These AP 7th Class Telugu Important Questions 4th Lesson మేలిమి ముత్యాలు will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 4th Lesson Important Questions and Answers మేలిమి ముత్యాలు
7th Class Telugu 4th Lesson మేలిమి ముత్యాలు Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
ఈ కింది పరిచిత పద్యాలను చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. కలిమిగల లోభికన్నను
విలసితముగ బేద మేలు వితరణి యైనన్
చలిచెలమ మేలు కాదా
కులనిధి యంభోధికన్న గువ్వలచెన్నా !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరి కన్న పేద మేలు ?
జవాబు:
సంపదకల లోభి కన్న పేద మేలు.
ఆ) లోభికన్న పేద ఎప్పుడు మేలు?
జవాబు:
పేద వితరణి (దాత) అయితే, లోభివాని కన్న మేలు.
ఇ) చలిచెలమ దేనికన్న మేలు?
జవాబు:
చలిచెలమ అంభోధి (సముద్రము) కన్న మేలు.
ఈ) చలిచెలమ అంభోధి కన్న ఎందుకు మేలని చెప్పగలవు.
జవాబు:
చలిచెలమలో నీళ్ళు కొంచెమే ఉన్నా అవి త్రాగడానికి పనికి వస్తాయి. సముద్రంలో నీళ్ళు ఎక్కువగా ఉన్నా ఉప్పుగా ఉండి అవి త్రాగడానికి పనికిరావు. అందువల్ల చలిచెలమ, అంభోధికన్న మేలు.
2. పుస్తకముల నీవు పూవువలెను జూడు
చింపఁబోకు మురికి చేయఁబోకు
పరుల పుస్తకముల నెరవు తెచ్చితి వేని
తిరిగి యిమ్ము వేగ, తెలుఁగు బిడ్డ !
ప్రశ్నలు – జవాబులు:
అ) పుస్తకములను ఎలా చూడాలి?
జవాబు:
పుస్తకములను పువ్వుల్లా చూడాలి.
ఆ) పుస్తకాల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి?
జవాబు:
పుస్తకాలను చింపరాదు. మురికి చేయరాదు.
ఇ) ఇతరుల పుస్తకముల విషయంలో ఎలా ఉండాలి?
జవాబు:
ఇతరుల పుస్తకాలు ఎరవు తెస్తే వేగంగా వారికి తిరిగి ఇయ్యాలి.
ఈ) ఎరవు తేవడం అంటే ఏమిటి?
జవాబు:
అవసరం కోస ఇతరులను అడిగి తెచ్చుకోవడం.
3. పుత్తడిగలవాని పుండుబాడైనను
వసుధలోన చాల వారకెక్కు
పేదవాని యింట పెండైన యెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘ధనవంతుడు చిన్న కురుపుతో బాధపడితే’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
‘పుత్తడి గలవాని పుండు బాధైనను’ అనే పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఆ) ఏ విషయం పెద్దగా ప్రచారమవుతుంది?
జవాబు:
పుత్తడిగల వాని పుండు బాధ పెడితే, ఆ వార్త బాగా ప్రచారము అవుతుంది.
ఇ) ‘వార్తకెక్కు’ అంటే ఏమిటి?
జవాబు:
వార్తలలోకి వస్తుంది. అంటే అంతా ఆ విషయం గూర్చి చెప్పుకుంటారు.
ఈ) ఏ విషయాన్ని జనం పట్టించుకోరు?
జవాబు:
బీదవాడి ఇంట్లో పెళ్ళి జరిగినా ఎవరికీ తెలియదు.
4. పత్రికొకటియున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్రకోటి
ప్రజకు రక్షలేదు పత్రికలేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట
ప్రశ్నలు – జవాబులు:
అ) ఏది పదివేల సైన్యంతో సమానము?
జవాబు:
పత్రిక ఒక్కటి ఉంటే అది పదివేల సైన్యం వంటిది.
ఆ) ‘పత్రిక కోటి స్నేహితులతో సమం’ అనే భావం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
పత్రికొక్కటున్న మిత్రకోటి” – అనే పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఇ) ఏమి లేకపోతే ప్రజలకు రక్షణ లేదు?
జవాబు:
పత్రిక లేకపోతే ప్రజలకు రక్షణ లేదు.
ఈ) ‘నార్లవారి మాట’ శతక రచయిత ఎవరు?
జవాబు:
నార్లవారి మాట శతక రచయిత, “శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు.”
5. “సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు. జనులకు గలుషమడంచు
గీర్తిఁ బ్రకటించు చిత్తవిస్ఫూర్తిఁ జేయు
సాధుసంగంబు సకలార్థ సాధకంబు.
ప్రశ్నలు – జవాబుల
అ) సకలార్థ సాధకము ఏది?
జవాబు:
సాధుసంగము (సజ్జన సహవాసులు) సకలార్థ సాధకము.
ఆ) సాధుసంగము దేనిని ఘటిస్తుంది?
