దానికి 1మి.లీ. నూనెను కలిపి రబ్బరు బిరడాతో బిగించండి.
  4. పరీక్షనాళిక ‘C’ లో కొంచెం అనార్థ కాల్షియం క్లోరైడ్ ను తీసుకొని రబ్బరు బిరడాను బిగించండి.
  5. అనార్థ కాల్షియం క్లోరైడ్ గాలిలోని తేమను గ్రహించును.
  6. పై పరీక్షనాళికలను కొన్ని రోజుల వరకూ అలా ఉంచేసి తర్వాత వచ్చిన మార్పులను పరిశీలించండి.
  7. పరీక్షనాళిక ‘A’ లోని ఇనుప మేకు త్రుప్పు పట్టును. కానీ ‘B’ మరియు ‘C’ పరీక్ష నాళికలోని మేకులు తుప్పు పట్టవు.
  8. పరీక్షనాళిక ‘A’ లోని మేకులు గాలి, నీరు ఉన్న వాతావరణంలో ఉంచబడ్డాయి.
  9. ‘B’ పరీక్ష నాళికలోని మేకులు కేవలం నీటిలోను, పరీక్షనాళిక ‘C’ లోని మేకులు పొడిగాలిలో ఉంచబడ్డాయి.
  10. కనుక ఈ ప్రయోగం ద్వారా లోహక్షయానికి (corrosion) గాలి మరియు నీరు అవసరం అని నిరూపించవచ్చు.

ప్రశ్న 16.
అల్పచర్యాశీలత గల లోహాలైన వెండి, బంగారం, ప్లాటినం వంటి లోహాల నిష్కర్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించండి. ఒక నివేదిక తయారు చేయండి. (AS4)
(లేదా)
వెండి, బంగారం, ప్లాటినం వంటి అల్ప చర్యాశీలత గల లోహాలను సంగ్రహించుటకు అవసరమైన సమాచారాన్ని తయారు చేయుము.
జవాబు:
వెండి లోహం నిష్కర్షణ :

  1. సోడియం సైనేడ్ (NaCN) తో Ag నీటిలో కరిగే సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది.
  2. ఈ సంక్లిష్టానికి జింక్ లోహం కలుపుట ద్వారా Ag ని స్థానభ్రంశం చేయవచ్చు.
  3. AgCl + 2 NaCN → Na [Ag(CN)2] + NaCl
  4. పైన లభించిన ద్రావణాన్ని వడపోయగా మలినాలు వేరవుతాయి.
  5. లభించిన ద్రావణాన్ని క్షారయుతంగా ఉండేట్లు చేసి ముడి జింక్ లేక అల్యూమినియం లోహాలను పొడి రూపంలో కలుపుతారు.
  6. సూక్ష్మకణాల రూపంలో నల్లని సిల్వర్ లోహం అవషించబడుతుంది.
    Na [Ag(CN)2] + Zn → Na2 [Zn(CN)4] + 2 Ag ↓
  7. పైన లభించిన Ag లోహాన్ని వడపోసి, కడిగి బోరాక్స్ లేక KNO, తో కలిపి గలనం చేస్తారు.
  8. Ag లోహం ముద్దగా లభిస్తుంది.

బంగారం లోహం నిష్కర్షణ :

  1. బంగారం లోహం దాని ధాతువైన ఎలక్టమ్ నుండి సంగ్రహిస్తారు.
  2. బలహీన సైనేడ్ ద్రావణంతో చర్య జరిపించి బంగారం ధాతువుకు ఉన్న మలినాలను తొలగిస్తారు.
  3. ఈ దశలో జింక్ (Zn) కలిపి బంగారం ధాతువు నుండి బంగారాన్ని వేరుపరుస్తారు.
  4. ఫిల్టర్ చేసి మిగిలిన మలినాలను కూడా తొలగించి స్వచ్ఛమైన బంగారాన్ని పొందుతారు.
  5. బంగారం నిష్కర్షణలో వాటి ధాతువులను గాలి (O2 కోసం) సమక్షంలో నిక్షాళనం చేస్తారు.
  6. నిక్షాళన ద్రావణం నుంచి జింక్ ద్వారా లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తే అప్పుడు బంగారం లోహాలు లభ్యమవుతాయి.
  7. 4 Au + 8 CN → 2 H2O + O2 → 4 [Au(CN)2] + 4 OH
    2 [Au(CN)2] + Zn → 2Au+ [Zn(CN)4] 2-
    ఈ చర్యలో జింక్ క్షయకారిణిగా వ్యవహరిస్తుంది.

ప్లాటినం లోహ నిష్కర్షణ :

  1. ప్లాటినం లోహ నిష్కర్షణ సంక్లిష్టమైన పద్ధతి. ధాతువును ప్లనన ప్రక్రియ మరియు ప్రగలన ప్రక్రియ ద్వారా, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చర్యనొందించి నిష్కరణ చేస్తారు.
  2. పై ప్రక్రియల వలన ధాతువులోని ఇనుము మరియు సల్ఫర్ పదార్థాలు తొలగించబడి, ప్లాటినం లోహం నిష్కర్షింపబడుతుంది.

ప్రశ్న 17.
ఈ క్రింది ప్రక్రియలను చూపే పటాలను గీయండి. (AS5)
i) ప్లవన ప్రక్రియ ii) అయస్కాంత వేర్పాటు పద్ధతి
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 1
i) ప్లవన ప్రక్రియ ద్వారా సల్ఫైడ్ ధాతువు సాంద్రీకరణ

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 5
ii) అయస్కాంత వేర్పాటు పద్ధతి

ప్రశ్న 18.
రివర్సరేటరీ కొలిమి పటాన్ని గీచి, భాగాలు గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 6

ప్రశ్న 19.
చర్యాశీలత శ్రేణి అనగానేమి ? నిష్కర్షణకు ఇది ఏ విధంగా సహాయపడుతుంది? (AS6)
(లేదా)
చర్యాశీలతను నిర్వచించి, లోహ సంగ్రహణలో దాని ఉపయోగంను వివరింపుము.
జవాబు:
1. “క్రియాశీలత ఆధారంగా లోహాలను అవరోహణ క్రమంలో అమర్చగా వచ్చు శ్రేణిని “చర్యాశీలత శ్రేణి” అంటారు.
ఉదా:
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 7

2. ధాతువు నుండి మనం సంగ్రహించవలసిన లోహం యొక్క చర్యాశీలత తెలిస్తే దాని ఆధారంగా లోహ సంగ్రహణకు
సరైన పద్ధతి ఎంచుకోవచ్చు.
ఉదా :

  1. చర్యాశీలత శ్రేణిలో దిగువన ఉన్న లోహాలు ఇతర పరమాణువులతో చాలా తక్కువగా చర్య జరుపుతాయి. ఇలాంటి లోహాలను వేడిమి చర్యతో క్షయీకరింపచేయడం ద్వారా లేదా కొన్నిసార్లు వీటి జలద్రావణాల నుండి స్థానభ్రంశం చెందించడం ద్వారా పొందవచ్చు.
  2. చర్యాశీలత శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాలైన Zn, Fe, Pb, Cu వంటి లోహాల యొక్క లోహ ధాతువులు సాధారణంగా సల్ఫేలు, కార్బొనేట్స్ రూపంలో ఉంటాయి. ఈ లోహ ధాతువులను క్షయకరణం చెందించే ముందు వాటిని ఆక్సెలుగా తప్పక మార్చాలి. తర్వాత రసాయన క్షయకరణం, స్వయం క్షయకరణం లేదా థర్మెట్ పద్ధతిలో లోహాన్ని సంగ్రహించవచ్చు.
  3. చర్యాశీలత శ్రేణిలో ఎగువ భాగంలో ఉన్న లోహాలైన K, Na, Ca, Mg మరియు Al వంటి లోహాల యొక్క లోహ ధాతువులను విద్యుత్ క్షయకరణం చేయడం ద్వారా లోహాన్ని పొందవచ్చు.
  4. ఈ విధంగా చర్యాశీలత శ్రేణి లోహాల నిష్కర్షణను ప్రభావితం చేస్తుంది.

ప్రశ్న 20.
“థెర్మెట్ ప్రక్రియ” అనగానేమి ? నిజ జీవితంలో ఈ ప్రక్రియ యొక్క వినియోగాలను వ్రాయండి. (AS7)
(లేదా)
“థెర్మిట్ ప్రక్రియ”ను నిర్వచించి, నిత్యజీవితంలో ఈ పద్ధతి యొక్క ఆవశ్యకతను వ్రాయుము.
జవాబు:
1) థెర్మిట్ అనే ప్రక్రియలో ఆక్సెలు మరియు అల్యూమినియంల మధ్య చర్య జరుగుతుంది.

2) అధిక చర్యాశీలత గల సోడియం, కాల్సియం, అల్యూమినియం వంటి లోహాలను, తక్కువ చర్యాశీలత గల లోహాలను వాని ధాతువుల నుండి స్థానభ్రంశం చేయడానికి క్షయకారిణిలుగా ఉపయోగించే ప్రక్రియను థర్మెట్ ప్రక్రియ అంటాం.

3) ఈ స్థానభ్రంశ చర్యలు సాధారణంగా అతి ఉష్ణమోచక చర్యలుగా ఉంటాయి. ఈ చర్యలో ఎంత ఎక్కువ మొత్తంలో . ఉష్ణం విడుదలవుతుందంటే, ఏర్పడిన లోహాలు ద్రవస్థితిలో ఉంటాయి.
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 8

4) నిత్య జీవితంలో థెర్మిట్ చర్య వినియోగం :
ఐరన్ ఆక్సైడ్ (Fe2O3) అల్యూమినియంతో చర్య పొందినప్పుడు ఏర్పడిన ద్రవ ఇనుమును విరిగిన రైలు కమ్మీలు, పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగిస్తారు.

  1. Fe2O3 + 2Al → 2 Fe + 2 Al2O3 + ఉష్ణశక్తి
  2. Cr2O3+ 2 Al → 2Cr + Al2O3/sub> + ఉష్ణశక్తి

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 21.
నిజ జీవితంలో ‘చేతితో ఏరివేయడం’, ‘నీటితో కడగడం’ వంటి ప్రక్రియలను ఏ సందర్భంలో వాడుతాం? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. లోహాన్ని సాంద్రీకరించడంతో వీటిని ఎలా పోలుస్తారు? (AS7)
జవాబు:
చేతితో ఏరివేయడం :

  1. రంగు, పరిమాణం వంటి ధర్మాలలో ధాతువు, మలినాల (గాంగ్) కు మధ్య వ్యత్యాసం ఉంటే ఈ పద్ధతిని వాడతారు.
  2. ఈ పద్దతిలో ధాతు కణాలను చేతితో ఏరివేయడం ద్వారా ఇతర మలినాల నుండి వేరు చేయవచ్చు.

నీటితో కడగడం :

  1. ధాతువును బాగా చూర్ణం చేసి వాలుగా ఉన్న తలంపై ఉంచుతారు.
  2. పై నుంచి వచ్చే నీటి ప్రవాహంతో కడుగుతారు.
  3. అప్పుడు తేలికగా ఉన్న మలినాలు నీటి ప్రవాహంతో కొట్టుకుపోతాయి.
  4. బరువైన, శుద్ధమైన ముడిఖనిజ కణాలు నిలిచిపోతాయి.

లోహాన్ని సాంద్రీకరించడంతో పోలిక :

  1. భూమి నుండి మైనింగ్ ద్వారా పొందిన ధాతువులో సాధారణంగా మట్టి, ఇసుక వంటి మలినాలు చాలా పెద్ద మొత్తంలో కలసి ఉంటాయి. ఈ మలినాలను ఖనిజ మాలిన్యం అంటాం.
  2. ఖనిజ మాలిన్యం అధిక పరిమాణంలో ఉన్న ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని తక్కువ ఖర్చుతో కూడిన కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా ముందుగా వేరు చేస్తారు. ఇలా పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని ధాతువు నుంచి వేరు చేసే ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటాం.
  3. ధాతువు, ఖనిజ మాలిన్యం మధ్య భౌతిక ధర్మాలలో గల భేదంపై ఆధారపడి కొన్ని భౌతిక పద్ధతులను ధాతువును సాంద్రీకరణ చేయడానికి అవలంభిస్తారు.
  4. వానిలో ప్రధానమైనవి ‘చేతితో ఏరివేయడం’ మరియు ‘నీటితో కడగడం’.

ఖాళీలను పూరించండి

1. సల్ఫైడ్ ధాతువును సాంద్రీకరించడానికి అనువైన పద్ధతి. …………….. (ప్లవన ప్రక్రియ)
2. లోహాలను వాని చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చడాన్ని …………. అంటారు. (చర్యాశీలత శ్రేణి)
3. అల్ప బాష్పీభవన స్థానాలు గల లోహాలను శుద్ధి చేయడానికి ……………….. పద్ధతిని అనుసరిస్తారు. (స్వేదనం)
4. లోహక్షయం …… మరియు …………… సమక్షంలో జరుగుతుంది. (నీరు, గాలి)
5. గాలి అందుబాటులో లేకుండా లోహధాతువును వేడిచేసే ప్రక్రియను ……….. అంటారు. (భస్మీకరణం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. ముడి ఖనిజంతో కలసిపోయి ఉన్న మలినాలను …….. అంటారు.
A) గాంగ్
B) ద్రవకారి
C) లోహమలం
D) ఖనిజం
జవాబు:
A) గాంగ్

2. కిందివానిలో ఏది కార్బొనేట్ ధాతువు?
A) మాగ్నసైట్
B) బాక్సైట్
C) జిప్సమ్
D) గెలీనా
జవాబు:
A) మాగ్నసైట్

3. కిందివానిలో జిప్సమ్ ఫార్ములా ఏది?
A) CuSO4 . 2H2O
B) CaSO4 . ½H2O
C) CuSO4 . 5H2O
D) CaSO4. 2H2O
జవాబు:
D) CaSO4. 2H2O

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

4. కిందివానిలో లోహశుద్ధికి వాడే పద్దతి …….
A) స్వేదనం
B) పోలింగ్
C) ప్లవన ప్రక్రియ
D) గలనిక పృథక్కరణం
జవాబు:
B) పోలింగ్

5. ప్లవన ప్రక్రియను ఏ రకపు ధాతువు సాంద్రీకరణలో ఎక్కువ ఉపయోగిస్తారు?
A) సల్ఫైడ్
B) ఆక్సెడ్
C) కార్బొ నేట్
D) నైట్రేట్
జవాబు:
A) సల్ఫైడ్

6. గెలీనా ………. ధాతువు.
A) Zn
B) Pb
C) Hg
D) Al
జవాబు:
B) Pb

7. కింది వాటిలో ప్రకృతిలో సహజసిద్ధంగా లభ్యమయ్యే లోహం ………
A) Pb
B) Au
C) Fe
D) Hg
జవాబు:
B) Au

8. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం ……
A) ఆక్సిజన్
B) అల్యూమినియం
C) జింక్
D) ఇనుము
జవాబు:
B) అల్యూమినియం

9. థెర్మిట్ విధానంలో క్షయకరణ కారకం
A) Al
B) Mg
C) Fe
D) Si
జవాబు:
A) Al

10. ప్రగలనంలో ధాతువును …. చేస్తారు.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) తటస్థీకరణం
D) ఏదీకాదు
జవాబు:
B) క్షయకరణం

10th Class Physical Science 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 245

ప్రశ్న 1.
“అన్ని ధాతువులు ఖనిజాలే … కానీ అన్ని ఖనిజాలు ధాతువులు కానక్కర్లేదు” ఈ వాక్యాన్ని సమర్థిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
1) నేను ఈ వాక్యాన్ని సమర్థిస్తున్నాను.
2) ఎందుకనగా :
a) లోహఖనిజాలు :
ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను లోహఖనిజాలు అంటారు.

b) ధాతువులు :
లాభదాయకంగా లోహం పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలను ‘ధాతువులు’ అంటారు.

c) మనకు లభించే అన్ని ఖనిజాల నుండి లాభదాయకంగా లోహాన్ని పొందలేము. అందువలన అన్ని ఖనిజాలను ధాతువులు అనలేము.

d) కాని ధాతువులన్నీ ఖనిజాల నుండి లభిస్తున్నాయి. కావున అన్ని ధాతువులను ఖనిజాలు అనవచ్చును.

10th Class Physical Science Textbook Page No. 244

ప్రశ్న 2.
లోహాలతో తయారైన వస్తువుల పేర్లను కొన్నింటిని చెప్పగలరా?
జవాబు:
ఇనుప కుర్చీ, రాగి పాత్రలు మొదలగునవి.

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 3.
మనం నిత్యం ఉపయోగించే లోహాలు ప్రకృతిలో అదే స్థితిలో లభిస్తున్నాయా?
జవాబు:
లేదు. మనం ఉపయోగించే రీతిలో లభించడం లేదు.

ప్రశ్న 4.
ప్రకృతిలో లోహాలు ఏ రూపంలో ఉంటాయి?
జవాబు:
ప్రకృతిలో లోహాలు సమ్మేళనరూపంలో ఉంటాయి.

10th Class Physical Science Textbook Page No. 246

ప్రశ్న 5.
పట్టిక -1 లోని ధాతువుల నుండి ఏ ఏ లోహాలను పొందగలం?
జవాబు:
అల్యూమినియం, రాగి, మెగ్నీషియం, వెండి, మాంగనీస్, ఇనుము, జింక్, సోడియం, పాదరసం, సీసం, కాల్షియం వంటి లోహాలను పొందగలం.

ప్రశ్న 6.
లోహాల చర్యాశీలతను బట్టి వాటిని ఒక క్రమంలో అమర్చగలరా?
జవాబు:
చర్యాశీలతను బట్టి లోహాలను ఇలా అమర్చవచ్చు.
Ag < Cu < Pb < Mn < Fe < Zn < Al < Mg < Ca < Na.

ప్రశ్న 7.
పట్టిక – 2 లో మీరేం గమనించారు?
జవాబు:
చాలా లోహాల యొక్క ధాతువులు ఆక్సెలు మరియు సల్ఫేట్లుగా ఉండటం గమనించాము.

ప్రశ్న 8.
లోహాలను వాటి ధాతువుల నుండి ఎలా పొందుతారో ఆలోచించగలరా?
జవాబు:
వివిధ రకాల నిష్కర్షణ పద్ధతులను ఉపయోగించి, లోహాలను వాటి ధాతువుల నుండి పొందుతారు.

ప్రశ్న 9.
లోహాల నిష్కర్షణలో లోహక్రియాశీలతకు, ధాతువు రకానికి (ఆక్సెడ్, సల్ఫైడ్, క్లోరైడ్, సల్ఫేట్, కార్బొనేట్) ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
అవును ఉంది.

10th Class Physical Science Textbook Page No. 254

ప్రశ్న 10.
లోహక్షయం ఎందుకు జరుగుతుందో తెలుసా?
జవాబు:
నీరు మరియు గాలి సమక్షంలో లోహాలు లోహక్షయానికి గురి అవుతాయి.

ప్రశ్న 11.
ఏ ఏ సందర్భాలలో లోహక్షయం జరుగుతుంది?
జవాబు:
లోహక్షయంలో సాధారణంగా ఆక్సిజన్ ఎలక్ట్రాను కోల్పోవడం వలన ఆక్సెన్లు ఏర్పడడం ద్వారా లోహం ఆక్సీకరణం చెందును. ఇనుప లోహక్షయం (తుప్పు పట్టడం) నీరు, గాలి వలన జరుగుతుంది.

10th Class Physical Science Textbook Page No. 257

ప్రశ్న 12.
లోహ నిష్కర్షణలో కొలిమి పాత్ర ఏమిటి?
జవాబు:
లోహ నిష్కర్షణలో ఉష్ణ రసాయన ప్రక్రియలను చేయడానికి వాడేదే కొలిమి.

AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం

ప్రశ్న 13.
అధిక ఉష్ణోగ్రతలను కొలిమి ఎలా తట్టుకోగలుగుతుంది?
జవాబు:
కొలిమిలో ఉండే లోహపు పూత వలన తట్టుకోగలుగుతుంది.

ప్రశ్న 14.
అన్ని కొలుములు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయా?
జవాబు:
ఉండవు.

10th Class Physical Science Textbook Page No. 246

ప్రశ్న 15.
లోహాలను వాటి ధాతువుల నుండి ఎలా సంగ్రహిస్తారు? ఎలాంటి పద్దతులు వాడతారు?
జవాబు:
సంగ్రహణ : లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించి, వేరు పరచడంలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి.
అవి :

  1. ముడి ఖనిజ సాంద్రీకరణ
  2. ముడిలోహ నిష్కర్షణ
  3. లోహాన్ని శుద్ధి చేయడం.

పద్ధతులు :

  1. ప్రగలనం
  2. భర్జనం
  3. భస్మీకరణం.

పరికరాల జాబితా

మూడు పరీక్ష నాళికలు, రబ్బరు బిరడా, నూనె, అనార్థ కాల్షియం క్లోరైడ్.

10th Class Physical Science 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
ధాతువులను వాని ఫార్ములాల సహాయంతో ఎలా వర్గీకరిస్తారు?
(లేదా)
ధాతువుల ఫార్ములాలు, వాటి వర్గీకరణ పాత్రను వ్రాయుము.
జవాబు:
క్రింది ధాతువులను గమనించి, ఆ ధాతువుల్లో ఉండే లోహాలను గుర్తిద్దాం.
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 9

పై ధాతువులను క్రింది పట్టికలో సూచించిన విధంగా వర్గీకరించండి.
AP Board 10th Class Physical Science Solutions 11th Lesson లోహ సంగ్రహణ శాస్త్రం 10

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

SCERT AP 10th Class Physics Study Material Pdf 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Physical Science 5th Lesson Questions and Answers మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
హ్రస్వదృష్టి లోపాన్ని మీరెలా సవరిస్తారు?
(లేదా)
కన్ను యొక్క హ్రస్వ దృష్టిని మీరు ఏ విధంగా సవరిస్తారు?
జవాబు:
1) ఒక వ్యక్తి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోవు దోషాన్ని “హ్రస్వదృష్టి” అంటారు.

2) ఏ దూరం వద్ద నున్న బిందువుకు లోపల గల వస్తువుకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచుకోగలదో ఆ బిందువును గరిష్ఠ దూర బిందువంటారు.

3) గరిష్ఠ దూరబిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటి కటకం రెటీనా పై ప్రతిబింబమును ఏర్పరచగలదు.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1

|4) గరిష్ఠ దూరబిందువు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కంటి కటకం రెటీనా కంటే ముందు ఏర్పరుస్తుంది.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2

5) కావున ఒక కటకంను ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుల మధ్యకు తేగలిగితే ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పని చేస్తుంది.

6) హ్రస్వదృష్టిని నివారించేందుకు అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర బిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని ఎంచుకోవాలి.

7) దీని కొరకు ద్విపుటాకార కటకమును వాడాలి.

8) ఈ ద్విపుటాకార కటకం ఏర్పరిచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువు వలె పనిచేసి, చివరకు వస్తు ప్రతిబింబంను రెటీనా పై ఏర్పరచును.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

ప్రశ్న 2.
దీర్ఘదృష్టి లోపాన్ని సవరించే విధానాన్ని వివరించండి.
(లేదా)
కన్ను యొక్క దీర్ఘదృష్టిని మీరు ఏ విధంగా సవరిస్తారు?
జవాబు:
1) దీర్ఘదృష్టి గల వ్యక్తి దూరంలో వున్న వస్తువులను స్పష్టంగా చూడగలడు. కానీ దగ్గరి వస్తువులను చూడలేడు.
2) దీనికి గల కారణము కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కన్నా ఎక్కువగా ఉండడమే.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 4
3) పై పటంలో చూపినట్లుగా ఈ సందర్భంలో దగ్గరలోని వస్తువు నుండి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం చెంది ప్రతిబింబం రెటీనాకు ఆవల ఏర్పడుతుంది.
4) వస్తువు కనిష్ఠ దూర బిందువుకు ఆవల ఉంటే, కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5
5) కనుక దీర్ఘదృష్టిని నివారించడానికి ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
6) ఈ కటకం వలన ఏర్పడే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువుగా పనిచేస్తుంది.
7) అందువలన చివరకు కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం పటంలో చూపినట్లుగా రెటీనా పై ఏర్పడును.

ప్రశ్న 3.
పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా కనుగొంటారు?
(లేదా)
పట్టకపు వక్రీభవన గుణకమును కనుగొను కృత్యంను వ్రాయుము. (ప్రయోగశాల కృత్యం)
జవాబు:
ఉద్దేశ్యం : పట్టక వక్రీభవన గుణకాన్ని కనుగొనడము.

కావలసిన వస్తువులు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్ (20 X 20 సెం.మీ.), పెన్సిల్, గుండుసూదులు, స్కేలు మరియు కోణమానిని.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 6

నిర్వహణ పద్దతి :

  1. ఒక గాజు పట్టకాన్ని తీసుకొని, దాని త్రిభుజాకార పతనకిరణం, AM ఆధారం డ్రాయింగ్ చార్ట్ పై ఉండే విధముగా అమర్చుము.
  2. పట్టక ఆధారం చుట్టూ పెన్సిల్ తో గీత గీసి పట్టకాన్ని తీసివేయాలి.
  3. త్రిభుజ భుజం PQ పై ఒక బిందువు ‘M’ ను గుర్తించుము.
  4. M వద్ద PQ కు లంబాన్ని గీయాలి.
  5. M వద్ద PQ తో 30° కోణాన్ని గుర్తించి, ఒక రేఖను గీయుము. ఇదియే పతన కిరణం అగును.
  6. ఈ కోణమును “పతన కోణము” అంటారు.
  7. పట్టకాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచి పతన కిరణం AB పై రెండు గుండు సూదులను నిలువుగా గుచ్చుము.
  8. పట్టకం రెండోవైపు నుండి గుండుసూదుల ప్రతిబింబాలతో ఒకే వరుసలో ఉండునట్లు C, D బిందువుల వద్ద మరో రెండు గుండు సూదులను గుచ్చుము.
  9. ఇప్పుడు C, D లను కలుపుము. ఇది బహిర్గత కిరణమును సూచించును.
  10. పతన కిరణం, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగించిన అవి రెండూ ‘O’ వద్ద ఖండించుకుంటున్నాయి.
  11. ‘O’ బిందువు వద్ద ఈ రెండు కిరణాల మధ్య కోణమును కొలిచిన, అది విచలన కోణం (d) అగును.
  12. ఈ విధంగా వివిధ పతన కోణాలకు, విచలన కోణాల విలువలను తెలుసుకొని, వాటిని నమోదు చేయుము.
  13. ఈ ప్రయోగం ద్వారా పతన కోణం పెరుగుతున్న కొలదీ కొంతమేర విచలన కోణం విలువ తగ్గి తర్వాత పతన కోణంతో పాటుగా పెరగడం గమనించవచ్చును.
    AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 7
  14. పతన కోణంను X-అక్షం వెంబడి, విచలన కోణంను Y-అక్షం వెంబడి తీసుకొని గ్రాఫును గీసిన సున్నిత వక్రం ఏర్పడుతుంది.
  15. ఈ వక్రం ద్వారా కనిష్ట విచలన కోణం ‘D’ ను కనుగొనవచ్చును.
  16. ‘పట్టక కోణం ‘A’ కనిష్ఠ విచలన కోణం ‘D’ అయితే పట్టక వక్రీభవన గుణకము \(n=\frac{\sin \left[\frac{(A+D)}{2}\right]}{\sin \frac{A}{2}}\) అగును.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 4.
ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి. (కృత్యం – 5)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 8

  1. ప్రకృతిలోని తెల్లని సూర్యకాంతి, అనేక లక్షల నీటి బిందువుల చేత విక్షేపణం చెందడం వల్ల ఇంద్రధనుస్సు ఏర్పడును.
  2. పటంలో చూపినట్లుగా నీటి బిందువు పై ప్రాంతం నుండి సూర్యుని కాంతికిరణం లోపలికి ప్రవేశించును.
  3. అక్కడ జరిగే మొదటి వక్రీభవనంలో తెల్లని కాంతి వివిధ రంగులుగా విక్షేపణం చెందును.
  4. అన్ని రంగులు నీటి బిందువు రెండో వైపుకు చేరాక, సంపూర్ణాంతర పరావర్తనం వల్ల నీటి బిందువులోనే వెనుకకు పరావర్తనం చెందుతాయి.
  5. ఫలితముగా నీటి బిందువు మొదటి ఉపరితలాన్ని చేరాక, ప్రతీ రంగు మరలా గాలిలోకి వక్రీభవనం చెందును.
  6. నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం (0° నుండి 42° మధ్య ఎంతైనా ఉండవచ్చు.
  7. ఆ కోణం 42° లకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును మనం చూడగలము.
  8. ప్రతి నీటి బిందువు కాంతిని ఏడు రంగులలోకి విడగొట్టినా, ఒక పరిశీలకుడు తాను ఉన్న స్థానాన్ని బట్టి, ఒక నీటి బిందువు నుండి వచ్చే రంగులలో ఏదో ఒకదానిని మాత్రమే చూడగలడు.
  9. సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్యకోణం 42° ఉన్నప్పుడే మనకు ఎరుపు రంగు కనబడుతుంది.
  10. 40° ల నుండి 42°ల మధ్య కోణంలో VIBGYOR లోని మిగిలిన రంగులు కనిపిస్తాయి.
    AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 9
  11. ఈ విధముగా ప్రకృతిలో ఇంద్రధనుస్సు ఏర్పడును.

ప్రశ్న 5.
ఆకాశం నీలి రంగులో కనబడటానికి గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి.
(లేదా)
మనకు ఆకాశము నీలముగా కనబడుటకు గల కారణమును వివరింపుము.
జవాబు:

  1. ఆకాశం నీలిరంగుగా ఉండుటకు కారణము కాంతి యొక్క పరిక్షేపణము.
  2. కాంతి పరిక్షేపణమనగా ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటాము.
  3. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
  4. వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువు పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధముగా ఉంటుంది.
  5. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  6. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు ఎక్కువగా వుండటం వల్ల, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వల్ల ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.

ప్రశ్న 6.
అంశం (A) : కాంతి పరిక్షేపణం వలన ఆకాశం నీలిరంగులో కనబడుతుంది.
కారణం (R) : తెల్లని కాంతిలోని వివిధ కాంతులలో నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యం తక్కువ.
a) A, R రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R రెండూ సరియైనవి. కానీ A కు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. కానీ R సరియైనది కాదు.
d) A మరియు R సరైనవి కావు.
e) A సరియైనది కాదు కానీ R సరైనది.
జవాబు:
a) A, R లు రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.

కారణము :
ఆకాశం నీలిరంగుకు కాంతి పరిక్షేపణమే కారణము. తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతికి, అధిక తరంగదైర్ఘ్యం గల కాంతితో పోల్చితే పరిక్షేపణ సామర్థ్యం ఎక్కువ.

ప్రశ్న 7.
తరగతి గదిలో ఇంద్రధనుస్సును ఏర్పరిచేందుకు ఒక ప్రయోగాన్ని తెల్పండి. ప్రయోగ విధానాన్ని వివరించండి. (కృత్యం-4)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 10

  1. ఒక లోహపు పళ్ళాన్ని తీసుకొని; నీటితో నింపుము.
  2. నీటి ఉపరితలంతో కొంతకోణం చేసే విధంగా ఒక సమతల దర్పణమును పటంలో చూపిన విధంగా ఉంచుము.
  3. పటంలో చూపినట్లుగా నీటి గుండా అద్దం పై తెల్లని కాంతిని ప్రసరింపజేయుము.
  4. ఈ అమరికకు కొంత ఎత్తులో తెల్లటి కార్డుబోర్డుపై వివిధ రంగులతో ఇంద్రధనుస్సు ఏర్పడుటను గమనించవచ్చును.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 8.
కొన్ని బైనాక్యులర్లందు పట్టకాలను వినియోగిస్తారు. బైనాక్యులర్లలో పట్టకాలు ఎందుకు వినియోగిస్తారో తెలియజేసే – సమాచారాన్ని సేకరించండి.
(లేదా)
పట్టకములకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుము. వాటిని బైనాక్యులలో ఎందుకు వాడుతారో వివరింపుము.
జవాబు:

  1. పరిశీలకునికి దూరపు వస్తువులను పరీక్షించుటకు సమాంతరంగా కదిలే విధంగా రెండు కటకాలను అమర్చుతారు.
  2. అధిక -పరావర్తనం కోసం బైనాక్యులర్లలో పట్టకాలను ఉపయోగిస్తారు.
  3. పట్టకాలను ఉపయోగించి బైనాక్యులర్ యొక్క పరిమాణంను తగ్గిస్తారు.
  4. పట్టకములను ఉపయోగించి వస్తు పరిమాణం మరియు దృక్ తీవ్రతలను పెంచవచ్చును.
  5. సాధారణంగా బైనాక్యులర్లలో లంబకోణ పట్టకం లేదా ద్విపట్టకాలను ఉపయోగిస్తారు.
  6. బైనాక్యులలో పట్టకాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే వాటి పరావర్తన సామర్థ్యాన్ని 95% వరకు పెంచవచ్చును.

ప్రశ్న 9.
పటంలో పట్టక తలం AB పై పడిన పతన కిరణాన్ని, పట్టక తలం AC నుండి వచ్చే బహిర్గత కిరణాన్ని చూపడం జరిగింది. పటంలో లోపించిన వాటిని గీయండి.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 11
జవాబు:
AB, AC లు వక్రీభవన తలాలు మరియు BC పరావర్తన తలము.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 12

ప్రశ్న 10.
ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణమైన వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు?
(లేదా)
ఆకాశం నీలి రంగులో కనబడుటకు కారణం ఏమిటి ? ఈ విషయంలో వాతావరణంలోని అణువుల పాత్రను మీరెలా అభినందిస్తారు?
జవాబు:

  1. ఆకాశం నీలిరంగులో ఉండుటకు ముఖ్యకారణము కాంతి పరిక్షేపణమే.
  2. వాతావరణంలోని N2, O2 అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధముగా ఉంటుంది.
  3. ఈ అణువులు నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  4. వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ అణువుల శాతము ఎక్కువగా ఉండటం వలన, అవి నీలిరంగు కాంతికి పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేయడం వలన ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది.
  5. ఈ విధమైన ఆకాశపు నీలిరంగుకి కారణమైన వాతావరణంలోని N2 మరియు O2ల పాత్రను నేను అభినందించుచున్నాను.

ప్రశ్న 11.
కంటిలోని సిలియరి కండరాల పనితీరును మీరెలా అభినందిస్తారు?
(లేదా)
సిలియరి కండరాల పనితీరు మన కంటికి ఏ విధమైన అవసరమో అభినందించుము.
జవాబు:
కంటిలోని సిలియరి కండరాల పనితీరు కంటిపై ప్రతిబింబంను ఏర్పరుచుటలో ఎంతో అభినందనీయమైనది. ఎందుకనగా

  1. కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న ఈ కండరాలు కటక వక్రతా వ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరమును మార్చుకోవడానికి దోహదపడతాయి.
  2. దగ్గరలో వున్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరి కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
  3. దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నప్పుడు, సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్ఠమవుతుంది.
  4. ఈ విధమైన సర్దుబాటును సిలియరి కండరాలు చేస్తాయి.

ప్రశ్న 12.
కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనబడుతుంది. ఎందుకు?
(లేదా)
అప్పుడప్పుడు ఆకాశం తెలుపు రంగులో కనబడుటకు వెనుకన గల కారణాలేమిటో వ్రాయుము.
జవాబు:

  1. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి.
  2. ఆ కణాలు వాటి పరిమాణాలకనుగుణంగా వివిధ తరంగదైర్ఘ్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
  3. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
  4. దీని ద్వారా వాతావరణంలో నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
  5. N2, O2 ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగు కాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపురంగు కాంతి కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 13.
తెల్లకాగితానికి నూనె పూస్తే, అది పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది. ఎందుకు?
(లేదా)
కాగితం (లేదా) న్యూస్ పేపర్ కు నూనెను పూసిన అది పాక్షిక పారదర్శకంగా పని చేయుటకు గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. తెల్లని కాగితం కాంతినిరోధములా ప్రవర్తించును.
  2. తెల్లని కాగితానికి నూనె పూస్తే అది పాక్షిక పారదర్శక పదార్థంగా పనిచేయును.
  3. కాగితము మరియు నూనెల వక్రీభవన గుణకాలు సమానమైతే, దానిమీద పడిన కాంతి సమాన వక్రీభవన గుణకాల వలన కాగితం నుండి నూనెలోనికి ప్రవేశించునపుడు ఎటువంటి పరిక్షేపణం చెందకుండా ప్రయాణించును.
  4. ఈ కారణం చేత నూనె పూసిన కాగితము పాక్షిక పారదర్శకముగా పనిచేయును.

ప్రశ్న 14.
“దీర్ఘదృష్టి” గల ఒక వ్యక్తికి 100 సెం.మీ. నాభ్యంతరం గల కటకాన్ని వాడమని డాక్టర్ సలహా ఇచ్చారు. కనిష్ఠ దూరబిందువు యొక్క దూరాన్ని, కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (జవాబు : 33.33 సెం.మీ., 1D)
జవాబు:
వస్తు దూరము u =- 25 సెం.మీ. –
ప్రతిబింబదూరం V = కనిష్ఠ దూరము = -d
నాభ్యంతరము f = 100 సెం.మీ.
కనిష్ఠ దూరము ‘d’ మరియు నాభ్యంతరం ‘f అయిన
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 13

ప్రశ్న 15.
ఒక వ్యక్తి దూరంలో ఉన్న వస్తువును చూస్తున్నాడు. అతని కంటిముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచితే, అతనికి వస్తువు పెద్దదిగా కనబడుతుందా? కారణాన్ని తెల్పండి.
(లేదా)
రావు, అతనికి దూరంగా గల వస్తువును చూస్తున్నప్పుడు అతని స్నేహితుడు శ్రీను ఒక కుంభాకార కటకంను అతని కంటి ముందు ఉంచిన అది అతనికి వస్తువును పెద్దదిగా కనబడేటట్లు చేస్తుందా? దీనికి గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. ఒక వ్యక్తి దూరంలో వున్న వస్తువును చూస్తున్నప్పుడు, అతని కంటి ముందు కేంద్రీకరణ కటకాన్ని ఉంచిన, వస్తు ప్రతిబింబం మసకబారుతుంది.
  2. కేంద్రీకరణ (లేక) కుంభాకార కటకపు ప్రతిబింబ విషయం వస్తు స్థానంపై ఆధారపడును.
  3. దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూస్తున్నపుడు కుంభాకార కటకం వలన అవి మసకగా కనిపిస్తాయి.
  4. ఒకవేళ వస్తువును కుంభాకార కటకపు విషయంలో కటకనాభి, కటక కేంద్రముల మధ్య ఉంచినపుడు నిటారైన, వృద్ధీకరణ చెందిన ప్రతిబింబం ఏర్పడును.

ప్రశ్న 16.
కృత్రిమ ఇంద్రధనుస్సును పొందే విధానాన్ని రెండు కృత్యాల ద్వారా వివరించండి. (AS1)
(లేదా)
మీ ఉపాధ్యాయుడు నిన్ను ఒక ఇంద్రధనుస్సును ఏర్పరచమన్న నీవు ఏ విధంగా ఏర్పరచెదవో ఒక కృత్యంను వ్రాయుము. (కృత్యం : 1)
జవాబు:

  1. తెల్లని గోడకు దగ్గరగా ఒక టేబుల్ ను ఉంచుము.
  2. ఒక కార్డ్ బోర్డు షీట్ కు మధ్యలో సన్నని రంధ్రం చేసి, దానిని టేబుల్ పై నిలువుగా అమర్చుము.
  3. కార్డ్ బోర్డుకు, గోడకు మధ్యలో ఒక పట్టకాన్ని ఉంచుము.
  4. తెలుపురంగు కాంతినిచ్చే కాంతి జనకాన్ని కార్డ్ బోర్డ్ కు దగ్గరగా ఉంచి, దాని రంధ్రం గుండా కాంతిని ప్రసరింపజేయుము.
  5. ఈ కాంతి సన్నని పుంజంగా ఉంటుంది. దీనిని పట్టకం యొక్క ఏదో ఒక దీర్ఘచతురస్రాకార తలంపై పడే విధముగా పట్టుకొని పట్టకాన్ని త్రిప్పుతూ ఉంటే, గోడపై ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది.

