SCERT AP State 7th Class Telugu Textbook Solutions 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Questions and Answers.
AP State Syllabus 7th Class Telugu 1st Lesson Important Questions and Answers శ్రీలు పొంగిన జీవగడ్డ
7th Class Telugu 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ Important Questions and Answers
అవగాహన – ప్రతిస్పందన
కింది పరిచిత గేయాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. శ్రీలు పొంగిన జీవగడ్డయి
పాలు పారిన భాగ్యసీమయి
వరలినది యీ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా.!
ప్రశ్నలు – జవాబులు:
అ) భరతఖండము ఎటువంటి గడ్డ?
జవాబు:
భరతఖండము శ్రీలు పొంగిన జీవగడ్డ.
ఆ) భరతఖండము ఎటువంటి సీమ?
జవాబు:
భరతఖండము పాలు పారిన భాగ్యసీమ.
ఇ) ‘పాడి పంటలు గల భాగ్యదేశం’ అని భావం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘పాలు పారిన భాగ్యసీమ’ అన్న పంక్తి, పై అర్థాన్ని ఇస్తుంది.
ఈ) ఈ గేయ రచయిత ఎవరు ? ఇది ఏ పాఠం లోనిది?
జవాబు:
ఈ గేయ రచయిత, శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు. ఇది “శ్రీలు, పొంగిన జీవగడ్డ” అనే పాఠంలోనిది.
2. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆదికావ్యం బలరె నిచ్చట
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా’!
ప్రశ్నలు – జవాబులు:
అ) భరతఖండములో ఏమి వెలిశాయి?
జవాబు:
భరతఖండములో వేదశాఖలు వెలిశాయి.
ఆ) ఆదికావ్యం ఏది? అది ఎక్కడ పుట్టింది?
జవాబు:
ఆదికావ్యం అంటే మొదటి కావ్యమైన ‘వాల్మీకి రామాయణం’. అది భరతఖండములో పుట్టింది.
ఇ) భరతఖండము ఎటువంటి ఋషులకు నిలయం?
జవాబు:
భరతఖండము బాదరాయణుడు (వేదవ్యాసుడు) వంటి ఋషులకు నిలయం.
ఈ) బాదరాయణుడు అంటే ఎవరు?
జవాబు:
‘బాదరాయణుడు’ అంటే బదరీవనంలో నివసించిన వేదవ్యాసుడు.
3. విపిన బంధుర వృక్షవాటిక
ఉపనిషన్మధు వొలికె నిచ్చట
విపుల తత్త్వము విస్తరించిన
విషుల తల మిదె తమ్ముడా !
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘ఇక్కడ దట్టంగా చెట్లతో అరణ్యాలు ఉన్నాయి’ అని అర్థం వచ్చే పంక్తి ఏది ?
జవాబు:
‘విపిన బంధుర వృక్షవాటిక’ – అనే పంక్తి, పై భావాన్ని ఇస్తుంది.
ఆ) ఉపనిషత్తులు ఎటువంటివి? అవి ఎక్కడ పుట్టాయి?
జవాబు:
ఉపనిషత్తులు తేనె వంటివి. అవి భరతఖండంలో పుట్టాయి.
ఇ) భరతఖండములో ఏది విస్తరించింది?
జవాబు:
భరతఖండములో విస్తారమైన తత్త్వజ్ఞానం విస్తరించింది.
ఈ) ఈ గేయ రచయిత ఎవరు? ఇది ఏ పాఠంలోనిది?
జవాబు:
ఈ గేయ రచయిత రాయప్రోలు సుబ్బారావుగారు. ఇది “శ్రీలు పొంగిన జీవగడ్డ” – అనే గేయంలోనిది.
4. నవరసమ్ములు నాట్యమాడగ
చివురు పలుకులు చెవుల విందుగ
కవితలల్లిన క్రాంతహృదయుల
గారవింపవె చెల్లెలా !
ప్రశ్నలు – జవాబులు:
అ) చెల్లెల్ని రచయిత ఎవరిని గౌరవించమంటున్నాడు?
