These AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 5th Lesson Important Questions and Answers మన విశిష్ట ఉత్సవాలు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యా లు

కింది గద్యాలను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. భక్తుల తాకిడి పెరగడంతో గుణదల మేరీమాత ఉత్సవాలు ఒకే రోజు కాకుండా మూడు రోజులపాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. కొండ వద్ద సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన శిలువకు ఇప్పుడు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడోలరోసా అనే 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. నవంబరు నుండి డిసెంబరు వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్రం నలుమూలల నుండి క్రైస్తవ | భక్తులు వేలాదిగా వస్తారు. ఫాదర్ పి. ఆటి మేరీమాత విగ్రహాన్ని 1924న ఏర్పాటు చేశారు.
ప్రశ్నలు-జవాబులు:
అ) మేరీమాత ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు?
జవాబు:
మేరీమాత ఉత్సవాలు మూడు రోజులు జరుపుకుంటారు.

ఆ) క్రీస్తు జీవిత ఘట్టాలను తెలిపేది ఏది?
జవాబు:
క్రైస్తవులు పవిత్రంగా భావించే ‘వయాడోలరోసా’ క్రీస్తు జీవిత ఘట్టాలను తెలుపుతుంది.

ఇ) ఏయే నెలలో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతాయి?
జవాబు:
నవంబరు, డిశంబరు నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

ఈ) మేరీమాత విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
జవాబు:
మేరీమాత విగ్రహాన్ని ఫాదర్ పి. ఆర్లాటి ఏర్పాటు చేశారు.

2. మొక్కుబడులు ఉన్నవారు చిన్న ప్రభలను తమ భుజాలపై ఉంచుకొని కోటప్పకొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రజలు ఆయా గ్రామాల నుండి ఊరేగింపుగా వచ్చేటప్పుడు స్త్రీలు కడవలతో నీరు పోస్తారు. ప్రభల ముందు భాగంలో జంగమ దేవరలు కత్తులు చేతపట్టి “శివ శివ మూర్తివి గణనాథా” అంటూ భక్తితో దండకాలు చదువుతారు. “చేదుకో కోటయ్య చేదుకో” అని స్వామిని భక్తి భావంతో పిలుస్తూ కొండను ఎక్కడం నేటికి ఇక్కడ చూడవచ్చే విశేషం.
ప్రశ్నలు-జవాబులు:
అ) ప్రభలు ఊరేగింపుకు వచ్చేటప్పుడు స్త్రీలు ఏమి చేస్తారు?
జవాబు:
ప్రభలు ఊరేగింపుకు వచ్చేటప్పుడు స్త్రీలు కడవలతో నీరు పోస్తారు.

ఆ) శివ శివ మూర్తివి గణనాథా’ అని దండకాలు చదివేదెవరు?
జవాబు:
జంగమదేవరలు కత్తుల చేతపట్టి “శివ శివ మూర్తివి గణనాథా” అంటూ భక్తితో దండకాలు చదువుతారు.

ఇ) స్వామిని భక్తులు ఏమని పిలుస్తూ కొండను ఎక్కుతారు?
జవాబు:
“చేదుకో కోటయ్య చేదుకో” అని స్వామిని భక్తి భావంతో పిలుస్తూ కొండను ఎక్కుతారు.

ఈ) కొండచుట్టూ తిరగడాన్ని ఏమని అంటారు?
జవాబు:
కొండచుట్టూ తిరగడాన్ని ‘ప్రదక్షిణ’ అంటారు.

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

3. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాటు నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. ఆ రోగ నివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ పన్నెండుమంది యుద్ధవీరులు కలలో కనిపించారు. సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలోని రాజగురువుకి చేరవేశారు. రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారాషహీద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం పూస్తాడు. దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది. దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్యా సమేతంగా బారాషహీద్ ను సందర్శించాడు. ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు.
ప్రశ్నలు-జవాబులు:
అ) ఆర్కాటు నవాబు ఏ ప్రాంతాన్ని పాలించారు?
జవాబు:
ఆర్కాటు నవాబు నెల్లూరు ప్రాంతాన్ని పాలించారు.

ఆ) యుద్ధవీరులు ఎవరికి కలలో కనిపించారు?
జవాబు:
యుద్ధవీరులు రజక దంపతులకు కలలో కనిపించారు.

ఇ) ఆర్కాటు నవాబు భార్యకు ఏ లేపనం పూశాడు?
జవాబు:
సమాధులపై ఉన్న మట్టిని ఆర్కాట్ నవాబు తన భార్యకు లేపనంగా పూశాడు. .

ఈ) ఆర్కాటు నవాబు కృతజ్ఞతగా ఎవరిని సందర్శించాడు?
జవాబు:
ఆర్కాటు నవాబు కృతజ్ఞతగా భార్యా సమేతంగా బారాషహీద్ ను సందర్శించాడు.

