SCERT AP State 7th Class Telugu Textbook Solutions 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?” Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?”

7th Class Telugu 6th Lesson “ఎందుకు పారేస్తాను నాన్నా?” Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

ఈ క్రింది ప్రశ్నలపై చర్చించండి – జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
“ఎందుకు పారేస్తాను నాన్నా?” కథను సంక్షిప్తంగా సొంతమాటలలో రాయండి.
జవాబు:
కృష్ణుడు ఫోర్తు ఫారమ్ లోకి వచ్చాడు. వాళ్ళ అమ్మ వాడిని చదివించమన్నా, వాళ్ళ నాన్న వాడిని బడికి పంపలేనన్నాడు. తన దగ్గర డబ్బులేదన్నాడు. కృష్ణుడికి వాళ్ళ నాన్న, చుట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చాడు. చుట్టలు తేవాలంటే స్కూలు ప్రక్క నుంచే వెళ్ళాలి. కృష్ణుడికి బడి మానినందువల్ల బడివైపు వెళ్ళడం అవమానంగా ఉంది.

కృష్ణుడు ఎలాగో తలవంచుకొని బడి ప్రక్కగా వెడుతూంటే, వాడి స్నేహితుడు నరసింహం కనబడి బడికి రాటల్లేదేమీ అని అడిగాడు. తాను బడిలో చేరాననీ, పుస్తకాలు అన్నీ కొన్నాననీ వాడు చెప్పాడు. కృష్ణుడు, వాడి ఇంగ్లీషు పుస్తకం వాసన చూసి, తాను సోమవారం. బడిలో చేరతానని నరసింహానికి చెప్పాడు. ఇంతలో శకుంతల అనే కృష్ణుడి సహాధ్యాయిని వచ్చి, ఇంగ్లీషులో తనదే ఫస్టు మార్కు అంది. కృష్ణుడు తనకు మూడింట్లో ఫస్టు వచ్చిందన్నాడు. ఇంతలో స్కూలు బెల్లు కొట్టారు. పిల్లలు అంతా బడిలోకి వెళ్ళారు.

కృష్ణుడికి అక్కడ నుండి కదలబుద్ధి పుట్టలేదు. అక్కడే కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్న బజారుకు వెడుతూ అక్కడకు వచ్చి కృష్ణుడిని చూశాడు – కృష్ణుడి ఏడుపు ముఖం చూసి ఆయన జాలిపడ్డాడు. తాను చుట్టలు కాల్చడం మాని, ఆ డబ్బుతో కృష్ణుడిని చదివిస్తానన్నాడు. కృష్ణుడు వాళ్ళ నాన్నను ఇంగ్లీషు పుస్తకం కొనిమ్మని అడిగాడు. ఆయన అంగీకరించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 2.
కృష్ణుడికి చదువంటే ఎంత ఇష్టమో మీ మాటల్లో చెప్పండి.
జవాబు:
కృష్ణుడు తెలివైన పిల్లవాడు. ‘ఫోర్తు ఫారములోకి వచ్చాడు. కృష్ణుడి తండ్రి, తన దగ్గర డబ్బులేదని కృష్ణుడిని బడి మానిపించాడు. కృష్ణుడికి ఇంగ్లీషులో సెకండు మార్కు మూడింట్లో ఫస్టు వచ్చింది. లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి. తండ్రి చదువు మాన్పించాడని నామోషితో కృష్ణుడు వీధుల్లోకి రావడం మానేశాడు.

కృష్ణుడి తండ్రి చుట్టలు తెమ్మన్నాడని, కృష్ణుడు సిగ్గుతో బడి ప్రక్క నుంచి వేడుతున్నాడు. కృష్ణుడి స్నేహితుడు నరసింహం కనబడి బడికి రావడం లేదేమని అడిగితే, కృష్ణుడు తాను సోమవారం చేరతానని అబద్దమాడాడు – నరసింహం ఇంగ్లీషు పుస్తకాన్ని కృష్ణుడు . ఆనందంగా వాసన చూశాడు. ‘కొత్త పుస్తకం వాసన తనకు ఇష్టం అన్నాడు.