జవాబు:
చెల్లెల్ని రచయిత, కవులను గౌరవించమన్నాడు.
ఆ) ఏవి నాట్యము చేసేటట్లు కవులు రచించారు?
జవాబు:
కవులు, నవరసాలు నాట్యమాడేటట్లు రచించారు.
ఇ) కవుల పలుకులు ఎలా ఉంటాయి?
జవాబు:
కవుల పలుకులు చివు గుల వంటివి. అవి చెవులకు విందుగా ఉంటాయి.
ఈ) కవిత లల్లిన కవులు ఎట్టివారు?
జవాబు:
కవితలు అల్లిన కవులు, ‘క్రాంతహృదయులు’.
5. పాండవేయుల పదును కత్తులు
మండి మెఱసిన మహిత రణకథ
కండగల చిక్కని తెలుంగుల
కలసి పాడవె చెల్లెలా !
ప్రశ్నలు – జవాబులు :
అ) పాండవేయులు ఎవరు?
జవాబు:
పాండవేయులు అంటే పాండురాజు కుమారులు. వారు – ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు.
ఆ) పాండవేయుల కత్తులు మెఱసిన రణకథ ఏది?
జవాబు:
పాండవేయుల కత్తులు మెఱసిన రణకథ, “భారత యుద్ధగాథ”.
ఇ) రణకథను ఎలా పాడమని రచయిత చెప్పాడు?
జవాబు:
రణకథను చిక్కని తెలుగు పదాలతో పాడమని రచయిత చెప్పాడు.
ఈ). ఈ గేయ రచయిత ఎవరు?
జవాబు:
ఈ గేయ రచయిత “రాయప్రోలు సుబ్బారావు” గారు.
6. తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి
భంగపడని తెలుంగునాథుల
పాట పాడవె చెల్లెలా !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరి పాట పాడమని రచయిత చెప్పాడు?
జవాబు:
తెలుగునాథుల పాట పాడమని రచయిత చెప్పాడు.
ఆ) తెలుగునాథులు ఎటువంటి వారు?
జవాబు:
తెలుగునాథులు భంగపాటు లేనివారు.
ఇ) నింగిని పొంగిన వేవి?
జవాబు:
తుంగభద్రానది కెరటాలు.
ఈ) “చెక్కుచెదరని తెలుగు రాజులు” – అన్న భావం వచ్చే ఫంక్తి ఏది?
జవాబు:
‘భంగపడని తెలుంగునాథులు’ – అన్న పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఈ క్రింది అపరిచిత పద్యాలను చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కోతి ఁబట్టి తెచ్చి కొత్తపుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల (గొలిచి నట్టు
ీతిహీనును నొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ ! వినుర వేకు !
ప్రశ్నలు :
అ) కోతికి ఏమి కట్టారు?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టారు.
ఆ) ఎవరు కోతికి పట్టుచీర కట్టారు?
జవాబు:
కొండముచ్చులు కోతికి పట్టుచీర కట్టారు.
ఇ) కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు ఏమి చేసాయి?
జవాబు:
కోతికి పట్టుచీర కట్టి కొండముచ్చులు సేవించాయి.
ఈ) నిర్భాగ్యులు ఎవరిని సేవిస్తూ ఉంటారు?
జవాబు:
నిర్భాగ్యులు నీతిహీనుణ్ణి సేవిస్తూ ఉంటారు.
2. కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ !
ప్రశ్నలు :
అ) దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.
ఆ) గుణము ఏలా కొరతపడుతుంది?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.
ఇ) కోపము వలన బ్రతుకు ఏమౌతుంది?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.
ఈ) పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము
3. తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్ న
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
ప్రశ్నలు :
అ) ఫణికి విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఫణికి విషం తలలో ఉంటుంది.
ఆ) దేనికి విషం తోకలో ఉంటుంది?
జవాబు:
వృశ్చికానికి (తేలుకు) విషం తోకలో ఉంటుంది.