కృత్యం : 2
జవాబు:
7వ ప్రశ్న జవాబు చూడుము.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 17.
పట్టక వక్రీభవన గుణక సూత్రాన్ని ఉత్పాదించండి. (AS1)
(లేదా)
పట్టకపు వక్రీభవన గుణకంను కనుగొను సూత్రంను వ్రాసి, రాబట్టుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 15
1) పటంలో PQR అను పట్టకం యొక్క పట్టక కోణము ‘A’, పట్టక పదార్థపు వక్రీభవన గుణకము ‘n’, PQ, PRలు వక్రీభవన తలాలు.
2) AB పతన కిరణము, CD బహిర్గామి కిరణము పతన కోణము i1 బహిర్గామి కోణం i2 అనుకొనుము.

3) త్రిభుజము OMN నుండి,
d= i1 – r1 + i2 – r2
∴ d = (i1 + i2) – (r1 + r2) ………. (1)

4) త్రిభుజము PMN నుండి,
A + (90° = r1) + (90° – r2) = 180°
r1 + r2 = A ……………… (2)
5) (1), (2) సమీకరణాల నుండి
=d = (i1 + i2) – A
= A+ d = i1 + i2 ……………………… (3)

6) పతన కోణం, బహిర్గత కోణం, విచలన కోణము మరియు పట్టక కోణాల మధ్య సంబంధమును సమీకరణం- (3) తెలియజేస్తుంది.

7) స్నెల్ నియమం n1 sin i = n2 sin r కనుక, M బిందువు వద్ద, గాలి వక్రీభవన గుణకము n1 = 1, పట్టక వక్రీభవన గుణకము n2 = n, పతన కోణము i = i1, వక్రీభవన కోణం r = r1 లను స్నెల్ నియమంలో ప్రతిక్షేపించగా
sin i1 = n sin r1 ………. (4)

8) అదే విధముగా N బిందువు వద్ద, పట్టక వక్రీభవన గుణకము n1 = n, గాలి వక్రీభవన గుణకము n2 = 1, పతన కోణం i = r2, వక్రీభవన కోణం r= i2, స్నెల్ నియమంలో ప్రతిక్షేపించగా
n sin r2 = sin i2 ………. (5)

9) కనిష్ఠ విచలన కోణం (D) వద్ద పతన కోణం, బహిర్గామి కోణాల విలువలు సమానం. అనగా i1 = i2

10) సమీకరణం (3) నుండి కనిష్ఠ విచలన కోణంకు A + D = i + i
⇒ A + D = 2i1
∴ \(\mathrm{i}_{1}=\frac{\mathrm{A}+\mathrm{D}}{2}\)
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 16

ప్రశ్న 18.
λ1 తరంగదైర్ఘ్యం గల కాంతి n1 వక్రీభవన గుణకం గల యానకం నుండి n2 వక్రీభవన గుణకం గల యానకంలోకి ప్రవేశించింది. రెండవ యానకంలో ఆ కాంతి తరంగదైర్ఘ్యం ఎంత? (AS1)
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 17
2) రెండు యానకాలలో తరంగదైర్ఘ్యాలు వరుసగా λ1 మరియు λ2 అనుకొనుము.

3) రెండు యానకాల వక్రీభవన గుణకాలు వరుసగా n1 మరియు n2 అనుకొనుము.

4) ఒక యానకపు వేగము (v), తరంగదైర్ఘ్యం (λ) మరియు పౌనఃపున్యాల (υ) మధ్య సంబంధము v = υλ.

5) కాంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రవేశించినపుడు, దాని పౌనఃపున్యంలో మార్పు ఉండదు.

6) కావున v1 = υλ1 మరియు v2 = υλ2 అగును.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 18

ప్రశ్న 19.
అంశం (A) : పట్టక వక్రీభవన గుణకం, ఆ పట్టక తయారీకి వాడిన గాజురకంపై మరియు కాంతి రంగుపై మాత్రమే ఆధారపడుతుంది. (AS2)
కారణం (R) : పట్టక వక్రీభవన గుణకం, పట్టక వక్రీభవన కోణంపై మరియు కనిష్ఠ విచలన కోణంపై ఆధారపడుతుంది.
a) A, R రెండూ సరియైనవి. మరియు A కు R సరైన వివరణ.
b) A, R రెండూ సరియైనవి. కానీ Aకు R సరైన వివరణ కాదు.
c) A సరియైనది. కానీ R సరియైనది కాదు.
d) A మరియు R సరైనవి కావు.
e) A సరియైనది కాదు కానీ R సరైనది.
జవాబు:
b) ‘A, R’ లు రెండూ సరియైనవే, కాని A కు R సరైన వివరణ కాదు.
కారణము :
పట్టక వక్రీభవన సూత్రము ప్రకారం వక్రీభవన గుణకము, పట్టకం తయారీకి వాడిన గాజురకంపై మరియు కాంతి రంగుపై ఆధారపడుతుంది.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 19

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 20.
మన చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని మనం చూడడానికి ఉపయోగపడేది కన్ను. కంటి కటకానికి గల సర్దుబాటు లక్షణం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంపై మీ స్పందనను తెలియజేసే విధంగా ఆరు వాక్యాల పద్యాన్ని రాయండి. (AS6)
జవాబు:
ఇంద్రియాలన్నింటిలో కన్నే మిన్నరా
అది లేకపోతే బ్రతుకే సున్నరా
సృష్టిని చూడగల్గడమే మహాభాగ్యంరా
దృష్టిని కల్గి ఉండడమే గొప్ప అదృష్టంరా
మన్నువంటి ఆధారం లేదురా
కన్నువంటి ప్రకాశం లేదురా
‘A’ విటమిన్ లోపిస్తే అంధత్వమేరా
అంధులైతే జీవితమే వృధారా
అందుకే కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలిరా.

ప్రశ్న 21.
గాజు పారదర్శక పదార్థం. ఒక తలం గరుకుగా చేయబడిన గాజు పాక్షిక పారదర్శకంగానూ, తెలుపురంగులోనూ కనబడుతుంది. ఎందుకు?
(లేదా)
సమరీతి, నునుపైన గాజు పారదర్శక పదార్థంగానూ, గరుకు చేయబడిన గాజు పాక్షిక పారదర్శకంగానూ, తెలుపు రంగులో కనబడుటకు గల కారణాలను వ్రాయుము.
జవాబు:

  1. గాజు ఒక పారదర్శక పదార్థం. ఇది తన గుండా కాంతిని ప్రసారం చేయును.
  2. గాజును ఒక తలం గరుకుగా చేయడం వల్ల ఆ ఉపరితలంలో అనేక ఎత్తు పల్లాలు అనగా అసమతలం ఏర్పడుతుంది.
  3. ఇటువంటి అసమతలం క్రమరహిత పరావర్తనమును ఏర్పరుస్తుంది.
  4. దీనివల్ల కొంతి ప్రసారం జరుగదు.
  5. దీని ప్రభావం వలన గాజు పాక్షిక పారదర్శకముగా పని చేస్తుంది.
  6. అందుకనే గరుకుతలం తెలుపురంగులో కనబడుతుంది.

ప్రశ్న 22.
పట్టకం యొక్క ఒక తలంపై 40° కోణంతో పతనమైన కాంతి కిరణం, 30° కనిష్ఠ విచలనాన్ని పొందింది. అయిన పట్టక కోణాన్ని, ఇచ్చిన తలం వద్ద వక్రీభవన కోణాన్ని కనుగొనండి. (జవాబు : 50°, 25°) (AS7)
జవాబు:
పట్టకపు తలంపై పతనమయ్యే కాంతి పతన కోణము = i = 40°
కనిష్ఠ విచలన కోణము = D = 30°
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 20

ఖాళీలను పూరించండి

1. స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం విలువ …………. (25 సెం.మీ.)
2. రెటీనా, కంటి కటకాల మధ్య దూరం ………….. (2.5 సెం.మీ.)
3. కంటి కటకం యొక్క గరిష్ఠ నాభ్యంతరం విలువ …………… (2.5 సెం.మీ.)
4. మానవుని కంటి యొక్క నాభ్యంతరం మారటానికి దోహదపడే కండరాలు ………………. (సిలియరి)
5. కటకం యొక్క సామర్థ్యం 1D అయిన, ఆ కటక నాభ్యంతరం …………….. (100 సెం.మీ.)
6. హ్రస్వ దృష్టిని నివారించేందుకు ………………….. కటకాన్ని వాడుతారు. (పుటాకార)
7. దీర్ఘదృష్టిని నివారించేందుకు ……………… కటకాన్ని వాడుతారు. (కుంభాకార)
8. పట్టకం కనిష్ఠ విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణం ………………….. కు సమానం. (బహిర్గామికోణం)
9. తెల్లని కాంతి వివిధ రంగులుగా (VIBGYOR) విడిపోవడాన్ని ………………… అంటాం. (కాంతి విక్షేపణం)
10. వక్రీభవనం జరిగినప్పుడు కాంతి ………………….. లో మార్పు రాదు. (పౌనఃపున్యం)

సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1. మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా …. పై ఆధారపడుతుంది.
A) వస్తువు నిజ పరిమాణం
B) కన్ను నుండి వస్తువుకు గల దూరం
C) నల్లగుడ్డు రంధ్రం
D) రెటీనాపై ఏర్పడ్డ ప్రతిబింబ పరిమాణం
జవాబు:
B) కన్ను నుండి వస్తువుకు గల దూరం

2. వివిధ దూరాలలో గల వస్తువులను చూస్తున్నప్పుడు కింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది?
A) కంటి కటక నాభ్యంతరం
B) కంటి కటకం నుండి వస్తువుకి గల దూరం
C) కంటి కటక వక్రతా వ్యాసార్ధం
D) కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం
జవాబు:
D) కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం

3. కింది వాటిలో వక్రీభవన సమయంలో మారని విలువ
A) తరంగదైర్ఘ్యం
B) పౌనఃపున్యం
C) కాంతివేగం
D) పైవన్నీ
జవాబు:
B) పౌనఃపున్యం

4. పటంలో చూపిన విధంగా టేబుల్ పై ఉంచిన ఒక సమద్విబాహు పట్టకంపై కాంతి పతనమైంది. కనిష్ఠ విచలనానికి సంబంధించి కింది వాటిలో ఏది సరియైనది?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 14
A) ఆధారానికి సమాంతరరేఖ PQ
B) ఆధారానికి సమాంతరరేఖ QR
C) ఆధారానికి సమాంతరరేఖ RS
D) ఆధారానికి సమాంతర రేఖ PQ లేదా RS
జవాబు:
B) ఆధారానికి సమాంతరరేఖ QR

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

5. హ్రస్వదృష్టితో బాధపడే వ్యక్తి యొక్క గరిష్ఠ దూరం 5 మీ. దీనిని నివారించి సాధారణ దృష్టి వచ్చేట్లు చేయాలంటే …. ను వినియోగించాలి.
A) 5 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం
B) 10 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం
C) 5 మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం
D) 2.5 మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం
జవాబు:
A) 5 మీ. నాభ్యంతరం గల పుటాకార కటకం

6. సూర్యకాంతిని శోషించుకున్న అణువు వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశలలోనూ కాంతిని విడుదల చేయడాన్ని …….. అంటాం.
A) కాంతి పరిక్షేపణం
B) కాంతి విక్షేపణం
C) కాంతి పరావర్తనం
D) కాంతి వక్రీభవనం
జవాబు:
A) కాంతి పరిక్షేపణం

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook InText Questions and Answers

10th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 1.
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనిపిస్తుందో ఊహించగలరా? మీ స్నేహితులతో చర్చించండి. సమాచారాన్ని సేకరించండి.
జవాబు:
విమానంలో ప్రయాణించే వ్యక్తికి ఇంద్రధనుస్సు పూర్తిగా వృత్తాకారంలో కన్పించును.

10th Class Physical Science Textbook Page No. 90

ప్రశ్న 2.
మన కంటిముందున్న అన్ని వస్తువులనూ మనం స్పష్టంగా చూడగలమా?
జవాబు:
మన కంటి ముందు 25 సెం.మీ. దూరానికి అవతల ఉన్న అన్ని వస్తువులను మనం స్పష్టంగా చూడగలం.

10th Class Physical Science Textbook Page No. 91

ప్రశ్న 3.
స్పష్ట దృష్టి యొక్క సరాసరి దూరం విలువ ఎంత?
జవాబు:
స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం 25 సెం.మీ.

ప్రశ్న 4.
మీ కంటికి 25 సెం.మీ. దూరంలో ఉంచిన వస్తువు ఆకారం ఎలా ఉన్నా, దానిని పై నుండి కింది వరకు మీరు చూడగలరా?
జవాబు:
చూడలేము. ఎందుకనగా స్పష్ట దృష్టి కనీస దూరం విలువ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా కంటి వద్ద 60° కోణంతో కనబడే వస్తుభాగం మాత్రమే మనం చూడగలం.

10th Class Physical Science Textbook Page No. 92

ప్రశ్న 5.
స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టికోణం విలువలు వ్యక్తినిబట్టి, వయసునుబట్టి ఎందుకు మారతాయి?
జవాబు:
ఈ విలువలన్నీ కంటి నిర్మాణం మరియు సిలియరి కండరాల పనితీరుపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.

10th Class Physical Science Textbook Page No. 93

ప్రశ్న 6.
వివిధ వస్తుదూరాలకు ఒకే ప్రతిబింబదూరం ఉండడం ఎలా సాధ్యం?
జవాబు:
కటకనాభ్యంతరం విలువను మారుస్తూ ఉంటే వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండటం సాధ్యపడుతుంది.

ప్రశ్న 7.
కటకాల గుండా వక్రీభవనం గురించి మీకున్న అవగాహనతో పై ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?
జవాబు:
చెప్పగలము. వస్తుదూరం మారినప్పుడు ప్రతిబింబ దూరం స్థిరంగా ఉండాలంటే కటక నాభ్యాంతరం మారాలి.

10th Class Physical Science Textbook Page No. 94

ప్రశ్న 8.
కన్ను తన నాభ్యంతరాన్ని ఎలా మార్చుకుంటుంది? కనుగుడ్డులో ఈ మార్పు ఎలా జరుగుతుంది?
జవాబు:
కనుగుడ్డులోని కటకానికి ఆనుకుని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతా వ్యాసార్థాన్ని మారుస్తాయి. ఈ మార్పు ద్వారా కన్ను తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది.

ప్రశ్న 9.
కంటి కటకం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా? మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?
జవాబు:
కంటి కటకం వస్తువు నిజ ప్రతిబింబాన్ని రెటీనా పై తలక్రిందులుగా ఏర్పరుస్తుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 10.
కంటి కటక నాభ్యంతరం మార్పుకు ఏదైనా హద్దు ఉందా?
జవాబు:
అవును. కటక నాభ్యంతరానికి గరిష్ఠ, కనిష్ఠ విలువలుంటాయి.

10th Class Physical Science Textbook Page No. 95

ప్రశ్న 11.
కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోలేకపోతే వస్తువును సులభంగా, స్పష్టంగా చూడలేము.

ప్రశ్న 12.
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ.లకు మధ్యస్థంగా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ. లకు మధ్యస్థంగా లేకపోతే కంటి దోషాలు ఏర్పడతాయి.

10th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 13.
‘కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. కంటి కటక కనిష్ఠ నాభ్యంతరం 2.27 సెం.మీ. కంటే ఎక్కువైతే దీర్ఘదృష్టి ఏర్పడుతుంది.
  2. అంటే ఆ వ్యక్తి దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు కాని దగ్గరి వస్తువులను చూడలేదు.

10th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 14.
దీర్ఘదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
జవాబు:
దీర్ఘదృష్టి సవరణ :

  1. వస్తువు కనిష్ఠదూర బిందువుకు ఆవల ఉంటే, కంటికటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
  2. కనుక కనిష్ఠదూర బిందువు (H) కు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) కు మధ్యనున్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని కనిష్ఠదూర బిందువుకు ఆవల ఏర్పరచగలిగే కటకాన్ని అంటే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించాలి.
  3. ద్వికుంభాకార కటకాన్ని వాడటం వల్ల ఇది సాధ్యపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 99

ప్రశ్న 15.
కంటి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ లోని వివరాలను మీరెప్పుడైనా పరిశీలించారా?
జవాబు:
కంటి డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లోని వివరాలను పరిశీలించాను. అవి +, – గుర్తులతో సూచింపబడి ఉంటాయి.

ప్రశ్న 16.
సైట్ పెరగడం లేదా తగ్గడం అంటే ఏమిటి?
జవాబు:
కంటి చూపులోని పెరుగుదల లేదా తగ్గుదల.

ప్రశ్న 17.
కటక సామర్థ్యం అంటే ఏమిటి?
జవాబు:
కటక సామర్థ్యం :
ఒక కటకం కాంతికిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యం అంటాం. (లేదా) కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువను కటక సామర్థ్యం అంటాం.

ఒక కటక నాభ్యంతరం గ అనుకుంటే,
కటక సామర్థ్యం P = 1/f (మీటర్లలో) ; P = 100/f (సెం.మీ.లలో)
కటక సామర్థ్యానికి ప్రమాణం డయాప్టర్ (Dioptre). దీనిని D తో సూచిస్తాం.

10th Class Physical Science Textbook Page No. 100

ప్రశ్న 18.
పట్టకం అంటే ఏమిటి?
జవాబు:
ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసరయానకం నుండి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని “పట్టకం” అంటారు.

10th Class Physical Science Textbook Page No. 105

ప్రశ్న 19.
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించగలమా?
జవాబు:
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించలేము.

ప్రశ్న 20.
వివిధ రంగులు గల కొంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయా?
జవాబు:
శూన్యంలో వివిధ రంగులు గల కాంతుల వేగాలు స్థిరంగా ఉంటాయి. యానకంలో వివిధ రంగులు గల కాంతుల వేగాలు వేర్వేరుగా ఉంటాయి.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 21.
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
జవాబు:
శూన్యంలో అన్ని రంగుల కాంతి వేగాలు ఒకటే అయినప్పటికీ, ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతివేగం దాని తరంగదైర్యంపై ఆధారపడును. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

10th Class Physical Science Textbook Page No. 106

ప్రశ్న 22.
పట్టకం గుండా తెలుపురంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో ఇప్పుడు మీరు ఊహించగలరా?
జవాబు:
యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతి వేగం దాని తరంగదైర్ఘ్యంపై ఆధారపడుతుంది. అందువల్ల కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

ప్రశ్న 23.
కృత్యం – 3లో చూసినట్లు ప్రకృతిలో మీరు రంగులు చూడగలిగే సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
జవాబు:
ప్రకృతిలో రంగులు చూడగలిగే సందర్భం ఇంద్రధనుస్సు.

10th Class Physical Science Textbook Page No. 108

ప్రశ్న 24.
ఆకాశం నీలిరంగులో ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
వాతావరణంలోని N2, O2 అణువులు సూర్యుని కాంతిలోని నీలం రంగు కాంతిని పరిక్షేపణం చెందించడం వల్ల ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 109

ప్రశ్న 25.
పరిక్షేపణం అంటే ఏమిటి?
జవాబు:
ఒక కణం శోషించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో విడుదల చేయడాన్ని “కాంతి పరిక్షేపణం” అంటారు.

ప్రశ్న 26.
స్వేచ్ఛా పరమాణువు లేదా అణువుపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కాంతి పతనం చెందితే ఏం జరుగును?
జవాబు:
పరమాణువులు లేదా అణువులపై కాంతి పతనం చెందినపుడు అవి కాంతి శక్తిని శోషించుకుని, అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం చేస్తాయి. ఇదే కాంతి పరిక్షేపణంలోని ప్రాథమిక నియమము.

10th Class Physical Science Textbook Page No. 94

ప్రశ్న 27.
వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులలో ఏ మార్పు లేకుండా వస్తువును మనం గుర్తించే విధంగా రెటీనాపై ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది?
జవాబు:

  1. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర.
  2. దీనిలో దండాలు (rods) మరియు శంఖువులు (cones) అనబడే దాదాపు 125 మిలియన్ల గ్రాహకాలు (receptors) ఉంటాయి.
  3. ఇవి కాంతి సంకేతాలను (signals) గ్రహిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి. దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి.
  4. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృక్ నాడుల (optic – nerve fibres) ద్వారా మెదడుకు చేరవేయబడతాయి.
  5. వాటిలోని సమాచారాన్ని మెదడు విశ్లేషించడం ద్వారా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులను మనం గుర్తిస్తాం.

ప్రశ్న 28.
కంటి కటకం యొక్క కనిష్ఠ, గరిష్ఠ నాభ్యంతరాలు ఎంత? వాటిని మనం ఎలా కనుగొంటాము?
జవాబు:
గరిష్ఠ నాభ్యంతరం

  1. పటంలో చూపినట్లు అనంతదూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే
    సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెందాక
    రెటీనా పై ఒక బిందురూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
  2. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం గరిష్టంగా ఉంటుంది.
  3. దీని విలువ fగరిష్ఠ = 2.5 సెం.మీ. ఉండును.

కనుగొనే విధానం :
వస్తుదూరం = µ = α
ప్రతిబింబ దూరం = v = 2.5 సెం.మీ (కంటికటకం నుండి రెటీనాకు దూరం)
నాభ్యంతరం = f = ?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 21

కనిష్ఠ నాభ్యంతరము :

  1. పటంలో చూపినట్లు కంటి ముందు 25 సెం.మీ. దూరంలో వస్తువు ఉందనుకొనుము.
  2. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం కనిష్ఠంగా ఉంటుంది.
  3. దీని విలువ fకనిష్ఠ = 2.27 సెం.మీలుగా ఉండును.

కనుగొనే విధానం :
వస్తు దూరం = u = 25 సెం.మీ.
ప్రతిబింబ దూరం = v = 25 సెం.మీ. (కంటి కటకం నుండి రెటీనాకు గల దూరం)
నాభ్యంతరం = f = ?
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 22

10th Class Physical Science Textbook Page No. 96

ప్రశ్న 29.
హ్రస్వదృష్టిని సవరించడానికి ఏం చేయాలి?
జవాబు:
హ్రస్వదృష్టికి సవరణ :

  1. గరిష్ఠదూర బిందువుకు, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువుకు మధ్య వస్తువు ఉన్నప్పుడు కంటికటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు.
  2. కాబట్టి ఒక కటకాన్ని ఉపయోగించి గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూరబిందువు (M) మరియు స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) ల మధ్యకు తేగలిగితే, ఆ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది.
  3. పుటాకార కటకాన్ని వాడడం వల్ల ఇది సాధ్యపడుతుంది.

10th Class Physical Science Textbook Page No. 97

ప్రశ్న 30.
హ్రస్వదృష్టిని నివారించడానికి వాడవలసిన పుటాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:

  1. హ్రస్వదృష్టిని నివారించడానికి, అనంతదూరంలో ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని గరిష్ఠ దూరబిందువు వద్ద ఏర్పరచగలిగే కటకాన్ని అంటే ద్విపుటాకార కటకాన్ని ఎంచుకోవాలి.
  2. ఈ కటకం ఏర్పరచే ప్రతిబింబం కంటి కటకానికి వస్తువులా పనిచేసి చివరగా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది.
  3. ఈ సందర్భంలో వస్తుదూరం (u) అనంతం. ప్రతిబింబదూరం (v) గరిష్ఠ దూర బిందువుకు గల దూరానికి సమానం. కావున
    u = – ∞, v = -D (గరిష్ఠ దూరబిందువుకు, కంటికి గల దూరం)
  4. ద్విపుటాకార కటక నాభ్యంతరం గ అనుకుంటే..
    1/f = 1/v – 1/4 సూత్రాన్ని ఉపయోగించినపుడు 1/f = 1/-D ⇒ f = -D
  5. ఇక్కడ f కు ‘ఋణ విలువ’ రావడమనేది పుటాకార కటకాన్ని తెలియజేస్తుంది.

10th Class Physical Science Textbook Page No. 108

ప్రశ్న 31.
వాననీటి బిందువులతో విక్షేపణం చెందిన కాంతి అర్ధవలయాకారంలో ఎందుకు కన్పిస్తుంది?
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 23

  1. ఇంద్రధనుస్సు అనునది మనకు కనబడే విధంగా పలుచని ద్విమితీయ చాపం కాదు.
  2. ఇంద్రధనుస్సు అనేది మీ కంటి వద్ద తన కొనభాగాన్ని కల్గి వున్న త్రిమితీయ శంఖువు.
  3. పటంలో చూపినట్లు శంఖువు అక్షం వెంబడి మనం భాగం భూమి పైని వాతావరణంలోని కణాల నుండి, శంఖువు కింది సగ భాగం నేలపైని వస్తువుల నుండి వచ్చే కాంతులను మన కంటికి చేరవేస్తున్నాయి.
  4. కావున గాలిలోని నీటి బిందువుల నుండి వచ్చే కాంతి (శంఖువు పై సగం) మనకు ఇంద్రధనుస్సును అర్ధ చంద్రాకారంలో ఏర్పరుస్తుంది.
  5. మనం భూమి నుండి నిర్ణీత ఎత్తుకు వెళ్తే ఇంద్ర ధనుస్సును పూర్తి వలయంగా చూడవచ్చు.

10th Class Physical Science Textbook Page No. 110

ప్రశ్న 32.
వేసవి రోజుల్లో (ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో) ఒక నిర్దిష్ట దిశలో చూస్తున్నపుడు కొన్ని సందర్భాలలో ఆకాశం తెలుపురంగులో కనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:

  1. వాతావరణంలో వివిధ పరిమాణాలు గల కణాలుంటాయి. వాటి పరిమాణాల కనుగుణంగా అవి వివిధ తరంగదైర్యాలు గల కాంతిని పరిక్షేపణం చేస్తాయి.
  2. ఉదాహరణకు N2, O2 అణువుల కన్నా నీటి అణువు పరిమాణం ఎక్కువ. కాబట్టి అది నీలిరంగుకాంతి కంటే తక్కువ పౌనఃపున్యాలు (ఎక్కువ తరంగదైర్యాల) గల కాంతులకు పరిక్షేపణ కేంద్రంగా పనిచేస్తుంది.
  3. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వాతావరణంలోకి నీటి ఆవిరి చేరుతుంది.
  4. తద్వారా వాతావరణంలో నీటి అణువులు అధిక స్థాయిలో ఉంటాయి.
  5. ఈ నీటి అణువులు ఇతర పౌనఃపున్యాలు (నీలిరంగు కానివి) గల కాంతులను పరిక్షేపణం చేస్తాయి.
  6. N2, O2, ల పరిక్షేపణం వల్ల వచ్చే నీలిరంగుకాంతి, నీటి అణువుల పరిక్షేపణం వల్ల వచ్చే ఇతర రంగుల కాంతులు అన్నీ కలిసి మన కంటిని చేరినప్పుడు తెలుపు రంగు కాంతి కనబడుతుంది.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physical Science Textbook Page No. 111

ప్రశ్న 33.
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనబడడానికి గల కారణం మీకు తెలుసా?
జవాబు:

  1. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుని నుండి వెలువడే కాంతి మీ కంటిని చేరడానికి భూ వాతావరణంలో అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
  2. ఎరుపు రంగు కాంతి తప్ప మిగిలిన అన్ని రంగుల కాంతులు అధికంగా పరిక్షేపణం చెంది కాంతి మీ కంటిని చేరే లోపే ఆ రంగులన్నీ కనుమరుగవుతాయి.
  3. ఎరుపు రంగు కాంతి తక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల అది మీ కంటిని చేరును.
  4. ఫలితంగా సూర్యుడు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో ఎరుపుగా కన్పిస్తాడు.

ప్రశ్న 34.
మధ్యాహ్న వేళల్లో సూర్యుడు ఎర్రగా ఎందుకు కనబడడో ఊహించగలరా?
జవాబు:

  1. ఉదయం, సాయంత్రం వేళల కంటే మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో సూర్యకాంతి ప్రయాణించే దూరం తక్కువ.
  2. కాబట్టి కాంతి ఎక్కువగా పరిక్షేపణం చెందక పోవడం వల్ల అన్ని రంగులూ మీ కంటిని చేరతాయి.
  3. కాబట్టి మధ్యాహ్న వేళల్లో సూర్యుడు తెల్లగా కనబడతాడు.

10th Class Physical Science Textbook Page No. 98

ప్రశ్న 35.
దీర్ఘదృష్టిని నివారించడానికి వాడవలసిన కుంభాకార కటక నాభ్యంతరం ఎంత ఉండాలనేది ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:
1) కటక నాభ్యంతరాన్ని కనుగొనడానికి, స్పష్ట దృష్టి కనీస దూరాన్ని తెలిపే బిందువు (L) వద్ద ఒక వస్తువు ఉన్నదని ఊహించవలెను.

2) పటంలో చూపినవిధంగా L వద్ద ఉన్న వస్తువు ప్రతిబింబాన్ని కనిష్ఠదూర బిందువు (H) వద్ద ఏర్పరచగలిగే ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగిస్తే దృష్టిదోషం సవరించబడుతుంది.

3) ఆ ప్రతిబింబం కంటికటకానికి వస్తువుగా పనిచేస్తుంది.

4) కనుక చివరగా కంటి కటకం వలన ఏర్పడే ప్రతిబింబం రెటీనా పై ఏర్పడుతుంది.

5) ఈ సందర్భంలో, వస్తుదూరం
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5
(u) = -25 సెం.మీ.
ప్రతిబింబం దూరం (v) = – d
(కంటికి, కనిష్ఠ దూరబిందువుకు గల దూరం)
మనం వాడే ద్వికుంభాకార కటక నాభ్యంతరం f అనుకుంటే.
1/f = 1/v – 1/4 సూత్రాన్ని ఉపయోగించినపుడు :
1/f = 1/-d – 1/(-25) ⇒ 1/f = -1/d + 1/25
1/f = (d – 25)/25d ⇒ f = 25d(d – 25)
d > 25 కాబట్టి గ విలువ ధనాత్మకం అవుతుంది. అనగా కుంభాకార కటకం వాడాలని తెలుస్తుంది.

పరికరాల జాబితా

పొడవైన కర్ర లేదా పివిసి పైపు ముక్కలు (20, 30, 35, 40, 50 సెం.మీ.,) అడ్డు కడ్డీ, రిటారు స్టాండు, కంటి నిర్మాణం ప్రదర్శించే నమూనా, డ్రాయింగ్ షీట్, పెన్సిల్, గుండుసూదులు, స్కేలు, కోణమానిని, పట్టకం, చిన్న రంధ్రం కలిగిన కార్డుబోర్డు, తెల్లని కాంతి జనకం (టార్చిలైటు), లోహపు పళ్లెం, అద్దం, నీరు, గాజుబీకరు, సోడియం’
థయో సల్ఫేట్, సల్ఫూరికామ్ల ద్రావణాలు

10th Class Physical Science 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Textbook Activities

కృత్యములు

కృత్యం – 1

ప్రశ్న 1.
స్పష్ట దృష్టి కనీస దూరమును కనుగొనుటకు ఒక కృత్యాన్ని వ్రాయుము.
జవాబు:

  1. ఒక పుస్తకాన్ని తెరచి మీ కంటి ముందు కొంతదూరంలో పట్టుకొని చదవడానికి ప్రయత్నించండి.
  2. నెమ్మదిగా ఆ పుస్తకాన్ని మీ కంటివైపుగా, కంటికి అతి దగ్గరగా చేరే వరకు కదిలించండి.
  3. పుస్తకంలోని అక్షరాలు మసకబారినట్లుగా అనిపిస్తాయి లేదా మీ కన్ను ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది.
  4. పుస్తకంలోని అక్షరాలను మీ ‘కన్ను ఏ ఒత్తిడి లేకుండా చూడగలిగే స్థానం వరకు నెమ్మదిగా పుస్తకాన్ని వెనుకకు . జరపండి.
  5. ఈ సందర్భంలో పుస్తకానికి, మీ కంటికి గల దూరాన్ని కొలిస్తే అది దాదాపు 25 సెం.మీ. ఉంటుంది.
  6. ఈ దూరం వ్యక్తికి, వ్యక్తికీ వయస్సును బట్టి మారుతుంది.
  7. మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనము చూడాలంటే ఉండవలసిన కనీస దూరాన్ని “స్పష్ట దృష్టి కనీస దూరం” అంటారు.

కృత్యం – 2

ప్రశ్న 2.
“దృష్టికోణం” ను కనుగొనేందుకు ఒక కృత్యాన్ని తెల్పుము.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 24 AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 25

  1. బట్టలషాప్ లో బట్టల చుట్టలకు వచ్చే కర్రలను లేదా PVC పైపులను సేకరించుము.
  2. ఈ వస్తువులను 20 సెం.మీ., 30 సెం.మీ., 35 సెం.మీ., 40 సెం.మీ., 50 సెం.మీ. పొడవు గల ముక్కలుగా ఆ కత్తిరించుము.
  3. ఒక రిటార్ట్ స్టాండును బల్లపై ఉంచి, రిటార్ట్ స్టాండు నిలువు కడ్డీ ప్రక్కన మీ తల ఉండే విధముగా బల్ల దగ్గర నిలబడండి.
  4. మీ కంటి నుండి 25 సెం.మీ. దూరంలో రిటార్టు స్టాండ్ అడ్డుకడ్డీకి క్లాంప్ ను బిగించి, 30 సెం.మీ. పొడవు గల కర్రను కట్టమని మీ స్నేహితునికి చెప్పుము.
  5. ఇప్పుడు అడ్డుకడ్డీ వెంబడి మీ దృష్టి సారిస్తూ, కర్రముక్కను పై అంచు నుండి క్రింది అంచు వరకు మొత్తంగా చూడడానికి ప్రయత్నించుము.
  6. కర్రముక్క 25 సెం.మీ. దూరంలో ఉన్నప్పుడు దాని రెండు చివరలను మీరు స్పష్టంగా చూడలేకపోతే, అడ్డుకడ్డీ వెంబడి కర్రముక్కను వెనుకకు జరుపుము.
  7. ఏ కనీస దూరం వద్ద మీరు దానిని పూర్తిగా చూడగలరో అక్కడ దానిని అడ్డుకడ్డీకి ఇంప్ సహాయంతో బిగించండి.
  8. వస్తువు యొక్క చివరి బిందువుల నుండి వచ్చే కిరణాలు కంటి వద్ద కొంత కోణం చేస్తాయి.
  9. ఈ కోణం 60° కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువును పూర్తిగా మనము చూడగలము.
  10. ఈ కోణం 60° కంటే ఎక్కువగా ఉంటే ఆ వస్తువులో కొంతభాగం మాత్రమే మనము చూడగలము.
  11. ఏ గరిష్ఠ కోణము వద్ద మనము పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని “దృష్టికోణం” అంటారు.
  12. ఈ విధముగా దృష్టికోణమును కనుగొంటారు.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

కృత్యం – 6

ప్రశ్న 3.
కాంతి పరిక్షేపణాన్ని ప్రయోగ పూర్వకముగా వ్రాయుము.
జవాబు:

  1. ఒక బీకరులో సోడియం థయోసల్ఫేట్ (హైపో) మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లాల ద్రావణాన్ని తీసుకొనుము.
  2. ఈ గాజు బీకరును ఆరుబయట సూర్యుని వెలుగులో ఉంచుము.
  3. బీకరులో సల్ఫర్ స్పటికాలు ఏర్పడటాన్ని గమనించుము.
  4. రసాయన చర్య జరుగుతున్న కొలదీ సల్ఫర్ అవక్షేపం (precipitation) ఏర్పడటం గమనించవచ్చును.
  5. ప్రారంభంలో సల్ఫర్ స్పటికాలు చాలా చిన్నవిగానూ చర్య జరిగే కొలదీ వాటి పరిమాణం పెరుగును.
  6. మొదట సల్ఫర్ స్పటికాలు నీలిరంగులో ఉం, వాటి పరిమాణం పెరుగుతున్నకొలదీ తెలుపు రంగులోకి మారును. దీనికి కారణం కాంతి పరిక్షేపణము.
  7. ప్రారంభంలో సల్ఫర్ స్పటికాల పరిమాణం చాలా తక్కువగా ఉండి, అది నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చడానికి వీలైనదిగా ఉంటుంది. కావున అపుడు అవి నీలిరంగులో కనబడతాయి.
  8. సల్పర్ స్పటికాల పరిమాణం పెరుగుతున్న కొలదీ వాటి పరిమాణం ఇతర రంగు కాంతుల తరంగదైర్యాలతో పోల్చడానికి వీలయ్యేదిగా ఉంటుంది.
  9. అప్పుడు ఆ స్పటికాలు ఇతర రంగుల కాంతులకు పరిక్షేపణ కేంద్రాలుగా పనిచేస్తాయి.
  10. ఈ అన్ని రంగులూ కలిసి తెలుపు రంగులా కనబడుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Studies 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది కథనం ఆధారంగా సమాచార హక్కు చట్టం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల, పౌరుల పాత్రలను వివరించండి. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పని మరింత పారదర్శకంగా ఎలా అవుతుందో రాయండి. (AS2)
కింద పేర్కొన్న ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరం పేటలో జరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీలలో చేరారు. ఈ పథకం కింద 9 నుంచి 12 తరగతులు చదువుతున్న పిల్లలకు 1200 రూపాయల స్కాలర్షిప్ పొందడానికి అర్హత ఉంది. అయితే 2008-11 మధ్య మూడు సంవత్సరాల పాటు విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం అందలేదు. విద్యార్థులు ఇందిరా క్రాంతి పథకం (IKP) కార్యాలయానికి వెళ్లి అడిగారు. కానీ అక్కడి అధికారులు వాళ్లను పట్టించుకోలేదు.

ఇది స్థానిక దినపత్రికల దృష్టికి వచ్చింది. ఆమోదించిన స్కాలర్షిప్పుల వివరాలు ఇవ్వమంటూ వాళ్లు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేశారు. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాలలో లబ్ధిదారుల సంఖ్య, మంజూరు చేసిన మొత్తం ఎంత అని అడిగారు. వాళ్లకు ఒక వారంలోపు సమాచారం వచ్చింది. మొత్తం ఏడు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సమాచార హక్కు ద్వారా అందిన వివరాలను బట్టి డబ్బు మంజూరయ్యింది కానీ, దానిని పంచలేదని తెలిసింది. ఈ విషయం వార్తాపత్రికలలో ప్రచురితం కాగానే 15 రోజుల లోపు 1167 విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు.
జవాబు:
సమాచార హక్కు చట్టం ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే రెండు పాత్రలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.

  1. ప్రభుత్వ శాఖలు
  2. పౌరులు

ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి.

1) ప్రభుత్వశాఖల పాత్ర :
పై ఘటనలో ఉన్న ప్రభుత్వ శాఖలు – రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాలైన అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం. ఈ సంస్థలు వాటి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి. అంటే 9 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు 1200 రూపాయల స్కాలర్షిప్ అందజేయాలి. కాని 2008-11 మధ్య మూడు సంవత్సరాలపాటు పిల్లలకు స్కాలర్షిప్ అందచేయలేదు. ఆ విషయాలు పట్టించుకోలేదు. చివరికి విద్యార్థులే సమాచారహక్కును ఉపయోగించి వివరాలు కనుక్కోవలసి వచ్చింది. ఈ విషయమంతా వార్తాపత్రికలలో కూడా వచ్చింది. దీనితో 15 రోజులలోపు 1167 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందచేశారు. అయితే ఈ సంస్థల నిర్లక్ష్యం, జాప్యం అనేవి ప్రజలు, వార్తాపత్రికల దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వ సంస్థలు సక్రమంగా పనిచేయట్లేదంటూ మాట్లాడారు. కావున ప్రభుత్వ సంస్థలు నిరంతరం మెలకువతో ఉండి, తమ వద్ద ఏ ఫైల్ను ఆపకుండా సకాలంలో పనిచేయాలి.

