These AP 7th Class Telugu Important Questions 2nd Lesson అతిథి మర్యాద will help students prepare well for the exams.
AP State Syllabus 7th Class Telugu 2nd Lesson Important Questions and Answers అతిథి మర్యాద
7th Class Telugu 2nd Lesson అతిథి మర్యాద Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
ఈ కింది పరిచిత గద్యాలను చదవండి నాలుగు ప్రశ్నలు తయారుచేయండి.
1. “ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షౌహిణుల సేన ఉన్న కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ, కృష్ణుడూ, సాత్యకి మిగిలారు.
ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడు పాండవులకు సర్వధర్మ విషయాలు బోధించి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు.
జవాబు:
అ) కురుక్షేత్రంలో ఎవరెవరు మరణించారు?
ఆ) కురుక్షేత్రంలో పాల్గొన్న సేన సంఖ్య ఎంత?
ఇ) కురుపక్షంలో యుద్ధం పూర్తి అయ్యాక, మిగిలిన వారు ఎవరు?
ఈ) భీష్మపితామహుడు ఎప్పుడు దివ్యలోకాలు చేరాడు?
2. ‘విద్వాంసుల ఆదేశానుసారం ధర్మరాజు అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశదేశాల నుండి చక్రవర్తులూ, విద్వాంసులూ ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వచ్చారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు, నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు’
జవాబు:
అ) అశ్వమేధ యాగం ధర్మరాజు ఎందుకు ప్రారంభించాడు?
ఆ) యాగం చూడడానికి ఎవరెవరు వచ్చారు?
ఇ) చూడడానికి వచ్చిన వారికి ఏయే దానాలు చేశాడు?
ఈ) యోగ్యులైన వారికి ఏ దానాలు చేశాడు?
3. ‘ధర్మ భూమి అయిన కురుక్షేత్రంలో సక్తుప్రసుడనే పేరుగల గృహయజమానుడు ఉండేవాడు. ఆయన కుమారునికి వివాహం అయ్యింది. కొడుకూ, కోడలూ ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. వారు ఎవరికీ హానిచేయకుండా, ఏ ఆ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని, తృప్తిగా జీవితం నడుపుతున్నారు. వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని, దంచి పిండి చేసి వండుకొని, నలుగురూ సమంగా పంచుకున్నారు. తినడానికి, సిద్ధం అవుతున్నారు. ఆ సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి. డొక్కలు మాడి ఉన్నాయి.
ఆ ‘ఆకలి, ఆకలి’ అని నీరసంగా అడిగాడు.
జవాబు:
అ) సక్తుప్రస్థుడు ఎక్కడ ఉండేవాడు?
ఆ) సక్తుప్రస్థుని కుటుంబం వారు జీవితం ఎలా సాగించేవారు?
ఇ) సక్తుప్రస్థుని కుటుంబం వారికి వండుకోడానికి పిండి ఎలా వచ్చింది?
ఈ) వారు తినడానికి సిద్ధమైన సమయంలో వచ్చినవారు ఎవరు? అతడు ఎలా ఉన్నాడు?
4. క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. “ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం సక్తుప్రస్తుడనే పేరుగల గృహ యజమానుడు ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడుండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయ్యింది. వాళ్ళు నలుగురూ సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలను విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకూ, కోడలూ ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు.
ప్రశ్నలు:
అ) సక్తుప్రస్థుడు ఎక్కడ ఉండేవాడు?
జవాబు:
సక్తుప్రస్థుడు కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం ఉండేవాడు.
ఆ) సక్తుప్రుని కుటుంబ సభ్యులు ఎంతమంది?
జవాబు:
సక్తుప్రస్థుని కుటుంబ సభ్యులు ‘మొత్తం నలుగురు.
ఇ) కొడుకు, కోడలు ఏమి చేస్తూ ఉండేవారు?
జవాబు:
కొడుకు, కోడలు వృద్ధులను సేవిస్తూ ఉండేవారు.
ఈ) సక్తుప్రస్థుని కుటుంబ సభ్యులు ఎలా జీవించేవారు?
జవాబు:
సక్తుప్రస్థుని కుటుంబ సభ్యులు నలుగురూ సర్వభూత కోటిని దయతో చూస్తూ, కామక్రోధాలను విడిచి . తపస్సు చేసుకుంటున్నారు.
ఈ క్రింది ‘అపరిచిత గద్యాలను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. దానం చేయడం కూడా ఒక కళే. ఒక్కోసారి దానం చేసినందు వలన ఆత్మానందం కలుగుతుంది. అది ఎవరికి అవసరమో వారికి దానం చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అయితే దానం చేసేవారి మనసును, ఆలోచనను బట్టి ఈ విషయం ఆధారపడి ఉంటుంది. విరాళాలు అడిగేవారు అడుగుతుంటారు. కానీ వసూలు చేసే వారిపై నిందారోపణ చేయరాదు.