జవాబు:
సాధుసంగము సత్యసూక్తిని ఘటిస్తుంది.
ఇ) సాధుసంగము దేనిని పోగొడుతుంది?
జవాబు:
సాధుసంగము ధీజడిమను అనగా బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది.
ఈ) ‘కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనస్సును బాగుచేస్తుంది’ అనే అర్థం వచ్చే పంక్తి ఏది?
జవాబు:
కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి ‘జేయు’ అనే పద్య పంక్తి పై భావాన్ని ఇస్తుంది.
ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు
ప్రశ్నలు
అ) మానవులకు ఏం కావాలి?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.
ఆ) అక్షరం జిహ్వకు ఎటువంటిది?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.
ఇ) అక్షరము దేనిని రక్షిస్తుంది?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షర మహిమ.
2. పరగ రాతి గుండు పగులఁ గొట్టఁగవచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపఁగా రాదు
విశ్వదాభిరామ ! వినుర వేమ!
ప్రశ్నలు :
అ) వేటిని పగుల గొట్టవచ్చును?
జవాబు:
రాతి గుండులను పగుల గొట్టవచ్చును.
ఆ) వేటిని పిండి కొట్టవచ్చును?
జవాబు:
కొండలను పిండి కొట్టవచ్చును.
ఇ) ఎవరి మనస్సుని కరిగించలేము?
జవాబు:
కఠిన చిత్తుని మనస్సుని కరిగించటము కష్టము.
ఈ) పై పద్యము ఏ శతకములోనిది?
జవాబు:
పై పద్యము వేమన శతకము లోనిది.
3. ఇద్దఱు గూడుక యొక చో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా
యొద్దకు జనగూడదు తన
పెద్దతనం బెల్ల సణఁగ బెట్టు గుమారీ !
ప్రశ్నలు :
అ) ఇద్దరు మాట్లాడుకొనునప్పుడు ఏం చేయరాదు?
జవాబు:
వారి మధ్యకు వెళ్ళి మాట్లాడకూడదు.
ఆ) ఎటువంటి స్థలమునకు వెళ్ళకూడదు?
జవాబు:
ఇద్దరు మాట్లాడుకొను స్థలమునకు వెళ్ళకూడదు.
ఇ) అటువంటి చోటికి వెడితే ఏం జరుగుతుంది?
జవాబు:
తన గొప్పతనం, పెద్దతనం పోతుంది.
ఈ) పై పద్యంలోని నీతి ఏమిటి?
జవాబు:
రహస్యాలు వినకూడదు.
4. అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
ప్రశ్నలు:
అ) ఎటువంటి చుట్టమును విడిచిపెట్టాలి?
జవాబు:
సమయమునకు సహాయము చేయని చుట్టమును విడిచిపెట్టేయాలి.
ఆ) ఎటువంటి దైవమును విడిచిపెట్టాలి?
జవాబు:
నమస్కరించిననూ వరమీయని దేవుణ్ణి విడిచి పెట్టవలెను.
ఇ) యుద్ధములో ఎవరిని విడిచిపెట్టాలి?
జవాబు:
యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టాలి.
ఈ) పై పద్యములోని నీతి ఏమిటి?
జవాబు:
అవసరానికి ఉపయోగపడని వాటిని వెంటనే విడిచి పెట్టాలి.
5. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిటికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు :
1. మేడి పండు పైకి ఎలా ఉంటుంది?
జవాబు:
మేలిమిగా.
2. పైకి ధైర్యంగా లోపల భయంగా ఉండడాన్ని సూచించే పద్యపాదం ఏది?
జవాబు:
పిటికి వాని మదిని బింకమీలాగురా.
3. మేడి పండును ఎవరితో పోల్చారు?
జవాబు:
పిటికివానితో
4. ఈ పద్యానికి మకుటం ఏది?
జవాబు:
విశ్వదాభిరామ వినురవేమ.
6. ఈ కింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరితా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ !
ప్రశ్నలు :
1. ‘సిరి’ ఎట్లా వస్తుంది?
జవాబు:
టెంకాయలోనికి నీరెలా తెలియకుండా చేరుతుందో అలాగే సంపద ‘తెలియకుండానే వస్తుంది.
2. ‘సిరి’ ఎలా పోతుంది?
జవాబు:
ఏనుగు తిన్న వెలగపండు గుజ్జువలె సంపద పోతుంది.
3. ఈ పద్యాన్ని చదివి నీవు ఏమి గ్రహించావు?
జవాబు:
సంపదలు నిత్యములు కావు.
4. ఈ పద్యము ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
సుమతీ శతక కర్త ఎవరు?
7. క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు – జవాబులు రాయండి.
పూజకన్న నెంచ బుద్ది నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులము కన్న నెంచ గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు:
1. పూజకంటే ఏది ముఖ్యం?
జవాబు:
బుద్ధి
2. మాటకంటే ఏది దృఢంగా ఉండాలి?
