AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

These AP 10th Class Physics Chapter Wise Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 9th Lesson Important Questions and Answers విద్యుత్ ప్రవాహం

10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
వలయంలో ప్రవహించే విద్యుత్ పరిమాణము కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 1
పటంలో మూడు నిరోధాలు శ్రేణి సంధానంలో ఉన్నాయి.
R1 = 3Ω, R2 = 5Ω, R3 = 2Ω
ఫలిత నిరోధం R = R1 + R2 + R3 = 3Ω + 5Ω + 2Ω
R= 10Ω, V = 1.5
విద్యుత్ I = \(\frac{V}{R}\) = \(\frac{1.5}{10}\) = 0.15 A

ప్రశ్న 2.
పటంలో చూపిన విధంగా రవి, A, B, C నిరోధాలను వలయంలో కలిపాడు. ప్రతీ నిరోధం 18 W సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది. ఒక్కొక్క నిరోధం గుండా ప్రవహించే విద్యుత్ ను కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 2

ప్రశ్న 3.
ఒక విద్యుత్ వలయంలో వలయాన్ని ఏర్పరచుటకు వాడిన వాహక తీగనే ఉపయోగించి తయారు చేసిన ఫ్యూజ్ ను అమర్చితే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:
ఆ ఫ్యూజ్ పని చేయదు. కావున అధిక ఓల్టేజ్. ఏర్పడినప్పుడు వలయం తెరువబడదు. కనుక వలయంలో విద్యుత్ సాధనాలు పాడైపోతాయి.

ప్రశ్న 4.
బ్యాటరీ, ఓల్ట్ మీటర్, అమ్మీటర్, నిరోధము మరియు వాహక తీగలను ఉపయోగించి విద్యుత్ వలయాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 3

ప్రశ్న 5.
ఓమీయ, అఓమీయ వాహకాల మధ్య ఏవేని రెండు భేదాలు రాయండి.
జవాబు:

  1. ఓమీయ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయి. అఓమీయ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటించవు.
  2. ఓమీయ వాహకాలు విద్యుత్ వాహకాలు, అఓమీయ వాహకాలు అర్ధవాహకాలు.
  3. ఓమీయ వాహకాలకు V-I గ్రాఫ్ సరళరేఖగా ఉంటుంది.
    అఓమీయ వాహకాలకు V-I గ్రాఫ్ సరళరేఖగా ఉండదు.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 6.
గృహాల విద్యుత్ వలయంలో విద్యుత్ ఉపకరణాలను శ్రేణిలో కలిపితే ఏమగును?
జవాబు:
గృహాల విద్యుత్ వలయంలో విద్యుత్ ఉపకరణాలను శ్రేణిలో కలిపితే

  1. ఏదేని ఒక ఉపకరణం పాడైపోతే మొత్తం వలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
  2. వలయంలో నిరోధం పెరిగిపోయి విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
  3. ఒక ఉపకరణాన్ని ఉపయోగించడానికి స్విచ్ ఆన్ చేస్తే మిగిలిన అన్ని ఉపకరణాలు కూడా పనిచేస్తూ అనవసరంగా ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయి. తద్వారా విద్యుత్ బిల్లు, విద్యుత్ నష్టం ఎక్కువగును.

ప్రశ్న 7.
“అధిక వోల్టేజి – ప్రమాదం” అనే బోర్డులను తరచుగా చూస్తుంటాం. కాని ‘అధిక విద్యుత్-ప్రమాదం’ అని ఎందుకు ఉంచటం లేదు. ఊహించి సమాధానం రాయండి.
జవాబు:
అధిక వోల్టేజ్ – అని రాయబడి ఉన్న తీగలకు ఏదైనా వస్తువు / మనిషి కలుపబడితే ఆ వస్తువులో తీగలకు తగిలిన రెండు బిందువుల మధ్య అధిక పొటనియల్ భేదం ఏర్పాటు చేయబడుతుంది. అయితే వస్తువులో ఎంత విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందనేది ఆ వస్తువు తయారైన పదార్థ స్వభావం, నిరోధంపై ఆధారపడి ఉంటుంది. అన్ని సందర్భాలలో ఒకే విధమైన అధిక విద్యుత్ ప్రవాహం ఉంటుందని చెప్పలేము. కనుక అధిక విద్యుత్ ప్రవాహం – ప్రమాదం అని రాయరు.

ప్రశ్న 8.
వాహక పొడవు, నిరోధం మధ్య సంబంధాన్ని గుర్తించే ప్రయోగాన్ని నిర్వహించడానికి కావలసిన పరికరాలను తెల్పండి.
జవాబు:
వాహక పొడవు, నిరోధం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించు ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఈ క్రింది పరికరాలు అవసరం.

  1. ఒకే మధ్యచ్ఛేదం కలిగి వేర్వేరు పొడవులు గల ఇనుప చువ్వలు,
  2. బ్యాటరీ
  3. అమ్మీటర్
  4. కీ
  5. రాగి తీగలు.

ప్రశ్న 9.
విద్యుత్ వాహకాలంటే ఏమిటి?
జవాబు:
ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలంటారు.
ఉదా : లోహాలు

ప్రశ్న 10.
విద్యుత్ బంధకాలంటే ఏమిటి?
జవాబు:
ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ ను ప్రసరింపచేయలేవో వాటిని విద్యుత్ నిబంధకాలంటారు.
ఉదా : చెక్క రబ్బరు.

ప్రశ్న 11.
విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి?
జవాబు:
ఒక వాహకంలో ఎలక్ట్రాన్ క్రమమైన చలనాన్ని విద్యుత్ ప్రవాహం అంటాము (లేదా) ఆవేశాల క్రమ చలనమును విద్యుత్ ప్రవాహం అంటారు.

ప్రశ్న 12.
విద్యుత్ ప్రవాహంకు సమీకరణంను వ్రాయుము.
జవాబు:
‘t’ కాలవ్యవధిలో ఒక వాహకంలోని ఏదేని మధ్యచ్ఛేదంను దాటి వెళ్ళే ఆవేశం (Q)ను విద్యుత్ ప్రవాహం (I) అంటారు.
విద్యుత్ ప్రవాహం (I) = \(\frac{Q}{t}\) అగును.

ప్రశ్న 13.
విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలను వ్రాయుము.
జవాబు:
SI పద్దతిలో విద్యుత్ ప్రవాహానికి ప్రమాణము ఆంపియర్.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 4

ప్రశ్న 14.
డ్రిఫ్ట్ లేదా అపసర వడిని నిర్వచించుము.
జవాబు:
ఒక వాహకంలో ఎలక్ట్రాన్ల స్థిర సరాసరి వడిని డ్రిఫ్ట్ లేదా అపసర వడి అంటాము.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 15.
విద్యుత్ ప్రవాహంను కొలుచుటకు వాడు పరికరం ఏది?
జవాబు:
అమ్మీటరు విద్యుత్ ప్రవాహంను కొలుచుటకు వాడతారు. దీనిని ఎల్లప్పుడు శ్రేణి సంధానంలో కలుపుతారు.

ప్రశ్న 16.
పొటెన్షియల్ భేదంను నిర్వచించుము. దాని ప్రమాణాలను వ్రాయుము.
జవాబు:

  1. వాహకంలో ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రమాణ ధనావేశంను కదల్చటానికి విద్యుత్ బలం చేసిన పనిని ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు.
  2. దీనికి SI ప్రమాణం “ఓల్ట్”.

ప్రశ్న 17.
పొటెన్షియల్ భేదంను, విద్యుచ్చాలక బలంను కొల్చుటకు వాడు పరికరం ఏది?
జవాబు:
పొటెన్షియల్ భేదంను విద్యుచ్చాలక బలంను కొలుచుటకు ఓల్ట్ మీటర్‌ను వాడతారు. దీనిని వలయంలో సమాంతర సంధానంలో కలుపుతారు.

ప్రశ్న 18.
విద్యుచ్చాలక బలంను నిర్వచించుము.
జవాబు:

  1. ప్రమాణ ఋణావేశంను ధనధృవం నుండి ఋణధృవంకు కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని విద్యుచ్చాలక బలం అంటారు.
  2. దీనికి SI ప్రమాణం “ఓల్ట్”.

ప్రశ్న 19.
వాహకాల యొక్క V – I గ్రాఫ్ ఆకృతిని గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 5

ప్రశ్న 20.
అర్ధవాహకాల యొక్క V – I గ్రాఫ్ ఆకృతిని గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 6

ప్రశ్న 21.
ఓమ్ నియమమును నిర్వచించుము.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించు విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
V ∝ I ⇒ \(\frac{V}{I}\) =R

ప్రశ్న 22.
ఓమ్ నియమము యొక్క షరతులేవి?
జవాబు:

  1. లోహ వాహకాలు ఓమ్ నియమంను పాటిస్తాయి.
  2. వాయు వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు.
  3. అర్ధ వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు. ‘.

ప్రశ్న 23.
పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేయు అంశాలు ఏవి?
జవాబు:

  1. వాహక పదార్థపు నిరోధము దాని ఉష్ణోగ్రతపై
  2. పదార్థ స్వభావంపై
  3. వాహకపు పొడవుపై
  4. వాహకపు మధ్యచ్ఛేద వైశాల్యంపై ఆధారపడి ఉండును.

ప్రశ్న 24.
విద్యుత్ వలయం అంటే ఏమిటి?
జవాబు:
బ్యాటరీ, వాహక తీగలతో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరచిన సంవృత మార్గాన్ని వలయం అంటారు.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 25.
కిర్ఛాఫ్ జంక్షన్ నియమంను వ్రాయుము.
జవాబు:
వలయంలో విద్యుత్ ప్రవాహం విభజింపబడే ఏ జంక్షన్ వద్దనైనా, జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షనను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తంకు సమానము.

ప్రశ్న 26.
కిర్ఛాఫ్ లూప్ నియమంను వ్రాయుము.
జవాబు:
ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదల బీజీయ మొత్తం శూన్యము.

ప్రశ్న 27.
విద్యుత్ సామర్థ్యం అంటే ఏమిటి?
జవాబు:
విద్యుత్ ప్రవాహం, పొటెన్షియల్ భేదాల లబ్దాన్ని విద్యుత్ సామర్థ్యం అంటారు. దీనికి SI ప్రమాణం వాట్.

ప్రశ్న 28.
60 W, 120 V అని ముద్రించబడియున్న బల్బు యొక్క నిరోధమెంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 7

ప్రశ్న 29.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధకాలు శ్రేణిలో ఉన్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకేరకమైన విద్యుత్ ప్రవాహము ఉన్నప్పుడు, అవి శ్రేణిలో కలుపబడి ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రశ్న 30.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు సమాంతరంగా కలుపబడి ఉన్నాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల ద్వారా ఒకే విధమైన పొటెన్షియల్ భేదమున్నపుడు ఆ నిరోధాలను సమాంతరంగా కలిపామని చెప్పవచ్చు.

ప్రశ్న 31.
“లాటిస్” అనగానేమి?
జవాబు:
లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాలలో ఉంటాయి. ఈ ధనాత్మక అయాన్ల అమరికను “లాటిస్” అంటారు.

ప్రశ్న 32.
వాహకం రెండు చివరల బ్యాటరీకి కలిపితే దానిలో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలోనే ఎందుకు కదులుతాయి?
జవాబు:
వలయంలో బ్యాటరీ లేనప్పుడు వాహకంలో ఎలక్ట్రాన్లు ‘క్రమరహిత’ చలనంలో ఉంటాయి. కాని వలయంలో బ్యాటరీని కలిపితే, వాహకమంతా ఒక సమ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఈ క్షేత్రమే ఎలక్ట్రాన్లను నిర్దిష్ట దిశలలో కదిలిస్తుంది.

ప్రశ్న 33.
మధ్యచ్ఛేద వైశాల్యం 10-6 m² గా గల రాగి తీగ గుండా 14 విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ అపసర వడిని కనుగొనండి.
జవాబు:
రాగి ఎలక్ట్రాన్ సాంద్రత n = 8.5 × 1028 m-3
qe = 1.602 × 10-19c
మధ్యచ్ఛేద వైశాల్యం A = 10-6
విద్యుత్ ప్రవాహము I = 1A
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 8

ప్రశ్న 34.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 9  A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
4Ω, 4Ω లు శ్రేణి సంధానంలో ఉన్నాయి. కనుక
R= R1 + R2 ∴ R = 4Ω + 4Ω = 8Ω ఫలిత నిరోధం R = 8Ω

ప్రశ్న 35.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 10 P, Q ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
5Ω, 5Ω లు సమాంతర సంధానంలో ఉన్నాయి. కనుక
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 11

ప్రశ్న 36.
మన ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూను సమాంతరంగా కలపాలా? శ్రేణిలో కలపాలా? ఎందుకు?
జవాబు:

  1. మన ఇంటిలోని విద్యుత్ వలయంలో ఫ్యూజ్ ను శ్రేణిలో కలపాలి.
  2. ఎందుకనగా, శ్రేణిలో ఫ్యూజ్ ను కలపడం వలన వలయంలో ఓవర్ లోడ్ సంభవించినప్పుడు వలయం తెరువబడి, విద్యుత్ ప్రవాహం ఆగిపోవును.
  3. దీని వలన వలయంలో అన్ని పరికరాలు పాడవకుండా ఉంటాయి.

ప్రశ్న 37.
విద్యుత్ వల్ల కలిగే రెండు దుష్ఫలితాలు తెలుపుము.
జవాబు:

  1. ఎవరైనా వ్యక్తులు విద్యుత్ ప్రవహించే తీగను తాకితే, విద్యుత్ షాక్ తగిలి ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా వుంది.
  2. విద్యుత్ లఘువలయం ఏర్పడడం వల్ల ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 38.
విద్యుత్ లఘువలయం ఏర్పడిన చోట మెరుపు ఎందుకు వస్తుంది? ఆ కాంతి తెల్లగా ఎందుకుంటుంది?
జవాబు:
లఘువలయం ఏర్పడినపుడు విద్యుత్ నిరోధం తగ్గి, అధిక మొత్తంలో విద్యుత్ ప్రవహించడం వల్ల తీగ వేడెక్కుతుంది. ఆ వేడికి తీగను తయారుచేసిన లోహం ఆవిరిగా మారి మెరుపులాగా కనిపిస్తుంది. అధికవేడి వల్ల ఆ కాంతి తెల్లగా . కనిపిస్తుంది.

10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక విద్యుత్ వాహకం యొక్క VII విలువ స్థిరమని నిరూపించేందుకు నిర్వహించే ప్రయోగానికి సంబంధించిన పరికరాల అమరికను పటం గీచి చూపండి.
లేదా
ఓమ్ నియమాన్ని సరిచూచు ప్రయోగాల పటం గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 12

ప్రశ్న 2.
ఫ్యూజ్ ల తయారీలో లెడ్ తీగను వాడటానికి కారణాలు తెల్పండి.
జవాబు:

  1. ఫ్యూజ్ ల తయారీలో లెడ్ తీగను వాడుటకు గల కారణము లెడ్ కు ద్రవీభవన స్థానం తక్కువ మరియు నిరోధత్వం విలువ తక్కువ.
  2. ఈ పదార్థం ద్వారా తయారు చేసిన తీగ గుండా విద్యుత్ ప్రవహించిన, అది ఒక ఉష్ణోగ్రత వద్ద వేడెక్కి కరుగును. దీని వలన వలయం తెరచుకొని ఇంటిలోని ఇతర పరికరాలకు విద్యుత్ ప్రవాహం ఆగును.

ప్రశ్న 3.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 13
వలయాన్ని పటంలో చూపటం జరిగింది. A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
A, B ల మధ్య ‘R’ నిరోధం గల మూడు నిరోధకాలు సమాంతరంగా కలుపబడ్డాయి. వీటికి ‘R’ నిరోధకం శ్రేణిలో కలుపబడినది.

1) సమాంతరంగా కలుపబడ్డ మూడు నిరోధకాల ఫలిత నిరోధం
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 14

ప్రశ్న 4.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 15
వలయాన్ని పటంలో చూపటం జరిగింది. A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
మూడు నిరోధాలు సమాంతరంగా అనుసంధానంలో ‘కలవు. కావున వాటి ఫలిత నిరోధం RP అగును.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 16

ప్రశ్న 5.
ఒక పెట్టెలో రెండు నిరోదాలను అనుసంధానించారు. కాని ఎలా పెట్టెలో అనుసంధానం చేసారో తెలియదు. నిరోధ విలువలు సమానం. A, B ల మధ్య 10V బ్యాటరీని ఉంచారు. C, D ల మధ్య వోల్టు మీటర్ కలిపిన, వోల్టుమీటరు 5V గా చూపింది. మరల C, D ల మధ్య 10V బ్యాటరీని కలిపి A, B ల మధ్య వోల్టుమీటరు రీడింగు తీసుకున్నారు. ఆ రీడింగు 10V అయింది. ఆ నిరోధాలను పెట్టెలో ఎలా కలిపితే పై విలువ వస్తాయో తెలపండి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 17
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 18
VAB = 10V అయితే R1// R2 కనుక ఫలిత నిరోధం = \(\frac{R}{2}\)
∴ VCD = 5V
VCD = 10V అయితే VAB = V అగును.
R1 R2 లు శ్రేణిలో ఉండును. R2 = 10V

ప్రశ్న 6.
కారు హెడ్ లైట్ తక్కువకాంతి విడుదలయ్యేటప్పుడు ; అవి 40 W సామర్థ్యాన్ని, ఎక్కువ కాంతి విడుదలచేసేటప్పుడు అవి 50 W సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. ఏ సందర్భంలో హెడ్ లైట్ నిరోధం ఎక్కువగా ఉంటుంది? చర్చించండి.
జవాబు:
విద్యుత్ సామర్ధ్యం అనేది నిరోధానికి, విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కనుక రెండవ సందర్భంలో హెడ్ లైట్ నిరోధం ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 7.
క్రింది వాటి గుర్తులు రాయుము.
1) బ్యాటరీ 2) నిరోధం 3) అమ్మీటర్ 4) వోల్ట్ మీటర్ 5) ప్లగ్ కీ 6) రియోస్టాట్ 7) టాప్ కీ
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 19

10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
స్థిర ఉష్ణోగ్రత వద్ద సమానమయిన మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం యొక్క నిరోధం, దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందనే అంశాన్ని మీరెలా సరిచూస్తారో తెల్పండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 6

  • వాహకం యొక్క పొడవుకు, దాని నిరోధానికి గల సంబంధాన్ని సరిచూడవలసి ఉన్నది. కావున ఒకే పదార్థంతో తయారై సమాన మధ్యచ్ఛేద వైశాల్యం కలిగియుండి వివిధ పొడవులు గల లోహపు తీగలు లేదా సువ్వలను కొన్నింటిని తీసుకోవాలి.
  • బ్యాటరీ, అమ్మీటరు, స్విచ్ (కీ) మరియు వాహక తీగలను ఉపయోగించి వలయాన్ని ఏర్పాటు చేయాలి. ఈ వలయంలో వివిధ పొడవులు గల సువ్వలను కలిపేందుకు వాహక తీగ మధ్యలో కొంత ఖాళీలని వదలాలి.
  • ఎంచుకున్న సువ్వలను ఒక్కొక్కటిగా వలయంలో కలుపుతూ అమ్మీటరు సహాయంతో వలయంలో ప్రవహించే విద్యుత్ ను కొలవాలి. సువ్వల పొడవు, విద్యుత్ ప్రవాహాన్ని నమోదు చేయాలి.
  • మనం ఉపయోగించిన సువ్వల పొడవులు పెరిగే క్రమంలోనే వలయంలో విద్యుత్ ప్రవాహం తగ్గితే (నిరోధం పెరిగితే), వాహకం యొక్క నిరోధం దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉన్నదని గుర్తించవచ్చు.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 2.
విద్యుత్ వాహక నిరోధమును ప్రభావితం చేసే కారకాలు ఏవి? ఏవేని రెండు కారకాల ప్రభావమును వివరించండి.
జవాబు:
విద్యుత్ వాహక నిరోధమును ప్రభావితం చేయు కారకాలు

  1. పదార్థ స్వభావము,
  2. ఉష్ణోగ్రత,
  3. వాహక పొడవు,
  4. వాహక మధ్యచ్ఛేద వైశాల్యము

వివరణ :

  1. వాహక ఉష్ణోగ్రత పెరిగిన దాని నిరోధము కూడా పెరుగును.
  2. వేర్వేరు పదార్థాలకు వేర్వేరు నిరోధములుండును.
  3. పదార్థ వాహకము యొక్క నిరోధము దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉండును.
    (T మరియు A లు స్థిరంగా ఉన్నప్పుడు) ∴ R ∝ l
  4. పదార్ధ వాహకము యొక్క నిరోధము దాని మధ్యచ్ఛేద వైశాల్యము (A) కు విలోమానుపాతంలో ఉండును.
    (1 మరియు T లు స్థిరంగా ఉన్నప్పుడు) ∴ R ∝ \(\frac{1}{A}\)

ప్రశ్న 3.
5Ω, 15Ω, 20Ω మరియు 10Ω నిరోధాలు వలయంలో క్రింద చూపబడిన విధంగా కలుపబడినాయి. అయిన వలయంలో ఫలిత నిరోధంను కనుగొనుము.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 20
జవాబు:
a) వలయంలో 5Ω మరియు 15Ω నిరోధాలు శ్రేణిలో కలుపబడి ఉన్నాయి.
వీటి ఫలిత నిరోధం (Ri) = 5Ω + 15Ω [∵ R = R1 + R2] = 20Ω

b) వలయంలో Ri మరియు 20Ω లు సమాంతరంగా ఉన్నాయి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 21

c) వలయంలో Rii మరియు 10 Ω లు శ్రేణిలో ఉన్నాయి.
వీటి ఫలిత నిరోధం (Riii) = 10 Ω + 10 Ω = 20 Ω.
కావున ఇచ్చిన వలయంలో ఫలిత నిరోధం = 20 Ω.

ప్రశ్న 4.
వాహకం పొడవు, వాహక నిరోధముల మధ్య సంబంధం ఏమిటి? ఈ సంబంధంను పరిశీలించుటకు చేయు ప్రయోగ విధానం రాయుము.
జవాబు:

  • పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పుడు వాహక నిరోధం, దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
  • ఒకే మధ్యచ్ఛేద వైశాల్యం, వివిధ పొడవులు గల కొన్ని ఇనుప చువ్వలను తీసుకోవాలి.
  • ఒక ఇనుప చువ్వ, బ్యాటరీ, ఆమ్మీటర్, స్విచ్ లను శ్రేణిలో కలుపుతూ వలయాన్ని పూర్తి చేయాలి.
  • వలయంలో విద్యుత్ ప్రవహింపజేసి ఆమ్మీటర్ రీడింగ్ ని నమోదు చేయాలి.
  • ఈ విధంగా వివిధ పొడవులు గల ఇనుప చువ్వలను మార్చి ఆమ్మీటర్ రీడింగ్లను నమోదు చేయాలి.
  • రీడింగ్ లను అనుసరించి ఇనుప చువ్వ పొడవు పెరిగితే ఆమ్మీటర్ రీడింగ్ తగ్గుతుంది. దీనిని బట్టి వాహక తీగ పొడవు పెరిగితే నిరోధం పెరిగిందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
60 V బ్యాటరీని మూడు నిరోధాలు R1 = 10 Ω R3 = 20 Ω మరియు R3 = X Ω లను వలయంలో శ్రేణిలో కలిపారు. వలయంలో 1 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కిర్కాఫ్ లూప్ నియమాన్ని ఉపయోగించి R3 యొక్క నిరోధంను కనుగొనుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 22
లూప్ నియమం ప్రకారం 60 – 10I – 20I – XI = 0
I = 1 ఆంపియర్ విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా
60 – 10 – 20 – x = 0 = X ⇒ 30
∴ R3 = 30 Ω

ప్రశ్న 6.
కిర్ ఛాఫ్ “లూప్ నియమము” ను నిర్వచించి, వివరించండి.
జవాబు:
లూప్ నియమం :
ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదల బీజీయ మొత్తం శూన్యం.

వివరణ :
ఒక మూసిన వలయంలోని ప్రారంభంలో గల రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని, ఒక నిర్దిష్ట విలువగా భావించండి. ఆ వలయంలో ఉపయోగించిన వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలను కొలుస్తూ పోతే, వలయంలో ఉపయోగించిన బ్యాటరీ, నిరోధాలను బట్టి పొటెన్షియల్ భేదం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కానీ మనం వలయం అంతటా ప్రయాణించి తిరిగి ప్రారంభ బిందువును చేరితే, పొటెన్షియల్ భేదంలో ఫలిత మార్పు శూన్యమవుతుంది. అంటే పొటెన్షియల్ భేదాలలో మార్పుల బీజీయ మొత్తం శూన్యము.

ప్రశ్న 7.
ఒక ఇంటిలో మూడు ట్యూబ్ లైటులు, రెండు ఫ్యానులు, ఒక టెలివిజన్‌ను వాడుతున్నారు. ప్రతి ట్యూబ్ లైట్ 40 W విద్యుత్ ను వినియోగిస్తుంది. టెలివిజన్ 60 W, ఫ్యాన్ 80 W విద్యుత్ ను వినియోగిస్తున్నాయి. సుమారు ప్రతి ట్యూబ్ లైట్ ను ఐదు గంటల చొప్పున, ప్రతి ఫ్యానును 12 గంటల చొప్పున, టెలివిజనను 5 గంటల చొప్పున ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. ఒక యూనిట్ (KWH) కు 3 రూ॥ చొప్పున విద్యుత్ ఛార్జి చేస్తే 30 రోజుల్లో చెల్లించాల్సిన సొమ్ము ఎంత?
మొత్తం 30 రోజులలో వినియోగించిన విద్యుత్
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 23

ఒక యూనిట్ (KWH) కు ఛార్జీ = 3 రూ.
కావున 84.6 KWH కు చెల్లించవలసిన మొత్తం సొమ్ము = 84.6 × 3 = 253.80 రూ.

ప్రశ్న 8.
ఒక విద్యుత్ వలయంలో 12 V బ్యాటరీకి 4 Ω, 12 Ω ల నిరోధాలను సమాంతరంగాను, దీనికి 3 Ω ల నిరోధమును శ్రేణిలోను కలుపబడ్డాయి. ఈ దత్తాంశానికి సరిపడు విద్యుత్ వలయాలు గీయండి. ఈ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 24
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 25

ప్రశ్న 9.
విద్యుత్ నిరోధం పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని చూపు ప్రయోగంనకు కావల్సిన పరికరాలు తెలిపి ప్రయోగ విధానము రాయండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
బ్యాటరీ, సమాన పొడవు – సమాన మధ్యచ్ఛేద వైశాల్యం గల వేరు వేరు లోహాలతో తయారు చేసిన తీగలు, సంధాన తీగలు, టాప్ కీ, అమ్మీటర్.

ప్రయోగ విధానం :
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 26

  1. పటంలో చూపిన విధంగా పరకరాలను అమర్చండి.
  2. పటంలోని P మరియు Q ల మధ్య ఎంపిక చేసుకొన్న ఒక లోహపు తీగను అమర్చండి. అమ్మీటర్ రీడింగ్ గుర్తించండి.
  3. ఇదేవిధంగా P మరియు Q ల మధ్యలో వేరు వేరు తీగలను (ఎంపిక చేసుకున్న అన్ని తీగలను) అమర్చి అమ్మీటర్ లోని రీడింగ్ గ్లను పరిశీలించండి.
  4. పై విధంగా నిర్వహించిన ప్రయోగంలో అమ్మీటర్ రీడింగ్ ప్రతిసారీ వేరు వేరుగా వస్తుంది.
    దీనిని బట్టి విద్యుత్ వాహక నిరోధం పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును.

ప్రశ్న 10.
ఒక విద్యార్ధి దీర్ఘఘనాకార కడ్డీని తీసుకొని దాని కొనల మధ్య ఒకే పొటెన్షియల్ భేదాన్ని అనువర్తింపజేస్తే కింది విద్యుత్ విలువలు లెక్కించాడు. పొడవు, వెడల్పు, ఎత్తు కొనల మధ్య

 

పొటెన్షియల్ భేదం అనువర్తించిన కొలత విద్యుత్
పొడవు 2A
వెడల్పు 4A
ఎత్తు 6A

పై సమాచారం ఆధారంగా మూడు సందర్భాల్లో పొడవు, వెడల్పు, ఎత్తుల నిష్పత్తిని కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 27
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 28

ప్రశ్న 11.
నీ స్నేహితుడికి 10Ω నిరోధం అవసరమయింది. నీ దగ్గరకు వచ్చి అడిగాడు. కాని నీ దగ్గర 40Ω ల నిరోధాలున్నవి.
i) కనీసం ఎన్ని నిరోధాలను నీ స్నేహితుడు నిన్ను అడుగుతాడు?
ii) తీసుకున్న వాటిని ఎలా సంధానించాలి?
iii) వాటి ఫలితనిరోధం 10Ω అని చూపండి.
జవాబు:
i) దాదాపు 4 నిరోధాలు,
ii) తీసుకున్న వాటిని సమాంతర సంధానం చేయాలి.
iii) నిరోధాలను సమాంతర సంధానం చేసినపుడు ఫలిత నిరోధం
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 29

ప్రశ్న 12.
ఎలక్ట్రాన్ల అపసరవడి కనుగొనడానికి ఒక సమీకరణమును ఉత్పాదించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 30

  1. A మధ్యచ్ఛేద వైశాల్యం గల వాహకం రెండు చివరలను బ్యాటరీకి కలిపితే, దానిలో విద్యుత్ ప్రవహిస్తుంది. ఆవేశాల అపసరవడి Vd అనుకుందాం.
  2. వాహకంలోని ఏకాంక ఘనపరిమాణంలో గల ఆవేశాల సంఖ్య (ఆవేశాల సాంద్రత) n అనుకుందాం.
  3. ఒక సెకను కాలంలో ప్రతీ ఆవేశం కదిలిన దూరం Vd అవుతుంది. ఈ దూరానికి సంబంధించిన వాహక ఘనపరిమాణం AVd అవుతుంది.
  4. ఆ ఘనపరిమాణంలోనున్న ఆవేశాల సంఖ్య n.A.Vd కి సమానం.
  5. ఒక్కొక్క వాహక కణం యొక్క ఆవేశం q అనుకుంటే, ఒక సెకనుకాలంలో D వద్ద గల మధ్యచ్ఛేదాన్ని దాటివెళ్ళే మొత్తం ఆవేశం ng AVd అవుతుంది. ఇది విద్యుత్ ప్రవాహానికి సమానం.
    AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 31

ప్రశ్న 13.
వాహకంలో విద్యుత్ ప్రవాహదిశను మనం ఎలా నిర్ణయిస్తాం?
జవాబు:

  1. I = nqAVd అని మనకు తెలుసు. దీనిలో n. A విలువలు ధనాత్మకం. కావున ఆవేశం q డ్రిఫ్ట్ వడి V, గుర్తులపై విద్యుత్ ప్రవాహదిశ ఆధారపడి ఉంటుంది.
  2. ఋణావేశాలకు q విలువ ఋణాత్మకం, Vd విలువ ధనాత్మకం ఐతే q.Vd ల లబ్దం ఋణాత్మకం అవుతుంది. అనగా విద్యుత్ ప్రవాహ దిశ ఋణావేశ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.
  3. ధనావేశాలకు q విలువ ధనాత్మకం, Vd విలువ ధనాత్మకం ఐతే q.Vd ల లబ్దం ధనాత్మకం. అనగా విద్యుత్ ప్రవాహ దిశ ధనావేశ ప్రవాహదిశలోనే ఉంటుంది.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 14.
కొంతదూరంలో వేరుచేయబడిన రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కనుగొనడానికి సూత్రాన్ని ఉత్పాదించండి.
జవాబు:
1) వాహక తీగ రెండు చివరలను బ్యాటరీకి కలిపితే వాహక విద్యుత్ క్షేత్ర దిశ మంతటా విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ క్షేత్రం ఎలక్ట్రాన్ (ఆవేశం)పై F అనే బలాన్ని కలుగజేస్తుంది.
2) ఈ బలం, స్వేచ్ఛ, ఆవేశాలను కొంతదూరం కదిలించ డానికి కొంత ‘పని’ చేస్తుంది.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 32
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 33

ప్రశ్న 15.
ఒక బ్యాటరీ యొక్క విద్యుచ్ఛాలక బలాన్ని కనుగొనుటకు ఒక సూత్రాన్ని ఉత్పాదించుము.
జవాబు:
ఏకాంక ధనావేశాన్ని ఋణ ధృవం నుండి ధనధృవానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనినే “విద్యుచ్ఛాలక బలం” అంటారు.
1) రసాయన బలం Fc అనుకుందాం.
2) ఈ రసాయన బలం, ‘q’ పరిమాణం గల ఋణావేశాన్ని విద్యుత్ బలానికి వ్యతిరేకంగా ధనధృవం నుండి ఋణదృవానికి కదిలించడానికి చేసిన పని ‘W’ అనుకుందాం.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 34

ప్రశ్న 16.
మల్టీమీటర్‌ను గురించి వివరించుము.
జవాబు:
మల్టీమీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది నిరోధం, ఓల్ట్జ్, కరెంట్ వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది. దీనితో కొలిచిన విలువలను ఇది సంఖ్యాత్మకంగా చూపిస్తుంది. మల్టీమీటర్ లో ప్రధానంగా 3 విభాగాలుంటాయి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 35

డిస్సే (Display) :
మల్టీమీటరు 4 ‘డిజిట్స్’ (Digits) చూపగలిగే డిస్పే ఉంటుంది. ఇది ఋణగుర్తు (nega tive symbol) ను కూడా చూపగలుగుతుంది.

సెలక్షన్ నాబ్ (Selection knob) :
ఓల్టేజ్ (V), నిరోధం (R) మొదలగు అంశాలలో దేనిని కొలవాలో, దానికి అనుగుణంగా మల్టీమీటరును అమర్చుకోడానికి సెలక్షన్ నాబ్ ఉపయోగపడుతుంది.

పోర్ట్ (Ports) :
మల్టీమీటరుకు సాధారణంగా రెండు పోర్టులుంటాయి. ఒకదానివద్ద COM (common or ground port) అని రాసి ఉంటుంది. దీనిలో నలుపురంగు తీగను (test lead) ను అమర్చాలి. రెండవ దానివద్ద mAVI2 అని రాసి ఉంటుంది. ఇందులో ఎరుపు తీగను అమర్చాలి.

హెచ్చరిక :
సాధారణంగా మల్టీమీటర్లు ‘AC’ వ్యవస్థల విలువలను కూడా కొలవగలవు. కానీ AC’ వలయాలు ప్రమాదకరమైనవి. కావున మల్టీమీటరును DC విలువలను కొలవడానికి మాత్రమే వినియోగించండి.

ప్రశ్న 17.
విద్యుత్ సామర్థ్యం కనుగొనడానికి ఒక సూత్రాన్ని ఉత్పాదించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 36
1) పటంలో చూపినట్లు A బిందువు నుండి B బిందువును t పొటెన్షియల్ భేదం (V) సెకన్ల కాలంలో Q కులూంటే ఆవేశం ప్రవహించింది. అనుకొనుము.
2) A, B ల మధ్య పొటెన్షియల్ భేదం V అనుకుంటే, t కాలంలో
విద్యుత్ క్షేత్రం చేసిన పని W = QV – (1)
3) ఈ ‘పని’ వాహకంలో ప్రవహిస్తున్న Q ఆవేశం కోల్పోయిన శక్తికి సమానం.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 37

ప్రశ్న 18.
ఒక వలయాన్ని పటంలో చూపటం జరిగింది.
A వద్ద వలయంలోనికి ప్రవేశించే విద్యుత్ I.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 38
a) C, D బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత?
b) A, B బిందువుల మధ్య వలయఫలిత నిరోధం ఎంత?
c) C, D ల గుండా ప్రవహించే విద్యుత్ ఎంత?
జవాబు:
a) కిర్కాఫ్ లూప్ నియమం ప్రకారం ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదల బీజీయ మొత్తం శూన్యం.

కావున C, Dల మధ్య పొటెన్షియల్ భేదం శూన్యం కారణం ఇది ఒక మూసిన లూప్.

b) ఇక్కడ 20 Ω, 5 Ω లు ఒకదానికొకటి సమాంతరంగా కలవు. వాటి ఫలితాలు ఒకదానికొకటి శ్రేణిలో ఉండును.
20 Ω మరియు 5 Ω ల ఫలిత నిరోధం విలువ
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 39
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 40

ప్రశ్న 19.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 41
పటాన్ని గమనించండి. A, B, C వద్ద పొటెన్షియల్ విలువలు 70 V, 0 V, 10V
a) D వద్ద పొటెన్షియల్ ఎంత?
b) AD, DB, DC లలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు నిష్పత్తిని కనుగొనండి.
జవాబు:
a) ఓమ్ నియమం ప్రకారం పొటెన్షియల్ భేదం (V) = IR
ఇవ్వబడిన వలయంలో జంక్షన్ నియమాలను పాటించగా
‘D’ జంక్షన్ వలె ప్రవర్తించుచున్నది. కావున, I = I1 + I2
‘D’ వద్ద పొటెన్షియల్ భేదం V0 అనుకొనుము.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 42
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 43
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 44

ప్రశ్న 20.
వలయాన్ని పటంలో గమనించండి. R1 = R2 = R3 = 200 Ω.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 45
వోల్టుమీటరు రీడింగు = 100 V,
వోల్టుమీటరు నిరోధం = 1000 Ω అయితే
బ్యాటరీ విద్యుచ్ఛాలక బలం ‘E’ ను కనుగొనండి.
జవాబు:
ఇవ్వబడిన విలువలు R1 = R2 = R3 = 200 Ω
వోల్ట్ మీటరు రీడింగు = 100 V.
వోల్ట్ మీటరు నిరోధపు విలువ = 1000 Ω
ఇవ్వబడిన వలయంలో R2 మరియు R3 లు శ్రేణిలో కలవు. కనుక ఫలిత నిరోధం విలువ
R= R2 + R3 = 200 + 200 = 400 Ω.
ఫలిత నిరోధం (400 2) మరియు వోల్ట్ మీటరు నిరోధం (1000 Ω) లు సమాంతరంగా కలవు. కావున
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 46

ప్రశ్న 21.
ఒక రాగి తీగతో ప్రక్కపటంలో చూపిన విధంగా వలయాన్ని ఏర్పరిచారు. వాహక నిరోధం దాని పొడవుకు అనులోమానుపాతంలో వుందని మనకు తెలుసు. దీని ఆధారంగా 1, 2 బిందువుల మధ్య వలయ ఫలిత నిరోధాన్ని లెక్కించండి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 47
జవాబు:
తీగ యొక్క వాహక నిరోధము విలువ ‘R’ మరియు తీగ పొడవు ‘l’ అనుకొనుము.
వలయము చతురస్ర ఆకారములో కలదు. భుజము పొడవు (l) = R
చతురస్రము కర్ణము, భుజముకు √2 రెట్లు ఉండును = √2l
కర్ణం పరముగా నిరోధము విలువ √2R అగును.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 48
ఇవ్వబడిన తీగ యొక్క ఆకారమును వలయ రూపములో వ్రాయగా PTR మరియు QTS
పరంగా ఫలిత విద్యుత్ ఉండదు కనుక విద్యుత్ ప్రవాహం ఉండదు.
PQ మరియు PS లు శ్రేణిలో కలవు. కనుక ఫలిత నిరోధము విలువ R1 + R2 = R + R = 2R.
QR మరియు SR లు శ్రేణిలో కలవు. కనుక ఫలిత నిరోధము విలువ R1 + R2 = R + R = 2R.
ఈ వలయమును తిరిగి నిర్మించగా క్రింది రూపంలో ఉండును.
(1), (2) బిందువుల మధ్య వలయపు ఫలిత నిరోధము విలువ
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 49

ప్రశ్న 22.
సుధాకర్ వివిధ వోల్టేజిలు, ఒక పదార్థం (తీగరూపంలో ఉన్నది), వోల్టు మీటరు, అమ్మీటర్లు వాడి సేకరించిన విద్యుత్ ప్రవాహాలను పట్టికలో పొందుపరిచారు.
ఆ పట్టిక ఆధారంగా వచ్చిన గ్రాఫ్ ఈ క్రింది విధంగా ఉంది.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 50
గ్రాఫ్ లో వోల్టేజి (V) ని వోల్టులలోనూ; విద్యుత్ (I) ని ఆంపియర్ లలోనూ కొలిచాడు. గ్రాఫ్ ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) సుధాకర్ తీసుకున్న పదార్థం ఏరకమైనదిగా చెప్పవచ్చు?
బి) తీసుకున్న పదార్థం నిరోధం ఎంత?
సి) తీగ కొనలమధ్య 20 V ల పొటెన్షియల్ భేదాన్ని అనువర్తించినప్పుడు ఆ తీగ ఎంత విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది?
డి) పై శ్లో ఇమిడియున్న నియమాన్ని తెల్పండి.
జవాబు:
ఎ) పటంలో ఇచ్చిన గ్రాఫు మూలబిందువు గుండా పోవు సరళరేఖను సూచిస్తున్నది. కావున తీసుకున్న పదార్థం ఓమీయ వాహకం అగును.
బి) ఓమ్ నియమం ప్రకారం V = IR = R = – = R = 0 = 502 .
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 51
డి) ఓమీయ వాహకాలు ఓమ్ నియమమును పాటించును.
ఓమ్ నియమం :
పొటెన్షియల్ భేదం (V) విద్యుత్ ప్రవాహం, (I) కు అనులోమానుపాతంలో కలదు.

ప్రశ్న 23.
మీ ఇంటిలోని వివిధ విద్యుత్ పరికరాలు వలయంలో ఏ విధంగా కలుపబడ్డాయో తెలియజేసే చిత్రాన్ని గీయండి. వలయంలో వాడిన సంకేతాలకు పేర్లు రాయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 11

ప్రశ్న 24.
ఒకే పొడవు, ఒకే మధ్యచ్ఛేద వైశాల్యం కలిగియున్న వివిధ పదార్థాల నిరోధాలు పోల్చేందుకు వలయాన్ని ఎలా ఏర్పాటు చేయాలో పటంతో చూపండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 52

ప్రశ్న 25.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 53
పైపటాన్ని గమనించి సమాధానములు వ్రాయండి.
(ఎ) పై నిరోధాలన్నీ సమాంతర సంధానంలో ఉన్నాయా లేక శ్రేణిలో ఉన్నాయా?
(బి) ఇచ్చిన మూడు నిరోధాల ఫలిత తుల్య నిరోధం ఎంత?
(సి) ఈ వ్యవస్థలో ఏ భౌతిక రాశి స్థిరం?
(డి) R1 = 2Ω, R2 = 3Ω, R3 = 4Ω అయితే ఫలిత తుల్య నిరోధం ఎంతో కనుగొనండి.
జవాబు:
(ఎ) శ్రేణి సంధానంలో ఉన్నాయి.
(బి) R = R1 + R2 + R3
(సి) కరెంట్ (i)
(డి) R = R1 + R2 + R3 = 2 + 3 + 4 = 9Ω

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 26.
ఇచ్చిన వలయాన్ని పరిశీలించండి. R1, R2 లు రెండు నిరోధాలు మరియు R1 = R2 = 4Ω బ్యాటరీ విద్యుత్ చాలక బ్యాటరీ E విలువ 10V. క్రింది ప్రశ్నలకు సమాధానములను రాయండి.
a) R1, R2 నిరోధాలను ఏ సంధానంలో కలిపారు?
b) R1 నిరోధంపై ఉండే పొటెన్షియల్ భేదం ఎంత?
c) వలయ ఫలిత నిరోధం ఎంత?
d) బ్యాటరీ నుండి వెలువడు మొత్తం విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
a) R1 మరియు R2 నిరోధాలు వలయంలో సమాంతరంగా కలుపబడ్డాయి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 54

ప్రశ్న 27.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 55
i) వలయంలో ఫలిత నిరోధం ఎంత?
ii) వలయంలో ప్రవహించే విద్యుత్ ఎంత?
జవాబు:
పటం నుండి
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 56

ప్రశ్న 28.
క్రింది పటంలో ఏ రెండు చివరల మధ్యనైనా ఫలిత నిరోధాన్ని కనుగొనండి. వలయంలో ప్రవహించే మొత్తం విద్యుత్ ప్రవాహాన్ని లెక్కించండి.
జవాబు:
పటం నుండి BC, CA నిరోధాలు శ్రేణిలోను, ఇవి రెండు AB నిరోధానికి సమాంతరంగాను ఉన్నాయి.
BC, CA ఫలిత నిరోధం R1 = RBC + RAC = 30 + 30 = 60 Ω
R1, AB లు సమాంతరంగా ఉన్నాయి. వీటి ఫలిత నిరోధం
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 57

ప్రశ్న 29.
ఒక తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం V, ఆ తీగలో ప్రవహించే విద్యుత్ I లకు సంబంధించిన గ్రాఫ్ గీయండి. ఆ గ్రాఫ్ ఆకారం ఎలా ఉంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 58

  1. ఒక వాహక విద్యుత్ పొటెన్షియల్ (V) దాని గుండా ప్రవహించు విద్యుత్ (I) కు అనులోమానుపాతంలో ఉండునని ఓమ్ నియమము తెలుపును.
  2. ఓమ్ నియమం ప్రకారం \(\frac{V}{I}\) స్థిరము.
  3. ప్రవాహ విద్యుత్ (I) విలువలను Y – అక్షంపై, తీగ రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం (V) విలువలను X- అక్షంపై తీసుకొనుము.
  4. తగిన స్కేలును నిర్ణయించుకుని V, I మధ్య గ్రాఫ్ గీయగా అది మూలబిందువు గుండా పోవు సరళరేఖను ఏర్పరచినది.

10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం Important Questions and Answers

ప్రశ్న 1.
ఓమ్ నియమం ప్రయోగంలో క్రింది ఇచ్చిన విలువల సహాయంతో I మరియు V మధ్య గ్రాఫ్ గీచి సరిచూడండి. మరియు వాహకం నిరోధం కనుగొనండి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 60
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 59
జవాబు:
V = IR ⇒ R = \(\frac{V}{I}\) ⇒ \(\frac{1.6}{0.5}\) = 3.2 ఓమ్ లు
∴ వాహకం యొక్క నిరోధము 3.2 Ω

ప్రశ్న 2.
ఒక వాహకపు నిరోధానికి 300 పొటెన్షియల్ భేదాన్ని ఏర్పరచనపుడు దానిలోని విద్యుత్ ప్రవాహం 3A పొటెన్షియల్ భేదాన్ని 200 తగ్గించినపుడు విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
వాహకపు పొటెన్షియల్ భేదం = V = 30 V
వాహకంలో విద్యుత్ ప్రవాహం = 1 = 3A
వాహకంలో విద్యుత్ నిరోధము = R = ?
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 61

ప్రశ్న 3.
ఓల్ట్ మరియు ఆంపియర్ పరంగా ఓమ్ ను వివరించండి.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాహకం రెండు చివరల మధ్య 1 ఓల్ట్ పొటెన్షియల్ భేదం, వాహకం గుండా ప్రవహించే 14 విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో వుంటుంది.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 62

ప్రశ్న 4.
వాహక మూలకాలన్నింటికి ఓమ్ నియమం సార్వత్రికమైనది. ‘అయితే ఓమ్ నియమాన్ని పాటించని మూలకాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఓమ్ నియమాన్ని పాటించని మూలకాలు లేదా పదార్థాలను అఓమీయ పదార్థాలు అంటారు.
ఉదా : అర్ధ వాహకాలు, అలోహాలు.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

ప్రశ్న 5.
నిత్యజీవితంలో ఓమ్ నియమం యొక్క అనువర్తనాలను తెల్పండి.
జవాబు:

  1. ఓమ్ నియమాలను DC వలయాలలో వాడతారు.
  2. వలయంలో ఓల్టేజ్ డ్రాప్ సమయంలో ఖచ్చిత నిరోధంను లెక్కించుటకు ఓమ్ నియమాలను వాడతారు.
  3. ఇంటిలో, వలయంలోని ఏ పరికరము యొక్క నిరోధము విలువలను కనుగొనుటకు అయినా ఓమ్ నియమం వాడతారు.
  4. మనము ఇళ్ళలో వాడు బల్బులలోని ఫిలమెంట్ నిరోధం విలువను లెక్కించుటకు ఓమ్ నియమమును వాడతారు.
  5. హీటర్ నిర్మాణంలో వాడతారు.
  6. ఎలక్ట్రిక్ స్ట్రీ నిర్మాణంలోనూ,
  7. సిగార్ వెలిగించే లైటర్ లో ఉష్ణం విడుదలవుటలోనూ,
  8. LED బల్బులు తయారీలోను ఓమ్ నియమమును వాడతారు.

ప్రశ్న 6.
ప్రక్క వలయంలో లోపాలను గుర్తించండి.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 63
జవాబు:

  1. ఇవ్వబడిన వలయంలో అమ్మీటర్ (A) ను బ్యాటరీకి సమాంతరంగా అనుసంధానం చేశారు. ఇది లోపము.
  2. అమ్మీటరు (A)ను బ్యాటరీకి ఎల్లప్పుడు శ్రేణిలో కలపాలి.

10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం ½ Mark Important Questions and Answers

1. స్వేచ్ఛా ఎలక్ట్రానులు దేనిలో ఉంటాయి?
A) వాహకం
B) బంధకం
C) A మరియు B
D) రెండూ కావు
జవాబు:
A) వాహకం

2. మేఘాల నుండి భూమికి గాలి ద్వారా జరిగే విద్యుత్ ఉత్సర్గం ఏ రూపంలో కనిపిస్తుంది?
జవాబు:
మెరుపులు

3. వాతావరణంలో ఆవేశాల చలనానికి ఉదాహరణ ఇమ్ము.
జవాబు:
మెరుపులు

4. నైలాన్ తీగల గుండా విద్యుత్ ప్రవాహం జరగదు. కారణం ఊహించండి.
జవాబు:
నైలాన్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు.

5. క్రింది వానిలో అవాహకం
A) రాగి తీగ
B) అల్యూమినియం తీగ
C) నైలాన్ తీగ
D) ఇనుప తీగ
జవాబు:
C) నైలాన్ తీగ

6. లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాలలో ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు?
జవాబు:
డ్రూడ్ మరియు లోరెంజ్

7. వాహకాలలో ధనాత్మక అయాన్ల అమరికను ఏమంటారు?
జవాబు:
లాటిస్

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

8. తెరిచియున్న వలయం వంటి వాహకంలో ఏదేని మధ్యచ్చేదం వెంబడి కదిలే ఫలిత ఆవేశం
A) గరిష్ఠం
B) శూన్యం
C) ఋణావేశం
D) ధనావేశం
జవాబు:
B) శూన్యం

9. A : తెరచి ఉన్న వలయంలో ఏదేని వాహకంలో మధ్యచ్ఛేదం వెంబడి కదిలే ఆవేశాల మొత్తం శూన్యం.
R : వలయంలో బ్యాటరీ లేనప్పుడు వాహకంలో ఎలక్ట్రానులు చలనంలో ఉండవు.
A) A, R లు సరియైనవి
B) A మాత్రమే సరియైనది
C) R మాత్రమే సరియైనది
D) A, R లు సరియైనవి కావు
జవాబు:
B) A మాత్రమే సరియైనది

10. విద్యుత్ ప్రవాహం అనగా ఏమిటి?
జవాబు:
ఆవేశాల క్రమచలనం

11. ఒక సెకను కాలంలో వాహకంలోని ఏదేని మధ్యచ్ఛేదాన్ని దాటి వెళ్ళే ఆవేశ పరిమాణాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుత్ ప్రవాహం

12. క్రింది వానిలో సరియైనది ఏది?
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 64
జవాబు:
D

13. విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ఏమిటి?
జవాబు:
ఆంపియర్

14. 1 ఆంపియర్ అనగా ఏమిటి ?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 65

15. వాహకం రెండు చివరలను బ్యాటరీ టెర్మినల్స్ కి కలిపినపుడు వాహకంలో ఎలక్ట్రానులు నిర్దిష్ట దిశలో కదులుతాయి. ఈ కదలికకు కారణం ఏమిటో ఊహించండి.
జవాబు:
వాహకమంతా ఏర్పడే సమ విద్యుత్ క్షేత్రం.

16. వాహకంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల దృష్ట్యా సరికాని వాక్యం
a) విద్యుత్ క్షేత్రం వలన త్వరణాన్ని పొందుతాయి.
b) విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి.
c) విద్యుత్ క్షేత్రం వలన ఎలక్ట్రానులు లాటిన్ అయాన్లతో అభిఘాతం చెందుతాయి.
d) పైవేవీ కావు
జవాబు:
b) విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి.

17. వాహకంలో విద్యుత్ క్షేత్ర దిశకు ఎలక్ట్రాన్ల చలన దిశ ఇలా ఉంటుంది.
A) ఒకే దిశలో
B) వ్యతిరేక దిశలో
C) పై రెండింటిలో ఏదైనా
జవాబు:
B) వ్యతిరేక దిశలో

18. వాహకంలో ఎలక్ట్రానులు చలించే మార్గం ఇలా వుంటుంది.
A) సరళరేఖా మార్గంలో
B) వృత్తాకారంగా
C) క్రమరహితంగా
జవాబు:
C) క్రమరహితంగా

19. వాహకంలో ఎలక్ట్రానులు ఇలా చలిస్తాయి.
A) స్థిర వేగంతో
B) స్థిర సరాసరి వడితో
జవాబు:
B) స్థిర సరాసరి వడితో

20. వాహకంలో ఎలక్ట్రాలు స్థిర సరాసరి వడితో చలిస్తాయి. ఈ వడిని ఏమంటారు?
జవాబు:
అపసర వడి (లేదా) డ్రిఫ్ట్ వడి

21. ఎలక్ట్రాన్ విద్యుదావేశ పరిమాణం ఎంత?
జవాబు:
1.602 × 10-19 C

22. మధ్యచ్ఛేద వైశాల్యం 10-6m² గల రాగి తీగలో ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత?
జవాబు:
n = 8.5 × 1028 m-3

23. వాహకంలో ఎలక్ట్రాన్ల అపసర వడి లేదా డ్రిప్ట్ వడి ఎంత?
జవాబు:
Vd = 7 × 10-5m/s (లేదా) 0.07 mm/s.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

24. 10-6m² మధ్యచ్చేద వైశాల్యం గుండా 14 కరెంట్ ప్రవహించినపుడు ఒక ఎలక్ట్రాన్ ఎంత సరాసరి వడితో కదులుతుంది?
జవాబు:
సెకనుకి 0.07 మి.మీ.

25. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు?
జవాబు:
అమ్మీటర్

26. వలయంలో అమ్మీటర్‌ను ఎలా కలుపుతారు?
జవాబు:
శ్రేణిలో

27. స్వేచ్చావేశాలను నిర్దిష్ట దిశలో కదిలించడానికి విద్యుత్ క్షేత్రం చేసే పనికి సూత్రం రాయండి.
జవాబు:
W = Fe l
ఇక్కడ Fe = విద్యుత్ బలం,
l= ఆవేశం కదిలిన దూరం

28. ఏకాంక ఆవేశంపై విద్యుత్ బలం చేసే పనిని ఏమంటారు?
జవాబు:
పొటెన్షియల్ భేదం

29. పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం రాయుము.
జవాబు:
ఓల్ట్ (V)

30. 1 ఔల్ /1 కూలూంబ్ =?
జవాబు:
1 వోల్ట్

31. సరికాని సూత్రం ఏది?
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 66
జవాబు:
C

32. ధనావేశాల చలనాన్ని మనం ఎక్కడ గమనించవచ్చును?
జవాబు:
ద్రవాల గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు (లేదా) ఎలక్ట్రో ప్లేటింగ్ లో.

33. i) ద్రవాలలో విద్యుత్ ప్రవాహం జరగడానికి ధన, ఋణ ఆవేశాలు రెండూ చలిస్తాయి.
ii) లోహ ఘనరూప వాహకంలో ఎలక్ట్రాన్లు మాత్రమే చలిస్తాయి.
పై వాక్యా లలో ఏది సరికాదు?
జవాబు:
రెండూ సరియైనవే.

34. i) ఎలక్ట్రాన్లు అల్ప పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కి కదులుతాయి.
ii) ఋణావేశాలు ఎప్పుడూ విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి.
పై వాక్యాలలో తప్పుగా గల వాక్యం ఏది?
జవాబు:
(ii)

35. “బ్యాటరీలలో ఎల్లప్పుడూ వాటి పొటెన్షియల్ భేదం సిరంగా ఉంటుంది.” ఈ వాక్యం సరియైనదేనా?
జవాబు:
సరియైనదే.

36. బ్యాటరీలలో విద్యుద్విశ్లేష్యంలో గల ధన అయాన్లను ఆనోడ్ వైపు కదిలించే బలం
A) రసాయన బలం
B) విద్యుత్ క్షేత్ర బలం
C) A మరియు B
జవాబు:
A) రసాయన బలం

37. బ్యాటరీలలో ధన అయాన్లు గల పలకను ఏమంటారు?
జవాబు:
ఆనోడ్

38. కేథోడ్ పై ఆవేశం
A) ధన
B) ఋణ
C) శూన్య
D) A లేదా B
జవాబు:
B) ఋణ

39. బ్యాటరీలో విద్యుత్ బల దిశ
i) రసాయన బల దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది.
ii) పరిమాణం ఎలక్ట్రోడ్లపై పోగయిన ఆవేశంపై ఆధారపడి ఉంటుంది.
జవాబు:
(i) మరియు (ii)

40. బ్యాటరీలోని పలకలపై పోగయ్యే ఆవేశ పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
బ్యాటరీలోని రసాయన స్వభావంపై

41. విద్యుచ్ఛాలక బలం సూత్రం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 67

42. ఏకాంక ఋణావేశాన్ని ధన ధృవం నుండి ఋణ ధృవానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని ఏమందురు?
జవాబు:
విద్యుచ్ఛాలక బలం (emf)

43. పొటెన్సియల్ భేదంను కొలుచుటకు ఉపయోగించు పరికరం ఏమిటి?
జవాబు:
వోల్ట్ మీటర్

44. వోల్ట్ మీటరు వలయంలో ఎలా కలుపుతారు?
జవాబు:
సమాంతరంగా

45. ఓమ్ నియమాన్ని చెప్పినవారు ఎవరు?
జవాబు:
జార్జ్ సైమన్ ఓమ్

46. ఓమ్ నియమంను రాయండి.
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. (లేదా)
\(\frac{V}{I}\) స్థిరం.

47. i) అర్ధవాహక \(\frac{V}{I}\) స్థిరం.
ii) వాహకాలకి \(\frac{V}{I}\) స్థిరం. కాదు.
పై వాక్యాలలో సరికానిది ఏది?
జవాబు:
రెండూ సరియైనవి కావు.

48. V/I = స్థిరం అని చూపు ప్రయోగానికి తీసుకోవలసిన పరికరాలేవి ?
జవాబు:
6V బ్యాటరీ ఎలిమినేటర్, అమ్మీటర్, ఓల్ట్ మీటర్, లోహపు తీగ (మాంగనిన్), రియోస్టాట్.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

49. ఓమ్ నియమం నిరూపించు ప్రయోగంలో కొలవవలసిన అంశాలు ఏవి?
జవాబు:
వోల్టేజి (V) మరియు విద్యుత్ ప్రవాహం (I)

50. లోహాలతో ఓమ్ నియమం ప్రయోగం చేసినప్పుడు V, I గ్రాఫ్ ఎలా ఉంటుంది?
జవాబు:
మూల బిందువు గుండా పోయే సరళరేఖ

51. LED కి సంబంధించి V, I గ్రాఫు ఎలా వుంటుంది? పై వాక్యా లలో ఏది సరియైనది?
జవాబు:
వక్రరేఖ

52. V/I = స్థిరాంకం. ఈ స్థిరాంకాన్ని ఏమంటారు?
జవాబు:
వాహక నిరోధం

53. V = ?
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 68
జవాబు:
D

54. 1 వోల్ట్ /1 ఆంపియర్ అనగా ఏమిటి?
జవాబు:
1 ఓమ్

55. నిరోధాన్ని సూచించు గుర్తును రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 69

56. నిరోధం యొక్క ప్రమాణాన్ని సూచించు గుర్తు రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 70

57. ఓమ్ నియమం ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు?
జవాబు:
2

58. ఓమీయ పదార్థాలు అనగానేమి?
జవాబు:
ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలు

59. ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలను ఏమందురు?
జవాబు:
అఓమీయ పదార్థాలు

60. క్రింది వానిలో అఓమీయ వాహకం
A) రాగి తీగ
B) మాంగనిన్ తీగ
C) నికెల్ తీగ
D) LED
జవాబు:
D) LED

61. a) లోహ వాహకాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయి.
b) ఉష్ణోగ్రతను బట్టి పదార్థ నిరోధం మారుతుంది.
c) వాహకానికి చెందిన V, I గ్రాఫు ఎల్లప్పుడూ సరళరేఖయే.
d) వాయు వాహకాలకు ఓమ్ నియమం వర్తించదు.
పై వాక్యాలలో సరికాని వాక్యం ఏది?
జవాబు:
c) వాహకానికి చెందిన V, I గ్రాఫు ఎల్లప్పుడూ సరళరేఖయే.

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

62. నిరోధం అనగానేమి?
జవాబు:
వాహకంలో ఎలక్ట్రాన్ చలనానికి కలిగే ఆటంకం.

63. నిరోధకం అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ చలనాన్ని నిరోధించే పదార్థాన్ని ‘నిరోధకం’ అంటారు.

64. మన నిత్య జీవితంలో ఓమ్ నియమం యొక్క ఉపయోగం రాయండి.
జవాబు:
విద్యుత్ బల్బ్ లు ఓమ్ నియమం ప్రకారం పనిచేయుట.

65. మానవ శరీరం యొక్క నిరోధం ఎంత వుంటుంది?
జవాబు:
100Ω – 5,00,000Ω

66. మానవ శరీరం గుండా విద్యుత్ ప్రవహించే కాలం పెరుగుతున్న కొలదీ శరీర నిరోధం ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది.

67. విద్యుత్ షాక్ ప్రభావాన్ని గుర్తించగలగాలంటే మన శరీరం గుండా ప్రవహించే కనీస విద్యుత్ ప్రవాహ విలువ ఎంత ఉండాలి?
జవాబు:
0.001 ఆంపియర్లు

68. శరీరం గుండా 0.01 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తే శరీరంపై ప్రభావం ఏమిటి?
జవాబు:
కండరాలు సంకోచిస్తాయి

69. విద్యుత్ ఘాతం క్రింది వాని వలన జరుగును.
A) విద్యుత్ ప్రవాహం
B) పొటెన్సియల్ భేదం
C) శరీర నిరోధం
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

70. అధిక ఓల్టేజి తీగపై నిలుచున్న పక్షికి విద్యుత్ ఘాతం కలగదు. కారణం ఏమిటి?
జవాబు:
దాని కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం ఉండదు.

71. పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి కానిది.
A) ఉష్ణోగ్రత
B) పదార్థ స్వభావం
C) వాహకం పొడవు
D) వాహక ద్రవ్యరాశి
జవాబు:
D) వాహక ద్రవ్యరాశి

72. క్రింది వానిలో ఏది పెరిగితే వాహక నిరోధం పెరుగుతుంది?
i) ఉష్ణోగ్రత
ii) వాహక పొడవు
iii) మధ్యచ్ఛేద వైశాల్యం
జవాబు:
(i), (ii)

73. వాహక పొడవును పెంచితే నిరోధం ఏమవుతుంది?
జవాబు:
పెరుగును.

74. వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం పెంచితే దాని నిరోధం ఏమవుతుంది?
జవాబు:
తగ్గుతుంది.

75. R = ρ\(\frac{l}{A}\) లో ρ దేనిని సూచించును?
జవాబు:
విశిష్ట నిరోధం (లేదా) నిరోధకత

76. ‘విశిష్ట నిరోధం’ ఆధారపడే అంశాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణోగ్రత, పదార్థ స్వభావం

77. ‘నిరోధం ‘ ఆధారపడే అంశాలు ఏమిటి?
జవాబు:
ఉష్ణోగ్రత, పదార్థ స్వభావం, పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యం

78. విశిష్ట నిరోధానికి (S.I.) ప్రమాణం ఏమిటి?
జవాబు:
12 – m (ఓమ్ – మీటర్)

79. వాహకత్వం అనగానేమి?
జవాబు:
విశిష్ట నిరోధ విలోమం

80. వాహకత్వాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు?
జవాబు:
σ

81. విశిష్ట నిరోధం తక్కువ వుంటే ఆ పదార్థాలు
A) మంచి వాహకాలు
B) నిరోధాలు
C) అర్ధవాహకాలు
D) చెప్పలేం
జవాబు:
A) మంచి వాహకాలు

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

82. (A) : రాగిని విద్యుత్ తీగల తయారీలో ఉపయోగిస్తారు.
(R) : రాగికి విశిష్ట నిరోధం తక్కువ.
A) A, Rలు సరియైనవి. A కి R సరియైన కారణం.
B) A, Rలు సరియైనవి. A కి R సరియైన కారణం కాదు.
C) A సరియైనది, R సరియైనది కాదు.
D) R సరియైనది, A సరియైనది కాదు.
జవాబు:
A) A, Rలు సరియైనవి. A కి R సరియైన కారణం.

83. విద్యుత్ బల్బ్ లలో వినియోగించే లోహం ఏమిటి?
జవాబు:
టంగ్ స్టన్

84. విద్యుత్ బల్బ్ లలో ఫిలమెంట్ గా టంగ్ స్టనన్ను వినియోగించడానికి కారణం ఏమిటి?
జవాబు:
దాని విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ.

85. టంగ్ స్టన్ యొక్క ద్రవీభవన స్థానం, విశిష్ట నిరోధం విలువలు రాయండి.
జవాబు:
ద్రవీభవన స్థానం – 3422°C.
విశిష్ట నిరోధం 5.6 × 10-8 Ω-m

86. జతపరుచుము :
విశిష్ట నిరోధాలు పదార్థం
i) 1014 – 1016Ω – m a) వాహకాలు
ii) 10-1 – 101Ω – m b) అర్ధవాహకాలు
iii) 10-6 – 10-8Ω – m c) విద్యుత్ బంధకాలు
జవాబు:
i – c, ii – b, iii – a

87. నిక్రోమ్ లో ఉండే లోహాలు ఏమిటి?
జవాబు:
నికెల్, క్రోమియం, ఇనుము

88. మాంగనిలో ఉండే లోహాలు ఏమిటి?
జవాబు:
86% రాగి, 12% మాంగనీస్, 2% నికెల్

89. మిశ్రమ లోహాలయిన నిక్రోమ్, మాంగనిన్ నిరోధాలు లోహాల నిరోధాల కన్నా
A) 30 – 100 రెట్లు తక్కువ ఉంటాయి.
B) 30 – 100 రెట్లు ఎక్కువ ఉంటాయి.
జవాబు:
B) 30 – 100 రెట్లు ఎక్కువ ఉంటాయి.

90. మిశ్రమ లోహాల
i) విశిష్ట నిరోధం విలువ ఎక్కువ.
ii) నిరోధం ఉష్ణోగ్రతలతో పాటు స్వల్పంగా మారుతుంది.
iii) సులభంగా తుప్పు పట్టవు.
iv) తాపన పరికరాలుగా వినియోగిస్తారు.
పై వానిలో సరికాని వాక్యం ఏది?
జవాబు:
ఏదీ లేదు

91. మిశ్రమ లోహాలైన మాంగనీస్, నిక్రోమ్ ఒక ఉపయోగాన్ని రాయండి.
జవాబు:
ఇస్త్రీ పెట్టె, టోస్టర్ (toaster) లలో తాపన పరికరాలుగా వినియోగిస్తారు.

92. అర్ధవాహకాలకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
సిలికాన్, జెర్మేనియం

93. అర్ధవాహకాలను ఎక్కడ వినియోగిస్తారు?
జవాబు:
డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ (IC) చిట్లలో వినియోగిస్తారు.

94. జతపర్చుము :
a) వెండి ( ) i) 1.00 × 1013 Ω-m
b) జెర్మేనియం ( ) ii) 4.60 × 10-1Ω-m
c) రబ్బరు ( ) iii) 1.59 × 10-8Ω-m
జవాబు:
a – iii, b – ii, c – i

95. బ్యాటరీ, వాహక తీగలతో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరిచిన సంవృత మార్గాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుత్ వలయం (సర్క్యూట్)

96. విద్యుత్ వలయంలో వలయాన్ని తెరవడానికి, మూయడానికి వినియోగించే పరికరం ఏమిటి?
జవాబు:
స్విచ్

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

97. నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపినపుడు దాని యొక్క ……… స్థిరం.
A) నిరోధం
B) విద్యుత్ ప్రవాహం
C) పొటెన్షియల్ భేదం
D) పైవన్నీ
జవాబు:
B) విద్యుత్ ప్రవాహం

98.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 53
పై పటంలో నిరోధాలు ఎలా కలిపారు?
జవాబు:
శ్రేణి సంధానంలో

99. ఏ సంధానంలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం, ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానం?
జవాబు:
శ్రేణి సంధానంలో

100.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 71
పై పటంలో,
i) నిరోధాలు ఎలా కలుపబడ్డాయి?
జవాబు:
సమాంతర సంధానంలో

ii) నిరోధాల ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 72

iii) పై వలయంలో ఏది స్థిరంగా ఉంటుంది?
A) విద్యుత్ ప్రవాహం
B) పొటెన్షియల్ భేదం
C) రెండూ
జవాబు:
B) పొటెన్షియల్ భేదం

iv) R1 వద్ద విద్యుత్ ప్రవాహం ఎంత?
జవాబు:
\(\mathrm{I}_{1}=\frac{\mathrm{V}}{\mathrm{R}_{1}}\)

101. సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా
A) తక్కువ
B) ఎక్కువ
C) సమానం
D) చెప్పలేం
జవాబు:
A) తక్కువ

102. మందపాటి తీగ నిరోధం , సన్నని తీగ నిరోధం కన్నా
A) ఎక్కువ
B) తక్కువ
C) సమానం
D) A లేదా C
జవాబు:
B) తక్కువ

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

103. జతపరుచుము.
a) శ్రేణి సంధానంలో నిరోధాలు ( ) i) I = I1 + I2 + I3
b) సమాంతర సంధానంలో నిరోధాలు ( ) ii) V = V1 +V2 + V3
జవాబు:
a – ii, b – i

104. కిర్ఛాఫ్ నియమాలు ఏమిటి?
జవాబు:
జంక్షన్ నియమం, లూప్ నియమం

105.
AP Board 10th Class Physical Science Solutions 9th Lesson విద్యుత్ ప్రవాహం 9
పై పటంలో దత్తాంశం ప్రకారం
i) I1 + I4 + I6 ఎంత?
జవాబు:
I2 + I3 + I5

ii) పై పటం ఏ నియమాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
జంక్షన్ నియమం

iii) జంక్షన్ వైపు వచ్చే విద్యుత్ ప్రవాహాలు ఏవి?
జవాబు:
I1, I4, I6

iv) ఈ జంక్షన్ వద్ద పోగు అయ్యే ఆవేశం ఎంత?
జవాబు:
శూన్యం

106. జంక్షన్ నియమాన్ని రాయండి.
జవాబు:
జంక్షన్ ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం = జంక్షన్ ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తం

107. లూప్ నియమాన్ని రాయండి.
జవాబు:
ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల, తగ్గుదలల బీజీయ మొత్తం శూన్యం.

108.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 73
పై పటంలో వలయంలో ఫలిత పొటెన్షియల్ భేదం ఎంత?
జవాబు:
-V1 + I1 R1 = 0

109.
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 74
పై పటంలో ఇచ్చిన వలయంలో
IR1 + IR2 + IR3 = ?
జవాబు:
V1 + V2

110. విద్యుత్ సామర్థ్యానికి సూత్రం రాయుము.
జవాబు:
P = VI (లేదా) P = I²R (లేదా) P = \(\frac{\mathrm{V}^{2}}{\mathrm{R}}\)

111. AC : P= VI :: DC : P = ?
జవాబు:
εI (ε = emf)

112. ఒక బల్బ్ పై 60W మరియు 120V అని రాసి వుంది. అది ఎంత నిరోధకత్వం కలిగియుండును?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 75

113. విద్యుత్ శక్తికి పెద్ద ప్రమాణం ఏమిటి?
జవాబు:
కిలో వాట్

114. మనం సాధారణంగా ఇండ్లలో వినియోగించే విద్యుచ్ఛక్తిని కొలవడానికి ‘యూనిట్లు’ అని అంటాం. ఒక యూనిట్ అనగా ఎంత ?
జవాబు:
యూనిట్ = 1 కిలో వాట్ అవర్(1 unit = 1 KWH)

115. IKWH కి ఎన్ని ఔళ్ళు?
జవాబు:
3.6 x 106J

116. సాధారణంగా మన ఇండ్లలో విద్యుత్ సప్లై ఎంత పొటెన్షియల్ భేదాన్ని కలిగియుండును?
జవాబు:
240V

117. ఓవర్ లోడింగ్ వలన గృహోపకరణాలను కాపాడే పరికరం ఏమిటి?
జవాబు:
ఫ్యూజ్

118. 100W -1 ఫ్యాన్ – 12 గంటలు; 9W-5LED బల్బులు – 10 గంటలు వినియోగించిన, విద్యుచ్ఛక్తి ఎంత ఖర్చు అగును?
జవాబు:
1.65 U (లేదా) 1.65 KWH

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

119. ఇండ్లలో వాడే విద్యుచ్ఛక్తిని దేనిలో కొలుస్తారు?
జవాబు:
కిలో వాట్ అవర్

120. క్రింది వానిలో దేనికి, వేటికి అధిక నిరోధం ఉండును?
i) మందపాటి తీగ
ii) సన్నని తీగ
iii) పొడవాటి తీగ
iv) పొట్టి తీగ
జవాబు:
(ii) మరియు (iii)

121. ఒక పరికరం 12V వద్ద 0.2A విద్యుత్ ను పొందుతుంది. అయిన దాని నిరోధం ఎంత?
జవాబు:
60 Ω

122. 2Ω, 4Ω మరియు 6Ω ల నిరోధాలు శ్రేణిలో వలయానికి అనుసంధానం చేయబడ్డాయి. వలయం ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
12Ω [∵ R1 + R2 + R3]

123. 10V బ్యాటరీ 10W ల సామర్థ్యం కలిగియుంది. బ్యాటరీ ఎంత విద్యుత్ ఇవ్వగలదు?
జవాబు:
1 Amp
[∵ P = 10W, V = 10V ⇒ P= VI ⇒ I = \(\frac{P}{V}\)]

124. 500 నిరోధం గల ఒక తీగను అడ్డంగా, సమానంగా 5 భాగాలుగా, ముక్కలుగా కత్తిరించారు. ఈ ముక్కలను సమాంతరంగా ఒక వలయంలో ఉంచారు. దాని ఫలిత నిరోధం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 76

125. ఈ క్రింది పరికరాల గుర్తులను గీయండి.
i) నిరోధం
ii) బ్యాటరీ
iii) రియోస్టాట్
iv) అమ్మీటర్
v) వోల్ట్ మీటరు
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 77

126. R1, R2 రెసిస్టర్లు సమాంతరంగా వలయంలో కలపబడ్డాయి. ఫలిత నిరోధం ఎంత?
జవాబు:

127. నిరోధకత్వం : ρ : : …?… : σ
జవాబు:
వాహకత్వం

128. ఓమ్ నియమాన్ని నిరూపించునప్పుడు ఏ రాశిని స్థిరంగా ఉంచాలి?
జవాబు:
ఉష్ణోగ్రతని

129. వలయంలో వోల్ట్ మీటరు, అమ్మీటర్, బ్యాటరీ నిరోధాలను ఎలా అనుసంధానిస్తారో పటం ద్వారా చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 78

పట్టికలు

విద్యుత్ ప్రవాహం (ఆంపియర్లలో) శరీరంపై ప్రభావం
0.001 ప్రభావాన్ని గుర్తించగలం
0.005 నొప్పిని కలుగజేస్తుంది
0.010 కండరాలు సంకోచిస్తాయి
0.015 కండరాల పటుత్వం దెబ్బ తింటుంది
0.070 1 సెకను కంటే ఎక్కువ సమయం గుండె ద్వారా ప్రవహిస్తే స్పృహ కోల్పోతారు.

→ వివిధ పదార్థాల నిరోధకతలు పదార్థం
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 79

ప్రమాణాలు మరియు వాటి సంకేతాలు
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 80

10th Class Physics 9th Lesson విద్యుత్ ప్రవాహం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 69 ఇది దేనికి గుర్తు?
A) బ్యాటరీ
B) రియోస్టాట్
C) నిరోధము
D) అమ్మీటరు
జవాబు:
C) నిరోధము

2. మందంగా ఉన్న వాహకం నిరోధం ,సన్నని వాహకం నిరోధం కంటే ….
A) ఎక్కువ
B) తక్కువ
C) సమానం
D) A మరియు B
జవాబు:
B) తక్కువ

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

3. క్రింది వానిలో అసత్య వాక్యం / వాక్యాలను గుర్తించండి.
i) వాహక నిరోధం అపదార్థ స్వభావంపై ఆధారపడుతుంది.
ii) వాహక నిరోధం వాహకం మధ్యచ్ఛేద వైశాల్యంపై ఆధారపడదు
iii) వాహక నిరోధం వాహకం పొడవుపై ఆధార పడుతుంది.
iv) వాహక నిరోధం వాహకం ఉష్ణోగ్రతపై ఆధారపడదు.
A) (i) & (ii)
B) (ii) & (iii)
C) (ii) & (iv)
D) (iv) మాత్రమే
జవాబు:
C) (ii) & (iv)

4. వలయాన్ని పరిశీలించండి. R2 నిరోధం వినియోగించే విద్యుత్ సామర్థ్యం P వలయం నుండి R1 ను తొలగించిన R2 నిరోధం వినియోగించే విద్యుత్ సామర్థ్యం ………… (R1 = R,2 గా తీసుకోండి.)
AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం 81
జవాబు:
C

5. కింది వాటిల్లో ఏది పొటెన్షియల్ భేదంను కొలవడానికి ఉపయోగించే పద్ధతి?
A) వోల్టుమీటరును వలయంలో సమాంతరంగా కలపడం
B) వోల్టుమీటరును వలయంలో శ్రేణిలో కలపడం
C) అమ్మీటరును వలయంలో సమాంతరంగా కలపడం
D) అమ్మీటరును వలయంలో శ్రేణిలో కలపడం
జవాబు:
A) వోల్టుమీటరును వలయంలో సమాంతరంగా కలపడం

6. ఒక గదిలో టెలివిజన్ మరొక గదిలో కంప్యూటర్ కలదు. ఈ రెండూ ఒకే వలయంలో కలుపబడ్డాయి. అవి ఈ విధంగా కలుపబడి ఉంటాయి.
A) శ్రేణి పద్ధతి
B) సమాంతర పద్దతి
C) ఒకటి శ్రేణి మరొకటి సమాంతర పద్ధతిలో
D) ఏవిధంగానైనా
జవాబు:
B) సమాంతర పద్దతి

7. ఓవర్ లోడ్ వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి ఉపయోగించే సాధనం
A) అమ్మీటర్
B) ఓల్టామీటరు
C) ఫ్యూజ్
D) స్విచ్
జవాబు:
C) ఫ్యూజ్

8. 10 Ω మరియు 10 Ω నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలితం నిరోధం
A) 5 Ω
B) 10 Ω
C) 0 Ω
D) 20 Ω
జవాబు:
D) 20 Ω

9. క్రింది జతలలో ఏది సరైన జతల సమూహం?
i) అమ్మీటర్ ( ) a) వలయంలో సమాంతరంగా కలుపబడుతుంది.
ii) టాప్ కీ ( ) b) వలయంలో శ్రేణిలో కలుపబడును.
iii) ఓల్ట్ మీటర్ ( ) c) వలయం కలుపబడానికి విడదీయడానికి ఉపయోగిస్తారు.
A) i – a, ii – b; iii – c
B) i – b, ii – c, iii – a
C) i – c, ii – a, iii – b
D) i – a, ii – c, iii – b
జవాబు:
B) i – b, ii – c, iii – a

10. పొటెన్షియల్ భేదం కొలవటానికి ……………… ఉపయోగిస్తారు.
A) ఆమ్మీటర్
B) గాల్వనోమీటర్
C) బ్యాటరీ
D) వోల్టుమీటర్
జవాబు:
D) వోల్టుమీటర్

11. రెండు నిరోధాలు 10Ω, 15Ω శ్రేణిలో కలిపిన ఫలిత నిరోధం
A) 10Ω
B) 15 Ω
C) 20 Ω
D) 25 Ω
జవాబు:
D) 25 Ω

12. ఏకరీతి మందంతో RΩ ల నిరోధం గల ఒక తీగను 10 సమాన భాగాలుగా చేసి, వాటిని సమాంతర సంధానం చేశారు. సంధాన ఫలిత నిరోధం ……..
A) 100 RΩ
B) 10 RΩ
C) 0.1 RΩ
D) 0.01 RΩ
జవాబు:
D) 0.01 RΩ

13. క్రింది ఏ సందర్భంలో విశిష్ట నిరోధం మారదు ?పై వాటిని జతపరుచుటకు క్రింది వాటిలో సరైన సమాధానం.
A) పదార్థం మారినపుడు
B) ఉష్ణోగ్రత మారినపుడు
C) నిరోధం ఆకారం మారినపుడు
D) పదార్థం, ఉష్ణోగ్రత రెండూ మారినపుడు
జవాబు:
C) నిరోధం ఆకారం మారినపుడు

AP 10th Class Physical Science Important Questions 9th Lesson విద్యుత్ ప్రవాహం

14. 6Ω, 6Ω, 6Ω లను సమాంతర సంధానం చేస్తే వచ్చే ఫలిత నిరోధం …………
A) 1/6
B) 6
C) 18
D) 2
జవాబు:
D) 2

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

These AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 8th Lesson Important Questions and Answers రసాయన బంధం

10th Class Physics 8th Lesson రసాయన బంధం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
“రసాయన బంధం” అనగానేమి?
జవాబు:
అణువులోని పరమాణువుల మధ్యగల ఆకర్షణ శక్తిని “రసాయన బంధం” అంటారు.

ప్రశ్న 2.
అయానిక బంధం గల రెండు సంయోగ పదార్థాల పేర్లు రాయండి.
జవాబు:
అయానిక బంధం గల సంయోగ పదార్థాలు

  1. Nacl
  2. MgCl2

ప్రశ్న 3.
వేలన్సీ స్థాయి ఎలక్ట్రాన్ జంట వికర్షణ సిద్ధాంతం ఆధారంగా అమ్మోనియా అణువు నిర్మాణాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 1

ప్రశ్న 4.
కింద ఇచ్చిన లూయిస్ చుక్కల నిర్మాణాలను గమనించి, HCl అణువు ఏర్పడే విధానాన్ని లూయిస్ చుక్కల నిర్మాణంతో చూపండి.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 2
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 3

ప్రశ్న 5.
A, B లు రెండు మూలకాలు, వాటి సంయోగ పదార్థం A,B అయిన A, B ల వేలన్సీలు ఏమై ఉండవచ్చునో తెల్పండి.
జవాబు:
‘A యొక్క వేలన్సీ -1 ; B యొక్క వేలన్సీ -2.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 6.
సాధారణంగా తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటి మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల ఒక మూలక పరమాణువు ఏ రకమైన అయానను ఏర్పరచగలదో ఊహించి వ్రాయండి.
జవాబు:
కాటయాన్ (లేదా) ధనాత్మక అయానను ఏర్పరుస్తుంది.

ప్రశ్న 7.
నీటి అణువులో బంధకోణం 109° 28′ కాకుండా 104°31′ గా ఎందుకు ఉంటుందో వివరించండి.
జవాబు:
నీటి అణువులోని ఆక్సిజన్ పరమాణువులో ఉండే “బంధంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు” ఆక్సిజన్, హైడ్రోజన్ల మధ్య, “బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటల” మధ్య వికర్షణ వల్ల నీటి అణువులో బంధ కోణం 109° 28′ కాక 104°31′ గా ఉంటుంది.

ప్రశ్న 8.
“అష్టక నియమం” అంటే ఏమిటి?
జవాబు:
పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోవడం, స్వీకరించడం లేదా పంచుకోవడం ద్వారా వాటి వేలన్సీ కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లను పొందటానికి ప్రయత్నిస్తాయి. దీనినే అష్టక నియమం అంటారు.

ప్రశ్న 9.
“అష్టక నియమం”ను ఎవరు ప్రవేశపెట్టారు?
జవాబు:
కొసెల్, లూయీలు అష్టక సిద్ధాంతమును కనిపెట్టారు.

ప్రశ్న 10.
s, s2- లకు లూయీ ఎలక్ట్రాన్ చుక్కల సంకేతాలు వ్రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 4

ప్రశ్న 11.
‘ఎలక్ట్రోవేలన్సీ’ మరియు ‘కోవేలన్సీ’ అనగానేమి?
జవాబు:

  1. ఎలక్ట్రాన్ల స్థానాంతర గమనం వల్ల ఏర్పడే వేలన్సీని “ఎలక్ట్రో వేలన్సీ” అని అంటారు.
  2. ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే వేలన్సీని “కోవేలన్సీ” అని అంటారు.

ప్రశ్న 12.
‘అయానిక బంధం’ లేదా ‘ఎలక్ట్రోవేలంట్ బంధం’ అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఎలక్ట్రాన్ల స్థానాంతర గమనం వల్ల ఏర్పడ్డ విరుద్ధ ఆవేశాలు గల అయాన్ల మధ్య గల స్థిర విద్యుదాకర్షణ బలాలను ‘అయానిక బంధం’ లేక ‘ఎలక్ట్రోవేలంట్ బంధం’ అంటారు.
ఉదా : NaCl, MgCl2, Na2O, AlCl3

ప్రశ్న 13.
లాటిస్ శక్తి అనగానేమి?
జవాబు:
అనంత దూరంలో ఉన్న విరుద్ధ ఆవేశాలు గల అయాన్లను దగ్గరకు చేర్చినపుడు ఒక మోల్ అయానిక స్ఫటికం ఏర్పడుతుంది. అప్పుడు విడుదలయ్యే శక్తిని లాటిస్ శక్తి అంటారు.

ప్రశ్న 14.
సమయోజనీయ బంధం అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. దీనిని ఎలక్ట్రాన్ జంట బంధం అని కూడా అంటారు.
ఉదా : F2, O2, N2, CH4, NH3, H2O

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 15.
VSEPRT సిద్ధాంతం దేనిని వివరిస్తుంది?
జవాబు:
VSEPRT సిద్ధాంతం అణువుల ఆకృతులను మరియు బంధ కోణాలను వివరిస్తుంది.

ప్రశ్న 16.
VSEPRT ని విస్తరింపుము.
జవాబు:
వేలన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్టన్ థియరీ (Valency Shell Electron Pair Repulsion Theory).

ప్రశ్న 17.
“బంధదైర్ఘ్యం” అనగానేమి?
జవాబు:
బంధింపబడి ఉన్న పరమాణువుల మధ్య గల సరాసరి అంతర్ కేంద్ర దూరాన్ని “బంధదైర్ఘ్యం” అంటారు.

ప్రశ్న 18.
“బంధశక్తి” అనగానేమి?
జవాబు:
ఒక మోల్ సమయోజనీయ బంధాన్ని దాని అనుఘటక పరమాణువులుగా విడగొట్టడానికి కావలసిన శక్తిని “బంధశక్తి” అంటారు.

ప్రశ్న 19.
‘ధృవాత్మక బంధం’ అనగానేమి?
జవాబు:
రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రానులు ఎప్పుడూ కూడా సమానంగా పంచుకోబడకపోవచ్చు. దీనినే ‘ధృవాత్మక బంధం’ అంటాం.

ప్రశ్న 20.
కర్పూరం కిరోసిన్లో కరుగుతుంది. కానీ నీటిలో కరగదు. ఎందువల్ల?
జవాబు:
సమయోజనీయ సమ్మేళనాలు అధృవ ద్రావణాలలో కరుగుతాయి. కాని ధృవ ద్రావణులలో కరగవు. కర్పూరం సమయోజనీయ సమ్మేళనం. కనుక ఇది అధృవ ద్రావణి అయిన కిరోసిన్లో కరుగుతుంది. కానీ ధృవ ద్రావణి అయిన నీటిలో కరగదు.

ప్రశ్న 21.
ఆల్కహాల్ లేదా ఈథర్ మొదలయిన కర్బన ద్రావణాలలో Lice కరుగుతుందా? ఎందుకు?
జవాబు:
Lice కోవలెంట్ స్వభావం గల పదార్థం. అందువల్ల అది అధృవ ద్రావణులైన ఆల్కహాల్, ఈథర్ లో కరుగుతుంది.

ప్రశ్న 22.
జడ వాయువుల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏది?
జవాబు:
ns² np6 (హీలియం తప్ప మిగిలిన జడవాయువులకు) మరియు He ఎలక్ట్రాన్ విన్యాసం 1s².

ప్రశ్న 23.
అయాన్ యొక్క సమన్వయ సంఖ్య అనగానేమి?
జవాబు:
ఒక నిర్దిష్ట ఆవేశం గల అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయానులు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను ఆ అయాన్ యొక్క సమన్వయ సంఖ్య (Coordination number) అంటారు.

ప్రశ్న 24.
‘ఋణ విద్యుదాత్మకత’ అనగానేమి?
జవాబు:
ఋణ విద్యుదాత్మకత : బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటను తమ వైపుగా ఆకర్షించే స్వభావాన్ని ‘ఋణ విద్యుదాత్మకత’ అంటారు.

ప్రశ్న 25.
‘సంయోజనీయత’ అనగానేమి?
జవాబు:
ఒక మూలక పరమాణువు ఎన్ని సంయోజనీయ బంధాలను ఏర్పరచగలదో తెలిపే సంఖ్యనే ఆ మూలకం యొక్క “సంయోజనీయత” అంటారు.

ప్రశ్న 26.

‘బంధ దూరం’ లేదా ‘బంధదైర్ఘ్యం’ అనగానేమి?
జవాబు:
సంయోజనీయ బంధంతో కలుపబడిన రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద గల దూరాన్నే ‘బంధదూరం’ లేదా ‘బంధదైర్ఘ్యం’ అంటారు.

ప్రశ్న 26.
బంధదూరం ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
బంధదూరం ప్రమాణాలు నానోమీటర్ (nm) గానీ, ఆంగ్ స్ట్రామ్ (A°) యూనిట్ లో గానీ తెలియజేస్తారు.

ప్రశ్న 27.
నీటి అణువు ఆకృతి ఏమి?
జవాబు:
నీటి అణువు ‘V’ ఆకృతిని కలిగి ఉండును.

ప్రశ్న 28.
NH3, PCl3 మరియు PH3 అణువుల ఆకృతి ఏమి?
జవాబు:
NH3, PCl3 మరియు PH3 అణువుల ఆకృతి ‘పిరమిడల్ ఆకృతి’.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 29.
PCl5 ఆకృతి ఏమి?
జవాబు:
PCl5 అణువు, ట్రైగోనల్ బై-పిరమిడ్ ఆకృతిని కలిగి ఉండును.

ప్రశ్న 30.
‘σ’ మరియు ‘π’ బంధములు ఎలా ఏర్పడును?
జవాబు:
ఆర్బిటాళ్ళ అంత్యాతిపాతం (End – on) వలన సిగ్మా (σ) బంధం మరియు ఆర్బిటాళ్ళ పార్శ్వ (partial) అతిపాతం వల్ల పై (π) బంధం ఏర్పడును.

ప్రశ్న 31.
ద్విబంధము ఏర్పరచే అణువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
O2

ప్రశ్న 32.
త్రికబంధం ఏర్పరచే అణువులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
N2

ప్రశ్న 33.
సమయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడును?
జవాబు:
రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్లను పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడే బంధమే “సమయోజనీయ బంధం”.
ఉదా : H2, O2, N2 అణువులు ఏర్పడుట.

ప్రశ్న 34.

సిగ్మా (σ) మరియు పై (π) బంధాలను పోల్చుము.
జవాబు:

సిగ్మా (σ) బంధం పై (π) బంధం
1. ఇది పరమాణు ఆర్బిటాళ్ళ అంత అతిపాతం వల్ల వల్ల ఏర్పడును. 1. ఇది పరమాణు ఆర్బిటాళ్ళ పార్శ్వ అతిపాతం ఏర్పడును.
2. ఇది స్వతంత్రంగా ఏర్పడగలదు. 2. ఇది స్వతంత్రంగా ఏర్పడలేదు.
3. ఇది బలమైన బంధం. 3. ఇది బలహీన బంధం.
4. అణువులో ఒకే ఒక సిగ్మా (σ) బంధం ఉండును. 4. రెండు పరమాణువుల మధ్య ఒకటి లేదా రెండు పై (π) బంధాలుంటాయి.

ప్రశ్న 35.
కాటయాన్ ఎలా ఏర్పడును?
జవాబు:
ఒక పరమాణువు ఎలక్ట్రాన్ కోల్పోయినపుడు కాటయాన్ ఏర్పడుతుంది.

ప్రశ్న 36.
ఆనయాన్ ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
ఒక పరమాణువు ఎలక్ట్రాన్ ను గ్రహించినపుడు ఆనయాన్ ఏర్పడుతుంది.

ప్రశ్న 37.
అయానిక బంధంలోనున్న బలాలు ఏవి?
జవాబు:
అయానిక బంధంలో స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు వున్నాయి.

ప్రశ్న 38.
ఎటువంటి సమ్మేళనాలు ధృవ ద్రావణిలలో కరుగుతాయి?
జవాబు:
అయానిక పదార్థాలు ధృవ ద్రావణిలలో ఎక్కువగా కరుగుతాయి.

ప్రశ్న 39.
అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు గల సమ్మేళనాలు ఏవి?
జవాబు:
అయానిక సమ్మేళనాలు అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 40.
ఒక అలోహం యొక్క వేలన్సీని ఎలా తెలుసుకుంటారు?
జవాబు:
ఒక అలోహ పరమాణువు, అణువుగా ఏర్పడటానికి పొందే ఎలక్ట్రానుల సంఖ్యను దాని వేలన్సీ అంటారు.
వేలన్సీ = (8 – ఆ అలోహపు గ్రూపు సంఖ్య)
ఉదా : క్లోరిన్ వేలన్సీ = (8 – 7) = 1

ప్రశ్న 41.
పరమాణువులు సంయోగం చెంది అణువుగా ఎందుకు మారతాయి?
జవాబు:
ఒక అణువు శక్తి, దానిలోనున్న పరమాణువుల మొత్తం శక్తికన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల అది సంయోగం చెంది స్థిరత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 42.
అయానిక పదార్థాలు మంచి విద్యుద్విశ్లేషకాలు ఎందుకు?
జవాబు:
అయానిక పదార్థాల జలద్రావణాలలో స్వేచ్ఛగా చలించే అయానులు ఉంటాయి. కావున ఇవి విద్యుద్విశ్లేషకాలు.

ప్రశ్న 43.
పరమాణువుల మధ్య అయానిక బంధం ఎప్పుడు ఏర్పడుతుంది?
జవాబు:
స్వల్ప అయనీకరణ శక్మము గల పరమాణువులు మరియు అత్యధిక ఋణ విద్యుదాత్మకత గల పరమాణువుల మధ్య అయానిక బంధం ఏర్పడును.
(లేదా)
రెండు మూలకాల ఋణ విద్యుదాత్మకతల మధ్య తేడా 1.9 గానీ అంతకన్నా ఎక్కువ గానీ ఉంటే ఆ మూలకం పరమాణువుల మధ్య అయానిక బంధం ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 44.
బంధకోణం అనగానేమి?
జవాబు:
మధ్య పరమాణువు, సమయోజనీయ బంధంలో పాల్గొనే మిగతా పరమాణువుల కేంద్రకాల గుండా వెళ్ళే ఊహా రేఖలు, మధ్య పరమాణువు కేంద్రం వద్ద చేయు కోణాన్ని ‘బంధకోణం’ అంటారు.

ప్రశ్న 45.
NaCl నీటిలో కరుగును కాని బెంజీన్లో కరుగదు. ఎందుకు?
జవాబు:
నీరు ధృవద్రావణి. NaClలో Na+ మరియు Cl అయానులు ఉంటాయి. కావున ఇది అయానిక పదార్థం. అయానిక పదార్థాలు ధృవద్రావణిలలో కరుగుతాయి. కాని అధృవ ద్రావణులలో కరుగవు. కావున NaCl నీటిలో కరుగుతుంది కాని బెంజీన్లో కరుగదు.

ప్రశ్న 46.
సంకరీకరణము అనగానేమి?
జవాబు:
పరమాణువుల చివరి కక్ష్యలో ఉండి దాదాపు సమానశక్తి కలిగిన పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరించబడడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరచే దృగ్విషయాన్ని సంకరీకరణము అంటారు.

ప్రశ్న 47.
H2O మరియు NH3 లలోని బంధకోణాలు ఎంత?
జవాబు:
H2O అణువులో బంధకోణం 104°.31′
NH3 అణువులో బంధకోణం 107°.48′

10th Class Physics 8th Lesson రసాయన బంధం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కింద తెలిపిన పదార్థాలు ఏర్పడే క్రమాన్ని లూయీస్ నిర్మాణంలో సాంకేతాలతో చూపండి.
(i) కాల్షియం, క్లోరిన్ కలిసి కాల్షియం క్లోరైడ్ ఏర్పడడం.
(ii) ఆక్సిజన్ అణువు ఏర్పడడం.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 5

ప్రశ్న 2.
ఒక తటస్థ పరమాణువు, దాని ధన అయాన్లలో దేని పరిమాణం ఎక్కువ? ఎందుకు?
జవాబు:

  1. తటస్థ పరమాణువు కన్నా దాని ధన అయాన్ పరిమాణం తక్కువ ఉంటుంది.
  2. ఎలక్ట్రాన్లు కోల్పోయిన పరమాణువు కేంద్రక ఆవేశ ప్రభావం ఎక్కువగా ఉండి, చిట్ట చివరి కక్ష్యలోని ఎలక్ట్రాన్లను మరింత బలంగా ఆకర్షిస్తుంది.
  3. ఈ ఆకర్షణ కారణంగా అయాన్ పరిమాణం తగ్గిపోతుంది.
  4. కాబట్టి పరమాణువుకన్నా దాని ధన అయాన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.