2) పౌరుల పాత్ర :
అభయహస్తం, ఆమ్ ఆద్మీ, ఇందిరా క్రాంతి పథం వంటి సంస్థలు వాటి విధులు మరిచిపోయాయి. కాని విద్యార్థులు వదలకుండా సమాచార హక్కు చట్టంను ఉపయోగించి వాస్తవాలు తెలుసుకున్నారు. ఈలోగా ఈ విషయాలన్నీ వార్తాపత్రికలో వచ్చాయి. అప్పుడు హడావుడిగా ఆ సంస్థలు విద్యార్థులకు డబ్బును అందించారు. ఇందులో పౌరులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించినారని తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 2.
సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగుపరచటం, పర్యవేక్షించటం ఎలా సాధ్యమవుతుంది? (AS4)
జవాబు:
మెరుగుపరచటం :
1) ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబుదారీగా ఉండాలి. ఏ విషయం మీదైనా ప్రజలు సమాచారం అడగవచ్చు. కనుక ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
2) ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. దీని కొరకు రికార్డులను, రిజిష్టర్లను, నివేదికలను, డాక్యుమెంట్లను నిర్వహించాలి.
3) ప్రతి వ్యవస్థ, తన విధి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత వహించాలి. విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
4) సమాచార హక్కు చట్టం వలన ఇప్పుడు ప్రతి ప్రభుత్వశాఖ రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.

పర్యవేక్షణ :
5) ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటాడు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
6) అన్ని శాఖల అప్పిలేట్ అధికారులు, పౌర సమాచార అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
7) రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. కేంద్ర సమాచార కమిషనర్లు ఉంటారు.

మనం సమాచారం కొరకు దరఖాస్తు చేసినపుడు ఆయా సమాచార అధికారులు సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర, కేంద్ర సమాచార కమిషనర్లు జవాబుదారీగా ఉంటారు. అవసరం అయితే వీరు ఆ సమాచార అధికారికి జరిమానా కూడా విధించవచ్చు.

ప్రశ్న 3.
సమాచారం అని దేనిని అంటారు? ఇది ప్రభుత్వ శాఖలలో ఎలా ఉత్పన్నమవుతుంది? పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవుతుందా? (AS1)
జవాబు:
ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమనిబంధనల ఆధారంగా పనిచేస్తుంది.
ఉదా :

  1. ఆరోగ్యశాఖలో ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల ఎంపిక, నియామకం, బదిలీలకు సంబంధించి లేదా మందుల కొనుగోలు, పంపిణీలకు సంబంధించి నియమనిబంధనలు ఉంటాయి.
  2. అందువల్ల ప్రతి సంస్థ కొన్ని రికార్డులను నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి కారణంగా వ్యవస్థలో అనేక రాత పత్రాలు రూపొందుతాయి. ఇవి ఈ క్రింది రూపాలలో ఉండవచ్చు.
  3. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్, ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
  4. సమాచార హక్కు చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వ శాఖకు రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
  5. పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవదు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 4.
రాష్ట్ర, కేంద్ర సమాచార కార్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇచ్చారు? (AS4)
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటారు.
  2. అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ట్ర పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  3. దీనికి రాష్ట్ర సమాచార కమిషనర్లు ఉంటారు. ఏదైనా ప్రభుత్వశాఖ కేంద్రప్రభుత్వం కిందికి వస్తే కేంద్ర సమాచార కమిషనర్లతో కూడిన సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు.
  4. ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఎందుకనగా మనం ఏదైనా ఒక కార్యాలయంలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే, వారు మనల్ని వేరే కార్యాలయం నుండి సమాచారం పొందమని చెప్పడానికి లేదు.
  5. ఒకవేళ మనమడిగిన సమాచారం వారి దగ్గర లేనట్లయితే సమాచారం ఉన్న అధికారి నుంచి సమాచారం పొంది దానిని అందజేయటం వాళ్ళ బాధ్యత.
  6. ఈ అంశాల మూలంగా ఈ సమాచార కార్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయని తెలుస్తుంది. మరియు ఇతరుల ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే స్వయంప్రతిపత్తి ఉండాలి.

ప్రశ్న 5.
సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు? (AS6)
జవాబు:

  1. ప్రజాస్వామ్యమంటేనే ప్రజల ప్రభుత్వమని అర్థం. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులచే ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తారు. కావున ప్రభుత్వ కార్యక్రమాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ప్రభుత్వమే కల్పించింది.
  2. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు శ్రేయో రాజ్యాలు. ప్రజల కొరకు అనేక సంస్కరణలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేసే పనులు ప్రజలకు తెలియచేయడానికే ఈ సమాచార హక్కును కల్పించింది.
  3. ప్రజలు ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నులు మరియు ఇతర రుసుములన్నింటిని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకునే అవకాశం ఈ సమాచార హక్కు కల్పిస్తుంది.
  4. సమాచారంలో పారదర్శకత ఉండాలి. ఇది ప్రభుత్వ సంస్థలలో అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుంది.
  5. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఒక పౌరునికి కూడా జవాబుదారీగా ఉంటాయి.
  6. ఈ సమాచార హక్కు ద్వారా ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను, వారి విధులను, కార్యకలాపాలను నియంత్రణ చేయవచ్చు.
  7. ఈ సమాచార హక్కును ప్రజాస్వామ్య రాజ్యాలే ఇచ్చాయి. ఇది వ్యక్తి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.
  8. ప్రభుత్వ ఆఫీసులలోని కార్యక్రమాల పట్ల ఇంతకుముందున్న అస్పష్టత ఈ హక్కు మూలంగా పోయింది.

కావున ఈ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియచేస్తుంది.

ప్రశ్న 6.
దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఏ పౌరుడికైనా సమాచారం అందుబాటులో ఉండేలా చెయ్యటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? (AS4)
జవాబు:
సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ సంస్థలు
అ) కంప్యూటరైజ్డ్ రూపంలో సమాచారాన్ని భద్రపరచాలి,
ఆ) దానికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే వెల్లడి చెయ్యాలి. సమాచార హక్కు చట్టం ఇలా పేర్కొంటోంది:

1) ప్రతి ప్రభుత్వ సంస్థ :
అ) తనకు సంబంధించిన అన్ని రికార్డులను… ఇటువంటి రికార్డులను తేలికగా బయటకు తీయటానికి వీలుగా వర్గీకరించి, సూచికలతో నిర్వహించాలి.
ఆ) ప్రతి సంస్థ ఈ దిగువ సమాచారాన్ని ప్రచురించాలి.
i) సంస్థ వివరాలు, విధులు, బాధ్యతలు.
ii) సంస్థలోని అధికారులు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు :
iii) నిర్ణయాలు తీసుకోవటంలో అనుసరించే విధానం, పర్యవేక్షణ, జవాబుదారీ విధానాలను కూడా పేర్కొనాలి.
iv) సంస్థకు ఉండే లేదా దాని నియంత్రణలో ఉండే లేదా తమ విధులను నిర్వర్తించటంలో ఉద్యోగస్తులు ఉపయోగించే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు, రికార్డులు.
v) సలహా ఇవ్వటం కోసం ఏర్పాటు చేసి …. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న బోర్డులు, సమితులు, సంఘాలు, ఇతరాల వివరాలు:
vi) ఆ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగస్తుల వివరాలు :
vii) అధికారులు, ఉద్యోగస్తులకు ఇస్తున్న నెలసరి జీతం, నియమాల ప్రకారం చేసే ఇతర చెల్లింపులు
viii) తన ప్రతి ఒక్క ఏజెన్సీకి కేటాయించిన బడ్జెటు
ix) సబ్సిడీ పథకాల అమలు విధానం దానికి కేటాయించిన నిధులు.
x) దాని ద్వారా రాయితీలు, పర్మిట్లు, లేదా అధీకృత పత్రాలు పొందిన వాళ్ల వివరాలు
xi) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.

ఇ) ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు సంబంధిత అన్ని వాస్తవాలను వెల్లడి చేయాలి.
ఈ) ప్రభావిత వ్యక్తికి పరిపాలన సంబంధ లేదా న్యాయ స్వరూపం గల నిర్ణయాలకు కారణాలను తెలియచెయ్యాలి.

2) పై సమాచారమంతటినీ ఎవరూ అడగకుండానే ప్రభుత్వ సంస్థలు వెల్లడి చేయాలి.
3) ఇది అందరికీ తేలికగా అందుబాటులో ఉండాలి.
4) ఇది స్థానిక భాషలో ఉండాలి, దీనికి ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే అది ప్రజలకు భారం కాకుండా ఉండాలి.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 7.
న్యాయ సహాయం ఆశించే ప్రజలకు న్యాయ సేవల ప్రాధాన్యత సంస్థ ఏ విధంగా దోహదపడుతుంది? (AS1)
జవాబు:

  1. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
  2. న్యాయసేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.
  4. దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.

ప్రశ్న 8.
లోక్ అదాలత్ ఉద్దేశం ఏమిటి? (AS1)
జవాబు:

  1. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
  2. లోక్ అదాలత్ లను “న్యాయసేవల పీఠాల చట్టం 1987″ని 1994లోను తిరిగి 2002లోను సవరించారు. ఈ సవరణ ప్రకారం లోక్ అదాలలను ఏర్పాటుచేశారు.
  3. లోక్ అదాలత్ అంటే ప్రజాస్వామ్య పీఠాలు. వీటి ద్వారా న్యాయకోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో పరస్పర అంగీకారంతో తగాదాలు, వివాదాలు పరిష్కరించుకోవచ్చు.
  4. ఖర్చు లేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి లోక్ అదాలలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
  5. కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది.

ప్రశ్న 9.
ఈ చట్టం కింద చేపట్టే కేసులు, ఉచిత న్యాయసేవలు పొందటానికి పేర్కొన్న అర్హతలపై మీ అభిప్రాయం ఏమిటి? (AS2)
జవాబు:
I. ఉచిత న్యాయసేవలు పొందటానికి అర్హతలు :

  1. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ జాతులకు చెందిన వ్యక్తులు ఉచిత న్యాయ సహాయానికి అర్హులు.
  2. అక్రమ రవాణా బాధితులైన వ్యక్తులు, బిక్షాటకులు.
  3. స్త్రీలు, పిల్లలు.
  4. మతిస్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు.
  5. పెను విపత్తు, జాత్యాహంకార హింస, కుల వైషమ్యాలు, వరదలు, కరవులు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులకు గురైనవారు.
  6. పారిశ్రామిక కార్మికులు.
  7. వ్యభిచార వృత్త (నివారణ) చట్టం, 1956లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం రక్షణ గృహం, లేదా బాల నేరస్తుల న్యాయ చట్టం, 1986లోని సెక్షన్ 2, క్లాజు (జె) ప్రకారం బాల నేరస్తుల గృహం లేదా మానసిక ఆరోగ్య చట్టం 1987లో సెక్షన్ 2, క్లాజు (జి) ప్రకారం మానసిక వ్యాధి చికిత్సాలయం లేదా మానసిక రోగుల సంరక్షణాలయంలో నిర్బంధంలో ఉన్న వ్యక్తులు.
  8. లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు.

పైన పేర్కొన్న వారిలో ఏ వ్యక్తులైనా సహాయం పొందటానికి అర్హులని సంబంధిత న్యాయమూర్తి సంతృప్తి చెందితే వారు తగిన న్యాయ సేవలు పొందవచ్చు.

II. లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే కేసులు :

  1. వైవాహిక విభేదాలు.
  2. భరణానికి సంబంధించిన కేసులు.
  3. భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు.
  4. గృహ హింస కేసులు.
  5. అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు.
  6. చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.

III.నా అభిప్రాయం :
సమాజంలో వెనుకబడినవారు, పేదవారు, ఏ విధమైన సహాయ సహకారాలు లభించని వారికి ఈ లోక్ అదాలత్ సహాయపడుట చాలా మంచిదని నా అభిప్రాయం. స్త్రీలకు సంబంధించిన కేసులలో సరైన న్యాయం లభించుటలేదు. ఇటువంటి నేపథ్యంలో లోక్ అదాలత్ లు స్త్రీల వేధింపులకు సంబంధించిన కేసులను విచారించి, పరిష్కరించడమనేది అభినందనీయమే.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

ప్రశ్న 10.
గ్రామ పెద్దలు, కోర్టులు వివాదాలు తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేనిని ఇష్టపడతారు, ఎందుకు? (AS2)
జవాబు:

గ్రామ పెద్దలుకోర్టులు
1) గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మనదేశంలో అనాదిగా జరుగుతోంది.1) కోర్టులు ముఖ్యంగా లోక్ అదాలత్ ల ద్వారా న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో, సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలు వివాదాలను పరిష్కరించుకోవచ్చు.
2) తగాదాలు, వివాదాల స్వభావం వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి.2) ఖర్చులేకుండా, త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు ఇప్పుడు లోక్ అదాలత్ లు ఉపయోగపడుతున్నాయి.
3) దీనివల్ల ఆ తగాదాలను, వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలిగి, పారదర్శక పద్ధతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది.3) కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోటానికి లోక్ అదాలత్ లు సహాయపడుతున్నాయి.

నా అభిప్రాయం :
ప్రస్తుత ప్రజాస్వామ్య దేశాలలో జరిగే కార్యక్రమాలన్నింటికి రికార్డులు, రుజువులు, సాక్ష్యాలు ఉండాలి. తీసుకున్న నిర్ణయాల వివరాలను రికార్డు చేయాలి. కోర్టుల తీర్పులను ఎవరైనా పాటించకపోతే న్యాయస్థానాలు వారి మీద చర్యలు తీసుకొని, వాటిని పాటించేలా చేస్తాయి.

కాని గ్రామాలలో జరిగే తీర్పులను ప్రజలు అమలుచేయకపోతే అటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం గ్రామపెద్దలకు ఉండదు. కావున గ్రామాలలో నిర్వహించే కార్యక్రమాల కంటే కోర్టుల ద్వారా వచ్చే తీర్పులే మంచివని నా అభిప్రాయం.

10th Class Social Studies 22nd Lesson పౌరులు, ప్రభుత్వాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 1.
కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులు భరించలేని పేద ప్రజలకు మనదేశంలో ఉచిత న్యాయసేవలకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి?
జవాబు:

  1. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించటానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
  2. న్యాయ సేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం, 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి కూడా న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు.
  4. దీనివల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 2.
ఉచిత న్యాయసేవల ద్వారా ఎటువంటి కేసులు, తగాదాలను చేపట్టవచ్చు?
జవాబు:

  1. లోక్ అదాలల ద్వారా న్యాయ సేవల ప్రాధికార సంస్థ దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న కేసులను తక్కువ కాలంలో, ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరిస్తుంది.
  2. వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు, భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహ హింస కేసులు.
  3. అన్ని రకాల సివిల్ కేసులు భూ వివాదాలు, చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు వంటి వాటిని ఇది చేపట్టవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 3.
కోర్టుల బయట తగాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానం ఏదైనా ఉందా?
జవాబు:
ప్రాచీన కాలం నుండి ఒక విధానం అమలులో ఉంది. అదేమనగా :

  1. గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను, అంశాలను గ్రామ/తెగ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మన దేశంలో అనాదిగా జరుగుతోంది.
  2. తగాదాలు, వివాదాల స్వభావం, వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి.
  3. దీనివల్ల ఆ తగాదాలను / వివాదాలను గ్రామ ప్రజలు చర్చించటానికి వీలు కలుగుతుంది.
  4. పారదర్శక పద్దతిలో అందరికీ ఆమోదయోగ్య పరిష్కారాన్ని కనుగొనటం సాధ్యమవుతుంది.

10th Class Social Textbook Page No.316

ప్రశ్న 4.
టీచరుకు హెడ్ మాష్టారు ఇచ్చే మౌఖిక ఆదేశం సమాచారం కాకపోవటానికి కారణం ఏమిటో చర్చించండి.
జవాబు:
సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న ప్రకారం సమాచారం ఈ క్రింది వాటి రూపంలో ఉండాలి.

  1. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్.
  2. ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, అమలులో ఉన్న ఇతర చట్టాల కింద ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారం.
  3. కావున మౌఖిక ఆదేశాలు సమాచారంలోకి రావని తెలుస్తుంది.
  4. హెడ్ మాష్టారు ఆదేశాలను రాత పూర్వకంగా ఇవ్వలేదు. కావున హెడ్ మాష్టారు టీచరుకు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు సమాచారం క్రిందకు రావని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.316

ప్రశ్న 5.
సిఫారసు చేసిన విధంగా నియమ, నిబంధనలను పాటించినట్లయితే ప్రభుత్వ శాఖలు మరింత జవాబుదారీతనాన్ని ఎలా కనబరుస్తాయో ఊహించండి.
జవాబు:

  1. ప్రతి ప్రభుత్వశాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది. మరియు సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని తయారుచేసి తయారుగా పెట్టుకోవాలి.
  2. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ శాఖలు ప్రజలకు బాధ్యత వహిస్తాయి. కావున ప్రభుత్వ సంస్థలన్నీ నిరంతరం మెలకువగా ఉండి, తమ విధులను నిర్వర్తించాలి.
  3. ప్రతి ప్రభుత్వ శాఖ నియమ నిబంధనలకు లోబడి పని చేసినప్పుడు పనిలో పారదర్శకత ఏర్పడి ప్రజల నియంత్రణలో ఉంటుంది.
  4. ఎవరైనా వ్యక్తులు, ఏదైనా విషయం మీద, ఏ సంస్థనైనా సమాచారం అడగవచ్చు. కావున ప్రతి సంస్థ తన విధి నిర్వహణలో అవినీతికి పాల్పడకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది.
  5. ఈ సమాచార హక్కు చట్టం అనేది అన్ని ప్రభుత్వ శాఖల మీద పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.318

ప్రశ్న 6.
ఈ చట్టం ప్రకారం ఏ సమాచార అధికారి అయినా సమాచారం ఇవ్వకపోతే వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు దీనితో ఏకీభవిస్తారా? ఎందుకని?
జవాబు:
ఏకీభవిస్తాను. ఎందుకనగా :

  1. సమాచార అధికారులు పౌరులు అడిగిన సమాచారాన్ని అందివ్వని పక్షంలో జరిమానా కట్టవలసిందే.
  2. ఎప్పుడైతే ఆ అధికారి జరిమానా చెల్లిస్తాడో, తాను చేసిన పని పట్ల సిగ్గుపడతాడు. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదని భావిస్తాడు.
  3. ఒక అధికారి జరిమాన చెల్లించడం ద్వారా ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని భావించి, మరింత బాధ్యతగా పనిచేస్తాడు. పనిలో పారదర్శకత ఉండేలా చూసుకుంటాడు.
  4. జరిమానా కట్టుట మూలంగా, ఆ విషయం ఆ కార్యాలయంలో అందరికి తెలిసిపోతుంది. దీని పట్ల అతను సిగ్గుపడడమే కాకుండా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటాడు.
  5. సమాచారాన్ని అందివ్వకపోతే జరిమానా కట్టవలసి వస్తుంది. కావున ఇంకెప్పుడు అటువంటి పొరపాటు చేయకుండా సమాచారాన్ని అడిగిన వారందరికి అందిస్తాడు.

10th Class Social Textbook Page No.318

ప్రశ్న 7.
ఏ రకమైన సమాచారం ప్రజలకు అందుబాటులో లేదు? దీనికి మద్దతు తెలిపిన వాదన ఏది?
జవాబు:
కొంత సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడి చేయకుండా ఉండే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఆ అంశాలు :

  1. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం, విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
  2. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
  3. గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
  4. ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
  5. (అంతిమ నిర్ణయం తీసుకోటానికి ముందు) మంత్రుల లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే క్యాబినెట్ పత్రాలు లేదా రికార్డులు.
  6. మన సైనిక దళాలు, భద్రతా సంస్థలు చాలా వరకు సమాచార కమిషన్ల పరిధిలోకి రావు.

ఈ చట్టానికి మద్దతుగా చేసిన వాదన :
ఈ చట్టం చేసిన తరువాత దీనిలోని పలు అంశాలను అనేక సందర్భాలలో వివిధ శాఖలు ప్రశ్నించాయి. అవసరమనిపిస్తే ఈ చట్టానికి పార్లమెంటు సవరణలు చేయవచ్చు. అయితే రాజ్యాంగం అర్థం చేసుకుని నిర్వచించిన దానికి మద్దతుగా, సమాచారానికి ఉన్న మౌలిక హక్కుకు భంగం కలిగించేలా ఇది ఉండకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 22 పౌరులు, ప్రభుత్వాలు

10th Class Social Textbook Page No.320

ప్రశ్న 8.
లోక్ అదాలత్ ను మీరు సమర్థిస్తారా?
జవాబు:
అవును సమర్థిస్తాను. ఎందుకనగా :

  1. సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయవ్యవస్థ పనిచేసేలా చూడటానికి లోక్ అదాలత్ లను ఏర్పాటు చెయ్యటం జరిగింది.
  2. ఖర్చు లేకుండా లోక్ అదాలత్ న్యాయాన్ని అందిస్తుంది.
  3. త్వరితగతిన న్యాయం పొందటానికి ప్రజలకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది. విధానాలలో వెసులుబాటు ఉంటుంది.
  4. కోర్టులలో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కేసులకు లోక్ అదాలత్ లో పరిష్కారం దొరుకుతుంది.
  5. ఎటువంటి కోర్టు రుసుము ఉండదు, ఒకవేళ కోర్టు రుసుము అప్పటికీ చెల్లించి ఉంటే లోక్ అదాలత్ లో కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు.
  6. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయ స్థానాలో సాధ్యంకాదు.
  7. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది, ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది.
  8. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయసలహా అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్దతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు, తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

SCERT AP 10th Class Social Study Material Pdf 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విభిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. (AS1)
ఎ) స్వాతంత్ర్య పోరాట అనుభవాల నుంచి భారత రాజ్యాంగం ఏర్పడింది.
బి) అప్పటికే ఉన్న రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగం రూపొందింది.
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.
డి) దేశాన్ని పాలించటానికి రాజ్యాంగ సూత్రాలను, అంశాలను పేర్కొంది.
జవాబు:
సి) ముసాయిదా రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించారు.

ప్రశ్న 2.
తప్పు వాక్యాలను సరిదిద్దండి : (AS1)
ఎ) రాజ్యాంగ సభ చర్చలలో కొన్ని అంశాలపై అందరూ ఒకటే భావాన్ని వ్యక్తం చేశారు.
బి) రాజ్యాంగ నిర్మాతలు దేశంలోని కొన్ని ప్రాంతాలకే ప్రాతినిధ్యం వహించారు.
సి) రాజ్యాంగంలోని అధికరణాలను సవరించటానికి అది అవకాశం కల్పించింది.
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను కూడా సవరించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
జవాబు:
డి) రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో సవరించకూడదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. కావున రాజ్యాంగంలోని మౌలిక అంశాలను ఎట్టి స్థితిలో మార్చకూడదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 3.
రాజ్యాంగ సభ చర్చల నుంచి భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలను వివరించండి. (AS1)
జవాబు:
సమాఖ్య సూత్రాలు:

  1. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉంటాయి.
  2. ఆ రాష్ట్రాలకు సర్వసత్తాక అధికారాలు ఉంటాయి.
  3. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ చేస్తుంది.

ఏకీకృత సూత్రాలు :

  1. కేంద్ర ప్రభుత్వం సర్వసత్తాకమైనది.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు ఉండకపోవడం.
  3. ఒకే ప్రభుత్వం ఉంటుంది. కావున అధికార విభజన ఉండదు.

ప్రశ్న 4.
ఆనాటి రాజకీయ ఘటనలను రాజ్యాంగం ఎలా ప్రతిబింబిస్తోంది ? స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి ఇంతకు ముందు అధ్యాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. (AS1)
జవాబు:
ముందుగా భారతదేశంలో వివిధ రకాల ప్రజలు మెరుగైన సమాజాన్ని కోరుతూ చేసిన పోరాటాలు రాజ్యాంగ నిర్మాణానికి స్పూర్తినిచ్చాయి.

రాజ్యాంగంలో ప్రతిబింబించే వివిధ సంఘటనలు :

  1. దేశంలో అధికభాగం రాచరిక పాలనలో ఉండేది. సామాజిక, సాంస్కృతిక వైవిధ్యతలే కాకుండా ధనిక-పేద మధ్య, అగ్ర-కింది కులాల మధ్య, స్త్రీ-పురుషుల మధ్య చాలా తేడాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి మన రాజ్యాంగంలో అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి.
  2. దీని ప్రకారం చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. లింగ, కుల, మత, జాతి, సంపద భేదం లేకుండా “సార్వజనీన వయోజన ఓటు హక్కు” ద్వారా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది.
  3. ఫ్రెంచి విప్లవం ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంను, అమెరికాలోని హక్కుల చట్టంను, రష్యా, చైనాలలో సోషలిస్ట్ విప్లవం ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయం వంటివి మన రాజ్యాంగంలో పొందుపరచడానికి కారణం అయ్యాయి. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను పొందుపరుచుకున్నాం.
  4. పాశ్చాత్య ఉదార సంస్థలైన గణతంత్ర, ప్రజాస్వామ్య, ‘లౌకిక, సమాఖ్య, స్వతంత్ర్య న్యాయశాఖల వంటి సంస్థలను, ఎంతోకాలం వీటిని కొనసాగించిన బ్రిటిష్ పాలన మన దేశానికి తీసుకొచ్చింది.
  5. గాంధేయ ,తత్వాలు ఆదేశ సూత్రాల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి.
  6. భారతదేశం మత ప్రాతిపదికన విభజింపబడినప్పటికి ఇంకా భారతదేశంలో అనేక మతాల ప్రజలు ఉన్నందున భారతదేశంలో “లౌకిక” అనే భావనను 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినారు.
  7. భారతదేశంలో అల్పసంఖ్యాక ప్రజల రక్షణ కొరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచినారు.
  8. రైతులు, భూస్వాములకు వ్యతిరేకంగా వారి హక్కుల కొరకు చేసిన ఉద్యమాల నేపథ్యంగా ‘సామ్యవాదం’ అనే అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చుట జరిగింది.

ప్రశ్న 5.
రాజ్యాంగ సభను సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో ఎన్నుకుని ఉంటే రాజ్యాంగాన్ని రూపొందించటంలో అది ఎటువంటి ప్రభావాన్ని చూపించి ఉండేది? (AS1)
జవాబు:

  1. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు, రాజసంస్థానాలకూ జనాభా ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యం కల్పించారు. అదే విధంగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. అల్పసంఖ్యాక వర్గాల నుండి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి కూడా సభ్యులు రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. చైతన్యవంతులైనటువంటి నాయకులు రాజ్యాంగ సభకు ఎన్నికవడం మూలంగా, దేశంలోని ఏ వర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా దేశ ప్రజలందరిని పరిగణనలోకి తీసుకొని ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు.
  2. రాజ్యాంగ సభకు, వయోజన ఓటుహక్కు ద్వారా సభ్యులను ఎన్నుకున్నట్లయితే నిష్ణాతులైన, చైతన్యవంతులైన వారు ఎన్నిక కాకపోవచ్చు. తద్వారా అందరి ప్రయోజనాలకు అనుగుణమైన రాజ్యాంగం తయారై ఉండేది కాదు.
  3. వయోజన ఓటు హక్కు ద్వారా అన్ని వర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మరియు వయోజనులందరు ఎన్నికలో పాల్గొనే అవకాశం వచ్చేది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 6.
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి చిన్న వ్యాసం రాయంది. (AS1)
జవాబు:
భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు :
1) సార్వభౌమత్వం :
భారతదేశం అంతర్గతంగా, బాహ్యంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కలిగి ఉన్నదని తెల్పుతున్నది.

2) సామ్యవాదం :
రాజ్యం క్రమేణా అవసరం అయిన మార్పులను తెచ్చి సమసమాజాన్ని స్థాపించడం అని అర్థం. ఈ సామ్యవాదం అనే పదంను 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

3) పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విధానం :
శాసన, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంపై ఆధారపడి ప్రభుత్వం ఉంటే అది “పార్లమెంటరీ విధాన”మని అంటాం. ప్రజలచేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం.

4) సమాఖ్య విధానం :
ప్రభుత్వాధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ అయి ఉన్న ప్రభుత్వ విధానమే సమాఖ్య ప్రభుత్వం.

5) న్యాయం :
భారత రాజ్యాంగంలోని ఈ న్యాయం అనేది పౌరులకు రాజకీయ న్యాయం, ఆర్ధిక న్యాయం, సాంఘిక న్యాయం వంటి న్యాయాలను అందచేస్తుంది.

6) స్వేచ్ఛ, స్వాతంత్ర్యం :
ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మత స్వేచ్ఛ, ధర్మం మొదలైన స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పిస్తుంది.

7) సమానత్వం :
అసమానత్వాన్ని రూపుమాపకుండా వ్యక్తుల హక్కులకు హామీ ఇవ్వడం నిరర్ధకం. ప్రతి వ్యక్తి తన్ను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకొనుటకు సమానహోదా, అవకాశాలు కల్పించడం జరిగింది.

8) సంక్షేమ రాజ్యం :
ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలే. ప్రజల సంక్షేమానికి అవసరమైన చట్టాలను చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది.

ప్రశ్న 7.
దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఎలా నిర్వచించింది, వాటిని ఎలా మార్చింది? (AS1)
జవాబు:
రాజకీయ వ్యవస్థలకు సంబంధించి ఇతర దేశాల అనుభవాలను తీసుకొని, వాటిని మనదేశ పరిపాలనకు అనుగుణంగా మార్చుకొనుట జరిగింది. అవి :

1) పార్లమెంటరీ వ్యవస్థ :
ఈ పార్లమెంటరీ విధానాన్ని మనం బ్రిటిష్ పరిపాలన నుండి నేర్చుకున్నాం. దాదాపు 200 సంవత్సరాలు వారిచే పరిపాలించబడుట వలన ఆ విధానం మనదేశానికి అనుకూలంగా ఉంటుందని రాజ్యాంగం భావించి, పార్లమెంటరీ విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.

2) సమాఖ్య విధానం :
సమాఖ్య విధానం ప్రకారం అధికారాల విభజన అనేది మనం ‘కెనడా’ దేశం నుండి తీసుకున్నప్పటికీ, ఈ ‘అధికారాల విభజనకు మూలం అనేది “1935 భారత ప్రభుత్వ చట్టం” లోనే ఉంది. సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఈ రెండు కూడా వాటి పరిధిలో సర్వసత్తాకమైనవి. అయినప్పటికి భారత రాజ్యాంగం, ఈ సమాఖ్య విధానంలో కేంద్రాన్ని బలమైన సంస్థగా మార్చింది.

3) సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. ఈ అధ్యక్ష విధానం, అమెరికా అధ్యక్ష విధానానికి వేరుగా ఉంటుంది. ” అమెరికా అధ్యక్షుడు వాస్తవాధికారి, కాని భారత అధ్యక్షుడు ఇంగ్లాండు రాజువలె నామమాత్ర అధ్యక్షుడు. వాస్తవాధికారిగా ప్రధానమంత్రి, అతని ఆధ్వర్యంలో ఇతర మంత్రులు ఉంటారు.

4) అధికారాల విభజనలో కెనడా రాజ్యాంగాన్ని మూలంగా తీసుకొని, మన దేశానికి అనుకూలంగా మార్చుకున్నాం. ఏ విధంగా అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగాక మిగిలిన “అవశేషాధికారాలను” రాజ్యాంగం కేంద్రానికే కట్టబెట్టి బలమైన కేంద్రంగా తయారవడానికి ప్రయత్నించింది.

5) అమెరికాలో వలె మనదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు. భారతదేశంలో ఎక్కడ పుట్టినా, దేశ పౌరసత్వం లభిస్తుంది.

6) అమెరికాలో ద్వంద్వ న్యాయవ్యవస్థలున్నాయి. కాని మన సమాఖ్యలో ఏకీకృత న్యాయవ్యవస్థ మాత్రమే ఉంది.

ఈ విధంగా మన రాజ్యాంగం రాజకీయ వ్యవస్థలను నిర్వచించి, మన దేశానికి అనుగుణంగా వాటిని మార్చిందని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ప్రశ్న 8.
రాజ్యాంగంలో, మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ . వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
ఏ దేశ రాజ్యాంగంలో అయిన కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుందనే వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.

కారణాలు:
1) భారతదేశం మత ప్రాతిపదికన 1947లో భారత్, పాలుగా విడిపోయింది. అయితే భారతదేశంలో వివిధ మతాల ప్రజలు ఉన్నారు. ముస్లిం దేశంగా పాకిస్థాన్ విడిపోయినప్పటికి ఇంకా ముస్లిం జనాభా భారత్ లో అధికంగానే ఉంది. యూరోపియన్లు పరిపాలించుట మూలంగా క్రైస్తవమతం, సిక్కులు, పార్శీలు అత్యధిక సంఖ్యలో హిందువులు ఉన్నారు. మత ఘర్షణల మూలంగా వస్తున్న ధన, ప్రాణ నష్టాలను అధిగమించడానికి “లౌకిక” వాదంను మన రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. దీని మూలంగా భారతదేశం మత ప్రమేయం లేని దేశం అయింది.

2) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాలు, బడుగు, బలహీనవర్గాలు అనాదిగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎదుర్కొనుటకు చేసిన పోరాటాల ఫలితంగా “సామ్యవాదం” ను 1976 లో రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చినాము. అయినప్పటికి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగదు. సంక్షేమ రాజ్యమే ఆధునిక దేశాల లక్ష్యం. కాబట్టి సామ్యవాదాన్ని మన రాజ్యాంగంలో చేర్చుకొనుట జరిగింది.

3) తరతరాలుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను పరిష్కరించటానికి వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించుట జరిగింది. ప్రాథమిక హక్కులను అందరూ పొందే విధంగా న్యాయస్థానాల ద్వారా రక్షణ కల్పించినారు.

4) ‘అంటరానితనం’ కు ప్రజలు బలికాకూడదని, అంటరానితనం నేరమని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో 17వ ప్రకరణలో దానిని చేర్చినారు. ప్రాథమిక హక్కులలో చేర్చుట మూలంగా అంటరానితనం కొంతవరకు కనుమరుగైందని చెప్పవచ్చు.

5) భారత రాజ్యాంగం కల్పించిన అన్ని ప్రాథమిక హక్కులలో ఎక్కువ వివాదాస్పదమైనది ఆస్తి హక్కు. ఆస్తి హక్కును కొనసాగిస్తే సమానత్వాన్ని సాధించడం అసాధ్యమవుతుందని, దానిని తొలగించాలని సామ్యవాదులు భావించారు. ఆస్తి హక్కును పూర్తిగా తొలగించాలని కమ్యూనిస్టులు భావించారు. నిజమైన సామ్యవాద వ్యవస్థను స్థాపించడంలో ఆస్తి హక్కు అడ్డంకి కాకూడదని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా చేయుట జరిగింది.

10th Class Social Studies 17th Lesson స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం InText Questions and Answers

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 1.
భారత రాజ్యాంగానికి …………………………. ……… ప్రధానంగా దోహదం చేశారు.
జవాబు:
డా॥ బి.ఆర్. అంబేద్కర్, డా॥ బాబు రాజేంద్రప్రసాద్, మోతిలాల్ నెహ్రూ, బి.ఎన్.రావు.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 2.
లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది?
జవాబు:
“లింగం” అన్న పదాన్ని “నేపాల్” దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 3.
శాంతి కాముకతను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనబరిచింది?
జవాబు:
జపాన్ “శాంతి కాముకత”ను ఆ దేశ రాజ్యాంగ ప్రవేశికలో కనబరిచింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 4.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు ………… రోజులకు ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
జవాబు:
14 (ఆగస్టు 29, 1947)

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 5.
రాజ్యాంగ సభ ముందుగా …………………., ……….. …………………., …………………. వంటి ముఖ్యాంశాలపై ప్రత్యేక సంఘాలను నియమించింది.
జవాబు:

  1. యూనియన్ రాజ్యాంగ కమిటీ,
  2. కేంద్ర అధికారాల సంఘం,
  3. స్టీరింగ్ కమిటీ,
  4. రాష్ట్రాల రాజ్యాంగ సంఘం,
  5. ప్రాథమిక హక్కుల సంఘం.

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 6.
ఈ కమిటీల నివేదికలను డా॥ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న …………………… చర్చించి, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.
జవాబు:
ముసాయిదా సంఘం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 7.
డా॥ అంబేద్కర్ అధ్యక్షతన …… కమిటీ తీసుకున్న నిర్ణయాలను ముసాయిదా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
జవాబు:
డ్రాఫ్టింగ్,

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 8.
బ్రిటిష్ ప్రభుత్వం చేసిన …………….. అంశాలను కూడా ముసాయిదా తీసుకుంది.
జవాబు:
1935 భారత ప్రభుత్వ చట్టంలోని

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 9.
ఆ తరువాత విమర్శలకు, సూచనలకు దీనిని ……… నెలల పాటు ప్రజల ముందు ఉంచారు.
జవాబు:
8 నెలలు

10th Class Social Textbook Page No.237

ప్రశ్న 10.
ముసాయిదా రాజ్యాంగంలో ……………. అధికరణలు, …………… షెడ్యూళ్లు ఉన్నాయి.
జవాబు:
315, 8

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 11.
భారత అధ్యక్షునికి ఇచ్చిన అధికారాలు ……………. కి చెందిన ……………. కంటే …………….. కి చెందిన …………… అధికారాలకు దగ్గరగా ఉన్నాయి.
జవాబు:
అమెరికా, అధ్యక్షుడు, ఇంగ్లాండ్, రాజు

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 12.
భారత అధ్యక్షుడు ………….. సలహాలను పాటించేలా రాజ్యాంగ సభ రూపొందించింది.
జవాబు:
తన మంత్రుల

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 13.
సమాఖ్య రాజ్యతంత్రంలో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వాలు ఉంటాయి, భారతదేశ విషయంలో అవి ….. – స్థాయిలలో ఉన్నాయి. మీరు …………. రాష్ట్రానికి, …………. దేశానికి చెందుతారు.
జవాబు:
కేంద్ర ప్రభుత్వం కేంద్రస్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, భారత

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 14.
ఏ రకమైన రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి?
జవాబు:
ఏకీకృత రాజ్యాంగం కింద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలుంటాయి.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 15.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన అధికారాలను ఏ రకమైన రాజ్యాంగం ఇస్తుంది?
జవాబు:
సమాఖ్య విధాన రాజ్యాంగం,

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 16.
భారతదేశ రాష్ట్రాలు ఏ విధంగా “కేంద్ర ప్రభుత్వ పాలనా అంగాల శాఖలు కావు”?
జవాబు:
భారతదేశంలో రెండు రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. అవి 1) కేంద్ర ప్రభుత్వం 2) రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండింటికి రాజ్యాంగం కేటాయించే రంగాలలో అవి సర్వసత్తాక అధికారాలను కలిగి ఉంటాయి. కావున భారతదేశ రాష్ట్రాలు కేంద్రప్రభుత్వ పాలన అంగాల శాఖలు కావు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 17.
రాష్ట్రాలు తమ సొంత సివిల్ సర్వెంట్లను (అధికారులను) కలిగి ఉండే అధికారాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తుందా?
జవాబు:
కల్పించుట లేదు. అఖిల భారత సివిల్ సర్వెంట్లను కేంద్రప్రభుత్వమే నియమిస్తుంది. రాష్ట్రాలకు ఆ అవకాశం రాజ్యాంగం కల్పించలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 18.
ఒక రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వాళ్లేనా?
జవాబు:
కాదు. రాష్ట్రంలోని అధికారులందరూ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నుండి నియమింపబడిన వారు కాదు. కొందరిని కేంద్ర ప్రభుత్వం నియామకం చేస్తుంది. అవి అఖిల భారత సర్వీస్ కమిషన్ ద్వారా.

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 19.
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ ఏ మౌలిక ఆదర్శాలు పొందుపరచబడ్డాయి?
జవాబు:
భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ క్రింది మౌలిక ఆదర్నాలు పొందుపరచబడ్డాయి. ఇవి పౌరులందరికి సమానంగా వర్తిస్తాయి.

1) న్యాయం :
“పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం.”

2) స్వాతంత్ర్యం :
“ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని అందరికి అందించడం.”

3) సమానత్వం :
“అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చటం.”

4) స్వేచ్ఛ :
“పౌరులు స్వేచ్ఛాయుత జీవనం గడుపుటకు, ప్రతి వ్యక్తికి ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన, సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛలు అందరికీ అందించడం.

