These AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 3rd Lesson Important Questions and Answers చిన్ని శిశువు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గేయాలు

కింది గేయాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. తోయంపు గురులతోడ దూగేటి శిరసు, చింత
కాయల వంటి జడల గముల తోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట పాటాడు శిశువూ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘పాయక’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
విడువక

ఆ) ‘కనకం’ పర్యాయపదాలు ఏవి?
జవాబు:
బంగారం, స్వర్ణం

ఇ) ‘యశోద’ ఎవరి తల్లి?
జవాబు:
శ్రీకృష్ణుని (పాఠం ప్రకారం)

ఈ) ‘శిశువు’ వ్యుత్పత్తి ఏమిటి?
జవాబు:
ఎక్కువకాలం నిద్రించునది.

2. ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపుం జేతుల పైడి బొద్దుల తోడ
అద్దపుం జెక్కులతోడ అప్ప లప్ప లని నంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువూ!
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘ముద్దు’ దీని ప్రకృతి పదం ఏమిటి?
జవాబు:
ముద్రా / ముద్ర

ఆ) ‘నిద్దపుంజేతులు’ పదాన్ని విడదీయండి.
జవాబు:
నిద్దము + చేతులు

ఇ) ‘అద్దపుం జెక్కులు’ పదానికి విగ్రహవాక్యం ఏమిటి?
జవాబు:
అద్దము వంటి చెక్కులు

ఈ) ‘గద్దించు’ నానార్థాలు ఏమిటి?
జవాబు:
అరచు, మందలించు

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

3. బలుపైన పొట్టమీది పాలచారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదె వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘శిశువు’ తాగిన పదార్థం ఏమిటి?
జవాబు:
పాలు

ఆ) ‘నులివేడి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కొంచెం వేడి

ఇ) ‘నేడిదె’ పదాన్ని విడదీయండి.
జవాబు:
నేడు + ఇదే

ఈ) లోకాలను కాపాడు ఆ స్వామి ఎక్కడ నిలిచాడు?
జవాబు:
లోకాలను కాపాడే ఆ స్వామి వేంకటాద్రిపై నిలిచాడు.

అపరిచిత పద్యా లు

కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతీ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘సుమతీ’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
మంచిబుద్ధి కలవాడు

ఆ) ‘ధన్యుడు’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
పుణ్యవంతుడు / వివేకవంతుడు

ఇ) ‘మాటలాడి’ పదాన్ని విడదీయండి.
జవాబు:
మాటలు + ఆడి

ఈ) ఈ పద్యానికి శీర్షిక (పేరు) రాయండి.
జవాబు:
ధన్యుడు

2. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?
విశ్వదాభిరామ వినుర వేమ!
ప్రశ్నలు – జవాబులు :
అ) ‘తల్లిదండ్రులు’ ఏ సమాసం?
జవాబు:
ద్వంద్వ సమాసం

ఆ) తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుణ్ణి వేమన దేనితో పోల్చాడు?
జవాబు:
పుట్టలోని చెదలతో పోల్చాడు

ఇ) వేమన శతకంలోని మకుటం ఏమిటి?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ

ఈ) ‘పుట్టు’కు వ్యతిరేక పదం రాయండి.
జవాబు:
గిట్టు

3. కోకిలమ్మ చేసికొన్న పుణ్యంబేమి!
కాకి చేసికొన్న కర్మమేమి!
మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు
లలిత సుగుణజాల తెలుగుబాల!
ప్రశ్నలు – జవాబులు :
అ) పై పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
తెలుగుబాల శతకం

ఆ) పై పద్యం రాసినదెవరు?
జవాబు:
జంధ్యాల పాపయ్యశాస్త్రి

ఇ) మర్యాద దేని ద్వారా వస్తుంది?
జవాబు:
మధుర భాషణము వల్ల మర్యాద వస్తుంది.