ప్రశ్నలు :
అ) ఏది కూడా ఒక కళ?
జవాబు:
దానం చేయడం కూడా ఒక కళ.
ఆ) ఆత్మానందం ఎప్పుడు కలుగుతుంది?
జవాబు:
దానం చేసినందువల్ల ఆత్మానందం కలుగుతుంది.
ఇ) ఎప్పుడు సంతోషంగా ఉంటుంది?
జవాబు:
ఎవరికి అవసరమో వారికి దానం చేసినపుడు సంతోషంగా ఉంటుంది.
ఈ) ఎవరిపై నిందారోపణ చేయరాదు?
జవాబు:
విరాళాలు అడిగేవారిపై నిందారోపణ చేయరాదు.
2. దేశంలో యువత అంతా ఉద్యోగాల కోసం ఆశపడడం, చదువుకునే సమయంలోనే నాకు ఫలానా ఉద్యోగం వస్తే బావుండును అనుకోవడం, విద్యాభ్యాసం పూర్తయ్యాక ప్రభుత్వం ఉద్యోగం కల్పించలేకపోయిందని ఆరోపించడం, కనీస విద్యార్హత లేని వాళ్ళు కూడా మాకు ఉపాధి కల్పించలేకపోయారని నిందించడం పరిపాటి. . కానీ యువత తమ తెలివితేటలతో స్వయం ఉపాధి కల్పించుకోవాలి. చదివింది తక్కువే అయినా ఆ చదువుకు తగ్గ ఉద్యోగం పోటీ పరీక్షలలో నెగ్గి సాధించాలి.
ప్రశ్నలు:
అ) ఎవరంతా ఉద్యోగాల కోసం ఆశపడతారు?
జవాబు:
దేశంలోని యువత అంతా ఉద్యోగాల కోసం ఆశపడతారు.
ఆ) ఉద్యోగం కల్పించలేదని ఎవరిని నిందించకూడదు?
జవాబు:
ఉద్యోగం కల్పించలేదని ప్రభుత్వాన్ని నిందించకూడదు.
ఇ) యువత ఎలా స్వయం ఉపాధి కల్పించుకోవాలి?
జవాబు:
యువత తమ తెలివితేటలతో స్వయం ఉపాధి కల్పించుకోవాలి.
ఈ) ఉద్యోగం ఎలా సాధించాలి?
జవాబు:
పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగం సాధించాలి.
3. బీజింగ్ ఆసియా క్రీడలకు క్రీడాకారులను ఎంపిక చేసే ప్రయత్నాలు న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. రెండు వందల మీటర్ల పరుగు పందెం ప్రారంభం కాబోతున్నది. అందరికీ ప్రత్యేక ఆకర్షణ పి.టి. ఉష. ఆమె గెలుస్తుందని అందరి విశ్వాసం. గన్ పేలి పరుగు ప్రారంభమయింది. కాని చూసేవారిని ఆశ్చర్యపరుస్తూ వేరే క్రీడాకారిణి 24,07 సెకన్లలో గమ్యం చేరింది. 24. 12 సెకన్లలో పి.టి.ఉష రెండవ స్థానాన్ని పొందింది. ఆ క్రీడాకారిణే అశ్వని.
ప్రశ్నలు:
అ) క్రీడాకారులను ఎంపిక చేసే ప్రయత్నం ఎక్కడ జరిగింది?
జవాబు:
క్రీడాకారులను ఎంపికచేసే ప్రయత్నం న్యూఢిల్లీలో జరిగింది.
ఆ) ఎన్ని మీటర్ల పరుగు పందెం?
జవాబు:
రెండు వందల మీటర్ల పరుగు పందెం.
ఇ) అందరి విశ్వాసం ఎవరి మీద ఉంది?
జవాబు:
అందరి విశ్వాసం పి.టి. ఉష మీద ఉంది.
ఈ) అశ్వని ఎంత సేపటిలో గమ్యాన్ని చేరింది?
జవాబు:
అశ్వని 24.07 సెకన్లలో గమ్యం చేరింది.
4. గాల్లో ఉష్ణోగ్రత మామూలు ప్రాంతాల్లో 40°C మించి, కొండ ప్రాంతాల్లో 30°C దాటితే వడగాలులుగా పేర్కొంటారు. భారత వాతావరణ శాఖ ప్రకారం ఉష్ణోగ్రతలు 46°C కి మించి ఉంటే తీవ్రమైన వడగాలుల కింద లెక్క ప్రపంచంలోనే అతి ఎక్కువ ఉష్ణోగ్రత 56.7°C కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 1913 జూలై 10న నమోదయ్యింది. మన దేశంలోని రాజస్థాన్ లో 1956లో 50.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ప్రశ్నలు:
అ) వడగాలులంటే ఏమిటి?
