AP 7th Class Telugu Important Questions 10th Lesson ప్రియ మిత్రునికి

These AP 7th Class Telugu Important Questions 10th Lesson ప్రియ మిత్రునికి will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 10th Lesson Important Questions and Answers ప్రియ మిత్రునికి

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. మైత్రి, ప్రేమ, నిస్వార్థత వున్న మానవులంతా ఎంత దూరాన వున్నా కూడా చాలా దగ్గరిలోని వారే. వారు ఏ వయసు వారైనప్పటికీ ఒకే వయసువారు. వారు ఏ వర్ణానికి చెందినా ఒకే వర్ణము వారు. వారు ఏ దేశానికి చెందినా ఒకే దేశానికి చెందిన వారు. కులతత్వాలూ, జాతి భేదాలకు మనమంతా దూరం.
ప్రశ్నలు – జవాబులు :
అ) మనుషుల మధ్య దూరాన్ని చెరిపేవి ఏవి?
జవాబు:
మైత్రి, ప్రేమ, నిస్వార్థతలే మనుష్యుల మద్య దూరాన్ని చెరిపేవి.

ఆ) వారు ఏ దేశానికి చెందినా ఒకే దేశానికి చెందినవారు అనడంలో ఆంతర్యం ఏమిటి?
జవాబు:
స్నేహం, ప్రేమ, నిస్వార్ధతలు మనుష్యులను కలుపుతాయనేది కవి ఉద్దేశం.

ఇ) ‘కులం’ పర్యాయ పదాలు ఏవి?
జవాబు:
తెగ, జాతి

ఈ) ‘వర్ణము’ వికృతి పదతి ఏది?
జవాబు:
వన్నెము

కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

2. ఎక్కువ మంది మానవులలో సుఖాలకంటే బాధలే ఎక్కువ. మానవుని బాధల నుండి, శోకాల నుండి, దిగుళ్ళూ, చింతల నుండి తప్పించి ఆనందంవైపు మరలించటానికే అనేకమైన లలిత కళలు. సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలైనవి. ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ కల మాత్రమే అవుతుంది.
ప్రశ్నలు – జవాబులు :
అ) మానవుని బాధను మరలించేవి ఏవి?
జవాబు:
మానవుని బాధను మరలించేవి లలితకళలు.

ఆ) ‘తాత్కాలికం’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కొంత సమయం వరకు.

ఇ) ‘లలిత కళలు’ ఏవి?
జవాబు:
సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం.

ఈ) చింత – వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
నిశ్చింత

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

అపరిచిత గద్యాలు

కింది అపరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితాన్ని ‘కరపత్రం’ అనవచ్చు. కరపత్రం సంస్కృత పదం. చేతిలోని కాగితమని దీని అర్థం. దీన్నే ఆంగ్లంలో ‘పాంప్లెట్’ అంటారు. పదిమందికి తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం. ఒక వ్యక్తి ఒక విషయాన్ని మరొకరికి తెలియబరచడానికి ఒక కాగితం మీద రాసి పంపవచ్చు. ఆ విషయం ఆ ఒక్క వ్యక్తికే సంబంధించినది కాక, ఎందరికో సంబంధించినది కావచ్చు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ మతస్థితులను . ప్రతిబింబించేది కావచ్చు. ఇలా రాసి పంపే కాగితాలను లేఖలు అనవచ్చు గదా ! అనిపిస్తుంది.
ప్రశ్నలు – జవాబులు :
అ) కరపత్రం అంటే ఏమిటి?
జవాబు:
చేతిలో ఒదిగి ఏదైనా విషయానికి సంబంధించి వివరణను ఇచ్చే కాగితాన్ని ‘కరపత్రం’ అంటారు.

ఆ) కరపత్రం అంటే అర్థం ఏమిటి? దీన్ని ఆంగ్లంలో ఏమంటారు?
జవాబు:
కరపత్రం అంటే చేతిలో కాగితం అని అర్థము. దీన్ని ఇంగ్లీషులో ‘పాంప్లెట్’ అంటారు.

ఇ) కరపత్రంలో విషయం దేనితో కూడుకొని ఉంటుంది?
జవాబు:
కరపత్రంలో విషయం పదిమందికీ తెలియవలసిన విషయంతో కూడి ఉంటుంది.

ఈ) కరపత్రంలో విషయం దేన్ని ప్రతిబింబిస్తుంది?
జవాబు:
కరపత్రంలో విషయం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ మతస్థితులను గూర్చి ప్రతిబింబిస్తుంది.

2. లిపి వాడుకలోకి వచ్చిన తరువాత, గుడ్డముక్కల మీద, చెక్క పలకల మీద రాసేవారు. ఒక విషయాన్ని దూరప్రాంతాల వారికి పంపాలనుకున్నప్పుడు మందపాటి గుడ్డమీద రాసి దానికి ఒక పిడిని అమర్చి ఆ పిడి చుట్టూ రాత ఉన్న గుడ్డను చుట్టి పైన తాడుతో కట్టి పంపేవారు. రాజుల కాలంలో ఇది ఎక్కువగా వాడుకలో ఉండేది. ఇలాంటి గుడ్డ ఉత్తరాలు ఇప్పటికీ కొన్ని ప్రాచీన మఠాలలో ఉన్నాయని తెలుస్తోంది. చేతులలో – అందంగా అమరే ఈ గుడ్డ ఉత్తరాలను, కరపత్రాల పరిణామంలో రెండో దశగా భావించవచ్చు. ముద్రణ సౌకర్యం ఏర్పడిన తరువాత, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలలో కరపత్రాల ముద్రణ మొదలై, ప్రపంచమంతా విస్తరించింది.
ప్రశ్నలు – జవాబులు :
అ) గుడ్డ ఉత్తరాలు ఎలా పంపేవారు?
జవాబు:
గుడ్డ మీద రాసి, దానికి ఒక పిడి అమర్చి, ఆ పిడి చుట్టూ రాత గుడ్డను చుట్టి, పైన తాడుతో కట్టి, పంపేవారు.

ఆ) గుడ్డ ఉత్తరాలు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:
గుడ్డ ఉత్తరాలు ప్రాచీన మఠాలలో ఉన్నాయని తెలుస్తోంది.

ఇ) గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిణామంలో ఎన్నో దశకు సంబంధించినవి?
జవాబు:
గుడ్డ ఉత్తరాలు కరపత్రాల పరిణామంలో రెండవ దశగా భావించాలి.

ఈ) కరపత్రాలు మొదట ఏయే దేశాల్లో ముద్రించబడ్డాయి?
జవాబు:
కరపత్రాల ముద్రణ, మొదట ఇంగ్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ దేశాలలో జరిగింది.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

3. ‘కరపత్రాల్లో విషయాలు ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థమౌతాయి. మిగిలిన వాళ్ళకు వాటిలోని భావాలు సందిగ్ధంగా ఉంటాయి. కొన్ని కరపత్రాలను ఎవరికీ తెలియనివ్వకుండా రహస్యంగా అతి తక్కువ సమయంలో ముద్రించి పంపకం చేస్తారు. అందువల్ల అచ్చు తప్పులకు, అపార్థాలకు ఎక్కువ ఆస్కారముంటుంది. కరపత్రాల్లోని విషయాలు నిజాలా ! అబద్దాలా అనే అనుమానం కలుగుతుంది. ఆధారాలు దొరికితే తప్ప, ఈ విషయాల వెనక ఉన్న వాస్తవం బయటపడదు. కొన్ని విషయాలను వార్తాపత్రికల్లో చూడనివారు కరపత్రాల్లో చూసి తెలుసుకుంటారు. కరపత్రాల్లో ఎక్కువగా వాడుకభాష ఉంటుంది. సాధారణంగా కరపత్రాలను ఉచితంగా పంపిణీ చేస్తారు. కరపత్రం మనిషి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతం.
ప్రశ్నలు – జవాబులు :
అ) కరపత్రాల్లో విషయాలు ఎవరికి వెంటనే అర్థమౌతాయి?
జవాబు:
కరపత్రాలలో విషయాలు, ఉద్దేశించిన వ్యక్తులకు వెంటనే అర్థం అవుతాయి.

ఆ) కరపత్రాల్లో విషయాలు ఎవరికి సందిగ్ధంగా ఉంటాయి?
జవాబు:
ఉద్దేశింపబడినవారు కాని వ్యక్తులకు, కరపత్రంలో విషయాలు సందిగ్ధంగా ఉంటాయి.

ఇ) అచ్చుతప్పులు కరపత్రాల్లో ఎందుకు వస్తూ ఉంటాయి?
జవాబు:
కరపత్రాలు రహస్యంగా, అతితక్కువ సమయంలో ముద్రించబడడం చేత అచ్చు తప్పులు వస్తాయి.

ఈ) కరపత్రం దేనికి సంకేతం?
జవాబు:
కరపత్రం మనిషి భావప్రకటనా స్వేచ్ఛకు సంకేతం.

4. జీవావరణం మీద పర్యావరణం మీద మనుష్యులు ఇంత కక్ష కట్టారెందుకో? ఇలా ఉన్న చెట్లన్నింటినీ నరికేసుకుంటూ పోతే, చివరికి మనిషికి మిగిలేదేమిటి ? అయినా ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా ! గ్రీన్ హౌజ్ ఎఫెక్టునీ………. ఆమ్ల దర్పాలనీ. ఆధునిక కాలుష్యకారక సమస్యలన్నింటికీ చెట్లు నరికివేతే కారణమని, ఈ మానవ మేధావులే తేల్చి చెబుతారు. మళ్ళీ ఉన్న చెట్లన్నింటినీ నరికి భవనాలూ, నగరాలూ నిర్మిస్తారు. వాళ్ళ అభివృద్ధి ఎటు పోతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు.
ప్రశ్నలు – జవాబులు :
అ) కాలుష్యానికి కారణం ఏమిటి?
జవాబు:
కాలుష్యానికి కారణం చెట్లు నరికివేత.

ఆ) మానవులు చెప్పేదే చేస్తున్నారా?
జవాబు:
లేదు. మనుషులు జీవావరణ, పర్యావరణాలపై కక్ష కట్టారు.

ఇ) మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేస్తోందా?
జవాబు:
మానవుల అభివృద్ధి జీవావరణానికి మేలు చేయడం లేదు.

ఈ) చెట్లు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
చెట్లు లేకపోతే a) గ్రీన్ హౌజ్ ఎఫెక్టు b) ఆమ్ల దర్పాలు కలుగుతాయి.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

5. ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావించబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్నలు – జవాబులు :
అ) వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

ఆ) జంతువులు ఎందుకు నశించిపోతాయి?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

ఇ) మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది?
జవాబు:
సైకిలు

ఈ) వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
లేఖారచనలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొన్న డా. సంజీవ్ దేవ్ గురించి రాయండి.
జవాబు:
తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధి చెందినవాడు డా. సంజీవ్ దేవ్. ఈయన ప్రతి ఉత్తరం ఓ చిత్రకావ్యం. వీరి వాక్య నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. “నిమ్మంటే నాకిష్టం, దానిమ్మంటే నాకిష్టం బొమ్మంటే నాకిష్టం, లేని అమ్మంటే నాకిష్టం” – అంటూ తన కవి హృదయాన్ని వ్యక్తపరిచాడు ఓ లేఖలో. ఆయన లేఖల్లో ఎక్కువగా వేదాంత, తాత్విక విషయాలే కనిపిస్తాయి. మరికొన్ని లేఖల్లో సంగీత, సాహిత్యాల పట్ల తన వైఖరి, ఇతర కవుల పై తన అభిప్రాయాలు కూడా కనిపిస్తాయి. “గద్యం అనేది ఆలోచన, పద్యం అనేది వేదన, సంగీతం అనేది సంవేదన” అంటూ వాటి ప్రాధాన్యతను వివరిస్తూ, ‘గద్యం అనేది భూమి, పద్యం అనేది ఆకాశం, సంగీతం అనేది ఇంద్రధనుస్సు” అని పోలుస్తాడు – ఒక లేఖలో. ఆయన ప్రతి లేఖ ఆకట్టుకునే పదబంధాలతో, సందేశాత్మక లక్ష్యంతో జనరంజకంగా కొనసాగుతాయి.

ప్రశ్న 2.
సంకల్పించుకొన్న కార్యాలు నెరవేరనపుడు మన ఆలోచన ఎలా ఉండాలని కవి సంజీవ్ దేవ్ అన్నారు?
జవాబు:
తన జీవితంలో సంకల్పించుకొన్న కార్యాలలో ఇంతవరకు నెరవేర్చిన వాటికంటే నెరవేర్చవలసినవే భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నాయని కవి సంజీవ్ పేర్కొన్నారు. సకాలంలో అవి అన్నీ కాకపోయినా కొన్ని అయినా సఫలం కాగలవని ఆశిస్తానంటాడు సంజీవ్. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడకూడదని, నిరాశ చెందకూడదని, విచారించకూడదని కార్యాచరణ మాత్రమే ప్రధానం కాని సఫలతలూ, విఫలతలూ సమానంగా స్వీకరించాలని సంజీవ్ అంటారు.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
లేఖల వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి.
జవాబు:
లేఖ అంటే జాబు, ఉత్తరం. ఒక చోటు నుండి మరొక చోటుకు, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కబుర్లనూ, వార్తలనూ, విశేషాలనూ చేరవేయడానికి ఉపయోగపడే రచనా మాధ్యమం ఉత్తరం. మానవుల మధ్య సంబంధాలకూ, దేశాల మధ్య సంబంధాలకూ ప్రాతినిధ్యం వహించే భాషా మాధ్యమం లేఖ. లేఖా రచన వ్యక్తిగత, సామాజిక జీవితాలపై ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. సందర్భ శుద్ధి, సౌజన్యత, ఆత్మీయత, యథార్థత అనేవి లేఖ ద్వారా కలిగే ప్రయోజనాలు. పెండ్లి పిలుపులు, వినతి పత్రాలు, ఫిర్యాదులు, సంపాదకీయ లేఖలు, ఆహ్వాన పత్రికలు ఇలా అనేక రకాలుగా లేఖలు మనకు ప్రయోజనాన్ని కల్గిస్తున్నాయి.

ప్రశ్న 2.
లేఖల్లో రకాలను తెలపండి.
జవాబు:
వ్యక్తిగత, సామాజిక ప్రయోజనాలననుసరించి ఉత్తరాలలో రకాలు ఏర్పడతాయి. ఉదాహరణకు వ్యక్తిగత లేఖలలో – వ్యక్తుల మధ్య సంబంధాలు వారి భావాల వ్యక్తీకరణ ప్రధాన ప్రయోజనం. వ్యాపార లేఖల్లో వివిధ వ్యాపార సంస్థల మధ్య లావాదేవీలు, లాభనష్టాలు వంటి అంశాల వ్యక్తీకరణ ప్రధానం. ఇలా విషయ ప్రాధాన్యాన్ని అనుసరించి లేఖలు 4 రకాలు. అవి –
1. వ్యక్తిగత లేఖలు
2. వ్యాపార లేఖలు
3. వ్యవహార లేఖలు
4. సాంఘిక లేఖలు అనే విభాగాలుగా ఏర్పడతాయి.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

మిత్రుడు = స్నేహితుడు, సఖుడు
లేఖ = జాబు, ఉత్తరం
నమస్సులు = నమస్కారాలు, వందనాలు
అనురాగం = ప్రేమ, మమకారం
సోదరి = సహోదరి, తోబుట్టువు
అమితం = అధికం, ఎక్కువ
రాత్రి = రాతిరి, రేయి
ఆనందం = సంతోషం, మోదము
అనుభూతి = అనుభవము, అనుభుక్తి
మైత్రి = స్నేహం, సఖ్యం
కులము = వంశము, కొలము
జాతి = కులము, పుట్టుక
ప్రతిబింబం = బింబము, ప్రతిమ
ముఖము = వదనం, ఆననం
ఆకృతి = ఆకారం, రూపం
తేజం = కాంతి, తేజస్సు
సుఖం = శాంతి, సౌఖ్యము
బాధ = కష్టం, దుఃఖం
శోకం = ఏడుపు, విలపించడం
దిగులు = వేదన, బాధ
కీర్తి = యశస్సు, ప్రఖ్యాతి

ప్రకృతి – వికృతులు

రాజు – ఱేడు
సంతోషము – సంతసము
రాత్రి – రేయి
దూరము – దవ్వు
కులము – కొలము
కార్యము – కర్జము
ముఖము – మొగము
సుఖము – సుగము
చిత్రము – చిత్తరువు
విద్య – విద్దె
కీర్తి – కీరితి
జీవితము – జీతము
ఫలము – పండు
ఆశ – ఆస

వ్యతిరేక పదాలు

సంతోషం × విచారం
అవును × కాదు
దూరము × దగ్గర
అస్పష్టం × స్పష్టం
స్వప్నం × జాగ్రత్
మైత్రి × వైరం
ప్రేమ × ద్వేషం
నిస్స్వార్థం × స్వార్థం
రాత్రి × పగలు
తేజం × నిస్తేజం
ఎక్కువ × తక్కువ
సుఖము × దుఃఖము
బాధ × ఆనందం
శోకము × సంతోషం
తాత్కాలికం × శాశ్వతం
విద్య × అవిద్య
సంపద × దరిద్రం
కీర్తి × అపకీర్తి
భవిష్యత్తు × గతం
ఆశ × నిరాశ
సఫలం × విఫలం

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

సంధులు

ఉత్వసంధి

ఔనండీ = ఔను + అండీ
నాకంత = నాకు + అంత
స్పష్టమైన = స్పష్టము + ఐన
మానవులంతా = మానవులు + అంతా
వారయిన = వారు + అయిన
మనమంతా = మనము + అంతా
అనేకమైన = అనేకము + ఐన

అత్వసంధి

ఉన్నట్లు = ఉన్న + అట్లు
మనింటివద్ద = మన + ఇంటి వద్ద

ఇత్వ సంధి

సోదరినింక = సోదరిని + ఇంక
ఆపాలని = ఆపాలి + అని
అవన్నీ = అవి + అన్నీ

సవర్ణదీర్ఘ సంధి

ముఖాకృతి = ముఖ + ఆకృతి
కార్యాచరణ = కార్య + ఆచరణ

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ………………… గా ఉండకూడదు. (విచారం)
2. మంచిపనులు చేస్తే తేజం పెరుగుతుంది. ……………. పోతుంది. (నిస్తేజం)
3. సుఖము, …………… సమానమే. (దుఃఖము)
4. ఏదీ శాశ్వతం కాదు. అన్నీ ……………… . (తాత్కాలికమే)
5. కీర్తి పెంచుకోవాలి. ……………….. కాదు. (అపకీర్తి)
6. ఆశతో జీవించాలి. …………….. తో కాదు. (నిరాశ)
7. ఉత్సాహంగా ఉండాలి. ……………. గా ఉండకూడదు. (నిరుత్సాహం)
8. విద్య వలన …………… పోతుంది. (అవిద్య)
9. పనిని సఫలం అయ్యేదాకా చేయాలి. ……………… వచ్చిందని ఆపకూడదు. (విఫలం)
10. స్వార్థం పనికిరాదు. ………….. గా పనిచేయాలి. (నిస్స్వార్థం)

సంధులు

1. ఔనండీ = ఔను + అండీ – ఉత్వ సంధి
2. ఉన్నట్లు = ఉన్న + అట్లు – అత్వ సంధి
3. ఆపాలని = ఆపాలి + అని – ఇత్వ సంధి
4. ముఖాకృతి = ముఖ + ఆకృతి – సవర్ణదీర్ఘ సంధి
5. కార్యాచరణ = కార్య + ఆచరణ – సవర్ణదీర్ఘ సంధి
6. మానవులంతా = మానవులు + అంతా – ఉత్వ సంధి
7. అవన్నీ = అవి + అన్నీ – ఇత్వ సంధి
8. మనింటి వద్ద = మన + ఇంటివద్ద – అత్వ సంధి
9. సోదరినింక = సోదరిని + ఇంక – ఇత్వ సంధి
10. అనేకమైన = అనేకము + ఐన – ఉత్వ సంధి

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. స్నేహితులంటే ప్రియము ఎక్కువ.
a) కష్టం
b) ఇష్టం
c) నష్టం
d) పుష్టి
జవాబు:
b) ఇష్టం

2. మా అమ్మకు ఉత్తరం వ్రాశాను.
a) జవాబు
b) బదులు
c) సఖి
d) వ్యాసం
జవాబు:
c) సఖి

3. సోదరి అంటే ఎవరికైనా ఇష్టమే.
a) స్నేహితురాలు
b) చెలియ
c) సఖి
d) తోబుట్టువు
జవాబు:
d) తోబుట్టువు

4. స్నేహితుని కంటె మించిన గ్రంథం లేదు.
a) ఎక్కువైన
b) తక్కువైన
c) ముంచిన
d) మంచి
జవాబు:
a) ఎక్కువైన

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

5. మొన్న నాకు మంచి స్వప్నం వచ్చింది.
a) కల
b) కలత నిద్ర
c) నిద్ర
d) దృశ్యం
జవాబు:
a) కల

6. కూచిపూడి కళాకారులు నృత్యం బాగా చేస్తారు.
a) నటన
b) ప్రదర్శన
c) నాట్యం
d) కచేరీ
జవాబు:
c) నాట్యం

7. సుఖదుఃఖాలు తాత్కాలికం.
a) శాశ్వతం
b) అశాశ్వతం
c) ఉంటాయి
d) పోతాయి
జవాబు:
b) అశాశ్వతం

8. ముందుగా బొమ్మ ఆకృతి గీయాలి.
a) ఆకారం
b) అందంగా
c) కాగితంపై
d) చక్కగా
జవాబు:
a) ఆకారం

9. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది.
a) ఆకారం
b) ప్రతిమ
c) రూపం
d) అందం
జవాబు:
b) ప్రతిమ

10. మంచివారి మైత్రిని విడువకూడదు.
a) స్నేహం
b) బంధుత్వం
c) చుట్టరికం
d) కలయిక
జవాబు:
a) స్నేహం

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. రాత్రి ఒంటరిగా తిరగకూడదు.
a) రేయి, రాతిరి
b) చీకటి, ఆంద్యం
c) పగలు, పవలు
d) ఏకం, అనేకం
జవాబు:
a) రేయి, రాతిరి

12. అమ్మనాన్నల అనురాగం వెలకట్టలేనిది.
a) స్నేహం, మైత్రి
b) గొప్పతనం, శక్తి
c) మమకారం, ప్రేమ
d) ఇష్టం, సఖ్యం
జవాబు:
c) మమకారం, ప్రేమ

13. ఎవరి ముఖము వారికి అందంగా కనిపిస్తుంది.
a) వదనం, వందనం
b) ఆననం, వదనం
c) ఆనం, ఆనందం
d) హస్తం, హస్తి
జవాబు:
b) ఆననం, వదనం

14. గురువులకు నమస్సులు పెట్టాలి.
a) నమస్కారాలు, వందనాలు
b) ఆశీస్సులు, దీవెనలు
c) ధనం, డబ్బులు
d) పిండివంటలు, భోజనం
జవాబు:
a) నమస్కారాలు, వందనాలు

15. దేనికీ దిగులు చెందకూడదు.
a) చెంత, చింత
b) వేదన, వేతనం
c) వేదన, బాధ
d) దుఃఖం, నవ్వు
జవాబు:
c) వేదన, బాధ

16. మంచి కీర్తి సంపాదించాలి.
a) యశస్సు, ప్రఖ్యాతి
b) డబ్బు, సంపద
c) ఆస్తి, తోట
d) చేను, పొలం
జవాబు:
a) యశస్సు, ప్రఖ్యాతి

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

17. మిత్రుడు కష్టాలలో ఆదుకొంటాడు.
a) స్నేహితుడు, బంధువు
b) స్నేహితుడు, సఖుడు
c) అధికారి, హెూదా కలవాడు
d) ధనవంతుడు, మిత్రుడు
జవాబు:
b) స్నేహితుడు, సఖుడు

18. అమితంగా మంచిపనులు చేయాలి.
a) తగినంత, శక్తి మేరకు
b) కొంచెం, మితం
c) ఎక్కువ, అధికం
d) మితం, హితం
జవాబు:
c) ఎక్కువ, అధికం

19. ఎప్పుడూ ఆనందంగా గడపాలి.
a) సంతోషం, మోదం
b) మోదం, మోదకాలు
c) ముద్దు, ముదం
d) హితం, మితం
జవాబు:
a) సంతోషం, మోదం

20. దేనికీ శోకం పనికిరాదు.
a) లోకం, శ్లోకం
b) ఏడ్పు, నవ్వు
c) బాధ, సుఖం
d) ఏడుపు, విలపించడం
జవాబు:
d) ఏడుపు, విలపించడం

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. రవివర్మ చిత్తరువు బాగా గీస్తాడు.
a) చిత్రము
b) చిత్తరము
c) చిత్తుప్రతి
d) చిత్తం
జవాబు:
a) చిత్రము

22. కీర్తి సంపాదించాలి.
a) కీర్ధి
b) కీర్తి
c) కిరతం
d) కీరితి
జవాబు:
d) కీరితి

23. విద్దె వలన కీర్తి పెరుగుతుంది.
a) విద్ద
b) విద్ది
c) విద్దియ
d) విద్య
జవాబు:
d) విద్య

24. పనిచేస్తే ఫలము ఉంటుంది.
a) పళ్లు
b) పండు
c) ఫలితము
d) ఫలాహారం
జవాబు:
b) పండు

25. ఎప్పుడూ ఆశను విడవకూడదు.
a) ఆష
b) ఆశయం
c) ఆస
d) ఆసరా
జవాబు:
c) ఆస

26. ఎవరి కులము వారికి గొప్ప.
a) కొలము
b) కులాయము
c) కూలము
d) కొలను
జవాబు:
a) కొలము

27. దవ్వులో ఉన్నా మానవులంతా ఒకటే.
a) దువ్వు
b) దూరము
c) దగ్గర
d) సమీపం
జవాబు:
b) దూరము

28. మొదలు పెట్టిన కార్యము విడువకూడదు.
a) కర్యము
b) క్రౌర్యము
c) కర్ణము
d) కారణం
జవాబు:
c) కర్ణము

29. ముఖము అద్దంలో చూసుకోవాలి.
a) వదనం
b) ఆననం
c) మొగము
d) ఆస్యం
జవాబు:
c) మొగము

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

30. ఎవరైనా సుఖమునే కోరుకొంటారు.
a) సొగసు
b) సుగము
c) శుకము
d) సౌఖ్యం
జవాబు:
b) సుగము

2. వ్యాకరణాంశాలు

ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

31. – పొలము అతని చేత దున్నబడెను – కర్త ఏది?
a) పొలము
b) అతను
c) దున్నడం
d) పడెను
జవాబు:
b) అతను

32. నేను వ్యవసాయమును చేస్తాను – కర్మ ఏది?
a) వ్యవసాయం
b) ను
c) నేను
d) చేస్తాను
జవాబు:
a) వ్యవసాయం

33. పంటలు పండించి ఎగుమతి చేస్తాను – అసమాపక క్రియ ఏది?
a) చేస్తాను
b) ఎగుమతి
c) పండించి
d) పంటలు
జవాబు:
c) పండించి

34. సాధారణంగా కర్మపదం పక్కనే ఉండే ప్రత్యయం?
a) యొక్క
b)డు
c) ము
d) ను లేక ని
జవాబు:
d) ను లేక ని

35. వీచెను గాలి చల్లగా బయట – కర్త ఏది?
a) వీచెను
b) గాలి
c) చల్లగా
d) బయిట
జవాబు:
b) గాలి

36. అతను స్త్రీని నిర్బంధించుట తప్పు – కర్మ ఏది?
a) అతను
b) నిర్బంధించు
c) స్త్రీ
d) తప్పు
జవాబు:
b) నిర్బంధించు

37. నేను పుస్తకమును వ్రాస్తాను – దీనిలో ‘నేను’ అనేది?
a) కర్త
b) కర్మ
c) క్రియ
d) విశేషణం
జవాబు:
a) కర్త

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

38. అతను పనిని నిర్లక్ష్యం చేశాడు – దీనిలో పని’ ఏమిటి?
a) కర్త
b) క్రియ
c) కర్మ
d) అవ్యయం
జవాబు:
c) కర్మ

39. క్రిందివానిలో అసమాపక క్రియను గుర్తించండి.
a) చూస్తూ
b) చేస్తాను
c) వస్తాను
d) తింటాను
జవాబు:
a) చూస్తూ

40. క్రిందివానిలో కర్మపదమును గుర్తించండి.
a) రాముడు
b) సీతను
c) అడవికి
d) పంపెను
జవాబు:
b) సీతను

41. గాలి వీచెను – ఇది ఏ రకమైన వాక్యం?
a) కర్తథకం
b) సకర్మకం
c) అకర్మకం
d) క్రియావాక్యం
జవాబు:
c) అకర్మకం

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

42. హనుమ సముద్రమును దాటెను – ఏ రకమైన వాక్యం?
a) అకర్మకం
b) కర్తర్ణకం
c) వాక్యం
d) సకర్మకం
జవాబు:
d) సకర్మకం

నేనివి చేయగలనా?

1. కళల గురించి చర్చించగలను. [ ఔను/ కాదు ]
2. పాఠంలోని పదాలకు అర్థాలను, పర్యాయపదాలను గుర్తించి రాయగలను. [ ఔను/ కాదు ]
3. లేఖలను చదవగలను. సొంతమాటల్లో రాయగలను. [ ఔను/ కాదు ]
4. నేను చూసిన ఒక దర్శనీయ ప్రాంతం గురించి మిత్రునికి లేఖ రాయగలను. [ ఔను/ కాదు ]

చదవండి – ఆనందించండి

గురుభక్తి

ఒకరోజు ధౌమ్యుమహర్షి ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వర్షం ఏకదాటిగా కురుస్తోంది. ఆశ్రమప్రాంతం అంతా జలమయం అయింది. వెంటనే దౌమ్యమహర్షి తన శిష్యులను దగ్గరగా పిలిచి ఇలా అన్నాడు. ‘శిష్యులారా ! మన పంట చేనుకు ప్రక్కన ఉన్న కాలవగట్టు సక్రమంగా లేకపోతే మన పంట మొత్తం నీళ్ళపాలు అవుతుంది. అదే జరిగితే మన ఆశ్రమంలో అందరూ పస్తులు ఉండాలి. ముందు మీలో ఎవరో ఒకరు వెళ్లి పంటపొలాలను చూసి రండి’ అని అన్నాడు.

గురువు మాటలకు అందరూ తలలు వంచుకొని రకరకాల కారణాలు చెప్పారు తప్ప, ఆ వర్షంలో పంటచేనుకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. అక్కడ ఉన్న ఆరుణి అనే శిష్యుడు లేచి “గురుదేవా ! ఆశ్రమానికి ఆహారం అందించే పంటచేను ఎలా ఉందో నేను చూసి వస్తాను” అని పంటచేను దగ్గరికి బయలుదేరాడు.

ఆరుణి పంటచేల గట్టు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక చోట కాలవగట్టుకి చిన్న గండిపడింది. ఆ గండిలో నుంచి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఆరుణి గడ్డి, రాళ్ళు, రప్పలు తెచ్చి గండికి అడ్డం వేసినా ప్రవాహం ఆగలేదు. ఆరుణి ఒక ఉపాయం ఆలోచించి చివరికి తానే గండికి అడ్డంగా పడుకున్నాడు. ప్రవాహాన్ని అడ్డుకున్నాడు.

తెల్లవారింది. ధౌమ్యుమహర్షి ఆరుణిని వెతుక్కుంటూ పంటచేను దగ్గరికి వెళ్ళాడు. అడ్డంగా పడుకున్న ఆరుణి తడిసి, చలికి వణుకుతూ అక్కడే ఉన్నాడు. మహర్షి అతని దగ్గరికి వచ్చి పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. సాయంత్రానికి ఆరుణి కోలుకున్నాడు. గురువు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు దౌమ్యమహర్షి “నీ గురుభక్తి, కార్యదీక్ష వెలకట్టలేనిది” ! అని ఆరుణిని మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న మిగతా శిష్యులు సిగ్గుతో తలవంచుకున్నారు. గురువుపై భక్తి ఉన్న వాళ్లకి ఆయన చెప్పిన ఏ పనీ కష్టంగా అనిపించదు. వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ, ఉత్తమశిష్యులుగా అందరి మన్ననలు పొందుతారు.

జాజిపువు నాజూకు జజాము నవకంబు
మల్లెపువ్వుల పరీమళ పరీవాహంబు – తెలుగు భాష – రాయప్రోలు సుబ్బారావు

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

These AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 9th Lesson Important Questions and Answers హితోక్తులు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత పద్యాలు

కింది పరిచిత పద్యాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. నీటిమీది వ్రాత నిజము దుర్జనమైత్రి,
చేయుచుండఁగనె నశించుచుండు
అదియె సజ్జనాళియందుఁజల్పితి మేని
రాతగీచినట్టి గీత గాదె?
ప్రశ్నలు – జవాబులు:
అ) చెడ్డవారితో స్నేహం ఎలాంటిది?
జవాబు:
చెడ్డవారితో స్నేహం నీటిమీద రాత లాంటిది.

ఆ) మంచివారితో స్నేహం ఎలా ఉంటుంది?
జవాబు:
మంచివారితో స్నేహం రాతి మీద చెక్కిన రాత లాగే చిరకాలం ఉంటుంది.

ఇ) అప్పుడే నశించేది ఏది?
జవాబు:
చెడ్డవారితో స్నేహం అప్పుడే నశిస్తుంది.

ఈ) ఈ పద్యము ద్వారా మీరు గ్రహించిన నీతి ఏమి?
జవాబు:
మంచివారితో స్నేహం చేయవలెను.

2. ఎంత యలుకగొన్న నేమి సత్పురుషుల
నోటనెట్లు చెడ్డమాట వెడలు
రాహువదన గహ్వరమున నున్నను జంద్రు
కరములమృతరసమె కురియుఁగా గాదె !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎంత అలిగినా సత్పురుషులు ఎలా ఉంటారు?
జవాబు:
ఎంత అలిగినా సత్పురుషుల నోటి నుండి చెడ్డ మాటలు రావు.

ఆ) ‘గహ్వరము’ పదానికి అర్థమేమి?
జవాబు:
గుహ

ఇ) ఎవరి కరములు అమృతము కురియును?
జవాబు:
చంద్రుని కరములు అమృతము కురియును.

ఈ) ఎంత కోపం వచ్చినప్పటికి ఎవరి నోటి నుండి మంచిమాటలు వస్తాయి?
జవాబు:
ఎంత కోపం వచ్చినప్పటికి మంచివారి నోటి నుండి మంచిమాటలు వస్తాయి.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

అపరిచిత పద్యాలు

కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

కసవు గల దిరవు పసులకు,
లస దద్రినదీ మహీజ లతికావలి పెం
పెసఁగును, గాఁపురమునకును,
బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
ప్రశ్నలు – జవాబులు:
అ) బృందావనము పశువులకు ఎలా ఉంటుంది?
జవాబు:
బృందావనము పశువులకు అనుకూలము. అక్కడ వాటికి గడ్డి దొరుకుతుంది.

ఆ) బృందావనము పర్వతాలు, నదులు, చెట్లు, తీగలతో ఉంటుంది. అనే భావంగల పంక్తి ఏది?
జవాబు:
“లస దద్రినదీ మహీజలతికావలి పెంపెసఁగును” అనే పంక్తి.

ఇ) బృందావనము ఏ విధంగా పొసగుతుంది?
జవాబు:
బృందావనం కాపురానికి తగి యుంటుంది.

ఈ) ‘పొదడచ్చటికిన్’ – అంటే ఏమిటి?
జవాబు:
‘అక్కడికి పోదాం ‘ అని ఆ పంక్తికి గల భావం.

2. ఒక్కఁడు ము న్నే మఱి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్, వే
డొక్కఁడు ముట్టి తటాలున,
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎప్పుడు బలుబొబ్బ పెట్టాడు?
జవాబు:
ఒకడు ఏమరుపాటుగా నడుస్తుండగా, మరొకడు పెద్దబొబ్బ పెట్టాడు.

ఆ) పెద్దబొబ్బ పెడితే ఏమయింది?
జవాబు:
బలుబొబ్బ (పెద్దకేక) పెడితే, నడిచివెళ్ళే వాడు ఉలికి పడ్డాడు.