ఈ) ఈ పద్యంలోని పక్షుల పేర్లు ఏమిటి?
జవాబు:
కోకిలమ్మ, కాకి

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

4. కన్నతల్లి దండ్రి కలహించి విడిపోవ
ప్రేమ లేక పెరుగు పిల్లలిపుడు
నేరగాండలోన జేరు చుండిరి సుమా!
పగ, మనస్సులో న రగులు చుండ.
ప్రశ్నలు – జవాబులు :
అ) తల్లిదండ్రుల ప్రేమ దూరమైన పిల్లలు ఎలా మారుతున్నారు?
జవాబు:
నేరచరితులుగా

ఆ) ఎవరు కలహించి విడిపోతున్నారు?
జవాబు:
తల్లి, తండ్రి

ఇ) నేరగాళ్ళగా మారిన పిల్లల మనసులో ఏమి రగులుతుంటుంది?
జవాబు:
పగ

ఈ) తల్లిదండ్రులు ఎలా ఉంటే మీకిష్టం?
జవాబు:
ప్రేమగా

5. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు
నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా
లలితసుగుణజాల తెలుగుబాల.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఎవరి మనసు కష్టపెట్టరాదు?
జవాబు:
కన్నతల్లి మనసు

ఆ) దైవ సన్నిభులు ఎవరు?
జవాబు:
తల్లిదండ్రులు

ఇ) ఎవరి పనులు నష్టపెట్టరాదు?
జవాబు:
నాన్న పనులు

ఈ) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యములో గల మకుటం ఏది?

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఎటువంటి కృష్ణుడు వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు?
జవాబు:
పొట్టమీద పాలచారలతో ఉన్న కృష్ణుడు శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. కొసరి కొసరి తిన్న వెన్న నోటితో వెలిశాడు. సర్వ లోకాలనూ కాపాడడానికి వెలిశాడు.

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ప్రశ్న 2.
శ్రీ కృష్ణుడు తన తల్లినెందుకు కౌగిలించుకొనేవాడు?
జవాబు:
చిన్నపిల్లలు సాధారణంగా తల్లిని వదిలి ఉండరు. ఉండలేరు. తల్లి పాడే పాటలు, చెప్పే కబుర్లు, ఆడించే ఆటలు పిల్లలకు చాలా ఇష్టం. అందుకే చిన్ని కృష్ణుని కూడా తోటివారు ఆటలకు పిలిస్తే వెళ్లేవాడుకాదు. వారిని గదమాయించేసేవాడు. తల్లిని కౌగిలించుకొనేవాడు. ఆమె దగ్గరే ఉండేవాడు.

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“చిన్ని శిశువు” పాఠంలోని చిన్ని శిశువు గురించి మీకేం తెలిసింది?
జవాబు:
చిన్ని శిశువు శ్రీకృష్ణుడు. ఆయన జడలు చింతకాయలులా ఉన్నాయి. ఆయన బంగారు మువ్వల గజ్జెలు ధరించాడు. వంకీ ఉంగరాలు ధరించాడు. చేతులకు బంగారు. మురుగులు ధరించాడు. వీటన్నింటినీ బట్టి ఆయన చాలా డబ్బు గలవారి గారాలబిడ్డ అని తెలిసింది. పొట్టమీద పాలచారలున్నాయి. వెన్న తిన్న నోరును బట్టి ఆయనకు వెన్న, పాలు ఇష్టమని తెలిసింది. ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. అన్ని లోకాలను రక్షిస్తున్నాడంటే ఆయన దేవుడని తెలిసింది.

ప్రశ్న 2.
శ్రీకృష్ణుని గురించి మీకు తెలిసినవి వ్రాయండి.
జవాబు:
శ్రీకృష్ణుడు’ దేవకీదేవి, వసుదేవుల బిడ్డ. ఆయన జైలులో జన్మించాడు. ఆయన పుట్టగానే యశోద పక్కలోకి చేర్చాడు వసుదేవుడు. అందుచేత యశోద దగ్గర పెరిగాడు. చాలా అల్లరి చేసేవాడు. చుట్టుప్రక్కల ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న దొంగిలించి తాగే సేవాడు. తన స్నేహితులకు పెట్టేసేవాడు. ఇంటికి ఎవరైనా గొడవకు వచ్చి యశోదకు చెబితే ఆమె చీర కొంగుచుట్టుకొని వెనక దాక్కొనేవాడు. అమాయకత్వం నటించేవాడు. నల్లగా ఉండేవాడు.