జవాబు:
గాల్లో ఉష్ణోగ్రత మామూలు ప్రాంతాలలో 40°C మించి, కొండ ప్రాంతాలలో 30°C దాటితే వడగాలులుగా పేర్కొంటారు.
ఆ) తీవ్రమైన వడగాలులంటే ఏమిటి?
జవాబు:
భారత వాతావరణ శాఖ ప్రకారం 46°C మించి ఉష్ణోగ్రతలు ఉంటే అవి తీవ్రమయిన వడగాలుల కింద లెక్క.
ఇ) ప్రపంచంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఎప్పుడు, ఎక్కడ నమోదయ్యింది?
జవాబు:
ప్రపంచంలో అతిఎక్కువ ఉష్ణోగ్రత 56.7°C కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 1913 జూలై 10న నమోదయ్యింది.
ఈ) మన దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదయ్యింది?
జవాబు:
మన దేశంలో 1956లో 50.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రాజస్థాన్‌లో నమోదయ్యింది.
5. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆంధ్రుల ప్రథమ రాజులు శాతవాహనులు. వీరి ప్రథమ రాజధాని శ్రీకాకుళం. ఇది కృష్ణానది తీరాన అవనిగడ్డకు చేరువలో ఉంది. ప్రజలందరిచే మన్ననలందుకున్న శాతవాహనులలో ప్రథమరాజు శ్రీకాకుళాంధ్ర విష్ణువు. శాతవాహనులు తమ రాజధానిని శ్రీకాకుళం నుండి ధాన్యకటకానికి మార్చుకున్నారు. అమరావతికి చేరువలో ఉన్న ఈ నగరం శాతవాహనుల పాలనలో ఉచ్ఛదశకు చేరుకుంది. తరువాత వీరు తమ రాజధానిని మహారాష్ట్రలోని ప్రతిష్టానపురానికి మార్చుకున్నారు. శాతవాహనులు తమ పేర్ల ముందు తల్లి పేరు చేర్చి పిల్చుకొనే సంప్రదాయముంది.
ప్రశ్నలు:
1) శాతవాహనుల ప్రథమ రాజధాని ఏది?
జవాబు:
శ్రీకాకుళం
2) ధాన్యకటకానికి చేరువలో ఉన్న పట్టణమేది?
జవాబు:
అమరావతి
3) శాతవాహనుల సంప్రదాయం ఏమిటి ?
జవాబు:
శాతవాహనులు తమ పేర్ల ముందు తల్లి పేరు చేర్చి ‘పిల్చుకొనే సంప్రదాయం.
4) ఈ పేరా ఎవరి గురించి చెప్పబడింది?
జవాబు:
శాతవాహనుల గురించి
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.
1. ధర్మరాజును దేవతలు ఎందుకు అభినందించారు?
జవాబు:
అశ్వమేధయాగాన్ని చూడటానికి వచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటుగా నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూలేడు.
అలా అందరికి సంతృప్తి కలిగించిన అశ్వమేధయాగాన్ని చూసిన దేవతలు పూలవాన కురిపించి, ధర్మరాజును అభినందించారు.
2. ముంగిస దేహం పూర్తిగా బంగారుమయం అయిందా, కాలేదా? ఎందువల్ల?
జవాబు:
ముంగిస దేహం పూర్తిగా బంగారుమయం కాలేదు. ఎందుకంటే సక్తుప్రస్థుడు చేసిన దానం (అతిథి మర్యాద) తరువాత అంత గొప్పగా దానధర్మాలు ఎవరూ చేయలేదు. కావున ముంగిస దేహం రెండోవైపు అలాగే ఉండిపోయింది.
3. అతిథులు అంటే ఎవరు ? మీ. ఇంటికి అతిథులు వస్తే ఎలాగ మర్యాద చేస్తారో వివరించండి.
జవాబు:
తిథి, వార, నక్షత్రాలు చూసుకోకుండా మన ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. అతిథులు రాగానే వారిని సాదరంగా ఆహ్వానించి, కుశల ప్రశ్నలు అడిగి, మన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరి, మనకున్న దానిని వారికి పెట్టి వారిని తృప్తి పరచాలి. దీనినే అతిథి మర్యాద ‘అంటారు.
మా ఇంటికి వచ్చిన అతిథిని లోనికి రమ్మని పిలుస్తాము. కాళ్లు కడుగుకోడానికి నీళ్లు ఇస్తాము. మంచినీరు తెచ్చి ఇస్తాము. ఆయన వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాము. ఆయనకు కాఫీ కాని, టీ కాని, మజ్జిగ కాని ఇస్తాము. భోజన సమయమైతే వండి పెడతాము.