ప్రశ్న 3.
అష్టక నియమంను రాయండి. ఈ నియమం ప్రకారం మెగ్నీషియం (Z = 12) క్లోరితో చర్య జరిపేటప్పుడు ఎలా స్థిరత్వం పొందుతుందో తెల్పండి.
జవాబు:
అష్టక నియమం :
మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు మిగిలి ఉండేలా రసాయన మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీనిని అష్టక నియమం అంటాం.

మెగ్నీషియం రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయి చివరి కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లు మిగుల్చుకొని నియాన్ విన్యాసాన్ని పొంది స్థిరత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 4.
ఆక్సిజన్ అణువు ఏర్పడే విధానాన్ని వేలన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం పటం గీచి చూపండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 6

ప్రశ్న 5.
అయానిక బంధంను ఒక ఉదాహరణతో వివరించండి. ..
జవాబు:

  1. సోడియం (Na) పరమాణువు ఒక ఎలక్ట్రాన్ ను కోల్పోయి సోడియం ధన అయాన్ గా మారుతుంది. (Na+)
    Na → Na+ + le
  2. క్లోరిన్ (Cl) పరమాణువు ఒక ఎలక్ట్రాన ను గ్రహించి క్లోరిన్ ఋణ అయాన్ గా మారుతుంది. (Cl )
    Cl + le → Cl
  3. సోడియం ధన అయాన్, క్లోరిన్ ఋణ అయాన్ల మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ వలన అయానిక బంధం ఏర్పడి సోడియం క్లోరైడ్ (NACl) ఏర్పడుతుంది.
    Na+ + Cl → NaCl

ప్రశ్న 6.
VSEPRT సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
మూడు, అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వలన ఏర్పడిన అణువులలో అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువులతో సమయోజనీయ బంధంతో బంధింపబడి ఉన్నప్పుడు, వాని మధ్య బంధకోణాలు వివరించడానికి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధిపరచారు. దీనినే VSEPRT సిద్ధాంతం అంటారు.

ప్రశ్న 7.
సంకరీకరణం (Hybridization) అనగానేమి?
జవాబు:
పరమాణువుల చివరి కక్ష్యలో ఉండే దాదాపు సమానశక్తి కలిగిన పరమాణు ఆర్బిటాళ్ళు పరస్పరం కలిసిపోయి, పునర్వ్యవస్థీకరించబడటం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం వంటి ధర్మాలు ఒకే విధంగా ఉండే సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరచే దృగ్విషయాన్ని సంకరీకరణం అంటారు.

ప్రశ్న 8.
Cl అయాను, Cl పరమాణువు కంటే స్థిరమైనది. ఎందువల్ల?
జవాబు:
ns²np6 ఎలక్ట్రాన్ విన్యాసం గల పరమాణువు లేదా అయాను స్థిరమైనది. Cl కు స్థిర ఎలక్ట్రాను విన్యాసం కలదు.
Cl (Z = 17) ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p63s² 3p5
Cl ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s² 3p6
అందువల్ల Cl కన్నా Cl అయాను స్థిరమైనది.

ప్రశ్న 9.
‘లోహధర్మం ‘ లేదా ‘ధన విద్యుదాత్మకత’ అనగానేమి?
జవాబు:
లోహ మూలకాలు తమ బాహ్య కక్ష్య నుండి ఎలక్ట్రాన్లను కోల్పోయి, అష్టక విన్యాసం పొందటానికి ప్రయత్నిస్తాయి. ఈ విధమైన స్వభావాన్నే ‘లోహధర్మం’ లేదా ‘ధన విద్యుదాత్మకత’ అంటారు.

ప్రశ్న 10.
VSEPRT సిద్ధాంతం ప్రకారం, బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య, అణువు ఆకృతి గురించి వివరించండి.
జవాబు:

బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య అణువు ఆకృతి
2 రేఖీయం
3 సమతల త్రిభుజం
4 టెట్రా హైడ్రల్
5 ట్రైగోనల్ బై పిరమిడల్
6 ఆక్టా హైడ్రల్
7 పెంటాగోనల్ బై పిరమిడల్

ప్రశ్న 11.
లూయిస్ చుక్కల నిర్మాణం అనగానేమి?
జవాబు:
పరమాణు కేంద్రకాన్ని లోపలి కక్ష్యలోని ఎలక్ట్రాన్లను ఆ మూలకం యొక్క గుర్తు ద్వారా మరియు పరమాణు బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్లను చుక్కలు (⋅) లేదా గుణకారపు గుర్తు (×)తో సూచిస్తారు. దీనినే లూయిస్ చుక్కల నిర్మాణం అంటాం.
ఉదా : Nax
దీనిలో Na అనేది సోడియం పరమాణు కేంద్రకం మరియు దాని పైనున్న గుణకారపు గుర్తు (×), సోడియం యొక్క వేలన్సీలోనున్న ఎలక్ట్రానుల సంఖ్యను తెలియజేస్తుంది.

ప్రశ్న 12.
అయనీకరణము అనగానేమి? ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:

  1. ఒక పరమాణువు నుండి ఎలక్ట్రాన్ (ల)ను తొలగించు ప్రక్రియను అయనీకరణము అందురు.
    ఉదా : Na → Na+ + e
  2. ఒక అయానిక పదార్థం సరియైన ద్రావణిలో, దాని అంశీభూత అణువులుగా విడిపోయే ప్రక్రియను అయనీకరణము అంటారు.
    ఉదా : NaCl(జ.ద్రా.) → Na+ + Cl

ప్రశ్న 13.
HCl అణువు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
H పరమాణువులో ఒంటరి ఎలక్ట్రాన్ ను కలిగి ఉన్న ‘1s’ ఆర్బిటాల్, క్లోరిన్ పరమాణువులో వ్యతిరేక స్పినను కలిగి ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ ను కలిగి ఉన్న ‘3p’ ఆర్బిటాల్ తో అతిపాతం చెంది HCl అణువును ఏర్పరుస్తాయి.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 7

ప్రశ్న 14.
కొన్ని అణువులు వాటి బంధకోణాలు, ఆకృతులు పట్టిక రూపంలో రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 8

10th Class Physics 8th Lesson రసాయన బంధం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
త్రిబంధం గురించి వివరించండి.
(లేదా)
వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ? ఈ సిద్ధాంత ఆధారంగా N, అణువు ఏర్పడు విధానం వివరించండి.
జవాబు:
వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని “లైనస్ పౌలింగ్” ప్రతిపాదించారు.

N2 అణువు ఏర్పడుట :

  1. 7N యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం (z = 7) = 1s²2s² 2px¹2py¹ 2pz¹
  2. ఒక నైట్రోజన్ పరమాణువులోని ‘Px‘ ఆర్బిటాల్, వేరొక నైట్రోజన్ పరమాణువులోని ‘Px‘ ఆర్బిటాల్ తో అతిపాతం చెందటం ద్వారా సిగ్మా (σ) px – px బంధం ఏర్పడుతుంది.
  3. నైట్రోజన్ పరమాణువులో మిగిలిన py మరియు pz ఆర్బిటాళ్ళు వేరొక నైట్రోజన్ పరమాణువులోని py, pz ఆర్బిటాళ్ళతో పార్శ్వ అతిపాతం చెంది రెండు పై (π) (py – pz మరియు pz – pz) బంధాలను ఏర్పరుస్తాయి.
  4. ఈ విధంగా N2 అణువులోని రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య ఒకటి సిగ్మా(σ), రెండు పై (π) బంధాలు ఏర్పడుతాయి. మొత్తం 3 బంధాలు ఏర్పడుట వలన N2 అణువులో “త్రి బంధం” ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 9

ప్రశ్న 2.
వేలన్సీ బంధ సిద్ధాంతం ద్వారా BF3 అణువు ఏర్పడు విధానాన్ని వివరించండి.
జవాబు:

  1. బోరాన్ పరమాణుసంఖ్య 5. ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p¹.
  2. ఉత్తేజ స్థితిలో బోరాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s¹ 2px¹ 2py¹.
  3. బోరాన్లోని 2s, 2px, 2py, ఆర్బిటాళ్ళు కలిసి మూడు sp² సంకర ఆర్బిటాళ్ళను ఏర్పరచును. ఇవి బంధంలో పాల్గొంటాయి.
  4. ఫ్లోరిన్ పరమాణు సంఖ్య 9. ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p5.
  5. ఫ్లోరిన్ లోని 2pz ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్ బంధంలో పాల్గొంటుంది.
  6. బోరాన్ లోని మూడు sp² సంకర ఆర్బిటాళ్ళతో మూడు ఫ్లోరిన్ పరమాణువులలోని 2p, ఆర్బిటాల్ లోని ఒంటరి ఎలక్ట్రాన్లు జతకూడి మూడు సిగ్మా బంధాలు ఏర్పరుస్తాయి. ఈ విధంగా మూడు (σsp²-p) బంధాలతో BF3 అణువు ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
“నైట్రోజన్, హైడ్రోజన్ చర్యనొంది, అమ్మోనియా (NH3) అణువును ఏర్పరుస్తాయి. కార్బన్, హైడ్రోజన్ తో చర్యనొంది మీథేన్ (CH4) అణువును ఏర్పరచును.
పై వాటిలో ప్రతీ చర్యకి సంబంధించి
A) చర్యలో పాల్గొన్న ప్రతి పరమాణువు వేలెన్సీ ఎంత?
B) చర్యలో ఏర్పడిన సమ్మేళనాల యొక్క చుక్కల నిర్మాణం తెల్పండి.
జవాబు:
A) అమ్మోనియాలో : నైట్రోజన్ వేలెన్సీ 3, హైడ్రోజన్ వేలెన్సీ 1
మీథేన్ లో : కార్బన్ వేలెన్సీ 4, హైడ్రోజన్ వేలెన్సీ 1
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 10

ప్రశ్న 4.
అ) సోడియం, ఆక్సిజన్ మరియు మెగ్నీషియంలకు ఎలక్ట్రాన్ బిందు నిర్మాణాలను చూపే పటాలను గీయండి.
జవాబు:
1) సోడియం పరమాణువులో ఒక వేలన్సీ ఎలక్ట్రాన్ ఉన్నది కావున సోడియం యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణం Na x లేక Na⋅
2) ఆక్సిజన్ పరమాణువులో రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి కావున ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణం Oxx లేక O:
3) మెగ్నీషియం పరమాణువులో కూడా రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లుంటాయి కావున మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ బిందు
నిర్మాణం Mgxx లేక Mg:

ఆ) Na2O మరియు MgO ల ఏర్పాటును గురించి పటం రూపంలో చూపండి.
జవాబు:
Na2O
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 11

ప్రశ్న 5.
నీటి యొక్క సాంకేతికం H2O గానే రాస్తాం. HO2 గా ఎందుకు రాయకూడదో తెల్పండి.
జవాబు:

  1. నీటి అణువులో ఆక్సిజన్ పరమాణువు తనకు దగ్గరి జడవాయువైన నియాన్ విన్యాసం పొందుటకు రెండు ఎలక్ట్రానులు అవసరము.
  2. హైడ్రోజన్ పరమాణువు తన దగ్గరి జడవాయువైన హీలియం విన్యాసం పొందుటకు ఒక ఎలక్ట్రాను అవసరం.
  3. ఈ విధంగా రెండు హైడ్రోజన్ (H) పరమాణువులతో, ఒక ఆక్సిజన్ (O) చర్య జరిపి రెండు ఏక సమయోజనీయ బంధాలను ఏర్పరచును. కనుక నీటి యొక్క రసాయన సాంకేతికం H2O గానే వ్రాస్తాము.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 6.
A మరియు B అనే పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా :
1s²2s²2p63s²3p¹; 1s²2s²2p4 అయితే
జవాబు:
పరమాణువు – A యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p63s²3p¹
పరమాణువు – B యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p4

అ) ఏ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది?
జవాబు:
‘A’ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయే అవకాశం కలదు, ‘B’ పరమాణువు ‘2’ ఎలక్ట్రాన్లను స్వీకరించే అవకాశం కలదు. కనుక ‘B’ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది.

ఆ) ఏ పరమాణువు ధన అయానును ఏర్పరుస్తుంది?
జవాబు:
‘A’ పరమాణువు మూడు ఎలక్ట్రానులను కోల్పోవుట వలన ధన అయానుగా మారును.

ఇ) పరమాణువు A వేలెన్సీ ఎంత?
జవాబు:
పరమాణువు ‘A’ యొక్క వేలన్సీ – 3

ఈ) A మరియు B అనే పరమాణువులచే ఏర్పడే సంయోగపదార్థం యొక్క అణుఫార్ములా ఏమిటి?
జవాబు:
క్రిస్ క్రాస్ పద్ధతిన A మరియు B పరమాణువులచే ఏర్పడు సంయోగ పదార్థం యొక్క అణుఫార్ములా – A3B2
ఈ అణుఫార్ములా గల పదార్థం – Al3O2

ప్రశ్న 7.
అయానిక మరియు సమయోజనీయ బంధాల మధ్య భేదాలను రాయుము.
జవాబు:

అయానిక బంధం సమయోజనీయ బంధం
1. ఒక పరమాణువు నుండి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల అయానిక బంధం ఏర్పడును. 1. పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల పంపిణీ వల్ల సమయోజనీయ బంధం ఏర్పడును.
2. స్థిరవిద్యుత్ ఆకర్షణ బలం ఉంటుంది. 2. స్థిర విద్యుదాకర్షణ బలం ఉండదు.
3. అయానిక బంధం వల్ల అయానిక పదార్థాలు ఏర్పడుతాయి. 3. సమయోజనీయ బంధం వల్ల సమయోజనీయ పదార్థాలు ఏర్పడుతాయి.
4. దిశా ధర్మం లేదు. 4. దిశా ధర్మం పాటిస్తుంది.

ప్రశ్న 8.
ద్విబంధం గురించి వివరించండి.
(లేదా)
వేలన్సీ బంధ సిద్ధాంతం ఆధారంగా O2 అణువు ఏర్పడు విధానం వివరించండి.
జవాబు:
ఆక్సిజన్ అణువు (O2) ఏర్పడుట :

  1. 80 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం (z = 8) = 1s²2s²2px²2py¹2pz¹
  2. ఆక్సిజన్ పరమాణువులో ‘py‘ ఆర్బిటాల్, మరొక ఆక్సిజన్ పరమాణువులోని ‘py‘ ఆర్బిటాల్ లో అతిపాతం చెందడం వలన py – py మధ్య సిగ్మా బంధం (σ) ఏర్పడుతుంది.
  3. ఒక ఆక్సిజన్ పరమాణువులో ఉండే pz ఆర్బిటాల్, వేరొక ఆక్సిజన్ పరమాణువులో ఉండే pz ఆర్బిటాల్లో పార్శ్వ అతిపాతం చెందడం వలన pz – pz మధ్య పై (π) బంధం ఏర్పడుతుంది.
  4. ఈ విధంగా O2 అణువులో ఒక సిగ్మా బంధం, ఒక పై బంధం ఏర్పడుతాయి. మొత్తం 2 బంధాలు ఏర్పడుట వలన O2అణువులో ద్విబంధం ఏర్పడును.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 12

ప్రశ్న 9.
A మరియు B అనే పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసాలు వరుసగా :
1s²2s²2p63s²3p¹ ; 1s²2s²2p4 అయితే
అ) ఏ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది?
ఆ) ఏ పరమాణువు ధన అయానును ఏర్పరుస్తుంది?
ఇ) పరమాణువు A వేలెన్సీ ఎంత?
ఈ) A మరియు B అనే పరమాణువులచే ఏర్పడే సంయోగపదార్థం యొక్క అణుఫార్ములా ఏమిటి?
జవాబు:
పరమాణువు – A యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p63s²3p¹
పరమాణువు – B యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము – 1s²2s²2p4

అ) ‘A’ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయే అవకాశం కలదు, ‘B’ పరమాణువు ‘2’ ఎలక్ట్రాన్లను స్వీకరించే అవకాశం కలదు. కనుక ‘B’ పరమాణువు ఋణ అయానును ఏర్పరుస్తుంది.

ఆ) ‘A’ పరమాణువు మూడు ఎలక్ట్రానులను కోల్పోవుట వలన ధన అయానుగా మారును.

ఇ) పరమాణువు ‘A’ యొక్క వేలన్సీ – 3

ఈ) క్రిస్ క్రాస్ పద్ధతిన A మరియు B పరమాణువులచే ఏర్పడు సంయోగ పదార్థం యొక్క అణుఫార్ములా – A3B2
ఈ అణుఫార్ములా గల పదార్థం – Al3O2

10th Class Physics 8th Lesson రసాయన బంధం ½ Mark Important Questions and Answers

1. క్రింది అణువులలో దేనికి sp³ సంకరీకరణం ఉండదు?
(CH4, BF3, NH3, H2O)
జవాబు:
BF3

2. రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడుటకు కారణమైనవి ఏమిటి?
జవాబు:
వేలన్సీ ఎలక్ట్రానులు

3. చర్యాశీలత లేని మూలకాలు గల గ్రూపు ఏది?
జవాబు:
18 (VIIIA)

4. He కి తప్ప, మిగిలిన జడవాయువుల బాహ్య కక్ష్యలో ఎలక్ట్రానుల సంఖ్య ఎంత?
జవాబు:
ఎనిమిది

5.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 13
1) హీలియం వాయువు యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
‘O’ (సున్న)

2) ఆర్గాన్ యొక్క వేలన్సీ కర్పరం ఏమిటి?
జవాబు:
‘M’

3) పైన ఇచ్చిన మూలకాలలో ఏది అష్టక నియమాన్ని పాటించదు? (హీలియం తప్ప).
జవాబు:
ఏదీ లేదు.

4) నియాన్ ఎటువంటి చర్యలలో పాల్గొనును?
జవాబు:
అసలు పాల్గొనదు.

6. లూయిస్ గుర్తుల ప్రకారం ఎలక్ట్రానులను ఎలా సూచిస్తారు?
జవాబు:
చుక్క (⋅) లేదా క్రాస్ గుర్తు (×).

7. ‘X’ అనే పరమాణువుకి ‘స’ వేలన్నీ ఎలక్ట్రానులు కలవు. దీనిని లూయిస్ గుర్తు ప్రకారం ఎలా సూచిస్తారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 14

8. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 15 ఇచ్చిన లూయిస్ చుక్క పటం ప్రకారం Mg యొక్క వేలన్సీని కనుగొనుము.
జవాబు:
‘2’

9. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 16 ఆర్గాన్ యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
‘0’ (సున్న)

10. గ్రూపు – I మూలకం ‘X’ అయిన, దానిని లూయీస్ చుక్క పటం ద్వారా చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 17

11. ‘వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం’ను ప్రతిపాదించిన వారెవ్వరు?
జవాబు:
లూయీస్ మరియు కొస్సెల్

12. “మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్లను మిగిలి ఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి.” ఈ నియమం పేరు ఏమిటి?
జవాబు:
అష్టక నియమం

13. 11Na+ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయుము.
జవాబు:
2, 8 (లేదా) 1s² 2s² 2p6.

14. Mg2+ యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
‘0’

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

15. జతపరుచుము :
a) 8O ( ) i) ఎలక్ట్రాన్లను కోల్పోవును
b) 12Mg ( ) ii) ఎలక్ట్రాన్లను పొందదు, కోల్పోదు
c) 10Ne ( ) iii) ఎలక్ట్రాన్లను పొందును
జవాబు:
a – iii, b-i, c – ii

16. ఏ గ్రూపు మూలకాలు ద్విఋణాత్మక అయాన్లను ప్రదర్శించును?
జవాబు:
VI A

17.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 18
1) ఏకాత్మక ఆనయాన్లను ఇవ్వగల గ్రూపు ఏది?
జవాబు:
VIIA

2) చాల్కోజన్ కుటుంబం ఎన్ని ఎలక్ట్రాన్లను పొందగలదు?
జవాబు:
‘2’

18. వేలన్సీ కర్పరంలో 2 ఎలక్ట్రానులను కలిగి యుండి, అధిక స్థిరత్వం కలిగిన మూలకం ఏది?
జవాబు:
He

19. అయానిక బంధాన్ని ప్రతిపాదించినవారెవరు?
జవాబు:
కొసెల్

20. IA మరియు VIIA గ్రూపు మూలకాల మధ్య ఏర్పడే బంధం ఏ రకమైనది?
జవాబు:
అయానిక బంధం

21. IIA గ్రూపు మూలకాలు ఎటువంటి బంధాలను సులువుగా ఏర్పరచగలవు?
జవాబు:
అయానిక బంధం

22. అయానిక బంధం ఎప్పుడూ వీటి మధ్య ఏర్పడును.
a) రెండు ఒకే పరమాణువుల మధ్య
b) రెండు వేరు వేరు పరమాణువుల మధ్య
c) ‘a’ మరియు ‘b’
d) రెండూ కావు
జవాబు:
b) రెండు వేరు వేరు పరమాణువుల మధ్య

23. అయానిక బంధానికి గల మరొక పేరు రాయుము.
జవాబు:
స్థిర విద్యుత్ బంధం (లేదా) ఎలక్ట్రోవాలెంట్ బంధం.

24. కాటయాన్లు అనగానేమి?
జవాబు:
ధనాత్మక అయాన్లు

25. కాటయాన్లకు ఉదాహరణిమ్ము.
జవాబు:
Na+, Mg2+, Al3+

26. ఋణాత్మక అయాన్లను ఏమందురు?
జవాబు:
ఆనయాన్లు

27. ఆనయాన్లకు ఉదాహరణిమ్ము.
జవాబు:
P3- ; S2- ; Cl

28. ఎలక్ట్రాన్ల బదిలీ వలన ఏర్పడే బంధం ఏది?
జవాబు:
అయానిక బంధం

29. సోడియం క్లోరైడ్ అణువు ఏర్పడు సమీకరణం
జవాబు:
Na(s) + ½ Cl2(g) → NaCl(s)

30. సోడియం కాటయాన్ ఏర్పడు విధం రాయుము.
జవాబు:
11Na → Na+ + e

31. సోడియం క్లోరైడ్ ఏర్పడు విధానాన్ని లూయీస్ చుక్క పటం ద్వారా చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 19

32. మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడునపుడు ఏర్పడే కాటయాన్, ఆనయాన్లు ఏవి?
జవాబు:
Mg2+ (కాటయాన్); Cl(ఆనయాన్)

33. MgCl2 ఏర్పడు విధానాన్ని సూచించు సమీకరణం రాయుము.
జవాబు:
Mg2+ + 2Cl → MgCl2

34. AlCl3 ఏర్పాటులో గల రసాయన బంధం పేరేమిటి?
జవాబు:
అయానిక బంధం

35. MgCl2 ఏర్పాటును సూచించు లూయీస్ చుక్కపటం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 20

36. సోడియం క్లోరైడ్ స్ఫటికంలో ఒక సోడియం చుట్టూ ఎన్ని క్లోరిన్ అయాన్లు ఉంటాయి?
జవాబు:
‘6’

37. NaCl అణు ఆకృతి ఏమిటి?
జవాబు:
ముఖ కేంద్రక స్ఫటిక నిర్మాణం

38. ఒక నిర్దిష్ట ఆవేశం గల అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం గల అయాన్లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను ఏమంటారు?
జవాబు:
సమన్వయ సంఖ్య

39. Nacl లో Na+ యొక్క సమన్వయ సంఖ్య ఎంత?
జవాబు:
‘6’

40. Nacl లో Cl యొక్క సమన్వయ సంఖ్య ఎంత?
జవాబు:
‘6’

41. సాధారణంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాన్నీ ఏమందురు?
a) లోహ ధర్మం
b) ధన విద్యుదాత్మకత
c) a లేదా b
d) అలోహ ధర్మం
జవాబు:
c) a లేదా b

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

42. ధన విద్యుదాత్మకత ధర్మం గల మూలకాలు ఏర్పరచేది?
a) ఆనయాన్
b) కాటయాన్
c) a లేదా b
d) రెండూ కాదు రాయుము.
జవాబు:
b) కాటయాన్

43. ఋణ విద్యుదాత్మకత స్వభావాన్ని ప్రదర్శించే కొన్ని మూలకాలను రాయుము.
జవాబు:
ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్

44. అష్టక విన్యాసం కొరకు ఒక మూలకం ఎలక్ట్రాన్లను గ్రహించే స్వభావాన్ని ఏమంటారు?
జవాబు:
ఋణ విద్యుదాత్మకత

45. రెండు మూలకాలకు చెందిన పరమాణువులు అయానిక బంధంలో పాల్గొనాలంటే వాటి మధ్య ఋణ విద్యుదాత్మకతల మధ్య తేడా ఎంత వుండాలి?
a) 1.9
b) > 1.9
c) a లేదా b
d) <1.9
జవాబు:
c) a లేదా b

46. అయానిక బంధంలో పాల్గొనే పరమాణువులు
a) ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయి
b) ఎలక్ట్రాన్లను కోల్పోతాయి
c) a లేదా b
d) ఎలక్ట్రాన్లను పంచుకుంటాయి.
జవాబు:
c) a లేదా b

47. ఒక మూలకం ఎలక్ట్రాన్లను కోల్పోవడం గానీ, గ్రహించడం గానీ ఈ క్రింది ఏ అంశంపై ఆధారపడదు?
a) పరమాణు పరిమాణం
b) అయనీకరణ శక్మం
c) ఎలక్ట్రాన్ విన్యాసం
d) ఏదీ లేదు
జవాబు:
d) ఏదీ లేదు

48. తక్కువ అయనీకరణ శక్మం, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు ఎక్కువ పరమాణు పరిమాణం గల మూలకాలు వీటిని ఏర్పరుస్తాయి?
a) కాటయాన్లు
b) ఆనయాన్లు
c) a లేదా b
d) రెండూ కావు
జవాబు:
a) కాటయాన్లు

49. అధిక అయనీకరణ శక్మం గల మూలకాలు ఏర్పరచే అయాన్లు ఎటువంటివి?
జవాబు:
ఆనయాన్లు

50. మూలకం X కు తక్కువ అయనీకరణ శక్మం కలదు.
జవాబు:
కాటయాన్

51. సమయోజనీయ బంధాన్ని ప్రతిపాదించిన వారెవరు?
జవాబు:
జి.యన్. లూయీస్ (G.N. Lewis)

52. పరమాణువులు ఒకటి గాని, అంతకన్నా ఎక్కువగాని వాటి వేలన్సీ ఎలక్ట్రానులను మరొక పరమాణువుతో పంచుకొని ఏర్పరచే బంధం ఏమిటి?
జవాబు:
సమయోజనీయ బంధం

53. జతపరుచుము :
a) సమయోజనీయ బంధం ( ) i) ఎలక్ట్రాన్ల పంపకం
b) అయానిక బంధం ( ) ii) ఎలక్ట్రాన్ల పంపిణీ
జవాబు:
a – i, b – ii

54. సమయోజనీయ బంధాలకి ఉదాహరణిమ్ము.
జవాబు:
F2, Cl2, HCl మొదలగునవి.

55. ఫ్లోరిన్ అణువు ఏర్పాటును సూచించు చుక్క పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 21

56. ఆక్సిజన్ అణువు ఏర్పాటును సూచించు చుక్క పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 22

57. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 23
1) F చుట్టూ గల చుక్కలు వేటిని సూచిస్తాయి?
జవాబు:
వేలన్సీ ఎలక్ట్రానులను

2) ఫ్లోరిన్ ఏర్పరచగల ఒక సమయోజనీయ అణువుని రాయుము.
జవాబు:
F2; HF

58. ఆక్సిజన్ అణువులో ఎన్ని బంధాలు కలవు?
జవాబు:
రెండు

59. త్రిబంధం గల ఒక అణువు పేరు రాయుము.
జవాబు:
N2 (N ≡ N)

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

60. CH4 లో ఎన్ని సమయోజనీయ బంధాలు గలవు ?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 24

61. CH4 అణు ఆకృతిని యుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 25

62. అమ్మోనియా అణు ఆకృతిని గీయుము. అయిన అది ఏర్పరచు అయాన్ ఏది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 26

63. అమ్మోనియా అణువులో
a) ఎన్ని ఏకబంధాలు కలవు?
జవాబు:
‘3’

b) ఎన్ని ఒంటరి జత ఎలక్ట్రాన్లు కలవు?
జవాబు:
‘1’

c) H\(\hat{\mathbf{N}}\)H బంధకోణం ఎంత?
జవాబు:
107°48′

64. రెండు ఒంటరి జత ఎలక్ట్రాన్లను కలిగియున్న అణువుకి ఉదాహరణనిమ్ము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 27

65. H2O అణువు లూయీస్ చుక్క పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 28

66. ఒక అణువులో ఒక పరమాణువులు ఏర్పరచు సమయోజనీయ బంధాల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
‘కో-వేలన్సీ’

67. సమయోజనీయ బంధం ఏర్పరచు రెండు పరమాణువుల మధ్య దూరంను ఏమంటారు?
జవాబు:
బంధ దూరం / బంధదైర్ఘ్యం

68. బంధదూరం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
nm (నానోమీటర్) (లేదా) A° (ఆంగ్ స్టాం)

69. రెండు పరమాణువులు గల ఒక అణువులో ఆ పరమాణువులను విడదీయడానికి కావలసిన శక్తిని ఏమందురు?
జవాబు:
బంధ శక్తి (లేదా) బంధవిచ్ఛేదక శక్తి

70. 1 నానోమీటర్
a) 10-8 మీ.
b) 10-9మీ.
c) 10-10మీ.
జవాబు:
b) 10-9మీ.

71. 1 ఆంగ్ సాం
a) 10-9మీ.
b) 10-10మీ.
c) 10-8మీ.
జవాబు:
b) 10-10మీ.

72. Cl\(\hat{\mathbf{Be}}\)Cl లో బంధకోణం ఎంత?
జవాబు:
180°

73. CH4 లో H\(\hat{\mathbf{C}}\)H బంధకోణం ఎంత?
జవాబు:
109°28¹

74. క్రింది వానిని జతపరుచుము.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 29
జవాబు:
a – iii, b – i, c – ii

75. అణు ఆకృతులను వివరించలేకపోయిన సిద్ధాంతం.
a) VSEPRT
b) ఎలక్ట్రాన్ వేలన్సీ సిద్ధాంతం
c) వేలన్సీ బంధ సిద్ధాంతం
జవాబు:
b) ఎలక్ట్రాన్ వేలన్సీ సిద్ధాంతం

76. VSEPRT ని విస్తరించుము.
జవాబు:
Valency – Shell – Electron – Pair – Repulsion – Theory.
(వేలన్సీ- షెల్ – ఎలక్ట్రాన్ – పెయిర్ – రిపల్టన్ – థియరీ)

77. VSEPRT ని ప్రతిపాదించినది ఎవరు?
జవాబు:
సిధ్ధ విక్ మరియు పావెల్ (Sidgwick & Powell)

78. VSEPRT ని అభివృద్ధి చేసినది ఎవరు?
జవాబు:
గిలెస్పీ మరియు నైహామ్ (Gillespie & Nyholm)

79. బంధ జతలు, ఒంటరి జతలు అనే దృగ్విషయం గల సిద్ధాంతం
A) వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం
B) ఎలక్ట్రాన్ బంధ సిద్ధాంతం
C) VSEPRT
D) పైవన్నియు
జవాబు:
C) VSEPRT

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

80. a) బంధ జంట ఎలక్ట్రాన్లు, ఒంటరి జంట ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ వలన అణువులు ఆకృతులు పొందుతాయి.
b) మధ్య పరమాణువు చుట్టూ బంధ జంటల కంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఎక్కువ ఖాళీని ఆక్రమిస్తాయి.
పై వాక్యాలలో ఏ వాక్యం సరైనది?
A) a
B) b
C) a మరియు b
D) రెండూ కావు
జవాబు:
C) a మరియు b

81. జతపరచుము :

ఒంటరి జత ఎలక్ట్రాన్లు లేకుండా బంధకోణం
a) రెండు బంధ జంటలు i) 120°
b) మూడు బంధజంటలు ii) 180°
c) నాలుగు బంధ జంటలు iii) 109°28′

జవాబు:
a – ii, b-i, c – iii

82. CH4 లో బంధకోణం 109°28¹ అయిన ఎన్ని ఒంటరి జత ఎలక్ట్రాన్లు కలవు ?
జవాబు:
సున్న (0)

83. NH3 అణువు ఆకృతి ఏమిటి?
జవాబు:
త్రికోణీయ పిరమిడల్

84.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 30
1) ఇచ్చిన అణువు ఆకృతి ఏమిటి?
జవాబు:
‘V’ లేదా కో ణీయ ఆకృతి

2) ఎన్ని ఒంటరి జంటలు కలవు?
జవాబు:
‘2’

85. VSEPRT యొక్క ఒక పరిమితిని రాయుము.
జవాబు:
బంధశక్తులను వివరించలేదు.

86. వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
జవాబు:
లైనస్ పౌలింగ్

87. పరమాణువుల కేంద్రకాలను కలిపే అంతర కేంద్రక అక్షం వెంబడి ఆర్బిటాళ్ళు అతిపాతం చెందితే ఏర్పడే బంధం
a) సిగ్మా (σ)
b) పై (π)
c) రెండూ
జవాబు:
a) సిగ్మా (σ)

88. ఆర్బిటాళ్ళ పార్శ్వ అతిపాతం వలన ఏర్పడే బంధం ఏది?
జవాబు:
పై (π)

89. A : ‘σ’ బంధం, ‘π’ బంధం కన్నా బలమైనది.
R: ‘σ’ బంధం పార్శ్వ అతిపాతం వలన ఏర్పడును.
a) A మరియు Rలు సరియైనవి
b) A మరియు R లు తప్పు
c) A మాత్రమే ఒప్పు
d) R మాత్రమే ఒప్పు
జవాబు:
c) A మాత్రమే ఒప్పు

90. i) σ బంధం ఏర్పడిన తర్వాత π బంధం ఏర్పడును.
ii) σ బంధం ఉంది అని అంటే π కూడా ఉందని అర్థం సరియైన వాక్యం ఏది?
జవాబు:
(i)

91. H2 అణువులో s – ఆర్బిటాళ్ళ అతిపాతం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 31

92. Cl2 లో p- ఆర్బిటాళ్ళ అతిపాతం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 32

93. HCl లో ఆర్బిటాళ్ల అతిపాతం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 33

94. πpz – pz, πpy – py లు N2 లో కలవు. మరియొక బంధం ఏమి ఉండును?
జవాబు:
σpx – px

95. 4Be లో భూస్థాయిలో ఎన్ని జతకూడని ఎలక్ట్రాన్లు కలవు?
జవాబు:
సున్న (లేవు)

96. సంకర ఆర్బిటాళ్ళలో ఇవి సమానం లేదా ఒకే విధంగా ఉంటాయి.
a) శక్తి
b) ఆకృతి
c) రెండూ
d) రెండూ కావు
జవాబు:
c) రెండూ

97. BeCl2 లో ఎటువంటి సంకరీకరణం జరుగును?
జవాబు:
sp

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

98. BeCl2 లో Be మరియు CI ల మధ్య ఎటువంటి సంకరీకరణ బంధం కలదు?
జవాబు:
σsp – p

99. BF3 లో సంకరీకరణం పేరు ఏమిటి ? ఏది?
జవాబు:
sp²

100. NH3 లో ఒంటరి జత ఎలక్ట్రాన్లు లేకుంటే HNH ఎంత ఉంటుంది?
జవాబు:
109°28¹

101. జతపరుచుము.

ఒంటరి జతలు అణువులు
i) 1 a) BF3
ii) 2 b) NH3
iii) 0 c) H2O

జవాబు:
i – b, ii – c, iii – a

102. H2O లో బంధ కోణాన్ని ప్రభావితం చేసేది
a) ఒంటరి జత – ఒంటరి జత వికర్షణ
b) బంధ జత – బంధ జత వికర్షణ
c) పై రెండూ
d) పై రెండూ కావు
జవాబు:
c) పై రెండూ

103. అయానిక పదార్థానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
NaCl

104. సమయోజనీయ పదార్థానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
C2H6

105. ధృవశీల సమయోజనీయ పదార్థానికి ఒక
ఉదాహరణనిమ్ము.
జవాబు:
HCl

106. A : NaCl నీటిలో కరుగును.
R : ధృవ పదార్థాలు, ధృవ పదార్థాలలో మాత్రమే కరుగును.
A ని R సమర్ధిస్తుందా?
జవాబు:
అవును

107. ‘అయానిక పదార్థాలకి అధిక ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు ఉంటాయి’.
పై సమాచారం ఆధారంగా క్రింది వానిలో ఏది అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది?
a) NaCl
b) HCl
c) C2H6
జవాబు:
a) NaCl

108. 1123X అను మూలకం ‘Y’ అను మూలకంతో అయానిక బంధాన్ని ఏర్పరచగలదు. అయితే Y ఎటువంటి అయాను ఏర్పరుచును?
జవాబు:
ఆనయాన్ (ఋణాత్మక)

109. ‘A’ అనే మూలకం ‘ACl4‘ అనే అణువును ఏర్పరచగలదు. A లో వేలన్సీ ఎలక్ట్రాన్లు ఎన్ని వుండవచ్చును?
జవాబు:
1 లేదా 7

110. ‘X’ అనే వాయువు తప్ప మిగిలిన వాటి వేలన్సీ షెల్ లో అష్టకం ఉంది. కాని ‘X’ స్థిరమైనది. అయిన ‘X’ ఏమిటో ఊహించండి.
జవాబు:
He

111. చివరి కక్ష్యలో ఎలక్ట్రానులు : వేలన్సీ ఎలక్ట్రానులు : : సమయోజనీయ బంధాల సంఖ్య : ?
జవాబు:
కో వేలన్సీ

112. AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 34 ఈ అణువు ఏమిటో ఊహించుము.
జవాబు:
H2O.

113. మీథేన్ అణువులో బంధ కోణం ఎంత?
జవాబు:
109°28¹

114. అమ్మోనియా అణువులో బంధకోణం ఎంత?
జవాబు:
107°48¹

115. సంకరీకరణ ద్వారా ఏర్పడిన బోరాన్ ట్రై ఫ్లోరైడ్ లో ఎటువంటి బంధాలు ఉంటాయి?
జవాబు:
మూడు σsp² – p బంధాలు

116. ఒంటరి జత ఎలక్ట్రాన్లు లేని అణువు ఏది?
A) NH3
B) H2O
C) BF3
D) ఏదీకాదు
జవాబు:
C) BF3

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

117. క్రింది వానిలో సమయోజనీయ బంధం గల అణువు ఏది?
A) NaCl
B) MgCl2
C) BeCl2
D) ఏదీకాదు
జవాబు:
C) BeCl2

118. అతి తక్కువ బంధ దూరం గల అణువు
A) H – H
B ) F – F
C) Br – Br
D) H – Cl
జవాబు:
A) H – H

119. అతి ఎక్కువ బంధశక్తి గల బంధం
A) I – I
B) H -H
C) Cl – Cl
D) H – F
జవాబు:
D) H – F

అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రశ్న 1.
19వ శతాబ్ది చివరిలో లేదా 20వ శతాబ్ది మొదట్లో శాస్త్రవేత్తలు, బంధం ఏర్పడడానికి ఏ బలం అవసరమైనదని భావించారు? దీని ఆధారంగా పరమాణువుల మధ్య బంధం ఏర్పడడాన్ని ఎలా వివరించారు?
జవాబు:
విద్యుదాకర్షణ బలం వల్లనే పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుందని 19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్ది మొదట్లో శాస్త్రవేత్తలు నమ్మేవారు.

  1. పరమాణువులు సాధ్యమైనంత దగ్గరగా వచ్చినపుడు ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు రెండవ పరమాణువులో గల కేంద్రకం యొక్క ఆకర్షణకు లోనవుతాయి.
  2. అదే సమయంలో ఒకే ఆవేశం గల ఎలక్ట్రాన్లు పరస్పర వికర్షణకు, ఒకే ఆవేశం గల కేంద్రకాలు కూడా ‘పరస్పర వికర్షణకు లోనవుతాయి.
  3. పరమాణువుల మధ్య వుండే వికర్షణ / ఆకర్షణ బలాల తీవ్రత బంధం ఏర్పాటును నిర్ణయిస్తుంది.
  4. ఆకర్షణ బలం కన్నా వికర్షణ బలం ఎక్కువైతే ఆ పరమాణువులు సంయోగం చెందవు.
  5. రెండు పరమాణువులు సంయోగం చెందేటప్పుడు కేంద్రకం గాని, అంతరకక్ష్యలో వుండే ఎలక్ట్రానులు గాని ప్రభావానికి గురికావు. కేవలం బాహ్యకక్ష్యలో ఉండే ఎలక్ట్రానులు మాత్రమే ప్రభావితమవుతాయి.
  6. కాబట్టి వేలన్సీ ఎలక్ట్రాన్లు రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడడానికి కారణమౌతాయి.

ప్రశ్న 2.
జడవాయువుల లక్షణాలేవి?
జవాబు:

  1. జడవాయువులు ‘O’ గ్రూపుకు చెందుతాయి. (18 వ గ్రూపు / VIIIA)
  2. హీలియం తప్ప మిగిలిన జడవాయువుల ఎలక్ట్రాన్ విన్యాసం ns² np6.
  3. వీటి బాహ్య కక్ష్య పూర్తిగా నిండి యుండడం వల్ల, మిగిలిన మూలకాలతో పోల్చుకుంటే వీటి చర్యాశీలత శూన్యం.
  4. ఇవి చాలా స్థిరమైనవి. ఇవి ఇతర మూలకాలతో కలిసి గాని వాటితో అవి కలిసిగాని ఇతర సంయోగ పదార్థాలను ఏర్పరచలేవు.

ప్రశ్న 3.
ఏకమాత్ర ధనాత్మక అయాన్, ద్విమాత్ర ధనాత్మక అయాన్, త్రిమాత్రక ధనాత్మక అయాన్లు ఏర్పడే విధానాన్ని ఉదాహరణలతో వివరించుము.
జవాబు:
ఏకమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
IA గ్రూపు మూలకాలు (Li నుండి CS వరకు) వాని పరమాణు బాహ్యకక్ష్య నుండి ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి దానికి సంబంధించిన ఏకమాత్ర ధన్మాతక అయాను ఏర్పరచడం ద్వారా అష్టక విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది.
ఉదా : 11Na → 2, 8, 1; 11Na+ → 2, 8.

ద్విమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
IIA గ్రూపు మూలకాలు (Mg నుండి Ba వరకు) పరమాణువులు రసాయనిక చర్యలలో పాల్గొనేటప్పుడు తమ బాహ్య కక్ష్య నుండి రెండు వేలన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోవడం ద్వారా ద్విమాత్రక ధనాత్మక అయాన్ గా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 12Mg → 2, 8, 2 ; 12Mg+2 → 2, 8.

త్రిమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
IIIA గ్రూపు మూలకాలు మూడు వేలన్సీ ఎలక్ట్రాన్లను కోల్పోయి త్రిమాత్రక ధనాత్మక అయాన్లుగా ఏర్పడటం ద్వారా అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 13Al → 2, 8, 3 ; 13Al3+ → 2, 8.

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

ప్రశ్న 4.
త్రిమాత్ర, ద్విమాత్ర, ఏకమాత్ర ఆనయాన్లు (ఋణాత్మక అయాన్లు) ఏర్పడే విధానాన్ని వివరించుము.
జవాబు:
ఏకమాత్ర ఆనయాన్లు ఏర్పడుట :
VII A గ్రూపు మూలకాల పరమాణువులు రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ ను గ్రహించి, ఏకమాత్ర ఆనయాన్ గా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 9F → 2, 7 ; 9F3- → 2, 8.

ద్విమాత్ర ధనాత్మక అయాన్ ఏర్పడుట :
VI A గ్రూపు మూలకాలు పరమాణువులు రసాయన మార్పుకు లోనయ్యేటప్పుడు రెండు ఎలక్ట్రాన్లను గ్రహించి – ద్విమాత్ర ఆనయాన్లుగా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి.
ఉదా : 8O → 2, 6 ; 8O2- → 2, 8.

త్రిమాత్ర ధనాత్మక అయాన్లు ఏర్పడుట :
V A గ్రూపు మూలకాల పరమాణువులు రసాయన మార్పులకు లోనయ్యేటప్పుడు మూడు ఎలక్ట్రాన్లను గ్రహించి త్రిమాత్రక ఆనయాన్లుగా మారి అష్టక విన్యాసాన్ని పొందుతాయి. .
ఉదా : 7N → 2, 5; 7N3- → 2, 8.

ప్రశ్న 5.
లూయిస్ ప్రకారం కెర్నెల్ అనగానేమి?
జవాబు:
కెర్నెల్ అనగా అంతర కక్ష్యలోని ఎలక్ట్రాన్లను కలిగియున్న కేంద్రకం.

ప్రశ్న 6.
అయానిక బంధాన్ని ఎలక్ట్రోవేలెంట్ బంధం అని ఎందుకంటారు?
జవాబు:
అయానిక బంధం రెండు ఆవేశపూరిత కణాలయిన అయాన్ల మధ్య ఏర్పడడం చేత దీనిని ‘అయానిక బంధం’ అంటారు. ఆనయాన్ల మధ్య పనిచేస్తున్న బలాలు, స్థిర విద్యుదాకర్షణ బలాలు కావడం చేత ఈ బంధాన్ని స్థిర విద్యుత్ బంధం అంటారు. వేలన్సీ భావనను ఎలక్ట్రాన్స్ పరంగా వివరిస్తాం కాబట్టి దీనిని ఎలక్ట్రోవేలెంట్ బంధం అంటారు.

ప్రశ్న 7.
వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతంలోని లోపాలేవి?
జవాబు:
ప్రయోగాత్మకంగా కనుగొనబడిన బంధ దూరాలు, బంధ శక్తులు, విలువలు, పరమాణువులు జంటలుగా మారినపుడు వేరువేరుగా ఉంటాయి. ఈ వివిధ అణువులలో బంధకోణాలు వేరువేరుగా వుండడాన్ని వివరించలేకపోయింది.

10th Class Physics 8th Lesson రసాయన బంధం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. CH4 అణువులో గల σ – బంధాల సంఖ్య …….
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
C) 4

2. H2O అణువు ఆకృతి …………..
A) రేఖీయం
B) V – ఆకృతి
C) త్రికోణీయ ద్వి పిరమిడ్
D) త్రికోణీయ పిరమిడ్
జవాబు:
B) V – ఆకృతి

3. క్రింది వానిలో అష్టక నియమం పాటింపబడని అణువు.
A) O2
B) F2
C) BCl3
D) N2
జవాబు:
C) BCl3

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

4. HCl అణువులో ఉండే బంధం ఏది?
A) అయానిక బంధం
B) ధృవ సమయోజనీయ బంధం
C) అధృవ సమయోజనీయ బంధం
D) ఏదీకాదు
జవాబు:
B) ధృవ సమయోజనీయ బంధం

5. అమ్మోనియా అణువు ఆకృతి
A) రేఖీయం
B) రేఖీయ త్రిభుజం
C) చతుర్ముఖీయ
D) త్రికోణీయ పిరమిడ్
జవాబు:
D) త్రికోణీయ పిరమిడ్

6. కింది వాటిలో అయానిక పదార్థం
A) C2H6
B) HCl
C) NaCl
D) H2
జవాబు:
C) NaCl

7. ‘A’ అనే మూలకం హైడ్రోజన్‌ సంయోగం చెంది AH2 అను పదార్థం ఏర్పడింది. అయిన ‘A’ వేలన్సీ కక్ష్యలోని ఎలక్ట్రాన్ల సంఖ్య సాధారణంగా
A) 2
B) 3
C) 5
D) 8
జవాబు:
A) 2

8. VESPRT సిద్ధాంతం ప్రకారం NH3లో బంధకోణం 107°48′ ఉండడానికి గల కారణం
A) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల ఆకర్షణ
B) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ
C) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల ఆకర్షణ సమానంగా ఉండడం
D) బంధ ఎలక్ట్రాన్ జంటల వికర్షణ అధికంగా ఉండడం వలన
జవాబు:
B) బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల వికర్షణ

9. ‘X’ అను సమ్మేళనం యొక్క ఆక్సెడ్ XO. క్రింది వాటిలో ‘X’ ఏ సమ్మేళనాన్ని ఏర్పరచదు?
A) X(NO3)2
B) X(SO4)8
C) XCl2
D) X3N2
జవాబు:
B) X(SO4)8

10. క్రింది వానిలో అధిక స్థిరత్వం కలది.
A) Li
B) Be
C) F
D) Ne
జవాబు:
D) Ne

11. వాక్యం 1 : VSEPR సిద్ధాంతాన్ని సిద్ధివిక్, పావెల్ ప్రతిపాదించారు.
వాక్యం 2 : VSEPR సిద్ధాంతాన్ని సివిక్, గిలెస్పీ అభివృద్ధి పరచారు.
A) 1, 2 రెండూ సరియైన వాక్యములు.
B) వాక్యం 1 మాత్రమే సరియైనది.
C) వాక్యం 2 మాత్రమే సరియైనది.
D) రెండు వాక్యములు సరియైనవి కావు.
జవాబు:
B) వాక్యం 1 మాత్రమే సరియైనది.

12. క్రింది వానిలో సరియగు జత ………..
A) BeCl2 – బంధకోణం 120°
B) BF3 – బంధకోణం 180°
C) NH3 – బంధకోణం 104°27′
D) CH4 – బంధకోణం 109°28′
జవాబు:
D) CH4 – బంధకోణం 109°28′

13. C2H4 అణువులోని ‘π’ బంధాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1

AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం

14. క్రింది వాటిలో అయానిక బంధం గల సంయోగ పదార్థం
A) H2O
B) NH
C) MgO
D) HCl
జవాబు:
B) NH

మీకు తెలుసా?

డేవి ప్రయోగం :
లండన్ లోని రాయల్ ఇనిస్టిట్యూట్ లో హంఫ్రిడేవి (1778-1819) అనే రసాయన శాస్త్రవేత్త, 250 లోహపు పలకలతో ఒక బ్యాటరీని నిర్మించాడు. బ్యాటరీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఉపయోగించి లవణ ద్రావణాల నుండి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా అధిక చర్యాశీలత గల మూలకాలైన పొటాషియం, సోడియంలను ఇతను రాబట్టాడు.
AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 35 AP 10th Class Physical Science Important Questions 8th Lesson రసాయన బంధం 36

ఈ ప్రయోగంలో సంయోగ పదార్థం (లవణ ద్రావణం) లోని లోహ భాగం ఋణధృవం వైపు, ఆలోహభాగం ధనధృవంవైపు కదలడాన్ని గమనించాడు. దీని ఆధారంగా లోహాలు ధనాత్మకమైనవని, లోహలు ఋణాత్మకమైనవని ఈ రెండు కూడా సంయోగ పదార్థంలో విద్యుదాకర్షణ బలంచే బంధించబడి ఉంటాయని అతను ప్రతిపాదించాడు.

ఈ వివరణల ఆధారంగా NaCl, KCI వంటి సంయోగపదార్థాలలోని రసాయనబంధాలను కొంతవరకూ వివరించగలిగినప్పటికీ, కర్బన సమ్మేళనాలలో, ద్విపరమాణుక అణువులలో ఉండే బంధాలను వివరించలేకపోయాడు.

ఒక లోహ పరమాణువు దాని వాలన్సీ కక్ష్యనుండి కోల్పోయే ఎలక్ట్రాన్ల సంఖ్య దాని గ్రూప్ సంఖ్యకు సమానం.
ఉదా : సోడియం మరియు మెగ్నీషియం వేలన్సీలు వరుసగా 1 మరియు 2. ఇవి వాటి గ్రూప్ సంఖ్యలకు సమానం.

అలోహ మూలకం దాని పరమాణువు కోసం గ్రహించే ఎలక్ట్రాన్ల సంఖ్యనే దాని ‘వేలన్సీ’ అంటాం. ఇది (8 – ఆ మూలకం యొక్క గ్రూపు సంఖ్య)కు సమానం అవుతుంది.
ఉదా : క్లోరిన్ వేలెన్సీ (8-7) = 1.

  • 1 ఆంగ్ స్ట్రామ్ 10-10 మీ.లకు సమానం ఆంగ్ స్ట్రామ్ అనేది పొడవుకు ప్రమాణం. దీని విలువ 0.1 నానోమీటర్లకు లేదా 100 పికోమీటర్లకు సమానం.
  • 1 నానోమీటర్ 10-9 మీటర్లకు సమానం.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 7th Lesson Important Questions and Answers మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

10th Class Physics 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
నవీన ఆవర్తన నియమమును వ్రాయుము. (లేదా) మోస్లే ఆవర్తన నియమాన్ని వ్రాయండి.
జవాబు:
మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.

ప్రశ్న 2.
కార్బన్ కుటుంబం అని ఏ గ్రూప్ మూలకాలను అంటారు?
జవాబు:
14 (లేదా) IVA గ్రూపు మూలకాలను కార్బన్ కుటుంబం అంటాము.

ప్రశ్న 3.
ఏ మూలకానికైనా మొదటి అయనీకరణ శక్తి కంటే 2వ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. ఎందుకు?
జవాబు:
1) ఏ మూలకమైనా, అయనీకరణ శక్తిని తీసుకొని, ఎలక్ట్రాన ను కోల్పోయి అయాగా మారుతుంది.
M(g) + IE1 → M+(g) + e
2) ఈ ధనాత్మక అయాన్ కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్యకన్నా ఎక్కువగా ఉండి, చిట్టచివరి ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్లను బలంగా ఆకర్షిస్తుంది. దీని వలన అయాన్ పరిమాణం కూడా తగ్గుతుంది.
3) కాబట్టి, మరొక ఎలక్ట్రాను తీయడానికి ఎక్కువ అయనీకరణ శక్తి అవసరం అవుతుంది.
M+(g) + IE2 → M+2(g) + e
4) కావున మొదటి అయనీకరణ శక్తి కన్నా, రెండవ అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 4.
Ne మరియు Ar పరమాణువులలో పరిమాణపరంగా ఏది పెద్దది? ఎందుకు?
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 1
జవాబు:
Ne మరియు Ar పరమాణువులలో పరిమాణ పరంగా Ar పెద్దది.
కారణం :
గ్రూప్ లో పై నుండి కిందికి కక్ష్యల సంఖ్య పెరుగుతుంది. అంటే క్రొత్త కక్ష్యలు ఏర్పడుతుంటాయి.

ప్రశ్న 5.
డోబర్‌ నీర్ త్రికంకు ఒక ఉదాహరణ వ్రాయమని ఒక ఉపాధ్యాయుడు అడిగాడు. దానికి రాము “Li, Na, Mg” అని వ్రాసాడు. ఈ మూడింటిలో ఏది ఈ త్రికంలోనిది కాదో గుర్తించండి.
జవాబు:
మెగ్నీషియం లేదా (Mg) త్రికంలో లేదు.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 6.
రాబర్ట్ బాయిల్ నియమం ప్రకారం మూలకమును నిర్వచించుము.
జవాబు:
భౌతిక, రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థముగా విభజించలేమో, దానిని మూలకం అంటారు.

ప్రశ్న 7.
డాబరీనర్ త్రికము అనగానేమి?
జవాబు:
ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉన్న మూడేసి మూలకాల సమూహంను త్రికము అంటారు.

ప్రశ్న 8.
డాబరీనర్ త్రిక సిద్ధాంతంను వ్రాయుము.
జవాబు:
ప్రతీ త్రికములో మధ్య మూలకపు పరమాణుభారం, మిగిలిన రెండు మూలకాల పరమాణుభారాల సరాసరికి దాదాపు సమానముగా ఉంటుంది. దీనినే ‘డాబరీనర్ త్రిక సిద్ధాంతం’ అని అంటారు.

ప్రశ్న 9.
మెండలీవ్ ఆవర్తన నియమమును వ్రాయుము.
జవాబు:
మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు.

ప్రశ్న 10.
మెండలీవ్ ఆవర్తన పట్టిక లోపాలను వ్రాయుము.
జవాబు:

  1. అసంగత మూలకాల జతలు.
  2. సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం.

ప్రశ్న 11.
మోస్లే ప్రకారము పరమాణు సంఖ్య అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావేశిత కణాల సంఖ్యను ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు.

ప్రశ్న 12.
గ్రూపులంటే ఏమిటి?
జవాబు:
మూలక పరమాణువుల బాహ్య కక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం ఒకేలా ఉండే మూలకాలన్నీ, ఒకే నిలువు వరుసలో అమర్చబడి ఉంటే, వీటిని గ్రూపులు అంటారు.

ప్రశ్న 13.
పీరియడ్లు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
కక్ష్యల సంఖ్య సమానంగా గల మూలకాలు ఒకే అడ్డు వరుసలో అమర్చబడి పీరియడ్లు ఏర్పడతాయి.

ప్రశ్న 14.
లాంథనైడులు అని వేటినంటారు?
జవాబు:
4f మూలకాలను లాంథనాయిడ్లు లేదా లాంథనైడ్లు అంటారు. (లేదా) మూలకాలు 58Ce నుండి 71Lu వరకు గల మూలకాలు 57La లక్షణాలను ప్రదర్శిస్తాయి. కనుక వీటిని లాంథనైడులు అంటారు.

ప్రశ్న 15.
ఆక్టినైడులు అంటే ఏమిటి?
జవాబు:
5f మూలకాలను ఆక్టినైడ్లు లేదా ఆక్టినాయిడ్లు అంటారు. (లేదా) మూలకాలు 90Th నుండి 103Lr వరకు గల మూలకాలు 89Ac లక్షణాలను ప్రదర్శిస్తాయి. కనుక వీటిని ఆక్టినైడులు అంటారు.

ప్రశ్న 16.
మూలకాలను లోహాలు మరియు అలోహాలుగా ఎలా వర్గీకరించారు?
జవాబు:
మూలకాలను బాహ్యకక్ష్యలో గల ఎలక్ట్రానుల ఆధారముగా వర్గీకరించారు.
లోహాలు :
బాహ్యకక్ష్యలో మూడు లేదా అంతకన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణించారు.

అలోహాలు :
బాహ్యకక్ష్యలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను అలోహాలుగా పరిగణించారు.

ప్రశ్న 17.
సంయోజకత అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటారు.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 18.
పరమాణు వ్యాసార్ధము అంటే ఏమిటి?
జవాబు:
ఘన పదార్థంలోని రెండు ప్రక్కప్రక్క పరమాణువుల కేంద్రకాల మధ్య దూరాన్ని పరమాణు వ్యాసార్ధము అంటారు. (లేక) ఒక పరమాణువు యొక్క కేంద్రకం నుండి వేలన్సీ స్థాయి ఎలక్ట్రాన్లకు మధ్య గల దూరంను పరమాణు వ్యాసార్ధమంటారు.

ప్రశ్న 19.
సమయోజనీయ వ్యాసార్ధము అంటే ఏమిటి?
జవాబు:
సమయోజనీయ బంధాన్ని కలిగి ఉన్న అణువులోని పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని సమయోజనీయ వ్యాసార్ధము అని అంటారు.

ప్రశ్న 20.
పరమాణు వ్యాసార్ధాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు?
జవాబు:
పరమాణు వ్యాసార్ధాన్ని పికోమీటర్లలో కొలుస్తారు.
1pm = 10-12 m

ప్రశ్న 21.
అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం అంటే ఏమిటి?
జవాబు:
వాయుస్థితిలో గల ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్యకక్ష్యలో నుండి చివరి ఎలక్ట్రాన్ ను తీయుటకు కావలసిన శక్తిని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం అంటారు.

ప్రశ్న 22.
ప్రథమ అయనీకరణ శక్తి (IE1) అంటే ఏమిటి?
జవాబు:
వాయుస్థితిలో గల ఒంటరి తటస్థ పరమాణువు యొక్క బాహ్యకక్ష్యలోని చివరి ఒక ఎలక్ట్రాన్ ను తీసివేయుటకు కావలసిన శక్తిని ప్రథమ అయనీకరణ శక్తి (IE1) అంటాము.
M(g) + IE1 → M(g)+ + e

ప్రశ్న 23.
ద్వితీయ అయనీకరణ శక్తి (IE2) అంటే ఏమిటి?
జవాబు:
ఏకమాత్ర ధనావేశమున్న అయాన్ నుండి ఒక ఎలక్ట్రాన ను తీసివేయడానికి కావలసిన శక్తిని రెండవ అయనీకరణ శక్తి (IE2) అంటాము.
M(g)+ + IE2 → M(g)+2 + e

ప్రశ్న 24.
ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏమిటి?
జవాబు:
వాయుస్థితిలో గల ఒంటరి తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ ను గ్రహిస్తే విడుదలగు శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.

ప్రశ్న 25.
మొదటి, రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీలను వ్రాయుము.
జవాబు:

  1. వాయుస్థితిలో గల ఒంటరి తటస్థ పరమాణువుకు మొదటి ఎలక్ట్రాన్ ను చేర్చడం వలన విడుదలైన శక్తిని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.
  2. ఏకమాత్ర ఋణావేశమున్న అయాన్ కు మరొక ఎలక్ట్రాన్ ను చేర్చినపుడు విడుదలైన శక్తిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.

ప్రశ్న 26.
ఋణవిద్యుదాత్మకత అంటే ఏమిటి?
జవాబు:
ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధములో ఉన్నపుడు ఎలక్ట్రాన్లను తనవైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలక ఋణవిద్యుదాత్మకత అంటారు.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 27.
ఋణవిద్యుదాత్మకత పరముగా మిల్లికన్ ప్రతిపాదన ఏమిటి?
జవాబు:
ఒక మూలకం యొక్క ఋణవిద్యుదాత్మకత దాని అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల సగటుగా ప్రతిపాదించాడు.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 2

ప్రశ్న 28.
మూలక కుటుంబం అంటే ఏమిటి?
జవాబు:
మూలకాల సమూహమును మూలక కుటుంబం అంటారు.
ఉదా : క్షార లోహాలు (IA గ్రూపు మూలకాలు)
బోరాన్ కుటుంబం (IIIA గ్రూపు మూలకాలు)

ప్రశ్న 29.
అర్దలోహాలు అనగానేమి?
జవాబు:
లోహాల, అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా ఉన్న ధర్మాలను కలిగియున్న మూలకాలను అర్ధలోహాలు అంటారు.

ప్రశ్న 30.
ఒక గ్రూపులో ఉన్న మూలకాలు ఒకే రసాయన ధర్మాలను ఎందుకు కలిగి ఉంటాయి?
జవాబు:
మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసం, ముఖ్యంగా వేలన్నీ ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా ఉంటాయి. ఒకే గ్రూపులోని మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఒకే గ్రూపులోని మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి.

ప్రశ్న 31.
ఒక పీరియడ్ లోని మూలకాలు ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉండవు. ఎందుకు?
జవాబు:
పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోవుకొలది పరమాణు సంఖ్య ఒక ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. అనగా వేలన్సీలో ఒక కొత్త ఎలక్ట్రాన్ వచ్చి చేరుతుంది. అందువల్ల ఏ రెండు మూలకాలూ ఒకే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండవు. కావున పీరియడ్లోని మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను కలిగి ఉండవు.

ప్రశ్న 32.
ఒక గ్రూపు మరియు పీరియడ్లలో పరమాణు వ్యాసార్ధం ఎలా మారుతుంది?
జవాబు:
గ్రూపులో పైనుండి క్రిందికి పోవుకొలది పరమాణు వ్యాసార్ధం పెరుగుతుంది. పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోవుకొలది పరమాణు వ్యాసార్ధం తగ్గుతుంది.

ప్రశ్న 33.
గ్రూపు మరియు పీరియడ్ లో అయనీకరణ శక్తి ఏ విధంగా మారును?
జవాబు:
అయనీకరణ శక్మం గ్రూపులో పై నుండి క్రిందికి పోవుకొలది తగ్గును మరియు పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోవుకొలది పెరుగును.

ప్రశ్న 34.
గ్రూపు మరియు పీరియలో ఋణవిద్యుదాత్మకత ఎలా మారును?
జవాబు:
గ్రూపు :
గ్రూపులో పై నుండి కిందికి పోవుకొలది ఋణవిద్యుదాత్మకత తగ్గును.

పీరియడ్ :
పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోవుకొలది ఋణవిద్యుదాత్మకత పెరుగును.

ప్రశ్న 35.
ఒక బ్లాకులో ఉంచబడిన మూలకాల కోవకు చెందని మూలకాలకొక ఉదాహరణనిమ్ము.
జవాబు:
1) He : 1s² దీనిని. p-బ్లాకులో ఉంచారు.
2) H : 1s¹ దీనికి నిర్దిష్టమైన స్థలాన్ని సూచించలేదు.

ప్రశ్న 36.
స్క్రీనింగ్ ఫలితం అనగానేమి?
జవాబు:
కేంద్రకానికి, వేలన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్ష్యల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వేలన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీనినే స్క్రీనింగ్ ఫలితము అంటారు.

ప్రశ్న 37.
5వ పీరియడ్లో ఎన్ని మూలకాలు ఉంటాయి? కారణమేమిటి?
జవాబు:
5వ పీరియలో 18 మూలకాలు ఉన్నాయి.

కారణం :
5వ పీరియడ్ లోని మూలకాలు 5s తో మొదలై 5p తో ముగుస్తాయి. అనగా 58, 4d, 5p స్థాయిలు నిండుతాయి. వీటిలో నిండే ఎలక్ట్రాన్ల సంఖ్య 18. కావున 18 మూలకాలు ఉంటాయి.

ప్రశ్న 38.
B, N, Be మరియు 0 మూలకాలను వాటి అయనీకరణ శక్మల ఆరోహణ క్రమంలో అమర్చండి.
జవాబు:
B < Be < 0 < N.

10th Class Physics 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
జడవాయువుల ప్రత్యేక ప్రవృత్తిని మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:

  1. జడవాయువుల ప్రత్యేక ప్రవృత్తిని నేను అభినందిస్తాను. ఎందుకంటే అవి మిగిలిన అన్ని మూలకాల పరమాణువుల మధ్య రసాయన బంధాల ఏర్పాటును వాటి స్థిరత్వాన్ని వివరించటంలో సహాయపడుతాయి.
  2. జడవాయువులు అష్టక విన్యాసంతో స్థిరత్వం కల్గి ఉంటాయి.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 2.
ఒక మూలకం పరమాణు సంఖ్య 35 ఆవర్తన పట్టికలో దాని స్థానం ఎక్కడ ఉంటుంది? ఎందుకు?
జవాబు:
పరమాణు సంఖ్య 35గా గల మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 18,7. ఈ మూలక పరమాణువుకు 7 వేలన్సీ ఎలక్ట్రానులు కలవు. కనుక ఇది 17వ గ్రూపు లేక VII A గ్రూపులో ఉండును. మరియు 4వ పీరియడ్ లోని బ్రోమైన్ మూలకము.

ప్రశ్న 3.
మూలకాలను వర్గీకరించడంలో డాబరీనర్, న్యూలాండ్, మెండలీఫ్ ఎందుకు 100% సఫలీకృతం కాలేకపోయారు? వారి వర్గీకరణం కన్నా నవీన ఆవర్తన పట్టిక సరియైనది, ఎందుకు? కారణాలను ఊహించండి.
జవాబు:

  1. డాబరీనర్ కాలంనాటికి తెలిసిన మూలకాలన్నింటిని త్రికాలుగా అమర్చలేకపోయాడు.
  2. న్యూలాండ్ అష్టక సిద్ధాంతం కేవలం 56 మూలకాలకు మాత్రమే పరిమితమైనది.
  3. మెండలీఫ్ పరమాణుభారం ఆధారంగా మూలకాలను వర్గీకరించాడు. దీనివల్ల ఒకే గ్రూపులో వేరువేరు ధర్మాలున్న మూలకాలు అమర్చవలసి వచ్చింది.
  4. కావున నవీన ఆవర్తన పట్టిక ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా. అమర్చడం వలన గ్రూపులు మరియు పీరియడ్స్ అమరిక సరిగా జరిగింది. అంతేగాక భవిష్యత్ లో కనుగొనబోయే మూలకాలకు కూడ స్థానాలు వదిలివేయబడినవి.
    పై కారణాల వల్ల నవీన ఆవర్తన పట్టిక డాబరీనర్, న్యూలాండ్, మెండలీఫ్ల వర్గీకరణల కన్నా సరియైనది.

ప్రశ్న 4.
ఇచ్చిన ఎలక్ట్రాన్ విన్యాసాలను పరిశీలించి, ఆ మూలకాల గ్రూప్ ల మరియు పీరియడ్ల సంఖ్యలను రాయండి.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 3
జవాబు:
a) 3వ పీరియడ్, 1వ గ్రూపు.
b) 3వ పీరియడ్, 15వ గ్రూపు.

ప్రశ్న 5.
క్రింది ఫట్టికలో ఇచ్చిన సమాచారంను పరిశీలించి, పట్టిక క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 4
i) పై పట్టికలో S-బ్లాక్ మూలకాలు ఏవి?
ii) పై పట్టికలోని ‘p’ బ్లాక్ మూలకాలు, ‘d’ బ్లాక్ మూలకాలను రాయండి.
జవాబు:
i) s – బ్లాకు మూలకాలు : Na, Ca
ii) p- బ్లాకు మూలకాలు : C, P
d- బ్లాకు మూలకాలు : Ti, Ni.

ప్రశ్న 6.
ఒక మూలకం పరమాణు సంఖ్య 17. ఆ మూలకం స్థానం ఆవర్తన పట్టికలో ఎక్కడ ఉంటుందని ఊహిస్తున్నావు? ఎందుకు?
జవాబు:

  1. ఇచ్చిన మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసము 1s²2s²2p63s²3p5.
  2. మూలకం 3వ పీరియడ్, 17వ గ్రూప్ కు చెందినది.
  3. 3s² 3p5 వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసము వల్ల ఇది 17వ గ్రూప్, 3వ పీరియడ్ కు చెందుతుంది.

ప్రశ్న 7.
క్రింది జతలలో ప్రతి దానిలోను దేని పరిమాణం రెండవ దానితో పోలిస్తే పెద్దదో ఊహించండి, వివరించండి.
(X) Na, Al (Y) Na, Mg+2
జవాబు:
(X) : Na పరిమాణం పెద్దదిగా ఉంటుంది.
వివరణ : పీరియడ్ లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం తగ్గుతుంది.

(Y) : Na పరిమాణం పెద్దదిగా ఉంటుంది.
వివరణ : Mg కన్నా Na పెద్దది.
Mg+2 కన్నా Mg పెద్దది.
కావున Na, Mg+2 కన్నా పెద్దది.

ప్రశ్న 8.
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 5
1) వ్యాలెన్సీ ‘2’ గల మూలకం పేరు రాయండి.
2) 3వ పీరియడ్, VA గ్రూపుకు చెందిన మూలకం పేరు రాయండి.
జవాబు:

  1. కాల్షియం (లేదా) Ca
  2. పాస్ఫరస్ (లేదా) P

ప్రశ్న 9.
డాబరీనర్ సిద్ధాంతపు పరిమితులను వ్రాయుము.
జవాబు:

  1. డాబరీనర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేకపోయాడు.
  2. ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులున్న మూలకాలకు వర్తించదు.
  3. పరమాణు ద్రవ్యరాశిని కచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం కచ్చితమైనదిగా నిలువలేకపోయింది.

ప్రశ్న 10.
న్యూలాండ్స్ అష్టక నియమమును వ్రాయుము.
జవాబు:
మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమములో అమర్చినపుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధులలో పున వుతాయి.
(లేదా)
మూలకాలను పరమాణుభారాల ఆరోహణ క్రమములో అమర్చినపుడు ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతీ ఎనిమిదవ మూలకము ధర్మాలు మొదటి మూలక ధర్మాలను పోలి ఉంటాయి.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 11.
న్యూలాండ్స్ అష్టక నియమపు పరిమితులు వ్రాయుము.
జవాబు:

  1. న్యూలాండ్స్ ఒకే గడిలో రెండు మూలకాలను పొందుపరిచాడు.
    ఉదా : కోబాల్ట్, నికెల్.
  2. పూర్తిగా భిన్నమైన ధర్మాలు కలిగిన కొన్ని మూలకాలను ఒకే గ్రూపులో అమర్చాడు.
  3. కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు ఇది వర్తించదు.
  4. ఈ నియమము 56 మూలకాల వరకు మాత్రమే పరిమితమైనది.

ప్రశ్న 12.
అయనీకరణ శక్తి ఆధారపడు అంశాలను వ్రాయుము.
జవాబు:
అయనీకరణ శక్తి క్రింది అంశాలపై ఆధారపడును.

  1. కేంద్రక ఆవేశం
  2. స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితము
  3. ఆర్బిటాళ్ళు చొచ్చుకుపోయే స్వభావం
  4. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసము
  5. పరమాణు వ్యాసార్ధము

ప్రశ్న 13.
మెండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క పరిమితులేవి?
జవాబు:
అసంగత మూలకాల జతలు :
అధిక పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలు, అల్ప పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలకు ముందు ఉన్నాయి.

సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం :
విభిన్న ధర్మాలు గల మూలకాలను ఒకే గ్రూపులో, ఉపగ్రూపు A మరియు B లలో ఉంచారు.

10th Class Physics 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
అయనీకరణ శక్తి అనగానేమి? అయనీకరణ శక్తిని ప్రభావితం చేసిన అంశాలను వివరించండి.
(లేదా)
అయనీకరణ శక్మమును నిర్వచించి, అది ఏఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో వివరించండి.
జవాబు:
అయనీకరణ శక్తి (అయనీకరణ శక్మం) :
ఏదైనా మూలక పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు దానికి తగినంత శక్తిని అందజేసి బాహ్యకక్ష్యలో నుండి చివరి ఎలక్ట్రాన్ ను పరమాణువు నుండి తీసివేయడానికి కావలసిన కనీస శక్తిని “అయనీకరణ శక్తి” అంటాం.

అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు (ఆధారపడే అంశాలు) :
1) కేంద్రక ఆవేశం :
కేంద్రకంలో ఆవేశం ఎక్కువ ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది.
ఉదా : 11Na, 17Cl లలో సోడియంతో పోల్చినపుడు క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ.

2) స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం :
కేంద్రకానికీ, వేలన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్ష్యల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువలన వేలన్సీ ఎలక్ట్రాన్ల పై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీనినే “స్క్రీనింగ్ ఫలితం” లేదా “పరివేశిక ప్రభావం” అంటారు.
– ఈ ఫలితం పెరిగితే అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
ఉదా : 3Li తో పోల్చితే 55CS నందు కక్ష్యల సంఖ్య ఎక్కువ కావున, Li కన్నా CS అయనీకరణ శక్తి తక్కువ.

3) ఆర్బిటాల్ చొచ్చుకుపోయే స్వభావం :
ఒకే ప్రధాన కక్ష్యలో ఉండే ఆర్బిటాల్ లో కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావం వేర్వేరుగా ఉంటుంది.
ఉదా : నాలుగో క్యలో ఈ స్వభావం 4s>4p>4d>4f కావున. 4s కన్నా 4f నుండి ఎలక్ట్రాన్లను సులభంగా తొలగించవచ్చును.

4) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం :
ఏదైనా పరమాణువులో ఆర్బిటాళ్ళు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని “స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం” అంటాం. ఇలా పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాళ్ళు గల పరమాణువుల నుండి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అధిక శక్తి అవసరమవుతుంది.
ఉదా : ఆక్సిజన్ ఎలక్ట్రాన్ విన్యాసం (z = 8) : 1s²2s²2p4
నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం (z = 7) : 1s²2s²2p³

ఆక్సిజన్ తో పోల్చినపుడు, నైట్రోజన్లో సగం నిండిన ఆర్బిటాళ్ళు ఉన్నాయి. కాబట్టి నైట్రోజన్ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ.

5) పరమాణు వ్యాసార్ధం :
పరమాణు వ్యాసార్ధం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
ఉదా : ఫ్లోరిన్ అయనీకరణ శక్తి విలువ అయోడిన్ కన్నా ఎక్కువ. అలాగే సోడియం అయనీకరణ శక్తి విలువ సీసియం కన్నా ఎక్కువ.

ప్రశ్న 2.
విస్తృత ఆవర్తన పట్టికలోని ఒక సంక్లిష్ట పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు ఎడమ నుండి కుడివైపుకు క్రమ పద్ధతిలో ఇవ్వబడినాయి.
Li, Be, B, C, N, F, Ne
క్రింది ప్రశ్నలకు జవాబులివ్వండి.
i) పై మూలకాలు ఆవర్తన పట్టికలో ఏ పీరియడ్ కు చెందినవి?
ii) పైన పేర్కొన్న పీరియడ్ లో విస్మరించబడిన మూలకం ఏది? అది ఉండవలసిన స్థానం ఏది?
iii) పై వాటిలో హాలోజన్ కుటుంబానికి చెందిన మూలకం ఏది? దాని ఋణ విద్యుదాత్మకత విలువ ఎంత?
iv)ఈ పీరియడ్ లో లోహ ధర్మం ఎలా మారుచున్నది?
జవాబు:
i) 2వ పీరియడకు చెందినవి
ii) ఆక్సిజన్ (O) అది ఉండవలసిన స్థానం నైట్రోజన్ (N) మరియు ఫ్లోరిన్ (F) ల మధ్యలో ఉండును.
iii) ఫ్లోరిన్ (F) దీని ఋణ విద్యుదాత్మకత : 4.0
iv)పీరియలో ఎడమ నుండి కుడికి లోహ ధర్మం తగ్గును.

ప్రశ్న 3.
క్రింది పట్టికలో 18వ గ్రూపుకు చెందిన మూలకాలలో వివిధ కర్పరాలలో పంపిణీ అయిన ఎలక్ట్రాన్ల సంఖ్య చూపబడినది.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 6
క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
i) పై మూలకాల సామాన్య ఎలక్ట్రాన్ విన్యాసం వ్రాయండి. (He తప్ప).
ii) “ఆర్గాన్” యొక్క సంయోజకత ఎంత?
iii) “నియాన్” మూలక పరమాణువును లూయీ చుక్కల నిర్మాణంగా చూపండి.
iv) పై మూలకాలు రసాయన బంధాలను ఏర్పరచవు. ఎందుకు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 7
iv) బాహ్య కర్పరంలో ‘8’ ఎలక్ట్రాన్లను కలిగి ఉండుట (He తప్ప) చే స్థిరత్వాన్ని పొందుతాయి.

ప్రశ్న 4.
కింది పట్టికలో కొన్ని మూలక కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఇవ్వబడింది. దీని ఆధారంగా మిగిలిన ఖాళీ గడులలో సమాచారాన్ని పూరించండి.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 8
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 9

ప్రశ్న 5.
ఆవర్తన పట్టికలో ఒకే పీరియడ్ కు చెందిన 1వ గ్రూపు మూలకం Y మరియు 2వ గ్రూపు మూలకం Y. కింద తెలిపిన అంశాల పరంగా X, Y మూలకాలను పోల్చండి.
i) బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య
ii) వాటి పరమాణు పరిమాణం మరియు సంయోజకతలు
iii) వాటి అయనీకరణ శక్మం మరియు లోహ లక్షణం
iv) వాటి క్లోరైడ్, సల్ఫేట్ సాంకేతికాలు
జవాబు:
i) X యొక్క బాహ్యకక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య = 1
Y యొక్క బాహ్యకక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య = 2

ii) X కన్నా Y.పరమాణు పరిమాణం తక్కువ
X యొక్క సంయోజకత = 1
Y యొక్క సంయోజకత = 2

iii) X కన్నా Y యొక్క అయనీకరణం శక్మం విలువ ఎక్కువ
Xకు Y కన్నా లోహ లక్షణం అధికంగా ఉంటుంది.

iv) X యొక్క క్లోరైడ్ …. XCl
Y యొక్క క్లోరైడ్ …. YCl2
X యొక్క సల్ఫేట్…. X2SO4
Y యొక్క సల్ఫేట్ …. YSO4

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 6.
ఎలక్ట్రాన్ ఎఫినిటీ (ఎలక్ట్రాన్ స్వీకరణ ఎంథాల్పీ) పై ప్రభావం చూపే అంశాలలో ఏవేని నాలుగింటిని వివరించండి.
జవాబు:
ఎలక్ట్రాన్ ఎఫినిటిపై ప్రభావం చూపే అంశాలు

i. కేంద్రక ఆవేశం :
కేంద్రక ఆవేశం పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ పెరుగుతుంది. కేంద్రక ఆవేశం తగ్గితే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ తగ్గుతుంది.

ii. స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం :
షీల్డింగ్ ఫలితం విలువ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ తగ్గుతుంది. షీల్డింగ్ ఫలితం విలువ తగ్గితే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ పెరుగుతుంది.

iii. ఆర్బిటాళ్ళు చొచ్చుకు పోయే సామర్థ్యం :
ఆర్బిటాళ్ళు చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ ఎక్కువ చొచ్చుకుపోయే సామర్థ్యం తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ తక్కువ.

iv. సిద్ధమైన ఎలక్ట్రాన్ విన్యాసం :
స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ తగ్గుతుంది.

v. పరమాణు వ్యాసార్ధం :
పరమాణు వ్యాసార్ధం పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువ తగ్గుతుంది. వ్యాసార్ధం తగ్గితే ఎలక్రాన్ ఎఫినిటి విలువ పెరుగుతుంది.

vi. లోహ స్వభావం :
లోహ స్వభావం పెరుగుతుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలు తగ్గుతాయి.

vii. అలోహ స్వభావం :
అలోహ స్వభావం పెరుగుతుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటి విలువలు పెరుగుతాయి.

ప్రశ్న 7.
నవీన ఆవర్తన పట్టికలో గ్రూపులు, పీరియడ్ లో మూలకాలను ఎలా అమర్చినారు? ఒకే గ్రూపులోని మూలకాలు వాని ధర్మాలలో సారూప్యతను ప్రదర్శిస్తాయి కానీ ఒకే పీరియడులోని మూలకాలు వాటి ధర్మాలలో సారూప్యతను ప్రదర్శించవు. దీనికి కారణం రాయండి.
జవాబు:

  • నవీన ఆవర్తన పట్టికలో గ్రూపులను, పీరియడ్లను ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా అమర్చడం జరిగింది.
  • మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి బాహ్యకక్ష్య విన్యాసముతో సంబంధం కలిగి ఉంటాయి.
  • ఒకే గ్రూపులో ఉన్న మూలక పరమాణువులు ఒకే బాహ్యకక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం కల్గి ఉంటాయి.
  • కావున ఆవర్తన పట్టికలోని గ్రూపులో పై నుండి కిందికి పోయే కొద్ది ఆ మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి మరియు వాటి భౌతిక ధర్మాలలో క్రమమైన మార్పు కనిపిస్తుంది.
  • పీరియలలో ఎడమ నుండి కుడికి పోయేకొద్ది మూలకాల పరమాణు సంఖ్య ఒక యూనిట్ చొప్పున పెరుగుతూ ఉంటుంది.
  • అందువల్ల పీరియడ్ లో ఏ రెండు మూలకాల బాహ్యకక్ష్య విన్యాసం ఒకేలా ఉండదు.
  • ఈ కారణం చేత పీరియలో, మూలకాల రసాయన ధర్మాలు వేర్వేరుగా ఉంటాయి. కాని భౌతిక ధర్మాలలో క్రమమైన మార్పు కనిపిస్తుంది.

ప్రశ్న 8.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 10
పై సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) పై మూలకాలలో పరమాణు పరిమాణం అత్యధికంగా గల మూలకం ఏది?
జవాబు:
పరమాణు పరిమాణం అత్యధికంగా గల మూలకం K (పొటాషియం).

ii) అయానిక బంధం ఏర్పరచగల ఏవేని రెండు మూలకాల జతలను రాయండి.
జవాబు:
Na, Cl; Mg, Cl మొదలగునవి.

iii) వేలన్సీ 2 గా గల రెండు మూలకాల పేర్లు రాయండి.
జవాబు:
వేలన్సీ 2గా గల మూలకాలు : Be, Mg, Ca, O, S, Se.

iv) 1s² 2s² 2p6 ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకం ఏది?
జవాబు:
ఆక్సిజన్.

ప్రశ్న 9.
క్రింది పట్టికలోని సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 11
1) మెగ్నీషియం యొక్క వేలన్సీ ఎంత?
2) అధిక ధన విద్యుదాత్మకత గల మూలకం ఏది?
3) మూడవ పీరియడ్ కు చెందిన మూలకాల పేర్లు రాయండి.
4) ఒకటవ గ్రూపునకు చెందిన మూలకాల పేర్లు రాయండి.
జవాబు:

  1. మెగ్నీషియం యొక్క వేలన్సీ ‘2’.
  2. అధిక ధన విద్యుదాత్మకత గల మూలకం : పొటాషియం (K).
  3. మూడవ పీరియడ్ కు చెందిన మూలకాలు : సోడియం (Na), మెగ్నీషియం (Mg).
  4. ఒకటవ గ్రూపునకు చెందిన మూలకాలు : సోడియం (Na), పొటాషియం (K).

ప్రశ్న 10.
అయనీకరణ శక్మం ఏయే అంశాల మీద ఆధారపడి ఉంటుందో తెలిపి ఏవేని మూడు (3) అంశాలు వివరించండి.
జవాబు:
అయనీకరణ శక్మం ఆధారపడే అంశాలు :
1. కేంద్రక ఆవేశం, 2. స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం, 3. ఆర్బిటాళ్ళ చొచ్చుకుపోయే స్వభావం, 4. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం, 5. పరమాణు వ్యాసార్ధం.

1. కేంద్రక ఆవేశం :
కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్మం విలువ పెరుగుతుంది.

2. స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం :
స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం పెరిగితే అయనీకరణ శక్మం విలువలు తగ్గుతాయి.

3. ఆర్బిటాళ్ళ చొచ్చుకుపోయే స్వభావం :
ఆర్బిటాళ్ళ చొచ్చుకుపోయే స్వభావం పెరిగితే అయనీకరణ శక్మం విలువలు పెరుగుతాయి.

4. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం :
పరమాణువు స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటే అయనీకరణ శక్మం విలువ ఎక్కువ అవుతుంది.

5. పరమాణు వ్యాసార్థం :
పరమాణు వ్యాసార్థం పెరిగేకొలదీ అయనీకర , శక్మం విలువలు తగ్గుతాయి.

ప్రశ్న 11.
మూలకాల ఆవర్తన పట్టికలో రెండవ పీరియడ్ కు చెందిన కొన్ని మూలకాలు, వాటి పరమాణు వ్యాసార్ధాలు కింద ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించి సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 12
అ) పై మూలకాలను పరమాణు వ్యాసార్ధాల ఆరోహణ క్రమంలో రాయండి.
ఆ) 2వ పీరియడ్ లోని మూలకాలలో జడవాయు విన్యాసానికి దగ్గరగా ఉన్న మూలకం ఏది?
ఇ) ఈ మూలకాలన్నింటిలో బాహ్యకక్ష్య ఏమిటి?
ఈ) బెరీలియం, కార్బన్లలో ఏ మూలకపు పరమాణు పరిమాణం ఎక్కువ? ఎందుకు?
జవాబు:
అ) పరమాణు వ్యాసార్ధాల పరముగా మూలకాల యొక్క ఆరోహణ క్రమము O, N, C, B, Be మరియు Li.
ఆ) లిథియంకు జడవాయువైన హీలియం ఎలక్ట్రాన్ విన్యాసంను కల్గి ఉన్నది.
ఇ) ఇవ్వబడిన మూలకాల యొక్క బాహ్య కర్పరము రెండు.
ఈ) బెరీలియంకు కార్బన్ కంటే ఎక్కువ పరమాణు పరిమాణం కలదు. ఎందుకనగా, ఒక పీరియడ్ లో అడ్డముగా పోవుచున్న పరమాణు సంఖ్య పెరుగును. కావున కేంద్రక ఆవేశం పెరుగును. కార్బన్ కంటే బెరీలియంకు పరమాణు పరిమతం ఎక్కువ.

ప్రశ్న 12.
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 13
పై ఆవర్తన పట్టిక భాగాన్ని ఉపయోగించి, ఈ కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
అ) కనిష్ఠ పరమాణు పరిమాణం కల మూలకం
ఆ) B మరియు E మూలకముల ఎలక్ట్రాన్ విన్యాసాలు రాయండి.
ఇ) Y మూలకం యొక్క భౌతిక, రసాయనిక ధర్మాలతో సారూప్యతను కలిగిన మూలకాలను గుర్తించండి.
ఈ) పట్టికలోని అన్ని మూలకాలను వాటి ఋణ విద్యుదాత్మకత పెరిగే క్రమంలో రాయండి.
జవాబు:
అ) ‘E’ అను మూలకము కనిష్ఠ పరమాణు పరిమాణంను కల్గి ఉన్నది. ఎందుకనగా ఆవర్తన పట్టిక యొక్క పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయేకొలది పరమాణు పరిమాణం కనిష్ఠము.

ఆ) ‘B’ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p63s² 3p¹. కారణమేమనగా ఈ మూలకము 13 వ గ్రూపుకు చెందినది. ఈ గ్రూపు ఎలక్ట్రాన్ విన్యాసము ns² np¹ మరియు ఇది 3 వ పీరియడకు చెందినది. దీని పరమాణు సంఖ్య 13. అదే విధముగా ‘E’ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p+ 3s² 3p4 కారణమేమనగా ఈ మూలకం 16వ గ్రూపుకు చెందినది. దీని సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము ns² np4 మరియు 3 వ పీరియడక్కు చెందినది కావున దీని పరమాణు సంఖ్య 16.

ఇ) పట్టికలో Yకు సమాన భౌతిక మరియు రసాయన ధర్మాలు గల మూలకాలు X మరియు Z. కారణమేమనగా ఇవి 1వ గ్రూపుకు చెందిన మూలకాలు. ఒక గ్రూపులోని మూలకాలన్నీ ఒకే భౌతిక మరియు రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి.

ఈ) Z < Y< X< B < C < D < E.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

ప్రశ్న 13.
ఒక మూలక పరమాణువు A యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 6
అ) A మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎంత?
ఆ) మూలకం A యొక్క పరమాణు పరిమాణం, పరమాణుసంఖ్య 14 గా గల మూలకం యొక్క పరమాణు పరిమాణం కంటే ఎక్కువ ఉంటుందా? తక్కువగా ఉంటుందా? తెలపండి. ఎందుకు?
ఇ) A అనే మూలకం C (6), N(7), Ar (18), 0(8) మూలకాలలో దేనితో రసాయనిక ధర్మాల సారూప్యతను కలిగివుంటుంది? ఎందుకు?
ఈ) మూలకం A తన సమీప జడవాయువు విన్యాసాన్ని ఎలా పొందగలదు?
జవాబు:
ఇచ్చిన మూలక పరమాణువు ‘A’ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2, 8, 6.
అ) ఇవ్వబడిన మూలకం A యొక్క పరమాణు సంఖ్య 16.
పరమాణు సంఖ్య ’16’ గా గల మూలకము సల్ఫర్.

ఆ) పరమాణు సంఖ్య 14గా గల మూలకం సిలికాన్. సల్ఫర్ మూలకము సిలికాన్ కన్నా తక్కువ పరిమాణంను కల్గి ఉండును. ఎందుకనగా పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోవుకొలది పరమాణు వ్యాసార్ధం తగ్గును.

ఇ) ‘A’ అనే మూలకము ఆక్సిజన్ O(8) తో రసాయనిక ధర్మాల సారూప్యతను కల్గి ఉండును. ఎందుకనగా ఆక్సిజన్ మరియు సల్ఫర్లు ఒకే గ్రూపుకు చెందిన మూలకాలు కాబట్టి.

ఈ) మూలకం ‘A’ తన సమీప జడవాయువైన ఆర్గాన్ యొక్క జడవాయువు విన్యాసమును పొందేందుకు రెండు ఎలక్ట్రాన్లను స్వీకరించాలి.

ప్రశ్న 14.
మెండలీవ్ ఆవర్తన పట్టిక ద్వారా రసాయనశాస్త్ర అధ్యయనానికి కలిగిన లాభాలను వివరించండి.
జవాబు:

  1. మెండలీవ్ పాటించిన అసాధారణ ఆలోచనా విధానం, మిగిలిన రసాయన శాస్త్రవేత్తలందరినీ మెండలీవ్ ఆవర్తన పట్టికను అంగీకరించేలా, గుర్తించేలా సహాయపడింది.
  2. మెండలీవ్ ఆవర్తన పట్టికకు, ఆయన ప్రతిపాదించిన ఆవర్తన నియమానికి గొప్ప గుర్తింపు లభించింది.
  3. మెండలీవ్ తన ఆవర్తన పట్టికను పరిచయం చేసే కాలంలో కనీసం ఎలక్ట్రాన్ కూడా కనుగొనబడలేదు.
  4. చెల్లాచెదురుగా ఉన్న వంటశాల వంటి రసాయన శాస్త్ర అధ్యయనానికి ఒక శాస్త్రీయ ఆధారాన్ని అందించింది.
  5. ఇతని గౌరవార్థం 101వ మూలకమునకు “మెండలీవియం” అని పేరు పెట్టారు.

ప్రశ్న 15.
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని ముఖ్యాంశాలను పేర్కొనుము.
జవాబు:
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని ముఖ్యాంశాలు :
గ్రూపులు మరియు ఉపగ్రూపులు :
మెండలీవ్ ఆవర్తన పట్టికలో 8 నిలువు వరుసలున్నాయి. వీటిని ‘గ్రూపులు’ అంటారు. వీటిని I నుండి VIII వరకు రోమన్ సంఖ్యలతో సూచిస్తారు. ప్రతి గ్రూపు A మరియు B అనే రెండు ఉపగ్రూపులుగా విభజించబడినది. ఏదైనా ఉపగ్రూపులోని మూలకాలన్నీ ఒకదానికొకటి రసాయన ధర్మాల్లో దగ్గరి సంబంధముంటుంది.

పీరియడ్లు :
మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను ‘పీరియడ్లు’ అంటారు. వీటిని 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తారు. ఒక పీరియడ్ లోనున్న మూలకాలన్నింటిలో ఒకేరకమైన ధర్మాలు పునరావృతమవుతుంటాయి.

అప్పటివరకు తెలియని మూలకాల ధర్మాలను ఊహించడం :
ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెండలీవ్ కొన్ని మూలకాలు లభ్యం కావడం లేదని గుర్తించి, వాటికోసం పట్టికలో నిర్దిష్ట స్థానాలలో ఖాళీ గడులను వదిలాడు.

పరమాణు ద్రవ్యరాశి సరిచేయడం :
మెండలీవ్ ఆవర్తన పట్టికలో మూలకాలను సరైన స్థానంలో ఉంచడం ద్వారా కొన్ని మూలకాల పరమాణు ద్రవ్యరాశిని సరిచేయుటకు వీలు కలిగింది.

అసంగత శ్రేణులు :
టెలూరియం (Te), అయొడిన్ (I) వంటి కొన్ని అసంగత శ్రేణులను మెండలీవ్ పట్టికలో గమనించవచ్చు.

ప్రశ్న 16.
నవీన ఆవర్తన పట్టికలో పీరియడ్ల నిర్మాణాన్ని వివరించండి.
జవాబు:
ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. ఇవి మొత్తం 7 ఉన్నాయి.
1) ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్ష్యలున్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్ కు చెందుతుంగో తెలియజేస్తుంది.
ఉదా : H, He లలో ఒకే ప్రధానకక్ష్య (K) ఉంటుంది. కావున ఇవి 1వ పీరియడ్ కు చెందుతాయి.

2) ఒక పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య, మూలక పరమాణువుల యొక్క వివిధ కక్ష్యల్లో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది.
ఉదా : మొదటి కక్ష్య (K) లో ఒకే ఉపకక్ష్య (18) ఉన్నది. దీనిలో రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే నింపగలము. కావున మొదటి పీరియడ్లో 2 మూలకాలు మాత్రమే ఉన్నాయి.

3) రెండవ పీరియడ్ రెండవ ప్రధానకక్ష్య (C) తో మొదలవుతుంది. దీనిలో 28, 2p అనే రెండు ఉపకక్ష్యలుంటాయి. వీటిలో 8 ఎలక్ట్రాన్లు నింపవచ్చు. కావున 2వ పీరియడ్లో 8 మూలకాలు ఉంటాయి.

4) ఇదే విధంగా 3, 4, 5 పీరియడ్లలో వరుసగా 8, 18, 18 వంతున మూలకాలు ఉంటాయి.

5) 6వ పీరియడ్ లో 32 మూలకాలు (55Cs నుండి 86Rn) వరకు ఉంటాయి.

6) 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది.

7) 6వ పీరియడకు చెందిన ‘4f ‘ మూలకాలను లాంథనైళ్లు అని, 7వ పీరియడ్కు చెందిన ‘5f ‘ మూలకాలను ఆక్టి లు అని అంటారు. వీటిని ఆవర్తన పట్టికలో విడిగా ఉంచారు.

ప్రశ్న 17.
ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాలను s, p, d, f బ్లాకులుగా ఎలా విభజించారు?
జవాబు:
మూలకం యొక్క పరమాణువులో చిట్టచివరి ఎలక్ట్రాన్ ఏ ఉపకక్ష్యలో చేరుతుందో దానిని ఆధారంగా చేసుకొని మూలకాలను s, p, d, f బ్లాకులుగా వర్గీకరించారు.

  1. సోడియం (Na) ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s¹ దీనిలో చిట్టచివరి ఎలక్ట్రాన్ ‘S’ ఆర్బిటాల్ లో ఉన్నది. కావున ఇది ‘S’ బ్లాకుకు చెందుతుంది.
  2. అదే విధంగా (AI) ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s² 3p¹ ఇది ‘p’ బ్లాకుకు చెందుతుంది.
  3. స్కాండియం (SC) ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s² 3p6 4s² 3d¹. ఇది ‘d’ బ్లాకుకు చెందుతుంది.
  4. సెలెరియం (Ce) ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p6 3s² 3p6 3d10 4s² 4p6 4d10 5s² 5p6 6s² 4f¹. కావున ఇది ‘f ‘ బ్లాకుకు చెందుతుంది.