ఇ) ఖలునకు విషం ఎక్కడ ఉంటుంది?
జవాబు:
ఖలునకు విషం నిలువెల్లా (శరీరమంతా) ఉంటుంది.
ఈ) ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తోంది?
జవాబు:
ఈ పద్యం ద్వారా మనకు ఖలుని స్వభావం తెలుస్తోంది.
4. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.
ప్రశ్నలు :
అ) నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.
ఆ) పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.
ఇ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.
ఈ) ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ) మనదేశపు గొప్పతనం ఏమిటి?
జవాబు:
మన దేశం పాడి పంటలు గల భాగ్యసీమ., ఇక్కడ వేదాలు, ఇతిహాసాలు పుట్టాయి. వ్యాసుడు వంటి ఋషులు ఇక్కడ పుట్టారు. ఇక్కడి కవులు నవరసాలతో కావ్యాలు అల్లారు. కాకతీయ, విజయనగర చక్రవర్తులు దేశాన్ని పరాక్రమంతో పాలించారు. గంగ, గోదావరి వంటి జీవనదులు ప్రవహిస్తున్నాయి. విస్తారమైన అడవులతో, అనేక పరిశ్రమలతో సిరులు పొంగిన జీవగడ్డ మన భారతదేశం.
ఆ) భారతదేశం గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోవాలి?
జవాబు:
మన భారతదేశం ఎందరో వీరులు, ఋషులు, కవులు, సంగీత విద్వాంసులు, సూత్రకారులు పుట్టిన పుణ్యసీమ. ఇది పాడిపంటలకు నిలయమైనది.
మన దేశం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనం కూడా మన పూర్వీకుల వలె ధర్మబద్దంగా జీవిస్తాము, ధైర్యం సాహసాలను చూపి దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించుకుంటాము. కవిత్వాన్ని, కళలను ఆరాధిస్తాము.
జాతీయ భావాలను పెంపొందించుకొని దేశాన్ని ప్రేమిస్తాము. మన దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అందుకోసం భారతదేశ గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి.
ఇ) గేయం ఆధారంగా కవి గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
రాయప్రోలు సుబ్బారావు గారి ఈ గేయం చాలా బాగుంది. ఈ గేయం మనలో దేశభక్తిని పెంపొందిస్తుంది. మనకు మనదేశంపై గౌరవాన్ని, భక్తిని, ప్రేమను కలుగజేస్తుంది. మన పూర్వులపై మనకు విశేషమైన
గౌరవాదరాలను కలుగజేస్తుంది.
రాయప్రోలు వారి గేయంపై నా అభిప్రాయం :
తెలుగులో దేశభక్తి కవిత్వానికి గురజాడ ఆద్యుడు. అయినా భారతదేశం గొప్పతనాన్ని వర్ణించి చెప్పి మనకు భారత జాతీయాభిమానాన్ని రాయప్రోలువారు ప్రబోధించారు. మన వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సూత్రాల గొప్పదనాన్ని గూర్చి గుర్తుచేశారు. మన కవుల గొప్పతనాన్ని కీర్తించారు. మనకు మనదేశంపై గౌరవం కలిగించారు.
ముఖ్యంగా మన తెలుగు రాజులైన కాకతీయులను, విజయనగర రాజులను, వారి పరాక్రమాన్ని కీర్తించారు. ఈ విధంగా నా దేశం, నా జాతి, నా భాష అన్న అహంకారాన్ని భారతీయులకు కలిగించే గొప్ప దేశభక్తి కవిత్వాన్ని ఈ గేయంలో రాయప్రోలువారు చెప్పారు.
ఈ) శ్రీలు అంటే సంపదలు అని అర్థం కదా ! మన దేశం ఏయే సంపదలకు నిలయమో వ్యక్తీకరించండి.