7th Class Telugu 2nd Lesson అతిథి మర్యాద 1 Mark Bits
1. అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. (వికృతిని గుర్తించండి) (బి)
ఎ) సొగసుగా
బి) సుకంగా
సి) పెద్దగా
డీ) బొద్దుగా
జవాబు:
బి) సుకంగా
2. దేవతలు అధర్మమును సహించరు. (వ్యతిరేక పదాన్ని గుర్తించండి)
ఎ) దానము
బి) పుణ్యము
సి) ధర్మము
డి) న్యాయము
జవాబు:
సి) ధర్మము
3. దానాలలో సువర్ణదానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. (సమానార్థక పదాలను గుర్తించండి)
ఎ) బంగారం, పసిడి
బి) వెండి, రజితం
సి) రాగి, ఇత్తడి
డి) ఇనుము, ఉక్కు
జవాబు:
ఎ) బంగారం, పసిడి
4. షషీ విభక్తి ప్రత్యయములను గుర్తించండి.
ఎ) అందు, న
బి) కి, కు, యొక్క, లో, లోపల
సి) డు, ము, వు, లు
డి) వలన, కంటె
జవాబు:
బి) కి, కు, యొక్క, లో, లోపల
5. సక్తుప్రస్థుడు దానగుణం కలవాడు. (ఏ రకమైన వాక్యము ?)
ఎ) సామాన్య
బి) సంయుక్త
సి) సంక్లిష్ట
డి) ఆశ్యర్యార్థక
జవాబు:
ఎ) సామాన్య
6. వినయ్ నిర్విరామంగా చదువుతున్నాడు. (వ్యతిరేక పదాన్ని గుర్తించండి)
ఎ) ఆలస్యం
బి) తొందర
సి) విరామం
డి) ఓపిక
జవాబు:
సి) విరామం
7. తృతీయా విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) కొఱకున్, కై
బి) చేత, తోడ
సి) అందు, న
డి) వలనన్, కంటే, పట్టి
జవాబు:
బి) చేత, తోడ
8. రహస్యాలను అన్వేషించండి. (విభక్తిని గుర్తించండి)
ఎ) చతుర్డీ
బి) పంచమీ
సి) ద్వితీయ
డి) ప్రథమా
జవాబు:
సి) ద్వితీయ
9. ఉచితంగా చదువు చెబితే. (ఇది ఏ దానమో గుర్తించండి)
ఎ) విద్యాదానం
బి) అన్నదానం
సి) శ్రమదానం
డి) నేత్రదానం
జవాబు:
ఎ) విద్యాదానం
10. సమావేశంలో చదివిన విషయం బాగుంది. (విభక్తి నామం గుర్తించండి)
ఎ) ప్రథమ
బి) సప్తమీ
సి) షష్ఠీ
డి) ద్వితీయా
జవాబు:
సి) షష్ఠీ
11. కింది వానిలో తృతీయా విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) డు,ము,వు,లు
బి) చేతన్, చేన్, తోడన్,తోన్
సి) అందున్,నన్
డి) వలనన్, కంటెన్, పట్టి
జవాబు:
బి) చేతన్, చేన్, తోడన్,తోన్
12. ‘ఇనుముతో నాగటికర్రు చేస్తాడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? (సి)
ఎ) ప్రథమా
బి) ద్వితీయా
సి) తృతీయా
డి) చతుర్జీ
జవాబు:
సి) తృతీయా
13. ఈ క్రింది వానిలో చతుర్డీ విభక్తి ప్రత్యయాలు గుర్తించండి.
ఎ) చేత, తోడ
బి) కొఱకు, కై
సి) అందు, న
డి) వలన, కంటె, పట్టి
జవాబు:
బి) కొఱకు, కై
III. భాషాంశాలు
పదాలు – ఆర్థాలు
సూచన : ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థం గుర్తించండి.
14. భీష్మ పితామహుడు పాండవులకు ధర్మాలు బోధించాడు.
ఎ) తండ్రి
బి) తాత
సి) ముతాత
డి) పిత
జవాబు:
బి) తాత
15. పాపం పోడానికి ప్రాయశ్చితం చేసుకోవాలి.
ఎ) యజ్ఞం
బి) మజ్ఞం
సి) అశ్వమేథం
డి) పాపం పోవడానికి చేసే కర్మ
జవాబు:
డి) పాపం పోవడానికి చేసే కర్మ
16. జరిగిన సంగ్రామంలో ఆప్తులు మరణించారు.