ఇ) ‘ఉలికిపడేటట్లు ఒకడు పెద్దకేక వేయగా’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘ఒక్కడు బలుబొబ్బ పెట్టు నులికిపడన్’ అనే పంక్తి ఈ భావాన్ని ఇస్తుంది.

ఈ) కనుదోయి మూయగా ఏమి జరిగింది?
జవాబు:
ఒకడు కనుదోయి మూయగా, అది చూచి మరొకడు నవ్వాడు.

3. కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.
ప్రశ్నలు – జవాబులు:
అ) సుజనుడు ఎట్లా ఉంటాడు?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

ఆ) మందుడు ఎలా ఉంటాడు?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

ఇ) సుజనుని కవి దేనితో పోల్చాడు?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

ఈ) ఈ పద్యంలోని అలంకారమేమి?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

4. సద్గొష్ఠి సిరియు నొసెగును
సద్గొష్ఠియె కీర్తి పెంచు, సంతుష్టియునా
సద్గొష్ఠియె యొనగూర్చును
సద్గొష్ఠియె పాపములను చఱచు కుమారా !
ప్రశ్నలు – జవాబులు:
అ) సద్గోష్ఠి దేన్ని ఇస్తుంది?
జవాబు:
సద్గోష్ఠి సంపదను ఇస్తుంది.

ఆ) కీర్తిని పెంచేది ఏది?
జవాబు:
కీర్తిని పెంచేది సద్గోష్ఠి

ఇ) సద్గోష్ఠి పోగొట్టేది ఏది?
జవాబు:
సద్గోష్ఠి పాపములను పోగొడుతుంది.

ఈ) ఈ పద్యము ఏ శతకంలోనిది?
జవాబు:
ఈ పద్యము కుమార శతకంలోనిది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దుర్జనమైత్రిని నీటిమీది వ్రాతతో ఎందుకు పోల్చారు?
జవాబు:
దుర్జనమైత్రి ఎంతో కాలం సాగదు. స్నేహం చేస్తుంటేనే అనేక అభిప్రాయ భేదాలు వస్తాయి. అపార్థాలు వస్తాయి. అనవసరమైన గొడవలెన్నో వస్తాయి. ఎంతగా సర్దుకుపోదామన్నా కుదరదు. అడుగడుగునా అవమానాలు ఎదురౌతాయి. అందుచేత దుర్జనమైత్రి నిలబడదు. అలాగే నీటి మీద వ్రాసిన వ్రాత కూడా అంతే. వ్రాస్తుంటేనే చెరిగిపోతుంది.

ప్రశ్న 2.
లోభి వాని చేతిలో డబ్బును వేసవిలో ఎండలో వెళ్లే వ్యక్తి నీడతో పోల్చడాన్ని ఎలా సమర్ధిస్తారు?
జవాబు:
లోభి వాని చేతిలో డబ్బు ఉంటుంది. కాని ప్రయోజనం ఉండదు. లోభి ఆ డబ్బును ఎవరికీ ఇవ్వడు. తనూ ఖర్చు చేసుకోడు. సుఖపడడు. అలాగే వేసవి ఎండలో వెళ్లే వాడి నీడ వలన కూడా ఎవరికీ ప్రయోజనం లేదు. ఆ నీడను ఎవరూ సేద తీరలేరు. అలాగే ఆ వ్యక్తికి కూడా తన నీడ చల్లదనాన్ని ఇవ్వదు. అందుచేత లోభి చేతిలో డబ్బు, వేసవిలో నడిచేవాని నీడా ప్రయోజనం లేనివే. కనుక రెండింటినీ పోల్చడం సమర్థనీయమే.

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
xxxxx.

ప్రియమైన శ్రీవల్లికి,
నీ స్నేహితురాలు లలిత వ్రాయు లేఖ.
ఇటీవల మా తెలుగు మాస్టారు ‘హితోక్తులు’ పాఠం చెప్పారు. దీనిని రాసిన కవి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు. రాళ్ళపల్లి గ్రంథ పరిష్కర్తగా, వ్యాస రచయితగా, విమర్శకునిగా, గానకళా ప్రపూర్ణగా సాహిత్య లోకానికి సుపరిచితులని చెప్పారు. రఘువంశం, స్వప్న వాసవదత్త గాథా సప్తశతి (ప్రాకృతభాష) వంటి సంస్కృత గ్రంథాలను ఆంద్రీకరించారు. అనేక గ్రంథాలను పరిశీలించి, పరిశోధకుడిగా పరిష్కరించి సమగ్ర పీఠికలను అందించారు. తిరుమలతిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 108 అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. రాళ్ళపల్లివారి పాత్ర చిత్రీకరణను తెలియజేసే వ్యాసాలు నిగమశర్మ అక్క తిక్కన తీర్చిన సీతమ్మ. వేమనపై ఏడు ఉపన్యాసాలు ఇచ్చారు. ‘ఏకసంథాగ్రాహి’ పేరు పొందారని మా సార్ చెబుతుంటే అద్భుతం అనిపించింది. ఇలాంటి గొప్పకవి రాసిన పద్యాలు చదవడం అదృష్టంగా భావిస్తున్నా. దీనిపై నీ అభిప్రాయం రాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
కె. లలిత.

చిరునామా :
ఎస్. శ్రీవల్లి, 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.

ప్రశ్న 2.
కవుల గొప్పదనాన్ని ప్రశంసిస్తూ కవిత రాయండి.
జవాబు:
బుద్ధి బలాన్ని సిరాగా మార్చి కలం పట్టిన
కవులకు మనమేమివ్వగలం ?

విలువలకు ఛందస్సులు తొడిగిన ఘనులే !
సాహిత్యపు మాగాణంలో పండిన మణులే ! .
ఆలోచనలే అక్షర రూపం దాల్చగా
పథం చూపే కథనాలను అందించిన
కవులకు మనమేమివ్వగలం
జయంతికో, వర్థంతికో వందనం తప్ప.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

హితోక్తులు = మంచి మాటలు, సూక్తులు
నీరు = జలము, ఉదకము
నిజము = సత్యము, యధార్థం
దుర్జనుడు = చెడ్డవాడు, దుష్టుడు
మైత్రి = స్నేహం, సఖ్యం
నశించు = నాశనమగు, ధ్వంసమగు
సజ్జనులు = మంచివారు, ఉత్తములు
అళి = సమూహం, గుంపు
సల్పుట = చేయుట, ఆచరించుట
సిరి = డబ్బు, ధనం
చేయి = హస్తము, కరము
వెలయు = వెలుగు, ప్రకాశించు
సుంత = కొంచెం, కొద్దిగా
ఫలము = ఫలితం, ప్రయోజనం
తెరవు = మార్గం, దారి
కఱకు = కఠినం, దట్టమైన
వేసవి = వేసంగి, ఎండాకాలం
నీడ = ఛాయ, పొడ
అలుక = కినుక, కోపం
సత్పురుషులు = ఉత్తములు, మంచివారు
నోరు = వక్రము, వాయి
రాహువు = స్వర్భానుడు, అహి
మాట = పలుకు, వాణి
వదనము = ముఖము, ఆననము
గహ్వరము = గుహ, బిలము
చంద్రుడు = శశి, శశాంకుడు
కరములు = కిరణాలు, మరీచులు
అమృతము = సుధ, పీయూషము
మనము = మనస్సు, మనసు
అంత్యము = తుద, చివర
దశ = స్థితి, పరిస్థితి
సూర్యుడు = ద్యుమణి, రవి

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

ప్రకృతి – వికృతులు

హితము – ఇతము
నిజము – నిక్కము
శ్రీ – సిరి
ఫలము – పండు
చంద్రుడు – చందురుడు
గహ్వరము – గవి

వ్యతిరేక పదాలు

నిజము × అబద్దము
దుర్జనుడు × సజ్జనుడు
మైత్రి × వైరము
సుంత × అధికం
ఫలము × నిష్ఫలము
నీడ × వెలుగు
అలుక × శాంతం
సత్పురుషులు × దుష్టులు
చెడు × మంచి
అమృతం × విషం
అంత్యం × ఆది
ఉన్నతం × అధమం
మీద × క్రింద

సంధులు

కరములమృతము = కరములు + అమృతము – ఉత్వసంధి
మానవంతుడైన = మానవంతుడు + ఐన – ఉత్వసంధి
ఉన్నతంబె = ఉన్నతంబు + ఎ – ఉత్వసంధి
సల్పితిమేని = సల్పితిమి + ఏని – ఇత్వసంధి
సజ్జనాళియందు = సజ్జనాళి + అందు – యడాగమం
సిరియెంతగా = సిరి + ఎంతగా – యడాగమం
వేసవియెండ = వేసవి + ఎండ – యడాగమం
ఎంతయలుక = ఎంత + అలుక – యడాగమం
ఉన్నతంబెయగును = ఉన్నతంబె + అగును – యడాగమం
సజ్జనాళి = సజ్జన + అళి – సవర్ణదీర్ఘసంధి
గీచినట్టి = గీచిన +అట్టి – అత్వసంధి
వేళఁగఱకు = వేళన్ + కఱకు – సరళాదేశ సంధి
వానికిఁదన = వానికిన్ + తన – సరళాదేశ సంధి
దశలఁగూడ = దశలన్ + కూడ – సరళాదేశ సంధి
ప్రక్కఁగాదె = ప్రక్కన్ + కాదె – సరళాదేశ సంధి

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. మంచివారితో మైత్రి చేయాలి.
a) స్నేహం
b) బంధుత్వం
c) వ్యాపారం
d) వ్యవసాయం
జవాబు:
a) స్నేహం

2. దుర్జనులు దూరంగా ఉంచవలసినవారు.
a) దేవతలు
b) కోపం కలవారు
c) శత్రువులు
d) చెడ్డవారు
జవాబు:
d) చెడ్డవారు

3. సిరిని అనవసరంగా వృథా చేయకూడదు.
a) ఆహారం
b) డబ్బు
c) నీరు
d) కాలం
జవాబు:
b) డబ్బు

4. మంచి తెరువులో ప్రయాణించాలి.
a) వాహన
b) సమయం
c) దారి
d) మిత్రుడు
జవాబు:
c) దారి

5. వదనములో చిరునవ్వు ఉండాలి.
a) ఎప్పుడు
b) ఎల్లప్పుడు
c) ముఖము
d) ఆనందం
జవాబు:
c) ముఖము

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

6. చెట్టు నీడ చల్లగా ఉంటుంది.
a) క్రింద
b) ఛాయ
c) ప్రక్క
d) లోపల
జవాబు:
b) ఛాయ

7. సూర్య కరములు వేడిగా ఉంటాయి.
a) కిరణాలు
b) కాంతులు
c) ఎండలు
d) తాపం
జవాబు:
a) కిరణాలు

8. అంత్యదశలోనూ మహాత్ములు ఉపకారం చేస్తారు.
a) మొదటి స్థితి
b) చివరిస్థితి
c) దుస్థితి
d) సుస్థితి
జవాబు:
b) చివరిస్థితి

9. చంద్రుడు వెన్నెలనిస్తాడు.
a) కౌముది
b) రవి
c) శశి
d) ఆతపం
జవాబు:
c) శశి

10. సూర్యుడు పగటికి రాజు.
a) శశి
b) శశాంకుడు
c) ద్యుః
d) రవి
జవాబు:
d) రవి

పర్యాయపదాలు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. పెద్దల హితోక్తి వినాలి.
a) సూక్తి, ఉక్తి
b) సూక్తి, మంచిమాట
c) నీతి, ధర్మం
d) మాట, పలుకు
జవాబు:
b) సూక్తి, మంచిమాట

12. మంచి నీరు వృథా చేయకూడదు.
a) జలము, ఉదకం
b) జలము, జలజం
c) ఉదకం, ఉదధి
d) నీరు, నీరజ
జవాబు:
a) జలము, ఉదకం

13. మంచివారితో మైత్రి చేయాలి.
a) బంధుత్వం, చుట్టరికం
b) వైరం, శత్రుత్వం
c) స్నేహం, సఖ్యం
d) వ్యాపారం, వాణిజ్యం
జవాబు:
c) స్నేహం, సఖ్యం

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

14. సుంత కోపం కూడా ఉండకూడదు.
a) కొంచెం, కొద్దిగా
b) చాలా, ఎక్కువ
c) అంత, ఇంత
d) ఇంత, వింత
జవాబు:
a) కొంచెం, కొద్దిగా

15. చేయి చాపి యాచించకూడదు.
a) కరి, కరము
b) కరము, కరుణ
c) హస్తం, హస్తి
d) కరము, హస్తము
జవాబు:
d) కరము, హస్తము

16. చంద్రుడు రాత్రికి రాజు.
a) శశి, చంద్రిక
b) కౌముది, చందురుడు
c) శశి, శశాంకుడు
d) ద్యు, మహి
జవాబు:
c) శశి, శశాంకుడు

17. మంచి తెరువు చూసుకోవాలి.
a) మార్గం, దారి
b) ఉద్యోగం, జీతం
c) ఉపాధి, పని
d) ఉద్యోగం, పని
జవాబు:
a) మార్గం, దారి

18. గహ్వరములోకి వెళ్లకూడదు.
a) అడవి, కాననం
b) కొండ, శైలం
c) నది, గోదావరి
d) గుహ, బిలము
జవాబు:
d) గుహ, బిలము

19. వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది.
a) వేసగి, ఎండాకాలం
b) వేసటం, వేసము
c) వేసదము, ఎండ
d) ఆతపం, ఎండ
జవాబు:
a) వేసగి, ఎండాకాలం

20. దేవతలు అమృతము త్రాగుతారు.
a) సుధ, సుద్ద
b) సుధ, పాలు
c) సుధ, పీయూషము
d) మధువు, తేనె
జవాబు:
c) సుధ, పీయూషము

ప్రకృతి-వికృతులు

ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. హితము పలకాలి.
a) హితవు
b) హిమము
c) ఇతవు
d) హితోక్తి
జవాబు:
c) ఇతవు

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

22. నిక్కము పలకాలి.
a) నిక్కరు
b) నిజము
c) సత్యము
d) యదార్థం
జవాబు:
b) నిజము

23. సిరి గలవాడు శ్రీహరి.
a) డబ్బు
b) లక్ష్మి
c) ధనం
d) శ్రీ
జవాబు:
d) శ్రీ

24. ఫలము లేనిదే ఎలా?
a) పండు
b) ఫలితం
c) ప్రయోజనం
d) లాభం
జవాబు:
a) పండు

25. చంద్రుడు రేరాజు.
a) శశి
b) శశాంకుడు
c) చందురుడు
d) చంద్రిక
జవాబు:
c) చందురుడు

26. గహ్వరము కొండలలో ఉంటుంది.
a) గుహ
b) గొబ
c) బిలము
d) గవి
జవాబు:
d) గవి

27. ప్రతిదానికీ ఆశ్చర్యము వ్యక్తం చేయకూడదు.
a) అచ్చెరువు
b) ఆచెరుము
c) ఆచ్చెరం
d) ఆచెరం
జవాబు:
a) అచ్చెరువు

28. ధర్మము తప్పకూడదు.
a) దరమము
b) దరిమ
c) దరము
d) దమ్మము
జవాబు:
d) దమ్మము

29. న్యాయమునకు గెలుపు వస్తుంది.
a) న్యాయ్యము
b) నాయము
c) నాయ్యము
d) నయము
జవాబు:
b) నాయము

30. ప్రతి కార్యము శ్రద్ధతో చేయాలి.
a) కర్యము
b) కర్జూరం
c) కర్ణము
d) కర్చు
జవాబు:
c) కర్ణము

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

వ్యతిరేకపదాలు : ఈ క్రింది గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు గుర్తించండి.

31. నిజమును పలకాలి.
a) సత్యం
b) అబద్ధం
c) యదార్థం
d) నృతము
జవాబు:
b) అబద్ధం

32. మైత్రిని పాటించాలి.
a) స్నేహం
b) సఖ్యం
c) వైరం
d) నటన
జవాబు:
c) వైరం

33. శ్రమకు ఫలము ఉంటుంది.
a) నిష్ఫలము
b) ఫలితము
c) ప్రయోజనం
d) లాభం
జవాబు:
a) నిష్ఫలము

34. నీడలో చీకటి ఉంటుంది.
a) నీడజము
b) ఛాయ
c) పొడ
d) వెలుగు
జవాబు:
d) వెలుగు

35. దుర్జనుడు విడువ తగినవాడు.
a) సజ్జనుడు
b) దుష్టుడు
c) దుర్మార్గుడు
d) దుర్మదుడు
జవాబు:
a) సజ్జనుడు

36. దేవతలకు అమృతం ఇష్టం.
a) పీయూషం
b) సుధ
c) విషం
d) విషజం
జవాబు:
c) విషం

37. అంత్యంలోనైనా మంచిగా ఉండాలి.
a) చివరి
b) తుద
c) వెనుక
d) ఆది
జవాబు:
d) ఆది

38. ఉన్నతంగా జీవించాలి.
a) అధమం
b) ఉత్తమం
c) చాలా
d) కొంచెం
జవాబు:
a) అధమం

39. తల మీద ఉంటుంది.
a) పైన
b) క్రింద
c) ప్రక్క
d) ఇటు
జవాబు:
b) క్రింద

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

40. చెడు ను విడవాలి.
a) మంచి
b) కీడు
c) ఆపద
d) ఇడుము
జవాబు:
a) మంచి

2. వ్యాకరణాంశాలు

ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

41. కరములమృతము – సంధి పేరు?
a) ఉత్వసంధి
b) అత్వసంధి
c) ఇత్వసంధి
d) యడాగమం
జవాబు:
a) ఉత్వసంధి

42. సిరియెంతగా – సంధి విడదీయండి.
a) సిరి + యెంతగా
b) సిరి + ఎంతగా
c) సిరియెంత + గా
d) సిరీ + ఎంతగా
జవాబు:
b) సిరి + ఎంతగా

43. సజ్జనాళి – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) సవర్ణదీర్ఘ సంధి
d) గుణసంధి
జవాబు:
c) సవర్ణదీర్ఘ సంధి

44. గీచినట్టి – సంధి విడదీయండి.
a) గీచి + నట్టి
b) గీచిన + అట్టి
c) గీచిన + ట్టి
d) గీచీ + న + అట్టి
జవాబు:
b) గీచిన + అట్టి

45. సల్పితిమేని – ఇది ఏ సంధి?
a) అత్వసంధి
b) యడాగమం
c) ఉత్వసంధి
d) ఇత్వసంధి
జవాబు:
d) ఇత్వసంధి

46. వానికిఁదన – సంధి విడదీయండి.
a) వానికిన్ + తన
b) వాని + కిదన
c) వానికి + తన
d) వానికి + దన
జవాబు:
a) వానికిన్ + తన

47. ప్రక్కఁగాదె – సంధి పేరేమి?
a) గసడదవాదేశ సంధి
b) సరళాదేశ సంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
b) సరళాదేశ సంధి

48. ఎంతయలుక – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) యడాగమం
d) త్రికసంధి
జవాబు:
c) యడాగమం

49. ఉన్నతంబె – సంధి పేరేమి?
a) ఉత్వసంధి
b) అత్వసంధి
c) ఇత్వసంధి
d) యడాగమం
జవాబు:
a) ఉత్వసంధి

AP 7th Class Telugu Important Questions 9th Lesson హితోక్తులు

50. దశలఁగూడ – సంధి పేరేమి?
a) ఉత్వసంధి
b) ఇత్వసంధి
c) సరళాదేశ సంధి
d) గసడదవాదేశ సంధి
జవాబు:
c) సరళాదేశ సంధి

నేనివి చేయగలనా?

1. పద్యాలను వినసొంపుగా పాడగలను. [ ఔను / కాదు ]
2. పద్యాలను స్పష్టమైన ఉచ్చారణతో చదవగలను. [ ఔను / కాదు ]
3. నేర్చుకున్న భాషాంశాలను సొంత మాటల్లో రాయగలను. [ ఔను / కాదు ]
4. నేను విన్న హితోక్తులను ఆచరించగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి.

సంకల్పబలం

టిట్టిభము అనేది ఒక చిన్న పక్షి. దానిని లకుముకి పిట్ట అని కూడా అంటారు. ఈ ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్ళింది. అది తిరిగి వచ్చి చూసే సరికి దాని గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోకి ఈడ్చుకుని పోయాయి.

గుడ్లు కనిపించకపోవడంతో ఆ పక్షి చాలా బాధపడింది. ‘అయ్యో ! నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకుని పోయిందే’ అని తలుచుకుంటూ ఆ చిన్న పక్షి రోదించింది. ఏడుపు ఆపి ఆలోచించింది. పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది. వెంటనే కార్యాచరణకు దిగింది. సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒకచోట ఉమ్మివేసేది. మళ్లీ సముద్రం వద్దకు వచ్చి ఇంకొక బొట్టును పీల్చి దూరంగా పోయి ఉమ్మివేయసాగింది.

ఈ విధంగా అది విశ్రాంతి లేకుండా ఆ నీటిని ఉమ్మివేసే పనిలో నిమగ్నమయ్యింది. ఆ సముద్ర జలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయనుకుంటుంది. టిట్టిభపక్షి చేస్తున్న పనిని తోటి పక్షులు హేళన చేసాయి. సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా ? అని ఎగతాళిగా మాట్లాడాయి. మరికొన్ని దాని కష్టం చూడలేక దానికి సాయం చేసాయి. మొత్తానికి టిట్టిభ పక్షులన్నీ కలిసి సముద్రంలోకి నీటిని పీల్చడం…. బయట వదలి వేయడం. ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటని వాటిని అడిగాడు.

తన గుడ్లని సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకొనిపోయిన విషయాన్ని టిట్టిభపక్షి సముద్రుడితో మొర పెట్టుకుంది. ఆ పక్షుల పట్టుదల, సంకల్పాన్ని, సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనస్సు కరిగిపోయింది. తన గర్భంలోకి జారిపోయిన గుడ్లను వెతికి తెచ్చి టిట్టిభపక్షికి అప్పగించాడు. పని చిన్నదా? పెద్దదా? అవుతుందా? కాదా? అనేది కాదు…. ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి, పట్టుదల ఎలా ఉండాలనే సంకల్పాన్నీ, తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్నికథ మనకు అందిస్తోంది.

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

These AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 8th Lesson Important Questions and Answers ఎద

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఎంత రాత్రయిందో తెలియదు. కుదురుమీద దీపం వెలుగుతూనే ఉంది. పోలమ్మకు కంటికి కునుకు మాత్రం రావడం లేదు. ఆవిడ ఆలోచనంత వర్షం గురించే, కొండల మీద నుండి మేఘాలు రావడం అయితే వస్తున్నాయి గానీ – వర్షం పడ్డం లేదు.
ప్రశ్నలు:
అ) ‘రాత్రి’ పదానికి వ్యతిరేక పదం ఏమిటి?
జవాబు:
పగలు

ఆ) ‘కుదురు’ పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
పాదు, ఆధారం

ఇ) ‘కునుకు’ పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
నిద్ర

ఈ) ‘మేఘం’ పదానికి వికృతి పదం ఏమిటి?
జవాబు:
మొగలు

2. బడులు పెట్టి పిల్లలకి తిండి, బట్టా ఇవ్వడంతో ఇద్దరు పిల్లలూ చదవగలుగుతున్నారు. తల్లిదండ్రి బాగుచేసి ఇచ్చిన మడిసెక్కలు – ఆ రెండు మడిసెక్కలే పోలమ్మకు ఏకైక ఆధారం. అందులో పండగా వచ్చిన గింజలతో అర్థాంతరంగా వచ్చిన ఖర్చులు గట్టెక్కిపోతున్నాయి. ఆ మడిసెక్కలు అమ్మడం గానీ – అప్పు చెయ్యడం గానీ లేకుండా ఇంతవరకూ కాలం గడిచింది.
ప్రశ్నలు:
అ) పోలమ్మ పిల్లలు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఏమిటి?
జవాబు:
బడులు పెట్టి పిల్లలకు తిండి, బట్టా ఇవ్వడం వల్ల.

ఆ) ‘మడిసెక్క’ అంటే ఏమిటి?
జవాబు:
చిన్నపొలం

ఇ) ‘ఏకైక’ పదాన్ని విడదీయండి.
జవాబు:
ఏక + ఏక

ఈ) ‘కాలం’ నానార్థాలు రాయండి.
జవాబు:
సమయం, నలుపు

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

అపరిచిత గద్యాలు

కింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతూంటే వారికి చెరో పక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని “కథకుడు” అనీ ఆయనకు రెండుపక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను “వంతలు” అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు.
ప్రశ్నలు:
అ) జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ ఏది?
జవాబు:
జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ “బుర్రకథ”.

ఆ) బుర్రకథను చెప్పేవారిని ఏమంటారు?
జవాబు:
బుర్రకథను చెప్పేవారిని కథకుడు అంటారు.

ఇ) తంబురా వాయించేది ఎవరు?
జవాబు:
కథకుడు తంబూరా వాయిస్తాడు.

ఈ) కథకునికి వంత పాడేవాళ్ళను ఏమంటారు?
జవాబు:
కథకునికి వంత పాడేవారిని “వంతలు” అంటారు.

2. శ్రావణి టీచర్ సీత మనసులో చదువుబీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌనుకు పోయి స్కూల్ చదువుతూ కాలేజీలో ఇంటరూ పూర్తిచేసి డిగ్రీలో చేరింది. ఏదో చదువుకొని, డబ్బులు సంపాదించి, తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని, తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టరుగానో, నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి, మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది.
ప్రశ్నలు:
అ) సీత మనసులో చదువు బీజాలు నాటింది ఎవరు?
జవాబు:
శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు నాటింది.

ఆ) పై చదువులకు సీత ఎక్కడికి వెళ్ళింది?
జవాబు:
సీత పై చదువులకు టౌనుకు వెళ్ళింది.

ఇ) సీత ఎంత వరకు చదువుకొంది?
జవాబు:
సీత డిగ్రీ వరకు చదువుకొంది.

ఈ) సీత ఏ అధికారిగా ఎంపికైంది?
జవాబు:
సీత “మండల అభివృద్ధి అధికారి”గా ఎంపిక అయ్యింది.

3. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో | – ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు. నీళ్ళు దొరక్క. అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.
ప్రశ్నలు :
అ) జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.

ఆ) వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యుడు ఒక తొట్టెను తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోయటం ద్వారా వాటి బాధ తీరింది.

ఇ) ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
అన్ని ప్రాణుల యెడల జాలి, దయ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాను.

ఈ) జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
జీవులపట్ల జాలి, దయ కలిగి ఉండుటను జీవకారుణ్యం అంటారు.

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

4. బాలమురళీకృష్ణగారు 1930 జూలై 6వ తేదీన తూర్పుగోదావరిలోని శంకరగుప్తంలో పుట్టారు. అమ్మ సూర్యకాంతమ్మ, వీణా కళాకారిణి. నాన్న పట్టాభిరామయ్య, వయోలిన్ ఉపాధ్యాయులు. బాలమురళీకృష్ణ గారు కర్నాటక సంగీత విద్వాంసుడి గానే కాక వాగ్గేయకారుడిగా బోలెడంత పేరు సంపాదించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి జాతీయ పురస్కారాలు పొందారు. ప్రశ్నలు:
అ) బాలమురళీకృష్ణగారు ఎప్పుడు జన్మించారు?
జవాబు:
6.7.1930.

ఆ) పట్టాభిరామయ్యగారు ఏం చేసేవారు?
జవాబు:
వయోలిన్ ఉపాధ్యాయులు.

ఇ) బాలమురళీకృష్ణగారు పొందిన జాతీయ పురస్కారాలు ఏవి?
జవాబు:
పద్మశ్రీ, పద్మభూషణ్

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
బాలమురళీకృష్ణ గారి తల్లి పేరేమి?

5. క్రింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అది విద్యానగరం ఆవరణం
ఎంతోమంది అనాథలకు ఆశ్రయ ప్రాంగణం
అక్కడ అమ్మలా నీడ నిచ్చే వేపచెట్టు
అక్కడ నాన్నలా హుందాగా రావిచెట్టు
అందాలు చిందించే పూల పాదులు
లేలేత కాయలతో అందాల తోటలు
ఆ చెట్లపై పరవశంతో పాడుతున్న పిట్టలు
ప్రశ్నలు :
అ) విద్యానగరంలో ఎవరు ఆశ్రయం పొందుతున్నారు?
జవాబు:
విద్యానగరంలో చాలామంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు.

ఆ) వేపచెట్టు ఏమిస్తుంది?
జవాబు:
అమ్మలా వేపచెట్టు నీడనిస్తుంది.

ఇ) పూలపాదులెలా ఉన్నాయి?
జవాబు:
పూలపాదులు అందాలు చిందిస్తున్నాయి.

ఈ) పిట్టలెక్కడ ఉన్నాయి?
జవాబు:
పిట్టలు చెట్ల పై ఉన్నాయి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పోలమ్మకెందుకు కడుపులో దేవినట్టయింది?
జవాబు:
రోజూ మేఘాలు వర్షిస్తాయని పోలమ్మ ఆశగా చూసేది. పొలమంతా తిరిగేది. ఆశగా ఆకాశంలోకి చూసేది. వర్షపు చుక్క పడేది కాదు. గోగు మొక్కలు కొంచెం పెరిగాయి. వర్షం లేక అవి కూడా వాడిపోయాయి. తలలు వాల్చేసాయి. ఎదిగిన మొక్కలు కూడా చచ్చిపోతున్నాయనే బాధ పోలమ్మకు కలిగింది. అందుకే ఆ మొక్కలను చూస్తే బాధ మరీ ఎక్కువైపోయి కడుపులో దేవినట్లు అయింది.

ప్రశ్న 2.
వర్షం ఎందుకు రావడం లేదని పోలమ్మ అనుకొంది?
జవాబు:
అడవి తగ్గిపోయింది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు అడవులు నరికేశారు. అడవిని పాడుచేసేసేరు. మనుషులు తమ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు. అది కలికాలపు లక్షణం. మనుషులకు దేవుడిపై భక్తి లేదు. పాపం చేయడానికి భయపడరు. ఇటువంటి మనుషులని చూసి కాలం కూడా మారిపోయింది. అందుకే వర్షాలు రావడం లేదని పోలమ్మ అనుకొంది.

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పోలమ్మ గురించి వ్రాయండి.
జవాబు:
పోలమ్మ చిన్నతనంలో తల్లిదండ్రులతో పశువులను మేపేది. ఏమీ చదువుకోలేదు. మలేరియా వచ్చి, ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దోమల నివారణకు వచ్చిన వారిలో ఒకతనిని ఇష్టపడింది. ఇద్దరు పిల్లల తల్లయింది. ఆమె భర్త ఆమెను, పిల్లలను పట్టించుకోడు. అప్పుడప్పుడు వస్తాడు. పోతాడు. రాళ్లు కొట్టి, వ్యవసాయపు పనులు చేసి తను, పిల్లలు బ్రతుకుతున్నారు. ఆ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో చాలా బాధపడింది. ఎదరుచూసింది. ఆమె తపన ఫలించింది. వర్షాలు వచ్చాయి.

ప్రశ్న 2.
వర్షం పడుతుందని పోలమ్మ ఎందుకు నమ్మింది? నిజమైందా?
జవాబు:
పోలమ్మకు భక్తి ఎక్కువ. భూమిని భూదేవత, నేలతల్లి అంటుంది. జన్మ నిచ్చిన తల్లి ఎప్పుడూ తన పిల్లలకు అన్యాయం చేయదు. తిండికి లోటు రానివ్వదు. అలాగే భూమాత పంటలిచ్చి కాపాడుతుందని ఆమెకు పూర్తి నమ్మకం.

నీటిని కూడా గంగమ్మ తల్లి అంటుంది. నీటిని కూడా తల్లిగా భావిస్తుంది. తమకు అన్యాయం చేయదని . గట్టిగా నమ్మింది. నీరు, భూమి, ప్రకృతికి మానవులకున్న మూర్ఖత్వం లేదు. మానవులు మూర్ఖత్వంతో అడవులు నాశనం చేసినా గంగమ్మ క్షమిస్తుందని పోలమ్మ నమ్మకం.