10th Class Physics 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక ½ Mark Important Questions and Answers

1. అధిక మరియు అల్ప ఋణవిద్యుదాత్మకత కలిగిన మూలకాలు వరుసగా
A) ఆక్సిజన్, ఫ్లోరిన్
B) ఫ్లోరిన్, ఆక్సిజన్
C) ఫ్లోరిన్, సీజియం
D) కార్బన్, ఫ్లోరిన్
జవాబు:
C) ఫ్లోరిన్, సీజియం

2. ‘భౌతిక, రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేమో దానిని మూలకం అంటారు’ అని చెప్పిన వారు ఎవరు?
జవాబు:
రాబర్ట్ బాయిల్

3. మొట్టమొదటగా మూలకాలను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
డాబరీనర్

4. డాబర్ నీర్ మూలకాల వర్గీకరణలో ఒక సమూహంలో ఉండే మూలకాలు ఎన్ని?
జవాబు:
మూడు

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

5. డాబర్ నీర్ వర్గీకరించిన మూలకాల సమూహాలను ఏమందురు?
జవాబు:
త్రికములు

6. ఊబర్ నీర్ త్రికములకు ఉదాహరణ ఇమ్ము.
జవాబు:

  1. లిథియం-సోడియం-పొటాషియం (Li – Na – K)
  2. కాల్షియం -స్ట్రాన్షియం -బేరియం (Ca – Sr- Ba)
  3. క్లోరిన్-బ్రోమిన్-అయోడిన్ (Cl – Br – I)
  4. సల్ఫర్ – సెలీనియం-టెలూరియం (S – Se – Te)
  5. మాంగనీస్-క్రోమియం -ఇనుము (Mn – Cr – Fe)

7. మూలకాలను త్రికములుగా వర్గీకరించినవారు
A) న్యూలాండ్స్
B) డాబరీనర్
C) బాయిల్
D) మోస్లే
జవాబు:
B) డాబరీనర్

8. డాబరనీర్ త్రికములో మొదటి, చివరి మూలకాల పరమాణు భారాలు వరుసగా 7 మరియు 39 అయిన, మధ్య మూలకం పరమాణు భారం ఎంత వుంటుందో ఊహించండి.
జవాబు:
23

9. మూలకాలకు మొదటిసారిగా పరమాణు సంఖ్యలను కేటాయించిన వారు ఎవరు?
జవాబు:
న్యూలాండ్స్

10. న్యూలాండ్స్ మూలకాల వర్గీకరణలో అనుసరించిన నియమం ఏమిటి?
జవాబు:
అష్టక నియమం

11. అష్టక నియమం ప్రకారం మొదటి మూలకం మరియు ఎన్నవ మూలకం ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి?
జవాబు:
ఎనిమిదవ

12. న్యూలాండ్స్ ప్రకారం సమానమైన ధర్మాలు గల రెండు మూలకాలు రాయుము.
జవాబు:
ఫ్లోరిన్, క్లోరిన్ లేదా సోడియం , పొటాషియం

13. అష్టక నియమం ఏ మూలకం వరకు సరిగ్గా వర్తిస్తుంది?
జవాబు:
కాల్షియం (Ca)

14. జతపరచుము.
a) ఒకే గడిలో రెండు మూలకాలు గల పట్టిక i) న్యూలాండ్స్
b) ఖాళీ గడులు గల పట్టిక ii) డాబరనీర్
iii) మెండలీవ్
జవాబు:
a – i, b – iii

15. ఎవరి మూలకాల అమరిక పట్టికలో కోబాల్ట్, నికెలు ఒకే గడిలో ఉంచబడినవి?
జవాబు:
న్యూలాండ్స్

16. సంగీత స్వరాలలో ఆవర్తనంతో పోల్చదగినట్లు ఉన్న మూలకాల వర్గీకరణ
A) న్యూలాండ్స్
B) డాబరీనర్
C) మెండలీవ్
జవాబు:
A) న్యూలాండ్స్

17. మెండలీవ్ ఆవర్తన పట్టికలో నిలువు వరుసలు ఎన్ని?
జవాబు:
‘8’

18. మెండలీవ్ గ్రూపులలో మూలకాల సారూప్యతలను దేని ఆధారంగా వివరించడానికి ప్రయత్నించాడు?
జవాబు:
ఉమ్మడి సంయోజకతను

19. మెండలీవ్ ఆవర్తన నియమం రాయుము.
జవాబు:
మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు.

20. మెండలీవ్ ఆవర్తన పట్టికలో పీరియడ్లు ఎన్ని?
జవాబు:
‘7’

21. అప్పటి వరకు తెలియని మూలకాల ధర్మాలను ఊహించిన శాస్త్రవేత్త ఎవరు?
A) న్యూలాండ్స్
B) మెండలీవ్
C) మోస్లే
D) పైవారందరూ
జవాబు:
B) మెండలీవ్

22. మెండలీవ్ ప్రకారం జతపరుచుము.
a) గ్రూపు – 1 ( ) i) R2O3
b) గ్రూపు – 2 ( ) ii) R2O
c) గ్రూపు – 3 ( ) iii) RO
జవాబు:
a – ii, b – iii, c – i

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

23. క్రింది వానిని జతపరుచుము.
a) ఎకా-బోరాన్ ( ) i) గాలియం
b) ఎకా-అల్యూమినియం ( ) ii) స్కాండియం
c) ఎకా-సిలికాన్ ( ) iii)జెర్మేనియం
జవాబు:
a-i, b – ii, c – iii

24. మెండలీవ్ ఇలా చెప్పాడు “నేను దానిని నా అరచేతిలో పట్టుకుంటే కరిగిపోతుంది”. అది ఏ మూలకమో ఊహించండి.
A) స్కాండియం
B) జెర్మేనియం
C) గాలియం
D) సీజియం
జవాబు:
C) గాలియం

25. మెండలీవ్ ఆవర్తన పట్టికలో మూలకాలను సరియైన స్థానంలో ఉంచడం ద్వారా క్రింది మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశిని సరిచేయడం జరిగింది.
a) బెరీలియం
b) ఇండియం
c) బంగారం
d) పైవన్నీ
జవాబు:
d) పైవన్నీ

26. పరమాణు భారాన్ని కనుగొనుటకు మెండలీవ్ అనుసరించిన సూత్రం రాయండి.
జవాబు:
పరమాణు భారం = తుల్యాంక భారం × సంయోజకత

27. ఒక పరమాణువు తుల్యాంక భారం, సంయోజకతలు వరుసగా 4.5, 2 లు. అయిన దాని పరమాణు భారం ఎంత?
జవాబు:
9 (∵ 4.5 x 2)

28. మెండలీవ్ అసంగతశ్రేణికి ఉదాహరణనిమ్ము.
జవాబు:
టెలూరియంను అయోడిన్ కన్నా ముందు ఉంచడం.

29. మెండలీవ్ పేరుపై ఉన్న మూలకం పరమాణు సంఖ్య ఎంత?
జవాబు:
101 (మెండలీవియం)

30. మెండలీవ్ ఆవర్తన పట్టికలోని ఒక పరిమితిని రాయండి.
జవాబు:

  1. అసంగత మూలకాల జతలు (లేదా)
  2. సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం

31. మెండలీవ్ ‘సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం’ అనే పరిమితికి ఉదాహరణనిమ్ము.
జవాబు:
VIIA గ్రూపులో క్లోరిన్ అలోహంను ఉంచడం

32. మో` మూలకాల వర్గీకరణకు ప్రతిపాదించిన పరమాణు ధర్మం ఏది?
జవాబు:
పరమాణు సంఖ్య

33. మెండలీవ్ అసంగత మూలకాలు
A) Be – In – Au
B) Te – I
C) A మరియు B
D) రెండూ కావు
జవాబు:
B) Te – I

34. పరమాణువులో ధనావేశిత కణాల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
పరమాణు సంఖ్య

35. పరమాణు భారం అనే భావన నుండి పరమాణు సంఖ్య ఆవర్తన నియమంను మార్చిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
మోస్లే

36. విస్తృత ఆవర్తన పట్టికను దేని ప్రాతిపదికన నిర్మించారు?
జవాబు:
పరమాణు సంఖ్యలు / ఎలక్ట్రాన్ విన్యాసం

37. విస్తృత ఆవర్తన నియమాన్ని’ రాయుము.
జవాబు:
మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.

38. నవీన ఆవర్తన పట్టికలో గ్రూపులు మరియు పీరియడ్ల సంఖ్య ఎంత?
జవాబు:
గ్రూపులు – 18, పీరియడ్లు – 7

39. మూలకాల ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగే క్రమంలో అమర్చినవి.
A) పీరియడ్లు
B) గ్రూపులు
C) రెండూ
D) రెండూ కావు
జవాబు:
B) గ్రూపులు

40. a) బాహ్యకక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం గ్రూపులలో ఉన్న మూలకాలకి ఒకేలా ఉంటాయి.
b) ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగే క్రమంలో గ్రూపులలో మూలకాలు అమర్చబడ్డాయి.
పై వాక్యంలో ఏది సరియైనది?
జవాబు:
రెండూ (a మరియు b)

41.
D:\AP board\apboardsolutions.guru\VGS CCE Model Question Bank Class 8 Social Science (TM)\Ch 1\AP 8th Class Social Important Questions Chapter 1 పటాల అధ్యయనం – విశ్లేషణ 2.png
ఖాళీ నింపుము.
జవాబు:
d – ఉపకక్ష్య

42. మూలకాల ఆవర్తన పట్టికలో బ్లాలుగా విభజించడానికి ఆధారమైనది
a) పరమాణు పరిమాణం
b) భేదపరిచే ఎలక్ట్రాన్
c) పై రెండూ
d) వేలన్సీ
జవాబు:
b) భేదపరిచే ఎలక్ట్రాన్

43. పీరియాడిక్ టేబుల్ లో గల బ్లాకులు ఎన్ని?
A) 2
B) 4
C) 6
D) 7
జవాబు:
B) 4

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

44. క్రింది వానిలో 6 బ్లాక్ మూలకం
A) 11Na
B) 13Al
C) 21SC
D) 58Ce
జవాబు:
A) 11Na

45. 11Na : 1s²2s²2p63s¹. ఈ మూలకం ఏ బ్లాక్ నకు చెందును?
జవాబు:
S – బ్లాక్

46. IUPAC నిర్ణయం ప్రకారం ప్రస్తుతం గ్రూపులను ఎలా సూచిస్తారు?
జవాబు:
1 నుండి 18 (అరబిక్ అంకెలలో)

47. మూలక కుటుంబం అనగానేమి?
జవాబు:
ఒకే గ్రూపులో ఉన్న మూలకాల సమూహం

48. 1(IA) గ్రూపు మూలకాల బాహ్య కక్ష్యలో ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి?
జవాబు:
ns¹

49. బాహ్యకక్ష్యలో ns² ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకాలను ఏమంటారు?
జవాబు:
క్షారమృత్తిక లోహాల కుటుంబం

50. మూలకాలు Li, Be, B, …… రెండవ పీరియడ్ కు చెందినవి. ఈ మూలకాలలో ఎన్ని ప్రధానకక్ష్యలు ఉంటాయి?
జవాబు:
రెండు (K, L)

51. ఉత్కృష్ట వాయువుల కుటుంబం ఎన్నవ గ్రూపునకు చెందినది?
జవాబు:
18(VIIIA)

52. మొదటి పీరియడ్ లో గల మూలకాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు:
2(H, He)

53. మూడవ పీరియడ్ లో ఎన్ని మూలకాలు ఉంటాయి?
జవాబు:
8

54. 3s, 3p, 3d అనే కక్ష్యలు మొదలయ్యే పీరియడ్ సంఖ్య ఎంత?
జవాబు:
3వ పీరియడ్

55. 32 మూలకాలు ఉన్న పీరియడ్ సంఖ్యను ఒకదానిని రాయండి.
జవాబు:
6వ పీరియడ్

56. 4f మరియు 5f మూలకాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
4f – లాంథనైడ్లు; 5f – ఆక్టినైన్లు

57. f- బ్లాక్ మూలకాలు ఎన్నవ పీరియలో ఉంటాయి?
జవాబు:
6 మరియు 7వ పీరియడ్లలో

58. ప్రతి పీరియడ్ లో (1 తప్ప) ఎన్ని S – బ్లాక్ మూలకాలు ఉంటాయి?
జవాబు:
‘2’

59. సాధారణంగా లోహ మూలకాలలో బాహ్యకక్ష్యలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
1, 2 లేదా 3

60. d- బ్లాక్ మూలకాలను ఏమని పిలుస్తారు?
జవాబు:
పరివర్తన మూలకాలు

61. లాంథనైన్లు, ఆక్టినైళ్లు ఏ గ్రూపునకు చెందుతాయి?
జవాబు:
3(III B)

62. అంతర పరివర్తన మూలకాలని వేనిని అందురు?
జవాబు:
f- బ్లాక్ మూలకాలు (లేదా) లాంథరైలు, ఆక్టినైట్లు.

63. కొన్ని అర్ధలోహాల పేర్లు రాయుము.
జవాబు:
B, Si, As, Ge

64. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు కలిగియున్న బ్లాక్ ఏమిటి?
జవాబు:
‘d’

65. అన్నీ లోహాలు గల బ్లాక్ ఏమిటి?
జవాబు:
S – బ్లాక్

66. A – పీరియడ్ లో ఉన్న మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి.
R – ఒకే గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే బాహ్యకక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి.
A) A, R లు సరైనవి
B) A మాత్రమే సరైనది
C) R మాత్రమే సరైనది
D) A, Rలు సరైనవి కావు
జవాబు:
C) R మాత్రమే సరైనది

67. జతపరుచుము.
a) 58Ce – 71Lu ( ) i) ఆక్టినాయిడ్లు
b) 90Th – 103Lr ( ) ii) లాంథనాయిడ్లు
జవాబు:
a – ii, b – i

68. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని ఏమంటారు?
జవాబు:
సంయోజకత

69. ఏదైనా ఒక మూలక పరమాణువు ఎన్ని ………… పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్యను
ఆ పరమాణువు యొక్క సంయోజకత అంటారు.
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
జవాబు:
B) హైడ్రోజన్

70. NaH లో Na యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
1

71. Ca0 లో Ca యొక్క వేలన్సీ ఎంత?
జవాబు:
2

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

72. గ్రూపు సంఖ్య V కన్నా ఎక్కువ ఉండే గ్రూపు మూలకాలకు సంయోజకతను ఎలా లెక్కిస్తారు?
జవాబు:
8 – గ్రూపు సంఖ్య

73. పీరియాడిక్ టేబుల్ లో ప్రతి పీరియడ్ లో మొదటి, చివరి మూలకాల వేలన్సీలను రాయండి.
జవాబు:
మొదటి మూలకం – 1, చివరి మూలకం – 0

74. పరమాణు వ్యాసార్ధాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
జవాబు:
పికోమీటర్ (pm)

75. 1 pm = ……………..m.
జవాబు:
10-12

76. a) Cu ( ) i) లోహ వ్యాసార్ధం
b) Cl ( ) ii) సమయోజనీయ వ్యాసార్ధం
జవాబు:
a – i, b – ii

77. ఆవర్తన పట్టికలోని గ్రూప్ లో పై నుండి క్రిందికి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్ధం ఎలా మారుతుంది?
జవాబు:
పెరుగుతూ వుంటుంది

78. a) ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయేకొద్దీ పరమాణు సంఖ్యతో పాటు కేంద్రకావేశం పెరుగుతుంది.
b) వీరియలో భేదాత్మకత ఎలక్ట్రాన్లు ఒకే బాహ్యకక్ష్యలో చేరుతాయి.
c) పీరియలో ఎలక్ట్రాన్ కక్ష్యలు మారవు.
d) పీరియలో పరమాణు వ్యాసార్ధం తగ్గుతుంది.
పై వానిలో సరికాని వాక్యం ఏది?
జవాబు:
ఏదీ లేదు.

79. Na మరియు Na+ లలో ఏది ఎక్కువ పరిమాణం గలది?
జవాబు:
Na

80. Na+ బాహ్యకక్ష్య ఎలక్ట్రాన్ విన్యాసం రాయుము.
జవాబు:
2s² 2p6

81. Cl మరియు Cl లలో ఎక్కువ సైజ్ గలది. ఏది?
జవాబు:
Cl

82. Cl మరియు Cl ల మధ్య దేనికి తక్కువ కేంద్రక ఆకర్షణ ఉంటుంది?
జవాబు:
Cl

83. A : క్లోరిన్ పరిమాణం, క్లోరిన్ ఆనయాన్ పరిమాణం తో పోల్చితే తక్కువగా ఉంటుంది.
R : క్లోరిన్ పరమాణువుతో పోల్చితే క్లోరిన్ అయాన్ లోని ఎలక్ట్రాన్లపై కేంద్రకావేశం తక్కువగా ఉంటుంది.
A) A, R లు సరైనవి, A ని R సమర్థించును.
B) A, R లు సరైనవి, A ని R సమర్ధించదు.
C) A మాత్రమే సరియైనది.
D) R మాత్రమే సరియైనది.
జవాబు:
A) A, R లు సరైనవి, A ని R సమర్థించును.

84. క్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p63s² 3p5 అయిన క్లోరిన్ ఆనయాన్ విన్యాసం ఎంత?
జవాబు:
1s²2s²2p63s²3p6

85. మూలకం యొక్క బాహ్యకక్ష్య నుండి ఒక ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావల్సిన శక్తిని ఏమందురు?
జవాబు:
అయనీకరణ శక్తి

86. M+(g) + I.E. → M+2(g) + e దీనిలో I.E
A) మొదటి అయనీకరణ శక్తి
B) రెండవ అయనీకరణ శక్తి
C) A లేదా B
D) ఏదీకాదు
జవాబు:
B) రెండవ అయనీకరణ శక్తి

87. అయనీకరణ శక్తి ఆధారపడని అంశం
A) కేంద్రక ఆవేశం
B) స్క్రీనింగ్ ఫలితం
C) పరమాణు వ్యాసార్ధం
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

88. 11Na మరియు 17Cl లలో దేనికి అయనీకరణ శక్తి ఎక్కువ?
జవాబు:
17Cl

89. 11Na మరియు 17Cl లలో దేనికి కేంద్రక ఆకర్షణ శక్తి ఎక్కువ?
జవాబు:
17Cl

90. 4s, Ap, 4d, 4f లలో కేంద్రకం వైపుకు చొచ్చుకుపోయే స్వభావాన్ని అవరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
4s > 4p > 4d > 4f

91. A, B అనే మూలకాలు బాహ్యకక్ష్యలలో 2s మరియు 2p అనే ఆర్బిటాళ్ళు కలవు. అయితే A, B లలో దేని యొక్క అయనీకరణ శక్తి తక్కువ?
జవాబు:
‘B’

92. బెరీలియం మరియు బోరాన్లో దేనికి అయనీకరణ శక్తి తక్కువ?
జవాబు:
బోరాన్

93. ఆక్సిజన్ : 1s22s22p4
నైట్రోజన్ : 1s22s22p3
• పై వానిలో దేని యొక్క అయనీకరణ శక్తి తక్కువ?
జవాబు:
ఆక్సిజన్

• పై వానిలో సగం నిండిన ఆర్బిటాల్ దేనిలో ఉంది?
జవాబు:
నైట్రోజన్

94. ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ యొక్క అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. కారణం
A) కేంద్రక ఆవేశం
B) షీల్డింగ్ ఫలితం
C) ఆర్బిటాల్ చొచ్చుకుపోయే స్వభావం
D) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం
జవాబు:
D) స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం

95. అయనీకరణ శక్తికి ప్రమాణం రాయండి.
జవాబు:
KJmol-1 (లేదా) eV atom-1

96. ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నపుడు అది ఒక ఎలక్ట్రాను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఏమంటారు?
జవాబు:
ఎలక్ట్రాన్ ఎఫినిటీ

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

97. a) M(g) + e → M-2 + Q1
b) M(g)+ + Q2 → M+2 + e
పై వానిలో ఎలక్ట్రాన్ ఎఫినిటీని సూచించేది
A) Q1
B) Q2
C) రెండూ
D) రెండూ కావు
జవాబు:
A) Q1

98. a) లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఎక్కువగా ఉంటాయి.
b) ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఋణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది.
పై వానిలో సరికాని వాక్యం
జవాబు:
‘a’

99. ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నపుడు ఎలక్ట్రాన్లను తనవైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలకం యొక్క …… అంటారు.
A) అయనీకరణ శక్తి
B) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
C) ఋణవిద్యుదాత్మకత
D) ధనవిద్యుదాత్మకత
జవాబు:
C) ఋణవిద్యుదాత్మకత

100. మిల్లికన్ ఋణవిద్యుదాత్మకత సూత్రం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 15

101. బంధశక్తుల ఆధారంగా ఋణవిద్యుదాత్మకతను ప్రతిపాదించినవారు ఎవరు?
జవాబు:
లైనస్ పౌలింగ్

102. హైడ్రోజన్ యొక్క ఋణవిద్యుదాత్మకత ఎంత?
జవాబు:
2.20

103. అత్యధిక ఋణవిద్యుదాత్మకత గల మూలకం ఏది?
జవాబు:
ఫ్లోరిన్

104. అత్యల్ప ఋణవిద్యుదాత్మకత గల స్థిర మూలకం ఏది?
జవాబు:
సీసియం

105. మూడవ పీరియడ్ – Na, Mg, Al, Si, P, S, Cl
1) లోహాలు ఏవి?
జవాబు:
Na, Mg

2) అలోహాలు ఏవి?
జవాబు:
P, S, Cl

3) అర్ధ లోహాలు ఏవి?
జవాబు:
Al, Si

106. IVA (Kosong Swoostev: C, Si, Ge, Sn, Pb
1) లోహాలు ఏవి?
జవాబు:
Sn, Pb

2) అలోహాలు ఏవి?
జవాబు:
C

3) అర్ధలోహాలు ఏవి?
జవాబు:
Si, Ge

107. గ్రూపులలో పై నుండి క్రిందికి పెరిగే ధర్మాలు కొన్నింటిని రాయండి.
జవాబు:
పరమాణు వ్యాసార్ధం, ధన విద్యుదాత్మకత, లోహ స్వభావం

108. పీరియలో ఎడమ నుండి కుడికి తగ్గే మూలక ధర్మాలు రెండింటిని రాయండి.
జవాబు:
పరమాణు వ్యాసార్ధం, ధన విద్యుదాత్మకత, లోహ స్వభావం

109. గ్రూపులలో మారని మూలక ఆవర్తన ధర్మమేది?
జవాబు:
వేలన్సీ

110. A : 1s²2s²
B : 1s²2s²2p63s².
1) A మూలకం ఏ పీరియడ్ కు చెందినది?
జవాబు:
రెండవ

2) B మూలకం ఏ గ్రూపునకు చెందినది?
జవాబు:
రెండవ

3) ‘B’ యొక్క వేలన్సీ ఎంత ?’
జవాబు:
2

111. 2, 8, 7 ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకానికి సారూష్య ధర్మాలు గల ఏదేని మూలకం పేరు రాయుము.
జవాబు:
ఫ్లోరిన్ (Z = 9).

112. 3వ పీరియడ్, 2వ గ్రూపునకు చెందిన మూలక వేలన్సీని ఊహించండి.
జవాబు:
2

10th Class Physics 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. 1వ పీరియడ్ నందు గల మూలకాల సంఖ్య …………..
A) 2
B) 4
C) 6
D) 8
జవాబు:
A) 2

2. అష్టక నియమం పాటింపబడని అణువు …………
A) O2
B) F2
C) BeCl2
D) N2
జవాబు:
C) BeCl2

3. నవీన ఆవర్తన పట్టిక నందు 2వ పీరియడ్ లో గల మూలకాల సంఖ్య
A) 2
B) 18
C) 32
D) 8
జవాబు:
D) 8

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

4. క్రింది వానిలో ఏ లోహం అత్యధిక చర్యాశీలత గలది?
A) లిథియం
B) జింక్
C) పొటాషియం
D) రుబీడియం
జవాబు:
D) రుబీడియం

5. గ్రూపులో పై నుండి క్రిందికి వెళ్ళే కొలదీ అయనీకరణ శక్తి విలువ …….
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
B) తగ్గుతుంది

6. కింది వానిలో అధిక ధనవిద్యుదాత్మకత విలువ గల మూలకం
A) క్లోరిన్
B) కార్బన్
C) ఆక్సిజన్
D) పొటాషియం
జవాబు:
D) పొటాషియం

7. మెండలీవ్ ‘ఏకా-అల్యూమినియం’గా భావించిన మూలకం
A) స్కాండియం
B) గాలియం
C) జెర్మేనియం
D) ఇండియం
జవాబు:
B) గాలియం

8. ఆధునిక ఆవర్తన పట్టికలో నిలువు వరుసల (గ్రూపుల) సంఖ్య (IUPAC విధానంలో)
A) 7
B) 8
C) 10
D) 18
జవాబు:
D) 18

9. కింది వాటిలో డాబరీనర్ త్రికం
A) Cl, Br, I
B) H, He, Li
C) H, Na, Cl
D) C, N, O
జవాబు:
A) Cl, Br, I

10. క్రింది వానిలో డాబరీనర్ త్రికానికి చెందిన పరమాణు భారాల సమూహము
A) 40, 87.5, 120
B) 40, 87.5, 127
C) 40, 77.5, 137
D) 40, 87.5, 137
జవాబు:
D) 40, 87.5, 137

11. క్రింది వాటిలో జడవాయు మూలకపు ఎలక్ట్రాన్ విన్యాసం
AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక 16
జవాబు:
C

12. మెండలీవ్ అసంగతశ్రేణికి ఉదాహరణ
A) టెలూరియం, అయోడిన్
B) సోడియం, పొటాషియం
C) ఎకాబోరాన్, ఎకాసిలికాన్
D) సోడియం, కాల్షియం
జవాబు:
A) టెలూరియం, అయోడిన్

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

13. Na, Mg, AI, SI ల పరమాణు సంఖ్యలు వరుసగా 11, 12, 13, 14 అయితే అధిక పరమాణు వ్యాసార్ధం గల మూలకం,
A) Na
B) Mg
C) Al
D) Si
జవాబు:
A) Na

మీకు తెలుసా?

1) మీకు సంగీత స్వరాల గురించి తెలుసా?

భారతీయ సంగీతంలో ఒక స్కేలులో 7 సంగీత స్వరాలుంటాయి. అవి స, రి, గ, మ, ప, ద, ని. పాశ్చాత్య సంగీతంలో do, re, mi, fa, so, la, ti అనే స్వరాలను వాడుతారు. ఒక పాటకు సంగీతంను సమకూర్చడానికి స్వరకర్త (musician) ఈ నోట్లను వాడతాడు. సహజంగా ఈ ‘నోట్’లు పునరావృతమవుతుంటాయి. ప్రతీ ఎనిమిదవ నోట్ మొదటి నోట కు సమానంగా ఉంటుంది. మరియు అక్కడి నుండి కొత్త నోట్ మొదలవుతుంది.

2) ఎకా అల్యూమినియం యొక్క ద్రవీభవనస్థానం గురించి మెండలీవ్ ఇలా చెప్పాడు. “నేను దానిని నా అరచేతిలో పట్టుకుంటే, అది కరిగిపోతుంది.”

ఆ తర్వాత ఎకా అల్యూమినియంగా కనుగొన్న గాలియం యొక్క ద్రవీభవనస్థానం 30.2°C అని కనుగొన్నారు. మన శరీర ఉష్ణోగ్రత 37°C. మెండలీవ్ మూలకాల ధర్మాలను గురించి ఎంత కచ్చితంగా ఊహించాడో కదూ !

3) మెండలీవ్ తన ఆవర్తన పట్టికను పరిచయం చేసే కాలంలో కనీసం ఎలక్ట్రాన్ కూడా కనుగొనబడలేదు. అయినప్పటికీ ఈ ఆవర్తన పట్టిక ఒక చెల్లాచెదురుగా ఉన్న వంటశాల వంటి రసాయనశాస్త్ర అధ్యయనానికి ఒక శాస్త్రీయ ఆధారాన్ని అందించింది. అతని గౌరవార్థం 101వ మూలకానికి ‘మెండలీవియం’ అనే పేరు పెట్టారు.

4. ఆవర్తన పట్టికలో కొన్ని మూలక కుటుంబాలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

1. క్షార లోహాలు :
ఈ కుటుంబంలోని Na, K వంటి మూలకాలను మొక్కల బూడిద నుండి రాబట్టారు. ఆల్కలీ అంటే మొక్కల బూడిద అని అర్థం.

2. చాల్కోజన్లు :
ఈ కుటుంబంలోని అంటే 16 (VI A) వ గ్రూప్ మూలకాలను గనుల. నుండి తవ్వి తీయబడిన లోహాల నుండి రాబట్టారు. చాల్కోజన్లు అంటే ఖనిజ ఉత్పత్తులు అని అర్థం.

3. హాలోజన్లు :
ఈ కుటుంబంలోని అంటే 17 (VII A) గ్రూప్ మూలకాలను సముద్ర లవణాల నుండి రాబట్టారు. ‘హాలోస్’ అంటే సముద్ర లవణం అని అర్థం.

4. ఉతృష్ట వాయువులు :
ఈ కుటుంబంలోని అంటే 18వ (VIII A) వ గ్రూప్ మూలకాలకు రసాయన చర్యాశీలత తక్కువ. దీనికి కారణం బాహ్యకక్ష్యలో పూర్తిగా నిండిన ఆర్బిటాళ్ళు ఉండడమే. వీటిని జడవాయువులు అని కూడా అంటాం.

AP 10th Class Physical Science Important Questions 7th Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక

5) అయిడ్ (Ide) అనగా సంపద (heir) అని, ఆయిడ్ (Oid) అనగా ‘సమానమైన’ అని అర్థం. ఉదాహరణకు మనం క్లోరిన్ పరమాణువు (Cl)ను క్లోరిన్, దాని అయాన్ Cl ను క్లోరైడ్ అయాన్ అని పిలుస్తుంటాం కదా! అదే విధంగా లాంథసైడ్స్ (లాంథనమ్ ను పోలినవి), ఆక్టిసైడ్స్ (ఆక్టీనియంను పోలినవి) అనే పేర్లు ప్రాచుర్యం పొందాయి. శాస్త్రవేత్తల్లో కొంతమంది 57La నుండి 70Yb వరకు, మరికొంతమంది 58Ce నుండి 71Lu వరకు ఇంకొందరు 57La నుండి 71Lu వరకు లాంథనైళ్లుగా పరిగణిస్తారు.

21SC మరియు 39Y లను కూడా లాంథనై లుగా పరిగణిస్తున్నారు. ఈ సూచనలన్నీ ఎలక్ట్రాన్ విన్యాసం దృష్ట్యా నిజమైనవే. ఎందుకంటే 21Sc, 39Y మరియు 57La నుండి 71Lu వరకు మూలకాలన్నీ ఒకే బాహ్యకక్ష్య విన్యాసం కలిగి ఉంటాయి. ఆర్టైనైడ్ ల విషయంలో కూడా 90Th నుండి 103Lr వరకు లేదా 98Ac నుండి 102No వరకు లేదా 98Ac నుండి 103Lr వరకు వంటి రకరకాల వాదనలు ఉన్నాయి.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 6th Lesson Important Questions and Answers పరమాణు నిర్మాణం

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని వ్రాయండి.
జవాబు:
క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసము : 1s²2s²2p63s²2p64s¹3d5 or [Ar] 4s¹3d5.

ప్రశ్న 2.
ఇనుప కడ్డీని క్రమంగా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయటాన్ని పరిశీలించినప్పుడు ఏ ఏ రంగులు కనబడుతాయి?
జవాబు:
ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలదీ ఇనుప కడ్డీపై ఎరుపు, నారింజ, పసుపు, నీలము లేక తెల్లని రంగులు ఏర్పడును.

ప్రశ్న 3.
1s² 2s¹ 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఏ నియమం ఉల్లంఘించబడింది ? కారణాలు తెల్పండి.
జవాబు:
1s² 2s¹ 2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో ఆఫ్ భౌ నియమం ఉల్లంఘించబడినది.
కారణం : ఈ నియమం ప్రకారం 25 నిండిన తరువాతనే 22 కి నింపాలి.

ప్రశ్న 4.
మెగ్నీషియం (Z = 12) మూలక పరమాణువులో బాహ్య కర్పరం యొక్క సంకేతం (Bymbol)ను వ్రాయండి. మెగ్నీషియం బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
మెగ్నీషియంలో బాహ్య కర్పరం (3వ కర్పరం) సంకేతం M మెగ్నీషియం బాహ్య కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య = 2

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 5.
స్కాండియమ్ (Sc) పరమాణువులో 21వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ సంఖ్యల విలువలు కింది పట్టికలో ఇవ్వబడినాయి. అయితే స్కాండియమ్ పరమాణువులోని 20వ ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ సంఖ్యల విలువలను పట్టిక రూపంలో వ్రాయండి.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 1
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 2

ప్రశ్న 6.
n = 3 అయినపుడు కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళను తెల్పి, ఆ కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్యను రాయండి.
జవాబు:
n = 3 అయినప్పుడు కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు s, p, d. ఆ కర్పరంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 18.

ప్రశ్న 7.
ఎలక్ట్రాన్ ను కనుగొన్నదెవరు? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
ఎలక్ట్రాన్ ను కనుగొన్నది J.J. థామ్సన్. దీని సంకేతం 0-1e.
ఎలక్ట్రాన్ ఆవేశం ఋణావేశం. ఆవేశ పరిమాణం – 1.602 × 10-19 కూలుంట్లు. ద్రవ్యరాశి 9.1 × 10-31kg.

ప్రశ్న 8.
ప్రోటాన్ ను కనుగొన్నది ఎవరు? ప్రోటాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
ప్రోటాన్ ను కనుగొన్నది “గోల్డ్ స్టీన్.” దీని సంకేతం 1+1P. ప్రోటాన్ ధనావేశం కలిగి ఉండును. దీని ఆవేశ పరిమాణం +1.602 × 10-19 కూలుంట్లు. ద్రవ్యరాశి 1.675 × 10-27kg.

ప్రశ్న 9.
న్యూట్రాన్ ను కనుగొన్నది ఎవరు? న్యూట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశులను తెల్పండి.
జవాబు:
న్యూట్రాన్ ను కనుగొన్నది చాడ్విక్. దీని సంకేతం 10n.
ఆవేశం లేదు. ద్రవ్యరాశి 1.675 × 10-27 kg.

ప్రశ్న 10.
పరమాణు నమూనా అనగానేమి?
జవాబు:
పరమాణువులో ధనావేశాలు, ఋణావేశాలు ఏ విధంగా పంపిణీ జరిగినవో తెలియజేసే దానిని “పరమాణు నమూనా” అంటారు.

ప్రశ్న 11.
మొట్టమొదటి పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
జవాబు:
మొట్టమొదటి థామ్సన్ పరమాణు నమూనాను “పుచ్చకాయ నమూనా” అని పిలుస్తారు.

ప్రశ్న 12.
రూథర్ ఫోర్డ్ పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు?
జవాబు:
రూథర్‌ఫోర్డ్ పరమాణు నమూనాను “గ్రహమండల నమూనా” అని పిలుస్తారు.

ప్రశ్న 13.
బోర్ పరమాణు నమూనా ఏ సూత్రం ఆధారంగా నిర్ధారించబడినది?
జవాబు:
బోర్ పరమాణు నమూనా “మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం” ఆధారంగా నిర్ధారించబడినది.

ప్రశ్న 14.
స్థిర కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
స్థిర కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త “నీల్స్ బోర్”.

ప్రశ్న 15.
ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ అధిక శక్తి గల కక్ష్య నుండి తక్కువ శక్తి గల కక్ష్యలోకి దూకినపుడు విడుదలయ్యే వికిరణపు శక్తి (E), వికిరణపు పౌనఃపున్యానికి (υ) అనులోమానుపాతంలో ఉంటుంది. E ∝ υ (E = hυ)

ప్రశ్న 16.
ప్లాంక్ స్థిరాంకం విలువ మరియు ప్రమాణాలు వ్రాయుము.
జవాబు:
ప్లాంక్ స్థిరాంకం విలువ h = 6.626 x 10-34 బౌల్. సెకను లేదా h = 6.626 x 10-27 ఎర్గ్. సెకన్.

ప్రశ్న 17.
దృగ్గోచర వర్ణపటం అనగానేమి?
జవాబు:
మానవుని కంటితో నేరుగా చూడగల రంగుల సమూహాన్ని దృగ్గోచర వర్ణపటం అంటారు. దీనిని VIBGYOR తో తెలియజేస్తారు.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 18.
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ శక్తి గల రంగు ఏది?
జవాబు:
ఏ తరంగానికైనా శక్తి అనేది పౌనఃపున్యంపై ఆధారపడును. ఊదా రంగు అధిక పౌనఃపున్యం కలిగి ఉండుట వలన, ఎక్కువ శక్తిని కలిగి ఉండును.

ప్రశ్న 19.
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలేవి?
జవాబు:
దృగ్గోచర వర్ణపటంలో అధిక తరంగదైర్ఘ్యం గల తరంగాలు ఎరుపురంగు తరంగాలు. ఇవి అధిక దూరం ప్రయాణించగలవు.

ప్రశ్న 20.
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శక్తివంతమైన వికిరణాలేవి?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ పౌనఃపున్యం కలిగినవి కాస్మిక్ వికిరణాలు. వీటి తర్వాత Y – వికిరణాలు. వీటికి అత్యధిక శక్తి ఉండును. ఇవి ప్రమాదకరమైన వికిరణాలు.

ప్రశ్న 21.
విద్యుదయస్కాంత వికిరణాలలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల వికిరణాలేవి?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలు ప్రసార పట్టీలు. వాటి తర్వాత రేడియో తరంగాలు. ఇవి తక్కువ శక్తి గలవి. విశ్వంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళిరాగలవు.

ప్రశ్న 22.
విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాల వేగాలను తెల్పుము.
జవాబు:
c = υλ; c = కాంతి వేగం, υ = పౌనఃపున్యం, λ = తరంగదైర్ఘ్యం. ఇవి 3 × 108 మీ/సె వేగంతో ప్రయాణిస్తాయి.

ప్రశ్న 23.
నీబోర్ పరమాణు నమూనా వివరించి హైడ్రోజన్ వర్ణపటాన్ని వివరించటాన్ని నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
నీల్స్ బోర్ పరమాణు నమూనా, వివరించడంలో విజయం సాధించడమే కాకుండా, హైడ్రోజన్ వర్ణపటాన్ని చక్కగా వివరించగలిగాడు. కావున నీల్స్ బోర్ చేసిన కృషిని ప్రశంసించవలసియున్నది.

ప్రశ్న 24.
పదార్థం విభజింప శక్యం కాదు అనే భావన నుండి పరమాణు నమూనాలను వివరించే స్థాయికి శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల కృషిని ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
పదార్థం విభజింప శక్యం కాని కణాలతో నిర్మితమైందనే డాల్టన్ భావన నుండి J.J. థామ్సన్, రూథర్‌ఫోర్డ్, నీల్స్ బోర్, సోమర్ ఫెల్డ్, జోడింగర్ మొదలైన అనేకమంది కృషి ఫలితంగా సైన్స్ విజ్ఞానం క్రొత్త పుంతలు తొక్కింది. వారి కృషిని మిక్కిలి ప్రశంసించవలసియున్నది.

ప్రశ్న 25.
మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం యొక్క అనేక రంగాలలోని ఉపయోగాలను ఎలా అభినందిస్తావు?
జవాబు:
ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడిగా గుర్తించబడిన మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా అనేక వస్తువులు పనిచేస్తున్నాయి. వాటిలో α, β, γ వికిరణాలను అర్థం చేసుకోవడానికి, లేజర్లు, కంప్యూటర్లు, సి.డి.లు, రసాయన బంధాల (D.N.A.) గురించి తెలుసుకోవడానికి క్వాంటం సిద్ధాంతం ఉపయోగపడినది. కాబట్టి మా ప్లాంక్ చేసిన కృషిని అభినందించవలసి ఉన్నది.

ప్రశ్న 26.
దీపావళి పండుగ నాడు నీవు కాల్చిన టపాసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం ఏమిటి?
జవాబు:
దీపావళి పండుగనాడు కాల్చిన టపాసుల నుండి రంగురంగుల కాంతి వెలువడటానికి కారణం వాటిలో ఒక్కొక్క పరమాణువు ఒక్కొక్క కాంతిని వెదజల్లుతుంది.

ప్రశ్న 27.
పసుపు వర్ణంలో కాంతిని వెదజల్లే పరమాణువులేవి?
జవాబు:
సోడియం మూలకాన్ని వేడిచేసినపుడు పసుపు వర్ణంలో కాంతిని ఉద్గారించును.

ప్రశ్న 28.
ట్రాఫిక్ సిగ్నల్, సెల్ టవర్లు, వాహనాల వెనుక ఎర్రని లైట్ ను ఎందుకు అమర్చుతారు?
జవాబు:
దృగ్గోచర వర్ణపటంలో ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎరుపు. ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి ఎక్కువ దూరం ప్రయాణించును. కాబట్టి ఎక్కువ దూరంలో ఉన్న వ్యక్తి కూడా స్పష్టంగా చూడగలడు.

ప్రశ్న 29.
γ – వికిరణాలను వైద్యరంగంలో ఎందుకు వాడతారు?
జవాబు:
γ- వికిరణాలను కేన్సర్ కణుతులను నిర్మూలించటానికి కీమోథెరపి చికిత్సలో వాడతారు.

ప్రశ్న 30.
X – కిరణాలను వైద్యరంగంలో ఎందుకు వాడతారు?
జవాబు:

  1. X – కిరణాలు రెండు రకాలు. 1) కఠిన X – కిరణాలు 2) మృదు X – కిరణాలు.
  2. మృదు X – కిరణాలను వైద్యరంగంలో రోగాన్ని నిర్ధారించడానికి, రోగచికిత్సకు వాడతారు.

ప్రశ్న 31.
మైక్రో తరంగాల ఉపయోగాలేవి?
జవాబు:
సెల్ ఫోన్, రాడార్లు, మైక్రో ఓవెన్లు మైక్రో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి.

ప్రశ్న 32.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి ఉపయోగపడే నియమాలేవి?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయటానికి ఉపయోగపడే నియమాలు మూడు :

  1. ఆఫ్ బౌ నియమం
  2. హుండ్ నియమం
  3. పౌలీవర్జన నియమం

ప్రశ్న 33.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి మాదిరి పటం లాగా ఉపయోగపడేది ఏది?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సులువుగా రాయటానికి ఉపయోగపడేది మాయిలర్ పటము.

ప్రశ్న 34.
సమశక్తి గల ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్లు నింపవలసి వచ్చినపుడు ఉపయోగపడే నియమం ఏది?
జవాబు:
హుండ్ నియమం

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 35.
వర్ణపటంలోని సూక్ష్మరేఖలను పరిశీలించటానికి ఉపయోగపడే పరికరం ఏది?
జవాబు:
అధికశక్తి గల వర్ణపట దర్శిని (Spectroscope).

ప్రశ్న 36.
రేఖా వర్ణపటంలో ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించగలిగినదా?
జవాబు:
రేఖా వర్ణపటంలో ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా వివరించలేదు. సోమర్ ఫెల్డ్ నమూనా వివరించగలిగినది.

ప్రశ్న 37.
తరంగదైర్ఘ్యము అనగానేమి?
జవాబు:
ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరం లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరంను ఆ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం (λ) అంటాం.

ప్రశ్న 38.
విద్యుదయస్కాంత తరంగం యొక్క పటం గీయుము. (లేదా) విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు ఒకదానికొకటి లంబంగా ఉండి, తరంగ వ్యాప్తి దిశకు లంబంగా కంపిస్తూ ఉంటాయి. దీనిని పటరూపంలో చూపించండి. .
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 3

ప్రశ్న 39.
పౌనఃపున్యం అనగానేమి?
జవాబు:
ఒక సెకను కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనఃపున్యం (υ) అంటారు.

ప్రశ్న 40.
విద్యుదయస్కాంత వర్ణపటం అనగానేమి?
జవాబు:
విద్యుదయస్కాంత తరంగాలు విస్తృత వైవిధ్యం గల పౌనఃపున్యాల సముదాయం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనఃపున్యాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటారు.

ప్రశ్న 41.
ప్లాంక్ సిద్ధాంత ప్రతిపాదనలోని విశిష్టత ఏమిటి?
జవాబు:
విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా, నిర్దిష్ట విలువలు గల భాగాలుగా ఉంటుంది.

ప్రశ్న 42.
పరమాణు వర్ణపటాలలోని రేఖల ఉపయోగమేమిటి?
జవాబు:
వేలిముద్రలను బట్టి మనుషులను గుర్తించినట్లుగానే పరమాణు వర్ణపటాల్లోని రేఖలను బట్టి ఆయా పరమాణువులను తేలికగా గుర్తించవచ్చు.

ప్రశ్న 43.
భూ స్థాయి అనగానేమి?
జవాబు:
ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని భూస్థాయి అంటారు.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 44.
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినపుడు అది ఎక్కువ శక్తి స్థాయికి చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఉన్నదని అంటారు.

ప్రశ్న 45.
బోర్ పరమాణు నమూనాలోని లోపాలేవి?
జవాబు:

  1. బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.
  2. ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువుల వర్ణపటాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 46.
పరమాణు నిర్మాణంలో సోమర్ ఫెల్డ్ పాత్ర ఏమిటి?
జవాబు:
రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించాడు. అతను దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టినాడు.

ప్రశ్న 47.
‘ఆర్బిటాల్’ అనగానేమి?
జవాబు:
పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఆర్బిటాల్ అంటారు.

ప్రశ్న 48.
క్వాంటం సంఖ్యలు అనగానేమి?
జవాబు:
పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాన్ ను n, l, ml అనే మూడు సంఖ్యల సమితులతో సూచిస్తారు. ఈ సంఖ్యలనే క్వాంటం సంఖ్యలు అంటారు.

ప్రశ్న 49.
క్రింది పట్టికను పూరించి, ఏ నియమం ప్రకారం పూరించావో రాయుము.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 4
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 5
పై పట్టికను పూరించడానికి నేను ఉపయోగించిన సూత్రం (2l + l).

ప్రశ్న 50.
ఎలక్ట్రాన్ విన్యాసం అనగానేమి?
జవాబు:
పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.

ప్రశ్న 51.
పౌలీవర్జన నియమాన్ని రాయుము.
జవాబు:
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.

ప్రశ్న 52.
ఆఫ్ బౌ నియమాన్ని రాయుము.
జవాబు:
పరమాణువు భూస్థాయిలో ఉన్నపుడు ఎలక్ట్రానులు అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్ లో చేరుతూ, అలా మొత్తం ఎలక్ట్రానుల సంఖ్య పరమాణు సంఖ్యకి సమానం అయ్యేవరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మించబడుతుంది.

ప్రశ్న 53.
హుండ్ నియమం రాయుము.
జవాబు:
ఈ నియమం ప్రకారం సమానశక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమించబడిన తరువాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.

ప్రశ్న 54.
3s, ap, 28, 4s, 3p, 1s మరియు 3d ఆర్బిటాళ్ళను వాటి ఆరోహణ క్రమంలో వ్రాయండి.
జవాబు:
1s < 2s < 3s, 3p < 4s < 3d
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 6

ప్రశ్న 55.
K, L, M మరియు N శక్తి స్థాయిలను వాటి శక్తి విలువల ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
K

ప్రశ్న 56.
ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే ఏం జరుగుతుంది?
జవాబు:
ఒక ఎలక్ట్రాన్ శక్తిని గ్రహిస్తే అది అధిక శక్తి స్థాయికి లేదా ఉత్తేజిత స్థాయికి చేరును.

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సోడియం మూలక పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p63s¹. ఇది ఇచ్చే సమాచారం ఏమి?
జవాబు:

  1. దీని పరమాణు సంఖ్య – 11
  2. ఇది S – బ్లాకు మూలకం
  3. ఇది 3వ పీరియడకు చెందినది
  4. ఇది 1వ గ్రూపునకు చెందినది.
  5. ఇది ఒక లోహం
  6. దీని వేలన్సీ (సంయోజకత) – 1
  7. ఇది ఏక ధనాత్మక అయానను ఏర్పరుస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 2.
3d మరియు 4s లలో దేనికి (n+1) విలువ ఎక్కువ ? వివరింపుము.
జవాబు:

  1. 3d మరియు 4s లలో 3d యొక్క (n+1) విలువ ఎక్కువ.
  2. 3d యొక్క n + 1 విలువ = 3 + 2 = 5
    4s యొక్క n+1 విలువ = 4 + 0 = 4
    కావున 4s కన్నా 3d యొక్క శక్తి ఎక్కువ.

ప్రశ్న 3.
ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండగలవు అని తెలిపే నియమం పేరు తెలిపి, వివరించండి.
జవాబు:
పౌలీవర్జన నియమం

ఒక ఆర్బిటాల్ లోని ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.

ప్రశ్న 4.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం గురించి వివరించడానికి ఉపాధ్యాయుడు నల్లబల్లపై nlx అని రాశాడు. దానిని చూసినప్పుడు విద్యార్థి మదిలో ఏ ఏ ప్రశ్నలు ఉదయించే అవకాశం ఉంది ? ఏవైనా రెండు ప్రశ్నలను రాయండి.
జవాబు:

  1. n, l, x అక్షరాలు పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించిన ఏ ఏ అంశాలను సూచిస్తాయి?
  2. nlx ఆధారంగా పరమాణువులోని ఎలక్ట్రాన్ స్థానాన్ని తెలుసుకోవచ్చా?

ప్రశ్న 5.
పరమాణు సంఖ్య 11 గల మూలక పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయండి. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడంలో మీరు. పాటించిన సూత్రాలు, నియమాల పేర్లను తెల్పండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 7
పాటించిన నియమాలు :
ఆఫ్భౌ నియమం, హుండ్ నియమం, పౌలీవర్జన నియమం

ప్రశ్న 6.
“ఎలక్ట్రాన్ ‘3p’ ఆర్బిటాల్ నిండిన తర్వాత ‘3d’ లోకి కాకుండా ‘4s’ లోకి వెళ్తుంది.” దీనికి గల కారణం వివరించండి.
జవాబు:
(n+ l) విలువల ఆధారంగా 3d ఆర్బిటాల్ శక్తి విలువ 3 + 2 = 5. 4s ఆర్బిటాల్ శక్తి విలువ 4 + 0 = 4. 3d ఆర్బిటాల్ కన్నా 4వ ఆర్బిటాల్ శక్తి తక్కువ. ఆఫ్ భౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోకి ముందుగా చేరుతుంది. కనుక 3p ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ‘3d’ లోకి కాకుండా 48 లోకి వెళ్తుంది.

ప్రశ్న 7.
“సమశక్తి ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల అమరిక” ను తెలియజేసే నియమాన్ని వివరించండి.
జవాబు:
హుండ్ నియమం ప్రకారం సమశక్తి ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతే జతగూడడం జరుగుతుంది.
ఉదా : కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసము 1s² 2s² 2p²
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 8

చివరి రెండు ఎలక్ట్రాన్లు వేరు వేరు p ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి.

ప్రశ్న 8.
Na+, Cl-1 ల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 9

ప్రశ్న 9.
పరమాణువుకు, వర్ణపటానికి సంబంధమేమి?
జవాబు:
మూలకాలను వేడిచేసినపుడు అవి శక్తిని కాంతి రూపంలో విడుదల చేస్తాయి. ఈ శక్తిని పట్టకంపై పడేలా చేస్తే తెరపై రంగు గీతలతో వర్ణపటం ఏర్పడును. ప్రతి మూలకం ఒక్కొక్క ప్రత్యేక రంగులు గల గీతలను తెరపై ఏర్పరచును. ఈ రంగుల గీతలను మానవుని వేలి ముద్రలతో పోల్చవచ్చు. ఏ ఇద్దరి మానవుల వేలి ముద్రలూ ఒకేలా ఉండవు, అలానే ఏ రెండు మూలకాల రేఖావర్ణపటంలో ఒకే రంగుల గీతలు ఉండవు.
ఉదా : హైడ్రోజన్ – పింక్ రంగు గీతలు
క్యూప్రిక్ క్లోరైడ్ – ఆకుపచ్చ రంగు
స్ట్రాన్షియం రైడ్ – ఎరుపు రంగు
ఈ రంగులనుబట్టి పదార్థంలోని పరమాణువుల ఉనికిని తెలుసుకొంటారు.

ప్రశ్న 10.
కాపర్, క్రోమియం, ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
జవాబు:
1) క్రోమియం 24Cr యొక్క పరమాణు సంఖ్య = 24
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s¹ 3d5

2) కాపర్ యొక్క 29Cu యొక్క పరమాణు సంఖ్య = 29
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 4s¹ 3d10

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 11.
సమశక్తి గల ఆర్బిటాళ్ళు అనగానేమి?
జవాబు:
ఏ పరమాణు ఆర్బిటాళ్ళు సమాన శక్తి కలిగి ఉండునో ఆ ఆర్బిటాళ్లను సమశక్తి గల ఆర్బిటాళ్ళు అంటారు.
ఉదా 1 : p – ఆర్బిటాళ్లు

p – ఆర్బిటాళ్ళలోని px, py, pz. మూడింటికి సమాన శక్తి ఉండును.
ఉదా 2 : d – ఆర్బిటాళ్ళు
d ఉపస్థాయిలోని ఐదు ఆర్బిటాళ్ళు ఒకే శక్తిని కలిగి ఉండును.

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
హుండ్ నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
హుండ్ నియమం :
ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చే ఆక్రమింపబడిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి.

కార్బన్ పరమాణు సంఖ్య Z = 6. ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p² ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రాన్లు 1s మరియు 2వ ఆర్బిటాళ్ళలోకి చేరతాయి. తరువాత రెండు ఎలక్ట్రానులు వేరు వేరు 22 ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రానుల స్పిన్ ఒకేవిధంగా ఉంటుంది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 10

ప్రశ్న 2.
పట్టికలో ఇచ్చిన సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 11
i) 4వ ప్రధాన కక్ష్యలో గల m, కు ఎన్ని విలువలు కలవు? అవి ఏవి?
జవాబు:
1) 4వ ప్రధాన కక్ష్యలో గల m, కు గల విలువలు = 16 అవి
4వ ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య = 1 [0]
4p ఆర్బిటాల్ కి m విలువల సంఖ్య = 3 [-1, 0, 1]
4d ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య = 5 [-2, -1, 0, 1, 2]
4f ఆర్బిటాల్ కి m, విలువల సంఖ్య =76-3, -2, -1, 0, 1, 2, 3]
మొత్తం m, విలువల సంఖ్య = 16

ii) n = 3, l = 1 అయిన ఉపకక్ష్యలో గల ఎలక్ట్రాన్ ml విలువలు రాయుము.
జవాబు:
n = 3, l = 1 అయిన ఉపకక్ష్యలో గల ఎలక్ట్రాన్ ml విలువలు = -1, 0, 1.

iii) ‘N’ కర్పరం, ప్రధాన క్వాంటం సంఖ్య విలువ వ్రాసి, ఈ కర్పరంలో గల ఉపకర్పరాలను వ్రాయుము.
జవాబు:
‘N’ కర్పరం ప్రధాన క్వాంటం సంఖ్య విలువ = 4 ‘N’ కర్పరంలో ఉపకర్పరాలు = 4s, 4p, 4d, 4f.

iv) పై పట్టికలోని ml విలువలను పరిశీలించి ml మరియు l మధ్యగల సంబంధాన్ని తెలిపే ఫార్ములా వ్రాయుము.
జవాబు:
ml మరియు l మధ్య సంబంధం ⇒ m = 2l + 1.

ప్రశ్న 3.
క్రింది క్వాంటం సంఖ్యల విలువల పట్టికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 12
i) గోళాకృతి కల్గిన ఉపకర్పరాన్ని సూచించు ‘l’ విలువ ఎంత ? ఆ ఉపకర్పరం సంకేతం రాయండి.
ii) l = 2 కు ఎన్ని ‘ml‘ విలువలు ఉంటాయి ? అవి ఏవి?
iii) l = 1 ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ళ సంకేతాలు రాయండి.
iv) l = 2 ఉపకర్పరం ఏ ఆకృతిని కల్గి ఉంటుంది? ఈ ఉపకర్పరంలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు?
జవాబు:
i) l = 0, ఉపకర్పరం – ‘S’.
ii) l = 2 కు m, విలువలు 5 ఉంటాయి. అవి : -2, -1, 0, 1, 2.
iii) l = 1 అయిన ఉప కర్పరాల సంకేతాలు px, py, pz.
iv) l = 2 ఉప కర్పరం డబుల్ డంబెల్ ఆకృతి కల్గి ఉంటుంది. ఈ ఉపకర్పరంలో గరిష్ఠంగా 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి.

ప్రశ్న 4.
ఆర్బిటాళ్ల శక్తి క్రమాలను చూపి, మాయిలర్ పటం గీయుము. (లేదా) ఆర్బిటాళ్ళ (n+1) విలువ పెరిగే క్రమాన్ని సూచించే పటాన్ని గీయండి.
(లేదా)
ఆరోహణక్రమంలో పరమాణు ఆర్బిటాళ్ళ వివిధ శక్తి స్థాయిలను చూపే మాయిలర్ పటాన్ని గీయుము.
జవాబు:
ఆర్బిటాళ్ల శక్తి క్రమాలు :
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d< 4p< 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p <7s < 5f < 6d <7p < 8s.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 13

ప్రశ్న 5.
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను, దాని పరిమితులను వ్రాయండి.
(లేదా)
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాలోని ప్రతిపాదనలు మరియు పరిమితులు రాయండి.
జవాబు:
బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా :

  1. పరమాణువులో ఎలక్ట్రానులు, కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిలలో లేదా స్థిర కర్పరాలలో వుంటాయి.
  2. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయి (భూస్థాయి) నుండి ఎక్కువ శక్తిస్థాయి (ఉత్తేజిత స్థాయి) లోకి చేరినపుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది.
  3. పరమాణువులో గల ఎలక్ట్రానులకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 ……. అంటే ఎలక్ట్రానుల శక్తి క్వాంటీకరణం చెందుతుంది. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు అని, వీటికుండే శక్తి విలువలను శక్తి స్థాయిలు అని అంటారు.

పరిమితులు :
బోర్ పరమాణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవటాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 6.
ఒక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము ఈ విధంగా ఉంది. 1s² 2s² 2p²
అ) ఇది ఏ మూలక పరమాణువును సూచిస్తున్నది?
ఆ) చిట్టచివరి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లో ఉన్నది?
ఇ) చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు రాయండి.
ఈ) మొదటి డబ్బాలోని రెండు ఎలక్ట్రాన్ ప్రధాన క్వాంటం సంఖ్య విలువ ఎంత?
జవాబు:
ఇచ్చిన పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s² 2s² 2p²
అ) ఇది “కార్బన్” మూలక పరమాణువును సూచిస్తున్నది.
ఆ) చిట్టచివరి ఎలక్ట్రాన్ 22 ఆర్బిటాల్ నందు కలదు.
ఇ) చివరి ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటం సంఖ్యలు n = 2, l = 1, ml = 0, ms = + ½
ఈ) మొదటి డబ్బాలోని ఎలక్ట్రానుల యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 1.

ప్రశ్న 7.
బోర్ పరమాణు నమూనాలోని ప్రతిపాదనలు మరియు లోపాలేవి?
జవాబు:
ప్రతిపాదనలు :

  1. పరమాణువులో ఎలక్ట్రానులు అత్యధిక వేగంతో నిర్దిష్ట మార్గాలలో తిరుగుతాయి. వీటిని “కక్ష్యలు” అంటారు.
  2. ఈ కక్ష్యలలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంత సేపూ శక్తి గ్రహించటంగానీ, కోల్పోవటంగానీ జరగదు. వీటిని ‘స్థిర కక్ష్యలు” అంటారు.
  3. వీటిని K, L, M, N లతో సూచిస్తారు. వీటికి నిర్దిష్ట శక్తులు కలవు.
  4. ఎలక్ట్రాన్ పై కక్ష్య నుండి లోపలి కక్ష్యకు దూకినపుడు శక్తి వికిరణ రూపంలో విడుదలగును. E2 – E1 = hυ.
  5. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం : mvr = \(\frac{\mathrm{nh}}{2 \pi}\)
  6. కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం చెందినది.

లోపాలు :

  1. He, Li, Be, B వంటి బహు ఎలక్ట్రాన్ల వర్ణపటాలను వివరించలేదు.
  2. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేదు.
  3. కోణీయ ద్రవ్యవేగం ఎందుకు క్వాంటీకరణం చెందినదో వివరించలేదు.
  4. రసాయన బంధాల గురించి వివరించలేదు.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 8.
హుండ్ నియమాన్ని రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
నియమం : సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడటం జరుగుతుంది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 14
1) కార్బన్లో మొదటి, రెండవ ఎలక్ట్రానులు 1s లోనికి, మూడవ, నాలుగవ ఎలక్ట్రానులు 28 లోనికి ప్రవేశించును.
2) ఐదవ ఎలక్ట్రాన్ 2p సమశక్తి గల ఆర్బిటాల్ కాబట్టి 2px లోనికి ప్రవేశించును.
3) ఆరవ ఎలక్ట్రాన్ హుండ్ నియమాన్ని పాటిస్తూ 2py లోనికి ప్రవేశించును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 15
4) నైట్రోజన్లో మొదటి, రెండవ, మూడవ, నాలుగవ ఎలక్ట్రాన్లు కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం వలె 1s, 2s లోనికి ప్రవేశించును.
5) ఐదవ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించును.
6) ఆరవ ఎలక్ట్రాన్ 2py లోనికి ప్రవేశించును.
7) ఏడవ ఎలక్ట్రాన్ 2pz లోనికి ప్రవేశించును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 16
ఆక్సిజన్ పరమాణువులో ఎలక్ట్రాన్ విన్యాసం 7 ఎలక్ట్రాన్ల వరకు నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పోలి ఉండును.

8) 8వ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించి ఎలక్ట్రాన్ తో జతకూడును.

ప్రశ్న 9.
ఆఫ్ బౌ నియమం లేదా ఊర్ద్వ నిర్మాణ నియమాన్ని రాసి, ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
నియమం : ఎలక్ట్రాను తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోనికి ముందు ప్రవేశించును.
(లేదా)
ఎలక్ట్రాను ఏ ఆర్బిటాల్ యొక్క (n + l) విలువ కనిష్ఠమో దానిలోనికి ముందు ప్రవేశించును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 17
పొటాషియంలో చిట్టచివరి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించకుండా, 4s లోనికి ప్రవేశించింది. కారణం 4s యొక్క n + l విలువ తక్కువ.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 18
ఉదా 3 : స్కాండియం 21Sc. 1s² 2s 2p6 3s² 3p6 4s² 3d¹
స్కాండియంలో చిట్టచివరి 21వ ఎలక్ట్రాన్ 4p లోనికి ప్రవేశించకుండా 3d లోనికి ప్రవేశించింది. దీనికి కారణం 4p, 3dల n + l విలువలు సమానం అయినప్పటికీ n విలువ 3d ఆర్బిటాల్ కు కనిష్టం కాబట్టి ఎలక్ట్రాన్ 3d లోనికి ప్రవేశించింది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 19

ప్రశ్న 10.
బోర్ – సోమర్ ఫెల్డ్ పరమాణు నమూనాను వివరించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 20

  1. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు, సోమర్ ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
  2. బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచుతూ, ఇతను రెండవ కక్ష్యకి ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యని, మూడవ కక్ష్యను రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణు కేంద్రకం, ఈ దీర్ఘవృత్తాకార కక్ష్య యొక్క రెండు ప్రధాన నాభులలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
  3. ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం ధీర్ఘవృత్తాకార కక్ష్యల ఏర్పాటుకు దారి తీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.

లోపాలు :
ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను వివరించడంలో ఈ నమూనా విఫలమైంది.

ప్రశ్న 11.
క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను వివరించుము.
జవాబు:

  1. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి, పరమాణువుకు నిర్ణీతమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి పరమాణువులో ఎలక్ట్రాన్ కచ్చితంగా ఎక్కడ ఉంటుందో చెప్పడం కష్టం.
  2. ఈ పరిస్థితులలో పరమాణువులోని ఎలక్ట్రానుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి ఇర్విన్ ప్రోడింగర్ క్వాంటం యాంత్రిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.
  3. ఈ నమూనా ప్రకారం, ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రానులు, పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ ప్రాంతాలనే ఆర్బిటాళ్ళు అంటారు.
  4. ఒకే శక్తి స్థాయిలకు చెందిన ఆర్బిటాళ్ళు గురించి క్వాంటం సంఖ్యల ఆధారంగా తెలుసుకోవచ్చు.

ప్రశ్న 12.
పౌలీవర్జన నియమమును ఒక ఉదాహరణతో వివరించుము.
జవాబు:
పౌలీవర్జన నియమం :
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు.
ఉదా : He, Z = 2
ఎలక్ట్రాన్ విన్యాసం : 1s²

నాలుగు క్వాంటం సంఖ్యలు :
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 21

ప్రశ్న 13.
p – ఆర్బిటాల్ పటాలను గీయుము.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 22
జవాబు:
p యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య విలువ l = 1.
వీటి అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ml = – 1, 0, + 1.
p ఆర్బిటాల్ యొక్క ఆకృతి డంబెల్ ఆకారంలో ఉండును.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 23

ప్రశ్న 14.
d – ఆర్బిటాళ్ల ఆకృతులు గీయుము.
జవాబు:
d ఉపస్థాయి యొక్క కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య విలువ l = 2.
d ఉపస్థాయి యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు ml = – 2 – 1, 0, 1, 2.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 24

ప్రశ్న 15.
విద్యుదయస్కాంత వర్ణపటం గీచి, వివిధ వికిరణాల తరంగదైర్ఘ్యాలను చూపుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 25

ప్రశ్న 16.
“ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది”. ఈ వాక్యాన్ని సమర్థిస్తావా?
జవాబు:
అవును. నేను సమర్థిస్తాను.
నైట్రోజన్లో ఉన్న మూడు p – ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో సగం నిండి ఉంటాయి.
“సమశక్తి ఆర్బిటాళ్ళు సగం నిండినా లేదా పూర్తిగా నిండిన దానికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 26
కనుక ఆక్సిజన్ కన్నా నైట్రోజన్ కు స్థిరత్వం ఎక్కువ.

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం ½ Mark Important Questions and Answers

1. పరమాణువులోని ఉపకణాల పేర్లు రాయుము.
జవాబు:
ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్

2. దృగొగోచర కాంతి వడి ఎంత?
జవాబు:
3 × 108 ms-1

3. తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని ఏమంటారు?
జవాబు:
తరంగదైర్యం (λ)

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

4. ఒక సెకనులో ఒక బిందువును దాటే తరంగాల సంఖ్యను ఏమంటారు?
జవాబు:
పౌనఃపున్యం (υ)

5. పౌనఃపున్యం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
హెర్ట్జ్ (లేదా) \(\frac{1}{s}\) (లేదా) s-1,

6. \(\frac{\text { c }}{\lambda}\) దేనిని సూచించును?
జవాబు:
పౌనఃపున్యం

7. తరంగదైర్ఘ్యం (λ), పౌనఃపున్యం (υ) మరియు కాంతి తరంగ వేగం (c) ల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
c = υλ

8. c = υλ. లో υ పెరిగితే? ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది

9. విద్యుదయస్కాంత తరంగాల వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయాన్ని ఏమంటారు?
జవాబు:
విద్యుదయస్కాంత వర్ణపటం

10. సహజంగా ఏర్పడే వర్ణపటంనకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఇంద్రధనుస్సు

11. క్రింది ఇవ్వబడిన కిరణాలను వాటి తరంగదైర్ఘ్యం ఆధారంగా ఆరోహణ క్రమంలో రాయండి.
γ (గామా) కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, దృగ్గోచర కాంతి.
జవాబు:
γ కిరణాలు < అతినీలలోహిత కిరణాలు < దృగ్గోచర కాంతి < పరారుణ కిరణాలు

12. దృగ్గోచర కాంతి తరంగదైర్ఘ్యం ఎంత?
జవాబు:
400 nm నుండి 700 nm

13. క్రింది వానిలో దేనికి తక్కువ తరంగదైర్ఘ్యం కలదు?
A) కాస్మిక్ కిరణాలు
B) γ – కిరణాలు
C) మైక్రో కిరణాలు
జవాబు:
A) కాస్మిక్ కిరణాలు

14. విద్యుదయస్కాంత శక్తి గ్రహించినా, విడుదలయినా ఇలా ఉంటుంది.
a) అవిచ్ఛిన్నంగా
b) విచ్ఛిన్నంగా
జవాబు:
b) విచ్ఛిన్నంగా

15. ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత?
జవాబు:
6.626 × 10-34 J

16. ‘υ’ పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగం ఎంత శక్తి (E) ని విడుదల చేయగలదు?
జవాబు:
E = hυ

17. ఒక విద్యుదయస్కాంత తరంగం యొక్క తరంగదైర్ఘ్యం తగ్గించినా లేదా పౌనఃపున్యం పెంచినా తరంగ శక్తి ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గును

18. క్యూప్రిక్ క్లోరైడ్ ను మండించినపుడు ఏ రంగును పరిశీలిస్తావు?
జవాబు:
ఆకుపచ్చ రంగు

19. స్ట్రాన్షియం క్లోరైడ్ ను సన్నని జ్వాలపై మండించినప్పుడు ఏ రంగులో మండుతుంది?
జవాబు:
క్రిమ్సన్ ఎరుపు

20. రమేష్ కు వీథి దీపాలు కొన్ని పసుపురంగులో వెలుగుతూ కనిపించాయి. ఆ పసుపురంగుకి కారణం ఏమిటో ఊహించుము.
జవాబు:
సోడియం ఆవిరి

21. రేఖావర్ణపటం ఉపయోగం ఏమిటి?
జవాబు:
తెలియని పరమాణువులను గుర్తించుటకు

22. ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి ఉత్తేజ స్థితికి వెళ్తుంది. ఉత్తేజ స్థితిలో ఎప్పటికీ ఉండగలుగుతుందా?
జవాబు:
ఉండలేదు.

23. జతపర్చుము.
a) ఎలక్ట్రాన్ భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళ్ళినపుడు ( ) i) శోషణ వర్ణపటం
b) ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయి నుండి భూస్థాయికి వెళ్ళినపుడు ( ) ii) ఉద్గార వర్ణపటం
జవాబు:
a – i, b – ii

24. రేఖావర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేని పరమాణు నమూనా ఏది?
జవాబు:
బోర్ పరమాణు నమూనా

25. దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:
సోమర్ ఫెల్డ్

26. బోర్ మొదటి వృత్తాకార కక్ష్యకు, సోమర్ ఫెల్డ్ ఎన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలను జోడించాడు?
జవాబు:
సున్న

27. హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని సూక్ష్మరేఖలను గూర్చి వివరించిన పరమాణు నమూనా ఏది?
జవాబు:
బోర్ – సోమర్ ఫెల్డ్

28. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క వర్ణపటాలను వివరించడంలో విఫలమైన నమూనా
A) బోర్
B) బోర్-సోమర్ ఫెల్డ్
C) A మరియు B
D) రెండూ కావు.
జవాబు:
C) A మరియు B

29. క్వాంటం సిద్ధాంత రూపకర్త ఎవరు?
జవాబు:
మ్యాక్స్ ప్లాంక్

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

30. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా ప్రతిపాదించిన వారు ఎవరు?
జవాబు:
ఇర్విన్ జోడింగర్

31. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ను కనుగొనగలిగే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా వుంటుందో ఆ ప్రాంతాన్ని ఏమంటారు?
జవాబు:
ఆర్బిటాల్

32. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎక్కడ కనిపిస్తాయి?
జవాబు:
ఆర్బిటాళ్ళలో

33. పరమాణువులో, కేంద్రకం చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యతను సూచించే సంఖ్యలను ఏమంటారు?
జవాబు:
క్వాంటం సంఖ్యలు

34. ప్రధాన కర్పర పరిమాణం, దాని శక్తిని గూర్చి తెలుపు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య (n)

35. ప్రధాన క్వాంటం సంఖ్య (n) విలువలు రాయుము.
జవాబు:
n = 1, 2, 3, ……..

36. క్రింది. ఏ ఆర్బిట్ పరిమాణం ఎక్కువ? జ.
A) n = 1
B) n = 3
C) n = 2
D) ఏదీకాదు
జవాబు:
B) n = 3

37. కర్సరాలు K,L,M,N లకు సరిపోవు…’n’ విలువలను రాయుము.
జవాబు:
n = 1, 2, 3, 4

38.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 27
• ఏ కర్పరం కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది?
జవాబు:
K (లేదా) n = 1

• ఏ కర్పరం శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
N (లేదా) n = 4

• పై పట్టికలోని విలువలు ఏ క్వాంటం సంఖ్యను సూచిస్తాయి?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య

39. ప్రతి n విలువకు ‘1’ విలువలు రాయండి.
జవాబు:
0 నుండి n – 1

40. ఏ క్వాంటం సంఖ్య ఉపకర్పరాన్ని సూచించును?
జవాబు:
‘l’ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య).

41. ఉపకర్పరం యొక్క ఆకృతిని తెలియజేయు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
‘l’ (కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య)

42. l = 2 అయిన ఉపకర్పరం ఏది?
జవాబు:
‘d’

43. 1 = 0 అయిన ఉపకర్పరం దేనిని సూచించును?
జవాబు:
‘s’

44. n = 1 మరియు 1 = 0 అయిన ఆర్బిటాల్ పేరు రాయండి.
జవాబు:
‘1s’

45. n = 2 ప్రధాన కర్పరంలో ఉండే ఉపకర్పరాల పేర్లు రాయండి.
జవాబు:
2s, 2p

46. f-ఆర్బిటాల్ యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎంత?
జవాబు:
3 ( l = 3)

47. n = 4 అయిన ‘l’ యొక్క గరిష్ఠ విలువ ఎంత?
జవాబు:
3

48. n = 4 అయిన ‘I’ యొక్క విలువలు రాయండి. రాయుము.
జవాబు:
l = 0, 1, 2, 3

49. ‘n’ కి గరిష్ట ‘l’ విలువ ఎంత?
జవాబు:
(n – 1)

50. ‘l’ విలువకు ఎన్ని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువలు వుంటాయి?
జవాబు:
(2l + 1) (-l, (-l + 1), -0, 1, (+l -l), + l]

51. l విలువకు అయస్కాంత క్వాంటం సంఖ్య ఏఏ విలువలను కలిగి ఉంటుంది?
జవాబు:
-l, 0, +l

52. పరమాణువులో గల ఆర్బిటాళ్ళ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని ఏ క్వాంటం సంఖ్య సూచిస్తుంది?
జవాబు:
అయస్కాంత క్వాంటం సంఖ్య

53. l = 0 అయితే m, విలువలు ఎన్ని ఉంటాయి?
జవాబు:
ఒకటి (0)

54. l = 0 అయితే ఏ ఆర్బిటాల్ ను సూచిస్తుంది?
జవాబు:
‘s’

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

55. l = 1 అయితే m, విలువలు ఎన్ని వుంటాయి?
జవాబు:
3 [ ∵ (px, py, pz); (-1, 0, +1)]

56. ఒక ఉపకర్సరంలో ఉండే ఆర్బిటాళ్ళను ఏమంటారు?
జవాబు:
సమశక్తి ఆర్బిటాళ్ళు

57. క్రింది ఇచ్చిన l విలువలకు సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్యను రాయండి.
l = 0, l = 1, l = 2, l = 3
జవాబు:
l = 0 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 1 (0)
l = 1 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 3 (-1, 0, +1)
l = 2 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 5 (-2, -1, 0 + 1, +2)
l = 3 — సమశక్తి ఆర్బిటాళ్ళ సంఖ్య = 7 (-3, -2, -1, 0, +1, +2, +3)

58. S ఆర్బిటాల్ కి ml విలువ ఎంత?
జవాబు:
‘0’

59. 1=1 అయిన డీ జనరేటెడ్ ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత? అవి ఏవి?
జవాబు:
3; px, py, pz.

60. ఇచ్చిన ‘1’ విలువకి ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యను తెలుసుకొనుటకు ఉపయోగపడు సూత్రం
జవాబు:
21 + 1

61. ప్రతి ఉపకర్పరంలో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి?
జవాబు:
ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్యకు రెట్టింపు.

62. s,p,d,f ఉపకర్పరాలలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్యను రాయుము.
జవాబు:
2, 6, 10, 14

63. S ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
1

64. p ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
3

65. గరిష్ఠంగా 5 ఆర్బిటాళ్లు గల ఉపకర్పరం పేరు ఏమిటి?
జవాబు:
‘d’

66. l = 3 ఉపకర్పరంలో ఆర్బిటాళ్ళ సంఖ్య ఎంత?
జవాబు:
‘7’

67. l = 3 కి m, విలువలు రాయుము.
జవాబు:
-3, -2, -1, 0, + 1, +2, +3

68. ఆర్బిటాళ్ళ ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని సూచించు క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
అయస్కాంత క్వాంటం సంఖ్య

69. S – ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
గోళాకారం

70. p- ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
డంబెల్

71. d – ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి?
జవాబు:
డబుల్ డంబెల్

72. AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 28   ఈ ఆర్బిటాల్ పేరు ఏమిటి?
జవాబు:
S – ఆర్బిటాల్

73. AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 29 ఈ ఆర్బిటాల్ పేరు రాయుము.
జవాబు:
py – ఆర్బిటాల్

74. AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 30 ఈ ఆర్బిటాల్ పేరు రాయుము.
జవాబు:
dxy– ఆర్బిటాల్

75. d-ఆర్బిటాళ్ళ జ్యామితీయ ఆకృతుల పేర్లు రాయుము.
జవాబు:
dxy, dyz dzx dx²-y² d

76. 5-డీజనరేటెడ్ ఆర్బిటాళ్ళు గల ఉపకర్పరం ఏది?
జవాబు:
‘d’

77. ఉపకర్పరం (1) కి, గరిష్ఠ ఎలక్ట్రానికి మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
2(2l + l)

78. ఒక ఆర్బిటాల్ లో గల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
‘2’

79. జతపరుచుము.
a) ఆర్బిటాల్ పరిమాణం ( ) i) l
b) ఆకారం ( ) ii) ml
c) ప్రాదేశిక దిగ్విన్యాసం ( ) iii) n
జవాబు:
a – iii, b – i, c-ii

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

80. ‘ms‘ యొక్క విలువలు రాయండి.
జవాబు:
+ ½ మరియు – ½

81. ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణాలను వివరించే క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
స్పిన్ క్వాంటం సంఖ్య (ms)

82. ఎలక్ట్రాన్స్ రెండు రకాల స్పిన్ విలువలు ధనాత్మకం అయితే ఆ స్పిన్లు ఎలా ఉంటాయి?
జవాబు:
సమాంతరంగా (↓↓) లేదా (↑↑)

83. ఎలక్ట్రాన్స్ దిగ్విన్యాసాలను వివరించే క్వాంటం సంఖ్య ఏది?
జవాబు:
స్పిన్

84. పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఏమంటారు?
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసం

85. సాధారణంగా సవ్యదిశలో ఉన్న స్పిన్ ను ఎలా సూచిస్తారు?
జవాబు:
↑ లేదా + ½

86. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతాన్ని రాయండి.
జవాబు:
nlx

87. nlx లో n, 1, x లు వేటిని సూచిస్తాయి?
జవాబు:
n = ప్రధాన శక్తి స్థాయి
1 = ఉపశక్తి స్థాయి
X = ఎలక్ట్రాన్ల సంఖ్య

88. nlx పద్ధతిలో ఎన్ని క్వాంటం సంఖ్యలు వున్నాయి?
జవాబు:
‘2’ (n, l)

89. 1s’ లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క అన్ని క్వాంటం సంఖ్యలు రాయండి.
జవాబు:
n = 1, l = 0, ml = 0, ms = + ½ (లేదా) – ½

90. హీలియం పరమాణువులో గల రెండు ఎలక్ట్రాన్ల యొక్క క్వాంటం సంఖ్యలలో వేరుగా గలది ఏది?
జవాబు:
స్పిన్ క్వాంటం సంఖ్య

91. a) ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి.
b) ఒక ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్లు కచ్చితంగా వ్యతిరేక స్పినను కలిగి ఉంటాయి.
పై వాక్యా లలో ఏది సరైనది?
జవాబు:
రెండూ సరియైనవే

92. ఊర్ధ్వ నిర్మాణ నియమం అని దేనికి పేరు?
జవాబు:
ఆబౌ నియమానికి

93. పౌలీవర్జన నియమం రాయుము.
జవాబు:
ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.

94. జంట స్పిన్లు గల ఎలక్ట్రాన్లను ఎలా సూచిస్తారు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 31

95. ఒకే ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్ స్పి న్లు ఎలా ఉంటాయి?
A) ఒకే దిశలో
B) వ్యతిరేక దిశలో
C) A లేదా B
జవాబు:
B) వ్యతిరేక దిశలో

96. ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్స్ సంఖ్యను తెలియజేయు నియమం ఏమిటి?
జవాబు:
పౌలీవర్జన నియమం

97. ఒక ఆర్బిటాల్ కి ఎన్ని m విలువలు ఉంటాయి?
జవాబు:
2

98. హీలియం పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 32

99. ఒక కర్పరం (n) లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
2n²

100. ఒక ఉపకర్పరం (!) లో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
2(2l + l)

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

101. ఆఫ్ బౌ అనగా అర్థం ఏమిటి?
జవాబు:
ఆఫ్ బౌ అనగా ఊర్ధ్వ నిర్మాణం

102. ఆర్బిటాళ్ళలోని ఎలక్ట్రాన్లు నిండే క్రమం ఎలా ఉంటుందని ఆఫ్ బౌ నియమం చెప్పింది?
జవాబు:
ఆర్బిటాళ్ళ ఆరోహణ శక్తి క్రమం

103. 4s, 3d లలో ఎలక్ట్రాన్ దేనిని ముందుగా చేరును?
జవాబు:
4s

104. 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 5s, 5p, 4f, 6s, 5d లను వాటి శక్తి క్రమంలో రాయుము.
జవాబు:
1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d <4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d

105. 4s, 4p, 4d, 3d లలో ఏది తక్కువ శక్తి గలది?
జవాబు:
4s

106. మాయిలర్ చిత్రం దేనిని సూచిస్తుంది?
A) పౌలీవర్జన నియమం
B) ఆఫ్ బౌ నియమం
C) హుండ్ నియమం
జవాబు:
B) ఆఫ్ బౌ నియమం

107. ‘సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఒక్కొక్క ఎలక్ట్రాతో నిండిన తర్వాతే జతకూడడం జరుగును”. ఈ నియమం పేరేమిటి?
జవాబు:
హుండ్ నియమం

108. కార్బన్ పరమాణువులో భూస్థాయిలో p ఆర్బిటాళ్ళలో ఒకే స్పిన్ గల ఎలక్ట్రాన్లు ఎన్ని కలవు?
జవాబు:
2

109. నిర్దిష్ట పౌనఃపున్యాలు గల కాంతి శక్తి మాత్రమే శోషణం లేదా ఉద్గారం చెందడం వలన ఏర్పడే పటాన్ని ఏమంటారు?
జవాబు:
పరమాణు రేఖా వర్ణపటం

110. పరమాణువు వికిరణ శక్తి నిర్దిష్ట విలువ ప్రమాణాన్ని ఏమంటారు?
జవాబు:
క్వాంటం

111. అనేక తరంగదైర్యాల లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని ఏమందురు?
జవాబు:
వర్ణపటం

112. 1s² 2s² 2px² ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
హుండ్ నియమం

113. He : ↑↑ ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
పౌలీవర్జన నియమం

114. 1s² 2s² 2p6 3s² 3p6 3d10 ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
ఆఫ్ బౌనియమం

115. క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం రాయుము.
జవాబు:
1s² 2s² 2p6 3s² 3p6 4s¹ 3d5

116. రాగి (కాపర్) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయుము.
జవాబు:
1s² 2s² 2p6 3s² 3p6 4s¹ 3d10

117.
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 33
ఇది ఏ నియమాన్ని ఉల్లంఘించింది?
జవాబు:
హుండ్ నియమం

118. 1s°2s² 2p4 లో ఏ నియమం ఉల్లంఘింపబడింది?
జవాబు:
ఆబౌ నియమం

119. సోడియం పరమాణువులో చివరిగా చేరే ఎలక్ట్రాన్ యొక్క అన్ని క్వాంటం సంఖ్యలు రాయండి.
జవాబు:
n = 2, l = 1, ml = +1, ms = +½ (లేదా) -½

120. ‘K’ మరియు ‘I’ కక్ష్యలలో దేనికి ఎక్కువ శక్తి గలదు?
జవాబు:
‘L’

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

121. M – కర్పరంలో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత?
జవాబు:
18

122. ఒక విద్యుదయస్కాంత తరంగదైర్ఘ్యం 1మీ. దాని పౌనఃపున్యం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 34

అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రశ్న 1.
“ప్రతి మూలకం, తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుంది”. దీనిని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:

  • చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ ను వాచ్ గ్లాసులో తీసుకొని, గాఢ హైడ్రోక్లోరికామ్లం కలిపి ముద్దలా చేయండి.
  • ఒక ప్లాటినం తీగ చివరను రింగులా మడచి లూప్ లాగా చేసి దానిపై ముద్దను తీసుకొని సన్నని జ్వాలపై పెట్టండి.
  • ఇది ఆకుపచ్చ రంగు మంటని ఇస్తుంది.
  • ఇదే ప్రయోగాన్ని ఫ్రాన్షియం క్లోరైడ్ తో చేయండి.
  • ఇది ఎరుపు రంగు మంటను ఇస్తుంది.
    పై ప్రయోగాల ద్వారా ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని ఋజువౌతుంది.

ప్రశ్న 2.
వివిధ మూలకాలను ఒకే జ్వాలపై వేడిచేసినపుడు వేరు వేరు రంగులు గల మంటలను ఎందుకు ఏర్పరుస్తాయి?
జవాబు:
వివిధ మూలకాలు ఒకే జ్వాలపై వేడిచేసినపుడు వేరు వేరు రంగులు గల మంటలను ఏర్పరచుటకు కారణం ఆయా మూలకాలలోని ఎలక్ట్రాన్లు వెలువరించే విద్యుదయస్కాంత తరంగాల వైవిధ్యభరితమైన పౌనఃపున్యాలు.

ప్రశ్న 3.
ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన మార్గంలో తిరగవు అని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఎలక్ట్రాన్లు కంటికి కనిపించని కణాలు. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ల వేగాన్ని, స్థానాన్ని కనుగొనడానికి కూడా తగిన కాంతి సహాయాన్ని తీసుకుంటాము. ఎలక్ట్రానులు అత్యంత సూక్ష్మమైనవి. కాబట్టి అతి తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతినే ఈ పనికి వాడుకోవలసి ఉంటుంది. ఈ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎలక్ట్రాన్ ను తాకినపుడు అది ఎలక్ట్రాన్ చలనాన్ని ప్రభావితం చేసి దాని చలనంలో మార్పుని కలుగజేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ స్థానాన్ని గాని, వేగాన్ని గాని కచ్చితంగా ఒకేసారి కనుక్కోలేం. దీనిని బట్టి ఎలక్ట్రాన్ ఒక నిర్దిష్టమైన మార్గాన్ని అనుసరించదని తెలుస్తుంది.

ప్రశ్న 4.
బోర్ పరమాణు నమూనా యొక్క ముఖ్యమైన లోపమేమిటి?
జవాబు:
బోర్ పరమూణు నమూనా, రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని వివరించలేకపోయింది.

ప్రశ్న 5.
సోమర్ ఫెల్డ్ ప్రతిపాదించిన దీర్ఘవృత్తాకార కక్ష్యలు అనగానేమి?
జవాబు:

  • రేఖా వర్ణ పటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్ ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించినాడు. అతడు దీర్ఘ వృత్తాకార కక్ష్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
  • బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యను అలాగే వుంచుతూ ఇతను రెండవ కక్ష్యకి ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యను, మూడవ కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలుపుతూ, పరమాణువు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష్య యొక్క రెండు ప్రధాన నాభిలలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.
  • ఒక కేంద్ర బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్ష్యలు ఏర్పడుటకు దారి తీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది.

ప్రశ్న 6.
బోర్ – సోమర్ ఫెల్డ్ నమూనాలో ప్రధాన లోపం ఏమిటి?
జవాబు:
ఒకటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల మూలకాల యొక్క పరమాణు వర్ణపటాన్ని ఈ నమూనా వివరించలేకపోయింది.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 7.
క్వాంటం సంఖ్యల ఉపయోగమేమిటి?
జవాబు:
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ యొక్క కచ్చితమైన స్థానాన్ని కనుగొనడానికి క్వాంటం సంఖ్యలు ఉపయోగపడతాయి.

ప్రశ్న 8.
ఎలక్ట్రాన్ విన్యాసము అనగానేమి?
జవాబు:
ఒక పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు కర్పరాలు, ఉపకర్షరాలు, ఆర్బిటాళ్ళలో అమరివుండే అమరికను తెలిపేదే ఎలక్ట్రాన్ విన్యాసము.

ప్రశ్న 9.
ఒక ఆర్బిటాల్ కేవలం రెండు ఎలక్ట్రాన్లను మాత్రమే ఎందుకు ఉంచుకోగలదు?
జవాబు:
పౌలీవర్జన సూత్రం ప్రకారం రెండు ms విలువలు మాత్రమే కలవు. ఈ రెండు విలువలు రెండు వేరు వేరు ఎలక్ట్రాన్ల వ్యతిరేక స్పినను తెలుపుతుంది. కావున ఒక ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లను మాత్రమే ఉంచగలం.

ప్రశ్న 10.
‘N’ కర్పరంలో ఉంచగలిగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? అది ఏ నియమాన్ని అనుసరించింది?
జవాబు:
‘N’ కర్పరంలో ఉంచగలిగిన గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య 32.
ఇది 2n² అనే నియమాన్ని అనుసరిస్తుంది.
‘N’ కర్పరానికి ‘n’ విలువ 4
∴ 2n² = 2 × 4² = 2 x 16 = 32

ప్రశ్న 11.
ఒక దృగ్గోచర వర్ణపటం యొక్క తరంగదైర్ఘ్యం విలువలు ఊదా (400 nm) నుండి ఎరుపు (750 nm) వరకు విస్తరించి ఉన్నాయి. ఈ విలువలను పౌనఃపున్యం రూపంలో తెలపండి. (lnm = 10-9 m)
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 35

ప్రశ్న 12.
పసుపు రంగు ఉద్గారము యొక్క తరంగదైర్ఘ్యం 580 A అయిన దీని పౌనఃపున్యాన్ని లెక్కించండి. (1Å = 10-10m)
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 36

ప్రశ్న 13.
ఒక కక్ష్య యొక్క ‘n’ విలువ 2. అయిన సాధ్యమయ్యే ” మరియు ml విలువలు ఏవి?
జవాబు:
n = 2 l = 0 అయిన ml = 0
l యొక్క విలువలు 0, 1. l = 1 అయిన ml = – 1, 0, + 1.

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

ప్రశ్న 14.
కొన్ని ఎలక్ట్రాన్ల క్వాంటం సంఖ్యల సమితులు ఇవ్వబడ్డాయి. వీటిని వాటి శక్తిని బట్టి ఆరోహణ క్రమంలో అమర్చుము.
a) n = 5, 1 = 1, m, = 1, m, = + 1/2
b) n = 4, 1 = 0, m, = 0, m, = – 1/2
c) n = 4, 1 = 1, m, = + 1, m, = – 1/2
d) n = 5, 1 = 0, m, = 0, m, = + 1/2
జవాబు:
ఇచ్చిన క్వాంటం సంఖ్యలను బట్టి a) 5p b) 4s c) 4p d) 5s
ఆరోహణ క్రమం 4s, Ap, 53, 5p అనగా b, c, d, a.

పట్టికలు

పట్టిక – 1
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 37

పట్టిక – 2
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 38 AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 39

పట్టిక – 3
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 40
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 41
AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం 42

10th Class Physics 6th Lesson పరమాణు నిర్మాణం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. p ఆర్బిటాల్ ఆకృతి ……….
A) గోళం
B) రేఖీయం
C) డంబెల్
D) డబుల్ డంబెల్
జవాబు:
C) డంబెల్

2. K కర్పరంలో గల గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య ………
A) 2
B) 4
C) 6
D) 8
జవాబు:
A) 2

3. ప్లాంక్ స్థిరాంకం విలువ ……..
A) 6.023 × 10-34 JS
B) 6.626 × 1034 JS
C) 6.626 × 10-36 Js
D) ఏదీ కాదు
జవాబు:
D) ఏదీ కాదు

4. 3d ఆర్బిటాల్ నిండిన తర్వాత ఎలక్ట్రాన్ ………. లోనికి ప్రవేశించును.
A) 4s
B) ap
C) 5s
D) 4p
జవాబు:
D) 4p

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

5. 1s²2s°2p² అనే ఎలక్ట్రాన్ విన్యాసంలో ఏ నియమం ఉల్లంఘించబడినది?
A) ఆఫ్ బౌ నియమం
B) హుండ్ నియమం
C) పౌలీవర్జన నియమం
D) అష్టక నియమం
జవాబు:
A) ఆఫ్ బౌ నియమం

6. n = 2 అయిన దాని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య l విలువలు = ……….
A) 0, 1
B) 0, 1, 2
C) 0
D) 1, 2
జవాబు:
A) 0, 1

7. l = 3 విలువ గల ఆర్బిటాళ్ళలో నిండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య
A) 6
B) 10
C) 14
D) 18
జవాబు:
C) 14

8. ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రానులకు నాలుగు క్వాంటమ్ సంఖ్యల విలువలు సమానంగా ఉండవని తెలియజేసినది
A) పౌలీ వర్జన సూత్రం
B) ఆఫ్ బౌ సూత్రం
C) హుండ్ సూత్రం
D) ఫ్లెమింగ్ ఎడమచేయి సూత్రం
జవాబు:
A) పౌలీ వర్జన సూత్రం

9. ప్రధాన క్వాంటం సంఖ్య 3 కింది వాటిలో దేనిని తెలియజేస్తుంది?
A) M – ప్రధాన కర్పరం
B) f – ఉప కర్పరం
C) N – ప్రధాన కర్పరం
D) d – ఉప కర్పరం
జవాబు:
A) M – ప్రధాన కర్పరం

10. కింది వాటిలో ఏ పరమాణువు నిర్మాణంను ‘నీల్స్ బోర్’ సిద్ధాంతం సరిగ్గా వివరించింది?
A) హైడ్రోజన్ పరమాణువు
B) హీలియం పరమాణువు
C) కార్బన్ పరమాణువు
D) అన్ని పరమాణువులు
జవాబు:
A) హైడ్రోజన్ పరమాణువు

11. ఒక ప్రధాన కర్పరం (n) లో ఉండగల గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య ……
A) 2n
B) 2n²
C) n²
D) n
జవాబు:
B) 2n²

12. ప్లాంక్ స్థిరాంకం విలువ …….. .
A) 6.626 × 10-27 J.sec
B) 6.626 × 10-34 J.sec
C) 6.626 × 1027 J.sec.
D) 6.626 × 1034 J.sec
జవాబు:
B) 6.626 × 10-34 J.sec

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

13. n = 4; l = 2 అయిన ఆ ఆర్బిటాల్……..
A) 4s
B) 4p
C) 4d
D) 4f
జవాబు:
C) 4d

14. క్రింది వాటిని జతపరుచుము.

A B
1) కర్పర పరిమాణం, శక్తి P) కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య
ii) ఉప కర్పరం ఆకృతి Q) అయస్కాంత క్వాంటమ్ సంఖ్య
iii) ఆర్బిటాల్ ప్రాదేశిక దృగ్విన్యాసం R) ప్రధాన క్వాంటమ్ సంఖ్య

A) (i) – P, (ii) – Q, (iii) – R
B) (i) – R, (ii) – P, (iii) – Q
C) (i) – R, (ii) – Q, (iii) – P
D) (i) – Q, (ii) – R, (iii) – P
జవాబు:
B) (i) – R, (ii) – P, (iii) – Q

15. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త ………
A) మాక్స్ ప్లాంక్
B) సోమర్ ఫెల్డ్
C) మోస్లీ
D) లూయిస్
జవాబు:
B) సోమర్ ఫెల్డ్

16. పరమాణువు అయాన్ గా మారుటకు దోహదపడునది ఏది?
A) కేంద్రక ఆవేశం
B) ద్రవ్యరాశి సంఖ్య
C) న్యూట్రాన్ల సంఖ్య
D) ఎలక్ట్రాన్ల సంఖ్య
జవాబు:
D) ఎలక్ట్రాన్ల సంఖ్య

17. ఆఫ్ బౌ నియమం ప్రకారం క్రింది వాటిలో ఏ ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్లు ముందుగా ప్రవేశించును?
A) 4s
B) 4p
C) 3d
D) 4f
జవాబు:
A) 4s

AP 10th Class Physical Science Important Questions 6th Lesson పరమాణు నిర్మాణం

18. గరిష్ఠంగా 32 ఎలక్ట్రాన్లు ఉండగల కర్పరం
A) N
B) M
C) L
D) K
జవాబు:
A) N

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

These AP 10th Class Physics Chapter Wise Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 5th Lesson Important Questions and Answers మానవుని కన్ను-రంగుల ప్రపంచం

10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
కటక సామర్థ్యం అనగానేమి?
జవాబు:
కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువను కటక సామర్థ్యం అంటారు.

ప్రశ్న 2.
పట్టకంతో ప్రయోగం చేసి, ఏ భౌతికరాశిని కనుగొనగలం?
జవాబు:
పట్టకంతో చేసిన ప్రయోగం ద్వారా

  1. ఆ పట్టక కనిష్ట విచలన కోణాన్ని,
  2. ఆ పట్టక పదార్థ వక్రీభవన గుణకాన్ని కనుగొనవచ్చును.

ప్రశ్న 3.
చత్వారం (Presbyopia) కలగడానికి గల కారణమేమి?
జవాబు:
సాధారణంగా వయసుతోపాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల చత్వారం కలుగుతుంది.

ప్రశ్న 4.
పట్టకం గుండా ప్రయాణించిన కాంతికిరణం పొందే విచలన కోణాన్ని తెలియజేసే పటాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1

ప్రశ్న 5.
ఆకాశం నీలిరంగులో కనబడడం అనే దృగ్విషయానికి గల కారణంను వివరించండి.
జవాబు:
వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువుల పరిమాణం నీలిరంగు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉంటుంది. ఈ అణువుల వలన నీలిరంగు కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆకాశం నీలిరంగులో కనబడుతుంది.