జవాబు:
మనసు
3. పై పద్యం ఏ శతకంలోనిది?
జవాబు:
వేమన
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
కులం కన్నా ఏది ప్రధానం?
8. ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
కన్నతల్లి దండ్రి కలహించి విడిపోవ
ప్రేమ లేక పెరుగు పిల్లలిపుడు
నేరగాండ్రలోన జేరు చుండిరి సుమా !
పగ, మనస్సులో న రగులు చుండ.
ప్రశ్నలు:
1. తల్లిదండ్రుల ప్రేమ దూరమైన పిల్లలు ఎలా – మారుతున్నారు?
జవాబు:
నేరచరితులుగా
2. ఎవరు కలహించి విడిపోతున్నారు?
జవాబు:
తల్లి,తండ్రి
3. నేరగాళ్ళగా మారిన పిల్లల మనసులో ఏమి రగులు తుంటుంది?
జవాబు:
పగ
4. తల్లిదండ్రులు ఎలా ఉంటే మీకిష్టం?
జవాబు:
ప్రేమతో
9. ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి, ఇవ్వబడిన ఆ ప్రశ్నలకు జవాబులు రాయండి.
కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు
నష్టపెట్టబోకు నాన్న పనులు.
తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా
లలితసుగుణజాల తెలుగుబాల.
ప్రశ్నలు:
1. ఎవరి మనసు కష్టపెట్టరాదు?
జవాబు:
కన్నతల్లి మనసు
2. దైవ సన్నిభులు ఎవరు?
జవాబు:
తల్లిదండ్రులు
3. ఎవరి పనులు నష్టపెట్టరాదు?
జవాబు:
నాన్న పనులు
4. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారుచేయండి.
జవాబు:
ఈ పద్యములో గల మకుటం ఏది?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
అ). ధనవంతులు, పేదవారి ఇళ్లలో ఏమి జరిగినా ఎవరిని గురించి తొందరగా బయటవాళ్లకు తెలుస్తుంది?
జవాబు:
ధనవంతుడు చిన్న కురుపుతో బాధపడినా కూడా పెద్దగా ప్రచారమవుతుంది.. పేదవాడి ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా ఎవరికీ తెలియదు. కావున ధనవంతుడి ఇంట్లో విషయమే తొందరగా బయటవాళ్లకు తెలుస్తుంది.
ఆ) బుద్ధిమంతుడు ఏమి తెలుసుకొని వ్యవహరించాలి?
జవాబు:
చెడ్డవారితో స్నేహం ఉదయంపూట నీడలాగ మొదట ఎక్కువగా ఉండి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మంచివారితో స్నేహం మిట్టమధ్యాహ్నపు నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. బుద్ధిమంతుడు ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకొని వ్యవహరించాలి.
ఇ) మంచితనానికి ఉండే గొప్పతనం ఏమిటి?
జవాబు:
మంచివాళ్లతో సహవాసం మందకొడితనాన్ని పోగొడుతుంది. సత్యాన్ని మాట్లాడేలా చేస్తుంది. మంచి గౌరవాన్ని ఇస్తుంది. , పాపాలను పోగొడుతుంది. మనస్సును శుభ్రపరుస్తుంది. కీర్తిని వ్యాపింపచేస్తుంది. లోకంలో మంచితనం చేయలేని మంచి పని అంటూ ఏదీలేదు.
ఈ) ఇతరుల పుస్తకాలను అడిగి తెచ్చుకుంటే వెంటనే తిరిగి ఇవ్వాలని తెలుసుకున్నారు కదా ! ఇలా ఎందుకు చెయ్యాలి?
జవాబు:
పుస్తకములు ఇతరులకు ఇస్తే అవి తిరిగి రావనీ, వచ్చినా అవి చిరిగిపోయాక మాత్రమే వస్తాయని లోకంలో ఒక మాట ఉంది. అది మంచిది కాదు. పుస్తకాలను అన్నిటినీ మనము కొనలేము. అవసరమైనపుడు ప్రక్కవారిని అడిగి తెచ్చుకొని, దాన్ని త్వరగా ఉపయోగించుకొని తిరిగి ఇచ్చివేయాలి. అప్పుడు అవి మరి కొందరికి ఉపయోగిస్తాయి. తప్పక తిరిగి ఇచ్చివేస్తాడనే నమ్మకం కలిగిస్తే, ఎవరైనా అతడికి పుస్తకాలు ఎరవు ఇస్తారు.
ఉ) మంచి వాళ్లతో స్నేహం చేయడానికి మీరు ఏమి చేస్తారు?
జవాబు:
మంచివారితో ముందు మంచి మాటల ద్వారా పరిచయం పెంచుకుంటాను. మంచివారికి కావలసిన వస్తువులను అందిచ్చి, వారితో స్నేహం పెంచుకుంటాను. మంచివారు మాట్లాడిన మాటలకు అనుగుణంగా మాట్లాడుతాను. మంచివారికి అవసరమైతే ధనం సాయం చేస్తాను. నా పుస్తకాలు, నోట్సు, గైడులు మంచి వారికి కావలసివస్తే ఇస్తాను. ఈ విధంగా మంచివారితో స్నేహాన్ని పెంచుకుంటాను.