III. భాషాంశాలు

పర్యాయపదాలు

శిశువు = బిడ్డ, చంటిపాప
కురులు = వెంట్రుకలు, రోమములు
చేతులు = కరములు, హస్తములు
చెక్కులు = చెక్కిళ్లు, కపోలము
నోరు = వాయి, మూతి
జడ = జట, వేణి
మువ్వ = మంజీరము, శింజిని
నిద్దము = సొగసు, అందము
మేను = శరీరం, దేహం
పాలు = క్షీరము, దుగ్ధము
లోకము = జగము, జగతి
చూచుట = కనుట, వీక్షించుట
శిరసు = తల, మస్తకము
అద్దము = ముకురము, దర్పణము
వెన్న – నవనీతము, వెన్నపూస
గములు = గుంపులు, సమూహాలు
కనకం = బంగారం, పైడి
ఉంగరం = అంగుళీయకము, బటువు
గద్దించి = అదలించి, గదమాయించి
పొట్ట = కడుపు, ఉదరము
అద్రి = పర్వతము, కొండ

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ప్రకృతులు – వికృతులు

శిశువు – నిసుగు
అంబ – అమ్మ
శిరసు – సిరసు
తింత్రిణి, చించా – చింత
జట – జడ
ముద్ర -ముద్దు
శ్రీ – సిరి
అబ్దము – అద్దము
కృష్ణుడు – కన్నడు

వ్యతిరేకపదాలు

చిన్న × పెద్ద
చూడము × చూస్తాము
పాయక × పాసి
వచ్చి × వెళ్లి
పైన × క్రింద

సంధులు : (ఉత్వసంధి)

చూడము + అమ్మా = చూడమమ్మా
తూగు + ఏటి = తూగేటి
పాఱు + ఆడు = పాఱాడు
బలుపు + ఐన = బలుపైన
నేడు + ఇది = నేడిదె
లోకములు + ఎల్ల = లోకములెల్ల

యడాగమం:
అమ్మయిటువంటి = అమ్మ + ఇటువంటి
మొరవంకయుంగరాల . = మొరవంక + ఉంగరాల

సంధులు : ఈ క్రింది పదాలను కలిపి రాయండి.

1. అమ్మ + ఇటువంటి = అమ్మయిటువంటి.
2. మొరవంక + ఉంగరాల = మొరవంకయుంగరాల
3. కట్టిన + అట్లు = కట్టినయట్లు
4. మా + ఊరు = మయూరు
5. మీ + ఇంట = మీయింట

విభక్తులు : ఈ క్రింది ఖాళీలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.

1. సింహము ……………… పిల్ల (యొక్క)
2. అడవి ………………… జంతువులుంటాయి. (లో)
3. నలుగురి …………………. మంచిగా ఉండాలి. (తో)
4. పెద్దల ………………. గౌరవించాలి. (ను)
5. మా ఊరి ……………….. బస్సు వచ్చింది. (కి)
6. అతని ………………. నేనేమీ అనలేదు. (ని)
7. వాళ్ల …………………… గొడవ వద్దు. (తో)
8. కృష్ణు …………………. దైవం. (డు)
9. వన ……………….. లో మొక్కలున్నాయి. (ము)
10. మంచి ………………. మారుపేరుగా ఉండాలి. (కి)

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. చిన్న …………… లేకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు. (పెద్ద)
2. చెడును చూడము. మంచిని …………… (చూస్తాము)
3. మంచిని పాయక నేర్చుకోవాలి. చెడును ………………. బ్రతకాలి. (పాసి)
4. బడికి వచ్చి చదవకుండా ……………. పోతే ప్రయోజనం లేదు. (వెళ్లి)
5. పైన, ……………… చూసుకొని నడవాలి. (క్రింద)