5) సౌభ్రాతృత్వం :
“పౌరులందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సఖ్యత నేర్పరచుటకు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 20.
రాజ్యాంగ ప్రవేశికలో ప్రజా ఉద్యమాలు ఎలా ప్రతిబింబించాయి?
జవాబు:
1) నేపాల్ రాజ్యాంగ ప్రవేశికలో, ఇప్పటివరకు ప్రజలు చేపట్టిన ఉద్యమాలు, చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం, శాంతి, ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ వర్గ, జాతిమూలాలు, ప్రాంత, లింగ వంటి సమస్యలను పరిష్కరించి దేశాన్ని ప్రగతిశీలంగా పునః నిర్మించటానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

2) జపాన్ ప్రజా ఉద్యమాల మూలంగా ప్రజలకు శాంతి, సహకారాలు, స్వేచ్ఛ, యుద్ధభూములు లేని దేశాన్ని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించారు.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 21.
రాజకీయ వ్యవస్థ స్వరూపానికి సంబంధించి ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:

  1. భారతదేశంలో వయోజన ఓటుహక్కు ద్వారా రాజకీయ న్యాయం పొందవచ్చు. 18 సం||లు నిండిన ప్రతి పౌరుడు ఆస్తి, విద్య మరియు ఏ ఇతర అర్హతలతో నిమిత్తం లేక రాజ్యవ్యవస్థ నిర్మాణ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
  2. నేపాల్ దేశంలో వయోజనులకు ఓటు హక్కు క్రమం తప్పకుండా ఎన్నికలు, రాచరిక పాలన రద్దు వంటి వాగ్దానాలు చేయబడినవి.
  3. రాజకీయ నైతికతకు సంబంధించిన చట్టాలు విశ్వజనీనమైనవి, తమ సర్వసత్తాకతను కొనసాగిస్తూ, ఇతర దేశాలతో సర్వసత్తాక సంబంధాలను సమర్థించుకుంటూ అన్ని దేశాలు ఈ చట్టాలను గౌరవించాలి. ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని జపాన్ దేశంలో వాగ్దానాలు చేశారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 22.
ఈ దేశాల పౌరులకు ఏ ఏ వాగ్దానాలు చేశారు?
జవాబు:
ఈ దేశాల పౌరులకు ఈ క్రింది వాగ్దానాలు చేశారు :
భారతదేశ పౌరులకు :
ప్రజలందరికి అన్ని రకాలైన న్యాయం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమానత్వాలు, సౌభ్రాతృత్వం మొదలైనవి ప్రజలందరు అనుభవించుటకు వీలుగా “థమిక హక్కులను” కల్పించారు.

నేపాల్ పౌరులకు :
ప్రజలందరికి పౌరస్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, వయోజనులకు ఓటుహక్కు, పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ వంటి వాగ్దానాలు నేపాల్ వారి పౌరులకు చేసింది.

జపాన్ పౌరులకు :
శాంతియుత సహకార ఫలాలు, యుద్ధభయం రాదని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్, వారి పౌరులకు వాగ్దానం చేసింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 23.
“భారతదేశ ప్రజలమైన మేము….” అన్న పదాలతో భారతదేశ రాజ్యాంగం మొదలవుతుంది. భారతదేశ ప్రజలందరికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోవటం సమర్ధనీయమేనా?
జవాబు:
సమర్థనీయమే, ఎందుకనగా “భారత ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెల్పును. రాజ్యాంగాన్ని “చర్చించి, శాసనం చేసుకొని, మాకు మేము” సమర్పించుకుంటున్నాము అనే భావన రాజ్యాంగ పరిషత్తు – ప్రజలకు ప్రాతినిధ్యం వహించిందని తెలియచేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 24.
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటే ఎవరెవరు అందులో భాగస్వాములు కావాలి, ఎలా భాగస్వాములు కావాలి?
జవాబు:
1) భాగస్వాములుగా ఉండాల్సిన వారు :
పాఠశాల మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయవలసి వస్తే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ వర్గం నుండి కొంతమంది, ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని రూపొందించాలి.

2) భాగస్వామ్యం :
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) సబ్జెక్టువారీగా, ప్రతి సబ్జెక్టు నుండి ఒక ఉపాధ్యాయుడు’
సి) ఉపాధ్యాయేతర సిబ్బంది నుండి ఒకరు చొప్పున భాగస్వాములుగా ఉండి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

10th Class Social Textbook Page No.238

ప్రశ్న 25.
బ్రిటన్ రాజు, భారత అధ్యక్షుడి స్థానాలలో తేడా ఏమిటి?
జవాబు:

భారత అధ్యక్షుడుబ్రిటన్ రాజు
1) భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు.1)రాజ్యా నికి అధిపతి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
2) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు.2) కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కాదు. దేశాన్ని పాలించడు. అతడి స్థానం అలంకారప్రాయం.
3) భారత అధ్యక్షుడు తన మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటాడు.3)రాజు ముద్ర ద్వారా దేశ నిర్ణయాలను తెలియచేసారు.

10th Class Social Textbook Page No.239

ప్రశ్న 26.
భారత రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వ (దేశ, రాష్ట్ర విధానాన్ని ఎందుకు తిరస్కరించారు?
జవాబు:
భారత రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థను మనం రూపొందించుకున్నప్పటికి కేంద్రానికి, రాష్ట్రానికి వేరువేరుగా రాజ్యాంగాలు లేవు. దేశానికంతటికి ఒకే రాజ్యాంగం, అదే విధంగా ఒకే పౌరసత్వాన్ని కల్పించుట జరిగింది. ఒకే పౌరసత్వం మూలంగా ప్రజలందరిలో ఐకమత్యం పెంపొందించడానికి వీలుంటుంది. దేశ సమగ్రత, దేశ సమైక్యత కూడా పటిష్ఠంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లయితే ప్రజలు దేశ పౌరసత్వానికంటే తన రాష్ట్ర పౌరసత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని రాజ్యాంగ రూపకర్తలు ద్వంద్వ పౌరసత్వాన్ని తిరస్కరించినారు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 27.
పై చర్చల్లో ఏ అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యా యి?
జవాబు:

  1. పై చర్చలో అంటరానితనానికి సంబంధించి భేదాలు వ్యక్తమయ్యాయి.
  2. ‘అంటరానితనం’ అనగా కొన్నిసార్లు ‘హరిజనులకు’ ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. కొన్నిసార్లు ‘ అది అన్ని కులాలు కలిసి భోజనం చెయ్యటంగా పరిగణించబడుతుంది.
  3. అంటరానితనం అనేది కులవ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే.
    ఈ విధమైన అభిప్రాయ భేదాలు వ్యక్తమయ్యాయి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 28.
ఈ చర్చలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే, మీరు ఏ పరిష్కారాన్ని సూచిస్తారు?
జవాబు:
ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు లభిస్తే, ‘అంటరానితనం’ అనే పదం ఏ రూపంలో ఉన్నా నేరమని చెపుతాను. – అంటరానితనం, కులం అనే పదాలను సమూలంగా తొలగించాలంటాను. అంటరానితనం అనే దురాచారం తరతరాలుగా సమాజం నుండి అనేకమంది వెలివేయబడుతున్నారు. ఇది సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు. కావున ఈ పదాలను పూర్తిగా నిర్మూలించాలి.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 29.
ఈ పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా పొందుపరచడం ఒక మంచి ఆలోచన అని మీరు భావిస్తున్నారా ? మీ వాదనకు కారణాలను తెల్పండి.
జవాబు:
‘అంటరానితనం’ అనే పదాన్ని రాజ్యాంగంలో నిర్వచించకుండా, దానిని పొందుపరచడం మంచిదే అని నేను భావిస్తున్నాను. ఎందుకనగా విశాలమైన భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రకరకాలైన అర్థాలున్నాయి. కావున అంటరానితనాన్ని నిర్వచించకపోవడమే సమంజసం. అయితే రాజ్యాంగంలోని 17వ ప్రకరణ- అంటరానితనం నేరమని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.245

ప్రశ్న 30.
‘కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది’ అనే విషయంతో మీరు ఏకీభవిస్తారా ? ఇది ఏ విధంగా చేసి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
కేవలం అంటరానితనమే కాకుండా రాజ్యాంగం కులవ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలకు అంతం పలికుండాల్సింది అనే విషయంతో నేను ఏకీభవిస్తాను. కులాల ప్రసక్తి లేకుండా వ్యక్తుల యొక్క ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా ప్రజలను విభజించినట్లయితే బాగుండేదని నా అభిప్రాయం. దీనివల్ల సమాజం కులాల ప్రాతిపదికన విభజింపబడేది కాదు. కులాల ప్రసక్తి వచ్చేది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.232

ప్రశ్న 31.
భారతదేశ రాజ్యాంగ ప్రవేశికతోపాటు కింద ఇచ్చిన రెండు దేశాల ప్రవేశికలను చదివి వాటిల్లో పోలికలు, తేడాలు పేర్కొనండి. తమ దేశం ఏర్పడటానికి దారితీసిన రాజకీయ ఘటనలను ప్రతిబింబించటానికి ప్రతి రాజ్యాంగమూ ప్రయత్నిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజ్యాంగంలో చోటు చేసుకున్న వాటిని ప్రభావితం చేసిన రాజకీయ ఘటనలను గుర్తించటానికి ప్రయత్నించండి. జపాన్ నేపథ్యాన్ని అర్థం చేసుకోటానికి 13వ అధ్యాయంలో జపాను గురించి మరొకసారి చదవండి. నేపాల్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవటానికి 234వ పేజీ చూడండి.
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలోని పోలికలు :
1) ప్రాథమిక హక్కులు, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉండడం, పౌర స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, దేశ సమగ్రత, పౌరులకు స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం వంటి లక్షణాలు భారతదేశం మరియు నేపాల్ రాజ్యాంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. జపాన్ రాజ్యాంగంలో సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందనే లక్షణం మాత్రమే సారూష్యంగా కనిపిస్తుంది.

తేడాలు :

భారత రాజ్యాంగంనేపాల్ రాజ్యాంగంజపాన్ రాజ్యాంగం
భారత రాజ్యాంగం వ్యక్తికి స్వేచ్ఛ, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాలను అన్ని రంగాలలో ఇస్తుంది.ప్రజలకు జాతి, వర్గ, ప్రాంత, లింగం అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, రాచరిక పాలన రద్దు వంటివి నేపాల్ రాజ్యాంగం తెలుపుతుంది.జపాన్ రాజ్యాంగం, రానున్న తరాలకు వంటి యుద్ధ భయంలేని దేశాన్ని, శాంతిని, వాటి ఫలాలను అందించడానికి కృషి చేస్తామని తెలియచేస్తుంది.

10th Class Social Textbook Page No.233

ప్రశ్న 32.
ఈ దేశాల రాజకీయ నేపథ్యాలలో పోలికలు, తేడాలు ఏమిటి? అంతకు ముందు ఘటనలు ఏమిటి? అంతకు ముందు పాలకులు ఎవరు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాల రాజకీయ నేపథ్యంలో ఈ క్రింది పోలికలు, తేడాలు కనిపిస్తున్నాయి.
తేడాలు :

  1. భారతదేశం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నది.
  2. నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరంతర పోరాట ఫలితంగా రాచరికం రద్దయి, ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చింది.
  3. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్, సామ్రాజ్యకాంక్షతో యూరోపియన్ దేశాలతో పోటీ పడుతూ ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవడానికి అనేక యుద్ధాలు చేసింది. జపాన్ ప్రజలకు యుద్ధభయాన్ని కలుగచేసింది. ఇటువంటి నేపథ్యంలో జపాన్, జపాన్ ప్రజలకు శాంతిని, యుద్ధభయం లేనటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటామని జపాన్ రాజ్యాంగం తెల్పుతుంది.

పోలికలు:

  1. “ఈ మూడు దేశాల రాజ్యాంగాలను, ఆ దేశ ప్రజలు తమకు తామే ఇచ్చుకున్నాం” అనే పోలిక భారత్, నేపాల్, జపాన్ రాజ్యాంగాలలో కనిపిస్తుంది.
  2. భారత్, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు అనేక భయాలకు, కష్టాలకు, సమస్యలకు లోనయి ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.

అంతకు ముందు ఘటనలు :

  1. 1947కు ముందు భారతదేశం బ్రిటీషు వారి పరిపాలనలో ఉంది. స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి.
  2. నేపాల్ 2007కు ముందు రాచరికపాలనలో ఉంది. ప్రజాస్వామ్యం కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి.
  3. 1945కు పూర్వం రాచరిక ప్రభుత్వాల వలన జపాన్ రెండు ప్రపంచయుద్ధాలలో పాల్గొని అపార నష్టాన్ని చవిచూసింది. – 1945లో రెండవ ప్రపంచయుద్ధం తరువాత జపాన్ ప్రజాస్వామ్య దేశమైనది.

అంతకు ముందు పాలకులు :
రాజ్యాంగాలను రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ఉంది. నేపాల్ లో నిరంకుశ రాచరికం ఉంది. జపాన్లో సామ్రాజ్యకాంక్ష ఉన్న నాయకత్వం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 33.
గతం పట్ల సమీక్షలో వివిధ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్ ప్రవేశికలలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పోలికలు :
భారతదేశం, నేపాల్, జపాన్ దేశాలలోని ప్రజలు తరతరాలుగా రాజరికం నిరంకుశ పాలనతో విసిగిపోయి ఉన్నారు. అయితే భారతదేశంలో రాచరికాలకు తోడు బ్రిటిష్ వలస పాలన కూడా తోడైంది. జపాన్లో షోగునేట్ పాలన అంతమవడంతో కొంత అభివృద్ధి జరిగింది.

తేడాలు :

  1. భారత్, నేపాల్, దేశాలలో రాచరికాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. భారతదేశంలో అయితే వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది.
  2. జపాన్ “మిజి”ల పరిపాలనలో అభివృద్ధి సాధించినప్పటికీ జపాన్ చేసిన యుద్దాల మూలంగా ప్రజలలో యుద్ధభయం, 2వ ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబులు భయాన్ని పుట్టించాయి.

10th Class Social Textbook Page No.234

ప్రశ్న 34.
మూడు దేశాల్లో భవిష్యత్తు సమాజం గురించి ఎటువంటి వాగానాలు చేశారు?
జవాబు:
భారతదేశం, నేపాల్, జపాన్లలో భవిష్యత్తు సమాజం గురించి చేసిన వాగ్దానాలు :

1) భారతదేశం :
సార్వజనీన అక్షరాస్యత, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఆదాయ అసమానతలను తగ్గించటం, ప్రాథమిక హక్కులను అందరికి వర్తింపచేయటం. “న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలందరికి వర్తిస్తాయని వాగ్దానం చేసింది భారత ప్రభుత్వం.

2) నేపాల్ :
పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల వంటివాటి నిర్మాణం, అధికారాలను పేర్కొనటం, ప్రభుత్వమూ, సమాజమూ కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించటం వంటి వాటిని నేపాల్ దేశం ప్రకటించింది.

3) జపాన్ :
రానున్న తరాలకు అన్ని దేశాలతో శాంతియుత సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా సహకారం లభించాలని, ప్రభుత్వ చర్యల ద్వారా ఎన్నడూ యుద్ధభయాలు తిరిగి దేశాన్ని కమ్ముకోవని, సర్వసత్తాక అధికారం ప్రజలలో ఉంటుందని జపాన్ తెలియచేస్తూ రాజ్యాంగాన్ని ప్రకటించింది.

10th Class Social Textbook Page No.236

ప్రశ్న 35.
దేశం మొత్తానికి రాజ్యాంగాన్ని రూపొందించటంలో భారతదేశ ప్రజలందరూ పాల్గొనగలరా ? ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాల్సిన అవసరం ప్రజలందరికీ ఉందా లేక కొంతమంది విజ్ఞులకు ఈ బాధ్యత అప్పగిస్తే సరిపోయేదా?
జవాబు:

  1. రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోలేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే ఓటుహక్కు ఉండేది.
  2. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని ప్రజలు లేక వారి ప్రతినిధులు రూపొందిస్తారు. కావున మనదేశంలో ప్రజా ప్రతినిధులు రూపొందారు.
  3. ప్రజలందరూ రాజ్యాంగ రూపకల్పనలో క్రియాశీలంగా పాల్గొనవలసిన అవసరం లేదు. ప్రజలందరికి విద్య లేదు. విజ్ఞానం కూడా అందరికి ఉండదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు శాస్త్ర, విజ్ఞాన, విద్యా రంగాల నిష్ణాతులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. కావున ఇటువంటి విజ్ఞులు కొంతమందికి రాజ్యాంగ రూపకల్పన బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 36.
భారతీయ సమాఖ్య వ్యవస్థకూ, అమెరికా సమాఖ్య వ్యవస్థకూ మధ్యగల ముఖ్యమైన తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారత్, అమెరికాల సమాఖ్య వ్యవస్థలో ఈ క్రింది తేడాలున్నాయి.

భారత సమాఖ్య వ్యవస్థఅమెరికా సమాఖ్య వ్యవస్థ
1) పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది.1) అధ్యక్ష వ్యవస్థ ప్రభుత్వం అంటారు.
2) కేంద్రరాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖలో అంతర్భాగం.2) ఫెడరల్ ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వమని ద్వంద్వ ప్రభుత్వాలుంటాయి. కార్యనిర్వాహకశాఖ అనగా అధ్యక్షుడు, అతని సలహాదారులు. శాసననిర్మాణం శాఖలో అంతర్భాగం కాదు.
3) భారత సమాఖ్యలో అధ్యక్షుడు, రాజ్యా నికి అధిపతి, కాని పరిపాలన బాధ్యత ఉండదు.3) పరిపాలన బాధ్యత అంతా అధ్యక్షుడి క్రింద ఉంటుంది.
4) అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు.4) అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ సెక్రటరీలు ఉంటారు.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 37.
అమెరికాలో కేంద్ర ప్రభుత్వ న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ వేరు వేరు. భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాల న్యాయవ్యవస్థలు సమగ్ర న్యాయవ్యవస్థలో ఒక భాగం – వివరించండి.
జవాబు:
అమెరికాలో సమాఖ్య న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ రెండూ వేరు, వేటికవి స్వతంత్రమైనవి. అయితే భారత సమాఖ్యలో రాజ్యాంగం రెండు స్థాయిలలో న్యాయస్థానాలను ఏర్పాటు చేయలేదు. మనది ఏకీకృత, సమగ్ర న్యాయవ్యవస్థ.

  1. సుప్రీంకోర్టు విచారణ పరిధి కిందకు యావత్ దేశం వస్తుంది. కేంద్ర పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన చట్టాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తుంది.
  2. రాష్ట్రస్థాయిలో పనిచేసే హైకోర్టుకు కూడా శాసనసభ కార్యనిర్వాహక చర్యల రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం ఉంది.
  3. సుప్రీంకోర్టు, హైకోర్టులకు ‘రిట్’ లను జారీ చేసే అధికారం ఉంది.
  4. సుప్రీంకోర్టు, హైకోర్టు వాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు.
  5. సుప్రీంకోర్టు నిర్ణయాలు యావత్ భారతదేశానికి వర్తిస్తాయి. అన్ని న్యాయస్థానాలు ఈ తీర్పులను పాటించాలి.
  6. హైకోర్టులు కింది న్యాయస్థానాలపై అజమాయిషీ చేస్తాయి.
  7. అదే విధంగా ఏ న్యాయస్థానం తీర్పునైనా తాత్కాలిక నిలుపుదల ఉత్తరువు ఇవ్వవచ్చు. దానిని పరిశీలించి తిరిగి విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

ఉన్నత న్యాయవ్యవస్థ నిర్మాణం హైకోర్టులతో సహా కేంద్ర ప్రభుత్వ పరిధి కిందకు వస్తుంది. పార్లమెంటు హైకోర్టు అధికార పరిధిని పెంచవచ్చు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉంది. వీటిని బట్టి మనకర్ధమవుతున్నదేమిటంటే భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ నిర్మాణంలో ఏకీకృత పద్ధతిని అనుసరించింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 38.
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
సేథ్ అభిప్రాయాలు, ముసాయిదా రాజ్యాంగానికి మధ్య పోలికలు :

  1. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదని సేథ్ వాదించారు. ముసాయిదా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు వయోజన ఓటుహక్కు ద్వారా ఎన్నుకోబడలేదు.
  2. ముసాయిదా రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని ప్రతిపాదిస్తుంది. సేథ్ కూడా అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. అధికార కేంద్రీకరణ జరిగితే ఫాసిస్ట్ ఆదర్శాల వైపు నిరంకుశ అధికారంగా మారుతుందని అన్నాడు. మన రాజ్యాంగం కేంద్రరాష్ట్రాల మధ్య అధికారాన్ని వికేంద్రీకరించింది.
  3. గ్రామ పంచాయితీల గురించి ప్రస్తావన లేదని సేథ్ విమర్శించారు. ముసాయిదా రాజ్యాంగంలో గాంధీజీ కలలు కన్న గ్రామాల గురించి విస్మరించినారు.

తేడాలు :

  1. సేథ్ అధికార కేంద్రీకరణ జరిగిందని వాదించారు. వాస్తవానికి ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారం అనేది పంచబడింది.
  2. అధికార కేంద్రీకరణ ఎక్కువైతే ఫాసిజం వైపు మళ్ళుతుందని సేథ్ అన్నాడు. అయితే ముసాయిదా రాజ్యాంగంలో పార్లమెంటరీ సమాఖ్య విధానంతో ప్రజాస్వామ్యం వైపు వెళుతున్నామని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.242

ప్రశ్న 39.
రాజ్యాంగానికి 73వ సవరణ చేసిన తరువాత గ్రామాలకు ఎటువంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలుసుకోండి.
జవాబు:
1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేయుట జరిగింది.

73వ సవరణతో గ్రామాలకు స్వయంప్రతిపత్తి :

  1. గాంధీజీ ఆశించిన గ్రామాలకు రాజ్యాంగంలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. 1992లో రాజ్యాంగానికి 73వ సవరణ చేసి ఆర్టికల్ 40లో ఈ గ్రామపంచాయితీలను చేర్చారు.
  2. ఆర్టికల్ 40 నిర్దేశిక నియమాలలోనిది. గాంధీజీ ఆశించినట్లు ప్రతి గ్రామం “ఒక రామరాజ్యం ” కావాలని ఈ సవరణ చేసి గ్రామపంచాయితీలకు ప్రాధాన్యత కల్పించారు.
  3. ఈ 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీ సభ్యులు, అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కావాలి.
  4. గ్రామ పంచాయితీకి అవసరం అయిన నిధులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి.
  5. సర్పంచ్ వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 40.
AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం 1
1950, జనవరి 26 నాటి వార్తాపత్రిక. ఈ పేజీలో ఏ ఏ అంశాలు ఉన్నాయో వ్యాఖ్యానించండి.
జవాబు:
ది స్టేట్స్మ న్ అనే వార్తాపత్రికలో క్రింది అంశాలు కనిపిస్తున్నాయి.

  1. భారతదేశం ఈ రోజు గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రజలందరు ఓర్పు, సహనాలను కలిగి ఐకమత్యంగా ఉండాలని నెహ్రూ ప్రజలకు పిలుపునిచ్చాడు. అన్ని దేశాలను స్నేహ సంబంధాల కొరకు ఆహ్వానించాడు.
  2. సుకర్నో భారత ఎం.పి.లను ఉద్దేశించి మాట్లాడినాడు. భారతదేశం కొత్త గణతంత్రదేశంగా ఆవిర్భవించినందుకు శుభాకాంక్షలు తెలిపినారు.
  3. భారత రాజ్యాంగంలోని “ప్రవేశిక” ను ప్రచురించినారు.
  4. కలకతాలో ఈ రోజు ప్రోగ్రాం అనే వార్తతో ఆ రోజు కార్యక్రమాలను ఇచ్చినారు.
  5. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నారు.
  6. “హౌర” గ్రామంలో గన్‌మెన్, ఇద్దరు పోలీసులను చంపినాడు.
  7. “కలకతా నుండి గౌహతి” వెళుతున్న విమాన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించినారు.
  8. “ఇంపీరియల్ కెమికల్ ఇండియా” వారి ఫర్నీచర్‌కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ప్రచురించబడింది.

AP Board 10th Class Social Solutions Chapter 17 స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

10th Class Social Textbook Page No.246

ప్రశ్న 41.
భారత రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి మీరు గుర్తించిన ఉదాహరణలు, వివరణలు పేర్కొనండి.
జవాబు:
రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సంబంధించి నేను గుర్తించిన అంశాలు :
1) వయోజనులందరికి ఓటుహక్కు ఉండడం, వారి ఓటుతో తమకు కావలసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనే సార్వభౌమాధికారం ప్రజలలో ఉందని తెలుపుతుంది.

2) “సామ్యవాదం” :
ప్రజలందరూ, సమానత్వాన్ని అనుభవించాలంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి, దానిని సాధారణ, చట్ట హక్కుగా చేసినారు. ఇదంతా సామ్యవాద సమాజాన్ని స్థాపించుట కొరకే.

3) న్యాయం :
ప్రతి వ్యక్తికి రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాలను రాజ్యాంగం కల్పించింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయిన వయోజనుడైతే ఎన్నికలలో పోటీచేయవచ్చు. పేదరిక నిర్మూలన సమాన ప్రాతిపదికపై సంపద పంపిణీ, కుల, మత, వర్గ, స్త్రీ, పురుష, అల్పసంఖ్యాకులనే భేదం లేకుండా అందరికి సమాన న్యాయం కల్పించబడింది.

4) స్వేచ్ఛ :
ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ప్రతి వ్యక్తికి భావప్రకటన తన ఇష్టం వచ్చిన మతాన్ని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నది.

5) ప్రాథమిక హక్కులు :
ప్రతి వ్యక్తి రాజ్యాంగం తనకు కల్పించిన ప్రాథమిక హక్కులు అనుభవించవచ్చు. ఏ కారణాల వలన అయిన తమ హక్కులకు భంగం కలిగినట్లైతే న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు.

న్యాయస్థానాలు వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయని నేను గమనించాను.

AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు

10th Class Social Studies 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సామాజిక ఉద్యమాలపై ఒక పట్టిక తయారు చెయ్యటానికి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక తయారుచేసి వివిధ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను గుర్తించండి.
ఉద్యమం దృష్టి పెట్టిన ప్రధాన అంశం; ఎక్కడ జరిగింది; ప్రధాన కోరికలు; నిరసన తెలియచేసిన పద్ధతులు; ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వం స్పందించిన తీరు; సమాజంపై ఉండే ప్రభావం. (AS3)
జవాబు:

ప్రశ్న 2.
కన్నయ్య, రమ్య, సల్మా ఒక విషయాన్ని చర్చిస్తున్నారు. వాళ్ల కోరికలు వేరు. మానవ హక్కుల కోణం నుంచి మీరు ఎవరితో ఏకీభవిస్తారో పేర్కొని మీ కారణాలను తెలియచెయ్యండి.
ప్రజలు పేదరికంలో మగ్గకుండా చూడాలి, అందుకు అవసరమైతే పత్రికా స్వేచ్ఛను కొంతవరకు నియంత్రించినా ఫర్వాలేదని రమ్య అంటుంది. ఆహారం ఒక్కటే ఉంటే చాలదని, పత్రికా స్వేచ్ఛ కూడా ఉండటం ముఖ్యమని లేకపోతే దేశ వివిధ ప్రాంతాలలో మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘింపబడుతున్నాయేమో తెలిసే మార్గమే ఉండదన్నది సల్మా వాదన. పత్రికలు ధనికులు, శక్తిమంతుల చేతుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం ఏమిటి, అవి సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలను ఎందుకు ప్రచురిస్తాయని కన్నయ్య అంటాడు. (AS2)
జవాబు:
నేను సల్మా వాదనతో ఏకీభవిస్తాను. ఎందుకనగా

  1. ప్రతివ్యక్తికి ఆహారం ముఖ్యమే, అయినా స్వేచ్ఛ కూడా ముఖ్యమే.
  2. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. పత్రికా స్వేచ్ఛ అనగా, భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది ఒక ప్రాథమిక హక్కు
  3. ప్రతీ వ్యక్తికి ప్రాథమిక హక్కులు అవసరం. ప్రజలకు ఆహారం ఒక్కటే ముఖ్యం కాదు. పత్రికా స్వేచ్ఛతో ప్రపంచం నలుమూలలా ఏం జరిగినా తెలుసుకోగలుగుతారు. అదే విధంగా మానవ హక్కులు ఎక్కడైనా ఉల్లంఘించ బడుతున్నాయేమో తెలుసుకోవచ్చు.
  4. ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా అవసరం.
  5. సమాజంలో జరిగే విషయాలు తెలుసుకొని, పాల్గొనడానికి పత్రికా స్వేచ్ఛ ఉండాలి.
  6. మానవ హక్కులకు రక్షణ చాలా అవసరం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 3.
సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలు ఏమిటి?
జవాబు:

  1. వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం.
  2. ప్రజలకు స్వేచ్ఛాపూరిత, భావ ప్రకటన వంటివి.
  3. పర్యావరణ ఉద్యమాలలో – నష్టపరిహారం, పునరావాసం.
  4. సారా వ్యతిరేక ఉద్యమాలు.
  5. మైరా పైబీ ఉద్యమంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరటం జరిగింది.
  6. సామాజిక ఉద్యమాలన్నీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం పనిచేస్తాయి.
  7. కొన్ని సందర్భాలలో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి.
  8. మార్టిన్ లూథర్ కింగ్, మైరా పైబీ వంటి కొన్ని ఉద్యమాలు మార్పును కోరుకున్నాయి.

ప్రశ్న 4.
పైన ఇచ్చిన ఉదాహరణలో సాధారణ ప్రజల పాత్రను ఎలా పేర్కొన్నారు?
జవాబు:

  1. సాధారణ ప్రజలు ముందుగా వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తారు.
  2. ప్రభావిత ప్రజలు, వారి సమస్యలను తీర్చే నాయకుల వద్ద వెలిబుచ్చుతారు.
  3. ప్రజలు, వారి అభిప్రాయాలను ప్రజా ప్రతినిధుల ద్వారా వినిపిస్తారు.
  4. ప్రజలు వారి నాయకులు ప్రారంభించిన ఉద్యమాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, పికెటింగ్ వంటి వాటిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు.
  5. ఈ మధ్యకాలంలో ప్రజలు, ఇంటర్నెట్, సాంఘిక ప్రచార సాధనాల వల్ల చైతన్యవంతులవుతున్నారు. వారి సమస్యల సాధన కొరకు పోరాడుతున్నారు.
  6. ప్రస్తుత కాలంలో ప్రజలు వారి సమస్యలే కాకుండా సమాజ సమస్యలు అనగా పర్యావరణం, కాలుష్యం, పునరావాసం, నష్టపరిహారం వంటి సమస్యల పట్ల మరియు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్న ప్రజలకు కూడా సహకారం అందిస్తూ, ఆయా ఉద్యమాలలో భాగస్వాములు అవుతున్నారు.
  7. సామాన్య ప్రజల సహకారం, భాగస్వామ్యం లేనిదే సాంఘిక ఉద్యమాలు విజయం సాధించలేవు.

ప్రశ్న 5.
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
అమెరికాలోని నల్లజాతీయులు, మైరా పైబీ ఉద్యమాల మధ్య ఉన్న తేడాలు :

అమెరికాలోని నల్లజాతీయులుమైరా పైబీ ఉద్యమం
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి.1) సాయుధ ధళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చెయ్యాలని మైరా పైబీ ఉద్యమం కోరుతుంది.
2) మంచి గృహ వసతి.2) మహిళలు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నారు.
3) స్త్రీ, పురుషులందరూ పాల్గొన్నారు.3) ఎన్నికలను బహిష్కరించారు.
4) ఓటు హక్కు4) వీరు కేవలం కిరోసితో తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉపయోగించారు.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే విద్యా సదుపాయాలు వంటివి నల్లజాతీయుల కోరికలు.5) రాత్రిళ్లు కాపలా కాసేవారు.
6) ప్రదర్శనలు, నిరసనలు, ఊరేగింపుల ద్వారా ఉద్యమాన్ని నడిపారు.

పోలికలు:

అమెరికాలోని నల్లజాతీయులుమైరా పైబీ ఉద్యమం
1) పౌరహక్కుల చట్టాన్ని చేయవల్సిందిగా కోరారు.1) మానవ హక్కుల ఉద్యమంగా మారింది.
2) తమను పట్టించుకొనుటలేదని మహిళలు భావించారు.2) మహిళలు మాత్రమే ఉద్యమం చేశారు.
3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.3) మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది.

ప్రశ్న 6.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రాజకీయ వ్యవస్థలుగా ప్రజాస్వామ్యాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలకు పూర్తి న్యాయం చేశాయా? ఈ అధ్యాయంలో ఇచ్చిన ఉదాహరణల ఆధారంగా ‘ప్రజాస్వామ్యం సామాజిక ఉద్యమాలు’ అన్న అంశంపై చిన్న వ్యాసం రాయండి. (AS4)
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 1
జవాబు:
“ప్రజాస్వామ్యం – సామాజిక ఉద్యమాలు” :
ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ఉన్నాయి. ఇవి ప్రజల ఆకాంక్షలను పూర్తిగా న్యాయం చేయలేదనడానికి నిదర్శనమే సామాజిక ఉద్యమాలు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలే ప్రజలను వివక్షతతో చూస్తున్నాయి. కొందరికి మానవ హక్కులను – ఉల్లంఘిస్తున్నాయి, సామాజిక న్యాయాన్ని చేకూర్చుట లేదు.
ఉదా :
అమెరికా పౌరహక్కుల ఉద్యమం. (నల్లజాతి వారిని ప్రభుత్వం వివక్షతతో చూడడం) దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షత చాలాకాలం సమాన హక్కులకు దూరంగా ఉన్నవారు సామాజిక ఉద్యమాలను లేవనెత్తుతారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుండి అనేక దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. ఇటువంటి దేశాల ప్రజలు వలస పాలనతో ఇబ్బందులను అనుభవించి, తమ కష్టాలను తీర్చే ప్రభుత్వాలను ఆశించారు. కాని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రజల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా అణుయుద్ధాలు చేశాయి. ఆయుధసమీకరణ చేసి, ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత అణ్వాయుధాలను నిషేదించినప్పటికి ప్రజలకు శాంతి, భద్రతలను కల్పించలేకపోయాయి. ఇటువంటి తరుణంలోనే ప్రజలు ప్రభుత్వాలను వ్యతిరేకించారు. అనేక ఉద్యమాలను లేవదీశారు. ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, సామాజిక న్యాయం కల్పించకపోవడం, వివక్షతను పాటించటం వంటి సమస్యలు ఉద్యమాలకు కారణాలని చెప్పవచ్చు. ఇటువంటి సమస్యల సాధనలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం అయ్యాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 7.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి వాటి నేపథ్యంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎలా సమీకరిస్తారో తెలుసుకుని, చర్చించండి. (AS3)
జవాబు:
వివిధ ఉద్యమాలలో ప్రజలను వివిధ రకాలుగా సమీకరించుట జరిగింది. వాటిలో నుండి కొన్ని :
1) భోపాల్ గ్యాస్ దుర్ఘటన చాలా తీవ్రమైనది. ఇది భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ తరువాత దీనిని ‘డౌ’ కంపెనీకి అమ్మేశారు. ఏమీ తెలియని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఒకరాత్రి కంపెనీ నుండి విషవాయువు వెలువడి వేలాదిమంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికి వేలాది మంది బాధపడుతున్నారు. అయితే ఈ కంపెనీ బహుళజాతి కంపెనీ. ఇది అమెరికాలో ఉంది. ఈ దుర్ఘటనలో బాధితులకు సరైన నష్టపరిహారం, వైద్య సదుపాయాలు కల్పించలేదు. ఈ కంపెనీ మీద పోరాటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగిస్తున్నారు. లండన్ ఒలింపిక్స్ క్రీడలకు ‘ఔ’ కంపెనీ స్పోన్సరు చెయ్యటానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతకాలు సేకరిస్తున్నారు.

2) ‘నర్మదా బచావో’ ఉద్యమంలో నిర్వాసితులైన ప్రజలకోసం ఉద్యమ నాయకులు. ‘బావా మహలియా’, మేధాపాట్కర్ వంటి నాయకులు పోరాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమంలోకి భాగస్వాములను చేశారు. దీని కొరకు తీవ్ర నిరసనలు, ప్రదర్శనలు, నిరాహారదీక్షలు అంతర్జాతీయ ఉద్యమాల ద్వారా ప్రజలను సమీకరించారు.

3) కేరళలోని ‘సైలెంట్ వ్యాలీ’ ఉద్యమం విషయంలో అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని అనేకమంది విద్యావంతులు గ్రహించారు. వీటి రక్షణ కొరకు పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికీ, విద్యకోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (కెఎఎపి) రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించింది.

4) అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో వివక్షతకు గురి అవుతున్న నల్లజాతీయులే ఈ ఉద్యమాన్ని లేవదీసారు.

5) యూరపులో గ్రీన్ పీస్ ఉద్యమంలో అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైనది. దీనిలో స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలకు విస్తరించింది.

6) సారా వ్యతిరేక ఉద్యమంలో పేదవారు, ఈ సమస్యకు ప్రభావితమవుతున్నా మహిళలు పాల్గొన్నారు. ‘సాక్షరతా’ పుస్తకాల ద్వారా ఉద్యమ విషయాలు తెలుసుకుని అనేక గ్రామాలలోని మహిళలు ఈ ఉద్యమంలోకి వచ్చారు.

7) మైరా పైబీ ఉద్యమం తీసుకువచ్చింది మణిపూర్ మహిళలు. సాయుధ దళాలకు ఉన్న ప్రత్యేక అధికారాల చట్టం మూలంగా తరచు మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇందుకు నిరసనగా సాయుధ దళాలకు ప్రత్యేక అధికార చట్టాలను రద్దుచేయాలని మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు.

8) ప్రస్తుత కాలంలో నిరసనలు, ఉద్యమాలకు ప్రజలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇ-మెయిల్, ఇంటర్నెట్, వార్తాపత్రికలు వంటి వాటి ద్వారా సమీకరిస్తున్నారు.

10th Class Social Studies 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 1.
గ్రీన్‌పీస్ ఉద్యమం వెబ్ సైట్ చూసి (http:/www.greenpeace.org/international) అది పనిచేస్తున్న అంశాల గురించి, ఎంచుకున్న పోరాట పద్ధతుల గురించి తెలుసుకోండి. ఈ ఉద్యమంపై ఉన్న చర్చలు, విమర్శల గురించి కూడా తెలుసుకోండి.
జవాబు:

10th Class Social Textbook Page No.302

ప్రశ్న 2.
పెంటగావ్ వద్ద కాపలా ఉన్న సైనికుడికి నిరసనకారులలోని ఒక మహిళ ఒక పువ్వు ఇస్తోంది. ఈ బొమ్మలోని భావనలను చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 2
జవాబు:
అమెరికా, వియత్నాంతో అన్యాయంగా యుద్ధం చేస్తుందనే భావన అమెరికా సైనికులలో, ప్రజలలో ఉంది. ఆ యుద్ధాన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం కూడా చేశారు. అయితే అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల వ్యతిరేకత సైనికులలో గమనించిన, నిరసన తెలియజేయడానికి వచ్చిన వారిలో నుండి ఒక మహిళ ఆ సైనికుడిని అభినందిస్తూ ఒక పువ్వును ఇస్తుందని పై చిత్రం ద్వారా తెలుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.299

ప్రశ్న 3.
డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ దా! కింగ్ ఇచ్చిన ఈ ప్రఖ్యాత ఉపన్యాసాన్ని చదివి, అమెరికా సమాజానికి అతడు.. ఉంచిన ఆదర్శాల గురించి, వాటిని సాధించటానికి అతడు రూపొందించుకున్న ప్రణాళిక గురించి ఒక వ్యాసం రాయంది.
AP Board 10th Class Social Solutions Chapter 21 సమకాలీన సామాజిక ఉద్యమాలు 3
జవాబు:
ఉద్యమాలలో అమెరికాలోని పౌరహక్కుల ఉద్యమం చాలా ముఖ్యమైనది. ఈ ఉద్యమాన్ని డా|| మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డా॥ కింగ్ ముందుకు నడిపించారు. అయితే ఈ ఉద్యమమనేది “పౌర నిరాకరణ” ధ్యేయంగా నడిచింది. (వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం). డా॥ కింగ్ అమెరికా సమాజంపై ఉంచిన ఆదర్శాలు. పాఠశాలల్లో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వారిని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గృహవసతిలో, ఓటు హక్కులలో నల్లవారిని వివక్షతతో చూడకుండా వీరికి కూడా తెల్లవారితో సమానంగా హక్కులు కల్పించాలి.