ప్రశ్న 6.
‘దీర్ఘదృష్టి’ గల రోగికి కంటివైద్యుడు సూచించే కటకం పటాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2
దీర్ఘదృష్టి గల రోగికి కంటివైద్యుడు సూచించు కటకం ద్వికుంభాకార కటకము.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 7.
దృష్టి దోషంగల వ్యక్తి దోషం సవరించడానికి + 50 సెం.మీ.ల నాభ్యాంతరం గల ద్వికుంభాకార కటకాన్ని సూచించిన ఆ కటక సామర్థ్యంను కనుగొనుము.
జవాబు:
నాభ్యాంతరం f = 50 సెం.మీ.
కటక సామర్థ్యం (P) = \(\frac{100}{f}\) (సెం! మీ||లో )
P= \(\frac{100}{50}\) = 2 డయాప్టర్లు

ప్రశ్న 8.
ఒక వ్యక్తి యొక్క కంటి కటకం తన గరిష్ఠ నాభ్యంతరాన్ని 2.4 సెం.మీ. కంటే ఎక్కువకు సర్దుబాటు చేసుకోలేకపోతే ఏమి జరుగుతుందో ఊహించండి.
జవాబు:
ఆ వ్యక్తి నిర్ణీత దూరం మేరకు గల వస్తువులను మాత్రమే చూడగలడు. అంతకన్నా దూరంలో ఉన్న వస్తువులను చూడలేడు అతను పుటాకార కటకం వాడవలసి వస్తుంది.

ప్రశ్న 9.
ఒక వ్యక్తి దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోతున్నాడు. ఆ వ్యక్తికి గల దృష్టి లోపాన్ని కిరణచిత్రం ద్వారా చూపండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

ప్రశ్న 10.
కటక సామర్థ్యము, నాభ్యంతరముల మధ్య సంబంధమేమి?
జవాబు:
కటక సామర్థ్యము (P) మరియు నాభ్యంతరము (1) ల మధ్య సంబంధం :
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 4

ప్రశ్న 11.
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఎర్రగా కనపడడానికి గల కారణము రాయండి.
జవాబు:
సూర్యకాంతిలోని ఎరుపు రంగు వేగం ఎక్కువ ఉండడం వల్ల అది పరిక్షేపణం చెందకుండానే మన కంటిని చేరడం వల్ల సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

ప్రశ్న 12.
స్పష్ట దృష్టి కనీస దూరమంటే ఏమిటి?
జవాబు:
మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా, స్పష్టంగా ఒక వస్తువును మనము చూడాలంటే అది దాదాపు 25 సెం.మీటర్ల దూరంలో ఉండాలి. దీనినే స్పష్ట దృష్టి కనీస దూరమంటారు.

ప్రశ్న 13.
10 సం||ల లోపు వారికి స్పష్ట దృష్టి కనీస దూరమెంత?
జవాబు:
10 సం||ల లోపు వారికి స్పష్ట దృష్టి కనీస దూరము విలువ 7 సెం.మీ.ల నుండి 8 సెం.మీ.ల వరకు ఉంటుంది.

ప్రశ్న 14.
వయసు మళ్ళిన వారి విషయంలో స్పష్ట దృష్టి కనీస దూరమెంత?
జవాబు:
వయసు మళ్ళిన వారి విషయంలో స్పష్ట దృష్టి కనీస దూరము విలువ 1 మీటరు నుండి 2 మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న 15.
మానవుని కంటి ఉపయోగమేమి?
జవాబు:
మానవుని కన్ను మన చుట్టూ వున్న వివిధ వస్తువులను, రంగులను చూడడానికి ఉపయోగపడును.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 16.
మానవుని. కన్ను దేనిపై ఆధారపడి పనిచేయును?
జవాబు:
మానవుని కన్ను దృష్టి ప్రతిస్పందన అనే నియమంపై ఆధారపడి పని చేయును.

ప్రశ్న 17.
మనము ఏ విధంగా వస్తువులను చూడగలుగుతున్నాము?
జవాబు:
వస్తువులపై పడిన కాంతి పరిక్షేపణం చెంది మన కంటిని చేరడం వలన మనము వస్తువులను చూడగలుగుతున్నాము.

ప్రశ్న 18.
దృష్టికోణం అంటే ఏమిటి?
జవాబు:
ఏ గరిష్ఠ కోణం వద్ద మనము వస్తువును పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని “దృష్టికోణం” అంటారు.

ప్రశ్న 19.
సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టికోణం విలువలను వ్రాయుము.
జవాబు:
సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరము 25 సెం.మీ. మరియు దృష్టికోణము 60° అగును.

ప్రశ్న 20.
కంటిలోని కటకానికి, రెటీనాకు మధ్య దూరం ఎంత ఉంటుంది?
జవాబు:
కంటిలోని కటకానికి, రెటీనాకు మధ్య దూరం దాదాపు 2.5 సెం.మీ. ఉంటుంది.

ప్రశ్న 21.
కార్నియా అంటే ఏమిటి?
జవాబు:
గోళాకారపు కనుగుడ్డు ముందు ఉండే పారదర్శక రక్షణ పొరను “కార్నియా” అంటారు.

ప్రశ్న 22.
నల్లగుడ్డు లేక ఐరిస్ అంటే ఏమిటి?
జవాబు:
నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య గల కండర పొరను నల్లగుడ్డు లేక “ఐరిస్” అంటారు.

ప్రశ్న 23.
సర్దుబాటు అంటే ఏమిటి?
జవాబు:
కంటి కటక నాభ్యంతరంను తగిన విధముగా మార్పు చేసుకునే పద్ధతిని “సర్దుబాటు” అంటారు.

ప్రశ్న 24.
కంటికటక సర్దుబాటు దోషాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
కంటికటక సర్దుబాటు దోషాలు మూడు రకాలు. అవి :

  1. హ్రస్వదృష్టి
  2. దీర్ఘదృష్టి
  3. చత్వారం

ప్రశ్న 25.
హ్రస్వదృష్టి అంటే ఏమిటి?
జవాబు:
గరిష్ఠ దూర బిందువుకు ఆవల వున్న వస్తువును చూడలేకపోయే దోషమును “హ్రస్వదృష్టి” అంటారు.

ప్రశ్న 26.
దీర్ఘదృష్టి అంటే ఏమిటి?
జవాబు:
దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలిగి, దగ్గరిలోని వస్తువులను చూడలేని కంటి దోషమును “దీర్ఘదృష్టి” అంటారు.

ప్రశ్న 27.
చత్వారం అంటే ఏమిటి?
జవాబు:
వయస్సుతో పాటుగా కంటి కటక సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోవు దృష్టి దోషాన్ని “చత్వారం” అంటారు.

ప్రశ్న 28.
చత్వారంను నివారించుటకు వాడు కటకం ఏది?
జవాబు:
చత్వారంను నివారించుటకు ద్వినాభ్యంతర కటకమును ఉపయోగిస్తారు.

ప్రశ్న 29.
విచలన కోణం అంటే ఏమిటి?
జవాబు:
ఒక పట్టకపు పతన, బహిర్గత కిరణాలను వెనుకకు పొడిగించగా, ఆ రెండు కిరణాల మధ్య కోణమును “విచలన కోణం” అంటారు.

ప్రశ్న 30.
పట్టకపు పతన, బహిర్గత మరియు విచలన కోణాల మధ్య సంబంధమును వ్రాయుము.
జవాబు:
A+ d = i1 + i2
ఇక్కడ A = పట్టకపు కోణం, d = విచలన కోణం, i1 = పతన కోణం, i2 = బహిర్గత కోణం.

ప్రశ్న 31.
పట్టకపు వక్రీభవన గుణక సూత్రమును వ్రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5

ప్రశ్న 32.
తెల్లని కొంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించగలమా?
జవాబు:
తెల్లని కాంతి రంగులుగా విడిపోవడాన్ని కిరణ సిద్ధాంతంతో వివరించలేము.

ప్రశ్న 33.
పట్టకం గుండా తెలుపు రంగు కాంతిని పంపితే అది వివిధ రంగులుగా ఎందుకు విడిపోతుందో నీవు చెప్పగలవా?
జవాబు:
అన్ని రంగుల కాంతి వేగాలు శూన్యంలో ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఒక యానకంలో ప్రయాణించేటప్పుడు కాంతివేగం దాని తరంగదైర్ఘ్యం పై ఆధారపడును. అందువలన కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 34.
మనము దినపత్రికల్లో, వార్తలలో కంటి దానమునకు సంబంధించిన ప్రకటనలను చూస్తాము. వాటి ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
ఈ రకపు ప్రకటనల వలన

  1. జనాభాలో జ్ఞానేంద్రియాల ప్రాముఖ్యతను పెంపొందించగలం.
  2. అంగవైకల్యం గల వారిపై సానుభూతి తత్వమును పెంపొందించగలం.

ప్రశ్న 35.
కాంతి గాలి నుండి మరొక పారదర్శక యానకంలోకి ప్రవేశించినప్పుడు ఏఏ రంగుల కాంతులు కనిష్ఠ మరియు గరిష్ఠముగా విచలనం పొందును?
జవాబు:
ఎరుపు రంగు కాంతి కనిష్టముగాను, ఊదా రంగు కాంతి గరిష్టముగాను విచలనము పొందును.

ప్రశ్న 36.
తెలుపు మరియు నలుపులను రంగులుగా ఎందుకు లెక్కించరు?
జవాబు:
ఒక వస్తువు అన్ని రంగులను పరిక్షేపణం చెందించిన అది తెల్లగాను, శోషించుకున్న అది నల్లగాను కనిపించును, కావున ఈ రంగులను లెక్కలోనికి తీసుకొనరు.

ప్రశ్న 37.
ఇంద్రధనుస్సు ఏ ఆకారంలో కనపడును?
జవాబు:
ఇంద్రధనుస్సు అర్ధవలయాకారంలో కనపడును.

ప్రశ్న 38.
60°ల పట్టక కోణం (A) గల పట్టకం యొక్క కనిష్ఠ విచలన కోణం (D) 30°. అయిన పట్టకం తయారీకి వినియోగించిన పదార్థ వక్రీభవన గుణకాన్ని కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 6

ప్రశ్న 39.
కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం వలె పనిచేసే అవయవం ఏది?
జవాబు:
కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం వలె పనిచేసే అవయవం కనుపాప (Pupil). ఇందుకొరకు కాంతి ప్రకాశవంతంగానున్న సందర్భాలలో కనుపాపను సంకోచింప చేయుట, కాంతి ప్రకాశం తక్కువ ఉన్నపుడు కనుపాపను వ్యాకోచింప చేయుటలో ‘ఐరిస్’ ఉపయోగపడుతుంది.

ప్రశ్న 40.
మానవుని కన్నులో దండాలు, శంఖువుల పాత్ర ఏమిటి?
జవాబు:
కంటిలోని దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి.

ప్రశ్న 41.
గరిష్ఠ దూర బిందువు అనగానేమి?
జవాబు:
ఏ గరిష్ఠ దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో ఆ బిందువును గరిష్ఠ దూర బిందువు అంటారు.

ప్రశ్న 42.
కనిష్ఠ దూర బిందువు అనగానేమి?
జవాబు:
ఏ కనిష్ఠ దూరం వద్ద గల బిందువుకు ఆవల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచ గలదో, ఆ బిందువును కనిష్ఠ దూర బిందువు అంటారు.

ప్రశ్న 43.
చత్వారం అనగానేమి? దీనిని ఎలా సరిచేస్తారు?
జవాబు:
సాధారణంగా వయసుతోపాటు కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇటువంటి దృష్టి దోషాన్ని చత్వారం అంటారు. దీని నివారణకు ద్వినాభ్యంతర కటకాన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 44.
కాంతి తీవ్రత అనగానేమి?
జవాబు:
కాంతి ప్రయాణ దిశకు లంబంగానున్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని కాంతి తీవ్రత అంటారు.

ప్రశ్న 45.
సూర్య కిరణాలకు లంబ దిశలో మనం ఆకాశాన్ని చూసినపుడు, ఆకాశం ఏ రంగులో కనబడుతుంది?
జవాబు:
సూర్యకిరణాల దిశకు లంబ దిశలో మనం ఆకాశాన్ని చూసినపుడు, ఆకాశం నీలి రంగులో కనబడుతుంది.

ప్రశ్న 46.
నలుపు, తెలుపు రంగుల ప్రత్యేకత ఏమి?
జవాబు:
నలుపు అనగా అన్ని రంగులను పూర్తిగా ఒక వస్తువు శోషణం చేసుకొన్నది అని అర్థం. తెలుపు అనగా ఏడురంగుల మిశ్రమం. ఒక వస్తువు కాంతిని పూర్తిగా పరావర్తనం చెందిస్తే దానిని తెలుపుగా గుర్తిస్తారు.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 47.
పట్టకమునకు సంబంధించి క్రింది పదాలను నిర్వచింపుము.
a) పతన కిరణం
b) లంబము
c) పతన కోణము
d) బహిర్గత కిరణం
e) బహిర్గత కోణం
f) వక్రీభవన కోణం
g) విచలన కోణం
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 6
a) 1) పటంలో APQR, పట్టకం యొక్క త్రిభుజాకార ఆధారపు హద్దును సూచిస్తుంది.
2) PQ అనే సమాంతర తలంపై M బిందువు వద్ద ఒక కాంతి కిరణం పతనమైనదని భావిస్తే, ఈ కిరణాన్ని పతన కిరణం అంటారు.

b) M వద్ద PQ తలానికి ఒక లంబాన్ని గీస్తే అది, ఆ తలానికి పతన బిందువు వద్ద లంబము.

c) పతన కిరణానికి, లంబానికి మధ్యగల కోణాన్ని “పతనకోణం (i1)” అంటారు.

d) పతన కిరణం M వద్ద వక్రీభవనం చెంది పట్టకం గుండా ప్రయాణించి మరో సమతలంపై గల ‘N’ బిందువును చేరుతుంది. చివరకు PR తలంపై గల ‘N’ బిందువు గుండా బయటకు వెళుతుంది. దీనినే “బహిర్గత కిరణం” అంటారు.

e) బహిర్గత కిరణానికి ‘N’ వద్ద PR తలానికి గీసిన లంబానికి మధ్య గల కోణాన్ని బహిర్గత కోణం (i2) అంటారు.

f) PQ, PR తలాల మధ్య కోణాన్ని పట్టక కోణం (A) లేదా పట్టక వక్రీభవన కోణం అంటారు.

g) పతన కిరణానికి, బహిర్గత కిరణానికి మధ్య గల కోణాన్ని విచలన కోణం ‘d’ అంటారు.

ప్రశ్న 48.
పట్టకం గుండా ఒకే రంగు గల కాంతిని పంపించామనుకుందాం. అది మరికొన్ని రంగులుగా విడిపోతుందా. ఎందుకు?
జవాబు:
కాంతి జనకం ఒక సెకనుకు విడుదల చేసే కాంతి తరంగాల సంఖ్యను పౌనఃపున్యం అంటాం. కాంతి పౌనఃపున్యం అనేది కాంతి జనకం యొక్క లక్షణం. ఇది ఏ యానకం వలన కూడా మారదు. అనగా వక్రీభవనంలో కూడా పౌనఃపున్యం. మారదు. అందువల్ల పారదర్శక పదార్థం గుండా ప్రయాణించే ‘రంగు కాంతి’ యొక్క రంగు మారదు.

ప్రశ్న 49.
కంటి నుండి వస్తు దూరాన్ని పెంచినపుడు కంటిలోని ప్రతిబింబం దూరం ఎలా మారుతుంది?
జవాబు:
కంటిలో ప్రతిబింబ దూరం (కంటి కటకము మరియు రెటీనాల మధ్య దూరం) స్థిరంగా ఉంటుంది. దీనిని మార్చలేము. కావున వస్తుదూరాన్ని పెంచినప్పటికీ ప్రతిబింబ దూరం మారదు. కాని ప్రతిబింబ పరిమాణంలో మార్పు ఉంటుంది.

ప్రశ్న 50.
విమానంలో నుండి చూసినపుడు ఇంద్రధనుస్సు ఒక పూర్తి వృత్తం లాగా కనిపిస్తుంది. విమానం యొక్క నీడ ఎక్కడ ఏర్పడుతుంది?
జవాబు:
విమానానికి, ఇంద్రధనుస్సుకు మధ్య భూమి అడ్డుగా లేకపోవుట వల్ల, విమానంలో నుండి చూసినపుడు ఇంద్ర ధనుస్సు పూర్తి వృత్తాకారంగా కనిపిస్తుంది. అపుడు విమానం యొక్క నీడ వృత్తాకార ఇంద్రధనుస్సు యొక్క కేంద్రం వద్ద ఏర్పడుతుంది.

ప్రశ్న 51.
దృష్టికోణం అనగానేమి? దీని విలువ ఎంత?
జవాబు:
ఏ గరిష్ఠ కోణం వద్ద మనము వస్తువును పూర్తిగా చూడగలమో, ఆ కోణాన్ని దృష్టికోణం అంటారు. దృష్టికోణం విలువ 60°

10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఇంద్రధనుస్సు ఏ ఏ సందర్భాలలో ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది?
జవాబు:
i) వర్షం పడిన తరువాత గాలిలో నీటి తుంపరలు ఉన్న సమయంలో సూర్యరశ్మి ఉన్న సమయంలో ఇంధ్రధనుస్సు ఏర్పడును.
ii) ప్రకృతిలోని తెల్లని సూర్యకాంతి, అనేక లక్షల నీటి బిందువుల చేత విక్షేపణం చెందడం వలన ఇంధ్రధనుస్సు ఏర్పడును.

ప్రశ్న 2.
ఒక వ్యక్తికి స్పష్ట దృష్టి కనీస దూరం 35 సెం.మీ. ఉన్నట్లుగా గుర్తించాం. అతని పరిసరాలను అతను స్పష్టంగా చూడడానికి ఏ కటకం ఉపయోగపడుతుంది? ఎందుకు?
జవాబు:
ఒక వ్యక్తి స్పష్టదృష్టి కనీస దూరం 35 సెం.మీ. అనగా అది సాధారణ మానవుని స్పష్టదృష్టి కనీస దూరం (25 సెం.మీ) కన్నా ఎక్కువ. కనుక ఆ వ్యక్తికి గల దోషం ‘దీర్ఘ దృష్టి’.

అతను పరిసరాలను స్పష్టంగా చూడడానికి ఉపయోగపడే కటకం “ద్వికుంభాకార కటకం”.

ప్రశ్న 3.
కుంభాకార కటకం ఉపయోగించి దీర్ఘ దృష్టి దోషం సవరించడాన్ని చూపే కిరణ చిత్రంను గీయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 5

ప్రశ్న 4.
కంటిలోని ఐరిస్ పనితీరును మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:
కనుపాప ద్వారా కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని నియంత్రిస్తుంది.

ప్రశ్న 5.
పట్టకము యొక్క వక్రీభవన గుణకమును కనుగొనుటకు నీవు ఏ పరికరాలను ఉపయోగిస్తావు? ఈ ప్రయోగములో గ్రాఫ్ యొక్క ఆవశ్యకతను తెలపండి.
జవాబు:
పరికరాలు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్, పెన్సిల్, గుండుసూదులు, స్కేలు మరియు కోణమానిని

గ్రాఫ్ ఆవశ్యకత :
కనిష్ట విచలన కోణము కనుగొనడానికి గ్రాఫ్ ఉపయోగపడును.

ప్రశ్న 6.
సిలియరి కండరాలలో వ్యాకోచ, సంకోచాలు లేనట్లయితే ఏమి జరుగునో ఊహించి రాయండి.
జవాబు:

  1. సిలియరి కండరాలలో సంకోచ, వ్యాకోచాలు లేనట్లయితే కంటి కటక నాభ్యంతరం మారదు.
  2. మానవుని కన్ను నిర్దిష్ట దూరంలోని వస్తువులను మాత్రమే చూడగలుగుతుంది. ఆ వస్తువు కన్నా దగ్గరగా ఉన్న లేదా దూరంగా ఉన్న వస్తువును కన్ను చూడలేదు.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 7.
నిత్య జీవితంలో కాంతి విక్షేపణంను గమనించే రెండు సందర్భాలు తెలపండి.
జవాబు:
నిత్య జీవితంలో కాంతి విక్షేపణాన్ని కింది సందర్భాలలో గమనించవచ్చు.

  1. ఇంద్రధనుస్సు ఏర్పడడం.
  2. త్రిభుజాకార పారదర్శక పదార్థాల గుండా (పట్టకం, స్కేలు అంచు) సూర్యకాంతిని చూడడం.
  3. నూతన నిర్మాణ ఇండ్లగోడలకు నీటిని కొట్టడం (క్యూరింగ్) వంటి సందర్భాలలో.
  4. నీటిలో ఏటవాలుగా మునిగిన సమతల దర్పణాల వలన కాంతి విక్షేపణం.

ప్రశ్న 8.
ప్రస్వదృష్టి దోషాన్ని సరిచేయుటను చూపు కిరణ రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

ప్రశ్న 9.
కాంతి విక్షేపణం, పరిక్షేపణం జరుగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. కాంతి విక్షేపణం జరుగకపోతే తెల్లని రంగు గల సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోదు (లేదా) ఇంద్రధనుస్సు ఏర్పడదు.
  2. కాంతి పరిక్షేపణం జరుగకపోతే
    ఎ. సూర్యుడు ఉదయం, సాయంత్రం వేళల్లో ఎర్రగా కనపడడు. ఎల్లప్పుడూ తెల్లగానే కనిపిస్తాడు.
    బి. ఆకాశం నీలిరంగులో కనిపించదు.
    సి. వస్తువులకు వివిధ రంగులు ఉండడం జరుగదు.
    డి. వస్తువులను మనం చూడలేము.

ప్రశ్న 10.
కిషోర్ కళ్ళ అద్దాలు ధరించాడు. అతడి కళ్ళద్దాల గుండా నువ్వు చూసినపుడు అతడి కళ్ళ పరిమాణం, అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపించాయి.
a) అతడు వాడిన కటకం ఏ రకం?
b) ఆ దృష్టి దోషాన్ని వివరించండి. (పట సహాయంతో)
జవాబు:
a) కిషోర్ కళ్ళద్దాల గుండా నువ్వు చూసినపుడు అతడి కళ్ళ పరిమాణం, అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపించాయి. అనగా అతడు వాడిన కటకం కుంభాకార కటకం. ఈ కుంభాకార కటకం గుండా చూసినపుడు వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి.
b) కిషోర్ కు గల దోషము, అతడు వాడుచున్న కటకాన్ని బట్టి అతనికి దీర్ఘదృష్టి కలదని అర్థమగుచున్నది.

ఈ దృష్టిదోషం గల వ్యక్తి దగ్గర వస్తువులను చూడలేరు. దీనికి గల కారణం వస్తువులు ఏర్పరచు ప్రతిబింబం రెటీనాకు ఆవల ఏర్పడును. దీని సవరణకు కుంభాకార కటకంను వాడుట వలన కిరణాలు రెటీనా పై పడు విధంగా చేయవచ్చును.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 7

ప్రశ్న 11.
సూర్య రాత్రి 12 గంటలకు నిద్రలేచి, తన రూమ్ లోగల ట్యూబ్ లైట్ స్విచ్ ను ఆన్ చేశాడు. తను ఆ కాంతిలో కనురెప్పలను తెరవటం కష్టం అనిపించింది. దానికి గల కారణాలను ఊహించండి.
జవాబు:

  1. సాధారణంగా మానవుని కంటి రెటీనా ఒకేసారిగా కాంతి లేమి ప్రాంతం నుండి తీవ్రత ప్రాంతం వైపు చూడలేదు.
  2. కాంతి తక్కువగా ఉన్నప్పుడు కనుపాప పెద్దగా ఉంటుంది. ఒకేసారి లైట్ వెలిగి ఎక్కువ కాంతి కంటిలోకి వెళ్ళడం కన్ను భరించలేదు. కనుక కనుపాప పరిమాణం తగ్గిన తర్వాత మాత్రమే’ అతను కన్ను పూర్తిగా తెరువగలడు. అందుకు కొద్దిగా సమయం పడుతుంది.

ప్రశ్న 12.
తరగతి గదిలో నలుగురు స్నేహితులు కటక నాభ్యాంతరాన్ని ప్రయోగపూర్వకంగా కనుగొన్నారు. ఆ విలువలు వరుసగా 12.1 సెం.మీ., 12.2 సెం.మీ. 12.05 సెం.మీ., 12.3 సెం.మీ. గా వచ్చినవి. ఆ స్నేహితులు వారు చూసుకొని ఈ దోషాలకు లేక వ్యత్యాసాలకు గల కారణాలను చర్చించారు. ఆ కారణాలను తెల్పండి.
జవాబు:
విద్యార్థులు వివిధ నాభ్యంతర విలువలు పొందిరి.

  1. పై విలువలను గమనించగా వారందరికీ అన్నీ ధనాత్మక విలువలున్నాయి. అనగా వారికి కుంభాకార కటకమును ఇచ్చిరి.
  2. వారందరికీ ఒకే పూర్ణసంఖ్య విలువ వచ్చినది, కానీ దశాంశ సంఖ్య వేరుగా కలదు.
    కారణాలు :
  3. వారందరి విలువలలో తేడాకు గల కారణము కనీస కొలతలో దోషాలు, దృష్టిదోషాలు, ప్రయోగ వైఫల్యాలు మరియు కొలతలను గుర్తించు దోషాలు మొదలగునవి.

ప్రశ్న 13.
రెటీనా పని తీరును నీవెలా అభినందిస్తావు?
జవాబు:

  1. రెటీనా అనేది ఒక సున్నితమైన పొర.
  2. దీనిలోని గ్రాహకాలు కాంతి సంకేతాలను గ్రహిస్తాయి. దండాలు కొంతి తీవ్రతను గుర్తిస్తాయి.
  3. శంఖువులు రంగును గుర్తిస్తాయి.
  4. ఈ సంకేతాలు దాదాపు 1 మిలియన్ దృకనాడుల ద్వారా మెదడుకు చేరవేయబడతాయి.
  5. వాటిలోని సమాచారాన్ని అనగా వస్తువు ఆకారం, పరిమాణం మరియు రంగులలో ఏ మార్పూ లేకుండా వస్తువును మనం గుర్తించే విధంగా రెటీనా ఉపయోగపడుతుంది. కావున ఇది అభినందనీయమైనది.

ప్రశ్న 14.
దండాలు, శంఖువుల ఉపయోగాలను తెలుపండి.
జవాబు:
దండాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి. శంఖువులు రంగును గుర్తిస్తాయి. శంఖువులు సరిగా పనిచేయకపోతే వర్ణ అంధత్వం ఏర్పడుతుంది. దండాలు సరిగా పనిచేయకపోతే కాంతిని సరిగా చూడలేం.

ప్రశ్న 15.
హ్రస్వదృష్టి, దీర్ఘ దృష్టిల మధ్యగల భేదాలను తెలుపండి.
జవాబు:

హ్రస్వదృష్టి దీర్ఘదృష్టి
1. ఈ దృష్టి లోపం గలవారు గరిష్ఠ దూర బిందువుకు దూరంగా ఉండే వస్తువులు చూడలేరు. 1. ఈ దృష్టి లోపం గలవారు కనిష్ఠ దూర బిందువు కంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు.
2. కాంతి కిరణాలు రెటీనాకు ముందు కేంద్రీకరించబడతాయి. 2. కాంతి కిరణాలు రెటీనా వెనుకవైపు కేంద్రీకరించబడతాయి.
3. ద్విపుటాకార కటకం ద్వారా ఈ దృష్టి దోషాన్ని నివారించవచ్చు. 3. ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి ఈ దృష్టి దోషాన్ని నివారించవచ్చు.

ప్రశ్న 16.
ఈ క్రింది పదాలను నిర్వచించండి.
ఎ) పట్టకము
బి) కాంతి విక్షేపణం
సి) కాంతి పరిక్షేపణం
జవాబు:
ఎ) పట్టకము : ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరుచేయబడి ఉన్న పారదర్శక యానకాన్ని పట్టకం అంటారు.
బి) కాంతి విక్షేపణం : తెల్లని కాంతి పట్టకం గుండా ప్రసరించినపుడు వివిధ రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు.
సి) కాంతి పరిక్షేపణం : ఒక కణం తను శోషించుకొన్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశలలో వివిధ తీవ్రతలతో ఉద్గారం చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటారు.

ప్రశ్న 17.
పట్టక వక్రీభవన గుణకం కనుగొనుటలో గ్రాఫ్ ప్రాముఖ్యతను తెలుపండి.
జవాబు:

  1. గ్రాఫ్ ద్వారా పతనకోణం, విచలన కోణంకు ను గీస్తే ఆ గ్రాఫ్ ద్వారా లభించే కనిష్ఠ విలువ కనిష్ఠ విచలన కోణాన్ని తెలియజేస్తుంది.
  2. పట్టక వక్రీభవన గుణకం కనుగొనడానికి పట్టక కోణంతోపాటు కనిష్ఠ విచలన కోణం అవసరం.

ప్రశ్న 18.
మీ స్నేహితునికి ఉన్న దృష్టి దోషాన్ని తెలుసుకొనుటకు నీవు అతనిని ప్రశ్నించుటకు కొన్ని ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:

  1. నీకు పుస్తకంలో అక్షరాలు కనపడటం లేదా (లేదా) మసకగా కనిపిస్తున్నాయా?
  2. నీకు క్లాస్ లో చివరి బెంచిలో కూర్చున్నప్పుడు బోర్డ్ పై రాసిన అక్షరాలు కనపడటం లేదా?
  3. నీవు పుస్తకాన్ని బాగా దూరంగా పెట్టి చదువుతున్నావా?
  4. రోడ్డుమీద నడుస్తున్నప్పుడు హోర్డింగ్ మీద ఉన్న అక్షరాలు కనపడడం లేదా?

ప్రశ్న 19.
పట్టకము వక్రీభవన గుణకాన్ని కనుగొనుటకు కావలసిన వస్తువులను వ్రాయండి.
జవాబు:
కావలసిన వస్తువులు :
పట్టకం, తెల్లని డ్రాయింగ్ చార్ట్ (20 x 20 సెం.మీ.), పెన్సిల్, గుండుసూదులు మరియు కోణమానిని, గ్రాఫ్ కాగితం.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 20.
కాంతి విక్షేపణలో, ఏర్పడిన ఇంద్రధనుస్సు రంగులను మీ పరిసరాలలో ఈ ప్రక్రియను గమనించిన ఇతర ఉదాహరణలను వ్రాయండి.
జవాబు:

  1. ఫౌంటన్ నీటి ద్వారా కాంతి ప్రసరించినపుడు వివిధ రంగులు గమనించవచ్చు.
  2. టార్చిలైట్ ద్వారా తెల్లని కాంతిని నీటి బిందువుల ద్వారా పంపిస్తే అది వివిధ రంగులలో విడిపోతుంది.

ప్రశ్న 21.
పట్టకానికి సంబంధించిన పదాలను పటము ద్వారా వివరించండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 6

  1. పతన కిరణం : పట్టకంపైన పడిన కాంతి కిరణం
  2. బహిర్గత కిరణం : పట్టకం రెండవ తలం నుంచి బయటకు వచ్చిన కిరణం.
  3. పతనకోణం (i) : పతన కిరణానికి, లంబానికి మధ్య గల కోణం.
  4. బహిర్గత కోణం (i,) : బహిర్గత కిరణానికి, లంబానికి మధ్య గల కోణం.
  5. విచలన కోణం : పతన కిరణానికి, బహిర్గత కిరణానికి మధ్య గల కోణం.
  6. పట్టక కోణం (A) : పట్టకంలోని రెండు అంచుల మధ్య గల కోణం.

ప్రశ్న 22.
దాతల “నేత్రదానాన్ని” నీవు ఎలా ప్రశంసిస్తావు?
జవాబు:
ప్రపంచంలో ఏ వస్తువునైనా చూడాలంటే మనకు కన్ను అవసరం. అటువంటి కన్నులు లేనివారు ఈ అద్భుత ప్రపంచాన్ని చూడలేరు. కాబట్టి అటువంటి అంధులకు దృష్టి సామర్థ్యాన్ని కలుగజేసే నేత్రదానం ఎంతైనా ప్రశంసనీయం.

ప్రశ్న 23.
కాంతి విక్షేపణలో ఎరుపు రంగు, ఊదారంగుల వివిధ లక్షణాలను తెలుపండి.
తరంగదైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం తగ్గుతుంది. కాంతి విక్షేపణం చెందినపుడు ఎరుపురంగు తక్కువ విచలనాన్ని పొందుతుంది. ఊదారంగు ఎక్కువ విచలనం పొందుతుంది. కారణం ఎరుపురంగు తరంగదైర్ఘ్యం ఎక్కువ. అంటే వక్రీభవన గుణకం తక్కువ కాబట్టి తక్కువ విచలనానికి గురి అవుతుంది.

10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కావ్య దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలదు. కానీ దగ్గర వస్తువులను చూడలేదు. ఆమెకు ఉన్న దృష్టి దోషం ఏది? దృష్టి దోషం ఉన్న మరియు దృష్టి దోషాన్ని సవరించుటకు చూపే పటములు గీయండి.
(లేదా)
రేవతి తరగతి గదిలో ముందు వరుసలో కూర్చునే విద్యార్థిని బోర్డుపై గీయబడిన బొమ్మ సరిగా కనిపించకపోవడంతో ఉపాధ్యాయుని అనుమతితో వెనుక వరుసలో కూర్చొని గీయగలిగింది. ఆమెకు ఉండే కంటి దోషం ఏది ? దాని సవరణను సూచించే పటం గీయండి.
జవాబు:
కావ్యకు దీర్ఘ దృష్టి లోపము ఉన్నది.
ఈ క్రింది పటాలు దృష్టి దోషాన్ని మరియు సవరించుటను చూపుతాయి.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 8

ప్రశ్న 2.
దీర్ఘ దృష్టిని సవరించడానికి ఉపయోగించే ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలో మీరెలా నిర్ణయిస్తారు?
జవాబు:
దీర్ఘదృష్టి గల వ్యక్తికి దగ్గర వస్తువులు కనిపించవు. కనిష్టదూర బిందువు (H) కు అవతల ఉన్న వస్తువులను మాత్రమే చూడగలడు. సవరణ కొరకు స్పష్ట దృష్టి కనీస దూరం (L) వద్ద ఉన్న వస్తువుకు కనిష్ఠ దూరబిందువు (H) వద్ద ప్రతిబింబం ఏర్పడాలి.
u : -25 సెం.మీ.; V = =d సెం.మీ.;
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 9
ఇక్కడ d > 25, కనుక ‘f’ కు ధనవిలువ వస్తుంది అనగా కుంభాకార కటకం వాడాలి.

ప్రశ్న 3.
దృష్టిదోషం గల ఒక వ్యక్తికి నేత్రవైద్యుడు + 2D కటకంను సూచించాడు. ఆ వ్యక్తికి గల దృష్టి దోషం ఏది? ఆ దృష్టిదోషాన్ని చూపు పటం మరియు తగిన కటకంతో ఆ దోషాన్ని సవరించుటకు సూచించు పటం గీయుము.
జవాబు:
నేత్ర వైద్యుడు సూచించిన కటకం + 2D కావున అది ద్వికుంభాకార కటకం. ద్వికుంభాకార కటకం దీర్ఘదృష్టి నివారణకు ఉపయోగిస్తారు. కనుక ఆ వ్యక్తికి దీర్ఘదృష్టి లోపము ఉందని చెప్పవచ్చును.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 10

ప్రశ్న 4.
కాంతి పరిక్షేపణమును ప్రయోగపూర్వకంగా చూపుటకు కావలసిన పరికరాలు, రసాయనాల జాబితాను రాసి, – ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు, రసాయనాలు : ఒక బీకరు, సోడియం థయో సల్ఫేట్ (హైపో) సల్ఫ్యూరికామ్లం, నీరు.

ప్రయోగ విధానము:

  1. ఒక బీకరు తీసుకొని సోడియం థయోసల్ఫేటు ద్రావణమును తయారు చేయాలి.
  2. ఈ బీకరును ఆరుబయట ఎండలో సూర్యుని వెలుగులో ఉంచాలి.
  3. బీకరులోని ద్రావణానికి సల్ఫ్యూరికామ్లమును కలపాలి. బీకరులో సల్పర్ స్పటికాలు ఏర్పడడం గమనించితిని.
  4. ప్రారంభంలో సల్ఫర్ స్ఫటికాలు చాలా చిన్నవిగాను, చర్య జరుగుతున్న కొద్ది ఏర్పడిన స్ఫటికాల పరిమాణం పెరుగుతున్నట్లు గమనించితిని.
  5. మొదట సల్ఫర్ స్ఫటికాలు నీలిరంగులో ఉండి వాటి పరిమాణం పెరుగుతున్న కొలది తెలుపు రంగులోకి మారతాయి. దీనికి కారణం కాంతి పరిక్షేపణం.

ప్రశ్న 5.
ఫణి తాతగారు పేపర్ చదవలేకపోతున్నారు. అది చూసిన ఫణి వాళ్ళ తాతగారికి కటకాన్ని ఇచ్చి చదవమన్నాడు.
ఎ) అతడు ఇచ్చిన కటకం ఏమిటి?
బి) ఆ కటకాన్ని ఇవ్వడానికి గల అంశాలను తెలియజేయండి. స్పష్టత కోసం పట సహాయం తీసుకోండి.
జవాబు:
ఎ) ఫణి ఇచ్చిన కటకం ద్వికుంభాకార కటకం.
బి) ఫణి తాతగారు పేపరు చదవలేకపోతున్నారు, అనగా దగ్గరి వస్తువులను చూడలేకపోవటమే. ఇది దీర్ఘదృష్టి అను కంటి దోషప్రభావమే. దీనిని కుంభాకార కటకంతో సవరించవచ్చు.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

ప్రశ్న 6.
ఒక చెరువు ప్రక్కన గల రోడ్డుపై బస్సులో నీవు ప్రయాణిస్తున్నావు. ఆ చెరువులో నీటి ఫౌంటేన్ నుండి నీరు వెదజల్ల ‘బడుతుంది. దాని గుండా చూసిన నీకు ఇంద్రధనస్సు కనిపించింది. కాని అది కొంతదూరం పోయిన తర్వాత కనిపించలేదు. దీనిని ఎలా వివరిస్తావు?
జవాబు:

  1. నీటి బిందువులలోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్యకోణం 0° నుండి 42° మధ్య ఎంతైనా ఉన్నప్పుడు మనము ఇంద్రధనుస్సును చూడగలము.
  2. ఆ కోణం. 40° నుండి 42° లకు దాదాపు సమానంగా ఉన్నప్పుడు ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సును మనం చూడగలము.
  3. బస్సులో ప్రయాణిస్తున్న నేను ఆ కోణం కంటే ఎక్కువ కోణంను ఏర్పరచినప్పుడు ఇంద్రధనుస్సు నాకు కన్పించదు.

AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 9

ప్రశ్న 7.
కంటి కటక గరిష్ఠ, కనిష్ఠ నాభ్యంతరాలను కనుగొనుము.
జవాబు:
గరిష్ఠ నాభ్యంతరం :
1) అనంత దూరంలోనున్న వస్తువు నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు కంటి కటకంపై పడి వక్రీభవనం చెందాక రెటీనా పై ఒక భిందురూప ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం గరిష్ఠంగా ఉంటుంది.

2) వస్తువు అనంత దూరంలోనున్నపుడు
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 12

కనిష్ఠ నాభ్యంతరం :
1) కంటి ముందు 25 సెం.మీ. దూరంలో వస్తువు ఉందనుకుందాం. ఈ సందర్భంలో కంటి కటక నాభ్యంతరం కనిష్ఠంగా ఉంటుంది.
అపుడు
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 13
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 14

ప్రశ్న 8.
చత్వారం అనగానేమి? దానినెట్లా సరిదిద్దుతారు?
జవాబు:

  1. వయసుతో పాటుగా కంటి సర్దుబాటు సామర్థ్యం తగ్గిపోయే దృష్టిదోషాన్ని చత్వారం అంటారు.
  2. వయసుతో పాటుగా చాలామందికి కనిష్ట దూర బిందువు క్రమంగా దూరమైపోతుంది. అప్పుడు వారు దగ్గరలోనున్న వస్తువులను స్పష్టంగా చూడలేరు.
  3. సిలియరీ కండరాలు క్రమంగా బలహీనపడి కంటి కటక స్థితిస్థాపక లక్షణం క్రమంగా తగ్గిపోవటం వలన ఈ విధంగా జరుగుతుంది. కొన్నిసార్లు హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి దోషాలు రెండూ కలుగవచ్చు.
  4. ఇటువంటి దోషాల్ని సవరించడానికి ద్వి-నాభ్యంతర కటకాన్ని ఉపయోగించాలి. ఈ కటకం పై భాగంలో పుటాకార కటకం, క్రింది భాగంలో కుంభాకార కటకం ఉంటాయి.

ప్రశ్న 9.
కాంతి పరిక్షేపణ అనగానేమి? కాంతి ఎలా పరిక్షేపణ చెందుతుంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 15
కాంతి పరిక్షేపణ :
కణాలు తాము శోషించుకున్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశల్లో వివిధ తీవ్రతలతో తిరిగి ఉద్గారం చేసే ప్రక్రియను కాంతి పరిక్షేపణ అంటారు.

  1. అంతరాళంలో ఒక స్వేచ్ఛా పరమాణువు లేదా అణువు ఉన్నదనుకుందాం. ఆ కణంపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కోంతి పతనమైనదనుకుందాం.
  2. ఆ కణం పరిమాణం, పతనం చెందిన కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన విధంగా ఉన్నపుడు మాత్రమే ఆ కాంతికి, కణం స్పందిస్తుంది. ఈ నియమం పాటించబడినపుడు మాత్రమే ఆ కణం కాంతిని శోషించుకుని కంపనాలు చేస్తుంది.
  3. ఈ కంపనాల వలన కణం శోషించుకున్న శక్తిలో కొంత భాగాన్ని అన్ని దిశలలో వివిధ తీవ్రతలలో తిరిగి ఉద్గారం చేస్తుంది.
  4. ఇలా తిరిగి ఉద్గారించడాన్నే కాంతి పరిక్షేపణం అంటారు. ఉద్గారమైన కాంతిని పరిక్షేపణ కాంతి అంటారు.
  5. ఈ అణువులు / పరమాణువులను పరిక్షేపణ కేంద్రాలు అంటారు.

ప్రశ్న 10.
పట్టకం కాంతిని విక్షేపణం చెందించును కాని గాజు పలక చెందించదు. వివరించుము.
జవాబు:

  1. పట్టకంలో కాంతి వక్రీభవనం రెండు తలాల వద్ద జరుగును.
  2. మొదటి తలం వద్ద కాంతి విక్షేపణం చెంది, వివిధ రంగులు గల కాంతి కిరణాలు, వాటి పౌనఃపున్యాల ఆధారంగా వివిధ కోణాలలో ప్రయాణిస్తాయి.
  3. ఇవి రెండవ తలాన్ని చేరి మరొకసారి వక్రీభవనానికి గురై మరింతగా విడిపోతాయి.
  4. దీర్ఘచతురస్రాకార గాజుదిమ్మెలో, రెండు సమాంతర తలాలలో వక్రీభవనం జరుగుతుంది.
  5. మొదటి తలం వద్ద కాంతి విక్షేపణానికి గురై దానిలోని వివిధ రంగులుగా విడిపోయినప్పటికి, రెండవ తలం సమాంతరంగా వుండడం వల్ల ఆ కిరణాలు మరొకసారి వక్రీభవనానికి గురియైన కూడా కలిసిపోయి తెల్లని కాంతిగా బయటకు వస్తుంది.

ప్రశ్న 11.
మానవుని కంటి నిర్మాణమును పటము ద్వారా వివరించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 16

  1. కంటి ముందు భాగం కార్నియా అనే పారదర్శక రక్షణ పొరను కలిగి ఉంటుంది.
  2. కార్నియా వెనుక ప్రదేశంలో నేత్రోదక ద్రవం ఉంటుంది.
  3. దీని వెనుక ప్రతిబింబ ఏర్పాటుకు ఉపయోగపడే కటకం ఉంటుంది.
  4. నేత్రోదక ద్రవానికి, కటకానికి మధ్య నల్లగుడ్డు / ఐరిస్ అనే కండర పొర ఉంటుంది.
  5. ఈ కండర పొరకు ఉండే చిన్న రంధ్రాన్ని కనుపాప అంటారు.
  6. కంటిలోకి వెళ్ళే కాంతిని నియంత్రించే ద్వారం లాగా కనుపాపకు ఐరిస్ సహాయపడుతుంది.
  7. కంటిలోకి ప్రవేశించిన కాంతి కనుగుడ్డుకు వెనుకవైపున ఉండే రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం Important Questions and Answers

ప్రశ్న 1.
వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబ దూరం ఉండడం ఎలా సాధ్యం?
జవాబు:
1. వివిధ వస్తు దూరాలకు ఒకే ప్రతిబింబం ఏర్పడుటకు, కంటి నిర్మాణమే ముఖ్య కారణము.
2. కంటి నిర్మాణంలో గల సిలియరి కండరాలు అధిక దూరపు, అల్ప దూరపు వస్తువుల ప్రతిబింబాలు కటకంపై సరిగా ఏర్పడే విధంగా సహాయపడతాయి.

ప్రశ్న 2.
కన్ను తన నాభ్యంతరాన్ని ఎలా మార్చుకుంటుంది?
జవాబు:

  1. దూరంలో ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు సిలియరి కండరాలు విశ్రాంత స్థితిలో ఉండటం వల్ల కంటి కటక నాభ్యంతరం గరిష్టమగును. అనగా కటకం నుండి రెటీనాకు గల దూరానికి, నాభ్యంతరం విలువ సమానమగును.
  2. ఈ సందర్భంలో కంటిలోనికి వచ్చు సమాంతర కిరణాలు రెటీనాపై కేంద్రీకరింపబడుట వలన వస్తువును మనము చూడగలము.
  3. దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు సిలియరి కండరాలు ఒత్తిడికి గురికావడం వల్ల కంటి కటక నాభ్యంతరం తగ్గును. రెటీనా పై ప్రతిబింబం ఏర్పడే విధంగా సిలియరి కండరాలు కటక నాభ్యంతరంను మార్చి, నాభ్యంతర విలువ తగిన విధంగా సర్దుబాటు చేయును.

ఈ విధముగా కంటిలోని కటకానికి ఆనుకొని ఉన్న సిలియరి కండరాలు కటక వక్రతావ్యాసార్ధాన్ని మార్చడం ద్వారా కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి దోహదపడతాయి.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 3.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 17
పై పటంలో చూపిన భాగం దేనిని సూచిస్తుంది? దాని పనితీరు తెలుపుము.
జవాబు:
పటంలో చూపించబడిన కంటి భాగము సిలియరి కండరాలు.

పనితీరు :

  1. సిలియరి కండరాలు, కంటి కటకం వస్తుదూరానికి అనుగణంగా తన నాభ్యంతరాన్ని మార్చుకుంటుంది.
  2. దూరంగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు కటక నాభ్యంతరం గరిష్టమయ్యినపుడు, వస్తువు నుండి వచ్చే కిరణాలు రెటీనాపై కేంద్రీకరింపబడునట్లు ఈ కండరాలు సహాయపడుతాయి.
  3. దగ్గరగా ఉన్న వస్తువును కన్ను చూస్తున్నపుడు, కటక నాభ్యంతరం కనిష్టమయినపుడు, వస్తువు నుండి వచ్చే కిరణాలు రెటీనాపై కేంద్రీకరింపబడునట్లు ఈ కండరాలు సహాయపడతాయి. ఈ విధంగా సర్దుబాటు లక్షణంను సిలియరి కండరాలు ప్రదర్శించి మన కంటికి స్పష్టదృష్టిని అందిస్తాయి.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 18

ప్రశ్న 4.
కంటి ముందు వస్తువు ఎంత దూరంలో ఉన్న ప్రతిబింబ దూరం మాత్రం 2.5 సెం.మీ మాత్రమే ఉంటుంది. నీ సమాధానం సమర్దింపుము.
జవాబు:

  1. సిలియరి కండరాలు మానవుని కంటిలో లేకుంటే, దూరపు వస్తువులను మరియు దగ్గర వస్తువులను స్పష్టంగా చూడలేము.
  2. ఈ ప్రభావం వలన వస్తు పరిమాణం, ఆకారంలో స్పష్టత లోపిస్తుంది.
  3. కనుక సిలియరి కండరాలు లేని మానవుని కన్ను వలన దృష్టిలో దాదాపు 30% వరకు మాత్రమే ఉపయోగము కానీ పూర్తిగా ఉపయోగము ఉండేది కాదు.
  4. మనము, మనకు తెలిసిన వారిని కూడా త్వరగా గుర్తించలేము.

ప్రశ్న 5.
కంటి కటక నాభ్యంతరం 2.27 – 2.5 సెం.మీ మధ్యస్తంగా ఉండడానికి ఏ కండరాలు ఉపయోగపడతాయో వివరించండి.
జవాబు:
ఉదాహరణకు మనము ఒక వస్తువును కంటికి చాలా దగ్గరగా ఉంచినపుడు రెటీనా పై ప్రతిబింబం ఏర్పడే విధంగా నాభ్యంతరం సర్దుబాటు జరుగదు. కాబట్టి వస్తువును స్పష్టంగా చూడలేము. అదే వస్తువును స్పష్టంగా చూడాలంటే కనీసం 25 సెం.మీల దూరంలో ఉంచాలి.
(లేదా)
కంటి కటకం తన నాభ్యంతరాన్ని 2.27 సెం.మీ నుండి 2.5 సెం.మీలకు మధ్యస్థముగా ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా ప్రతిబింబం రెటీనాపై ఏర్పడుతుంది.

10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం ½ Mark Important Questions and Answers

1. మానవుని కంటి కటకం ప్రతిబింబ దూరం ఎంత
జవాబు:
2.5 సెం.మీ.

2. వస్తువు ఎక్కడ వున్నప్పుడు కుంభాకార కటక నాభ్యంతరం మరియు ప్రతిబింబ దూరం సమానమవుతుందో ఊహించుము.
జవాబు:
అనంత దూరంలో

3. మానవుని కంటి స్పష్టదృష్టి కనిష్ఠ దూరం ఎంత?
జవాబు:
25 సెం.మీ.

4. చిన్న పిల్లలలో స్పష్టదృష్టి కనిష్ఠ దూరం ఎంత? వుంటుంది?
జవాబు:
7 నుండి 8 సెం.మీ.

5. నీ స్నేహితుడు తన కంటి నుండి 10 సెం.మీ. దూరంలో గల వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నాడు. అతని దృష్టి లోపం
a) హ్రస్వ దృష్టి
b) దీర్ఘ దృష్టి
c) చత్వారం
d) దృష్టి లోపం లేదు
జవాబు:
d) దృష్టి లోపం లేదు

6. క్రింది వానిలో దేనిని మానవుడు పూర్తిగా స్పష్టంగా చూడగలడు?
a) కంటితో 60° కోణం చేసే వస్తువును
b) కంటితో 60° కన్నా ఎక్కువ కోణం చేసే వస్తువును
c) కంటితో 60° కన్నా తక్కువ కోణం చేసే వస్తువును
d) a మరియు c
జవాబు:
d) a మరియు c

7. దృష్టికోణం మానవునిలో
a) 60°
b) 360°
C) 180°
d) 0°
జవాబు:
a) 60°

8. క్రింది వానిని జతపర్చుము :
a) దృష్టికోణం ( ) i) 2.5 సెం.మీ.
b) స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం ( ) ii) 25 సెం.మీ.
c) రెటీనా-కంటి కటకం మధ్య గరిష్ఠ దూరం ( ) iii)60°
జవాబు:
a . (iii), b – (ii), C – (i)

9. మానవుని కంటి ఆకారం ఎలా వుంటుంది?
జవాబు:
గోళాకారంలో

10. కంటిలో పారదర్శక రక్షణ పొర ఏది?
జవాబు:
కార్నియా

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

11. నేత్రోదక ద్రవం కంటిలో ఎక్కడ ఉంటుంది?
జవాబు:
కార్నియా మరియు కంటి కటకం మధ్యలో

12. మన కంటిలో ఏ భాగం కనుపాపను కలిగి ఉంటుంది?
జవాబు:
ఐరిస్ (నల్లగుడ్డు)

13. కనుపాప (ఐరిస్) అనేది
a) పొర
b) ద్రవం
c) కటకం
d) ఏదీకాదు
జవాబు:
d) ఏదీకాదు

14. కంటిలో ఏ భాగం రంగులో కనిపిస్తుంది?
జవాబు:
ఐరిస్ (నల్లగుడ్డు)

15. A : కనుపాప నలుపు రంగులో కనిపిస్తుంది.
R : కనుపాప గుండా పోయే కాంతి తిరిగి వెనుకకు రాదు.
A) ‘A’ మరియు ‘R’ లు సరియైనవి. మరియు ‘R’, ‘A’ కు సరియైన కారణం.
B) ‘A’ మరియు ‘R’ లు సరియైనవి. మరియు ‘R’, ‘A’ కు సరియైన కారణం కాదు.
C) ‘A’ మాత్రమే సరియైనది.
D) ‘R’ మాత్రమే సరియైనది.
జవాబు:
A) ‘A’ మరియు ‘R’ లు సరియైనవి. మరియు ‘R’, ‘A’ కు సరియైన కారణం.

16. కంటిలోకి ప్రవేశించే కాంతిని అదుపు చేసేది ఏది?
జవాబు:
ఐరిస్

17. ఏ సందర్భంలో కనుపాప సంకోచిస్తుంది?
జవాబు:
ఎక్కువ తీవ్రత గల కాంతి కంటిలో ప్రవేశించినపుడు.

18. ‘కాంతిని నియంత్రించే ద్వారం’ అని దేనిని అంటారు?
జవాబు:
కనుపాప

19. కనుపాప సంకోచవ్యాకోచాలకు సహాయపడేది ఏది?
జవాబు:
ఐరిస్

20. కంటి కటక ప్రతిబింబ దూరం ఎంత ?
జవాబు:
2.5 సెం.మీ.

21. కంటి కటకానికి ఈ దూరం స్థిరంగా వుంటుంది.
A) వస్తు దూరం
B) ప్రతిబింబ దూరం
C) నాభ్యంతరం
D పైవన్నీ
జవాబు:
B) ప్రతిబింబ దూరం

22. కంటి కటకం యొక్క వక్రతా వ్యాసార్ధం మార్చడానికి సహాయపడేది ఏది?
జవాబు:
సిలియరి కండరం

23. కంటిలో ఏ భాగంనకు నిలియరి కండరాలు అతికించబడి వుంటాయి?
జవాబు:
కంటి కటకం

24. కంటి కటకం
a) కుంభాకార కటకం.
b) పుటాకార కటకం
c) a మరియు b
d) సమతల కుంభాకార కటకం
జవాబు:
a) కుంభాకార కటకం

25. కన్ను దగ్గరి వస్తువును చూసినపుడు
a) సిలియరి కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి.
b) కంటి కటక నాభ్యంతరం తగ్గుతుంది.
c) a మరియు b
d) సిలియరి కండరాలు విశ్రాంతిలో ఉంటాయి.
జవాబు:
c) a మరియు b

26. క్రింది కంటి భాగాలను ఒక క్రమంలో అమర్చుము.
కంటి కటకం, నేత్రోదకం, రెటీనా, ఐరిస్, కార్నియా
జవాబు:
కార్నియా, ఐరిస్, నేత్రోదకం, కంటి కటకం, రెటీనా

27. దూరపు వస్తువులను చూసినపుడు సిలియరీ కండరాల స్థితి.
a) సంకోచం
b) వ్యాకోచం
c) a లేదా b
d) రెండూ కావు
జవాబు:
d) రెండూ కావు

28. కంటి కటకం యొక్క నాభ్యంతరం ఎప్పుడు తగ్గుతుంది?
జవాబు:
దగ్గర వస్తువులను చూస్తున్నప్పుడు

29. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే ప్రక్రియను ఏమందురు ?
జవాబు:
సర్దుబాటు

30. వాక్యం (A) : 25 సెం.మీ. కన్నా తక్కువ దూరంలో ఉన్న వస్తువును మనం స్పష్టంగా చూడలేము.
కారణం (R1) : సిలియరీ కండరాలు విశ్రాంతి స్థితిలో ఉండటం వలన.
కారణం (R2) : సిలియరీ కండరాలు ఎక్కువ ఒత్తిడికి గురి కాలేవు.
A) R1 సరియైనది
B) R2 సరియైనది
C) A, B లు సరియైనవి
D) రెండూ సరియైనవి కావు
జవాబు:
B) R2 సరియైనది

31. కంటిలో రెటీనాపై ఏర్పడే ప్రతిబింబం లక్షణాలేవి?
జవాబు:
నిజ, తలక్రిందులు

32. కంటిలో దండాలు, శంఖువులు ఎక్కడ వుంటాయి?
జవాబు:
రెటీనాపై

33. కంటిలో ఏ గ్రాహకాలు రంగులను గుర్తిస్తాయి?
జవాబు:
శంఖువులు

34. కంటిలో ఏ గ్రాహకాలు కాంతి తీవ్రతను గుర్తిస్తాయి?
జవాబు:
దండాలు

35. కాంతి సంకేతాలను మెదడుకు తీసుకుపోయేవి ఏవి?
జవాబు:
దృక్ నాడులు

36. మన రెటీనాలో ఎన్ని గ్రాహకాలు ఉంటాయి?
జవాబు:
125 మిలియన్లు

37. వస్తువు ఆకారం, రంగు, పరిమాణాలను ఎవరు గుర్తిస్తారు?
జవాబు:
మెదడు

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

38. కంటి కటక నాభ్యంతర కనిష్ఠ, గరిష్ఠ విలువలు ఏమిటి?
జవాబు:
fగరిష్టం = 2.5 సెం.మీ., fకనిష్ఠం = 2.27 సెం.మీ.

39. జతపరుచుము :
a) fగరిష్టం ( ) i) వస్తువు 25 సెం.మీ. వద్ద
b) fకనిష్ఠం ( ) ii) వస్తువు అనంత దూరంలో
iii) వస్తువు 1 సెం.మీ. వద్ద
జవాబు:
a – ii, b-i

40.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 19
పటంను బట్టి వస్తువు ఎక్కడ వుంది?
జవాబు:
అనంత దూరంలో

41.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 20
పటంను బట్టి, కంటి కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
2.27 సెం.మీ.

42. అనంత దూరంలో వస్తువును చూసినపుడు కంటి కటక నాభ్యంతరం ఎంత వుంటుంది?
జవాబు:
2.5 సెం.మీ.

43. కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే సామర్థ్యంను ఏమంటారు?
జవాబు:
కటక సర్దుబాటు సామర్థ్యం

44. ఏవేని రెండు దృష్టి లోపాలను రాయండి.
జవాబు:
హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి

45. రమ దగ్గరగా వున్న వస్తువులను చూడగలదు. కానీ దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేదు. ఈమె దృష్టిలోపం ఏమిటి?
జవాబు:
హ్రస్వదృష్టి

46. క్రింది వానిలో f ఎంత వుంటే హ్రస్వదృష్టిని సూచిస్తుంది?
a) 2.5 సెం.మీ.
b) 2.27 సెం.మీ.
c) 2.7 సెం.మీ.
జవాబు:
b) 2.27 సెం.మీ.

47. క్రింద ఇవ్వబడిన పటం ఎటువంటి దృష్టి లోపాన్ని సూచిస్తుంది?
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 21
జవాబు:
హ్రస్వదృష్టి

48. పై పటంలో చూపిన దృష్టి లోపాన్ని సవరించుటకు వినియోగించవలసిన కటకం ఏమిటి?
జవాబు:
ద్విపుటాకార కటకం

49. పై పటంలో ‘M’ దేనిని సూచిస్తుంది?
జవాబు:
గరిష్ఠ దూర బిందువు

50. హ్రస్వదృష్టి గలవారు ఏ వస్తువులను చూడలేరు?
a) గరిష్ఠ దూర బిందువుకు ఆవల
b) గరిష్ఠ దూర బిందువుపై
c) గరిష్ఠ దూర బిందువు లోపల
జవాబు:
a) గరిష్ఠ దూర బిందువుకు ఆవల

51. ఏ గరిష్ఠ దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబంను ఏర్పరచగలదు? ఆ బిందువునేమంటారు?
జవాబు:
గరిష్ఠ దూర బిందువు (M)

52. గరిష్ఠ దూర బిందువుకు ఆవల ఉన్న వస్తువును చూడలేకపోయే దృష్టి లోపాన్ని ఏమంటారు?
జవాబు:
హ్రస్వదృష్టి

53. ఏ కటకం దూరపు వస్తువుల ప్రతిబింబాన్ని గరిష్ఠ దూర భిందువు వద్ద ఏర్పరచగలదు?
జవాబు:
ద్విపుటాకార కటకం

54. హ్రస్వదృష్టి గలవారు వినియోగించవలసిన ద్విపుటాకార కటక నాభ్యంతరాన్ని (f), గరిష్ఠ దూర బిందువు నుండి కంటికి గల దూరం (D) లలో వ్యక్తపరుచుము.
జవాబు:
f = – D

55. f = -D దీనిలో ‘-‘ గుర్తు దేనిని సూచించును?
జవాబు:
పుటాకార కటకం

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

56. కంటి కటక నాభ్యంతరం 2.27 సెం.మీ. కన్నా ఎక్కువైతే ఏ దృష్టిలోపం ఏర్పడును?
జవాబు:
దీర్ఘదృష్టి

57. దీర్ఘదృష్టిలో దగ్గరి వస్తువుల నుండి వచ్చే కాంతి కిరణాలు ఎక్కడ కేంద్రీకరింపబడతాయి?
జవాబు:
రెటీనాకు ఆవల

58. కనిష్ఠ దూర బిందువును ఏ దృష్టి లోపం గల వారిలో గుర్తిస్తారు?
జవాబు:
దీర్ఘదృష్టి

59. దీర్ఘదృష్టి సవరణకు వినియోగించవలసిన కటకం ఏది?
జవాబు:
ద్వికుంభాకార కటకం

60. a) దీర్ఘదృష్టి గలవారు కనిష్ఠ దూర బిందువు (H) కు, స్పష్టదృష్టి కనీస దూరం (L) కు మధ్య గల వస్తువులను చూడలేరు.
b) హ్రస్వదృష్టి గలవారు గరిష్ఠ దూరబిందువు (M)కి ఆవల గల వస్తువులు చూడలేరు. పై వాక్యా లలో ఏది సరియైనది?
జవాబు:
రెండూ సరియైనవే.

61.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 22
పటంలో చూపబడిన దృష్టి లోపం ఏమిటి?
జవాబు:
దీర్ఘదృష్టి

62. దీర్ఘదృష్టి కలవారు వినియోగించవలసిన కటక నాభ్యంతరం కనుగొనుటకు సూత్రం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 23

63. వయసుతోబాటు కంటి కటక సామర్థ్యం తగ్గిపోవు దృష్టి లోపాన్ని ఏమంటారు?
జవాబు:
చత్వారం

64. చత్వారం గలవారు (హ్రస్వ మరియు దీర్ఘ దృష్టి లోపం) వినియోగించవలసిన కటకాలు ఏవి?
జవాబు:
ద్వినాభ్యంతర కటకం

65. చత్వారం వచ్చేవారు వినియోగించే కళ్ళద్దాలలో దిగువన ఉండే కటకం ఏది?
జవాబు:
కుంభాకార కటకం

66. కటక సామర్థ్యం అనగానేమి?
జవాబు:
కటక నాభ్యంతరం యొక్క విలోమ విలువ (లేదా) ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయి.

67. కటక సామర్థ్యం సూత్రం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 24

68. కటక సామర్థ్యం ప్రమాణం రాయుము.
జవాబు:
డయాప్టర్

69. 2D కటకాన్ని వాడాలని డాక్టర్ సూచించారు. ఆ కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 25

70. ఒక కటకం నాభ్యంతరం 50 సెం.మీ. అయిన కటక సామర్థ్యం ఎంత?
జవాబు:
2 డయాప్టర్లు

71. గాజు పట్టకంలో ఎన్ని త్రికోణ భూములు ఉంటాయి?
జవాబు:
2

72. ‘ఒకదానికొకటి కొంత కోణం చేసే కనీసం రెండు సమతలాలతో పరిసర యానకం నుండి వేరు చేయబడివున్న పారదర్శక పదార్థం’ అనగా
A) గాజు పలక
B) పట్టకం
C) కటకం
D) పైవన్నియు
జవాబు:
B) పట్టకం

73.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 26
• పటంలో పట్టక వక్రీభవన కోణం ఏది?
జవాబు:
PQ మరియు PR ల మధ్య కోణం (లేదా) ∠QPR.

• పటంలో ‘d’ దేనిని సూచిస్తుంది?
జవాబు:
విచలన కోణం

• పటంలో i1, i2 లు వేనిని సూచిస్తాయి?
జవాబు:
i1 = పతన కోణం,
i2 = బహిర్గత కోణం

74. పతన కిరణం మరియు బహిర్గత కిరణంల మధ్య గల కోణాన్ని ఏమంటారు?
జవాబు:
విచలన కోణం

75. పట్టకం వక్రీభవన గుణకాన్ని కనుగొనుటకు చేయు ప్రయోగంలో కొలవవలసిన విలువలు ఏవి?
జవాబు:
పతన కోణం (i1), బహిర్గత కోణం (i2).

76. కనిష్ఠ విచలన కోణం వద్ద, పట్టక పతన కోణం (i1) మరియు బహిర్గత కోణం (i12) ల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
i1 = i2

77. పట్టక కోణం (A), విచలన కోణం (d), పతన కోణం (i1) మరియు బహిర్గత కోణం (i2) ల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
A + d = i1 +i2

78. పట్టక వక్రీభవన గుణక సూత్రాన్ని రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 27

79.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 7
• పై గ్రాలో ‘D’ దేనిని సూచిస్తుంది?
జవాబు:
కనిష్ఠ విచలన కోణం

• విచలనకోణం మరియు పతనకోణంల గ్రాఫ్ ఎలా ఉంటుంది?
జవాబు:
వక్రరేఖ (సున్నిత వక్రం)

80. పట్టక ప్రయోగంలో పతన కోణం పెరుగుతున్న కొలదీ
విచలన కోణం
a) పెరుగును
b) తగ్గును
c) ముందు తగ్గి తర్వాత పెరుగును
జవాబు:
c) ముందు తగ్గి తర్వాత పెరుగును

81. పట్టక వక్రీభవన గుణకం కనుగొనుటకు కావలసిన కనీస దత్తాంశం
a) పట్టక కోణం విలువ
b) కనిష్ఠ విచలన కోణం విలువ
c) పై రెండూ
d) రెండూ కావు
జవాబు:
c) పై రెండూ

82. 60°ల పట్టక కోణం గల పట్టకం యొక్క కనిష్ఠ విచలన కోణం 30° అయిన పట్టక పదార్థ వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 28

83. పట్టకం యొక్క ఒక ఉపయోగం రాయుము.
జవాబు:

  1. కృత్రిమ ఇంద్రధనుస్సునేర్పరచుటకు
  2. తెల్లని కాంతిని విక్షేపణ చెందించుటకు

84. VIBGYOR ను విస్తరించుము.
జవాబు:
ఊదా, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

85. తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు?
జవాబు:
కాంతి విక్షేపణం

86. తక్కువ విచలనం చెందే రంగు ఏమిటి? దృగ్విషయంను ఏమంటారు?
జవాబు:
ఎరుపు

87. ఎక్కువ విచలనం చెందే రంగు ఏమిటి?
జవాబు:
ఊదా

88. తక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది?
జవాబు:
ఊదా

89. ఎక్కువ తరంగదైర్ఘ్యం గల రంగు ఏది?
జవాబు:
ఎరుపు

90. a) శూన్యంలో కాంతి వేగం స్థిరం.
b) కాంతి ఒక యానకం గుండా వెళ్ళినపుడు దాని వేగం, దాని తరంగదైర్ఘ్యంపై ఆధారపడును.
పై వాక్యములలో ఏది సరియైనది?
జవాబు:
రెండూ

91. కాంతి తరంగదైర్ఘ్యం పెరిగితే వక్రీభవన గుణకం ఎలా మారుతుంది?
జవాబు:
తగ్గుతుంది

92. గొజు యొక్క వక్రీభవన గుణకం క్రింది ఇవ్వబడిన ఏ కాంతిలో ఎక్కువ?
a) నీలం
b) పసుపు
c) నారింజ
d) మారదు.
జవాబు:
c) నారింజ

93. వక్రీభవనం వలన ఏ తరంగ ధర్మం మారదు?
జవాబు:
పౌనఃపున్యం

94. ఒకవేళ ఎరుపు కాంతిని పట్టకం గుండా పంపితే ఏ రంగుగా బహిర్గతమవుతుంది?
జవాబు:
ఎరుపు

95. కాంతి వేగం (v), తరంగదైర్ఘ్యం (λ) మరియు పౌనఃపున్యం (f) ల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
v = fλ

96. ఒక స్థిర కాంతి జనకం నుండి వస్తున్న కాంతి వేగం ఒక యానకం వలన మారింది. అయిన ఏ కాంతి తరంగ ధర్మం మారి వుంటుంది?
జవాబు:
తరంగదైర్ఘ్యం

97. కాంతి విక్షేపణానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఇంద్రధనుస్సు ఏర్పడుట

98. యానకాలు వేరు చేయు ఏ తలం వద్ద వక్రీభవనం జరిగినపుడు కాంతివేగం (v), తరంగదైర్ఘ్యం (λ) కు సంబంధమేమిటి?
జవాబు:
అనులోమానుపాతం (λ ∝ v)

99. అభి నోటితో నీటిని బయటకు తుంపరులుగా ఊదినపుడు వివిధ రంగులను గమనించాడు.
జవాబు:
కాంతి విక్షేపణం

100. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాలకు మధ్యకోణం ఎంత ఉంటే ప్రకాశవంతమైన ఇంద్ర ధనుస్సు కనిపిస్తుంది?
జవాబు:
42°

101. ఇంద్రధనుస్సు ఏర్పడునప్పుడు ఒక పరిశీలకునికి ఒక నీటి బిందువు నుండి గరిష్ఠంగా ఎన్ని రంగులను చూడగలడు?
జవాబు:
1 (ఒకటి)

102. సూర్యకాంతి పుంజానికి, నీటి బిందువుచే వెనుకకు పంపబడిన కాంతికి మధ్య ఎంత కోణంలో VIBGYOR కనిపిస్తుంది?
జవాబు:
40° నుండి 42°ల కోణంలో

103. సాధారణంగా మనకు కనిపించే ఇంద్రధనుస్సు అసలు ఆకారం ఏమిటి?
జవాబు:
త్రిమితీయ శంఖువు

104. శంఖువు ఆకారంలో ఉండే ఇంద్రధనుస్సు బాహ్యపొరపై ఏ రంగు కనిపిస్తుంది?రంగుగానే
జవాబు:
ఎరుపు

105. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు, పరిశీలకుడు
a) ఒక నీటి బిందువు నుండి ఒక రంగును మాత్రమే చూడగలడు.
b) వివిధ బిందువుల నుండి వివిధ రంగులను చూడగలడు.
సరియైన వాక్యం ఏది?
జవాబు:
రెండూ

106. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు ఒక నీటి బిందువు వద్ద కాంతి కిరణం ఎన్నిసార్లు వక్రీభవనం చెందును ?
జవాబు:
రెండు సార్లు

107. ఇంద్రధనుస్సు ఏర్పడినపుడు ఏ దృగ్విషయాలు జరుగును?
a) వక్రీభవనం
b) సంపూర్ణాంతర పరావర్తనం
c) a మరియు b
d) పరావర్తనం
జవాబు:
c) a మరియు b

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

108. కాంతి ప్రయాణ దిశకు లంబంగా ఉన్న ఏకాంక వైశాల్యం గల తలం గుండా ఒక సెకను కాలంలో ప్రసరించే కాంతి శక్తిని ఏమని పిలుస్తారు?
జవాబు:
కాంతి తీవ్రత

109. a) ఒక కణం పరిమాణం తక్కువగా ఉంటే, అది ఎక్కువ పౌనఃపున్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది.
b) ఒక కణం పరిమాణం ఎక్కువగా ఉంటే అది ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతితో ప్రభావితం అవుతుంది.
పై రెండు వాక్యా లలో సరియైనది/వి?
జవాబు:
రెండు సరియైనవే.

110. ఒక పరమాణువుపై నిర్దిష్ట పౌనఃపున్యం గల కాంతి పతనమయినపుడు ఏం జరుగుతుందో ఊహించుము.
జవాబు:
కంపించును

111. ఒక కణం, పతనకాంతికి స్పందించాలంటే కావలసిన నియమం ఏమిటి?
జవాబు:
కణపరిమాణం, పతనకాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగినదిగా ఉన్నప్పుడు

112. పరిక్షేపణం వలన కాంతిని ఉద్గారం చేసే పరమాణువులు లేదా అణువులను ఏమంటారు?
జవాబు:
పరిక్షేపణ కేంద్రాలు

112. పై పటంలో చూపిన ప్రయోగంలో ఏ దృగ్విషయాన్ని పరిశీలించవచ్చును?
జవాబు:
కాంతి విక్షేపణం

113. పరిక్షేపణ కోణం ఎంత ఉన్నప్పుడు ఉద్గార కాంతి తీవ్రత అత్యధికంగా ఉంటుంది?
జవాబు:
90°

114. వాతావరణంలో ఏయే అణువులు ఆకాశం నీలి రంగుకు కారణం అవుతాయి?
జవాబు:
నైట్రోజన్, ఆక్సిజన్

115. నీలి రంగు కాంతిని పరిక్షేపణం చెందించే ఏదైనా అణువును రాయండి.
జవాబు:
నైట్రోజన్ లేదా ఆక్సిజన్

116. ఆకాశం నీలిరంగుకు కారణమైన దృగ్విషయంను ఏమంటారు?
జవాబు:
కాంతి పరిక్షేపణం

117. ఏ దృగ్విషయంలో కణాలు కాంతిని శోషించి, కంపించి, తిరిగి ఉద్గారం చేస్తాయి?
జవాబు:
కాంతి పరిక్షేపణంలో

118. వేసవి రోజుల్లో ఆకాశం తెల్లగా కనిపించడానికి కారణమయ్యే ‘అణువుల పేర్లు రాయుము.
జవాబు:
N2, O2 మరియు H2O

119.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 15
పటంలో చూపబడిన కాంతి దృగ్విషయాన్ని రాయండి.
జవాబు:
కాంతి పరిక్షేపణం

120. ‘హైపో’ అనగానేమి?
జవాబు:
సోడియం థయో సల్ఫేట్

121. సాధారణంగా ఏ రంగు గల కాంతి తక్కువ పరిక్షేపణం చెందును?
జవాబు:
ఎరుపు

122.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 10
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏ దృగ్విషయాన్ని పరిశీలించవచ్చును?
జవాబు:
కాంతి విక్షేపణం

123. కాంతి విక్షేపణం చూపడానికి ప్రయోగశాలలో లభించే పరికరం ఏమిటి?
జవాబు:
పట్టకం

124.
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 7
ఈ గ్రాఫు ద్వారా ఏ విలువను లెక్కిస్తారు?
జవాబు:
పట్టక కనిష్ఠ విచలన కోణం

125. హ్రస్వదృష్టి సవరణకు వినియోగించు కటకం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 29

126. దీర్ఘదృష్టి సవరణకు వినియోగించు కటకం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 30

127. పట్టకం ఆకారం ఎలా ఉంటుందో పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 31

128. కంటి కటకం ఆకారం పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 32

129. చివరి బెంచిలో కూర్చున్న ఉమకి నల్లబల్లపై అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. దీని సవరణకు ఏ కటకం వినియోగించాలి?
జవాబు:
ద్విపుటాకార

130. మీ తాతగారు దూరపు, దగ్గర వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారు. అతను వినియోగించవలసిన కటకం ఏమిటి?
జవాబు:
ద్వి నాభ్యంతర కటకం

131. కటక సామర్థ్యం
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 33
1) ఏ వ్యక్తి హ్రస్వదృష్టితో బాధపడుతున్నాడు?
జవాబు:
‘A’

2) ఏ వ్యక్తి చత్వారంతో బాధపడుతున్నాడు?
జవాబు:
‘C’

3) B వ్యక్తికి గల దృష్టి లోపం ఏమిటి?
జవాబు:
దీర్ఘదృష్టి

4) ఏ వ్యక్తి దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడగలడు?
జవాబు:
A

5) ఎవరు పుటాకార కటకాన్ని వినియోగిస్తున్నారు ?
జవాబు:
A మరియు C

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

132. P = -1.5 D అని డాక్టర్ గారు చీటీ పై రాసారు.
1) ఎటువంటి రకపు కటకంను సూచించారు?
జవాబు:
ద్విపుటాకార

2) కటక సామర్థ్యం ఎంత?
జవాబు:
-1.5 D.

3) వినియోగించు కటక నాభ్యంతరం ఎంత?
జవాబు:
66.66 సెం.మీ.

4) వ్యక్తి యొక్క దృష్టి లోపం ఏమిటి?
జవాబు:
హ్రస్వదృష్టి

సాధించిన సమస్యలు

1. ఒక కుంభాకార కటకము యొక్క నాభ్యంతరము 10 మీ అయిన ఆ కటక సామర్థ్యము కనుగొనండి. (+ 0.1 D)
సాధన:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 34

2. ఒక కటక సామర్థ్యం + 2.5D అయిన ఆ కటకం ఏ రకానికి చెందినది? మరియు దాని నాభ్యంతరాన్ని కనుగొనండి.
(కుంభాకార కటకం, 40 సెం.మీ.)
సాధన:
P = +2.5 D
కటక సామర్థ్యం ధనాత్మకం కాబట్టి అది కుంభాకార కటకం.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 35

3. ఒక కుంభాకార, ఒక పుటాకార కటకముల నాభ్యంతరాలు వరుసగా + 20 సెం.మీ. – 30 సెం.మీ, అయిన వాటి కటక సామర్థ్యాలను వేరువేరుగా లెక్కించండి. మరియు ఈ రెండు కలిసిన సంయుక్త కటకము నాభ్యంతరము ఎంత? సంయుక్తంగా కటక సామర్థ్యాన్ని లెక్కించండి.
(+5D; – 3.3D, to 60 సెం.మీ. ; + 1.7D)
సాధన:
కుంభాకార కటకం నాభ్యంతరం f1 = 20 సెం.మీ
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 36

4. హ్రస్వదృష్టి కలిగిన వ్యక్తి కంటి ముందు దూరపు బిందువు 80 సెం.మీ.లో ఉంది. ఈ దృష్టిదోషాన్ని సవరించుటకు వాడు కటకమును మరియు దాని కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (పుటాకార కటకము, -1.25D).
సాధన:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 37

5. దీర్ఘదృష్టిలో కంటి దగ్గర గల బిందువు 1 మీ. దూరంలో ఉంది. ఈ దృష్టి దోషాన్ని సవరించుటకు వాడు కటకమును మరియు దాని కటక సామర్థ్యాన్ని కనుగొనండి. (స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెం.మీ.) (కుంభాకార కటకము, +3.0D).
సాధన:
d = 1 మీ = 100 సెం.మీ.
వాడే కటకం కుంభాకార కటకం
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 38

అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రశ్న 1.
సంజయ్, బయటి నుండి చీకటిగానున్న సినిమా హాల్ లోకి ప్రవేశించగానే అతనికి సీట్లుగాని, ఏమీ కనబడలేదు. కాని కొంత సేపటి తరువాత అతనికి సీట్లు, వాటిలోని మనుషులు కనబడ్డారు. దీని కారణాన్ని కంటిలోని కనుపాప పనితీరు ఆధారంగా వివరించండి.
జవాబు:
సంజయ్ వెలుతురులోనున్నప్పుడు అతని కనుపాప పరిమాణం చాలా తక్కువగా వుండి అతి తక్కువ కాంతి కంటిలోకి ప్రవేశిస్తుంది. అతను చీకటిలోకి ప్రవేశించగానే, కనుపాప పెద్దదవడానికి కొంత సమయం తీసుకుంటుంది. అప్పటి వరకు అతనికి ఏమీ కనబడవు. కనుపాప పెద్దదవగానే అతడు అతని చుట్టూ వున్న పరిసరాలను గమనించగలడు.

ప్రశ్న 2.
గుడ్లగూబ చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు కాని మనం చూడలేము. ఎందుకు?
జవాబు:
తక్కువ కాంతి వున్నప్పుడు కూడా వస్తువును చూడడానికి కంటిలోని ‘దండాలు’ ఉపయోగపడతాయి. గుడ్లగూబ కంటిలో మానవుని కన్నా ఎక్కువ దండాలు వుండడం వల్ల అది చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు.

ప్రశ్న 3.
మన కన్ను రంగులను ఎలా గుర్తించగలదు?
జవాబు:
కంటిలోనున్న ‘శంఖువులు’ రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 4.
మనం మనకి దూరంగా లేదా దగ్గరగానున్న వస్తువులను స్పష్టంగా చూడగలం. ఇది ఎలా సాధ్యం?
జవాబు:
కంటి కటకం యొక్క సర్దుబాటు స్వభావం వల్ల ఇది సాధ్యమవుతుంది. కంటి కటకం వస్తు దూరాన్ని బట్టి దాని నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకుంటుంది.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 5.
‘గరిష్ఠ దూర బిందువు’, ‘కనిష్ఠ దూర బిందువు’ అనగానేమి?
జవాబు:
గరిష్ఠ దూర బిందువు :
ఏ గరిష్ఠ దూరం వద్దనున్న బిందువుకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో, ఆ బిందువును గరిష్ఠ దూర బిందువు అంటారు.

కనిష్ఠ దూర బిందువు :
ఏ కనిష్ఠ దూరం వద్ద గల బిందువుకు ఆవల గల వస్తువులను మాత్రమే కంటి కటకం రెటీనా పై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో, ఆ బిందువును కనిష్ఠ దూర బిందువు అంటారు.

ప్రశ్న 6.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 21
ఈ పటాన్ని పరిశీలించండి.
i) ఇది ఏ దృష్టి దోషం?
ii) ఈ దోషాన్ని నివారించుటకు ఏ కటకాన్ని వాడాలి?
iii) ఈ దోష నివారణను చూపే పటాన్ని గీయండి.
iv) ఈ దోష నివారణకు వాడవలసిన కటకం గురించి వివరించండి
జవాబు:
i) పటంలో చూపబడిన దృష్టిదోషం ‘హ్రస్వదృష్టి’.
ii) ఈ దోషాన్ని నివారించడానికి పుటాకార కటకాన్ని వాడాలి.
iii)
AP Board 10th Class Physical Science Solutions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 3

iv) అనువైన పుటాకార కటకాన్ని వాడడం వల్ల, గరిష్ఠ దూర బిందువుకు ఆవల గల వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబం గరిష్ఠ దూర బిందువు వద్ద ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం కంటి కటకానికి వస్తువు వలె పనిచేసి ఆ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రెటీనాపై ఏర్పడునట్లు చేస్తుంది. కావున మనం వస్తువును స్పష్టంగా చూడగలం.

ప్రశ్న 7.
హ్రస్వదృష్టితో బాధపడే ఒక వ్యక్తికి గరిష్ఠ దూర బిందువు 150 సెం.మీ. అతను దృష్టి దోషం సవరించుకోవడానికి ఎటువంటి కటకాన్ని వాడాలి? ఆ కటక సామర్థ్యమెంత?
జవాబు:
ఈ వ్యక్తి హ్రస్వదృష్టితో బాధపడుతున్నాడు. కావున ఇతను. అనువైన పుటాకార కటకాన్ని వాడాలి.
u = ∞, V = – 150 సెం.మీ., f = ?
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 39

ప్రశ్న 8.
దీర్ఘదృష్టితో బాధపడే ఒక వ్యక్తి యొక్క కనిష్ఠ దూర బిందువు 50 సెం.మీ. ఈ దోష నివారణకు వాడే కటక నాభ్యంతరాన్ని, ఆ కటక సామర్థ్యాన్ని కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 40

ప్రశ్న 9.
మీ తరగతి గదిలో ఇంద్రధనుస్సు ఏర్పరచుటకు కావలసిన పరికరముల జాబితా వ్రాయుము.
జవాబు:
కావలసిన పరికరములు :
ట్రే, నీరు, సమతల దర్పణం, తెల్లరంగు గల గోడ.

ప్రశ్న 10.
పట్టకం గుండా తెల్లని కాంతి ఎందుకు విక్షేపణం చెందును?
జవాబు:
తెల్లని కాంతి పట్టకం గుండా ప్రవేశించినపుడు అది వివిధ రంగులుగా విక్షేపణం చెందును. ఎందుకనగా తెల్లని కాంతి వివిధ రంగుల మిశ్రమం. అంతేగాక ప్రతి రంగుకు గల తరంగదైర్ఘ్యాలు వేరువేరుగా వుంటాయి. దీని వలననే వివిధ రంగుల వర్ణపటం ఏర్పడుతుంది.

ప్రశ్న 11.
పట్టకం గుండా ఏదైనా ఒక రంగు గల కాంతిని పంపినపుడు అది మరికొన్ని రంగులుగా విక్షేపణం చెందుతుందా? ఎందుకు?
జవాబు:
కాంతి జనకం యొక్క ఒక ప్రత్యేక లక్షణం దాని పౌనఃపున్యం. అనగా ఆ కాంతి జనకాన్ని ఒక సెకనులో విడిపోయే తరంగాల సంఖ్య. ఈ సంఖ్య యానకాన్ని బట్టి మారదు. కావున వక్రీభవనం వల్ల కాంతి పౌనఃపున్యం మారదు. అందువల్ల పట్టకంలో ప్రవేశించిన రంగు.కాంతి మరికొన్ని రంగులుగా విక్షేపణం చెందదు.

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

ప్రశ్న 12.
తెల్లని కాంతి పట్టకంలోనికి ప్రవేశించినపుడు 7 రంగులను గమనిస్తాము. ఆ 7 రంగుల జాబితా వ్రాయుము.
జవాబు:
1) ఊదారంగు 2) ఇండిగో 3) నీలం 4) ఆకుపచ్చ 5) పసుపుపచ్చ 6) నారింజరంగు 7) ఎరుపురంగు

ప్రశ్న 13.
ప్రక్కపటాన్ని పరిశీలించండి. ఈ పటం నుండి క్రింది వాటిని గుర్తించండి.
i) బహిర్గత కిరణం ii) విచలన కోణం iii) పట్టక కోణం iv) పట్టకంలో వక్రీభవన కిరణం v) వక్రీభవన గుణకం కనుగొను సూత్రం
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 41
i) బహిర్గత కిరణం YZ
ii) విచలన కోణం ∠d
iii) పట్టక కోణం ∠BAC
iv) పట్టకంలో వక్రీభవన కిరణం XY
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 42

10th Class Physics 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. సాధారణ మానవుని దృష్టి కోణం
A) 160°
B) 60°
C) 6°
D) 16°
జవాబు:
B) 60°

2. జతపరచండి.
i) పరిక్షేపణం P) కంటి దృష్టి దోషం
ii) విక్షేపణం Q) VIBGYOR
iii) కటక సామర్థ్యం R) రెటీనా
iv) కోనులు, దండాలు’ S) ఆకాశపు రంగు
A) i – s, ii – Q, iii – R, iv – P
B) i – Q, ii – S, iii – P, iv – R
C) i – s, ii – Q, iii – P, iv – R
D) i – Q, ii – S, iii – R, iv-P
జవాబు:
C) i- s, ii – Q, iii – P, iv – R

3.
AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం 43
పటాన్ని పరిశీలించండి. కన్నుపై సమాంతర కాంతి కిరణాలు పతనం చెంది, రెటీనాకు ముందు అభిసరణం చెందినది. ఇది కంటి యొక్క ఒక నిర్దిష్ట దృష్టిలోపాన్ని
తెలుపుతుంది. దీనిని నివారించడానికి ……. కటకాన్ని వాడాలి.
A) ద్వికుంభాకార
B) ద్విపుటాకార
C) కుంభాకార లేదా పుటాకార
D) పుటాకార – కుంభాకార
జవాబు:
B) ద్విపుటాకార

4. రాజ్ కుమార్ కళ్ళను డాక్టర్ పరీక్షించి, అతడికి దీర్ఘదృష్టి ఉందని గుర్తించాడు. అతడి కనిష్ట దూర బిందువు దూరం 50 సెం.మీ. డాక్టర్ అతడికి సూచించిన కటకం
A) -2D
B) +1D
C) -1D
D) +2D
జవాబు:
D) +2D

5. ప్రవచనం P : హ్రస్వదృష్టిని నివారించేందుకు ద్విపుటాకార కటకాన్ని వాడతారు.
ప్రవచనం Q : ద్విపుటాకార కటకం యొక్క f విలువ ధనాత్మకం.
A) P సరియైనది కాదు. Q సరియైనది
B) P సరియైనది, Q సరియైనది కాదు
C) P, Q లు రెండూ సరియైనవి
D) P, Q లు రెండూ సరియైనవి కావు
జవాబు:
B) P సరియైనది, Q సరియైనది కాదు

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

6. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు?
A) పరిక్షేపణం
B) పరావర్తనము
C) వక్రీభవనం
D) విక్షేపణం
జవాబు:
D) విక్షేపణం

7. హ్రస్వదృష్టి (Myopia) గల కంటి యొక్క గరిష్ఠ దూర బిందువు 1.5 మీ|| దూరంలో ఉంది. ఈ దోషాన్ని సవరించడానికి వాడవలసిన కటక సామర్థ్యం విలువ
A) 0.66 D
B) -0.66 D
C) +1.5D
D) -1.55 D
జవాబు:
B) -0.66 D

8. కింది వాటిలో కాంతి విక్షేపణం యొక్క ఫలితం
A) ఎండమావులు
B) ఆకాశపు నీలి రంగు
C) ఇంధ్రధనుస్సు
D) నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం
జవాబు:
C) ఇంధ్రధనుస్సు

9. నీవు ఎండలో నిలబడి పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంలో క్రింది వానిలో సరియైనది.
A) నల్లగుడ్డు, కనుపాపను సంకోచింపచేయును.
B) నల్లగుడ్డు, కనుపాపను వ్యాకోచింపచేయును.
C) కనుపాపలో ఎలాంటి మార్పూ లేదు.
D) నల్లగుడ్డులో ఎలాంటి మార్పూ లేదు. యొక్క సామర్థ్యం
జవాబు:
A) నల్లగుడ్డు, కనుపాపను సంకోచింపచేయును.

10. ఆకాశం నీలిరంగులో కనబడడానికి కారణం
A) కాంతి పరావర్తనం
B) కాంతి వక్రీభవనం
C) కాంతి విక్షేపణం
D) కాంతి పరిక్షేపణం
జవాబు:
D) కాంతి పరిక్షేపణం

11. ఆకాశం నీలిరంగులో కనిపించటానికి వాతావరణంలోని ……. అణువులు కారణం.
A) నీటి ఆవిరి మరియు క్రిప్టాన్
B) కార్బన్ డై ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్
C) నైట్రోజన్ మరియు ఆక్సిజన్
D) క్రిప్టాన్ మరియు కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
C) నైట్రోజన్ మరియు ఆక్సిజన్

12. పరిక్షేపణ కాంతి యొక్క తీవ్రత అధికంగా ఉండాలంటే పరికేపణం కోణ విలువ
A) 0°
B) 90°
C) 180°
D) 60°
జవాబు:
B) 90°

13. VIBGYOR లో కనిష్ఠ శక్తి కలిగిన కాంతి ……….
A) ఊదా (వయోలెట్)
B) నీలం
C) ఆకుపచ్చ
D) ఎరుపు
జవాబు:
D) ఎరుపు

14. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం, దృష్టి కోణం విలువలు వరుసగా ……
A) 25 సెం.మీ., 60°
B) 60 సెం.మీ., 20°
C) 25 సెం.మీ., 25°
D) 60 సెం.మీ., 60°
జవాబు:
A) 25 సెం.మీ., 60°

15. మధ్యాహ్నం సూర్యుడు తెలుపు రంగులో కనిపించుటకు ప్రధాన కారణం
A) కాంతి తక్కువగా పరిక్షేపణం చెందుట.
B) కాంతి పరావర్తనం చెందడం.
C) కాంతి వక్రీభవనం చెందడం.
D) కాంతి విక్షేపణం చెందడం.
జవాబు:
A) కాంతి తక్కువగా పరిక్షేపణం చెందుట.

16. దగ్గర వస్తువులు మాత్రమే చూడగల్గటాన్ని ……… అని అంటారు. దాని నివారణకు ……… కటకాన్ని వాడతారు.
A) హ్రస్వదృష్టి, కుంభాకార
B) దీర్ఘదృష్టి, కుంభాకార
C) దీర్ఘదృష్టి, పుటాకార
D) హ్రస్వదృష్టి, పుటాకార
జవాబు:
D) హ్రస్వదృష్టి, పుటాకార

17. కంటి కటకం తన నాభ్యంతరాన్ని ……… సెం.మీ. నుండి ……… సెం.మీ. ల మధ్య ఉండేటట్లు సర్దుబాటు చేసుకుంటుంది.
A) 22.7; 25
B) 2.27; 2.42
C) 2.26; 2.5
D) 2.27; 2.5
జవాబు:
D) 2.27; 2.5

18. జతపరచండి.
1) కంటి కటకానికి నేత్రోదక ద్రవానికి మధ్య ఉండే కండర పొర ( ) X) రెటీనా
2) కంటి కటకానికి నేత్రోదక ద్రవానికి మధ్య ఉండే కండర పొరకు ఉండే చిన్న రంధ్రం ( ) Y) కనుపాప
3) కనుగుడ్డు వెనక ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం ( ) Z) ఐరిస్
A) (1) – X, (2) – Y, (3) – Z
B) (1) – X, (2) – Z, (3) – Y
C) (1) – 2, (2) – X, (3) – Y
D) (1) – Z, (2) – Y, (3) – X
జవాబు:
D) (1) – Z, (2) – Y, (3) – X

AP 10th Class Physical Science Important Questions 5th Lesson మానవుని కన్ను-రంగుల ప్రపంచం

19. క్రింది వాటిలో కంటి యొక్క ఏ భాగాలు కంటిలోకి వచ్చే కాంతి తీవ్రతను నియంత్రిస్తాయి?
(లేదా)
మానవుని కంటిలోనికి ప్రవేశించే కాంతిని అదుపు చేయు కంటి భాగం
A) నల్లగుడ్డు, కనుపాప
B) నల్లగుడ్డు, సిలియరి కండరాలు
C) కనుపాప, కార్నియా
D) నల్లగుడ్డు, కార్నియా
జవాబు:
A) నల్లగుడ్డు, కనుపాప

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

These AP 10th Class Physics Important Questions and Answers 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 4th Lesson Important Questions and Answers వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physics 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
కుంభాకార కటకం నాభ్యంతరం కనుగొనుటకు అవసరమగు పరికరాల జాబితా రాయండి.
జవాబు:
కుంభాకార కటకం, సూర్య కాంతి, చిన్న కాగితం ముక్క, స్కేలు
(లేదా)
కుంభాకార కటకం, V – స్టాండ్, కొవ్వొత్తి, అగ్గిపెట్టె, తెర, స్కేలు.

ప్రశ్న 2.
పటంలో చూపిన విధంగా రెండు రకాల పారదర్శక పదార్థాలతో కుంభాకార కటకాన్ని తయారు చేస్తే ఏర్పడే ప్రతిబింబంలో ఏం మార్పు జరుగుతుంది?
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 1
జవాబు:
రెండు రకాల పారదర్శక పదార్థాల వక్రీభవన గుణకాలు వేరువేరుగా వుంటాయి. కావున పటంలో చూపిన కుంభాకార కటకం ద్వారా రెండు వేరు వేరు ప్రతిబింబాలు ఏర్పడుతాయి.

ప్రశ్న 3.
మీరు ఈత కొలనులోని నీటి లోపల ఉన్నారనుకుందాం. మీ స్నేహితుడు ఈత కొలను ఒక చివర అంచు వద్ద నిలుచున్నాడు. అతను మీకు తన ఎత్తు కంటే పొడవుగా కనిపిస్తాడా? పొట్టిగా కనిపిస్తాడా? ఎందుకు?
జవాబు:
స్నేహితుడు పొడవుగా కనిపిస్తాడు కారణం కాంతి వక్రీభవనము.

ప్రశ్న 4.
క్రింద ఇచ్చిన కిరణ రేఖా చిత్రమును పూర్తి చేయండి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 2
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 3

ప్రశ్న 5.
ఇవ్వబడిన పటంలోని ప్రతిబింబ స్వభావాన్ని చర్చించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 4

  1. ఇవ్వబడిన చిత్రంలో వస్తువు వక్రతా కేంద్రం (C2), నాభి (F2) ల మధ్య ఉంచబడినది కనుక నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడినది.
  2. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కన్నా ఎక్కువ.
  3. ప్రతిబింబం ‘C1‘ కు ఆవల ఏర్పడినది.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 6.
వక్రీభవనం అనగానేమి?
జవాబు:
ఒక పారదర్శక యానకం నుండి మరొక పారదర్శక యానకంలోకి ,కాంతి ప్రయాణిస్తున్నపుడు రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతివేగం మారడాన్ని కాంతి వక్రీభవనం అంటాం.

ప్రశ్న 7.
సమతల వక్రీభవన తలాలవలె గోళాకార వక్రీభవన తలాలు వక్రీభవన నియమాలను పాటిస్తాయా?
జవాబు:
అవును, గోళాకార వక్రీభవన తలాలు కాంతి వక్రీభవన నియమాలను పాటిస్తాయి.

ప్రశ్న 8.
వక్రీభవన స్నెల్ నియమమును వ్రాయుము.
జవాబు:
పతన కోణపు సైన్ విలువకు, వక్రీభవన కోణపు సైన్ విలువకు గల నిష్పత్తి వరుసగా రెండవ యానకం, మొదటి యానకాల వక్రీభవన గుణకాల నిష్పత్తికి సమానం. దీనినే స్నెల్ నియమం అంటారు.

ప్రశ్న 9.
యానకాల వక్రీభవన గుణకాలు, వస్తుదూరం, ప్రతిబింబదూరం మరియు వక్రతా వ్యాసార్ధాల మధ్య సంబంధంను వ్రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 5

ప్రశ్న 10.
కటకం అంటే ఏమిటి?
జవాబు:
రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలూ లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని ‘కటకం’ అంటారు.