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. మంచిని ఎన్నడు విడువకు.
a) ఎప్పుడు
b) అప్పుడు
c) ఇప్పుడు
d) నిన్న
జవాబు:
a) ఎప్పుడు

2. వృద్ధులకు కురులు తెల్లబడతాయి.
a) శరీరాలు
b) అరచేతులు
c) అరికాళ్లు
d) వెంట్రుకలు
జవాబు:
d) వెంట్రుకలు

3. ఏనుగుల గములు ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి.
a) అరుపులు
b) గుంపులు
c) ఘీంకారాలు
d) ఆటలు
జవాబు:
b) గుంపులు

4. కనకము ధర రోజురోజుకూ పెరుగుతోంది.
a) వెండి
b) భూమి
c) బంగారం
d) పెట్రోలు
జవాబు:
c) బంగారం

5. గురువును పాయక జ్ఞానం సంపాదించాలి.
a) సేవించి
b) విడువక
c) బెదిరింపక
d) గౌరవించి
జవాబు:
b) విడువక

6. ఎవరి పిల్లలు వారికి నిద్దముగా కనబడతారు.
a) అందము
b) బుద్ది
c) తెలివి
d) ఆరోగ్యం
జవాబు:
a) అందము

7. శివుడు అద్రి మీద శయనించును.
a) శివలింగం
b) పానపట్టు
c) శ్మశానం
d) కొండ
జవాబు:
d) కొండ

8. మేను ను శుభ్రంగా తోముతూ స్నానం చేయాలి.
a) సబ్బు
b) శరీరం
c) బట్టలు
d) గిన్నె
జవాబు:
b) శరీరం

9. చంటి పిల్లలకు బొద్దులు చేయిస్తారు.
a) దుద్దులు
b) ఉంగరాలు
c) మురుగులు
d) మొలతాళ్లు
జవాబు:
c) మురుగులు

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

10. పిల్లలను గద్దించి ఐనా చదివించాలి.
a) అదలించి
b) కొట్టి
c) తిట్టి
d) నించోపెట్టి
జవాబు:
a) అదలించి

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. వెన్న తినడం అందరికీ ఇష్టమే.
a) నెయ్యి
b) మీగడ
c) నవనీతం, వెన్నపూస
d) నెయ్యి, ఘృతం
జవాబు:
c) నవనీతం, వెన్నపూస

12. జడలో పూలు పెట్టుకోవాలి.
a) జడ్జ, జడము
b) తల, శిరసు
c) జడత, పూలజడ
d) వేణి, జట
జవాబు:
a) జడ్జ, జడము

13. కనకంతో ఆభరణాలు చేయించుకొంటారు.
a) బంగారం, పైడి
b) ఇత్తడి, పుత్తడి
c) రజతం, వెండి
d) డబ్బు, ధనం
జవాబు:
a) బంగారం, పైడి

14. హనుమ మేను పెంచి సీతమ్మను ఓదార్చాడు.
a) కాయం, ఖాయం
b) శరీరం, దేహం
c) బలం, శక్తి
d) భక్తి, నమ్మకం
జవాబు:
b) శరీరం, దేహం

15. పిల్లలు పాలు ఎక్కువ త్రాగాలి.
a) ఉదకం, నీరు
b) పరమాన్నం, క్షీరాన్నం
c) క్షీరము, దుగ్ధం
d) టీ, కాఫీ
జవాబు:
c) క్షీరము, దుగ్ధం

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

16. నిసుగు కు ఏడ్వడానికి విసుగు ఉండదు.
a) నలుసు
b) శిశువు
c) శిష్యుడు
d) చంటిబిడ్డ
జవాబు:
b) శిశువు

17. అంబను మించిన దైవం లేదు.
a) అమ్మ
b) పార్వతీదేవి
c) స్త్రీ
d) అమ్మవారు
జవాబు:
a) అమ్మ