ఎ) యజ్ఞం
బి) యుద్ధము
సి) అశ్వమేథం
డి) ప్రాయశ్చిత్తం
జవాబు:
బి) యుద్ధము
17. యోగ్యులకు సువర్ణమణి దానాలు చేశాడు.
ఎ) వెండి
బి) రత్నము
సి) బంగారము
డి) భూమి
జవాబు:
సి) బంగారము
18. చదువులో ఆతురత చూపాలి.
ఎ) విసుగు
బి) మంచము
సి) తొందర
డి) విరామం
జవాబు:
సి) తొందర
19. సమరంలో విజయం పొందాలి.
ఎ) విద్య
బి) ప్రేరణ
సి) కార్యం
డి) యుద్ధం
జవాబు:
డి) యుద్ధం
20. క్రోధం విడిచి పెట్టాలి.
ఎ) శాంతం
బి) తపన
సి) కోపం
డి) తామరసం
జవాబు:
సి) కోపం
21. అందరు కుశలంగా ఉన్నారు.
ఎ) విరామం
బి) క్షేమం
సి) పీడ
డి) కీడు
జవాబు:
బి) క్షేమం
పర్యాయపదాలు:
సూచన : గీత గీసిన పదాలకు పర్యాయపదాలను గుర్తించండి.
22. దానాలలో సువర్ణదానం మహా పుణ్యప్రదం
ఎ) వెండి, బంగారం
బి) రాగి, పైడి
సి) బంగారం, పసిడి
డి) పైడి, రాగి
జవాబు:
సి) బంగారం, పసిడి
23. కుమారుడు తరలి వచ్చాడు.
ఎ) తనయుడు, పుత్రుడు
బి) ప్రియుడు, నందనుడు
సి) జనకుడు, ఆత్మజుడు
డి) నాగరికుడు, నందనుడు
జవాబు:
ఎ) తనయుడు, పుత్రుడు
24. భూమిపై శాంతి వర్థిల్లాలి.
ఎ) భూతం, రసాతలం
బి) అవని, ఆదరణ
సి) చంచన, జలధి
డి) ధరణి, వసుధ
జవాబు:
డి) ధరణి, వసుధ
25. గృహంలో ఉండాలి.
ఎ) నయనం, నగరం
బి) నికేతనం, సదనం
సి) గీయు, గీతం
డి) మందిరం, కోవెల
జవాబు:
బి) నికేతనం, సదనం
26. సంగ్రామంలో పోరాడాలి.
ఎ) యుద్ధం, రణం
బి) సంశయం, పోరు
సి) పోరూ, పొందు
డి) వైరం, విందు
జవాబు:
ఎ) యుద్ధం, రణం
27. దేవతలు స్వర్గంలో ఉంటారు.
ఎ) దైవాలు, దమనులు
బి) సురలు, అనిమిషులు
సి) ద్యుతులు, కిన్నరులు
డి) నిర్యరులు, నింద్యులు
జవాబు:
బి) సురలు, అనిమిషులు
28. సైన్యం బయలుదేరింది.
ఎ) అలరు, శ్రేణి
బి) వాహిని, సేన
సి) సంత, మంది
డి) డాంబికం, గుంపు
జవాబు:
బి) వాహిని, సేన
29. యజ్ఞం ఆచరించాలి.
ఎ) అర్చన, ఆలపని
బి) జ్ఞానం , అభిషేకం
సి) యాతన, యాగం
డి) క్రతువు, యాగం
జవాబు:
డి) క్రతువు, యాగం
ప్రకృతి – వికృతులు :
సూచన : క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి ప్రకృతి – వికృతి పదాలు గుర్తించండి.
30. అంపశయ్య మీదున్న భీష్మ పితామహుడు
ఎ) సెజ్జ
బి) మంచం
సి) సెయ్యం
డి) శయనం
జవాబు:
ఎ) సెజ్జ
31. జీవితం సాగించడానికే ఆహారం తీసుకొనేవారు
ఎ) హారం
బి) ఓగిరం
సి) అహారం
డి) విహారం
జవాబు:
బి) ఓగిరం
32. ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు.
ఎ) పున్యం
బి) పున్నెం
సి) పున్యం
డి) పాపం
జవాబు:
బి) పున్నెం
33. బ్రహ్మ జగతి వర్ధిల్లు
ఎ) బెమ్మ
బి) బమ్మ
సి) వియోగం
డి) విచారం
జవాబు:
బి) బమ్మ
34. దమ్మం ఆచరించాలి.
ఎ) దొమ్మం
బి) దెమ్మం
సి) ధర్మం
డి) దైవం
జవాబు:
సి) ధర్మం
35. కింది వానిలో ప్రకృతి పదాన్ని గుర్తించండి.