జవాబు:
మనదేశం శ్రీలు పొంగిన ‘ భాగ్యసీమ. జీవమున్న భూమి. ‘పాడిపంటలు పుష్కలంగా కలిగినటువంటిది. వేదాలు, వేదాంగాలు, రామాయణం, మహాభారతం, భాగవతాలు రచించిన వేదవ్యాసుడు మున్నగు మహామునులు ఉదయించిన ఈ నేల ఘన చరిత్ర కలది.
శ్రీలు అంటే సిరులు, సంపదలు అని అర్థం. సంపద అంటే కేవలం డబ్బే కాదు. పశువులూ సంపదే, పంటలూ సంపదే, మత్స్య సంపద, అడవులూ సంపదే, నదీ జలాలూ సంపదే, వన్య మృగాలూ సంపదే, ఇంకా భూగర్భంలో దొరికే అనేక ఖనిజాలైన బంగారం, వెండి, బాక్సైట్, మైకా, బొగ్గు, అబ్రకం మొదలైన సంపదలకు నిలయం మనదేశం.
రామాయణాది దివ్య గ్రంథాలు నెలవు ఈ నేల. ఈ పుస్తక (విద్యా) సంపద ద్వారా ప్రపంచం అంతా మనవైపు గొప్పగా చూసే వ్యక్తిత్వం నెలకొల్పిన నేల మనది. సంపదలో కెల్ల గొప్ప సంపద వ్యక్తుల మధ్య అనుబంధం. ఇది మనదేశంలో పుష్కలంగా ఉంది. ఒకరితో ఒకరు సోదరభావంతో, స్నేహభావంతో మెలగడం ఈ గడ్డ ప్రత్యేకత. ఇక్కడ పుట్టిన చీమలకు, కాకులకు సైతం ఒక నిబద్ధత ఉంది. ఈ నేలపై ఉన్న గొప్ప సంపదల్లో ఇదీ ఒకటి.
ఉ) “భరతమాత” గొప్పదనాన్ని తెలియజేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి..
జవాబు:
లేఖ కాకినాడ, మిత్రుడు పి. రాజారావుకు, ఇట్లు, చిరునామా: |
7th Class Telugu 1st Lesson శ్రీలు పొంగిన జీవగడ్డ 1 Mark Bits
1.’ అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. ఇది ఏ సంధి సూత్రం?
ఎ) గుణసంధి
బి) యణాదేశ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) ద్విరుక్తటకార సంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి
2. భారతదేశం సిరిసంపదలకు ఆటపట్టు. (అర్థాన్ని గుర్తించండి)
ఎ) నిలయం
బి) వెలుగు
సి) సందర్భం
డి) సామర్థ్యం
జవాబు:
ఎ) నిలయం
3. విశాలమైన మనదేశంలో విస్తారమైన అడవులు, గనులు ఉన్నాయి. (సమానార్థక పదాలు గుర్తించండి)
ఎ) అడవులు, గనులు
బి) మనదేశం, గనులు
సి) విశాలమైన, విస్తారమైన
డి) అడవులు, విస్తారం
జవాబు:
సి) విశాలమైన, విస్తారమైన
4. అత్యాశ ఉండకూడదు. (సంధి విడదీసిన పదం గుర్తించండి)
ఎ) అతి + ఆశ
బి) అత్ + ఆశ
సి) అత్య + ఆశ
డి) అత్యా + ఆశ
జవాబు:
ఎ) అతి + ఆశ
5. మన భారతీయ సైనిక దళం శక్తివంతమైనది. (నానార్థాలు గుర్తించండి)
ఎ) బలం – గుంపు
బి) ఆకు – గుంపు
సి) నమస్కారం – సంస్కారం
డి) పటాలం – ప్రతిభ
జవాబు:
బి) ఆకు – గుంపు
III. భాషాంశాలు
పదాలు – అర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.
6. ఆదికావ్యం బలరె నిచ్చట.
ఎ) అంతిమ కావ్యం
బి) చివరి కావ్యం
సి) మొదటి కావ్యం
డి) మధ్య కావ్యం
జవాబు:
సి) మొదటి కావ్యం
7. ‘ఇది బాదరాయణ పరమ ఋషులకు పాదు.