ప్రశ్న 11.
కటకపు రకాలను వ్రాయుము.
జవాబు:
కటకములు ముఖ్యంగా రెండు రకాలు. అవి :
1) కుంభాకార కటకము
2) పుటాకార కటకము

ప్రతి రకపు కటకములో సమతల, ద్వితలపు కటకములు కలవు.

ప్రశ్న 12.
కటకాలలోని రకాల పటాలు గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 7

ప్రశ్న 13.
కటకాలలో వాడు ముఖ్య పదజాలంను తెల్పుము.
జవాబు:
వక్రతా కేంద్రం – (C) ; వక్రతా వ్యాసార్ధము – (R), నాభి – (F), నాభ్యంతరం – (f)
ప్రధానాక్షము మరియు దృక కేంద్రం మొ||నవి.

ప్రశ్న 15.
కటక నాభి అంటే ఏమిటి?
జవాబు:
ఒక కటకము గుండా కాంతిని ప్రసరింపజేసినపుడు కాంతికిరణాలు కేంద్రీకరింపబడిన బిందువు (లేదా) కాంతికిరణాలు వెలువడుతున్నట్లు కన్పించే బిందువును కటక నాభి (F) అంటారు.

ప్రశ్న 16.
కటక నాభ్యంతరం అంటే ఏమిటి?
జవాబు:
కటక నాభి మరియు దృక కేంద్రంల మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం (f) అంటారు.

ప్రశ్న 17.
కిరణ చిత్రాలలో కటకాలను సులభంగా గీయడానికి వాడు గుర్తులను వ్రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 8

ప్రశ్న 18.
కటకాల ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతికిరణమైనా ఏమగును?
జవాబు:
కటకాల ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతికిరణము విచలనం చెందదు.

ప్రశ్న 19.
కటకాల దృక కేంద్రం గుండా ప్రయాణించే కాంతికిరణ లక్షణమును వ్రాయుము.
జవాబు:
కటకాల దృక కేంద్రం గుండా ప్రయాణించే కాంతికిరణాలు విచలనం చెందవు.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 20.
కటక నాభి గుండా ప్రయాణించే కాంతికిరణాల ప్రవర్తన ఏ విధంగా ఉండును?
జవాబు:
కటక నాభి గుండా ప్రయాణించే కాంతికిరణం వక్రీభవనం పొందాక, ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించును.

ప్రశ్న 21.
కటకపు ప్రధానాక్షంకు సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణాల స్వభావంను వ్రాయుము.
జవాబు:
కటకపు ప్రధానాక్షంకు సమాంతరంగా ప్రయాణించు కాంతికిరణాలు నాభి వద్ద కేంద్రీకరింపబడటం కాని, వికేంద్రీకరింపబడటం కాని జరుగును.

ప్రశ్న 22.
కటకపు ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతికిరణాలు కటకంపై పతనం చెందితే ఏం జరుగును?
జవాబు:
ప్రధానాక్షంతో ంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతికిరణాలు నాభీయతలంపై ఏదేని బిందువు వద్ద . కేంద్రీకరింపబడతాయి (లేదా) వికేంద్రీకరింపబడతాయి.

ప్రశ్న 23.
వస్తువు అనంతదూరంలో ఉండటం అంటే ఏమిటి?
జవాబు:
కటకపు వక్రతా కేంద్రం (C2) కు ఆవల (నాభ్యంతరానికి కనీసం 4 రెట్ల కన్నా ఎక్కువ దూరంలో) వస్తువు ఉండుటను అనంతదూరంలో వస్తువుండటంగా భావిస్తాం.

ప్రశ్న 24.
అనంతదూరంలో వస్తువునుంచిన, దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడును?
జవాబు:
అనంతదూరంలో వస్తువునుంచిన, దాని ప్రతిబింబం కటక నాభి (F) వద్ద బిందురూపంలో ఏర్పడును.

ప్రశ్న 25.
కుంభాకార కటక వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై వస్తువునుంచిన ప్రతిబింబం ఏర్పడు స్థానం, లక్షణాలను వ్రాయుము.
జవాబు:
కుంభాకార కటక వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై వస్తువునుంచిన తలక్రిందులుగా ఉన్న నిజప్రతిబింబం F1 మరియు C1 ల మధ్య ఏర్పడును.

ప్రశ్న 26.
కుంభాకార కటక వక్రతా కేంద్రం వద్ద వస్తువునుంచిన ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
జవాబు:
కుంభాకార కటక, వస్తువును వక్రతా కేంద్రం (C2) వద్ద ఉంచినపుడు (C1) వద్ద సమాన పరిమాణం గల నిజప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడును.

ప్రశ్న 27.
కుంభాకార కటక వక్రతా కేంద్రం, నాభి మధ్య ఉంచినపుడు ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
జవాబు:
వస్తువును కుంభాకార కటక వక్రతా కేంద్రం, నాభి మధ్య ఉంచినపుడు నిజప్రతిబింబం మరియు పెద్దదైన ప్రతిబింబం తలక్రిందులుగా C1కు ఆవల ఏర్పడును.

ప్రశ్న 28.
కుంభాకార కటక నాభి వద్ద వస్తువునుంచినపుడు ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
జవాబు:
వస్తువును కుంభాకార కటక నాభి వద్ద ఉంచినపుడు ప్రతిబింబం అనంతదూరంలో ఏర్పడును.

ప్రశ్న 29.
కుంభాకార కటక నాభి మరియు కటక దృక కేంద్రం మధ్య వస్తువునుంచినపుడు ఏర్పడు ప్రతిబింబస్థానం, లక్షణాలను వ్రాయుము.
జవాబు:
కుంభాకార కటక నాభి మరియు కటక దృక కేంద్రానికి మధ్య వస్తువునుంచిన నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం, వస్తువు ఉన్నవైపునే ఏర్పడును.

ప్రశ్న 30.
కటక నాభ్యంతరం కనుగొనుటకు వాడు సూత్రంను వ్రాసి, దానిలోని పదాలను వ్రాయుము.
జవాబు:
కటక నాభ్యంతరం కనుగొనుటకు సూత్రం \(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)
ఇందులో u – వస్తుదూరము ; V – ప్రతిబింబదూరము ;  f – కటక నాభ్యంతరము

ప్రశ్న 31.
ద్వికుంభాకార కటకం అంటే ఏమిటి?
జవాబు:
రెండు వక్రతలాలు ఉబ్బెత్తుగా ఉండే కటకాలను ద్వికుంభాకార కటకాలు అంటారు. ఈ కటకాలు చివరల పల్చగానూ, మధ్యలో ఉబ్బెత్తుగానూ ఉంటాయి.

ప్రశ్న 32.
ద్విపుటాకార కటకం అనగానేమి?
జవాబు:
కటకం యొక్క రెండు తలాలు లోపలివైపు వంగివున్న తలాలుగా వుంటే ఆ కటకాన్ని ద్విపుటాకార కటకం అంటారు. ఈ కటకం అంచుల వద్ద మందంగాను, మధ్యలో పలుచగాను ఉంటుంది.

ప్రశ్న 33.
కటక నాభ్యంతరము అనగానేమి?
జవాబు:
కటకంపై పతనమైన సమాంతర కాంతికిరణాలు ప్రధానాక్షంపై ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడినట్లుగాను లేదా ఒక బిందువు నుండి వెలువడుతున్నట్లుగాను కనబడుతాయి. ఈ బిందువును ప్రధాన నాభి అంటారు. ప్రధాన నాభికి, కటక కేంద్రానికి మధ్య గల దూరాన్ని కటక నాభ్యంతరం అంటారు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 9

ప్రశ్న 34.
కుంభాకార కటకం ద్వారా వృద్ధీకృత – మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది?
జవాబు:
కటక నాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో వస్తువు ఉంచినపుడు లేదా వస్తువును కుంభాకార కటక నాభి, ధృక్ కేంద్రం మధ్య ఉంచినపుడు కుంభాకార కటకం ద్వారా వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 10

ప్రశ్న 35.
గాలి కాకుండా ఇతర యానకంలో ఉంచినపుడు కుంభాకార కటకం ఎలా పని చేస్తుంది?
జవాబు:

  1. కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినపుడు, అది కేంద్రీకరణ కటకం వలె పని చేస్తుంది.
  2. దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినపుడు అది వికేంద్రీకరణ కటకం వలె పని చేస్తుంది.

ప్రశ్న 36.
కుంభాకార, పుటాకార కటకాలకు కిరణ చిత్రాలు గీయడానికి ఉపయోగించు గుర్తులను వ్రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 11

ప్రశ్న 37.
కుంభాకార, పుటాకార కటకాలను ఉపయోగించు వివిధ పరికరాల పేర్లను వ్రాయండి.
జవాబు:
కుంభాకార కటకాలను ఉపయోగించు వస్తువులు :
సూక్ష్మదర్శిని, దూరదర్శిని, దీర్ఘదృష్టికి వాడు కళ్ళజోడు.

పుటాకార కటకాలను ఉపయోగించు వస్తువులు హ్రస్వ దృష్టికి వాడు కళ్ళజోడు.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 38.
నాభ్యంతరం 20 సెం.మీ. అయిన కటక నాభీయ సామర్థ్యం ఎంత?
జవాబు:
నాభ్యంతరం (f) = 20 సెం.మీ.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 12

10th Class Physics 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒకే నాభ్యంతరం గల రెండు కుంభాకార కటకాలను ఒక PVC గొట్టం నందు వాటి నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో అమర్చారు. ఈ అమరికతో ఒక బాలుడు చంద్రుని పరిశీలిస్తే ఏం గమనిస్తాడో ఊహించి రాయండి.
జవాబు:
చంద్రుని నుండి వచ్చే కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు వాటిని మొదటి కటకం నాభివద్ద కేంద్రీకరిస్తుంది. అదే నాభి రెండవ కటకానికి కూడా నాభి అవుతుంది. కనుక నాభి నుండి వచ్చే కాంతి కిరణాలను రెండవ కటకం సమాంతర కిరణాలుగా మారుస్తుంది.

కావున చంద్రుని కిరణాలలో ఏ మార్పూ జరగదు. కనుక ఈ అమరిక లేకుండా చంద్రుణ్ణి చూసినా ఈ అమరిక గుండా చంద్రుణ్ణి చూసినా ఏ మార్పూ ఉండదు.
(లేదా)
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 13
మామూలుగా చూసినప్పుడు చంద్రుడు ఎలా కనిపిస్తాడో ఈ పరికరం నుండి చూసినా అదే విధంగా కనిపిస్తాడు.

ప్రశ్న 2.
పటంలో చూపినట్లు ఒక కుంభాకార కటకం 5 వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడింది. అది ఎన్ని ప్రతి బింబాలను ఏర్పరుస్తుంది? ఎందుకు?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 14
ఇచ్చిన కుంభాకార కటకం 5 వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడినది. కనుక అవి విభిన్న (వేర్వేరు) A వక్రీభవన గుణకాలు. వేర్వేరు నాభ్యాంతరాలు కలిగి ఉంటాయి. అందువల్ల ‘5’ వేర్వేరు ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది.

ప్రశ్న 3.
కింది కిరణ చిత్రాన్ని పూర్తి చేయండి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 15
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 16

ప్రశ్న 4.
ఒక కుంభాకార కటక పదార్థం యొక్క వక్రీభవన గుణకం 1.46. బెంజీన్ వక్రీభవన గుణకం 1.5, నీటి వక్రీభవన గుణకం 1 అయిన పై కటకాన్ని నీరు, బెంజీన్లలో ఉంచినపుడు ఆ కటకం ఎలా ప్రవర్తిస్తుందో ఊహించండి.
జవాబు:

  1. 1.46 వక్రీభవన గుణకం కలిగిన కుంభాకార కటకాన్ని 1 వక్రీభవన గుణకం గల నీటిలో ఉంచినప్పుడు అది కేంద్రీకరణ కటకంలా పనిచేస్తుంది.
  2. దానికి 1.5 వక్రీభవన గుణకం గల బెంజీన్లో ఉంచినప్పుడు అది వికేంద్రీకరణ కటకంలా పనిచేస్తుంది.

ప్రశ్న 5.
ఒక కటకం యొక్క నాభ్యంతరం దాని చుట్టూ ఉన్న యానకం మీద ఆధారపడుతుంది. పరిసర యానకంగా ఉపయోగించే ద్రవం యొక్క వక్రీభవన గుణకం కటక పదార్థం యొక్క వక్రీభవన గుణకంతో సమానం అయితే ఏమి జరుగుతుందో ఊహించి రాయండి.
జవాబు:

  1. పరిసరయానక వక్రీభవన గుణకం, కటక పదార్థ వక్రీభవన గుణకంతో సమానం అయితే ఆ కటకం కటక లక్షణాలను కోల్పోతుంది.
  2. ఆ కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించడం గానీ, వికేంద్రీకరించడం గానీ చేయదు.
  3. ఆ కటకంపై పడ్డ కాంతి కిరణం వక్రీభవనం చెందకుండా సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది.

ప్రశ్న 6.
సమతల కుంభాకార కటక వక్రతా వ్యాసార్ధం R. కటక పదార్థ వక్రీభవన గుణకం n అయిన దాని నాభ్యంతరం కనుగొనండి.
జవాబు:
ఇచ్చిన కటకము సమతల కుంభాకార కటకము.
కటక వక్రతా వ్యాసార్ధం = R, కటక పదార్థ వక్రీభవన గుణకము = n.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 17

ప్రశ్న 7.
ఒక విద్యార్థి ద్వికుంభాకార కటకంతో ప్రయోగం చేసి ఈ క్రింది టేబుల్ ను రూపొందించాడు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 18
పై పట్టికలో గల సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పై పట్టికలో నాభ్యాంతరం విలువలు విభిన్నంగా వుండడానికి గల కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నావు?
బి) పై కటక నాభ్యంతరంను ఎలా నిర్ణయిస్తాం? ఆ విలువ ఎంత?
సి) వస్తు దూరం 10 సెం.మీ. అయ్యేట్లు ప్రయోగాన్ని నిర్వహించి ప్రతిబింబ దూరాన్ని కొలవగలరా? ఎందుకు?
డి) పై పట్టిక ప్రకారం u, v, f ల మధ్య మీరు గుర్తించిన సంబంధం ఏమిటి?
జవాబు:
ఎ) నాభ్యంతరం విలువలు సరిగా రాలేదంటే ప్రయోగ నిర్వహణలో దోషాలు జరిగి ఉండవచ్చును.
బి) కటక నాభ్యంతరం విలువ, మొత్తం నాభ్యంతరాల సగటు విలువకు సమానం.

సి) ఇది అసాధ్యము, ఎందుకనగా వస్తువును f కంటే ముందు ఉంచిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది కనుక దాని దూరాన్ని కొలవలేము.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 19

డి) u విలువ తగ్గుతూ ఉంటే ఆ విలువ పెరుగుతూ ఉంటుంది. కాని f విలువ అన్ని సందర్భాలలో దాదాపు స్థిరంగా ఉంటుంది.
\(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)

ప్రశ్న 8.
నీ స్నేహితుడు నీకు క్రింది ఫార్ములాలను చెప్పాడు.
\(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\) ; \(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)
నిన్ను ఇలా అడిగాడు.
ఎ) పై ఫార్ములాలను వాడటంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
బి) పై రెండు ఫార్ములాలు ఏ సందర్భాల్లో వాడాలి?
జవాబు:
ఎ) పై సూత్రాలను ఉపయోగించినపుడు తప్పక సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాలి.
బి) \(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\) అను సూత్రంను ఏ కటకానికైన వినియోగించవచ్చును.
\(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)అను సూత్రంను కటకం గాలిలో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి.

ప్రశ్న 9.
సంజ్ఞాసంప్రదాయ నియమాలను వ్రాయుము.
జవాబు:

  1. అన్ని దూరాలను పోల్ లేదా దృక కేంద్రం నుండి కొలవాలి.
  2. పతన కాంతి దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా లెక్కించాలి.
  3. పతన కాంతి దిశకు వ్యతిరేకదిశలో కొలిచిన దూరాలను ఋణాత్మకంగా లెక్కించాలి.
  4. ప్రధానాక్షంపై గల బిందువుల నుండి పైవైపు కొలిచిన ఎత్తులను ధనాత్మకంగా తీసుకోవాలి.
  5. ప్రధానాక్షంపై గల బిందువుల నుండి కిందివైపు కొలిచిన ఎత్తులను ఋణాత్మకంగా తీసుకోవాలి.

ప్రశ్న 10.
వక్రతలాల వద్ద వక్రీభవనమును తెలుపు సూత్రము, సమతలాల వద్ద ఏ విధంగా వినియోగించవచ్చునో తెలుపండి.
జవాబు:
వక్రతలాలకు సంబంధించు సూత్రం n2/v – n1/u = (n2 – n1)/ R
సమతలాలకు R విలువ అనంతం అవుతుంది. \(\frac{1}{R}\) విలువ ‘0’ కు సమానం అవుతుంది.
n2/v – n1/a = 0 ⇒ n2/v = n1/u

ప్రశ్న 11.
కటక నాభ్యంతరము పరిసర యానకంపై ఆధారపడుతుందని ఎలా చెప్పవచ్చును? తెలపండి.
జవాబు:
కటకం గాలిలో ఉన్నప్పుడు కనుగొన్న నాభ్యంతరం కంటే, రాయి – కటకం మధ్య దూరం ఎక్కువగా ఉండే విధంగా కటకాన్ని నీటిలో ఉంచితే మనం ప్రతిబింబం చూడగలము. దీనిని బట్టి నీటిలో ఉన్నప్పుడు కటక నాభ్యంతరం పెరిగిందని తెలుస్తుంది. అంటే కటక నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుందని తెలుస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 12.
‘కుంభాకార కటకము ఎప్పుడు కేంద్రీకరణ కటకముగా మరియు వికేంద్రీకరణ కటకముగా పనిచేస్తుందో వివరించండి.
జవాబు:
కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు, అది కేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది. కాని దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది.

ప్రశ్న 13.
కుంభాకార, పుటాకార కటకముల మధ్య భేదములను వ్రాయండి.
జవాబు:

కుంభాకార కటకం పుటాకార కటకం
1. దీని అంచులు పలుచగాను, మధ్యలో మందంగాను ఉంటుంది. 1. దీని అంచులు మందముగాను, మధ్యలో పలుచగాను ఉంటుంది.
2. కాంతి కిరణాలు దీని మీద పడి వక్రీభవనం చెందిన తరువాత కేంద్రీకరించబడతాయి. 2. కాంతి కిరణాలు దీని మీద పడినపుడు వక్రీభవనం తరువాత వికేంద్రీకరణం చెందుతాయి.
3. దీని ద్వారా వస్తువులను చూచినపుడు పెద్దవిగా కనబడతాయి. 3. దీని ద్వారా వస్తువులను చూచినపుడు కుంచించుకొని  పోయినట్లు కనబడతాయి.
4. ఇది సాధారణంగా నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. 4. ఇది ఎల్లప్పుడు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 14.
కుంభాకార, పుటాకార కటకముల లక్షణాలను తెలుసుకొనుటకు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:

  1. ఇచ్చిన కటకం ఏ విధంగా ఉంది?
  2. కటకం ద్వారా ప్రతిబింబం తెరపై ఏర్పడినదా?
  3. కటకం ముందు వేరు వేరు స్థానాల వద్ద ఉంచినపుడు ప్రతిబింబం పరిమాణం ఏమవుతున్నది?
  4. వస్తు పరిమాణం కన్నా కటకంలో ప్రతిబింబ పరిమాణం గమనించినపుడు ఏ విధంగా ఉంటుంది?

ప్రశ్న 15.
సమతలాల వద్ద వక్రీభవనమును, వక్రతలాల వద్ద వక్రీభవనమును నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
వక్రతలాల వక్రీభవనాన్ని సూక్షదర్శినిలోను, దూరదర్శినిలోను మరియు దృష్టి దోషాల నివారణలోను ఉపయోగిస్తారు. కాబట్టి సమతలాల, వక్రతలాల వక్రీభవనాన్ని అభినందిస్తున్నాను.

ప్రశ్న 16.
కటక సామర్యం అనగానేమి?
జవాబు:
కటక నాభ్యంతరం (f) యొక్క విలోమమును “కటక సామర్థ్యం” అంటారు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 20
S.I. ప్రమాణం – డయాప్టర్ (D)
– కుంభాకార కటకానికి f, P విలువలు ధనాత్మకం (+). – పుటాకార కటకానికి 1. P విలువలు ఋణాత్మకం (-).

10th Class Physics 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
వస్తువును F, మరియు 2F, ల మధ్య ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాన్ని సూచిస్తూ, కింది పటాన్ని పూర్తి చేయండి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 21
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 22

ప్రశ్న 2.
10 సెం.మీ. నాభ్యాంతరం గల కుంభాకార కటకం ముందు కింద తెలిపిన వివిధ దూరాలలో వస్తువు ఉంచబడింది.
(a) 8 సెం.మీ. (b) 15 సెం.మీ. (c) 20 సెం.మీ. (d) 25 సెం.మీ.
పైన తెలిపిన ఏ స్థానం వద్ద వస్తువును ఉంచినపుడు ప్రతిబింబ లక్షణాలు కింది విధంగా ఉంటాయి? సకారణంగా వివరించండి.
i) వస్తు పరిమాణం కంటే చిన్నదైన, తలక్రిందులుగా ఉన్న నిజ ప్రతిబింబం
ii) వస్తు పరిమాణం కంటే పెద్దదైన, తలక్రిందులుగా ఉన్న నిజ ప్రతిబింబం
iii) వస్తు పరిమాణం కంటే పెద్దదైన, నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం
iv) వస్తు పరిమాణానికి సమాన పరిమాణం గల ప్రతిబింబం
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 23

ప్రశ్న 3.
క్రింది పట్టికలో కుంభాకార కటకం ద్వారా ఏర్పడు ప్రతిబింబంను చూపు కిరణ చిత్రాలు ఇవ్వబడినవి. ఈ పటాల ద్వారా ఈ క్రింది పట్టికను పూరించండి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 24
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 25

ప్రశ్న 4.
కుంభాకార కటకంపై పతనం చెందే కాంతి కిరణాల ప్రవర్తనను ఏవేని 4 సందర్భాలలో వివరించండి.
జవాబు:
1) ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతికిరణం :
ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కిరణమైనా విచలనం చెందదు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 26

2) కటక దృక్ కేంద్రం గుండా ప్రయాణించే కిరణం :
కటక దృక్ కేంద్రం గుండా ప్రయాణించే కాంతికిరణం కూడా విచలనం పొందదు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 27

3) ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణం :
ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతికిరణాలు నాభివద్ద కేంద్రీకరించబడతాయి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 28

4) నాభి గుండా ప్రయాణించే కాంతికిరణం :
కటక నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం చెందిన తరువాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 29

ప్రశ్న 5.
ఒక కుంభాకార కటకం నాభ్యంతరం 4 సెం.మీ. ఆ కటకం ముందు ప్రధానాక్షంపై వస్తువుని
i) 8 సెం.మీ. దూరంలో మరియు
ii) 10 సెం.మీ. దూరంలో ఉంచినపుడు ప్రతిబింబము ఏర్పడుటను సూచించు కిరణ చిత్రాలను గీచి రెండు సందర్భాలలో ప్రతిబింబ లక్షణాలు రాయుము.
జవాబు:
1) కిరణ చిత్రం :
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 22
ప్రతిబింబ లక్షణాలు :
1) వస్తువు పరిమాణానికి ప్రతిబింబ పరిమాణం సమానం.
2) ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడును.
3) నిజ ప్రతిబింబం ఏర్పడును.
4) ప్రతిబింబం ‘C1‘ వద్ద ఏర్పడును.

ii) కిరణ చిత్రం :
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 30
ప్రతిబింబ లక్షణాలు :
1) ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కంటే చిన్నది.
2) తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది.
3) నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది.
4) ప్రతిబింబం ‘F1‘ & ‘C1‘ ల మధ్య ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
వక్రీభవన గుణకం (n) = 1.5 గా గల ఒక ద్విపుటాకార కటకం గాలిలో ఉంచబడింది. ఈ కటకం యొక్క రెండు వక్రతలాల వక్రతా వ్యాసార్ధాలు వరుసగా R1 = 20 సెం.మీ., R2 = 60 సెం.మీ. అయిన కటక నాభ్యంతరంను కనుక్కోండి. ఆ కటకం లక్షణంను పేర్కొనండి.
జవాబు:
దత్తాంశం : n = 1.5; R1 = 20 సెం.మీ.; R2 = 60 సెం.మీ.
సంజ్ఞాసాంప్రదాయం ప్రకారం, n = 1.5; R1 = – 20 సెం.మీ. ; R2 = 60 సెం.మీ.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 31

కనుక f = – 30 సెం.మీ. (ఇక్కడ ఋణగుర్తు కటకం వికేంద్రీకరణ కటకం అని తెలియజేస్తుంది)

ద్విపుటాకార కటక లక్షణాలు :

  1. ఇది వికేంద్రీకరణ కటకం.
  2. ఇది మధ్య భాగంలో పలుచగాను, అంచులందు మందంగాను ఉన్నది.

ప్రశ్న 7.
25 సెం.మీ. నాభ్యంతరము గల కుంభాకార కటకం ప్రధానాక్షంపై 50 సెం.మీ. మరియు 75 సెం.మీ. దూరంలలో వస్తువును ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను రాయండి.
జవాబు:
వస్తువును 50 సెం.మీ. దూరంలో ఉంచినప్పుడు :

  1. ప్రతిబింబం 50 సెం.మీ. దూరంలో ఏర్పడుతుంది.
  2. వస్తుపరిమాణానికి ప్రతిబింబ పరిమాణం సమానం.
  3. ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది.
  4. నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది.

వస్తువును 75 సెం.మీ. దూధంలో ఉంచినప్పుడు :

  1. ప్రతిబింబం F, C ల మధ్య ఏర్పడుతుంది. (37.5 సెం.మీ. వద్ద)
  2. వస్తుపరిమాణం కన్నా తక్కువ పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడుతుంది.
  3. ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది.
  4. నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 8.
నిత్యజీవిత వినియోగంలో కటకాల పాత్రను తెలపండి.
జవాబు:
నిత్యజీవితంలో కటకాల పాత్ర :
i) దృష్టి దోషాల్ని సవరించుటకు
ii) భూతద్దంగా
iii) సూక్ష్మ దర్శినిలో
iv) టెలిస్కోప్ లో
v) బైనాక్యులలో
vi) సినిమా ప్రొజెక్టర్లలో
vii) కెమెరాలలో కటకాలను వినియోగిస్తారు.

ప్రశ్న 9.
4 సెం.మీ.ల నాభ్యంతరం గల ద్వి పుటాకార కటకం ముందు 3 సెంమీ., 5 సెం.మీ.ల వద్ద ప్రధానాక్షంపై వస్తువును ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాలకు కిరణచిత్రాలను గీయండి. ప్రతిబింబాల లక్షణాలు రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 32
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 33
ప్రతిబింబ లక్షణాలు :

  1. ప్రతిబింబం P, F ల మధ్య ఏర్పడును,
  2. వస్తువు కన్నా చిన్న ప్రతిబింబం,
  3. నిటారు ప్రతిబింబం,
  4. మిథ్యా ప్రతిబింబం.

ప్రశ్న 10.
ద్వికుంభాకార కటకాన్ని ఉపయోగించి దాని ప్రధానాక్షంపై S’ వద్ద బిందురూప ప్రతిబింబం ఏర్పరిచారు. కటక దృశ్యాకేంద్రం P దాని నాభులు ‘F’ మనకు తెలుసనుకుందాం. PF > PS’ అని కూడా తెలుసు. వీటి ఆధారంగా బిందురూప వస్తు స్థానాన్ని గుర్తించే కిరణచిత్రాన్ని గీసి, దానిలో ఇమిడివున్న కారణాలను తెల్పండి.
జవాబు:
ఇచ్చిన కటకము ద్వికుంభాకార కటకము మరియు ఇచ్చిన నియమము PF > PS’ అనగా ప్రతిబింబము దృశ్యాకేంద్రం (P) మరియు నాభి (F)ల మధ్య ఏర్పడును.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 34

స్నెల్ నియమం ప్రకారం ఈ నియమం వస్తువును ‘P’ మరియు ‘F’ ల మధ్య ఉంచినపుడు మాత్రమే సాధ్యపడును. ఎందుకనగా పరావర్తన కిరణాలు విసరణ చెందును కనుక.

ప్రశ్న 11.
ద్వికుంభాకార కటకం వక్రతా వ్యాసార్థాలు సమానం. వాటి ఒక వక్రతా కేంద్రం వద్ద ఒక వస్తువును ఉంచుదాం. కటక పదార్థ వక్రీభవన గుణకం ‘n’. కటకం గాలిలో ఉందని భావించండి. కటక ప్రతి తల వక్రతా వ్యాసార్ధం R అని తీసుకోండి.
a) కటక నాభ్యంతరం ఎంత?
b) ప్రతిబింబ దూరం ఎంత?
c) ప్రతిబింబ స్వభావాన్ని చర్చించండి.
జవాబు:
ద్వికుంభాకార కటకపు వక్రతా వ్యాసార్ధాలు సమానము కనుక R1 = R2 = R
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 35

c) పైన ఏర్పడిన ప్రతిబింబము తలక్రిందులైనదిగానూ మరియు v < u గా ఉండును.

ప్రశ్న 12.
ఒక కటకం పదార్థ వక్రీభవన గుణకం 1.5. ఆ కటకం ముందు 30 సెం.మీ. దూరంలో వస్తువు నుంచిన 20 సెం.మీ. దూరంలో ప్రతిబింబం ఏర్పడింది. అయితే దాని నాభ్యంతరం కనుగొనండి. అది ఏ కటకం ? కటక వక్రతా వ్యాసార్థాలు సమానమైతే ఆ విలువ ఎంత?
జవాబు:
i) ఆ కటకం కుంభాకారం అనుకుంటే :
వస్తు దూరము = u = – 30 సెం.మీ. (కటకంకు ముందున వస్తువు కలదు.)
ప్రతిబింబ దూరము = v = 20 సెం.మీ.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 36
∴ కటక వక్రతా వ్యాసార్ధము విలువ = R = 12, సెం.మీ.

ii) ఆ కటకం పుటాకార కటకం అనకుంటే :
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 37

ప్రశ్న 13.
కటక సూత్రాన్ని ఉత్పాదించుము. (లేదా) \(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\) ను ఉత్సాదించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 38
1) ఒక కుంభాకార కటకానికి ఎదురుగా ప్రధానాక్షంపై OO’ అను వస్తువునుంచుము.
2) కటకానికి రెండోవైపు II’ అనే నిజప్రతిబింబం ఏర్పడిందనుకొనుము.
3) O’ నుండి బయలుదేరి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కిరణం కటకంపై పతనమై, వక్రీభవనం చెందాక పటంలో చూపిన విధంగా నాభి F1 గుండా పోతుంది.
4) O’ బిందువు యొక్క ప్రతిబింబం I’ను గుర్తించేందుకు, కటక దృక కేంద్రం (P) గుండా ప్రయాణించే కిరణం విచలనాన్ని పొందదు.
5) OO’ యొక్క ప్రతిబింబం II’ ప్రధానాక్షంపై తలక్రిందులుగా ఏర్పడుతుంది.
6) పటంలో PO, PI, PF1 లు వరుసగా వస్తు, ప్రతిబింబ దూరములు మరియు కటక నాభ్యంతరాలు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 39
∴ ఈ సమీకరణాన్ని ‘కలక సూత్రము’ అంటాం.

ప్రశ్న 14.
రెండు యానకాల వక్రీభవన గుణకాలు (n1, n2), వస్తుదూరం (u), ప్రతిబింబ దూరం (v) మరియు వక్రతా వ్యాసార్ధం (R) ల మధ్య సంబంధంను ఉత్పాదించుము.
జవాబు:
1) పటంలో చూపినట్లు n,, n. వక్రీభవన గుణకాలు గల రెండు యానకాలను ఒక వక్రతలం వేరు చేస్తుందని భావించండి.
2) ప్రధానాక్షంపై ‘O’ వద్ద ఒక బిందురూప వస్తువునుంచాం.
3) ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కిరణం యానకాలను వేరు చేసే వక్రతలం వద్ద విచలనాన్ని పొందకుండా ధృవం గుండా ప్రయాణిస్తుంది.
4) ప్రధానాక్షంతో ‘∝’ కోణం చేసే రెండో కిరణం వక్రతలాన్ని ‘A’ బిందువు వద్ద తాకుతుంది. అక్కడ పతనకోణం θ1, ఆ కిరణం విచలనం పొంది రెండో యానకం గుండా AI రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. అక్కడ వక్రీభవన కోణం θ2
5) మొదటి, రెండవ కిరణాలు వక్రీభవన కిరణాలు I వద్ద కలుస్తాయి. అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది.
6) రెండవ వక్రీభవన కిరణం ప్రధానాక్షంతో చేసే కోణం γ, A బిందువు వద్ద గీసిన లంబం ప్రధానాక్షంతో చేసే కోణం β అనుకుందాం.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 40

ప్రశ్న 15.
కటక తయారీ సూత్రం అనగానేమి ? దీనికొక సూత్రాన్ని ఉత్పాదించుము.
జవాబు:
కటక తయారీ సూత్రము : \(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 41
ఉత్పాదన :
1) పలుచని కటకం ప్రధానాక్షంపై ఒక బిందురూప వస్తువు ‘O’ ను ఊహించండి. కటకంను ఉంచిన యానకం వక్రీభవన గుణకం n., కటక వక్రీభవన గుణకం (ny) అనుకోండి.

2) ‘O’ బిందువు నుండి బయలుదేరిన కాంతి కిరణం R1 వక్రతా వ్యాసార్థం గల ఆ కటకపు ఒక కుంభాకార ఉపరితలంపై ‘A’ బిందువు వద్ద పతనం చెందింది అనుకుందాం.

3) పతన కిరణం A వద్ద వక్రీభవనం పొందుతుంది. కటకానికి రెండవ ఉపరితలం లేకపోతే, వక్రీభవన కిరణం ‘Q’ వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అనుకుందాం.
పటం నుండి PO = – u, PQ = V = x; వక్రతా వ్యాసార్ధం = R1 ; n1 = na మరియు n2 = nb
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 42
కానీ, నిజానికి A వద్ద వక్రీభవనం చెందిన కిరణం R, వక్రతా వ్యాసార్ధం గల మరో ఉపరితలంపై B బిందువు వద్ద తిరిగి వక్రీభవనం పొంది I వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

4) కటకం యొక్క మొదటి ఉపరితలం వల్ల ఏర్పడిన ప్రతిబింబం ‘Q’ ను కటకం యొక్క రెండవ ఉపరితలానికి వస్తువుగా తీసుకోవాలి. అపుడు పుటాకార ఉపరితలం పరంగా Q యొక్క ప్రతిబింబం I అని చెప్పవచ్చు. పటం నుండి వస్తుదూరం u = PQ = + x
ప్రతిబింబ దూరం v = PI ; వక్రతా వ్యాసార్ధం R = – R2 ; n1 = nb, n2 = na
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 43

ప్రశ్న 16.
కుంభాకార కటకముతో వివిధ దూరాలలో వస్తువు నుంచినపుడు ఏర్పడు ప్రతిబింబ లక్షణాలను కనుగొను ప్రయోగ పద్దతి, కావలసిన పరికరములను తెలుపండి.
జవాబు:
కావలసిన వస్తువులు : వస్తువు, కుంభాకార కటకం, తెర, V – స్టాండ్.

ప్రయోగ విధానం :

  1. దాదాపు 2 మీటర్ల పొడవు గల టేబుల్ మధ్య భాగంలో ఒక V – స్టాండ్ ను ఉంచండి.
  2. V – స్టాండకు ఒక కుంభాకార కటకాన్ని అమర్చండి.
  3. కటకానికి దూరంగా ప్రధానాక్షంపై కొవ్వొత్తి మంట ఉండేటట్లుగా, కొవ్వొత్తిని పట్టుకొని నిలబడాలి. కటకానికి రెండోవైపు ప్రధానాక్షానికి లంబంగా ఒక తెరను ఏర్పరచాలి.
  4. కొవ్వొత్తి ముందుకు జరుపుతూ వేరు వేరు స్థానాల వద్ద ఉంచి తెరమీద ప్రతిబింబాలు ఏర్పరచాలి.
  5. ఇదే విధంగా వివిధ వస్తు స్థానాలకు ప్రతిబింబాలను తెరపై ఏర్పరచి లక్షణాలు పరిశీలించాలి.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 17.
కటకంపై వివిధ సందర్భాలలో పతనమయ్యే కిరణాల ప్రవర్తన ఎలా ఉంటుందో పటాల ద్వారా వివరించుము.
జవాబు:
1. ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం :
ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కిరణమైనా విచలనం చెందదు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 44

2. కటక దృక్ కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం :
కటక దృక్ కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం కూడా విచలనం చెందదు.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 45

3. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం :
ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి . కిరణాలు నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా నాభి నుండి వికేంద్రీకరింపబడతాయి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 47

4. నాఖి గుండా ప్రయాణించే కాంతి కిరణం :
నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు వక్రీభవనం పొందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తాయి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 48

5. ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతికిరణాలు :
ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు నాభీయ తలంపై ఏదేని బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా నాభీయ తలంపై ఏదేని బిందువు నుండి వికేంద్రీకరింపబడతాయి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 49

ప్రశ్న 18.
వస్తువు వివిధ స్థానాలలో ఉన్నపుడు కుంభాకార కటకం వలన ప్రతిబింబాలు
జవాబు:
1. వస్తువు అనంతదూరంలో ఉన్నపుడు :
వస్తువు అనంతదూరంలో ఉన్నపుడు, కటక నాభి వద్ద బిందురూప ప్రతిబింబం ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 50

2. వక్రతా కేంద్రానికి ఆవల, ప్రధానాక్షంపై వస్తువు ఉంచినపుడు :
వస్తువును, వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై ఉంచినపుడు చిన్నదైన, తలకింద్రులుగా ఉన్న నిజప్రతిబింబం. C1 మరియు F1 ల మధ్య ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 30

3. వక్రతా కేంద్రం (C2) వద్ద వస్తువునుంచినపుడు :
వక్రతా కేంద్రం (C2) వస్తువు వద్ద వస్తువునుంచినపుడు ప్రతిబింబం, (C1) వద్ద ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం వస్తు పరిమాణానికి సమానంగాను, తలక్రిందులుగా ఉండే నిజప్రతిబింబం.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 51

4. వక్రతా కేంద్రం, నాభి మధ్య వస్తువునుంచినపుడు :
వస్తువును వక్రతా కేంద్రం (C2), నాభి (F2) ల మధ్య వుంచినపుడు C1కి ఆవల, వృద్ధీకృతమైన తలక్రిందులుగానున్న నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 22

5. నాభి వద్ద వస్తువునుంచినపుడు :
నాభి (F1) వద్ద వస్తువునుంచినపుడు ప్రతిబింబం అనంతదూరంలో ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 52

6. నాభి (F2) మరియు కటక దృక్ కేంద్రం (P) వద్ద వస్తువునుంచినపుడు :
ప్రతిబింబం వస్తువును నాభికి, కటక దృక్ కేంద్రానికి మధ్య ఉంచినపుడు వృద్ధీకృతమైన, నిటారుగానున్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 53

10th Class Physics 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం ½ Mark Important Questions and Answers

1. వక్రతలంకి ధృవంను ఎక్కడ గుర్తిస్తారు?
జవాబు:
వక్రతలం మధ్యలో

2. వక్రతా కేంద్రం నుండి వక్రతలంపై ఏదైనా బిందువుకి గీసిన రేఖను ఏమందురు?
జవాబు:
లంబం

3. వక్రతా కేంద్రం నుండి ధృవంకి గీసిన రేఖను ఏమందురు?
జవాబు:
ప్రధానాక్షం

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

4. లంబం గుండా వెళ్లే కాంతి కిరణం ఏ విధంగా వక్రీభవనం చెందుతుంది?
జవాబు:
విచలనం చెందదు

5. వక్రతలాలకి వక్రీభవన సూత్రం రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 54

6. సమతలాలకు కాంతి వక్రీభవన సూత్రం రాయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 55

7. రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలూ లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని ఏమని అంటారు?
జవాబు:
కటకం

8. క్రింది ఇవ్వబడిన కటకం ఏ రకమైనది?
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 56
జవాబు:
సమతల – కుంభాకార కటకం

9. క్రింది ఇవ్వబడిన కటకం పేరు ఏమిటి?
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 57
జవాబు:
ద్విపుటాకార కటకం

10. కటకంనకు కనిష్ఠ వక్రతలాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 0
జవాబు:
A) 1

11. రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉండే కటకం పేరేమిటి?
జవాబు:
ద్వికుంభాకార కటకం

12. ఏ కటకంనకు మధ్యలో పలుచగానూ, అంచుల వద్ద మందంగానూ ఉంటుంది?
జవాబు:
ద్వి పుటాకార కటకం

13. కటకానికి ఎన్ని ధృవాలు ఉంటాయి?
జవాబు:
1

14. పుటాకార కుంభాకార కటకానికి ఎన్ని సమతలాలు ఉంటాయి?
జవాబు:
‘0 (సున్న)

15. కటకంనకు ఎన్ని నాభులను గుర్తిస్తారు?
జవాబు:
‘2’

16. కటక నాభి మరియు నాభ్యంతరాలను ఎలా సూచిస్తారు?
జవాబు:
నాభి = F,
నాభ్యంతరం = f

17. కుంభాకార కటకం మరియు పుటాకార కటకం యొక్క గుర్తులను గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 58

18. ఒక కటకం గుండా కాంతి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వక్రీభవనం చెందుతుంది?
జవాబు:
రెండు సార్లు

19. సందర్భం – 1 : కటక ప్రధానాక్షం గుండా వెళ్ళే కాంతి కిరణం
సందర్భం – 2 : కటక ధృవం గుండా వెళ్ళే కాంతి కిరణం
సందర్భం – 3 : ప్రధానాక్షంకి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణం
పై ఏ సందర్భంలో కాంతి విచలనం చెందదు?
జవాబు:
సందర్భం 1 మరియు 2

20. ఒక కటకం యొక్క నాభీయతలం ఎలా వుంటుంది?
జవాబు:
ప్రధానాక్షానికి లంబంగా, నాభి గుండా

21. ప్రధానాక్షానికి సమాంతరంగా పోయే కాంతిపుంజం ఎక్కడ కేంద్రీకరించబడుతుంది?
జవాబు:
నాభీయతలంపై

22. ఒక వస్తువు నుండి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కిరణాలు కుంభాకార కటకంపై పతనమైతే ఎక్కడ కేంద్రీకరించుకుంటాయి?
జవాబు:
నాభి వద్ద

23. ఒక కుంభాకార కటకం వలన ఏర్పడిన సూర్యుని ప్రతిబింబం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జవాబు:
బిందు పరిమాణంలో

24. ఒక కుంభాకార కటకం వలన నిజ, తలకిందులు మరియు క్షీణ ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఎక్కడ ఉంచాలి?
జవాబు:
2 F1కి ఆవల (వక్రతా కేంద్రం ఆవల)

25. శ్రీలత కుంభాకార కటకం ముందు ఒక కొవ్వొత్తిని ఉంచినపుడు, ప్రతిబింబం 2F1 వద్ద ఏర్పడినది. కొవ్వొత్తి ఎక్కడ ఉందో ఊహించండి.
జవాబు:
2F2 వద్ద

26. కుంభాకార కటక నాభి వద్ద ఒక వస్తువును ఉంచిన వక్రీభవన కిరణాలు ఎలా ఉంటాయి?
జవాబు:
సమాంతరంగా

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

27. క్రింది.ఏ సందర్భంలో వస్తువును ఉంచినపుడు ఆవర్ధనం చెందిన ప్రతిబింబం కుంభాకార కటకం వలన ఏర్పడుతుంది?
A) 2F2 కి ఆవల
B) 2F2 మీద
C) 2F2 మరియు F2ల మధ్య
D) అనంత దూరంలో
జవాబు:
C) 2F2 మరియు F2ల మధ్య

28. మిథ్యా, నిటారు, ఆవర్ధనం చెందిన ప్రతిబింబం ఏర్పరుచుటకు నీవు తీసుకునే కటకం ఏమిటి?
జవాబు:
కుంభాకార కటకం

29. పుటాకార కటకం వలన ఏర్పడిన ప్రతిబింబ లక్షణం ఏమిటి?
జవాబు:
మిథ్యా, క్షీణించిన ప్రతిబింబం (తక్కువ పరిమాణం).

30. క్రింది పటంలో వినియోగించిన కటకం ఏమిటి?
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 10
జవాబు:
కుంభాకార కటకం

31. పై పటంలో ఏర్పడిన ప్రతిబింబ లక్షణం ఏమిటి ?
జవాబు:
మిథ్య, నిటారు, ఆవర్ధనం చెందిన

32. పై పటంలో వస్తువు ఎక్కడ ఉంచబడింది?
జవాబు:
కటక దృక్ కేంద్రం, F2 ల మధ్య

33. పై పటంలో ప్రతిబింబాన్ని తెరపై పట్టగలమా?
జవాబు:
పట్టలేము

34. నిజప్రతిబింబంను తెర లేదా ఇతర వస్తువులపై ఏర్పరచగలమా?
జవాబు:
ఏర్పరచగలము

35. క్రింది ఏ ప్రతిబింబాన్ని చూడగలము?
A) నిజ
B) మిథ్యా
C) A మరియు B
D) రెండూ కావు.
జవాబు:
C) A మరియు B

36. ఒక కుంభాకార కటకం నాభ్యంతరం 10 సెం.మీ.
a) సమాన పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఎంత దూరంలో ఉంచాలి?
b) 15 సెం.మీ. దూరంలో వస్తువును ఉంచితే ప్రతిబింబ లక్షణాలేవి?
జవాబు:
నిజ, ఆవర్ధన, తలకిందులు

37. క్రింది వానిలో సరియైనది. పుటాకార కటకం వలన ఏర్పడిన ప్రతిబింబం
A) క్షీణించినది
B) మిథ్యా
C) నాభికి, దృక్ కేంద్రంకి మధ్య ఏర్పడును
D) పైవన్నియు
జవాబు:

38. UV పద్దతిలో కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం కనుగొనునప్పుడు కొలవవలసిన అంశాలు ఏవి?
జవాబు:
వస్తుదూరం (u), ప్రతిబింబ దూరం (V)

39. నిజ ప్రతిబింబం ఏర్పడుటకు కనిష్ఠ వస్తుదూరం ఎంత ఉండాలి?
జవాబు:
నాభ్యంతరం అంత వుండాలి

40. కటకంనకు u, v మరియు fల మధ్య సంబంధమేమి?
జవాబు:
\(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)

41. కటక సూత్రం రాయుము.
జవాబు:
\(\frac{1}{f}=\frac{1}{v}-\frac{1}{u}\)

42. ఒక యానకంనకు కటకం యొక్క ఏది స్థిరం?
A) వస్తుదూరం
B) ప్రతిబింబ దూరం
C) నాభ్యంతరం
D) పైవన్నియూ
జవాబు:
C) నాభ్యంతరం

43. క్రింది ఏ యానకంలో కటక నాభ్యంతరం ఎక్కువ?
A) నీరు
B) గాలి
C) సమానం
D) చెప్పలేం
జవాబు:
A) నీరు

44. కటక తయారీ సూత్రం రాయుము.
జవాబు:
\(\frac{1}{f}=\left(n_{b a}-1\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

45. గాలిలో వినియోగించు కటక తయారీ సూత్రం ఏమిటి?
జవాబు:
\(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

46. నీటిలో గాలిబుడగ ఎలా ప్రవర్తించును ? జ. 20 సెం.మీ.
A) కేంద్రీకరణ కటకం వలె
B) వికేంద్రీకరణ కటకం వలె
C) A మరియు B
D) రెండూ కావు
జవాబు:
B) వికేంద్రీకరణ కటకం వలె

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

47. ఒక కుంభాకార కటకం యొక్క వక్రీభవన గుణకం 1.5, దానిని 1.33 వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచారు. సమాంతర కిరణాలు పంపించిన ఎలా వక్రీభవనం చెందును?
జవాబు:
కేంద్రీకరింపబడును

48. కుంభాకార కటకం వలన ఏర్పడిన నిజ ప్రతిబింబంనకు u, v మరియు f లకు సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం తీసుకోవలసిన గుర్తులు రాయండి.
జవాబు:
-u, + v – f

49. ఒకవేళ ‘V’ ని ఋణాత్మకంగా తీసుకుంటే, ఏర్పడిన ప్రతిబింబ లక్షణం ఏది?
జవాబు:
మిథ్యా

50. నిజ మరియు మిథ్యా ప్రతిబింబం ఏర్పరచు కటకం
జవాబు:
ద్వికుంభాకార

51. అనంతదూరంలో వస్తువు ఉన్నప్పుడు దాని ప్రతిబింబం కుంభాకార కటకం వలన ఏర్పడింది. ఆ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?
జవాబు:
నాభి వద్ద

52. ఒక సమతల కుంభాకార కటక నాభ్యంతరం 28 వక్రతా వ్యాసార్ధం R అయిన కటక తయారీకి వాడిన పదార్థ వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 59

53. కటక తయారీకి వినియోగించు కొన్ని పదార్థాలు రాయుము.
జవాబు:
నీరు, గాజు, ప్లాస్టిక్ మొదలగునవి.

54. ప్రతిబింబ దూరం, నాభ్యంతరానికి సమానమయినపుడు కుంభాకార కటకంపై పతనమయ్యే కిరణాలు ఎలా ఉంటాయి?
జవాబు:
సమాంతరంగా

55. ప్రయోగశాలలో కటకంను ఉంచుటకు వినియోగించు పరికరం ఏమిటి?
జవాబు:
V – స్టాండ్

56. కటకం వలన ఏర్పడు ప్రతిబింబం దూరంనకు సూత్రం రాయుము.
జవాబు:
\(v=\frac{u f}{u+f}\)

57. ఒక కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం 20 సెం.మీ., వస్తు దూరం 30 సెం.మీ. అయిన,
a) ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది?
b) ప్రతిబింబం ఆవర్ధనం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 60

58. క్రింది చిత్రాన్ని పూర్తి చేయుము.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 61
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 62

59. కుంభాకార కటకం యొక్క ఒక ఉపయోగం రాయుము.
జవాబు:
టెలిస్కోపులు, మైక్రోస్కోపులలో వినియోగిస్తారు.

60. పుటాకార కటకం యొక్క ఒక వినియోగం రాయుము.
జవాబు:
హ్రస్వదృష్టి నివారణకు వినియోగిస్తారు.

61. కటక ఆవర్తనం సూత్రం రాయుము.’
జవాబు:
\(\frac{v}{u}\)

62. f = -40 సెం.మీ. అయిన ఆ కటకం ఏ రకానికి చెందినది?
జవాబు:
వికేంద్రీకరణ కటకం (పుటాకార కటకం)

63. ఈ కటకం మూడు వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడింది. దీనికి ఎన్ని నాభ్యంతరాలు ఉంటాయి?
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 63
జవాబు:
‘3’

64. ఒక కుంభాకార కటకంపై సగం నల్లని పేపర్ తో కప్పబడి ఉంది. దాని వలన ఏర్పడిన ప్రతిబింబం ఇలా ఉంటుంది.
A) పూర్తిగా
B) సగం
C) ఏర్పడదు
జవాబు:
‘A’

65. ‘n’ వక్రీభవన గుణకం, ‘R’ వక్రతా వ్యాసార్ధం గల ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత వుంటుంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 64

66. పటంలో చూపిన ప్రయోగంలో రాయిని చూడాలంటే కటకం మరియు రాయి మధ్య దూరం ఎంత ఉండాలి?
AP Board 10th Class Physical Science Solutions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 18
A) f కి సమానంగా
B) F కన్నా తక్కువగా
C) f కన్నా ఎక్కువగా
D) f కన్నా ఎక్కువ లేదా తక్కువ
జవాబు:
B) F కన్నా తక్కువగా

67. R1, R2 కటక వక్రతా వ్యాసార్థాలు, n వక్రీభవన గుణకం మరియు f నాభ్యంతరం మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
\(\frac{1}{f}=\{n-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

68. క్రింది వానిని జతపర్చుము :
a) వక్రతా వ్యాసార్ధం – 1) R
b) కటక దృక్ కేంద్రం – 2) P
C) వక్రతా కేంద్రం – 3) C
జవాబు:
a – 1, b – 2, C – 3

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

69. క్రింది వానిని జతపర్చుము : .
a) సమాన పరిమాణ ప్రతిబింబం – 1) వస్తువు 2 F2 ఆవల
b) ఆవర్తనం చెందిన ప్రతిబింబం – 2) వస్తువు 2 F2, F2 మధ్య
c) చిన్న ప్రతిబింబం – 3) వస్తువు 2F2 పై
జవాబు:
a – 3, b – 2, c – 1

సాధించిన సమస్యలు

1. 10 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని ఒక గోడ నుండి 12 సెం.మీ. దూరంలో ఉంచితే గోడపై ప్రతిబింబం ఏర్పడింది. అయిన కటకానికి, వస్తువునకు మధ్య దూరాన్ని లెక్కించండి.
సాధన:
f = 10 సెం.మీ. ⇒ v = 12 సెం.మీ.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 65
∴ వస్తుదూరం 60 సెం.మీ.

2. 20 సెం.మీ. నాభ్యంతరము గల పుటాకార కటకము ముందు 50 సెం.మీ. దూరంలో వస్తువు నుంచిన ఏర్పడు ప్రతిబింబ లక్షణాలను తెలుపండి. (14.3 సెం.మీ మిథ్యా ప్రతిబింబం, నిలువుగా)
సాధన:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 66

3. ఒక నదిపై ఒక పక్షి 3 మీ ఎత్తులో ఎగురుతున్నది. అదేచోట నది ఉపరితలం నుండి 4 మీ లోతులో చేప ఉంది. అయిన పక్షికి చేప ఎంత లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది? అలాగే చేపకు పక్షి ఎంత ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది?
(సహాయం nwa = 4/3) (Ans : 6మీ, 8మీ)
సాధన:
పక్షికి చేప కనిపించే దూరం = \(\frac{3}{4}\) × 4 = 3 సెం.మీ.
చేపకు పక్షి కనిపించే దూరం = \(\frac{4}{3}\) × 3 = 4 సెం.మీ.

అదనపు ప్రాక్టీస్ ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రధానాక్షానికి సమాంతరంగా విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందే కాంతి మార్గాన్ని గీయండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 70

ప్రశ్న 2.
ప్రధానాక్షానికి సమాంతరంగా విరళయానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణిస్తూ కుంభాకార తలంపై పతనం చెందే కాంతికిరణ మార్గాన్ని గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 67

ప్రశ్న 3.
ప్రధానాక్షానికి సమాంతరంగా సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తూ కుంభాకార తలంపై పతనం చెందే కాంతి కిరణ మార్గాన్ని చూపే పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 68

ప్రశ్న 4.
ప్రధానాక్షానికి సమాంతరంగా సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలంపై పతనం చెందే కాంతి కిరణ మార్గాన్ని చూపే పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 69

ప్రశ్న 5.
క్రింది సందర్భాలకు కిరణ చిత్రాలను గీయుము.
a) కుంభాకార కటకం ద్వారా నిటారైన ఆవర్గీకృతమైన ప్రతిబింబం ఏర్పడుట.
b) 20 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకం ముందు 60 సెం.మీ. దూరంలో వస్తువుంచినపుడు.
c) కుంభాకార కటకం ద్వారా సమాంతర కాంతికిరణ పుంజం ఏర్పడుట.
d) కుంభాకార కటకంతో వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానంగా ఏర్పడడం.
జవాబు:
a) వస్తువును కటక కేంద్రం (P), నాభి (F) ల మధ్య ఉంచినపుడు నిటారైన, ఆవస్థీకృత ప్రతిబింబం ఏర్పడును.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 10

b) కటక నాభ్యంతరం 20 సెం.మీ.
వస్తు దూరం = 60 సెం.మీ.
వస్తువు వక్రతా కేంద్రం (40 సెం.మీ.) కు ఆవల ఉన్నది.
ప్రతిబింబ F, C ల మధ్య నిజ, తలక్రిందులు మరియు వస్తువుకన్నా చిన్నది ఏర్పడును.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 30

c) కుంభాకార కటకం ద్వారా సమాంతర కాంతి కిరణ పుంజం ఏర్పడాలంటే వస్తువును F వద్ద వుంచాలి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 71
d) వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉండాలంటే వస్తువును C వద్ద వుంచాలి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 22

ప్రశ్న 6.
కటకాన్ని వాడి ఒక ప్రతిబింబం ఏర్పరచినప్పుడు ఆవర్ధనం + 0.5 అయిన ఎ) ప్రతిబింబ లక్షణాలేవి ? బి) వాడిన కటకమేది ?
జవాబు:
ఎ) ఏర్పడిన ప్రతిబింబం నిటారైన, మిథ్యా ప్రతిబింబం, వస్తువుకన్నా చిన్నదైన ప్రతిబింబం ఏర్పడును.
కారణం : ఆవర్ధనం విలువ ధనాత్మకం.

బి) వాడిన కటకం పుటాకార కటకం.
కారణం : ఆవర్ధనం +0. 5 అనగా ధనాత్మకం మరియు 1 కన్నా తక్కువ ఈ విలువ కేవలం పుటాకార దర్పణానికే సాధ్యం.

ప్రశ్న 7.
100 మి.మీ. నాభ్యంతరం గల ఒక వికేంద్రీకరణ కటకం ముందు 150 మి.మీ. దూరంలో ఒక వస్తువునుంచినపుడు ప్రతిబింబ దూరం మరియు ప్రతిబింబ స్వభావాలను కనుగొనుము.
జవాబు:
వస్తు దూరం (u) = -150 మి.మీ.
నాభ్యంతరం (f) = -100 మి.మీ.
ప్రతిబింబ దూరం (v) = ?
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 72
∴ కటకం ముందు వస్తువున్న వైపునే 60 మి.మీ. దూరంలో ప్రతిబింబం ఏర్పడును.

ప్రతిబింబ లక్షణాలు :
ప్రతిబింబం నిటారైనది, మిథ్యా ప్రతిబింబం, వస్తువు కన్నా చిన్నది.

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 8.
20 సెం.మీ. నాభ్యంతరం గల ఒక కేంద్రీకరణ కటకం ముందు క్రింద చూపిన దూరాలలో వస్తువునుంచారు.
a) 40 సెం.మీ.
b) 50 సెం.మీ.
c) 30 సెం.మీ.
d) 15 సెం.మీ. అయిన సందర్భంలో క్రింద చూపిన విధంగా ప్రతిబింబాలు ఏర్పడును?
i) ఆవర్గీకృతమైన నిజ ప్రతిబింబం
ii) అవర్గీకృతమైన మిథ్యా ప్రతిబింబం
iii) వస్తువు కన్నా చిన్నదైన నిజ ప్రతిబింబం
iv) వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానం.
జవాబు:
i) ఆవర్గీకృతమైన నిజ ప్రతిబింబం, వస్తువును F, Cల మధ్య వుంచినపుడు ఏర్పడును.
అనగా u =  30 సెం.మీ.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 73

ii) అవర్గీకృతమైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును F మరియు P ల మధ్య ఉంచాలి.
అనగా 15 సెం.మీ. దూరంలో
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 74

iii) వస్తువు కన్నా చిన్నదైన నిజ ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ‘C’ కి ఆవల వుంచాలి.
అనగా 50 సెం.మీ. దూరంలో
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 75

iv) వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానంగా అనగా వుండాలంటే వస్తువును ‘C’ వద్ద వుంచాలి.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 76

ప్రశ్న 9.
10 సెం.మీ. నాభ్యంతరం గల ఒక కేంద్రీకరణ కటకం ముందు 15 సెం.మీ. దూరంలో 4 సెం.మీ. ఎత్తు గల ఒక వస్తువునుంచారు. అయిన ప్రతిబింబ స్థానం, లక్షణం మరియు ఎత్తులను కనుగొనుము.
జవాబు:
u= 15 సెం.మీ., f = + 10 సెం.మీ.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 77

ప్రశ్న 10.
కుంభాకార కటక ఉపయోగాలను వ్రాయుము.
జవాబు:
కుంభాకార కటకాలను

  1. భూతద్దాలుగా వాడతారు.
  2. దీర్ఘదృష్టి అనే ఒక రకమైన దృష్టిదోషాన్ని నివారించుటకు వాడతారు.
  3. మైక్రోస్కోపులు, ప్రొజెక్టర్లు, కెమెరాలు, టెలిస్కోపులలో కుంభాకార కటకాలను వాడుతారు.

ప్రశ్న 11.
పుటాకార కటకం యొక్క ఉపయోగాలను పేర్కొనుము.
జవాబు:
పుటాకార కటకాలను

  1. టెలిస్కోపులలో అక్షి కటకంగాను,
  2. హ్రస్వదృష్టి అనే ఒక రకమైన దృష్టిదోషాన్ని సవరించుటకు,
  3. అత్యంత నాణ్యమైన దృశ్య పరికరాలను తయారుచేయుటకు కుంభాకార కటకాలతో కలిపి వాడుతారు.

10th Class Physics 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 78 పటంలో చూపబడ్డ కటకం పేరు
A) ద్వికుంభాకార కటకం
B) ద్విపుటాకార కటకం
C) పుటాకార – కుంభాకార కటకం
D) సమతల కుంభాకార కటకం
జవాబు:
B) ద్విపుటాకార కటకం

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

2. 10 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్న నీటిలో ముంచితే దాని నాభ్యంతరం
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) సున్నకు చేరును
జవాబు:
A) పెరుగుతుంది

3. కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షంపై వస్తువు ఎక్కడ ఉంచితే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది?
A) దృక్’ కేంద్రము మరియు F ల మధ్య
B) F వద్ద
C) F, C ల మధ్య
D) C వద్ద
జవాబు:
A) దృక్’ కేంద్రము మరియు F ల మధ్య

4. కింది పదార్థాలలో కటకం తయారీకి సాధారణంగా ఉపయోగపడేది
A) నీరు
B) గాజు
C) ప్లాస్టిక్
D) పైవన్నీ
జవాబు:
B) గాజు

5. ఈ పటంలో వస్తువు (O) స్థానం ……
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 79
A) ‘F’ వద్ద
B) ‘C’ వద్ద
C) ‘C’, ‘F’ ల మధ్య
D) ‘C’ కి ఆవల
జవాబు:
D) ‘C’ కి ఆవల

6. కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటే, ప్రతిబింబ దూరం ….
A) వస్తుదూరానికి సమానం
B) అనంతం
C) కటక నాభ్యంతరానికి సమానం
D) కటక వక్రతా వ్యాసార్ధానికి సమానం
జవాబు:
B) అనంతం

7. కింది వాటిలో దేని కొరకు పుటాకార కటకాన్ని వినియోగిస్తారు?
A) మైక్రోస్కోలో అక్షి (కంటి) కటకం
B) సూర్యకాంతిని ఒక బిందువు వద్ద కేంద్రీకరించుటకు
C) దీర్ఘదృష్టిని సవరించడానికి
D) హ్రస్వదృష్టిని సవరించడానికి
జవాబు:
D) హ్రస్వదృష్టిని సవరించడానికి

8. ఎల్లప్పుడు చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే ఉపయోగించేది
A) కుంభాకార కటకం
B) సమతల కుంభాకార కటకం
C) పుటాకార కటకం
D) పుటాకార దర్పణం
జవాబు:
C) పుటాకార కటకం

9. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబమును ఏర్పరచే కటకం …….
A) పుటాకార
B) కుంభాకార
C) సమతల కుంభాకార
D) పైవన్నీ
జవాబు:
A) పుటాకార

10. “40 సెం.మీ. ల వక్రతా వ్యాసార్థం గల ఒక కుంభాకార కటకం ఎదురుగా 20 సెం.మీ. ల దూరంలో వస్తువు ఉంచబడినది.” అపుడు ప్రతిబింబ స్థానం ………
A) ‘C’ కి ఆవల
B) ‘C’, ‘F’ ల మధ్య న
C) ‘C’ వద్ద
D) అనంత దూరంలో
జవాబు:
D) అనంత దూరంలో

11.
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 80
యొక్క పూర్తి రేఖాకిరణ చిత్రం
AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం 81
జవాబు:
C

AP 10th Class Physical Science Important Questions 4th Lesson వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం

12. ఒక ద్వికుంభాకార కటకం ప్రధానాక్షంనకు సమాంతరంగా వచ్చిన కిరణాలు 10 సెం.మీ.ల వద్ద కేంద్రీకరింపచేసిన దాని నాభ్యంతరము
A) 5 సెం.మీ.
B) 10 సెం.మీ.
C) 20 సెం.మీ.
D) 25 సెం.మీ.
జవాబు:
B) 10 సెం.మీ.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

These AP 10th Class Physics Important Questions and Answers 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 3rd Lesson Important Questions and Answers సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రకాశవంతమైన ఒక లోహపు గోళాన్ని తీసుకొని, కొవ్వొత్తి నుండి వచ్చే మసితో గోళాన్ని నల్లగా చేయండి. ఆ గోళాన్ని నీటిలో ముంచండి. నీవు గుర్తించిన ఒక పరిశీలన వ్రాయుము.
జవాబు:

  1. పరిశీలన : లోహపు గోళం మెరుస్తూ కనబడుతుంది.
  2. నీటిలో పైకి లేచినట్లు కనబడుతుంది.

ప్రశ్న 2.
సందిగ్ధ కోణంను నిర్వచింపుము.
జవాబు:
సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించే కాంతికిరణం ఏ పతన కోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతనకోణాన్ని ఆ రెండు యానకాలకు సంబంధించిన “సందిగ్ధ కోణం” అంటారు.

ప్రశ్న 3.
ఒక గాజు యొక్క వక్రీభవన గుణకము 3/2. అయిన ఆ గాజులో కాంతి వేగము ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1

ప్రశ్న 4.
ఎండమావులు ఏర్పడే విధానంపై ఏవైనా రెండు ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. ఎండమావులు ఎలా ఏర్పడుతాయి?
  2. ఎండమావులకి, సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధం ఉందా?
  3. ఎండమావులు ఏర్పడడంలో ఉన్న సైన్సు సూత్రం ఏమిటి?

ప్రశ్న 5.
దృశ్యా తంతువు (OFC)లను సమాచార ప్రసారం కోసం తరచూ వినియోగిస్తూ ఉంటాము. ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం

ప్రశ్న 6.
గాజు, వజ్రాలతో తయారైన వస్తువులను పరిశీలిస్తే ఏది ఎక్కువగా మెరుస్తుంది? ఎందుకు?
జవాబు:
వజ్రాలతో తయారైన వస్తువు ఎక్కువగా మెరుయును. ఎందుకనగా దీని సందిగ్ధకోణం విలువ 24.4° కన్నా తక్కువగా ఉండుటయే.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 7.
నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం అనే దృగ్విషయానికి గల కారణంను వివరించండి.
జవాబు:
నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి కారణం కాంతి వక్రీభవనం.

ప్రశ్న 8.
కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి వెళ్తున్నపుడు సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువైనపుడు కాంతి కిరణ మార్గాన్ని చూపు పటం గీయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 2

ప్రశ్న 9.
ఏ సందర్భంలో పతనకోణం, వక్రీభవన కోణం సమానంగా ఉంటాయి?
జవాబు:
రెండు యానకాల యొక్క వక్రీభవన గుణకాలు సమానమైనప్పుడు, పతనకోణం మరియు వక్రీభవన కోణాలు సమానంగా ఉంటాయి.

ప్రశ్న 10.
నీటిలో ఏర్పడ్డ చిన్న గాలిబుడగలపై కాంతిని పతనం చెందిస్తే, ఆ కాంతిని ఆ బుడగలు అపసరణం (diverge) చేస్తున్నాయి. దీనికి గల కారణాన్ని తెలపండి.
జవాబు:
కుంభాకార కటకాన్ని, దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచిన, ఆ కటకం వికేంద్రీకరణ కటకం వలె పని చేయును. నీరు వక్రీభవన గుణకం 1.33 మరియు గాలి వక్రీభవన గుణకం ‘1’ కనుక నీటిలో ఏర్పడిన చిన్న చిన్న గాలి బుడగలపై పడిన కాంతిని ఆ బుడగలు అపసరణం చెందిస్తాయి.

ప్రశ్న 11.
నాని, అనిల్ స్నేహితులు. వీరు మధ్యాహ్న సమయంలో తారు రోడ్డుపై నడుస్తున్నారు. అనిల్ రోడ్డుపై నీటిఛాయలు చూశాడు. నానికి చూపించాడు. అనిల్, నానికి ఆ నీటి ఛాయలకు కారణాలను ఊహించమన్నాడు. నీవయితే ఏమి ఊహిస్తావు?
జవాబు:

  1. ఎండాకాలంలో కొన్నిసార్లు తారురోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డుపై నీటి ఛాయలు గమనిస్తుంటాము. అదే విధంగా ఇవి ఏర్పడి ఉంటాయని భావించాను.
  2. ఇది దృఢమ వలన ఏర్పడతాయి.
  3. ఇవి యానకంలోని వక్రీభవన గుణకంలోని భేదాలు మరియు సంపూర్ణాంతర పరావర్తనాల వలన ఏర్పడతాయి.

ప్రశ్న 12.
కటకాన్ని నీటిలో ముంచి, ఆ నీటి అడుగుభాగాన ఉన్న రాయిని చూస్తూ మీరు నిర్వహించిన ప్రయోగం ద్వారా ఏం తెలుసుకున్నారు?
జవాబు:
ఈ ప్రయోగం నుండి నీటిలో ఉంచినపుడు కటకం యొక్క నాభ్యంతరం పెరిగినదని తెలుసుకున్నాను.

ప్రశ్న 13.
క్రింది పట్టికను గమనించండి.

పదార్థం వక్రీభవన గుణకం
మంచు 1.31
నీరు 1.33
బెంజీన్ 1.5
కార్బన్ డై సల్ఫైడ్ 1.63

పై విలువల ఆధారంగా, ఏ పదార్థంలో కాంతి వేగం స్వల్పం?
జవాబు:
యానకంలో కాంతివేగం దాని వక్రీభవన గుణకంకు విలోమానుపాతంలో ఉండును. పై పట్టిక నుండి కార్బన్ డై సల్ఫైడ్ . నందు కొంతి వేగం స్వల్పం.

ప్రశ్న 14.
“ఫెర్మాట్ సూత్రం” అంటే ఏమిటి?
జవాబు:
ఏవైనా రెండు బిందువుల మధ్య కాంతి ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణించును.

ప్రశ్న 15.
కొంతి ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రయాణించునపుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించునపుడు కాంతి ప్రయాణదిశ మారుతుంది. కాంతి లంబం వద్ద, లంబానికి దగ్గరగా గాని లేదా దూరంగా గాని వంగి ప్రయాణించును.

ప్రశ్న 16.
కాంతి వేగం ఎప్పుడు తగ్గును?
జవాబు:
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని వేగం తగ్గును.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 17.
సాంద్రతర యానకమంటే ఏమిటి?
జవాబు:
ఏ యానకానికైతే ఎక్కువ దృక్ సాంద్రత ఉండునో దానిని “సాంద్రతర యానకం” అంటారు.

ప్రశ్న 18.
వక్రీభవనం అంటే ఏమిటి?
జవాబు:
వక్రీభవనం :
ఒక యానకం నుండి మరొక యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి దిశ మారే దృగ్విషయాన్ని కాంతి “వక్రీభవనం” అంటారు.

ప్రశ్న 19.
వక్రీభవన గుణకం (లేదా) పరమ వక్రీభవన గుణకం అంటే ఏమిటి?
జవాబు:
ఏదైనా యానకపు కాంతి వేగానికి, శూన్యంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఆ యానకపు “వక్రీభవన గుణకం” (లేదా) “పరమ వక్రీభవన గుణకం” అంటారు.

ప్రశ్న 20.
ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము ఏ అంశాలపై ఆధారపడును?
జవాబు:
వక్రీభవన గుణకము పదార్థ స్వభావం మరియు కాంతి తరంగదైర్ఘ్యంపై ఆధారపడును.

ప్రశ్న 21.
సాపేక్ష వక్రీభవన గుణకం (లేదా) తారతమ్య వక్రీభవన గుణకం అంటే ఏమిటి?
జవాబు:
ఏవైనా రెండు యానకాలలో రెండవ యానకపు వక్రీభవన గుణకం (n2), మొదటి యానకపు వక్రీభవన గుణకం (n1) లకు గల నిష్పత్తిని “సాపేక్ష వక్రీభవన గుణకం (లేదా) తారతమ్య వక్రీభవన గుణకం” అంటారు.

ప్రశ్న 22.
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించునపుడు లంబానికి దూరంగా వంగుతుంది.

ప్రశ్న 23.
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించునపుడు లంబానికి దగ్గరగా వంగుతుంది.

ప్రశ్న 24.
విస్థాపనము అంటే ఏమిటి?
జవాబు:
ఒక గాజు దిమ్మె నుండి వెలువడిన పతనకిరణాలు మరియు వక్రీభవన కిరణాలను పొడిగించగా ఏర్పడిన సమాంతర రేఖల మధ్య దూరాన్ని “విస్థాపనం” అంటారు.

ప్రశ్న 25.
స్నెల్ నియమాన్ని నిర్వచించుము.
జవాబు:
కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఆ యానకాలలో కాంతి వేగాల నిష్పత్తి \(\frac{\mathrm{v}_{1}}{\mathrm{v}_{2}}\) , ఆ యానకాల వక్రీభవన గుణకాల నిష్పత్తి \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\) కు సమానంగా ఉంటుంది. దీనినే “స్నెల్ నియమం” అంటారు.

ప్రశ్న 26.
కాంతి శూన్యంలో ఎందుకు ప్రయాణించును?
జవాబు:
కాంతి ప్రసరించుటకు యానకముపై ఆధారపడదు కావున శూన్యంలో కూడా ప్రయాణించును.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 27.
ఏ రకపు కోణం పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే రేఖ వెంబడి ప్రయాణించును?
జవాబు:
సందిగ్ధ కోణం వద్ద ఇది సాధ్యపడును.

ప్రశ్న 28.
వక్రీభవన గుణకం ఆధారపడు అంశాలేవో సమాచారం సేకరించుము.
జవాబు:
వక్రీభవన గుణకం 1) పదార్థ స్వభావం 2) వాడిన పదార్థపు తరంగదైర్ఘ్యాలపై ఆధారపడును.

ప్రశ్న 29.
పరావర్తన కోణపు sin విలువకు, వక్రీభవన కోణపు sin విలువకు గల నిష్పత్తి దేనిని తెల్పును?
జవాబు:
వక్రీభవనపు గుణకం పరావర్తన కోణపు sin విలువకు, వక్రీభవన కోణపు sin విలువకు గల నిష్పత్తిని తెల్పును.

ప్రశ్న 30.
ఒక పాత్రలోని నీటిలో వేసిన నాణెం కొంత ఎత్తులో కనబడుటకు కారణమేమి?
జవాబు:
కాంతి యొక్క వక్రీభవన లక్షణం వలన ఇది సాధ్యపడును.

ప్రశ్న 31.
కాగితంపై గల అక్షరాలపై ఒక మందపాటి గాజు పలక ఉంచి చూసిన ఆ అక్షరాలు కాగితంపై నుండి కొంత ఎత్తులో కనపడుటకు కారణం ఏమిటి?
జవాబు:
కాంతి యొక్క వక్రీభవన లక్షణం వలన అక్షరాలు అలా ఎత్తుగా కనబడతాయి.

ప్రశ్న 32.
ఒక గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనపడుతుంది. దీనికి కారణం ఏమిటి?
జవాబు:
కాంతి యొక్క వక్రీభవన లక్షణం వలన నిమ్మకాయ పరిమాణం పెరిగినట్లు కనబడుతుంది.

ప్రశ్న 33.
వేసవి కాలంలో తారురోడ్ల మీద మనం ప్రయాణించేటప్పుడు కనబడే “ఎండమావులు” దేనికి ఉదాహరణ?
జవాబు:
ఎండలో తారురోడ్డు మీద కనిపించే ఎండమావులు కాంతి సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక నిజజీవిత ఉదాహరణ.

ప్రశ్న 34.
ఎండమావులు దేని వలన ఏర్పడతాయి?
జవాబు:
ఎండమావులు దృఢమ వల్ల ఏర్పడతాయి.

ప్రశ్న 35.
వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్య కారణమేమి?
జవాబు:
వజ్రాలు ప్రకాశించడానికి ముఖ్యకారణం సంపూర్ణాంతర పరావర్తనం.

ప్రశ్న 36.
ఆప్టికల్ ఫైబర్స్ దేనిపై ఆధారపడి పనిచేస్తాయి?
జవాబు:
ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి.

ప్రశ్న 37.
సమాచార సంకేతాలను ప్రసారం చేయుటకు వేటిని వాడతారు?
జవాబు:
సమాచార సంకేతాలను ప్రసారం చేయుటకు ఆప్టికల్ ఫైబర్స్ ను విరివిగా వాడతారు.

ప్రశ్న 38.
మానవ శరీరంలోని లోపలి అవయవాలను చూచుటకు వైద్యులు వేటిని వాడతారు?
జవాబు:
మానవ శరీరంలోని లోపలి అవయవాలను చూచుటకు వైద్యులు ఆప్టికల్ ఫైబర్స్ ను వాడతారు.

ప్రశ్న 39.
“లైట్ పైప్” అంటే ఏమిటి?
జవాబు:
సుమారు 1 మైక్రోమీటర్ (10-6 మీ) వ్యాసార్ధం గల సన్నని తీగల సముదాయాన్ని “లైట్ పైప్” అంటారు.

ప్రశ్న 40.
కాంతి వేగము మరియు వక్రీభవన గుణకముల మధ్య సంబంధమేమిటి?
జవాబు:
ఒక యానకము యొక్క వక్రీభవన గుణకము ఎక్కువగా ఉంటే దానిలో కాంతివేగము తక్కువగా ఉండును.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 41.
గాజు యొక్క వక్రీభవన గుణకము 1.5. దీని అర్థమేమిటి?
జవాబు:

  1. వక్రీభవన గుణకం ‘n’ అనగా ఆ యానకంలో కాంతి వేగం, శూన్యంలో కాంతి వేగంలో ‘n’ వ భాగం అని అర్థం.
  2. గాజు వక్రీభవన గుణకం 1.5 అనగా గాజులో కాంతి వేగం = \(\frac{1}{1.5}\) × 3 × 108 = 2 × 108 మీ/సె.

ప్రశ్న 42.
స్నెల్ సూత్రమును రాయుము.
జవాబు:
స్నెల్ సూత్రము : n1 sin i = n2 sin r
n1 = మొదటి యానకంలో కాంతివేగం
n2 = రెండవ యానకంలో కాంతివేగం
i = పతన కోణము
r = వక్రీభవన కోణము

ప్రశ్న 43.
వక్రీభవన సూత్రాలను పేర్కొనుము.
జవాబు:

  1. పతన కిరణము, వక్రీభవన కిరణము, పతన బిందువు వద్ద రెండు యానకాలు వేరయ్యే తలంలో గీసిన లంబం, ఒకే తలంలో వుంటాయి.
  2. వక్రీభవనం చెందునపుడు కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది.
    n1 sini = n2 sinr (లేదా) \(\frac{\sin i}{\sin r}\) = స్థిరరాశి

ప్రశ్న 44.
క్రింది పట్టికను పరిశీలించండి.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 3
క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
ఎ) అత్యధిక ధృక్ సాంద్రత మరియు అత్యల్ప దృక్ సాంద్రత కలిగిన యానకాలేవి? ఎందుకు?
జవాబు:

  1. అత్యధిక దృక్ సాంద్రత కలిగిన యానకం వజ్రం. ఎందుకనగా దాని వక్రీభవన గుణకం అత్యధికం.
  2. గాలి అత్యల్ప దృక్ సాంద్రత కలిగిన యానకం, కారణం గాలి యొక్క వక్రీభవన గుణకం చాలా తక్కువ.

బి) కిరోసిన్, టర్పెంటైన్ ఆయిల్ మరియు నీరులలో కాంతి వేగం దేనిలో ఎక్కువ?
జవాబు:
నీటిలో కాంతి ఎక్కువ వేగంతో ప్రయాణించును. ఎందుకనగా మిగిలిన వాటితో పోల్చినపుడు నీటి వక్రీభవన గుణకం తక్కువ. వక్రీభవన గుణకాలు వరుసగా కిరోసిన్ : 1.44; టర్పెంటైన్ ఆయిల్ : 1.47; నీరు : 1:33.

సి) వజ్రం యొక్క వక్రీభవన గుణకం 2.42. దీని అర్థమేమిటి?
జవాబు:
శూన్యంలో కాంతి వేగం, వజ్రంలో కాంతి వేగంకన్నా 2.42 రెట్లు ఎక్కువ.

డి) కాంతి నీటిలోనుండి క్రౌన్ గాజులోకి ప్రవేశించునపుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతి కిరణం, లంబము వైపు వంగును.

ఇ) కాంతి కిరణం వజ్రం నుండి గాలిలోకి ప్రవేశించునపుడు ఏమి జరుగును?
జవాబు:
కాంతికిరణం, లంబం నుండి దూరంగా జరుగును.

ప్రశ్న 45.
“పాత్ర నీటిలో అడుగున ఉన్న నాణెం పైకి కొంత ఎత్తులో కనబడుటకు కారణం ఏమి?
జవాబు:
కాంతి విరళయానకం నుండి సాంద్రతర యానకంలో ప్రయాణించడం వలన, లంబంవైపుకు వంగడం వలన నాణెం పైకి వచ్చినట్లు కనబడుతుంది.

ప్రశ్న 46.
వక్రీభవనమును నిర్వచించండి.
జవాబు:
కాంతి వేర్వేరు యానకం గుండా ప్రయాణించునపుడు కాంతివేగం మారడం వలన కాంతి వంగి ప్రయాణించే దృగ్విషయాన్ని వక్రీభవనం అంటారు.

ప్రశ్న 47.
సంపూర్ణాంతర పరావర్తనాన్ని తెలుపుటకు ఒక కృత్యాన్ని వ్రాయండి.
జవాబు:
నీటిలో నూనెను వేస్తే రంగులు ఏర్పడడం.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 48.
గాజు దిమ్మెను నిర్వచించండి.
జవాబు:
రెండు సమాంతర తలాలను కలిగియుండి, దాని పరిసరాలలోని యానకం నుండి వేరుచేయబడిన పారదర్శక యానకం.

10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతి పొందే విచలన కోణమెంత? దానిని కిరణ చిత్రంతో చూపండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 21

  1. విచలన కోణం : పతన కిరణం, బహిర్గత కిరణాల మధ్య కోణమే విచలన కోణం.
  2. గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతి పొందే విచలన కోణం ‘0’ (సున్న).

కారణం :
పతన కిరణం, బహిర్గత కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. దీనిని పటంలో గమనించవచ్చును.

ప్రశ్న 2.
కాంతి గాలి నుండి X అనే యానకంలోకి ప్రవేశించింది. గాలిలో కాంతివేగం 3 × 108 మీ/సె, X యానకంలో కాంతివేగం 1.5 × 108 మీ/సె అయిన X యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని కనుగొనండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4

ప్రశ్న 3.
నిజ జీవితంలో ఫైబర్ ఆప్టిక్స్ ఉపయోగాలను రెండింటిని రాయండి.
జవాబు:

  1. సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి ఆప్టికల్ ఫైబర్లను విరివిగా వినియోగిస్తున్నారు. దాదాపు 2000 టెలిఫోన్ సిగ్నళ్ళను ఒకేసారి ఆప్టికల్ ఫైబర్ గుండా ప్రసారం చేయవచ్చును. ఈ సిగ్నల్స్ చాలా స్పష్టంగా, వేగవంతంగా ఉంటాయి.
  2. సన్నని ఆప్టికల్ ఫైబర్ తీగలు కొన్ని కలిసి లైట్ పైప్ గా ఏర్పడతాయి. డాక్టర్లు లైట్ పైప్ ను రోగి నోటి ద్వారా పొట్టలోకి పంపుతారు. ఆప్టికల్ ఫైబర్ కాంతిని పొట్టలోకి పంపుతుంది. ఆ కాంతి పొట్టభాగాలను ప్రకాశవంతం చేస్తుంది. లోపలి దృశ్యాలను కంప్యూటర్ ద్వారా చూడవచ్చును.

ప్రశ్న 4.
ఒక గాజుదిమ్మె వల్ల కలిగే లంబ విస్తాపనాన్ని కనుగొనడానికి వస్తువును ఎక్కడ అమర్చాలో తెలిపే పటాన్ని గీయండి.
జవాబు:
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 34

ప్రశ్న 5.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 5
ప్రక్క పటంలో NM అనేవి రెండు యానకాలను వేరుచేసే తలం, NN అనేది MM తలానికి, బిందువు వద్ద గీసిన లంబం. MM కు ఇరువైపులా ఉన్న a, b ప్రాంతాలలో ఉన్న యానకాలలో ఏది సాంద్రతర యానకం?
జవాబు:
పటంను గమనించగా కాంతి కిరణము ‘b’ యానకంలో లంబమునకు దూరంగా ప్రయాణించుచున్నది కనుక ‘a’ సాంద్రతర యానకం అగును.

ప్రశ్న 6.
వజ్రాల ప్రకాశం గురించి రాయుము.
జవాబు:

  1. వజ్రాల ప్రకాశానికి ముఖ్యకారణం సంపూర్ణాంతర పరావర్తనమే.
  2. వజ్రం యొక్క సందిగ్ధ కోణము విలువ చాలా తక్కువ (24.49).
  3. కావున వజ్రంలోకి ప్రవేశించే కాంతికిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది, వజ్రం ప్రకాశవంతంగా కనబడునట్లు చేస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 7.
సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి? దీని అనువర్తనాలు ఏవి?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం :
సందిగ్ధకోణం కన్నా పతన కోణం ఎక్కువైనపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర యానకంలోనికి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని ‘సంపూర్ణాంతర పరావర్తనం’ అంటారు.

అనువర్తనాలు :
1) వజ్రాల ప్రకాశం :
వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ (24.49) కాబట్టి వజ్రంలోకి ప్రవేశించే కాంతి కిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది, వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్లు చేస్తుంది.

2) ఆప్టికల్ ఫైబర్స్ :
సమాచార, సాంకేతిక రంగాలలో వాడే ఆప్టికల్ ఫైబర్స్ కూడా ‘సంపూర్ణాంతర పరావర్తనం’ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి.

ప్రశ్న 8.
గ్రహాలు ఎందుకు మెరవవు?
జవాబు:

  1. గ్రహాలు, భూమికి చాలా దగ్గరగా వుండడం వలన అవి భూమిచుట్టూ ఉన్న అదనపు వస్తువులుగా కనిపిస్తాయి.
  2. గ్రహాలపై పడిన కాంతి, అనేక సూక్ష్మకాంతి బిందువుల సముదాయమని భావిస్తే, ఆ గ్రహాల నుండి మనకంటిని. చేరే సరాసరి కాంతి, గ్రహాల కాంతితో పోలిస్తే శూన్యము. కావున గ్రహాల ప్రకాశాన్ని మనం చూడలేము.

ప్రశ్న 9.
గాజుగ్లాసులోని నీటిలో ఒక ఖాళీ పరీక్ష నాళికను ఉంచి పై నుండి చూసినపుడు, పాదరసంతో నింపబడినట్లుగా కనబడుతుంది. ఎందుకు?
జవాబు:

  1. నీటి గుండా ప్రయాణించే కాంతికిరణాలు, నీటి యొక్క సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంలో, పరీక్షనాళిక, గాజు మరియు నీరుల ఉపరితలాలను వేరుచేసే తలం వద్ద ప్రవేశిస్తాయి. దీనివల్ల ఆ కిరణాలు సంపూర్ణాంతర పరావర్తనానికి గురౌతాయి.
  2. ఈ విధంగా సంపూర్ణాంతర పరావర్తనం చెందిన కిరణాలు, పరీక్షనాళిక ఉపరితలం నుండి వచ్చినట్లుగా కనబడతాయి. అందువల్ల పరీక్షనాళిక పాదరసంలో నిండినట్లుగా కనిపిస్తుంది.

ప్రశ్న 10.
అక్వేరియంలో బుడగలు వెండిలా మెరుస్తుంటాయి. ఎందుకు?
జవాబు:

  1. అక్వేరియంలోని నీటిలో ప్రయాణించే కిరణాలు, నీటి సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంలో, నీరు బుడగలను వేరు చేసే యానక ఉపరితలాన్ని ఢీకొంటాయి. అందువల్ల ఇవి సంపూర్ణాంతర పరావర్తనానికి గురవుతాయి.
  2. ఈ కిరణాలు కంటిని తాకినపుడు, అవి బుడగల నుండి వస్తున్నట్లుగా అనిపిస్తాయి. అందువల్ల బుడగలు వెండిలా మెరుస్తుంటాయి.

ప్రశ్న 11.
సమాచార విజ్ఞాన శాస్త్రంలో ఆప్టికల్ ఫైబర్స్ యొక్క ఉపయోగమేమిటి?
జవాబు:

  1. సమాచార సంకేతాలను లైట్ పైపుల ద్వారా ప్రసారం చేయుటకు ఆప్టికల్ ఫైబర్స్ పాడతారు.
  2. సుమారు 2000 టెలిఫోన్ సంకేతాలను, కాంతి తరంగాలతో కలిపి ఒకేసారి ప్రసారం చేయడానికి ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా అవకాశం ఉంది.
  3. ఈ విధానం ద్వారా ప్రసారం చేయబడిన సంకేతాలు అత్యంత స్పష్టమైనవిగా ఉంటాయి.

ప్రశ్న 12.
వక్రీభవన గుణకం అనగానేమి? యానకం యొక్క వక్రీభవన గుణకానికి, ఆ యానకంలోని కాంతి వేగానికి గల సంబంధాన్ని తెలుపండి.
జవాబు:
వక్రీభవన గుణకం :
శూన్యంలో కాంతి వేగానికి, యానకంలో కాంతి వేగానికి మధ్యగల నిష్పత్తిని యానక వక్రీభవన గుణకం అంటారు.
\(\mathbf{n}=\frac{\mathrm{C}}{\mathrm{V}}\)
వక్రీభవన గుణకం పెరిగితే యానకంలో కాంతివేగం తగ్గుతుంది.

ప్రశ్న 13.
కాంతి వక్రీభవన నియమాలను తెలుపండి.
జవాబు:

  1. పతనకిరణం, వక్రీభవన కిరణం, రెండు యానకాలను వేరుచేసే తలం వద్ద, పతన బిందువు వద్ద గీసిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి.
  2. వక్రీభవనంలో కాంతి స్నెల్ నియమాన్ని పాటిస్తుంది.
    n1 sin i = n2 sin r లేదా sin i/sin r = స్థిరాంకం

ప్రశ్న 14.
పార్శ్వవిస్థాపనము, నిలువు విస్థాపనము అనగానేమి?
జవాబు:
పార్శ్వ విస్థాపనము :
గాజుదిమ్మె ఉంచినపుడు పతన మరియు బహిర్గత సమాంతర కిరణాల మధ్యగల దూరాన్ని పార్శ్వ విస్థాపనము అంటారు.

నిలువు విస్థాపనము :
గాజుదిమ్మె నుంచి చూచినపుడు వస్తువుకు, దాని ప్రతిబింబానికి మధ్యగల లంబ దూరాన్ని నిలువు విస్థాపనము అంటారు.

ప్రశ్న 15.
పతన కోణానికి, వక్రీభవన కోణానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించు ప్రయోగంలోని పరికరాలను వ్రాయండి.
జవాబు:
కావలసిన వస్తువులు :
ప్రొ సర్కిల్, తెల్ల డ్రాయింగ్ షీట్, స్కేలు, నలుపురంగు వేసిన చిన్న కార్డ్ బోర్డ్ ముక్క (10 సెం.మీ. × 10 సెం.మీ.), 2 సెం.మీ. మందం గల అర్ధవృత్తాకారపు గాజుపలక, పెన్సిల్ మరియు లేజర్ లైట్.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 16.
గాజుదిమ్మె గుండా వక్రీభవనం అను ప్రయోగానికి ఉద్దేశ్యం, కావలసిన వస్తువులను వ్రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
గాజు దిమ్మెతో ఏర్పడే ప్రతిబింబ స్వభావం, స్థానాలను గుర్తించడం.

కావలసిన వస్తువులు :
డ్రాయింగ్ బోర్డ్, డ్రాయింగ్ చార్ట్, క్లాంట్లు, స్కేలు, పెన్సిలు, పలుచని గాజుదిమ్మె మరియు గుండు సూదులు.

ప్రశ్న 17.
వ్రేలాడే దీపపు స్తంభాలు (షాండ్లియర్స్) నుండి మిరుమిట్లు గొలిపే కాంతి వెదజల్లుటను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:
వ్రేలాడే దీపపు స్తంభాలు సంపూర్ణ అంతర పరావర్తనం వలన అద్భుతమైన కాంతిని వెదజల్లుతాయి. కాబట్టి దీనికి కారణమైన అంతర పరావర్తన దృగ్విషయాన్ని అభినందిస్తున్నాను.

ప్రశ్న 18.
ఎండమావులు ఏర్పడడానిని గురించి తెలుసుకొనుటకు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:

  1. ఎండమావి అనగానేమి?
  2. తారురోడ్డు ఎండాకాలం నీళ్ళు నిలచినట్లు కనపడుతుంది దానికి కారణం తెల్పండి.
  3. ఎండమావి ఎక్కడైనా ఏర్పడుతుందా?
  4. ఎండమావి ఏర్పడడానికి అవసరమయ్యే పరిస్థితులు తెల్పండి.

ప్రశ్న 19.
ప్రకృతిలోని సంపూర్ణాంతర పరావర్తన ప్రక్రియను నీవు ఎలా అభినందిస్తావు?
జవాబు:

  1. వజ్రం ప్రకాశవంతంగా మెరవడానికి సంపూర్ణ అంతర పరావర్తన దృగ్విషయం కారణం.
  2. సమాచార ప్రసారణలో, వైద్యరంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణ అంతర పరావర్తనం ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి సంపూర్ణ అంతర పరావర్తన పాత్రను అభినందిస్తున్నాను.

ప్రశ్న 20.
ఒక పారదర్శక యానకం (గాజు) యొక్క వక్రీభవన గుణకం 3/2 అయిన ఆ యానకంలో కాంతి వేగాన్ని కనుక్కోండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 6

ప్రశ్న 21.
సందిగ్ధకోణం, సంపూర్ణాంతర పరావర్తనం మధ్య భేదాలు వ్రాయుము.
జవాబు:

సందిగ్ధకోణం సంపూర్ణాంతర పరావర్తనం
సాంద్రతర యానకం నుండి విరళయానకంలోనికి ప్రయాణించే కాంతి కిరణం ఏ పతనకోణం వద్ద యానకాలను విభజించే తలానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో ఆ పతనకోణాన్ని ఆ రెండు యానకాలకు సంబంధించిన “సందిగ్ధకోణం” అంటారు. సందిగ్ధ కోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరు చేసే తలంవద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని “సంపూర్ణాంతర పరావర్తనం” అంటారు.

10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
సంపూర్ణాంతర పరావర్తనమును తెలిపే ఏవైనా రెండు ఉదాహరణలు వివరించండి.
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనమును తెలిపే ఉదాహరణలు :

  1. వజ్రాల ప్రకాశానికి ముఖ్య కారణం సంపూర్ణాంతర పరావర్తనమే. వజ్రం యొక్క సందిగ్ధ కోణం విలువ చాలా తక్కువ (24.49). కావున వజ్రంలోకి ప్రవేశించే కాంతికిరణం సులభంగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం ప్రకాశవంతంగా కనబడేటట్లు చేస్తుంది.
  2. ఆప్టికల్ ఫైబర్స్ సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్ యొక్క అతి తక్కువ వ్యాసార్ధం వల్ల దానిలోకి ప్రవేశించే కాంతి, దాని లోపలి గోడలకు తగులుతూ పతనం చెందుతుంది. పతనకోణం సందిగ్ధకోణం కన్నా ఎక్కువ ఉండడం వల్ల సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. తద్వారా ఆప్టికల్ ఫైబర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది.

ప్రశ్న 2.
స్నెల్ సూత్రమును రాయుము. (లేక) n1 sin i = n2 sin r ను నిరూపించుము.
జవాబు:
1) పటంలో చూపిన విధముగా B అనే బిందువు వద్ద ఒక వ్యక్తి నీటిలో పడి సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు అనుకొనుము.
2) పటంలో X బిందువు గుండా అడ్డంగా గీసిన రేఖ నీటి ప్రాంతానికి ఒడ్డును తెలియచేసే రేఖ అని భావించుము.
3) మనం నేలపై A బిందువు దగ్గర ఉన్నామనుకొనుము.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 7
4) మనం ఆ వ్యక్తిని కాపాడాలనుకుంటే కొంతదూరం నేలమీద, కొంతదూరం నీటిలో ప్రయాణించాలి.
5) పటం. 3లో చూపిన విధంగా నేలపై ప్రయాణించు మార్గాలను అనగా AD, AC లను చూడుము.
6) ADB మార్గం గుండా ప్రయాణిస్తే EC దూరం నేల మీద ప్రయాణించడానికి పట్టే కాలం ఆదా అవుతుంది.
7) నీటిలో DF దూరం ప్రయాణించడానికి పట్టేకాలం అధికంగా అవసరం అవుతుంది. ఈ రెండు కాలాలు సమానం కావాలి.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 8
8) E నుండి C కి, D నుండి F కు ప్రయాణించుటకు పట్టేకాలం ∆t అనుకొనుము.
9) నేలపై అతని వేగం v1, నీటిలో అతని వేగం v2 అగును.
10) పటం నుండి EC = v1 ∆t నుండి DF = v2 ∆t
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 10
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 9

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 11

ప్రశ్న 3.
ఆప్టికల్ ఫైబర్ ద్వారా రోగి శరీరంలోని లోపలి భాగాలను ఎలా చూడగలుగుతారు?
జవాబు:

  1. మానవ శరీరం లోపలి అవయవాలను డాక్టర్ కంటితో చూడలేరు.
  2. డాక్టర్ ‘లైట్ పైప్’ను నోటి ద్వారా పొట్టలోనికి పంపుతారు. ఆ కాంతి పొట్టలోపలి భాగాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
  3. ఆ లోపలి కాంతి, లైట్ పైలోని మరికొన్ని ఆప్టిక్ ఫైబర్స్ ద్వారా బయటకు వస్తుంది.
  4. ఆ ఫైబర్స్ రెండవ చివరి నుండి వచ్చే కాంతిని కంప్యూటర్ స్క్రీన్ పై చూసి పరిశీలించడం ద్వారా పొట్టలోపలి భాగాల చిత్రాన్ని డాక్టర్స్ తెలుసుకుంటారు.