18. సిరసున తలపాగా బాగుంది.
a) తల
b) మస్తకం
c) శిరసు
d) శీర్షము
జవాబు:
c) శిరసు

19. తింత్రిణీ ఫలము బాగుంటుంది.
a) చింత
b) చింతపండు
c) చించా
d) నిమ్మ
జవాబు:
a) చింత

20. చంటిపిల్లల నెక్కువగా ముద్దు పెట్టుకోకూడదు.
a) ముగ్ధ
b) ముద్ర
c) ముదర
d) పట్టుకోవడం
జవాబు:
b) ముద్ర

21. అద్దములో ముఖం చూసుకొంటాం.
a) ఆబ్దికం
b) శతాబ్దం
c) సహస్రాబ్దం
d) అబ్దం
జవాబు:
d) అబ్దం

22. సిరి గలవారు కొద్దిమందే ఉంటారు.
a) శ్రీ
b) డబ్బు
c) డబ్బు
d) సంపద
జవాబు:
a) శ్రీ

23. కన్నడు అల్లరి ఎక్కువ చేశాడు.
a) దొంగ
b) దొంగవాడు
c) కృష్ణుడు
d) శ్రీకృష్ణుడు
జవాబు:
c) కృష్ణుడు

2. వ్యాకరణాంశాలు

ఈ క్రింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.

24. రాముని ……… రావణుడు యుద్ధం చేశాడు.
a) చేత
b) ని
c) తో
d) చే
జవాబు:
c) తో

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

25. చిన్ని కృష్ణు ………. అన్నమయ్య వర్ణించాడు.
a) ని
b) ను
c) చేత
d) తో
జవాబు:
a) ని

26. అన్నమయ్య ………. ఎంత చెప్పినా తక్కువే.
a) ను
b) ని
c) తో
d) గురించి
జవాబు:
d) గురించి

27. కృష్ణు ………. వెన్నదొంగ.
a) ని
b) డు
c) చేత
d) తో
జవాబు:
b) డు

28. బాణం ………… కొట్టాడు .
a) ను
b) తో
c) గూర్చి
d) వలన
జవాబు:
b) తో

29. వృక్షముల ……….. కొట్టరాదు.
a) తో
b) వలన
c) యొక్క
d) ను
జవాబు:
d) ను

30. నల్ల ………. రంగు గలవాడు కృష్ణుడు.
a) ని
b) న
c) తో
d) యొక్క
జవాబు:
a) ని

31. పాము ………. కరవబడ్డాడు.
a) యొక్క
b) ను
c) చేత
d) ని
జవాబు:
c) చేత

32. తెలివి ……… పనులు చేయాలి.
a) ని
b) తో
c) చేత
d) ను
జవాబు:
b) తో

33. పాఠము ………. చదవాలి.
a) గూర్చి
b) తో
c) ని
d) ను
జవాబు:
d) ను

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

సమాసాలు: సరైన సమాస పదాలను, విగ్రహవాక్యాలను గుర్తించి వ్రాయండి.

34. చిన్నిశిశువు – విగ్రహవాక్యం గుర్తించండి.
a) చిన్ని యొక్క శిశువు
b) చిన్నియును, శిశువును
c) చిన్నదైన శిశువు
d) చిన్నితో శిశువు
జవాబు:
c) చిన్నదైన శిశువు

35. మా పాఠము విగ్రహవాక్యం గుర్తించండి.
a) మాదైన పాఠము
b) మా యొక్క పాఠము
c) పాఠము మాది
d) మా కొఱకు పాఠము
జవాబు:
b) మా యొక్క పాఠము

36. తల్లియును తండ్రియును – సమాసపదం గుర్తించండి.
a) తల్లితండ్రి
b) తల్లేతండ్రి
c) తండ్రితల్లి
d) తల్లిదండ్రులు
జవాబు:
d) తల్లిదండ్రులు