ఆమె అమాయకపు నమ్మకాన్ని ప్రకృతి కూడా కాదనలేకపోయింది. ఆమె నమ్మకమే నిజమైంది. వర్షం కురిసింది. నేలతల్లి పులకించింది. గోగు మొక్కలు తలలెత్తాయి. ధాన్యపు మొలకలు వచ్చాయి.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

ఎద = హృదయం, గుండె
నిద్ర = కునుకు, నిదుర
రాత్రి = రేయి, రాతిరి
పిల్లలు = బిడ్డలు, తనూజులు
దీపం = జ్యోతి, దివ్వె
పశువు = జంతువు, మృగము
అయ్య = తండ్రి, జనకుడు
కొండ = నగము, అది
బాల్యం = చిన్నతనం, పసితనం
బడి = పాఠశాల, విద్యాలయం
పుస్తకం = గ్రంథం, పొత్తము
బతుకు = జీవితం, జీవనం
ఇల్లు = గృహము, సదనము
ఆనందం = సంతోషం, మోదము
మంటి = మట్టి, మన్ను
మొలక = మొక్క, అంకురము
పొద్దున్న = ఉదయం , పొద్దుట
పొలం = చేను, క్షేత్రము
పక్షి = విహంగం, పులుగు
కాపలా = కావలి, రక్షణ
వాన = వర్షం, వృష్టి
మేఘం = పయోధరము, మొగిలు
కుండ = కడవ, మట్టిపాత్ర
చుక్క = బిందువు, బొట్టు
కడుపు = పొట్ట, ఉదరము
గంగ = నీరు, జలము
మనసు = మనము, మనస్సు
ఇష్టము = ప్రీతి, మక్కువ
జ్ఞాపకం = జ్ఞప్తి, గుర్తు
వయసు = వయస్సు, ఈడు, ప్రాయము.
రోజు = దినము, దివసము
అడవి = అరణ్యము, కాననము
జబ్బు = రుగ్మత, రోగం
వీధి = వాడ, ఇండ్లవరుస
పాపం = దురితం, దోషం
భీతి = భయం, పిరికితనం
మొక్క = మొలక, చిగురుమొలక
సమస్తం = సర్వం, అఖిలం
తగువు = గొడవ, జగడం
మేత = తిండి, ఆహారం
కోడి = కుక్కుటము, అజ్జవము
మేక = మేషము, అజము
దోమ = మశకము, చీకటీగ
కష్టము = ఇడుము, ఆపద
పని = కార్యము, వ్యాపారము
వ్యవసాయం = కృషి, కమతము
తండ్రి = జనకుడు, పిత
గింజ = పిక్క విత్తు
మామిడి = మావి, ఆమ్రము
నిమ్మ = జంభీరము, రేవతము
కొబ్బరి = కొబ్బెర, నారికేళము
ఉత్సాహం = హుషారు, చురుకుదనం
తల = మస్తకం, శిరస్సు
కాంతి = వెలుగు, దీప్తి
చెవి = కర్ణము, శ్రోత్రము
తోట = ఉపవనము, గృహవనము

ప్రకృతి – వికృతులు

హృదయము – ఎద
నిద్ర – నిదుర
రాత్రి – రాతిరి, రేయి
దీపము – దివ్వె
పుస్తకము – పొత్తము
పశువు – పసరము
బ్రధ్నము – పొద్దు
మొక్క – మూలిక
కష్టము – కస్తి
మేఘము – మొగలు
కుండ – కుండ
భీతి – బీతు
గర్భము – కడుపు
అటవి – అడవి
రాశి – రాసి
వీధి – వీథి
దృఢము – దిటవు
వృద్ధు – పెద్ద
శబ్దము – సద్దు
మేషము – మేక
పక్షి – పక్కి
దాహము – దప్పి
సంతోషము – సంతసము
శ్రవము – చెవి

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

వ్యతిరేక పదాలు

నిద్ర × మెలుకువ
రాత్రి × పగలు
చింత × నిశ్చింత
వెళ్లి × వచ్చి
వెలిగించు × ఆర్పు
ఆనందం × విచారం
పొద్దున్న × సాయంత్రం
రావడం × పోవడం
వంచి × ఎత్తి
జ్ఞాపకం × మరపు
ఇష్టం × అయిష్టం
కష్టం × సుఖం
పాపం × పుణ్యం
భీతి × నిర్భీతి
భయం × నిర్భయం
చల్లారు × వేడెక్కు
ఇవ్వడం × తీసుకోవడం
బాగుచేసి × పాడుచేసి
ముందు × వెనుక

సంధులు – ఉత్వసంధి

పిల్లలిద్దరూ = పిల్లలు + ఇద్దరూ
మామూలై = మామూలు + ఐ
దేవేసినట్టనిపించింది = దేవేసినట్టు + అనిపించింది
ఎన్నాళ్లిలా = ఎన్నాళ్లు + ఇలా
కొందరిలా = కొందరు + ఇలా
మనుషులిలాగ = మనుషులు + ఇలాగ
రోజులై = రోజులు + ఐ
ఎంతసేపైనా = ఎంతసేపు + ఐనా
కొండలంతటా = కొండలు + అంతటా
పనులక్కడే = పనులు + అక్కడే
పట్టాలిస్తున్నామని = పట్టాలు + ఇస్తున్నాము +అని
నేలనిచ్చేరు = నేలను + ఇచ్చేరు
పెంచలేనంటాదా = పెంచలేను + అంటాదా
నీరెండ = నీరు + ఎండ
మొలకలెత్తిన = మొలకలు + ఎత్తిన
పోలమ్మ = పోలు + అమ్మ

ఇత్వసంధి

రాత్రయిందో – రాత్రి + అయింది + ఓ
పడుతుందేమో = పడుతుంది + ఏమో
పన్తె = పని + ఐ
ఎవరిష్టం = ఎవరి + ఇష్టం
మరోలా = మరి + ఓలా
ఏమై = ఏమి + ఐ
ఏమౌతుందో = ఏమి + ఔతుంది + ఓ
రావాలని = రావాలి + అని
వెళ్లాలని = వెళ్లాలి + అని
పడిందమ్మా = పడింది + అమ్మా

అత్వసంధి

పోతున్నప్పుడు = పోతున్న + అప్పుడు
ఈవేళైనా = ఈ వేళ + ఐనా
గంగమ్మ = గంగ + అమ్మ
చల్లారిన = చల్ల + ఆరిన
అనుకొన్నప్పుడు = అనుకొన్న + అప్పుడు
వెళ్లినప్పుడు = వెళ్లిన + అపుడు
తలెత్తి = తల + ఎత్తి
పరిచినట్లు = పరిచిన + అట్లు

సవర్ణదీర్ఘ సంధి

అర్థాంతరంగా = అర్థ + అంతరంగా

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

సంధులు: ఈ క్రింది. పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

1. రాత్రయింది = రాత్రి + అయింది – ఇత్వ సంధి
2. కొందరిలా = కొందరు + ఇలా – ఉత్వ సంధి
3. అర్థాంతరంగా = అర్థ + అంతరంగా – సవర్ణదీర్ఘ సంధి
4. వెళ్లినప్పుడు = వెళ్లిన + అప్పుడు – అత్వ సంధి
5. పడిందమ్మా = పడింది అమ్మా – ఇత్వ సంధి
6. తలెత్తి = తల + ఎత్తి – అత్వ సంధి
7. ఏమై = ఏమి + ఐ – ఇత్వ సంధి
8. రావాలని = రావాలి + అని – ఇత్వ సంధి
9. పిల్లలిద్దరూ = పిల్లలు + ఇద్దరూ – ఉత్వ సంధి
10. పరచినట్లు = పరచిన + అట్లు – అత్వ సంధి

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. కుదురులో దీపం వెలిగించాలి.
a) కుంది
b) మామిడి
c) లాంతరు
d) దీపం
జవాబు:
a) కుంది

2. కష్టపడి పనిచేస్తే కునుకు వస్తుంది.
a) ఆవులింత
b) బద్దకం
c) చెమట
d) నిద్ర
జవాబు:
d) నిద్ర

3. మడిలో విత్తులు చల్లాలి.
a) పవిత్రం
b) పునీతం
c) వరిపొలం
d) భూమి
జవాబు:
c) వరిపొలం

4. మందులు వాడితే జబ్బులు తగ్గుతాయి.
a) రొంప
b) రోగాలు
c) తుమ్ములు
d) కరోనా
జవాబు:
b) రోగాలు

5. నిన్న డొంకలలో పాము మెదిలింది.
a) కనిపించింది
b) సంచరించింది
c) బుసకొట్టింది
d) ఉంది
జవాబు:
b) సంచరించింది

6. అనవసరంగా భీతి చెందకూడదు.
a) భయం
b) కోపం
c) పంతం
d) దూరం
జవాబు:
a) భయం

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

7. కటకట పడితే సమస్యలు పరిష్కారం కావు.
a) ఆందోళన
b) కంగారు
c) హడావిడి
d) పరుగు
జవాబు:
a) ఆందోళన

8. అనవసరంగా తగువు పడకూడదు.
a) తిట్లు
b) దెబ్బలు
c) గొడవ
d) ఆందోళన
జవాబు:
c) గొడవ

9. పశువులకు మేత పెట్టాలి.
a) గడ్డి
b) నీరు
c) దాణా
d) తిండి
జవాబు:
d) తిండి

10. ధరణిని నమ్మిన రైతు చెడిపోడు.
a) డబ్బు
b) ధనం
c) భూమి
d) చేను
జవాబు:
c) భూమి

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. పిల్లలు అల్లరి చేస్తారు.
a) విద్యార్థులు, పెద్దలు
b) తనూజులు, బిడ్డలు
c) శిష్యులు, కొడుకులు
d) కూతుళ్లు, కొడుకులు
జవాబు:
b) తనూజులు, బిడ్డలు

12. మేక ఆకులను తింటుంది.
a) మేషం, అజము
b) మేమే, మేక
c) ఝషం, మేషం
d) మృగం, మెకం
జవాబు:
a) మేషం, అజము

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

13. పాపం చేయకూడదు.
a) ఘోరం, నేరం
b) నేరం, హత్య
c) దురితం, దోషం
d) చెడు, పని
జవాబు:
c) దురితం, దోషం

14. మామిడి కాయ పుల్లగా ఉంటుంది.
a) చింత, ఆమ్లం
b) బంగినపల్లి, గోవా
c) తింత్రిణీ, పులుపు
d) మావి, ఆమ్రము
జవాబు:
d) మావి, ఆమ్రము

15. మనసులో మంచి ఆలోచనలే ఉండాలి.
a) మనము, మనస్సు
b) తల, తలపు
c) మనము, మేము
d) దేహం, కాయం
జవాబు:
a) మనము, మనస్సు

16. దోమ కుడితే మలేరియా వస్తుంది.
a) ఈగ, చీకటిగ
b) హస్తి, మశకం
c) మశకం, చీకటీగ
d) ఈగ, హస్తి
జవాబు:
c) మశకం, చీకటీగ

17. కోడి ప్రతి ఝాముకు కూస్తుంది.
a) కుక్కుటము, భైరవం
b) భైరవం, అజము
c) భైరవం, రౌరమా
d) కుక్కుటము, అజ్ఞవము
జవాబు:
d) కుక్కుటము, అజ్ఞవము

18. మా పొలంలో నల్లవరి పండించాము.
a) పంట, ధాన్యం
b) క్షేత్రము, చేను
c) చేను, తోట
d) తోట, వనం
జవాబు:
b) క్షేత్రము, చేను

19. వ్యవసాయం చేస్తే రైతు కష్టం తెలుస్తుంది.
a) కృషి, కమతము
b) సేద్యం, శ్వేదం
c) క్షేత్రం, కృషి
d) కమతం, పొలం
జవాబు:
a) కృషి, కమతము

20. సూర్యకాంతి పడితే రోగాలు పోతాయి.
a) వెలుగు, వేడి
b) దీప్తి, దీపం
c) వెలుగు, దీప్తి
d) దీప్తి, వేడి
జవాబు:
c) వెలుగు, దీప్తి

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. కష్టమునకు తగిన ఫలితం ఉంటుంది.
a) నష్టము
b) కషటము
c) కస్తి
d) కసి
జవాబు:
c) కస్తి

22. నిదురపోతే అలసట తగ్గుతుంది.
a) నిద్ర
b) నీరసం
c) మత్తు
d) కునుకు
జవాబు:
a) నిద్ర

23. హృదయం పవిత్రంగా ఉండాలి.
a) మనసు
b) గుండె
c) ఎద
d) తల
జవాబు:
c) ఎద

24. పశువును హింసించడం మహాపాపం.
a) జంతువు
b) మూగజీవి
c) మృగం
d) పసరము
జవాబు:
d) పసరము

25. దీపము లేకుండా నిద్రపోకూడదు.
a) లైటు
b) దివ్వె
c) కాంతి
d) దీప్తి
జవాబు:
b) దివ్వె

26. పుస్తకములు ఎక్కువగా చదవాలి.
a) పొత్తము
b) పుస్తె
c) పుత్తము
d) పుత్తడి
జవాబు:
a) పొత్తము

27. బ్రద్నము వెలుగు తెస్తుంది.
a) బద్ధకం
b) బద్ధము
c) ప్రొద్దు
d) బదనాం
జవాబు:
c) ప్రొద్దు

28. ఆకాశంలో మేఘములు ఉన్నాయి.
a) మేగము
b) మొగిలు
c) మేఘన
d) మొగ్గ
జవాబు:
b) మొగిలు

29. మన ఆశ తీరాలంటే కృషి చేయాలి.
a) అశ
b) అస్సు
c) ఆస
d) ఆష
జవాబు:
c) ఆస

30. మూలికలు జాగ్రత్తగా పెంచాలి.
a) మొక్క
b) ఔషధం
c) మందు
d) ఆయుర్వేదం
జవాబు:
a) మొక్క

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

వ్యతిరేక పదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు గుర్తించండి.

31. దీపము వెలిగించు.
a) జ్వలించు
b) ఆర్పు
c) పెద్దది
d) వెలుగు
జవాబు:
b) ఆర్పు

32. చింత పనికిరాదు.
a) నిశ్చింత
b) చింతాకు
c) పరచింత
d) ఈస్వచింత
జవాబు:
a) నిశ్చింత

33. చుట్టాలు రావడం మంచిది.
a) కూర్చోవడం
b) ఉండడం
c) పోవడం
d) నిలవడం
జవాబు:
c) పోవడం

34. నీరు చల్లారుతుంది.
a) గడ్డకట్టు
b) ఆవిరగు
c) ఘనీభవించు
d) వేడెక్కు
జవాబు:
d) వేడెక్కు

35. ముందు ఏం జరుగుతుందో తెలియదు.
a) వెనుక
b) మున్ముందు
c) పైన
d) క్రింద
జవాబు:
a) వెనుక

36. నిర్భయంగా జీవించాలి.
a) ధైర్యం
b) అధైర్యం
c) భయం
d) దడ
జవాబు:
c) భయం

37. కష్టం తెలుసుకోవాలి.
a) సుఖం
b) లాభం
c) ఇడుము
d) ఆపద
జవాబు:
a) సుఖం

38. భీతి పనికిరాదు.
a) బీతు
b) భయం
c) పిరికితనం
d) నిర్భీతి
జవాబు:
d) నిర్భీతి

39. పాపం చేయకూడదు.
a) దురితం
b) పుణ్యం
c) దోషం
d) కల్మషం
జవాబు:
b) పుణ్యం

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

40. ఆనందంగా జీవించాలి.
a) సంతోషం
b) వందనం
c) విచారం
d) వనచరం
జవాబు:
c) విచారం

2. వ్యాకరణాంశాలు

క్రిందివానిని కోరిన విధంగా గుర్తించండి.

41. రజనీ చాలా పొడవుగా ఉంది – భాషాభాగమేది?
a) క్రియ
b) విశేషణం
c) నామవాచకం
d) సర్వనామం
జవాబు:
b) విశేషణం

42. ఆమె అన్నం తిని సినిమాకు వెళ్లింది.
a) సమాపక క్రియ
b) అసమాపక క్రియ
c) అవ్యయం
d) సర్వనామం
జవాబు:
b) అసమాపక క్రియ

43. వాడు ఈ రోజే వెళ్లాడు.
a) సమాపక క్రియ
b) అసమాపక క్రియ
c) అవ్యయం
d) నామవాచకం
జవాబు:
a) సమాపక క్రియ

44. పేపరు బాగుంది.
a) నామవాచకం
b) క్రియ
c) అవ్యయం
d) సర్వనామం
జవాబు:
d) సర్వనామం

45. ఆహా ! ఎంత రుచిగా ఉంది?
a) నామవాచకం
b) సర్వనామం
c) అవ్యయం
d) క్రియ
జవాబు:
c) అవ్యయం

46. గులాబీ పూలు అందంగా ఉన్నాయి.
a) నామవాచకం
b) క్రియ
c) విశేషణం
d) అవ్యయం
జవాబు:
a) నామవాచకం

47. ఇంటికి వెళ్లి, చదువుకో.
a) సమాపక క్రియ
b) అసమాపక క్రియ
c) అవ్యయం
d) విశేషణం
జవాబు:
b) అసమాపక క్రియ

48. నేను పాఠశాలకు వెడతాను.
a) అవ్యయం
b) నామవాచకం
c) సమాపక క్రియ
d) అసమాపక క్రియ
జవాబు:
c) సమాపక క్రియ

49. సూర్యుడు తూర్పున ఉదయించును.
a) సర్వనామం
b) క్రియ
c) విశేషణం
d) నామవాచకం
జవాబు:
d) నామవాచకం

50. క్రిందివానిలో అసమాపక క్రియను గుర్తించండి.
a) చేసి
b) చూస్తాను
c) కృష్ణుడు
d) అయ్యో
జవాబు:
a) చేసి

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

సంధులు : క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

51. ధర్మార్థములు – సంధి పేరేమిటి?
a) అత్వసంధి
b) సవర్ణదీర్ఘ సంధి
c) ఇత్వసంధి
d) ఉత్వసంధి
జవాబు:
b) సవర్ణదీర్ఘ సంధి

52. ఆటాడుకో – సంధి పేరేమిటి?
a) అత్వసంధి
b) సవర్ణదీర్ఘ సంధి
c) ఇత్వసంధి
d) గుణసంధి
జవాబు:
a) అత్వసంధి

53. బాలుడెవరు – సంధి విడదీయండి.
a) బాలుడె + వరు
b) బాలు + డెవరు
c) బాలుడు + ఎవరు
d) బాలుడెవ + రు
జవాబు:
c) బాలుడు + ఎవరు

54. – పాకెక్కడుంది – సంధి పేరేమి?
a) ఇత్వసంధి
b) ఉత్వసంధి
c) గుణసంధి
d) అత్వసంధి
జవాబు:
d) అత్వసంధి

55. తరగతిగదియేది – సంధి విడదీయండి.
a) తరగతి గది + ఏది
b) తరగతి గది + యేది
c) తరగతి + గదియేది
d) తర + గతి + యేది
జవాబు:
a) తరగతి గది + ఏది

56. క్రిందివానిలో అత్వసంధి పదం గుర్తించండి.
a) రామార్పణం
b) మనమందరం
c) వంటాముదం
d) పానకాలు
జవాబు:
c) వంటాముదం

57. పాపాత్ముడు – సంధి పేరేమి? – పంది పేరేమి?
a) సవర్ణదీర్ఘసంధి
b) త్రికసంధి
c) ఆమ్రేడిత సంధి
d) గుణసంధి
జవాబు:
a) సవర్ణదీర్ఘసంధి

58. కట్టకడ – సంధి విడదీయండి.
a) కట్ట + కడ
b) కడ + కడ
c) కట్టు + కడ
d) కట్టడి + కడ
జవాబు:
b) కడ + కడ

59. పిడుగు + పిడుగు – సంధి కలిపిన రూపమేది?
a) పిడుపిడుగు
b) పిప్పిడుగు
c) పిడవిడుగు
d) పిట్టపిడుగు
జవాబు:
d) పిట్టపిడుగు

AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద

60. అచ్చెరువున – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అ + చెరువున
b) ఆ + చెరువున
c) అచ్చేరు + వున
d) అచ్చె + రువున
జవాబు:
b) ఆ + చెరువున

నేనివి చేయగలనా?

1. పాఠాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకొని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠంలోని పదబంధాలను వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంతమాటల్లో రాయగలను. [ ఔను / కాదు ]
4. రైతు గొప్పతనాన్ని గురించి నా అభిప్రాయాన్ని రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

నిరంతరం నెర్చుకో …………

సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో రాజు మరణశిక్ష విధించాడు. శిక్షలో భాగంగా తనకుతాను విషం తాగి మరణించవలసి ఉంది. ఆయన్ని జైల్లో పెట్టారు. పేరుకు జైల్లో పెట్టారే కానీ అందరూ వచ్చి చూసి వెళుతున్నారు. శిష్యులు మాత్రం అక్కడే ఉండి బాధ పడుతున్నారు. సోక్రటీస్ ఇవేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు. మరణించబోతున్నాననే భయం లేకుండా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు.

సోక్రటీస్ జీవితంలో చివరి రోజు రానే వచ్చింది. మరణశిక్ష అమలు కావడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది. అక్కడ శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు ఎక్కువయింది. సోక్రటీస్ ముఖంలో మాత్రం ప్రశాంతత, ఆనందం, వెలుగు కనిపిస్తున్నాయి.

సోక్రటీస్, కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని ఒక వాద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. అది సోక్రటీస్ మనసును ఆకట్టుకుంది. ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ ని పిలిచాడు. జైలర్ గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలో నుంచి చూపిస్తూ “మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకువస్తారా” అని అడిగాడు. ‘అలానే అంటూ జైలర్ వెళ్లి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు. సోక్రటీస్ బిచ్చగాడితో తనకు ఆ పాట నేర్పమన్నాడు.

అతని దగ్గర నుంచి వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ పాటపాడుతూ వాద్యం వాయించాడు. ఇలా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే సోక్రటీస్ ఆ పాట పాడాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించాడు.

ఇదంతా చూస్తున్న శిష్యులు, జైలర్ మరింతగా ఆశ్చర్యపోయారు. అప్పుడు శిష్యులు “గురువుగారు ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆఖరిక్షణాల్లో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేసి పాడటం నేర్చుకున్నారు. ఎందుకు? అని అడిగారు. సోక్రటీస్ నవ్వి “జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినంత కాలం ప్రతిక్షణం విలువైనదే.. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట క్రితం నాకు ఆ పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది. అంటే ఇప్పటికీ నేర్చుకోటానికి నాకు అవకాశం ఉంది” అన్నాడు. అక్కడున్న వారి నోట మాట రాలేదు.

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

These AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 7th Lesson Important Questions and Answers కప్పతల్లి పెళ్ళి

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత పద్యాలు

కింది పద్యాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

కప్పతల్లి పెళ్లి నేడూ – చూడారే
కావిళ్ళనీళ్ళోంపినాడు !
వరుణదేవుడు వంపినాడూ – ఓ చెలీ
వాడలన్నీ నింపినాడు !
గగనతలము నుంచి నేడు – వీవెనలు
చెట్లచే వేయించినాడు !
స్వర్గాధినాథుడు నేడూ – రథమెక్కి
పయనమై పోవుచున్నాడు !
ప్రశ్నలు-జవాబులు:
అ) పై గేయంలో చెప్పబడిన వర్షదేవుడు ఎవరు?
జవాబు:
వరుణదేవుడు

ఆ) పూర్వం మగవారు నీళ్ళు తేవడానికి ఉపయోగించే వస్తువు పై గేయంలో చెప్పబడింది. అది ఏది?
జవాబు:
కావిడి

ఇ) స్వర్గానికి అధిపతి ఎవరు?
జవాబు:
ఇంద్రుడు

ఈ) ‘వీవెన’ అంటే ఏమిటి?
జవాబు:
విసనకర్ర

2. భత్యాలు లేకనేవాడు – పెళ్లికి
బాజాలు వేయించినాడు!
బండరాళ్ళ పైని వాడు – చక్రములు
బడబడాదొర్లించినాడు !
బాణసంచా వెలితి లేదే – పెళ్లికీ
బహుబాగుగా జేసినారే
కళ్ళు చెదిరే మెరుపులమ్మా – చూడగా
వొళ్ళు పరవశమౌనుసుమ్మా !
ప్రశ్నలు-జవాబులు:
అ) ‘భత్యము’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
భోజనమునకై ఇచ్చే ధనం

ఆ) ‘బడబడా దొర్లించినాడు’ అని గేయంలో ఉంది కదా ! అతడు ఎవరు?
జవాబు:
ఇంద్రుడు

ఇ) బాణసంచా వెలిగించే పండుగ ఏది?
జవాబు:
దీపావళి

ఈ) ‘వెలితి’ అంటే అర్థము రాయండి.
జవాబు:
తక్కువ / లోపం

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

3. కప్పమ్మ పెళ్లికోయంచూ – మేళములు
గొప్పగా తెప్పించినారే!
చెప్ప శక్యము కాదు వేరే – బోదురూ
కప్పలా మేళములురారె !
కప్పమ్మ గడప తొక్కినది – శుభమన్న
సూచనలు చూరు చెప్పినది !
కప్పలెగిరేవానలమ్మా – పొలములో
కనకాలే పండుతాయమ్మా !
ప్రశ్నలు- జవాబులు:
అ) ‘మేళము’లో వాడే వాయిద్యాల పేర్లు రాయండి.
జవాబు:
డోలు, సన్నాయి మొదలైనవి.

ఆ) ‘పెళ్ళి’ అనే పదానికి పర్యాయపదాలు రాయండి.
జవాబు:
వివాహం, పరిణయం

ఇ) ‘పొలములో కనకాలె పండుతాయి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
మంచి పంటలు పండుతాయి. (వెల / విలువ గల పంటలు పండుతాయి, బంగారపు రంగులో గల మంచి వరి పంట పండుతుంది.)

ఈ) ‘గడప’ లాగా ‘ప’ చివరి అక్షరంగా ఉండి మూడు అక్షరాల పదాలు రాయండి.
జవాబు:
కలప, కడప, పిడప, పిదప

అపరిచిత పద్యాలు

1. కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్దాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు”
ప్రశ్నలు-జవాబులు:
అ) ఎవరు ఎలా విరగబడుతున్నారు?
జవాబు:
ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.

ఆ) ఎందుకు గుసగుసలాడుతున్నారు?
జవాబు:
కంగారుతో, భయంతో గుసగుసలాడుతున్నారు.

ఇ) ప్రజల్ని ఆకర్షించనివేవి?
జవాబు:
కావ్యచర్చలు, కళాలయాలు ప్రజల్ని ఆకర్షించడం లేదు.

ఈ) ఎవరు రొమ్ములు బాదుకుంటున్నారు?
జవాబు:
స్వార్థ జీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు.

2. “అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”
ప్రశ్నలు- జవాబులు:
అ) ‘దయతో కూడిన కనుగొలకులు’ అని భావం వచ్చే గేయపంక్తి ఏది?
జవాబు:
”అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు’ – అనే గేయపంక్తి భావాన్ని ఇస్తుంది.

ఆ) శాంతి రాణి సద్గుణాలు పేర్కొనండి.
జవాబు:
శాంతి రాణి ఎప్పుడూ ప్రజల మేలును కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వం లేని రాణి.

ఇ) శాంతి రాణి వేటిని ఎగరేస్తుంది?
జవాబు:
శాంతి రాణి, తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.

ఈ) శాంతి కేశపాశంలో ఏమి అలంకరించుకొంది?
జవాబు:
శాంతి తన కొప్పులో, ప్రేమ గులాబిని అలంకరించుకొంది.

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

3. విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్ణింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు-జవాబులు:
అ) చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

ఆ) ఎటువంటి పాము భయంకరమైనది?
జవాబు:
తలపై మణులచేత అలంకరింపబడినా పాము భయంకరమైనది.

ఇ) ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు?
జవాబు:
ఈ పద్యంలో దుర్జనుడు, పాముతో పోల్చబడ్డాడు.

ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికి రాదు.

4. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు నిహము పరము
ప్రశ్నలు- జవాబులు:
అ) రాజు చేతి కత్తి దేనిని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించును.

ఆ) సుధలు కురిపించేది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.

ఇ) ఇహపరాలెవరు పరిపాలించగలరు?
జవాబు:
ఇహపరాలను సుకవి పరిపాలించగలడు.

ఈ) పై పద్యం ప్రకారం ఎవరు గొప్పవారు?
జవాబు:
పై పద్యం -ప్రకారం సుకవి గొప్పవాడు.

II. వ్యక్తికరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
వర్షం ఎవరు కురిపించారు? ఎందుకు?
జవాబు:
వరుణదేవుడు వర్షాన్ని కురిపించాడు. కప్పతల్లి పెళ్లికి నీరు అవసరం కదా ! అందుకే వరుణదేవుడు కావిళ్లతో నీళ్లు ఒంపినాడు. వాడవాడలా వర్షం కురిపించాడు.

ప్రశ్న 2.
కప్ప గడప తొక్కితే శుభమని కవయిత్రి ఎందుకన్నారు?
జవాబు:
కప్పలు వర్షాలెక్కువగా వస్తేనే గంతులు వేస్తాయి. కప్పలు గంతులు వేస్తూ ఇళ్లలోకి వచ్చేస్తాయి. అలా గడప తొక్కి కప్ప ఇంట్లోకి వస్తే, ఇంకా వర్షాలెక్కువ పడతాయని నమ్మకం. వర్షాలేక్కువగా పడితే చెరువులు నిండుతాయి. పంటలు బాగా పండుతాయి. తిండికి, నీటికి లోటుండదు. అంతా శుభమే జరుగుతుంది. అందుకే కవయిత్రి అలా అన్నారు.

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఆ) కింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాలలో జవాబు రాయండి.

ప్రశ్న 1.
కప్పల గురించి మీకు తెలిసినవి వ్రాయండి.
జవాబు:
కప్పలను మండూకాలు అంటారు. ఇవి వానాకాలం ఎక్కువగా కనిపిస్తాయి. వానాకాలమే వీటి సంతాన వృద్ధి కలుగుతుంది. వీటి శరీరం పొట్టిగా ఉంటుంది. వెనుక కాళ్లు పొడవుగా ఉంటాయి. కాలివేళ్లు అతుక్కొని ఉంటాయి. కనుగ్రుడ్లు పెద్దగా ఉంటాయి. తోక ఉండదు. ఇవి. ఉభయచరాలు. అంటే నీటిలోనూ, భూమిపైనా కూడా జీవిస్తాయి. నీటిలో ఈదుతాయి. భూమి పైన గెంతుతాయి. ఇవి నీటి గుంటలలో గ్రుడ్లు పెడతాయి. వీటి పిల్లలైన చిన్న కప్పలను తోక కప్పలంటారు. వీటికి మొప్పలుంటాయి. అభివృద్ధి చెందాక చిన్ని చిన్ని పురుగులను తిని జీవిస్తాయి. కప్పలు బెకబెకమని శబ్దం చేస్తాయి. కప్పలు ప్రపంచంలో ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఎక్కువగా జీవిస్తాయి.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

కప్ప = మండూకము, భేకము
నీరు = జలము, సలిలము
చెలి = స్నేహితురాలు, చెలికత్తె
వాడ = వీథి, ఇండ్ల వరుస
చెట్లు = తరువులు, వృక్షములు
స్వర్గము = విష్టపము, దివి
వీవన = సురటి, వ్యజనము, విసనకర్ర
అధినాథుడు = అధిపతి, ప్రభువు
రథము = తేరు, స్యందనము
స్వర్గాధినాథుడు = ఇంద్రుడు, దేవేంద్రుడు
పెళ్లి = ఉద్వహము, పరిణయము
రాళ్లు= రాలు, ఉపలములు
గగనం = ఆకాశం, నభము
మెరుపు = తటిత్తు, సౌదామిని
వాన = వర్షం, జడి
పొలము = చేను, క్షేత్రము
ఒళ్లు = శరీరం, కాయము
కళ్లు = నయనాలు, నేత్రాలు
వరుణుడు = పడమటి దిక్కుకు అధిపతి, నీటిఱేడు

ప్రకృతి – వికృతులు

స్థలము – తలము
దేవుడు – దేవర
భత్యము – బత్తెము
రథము – అరదం
ప్రయాణం – పయనం

వ్యతిరేక పదాలు

ఎక్కి × దిగి
పోవు × వచ్చు
లేదు × ఉంది
పైన × క్రింద
చేసి × చేయక
పరవశం × స్వాధీనం
కాదు × ఔను
శుభము × అశుభము
పండుతాయి × పండవు
శక్యము × అశక్యము

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. కష్టపడితే శక్యము. కష్టపడకపోతే …………. (అశక్యము)
2. అందరికీ శుభము జరగాలి. ………………. కోరుకోకూడదు. (అశుభము)
3. వానలు వస్తే పంటలు పండుతాయి, లేకుంటే ………………… (పండవు)
4. లేదు అనకూడదు ……………………. అనుకోవాలి. (ఉంది)
5. నింగి పైన ఉంటుంది. నేల …………………… ఉంటుంది. (క్రింద)

సంధులు : ఈ క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

1. నీల్గింపినారు = నీళ్లు + ఒంపినారు – ఉత్వ సంధి
2. వాడలన్నీ = వాడలు + అన్నీ – ఉత్వ సంధి
3. పయనమై పయనము + ఐ – ఉత్వ సంధి
4. పరవశమౌను – పరవశము + ఔను – ఉత్వ సంధి
5. పండుతాయమ్మా = పండుతాయి + అమ్మా – ఇత్వ సంధి

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. గగనంలో సూర్య, చంద్రులుంటారు.
a) ఆకాశం
b) స్వర్గం
c) భూమి
d) పైలోకం
జవాబు:
a) ఆకాశం

2. పూర్వం వీవెనతో విసురుకొనేవారు.
a) చేట
b) జల్లెడ
c) తిరగలి
d) విసనకర్ర
జవాబు:
d) విసనకర్ర

3. స్వర్గాధినాథుడు దేవతలకు రాజు.
a) బ్రహ్మ
b) ఇంద్రుడు
c) విష్ణువు
d) శివుడు
జవాబు:
b) ఇంద్రుడు

4. పిల్లలకు వెలితి రాకుండా తల్లిదండ్రులు పెంచుతారు.
a) కోపం
b) అల్లరి
c) లోటు
d) దరిద్రం
జవాబు:
c) లోటు

5. ఒళ్లు శుభ్రంగా తోముకోవాలి.
a) కాళు
b) శరీరం
c) పళ్లు
d) వీపు
జవాబు:
b) శరీరం

6. మంచి కథ వింటే పరవశం కలుగుతుంది.
a) తన్మయం
b) నిద్ర
c) ఆలోచన
d) ఆవులింత
జవాబు:
a) తన్మయం

7. కప్ప ఉభయచరజీవి.
a) బెకబెక
b) మొప్ప
c) మండూకము
d) కూపము
జవాబు:
c) మండూకము

8. కష్టపడితే ఏదైనా శక్యము ఔతుంది.
a) అసాధ్యం
b) సాధ్యము
c) సులువు
d) ముఖ్యము
జవాబు:
b) సాధ్యము

9. కనకం అందరికీ కావాలి.
a) డబ్బు
b) గాలి
c) ఆహారం
d) బంగారం
జవాబు:
d) బంగారం

10. పెళ్లికి పిలిచారు.
a) వేడుక
b) ఉత్సవం
c) వివాహం
d) వివాదం
జవాబు:
c) వివాహం

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో, గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. మంచి నీరు ఎక్కువ త్రాగాలి.
a) జలము, సలిలము
b) పాలు, క్షీరము
c) పెరుగు, దధి
d) టీ, తేనీరు
జవాబు:
a) జలము, సలిలము

12. చెలితో విరోధం పెట్టుకోకూడదు.
a) భార్య, సఖి
b) స్నేహితురాలు, చెలికత్తె
c) అమ్మ, వదిన
d) చెల్లి, సోదరి
జవాబు:
b) స్నేహితురాలు, చెలికత్తె

13. చెట్లు ఎక్కువగా పెంచాలి.
a) మొక్కలు, తీగలు
b) తోట, వనం
c) కాన, అడవి
d) తరువులు, భూరుహములు
జవాబు:
d) తరువులు, భూరుహములు

14. స్వర్గంలో దేవతలుంటారు.
a) ద్యుమణి, దివిజం
b) నరకం, మమకారం
c) విష్టపము, దివి
d) లోకం, ప్రపంచం
జవాబు:
c) విష్టపము, దివి

15. పూర్వం వీవనతో విసురుకొన్నారు.
a) ఫాను, పంకా
b) సురటి, వ్యజనము
c) సుర, అసుర
d) విసన, కర్ర
జవాబు:
b) సురటి, వ్యజనము

16. రాముడు రథం మీద అయోధ్యకు సీతతో వచ్చాడు.
a) తేరు, స్యందనము
b) బండి, గుర్రపు బండి
c) బండి, బంధనం
d) తేరు, తేనీరు
జవాబు:
a) తేరు, స్యందనము

17. ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి.
a) పిడుగులు, ఉరుములు
b) నక్షత్రాలు, కాంతులు
c) వెలుగులు, ఉడులు
d) తటిత్తు, సౌదామిని
జవాబు:
d) తటిత్తు, సౌదామిని

18. మా పొలములో బంగారం పండింది.
a) భూమి, అడవి
b) భూమి, నీరు
c) చేను, క్షేత్రము
d) దివి, స్వర్గం
జవాబు:
c) చేను, క్షేత్రము

19. కళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
a) నయనాలు, నేత్రాలు
b) ఒళ్లు, శరీరం
c) పళ్లు, రదనాలు
d) కాళ్లు, పాదాలు
జవాబు:
a) నయనాలు, నేత్రాలు

20. పెళ్లిలో చాలామంది చుట్టాలు కలుస్తారు.
a) ఉద్వహము, ఉత్సవము
b) వేడుక, సరదా
c) పరిణయము, వివాహము
d) మ్యారేజ్, ఫంక్షన్
జవాబు:
c) పరిణయము, వివాహము

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ప్రకృతి-వికృతులు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. మంచి స్థలములో నిద్రించాలి.
a) స్తలము
b) సలిలము
c) తలము
d) తరలము
జవాబు:
c) తలము

22. చక్రవర్తి అరదంపై వెడతాడు.
a) రథం
b) అర్థం
c) అనర్థం
d) అనడ్వాహం
జవాబు:
a) రథం

23. మన పయనం ఆగకూడదు.
a) పయానం
b) పయాణం
c) పెయానం
d) ప్రయాణం
జవాబు:
d) ప్రయాణం

24. దేవుడు మంచి చేస్తాడు.
a) దైవం
b) దేవర
c) దేవత
d) దేవాలయం
జవాబు:
b) దేవర

25. జీతం బత్తెం లేని ఉద్యోగం ఎందుకు?
a) భత్యము
b) భృత్యుడు
c) బాధ్యత
d) భాద్యము
జవాబు:
a) భత్యము

2. వ్యాకరణాంశాలు

క్రింద గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తో గుర్తించండి.