కృష్ణుడు మొదటి నుంచీ తెలివైనవాడు. పంతంతో చదివేవాడు. అందువల్ల మేష్టర్లు కృష్ణుడిని ప్రేమగా చూసేవారు – తల్లి కృష్ణుడిని బడికి పంపమని తండ్రితో బ్రతిమాలి చెప్పింది. కాని తండ్రి తన దగ్గర డబ్బుల్లేవని మొండికేశాడు.

కృష్ణుడి సహాధ్యాయిని శకుంతల కనబడి, ఇంగ్లీషులో తనది ఫస్టు అని కృష్ణుడికి చెప్పింది. ఏమయినా తాను బడి .నుండి కదలననీ, ఇంటికి భోజనానికి వెళ్ళననీ కృష్ణుడు బడి దగ్గరే కూర్చుని ఏడ్చాడు. ఆ బడి తనదని అన్నాడు. కృష్ణుడి ఏడుపు ముఖం చూసి, తండ్రి జాలిపడ్డాడు. తాను చుట్టలు మానివేసి, ఆ డబ్బుతో కృష్ణుడిని చదివిస్తానన్నాడు. కృష్ణుడు సంతోషంగా ఇంగ్లీషు పుస్తకం తండ్రిచే కొనిపించుకున్నాడు.

దీనిని బట్టి కృష్ణుడికి చదువంటే ఎంతో ఇష్టం అని తెలుస్తోంది.

ప్రశ్న 3.
కృష్ణుడు తండ్రిలాంటి వ్యసనపరులు, సమాజంలో ఉంటారు కదా ! వాళ్ళ ప్రభావం, పిల్లలపై ఎలా ఉంటుందో చర్చించండి.
జవాబు:
కృష్ణుడు తండ్రి బీదవాడు – కృష్ణుడు తెలివిగలవాడైనా, ఫోర్తు ఫారం చదివించడానికి కనీసం ఏభై రూపాయలు -కావాలని, కృష్ణుడిని తండ్రి బడి మానిపించాడు. కృష్ణుడు దానితో కుమిలి కుమిలి ఏడ్చాడు. వీధిలోకి రావడానికే, . సిగ్గు పడ్డాడు. అతడు స్నేహితుల ముఖాలు చూడలేకపోయాడు.

కృష్ణుడి తండ్రి చుట్టలు కాలుస్తాడు – చుట్టలు కాల్చడం కోసం, కృష్ణుడిని బడి మానిపించాడు. కొందరు తండ్రులు త్రాగుతారు. మరికొందరు సిగరెట్లు కాలుస్తారు. కొందరు క్లబ్బులకు పోతారు. కొందరు పేకాట ఆడతారు. ఆ దురలవాట్లకు డబ్బు తమకు తక్కువవుతుందని, తమ పిల్లలచే చదువులు మానిపిస్తారు. తమ పిల్లలను బాలకార్మికులుగా మారుస్తారు.

పిల్లలు కూడా తండ్రిని చూసి ఆ దురలవాట్లు నేర్చుకుంటారు. పిల్లలు చదువు మానివేసి ఆ దురలవాట్లకు లోనవుతారు. వారు చిన్నప్పుడే బట్టీలలో కార్మికులుగా, హోటళ్ళలో పనివారుగా తయారు అవుతారు. కాబట్టి తండ్రులు తాము చెడు అలవాట్లు మానుకొని, ఆ డబ్బుతో తమ పిల్లలను చదివించాలి. కృష్ణుడి తండ్రిని చూసి తల్లిదండ్రులు జ్ఞానం తెచ్చుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 4.
మన సమాజంలో కృష్ణుడు లాంటి విద్యార్థులు ఎందరో ఉండవచ్చు. వాళ్ళకు మీరు ఎలా సాయపడతారు?
జవాబు:
మన చుట్టూ సమాజంలో ఎందరో పిల్లలు తాము కూడా బడిలో చదువుకోవాలని, పుస్తకాల సంచి బుజాన వేసుకొని, పెన్ను జేబులో పెట్టుకొని, దర్జాగా బడికి వెళ్ళాలనీ, కోరుకుంటూ ఉంటారు.