ప్రశ్న 4.
పరావర్తనము, సంపూర్ణాంతర పరావర్తనముల మధ్య ఏవైనా 4 భేదాలను వ్రాయుము.
జవాబు:

పరావర్తనము సంపూర్ణాంతర పరావర్తనము
1) నునుపైన, మెరుగు పెట్టబడిన ఉపరితలంపై పరావర్తనం జరుగును. 1) సంపూర్ణాతర పరావర్తనం ఏ ఉపరితలం మీదనైనా జరుగును.
2) ఏ పతనకోణం విలువకైనా పరావర్తనం జరుగును. 2) పతనకోణం విలువ, సందిగ్ధ కోణం విలువకన్నా ఎక్కువ అయినపుడు మాత్రమే సంపూర్ణాంతర పరావర్తనం జరుగును.
3) కాంతికిరణాలు విరళయానకం నుండి సాంద్రతర యానకంలోనికి లేదా అపారదర్శక యానకంలోనికి ప్రవేశించునపుడు పరావర్తనం చెందుతాయి. 3) కాంతి కిరణాలు సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రవేశించునపుడు సంపూర్ణాంతర పరావర్తనానికి గురవుతాయి.
4) పరావర్తన ఉపరితలం కొంతకాంతిని శోషించుకుంటుంది. 4) పరావర్తన ఉపరితలం కాంతిని శోషించుకోదు.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

ప్రశ్న 5.
సంపూర్ణాంతర పరావర్తనం అనగానేమి? సందిగ్ధకోణం, సంపూర్ణాంతర పరావర్తనల మధ్యగల సంబంధాల్ని ఉత్పాదించండి.
జవాబు:
సంపూర్ణ అంతర పరావర్తనం :
సందిగ్ధ కోణం కంటే పతన కోణం ఎక్కువైనప్పుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణ అంతర పరావర్తనం అంటారు.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 12
5) సందిగ్ధ కోణం కన్నా పతన కోణం ఎక్కువయినపుడు యానకాలను వేరుచేసే తలం వద్ద కాంతికిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందును. దీనినే సంపూర్ణ అంతర పరావర్తనం అంటారు.

ప్రశ్న 6.
స్నెల్ నియమాన్ని వాడి గాజు దిమ్మెపై కొంత పతనకోణంతో పడిన కాంతికిరణం, బహిర్గత కిరణం ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయని నిరూపించండి.
లేదా
గాజు దిమ్మె గుండా ప్రయాణించే కాంతిపొందే విచలన కోణం ఎంత? దానిని కిరణ చిత్రంతో చూపండి.
జవాబు:

  1. ఒక గాజు దిమ్మె రెండు జతల సమాంతర భుజాలు కలిగి ఉండును.
  2. కాంతికిరణం, ఒక గాజు తలంపై పతనమైనపుడు అనగా విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించుచున్నది.
  3. ఈ సందర్భంలో వక్రీభవన కోణం విలువ, పతన కోణం విలువ కన్నా తక్కువగా ఉంటుంది. కావున కాంతి కిరణం లంబంవైపుగా వంగును.
  4. గాజు దిమ్మెలోని వక్రీభవన కాంతి రెండవ సమాంతర ‘తలం నుండి బయటకు వచ్చు సందర్భంలో లంబానికి దూరంగా వంగును.
  5. దీనికి కారణం కాంతి సాంద్రతర యానకంలో నుండి విరళ యానకంలోకి ప్రయాణించునపుడు వక్రీభవన కోణం విలువ, పతన కోణం కన్నా ఎక్కువగా ఉండును.

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 13
ABCD – గాజుదిమ్మె
∠i – పతనకోణం ; ∠r – వక్రీభవన కోణం ; n – వక్రీభవన గుణకం

10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం ½ Mark Important Questions and Answers

1. క్రింది వానిని జతపరచి, సమాధానం రాయుము.
1. వక్రీభవన గుణక సూత్రం P) \(\frac{v}{c}\)
2. వక్రీభవన గుణకం యొక్క విలువ Q) \(\frac{c}{v}\)
R) > 1
S) < 1
జవాబు:
1 – Q, 2 – R

2.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 14
పై పటంలో చూపిన కృత్యంలో ఇమిడియున్న దృగ్విషయం ఏమిటి?
జవాబు:
సమతలాల వద్ద కాంతి వక్రీభవనం

3. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటపుడు దేనిలో మార్పు వచ్చును?
జవాబు:
కాంతి వడి

4. “కాంతి కిరణం యానకం – A నుండి యానకం – B లోనికి వెళ్ళినపుడు లంబం వైపు వంగినది”. పై దత్తాంశం ప్రకారం ఏ యానకం సాంద్రతర యానకం?
జవాబు:
యానకం – B.

5.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 15
ప్రక్కన చూపిన కాంతి కిరణం యొక్క పతన కోణం ఎంత?
జవాబు:
50° [∵ 90° = 40° = 50°]

6. శూన్యంలో కాంతి వేగం ఎంత?
జవాబు:
3 × 108 m/s

7. వక్రీభవన గుణకం యొక్క ప్రమాణం ఏమిటి?
జవాబు:
ప్రమాణాలు ఉండవు

8. గాజులో కాంతి వేగం 2 × 108 మీ./సె. అయిన గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 16

9. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం 1.33 అయిన
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 17

10. వక్రీభవన గుణకం యానకం
1.44 – A
1.71 – B
• పై ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువ?
జవాబు:
యానకం – A

• పై ఏ యానకం యొక్క దృక్ సాంద్రత తక్కువ?
జవాబు:
యానకం – A

11. జతపరిచి సరియైన సమాధానం రాయుము.

వక్రీభవన గుణకం యానకం
a) 1.0003 (1) వజ్రం
b) 1.50 (2) గాలి
c) 2.42 (3) బెంజీన్జ

జవాబు:
a – 2, b – 3, c-1

12. క్రింది వానిలో ఏ వాక్యం సరియైనది?
వాక్యం a : నీటి యొక్క దృశా సాంద్రత కిరోసిన్ కన్నా తక్కువ.
వాక్యం b : కిరోసిన్ యొక్క పదార్ధ సాంద్రత నీటి కన్నా తక్కువ.
A) a
B) b
C) a మరియు b.
D) రెండూ కావు
జవాబు:
B) b

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

13. వక్రీభవన గుణకం ఆధారపడే అంశాలు ఏవి?
జవాబు:
పదార్థ స్వభావం, కాంతి తరంగదైర్ఘ్యం

14. క్రింది వానిలో సరియైనది ఏది?
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 18
c) రెండూ
జవాబు:
c) రెండూ

15. n1 = 1, n2 = 1.33 అయిన n21 విలువ ఎంత? ఆ యానకంలో కాంతి వేగం ఎంత?
జవాబు:
1.33

16. పతన కోణం (i), వక్రీభవన కోణం (r) ల మధ్య సంబంధం ఏమిటి?
జవాబు:
\(\frac{\sin i}{\sin r}\) = స్థిరాంకం

17. కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రవేశించినపుడు
A) r < i
B) r > i
C) r = i
జవాబు:
A) r < i

18. స్నెల్ నియమంను రాయుము. వక్రీభవన గుణకం యానకం
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 19

19. రెండు యానకాల వక్రీభవన గుణకాలకి, కాంతి వేగాలకి మధ్య సంబంధాన్ని రాయుము. ‘
జవాబు:
\(\frac{\mathbf{v}_{1}}{\mathbf{v}_{2}}\) = \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\)

20. n1 = 1.33 అయితే \(\frac{\mathbf{v}_{1}}{\mathbf{v}_{2}}\) ఎంత?
జవాబు:
1.33

21. ‘కాంతి వక్రీభవన గుణకం దృష్ట్యా సరియైనది ఏది?
a) ∠i = ∠r
b) n1 sin i = n2 sin r
c) రెండూ
జవాబు:
b) n1 sin i = n2 sin r

22. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం ఎంత ?
జవాబు:
900

23. r= 90° అయితే పతన కోణంను ఏమని పిలుస్తారు?
జవాబు:
సందిగ్ధ కోణం

24. sin C విలువ ఎంత ?
జవాబు:
sin C = \(\frac{1}{\mathrm{n}_{21}}\) (లేదా) sin C = \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\)

25. సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతనకోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరు చేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణాన్ని సాంద్రతర యానకం యొక్క ………… అంటారు.
జవాబు:
సందిగ్ధ కోణం

26. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కిరణం ఎలా ప్రయాణిస్తుంది?
జవాబు:
యానకాలు వేరు చేసే తలం గుండా

27. ఏ సందర్భంలో వక్రీభవన కోణం 90° అవుతుందో ఊహించి రాయుము.
జవాబు:
సందిగ్ధ కోణం వద్ద

28. Sin C = \(\frac{1}{\mathrm{n}_{12}}\) లో ‘C’ అనగానేమి?
జవాబు:
సందిగ్ధ కోణం

29. ‘సందిగ్ధ కోణం కన్నా పతనకోణం ఎక్కువైనపుడు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి కిరణం తిరిగి సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది’. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం

30.
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 20
‘2’ పతన కిరణం యొక్క వక్రీభవన కిరణం ఏది?
జవాబు:
3

31.
AP Board 10th Class Physical Science Solutions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 18
పై పటంలో చూపిన ప్రయోగంలో పరిశీలింపబడే ముఖ్య కాంతి దృగ్విషయం ఏమిటి?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం

32. వేసవి మధ్యాహ్నం సమయంలో తారు రోడ్ పై దూరంగా నీరు కనిపించింది. కానీ అక్కడ నిజానికి నీరు లేదు. కారణం ఏమిటి?
జవాబు:
కాంతి సంపూర్ణాంతర పరావర్తనం

33. ఒకే యానకంలో వక్రీభవన గుణకం మారే సందర్భానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఎండమావి ఏర్పడుట

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

34. ఎండమావిలో ఏర్పడే ప్రతిబింబం లక్షణాలేవి?
జవాబు:
మిథ్యా ప్రతిబింబం.

35. ఎండమావిని ఫోటో తీయగలమా?
జవాబు:
తీయగలం

36. వజ్రం యొక్క సందిగ్ధ కోణం (గాలి దృష్ట్యా) ఎంత?
జవాబు:
24.4°

37. వజ్రం మెరవడానికి కారణం ఏమిటి?
జవాబు:
వజ్రం సందిగ్ధ కోణం చాలా తక్కువ

38. వజ్రం మెరవడంలో ఇమిడి వున్న దృగ్విషయం ఏది?
జవాబు:
సంపూర్ణాంతర పరావర్తనం

39. సన్నని ఫైబర్ తీగలు కొన్ని కలిసి ఏర్పడేది?
a) హాట్ పైప్
b) టైట్ పైప్
c) లైట్ పైప్
d) బ్లాక్ పైప్
జవాబు:
c) లైట్ పైప్

40. సాధారణంగా ఆప్టికల్ ఫైబర్ వ్యాసార్ధం ఎంత వుంటుంది?
జవాబు:
1 మైక్రోమీటర్ (10-6 మీ.)

41. ఆప్టికల్ ఫైబర్ లో కాంతి ప్రయాణ మార్గం
a) సరళరేఖ
b) జిగ్ జాగ్
c) సర్పిలం
జవాబు:
b) జిగ్ జాగ్

42. ఆప్టికల్ ఫైబర్ ఒక వినియోగం రాయుము.
జవాబు:
సమాచార సాంకేతాలను ప్రసారం చేయడానికి

43. సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక నిజజీవిత వినియోగం రాయుము.
జవాబు:
వజ్రం మెరుపు / ఎండమావి / ఆప్టికల్ ఫైబర్

44. రెండు సమాంతర తలాలను కలిగియుండి, దాని పరిసరాలలోని యానకం నుండి వేరు చేయబడివున్న ఒక పారదర్శక యానకం
a) పట్టకం
b) గాజు పలక
c) ఆప్టికల్ ఫైబర్
జవాబు:
b) గాజు పలక

45. గాజు వక్రీభవన గుణకం కనుగొనుటకు సూత్రం రాయుము.
జవాబు:
వక్రీభవన గుణకం =
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 21

46. Sin C = \(\frac{\mathrm{n}_{2}}{\mathrm{n}_{1}}\) (n1 = 1వ యానకం యొక్క వక్రీభవన గుణకం)
(n2 = 2వ యానకం యొక్క వక్రీభవన గుణకం)
దీనిలో ఏది సాంద్రతర యానకం?
జవాబు:
n1

47. నీటి పరంగా గాజు వక్రీభవన గుణకం 9/8. గాజు పరంగా నీటి వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
8/9

48. గాజు పలక ద్వారా వచ్చే కాంతి విచలన కోణం ఎంత?
జవాబు:

49. గాజు యొక్క వక్రీభవన గుణకం ‘2’ అయిన గాజు యొక్క సందిగ్ధ కోణం ఎంత?
జవాబు:
30°

50. నక్షత్రాలు మిణుకుమిణుకుమనడానికి కారణం ఏమిటి?
జవాబు:
వాతావరణంలో వివిధ సాంద్రతలు గల పొరల వలన

51. ఒక గాజుపలక మందం 3 సెం.మీ. నిలువు విస్తాపనం 1 సెం.మీ. అయిన గాజుపలక వక్రీభవన గుణకం ఎంత?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 22

52. నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. కారణం ఏమిటి?
జవాబు:
కాంతి వక్రీభవనం

సాధించిన సమస్యలు

1. కాంతి గాలి నుండి నీటిలోనికి ప్రయాణిస్తున్నపుడు నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33 అయిన కాంతి నీటినుండి గాలిలోనికి ప్రయాణిస్తున్నపుడు వక్రీభవన గుణకం ఎంత?
సాధన:
గాలి వక్రీభవన గుణకం (n1) = 1
నీటి యొక్క వక్రీభవన గుణకం (n2) = 1.33
కాంతి నీటి నుంచి గాలిలోకి ప్రయాణిస్తున్నప్పుడు వక్రీభవన గుణకం = \(\frac{\mathrm{n}_{1}}{\mathrm{n}_{2}}\) = \(\frac{1}{1.33}\) = 0.75

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

2. వజ్రం వక్రీభవన గుణకం 2.42, గాజు వక్రీభవన గుణకం 1.5 అయిన సందిగ్ధకోణమును పోల్చండి.
(C = 24° వజ్రంకు) (C = 42° గాజుకు).
సాధన:
వజ్రం వక్రీభవన గుణకం (n1) = 2.42
AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 23

10th Class Physics 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు
A) సెంటీమీటర్
B) డయాప్టరు
C) డిగ్రీ
D) ప్రమాణాలు లేవు
జవాబు:
D) ప్రమాణాలు లేవు

2. టార్చ్, సెర్చ్ లైట్, వాహనాల హెడ్ లైట్ లో బల్బు ఉంచబడే స్థానం
A) పరావర్తకపు నాభి మరియు ధృవాల వద్ద
B) పరావర్తకం నాభి వద్ద
C) పరావర్తకం యొక్క వక్రతా కేంద్రం వద్ద
D) పరావర్తకం యొక్క నాభి మరియు కేంద్రం మధ్య
జవాబు:
B) పరావర్తకం నాభి వద్ద

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

3. ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్ష నాళికను ఒక ప్రత్యేక స్థానం నుండి చూచినపుడు పరీక్షనాళిక గోడ అద్దం వలె కనిపించడానికి కారణం ……. నోట్ : పరీక్షనాళికలో నీరు చేరరాదు.
A) పరావర్తనం
B) వక్రీభవనం
C) పరీక్షేపణం
D) సంపూర్ణాంతర పరావర్తనం
జవాబు:
C) పరీక్షేపణం

4. వివిధ పదార్ధ యానకాల వక్రీభవన గుణకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
పై వాటిలో దేనిలో కాంతివేగం ఎక్కువగా ఉంటుందో ఊహించండి.
A) సఫైర్
B) క్రౌన్ గాజు
C) మంచుముక్కలు
D) రూబీ
జవాబు:
C) మంచుముక్కలు

5. వస్తువును ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు కుంభాకార కటకం అదే పరిమాణంలో తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచును?
A) C వద్ద
B) F వద్ద
C) F మరియు C ల మధ్య
D) F మరియు కటక దృక్ కేంద్రం మధ్య
జవాబు:
B) F వద్ద

6. 10 సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని నీటిలో ముంచితే దాని నాభ్యంతరం
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) సున్నాకు చేరును
జవాబు:
A) పెరుగుతుంది

7. పటంలో సరిగా గుర్తించబడిన కోణాలు
A) ∠i మరియు ∠r
B) ∠i మరియు ∠e
C) ∠r మరియు ∠e
D) ∠i, ∠r మరియు ∠e.
జవాబు:
A) ∠i మరియు ∠r

8. నక్షత్రాలు మిణుకు మిణుకుమనడానికి కారణం ……………..
A) సంపూర్ణాంతర పరావర్తనం
B) పరిక్షేపణం
C) విక్షేపణం
D) వాతావరణంలో కాంతి వక్రీభవనం
జవాబు:
D) వాతావరణంలో కాంతి వక్రీభవనం

9. భావన ‘A’ : గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం, దాని అసలు పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తుంది.
కారణం ‘R’: పతనకోణం విలువ, సందిగ్ధకోణం విలువకన్నా ఎక్కువ అయినపుడే సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది.
క్రింది వాటిలో ఏది సరైనది?
A) A సరియైనది కాని R తప్పు
B) A, R రెండూ సరైనవే, R, A కు సరైన వివరణ
C) A, R రెండూ సరైనవే, R, A కు సరైన వివరణ కాదు
D) A, R రెండూ తప్పు
జవాబు:
C) A, R రెండూ సరైనవే, R, A కు సరైన వివరణ కాదు

AP 10th Class Physical Science Important Questions 3rd Lesson సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

10. ఎండమావులు ఏర్పడటానికి ……. కారణం.
A) విక్షేపణం
B) పరిక్షేపణం
C) వ్యతికరణం
D) సంపూర్ణాంతర పరావర్తనం
జవాబు:
D) సంపూర్ణాంతర పరావర్తనం

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

These AP 10th Class Physical Science Chapter Wise Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 2nd Lesson Important Questions and Answers ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
పరీక్షనాళికలో నీరు తీసుకొని కొద్దిగా గాఢ H2SO4) ను కలిపి కదపండి. పరీక్షనాళిక అడుగుభాగం వేడిగా ఉంటుంది. H2SO4 కి బదులుగా NaOH బిళ్ళలు నీటికి కలిపితే పరీక్షనాళిక అడుగు భాగం ఏ విధంగా ఉంటుంది?
జవాబు:
పరీక్షనాళిక అడుగుభాగం వేడిగా ఉండును. దీనికి కారణము ఆమ్లాలు, క్షారాలు నీటితో చర్య జరుపుట అనునది ఒక ఉష్ణమోచక చర్య.

ప్రశ్న 2.
కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడి పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే ఏం జరుగుతుందో రాయండి.
జవాబు:

  1. కాపర్ సల్ఫేటు స్పటికాలను పొడి పరీక్షనాళికలో తీసుకొని వేడి చేస్తే, పరీక్షనాళీక గోడలపై నీటి బిందువులు ఏర్పడతాయి.
  2. అంతేకాకుండా, నీలి రంగులో ఉన్న స్పటికాలు తెలుపు రంగులోకి మారుతాయి.
  3. దీనికి కారణం, నీలిరంగు CuSO4 5H2O లో గల 5 నీటి అణువులు బాష్పీభవనం చెంది తెలుపు రంగు CuSO4 ఏర్పడటమే.

ప్రశ్న 3.
వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను ఎందుకు పరీక్షిస్తారు?
జవాబు:

  1. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి నిర్దిష్ట పరిమితిలో pH విలువ కలిగియున్న మట్టి అవసరం.
  2. వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను పరీక్షించటం ద్వారా మట్టి యొక్క ఆమ్ల లేదా క్షారపు స్వభావాన్ని కనుగొని, ఆ స్వభావానికనుగుణంగా కావలసిన లవణాలను కలిపి కావలసిన pH విలువను పొందడం కొరకు వ్యవసాయ భూములలో మట్టి యొక్క pH విలువను పరీక్షిస్తారు.

ప్రశ్న 4.
ఇంటిలో ఎక్కువగా ఉపయోగించే ఉప్పు, వంటసోడాల అణుఫార్ములాను రాయండి.
జవాబు:
సాధారణ ఉప్పు : NaCl
వంటసోడా : NaHCO3

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 5.
“ఆమ్లాలు జల ద్రావణంలో మాత్రమే అయాన్లను ఏర్పరుస్తాయి” అని చూపే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాయండి.
జవాబు:

  1. ప్రయోగంలో వెలువడిన వాయు రూపంలోని ఆమ్లాన్ని మొదట ‘పొడి’ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి. తర్వాత ‘తడి’ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి.
  2. అనార్థ CaCl2 గల గార్డ్ ట్యూబ్ ను ఉపయోగించాలి.

ప్రశ్న 6.
సహజ సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
లిట్మస్, రెడ్ క్యాబేజి రసం, పసుపు కలిపిన జల ద్రావణం, పుష్పాల ఆకర్షక పత్రాలు, బీట్ రూట్ రసం.

ప్రశ్న 7.
కృత్రిమ రసాయన సూచికలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ మొదలైనవి.

ప్రశ్న 8.
సార్వత్రిక ఆమ్ల – క్షార సూచికలు అనగానేమి?
జవాబు:
సేంద్రియ రంజనాల మిశ్రమాలను లేదా సూచికల మిశ్రమాలను సార్వత్రిక ఆమ్ల – క్షార సూచికలు అంటారు. ఇవి ఆమ్ల, క్షార బలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఉదా : pH పేపరు

ప్రశ్న 9.
బలమైన ఆమ్లాలు అనగానేమి ? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది అధిక H3O+ అయాన్లు ఇచ్చే వాటిని బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.

ప్రశ్న 10.
బలహీన ఆమ్లాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందిన ఆమ్లాలను బలహీన ఆమ్లాలు అంటారు.
ఉదా : CH3COOH, H2CO3, H3PO4.

ప్రశ్న 11.
ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అనగానేమి?
జవాబు:
కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార మాధ్యమంలో వేర్వేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు.

ప్రశ్న 12.
విలీనత అనగానేమి?
జవాబు:
విలీనత :
ఆమ్లానికి లేదా క్షారానికి నీటిని కలుపుట వలన ప్రమాణ ఘనపరిమాణం గల ద్రావణం యొక్క గాఢత తగ్గే దృగ్విషయాన్ని విలీనత అంటారు.

ప్రశ్న 13.
బలమైన క్షారాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెంది ఎక్కువ OH- అయాన్లు ఇచ్చే వాటిని బలమైన క్షారాలు అంటారు.
ఉదా : NaOH, KOH.

ప్రశ్న 14.
బలహీన క్షారాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
జల ద్రావణంలో పూర్తిగా అయనీకరణం చెందని క్షారాలను బలహీన క్షారాలంటారు.
ఉదా : NH4OH, Ca(OH)2, Mg(OH)2.

ప్రశ్న 15.
pH స్కేలు అనగానేమి?
జవాబు:
హైడ్రోజన్ గాఢత యొక్క ఋణ సంవర్గమానాన్ని pH స్కేలు అంటారు. దీనిని సొరెన్సన్ కనుగొన్నాడు.
pH = – log [H+]

ప్రశ్న 16.
ఏంటాసిడ్ అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
ఒక బలహీన క్షారం జీర్ణాశయంలో తయారైన అధిక పరిమాణంలోని ఆమ్లాలను తటస్థీకరించి ఉపశమనం కలుగజేయును. దీనినే ఏంటాసిడ్ అంటాం.
ఉదా : జెలూసిల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా.

ప్రశ్న 17.
తటస్థీకరణం అనగానేమి?
జవాబు:
ఒక ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరచే చర్యను తటస్థీకరణ చర్య అంటారు.

ప్రశ్న 18.
అలోహ ఆక్సెలు అనగానేమి? ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
అలోహాలు ఆక్సిజన్ తో కలిసి ఏర్పరచే ఆక్సెను అలోహ ఆక్సెలు అంటారు. ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఉదా : CO2, NO2, SO2

ప్రశ్న 19.
క్షార ఆక్సెన్లు అనగానేమి? ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జవాబు:
లోహాలు ఆక్సిజన్ తో కలిపి ఏర్పరచే ఆక్సెలను క్షార ఆక్సెన్లు అంటారు. వీటికి క్షార స్వభావం ఉండును. వీటిని లోహ ఆక్సెట్లు లేదా క్షార ఆక్సెలు అంటాం.
ఉదా : Na2O, MgO, CaO.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 20.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అగానేమి?
జవాబు:
కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4. ½H2O ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు.

ప్రశ్న 21.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగమేమి?
జవాబు:
విరిగిన ఎముకలకు కట్లు కట్టడానికి, బొమ్మల తయారీలోనూ, సీలింగ్ చేయడానికి, వాటర్ ఫిల్టర్ లో క్యాండిల్స్ గాను వాడతారు.

ప్రశ్న 22.
సోడియం క్లోరైడ్ నుండి తయారు చేసే పదార్థాలేవి?
జవాబు:
సోడియం క్లోరైడ్ నుండి 1) NaOH క్షారం 2) బ్లీచింగ్ పౌడర్ 3) బేకింగ్ పౌడర్ 4) బట్టల సోడాలను తయారు చేస్తారు.

ప్రశ్న 23.
బ్లీచింగ్ పౌడరును ఎలా తయారు చేస్తారు?
జవాబు:
తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ను Ca(OH), పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడును.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O

ప్రశ్న 24.
జిప్సం అనగానేమి? ఉపయోగాలేవి?
జవాబు:
CaSO4 2H2O ను జిప్పం అంటారు.

  1. దీనిని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారీలో ఉపయోగిస్తారు.
  2. పొలాలలో ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి జిప్సం చల్లుతారు.
  3. ఇళ్లకు, షాపులకు సీలింగ్ చెయ్యటానికి జిప్సం షీట్ లను విరివిగా వాడుచున్నారు.

ప్రశ్న 25.
వివిధ అణువులలోని స్ఫటిక జలం అణువుల సంఖ్యను తెలపండి.
జవాబు:
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో ½ నీటి అణువు, జిప్సంలో 2 నీటి అణువులు, కాపర్ సల్ఫేట్ లో 5 నీటి అణువులు, వాషింగ్ సోడాలో 10 నీటి, అణువులు కలవు.

ప్రశ్న 26.
pH స్కేలును తయారు చేసిన సొరెన్సన్ కృషిని ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
ద్రావణాలలో హైడ్రోజన్ అయాను గాఢతల ఋణాత్మక విలువలను గుర్తుపెట్టుకోవడం కష్టంగా మారిన తరుణంలో pH స్కేలును కనిపెట్టిన సొరెన్సన్ అభినందనీయుడు. ఈయన కనిపెట్టిన pH స్కేలు వ్యవసాయంలో, వైద్యరంగంలోను ఆహారపదార్థాల తయారీలో విరివిగా వాడుచున్నారు. ఈయన చేసిన కృషిని అభినందించవలసి యున్నది.

ప్రశ్న 27.
NaCl ఆహారానికి మంచి రుచిని తీసుకురావడమే కాకుండా అనేక రసాయనాల తయారీకి ఉపయోగపడును. NaCl పట్ల ఎటువంటి సానుభూతిని కలిగి ఉంటావు?
జవాబు:
సాధారణ లవణం లేదా సోడియం క్లోరైడ్ ఆహారపదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బట్టల సోడా తయారీలో ముడిపదార్థంగా ఉపయోగపడును. కావున NaClను ప్రత్యేక పదార్థంగా చూడవలసిన అవసరం ఉన్నది.

ప్రశ్న 28.
సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సెడ్ లాంటి అలోహ ఆక్సెలు తాజ్ మహల్ లాంటి గొప్ప నిర్మాణాలను పాడుచేస్తున్నాయి. దీనిని ఏ విధంగా అరికడతావు?
జవాబు:
తాజ్ మహల్ వంటి మహాకట్టడంను మార్బుల్ తో నిర్మించడం జరిగినది. మార్బుల్ అనగా కాల్షియం కార్బోట్ (CaCO3). ఇది గాలిలోని SO2తో చర్య జరుపుట వలన పసుపురంగులోకి మారి రోజురోజుకు తాజ్ మహల్ అందం తగ్గుచున్నది. కాబట్టి వాతావరణంలో SO2 వాయువు కలవకుండా జాగ్రత్తపడవలసి ఉన్నది.

ప్రశ్న 29.
రాగి పాత్రలు వాడుకలో తమ మెరుపును కోల్పోతాయి. కాని చింతపండుతో రుద్దితే తళతళ మెరుస్తాయి. ఎందుకు?
జవాబు:
రాగి పాత్రలు ఎల్లప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్, CO2లతో చర్య జరిపి క్షార స్వభావం గల కాపర్ ఆక్సెడ్, కాపర్ కార్బోనేట్ గా మారి పాత్రలపై చిలుము పొరలుగా ఏర్పడతాయి. అందువలన పాత్రల మెరుపు తగ్గుతుంది.

మనం చింతపండుతో పాత్రలను రుద్దితే చింతపండులోని టార్టారిక్ ఆమ్లం కాపర్ ఆక్సెడ్, CuCO3 లతో తటస్థీకరణ చర్యజరిపి కాపర్ టార్టారే గా మారి నీటితో కలిసి బయటకు పోవును. కావున పాత్రలు తళతళ మెరుస్తాయి.

ప్రశ్న 30.
తడి సున్నం, తడి చాపీతో వ్రాసిన కొంతసేపటి తర్వాత తెల్లగా, స్పష్టంగా కన్పించును. ఎందుకు?
జవాబు:
తడిసున్నం లేదా తడి చాక్ పీ లో Ca(OH)2 అనే బలహీన క్షారం ఉండును. దీనిని గోడలపై సున్నం కొట్టినా లేదా బోర్డుపై రాసినా వాతావరణంలోని CO2 తో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ ను ఏర్పరచును.
Ca(OH)2 + CO2 → ↓CaCO3 + H2O
కాల్షియం కార్బోనేట్ తెల్లగా, స్పష్టంగా కనిపించును.

ప్రశ్న 31.
NaOH యొక్క పారిశ్రామిక ఉపయోగాలేవి?
జవాబు:
NaOH ను కాస్టిక్ సోడా అంటారు. దీనిని సబ్బులు, పేపర్, కృత్రిమ దారాలు, మందుల తయారీలో వాడతారు.

ప్రశ్న 32.
KOH యొక్క పారిశ్రామిక ఉపయోగాలేవి?
జవాబు:
KOHను ఒంటి సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 33.
మానవ లేదా జంతువుల ఎముకలలో ఎటువంటి లవణాలు ఉండును?
జవాబు:
మానవ లేదా జంతువుల ఎముకలలో కాల్షియం ఫాస్ఫేటు (Ca3(PO4)2) లాంటి లవణాలు ఉండును.

ప్రశ్న 34.
బోరిక్ ఆమ్లాన్ని ఎందుకు వాడతారు?
జవాబు:
బోరిక్ ఆమ్లాన్ని కళ్లను శుభ్రం చెయ్యటానికి వాడతారు.

ప్రశ్న 35.
బట్టలపై మరకలను శుభ్రం చెయ్యటానికి వాడే ఆమ్లమేది?
జవాబు:
ఆక్జాలిక్ ఆమ్లం.

ప్రశ్న 36.
కూల్ డ్రింకులు, సోడాలలో వాడే ఆమ్లం ఏది?
జవాబు:
కార్బోనిక్ ఆమ్లం (H2CO3).

ప్రశ్న 37.
ఏంటాసిడ్ గా వాడే క్షారం ఏది?
జవాబు:
మెగ్నీషియం హైడ్రాక్సైడ్.

ప్రశ్న 38.
బట్టల పైన అంట్టిన గ్రీజు మరకలను తొలగించడానికి వాడే క్షాతం ఏది?
జవాబు:
అమ్మోనియం హైడ్రాక్సైడ్ (NH4OH).

ప్రశ్న 39.
ఆమ్ల సమక్షంలో లిట్మస్ కాగితం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
ఆమ్ల సమక్షంలో నీలి లిట్మస్ ఎర్రగా మారుతుంది. కానీ ఎర్ర లిట్మస్ రంగు మారదు.

ప్రశ్న 40.
లిట్మస్ ద్రావణం అనగానేమి?
జవాబు:
లిట్మస్ అనేది ఒక రంజనము. దీనిని థాలోఫైటా వర్గానికి చెందిన ‘లైకెన్’ అనే మొక్క నుండి సేకరిస్తారు.

ప్రశ్న 41.
క్షార సమక్షంలో లిట్మస్ కాగితం ఏవిధంగా మారుతుంది?
జవాబు:
క్షార సమక్షంలో ఎర్రలిట్మస్ నీలిగా మారుతుంది. నీలి లిట్మస్ తన రంగును మార్చుకోదు.

ప్రశ్న 42.
లోహాలతో ఆమ్ల, క్షార చర్యలకు రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
లోహాలు, ఆమ్లాలు, లేదా క్షారాలతో చర్య పొందినపుడు H2 వాయువును విడుదల చేయును.
ఉదా : 1) 2HCl + Zn → ZnCl2 + H2
2) 2NaOH + Zn → Na2ZnO2 + H2

ప్రశ్న 43.
కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల చర్యలను వ్రాయుము.
జవాబు:
ఆమ్లాలు కార్బొనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో చర్య పొందినపుడు CO2 వాయువు వెలువడును.
ఉదా : 1) Na2CO3 + 2HCl → 2NaCl + H2O + CO2
2) NaHCO3 + HCl → NaCl + H2O + CO2

ప్రశ్న 44.
ఆల్కలీ అనగానేమి?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ‘ఆల్కలీ’ అంటారు.

ప్రశ్న 45.
ఆమ్ల, క్షార బలాలను ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
ఒక ద్రావణంలోని H3O+ అయానుల సంఖ్య లేదా OH అయానుల సంఖ్య ఆధారంగా ఆమ్ల, క్షారాల బలాలను నిర్ణయిస్తారు.

ప్రశ్న 46.
ఒక ద్రావణం యొక్క ‘pH’ అనగానేమి?
జవాబు:
ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువ, ఆ ద్రావణం యొక్క pH.

ప్రశ్న 47.
ఒక ఆమ్లం, క్షారం మధ్య తటస్థీకరణ చర్య జరిగి ఏర్పడిన లవణం యొక్క లక్షణాన్ని ఎలా నిర్ణయిస్తారు?
జవాబు:
తటస్థీకరణ చర్యలో ఏర్పడిన లవణం యొక్క స్వభావం ఆ చర్యలో పాల్గొన్న ఆమ్ల, క్షార బలాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదా : బలమైన ఆమ్లం + బలమైన క్షారం → తటస్థ లవణం
బలమైన ఆమ్లం + బలహీన క్షారం → ఆమ్ల లవణం
బలహీన ఆమ్లం + బలమైన క్షారం → క్షార లవణం
బలహీన ఆమ్లం + బలహీన క్షారం → ఆమ్ల-క్షారాల సాపేక్ష బలంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 48.
స్ఫటికీకరణ జలం అనగానేమి?
జవాబు:
ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటికీకరణ జలం అంటారు.

ప్రశ్న 49.
జిప్సం నుండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఎలా తయారుచేస్తారు?
జవాబు:
జిప్సంను 373 K ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగాను, అతి జాగ్రత్తగాను వేడి చేస్తే, పాక్షికంగా నీటి అణువులను కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ గా మారుతుంది. దీనినే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (CaSO4.½H2O) అంటారు.

ప్రశ్న 50
సాధారణ ఉప్పు నుండి లభించే ఇతర లవణాలు ఏవి?
జవాబు:
సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), వంటసోడా (NaHCO3), ఉతికే సోడా (Na2CO3), బ్లీచింగ్ పౌడర్ (CaOCl3) వంటి లవణాలు ఏర్పడుతాయి.

ప్రశ్న 51.
హైడ్రోక్లోరికామ్లం యొక్క ఉపయోగాలు తెలుపుము.
జవాబు:
స్టీలు వస్తువులు, గచ్చు మరియు టాయిలెట్లు శుభ్రపరిచే ద్రవాలలో హైడ్రోక్లోరికామ్లాలు వాడతారు. అంతేగాక మందులు, సౌందర్య సాధనాల తయారీలో కూడా హైడ్రోక్లోరికామ్లాన్ని వాడతారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 52.
రాతి ఉప్పు అనగానేమి?
జవాబు:
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలలో ఉండే సోడియం క్లోరైడ్ స్పటికాలు మలినాలతో కలిసి ఉండడం వలన ముదురు గోధుమ రంగులో ఉంటాయి. దీనినే రాతి ఉప్పు (Rock Salt) అంటారు.

ప్రశ్న 53.
Na2CO3 . 10H2O అనే ఫార్ములాలో 10H2O అనగానేమి?
జవాబు:
Na2CO3 . 10H2O అనే ఫార్ములాలో, 10H2O అనేది Na2CO,3 యొక్క ఒక ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిలో 10 నీటి అణువులు ఉన్నాయని సూచిస్తుంది. కాని Na2CO3 తడిగా వుండదు.

ప్రశ్న 54.
ఎసిటిక్ ఆమ్లము నీలిలిట్మస్ కాగితంను ఎరుపుగా మార్చదు. ఎందుకు?
జవాబు:
ఎసిటిక్ ఆమ్లము బలహీన ఆమ్లం కాబట్టి నీలి లిట్మసను ఎరుపుగా మార్చదు.

ప్రశ్న 55.
బ్లీచింగ్ పౌడర్ యొక్క రెండు ఉపయోగాలు తెల్పుము.
జవాబు:

  1. దీనిని విరంజనకారిణిగా ఉపయోగిస్తారు.
  2. రసాయన పరిశ్రమలలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 56.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, జిప్సంల ఫార్ములాలు వ్రాయుము.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ – CaSO4 . ½H2O
జిప్సం – CaSO4 . 2H2O

ప్రశ్న 57.
ఏవేని రెండు ఆమ్ల-క్షార సూచికలను తెల్పుము.
జవాబు:
మిథైల్ ఆరెంజ్, లిట్మస్, ఫినాఫ్తలీన్.

ప్రశ్న 58.
బోరాక్స్ తయారీలో ఉపయోగించు లవణం ఏది?
జవాబు:
వాషింగ్ సోడా (Na2CO3 . 10H2O)

ప్రశ్న 59.
మానవ శరీరంలోని రసాయనాల pH విలువ తగ్గితే ఏమవుతుంది?
జవాబు:
పుల్లని పదార్థాలు అధికంగా తినడం వల్ల మానవ జీర్ణాశయంలోని pH తగ్గుతుంది. కాబట్టి అజీర్తికి గురి అవుతారు.

ప్రశ్న 60.
తటస్థ, ఆమ్ల, క్షార పదార్థాల PH విలువలు తెల్పుము.
జవాబు:
తటస్థ పదార్థ pH విలువ 7. ఆమ్ల పదార్థాల PH 7 కంటే తక్కువ. క్షార పదార్థాల PH 7 కంటే ఎక్కువ.

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రెండు పరీక్షనాళికలు X, Y లలో ఒకే పరిమాణంలో మెగ్నీషియం రిబ్బన్ ను తీసుకోవడం జరిగింది. X పరీక్షనాళికలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, Y పరీక్షనాళికలో ఎసిటికామ్లాన్ని పోస్తే, ఏ పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది? ఎందుకు?
జవాబు:
X పరీక్షనాళికలో రసాయన చర్య వేగంగా జరుగుతుంది.

కారణం :
హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటికామ్లం కన్నా బలమైన ఆమ్లం. కావున ఎసిటికామ్లం కంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మెగ్నీషియం రిబ్బన్లో వేగంగా చర్య జరుగుతుంది.

ప్రశ్న 2.
సాధారణ ఉప్పు నుండి తయారుచేయగల రసాయనాలకు 4 ఉదాహరణలు ఇవ్వండి. వాటి సాంకేతికాలను రాయండి.
జవాబు:
సాధారణ ఉప్పు నుండి తయారు చేయగల రసాయనాలు :

  1. సోడియం హైడ్రాక్సైడ్ – NaOH
  2. బేకింగ్ సోడా / వంట సోడా / సోడియం బైకార్బొనేట్ / సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ – NaHCO3
  3. బట్టల సోడా / వాషింగ్ సోడా / సోడియం కార్బొనేట్ – Na2CO3. 10H2O
  4. బ్లీచింగ్ పౌడర్ / కాల్షియం ఆక్సీక్లోరైడ్ – CaOCl2

ప్రశ్న 3.
కింది పట్టికలో ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి, పట్టిక కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పదార్థం (జల ద్రావణంలో) నీలి లిట్మ తో సూచించే రంగు మార్పు రెడ్ లిట్మతో సూచించే రంగు మార్పు
A ఎరుపు మార్పు లేదు
B మార్పు లేదు నీలం
C మార్పు లేదు మార్పు లేదు

i) A, B, C పదార్థాలలో తటస్థ లవణం ఏది?
ii) B పదార్థానికి కొన్ని చుక్కల ఫినాఫ్తలీన్ కలిపితే ఏం జరుగుతుంది?
జవాబు:
(i) C
(ii) పింక్ (గులాబి) రంగులోకి మారుతుంది.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 4.
ఆంటాసిడ్ ఎందుకు ఉపయోగిస్తారో తెల్పి, దాని స్వభావమును రాయండి.
జవాబు:

  1. ఎసిడిటి సమస్య ఉన్నప్పుడు / అజీర్తి సమస్య ఉన్నప్పుడు జీర్ణాశయంలో / కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
  2. జీర్ణాశయంలో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం కలగడానికి ఆంటాసిడ్ ఉపయోగిస్తారు.
  3. ఆంటాసిడ్ క్షారస్వభావాన్ని కలిగి యుంటుంది.

ప్రశ్న 5.
CaO ను నీటిలో కరిగించిన ఏర్పడు పదార్థం ఏది? దాని స్వభావాన్ని ఎలా నిర్ధారిస్తారు?
జవాబు:

  1. CaO నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ Ca(OH)2
  2. కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం స్వభావాన్ని సాధారణంగా ఎరుపు లిట్మస్ కాగితం లేదా pH కాగితంతో నిర్ధారిస్తారు.
  3. Ca(OH)2 ఎరుపు లిట్మసు నీలిరంగుకు మారుస్తుంది. కనుక దానికి క్షార స్వభావం ఉందని చెప్పవచ్చు.

(లేదా)
Ca(OH)2 ను pH కాగితంతో పరీక్షింపగా దాని pH విలువ 7 కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. కనుక అది క్షార స్వభావాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 6.
వాషింగ్ సోడా యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు రాయండి.
జవాబు:
వాషింగ్ సోడా ఉపయోగాలు :

  1. గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  2. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాల తయారీకి ఉపయోగిస్తారు.
  3. గృహావసరాలలో వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
  4. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 7.
ఆమ్ల, క్షార మాధ్యమాలలో సూచిక రంగులు ఏ విధంగా మారతాయో తెల్పండి.
జవాబు:

సూచిక ఆమ్ల మాధ్యమం క్షార మాధ్యమం
1. లిట్మస్ నీలి లిట్మ స్
ఎరుపురంగులోకి మారును
ఎర్రలిట్మస్
నీలిరంగులోకి మారును
2. ఫినాఫ్తలీన్ రంగు లేదు పింక్ రంగులోకి మారును
3. మిథైల్ ఆరెంజ్ ఎరుపు రంగులోకి మారును పసుపు రంగులోకి మారును
4. పసుపు రసం పసుపురంగులోనే ఉండును ముదురు ఎరుపు రంగులోకి మారును

ప్రశ్న 8.
pH మానముపై లఘు వ్యాఖ్య వ్రాయుము.
జవాబు:

  1. ఒక ద్రావణంలోని హైడ్రోజన్ అయానుల గాఢతను లెక్కించడానికి వాడే మానమే pH మానము.
  2. ఒక ద్రావణం ఆమ్లమా, క్షారమా అని నిర్ణయించే ఒక సంఖ్యాత్మక విలువే pH.
  3. pH విలువ 0 నుండి 14 వరకు వుంటుంది.
  4. pH = 7 అయిన ఆ ద్రావణం తటస్థ ద్రావణం
    pH < 7 అయిన ఆ ద్రావణం ఆమ్ల ద్రావణం
    pH > 7 అయిన ఆ ద్రావణం క్షార ద్రావణం
  5. pH విలువ 7 నుండి 14కు పెరుగుతూ ఉంటే, ఆ ద్రావణంలో H3O+ అయానుల గాఢత తగ్గి, OH అయానుల గాఢత పెరుగుతూ ఉన్నదని అర్థం.

ప్రశ్న 9.
మన జీర్ణక్రియలో pH పాత్ర ఏమిటి?
జవాబు:

  1. జీర్ణక్రియలో మన జీర్ణాశయం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయానికి నష్టం కలుగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది.
  2. అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వలన కడుపులో మంట, అసహనం కలుగుతాయి.
  3. ఈ దుష్ప్రభావం నుండి విముక్తి పొందడానికి మనం ఏంటాసిడ్లుగా పిలువబడే క్షారాలను తీసుకుంటాం.
  4. ఏంటాసిడ్ లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి.

ప్రశ్న 10.
సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్ ను పొందే విధానాన్ని వివరించుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1

  1. సోడియం క్లోరైడ్ జలద్రావణం (జైన్ ద్రావణం) గుండా విద్యుత్ ను ప్రసరింపజేస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది.
  2. ఈ ప్రక్రియను క్లోరో – ఆల్కలీ ప్రక్రియ అంటాం.
    Nacl + 2 H2O → 2NaOH + Cl2 + H2
  3. క్లోరిన్ వాయువు ఆనోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు కాథోడ్ వద్ద విడుదలవుతాయి.
  4. కాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు అనేక రకాలుగా – ఉపయోగపడుతున్నాయి.

ప్రశ్న 11.
సార్వత్రిక ఆమ్ల, క్షార సూచిక అనగానేమి?
జవాబు:

  1. సార్వత్రిక ఆమ్ల, క్షార సూచికనుపయోగించి ఆమ్లాల, క్షారాల బలాలను నిర్ణయించవచ్చు.
  2. ఇది అనేక సూచికల మిశ్రమం.
  3. ఇది ద్రావణంలో ఉండే వేర్వేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతలను బట్టి వేర్వేరు రంగులను చూపుతుంది.

ప్రశ్న 12.
స్వీయ రక్షణ కోసం, మొక్కలు, కీటకాలు, జంతువులు రసాయనాలను ఉపయోగించుకొనే సందర్భాలను రాయుము.
జవాబు:

  1. తేనెటీగ కుట్టినప్పుడు, దాని కొండి ద్వారా మిథనోయిక్ ఆమ్లం చర్మం క్రిందకు చేరి తీవ్రమైన నొప్పి, మంట, దురద కలుగుతాయి.
  2. బేకింగ్ సోడా వంటి బలహీనమైన క్షారంను, కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
  3. ఆకులపై ముండ్లు ఉండే ‘దూలగొండి’ మొక్క మనకు గుచ్చుకున్నప్పుడు, అవి మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోనికి ప్రవేశ పెట్టడం వలన తీవ్రమైన మంట కలుగుతుంది.
  4. ‘దుష్టపాకు’ ఆకులతో, కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఉపశమనం ఉంటుంది.

ప్రశ్న 13.
ఆమ్ల, క్షార ధర్మాలను పోల్చుము.
జవాబు:

ఆమ్ల ధర్మాలు క్షార ధర్మాలు
1) ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. 1) క్షారాలు జారుడు స్వభావం కలిగి ఉంటాయి.
2) లోహాలతో చర్య జరిపినపుడు H2 వాయువులు విడుదల చేయును. 2) లోహాలతో చర్య జరిపినపుడు H2 వాయువును విడుదల చేయును.
3) నీలి లిట్మసను ఎర్రగా మార్చును. 3) ఎర్ర లిట్మసను నీలంగా మార్చును.
4) ఆమ్లాలన్నింటిలో H3O+ అయాన్ వుండును. 4) క్షారాలన్నింటిలో OH అయాన్ వుండును.

ప్రశ్న 14.
క్రింద ఇవ్వబడిన పదార్థాలను ఆమ్లాలు, క్షారాలు లేదా లవణాలుగా వర్గీకరించండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 2
జవాబు:
ఆమ్లాలు : నిమ్మరసం, చింతపండు రసం
క్షారాలు : సర్ఫ్ నీరు, సున్నపు నీరు, సబ్బు నీరు.
లవణాలు : ఉప్పు నీరు

ప్రశ్న 15.
పసుపు సూచికను ఎలా తయారుచేస్తావు? దాని ఉపయోగమేమి?
జవాబు:
పసుపు కొమ్ములను ఎండబెట్టి దానిని చూర్ణం చేస్తారు. ఈ పసుపు పొడికి నీటిని కలిపితే ఏర్పడే పసుపు ద్రావణం సూచికగా పనిచేస్తుంది. ఈ పసుపు ద్రావణానికి క్షార ద్రావణం కలిపితే ఎరుపురంగులో మారుతుంది. కాబట్టి క్షార ద్రావణాలను పసుపు సూచిక ద్వారా గుర్తించవచ్చు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 16.
స్ఫటిక జలాన్ని కలిగి ఉన్న ఏవైనా రెండు లవణాల పేర్లు మరియు వాటి ఫార్ములాలను వ్రాయండి.
జవాబు:

  1. ఆర్థ కాపర్ సల్ఫేట్ – CuSO4 . 5H2O
  2. ఎప్సం లవణం – MgSO4 . 7H2O

ప్రశ్న 17.
తటస్థీకరణం అనగానేమి? తటస్థీకరణానికి రెండు ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఆమ్లము క్షారానికి కలిపినపుడు లవణము, నీరు ఏర్పడే ప్రక్రియను తటస్థీకరణం అంటారు.
NaOH+ HCl → NaCl + H2O

ప్రశ్న 18.
ఆమ్లము, లోహంతో చర్య జరిపినపుడు విడుదలయ్యే వాయువు ఏది? రెండు ఉదాహరణలిమ్ము,
జవాబు:
ఆమ్లము, లోహంతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
Zn+ 2HCl → ZnCl2 + H2
Mg+ H2SO4 → MgSO4 + H2

ప్రశ్న 19.
పెరుగు మరియు పుల్లని పదార్థాలను రాగి మరియు కంచు పాత్రలలో నిల్వ చేయకూడదు. ఎందుకు?
జవాబు:

  1. పెరుగు మరియు పుల్లని పదార్థాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  2. ఇవి రాగి మరియు కంచు వంటి లోహాలతో చర్యజరిపి విష స్వభావం ఉన్న లవణాలను ఏర్పరుస్తాయి.
  3. కనుక పెరుగు మరియు పుల్లని పదార్థాలను రాగి మరియు కంచు పాత్రలలో నిల్వ చేయరాదు.

ప్రశ్న 20.
గాఢ సల్ఫ్యూరికామ్లాన్ని (గాఢ H2SO4) విలీనం చేయడానికి దానికి నీటిని కలుపవచ్చా తెలుపుము.
జవాబు:

  1. గాఢ సల్ఫ్యూరికామ్లాన్ని విలీనం చేయడానికి నీటిని కలపరాదు.
  2. విలీనం చేయడానికి నీటికి ఆమ్లాన్ని చుక్కలు, చుక్కలుగా కలపాలి.
  3. కాని ఆమ్లానికి నీటిని కలపకూడదు.

ప్రశ్న 21.
కుళాయి నీరు విద్యుత్ వాహకం, స్వేదన జలం విద్యుత్ అవాహకం (విద్యుత్ ప్రవహించదు). ఎందుకు?
జవాబు:

  1. కుళాయి నీరు కొన్ని లవణాలను కలిగి ఉంటుంది. లవణాలు ఉండటం వలన కుళాయి నీరు నుండి విద్యుత్ ప్రవహిస్తుంది.
  2. స్వేదన జలంలో లవణాలు ఉండవు కనుక స్వేదన జలంలో విద్యుత్ ప్రవహించదు.

ప్రశ్న 22.
వంటసోడా తయారీని సూచించే రసాయన సమీకరణం రాయండి.
జవాబు:
వంటసోడా తయారీ :

  1. వంటసోడా రసాయననామం సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. దీని ఫార్ములా NaHCO3.
  2. దీని తయారీని సూచించే సమీకరణం
    NaCl + H2O + CO2 + NH3 → NH4Cl + NaHCO3

ప్రశ్న 23.
ఉతికే సోడా Na2CO3 ని ఎలా తయారుచేస్తారు?
జవాబు:
1) బట్టల సోడా (ఉతికే సోడా) ను సోడియం క్లోరైడ్ నుండి తయారుచేస్తారు.
2) NaCl + H2O + CO2 + NH3 → NH3Cl + NaHCO3
పై చర్యలో ఏర్పడిన వంటసోడా (NaHCO3) ని వేడిచేస్తే బట్టల సోడా ఏర్పడుతుంది.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 3
3) సోడియం కార్బొనేట్ ను ఘనఃస్ఫటికీకరణం చేస్తే ఉతికేసోడా లభిస్తుంది.
Na2CO3 + 10H2O → Na2CO3 . 10H2O.

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
CuSO4 • 5H2O లో స్ఫటిక జలంను గూర్చి తెలిపే ఒక కృత్యాన్ని వివరించండి.
జవాబు:
CuSO4 • 5H2O లో స్ఫటిక జలంను గూర్చి తెలిపే కృత్యం :

  1. కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొడిగానున్న పరీక్ష నాళికలో ఉంచి వేడి చేయాలి.
  2. నీలిరంగు కాపర్ స్ఫటికాలు తమ రంగును కోల్పోవును.
  3. పరీక్షనాళిక లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడినాయి.
  4. వేడి చేయగా లభించిన కాపర్ సల్ఫేటకు 2-3 చుక్కలు నీటిని కలిపిన నీలిరంగు తిరిగి వచ్చును.

ప్రశ్న 2.
పట్టికలో ఇవ్వబడిన సమాచారం ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 4
a) పై పట్టికలో ఇచ్చిన ఆమ్లాలను తెల్పండి.
b) ఫినాఫ్తలీన్ ద్రావణంతో చర్యజరిపి ఎరుపు రంగును ఇచ్చే ద్రావణాల స్వభావాన్ని తెల్పండి.
c) పై పట్టికలో ఇచ్చిన తటస్థ ద్రావణాలను తెల్పండి.
d) ఇచ్చిన ద్రావణాలలో అత్యంత బలమైన ఆమ్లాన్ని, అత్యంత బలమైన క్షారాన్ని తెల్పండి.
జవాబు:
a) పై పట్టికలోని ఆమ్లాలు HCl, నిమ్మరసం.
b) క్షారాలు
c) స్వేదన జలం
d) అత్యంత బలమైన
ఆమ్లం : HCL, అత్యంత బలమైన క్షారం : NaOH

ప్రశ్న 3.
ఈ క్రింది పట్టికలో సమాన గాఢతలు గల వివిధ పదార్థాల జల ద్రావణాల యొక్క pH విలువలు ఇవ్వబడినాయి. పట్టిక క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 5
i) పై పట్టికలోని ఆమ్లాలలో అత్యంత బలహీన ఆమ్లం ఏది? ఎందువల్ల?
జవాబు:
బలహీనమైన ఆమ్లం ‘C’ – ఎందుకనగా దీని pH విలువ 7 కన్నా తక్కువగా ఉండి, 7 కి దగ్గరగా ఉంది.

ii) పై ద్రావణాలలో అత్యంత బలమైన క్షారం ఏది? ఎందువల్ల?
జవాబు:
బలహీనమైన క్షారం ‘D’ – ఎందుకనగా దీని pH విలువ 14 కి దగ్గరగా ఉంది.

iii) పట్టికలోని ఏ రెండు పదార్థాల జలద్రావణాల మధ్య రసాయనిక చర్య వలన ఎక్కువ ఉష్ణం విడుదల అవుతుంది? ఈ ఉష్ణమును ఏమంటారు?
జవాబు:
“B” మరియు “D” ల మధ్య రసాయన చర్య వలన అధిక ఉష్ణం వెలువడును. ఈ వెలువడిన ఉష్ణాన్ని తటస్థీకరజోష్ణం అంటారు.

iv) పట్టికలోని ద్రావణాలలో స్వేదనజలం యొక్క pH విలువను కలిగిన ద్రావణం ఏది? ఈ pH విలువను కలిగిన ద్రావణాలను ఏమంటారు?
జవాబు:
స్వేదన జలము యొక్క pH విలువను కలిగియున్న పదార్థం G. ఈ pH విలువలు కలిగిన ద్రావణాలను తటస్థ పదార్థాలు అంటారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 4.
ఆమ్ల, క్షార ద్రావణాలు అయాన్లను కలిగియున్నాయా, లేదా తెలుసుకొనుటకు నిర్వహించే ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితా రాయండి. ప్రయోగ విధానాన్ని వివరించండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
బీకరు, బల్బు, గ్రాఫైట్ కడ్డీలు, విద్యుత్ వాహక తీగలు, 230 V AC కరెంటు, నీరు, వివిధ ఆమ్లాలు, క్షారాలు.

ప్రయోగ విధానము :
రెండు విద్యుత్ వాహక తీగలకు గ్రాఫైట్ కడ్డీలు కలపాలి. ఈ గ్రాఫైట్ కడ్డీలను ఒక గాజు బీకరులో ఒకదానికొకటి తగలకుండా అమర్చాలి. వలయంలో, విద్యుత్ బల్బు అమర్చాలి. బీకరులో సజల ఆమ్లాన్ని పోయాలి. విద్యుత్ వాహక తీగల రెండవ చివరలను 230 V AC కి కలిపి వలయంలో విద్యుత్ ప్రసరింపజేయాలి. ఈ విధముగా వివిధ ఆమ్లాలు, క్షారాలను మార్చుతూ ప్రయోగాన్ని చేయాలి. ఆమ్లాలు, క్షారాలతో ప్రయోగాన్ని చేసిన ప్రతి సందర్భంలోనూ బల్బు వెలుగుతుంది. అనగా ఆమ్లాలు, క్షారాలు అయానులను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
హైడ్రోక్లోరికామ్లంతో NaHCO3 చర్య వలన CO2 విడుదల అగునని చూపు ప్రయోగానికి కావలసిన పరికరాల జాబితాను రాసి, ప్రయోగ విధానమును వివరించండి.
జవాబు:
కావలసిన పదార్థాలు : స్టాండు, పరీక్ష నాళికలు, వాయు వాహక నాళము, థిసిల్ గరాటు, రెండు రంధ్రములు గల రబ్బరు బిరడా, Ca(OH)2, NaHCO3, HCl.

ప్రయోగ విధానము :

  1. ఒక పరీక్ష నాళికలో NaHCO3 తీసుకొని దానికి రెండు రంధ్రాల రబ్బరు బిరడాని బిగించవలెను.
  2. ఒక రంధ్రం గుండా థిసిల్ గరాటును, రెండవ రంధ్రం గుండా వాయు వాహక నాళం ఒక కొనను అమర్చాలి. వాయు వాహక నాళం రెండవ చివరను Ca(OH)2 గల మరొక పరీక్షనాళికలో ఉంచాలి.
  3. థిసిల్ గరాటు గుండా సజల HCl ఆమ్లంను పోయాలి. NaHCO3, HCl ల మధ్య చర్య జరగడం ప్రారంభమవుతుంది.
  4. చర్యలో విడుదలైన వాయువు వాయు వాహక నాళం గుండా ప్రయాణించి Ca(OH)2 ని తెల్లని పాలవలె మార్చును. ఇది CO2 వాయువు అని నిర్ధారించవచ్చును.

ప్రశ్న 6.
X, Y, Z అనే ద్రావణాల pH విలువలు వరుసగా 13, 6, 2 అయిన
అ) ఏ ద్రావణం బలమైన ఆమ్లము? ఎందుకు?
జవాబు:
Z అను ద్రావణము యొక్క pH విలువ ‘2’, ఈ విలువ మిగిలిన ద్రావణాల కన్నా తక్కువ కనుకనే ‘Z’ ద్రావణము బలమైన ఆమ్లము అగును.

ఆ) ఏ ద్రావణంలో ద్రావితపు అణువులతోపాటు అయానులు కూడా ఉంటాయి?
జవాబు:
బలహీన ఆమ్లంకు ద్రావితపు అణువులతోపాటు అయానులు కూడా ఉంటాయి. ఇచ్చిన ద్రావణాలలో ‘X’ బలహీన ఆమ్లం కనుక దీనికి ద్రావితపు అణువులతో పాటు అయానులు కూడా ఉంటాయి.

ఇ) ఏ ద్రావణం బలమైన క్షారం? ఎందుకు?
జవాబు:
ఏ ద్రావణపు pH విలువ ఎక్కువగా ఉండునో అది బలమైన క్షార స్వభావంను ప్రదర్శించును. కనుక ఇచ్చిన ద్రావణాలలో ‘X’ బలమైన క్షారంగా ప్రవర్తించును.

ఈ) ఒక ద్రావణానికి క్షారాన్ని కలిపినపుడు దాని pH విలువ పెరుగుతుందా? తగ్గుతుందా? ఎందుకు?
జవాబు:
ఏదైనా ఒక ద్రావణంకు క్షారంను కలిపిన ఆ ద్రావణంలోని OH అయానుల గాఢత పెరిగి pH విలువ పెరుగును.

ప్రశ్న 7.
X అనే ద్రావణం నీలిలిట్మస్ ను ఎరుపు రంగులోకి, Y అనే ద్రావణం ఎరుపు లిట్మసను నీలిరంగులోకి మార్చినాయి.
అ) X, Y ద్రావణాలను రెండింటినీ కలిపినపుడు ఏ ఏ ఉత్పన్నాలు ఏర్పడవచ్చు?
జవాబు:
X మరియు Yలను కలుపుట అనగా అమ్లంతో క్షారంను కలిపినా వాటి మధ్య రసాయనిక చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పడును.

ఆ) X ద్రావణంలో మెగ్నీషియం ముక్కలు వేసినపుడు ఏ వాయువు విడుదలౌతుంది?
జవాబు:
X ద్రావణం అనగా ఆమ్లంలో మెగ్నీషియం ముక్కలు వేసినపుడు H2 వాయువు విడుదలగును. అనగా అమ్లంలు, అలోహాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.

ఇ) Y ద్రావణంలో జింకు ముక్కలు వేసినపుడు రసాయనిక చర్య జరుగుతుందా? ఎందుకు?
జవాబు:
Y ద్రావణం అనగా క్షారంలో జింకు ముక్కలు వేసినపుడు అవి రసాయన చర్యలో పాల్గొని, H2 వాయువును విడుదల చేయును.

అనగా క్షారాలు, లోహాలతో చర్య జరిపి H2 వాయువును విడుదల చేయును.

ఈ) పై రెండింటిలో హైడ్రోజన్ అయానులు ఎక్కువగా ఉండే ద్రావణం ఏది?
జవాబు:
ఆమ్లాలలో H+ అయానులు ఎక్కువగా ఉండును. అనగా ఇచ్చిన వాటిలో X ద్రావణం నందు ఎక్కువగా హైడ్రోజన్ అయానులుండును.

ప్రశ్న 8.
నిత్యజీవితంలో pH యొక్క ప్రాముఖ్యతను తెలుపు కొన్ని ఉదాహరణలను క్లుప్తంగా చర్చించండి.
జవాబు:

  1. జీవ సంబంధ ప్రాణులన్నీ pH విలువలలోని అతిస్వల్ప మార్పులకు లోబడి మాత్రమే జీవించగలవు.
    ఉదా : తక్కువ pH విలువలు గల నదీజలాలలో ఉండే జలచరాల జీవనం సంక్లిష్టస్థితిలో ఉండును.
  2. pH లోని మార్పు దంతక్షయానికి కారణమగును.
  3. జీర్ణవ్యవస్థలో జీర్ణక్రియ జరుగుటకు విడుదలగు ఆమ్లాల pH ముఖ్యపాత్ర వహించును.
  4. మొక్కలు ఆరోగ్యవంతంగా. పెరుగుటకు నిర్దిష్ట పరిమితిలో pH గల మట్టి అవసరం.
  5. స్వీయరక్షణ కొరకు మొక్కలు, కీటకాలు, జంతువులు కొంత pH గల రసాయనాలను ఉపయోగించుకుంటాయి.

ప్రశ్న 9.
బలమైన ఆమ్లము, క్షారం, బలహీనమైన ఆమ్లం, క్షారం అనగానేమి? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
బలమైన ఆమ్లము :
ఏ ఆమ్లాలైతే 100% అయనీకరణం చెందుతాయో ఆ ఆమ్లాలను బలమైన ఆమ్లాలు అంటారు.
ఉదా : HCl, H2SO4, HNO3.

బలహీనమైన ఆమ్లం :
ఏ ఆమ్లాలైతే 100% అయనీకరణం చెందవో ఆ ఆమ్లాలను బలహీన ఆమ్లాలు అంటారు.
ఉదా : CH3COOH, H2CO3, H3PO4.

బలమైన క్షారం :
ఏ క్షారాలైతే 100% అయనీకరణం చెందుతాయో వాటిని బలమైన క్షారాలంటారు.
ఉదా : NaOH, KOH.

బలహీన క్షారం :
ఏ క్షారాలైతే 100% అయనీకరణం చెందవో వాటిని బలహీన క్షారాలంటారు.
ఉదా : NH4OH, Ca(OH)2, Mg(OH)2.

ప్రశ్న 10.
బ్లీచింగ్ పౌడరును పారిశ్రామికంగా ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? దాని ఉపయోగాలేవి?
జవాబు:
తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ తయారగును.
Ca(OH)2 + Cl2 → CaOCl2 + H2O

ఉపయోగాలు :

  1. వస్త్ర పరిశ్రమలలో కాటన్ మరియు కాగితాలను విరంజనం చెయ్యటానికి వాడతారు.
  2. అనేక రసాయన పరిశ్రమలలో దీనిని ఆక్సీకరణిగా వాడతారు.
  3. తాగే నీటిలోని క్రిములను సంహరించటానికి క్రిమిసంహారిణిగా వాడతారు.
  4. క్లోరోఫాం తయారీలో కారకంగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 11.
కొన్ని రసాయనాల సాంకేతిక నామాలను తెల్పుము.
జవాబు:

సాధారణ నామం  సాంకేతికం
1. బ్రైన్ ద్రావణం Nacl ద్రావణం
2. కాస్టిక్ సోడా NaOH
3. కాస్టిక్ పొటాష్ KOH
4. క్విక్ లైమ్ CaO
5. స్లేక్ డ్ లైమ్ Ca(OH)2
6. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ CaSO4 ½H2O
7. జిప్సం Ca SO4.2H2O
8. బేకింగ్ సోడా NaHCO3
9. వాషింగ్ సోడా Na2CO310H2O
10. సోడాయాష్ Na2CO3
11. మార్బుల్ CaCO3
12. వెనిగర్ CH3COOH
13. బ్లీచింగ్ పౌడర్ CaOCl2

ప్రశ్న 12.
ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలను ఏవేని నాలిగింటిని తెల్పండి.
జవాబు:
ఆమ్ల ధర్మాలు :
1) ఆమ్లాలు చర్యాశీలత కల లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.
Mg + 2HCl → MgCl2 + H2

2) ఆమ్లాలు, క్షారాలతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తాయి.
HCI+ NaOH — Nacl + H2O

3) ఆమ్లాలు కార్బొనేట్లు మరియు హైడ్రోజన్ కార్బొనేట్లతో చర్య జరిపి లవణము, నీరు మరియు కార్బన్ డై ఆక్సెలను ఏర్పరుస్తాయి.
CaCO3 + 2HCl → CaCl2 + H2O + CO2
NaHCO3 + HCl → NaCl + H2O + CO2

4) ఆమ్లాలు, లోహ ఆక్సెతో చర్య జరిపి లవణము మరియు నీటిని ఏర్పరుస్తాయి.
2HCl + Ca0 → CaCl2 + H2O

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 13.
క్రింద తెలుపబడిన లవణాల ఫార్ములాలను వ్రాయండి. – ఎ) సోడియం సల్ఫేట్
బి) అమ్మోనియం క్లోరైడ్ పైన సూచించిన లవణాలు ఏ ఏ ఆమ్లముల మరియు క్షారాల మధ్య జరిగే చర్యల వలన ఏర్పడతాయో తెల్పండి. సంబంధిత రసాయన చర్యల సమీకరణాలను వ్రాయండి. అవి ఏ రకపు రసాయన చర్యలో పేర్కొనండి.
జవాబు:
సోడియం సల్ఫేట్ ఫార్ములా – Na2SO4
అమ్మోనియం క్లోరైడ్ ఫార్ములా – NH4Cl

1) సోడియం హైడ్రాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు సోడియం సల్ఫేట్ ఏర్పడుతుంది.
2NaOH + H2SO4 → Na2SO4 + 2H2O

2) అమ్మోనియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది.
NH4OH + HCl → NH4Cl + H2O
ఈ రెండు తటస్థీకరణ చర్యలు.

ప్రశ్న 14.
కొన్ని పదార్థాల (ఆమ్ల / క్షార / తటస్థ)కు మరియు సూచికలకు మధ్య జరిగే చర్యల ఫలితాలకు సంబంధించి క్రింద ఇవ్వబడిన పట్టికను పూర్తిచేయండి.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 6
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 7

ప్రశ్న 15.
A, B, C, D&E అనే ద్రావణాల pH విలువలు సార్వత్రిక సూచిక ద్వారా పరీక్షించినపుడు అవి వరుసగా 5,2,13,7 &9 గా గుర్తించబడినాయి. వీటిలో ఏది?
ఎ) తటస్థ ద్రావణం బి) బలమైన క్షారం సి) బలమైన ఆమ్లం డి) బలహీన ఆమ్లం ఇ) బిలహీన క్షారం –
వీటిలో H+ అయాన్ల సంఖ్య యొక్క పెరిగే దిశలో ఆరోహణ క్రమంలో రాయండి.
జవాబు:
ఎ) E ద్రావణం బి) C ద్రావణం సి) B ద్రావణం డి) A ద్రావణం ఇ) E ద్రావణం
H+ అయాన్ల సంఖ్య పెరిగే దిశలో ఆరోహణక్రమం : E, B, A, E, C.

ప్రశ్న 16.
తినేసోడా (బేకింగ్ సోడా), ఉతికేసోడా (వాషింగ్ సోడా)ల యొక్క ఏవేని నాలుగు ఉపయోగాలు వ్రాయుము.
జవాబు:
తినేసోడా ఉపయోగాలు : .

  1. బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు.
  2. యాంటాసిడ్ లో ఉపయోగిస్తారు.
  3. అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు.
  4. యాంటీ సెప్టిక్ గా కూడా ఉపయోగపడుతుంది.

ఉతికే సోడా ఉపయోగాలు :

  1. గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
  2. బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు.
  3. వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.
  4. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక లవణం అర్ధ లవణమా? అనార్థ లవణమా? నిర్ణయించుటకు నిర్వహించే పరీక్ష ఏది?
జవాబు:
లవణమును ఒక పరీక్ష నాళికలో ఉంచినపుడు,

  1. ఒకవేళ అది ఆర్ధ లవణమైనట్లయితే పరీక్ష నాళికను వేడి చేసినపుడు దాని గోడలపై తేమను గమనించవచ్చును.
  2. అదే అనార్ధ లవణమైనట్లయితే పరీక్ష నాళికను వేడి చేసినపుడు దాని గోడలపై ఎట్టి తేమ ఏర్పడదు.

ప్రశ్న 2.
నీకివ్వబడిన అర్ధ స్పటికంలోని నీటిని తొలగించుటకు నీవు అనుసరించు విధానమును తెలుపుము.
జవాబు:
నాకివ్వబడిన ఆర్ధ స్ఫటికం ‘తడిగా లేకున్నప్పటికి వాటిలో స్పటిక జలం ఉండును. వాటిని వేడి చేసినపుడు ఈ స్పటిక జలం ఆవిరగును.

ప్రశ్న 3.
P.O.P (Plaster of Parts) సిమెంటు, కాల్షియం క్లోరైడ్ లాంటి వాటిని గాలి సోకని, తేమ లేని విధంగా సీలు చేసి ఉంచుతారు. కారణమేమి?
జవాబు:

  1. సాధారణ ఉష్ణోగ్రత వద్ద వీటిలో అనగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కాల్షియం క్లోరైడ్ లో నీటి అణువులుండును కనుక, ఇవి
  2. మొదటగా తడిగా మారి, వాటి స్ఫటిక లక్షణం కోల్పోయి చివరకు గ్రహించిన తేమ నీటిలో కరిగి ద్రావణంను ఏర్పరచును.
  3. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మాత్రము జిప్సంను ఏర్పరచును.
  4. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, CaCl, 6H,Oలు ఆర్థ లవణాలు కనుక.

ప్రశ్న 4.
ఆర్థ, అనార్థ లవణాలకు కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
అనార్ధ లవణములు :
i) కోబాల్ట్ (ii) క్లోరైడ్ – COCl2
ii) కాపర్ (ii) సల్ఫేట్ – Cu2SO4
iii) కాల్షియం క్లోరైడ్ – CaCl2

ఆర్ధ లవణములు :
i) సోడియం కార్బోనేట్ – Na2CO3.10H2O
ii) మెగ్నీషియం సల్ఫేట్ – MgSO4.7H2O
iii) కాల్షియం సల్ఫేట్ – CaSO4.2H2O
iv) కాపర్ సల్ఫేట్ – CuSO4.5H2O
v) ఫెర్రస్ సల్ఫేట్ – FeSO4.7H2O\

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

ప్రశ్న 5.
ఇచ్చిన పదార్థం (లవణం) ఆర్థ, అనార్థ పదార్థమా నిర్ధారించుటకు నీవు అనుసరించు పద్ధతిని వివరించుము.
జవాబు:

  1. మనకు ఇచ్చిన పదార్ధమును కొంతసేపు ఆరుబయట ఉంచిన, దానిలోని నీటి లవణాలు కోల్పోయి, రంగులో మార్పు ఏర్పడినట్లయితే అది ఒక ఆర్ధ లవణంగా భావిస్తాము.
  2. అదే విధముగా మనకు ఇచ్చిన పదార్ధంను వేడి చేసినపుడు అది దాని రంగును కోల్పోయినట్లయితే ఆ పదార్థము అనార్ధ లవణం అగును. “అదే అనార్ధ లవణంకు నీటిని కలిపిన అది ఆర్ధ లవణంగా మారును.

ప్రశ్న 6.
అనార్థ లవణం, అర్థ లషణాలను వేడి చేసినపుడు నీ పరిశీలనలు ఏవి?
జవాబు:

  1. ఉదాహరణకు కోబాల్డ్ క్లోరైడ్ (COCl2) ను బీకరులో తీసుకున్నపుడు దాని రంగు పింకు గాను, గది ఉష్ణోగ్రత వద్ద
    ముదురు వంకాయ రంగులోను, వేడి చేయగా నీలంగా మారును. అనగా COCl2 అనునది ఒక అనార్థ లవణం కనుక దానిని వేడి చేయగా రంగులో మార్పు ఏర్పడును.
  2. అర్ధ లవణంను వేడి చేయగా అది కూడా దానిలో ఉండు నీటిని కోల్పోయి రంగు మారును.
  3.  రెండు రకాల లవణాల యొక్క ద్రవ్యరాశులలో మార్పు జరుగును.

ప్రశ్న 7.
నీ దైనందిన జీవితంలో అర్థ, అనార్ధ స్ఫటికాలను ఉపయోగించే సందర్భాలను రెండింటిని పేర్కొనండి.
జవాబు:
అనార్థ లవణాల నిత్య జీవిత ఉపయోగాలు :

  1. ప్రయోగాలలో, ప్రయోగ సమయములో ఏర్పడు ఆవిరులను, తుంపరలను తొలగించుటకు.
  2. వేసవి కాలంలో రహదారులను సరైన కండిషన్లో ఉంచుటకు తరచుగా అనార్ధ లవణాలను వాడతారు.
  3. గాజు, పేపరు మరియు రసాయనాల తయారీ పరిశ్రమలలో వీటిని తరచుగా వాడతారు.
  4. తోళ్ళ పరిశ్రమలలో విరివిగా వాడతారు.

ఆర్ద్ర లవణాల ఉపయోగాలు :

  1. వాషింగ్ సోడా తయారీలో.
  2. నీటిని శుద్ధి చేయటకు వాడు పట్టిక తయారీలో.
  3. రక్తం కారుచున్న చిన్న గాయాలను అదుపులోనికి తెచ్చుటకు పట్టికను వాడతారు.
  4. ఇంకుల తయారీలో.

ప్రశ్న 8.
అర్ధ లవణం నుండి జలాణువులను తొలగించుటను సూచించు పటంలో లోపాన్ని గుర్తించండి.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 8

  1. నీటిఆవిరులు ఏర్పడటం కన్పించుట లేదు.
  2. CuSO4 స్ఫటికాలను సరైన ప్రాంతంలో వేడి చేయుట లేదు. అనగా బున్ సైన్ దీపంపై సరైన రీతిలో ఉంచకపోవటం.
  3. పరీక్షనాళిక గట్టి గాజుతో తయారైనది కాదు.

ప్రశ్న 9.
Na2CO3, Nacl, NaHCO3, CUSO4, Na2S2O3, MgSO4, CaCO3, ZNCO3, CuCO3 ఈ లవణాలలో ఏవి – ఆర్థ, అనార్థ లవణాలో పట్టికలో పొందుపరచండి.
జవాబు:

ఆర్ధ లవణం అనార్థ లవణం
Na2CO3, NaHCO3, CuSO4 Na2S2O3, Ag SO4 Nacl, ZnCO3, CaCO3

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1/2 Mark Important Questions and Answers

1. ఒక పరీక్ష నాళికలో 2 మి.లీ. NaOH ను తీసుకొని దానికి 2 చుక్కల ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని కలుపుము. నీవు పరిశీలించే రంగు ఏమిటి?
జవాబు:
పింక్ (గులాబి)

2. ఏదేని ఒక సహజ సూచికను రాయుము.
జవాబు:
లిట్మస్ / బీట్ రూట్ / ఎర్ర క్యాబేజీ / పసుపు ద్రావణం.

3. ఆమ్లానికి ఉదాహరణ రాయుము.
జవాబు:
HCl/H2SO4/HNO3/CH3COOH, మొ॥.

4. క్షారానికి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
NaOH/Ca(OH)2/Mg(OH)2/ KOH, మొ||.

5.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 9
పై ఏ ద్రావణం ఫినాఫ్తలీన్ ద్రావణాన్ని ‘పింక్ రంగులోకి మార్చగలదు?
జవాబు:
ద్రావణం ‘A’

6. సువాసన సూచికకు ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఉల్లి | వెనిల్లా ఎసెన్స్ / లవంగ నూనె మొ||

7. ఒక ద్రావణం ఎర్రలిట్మసను నీలి రంగులోకి మార్చింది. అయిన ఆ ద్రావణం మిథైల్ ఆరెంజ్ సూచికను ఏ రంగులోకి మార్చును?
జవాబు:
పసుపు రంగు

8. నిజ జీవితంలో సువాసన సూచికనొకదానిని రాయుము. ఏది?
జవాబు:
వెనిల్లా ఎసెన్స్

9. ప్రవచనం (A) : ఊరగాయ మరియు పుల్లని పదార్థాలను ఇత్తడి, రాగి వంటి పాత్రలలో నిల్వ చేయరాదు.
కారణం (R) : ఆమ్లాలు లోహాలతో చర్య జరుపును.
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.
B) A, Rలు సరైనవి మరియు A ను R సమర్ధించదు.
C) A సరియైనది, B సరైనది కాదు.
D) A సరియైనది కాదు. B సరియైనది.
జవాబు:
A) A, Rలు సరైనవి మరియు A ను R సమర్థిస్తుంది.

10. ఆమ్లంతో ఒక లోహం చర్య జరిపితే ఏ వాయువు విడుదలగును?
జవాబు:
హైడ్రోజన్

11. a) లోహాలు అన్ని ఆమ్లాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
b) లోహాలు అన్ని క్షారాలతో హైడ్రోజన్ ను ఇస్తాయి.
A) a మరియు b లు సరియైనవి.
B) ‘a’ మాత్రమే సరియైనది.
C) ‘b’ మాత్రమే సరియైనది.
D) a, b లు సరియైనవి కావు
జవాబు:
B) ‘a’ మాత్రమే సరియైనది.

12. హైడ్రోజన్ వాయువును పరిశీలించుటకు నీవు వినియోగించు పరికరం ఏది?
జవాబు:
మండుతున్న క్రొవ్వొత్తి / మండుతున్న అగ్గిపుల్ల.

13. మండుతున్న క్రొవ్వొత్తిని హైడ్రోజన్ వాయువు వద్దకు తీసుకువచ్చినపుడు ఏమి జరుగును?
జవాబు:
‘టప్’ మనే శబ్దంతో వాయువు మండును.

14. ప్రయోగశాలలో హైడ్రోజన్ పొందుటకు కావల్సిన రెండు పదార్థాలను రాయుము.
జవాబు:
HCl, Zn.

15. క్రింది రసాయనిక చర్యలో లభించే పదార్థాలు ఏవి?
ఆమ్లం + లోహం →
జవాబు:
లవణం + హైడ్రోజన్

16. NaOH, Zn తో చర్య జరిపినపుడు ఏర్పడు లవణం ఏమిటి?
జవాబు:
Na2ZnO2 (సోడియం జింకేట్).

17. కార్బొనేట్ తో ఆమ్లం చర్య జరిపిన వెలువడు వాయువు
జవాబు:
CO2 వాయువు

18. CO2 వాయువును పరీక్షించుటకు వినియోగించు రసాయన పదార్థం ఏమిటి?
జవాబు:
Ca(OH)2 ద్రావణం/ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

19. క్రింది చర్యలలో ఏది / ఏవి CO, ను ఇచ్చును?
A) Na2CO, + HCl →
B) NaHCO3 + HCl →
C) Zn + HCl →
జవాబు:
A, B

20. క్రింది సమీకరణంలో చర్యను ఏమని పిలుస్తారు?
క్షారం + ఆమ్లం – నీరు + లవణం
జవాబు:
తటస్థీకరణ చర్య

21. ఆంటాసిడ్ గుళికను తీసుకొన్నప్పుడు కడుపులో జరుగు చర్య ఏమిటి?
జవాబు:
తటస్థీకరణ చర్య

22. లోహ ఆక్సైడ్ లు ఆమ్లంతో చర్యను ఏ చర్య అంటారు?
జవాబు:
తటస్థీకరణ చర్య

23. లోహ ఆక్సైడ్ లు ఎటువంటి స్వభావాన్ని కలిగి యుంటాయి?
జవాబు:
క్షార స్వభావం

24. అలోహ ఆక్సైడ్లు ఎటువంటి స్వభావాన్ని కలిగి యుంటాయి?
జవాబు:
ఆమ్ల స్వభావం

25. బీకరులో గల HCl ద్రావణానికి కాపర్ ఆక్సైడ్ కలిపిన, ద్రావణం ఏ రంగులోకి మారును?
జవాబు:
నీలి-ఆకుపచ్చ

26. వాక్యం – a : అన్ని అలోహ ఆక్సైడ్ లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.
వాక్యం – b: అన్ని లోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
పై వానిలో ఏది సరియైన వాక్యం?
జవాబు:
రెండూ కావు.

27. ఆమ్లాల సాధారణ ధర్మం ఏమిటి?
జవాబు:
జలద్రావణంలో H+/H3O+ అయాన్లు ఇచ్చును.

28. క్షారాల సాధారణ ధర్మం ఏమిటి?
జవాబు:
జలద్రావణంలో OH- అయాన్లు ఇచ్చును.

29. క్రింది వానిలో సరికాని వాక్యం / వాక్యాలు ఏవి?
A) హైడ్రోజన్ ను కలిగి వున్న అన్ని సమ్మేళనాలు ఆమ్లాలే.
B) హైడ్రోజనను కలిగి వున్న అన్ని సమ్మేళనాలు క్షారాలే.
C) హైడ్రోజన్ ను కలిగి ఉన్న అన్ని సమ్మేళనాలు ఆమ్లాలు కావు.
జవాబు:
A మరియు B.

30.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 10
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏయే ద్రావణాలకి బల్బ్ వెలుగుతుంది?
1) ఆల్కహాల్
2) గ్లూకోజ్
3) హైడ్రోక్లోరికామ్లం
4) సల్ఫ్యూరికామ్లం
జవాబు:
3, 4

31. జలద్రావణంలో H+ అయాన్లు ఇచ్చు పదార్థం ఒక దానిని రాయుము.
జవాబు:
HCl

32. తడిగాలిని పొడిగాలిగా చేయుటకు నీవు వినియోగించే పదార్థం ఏమిటి?
జవాబు:
కాల్షియం క్లోరైడ్

33. హైడ్రోనియం అయాను అనగానేమి?
జవాబు:
H3O<+

34. ఆల్కలీ అని వేటినందురు?
జవాబు:
నీటిలో కరిగే క్షారాలను ఆల్కలీ అందురు.

35. పొడి నీలి లిట్మస్ కాగితాన్ని పొడి HCl లో ముంచినపుడు ఏమి జరుగునో ఊహించుము.
జవాబు:
లిట్మస్ కాగితం రంగు మారదు.

36. క్రింది వానిలో నీవు అవలంబించే సరియైన పద్దతి ఏమిటి?
a) ఆమ్లాన్ని నీటికి నెమ్మదిగా కలపాలి.
b) నీటిని ఆమ్లానికి నెమ్మదిగా కలపాలి.
జవాబు:
‘a’

37. ‘ఆమ్ల, క్షార బలాలను కనుగొనుటకు వినియోగించు ఒక సూచికను రాయుము.
జవాబు:
సార్వత్రిక సూచిక. (యూనివర్శల్ ఇండికేటర్)

38. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను తెలుసుకొనే స్కేలు ఏమిటి?
జవాబు:
pH స్కేలు

39. తటస్థ ద్రావణం pH విలువ ఎంత?
జవాబు:
‘7’

40. సరియైన జతలు రాయుము.
a) ఆమ్లం pH – 1) <7
b) cho pH – 2) = 7
c) తటస్థ ద్రావణం pH – 3) > 7
జవాబు:
a – 1, b – 3, c – 2.

41. pH విలువల వ్యాప్తి ఎంత?
జవాబు:
0-14

42. నోటిలో దంతక్షయం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జవాబు:
నోటిలో pH విలువ 5.5 కన్నా తగ్గినప్పుడు

43. ఆంటాసిడ్ కి ఒక ఉదాహరణనిమ్ము.
జవాబు:
మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (మిల్క్ ఆఫ్ మెగ్నీషియా)

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

44. ఒక పరీక్ష నాళికలో ఆంటాసిడ్ మాత్రను పొడి చేసి వేయుము. దానికి మిథైల్ ఆరెంజ్ సూచికను కలుపుము. నీవు గమనించు రంగు ఏమిటి?
జవాబు:
పసుపు

45. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, కడుపులో గల ఆమ్లంతో జరిపే చర్యా సమీకరణం రాయుము.
జవాబు:
Mg(OH)2 + 2HCl → 2H2O + MgCl2

46. ఒక రైతు తన పొలాన్ని కాల్షియం కార్బొనేట్ తో తటస్థీకరిస్తున్నాడు. ఆ నేల స్వభావాన్ని ఊహించుము.
జవాబు:
ఆమ్ల స్వభావం.

47. తేనెటీగలు కుట్టినప్పుడు వంటగదిలో వినియోగించే ఏ పదార్థాన్ని వినియోగించవచ్చును?
జవాబు:
బేకింగ్ సోడా

48. దురదగొండి ఆకు ఏ ఆమ్లం ఉత్పత్తి చేయును?
జవాబు:
మిథనోయికామ్లం / ఫార్మికామ్లం

49. బలమైన ఆమ్ల, క్షారాల చర్య వలన ఏర్పడే లవణం pH ఎంత వుంటుంది?
జవాబు:
pH = 7

50. టేబుల్ సాల్ట్ రసాయన నామం ఏమిటి?
జవాబు:
సోడియం క్లోరైడ్ (NaCl)

51. క్లోరో-ఆల్కలీ పద్ధతిలో మూల పదార్థం ఏమిటి?
జవాబు:
Nacl

52. క్లోరో – ఆల్కలీ పద్ధతిలో ఏర్పడే ఆల్కలీ ఏమిటి?
జవాబు:
సోడియం హైడ్రాక్సైడ్

53. క్లోరో – ఆల్కలీ పద్ధతిలో లభించే పదార్థాలు ఏవి?
జవాబు:
NaOH, CL, H,

54. పొడిసున్నంతో క్లోరిన్ చర్య వలన ఏర్పడే పదార్థం ఏమిటి?
జవాబు:
బ్లీచింగ్ పౌడర్

55. క్రింది వానిని జతపరుచుము
a) బ్లీచింగ్ పౌడర్ – 1) Na2CO3.10 H2O
b) బేకింగ్ సోడా – 2) NaHCO3
c) వాషింగ్ సోడా – 3) CaoCl2
జవాబు:
a – 3; b – 2; c -1

56. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి?
జవాబు:
సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHCO3).

57. బేకింగ్ సోడాను వేడి చేసిన విడుదలయ్యే వాయువేది?
జవాబు:
CO2

58. అగ్నిమాపక పరికరాలలో వినియోగించే లవణం ఏమిటి?
జవాబు:
NaHCO3.

59. వాషింగ్ సోడా అణువులో ఎన్ని నీటి అణువులు ఉంటాయి?
జవాబు:
10[Na2CO3.10H30]

60. CuSO4. 5H2O రంగు ఏమిటి?
జవాబు:
నీలం.

61. జిప్సం అణువులో ఉండే నీటి అణువుల సంఖ్య ఎంత?
జవాబు:
‘2’ [CaSO4.2H2O]

62. క్రింది వానిని జతపరుచుము.
a) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 1) CaSO4.½H2O
b) జిప్సం 2) Na2CO3.10H2O
c) వాషింగ్ సోడా – 3) CaSO4.2H2O
జవాబు:
a) – 1, b) – 3, c) – 2

63. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనిక నామం ఏమిటి?
జవాబు:
కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్ (CaSO4.½H20).

64. P.O.P. కి తడి తగిలిన ఏమవుతుంది?
జవాబు:
జిప్సం ఏర్పడును

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

65. క్రింది వానిలో దేనిని గాలి చొరబడని పాత్రలలో ఉంచాలి?
A) CaoCl2
B) CaSO4. ½H2O
C) CaSO4.2H2O
D) పైవన్నియు
జవాబు:
B) CaSO4. ½H2O

66. CaSO4. ½H2O ను గాలి తగిలే చోట ఉంచితే ఏమగును?
జవాబు:
గట్టిగా మారును / జిప్సంగా మారును.

67. క్షార ద్రావణాన్ని పరీక్షించడానికి వినియోగించే పరికరం పదార్థం ఏమిటి?
జవాబు:
ఎర్రలిట్మ స్ పేపర్

68.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 11
• ఏ పదార్థం ఆమ్లం?
జవాబు:
‘A’.

• ఏ పదార్థం లిట్మస్ పేపర్ రంగు మార్చలేదు?
జవాబు:
‘A’.

69.
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 12
పటంలో చూపిన ప్రయోగంలో ఏ వాయువు విడుదలగును?
జవాబు:
CO2

70. ఒక పదార్థం ఫినాఫ్తలీన్ సూచికను పింక్ రంగులోకి మార్చింది. ఆ పదార్థం మిథైల్ ఆరెంజ్ సూచికలో ఏ రంగు ఇచ్చును?
జవాబు:
పసుపు

71. కాల్షియం హైడ్రాక్సైడ్ ను ఏ వాయువును పరీక్షించడానికి వినియోగించవచ్చును?
జవాబు:
CO2

72. 10 మి.లీ. నీటిని పరీక్ష నాళికలో తీసుకొని, దానికి కొన్ని సోడియం హైడ్రాక్సైడ్ గుళికలను కలిపి పరీక్ష నాళిక అడుగున పట్టుకుంటే ఎలా అనిపిస్తుందో రాయుము.
జవాబు:
చల్లగా ఉంటుంది.

73. pH – పదార్థం
1) 12 – A) టమాట రసం
2) 4 – B) నీరు
3) 7 – C) వంట సోడా
జతచేసి రాయుము.
జవాబు:
1 – C; 2 – A; 3 – B.

74. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అణువులో ఉండే నీటి అణువులు ఎన్ని?
జవాబు:
½

75. ఒక యూనిట్ ఫార్ములా లవణంలో ఉండే నీటి అణువులను ఏమంటారు?
జవాబు:
స్ఫటిక జలం

76. కార్బన్ డయాక్సైడ్
a) అలోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
b) అలోహ ఆక్సైడ్ మరియు క్షారం
c) లోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం
d) ఏదీకాదు.
జవాబు:
a) అలోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం

77. వ్యక్తి (A) : అన్ని ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి CO2 వాయువునిచ్చును.
వ్యక్తి (B) : కొన్ని క్షారాలు లోహాలతో చర్య జరిపి H2 వాయువునిచ్చును.
ఏ వ్యక్తిది సరియైన ప్రవచనం?
జవాబు:
వ్యక్తి ‘B’.

78. క్రింది వానిలో క్షారం
a) లోహ ఆక్సైడ్
b) లోహ హైడ్రాక్సైడ్
c) పై రెండూ
జవాబు:
c) పై రెండూ

79. NaCl కి H2SO4 కలిపిన విడుదలయ్యే వాయువు ఏది?
జవాబు:
పొడి HCl

80. pH ను ప్రవేశపెట్టిన వారు ఎవరు?
జవాబు:
సోరెన్స న్

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

81. గృహంలో వినియోగించే వెనిగర్ లో వుండే ఆమ్లం ఏమిటి?
జవాబు:
ఎసిటికామ్లం

82. సున్నపు నీటి గుండా CO2 ను పంపినపుడు ఏర్పడు తెల్లని అవక్షేపం ఏమిటి?
జవాబు:
CaCO3

పట్టికలు

1. pH స్కేలు పట్టిక :
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 13

2. పటం pH విలువలను వివిధ రంగులలో చూపు సార్వత్రిక సూచిక :
AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 14

10th Class Physics 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. ఒక ద్రావణం ఎర్ర లిట్మసు నీలిరంగులోనికి మార్చింది. దాని pH విలువ
A) 1
B) 4
C) 5
D) 10
జవాబు:
D) 10

2. రవి లోహ హైడ్రోజన్ కార్బొనేట్ కు ఆమ్లాన్ని కలిపినపుడు ఒక వాయువు వెలువడుటను గమనించాడు. ఆ వెలువడిన వాయువు …………
A) O2
B) N2
C) H2
D) CO2
జవాబు:
D) CO2

3. ఒక విద్యార్థి తనకిచ్చిన రంగులేని ద్రావణానికి కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపాడు. ఆ ద్రావణం ఎరుపు రంగును పొందితే ఆ ద్రావణపు స్వభావం.
A) తటస్థ ద్రావణం
B) ఆమ్లం
C) క్షారం
D) ఆమ్లం కాని క్షారం కాని కావచ్చు
జవాబు:
B) ఆమ్లం

4. అజీర్తికి ఎంటాసిడ్ మందును ఉపయోగిస్తాం. ఎందుకంటే
A) ఎక్కువగా ఉత్పన్నమయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.
B) జీర్ణమైన ఆహారాన్ని తటస్థీకరిస్తుంది.
C) ఆహారాన్ని ఆక్సీకరణం చేస్తుంది.
D) జీర్ణరసాల ఉత్పత్తిలో సహకరిస్తుంది.
జవాబు:
A) ఎక్కువగా ఉత్పన్నమయిన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

5. X అనే పదార్థ ద్రావణానికి ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపినపుడు రంగులేని, వాసనలేని వాయువు Y వెలువడింది. Y వాయువు సున్నపుతేటను పాలవలె మార్చినచో X పదార్థాన్ని గుర్తించండి.
A) NaHCO3
B) NaOH
C) CH3COONa
D) NaCl
జవాబు:
A) NaHCO3

6. క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. అయిన ఆ లోహం ………..
A) Na
B) Fe
C) Cu
D) Zn
జవాబు:
D) Zn

7. అసిడిటీతో బాధపడే వ్యక్తికి ఉపశమనానికి ఈ క్రింది వానిలో దేనిని ఇస్తారు?
A) సోడానీరు
B) వంటసోడా
C) వినిగర్
D) నిమ్మకాయరసం
జవాబు:
B) వంటసోడా

8. ఒక కార్బొనేట్ జల ద్రావణం ఈ క్రింద తెలిపిన ఏ ద్రావణంతో చర్య జరిపిన CO2 ను వెలువరించును?
A) Na2CO3
B) CuSO4
C) HCl
D) KMnO4
జవాబు:
C) HCl

9. ‘యాంటాసిడ్’ లను దేనికొరకు ఉపయోగిస్తారు?
A) జీర్ణాశయంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం కోసం
B) జీర్ణాశయంలో నీటిని ఉత్పత్తి చేయడం కోసం
C) జీర్ణాశయంలో అధికంగా ఉన్న క్షారాన్ని తటస్థీకరించడం కోసం
D) జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం
జవాబు:
D) జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం

10. ఒక ద్రావణానికి ఫినాఫ్తలీన్ సూచిక కలిపితే ఆ ద్రావణం గులాబీ రంగుకి మారింది. అయిన ఆ ద్రావణం pH విలువ ………
A) 5
B) 6
C) 7
D) 10
జవాబు:
D) 10

11. బేకింగ్ పౌడరు తయారీలో ఉపయోగించే పదార్థం
A) Na2CO3
B) NaHCO3
C) NaOH
D) Nacl
జవాబు:
B) NaHCO3

12. క్రింది వానిలో ఓల్ ఫ్యాక్టరీ సూచిక కానిది …….
A) ఉల్లిపాయ
B) వెనీలా ఎసెన్స్
C) శనగకాయ
D) లవంగ నూనె
జవాబు:
C) శనగకాయ

13. కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, సోడియం సల్ఫేట్ ద్రావణాలు వరుసగా X, Y, Z అని గుర్తించబడినవి. ప్రతిదానికి కొన్ని అల్యూమినియం ముక్కలు కలిపినట్లయితే ఏఏ ద్రావణాలలో మార్పు కనిపించును?
A) సోడియం క్లోరైడ్
B) బ్లీచింగ్ పౌడర్
C) సోడియం బైకార్బోనేట్
D) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
జవాబు:
A) సోడియం క్లోరైడ్

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

14. 2 మి.లీ. సల్ఫ్యూరిక్ ఆమ్లం, 10 మి.లీ. నీటికి కలిపితే కింది పరిశీలనలో ఏది నిజం?
A) ఒక పారదర్శక ద్రావణం ఏర్పడును.
B) కలిపిన వెంటనే తెల్లని అవక్షేపం ఏర్పడును.
C) రెండు వేర్వేరు పొరలుగా కనిపించును.
D) రంగు, వాసనలేని వాయువు వెలువడును.
జవాబు:
A) ఒక పారదర్శక ద్రావణం ఏర్పడును.

15. క్రింది వానిలో త్రాగు నీటిని శుభ్రపరచడానికి ఉపయోగించునది.
A) ప్లాస్టర్ ఆఫ్ పారిస్
B) వాషింగ్ సోడా
C) వంటసోడా
D) బ్లీచింగ్ పౌడర్
జవాబు:
D) బ్లీచింగ్ పౌడర్

16. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించు రసాయనం
A) X మరియు Y
B) Y మరియు Z
C) X మరియు Z
D) X, Y మరియు Z
జవాబు:
C) X మరియు Z

మీకు తెలుసా?

లైకెన్ అనే (Lichen) మొక్క థాలో ఫైటా వర్గానికి చెందినది. దీని నుండి సేకరించిన రంజనమే (dye) లిట్మస్. ‘తటస్థ ద్రావణంలో దీని రంగు ముదురు ఊదా (Purple). హైడ్రాంజియా (Hydrangea), పిటూనియా(Petunia) మరియు జెరేనియం(Geranium) వంటి మొక్కల యొక్క రంగుపూల ఆకర్షక పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 15

సజల ఆమ్లాలు, క్షారాలలో H+ అయాన్ల గాఢతలో ఋణఘాతాన్ని తొలగించేందుకు సోరెన్ సెన్ pH విలువలను ప్రవేశపెట్టాడు.

1 మోల్ కంటే తక్కువ H+ అయాన్ల గాఢత గల ద్రావణాలకు ఈ pH స్కేలు పరిమితమవుతుంది.

pH వ్యాప్తి ఎలా చదవాలి?
pH స్కేలు సాధారణంగా 0 నుండి 14 వరకు వ్యాప్తి , చెంది ఉంటుంది. ఈ pH విలువ H+ అయానుల గాఢతను సూచిస్తుంది. ఉదాహరణకు pH విలువ సున్న వద్ద, హైడ్రోనియం అయాన్ గాఢత ఒక మోలార్ ఉంటుంది. నీటిలో చాలా ద్రావణాల H+ అయాన్ల గాఢత 1 M (DH = 0) నుండి 10-14 M (pH = 14) వరకు విస్తరించి ఉంటుంది.

pH స్కేలులో కొన్ని సాధారణ ద్రావణాల స్థానాలు పక్కనున్న పటంలో చూపబడినాయి.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 16
pH మీటర్ :
pH మీటర్ అనునది జల ద్రావణాలలో హైడ్రోజన్ అయాన్ల చర్యాశీలత ఆధారంగా ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని pH రూపంలో తెలియచేయు సాధనం. దీనిని ప్రయోగశాల స్థాయి నుండి పరిశ్రమల స్థాయి వరకు ఉపయోగిస్తున్నారు.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు 17
ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం
మనం తినే ఆహారపదార్థాలకు రుచిని కలిగించే పదార్థంగా సామాన్య ఉప్పు మీకు పరిచయం. కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది. ఆ సామాన్య ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను ధనికులు, పేదవారు అనే భేదం లేకుండా అందరినీ ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి కార్యోన్ముఖులను చేసింది.

AP 10th Class Physical Science Important Questions 2nd Lesson ఆమ్లాలు-క్షారాలు-లవణాలు

మహాత్మాగాంధీ నిర్వహించిన “దండి సత్యాగ్రహ కవాతు” గురించి వినే ఉంటారు. ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలవబడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

These AP 10th Class Physics Important Questions and Answers 1st Lesson ఉష్ణం will help students prepare well for the exams.

AP Board 10th Class Physical Science 1st Lesson Important Questions and Answers ఉష్ణం

10th Class Physics 1st Lesson ఉష్ణం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఆర్ధత అనగానేమి?
జవాబు:
గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ధత అంటాం.

ప్రశ్న 2.
ద్రవీభవన గుప్తోష్ణం అనగానేమి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద 1గ్రాం. ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్టాన్ని ‘ద్రవీభవన గుప్తోష్ణం” అంటారు.

  • m ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి ‘Q’ కెలోరీల ఉష్ణం అవసరం అనుకుందాం. 1 గ్రాం ద్రవ్యరాశి గల ఘన పదార్థం ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణం \(\frac{Q}{M}\) అవుతుంది.
  • ద్రవీభవన గుప్తోష్ణం L = \(\frac{Q}{M}\)
  • మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 కెలోరీలు / గ్రాం.

ప్రశ్న 3.
రమ మంచినీరు త్రాగుతుంటే నీరు ఒలికి (చింది) కిందపడింది. కొంతసేపటి తరువాత అక్కడ నీరు కనిపించలేదు. నీరు ఏమైంది?
జవాబు:
ఈ సందర్భంలో నీరు కనిపించకుండా పోవుటకు గల కారణము బాష్పీభవన ప్రక్రియే. బాష్పీభవనం అనునది ఉపరితలానికి చెందిన దృగ్విషయం. ఉపరితల వైశాల్యం పెరిగిన, బాష్పీభవన రేటు కూడా పెరుగును.

ప్రశ్న 4.
బాష్పీభవనం (ఇగురుట) అనేది శీతలీకరణ ప్రక్రియ అని తెలిపేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. మన అరచేతిలో పోసుకున్న స్పిరిట్ లేదా పెట్రోల్ వంటి పదార్థాలు ఆవిరి అయినప్పుడు మన అరచేయి చల్లగా అనిపిస్తుంది.
  2. మన శరీరానికి చెమట పట్టినప్పుడు శరీరానికి గాలితగిలి చెమట ఆవిరి అవుతున్నప్పుడు మన శరీరం చల్లగా అవుతుంది.
  3. ఎండాకాలం స్నానాలగదిలో స్నానం చేసి బయటకు రాగానే మన శరీరంపై నీరు ఆవిరిగా మారుతుంటే మన శరీరం చల్లబడినట్లు అనిపిస్తుంది.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 5.
రెండు వస్తువులు ఉష్ట్రీయ స్పర్శలో ఉన్నప్పుడు ఇంకే విధమైన ఉష్ణనష్టం జరగనంత వరకు
వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం
పై వాక్యం ఒక సూత్రాన్ని సూచిస్తోంది. ఆ సూత్రం పేరు వ్రాయండి.
జవాబు:
మిశ్రమాల పద్ధతి సూత్రం.

ప్రశ్న 6.
పరమశూన్య ఉష్ణోగ్రత అనగానేమి?
జవాబు:
0 K (కెల్విన్) గానీ, – 273°C ఉష్ణోగ్రతను పరమశూన్య ఉష్ణోగ్రత అంటారు.

ప్రశ్న 7.
మానవుని శరీర ఉష్ణోగ్రతను వివిధ ప్రమాణాలలో తెల్పండి.
జవాబు:
మానవుని శరీర ఉష్ణోగ్రత ఫారెన్ హీట్ లో – 98.4°F, సెంటీగ్రేడ్ లో – 37°C, కెల్విన్‌మానంలో 310 K

ప్రశ్న 8.
క్రింది పట్టికను గమనించండి.

పదార్థం విశిష్టోష్ణం (Cal/g-C° లలో)
సీసం 0.031
ఇతడి 0.092
ఇనుము 0.115
అల్యూమినియం 0.21
కిరోసిన్ 0.5
నీరు 1

పై పదార్థాలను సమాన ద్రవ్యరాశిగా తీసుకొని, సమాన పరిమాణంలో ఉష్ణం అందిస్తున్నారనుకుందాం. పై పదార్థాలలో దేని ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుంది? దేని ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది? ఎందుకు?
జవాబు:

  1. సమాన ద్రవ్యరాశిగా తీసుకొని, సమాన పరిమాణంలో ఉష్ణం అందిస్తున్నా ఉష్ణోగ్రతలో మార్పు అనేది పదార్థ విశిష్టోష్ణంపై ఆధారపడును.
  2. తక్కువ విశిష్టోష్ణం గల పదార్థాలలో ఉష్ణోగ్రత మార్పు ఎక్కువగా ఉంటుంది. కనుకనే అవి త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడును.
    పై పట్టిక నుండి సీసం ఉష్ణోగ్రత త్వరగా పెరుగును, నీటి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగును.

ప్రశ్న 9.
27°C గది ఉష్ణోగ్రతను కెల్విన్లో తెల్పుము.
జవాబు:
కెల్విన్ మానం = 273 + °C = 273 + 27 = 300 K

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 11.
318K ను సెంటీగ్రేడ్ లోకి మార్చుము.
జవాబు:
సెంటీగ్రేడ్ మానం = కెల్విన్ మానం – 273 = 318 – 273 = 45°C

ప్రశ్న 12.
పదార్థ స్థితులను ప్రభావితం చేసే భౌతిక రాశులేవి?
జవాబు:
పదార్థ స్థితులను ప్రభావితం చేసే భౌతిక రాశులు రెండు. అవి :

  1. ఉష్ణోగ్రత
  2. పీడనం

ప్రశ్న 13.
వేడినీటి కంటే, నీటి ఆవిరి వలన ఎక్కువ గాయాలగును. ఎందువల్ల?
జవాబు:
వేడి నీటికి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 100°C ఉండును. వేడినీరు శరీరంపై పడితే గాయాలగును. కానీ నీటి ఆవిరి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 Cal/gram. అనగా నీటిఆవిరి శరీరాన్ని తాకి సాంద్రీకరణం చెందినపుడు 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేయును. ఈ అధికమైన ఉష్ణశక్తి వలన మనకు తీవ్రమైన గాయాలగును. కాబట్టి వేడినీటి కంటే నీటి ఆవిరి తగలటం ఎక్కువ ప్రమాదకరం.

ప్రశ్న 14.
ఉష్ట్రీయ స్పర్శలోనున్న A, B అనే రెండు వ్యవస్థలు విడివిడిగా C అనే వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే (A, B లతో ఉయ స్పర్శలో ఉంది) A, B వ్యవస్థలు ఒకదానితోనొకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయా?
జవాబు:

  1. A అనే వ్యవస్థ C అనే వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే, ఆ రెండు వ్యవస్థలు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయని మనకు తెలుసు.
  2. అదే విధంగా B, C లు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి.
  3. కనుక A, B లు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంటాయి మరియు A, B లు ఒకదానికొకటి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి.

ప్రశ్న 15.
వస్తువుల మధ్య ఉష్ణశక్తి ఎందుకు బదిలీ అవుతుంది?
జవాబు:
రెండు వస్తువులను ఒకదానితోనొకటి తాకుతూ ఉంచినపుడు ఆ రెండు ‘వస్తువుల ఉష్ణోగ్రతలలోని తేడా వల్ల ఉష్ణశక్తి అధిక ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకు బదిలీ అవుతుంది.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 16.
అంతర్గత శక్తి అనగానేమి?
జవాబు:
ఒక వ్యవస్థలోని కణాలు వేరు వేరుగా శక్తులను కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిశక్తి, భ్రమణ గతిశక్తి, కంపన శక్తి, మరియు అణువుల మధ్య స్థితిశక్తి. వీటన్నింటి మొత్తాన్ని వ్యవస్థ అంతర్గత శక్తి అంటారు.

ప్రశ్న 17.
ఏకాంక ద్రవ్యరాశి గల పదార్ధ ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి?
జవాబు:
ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి, ఆ పదార్థ విశిష్టోష్ణానికి సమానమైన ఉష్ణశక్తి కావాలి. అనగా 1 cal/g°C.

1 cal/g°C = 1 k cal/ kg – K = 4.2 x 103 J/kg- K

ప్రశ్న 18.
ఫ్యాను క్రింద తెరచి ఉంచిన పెట్రిడి లోని స్పిరిట్, మూత ఉంచిన పెట్రీడి లోని స్పిరిట్ కన్నా త్వరగా ఆవిరైపోవడానికి కారణమేమి?
జవాబు:
తెరచి ఉంచిన పాత్రలోని ద్రవానికి గాలి వీస్తే, ద్రవం నుండి బయటికి వెళ్ళి తిరిగి ద్రవంలోకి వచ్చి చేరే అణువుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే, గాలి వీయడం వల్ల ద్రవం నుండి బయటకు వెళ్ళిన అణువులు ద్రవం పరిధిని దాటి దూరంగా నెట్టివేయబడతాయి. దానివల్ల బాష్పీభవన రేటు పెరుగుతుంది. కనుక, మూత ఉంచిన పెట్రిడిలోని స్పిరిట్ కంటే ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ త్వరగా బాష్పీభవనం చెందుతుంది.

ప్రశ్న 19.
ఏదైనా పని చేస్తున్నపుడు మనకు చెమట ఎందుకు పడుతుంది?
జవాబు:
మనం పని చేసేటప్పుడు మన శక్తిని ఖర్చు చేస్తాం. మన శరీరం నుండి శక్తి ఉష్ణరూపంలో విడుదలవుతుంది. తద్వారా చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు స్వేదగ్రంథులలోని నీరు బాష్పీభవనం చెందడం ప్రారంభిస్తుంది. అందువల్ల శరీరం చల్లబడుతుంది.

ప్రశ్న 20.
నీటికి నిరంతరాయంగా ఉష్ణాన్ని అందిస్తూ ఉంటే నీటి ఉష్ణోగ్రత నిరంతరాయంగా పెరుగుతూ ఉంటుందా?
జవాబు:
నీటికి నిరంతరాయంగా ఉష్ణాన్ని అందిస్తూ ఉంటే, నీటి ఉష్ణోగ్రత 100°C ని చేరేవరకు, నీటి ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంది. ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. 100°C వద్ద ఇంకా ఉష్ణాన్ని అందిస్తున్నా, ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.

ప్రశ్న 21.
మూత కలిగిన ఒక చిన్న గాజుసీసాను తీసుకోండి. సీసాలో ఎటువంటి గాలి బుడగలు లేకుండా పూర్తిగా నీటితో నింపండి. సీసాలోని నీరు బయటకుపోయే అవకాశం లేకుండా గట్టిగా మూతను బిగించండి. ఈ సీసాను ఫ్రిజ్ లో కొన్ని గంటలు ఉంచి తర్వాత బయటకు తీసిచూస్తే, సీసాకు పగుళ్ళు ఏర్పడుటను గమనిస్తాము. ఎందుకు?
జవాబు:
సీసాలో పోసిన నీటి ఘనపరిమాణం, సీసా ఘనపరిమాణానికి సమానం. కాని నీరు ఘనీభవించినపుడు వ్యాకోచిస్తుంది. అనగా నీటి ఘనపరిమాణం పెరిగింది. అందువల్ల సీసా పగులుతుంది.

ప్రశ్న 22.
థర్మామీటర్ ను వేడినీటిలో ఉంచినపుడు దానిలోని పాదరస మట్టం పెరుగుటను, చల్లని నీటిలో ఉంచినపుడు పాదరస మట్టం ఎత్తు పడిపోవుటను గమనిస్తాము. ఎందుకు?
జవాబు:

  1. రెండు వస్తువులు ఉద్ధీయ స్పర్శలోనున్నపుడు, ఉష్ణం ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి, ఉష్ణ సమతాస్థితిని పొందునంత వరకు ప్రసరిస్తుంది.
  2. థర్మామీటరును వేడినీటిలో ఉంచినపుడు ఉష్ణం వేడినీటి వస్తువు నుండి చల్లని వస్తువు (థర్మామీటరులోని పాదరసం)కు ప్రసరించింది. అందువల్ల పాదరస మట్టం పెరుగుతుంది.
  3. థర్మామీటరను చల్లని నీటిలో ఉంచినపుడు, ఉష్ణం వేడి వస్తువు (పాదరసం) నుండి చల్లని నీటిలోకి ప్రసరిస్తుంది. అందువల్ల పాదరస మట్టం పడిపోతుంది.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 23.
ఉష్ణోగ్రతకు, కణాల గతిజశక్తికి గల సంబంధం ఏమిటి?
జవాబు:

  1. అణువుల / కణాల సరాసరి గతిజశక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుంది.
  2. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిజశక్తిని సూచిస్తుందని చెప్పవచ్చు.
  3. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిజశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
    K.E(సరాసరి) ∝ T

ప్రశ్న 24.
ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతలోని పెరుగుదల (తరుగుదల) రేటుకు, విశిష్టోష్ణానికి ఏమైనా సంబంధం ఉన్నదా?
జవాబు:

  1. ఉష్ణోగ్రతలోని పెరుగుదల (తరుగుదల) పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. అనగా ఒక పదార్థ విశిష్టోష్ణం ఆ పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది.
  2. ఒకే పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పటికి, పదార్థ విశిష్టోష్ణం విలువ ఎక్కువగా ఉంటే, దాని ఉష్ణోగ్రతలోని పెరుగుదల (తరుగుదల) రేటు తక్కువగా ఉంటుంది.
  3. ఒక పదార్థం దాని ఉష్ణోగ్రత మార్పుకు ఎంత మేర విముఖత చూపుతుందనే భావాన్ని విశిష్టోష్ణం తెలియజేస్తుంది.

ప్రశ్న 25.
గాలిలో నీటి ఆవిరి ఎక్కడి నుండి వస్తుంది?
జవాబు:
కాలువలు, చెరువులు, నదులు, సముద్రాలు మొదలైన వాటి ఉపరితలాల నుండి నీరు బాష్పీభవనం చెందడం ద్వారా, తడి బట్టలు ఆరవేసినపుడు, చెమట మొదలగు ప్రక్రియల ద్వారా గాలిలో నీటి ఆవిరి చేరుతుంది.

ప్రశ్న 26.
20 కి.గ్రా. నీటి యొక్క ఉష్ణోగ్రతను 25°C నుండి 75°C కు పెంచడానికి ఎంత ఉష్ణశక్తి కావాలి?
జవాబు:
m = 20 కి.గ్రా. = 20,000 గ్రా.
t1 = 25°C
t2 = 75°C
S = 1 cal/gm°C.

Q = mS∆T
= 20000 × 1 × (75 – 25)
= 20000 × 1 × 50
= 1000000 కెలోరీలు
= 10³ కిలో కెలోరీలు

ప్రశ్న 27.
20°C వద్దనున్న 200 మి.లీ. నీటిని త్రాగినపుడు మన శరీరం నుండి నీరు గ్రహించు ఉష్ణశక్తి ఎంత? (మానవ శరీర ఉష్ణోగ్రత 37°C).
జవాబు:
m = 200 మి.లీ.
t1 = 20°C
t2 = 37°C
S = 1 cal/gm°C

Q = mS∆T
= 200 × 1 × (37-20)
= 200 × 1 × 17
= 3400 కెలోరీలు.

ప్రశ్న 28.
మిశ్రమాల పద్ధతి యొక్క సూత్రం వ్రాయుము.
జవాబు:
మిశ్రమాల పద్ధతి సూత్రం :
వివిధ ఉష్ణోగ్రతల వద్దనున్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉద్దీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతాస్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానం.

వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం.

ప్రశ్న 29.
రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిని సాధించాయని ఎలా చెప్పగలవు?
జవాబు:
రెండు వస్తువులు ఒకదానికొకటి ఉష్ణస్పర్శలో ఉంచినపుడు, వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణశక్తి బదిలీ అవుతుంది. ఆ రెండు వస్తువులు ఒకే వెచ్చదనం స్థాయి’ పొందే వరకు ఈ ఉష్ణశక్తి బదిలీ కొనసాగుతుంది. అప్పుడు, ఆ రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిని పొందాయని చెప్పవచ్చు.

ప్రశ్న 30.
ఉష్ణం అనగానేమి?
జవాబు:
అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు.

ప్రశ్న 32.
‘కెలోరి’ అనగానేమి?
జవాబు:
ఉష్ణానికి CGS ప్రమాణం కెలోరి. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని కెలోరి అంటారు.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 33.
విశిష్టోష్ణమును నిర్వచించి, దాని CGS మరియు SI ప్రమాణాలు తెలుపుము.
జవాబు:
ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని ఆ పదార్థ విశిష్టోష్ణం అంటారు.
CGS ప్రమాణాలు : Cal/g°C
SI ప్రమాణాలు : J/kg-K

ప్రశ్న 34.
ద్రవం యొక్క బాష్పీభవన రేటు ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
ద్రవం యొక్క బాష్పీభవన రేటు
1) ఆ ద్రవ ఉపరితల వైశాల్యం
2) ఉష్ణోగ్రత మరియు
3) వాని పరిసరాలలో అంతకుముందే చేరియున్న ద్రవ బాష్పం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న 35.
సాంద్రీకరణము అనగానేమి?
జవాబు:
వాయువు ద్రవంగా స్థితి మార్పు చెందడమే సాంద్రీకరణం.

ప్రశ్న 36.
శీతాకాలపు ఉదయం వేళల్లో పూలపై, గడ్డిపై లేదా కిటికీ అద్దాలపై నీటి బిందువులు ఎలా ఏర్పడతాయి.?
జవాబు:
శీతాకాలంలో రాత్రివేళ వాతావరణ ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. అందువల్ల కిటికీ అద్దాలు, పూలు, గడ్డి మొదలైనవి మరీ చల్లగా అవుతాయి. వాటి చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి సంతృప్త స్థితిలో ఉన్నపుడు, అది సాంద్రీకరణం చెందడం ప్రారంభిస్తుంది. ఇలా వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు.

ప్రశ్న 37.
గాలిలో పొగమంచు ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
శీతాకాలంలో రాత్రివేళ ఉష్ణోగ్రత బాగా తగ్గితే, ఆ ప్రాంతంలోని వాతావరణం అధిక మొత్తంలో నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. ఆవిరిలో ఉన్న నీటి అణువులు గాలిలోని ధూళి కణాలపై సాంద్రీకరణం చెంది చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ, పలుచని మేఘం వలె / పొగ వలె మనకు దూరంలోనున్న వస్తువులను కనబడనీయకుండా చేస్తాయి. దీనినే పొగమంచు అంటారు.

ప్రశ్న 38.
మరుగుట, మరియు మరుగు స్థానం అనగానేమి?
జవాబు:
ఏదేని పీడనం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోకి మారడాన్ని మరుగుట అంటాం. ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క మరుగు స్థానం అంటాం.

ప్రశ్న 39.
బాష్పీభవన గుప్తోష్ణం అనగానేమి?
జవాబు:
బాష్పీభవన గుప్తోష్ణం : నీరు ద్రవ స్థితి నుండి వాయుస్థితికి మారడానికి వినియోగింపబడే ఉష్ణాన్ని “బాష్పీభవన గుప్తోష్ణం” అంటారు.

  • బాష్పీభవన గుప్తోషాన్ని ‘L’ తో సూచిస్తారు.
  • L = \(\frac{Q}{M}\)
  • నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 కెలోరీలు / గ్రాం.

ప్రశ్న 40.
ద్రవీభవనం అనగానేమి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం.

ప్రశ్న 41.
ద్రవీభవన గుప్తోష్ణం అనగానేమి?
జవాబు:
స్థిర ఉష్ణోగ్రత వద్ద 1 గ్రా. ఘన పదార్థం పూర్తిగా ద్రవంగా మారడానికి కావలసిన ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. L = Q/M

ప్రశ్న 42.
ఘనీభవనం అనగానేమి?
జవాబు:
ద్రవ స్థితిలో ఉన్న ఒక పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘన స్థితిలోకి మారే ప్రక్రియను ఘనీభవనం అంటాం.

ప్రశ్న 43.
ఎత్తైన పర్వత ప్రాంతాలతో, మైదాన ప్రాంతాలతో పోల్చినపుడు ఆహార పదార్థాలను ఉడికించడం కష్టం అంటారు. దీనికి గల కారణాలు ఏమిటి?
జవాబు:
భూ ఉపరితలం నుండి పైకి పోవు కొలది వాతావరణ పీడనం తగ్గుతుంది. కనుక తక్కువ ఉష్ణోగ్రత విలువకే నీరు మరుగును. కానీ ఆహార పదార్థాలు అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతాయి. కనుక ఎత్తుకు పోవుకొలది ఆహారపదార్థాలు ఉడికే ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నీరు మరుగును కానీ పదార్థాలు ఉడకవు.

ప్రశ్న 44.
4 కేజీల నీరు, 100 °C వద్ద ఉందనుకొనుము. 4 కేజీల నీరు పూర్తిగా బాష్పంగా మారుటకు కావలసిన ఉష్ణశక్తి విలువ ఎంత?
జవాబు:
నీరు ద్రవ్యరాశి = m = 4 కి. = 4 × 10³ గ్రా||
నీటి బాష్పీభవన గుప్తోష్ణం = L = 540 కాలరీలు
కావలసిన ఉష్ణశక్తి = Q = mL = 4 × 10³ × 540 = 216 × 104 = 2.16 × 106 కాలరీలు

ప్రశ్న 45.
కుండలో నీరు చల్లగా ఉండుటకు గల కారణమేమిటి?
జవాబు:

  1. మట్టితో చేసిన కుండకు అనేక సూక్ష్మరంధ్రాలుంటాయి.
  2. కుండలో నీరు పోసినపుడు, ఈ సూక్ష్మరంధ్రాల ద్వారా నీరు ఉపరితలంపై చెమ్మగా చేరుతుంది.
  3. ఉపరితలంపై గల నీరు లోపలి ఉష్ణాన్ని గ్రహించి బాష్పీభవనం చెందును.
  4. ఈ విధంగా కుండ లోపలి నీరు ఉష్ణం కోల్పోవుట వలన చల్లగా ఉండును.

ప్రశ్న 46.
పందులు బురదలో దొర్లుతాయి. ఎందుకు?
జవాబు:
పందుల చర్మంపై స్వేద గ్రంథులు ఉండవు. కనుక వాటి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకొనుటకు అవి ఎక్కువ భాగము బురదలోనే దొర్లుతుంటాయి.

ప్రశ్న 47.
0°C వద్ద గల 1 గ్రాము మంచును (0 °C వద్ద గల 1 గ్రాము నీరుగా మార్చుటకు అందించవలసిన ఉష్ణరాశి విలువ ఎంత?
జవాబు:
0°C వద్ద గల 1 గ్రాము మంచును 0°C వద్ద ఉన్న 1 గ్రాము నీరుగా మార్చడానికి అందించవలసిన ఉష్ణరాశి 80 కేలరీలు.

ప్రశ్న 48.
0°C వద్ద గల మంచుకు ఎంత ఉష్ణాన్ని అందించినప్పటికీ అది నీరుగా మారేంత వరకు దాని ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. ఎందువల్ల?
జవాబు:
మనం అందించిన ఉష్ణం దాని స్థితిని మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు.

ప్రశ్న 49.
ప్రెషర్ కుక్కర్ లో వంట చేయడం తేలిక. ఎందుకు?
జవాబు:
పీడనం పెరిగితే నీటి మరుగు స్థానం పెరుగుతుంది. ప్రెషర్ కుక్కర్ లో నీటి మరుగు స్థానం 120°C వరకు పెరుగుతుంది. కాబట్టి వంట చేయడం తేలిక.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 50.
నీటిని శీతలీకరణిగా వాడతారు. ఎందుకు?
జవాబు:
నీరు అత్యధిక విశిష్టోష్ణం కలిగిన ద్రవం కావున అధిక ఉష్టాన్ని గ్రహించి కూడా తొందరగా వేడెక్కదు. కాబట్టి నీటిని శీతలీకరణిగా వాడతారు.

ప్రశ్న 51.
మంచు నీటిపై తేలుతుంది. ఎందుకు?
జవాబు:
మంచు ఘనపరిమాణం నీటికంటే ఎక్కువ. కాబట్టి మంచు సాంద్రత నీటికంటే తక్కువ. కాబట్టి మంచు నీటిపై తేలుతుంది.

ప్రశ్న 52.
చిన్న కప్పు మరియు పెద్ద డిష్ లో ఒకే పరిమాణం గల ద్రవాన్ని ఉంచితే ఏది త్వరగా బాష్పీభవనం చెందుతుంది?
జవాబు:
పెద్ద డిష్ లోని ద్రవం తొందరగా బాష్పీభవనం చెందుతుంది. కారణం ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన రేటు పెరుగుతుంది.

ప్రశ్న 53.
వేసవి రోజుల్లో కుక్కలు నాలుకను బయటకు చాచి ఉంచడానికి గల కారణాన్ని బాష్పీభవనం భావనతో వివరింపుము.
జవాబు:
కుక్కల శరీరంపై స్వేద రంధ్రాలు ఉండవు. కావున వేసవిలో నాలుక బయటకు చాచుట వలన నాలుకపై నీరు బాష్పీభవనం చెంది తద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ విధంగా కుక్కలు శరీరాన్ని చల్లబరుచుకొంటాయి.

10th Class Physics 1st Lesson ఉష్ణం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
శీతాకాలపు ఉదయం వేళల్లో పూలపై, గడ్డిపై నీటి బిందువులు (తుషారం) ఏర్పడుటకు కారణం ఏమి?
జవాబు:
i) శీతాకాలపు ఉదయం వేళల్లో భూ ఉపరితలం, భూమిపై నున్న గడ్డి, పూలు, ఇతర వస్తువుల ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది.
ii) అతి శీతలంగా ఉన్న ఆ గడ్డి, ఇతర వస్తువులకు గాలిలోని నీటి ఆవిరి తగిలినపుడు సాంద్రీకరణం జరిగి గడ్డిపై నీటి బిందువులు (తుషారం) ఏర్పడతాయి.

ప్రశ్న 2.
వివిధ సమయాల్లో రెండు పట్టణాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు ఇవ్వబడ్డాయి.
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 6
పై పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
A) ఉదయం 6 గంటలకు గల ఉష్ణోగ్రతను పోలిస్తే ఏ పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది?
B)ఏ సమయంలో రెండు పట్టణాలలోను ఒకే ఉష్ణోగ్రత కలదు?
జవాబు:
A) ‘B’ పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది.
B) 11 : 30 AM వద్ద రెండు పట్టణాలలో ఒకే ఉష్ణోగ్రత కలదు.

ప్రశ్న 3.
2 కి.గ్రా. ల ద్రవ్యరాశి గల ఇనుముకు 12,000 Cal. ఉష్ణాన్ని అందించారు. ఇనుము యొక్క తొలి ఉష్ణోగ్రత 20°C. దాని విశిష్టోష్ణం 0.1 Cal/g-°C. ఇనుము పొందే తుది ఉష్ణోగ్రత ఎంత?
జవాబు:
ఇనుము ద్రవ్యరాశి (m) = 2 కి.గ్రా. × 1000 గ్రా. = 2000 గ్రా.
అందించబడిన ఉష్ణము = Q = 12,000 కేలరీలు.
తొలి ఉష్ణోగ్రత = θi = 20°C ; తుది ఉష్ణోగ్రత = θf = ?
ఇనుము విశిష్టోష్ణము విలువ (S) = 0.1 కి./గ్రా. °C.
ఉష్ణము = Q = mS∆θ = Q = mS(θf – θi)
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 1

∴ తుది ఉష్ణోగ్రత = θf= 60 + 20 = 80°C

ప్రశ్న 4.
మంచు ఖండాల (Iceberg) చుట్టూ అధికంగా పొగమంచు ఉంటుంది. చర్చించండి.
జవాబు:
మంచు ఖండాల యొక్క ఉపరితలాలపై సాంద్రీకరణ చెందిన నీటి బిందువుల యొక్క ఉష్ణోగ్రత విలువ తగ్గిన, ఆ ప్రదేశంలో అధిక మొత్తంలో గల నీటిఆవిరి రూపంలోని నీటి అణువులు చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడును. ఇవి గాలిలో తేలియాడుతూ, పలుచని మేఘం లేదా పొగ వలె ఏర్పడతాయి.

ప్రశ్న 5.
A అనే 10 గ్రా. వస్తువుకు 50 కేలరీల ఉష్ణశక్తి అందించబడినది. B అనే 20 గ్రా. వస్తువుకు 80 కేలరీల ఉష్ణశక్తి అందించబడినది. ఈ రెండు వస్తువులను ఉయ స్పర్శలో ఉంచినపుడు ఏ వస్తువు నుండి ఏ వస్తువుకు ఉష్ణ ప్రసారం జరుగును?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 2
రెండు వస్తువులను ఉద్ధీయ స్పర్శలో ఉంచినపుడు A నుండి ఉష్ణశక్తి Bలోనికి ప్రవేశించును.

ప్రశ్న 6.
తుషారం మరియు పొగమంచు (Dew and Fog) ల మధ్య భేదాలను వ్రాయుము.
జవాబు:

తుషారం (Dew) పొగమంచు (Fog)
1. ఉదయం లేదా సాయంత్రం సమయాలలో వివిధ ఉపరితలాలపై (ఆకులు, గడ్డి, మొక్కలు మొ||) సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు. 1. పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగ మంచు అంటాం.
2. తుషారం వస్తువులను కనబడనీయకుండా చేయదు. 2. పొగమంచు మనకు దూరంగా ఉన్న వస్తువులను కనబడనీయకుండా చేస్తుంది.
3. సాపేక్ష ఆర్థత. ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉన్నపుడు తుషారం ఏర్పడుతుంది. 3. పరిసరాలలోని సముద్రాలు లేదా పెద్ద నీటి వనరుల ఉష్ణోగ్రత కన్నా భూ ఉష్ణోగ్రత అధికంగా ఉన్నపుడు పొగమంచు ఏర్పడుతుంది.

ప్రశ్న 7.
లలిత అల్యూమినియం గోళీల యొక్క విశిష్టోష్ణం కనుగొనాలని అనుకొంది. ఈ ప్రయోగం నిర్వహించడానికి ఏ విధమైన పరికరాలు లేదా సామగ్రి అవసరమవుతాయో వివరించండి.
జవాబు:
అవసరమయిన వస్తువులు :
కెలోరీమీటర్, ఉష్ణమాపకం, మిశ్రమాన్ని కలిపే కాడ లేదా స్టర్రర్, నీరు, నీటిఆవిరి గది, చెక్కపెట్టి మరియు అల్యూమినియం గోళీలు.

ప్రశ్న 8.
ఉష్ణోగ్రతలో నిర్ణీత పెరుగుదలకు గాను దిగువ పదార్థాలలో ఏది ఎక్కువ సమయం తీసుకొంటుంది? కారణం తెల్పండి.
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 3
జవాబు:
నీరు అధిక సమయం తీసుకొంటుంది. కారణం నీటి విశిష్టోష్ణం అధికం కాబట్టి వేడెక్కడానికి అధిక సమయం తీసుకొంటుంది. చల్లబడడానికి అధిక సమయం తీసుకొంటుంది.

ప్రశ్న 9.
ఫ్రిజ్ నుండి బయటకు తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉండటంలో విశిష్టోష్ణం పాత్రను వివరింపుము.
జవాబు:
పుచ్చకాయ ఎక్కువ శాతం నీటిని కలిగి ఉండటం మరియు అది అధిక విశిష్టోష్ణం కలిగి ఉండటం వలన ఫ్రిజ్ నుంచి తీసిన పుచ్చకాయ ఎక్కువ సమయం చల్లదనాన్ని నిలుపుకొంటుంది.

ప్రశ్న 10.
తుషారము మరియు పొగమంచు మధ్య భేదాలను తెల్పండి.
జవాబు:
తుషారం :
వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అంటారు. ఇది కాలుష్య రహితం.

పొగమంచు :
వాతావరణంలోని నీటి ఆవిరి గాలిలోని ధూళికణాలపై సాంద్రీకరణం చెంది పొగ వలె గాలిలో తేలియాడే నీటి బిందువులను ఏర్పరుస్తుంది. దీనినే పొగమంచు అంటారు. ఇది కాలుష్యాన్ని కలుగజేస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ప్రమాదకరం.

ప్రశ్న 11.
30°C ఉష్ణోగ్రత గల 60 గ్రా|| నీటిని, 60 °C ఉష్ణోగ్రత గల 60 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 4

ప్రశ్న 12.
మీ ఉపాధ్యాయులు తరగతి గదిలో తుషారము మరియు హిమము ఏర్పడుటను ప్రయోగపూర్వకంగా చూపించినారు కదా ! తుషారము మరియు హిమము ఏర్పడుటను నీవు ప్రయోగపూర్వకంగా ఏ విధంగా నిర్వహించెదవు?
జవాబు:
ఫ్రిజ్ లో ఉంచిన నీటి బాటిల్ ను బయటకు తీస్తే బాటిల్ లోపల మంచు ఏర్పడటం గమనించవచ్చు. అది హిమానికి ఉదాహరణ. బాటిల్ బయట నీటిఆవిరి సాంద్రీకరణం చెందడం వలన బిందువులు ఏర్పడుతాయి. అది తుషారానికి ఉదాహరణ.

ప్రశ్న 13.
నీరు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఆవిరి అవుతుంది? ఉదాహరణతో వివరించండి.
జవాబు:

  1. వర్షాకాలంలో మనము నేలపై గల గచ్చును తుడిచిన అది కొంతసేపటికి ఆరిపోవును. అనగా నేలపై తడి ఆవిరైపోయినది.
  2. ఆరుబయట ఆరవేసిన బట్టలు శీతాకాలంలో కూడా ఆరిపోవుటకు కారణము వాటిలోని నీరు ఆవిరైపోవుటయే.
  3. గాలిలో ఆవిరి రూపంలో నీటి అణువులు ఉంటాయి.
    పై దృగ్విషయాలను బట్టి నీరు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఆవిరి అవుతుంది.

ప్రశ్న 14.
20°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని, 40°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 5
∴ మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత = 30°C.

ప్రశ్న 15.
కింది వానిని కెల్విన్ మానంలోకి మార్చుము. i) 40°C ii) 27°C iii) – 273°C
జవాబు:
కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత = 273 + సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత

  1. 40°C ను కెల్విన్ మానంలో వ్రాయగా = 273 + 40 = 313K
  2. 27°C ను కెల్విన్ మానంలో వ్రాయగా = 273 + 27 = 300 K
  3. – 273°C ను కెల్విన్ మానంలో వ్రాయగా = 273 + (-273) = 0 K

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 16.
ఒక పదార్థం గ్రహించిన (కోల్పోయిన) ఉష్ణరాశికి సూత్రం వ్రాసి అందులోని పదాలను వ్రాయండి.
జవాబు:
ఉష్ణరాశి Q = m∆T
ఇచ్చట Q = ఉష్ణరాశి, m = పదార్థం ద్రవ్యరాశి
s = పదార్థం విశిష్టోష్ణం , ∆T = ఉష్ణోగ్రతలో మార్పు

10th Class Physics 1st Lesson ఉష్ణం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
బాష్పీభవన ప్రక్రియను ప్రభావితం చేయు అంశాలను వ్రాసి, ఉదాహరణలతో వివరింపుము.
జవాబు:
బాష్పీభవన ప్రక్రియను ప్రభావితం చేయు అంశాలు :
ఉష్ణోగ్రత, ద్రవ ఉపరితల వైశాల్యం గాలిలో అంతకుముందే చేరి ఉన్న ద్రవబాష్పం (ఆర్థత), గాలి వేగం ప్రభావితం చేయును.
– ఉష్ణోగ్రత పెరిగితే బాష్పీభవన రేటు పెరుగును.

ఉదాహరణ – 1:

  1. రెండు పెట్రెడిషన్లు తీసుకొని వాటిలో సుమారు ఒకే పరిమాణంలో స్పిరిట్ ను తీసుకొండి.
  2. ఒక పెట్రెడిషన్ను ఫ్యాన్ గాలి తగిలే విధంగా ఉంచాలి. రెండవ దానిపైన మూత పెట్టి ఉంచాలి.
  3. కొంత సమయం తరువాత రెండింటిలోని స్పిరిట్ పరిమాణాన్ని పరిశీలించండి.
  4. ఫ్యాన్ గాలికి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ ఏమీ లేకపోవడం, మూత పెట్టి ఉంచిన పెట్రెడిష్ లోని స్పిరిట్ అంతే ఉండటం మనం గమనించవచ్చు.

ఉదాహరణ – 2:

  1. ఒకే పరిమాణం గల వేడి ‘టీ’ని ఒక కప్పులోనూ, ఒక ‘సాసర్’లోనూ తీసుకోండి.
  2. సుమారు 5 నిమిషాల తర్వాత రెండింటిలోనూ ‘టీ’ పరిమాణాన్ని పరిశీలించండి.
  3. టీ కప్పులోని టీ కంటే సాసర్ లోని టీ త్వరగా చల్లబడుతుంది.

ఉదాహరణ – 3:

  1. తడి బట్టలలోని నీరు మామూలు పరిస్థితులలో కన్నా ఫ్యాన్ గాలి క్రింద ఉంచినపుడు త్వరగా బాష్పీభవనం చెందుతుంది.
  2. తడి బట్టలలోని నీరు ఎక్కువ ఆర్ధత ఉన్న సందర్భంలో కంటే తక్కువ ఆర్ధత గల సందర్భాలో తొందరగా బాష్పీభవనం చెందుతుంది.

ప్రశ్న 2.
పట్టికను పరిశీలించి, దిగువ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయుము.

పదార్థం విశిష్టోష్ణం cal/g°C.
సీసం 0.031
అల్యూమినియం 0.21
రాగి 0.095
నీరు 1.00
ఇనుము 0.115

a) విశిష్టోష్ణం యొక్క SI ప్రమాణాలు వ్రాయండి.
b) విశిష్టోష్ణం విలువలు ఆధారంగా ఇచ్చిన పదార్థాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
c) ఒకే పరిమాణం గల ఉష్ణం అందిస్తే వీటిలో ఏది త్వరగా వేడెక్కుతుంది?
d) 1kg ఇనుము ఉష్ణోగ్రతను 10°C పెంచడానికి కావలసిన ఉష్ణం ఎంతో లెక్కించండి.
జవాబు:
a) బౌల్ / కి.గ్రా. కెల్విన్
b) సీసం, రాగి, ఇనుము, అల్యూమినియం, నీరు
c) సీసం
d) Q = ms∆T = 1000 x 0.115 x 10 = 1150 కేలరీలు.

ప్రశ్న 3.
మంచు నీరుగా మారినపుడు ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు కనిపించదని తెలుపుటకు ఒక ప్రయోగాన్ని సూచించండి. 0°C వద్ద ఉన్న 5 గ్రాముల మంచు 0°C వద్ద నీరుగా మారడానికి ఎంత ఉష్ణం అవసరం అవుతుంది? (మంచు ద్రవీభవన గుప్తోష్ణం 80 Callgram).
జవాబు:
1) ఒక బీకరులో కొన్ని మంచుముక్కలు తీసుకొని, థర్మామీటరు సహాయంతో ఉష్ణోగ్రతను కొలవవలెను.

2) బీకరును బర్నర్ పై ఉంచి వేడిచేస్తూ ప్రతి నిమిషం ఉష్ణోగ్రతను నమోదు చేయవలెను.

3) మంచుముక్కలు కరిగేటప్పుడు మనం ఈ క్రింది విషయాలను గమనిస్తాము.
a) ప్రారంభంలో మంచు తక్కువ ఉష్ణోగ్రత 0°C లేదా అంతకంటే తక్కువగా ఉంటుందని గమనిస్తాము.
b) 0°C కంటే తక్కువగా ఉంటే 0°C ను చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరము పెరుగుతుంది.
c) మంచు కరగడం ప్రారంభం అవగానే ఎంత ఉష్ణాన్ని అందిస్తున్నా ఉష్ణోగ్రతలో మార్పు లేకపోవడం గమనిస్తాము.

4) ఈ విధముగా జరగడానికి గల కారణము :
a) మంచుముక్కలకు మనం అందించిన ఉష్ణం మంచు అణువుల అంతర్గత శక్తిని పెంచుతుంది.
b) ఇలా పెరిగిన అంతర్గత శక్తి మంచులోని అణువుల (H2O) మధ్య గల బంధాలను బలహీనపరచి, తెంచుతుంది.
c) అందువల్ల మంచు (ఘన స్థితి), నీరు (ద్రవస్థితి) గా మారుతుంది.
d) ఈ ప్రక్రియ స్థిర ఉష్ణోగ్రత (0°C లేదా 273K) వద్ద జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం (melting point) అంటాం.

5) ద్రవీభవన స్థానం :
స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థం ద్రవస్థితిలోకి మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటారు.

6) ద్రవీభవనం చెందేటప్పుడు ఉష్ణోగ్రత మారదు.

7) ఎందుకనగా, మంచుకు అందించబడిన ఉష్ణం పూర్తిగా నీటి అణువుల మధ్య గల బంధాలను తెంచడానికే వినియోగపడుతుంది.
మంచు ద్రవ్యరాశి = m = 5 గ్రాముల
మంచు ద్రవీభవన గుప్తోష్ణం = Lf = 80 కెలోరి/గ్రాము
అవసరమైన ఉష్ణము = Q = mLf = 5 × 80 = 400 కెలోరి / గ్రాము

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 4.
ద్రవీభవన ప్రక్రియ (process of melting) మరియు ద్రవీభవన గుప్తోష్ణాలను (latent heat of fusion) వివరించండి.
జవాబు:
ద్రవీభవన ప్రక్రియను పరిశీలించడానికి వేడిచేసినప్పుడు ద్రవంగా మారే మంచు, మైనం వంటి ఏదైనా ఒక పదార్థాన్ని ఎంచుకోవాలి.

  • ఎంచుకున్న పదార్థాన్ని బీకరులో తీసుకుని థర్మామీటరు సహాయంతో దాని ఉష్ణోగ్రతను కొలవాలి.
  • ఆ బీకరును బర్నర్ లేదా స్టవ్ పై వేడిచేస్తూ ప్రతి నిమిషానికి ఉష్ణోగ్రతలో మార్పును పరిశీలించాలి.
  • పదార్థాన్ని వేడి చేస్తున్నప్పుడు కొంత సమయం వరకూ పదార్థ ఉష్ణోగ్రత పెరుగుతుంది. తదుపరి ఒకానొక ఉష్ణోగ్రత వద్ద పదార్థం ద్రవ రూపంలోకి మారడం ప్రారంభమైనప్పుడు ఉష్ణాన్ని అందిస్తూ ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలో, మార్పు ఉండదు. మనం అందించే ఉష్ణం పదార్థం స్థితి మారడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పదార్థం పూర్తిగా ద్రవస్థితిలోకి మారిన తర్వాత థర్మామీటరులో ఉష్ణోగ్రత పెరుగుదలను గమనించవచ్చు.
  • ఈ విధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘన స్థితిలో ఉన్న పదార్థం ద్రవ స్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం.
  • ఈ విధంగా ఒక గ్రాము పదార్థాన్ని ఘన స్థితి నుండి పూర్తిగా ద్రవంగా మార్చడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క ద్రవీభవన గుప్తోష్ణం అంటారు.

ప్రశ్న 5.
‘వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు వేరువేరుగా ఉంటాయి’. దీనికి కారణాలు వివరించండి.
జవాబు:

  1. పదార్థానికి / వ్యవస్థకు ఉష్ణశక్తిని అందించినప్పుడు అది అందులోని కణాల రేఖీయ గతి శక్తి, కంపన శక్తి, భ్రమణ శక్తి మరియు అణువుల మధ్య స్థితి శక్తి వంటి వివిధ రూపాలలోకి వితరణ చెందుతుంది.
  2. ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది.
  3. పదార్థానికి ఇచ్చిన ఉష్ణశక్తిలో ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిజ శక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
  4. వివిధ పదార్థాలు తమకు అందిన ఉష్ణాన్ని రేఖీయ గతి శక్తి పెంపుదలకు వినియోగించుకొనే విధానంలో మార్పు ఉండడం వలన వాటి విశిష్టోష్ణాలు వేరు వేరుగా ఉంటాయి.

ప్రశ్న 6.
మంచు నీటి ఆవిరిగా మారేవరకు వేడిచేసిన ప్రక్రియలో వివిధ ఉష్ణోగ్రత విలువలు లో చూపబడ్డాయి. గ్రాఫ్ ను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (ఈ గ్రాఫ్ పరిమాణాత్మక విలువలనివ్వడం లేదు మరియు ఖచ్చితమైన ‘స్కేలు’కు అనుగుణంగా ఇవ్వబడినది కాదు. ఇది కేవలం గుణాత్మకమైనది.)
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 7
a) ఏ ఉష్ణోగ్రత వద్ద మంచు నీరుగా మారుతుంది?
b) \(\overline{\mathrm{DE}}\) ఏమి తెలియజేస్తుంది?
c) ఏ ఏ ఉష్ణోగ్రతల మధ్య నీరు ద్రవరూపంలో ఉంటుంది?
d) గ్రాలోని ఏ భాగం మంచు నీరుగా మారడాన్ని తెలియజేస్తుంది?
జవాబు:
a) 0°C
b) నీరు, నీటి ఆవిరిగా మారుటను (స్థితి మార్పును) తెలియజేయును.
c) 0°C నుండి 100°C వరకు
d) \(\overline{\mathrm{BC}}\)

ప్రశ్న 7.
A) “మిశ్రమాల పద్ధతి” సూత్రంను వ్రాయుము.
B) 50°C ల ఉష్ణోగ్రత గల 60 గ్రాముల నీటిని 70°C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటితో కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జవాబు:
A) వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 8

ప్రశ్న 8.
ఒక పాత్రలో 0°C వద్ద నీరు తీసుకున్నారు. దీనిని పటంలో చూపిన విధంగా ఒక పెద్ద గాజుపాత్రతో మూసినారు. దానికి గల వాయురేచకం వాడి లోపల ప్రాంతాన్ని శూన్యంగా మార్చారు.
a) ఏమి జరుగును? వివరించండి.
b) పాత్రలో కొంత నీరు గడ్డ కడుతుంది. గడ్డ కట్టే నీటి పరిమాణం ఎంత?
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 9
జవాబు:
a) 0°C వద్ద నీరు ద్రవరూపమును కలిగి ఉండును. అదే విధముగా 0°C వద్ద కూడా మంచు సాధ్యము. కారణమేమనగా శూన్యంలోని గాలి ఉష్ణోగ్రతను పెంచును. ఇక్కడ సాధ్యము కనుక బాష్పీభవనం జరుగును.

b) 0°C వద్ద ‘y’ మి.లీ.ల నీరు తీసుకున్నారనుకొనుము.
‘x’ మి.లీ.ల నీరు బాష్పీభవనం చెందినదనుకొనుము.
బాష్పీభవన గుప్తోష్ణం విలువ = Lఆవిరి = 540 Cal/g.
మంచు బాష్పీభవన గుప్తోష్ణం విలువ = Lమంచు = 80 Cal/g.
కొంత సేపటికి నీరు మంచుగా మారు ప్రక్రియ ఆగిపోయి ఉష్ణసమతాస్థితి ఏర్పడును. కనుక
540 x = (y- x) 80
540 x = 80y – 80 x
540x + 80 x = 80 y

620 x = 80 y ⇒ \(\frac{x}{y}=\frac{80}{620}=\frac{4}{31}=\frac{1}{8}\) (దాదాపు)
∴ దాదాపు \(\frac{1}{8}\) వ భాగం నీరు బాష్పీభవనం చెందును.
(1- \(\frac{1}{8}\))వ భాగపు నీరు ఘనీభవించును అనగా మంచుగా మారును.

ప్రశ్న 9.
Q = ms∆T ల మధ్య సంబంధాన్ని ఉత్పాదించండి.
జవాబు:
1) ఒకే విధమైన ఉష్ణోగ్రత మార్పుకు, ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి (Q), దాని ద్రవ్యరాశికి (m) అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ Q ∝ m (∆T స్థిరం ) —– (1)
2) ఒక బేకరులో 1 లీటరు నీటిని తీసుకొని ఏకరీతి మంటపై వేడి చేయండి. ప్రతి 2 నిమిషాలకు ఉష్ణోగ్రతలోని మార్పు (∆T) ను గుర్తించండి.
3) ఉష్ణాన్ని అందించే సమయానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలో పెరుగుదల స్థిరంగా ఉంటుంది. దీనిని బట్టి స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు, అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ Q & ∆T (ద్రవ్యరాశి స్థిరం) ——– (2)
(1), (2) సమీకరణాల నుండి Q ∝ m.∆T
Q = m.s.∆T (∴ s స్థిరాంకం)

ప్రశ్న 10.
విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలను తెలుపుము.
జవాబు:

  1. సూర్యుడు ప్రతిరోజు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తాడు. వాతావరణ ఉష్ణోగ్రతను సాపేక్షంగా, స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు, ప్రత్యేకంగా సముద్రాలు ఈ శక్తిని గ్రహించుకొని పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి.
  2. ఫ్రిజ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చినపుడు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. దీనికి కారణం పుచ్చకాయలో అధికంగా నీరు ఉండటం మరియు నీటి విశిష్టోష్ణం విలువ అధికంగా ఉండటం.
  3. సమోసాను చేతితో తాకినపుడు వేడిగా అనిపించకపోయినా, దానిని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువ.
  4. నీటికున్న అధిక విశిష్టోష్ణ విలువ వలన దానిని థర్మల్ విద్యుత్ కేంద్రాలలోను, కార్ల రేడియేటర్లలోను శీతలీకరణిగా వాడుతారు.
  5. నీటి యొక్క అధిక విశిష్టోష్ణ విలువ వలననే జంతువుల మరియు మొక్కల జీవనం సాధ్యపడుతున్నది.

ప్రశ్న 11.
బాష్పీభవన ప్రక్రియను వివరించుము.
జవాబు:

  1. డిష్ లో ఉంచిన స్పిరిట్ అణువులు నిరంతరంగా వివిధ దిశలలో, వివిధ వేగాలతో కదులుతూ ఉంటాయి. అందువల్ల అణువులు పరస్పరం అఘాతం చెందుతాయి.
  2. అభిఘాతం చెందినపుడు ఈ అణువులు ఇతర అణువులకు శక్తిని బదిలీ చేస్తాయి. ద్రవం లోపల ఉన్న అణువులు ఉపరితలం వద్ద ఉండే అణువులతో అఘాతం చెందినపుడు ఉపరితల అణువులు శక్తిని గ్రహించి, ద్రవ ఉపరితలాన్ని వదిలి పైకి వెళతాయి.
  3. ఇలా ద్రవాన్ని వీడిన అణువులలో కొన్ని గాలి అణువులతో అభిఘాతం చెంది తిరిగి ద్రవంలోకి చేరతాయి.
  4. ద్రవంలోకి తిరిగి చేరే అణువుల సంఖ్య కన్నా ద్రవాన్ని వీడిపోయే అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటే ద్రవంలోని అణువుల సంఖ్య తగ్గుతుంది.
  5. కనుక ఒక ద్రవానికి గాలి తగిలేలా ఉంచినపుడు, ఆ దద్రం పూర్తిగా ఆవిరైపోయే వరకు ద్రవ ఉపరితలంలోని అణువులు గాలిలోకి చేరుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియను “బాష్పీభవనం” అంటారు.

ప్రశ్న 12.
బాష్పీభవనమును నిర్వచించండి. బాష్పీభవనమును ప్రభావితం చేయు అంశాలను తెల్పి, అవి ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెల్పండి.
జవాబు:
బాష్పీభవనం :
ద్రవంలోని అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.

బాష్పీభవనం ఆధారపడు అంశాలు :

  1. ఉష్ణోగ్రత : ఉష్ణోగ్రత పెరిగితే బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది.
  2. గాలివేగం : గాలివేగం పెరిగితే బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది.
  3. ఉపరితల వైశాల్యం : ఉపరితల వైశాల్యం పెరిగితే బాష్పీభవన ప్రక్రియ పెరుగుతుంది.
  4. ఆర్ధత : ఆర్థత పెరిగితే బాష్పీభవనం తగ్గుతుంది.

ప్రశ్న 13.
మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని ఒక కృత్యం ద్వారా వివరింపుము.
జవాబు:

  1. m1, m2 ద్రవ్యరాశులు గల రెండు పదార్థాల తొలి ఉష్ణోగ్రతలు వరుసగా T1, T2 (అధిక ఉష్ణోగ్రత T1, అల్ప ఉష్ణోగ్రత T2).
  2. మిశ్రమ తుది ఉష్ణోగ్రత T.
  3. మిశ్రమ ఉష్ణోగ్రత వేడి పదార్థం ఉష్ణోగ్రత (T1) కన్నా తక్కువగా, చల్లని పదార్థ ఉష్ణోగ్రత (T2) కన్నా ఎక్కువగా ఉంటుంది.
  4. కాబట్టి వేడి వస్తువు ఉష్ణాన్ని కోల్పోయింది. చల్లని వస్తువు ఉష్ణాన్ని గ్రహించింది.
  5. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 10

ప్రశ్న 14.
సమాన పరిమాణం గల వివిధ రకాలైన లోహపు ముక్కలను ఒకే ఉష్ణోగ్రతకు వేడిచేసి వాటి వెంటనే ఒకే పరిమాణంలో నీరు గల బీకర్లలో ముంచి వాటి ఉష్ణోగ్రతలలో తేడాలను గుర్తించండి. మీ పరిశీలనలను రాయండి.
జవాబు:
ఉద్దేశ్యం :
వివిధ లోహాల ఉష్ణోగ్రతలను పరిశీలించుట.

కావలసిన పరికరాలు :
రాగి, ఇనుము, అల్యూమినియం లోహాల ముక్కలు, మూడు బీకర్లు, కొలిమి, 3 థర్మామీటర్లు.

ప్రక్రియ:

  1. సమాన పరిమాణం గల రాగి, ఇనుము, అల్యూమినియం లోహాల ముక్కలను సేకరించుము.
  2. ఈ లోహాలను కొలిమిలో 80°C వద్దకు వేడి చేయుము.
  3. ముందుగా మూడు బీకర్లలో సమాన పరిమాణం గల నీటిని తీసుకొనుము.
  4. కొలిమి నుండి లోహపు ముక్కలను తీసుకొని వెళ్ళి బీకర్లలో వేయుము.
  5. బీకర్లలో మూడు వేర్వేరు థర్మామీటర్లను ఉంచుము.
  6. ఆ థర్మామీటర్ల రీడింగులను 2 నిమిషాల తరువాత సేకరించుము.
  7. థర్మామీటరు రీడింగులను గమనించగా వాటి విలువలు వేర్వేరుగా ఉండుటను గమనించవచ్చును.
  8. దీనిని బట్టి ఉష్ణోగ్రత పదార్థ స్వభావంపై ఆధారపడును.

10th Class Physics 1st Lesson ఉష్ణం Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక కి.గ్రా ద్రవ్యరాశి గల పదార్థంకు అందించిన ఉష్ణం (H) మరియు పదార్థ ఉష్ణోగ్రత (T) అయిన H,T లకు సంబంధించిన గ్రాఫు ఇవ్వడమైనది. గ్రాఫు నందు ‘O’ అనునది పదార్థపు ఘనస్థానమైన, గ్రాఫు ద్వారా క్రింది ప్రశ్నలకు సమాధానాలిమ్ము.
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 11
1. ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానము ………..
2. పదార్థపు ద్రవీభవన గుప్తోష్ణము విలువ …………….
3. పదార్థపు బాష్పీభవన గుప్తోష్ణము విలువ …………
4. పదార్థపు మరుగు స్థానము విలువ ………….
జవాబు:
1. (H1, T1)
2. (H1, T1) నుండి (H2, T2) అగును.
3. (H3, T3) నుండి (H4, T4) అనునది బాష్పీభవన గుప్తోష్ణము.
4. (H3, T3) పదార్ధపు మరుగు స్థానము.

ప్రశ్న 2.
ఇచ్చిన పటంలో ఉష్ణోగ్రతకు, కాలంకు మధ్యన గల ఒక గ్రాఫు ఇవ్వడమైనది. ఆ గ్రాఫులో A, B మరియు C అను పదార్థాల విశిష్టోష్ణాలు ఇవ్వడమైన, వాటిలో ఏది అధిక విశిష్టోష్ణం కల్గి వుంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 12
1. ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సరాసరి గతిశక్తికి అనులోమానుపాతంలో వుంటుంది.

2. ‘A’ అను పదార్థపు వాలు ఎక్కువగా గలదు. కనుక దాని విశిష్టోష్ణం ఎక్కువ.

ప్రశ్న 3.
మరిగే స్థానం వద్ద నీటి విశిష్టోష్ణం విలువ ఎంత?
జవాబు:
మరిగే స్థానం వద్ద నీటి విశిష్టోష్ణం విలువ 1.007 K cal / Kg, K లేక 4.194 KJ / Kg.K

ప్రశ్న 4.
100°C వద్ద గల వేడినీటి కన్నా అదే 100°C వద్ద గల నీటి ఆవిరి వలన ఎక్కువ గాయాలగును. ఎందువలన?
జవాబు:
వేడి నీటికి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 100°C ఉండును. వేడి నీరు శరీరంపై పడితే గాయాలగును. కానీ నీటి ఆవిరి బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 cal/grams అనగా నీటి ఆవిరి శరీరాన్ని తాకి సాంద్రీకరణం చెందినపుడు 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేయును. ఈ అధికమైన ఉష్ణశక్తి వలన మనకు తీవ్ర గాయాలగును. కాబట్టి వేడినీటి కంటే నీటిఆవిరి తగలటం ఎక్కువ ప్రమాదకరము.

ప్రశ్న 5.
A, B మరియు C అను పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా 20°C, 30°C మరియు 40°C లు. సమాన ద్రవ్యరాశులు గల A మరియు Bల మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత విలువ 26°C. సమాన ద్రవ్యరాశులు గల A మరియు C ల మిశ్రమ ఫలిత ఉష్ణోగ్రత విలువ 33°C. అయిన వాటి విశిష్టోష్ణాల నిష్పత్తిని కనుగొనుము.
జవాబు:
A, B మరియు C పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా ty, t, మరియు 1, లయిన వాటి విలువలు 20°C, 30°C మరియు 40°C లు అగును.
∴ t1 = 20°; t2 = 30°C మరియు t3 = 40°C
పదార్థాల విశిష్టోష్ణాలు వరుసగా S1, S2 మరియు S3 లనుకొనుము.

Case – I
A మరియు B ల సమాన ద్రవ్యరాశులు గల పదార్థాలను కలుపగా వాటి మిశ్రమ ఉష్ణోగ్రత విలువ 26°C.
∴ m1 = m2 = m, Tఫలిత = 26°C, t1 = 20°C, t2 = 30°C

కెలోరిమితి సూత్రం ప్రకారం :
పదార్థం కోల్పోయిన లేదా గ్రహించిన ఉష్ణరాశి = Q = mis.t

మిశ్రమ పద్ధతి ప్రకారం :
వేడి వస్తువు కోల్పోవు ఉష్ణరాశి = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణరాశి
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 13

Case – II
B మరియు C అను ద్రవ్యరాశి గల పదార్థాలను కలుపగా వాటి మిశ్రమ ఉష్ణోగ్రత విలువ 33°C అగును.
∴ m2 = m3 = m, Tఫలిత = 33°C, t2 = 30°C మరియు t3 = 40°C అగును.

మిశ్రమ పద్ధతి ప్రకారం :
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 14
(1) మరియు (2) ల నుండి s1 : s2 : s3 = 2 × 7 : 3 × 7 : 3 × 3
A, B, C ల విశిష్టోష్ణాల నిష్పత్తి = s1 : s2 : s3 = 14 : 21 : 9

ప్రశ్న 6.
నీటిలో నింపిన గాజు సీసాను ఫ్రిజ్ లో కొన్ని గంటలుంచిన తర్వాత బయటకు తీసిచూస్తే, సీసాకు పగుళ్ళు ఏర్పడడం జరుగును. ఎందుకు?
జవాబు:
నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచించును అనగా ఘనపరిమాణం పెరుగును. కనుక ఫ్రిజ్ లో ఉంచిన గాజు సీసాపై పగుళ్ళు ఏర్పడును.

ప్రశ్న 7.
ఒక వస్తువు యొక్క గతిజశక్తి శూన్యమగునా?
జవాబు:
ఒక పదార్థ ఉష్ణోగ్రత దానిలోని కణాల సగటు గతిజశక్తికి అనులోమానుపాతంలో వుండును. కనుక వస్తువు యొక్క గతిజశక్తి ఎన్నటికీ శూన్యము కాదు.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

ప్రశ్న 8.
ప్రెజర్ కుక్కర్ లో చేయు వంట, మూతలేని పాత్రలో చేయు వంటకన్నా వేగమెక్కువ. ఎందుకు?
జవాబు:
ప్రెజర్ కుక్కర్ లో నీటి ఆవిరి బంధించబడి ఉండుట వలన మరియు వేడి నీటిఆవిరి గుప్తోష్ణం విలువ 100°C వద్ద 540 cal – grms ఉండుట వలన పదార్థాలపై 540 కేలరీల ఉష్ణశక్తిని విడుదల చేయును. అదే మూతలేని పాత్రలో నీరు వేడెక్కును గానీ పదార్థాలకు తక్కువ ఉష్ణశక్తి అందును.

ప్రశ్న 9.
‘x’ గ్రా||ల పదార్ధము యొక్క ఉష్ణోగ్రతను t1°C కు పెంచుటకు అవసరమైన ఉష్ణ పరిమాణం అదే ‘y’ గ్రా|| నీటిని ఉష్ణోగ్రతలో t2°C పెరుగుటకు సరిపోయిన, వాటి యొక్క విశిష్టోష్ణాల నిష్పత్తి ఎంత?
జవాబు:
m1 = x గ్రా|| మరియు m2 = y గ్రా||
T1 = t1°C మరియు T2 = t2 °C, ఫలిత ఉష్ణోగ్రత = T

మిశ్రమ పద్ధతి ప్రకారం :
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 15

10th Class Physics 1st Lesson ఉష్ణం 1/2 Mark Important Questions and Answers

1. క్రింది పటంలో చూపిన ప్రయోగంలో ఏ థర్మామీటర్ లో పాదరస మట్టం పెరుగుతుంది?
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 16
జవాబు:
థర్మామీటర్ – A

2. క్రింది ఏ సందర్భంలో నీవు చల్లదనాన్ని పొందుతావు?
సందర్భం-1 : నీ శరీరం నుండి ఉష్ణం బయటకు ప్రవహించినపుడు
సందర్భం-2 : నీ శరీరంలోకి ఉష్ణం ప్రవహించినపుడు
జవాబు:
సందర్భం – 1

3. ఏ భౌతిక రాశిని ‘చల్లదనం లేదా వెచ్చదనం స్థాయి’గా నిర్వచిస్తారు?
జవాబు:
ఉష్ణోగ్రత

4. ఉష్ణానికి SI ప్రమాణం ఏమిటి?
జవాబు:
జౌల్

5. 1 గ్రాము నీటి యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి ఎంత ఉష్ణశక్తి అవసరం అవుతుంది?
జవాబు:
1 కేలరీ లేదా 4.186 పౌల్

6. 1 కేలరీ ఎన్ని ఔళ్ళకి సమానం అవుతుంది?
జవాబు:
4. 186 జోళ్ళు

7. ఉష్ణోగ్రతకి S.I ప్రమాణాలు రాయుము.
జవాబు:
కెల్విన్ (K)

8. 0°C ను కెల్విన్లోకి మార్చుము.
జవాబు:
273K

9. డిగ్రీ సెల్సియలో ఉన్న ఉష్ణోగ్రతను, కెల్విన్లోకి మార్చు సూత్రము రాయుము.
జవాబు:
కెల్విన్లో ఉష్ణోగ్రత = 273 + °C లో ఉష్ణోగ్రత

10. 100°C ను పరమ ఉష్ణోగ్రతా మానంలోకి మార్చుము.
జవాబు:
373 K

11. Q = msAT లో ‘S’ అనే పదం దేనిని సూచిస్తుంది?
జవాబు:
విశిష్టోష్ణం

12. ‘విశిష్టోష్ణం’నకు ఒక సూత్రం రాయుము.
జవాబు:
\(\mathrm{s}=\frac{\mathrm{Q}}{\mathrm{m} \Delta \mathrm{T}}\)

13. విశిష్టోష్ణం యొక్క C.G.S. ప్రమాణాలు రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 18

14. విశిష్టోష్టానికి S.I. ప్రమాణాలు రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 17

15. AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 19 ఖాళిను పూరించుము.
జవాబు:
4.186 × 10³

16. ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణానికి, ఉష్ణోగ్రత పెరుగుదల రేటుకి మధ్య సంబంధం ఏమిటి ?
జవాబు:
విలోమానుపాతం

17. ‘ఉష్ణ భాండాగారాలు’ అని వేటిని అంటారు?
జవాబు:
సముద్రాలను

18. నీటి యొక్క విశిష్టోష్ణం విలువ ఎంత
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 20

19. A, B, C, D, E మరియు F పదార్థాల విశిష్టోష్ణాలు
వరుసగా 0.031, 0.033, 0.095, 0.115, 0.50,
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 21
a) ఏ పదార్థం తక్కువ ఉష్ణంతో త్వరగా వేడెక్కును?
జవాబు:
పదార్థం – A

b) పదార్థం – C యొక్క ఉష్ణోగ్రతను 1°C పెంచడానికి ఎంత ఉష్ణం కావాలి?
జవాబు:
0.095 కాలరీలు

20. ద్రవాల మిశ్రమం యొక్క ఫలిత ఉష్ణోగ్రతను కనుగొనుటకు వినియోగించే ఒక సూత్రం రాయుము.
జవాబు:
\(\mathbf{T}=\frac{\left(m_{1} \mathbf{T}_{1}+m_{2} \mathbf{T}_{2}\right)}{\left(m_{1}+m_{2}\right)}\)

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

21. మిశ్రమాల పద్ధతి సూత్రాన్ని రాయుము.
జవాబు:
వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం = చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం

22. 100 మి.లీ. నీరు 90°C వద్ద, 200 మి.లీ. నీరు 60°C వద్ద కలవు. వీటిని కలపగా ఏర్పడిన మిశ్రమం ఉష్ణోగ్రత ఎంత వుంటుంది?
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 22

23. ఇచ్చిన ఘనపదార్థం విశిష్టోష్ణం కనుగొనుటకు కావలసిన పరికరాలను రెండింటిని రాయుము.
జవాబు:
కెలోరీమీటర్, థర్మామీటరు

24. సీసం విశిష్టోష్ణం కనుగొనుటకు ఉపయోగించే సూత్రం రాయుము.
జవాబు:
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 23
(1 = సీసం, c = కెలోరీమీటర్, W = నీరు)

25. గదిలో నీరు కొద్ది సేపటి తరువాత కనిపించదు. కారణాన్ని రాయండి.
జవాబు:
బాష్పీభవనం వలన

26. బాష్పీభవనానికి నిజ జీవిత వినియోగం రాయుము.
జవాబు:
తడిబట్టలు ఆరుట

27. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా నీరు ఆవిరి అవడాన్ని ఏమంటారు?
జవాబు:
బాష్పీభవనం

28. ద్రవం ఉపరితలం దగ్గర మాత్రమే నీరు ఆవిరిగా మారు ప్రక్రియ.
A) మరుగుట
B) బాష్పీభవనం
C) A మరియు B
D) సాంద్రీకరణం
జవాబు:
B) బాష్పీభవనం

29. వాక్యం a : బాష్పీభవనం ఉపరితల ప్రక్రియ.
వాక్యం b : బాష్పీభవనంలో వ్యవస్థ ఉష్ణోగ్రత తగ్గును.
జవాబు:
రెండూ

30. జతపరుచుము
a) బాష్పీభవనం i) ఉయ ప్రక్రియ
b) సాంద్రీకరణం ii) శీతలీకరణ ప్రక్రియ
జవాబు:
a – ii, b-i

31. మన శరీరంపై ‘చెమట పట్టి ఆరినపుడు చల్లగా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
బాష్పీభవనం

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

32. బాష్పీభవన రేటు ఆధారపడని అంశం
A) ఉపరితల వైశాల్యం
B) ఉష్ణోగ్రత
C) ఆర్థత
D) ద్రవ్యరాశి
జవాబు:
D) ద్రవ్యరాశి

33. బాష్పీభవనానికి వ్యతిరేక ప్రక్రియ ఏమిటి?
జవాబు:
సాంద్రీకరణం

34. చల్లని నీరు పోసిన సీసాను గదిలో ఉంచితే నీవు గమనించే అంశం ఏమిటి?
జవాబు:
సీసా చుట్టూ నీటి బిందువులను గమనిస్తాను.

35. పై కృత్యంలో సీసాలో నీటి ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు వచ్చును?
జవాబు:
పెరుగును

36. సాంద్రీకరణలో స్థితులు ఎలా మారుతాయి?
జవాబు:
వాయువు నుండి ద్రవానికి.

37. స్నానాల గదిలో స్నానం చేసిన తర్వాత వెచ్చగా అనిపిస్తుంది. కారణం ఏమిటి?
జవాబు:
సాంద్రీకరణం

38. గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు?
జవాబు:
ఆర్ద్రత

39. తుషారం లేదా పొగమంచు ఏర్పడుటలో ఇమిడియున్న దృగ్విషయం ఏది?
జవాబు:
సాంద్రీకరణం

40. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి శరీరంలో జరిగే ఒక జీవక్రియను రాయుము.
జవాబు:
చెమట పట్టుట

41. వాతావరణంలో ధూళి కణాల పై నీటి ఆవిరి సాంద్రీకరించే ప్రక్రియ వలన ఏమి ఏర్పడును?
జ. పొగమంచు

42. సరియైన జత కానిది ఏది?
1) మేఘాలు – బాష్పీభవనం వలన ఏర్పడును
2) పొగమంచు – సాంద్రీకరణ వలన ఏర్పడును
జవాబు:
రెండూ సరియైనవే / సరికానివి ఏవీ లేవు.

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

43. నీటి యొక్క మరుగు స్థానం ఎంత? ఏది సరైనది?
జవాబు:
100°C లేదా 373 K

44. ద్రవం వాయువుగా ఈ క్రింది సందర్భంలో మారగలదు.
A) ఏ ఉష్ణోగ్రత వద్దనైనా
B) స్థిర ఉష్ణోగ్రత వద్ద
C) A మరియు B
జవాబు:
C) A మరియు B

45.
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 24
a) ద్రవీభవన గుప్తోష్ణం సూచించు భాగం ఏది?
జవాబు:
BC

b) ఏ భాగం మరగడాన్ని సూచిస్తుంది?
జవాబు:
DE

46. బాష్పీభవన గుప్తోష్ణం ప్రమాణం ఏమిటి?
జవాబు:
కాలరీ / గ్రా. (లేదా) బౌల్/కి. గ్రా.

47. నీటికి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత?
జవాబు:
540 కాలరీ / గ్రాం.

48. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఎంత?
జవాబు:
80 కాలరీ / గ్రా.

49. ఏ ఉష్ణోగ్రత వద్ద మంచు కరుగుతుంది?
జవాబు:
0°C లేదా 273K

50. 2 గ్రాముల మంచు 0°C వద్ద కలదు. అది పూర్తిగా నీరుగా మారుటకు కావలసిన. ఉష్ణం ఎంత?
జవాబు:
160 కాలరీలు

51. క్రింది ఏ ప్రక్రియలో ఉష్ణం విడుదలగును?
A) ద్రవీభవనం
B) మరగడం
C) బాష్పీభవనం
D) సాంద్రీకరణం
జవాబు:
D) సాంద్రీకరణం

52. రిఫ్రిజిరేటర్ లో జరిగే ప్రక్రియ ఏమిటి?
జవాబు:
ఘనీభవనం

53. a) వాయువు నుండి ద్రవం i) మంచు తుషారం
b) ద్రవం నుండి వాయువు ii) పొగమంచు
c) ద్రవం నుండి ఘనం iii) తడిబట్టలు
జవాబు:
(a) – ii; (b) – iii; (c) – i

54. క్రింది ఇచ్చిన సందర్భానికి నిత్యజీవిత ఉదాహరణ ఇమ్ము.
“నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ”
జవాబు:
1) మంచు నీటిపై తేలుట,
2) గాజు సీసా నిండా నీరు పోసి మూత బిగించి, ఫ్రిజ్ లో పెట్టిన సీసాపై పగుళ్ళు ఏర్పడుట.

55. జతపరుచుము :
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 25
జవాబు:
1 – a, 2 – b, 3 – c, 4 – d

56. A, B మరియు C అనే పదార్థాల ఉష్ణోగ్రతలు వరుసగా 60°C, 2301, 333K. ఏయే పదార్థాలు ఉష్ణసమతాస్థితిలో ఉన్నవి?
జవాబు:
A మరియు C

57. 0°C వద్ద ఉన్న కొంత పరిమాణం మంచుకి 160 కాలరీలు ఇచ్చినప్పుడు అది పూర్తిగా నీరుగా మారింది. వినియోగించిన మంచు పరిమాణం ఎంత ఉండ వచ్చును?
జవాబు:
2 గ్రా

58. 100°C వద్ద గల 1 గ్రాము నీటి కన్నా, 1 గ్రాము నీటి ఆవిరిలో ఎంత అధిక ఉష్ణం దాగి ఉంటుంది?
జవాబు:
540 కాలరీలు

59. ఉక్కపోతకు కారణమైన దృగ్విషయం ఏది?
జవాబు:
ఆర్ద్రత

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 26

60. ఏఏ పట్టణాలలో ఒకే ఉష్ణోగ్రత నమోదు చేయబడింది?
జవాబు:
A మరియు B

61. – 4°C ను కెల్విన్లోకి మార్చండి.
జవాబు:
269 K

62. ఫ్రిజ్ నుండి తీసిన నీటిలో వేలు ముంచినప్పుడు చల్లగా ఆరుట అనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:
శరీరం నుండి నీటికి ఉష్ణం ప్రవహించడం వలన

63. కొన్ని చుక్కల పెట్రోల్ చేతిపై పడినప్పుడు, చల్లగా అనిపిస్తుంది. కారణమైన ప్రక్రియ ఏది?
జవాబు:
బాష్పీభవనం (శీతలీకరణ ప్రక్రియ)

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

64. 100°C వద్ద గల 1 గ్రా. నీరు 100°C గల నీరుగా మారడానికి బదిలీ కావలసిన ఉష్ణరాశి ఎంత?
జవాబు:
540 కాలరీలు

65. మరగడం మరియు బాష్పీభవనం మధ్య తేడాలను తెలుసుకొనుటకు ఒక ప్రశ్నను తయారుచేయుము.
జవాబు:
మరగడం మరియు బాష్పీభవనం అనే ప్రక్రియలలో ఏ ప్రక్రియ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగుతుంది?

66. మంచు ముక్కలు నీటిపై తేలడానికి కారణం ఏమిటి?
జవాబు:
నీటి సాంద్రత కన్నా మంచు సాంద్రత తక్కువ.

67. సమాన పరిమాణంలో నీటిని ఒక కప్పు మరియు ఒక ప్లేట్లో తీసుకొనుము. కొద్దిసేపటి తరువాత దేనిలో నీరు నీరు త్వరగా బాష్పీభవనం చెందును?
జవాబు:
ప్లేట్ లో నీరు

68. శీతలీకరణిగా వినియోగించే ద్రవం ఏమిటి?
జవాబు:
నీరు

69. తడి బట్టలు పొడిగా మారినప్పుడు ఆ నీరు ఏమవుతుంది?
జవాబు:
బాష్పీభవనం చెందును.

70. ‘బాష్పీభవన రేటు ఉపరితల వైశాల్యంపై ఆధారపడును’ అనే వాక్యాన్ని ప్రయోగం ద్వారా నిరూపించడానికి కావలసిన పరికరాలేవి?
జవాబు:
1) కప్పు,
2) సాసర్ / ప్లేట్

71. భూగోళంపై ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుటలో ఉపయోగపడే నీటి యొక్క ధర్మం ఏమిటి?
జవాబు:
అధిక విశిష్టోష్ణం

72. ఏ పదార్థానికి అధిక విశిష్టోష్ణం కలదు?
జవాబు:
నీటికి

73. తడిబట్టలు త్వరగా పొడిబట్టలుగా మారుటకు కావలసిన కొన్ని కారకాలు రాయుము.
జవాబు:
గాలి వీచు వేగం, ‘గాలిలో తేమ, ఉష్ణోగ్రత

74. మంచులో గల అణువుల మధ్య బంధాలను తెంచుటకు వినియోగింపబడు శక్తిని ఏమంటారు?
జవాబు:
ద్రవీభవన గుప్తోష్ణం

75. వర్షం పడిన కొద్ది సేపటి తర్వాత రోడ్డు పై నీరు మాయమగును. కారణం ఏమిటి?
జవాబు:
బాష్పీభవనం

76. కెల్విన్ మానంలో నీటి ద్రవీభవన, బాష్పీభవన స్థానాల మధ్య ఉష్ణోగ్రత భేదాన్ని రాయుము.
జవాబు:
100 K

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

77. వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలుచునపుడు సందర్భం
a) థర్మామీటర్ లో రీడింగు పెరగడం / తగ్గడం ఆగిన తర్వాత కొలవాలి
b) థర్మామీటర్ లో రీడింగు పెరుగుతున్నప్పుడు కొలవాలి. పై ఏ సందర్భం సరియైనది?
జవాబు:
‘a’ సరియైనది.

78. ఏ శక్తి వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహించును?
A) ఉష్ణం
B) నీరు
C) ఉష్ణోగ్రత
D) A (or) B
జవాబు:
A) ఉష్ణం

79.
AP Board 10th Class Physical Science Solutions 1st Lesson ఉష్ణం 6
పై పటంలో చూపిన ప్రయోగంలో ఏ థర్మామీటర్ రీడింగ్ త్వరగా పెరుగును?
జవాబు:
మొదటి థర్మా మీటరు (ఎడమ వైపు).

80. బాష్పీభవనం చెందినపుడు వ్యవస్థ ఉష్ణోగ్రత
a) తగ్గును
b) పెరుగును
C) స్థిరంగా ఉండును
జవాబు:
a

81. ప్రమీల శీతాకాలం ఉదయం కారు అద్దాలపై నీటి బిందువులను గమనించింది. దీనికి కారణం
a) తుషారం, బాష్పీభవనం
b) తుషారం, సాంద్రీకరణం
c) పొగమంచు, సాంద్రీకరణం
d) పొగమంచు, బాష్పీభవనం
జవాబు:
b) తుషారం, సాంద్రీకరణం

82. ‘నీటికి ఉష్ణోగ్రత ఇస్తూవుంటే, దాని ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది’. ఈ వాక్యంను సమర్థిస్తావా?
జవాబు:
సమర్థించను.

83. క్రింది ఏ ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు?
a) బాష్పీభవనం
b) మరగడం
c) ద్రవీభవనం
జవాబు:
a) బాష్పీభవనం

84. a) ద్రవం నుండి వాయువు
b) ద్రవం నుండి ఘనం
c) ఘనం నుండి ద్రవం
పై వానిలో ఏది ఘనీభవనాన్ని సూచించును?
జవాబు:
b) ద్రవం నుండి ఘనం

85. నీటి ఆవిరి నీరుగా మారినప్పుడు పరిసర గాలి ఎలా మారుతుంది?
జవాబు:
వేడెక్కును

10th Class Physics 1st Lesson ఉష్ణం 1 Mark Bits Questions and Answers

సరియైన సమాధానమును గుర్తించండి.

1. పళ్ళెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాలో సమాన పరిమాణంలో స్పిరిట్ ను తీసుకుంటే దేనిలో స్పిరిట్ నెమ్మదిగా బాష్పీభవనం చెందును?
A) సాసర్
B) వాచ్ గ్లాస్
C) కప్పు
D) పళ్ళెం
జవాబు:
C) కప్పు

2. 10వ తరగతి విద్యార్థిని పరీక్షించిన వైద్యుడు అతని శరీర ఉష్ణోగ్రత 310K గా చెప్పాడు. ఆ విద్యార్థి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలో …….
A) 273°C
B) 30°C
C) 98.4°C
D) 37°C
జవాబు:
D) 37°C

3. ప్రవచనం A : బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ.
ప్రవచనం B : మరగటం ఒక ఉద్ధీయ ప్రక్రియ.
A) A సరైనది, B సరైనది
B) A సరైనది, B సరియైనది కాదు
C) A సరియైనది కాదు, B సరైనది
D) A సరియైనది కాదు, B సరియైనది కాదు
జవాబు:
B) A సరైనది, B సరియైనది కాదు

4. ఉష్ణానికి S.I ప్రమాణాలు
A) కెలోరి
B) బౌల్
C) కెలోరి / p°C
D) బౌల్/కి.గ్రా. – కెల్విన్
జవాబు:
B) బౌల్

5. m1, m2 ద్రవ్యరాశులు గల ఒకే పదార్థానికి చెందిన నమూనాల ఉష్ణోగ్రతలు వరుసగా T1, T2 అయితే, వాటిని కలుపగా ఏర్పడే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత
AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం 27
జవాబు:
B

6. కింది వాటిలో ‘తుషారం’ ఏర్పడడం అనేది దేనికి ఉదాహరణ?
A) మరగడం
B) ద్రవీభవనం
C) సాంద్రీకరణం
D) బాష్పీభవనం
జవాబు:
C) సాంద్రీకరణం

7. నీరు మరుగుతున్న సందర్భంలో దాని ఉష్ణోగ్రత …….
A) స్థిరంగా ఉంటుంది
B) పెరుగుతుంది
C) తగ్గుతుంది
D) చెప్పలేము
జవాబు:
A) స్థిరంగా ఉంటుంది

AP 10th Class Physical Science Important Questions 1st Lesson ఉష్ణం

8. ఇది ఉపరితలానికి చెందిన దృగ్విషయము ……..
A) ఘనీభవనం
B) మరగడం
C) బాష్పీభవనము
D) పైవన్నీ
జవాబు:
C) బాష్పీభవనము

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

These AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 12th Lesson Important Questions and Answers నక్షత్రాలు – సౌరకుటుంబం

8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ధృవ నక్షత్రం ఎక్కడ కనిపిస్తుంది?
జవాబు:
ధృవ నక్షత్రం భూభ్రమణ అక్షానికి సూచీగా పైవైపు కనిపిస్తుంది.

ప్రశ్న 2.
ఉత్తరాయనం అనగానేమి?
జవాబు:
సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకి ఉత్తర దిక్కుగా కదులుటను ఉత్తరాయనం అంటారు.

ప్రశ్న 3.
ప్రాంతీయ మధ్యాహ్నవేళ అనగానేమి?
జవాబు:
ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క “ప్రాంతీయ మధ్యాహ్నవేళ” అంటారు.

ప్రశ్న 4.
దక్షిణాయనం అనగానేమి?
జవాబు:
సూర్యుడు ఉదయించే స్థానం రోజురోజుకి దక్షిణ దిక్కుగా కదులుటను దక్షిణాయనం అంటారు.

ప్రశ్న 5.
నీడ గడియారము ద్వారా సమయాన్ని కచ్చితంగా కొలవలేము. ఎందుకు?
జవాబు:
సూర్యుడు ఉత్తర-దక్షిణ దిశలలో (ఉత్తరాయనం, దక్షిణాయనం) కదలడం వల్ల నీడల పొడవులు రోజురోజుకి మారుతున్నాయి. కాబట్టి నీడ గడియారము ద్వారా సమయాన్ని కచ్చితంగా కొలవలేము.

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 6.
చంద్రకళలు ఏర్పడడానికి కారణం ఏమిటి?
జవాబు:
చంద్రుడు ఆకాశంలో తాను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. ఇదే చంద్రకళలు ఏర్పడడానికి కారణం.

ప్రశ్న 7.
చంద్రకళలు అనగానేమి?
జవాబు:
చంద్రుని ఆకారంలో కలిగే మార్పులను చంద్రకళలు అంటారు.

ప్రశ్న 8.
చంద్రగ్రహణం అనగానేమి?
జవాబు:
చంద్రుని కొంతభాగమో లేక పూర్తిగానో భూమి యొక్క నీడ చేత కప్పివేయబడినట్లు కనబడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు.

ప్రశ్న 9.
సూర్యగ్రహణం అనగానేమి?
జవాబు:
ఒక్కొక్కసారి సూర్యుడు పూర్తిగానో, పాక్షికంగానో, చంద్రునితో కప్పివేయబడినట్లవుతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు.

ప్రశ్న 10.
విశ్వం అనగానేమి?
జవాబు:
అనేక కోట్ల గెలాక్సీల సముదాయాన్ని విశ్వం అంటారు.

ప్రశ్న 11.
పాలపుంత (Milky way) అనగా నేమి?
జవాబు:
మనం ఉండే గెలాక్సీని పాలపుంత అంటారు.

ప్రశ్న 12.
గ్రహాల పరిభ్రమణ కాలం అనగానేమి?
జవాబు:
ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంటారు.

ప్రశ్న 13.
గ్రహాల భ్రమణ కాలం అనగానేమి?
జవాబు:
ఒక గ్రహం తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటారు.

ప్రశ్న 14.
గ్రహాలు అనగానేమి?
జవాబు:
సూర్యుని చుట్టూ తిరిగే ఎనిమిది అంతరిక్ష వస్తువులను గ్రహాలు అంటారు.

ప్రశ్న 15.
కృత్రిమ ఉపగ్రహాలు అనగానేమి?
జవాబు:
భూమి (గ్రహాల) చుట్టూ తిరిగే మానవ నిర్మిత అంతరిక్ష వస్తువులను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.

ప్రశ్న 16.
సూర్యునికి అతి దగ్గరగా, దూరంగా ఉన్న గ్రహాలేవి?
జవాబు:

  1. సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు.
  2. సూర్యునికి అతి దూరంగా ఉండే గ్రహం నెప్ట్యూన్.

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 17.
అంతర గ్రహాలు అని వేటిని అంటారు?
జవాబు:
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలను అంతర గ్రహాలు అంటారు.

ప్రశ్న 18.
బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు?
జవాబు:
గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలు అంటారు.

ప్రశ్న 19.
అంతరిక్షం నుండి భూమిని చూసినపుడు నీలి-ఆకుపచ్చ రంగులో ఎందుకు కనిపిస్తుంది?
జవాబు:
భూమి పైనున్న నేల మరియు నీటివల్ల కాంతి వక్రీభవనం చెందటం వలన అంతరిక్షం నుండి చూసినపుడు భూమి నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.

ప్రశ్న 20.
తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి?
జవాబు:
శుక్రగ్రహం, యురేనస్.

ప్రశ్న 21.
యురేనస్ గ్రహం సూర్యుని చుట్టూ దొర్లుతూ పరిభ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం ఏమిటి?
జవాబు:
యురేనస్ గ్రహం అక్షం అత్యధికంగా వంగి ఉండటం కారణంగా అది తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ప్రశ్న 22.
ఆస్టరాయిడ్లు అని వేటిని అంటారు?
జవాబు:
కుజుడు, బృహస్పతి, గ్రహ కక్ష్యల మధ్యగల విశాలమైన ప్రదేశంలో అనేక ,చిన్న చిన్న వస్తువులు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిని ఆస్టరాయిడ్లు అంటారు.

ప్రశ్న 23.
తోకచుక్కలు అనగానేమి?
జవాబు:
అంతరిక్షం నుండి పడే కొన్ని శకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతాయి. వీటినే తోకచుక్కలు అంటారు.

ప్రశ్న 24.
ఉల్కలు అనగానేమి?
జవాబు:
బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్ళు మరియు ఖనిజాలను ఉల్కలు అంటారు.

ప్రశ్న 25.
సౌర కుటుంబంలో గ్రహాలు కాకుండా మిగిలిన ఇతర అంతరిక్ష వస్తువులను తెల్పండి.
జవాబు:
ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు మరియు ఉల్కలు.

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 26.
అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది?
జవాబు:
శని గ్రహానికి అత్యధిక ఉపగ్రహాలు కలవు. ఇప్పటి వరకు కనుగొన్న ఉపగ్రహాల సంఖ్య 53.

ప్రశ్న 27.
కొన్ని కృత్రిమ ఉపగ్రహాల పేర్లు రాయండి.
జవాబు:
1. ఆర్యభట్ట 2. Insat 3. Irs 4. కల్పన -I 5. Edusat.

ప్రశ్న 28.
అంతరిక్ష వస్తువులు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనబడుతుంది. ఎందుకు?
జవాబు:
భూమి తన అక్షం చుట్టూ పడమర నుండి తూర్పునకు భ్రమణం చెందుతుంది. కాబట్టి అంతరిక్ష వస్తువులు తూర్పు నుండి పడమరకు కదులుతున్నట్లు కనబడతాయి. నిజానికి అంతరిక్ష వస్తువులు కదలవు.

ప్రశ్న 29.
మన రాష్ట్రంలో నీడ గడియారం ఎక్కడ తయారుచేయబడినది? రాయండి.
జవాబు:
మన రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గల ‘అన్నవరం’లో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నీడ గడియారం తయారుచేయబడినది.

ప్రశ్న 30.
ఈ క్రింది పట్టికను గమనించండి.

గ్రహం పేరు అంతర / బాహ్య గ్రహం ప్రత్యేక నామం
శుక్రుడు అంతర గ్రహం వేగుచుక్క / సాయంకాలం చుక్క
కుజుడు అంతర గ్రహం అరుణ గ్రహం

శుక్రుని వేగుచుక్క / సాయంకాల చుక్క అని అంటారు. ఎందుకు?
జవాబు:
కొన్ని సార్లు తూర్పువైపు సూర్యోదయం కన్నా ముందుగా కనిపించుట వలన వేగుచుక్క అని, కొన్ని సార్లు పడమర వైపు సూర్యాస్తమయం తరువాత కనిపించడం వలన సాయంకాలం చుక్క అని అంటారు.

8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నక్షత్రాలు పగటిపూట కనబడవు ఎందుకో తెల్పండి.
జవాబు:

  1. నక్షత్రాలు భూమి నుండి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి నక్షత్రాలు చుక్కలవలె రాత్రిపూట కనబడతాయి.
  2. పగటిపూట నక్షత్రాలు కనబడవు. ఎందుకంటే పగటిపూట సూర్యకాంతి చాలా ఎక్కువగా ఉండుట వలన.

ప్రశ్న 2.
సూర్యగ్రహణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
సూర్యగ్రహణాలు 4 రకాలు. అవి :

  1. సంపూర్ణ సూర్యగ్రహణం
  2. పాక్షిక సూర్యగ్రహణం
  3. వలయాకార సూర్యగ్రహణం
  4. మిశ్రమ సూర్యగ్రహణం

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 3.
చంద్రగ్రహణాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
చంద్రగ్రహణాలు 3 రకాలు అవి :

  1. సంపూర్ణ చంద్రగ్రహణం
  2. పాక్షిక చంద్రగ్రహణం
  3. ప్రచ్ఛాయ / ఉపచ్ఛాయ చంద్రగ్రహణం.

ప్రశ్న 4.
చంద్రయాన్-1 యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి?
జవాబు:

  1. చంద్రునిపై నీటి జాడను వెదకడం.
  2. చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం.
  3. హీలియం-3 ను వెదకడం, చంద్రుని యొక్క త్రిమితీయ ‘అట్లాస్’ను తయారుచేయడం.
  4. సౌరవ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెదకడం.

ప్రశ్న 5.
శాటిలైట్ (ఉపగ్రహాల)కు, గ్రహాలకు మధ్య భేదాలు రాయండి.
జవాబు:

శాటిలైట్ (ఉపగ్రహాలు) సంగ్రహాలు
1) ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తాయి 1) గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి.
2) ఉపగ్రహాలు నెమ్మదిగా పరిభ్రమిస్తాయి. 2) గ్రహాలు ఉపగ్రహాల కంటే వేగంగా పరిభ్రమిస్తాయి.

ప్రశ్న 6.
సూర్యుడిని నక్షత్రంగా గుర్తించుటకు గల కారణాలు ఏమిటి?
జవాబు:

  1. సూర్యుడు శక్తి వనరు.
  2. సూర్యుడు నిరంతరం మండుతూ ఉష్ణాన్ని. కొంతిని విడుదల చేస్తుంది.
  3. సూర్యుని జీవితకాలం ఎక్కువగా ఉండుట. సూర్యుడు 5 బిలియన్ల సంవత్సరాల క్రితం నుండి మండుతూ ఉంది.
    ఇంకా 5 బిలియన్ల సంవత్సరాలు మండుతుంది.

ప్రశ్న 7.
భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆ నక్షత్రం చుట్టూ తిరిగే ఏవైనా రెండు గ్రహాల పేర్లను తెల్పండి.
జవాబు:

  1. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు.
  2. బుధుడు, శుక్రుడు.

8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
నక్షత్రాలకు, గ్రహాలకు మధ్యగల భేదాలను రాయండి.
జవాబు:

నక్షత్రాలు గ్రహాలు
1) నక్షత్రాలు స్వయం ప్రకాశితాలు. 1) గ్రహాలు స్వయం ప్రకాశితాలు కావు.
2) ఇవి లెక్కపెట్టలేనన్ని గలవు. 2) గ్రహాలను లెక్కించవచ్చును.
3) నక్షత్రాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. 3) గ్రహాలు పరిమాణంలో నక్షత్రాల కంటే చిన్నగా ఉంటాయి.
4) నక్షత్రాలు కదలవు. 4) గ్రహాలు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయి.