ఎ) పున్నెం
బి) బొమ్మ
సి) ఆహారం
డి) ఆకసం
జవాబు:
సి) ఆహారం
36. ఈ క్రింది వానిలో వికృతి పదం గుర్తించండి.
ఎ) బుద్ధి
బి) పెద్ద
సి) ధర్మం
డి) భూమి
జవాబు:
బి) పెద్ద
37. కన్నయ్య ఆచరించాడు.
ఎ) కెన్నయ్య
బి) కృష్ణుడు
సి) వసుదేవుడు
డి) శివుడు
జవాబు:
బి) కృష్ణుడు
వ్యతిరేకపదాలు :
సూచన : గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు గుర్తించండి.
38. అన్నదానం నాకు తృప్తి కల్గించింది.
ఎ) సంతృప్తి
బి) అసంతృప్తి
సి) తర్పణము
డి) అతృప్తి
జవాబు:
బి) అసంతృప్తి
39. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు.
ఎ) పుణ్యపురుషులు
బి) పాపాత్ములు
సి) ధర్మాత్ములు
డి) అపుణ్యాత్ములు
జవాబు:
బి) పాపాత్ములు
40. నిర్విరామంగా శ్రమిస్తే ఆరోగ్యం చెడుతుంది.
ఎ) రామం
బి) నిర్విరామం
సి) విరామం
డి) ఆరామం
జవాబు:
సి) విరామం
41. అందరి ఆదరణ పొందాలి.
ఎ) ప్రతిదరుణ
బి) సమాదరణ
సి) అనుదరణ
డి) నిరాదరణ
జవాబు:
డి) నిరాదరణ
42. మానవులు ధర్మం ఆచరించాలి.
ఎ) పరధర్మం
బి) విధర్మం
సి) సుధర్మం
డి) అధర్మం
జవాబు:
డి) అధర్మం
43. పేదలపట్ల దయ చూపాలి.
ఎ) పరదయ
బి) నిర్దయ
సి) సుదయ
డి) అనుదయ
జవాబు:
బి) నిర్దయ
44. అన్నింటి యోగ్యత సాధించాలి.
ఎ) ప్రయోగ్యత
బి) పరయోగ్యత
సి) అయోగ్యత
డి) సుయోగ్యత
జవాబు:
సి) అయోగ్యత
45. పెద్దలు ఆనందం పొందారు.
ఎ) వింత
బి) విరామం
సి) జమ్య
డి) విధాత
జవాబు:
డి) విధాత
46. దేవతలు వరాలు ఇస్తారు.
ఎ) రాక్షసులు
బి) కిన్నరులు
సి) కింపురుషులు
డి) సుందరులు.
జవాబు:
ఎ) రాక్షసులు
47. మితిమీరిన ఆశ ఉండరాదు.
ఎ) సురాశ
బి) నిరాశ
సి) అనురాశ
డి) పరాశ
జవాబు:
బి) నిరాశ
సంధులు :
48. శ్రీలు పొంగిన జీవగడ్డయి – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) జీవ + కడ్డయి
బి) జీవగడ్డ + యి
సి) జీవగడ్డ + అయి
డి) జీవగడ్డ + యై
జవాబు:
సి) జీవగడ్డ + అయి
49. ‘కావ్యం బలరె‘ – గీత గీసిన పదం ఏ సంధి?
ఎ) అత్వ సంధి
బి) ఇత్వ సంధి
సి) ఉత్వ సంధి
డి) యణాదేశ సంధి
జవాబు:
సి) ఉత్వ సంధి
50. ‘చిర్రెత్తు‘ – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) చిత్ర + ఎత్తు
బి) చిర్రు + ఎత్తు
సి) చిర్రె + త్తు
డి) చిరు + ఎత్తు
జవాబు:
బి) చిర్రు + ఎత్తు
51. సెలవిచ్చి వచ్చింది – గీత గీసిన పదాన్ని విడదీయండి.
ఎ) సెలవ + ఇచ్చి
బి) సెలవు + అచ్చి
సి) సెలవు + ఇచ్చి
డి) సెలవి + ఇచ్చి
జవాబు:
సి) సెలవు + ఇచ్చి
52. ఉత్వసంధికి ఉదాహరణను గుర్తించండి.
ఎ) మేనత్త
బి) కవితలల్లిన
సి) అమ్మయిచ్చే
డి) ఎవరికిచ్చి
జవాబు:
బి) కవితలల్లిన
53. క్రింది వానిలో వికల్ప సంధిని గుర్తించండి.
ఎ) ఉత్వసంధి
బి) ఇత్వ సంధి
సి) గుణసంధి
డి) అత్వసంధి
జవాబు:
బి) ఇత్వ సంధి
54. క్రింది వానిలో తెలుగు సంధిని గుర్తించండి.