అయితే కొందరు పిల్లలకు అసలు తల్లిదండ్రులే ఉండరు. మరికొందరు తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించే స్తోమత ఉండదు. నిజానికి మన ప్రభుత్వము పిల్లలందరికీ పుస్తకాలు ఉచితంగా ఇస్తోంది. మధ్యాహ్నం భోజనం పెడుతోంది. ఆడపిల్లలకు సైకిళ్ళు ఉచితంగా ఇస్తోంది. బడిలో ఫీజులు లేవు.

నేను కృష్ణుడిలాంటి పిల్లల తండ్రుల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలు, పెన్ను వగైరా ఉచితంగా వారికి ఇస్తాను. బీద పిల్లలకు పరీక్ష ఫీజులు కడతాను. వారికి నోట్సు పుస్తకాలు ఉచితంగా ఇస్తాను. నా పాతచొక్కాలు, లాగులు వారికి ఉచితంగా ఇస్తాను. మా తల్లిదండ్రులతో చెప్పి మాకు ఇరుగు పొరుగున ఉన్న బీద విద్యార్థులకు కావలసిన వస్తువులు, కొని ఇస్తాను. నా మిత్రులతో చెప్పి వారిచేత కూడా వారికి సాయం చేయిస్తాను.

ప్రశ్న 5.
ఈ కథలో నరసింహం, శకుంతల, కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణను రాయండి.
జవాబు:
(నరసింహం, శకుంతల, కృష్ణుడు సహాధ్యాయులు)
నరసింహం : కృష్ణా ! నువ్వు బడికి రావడం లేదేం?
కృష్ణుడు : నేను సోమవారం చేరతాను.
నరసింహం : మరి పుస్తకాలు కొన్నావా?
కృష్ణుడు : ఇంకా లేదు.
నరసింహం : తొందరగా కొను. మళ్ళీ అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు స్టోర్సులో కొనకు. నా పుస్తకం చూడు.
నరసింహం : కొత్త పుస్తకం వాసన బాగుంటుందిరా కృష్ణా !
కృష్ణుడు : కమ్మగా ఉంటుంది. అది నాకెంతో ఇష్టం.
నరసింహం : ఇంగ్లీషులో ఫస్టుమార్కు ఎవరికొచ్చిందిరా?
కృష్ణుడు : శకుంతల కొట్టేసింది.
నరసింహం : ఆడపిల్లని మాస్టరు వేసేసుంటారు.
కృష్ణుడు : నీ మొహం ! అది తెలివైంది.
శకుంతల (వచ్చి) : కృష్ణా ! ఇంగ్లీషులో ఫస్టుమార్కు నాది ! తెలుసా?
కృష్ణుడు : నీకు ఒక్క ఇంగ్లీషులోనే కదా ! నాకు మూడింట్లో ఫస్టుమార్కులొచ్చాయి. లెక్కల్లో నూటికి నూరు వచ్చాయి.
శకుంతల : ఇంగ్లీషు ముఖ్యమైందండీ !
కృష్ణుడు : తెనుగే ముఖ్యమండి ! బి.ఏ వాళ్ళు కూడా ఇంగ్లీషులో మానేసి, తెలుగులోనే చెప్పాలని పేపర్లో పడ్డాదండి.
శకుంతల : కృష్ణా ! బెల్లయింది బళ్ళోకిరా !
కృష్ణుడు : నేను సోమవారం నుంచి వస్తా.
శకుంతల : -నేను బళ్ళోకి పోవాలి బాబూ !
కృష్ణుడు : శకుంతలా ! సరే వెళ్ళు.