4. పారువేట ఒక దేవ ఉత్సవం. ‘పరి’ అనగా గుర్రం, ‘వేట’ అనగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ గురించి జరిగేది. దీనికై స్వామివారు అసూబిలం చుట్టుప్రక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తాడు. ఈ క్షేత్రంలో కొండపై ఉగ్రనరసింహునిగా కొండ దిగువన శాంతమూర్తిగా మొత్తం క్షేత్రం అంతా 9 రూపాలతో నవ నారసింహులుగా కొలువై ఉన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడ ఉంది. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైన 97వ క్షేత్రం.
ప్రశ్నలు-జవాబులు:
అ) ‘పరి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
పరి అంటే ‘గుర్రం’.

ఆ) ఎన్ని సంవత్సరాలు నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి?
జవాబు:
600 సం|| నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇ) కొండ దిగువన నరసింహుడు ఏ రూపంలో ఉన్నాడు?
జవాబు:
కొండ దిగువన నరసింహుడు శాంతమూర్తిగా కొలువై ఉన్నాడు.

ఈ) వైష్ణవ క్షేత్రాలలో 97వ క్షేత్రం ఏది?
జవాబు:
వైష్ణవ క్షేత్రాలలో 97వ క్షేత్రం అఘోబిలం.

5. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చి ఒకటి. ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది. ఇది గుహలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. 1924వ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం గుణదలలో “సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్” అనే అనాథశరణాలయం ఏర్పాటు చేసింది. 1947 నాటికి చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. అప్పటి నుండి ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లోనూ, క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే వంటి క్రైస్తవ పర్వదినాల్లోనూ ప్రజలు మేరీమాతను దర్శించుకుని దీవెనలు పొందుతున్నారు.
ప్రశ్నలు-జవాబులు:
అ) గుణదల చర్చిలోని మేరీమాత విగ్రహం ఎక్కడి మేరీమాత విగ్రహాన్ని పోలి ఉంది?
జవాబు:
గుణదల చర్చిలోని మేరీమాత విగ్రహం ఫ్రాన్స్ దేశంలోని లూర్దునగరం చర్చిలోని మేరీమాత విగ్రహంతో పోలి ఉంది.

ఆ) గుణదల మేరీమాత ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి?
జవాబు:
గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో జరుగుతాయి.

ఇ) 1924లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం ఏది?
జవాబు:
1924లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం “సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్”.

ఈ) క్రైస్తవ పర్వదినాలు ఏవి?
జవాబు:
ప్రతి శుక్ర, శని, ఆదివారాలు, క్రిస్మస్, జనవరి 1, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రైస్తవ పర్వదినాలు.

6. సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు. పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతోంది. సుమారు 60 అడుగుల పొడవు ఉండే సిరిమాను చివర ఆసనం ఏర్పాటు చేస్తారు. ఆ సిరిమానుకు ముందుభాగంలో బెస్తవారి వల, అంజలి రథం (దేవతల రథం) నడుస్తాయి.
‘ప్రశ్నలు-జవాబులు:
అ) ‘సిరిమాను’ అంటే ఏమిటి?
జవాబు:
సిరిమాను అంటే సంపదలు ఇచ్చే పెద్ద చెట్టు.

ఆ) పైడితల్లి అమ్మవారు ఎవరి ఇలవేల్పు?
జవాబు:
పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు.

ఇ) ఏ రోజున సిరిమానోత్సవం జరుగుతుంది?
జవాబు:
దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది.

ఈ) సిరిమాను పొడవు ఎంత?
జవాబు:
సిరిమాను పొడవు సుమారు 60 అడుగులు.

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా పేరొందింది. విజయనగర రాజులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం కనిపిస్తుంది. ప్రముఖ కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవన్నను ఉద్దేశించి రాసిన గేయం….. “లేపాక్షి బసవయ్య – లేచి రావయ్య” చాలా ప్రసిద్ధి పొందింది. ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. ప్రశ్నలు-జవాబులు:
అ)’ ‘లేపాక్షి’ ఏ జిల్లాలో ఉంది?
జవాబు:
లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది.

ఆ) లేపాక్షిలోని ఆలయాలు, కట్టడాలు ఎవరి పాలనలో నిర్మించబడినాయి?
జవాబు:
లేపాక్షిలోని ఆలయాలు, కట్టడాలు విజయనగర రాజుల పరిపాలనా కాలంలో నిర్మించబడినాయి.

ఇ) దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఎక్కడ ఉంది?
జవాబు:
దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం లేపాక్షిలో ఉంది.