7th Class Telugu 4th Lesson మేలిమి ముత్యాలు 1 Mark Bits
1. రైతులు రేయింబగళ్ళు కష్టపడతారు. (విగ్రహవాక్యాన్ని గుర్తించండి)
ఎ) రేయీ, పగలు
బి) పగలు, రాత్రి
సి) రాత్రి, పగలు
డి) రేయి మొత్తం
జవాబు:
ఎ) రేయీ, పగలు
2. రవి పాఠశాలకు వెళ్ళుతున్నాడు. (ఏ భాషాభాగమో గుర్తించండి)
ఎ) నామవాచకం
బి) సర్వనామం
సి) క్రియ
డి) విశేషణం
జవాబు:
సి) క్రియ
3. సూర్యచంద్రులు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తారు. (సమాసమును గుర్తించండి)
ఎ) ద్విగుసమాసం
బి) ద్వంద్వసమాసం
సి) షష్టీతత్పురుషసమాసం
డి) విశేషణ పూర్వపద కర్మధారయసమాసం
జవాబు:
బి) ద్వంద్వసమాసం
4. విష్ణువు “దశావతారములు ఎత్తెను.” – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) పది సంఖ్య గల అవతారాలు
బి) నూరు సంఖ్య గల
సి) వేయి సంఖ్య గల అవతారాలుఅవతారాలు
డి) పద్దెనిమిది సంఖ్య గల పర్వములు
జవాబు:
ఎ) పది సంఖ్య గల అవతారాలు
5. కలిమి గల లోభి కన్నను విలసినతముగఁ బేదమేలు. (అర్థాన్ని గుర్తించండి)
ఎ) పిసినారి
బి) ధనవంతుడు
సి) మూర్ఖుడు
డి) హీనుడు
జవాబు:
సి) మూర్ఖుడు
6. “ద్వంద్వ సమాసము”నకు చెందిన పదమును గుర్తించండి.
ఎ) రెండు, జంటలు
బి) దేశభాషలు
సి) సూర్యచంద్రులు
డి) భరతమాత
జవాబు:
సి) సూర్యచంద్రులు
7. చెడ్డవాళ్ళతో స్నేహం చేయరాదు – విభక్తిని గుర్తించండి.
ఎ) తృతీయా
బి) సప్తమీ
సి) ద్వితీయా
డి) చతుర్డీ
జవాబు:
ఎ) తృతీయా
8. భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. (సమానార్థక పదాలను గుర్తించండి)
ఎ) సంద్రం, అవని
బి) ధరణి, ధరిత్రి
సి) అవని, సముద్రం
డి) పుడమి, పయోధి
జవాబు:
బి) ధరణి, ధరిత్రి
9. నవరసాలు (సమాస నామాన్ని గుర్తించండి)
ఎ) ద్వంద్వ సమాసం
బి) బహు బ్రీహి సమాసం
సి) అవ్యయీభావ సమాసం
డి) ద్విగు సమాసం
జవాబు:
డి) ద్విగు సమాసం
10. “సీతయును, రాముడును”, ఈ పదాలను సమాన పదంగా కూర్చండి.
ఎ) సీతారాములు
బి) సీతారాముడు
సి) రామసీత
డి) సీతరామ
జవాబు:
బి) సీతారాముడు
11. భూమి మీద ఎవరూ శాశ్వతంగా ఉండరు. (సమానారక పదాలను గుర్తించండి)
ఎ) ధరణి, పుడమి
బి) నింగి, గగనం
సి) కడలి, సాగరం
డి) సంపద, కలిమి
జవాబు:
ఎ) ధరణి, పుడమి
12. వారానికి ఏడు రోజులు. (సమాసనామాన్ని గుర్తించండి.)
ఎ) ద్వంద్వం
బి) సప్తమీ తత్పురుష
సి) ద్విగు
డి) బహుపద ద్వంద్వం
జవాబు:
సి) ద్విగు
13. “అన్నదమ్ములు కలసి మెలసి జీవిస్తున్నారు.” – గీత గీసిన పదం సమాసం పేరు గుర్తించండి.
ఎ) ద్విగు సమాసం
బి) ద్వంద్వ సమాసం
సి) బహుప్రీహి సమాసం
డి) అవ్యయీభావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం
14. అసత్యం అనర్థాలకు దారి తీస్తుంది. (వ్యతిరేక పదాన్ని గుర్తించండి)
ఎ) అబద్దం
బి) సత్యం
సి) న్యాయం
డి) దయ
జవాబు:
బి) సత్యం
15. దుర్జనులకు దూరంగా ఉండాలి. (వ్యతిరేక పదాన్ని గుర్తించండి)
ఎ) సజ్జనులు
బి) దురంతులు
సి) బలవంతులు
డి) బలహీనులు
జవాబు:
ఎ) సజ్జనులు
16. “సంపదతో గర్వపడకూడదు. కలిమి గర్వాన్ని పెంచుతుంది”.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) సంపద, కలిమి
బి) సంపద, గర్వం
సి) కలిమి, గర్వం
డి) పడకూడదు, పెంచుతుంది
జవాబు:
ఎ) సంపద, కలిమి
III. భాషాంశాలు
పదాలు – అర్థాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.
17. ‘విలసితముగ పేదమేలు వితరణి యైనన్’
ఎ) దానశీలి
బి) దానము
సి) ధర్మము
డి) లోభి
జవాబు:
ఎ) దానశీలి
18. ‘పుత్తడి గలవాని పుండు బాధైనను’
ఎ) ఇత్తడి
బి) వెండి
సి) బంగారము
డి) ధనము
జవాబు:
సి) బంగారము
19. ‘ఆజి బాహాపటు శక్తి’
ఎ) విద్య
బి) యుద్ధము
సి) పరిశ్రమ
డి) సముద్రం
జవాబు:
బి) యుద్ధము
20. ‘వాస్తవమ్ము నార్లవారి మాట’
ఎ) అబద్ధము
బి) ధర్మము
సి) నిజము
డి) అధర్మము
జవాబు:
సి) నిజము
21. ‘తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు‘
ఎ) ధర్మపరులు
బి) బాటసారులు
సి) దొంగలు
డి) తేనెటీగలు
జవాబు:
బి) బాటసారులు
22. కలిమితో గర్వం పొందరాదు.
ఎ) గర్వం
బి) సంపద
సి) వినయం
డి) వినోదం
జవాబు:
బి) సంపద
23. స్మృతులు మనకు ఆదర్శాలు
ఎ) కథలు
బి) కావ్యాలు
సి) ధర్మశాస్త్రాలు
డి) ప్రబంధాలు
జవాబు:
సి) ధర్మశాస్త్రాలు
24. లవణం కూరల్లో వాడుతారు.
ఎ) కారం
బి) పులుపు
సి) ఉప్పు
డి) పసుపు
జవాబు:
సి) ఉప్పు
పర్యాయపదాలు :
25. బంగారం ఉన్నవాడు గొప్పవాడు కాడు – పుత్తడి కలవాడికి దొంగ భయం ఎక్కువ.
పై వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించండి.
ఎ) ఉన్నవాడు, గొప్పవాడు
బి) బంగారం, పుత్తడి
సి) కలవాడు, ఉన్నవాడు
డి) గొప్పవాడు, కలవాడు
జవాబు:
బి) బంగారం, పుత్తడి
26. కలిమికి వితరణ, సంపదలందు తాల్మి శోభిస్తుంది. పై వాక్యంలో సమానార్ధక పదాలు గుర్తించండి.
ఎ) వితరణ, సంపద
బి) తాల్మి; కలిమి
సి) కలిమి, సంపద
డి) సంపద, శోభిస్తుంది
జవాబు:
సి) కలిమి, సంపద
27. యశము నందనురక్తి ఉంటే కీర్తి తప్పక వస్తుంది – పై వాక్యంలోని పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) యశము, కీర్తి
బి) అనురక్తి, కీర్తి
సి) కీర్తి, రక్తి
డి) యశము, రక్తి
జవాబు:
ఎ) యశము, కీర్తి
28. ‘ధన మూలమ్ ఇదం జగత్’ – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) డబ్బు, కలిమి
బి) సంపద, ఐశ్వర్యం
సి) విత్తము, సొమ్ము
డి) ధనము, బంగారము
జవాబు:
సి) విత్తము, సొమ్ము
29. సముద్రం మీద ఓడలు ప్రయాణిస్తాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) అంభోధి, సాగరం
బి) సాగరం, నది
సి) ఏఱు, వాగు
డి) జలధి, వారధి
జవాబు:
ఎ) అంభోధి, సాగరం
30. భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఆకాశం , నేల
బి) ధరణి, వారధి
సి) ధరిత్రి, పృథివి
డి) ‘క్షోణి, పాణి
జవాబు:
సి) ధరిత్రి, పృథివి
31. ఆపదను పొందకూడదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) ఆపద, సంపద
బి) దమనం, అదనం
సి) కష్టము, విపత్తు
డి) వెలుగు, అవని
జవాబు:
సి) కష్టము, విపత్తు
32. విత్తం సంపాదించాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) విగతం, విరించి
బి) విత్తం, వైనం
సి) కష్టము, ధనం
డి) ధనం, సంపద
జవాబు:
డి) ధనం, సంపద
33. అందరు తాల్మిని పొందాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
ఎ) సహనం, శాంతి
బి) తామర, తపన
సి) సంబరం, సదలం
డి) ఓర్పు, సహనం
జవాబు:
డి) ఓర్పు, సహనం
34. పుత్తడి చాలా విలువైనది – గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.
ఎ) హేమం, కాంత
బి) బంగారం, హేమం
సి) రజతం, సువర్ణం
డి) కాంస్యం, హేమం
జవాబు:
బి) బంగారం, హేమం
ప్రకృతి – వికృతులు :
సూచన : క్రింద గీత గీసిన పదాలకు ప్రకృతి, వికృతులను గుర్తించండి.
35. భృంగారం, తులం 35 వేలు ధర పలుకుతోంది.
ఎ) పసిడి
బి) బంగారం
సి) స్వర్ణము
డి) పుత్తడి
జవాబు:
బి) బంగారం
36. కేవలం పుస్తకము జ్ఞానం లోకజ్ఞానం కంటే తక్కువ
ఎ) పొస్తకం
బి) గ్రంథం
సి) పొత్తము
డి) పత్రిక
జవాబు:
సి) పొత్తము
37. విద్య గలవాడే, మనిషి
ఎ) విద్దె
బి) విద్య
సి) విత్తు
డి) అవిద్య
జవాబు:
ఎ) విద్దె
38. సిరి గలవాడే శ్రీమంతుడు
ఎ) శ్రీ
బి) రీ
సి) శ్రీ
డి) సిరీ
జవాబు:
సి) శ్రీ
39. సంపద వృద్ధి పొందాలి
ఎ) వృధ
బి) వడ్డి
సి) వొద్ది
డి) వైద్ది
జవాబు:
బి) వడ్డి
40. కీర్తి పొందాలి
ఎ) కీరితి
బి) కితారి
సి) కితరి
డి) నైతిరి
జవాబు:
ఎ) కీరితి
41. దమ్మం ఆశ్రయించాలి
ఎ) ధర్మం
బి) ధోమ్మం
సి) ధరమం
డి) దామ్మం
జవాబు:
ఎ) ధర్మం
42. పెద్దలపట్ల గారవం ప్రదర్శించాలి.
ఎ) గార్ధవం
బి) గైరవం
సి) గౌరవం
డి) గారెవం
జవాబు:
సి) గౌరవం
43. విద్యార్థులు సుఖం వదలాలి
ఎ) సుకం
బి) సైకం
సి) సొకం
డి) సౌకం
జవాబు:
ఎ) సుకం
వ్యతిరేక పదాలు :
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.
44. ‘కలిమి గల లోభి కన్నా పేద మేలు’
ఎ) కల్మి
బి) లేమి
సి) బీద
డి) ధనికుడు
జవాబు:
బి) లేమి
45. సజ్జనులతో స్నేహం చేయాలి.
ఎ) స్వజనులు
బి) దుర్జనులు
సి) పరిజనులు
డి) పరజనులు.
జవాబు:
బి) దుర్జనులు
46. ‘వాస్తవమ్ము నార్లవారి మాట’
ఎ) సత్యం
బి) నిజము
సి) అబద్ధము
డి) అవాస్తవమ్ము
జవాబు:
డి) అవాస్తవమ్ము
47. కీర్తి ప్రకటించు. చిత్త విస్ఫూర్తి చేయు.
ఎ) అకీర్తి
బి) చెడ్డకీర్తి
సి) అపకీర్తి
డి) నిష్మీర్తి
జవాబు:
సి) అపకీర్తి
48. పండితులు గౌరవింపబడతారు.
ఎ) దైత్యులు
బి) సురలు
సి) పామరులు
డి) సుజనులు
జవాబు:
సి) పామరులు
49. నీరు కలుషితం కావాలి. (బి)
ఎ) అనుకలుషితం
బి) నిర్మలం
సి) వ్యత్యయం
డి) ప్రత్యయం
జవాబు:
బి) నిర్మలం
50. నీరు అధికంగా ఉంది.
ఎ) అల్పం
బి) అనల్పం
సి) అనుధికం
డి) ప్రత్యధికం
జవాబు:
ఎ) అల్పం
51. తాడు చాలా కుఱచగా ఉంది.
ఎ) కంటి
బి) పొడుగు
సి) కణిత
డి) పత్రిక
జవాబు:
బి) పొడుగు
52. అందరికి మేలు కలగాలి.
ఎ) మంచి
బి) మమత
సి) కీడు
డి) సమత
జవాబు:
సి) కీడు
53. సత్యం పలకాలి.
ఎ) అసత్యం
బి) కుసత్యం
సి) సుసత్యం
డి) విసత్యం
జవాబు:
ఎ) అసత్యం
సంధులు:
54. భూప సభాంతరాళములో పుష్కల వాక్చతురత ఉండాలి – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) సభ + అంతరాళము
బి) సభా + అంతరాళము
సి) సభాంత + రాళము
డి) స + భాంతరాళము
జవాబు:
బి) సభా + అంతరాళము
55. జుంటీగలు తేనెను సేకరిస్తాయి. – గీత గల పదం ఏ సంధి?