ప్రశ్న 6.
“తల తాకట్టు పెట్టి అయినా నిన్ను బడిలోకి పంపిస్తాను” అనే విధంగా తన తండ్రిని మార్చిన కృష్ణుని గూర్చి రాయండి.
జవాబు:
కృష్ణుడు వాళ్ళ నాన్నది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. కొడుకు చదవడానికి చాలా ఖర్చు అవుతుందని అంత ఖర్చు పెట్టడం కష్టమంటాడు కృష్ణుడు వాళ్ళ నాన్న. కృష్ణుడి తల్లి ఎంత పోరినా కాదు పొమ్మంటాడు. నెలనెలా జీతం ఎంత కట్టాలో? పుస్తకాలకు యాభై రూపాయలు, దస్తాకాగితాలు రూపాయి అర్ధణా, పెన్సిలు ఆరణాలు. ఇవన్నీ ఎక్కడ నుండి తేవాలి అంటాడు. ఇంకా, వారం వారం ఎక్కడలేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తల ప్రాణం తోక్కొస్తున్నది అంటాడు. తండ్రి మాటలు విన్న కృష్ణుడు చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని. బాధపడుతున్నాడు. చదువుతున్న కుర్రాళ్ళ మీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖం, మనసును – కుదిపేస్తున్నాయి.

తండ్రి చుట్టలు తెమ్మనడంతో బయలుదేరిన కృష్ణుడు బడి దగ్గర ఆగిపోతాడు. కొడుకు ఎంత సేపటికి రాకపోవడంతో వెతుకుతూ వస్తున్న తండ్రికి కొడుకు బడి దగ్గర నుంచుని తనతోటివారిని చూస్తూ ఉండడం కనిపించింది. పిల్లవాడి ముఖంలోని విచారరేఖల్ని చూసి, ఏంటని అడగడంతో కృష్ణుడికి ఆనకట్టలు తెగొట్టుకొని దుఃఖం కొట్టుకొచ్చింది. కొడుకు బాధ చూసి, చుట్టలు తాగడం మాని ఆ డబ్బులతో పిల్లవాణ్ణి చదివించాలనుకున్నాడు ఆ తండ్రి. ఎంత మానుదామనుకొన్నా మానలేకపోతున్న ఆయన పిల్లవాడి కోసం “తల తాకట్టు పెట్టుకునైనా బళ్ళో వేస్తాను” అంటాడు. కృష్ణుడిలోని చదవాలనే పట్టుదలే తన తండ్రి చేత ఆ మాటలు అనిపించింది.

కఠిన పదములకు అర్థములు

పురమాయించేడు = ఆజ్ఞాపించాడు
నామోషి = అవమానము
గింజుకుంటూ = కాళ్ళు విదలించుకుంటూ
ఘోష = ధ్వని
నిశ్చయంగా = నిర్ణయంగా
ఈడు = వయస్సు
శతపోరి = నూరు; విధాల దెబ్బలాడి
సంబరము = సంతోషం
ఫోర్తు ఫారమ్ = 9వ తరగతి
ప్రారబ్ధం = అనుభవించి తీరవలసిన కర్మ (పూర్వజన్మ కర్మ)
తల ప్రాణం తోక్కొస్తోంది = మిక్కిలి కష్టం అవుతోంది
స్వస్తి చెప్పడం = ముగించడం
నిర్ధారణ = నిశ్చయము
ఈర్ష్య = అసూయ

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

త్రివర్ణ చిత్రం = మూడు రంగుల బొమ్మ
బెల్లు (Bell) = గంట
దుఃఖోపశమనం (దుఃఖ +ఉపశమనం) = దుఃఖం అణగడం
స్తంభించిపోయి = స్తంభంలా బిగిసిపోయి
కుమిలిపోతున్నాడు = తపించిపోతున్నాడు (బాగా బాధపడుతున్నాడు)
చాడీలు చెప్పాడు = లేని నేరాలు చెప్పాడు
పునః నిశ్చయించు = తిరిగి నిర్ణయించు
కందగడ్డ = కందదుంపలా ఎఱుపు
దిగమారావేం = ఉండిపోయావేం?
బోధపడ్డాది = అర్థమయ్యింది
దేవులాడుతున్నావా? = విచారిస్తున్నావా?
పాలుపోలేదు = నిర్ణయం కాలేదు (తోచలేదు)