26. రాముని కంటె గొప్ప వీరుడు లేడు.
a) షష్టీ
b) పంచమీ
c) చతుర్టీ
d) ద్వితీయ
జవాబు:
b) పంచమీ

27. నేను జ్ఞానం కొఱకు చదువుతున్నాను.
a) ద్వితీయ
b) తృతీయ
c) ప్రథమ
d) చతుర్డీ
జవాబు:
d) చతుర్డీ

28. హనుమంతునిచే లంక తగులబెట్టబడెను.
a) ప్రథమ
b) తృతీయ
c) ద్వితీయ
d) పంచమీ
జవాబు:
b) తృతీయ

29. కోతికి స్థిరత్వం తక్కువ.
a) షష్ఠీ
b) ద్వితీయ
c) చతుర్థి
d) సప్తమీ
జవాబు:
a) షష్ఠీ

30. చెఱువు నందు కమలాలున్నాయి.
a) పంచమీ
b) షష్ఠీ
c) సప్తమీ
d) ద్వితీయ
జవాబు:
c) సప్తమీ

31. ఓరీ ! దుర్మార్గుడా ! ఎంత పని చేశావురా?
a) సంబోధన ప్రథమ
b) ప్రథమ
c) ద్వితీయ
d) చతుర్థీ
జవాబు:
a) సంబోధన ప్రథమ

32. నీటిని వృథా చేయకు.
a) ప్రథమ
b) ద్వితీయ
c) తృతీయ
d) చతుర్థీ
జవాబు:
b) ద్వితీయ

33. రాముడు సీతాపతి.
a) ద్వితీయ
b) తృతీయ
c) ప్రథమ
d) చతుర్థీ
జవాబు:
c) ప్రథమ

34. పట్టణమునందు సౌకర్యాలెక్కువ.
a) ప్రథమ
b) తృతీయ
c) ద్వితీయ
d) సప్తమీ
జవాబు:
d) సప్తమీ

35. రాజు యొక్క భటులు.
a) షష్టీ
b) ప్రథమ
c) ద్వితీయ
d) తృతీయ
జవాబు:
a) షష్టీ

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

36. విద్యకు సాటి ధనంబు లేదు – ఇది ఏ అక్షరం?
a) అచ్చు
b) హల్లు
c) ద్విత్వాక్షరం
d) సంయుక్తాక్షరం
జవాబు:
d) సంయుక్తాక్షరం

37. కాకిపిల్ల కాకికి ముద్దు – దీనిలో ద్విత్వాక్షరాలు?
a) 2
b) 3
c) 5
d) 4
జవాబు:
a) 2

38. 7వ తరగతి పుస్తకం బాగుంది – ఇది ఏ అక్షరం?
a) ద్విత్వం
b) సంయుక్తం
c) సంశ్లేష
d) సంశ్లిష్టం
జవాబు:
b) సంయుక్తం

39. పాపమ్ము దుఃఖమును తెచ్చును – దీనిలో ద్విత్వాక్షరాలెన్ని?
a) 3
b) 1
c) 2
d) 4
జవాబు:
c) 2

40. “సంయుక్తాక్షరం”లో సంయుక్తాక్షరాలెన్ని ఉన్నాయి?
a) 2
b) 4
c) 5
d) 3
జవాబు:
a) 2

41. “ద్విత్వాక్షరం”లో ద్విత్వాక్షరాలెన్ని ఉన్నాయి?
a) 1
b) 2
c) 3
d) లేవు
జవాబు:
d) లేవు

42. రెండు కాని అంత కంటే ఎక్కువ కాని, హల్లులతో ఏర్పడేది?
a) ద్వితం
b) సంయుక్తం
c) సంశ్లేష
d) సంశ్లిష్టం
జవాబు:
b) సంయుక్తం

43. ‘ఆంధ్రప్రదేశ్’లో ఎన్ని సంయుక్తాక్షరాలున్నాయి?
a) 1
b) 3
c) 2
d) 4
జవాబు:
c) 2

44. క్రిందివానిలో ద్విత్వాక్షరమేది?
a) క్ష
b) త
c) క్క
d) ప్ర
జవాబు:
c) క్క

45. క్రిందివానిలో సంయుక్తాక్షరమేది?
a) భ్ర
b) త్త
c) మ్మ
d) ల్ల
జవాబు:
a) భ్ర

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

సంధులు : ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

46. ఎవ్వారు – సంధి విడదీయండి.
a) ఎ + వారు
b) ఏ + వారు
c) ఎ + వ్వారు
d) ఎవ్వా + రు
జవాబు:
b) ఏ + వారు

47. ఎట్లెట్లు – సంధి విడదీయండి.
a) ఎట్లు + ఎట్లు
b) ఎట్లె + ఎట్లు
c) ఎట్లె + ట్లు
d) ఎట్లున్ + ఎట్లు
జవాబు:
a) ఎట్లు + ఎట్లు

48. అక్కడ – సంధి విడదీయండి.
a) అక్క + డ
b) అ + కడ
c) ఆ + కడ
d) ఆ + కాడ
జవాబు:
c) ఆ + కడ

49. లోకాధిపతి – సంధి పేరేమి?
a) గుణసంధి
b) అత్వసంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
d) సవర్ణదీర్ఘ సంధి

50. కప్పమ్మ – సంధి పేరేమిటి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) ఆమ్రేడిత సంధి
d) త్రికసంధి
జవాబు:
a) అత్వసంధి

51. నీళ్ళోంపినాడు – సంధి విడదీయండి.
a) నీళ్లును + ఒంపినాడు
b) నీళ్లు + ఒంపినాడు
c) నీళోంపి + నాడు
d) నీళ్ళాంపిన + వాడు
జవాబు:
b) నీళ్లు + ఒంపినాడు

52. రథమెక్కి – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) ఇత్వసంధి
d) గుణసంధి
జవాబు:
c) ఇత్వసంధి

53. దారేది – సంధి పేరు ఏమి?
a) ఇత్వసంధి
b) అత్వసంధి
c) ఉత్వసంధి
d) యడాగమం
జవాబు:
a) ఇత్వసంధి

54. ఇది యేమిటి? – సంధి విడదీయండి.
a) ఇది + యేమిటి
b) ఇది + ఏమిటి
c) ఇదేమి + టి
d) ఇదేమిట + ఇ
జవాబు:
b) ఇది + ఏమిటి

AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి

55. అక్కడున్నదేమిటి – దీనిలో ఎన్ని సంధులున్నాయి?
a) 1
b) 3
c) 2
d) 4
జవాబు:
c) 2

నేనివి చేయగలనా?

1. గేయాన్ని రాగయుక్తంగా పాడగలను. [ ఔను / కాదు ]
2. గేయాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకుని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదజాలాన్ని వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. వానను వర్ణించే పాటలను సేకరించగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

పాలిథిన్ భూతం -(పర్యావరణ స్పృహ) ఏకపాత్రాభినయం

గడగడలాడి పోవాలి ! మొత్తం ఈ మానవజాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి. ఇంతకీ నేను ఎవరో తెలుసా ? మీకు తెలియదు కదా ! నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చాపకింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా.

మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామగ్రిని మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికివస్తా. కూరలు, పండ్లు, స్వీటు, పూలు, పాలు… ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూశారా ! నా ప్రతాపం, చూశారా ! నా ప్రభావం.

మీ సామానులను మోసుకుని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్తకుప్పలోకి విసురుతారు. కాలువలు, చెత్తకుప్పలే నా స్థావరాలు. అక్కడి నుంచి మానవ జాతిపై నా సమరభేరి మోగించి భూగోళాన్ని దడ దడ లాడిస్తాను. మీ జీవిత కాలం వందేళ్లు. కానీ నా జీవితకాలం కొన్ని వందల యేళ్లు.

చెత్తలో ఉన్నా, కాలువలో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా ఎక్కడున్నా ‘నేను క్షేమం – మీకు క్షామం’ నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి నేస్తాలైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దుర్గంధాన్ని వ్యాప్తిచేసే శిబిరంగా మారతాను. మలేరియా, ఫైలేరియా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను. భూమిపై నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలులేకుండా పచ్చదనాన్ని కబళిస్తాను. పర్యావరణాన్ని పాడుచేసే మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను.

మానవజాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కుపెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు, ఇది చాలు నేను భూమిని వశం చేసుకోవడానికి, ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులూ ! నన్ను ఆపగలరా? …… ప్రయత్నించండి…… చూద్దాం…..

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

These AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 5th Lesson Important Questions and Answers మన విశిష్ట ఉత్సవాలు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యా లు

కింది గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. భక్తుల తాకిడి పెరగడంతో గుణదల మేరీమాత ఉత్సవాలు ఒకే రోజు కాకుండా మూడు రోజులపాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. కొండ వద్ద సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన శిలువకు ఇప్పుడు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడోలరోసా అనే 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. నవంబరు నుండి డిసెంబరు వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్రం నలుమూలల నుండి క్రైస్తవ | భక్తులు వేలాదిగా వస్తారు. ఫాదర్ పి. ఆటి మేరీమాత విగ్రహాన్ని 1924న ఏర్పాటు చేశారు.
ప్రశ్నలు-జవాబులు:
అ) మేరీమాత ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు?
జవాబు:
మేరీమాత ఉత్సవాలు మూడు రోజులు జరుపుకుంటారు.

ఆ) క్రీస్తు జీవిత ఘట్టాలను తెలిపేది ఏది?
జవాబు:
క్రైస్తవులు పవిత్రంగా భావించే ‘వయాడోలరోసా’ క్రీస్తు జీవిత ఘట్టాలను తెలుపుతుంది.

ఇ) ఏయే నెలలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతాయి?
జవాబు:
నవంబరు, డిశంబరు నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

ఈ) మేరీమాత విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
జవాబు:
మేరీమాత విగ్రహాన్ని ఫాదర్ పి. ఆర్లాటి ఏర్పాటు చేశారు.

2. మొక్కుబడులు ఉన్నవారు చిన్న ప్రభలను తమ భుజాలపై ఉంచుకొని కోటప్పకొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రజలు ఆయా గ్రామాల నుండి ఊరేగింపుగా వచ్చేటప్పుడు స్త్రీలు కడవలతో నీరు పోస్తారు. ప్రభల ముందు భాగంలో జంగమ దేవరలు కత్తులు చేతపట్టి “శివ శివ మూర్తివి గణనాథా” అంటూ భక్తితో దండకాలు చదువుతారు. “చేదుకో కోటయ్య చేదుకో” అని స్వామిని భక్తి భావంతో పిలుస్తూ కొండను ఎక్కడం నేటికి ఇక్కడ చూడవచ్చే విశేషం.
ప్రశ్నలు-జవాబులు:
అ) ప్రభలు ఊరేగింపుకు వచ్చేటప్పుడు స్త్రీలు ఏమి చేస్తారు?
జవాబు:
ప్రభలు ఊరేగింపుకు వచ్చేటప్పుడు స్త్రీలు కడవలతో నీరు పోస్తారు.

ఆ) శివ శివ మూర్తివి గణనాథా’ అని దండకాలు చదివేదెవరు?
జవాబు:
జంగమదేవరలు కత్తుల చేతపట్టి “శివ శివ మూర్తివి గణనాథా” అంటూ భక్తితో దండకాలు చదువుతారు.

ఇ) స్వామిని భక్తులు ఏమని పిలుస్తూ కొండను ఎక్కుతారు?
జవాబు:
“చేదుకో కోటయ్య చేదుకో” అని స్వామిని భక్తి భావంతో పిలుస్తూ కొండను ఎక్కుతారు.

ఈ) కొండచుట్టూ తిరగడాన్ని ఏమని అంటారు?
జవాబు:
కొండచుట్టూ తిరగడాన్ని ‘ప్రదక్షిణ’ అంటారు.

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

3. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. ఆ రోగ నివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ పన్నెండుమంది యుద్ధవీరులు కలలో కనిపించారు. సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలోని రాజగురువుకి చేరవేశారు. రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారాషహీద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం పూస్తాడు. దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది. దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్యా సమేతంగా బారాషహీద్ ను సందర్శించాడు. ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు.
ప్రశ్నలు-జవాబులు:
అ) ఆర్కాటు నవాబు ఏ ప్రాంతాన్ని పాలించారు?
జవాబు:
ఆర్కాటు నవాబు నెల్లూరు ప్రాంతాన్ని పాలించారు.

ఆ) యుద్ధవీరులు ఎవరికి కలలో కనిపించారు?
జవాబు:
యుద్ధవీరులు రజక దంపతులకు కలలో కనిపించారు.

ఇ) ఆర్కాటు నవాబు భార్యకు ఏ లేపనం పూశాడు?
జవాబు:
సమాధులపై ఉన్న మట్టిని ఆర్కాట్ నవాబు తన భార్యకు లేపనంగా పూశాడు. .

ఈ) ఆర్కాటు నవాబు కృతజ్ఞతగా ఎవరిని సందర్శించాడు?
జవాబు:
ఆర్కాటు నవాబు కృతజ్ఞతగా భార్యా సమేతంగా బారాషహీద్ ను సందర్శించాడు.

4. పారువేట ఒక దేవ ఉత్సవం. ‘పరి’ అనగా గుర్రం, ‘వేట’ అనగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ గురించి జరిగేది. దీనికై స్వామివారు అసూబిలం చుట్టుప్రక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తాడు. ఈ క్షేత్రంలో కొండపై ఉగ్రనరసింహునిగా కొండ దిగువన శాంతమూర్తిగా మొత్తం క్షేత్రం అంతా 9 రూపాలతో నవ నారసింహులుగా కొలువై ఉన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడ ఉంది. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైన 97వ క్షేత్రం.
ప్రశ్నలు-జవాబులు:
అ) ‘పరి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
పరి అంటే ‘గుర్రం’.

ఆ) ఎన్ని సంవత్సరాలు నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి?
జవాబు:
600 సం|| నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇ) కొండ దిగువన నరసింహుడు ఏ రూపంలో ఉన్నాడు?
జవాబు:
కొండ దిగువన నరసింహుడు శాంతమూర్తిగా కొలువై ఉన్నాడు.

ఈ) వైష్ణవ క్షేత్రాలలో 97వ క్షేత్రం ఏది?
జవాబు:
వైష్ణవ క్షేత్రాలలో 97వ క్షేత్రం అఘోబిలం.

5. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చి ఒకటి. ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది. ఇది గుహలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. 1924వ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం గుణదలలో “సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్” అనే అనాథశరణాలయం ఏర్పాటు చేసింది. 1947 నాటికి చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పటి నుండి ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లోనూ, క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే వంటి క్రైస్తవ పర్వదినాల్లోనూ ప్రజలు మేరీమాతను దర్శించుకుని దీవెనలు పొందుతున్నారు.
ప్రశ్నలు-జవాబులు:
అ) గుణదల చర్చిలోని మేరీమాత విగ్రహం ఎక్కడి మేరీమాత విగ్రహాన్ని పోలి ఉంది?
జవాబు:
గుణదల చర్చిలోని మేరీమాత విగ్రహం ఫ్రాన్స్ దేశంలోని లూర్దునగరం చర్చిలోని మేరీమాత విగ్రహంతో పోలి ఉంది.

ఆ) గుణదల మేరీమాత ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి?
జవాబు:
గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో జరుగుతాయి.

ఇ) 1924లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం ఏది?
జవాబు:
1924లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం “సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్”.

ఈ) క్రైస్తవ పర్వదినాలు ఏవి?
జవాబు:
ప్రతి శుక్ర, శని, ఆదివారాలు, క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రైస్తవ పర్వదినాలు.

6. సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు. పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతోంది. సుమారు 60 అడుగుల పొడవు ఉండే సిరిమాను చివర ఆసనం ఏర్పాటు చేస్తారు. ఆ సిరిమానుకు ముందుభాగంలో బెస్తవారి వల, అంజలి రథం (దేవతల రథం) నడుస్తాయి.
‘ప్రశ్నలు-జవాబులు:
అ) ‘సిరిమాను’ అంటే ఏమిటి?
జవాబు:
సిరిమాను అంటే సంపదలు ఇచ్చే పెద్ద చెట్టు.

ఆ) పైడితల్లి అమ్మవారు ఎవరి ఇలవేల్పు?
జవాబు:
పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు.

ఇ) ఏ రోజున సిరిమానోత్సవం జరుగుతుంది?
జవాబు:
దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది.

ఈ) సిరిమాను పొడవు ఎంత?
జవాబు:
సిరిమాను పొడవు సుమారు 60 అడుగులు.

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా పేరొందింది. విజయనగర రాజులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం కనిపిస్తుంది. ప్రముఖ కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవన్నను ఉద్దేశించి రాసిన గేయం….. “లేపాక్షి బసవయ్య – లేచి రావయ్య” చాలా ప్రసిద్ధి పొందింది. ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. ప్రశ్నలు-జవాబులు:
అ)’ ‘లేపాక్షి’ ఏ జిల్లాలో ఉంది?
జవాబు:
లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది.

ఆ) లేపాక్షిలోని ఆలయాలు, కట్టడాలు ఎవరి పాలనలో నిర్మించబడినాయి?
జవాబు:
లేపాక్షిలోని ఆలయాలు, కట్టడాలు విజయనగర రాజుల పరిపాలనా కాలంలో నిర్మించబడినాయి.

ఇ) దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఎక్కడ ఉంది?
జవాబు:
దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం లేపాక్షిలో ఉంది.

ఈ) ప్రముఖ కవి అడవి బాపిరాజు రాసిన గేయం ఏమిటి?
జవాబు:
ప్రముఖ కవి అడవి బాపిరాజు రాసిన గేయం “లేపాక్షి బసవయ్య – లేచి రావయ్య”.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే సిరిమానోత్సవంలోని చారిత్రక అంశాలు ఏమిటి?
జవాబు:
పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే సిరిమానోత్సవంలో చారిత్రక అంశాలు మిళితమై ఉన్నాయి. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమౌతాడు. యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు పైడిమాంబ బ్రతిమాలింది. అయినప్పటికీ చెల్లెలు మాట పెడచెవిన పెట్టి, యుద్ధానికి వెళతాడు. అక్కడ ..’ ‘ తాండ్రపాపారాయుడి చేతిలో రామరాజు మరణిస్తాడు. ఈ సంగతి విని సమీపంలోని పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది పైడిమాంబ. కొంతకాలానికి స్నేహితురాళ్ళకు కలలో కనిపించి పెద్ద చెరువులో తాను విగ్రహమై వెలుస్తానని, తనకు గుడి కట్టాలని చెప్పింది. అలా ఆ చెరువు గట్టు మీద ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ప్రతియేడు ఈ రోజున పైడితల్లి సిరిమానోత్సవం జరుగుతుంది.

ప్రశ్న 2.
కోటప్పకొండ చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను రాయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాలలో కోటప్పకొండ ఒకటి. ఇది గుంటూరు జిల్లాలోని నరసరావు పేట సమీపంలో ఉంది. 1500 ఎకరాల వైశాల్యంలో ఎనిమిదిమైళ్ళ చుట్టుకొలతలో ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. కొండ మధ్యలో ‘పాపనాశనం’ అనే తీర్థం ఉంది. ఇది స్వయంగా శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఏర్పడిందంటారు. వీటిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

ఈ కొండను ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. వీటిమీద మూడు శివలింగాలు ఉన్నాయి. అందుకే కోటప్పకొండ, త్రికూటాచలంగానూ, మధ్య శిఖరం మీద ఉన్న శివుడు త్రికూటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. కొండ కింద భాగంలో గొల్లభామ గుడి ఉంది. ఈమె పరమ భక్తురాలైన ఆనందవల్లి. ఈమెను ముందుగా దర్శించిన తరువాత కోటయ్యను దర్శిస్తారు. స్థలపురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత .. శివుడు ఇక్కడ 12 సంవత్సరాల బాలునిగా అవతరించాడు. శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలో దేవతలతో నివసించాడని చెబుతారు.

ప్రశ్న 3.
‘బారాషహీద్’ గురించి రాయండి.
జవాబు:
నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వీరి మొండేలను వారి గుర్రాలు దర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి. మొండేలు అక్కడే ఖననం అయ్యాయి. కాలక్రమంలో ఈ పన్నెండు మొండేలకు స్థానికులు సమాధులు నిర్మించారు. ఆ స్థలానికి బారా షహీద్ (బారహ్ అనగా పన్నెండు, షహీద్ అనగా వీరుడు) అని పేరు పెట్టారు. మరణించిన 12మంది తలలో ఏడుగురి తలలు మాత్రమే యుద్ధం జరిగినచోట లభ్యమయ్యాయి. ఈ ఏడు తలలు లభ్యమైన ప్రదేశాన్ని ‘సాతోషహీద్’ అంటారు.

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

ప్రశ్న 4.
‘లేపాక్షి’ ఆనాటి శిల్పుల అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక – వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా, పర్యాటక కేంద్రంగా పేరొందింది. విజయనగర రాజులు తమ పాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం చూడవచ్చు. ఇది ఠీవీగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. 8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు కలిగిన ఈ బసవయ్య మెడలో పూసల హారాలు, గంటలు ఉంటాయి. రిక్కించిన చెవులతో లేచి ఉరకడానికి కాళ్ళను సరిచేసుకుంటున్న భంగిమతో ఉండే ఈ బసవయ్య మెడలోని హారంలో వేలాడే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కున వ్రేలాడే ఏనుగులు ఉంటాయి. ఇది ఆనాటి శిల్పుల శిల్పకళా సౌందర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు.

ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. దీనినే “లేపాక్షి” ఆలయం అంటారు. ఈ ఆలయంలో దుర్గాదేవి, గణపతి, నాగేంద్రుడు మొదలైన విగ్రహాలు ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రతి నిర్మాణం రాతితో నిర్మించినవే. వ్రేలాడే రాతిస్తంభం ఇక్కడ మరో ప్రత్యేకత. ఇక్కడ ప్రతి అణువూ అత్యద్భుతంగా ఆనాటి శిల్పులు తీర్చిదిద్దారు. గోడలు, పై కప్పులపై చిత్రించిన వర్ణ చిత్రాలు అప్పటి కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి.

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

These AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 4th Lesson Important Questions and Answers మర్రిచెట్టు

I. అవగాహన-ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఆ క్లబ్బులు చేసేపని తరతరాల నుంచీ నేను చేస్తున్న పనే. పిల్లలు, పెద్దలూ అందరూ కాలక్షేపానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నా నీడలో కూర్చుని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. పులిజూదం మొదలైన ఆటలు యెన్నో ఆడుకుంటూ ఉండేవారు. నేను వారికి శ్రమ కలగకుండా గాలివీస్తూ ఉండేదాన్ని. దాహమైతే చెరువులో నీళ్ళు దోసిళ్ళతో త్రాగి మళ్ళీ వచ్చి నా నీడను కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. నా నీడనూ, గాలిని అలవాటు పడినవాళ్లు ఇంట్లో ఒక్కక్షణం ఉండేవారు కాదంటే మీరు నామాట నిస్సంకోచంగా నమ్మవచ్చు.
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘నీడ’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
ఛాయ

ఆ) పై పేరాలో చెప్పబడిన ఆట పేరేమిటి?
జవాబు:
పులిజూదం

ఇ) ‘శ్రమ’ పదానికి వ్యతిరేక పదాన్ని రాయండి.
జవాబు:
విశ్రాంతి

ఈ) ‘నామాట’ విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
నా యొక్క మాట

2. ఈ మానవులు నా నీడను కూర్చుని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటప్పుడు నా కొమ్మలను ఆశ్రయించుకొని బ్రతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీరికి ఎవరిచ్చారో ! నా నీడన కూర్చొని కబుర్లు చెప్పుకొనే హక్కు వీరికి ఉన్నప్పుడు, నా చెట్ల కొమ్మలమీద గూళ్ళు కట్టుకొని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు ? అసలు ఇంతకీ నా హక్కు మాటేమిటి? నన్నడిగే, వాళ్ళు నా క్రింద కూర్చున్నారంటారా?
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘అస్తమానం’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
ఎల్లప్పుడు

ఆ) ‘నన్నడిగి’ పదాన్ని విడదీయండి.
జవాబు:
నన్ను + అడిగి

ఇ) ‘పక్షి’ పదానికి వికృతి రాయండి.
జవాబు:
పక్కి

ఈ) ‘చెట్టు’ పదానికి పర్యాయపదాలు రాయండి.
జవాబు:
వృక్షం, తరువు

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

3. బ్రతకటానికి ఇన్ని ఘోరాలు చెయ్యాలా? ఇతర జీవులను నిర్దాక్షిణ్యంగా తమ పొట్టను పెట్టుకోవాలా? ఏ ఆకూ దుంపలు తింటే సరిపోదు ? కాని ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకున్నట్లు కనబడదు. వాళ్ళతోపాటు మాకూ ఈ ప్రపంచంలో బ్రతికే హక్కున్నదనీ, అందరం బ్రతికితేనే ఈ ప్రపంచం అందమనీ, వాళ్ళు అనుకొన్నట్లు కనబడదు.
ప్రశ్నలు – జవాబులు :
అ) పై పేరాలో ఉన్న జాతీయ పదాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
పొట్టను పెట్టుకొను

ఆ) ‘ప్రపంచం’ పదానికి పర్యాయపదాలు రాయండి.
జవాబు:
జగము, జగత్తు

ఇ) ‘హక్కు’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
బాధ్య త

ఈ) ‘నిర్దాక్షిణ్యం’ విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
దాక్షిణ్యం లేని

4. అతని మాటలు వింటే నాకు గుండె చెరువయింది. చావటానికి భయపడి కాదు. చావంటే మా జాతికి భయమే లేదు. నా గుండె చెరువయింది, అతని నిర్లక్ష్యానికి. మా ఉద్దేశాలను మేము మానవులకు మల్లే పైకి చెప్పుకోలేక పోయినా, మాకూ ప్రాణం అనేది ఉంటుందని – నాతో యింత పరిచయం ఉన్న అతనికి తట్టకపోవటం నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నాం అనుకున్నారు. మా ప్రాణాలు తియ్యడానికి అతనికేం హక్కుంది. ఎవ్వరు బ్రతకటానికి అర్హులో యెవ్వరు గాదో నిర్ణయించడానికి అర్హుడు తానా?
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘జాతి’ నానార్థాలు రాయండి.
జవాబు:
కులం, పుట్టుక

ఆ) ‘చెరువు’ పర్యాయపదాలు రాయండి.
జవాబు:
తటాకం, కోనేరు

ఇ) ‘ఆశ్చర్యం’ పదానికి వికృతి రాయండి.
జవాబు:
అచ్చెరువు

ఈ) ‘ప్రారంభం’ పదానికి వ్యతిరేకపదం రాయండి.
జవాబు:
ముగింపు / అంతం

అపరిచిత గద్యాలు

కింది అపరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. (శిష్యులకు) ఇతరులకు వివరించి చెప్పగలిగినదే నిజమైన పాండిత్యం. బయట ప్రగల్భములాడుట కాక యుద్ధములో నిలువగలిగినదే వీరత్వము. కవీంద్రులు మెచ్చునదే అసలైన కవిత్వము. వివాదమునకు దారితీయు పనియే మనుష్యునకు హానికరము.
ప్రశ్నలు – జవాబులు :
అ) నిజమైన పాండిత్యం ఏది?
జవాబు:
తన వద్ద ఉన్న విద్యను ఇతరులకు (శిష్యులకు) చెప్పడం.

ఆ) ‘ప్రగల్భము’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
గొప్పలు

ఇ) కవీంద్రులు మెచ్చేది ఏమిటి?
జవాబు:
మంచికవిత్వం

ఈ) మనుష్యులకు హానికరం ఏది?
జవాబు:
వివాదానికి దారితీసే పని

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

2. ప్రపంచంలో మొట్టమొదట విడుదల చేయబడిన తపాలాబిళ్ళ అతికించే రకం కాదు. అది రెండు అణాల ఖరీదు కలిగిన కాపర్ టికెట్. ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడిన వందమైళ్ళ లోపు చిరునామాకు దాని ద్వారా ఒక కవరును పంపవచ్చును. ఆ కవరును డాక్ రన్నర్ తీసుకువెడతాడు. ఈ కాపర్ టోకెన్ ప్రప్రథమంగా 1774 మార్చి 31వ తేదీన పాట్నాలో విడుదల చేయబడింది. 1852లో సింధు ప్రావిన్స్ కమిషనర్ సర్ బార్టిల్ ఫ్రెర్ ఆసియాలో మొట్టమొదట తపాలాబిళ్ళను తీసుకువచ్చాడు. అందులో ఈస్టిండియా కంపెనీ ముద్ర ఉండేది. దానిని సింధు లోపల ఉత్తరాలు పంపడానికి ఉపయోగించేవారు. దీనిని సిండే డాక్ అనేవారు.
ప్రశ్నలు – జవాబులు :
అ) డాక్ రన్నర్ అంటే ఎవరు?
జవాబు:
తపాలా బంట్రోతు.

ఆ) సింధు ప్రావిన్స్ ఎవరి పరిపాలనలో ఉంది?
జవాబు:
ఈస్టిండియా కంపెనీ.

ఇ) అణా అంటే ఎన్ని పైసలు?
జవాబు:
ఆరు పైసలు.

ఈ) సిండే డాక్ అంటే ఏమిటి?
జవాబు:
సింధు ప్రావిన్స్ లోని కాపర్ టికెట్.

3. అప్పటికి 200 సంవత్సరాల నుంచి ఆంగ్లేయుల కారణంగాను, అంతకు ముందు ఏడెనిమిది వందల ఏళ్ళ నుంచి తురుష్కుల కారణంగాను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బానిసత్వంలో మ్రగ్గుతున్న భారతజాతి దైన్యస్థితి నుంచి మేల్కొని 1857లో వీరోచితంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సాగించింది. కానీ ఆ చైతన్యాన్ని సైనికుల తిరుగుబాటు అంటూ తక్కువగా అంచనా వేసి, ఆంగ్ల ప్రభుత్వం అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకుని భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టింది.
ప్రశ్నలు – జవాబులు :
అ) సుమారు ఏ సంవత్సరములో ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశించారు?
జవాబు:
క్రీ.శ. 1600లో

ఆ) తురుష్కులు భారతదేశాన్ని పాలించడం ఎప్పుడు మొదలు పెట్టారు?
జవాబు:
సుమారు క్రీ.శ 800లు లేక 900 సంవత్సరాల నుండి

ఇ) సైనికుల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు:
క్రీ.శ. 1857

ఈ) భారతదేశం ఆంగ్లేయుల పాలనలోకి పూర్తిగా ఎప్పటి నుంచి వెళ్ళింది?
జవాబు:
1857

4. జంధ్యాల గారు అన్నట్లుగా హాస్యం అనేది చక్కని వంటకంలో ఉప్పులాంటిది. ఉప్పులేని కూర ఎంత చప్పగా ఉంటుందో సున్నిత హాస్యం లేని ప్రసంగం కూడా అలాగే ఉంటుంది. అంటే జోక్ చెప్తున్నట్లుగా చెప్పకూడదు. అది ప్రసంగంలో భాగమైపోవాలి. మాట్లాడే మాటలు ప్రాంతాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ఒక పెద్దాయన వచ్చి ‘ఈ వాల్ పోస్టర్లు అంటించండి!’ ఆ పెద్దాయన సహాయకులు వెంటనే రంగంలోకి దూకి తగులబెట్టారు. అంటించండి అంటే అతికించండి అని ఆయన ఉద్దేశ్యం.
ప్రశ్నలు – జవాబులు :
అ) హాస్యం ఎలాంటిది?
జవాబు:
చక్కని వంటకంలో ఉప్పులాంటిది

ఆ) ఉప్పులేని కూర ఎలా వుంటుంది?
జవాబు:
చప్పగా ఉంటుంది.

ఇ) పై పేరాలో హాస్యం గురించి మాట్లాడినది ఎవరు?
జవాబు:
జంధ్యాలగారు

ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ప్రసంగంలో ఏది ఉండాలి?

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

5. క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహాసంస్కర్తల కోవలోనివాడే వీరేశలింగం, ఆయన సంస్కరణాభిలాషి, దేనినైనా ఆచరించి చూపేవాడు. శతాధిక గ్రంథాలు రచించాడు. సాహిత్య రంగంలో ఆయన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవాడు. అందుకే ఆయన ఆధునికాంధ్ర సాహిత్యానికి ఆద్యుడు, మార్గదర్శి, అనుభవాల గని.
ప్రశ్నలు – జవాబులు :
అ) రాజారామమోహనరాయ్ ఎవరు?
జవాబు:
రాజారామమోహన్ రాయ్ ఒక మహా సంస్కర్త.

ఆ) ఆచరించి చూపించిన వారెవరు?
జవాబు:
కందుకూరి వీరేశలింగం పంతులుగారు దేనినైనా ఆచరించి చూపించేవారు.

ఇ) ఆయన ఎన్ని గ్రంథాలు వ్రాశారు?
జవాబు:
ఆయన శతాధిక గ్రంథాలు వ్రాశారు.

ఈ) కందుకూరి ప్రతిభా పాటవాలు దేనిలో ప్రదర్శించారు?
జవాబు:
సాహిత్యరంగంలో కందుకూరి ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జీవాబులు రాయండి.

ప్రశ్న1.
మజ్జిచెట్టు ఎవరిమీద ఆధారపడలేదని ఎలా చెప్పగలవు?
జవాబు:
మద్దిచెట్టును ఎవ్వరూ నాటలేదు, దానికెవ్వరూ ఎరువూ, నీరుపోసి పెంచలేదు. ఏ గాలికో విత్తనం కొట్టుకొని వచ్చి చెరువుగట్టుపై పడింది. మొక్కె మొలిచింది. లేదా ఏ కాకి ముక్కు నుండో విత్తనం జారిపడి మొలిచి ఉంటుంది. అది ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీదా ఆధారపడి బ్రతకలేదు. అప్పుడప్పుడు వర్షాలకు భూమిలోని సత్తువను పీల్చుకొంటూ బతికింది. అందుకే మట్టిచెట్టు ఎవరిమీదా ఆధారపడలేదని కచ్చితంగా చెప్పగలను.”

ప్రశ్న2.
మద్దిచెట్టు గ్రామస్తులకు ఎలా ఉపయోగపడింది?
జవాబు:
చెరువుగట్టు మట్టి వర్షాలకు కరిగిపోకుండా తన వేళ్లతో కాపాడింది. ఎంతోమంది పేదలు తన వేర్ల మధ్య వంట వండుకొనే సదుపాయం కల్గించింది. తను ఎంతోమందికి నీడనిచ్చింది. మట్టిపాలు, కాయలు మందులలో ఉపయోగించుకొందుకిచ్చి, ఎన్నో జబ్బులను తగ్గించడంలో సహాయపడింది.

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న1.
మానవుల ప్రవర్తన మజ్జి చెట్టుకు ఎందుకు నచ్చలేదు?
జవాబు:
మానవులలోని స్వార్థబుద్ది మట్టిచెట్టుకు నచ్చలేదు. తాము చెట్టునీడను కూర్చొంటారు. అది తమ హక్కుగా భావిస్తారు. కాని, చెట్టుపై గూళ్లుకట్టుకొని నివసిస్తున్న పక్షులపై కోపం వస్తుంది. వాటికక్కడ నివసించే హక్కు లేనట్లు వాటిని రాళ్లతో కొడతారు. ఈ విధంగా తమకో న్యాయం, పక్షులకో న్యాయం అన్నట్లు ప్రవర్తించే విధానాన్ని విమర్శించింది. పక్షులు రెట్టలు వేస్తున్నవంటే, మనుషులు కూడా చీకటి పడ్డాక అంతేకదా ! అందుకే మచెట్టుకు మానవుల ప్రవర్తన నచ్చలేదు.

తన క్రింద ఆడుకొని పెరిగి పెద్దెన నరసింహులు ప్రెసిడెంటు అయ్యాక తనకు ఆశ్రయమిచ్చిన చెట్టునే డబ్బు కోసం ముక్కలు ముక్కలుగా నరికించాడు. అతని ప్రవర్తన కూడా మట్టిచెట్టుకు నచ్చలేదు.
వేటగాడు పక్షిని వేటాడిన పద్ధతి మజ్జి చెట్టుకు చాలా అసహ్యం కల్గించింది. కోపం వచ్చేలా చేసింది.

ప్రశ్న2.
మజ్జి చెట్టు ఎన్నో జీవులకు ఆశ్రయమని, గొప్పదని ఎలా చెప్పగలవు?
జవాబు:
మట్టిచెట్టు కింద ఎంతోమంది మానవులు కూర్చొంటారు. చల్లని గాలిని అనుభవిస్తారు. సేద తీరతారు. ఎంతోమంది పేదలు అక్కడే వంటలు వండుకొంటారు. అంటే మానవులకు ఆశ్రయం కల్పించింది.

చెట్టుపైన ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకొని జీవిస్తున్నాయి. తమ పిల్లలను ఆ గూళ్ళలో ఉంచి పగలంతా ఆహార సంపాధన చేసుకొని ఆనందంగా జీవిస్తున్నాయి. అప్పుడప్పుడు వేటగాడు వచ్చి, పక్షులను వేటాడి వాటి మాంసంతో జీవిస్తున్నాడు. ఈ విధంగా మట్టిచెట్టు జీవించి ఉండగా చాలా జీవులకు ఉపయోగపడింది. తనను ముక్కలుగా నరికేరు. అవి కూడా 12 మంది వాటాలేసుకొన్నారు. అంటే తనను నరికిన వారికి కూడా ఉపయోగపడింది. మళ్లీ చిగురువేసి ఉపయోగపడాలనే మంచి ఆలోచనగల మట్టిచెట్టుకు చేతులెత్తి నమస్కరించాలి.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

మఱ్ఱిచెట్టు = వటము , విటపి
రంపం = క్రకచము, కరపత్రము
రైతు = కర్షకుడు, వ్యవసాయదారుడు
చెవి = కర్ణము, శ్రుతి
గ్రామం = పల్లెటూరు, జనపదం
నవ్వు = హసనము, హాసము
శ్రమ = అలసట, శ్రాంతి
నీరు = జలము, ఉదకం
ఆట = క్రీడ, కేళి
క్షణం = సెకను, త్రుటి
కన్ను = నయనం, నేత్రం
చిన్నతనం = పసితనం, బాల్యం
విత్తు = విత్తనం, బీజం
సహజం = స్వతస్సిద్ధము, స్వాభావ్యము
భూమి = పుడమి, పృథివి
కష్టము = ఆపద, ఇడుము
నష్టం = నాశనం, కోల్పోవుట
కాకి = కాకము, వాయసము
బ్రతుకు = జీవితం, జీవనం
ఆహారం = తిండి, భోజనం
అపేక్ష = కాంక్ష, కోరిక
రాళ్లు = రాలు, ఉపలములు
గోల = రొద, శబ్దం
ఆనందం = సంతోషం, ముదము
హక్కు = స్వామ్యము, అధికారం
ఉత్సాహం = ఉద్యోగము, సన్నాహం
వ్యక్తి = మనిషి, నరుడు
చెరువు = తటాకము, తడాకము
సంగతి = విషయం, అంశం
రహస్యము = మర్మము, గుప్తము
రోజు = దినము, దినము
నెపం = మిష, వంక
నీడ = ఛాయ, అనాతపము
గాలి = వాయువు, పవనం
దోసిలి = దోయిలి, అంజలి
దాహం = దప్పి, దప్పిక
సంకోచం = అనుమానం, సందేహం
విలువ = మూల్యము, వెల
నిజం = సత్యం, యథార్థం
దృష్టి = చూపు, దిష్టి
కాలం = సమయం, తరుణము
మనిషి = నరుడు, వానరుడు
కించిత్ = స్వల్పం, కొద్ది
నెమ్ము = చెమ్మ, తడి
సత్తువ = శక్తి, బలం
సహాయము = సహకారం, చేదోడు
కోరిక = కాంక్ష, ఆశ
గూడు = నీడము, కులాయము
భయం = అధైర్యం, పిరికితనం
రెక్క = పక్షము, ఎరక
జీవులు = ప్రాణులు, ప్రాణికోటి
కసి = కోపం, కినుక
ముఖం = వదనం, ఆననం
భేదం = తేడా, అంతరం
సత్తువ = సాజము
నిత్యం = ఎల్లప్పుడూ, సదా
పిట్ట = పక్షి, పులుగు
నేస్తం = చెలికాడు, స్నేహితుడు
ప్రాణాలు = అసువులు, ఉసురులు
ఆచారం = ప్రవర్తన, పద్ధతి
ఆకు = పత్రము, పర్ణము
బాకు = కటారి, చిన్నకత్తి
గొంతు = కంఠం, గొంతుక
మరణం = చావు, కాలధర్మం
ఘోరం = దారుణం, అమానుషం
పుస్తకం = పొత్తము, గ్రంథం
ఆశ్చర్యం = విస్మయం, అచ్చెరువు
వర్షం = వాన, జడి
ఊడ = అవరోహము, జట
ముక్కలు = ఖండాలు, శకలాలు
వేటగాడు = వ్యాధుడు, మృగయుడు
అపాయం = ఆపద, ప్రమాదం
అరచేయి = కరతలం, ప్రహస్తము
కొమ్మ = విటపము, శాఖ
పొట్ట = కడుపు, ఉదరం
వాసం = దూలము, పట్టె
భగవంతుడు = దైవం, దేవుడు
స్పృహ = తెలివి, చైతన్యం
అందం = సొగసు, సౌందర్యం
ఉయ్యాల = ఊయల, డోలిక
ప్రారంభం = ఆది, మొదలు
వడ్రంగి = వడ్లంగి, స్థపతి

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

ప్రకృతి – వికృతులు

ఘట్టము – గట్టు
కాష్ఠము – కట్టె
పుటకము – పుట్ట
ముఖము – మొగము, మోము
ఆశ్రయము – ఆసరా
పట్టణము – పట్నము
మనుష్యుడు – మనిషి
సహనము – సయిరము
సహజము – సాజము
విస్మయము – విసుమానము
నిజము – నిక్కము
విధము – వితము
కాకము – కాకి
భూమి – భువి
వృద్ధు – పెద్ద
సహాయము – సాయము
హృదయం – ఎద
పకి – పక్కి
నరసింహం – నరసింగడు
భోజనము – బోనము
పుస్తకము – పొత్తము
త్వర – తొర
నీరము – నీరు
ప్రాణము – పానము
ఆశ్చర్యం – అచ్చెరువు
కార్యము – కర్ణము
రాత్రి – రేయి, రాతిరి
యత్నము – జతనము
ధర్మము – దమ్మము
ఆహారము – ఓగిరము

వ్యతిరేక పదాలు

క్రింద × మీద
అమ్మి × కొని
లాభం × నష్టం
రహస్యం × బహిర్గతం
కాదు × ఔను
ఆశ్రయం × నిరాశ్రయం
పెద్ద × చిన్న
అమాయకత్వం × మాయకత్వం
నీడ × వెలుగు
విశ్రాంతి × శ్రాంతి
సంకోచం × నిస్సంకోచం
ఖర్చు × జమ
ఎక్కువ × తక్కువ
నిజం × అబద్దం
సహజం × అసహజం
అపేక్ష × అనపేక్ష
స్పష్టం × అస్పష్టం
జ్ఞాపకం × మరపు చిన్న
ఆధారం × నిరాధారం
సత్తువ × నిస్సత్తువ
అవసరం × అనవసరం
కష్టం × సుఖం
స్వార్థం × నిస్స్వార్థం
సహాయం × నిస్సహాయం
స్వ × పర
చల్లదనం × వెచ్చదనం
ఆనందం × విచారం
జీవి × నిర్జీవి
అపకారం × ఉపకారం
బాధ × నిర్బా ధ
కశ్మలం × నిర్మలం
ప్రయత్నం × అప్రయత్నం
దొంగ × దొర
సాధారణం × అసాధారణం
చీకటి × వెలుగు
రాత్రి × పగలు
లక్ష్యం × నిర్లక్ష్యం
సహనం × అసహనం
హింస × అహింస
భయం × నిర్భయం
నిత్యం × అనిత్యం
నేస్తం × వైరి
అపాయం × నిరపాయం
ఆచారం × అనాచారం
దగ్గర × దూరం
కొన × మొదలు
మరణం × పుట్టుక
మంచి × చెడు
ముఖ్యం × అముఖ్యం
దాక్షిణ్యం × నిర్దాక్షిణ్యం
ఎక్కి × దిగి
ఇష్టం × అనిష్టం
పున్మానం × అవమానం
పరిచయం × అపరిచయం
క్రూరం × అక్రూరం
ప్రశ్న × జవాబు
ధర్మం × అధర్మం

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

సంధులు (ఉత్వసంధి)

మేమంతా = మేము + అంతా
మొద్దునై = మొద్దును + ఐ
వస్తున్నాడని = వస్తున్నాడు + అని
రైతులందరూ = రైతులు + అందరూ
కనపడననుకొంది = కనపడను + అనుకొంది
సంగతులన్నీ = సంగతులు + అన్నీ
పదునైన = పదును + ఐన
ఉన్నామనుకొని = ఉన్నాము + అనుకొని
పడదామనుకొన్నాను = పడదాము + అనుకొన్నాను
రహస్యాలన్నీ = రహస్యాలు + అన్నీ
వద్దనుకొన్నా = వద్దు + అనుకొన్న
ముఖ్యమైంది = ముఖ్యము + ఐంది
ఆటలుంటాయి = ఆటలు + ఉంటాయి
హక్కున్నది = హక్కు + ఉన్నది
వాళ్లందరు = వాళ్లు + అందరు
అందమనీ = అందము + అనీ
ఎందుకింత = ఎందుకు + ఇంత
ఎవ్వరైనా = ఎవ్వరు + ఐనా
మొదలయిన = మొదలు + అయిన
ఉయ్యాలలూగుతూ = ఉయ్యాలలు + ఊగుతూ
దాహమయితే = దాహము + అయితే
వచ్చాడనుకొని = వచ్చాడు + అనుకొని
కాదంటే = కాదు + అంటే
మాకున్న = మాకు + ఉన్న
అలవాటై = అలవాటు + ఐ
పాడవుతూ = పాడు + అవుతూ
నేనేమి = నేను + ఏమి
చెరువయింది = చెరువు + అయింది
నేనంటే = నేను + అంటే
చావంటే = చావు + అంటే
ఇదమిద్ధమని = ఇదమిద్ధము + అని
నీడనివ్వటం = నీడను + ఇవ్వటం
వేరొక = వేరు + ఒక
అటుంచి = అటు + ఉంచి
ఇతరులకేమాత్రం = ఇతరులకు + ఏమాత్రం
పక్షులన్నీ = పక్షులు + అన్నీ
ఎవ్వరిచ్చారో = ఎవ్వరు + ఇచ్చారు + ఓ
ఎందుకనో = ఎందుకు + అనో
కూర్చున్నారంటారా= కూర్చున్నారు + అంటారు + ఆ
పెట్టడని = పెట్టడు + అని
ఎందుకనో = ఎందుకు + అనో
కాగలననే = కాగలను + అనే
మానవులంతా = మానవులు + అంతా
భయంకరమైన = భయంకరము + ఐన
ముక్కలయ్యేంత = ముక్కలు + అయ్యేంత
దారుణమైనవి = దారుణము + ఐనవి
వాడొకడు – వాడు + ఒకడు

అత్వసంధి

పుట్టినప్పటి = పుట్టిన + అప్పటి
ఉన్నంత = ఉన్న + అంత
ఇచ్చినందుకు = ఇచ్చిన + అందుకు
తగినట్లు = తగిన + అట్లు
ఉన్నట్లు = ఉన్న + అట్లు
ఉన్నప్పుడు = ఉన్న + అప్పుడు
మాటేమిటి = మాట + ఏమిటి
అనుకొన్నట్లు = అనుకొన్న + అట్లు
చిన్నప్పటి = చిన్న + అప్పటి
వచ్చినందుకు = వచ్చిన + అందుకు
తెలిసినట్లు = తెలిసిన + అట్లు

ఇత్వసంధి

భాగాన్నంతా = భాగాన్ని + అంతా
దాన్నయినా = దాన్ని + అయినా
ఉంటాయని = ఉంటాయి + అని
ఉంటాయట = ఉంటాయి + అట
చేస్తున్నదేమిటి = చేస్తున్నది + ఏమిటి
ఏమంత = ఏమి + అంత
వేస్తున్నవనే = వేస్తున్నవి + అనే
మందలించాలని = మందలించాలి + అని
సంగతేమిటి = సంగతి + ఏమిటి
ఉన్నదని = ఉన్నది + అని
పైకెత్తి = పైకి + ఎత్తి
ఇదంతా : ఇది + అంతా
దాన్నట్లా = దాన్ని + అట్లా
ఇనేళ్లు = ఇన్ని + ఏళ్లు
ఉన్నదంటే = ఉన్నది + అంటే
అతనికేం = అతనికి + ఏం
చెయ్యాలనే = చెయ్యాలి + అనే

యడాగమం

జీవినియిట్టే = జీవిని + ఇట్టే
గురించి యెందుకు= గురించి + ఎందుకు
ఒకరిని యిబ్బంది= ఒకరిని + ఇబ్బంది

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. హింస పనికిరాదు ………….. మంచిది. (అహింస)
2. నిర్భయంగా జీవించాలి. ……………. పనికిరాదు. (భయం)
3. అపాయం వచ్చినపుడే ……………… వెతకాలి. (నిరపాయం)
4. అనాచారం మంచిది కాదు …………… కాపాడుతుంది. (ఆచారం)
5. సహాయం చేయాలి. …………….. గా చూడకూడదు. (నిస్సహాయం)
6. మంచిని …………. ను తెలుసుకోవాలి.
7. చెట్టు జీవి, కుర్చీ ……………. (నిర్జీవి)
8. స్వ, ……………. భేదం తప్పు. (పర)
9. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యం ……………… గా ఏదీరాదు. (అప్రయత్నం)
10. గురువుగారి దగ్గర సంకోచం వద్దు. …………….. గా అడగండి. (నిస్సంకోచం)

వ్యాకరణాంశాలు: ఈ క్రింది వానిలో సరైన సకర్మక, అకర్మక వాక్యాలు గుర్తించి, రాయండి.

1. శ్రీహరి లక్ష్మీదేవిని పెండ్లాడాడు.
జవాబు:
సకర్మకం

2. తూర్పున సూర్యుడు ఉదయించును.
జవాబు:
అకర్మకం

3. నేను సూర్యుని ప్రార్థించాను.
జవాబు:
సకర్మకం

4. గురువును గౌరవించాలి.
జవాబు:
సకర్మకం

5. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ..
జవాబు:
అకర్మకం

6. మాస్కులు ధరించాలి.
జవాబు:
సకర్మకం

7. అందరూ మంచివాళ్లూ కాదు, చెడ్డవాళ్లూ కాదు.
జవాబు:
అకర్మకం

8. కరోనా చదువులను దెబ్బతీసింది.
జవాబు:
సకర్మకం

9. సీతారాములు అడవికి వెళ్లారు.
జవాబు:
అకర్మకం

10. మంచి మాటలను మాట్లాడండి.
జవాబు:
సకర్మకం

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

సంధులు : ఈ క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

1. ఎందుకింత = ఎందుకు + ఇంత – ఉత్వ సంధి
2. తగినట్లు = తగిన + అట్లు – అత్వ సంధి
3. ఏమంత = ఏమి + అంత – ఇత్వ సంధి
4. జీవినియిట్టే = జీవిని + ఇట్టే – యడాగమం
5. ఉన్నదని = ఉన్నది + అని – ఇత్వ సంధి
6. దాన్నట్లా = దాన్ని + అట్లా – ఇత్వ సంధి
7. ఇచ్చినందుకు = ఇచ్చిన + అందుకు – అత్వ సంధి
8. ఎందుకనో = ఎందుకు + అనో – ఉత్వ సంధి
9. ఇదంతా = ఇది + అంతా – ఇత్వ సంధి
10. ఒకరిని యిబ్బంది = ఒకరిని + ఇబ్బంది – యడాగమం

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. ఒకరి రహస్యాలు ఒకరికి చెప్పకూడదు.
a) మరమరాలు
b) విషయాలు
c) మర్మాలు
d) మాటలు
జవాబు:
c) మర్మాలు

2. ఎవరినీ దేనికీ అర్థించుట మంచిది కాదు.
a) యాచించుట
b) నమ్ముట
c) పొగుడుట
d) కొట్టుట
జవాబు:
a) యాచించుట

3. ఎవరి మీదా కసి ఉండకూడదు.
a) ప్రేమ
b) కోపం
c) లోకువ
d) ఆధారపడి
జవాబు:
b) కోపం

4. కొన్ని దారుణాలు చూడలేము.
a) యుద్ధాలు
b) సరదాలు
c) ఇళ్లు
d) ఘోరాలు
జవాబు:
d) ఘోరాలు

5. పగను నాశనం చేయాలి.
a) నిర్మూలనం
b) పెద్దది
c) చిన్నది
d) నవ్వుగా
జవాబు:
a) నిర్మూలనం

6. నిప్పుతో చెలగాటం అపాయం.
a) కాల్తుంది
b) సరదా
c) ప్రమాదం
d) ప్రమోదం
జవాబు:
c) ప్రమాదం

7. దొంగల లక్షణాలను పసిగట్టడం పోలీసులకు అలవాటు.
a) కొట్టడం
b) ఖైదు చేయడం
c) చెప్పడం
d) గ్రహించడం
జవాబు:
d) గ్రహించడం

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

8. మన పంథా మంచిది కావాలి.
a) సంపాదన
b) ఆస్తి
c) మార్గం
d) కోరిక
జవాబు:
c) మార్గం

9. పిల్లలు చిన్నపని చేసినా ఘనకార్యం చేసినట్లు పెద్దలు భావిస్తారు.
a) చెడ్డపని
b) గొప్పపని
c) మంచిపని
d) పని
జవాబు:
b) గొప్పపని

10. సముద్రపు అలలు బాగుంటాయి.
a) కెరటాలు
b) నీరు
c) చేపలు
d) ఉప్పు
జవాబు:
a) కెరటాలు

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. మఱ్ఱిచెట్టు విత్తనం చిన్నదైనా నీడ నెక్కువ ఇస్తుంది.
a) రావిచెట్టు, జువ్విచెట్టు
b) వటము, విటపి
c) తింత్రిణీ, నేరేడు
d) మఱ్ఱి, రాతి
జవాబు:
b) వటము, విటపి

12. మంచి నీరు తగినంత త్రాగాలి.
a) ఉదకం, జలం
b) క్షీరము, ఉదధి
c) జలం, జలధి
d) ఉదధి, జలధి
జవాబు:
a) ఉదకం, జలం

13. స్వచ్ఛమైన గాలి పీల్చాలి.
a) నీరు, ప్రాణం
b) ఆక్సిజన్, నత్రజని
c) వాయువు, వారము
d) పవనం, వాయువు
జవాబు:
d) పవనం, వాయువు

14. కొంతసేపు ఆడే ఆట ఉత్సాహాన్నిస్తుంది.
a) వాలీబాల్, క్రికెట్
b) కబడ్డీ, క్రికెట్
c) క్రీడ, కేళి
d) కబడ్డీ, వాలీబాల్
జవాబు:
c) క్రీడ, కేళి

15. ఒక్క క్షణంలో ప్రమాదం జరగవచ్చు.
a) సెకను, నిముషం
b) కొంచెం, కొద్ది
c) నిముషం, అరనిముషం
d) సెకను, త్రుటి
జవాబు:
d) సెకను, త్రుటి

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

16. కన్నును జాగ్రత్తగా కాపాడుకోవాలి.
a) నయనం, నేత్రం
b) అక్షం, గవాక్షం
c) దృష్టి, పుష్టి
d) నేత్రం, వేత్రం
జవాబు:
a) నయనం, నేత్రం

17. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది.
a) సొగసు, చందం
b) ఇంపు, ఇంకు
c) సొగసు, సౌందర్యం
d) లవణం, లావణ్యం
జవాబు:
c) సొగసు, సౌందర్యం

18. కసి పెంచుకోకూడదు.
a) పగ, పట్టుదల
b) కోపం, కినుక
c) పంతం, అంతం
d) ప్రేమ, ద్వేషం
జవాబు:
b) కోపం, కినుక

19. పక్షికి రెక్కలే ఆధారం.
a) పక్షము, ఎరక
b) పక్షం, ఎరుక
c) స్వపక్షం, ప్రతిపక్షం
d) కాలు, పాదం
జవాబు:
a) పక్షము, ఎరక

20. శిశిర ఋతువులో ఆకులు రాలును.
a) విస్తరాకు, విస్తరణ
b) పత్రహరితం, పత్రం
c) పర్ణశాల, పర్ణం
d) పత్రం, పర్ణము
జవాబు:
d) పత్రం, పర్ణము

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. గోదావరి గట్టుపై చల్లగా ఉంటుంది.
a) తీరము
b) దరి
c) ఘట్టము
d) ఘంటము
జవాబు:
c) ఘట్టము

22. నిజమునే మాట్లాడాలి.
a) నిక్కము
b) సత్యము
c) యథార్థం
d) జరిగినదే
జవాబు:
a) నిక్కము

23. కాకి మానవుల ఇళ్ల వద్దనే బ్రతుకుతుంది.
a) వాయసం
b) కాకాసురుడు
c) కాకము
d) కాక
జవాబు:
c) కాకము

24. మంచి నీరు వృథా చేయకూడదు.
a) ఉదకం
b) నీరము
c) జలం
d) సలిలం
జవాబు:
b) నీరము

25 మంచి కార్యమునకు సహకరించాలి.
a) కర్ణము
b) పని
c) నిర్మాణం
d) నిర్యాణం
జవాబు:
a) కర్ణము

26. పక్షి కూత మధురంగా ఉంటుంది.
a) పక్షము
b) పులుగు
c) ఖగము
d) పక్కి
జవాబు:
d) పక్కి

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

27. పుష్టినిచ్చే ఆహారమును తినాలి.
a) ఓగిరము
b) తిండి
c) భోజనం
d) అన్నము
జవాబు:
a) ఓగిరము

28. ధర్మము తప్పకూడదు.
a) దరమము
b) దమము
c) దమ్మము
d) న్యాయము
జవాబు:
c) దమ్మము

29. మనిషి ప్రవర్తన ఒక్కొక్కసారి విసుమానం కల్గిస్తుంది.
a) విసుగు
b) విస్మయము
c) విసుపు
d) చిరాకు
జవాబు:
b) విస్మయము

30. సహనము కోల్పోకూడదు.
a) సహనం
b) ఓర్పు
c) ఓర్మి
d) సయిరణ
జవాబు:
d) సయిరణ

2. వ్యాకరణాంశాలు

ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

31. రాముడు రావణుని చంపెను – దీనిలో కర్మను గుర్తించండి.
a) రాముడు
b) రావణుడు
c) చంపెను
d) అకర్మకం
జవాబు:
b) రావణుడు

32. జానకి పూలను హారంగా గ్రుచ్చింది – కర్మను గుర్తించండి.
a) పూలు
b) జానకి
c) గ్రుచ్చించి
d) హారంగా
జవాబు:
a) పూలు

33. కర్మగల వాక్యాన్ని ఏమంటారు?
a) కర్మ
b) కర్తృకం
c) సకర్మకం
d) అకర్మకం
జవాబు:
c) సకర్మకం

34. కర్మలేని వాక్యాన్ని ఏమంటారు?
a) కర్తృకం
b) కర్మకం
c) సకర్మకం
d) అకర్మకం
జవాబు:
d) అకర్మకం

35. గాలి వీచింది – ఇది ఏ రకమైన వాక్యం?
a) కర్తృకం
b) కర్మకం
c) అకర్మకం
d) సకర్మకం
జవాబు:
c) అకర్మకం

36. రావణుడు వాయువును శాశించాడు – ఇది ఏ రకమైన వాక్యం?
a) సకర్మకం
b) అకర్మకం
c) కర్మకం
d) కర్తృకం
జవాబు:
a) సకర్మకం

37. అర్జునుని కృష్ణుడు మెచ్చెను – దీనిలో కర్మ?
a) కృష్ణుడు
b) అర్జునుడు
c) మెచ్చెను
d) కర్మపదం లేదు
జవాబు:
b) అర్జునుడు

38. మనము ప్రకృతిని దైవంగా భావించాలి – కర్మపదం గుర్తించండి.
a) మనము
b) దైవంగా
c) భావించాలి
d) ప్రకృతిని
జవాబు:
d) ప్రకృతిని

39. కర్మపదం తర్వాత వచ్చే ప్రత్యయమేది?
a) ని
b) ను
c) ని, ను
d) వలన
జవాబు:
c) ని, ను

40. కర్మపదం ప్రక్కన ఏ విభక్తి ప్రత్యయం వస్తుంది?
a) ప్రథమావిభక్తి
b) ద్వితీయ
c) తృతీయ
d) చతుర్థి
జవాబు:
b) ద్వితీయ

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు

సంధులు : ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

41. నీ చేతికేమిటి ఉన్నది – సంధి పేరు గుర్తించండి.
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘసంధి
జవాబు:
c) ఇత్వసంధి

42. నాకున్నది నేను ఇస్తాను – సంధి విడదీసినది గుర్తించండి.
a) నాకు + ఉన్నది
b) నాకె + ఉన్నది
c) ఉత్వసంధి
d) ఇత్వసంధి
జవాబు:
a) నాకు + ఉన్నది

43. మరేమిటి అని అడగకు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మరు + ఏమిటి
b) మరేమి + టి
c) మరె + ఏమిటి
d) మరి + ఏమిటి
జవాబు:
d) మరి + ఏమిటి

44. రైతులందరూ వచ్చారు – సంధి పేరు గుర్తించండి.
a) రైతుల + అందరు
b) రైతులు + అందరు
c) రైతులం + దరు
d) రైతులంద + రు
జవాబు:
b) రైతులు + అందరు

45. క్రిందివానిలో ఇత్వసంధి పదం గుర్తించండి.
a) ఏమేమి
b) ఏయూరు
c) ఏమిటి
d) ఏమంటివి
జవాబు:
d) ఏమంటివి

46. క్రిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఊరూరు
b) ఊరదిగో
c) ఊరుగాయ
d) ఊరడించు
జవాబు:
b) ఊరదిగో

47. మనదే ఊరు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మనది + ఏ ఊరు
b) మనదే + ఊరు
c) మనదె + ఊరు
d) మనదు + ఊరు
జవాబు:
a) మనది + ఏ ఊరు

48. లేదని చెప్పను – గీత గీసిన సంధి పదంలో పరపదం ఏది?
a) లేదు
b) అని
c) లేదని
d) అకారం
జవాబు:
b) అని

49. ఉత్వసంధిలో పూర్వపదం చివర ఉండే అచ్చు?
a) అ
b) ఇ
c) ఉ
d) ఋ
జవాబు:
c) ఉ

50. ఉత్వసంధిలో పరపదం మొదట ఏముంటుంది?
a) ఉ
b) అ
c) ఇ
d) ఏదైనా అచ్చు
జవాబు:
d) ఏదైనా అచ్చు

నేనివి చేయగలనా?

1. పాఠాన్ని అర్థం చేసుకొని సొంత మాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠాన్ని ధారాళంగా చదవగలను. [ ఔను / కాదు ]
3. రచయిత పాఠంలో చేసిన వాక్యప్రయోగాన్ని గ్రహించి అనుసరించగలను. [ ఔను / కాదు ]
4. పరిసరాలలో ప్రాణులను గమనిస్తూ, వాటి బాధను గురించి రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

ఆచరించి చూపాలి

AP 7th Class Telugu Important Questions 4th Lesson మర్రిచెట్టు 1
ఒకసారి రామకృష్ణ పరమహంస నివసించే ఆశ్రమానికి తన ఆరేళ్ళ కుమారుడిని తీసుకొని ఒక తల్లి వచ్చింది. ‘స్వామీ ! మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు. ఈ అలవాటును వాడితో ఎలాగైనా మానిపించండి’ అని కోరింది.

రామకృష్ణ పరమహంస ఆ బాలుడి వైపు చూశారు. ఆమెతో “అమ్మా ! ఒక వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి.” అని పంపేశారు.

వారం రోజుల గడిచాయి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగానే ఆమె తన కొడుకుని తీసుకొని ఆశ్రమానికి వచ్చింది. “అమ్మా ! మరో వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకొని మళ్ళీ నా వద్దకు రండి”. అని ‘చెప్పి పంపారు.

మూడోసారి ఆ మహిళ తన బాలుడిని తీసుకెళ్ళింది. అప్పుడు పరమహంస బాబుతో “బాబూ ! తీపి తినొద్దు” అని చెప్పారు. దానికి బాలుడు అలాగేనంటూ తల ఊపి తీపి తినడం మానేశాడు. ఆ తల్లి ఎంతగానో సంతోషించి మరోసారి రామకృష్ణ పరమహంసను కలవడానికి ఆశ్రమానికి వెళ్ళింది. “స్వామీ ! మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు. చాలా సంతోషం కానీ ఇలా చేయడానికి రెండు వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు” అంది.

రామకృష్ణ పరమహంస ఆమెతో “అమ్మా ! మీరు నా దగ్గరకు మొదటిసారిగా వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది. నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదని: చెప్పే అర్హత నాకు ఉంటుంది. ఆ అలవాటు మానుకోవడానికి నాకు రెండు వారాల సమయం పట్టింది. అందుకే అలా చెప్పాను. ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పేముందు మనం సక్రమంగా ఉండాలి కదా ! మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు. ‘చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు’ అని వివరణ ఇచ్చారు.

వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆఘ్రాణిస్తే కలిగే ఆ అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది. – సుబ్రహ్మణ్య భారతి

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

These AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 1st Lesson Important Questions and Answers అక్షరం

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గేయాలు

కింది గేయాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. నా గుండె గవాక్షాల్లోనే కాదు
మూసిన నా కనురెప్పలపై కూడా
అక్షరాలు కవాతు చేస్తుంటాయ్
నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయ్
ప్రశ్నలు – జవాబులు :
అ) గవాక్షం అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కిటికి

ఆ) కవాతు అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కసరత్తు

ఇ) నిద్రాభంగం చేసేవి ఏవి?
జవాబు:
అక్షరాలు

ఈ) నిరంతరం అంటే ఏమిటి?
జవాబు:
ఎల్లప్పుడు

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

2. ఇప్పుడు
ప్రతి అక్షరంలోనూ అమ్మే కన్పిస్తుంది
నన్నో అక్షరాల పుట్టని చేసిన
అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా
మరేమివ్వగలను?
ప్రశ్నలు – జవాబులు :
అ) అమ్మ ఎక్కడ కన్పిస్తోంది?
జవాబు:
ప్రతి అక్షరంలోను

ఆ) పై గేయంలో ‘నన్ను’ అంటే ఎవరు?
జవాబు:
కవిని

ఇ) అమ్మకు ఏమి ఇవ్వగలను అని చెప్పాడు?
జవాబు:
అమ్మ చెప్పినట్లు బాగా చదవడమే

ఈ) అక్షరాల పుట్ట అంటే ఏమిటి అర్థం?
జవాబు:
జ్ఞాని

అపరిచిత గేయాలు

1. క్రింది గేయ కవిత చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
కంచి రాజధానిగా పాలించాడు.
మంచి రేవు పట్నంగా కట్టించాడు
తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు
పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) మహాబలిపురం ఎవరు కట్టించారు?
జవాబు:
మహాబలిపురంను పల్లవరాజు కట్టించాడు.

ఆ) పల్లవుల రాజధాని ఏది?
జవాబు:
పల్లవుల రాజధాని కంచి.

ఇ) అక్కడి శిల్పులెవరు?
జవాబు:
అక్కడి శిల్పులు తెలుగువారు.

ఈ) శిల్పాలుగా వేటిని చెక్కేరు?
జవాబు:
శిలలను శిల్పాలుగా చెక్కేరు.

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

2. క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండ పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఆడంబరంగా ఎవరు పలుకుతారు?
జవాబు:
ఆడంబరంగా అల్పుడు పలుకుతాడు.

ఆ) చల్లగా పలికేదెవరు?
జవాబు:
సజ్జనుడు చల్లగా పలుకుతాడు.

ఇ) బాగా మ్రోగేదేది?
జవాబు:
కంచు బాగా మ్రోగుతుంది.

ఈ) సరిగ్గా మ్రోగనిదేది?
జవాబు:
కనకం సరిగా ఛాగదు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
కవికి నిద్రాభంగం ఎందుకు కలుగుతోంది?
జవాబు:
కవి హృదయంలో అక్షరాల గురించిన ఆలోచనే ఉంది. నిద్రించే సమయానికి ఆయన కనురెప్పలపై అక్షరాలు కవాతు చేస్తున్నాయి. అందుచేతనే ఆయనకు నిద్రాభంగం కలుగుతోంది.

ప్రశ్న 2.
పంతులమ్మ గారి బుజోణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
పంతులమ్మ గారంటే ఉపాధ్యాయురాలు. సాధారణంగా తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. వారిని అనుకరిస్తారు. కవిగారి తల్లి ఉపాధ్యాయురాలు. కనుక ఆమె నిరంతరం పిల్లలకు చదువు చెబుతూనే గడుపుతారు. తల్లి కూడా ఉండే పిల్లవాడికి (కవికి) కూడా అక్షరాలతో అంటే చదువుతో అనుబంధం ఏర్పడిందని చెప్పడాన్నే అలా అన్నారు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
అమ్మకు అక్షరాన్నవ్వడం అంటే మీకేమి అర్థమయిందో వివరించండి.
జవాబు:
కవిగారి తల్లి ఉపాధ్యాయురాలు. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. అందుకే బాల్యంలో అన్నప్రాశననాడు కవి కలం పట్టుకొంటే ఆమె చాలా ఆనందించింది. బిడ్డను ముద్దులు పెట్టుకొంది. కవికి నిరంతరం చదువు పై ధ్యాస నిలబడేలా చేసింది. చదువుపై ఇష్టం పెంచింది. చదువుకుంటే దేనినైనా సాధించగలం అనే భావం కలిగించింది. ఆమెకు అన్నిటికంటే అక్షరం విలువైనదని తెలుసు. అందుకే కవి తన తల్లికి అక్షరాన్ని ఇవ్వాలనుకొన్నాడు. అంటే తనొక జ్ఞానమూర్తిగా తయారై తనను తాను తల్లికి సమర్పించుకోవాలనుకున్నాడు.

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

ప్రశ్న 2.
అమ్మ లచ్చరాల కంబళి కప్పిందేమో అంటే మీకేమీ అర్థమయింది?
జవాబు:
అమ్మ ఒక ఉపాధ్యాయురాలు. చదువు చెప్పడమంటే ఆమెకు చాలా ఇష్టం. తన బిడ్డకు తానే చదువు చెప్పుకొనేది. విద్య యొక్క విలువను తెలియజేసే ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పేది. నిద్రపోయే ముందు పిల్లలకు తల్లులు జోలపాటలు పాడతారు. కథలు చెబుతారు. కవి గారి బాల్యంలో ఆయనను నిద్రపుచ్చడానికి వాళ్లమ్మగారు చదువు విలువను తెలియజేసే జోలపాటలనే పాడి ఉంటారు. చదువుకుంటే లభించే గౌరవం, జ్ఞానం, బ్రతుకు తెరువు మొదలైన వాటి గురించి కథలు చెప్పేవారు. అందుచేతనే తన తల్లి అచ్చరాల కంబళి కప్పిందన్నారు.

III. భాషాంశాలు

సొంతవాక్యాలు:

1. గుండె = హృదయం
సొంతవాక్యం : తల్లి గుండె నిండా పిల్లలపై ప్రేమే ఉంటుంది.

2. కవాతు = కసరత్తు
సొంతవాక్యం : సరిహద్దు గ్రామాలలో సైన్యం కవాతు చేసింది.

3. కలలు = స్వప్నాలు
సొంతవాక్యం : భవిష్యత్తు గురించి కలలు కనాలి. కృషి చేయాలి.

4. అన్నప్రాశన = తొలిసారి అన్నం తినిపించడం.
సొంతవాక్యం : అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం తినిపిస్తే ఎలా?

5. పుట్ట = నిలయం
సొంతవాక్యం : వాడొక అబద్దాల పుట్ట.

పర్యాయపదాలు

గుండె = గుండియ, హృదయం
అక్షరము = అక్కరము, వర్ణము
నిరంతరం = ఎల్లప్పుడు, ఎప్పుడు
తావు = ప్రదేశం, చోటు
రాత్రి = రాతిరి, రేయి
పంతులమ్మ = ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాలు
ఇల = భూమి, పుడమి
ముద్దు = చుంబ, చుంబనము
పుట్ట = వల్మీకము, వామలూరము
గవాక్షం = కిటికి, వాతాయనము
కనురెప్ప = కందెర, రెప్ప
నిద్ర = కునుకు, శయనము
కల = స్వప్నము, స్వపము
ఒళ్లు = శరీరం, దేహం
కలం = గంటము, పెన్ను
ఆనందం = సంతోషం, ఆహ్లాదం
ముద్దర = గుర్తు, ఆనవాలు

ప్రకృతి – వికృతి

భంగము – బన్నము

సంధులు

చేస్తుంటాయ్ = చేస్తు + ఉంటాయ్
అక్షరాలంటని = అక్షరాలు + అంటని
ఎంతైనా = ఎంత + ఐనా
పంతులమ్మ = పంతులు + అమ్మ
అక్షరానుబంధం = అక్షర + అనుబంధం
ఉండదా = ఉండదు + ఆ
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
బాగుందని = బాగ + ఉంది + అని
ఒళ్ళంతా = ఒళ్లు + అంతా
నింపిందట = నింపింది + అట
ముద్దర్లున్నట్లుంది = ముద్దర్లు + ఉన్న + అట్లు + ఉంది
అమ్మే = అమ్మ + ఏ
కన్పిస్తుంది = కన్పిస్తు + ఉంది
రానన్నావు = రాను + అన్నావు
నేనెప్పుడు = నేను + ఎప్పుడూ
రావద్దని = రావద్దు + అని
ఊరూరు = ఊరు + ఊరు
అమ్మమ్మ = అమ్మ + అమ్మ

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. జగమునకు మేలు చేయాలి.
a) లోకము
b) తల్లి
c) తండ్రి
d) స్నేహితుడు
జవాబు:
a) లోకము

2. మాతను ఎదిరించకూడదు.
a) తండ్రి
b) గురువు
c) తల్లి
d) పెద్ద
జవాబు:
c) తల్లి

3. భారతదేశం ధర్మానికి నిలయం.
a) రక్షణ
b) శ్రమ
c) ఆశ్రయం
d) స్థానం
జవాబు:
d) స్థానం

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

4. మునులు జ్ఞానమూర్తులు.
a) ఋషులు
b) గురువులు
c) రాజులు
d) మిత్రులు
జవాబు:
a) ఋషులు

5. పామరులుగా ఉండకూడదు.
a) పండితులు
b) తెలివి తక్కువవారు
c) విద్యార్థులు
d) పిల్లలు
జవాబు:
b) తెలివి తక్కువవారు

6. గుండెను పదిలంగా కాపాడుకోవాలి.
a) గుండు
b) పొట్ట
c) హృదయం
d) కాలేయం
జవాబు:
c) హృదయం

7. గదికి గవాక్షం చాలా అవసరం.
a) కిటికి
b) గోడ
c) తలుపు
d) ఫ్యాను
జవాబు:
a) కిటికి

8. మంచి పనిని భంగం చేయకూడదు.
a) ఆలస్యం
b) ఆటంకం
c) పూర్తి
d) తొందరగా
జవాబు:
b) ఆటంకం

9. మన తావును మనం శుభ్రం చేసుకోవాలి.
a) ఇల్లు
b) బడి
c) ఆస్తి
d) ప్రదేశం
జవాబు:
d) ప్రదేశం

10. మంచి వారితో అనుబంధం పెంచుకోవాలి.
a) ఎడతెగని సంబంధం
b) స్నేహం
c) విరోధం
d) కోపం
జవాబు:
a) ఎడతెగని సంబంధం

11. పంతులమ్మ గారు చెప్పినట్లు వినాలి.
a) అమ్మ
b) బ్రాహ్మణ స్త్రీ
c) ఉపాధ్యాయురాలు
d) దేవత
జవాబు:
c) ఉపాధ్యాయురాలు

12. శీతాకాలం కంబళి అవసరం.
a) చొక్కా
b) వెచ్చదనం
c) బొంత
d) రగ్గు
జవాబు:
d) రగ్గు

13. అన్నప్రాశన నాడే ఆవకాయ పెడితే ఎలా?
a) అన్నం తినడం
b) శిశువుకు తొలిసారి అన్నం తినిపించడం
c) బువ్వ
d) చంటి పిల్లల భోజనం
జవాబు:
b) శిశువుకు తొలిసారి అన్నం తినిపించడం

14. ఇలలో అన్నీ ఉన్నాయి.
a) భూమి
b) ఆకాశం
c) సముద్రం
d) భారతదేశం
జవాబు:
a) భూమి

15. ఒళ్లు రోజూ తోముకోవాలి.
a) కాళ్లు
b) శరీరం
c) పళ్లు
d) ముఖం
జవాబు:
b) శరీరం

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

16. పర్వతముపై క్రూరమృగాలుంటాయి.
a) గిరి, కొండ
b) అడవి, కోన
c) కొండ, కోన
d) ఏరు, కాల్వ
జవాబు:
a) గిరి, కొండ

17. అరణ్యములో చాలా చెట్లు ఉంటాయి.
a) పర్వతం, కొండ
b) అడవి, కాన
c) చెట్టు, తరువు
d) కలప, జిగురు
జవాబు:
b) అడవి, కాన

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

18. చదువుతో జ్ఞానం పెరుగుతుంది.
a) డబ్బు, సంపద
b) తెలివి, మేధ
c) అజ్ఞానం, వివేకం
d) పదవి, హోదా
జవాబు:
b) తెలివి, మేధ

19. గురువులను గౌరవించాలి.
a) పెద్దలు, వృద్ధులు
b) ఉపాధ్యాయులు, చదువు చెప్పేవారు
c) ప్రధానోపాధ్యాయులు, అధికారులు
d) ఉపాధ్యాయుడు, బృహస్పతి
జవాబు:
b) ఉపాధ్యాయులు, చదువు చెప్పేవారు

20. దేవతలు వరాలిస్తారు.
a) సురలు, అసురులు
b) అసురులు, అమరులు
c) సురలు, అమరులు
d) కిన్నెరులు, మరులు
జవాబు:
c) సురలు, అమరులు

21. తల్లికి గుండె నిండా ప్రేమ ఉంటుంది.
a) హృదయం, ఎద
b) మనసు, ఆత్మ
c) ఆలోచన, యోచన
d) అంతరంగం, లోపల
జవాబు:
a) హృదయం, ఎద

22. ఇంటికి గవాక్షము వలన గాలి, వెలుతురు వస్తుంది.
a) కిటికీ, వాతాయనము
b) తలుపు, ద్వారం
c) గుమ్మం, వాకిలి
d) ద్వారము, గుమ్మం
జవాబు:
a) కిటికీ, వాతాయనము

23. కన్నును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
a) నయనం, చెవి
b) కర్ణం, శ్రోత్రం
c) నయనం, నేత్రం
d) మూడవకన్ను, ఫాలనేత్రం
జవాబు:
c) నయనం, నేత్రం

24. నిరంతరం మంచినే చేయాలి.
a) అప్పుడు, ఇప్పుడు
b) ఎల్లప్పుడు, ఎప్పుడు
c) అప్పుడప్పుడు, అక్కడక్కడ
d) అంతరం, అంతరంగం
జవాబు:
b) ఎల్లప్పుడు, ఎప్పుడు

25. నిద్ర పోయేవారిని అకస్మాత్తుగా లేపకూడదు.
a) మత్తు, మగత
b) కల, స్వప్నం
c) మగద, మగత
d) నిదుర, కునుకు
జవాబు:
d) నిదుర, కునుకు

26. కలం కత్తి కంటె పదునైనది.
a) పెన్ను, అక్షర జనని
b) పెన్ను, పెన్సీలు
c) అక్షరం, అంకె
d) వ్రాసేది, పెన్ను
జవాబు:
a) పెన్ను, అక్షర జనని

27. అన్నము వృథా చేయకూడదు.
a) తిండి, తినడం
b) భోజనము, ఆహారము
c) ఆహారము, నీరు
d) తిండి, బట్ట
జవాబు:
b) భోజనము, ఆహారము

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

28. అమ్మను ఎదిరించకూడదు.
a) తల్లి, దైవం
b) ఉపాధ్యాయురాలు, తల్లి
c) జనని, జనకుడు
d) జనని, తల్లి
జవాబు:
d) జనని, తల్లి

29. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
a) విచారం, సంతోషం
b) సంతోషం, సంతాపం
c) సంతోషం, మోదము
d) సంతోషం, మోదకము
జవాబు:
c) సంతోషం, మోదము

30. ఎవరి ఒళ్లు వారికి అందంగా కనబడుతుంది.
a) శరీరం, దేహం
b) ముఖం, వదనం
c) కళ్లు, నయనాలు
d) పళ్లు, రదనములు
జవాబు:
a) శరీరం, దేహం

ప్రకృతి-వికృతులు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

31. అమ్మకు సాటి వచ్చే దైవం లేదు.
a) మాత
b) తల్లి
c) జనని
d) అంబ
జవాబు:
d) అంబ

32. జమున నీరు నల్లగా ఉంటుంది.
a) గజము
b) యమున
c) యముడు
d) గోదావరి
జవాబు:
b) యమున

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

33. మా చేలో రతనాలు పండాయి.
a) రత్నాలు
b) ధాన్యం
c) గోధుమలు
d) వరి
జవాబు:
a) రత్నాలు

34. కడుపు నిండా అన్నం తినాలి.
a) పొట్ట
b) గర్భము
c) ఉదరము
d) బొజ్జ
జవాబు:
b) గర్భము

35. ఎవరు అడిగినా భిక్షము వేయాలి.
a) బిచ్చము
b) ముష్టి
c) ధాన్యం
d) దానం
జవాబు:
a) బిచ్చము

36. అక్షరం నేర్చుకో, భవిత మార్చుకో.
a) అక్కరం
b) అక్షయం
c) క్షరం
d) క్షవరం
జవాబు:
a) అక్కరం

37. నిద్ర తగినంత ఉండాలి.
a) నిద్దర
b) నిదుర
c) నిద్దు
d) నిధ్ర
జవాబు:
b) నిదుర

38. చంటి పిల్లలు ముద్దుగా ఉంటారు.
a) ముద్రా
b) ముగ్ధ
c) ముగుద
d) ముగ్ధము
జవాబు:
a) ముద్రా

39. రాత్రి ఒంటరిగా తిరగకూడదు.
a) రాతిరి
b) రాతిరి
c) రాతిర్రి
d) రాత్రము
జవాబు:
a) రాతిరి

2. వ్యాకరణాంశాలు

క్రింద గీత గీసిన పదాలకు కోరిన రూపం గుర్తించి వ్రాయండి.

40. రాముడు + అతడు – దీనిలో రాముడు అనేది?
a) పూర్వపదం
b) పరపదం
c) పదం
d) పదాంతరం
జవాబు:
a) పూర్వపదం

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

41. కృష్ణుడితడు – దీనిలో ఇతడు అనేది?
a) పూర్వరూపం
b) పరరూపం
c) పూర్వపదం
d) పరపదం
జవాబు:
d) పరపదం

42. ఆమేది దీనిలో, ఉన్న పదాల సంఖ్య?
a) 1
b) 2
c) 3
d) 4
జవాబు:
b) 2

43. రామన్న – దీనిని విడదీసిన రూపం?
a) రాము + అన్న
b) రామయ్య + అన్న
c) రామ + అన్న
d) రామ్ + అన్న
జవాబు:
c) రామ + అన్న

44. ఏమది – దీనిలో పరపదం ఏది?
a) ఏమి
b) అది
c) ఏమది
d) ఏదీకాదు
జవాబు:
b) అది

45. అమ్మదిగో – దీనిలో పూర్వపదం ఏది?
a) అమ్మదిగో
b) అదిగో
c) అమ్మ
d) అమ్మది
జవాబు:
c) అమ్మ

46. ఎందరెందరు – దీనిలో పూర్వ పర పదాలు?
a) ఒకటే
b) రెండు రకాలు
c) మూడు పదాలు
d) నాల్గు పదాలు
జవాబు:
a) ఒకటే

47. మీరెవరు? – దీనిలో పరపదం ఏది?
a) మీరు
b) ఎవరు
c) మీరెవరు
d) మీరే
జవాబు:
b) ఎవరు

48. అక్కడున్నది – దీనిలో పూర్వపదం ఏది?
a) అక్కడు
b) అక్కడే
c) అక్కడున్న
d) అక్కడ
జవాబు:
d) అక్కడ

49. ఈ ఇల్లెవరిది – దీనిలో పూర్వపదమేది?
a) ఈ
b) ఈ ఇల్లు
c) ఈ ఇల్లే
d) ఎవరిది
జవాబు:
b) ఈ ఇల్లు

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

సంధి విడదీయుట : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన రూపాలు గుర్తించండి.

50. అమ్మంటే దైవం – విడదీసిన రూపమేది?
a) అమ్మ + టే
b) అమ్మా + అటె
c) అమ్మే + అంటే
d) అమ్మ + అంటే
జవాబు:
d) అమ్మ + అంటే

51. భారతమంటే కౌరవ పాండవుల కథ విడదీయండి.
a) భారతం + అంటే
b) భారతము + అంటే
c) భారతమ + అంటే
d) భారతంబు + అంటే
జవాబు:
b) భారతము + అంటే

52. అతడొక్కడే వచ్చాడు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అతడా + ఒక్కడే
b) అతడె + ఒక్కడే
c) అతడు + ఒక్కడే
d) అతడూ + ఒక్కడే
జవాబు:
c) అతడు + ఒక్కడే

53. ఏమైనది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) ఏమి + ఐనది
b) ఏమై + నది
c) ఏమి + అయినది
d) ఏమైన + ది
జవాబు:
a) ఏమి + ఐనది

54. చాలా శ్రమౌతోంది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) శ్రమా + అవుతోంది
b) శ్రమే + ఔతోంది
c) శ్రమ + ఔతోంది
d) శ్రమము + ఔతోంది
జవాబు:
c) శ్రమ + ఔతోంది

55. నేనోడిపోను – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) నేనూ + ఓడిపోను
b) నేను + ఓడిపోను
c) నేనె + ఓడిపోను
d) నేనోడి + పోను
జవాబు:
b) నేను + ఓడిపోను

56. మనూరు పోదాం – విడదీసిన రూపం గుర్తించండి.
a) మనూ + ఊరు
b) మనదు + ఊరు
c) మనం + ఊరు
d) మన + ఊరు
జవాబు:
d) మన + ఊరు

57. కాకీక కాకిదే కదా ! – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) కాకీ + క
b) కాకి + ఈక
c) కాకి + ఇక
d) కాకీ + ఇక
జవాబు:
b) కాకి + ఈక

58. తెల్లావు పాలెక్కువిస్తోంది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) తెల్ల + ఆవు
b) తెల్లని + ఆవు
c) తెల్లటి + ఆవు
d) తెల్లదైన + ఆవు
జవాబు:
a) తెల్ల + ఆవు

59. మరొకడు సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మరు + ఒకడు
b) మరీ + ఒకడు
c) మరి + ఒకడు
d) మరి + ఓకడు
జవాబు:
c) మరి + ఒకడు

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

సంధి కలుపుట : క్రింది వానికి సంధి కలిసిన రూపం గుర్తించి వ్రాయండి.

60. రాధ + ఏది అని అడిగారు.
a) రాధది
b) రాధేది
c) రాధేది
d) రాధయేది
జవాబు:
b) రాధేది

61. మన + అందరం ఒకటే.
a) మనందరం
b) మనమందరం
c) మనాందరం
d) మనం అందరం
జవాబు:
a) మనందరం

62. అలా కళ్లు + అప్పగించి చూస్తున్నావేం?
a) కళ్ళప్పగించి
b) కళ్లు ఒప్పగించి
c) కళ్లు అప్పగించి
d) కళ్లప్పగించి
జవాబు:
a) కళ్ళప్పగించి

63. కాకి + అమ్మ కథలు చెప్పకు.
a) కాకియమ్మ
b) కాకొమ్మ
c) కాకిమ్మ
d) కాకమ్మ
జవాబు:
d) కాకమ్మ

64. ఏమి + ఔతుంది అని అడగకు.
a) ఏమౌతోంది
b) ఏమియౌతుంది
c) ఏమౌతుంది
d) ఏమి ఔతుంది
జవాబు:
c) ఏమౌతుంది

65. వాడు + ఒక్కడే అన్నీ చేయాలా?
a) వాడు ఒక్కడే
b) వాడొక్కడే
c) వాడువొక్కడే
d) వాడూ ఒక్కడే
జవాబు:
b) వాడొక్కడే

66. బలము + ఉందని గర్వపడకు
a) బలముందని
b) బలముంటుందని
c) బలము ఉందని
d) బలం ఉందని
జవాబు:
a) బలముందని

67. గురువులకు + ఎప్పుడూ నమస్కరించాలి.
a) గురువులకునెప్పుడూ
b) గురువులకెప్పుడూ
c) గురువులకె ఎప్పుడూ
d) గురువులకు ఎప్పుడూ
జవాబు:
b) గురువులకెప్పుడూ

68. గొడవ + ఔతుంది కదా!
a) గొడవ ఔతుంది
b) గొడవవుతుంది
c) గొడవౌతుంది
d) గొడవే ఔతుంది
జవాబు:
c) గొడవౌతుంది

69. ఔతుంది + అని ధీమాగా ఉండకు.
a) ఔతుందియని
b) ఔతుందిఅని
c) ఔతుందే అని
d) ఔతుందని
జవాబు:
d) ఔతుందని

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

క్రింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయం గుర్తించి వ్రాయండి.

70. చంద్రు ……….. వెన్నెల చల్లగా ఉంటుంది.
a) ను
b) డు
c) ని
d) లో
జవాబు:
c) ని

71. వనము ………… ఏనుగులు పాడుచేశాయి.
a) ను
b) ని
c) డు
d) ల
జవాబు:
a) ను

72. పుస్తకము ………. విలువ తెలుసుకోండి.
a) ని
b) ను
c) తో
d) ల
జవాబు:
d) ల

73. ఎవరిని ……….. మాట్లాడుతున్నావు?
a) ని
b) ను
c) గూర్చి
d) యొక్క
జవాబు:
c) గూర్చి

74. రాముని ………… రామాయణంలో వ్రాశారు.
a) గురించి
b) యొక్క
c) తో
d) వలన
జవాబు:
a) గురించి

75. గురువుల ……….. గౌరవించు.
a) ని
b) ను
c) గూర్చి
d) గురించి
జవాబు:
b) ను

76. తల్లి ………….. గౌరవించాలి.
a) యొక్క
b) ను
c) ని
d) తో
జవాబు:
c) ని

77. సముద్రము ………. హనుమంతుడు దాటెను.
a) ని
b) ను
c) లో
d) ల
జవాబు:
b) ను

78. భారతము ……….. వ్యాసమహర్షి రచించెను.
a) న
b) ల
c) ను
d) యొక్క
జవాబు:
c) ను

AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం

79. భారతంలో పాండవుల ………… వ్రాసెను.
a) కథ
b) చరిత్ర
c) ను
d) గురించి
జవాబు:
d) గురించి

నేనివి చేయగలనా?

1. పాఠం అర్థం చేసుకుని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠాన్ని ధారాళంగా చదవగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదాలను సొంతవాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. అమ్మ ప్రేమ గురించి నా మాటలలో రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

దేశభక్తి

ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు నలుగురు కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఈ పిల్లలకు చదువుకొనే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లుకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుండేదని భావించేవారు.

తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్ని గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాడు. కొడుకులు నలుగురు ఆస్తి పంపకానికి సిద్ధమయి ఒకచోట సమావేశం అయ్యారు. స్వేచ్ఛ లభించింది గనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుశల ప్రశ్నలయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు.

చంద్రశేఖర్ వారు చెప్పినదంతా ఓపికగా విని “మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను. అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి” అని ఇలా చెప్పసాగాడు. “భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటీష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లా ప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీథుల్లో విగ్రహాలు పెట్టడం కాదు ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న” అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా విన్న నలుగురు కొడుకులు తమ తప్పును తెలిసికొని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలసి మెలసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమయింది.

నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష – తెలుగు భాష – హెన్రీ మోరిస్

AP Board 7th Class Telugu Important Questions and Answers

Andhra Pradesh SCERT AP State Board Syllabus 7th Class Telugu Chapter Wise Important Questions and Answers are part of AP Board 7th Class Textbook Solutions.

Students can also read AP Board 7th Class Telugu Solutions for exam preparation.

AP State Board Syllabus 7th Class Telugu Important Questions and Answers

AP 7th Class Telugu Important Questions and Answers New Syllabus

7th Class Telugu Important Questions Sem 1

AP 7th Class Telugu Important Questions Sem 2

AP 7th Class Telugu Chapter Wise Important Questions (Old Syllabus)

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

These AP 8th Class Biology Important Questions 5th Lesson కౌమార దశ will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 5th Lesson Important Questions and Answers కౌమార దశ

ప్రశ్న 1.
కౌమారదశను ఒడిదుడుకులతో కూడిన దశ అని అంటారు ఎందుకు ?
జవాబు:

  1. కౌమారదశ ఒడిదుడుకులతో కూడిన దశ.
  2. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లలు శైశవదశను దాటి కౌమారదశలో ప్రవేశిస్తుంటారు.
  3. ఈ దశలో వచ్చే శారీరక మార్పులు పిల్లల్ని ఒత్తిడికి గురిచేస్తాయి.
  4. తాము ‘పిల్లలా’ ‘పెద్దలా’ అనేది నిర్ణయించుకోలేరు.
  5. మనిషి జీవితంలో ఇది సంశయానికి, సందిగ్గానికి, మార్పుకు గురయ్యే దశ.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 2.
కౌమారదశలో బాలురు, బాలికల్లో వచ్చే శారీరక మార్పులు ఏమిటి ? (లేదా)
కౌమారదశలో మార్పులు అబ్బాయిలలో, అమ్మాయిలలో వేరువేరుగా ఉంటాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:

  1. కౌమారదశలో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి.
  2. అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో భుజాలు వెడల్పుగా మారడం గమనించే ఉంటారు.
  3. అలాగే అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారడం కూడా గమనించి ఉంటారు.
  4. అమ్మాయిలలో ఈ మార్పు తరువాతి కాలంలో బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది.
  5. అబ్బాయిలలో కండరాలు గట్టిబడతాయి.
  6. అమ్మాయిలలో సుకుమారతనం పెరుగుతుంది.
  7. అంటే కౌమారదశలో జరిగే మార్పులు అబ్బాయిల్లో, అమ్మాయిల్లో వేరువేరుగా ఉంటాయన్నమాట.

ప్రశ్న 3.
ఋతుచక్రం గురించి రాయండి.
జవాబు:

  1. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 10-12 సంవత్సరాల వయస్సు మధ్యలో మొదలై సుమారుగా 45-50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
  2. కౌమారదశలో ప్రవేశించగానే అండం పరిపక్వం చెంది విడుదల కావడం మొదలవుతుంది.
  3. ప్రతి బీజకోశం నుండి నెలకోసారి ఒక అండం విడుదలవుతుంది.
  4. ఒక నెలలో కుడి బీజకోశం నుండి అండం విడుదలైతే దాని తరువాత నెలలో ఎడమ బీజకోశం నుండి అండం విడుదలౌతుంది.
  5. ఇది శుక్రకణంతో కలిసినట్లయితే ఫలదీకరణం జరుగుతుంది.
  6. ఈ సమయంలో గర్భాశయ కుడ్యాలు ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించేందుకు వీలుగా మందంగా తయారవుతాయి.
  7. ఫలితంగా స్త్రీలు గర్భం ధరించగలుగుతారు.
  8. ఫలదీకరణ జరగకపోతే, అండం మరియు గర్భాశయ కుడ్యం పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదల అవుతాయి.
  9. దీన్నే ఋతుచక్రం లేదా బహిష్టుకావడం (Menstruation) అని అంటారు. ఇది ఒక సహజమైన ప్రక్రియ.

ప్రశ్న 4.
ఋతుచక్రంపై సమాజంలో గల అపోహలు ఏమిటి ? వీటిని నీవు ఎలా ఖండిస్తావు ?
జవాబు:

  1. కొన్ని సమాజాలలో బహిష్టు సమయంలో స్త్రీలు ఇతరులను తాకడం పాపం అని భావిస్తారు.
  2. వాళ్ళని స్నానం చేయడానికి గాని, వంటచేయడానికి గాని అనుమతించరు.
  3. ఆ సమయంలో పాఠశాలకి కూడా అనుమతించకపోవడం వలన చదువులో కూడా వెనుకబడతారు.
  4. కొంతమంది వాళ్ళను ఇండ్లలోనికి కూడా అనుమతించరు.

ఇలాంటి వివక్ష స్త్రీలకు మేలు చేస్తుందా ?
1. దీనిపై చాలా పరిశోధనలు జరిపి, చివరికి పరిశోధకులు తేల్చింది ఏమిటంటే ఋతుచక్రం ఒక సహజ ప్రక్రియ. ఇలా స్త్రీల పట్ల వివక్షత చూపించడంలో మూఢనమ్మకం తప్ప ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏ రక్తం అయితే బయటకు విడుదలవుతుందో అదే రక్తం ఒకవేళ ఫలదీకరణ జరిగినట్లయితే బిడ్డ పెరుగుదలకు తోడ్పడుతుంది.
2. మరి అదే రక్తం ఋతుచక్రం ద్వారా విడుదలయ్యేటప్పుడు మాత్రం ఎట్లా కలుషితం అవుతుంది.
3. ఇటువంటి మూఢనమ్మకాల వల్ల ప్రయోజనం కలుగకపోగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వలన స్త్రీలలో అనేక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 5.
హార్మో న్స్ అనగా నేమి ? వాటి ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:

  1. అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళగ్రంథులు అని కూడా అంటారు.
  2. ఈ గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలను “హార్మోన్లు” అంటారు.
  3. ఈ హార్మోన్లు మానవ శరీరంలో కొన్ని జీవక్రియలను నియంత్రిస్తాయి.
  4. ఉదా : శరీరంలో చక్కెర, కాల్షియం, లవణాల వంటి పదార్థాల పరిమాణం నియంత్రించడం.
  5. ఇవి శరీరంలో నీటి పరిమాణాన్ని కూడా నియంత్రిస్తాయి.
  6. ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదలలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.
  7. ఋతుచక్ర ప్రారంభం ఆగిపోవడం, గర్భధారణ, పాల ఉత్పత్తి మొదలగునవన్నీ వీటి నియంత్రణలోనే జరుగుతాయి.
  8. బాలబాలికలలో కనిపించే ద్వితీయ లైంగిక లక్షణాలన్నీ హార్మోన్ ప్రభావం వల్లనే కలుగుతాయి.

ప్రశ్న 6.
మన శరీరంలోని కొన్ని వినాళ గ్రంథులు, వాటి హార్మోన్స్, ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 1

ప్రశ్న 7.
కౌమార దశలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ? (లేదా) కౌమార దశలో తీసుకోవలసిన సంతులిత ఆహారాన్ని గురించి వివరించండి.
జవాబు:

  1. సంతులిత ఆహారంలో తగు పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్రొవ్వు పదార్థాలు మరియు విటమిన్లు కలిగి ఉంటాయి.
  2. మన దేశీయ ఆహారపదార్థాలైన, రోటి, అన్నం, పప్పు, తృణధాన్యాలు కాయగూరల్లో ఈ పదార్థాలు తగు మోతాదులో ఉంటాయి.
  3. కనుక వీటిని తగు పరిమాణంలో తీసుకోవాలి. ఇనుము (Iron) రక్తకణాల తయారీలో తోడ్పడుతుంది.
  4. కనుక ఐరన్ లభ్యమయ్యే పదార్థాలైన ఆకుకూరలు, బెల్లం, మాంసం, సిట్రస్ జాతికి చెందిన ఫలాలు, ఉసిరికాయలు వంటివి కూడా తీసుకోవడం ఈ దశలో అవసరం.

ప్రశ్న 8.
జంక్ ఫుడ్స్ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ?
జవాబు:

  1. కౌమార వయస్సులో ఆకలి తట్టుకోలేక రకరకాల ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్, చిప్స్, స్నాక్స్ అంగడిలో అమ్మే ఆహార – పదార్థాలు తినడానికి ఇష్టపడతారు.
  2. కానీ ఇవేవీ సరైన పోషకాలను అందించలేవు.
  3. కాబట్టి ఇవేవీ సంతులిత ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.
  4. వీటిని రోజూ తీసుకొంటే శరీరబరువు పెరిగి స్థూలకాయానికి (Obesity) గురయ్యే అవకాశం ఉంది.
  5. వీటిని ఎక్కువగా తింటే కడుపులో పుండ్లు, రక్తంలో చక్కెర శాతం పెరగడం, ఒత్తిడి, రక్తపోటు వంటివి కలుగుతాయి.
  6. కాబట్టి కౌమారులు జంక్ ఫుడ్ తినేటప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. ‘వద్దని’ చెప్పాలి.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 9.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ఆవశ్యకత ఏమిటి ? (లేదా) కౌమార దశలో వున్న నీవు ఆరోగ్యంగా వుండుటకు పరిశుభ్రతను ఎలా పాటిస్తావు ?
జవాబు:

  1. కౌమారదశలో స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయటం వలన శరీరం నుండి ఘాటైన చెమట వాసన వస్తూ ఉంటుంది.
  2. కాబట్టి ఈ దశలో ఉన్నవారు రోజుకి రెండుసార్లు శుభ్రంగా స్నానం చేయడం మంచిది.
  3. ప్రతిరోజు అన్ని శరీర అవయవాలు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం, ఉతికిన లోదుస్తులు ధరించడం మంచిది.
  4. ఒక వేళ ఇలా చేయకపోతే రకరకాల శిలీంధ్రాల వలన, బ్యా క్టీరియాల వలన జబ్బులు వస్తాయి.
  5. ఋతుచక్రం సమయంలో అమ్మాయిలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం.
  6. వాడిపారేసే (Disposable) నాప్ కిన్లు వాడటం వలన చాలా రకాల రుతు సంబంధ వ్యాధులను దూరం చేయవచ్చు.

ప్రశ్న 10.
కౌమార దశలో శారీరక వ్యాయామం ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:

  1. ఆరు బయట స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అక్కడ నడవడం, ఆటలు ఆడుకోవటం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
  2. ఈ వయస్సులో ఉన్న అబ్బాయి, అమ్మాయిలందరూ నడకను అలవాటు చేసుకోవాలి.
  3. తేలికపాటి వ్యాయామం చేయటంతో పాటు ఆరు బయట ఆటలు ఆడాలి.
  4. ఇది ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడమే కాకుండా మంచి నిద్రను కూడా ఇస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది.
  5. ఇది రోజువారీ కార్యక్రమాలను చురుకుగా చేయడానికి సహాయపడుతుంది.

ప్రశ్న 11.
అబ్బాయిల గొంతు అమ్మాయి గొంతుకన్నా ఎందుకు భిన్నంగా ఉంటుంది ?
జవాబు:

  1. కౌమారదశలో అబ్బాయిలలో ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది.
  2. ఇది గొంతు క్రింద స్వరపేటిక 9వ మృదులాస్థి వృద్ధి వలన ఏర్పడుతుంది.
  3. దీని వలన స్వరపేటిక పరిమాణం పెరిగి గొంతు గంభీరంగా మారుతుంది.
  4. ఆడపిల్లలలో స్వరపేటిక పరిమాణం పెరగదు కావున వారి గొంతు సాధారణంగా ఉంటుంది.
  5. ఆడమ్స్ యాపిల్ వలన అబ్బాయి గొంతు అమ్మాయి గొంతుకన్నా భిన్నంగా మారుతుంది.

ప్రశ్న 12.
కౌమారదశలో మొటిమల గురించి నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:

  1. మొటిమలను గిల్లరాదు.
  2. తక్కువ క్షారగుణం గల సబ్బుతో రోజుకు రెండు మూడు సార్లు ముఖం కడుగుతుండాలి.
  3. గోరువెచ్చని నీళ్ళతో మొటిమలను కడుగుతూ ఉండాలి. అవసరమైతే వైద్యుడిని కలవాలి.
  4. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళనలు మొటిమలను ఇంకా ఎక్కువ వచ్చేలా చేస్తాయి.

ప్రశ్న 13.
ఎ) ఈ చిత్రంలో కనిపిస్తున్న భాగం పేరు ఏమిటి?
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 2
బి) ఇది ఏ దశలో అభివృద్ధి చెందుతుంది ?
సి) పై అవయవము ఎవరిలో బాగా అభివృద్ధి చెందుతుంది ? దీనివల్ల ఏమౌతుంది ?
డి) ఏ మృదులాస్థి పెరగడం వల్ల ఇది ఏర్పడుతుంది ?
జవాబు:
ఎ) ఆడమ్స్ ఆపిల్
బి) కౌమార దశలో మగపిల్లలలో అభివృద్ధి చెందుతుంది
సి) కౌమార దశలోని బాలుర యందు అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల బాలుర కంఠస్వరం బొంగురుగా మారుతుంది.
డి) థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వలన ఆడమ్స్ ఆపిల్ ఏర్పడుతుంది.

ప్రశ్న 14.
క్రింది పట్టికను చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 3
ఎ) కోపమొచ్చినప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఏది ?
బి) టెస్టోస్టిరాన్ హార్మోన్ ను విడుదల చేసే గ్రంథి ఏది ?
సి) ఏ హార్మోన్ ఇతర వినాళ గ్రంథులను నియంత్రిస్తుంది ?
డి) స్త్రీ, పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైన హార్మోన్లు ఏవి ?
జవాబు:
ఎ) అడ్రినలిన్
బి) ముష్కాలు
సి) పెరుగుదల హార్మోన్
డి) టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్

ప్రశ్న 15.
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 4
చిత్రంలోని అవయవంను గూర్చి తెలుసుకోవడానికి మీ సైన్స్ టీచరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
1. పై పటంలో చూపబడిన భాగం పేరు ఏమిటి ?
2. ఇది ఎవరిలో అభివృద్ధి చెందుతుంది ?
3. ఇది అభివృద్ధి చెందడం వల్ల వారిలో కలిగే మార్పు ఏమిటి ?

ప్రశ్న 16.
క్రింది వాక్యాలను చదివి తప్పుగా ఉన్న వాటిని సవరించి రాయండి.
ఎ) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయనవసరం లేదు.
బి) కణకవచం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది.
జవాబు:
ఎ) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం తప్పనిసరిగా చేయాలి.
బి) కణకవచం కణానికి బాహ్య, ఆఘాతాల నుండి రక్షణ కల్పిస్తుంది. యాంత్రిక బలాన్ని ఇస్తుంది.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 17.
ఈ కింది పట్టిక ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ 5
పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ? ఇందుకు కారణమైన హార్మోను ఏది ?
బి) కోపం, బాధ వంటి ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏది ?
సి) స్త్రీ బీజకోశాల నుండి విడుదలయ్యే హార్మోన్లు చేసే పనులు ఏవి ?
డి) కొన్ని గ్రంథులను అంతఃస్రావ గ్రంథులు అంటారు. ఎందుకు ?
జవాబు:
ఎ) ముష్కాల్ టెస్టోస్టిరాన్ హార్మోన్
బి) అడ్రినలిన్
సి) అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ
డి) ఈ గ్రంథులు తమ స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని అంతస్రావీ గ్రంథులని, వినాళ గ్రంథులని అంటారు.

ప్రశ్న 18.
మల్లికకు 15 సంవత్సరాలకే వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఇది సరియైనదేనా ? ఎందుకు?
జవాబు:

  1. ఈ నిర్ణయం సరియైనది కాదు.
  2. ఎందుకంటే భారత వివాహ చట్టం ప్రకారం బాలికలకు 18 సం|| వయస్సు వివాహ వయస్సుగా నిర్ణయించడమైనది. మల్లికకు 15 సం||లకే వివాహం చేయాలనుకోవడం చటరిత్యా నేరం.
  3. 15 సం|| వయస్సులో మల్లికకు శారీరక మానసిక స్థాయిలు సంపూర్ణంగా అభివృద్ధి చెందవు. ఈ వయసులో వివాహం ఆమె బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తుంది.

ప్రశ్న 19.
బాల్యవివాహాలు సామాజిక దురాచారం అని నీకు తెలుసుకదా ? దీన్ని గురించి సమాజాన్ని చైతన్యపరుచుటకు మీ పాఠశాల విద్యార్థులు ఓ ర్యాలీని తలపెట్టారు. దీనిని ఉద్దేశించి కొన్ని నినాదాలను తయారు చేయండి ?
జవాబు:
బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం

  1. దీనిని సమాజంలో కొసాగించడం ప్రమాదకరం
  2. బాలికల చదువు – భవితకు వెలుగు.
  3. బాలికలకు కౌమారదశలో వివాహం వారి జీవితాలను అంధకారం చేస్తుంది.
  4. బాల్యవివాహాలు – దేశ ప్రగతి నిరోధకాలు.

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోతుంది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.

ప్రశ్న 2.
అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుంది?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.

ప్రశ్న 3.
అమ్మాయిల్లో నిజంగా పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.

ప్రశ్న 4.
అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.

ప్రశ్న 5.
చిన్న పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ?
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.

ప్రశ్న 6.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ?
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా, అబ్బాయో, అమ్మాయో చెప్పగలుగుతాం.

ప్రశ్న 7.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ?
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.

ప్రశ్న 8.
స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

ప్రశ్న 9.
ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 10.
ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.

ప్రశ్న 11.
ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించిపోతుంది.

ప్రశ్న 12.
అసలు అండమే విడుదల కాకపోతే ఏమవుతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.

ప్రశ్న 13.
హార్మోన్లు అనగానేమి ?
జవాబు:
అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళగ్రంథులు అని కూడా అంటారు. ఈ గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలను “హార్మోన్లు” అంటారు.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
‘కౌమార విద్య’ కార్యక్రమాలు …………. క్లబ్ నిర్వహిస్తుంది.
ఎ) లయన్స్ క్లబ్
బి) రెడ్ రిబ్బన్ క్లబ్
సి) రోటరీ క్లబ్
డి) వాసవీ క్లబ్
జవాబు:
బి) రెడ్ రిబ్బన్ క్లబ్

ప్రశ్న 2.
ఋతుచక్రం ప్రతీ …….. రోజుల కొకసారి వస్తుంది.
ఎ) 20-30
బి) 25-30
సి) 28-30
డి) 30-32
జవాబు:
సి) 28-30

ప్రశ్న 3.
ముష్కాలు ……….ను విడుదల చేస్తాయి.
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఈస్ట్రోజన్
సి) ప్రొజెస్టిరాన్
డి) F.S.H
జవాబు:
ఎ) టెస్టోస్టిరాన్

ప్రశ్న 4.
స్వేద గ్రంథులు ……. ను ఉత్పత్తి చేస్తాయి.
ఎ) హార్మోనులు
బి) చెమట
సి) విటమిన్లు
డి) తైలం
జవాబు:
బి) చెమట

ప్రశ్న 5.
అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకుంటే అది ……………. కు దారితీస్తుంది.
ఎ) పోషకాహారలోపం
బి) బలహీనత
సి) ఫ్లోరోసిస్
డి) స్థూలకాయం
జవాబు:
డి) స్థూలకాయం

ప్రశ్న 6.
NPEGEL ఎవరి కోసం నిర్వహించబడు కార్యక్రమం?
ఎ) బాలురు
బి) బాలికలు
సి) స్త్రీలు
డి) పురుషులు
జవాబు:
డి) పురుషులు

ప్రశ్న 7.
పురుషులలో కనీస వివాహ వయస్సు ……..
ఎ) 20 సం||
బి) 21 సం||
సి) 22 సం||
ది) 23 సం||
జవాబు:
ది) 23 సం||

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 8.
స్త్రీల వ్యాధి నిపుణులను ………………. అంటారు.
ఎ) ఆంకాలజిస్ట్
బి) గైనకాలజిస్ట్
సి) కార్డియాలజిస్ట్
డి) నెఫ్రాలజిస్ట్
జవాబు:
బి) గైనకాలజిస్ట్

ప్రశ్న 9.
అబ్బాయిలలో గడ్డం, మీసాలు పెరగటం
ఎ) ప్రాథమిక లైంగిక లక్షణాలు
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
సి) తృతీయ లైంగిక లక్షణాలు
డి) పైవేవీ కావు
జవాబు:
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు

ప్రశ్న 16.
పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగ గుర్తించటానికి సహాయపడేవి
ఎ) ప్రాథమిక లైంగిక లక్షణాలు
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
సి) తృతీయ లైంగిక లక్షణాలు
డి) పైవేవీ కావు
జవాబు:
సి) తృతీయ లైంగిక లక్షణాలు

ప్రశ్న 17.
సాధారణంగా ప్రత్యుత్పత్తి శీ ఈ కాలంలో మొదలవుతుంది.
ఎ) 9-13 సం||
బి) 11-15 సం||
సి) 14-18 సం||
డి) 13-19 సం||
జవాబు:
సి) 14-18 సం||

ప్రశ్న 18.
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు త్వరగా కౌమార దశకు చేరుటకు కారణం
ఎ) రసాయనాలు కలిపిన పండ్లు తినడం
బి) కలుషిత ఆహారం, జంక్ ఫుడ్
సి) ఈస్ట్రోజన్ కలిపిన పాలు తాగడం
డి) పైవన్నీ
జవాబు:
సి) ఈస్ట్రోజన్ కలిపిన పాలు తాగడం

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 19.
ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమం
ఎ) మీనార్క్ – సుయేషన్ – మోనోపాజ్
బి) మెస్ట్రుయేషన్ – మోనోపాజ్ – మీనార్క్
సి) మోనోపాజ్ – మీనార్క్ – మెస్ట్రుయేషన్
డి) మెనోపాజ్ – మెనుస్టుయేషన్ – మీనార్క్
జవాబు:
ఎ) మీనార్క్ – సుయేషన్ – మోనోపాజ్

ప్రశ్న 20.
మన దేశంలో చట్టపరంగా స్త్రీ పురుషుల వివాహ వయస్సు
ఎ) 21 – 25 సం
బి) 18 – 21 సం||
సి) 16 – 18 సం||
డి) 25 – 28 సం||
జవాబు:
బి) 18 – 21 సం||

ప్రశ్న 21.
అంతస్రావికా గ్రంథులు స్రవించేది )
ఎ) ఎంజైములు
బి) హార్మోనులు
సి) స్రావాలు
డి) స్వేదం
జవాబు:
బి) హార్మోనులు

ప్రశ్న 22.
పురుషులలో స్రవించబడే హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) రుస్ట్రోజెన్
సి) ప్రొజెస్టిరాన్
డి) ఎడ్రినలిన్
జవాబు:
ఎ) టెస్టోస్టిరాన్

ప్రశ్న 23.
ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఈస్ట్రోజెన్
సి) ప్రొజెస్టిరాన్
డి) ఎడ్రినలిన్
జవాబు:
డి) ఎడ్రినలిన్

ప్రశ్న 24.
ఎగ్రంధి హార్మోను మిగతా గ్రంథులను నియంత్రిస్తుంది?
ఎ) పీనియల్ గ్రంథి
బి) పీయూష గ్రంథి
సి) అధివృక్క గ్రంధి
డి) థైరాయిడ్ గ్రంథి
జవాబు:
బి) పీయూష గ్రంథి

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 25.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జనాభాలో 15 సం|| కన్నా తక్కువ వయస్సు గలవారి జనాభా.
ఎ) 65%
బి) 6850
సి) 72
డి) 75%
జవాబు:
బి) 6850

ప్రశ్న 26.
స్టాన్లీహాల్ ఏ దశను ఒడిదుడుకులతో కూడిన దశ అన్నాడు?
ఎ) శైశవదశ
బి) కౌమారదశ
సి) యవ్వనదశ
డి) వృద్ధాప్యదశ
జవాబు:
బి) కౌమారదశ

ప్రశ్న 27.
మొటిమలను ఏర్పరచేవి
ఎ) స్వేద గ్రంథులు
బి) సెబేషియస్ గ్రంథులు
సి) ఎ మరియు బి
డి) లాలాజల గ్రంథులు
జవాబు:
సి) ఎ మరియు బి

ప్రశ్న 28.
స్త్రీ లైంగిక హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఎడ్రినలిన్
సి) ఈస్ట్రోజెన్
డి) ల్యూటినైజింగ్ హార్మోన్
జవాబు:
సి) ఈస్ట్రోజెన్

ప్రశ్న 29.
ఈ గ్రంథి యొక్క స్రావాలు భావోద్వేగాలను నియంత్రిస్తాయి.
A) క్లోమము
B) ముష్కాలు
C) వీబీజకోశము
D) అధివృక్క గ్రంధి
జవాబు:
D) అధివృక్క గ్రంధి

ప్రశ్న 30.
కౌమార దశ గురించి ఈ కింది వాటిలో నిజమైన వాక్యాన్ని గుర్తించండి.
A) మగ పిల్లల్లో ఆడమ్స్ ఆపిల్ స్పష్టంగా కనిపిస్తుంది.
B) మగ పిల్లల కంటే ఆడపిల్లల్లో భుజాలు వెడల్పుగా పెరుగుతాయి.
C) ఆడ పిల్లల్లో పోలిస్తే, మగ పిల్లల్లో స్వరంలో ఎలాంటి మార్పు ఉండదు.
D) కండరాల పెరుగుదల మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో స్పష్టంగా వుంటుంది.
జవాబు:
A) మగ పిల్లల్లో ఆడమ్స్ ఆపిల్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 31.
కౌమార దశలో వచ్చే మార్పు కానిది.
A) మీసాలు రావడం
B) గొంతులో మార్పు రావడం
C) వెంట్రుకలు తెల్లబడడం
D) మొటిమలు కనపడటం
జవాబు:
C) వెంట్రుకలు తెల్లబడడం

ప్రశ్న 32.
స్వరపేటికలోని మృదులాస్థుల సంఖ్య
A) 3
B) 6
C) 9
D) 12
జవాబు:
C) 9

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 33.
ఋతుచక్రం ఆగిపోయే వయస్సు
A) 35-45 సం||
B) 30-40 సం||
C) 40-45 సం||
D) 45-50 సం||
జవాబు:
D) 45-50 సం||

ప్రశ్న 34.
బాలుర కౌమార దశకు చేరుకొన్నారని చెప్పే లక్షణాలు
A) ముఖంపై మొటిమలు రావడం
B) మీసాలు, గడ్డాలు రావడం
C) ఆడమ్స్ ఆపిల్ ఏర్పడటం
D) ఇవన్నియు
జవాబు:
D) ఇవన్నియు

ప్రశ్న 35.
స్టాన్లీ హాల్ చెప్పినదేమిటంటే
A) కౌమారదశ ఒత్తిడి మరియు అలసటకు గురిఅయ్యే
B) కౌమారదశ అనేది ఆనందంగా గడిపేది
C) కౌమారదశ ఒత్తిడిలేని దశ,
D) కౌమారదశ విశ్రాంతితో కూడినది
జవాబు:
A) కౌమారదశ ఒత్తిడి మరియు అలసటకు గురిఅయ్యే

ప్రశ్న 36.
తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి.
P. పురుషుల్లో మాత్రమే ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి.
Q. ద్వితీయ లైంగిక లక్షణాలను హార్మోన్లు ప్రభావితం చేస్తాయి.
R. వినాళగ్రంథుల నుండి వచ్చే స్రావాన్ని మందులు అంటారు.
S. కౌమారదశ అనేది సమతుల్యంకాని భావోద్వేగాలతో కూడినది.
A) P మరియు Q
B) R మరియు S
C) P మరియు R
D) Q మరియు S
జవాబు:
C) P మరియు R

ప్రశ్న 37.
కౌమారదశలో ఉన్న ఒక బాధ్యత గల విద్యార్థిగా మీరు కల్గిఉండాల్సింది
A) మంచి అలవాట్లు
B) సరైన జీవననైపుణ్యాలు
C) మానవత్వాన్ని కల్గి ఉండడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Biology Important Questions Chapter 5 కౌమార దశ

ప్రశ్న 38.
కౌమారదశలో చెమట, మొటిమలకు సంబంధించి సరైన వాక్యం కానిది
A) ఇవి కౌమారదశలో కనపడతాయి.
B) చెమట గ్రంథులు, తైలగ్రంథులు చురుకుగా ఉంటాయి.
C) మొటిమలు కురుపులుగా మారే ప్రమాదం ఉంది.
D) మొటిమలు సాధారణ చర్మవ్యాధి.
జవాబు:
D) మొటిమలు సాధారణ చర్మవ్యాధి.

ప్రశ్న 39.
రాజు యొక్క కంఠస్వరంలో మార్పు కనబడినది అంటే అతను కింది దశలో ఉన్నాడు. ఈ
A) కౌమారదశ
B) పూర్వబాల్యదశ
C) వయోజన దశ
D) శిశుదశ
జవాబు:
A) కౌమారదశ

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం – సంరక్షణ

These AP 8th Class Biology Important Questions 6th Lesson జీవ వైవిధ్యం – సంరక్షణ will help students prepare well for the exams.

AP Board 8th Class Biology 6th Lesson Important Questions and Answers జీవ వైవిధ్యం – సంరక్షణ

ప్రశ్న 1.
70 సం||ల క్రితం ఉన్న జంతువులకు, ఇప్పుడు కనిపించే జంతువులలో భేదాలు ఏమిటి ? అవి కనిపించకుండా పోవటానికి కారణాలు ఏమిటి ?
జవాబు:
70 సం||రాల క్రితం ఉండే పులులు, చిరుతలు, కొండ్రిగాడు, ముళ్ళపందులు వంటి జంతువులు నేడు కనిపించటం కరువైపోయింది. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటికి ప్రధాన కారణం గతంలో ఉన్న దట్టమైన అడవులు.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏదైనా జాతి అంతరించి పోయిందా ? వాటి గురించి తెలుసుకొని రాయండి.
జవాబు:
మా ప్రాంతాలలో రాబందులు అంతరించిపోయాయి. ఒకప్పుడు మృతకళేబరాలను అనటానికి వచ్చే ఈ పెద్ద పక్షులు నేడు కనిపించటం లేదు. అదేవిధంగా పిచ్చుకల సంఖ్య కూడ గణనీయంగా తగ్గి కనిపించుట లేదు.

ప్రశ్న 3.
ఈ జీవులు అంతరించి పోవటానికి కారణాలు చర్చించండి.
జవాబు:
1. అధిక మోతాదులో వాడిన D.D.T. వలన రాబందుల గుడ్లు పెంకు పలచబడి వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.
2. నేటి కాలంలో బాగా అభివృద్ధి చెందిన మొబైల్ వాడకం వలన సెల్ టవర్ రేడియేషన్ పిచ్చుకల ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
3. వీటితోపాటుగా మారుతున్న జీవన విధానాల వలన, చెట్లు నరకటం, పూరి గుడిసెలు తగ్గటం వంటి చర్యలు కూడా పిచ్చుకలు అంతరించటానికి మరికొన్ని కారణాలు.

ప్రశ్న 4.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండిమిక్ జాతి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
క్రింది చిత్రాలలో ఏ జంతువు మన దేశానికి ఎండమిక్ జాతి అవుతుంది?
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 1
జవాబు:
పై చిత్రాలలో బెంగాల్ టైగర్ మన దేశానికి చెందిన ఎండమిక్ జాతి.

ప్రశ్న 6.
మీ తల్లిదండ్రులను అడిగి వారి బాల్యంలో గల వివిధ రకాల వరి రకాల గురించి తెలుసుకోండి.
జవాబు:
మా తల్లిదండ్రుల బాల్యంలో క్రింది వరి రకాలు కలవు.

  1. స్వర్ణ
  2. మసూరి
  3. నంబర్లు
  4. హంస
  5. పాల్గుణ

ప్రశ్న 7.
ఆపదలో ఉన్న ఈ క్రింది జంతు, వృక్ష జాతులను గుర్తించి పేర్లు రాయండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 2

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ లోని అంతరించిపోతున్న రెండు జంతువులు ఏమిటి ? వాటి గురించి రాయండి.
జవాబు:
అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) మరియు జంతుశాస్త్ర సంఘం, లండన్ (ISL) విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కర్నూల్ జిల్లాలోని నంధ్యాల, కొన్ని ప్రాంతాలలో ఉండే సాలీడు-గూటి టారంటలా (Gooty-tarantula) అలాగే కర్నూల్ లోని పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రంలోని బట్టమేక పక్షి (Great indian bustard) అత్యంత ఆపదలో ఉన్న జీవులుగా పేర్కొన్నారు.

ఎ) గూటీ టారంటలా సాలీడు :
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 3
1) శాస్త్రీయంగా ఫిసిలో తీరియా మెటాలికా అని పిలువబడే గూటీ టారంటలా సాలీడు ఆన్ లైన్ ద్వారా అమెరికా, యూరప్ మార్కెట్లలో అమ్ముడవుతోంది.
2) ఆవాసాలను ధ్వంసం చేయడం, అడవులను నరికివేయడం, వంట చెరకు సేకరణ మొదలైన కార్యక్రమాలు ఈ సాలీళ్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి.
3) ఆవాసాల సంరక్షణ, క్షేత్ర స్థాయిల్లో అవగాహన, జాతీయ అటవీ సంరక్షణ చట్టం, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార చట్టాలు పటిష్టంగా అమలుచేయడం ద్వారా ఈ జాతుల సంరక్షణకు కృషి చేయాలని సూచిస్తున్నారు.

బి) బట్టమేక పిట్ట :
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 4
1) బట్టమేక పక్షులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నప్పటికీ వీటి సంఖ్య కేవలం 50 నుండి 249 వరకు మాత్రమే ఉన్నట్లు అంచనా.
2) అడవులను నరికివేసి వ్యవసాయ భూములుగా మార్చటం వల్ల వీటికి ఆపద ఏర్పడింది.
3) సౌత్ కొరియాలోని ‘జేజూ’లో జరిగిన అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘ సమావేశంలో (ZSL మరియు IUCN) ప్రమాదం అంచున ఉన్న జీవజాతుల గురించిన జాబితాను విడుదల చేసింది.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 9.
ప్రజల్లో జీవవైవిధ్యంపై అవగాహన కలిగించుటకు కొన్ని నినాదాలు లేదా ఒక కరపత్రం చేయండి.
జవాబు:
నినాదాలు :
జీవ హింస – మహాపాపం
జీవించు – అన్ని జీవులనూ జీవించనివ్వు
బ్రతికే హక్కు – అన్ని జీవులకూ ఉంది
జీవులను కాపాడుదాం – జీవవైవిధ్యాన్ని నిలబెడదాం
జీవులు లేని ప్రకృతి – జీవం లేని ప్రకృతి
కరపత్రం : నానాటికీ మన చుట్టూ ఉన్న చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇవి అంతరించటానికి ప్రధాన కారణం మానవ చర్యలే. ఈ ప్రకృతిలో మనతోపాటు ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది. దానిని మనం ధిక్కరించరాదు. భూమిపై అన్ని జీవరాశులు ఉన్నప్పుడే జీవుల మధ్య తులాస్థితి ఉంటుంది. మన జీవనం సక్రమంగా ఉంటుంది. కావున మనం జీవిద్దాం, ఇతర జీవులను జీవించనిద్దాం.

ప్రశ్న 10.
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ ఎలా తయారవుతుంది ? దాని ప్రయోజనం ఏమిటి ?
జవాబు:
కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్ :

  1. ఇది చెక్కపొట్టు, కర్రముక్కలతో కలిపి చేసిన గుజ్జుతో తయారవుతుంది.
  2. ఈ గుజ్జుకు రసాయన సల్ఫేట్లు కలిపి సెల్యులోజును తయారుచేస్తారు.
  3. గుజ్జును రెండు పొరలుగా పేర్చి వాటి మధ్యలో కర్రపొట్టును చేర్చుతారు.
  4. దీనిని గట్టిగా అదిమి (కంప్రెస్) పెట్టి ఆరబెడతారు.
  5. ఇలా తయారయిన కార్డ్ బోర్డ్ కర్రలా గట్టిగా బలంగా ఉంటుంది.

ప్రయోజనం :
1. ‘కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్’ తయారీకి చెక్కముక్కలు, చెక్కపొట్టు అవసరం.
2. కాబట్టి చెట్టును నరకవలసిన అవసరం ఉండదు.
3. ఇది అడవుల నరికివేత తగ్గించటంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 11.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని జాతీయ పార్కులు మరియు సంరక్షణ కేంద్రాల గురించి సమాచారం సేకరించండి.
జవాబు:
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 5
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 6

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 12.
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి ఎలా తయారుచేస్తారు ? (లేదా) కాగితాన్ని పునఃచక్రీయ పద్ధతిలో తయారుచేసే విధానాన్ని రాయండి.
జవాబు:
రీసైకిల్డ్ కాగితాన్ని వృథా వార్తాపత్రికల నుంచి తయారుచేయడం
కావలసిన వస్తువులు : రెండు ప్లాస్టిక్ తొట్టెలు, కర్ర గరిటె, నీరు, శుభ్రమైన నూలు దుస్తులు, పాత వార్తా పత్రికలు, వైర్ స్క్రీన్, కొలపాత్ర, ప్లాస్టిక్ చుట్ట, బ్లెండర్ (mixer) బరువైన పుస్తకాలు, రోలర్.

తయారీ పద్ధతి :
1) కత్తిరించిన న్యూస్ పేపర్ ముక్కలను నీటితో నిండిన తొట్టెలో వేసి ఒక రోజు నానబెట్టాలి.
2) పిండి రుబ్బే దానిలో (బ్లెండర్) రెండు కప్పులు నానబెట్టిన కాగితం, ఆరు కప్పుల నీటిని చేర్చండి. మెత్తని గుజ్జు తయారయ్యేలా రుబ్బి శుభ్రమైన తొట్టెలో వేయాలి.
3) తొట్టెను 1/4వ వంతు నూరిన పేపర్ గుజ్జు మిశ్రమం (Paper pulp) తో నింపాలి.
4) పొడిగా, బల్లపరుపుగా ఉన్న తలంపై ఒక వస్త్రాన్ని పరచాలి. తడి పేపర్ గుజ్జు కింద వైర్ స్క్రీన్ ను ఉంచాలి. స్క్రీన్‌ను మెల్లగా బయటికి తీసి పేపర్ గుజ్జును ఒత్తుతూ అందులోని నీటిని తీసివేయాలి.
5) జాగ్రత్తగా వస్త్రం ఫైన స్క్రీన్ ను బోర్లించాలి. గట్టిగా క్రిందికీ ఒత్తి స్క్రీన్ ను తీసివేయాలి.
6) కాగితపు గుజ్జు మిశ్రమంపై మరో గుడ్డ , వస్త్రంను పరచాలి. గుడ్డపై ఒక ప్లాస్టిక్ షీట్ ను పరిచి దానిపై బరువు కోసం పుస్తకాలను పేర్చాలి.
7) కొన్ని గంటల తరువాత పుస్తకాలు, గుడ్డను తీసి పేపరును ఎండలో ఆరనివ్వాలి.
8). హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించి కూడా పేపరును ఆరబెట్టవచ్చును.
9) రంగులు గల పేపర్‌ను తయారుచేయడానికి కాగితపు గుజ్జుకు వంటకాల్లో ఉపయోగించే రంగు చుక్కలను కలపాలి. ఏర్పడిన కాగితాన్ని ఇస్త్రీ చేసి కావలసిన పరిమాణంలో, ఆకారంలో కత్తిరించుకోవాలి.
10) అందమైన గ్రీటింగ్ కార్డులు, ఫైల్ కవర్లు, బ్యాగులు మొదలగునవి రీ సైకిల్డ్ పేపరను ఉపయోగించి తయారు చేయవచ్చును.

ప్రశ్న 13.
మీకు తెలిసిన ఏవైనా నాలుగు ఔషధ మొక్కల పేర్లు మరియు వాటి ఉపయోగాలు తెలపండి.
జవాబు:
మా ప్రాంతంలో నాకు తెలిసిన ఔషధ మొక్కలు

  1. తులసి – దగ్గును నివారిస్తుంది
  2. వేప – యాంటీ సెప్టిక్
  3. పసుపు – యాంటిసెప్టిక్ మరియు సౌందర్య లేపనాల తయారీ
  4. సర్పగంధి – పాము కాటు నివారణ మందుల తయారీలో ఉపయోగపడుతుంది.

ప్రశ్న 14.
జతపరచండి మరియు కింది ప్రశ్నకు జవాబివ్వండి.
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 8
జవాబు:
1 – డి, 2 – సి, 3 – ఎ, 4 – బి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 15.
పక్షులు ఆహారం, నివాసం కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే విధానాన్ని ఏమంటారు. ఇలా వెళ్ళే పక్షుల పేర్లు వ్రాయండి.
జవాబు:
పక్షులు ఆహారం, నివాసం మరియు సంతానోత్పత్తికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలసపోవడం అంటారు. ఉదా : సైబీరియన్ కొంగ, పెలికన్ పక్షులు.

ప్రశ్న 16.
మీ ప్రదేశంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షణకై ఏవైనా 2 నినాదాలు రాయండి.
జవాబు:
1. ప్రకృతిలో జీవించు – జీవజాతులను పరిరక్షించు ,
2. వృక్షోరక్షతి రక్షితః –
3. ప్రకృతిలో ప్రతిజీవి అపురూపం – వాటిని సంరక్షించడం మన కర్తవ్యం.

ప్రశ్న 17.
కింది పేరాను చదవండి.
“ఒక్కోసారి రాత్రివేళల్లో కూడా కొన్ని పక్షులు ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని పక్షులకు శాశ్వత నివాసం ఉండదు. ఇవి గుంపులు గుంపులుగా ఒక చోటు నుండి మరో చోటుకు ఆవాసం, ఆహారం కోసం వెళుతుంటాయి. దీనినే వలస అంటారు. ఈ పక్షులనే “వలసపక్షులు” అంటారు. ఈ వలస పక్షులు వర్షాకాలంలో మన రాష్ట్రంలోని కొల్లేరు, పులికాట్ సరస్సులకు వస్తాయి. ఈ సరస్సుల దగ్గరున్న గ్రామాలలోని చెట్లపై ఇవి నివసిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చెట్లను నరికివేయడం వలన నివాసాలు అందుబాటులో లేకపోవడంతో వలస పక్షుల సంఖ్య తగ్గిపోయింది.
ఎ) వలస పక్షులు అని వేటిని అంటారు ? అవి ఎందుకు వలసపోతాయి ?
బి) మనదేశానికి పక్షుల వలస తగ్గిపోవడానికి కారణం ఏమి ?
జవాబు:
ఎ) ఆహారం కోసం ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే పక్షులను వలస పక్షులు అంటారు.
బి) పక్షులు వలస వచ్చే ప్రాంతాల గ్రామాలలో చెట్లను కొట్టివేయడం వల్ల ఆవాసాలు తగ్గి పక్షుల వలస తగ్గిపోతున్నది.

ప్రశ్న 18.
కాగితాన్ని పొదుపుగా వాడుకొనేందుకు నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1. కాగితాలను అవసరమైతేనే వాడాలి. రీసైకిల్ చేయబడిన కాగితాన్ని వాడాలి.
2. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోకి మారితే పేపర్ల వినియోగం చాలావరకు తగ్గుతుంది.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 19.
కింది తెలిపిన సమాచారాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రతిరోజు ఒకేరకమైన పక్షులు కనిపిస్తున్నాయా ? ప్రత్యేకించి కొన్ని కాలాలలో హఠాత్తుగా ఏమైనా మార్పులు ఏర్పడినాయా? కొత్తరకం పక్షులు ఎక్కడి నుండి వచ్చాయి ? ఈ విధంగా కొత్త పక్షులు మన ప్రాంతానికి ఆహారం, నివాసం కొరకు వస్తుంటాయి. దీనినే ‘వలస’ అంటారు. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు మనరాష్ట్రంలో కొల్లేరు, పులికాట్ సరస్సులకు వలస వస్తాయి. ఇవి సమీప గ్రామాలలోని చెట్లపై గూళ్లు కట్టుకొంటాయి. పూర్వపు రోజుల్లో పక్షుల రాకను శుభసూచకం అని నమ్మేవారు. కానీ ప్రస్తుతం చెట్లు నరికివేతకు గురవుతుండటం వల్ల పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి అనువైన స్థలాలు లేక అవి తమ విడిదిని మార్చుకొంటున్నాయి.

1. పై సమాచారం ఏ అంశాన్ని తెలియజేస్తోంది ?
జవాబు:
పక్షుల వలసపై పర్యావరణ ప్రభావం

2. వేరే ప్రాంతం నుండి కొత్త పక్షులు మన ప్రాంతానికి రావడాన్ని ఏమంటారు ?
జవాబు:
పక్షుల వలస

3. పక్షుల వలస రావాలంటే ఏమి చేయాలి ?
జవాబు:
వాటికి ఆవాసాలైన చెట్లను నరకకుండా పరిరక్షించాలి. సరస్సుల పర్యావరణాన్ని మానవ కార్యకలాపాలు కలుషితం , కాకుండా చూడాలి.

4. నీకు తెలిసిన కొన్ని వలస పక్షుల పేర్లు రాయండి ?
జవాబు:
పెలికన్ పక్షులు, సైబీరియన్ కొంగ.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

1 మార్కు ప్రశ్నలు

ప్రశ్న 1.
జీవవైవిధ్యం అంటే ఏమిటి ?
జవాబు:
జీవవైవిధ్యం : మొక్కలు, జంతువుల్లో కనపడే వైవిధ్యాలను జీవవైవిధ్యం అంటారు.

ప్రశ్న 2.
అంతరించిన జాతులు అంటే ఏమిటి?
జవాబు:
అంతరించిన జాతులు : భూమి పైనున్న ఆవరణ వ్యవస్థలలో పూర్తిగా కనబడకుండా అంతరించిపోయిన జాతులను అంతరించిన జాతులు అంటారు. ఉదా : డైనోసార్లు, హంసల్లాంటి తెల్ల కొంగలు మొదలయినవి. ఇక ఇలాంటి జీవులను మనం తిరిగి భూమిపై చూడలేము.

ప్రశ్న 3.
ఆపదలో ఉన్న జాతులు అని వేటిని అంటారు.
జవాబు:
భూమిపైనున్న ఆవరణ వ్యవస్థలలో సంఖ్యాపరంగా బాగా తక్కువగా ఉన్న జాతులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. అవి నివసించే ప్రాంతాలు మానవుని వల్ల నాశనం చేయబడటం వల్ల అవి నివాసం కోల్పోయి ఆపదలో ఉన్నాయి.

ప్రశ్న 4.
ఎండమిక్ జాతులు అనగానేమి?
జవాబు:
భూమిపై ఒక ప్రత్యేక ఆవాసానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు.
ఉదా : 1. కంగారూలు ఆస్ట్రేలియాలోనే వుంటాయి.
2. కోపిష్టి మదపుటేనుగులు ఆఫ్రికా అడవులలోనే ఉంటాయి.
3. ఒంగోలు జాతి గిత్తలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. కానీ ఈ మధ్య వీటిని కృత్రిమ గర్భధారణ ద్వారా బ్రెజిల్ లో పెంచుతున్నారు)

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 5.
భూమిపై అధిక జీవవైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది ?
జవాబు:
భూమిపై అధిక జీవవైవిధ్యం అడవులలో మాత్రమే కనిపిస్తున్నది. అడవులలో ఒకే జాతి మొక్కలు, జంతువుల మధ్య వైవిధ్యం కనబడుతుంది.

ప్రశ్న 6.
వలస అనగానేమి?
జవాబు:
వాతావరణ ప్రతికూలతల వల్ల ప్రత్యుత్పత్తి జరుపుకొనటానికి పక్షులు వాటి సహజ నివాసం వీడి మరొక చోటుకు (మారటాన్ని) వెళ్ళటాన్ని ‘వలస’ అంటారు.

ప్రశ్న 7.
రామగుండంలో పులులు ఎందుకు అంతరించాయి ?
జవాబు:
1. ఇక్కడ థర్మల్ పవర్ కేంద్రం ఏర్పాటు వల్ల వేల ఎకరాల అటవీ భూమి తగ్గిపోయింది.
2. అందుకే పులుల సంఖ్య తగ్గింది.

ప్రశ్న 8.
మన దేశంలో పులులు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ?
జవాబు:
అవును. శ్రీశైలం అడవులలో కనిపిస్తున్నాయి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 9.
అడవిని, అడవి జీవులను కాపాడటంలో టైగర్ ప్రాజెక్ట్ ఎలా ఉపయోగపడింది ?
జవాబు:
1. పులిని కాపాడాలంటే. అడవిని కాపాడాలి.
2. అడవిని కాపాడితే అది జీవవైవిధ్యపు నిల్వగా మారి ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులకు ఆవాసంగా మారుతుంది.
3. ఇలా అడవిని సంరక్షించటం అంటే పులుల సంరక్షణే !

ప్రశ్న 10.
ఇదివరకు పులులు ఉండి, ఇప్పుడు తగ్గితే అది జింకలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జవాబు:
1. పులుల ఆహారం ఎక్కువగా జింకలే.
2. పులులు’ తగ్గితే జింకల జనాభా పెరుగుతుంది.

ప్రశ్న 11.
జింకల సంఖ్య పెరిగితే మొక్కల పరిస్థితి ఏమిటి ?
జవాబు:
1. జింకలు గడ్డిని, మొక్కలను, వేరుశనగ, కందిచెట్లను తింటాయి.
2. పులులు తగ్గి, జింకల సంఖ్య పెరగటం వల్ల, అవి మొక్కలను తింటాయి కాబట్టి మొక్కల సంఖ్య బాగా తగ్గుతుంది.

ప్రశ్న 12.
మన రాష్ట్రానికే పరిమితమైన ఒక ఎండమిక్ జాతిని పేర్కొనండి.
జవాబు:
‘జెర్డాన్స్ కర్’ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎండమిక్ జాతి.

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 13.
ప్రకృతిలో మిమ్మల్ని అధికంగా ఆకర్షించినదేది?
జవాబు:
ప్రకృతిలో మా ఊరి చెరువు, దాని ప్రక్కన ఉన్న దేవాలయం నన్ను అధికంగా ఆకర్షించాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉంటుంది.