ఎ) జత్త్వసంధి
బి) గుణసంధి
సి) అనునాసికసంధి
డి) ఉత్వసంధి
జవాబు:
డి) ఉత్వసంధి
55. రానిది + అని – దీనిని కలిపి రాస్తే
ఎ) రానిదని
బి) రానెదని
సి) రానోదని
డి) రానైదని
జవాబు:
ఎ) రానిదని
సమాసాలు :
56. ‘కామక్రోధాలు‘ అశాంతికి నిలయాలు – గీత గీసిన పదం సమాసం పేరు
ఎ) బహుజొహి
బి) ద్వంద్వ సమాసం
సి) ద్విగు సమాసం
డి) అవ్యయీ భావ సమాసం
జవాబు:
బి) ద్వంద్వ సమాసం
57. పద్దెనిమిది అక్షౌహిణులు భారత ‘ యుద్ధంలో పాల్గొన్నాయి – గీత గీసిన పదం విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) పద్దెనిమిది, అక్షౌహిణి
బి) పద్దెనిమిది అక్షౌహిణులు కలది
సి) పద్దెనిమిది (18) సంఖ్యగల అక్షౌహిణులు
డి) పద్దెనిమిది కల అక్షౌహిణులు
జవాబు:
సి) పద్దెనిమిది (18) సంఖ్యగల అక్షౌహిణులు
58. అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
ఎ) పుణ్యమైన ఆత్మకలవారు
బి) పుణ్యం, ఆత్మ
సి) పుణ్యమైన ఆత్మ
డి) పుణ్యం వల్ల ఆత్మలు
జవాబు:
ఎ) పుణ్యమైన ఆత్మకలవారు
59. యాగశాలకు వచ్చాము-విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) యాగంతో శాల
బి) యాగమునందు శాల
సి) యాగమైన శాల
డి) యాగము కొరకు శాల
జవాబు:
డి) యాగము కొరకు శాల
60. కామమును, క్రోధమును విడనాడాలి – సమాస పదం గుర్తించండి.
ఎ) కామక్రోధములు
బి) క్రోధకామములు
సి) అనుకామక్రోధములు
డి) ప్రతిక్రోధములు
జవాబు:
ఎ) కామక్రోధములు
61. ఉత్తర పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది?
ఎ) రూపకం
బి) తత్పురుష
సి) ద్విగువు
డి) ద్వంద్వము
జవాబు:
బి) తత్పురుష
62. క్రింది వానిలో ద్విగు సమాసమునకు ఉదాహరణను గుర్తించండి.
ఎ) చతుర్ముఖుడు
బి) నలుదిక్కులు
సి) మంచి చెడ్డలు
డి) ముక్కంటి
జవాబు:
బి) నలుదిక్కులు
63. క్రింది వానిలో ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ గుర్తించండి.
ఎ) నాలుగు వేదాలు
బి) అప్రియం
సి) తల్లిదండ్రులు
డి) శాస్త్రజ్ఞుడు
జవాబు:
సి) తల్లిదండ్రులు
64. ధాన్యపు గింజలు తిన్నారు – విగ్రహవాక్యం గుర్తించండి.
ఎ) ధాన్యంతో గింజలు
బి) ధాన్యమైన గింజలు
సి) ధాన్యం కొరకు గింజలు
డి) ధాన్యము యొక్క గింజలు
జవాబు:
డి) ధాన్యము యొక్క గింజలు
65. అప్రియం పలుకరాదు – ఇది ఏ సమాసం?
ఎ) నఞ్ తత్పురుష
బి) కర్మధారయం
సి) షష్ఠీ తత్పురుష
డి) ద్విగువు
జవాబు:
ఎ) నఞ్ తత్పురుష
వాక్య ప్రయోగాలు :
66. అందరు భోజనం చేయండి – ఇది ఏ వాక్యం?
ఎ) విధ్యర్థక వాక్యం
బి) కర్తరి వాక్యం
సి) ఆశీర్వాద్యర్థక వాక్యం
డి) తద్ధర్మర్థక వాక్యం
జవాబు:
ఎ) విధ్యర్థక వాక్యం
67. అతిథులను ఆదరించాలి – దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి.
ఎ) అతిథులను మనం ఆదరించాలా?
బి) అతిథులను ఆదరించకపోవచ్చు
సి) అతిథులను ఆదరించకూడదు
డి) అతిథులను మాత్రమే ఆదరించాలి
జవాబు:
సి) అతిథులను ఆదరించకూడదు
68. నేను తప్పక బడికి వస్తాను – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) నిషేదార్థక వాక్యం
బి) విధ్యర్థక వాక్యం
సి) కర్తరి వాక్యం
డి) నిశ్చయార్థక వాక్యం
జవాబు:
డి) నిశ్చయార్థక వాక్యం
69. వర్తమాన కాల అసమాపక క్రియను గుర్తించండి.
ఎ) క్రోద్వార్థం
బి) ఆత్మర్థకం
సి) శత్రర్థకం
డి) చేదర్థకం
జవాబు:
సి) శత్రర్థకం
70. క్రింది వానిలో చేదర్థక క్రియా పదం గుర్తించండి.
ఎ) చేసినా
బి) చేస్తే
సి) చేస్తూ
డి) చేసి
జవాబు:
బి) చేస్తే
71. రమ, లత అక్కాచెల్లెళ్ళు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) పరోక్ష వాక్యం
బి) సంక్లిష్ట వాక్యం
సి) సంయుక్త వాక్యం
డి) కర్తరి వాక్యం
జవాబు:
సి) సంయుక్త వాక్యం
72. మీకు శుభం కలుగు గాక ! – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ఆశీర్వాద్యర్థక వాక్యం
బి) తద్ధర్మార్థక వాక్యం
సి) హేత్వర్థక వాక్యం
డి) యూహ్మాదర్థక వాక్యం
జవాబు:
ఎ) ఆశీర్వాద్యర్థక వాక్యం
73. ‘నేను అన్నం తిన్నాను’ అని రవి అన్నాడు – ఇది ఏ రకమైన వాక్యం?
ఎ) ప్రత్యక్ష కథనం
బి) ఆత్మార్థక వాక్యం
సి) పరోక్ష కథనం
డి) కర్మణి వాక్యం
జవాబు:
ఎ) ప్రత్యక్ష కథనం
విభక్తి ప్రత్యయాలు – భాషాభాగాలు – పురుషలు :
74. తృతీయా విభక్తి ప్రత్యయాలను గుర్తించండి.
ఎ) డుమువులు
బి) కొఱకున్, కై
సి) చేతన్, చేన్
డి) అందు, న
జవాబు:
సి) చేతన్, చేన్
75. దేశాన్ని కవులు కీర్తించారు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
ఎ) ప్రథమ
బి) తృతీయ
సి) చతుర్థి
డి) ద్వితీయ
జవాబు:
డి) ద్వితీయ
76. కంటిలోని నలుసు చూడు – గీత గీసిన నామవాచకం అసలు రూపం గుర్తించండి.
ఎ) నేత్రము
బి) కన్ను
సి) కన్నులో
డి) కంటి
జవాబు:
బి) కన్ను
77. దేశమును ప్రేమించాలి – గీత గీసిన, పదం ఏ విభక్తి?
ఎ) ద్వితీయ
బి) షష్ఠీ
సి) సప్తమీ
డి) చతుర్టీ
జవాబు:
ఎ) ద్వితీయ
78. మేము వచ్చాము – గీత గీసిన పదం ఏ పరుష వాచకం?
ఎ) ప్రథమ
బి) మధ్యమ
సి) అధమ
డి) ఉత్తమ
జవాబు:
డి) ఉత్తమ
79. పెద్దనగరం చూచాను – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) సర్వనామం
బి) విశేషణం
సి) క్రియ
డి) అవ్యయం
జవాబు:
బి) విశేషణం
80. అందరు పెళ్ళికి వచ్చారు – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
ఎ) విశేషణం
బి) అవ్యయం
సి) సర్వనామం
డి) క్రియ
జవాబు:
సి) సర్వనామం
81. క్రింది వానిలో చతుర్థి విభక్తి ప్రత్యయం
ఎ) కొరకున్
బి) వలన
సి) అందు
డి) కు
జవాబు:
ఎ) కొరకున్
సొంతవాక్యాలు :
సూచన : క్రింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
82. ఒడికట్టడం : ఆకలితో దుర్మార్గానికి ఒడిగట్టాడు.
83. నిర్విరామం : రాష్ట్రాభివృద్ధికి ప్రజలంతా నిర్వి రామంగా కృషి చెయ్యాలి.
84. ప్రాయశ్చిత్తం : పిల్లిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.
85. ధర్మబుద్ధి : ప్రతి ఒకరు ధర్మబుద్దిని కలిగియుండాలి.
86. పుణ్యకాలం : ఏదైనా మంచిపనిని పుణ్యకాలంలో ప్రారంభించాలి.
87. సావధానం : పాఠాలను సావధానంగా వినాలి.
88. ఆదరం : పేదలపట్ల ధనికులు ఆదరం చూపాలి.
89. తిలకించు : భక్తులు బ్రహ్మోత్సవ వేడుకను తిలకించు చున్నారు.
90. అలమటించు : పేదలు ఆకలిబాధలతో అలమటించు చున్నారు.
91. సంతృప్తి : తనకున్న దానితో సంతృప్తి చెందడం ఉత్తమం