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 2.
ఉల్కలు, ఉల్కాపాతముల మధ్య భేదాలను రాయండి.
జవాబు:

ఉల్కలు ఉల్కాపాతము
1) ఉల్కలు భూమిని చేరకముందే పూర్తిగా మండి కాంతిని ఇస్తాయి. 1) ఉల్కాపాతము పూర్తిగా మండకముందే భూమిని చేరుతుంది.
2) ఇవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. 2) వీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
3) ఇవి భూమిని నష్టపరచవు. 3) ఇవి భూమిని ఢీకొట్టి గోతులను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 3.
సూర్యగ్రహణం అనగా నేమి? అవి ఎన్నిరకాలు? వాటిని వివరించండి.
జవాబు:
చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుం. సూర్యగ్రహణాలు 4 రకాలు అవి :

  1. సంపూర్ణ సూర్యగ్రహణం
  2. పాక్షిక సూర్యగ్రహణం
  3. వలయాకార సూర్యగ్రహణం
  4. మిశ్రమ సూర్యగ్రహణం

1) సంపూర్ణ సూర్యగ్రహణం :
భూమిపై నుండి చూసినపుడు చంద్రుడు, సూర్యుని పూర్తిగా ఆవరించినట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

2) పాక్షిక సూర్యగ్రహణం :
చంద్రుని వలన ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ భూమిపై పడినపుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

3) వలయాకార సూర్యగ్రహణం :
సూర్యుడు భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్తున్నపుడు సూర్యుని మధ్యలో కొంతమేరకు మాత్రమే చంద్రుడు ఆవరించి, సూర్యుడు ప్రకాశవంతమైన వలయం వలె కనబడటాన్ని వలయాకార సూర్యగ్రహణం అంటాం.

4) మిశ్రమ సూర్యగ్రహణం :
వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందటాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటారు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది.

ప్రశ్న 4.
చంద్రగ్రహణం అనగానేమి? అవి ఎన్ని రకాలు? వాటిని వివరించండి.
జవాబు:
భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది.
చంద్రగ్రహణాలు 3 రకాలు అవి :

  1. సంపూర్ణ చంద్రగ్రహణం
  2. పాక్షిక చంద్రగ్రహణం
  3. ప్రచ్ఛాయ / ఉపచ్ఛాయ చంద్రగ్రహణం.

1) సంపూర్ణ చంద్రగ్రహణం :
మనకు కనిపించే చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా భూమి నీడ కప్పివేస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

2) పాక్షిక చంద్రగ్రహణం :
మనకు కనిపించే చంద్రుని ఉపరితలంలో కొంత భాగాన్ని భూమి నీడ కప్పివేస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

3) ప్రచ్ఛాయ./ ఉపచ్ఛాయ చంద్రగ్రహణం :
భూమి నీడ, యొక్క అంచులలో ఉండే పలుచని నీడ ప్రాంతం (భూమి యొక్క ప్రచ్ఛాయ / ఉపచ్ఛాయ) చంద్రునిపై పడటం వలన ఈ గ్రహణం ఏర్పడుతుంది.

ప్రశ్న 5.
సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల గురించి వివరించండి.
జవాబు:
1) బుధుడు (Mercury)

  1. బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న ఉపగ్రహం.
  2. సౌర కుటుంబంలో అతిచిన్న గ్రహం.
  3. సూర్యోదయానికి కొద్ది సమయం ముందుగానీ, సూర్యాస్తమయం వెంటనేగానీ, దిజ్మండలానికి దగ్గరలో బుధుడ్ని చూడవచ్చును.
  4. దీని ఒక పరిభ్రమణానికి 88 రోజులు పడుతుంది.

2) శుక్రుడు (Venus)

  1. సూర్యుని నుండి రెండవ గ్రహం.
  2. భూమికి అతిదగ్గరలో గల గ్రహం.
  3. గ్రహాలలో కెల్లా అతి ప్రకాశవంతమైనది. దీనిని వేగుచుక్క లేదా సాయంకాల చుక్క అంటారు.
  4. తన అక్షం చుట్టూ తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది.
  5. దీని పరిభ్రమణానికి 225 రోజులు పడుతుంది.

3) భూమి (Earth)

  1. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి.
  2. భూమిపై జీవం పుట్టడానికి, మనగలగడానికి ప్రత్యేక పర్యావరణ పరిస్థితులను కలిగి ఉన్నది.
  3. హానికరమైన (u.v) కాంతి నుండి జీవులను రక్షించడానికి ఓజోన్ పొర భూమిపై ఆవరించబడి ఉన్నది.
  4. భూమి ఒక్క చంద్రుణ్ణి మాత్రమే ఉపగ్రహంగా కలిగి వుంది.
  5. దీని ఒక పరిభ్రమణానికి 365.25 రోజులు పడుతుంది.

4) కుజుడు లేదా అంగారకుడు (Mars)

  1. ఇది సూర్యుని నుండి 4వ గ్రహం.
  2. ఇది ఎరుపు రంగులో కనబడడంచేత దీనిని ‘అరుణగ్రహం’ అంటారు.
  3. అంగారకుడికి రెండు సహజ ఉపగ్రహాలు కలవు.
  4. దీని పరిభ్రమణానికి 687 రోజులు పడుతుంది.

5) గురుడు లేదా బృహస్పతి (Jupiter)

  1. సౌర కుటుంబంలో ఇది అతి పెద్ద గ్రహం.
  2. ఇవి తనచుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.
  3. దీనికి 50 ఉపగ్రహాలు ఉన్నాయి.
  4. దీనిచుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నాయి.
  5. దీని ఒక పరిభ్రమణానికి 4331 రోజులు పడుతుంది.

6) శని (Saturn)

  1. శని గ్రహం పెద్ద గ్రహాలలో రెండవది.
  2. ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.
  3. దీని చుట్టూ ఉన్న వలయాలను టెలిస్కోపు ద్వారా చూడవచ్చును.
  4. దీనికి 53 ఉపగ్రహాలు ఉన్నాయి.
  5. దీని పరిభ్రమణానికి 29. 5 సంవత్సరాలు పడుతుంది.

7) యురేనస్ (Uranus)

  1. ఇది సూర్యుని నుండి 7వ గ్రహం.
  2. దీనిని అతి పెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం.
  3. ఇది శుక్రగ్రహం వలె తనచుట్టూ తాను తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది.
  4. దీని భ్రమణాక్షం వంపు కారణంగా తనచుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది.
  5. దీని పరిభ్రమణానికి 84 సంవత్సరాలు పడుతుంది.

8) నెఫ్యూన్ (Neptune)

  1. ఇది సూర్యుని నుండి 8వ గ్రహం.
  2. దీనిపై అత్యల్ప ఉష్ణోగ్రత (38°C) ఉంటుంది.
  3. దీని ఒక పరిభ్రమణానికి 165 సంవత్సరాలు పడుతుంది.

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

ప్రశ్న 6.
ఉల్కలకు, తోకచుక్కలకు గల భేదాలు రాయండి.
జవాబు:

ఉల్కలు తోకచుక్కలు
1) అంతరిక్షం నుండి కిందకు పడిపోతున్న రాళ్ళు మరియు ఖనిజాలు. 1) అంతరిక్షం నుండి పడేకొన్ని శకలాలు. సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగును.
2) ఇవి భూమి వాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశించి మండుతూ, వెలిగిపోతాయి. 2) సూర్యుని వేడి వలన ఉత్పత్తి అయిన వాయువులు మండి ప్రకాశిస్తూ తోకవలె కన్పిస్తాయి.
3) భూమిపై పడి గోతులను ఏర్పరుస్తాయి. 3) హేలీ అనే శాస్త్రవేత్త కనుగొన్న తోకచుక్కకు హేలీ తోకచుక్క అని పేరు పెట్టారు.

ప్రశ్న 7.
తోక చుక్కల గురించి వివరించండి.
జవాబు:

  1. అంతరిక్షం నుండి పడే కొన్ని శకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగే వాటిని తోక చుక్కలు అంటారు.
  2. తోక చుక్కల పరిభ్రమణ కాలం చాలా ఎక్కువగా ఉంటుంది.
  3. తోకచుక్క సాధారణంగా కాంతివంతమైన తల మరియు తోక కలిగి ఉన్నట్లుగా కనబడుతుంది.
  4. తోకచుక్క సూర్యుని సమీపిస్తున్న కొలదీ దానితోక పొడవు పెరుగుతుంది. ,దీని తోక ఎల్లప్పుడూ సూర్యుని వ్యతిరేక – దిశలో ఉంటుంది.
  5. హేలీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్న హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి మనకు కనిపిస్తుంది. 1986లో చూశాము. మరల 2062 సంవత్సరంలో కనబడుతుంది.

ప్రశ్న 8.
ఉల్కలను వివరించండి.
జవాబు:

  1. అంతరిక్షం నుండి భూమివైపు వేగంగా కిందకు పడిపోయే రాళ్ళను, ఖనిజాలను ఉల్కలు అంటారు.
  2. ఇవి భూ వాతావరణంలో చొరబడిన చిన్న వస్తువులు.
  3. ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటం వలన భూవాతావరణం యొక్క ఘర్షణ కారణంగా బాగా వేడెక్కి మండిపోయి ఆవిరైపోతాయి.
  4. ఇవి వెలుగుచున్న చారలవలె కనిపించి మాయమవుతాయి.
  5. కొన్నిసార్లు ఉల్కలు అతి పెద్దగా ఉండటం వల్ల మండి ఆవిరయ్యేలోపే భూమిని చేరుతాయి.
  6. భూమిని చేరి, ఢీ కొట్టి గోతులను కలుగచేస్తాయి.
  7. భూమిపై పడే ఉల్కను ఉల్కాపాతము అంటారు.
  8. సౌర కుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకొనుటకు ఉల్కాపాతాలు శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.

ప్రశ్న 9.
కింది పట్టికను అధ్యయనం చేసి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1
1. అతి తక్కువ మరియు గరిష్ట సంఖ్యలో చంద్రుళ్ళను కలిగిన గ్రహాలు ఏవి?
జవాబు:

  1. అతి తక్కువ చంద్రుళ్ళు గల గ్రహం : బుధుడు .
  2. అతి ఎక్కువ చంద్రుళ్ళు గల గ్రహం : శని

2. పై వాటిలో అత్యంత వేడియైన గ్రహం ఏది? ఎందుకు?
జవాబు:
బుధుడు. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉంటుంది.

3. అంతర, బాహ్య గ్రహాలకు ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
అంతర గ్రహాలు : బుధుడు (లేదా) భూమి (లేదా) అంగారకుడు.
బాహ్య గ్రహాలు : బృహస్పతి (లేదా) శని (లేదా) నెప్ట్యూన్.

4. ఏ గ్రహం యొక్క ఉపగ్రహం భూమి యొక్క సహజ ఉపగ్రహం కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది.
జవాబు:
బృహస్పతి లేదా శని ఉపగ్రహం

8th Class Physics 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

I. సరియగు జవాబును ఎంచుకోండి.

1. ఈ కింది వానిలో సౌర కుటుంబంలో లేనిది
A) గ్రహం
B) గెలాక్సీ
C) తోకచుక్క
D) ఉల్కలు
జవాబు:
B) గెలాక్సీ

2. హేలీ తోకచుక్క …..కు ఒకసారి కనిపిస్తుంది.
A) 76 నెలలు
B) 76 సంవత్సరాలు
C) 56 నెలలు
D) 56 సంవత్సరాలు
జవాబు:
B) 76 సంవత్సరాలు

3. సప్తర్షి మండలం (Ursa Minar) అనునది
A) నక్షత్రం
B) నక్షత్రరాశులు
C) గ్రహాలు
D) గ్రహాల సముదాయం
జవాబు:
B) నక్షత్రరాశులు

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

4. ఈ కింది వానిలో అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహమేది?
A) బృహస్పతి
B) శని
C) బుధుడు
D) కుజుడు
జవాబు:
B) శని

5. చిన్న చిన్న గుంపుల ఆకారాలను, వివిధ జంతువుల, మనుషుల ఆకారాలు గల వక్షత్రాల సముదాయాన్ని …………. అంటారు.
A) నక్షత్రరాశులు
B) గెలాక్సీ
C) ఆస్టరాయిడ్స్
D) సౌర కుటుంబం
జవాబు:
A) నక్షత్రరాశులు

6. సూర్యునిచుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరిగే అంతరిక్ష వస్తువు (శకలాలు) లను …….. అంటారు.
A) తోకచుక్కలు
B) ఉల్కలు
C) గ్రహాలు
D) ఆస్టరాయిడ్స్
జవాబు:
A) తోకచుక్కలు

7. కుజుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువు (శకలాలు) లను …… అంటారు.
A) శాటిలైట్స్
B) తోకచుక్కలు
C) ఆస్టరాయిడ్స్
D) ఉల్కలు
జవాబు:
C) ఆస్టరాయిడ్స్

8. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం
A) ధృవ నక్షత్రం
B) మకరము
C) ఒరియన్
D) సూర్యుడు
జవాబు:
D) సూర్యుడు

9. ఈ కింది వానిలో దేనిని వేగుచుక్క లేదా సాయంకాల చుక్క అంటారు.
A) శుక్రుడు
B) కుజుడు
C) బృహస్పతి
D) బుధుడు
జవాబు:
A) శుక్రుడు

10. మనం ఉండే గెలాక్సీని …….. అంటారు.
A) 24 గంటలు
B) 24 గంటల కంటే తక్కువ
C) 24 గంటల 50 నిమిషాలు
D) ఏదీకాదు
జవాబు:
C) 24 గంటల 50 నిమిషాలు

11. ఈ కింది వానిలో గ్రహం కానిది
A) కుజుడు
B) శని
C) బృహస్పతి
D) సప్తర్షి మండలం
జవాబు:
D) సప్తర్షి మండలం

12. సూర్యుని నుండి దూరంగా ఉన్న గ్రహం
A) యురేనస్
B) బృహస్పతి
C) నెప్ట్యూన్
D) శని
జవాబు:
C) నెప్ట్యూన్

13. ఈ కింది రోజున చంద్రుని మనం చూడలేము
A) అమావాస్య రోజు
B) పౌర్ణమి రోజు
C) అష్టమి రోజు
D) నవమి రోజు
జవాబు:
A) అమావాస్య రోజు

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

14. ఒక అమావాస్యకు మరొక అమావాస్యకు మధ్యకాలం
A) 15 రోజులు
B) 29 రోజులు
C) 28 రోజులు
D) 14 రోజులు
జవాబు:
C) 28 రోజులు

15. ధృవ నక్షత్రాన్ని ఈ కింది వాటి సహాయంతో గుర్తించవచ్చును.
A) సప్తర్షి మండలం
B) శర్మిష్టరాశి
C) ఒరియన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. కదలకుండా ఉన్నట్లు కనబడే నక్షత్రం
A) శుక్రుడు
B) ధృవ నక్షత్రం
C) ఒరియన్
D) శర్మిష్టరాశి
జవాబు:
B) ధృవ నక్షత్రం

17. M లేదా W ఆకారంలో గల నక్షత్ర రాశి
A) సప్తర్షి మండలం
B) శర్మిష్టరాశి
C) ఒరియన్
D) లియో (సింహరాశి)
జవాబు:
B) శర్మిష్టరాశి

18. సౌర కుటుంబంలో అతిచిన్న గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) కుజుడు
D) యురేనస్
జవాబు:
A) బుధుడు

19. ఈ కింది వానిలో ఉపగ్రహం
A) భూమి
B) చంద్రుడు
C) బుధుడు
D) శుక్రుడు
జవాబు:
B) చంద్రుడు

20. భూమి యొక్క ఆత్మభ్రమణం
A) తూర్పు నుండి పడమరకు
B) పడమర నుండి తూర్పునకు
C) ఉత్తరం నుండి దక్షిణానికి
D) దక్షిణం నుండి ఉత్తరానికి
జవాబు:
B) పడమర నుండి తూర్పునకు

21. చంద్రుడు ఆకాశంలో తను కనిపించిన ప్రదేశంలో మళ్ళీ కనిపించడానికి పట్టే సమయం
A) భూ గెలాక్సీ
B) సూర్య గెలాక్సీ
C) పాలపుంత
D) సప్తర్షి మండలం
జవాబు:
C) పాలపుంత

22. సూర్యోదయానికి కొద్ది సమయంగానీ సూర్యాస్తమయం వెంటనే గానీ, దిజ్మండలానికి దగ్గరలో కనబడే గ్రహం
A) శుక్రుడు
B) బుధుడు
C) కుజుడు
D) శని
జవాబు:
B) బుధుడు

23. వేగుచుక్క (morning star), సాయంకాల చుక్క (Evening star) అని పిలిచే గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) కుజుడు
D) శని
జవాబు:
B) శుక్రుడు

24. అరుణగ్రహం పేరు గల గ్రహం
A) కుజుడు
B) గురుడు
C) శని
D) యురేనస్
జవాబు:
A) కుజుడు

25. ఈ మధ్యకాలంలో ……… గ్రహంపై నీరు ఉన్నట్లు కనుగొనబడినది.
A) కుజుడు
B) గురుడు
C) శని
D) శుక్రుడు
జవాబు:
A) కుజుడు

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

26. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) బృహస్పతి
D) కుజుడు
జవాబు:
C) బృహస్పతి

27. భూమిపై నిట్టనిలువుగా ఉంచబడిన ఏ వస్తువు యొక్క “అతితక్కువ పొడవైన” నీడైనా ఎల్లప్పుడూ చూపు దిక్కులు
A) ఉత్తరం
B) దక్షిణం
C) ఉత్తర-దక్షిణలు
D) తూర్పు-పడమరలు
జవాబు:
C) ఉత్తర-దక్షిణలు

28. ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క …….. వేళ అంటారు.
A) మధ్యాహ్న
B) ఉదయపు
C) సాయంకాలపు
D) అర్ధరాత్రి
జవాబు:
A) మధ్యాహ్న

29. పూర్వకాలంలో ప్రజలు దీని ఆధారంగా కాలాన్ని లెక్కించేవారు.
A) సూర్యుని బట్టి
B) చంద్రుని బట్టి
C) వస్తు నీడలను బట్టి
D) వస్తు పొడవులను బట్టి
జవాబు:
C) వస్తు నీడలను బట్టి

30. సూర్యోదయ సమయంలో సూర్యుడు రోజురోజుకీ దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే అది
A) సంవత్సరం
B) దక్షిణాయనం
C) ఉత్తరాయనం
D) సంపూర్ణ సూర్యోదయం
జవాబు:
B) దక్షిణాయనం

31. సూర్యోదయ సమయంలో సూర్యుడు రోజురోజుకీ ఉత్తర దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే అది
A) సంవత్సరం
B) దక్షిణాయనం
C) ఉత్తరాయనం
D) సంపూర్ణ సూర్యోదయం
జవాబు:
C) ఉత్తరాయనం

32. మన రాష్ట్రంలోని ఏకైక నీడ గడియారం గల జిల్లా
A) పశ్చిమ గోదావరి
B) తూర్పు గోదావరి
C) విశాఖపట్నం
D) చిత్తూరు
జవాబు:
B) తూర్పు గోదావరి

33. మన రాష్ట్రంలోని ఏకైక నీడ గడియారం గల ప్రాంతం
A) అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం
B) తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
C) శ్రీకాకుళం సూర్యదేవుని ఆలయ ప్రాంగణం
D) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం
జవాబు:
A) అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం

34. చిత్తూరు జిల్లా అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 19
B) 13
C) 14
D) 15
జవాబు:
B) 13

35. పశ్చిమగోదావరి, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లాల అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 14
B) 15
C) 16
D) 17
జవాబు:
C) 16

36. శ్రీకాకుళం, విజయనగరం, మెదక్, నిజామాబాద్, ( కరీంనగర్, వరంగల్ జిల్లాల అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 16
B) 17
C) 18
D) 19
జవాబు:
C) 18

37. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల అక్షాంశ డిగ్రీ పూర్ణాంక విలువ
A) 15
B) 17
C) 18
D) 19
జవాబు:
A) 15

38. చంద్రుని ఆకారం ప్రతిరోజూ మారుతూ ఉండటంను …………. అంటారు.
A) చంద్ర ఆకారాలు
B) చంద్రుని కళలు
C) చంద్రుని రూపాలు
D) ఏదీకాదు
జవాబు:
B) చంద్రుని కళలు

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

39. ఆకాశంలో సూర్యోదయం సంభవించిన ఒక నిర్ణీత ప్రదేశంలోకి.మళ్ళీ సూర్యుడు రావడానికి పట్టుకాలం
A) 22 గంటలు
B) 21 గంటలు
C) 24 గంటలు
D) 25 గంటలు
జవాబు:
C) 24 గంటలు

40. చంద్రుని ఉపరితలం పూర్తిగా కన్పించు రోజు
A) అమావాస్య
B) పౌర్ణమి
C) చెప్పలేము
D) ఏదీకాదు
జవాబు:
B) పౌర్ణమి

41. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపున ఉంటారు.
A) పౌర్ణమి
B) అమావాస్య
C) చంద్రగ్రహణం
D) ఏదీకాదు
జవాబు:
B) అమావాస్య

42. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరోవైపున ఉంటారు.
A) పౌర్ణమి
B) అమావాస్య
C) సూర్యగ్రహణం
D) ఏదీకాదు
జవాబు:
A) పౌర్ణమి

43. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టిన సంవత్సరం
A) 1968
B) 1967
C) 1969
D) 1950
జవాబు:
C) 1969

44. మనదేశం చంద్రుని పైకి పంపిన మొదటి ఉపగ్రహం పేరు
A) చంద్రయాన్ -1
B) చంద్రయాన్ – 2
C) చంద్రయాన్ – 3
D) ఏదీకాదు
జవాబు:
A) చంద్రయాన్ -1

45. క్రింది వాటిలో చంద్రయాన్-1 ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి కానిది
A) నీటి జాడను వెదకడం
B) పదార్థ మూలకాలను తెలుసుకోవడం
C) హీలియం-3 ను వెదకడం
D) చంద్రునిపై ముసలమ్మ జాడను కనుగొనడం
జవాబు:
D) చంద్రునిపై ముసలమ్మ జాడను కనుగొనడం

46. వీరి నీడ భూమిపై పడుట వలన సూర్యగ్రహణం ఏర్పడును.
A) చంద్రుడు
B) సూర్యడు
C) భూమి
D) చెప్పలేము
జవాబు:
A) చంద్రుడు

47. సూర్యగ్రహణం ………………… రోజు మాత్రమే సంభవించును.
A) అమావాస్య
B) పౌర్ణమి
C) 15వ
D) ఏదీకాదు
జవాబు:
A) అమావాస్య

48. భూమిపై నుండి చూసినపుడు చంద్రుడు, సూర్యుని పూర్తిగా ఆవరించినట్లయితే ఈ రకపు సూర్యగ్రహణం ఏర్పడును.
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
A) సంపూర్ణ

49. చంద్రుని పలుచని నీడ (ఉపచ్ఛాయ/ప్రచ్ఛాయ)లు భూమిపై పడినపుడు ఏర్పడు సూర్యగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
B) పాక్షిక

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

50. సూర్యుని మధ్యలో కొంతమేర మాత్రమే చంద్రుడు ఆవరించినపుడు ఏర్పడు సూర్యగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
C) వలయాకార

51. వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్య గ్రహణంగా మార్పు చెందుటను …….. గ్రహణం అంటారు.
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
D) మిశ్రమ

52. ఈ క్రింది వాటిలో అరుదుగా ఏర్పడు సూర్యగ్రహణం మధ్య పనిచేయు బలం
A) సంపూర్ణ
B) పాక్షిక
C) వలయాకార
D) మిశ్రమ
జవాబు:
D) మిశ్రమ

53. భూమి యొక్క నీడ వీరిపై పడుట వలన చంద్రగ్రహణం ఏర్పడును.
A) చంద్రుడు
B) సూర్యడు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) చంద్రుడు

54. చంద్రుని ఉపరితలంను భూఛాయ పూర్తిగా కప్పివేసిన ఏర్పడు చంద్రగ్రహణం రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్ఛాయ
D) ఉపచ్ఛాయ
జవాబు:
A) సంపూర్ణ

55. చంద్రుని ఉపరితలంను భూఛాయ కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తే ఏర్పడు చంద్రగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్ఛాయ
D) ఉపచ్ఛాయ
జవాబు:
B) పాక్షిక

56. భూమి ప్రచ్ఛాయ వలన ఏర్పడు చంద్రగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్ఛాయ
D) ఉపచ్ఛాయ
జవాబు:
C) ప్రచ్ఛాయ

57. భూమి ఉపచ్ఛాయ వలన ఏర్పడు చంద్రగ్రహణ రకము
A) సంపూర్ణ
B) పాక్షిక
C) ప్రచ్చాయ
D) ఉపచ్చాయ
జవాబు:
D) ఉపచ్చాయ

58. నక్షత్రాల గుంపును ……. అంటారు.
A) రాశి
B) గెలాక్సీ
C) విశ్వం
D) చెప్పలేము
జవాబు:
A) రాశి

59. లక్షలు, కోట్లు నక్షత్రాలు గల పెద్ద గుంపులను ………. అంటారు
A) రాశి
B) గెలాక్సీ
C) విశ్వం
D) చెప్పలేము.
జవాబు:
B) గెలాక్సీ

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

60. అనేక కోట్ల గెలాక్సీలు దీనిలో కలవు.
A) రాశి
B) గెలాక్సీ
C) విశ్వం
D) చెప్పలేము
జవాబు:
C) విశ్వం

61. నక్షత్రాల కదలికలను తెలుసుకొనుటకు మనం తెలుసుకొని ఉండవలసినవి
A) ధృవ నక్షత్రం
B) సప్తర్షి మండలం
C) శర్మిష్ట రాశి
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ

62. ధృవ నక్షత్రం నిలకడగా వున్నట్లు కన్పించుటకు కారణం
A) భూభ్రమణ అక్షంకు పైవైపుననే ఉండుట వలన
B) భూభ్రమణ అక్షంకు క్రిందివైపుననే ఉండుట వలన
C) భూభ్రమణ అక్షంకు కుడివైపుననే ఉండుట వలన
D) భూభ్రమణ అక్షంకు ఎడమవైపుననే ఉండుట వలన
జవాబు:
A) భూభ్రమణ అక్షంకు పైవైపుననే ఉండుట వలన

63. సౌరకుటుంబంలోని సూర్యునికి, అంతరిక్ష వస్తువుల
A) గురుత్వాకర్షణ
B) అయస్కాంత
C) విద్యుత్
D) ప్రేరిత
జవాబు:
A) గురుత్వాకర్షణ

64. ఈ క్రింది వాటిలో అత్యంత ఉష్ణం మరియు కాంతిని నిరంతరంగా వెదజల్లునది
A) శుక్రుడు
B) బుధుడు
C) సూర్యుడు
D) భూమి
జవాబు:
C) సూర్యుడు

65. ఒక గ్రహం సూర్యుని చుట్టూ , ఒకసారి తిరుగుటకు పట్టుకాలంను ……… అంటారు.
A) భ్రమణకాలం
B) పరిభ్రమణకాలం
C) ఆత్మభ్రమణకాలం
D) ఏదీకాదు
జవాబు:
B) పరిభ్రమణకాలం

66. ఒక గ్రహం తనచుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టు కాలంను ….. అంటారు.
A) భ్రమణకాలం
B) పరిభ్రమణకాలం
C) ఆత్మభ్రమణకాలం
D) ఏదీకాదు
జవాబు:
A) భ్రమణకాలం

67. ఏ అంతరిక్ష వస్తువైనా మరొక దానిచుట్టూ తిరుగుతూ ఉంటే దానిని …….. అంటాము.
A) గ్రహశకలం
B) ఉపగ్రహం
C) తోకచుక్క
D) ఏదీకాదు
జవాబు:
B) ఉపగ్రహం

68. భూమికి గల సహజ ఉపగ్రహం
A) చంద్రయాన్-1
B) చంద్రయాన్-2
C) చంద్రుడు
D) చంద్రయాన్-3
జవాబు:
C) చంద్రుడు

69. గ్రహాలలోకెల్లా భూమికి దగ్గరగా ఉన్న గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) బృహస్పతి
D) కుజుడు
జవాబు:
B) శుక్రుడు

70. ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేనిది
A) బుధుడు
B) శుక్రుడు
C) బృహస్పతి
D) కుజుడు
జవాబు:
B) శుక్రుడు

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

71. సౌరకుటుంబంలోని గ్రహాలలోకెల్లా జీవం కల్గిన గ్రహం
A) బుధుడు
B) శుక్రుడు
C) భూమి
D) కుజుడు
జవాబు:
C) భూమి

72. అంతరిక్షం నుండి చూచినపుడు భూమి నీలి – ఆకుపచ్చ రంగులో కన్నించుటకు గల కారణము
A) కాంతి వక్రీభవనం
B) కాంతి పరావర్తనం
C) అయస్కాంత ప్రభావం
D) అన్నియూ
జవాబు:
A) కాంతి వక్రీభవనం

73. గ్రహాలలోకెల్లా ఎరుపు రంగులో ఉండు గ్రహం
A) కుజగ్రహం
B) బుధగ్రహం
C) శుక్రగ్రహం
D) బృహస్పతి
జవాబు:
A) కుజగ్రహం

74. గురుగ్రహ పరిమాణం భూమి పరిమాణంకు ……. రెట్లు.
A) 1200
B) 1300
C) 1400
D) 1500
జవాబు:
B) 1300

75. గురుగ్రహ ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి ……. రెట్లు.
A) 300
B) 350
C) 318
D) 250
జవాబు:
C) 318

76. ఈ క్రింది గ్రహాలలో పసుపు వర్ణంలో ఉండు గ్రహం
A) గురుడు
B) భూమి
C) శని
D) నెప్ట్యూన్
జవాబు:
C) శని

77. ఈ క్రింది వాటిలో అంతర గ్రహాలకు చెందనిది
A) భూమి
B) బుధుడు
C) శని
D) శుక్రుడు
జవాబు:
C) శని

78. ఈ క్రింది వాటిలో బాహ్య గ్రహాలకు చెందనిది
A) గురుడు
B) శని
C) కుజుడు
D) యురేనస్
జవాబు:
C) కుజుడు

79. ఈ క్రింది వాటిలో అధిక ఉపగ్రహాలు గలవి
A) అంతర గ్రహాలు
B) బాహ్య గ్రహాలు
C) సూర్యుడు
D) చెప్పలేము
జవాబు:
B) బాహ్య గ్రహాలు

80. ఈ క్రింది వాటిలో చుట్టూ వలయాలను కల్గి ఉన్నవి
A) అంతర గ్రహాలు
B) బాహ్య గ్రహాలు
C) సూర్యుడు
D) చెప్పలేము
జవాబు:
B) బాహ్య గ్రహాలు

81. క్రింది గ్రహాలలో సౌరకుటుంబం నుండి తొలగించబడిన గ్రహం
A) గురుడు
B) యురేనస్
C) నెప్ట్యూన్
D) ప్లూటో
జవాబు:
D) ప్లూటో

82. క్రింది పటంలో చూపబడిన సౌర వస్తువులు
AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం 2
A) ఆస్టరాయిడ్లు
B) తోకచుక్కలు
C) ఉల్కలు
D) ఉల్కాపాతాలు
జవాబు:
A) ఆస్టరాయిడ్లు

83. క్రింది వాటిలో సూర్యుని చుట్టూ అతి దీర్ఘవృత్త కక్ష్యలలో పరిభ్రమించేవి
A) ఆస్టరాయిడ్లు
B) తోకచుక్కలు
C) ఉల్కలు
D) ఉల్కాపాతాలు
జవాబు:
B) తోకచుక్కలు

84. భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం
A) INSAT
B) IRS
C) ఆర్యభట్ట
D) EDUSAT
జవాబు:
C) ఆర్యభట్ట

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

85. సూర్యుని వ్యాసము కి.మీలలో
A) 13, 92,000
B) 12,756
C) 14, 92,000
D) 13,90,000
జవాబు:
A) 13, 92,000

86. i) భూమి యొక్క నీడ చంద్రునిపై పడిన పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
ii) చంద్రుని నీడ భూమిపై పడిన పౌర్ణమి రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
A) (i) మాత్రమే సత్యం
B) (ii) మాత్రమే సత్యం
C) (i), (ii) లు రెండు సత్యమే
D) (i), (ii) లు రెండు అసత్యమే
జవాబు:
A) (i) మాత్రమే సత్యం

87. చంద్రునిపై పరిశోధనలకుగాను చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం
A) జపాన్
B) భారత్
C) రష్యా
D) ఇంగ్లాండ్
జవాబు:
B) భారత్

88. “బుధునిపై జీవరాశి లేదు” ఇందుకు గల కారణాలు గుర్తించండి.
A) ఎక్కువ వేడి ఉండటం.
B) భూభాగం లేకుండా అంతా నీరు ఉండుట.
C) ఉపగ్రహాలు లేకపోవడం.
D) పూర్తిగా మంచుతో కప్పబడి ఉండుట.
జవాబు:
A) ఎక్కువ వేడి ఉండటం.

89. గ్రూప్-Aలోని గ్రహాలను, గ్రూప్-Bలోని ప్రత్యేకతలతో జతపరచండి.
గ్రూప్-A గ్రూప్-B
P) అంగారకుడు X) అతి పెద్ద గ్రహం
Q) శుక్రుడు Y) అరుణ గ్రహం
R) బృహస్పతి Z) వేగుచుక్క
A) P-Y, Q-X, R-Z
B) P-Y, Q-Z, R-X
C) P-2, Q-X, R-Y
D) P-2, Q-Y, R-X
జవాబు:
B) P-Y, Q-Z, R-X

90. భూమి కొంత వంగి చలించడం వలన కలిగే ప్రభావం
A) తుపానులు
B) రాత్రి పగలు
C) ఋతువులు
D) గ్రహణాలు
జవాబు:
C) ఋతువులు

91. భూమి, అంగారకుడికి మధ్య ఒక కొత్త గ్రహాన్ని కనుగొంటే దాని యొక్క పరిభ్రమణ కాలం
A) అంగారకుడి పరిభ్రమణ కాలం కన్నా తక్కువ.
B) అంగారకుడి పరిభ్రమణ కాలం కన్నా ఎక్కువ.
C) అంగారకుడి పరిభ్రమణ కాలానికి సమానం.
D) భూమి యొక్క పరిభ్రమణ కాలం కన్నా తక్కువ.
జవాబు:
A) అంగారకుడి పరిభ్రమణ కాలం కన్నా తక్కువ.

92. భూమిపై నుండి చూసినపుడు సూర్యుడు తూర్పు నుండి పడమర వైపు కదిలినట్లు అనిపిస్తాడు. దీని అర్థం భూమి ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది.
A) తూర్పు నుండి పడమరకు
B) పడమర నుండి తూర్పుకు
C) ఉత్తరం నుండి దక్షిణానికి
D) దక్షిణం నుండి ఉత్తరానికి
జవాబు:
B) పడమర నుండి తూర్పుకు

AP 8th Class Physical Science Important Questions 12th Lesson నక్షత్రాలు – సౌరకుటుంబం

93. అంతరిక్ష నౌకలకు అమర్చే “హీట్ షీల్డ్” యొక్క క్రింది ఏ ఉపయోగాన్ని నీవు అభినందిస్తావు?
A) హీట్ షీల్డ్ అంతరిక్ష నౌకను ఆకర్షనీయంగా చేసుంది.
B) హీట్ షీల్డ్ అంతరిక్షనౌకను తేలికగా చేస్తుంది.
C) హీట్ షీల్డ్ అంతరిక్షనౌకను వేగాన్ని తగ్గిస్తుంది.
D) హీట్ షీల్డ్ ఘర్షణ వలన జనించే ఉష్ణాన్ని నిరోధిస్తుంది.
జవాబు:
D) హీట్ షీల్డ్ ఘర్షణ వలన జనించే ఉష్ణాన్ని నిరోధిస్తుంది.

II. జతపరచుము

1)

Group – A Group – B
1. బుధుడు A) అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం
2. బృహస్పతి B) తూర్పు నుండి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహం
3. శని C) అతి పెద్ద గ్రహం
4. నెప్ట్యూన్ D) అతిచిన్న గ్రహం
5. శుక్రుడు E) సూర్యుని నుండి అత్యధిక దూరంలో గల గ్రహం

జవాబు:

Group – A Group – B
1. బుధుడు D) అతిచిన్న గ్రహం
2. బృహస్పతి C) అతి పెద్ద గ్రహం
3. శని A) అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం
4. నెప్ట్యూన్ E) సూర్యుని నుండి అత్యధిక దూరంలో గల గ్రహం
5. శుక్రుడు B) తూర్పు నుండి పడమరకు ఆత్మభ్రమణం చేసే గ్రహం

2)

Group – A Group – B
1. చంద్రకళలు A) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ చూపించే దిశ
2. సూర్యగ్రహణం B) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ ఏర్పడినపుడు సమయం
3. చంద్రగ్రహణం C) అమావాస్య రోజు ఏర్పడును
4. ఉత్తర-దక్షిణ దిక్కులు D) చంద్రుని ఆకారంలో మార్పులు
5. ప్రాంతీయ మధ్యాహ్నవేళ E) పౌర్ణమిరోజు ఏర్పడును

జవాబు:

Group – A Group – B
1. చంద్రకళలు D) చంద్రుని ఆకారంలో మార్పులు
2. సూర్యగ్రహణం C) అమావాస్య రోజు ఏర్పడును
3. చంద్రగ్రహణం E) పౌర్ణమిరోజు ఏర్పడును
4. ఉత్తర-దక్షిణ దిక్కులు A) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ చూపించే దిశ
5. ప్రాంతీయ మధ్యాహ్నవేళ B) వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ ఏర్పడినపుడు సమయం

3)

Group – A Group – B
1. గెలాక్సీ A) సూర్యుడు ఉండే గెలాక్సీ
2. విశ్వం B) గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు మొదలగునవి
3. పాలపుంత C) వివిధ జంతువుల, మనుషుల మరియు చిన్న చిన్న ఆకారాలు గల నక్షత్రాలు
4. సౌర కుటుంబం D) అనేక కోట్ల నక్షత్రాల సమూహం
5. నక్షత్రరాశులు E) అనేక కోట్ల గెలాక్సీల సముదాయం

జవాబు:

Group – A Group – B
1. గెలాక్సీ D) అనేక కోట్ల నక్షత్రాల సమూహం
2. విశ్వం E) అనేక కోట్ల గెలాక్సీల సముదాయం
3. పాలపుంత A) సూర్యుడు ఉండే గెలాక్సీ
4. సౌర కుటుంబం B) గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు మొదలగునవి
5. నక్షత్రరాశులు C) వివిధ జంతువుల, మనుషుల మరియు చిన్న చిన్న ఆకారాలు గల నక్షత్రాలు

మీకు తెలుసా?

మన రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో గల ‘అన్నవరం’లోని సత్యన్నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నీడ గడియారం తయారు చేయబడి ఉంది.

2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ – 1 (చంద్రునికి ఉపగ్రహం)ను ప్రయోగించింది.

చంద్రయాన్-1 యొక్క ముఖ్య ఉద్దేశాలు :

  1. చంద్రునిపై నీటి జాడను వెదకడం
  2. చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
  3. హీలియం -3ను వెదకడం
  4. చంద్రుని యొక్క త్రిమితీయ ‘అట్లాస్’ను తయారు చేయడం.
  5. ‘సౌరవ్యవస్థ’ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను వెదకడం.

చంద్రయాన్-1ను ప్రయోగించడం ద్వారా చంద్రునికి ఉపగ్రహాలను పంపిన 6 దేశాలలో ఒకటిగా మన దేశం అవతరించింది. చంద్రయాన్-1 చంద్రునిపై ఏయే విషయాలు కనుగొందో వార్తాపత్రికలు, ఇంటర్నెట్ లో వెదికి తెలుసుకోండి.

2006 ఆగస్టు 25 నాటి వరకు మన సౌర కుటుంబంలో గ్రహాలు 9 అని చెప్పుకునే వాళ్లం. అప్పటి 9వ గ్రహం ‘ఫ్లూటో’. అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య (International Astronomical Union) 26వ జనరల్ అసెంబ్లీలో ప్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించడం జరిగింది. ఎందుకనగా ఫ్లూటో “క్లియర్డ్ ద నైబర్‌హుడ్” (తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు) అన్న నియమాన్ని ఉల్లంఘిస్తున్నది. ఇది కొన్ని కొన్ని సందర్భాలలో నెప్ట్యూన్ కక్ష్యలోకి ప్రవేశిస్తున్నది.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

These AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 11th Lesson Important Questions and Answers కొన్ని సహజ దృగ్విషయాలు

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని దేనితో కొలుస్తారు?
జవాబు:
భూకంపం ద్వారా విడుదలయ్యే విధ్వంస శక్తిని “భూకంప లేఖిని” లేదా “భ్రామక పరిమాణ స్కేలు’ ద్వారా కొలుస్తారు.

ప్రశ్న 2.
రెండు వస్తువులు ఒకే ఆవేశం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? తెల్పండి.
జవాబు:
రెండు వస్తువులు ఒకే ఆవేశం కలిగి ఉంటే వాటి మధ్య వికర్షణ బలం ఉంటుంది.

ప్రశ్న 3.
రెండు వస్తువులు వేరు వేరు ఆవేశాలు కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెల్పండి?
జవాబు:
రెండు వస్తువులు వేరు వేరు ఆవేశాలు కలిగి ఉంటే వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది.

ప్రశ్న 4.
వస్తువుకున్న ఆవేశాన్ని గుర్తించడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు?
జవాబు:
ఒక వస్తువు ఆవేశాన్ని గుర్తించడానికి విద్యుదర్శినిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
సహజ దృగ్విషయాలు అని వేటిని అంటారు?
జవాబు:
వరదలు, తుపాన్లు, వడగండ్ల వర్షం, మెరుపులు, ఉరుములు, భూకంపాలు, సునామీలు మరియు అగ్ని పర్వతాలు పేలడం వంటివి సంభవించే వాటిని సహజ దృగ్విషయాలు అని అంటారు.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 6.
విద్యుత్ ఆవేశ బలాల సూత్రాలను రాయండి.
జవాబు:

  1. సజాతి ఆవేశాల మధ్య వికర్షణ బలాలు ఉంటాయి.
  2. విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి.

ప్రశ్న 7.
ఆవేశం గల ఒక వస్తువును ఆవేశం లేని వస్తువు దగ్గరకు తీసుకొస్తే ఆకర్షణకు గురి అవుతుంది. ఎందుకు?
జవాబు:
ఆవేశం గల ఒక వస్తువును ఆవేశం లేని వస్తువు దగ్గరకు తీసుకు వస్తే ఆవేశం లేని వస్తువుపై, వ్యరేక ఆవేశం ప్రేరేపింపబడి అది ఆకర్షణకు గురవుతుంది.

ప్రశ్న 8.
ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో గుర్తించడానికి ఏ ధర్మం సరియైనది?
జవాబు:
ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో గుర్తించడానికి వికర్షణ ధర్మం సరియైనది.

ప్రశ్న 9.
భూకంప తరంగాలు అనగానేమి?
జవాబు:
భూ అంతర్భాగంలో కదలికలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ తరంగాలను భూకంప తరంగాలు అంటారు.

ప్రశ్న 10.
భూకంప తరంగాలను దేని ద్వారా గుర్తిస్తారు?
జవాబు:
భూకంప తరంగాలను భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.

ప్రశ్న 11.
ఉత్తర భారతదేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలు ఏవి?
జవాబు:
భారతదేశంలో కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాలు, కచ్ తీరం. రాజస్థాన్. గంగా పరీవాహక ప్రాంతాలు అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలు.

ప్రశ్న 12.
భూమిలో ఎన్ని పొరలు ఉంటాయి? అవి ఏవి?
జవాబు:
భూమిలో ముఖ్యంగా మూడు పొరలు ఉంటాయి. అవి :

  1. భూపటలం
  2. ప్రావారం
  3. భూకేంద్రం.

భూకేంద్రంలో రెండు పొరలు ఉంటాయి. అవి :

  1. అంతర్ భూకేంద్రం,
  2. బాహ్య భూకేంద్రం

ప్రశ్న 13.
భూకంప ప్రభావిత ప్రాంతాలు అనగానేమి?
జవాబు:
భూమి లోపల గల పలకల కదలిక వల్ల కొన్ని ప్రాంతాలలో భూకంపాలు తరచుగా రావడానికి అవకాశం ఉంటుంది. భూ ఉపరితలంపై ఈ పలకలకు దరిదాపుల్లో ఉండే ఈ బలహీన ప్రాంతాలను సెస్మిక్ ప్రాంతాలు లేదా భూరు ప్రభావిత ప్రాంతాలు అంటారు.

ప్రశ్న 14.
తటిద్వాహకం అనగానేమి?
జవాబు:
పిడుగుల (మెరుపు) ల నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి ఉపయోగించే దానిని తటిద్వాహకం అంటారు.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 15.
కాగితంతో రుద్దిన రబ్బరు బెలూనను చిన్న కాగితపు ముక్కల దగ్గరకు తీసుకువచ్చినపుడు నీవు గమనించిన కిషయాలు ఏమిటి?
జవాబు:

  1. రబ్బరు బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షించును.
  2. రబ్బరు బెలూన్ కాగితం ముక్కలపై ప్రభావం చూపదు.

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఏదైనా ఒక వస్తువును ఆవేశపరచడానికి మూడు పద్ధతులను రాయండి.
జవాబు:

  1. ఒక వస్తువును మరొక వస్తువుతో రాపిడికి గురిచేయడం వలన ఆవేశపరచవచ్చును.
  2. ఒక వస్తువును ఆవేశం గల వస్తువు దగ్గరకు తెచ్చినపుడు ఆ వస్తువులో ఆవేశం ప్రేరేపించడం వలన ఆవేశ పరచవచ్చును.
  3. ఒక వస్తువుకు, ఆవేశ వస్తువును తాకించడం వలన ఆవేశం గల వస్తువు నుండి ఆ వస్తువులోకి ఆవేశం బదిలీ అగుట వలన ఆవేశ పరచవచ్చును.

ప్రశ్న 2.
భ్రామక పరిమాణ స్కేలు గురించి కొన్ని ఉపయోగాలు రాయండి.
జవాబు:

  1. భ్రామక పరిమాణ స్కేలు భూకంప తీవ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు.
  2. భూకంపాలను భ్రామక పరిమాణ స్కేలు ద్వారా కచ్చితంగా నిర్ధారించవచ్చును.
  3. ఈ పద్ధతి రిక్టర్ స్కేలు పద్ధతి కంటే ఉన్నతమైనది.

ప్రశ్న 3.
భూకంపాలు ఏ విధంగా ఏర్పడతాయో తెల్పండి.
జవాబు:
భూమి ఉపరితలంలో ఒకే పొరగా లేదు. ఇది విడివిడి ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలను పలకలు అంటారు. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి. ఒక పలక మరొక పలకను ఢీకొన్నప్పుడు కాని, రెండింటి మధ్య రాపిడి జరిగినప్పుడు కాని భూ పటలంలో కదలికలు వస్తాయి.

భూ అంతర్భాగంలో జరిగే ఇటువంటి కదలికలు భూ ఉపరితలంలో భూకంపాలను ఏర్పరుస్తాయి.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 4.
ఒక వస్తువుపై ఆవేశము ఉన్నదో లేదో గుర్తించడానికి “ఆకర్షణ ధర్మం” సరైనది కాదు. ఎందుకో వివరించండి.
జవాబు:

  1. ఒక తటస్థ వస్తువును, ఆవేశ వస్తువు వద్దకు తీసుకొనివస్తే ఆకర్షిస్తుంది.
  2. ఒక ఆవేశ వస్తువును, దాని వ్యతిరేక ఆవేశ వస్తువు వద్దకు తీసుకొనివస్తే ఆకర్షిస్తుంది.
  3. ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు ఆవేశం గల వస్తువు దగ్గరకు తీసుకొనివస్తే ఆకర్షించినట్లైతే ఆ వస్తువుపై తటస్థ ఆవేశం లేదా వ్యతిరేక ఆవేశం మాత్రమే ఉండాలి. కాని తటస్థ ఆవేశమా, వ్యతిరేక ఆవేశమా అని కచ్చితంగా చెప్పలేము. కాబట్టి “ఆకర్షణ ధర్మం” సరియైనది కాదు.

ప్రశ్న 5.
తటిద్వా హకం (Lightning conductor) అనగానేమి? ఇది భవనాలను ఎలా రక్షిస్తుంది?
జవాబు:

  1. పిడుగుల (మెరుపు)ల నుండి పెద్ద పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి ఉపయోగించే దానిని తటిద్వాహకం అంటారు.
  2. భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలోనే గోడలో అమర్చుతారు.
  3. లోహపు కడ్డీ ఒక చివర గాలిలో ఉంటుంది. రెండవ చివరను భూమిలోకి పాతుతారు.
  4. భవనం కంటే లోహపుకడ్డీ ఎత్తులో ఉంటుంది కనుక అది మేఘాలకు దగ్గరగా ఉండటం వల్ల ఇది మొదట ఆవేశాన్ని స్వీకరిస్తుంది.
  5. ఇది మంచి విద్యుత్ వాహకం కనుక భవనానికి ఎటువంటి నష్టం జరగకుండా ఆవేశాన్ని భూమికి చేరవేస్తుంది.

ప్రశ్న 6.
భూకంపాలు ఏ విధంగా ఏర్పడుతాయో వివరించండి.
జవాబు:

  1. భూమి ఉపరితలంలో ఒకే పొరగా లేదు. ఇది విడివిడి ముక్కలుగా ఉంటుంది.
  2. ఈ ముక్కలను పలకలు అంటారు.
  3. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి.
  4. ఒక పలక మరో పలకను ఢీకొన్నప్పుడు కాని, రెండింటి మధ్య రాపిడి జరిగినపుడు కాని భూ పటలంలో కదలికలు వస్తాయి.
  5. భూ అంతర్భాగంలో జరిగే ఇటువంటి కదలికలు భూ ఉపరితలంలో భూకంపాలను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 7.
భ్రామక పరిమాణ స్కేలును వివరించండి.
జవాబు:

  1. భ్రామక పరిమాణ స్కేలు భూకంప తీవ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు.
  2. ఇది భూ ఉపరితలం వద్ద వచ్చే విస్తాపనంతో సంబంధం లేకుండా భూ అంతర్భాగంలో గల పలకల విస్తాపనంపై ఆధారపడి పనిచేస్తుంది.
  3. భూకంపాలను భ్రామక పరిమాణ స్కేలు ద్వారా కచ్చితంగా నిర్ధారించవచ్చును.
  4. ఈ పద్ధతి రిక్టర్ స్కేలు పద్ధతి కంటే ఉన్నతమైనది.

ప్రశ్న 8.
భూకంప ప్రమాద పటం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని జోన్లను వివరించండి.
జవాబు:

  1. భూకంప ప్రమాద పటం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు 2, 3 జోన్లలో ఉన్నాయి.
  2. ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, వై.ఎస్.ఆర్.కడప, నెల్లూరు మరియు కృష్ణా, గోదావరి మైదాన ప్రాంతాలు 3వ జోన్లో ఉన్నాయి.
  3. హైదరాబాద్ నగరం 2వ జోన్లో ఉన్నది.

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక వస్తువు ప్రేరణ వలన ఆవేశపరచడానికి, ఆవేశం గల వాహకం ద్వారా ఆవేశపరచడానికి మధ్యగల భేదాలను రాయండి.
జవాబు:

ప్రేరణ వలన ఆవేశపరచడం ఆవేశం గల వాహకం ద్వారా ఆవేశపరచడం
1) తటస్థ ఆవేశం గల వస్తువు వద్దకు ఆవేశం గల వస్తువును తీసుకొని వస్తే ప్రేరణ వలన తటస్థ ఆవేశం గల వస్తువుపై ఆవేశం ఏర్పడుతుంది. 1) తటస్థ ఆవేశం గల వస్తువుకు ఆవేశం గల వస్తువును తాకించినపుడు (స్పర్శలో) తటస్థ ఆవేశం గల వస్తువుపై ఆవేశం ఏర్పడుతుంది.
2) ఇది తాత్కాలికమైనది. 2) ఇది శాశ్వతమైనది.
3) తటస్థ ఆవేశ వస్తువుపై ఆవేశ పరచడానికి ఉపయోగించిన వస్తువు ఆవేశానికి వ్యతిరేకమైన ఆవేశం ఏర్పడుతుంది. 3) తటస్థ ఆవేశం గల వస్తువుపై, ఆవేశపరచడానికి ఉపయోగించిన వస్తువు ఆవేశం ఏర్పడుతుంది.

ప్రశ్న 2.
మెరుపులు, ఉరుములు ఏ విధంగా ఏర్పడునో వివరించండి.
జవాబు:

  1. గాలిలో మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలో కణాలతో ఘర్షణ వల్ల మేఘాలు ఆవేశపూరితం అవుతాయి.
  2. మేఘాల ఉపరితలాలు చాలా పెద్దవి కనుక ఈ ఉపరితలాలపై ఆవేశం చాలా ఎక్కువ మొత్తంలో నిలువ ఉంటుంది.
  3. ఒక ఆవేశపూరిత మేఘం దగ్గరగా మరొక మేఘం వచ్చినపుడు అది రెండవ మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపింపజేస్తుంది.
  4. ఈ మేఘాలపై గల ఆవేశం ఒక మేఘం నుండి మరొక మేఘం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ మేఘాల మధ్య గాలి విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది.
  5. మేఘాలపై అధిక మొత్తంలో పోగుపడిన ఆవేశాల బదిలీని గాలి విద్యుత్ బంధకం అయినప్పటికీ నిరోధించలేదు.
  6. అధిక ధన, ఋణ ఆవేశాలు గల మేఘాల మధ్య విద్యుత్ ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున వెలుగుతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది.
  7. ఏర్పడే వెలుగును మెరుపు అని, వెలువడే ధ్వనిని ఉరుము అని అంటారు.

ప్రశ్న 3.
వివిధ రిక్టర్ స్కేలు అవధుల విలువలకు భూకంప ప్రభావం ఏ విధంగా ఉంటుందో రాయండి.
జవాబు:

రిక్టర్ స్కేలు అవధులు భూకంప ప్రభావం
3.5 కన్నా తక్కువ భూకంప లేఖిని నమోదుచేస్తుంది. కానీ మనం గుర్తించలేం.
3.5 నుండి 5.4 అప్పుడప్పుడు గుర్తించగలం, విధ్వంసం పెద్దగా ఉండదు.
5.5 నుండి 6.0 భవనాలకు కొద్దిపాటి నష్టం జరుగుతుంది. నాణ్యతలేని నిర్మాణాలు ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది.
6.1 నుండి 6.9 100 కిలోమీటర్ల వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.
7.0 నుండి 7.9 పెద్ద భూకంపాలు. ఇవి జరిగినపుడు ఆస్తి మరియు ప్రాణ నష్టం అధికంగా జరుగుతుంది.
8 కన్నా ఎక్కువ అతి పెద్ద భూకంపాలు. వందల కిలోమీటర్ల వైశాల్యంలో ప్రభావం ఉంటుంది. తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.

ప్రశ్న 4.
తరచుగా భూకంపాలు వచ్చే ప్రాంతాలలో భవన నిర్మాణంలో మరియు భూకంప నష్ట తీవ్రతను తగ్గించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలను రాయండి.
జవాబు:

  1. భవన నిర్మాణాల సలహాలకై ఇంజనీర్లను, ఆర్కిటెక్ట్ ను సంప్రదించాలి.
  2. భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలలో మట్టి, కలప వినియోగించి నిర్మాణాలు చేయాలి.
  3. భవనాల పై భాగం తేలికగా ఉంటే అవి పడినపుడు నష్టం తక్కువగా ఉంటుంది.
  4. ఇంటి గోడలకు అల్మరాలను ఏర్పాటుచేయడం మంచిది. అవి త్వరగా పడిపోవు.
  5. గోడలకు వేలాడదీసిన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భూకంప సమయంలో అవి మీద పడే అవకాశం ఉంది.
  6. భూకంపాలు వచ్చిన సందర్భంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల విద్యుత్ పరికరాలు, తీగలు నాణ్యమైనవి వినియోగించాలి. పెద్ద భవనాలలో అగ్నిప్రమాద నిరోధక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

ప్రశ్న 5.
భారతదేశంలో గతంలో వచ్చిన భూకంపాలు ఎక్కడ వచ్చాయో వివరించండి.
జవాబు:

  1. డిసెంబరు 26, 2004లో వచ్చిన సునామి వలన అండమాన్ మరియు నికోబార్‌లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
  2. ఉత్తర కాశ్మీర్ లోని ఉరి, తంగదర్ పట్టణాలలో అక్టోబరు 8, 2005న సంభవించిన భూకంపం భారతదేశంలో అతి పెద్దది.
  3. జనవరి 26,2001లో గుజరాత్ లోని భుజ్ జిల్లాలో పెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 7.7 రిక్టరు స్కేలు నమోదు చేసింది.
  4. మే 22, 1997లో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 6గా రిక్టర్ స్కేలు నమోదు చేసింది.
  5. సెప్టెంబర్ 30, 1993లో మహారాష్ట్రలోని లాతూర్ (కిల్లరి) లో భూకంపం వచ్చింది.

ప్రశ్న 6.
భూకంప తీవ్రతను కొలిచే పరికరం యొక్క పటాన్ని గీయుము. ఇందులో ఉపయోగించే స్కేలు పేరు తెలుపుము.
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1
భూకంప తీవ్రతను కొలిచే పరికరంలో ఉపయోగించే స్కేలు : రిక్టర్ స్కేలు.

ప్రశ్న 7.
“భూకంపాల వలన వరదలు, కొండ చరియలు విరిగి పడటం మరియు సునామిలు రావడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 26, 2004 నాడు హిందూ మహాసముద్రంలో సునామి వచ్చింది. దీని వల్ల తూర్పు తీరప్రాంతం తీవ్ర ఆసి, ప్రాణ నష్టం సంభవించింది.” ఈ సమాచారం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. సునామీ సంభవించడానికి కారణమేమి?
జవాబు:
భూకంపాలు

2. తీవ్ర సునామీ సంభవించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
భారీ వర్షాలు, వరదలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది.

3. భూకంపాన్ని గుర్తించుటకు ఉపయోగించే పరికరం ఏది? దానిలోని ప్రధాన భాగాలేవి?
జవాబు:
భూకంప లేఖిని (సిస్మో గ్రాఫ్) లేదా భూకంప దర్శిన్ని (సిస్మో స్కోప్)
ముఖ్య భాగాలు : గుండ్రంగా తిరిగే డ్రమ్, లోలకం, అయస్కాంతం, తీగ.

4. భూకంప తీవ్రతను సూచించు స్కేలు 8 దాటితే దాని ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
తీవ్ర నష్టం (100 కి.మీ.ల విస్తీర్ణంలో)

8th Class Physics 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

I. సరియగు జవాబును ఎంచుకోండి.

1. ఏ శాస్త్రవేత్త, ఏ సంవత్సరంలో వెంట్రుకలు బట్టలను ఆకర్షించటం మరియు ఆకాశంలో మెరుపులూ రెండూ ఒకే దృగ్విషయమని తెలియజేశాడు?
A) 1762 రూథర్ ఫర్డ్
B) 1752 బెంజిమన్ ఫ్రాంక్లిన్
C) 1772 ఫారడే
D) 1782 జాన్ డాల్టన్
జవాబు:
B) 1752 బెంజిమన్ ఫ్రాంక్లిన్

2. భూమిలోని పలకల కదలికల వలన లేదా ఢీకొనుట వలన …………. ఏర్పడును.
A) భూకంపాలు
B) అగ్నిపర్వతాల ప్రేలుడు
C) పిడుగుపాటు
D) ఉరుములు
జవాబు:
A) భూకంపాలు

3. భారతదేశంలో అతిపెద్ద భూకంపం ఇక్కడ సంభవించింది.
A) గుజరాత్ లోని భుజ్ జిల్లాలో
B) ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాలో
C) ఉత్తర కాశ్మీర్ లోని ఉరితంగదర్ పట్టణాలలో
D) మధ్యప్రదేశ్ లోని ఉత్తర ప్రాంతంలో
జవాబు:
C) ఉత్తర కాశ్మీర్ లోని ఉరితంగదర్ పట్టణాలలో

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

4. ఆవేశం కలిగి ఉన్న వస్తువు నుండి భూమికి ఆవేశాలను బదిలీ చేసే ప్రక్రియను ……. అంటారు.
A) ఎర్తింగ్
B) మెరుపులు
C) ఉరుములు
D) ఏదీకాదు
జవాబు:
A) ఎర్తింగ్

5. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం
A) భూకంప స్కేలు
B) రిక్టరు స్కేలు
C) ఐరన్ స్కేలు
D) టేపు
జవాబు:
B) రిక్టరు స్కేలు

6. భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ………….
A) భూకంపలేఖిని
B) రిక్టర్ స్కేలు
C) ఎర్తింగ్
D) పైవన్నీ
జవాబు:
A) భూకంపలేఖిని

7. ఈ కింది వానిలో సహజ దృగ్విషయం కానిది
A) భూకంపం
B) తుపాన్
C) ఉరుములు, మెరుపులు
D) ఎర్తింగ్
జవాబు:
D) ఎర్తింగ్

8. వస్తువులను ఒకదానితో మరొకటి రుద్దడం వలన ఏర్పడే ఆవేశాల సంఖ్య
A) 2
B) 1
C) 3
D) 4
జవాబు:
A) 2

9. సునామి అంటే అర్థం
A) భూకంపం
B) తుపాను
C) సముద్రం అడుగున భూకంపం
D) సముద్రం అడుగున అగ్నిపర్వతం పేలుట
జవాబు:
D) సముద్రం అడుగున అగ్నిపర్వతం పేలుట

10. భూమి నుండి ఉత్పత్తి అయ్యే తరంగాలను ……….. అంటారు.
A) భూకంప తరంగాలు
B) మైక్రో తరంగాలు
C) రేడియో తరంగాలు
D) X-తరంగాలు
జవాబు:
A) భూకంప తరంగాలు

11. ఆవేశపూరిత వస్తువు పరీక్షించడానికి ఉపయోగపడే ధర్మం
A) ఆకర్షణ
B) వికర్షణ
C) ఆకర్షణ మరియు వికర్షణ
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షణ

12. రెండు వస్తువులు ఒకదానితో మరొకటి రుద్దినపుడు ఆ వస్తువులపై ఏర్పడే ఆవేశాలు
A) సమానంగా ఉండే ఒకే రకమైన ఆవేశాలు
B) సమానంగా ఉండే వేరు వేరు ఆవేశాలు
C) అసమానంగా ఉండే ఒకే రకమైన ఆవేశాలు
D) అసమానంగా ఉండే వేరు వేరు ఆవేశాలు
జవాబు:
B) సమానంగా ఉండే వేరు వేరు ఆవేశాలు

13. రిక్టరు స్కేలు విలువ ……. గా ఉన్నప్పుడు భూకంప లేఖిని నమోదు చేస్తుంది కాని మనం గుర్తించలేము
A) 3.5 నుండి 5.4
B) 5. 5 నుండి 6.00
C) 3. 5 కన్నా తక్కువ
D) 8 కన్నా ఎక్కువ
జవాబు:
C) 3. 5 కన్నా తక్కువ

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

14. …………… వరకు రిక్టరు స్కేలు విలువ ఉంటే ఆస్తి మరియు ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనిని పెద్ద భూకంపాలు అంటారు.
A) 5. 5 నుండి 6.0
B) 6.1 నుండి 6.9
C) 7.0 నుండి 7.9
D) 3.5 నుండి 5.4
జవాబు:
C) 7.0 నుండి 7.9

15. ఒక వస్తువు ఆవేశపరచే పద్ధతులు ………
A) రాపిడి (రుద్దడం) వలన
B) ప్రేరణ వలన
C) వాహకం ద్వారా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. ఉరుములు, మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితమైన ప్రదేశం
A) తక్కువ ఎత్తుగల ఇల్లు
B) ఎత్తైన భవనం
C) పొడవైన చెట్టు
D) టాప్ లేని కారులో ప్రయాణించడం
జవాబు:
A) తక్కువ ఎత్తుగల ఇల్లు

17. ఉరుములు, మెరుపులు వచ్చే సందర్భంలో సురక్షితం కాని ప్రదేశం
A) తక్కువ ఎత్తుగల ఇల్లు
B) పొట్టి చెట్టు
C) ఎలక్ట్రికల్, టెలిఫోన్ స్తంభాల దగ్గర నిలబడటం
D) ఏదీకాదు
జవాబు:
C) ఎలక్ట్రికల్, టెలిఫోన్ స్తంభాల దగ్గర నిలబడటం

18. భూకంపం వచ్చినపుడు భూమి కంపించిన సమయాన్ని గుర్తించేది
A) భూకంపలేఖిని
B) భూకంప దర్శిని
C) భ్రామపరిమాణ స్కేలు
D) రిక్టర్ స్కేలు
జవాబు:
B) భూకంప దర్శిని

19. భూకంపాలను ……….. ద్వారా కచ్చితంగా నిర్ధారించవచ్చును.
A) రిక్టర్ స్కేలు
B) భ్రామక పరిమాణ స్కేలు
C) మీటరు స్కేలు
D) పైవన్నీ
జవాబు:
B) భ్రామక పరిమాణ స్కేలు

20. ఇంటి లోపల ఉన్నప్పుడు భూకంపం వచ్చిన సందర్భంలో రక్షించుకోవడం కోసం
A) పొడవైన వస్తువులను గట్టిగా పట్టుకోవడం
B) మంచంపై పడుకోవడం
C) బల్ల కిందకు వెళ్ళడం
D) పైవన్నీ
జవాబు:
C) బల్ల కిందకు వెళ్ళడం

21. సీమగుగ్గిలంను ఉన్నితో రుద్దిన తర్వాత అది వెంట్రుకలను ఆకర్షించునని గుర్తించిన వారు
A) సిక్కులు
B) యూరోపియన్లు
C) అమెరికన్లు
D) గ్రీకులు
జవాబు:
D) గ్రీకులు

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

22. విద్యుత్ ఆవేశాల లక్షణాల విషయంలో
A) ప్లాస్టిక్ స్కేలును తలపై రుద్దితే అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించడం
B) పొడిజుట్టుతో ప్లాస్టిక్ స్కేలును రుద్దిన అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించకుండుట
C) గాలితో నిండిన బెలూనను బట్టతో రుద్దిన అది కాగితం ముక్కలను ఆకర్షించుట
D) స్ట్రాను నునుపైన గోడకు గాని, బట్టలకు గాని అది కాగితం ముక్కలను ఆకర్షించుట
జవాబు:
B) పొడిజుట్టుతో ప్లాస్టిక్ స్కేలును రుద్దిన అది చిన్న చిన్న కాగితం ముక్కలను ఆకర్షించకుండుట

23. ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూన్, ఉన్నిగుడ్డతో రుద్దిన మరో బెలూనన్ను …….
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

24. పాలిథిన్ కాగితంతో రుద్దిన రీఫిల్ అదే కాగితంతో రుద్దిన మరో రీఫిల్ ను ………..
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

25. ఉన్నిగుడ్డతో రుద్దిన బెలూన్, పాలిథిన్ కాగితంతో రుద్దిన రీఫిల్ ను ……….
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఆకర్షించును

26. విజాతి అయస్కాంతాల ధృవాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఆకర్షించును

27. సజాతి అయస్కాంతాల ధృవాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

28. ఒకే రకమైన రెండు ఆవేశాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) వికర్షించును

29. విభిన్నాలైన రెండు ఆవేశాలు
A) ఆకర్షించును
B) వికర్షించును
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ఆకర్షించును

30. వలయంలో విద్యుత్ ప్రవాహం …… కదలికను తెలుపును.
A) ఆవేశాల
B) ప్రోటానుల
C) న్యూట్రానుల
D) ఏదీకాదు
జవాబు:
A) ఆవేశాల

31. దీనినుపయోగించి వస్తువు ఆవేశాన్ని కల్గి ఉన్నది లేనిది తెలుసుకోవచ్చును
A) దిక్సూచి
B) థర్మోకోల్ బంతి
C) విద్యుదర్శిని
D) ఏదీకాదు
జవాబు:
C) విద్యుదర్శిని

32. వస్తువుపై గల ఆవేశాలు భూమికి బదిలీ అయ్యే పద్ధతిని ………. చేయటం అంటాము.
A) మెరుపు
B) ఉరుము
C) ఎర్తింగ్
D) ఆవేశము
జవాబు:
C) ఎర్తింగ్

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

33. గాలిలో మేఘాలు ప్రయాణించేటప్పుడు, గాలిలోని కణాలతో ఈ క్రింది ప్రక్రియ వలన ఆవేశపూరితం అవుతాయి.
A) బలం
B) శక్తి రుద్దిన
C) ఘర్షణ
D) స్థానభ్రంశం
జవాబు:
C) ఘర్షణ

34. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరొక మేఘం వచ్చినప్పుడు అది రెండవ మేఘంపై ……. ఆవేశాన్ని ప్రేరేపింపజేయును.
A) సమాన
B) వ్యతిరేక
C) తుల్య
D) ఏదీకాదు
జవాబు:
B) వ్యతిరేక

35. రెండు మేఘాల మధ్య గాలి …….. వాహకంగా పని చేయును.
A) అథమ విద్యుత్
B) ఉత్తమ విద్యుత్
C) మధ్యమ విద్యుత్
D) ఋణ విద్యుత్
జవాబు:
A) అథమ విద్యుత్

36. మెరుపులు ఏర్పడు ప్రక్రియను………….. అంటారు.
A) విద్యుత్ ఉత్సర్గం
B) విద్యుత్ ప్రవాహం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) విద్యుత్ ఉత్సర్గం

37. కింది వాటిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చు సందర్భంలో సురక్షితం కాని ప్రదేశం
A) టాప్ లేని వాహనాల్లో ప్రయాణించటం
B) ల్యాండ్ లైన్ ఫోన్లలో మాట్లాడడం
C) టి.వి., కంప్యూటర్ వంటి పరికరాలు వాడటం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ

38. తటిద్వాహకాలను వీటి రక్షణ కొరకై భవనాల్లో అమర్చుతారు
A) పిడుగుల నుండి
B) భూకంపాల నుండి
C) తుపానుల నుండి
D) ఆవేశాల నుండి
జవాబు:
A) పిడుగుల నుండి

39. క్రింది వాటిలో సహజ దృగ్విషయాల విషయంలో విభిన్నమైనది
A) మెరుపులు, ఉరుములు
B) వరదలు, తుపానులు
C) భూకంపాలు
D) ఋతుపవనాలు
జవాబు:
D) ఋతుపవనాలు

40. భూ పొరలలో అన్నింటికన్నా పెద్దది
A) భూపటలం
B) భూప్రావారం
C) అంతర కోర్
D) బాహ్య కోర్
జవాబు:
A) భూపటలం

41. భుజ్, కాశ్మీర్‌లో వచ్చిన భూకంప తీవ్రత విలువ
A) < 6.5
B) < 7.5
C) > 7.5
D) > 6.5
జవాబు:
C) > 7.5

42. సెస్మిక్ తరంగాలను దీని ద్వారా గుర్తిస్తారు
A) థర్మామీటరు
B) భూకంపలేఖిని
C) విద్యుద్దర్శిని
D) ఉత్సర్గ నాళం
జవాబు:
B) భూకంపలేఖిని

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

43. ‘భూకంప తీవ్రతను కచ్చితంగా కొలుచు పరికరం
A) భూకంపలేఖిని
B) భ్రామక పరిమాణ స్కేలు
C) విద్యుద్దర్శిని
D) థర్మామీటరు
జవాబు:
B) భ్రామక పరిమాణ స్కేలు

44. భూకంప ప్రమాద పటం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని 3వ జోన్ కి చెందు ప్రాంతము
A) కృష్ణా, గోదావరి మైదానం
B) కడప, చిత్తూరు
C) నెల్లూరు
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ

45. ఈ క్రింది వానిలో భూకంపాలు రాని ఖండం
A) అమెరికా
B) ఆసియా
C) ఆస్ట్రేలియా
D) ఏదీలేదు
జవాబు:
C) ఆస్ట్రేలియా

46. రిక్టర్ స్కేల్ ను కనుగొన్నవారు
A) ఛార్లెస్ లూయీస్
B) జేమ్స్ ఛార్లెస్
C) ఛార్లెస్ రిక్టర్
D) ఛార్లెస్ రెపో
జవాబు:
C) ఛార్లెస్ రిక్టర్

47. ఈ క్రింది భూకంప జోన్లో తీవ్ర ప్రమాదకరమైనది
A) 1వ జోన్
B) 3వ జోన్
C) 7వ జోన్
D) 5వ జోన్
జవాబు:
D) 5వ జోన్

48. సునామీల యొక్క వేగం సముద్ర అంతర్భాగంలో ………….. వద్ద ఏర్పడును.
A) 700
B) 600
C) 800
D) 900
జవాబు:
C) 800

49. సముద్రంలో ఏర్పడు భూకంపంకు గల పేరు
A) సునామీ
B) తుపాను
C) వాయుగుండం
D) భూకంపం
జవాబు:
A) సునామీ

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

50. ర్యాపిడ్ అనే సెట్ డిజాస్టర్‌కు ఉదాహరణ
A) సునామీ
B) తుపాను
C) వాయుగుండం
D) భూకంపం
జవాబు:
D) భూకంపం

51. మన దేశంలో భూకంప తీవ్రత జోన్-8 లోనికి చెందు ప్రాంతము
A) ఉత్తరప్రదేశ్
B) హిమాలయాల చుట్టూ ప్రాంతం
C) గుజరాత్
D) కాశ్మీర్
జవాబు:
B) హిమాలయాల చుట్టూ ప్రాంతం

52. భారతదేశ రాష్ట్రాల్లో తుపానులకు అధికంగా గురయ్యే రాష్ట్రం
A) ఒడిశా
B) అస్సోం
C) గుజరాత్
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
A) ఒడిశా

53. పశ్చిమ తీరంలో తుపాన్లకు గురయ్యే రాష్ట్రం
A) ఒడిశా
B) అస్సోం
C) గుజరాత్
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
C) గుజరాత్

54. బెలూన్ ప్లాస్టిక్ కాగితంతో రుద్ది, చిన్న కాగితం ముక్కల వద్దకు తెచ్చినప్పుడు ఏమి పరిశీలిస్తావు?
A) బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.
B) బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షించదు.
C) బెలూన్ పగిలిపోతుంది.
D) బెలూన్ పరిమాణంలో మార్పు వస్తుంది.
జవాబు:
A) బెలూన్ కాగితం ముక్కలను ఆకర్షిస్తుంది.

55. ప్లాస్టిక్ స్కేలును ప్లాస్టిక్ కాగితంతో రుద్ది చిన్న కాగితం ముక్కల వద్దకు తీసుకొని వస్తే అవి ఆకర్షించబడతాయి.
A) స్థావర విద్యుత్ బలం
B) అయస్కాంత బలం
C) గురుత్వాకర్షణ బలం
D) జ్వలన ఉష్ణోగ్రత
జవాబు:
A) స్థావర విద్యుత్ బలం

56. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సంభవించునపుడు సురక్షిత ప్రదేశం
1) బహిరంగ ప్రదేశాలలో ప్రయాణించడం.
2) పొడవాటి వృక్షాల కింద నిలబడడం.
3) విద్యుత్ స్థంబాల వద్ద నిలబడడం.
4) కిటికీలు మూసిన కారులో కూర్చోవడం.
A) 1 మాత్రమే
B) 1 & 4
C) 2 & 3
D) 1 మాత్రమే
జవాబు:
A) 1 మాత్రమే

57. రేవతి ఒక రబ్బరు బెలూన్ ను ఉన్ని గుడ్డతోను, రీఫిలను పాలిథీన్ తోను రుద్దినది. తర్వాత బెలూనను రీఫిల్ వద్దకు తెచ్చినపుడు సరైన పరిశీలన
A) రీఫిల్ వికర్షించును
B) రీఫిల్ ఆకర్షించును
C) బెలూన్ మరియు రీఫిల మధ్య బలం పనిచేయదు.
D) చెప్పలేము.
జవాబు:
B) రీఫిల్ ఆకర్షించును

58. రెండు విద్యుదావేశం చెందిన వస్తువులను దగ్గరగా తెచ్చినపుడు అవి
A) ఆకర్షించుకోవచ్చు
B) వికర్షించుకోవచ్చు
C) ఆకర్షించుకోవచ్చు లేదా వికర్షించుకోవచ్చు
D) ఏ విధమైన ప్రభావం ఉండదు.
జవాబు:
C) ఆకర్షించుకోవచ్చు లేదా వికర్షించుకోవచ్చు

59. భూమి యొక్క బాహ్య పొరను కింది విధంగా చెప్తారు
A) భూపటలం (మాంటిల్)
B) బాహ్య కేంద్రం
C) భూప్రావరం (క్రస్ట్)
D) అంతర కేంద్రం
జవాబు:
A) భూపటలం (మాంటిల్)

60. భూకంపానికి కారణమైన భూమి యొక్క ఫలకము
A) భూపటలం
B) భూప్రావరం
C) భూఅంతర కేంద్రం
D) భూ బాహ్య కేంద్రం
జవాబు:
B) భూప్రావరం

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

61. కింది వానిలో ఏది సునామీకి కారణం కాదు?
A) సముద్రం అడుగున అతి పెద్ద కేంద్రక విస్పోటనం
B) భూకంపం
C) అగ్నిపర్వతం విస్పోటనం.
D) పిడుగు
జవాబు:
D) పిడుగు

62. రాజేష్ ఒక బెలూనను ఊది దాని చివర ముడివేశాడు. ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చు పై వేసాడు. తర్వాత బెలూనను ఒక చేతితో బాగా రుద్ది కాగితం ముక్కల వద్దకు తెచ్చాడు. అపుడు కాగితం ముక్కలను బెలూన్ ఆకర్షించింది. ఆ కృత్యం చేయడం వలన రాజేష్ క్రింది విషయాన్ని తెలుసుకున్నాడు.
i)స్పర్శాబలం పనిచేయాలంటే వస్తువులు ఒకదాని కొకటి తాకనవసరం లేదు.
ii) బెలూనను కాగితంతో రుద్దినపుడు దాని ఉపరితలం విద్యుదావేశం పోతుంది.
iii) క్షేత్రబలం పనిచేయాలంటే వస్తువులు ఒకదాని కొకటి తాకనవసరం లేదు.
A) ii మాత్రమే సరైనది
B) i మరియు ii మాత్రమే సరైనవి
C) ii మరియు iii మాత్రమే సరైనవి
D) i మాత్రమే సరైనది
జవాబు:
C) ii మరియు iii మాత్రమే సరైనవి

II. జతపరచుము.

Group – A Group – B
1 భూకంపం A) భూకంపం సంభవించిన సమయాన్ని గుర్తించేది
2. సునామి B) భూకంప తీవ్రతను నిర్ధారిస్తుంది
3. రిక్టర్ స్కేలు C) భూకంప తరంగాలను లెక్కగట్టేది.
4. భూకంప లేఖిని D) భూమి కంపించడాన్ని
5. భూకంపదర్శిని E) సముద్రాల అడుగున భూకంపం రావడాన్ని

జవాబు:

Group – A Group – B
1 భూకంపం D) భూమి కంపించడాన్ని
2. సునామి E) సముద్రాల అడుగున భూకంపం రావడాన్ని
3. రిక్టర్ స్కేలు B) భూకంప తీవ్రతను నిర్ధారిస్తుంది
4. భూకంప లేఖిని C) భూకంప తరంగాలను లెక్కగట్టేది.
5. భూకంపదర్శిని A) భూకంపం సంభవించిన సమయాన్ని గుర్తించేది

AP 8th Class Physical Science Important Questions 11th Lesson కొన్ని సహజ దృగ్విషయాలు

2)

Group – A Group – B
1. సజాతి, ఆవేశాలు A) ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు
2. విజాతి ఆవేశాలు B) వస్తువుపై గల ఆవేశాలను భూమికి చేర్చుట
3. ఎర్తింగ్ C) ఉరుములు, పిడుగుల నుండి భవనాలను రక్షించడం
4. విద్యుదర్శిని D) ఆకర్పించుకొంటాయి
5. తటిద్వాహకం E) వికర్షించుకొంటాయి.

జవాబు:

Group – A Group – B
1. సజాతి, ఆవేశాలు D) ఆకర్పించుకొంటాయి
2. విజాతి ఆవేశాలు E) వికర్షించుకొంటాయి.
3. ఎర్తింగ్ B) వస్తువుపై గల ఆవేశాలను భూమికి చేర్చుట
4. విద్యుదర్శిని A) ఒక వస్తువుపై ఆవేశం ఉన్నదో లేదో తెలుసుకొనుటకు
5. తటిద్వాహకం C) ఉరుములు, పిడుగుల నుండి భవనాలను రక్షించడం

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

These AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 10th Lesson Important Questions and Answers సమతలాల వద్ద కాంతి పరావర్తనం

8th Class Physics 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
నీడలు ఏర్పడుటకు అవసరమైనవి ఏవి?
జవాబు:
నీడలు ఏర్పడడానికి ఒక కాంతి జనకం, అపారదర్శక పదార్థం మరియు తెర కావాలి.

ప్రశ్న 2.
ఫెర్మాట్ నియమమును రాయుము.
జవాబు:
కాంతి ఎల్లప్పుడు తక్కువ సమయం పట్టే మార్గమునే అనుసరిస్తుంది.

ప్రశ్న 3.
కాంతి 1వ పరావర్తన సూత్రాన్ని రాయుము.
జవాబు:
కాంతి ఏదేని ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం, పరావర్తన కోణం సమానంగా ఉంటాయి.

ప్రశ్న 4.
కాంతి 2వ పరావర్తన సూత్రాన్ని రాయుము.
జవాబు:
పతన కిరణం, పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం మరియు పరావర్తన కిరణం ఒకే తలంలో ఉంటాయి.

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 5.
పరావర్తన తలం అంటే ఏమిటి?
జవాబు:
పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబం ఉన్నటువంటి తలాన్ని “పరావర్తన తలం” అంటాము.

ప్రశ్న 6.
సమతల దర్పణంలో ఏర్పడు ప్రతిబింబ లక్షణాలు ఏవి?
జవాబు:
సమతల దర్పణంతో ఏర్పడ్డ ప్రతిబింబపు పరిమాణం, దూరం, పార్శ్వ విలోమం మొదలగు లక్షణాలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 7.
పార్శ్వ విలోమం అంటే ఏమిటి?
జవాబు:
సమతల దర్పణంలో ఏర్పడు ప్రతిబింబం అనునది వస్తు కుడి, ఎడమలు తారుమారు కావడం వలన ఏర్పడుతుంది. ఈ లక్షణాన్ని పార్శ్వ విలోమం అంటారు.

ప్రశ్న 8.
సెలూన్లలో వాడు దర్పణాలేవి?
జవాబు:
సెలూన్లలో సమతల దర్పణాలు వాడతారు.

ప్రశ్న 9.
సమతల దర్పణపు ఆవర్ధనం ఎంత?
జవాబు:
ప్రతిబింబ పరిమాణము = వస్తు పరిమాణము. కావున ఆవర్ధనం విలువ 1.

ప్రశ్న 10.
ఆవర్ధనం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండు దర్పణం పేరేమిటి?
జవాబు:
సమతల దర్పణం.

ప్రశ్న 11.
క్షారశాలలో ఏ దర్పణాలు వాడుతారు?
జవాబు:
క్షారశాలలో సమతల దర్పణాలు వాడుతారు.

ప్రశ్న 12.
భవంతుల వెలుపలి భాగాలను అద్దాలతో అలంకరించడంపై మీ అభిప్రాయమేమిటి?
జవాబు:
భవంతులను అద్దాలతో అలంకరించటం వల్ల భవంతులలోనికి వెలుతురు బాగా వస్తుంది మరియు భవంతులు అందంగా కనబడుతాయి. కాని ఈ అద్దాలవల్ల కలిగే కాంతి పరావర్తనాలు రోడ్లపై ప్రయాణించేవారికి, పక్షులకు ఇబ్బందులు కలిగిస్తాయి.

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 13.
నీడలు ఏర్పడడానికి కావలసిన కనీస పరిస్థితులు ఏవి?
జవాబు:
కాంతి, కాంతి నిరోధక పదార్థాలపై పడినపుడు వాటి వెనుకభాగంలో నీడలు ఏర్పడతాయి.

ప్రశ్న 14.
సమతల దర్పణం ఆవర్ధనం 1 అని ఇవ్వబడినది. దీని నుండి నీవు ఏమి గ్రహించావు?
జవాబు:
ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానం మరియు మిథ్యా ప్రతిబింబం.

ప్రశ్న 15.
ఫిన్ హోల్ కెమెరాలోని రంధ్రం పరిమాణాన్ని పెంచితే ఏర్పడు ప్రతిబింబాన్ని ఊహించి వ్రాయండి.
జవాబు:
ప్రతిబింబం మసక బారినట్లు ఏర్పడుతుంది.

ప్రశ్న 16.
కాంతి పరావర్తనం ఆధారంగా రూపొందిన పరికరాలను తెలుపండి.
జవాబు:
పెరిస్కోప్, కెలిడయోస్కోప్.

ప్రశ్న 17.
పతన బిందువు అనగా నేమి?
జవాబు:
దర్పణంపై కాంతి కిరణం పతనమయ్యే బిందువును ‘పతన బిందువు’ అంటారు.

8th Class Physics 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఒక వస్తువును మీ కంటికి దగ్గరగా జరుపుతున్నపుడు, ఆ వస్తువు యొక్క ప్రతిబింబ పరిమాణం చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకు?
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 1

  1. ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని మన కన్ను ఎలా అంచనా వేస్తుందో ప్రక్క పటం తెలియజేస్తుంది.
  2. ‘O’ వద్ద ఉన్న వస్తువును 1, 2 అనే పరిశీలకులు చూస్తున్నారు.
  3. 1వ స్థానంలో ఉన్న వ్యక్తికంటే 2వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఆ వస్తువు చిన్నగా కనబడుతుంది. ఎందుకనగా వస్తువునుండి వచ్చే కాంతి కిరణాలు 1వ పరిశీలకుని కంటివద్ద చేసే కోణం కన్నా 2వ పరిశీలకుని కంటివద్ద చేసే కోణం తక్కువ. ఈ కోణమే వస్తువు పరిమాణాన్ని అంచనా వేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 2.
సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏవి?
జవాబు:
సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు :

  1. మిథ్యా ప్రతిబింబం
  2. నిటారైన ప్రతిబింబం
  3. పార్శ్వ విలోమానికి గురౌతుంది.
  4. ప్రతిబింబ పరిమాణం, వస్తు పరిమాణానికి సమానం.
  5. ప్రతిబింబ దూరం, వస్తుదూరానికి సమానం.

ప్రశ్న 3.
సమతల దర్పణం ఎప్పుడైనా నిజప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?
జవాబు:
నిజ ప్రతిబింబం ఏర్పడాలంటే పరావర్తన కిరణాలు ఒక చోట కలవాలి. కాని సమతల దర్పణంలో ఇది సాధ్యం కాదు. కావున నిజ ప్రతిబింబం ఏర్పడదు.

ప్రశ్న 4.
సమతల దర్పణం (అద్దం)లో ఏర్పడు ప్రతిబింబ లక్షణాలను తెలుపండి.
జవాబు:

  1. వస్తు పరిమాణం, ప్రతిబింబ పరిమాణం సమానం.
  2. ప్రతిబింబం పార్శ్వ విలోమానికి గురి అవుతుంది.
  3. వస్తుదూరం, ప్రతిబింబ దూరం సమానం.
  4. ఇది నిటారుగా ఉండే మిథ్యా ప్రతిబింబం.

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ప్రశ్న 5.
అద్దంలో పార్శ్వ విలోమాన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరించండి.
జవాబు:
అద్దంలో మన కుడిచెవి ఎడమచెవిలాగా కనబడుతుంది. కారణం కుడిచెవి నుంచి బయలుదేరిన కాంతికిరణాలు అద్దంపై పడి పరావర్తనం చెంది మన కంటికి చేరుతాయి. అయితే ఆ పరావర్తన కిరణాలు అద్దం లోపల నుండి వస్తున్నట్లుగా మన మెదడు భావిస్తుంది. అందువలననే మన కుడిచెవి ప్రతిబింబం ఎడమచెవి లాగా కనిపిస్తుంది.

ప్రశ్న 6.
కొంతి పరావర్తనంలో లంబం ప్రాముఖ్యతను తెలుసుకొనుటకు ప్రశ్నలను తయారుచేయండి.
జవాబు:

  1. పతన కోణం అనగానేమి?
  2. పరావర్తనకోణం అనగానేమి?
  3. పతనకోణం -30° అయితే లంబానికి, పరావర్తన కిరణానికి మధ్య కోణం ఎంత?
  4. పతనకిరణం, పరావర్తన కిరణం మధ్యకోణం 80° అయితే పతనకోణం ఎంత?

ప్రశ్న 7.
కాంతి పరావర్తన సూత్రాలను సరిచూచుటకు ప్రయోగశాలలో కావలసిన వస్తువులను తెలుపండి.
జవాబు:
కావలసిన వస్తువులు : అద్దం, డ్రాయింగ్ బోర్డ్, తెల్లకాగితం, గుండు సూదులు, డ్రాయింగ్ బోర్డ్ క్లాంపులు, స్కేల్ మరియు పెన్సిల్.

ప్రశ్న 8.
ప్రక్క పటంను పరిశీలించి పతన, పరావర్తన కోణాల విలువలు రాయండి. వీటి ఆధారంగా పటం పూర్తి చేయండి.

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 2
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 3
పతనకోణం (i) = 90 – 60 = 30
పరావర్తన కోణం (r) = 30°
[ … పతన కోణం = పరావర్తన కోణం]

ప్రశ్న 9.
సమతల దర్పణంలో ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే పటం గీయండి.
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 4

8th Class Physics 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
లావణ్య. సమతల దర్పణంతో ఆడుతుంది. దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది.
a) ఆ ప్రతిబింబానికి గల కారణమేమిటి?
b) ఆ దర్పణాన్ని ఎండలో పెట్టింది. తరువాత ముట్టుకొన్న చాలా వేడిగా అనిపించింది. దానికి గల కారణమేమిటి?
c) ఎండలో ఉంచిన దర్పణానికి కొంత దూరంలో నిలబడి చూస్తే దర్పణం మెరవడాన్ని గమనించింది. దీనికి గల కారణమేమిటి?
జవాబు:
a) ప్రతిబింబం ఏర్పడుటకు కారణము కాంతి యొక్క పరావర్తన ధర్మమే.
b) దర్పణం వేడెక్కుటకు గల కారణము కాంతిశక్తి ఉష్ణశక్తిగా మారుటయే.
c) సమతల దర్పణంకు ఒక తలము కాంతి నిరోధక పూత ఉండుట వలన కాంతి పరావర్తన సూత్రాలను పాటించును.

దీని వలన దర్పణంకు కొంత దూరంలో ఉన్న వ్యక్తి చేస్తే దర్పణం మెరుయుటను గమనించగలము.

ప్రశ్న 2.
సమతల దర్పణంలో బిందురూప వస్తువు ఏర్పరచు ప్రతిబింబాన్ని విశ్లేషించుము.
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 5

  1. ‘O’ అనేది ఒక బిందురూప వస్తువు.
  2. ‘O’ నుండి బయలుదేరిన కొన్ని కాంతికిరణాలు సమతల దర్పణంపై పడి పరావర్తనం చెందుతాయి.
  3. మనం దర్పణంలోకి చూస్తున్నపుడు పరావర్తన కిరణాలన్నీ ‘I’ అనే బిందువు నుండి వస్తున్నట్లు కనిపిస్తాయి.
  4. కావున I అనేది O యొక్క ప్రతిబింబం.
  5. పటంలో దర్పణం నుండి వస్తువు ‘O’, ప్రతిబింబం (I) లకు గల,దూరాలను పరిశీలించుము.
  6. ఈ దూరాలు రెండూ సమానమని గుర్తించవచ్చును.

8th Class Physics 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

I. సరియైన సమాధానమును గుర్తించండి.

1. ప్రక్కపటంలో ∠i, ∠r విలువలను కనుగొనుము. దూరాన్ని ఏమంటారు?
AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం 6
A) ∠i = 60°, ∠r = 60°
B) ∠i = 60°, ∠r = 30°
C) ∠i = 30°, ∠r = 60°
D) ∠i = 30°, ∠r = 30°
జవాబు:
D) ∠i = 30°, ∠r = 30°

2. కింది వాటిలో పరావర్తన తలంలో ఉండనిది.
A) పరావర్తనానికి కారణమైన ఉపరితలం
B) పతన కిరణం
C) పతన బిందువు వద్ద గీసిన లంబం
D) పరావర్తన కిరణం
జవాబు:
A) పరావర్తనానికి కారణమైన ఉపరితలం

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

3. పరావర్తన మొదటి నియమము నుండి క్రింది వానిలో సరైనది
A) ∠i = ∠r
B) ∠i > ∠r
C) ∠i < ∠r
D) ఏదీకాదు
జవాబు:
A) ∠i = ∠r

4. కాంతి పరావర్తన నియమాలను తృప్తిపరచునవి
A) సమతల దర్పణాలే
B) కుంభాకార దర్పణాలే
C) పుటాకార దర్పణాలే
D) అన్ని పరావర్తన తలాలు
జవాబు:
D) అన్ని పరావర్తన తలాలు

5. దర్పణ ధృవానికి, దర్పణవక్రతా కేంద్రానికి మధ్య
A) నాభ్యంతరం
B) నాభి
C) వ్యాసం
D) వక్రతా వ్యాసార్ధం
జవాబు:
D) వక్రతా వ్యాసార్ధం

6. దర్పణ ధృవానికి, నాభికి మధ్య దూరాన్ని అంటారు.
A) నాభ్యంతరం
B) నాభి
C) వ్యాసం
D) వ్యాసార్ధం
జవాబు:
A) నాభ్యంతరం

7. నాభ్యంతరం మరియు వక్రతావ్యాసార్ధాల మధ్య సంబంధాన్ని ………. గా రాయవచ్చు.
A) f = R
B) R = 2f
C) f = 2R
D) F = R + 2
జవాబు:
B) R = 2f

8. పతన, పరావర్తన కోణాల మధ్య సంబంధాన్ని …. గా రాయవచ్చు.
A) i = r
B) i > r
C) i = r
D) i ≠ r
జవాబు:
A) i = r

9. కాంతి ఎల్లప్పుడు ప్రయాణకాలం తక్కువగా ఉండే మార్గాన్ని ఎన్నుకుంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త
A) గెలీలియో
B) న్యూటన్
C) హైగెన్స్
D) ఫెర్మాట్
జవాబు:
D) ఫెర్మాట్

10. పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబాలు కలిగి ఉన్న తలాన్ని ………. అంటారు.
A) పరావర్తన తలం
B) పతన తలం
C) లంబ తలం
D) దర్పణ తలం
జవాబు:
A) పరావర్తన తలం

11. ప్రతిబింబ కుడి, ఎడమలు తారుమారు కావడాన్ని ……….. అంటారు.
A) పరావర్తనం
B) పార్శ్వ విలోమం
C) వక్రీభవనం
D) కాంతి ప్రయాణించుట
జవాబు:
B) పార్శ్వ విలోమం

12. షేవింగ్ అద్దాలలో ………… దర్పణాలను వాడతారు.
A) కుంభాకార
B) పుటాకార
C) సమతల
D) పరావలయ
జవాబు:
B) పుటాకార

13. పతనకోణం = 30° అయిన పరావర్తన కోణం = ……
A) 45°
B) 30°
C) 90°
D) 20°
జవాబు:
B) 30°

14. స్పి ల్ కెమెరానందు ఏర్పడు ప్రతిబింబము …………. ఉండును.
A) నిజ ప్రతిబింబంగా
B) తలక్రిందులుగా
C) A మరియు B
D) ప్రతిబింబం ఏర్పడదు
జవాబు:
C) A మరియు B

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

15. క్రింది వాటిలో సరియైనది
A) పతనకోణం, వక్రీభవన కోణం లంబంతో కోణాన్ని ఏర్పరచవు.
B) వక్రీభవన కోణం ఒక తలంలో, లంబం ఒక తలంలో ఉంటాయి.
C) పతనకిరణం, వక్రీభవన కిరణం, లంబం పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి.
D) పతనకిరణం, వక్రీభవన కిరణం, లంబం ఒకే తలంలో ఉండవు.
జవాబు:
C) పతనకిరణం, వక్రీభవన కిరణం, లంబం పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి.

II. జతపరచుము.

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. సమతల దర్పణం A) ఇంటిలోని పాత్రల లోపలి భాగాలు
2. కుంభాకార B) బార్బర్ షాప్
3. పుటాకార C) వాహనాలలో
4. వలయాకారపు D) సోలార్ కుక్కర్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. సమతల దర్పణం D) సోలార్ కుక్కర్
2. కుంభాకార C) వాహనాలలో
3. పుటాకార A) ఇంటిలోని పాత్రల లోపలి భాగాలు
4. వలయాకారపు B) బార్బర్ షాప్

AP 8th Class Physical Science Important Questions 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం

ii) ఒక కుంభాకార దర్పణపు నాభ్యంతరం 20 సెం.మీ. అయిన దాని ముందు కింది స్థానాలలో వస్తువును ఉంచితే ప్రతిబింబం ఏర్పడు స్థానం విలువను జతపరచుము.

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. అనంతము A) 12 సెం.మీ.
2. 30 సెం.మీ. B) 10 సెం.మీ.
3. 20 సెం.మీ. C) 20 సెం.మీ.
4. 10 సెం.మీ. D) 6.5 సెం.మీ.

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. అనంతము C) 20 సెం.మీ.
2. 30 సెం.మీ. A) 12 సెం.మీ.
3. 20 సెం.మీ. B) 10 సెం.మీ.
4. 10 సెం.మీ. D) 6.5 సెం.మీ.

మీకు తెలుసా?

నీడలు ప్రతిబింబాలు ఒక్కటేనా?

నీడలు ప్రతిబింబాలు
కాంతి ప్రసార మార్గంలో అపారదర్శక వస్తువును ఉంచినపుడు వస్తువు నీడ ఏర్పడుతుంది. కాంతి పరావర్తనం లేదా వక్రీభవనం జరిగినపుడు మరియు పినహోల్ కెమెరా ద్వారా ప్రవేశించినపుడు ప్రతిబింబం ఏర్పడుతుంది.
కాంతి కంటికి చేరని ప్రదేశమే నీడను తెలియజేస్తుంది. కంటికి చేరిన కాంతి కిరణ పుంజం ప్రతిబింబాన్ని ఏర్పరస్తుంది.
వస్తువులోని ప్రతిబిందువుకు నీడలోని బిందువులతో సంబంధం ఉండదు. ఇది కేవలం వస్తువు జ్యామితీయ ఆకృతిని మాత్రమే ఇస్తుంది. వస్తువులోని ప్రతిబిందువుకు ప్రతిబింబంలోని ప్రతిబిందువుతో సంబంధం ఉంటుంది. ప్రతిబింబం వస్తువును గూర్చిన సంపూర్ణ సమాచారాన్ని ఇస్తుంది.