ఎ) ద్విగు సమాసం
బి) బహుజొహి
సి) ద్వంద్వ సమాసం
డి) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
సి) ద్వంద్వ సమాసం
56. విత మార్లన చేసి విఱ్ఱవీగుట మంచిది కాదు – గీత గీసిన పదం ఏ సంది?
ఎ) ఆమ్రేడిత సంధి
బి) అత్వసంధి
సి) రుగాగమ సంధి
డి) ద్విరుక్తటకారదేశ సంధి
జవాబు:
ఎ) ఆమ్రేడిత సంధి
57. ‘సజ్జనాళికి ప్రకృతి సిద్ధ గుణములు’ – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) సజ్జ + నాళి
బి) సత్ + జనాళి
సి) సజ్జన + ఆళి
డి) స + జనాళి
జవాబు:
సి) సజ్జన + ఆళి
58. నేర్చిన యేని – ఇది ఏ సంధి పదం?
ఎ) అత్వసంధి
బి) యడాగమ సంధి
సి) ఉత్వసంధి
డి) త్రికసంధి
జవాబు:
బి) యడాగమ సంధి
59. విద్యయందు నేర్పు కావాలి – దీనిని విడదీయండి.
ఎ) విద్య + అందు
బి) విద్యా + యందు
సి) విద్యే + యందు
డి) విది + అందు
జవాబు:
ఎ) విద్య + అందు
60. సవర్ణదీర్ఘసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) నభైంతకం
బి) సభాంతరము
సి) నభైంతరం
డి) నభోంతరం
జవాబు:
బి) సభాంతరము
61. పుత్తడి గలవాడు – ఇది ఏ సంధి పదము?
ఎ) ఉత్వసంధి
బి) త్రికసంధి
సి) అత్వసంధి
డి) గసడదవాదేశసంధి
జవాబు:
డి) గసడదవాదేశసంధి
62. ఉత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) మీరెన్ని
బి) ఏమంటివి
సి) మరిన్ని
డి) ఒకటితున్న
జవాబు:
ఎ) మీరెన్ని
63. సకలార్థ సాధకులు – దీనిని విడదీయండి.
ఎ) సకలా + అర్థ సాధకులు
బి) సకల + యార్ధి సాధకులు
సి) సకలో + సాధకులు
డి) సకల + అర్థ సాధకులు
జవాబు:
డి) సకల + అర్థ సాధకులు
సమాసాలు:
64. విష్ణువు దశావతారములు ఎత్తాడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) పది అవతారాలు
బి) దశ (10) సంఖ్యగల అవతారాలు
సి) పది అవతారాలు కలది
డి) దశ, అవతారాలు
జవాబు:
బి) దశ (10) సంఖ్యగల అవతారాలు
65. సూర్యచంద్రులు ఆకాశంలో కనిపిస్తారు – గీత గీసిన పదం సమాసం పేరు
ఎ) సవర్ణదీర్ఘ సంధి
బి) అత్వసంధి
సి) ఇత్వసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
సి) ఇత్వసంధి
66. నవగ్రహాలు శాంతిని ఇస్తాయి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) ఎనిమిది సంఖ్యగల గ్రహాలు
బి) నవ 9 సంఖ్యగల గ్రహాలు
సి) తొమ్మిది గ్రహముల రాశి
డి) తొమ్మిది గ్రహములు కలది
జవాబు:
బి) నవ 9 సంఖ్యగల గ్రహాలు
67. అజ్ఞానికి ఏమీ తెలియదు – గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి.
ఎ) నఞ్ తత్పురుష
బి) బహుజొహీ
సి) ద్విగు
డి) ద్వంద్వము
జవాబు:
ఎ) నఞ్ తత్పురుష
68. సీతారాముల వివాహం జరిగింది – గీత గీసిన పదం ఏ సమాసం?
ఎ) ద్విగువు
బి) బహుజొహి సమాసం
సి) ద్వంద్వ సమాసం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
సి) ద్వంద్వ సమాసం
69. క్రికెటర్ వంద పరుగులు చేశాడు – దీనికి విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) వంద సంఖ్య గల పరుగులు
బి) వంద వలన పరుగులు
సి) వంద కొరకు పరుగులు
డి) వంద చేత పరుగులు
జవాబు:
ఎ) వంద సంఖ్య గల పరుగులు
70. ఉభయ పదార్ధ ప్రధానమైన సమాసం ఏది?
ఎ) బహుహ్రీహి సమాసం
బి) ద్విగు సమాసం
సి) అవ్యయీభావం
డి) ద్వంద్వ సమాసం
జవాబు:
డి) ద్వంద్వ సమాసం
71. సంఖ్యా శబ్దం పూర్వం – ఏ సమాసమో గుర్తించండి.