ఒక సంవత్సరం పాటు డా॥ కింగ్ అధ్యక్షతన మాంటగోయెరిలో నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఈయన పౌరహక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు కావాలని కోరాడు. మనుషులను శరీర రంగును బట్టి కాకుండా వాళ్ల వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనావేసే దేశంగా అమెరికా మారాలని డా॥ కింగ్ తన ఉపన్యాసంలో తెలియచేశాడు.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 4.
పౌర హక్కుల ఉద్యమ కోరికల జాబితా తయారుచేసి, వాటికి మీరు సూచించే పరిష్కారాలు ఏమిటో రాయండి.
జవాబు:
పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు, వాటికి నేను సూచించే పరిష్కారాలు

పౌరహక్కుల ఉద్యమ కోరికలుపరిష్కార సూచనలు
1) ఉపాధి కల్పనకు కార్యక్రమాలు1) ప్రభుత్వమే వివిధ పరిశ్రమలను స్థాపించాలి, సమానత్వాన్ని పాటించాలి.
2) పూర్తి న్యాయమైన ఉపాధి కల్పించడం.2) తెల్లవారు, నల్లవారు అనే విచక్షణ చూపించకుండా అందరికీ సమాన ఉపాధి కల్పించాలి.
3) మంచి గృహవసతి3) ప్రభుత్వం గృహవసతి కల్పించాలి. లేదా నల్లవారు ఇళ్లు కట్టుకోవడానికి సహాయం చేయాలి.
4) ఓటు హక్కు కల్పించాలి.4) తెల్లవారితో సమానంగా నల్లవారందరికీ ఓటు హక్కు కల్పించాలి.
5) శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు.5) నల్లవారు కూడా తెల్లవారితో కలిసి చదువుకునేలా చట్టాలు చేయాలి. వాటిని సక్రమంగా అమలుచేయాలి.
6) పౌర హక్కుల చట్టాన్ని చేయాలి.6) పౌరహక్కుల ఉద్యమంలోని కోరికలు అమలు జరగాలంటే పౌరహక్కుల చట్టాన్ని చేయాలి, చట్టం అమలు కొరకు యంత్రాంగాన్ని కూడా నియమించాలి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 5.
ప్రజాస్వామిక దేశమని అమెరికా చెప్పుకుంటుంది. కానీ గత శతాబ్దం మధ్యకాలం వరకు కొంతమంది ప్రజలను వేరుగా ఉంచింది. భారతదేశ నేపథ్యంలో ప్రజాస్వామ్య భావన అందరినీ కలుపుకునేలా ఎలా ఉండాలో చర్చించండి.
జవాబు:
భారతదేశ నేపధ్యంలోని ప్రజాస్వామ్యం వలె అమెరికాలో ప్రజాస్వామ్యం అమలు కావాలంటే ఈ క్రింది విధంగా చేయాలి.

  1. జాతి, మత, వర్గ విచక్షణ, పేద, ధనిక అనే తారతమ్యాలు ప్రత్యేకించి నల్లవారు, తెల్లవారు అనే విచక్షణ చూపకుండా అందరినీ సమాన ప్రాతిపదికన చూడాలి.
  2. మన దేశంలో స్త్రీ, పురుష, జాతి, వర్గ, కుల, మత, భాషా తారతమ్యాలు పాటించకుండా అందరికీ ఓటు హక్కును కల్పించినట్లు అమెరికా కూడా దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించాలి.
  3. మనదేశంలో అల్పసంఖ్యాకులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించినట్లు అమెరికా కూడా అల్పసంఖ్యాకులైన నల్లవారికి కూడా రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలి.
  4. భారత రాజ్యాంగం ప్రకారం మనదేశ పౌరులందరికీ పౌరసత్వం ఉన్నట్లే అమెరికాలో కూడా నల్లవారనే తేడాలు లేకుండా అందరికీ పౌరసత్వం ఇవ్వాలి.
  5. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఉన్నట్లు అమెరికాలో కూడా ప్రతి పౌరునికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కల్పించాలి.
  6. మనదేశంలో పౌరుల శరీర రంగుకు ప్రాధాన్యత లేనట్లే అమెరికాలో కూడా నల్లవారిని రంగును బట్టి విచక్షణ చూపరాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 6.
ఒక ఉద్యమంలో భిన్న గొంతుకలు ఎందుకు వినపడుతుంటాయి ? వాటిల్లోని అభిప్రాయభేదాలను గుర్తించండి.
జవాబు:
అమెరికాలో పౌరహక్కుల చట్టం కోసం ఉద్యమం బలపడుతున్న సమయంలో భిన్నభిన్న అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని :

  1. చాలామంది శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికి సమానత్వం సాధించటం వీలవుతుందని అన్నారు. అందుకు అవసరం అయిన చట్టాలు ప్రభుత్వం చేసేలా చెయ్యవచ్చని అనేకమంది మరియు డా|| కింగ్ కూడా అన్నారు.
  2. “మాల్కం ఎక్స్” వంటి వారు అనేకమంది నల్లవాళ్లు వేరేజాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాలని భావించారు.
  3. అధికారాన్ని చేజిక్కించుకోటానికి సాయుధ ఘర్షణలతో సహా అన్ని మార్గాలను వినియోగించుకోవాలని ‘మాల్కం ఎక్స్’ వంటివారు భావించారు.
  4. ఈ ఉద్యమంలో పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని నల్లజాతి మహిళలు భావించసాగారు.
    ఈ విధంగా అభిప్రాయభేదాలు వెలువడ్డాయి.

10th Class Social Textbook Page No.300

ప్రశ్న 7.
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలో పోలికలు, తేడాలు గుర్తించండి. ప్రజల హక్కులకు అవి ఎలా స్పందించాయి?
జవాబు:
అమెరికా, యుఎస్ఎస్ఆర్‌లోని రాజకీయ వ్యవస్థలోని పోలికలు, తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తేడాలు :

అమెరికా రాజకీయ వ్యవస్థయుఎస్ఎస్ఆర్ లోని రాజకీయ వ్యవస్థ
1) సెన్సారు లేని స్వేచ్ఛాపూరిత పత్రికలున్నాయి.1) సెన్సారులేని స్వేచ్ఛాపూరిత పత్రికలు లేవు.
2) స్వేచ్ఛాపూరిత ప్రసార సాధనాలను అనుమతించారు.2) స్వేచ్ఛాపూరిత ప్రసారసాధనాలను అనుమతించలేదు.
3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించలేదు.3) సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలను అనుమతించారు.
4) ప్రజల కదలికలు, చర్యల మీద పూర్తి స్వేచ్చ ఉంది. నియంత్రణ లేదు.4) ప్రజల కదలికలు, చర్యల మీద స్వేచ్ఛ లేదు. నిరంతరం ప్రజల చర్యల మీద నియంత్రణ ఉంది.
5) ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది.5) సోషలిస్ట్ ప్రభుత్వం ఉంది.
6) నల్లవారు, తెల్లవారనే విచక్షణ చాలాకాలం పాటించారు.6) ఎటువంటి విచక్షణ లేదు. అందరూ సమానమే అనే భావన ఉంది.
7) పౌరహక్కుల చట్టంను అనుమతించారు. సక్రమంగా అమలుచేయుట జరుగుతుంది.7) గోర్బచేవ్ ప్రజలకు స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్” అనే సంస్కరణలు చేశాడు.

పోలికలు :
ఈ రెండు దేశాలలో మానవ హక్కుల కోసం ఉద్యమాలు జరిగాయి.

10th Class Social Textbook Page No.301

ప్రశ్న 8.
వీళ్లు దేశభక్తి లేని వాళ్లని కొంతమంది భావించగా, అన్యాయమైన యుద్ధంలో పాల్గొనాలనుకోకపోవటం సమర్ధనీయమే అని మరికొంతమంది భావించారు. ఈ రెండు దృష్టి కోణాలను తరగతిలో చర్చించి మీ దృష్టికోణంతో పాటు రెండు వైపుల వాదనలను క్లుప్తంగా రాయండి.
జవాబు:

  1. అమెరికాలోని చట్టం ప్రకారం సైన్యంలో చేరే వయసున్న యువకులందరూ కొంతకాలం సైన్యంలో పనిచేయాలనేది చట్టం. చట్టంను అందరూ పాటించాలి. అయినప్పటికీ వారు, మేము సైన్యంలో చేరం, అని సైన్యంలో చేరడానికి నిరాకరించడమనేది చట్ట వ్యతిరేకం అవుతుంది.
  2. వియత్నాం ‘ యుద్ధంలో వియత్నాంకి చెందిన 8,00,000 సైనికులు, 30,00,000 పౌరులు కాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు చనిపోయారు. అమెరికాకు ఎటువంటి పౌరనష్టం జరగలేదు.
  3. అమాయకులైన వియత్నాం ప్రజలపై బాంబులు వేసి, చంపడం అనేది అన్యాయం, అమానుషం. ఇటువంటి అన్యాయానికి పూనుకున్న అమెరికా సైన్యంలో చేరకపోవడం సమర్థనీయమే అని చాలామంది భావించారు.

అమాయకులైన వియత్నాం ప్రజల చావుకు కారణమవుతున్న అమెరికా సైన్యంలో యువకులు చేరకపోవడం సమర్థనీయమే అని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 9.
ఆయుధీకరణకు వివిధ రకాల స్పందనలు ఏమిటి?
జవాబు:
అమెరికా, యుఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు అణుబాంబులను ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి. ఈ విధంగా పెంచుకోవడానికి ఆ – దేశాలు రకరకాల కారణాలు తెలియచేశాయి.

  1. అణ్వాయుధాల నిల్వలలో పోటీ తీవ్రరూపం దాల్చింది.
  2. ఆయుధాలను ఉత్పత్తిచేసే కంపెనీలు (వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలంటారు). ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి, అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టటానికి మద్దతు పొందేవి.
  3. ప్రజా నిరసనల మూలంగా అమెరికా 1975లో వియత్నాంతో యుద్ధాన్ని ఆపేసి, వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది.
  4. యూరపులో అనేకమంది ప్రజలు యుద్ధం గురించి భయపడసాగారు.
  5. ఆయుధపోటీ వల్ల ప్రపంచమంతా ముప్పులో పడుతుందని, ప్రపంచమంతా నాశనమయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు.
  6. పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటుచేసుకున్నాయి.
  7. ఇతర దేశాల ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవటానికి, శాంతి దిశగా కృషి చెయ్యటానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ప్రజలు ఒత్తిడి చెయ్యసాగారు.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 10.
పరస్పర విధానాలను ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయించటం మాత్రమే కాక వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే యుద్ధ అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ సమాధానానికి కారణాలు పేర్కొనండి.
జవాబు:
దీంతో నేను ఏకీభవించను. కారణాలేమిటనగా …… .

  1. ప్రతి దేశానికి స్వంత ప్రభుత్వ విధానం ఉంటుంది.
  2. వివిధ దేశాల ప్రజలు ఒకరినొకరు కలుస్తుంటే సంస్కృతి వ్యాప్తి చెందుతుంది. అంతేకాని ప్రజలు యుద్ధాలు జరగకుండా ఆపలేరు.
  3. ప్రపంచంలోని చాలా దేశాలు ప్రజాస్వామ్య దేశాలు, కావున ప్రజాస్వామ్యబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
  4. అణుశక్తిని ఉపయోగించటంలోని ప్రమాదాలు ప్రజలకు తెలిశాయి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాలు నిరాయుధీకరణకు ముందుకు వచ్చి, యుద్ధ భయాన్ని తగ్గించాయి.

10th Class Social Textbook Page No.303

ప్రశ్న 11.
అణు కర్మాగారాలను, కాలుష్య పరిశ్రమలను ఎక్కడ పెట్టాలన్న నిర్ణయాలతో సంబంధం లేని దేశాల ప్రజలు కూడా పర్యావరణ కాలుష్య ప్రభావానికి ఎలా గురవుతారో వివరించండి. ఇటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించాలి?
జవాబు:
కాలుష్య ప్రభావం:

  1. కొన్ని సమయాలలో అణు కర్మాగారాలలో ప్రమాదాలు జరిగి కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోతారు.
    ఉదా : రష్యాలోని చెర్నోబిల్ అణుకర్మాగార ప్రమాదం.
  2. యూరప్లో అణు కర్మాగారాలు ఎక్కువవటం వలన యూరప్లో అధిక ప్రాంతం అణు కాలుష్యానికి కారణమయి, ప్రజలను కాలుష్యానికి గురిచేశాయి.
  3. కాలుష్య పరిశ్రమల స్థాపన మూలంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
    ఉదా : భోపాల్ లో ఒకరాత్రి యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాదిమంది చనిపోయారు. చాలా మంది ఇంకా బాధపడుతున్నారు.
  4. కాలుష్యం మూలంగా ఓజోను పొర దెబ్బతింటుంది.
  5. భూగోళం వేడెక్కుతుంది. తద్వారా ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి సముద్రాలలోని నీటిమట్టం పెరిగి తీరప్రాంతాలు ముంపుకు గురి అవుతాయి.

కాలుష్య పరిస్థితుల పరిష్కారానికి సూచనలు :

  1. అణు కర్మాగారాలను ప్రభుత్వాలు నిషేధించాలి. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అణు కాలుష్యానికి గురైన ప్రజలకు ప్రభుత్వాలు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం మెలకువగా ఉండి, కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదు.
  3. కాలుష్యానికి గురయ్యే ప్రజలకు ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించి, ఆయా పరిశ్రమల నుండి ప్రజలకు పరిహారాలు ఇప్పించాలి.
  4. ఆయా పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.307

ప్రశ్న 12.
రైతులను, గిరిజనులను నిర్వాసితులను చెయ్యకుండా కర్మాగారాలు కట్టడం, గనుల తవ్వకం, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను చేపట్టడం సాధ్యంకాదా? ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి? ఈ అంశాలపై మీ ఇంటిలోనూ, తరగతిలోనూ చర్చించండి.
జవాబు:

  1. కర్మాగారాలు నిర్మించడానికి అనువైన పరిస్థితులు ఉన్నప్పుడు అనగా ముడిసరుకులు అందుబాటులో ఉన్న ప్రాంతాలలోనే కర్మాగారాలు నిర్మిస్తారు. ఈ పరిస్థితులలో ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నారు.
  2. గనుల తవ్వకం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది మరియు గనులు ఉన్నచోటులో ఉన్న ప్రజలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.
  3. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు కూడా ముడి సరుకులు (నీరు, బొగ్గు) లభించే ప్రాంతాలలోనే, నిర్మించవలసి వస్తుంది.
  4. అయితే ఆనకట్టల నిర్మాణంలో మాత్రం, ఆనకట్టల నిర్మాణం మూలంగా వచ్చే ఉపయోగం, నష్టాలను అంచనా వేసుకుని ఆనకట్టలను నిర్మించవచ్చు. లేదా ఆపివేయవచ్చు.
    ఉదా : కేరళలోని సైలెంట్ వ్యాలీలోని ఆనకట్ట (1973-83)

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 13.
సామాజిక ఉద్యమాలు ఉపయోగించిన వివిధ’ వ్యూహాలను పేర్కొనండి.
జవాబు:

  1. అమెరికా పౌరహక్కుల ఉద్యమంలో నల్లజాతి ప్రజలు నిరసన తెలుపుతూ ఒక సంవత్సరం పాటు ‘బస్సులను’ బహిష్కరించారు.
  2. యుఎస్ఎస్ఆర్ లో గోర్బచేవ్, ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించటానికి “గ్లాస్ నోస్తే” అన్న సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు.
  3. వియత్నాంతో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యంలోకి అమెరికా పౌరులు చాలామంది “మేము వెళ్లం” అని సైన్యంలో చేరడానికి నిరాకరించి, నిరసన తెలియచేశారు.
  4. అణ్వాయుధాల ఉత్పత్తిని తగ్గించుకొమ్మని, శాంతి దిశగా ప్రయాణం చేయమని అనేకమంది సైంటిస్టులు, ప్రజలు, అధికారులు చేసిన ఒత్తిడి కారణంగా అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి స్ట్రాటెజిక్ ఆర్ట్స్ రిడక్షన్ ట్రీటి (START) మీద సంతకాలు చేశారు.
  5. గ్రీన్ పీస్ ఉద్యమం అనగా అలస్కా దగ్గర సముద్రంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా నిరసనకర్తలు ఒక చిన్న పడవలో ప్రయోగశాలకు బయలుదేరినారు. ఆ పడవ పేరు “గ్రీన్ పీస్”. ఆ పడవ పేరు మీదుగా ఆ ఉద్యమానికి గ్రీన్ పీస్ అని పేరు వచ్చింది.
  6. సమానత్వం కోసం అమెరికాలో మహిళలు ఉద్యమం చేశారు.
  7. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో నష్టపోయిన కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చెయ్యటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించవలసి వచ్చింది.
  8. ‘నర్మదా బచావో’ ఆందోళనలో ఆనకట్టల నిర్మాణాన్నే వ్యతిరేకించారు.
  9. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో చేసిన ఉద్యమంలో తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ, ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాలు చేయుట జరిగింది.
  10. “నర్మదా బచావో” ఉద్యమంలో – మూలవాసీ ప్రజల ఉద్యమం, సయా – ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటికోసం భూములు లాక్కోబడుతున్న నేపధ్యంలో తమ భూములు కాపాడుకొనుటకు రైతులు చేస్తున్న ఉద్యమాలు మొదలైన వ్యూహాలు ఉపయోగించబడ్డాయి.

10th Class Social Textbook Page No.308

ప్రశ్న 14.
పునరావాసాన్ని కల్పిస్తామన్న వాగ్దానాలను ఉద్యమంలోని ప్రజలు ఎలా పరిగణిస్తున్నారు?
జవాబు:
పథకాల వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. అయితే త్వరలోనే ప్రజలు కొన్ని విషయాలు గుర్తించారు. అవి :

  1. భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా భూమిని ఇవ్వటానికి తగినంత భూమి లేదు.
  2. నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించటం సాధ్యం కాదు అని తెలుసుకున్నారు.
  3. ఇది నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్యకాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట దృక్పథమని ప్రజలు గుర్తించసాగారు.
  4. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని, గిరిజన ప్రజలను పణంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయటం, సహజ వనరులను సుస్థిరంకాని పద్ధతులలో వినియోగించటం పైన ఆధారపడి ఉంది.
  5. ఇది పేద రైతులు, గిరిజనుల జీవన ప్రమాణాన్ని ఏ రకంగాను మెరుగుపరచకుండా వాళ్లని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 15.
ఇటీవల కాలంలో పశ్చిమబెంగాల్ (నందిగ్రాం), ఒడిశా (నియమగిరి), ఆంధ్రప్రదేశ్ (పోలవరం, సోంపేట, మొదలైనవి)లో జరిగిన ఇటువంటి పోరాటాల గురించి మరింత తెలుసుకోండి. ఈ పోరాటాల్లో ముఖ్యమైన అంశాలను వివరిస్తూ ఒక పోస్టరు తయారు చేయండి
జవాబు:
ఇటీవల కాలంలో కట్టబడిన ఆనకట్టల సందర్భాలలో ఎన్నో పోరాటాలు జరిగాయి. అటువంటి పోరాటాలలో కొన్ని నందిగ్రాం – పశ్చిమ బెంగాల్, నియమగిరి – ఒడిశా, పోలవరం, సోంపేట – ఆంధ్రప్రదేశ్,

1. నందిగ్రాం (పశ్చిమ బెంగాల్) :
ఎ) ఇది హాల్దియాలోది. కోల్ కతాకు దూరంగా ఉంటుంది.
బి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2001 మార్చిలో ఈ స్థలాన్ని ప్రత్యేక ఆర్థిక స్థలంగా ప్రకటించింది.
సి) నందిగ్రాం ప్రజలకు కోపం వచ్చి ఊరేగింపులు నిర్వహించారు. పోరాటం చేశారు. ఈ పోరాటంలో 14 మంది చనిపోయారు.

2. నియమగిరి (ఒడిశా):
ఎ) ఒడిశాలో ఈ నియమగిరి కొండలు బాక్సైట్ నిల్వలకు ప్రఖ్యాతిగాంచాయి.
బి) బ్రిటిష్ మైనింగ్ కంపెనీకి, ఒడిశా ప్రభుత్వం బాక్సైట్ ను వెలికి తీయడానికి అనుమతినిచ్చింది.
సి) ప్రజలు ఆగ్రహించి ముఖ్యంగా గిరిజనులు అనేక ఊరేగింపులు నిర్వహించారు. కోర్టుకు కూడా ఫిర్యాదు చేసినారు. న్యాయస్థానం స్పందించి బ్రిటిష్ కంపెనీకి ఇచ్చిన అనుమతిని జనవరి, 2014లో రద్దు చేసింది.

3. సోంపేట (శ్రీకాకుళం – ఆంధ్రప్రదేశ్) : .
ఎ) సోంపేట అనేది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని మండలం.
బి) ఇక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించుటకు ప్రభుత్వం “నాగార్జున కంపెనీ లిమిటెడ్”కు అనుమతినిచ్చింది.
సి) రాజకీయ పార్టీల అండతో ప్రజలు దీనిని వ్యతిరేకించి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

4. పోలవరం (ఆంధ్రప్రదేశ్) :
ఎ) పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిమీద నిర్మించబడుతుంది.
బి) ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాలకు వ్యాపించి ఉంది.
సి) ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2006లో అనుమతినిచ్చింది.
డి) దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఛత్తీస్ గఢ్, ఒడిశాలలోని ప్రాంతాలు కూడా ముంపుకు గురి అవుతాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.310

ప్రశ్న 16.
మానవ హక్కులలోని కొన్ని అధికరణాలు కింద ఉన్నాయి. ఈ భాగాన్ని రెండుసార్లు చదవంది. మొదటిసారి అంతా చదివి మానవులందరికీ, ఉండాల్సిన మానవ హక్కులను గుర్తించండి. తరువాత కింద ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఏ పేరా, ఏ వాక్యంలో ఉందో గుర్తించండి. (ప్రతిదానికి దొరకక పోవచ్చు, దానిని ఖాళీగా ఉంచెయ్యండి.)
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా …………. వాక్యం ………….
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచేయ్యకూడదు. పేరా ………….. వాక్యం ………….
అధికరణం 7 : చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్షతకు లోనుకాకుండా అందరికి చట్టం ద్వారా సమాన రక్షణ లభించాలి. ఈ ప్రకటనకు భంగం కలిగిస్తూ వివక్షతకు గురికాకుండా అందరికీ సమాన రక్షణ లభించాలి, ఇటువంటి వివక్షతకు రెచ్చగొట్టబడటం నుంచి కూడా రక్షణ లభించాలి. పేరా ………. వాక్యం …………..
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా ………….. వాక్యం ……………….
అధికరణం 10 : ఒక వ్యక్తిపై మోపబడిన నేరాలకు అతడు / ఆమె హక్కులు, బాధ్యతలు నిర్ణయించటానికి స్వతంత్ర, నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. పేరా – ………….. వాక్యం ………..
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికి, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా ……………. వాక్యం …………..
అధికరణం 13 : (1) దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరుచుకునే హక్కు ఉంటాయి. పేరా …………… వాక్యం …………..
(2) ప్రతి ఒక్కరికీ సొంత దేశంతో సహా ఏ దేశాన్నైనా వీడే హక్కు తిరిగి సొంత దేశానికి చేరే హక్కు ఉంటాయి. పేరా ……….. వాక్యం ……………
జవాబు:
అధికరణం 3 : ప్రతి ఒక్కరికీ జీవితం, స్వేచ్ఛ, వ్యక్తిగత భద్రతలకు హక్కు ఉంది. పేరా 3 వాక్యం 13
అధికరణం 5 : ఎవరిని హింసకు లేదా క్రూర, అమానవీయ, అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురిచెయ్యకూడదు. పేరా 3 వాక్యం 6 మరియు 7.
అధికరణం 9 : ఎవరినీ అకారణంగా అరెస్టు చెయ్యకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించగూడదు. పేరా 3 వాక్యం 4.
అధికరణం 12 : అకారణంగా ఎవరి ఏకాంతానికీ, కుటుంబానికి, నివాసానికి లేదా ఉత్తర ప్రత్యుత్తరాలకు అడ్డుపడకూడదు, జోక్యం చేసుకోకూడదు, వ్యక్తి పరువు, మర్యాదలకు భంగం కలిగించకూడదు. ఈ విధమైన దాడుల, జోక్యం చేసుకోవడాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికీ చట్టం ద్వారా రక్షణ పొందే హక్కు ఉంటుంది. పేరా 3 వాక్యం 10.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

SCERT AP 10th Class Social Study Material Pdf 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రచ్ఛన్న యుద్ధం గురించి కింద ఉన్న వ్యాఖ్యావాలలో ఏది సరైనది కాదు?
అ) అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య విరోధం.
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం
ఇ) ఆయుధ పోటీకి కారణం అవ్వటం
ఈ) రెండు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరు (AS1)
జవాబు:
ఆ) అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం

ప్రశ్న 2.
కింద పేర్కొన్న వాటిల్లో ఏది పశ్చిమ ఆసియా సంక్షోభంలో లేదు? అ) ఈజిప్టు ఆ) ఇండోనేషియా ఇ) బ్రిటన్ ఈ) ఇజ్రాయెల్ (AS1)
జవాబు:
ఆ) ఇండోనేషియా

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ అధికారంలో చాలా మార్పులు వచ్చాయి.

  1. యుద్ధరంగాలకు దూరంగా ఉన్నందున అమెరికా శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించింది.
  2. అన్ని దేశాలలో శాంతి, అభివృద్ధి వెల్లివిరిసేలా ఒక ప్రపంచసంస్థ అనగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు.
  3. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ వలస పాలనలను వదులుకోవలసి వచ్చింది. ఇవి రాజకీయంగా ఆర్థికంగా బలహీనమయ్యాయి.
  4. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. అవి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్టు శిబిరం; అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక – పెట్టుబడిదారీ శిబిరం. ప్రపంచం మొత్తం ఈ రెండు కూటాలుగా విడిపోయింది. ఈ రెండు కూటాల మధ్య చాలాకాలం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 4.
ప్రపంచంలో శాంతి నెలకొల్పటానికి ఐక్యరాజ్య సమితి నిర్వహించే వివిధ పాత్రలు ఏమిటి? (AS1)
జవాబు:
ఐక్యరాజ్య సమితి 1945, అక్టోబరు 24న ఏర్పడింది. ఇది ఆరు వేరు వేరు సంస్థల ద్వారా పనిచేస్తుంది.

ఐక్యరాజ్యసమితి నిర్వహించే విధులు:

1) శాంతి భద్రతలను కాపాడటం :
అంతర్జాతీయ శాంతిని, ప్రాదేశిక సమగ్రతలను పరిరక్షిస్తుంది. దీని కొరకు “భద్రతా మండలి” అనే సంస్థను ఏర్పాటు చేసింది.

2) విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచటం :
ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక సమస్యలను చర్చిస్తుంది. ఈ అంశాలపై పరిశోధనలు చేసి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య సంబంధమైన విధానాలను సిఫారసు చేస్తుంది. ఈ విధుల నిర్వహణ కోసం ఐక్యరాజ్య సమితి, ఆర్థిక, సామాజిక మండలిని ఏర్పాటు చేసింది. ఆర్థిక సంఘం జెనీవాలో ఉంది.

3) పేదరికాన్ని నిర్మూలించటం :
ప్రపంచ దేశాలలోని పేదరికాన్ని నిర్మూలించాలని సంకల్పించి, దీని కొరకు ఆర్థిక, సామాజిక మండలిని స్థాపించింది.

4) అంతర్జాతీయ నేరాల నేపథ్యంలో న్యాయాన్ని అందించటం వంటి విధులను ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దీని కొరకు అంతర్జాతీయ న్యాయస్థానం “హేగ్”లో ఉంది.

5) ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞానశాస్త్ర, సాంస్కృతిక సంస్థ పారిలో ఉంది.

6) బాలల కొరకు ఒక అత్యవసర నిధి సంస్థను న్యూయార్క్ లో స్థాపించింది.

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య భావన నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవటంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనదేనా? (AS2)
జవాబు:
ప్రపంచమంతా ప్రజాస్వామ్య భావనలోకి వెళుతున్న నేపథ్యంలో ప్రపంచసంస్థ అయిన ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలకు మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉండటం సరైనది కాదని చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్య భావనకు వ్యతిరేకం.

ప్రశ్న 6.
సైనిక ఒప్పందాలతో అగ్రరాజ్యాలు ఎలా లాభపడ్డాయి? (AS1)
జవాబు:
సైనిక ఒప్పందాల ద్వారా అగ్రరాజ్యాల పరిధి పెరిగి వాటికి కింద పేర్కొన్నవి అందుబాటులోకి వచ్చి లాభపడ్డాయి.

  1. చమురు, ఖనిజాలు వంటి కీలక వనరులు
  2. తమ ఉత్పత్తులకు మార్కెటు, తమ పెట్టుబడులు పెట్టటానికి ప్రమాదంలేని ప్రదేశాలు
  3. తమ సైనికులను, ఆయుధాలను ఉపయోగించటానికి సైనిక స్థావరాలు
  4. తమ భావజాల వ్యాప్తి
  5. పెద్ద మొత్తంలో సైనిక ఖర్చుకి ఆర్ధిక మద్దతు.

ప్రశ్న 7.
ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఆయుధ పోటీ, ఆయుధ నియంత్రణ రెండూ ఎలా జరిగాయి? (AS1)
జవాబు:
1) ఆయుధ పోటీ :
ఆయుధ పరిశోధనల పైనా, ఖండాంతర క్షిపణులు, విధ్వంసకర అణ్వాయుధాల నిల్వలపైనా అమెరికా, రష్యాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశాయి. ఈ రెండు దేశాలలో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పలుమార్లు మట్టుపెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటి మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు కూడా అణ్వాయుధాలను సమకూర్చుకున్నాయి. గూఢచర్యంలోనూ, క్షిపణులను నిర్దేశించటంలోనూ ఉపగ్రహాలు . దోహదం చేయటంతో ఇప్పుడు పోటీ అంతరిక్షంలోకి కూడా విస్తరించింది.

2) ఆయుధ నియంత్రణ :
కాలం గడుస్తున్న కొద్దీ ఆయుధ పోటీని తగ్గించి, అణ్వాయుధాలను నాశనం చేయవలసిందిగా యుఎస్ఎస్ఆర్, అమెరికాలపై ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయసాగారు. దీని ఫలితంగా ఈ రెండు దేశాలు సంప్రదింపులు జరిపి ఆయుధ పోటీని, నిల్వలను తగ్గించుకోవలసి వచ్చింది. చివరికి 1985-1991 మధ్య అణు పరీక్షలపై నిషేధం విధించారు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 8.
ప్రపంచంలో ఘర్షణలకు కేంద్రంగా పశ్చిమ ఆసియా ఎందుకు మారింది? (AS1)
జవాబు:
పశ్చిమ ఆసియా ఘర్షణలకు ముఖ్య కారణాలు :
1) యూరపు, ఆసియా మధ్య ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు. ఇదే ప్రాంతాన్ని మధ్యప్రాచ్యం అని కూడా అంటారు. అరబ్బులు, యూదుల మధ్య ఏర్పడిన ఘర్షణలను పశ్చిమ ఆసియా సంక్షోభమని అంటారు. ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించినది. అరబ్బులు నివాసముంటున్న పాలస్తీనా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది. అక్కడ ఉన్న జెరూసలెం యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్రస్థలం.

2) యూదులు పాలస్తీనాని తమ ‘వాగ్రత్త భూమి’గా పరిగణిస్తారు. ప్రాచీన కాలంలో అక్కడి నుంచి వాళ్లను నిర్వాసితులను చేయడంతో వారు యూరపు, ఆసియా అంతటా వలసలు పోయారు.

3) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూడులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జియానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. 1945లో దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (వీళ్లల్లో ఎక్కువమంది అరబ్బు ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం ఇరు ప్రజల మధ్య ఘర్షణ మొదలయ్యింది.

4) మధ్య ప్రాచ్యంలో, ప్రత్యేకించి అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలను కనుగొనటంతో సమస్య మరింత సంక్లిష్ట రూపం దాల్చింది. అమెరికా, రష్యాలు ఈ ప్రాంతాన్ని తమ ప్రాభవంలోకి తీసుకోవాలని ప్రయత్నించాయి. ఇతర దేశాలు దానిపై నియంత్రణ సాధించకుండా అడ్డుకున్నాయి.

ప్రశ్న 9.
20వ శతాబ్దం చివరి నాటికి ఒక్క దేశమే ప్రపంచం మీద పెత్తనం వహిస్తోంది. ఈ నేపథ్యంలో అలీనోద్యమం పాత్ర ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
ప్రస్తుత కాలంలో అలీనోద్యమం నిర్వహిస్తున్న పాత్ర :

  1. ప్రపంచం ఏకధృవంగా ఉన్న నేపథ్యంలో చైనా కూడా మరో ధృవంగా ఎదుగుతోంది. రష్యా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిలో తమ వీటో అధికారం ద్వారా అమెరికాను నియంత్రిస్తున్నాయి.
  2. ఇటీవలి సంవత్సరాలలో పోర్టారికో మరియు పశ్చిమ సహారా ప్రాంతాల గురించి అమెరికా వైఖరిని తప్పుబట్టాయి. ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అలీనోద్యమం కృషి చేస్తుంది.
  3. మానవ హక్కుల పరంగా బాగా వెనుకబడిన తమ సభ్య దేశాలలో మానవ హక్కుల ఉద్దరణకు అలీనోద్యమం కృషి చేయవలసిన అవసరం ఉంది.
  4. అగ్ర దేశాలు కలుగచేసుకోలేని కొన్ని సమస్యలున్న దేశాల సమస్యలను అలీనోద్యమం పరిష్కరించవచ్చు.
    ఉదా : పాలస్తీనా, సోమాలియా, సూడాన్.
    ఈ విధంగా అలీనోద్యమం తన పాత్రను నిర్వహించవచ్చు.

ప్రశ్న 10.
“కేవలం సైనిక ఒప్పందాల నేపథ్యంలోనే కాకుండా ఆర్థిక విధానాల నేపథ్యంలో కూడా అలీనోద్యమం ఏర్పడింది”. దీనిని సమర్ధించండి. (AS1)
జవాబు:
ఆసియా, ఆఫ్రికా, ఆ తరువాత లాటిన్ అమెరికాలో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించటానికి అంతర్జాతీయ సంస్థగా అలీనోద్యమం రూపొందింది. అలీన రాజ్యాల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల గురించి చర్చించడం జరిగింది.

  1. 1961 బెల్ గ్రేడ్ సమావేశంలో ప్రతి దేశానికి ఆర్థిక సమానత్వం ఉండాలని సూచించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక ద్రవ్యనిధిని ఏర్పాటుచేయాలని సూచించింది.
  2. 1970 లుసాకా సమావేశంలో రాజకీయ విషయాలతో బాటు ఆర్థిక విషయాలకు కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని, త్వరితగతిని ఆర్థికాభివృద్ధికి సహకరించే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పాలని, ఆర్థికాభివృద్ధిని అంతర్జాతీయ సమతాదృక్పథంతో పరిశీలించాలని ఐక్యరాజ్య సమితి కోరింది.
  3. 1973 అల్జీర్స్ సమావేశంలో అలీన దేశాల ఆర్థికాభివృద్ధికి, పునర్నిర్మాణానికి, ఐదు రకాల విధులు ఏర్పాటు చేయడానికి తీర్మానం జరిగింది.
  4. 1979 హవానా సమావేశంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాలను తగ్గించాలని సూచించింది.
  5. 1992 జకార్తా సమావేశం అలీనోద్యమం తన దృష్టిని G7 మరియు యూరోపియను యూనియన్ల వైపు దృష్టి సారించాయి.

ఈ విధంగా అనేక అలీనరాజ్యా ల శిఖరాగ్ర సమావేశాలలో ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు వివిధ సూచనలను చేసింది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

ప్రశ్న 11.
భారతదేశానికి పొరుగుదేశాలతో ఈ దిగువ అంశాలతో సంబంధాన్ని చూపటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి. ఘర్షణకు కారణమైన అంశాలు; యుద్ధ సంఘటనలు; సహాయ, సహకార ఘటనలు. (AS3)
జవాబు:
భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణలు, యుద్ధ సంఘటనలు, సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ క్రింది పట్టికలో చూపబడినాయి.

మన పొరుగు దేశాలతో ఘర్షణకు కారణమైన అంశాలుయుద్ధ సంఘటనలుసహాయ, సహకార ఘటనలు
1) టిబెట్లో జరిగిన తిరుగుబాటును చైనా అణిచివేసింది. ఆ సమయంలో దలైలామాతో సహా వేలాది టిబెటన్లు భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు. దీంతో భారత్-చైనాల మధ్య వైరుధ్యం మొదలైంది. లడక్ ప్రాంతంలోని ఆక్సాయ్-చిన్ సరిహద్దు వివాదం, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది.1) 1962 అక్టోబరులో భారతదేశంపై చైనా దండెత్తింది. భారతదేశం తీవ్ర నష్టాలు ఎదుర్కొవలసి వచ్చింది.1) శాంతిపట్ల తన నిబద్ధతను చాటటానికి జవహర్‌లాల్ నెహ్రూ తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. ఈ పంచశీల ఒప్పందంపై చైనా-భారత్లు 1954 ఏప్రిల్ 29న సంతకాలు చేశాయి.
2) పాకిస్తాన్-భారతదేశం మత ప్రాతిపదికన విడిపోయాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య కాశ్మీర్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. సరిహద్దు రాష్ట్రాలలో వేర్పాటు ఉద్యమాలకు పాకిస్తాన్ సహకరిస్తుందనే ఆరోపణలున్నాయి.2) కాశ్మీర్ కోసం, పాక్-భారత్ ల మధ్య మొదటిసారి 1947-48 మధ్య జరిగింది. రెండోసారి 1965లో పాక్-భారత్ ల మధ్య యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ కు సహకారంగా 1971లో భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయింది. కార్గిల్ యుద్ధం ఇరుదేశాల మధ్య జరిగింది2) 1966లో తాష్మెంట్ లో భారత్-పాకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. 1971లో కూడా సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం వాణిజ్యం, క్రీడలు, సినిమాలు, పర్యటన, సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహ సంబంధాలు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
3) బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల పంపకం వంటి అంశాలపై బంగ్లాదేశ్ భారత మధ్య విభేదాలున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్దంగా భారతదేశంలోకి రాకుండా తీసుకున్న భారతదేశ చర్యలు బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది.3) 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగినపుడు భారతదేశం సహాయపడుతూ, పాకిస్తాన్ తో యుద్ధం చేయవలసి వచ్చింది.3) 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం కావటానికి – భారత్ సహకరించింది. 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఆర్థిక రంగంలో ఈ రెండు దేశాలు సహకరించు కుంటున్నాయి.
4) శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు భారత్-శ్రీలంకల మధ్య ముల్లు మాదిరి తయారయ్యింది. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది.4) శ్రీలంకలో శాంతి నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపింది. దీనికి ప్రతీకారంలో తమిళ తీవ్రవాదులు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చంపినారు.4) క్రీడలు, పర్యాటక రంగం వాణిజ్యం ద్వారా భారత్, శ్రీలంకల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి.

ప్రశ్న 12.
“శ్రీలంకలో జాతి వైరుధ్యాలు భారతదేశంతో దాని సంబంధాలను ప్రభావితం చేశాయి.” వివరించండి. (AS1)
జవాబు:

  1. పురాణ కాలం నుండి భారతదేశానికి, శ్రీలంకకు మధ్య ఆర్థిక, సాంస్కృతిక, జాతిపరమైన సంబంధాలున్నాయి.
  2. శ్రీలంకలో అల్పసంఖ్యాకులైన తమిళం మాట్లాడే ప్రజలపట్ల ప్రభుత్వం అవలంబించిన వైఖరియే ఈ రెండు జాతుల మధ్య వైరుధ్యానికి కారణం.
  3. వీరిలో చాలామంది భారతదేశానికి శరణార్థులుగా రావడంతో భారతదేశానికి అది సమస్యగా పరిణమించింది.
  4. ఈ సమస్య పరిష్కారం కోసం భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి శ్రీలంకతో ఒక ఒప్పందం చేసుకొన్నది. దాని ప్రకారం ఈ సమస్య పరిష్కారం కోసం “భారత శాంతి సేన” ను శ్రీలంకకు పంపింది.
  5. ఈ చర్యకు ప్రతిగా తమిళ తీవ్రవాదులు ఎట్టిఇ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చారు.

ఈ కారణంగా సింహళీయులు, తమిళుల మధ్య ప్రారంభమైన పౌర సంఘర్షణలు ఒక వైపు రక్తపాతానికి దారితీయగా మరోవైపు శ్రీలంక భారత సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

10th Class Social Studies 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం InText Questions and Answers

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 1.
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదేనా?
జవాబు:
దలైలామాకి, అతని టిబెట్ అనుచరులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వటం సరైనదే.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 2.
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనదేనా?
జవాబు:
టిబెట్ ని నియంత్రించాలని చైనా అనుకోవటం సరైనది కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 3.
వలసపాలన నుంచి విముక్తి అంటే ఏమిటి?
జవాబు:
సామ్రాజ్యకాంక్ష కలిగిన బలవంతమైన దేశాలు వెనుకబడిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వారి ఆధిపత్యంలో ఉంచుకున్నారు. ఈ దేశాలలోని ప్రజలు జాతీయోద్యమాలు చేసి వారి పాలిత దేశాల నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొనుటనే వలసపాలన నుంచి విముక్తి అంటారు.

10th Class Social Textbook Page No.283

ప్రశ్న 4.
రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీతో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఏ విధంగా ప్రభావితం అయ్యాయి?
జవాబు:

  1. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు పెట్టుబడిదారీ విధానం – కమ్యూనిజం మధ్య (అమెరికా – రష్యాల మధ్య) విభజింపబడిన ప్రపంచాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.
  2. ఈ దేశాలు తమ అభివృద్ధికి సొంతమార్గం అనుసరించనివ్వకుండా ఏదో ఒక శిబిరాన్ని ఎంచుకోమని ఒత్తిడి చేయసాగాయి.
  3. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య విభేదాలను కొన్ని దేశాలు తమకు సానుకూలంగా వాడుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 5.
యుద్ధాలకూ, పేదరికం, సమాన అభివృద్ధి లేకపోవటం, దేశాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికీ మధ్య సంబంధం. ఏమైనా ఉందా?
జవాబు:
బలవంతమైన దేశాలు సామ్రాజ్య కాంక్షతో అనేక చిన్న దేశాలపై దాడులు చేశాయి. అధికార కాంక్షతో కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. అనేక దేశాలలో పేదరికం మరియు దేశాలన్నీ సమాన అభివృద్ధి సాధించకుండా కొన్ని దేశాలు ఆర్థికంగా, సాంస్కృతికంగా వెనకబడి ఉండడం వంటి కారణాలతో అభివృద్ధిని సాధించిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై దాడిచేసి, యుద్ధాలు చేసి ఆ దేశాలను వలసలుగా ఏర్పరచుకున్నాయి.

10th Class Social Textbook Page No.284

ప్రశ్న 4.
అయిదు దేశాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలు అప్రజాస్వామికం కాబట్టి వాటిని రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుంటారు. అయితే ఈ దేశాలకు ప్రత్యేక అధికారాలు లేకపోతే ఐక్యరాజ్య సమితి సాఫీగా పనిచేయలేదని కొంతమంది అంటారు. చర్చించండి.
జవాబు:
ప్రపంచంలో చాలా దేశాలు ప్రజాస్వామిక దేశాలు, ఇటువంటి నేపథ్యంలో కొన్ని దేశాలకు ప్రత్యేక అధికారాలు ఉండడం సరైనది కాదు. మరియు ఈ ప్రత్యేక వీటో అధికారంతో ఆ దేశాలు ఐక్యరాజ్య సమితి విధులకు అడ్డు పడుతున్నాయి.. ఐక్యరాజ్య సమితి నిష్పక్షపాతంగా పనిచేయకుండా ఈ వీటో అధికారం ఉన్న దేశాలు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 5.
1955 బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమిటి?
జవాబు:
అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల ఇటీవల వలసపాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. మరియు కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాల అభద్రతాభావంతో కూడిన పరిస్థితుల నుంచి మార్పు కావాలని కోరుకున్నాయి. ఇదే 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ సమావేశ ముఖ్య ఉద్దేశం.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 6.
అలీనోద్యమ సూత్రాలకు అగ్రరాజ్యాలు ఎలా స్పందించాయి?
జవాబు:

  1. రెండు అగ్రరాజ్యాలు అలీనోద్యమాన్ని అనుమానపు దృష్టితో చూశాయి.
  2. అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది.
    ఉదా : ఆఫ్ఘనిస్థాన్ పై నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని అమెరికా విమర్శించింది.

10th Class Social Textbook Page No.289

ప్రశ్న 7.
అలీనోద్యమ దేశాలను మూడవ ప్రపంచ దేశాలని ఎందుకంటారు?
జవాబు:

  1. రెండవ ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచం రెండు అధికార కూటములుగా విడిపోయింది. అవే రష్యా, అమెరికాలు. ఆ దేశాలు ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తులుగా అవతరించాయి.
  2. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చాలా ఆసియా, ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం సంపాదించుకొని, ఈ రెండు అగ్రరాజ్యాల శక్తి కూటములలో చేరలేదు. ఈ దేశాలు చాలావరకు అలీనోద్యమ విధానాన్ని స్వీకరించాయి.
  3. ఈ దేశాలు పెద్ద రాజ్యాల విధానాల మీద తమదైన రీతిలో ప్రభావం చూపాయి. వీటి విస్తీర్ణం, జనాభా వ్యూహాత్మకమైన, కీలకమైన స్థానాల కారణంగా ఇవి మూడవ ప్రపంచదేశాలని పేరు తెచ్చుకున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 8.
ఘర్షణలలో పాలస్తీనియన్లకు ఈజిప్టు ఎందుకు మద్దతు నిచ్చింది?
జవాబు:

  1. పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ దేశం అవలంబించిన విధానాలు విద్వేషాలను మరింత రెచ్చగొట్టాయి. అరబ్బులు తమ ఆస్తులు, ఇళ్లు వదిలి వెళ్లి ఇతర అరబ్బు దేశాలలో కాందిశీకులుగా ఆశ్రయం పొందారు. ఈ అరబ్బులందరినీ ఏకం చేయాలని ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్జెల్ నాసర్ ప్రయత్నించి పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చాడు.
  2. ఈజిప్టుకు ఇజ్రాయెల్ కు మధ్యన ఉన్న వైరం మూలంగా ఇజ్రాయెల్ శత్రుదేశమైన ‘పాలస్తీనాకు ఈజిప్టు మద్దతు ఇచ్చిందని అనుకోవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.290

ప్రశ్న 9.
శరణార్థుల శిబిరాలలో ఉంటూ నిరంతరం యుద్ధభయమూ, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల జీవన పరిస్థితుల గురించి తెలుసుకోండి.
జవాబు:

  1. ప్రజలందరూ పేదవారు. నిరక్షరాస్యులు ఎక్కువ.
  2. నిరంతర యుద్ధాల వల్ల ప్రజలు శరణార్థుల శిబిరాలలో నివసించవలసి వచ్చింది.
  3. నిరంతరం యుద్ధభయం కారణంగా ప్రజలు ప్రశాంత జీవితాన్ని కోల్పోయారు.
  4. ఇతర జీవనాధారాలు లేక ప్రజలు పేదరికంలో మగ్గిపోసాగారు.

ఈ విధంగా ఆనాడు పాలస్తీనియన్లు దుర్భర జీవితాన్ని గడపవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.294

ప్రశ్న 10.
సరిహద్దులకు సంబంధించి గత వైరుధ్యాలను మరచి రెండు దేశాలు ఎంత వరకు అర్థవంత సహకారాన్ని, మిత్రత్వాన్ని సాధించగలవని అనుకుంటున్నారు?
జవాబు:
ప్రస్తుతం రెండు దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తింపబడుతున్నాయి. ఈ ప్రపంచంలోనే ముఖ్య ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం రెండు దేశాలకూ ఉంది. దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ, ఆర్థిక పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి. సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి, సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 11.
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు కారణాలు ఏమిటి?
జవాబు:
అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలకు ఇవి కారణాలు :

  1. పాలస్తీనా యూదులు, క్రైస్తవులు, ముస్లిములందరికీ పవిత్ర స్థలం, అరబ్బులు, ఇజ్రాయెల్ ని చట్టబద్ద దేశంగా గుర్తించటానికి తిరస్కరించారు.
  2. యూదులు పాలస్తీనాని తమ వాగత భూమిగా పరిగణిస్తారు.
  3. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఏకం చేసి, తమ మాతృభూమి అయిన పాలస్తీనాను తిరిగి పొంది, యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించటానికి యూదులలో ‘జిమానిస్ట్ ఉద్యమం’ మొదలయ్యింది. దీనికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది.
  4. అయితే అప్పటికే పాలస్తీనియన్లు (ఎక్కువమంది అరబ్బు, ముస్లిములు) అక్కడ నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కోసం అరబ్బులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ మొదలయ్యింది.
  5. అరబ్బు ద్వీపఖండంలో పెద్ద ఎత్తున చమురు నిల్వలు కనుగొనటంతో ఇరువర్గాల మధ్యే కాకుండా అమెరికా, రష్యాలు కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించడం ఘర్షణలకు కారణాలయ్యాయి.

10th Class Social Textbook Page No.291

ప్రశ్న 12.
కొంతమంది పాలస్తీనియన్లు ఉగ్రవాద పంథాని ఎందుకు ఎంచుకున్నారు? దాని ఫలితాలు ఏమిటి?
జవాబు:
1964లో జోర్డాన్లో “పాలస్తీనా విముక్తి సంఘం” (పిఎల్‌ఓ) ఆవిర్భవించింది. దీని ముఖ్య ఉద్దేశం అరబ్బు బృందాలన్నింటిని ఏకం చేయడం, కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగిపొందటం. దీని నాయకుడు “యాసర్ అరాఫత్”.

ఇది ఉగ్రవాద పంథాని ఎంచుకోవడానికి కారణం :

  1. 1967లో పాలస్తీనా విముక్తి సంఘం (పిఎల్ఓ)- ఇజ్రాయెల్ పై దాడి చెయ్యాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది. దీనికి అయితే అరబ్బు దేశాలు అంత ఉత్సాహం చూపలేదు.
  2. అరబ్బు దేశాల సహకారం లేకపోవడంతో పాలస్తీనా విముక్తి సంఘంలో నుంచి ఒక వర్గం అరాఫత్ నేతృత్వంలో చీలి ఉగ్రవాద పంథాని ఎంచుకున్నది.

దీని వల్ల ఫలితాలు :

  1. దాడులు, ప్రతిదాడులతో నిత్యం యుద్ధ వాతావరణంతోటి, ఉగ్రవాదుల దాడులతోటి ఉండేది.
  2. పిఎల్‌ఓ పరస్పరం ఘర్షణకు పాల్పడే అనేక చిన్న వర్గాలుగా చీలిపోయింది.
  3. చివరకు అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్‌ను గుర్తించటం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనటానికి అంగీకరించాడు.
  4. దీర్ఘకాల యుద్ధాన్ని ముగించటానికి అతడు ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 13.
అరబ్బు సోషలిస్టు జాతీయతావాదానికీ, మతపర జాతీయతావాదానికీ మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:
అరబ్బు సోషలిస్టు జాతీయవాదానికీ, మతపర జాతీయవాదానికీ మధ్య తేడాలు.

సోషలిస్టు జాతీయవాదంమతపర జాతీయవాదం
1) సోషలిజం అంటే అరబ్బుల ఉద్దేశంలో చమురు వనరుల జాతీయకరణ చేయడం.1) అనేక ప్రాంతాలలో అమెరికాకు, అమెరికా మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలకు వ్యతిరేకత, మతపరమైన రంగు సంతరించుకుంది.
2) చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వం ఖర్చుచేయటం.2) సంపదను, అవకాశాలను అందరికీ సమంగా పంచాలన్న భావనకు జాతీయవాద శక్తులు రాకుండా ఆయా దేశాలలో మత ఛాందసవాదులు అధికారంలోకి రావడానికి మద్దతునిచ్చాయి.
ఉదా : ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

10th Class Social Textbook Page No.292

ప్రశ్న 14.
ఇరాన్ లోనూ, తాలిబన్ల కింద ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లోనూ సంభవించిన పరిణామాలను తెలుసుకుని మతపర ప్రభుత్వాలు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోండి.
జవాబు:
1) ఇరాన్ :
1979లో ఇరాన్లో విప్లవం సంభవించి, ఇరాన్ రాజుని తొలగించి, షియా ఇస్లామిక్ మత గురువులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

2) ఆఫ్ఘనిస్తాన్ :
ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైనికులు తిరిగి వెళ్లిపోయిన తరువాత ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మతపర ప్రభుత్వాల పని విధానం :

  1. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మత గ్రంథాలలో ఉన్న నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను బలవంతం చేయసాగారు.
  2. దీని మూలంగా మహిళలకు, మతపర అల్ప సంఖ్యాక ప్రజలకు మౌలిక స్వేచ్ఛ, సమానత్వం లేకుండా పోయాయి.
  3. అరబ్బులలో అసంతృప్తి పెరిగింది. ఫలితంగా మతపర ఉగ్రవాదం అధికమైంది. కొంత మంది అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన రెండు విమానాలను హై జాక్ చేసి వాటితో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్ళడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేలమంది మరణించారు. ఈ విధంగా మతపరప్రభుత్వాల మూలంగా అనేక విధ్వంపాలు జరుగుతున్నాయని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.293

ప్రశ్న 15.
రెండు ధృవాల, ఏకధృవ ప్రపంచం అన్న పదాలను వివరించండి.
జవాబు:
1) రెండు ధృవాల ప్రపంచం :
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో రెండు ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ శిబిరాలు ఏర్పడ్డాయి. యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ శిబిరం, అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామిక పెట్టుబడిదారి శిబిరం. ఈ రెండు దేశాలను ‘రెండు ధృవాల’ ప్రపంచమని అంటారు.

2) ఏకధృవ ప్రపంచం :
1991 అధ్యక్ష ఎన్నికలలో గోర్బచెవ్ గెలుపొంది, యుఎస్ఎస్ఆర్ ని రద్దుపరుస్తున్నట్లు ప్రకటించాడు. పాత యుఎస్ఎస్ఆర్ లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి. యుఎస్ఎస్ఆర్’ కుప్పకూలటంతో ప్రపంచ రాజకీయాలలో కొత్త యుగం ఆరంభమయ్యింది. దీనినే ఏకధృవ ప్రపంచం అని అంటాము.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 16.
రెండు దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొనటానికి భారతదేశం, పాకిస్తాన్లు ఏ చర్యలు తీసుకోవాలి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనడానికి ఈ కింది చర్యలు తీసుకోవచ్చు.

  1. పాకిస్తాన్ కూడా లౌకిక రాజ్యం కావాలి. మతతత్వ భావనను విడనాడాలి.
  2. పాకిస్తాన్ మత ఛాందసవాదాన్ని విడిచి పెట్టి ప్రజలకు స్వేచ్ఛను కలిగించాలి. దీని వల్ల ఇరు రాజ్యా లూ మత ప్రసక్తి లేని వాతావరణంలో సంప్రదింపులు జరుపుకోవచ్చు.
  3. రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెంచాలి.
  4. రెండు దేశాల ప్రజలలో సామరస్య దోరణులు కలిగేలా చర్యలు తీసుకోవాలి.
  5. తాము ఉపఖండ దేశాలమని, భారతదేశం, పాకిస్తాన్ దేశాలు కలసి కొన్ని వందల సంవత్సరాలు సహజీవనం సాగించామని గుర్తుకు తెచ్చుకోవాలి.
  6. క్రీడలు, సినిమాలు, వాణిజ్యం, పర్యటన, సాంస్కృతిక సంబంధాలు, వివాహ సంబంధాలతో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంచవచ్చు.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 17.
భారతదేశం, పాకిస్తాన్ల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరం ఏమిటి?
జవాబు:
భారతదేశం, పాకిస్తాన్‌ అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి అవసరమే. ఎందుకనగా………
1) యుద్ధ ఖర్చు :
ఈ రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతుండడంతో ఇరు దేశాలు ఆయుధాలను, సైనికసంపత్తిని సమీకరించుకొనుటకు అధిక ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొంటే యుద్ధ ఖర్చు తగ్గుతుంది.

2) ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది :
ఇరు దేశాల మధ్య యుద్ధ భయం లేకపోతే ఇరు దేశాల ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో జీవిస్తారు.

3) సరిహద్దు రాష్ట్రాలలో యుద్ధభీతి తగ్గుతుంది :
సరిహద్దు రాష్ట్రాల వాళ్లు యుద్ధ భయం లేకుండా ప్రశాంత జీవనం సాగించవచ్చు.

4) సంస్కృతి, నాగరికతలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరుదేశాలకూ ఉండటంతో ఇరు దేశాల మధ్య స్నేహం, శాంతి నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 18.
పొరుగునున్న పెద్ద దేశాలు ‘పెద్దన్న లాగా’ వ్యవహరిస్తున్నాయని అనేక దేశాలు ఆరోపిస్తూ ఉంటాయి. దీని అర్థం ఏమై ఉంటుంది?
జవాబు:

  1. భారతదేశపు పొరుగు దేశాలలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పెద్ద దేశాలు, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి చిన్న దేశాలు ఉన్నాయి.
  2. భారతదేశం విశాలమైన దేశమైనందున పొరుగు దేశాలు మన పట్ల అపోహలు పెంపొందించుకోవడం, మన చర్యలను అపార్థం చేసుకోవడం జరుగుతుంది.
  3. చిన్న దేశాలు, పెద్ద దేశమైన భారతదేశం తమ మీద ఆధిపత్యం చేస్తుందని, భారతదేశం “పెద్దన్న పాత్ర” పోషిస్తుందని అంటున్నాయి.
    ఉదా : బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించటాన్ని బంగ్లాదేశ్ అభ్యంతర పెట్టింది. తీరప్రాంతాలలో భారతదేశం ‘పెద్దన్న పాత్ర’ పోషిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 20 ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం

10th Class Social Textbook Page No.296

ప్రశ్న 19.
భారతదేశం, బంగ్లాదేశ్ ఉన్న పటం చూసి రెండు దేశాల మధ్య సహకారం ఆ రెండింటికీ ఎందుకు కీలకమైనదో పేర్కొనండి.
జవాబు:
భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య సహకారం ఆ రెండు దేశాలకూ చాలా కీలకమైనది. ఎందుకనగా

  1. బంగ్లాదేశ్ చుట్టూ సరిహద్దుగా భారతదేశ రాష్ట్రాలున్నాయి. ఈ సరిహద్దు రాష్ట్రాలలో బంగ్లాదేశ్ ఏమైనా అసాంఘిక చర్యలు చేపట్టినట్లయితే భారతదేశ జాతీయ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుంది. కావున ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు అవసరం.
  2. బ్రహ్మపుత్ర, గంగానదీ జలాల విషయం ఇరుదేశాలకు సంబంధించింది. కావున జలాల పంపిణీ సక్రమంగా, సమస్యలు లేకుండా జరగాలన్నా ఇరు దేశాల మధ్య స్నేహ, సహకారాలు అవసరమే.
  3. బంగ్లాదేశ్ తో మనకు స్నేహ, సహకారాలు లోపిస్తే బంగ్లాదేశ్ ఇతర అగ్ర రాజ్యాల ఆధిపత్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తద్వారా మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. కావున బంగ్లాదేశ్, భారతదేశాల మధ్య సహకారం చాలా కీలకమైనదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.297

ప్రశ్న 20.
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతుని, శ్రీలంకలో దాని పాత్రని పోల్చండి. రెండు దేశాలలో పరిస్థితి ఒకే రకంగా ఉందా, తేడాలు ఉన్నాయా?
జవాబు:
బంగ్లాదేశ్ కి భారతదేశం ఇచ్చిన మద్దతు వేరు. శ్రీలంక పరిస్థితి వేరు.

  1. బంగాదేశ్ భారతదేశ సహాయంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది. భారతదేశంతో 25 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంది.
  2. శ్రీలంక కూడా వలసపాలన నుంచి 1948లో స్వాతంత్ర్యం పొందింది. అయితే శ్రీలంకలో తమిళం మాట్లాడే అల్ప సంఖ్యాక ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం చిన్నచూపు మూలంగా తమిళుల్లో తాము వేరు అన్న భావన ఏర్పడింది. దీనికి ప్రభుత్వమే కారణం.
  3. శ్రీలంక తమిళ కాందిశీకులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది. దీంతో శ్రీలంకలో శాంతిని నెలకొల్పటానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించినందుకు తమిళ తీవ్రవాదులు ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపారు. కావున బంగ్లాదేశ్ కి మనమిచ్చే మద్దతు వేరు. శ్రీలంకకు మనమిచ్చిన మద్దతు వేరు.

AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

SCERT AP 10th Class Social Study Material Pdf 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలో వివిధ బృందాలు, వ్యక్తులు రెండవ ప్రపంచ యుద్ధం పట్ల స్పందించిన విధానాన్ని పోల్చటానికి ఒక పట్టిక తయారు చెయ్యండి. ఈ బృందాలు ఎటువంటి సందిగ్ధతకు లోనయ్యాయి? (AS1)
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం పట్ల వివిధ బృందాలు, వ్యక్తులు స్పందించిన విషయాలు :

కాంగ్రెస్ :
అనేకమంది కాంగ్రెస్ నాయకులు, హిట్లర్ ని, ముస్సోలినిని, ఫాసిజాన్ని వ్యతిరేకించారు. కాని భారతీయుల అభిప్రాయం కనుక్కోకుండా, రాష్ట్రాలలో భారతీయులచే పరిపాలన జరుగుచుండగా వారి అనుమతి లేకుండా, నిర్బంధంగా భారతీయులు యుద్ధానికి సహాయం చేయవలెనని ఆంగ్లేయులు చెప్పడం భారతీయులను అవమానించడమే అని కాంగ్రెస్ అన్నది.

ముస్లిం లీగు (జిన్నా) :
జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు కూడా తమ పార్టీని ఆంగ్లేయులు ఆమోదించి, లీగు అనుమతితోనే పరిపాలనా విధానాన్ని రూపొందిస్తామని ఒప్పుకుంటే తమ పక్షం ఆంగ్లేయులకు సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. అయితే ‘క్రిప్స్” రాయబారం విఫలం అవడంతో ముస్లిం లీగు కూడా తిరస్కరించింది.

గాంధీజీ :
గాంధీజీ యుద్ధానికి విముఖుడే. అహింసయే పరమధర్మం అని నమ్మిన గాంధీజీ ఎన్నడూ యుద్ధానికి సుముఖుడు కాడు. అయినను ఇంగ్లాండు క్లిష్ట పరిస్థితులలో ఉండగా యుద్ధంలో పాల్గొనలేకపోయినా, దానికెటువంటి నష్టం కలిగించకూడదని తలచినాడు.

ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ :
బోసు, భారతీయులు ఆంగ్లేయులకు ఎటువంటి సహాయం చేయరాదన్నాడు. ఆ దేశానికి సహాయం చేసినట్లయితే, భారతీయులకు ఎన్నటికి స్వతంత్రం రాదని వారందరూ శాసనోల్లంఘనం చేయవలెనని ఉపన్యాసాలు ఇచ్చినాడు.
1) సంస్థానాధీశులు
2) హిందూమహాసభ
3) జస్టీస్ పార్టీ
4) అంబేద్కర్ నాయకత్వంలోని హరిజనులు
5) భారత కమ్యూనిస్టు పార్టీలు యుద్ధంలో ఇంగ్లాండుకు సహాయం చేయాలని నిర్ణయించినాయి. కాంగ్రెస్ కు ఇతర బృందాలు, వ్యక్తులకు ఇతర స్వతంత్ర దేశాలను జయించటానికి ప్రయత్నిస్తున్న నాజీ, ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలని ఉన్నా తమకు స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వని బ్రిటిష్ వారికి ఎందుకు సహాయం చేయాలనే సందిగ్ధతకు లోనయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947

ప్రశ్న 2.
యూదులు, ఇతర సమూహాల పట్ల జర్మనీ దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో జర్మనీకి గాని, జపానుకి గాని మద్దతు ఇవ్వడం నైతికంగా సరైనదేనా? (AS1)
జవాబు:
సరైనది కాదు. ఎందుకనగా :

  1. జర్మనీ అనేకమంది యూదులను చీకటి గదుల్లో, నేలమాలిగళ్ళో బంధించి చంపింది.
  2. జర్మనీలోని “నాజీ” జాతి ప్రపంచంలోనే గొప్పజాతి అనే జాత్యాహంకారంతో జర్మనీ ఇతర దేశాలను చిన్నచూపు చూసింది.
  3. సామ్రాజ్య కాంక్షతో ఇతర స్వతంత్ర దేశాలను ఆక్రమించుకోవాలని చూసింది.
  4. జపాన్ ఆసియా ఖండానికి చెందిన చిన్నదేశం అయిన, యూరోపియన్ దేశాలతో పోటీపడుతూ దూరప్రాచ్యంలో వలసలను ఏర్పాటు చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది.
  5. సామాజ్య కాంకకు లోనయి ఇతర పెద్ద దేశాలను కవ్విస్తూ అనేక దేశాల మీద దాడులు జరిపింది.

ఇటువంటి నేపథ్యంలో జర్మనీ, జపాన్లకు మద్దతు ఇవ్వడం సరైనది కాదని చెప్పవచ్చు.

ప్రశ్న 3.
భారతదేశ విభజనకు దారితీసిన వివిధ కారణాల జాబితా తయారుచేయండి. (AS1)
జవాబు:
భారతదేశ విభజనకు దారి తీసిన వివిధ కారణాలు :

  1. ముస్లింలకు ప్రత్యేక దేశం అనే భావనకు తొలి ఆధారం కవి “మహ్మద్ ఇక్బాల్” చేసిన ప్రసంగంలో కనిపిస్తుంది.
  2. 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షోపన్యాసంలో ఇక్బాల్ వాయవ్య “భారత ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సూచించాడు.
  3. వాస్తవానికి కేంబ్రిడ్జిలో చదువుతున్న పంజాబ్ ముస్లిం విద్యార్థి “చౌదరి రెహ్మత్ ఆలీ” వర్గం దేశ విభజన భావనకు ఊపిరిపోసిందని చెప్పవచ్చు. 1933లో ప్రచురించిన ఒక కర పత్రంలో ” రెహ్మత్ ఆలీ” ముస్లిం వర్గానికి ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి కల్పించాలనే అభిప్రాయంతో “పాకిస్తాన్” అనే పదానికి రూపకల్పన చేసాడు. (పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింద్, బెలూచిస్తాన్స్ ఇంగ్లీష్ అక్షరాల నుంచి పాకిస్తాన్ ఏర్పరచారు.)
  4. 1937 నుంచి ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం అనే భావనపై లీగ్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
    ఎ) 1935 చట్టపు ఫెడరల్ క్లాజులు అమల్లోకి వస్తాయన్న నమ్మకం వారికి సన్నగిల్లింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో తాము హిందూ ఆధిక్యతకు తలవంచక తప్పదనే అభిప్రాయం కూడా వారికి కలిగింది.
    బి) రాష్ట్రాలలో ముస్లిం లీగ్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనే లీగ్ ప్రతిపాదనకు కాంగ్రెస్ వారు నిరాకరించడం జిన్నాకు, ముస్లిం లీగ్ కు అవమానంగా తోచింది. కాంగ్రెస్ మౌలికంగా హిందువుల పార్టీ అని లీగు సృష్టించగలిగింది.
  5. విద్యావంతులైన ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటు కావాలని భావించసాగారు. మొదట విద్యార్థుల పగటి కలగా కొట్టివేసిన “ముస్లింలకు ప్రత్యేక దేశం” అనే భావన చివరికి ముస్లిం లీగ్ ప్రధాన డిమాండ్ గా రూపొందింది.
  6. రెండవ ప్రపంచయుద్ధం తరువాత బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ నాయకులలో అనేకమంది భారతీయులు స్వాతంత్ర్యం పొందడానికి సుముఖంగా ఉన్నారు.
  7. బ్రిటన్ “విభజించి – పాలించు” అనే విధానాన్ని పాటిస్తూ కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ, ముస్లిం లీగు ప్రణాళికలకు మద్దతు ఇచ్చి, ముస్లిం లీగు బలపడేలా చేసింది.
  8. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్, భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని కలుగచేసారు.
  9. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అగ్రరాజ్యాలుగా రూపొందిన అమెరికా, సోవియట్ యూనియన్లకు భారతదేశ స్వాతంత్ర్య డిమాండ్ ను సమర్ధించాయి.
  10. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలలో ప్రజల ప్రతిపాదన, ప్రత్యేక పాకిస్తాన్ దేశం కావాలని, ఇది కూడా పాకిస్తాన్ ఏర్పాటుకు ఒక కారణం.
  11. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన ఎన్నికలలో 569 స్థానాలలో 442 స్థానాలకు కేంద్రంలో 30 స్థానాలను గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధానపార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి, భారతీయ ముస్లింల “ఏకైక ప్రతినిధి” అన్న తన వాదనను నిజం చేసుకుంది.
  12. చర్చలతో స్వాతంత్ర్యం రాదని లీగు భావించి, ప్రజలను వీధులలోకి రమ్మని పిలుపునిస్తూ ‘ప్రత్యక్ష కార్యాచరణ”కు దిగటానికి నిర్ణయించుకొని 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఇది అనేక అల్లర్లు, హింసకు కారణమైంది.

1947లో “వావెల్” స్థానంలో మౌంట్ బాటెన్ వచ్చి ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు. ఇవి కూడా విఫలం అవడంతో ఆగస్టు 14, 1947న పాకిస్తాన్‌కు, ఆగస్టు 15, 1947న భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటన చేశాడు. ఈ విధంగా భారత్, పాక్లు విభజింపబడినాయి.

ప్రశ్న 4.
దేశ విభజనకు ముందు వివిధ సమూహాల మధ్య అధికారాన్ని పంచుకోటానికి ఏ ఏ విధానాలను అవలంభించారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు ముస్లిం లీగు, కాంగ్రెస్ మధ్య అధికారాలను పంచుకున్నారు.

1945లో పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందుగా వైస్రాయ్, సైనికా దళాల కమాండర్ – ఇన్ – చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని భారతీయులతోనే ఏర్పరచటానికి బ్రిటన్ సిద్ధం అయ్యింది. ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చెయ్యటానికి ముస్లిం లీగుకి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబట్టడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. జాతీయవాద ముస్లిములలో పలువురి మద్దతు కాంగ్రెస్ కు ఉంది. పంజాబ్ లోని యూనియనిస్టు పార్టీలో పలువురు ముస్లింలు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ముస్లిం లీగు కోరికను సమర్థించలేదు. 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

ప్రశ్న 5.
బ్రిటిష్ వలస పాలకులు తమ విభజించి, పాలించు అన్న విధానాన్ని భారతదేశంలో ఏ విధంగా అమలు చేశారు? నైజీరియాలో అవలంబించిన విధానానికీ, దీనికీ మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
బ్రిటిష్ వలస పాలకులు భారతదేశంలో “విభజించి – పాలించు” అన్న విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేసారు.

  1. హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు.
  2. కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని పెంచి పోషించారు.
  3. హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించుకున్నారు.
  4. మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి ‘జసిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు.
  5. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు.
  6. శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది.
భారతదేశంనైజీరియా
1) హిందూ-ముస్లిం మత వైరుధ్యాన్ని పోషించారు.1) బ్రిటిష్ వలసపాలకుల విధానాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగాయి.
2) కమ్యూనల్ ఎలక్టోరేట్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదట విద్యావంతులయిన భారతీయులలోనూ తరువాత సాధారణ ప్రజానీకంలోను ఈ శత్రుత్వాన్ని, పెంచి పోషించారు.2) బ్రిటిష్ వలసపాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరచి, మొరుబా, ఈబు తెగల మధ్య విభజనలు సృష్టించారు.
3) హిందీ, ఉర్దూ భాషల విషయంలో ఏర్పడ్డ వివాదాన్ని గోసంరక్షణ ఉద్యమాన్ని సైతం వీరు ఉపయోగించు కున్నారు.3) విద్యావంతులైన ఆఫ్రికావాసులను సివిల్ సేవలకు అనుమతించకపోవడం, ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపడం జరిగింది.
4) మితవాదులను ప్రోత్సహిస్తూ జాతీయవాదులలో చీలిక తీసుకువచ్చారు. దాదాబాయ్ నౌరోజీ వంటి వారి నుండి “జస్టిస్ రనడే’ వంటి విప్లవనాయకులను వేరు చేయడానికి ప్రయత్నించారు. అతివాదులకు వ్యతిరేకంగా మితవాదులను ప్రోత్సహించారు.4) ప్రజలపై మరింత నియంత్రణను సాధించటానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నెరిపింది.
5) శీఘ్రంగా పెరిగిపోతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలువరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విభిన్న విధానాలను అనుసరించింది. కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాలను ప్రోత్సహించింది.5) జాతీయ ఉద్యమ తీవ్రతకు లోబడి, మూడు ప్రధాన ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ సంక్లిష్ట సమాఖ్య వ్యవస్థను నెలకొల్పి నైజీరియాన్లకు అధికారాన్ని అప్పగించింది.

ప్రశ్న 6.
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతాన్ని ఏ ఏ విధంగా ఉపయోగించుకున్నారు? (AS1)
జవాబు:
దేశ విభజనకు ముందు రాజకీయాలలో మతం కీలకపాత్ర వహించి, చివరికి దేశ విభజనకు దారి తీసింది.

  1. వర్తకం, పరిశ్రమ, ప్రభుత్వ సర్వీసు, విద్య, వృత్తుల వంటి రంగాలలో హిందువుల ప్రాబల్యం కారణంగా అధిక సంఖ్యాకులయిన హిందూ సముదాయం పట్ల అల్పసంఖ్యాకులయిన ముస్లిం సముదాయం పెంచుకొన్న భేదభావాలే దేశ విభజనకు దారి తీసాయని చెప్పవచ్చు.
  2. 1857 సిపాయిల తిరుగుబాటు కేవలం మహమ్మదీయులు రాజకీయంగా అసంతృప్తి చెంది తెచ్చిన విప్లవమని భావించి బ్రిటిష్ వారు ముస్లింలను ఆ విధంగా వ్యతిరేకభావంతోనే చూశారు.
  3. ‘విభజించి – పాలించు’ విధానాన్ని అనుసరించి బ్రిటిష్ వారు హిందువులను-ముస్లింలను మతాలవారీగా విడదీయటానికి పరోక్షంగా పథకాలు వేశారు.
  4. ముస్లింలలో పాశ్చాత్య విద్యావ్యాప్తి మందకొడిగా సాగిన కారణంగా వారిని ఏదో విధంగా స్వాతంత్ర్యోద్యమానికి దూరంగా ఉంచడానికి ప్రభుత్వం కృషి చేసింది.
  5. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన విద్యాపరమైన అలిఘర్ ఉద్యమం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రాజకీయ అధికారుల కోసం ముస్లీమ్ మతతత్వాన్ని ప్రోత్సహించారు. ఈయన తన చివరి రోజులలో ముస్లింలను జాతీయోద్యమం నుంచి వైదొలగడమే కాక హిందువులు, మహమ్మదీయులు పరస్పర విరుద్ధ రాజకీయ ప్రయోజనాలున్న వర్గాలని ప్రకటించాడు.
  6. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి వల్ల ‘బిద్రుద్దీన్ త్యాబ్ది’ లాంటివారు విద్యాధికులయ్యారు. వీరు అల్పసంఖ్యాకులైన తమకు ఉద్యోగాలు రావాలంటే బ్రిటిష్ వారికి విధేయులై ఉండాలని ఉద్భోదించారు.
  7. తిలక్, అరబిందు వంటివారు ప్రాచీన హిందూ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చి, హిందూమత ప్రాతిపదికకు పిలుపునిచ్చారు.
  8. తిలక్ గణపతి పూజ, శివాజీ ఉత్సవాలకు ప్రాధాన్యమిచ్చి, హిందువులను ఐక్యం చేయడానికి ప్రయత్నించాడు.
  9. ముస్లింలను ప్రోత్సహించడానికి బ్రిటిష్ వారు 1906 లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను వేర్పాటు చేసి, ఏర్పాటు వాదాన్ని పెంచినారు.
  10. హిందువులు కూడా మతతత్వంను పెంచుతూ అనేకమంది హిందూ నాయకులు హిందూ జాతీయతను గురించి చెప్పడం, వారి హక్కుల పరిరక్షణ కొరకు “హిందూ మహాసభ”, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థలను ఏర్పాటు చేసుకొన్నారు. భారతదేశం హిందువుల మాతృదేశమని, ముస్లింలు విదేశీయులని ప్రచారం చేసారు.

ప్రశ్న 7.
స్వాతంత్ర్య పోరాటం చివరి సంవత్సరాలలో కార్మికులను, రైతాంగాన్ని ఏ విధంగా సమీకరించారు? (AS1)
జవాబు:
భారతీయ కార్మిక వర్గానికి అక్షరాస్యత తక్కువే కాకుండా సాంస్కృతికంగా కూడా వెనుకబడి ఉంది. అందుకే మేధావులు, బూర్జువా వర్గాల కన్నా, వీరిలో జాతీయ, వర్గ చైతన్యం ఆలస్యంగా ప్రారంభమయిందని చెప్పవచ్చు. 1917లో రష్యన్ విప్లవం మూలంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి కార్మికసంఘ ఉద్యమాలకు కారణం అయ్యాయి. కార్మికుల యొక్క పని గంటలు, వేతనాలలో సంస్కరణలు తీసుకురావడం కొరకు అనేక కార్మికసంఘాలు, మద్రాస్ కార్మికసంఘం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (ఐ.టి.యు.ఎఫ్), ఎ.ఐ.టి.యు.సి., నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ల వంటివి ఆవిర్భవించాయి. 1935-39లో కార్మిక కార్యకలాపాలను పునరుద్ధరించడంలో సమ్మెలు కూడా తగ్గినాయి. 1935 చట్టం కార్మిక నియోజకవర్గాలను ఏర్పాటుచేసింది. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు. సమ్మెలు చేశారు. భారత కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. వివిధ దశల్లో చేసిన వివిధ చట్టాల వల్ల కార్మికుల పని పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. కార్మికులు తమ • నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ నాయకులకు పూర్తి మద్దతు ఇచ్చారు.

“చంపారన్” సత్యాగ్రహం బీహార్ రైతులలో చైతన్యాన్ని కలిగించింది. “ఖేరా’ కరవు విషయంలో గాంధీజీ సత్యాగ్రహం చేయడం రైతులకు రక్షణ కలిగించింది. రైతులు తమ కోర్కెల సాధన కొరకు సత్యాగ్రహాన్ని ఉపయోగించుకోవచ్చని రైతులు భావించసాగారు. ఇటువంటి సమయంలో రైతులను రాజకీయాలవైపు ఆకర్షిస్తూ, లక్షలాది రైతులను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేటట్టు చేయగలిగింది. దశాబ్దాల నుంచి రాజకీయ అంధకారంలో మగ్గుతున్న రైతులను రాజకీయ సుడిగుండంలోకి తీసుకురాగలిగింది. 1917 నుంచి గాంధీజీ ఆయన అనుచరులు భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రైతుల జీవితంలో జాతీయ రాజకీయాలను ప్రవేశపెట్టడంలో విజయం సాధించారు. 1923 లో ప్రముఖ రైతు నాయకుడు “యన్. జి. రంగా” “రైతుల సమాఖ్య”ను ఏర్పాటుచేశాడు. గుంటూరు జిల్లాలో రైతులు ఈయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ రైతు సమాఖ్యలు పశ్చిమగోదావరి, కృష్ణాలకు విస్తరించినాయి. 1929 లో “ఆంధ్రరైతుల ప్రొవిన్షియల్ సమాఖ్య” యన్.జి.రంగా అధ్యక్షతన సమావేశమై రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను సమర్ధించింది. 1942లో భారత రైతులు ‘శాసనోల్లంఘన’ ఉద్యమం పిలుపుకు వీరోచితంగా స్పందించినారు. బెంగాల్ లోని మిడ్నపూర్‌లో రైతుల తిరుగుబాటు కారణంగా కొన్ని సంవత్సరాలపాటు బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు.