లక్ష్యాత్మక నియోజనము

ప్రశ్న 1.
ప్రపంచం అంతటా రోజుకు ………….. జాతులు అంతరించిపోతున్నాయి.
ఎ) 26
బి) 27
సి) 28
డి) 30
జవాబు:
బి) 27

ప్రశ్న 2.
నెమళ్ళకు ……………… ఆహారం అంటే ఎంతో ఇష్టం
ఎ) చీమలు
బి) సాలీడు
సి) పాములు
డి) పిల్ల నెమళ్ళు
జవాబు:
సి) పాములు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 3.
‘పులుల లోయగా’ ఒకప్పుడు ఈ పట్టణం వద్ద నున్న అడవి పిలవబడింది.
ఎ) మంచిర్యాల
బి) కరీంనగర్
సి) అడ్డతీగల
డి) చిత్తూరు
జవాబు:
ఎ) మంచిర్యాల

ప్రశ్న 4.
ఏనుగుల బీభత్సం ఎక్కువగా ఏ జిల్లాలో ఉంటుంది? )
ఎ) చిత్తూరు
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) రంగారెడ్డి
జవాబు:
ఎ) చిత్తూరు

ప్రశ్న 5.
కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది?
ఎ) పశ్చిమగోదావరి
బి) వరంగల్
సి) శ్రీకాకుళం
డి) విజయనగరం
జవాబు:
ఎ) పశ్చిమగోదావరి

ప్రశ్న 6.
పాండా సంరక్షణ బాధ్యతను తీసుకున్న సమాఖ్య
ఎ) IUWC
బి) NGC
సి) WWF
డి) ZSL
జవాబు:
సి) WWF

ప్రశ్న 7.
మన దేశంలో బిల్లులు ఎక్కువగా ……………. కనుమలలో ఉన్నాయి.
ఎ) తూర్పు
బి) పశ్చిమ
సి) ఉత్తర
డి) దక్షిణ
జవాబు:
బి) పశ్చిమ

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 8.
శ్రీశైల అభయారణ్యం ……………. సంరక్షణ కోసం కేటాయించారు.
ఎ) సింహాల
బి) జింకల
సి) పాముల
డి) పులుల
జవాబు:
డి) పులుల

ప్రశ్న 9.
రాబందుల ఆహారం ………………..
ఎ) మృత కళేబరాలు
బి) లేళ్ళు
సి) కుందేళ్ళు
డి) నక్కలు
జవాబు:
ఎ) మృత కళేబరాలు

ప్రశ్న 10.
టైగర్ ప్రాజెక్టు ………….. సం||లో ప్రారంభించారు.
ఎ) 1971
బి) 1972
సి) 1973
డి) 1974
జవాబు:
బి) 1972

ప్రశ్న 11.
హైదరాబాద్ లో ప్రపంచ జీవవైవిధ్య సదస్సు జరిగిన సంవత్సరం
ఎ) 2010
బి) 2012
సి) 2015
డి) 2011
జవాబు:
బి) 2012

ప్రశ్న 12.
ప్రపంచంలో అంతరించిపోతున్న 100 జంతువుల ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందినవి
ఎ) 2
బి) 4
సి) 6
డి) 8
జవాబు:
ఎ) 2

ప్రశ్న 13.
గూటీ టారంటలా సాలీడు ఏ జిల్లాలో కన్పిస్తుంది ?
ఎ) కర్నూలు
బి) కడప
సి) అనంతపురం
డి) చిత్తూరు
జవాబు:
ఎ) కర్నూలు

ప్రశ్న 14.
బట్టమేక పక్షిని సంరక్షించే పుల్లెందు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉన్నది ?
ఎ) కడప
బి) ప్రకాశం
సి) కర్నూలు
డి) అనంతపురం
జవాబు:
సి) కర్నూలు

ప్రశ్న 15.
జీవ వైవిధ్యానికి దారితీసేవి
ఎ) జీవుల మధ్య పోలికలు
బి) జీవుల మధ్య భేదాలు
సి) జీవుల మధ్య పోరాటాలు
డి) జీవుల అలవాట్లు
జవాబు:
బి) జీవుల మధ్య భేదాలు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 16.
E.O. విల్సన్ అభిప్రాయం ప్రకారం ప్రపంచమంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి?
ఎ) 100
బి) 1000
సి) 10,000
డి) 1,00,000
జవాబు:
సి) 10,000

ప్రశ్న 17.
W.W.F ను విస్తరించి వ్రాయగా
ఎ) వరల్డ్ వైడ్ ఫండ్
బి) వరల్డ్ వైడ్ ఫెడరేషన్
సి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్
జవాబు:
డి) వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్

ప్రశ్న 18.
I.U.W.C విస్తరించి వ్రాయగా
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
బి) ఇండియన్ యూనియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
సి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వెల్త్ కన్జర్వేషన్
డి) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ
జవాబు:
ఎ) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్

ప్రశ్న 19.
అంతరించిపోతున్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని తెల్పేది
ఎ) రెడ్ డేటా బుక్
బి) గ్రీన్ డేటా బుక్
సి) బ్లూడేటా బుక్
డి) బ్లాక్ డేటా బుక్
జవాబు:
ఎ) రెడ్ డేటా బుక్

ప్రశ్న 20.
ఎండమిక్ జాతులు అనగా
ఎ) అంతరించిపోతున్న జాతులు
బి) అరుదైన జాతులు
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు
డి) అంతరించిపోయిన జాతులు
జవాబు:
సి) ఒక ప్రాంతానికి పరిమితమైన జాతులు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 21.
ఈ క్రింది వానిలో ఎండమిక్ జాతి
ఎ) ఏనుగు
బి) సింహం
సి) కంగారు
డి) పులి
జవాబు:
సి) కంగారు

ప్రశ్న 22.
ఈ క్రింది వానిలో విదేశీ ఆక్రమణ జాతికి ఉదాహరణ
ఎ) హైదరాబాదు కాకి
బి) హైదరాబాదు పావురం
సి) హైదరాబాదు పిచ్చుక
డి) హైదరాబాదు చిలుక
జవాబు:
బి) హైదరాబాదు పావురం

ప్రశ్న 23.
గుట్టపుడెక్క దేనికి ఉదాహరణ ?
ఎ) ఆపదలో ఉన్న జాతి
బి) అంతరించిపోతున్న జాతి
సి) విదేశీయ ఆక్రమణ జాతి
డి) అరుదైన జాతి
జవాబు:
సి) విదేశీయ ఆక్రమణ జాతి

ప్రశ్న 24.
పూర్వకాలంలో భారతదేశంలో ఎన్ని రకాల వరి వంగడాలు సాగులో ఉన్నాయి?
ఎ) 10,000
బి) 20,000
సి) 40,000
డి) 50,000
జవాబు:
డి) 50,000

ప్రశ్న 25.
పూర్వకాలంలో ఎన్ని రకాల మొక్కల జాతులను మానవుడు ఆహారంగా ఉపయోగించాడు?
ఎ) 5,000
బి) 10,000
సి) 15,000
డి) 20,000
జవాబు:
ఎ) 5,000

ప్రశ్న 26.
మనదేశంలో ఎన్ని పులి సంరక్షక కేంద్రాలున్నాయి ?
ఎ) 23
బి) 25
సి) 27
డి) 29
జవాబు:
సి) 27

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 27.
పులులను సంరక్షించుకోవటం ద్వారా వీనిని కాపాడుకోవచ్చు.
ఎ) అడవులు
బి) గడ్డిమైదానాలు
సి) పర్వత ప్రాంతాలు లోయలు
డి) ఆవరణ వ్యవస్థలు
జవాబు:
డి) ఆవరణ వ్యవస్థలు

ప్రశ్న 28.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు ?
ఎ) అస్సోం
బి) గౌహతి
సి) మేఘాలయ
డి) షిల్లాంగ్
జవాబు:
బి) గౌహతి

ప్రశ్న 29.
పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) కరీంనగర్
బి) ఖమ్మం
సి) వరంగల్
డి) ఆదిలాబాదు
జవాబు:
సి) వరంగల్

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 30.
ఒకటన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలని నరికివేయవలసి ఉంటుంది ?
ఎ) 17
బి) 22
సి) 25
డి) 27
జవాబు:
ఎ) 17

ప్రశ్న 31.
మనదేశానికి పక్షులు యిక్కడ నుండి వలస వస్తాయి.
ఎ) సైబీరియా
బి) మంగోలియ
సి) చైనా
డి) కజకిస్థాన్
జవాబు:
ఎ) సైబీరియా

ప్రశ్న 32.
అడవుల నరికివేత తగ్గించుటలో ఉపయోగపడే కలప
ఎ) టేకు
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్
సి) బైండింగ్ కార్డ్ బోర్డ్
డి) క్బార్డ్
జవాబు:
బి) కంప్రెస్ట్ కార్డ్ బోర్డ్

ప్రశ్న 33.
కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?
ఎ) తూర్పు గోదావరి
బి) పశ్చిమ గోదావరి
సి) కృష్ణా
డి) విజయనగరం
జవాబు:
ఎ) తూర్పు గోదావరి

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 34.
రేడియేషన్ వల్ల ప్రస్తుతం అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) కాకి
బి) రాబందు
సి) పిచ్చుక
డి) కొంగలు
జవాబు:
సి) పిచ్చుక

ప్రశ్న 35.
ఇటీవల మనదేశంలో అంతరిస్తున్న పక్షి జాతి
ఎ) నెమళ్ళు
బి) రాబందులు
సి) కాకులు
డి) కొంగలు
జవాబు:
బి) రాబందులు

ప్రశ్న 36.
భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంవత్సరం
A) 1978
B) 1979
C) 1988
D) 1972
జవాబు:
D) 1972

ప్రశ్న 37.
కింది వాటిలో జాతుల వైవిధ్యాన్ని వివరించునది.
A) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే ఆపదలో వున్న జాతుల జనాభా
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు
C) ఇచ్చిన ప్రాంతంలో అంతరించిపోయిన జాతులు లేకపోవటం
D) ఇవ్వబడిన ప్రాంతానికి స్థానికము కాని జాతుల సంఖ్య
జవాబు:
B) ఇవ్వబడిన ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు

ప్రశ్న 38.
భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు వున్నాయి. ప్రపంచంలోని ఎండమిక్ జాతులైన ఉ భయచరాలలో దాదాపు 62%, బల్లుల్లో 50% భారతదేశంలో ఈ ప్రాంతంలో వున్నాయి.
A) హిమాలయాలు
B) పశ్చిమ కనుమలు
C) ఆరావళి
D) రాజస్థాన్ ఎడారి
జవాబు:
B) పశ్చిమ కనుమలు

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 39.
“జాతి భావం” (Species Concept) కు సంబంధించిన వాక్యం
A) అన్ని జీవులకు వర్తించదు
B) లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించును
C) ఆలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించదు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

ప్రశ్న 40.
జాతీయపార్కు అనే దానికి సరియైన స్టేట్ మెంట్ గుర్తించండి.
1. ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలు
2. ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండేవిధంగా మానవ చర్యలను పరిమితంగా అనుమతించేవి
A) 1 మాత్రమే
B) 1 మరియు 2
C) 2 మాత్రమే
D) పై రెండు కాదు
జవాబు:
B) 1 మరియు 2

ప్రశ్న 41.
జతపరచుటలో సరైన సమాధానం గుర్తించండి.
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 7
A) 1-ఎ, 2-సి, 3-బి
B) 1-సి, 2-బి, 3-ఎ
C) 1 -బి, 2 – ఎ, 3-సి
D) 1-సి, 2-ఎ, 3-బి
జవాబు:
D) 1-సి, 2-ఎ, 3-బి

ప్రశ్న 42.
పర్యావరణ నిర్వహణ ఎందుకు అవసరం ?
A) మానవ మనుగడ కొనసాగింపు కొరకు
B) జంతువులు అంతరించకుండా
C) ప్రకృతి సమతుల్యత కొరకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

ప్రశ్న 43.
రెడేటా పుస్తకం నందు కింది అంశాలు ఉంటాయి.
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది
B) సాధారణ మరియు అపాయకరమైన జీవుల జాబితా ఉంటుంది
C) అరుదైన మరియు విదేశీ జాతులు ఉంటాయి
D) ఎండమిక్ జాతుల వివరాలు
జవాబు:
A) ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుంది

AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ

ప్రశ్న 44.
కింది వానిలో వలస పక్షిని గుర్తించండి
A) కాకి
B) ఫ్లెమింగో
C) గ్రద్ద
D) చిలుక
జవాబు:
B) ఫ్లెమింగో

ప్రశ్న 45.
రెడ్ డేటా బుక్ అనేది దీనిని ఉద్దేశించిననది
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది
B) వలస పక్షుల గురించి తెలిపేది
C) వివిధ ప్రాంతాలలో నివసించే జంతువులను గురించి తెలిపేది
D) విలుప్తమైన జీవుల గురించి తెలిపేది
జవాబు:
A) అంతరించిపోతున్న జంతువుల సమాచారం తెలిపేది

ప్రశ్న 46.
నీ మిత్రుడు తన ఇంటి మిద్దె మీద పక్షుల కొరకు గూళ్ళు ఏర్పాటు చేసి అవి తాగేందుకు నీటిని కూడా వుంచాడు. దీనిపై నీ ప్రతిస్పందన
A) ఇది ప్రోత్సహించవలసిన చర్య కాదు
B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను
C) ఈ చర్యవల్ల పక్షులు దూరమవుతాయి
D) ఈ చర్యను నేను వ్యతిరేకిస్తాను
జవాబు:
(B) ఇది చాలా గొప్ప చర్య అతన్ని నేను అభినందిస్తాను

ప్రశ్న 47.
చిత్రంలో ఉన్న జీవి ప్రత్యేకత ఏమిటి ?
AP 8th Class Biology Important Questions Chapter 6 జీవ వైవిధ్యం - సంరక్షణ 9
1) అత్యంత ఆపదలో ఉన్న కీటకం
2) దీనిని ‘గూటి టరాంటులా’ అంటారు.
3) ఇది హిమాలయాలలో ఉంటుంది.
4) దీనిని ‘బట్ట మేక’ పక్షి అంటారు.
పై వాక్యా లలో సరైనవి
A) 1, 2 మాత్రమే
B) 3, 4 మాత్రమే
C) 1, 4 మాత్రమే
D) 2, 4 మాత్రమే
జవాబు:
A) 1, 2 మాత్రమే

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం

These AP 10th Class Maths Chapter Wise Important Questions 14th Lesson సాంఖ్యక శాస్త్రం will help students prepare well for the exams

AP Board 10th Class Maths 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 1.
5, 3, 4, – 4, 6, 7, 0 దత్తాంశ మధ్యగతము ఎంత?
సాధన.
ఇవ్వబడిన పరిశీలనాంశములు 5, 3, 4, – 4, 6, 7, 0.
పరిశీలనాంశములను ఆరోహణ క్రమంలో వ్రాయగా – 4, 0, 3, 4, 5, 6, 7.
మొత్తము 7 పరిశీలనాంశములున్నవి. కనుక \(\frac{7+1}{2}\) = 4వ పరిశీలనాంశము మధ్యగతమగును.
∴ మధ్యగతము = 3.

ప్రశ్న 2.
5, 6, 9, 6, 12, 3, 6, 11, 6, 7 ల బాహుళకం ఎంత ?
సాధన.
5, 6, 9, 6, 12, 3, 6, 11, 6, 7 లలో 6 యొక్క పౌనఃపున్యము గరిష్టం కావున పై దత్తాంశానికి బాహుళకం = 6.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 3.
మొదటి n సహజ సంఖ్యల సగటు కనుగొనుము.
సాధన.
సగటు = మొదటి ‘n’ సహజ సంఖ్యల మొత్తం / n
= \(\frac{\Sigma \mathrm{n}}{\mathrm{n}}=\frac{\mathrm{n}(\mathrm{n}+1)}{2} \cdot \frac{1}{\mathrm{n}}=\left[\frac{\mathrm{n}+1}{2}\right]\)
∴ మొదటి ‘n’ సహజ సంఖ్యల సగటు = \(\frac{n+1}{2}\)

ప్రశ్న 4.
వర్గీకృత దత్తాంశము యొక్క అంకగణితపు సగటు \(\bar{x}=a+\frac{\sum f_{1} d_{i}}{\Sigma f_{i}}\) అయిన fi మరియు di పదాలు వేటిని సూచిస్తాయి ?
సాధన.
fi = తరగతి పౌనఃపున్యం
di = విచలనము = xi – a

ప్రశ్న 5.
5, 6, 9, 10, 6, 12, 3, 6, 11, 10 ల దత్తాంశపు సగటు ఎంత ?
సాధన.
దత్తాంశం సగటు = ఇచ్చిన రాశుల మొత్తం / ఇచ్చిన రాశుల సంఖ్య
= \(\frac{5+6+9+10+6+12+3+6+11+10}{10}\)
= \(\frac{78}{10}\) = 7.8.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 6.
క్రింది దత్తాంశానికి ఆరోహణ సంచిత మరియు అవరోహణ సంచిత పౌనఃపున్య పట్టికలు వ్రాయండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 1

సాధన.
ఆరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 2

అవరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 3

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 7.
క్రింది పౌనఃపున్య విభాజన. పట్టికకు మధ్య విలువలు • వ్రాయండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 4

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 5

ప్రశ్న 8.
క్రింది దత్తాంశమునకు మధ్యగతమును కనుగొనుము.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 6

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 7

n = 40
మధ్యగతము = \(\frac{n+1}{2}=\frac{40+1}{2}=\frac{41}{2}\) = 20.
5వ పదము = 7.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 9.
ఈ క్రింది దత్తాంశమునకు తరగతి అంతరములను ఉపయోగించి పౌనఃపున్య విభాజన పట్టికను తయారు చేయుము. .

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 8

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 9

ప్రశ్న 10.
క్రింది దత్తాంశం యొక్క అంకమధ్యమాన్ని కనుగొనండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 10

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 11

Σfixi = 256; Σfi = 20
అంకమధ్యమం = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}=\frac{256}{20}\) = 12.8.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 11.
క్రింది దత్తాంశమునకు బాహుళకము కనుగొనండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 12

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 13

ఎక్కువ మంది వినియోగదారులు 120 – 140.
తరగతికి చెందినవారు కనుక బాహుళకపు తరగతి. 120 – 140.
బాహుళకపు తరగతి దిగువహద్దు (l) = 120
తరగతి పరిమాణము (h) = 20
బాహుళకపు తరగతి పౌనఃపున్యం (f1) = 20
బాహుళకపు తరగతికి పూర్వపు తరగతి పౌనఃపున్యం (f0) = 16.
బాహుళకపు తరగతికి తర్వాత పౌనఃపున్యం (f2) = 14.
సూత్రమునుపయోగించి,
బాహుళకము = l + \(\left[\frac{\mathrm{f}_{1}-\mathrm{f}_{0}}{2 \mathrm{f}_{1}-\mathrm{f}_{0}-\mathrm{f}_{2}}\right]\) × h

= 120 + \(\left[\frac{20-16}{2 \times 20-16-14}\right]\) × 20

= 120 + \(\left[\frac{4}{40-30}\right]\) × 20

= 120 + \(\left[\frac{4}{10}\right]\) × 20
= 120 + 8 = 128.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 12.
క్రింది దత్తాంశానికి “అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం” గీయండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 14

సాధన.
అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 15

X- అక్షంపై దిగువ హద్దులు, మరియు Y – అక్షంపై అవరోహణ సంచిత పౌనఃపున్యం గుర్తించుము.

X- అక్షంపై 1 సెం.మీ. = 5 యూ.
Y – అక్షంపై 1 సెం.మీ. = 5 యూ.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 16

ప్రశ్న 13.
క్రింది దత్తాంశమునకు బాహుళకము కనుక్కోండి. ”

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 17

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 18

బాహుళకము = l + \(\frac{f_{1}-f_{0}}{2 f_{1}-f_{0}-f_{2}}\) × h;
l = 55.5; f0 = 110; f1 = 135; f2 = 115; h = 3

బాహుళకము = 55.5 + \(\frac{25}{270-225}\) × 3

= 55.5 + \(\frac{25}{45}\) × 3

= 55.5 + \(\frac{5}{3}\) × 3

= 55.50 + 1.67 = 57.17.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 14.
దిగువనీయబడిన దత్తాంశమునకు ‘మధ్యగతము’ కనుగొనండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 19

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 20

n = 40, \(\frac{n}{2}\frac{40}{2}\) = 20
l = 25.5, f = 12, cf = 17, h = 5
మధ్యగతము = l + \(\left(\frac{\frac{n}{2}-c f}{f}\right)\) × h
= 25.5 + (\(\frac{20-17}{12}\)) × 5
= 25.5 + (\(\frac{3}{12}\) × 5)
= 25.50 + \(\frac{5}{4}\)
= 25.50 + 1.25 = 26.75.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 15.
ఈ క్రింది పట్టికను, ఆరోహణ సంచిత పౌనఃపున్య పట్టికగా మార్చి దానినుపయోగించి ‘ఓజివ్’ వక్రమును గ్రాఫ్ ద్వారా చూపుము.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 21

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 22

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 23

ప్రశ్న 16.
క్రింద ఇవ్వబడిన పట్టికలో 25 కుటుంబాలు ఆహారానికి వెచ్చించే దినసరి ఖర్చులు ఇవ్వబడినవి. ఆ దత్తాంశానికి బాహుళకంను కనుగొనండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 24

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 25

భాహుళకము = l + \(\left(\frac{\mathrm{f}_{1}-\mathrm{f}_{0}}{2 \mathrm{f}_{1}-\mathrm{f}_{0}-\mathrm{f}_{2}}\right)\) × h

‘l’ = బాహుళక తరగతి దిగువ హద్దు = 200
‘f1‘ – బాహుళక తరగతి పౌనఃపున్యం = 12
‘f0‘ – బాహుళక తరగతికి ముందున్న ఉన్న తరగతి పౌనఃపున్యం = 5
‘f2‘ – బాహుళక తరగతికి తరువాత ఉన్న తరగతి పౌనఃపున్యం = 2
‘h’ – బాహుళక తరగతి పొడవు = 50 200-250 250-300
∴ బాహుళకము = 200 + (\(\frac{12-5}{24-5-2}\)) × 50
= 200 + \(\frac{7 \times 50}{17}\)
= 200 + \(\frac{350}{17}\)
= 200 + 20.58
∴ బాహుళకము = 220.58.

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 17.
ఒక పరీక్షలో 53 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు క్రింది పట్టికలో ఇవ్వబడినవి. ఆ దత్తాంశానికి “ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం”ను గీయండి.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 26

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 27

ఆరోహణ సంచిత పౌనఃపున్య ఓజీవ్ వక్రం గీయుట కొరకు X-అక్షంపై తరగతి ఎగువ హద్దును, Y-అక్షంపై ఆరోహణ సంచిత పౌనఃపున్యమును తీసుకొనవలెను.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 28

AP Board 10th Class Maths Solutions 14th Lesson Important Questions and Answers సాంఖ్యక శాస్త్రం

ప్రశ్న 18.
ఒక వాణిజ్య సంస్థ యందు కార్మికుల రోజువారీ వేతనములు క్రింది పౌనఃపున్య విభాజనము నందు ఇవ్వబడినవి. ఈ విభాజనము యొక్క సగటు ₹ 220. అయితే ఇందు లోపించిన పౌనఃపున్యం f ను కనుగొనుము.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 29

సాధన.

AP 10th Class Maths Important Questions Chapter 14 సాంఖ్యక శాస్త్రం 30

ఇచ్చినది, xi = 220
\(\overline{\mathrm{X}}=\frac{\sum \mathrm{f}_{\mathrm{i}} \mathrm{X}_{\mathrm{i}}}{\sum \mathrm{f}_{\mathrm{i}}}\)
⇒ 220 = \(\frac{36300+275 \mathrm{f}}{176+\mathrm{f}}\)
⇒ 220(176 + f) = 36300 + 275f
⇒ 38720 + 220 f = 36300 + 275 f
⇒ 220 f – 275 f = 36300 – 38720
⇒ – 55 f = – 2420
⇒ f = \(\frac{2420}{55}\) = 44.

AP 10th Class Maths Important Questions Chapter 13 సంభావ్యత

These AP 10th Class Maths Chapter Wise Important Questions 13th Lesson సంభావ్యత will help students prepare well for the exams

AP Board 10th Class Maths 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 1.
నీవు వ్రాయు ఒక పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలున్నాయి. ప్రతీ ప్రశ్నకూ 1 మార్కు. ఆ పరీక్షలో నీవు సాధించు మార్కులు “5 యొక్క గుణిజం” కావలెనంటే దాని సంభావ్యత ఎంత ?
సాధన.
మొత్తం ప్రశ్నల సంఖ్య = 40
మొత్తం పర్యవసానాల సంఖ్య = 40
40 వరకు 5 యొక్క గుణిజాల సంఖ్య = 8
అనుకూల పర్యవసానాల సంఖ్య = 8
5 యొక్క గుణిజం అగుటకు సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం సాధ్యమయ్యే పర్యవసానముల సంఖ్య
= \(\frac{8}{40}=\frac{1}{5}\).

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 2.
100 పేజీలు గల ఒక పుస్తకమునందు యాదృచ్ఛికంగా తెరువబడిన పేజీ సంఖ్య ఒక ‘ఖచ్చిత వర్గము అయ్యే సంభావ్యత కనుగొనుము.
సాధన.
ఒక పుస్తకం నందు గల మొత్తం పేజీల సంఖ్య = 100
ఈ పుస్తకం నుండి యాదృచ్ఛికంగా తెరవబడిన పేజీ సంఖ్య ఒక ఖచ్చిత వర్గ సంఖ్య అగుటకు గల పర్యవసానాలు = 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 మరియు 100 నెంబర్లు గల పేజీలు.
∴ అనుకూల పర్యవసానాల సంఖ్య = 10
మొత్తం పర్యవసానాల సంఖ్య = 100
∴ పై ఘటన యొక్క సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య
= \(\frac{10}{100}\) = 0.1

ప్రశ్న 3.
P(E) = 0.546, అయిన ‘E కాదు! యొక్క సంభావ్యత ఎంత ?
సాధన.
P(E) = 0.546
P(E) = 1 – P(E)
“E కాదు” సంభావ్యత = 1 – 0.546 = 0.454.

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 4.
ఒక పెట్టెలో 3 నీలం రంగు మరియు 4 ఎర్రబంతులు కలవు. యాదృచ్ఛికంగా పెట్టె నుండి తీయబడిన బంతి ఎరుపు బంతి అగుటకు సంభావ్యత ఎంత ?
సాధన.
మొత్తం బంతుల సంఖ్య = 3 + 4 = 7.
మొత్తం పర్యవసానాల సంఖ్య = 7
ఎర్రబంతి అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 4
తీసిన బంతి ఎర్రబంతి అగుటకు సంభావ్యత = \(\frac{4}{7}\)

ప్రశ్న 5.
ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు కలరు. వారిలో 32 మంది టీ త్రాగుదురు. టీ త్రాగని వారి సంభావ్యత ఎంత ?
సాధన.
మొత్తం పర్యవసానాల సంఖ్య = 60
టీ త్రాగని వారి సంఖ్య (అనుకూల పర్యవసానాల సంఖ్య) = 60 – 32 = 28
టీ త్రాగని వారి సంభావ్యత = టీ త్రాగకుండుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య
= \(\frac{28}{60}=\frac{7}{15}\)

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 6.
‘సమసంభవ ఘటనలు’ అనగానేమి ? ఒక ఉదాహరణ ఇవ్వండి.
సాధన.
సమసంభవ ఘటనలు :
ఒక ప్రయోగంలో రెండు లేక అంతకన్నా ఎక్కువ ఘటనలు సంభవించడానికి సమాన అవకాశములు ఉంటే వాటిని సమసంభవ ఘటనలు అంటారు.
ఉదా : ఒక నాణేన్ని ఎగురవేసినపుడు బొమ్మ లేదా బొరుసు పడే సంభావ్యత.

ప్రశ్న 7.
ఒక సంచిలో 5. ఎరుపు, 8 తెలుపు బంతులు కలవు. ఆ సంచి నుండి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది i) తెలుపు బంతి అయ్యే ii) తెలుపు బంతి కాకుండా సంభావ్యత ఎంత ?
సాధన.
సంచిలోని మొత్తం బంతుల సంఖ్య = 5 + 8 = 13
5 ఎరుపు + 8 తెలుపు = 13
తెలుపు బంతి అగుటకు గల సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య
= \(\frac{5}{13}\)
P(E) = \(\frac{8}{13}\)
తెలుపు బంతి కాకుండుటకు సంభావ్యత = P(\(\overline{\mathrm{E}}\)) = ?
P(E) + P(\(\overline{\mathrm{E}}\)) = 1
⇒ P(\(\overline{\mathrm{E}}\)) = 1 – P(E)
= 1 – \(\frac{8}{13}\) = \(\frac{5}{13}\)

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 8.
ఒక పెట్టెలో 1 నుండి 5 వరకు అంకెలు వ్రాయబడిన 5 కార్డులున్నాయి. వాటి నుండి ఏవైనా 2 కార్డులు తీసినచో, ఏర్పడే అనుకూల పర్యవసానాలు అన్నీ వ్రాసి, ఆ 2 కార్డులపై సరిసంఖ్యలుండే సంభావ్యత కనుగొనండి.
సాధన.
రెండు కార్డులను బాక్సు నుండి తీసుకొన్నప్పుడు వీలైన
అన్ని పర్యవసానాలు
(1, 2), (1, 3), (1, 4), (1, 5) (2, 3), (2, 4), (2, 5) (3,4), (3, 5), (4, 5)
∴ మొత్తం పర్యవసానాల సంఖ్య = 10
రెండు కార్డులపై సరి సంఖ్యలు అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 1, (అది (2, 4))
రెండు కార్డులపైనా సరి సంఖ్యలు వచ్చే సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య

ప్రశ్న 9.
ఒక పాచికను ఒక్కసారి దొర్లించినపుడు ఈ క్రింది ఘటనల సంభావ్యతలను కనుక్కోండి.
(i) సరి సంఖ్య
(ii) బేసి ప్రధాన సంఖ్య
సాధన.
ఒకసారి పాచికను దొర్లించిన మొత్తం పర్యవసానాల సంఖ్య = 6
(i) సరిసంఖ్య వచ్చుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 3
సరిసంఖ్య వచ్చుటకు సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య
= \(\frac{3}{6}=\frac{1}{2}\)

(ii) బేని ప్రధాన సంఖ్య వచ్చుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 2
బేసి ప్రధానసంఖ్య వచ్చుటకు సంభావ్యత = \(\frac{2}{6}=\frac{1}{3}\).

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 10.
పాచికను ఉపయోగించి సంభావ్యతను కనుగొను రెండు సమస్యలను వ్రాయుము.
సాధన.
పాచికను ఉపయోగించి సంభావ్యత కనుగొనుటకు రెండు సమస్యలు :
1) పాచికను ఒకసారి దొర్లించినపుడు దానిపైన సరిసంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత ?
2) పాచికను ఒకసారి దొర్లించినపుడు దానిపైన బేసి సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత ?

ప్రశ్న 11.
సంచిలో ఒకే పరిమాణం కలిగిన 5.ఎరుపు, 5 ఆకుపచ్చ మరియు 5 తెలుపు బంతులు కలవు. అందులో నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీయగా ఆ బంతి ఆకుపచ్చ, ఎరుపు లేదా తెలుపు రంగు వచ్చే సంభావ్యతలు సమసంభవాలా? కాదా? సమర్థించండి.
సాధన.
ఎరుపు బంతుల సంఖ్య = 5 = n(R)
ఆకుపచ్చ బంతుల సంఖ్య = 5 = n(G)
తెలుపు బంతుల సంఖ్య = 5 = n(W)
మొత్తం బంతులు = 15 = T(B)
ఎరుపు బంతులను తీయగలిగిన సంభావ్యత = P(R)
= ఎరుపు బంతుల సంఖ్య / మొతం బంతులు
= \(\frac{5}{15}=\frac{1}{3}\)
ఆకుపచ్చ బంతులను తీయగలిగిన సంభావ్యత = \(\frac{5}{15}=\frac{1}{3}\)
తెలుపు బంతులను తీయగలిగిన సంభావ్యత = \(\frac{5}{15}=\frac{1}{3}\)
సంభావ్యతలన్నీ సమానములు.
కావున అన్ని పర్యవసానములు సమసంభవాలు.

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 12.
ఒక పేక ముక్కల కట్ట నుండి ఏస్, రాజు మరియు 10 సంఖ్య గల 3 కళావరు ముక్కలను బయటకు తీసి, మిగిలిన వాటిని బాగా కలిపి, వాటి నుండి ఒక పేక ముక్కను తీసినచో అది
(i) కళావరు అగుటకు,
(ii) ఏస్ అగుటకు,
(iii) డైమండ్ రాజు అగుటకు,
(iv) కళావరు 5 అగుటకు సంభావ్యత కనుగొనండి.
సాధన.
మొత్తం పర్యవసానాల సంఖ్య 52 – 3 = 49
(i) తీసిన ముక్క కళావరు అగుటకు సంభావ్యత = కళావరు అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానముల సంఖ్య
= \(\frac{10}{49}\)

(ii) తీసిన ముక్క ఆసు అగుటకు సంభావ్యత = \(\frac{3}{49}\)
(iii) తీసిన ముక్క డైమండ్ రాజు అగుటకు సంభావ్యత = \(\frac{1}{49}\)
(iv)తీసిన ముక్క కళావరు 5 అగుటకు సంభావ్యత = \(\frac{1}{49}\)

ప్రశ్న 13.
ఒక సంచిలో 1 నుండి 20 వరకు వ్రాయబడి ఉన్న 20 ఫలకాలు ఉన్నాయి. వాటి నుండి యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకొంటే దానిపై క్రింది సంఖ్యలు ఉండుటకు సంభావ్యత ఎంత ?
(i) సరి సంఖ్య
(ii) ప్రధాన సంఖ్య
(iii) 5 యొక్క గుణిజము
(iv) రెండంకెల బేసి సంఖ్య
సాధన.
మొత్తం పర్యవసానాల సంఖ్య = 20
(i) తీసిన ఫలకము పైన ఉండు సంఖ్య సరిసంఖ్య అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 10
సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య
= \(\frac{10}{20}=\frac{1}{2}\)

(ii) తీసిన ఫలకముపైన ఉండు సంఖ్య ప్రధాన సంఖ్య అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 8.
సంభావ్యత = \(\frac{8}{20}=\frac{2}{5}\)

(iii) తీసిన ఫలకము పైన ఉండు సంఖ్య 5 యొక్క గుణిజము అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 4
∴ సంభావ్యత = \(\frac{4}{20}=\frac{1}{5}\)

(iv) తీసిన ఫలకముపైన ఉండు సంఖ్య రెండంకెల బేసి సంఖ్య అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 5
∴ సంభావ్యత = \(\frac{5}{20}=\frac{1}{4}\)

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 14.
రెండు పాచికలను ఒకేసారి దొర్లించడం జరిగింది. రెండు పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తం
(a) 10,
(b) 12 లేక అంతకన్నా తక్కువ,
(c) ప్రధాన సంఖ్య,
(d) ‘3’ యొక్క గుణిజం అగుటకు సంభావ్యతలను కనుగొనుము.
సాధన.
రెండు పాచికలను ఒకేసారి దొర్లించిన సాధ్యపడు మొత్తం పర్యవసానాలు S =

AP 10th Class Maths Important Questions Chapter 13 సంభావ్యత 1

మొత్తం,సాధ్యపడు పర్యవసానాల సంఖ్య = 6 × 6 = 36
రెండు సంఖ్యల మొత్తం 10 అయ్యే ఘటనకు అనుకూల
పర్యవసానాలు = (4, 6), (5, 5), (6, 4) .

(a) రెండు సంఖ్యల మొత్తం 10 అయ్యే ఘటనకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 3

P(E) = E కు అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం సాధ్యపడు పర్యవసానాల సంఖ్య
P(మొత్తం 10) = \(\frac{3}{36}=\frac{1}{12}\)

(b) రెండు సంఖ్యల మొత్తము 12 లేక అంతకన్నా తక్కువ అయ్యే ఘటనకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 36
P(మొత్తము ≤ 12) = \(\frac{36}{36}\) = 1

(c) రెండు సంఖ్యల మొత్తము ప్రధాన సంఖ్య అయ్యే ఘటనకు అనుకూల పర్యవసానాలు = (1, 1), (1, 2), (1, 4), (1, 6), (2, 1), (2, 3), (2, 5), (3, 2), (3, 4), (4, 1), (4, 3), (5, 2), (5, 6), (6, 1), (6, 5)
రెండు సంఖ్యల మొత్తము ప్రధాన సంఖ్య అయ్యే ఘటనకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 15
P(రెండు సంఖ్యల మొత్తం ప్రధాన సంఖ్య) = \(\frac{15}{36}=\frac{5}{12}\)

(d) రెండు సంఖ్యల మొత్తము 3 యొక్క గుణిజము అయ్యే ఘటనకు అనుకూల పర్యవసానాలు = (1, 2), (1, 5), (2, 1), (2, 4), (3, 3), (3,6), (4, 2), (4, 5), (5, 1), (5, 4), (6, 3), (6, 6)
రెండు సంఖ్యల మొత్తము 3 యొక్క గుణిజము అయ్యే ఘటనకు అనుకూల పర్యవసానాల సంఖ్య: :
= 12
P(రెండు సంఖ్యల మొత్తము 3 యొక్క గుణిజము) = \(\frac{12}{36}=\frac{1}{3}\)

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 15.
బాగుగా కలుపబడిన పేకముక్కల’ (52) కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతను లెక్కించండి.
(i) ఎరుపు రాజు
(ii) నలుపు జాకీ
(iii) నలుపు ముఖ కార్డు
(iv) డైమండ్ గుర్తు గల రాణి
సాధన.
పేకముక్కల సంఖ్య = 52
మొత్తం పర్యవసానాల సంఖ్య = 52
బాగుగా కలుపబడిన పేకముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది
(i) ఎరుపు రాజు కార్డు అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 2
సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాల సంఖ్య
= \(\frac{2}{52}=\frac{1}{26}\)

(ii) నలుపు “జాకీ – కార్డు అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 2
సంభావ్యత = \(\frac{2}{52}=\frac{1}{26}\)

(iii) నలుపు ముఖ కార్డు అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 6.
సంభావ్యత = \(\frac{6}{52}=\frac{3}{26}\)

(iv) డైమండ్ ‘గుర్తు గల రాణి కార్డు అగుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య = 1
∴ సంభావ్యత = \(\frac{1}{52}\)

AP Board 10th Class Maths Solutions 13th Lesson Important Questions and Answers సంభావ్యత

ప్రశ్న 16.
0, 1, 2, 3 మరియు 4 అనే అంకెలతో ఏర్పడే రెండంకెల సంఖ్యలలో (ఒక అంకె ఒకసారి మాత్రమే ఉపయోగించగా)
(i) 42 కంటే పెద్ద సంఖ్య
(ii) 4 యొక్క గుణిజం అగుటకు గల సంభావ్యత కనుగొనుము.
సాధన.
ఒక అంకెను ఒకేసారి ఉపయోగించి 0, 1, 2, 3 మరియు 4 అనే అంకెలతో ఏర్పడే రెండంకెల సంఖ్యలు. (10, 12, 13, 14, 20, 21, 23, 24, 30, 31, – 32, 34, 40, 41, 42, 43)
∴ అనుకూల పర్యవసానాలు = (10, 12, 13, 14, 20, 21, 23, 24, 30, 31, 32, 34, 40, 41, 42, 43)
∴ n(s) = 16
∴ అనుకూలపర్యవసానాల సంఖ్య = 16

(i) 42 కంటే పెద్ద సంఖ్యలు ఏర్పడే సంభావ్యత = అనుకూల పర్యవసానాల సంఖ్య / మొత్తం పర్యవసానాలు
ఇక్కడ, అనుకూల పర్యవసానాల సంఖ్య = 1 (43 మాత్రమే)
∴ సంభావ్యత = 1

(ii) అనుకూల పర్యవసానాలలో 4 యొక్క గుణిజాలు = 12, 20, 24, 32, 40
∴ 4 యొక్క గుణిజాల సంఖ్య = 5
‘4’ యొక్క గుణిజాలు ఏర్పడే సంభావ్యత = \(\frac{5}{16}\)