ఎ) బహుజొహి
బి) అవ్యయీభావం
సి) ద్విగు సమాసం
డి) షష్ఠీ తత్పురుష
జవాబు:
సి) ద్విగు సమాసం
72. సాధు సంగంబు శ్రేయోదాయకం – విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) సాధువు వలన సంగం
బి) సాధువును సంగం
సి) సాధువు కొఱకు సంగం
డి) సాధువులతో సంగం
జవాబు:
డి) సాధువులతో సంగం
వాక్య ప్రయోగాలు :
73. రామలక్ష్మణులు అన్నదమ్ములు – ఇది ‘ఏ రకమైన వాక్యం?
ఎ) హేత్వర్థక వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) అప్యర్థక వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం
74. అన్నం తిని బడికి వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియకు చెందినది?
ఎ) శత్రర్థకం
బి) అభ్యర్థకం
సి) చేదర్థకం
డి) క్వార్ధకం
జవాబు:
డి) క్వార్ధకం
75. క్రింది వానిలో వర్తమాన అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) నడిస్తే
బి) నడిచి
సి) నడిచినా
డి) నడుస్తూ
జవాబు:
డి) నడుస్తూ
76. రవి పాట పాడాడు – గీత గీసిన పదం ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేధార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) అప్యర్థక వాక్యం
డి) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
డి) సామర్థ్యార్థక వాక్యం
77. వానలు కురిస్తే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) తుమున్నర్థకం
బి) అభ్యర్థకం
సి) చేదర్థకం
డి) ధాత్వర్థకం
జవాబు:
సి) చేదర్థకం
78. మీరు ఇళ్ళకు వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ధాత్వర్థకం
బి) ప్రార్థనార్థకం
సి) అనుమత్యర్థకం
డి) నిషేధార్థకం
జవాబు:
సి) అనుమత్యర్థకం
79. అందరు అన్నం తినండి – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) కర్తరి వాక్యం
బి) ధాతవర్ధక వాక్యం
సి) విధ్యర్థక వాక్యం
డి) నిషేధార్థక వాక్యం
జవాబు:
సి) విధ్యర్థక వాక్యం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు
80. మంచి వారితో స్నేహం చేయాలి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) తృతీయ
బి) సప్తమీ
సి) షష్ఠీ
డి) చతుర్డీ
జవాబు:
ఎ) తృతీయ
81. కొఱకున్, కై – ఇవి ఏ విభక్తి ప్రత్యయాలు?
ఎ) తృతీయా విభక్తి
బి) పంచమీ విభక్తి
సి) ప్రథమా విభక్తి
డి) చతుర్జీ విభక్తి
జవాబు:
డి) చతుర్జీ విభక్తి
82. చెట్టు నుండి కింద పడినాడు – ఇది ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) షష్ఠీ
బి) సప్తమీ
సి) పంచమీ
డి) చతుర్డీ
జవాబు:
సి) పంచమీ
83. నల్లనయిన మనోహరంగా ఉంది – ఇది ఏ భాషాభాగం?
ఎ) నామవాచకం
బి) అవ్యయం
సి) విశేషణం
డి) క్రియ
జవాబు:
సి) విశేషణం
84. “నీవు – మీరు” – ఇవి ఏ పురుషకు చెందినవి?
ఎ) ఉత్తమ పురుష
బి) ప్రథమ పురుష
సి) మధ్యమ పురుష
డి) అధమ పురుష
జవాబు:
సి) మధ్యమ పురుష
85. లింగ, వచన, విభక్తులు లేని భాషా పదం
ఎ) నామవాచకం
బి) అవ్యయం
సి) సర్వనామం
డి) క్రియ
జవాబు:
బి) అవ్యయం
86. వారు బడికి వెళ్ళారు – గీత గీసిన పదం ఏ పురుషకు చెందినవి?
ఎ) సర్వనామం
బి) నామవాచకం
సి) క్రియ
డి) అవ్యయం
జవాబు:
ఎ) సర్వనామం
సొంత వాక్యాలు :
సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
87. విఱ్ఱవీగు : నా మిత్రుడు ధనమదంతో విఱ్ఱవీగు తున్నాడు.
88. దానధర్మములు : దానధర్మములు చేయకుండా కూడబెట్టిన సొమ్ము దొంగలపాలు అవుతుంది.
89. విలసిల్లు : అమరావతి రాష్ట్ర రాజధానిగా విలసిల్లు తున్నది.
90. లవణం : లవణంలేని కూర రుచిగా ఉండదు.
91. దురితం : మంచిపనులతో దురితం తొలగిపోయింది.
92. అనురక్తి : విద్యార్థులకు చదువుపట్ల అనురక్తి ఉండాలి.
93. ఆర్జించు : ధర్మ మార్గంలో సంపదను ఆర్జించుట శ్రేయస్కరం.
94. బుధులు : బుధులు అంతట గౌరవింపబడతారు.
95. వసుధ : వసుధపై శాంతి నెలకొనాలి.
96. పుష్కలం : కృష్ణానదిలో నీరు పుష్కలంగా ఉంది.