37. పనస అను పేరు గల కాయ – సమాసపదం గుర్తించండి.
a) పనసకాయ
b) కాయపనస
c) పనసనుకోయ
d)కాయైనపనస
జవాబు:
a) పనసకాయ

38. తల్లి ప్రేమ – విగ్రహవాక్యం గుర్తించండి.
a) తల్లికి ప్రేమ
b) తల్లియే ప్రేమ
c) తల్లి యొక్క ప్రేమ
d) తల్లిపైన ప్రేమ
జవాబు:
c) తల్లి యొక్క ప్రేమ

39. జడల యొక్క గములు – సమాసపదం గుర్తించండి.
a) జడలనెడి గములు
b) జడలగములు
c) గములనెడిజడలు
d) జలలేగములు
జవాబు:
b) జడలగములు

40. బాలుడైన కృష్ణుడు – సమాసపదం గుర్తించండి.
a) బాలకృష్ణుడు
b) కృష్ణబాలుడు
c) బాల్యకృష్ణ
d) బాలకృష్ణ
జవాబు:
a) బాలకృష్ణుడు

41. కనకపు మువ్వలు – విగ్రహవాక్యం గుర్తించండి.
a) కనకము యొక్క మువ్వలు
b) మువ్వలైన కనకము
c) కనకమైన మువ్వలు
d) కనకముతో మువ్వలు
జవాబు:
d) కనకముతో మువ్వలు

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

42. చల్లగాలి – విగ్రహవాక్యం గుర్తించండి.
a) చల్లనైన గాలి
b) గాలి యొక్క చల్లదనం
c) చలి పెంచే గాలి
d) గాలి వలన చలి
జవాబు:
a) చల్లనైన గాలి

43. పెద్దదైన ప్రశ్న – సమాసపదం గుర్తించండి.
a) పెద్దగా ప్రశ్న
b) ప్రశ్న పెద్దది
c) పెద్ద ప్రశ్న
d) ప్రశ్నే పెద్దది
జవాబు:
c) పెద్ద ప్రశ్న

సంధులు : క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.

44. మాయూరు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మా + ఊరు
b) మా + యూరు
c) మాయు + ఊరు
d) మాయ + యూరు
జవాబు:
a) మా + ఊరు

45. అక్కడ + ఉన్న – సంధి కలిసిన రూపం గుర్తించండి.
a) అక్కడున్న
b) అక్కడయున్న
c) అక్కడ ఉన్న
d) అకజొన్న
జవాబు:
a) అక్కడున్న

46. అమ్మమ్మ – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అమ్మా + అమ్మ
b) మ్మ + మ్మ
c) అమ్మ + అమ్మ
d) అమ్మ + మ్మ
జవాబు:
c) అమ్మ + అమ్మ

47. ఎవరు + అది – సంధి కలిసిన రూపం గుర్తించండి.
a) ఎవరిది
b) ఎవరది
c) అదెవరు
d) ఎవరిదో
జవాబు:
b) ఎవరది

48. అదేమిటి – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అది + ఏమిటి
b) అదేమి + టి
c) అదు + ఏమిటి
d) అది + ఏమిటి
జవాబు:
d) అది + ఏమిటి

49. రామాలయం – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) రామా + ఆలయం
b) రామ + ఆలయం
c) రామా + లయం
d) రాం + ఆలయం
జవాబు:
b) రామ + ఆలయం

50. శత + అబ్ది – సంధి కలిసిన రూపం గుర్తించండి.
a) శతయబ్ది
b) శతంఅబ్ది
c) శతాబ్ది
d) శతమ
జవాబు:
c) శతాబ్ది

51. నన్నోడెనా? – దీని సంధి పేరు గుర్తించండి.
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) సవర్ణదీర్ఘ సంధి
d) యడాగమం
జవాబు:
b) ఉత్వసంధి

52. క్రిందివానిలో ఉత్వసంధి ఉదాహరణ గుర్తించండి.
a) రాకున్నది
b) చీకాకు
c) మీకున్నది
d) పాకేది
జవాబు:
c) మీకున్నది

AP 7th Class Telugu Important Questions 3rd Lesson చిన్ని శిశువు

53. మీరందరూ – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మీర + అందరూ
b) మీరంద + రూ
c) మీరె + అందరూ
d) మీరు + అందరూ
జవాబు:
d) మీరు + అందరూ

నేనివి చేయగలనా?

1. చిన్ని శిశువు గేయాన్ని భావయుక్తంగా, రాగయుక్తంగా పాడగలను. [ ఔను / కాదు ]
2. కీర్తనలోని భావాలను, సొంత మాటలలో చెప్పగలను. [ ఔను / కాదు ]
3. కీర్తనలోని పదాలను సొంతవాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. చిన్నపిల్లల చేష్టలను గురించి రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

సత్యవ్రతం “నారాయణ ! నారాయణ ! అని ఉచ్చరిస్తుంటావు. ఎవరీ నారాయణుడు ? ఎక్కడ ఉంటాడు ? అతని గుణాలు ఏమిటి ? ఏమి చేయగలడు వాడు” అని హిరణ్యకశిపుడు తన పుత్రుణ్ణి అడిగాడు. ‘తండ్రీ ! నారాయణుడంటే ఈశ్వరుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అన్నాడు ప్రహ్లాదుడు. ‘చాలించు నీ ప్రలాపం’ తండ్రికి కోపం వచ్చింది. ‘లేదు తండ్రీ ! ఇది సత్యం. ఆయన సర్వ వ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి మంతుడు’.

“నేనే సర్వశక్తిమంతుణ్ణి మూర్బుడా ! నేనే ఈశ్వరుణ్ణి. నారాయణ, నారాయణ అనే జపం మాని ఇకనుండి నీవు నీ నామాన్ని జపించాలి. నీవు నా నామాన్ని జపించాలి. తెలిసిందా !! ‘లేదు…. మీరు నాకు తండ్రి…., పూజ్యులు’ కాని నేను మీ నామాన్ని జపించలేను. మిమ్మల్ని తండ్రిగా గౌరవించగలను’ అన్నాడు ప్రహ్లాదుడు.

రాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి కష్టాలకు లోనుచేసి చంపవలసినదిగా మంత్రిగారిని ఆదేశించాడు. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో ముంచారు. కొండపై నుండి క్రిందకు త్రోశారు. కాని ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకింది. ఆమె అగ్నిలో దూకి భస్మం అయింది. కాని ప్రహ్లాదుడు క్షేమంగా ఉన్నాడు. చివరికి మళ్లీ ప్రహ్లాదునికి నచ్చచెప్పాలని ప్రయత్నించారు. కాని అతను అంగీకరించలేదు. అతని నోటి నుండి కేవలం ‘నారాయణ ! నారాయణ ! అనే మాటలు మాత్రమే వస్తున్నాయి. అప్పుడు హిరణ్యకశిపుడు ‘ఈ స్థంభంలో నారాయుణ్ణి చూపించగలవా ?” అని ప్రహ్లాదుణ్ణి ప్రశ్నించాడు.

‘తండ్రీ ! నారాయణుడు ఇందు గలడు, అందు లేడు అనే సందేహం వద్దు. అంతటా వ్యాపించి ఉంటాడు’ అని చెప్పాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్థంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుండి నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రహ్లాదుని తండ్రియైన హిరణ్యకశిపుని వధించాడు. భక్తుడైన ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించి వరం ఇచ్చాడు. ‘నీవు తేజశ్శాలివి అవుతావు, మహాత్ముడివి అవుతావు. విద్వాంసుడవు అవుతావు’ ఇలా చెప్పి ఆయన అంతర్థానమైనాడు. ప్రహ్లాదుడు ధన్యుడు. అతని హరిభక్తి ధన్యం.

ఆంధ్రుడై జన్మించుట ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఃఫలం – అప్పయ్య దీక్షితులు