ఈ విధంగా భారతదేశంలోని రైతు ఉద్యమాలకు చైనాలోని ‘మావో’ లాగ సరైన నాయకత్వం గనుక లభించి ఉంటే భారతదేశ చరిత్ర మరోలా ఉండేదనడం నిర్వివాదాంశం. హైదరాబాద్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణా ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించింది.

ప్రశ్న 8.
సాధారణ ప్రజల జీవితాలను దేశ విభజన ఏ విధంగా ప్రభావితం చేసింది ? విభజన తరువాత జరిగిన వలసలకు రాజకీయ ప్రతిస్పందన ఏమిటి? (AS1)
జవాబు:
ముస్లిం మత పాకిస్తాన్ ఏర్పాటు కావటంతో చాలామంది ప్రజల ముందు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఎదురయ్యింది. కొత్తగా గీసిన సరిహద్దు రేఖకి ఒకవైపున ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడి వలస వెళ్లడం తప్పనిసరి అయ్యింది. ఈ కొత్త సరిహద్దు రేఖకు ఆవలివైపున ఉన్న ముస్లిములలో కూడా ఇదే పరిస్థితి. అందరూ దీనిని కోరుకుని ఉండకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతోందో అందరికీ అర్థం అయి ఉండకపోవచ్చు. తమ ఇళ్లు, ఊళ్లు, పట్టణాలను విడిచి వెళ్లవలసి రావటంతో ఒకరిపట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి. మొత్తంగా 1.5 కోట్ల హిందువులు, ముస్లిములు నిర్వాసితులయ్యారు. హత్యలు, దోపిడి, దహనాలు యధేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లిములు కలిపి రెండు నుంచి అయిదు లక్షలమంది చంపబడ్డారు. వాళ్లు కాందిశీకులుగా మారారు, పునరావాస శిబిరాలలో గడిపారు. రైళ్లల్లో కొత్త ఇళ్ల అన్వేషణలో బయలుదేరారు. శాంతి, సౌభ్రాతృత్వ సందేశాలను పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య, ఆసుపత్రులలో గడిపాడు. తను ఇంతగా కష్టపడింది ఇటువంటి స్వేచ్ఛ, స్వరాజ్యాల కోసం కాదు. జాతిపిత మొదటి స్వాతంత్ర్య దినోత్సవంనాడు సంబరాలు చేసుకోకుండా నిరాహారదీక్ష చేశాడు.

గాంధీజీ చొరవతో “అల్పసంఖ్యాక వర్గాల హక్కుల’ పై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఆ పార్టీ “రెండు దేశాల సిద్ధాంతాన్ని” ఎప్పుడూ అంగీకరించలేదు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేశవిభజనకు బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చినప్పటికీ ‘భారతదేశం అనేక మతాల, జాతుల దేశమనీ, అలాగే కొనసాగాలని’ విశ్వసించింది. పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ‘ప్రజాస్వామిక లౌకికరాజ్యం ‘ గా ఉంటుంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది. సమాన హక్కులు ఉంటాయి.

ప్రశ్న 9.
కొత్తగా ఏర్పడిన భారతదేశంలోకి వివిధ సంస్థానాలను విలీనం చేసే ప్రక్రియ ఒక సవాలుగా పరిణమించింది. చర్చించండి. (AS1)
జవాబు:
బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. 1947 భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాధీశులు తమ ఇష్ట ప్రకారం తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే అధికారం పొందారు. దీని మూలంగా కొంతమంది రాజులు స్వతంత్రంగా ఉంటామని ప్రకటించినారు. భోపాల్ నవాబు కాంగ్రెస్ ప్రభావం ఉన్న భారతదేశం చేరడానికి సుముఖంగా లేక, అతడు భారత ప్రభుత్వ రాజకీయ శాఖతోనూ, ముస్లింలీగుతోను రహస్యంగా కుమ్మక్కవుతున్నాడని తెలిసి, దేశీయాంగ మంత్రి సర్దార్ వల్లభబాయి పటేల్ భోపాల్ పాకిస్తాన్లో కాని చేరినట్లయితే దేశ సమగ్రతకు భంగం కలిగే ప్రమాదం ఉండటంతో పటేల్, భోపాల్ ను భారతదేశంలో కలిపివేసినారు.

1947 ఆగష్టు 15 నుండి బ్రిటిష్ ఆధిపత్యం తొలగుతుందని సంస్థానాధీశులు ఇండియా, పాక్లో దేనిలో అయినా చేరనూవచ్చు లేదా స్వతంత్రంగా ఉండనూవచ్చు అని మౌంట్ బాటెన్ ప్రకటించాడు.

ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం, సంస్థానాధీశుల మూలంగా చిన్నాభిన్నం కావడం ఇష్టంలేని పటేల్ స్వతంత్ర రాజులను ఒప్పించడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. దాని ప్రకారం సంస్థానాధీశుల అధికారం బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పటిలాగానే విదేశీ వ్యవహారాలు, రక్షణ, ప్రయాణ సౌకర్యాలు తప్ప మిగిలిన అధికారాలన్నీ రాజులకు కల్పించబడతాయి అని పటేల్ ప్రకటించగానే బరోడా, బికనీర్, కొచ్చిన్, జైపూర్, జోధ్ పూర్, పాటియాల, రేవా వంటి అనేక సంస్థానాలు భారత్ లో కలిసాయి.

1947 ఆగష్టు 15 నాటికి హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్ తప్ప తక్కిన సంస్థానాధీశులందరూ భారత్ లో చేరతామని ప్రకటించినారు. ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశ ఐక్యతకు తోడ్పడినాడు.

జునాగఢ్ :
ఈ సంస్థానంలో 75% ప్రజలు హిందువులు. కాని నవాబు జిన్నాకు అనుకూలుడు. అనేకమంది హిందువులను తరిమికొట్టాడు. జునాగఢ్ పాకిస్తాన్లో కలుస్తుందని ప్రకటించాడు. ప్రజలు తీవ్ర ఆందోళన లేవదీశారు. అందువల్ల సర్దార్ పటేల్ జునాగఢ్ మీదకి సైన్యాలను పంపాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేశాడు. ప్రజాభిప్రాయం ప్రకారం జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది. నవాబు పాకిస్తాన్ పారిపోయాడు.

హైదరాబాద్ :
నిజాంను ప్రభుత్వం సమానస్థాయి ఉన్న రాజ్యాధినేతగా పరిగణించింది. కాని సంతృప్తి చెందని నిజాం తన రాజ్యానికి సముద్రతీరం ఉండాలని ‘గోవా’ ను పోర్చుగీసు వారి నుండి కొనడానికి సన్నద్ధమయి, పాకిస్తాన్ నుండి సైన్యాన్ని, ఆయుధాలను చేరవేయడం జరిగింది. హైదరాబాదులోని భూస్వాములు, అధికారుల దురాగతాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం బయలుదేరింది. ఇది సాయుధ పోరాటంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని కాసిం రజ్వీ’ నాయకత్వంలో రజాకార్లు బయలుదేరి పౌర జీవనాన్ని స్తంభింపచేశారు. జిన్నా, ప్రపంచ ముస్లింలందరూ దీనికి సానుభూతి చూపి భారతను ఎదిరించాలని ప్రకటించాడు. ఈ చర్యల మూలంగా దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందని పటేల్ భావించి 1948 సెప్టెంబరు 13న భారత సైన్యాలను హైదరాబాద్ మీదకి పంపినాడు. కాసీం రజ్వీ, అతని అనుచరులు పారిపోయారు. నిజాం 1948 సెప్టెంబరు 17వ తేదీన భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. భారత ప్రభుత్వం హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసి, ఈ చర్యను “పోలీసు చర్య”గా ప్రకటించింది.

కాశ్మీర్ :
కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. కాని రాజు హిందువు. పాకిస్తాన్ సేనలు కాశ్మీర్ లోకి చొచ్చుకొని వచ్చాయి. దీని మూలంగా రాజు, కాశ్మీర్ భారత్ లో చేరిపోతుందని ప్రకటించి, భారత్ సహాయాన్ని కోరినాడు. భారత్, పాకు దాదాపు ఒక సంవత్సరం పోరాటం చేసారు. చివరికి ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన కమిషను మూలంగా పోరాటం ఆగింది. కాని కాశ్మీర్ లో కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉండిపోయింది.

దేశ సమైక్యతకు భంగం కలిగించే ఈ సంస్థానాధీశులను చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నవారు సర్దార్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందినాడు.

10th Class Social Studies 16th Lesson భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం: 1939-1947 InText Questions and Answers

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 1.
ప్రభుత్వాలు రాజీనామా చేస్తే రోజు వారీ వ్యవహారాలను ఎవరు నిర్వర్తిస్తారు?
జవాబు:
ప్రభుత్వాలు రాజీనామా చేసినప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. కాబట్టి రోజువారీ కార్యక్రమాలను వారు నిర్వర్తిస్తారు. దైనందిన వ్యవహారాలు స్పందించకుండా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 2.
భారతీయులు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని పక్కన పెట్టి స్వేచ్ఛాయుత ప్రపంచంపై దృష్టి కేంద్రీకరించాల్సినంతగా హిట్లర్ బలం పుంజుకుని మానవాళి స్వేచ్ఛకు ముప్పు కలిగించేవాదా?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తరువాత ఆమోదించిన రెహ్మత్ ఆలివర్సయిల్స్ సంధి షరతులు జర్మనీకి అవమానకరంగా ఉన్నాయని హిట్లర్ భావించాడు. ఇతర దేశాల ఆధీనంలో ఉన్న జర్మన్ భూభాగాలను ఏకం చేయాలని ఆశించాడు. సంధి షరతులను ఉల్లంఘించినాడు. పెద్ద దేశాలను ఎదిరించి, దూర ప్రాచ్యంలో తమకు కూడా వలసలు కావాలని ఆశించాడు. జర్మనీని చూసి అగ్రరాజ్యలు భయపడేలా చేసాడు. అయితే మన స్వాతంత్ర్య పోరాటం వదిలి స్వేచ్ఛాయుత ప్రపంచం కొరకు దృష్టి పెట్టవలసినంత అవసరం లేదు. జర్మనీకి భారత జాతీయ పోరాటం మీద సానుభూతి కూడా ఉంది.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 3.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ని సమర్ధించటానికి, సమర్థించకపోవటానికి మీ కారణాలను పేర్కొనండి.
జవాబు:

  1. బ్రిటనను సమర్థిస్తాను. ఎందుకనగా జాత్యాహంకారంతో, సామ్రాజ్యకాంక్షతో ఇతర స్వతంత్రదేశాలను ఆక్రమించు కుంటున్న జర్మనీ, జపాన్ వంటి దేశాల ఆటకట్టించడానికి బ్రిటన్ యొక్క ప్రయత్నాన్ని నేను సమర్ధిస్తాను.
  2. భారతీయులను సంప్రదించకుండా, వారితో ప్రమేయం లేకుండా, యుద్ధం తరువాత స్వాతంత్ర్యం ఇస్తామని కనీసం మాట కూడా ఇవ్వకుండా, భారత్ యుద్ధంలో పాల్గొనాలని బ్రిటిష్ ప్రకటించడాన్ని నేను సమర్థించను.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 4.
బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి కాంగ్రెస్ ఏ చర్య చేపడితే బాగుండేది?
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ దృక్పథం పట్ల నిరసన వ్యక్తపరచటానికి, భారతీయులు 1937లో జరిగిన ఎన్నికలలో 8 రాష్ట్రాలలో అధికారంలోనికి వచ్చిన ప్రభుత్వాలు రాజీనామా చేయకుండా, అధికారంలోనే ఉండి, బ్రిటిష్ వారికి సహకరించకుండా నిరసన తెలిపితే బాగుండేది.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 5.
బ్రిటన్ మాట ఇచ్చి భారతీయుల మద్దతు ఎందుకు పొందలేదు? 1939లో భారతీయులు అడిగింది మాటే కదా ! తరగతిలో అందరూ చర్చించండి.
జవాబు:

  1. బ్రిటిష్ వారికి, తాము భారతదేశంలో నిర్మించిన సామ్రాజ్యాన్ని వదులుకోవటం ఇష్టం లేదు.
  2. 2వ ప్రపంచయుద్ధం తరువాత భారత్ కు డొమీనియన్ ప్రతిపత్తి ఇస్తామని చెప్పారు. కాని జాతీయవాదులు సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరినారు. ఇది బ్రిటిష్ కు ఇష్టం లేదు.
  3. కాంగ్రెస్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని (ఉదా : ముస్లిం ప్రజలకు) బ్రిటిష్ భావించింది. అనేకమంది భారతీయుల ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని వాటిని కాపాడాల్సిన బాధ్యత ‘తమపైన ఉన్నదని బ్రిటన్ భావించి, భారతీయులకు 1939లో స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటన్ మాట ఇవ్వలేదని అర్థం అవుతుంది.

10th Class Social Textbook Page No.221

ప్రశ్న 6.
అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఒక విధానం. ఈ ఉద్దేశం నెరవేర్చటంలో సహాయపడగల -విధానాలు ఇంకేమైనా ఉన్నాయా? ఉదాహరణకు ముస్లింలకు సంబంధించిన అంశం మీద ఓటు వేయటానికి ముందు ముస్లిమేతర సభ్యులు తమ నియోజక వర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే ఎలా ఉంటుంది? ఇటువంటి పద్ధతి ఎప్పుడు పని , చేస్తుంది? ఎటువంటి పరిస్థితులలో ఇది విఫలం అవుతుంది?
జవాబు:

  1. అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడటానికి ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు చట్ట సభల్లో వారికి రిజర్వేషన్లు కూడా కల్పించవచ్చు.
  2. ముస్లిమేతర సభ్యులు తమ నియోజకవర్గంలోని ముస్లింలను సంప్రదించాలన్న షరతు పెడితే బాగుంటుంది. కాని ఈ ఈ పద్ధతి, ముస్లింలు చాలా తక్కువ సంఖ్యలో ఉండి, తమ హక్కులకు రక్షణ లభించగలదని నమ్మే పరిస్థితిలో పనిచేస్తుంది. ముస్లింలకు ఇతర వర్గాల మీద నమ్మకం లేనపుడు, వారి సంఖ్య అధికంగా ఉన్నప్పుడు ముస్లింలు, వారి వర్గ సభ్యులకే ఓటు వేసుకోవాలనుకుంటారు, కాని ఇతరులకు వేయాలనుకోరు.

10th Class Social Textbook Page No.229

ప్రశ్న 7.
తాము బందీలుగా పట్టుకున్న సైనికులను బోస్ తన సైన్యంలోకి తీసుకోవటాన్ని జపనీయులు ఎందుకు అనుమతించారు?
జవాబు:
జపాన్ ఆధ్వర్యంలో ‘గ్రేటర్ ఆసియా’ను స్థాపించడం కోసం స్థానికంగా సంబంధాలు ఏర్పరచుకోవాలనే, స్వార్ధ ప్రయోజనంతోనే జపాన్ వారు ‘భారత జాతీయ సేన’ ఏర్పాటును ప్రోత్సహించారు. తాము బందీలుగా పట్టుకున్న సైనికులతో జాతీయ సేనను ఏర్పాటుచేయుటకు ప్రోత్సహించారు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 8.
భారత సైనికులు భారత జాతీయ సైన్యంలో ఎందుకు చేరారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ సైనికులు కూడా ఉన్నారు. జపాన్ వారు బర్మా, మలయాపై దాడి చేసి అక్కడి, బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. మలయా కూడా బ్రిటన్ వలస దేశమే. బ్రిటిష్ సైన్యంలోని కెప్టెన్ ‘మోహన్ సింగ్’ తన జట్టు సైనికులతో జపనీయులకు లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన యుద్ధ ఖైదీలతో ‘భారత జాతీయ సైన్యం’ ఏర్పడింది.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 9.
యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ల చేతుల్లో చిక్కుతామన్న భయం భారతీయ సైనికులకు ఎందుకు లేకపోయింది? బ్రిటిష్ వాళ్లు వీరిని ఏమి చేసి ఉండేవాళ్లు?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి, యుద్ధంలో ఓడిపోతే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కుతామన్న భయం లేదు. వారిలో దేశభక్తి మెండుగా ఉంది. తాము చేసే యుద్ధంలో ఇంగ్లాండు ఓడిపోయినట్లయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని ఆశించారు. భారత సైనికులు కేవలం కిరాయి హంతకులు కాదని, తమ ప్రాణాలను స్వదేశం కోసం పణంగా పెట్టగల దేశభక్తులని నిర్ధారణ అయింది. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారతీయులందరిలో జాతీయవాద భావనలను పురికొల్పాయి. భారతదేశాన్ని దాని సైన్యంతోనే లొంగదీసుకోవడం ఇకపై సాధ్యంకాదని బ్రిటిష్ వారు గ్రహించారు.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 10.
ఘటనలు ఈ విధమైన మలుపు తీసుకోవటం వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా ప్రభావితమై ఉంటాయి?
జవాబు:
భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులు, రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటన్ చేతిలో జపాన్ ఓడిపోవుట వలన ఓడిపోయారు. అయితే ఈ సైనికులను జైలుపాలు జేసి వారిని శిక్షించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయించినారు. విద్రోహ చర్య క్రింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించాయి. సైనికులపై విచారణ కొనసాగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి.

10th Class Social Textbook Page No.225

ప్రశ్న 11.
నాయకులుగా ఆరాధించిన భారత జాతీయ సైనికులను బ్రిటిష్ వాళ్లు, విద్రోహులుగా పరిగణించి, విచారించి, ఉరి తీయటం ఇతర భారతీయులను ఎలా ప్రభావితం చేసి ఉంటుంది?
జవాబు:
జాతీయ సైనికులను అరెస్టు చేసి, విచారణ సాగుతుండగా చాలా ప్రాంతాలలో గొడవలు, అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువులు, ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. ఉదా : భారత జాతీయ సైనికులలో విచారింపబడుతున్న వాళ్ళలో చాలామంది ముస్లింలు, అయితే వాళ్ళ పట్ల ప్రజలలో సానుభూతి వెల్లివిరిసి వాళ్ళ మతం గురించి ఎవరూ ఆలోచించలేదు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 12.
పైన పేర్కొన్న పలు ప్రజా ఉద్యమాలలో మతపర తేడాలను పట్టించుకోలేదని గమనించాం. ఈ ఉద్యమాలలో ప్రజల ఐకమత్యానికి కారణం ఏమిటి?
జవాబు:
రైతు, కార్మిక, ఉద్యోగస్తుల, నౌకాదళంలోని భారత సైనికుల తిరుగుబాటు, జాతీయ సేనను బ్రిటిష్ వారు విచారించి శిక్షించాలనుకున్నపుడు, ఇటువంటి సందర్భాలలో భారత ప్రజలందరూ తామంతా ఒక్కటే అని కలిసికట్టుగా సమస్యల సాధనకొరకు కృషి చేసారు. వారిలో దేశభక్తి ఉప్పొంగింది. తామందరికీ శత్రువైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు.

10th Class Social Textbook Page No.218

ప్రశ్న 13.
1935 చట్టం ఇచ్చిన అధికారాలకు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలా?
జవాబు:
1935 చట్టంలోని అంశాలు :

  1. ఈ చట్టం భారతదేశంలో ఫెడరల్ విధానాన్ని ఏర్పాటు చేయాలి.
  2. కేంద్రంలో రెండు సభలతో కూడిన శాసనసభ ఏర్పడింది.
  3. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రద్దు అయ్యింది. మంత్రులకు అన్ని శాఖలు అప్పగించడం జరిగింది.

అయినప్పటికి 1935 చట్టం జాతీయవాదులను తృప్తి పరచలేదు. ఎందుకనగా :

  1. ఫెడరల్ విధానాన్ని అమలు జరపలేదు.
  2. గవర్నర్ లకు శాసనసభ తీర్మానాలను తోసిపుచ్చే అధికారం ఉండేది.
  3. చాలా తక్కువమంది ప్రజలకు ఓటుహక్కును కల్పించారు. భారతీయులు ఈ చట్టాన్ని ఎదిరించారు. కావున బ్రిటిష్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండనవసరం లేదు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 14.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను కాంగ్రెస్ తీవ్రతరం చేసి ఉన్నట్లయితే ఏం జరిగి ఉండేది? ఇది స్వాతంత్ర్య పోరాటానికి బలం చేకూర్చి ఉండేదా?
జవాబు:

  1. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసాయి. కాబట్టి అధికారం నాయకుల చేతుల్లో లేదు. బ్రిటిష్ వారి చర్యలను ఎదిరించలేరు.
  2. యుద్ధ సమయంలో శాంతి భద్రతలను కాపాడటానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను పొందింది.
  3. ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఎవరినైనా వెంటనే జైలుకి పంపించి, కోర్టుకి వెళ్ళకుండా కావలసినంత కాలం బందీగా ఉంచవచ్చు.
  4. వాక్ స్వాతంత్ర్యాన్ని కూడా పరిమితం చేశారు. ఇటువంటి గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ నిరసనలను తీవ్రతరం చేసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం నాయకులను అరెస్టు చేసి జైలుకి పంపించి ఉండేది. జైలులో ఎంతకాలమైన ఉంచే చట్టాలను చేసింది. కాబట్టి అరెస్టు అయిన జాతీయ నాయకులు ఎప్పుడు విడుదల అవుతారో తెలీదు కావున స్వాతంత్ర్య పోరాటం చేయడానికి నాయకులు లేక పోరాటానికి బలం తగ్గిపోయేదని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.220

ప్రశ్న 15.
అల్ప సంఖ్యాక వర్గాల భయాలు, సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను గురించి చర్చించండి. అధిక ఓట్లతో గెలిచే ఎన్నికలు అల్పసంఖ్యాక వర్గాలకు సహాయపడలేవని ఎందుకు భావించారు?
జవాబు:
భారతదేశంలో అధిక జనాభా హిందువులే. దీని మూలంగా భారతదేశంలో ఉన్న ముస్లింలకు తాము అల్ప సంఖ్యాక వర్గం అనే భావం వచ్చింది. మతరీత్యా కూడా వేరు అగుట మూలంగా కూడా తాము వేరు, హిందువులు వేరు అనే భావం ముస్లింలలో కలిగింది. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో తమకు న్యాయం జరగదని, తమ సమస్యలు పరిష్కరించబడవనే అపోహలకు ముస్లింలు లోనయ్యారని తెలుస్తుంది. అయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ – సమానమే అనే భావాన్ని కాంగ్రెస్ వారు ముస్లింలకు కల్పించాలి. వారు భయపడవలసిన అవసరం లేదని వారికి నమ్మకం కలిగించాలి. హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్. వంటి సంస్థల మూలంగా ముస్లింల భయాలు ఎక్కువయ్యాయి. అధిక మెజారిటీతో గెలిచే కాంగ్రెస్ నాయకత్వం ముస్లింలకు సహాయం చేయలేదని ముస్లింలు భావించారు.

10th Class Social Textbook Page No.223

ప్రశ్న 16.
ముస్లిం లీగు రాజకీయాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రజలు ఏ విధంగా అంచనా వేసుకున్నారు? వాళ్లకి ఏమైనా ఆ ప్రశ్నలు తలెత్తాయా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? చర్చించండి.
జవాబు:
ముస్లిం లీగ్ రాజకీయాల వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలు ఈ క్రింది విధంగా అంచనా వేసుకున్నారు.
1) హిందూ జమీందార్లు, వడ్డీ వ్యాపారస్తులు తమను దోచుకోని పరిస్థితి గురించి కలలు కన్నారు. వ్యాపారస్థులు, ఉద్యోగార్థులు హిందువుల నుంచి పోటీ ఉండదని ఆశించారు. మరింత మత స్వాతంత్ర్యం ఉంటుందని భావించారు.

2) హిందువుల ఆధిపత్యం గురించి ముస్లిం లీగుకు అనేక భయాలున్నాయని చెప్పవచ్చు. ముస్లింల పట్ల కాంగ్రెస్ సున్నితత్వంతో స్పందించటం లేదని అనేక అంశాల పట్ల ముస్లిం లీగుకు సందేహాలున్నాయి.
ఉదా : యునైటెడ్ ప్రావిన్స్ లో ఎక్కువ సీట్లనే గెలుచుకున్న ముస్లిం లీగుతో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయటాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం తమ సభ్యులు ముస్లిం లీగులో సభ్యత్వం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నిషేధించింది. ఈ వ్యవహారాల పట్ల ముస్లిం లీగులో అనేక సందేహాలున్నాయని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.224

ప్రశ్న 17.
1942-45 మధ్య కాలాన్ని సమీక్షించండి. అంతకుముందు కంటే ఇప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందా? వివరించండి.
జవాబు:
1942 – 45 మధ్యకాలాన్ని పరిశీలించినట్లయితే అంతకుముందు కంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల ప్రతిఘటన బలం పుంజుకుందని చెప్పవచ్చు.

  1. రెండవ ప్రపంచయుద్ధంలో భారతీయుల సహకారం కోసం పంపిన క్రిప్స్ రాయబారాన్ని కాంగ్రెస్, లీగులు తిరస్కరించినాయి.
  2. క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించిన తరువాత కాంగ్రెస్ కమిటీ సమావేశమై అనుసరించవలసిన విధానాన్ని ప్రకటించింది. 1942లో గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రతరం చేశారు. గాంధీజీ ఉద్యమకారులతో ప్రాణత్యాగాన్నెనా చేసి, స్వరాజ్యాన్ని సంపాదించవలెనని చెప్పినాడు. దానిని ‘Do or die’ అంటారు.
  3. 1942లో భారత జాతీయ సైన్యం ఏర్పడింది. ఇది సుభాష్ చంద్రబోసు నాయకత్వంలో దాదాపు 3 సంవత్సరాలు బ్రిటిష్ యుద్ధం చేసింది. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసింది.
  4. 1946 భారత జాతీయ సైన్యానికి చెందిన సైనికులను బ్రిటిష్ వారు శిక్షించాలని నిర్ణయించినారు. వారి మీద విచారణ జరుగుతుండగా దేశంలోని పలు ప్రాంతాలలో అశాంతి, అసంతృప్తి చెలరేగసాగాయి. జాతీయ చైతన్యంతో చెలరేగిన ఈ ప్రజా తిరుగుబాటులో హిందువు – ముస్లింల గుర్తింపు, విభజన రాజకీయాలు వంటివి ప్రాముఖ్యత కోల్పోయాయి. పై సంఘటనలన్నింటితో జాతీయోద్యమం బలాన్ని పుంజుకుందని చెప్పవచ్చు.

10th Class Social Textbook Page No.226

ప్రశ్న 18.
దేశంలోని సాధారణ ప్రజల చర్యలను సమీక్షించండి. వాళ్ల కోరికలు ఏమిటి?
జవాబు:
1) దేశంలోని సాధారణ ప్రజలు కొందరు జీవనాధారం కొరకు మిల్లులు, కర్మాగారాలలో పనిచేసేవారు. మరికొంతమంది వ్యవసాయం చేసేవారు. మొదటి కర్మాగారాలలో పని గంటలు అధికంగా ఉండేవి. పని పరిస్థితులు సరిగ్గా ఉండేవి కావు. వేతనాలు తక్కువ. కార్మికులు ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించేవారు. అనేక కార్మిక సంఘాలు ఆవిర్భవించాయి. భారతీయ కమ్యూనిస్ట్, సోషలిస్ట్ పార్టీలు ఆవిర్భవించి కార్మికుల సమస్యల సాధన కొరకు సమ్మెలలో మద్దతు ఇచ్చారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేశారు.

2) దేశంలోని చిన్న, పేద రైతులు ఆందోళన చేయసాగారు. కౌలు వ్యవసాయం చేస్తున్న వారు తమ వాటాని పెంచాలని, తెలంగాణా రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, వెట్టిచాకిరిని నిర్మూలించాలని, దున్నే వాడికే భూమి ఇవ్వాలని కోరినారు. రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. ఉద్యోగస్తులు, వేతనాల పెంపు కొరకు సమ్మెలు చేసారు. ట్రావెన్ కోర్, కాశ్మీరు లాంటి సంస్థానాలలో పెద్ద ఎత్తున సమ్మెలు జరిగినాయి.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 19.
కాంగ్రెస్ కి ఆమోదయోగ్యం కాని ముస్లిం లీగు కోరికలు ఏమిటి ? కాంగ్రెస్ పేర్కొన్న కారణాలతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
1944 లో సి. రాజగోపాలాచారి హిందూ-ముస్లింల మధ్య పరిష్కారం కొరకు ఒక ఫార్ములాను రూపొందించాడు. – అయితే దీనిని కాంగ్రెస్, ముస్లిం లీగులు రెండూ తిరస్కరించాయి.

1945 ‘వావెల్’ పథకంను అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వావెల్ రాజ్యాంగబద్ధమైన ప్రతిష్ఠంభనను అంతమొందించడానికి ఒక కొత్త పథకం రూపొందించాడు. దాని ప్రకారం “కమాండర్-ఇన్-చీఫ్ విషయంలో తప్ప కార్యనిర్వాహక మండలిని పూర్తిగా భారతీయులకే వదిలి పెట్టాలని, మండలిలో ముస్లింలకు, హిందువులకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని ప్రతిపాదించడమైంది.

అయితే, జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులను లీగ్ మాత్రమే ఎన్నుకోవాలని కోరాడు, ఈ పద్ధతిని కాంగ్రెస్ ఆమోదించలేదు. ఇది జిన్నా యొక్క అనుచిత వైఖరి అని, ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

10th Class Social Textbook Page No.227

ప్రశ్న 20.
ప్రజల అభిప్రాయాలను 1946 ఎన్నికలు ఏ విధంగా సూచించాయి? మీ అభిప్రాయాలను పేర్కొనండి.
జవాబు:
1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో రిజర్వు చేసిన 30 స్థానాలనూ, రాష్ట్రంలోని 569 స్థానాలలో 442 స్థానాలనూ ముస్లిం లీగు గెలుచుకుంది. అంటే 1946 చివరినాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లింలీగు ఆవిర్భవించి భారతీయ ముస్లిముల ఏకైక ప్రతినిధి’ ని అన్న తన వాదనను నిజం చేసుకుంది. ముస్లిం ఓట్లలో 86 శాతానికి పైగా ఆ పార్టీకి వచ్చాయి. 1946లో సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లలో 91 శాతంతో అఖండ విజయం సాధించింది.

నా అభిప్రాయాలు :

  1. 1946 ఎన్నికల ద్వారా ముస్లిం నియోజక వర్గాలలో వచ్చిన మెజారిటీని చూసినట్లయితే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ముస్లింలీగ్ అధిక స్థానాలను గెలుచుకుంది.
  2. సాధారణ నియోజక వర్గాలలో కాంగ్రెస్ ముస్లిమేతర ఓట్లలో 91% ఓట్లతో విజయం సాధించింది. దీని మూలంగా కొన్ని ప్రాంతాలలో ముస్లింలకు ఆధిక్యత ఉందని తెలుస్తుంది. లీగు ఏకైక ప్రతినిధి అని తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.228

ప్రశ్న 21.
భారతదేశ స్వాతంత్ర్యంపై దినపత్రిక నివేదిక. దీంట్లో ఏ ఏ అంశాలను గుర్తించారు? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 16 భారతదేశ జాతీయోద్యమం-దేశ విభజన, స్వాతంత్య్రం 1939-1947 1
జవాబు:
ఈ క్రింది విషయాలు గమనించాను.

  1. రెండు సార్వ భౌమాధికారం గల దేశాలు ఆవిర్భవించాయి.
  2. బ్రిటతో స్నేహ పూర్వకంగా సంబంధాలు కలిగి ఉంటామని నెహ్రూ, బ్రిటన్ ప్రధాని అట్లికి సమాధానం ఇచ్చారు.
  3. కలకత్తాలోని హిందూ, ముస్లింలు ఆనందంగా ఉన్న సంఘటనలు అని కనిపిస్తుంది.
  4. భారత మొదటి కాబినెట్ జరుపుకొంటున్న ఫంక్షను.
  5. పశ్చిమ బెంగాలకు మొదటి గవర్నర్ గా సి. ఆర్. ప్రమాణ స్వీకారం.
  6. కలకత్తాలో ఎటువంటి అంతరాయాలు, ఇబ్బందులు లేవు.
  7. గాంధీజీ, అంతరాయం లేకుండా మీటింగ్ ను ఆలకిస్తున్నారు.
  8. రాజ్యాంగ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
  9. ప్రక్కన “ఒమెగా” గడియారం ప్రకటన కనిపిస్తుంది – మొదలైన విషయాలు “ది స్టేట్స్మన్” అనే పత్రికలో కనిపిస్తున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటిని జతపరచండి. (AS1)
సన్ యెట్-సెన్ దేశాన్ని సైనిక దేశం చేశాడు
చియాంగ్ కై షేక్ పర్యావరణ ఉద్యమం
మావో జెడాంగ్ జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
కెన్ సారో వివా రైతాంగ విప్లవం
జవాబు:
సన్ యెట్-సెన్ – జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం
చియాంగ్ కై షేక్ – దేశాన్ని సైనిక దేశం చేసాడు
మావో జెడాంగ్ – రైతాంగ విప్లవం
కెన్ సారో వివా – పర్యావరణ ఉద్యమం

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 2.
దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులను గుర్తించండి. రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకూ, వీటికీ తేడాలు, పోలికలు ఏమిటి? (AS1)
జవాబు:
దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో అనేక మార్పులు సంభవించాయి. ఈ గుయోమిండాంగ్ పార్టీ నాయకుడిగా ఉన్న చియాంగ్ కై షేక్ కాలంలో మహిళల పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి. మహిళలకు తక్కువ వేతనాలు లభించేవి. పనిగంటలు అధికంగా ఉండేవి. చియాంగ్ మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి భావనను గూర్చి ఆలోచించడం, చర్చించడం చేసారు. పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న నాలుగు సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని అతడు భావించాడు. ఆ తదుపరి మావో గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు. విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశాడు.

తేడాలు :

చైనారష్యాజర్మని
1) కార్మిక సంఘాలలో మహిళలు సంఘటితం అయ్యేవారు. పనిగంటలు ఎక్కువ, దారుణమైన పరిస్థితులు.మహిళా కార్మికులు తరచు తమ తోటి పురుష కార్మికులకు స్ఫూర్తిని ఇచ్చేవారు.మహిళలకు ప్రాధాన్యం లేదు.
2) మహిళల పాత్ర ఇంటికే పరిమితమై ఉండేది.మహిళా దినోత్సవం వంటి సందర్భాలలో ఉత్సవాలు నిర్వహించి, పురుషులకు ఎర్ర మెడ పట్టీలను బహుమతిగా ఇస్తుండేవారు.పురుషుల ప్రపంచంలో మహిళలకు ప్రాధాన్యత లేదు.
3) గ్రామీణ మహిళా సంఘాలు ఏర్పడ్డాయి.ఉద్యమాలకు ముందుండేవారు.పురుషుల రంగాల్లో మహిళలు జోక్యం చేసుకోకూడదు. మహిళ ఇచ్చే ప్రతీ సంతానం యుద్ధం కోసమే అన్నట్లు ఉండేది.

పోలికలు:

చైనారష్యాజర్మని
1) చైనాలో అణగదొక్కబడిన మహిళలకు ప్రాధాన్యమిచ్చారు.మహిళలలో వచ్చిన మార్పువల్ల ప్రాధాన్యం పొందారు.రెండో ప్రపంచయుద్ధం తరువాత మహిళలలో చాలా మార్పు కనబడింది.
2) మహిళా సంఘాలుగా ఏర్పడి అభివృద్ధి పథంలో నడిచారు.టెలిఫోన్ భవనం వంటి కర్మాగారాలలో ఉద్యమాల ద్వారా అభివృద్ధి సాధించారు.ఒక జాతిని కాపాడటంలో అన్నిటికంటే స్థిరమైన అంశం మహిళలేనని తెలుసుకుని అభివృద్ధి సాధించారు.
3) పాలకులు ప్రోత్సహించారు.ఫిబ్రవరి విప్లవం ద్వారా మార్పు కనబడింది.నాజీ పార్టీ ప్రోత్సహించింది.

ప్రశ్న 3.
రాచరిక పాలనను పడదోసిన తరువాత చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
రాచరిక పాలనను ప్రజలు తిరస్కరించారు. పాలనాధికారులు, ప్రజలు రాచరిక పాలనపై అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో, అస్తవ్యస్థమైన చైనాలో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఉన్నాయి. వీటిలో ఒకటి సయెట్-సెన్ ఆధ్వర్యంలో గల గణతంత్ర రాజ్యం , రెండవది నూతన ప్రజాస్వామ్యం చైనా కమ్యూనిస్టు పార్టీ.

పోలికలు:

గణతంత్ర రాజ్యంచైనా కమ్యూనిస్టు పార్టీ
1) సయెట్-సెన్ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలు.1) మావో జెడాంగ్ ఆధ్వర్యంలో చైనాలో అనేక విప్లవాత్మక చర్యలు అమలు.
2) మహిళలకు రక్షణ నిచ్చి, ప్రాధాన్యతనందించారు. పురుషులతో పాటు సమాన హోదా.2) మహిళలకు రక్షణ నిచ్చి, హక్కులపై అవగాహన కల్పించి, అభివృద్ధి పథంలో నడిపించారు.
3) భూమిలేని రైతాంగానికి భూమిని పంచి, భూసంస్కరణలు, సమర్థంగా అమలుచేసారు.3) భూస్వాముల భూములను జపు చేసి, పేదలకు పంచి, భూసంస్కరణలు వినూత్న రీతిలో అమలుచేశారు.

తేడాలు :

గణతంత్ర రాజ్యంచైనా కమ్యూనిస్టు పార్టీ
1) సామ్యవాదం, జాతీయతావాదం, ప్రజాస్వామ్యం పునాదిగా ఏర్పాటు.1) భూస్వామ్య విధానం, సామ్రాజ్యవాదం వ్యతిరేకతతో ఏర్పాటు.
2) ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటు పెంపొందించుకోవాలని ఆశించారు.2) శ్రామికవర్గం ద్వారా విప్లవం వస్తుందని భావించారు.
3) పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించారు.3) రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపచేయటానికి వయోజన రైతాంగ పాఠశాలలు ఏర్పరచారు.
4) సామాజిక మూలాలు పట్టణాలలో ఉన్నాయి.4) సామాజికాభివృద్ధి ఛాయలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.
5) సైనిక దేశాన్ని నిర్మించారు.5) స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను ఏర్పరచారు.

ప్రశ్న 4.
ఈ అధ్యాయంలో చర్చించిన దేశాలన్నీ ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడినవే. అందులోని పద్ధతులు మార్చటానికి , – ఈ దేశాలలో ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? (AS1)
జవాబు:
చైనా దేశంలో సయెట్-సెన్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాడు. రైతాంగాన్ని పట్టించుకోలేదు. దీనివల్ల నేలలు నిస్సారం కావడం, అడవులను నరికివెయ్యటం, వరదల వలన జీవావరణం దెబ్బతినడం వంటివి జరిగాయి. ఆ తదుపరి మావో జెడాంగ్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించాడు. భూసంస్కరణలు అమలుచేసి, “పనిబృందాలు” ఏర్పరచి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాడు.

అదే విధంగా వియత్నాంలో ఫ్రెంచివారి పాలనలో ఈ దేశాన్ని వరిని ఎగుమతి చేసే దేశంగా చేయడానికి గాను, సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచి, వరి, రబ్బరు వంటి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కి సహకరించారు. నీటి పారుదల వసతులు వ్యవసాయానికి అందించి, అంతర్జాతీయ మార్కెట్లో వరి ఉత్పత్తి ఎగుమతిని పెంచారు. ఈ పద్దతుల వలన వియత్నాం ప్రపంచంలో 3వ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా మారింది.

అదే విధంగా నైజీరియాలో కూడా బానిసల వ్యాపారాన్ని నిషేధించిన పిదప, వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిచ్చి, ఉత్పత్తులు పెంచడానికి కృషి చేసి అనేక పద్ధతుల ద్వారా “కోకో”, “పామాయిల్” వంటి వ్యవసాయ పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు.

చమురు నిల్వల కోసం తవ్వకాల వలన పర్యావరణ జీవావరణం పాడైపోతుందని, కెన్ సారో వివా వంటివారు పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 5.
పైన చర్చించిన దేశాలలో పరిశ్రమలు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఈ పద్ధతులను మార్చటానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగాయి? పోల్చటానికి ఒక పట్టికను తయారు చేయండి. (AS1)
జవాబు:
పరిశ్రమల మూలాలు ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో ఉండేవి. పారిశ్రామిక ప్రగతి పరిమితం గానూ, నిదానం గానూ ఉంది. ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. ఈ పరిశ్రమలన్నీ శ్రామిక వర్గం ఆధీనంలో నడిచి, అభివృద్ధికి బాటలు వేశాయి. వీరిలో అధిక శాతం “మధ్యతరగతి పట్టణవాసులు”. వీరిలో వ్యాపారస్తులు, దుకాణదారులు ఉండేవారు.

చియాంగ్ కాలంలో ఫ్యాక్టరీ యజమానులను ప్రోత్సహించడానికి, కార్మిక సంఘాలను అణిచివెయ్యడానికి కూడా పూనుకున్నాడు.

వియత్నాంలో పండించిన పంటలు, వాణిజ్య సరుకుల రవాణా కోసం, పారిశ్రామిక ప్రగతి కల్పించడానికి గాను రోడ్డు, రైలు మార్గాలను అభివృద్ధి చేశారు.

నైజీరియాలో చమురు ముఖ్యమైన వనరు. చమురును ఎగుమతి చేసి ఆర్ధికంగా లాభపడింది. అయితే జీవావరణ వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. దీనివల్ల తాగునీళ్ళు కలుషితమై ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. దీనికిగాను గిరిజన ప్రజలు తిరుగుబాటు చేసి తమకు నష్టపరిహారం కావాలని కెన్ సారో వివా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

ప్రశ్న 6.
భారతదేశం, నైజీరియాలలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. భారతదేశంలో ఇది ఎందుకు బలంగా ఉండింది? (AS1)
జవాబు:
భారతదేశ జాతీయ ఉగ్యమాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. 1600 సం|| నుండి బ్రిటిష్ వలస పాలనలో మ్రగ్గిన దేశాన్ని రక్షించడానికి భారతీయుల ప్రతిఘటన, 1857 తిరుగుబాటు, భారతీయ పునరుజ్జీవనం, భారతీయులలో జాతీయ చైతన్యం తదితర భావాలతో అన్ని వర్గాల ప్రజలు ఏకమైనారు. ఆంగ్లేయులు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టారు. ఆంగ్లభాష ద్వారా భారతీయులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం వంటి అంశాలకు సంబంధించిన పాశ్చాత్యభావాలను తెలుసుకోగలిగారు. పాశ్చాత్య విద్యనభ్యసించిన ఈ భారతీయుల వల్లనే జాతీయవాద స్ఫూర్తి పెంపొందింది.

పాశ్చాత్య భావాల వల్ల, విలువల వల్ల ప్రభావితులైన ఆనాటి విద్యావంతులయిన భారతీయులు ప్రారంభించిన అనేక ఉద్యమాలలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ఆలీఘడ్ ఉద్యమం ముఖ్యమైనవి. ఈ సంస్కరణ ఉద్యమాలు – భారతదేశానికి మత మౌఢ్యాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి భారతదేశానికి విముక్తి , కలిగించడానికి ప్రయత్నించాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు విభజించు-పాలించు విధానం అమలుచేయడం ద్వారా భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల ద్వేషం పెరిగింది. భారతదేశంలో ముడి పదార్థాలు, సుగంధ ద్రవ్యాల కొరకు పలసలను స్థాపించారు.

నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరువేరు ప్రాంతాలను ఒకటిగా చెయ్యటం ద్వారా బ్రిటిష్ వారు నైజీరియాను ఏర్పరచారు. ఈ దేశంలో ముస్లింలు అధికం. ఈబో, యెరుబా గిరిజన తెగలు ఉండేవి. నైజీరియాలో దేశ సహజ వనరులపై ప్రత్యేకించి చమురుపై ఆధిపత్య వలసలను స్థాపించారు. భారతదేశంలో (కలకత్తా) పశ్చిమబెంగాల్‌లో లాగోస్ వలస పాలనపై వ్యతిరేకతకు, నైజీరియా జాతీయతావాదానికి ఖండాంతర ఆఫ్రికా వాదానికి కేంద్రంగా ఉంది. మన దేశంలో లాగా ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించింది. నైజీరియాలో కూడా విభజించు, పాలించు విధానం ద్వారా తమ దోపిడీ విధానాన్ని కొనసాగించారు. భారతదేశంలో జాతీయ కాంగ్రెస్, నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని 1923లో హెర్బెర్ట్ మకాలే స్థాపించాడు. మీరు తీవ్రవాద దాడులకు కూడా మన దేశ అతివాదుల మాదిరిగా మారారు. గాంధీజీలా అక్కడ ఎన్ నంది అజికివె జాతీయ నాయకుడుగా మారారు. భారతదేశంలో లాగా నైజీరియా జాతీయవాదం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం , వివిధ తెగల మధ్య ఐకమత్యం.

మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం రాగా నైజీరియాకు 1963 అక్టోబర్ 1న స్వాతంత్ర్యం లభించింది. భారతదేశంలో జాతీయ ఉద్యమాలు బలంగా ఉండడానికి కారణం ప్రపంచం మెచ్చే మేధావులైన రాజకీయ నాయకులు, ప్రపంచంలోని మేధావులతో సంబంధాలు గలవారు ఉద్యమాలను నడిపించారు. ఉద్యమాలు 3 దశలుగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచాయి. అంతేకాకుండా అహింసా పద్ధతిలో ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకిక విధానాలు రూపుదిద్దుకున్నాయి.

ప్రశ్న 7.
స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న వాళ్లతో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్ర్యం పొందింది. దురదృష్టవశాత్తు ప్రస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడం వలన అనతి కాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. పౌర, ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమైనాయి. సైనిక పాలనలో అవినీతి, మానవహక్కుల ఉల్లంఘన కొనసాగాయి. అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. చమురును వెలికితీయడం వలన వాతావరణ, జల కాలుష్యం పెరిగి ఈ దేశ ప్రజల అనేక నిరసనలకు, ఉద్యమాలకు నైజీరియా కారణమైంది.

పోలికలు

స్వతంత్ర భారతదేశంస్వతంత్ర నైజీరియా
1) 1950 నుండి ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా, లౌకిక రాజ్యంగా రూపొందింది.1) 1999 నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.
2) హత్యలు, దోపిడీ, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి.2) సైనికపాలన ఏర్పడి పౌరయుద్ధం కొనసాగింది.
3) స్వాతంత్ర్య సంపాదన అనంతరం మత ఘర్షణలు ఎక్కువయ్యాయి.3) ఇక్కడ కూడా బై ఫారియన్ వంటి యుద్ధాలు కొనసాగాయి.
4) పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి.4) ఇక్కడ కూడా చమురు వల్ల సమస్యలు ఎక్కువయ్యాయి.

తేడాలు

స్వతంత్ర భారతదేశంస్వతంత్ర నైజీరియా
1) స్వాతంత్ర్యానంతరం దేశ అభివృద్ధి కొరకు మేధావులు రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టారు.1) సైనిక పాలన వలన రాజ్యాంగ రచన జరగలేదు.
2) స్వాతంత్ర్యం సిద్ధింపచేసిన గాంధీజీ లాంటి జాతిపితను పొట్టన పెట్టుకున్నారు.2) హింసాకాండ జరిగినా జాతీయ నాయకుల మరణాలు లేవు.
3) స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం వలన విపరీత పరిణామాలు జరిగాయి.3) స్వదేశీ సంస్థానాలు లేవు.
4) 1947లో స్వాతంత్ర్యం సిద్ధించింది.4) 1999 నాటికి 50 సం||ల తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించింది.
5) కోటి, 50 లక్షల మంది, హిందూ – ముస్లింలు నిర్వాసితులయ్యారు.5) ఇంత పెద్ద సంఖ్యలో జరగలేదు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

ప్రశ్న 8.
భారతదేశం, వియత్నాంల లాగా స్వాతంత్ర్యం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి కొన్ని కారణాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
పాశ్చాత్య విద్య సొందిన కొంతమంది మేధావులైన నైజీరియన్లు ఉమ్మడి నైజీరియా దేశం అన్న భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. నైజీరియా మొదటి రాజకీయ పార్టీ “నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (NNDP) ని మకాలే స్థాపించిన పిదప, (1923లో) అది, 1923, 1928, 1933లో అన్ని స్థానాలను గెలుచుకుని బ్రిటిష్ వారికి పెను సవాళ్ళు విసిరింది. మకాలే బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా ప్రోత్సహించాడు. ఖండాంతర ఆఫ్రికా వాదం, ఖండాంతర నైజీరియా వాదం జాతీయ ఉద్యమానికి ప్రేరణ అయింది. దీంతో బ్రిటిష్ వారికి కనువిప్పు కలిగింది. 1945 నుండి సమ్మెలు, ఉద్యమాలతో జాతీయవాద కార్మికుల ఆధ్వర్యంలో ముందుకు నడిచారు.

రెండు లక్ష్యాలతో నైజీరియన్లు ఉద్యమాన్ని నడిపించారు. ఒకటి “బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం”. రెండు “వివిధ తెగల మధ్య ఐకమత్యం”. ఈ క్రమంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

1950 నాటికి నైజీరియాలోని 3 ప్రాంతాలలో 3 ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో “సాంప్రదాయ భావాలతో కూడిన “ఉత్తర ప్రజల కాంగ్రెస్”, తూర్పు ప్రాంతంలో “నైజీరియా కెమరూన్ల జాతీయ సంఘం, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు. వీటి ద్వారా నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాకుండా స్వాతంత్ర్యం పొందింది.

ప్రశ్న 9.
పైన చర్చించిన దేశాలలోని జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య పాత్ర ఏమిటి? (AS6)
జవాబు:
జాతీయ ఉద్యమాలలో పాఠశాల విద్య ప్రముఖ పాత్ర వహించింది. చైనాలో సామాజిక, సాంస్కృతిక మార్పులకు సంధానంగా పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించారు. భూసంస్కరణలు సమర్థంగా అమలు చెయ్యడానికి, ఆర్ధిక సంస్కరణ కార్యక్రమంలో యువతకు అవగాహన కలిగించేందుకు గాను రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపజేయటానికి గాను పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. చైనా నవ చైతన్యానికి సాధించిన అద్భుత విజయాలకు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలవడానికి అందరికీ పాఠశాల విద్య ప్రముఖపాత్ర వహించిందని మేధావులందరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు.

వియత్నాంలో స్థానికులను నాగరికులుగా చెయ్యటానికి విద్య ఒక మార్గంగా భావించారు. విద్యావంతులైన ‘వియత్నామీయుల వలన ఫ్రెంచి పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి, టీచర్లు, దుకాణదారులు, పోలీసులు వంటి ఉద్యోగాలు పొందడానికి ప్రాథమిక విద్య, పాఠశాల విద్య కీలకమని ఆలోచించారు. ఈ విధంగా కొద్దిమంది మాత్రమే పాఠశాల విద్య పూర్తి చేసి అభివృద్ధి సాధించారు. వియత్నాం నుంచి ఫ్రెంచివాళ్ళను తరిమివేయడానికి, ఉన్నతులుగా వియత్నామీయులు మారడానికి గాను ఉన్నత పాఠశాల విద్య కొరకు జపాన్ వెళ్ళేవారు.

వలస పాలనతో దోపిడీకి గురై విభజించు – పాలించు విధానం ద్వారా, అవినీతి, అక్రమాలు ఎదిరించే క్రమంలో నైజీరియాలో ఆధునిక విద్యకు మరీ ముఖ్యంగా పాఠశాల విద్యకు ప్రాధాన్యమిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి సూత్రాలను పెంపొందించడానికి గాను పాఠశాల విద్య ప్రధాన భూమిక పోషిస్తుందని తలంచి, నైజీరియాలో ఈ విద్యకు ప్రముఖస్థానం కల్పించారు.

ప్రశ్న 10.
ఈ దేశాల స్వాతంత్ర్య పోరాటాలలో పాలకులపై యుద్ధాలు చేశారు. వాటి ప్రభావాన్ని క్లుప్తంగా వివరించండి. (AS1)
జవాబు:
చైనా గణతంత్ర, నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడి అగ్రదేశంగా మారినప్పటికీ, వలస పాలకుల చర్యల వలన , అనేక ఇబ్బందులకు గురైంది. 1937 – 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది. క్రూర, వలస, సైనిక పాలనను జపాను అమలు చెయ్యటంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాన్ ఆక్రమణలను ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్, సిసిపి చేతులు కలిపాయి.

వియత్నాంలో దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడారు. వియత్నామీయులు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని భయపడే ఫ్రెంచి పాలకులతోను, స్థానిక సంపన్నులతోను పోరాడారు.

ఆగ్నేయ ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలన్న సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా జపాను 1940లో వియత్నాంను ఆక్రమించింది. దాంతో జాతీయవాదులు ఫ్రెంచి వాళ్ళనే కాకుండా, జపనీయులతో కూడా తలపడవలసి వచ్చింది.

అప్పటికే రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్ ఫ్రాన్స్ మొత్తాన్ని ఆక్రమించటం వలన ఫ్రెంచివారు బలహీనపడ్డారు. వియత్నాం స్వాతంత్ర్య సమితి జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1946 సెప్టెంబర్ లో హనాయ్ ని తిరిగి స్వాధీనం చేసుకుంది. తదుపరి అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.

రెండవ ప్రపంచయుద్ధం తరువాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనవటంతో నైజీరియా ప్రజలు జాతీయతావాదం తీవ్రవాద భావాలకు గురయ్యారు. బ్రిటన్ తరపున పోరాడి సైనికులు, కార్మిక సంఘ నాయకులు నైజీరియా స్వాతంత్ర్యం కొరకు కృషి చేశారు.

10th Class Social Studies 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 1.
ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి?
జవాబు:
వలసపాలిత దేశాల సాంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉంటే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి.

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 2.
బియ్యం ధరలు పడిపోవటంతో గ్రామీణ ఋణభారం ఎందుకు పెరిగింది?
జవాబు:
1930 ల నాటి ఆర్థికమాంద్యం వియత్నాంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బియ్యం ధరలు పడిపోయి, గ్రామీణ ఋణభారం పెరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 3.
జాతీయతాభావం అంటే ఏమిటో, అది ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోటానికి 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని మరొకసారి చదవండి.
జవాబు:
తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని జాతీయతాభావం అంటాం. జనాదరణ పొందిన కుటుంబ సంప్రదాయాలు, బానిసత్వాల రద్దు వంటి వాటివల్ల కూడా జాతీయతాభావం పెరిగింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం వంటివి జాతీయతాభావాన్ని మలచటంలో సహాయపడ్డాయి.

10th Class Social Textbook Page No.203

ప్రశ్న 4.
వలసపాలిత ప్రాంతాలలో ఏ సామాజిక వర్గాలు స్వాతంత్ర్యం కోసం పోరాడాయి ? సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్ళకు ఎందుకు ముఖ్యం అయ్యాయి?
జవాబు:
వలసపాలిత ప్రాంతాలలో మధ్యతరగతివారు, కార్మికవర్గం, యువకులు, మహిళలు, మేధావులు, ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కొన్ని దేశాలలోని అనుభవాలను, వలసపాలిత ప్రాంతాల లక్షలాది ప్రజల జీవితాలలో మార్పును అర్థం చేసుకోటానికి సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్లకు చాలా ముఖ్యం అయ్యాయి.

10th Class Social Textbook Page No.204

ప్రశ్న 5.
యువ చైనీయులు పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను ఎందుకు వ్యతిరేకించసాగారు?
జవాబు:
1919 మే 4న యువ చైనీయులు నిరసన ఉద్యమంగా చేపట్టి, పాత సాంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానశాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని యువత సంకల్పించింది. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని, సాధారణ భాష, లిపులను
అనుసరించడం, వివాహాలలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయటం వంటి వాటి కొరకు ఉద్యమించారు.

10th Class Social Textbook Page No.204

ప్రశ్న 6.
ఇటువంటిది ఏమైనా భారతదేశంలో జరిగిందా?
జవాబు:
భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీ విధానాన్ని నిరంకుశ పాలనకు, భారతీయుల దౌర్భాగ్యస్థితిని దూరం చేయడానికి అతివాదులుగా పేరొంది హింసామార్గంలో పయనించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, మరెందరో యువకులు వీరోచితంగా పోరాడారు. క్విట్ ఇండియా ఉద్యమకాలం (1942) లో గాంధీజీని అరెస్టు చేయగా, యువకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఏకమై, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయించి, సహాయనిరాకరణ, విధ్వంసం వంటి అనేక పద్ధతుల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేపట్టారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 7.
ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఏవి?
జవాబు:
ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు – “గుయోమిండాంగ్” (జాతీయ ప్రజాపార్టీ, దీనినే కె.ఎం.టి అనే వాళ్ళు) మరియు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి). ఇవి దేశ ఐక్యత, సుస్థిరత సాధన అనే లక్ష్యాలతో ఏర్పడ్డాయి.

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 8.
ఇటువంటి సమీకరణల్లో సభ్యులు ఎవరు?
జవాబు:
ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. వీరిలో అధికశాతం మధ్యతరగతి పట్టణవాసులు (సియావో షిమిన్) గా పరిగణింపబడే వ్యాపారస్తులు దుకాణదారులు ఉన్నారు.

10th Class Social Textbook Page No.205

ప్రశ్న 9.
వాళ్ళు ఆశించిన సామాజిక, ఆర్థిక మార్పుల స్వరూపం ఏమిటి?
జవాబు:
వాళ్ళు కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా గుర్తించారు. స్వేచ్చాభావనలు ఆదరణ పొందటంతో మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించడం, చర్చించటం మొదలు పెట్టారు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాలను అణగదొక్కారు. పెట్టుబడిని నియంత్రించి, భూమి సమాన పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చారు.

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 10.
దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు, సమాన అవకాశాలు, వాళ్ల సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
దేశ అభివృద్ధికి, స్వాతంత్ర్యానికి స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు, వాళ్ళ సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో నేను అంగీకరిస్తాను. ప్రస్తుతం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు ప్రధానభూమిక పోషిస్తున్నారు.

దేశ అభివృద్ధిలో స్త్రీలు తమ మేధాశక్తి, యుక్తులతో అపూర్వ సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ దృక్పథంతో నేను ఏకీభవిస్తున్నాను.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 11.
భూమి లేని రైతాంగానికీ, భూమి లేని కార్మికునికీ మధ్య తేడా ఏమిటి?
జవాబు:
కొంతమంది రైతులు తమకు భూమి లేకపోయినా, భూస్వాముల నుంచి భూమి తీసుకొని కౌలు చేసేవారు. వాస్తవానికి భూమి వాళ్ళది కాదు. దీనివలన వారు కౌలు చెల్లించడమే కాకుండా, భూస్వాముల ఇళ్ళల్లోనూ, పొలాల్లోనూ పనిచేసి దుర్భర జీవనం గడిపేవారు.
అదే విధంగా కార్మికులు, యంత్రాలలో వివిధ పరిశ్రమలలో, శ్రమ ద్వారా జీవనం సాగిస్తుంటారు. వాస్తవంగా వాళ్ళ ఆధీనంలో భూమి ఉండదు. వ్యవసాయానికి సంబంధించి అవగాహన తక్కువ.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 12.
స్వతంత్ర వియత్నాం ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యలలో భూమి కౌలు తగ్గించటం ఒకటి. ఈ చర్య ఎందుకు చేపట్టారు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్యం పెరిగి పెద్ద పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని వారితో కౌలు రైతులుగా పనిచేయించుకునే వాళ్ళు. ఫలితంగా రైతాంగ జీవన ప్రమాణం పడిపోయింది. కౌలు రైతులు అప్పుల విషవలయంలో చిక్కుకుపోయి బయటపడలేకపోయేవారు. అన్నాం అనే ప్రాంతంలో సుమారు 53% కుటుంబాలకు అసలు ఏమాత్రం భూమి లేదు. ఈ కారణాలతో వియత్నాం ప్రభుత్వంవారు అధికంగా ఉన్న కౌలు భూములు మిగతావారికి పంచడానికి కృషి చేశారు. వారి దుర్భర జీవితాలను దూరం చేయ్యడానికి గాను భూమి కౌలు తగ్గించారు.

10th Class Social Textbook Page No.211

ప్రశ్న 13.
ఇటువంటి భూసంస్కరణలు వియత్నాం సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపి ఉంటాయి ? గ్రామీణ ప్రాంతాలలోని వివిధ సామాజిక వర్గాల దృష్ట్యా దీనిని చర్చించండి.
జవాబు:
ఇటువంటి భూసంస్కరణల వలన భూస్వాముల చేతుల్లో ఉన్న వేల ఎకరాలను సేకరించి, పేద, మధ్యతరగతి రైతాంగానికి పునఃపంపిణీ చేయడం జరిగింది. రైతాంగ సంఘాలు ఏర్పడి, గ్రామీణ ప్రాంతాలలో వారు నాయకులుగా మారి మంచి – పాలన అందించడానికి ప్రయత్నం చేశారు. వెట్టిచాకిరి, వెట్టి కార్మికులు పోయి, అప్పుల బాధ తొలగి రైతాంగం ఆనందకర జీవనం కొనసాగించారు. ఏమాత్రం అసలు భూమి లేని 79% ప్రజలు ఈ సంస్కరణల వలన లబ్ధి పొందారు.

10th Class Social Textbook Page No.219

ప్రశ్న 14.
అమెరికా అంతటి బలమైన దేశాన్ని వియత్నాం వంటి చిన్నదేశం ఎలా ఎదిరించగలిగింది?
జవాబు:
ప్రతిఘటనకి, ఇల్లు, కుటుంబాలను త్యాగం చెయ్యటానికి, దారుణ పరిస్థితులలో జీవించటానికి, స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి వీలుగా ప్రజలకు జాతీయతాభావం ఇచ్చిన ప్రేరణ వల్లే అమెరికాను వియత్నాం ఢీకొంది. భూస్వాముల చేతులలో తరాలపాటు దోపిడీకి గురయి, అప్పుడే కొంత భూమిని పొందిన లక్షలాది పేద రైతాంగం నిబద్ధతతో అమెరికాను , ఎదిరించింది. జాతీయతాభావంతో ప్రేరణ భూసంస్కరణలతో ఉత్సాహం పొందిన ఈ పేద రైతాంగం ప్రపంచంలో కెల్లా – మేటి సైన్యాన్ని ఓడించడంలో కీలకపాత్ర పోషించింది.

10th Class Social Textbook Page No.217

ప్రశ్న 15.
నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని ఈ బూలు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు సరైన, న్యాయపూరితమైన పరిష్కారం ఏమిటి?
జవాబు:
నైజీరియాలోని చమురు నిల్వలలో అధిక వనరులు ఈబూలకే చెందాలి. ఎందుకంటే ఇక్కడ ఈ తెగవారే అధికులు. మరియు వెనుకబడిన అవిద్యావంతులు, నిరుద్యోగులు, ఉత్తర ప్రాంతంలో ఇంతకు ముందే ముస్లింలు అధికంగా ఉండి, ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నారు. కాబట్టి అధికభాగం చమురు లాభాలు ఈబూలకే చెందాలి.

10th Class Social Textbook Page No.202

ప్రశ్న 16.
క్రింది పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
AP Board 10tha Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు 1
1) బ్రిటన్‌కి చెందిన వలసలలో ఆసియాలో ఒక ప్రాంతాన్ని, ఆఫ్రికాలో మరొక ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
భారతదేశం, దక్షిణాఫ్రికా

2) హాలెండ్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
ఇండోనేషియా, పశ్చిమ సహారా

3) ఫ్రాన్స్ కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి.
జవాబు:
కాంబోడియా, మొరాకో.

4) ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా లేని ఆసియాలో రెండు దేశాలను, ఆఫ్రికాలో ఒక దేశాన్ని గుర్తించండి.
జవాబు:
చైనా, రష్యా, ఇథియోపియా

5) ఆస్ట్రేలియా ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా ఉంది?
జవాబు:
ఇంగ్లాండ్

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 17.
యుద్ధంలో గెలవటానికి సిసిపికి భూసంస్కరణలు ఎలా దోహదపడ్డాయి?
జవాబు:
విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చెయ్యటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను సిసిపి నిర్మించింది. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించడం, తరువాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి పంచటం వంటివి దీంట్లో ముఖ్యమైన దశలు. దీనికై “భూసంస్కరణల సంఘాన్ని ఏర్పరచారు. దీని ద్వారా స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చెయ్యటం వాటి ముఖ్య విధుల్లో భాగంగా ఉండేవి. ఇది ప్రధానంగా పేద, మధ్య తరగతి రైతాంగం నుంచి ఏర్పడింది. ఈ విధంగా భూసంస్కరణల కారణంగా అత్యధికుల మన్ననలు పొందడంతో, యుద్ధంలో గెలవటానికి అవకాశం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.207

ప్రశ్న 18.
భారతదేశంలో అమలు అయిన భూసంస్కరణలను చైనాలో జరిగిన వాటితో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి.
జవాబు:
భారతదేశంలో అమలు జరిగిన భూసంస్కరణలు లోపభూయిష్టంగా ఉండేవి. జమీందారుల ఆధీనంలో సాగుచేస్తున్న కౌలుదారులను ప్రభుత్వం భూయజమానులుగా గుర్తించింది. కానీ జమీందారులకు పెద్ద మొత్తంలో వెల చెల్లించాల్సి ఉన్నందున దానిని వారు కట్టలేక వారు కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగానే ఉండిపోయారు. చైనాలో అలా కాకుండా భూస్వాముల భూమి నంతటినీ స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేశారు.

భారతదేశంలో జమీందారుల ఆధీనంలో ఉన్న మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అందువలన చాలామంది జమీందారులు తమ బంధువులు, దూరపు బంధువుల పేరున రాయించుకున్నారు. అటవీ, బంజరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిసి, అటవీ భూములలో గల చెట్లు నరికి, అమ్మి అధికాదాయం జమీందారులు పొందగలిగారు.

చైనాలో అలా కాకుండా పేద, మధ్యతరగతి ప్రజలనే భూసంస్కరణ సంఘాలు ఏర్పరచి, వారినే నాయకులుగా గుర్తించి, ‘పని బృందాలు’ ఏర్పరచి, “రైతాంగ సంఘాల” నిర్మాణం ద్వారా ప్రణాళికా బద్ధంగా భూసంస్కరణలు అమలుచేసి ఆ దేశం అద్భుత విజయాలకు నిలయమైంది.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 19.
వియత్నాంలో రైలు మార్గాలను, కాలవలను ఫ్రెంచివాళ్ళు ఎందుకు అభివృద్ధి చేశారు?
జవాబు:
వియత్నాంని వరిని ఎగుమతి చేసే దేశంగా అభివృద్ధి చెయ్యాలని ఫ్రెంచి చాలా ఆసక్తి చూపించింది. ఇందులకై సాగునీటి సదుపాయాల్ని మెరుగుపరచాలని, మెకాంగ్ డెల్టా ప్రాంతంలో సాగు విస్తీర్ణాన్ని పెంచటానికి ఫ్రెంచివాళ్ళు బీడు భూముల నుంచి నీటిని తోడి కాలువల నిర్మాణం చేపట్టారు. తద్వారా వరి ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చెయ్యడం సాధ్యమైంది.

అదే విధంగా 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో మూడవ అతి పెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. దీనితోపాటు వాణిజ్య సరుకుల రవాణా కోసం, సైనిక కేంద్రాలను తరలించటానికి, మొత్తం ప్రాంతాన్ని తమ అదుపులో పెట్టుకోడానికి గాను మౌలిక సదుపాయాలు అనగా రోడ్డు, రైలుమార్గాలను అభివృద్ధి చేశారు.

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 20.
బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి గురించి మీరు చదివారు. వియత్నాం రైతాంగ స్థితికీ, దీనికీ పోలికలు ఏమిటి?
జవాబు:
బ్రిటిష్ పాలనలోని భారతదేశ రైతాంగ పరిస్థితి దారుణంగా ఉండేది. వియత్నాంలో కూడా రైతాంగ స్థితిలో అటువంటి ‘ దుర్భర పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి వీటి మధ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

పోలికలు: భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో భూస్వాములు, జమీందారులు సన్నకారు రైతుల భూములను చేజిక్కించుకొనడం, లేదా నామమాత్రం భూములు ఇచ్చి, దానికి అధికంగా శిస్తులు విధించడంతో వాటిని ఆ చిన్న రైతులు కట్టలేక, పంట ఫలాలు అందక దుర్భర పరిస్థితులు అనుభవించారు.

వియత్నాంలో కూడా పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను చేజిక్కించుకుని కౌలు రైతులుగా మార్చి జీవనం దిగజార్చారు.

భారతదేశంలో బలవంతపు వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళు అమలుచేశారు. ఆహారపంటలకు బదులు వాణిజ్య పంటలు వేసి ఇబ్బందులకు గురి చేయించారు. వియత్నాంలో కూడా బలవంతంగా వరి, రబ్బరు వంటి పంటలను తమ స్వలాభం కోసం వేయించారు.

భారతదేశంలో వ్యవసాయం చేయలేక, అప్పులకు వడ్డీ చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు వెట్టి కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారారు, వియత్నాం రైతుల్లో కూడా వ్యవసాయం చేయలేక చనిపోయినవారు, నలిగిపోయినవారు, తిండి లేక అలమటించినవారున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.209

ప్రశ్న 21.
భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాన్ని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు, వియత్నాంలో ఫ్రెంచివాళ్ళు అనుసరించిన వలసపాలన విధానాలను పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
భారతదేశంలో బ్రిటిష్ వారు, వియత్నాంలో ఫ్రెంచివారు అనుసరించిన వలసపాలనలో పోలికలు తేడాలు ఉన్నాయి. ముందుగా పోలికలు చూద్దాం.

పోలికలు:

బ్రిటిష్ వారు (భారత్)ఫ్రెంచివారు (వియత్నాం)
1) వీరు భారతదేశ రాజులను, చక్రవర్తులను కీలు బొమ్మలుగా మార్చి వ్యాపార రీత్యా వచ్చి స్థిరపడ్డారు.1) వీరు కూడా వియత్నాం చక్రవర్తిని లోబరుచుకొని తమ దోపిడీ విధానాన్ని అనుసరించారు.
2) భారత్ లో రోడ్డు, రైలు, జల మార్గాలను తమ ఉత్పత్తుల మార్కెట్ కొరకు, వాణిజ్య పంటలకు ఎగుమతుల కొరకు అభివృద్ధి చేశారు.2) ఫ్రెంచివారు కూడా వరి, రబ్బరు ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసి ధనాన్ని కూడబెట్టాలని ఆశించారు.
3) వీరు విభజించు – పాలించు విధానం అమలుచేశారు.3) ఫ్రెంచివారు కూడా ఈ విధానాన్నే అనుసరించారు.
4) ఇక్కడ భూస్వాములు, చిన్న రైతుల భూములను ఆక్రమించి వారిని వ్యవసాయ కూలీలుగా మార్చారు.4) వియత్నాంలో కూడా ఫ్రెంచివారు రైతుల భూములను ఆక్రమించి వారిని పెట్టి కార్మికులుగా మార్చారు.
5) భారతీయులు అనాగరికులని వీరు భావించారు. మూఢనమ్మకాలు, సంప్రదాయ పద్ధతులకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు.5) ఫ్రెంచివారు కూడా వియత్నాం వాసులకు అనాగరికులుగా భావించి, ఆధునిక నాగరికత ఫలాలు అందించడానికి కృషి చేశారు.

తేడాలు :

బ్రిటిష్ వారు (భారత్)ఫ్రెంచివారు (వియత్నాం)
1) సుదీర్ఘకాలం దోపిడీకి గురైంది.1) ఎక్కువకాలం కొనసాగలేదు.
2) అనేక రాజకీయ, సంస్కరణ ఉద్యమాలు, అనేక సమాజాలు, సంస్థలు ఏర్పడి బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాయి.2) ఇన్ని సంస్థలు, ఇంత స్థాయిలో జరగలేదు.
3) మహిళలు, యువకులు, విద్యావంతులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రిటిష్ వారిని ఎదిరించారు.3) మహిళల పాత్ర తక్కువ.
4) ఒక ప్రణాళికాబద్ధంగా 30 దశలుగా ఉద్యమాన్ని నడిపించారు.4) ఫ్రెంచ్లో అలా జరగలేదు.
5) ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆంగ్ల విద్యను అభ్యసించారు.5) ఇక్కడ సంపన్న వియత్నామీయుల పిల్లలే ఫ్రెంచి బడిలో చదివారు.

10th Class Social Textbook Page No.210

ప్రశ్న 22.
వియత్నాం, చైనాలలో జాతీయతావాదం ఏర్పడటంతో యువత, విద్యార్థులు ముఖ్యపాత్ర పోషించారు. వీటి మధ్య పోలికలు, తేడాలను చర్చించండి.
జవాబు:
చైనా యువత, విద్యార్థులు :
చైనాలో యువత 1919 మే 4న వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బ్రిటన్, పక్షాన చైనా ఉన్నప్పటికి జపాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు చైనాకు రాలేదు.

పాత సంప్రదాయాలను తిరస్కరించి, ఆధునిక విజ్ఞానం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని, దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమెయ్యాలని, పేదరికాన్ని తగ్గించి, అసమానతలను తగ్గించాలని యువత కోరుకుంది. సాధారణ భాష, లిపిలను అనుసరించడం, మహిళలపై ఉన్న దురాచారాలను దూరం చెయ్యాలని యువత, విద్యార్థులు సంకల్పించారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక సాంస్కృతిక మార్పులకు ఊతం ఇచ్చింది.

వియత్నాం విద్యార్థులు, యువత :

కార్యాలయాలలో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హుల్ని చేసేలా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించసాగారు. “దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం విద్యావంతుల విధి” అన్న నమ్మకంతో వారు ప్రేరణ పొందారు. కనుకనే వారు సంపన్నులతోను, ఫ్రెంచి పాలకులతోను ఘర్షణ పడ్డారు. 1920 ల నాటికి విద్యార్థులు “యువ అన్నాం” పార్టీ వంటి రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసి, “అన్నామీస్ స్టూడెంట్” వంటి పత్రికలను ప్రచురించారు. వియత్నాం దేశంలో యువత, విద్యార్థుల ప్రధాన ఉద్దేశం- “వియత్నాం నుండి ఫ్రెంచి వాళ్ళను తరిమివెయ్యడం”. కీలుబొమ్మ చక్రవర్తిని తొలగించి, అంతకుముందు ఫ్రెంచివాళ్ళు పడదోసిన “ఎ గుయెన్” వంశాన్ని తిరిగి అధికారంలోనికి తీసుకురావడం.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.211

ప్రశ్న 23.
చైనా, వియత్నాం , భారతదేశాలలోని భూసంస్కరణల తీరును పోల్చండి.
జవాబు:
1) చైనాలో భూసంస్కరణలు :
చైనాలోని భూసంస్కరణలలో ప్రధానాంశం ఏమనగా …….. గ్రామాలలోని ప్రజలందరి వర్గాలను ముందుగా గుర్తించటం, మరియు భూస్వాముల యొక్క భూమి, ఇతర ఆస్తులను జప్తు చేయుట ద్వారా కాని మరే విధంగానైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి వాటిని ప్రజలకు పంచటం అనేది ముఖ్యమైనది.

2) వియత్నాంలో భూసంస్కరణలు :
భూమి కౌలును 25 శాతానికి తగ్గించారు. భూమిని తిరిగి మళ్లీ (మారు) కౌలుకు ఇవ్వటాన్ని నిషేధించారు. 1945 ఆగష్టు నాటికి ఉన్న కౌలుదార్లు కౌలు బకాయిలన్నింటిని మాఫీ చేశారు. మరియు కౌలుదార్లు భూ యజమానులు అయ్యారు.

3) భారతదేశంలో భూసంస్కరణలు :
చైనా, వియత్నాంలలో అమలైనటువంటి భూసంస్కరణలేవి భారతదేశములో అమలు జరగలేదు. భూ ఒడంబడిక విధానంలో కొన్ని మార్పులు మాత్రమే జరిగాయి.

10th Class Social Textbook Page No.213

ప్రశ్న 24.
పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించటం సరైనదేనా?
జవాబు:
పౌరులపైన, అడవుల మీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ వంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించడం అమెరికా వంటి అగ్రదేశాలకు తగదు. కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళనతో అమెరికా ప్రవర్తించిన తీరు దారుణమైంది. అత్యంత శక్తిమంతమైన వైమానిక బాంబర్లు అయిన బి52 విమానం రసాయనిక ఆయుధాల వినియోగంతో – నాపాలం (మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు), ఏజెంట్ ఆరెంజ్ (చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సం॥లు బీడుగా మార్చివేశాయి), భాస్వరం బాంబులతో అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. అడవులు నాశనమైనాయి. వేల సంఖ్యలో పౌరులు చనిపోయారు. మానవాళి మనుగడకు తీవ్ర విపత్తులు సంభవించే విధంగా ఉన్నా అమెరికా దుశ్చర్యను ప్రపంచం యావత్తు విమర్శించింది. అమెరికా చర్యలను ఎండగట్టింది.

10th Class Social Textbook Page No.213

ప్రశ్న 25.
వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం పాత్ర ఏమిటి?
జవాబు:
వియత్నాం నుంచి అమెరికా ప్రభుత్వం విరమించుకోవటంలో ఆ దేశంలోని శాంతి ఉద్యమం ప్రముఖ పాత్ర వహించింది. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా అమెరికాకు కూడా చాలా భారంగా పరిణమించింది. తనకు సంబంధం లేని యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు. యుద్ధం కోసం యువతను సైన్యంలోకి తీసుకురావడంతో అక్కడ వ్యతిరేకత ఇంకా పెరిగింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగడంతో అమెరికాలో దాని పట్ల బలమైన నిరసనలు వెల్లువెత్తసాగాయి. ప్రభుత్వ విధానాన్ని సర్వత్రా ప్రశ్నించటంతో అంతిమంగా యుద్ధ ముగింపు సంప్రదింపులు చేపట్టేలా చేసింది.

10th Class Social Textbook Page No.215

ప్రశ్న 26.
జాతీయతావాదానికీ, ఖండాంతర ఆఫ్రికా భావానికి మధ్య తేడాలు ఏమిటో చర్చించండి. జాతీయతావాదం అన్నది పరిమితమైన భావమా?
జవాబు:
తమ దేశ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడడాన్ని “జాతీయతావాదం” అంటారు.

దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చెయ్యటానికి ఖండాంతర ఆఫ్రికా వాదం ప్రయత్నిస్తుంది.

ఆఫ్రికా భావం ముందు జాతీయతావాదం అన్నది పరిమితమైన భావం. ఎందుకంటే ఐకమత్యంతో వలసపాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించటమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించటానికి ఆఫ్రికా భావం ప్రయత్నిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 15 వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు

10th Class Social Textbook Page No.215

ప్రశ్న 27.
ఒక శతాబ్దకాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనలో కోస్తా ప్రాంతాలైన బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. అభివృద్ధిలో ఇలా అసమానతలు ఎందుకు చోటు చేసుకుంటాయి?
జవాబు:
శతాబ్ద కాల వలసపాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. ఎందుకంటే వలస పాలకులు తమ వ్యాపార అభివృద్ధికి, తమ దోపిడీ విధానాన్ని కొనసాగించడానికి తగ్గట్లు పాలించారు. భారతదేశంలో కూడా బెంగాలు, మద్రాసు, బొంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. ఎందుకంటే ఈ నగరాలు, రవాణా, రోడ్డు మార్గాలకు అనుకూలంగా ఉండడం వల్ల తమ పరిపాలన కేంద్రాలుగా ఈ నగరాలను అభివృద్ధి చేశారు. ఇటువంటి నగరాలలో విద్యావంతులైన మేధావులు, వివిధ సంస్థలు, సమాజాలు కూడా వలస పాలితులను ఎదిరించడం వలన అభివృద్ధి పథంలో నడిపించక తప్పలేదు.