ఎ) అత్రి
బి) వశిష్ఠుడు
సి) వ్యాసుడు
డి) అగస్యుడు
జవాబు:
సి) వ్యాసుడు
8. కాకతీయుల కదన పాండితి మేలయినది.
ఎ) కళ
బి) యుద్ధం
సి) పాలన
డి) విజ్ఞానము
జవాబు:
బి) యుద్ధం
9. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని ముట్టింది.
ఎ) కెరటము
బి) జలము
సి) నది
డి) టెక్కలు
జవాబు:
ఎ) కెరటము
10. విపినంలో జంతువులు ఉంటాయి.
ఎ) సరోవరం
బి) జలధి
సి) అరణ్యం
డి) తటాకం
జవాబు:
సి) అరణ్యం
11. నింగిలో తారలు ఉదయించాలి.
ఎ) రసాతలం
బి) ఆకాశం
సి) దివి
డి) నరకం
జవాబు:
బి) ఆకాశం
12. రణంలో విజయం పొందాం.
ఎ) రసం
బి) శాంతి
సి) యుద్ధం
డి) రసాతలం
జవాబు:
సి) యుద్ధం
13. మేలిమి రత్నాలు పొందాలి.
ఎ) న్యూనమైన
బి) అల్పమైన
సి) సాధారణమైన
డి) శ్రేష్ఠమైన
జవాబు:
డి) శ్రేష్ఠమైన
14. సముద్రంలోని దీప్తి అమెంధూ
ఎ) శిలలు
బి) క్షీరం
సి) నీరు
డి) ప్రకాశం
జవాబు:
డి) ప్రకాశం
15. స్వరాలను మేళవించి షాడాలి.
ఎ) బందం చేసి
బి) జతపరచి
సి) మరలి
డి) విడదీసి
జవాబు:
బి) జతపరచి
పర్యాయపదాలు :
16. విశాలమైన మనదేశంలో విస్తారమైన అటవీ సంపద ఉంది.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) విశాలమైన, మనదేశం
బి) విస్తారమైన, అటవీ సంపద
సి) విశాలమైన, విస్తారమైన
డి) విస్తారమైన, సంపద ఉంది
జవాబు:
సి) విశాలమైన, విస్తారమైన
17. విదినాలలో క్రూర జంతువులుంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) విపినాలలో, క్రూర జంతువులు
బి) విపినాలలో, అరణ్యాలలో
సి) మునులు, జంతువులు
డి) విపినాలలో, మునులు నివసిస్తారు
జవాబు:
ఎ) విపినాలలో, క్రూర జంతువులు
18. ‘కాకతీయుల కదన పాండితి’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) యుద్ధం, పోరు
బి) పోరు, జ్ఞానము
సి) రణము, విద్య
డి) సాహసం, యుద్ధం
జవాబు:
ఎ) యుద్ధం, పోరు
19. సువర్ణం విలువైంది. – గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.
ఎ) హేమం, సుందరం
బి) హేమం, హారిక
సి) బంగారం, హేమం
డి) రజతం, కాంస్యం
జవాబు:
సి) బంగారం, హేమం
20. గృహంలో నివసిస్తున్నాను. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఇల్లు, ఇంతి
బి) గేహం, గేయం
సి) గేయం, గాఢం
డి) సదనం, నికేతనం
జవాబు:
డి) సదనం, నికేతనం
21. దేహం రక్షణీయమైంది. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) తనువు, మేను
బి) వాసన, కాయం
సి) తనువు, తరువు
డి) మేను, మేరు
జవాబు:
ఎ) తనువు, మేను
22. యాగం నిర్వహించాలి. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) యజ్ఞం, క్రతువు
బి) జాతనం, యాగం
సి) కారచి, భీన్నం
డి) పూజ, హోమం
జవాబు:
ఎ) యజ్ఞం, క్రతువు
23. యుద్ధంలో సైన్యం ఉంది. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) దాస్యం, జాతనం
బి) గుంపు, మేశన
సి) మహిన, వారి
డి) సేన, వాహిని
జవాబు:
డి) సేన, వాహిని
ప్రకృతి – వికృతులు :
24. ‘ఆదికావ్యం బలరె నిచ్చట’ – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) కావ్యము
బి) కబ్బం
సి) రచన
డి) కావము
జవాబు:
బి) కబ్బం
25. దేశ గర్వము దీప్తి చెందగ – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) గరువము
బి) గర్వం
సి) గరవం
డి) గరం
జవాబు:
బి) గర్వం
26. మన భాగ్యము సమున్నతమైనది – గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
ఎ) భాగం
బి) బాగెము
సి) భజనం
డి) భాగ్యం
జవాబు:
బి) బాగెము
27. అందరు శ్రీ పొందాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) సిరి
బి) గిరి
సి) శీరి
డి) ప్రేరి
జవాబు:
ఎ) సిరి
28. అందరు భక్తి మార్గంలో వెళ్ళాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) బొత్తి
బి) బత్తే
సి) బోత్తి
డి) బత్తి
జవాబు:
డి) బత్తి
29. ఎద వికసించాలి – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
ఎ) యాద
బి) మోద
సి) హృదయం
డి) హేమం
జవాబు:
సి) హృదయం
30. రామ కథ మధురం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
ఎ) గాథ
బి) కత
సి) కేథ
డి) కోత
జవాబు:
బి) కత
31. కాళిదాసు కైత మధురం – గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది?
ఎ) కవిత
బి) కాయిత
సి) కావ్యం
డి) కార్యం
జవాబు:
ఎ) కవిత
వ్యతిరేక పదాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
32. పొంగి నింగిని పొడిచి తుళ్ళింది.
ఎ) ఆకాశం
బి) నేల
సి) కెరటము
డి) భంగము
జవాబు:
బి) నేల
33. పాలుపారిన భాగ్యసీమ.
ఎ) దుర్భాగ్య
బి) నిర్భాగ్య
సి) సౌభాగ్య
డి) మహాభాగ్య
జవాబు:
బి) నిర్భాగ్య
34. వాల్మీకి ఆదికావ్యం రచించారు.
ఎ) అంతం
బి) యాతి
సి) ప్రత్యాతి
డి) గునాది
జవాబు:
ఎ) అంతం
35. పెద్దలపట్ల గౌరవం ఉంచాలి.
ఎ) యథా గౌరవం
బి) అను గౌరవం
సి) ప్రతిగారవం
డి) అగౌరవం
జవాబు:
డి) అగౌరవం
36. పుణ్యం సంపాదించాలి.
ఎ) పాపం
బి) యాతం
సి) నివృతం
డి) అనూన్యం
జవాబు:
ఎ) పాపం
37. నీరు నిర్మలంగా ఉంది.
ఎ) వినిర్మలం
బి) ప్రత్యిర్మిలం
సి) దోషాంతం
డి) కలుషితం
జవాబు:
డి) కలుషితం
38. అందరు సత్యం పలకాలి.
ఎ) ప్రసత్యం
బి) అసత్యం
సి) విసత్యం
డి) అనునిత్యం
జవాబు:
బి) అసత్యం
39. ధర్మం ఆశ్రయించాలి.
ఎ) విధర్మం
బి) సుధర్మం
సి) కుధర్మం
డి) అధర్మం
జవాబు:
డి) అధర్మం
సంధులు :
40. ‘అషావధానం‘ – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) గుణ సంధి
బి) అత్వ సంధి
సి) సవర్ణదీర్ఘ సంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
సి) సవర్ణదీర్ఘ సంధి
41. ‘అణ్వాయుధం‘ బ్రద్దలయింది – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) అణ్వ + ఆయుధం
బి) అణు + ఆయుధం
సి) అణు + వాయుధం
డి) అణ్వా + యుధం
జవాబు:
బి) అణు + ఆయుధం
42. ‘పితృ + ఆర్జితం’ కలిపితే వచ్చే రూపాన్ని గుర్తించండి.
ఎ) పిత్రార్జితం
బి) పితృ ఆర్జితం
సి) పితరార్జితం
డి) పిత్ర ఆర్జితం
జవాబు:
ఎ) పిత్రార్జితం
43. క్రింది వానిలో యణాదేశ సంధికి ఉదాహరణ ఏది?
ఎ) సపరివారం
బి) ప్రత్యేకము
సి) సాదరము
డి) గణేశుడు
జవాబు:
బి) ప్రత్యేకము
44. గురూపదేశం అవసరం – పదాన్ని విడదీయండి.
ఎ) గుర్వ + ఉపదేశం
బి) గురో + ఉపదేశం
సి) గురవ + ఉపదేశం
డి) గురు + ఉపదేశం
జవాబు:
డి) గురు + ఉపదేశం
45. రాగము + ఎత్తి – దీనిని కలిపి రాయండి.
ఎ) రాగమెత్తి
బి) రాగవత్తి
సి) రాగమొత్తి
డి) రాగవొత్తి
జవాబు:
ఎ) రాగమెత్తి
46. కవితలల్లన – ఇది ఏ సంధి?
ఎ) గుణసంధి
బి) అత్వసంధి
సి) త్రికసంధి
డి) ఇత్వసంధి
జవాబు:
బి) అత్వసంధి
47. అత్యంత మధురం – దీనిని విడదీయండి.
ఎ) అతె + అంత
బి) అతి + ఎంత
సి) అతి + ఇంత
డి) అతి + అంత
జవాబు:
డి) అతి + అంత
సమాసాలు :
48. ‘వేద శాఖలు‘ ఎన్న? – గీత – గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వేదములు, శాఖలు
బి) వేదములచేత శాఖలు
సి) వేదములందు శాఖలు
డి) వేదముల యొక్క శాఖలు
జవాబు:
డి) వేదముల యొక్క శాఖలు
49. ‘కాకతీయుల కదన పాండితి అమోఘము – గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) సప్తమీ తత్పురుష సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) బహుప్రీహి సమాసం
జవాబు:
బి) సప్తమీ తత్పురుష సమాసం
50. భక్తితో పాడర – దీనికి సమాస పదం గుర్తించండి.
ఎ) అనుభక్తి
బి) భక్తి యందు పాడర
సి) భక్తి పాడర
డి) పాడర భక్తి
జవాబు:
సి) భక్తి పాడర
51. నవరసమ్ములు రావాలి – రాసిన పదం ఏ సమాసం?
ఎ) అవ్యయీభావం
బి) రూపక సమాసం
సి) షష్ఠీ తత్పురుష
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం
52. భారత ఖండంబు అఖండంబు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) భారతుని యొక్క ఖండం
బి) భరతునితో ఖండము
సి) భరతుని యందు ఖండము
డి) భరతుని వలన ఖండము
జవాబు:
ఎ) భారతుని యొక్క ఖండం
వాక్య ప్రయోగాలు :
53. ‘సీతారాములు అడవికి వెళ్ళారు’ – ఈ వాక్యం ఏ వాక్యం?
ఎ) సంక్లిష్ట వాక్యం
బి) సంయుక్త వాక్యం
సి) మహా వాక్యం
డి) సామాన్య వాక్యం
జవాబు:
బి) సంయుక్త వాక్యం
54. ఆటలు ఆడవద్దు – ఇది ఏ వాక్యం? (ఎ)
ఎ) నిషేధక
బి) ప్రశ్నార్థక
సి) కర్మణ్యర్థక
డి) హేత్వర్థక
జవాబు:
ఎ) నిషేధక
55. పరీక్షలు బాగా రాయాలి – ఇది ఏ వాక్యం?
ఎ) అభ్యర్థకం
బి) ప్రశ్నార్థకం
సి) విధ్యర్థకం
డి) ధాత్వర్థకం
జవాబు:
సి) విధ్యర్థకం
56. చిరకాలం దీవింతురుగాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆశీర్వార్థకం
బి) ప్రశ్నార్థకం
సి) ధాత్వర్థకం
డి) తూమున్నర్థకం
జవాబు:
ఎ) ఆశీర్వార్థకం
57. వాడు వస్తాడో? రాడో? – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
సి) సందేహార్థక వాక్యం
58. నడుస్తూ పనిచేస్తున్నాడు – గీత గీసిన పదం ఏ క్రియకు చెందింది?
ఎ) హేత్వర్థకం
బి) శత్రర్థకం
సి) భావార్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
బి) శత్రర్థకం
59. సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) అభ్యర్థక వాక్యం
బి) సామాన్య వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) సంక్లిష్ట వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం
60. భారతదేశం వృద్ధి పొందింది – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) భారతదేశం వృద్ధి పొంది యుండదు.
బి) భారతదేశం వృద్ధి పొందకపోవచ్చు.
సి) భారతదేశం వృద్ధి చెందితే బాగుండదు.
డి) భారతదేశం వృద్ధి పొందలేదు.
జవాబు:
డి) భారతదేశం వృద్ధి పొందలేదు.
61. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) విధ్యర్ధకం
బి) చేదర్థకం
సి) ఆత్మర్థకం
డి) అభ్యర్థకం
జవాబు:
బి) చేదర్థకం
62. ఆహా ! ఎంత బాగుందో ! – ఇది ఏరకమైన వాక్యం?
ఎ) ఆశ్చర్యార్థకం
బి) హేత్వర్థకం
సి) అప్యర్థకం
డి) చేదర్థకం
జవాబు:
ఎ) ఆశ్చర్యార్థకం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు :
63. వీరులను గూర్చి గానం చేయాలి – గీత గీసిన పదం, ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ద్వితీయా
బి) తృతీయ
సి) పంచమీ
డి) షష్టీ
జవాబు:
ఎ) ద్వితీయా
64. ‘పాట పాడవె చెల్లెలా !’ – గీత గీసిన పదము, ఏ భాషాభాగమో గుర్తించండి.
ఎ) నామవాచకం
బి) సర్వనామము
సి) క్రియ
డి) విశేషణము
జవాబు:
సి) క్రియ
65. తెల్లని పాలు మధురం – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) అవ్యయం
బి) క్రియ
సి) నామవాచకం
డి) విశేషణం
జవాబు:
డి) విశేషణం
66. లోకమంతకు కాక పెట్టనీ – గీత గీసినది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) షష్టి
బి) సప్తమీ
సి) ప్రథమా
డి) ద్వితీయ
జవాబు:
ఎ) షష్టి
67. నీవు అన్నం తిన్నావా? – గీత గీసిన పదం ఏ పరుషకు చెందినది?
ఎ) ఉత్తమ
బి) ప్రథమ
సి) మధ్యమ
డి) అధమ
జవాబు:
సి) మధ్యమ
68. రాముడు అడవికి వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) నామవాచకం
బి) సర్వనామం
సి) క్రియ
డి) అవ్యయం
జవాబు:
ఎ) నామవాచకం
సొంతవాక్యాలు :
69. ‘చెలిగిపోవు’ : నా మిత్రుని కృషితో వారి వంశపు అపకీర్తి చెఱిగిపోయింది.
70. జీవగడ్డ : అమరావతి కళలకు జీవగడ్డ.
71. చెవుల విందు : ఘంటసాల వారి పాటలు చెవుల విందుగా ఉంటాయి.
72. భాగ్యసీమ : భరతావని గొప్ప భాగ్యసీమగా కనిపించింది.
73. చీకటి పోవని : చీకటి పోవని కారడవిలో జంతువులు సంచరిస్తాయి.
74. విస్తరించు : దేశ నలుమూలల్లో అవినీతి బాగా విస్తరించింది.
75. దాస్యం : పరాయి పాలనలో భారతీయులు దాస్యం అనుభవించారు.
76. మేళవించు : రాగాలను మేళవించి మధురంగా గానం చేయాలి.