ఈ) ప్రముఖ కవి అడవి బాపిరాజు రాసిన గేయం ఏమిటి?
జవాబు:
ప్రముఖ కవి అడవి బాపిరాజు రాసిన గేయం “లేపాక్షి బసవయ్య – లేచి రావయ్య”.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే సిరిమానోత్సవంలోని చారిత్రక అంశాలు ఏమిటి?
జవాబు:
పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే సిరిమానోత్సవంలో చారిత్రక అంశాలు మిళితమై ఉన్నాయి. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమౌతాడు. యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు పైడిమాంబ బ్రతిమాలింది. అయినప్పటికీ చెల్లెలు మాట పెడచెవిన పెట్టి, యుద్ధానికి వెళతాడు. అక్కడ ..’ ‘ తాండ్రపాపారాయుడి చేతిలో రామరాజు మరణిస్తాడు. ఈ సంగతి విని సమీపంలోని పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది పైడిమాంబ. కొంతకాలానికి స్నేహితురాళ్ళకు కలలో కనిపించి పెద్ద చెరువులో తాను విగ్రహమై వెలుస్తానని, తనకు గుడి కట్టాలని చెప్పింది. అలా ఆ చెరువు గట్టు మీద ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు. విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ప్రతియేడు ఈ రోజున పైడితల్లి సిరిమానోత్సవం జరుగుతుంది.

ప్రశ్న 2.
కోటప్పకొండ చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను రాయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాలలో కోటప్పకొండ ఒకటి. ఇది గుంటూరు జిల్లాలోని నరసరావు పేట సమీపంలో ఉంది. 1500 ఎకరాల వైశాల్యంలో ఎనిమిదిమైళ్ళ చుట్టుకొలతలో ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. కొండ మధ్యలో ‘పాపనాశనం’ అనే తీర్థం ఉంది. ఇది స్వయంగా శివుడు తన త్రిశూలంతో కొట్టగా ఏర్పడిందంటారు. వీటిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

ఈ కొండను ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. వీటిమీద మూడు శివలింగాలు ఉన్నాయి. అందుకే కోటప్పకొండ, త్రికూటాచలంగానూ, మధ్య శిఖరం మీద ఉన్న శివుడు త్రికూటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. కొండ కింద భాగంలో గొల్లభామ గుడి ఉంది. ఈమె పరమ భక్తురాలైన ఆనందవల్లి. ఈమెను ముందుగా దర్శించిన తరువాత కోటయ్యను దర్శిస్తారు. స్థలపురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత .. శివుడు ఇక్కడ 12 సంవత్సరాల బాలునిగా అవతరించాడు. శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలో దేవతలతో నివసించాడని చెబుతారు.

ప్రశ్న 3.
‘బారాషహీద్’ గురించి రాయండి.
జవాబు:
నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వీరి మొండేలను వారి గుర్రాలు దర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి. మొండేలు అక్కడే ఖననం అయ్యాయి. కాలక్రమంలో ఈ పన్నెండు మొండేలకు స్థానికులు సమాధులు నిర్మించారు. ఆ స్థలానికి బారా షహీద్ (బారహ్ అనగా పన్నెండు, షహీద్ అనగా వీరుడు) అని పేరు పెట్టారు. మరణించిన 12మంది తలలో ఏడుగురి తలలు మాత్రమే యుద్ధం జరిగినచోట లభ్యమయ్యాయి. ఈ ఏడు తలలు లభ్యమైన ప్రదేశాన్ని ‘సాతోషహీద్’ అంటారు.

AP 7th Class Telugu Important Questions 6th Lesson మన విశిష్ట ఉత్సవాలు

ప్రశ్న 4.
‘లేపాక్షి’ ఆనాటి శిల్పుల అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక – వివరించండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా, పర్యాటక కేంద్రంగా పేరొందింది. విజయనగర రాజులు తమ పాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం చూడవచ్చు. ఇది ఠీవీగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. 8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు కలిగిన ఈ బసవయ్య మెడలో పూసల హారాలు, గంటలు ఉంటాయి. రిక్కించిన చెవులతో లేచి ఉరకడానికి కాళ్ళను సరిచేసుకుంటున్న భంగిమతో ఉండే ఈ బసవయ్య మెడలోని హారంలో వేలాడే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కున వ్రేలాడే ఏనుగులు ఉంటాయి. ఇది ఆనాటి శిల్పుల శిల్పకళా సౌందర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు.

ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. దీనినే “లేపాక్షి” ఆలయం అంటారు. ఈ ఆలయంలో దుర్గాదేవి, గణపతి, నాగేంద్రుడు మొదలైన విగ్రహాలు ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రతి నిర్మాణం రాతితో నిర్మించినవే. వ్రేలాడే రాతిస్తంభం ఇక్కడ మరో ప్రత్యేకత. ఇక్కడ ప్రతి అణువూ అత్యద్భుతంగా ఆనాటి శిల్పులు తీర్చిదిద్దారు. గోడలు, పై కప్పులపై చిత్రించిన వర్ణ చిత్రాలు అప్పటి కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి.