AP Board 7th Class Telugu వ్యాసాలు

SCERT AP Board 7th Class Telugu Guide వ్యాసాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu వ్యాసాలు

II. స్వీయరచన – వ్యవహార రూపాలు

1. నీకు నచ్చిన కవి గూర్చి వ్యాసరూపంగా రాయండి.
జవాబు:
నాకు నచ్చిన కవి
“రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించు రాతి విగ్రహముల యందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు !”

అంటూ తన కవితాకేతనాన్ని తెలుగు సాహితీ గగనాన సముజ్వలంగా ఎగురవేసిన కవి చక్రవర్తి జాషువా. ఈ కవి అంటే నాకు చాలా ఇష్టం. ఈయన 1895 సెప్టెంబరు 28న గుంటూరు జిల్లా వినుకొండలో వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాటి నుండి సమాజంలోని అసమానతలను చూసి, అనుభవించి, బడుగుల బతుకు వెతలను అనన్య సామాన్యంగా పద్యరూపంలో చిత్రించిన అసాధారణ కవి జాషువా. మూఢ విశ్వాసాలపై తిరుగు బావుటాను ఎగురవేశాడు. ఈ విశ్వమే మమతల మందిరం కావాలని అభిలషించిన నిత్య సత్య కృషీవలుడు జాషువా.”

పద్యం, గద్యం, పాట, మాట….. అన్నీ ఆయన మస్తిష్క అక్షయపాత్ర నుండి మనకు వడ్డించిన అమృతాన్నాలే. పద్య గద్య విద్యలతో అప్రతిహతంగా శరసంధానం చేసిన సవ్యసాచి జాషువా. నాటక రచనలోను తనదైన శైలిలో రవ్వలు రాల్చి గరగరల్ పచరించిన దిట్టగా గణుతికెక్కాడు.

జాషువా కలం నుంచి వెలువడ్డ అసంఖ్యాక రచనల్లో “గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, గిజిగాడు, శ్మశాన వాటిక” మొదలైన రచనల ద్వారా తెలుగు లోకానికి ఆప్తులయ్యారు. వీరి ‘క్రీస్తు చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, కవికోకిల, కవితా విశారద, నవయుగ కవితా చక్రవర్తి” అంటూ ఆంధ్రదేశం కీర్తించింది. 1951లో గుంటూరులో కనకాభిషేకంతో గజారోహణం, గండపెండేరంతో ఈ తెలుగునేల సత్కరించింది. “వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం” అని చాటిన ‘విశ్వనరుడు’ జాషువా.

2. ‘పోలమ్మ’లాంటి గుండెధైర్యం ఉన్న స్త్రీలు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మీకు తెలిసిన ఒకరి గురించి, వారి కష్టం గురించి ఒక వ్యాసం రాయండి.
జవాబు:
మన భారతదేశంలో స్త్రీలను శక్తి స్వరూపిణులుగా భావిస్తారు. దేశాభివృద్ధికి స్త్రీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడుతున్నారు. మనదేశంలో స్త్రీలు అన్ని రంగాలలోను సాధిస్తున్న విజయాలు కోకొల్లలు. యువతను సక్రమ మార్గంలో నడిపించాలన్నా, విద్యాబుద్ధులు నేర్పాలన్నా స్త్రీ పాత్ర ప్రధానమైనది. అలాంటి స్త్రీలు వంచనకు గురై బలౌతున్నారు. వారిలో కొందరే తమ సమస్యలను అధిగమించగల్గుతున్నారు. దేశానికి రైతు ఎంత అవసరమో ఇంటికి ఇల్లాలు అంతే.

మా ఊరిలో ఇటీవల ఒక రైతు మరణించాడు. చాలా అప్పులు ఉన్నాయి. అతని భార్య అప్పులవాళ్ళతో రెండు సంవత్సరాలు ఆగమని, సాగు చేసి ఋణం తీరుస్తానని చెప్పింది. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా ఆడదానివి నీవు వ్యవసాయం చేస్తావా ? అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆవిడ వారి మాటలను ప్రేరణగా తీసుకొని . వ్యవసాయం మొదలు పెట్టింది. నిజంగానే రెండేళ్ళలోనే వారి అప్పులు తీర్చింది. ఆ తర్వాత ఆమె సొంత ట్రాక్టరు కొన్నది. నవ్విన వాళ్ళే ఆశ్చర్యపోయేటట్లు నలుగురికి ఆదర్శంగా నిలిచింది.

AP Board 7th Class Telugu వ్యాసాలు

3. లలితకళల్లో నీకు నచ్చిన అంశం గురించి వ్యాసం రాయండి.
జవాబు:
లలితకళలు తెలుగు సంప్రదాయానికి పట్టుకొమ్మలు. భారతీయ సంస్కృతికి నిలువుటద్దాలు. పూర్వం నుండి మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎన్నో పద్ధతులను అనుసరిస్తున్నాడు. మానవ హృదయానికి ఆనందాన్ని కలిగించేవి లలితకళలు. లలితకళలను ఆంగ్లంలో FINE ARTS అంటారు. ‘సాహిత్యం , సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం’ ఇవి లలితకళలు. వీటిలో సంగీతం అంటే నాకు చాలా ఇష్టం.

సంగీతం – శ్రవణేంద్రియముల ద్వారా మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. ఈ సంగీతం. ఇది కేవల స్వరమయమైనది. తాళ, లయ ఆశ్రయమైనది. ఇది మానవులనే కాక ప్రాణవంతమైన జంతుజాలమునంతను తన వైపు ఆకర్షించుకొనగలదు. అందుచేతనే …… శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి:….. అను నానుడి ఏర్పడింది. సప్తస్వరాల సమ్మేళనంతో మనస్సుకు సంగీతం ఆనందాన్ని అందిస్తుంది. సంగీతానికి మోళ్ళు చిగురిస్తాయి. పాములు పడగ విప్పి నాట్యం చేస్తాయి. ఏడ్చే పసిపాప హాయిగా నిద్రిస్తుంది. మనకు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసులు ఉన్నారు. నేడు ఘంటసాల, మంగళంపల్లి, బాలు, ఏసుదాసు, సుశీల, జానకి, చిత్ర వంటి సంగీత , గాయకులూ ఉన్నారు.

4. కోవిడ్ – 19

సార్స్ వైరస్ కుటుంబమైన కోవిద్ – 19కు చెందినది కరోనా వైరస్. ఇది 2019 డిసెంబర్ లో చైనాలోని వూహాలో బయటపడింది. అప్పటినుండి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అనేక లక్షల మంది మరణానికి కారణమైంది. ప్రపంచం పాలిట మహమ్మారిగా నిలిచింది.

ఇది ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్. కరోనా వైరస్ సోకితే జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, రుచి, వాసన తెలియకపోవడం మొదలైన లక్షణాలుంటాయి. దీనిని నిర్ధారించడానికి RT. P CR పరీక్ష,

CT స్కాన్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష వంటివి చేస్తారు. కరోనా వైరస్ సోకితే సుమారు 5 రోజులు నుండి 10 నెలల వరకు కూడా మందులు వాడవలసి రావచ్చును.

ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలి. ఎవరితోనూ ఏవిధంగా కలిసిమెలిసి తిరగకూడదు. కనీసం 14 రోజులు అలా ఉండాలి. తర్వాత పరీక్షించుకొని కరోనా వైరస్ లేదని తేలితే మరొక 20 రోజులు బైటకు రాకూడదు.

వ్యాక్సిన్ వేయించుకోవాలి. మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్ వాడాలి. అనవసరంగా బైట తిరగకూడదు. జనసమూహాలలోకి వెళ్లకూడదు. అప్పుడు కరోనా వైరసను పూర్తిగా జయించవచ్చు.

జూలై 2021 నాటికి భారతదేశంలో 3 కోట్ల 4 లక్షలమందికి కరోనా సోకింది. 2 కోట్ల 95 లక్షలమంది కోలుకున్నారు. మూడు లక్షల 99 వేలమంది కరోనాతో మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా 18 లక్షల 90 వేల మందికి సోకింది. 18 లక్షల 40 వేల మంది కోలుకున్నారు. 12,706 మంది కరోనాతో మరణించారు.

అందుచేత కరోనా మన ప్రపంచానికి పట్టిన మహమ్మారిగా వైద్యులు పేర్కొన్నారు.

5. బాల్య వివాహాలు

బాల్యవివాహాలు అంటే చిన్నతనంలోనే పెళ్ళిళ్లు చేయడం. ఒకప్పుడు ఆటలాడుకొనే వయస్సులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం శారదా చట్టం పెట్టి చిన్నతనంలో పెళ్ళి చేయరాదని నిషేధించింది.

బాల్యవివాహాలు మంచివి కావు. చిన్నతనంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రుల, అత్తమామల పెత్తనం సాగుతుంది. దానితో చిక్కులు వస్తాయి. 13, 14 ఏళ్ళ వయస్సులోనే వారికి సంతానం కలుగుతుంది. అందువల్ల ఆడువారికి ఆరోగ్యం పాడవుతుంది.

కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన యువతీయువకులకే పెళ్ళిళ్ళు చేయాలని నియమం పెట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ పెద్దవారైతే వారు ఒకరినొకరు ప్రేమగా మంచిగా చూసుకుంటారు. వారు వారికి పుట్టిన పిల్లలను చక్కగా పెంచుతారు. వారి పిల్లలు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతారు. వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కాబట్టి బాల్య వివాహాలను అరికట్టాలి. వయస్సు వచ్చిన పిల్లలకే పెళ్ళిళ్లు చేయాలి. అప్పుడు వారి జీవితాలు ఆనందంగా హాయిగా సాగుతాయి.

6. కాలుష్యం (లేదా) పర్యావరణం (లేదా) కాలుష్యం గురించి 3 పేరాలలో వ్యాసం రాయండి

మన పరిసరాలన్నీ కాలుష్యంతో నిండి పోతున్నాయి. దేశంలో జనాభా పెరిగిపోయింది. మానవ జీవితంపై, వారి ఆరోగ్యాలపై కాలుష్య ప్రభావం ఉంటుంది. కాబట్టి మన పరిసరాలనూ, మనం పీల్చేగాలినీ, నీటినీ, శుభ్రంగా ఉంచుకోవాలి.

పరిసరాలలో కాలుష్యం మూడు రకాలుగా ఉంటుంది. 1) జల కాలుష్యం 2) ధ్వని కాలుష్యం 3) వాతావరణ కాలుష్యం.
1) జలకాలుష్యం :
నదుల్లో, కాలువల్లో, చెరువుల్లో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువుల్ని కడగడం మొదలయిన కారణాల వల్ల జలకాలుష్యం ఏర్పడుతోంది.

2) ధ్వని కాలుష్యం :
రోడ్లపై కార్లు, మోటారు కార్ల హారన్స్, యంత్రాల చప్పుళ్ళు, మైకుల హోరు మొదలైన వాటి వల్ల ధ్వని కాలుష్యం వస్తోంది.

3) వాతావరణ కాలుష్యం :
కర్మాగారాలూ, బస్సులూ, మొదలైన వాటి నుండి, విషవాయువులు పొగ రూపంలో గాలిలో కలిసి ‘వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శుభ్రత పాటించి, చెట్లను పెంచి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వారు కాలుష్యం కోరలలో చిక్కుకోరాదు.

AP Board 7th Class Telugu వ్యాసాలు

7. వార్తా పత్రికలు

వార్తలను అందించే పత్రికలను వార్తాపత్రికలు అంటారు. ప్రాచీనకాలంలో వార్తలను చేరవేయడానికి మనుషుల్నీ, జంతువుల్నీ, పక్షుల్నీ వాడేవారు. విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తరువాత ముద్రణాయంత్రాలు కనిపెట్టబడ్డాయి. వార్తాపత్రికల వ్యాప్తి జరిగింది.

ప్రపంచంలో మొట్టమొదటగా వెనిస్ నగరంలో వార్తాపత్రిక ప్రారంభించబడిందని చెప్తారు. సుమారు క్రీ.శ. 1620 నాటికి వార్తాపత్రికలు వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘ఇండియా గెజిట్’ అని కొందరూ, ‘బెంగాల్ గెజిట్’ అని కొందరూ చెబుతారు. 1850 నుంచి మన దేశంలో పత్రికల ప్రచురణ అధికమైంది.

వార్తాపత్రికలు అనేక భాషలలో వెలువడుతున్నాయి. మన తెలుగుభాషలో ఈనాడు, వార్త, సాక్షి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర మొదలైనవి బాగా ప్రచారంలో ఉన్న దినపత్రికలు.

వార్తాపత్రికలవల్ల లాభాలు చాలా ఉన్నాయి. వీటివల్ల దేశవిదేశవార్తలు తెలుసుకోవచ్చు. విజ్ఞానం పెరుగుతుంది. వీటివల్ల ప్రభుత్వం చేపట్టే పనులూ, లోపాలూ ప్రజలకి తెలియజేస్తాయి. ఇవి ప్రజల కష్టనష్టాలూ, సమస్యలూ, అభిప్రాయాలూ ప్రభుత్వానికి తెలియజేస్తాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ వార్తాపత్రికలు, కరదీపికలవంటివి. ఇవి జాతీయాభివృద్ధికీ, జాతి సమైక్యతకూ దోహదపడతాయి.

8. గ్రంధాలయాలు

తరతరాల విజ్ఞాన సంపదను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల స్థలాన్ని గ్రంథాలయం అంటారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి. అమెరికాలోని ‘కాంగ్రెసు లైబ్రరీ’, రోమ్ నగరంలోని వాటికన్ లైబ్రరీ’ మొదలైనవి ప్రపంచంలో పేరు పొందాయి. మన దేశంలో చెన్నైలోని ‘కన్నెమరా’ గ్రంథాలయం, తంజావూరులోని ‘సరస్వతీ మహలు’, హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవవూయాంధ్రభాషా నిలయం’, వేటపాలెంలోని ‘సారస్వత నికేతనం’ మొదలైనవి చెప్పుకోదగిన గ్రంథాలయాలు.

అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నాళం కృష్ణారావు మొదలైనవాళ్ళు మన రాష్ట్రంలో గ్రంథాలయోద్యమాన్ని చేపట్టి గ్రంథాలయాలను స్థాపించారు. ఇప్పుడు ప్రతి విద్యాలయంలోనూ గ్రంథాలయాలున్నాయి.

గ్రంథాలయాలలో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు ఉన్నాయి.

గ్రంథాలయాలవల్ల చాలా లాభాలున్నాయి. గ్రంథ పఠనంవల్ల విజ్ఞాన వినోదాలు పొందవచ్చు. అక్కడ లభించే దిన, వార, పక్ష, మాసపత్రికలను చదివి రాజకీయ, సాహిత్య, క్రీడారంగాది విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాలు మనిషిని మనీషిగా మారుస్తాయి. దేశాభ్యుదయానికీ, సమాజ వికాసానికీ మూలస్తంభాలు గ్రంథాలయాలు.

9. విజ్ఞాన యాత్రలు (విహార యాత్రలు)

విజ్ఞానాన్ని సంపాదించాలనే కోరికతో విద్యార్థులు చేసే యాత్రలను విజ్ఞాన యాత్రలు అంటారు. వీటినే ‘విహారయాత్రలనీ, వినోదయాత్రలనీ’ కూడా పిలుస్తారు.

పుస్తక పఠనంవల్ల పుస్తక జ్ఞానం, మాత్రమే లభిస్తుంది.. లోకానుభవం, ప్రజల ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి తెలుసుకోవాలంటే పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. పుస్తకాలలో ఉన్న విషయాలను పూర్తిగా గ్రహించాలంటే యాత్రలు చేయాలి. ఉదాహరణకు నీటి నుంచి విద్యుత్ ఎలా లభిస్తుందో పుస్తకాలలో వివరంగా ఉంటుంది. అది చదివితే కొంతమాత్రమే తెలుస్తుంది. జల విద్యుత్ కేంద్రానికి వెళ్ళి, పనిచేసే విధానాన్ని పరిశీలించినప్పుడు సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ముఖ్యంగా చరిత్ర, సైన్సు వంటి విషయాలను అర్థంచేసుకోవడానికి ఈ యాత్రలు ఎంతో అవసరం.

విజ్ఞాన యాత్రలవల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటివల్ల లోకజ్ఞానం అలవడుతుంది. మానసిక విశ్రాంతి లభిస్తుంది. విభిన్న సంస్కృతుల్ని, భాషల్ని, జీవన విధానాల్ని తెలుసుకోవచ్చు. విజ్ఞాన యాత్రల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులలో ఐకమత్యం పెంపొందుతుంది.

విజ్ఞానయాత్రలు లేదా విహారయాత్రలు కేవలం విద్యార్థులకే అనుకోవడం సరికాదు. అన్ని వయస్సుల వాళ్ళకీ, – అన్ని వృత్తుల వాళ్ళకీ ఇవి అవసరమే. పెద్దలు చేసే తీర్థయాత్రలు కూడా ఒక రకంగా విజ్ఞానయాత్రలే.

AP Board 7th Class Telugu వ్యాసాలు

10. చలనచిత్రాలు ( సినిమాలు)

చలనచిత్రాలు అంటే ‘కదిలే బొమ్మలు’ అని అర్థం. వీటినే సినిమాలు అంటారు. పూర్వం ప్రజల విజ్ఞాన వినోదాల కోసం తోలుబొమ్మలాటలు, భామా కలాపాలు, వీథినాటకాలు ప్రదర్శింపబడుతుండేవి.

కెమేరాలు కనిపెట్టబడ్డ తరువాత ‘మూకీ’ చిత్రాలు ప్రదర్శించేవారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత ‘టాకీ’ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో నేడు చలనచిత్రరంగాన హాలీవుడ్ పేరుగాంచింది. మన దేశంలో ముంబయి సినీరంగాన పేరుగాంచింది. చెన్నై, హైదరాబాదులు సినీ పరిశ్రమలో ముందున్నాయి.

ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదాన్ని పొందడానికి ఈ సినిమాలు ఉపయోగిస్తాయి. ప్రపంచంలోగానీ, దేశంలోగానీ ఉన్న వివిధ సుందర దృశ్యాల్ని సినిమాలలో చూసి ఆనందించవచ్చు. సినిమాలు సాంఘికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రచార సాధనాలు.

నేడు ఈ పరిశ్రమ పెక్కుమందికి జీవనోపాధిని కలిగిస్తున్నది. అనేకమంది నటీనటులు, కళాకారులు దీనివల్ల ధనవంతులవుతున్నారు. కార్మికులు, విద్యార్థులు, పిన్నలు, పెద్దలు అందరూ వీటిని చూసి మానసిక విశ్రాంతిని, వినోదాన్ని పొందుతున్నారు.

ఈ సినిమాలను సరైన పద్ధతిలో తీయకపోతే సమాజానికి చెడు కలుగుతుంది. కాబట్టి నిర్మాతలు కేవలం వ్యాపారదృష్టితోనే కాక, కళాత్మకపు విలువలను, నైతిక విలువలను పెంచే చిత్రాలను నిర్మించాలి.

11. రేడియో (ఆకాశవాణి)

రేడియోను ‘మార్కొని’ అనే ఇటలీ దేశస్థుడు 1895లో కనిపెట్టాడు. శబ్దతరంగాలను విద్యుత్తరంగాలుగా మార్చి నిస్తంత్రీ విధానంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఎక్కడెక్కడి విషయాలనూ తెలియజేసే అద్భుత సాధనం రేడియో.

మన దేశంలో రేడియో కేంద్రాలు పెద్ద పెద్ద నగరాలలో ఉన్నాయి. వాటిని బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లు అంటారు. కొన్ని ఉపకేంద్రాలు ప్రసారం మాత్రమే చేస్తాయి. వాటిని రిలే కేంద్రాలు అంటారు.

రేడియోలో వార్తలు, సంగీతం, నాటకాలు, సినిమాలు, హరికథలు, ప్రసంగాలు, ప్రసారం చేయబడతాయి. అలాగే రైతులకు వ్యవసాయ కార్యక్రమాలు, మహిళలకు మహిళామండలి కార్యక్రమాలు, బాలబాలికలకు బాలానందం, యువకులకు యువవాణి కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి.

ఇంకా భక్తిరంజని కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, విద్యావిషయకమైన కార్యక్రమాలు, క్రీడలు, ధరవరలు, ప్రకటనలు మరెన్నోరకాల కార్యక్రమాలూ రేడియోలో ప్రసారం చేయబడతాయి. టీవీల వ్యాప్తి జరిగాక రేడియోలు * వెనుకబడ్డాయి. –

అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందిస్తూ, ప్రజలలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాల్ని పెంపొందింపజేస్తున్న అద్భుతసాధనం రేడియో.

AP Board 7th Class Telugu వ్యాసాలు

12. దూరదర్శన్ (టీ.వీ)

విజ్ఞానశాస్త్ర ప్రగతికీ, మానవుడి ప్రతిభకీ నిదర్శనం టెలివిజన్. ఇది బ్రిటన్ లో 1936లో మొదట వ్యాప్తిలోకి వచ్చింది. దీనిని స్కాట్ దేశపు ఇంజనీర్ జాన్ లాగ్. బైర్డ్ 1928లో కనిపెట్టాడు.

రేడియోలో శబ్దాన్ని మాత్రమే వింటాం. శబ్దంతో పాటు దృశ్యాన్ని చూసే అవకాశం టెలివిజన్ లో ఉంటుంది. టెలివిజన్ ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. నేడు టీవీ లేని ఇల్లు లేదు.

టీ.వీ. ల వల్ల చాలా లాభాలున్నాయి. ఇది కేవలం ప్రచార సాధనమో, వినోద సాధనమో కాదు. దీనిద్వారా ప్రభుత్వమూ, వాణిజ్య సంస్థలు ప్రచారం చేసుకోవచ్చు. మనం స్వయంగా వెళ్ళి చూడలేని ప్రదేశాలెన్నో ఇందులో చూడవచ్చు.

విద్యారంగంలో, వైద్య రంగంలో, వాణిజ్య రంగంలో, విజ్ఞానశాస్త్ర రంగంలో ఈనాడు టెలివిజన్ కు తిరుగులేని స్థానం ఉంది. నిరక్షరాస్యతా నిర్మూలనలో టెలివిజన్ కీలకపాత్ర వహిస్తోంది. ప్రజల్ని అన్ని రంగాలలోనూ చైతన్యవంతం చేస్తున్న శక్తివంతమైన సాధనం టెలివిజన్. ‘వీడియో’ పరిజ్ఞానానికి టీవీ మూలకారణం. మన సంస్కృతిని, కళలను , కాపాడుకోవడానికి టీవీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీ.వీల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అతి ఎక్కడా పనికిరాదు. టీవీలను ఎక్కువగా చూస్తూ కొందరు వృధా కాలయాపన చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోంది. ఎక్కువగా చూడటంవల్ల కండ్ల జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

13. కంప్యూటర్

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. కంప్యూటర్ లో ‘డేటా’ ను నిల్వచేయవచ్చు. దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ చాలా కచ్చితంగా, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుత సాధనమైన కంప్యూటర్‌ను కనిపెట్టినవాడు ఛార్లెస్ బాబ్బేజి.

కంప్యూటర్ వల్ల చాలా లాభాలున్నాయి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు (హెచ్చవేతలు), భాగహారాలు వంటి లెక్కలు చాలా వేగంగా చేయడానికి కంప్యూటర్ బాగా పనికివస్తుంది. కంప్యూటర్ల ద్వారా వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు.

విమానాలు, బస్సులు, రైళ్ళు మొదలైనవాటి టిక్కెట్ల రిజర్వేషన్లకు కంప్యూటర్లను ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద కర్మాగారాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకుల్లో ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా, వైద్య, వ్యాపార, వ్యవసాయ, సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ కంప్యూటర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటర్నెట్ అనే సౌకర్యం ద్వారా ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ మన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చొని తెలుసుకోవచ్చు. ఆధునిక విజ్ఞాన ప్రగతికి నిదర్శనం కంప్యూటర్.

AP Board 7th Class Telugu వ్యాసాలు

14. ఒక పండుగ (దీపావళి)

మనం జరుపుకొనే ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో వస్తుంది. దీన్ని రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి. రెండోరోజు దీపావళి అమావాస్య. ఈ దీపావళి పండుగను మన దేశంలో అన్ని రాష్ట్రాలవారూ జరుపుకొంటారు.

నరక చతుర్దశిని గూర్చి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం నరకుడనే రాక్షసుడు లోకాల్ని బాధిస్తుండేవాడు. . . ఆ బాధలు భరించలేక ప్రజలు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకుడిపై యుద్ధానికి వెళ్ళి, వాడిని సంహరించాడు. నరకుడు మరణించినందుకు ప్రజలందరూ సంతోషించారు. అది చతుర్దశినాడు జరిగింది. కాబట్టి నరక చతుర్దశి అనే పేర పండుగ చేసుకున్నారు. నరకునివల్ల చీకటిలో మ్రగ్గిన ప్రజలు వెలుగు చూశారు. కాబట్టి దీపాల వెలుగులో మరునాడొక పండుగ చేసుకున్నారు.

నరక చతుర్దశి రోజు తెల్లవారు జామున లేచి పిల్లలు, పెద్దలు శిరస్నానం చేస్తారు. నూతన వస్త్రాలు ధరించి, పిండివంటలతో భోజనాలు చేస్తారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. దీపావళి రోజు రకరకాల టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలవంటి మందు- సామానులు కాలుస్తారు. కొందరు దీపావళి పండుగరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

15. లాల్ బహదూర్ శాస్త్రి (జాతీయ నాయకుడు)

లాల్ బహదూర్ 1904 వ సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన, వారణాసిలో జన్మించాడు. ఆయన తల్లి పేరు రామ్ దులారీదేవి. తండ్రి శారదా ప్రసాద్.

లాల్ బహదూర్ కాశీ విశ్వవిద్యాలయం నుండి ‘శాస్త్రి’ పట్టా పొందాడు. ఆనాటి నుండి లాల్ బహదూర్ శాస్త్రిగా పిలువబడ్డాడు. ఆయన భార్య పేరు లలితాదేవి.

మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో జవహర్ లాల్ నెహ్రూకు కుడిభుజంగా పనిచేశాడు. రవాణా, తంతి తపాలా శాఖలు, హోం శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, రైల్వేశాఖల మంత్రిగా భారతదేశానికి ఎంతో సేవ చేశాడు.

నెహ్రూ తర్వాత శాస్త్రి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదంతో భారతదేశాన్ని , ఉర్రూతలూగించాడు. ఆయనలో పట్టుదల ఎక్కువ. నైతిక విలువలకు, నిజాయితీకి, నిరాడంబరతకు ఈయనది పెట్టింది పేరు. ఆయన 1966వ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన మరణించాడు.

16. అక్షరాస్యత

‘విద్య లేనివాడు వింత పశువు’ అని పెద్దలంటారు. చదవడం, రాయడం, లెక్కలు నేర్చుకోవటమే. అక్షరాస్యత.

విద్య నేర్చినవాడు అన్ని రంగాల్లోనూ రాణిస్తాడు. కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశంలో చదువుకున్నవారి శాతం చాలా తక్కువ. దీనికి కారణాలు ప్రజల్లో చైతన్యం లేకపోవడం మరియు పేదరికం.

ప్రభుత్వం ప్రత్యేకంగా వయోజనుల కోసం అక్షరాస్యతా పథకాలు ప్రారంభించింది. పగలంతా పనుల్లో మునిగిపోయినవారికోసం, రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం జిల్లాల వారీగా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాలు చేపట్టింది.

పనిపాటలు చేసుకుంటూ చదువుకోవాలనుకునే వారి కోసం, మధ్యలో బడి మానేసిన పిల్లల కోసం అనియత విద్యాకేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఇంట్లో కూర్చొని తీరిక వేళల్లో చదువుకోవడానికి వీలుగా సార్వత్రిక పాఠశాల విద్య ఏర్పాటు చేశారు.

మనదేశంలో జనవిజ్ఞాన వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు సాక్షరతా ఉద్యమంలో ఎక్కువగా పాల్గొంటున్నాయి. సుఖసంతోషాలతో బతకాలంటే ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి.

AP Board 7th Class Telugu వ్యాసాలు

17. బాలకార్మికులు

నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరవు కాటకాల కారణంగా లక్షలాది పిల్లలు చిన్న వయస్సులోనే కార్మికులుగా చేరుతున్నారని అంతర్జాతీయ కార్మిక నిర్వహణ సంస్థ (ఐ.ఎల్.ఒ) తన సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ ఉందని ఐ.ఎల్.ఒ. నిర్వహించిన సర్వేలో తెలియజేసింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా బాలకార్మికులు ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పలు సందర్భాలలో చేస్తున్న ప్రకటనలు కేవలం ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసి అది అమలు జరిగేటట్లు చూడాలి. ప్రభుత్వం రూపొందించిన బాలకార్మిక నియంత్రణ చట్టం సరిగా అమలు అయ్యేట్లు చూడాలి.

భారతదేశంలో 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలలకు వెళ్ళడం లేదని, వీరంతా ఇళ్ళల్లోను, కర్మాగారాల్లోను, పొలాల్లోను పని చేస్తున్నారని ‘గ్లోబల్ మార్చ్ ఎగనెస్ట్ చైల్డ్ లేబర్’ అనే అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. కాబట్టి బాలకార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలి. వాళ్ళకు చదువుకొనే అవకాశం కల్పించాలి.

మన రాష్ట్రంలో 16 లక్షల మంది బాలకార్మికులు ఉన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది.

బాలకార్మికులను కూలివారుగానే చూస్తే వారు కార్మికులుగానే మిగిలిపోతారు. వారిలో ఉన్న యోగ్యతను, ప్రతిభను వెలికి తీసేందుకు సహకారం అందజేస్తే భవిష్యత్తులో ఒక మంచి నిపుణుడిని అందించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

18. కరవు – నివారణోపాయాలు

అనావృష్టి వల్ల కరవు వస్తుంది. కరవును క్షామం అని కూడా అంటారు. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘కరవు’గాను, 50% కన్నా తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరవు’ గాను భారత వాతావరణ శాఖ నిర్వచించింది.

ఋతుపవనాల నియమరహిత స్వభావం వల్ల దేశంలో ఏదో. ఒకచోట ప్రతి సంవత్సరం తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. . ఎక్కువగా వాయవ్య భారతదేశం, ఆ తరువాత దక్షిణ మరియు మధ్య భారతదేశంలో తరచుగా కరవులు సంభవిస్తున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులు అతిగా కరవులు సంభవించే రాష్ట్రాలు.

నివారణోపాయాలు :

  1. కరవు పీడిత ప్రాంతాలలో భూమిశిస్తు పూర్తిగా తొలగించడం గానీ, తగ్గించడం గానీ చేయాలి.
  2. క్షామపీడిత ప్రాంతాలలో ప్రజలు తిరిగి వ్యవసాయం చేసుకొనేందుకు వీలుగా ఆర్థిక సహాయం అందించడం, నీటి పారుదల సౌకర్యాలు కలిగించడం వంటివి చేయాలి.
  3. ఆయా ప్రాంతాలను బట్టి ఏయే పంటలు వేస్తే బాగా పండుతాయో వ్యవసాయదారులకు సూచనలివ్వాలి.
  4. పండిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కలిగించాలి.
  5. తుపానులు వచ్చినపుడు తట్టుకొని నిలబడి పంటనిచ్చే కొత్త రకాలను శాస్త్రజ్ఞులు కనిపెట్టాలి.
  6. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడాలి.

కరవు నష్టాలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం “కరవుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక” (Drought prone area programme) ప్రవేశపెట్టింది.. ఈ ప్రణాళికలో నీటిపారుదల, మృత్తికా పరిరక్షణ, వనీకరణ మొదలగు పథకాలున్నాయి. ప్రభుత్వమేకాకుండా ప్రజలు కూడా మానవతాదృష్టితో కరవుపీడిత ప్రాంతీయులను ఆదుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి.

AP Board 7th Class Telugu వ్యాసాలు

19. మాతృభాషలో విద్యను నేర్చుకోవడం (విద్యలో మాతృభాష ప్రాముఖ్యం)

మాతృభాష అంటే తల్లిభాష అని అర్థం. మనం పుట్టిన చోట జనవ్యవహారంలో ఉండే భాష మాతృభాష. మానవుడు పుట్టింది మొదలు గిట్టేవరకు మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో కలలు కంటామో ఆ భాషలోనే విద్యను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.

పరాయి భాషలో విద్యాభ్యాసం చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా పరాయి భాషను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అందులో తగినంత పరిజ్ఞానం అలవడనిదే విషయ గ్రహణంగానీ, విషయ వ్యక్తీకరణగానీ సాధ్యపడదు. మాతృభాషలో విద్యాభ్యాసంవల్ల విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకొని పరీక్షలు బాగా వ్రాయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చు.

మాతృభాషలో విద్యను నేర్చుకోవడం తల్లిపాలు త్రాగి పెరగడం వంటిది. పరభాషలో విద్యను నేర్చుకోవడం దాది పాలు త్రాగడం వంటిది. ఆంగ్లం వంటి పరాయిభాషలో విద్యార్థికి సరైన పరిజ్ఞానం లేనందువల్ల విద్యార్థికి ఆ భాష రాక బట్టీపట్టి ఏదోవిధంగా కృతార్థుడవుతున్నాడు. ఉపాధ్యాయులు చెప్పేది అర్థంకాక గైడ్సు (Guides) వెంట పడుతున్నాడు. కాబట్టి కనీసం సెకండరీ విద్యాస్థాయి వరకు మాతృభాషలోనే విద్యను బోధించడం, విద్యను నేర్చుకోవడం అవసరం.

AP Board 7th Class Telugu Grammar

SCERT AP Board 7th Class Telugu Guide Grammar Questions and Answers.

AP State Syllabus 7th Class Grammar

అక్షరమాల (వర్ణమాల)

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం, ‘ధ్వని’ అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను, ‘వర్ణమాల’ అంటారు. ‘అక్షరమాల’ అని కూడా . అంటారు.
ఉదా :
1. ‘అ’ – అనేది ఒక ధ్వ నిని తెలిపే గుర్తు, అంటే అక్షరం.
2. ‘మ’ – అనే అక్షరంలో రెండు ధ్వనులున్నాయి. మ్ + అ = “మ” అవుతుంది.

అక్షరాలలో, మనందరకూ చిన్నప్పటినుండి పరిఛితమైన అచ్చులు, హల్లులు అని రెండు రకాలున్నాయి.

ఉదా :
1. ‘అ, ఆ, ఇ, ఈ ‘ వంటి వర్ణాలను (అక్షరాలను ) “అచ్చులు” అంటారు. అచ్చులను స్వరాలు, ప్రాణాలు అని కూడా అంటారు.

ఉదా :
‘కథగఘ’ వంటి అక్షరాలు (వర్ణాలు) హల్లులు: హల్లులను వ్యంజనాలు, ప్రాణులు అని కూడా పిలుస్తారు.

తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు. అవి
1. అచ్చులు
2. హల్లులు
3. ఉభయాక్షరాలు.

1. అచ్చులు (స్వరాలు):
ఆ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ, – బూ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ

అ) హ్రస్వ అచ్చులు :
ఒక మాత్రా కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను, హ్రస్వాచ్చులు (హస్వాలు) అంటారు.
అవి : అ, :- ఇ, – ఉ – ఋ, – ఎ – ఒ (మాత్ర అంటే కనురెప్పపాటుకాలం).

ఆ) దీర్ఘాచ్చులు :
రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను, ‘దీర్ఘాచ్చులు’ – దీర్ఘాలు – అంటారు.
అవి : ఆ – ఈ – ఊ – బూ – ఏ – ఐ – ఓ – ఔ.

2. హల్లులు (వ్యంజనాలు, ప్రాణులు) :
AP Board 7th Class Telugu Grammar 1

ఉచ్చారణ విధానాన్ని బట్టి, హల్లులను ఈ క్రింది విభాగాలుగా చేశారు.
అ) పరుషాలు :- కఠినంగా పలికే ధ్వనులు — “క – చ -ట – త – ప”.
ఆ) సరళాలు :- సరళంగా పలికే ధ్వనులు 41 – జ – డ – ద – ఓ”.
ఇ) అల్పప్రాణాలు :- పరుష సరళాలను అల్పప్రాణాలు అంటారు.
ఈ) మహా ప్రాణాలు :- అర ఛఝ, ఠ,ఢ,థ, ధ, ఫ,భ – లను మహాప్రాణాలు అంటారు. వీటిని ” వర్గయుక్కులు” అని కూడా అంటారు.
ఉ) అనునాసికాలు :- ముక్కు సహాయంతో పలికే వర్ణాలు – “జ, ఇ’, ణ, న, మ”
ఊ) అంతస్థాలు. :- “య, ర, ఱ, ల, ళ, వ ”.

సూచన :- ‘ఱ’ – ఇది గ్రాంథిక భాషలోనే కనిపిస్తుంది.

AP Board 7th Class Telugu Grammar

3. ఉభయాక్షరాలు :- ఇవి మూడు.
అవి :
1. సున్న = ‘O’ (పూర్ణ బిందువు) (పూర్ణానుస్వారం)
2. అరసున్న = “c” (అర్ధానుస్వారం), (అర్ధ బిందువు)
3. విసర్గ = ‘ః’

పై మూడు అక్షరాలనూ, అచ్చులలోనూ, హల్లులలోనూ కూడా ఉపయోగించడం వల్ల, వీటిని ” ఉభయాక్షరాలు” అని పిలుస్తారు.

సూచన :-
1. అరసున్న గ్రాంథిక భాషలో మాత్రమే కనిపిస్తుంది.
2. విసర్గ, తత్సమ పదాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఉదా :
1. కృష్ణుడు
2. దుఃఖము మొ||నవి.

అభ్యాసం:
1) కింది వాక్యంలో పరుషములతో మొదలయ్యే పదములను గుర్తించి రాయండి.
డుపు బరువు గ్గినా, చ్చి క్కున జరజర ని అయ్యింది.
జవాబు:
1. డుపు, 2. చ్చి, 3. క్కున, 4. గ్గిన, 5. ని

2) కింది మాటల్లో సరళములతో మొదలయ్యే పదాలు గుర్తించి రాయండి.
లం, కలం, గాలి, లం, ళం, తళుకు, కాలు, బ్బు,
జవాబు:
1. గాలి, 2. లం, 3. బ్బు, 4. ళం, 5. లం – అనేవి
సరళాలతో మొదలయ్యే పదాలు.

3) కింది ‘మాటల్లో అంతస్థాలను గుర్తించండి.
మున, కారం, పాలు, వం, వేళ
జవాబు:

  1. మునలో ‘య’ అంతస్థము
  2. కారంలో ‘ర’ అంతస్థము
  3. పాలులో ‘లు’ అంతస్థము
  4. వంకరలో ‘వం’ అంతస్థము
  5. వేలో వ, ళ (అంతస్థాలు)

4) కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
భాషను మాట్లాడే సహజ శక్తి మనుషులందరికీ ఉంటుంది.
జవాబు:

  1. భాషలో ‘
  2. సహజశక్తిలో ‘,,
  3. మనుషులులో ‘‘ అనేవి ఊష్మాలు.

ద్విత్వ, సంయుక్తాక్షరాలు

కొన్ని అక్షరాలలో రెండేసిగాని, మూడేసి గాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి రెండు రకాలు.
1. ద్విత్వాక్షరం
2. సంయుక్తాక్షరం

1. ద్విత్వాక్షరం :
ఒక హల్లుకు, అదే హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “ద్విత్వాక్షరం అంటారు.
ఉదా :
1. క్క = క్ +్క (క్) + అ = క్క = ఇందులో కకారం రెండుసార్లు వచ్చింది.
2. త్త = త్ + త్ + అ = త్త = ఇందులో తకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం :
ఒక హల్లుకు వేరొక హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “సంయుక్తాక్షరం” అంటారు
ఉదా :
1. న్య = న్ + య్ + అ = న్య = ఇందులో నకారం, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
2. క్ష్మి = క్ + ష + మ్ + ఇ = క్ష్మి = ఇందులో కకార, షకార, మకారములనే మూడు హల్లులు కలిశాయి.

హల్లులు – వర్గాక్షరములు

1. వర్గాక్షరాలు : ‘క’ నుండి ‘మ’ వరకు ఉండే హల్లులను, ఐదు వర్గములుగా విభజించారు. ‘క’ నుండి ‘మ’ వరకు ఉండే హల్లులను, ‘స్పర్శములు’ అని కూడా అంటారు.

1) క వర్గం :- ‘క, ఖ, గ, ఘ, జ
2) చ వర్గం :- చ, ఛ, జ, ఝ, ఇ
3) ట వర్గం :- ట, ఠ, డ, ఢ, ణ
4) త వర్గం :- త, థ, ద, ధ, న
5) ప వర్గం :- ప, ఫ, బ, భ, మ

AP Board 7th Class Telugu Grammar

భాషాభాగాలు

వాక్యాల్లో ‘పదాలు’ ఉంటాయి. పదాల్లో అక్షరాలు ఉంటాయి. కొన్ని అక్షరాలు కలిస్తే, పదాలు అవుతాయి. ఈ పదాలను వ్యాకరణవేత్తలు, కొన్ని భాగాలుగా విభజించారు. వీటిని ‘భాషాభాగాలు’ అంటారు.

1. నామవాచకాలు :
మనుష్యుల పేర్లు, నదులు, ఊర్లు మొదలయిన వాటి పేర్లు, సముదాయాల పేర్లు, జాతులను సూచించే పదాలు “నామవాచకాలు” అంటారు.
ఉదా :
రాజు, కృష్ణుడు, గోదావరి, విశాఖపట్టణం, మొ||నవి.

2. సర్వనామాలు :
నామవాచకాలకు బదులుగా వాడే పదాలను “సర్వనామము”లు అంటారు.
ఉదా : వాడు, వారు, అతడు, నీవు, మీరు, మొ||నవి.

3. విశేషణాలు :
నామవాచకముల యొక్క సర్వనామముల యొక్క గుణాలనూ, లేక లక్షణాల్నీ తెలిపే పదాలకు విశేషణాలని పేరు.
ఉదా :
తెల్లని బట్టలు, మంచి పిల్లవాడు, అతడు పొట్టి, పొడుగు కాదు. ఇక్కడ తెల్లని, మంచి, పొట్టి, పొడుగు అనేవి విశేషణాలు.

4. క్రియలు :
పనులను తెలియజేసే పదాలు.
ఉదా :
1. వండుతోంది
2. రాస్తున్నాడు
3. తొక్కుతున్నాడు
4. చదువుతోంది మొదలుగునవి.

5. అవ్యయాలు :
లింగ వచన విభక్తుల వల్ల మారని పధాలు.
ఉదా : ఆహా, ఓహో, బాపురే, కాబట్టి మొదలగునవి.

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1. రమేష్ సినిమాకు వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) నామవాచకం
2) అవ్యయం
3) సర్వనామం
4) క్రియ
జవాబు:
1) నామవాచకం

2. కాంతి బాబు అసలు విషయం బయట పెట్టాడు – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) విశేషణం
2) అవ్యయం
3) క్రియ
4) నామవాచకం
జవాబు:
4) నామవాచకం

3. లింగవచన విభక్తులవల్ల మారని పదాలను ఇలా పిలుస్తారు.
1) విశేషణం
2) సర్వనామం
3) అవ్యయం
4) క్రియ
జవాబు:
3) అవ్యయం

4. భుజమంతా తెల్లగా బూడిదయ్యింది – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) నామవాచకం
2) క్రియ
3) విశేషణం
4) అవ్యయం
జవాబు:
3) విశేషణం

5. ఆమె బజారుకు వెళ్ళింది – గీతగీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) అవ్యయం
2) సర్వనామం
3) విశేషణం
4) నామవాచకం
జవాబు:
2) సర్వనామం

AP Board 7th Class Telugu Grammar

6. ఆమె అన్నం వండుతోంది – గీత గీసిన పదం ఏ భాషాభాగమో గుర్తించండి.
1) సర్వనామం
2) విశేషణం
3) క్రియ
4) అవ్యయం
జవాబు:
3) క్రియ

7. ఓహో నీ పని పూర్తి అయ్యిందా? – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
1) అవ్యయం
2) నామవాచకం
3) సర్వనామం
4) క్రియ
జవాబు:
1) అవ్యయం

8. మీరు పొట్టి మనిషి – గీత గీసిన పదం ఏ భాషాభాగం?
1) సర్వనామం
2) విశేషణం
3) క్రియ
4) అవ్యయం
జవాబు:
2) విశేషణం

లింగం, వచనాలు

1. లింగం :
‘లింగం’ అంటే చిహ్నం. అంటే గుర్తు. పురుష, స్త్రీ, నపుంసక వర్గాలను సూచించడానికి, ఇవి సహాయపడతాయి.

అ) పుంలింగం :
పురుషులనూ, వారి విశేషాలనూ తెలిపేది. ఉదా : రాముడు, గుణవంతుడు, ధీరుడు మొ||నవి.

ఆ) స్త్రీలింగం :
స్త్రీలనూ, వారి విశేషాలనూ తెలిపే పదాలు . ఉదా : సత్య, రాధ, అందగత్తె, సుందరి.

ఇ) నపుంసకలింగం :
స్త్రీ, పురుషులు కాని వాటినీ, వాటి విశేషాలను తెలిపేది నపుంసకలింగం.
ఉదా :
పేరు, మనస్సు, మంచిది మొ||నవి.

AP Board 7th Class Telugu Grammar

2. వచనం :
తెలుగులో వచనాలు రెండు రకాలు. అవి:
అ) ఏకవచనం :
ఒకే వస్తువును సూచించేది. ఉదా : రాముడు, పుస్తకం మొ||నవి.

ఆ) బహువచనం :
ఒకటి కన్నా ఎక్కువ వస్తువులను సూచించేది.
ఉదా :
రాములు, పుస్తకాలు మొ||నవి.

బహువచనంలో మూలపదానికి, లు, రు, ఱు,ండ్రు మొదలయిన ప్రత్యయాలు చేరతాయి.
ఉదా :
పుస్తకం (ఏకవచనం) – పుస్తకాలు (బహువచనం)

1. నితైకవచన పదాలు:
కొన్ని పదాలు ఎప్పుడూ ఏకవచనంలోనే ఉంటాయి. వాటిని ‘నిత్యాకవచన పదాలు’ అంటారు.
ఉదా :
నీరు, బంగారం, బియ్యం , తెలుపు, నిన్న, వరి, మొ||నవి.

2. నిత్యబహువచనాలు:
కొన్ని పదాలు ఎప్పుడూ బహువచనంలోనే ఉంటాయి. వాటిని ‘నిత్యబహువచనాలు’ అంటారు.
ఉదా :
వడ్లు, పెసలు, పేలాలు, అచ్చనగాయలు,అందరు ఎందరు మొ||నవి.

విభక్తి ప్రత్యయాలు

* విభక్తులు:- పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను, లేదా పదాలను “విభక్తులు” అంటారు.

1. కింది వాక్యాలను గమనించండి.

అ) భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది.
ఆ) సమాజంలో అవసరమున్నవాళ్ళకు సేవచేయడమే సమాజసేవ.
ఇ) అనారోగ్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ) లంక సింహాలు తోక ముడిచాయి.
ఉ) సచిన్ గురించి నీకు తెలిసిన విషయాలు ఏమిటి?

పై వాక్యములలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. “ఆరు వికెట్ల కప్” అనేది ఉండదు. ఇప్పుడు ‘తో’ అనే ప్రత్యయం కలిపి చూడండి.

“భారత్ ఆరు వికెట్లతో కప్ గెలిచింది”. అప్పుడు వాక్యం పదాల మధ్య సంబంధం ఏర్పడుతుంది.

* విభక్తులు:
పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను, లేదా పదాలను, “విభక్తులు” అంటారు.

“విభక్తి ప్రత్యయాలు”“విభక్తులు”
అ) అడు, ము, వు, లుప్రథమా విభక్తి
ఆ) ని(న్), ను(న్) , ల(న్), కూర్చి, గురించిద్వితీయా విభక్తి
ఇ) చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్)తృతీయా విభక్తి
ఈ) కొలకు(న్), కైచతుర్డీ విభక్తి
ఉ) వలన(న్), కంటె(న్), పట్టిపంచమీ విభక్తి
ఊ) కి(న్), కు(న్), యొక్క లో(న్), లోపల(న్)షష్ఠీ విభక్తి
ఋ) అందు(న్), న(న్),సప్తమీ విభక్తి
ఋ) ఓ ! ఓరి! ఓయి! ఓసి!సంబోధన ప్రథమా విభక్తి

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసము:

1. కింది వాక్యాలలోని విభక్తి ప్రత్యయాలను గుర్తించి, అవి ఏ విభక్తులో రాయండి.

ప్రత్యయం“విభక్తి”
1) సమావేశములో చదివిన విషయం బాగున్నది.లోషష్ఠీ విభక్తి
2) గాలికి రెపరెప లాడుతున్నది. ……………కిషష్ఠీ విభక్తి
3) రహస్యాలను అన్వేషించండి ……………నుద్వితీయా
4) జంతువులు మన కంటే ముందున్నాయి……….కంటెపంచమీ
5) జ్ఞానేంద్రియాలచేత గ్రహిస్తాం ……………చేతతృతీయా
6) బాధ వలన దుఃఖం వస్తుంది …………..వలనపంచమీ
7) ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు ………పట్టిపంచమీ
8) రాముడు ధేనువు పాలు పిండుతున్నాడు ……….డు,వు, లుప్రథమా

ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు

1. ఈ కింది వానిలో చతుర్థి విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి.
1) చేత, తోడ,
2) కొఱకు, కై
3) అందు,న
4) వలన, కంటె, పట్టి
జవాబు:
2) కొఱకు, కై

2. ఇనుముతో నాగటి కర్రు చేస్తారు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
1) ప్రథమా
2) ద్వితీయ
3) తృతీయ
4) చతుర్డీ
జవాబు:
3) తృతీయ

3. ధ్వనులను బట్టి జంతువులను గుర్తించవచ్చు – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం?
1) తృతీయ
2) చతుర్డీ
3) పంచమీ
4) షష్ఠీ
జవాబు:
3) పంచమీ

4. రహస్యాలను అన్వేషించండి – గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం ?
1) ప్రథమా
2) సప్తమీ
3) ద్వితీయ
4) పంచమీ
జవాబు:
3) ద్వితీయ

AP Board 7th Class Telugu Grammar

5. ఈ కింది వానిలో సప్తమీ విభక్తి ప్రత్యయాలు గుర్తించండి.
1) అందు, న
2) కి, కు, యొక్క లో, లోపల
3) చేత, చే
4) కొఱకు, కై
జవాబు:
1) అందు, న

ఉపవిభక్తులు – ఔపవిభక్తికాలు

ఉప విభక్తులు:
ఈ కింద గీత గీసిన పదాలను గమనించండి. వాటి నామవాచకం అసలు రూపాన్ని గుర్తించి రాయండి.

నామవాచకం

ఉదా:- కంటిలోని నలుసుకన్ను‘కన్ను’ యొక్క ఔపవిభక్తిక రూపం “కంటి”
1) ఇంటికి వెలుగు ఇల్లాలుఇల్లు‘ఇల్లు’ యొక్క ఔపవిభక్తిక రూపం “ఇంటి”
2) ఏటిలోని చేపపిల్లఏఱుయొక్క ఔపవిభక్తిక రూపం “ఏటి”
3) ఊరి కట్టుబాటుఊరు‘ఊరు’ యొక్క ఔపవిభక్తిక రూపం “ఊరి”
4) కాలికి బుద్ధి చెప్పారుకాలు‘కాలు’ యొక్క ఔపవిభక్తిక రూపం “కాలి”
5) రాతిని శిల్పంగా చెక్కారురాయి‘రాయి’ యొక్క ఔపవిభక్తిక రూపం “రాతి”

పై వాక్యాలలోని నామవాచకాలలో వచ్చిన మార్పులు గమనించండి. నామవాచకాలు వాక్యాలలో ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి స్వరూపం మారుతోంది. (కన్ను – కంటిగా ; ఇల్లు – ఇంటిగా ; ఏరు – ఏటిగా ; ఊరు – ఊరిగా, కాలు – కాలిగా ; రాయి – రాతిగా) మారాయి. అలా మారేటప్పుడు నామవాచకం చివరి అక్షరం మీద ‘ఇ’ గాని, ‘టి’ గాని, ‘తి’ గాని చేరుతున్నాయి.

వీటిని ‘ఉపవిభక్తులు’ అంటారు. ఉపవిభక్తులు కలిగిన నామవాచకాలను “ఔపవిభక్తికాలు” అంటారు.

అభ్యాసము:
1. కింది నామవాచకాలకు ఇచ్చిన ఉపవిభక్తులు చేర్చి, ఔపవిభక్తికాలుగా మార్చి వాక్యాలు రాయండి.
1) ఉదా:
చేయి + త = చేతి
అతనికి చేతినిండా పని ఉంది.

2) గోరు + టి = గోటి .
గోటితో గిల్లితే పోయేదానికి గొడ్డలెందుకు !

3) రోలు + టి = రోటి
రోటిలో వారు పిండిని దంచారు.

4) నూయి + తి = నూతి
నూతిలో కప్పలా ఉండకు.

5) గోయి + తి = గోతి
గోతిలో వారి చెంబు పడింది.

సమాసాలు

సమాసం :
వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి, ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ‘సమాసం’ అంటారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి, కొత్త పదం ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటిపదాన్ని ‘పూర్వపదం’ అనీ, రెండవపదాన్ని ‘ఉత్తరపదం’ అనీ అంటారు.
ఉదా :
రామలక్ష్మణులు చాలా గొప్పవారు.

పై వాక్యంలో నామవాచక పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి ‘రామలక్ష్మణులు’. ఇందులో పూర్వపదము , రాముడు. ఉత్తర పదము – లక్ష్మణుడు – వీటికి రాముడును, లక్ష్మణుడును అని అర్థం చెప్పుకుంటాం.

ద్వంద్వ సమాసం :
రెండుగాని అంతకంటే ఎక్కువ గాని నామవాచకాల . మధ్య ఏర్పడే ఈ సమాసాన్ని, “ద్వంద్వసమాసం” అంటారు.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
1. ఈ కింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి.
అ) ఆ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు.
జవాబు:
అన్నదమ్ములు

ఆ) నేను మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను.
జవాబు:
కూరగాయలు

ఇ) ప్రమాదంలో నా కాలు చేతులకు గాయాలయ్యాయి.
జవాబు:
కాలు చేతులు

ఈ) మనిషికి ఈర్ష్యాసూయలు ఉండకూడదు.
జవాబు:
ఈర్ష్యాసూయలు

ఉ) భారతంలో కృష్ణార్జునులు ప్రధాన పాత్రలు పోషించారు.
జవాబు:
కృష్ణార్జునులు

ఊ) మనం నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు.
జవాబు:
నిరాశా నిస్పృహలు

అభ్యాసం: 2
కింది మాటలను వివరించండి. (విగ్రహవాక్యాలు రాయండి.)
సమాస పదాలు – విగ్రహవాక్యాలు
1) ఎండవానలు – ఎండా, వానా
2) తల్లిదండ్రులు – తల్లీ, తండ్రీ !
3) రేయింబవళ్ళు – రేయీ, పగలూ
4) గంగాయమునలు – గంగా, యమునా

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 3
కింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చండి.
ఇచ్చిన విగ్రహవాక్యం – చేసిన సమాస పదం
ఉదా : రాముడూ – లక్ష్మణుడూ – రామలక్ష్మణులు
1) కుజనుడూ, సజ్జనుడూ – కుజనసజ్జనులు
2) కూరా, కాయా కూరగాయలు
3) అన్నా, తమ్ముడూ అన్నదమ్ములు
4) కష్టమూ, సుఖమూ – కష్టసుఖములు
5) మంచి, చెడు – మంచిచెడులు

ద్విగు సమాసం :
సమాసాల్లో మొదటి (పూర్వ) పదంలో ‘సంఖ్య’ గల సమాసాలను, ద్విగు సమాసాలు అంటారు.

అభ్యాసం : 4

1. కింది సమాస పదాలను ఉదాహరణలో చూపిన విధంగా వివరించండి.
ఉదా :- నవరసాలు – నవ (9) సంఖ్య గల, రసాలు.
అ) రెండు జడలు – రెండు (2) సంఖ్య గల, జడలు.
ఆ) నాలుగు వేదాలు – నాలుగు (4) సంఖ్య గల, వేదాలు.
ఇ) దశావతారాలు . – దశ (10) సంఖ్య గల, అవతారాలు.
ఈ) చతుషష్టి కళలు – చతుషష్టి (64) సంఖ్య గల, కళలు.
ఉ) ఏడు రోజులు – ఏడు (7) సంఖ్య గల, రోజులు.

గమనిక :
పైన పేర్కొన్న సమాసాలలో సంఖ్య ఉండటాన్ని గమనించండి. ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు “ద్విగు సమాసాలు” అంటారు.

అభ్యాసం : 5

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
అ) అక్కాచెల్లెళ్ళుఅక్కా చెల్లెలూద్వంద్వ సమాసము
ఆ) పంచ పాండవులుపంచ (5) సంఖ్య గల పాండవులుద్విగు సమాసము
ఇ) ద్వాదశ జ్యోతిర్లింగాలుద్వాదశ(12) సంఖ్యగల జ్యోతిర్లింగాలుద్విగు సమాసము
ఈ) సీతారాములుసీతా, రాముడూద్వంద్వ సమాసము
ఉ) రాబర్ట్ రహీములురాబర్టూ, రహీమూద్వంద్వ సమాసము
ఊ) త్రిమూర్తులుత్రి (3) సంఖ్యగల.మూర్తులుద్విగు సమాసము
ఋ) నవగ్రహాలునవ (9) సంఖ్యగల గ్రహాలుద్విగు సమాసము
ఋ) ఏడు రంగులుఏడు (7) సంఖ్యగల రంగులుద్విగు సమాసము
ఎ) వంద పరుగులువంద (100) సంఖ్యగల పరుగులుద్విగు సమాసము
ఏ) సూర్యచంద్రులుసూర్యుడూ, చంద్రుడూద్వంద్వ సమాసము

ఐచ్చిక సమాధాన ప్రశ్నలు

1. విష్ణువు దశావతారములు ఎత్తెను – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) పది సంఖ్య గల అవతారములు
2) నూరు సంఖ్య గల అవతారములు
3) వేయి. సంఖ్య గల అవతారములు
4) పద్దెనిమిది సంఖ్య గల అవతారములు
జవాబు:
1) పది సంఖ్య గల అవతారములు

2. అన్నదమ్ములు కలసిమెలసి జీవిస్తున్నారు – గీత గీసిన పదం సమాసం పేరు
1) ద్విగు సమాసం
2) ద్వంద్వ సమాసం
3) బహుప్రీహి సమాసం
4) అవ్యయీభావ సమాసం
జవాబు:
2) ద్వంద్వ సమాసం

3. సీతారాములు భద్రాచలం వెళ్ళారు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) సీతా రాముడు
2) సీతతో రాముడు
3) సీతారాములు కలది
4) సీత కొఱకు రాముడు
జవాబు:
1) సీతా రాముడు

4. త్రిమూర్తులు కలసి వచ్చారు – గీత గీసిన పదం, ఏ సమాసమో గుర్తించండి.
1) ద్వంద్వ సమాసం
2) ద్విగు సమాసం
3) బహుజొహి సమాసం
4) అవ్యయీభావ సమాసం
జవాబు:
2) ద్విగు సమాసం

AP Board 7th Class Telugu Grammar

5. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం గుర్తించండి.
1) పది సంఖ్య గల జ్యోతిర్లింగాలు
2) ఇరవై సంఖ్య గల జ్యోతిర్లింగాలు
3) మూడు సంఖ్య గల ‘లింగాలు
4) పండ్రెండు సంఖ్య గల జ్యోతిర్లింగాలు
జవాబు:
4) పండ్రెండు సంఖ్య గల జ్యోతిర్లింగాలు

తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక:
పై వాక్యంలో ‘చిన్నప్పుడు’ అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనిని సంధిపదం అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినపుడు, రాయవలసినపుడు, “సంధిపదం” – ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను, “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికకు, “సంధి” అని అంటారు.

సంధి కార్యం :
రెండు స్వరాల అచ్చుల) మధ్య జరిగే మార్పును, “సంధి కార్యం” అని అంటారు.

పూర్వ స్వరం:
మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని (అచ్చును), “పూర్వ స్వరం” అని అంటారు.

పర స్వరం :
రెండవ పదము మొదటి అక్షరములోని స్వరాన్ని (అచ్చును), “పరస్వరం” – అని అంటారు.
ఉదా :
రామ + అయ్య ; “మ” లోని ‘అ’ పూర్వస్వరం + ‘అయ్య’ లోని ‘అ’ ; పరస్వరం.

1. అత్వసంధి :
కింది పదాలను విడదీయండి.
ఉదా:
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ
1) ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = అకారసంధి
2) వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = అకారసంధి
3) చెప్పకున్న = చెప్పక + ఉన్న = (అ + ఉ = ఉ) = అకారసంధి
4) చేయకుంటే = చేయక + ఉంటే = (అ + ఉ = ఉ) = అకారసంధి
5) రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = అకారసంధి
6) జరగకేమి = జరగక + ఏమి = (అ + ఏ = ఏ) = అకారసంధి
7) లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = అకారసంధి
8) పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = అకారసంధి

గమనిక :
పై సంధి పదాలలో ‘అ’, పరస్వరంలోని అచ్చుతో కలిసినప్పుడు ‘అ’ లోపించింది. – పరస్వరం – రూపం కనిపిస్తుంది. దీన్ని “అత్వసంధి” అంటారు. – (హ్రస్వ (పొట్టి) ‘అ’ అనే అక్షరానికి, అచ్చు పరమైతే “అత్వసంధి” ఏర్పడుతుంది.

అత్వసంధి సూత్రం:
అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. (‘అత్తు’ అంటే హ్రస్వ అకారం)

2. ఇత్వసంధి :
కింది పదాలను విడదీయండి.
ఉదా:- (1) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ= అ) (ఇత్వసంధి)
సంధి జరగనప్పుడు, యకారం ఆగమంగా వస్తుంది.

(ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) (ఇకారసంధి రాని యడాగమరూపం)
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు = (ఇ + ఇ = 3) = వచ్చిరిపుడు – (ఇత్వసంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు = (ఇ + ఇ = యి) = (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి, అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ‘ఇత్వసంధి’, తప్పక జరగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వసంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అంటారు.

అభ్యాసం:
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా:
1) ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ) = ఇత్వసంది
2) పైకెత్తినారు = పైకి + ఎత్తినారు = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
3) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వసంధి
4) కోవెలలోకేగినారు = కోవెలలోకి + ఏగినారు = (ఇ + ఏ = ఏ) = ఇత్వసంధి

ఇత్వసంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబుగా వస్తుంది. (‘ఇత్తు’ అంటే హ్రస్వ ఇకారం)

3. ఉత్వసంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా:
1) రాముడతడు = రాముడు + అతడు = (డ్) (ఉ + అ = డ) = ఉత్వసంధి
2) అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = ఉత్వసంధి
3) మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = ఉత్వసంధి
4) మనసెన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = ఉత్యసంధి

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా (ఉత్తుకు) అచ్చు కలిసినప్పుడు, ఉకారం లోపించి, పరస్వరం కనిపిస్తుంది. దీన్నే “ఉత్వసంధి” అంటారు.

ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైతేసంధి నిత్యంగా వస్తుంది.

నిత్యం :
నిత్యం అంటే తప్పక సంధికార్యం జరుగుతుంది అని అర్థం.

AP Board 7th Class Telugu Grammar

4. యడాగమ సంధి :
1. కింది పదాలను విడదీయండి.

ఉదా:
1) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
2) మీ ఇల్లు = మీ + ఇల్లు = మీ యిల్లు
3) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక:
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
1) మా + య్ + అమ్మ – మా ‘య’ మ్మ
2) మీ + య్. + ఇల్లు = మీ ‘యి’ ల్లు
3) హరి + య్ + ఇతడు = హరి ‘యి’ తడు

యడాగమం :
సంధి లేని చోట ‘య్’ వచ్చి చేరడాన్నే, ‘యడాగమం’ అంటారు.

అభ్యాసం:
ఈ కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సంధి జరిగిన విధాన్ని చర్చించండి.

అ. అత్వసంధి సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగా వస్తుంది.
1) జీవగడ్డయి = జీవగడ్డ + అయి = (అ + అ = అ) = అత్వసంధి
2) భాగ్యసీమయి = భాగ్యసీమ + అయి = (అ + అ = అ) = అత్వసంధి

ఆ. ఇత్వసంధి సూత్రం:
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.
3) ఏమిటాకథ = ఏమిటి + ఆ కథ = (ఇ + ఆ = ఆ) = ఇత్వసంధి
4) చేసుకోవాలని = చేసుకోవాలి + అని= (ఇ + అ = అ) = ఇత్వసంధి
5) రానిదని = రానిది + అని = (ఇ + అ = అ) = ఇత్వసంధి
6) ఎవరికెంత = ఎవరికి + ఎంత = (ఇ + ఎ = ఎ) = ఇత్వసంధి
7) వచ్చితిరిపుడు = వచ్చితిరి + ఇపుడు = (ఇ + ఇ = ఇ) – ఇత్వసంధి

ఇ. ఉత్వసంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యంగా వస్తుంది.
8) సెలవిచ్చి = సెలవు + ఇచ్చి = (ఉ + ఇ = ఇ) = ఉత్వసంధి
9) కావ్యంబలం = కావ్యంబు + అలరె = (ఉ + అ = అ) = ఉత్వసంధి
10) మధువొలికె = మధువు + ఒలికె = (ఉ + ఒ = ఒ) = ఉత్వసంధి
11) కవితలల్లిన = కవితలు + అల్లిన = (ఉ + అ = అ) = ఉత్వసంధి\

మరికొన్ని తెలుగు సంధులు

1. ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి రెండో మారు పలుకుతాం. అలా రెండోమారు పలికే పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము. వ్యాకరణ పరిభాషలో ద్విరుక్తము యొక్క పరరూపమును ఆమ్రేడితం అంటారు.
ఉదా:
ఆహా + ఆహా ‘ = ‘ఆహా’ అనే పదం రెండు సార్లు వచ్చింది. అందులో రెండవ ‘ఆహా’ అనే – దాన్ని ఆమ్రేడితం అనాలి.

మరి కొన్ని ఉదాహరణములు :
1) ఔరౌర = ఔర + ఔర = రెండవసారి వచ్చిన ఔర ఆమ్రేడితం
2) అరెరె = అరె + అరె = రెండవసారి వచ్చిన అరె ఆమ్రేడితం
3) ఆహాహా = ఆహా + ఆహా = రెండవసారి వచ్చిన ఆహా ఆమ్రేడితం
4) ఏమేమి = ఏమి + ఏమి రెండవసారి వచ్చిన ఏమి ఆమ్రేడితం
5) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = రెండవసారి వచ్చిన ఎట్లు ఆమ్రేడితం
6) ఏమిటేమిటి = ఏమిటి + ఏమిటి = రెండవసారి వచ్చిన ఏమిటి ఆమ్రేడితం
7) ఓహోహో = ఓహో + ఓహో = రెండవసారి వచ్చిన ఓహో ఆమ్రేడితం

గమనిక :
పై ఉదాహరణములో .ఒక్కొక్క పదం, రెండు సార్లు వచ్చింది కదా ! రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.

ఆమ్రేడిత సంధి :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా = ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, అ, ఆ, ఓ, వంటి అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది.

ఔర + ఔర = ఔరౌర (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా = ఆహాహా (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో = ఓహోహో (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి (ఇ + ఏ = ఏ)
అరె + అరె = అరెరె (ఎ + అ = అ) లుగా మారుతాయి.

గమనిక :
పై విషయాలను బట్టి ఈ సంధిని గుర్తు పట్టడానికి, ఇలా సూత్రం తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా అవుతుంది.

గమనిక : ఆమ్రేడిత సంధి, కింది ఉదాహరణలలో వికల్పంగా జరుగుతుంది. ఈ ఉదాహరణలను. చూస్తే, సంధి జరిగిన రూపం, సంధి రాని యడాగమ రూపం కనబడతాయి.
ఉదా:
1) ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
2) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు యెట్లు (సంధి వైకల్పికం)
3) ఎంత + ఎంత = ఎంతెంత. ఎంతయెంత . (సంధి వైకల్పికం)

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం:
కింది పదాలను విడదీసి, సంధిని పేర్కొని సూత్రాన్ని రాయండి.

1) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) = ఆమ్రేడిత సంధి
2) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ | ఊ = ఊ) = ఆమ్రేడిత సంధి
3) అంతంత = అంత + అంత = (అ + అ = అ) = ఆమ్రేడిత సంధి
4) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) = ఆమ్రేడిత సంధి

ద్విరుక్తటకారసంధి :
కింది సంధులను విడదీయండి.
1) కుట్టుసురు = కుఱు + ఉసురు
2) చిట్టెలుక = చిఱు + ఎలుక
3) కట్టెదురు = కడు + ఎదురు
4) నట్టిల్లు = నడు + ఇల్లు
5) నిట్టూర్పు = నిడు + ఊర్పు

గమనిక :
పై ఉదాహరణములలో, పూర్వ, పరస్వరాలను కలిపితే ఈ కింది విధంగా మారతాయి.

1) ఱు + ఉ . = ట్టు
2) ఱు + ఎ = ట్టె
3) డు + ఎ – ట్టె
4) డు + ఇ = ట్టి
5) డు + ఊ – ట్టూ

గమనిక :
పూర్వ పదం చివర ఉన్న ఐ, డ లకు అచ్చు పరమైతే “ట్ట” – అంటే, ద్విరుక్తటకారం వచ్చింది. దీన్ని “ద్విరుక్తటకారసంధి” అంటారు.

అభ్యాసం:
కింది సంధులను విడదీసి, సంధిని పేర్కొనండి. సంధి సూత్రాన్ని రాయండి.
1) చిట్టడవి = చిఱు + అడవి = (ఱు + అ = ట్ట) = ద్విరుక్తటకార సంధి
2) నట్టేట = నడు + ఏట = (డు + ఏ ఇట్టే) = ద్విరుక్తటకార సంధి.

ద్విరుక్తటకార సంధి సూత్రం :
కులు, చిఱు, కడు, నడు, నిడు శబ్దములలోని ఐ,డ లకు, అచ్చుపరమైతే ద్విరుక్తటకారం ఆదేశం అవుతుంది.

అభ్యాసం:
కింది సంధి పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.
అ) అయ్యయ్యో = అయ్యో + అయ్యో = (ఓ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఆ) అన్నన్న = అన్న + అన్న = (అ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఇ) ఎట్లెట్లు = ఎట్లు + ఎట్లు = (ఉ + ఎ = ఎ) = ఆమ్రేడిత సంధి
ఈ) ఆహాహా = ఆహా + ఆహా = (ఆ + ఆ = ఆ) = ఆమ్రేడిత సంధి
ఉ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) = ఆమ్రేడిత సంధి
ఊ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) = ఆమ్రేడిత సంధి
ఋ) కుట్టుసురు = కుఱు + ఉసురు = (ఱు + ఉ = ట్టు) = ద్విరుక్తటకార సంధి
ఋ)పట్టపగలు = పగలు + పగలు = ఆమ్రేడిత సంధి
ఎ) కొట్టకొన = : కొన + కొన = ఆమ్రేడిత సంధి

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1) ఉదా :
రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
అ) రామాలయం = రామ + ఆలయం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి

2) ఉదా :
కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
అ) కవీశ్వరుడు = కవి + ఈశ్వరుడు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

3) ఉదా :
భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
అ) వధూపేతుడు = వధూ + ఉపేతుడు = (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి

4) ఉదా :
పిత్రణం = పితృ + ఋణం = (బ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
అ) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ =ఋ) = సవర్ణదీర్ఘ సంధి

సవర్ణదీర్ఘ సంధి సూత్రం:
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి.

పై విధంగా సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను ‘సంస్కృత సంధులు’ అంటారు.
సవర్ణములు:
‘అ’ వర్ణానికి – “అ – ఆ -” లు సవర్ణాలు
‘ఇ’ వర్ణానికి – “ఇ – ” లు సవర్ణాలు
‘ఉ’ వర్ణానికి – “ఉ – ఊ -” లు సవర్ణాలు
‘ఋ’ వర్ణానికి – “ఋ – ఋ -” లు సవర్ణాలు

అభ్యాసం: 1
కింది పదాలను విడదీయండి.
1) ఉదా :- విద్యా ర్థి = విద్యా + అ = (ఆ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) మహానందము = మహా + ఆనందము = (ఆ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3) కోటీశ్వరులు = కోటి + ఈశ్వరులు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4) సువర్ణాధ్యాయం = సువర్ణ అధ్యాయం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
5) కరీంద్రం = కరి + ఇంద్రం = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
6) సమరాంగణం = సమర + అంగణం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
7) శుభారంభం = శుభ + ఆరంభం = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
8) కపీంద్రులు = కపి + ఇంద్రులు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
9) అష్టావధానం = అష్ట + అవధానం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
10) మహీంద్రుడు = మహీ + ఇంద్రుడు = (ఈ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
11) పితౄణం = పితృ + ఋణం = (ఋ + ఋ = బూ)= సవర్ణదీర్ఘ సంధి

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 2
కింది పదాలు కలిపి రాయండి. సంధిని పేర్కొనండి.
1) సోమన + అది = సోమనాద్రి = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) రవి + ఇంద్రుడు = రవీంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
3) భాను + ఉదయం = భానూదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
4) మాతృ + ఋణం = మాతణం = (ఋ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
5) మహా + ఆత్ముడు = మహాత్ముడు = (ఆ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
6) చారు + ఊహ = చారూహ = (ఉ + ఊ – ఊ) = సవర్ణదీర్ఘ సంధి
7) కర + అగ్రం = కరాగ్రం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
8) గిరి + ఈశుడు = గిరీశుడు = (ఇ + ఈ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణసంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి
ఆ) మహేంద్రుడు = మహా + ఇంద్రుడు = (ఆ + ఇ = ఏ) = గుణసంధి
ఇ) నరేంద్రుడు = నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణసంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = (అ + ఉ = ఓ) = గుణసంధి
ఈ) మహోన్నతి = మహా + ఉన్నతి = (ఆ + ఉ = ఓ) = గుణసంధి
ఉ) దేశోన్నతి = దేశ + ఉన్నతి = (అ + ఉ = ఓ) = గుణసంధి
ఊ) గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణసంధి

3. ఉదా :
మహర్షి = మహా + ఋషి = (ఆ + ఋ = అర్)= గుణసంధి
ఋ) రాజర్షి = రాజ + ఋషి = (అ + ఋ = అర్) = గుణసంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను, మూడు రకాలుగా విడదీయడం సాధ్యమైంది.

1. అ / ఆ లకు, ఇ / ఈ లు కలసి, ‘ఏ’ గా మారడం.
2. అ ఆ లకు, ఉ / ఊ లు కలసి ‘ఓ’ గా మారడం.
3. అ / ఆ లకు, ఋ, ౠ లు కలసి, ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ పూర్వస్వరం అంటే, సంధి విడదీసినపుడు మొదటి పదం చివరి అచ్చు, అ | ఆ లు గా ఉంది. పరస్వరం’ అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు, ఇ – ఉ – ఋ – లు గా వచ్చాయి. ‘ఇ’ కలిస్తే – ఏ , ‘ఉ’ కలిస్తే – ఓ, ‘ఋ’ కలిస్తే ‘అర్’ ఆదేశంగా వచ్చాయి.

గుణాలు : ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణసంధి” అంటారు.

గుణసంధి సూత్రం :- అకారానికి ఇ ఉ ఋ లు పరమైతే, ఏ, ఓ, ‘అర్ లు ఏకాదేశంగా వస్తాయి.

అభ్యాసం : 3
ఈ కింది పదాలను కలిపి, ఏ సంధులో పేర్కొనండి.
1) నర + ఈశ్వరుడు = నరేశ్వరుడు = (అ + ఈ = ఏ) = గుణసంధి
2) మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు = (ఆ + ఈ = ఏ) = గుణసంధి
3) దేవ + ఋషి = దేవర్షి = (అ + ఋ = అర్) = గుణసంధి
4) స్వాతంత్ర్య + ఉద్యమం = స్వాతంత్ర్యోద్యమం = (అ + ఉ = ఓ) = గుణసంధి
5) రామ + ఈశ్వరం = రామేశ్వరం = (అ + ఈ = ఏ) = గుణసంధి
6) ఇతర + ఇతర = ఇతరేతర = (ఆ +a = ఏ) = , గుణసంధి

3. యణాదేశ సంధి :
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
అ. ఉదా :
అత్యానందం = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ =య) = యణాదేశసంధి
1. అత్యంతం = అతి – + అంతం = (అత్ + ఇ + అ = య) = యణాదేశ సంధి

ఆ. ఉదా :
అణ్వస్త్రం = అణు + అస్త్రం = (డ్ + ఉ + అ = వ) = యణాదేశసంధి
2. గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఇ. ఉదా :
పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋ + ఆ = ర్) = యణాదేశ సంధి
3. మాత్రంశ = మాతృ + అంశ = (బ + అ = ర) = యణాదేశసంధి

గమనిక :
ఇ, ఉ, ఋ లకు, అసవర్ణాలు (వేరేవర్ణాలు) పక్కన వచ్చినపుడు క్రమంగా వాటికి, య – వ-ర-లు వచ్చాయి. (య వ ర లను ‘యజ్ఞులు’ అంటారు.) ఇవి చేరినపుడు ఏర్పడే సంధిని, “యణాదేశసంధి” అంటారు.

యణాదేశ సంధిలో
‘ఇ’ కి బదులుగా = య్
‘ఉ’ కి బదులుగా = వ్
‘ఋ’ కి బదులుగా = ర్ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం :
ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే య, వ, ర లు ఆదేశంగా వస్తాయి.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 4
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
ప్రత్యహం = ప్రతి + అహం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
అ) ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
ఆ) మధ్వరి = మధు + అరి = (ఉ + అ = వ) = యణాదేశ సంధి
ఇ) పిత్రార్జితం = పితృ + ఆర్జితం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
ఈ) అత్యంత = అతి + అంత = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఉ) మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = ర) = యణాదేశ సంధి
ఊ) అణ్వాయుధం = అణు + ఆయుధం = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి
ఋ) ప్రత్యక్షం = ప్రతి + అక్షం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఋ) ప్రత్యహం = ప్రతి + అహం = (ఇ + అ = య) = యణాదేశ సంధి
ఎ) ఆద్యంత = ఆది + అంత = (ఇ + అ = య) = యణాదేశ సంధి

అభ్యాసం: 5

ఈ కింది పదాలను కలిపి రాసి, సంధిని పేర్కొనండి.
1) సు + ఆగతం = స్వాగతం = (ఉ + ఆ = వా) = యణాదేశ సంధి
2) అణు + అస్త్రం = అణ్వస్త్రం = (ఉ + అ = ఆ) = యణాదేశ సంధి
3) అతి + ఆశ = అత్యాశ = (ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
4) పితృ + ఆర్జితం = పిత్రార్జితం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి

4. వృద్ధి సంధి :
ఈ కింది పదాలను విడదీయండి.
1. ఉదా :
వసుధైక =వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధిసంధి
ఉ) వనౌకసులు = వన + ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్దిసంధి
ఊ) వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఓ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్దిసంధి
ఋ) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధిసంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనించిన విషయం సరిచూడండి.
1) వృద్ధిసంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వస్వరంగా ‘అ’ వచ్చింది.
2) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఏ, ఐ, ఔ లున్నాయి.
3) అకారానికి ఏ, ఐ లు కలిసినపుడు ‘ఐ’ వచ్చింది.
4) అకారానికి ఓ, ఔ లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ కారమూ, ఓ, ఔలు పరమైతే, ఔ కారమూ ఏకాదేశంగా .. వస్తాయి. దీనిని వృద్ధి సంధి అంటారు.

వృద్ధులు :
ఆ, ఐ, ఔలను వృద్ధులు అంటారు.

అభ్యాసం : 6
ఈ కింది సంధులను విడదీసి, సంధి పేర్లు రాయండి.
1) సభాంతరాళం = సభ + అంతరాళం = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2) కిరీటాకృతి = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి.
3) లఘత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
4) గిరీంద్రం = గిరి + ఇంద్రం = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
5) మాతణం = మాతృ + ఋణం = (బ + ఋ = ఋ) = సవర్ణదీర్ఘ సంధి
6) ఉదరాగ్ని = ఉదర + అగ్ని = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
7) మహేశ = మహా + ఈశ = (ఆ + ఈ = ఏ) = గుణసంధి
8) సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) = గుణసంధి
9) నరేంద్ర = నర + ఇంద్ర = (అ + ఇ = ఏ) = గుణసంధి
10)వర్షర్తువు = వర్ష + ఋతువు = (అ + ఋ = అర్) = గుణసంధి
11) అభ్యుదయం = అజి + ఉదయం = (ఇ + ఉ = యు) యణాదేశ సంధి
12) మాత్రాదరం = మాతృ + ఆదరం = (ఋ + ఆ = రా) = యణాదేశ సంధి
13) అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ) = యణాదేశ సంధి
14) లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
15) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
16) భాషోన్నత్యం = భాషా + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధిసంధి
17) నిఖిలైశ్వర్యం = నిఖిల + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్దిసంధి

క్రియలు – భేదములు

ఈ కింది వాక్యాలలోని క్రియలను గమనించండి.

  1. ఉదయ్ భోజనం చేసి, సినిమాకు వెళ్ళాడు.
  2. అరుణ్ చిత్రాలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.
  3. వైష్ణవి పుస్తకం చదివి, నిద్రపోయింది.

సమాపక క్రియలు :
పై వాక్యాలలో ప్రతి వాక్యం చివర ఉన్న క్రియలు, పని పూర్తి అయ్యిందని తెలుపుతున్నాయి. వీటిని ‘సమాపక క్రియలు” అంటారు.

అసమాపక క్రియలు :
అవాక్యం మధ్యలో ఉన్న “చేసి”, “గీసి”, “చదివి” – అన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. వీటిని “అసమాపక క్రియలు” అంటారు.

వాక్య భేదాలు

1. సామాన్యవాక్యం :
1) ఉష ఫారం చదువుతున్నది.
2) మురళి మంచి బాలుడు.

గమనిక :
మొదటి వాక్యంలో క్రియ ఉంది. రెండో వాక్యంలో క్రియలేదు. ఈ విధంగా క్రియ ఉన్నా, లేకున్నా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను “సామాన్య వాక్యాలు” అంటారు.

2. సంక్లిష్ట వాక్యం :
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి, రాయండి.
ఉదా :
1. శ్రీకాంత్ అన్నం తిన్నాడు.
2. శ్రీకాంత్ బడికి వచ్చాడు.
జవాబు:
శ్రీకాంత్ అన్నం తిని, బడికి వచ్చాడు. (సంక్లిష్టవాక్యం)

గమనిక :
పై వాక్యాలను కలిపినపుడు ఒక సమాపక క్రియ, ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని, అసమాపక క్రియలూ ఉంటాయి. ఇటువంటి వాక్యాలను “సంశిష్ట వాక్యాలు” అంటారు.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి, సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.
1) మాధవి బాగా చదివింది.
2. మాధవి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది.
జవాబు:
మాధవి బాగా చదివి, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది. (సంక్లిష్టవాక్యం)

2) గౌతమి సంగీతం నేర్చుకున్నది.
2. గౌతమి బాగా పాడింది.
జవాబు:
గౌతమి సంగీతం నేర్చకొని, బాగా పాడింది (సంక్లిష్టవాక్యం)

3. సంయుక్తవాక్యం :-
సమప్రాధాన్యం కల వాక్యాలను కలపడం వల్ల ఏర్పడ్డ వాక్యాలు “సంయుక్తవాక్యాలు”

అభ్యాసం : 2
ఈ కింది సామాన్య వాక్యాలను కలిపి రాయండి.
ఉదా :
1) కల్పన పాడుతుంది. కల్పన నాట్యం చేస్తుంది.
జవాబు:
కల్పన పాడుతుంది, నాట్యం చేస్తుంది.

2) అతడు నటుడు. అతడు రచయిత.
జవాబు:
అతడు నటుడు, రచయిత.

3) అశ్విని అక్క. జ్యోతి చెల్లెలు.
జవాబు:
అశ్విని, జ్యోతి అక్కా చెల్లెండ్రు.

4) అరుణ ఊరికి వెళ్ళింది. అనూష ఊరికి వెళ్ళింది.
జవాబు:
అరుణ, అనూష ఊరికి వెళ్ళారు.

వాక్య భేదములు కింది వాక్యాన్ని చదివి అర్థం చేసుకోండి.

1. ఆశ్చర్యార్థక వాక్యం :
1. ఆహా ! ఎంత బాగుందో !

గమనిక :
పై వాక్యము ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం “ఆశ్చర్యార్థక వాక్యం”

2. విధ్యర్థక వాక్యం :
ఉదా :
చేతులు కడుక్కో గమనిక : ఈ వాక్యం విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచిస్తున్నది. అంటే చేయాల్సిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.

3. నిషేధక వాక్యం :
ఉదా :
చాలాసేపు టీవీ చూడొద్దు. ఈ వాక్యము టీవీ చూడొద్దని చెబుతున్నది. టీవి చూడటాన్ని ఈ వాక్యం నిషేధిస్తోంది. కాబట్టి ఇది “నిషేధార్ధక వాక్యం ”.
లక్షణం :
ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం “నిషేధార్థక వాక్యం”.

4. అనుమత్యర్థక వాక్యం :
ఉదా : లోపలికి రావచ్చు.
ఈ వాక్యము ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే ఇది “అనుమత్యర్థక వాక్యం”.

5. సామర్థ్యార్థక వాక్యం :
ఉదా : గోపాల్ చెట్టు ఎక్కగలడు.

ఈ వాక్యములో గోపాలు చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.

AP Board 7th Class Telugu Grammar

అభ్యాసం : 1
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యాలు అవుతాయో, గుర్తించి రాయండి.
అ) సీత కలెక్టరైందా? :- ప్రశ్నార్థక వాక్యం
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు :- అనుమత్యర్థకవాక్యం
ఇ) అక్క చెప్పేది విను :- ప్రార్థనాద్యర్థక వాక్యం
ఈ) రసాభాస చేయకండి :- నిషేధార్థక వాక్యం
ఉ) సీత లెక్కలు బాగా చేసింది :- సామాన్యవాక్యం
ఊ) నీవు ఇంటికి వెళ్ళవచ్చు :- అనుమత్యర్థక వాక్యం

అభ్యాసం : 2
కింది వాక్యాలు వాటిలోని భావాన్ని అనుసరించి, ఏ వాక్యోలో గుర్తించండి.
ఉదా :
అ) ఎంత బాగుందో! :- ఆశ్చర్యార్థకం
ఆ) నువ్వు చదువు :- విధ్యర్థకం
ఇ) అల్లరి చేయవద్దు :- నిషేధార్థక వాక్యం
ఈ) పరీక్ష రాయవచ్చు :- అనుమత్యర్థక వాక్యం

మరికొన్ని వాక్య భేదాలు :
1. సందేహార్థక వాక్యం :
ఉదా : రవి పనిచేస్తాడో? చెయ్యడో?
ఈ వాక్యం చదివితే, రవి పని చేయడం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది. ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.

2. ఆశీరర్థక వాక్యం : (ఆశీరర్థక వాక్యాలు)
ఉదా : నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు.
పై వాక్యం ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది. ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీరర్థక వాక్యాలు” అంటారు.

3. ప్రార్థనాద్యర్థక వాక్యం :
ఉదా : దయచేసి పని చేయ్యండి.
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తోంది. కాబట్టి ఇది ప్రార్థనాద్యర్థక వాక్యం

లక్షణం : ఒక వాక్యం ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నట్లు ఉంటే అది “ప్రార్థనాద్యర్థక వాక్యం”.

4. ప్రశ్నార్థక వాక్యం :
ఉదా : ఏం ! ఎప్పుడొచ్చా వ్? ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లు ఉంది. అంటే ఇది ‘ప్రశ్నార్థక వాక్యం’.

5. హేత్వర్థక వాక్యం :
ఉదా : వర్షాలు లేక పంటలు పండలేదు.

గమనిక :
ఈ వాక్యం మనకు రెండు విషయాల్ని తెలుపుతోంది. ఒకటి, “వర్షాలు లేవని, రెండు పంటలు పండలేదు అని”. పంటలు పండక పోవడానికి కారణం, మొదటి విషయం అంటే వర్షాలు లేకపోవడం. ఇక్కడ మొదటి విషయం, రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు. అన్నమాట. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం”

లక్షణం :
ఒక పని కావడానికి, కారణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని, హేత్వర్థక వాక్యం : అంటారు.

అభ్యాసం :
కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.
1) ఎవరా పైడి బొమ్మ? :- ప్రశ్నార్థక వాక్యం
2) పంటలు పండలేదు. :- సామాన్యవాక్యం
3) దయచేసి సెలవు ఇయ్యండి :- ప్రార్థనాద్యర్థక వాక్యం
4) కిషన్ చదువుతాడో? లేదో? :- సందేహార్థక వాక్యం
5) మీకు శుభం కలగాలి :- ఆశీరర్ధక వాక్యం

ఛందస్సు – గురు లఘు నిర్ణయం

పద్యాలు, గేయాలు కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి.

ప్రతి నియమానికీ కూడా, కొన్ని గుర్తులుంటాయి.

1. లఘువు :
రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు, “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకునే అక్షరాలు లఘువులు.

2. గురువు :
లఘువు ఉచ్చరించే సమయం కంటె ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు, గురువులు.

లఘువునకు గుర్తు = “l”
గురువునకు గుర్తు = “U”

లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించడం.

AP Board 7th Class Telugu Grammar 2

గురువులు లక్షణాలు – వాటిని గుర్తించే విధము

AP Board 7th Class Telugu Grammar 3

AP Board 7th Class Telugu Grammar 4
అభ్యాసం: 1
కింది పదాలకు గురువు, లఘువులను నిర్ణయించండి.
AP Board 7th Class Telugu Grammar 5

అభ్యాసం : 2
కింది పదాలకు లఘువు, గురువులు నిర్ణయించండి.

అలంకారాలు

1. అలంకారం :
చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది.
అలంకారాలు రెండు రకాలు :
అ) శబ్దాలంకారములు.
ఆ) అర్థాలంకారములు

అ. శబ్దాలంకారం :
శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కల్గించేవి శబ్దాలంకారాలు.
కింది గేయాన్ని గమనించండి.
“అది గదిగో మే
మేడ కున్నది గో
గోడ పక్కన నీ
నీడలో కోడెదూ
దూడవేసింది పే

పై కవితలో ప్రతి వాక్యం చివర ‘డ’ అనే అక్షరం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. (అంటే పునరావృతమయ్యింది). ” ఇది కవితకు అందం తెచ్చింది. వినసొంపుగా తయారయింది. ఈ అందం, వినసొంపు, ‘డ’ అనే శబ్ద ప్రయోగం వల్ల వచ్చింది. కాబట్టి దీనిని ‘శబ్దాలంకారం’ అంటారు.

1. అంత్యానుప్రాసాలంకారం :
ఒక అక్షరం లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మాటిమాటికి వస్తే, దాన్ని • “అంత్యానుప్రాస” అలంకారం” అంటారు.
1. “భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ”

గమనిక :
పై కవితలో ప్రతి వాక్యం చివర ‘క్తి’ అనే అక్షరం తిరిగి తిరిగి వచ్చింది. కాబట్టి ఈ కవితలో “అంత్యానుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.

2. “గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
పై కవితలో ‘మ్ము’ అనే అక్షరం, ప్రతి పాదం చివర వచ్చింది. కాబట్టి. దీనిలో “అంత్యానుప్రాస” అనే శబ్దాలంకారం ఉంది.

1. అంత్యానుప్రాసాలంకార లక్షణం :
పాదాంతంలో, లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు, లేదా అక్షరాలు ఉంటే, దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటారు.

గమనిక :
కింది గేయాలు గమనించండి.
1. వేదశాఖలు వెలిసె నిచ్చట
ఆది – కావ్యం బలరె నిచ్చట
ఈ గేయంలోని మొదటి పంక్తి చివర “ఇచ్చట” అని, రెండో పాదం చివర కూడా “ఇచ్చట” అని ఉంది. కాబట్టి ఇది “అంత్యానుప్రాసాలంకారం”.

2. “తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుర్రపు కళ్ళెం
పై మూడు పాదాల్లో చివర ‘ళ్ళెం’ అనే అక్షరం వచ్చింది కాబట్టి ‘అంత్యానుప్రాసాలంకారం’.

2. వృత్త్యనుప్రాసాలంకార లక్షణం :
ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని అక్షరాలు అనేక సార్లు తిరిగి రావడాన్ని, ‘వృత్త్యనుప్రాసాలంకారం’ అంటారు. (వృత్తి అంటే ఆవృత్తి అని అర్థం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం)
ఉదా :
నానా ! నేను నిన్నేన్నాన్నానా? నీవు నన్నేన్నా అన్నావా?

గమనిక :
పై వాక్యంలో ‘న’ అనే అక్షరం అనేక సార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాస” అనే శబ్దాలంకారం.

అభ్యాసం : 1
కింది వాక్యాల్లో ఏ అలంకారాలున్నాయో గుర్తించి, కారణాలు చెప్పండి.

1. కా కి కో కి కా దు దా !
జవాబు:
ఈ వాక్యంలో ‘క’ అనే అక్షరం చాలా సార్లు వచ్చింది. కాబట్టి ఇది “వృత్త్యనుప్రాసాలంకారం”

2. లచ్చి పుచ్చకాయలు తెచ్చి యిచ్చింది.
జవాబు:
పై వాక్యంలో ‘చ్చ’ అనే అక్షరం, ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఈ వాక్యంలో ‘వృత్త్యనుప్రాసాలంకారం’ ఉంది.

అభ్యాసం : 2
1. “గంతులు వేతురు కౌతు కమున”
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ వచ్చిన హల్లు :- ‘త’

2. పోరు దురు గికురు వొడుచుచు దూఱుదురు.
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :- ‘ర’

3. ఒ నొ ని చల్ది కావడి,
నొ డడ కించి దాచు, నొ డదివే
ఱొ డొని మొఱగి కొని చన
నొ డొక
జవాబు:
ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :- ‘క’ ..

గమనిక :
పై మూడు ఉదాహరణలలోనూ, ఒకే హల్లు ఎక్కువ సార్లు ఆవృత్తి అయ్యింది. కాబట్టి ఆ పాదాలలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.

ఆ. “అర్థాలంకారాలు” :

1. ఉపమాలంకారం :
1. ఆమె ముఖం అందంగా ఉంది.
2. ఆమె ముఖం చంద్రబింబం లాగ అందంగా ఉన్నది.

పై వాక్యాలలోని తేడాను గమనించండి. ‘ఆమె ముఖం అందంగా ఉంది’ అనే దానికి బదులుగా, ‘ఆమె ముఖం చంద్రబింబంలాగ అందంగా ఉంది. అనే వాక్యం మనలను బాగా ఆకట్టుకుంటుంది. ఇలా ఆకట్టుకొనేలా చెప్పడానికి ‘చంద్రబింబం’ అనే పోలికను తీసుకున్నాము. ఈ విధంగా ఒక విషయాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి అందమైన పోలికను చెప్పడాన్ని “ఉపమాలంకారం” అంటారు.

సోముడు భీముడి లాగా(వలె) బలవంతుడు.

గమనిక :
ఈ. వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినపుడు వాక్యంలో ఉండే పదాలను, కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాము.
1. సోముడు – “ఉపమేయం” (అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదం)
2. భీముడు – ఉపమానం (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)
3. బలవంతుడు – సమానధర్మం (పోల్చడానికి వీలయిన సమాన గుణం, ఉపమాన, ఉపమేయాలలో ఉన్న ఒకే విధమైన ధర్మం కావాలి.)
4. లాగ (వలె) – ఉపమావాచకం. (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)
వివరణ :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని సామ్యం అంటే పోలిక చెప్పడాన్ని “ఉపమాలంకారం” అంటారు. * ఉపమాలంకారం లక్షణం : ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే “ఉపమాలంకారం”.

AP Board 7th Class Telugu Grammar

2. ఉత్ప్రేక్షాలంకారము :
ఉదా : అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి, సింహమేమోనని భయపడ్డాను.

గమనిక :
పై వాక్యంలో ఒక దాన్ని చూసి, మరొకటి అనుకోవడం లేదా ఊహించుకోవడం జరిగింది. ఇలా అనుకోవడం ఊహించుకోవడం కూడా ఒక అలంకారమే.

ఇలా ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా, ఊహించి చెప్పడాన్ని “ఉత్ప్రేక్షాలంకారం” అంటారు.
ఉదా :
1. ఆ మేడలు, ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి. ..
2. ఆ ఏనుగు, నడగొండా అన్నట్లు ఉంది.

ఈ కింది వాక్యాన్ని గమనించండి. ఇందులో కూడా పోలిక ఉంది. ఆ పోలిక ఊహించి చెప్పినది.
పై వాక్యంలో 1. ఉపమేయం : ఏనుగు
2. ఉపమానం : నడిచే కొండ

అంటే ఏనుగును నడిచే కొండలా ఊహిస్తున్నాము.

ఉత్ప్రేక్షాలంకార లక్షణం :
ఉపమేయాన్ని, మరొక దానిలా ఊహించి చెప్పడం “ఉత్ప్రేక్షాలంకారం”.

అభ్యాసాలు:
కింది వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి.
1. గోపి సూర్యుని లాగ ప్రకాశిస్తున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది. ఇందు గోపి సూర్యునితో పోల్చడం జరిగింది.

2. మండే ఎండ నిప్పుల కొలిమా ! అన్నట్లు ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. ఇందు ‘మండే ఎండ’ నిప్పుల కొలిమిగా ఊహింపబడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 17th Lesson వేసవి సెలవుల్లో Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 17th Lesson వేసవి సెలవుల్లో

7th Class Telugu 17th Lesson వేసవి సెలవుల్లో Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి.

ప్రశ్న 1.
చదువంటే కేవలం రాయటం, చదవడమేనా ?. ఇంకా ఏ ఏ అంశాలను చదువులో చేర్చవచ్చు?
జవాబు:
చదువు అంటే కేవలం, రాయడం, పుస్తకాలు చదవడమూ మాత్రం కాదు. తెలియని విషయాలను తెలుసుకొనే దంతా, పాఠమే. తెలియని విషయాలు నేర్చుకోడం అంతా చదువే.

ఈ రోజుల్లో చాలామంది సంవత్సరం చివర జరిగే పరీక్షలలో సమాధానాలు రాయడానికి కావలసిన విషయం నేర్చుకోవడమే చదువు అని భ్రాంతి పడుతున్నారు. ఆ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడమే వారికి లక్ష్యంగా ఉంటోంది. దాని కోసం పాఠాలు, నోట్సులు బట్టీ పట్టి, వారు పరీక్షలు రాస్తున్నారు.

నిజానికి పిల్లలు తమకు తెలియని విషయాలు అన్నీ నేర్చుకోవాలి. ఇండ్లలో పెరిగే మొక్కల గురించి, పొలాల్లో పండించే పంటలు గురించి తెలుసుకోవాలి. ఆటలలో మెలకువలు తెలుసుకోవాలి. తెలుగు పద్యాలు భావంతో నేర్చుకోవాలి. ఈత, యోగాభ్యాసాలు నేర్చుకోవాలి. వ్యాయామం చేయడం నేర్చుకోవాలి.

మహాత్ముల జీవిత చరిత్రలు చదివి విషయాలు గ్రహించాలి. తల్లిదండ్రులు చేసే వృత్తి రహస్యాలను తెలుసుకోవాలి. .. చేపలు పట్టడం, చెరువుల్లో ఈత , పాటలు పాడడం, పద్యాలు వ్రాయడం, గణిత అవధానం చేయడం మొదలయినవన్నీ నేర్చుకోవాలి. తల్లి చేసే పనులు కూడా నేర్చుకోవాలి. వంట పని కూడా నేర్వాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ప్రశ్న 2.
మీకిష్టమైన ఆట ఏది? ఎందుకు? దానివల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారు?
జవాబు:
నాకు ఇష్టమైన ఆట ‘క్రికెట్టు’. మా తాతగారి ఊరు పల్లెటూరు. సెలవుల్లో అక్కడకు వెళ్ళేవాడిని. అక్కడి పిల్లలు గూటీబిళ్ళ ఆట ఆడేవారు. అక్కడి పిల్లలతో కలిసి నేనూ ఆ ఆట ఆడేవాడిని. గూటీబిళ్ళ ఆట క్రికెట్ లాంటిదే. తరువాత మా స్కూల్లో క్రికెట్ నేర్చుకున్నా తీరిక సమయంలో మా ఇంట్లో అంతా టీ.వీ.లో క్రికెట్’ చూస్తారు. ఆ విధంగా నాకు క్రికెట్ అంటే అభిమానం కలిగింది.

ఈ రోజు మన దేశంలో సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, ‘కపిల్ దేవ్, గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ వంటి మంచి క్రికెటర్లు ఉన్నారు. వాళ్ళు ఈ ఆట ద్వారా ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కోట్లకొలది రూపాయలు సంపాదించారు. ఇంకా వాణిజ్య ప్రకటనల ద్వారా ఎంతో సంపాదిస్తున్నారు. దేశానికి ఎంతో పేరు తెచ్చారు. వారికి ఎందరో అభిమానులున్నారు.

నేను క్రికెట్ బాగా నేర్చుకొని, పైన చెప్పిన క్రికెటర్లలాగా పేరు తెచ్చుకోవాలనీ, డబ్బు సంపాదించాలనీ కోరుకొంటున్నాను.

ప్రశ్న 3.
ఈ కథ చదివిన తర్వాత పద్యపఠనం మీద నీకు కలిగిన అభిప్రాయాలు తెలపండి.
జవాబు:
పద్య పఠనం పోటీ మంచి పోటీ. ఈ పోటీ ద్వారా ప్రసిద్ధులైన తెలుగుకవుల పద్యాలూ, వాటి భావాలూ తెలుసుకోవచ్చు. పద్యాలు కంఠతా పట్టడం వల్ల, మనలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పద్యాలు మన తెలుగు వారి ఆస్తి. ఇంక ఏ భాషల్లోనూ పద్యాలు రాగాలతో చదవడం ఉండదు. వుహాకవుల పద్యాలు బట్టీ పట్టడం వల్ల, వాటి అర్థం తెలుసుకోవడం వల్ల అర్థజ్ఞానం కలిగి, మన మాతృభాషపై మంచి పట్టు ఏర్పడుతుంది. మన తల్లిభాషపై అభిరుచి ఏర్పడుతుంది. భాషా జ్ఞానం పెరగడంతో పోటీ పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసి మంచి ఉద్యోగాలు సాధింపవచ్చు. దైవభక్తి కలిగి భగవంతుణ్ణి పద్యాలతో స్తోత్రం చేయవచ్చు.

పద్య పఠనం వల్ల మంచి ఉత్సాహం, ఆనందం, సంతోషం కలుగుతాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ప్రశ్న 4.
మీ వేసవి సెలవులు ఎక్కడ గడపాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను వేసవి సెలవులు మా మామయ్య గారింట్లో గడపాలనుకుంటున్నాను. మా మామయ్య హైస్కూల్లో, – ప్రధానోపాధ్యాయుడు. ఆయనకు లెక్కలు” భౌతికశాస్త్రం బోధించడంలో మంచి అనుభవం ఉంది. ఆయన దగ్గర ఆ సబ్జెక్టుల్లో మెలకువలు నేర్చుకోవాలి. మా మామయ్య గారి ఊరు పల్లెటూరు. మా మామయ్య గారికి కొబ్బరి, మామిడి తోటలు ఉన్నాయి. బొండాలు త్రాగుతూ, మామిడి కాయలు కారం, ఉప్పు నంజుకు తినాలి. కాలువ గట్లపై పరుగులు పెట్టాలి. చెరువులో ఈతలు ఈదాలి.

మామయ్య గారి ఊరులో కాలువ లాకులు ఉన్నాయి. లాకుల్లోకి పడవలు రావడం, పోవడం మహా సరదాగా .. ఉంటుంది. అక్కడే మా తాతగారు ఉన్నారు. ఆయన తెలుగు పండితునిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన దగ్గర పద్యాలు నేర్చుకోవాలి. అందుకే నేను వేసవి సెలవులకు మా మామయ్యగారి ఊరు వెడదామని ఉంది.

కఠిన పదములకు అర్థములు

దోస్తులు = స్నేహితులు
పిసరంత = కొంచెము
ఏమారితే = జాగ్రత్త లేకపోతే
మొరాయించింది = మొండికేసింది
స్పోకెన్ ఇంగ్లీషు క్లాసు = ఇంగ్లీషు మాట్లాడడం నేర్పే తరగతి
మ్యాబ్స్ ట్యూషన్ = లెక్కలు ప్రైవేటు
డుమ్మాకొట్టి = ఎగకొట్టి
నిర్వాకానికి = చేసే పనికి (ఉద్దరింపుకు)
సీరియస్ (Serious) = గంభీరంగా
అయోమయం = బొత్తిగా తెలియనిది
ఉలిక్కిపడు = అదిరిపడు, త్రుళ్ళిపడు
భళ్ళున = గట్టిగా
అంబలి = గంజి
నీట్ (Neat) = శుభ్రము
వాచ్ = గడియారం
ఇంట్రెంస్టింగ్ గా = ఆసక్తిగా
ఫాస్ట్ బౌలింగ్ = వేగంగా బంతి విసరడం
కోచ్ = శిక్షకుడు
కండిషన్ = నియమము
యాక్సిడెంట్ = ప్రమాదము
ద్రోణాచార్య అవార్డు = ఆటలలో మంచి నేర్పుగల వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బహుమతి

AP Board 7th Class Telugu Solutions Chapter 17 వేసవి సెలవుల్లో

ఫిట్ (Fit) = అర్హత
ఆహ్వానించేడు = రమ్మని పిలిచాడు
డాన్సు (Dance) = నృత్యము
డకౌట్ = మొదటి బంతికే పరుగులు ఏమీ చేయకుండా ఔట్ అవడం
న్యాయ నిర్ణేతలు = న్యాయాన్ని నిర్ణయించేవారు
తత్తరపడటం = తొట్రుపాటు పడడం
ప్రశంసలు = పొగడ్తలు
తథ్యము = తప్పనిసరి (ఖాయం)
ఆలయప్రాంగణం = గుడి వాకిలి; ముంగిలి
చిచ్చర పిడుగులు = అగ్గి పిడుగులు (సమర్థులు)
ఏకాగ్రత = ఒకే విషయంపై మనస్సు లగ్నం కావడం
రాణించాడు = శోభించాడు
చిప్పిల్లాయి = కారాయి

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 16th Lesson బాల్య క్రీడలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 16th Lesson బాల్య క్రీడలు

7th Class Telugu 16th Lesson బాల్య క్రీడలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:

  1. పిల్లలు ఆడుకుంటున్నారు.
  2. పక్షి ఎగురుతూ ఉంది.
  3. కుక్క పరిగెడుతోంది.

ప్రశ్న 2.
చిత్రంలో పిల్లలు ఏ ఏ ఆటలాడుతున్నారు?
జవాబు:

  1. ఒకామె ఉయ్యాల ఊగుతూ ఉంది.
  2. మరికొందరు కబడ్డీ ఆడుతున్నారు.
  3. కొందరు దాగుడుమూతలు ఆడుతున్నారు.
  4. కొందరు పరుగులు పెడుతున్నారు.
  5. కొందరూ కోకో ఆట ఆడుతున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

ప్రశ్న 3.
మీకిష్టమైన ఒక ఆటను ఎలా ఆడతారో చెప్పండి.
జవాబు:
నాకు ‘వాలీబాల్’ ఆట ఇష్టం. వాలీబాల్ ఆటలో రెండు జట్లు ఉంటాయి. అటు ఆరుగురు, ఇటు ఆరుగురు. మధ్యన వాలీబాల్ నెట్ కడతారు. వాలీబాల్ ను ఒక వైపు వారు ఎదుటి వారికి సర్వీసు చేస్తారు. బంతిని అవతల వైపుకు గుద్దుతాడు. ఇవతలివారు దాన్ని అవతలి వైపుకి గెంటాలి. కింద పడిపోతే అటువైపు వారికి పాయింట్ వస్తుంది.. అలా ఎవరికి 15 పాయింట్లు ముందు వస్తే, ఆ పక్షము ఆటలో గెలుస్తుంది.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాలను భావయుక్తంగా పాడండి.
జవాబు:
మీ గురువుల సాయంతో పద్యాలు పాడడం నేర్చుకోండి.

ప్రశ్న 2.
పాఠంలోని ఏ ఏ పద్యాలు మీకు బాగా నచ్చాయి? ఎందువల్ల?
జవాబు:
ఈ పద్యాలలో పిల్లల ఆటలను వర్ణించిన మూడవ పద్యమూ, ఐదవ పద్యమూ బాగున్నాయి. గోపబాలుర అదృష్టాన్ని గూర్చి చెప్పిన “ఎన్నఁడునైన” అన్న పద్యము ఈ పద్యాలన్నింటిలో మణిపూస వంటిది.

ప్రశ్న 3.
ఈ పద్యాలు విన్నారు కదా ! బలరామకృష్ణులు, గోపబాలకులు ఏ ఏ ఆటలు ఆడారు? వాటిలో ఏ ఏ ఆటలను ఇప్పటి పిల్లలు కూడా ఆడుతున్నారు?
జవాబు:
బలరామకృష్ణులు కింది ‘ఆటలు ఆడారు.

  1. పిల్లన గ్రోవులు ఊదడం
  2. “అల్లి” ఆట
  3. చెట్ల పండ్లు రాలగొట్టడం
  4. జంతువుల గొంతుల పోలికగా కూతలు పెట్టడం
  5. పరుగుపందాలు
  6. బండరాళ్ళపై నుండి జారడం
  7. విచిత్ర వేషాలు
  8. చల్టి చిక్కాలు దాచడం
  9. వెనుక నుండి కళ్ళు మూయడం
  10. తినుబండారాలు దొంగిలించడం.

ఇప్పటి పిల్లలు

  1. పరుగుపందాలు
  2. వెనుకగా వచ్చి కళ్ళు మూసి, మూసింది ఎవరో చెప్పమనడం – వంటి ఆటలు నేటికీ ఆడుతున్నారు.

II చదవడం – రాయడం

1. పాఠం ఆధారంగా కింది అంశాలకు సంబంధించిన పద్యాలు ఏవో చెప్పండి. వాటి కింద గీత గీయండి.
అ) బృందావనం
ఆ) గోపబాలకుల భాగ్యం
ఇ) పిండివంటలతో ఆడుకోవడం
ఈ) ఒకరినొకరు ముట్టుకునే ఆట

అ) బృందావనం :
బృందావనం గురించి, 1వ పద్యం “కసపు గల దిరవు …… పొదడచ్చటికిన్” అనే పద్యంలో చెప్పబడింది.

ఆ) గోపబాలకుల భాగ్యం :
గోపబాలకుల భాగ్యం గురించి, 10వ పద్యం “ఎన్నఁడునైన …………. భాగ్యములింత యొప్పునే” అనే పద్యంలో చెప్పబడింది.

ఇ) పిండివంటలతో ఆడుకోవడం :
పిండి వంటలతో ఆడుకోవడం గురించి, 8వ పద్యం “తీపుగల ………….. నృపా!” అనే పద్యంలో చెప్పబడింది.

ఈ) ఒకరి నొకరు ముట్టుకునే ఆట :
ఒకరినొకరు ముట్టుకొనే ఆట గురించి, 9వ పద్యం “వనజాక్షుఁడు ………….. నరేంద్రా! ” అనే పద్యంలో చెప్పబడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2. కింది పద్యాలను చదవండి. వాటి భావం ఆధారంగా ఆ పద్యాలకు శీర్షికలు పెట్టండి.

అ) “వేణువులూఁదుచు ……………. బాల్యవిహారులగుచు” : ఈ పద్యానికి ‘గోపాలుర బాల్య విహారాలు’ అనే శీర్షిక బాగుంటుంది.
ఆ) “కపులమై జలరాశి ………. గొమరు మిగిలి” : ఈ పద్యానికి ‘గోపాలుర విచిత్ర వేషధారణ’ అనే శీర్షిక బాగుంటుంది.

3. కింది పేరాను చదవండి.

ఒకనాడు బలరామకృష్ణులూ, గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. పొద్దుటే లేచి, గబగబా తమ ఇంటి లేగదూడలను బయటికి తోలుకొని వచ్చారు. అందమైన కొమ్ము బూరలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులందరూ మేల్కొన్నారు. చల్ది అన్నపు కావడులను భుజాలకు తగిలించుకొన్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండివంటలు మూటలు కట్టుకొన్నారు. కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు, చేతికర్రలు పట్టుకున్నారు. లెక్కపెట్టడానికి కూడా కష్టమనిపించే తమతమ లేగలమందలను ‘హెహెయ్’ అని కేకలతో తోలుకొంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలోకి ప్రవేశించారు. బంగారు, మణి భూషణాలు ధరించి ఉన్న పూలను, చిగుళ్ళను, చిన్నచిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు.

కొమ్ముబూరలు పూరిస్తూ, పిల్లనగ్రోవులు ఊదుతూ, తుమ్మెదలతోబాటు ఝుమ్మని పాడుతూ, నెమళ్ళతో సమానంగా నాట్యంచేస్తూ, కోకిలలను, మిగిలిన పక్షులను అనుకరించి కూతలు కూస్తూ, చిలకలతోపాటు అరుస్తూ కేరింతలు కొట్టారు. పైన పక్షులు ఎగురుతూ ఉంటే వాటి నీడలతోపాటు తామూ పరుగులెత్తారు. జలజలపారే సెలయేళ్ళను చెంగున దాటారు. హంసలపక్కనే వాటిని అనుకరిస్తూ నడిచారు. కొంగలతో పాటు ఒంటికాలిమీద నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమితరిమి అలసిపోగొట్టారు. నదీ జలాలలో స్నానాలు చేశారు. తీగల ఉయ్యాలలు ఊగారు. గోతులలో దాక్కొన్నారు. దూరాలకు పరుగు పందాలు వేసుకొన్నారు. కోతులవలె చెట్టు ఎక్కారు. పండ్లు తిని, ఆ రుచులకు పరవశించిపోయారు. కుప్పించి దూకి, తమ నీడలను చూసి నవ్వుకొన్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. కేరింతలు కొడుతూ, పరుగెడుతూ, పడుకొంటూ, అలసిపోతూ ఇలా ఎన్నో రకాలుగా ఆటలు ఆడుకొన్నారు.

అ) పై పేరాకు వీలైనన్ని ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. బలరామకృష్ణులు దేనికి సరదా పడ్డారు?
  2. వారు వేటిని తోలుకొని వచ్చారు?
  3. బలరామకృష్ణులు గోపకుమారులను నిద్ర నుండి ఎలా లేపారు?
  4. గోపబాలకులు వేటిని భుజాలకు తగిలించు – కున్నారు?
  5. గోపబాలురు వేటిని మూటకట్టుకున్నారు?
  6. వారు కాళ్ళకు ఏమి ధరించారు?
  7. వారి లేగల మందలు ఎన్ని ఉన్నాయి?
  8. వారు లేగలను ఎలా తోలుకుంటూ వచ్చారు?
  9. వారు దూడలతో ఎక్కడ ప్రవేశించారు?
  10. గోపబాలుర అలంకారాలు పేర్కొనండి.
  11. గోపబాలురు ఎలా కేరింతలు కొట్టారు?
  12. గోపబాలురు దేనితో పాటు పరుగులెత్తారు?
  13. గోపబాలురు దేనిని దాటారు?
  14. గోపబాలురు దేని ప్రక్కన ఎలా నడిచారు?
  15. గోపబాలురు ఎలా నిలబడ్డారు?
  16. గోపబాలురు ఏ పక్షులను తరిమి అలిసి పోయారు?
  17. గోపబాలురు ఎక్కడ స్నానం చేశారు?
  18. గోపబాలురు దేనిలో ఊగారు?
  19. గోపబాలురు ఎక్కడ దాక్కొన్నారు?
  20. గోపబాలురు ఏమి పందాలు వేసుకున్నారు?
  21. వారు ఏమి ఎక్కారు?
  22. వారు దేనికి పరవశించిపోయారు?
  23. గోపబాలురు దేన్ని చూసి నవ్వుకున్నారు?
  24. ఏమి చేస్తూ గోపబాలురు ఆడుకున్నారు?

ఆ) పై పేరాకు శీర్షికను రాయండి.
జవాబు:
‘గోపబాలుర బాల్య క్రీడలు’ అనే శీర్షిక ఈ పేరాకు సరిపోతుంది.

ఇ) పై పేరాకు, పాఠానికి ఉన్న సంబంధం ఏమిటి?
జవాబు:
పాఠంలోనూ, ఈ పేరాలోనూ కూడా గోపబాలకుల ఆటలను గూర్చి వర్ణింపబడింది.

4. క్రింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి.

అ) బృందావనం ఎలా ఉంది?
జవాబు:
‘బృందావనం’లో పశువులకు మేత సమృద్ధిగా దొరకుతుంది. అక్కడ అందమైన చెట్లు, కొండలు, నదులు, తీగలు ఉన్నాయి. బృందావనం నివసించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఆ) గోపబాలురతో బలరామకృష్ణులు నీటికి సంబంధించి ఏ ఏ ఆటలు ఆడారు?
జవాబు:

  1. సరస్సులలో ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొనే ‘చల్లులాట’ ఆడారు.
  2. కాలువలకు అడ్డుకట్టలు కట్టారు.
  3. కొలనులలో దిగి, చేతులతో నీళ్ళను చిలికారు.

ఇ) గోపబాలకులు నవ్వుకొనేలా ఏ ఆటలాడారు?
జవాబు:

  1. ఒకరి చల్టికావడిని ఇంకొకడు దాచాడు. వాణ్ణి మోసగించి మరొకడు దాన్ని పట్టుకెళ్ళాడు. ఇంకొకడు దాన్ని తెచ్చి అసలు వాడికిచ్చాడు.
  2. ఒకడు పరధ్యానంగా నడచివెడుతూ ఉంటే, వాడు ఉలిక్కిపడేలా మరొకడు వెనుకగా వచ్చి, పెద్దకేక పెట్టాడు. ఒకడు వెనుకగా వచ్చి, మరొకటి రెండు కళ్ళూమూశాడు. అది చూచి మరొకడు నవ్వాడు.
  3. కృష్ణుడిని ముట్టుకోవాలని ఇద్దరు పిల్లలు పందాలు వేశారు. అందులో కృష్ణుడిని ముందుగా ముట్టుకున్నవాడు, ముట్టుకోలేనివాడిని చూచి నవ్వాడు.
  4. ఒకరు తెచ్చుకున్న పిండివంటను ఒకడు లాక్కొని పారిపోగా, వాడి చేతిలోది మరొకడు లాక్కుని ఎవరికీ అందకుండా వాడు దూడల మధ్యకు పరుగుపెట్టాడు. గోపాలురు పై విధంగా నవ్వు తెప్పించే ఆటలు ఆడారు.

ఈ) పోతన గోపబాలకుల అదృష్టాన్ని ఏమని చెప్పాడు?
జవాబు:
యోగీశ్వరులు సైతం, పరమ పురుషుడు అయిన శ్రీకృష్ణుని పాదధూళిని రవ్వంత కూడా చూడలేరు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపబాలురు కౌగిలించుకున్నారు. చెట్టాపట్టాలు వేసుకున్నారు. తన్నుతూ, నవ్వుతూ, గుద్దుతూ, మీదపడుతూ కృష్ణుడితో కలిసి వారు ఆడుకున్నారు. అందువల్ల గోపబాలుర అదృష్టం ఎంతో గొప్పది అని పోతన అన్నాడు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పోతన పద్యాలలో చెప్పిన ఆటల్లో మీరు ఆడే ఆటలు ఏమైనా ఉన్నాయా? అవి ఏవి?
జవాబు:

  1. చెట్లపై కాయలు రాలగొడతాను
  2. చెరువులలో దిగి నీళ్ళను చిలుకుతాను
  3. నేను అప్సరసలాగా నాట్యం చేస్తాను
  4. విచిత్ర వేషాలు ధరిస్తాను.

ఆ) గోపబాలకులతో బలరామకృష్ణులు బృందావనంలో ఆటలు ఆడారు కదా ! మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ ఏ ఆటలు, ఎవరితో ఆడతారు?
జవాబు:

  1. నేను మా వీధిలో, మా చెల్లెలుతో షటిల్ ఆడతాను.
  2. మా వీధి మొదలులో మిత్రులతో కబడ్డీ ఆడతాను.
  3. మా స్నేహితురాండ్రతో పాఠశాలలో బాడ్మింటన్ ఆడతాను.
  4. నా స్నేహితులతో పాఠశాల ఆట స్థలంలో క్రికెట్ ఆడతాను.

ఇ) గోపబాలకులు ఎంతో భాగ్యవంతులని పోతన వివరించాడు కదా ! ఇలా పోతన అనడానికి కారణం ఏమిటి?
జవాబు:
శ్రీకృష్ణుడు భగవంతుడు. అవతార స్వరూపుడు. కృష్ణుని చూడాలని యోగీశ్వరులు సైతం తపస్సు, ధ్యానం వగైరా చేస్తారు. కాని వారికి కృష్ణుని దర్శనం జరుగదు. గోపాలురు ఏ యోగమూ, ధ్యానమూ లేకుండానే, కృష్ణుణ్ణి చూశారు. కృష్ణుడితో కలసి ఆడిపాడారు. అందుకే గోపాలురు భాగ్యం గొప్పదని భక్తుడైన పోతన అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) పోతన సుమారు 500 సంవత్సరాల కిందట భాగవతంలో రకరకాల ఆటలను గురించి వివరించాడు కదా ! నాటి ఆటలతో పోల్చినపుడు నేటి ఆటల్లో ఏమైనా తేడాలున్నాయా? అలాగే ఆడుతున్నారా? మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పోతన చెప్పిన ఆటలు చాలావరకు నేడు లేవు. నిజానికి ఇప్పుడు పిల్లలకు ఆటలు ఆడే సమయమే లేదు. కాన్వెంటులకు వెళ్ళడం, వారు చెప్పినవి రాసుకోవడం. బట్టీపట్టడంతోనే వారికి సరిపోతోంది. చాలా పాఠశాలల్లో ఆట స్థలాలే లేవు. ఆటల పోటీలు ఏడాది కొకసారి పెడతారు. కాని పాఠశాలలో దానికి తగిన శిక్షణ లేదు. తల్లిదండ్రులు కూడా, ఆటలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, కోకో వంటి ఆటలు వచ్చాయి. పరుగు పందాలు నేటికీ ఉన్నాయి. జలక్రీడలు ఉన్నాయి కాని, దానిలో ఈతకే ప్రాధాన్యం.

ఆ) బలరామకృష్ణుల బాల్యక్రీడలను గురించి సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బలరామకృష్ణులు గోప బాలకులతో కలిసి ఆడిన బాల్య క్రీడా విశేషాల గురించి వివరించండి.
జవాబు:
బలరామకృష్ణులు పిల్లనగ్రోవులు ఊదుతూ గంతులు వేశారు. కంబళ్ళతో ఎద్దులను చేసి, ఒకరినొకరు ఎదిరించుకున్నారు. అల్లులు చేసి, తమ గజ్జెలు మ్రోగేలా వాటిని తన్నారు. పండ్ల గుత్తులు రాల గొట్టారు. అడవి జంతువుల్లా అరిచారు. సరస్సుల్లో చల్లులాట. ఆడారు. ఉత్తుత్త యుద్ధాలు చేశారు. బండరాళ్ళు ఎక్కి జారారు. కాలువలకు అడ్డుకట్టారు. మునులులాగా మౌనంగా ఉన్నారు. పాటలు పాడారు. నాట్యాలు చేశారు. సరస్సుల్లో నీళ్ళు చిలికారు. చలిది చిక్కాలు దాచి, స్నేహితుల్ని ఏడిపించారు. వెనక నుంచి స్నేహితుల కళ్ళు మూసి, కేకలు పెట్టి వారిని బెదరించారు. చేతులలోని పిండివంటలను లాక్కొని పారిపోయారు. పరుగు పందాలు వేసుకొని ఆడారు.

ఎదిరించుకున్నారు. అంచారు. సరసమునులులాగా మౌనూరుల్ని ఏడిపించారు. కొని పారి

IV. పదజాలం

1. పాఠంలోని పద్యాల ఆధారంగా బలరామకృష్ణులు ఏ ఏ వస్తువులు ఉపయోగించి ఆడుకున్నారో, ఆ వస్తువుల పేర్లు రాయండి.
జవాబు:
గోపాలురు ఉపయోగించిన వస్తువులు ఇవి.

  1. పిల్లన గ్రోవి
  2. కంబళాలు
  3. అల్లులు
  4. బండరాళ్ళు
  5. చల్ది కావడి
  6. తియ్యని కజ్జములు

2) కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలను రాయండి.

అ) రాముడు కపులతో కలసి వారధి కట్టాడు.
జవాబు:
కోతులు

ఆ) నదులన్నీ జలరాశిలో కలుస్తాయి.
జవాబు:
సముద్రము

ఇ) నరేంద్రుడు రాజ్యాన్ని పాలిస్తాడు.
జవాబు:
రాజు

ఈ) ప్రావీణ్యం కోసం రోజూ అభ్యాసం చేయాలి.
జవాబు:
నేర్పు

ఉ) రామయ్యకు భాగ్యం కొద్దీ ఉద్యోగం దొరికింది.
జవాబు:
అదృష్టము

3) కింది పదాలను చదవండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) బొబ్బపెట్టు :
మా తమ్ముడు చీకటిలో దేనినో చూచి, దెయ్యం అని భయపడి, పెద్దగా బొబ్బపెట్టాడు.

ఆ) ఒడిసిపట్టుకొని :
నీటిలో మునిగిపోతున్న నా మిత్రుని జుట్టును నేను ఒడిసిపట్టుకొని వాడిని పైకి లాగాను.

ఇ) కౌతుకము :
పరీక్షా ఫలితాలు తెలుసుకోవాలనే కౌతుకము మాకు ఎక్కువయ్యింది.

ఈ) వన్యజంతువులు :
చట్టం ప్రకారం వన్య జంతువులను వేటాడరాదు.

ఉ) బాల్యక్రీడలు :
ఎవరికైనా తమ బాల్యక్రీడలు గుర్తు చేసుకొంటే సరదాగానే ఉంటుంది.

ఊ) మన్ననచేయు : నేను బాగా చదువుతానని మా ఇంట్లో అంతా నన్ను మన్నన చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4) ప్రకృతులు – వికృతులు రాయండి.

ప్రకృతి – వికృతి
పశువులు – పసులు
రూపము – రూపు
పణితము – పన్నిదము
కుల్య – కాలువ
తపము – తబము
విద్యలు – విద్దెలు
కుమారులు – కొమరులు
కావటి – కావడి
ఖాద్యము – కజ్జెము
యోగి – జోగి
మాననము – మన్నన
ఘాసము – కసవు

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
పాఠం ఆధారంగా బృందావనం ఎలా ఉంటుందో ఊహించి చిత్రం గీయండి. రంగులు వేయండి. దాన్ని గురించి రాయండి.
జవాబు:
బృందావనంలో పశువులకు పచ్చిమేత సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ అందమైన చెట్లు, కొండలు, నదులు, తీగలు ఉన్నాయి. బృందావనం నివాసయోగ్యమైన స్థలం.

బృందావనంలో సరస్సులు, కాలువలు ఉన్నాయి. కూర్చుండి తపస్సు చేసుకొనేందుకు బండరాళ్ళు ఉన్నాయి. ఈతలు కొట్టడానికి కాలువలు, సరస్సులు ఉన్నాయి.

బృందావనంలోని పచ్చిగడ్డిని మేస్తే పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. అక్కడ పచ్చని కొండలు ఉన్నాయి. చెట్లు అన్నీ పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. పూలతీగలు చెట్లకు దట్టంగా అల్లుకొని ఉంటాయి.

అక్కడ పచ్చికమేస్తున్న పశువులు బలిసిన పొదుగులతో చూడముచ్చటగా నడుస్తూ ఉంటాయి. ఎద్దులు కైలాసం నుండి దిగివచ్చిన శివుని నందివాహనములా అన్నట్లు ఉంటాయి.

(లేదా)

ప్రశ్న 2.
మీరు ఆడుకొనే ఆటల జాబితా తయారుచేసి, వాటిని ఉపయోగించి ఒక గేయం రాయండి.
జవాబు:
రండి రండి పిల్లలూ – ఆటలాడుదాం, ఆటలాడుదాం ||
దాగుడు మూతలూ – కోతి కొమ్మచ్చులూ
కిరికీ ఆటలూ – కుందెన గుడులూ
దూదుంపుల్లలూ – కుప్పాతన్నులూ
వెన్నెల పాటలూ – బిళ్ళా బాధుడూ || రండి రండి పిల్లలూ || ఆటలాడుదాం ||
చెడుగుడు ఆటలూ – ఉప్పట్టి కూతలూ
కొక్కో ఆటలూ – కబడ్డీ ఆటలూ
బ్యాడ్మింటన్, ఫుట్ బాలూ – వాలీబాలు, క్రికెట్టూ
లాంగు జంపు, హై జంపు – పోలు జంపు, రన్నింగులు
నడక పరుగు పోటీలు – రకరకాల ఆటలు || రండి రండి పిల్లలూ || ఆటలాడుదాం ||

VI. ప్రశంసలు

1) పిల్లలను గురించి వాళ్ళు ఆడే ఆటలను గురించి పోతన ఎంతో చక్కగా పద్యాలలో వివరించాడు కదా! ఇలా – పోతన రాసిన మరికొన్ని పద్యాలను సేకరించండి. వాటిని రాగంతో, భావంతో పాడండి.
జవాబు:
1. అలవైకుంఠ పురంబులో నగరిలోనా మూల సౌధంబు దా
పల మందారవనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోదియగు నా పన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై

2. కం|| నీపాద కమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం
తా పార భూత దయయును
తాపస మందార ! నాకు దయసేయగదే !

(లేదా)

2) బాల్య క్రీడలనే పాఠం పోతన భాగవతంలోది కదా ! భాగవతంలోని, మరికొన్ని కథలను తెలుసుకొని చెప్పండి.
జవాబు:
భాగవతంలో

  1. వామనావతారము
  2. గజేంద్రమోక్షము
  3. ధ్రువ చరిత్ర
  4. అంబరీషోపాఖ్యానం
  5. కుచేలోపాఖ్యానం వంటి కథలు చాలా ఉన్నాయి. మీ గురువుగారిని అడిగి తెలుసుకోండి.

VII. ప్రాజెక్టు పని

* మీ నాన్న, అమ్మ, మీ తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలను అడిగి, వాళ్ళ చిన్నతనంలో ఏ ఏ ఆటలు ఆడుకొనేవారో, అడిగి తెలుసుకోండి. వాటి ఆధారంగా కింది పట్టికను పూరించండి.

తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు నాన్న, అమ్మ, అత్త మొదలైన 1. మీరు ఇప్పుడు ఆడుకొనే ఆటలు | వారు చిన్నప్పుడు ఆడిన ఆటలు వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలు
మీరు ఇప్పుడు ఆడుకొనే ఆటలు
| తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు వారు చిన్నప్పుడు ఆడిన ఆటలు
నాన్న, అమ్మ, అత్త మొదలైన — వాళ్ళు చిన్నప్పుడు ఆడిన ఆటలు
1) చెడుగుడు 2) ఉప్పాట 3) కుప్పతన్నులు 4) దూదుంపుల్ల 5) కిరికి 6) చింత గింజలు 7) వామన గుంటలు 8) పరమ పదసోపాన పటం 9) పేకాట 10) చదరంగం 11) దాగుడు మూతలు

1) కబడ్డీ 2) కోకో 3) బ్యాడ్మింటన్ 4) వాలీబాల్ 5) బాస్కెట్ బాల్ 6) రింగు టెన్నిసు 7) షటిల్ 8) క్రికెట్ 9) పులి-మేక 10) లాంగ్ జంప్ మొ||నవి.

1) అంత్యాక్షరి 2) క్రికెట్ 3) హాకీ 4) షటిల్ 5) తాడు ఆట 6) వాలీబాల్ 7) చదరంగం 8) పరుగు 9) హైజంప్ 10) చింతగింజలు 11) కిరికి 12) దాగుడుమూతలు

Note :
బలరామకృష్ణులు గోపబాలురతో ఆడిన ఆటలతో, వీటిని పోల్చండి. ఏమి గ్రహించారో చెప్పండి.
జవాబు:
ఆనాడు ఆడిన ఆటలు నేడు లేవు. కొత్త ‘ఆటలు కాలానికి తగ్గవి వస్తున్నాయి. ఈ వేళ ఆడ – మగ అందరినీ ఆకర్షించే ఆట “క్రికెట్” – ఆట.

VIII. భాషను గురించి తెలుసుకుందాం అని

అ. ఈ పాఠంలోని కింది పద్యపాదాలను గమనించి, అందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి.

1) గంతులు వేతురు కౌతుకమున
దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు
జవాబు:
‘తు’

2) పోరుదురు గికుర్తు వొడచుచు దూఱుదురు.
(దీనిలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు :
జవాబు:
‘రు’

3) ఒకనొని చల్టికావడి
నొకఁ డడకించి దాచు, నొకఁ డొకఁ డదివే
టొకఁడొకఁని మొఱగి కొని చన
నొకఁ డొ ……… ఈ పద్యంలో మళ్ళీ మళ్ళీ వచ్చిన హల్లు
జవాబు:
‘క’

పై ఉదాహరణల్లో ఏ అలంకారం ఉన్నదని గుర్తించారు? వృత్త్యనుప్రాసాలంకారం.

పైన మీరు రాసిన సమాధానాలను బట్టి వృత్త్యనుప్రాసాలంకారం గుర్తించడం ఎట్లాగో తెలుసుకుందాం.

వృత్త్యనుప్రాసాలంకారం లక్షణం :
ఒకే హల్లు పునరావృత్తమైతే అంటే పలుమార్లు వచ్చినట్లైతే దాన్ని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4) పాఠంలోని మూడవ, ఐదవ పద్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి రాయండి.
జవాబు:
‘మూడవ పద్యంలో వృత్త్యనుప్రాసాలంకారములు ఉన్నాయి.
1) వేణువు లూదుచు వివిధ రూపములతో :
‘వ’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

2) గంతులు వైతురు కౌతుకమున :
‘తు’ అనే హల్లు పలుమార్లు వచ్చింది.

3) మొరయ దన్నుదు రోలి ముమ్మరముగ :
‘మ’, ‘ర’ హల్లులు, పలుమార్లు వచ్చాయి.

4) న్యజంతు చయంబుల వాని వాని :
‘వ’ హల్లు పలుమార్లు వచ్చింది.

ఐదవ పద్యంలో వృత్త్యనుప్రాసలు ఉన్నాయి.
1) మునులమై తపములు మొనయుదమా యని :
‘మ’ అనే హల్లు చాలసార్లు వచ్చింది.

2) కొమరులను సరింప కొమరు మిగుల :
‘ర’ అనే హల్లు చాలాసార్లు వచ్చింది.

గమనిక :
పై ఉదాహరణలలో ఒకే హల్లులు పలుమార్లు వచ్చాయి. కాబట్టి అవి వృత్త్యనుప్రాసాలంకారములు.

ఆ. అంత్యానుప్రాసం :
1) వేద శాఖలు వెలిసెనిచ్చట
ఆది ‘కావ్యంబలరె నిచ్చట,
ఈ గేయంలోని రెండు పంక్తుల చివరన ఉన్న పదాలు ఏవి?
మొదటి పంక్తి చివర – ఇచ్చట; రెండో పంక్తి చివర – ఇచ్చట అనే పదాలు ఉన్నాయి.

2) తలుపు గొళ్ళెం
హారతిపళ్ళెం
గుఱ్ఱపుకళ్ళెం
ఈ మూడు వరసల్లో చివర వచ్చిన పదాలు ఏవి?

  1. గొళ్ళెం
  2. పళ్ళెం
  3. కళ్ళెం అనేవి.

గమనిక :
పై ఉదాహరణలలో మీరు రాసిన సమాధానాల ద్వారా, మీరు ఒక విషయాన్ని గుర్తించి ఉండాలి. అన్ని పంక్తులూ, చివరన ఒకే రకమైన పదంతోనో, అక్షరంతోనో ముగుస్తున్నాయి. అంతే కదూ !

ఇప్పుడు మీరు ఇది అంత్యానుప్రాసాలంకారమని గుర్తించారు ‘కదూ ! ఈ అలంకారాన్ని గుర్తించడానికి లక్షణం ఏమిటో రాద్దాం.

అంత్యానుప్రాసలంకార లక్షణం :
పాదాంతంలో లేదా పంక్తి చివరలో, ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే దాన్ని “అంత్యానుప్రాసాలంకారం” అంటాం.

ఇ. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం :

* కింది తరగతిలో పోలిక చెప్పడంలో అలంకారం ఉన్నదని. అది ‘ఉపమాలంకారం’ అని తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ఉపమాలంకారం లక్షణాన్ని తెలుసుకుందాం.

ఉదా : సోముడు భీముడిలాగ (వలె) బలవంతుడు.

ఈ వాక్యంలో సోముణ్ణి భీముడితో పోల్చారు. ఇలా చెప్పినప్పుడు వాక్యంలో ఉండే పదాలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తాం

సోముడు – ఉపమేయం (అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదం)
భీముడు – ఉపమానం (ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం)

బలవంతుడు – సమానధర్మం – పోల్చడానికి వీలయిన సమానగుణం (ఉపమేయ ఉపమానాలలో ఉన్న ఒకే విధమైన ధర్మం) లాగ (వలె) – ఉపమావాచకం (ఉపమానాన్ని సమానధర్మంతో కలపడానికి వాడే పదం)

గమనిక :
ఇక్కడ ఉపమాన, ఉపమేయాలకు చక్కని సామ్యం అంటే పోలిక – చెప్పటం జరిగింది. ఇలా చెప్పటాన్ని ‘ఉపమాలంకారం’ అంటారు.

ఉపమాలంకార లక్షణం :
“ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ‘ఉపమాలంకారము’.

ఈ. ఉత్ప్రేక్షాలంకారము :
ఆరో తరగతిలో, ఊహించి చెప్పడంలో ఒక అలంకారం ఉందని తెలుసుకున్నారు కదా ! అది ‘ఉత్ప్రేక్షాలంకారం’. ఇప్పుడు దీని లక్షణం తెలుసుకుందాం.

ఉదా : ‘ఆ ఏనుగు నడిచే కొండా! అన్నట్టు ఉంది’.

పై వాక్యాన్ని గమనించండి. ఇందులో కూడా పోలిక కనబడుతున్నది కదూ? ఈ పోలిక అనేది ఊహించి చెప్పినది.

ఈ వాక్యంలో ఉపమేయం – ‘ఏనుగు’, ఉపమానం – ‘నడిచే కొండ’.
ఇక్కడ ఏనుగును కొండలా ఊహిస్తున్నామన్నమాట.
దీన్ని బట్టి ఉత్ర్ఫేక్ష అలంకారం లక్షణాన్ని కింది విధంగా చెప్పవచ్చు.

ఉత్ప్రేక్షాలంకార లక్షణం : ఉపమేయాన్ని మరోకదానిలా (ఉపమానంగా) ఊహించి చెప్పడం ‘ఉత్ప్రేక్ష’.

కింది వాక్యాల్లోని అలంకారములు గుర్తించండి.

1. గోపి సూర్యుడిలాగ ప్రకాశిస్తున్నాడు.
జవాబు:
పై వాక్యంలో ‘ఉపమాలంకారము’ – ఉంది. ఇందు ‘గోపి’ని ‘సూర్యుడి’తో పోల్చారు.

2. మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉంది.
జవాబు:
పై వాక్యంలో ‘ఉత్ప్రేక్షాలంకారము’ – ఉంది. ఇందు ‘మండే ఎండ’ ‘నిప్పుల కొలిమి’గా ఊహించడం జరిగింది.

II. లఘువులు, గురువులు గుర్తించుట

మీరు చదువుకొనే పద్యాలు, గేయాలు, పాటలు ఒక పద్ధతిలో రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కదూ ! అలా ఎందుకు ఉంటాయంటే వాటిని కవులు కొన్ని నియమాలకు లోబడి రాస్తారు. ప్రతి నియమానికి కొన్ని గుర్తులు ఉంటాయి.

1) కింది అక్షరాలను పలకండి.

1) అ, ఇ, ఉ, ఋ, ఎ, ఒ
క, చి, తు, టె, ప, జొ
ఘ, ఝ, థ, ధ, భ, స, హ

పైన వ్రాసిన అక్షరాలను ఒక్కోటి పలకటానికి ఎంత సమయం పడుతున్నది?

గమనిక :
వీటిని పలకటానికి కనుటెప్ప పాటు అంతకాలం, లేక చిటికె వేసే అంతకాలం పడుతుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2) ఆ, ఈ ఊ, ఏ, ఐ, ఓ, ఔ, అం
గౌ, జం, డం, దా

పైన వ్రాసిన అక్షరాల వంటి అక్షరాలలో ఒక్కో అక్షరాన్ని పలకటానికి ఎంత సమయం పడుతున్నది? గమనించారా?

(1) లో సూచించిన అక్షరాలు పలకటానికి, (2) లో సూచించిన అక్షరాలు పలకటానికి పట్టే సమయంలో కొంత తేడా కనబడుతున్నది కదూ !

(1) లో వ్రాసిన అక్షరాలు పలకటానికి కనుటెప్పపాటు కాలం పడుతుంది లేదా చిటికె వేసేటంత కాలం పడుతుంది.
(2) లో వ్రాసిన అక్షరాలు పలకటానికి చిటికె వేసేటంత కాలం కంటె ఎక్కువ సమయం పడుతుంది.

గమనిక :
మరి వీటిని గుర్తు పట్టేందుకు మనవారు గుర్తులను ఏర్పాటు చేశారు – ఆ గుర్తులు ఏమిటో చూడండి.

రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు – అంటే మనం హ్రస్వాక్షరాలుగా పిలుచుకొనే అక్షరాలను ‘l’ గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తును ‘లఘువు’ అని అంటాం. ‘l’ = లఘువు.

లఘువు పలికే సమయం కంటె ఉచ్చారణకు ఎక్కువ సమయం అవసరం అయ్యే అక్షరాలను ‘U’ గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తును గురువు అంటాం. ‘U’ = గురువు.

గమనిక :
లఘువు మన అంకెల్లోని ’19, గురువు ఆంగ్ల అక్షరాలలోని ‘U’ ను పోలి ఉంటాయి.

* ఈ పదాలను చూడండి. వీటిలోని అక్షరాలను ఎలా సూచించారో గుర్తించండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 2

గమనిక :
అయితే గురులఘువులను గుర్తించటానికి మనం మరికొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

3) కింది పదాలను చూడండి.

1) తర్కం 2) మెట్ట 3) చూడగన్ 4) నష్టం వీటిలో
‘ర్క’ – ఇది సంయుక్తాక్షరం కదూ!
‘ట్ట’ – ఇది, ద్విత్వక్షరం కదూ!
‘గన్’ – ఇందులో “గ”న్ అనే పొల్లుతో కూడి ఉంది కదూ!
మరి ఇలాంటప్పుడు ‘లఘుగురువులను ఎలా గుర్తించవచ్చునో చూడండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 3

వీటిలో ఏం గమనించారు? సంయుక్తాక్షరాల ముందున్న అక్షరాన్ని గురువుగా గుర్తించాం కదూ!

* అంటే సంయుక్తాక్షరం ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించాలి.
ఈ కింది పదాలలో గురులఘువులను ఎలా గుర్తిస్తామో చూడండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 4

వీటిలో ద్విత్వాక్షరం ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించాం కదూ!

* అంటే సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరాల విషయంలో ఒకే విధానాన్ని పాటిస్తాం.
ఇక –
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 5

* వీటిలో పొల్లుతో కూడిన అక్షరాలను గురువుగా గుర్తించాం కదూ!
ఇలా లఘుగురువులను గుర్తించడం అనేది పద్యాలు రాయటానికి ఉపయోగపడే నియమాల్లో మొదటి నియమం. మిగిలిన విషయాలను పై తరగతుల్లో నేర్చుకుందాం.

4) కింది పదాలకు లఘువు, గురువులను గుర్తించండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు 6

కవి పరిచయం

పాఠ్యభాగం పేరు : “బాల్య క్రీడలు”
కవి పేరు : బమ్మెర పోతన
కాలం : 15వ శతాబ్దం
జన్మస్థలం : బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా
దేని నుండి గ్రహింపబడింది : ‘ఆంధ్రమహా భాగవతం’ దశమస్కంధం నుండి గ్రహింపబడింది.
రచనలు : 1) భోగినీ దండకం
2) ఆంధ్రమహా భాగవతం
3) వీరభద్ర విజయం

బిరుదు : “సహజ పండితుడు.

1. బాల్య క్రీడలు పాఠ్యభాగ రచయిత పోతన కవిని గూర్చి పరిచయం చేయండి.
జవాబు:
‘బాల్య క్రీడలు’ అనే పాఠం పోతన మహాకవి రచించిన ఆంధ్రమహా భాగవతము దశమ స్కంధములోనిది. పోతన 15వ శతాబ్దము వాడు. ఈయన తెలంగాణలో వరంగల్లు జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. ఈయనకు ‘సహజ పండితుడు’ అనే బిరుదు ఉంది.

పోతన గారు ఆంధ్రమహా భాగవతము, భోగినీ దండకము, వీరభద్ర విజయము, నారాయణ శతకము అనే గ్రంథాలు రచించాడు. పోతనగారి పద్యం ఒక్కటైనా రాని తెలుగువాడు ఉండడు.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

1వ పద్యం : – కంఠస్థ పద్యం
* క. కసవు గల దిరవు పసులకు,
లస దద్రినదీ మహీజ లతికావలి పెం
పెసఁగును, గాఁపురమునకును, .
బొసఁగును బృందావనంబు వొదఁడచ్చటికిన్.
ప్రతిపదార్థం :
బృందావనంబు = బృందావనము అనే ప్రదేశము ఉంది.
కసవు = గడ్డి (పశువులకు మేత)
కలదు = (అక్కడ) ఉంది
పసులకున్ = పశువులకు
ఇరవు = (అది) అనుకూలమైన చోటు
లసత్ = ఒప్పుచున్న
అద్రీ = పర్వతములు (క్రీడా పర్వతములు)
నదీ = నదులూ
మహీజ = చెట్లు
లలితావలి (లతికా + ఆవలి) = తీగల సమూహమును
పెంపు = ఇంపుగా (అందముగా)
ఎసగును = (అక్కడ) ఉంటాయి
కాపురమునకును = (మనము) నివసించడానికి
పొసగును = (అది) అనుకూలంగా ఉంటుంది
అచ్చటికిన్ = ఆ బృందావనానికి
పొదఁడు = పోదాం రండి.

భావం :
‘బృందావనం’ అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత సమృద్ధిగా దొరుకుతుంది. అక్కడ అందమైన పర్వతాలూ, నదులూ, చెట్లూ, తీగలూ ఉన్నాయి. అది నివసించడానికి తగినట్లుగా ఉంటుంది. అక్కడికి పోదాం పదండి.

గమనిక :
ఉపనందుడు అనే ముసలి గోపాలకుడు, మిగిలిన గోపాలురతో ఈ మాట చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

2వ పద్యం :
వ. ఇట్లు బృందావనంబుఁ జెందిఁయందుఁగొంతకాలంబునకు
రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడికొని
వేడుక లూదు కొన దూడలఁ గాచుచు.
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా
బృందావనంబున్ + చెంది = బృందావనానికి పోయి
అందున్ = అక్కడ
కొంతకాలంబునకు = కొంతకాలానికి
రామకృష్ణులు = బలరామకృష్ణులు
సమాన వయస్కులు + ఐన = తమతో సమానమైన వయస్సు కలవారైన
గోపబాలకులన్ = గోపాల బాలురను
కూడికొని = కలిసికొని
వేడుకలు = సంతోషములు
ఊడుకొనన్ = నాటుకొనేటట్లు (సంతోషంతో)
దూడలన్ + కాచుచు = దూడలను కాస్తున్నారు.

భావం :
ఇలా బృందావనం చేరిన కొంత కాలానికి, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలిసి, ఆనందంగా దూడలను కాస్తున్నారు.

3వ పద్యం : కంఠస్థ పద్యం
* సీ. వేణువు లూఁదుచు వివిధరూపములతో
గంతులు వైతురు కౌతుకమున,
గురుకంబళాదుల గోవృషంబులఁబన్ని
పరవృషభము లని ప్రతిఘటింతు,
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జెలు
మొరయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి
వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప,

తే.గీ. వన్యజంతుచయంబుల వాని వాని,
వదరు వదరుచు వంచించి పట్టఁబోదు,
రంబుజాకరములఁజల్లులాడఁజనుదు
రాకుమారులు బాల్యవిహారులగుచు.
ప్రతిపదార్థం :
ఆ కుమారులు = ఆ బాలురైన రామకృష్ణులు
బాల్య విహారులు + అగుచు = చిన్నతనంలో ఆటలు ఆడుతూ
వేణువులు = పిల్లన, గ్రోవులు
ఊదుచున్ = ఊదుతూ
వివిధ రూపములతోన్ = రకరకాల వేషాలతో
కౌతుకమునన్ = ఉత్సాహంతో
గంతులు వైతురు = గంతులు వేస్తారు
గురుకంబళ + ఆదులన్ = పెద్ద పెద్ద కంబళ్ళు మొదలయిన వాటితో
గోవృషంబులన్ = ఆబోతులను (ఎద్దులను)
పన్ని = తయారు చేసి
పరవృషభములు + అని = అవి శత్రువుల ఎద్దులు అని
ప్రతిఘటింతురు = వాటిని ఎదిరిస్తారు
అల్లులు = బట్టలతో తయారు
చేసిన బొమ్మలు
దట్టించి = కూరి, (గుడ్డలతో కూరి)
అంఘ్రుల = (తమ) కాళ్ళ;
గజ్జెలు = గజ్జెలు
మొరయన్ = మ్రోగేటట్లు
ముమ్మరముగా = ఎక్కువగా
ఓలిన్ = వరుసగా
తన్నుదురు = ఆ బొమ్మలను తన్నుతారు
పన్నిదంబులు = పందెములు
వైచి = వేసుకొని
ఫల మంజరులన్ = పండ్ల గుత్తులను
ప్రావీణ్యము + ఒప్పన్ = నేర్పుగా
కూల్చి = పడగొట్టి
వ్రేటులాడుదురు = దెబ్బలాడుకుంటారు
వన్యజంతుచయంబులన్ = అడవి జంతువుల సమూహములను
వాని వాని = ఆయా జంతువుల యొక్క
వదరు వదరుచున్ = కూతలవలె కూస్తూ (అరపులవలె అరిచి వాటిని ఆకర్షించి)
వంచించి = వాటిని మోసగించి
పట్టన్ + పోదురు = వాటిని పట్టుకోబోతారు
అంబుజ + ఆకరములన్ = తామరపూలు నిండిన సరస్సులలో
చల్లులు + ఆడన్ = ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొనే జలక్రీడలు ఆడడానికి
చనుదురు = వెళతారు

భావం :
ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ, రకరకాల వేషాలు ధరించి సంతోషంగా గంతులు వేస్తున్నారు. పెద్ద పెద్ద కంబళ్ళను కప్పుకొని, ఎద్దుల రూపాలు తయారుచేసి, అవి శత్రువుల ఎద్దులని వాటిని ఎదిరిస్తారు. బట్టలతో తయారుచేసిన బొమ్మలను తన్నుతూ ఆడుతుంటే, వాళ్ళ కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమంటున్నాయి. పండ్ల గుత్తులను రాలగొట్టడానికి పందెములు వేసుకొని వారు తమ నేర్పరితనాన్ని చూపిస్తున్నారు.

అడవి జంతువుల కూతలను అనుకరిస్తూ అరుస్తూ, ఆ జంతువులు దగ్గరకు రాగానే, వాటిని పట్టుకోబోతారు. సరస్సుల్లోకి వెళ్ళి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ బాల్య క్రీడలలో సంచరిస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

4వ పద్యం :
క. పోరుదురు గికురు వొడుచుచు,
దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్
జాఱుదురు ఘనశిలాతటి,
మీఱుదు రెన్నంగరాని మెలఁకువల నృపా !
ప్రతిపదార్థం :
నృపా = ఓ రాజా ! పరీక్షిన్మహా రాజా ‘ (శుక మహర్షి భాగవతాన్ని పరీక్షిత్తు మహారాజుకు చెబుతున్నాడు. అందువల్లనే ‘నృపా’ అంటే ఇక్కడ పరీక్షి న్మహారాజా ! అని భావం)
కికురు + పొడుచుచు = మోసగించుచు; (ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్ధాలు చేస్తూ)
పోరుదురు = పోరాడుతారు; (దొంగదెబ్బలు కొట్టుకుంటారు)
భయంబు లేక = భయం లేకుండా
తోరపుటిరవుల్ (తోరము + ఇరవుల్) = సుందరమైన ప్రదేశాలలో
దూఱుదురు = ప్రవేశిస్తారు
ఘనశిలా తటిన్ = పెద్ద బండరాళ్ళు పైకి ఎక్కి వాటిపై నుండి
జాఱుదురు = కిందికి జారుతూ ఉంటారు
ఎన్నంగరాని = ఊహింపశక్యముకాని
మెలకువలన్ = నైపుణ్యాలతో
మీఱుదురు = అతిశయిస్తారు (మించి పోతారు)

భావం :
ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్దాలు చేస్తూ, దొంగదెబ్బలు కొట్టుకుంటారు. అందమైన స్థలాలలోకి ఏ మాత్రం భయం లేకుండా పోతారు. పెద్ద పెద్ద బండరాళ్ళ పైకి ఎక్కి కిందికి జారుతూ ఉంటారు. ఈ పనులు చేయడంలో ఊహింపశక్యం కాని నైపుణ్యాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు.

5వ పద్యం : కంఠస్థ పద్యం
* సీ. కపులమై జలరాశిఁగట్టుదమా యని
కట్టుదు రడ్డంబుఁగాలువలకు,
మునులమై తపములు మొనయుదమా యని
మౌనులై యుందురు మాట లేక,
గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ
బాడుదమా యని పాడఁ జొత్తు,
రప్సరోజనులమై యాడుదమా యని
యాండు రూపుల ఁదాల్చి యాడఁ జనుదు,

ఆ.వె. రమర దైత్యవరులమై యభిం ద్రక్తమా,
యని సరోవరములయందు హస్త
దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు
కొమరులనుచరింపఁ గొమరు మిగిలి.
ప్రతిపదార్థం :
కపులము + ఐ = కోతుల వలె అయి
జలరాశిన్ = సముద్రానికి
కట్టుదము + ఆ = వారధికడదామా?
అని = అంటూ
కాలువలకున్ = (దగ్గరలోని) కాలువలకు
అడ్డంబు = అడ్డుకట్టలు
కట్టుదురు = కడుతున్నారు
మునులము + ఐ = (మనమంతా) మునులవలె అయి
తపములు = తపస్సులకు
మొనయుదుమా = పూనుకుందామా (చేద్దామా?)
అని = అంటూ
మౌనులు + ఐ = మునులవలె అయి
మాటలేక = మాట్లాడకుండా
ఉందురు = ఉంటారు
గంధర్వ వరులము + ఐ = శ్రేష్ఠులైన గంధర్వుల వలె
గానవిద్యలు = సంగీత విద్యలు
మీఱన్ = అతిశయించేటట్లుగా (సంగీత విద్యా నైపుణ్యంతో)
పాడుదుమా + అని = పాడదామా ? అని;
పాడన్ + బొత్తురు = పాడడం మొదలు పెడతారు
అప్సరోజనులమై (అప్పరః + జనులము + ఐ) = అప్సరసలవలె అయి
ఆడుదమా + అని = “నాట్యం చేద్దామా? అంటూ
ఆడురూపులన్ = ఆడువేషాలను
తాల్చి = ధరించి
ఆడన్ = నాట్యం చేయడానికి
చనుదురు = సిద్ధం అవుతారు
అమర, దైత్యవరులము + ఐ = దేవతలూ, రాక్షస శ్రేష్ఠులమూగానై
అబ్దిన్ = సముద్రాన్ని
త్రత్తమా + అని ఆ మథిద్దామా అంటూ
హస్తదండచయమున్ = (తమ) కట్టల వంటి చేతులతో
త్రిప్పి = నీళ్ళు చిలికి
తమ + ఈడు = తమతో సమాన వయస్సుగల
కొమరులు = కుమారులు
అనుచరింపన్ = అనుసరించి తమగ వెంట రాగా
కొమరు మిగిలిన్ = సౌందర్యము అతిశయించేటట్లు (కనుల విందుగా)
తరుతురు = నీటిని చిలుకుతారు.

భావం :
మనము అంతా కోతుల వలె సముద్రానికి వారధి కడదామా? అంటూ, కాలువలకు అడ్డుకట్టలు కడుతున్నారు. మునులవలె తపస్సు చేద్దామా? అంటూ, మాట్లాడకుండా మునులులాగా కూర్చుంటున్నారు. గంధర్వులవలె చక్కగా పాటలు పాడుదామా ? అంటూ, చెవులకు ఇంపుగా పాడుతున్నారు. మనం అంతా అప్సరసల వలె నాట్యం చేద్దామా? అంటూ, ఆడువేషాలు వేసుకొని నాట్యం చేస్తున్నారు. “మేము దేవతలం, మీరు రాక్షసులు, మనం కలిసి సముద్రాన్ని మథిద్దామా?” అంటూ, సరస్సులలో నీళ్ళను చేతులతో చిలుకుతున్నారు. ఈ విధంగా తమ ఈడు పిల్లలతో కలిసి బలరామకృష్ణులు ఆటలాడు తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

6వ పద్యం :
క. ఒకనొకని చల్దికావడి,
నొకఁడొకఁ డడకించి దాఁచు, నొకఁడొకఁడది వే
ఱోకనొకని మొఱగికొని చన
నొకఁడొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా !
ప్రతిపదార్థం :
ఉర్వీనాథా = ఓ రాజా ! (పరీక్షిన్మహా రాజా!)
ఒకనొకని = ఒకానొక పిల్లవాడి యొక్క
చల్టికావడిన్ = చలిది అన్నం మూట తెచ్చుకున్న కావడిని (చిక్కాన్ని)
ఒకడొకడు = ఒకానొకడు (ఒక పిల్లవాడు)
అడకించి = బెదరించి
దాచున్ = దాస్తాడు
ఒక డొకడు = ఇంకొకడు
అది = ఆ కావడిని
వేఱోకనొకని = ఇంకో బాలుడిని
మొఱగికొని = దాచిన వాడిని మోసగించి
చనన్ = పట్టుకొని పోగా
ఒకడు = ఇంకో పిల్లవాడు
అది = ఆ కావడిని
తెచ్చి + ఇచ్చు = తీసుకొని వచ్చి మొదటి వాడికి ఇస్తాడు

భావం :
ఒకని చల్ది కావడిని (చిక్కాన్ని) మరొకడు బెదరించి తీసుకొని ఒక చోట దాచాడు. దాచిన వాణ్ణి మోసగించి ఇంకొకడు ఆ చిక్కాన్ని తీసికొని వెళ్ళాడు. వాడి దగ్గర నుంచి వేరొకడు తెచ్చి మొదటి వాడికి దాన్ని ఇచ్చాడు.

7వ పద్యం : కంఠస్థ పద్యం
* క. ఒక్కఁడు ము న్నే మటి చన
నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్, వే
ఱోక్కఁడు ముట్టి తటాలున,
నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁ గన్.
ప్రతిపదార్థం :
ఒక్కడు = ఒక పిల్లవాడు
మున్ను = ముందు
ఏమఱి = ప్రమాదపడి (పరధ్యానంగా ఉండి)
చనన్ = నడుస్తూ ఉండగా
ఒక్కడు = మరో బాలుడు
ఉలికిపడన్ = (నడిచేవాడు) ఉలిక్కిపడేటట్లు (త్రుళ్ళిపడేటట్లు)
బలు బొబ్బ = పొలికేక (పెద్దకేక)
పెట్టున్ = పెడతాడు (వేస్తాడు)
వేరు + ఒక్కడు = మరో పిల్లాడు
ముట్టి = ముట్టుకొని
తటాలునన్ = అకస్మాత్తుగా
ఒక్కడు = మరో పిల్లాడు
నగగన్ = నవ్వేటట్లు
ఒక్కని = ఒక పిల్లవాని
కనుదోయిన్ = కన్నుల జంటను
మూయున్ = మూస్తాడు .

భావం :
ఒకడు పరధ్యానంగా నడుస్తూంటే, ఇంకొకడు వెనుక నుండి గట్టిగా కేకపెడతాడు. అది విని వాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, ఇంకొకడు వెనుక నుండి వచ్చి మరొకడి కళ్ళు రెండూ మూశాడు. అది చూసి వేరొకడు నవ్వుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

8వ పదం: కంఠస్థ పద్యం
* క. తీపుగల కట్ట మన్యుఁడు,
గోపింపఁగ నొడిసి పుచ్చుకొని పోవాఁడుం
బైపడి యదిగొని యొక్క ఁడు,
కేపులలో నిట్టునట్టుఁగికురించు నృపా !
ప్రతి పదార్థం :
నృపా = ఓ రాజా (పరీక్షిత్తు మహారాజా!)
కోపింపగన్ = కోపం వచ్చేటట్లు
తీపు + కల = తియ్యదనం కల
కజ్జము = పిండివంటను
అన్యుడు = మరొకడు
ఒడిసి పుచ్చుకొని = బలవంతంగా పట్టుకొని
పోలాడ్రున్ = పారిపోవును
ఒక్కడు = మరొకడు
పైపడి = వాడి మీద పడి (పిండి వంట లాగుకున్న వాడి మీద పడి)
అది + కొని = వాడి చేతిలోని పిండి వంటను తీసికొని
క్రేపులన్ = దూడల మధ్యన
ఇట్టునట్టున్ = ఇటూ అటూ
కికురించున్ = తప్పించుకొని తిరుగుతాడు

భావం :
ఒకడి చేతిలోని పిండి వంటను మరొక్కడు లాక్కొని పారిపోతున్నాడు. పిండి వంట తెచ్చుకొన్న వాడికి చాలా కోపం వచ్చింది. కాని ఆ పారిపోతున్నవాడి దగ్గరి నుంచి దాన్ని మరొకడు లాక్కొనిపోయి దూడల మధ్య అటూ ఇటూ తిరుగుతూ వాడికి తాను దొరకకుండా వీణ్ణి ఏడిపిస్తున్నాడు.

9వ పద్యం : కంఠస్థ పద్యం
* క. వనజాక్షుఁడు మున్నరిగిన,
మునుపడఁగా నేనెయతని ముట్టెద’ ననుచుం
గని మును ముట్టనివానిన్,
మును ముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా !
ప్రతిపదార్థం :
నరేంద్రా = ఓ రాజా !
వనజాక్షుడు (వనజ + అక్షుడు) = పద్మముల వంటి కన్నులు కలవాడైన శ్రీకృష్ణుడు
మున్ను = ముందుగా
అరిగినన్ = వెళ్ళగా (నడుస్తూ ఉంటే)
అతనిన్ = ఆ శ్రీకృష్ణుని
మునుపడగా = ముందుగా
నేనె = నేనే
ముట్టెదన్ = ముట్టుకుంటాను
అనుచుంగని = అంటూ చూచి
మును = ముందుగా
ముట్టనివానిన్ = ముట్టుకోలేనివాణ్ణి (చూచి)
మునుముట్టినవాడు = ముందుగా శ్రీకృష్ణుణ్ణి ముట్టుకొన్న పిల్లవాడు
మొనసి = గట్టిగా ప్రయత్నించి
నవ్వున్ = నవ్వుతున్నాడు

భావం :
కృష్ణుడు ముందు నడుస్తూ ఉంటే చూసి, ఇదరు బాలురు “కృష్ణుణ్ణి ముందుగా ఎవరు ముట్టుకుంటారో చూద్దాం” అని పందెం వేసుకున్నారు. వారిలో ముందుగా వెళ్ళి కృష్ణుని ఒకడు ముట్టుకున్నాడు. వాడు కృష్ణుని ముందుగా ముట్టుకోలేని పిల్లవాణ్ణి చూసి, గట్టిగా నవ్వుతున్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 16 బాల్య క్రీడలు

10వ పద్యం : -కంఠస్థ పద్యం
ఉ. ఎన్నఁడునైన యోగివిభు లేవ్వని పాదపరాగ మింతయుం
గన్నులఁగానరట్టి హరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్టఁబట్టుచుం
దన్నుచుగ్రుద్దుచున్ నగుచుఁదద్దయు ఁబైపడి కూడి యాడుచున్
మన్నన సేయు వలవకుమారుల భాగ్యము లింత యొప్పునే?
ప్రతిపదార్థం :
యోగి విభులు : యోగీశ్వరులు (మహాయోగులు)
ఎన్నడునైనన్ = ఎప్పుడైనా
ఎవ్వని = ఏ శ్రీకృష్ణుని
పాదపరాగము = పాద ధూళిని
ఇంతయున్ = రవ్వంతయైనా
కన్నులన్ = తమ కన్నులతో
కానరు = చూడలేకపోయారో
అట్టిహరిన్ = అటువంటి శ్రీకృష్ణుని
కౌగిటన్ = కౌగిలిలో
చేర్చుచున్ = చేర్చుకుంటూ (ఆలింగనం చేసికొంటూ)
చెట్టపట్టుచున్ = చెట్టాపట్టాలు వేసికొంటూ (భుజాలపై చేతులు వేసికొంటూ)
తన్నుచున్ = ఒకరినొకరు తన్నుకుంటూ
గ్రుద్దుచున్ = గుద్దుకుంటూ
నగుచున్ = నవ్వుకుంటూ
తద్దయున్ = మిక్కిలి (ఎక్కువగా)
పైబడి (పైన్ + పడి) . = మీదపడి
కూడి + ఆడుచున్ = కలసి ఆడుకుంటూ
మన్నన + చేయు = ఆదరించే
వల్లవ కుమారులు – గొల్లపిల్లల (గోపబాలుర)
భాగ్యములు = నా అదృష్టములు
ఇంత ఒప్పునే = ఎంత గొప్పవో కదా !

భావం :
యోగి శ్రేష్ఠులు సైతం, పరమ పురుషుడయిన శ్రీకృష్ణుని పాదధూళిని రవ్వంత కూడా తమకన్నులతో చూడలేరు. అటువంటి శ్రీకృష్ణుణ్ణి గోపబాలురు కౌగిలించు కుంటున్నారు. చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. తన్నుకుంటున్నారు, గుద్దుతున్నారు. నవ్వుతూ మీదపడుతూ కలిసి ఆడుకుంటున్నారు. ఈ గోప బాలకుల అదృష్టం ఎంత గొప్పదో కదా?

గమనిక :
ఈ మాట పోతన కవి అంటున్నాడు. మనం అందరం ఇలాగే అనుకోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 15th Lesson జానపద కళలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 15th Lesson జానపద కళలు

7th Class Telugu 15th Lesson జానపద కళలు Textbook Questions and Answers

ఇవి చేయండి

ప్రశ్న 1.
‘తోలుబొమ్మలాట’ గురించి రాయండి.
జవాబు:
తోలు బొమ్మలాట, ప్రాచీన కళ. మొదట కొండగుహల్లో, కొవ్వు దీపాల వెలుగులో, రాతి గోడలపై నీడలు పడేలా చేసేవారు. మొదట్లో కీలుబొమ్మలు, ఊచబొమ్మలు ప్రదర్శించేవారు. ఈ తోలు బొమ్మలాట కళింగపట్నం, మచిలీపట్టణం వంటి ఓడరేవుల నుండి, టర్కీ, పర్షియా వంటి విదేశాలకు వ్యాపించింది.

తోలుబొమ్మలాటలో తెరకట్టి తెరవెనుక దీపాలు వెలిగించి, తోలుబొమ్మలు ఆడిస్తారు. . ఈ బృందంలో భర్త రాముడి మాటలు, భార్య సీత మాటలు చెపుతుంది. మిగతా కుటుంబ సభ్యులు, మిగిలిన పాత్రలకు వాచికం చెపుతారు.

తోలుబొమ్మలను, మేక, జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. అందుకే దీనిని ‘చర్మనాటకం’ అని కూడా పిలుస్తారు. . తోలుబొమ్మలను వెదురుబద్దతో ఆడిస్తారు.

మధ్య మధ్య కేతిగాడు, జుట్టు పోలిగాడు, ‘బంగారక్క వంటి హాస్య పాత్రలు నవ్విస్తారు. పూర్వం తోలు బొమ్మలాట వారు, బళ్ళపై ఊరూరు తిరిగి, ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరు భీష్మపర్వం, పద్మవ్యూహం, రామాయణంలో సుందరకాండ, భాగవతంలో కృష్ణలీలలు, రావణవధ వంటి ప్రదర్శనలు ఇచ్చేవారు.

మన రాష్ట్రంలో హిందూపురం, అనంతపురం, మధిర, నెల్లూరు, కాకినాడ ప్రాంతాలలో ఈ తోలు బొమ్మలాట – బృందాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
వీధి భాగవతం గురించి మీ సొంతమాటల్లో రాయండి. .
జవాబు:
పురాణ గాథలను నాట్యరూపంగా ప్రదర్శించేవారిని, భాగవతులు అంటారు. భాగవతులు అంటే భగవంతుడి కథలను ప్రదర్శించేవారని అర్థం. వీరు పోతనగారి భాగవతంలోని కథలను, ‘కస్తూరి రంగ రంగా’ అంటూ జానపద శైలిలో నటిస్తూ పాడతారు. ఈ భాగవతాలలో కూచిపూడి భాగవతం, చిందు భాగవతం, గంటె భాగవతం, ఎరుకల భాగవతం, శివ భాగవతం, చెంచు భాగవతం, తూర్పు భాగవతం ప్రసిద్ధమైనవి.

మన రాష్ట్రంలో ఎర్రగొల్లలు, కూచిపూడి భాగవతులు, జంగాలు, చిందు భాగవతులు, యానాదులు, దాసరులు, ఈ భాగవతాలను ప్రదర్శిస్తున్నారు. నేటికీ వీధి భాగవతం లేదా తూర్పు భాగవతం, మన రాష్ట్ర తూర్పు తీరంలో సజీవంగా ఉంది. దీన్ని ‘సత్యభామా కలాపం’ అని కూడా అంటారు. తూర్పు భాగవతం అనే పేరుతో, విజయనగరం జిల్లాలో అమ్మవారి పండుగలలో నేటికి ఇది ప్రదర్శింపబడుతోంది.

ఉత్తరాంధ్ర మాండలికాలతో, యాసతో ఇది వినసొంపుగా ఉంటుంది. ఈ తూర్పు భాగవత ప్రదర్శన ఇచ్చేవారిలో వరదనారాయణ, జగన్నా నం, శంకరయ్య, దాలయ్య, వెంకటస్వామి ప్రముఖులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 3.
‘తప్పెటగుళ్ళు’ ప్రత్యేకత” . వివరించండి.
జవాబు:
తప్పెటగుళ్ళు ఉత్తరాం లో ఎక్కువగా కనిపించే జానపద కళ. తప్పెట గుళ్ళను ప్రదర్శించేవారు, రంగు బనియన్లు నిక్కరులు ధరించి, కాళ్ళకు బరువైన గజ్జెలు కట్టుకుంటారు. రేకుతో గుండ్రంగా చేసిన తప్పెట గుండ్లను, గుండెకు . కట్టుకొని, గట్టిగా వాయిస్తారు. వారు గుండ్రంగా తిరుగుతూ, లయానుగుణంగా అడుగులు వేస్తూ, ఎగురుతూ తప్పెట వాయిస్తూ పాడతారు. ఈ బృందంలో 20 మంది ఉంటారు. మిగిలిన వారు నాయకుడిలాగే తిరుగుతూ నృత్యం చేస్తారు. నాట్యం చివర, వీరు అద్భుత విన్యాసాలు చేస్తారు.

వీరు రామాయణ, భారత, భాగవత కథల్ని గేయాలుగా అల్లుకుంటారు. ఇదంతా మౌఖిక సాహిత్యం . వీరు చెంచులక్ష్మి, సారంగధర, లక్ష్మణ మూర్ఛ వంటి పురాణ కథలతో పాటు, తెలుపాట, గాజులోడి పాట, మందులోడి పాట, చుట్టపాట, వంటి జానపదాలు కూడా పాడతారు.

దేశ విదేశాలలో ఇచ్చిన ప్రదర్శనల వల్ల “తప్పెటగుళ్ళు” పేరుకెక్కింది. కోరాడ పోతప్పడు, చిన్నప్పయ్య, ఆదినారాయణ, కీట్లంపూడి బృందం యలమంచిలి బంగారమ్మ, దుర్యోధన బృందం, మొదలయినవి, ప్రసిద్ధి చెందిన తప్పెట గుళ్ళ కళా బృందాలు.

కింతాడి సన్యాసి రావు కళా బృందం, “తాగొద్దు మామో ! నీవు సారా తాగొద్దు” అంటూ, జన చైతన్యం కోసం ఇస్తున్న ప్రదర్శనలు ప్రజల మెప్పు పొందాయి.

ప్రశ్న 4.
బుర్రకథ – హరికథలను గురించి రాయండి.
జవాబు:
బుర్రకథ :
బుర్రలతో చెప్పే కథ కాబట్టి, ఇది బుర్రకథ. ప్రధాన కథకుడు తంబుర వాయిస్తూ పాడతాడు. వంతలు బుర్రలు వాయిస్తూ వంత పాడతారు. ప్రధాన కథకుడు కథ చెపుతాడు. వంతలలో ఒకడు కథను వివరిస్తాడు. మరొకడు హాస్యం చెపుతాడు.

బుర్రకథకు మొదటివాడు, షేక్ నాజర్. ఈయనకు ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు నిచ్చింది. వీరు అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం, పలనాటి వీరచరిత్ర వంటి చారిత్రక గాథలు చెపుతారు. పద్మవ్యూహం, లంకా దహనం వంటి పురాణ కథలూ, చెపుతారు.

హరికథ :
చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జెలు, పట్టుబట్టలు, మెడలో దండ ధరించి, హరిదాసులు ఈ కథ చెపుతారు. హరికథలో ఒకే వ్యక్తి అన్ని పాత్రలలో రసవంతంగా నటిస్తాడు. మంచివేషంతో, నోటితో కథ చెపుతూ, హరిదాసు తియ్యగా పాడుతాడు. కాళ్ళతో నృత్యం చేస్తాడు, చేతులతో అభినయిస్తాడు.

మొదటి హరికథ, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి రాసిన “ఆధ్యాత్మిక రామాయణం”. హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణ దాసుగారు, హరికథను అన్ని కళల మొత్తంగా తీర్చిదిద్ది ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకువచ్చారు.

ఉమాచౌదరి, లలితకుమారి, కోట సచ్చిదానంద భాగవతార్, అమ్ముల విశ్వనాథ భాగవతార్, మంగరాజు భాగవతారిణి వంటి కళాకారులు, పేరుపొందిన హరిదాసులు.. సామవేదం కోటేశ్వరరావు, సూర్యనారాయణ భాగవతాలు, మధుర హరికథా గాయకులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 5.
‘కోలాటం – చెక్క భజనలను’ గురించి మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
మీ ప్రాంతంలో ప్రసిద్ది చెందిన ఏదైనా రెండు జానపద కళలను గురించి మీ సొంతమాటలలో రాయండి.
జానపద కళలైన కోలాటం, చెక్కభజనలను గురించి మీకు తెలిసింది రాయండి.
జవాబు:
‘కోలాటం, అంటే కోలలతో అంటే కర్రలతో చేసే భజన నృత్యం. దీనిని గ్రామ దేవత పండుగలలో, తీర్థాలలో,. జాతరలలో ప్రదర్శిస్తారు. కళాకారులు చేతిలో కోలాటం కర్రలు పట్టుకుంటారు.

జట్టు నాయకుడు ఈల వేస్తూ ఎలా నాట్యం చేయాలో చెపుతాడు. జట్టులో వారు కర్రలు ఒకరికొకరు తగిలిస్తూ లయకు అనుగుణంగా పాడుతూ నృత్యం చేస్తారు. జట్టు నాయకుణ్ణి కోలన్న పంతులు లేక మేళగాడు అంటారు. వీరు జానపద పాటలు, రామాయణం ఘట్టాలు, కృష్ణుడి బాల్య చేష్టలు, భక్తి పాటలు, మొ||వి పాడతారు. పాటకు తగ్గట్టుగా నృత్యం చేయడాన్ని, ‘కోపు’ అంటారు. వెంకట రమణ ప్రముఖ కోలాట విద్వాంసుడు.

చెక్క భజన :
చెక్క భజనలు, పండుగలలో, జాతరలలో యువకులు రాత్రివేళ దేవాలయాల దగ్గర చేస్తారు. వీరు పంచె కట్టి, రంగు గుడ్డ తలకు చుట్టి, నడుమునకు పట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. ఇత్తడి బిళ్ళలు ఉన్న చెక్కలను చేతితో ఆడిస్తూ, గుండ్రంగా వెనుకకూ, ముందుకు నడుస్తూ, తిరుగుతూ భజన చేస్తారు. అందరూ ఈ కలిసి ఒకేసారి ఎగరడం, కూర్చోడం, లేవడం చేస్తారు.

వీరు భారత, రామాయణ, భాగవతాది పురాణ గాథలను పాడతారు. వీటిలో హరి భజనలు, పండరి భజనలు, కోలాట భజనలు, అడుగు భజనలు వంటి ప్రక్రియలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి చాలావరకు తగ్గాయి.

ప్రశ్న 6.
‘గిరిజన నృత్యం’ గురించి మీ సొంతమాటల్లో చెప్పండి. జ. అరకులోయలో కొండదొర, భగత, ఖ్యోద్, బోండీ అనే తెగల గిరిజనులున్నారు. ఉత్సవాల సమయంలో ఒక – గ్రామం వారు, మరో గ్రామానికి వెళ్లి, ‘థింసా’ నృత్యం. చేస్తారు. వివాహం సమయంలోనూ, చైత్రమాసంలో ఇటికల పండుగ రోజుల్లోనూ, గిరిజనులు ఈ నృత్యం చేస్తారు.

థింసా జట్టుకు ఒక నాయకుడు ఉంటాడు. 20 మంది స్త్రీలు నృత్యం చేస్తారు. వాయిద్యాలు, మగవారు వాయిస్తారు. థింసాలో సన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, పిన్నలగర్ర, జోడి కొమ్ములు అనే ఆరు వాయిద్యాలు పురుషులు వాయిస్తారు. తమ గ్రామదేవత ‘నిసాని దేవత’ ను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని, “బోడి థింసా” అంటారు.

ఈ నృత్యంలో ఒకవైపు మగవారు, మరొకవైపు స్త్రీలు, చేతులు పట్టుకొని వరుసగా నిలబడతారు. వీరు బృంద నాయకుడిని అనుసరిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తారు. ఈ నృత్యంలో పొంగిబుల్లమ్మ, కొర్రరాజమ్మ, కిలోల్ల లక్ష్మమ్మ మొదలయిన థింసా నృత్యబృందాలు. దేశమంతా ప్రదర్శనలు ఇస్తూ పేరుపొందాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రశ్న 7.
కురవంజిని గూర్చి రాయండి.
జవాబు:
తెలుగువారి మొట్టమొదటి గిరిజనుల దృశ్యకావ్యం అని, కురవంజిని గూర్చి చెపుతారు. కురవంజి అంటే ఒక నృత్యవేషంతో కూడిన లయబద్దమైన అడుగు. అరణ్యాలలో నివసించే చెంచులు, కోయలు, కురవలు ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు.

‘కురవలు’ అనే గిరిజనులు ప్రదర్శించేది, కాబట్టి దీనిని కురవంజి లేక కొరవంజి అని పిలుస్తూ వచ్చారు. పుణ్యక్షేత్రాలను గురించిన పురాణకథలు ఈ నృత్యంలో ప్రదర్శింపబడతాయి. ఈ నాటికీ తిరుపతి, మంగళగిరి, శ్రీశైలం, భద్రాద్రి, సింహాచలం మొదలయిన యాత్రాస్థలాల్లో, కురవలు కురవంజి నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

కఠిన పదములకు అర్థములు

పరవశించిన = ఆనందంతో తృప్తిపడిన
గాథలుగా = కథలుగా
అభినయించేవారు = నటించేవారు
ఓనమాల వంటివి = ప్రారంభకములు (మొదటివి)
రూపుదిద్దుకున్నాయి = రూపం ధరించాయి
జాలువారిన = ప్రసరించిన, వ్యాపించిన
వీనుల విందు = చెవులకు పండుగ
ఇతిహాసాలు = పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు
వన్నె తరుగుతున్న = యోగ్యత తగ్గిన
ఆధ్యాత్మిక ఔన్నత్యం = పరమాత్మ సంబంధమైన గొప్పతనం
అలరిస్తున్నాయి = ఆనందింపచేస్తున్నాయి
సంతరించుకుంటుంది = ధరిస్తుంది
ఆమడలు = నాలుగు క్రోసుల దూరం,
యోజనము నానుడి = సామెత
వాచికం = మాట
వంతపాడు = ఒకరు అన్న మాటనే అనాలోచితంగా తాను కూడా అనడం
అనుగుణంగా = తగ్గట్టుగా
జీవనోపాధి (జీవన + ఉపాధి) = బ్రతుకు దెరవు
ప్రఖ్యాతి చెందాయి = ప్రసిద్ధి పొందాయి
జానపద శైలి = గ్రామీణ శైలి
ఉధృతంగా = గొంతెత్తి గట్టిగా
వలయాకారంగా = గుండ్రంగా
పతాక స్థాయి = ఉన్నతస్థాయి
విన్యాసాలు = ప్రదర్శనలు
ఆకట్టుకుంటాయి = ఆకర్షిస్తాయి
ప్రాచుర్యం = విస్తారము
మన్ననలు పొందాయి = ఆదరం పొందాయి
గుమ్మెట = తుడుము అనే వాయిద్యము
రక్తి కట్టిస్తారు = ఆసక్తి కలిగేలా ప్రదర్శిస్తారు
ఆద్యుడు = మొదటివాడు
సత్కరించింది = గౌరవించింది

AP Board 7th Class Telugu Solutions Chapter 15 జానపద కళలు

ప్రజాదరణ (ప్రజా+ఆదరణ) = ప్రజల ఆదరణ
ఆహార్యం = వస్త్రధారణ రూపమైన అభినయం
వాచకం = నోటితో మాట్లాడడం ద్వారా చేసే అభినయం
సమాహారం = మొత్తము, గుంపు
అనాది = మొదలు లేనిది (చిరకాలంగా ఉన్నది)
ప్రాంగణం = ముంగిలి
ఉత్కృష్టము = శ్రేష్ఠము
దర్పణాలు = అద్దాలు
శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకొన్న పాండిత్యము
కాలగర్భం = కాలము కడుపు
గ్రంథస్థం = గ్రంథములో వ్రాయడం
జీవనోపాధి = బ్రతకడానికి దారి
వర్తమానం = ప్రస్తుత కాలం
వలస పోతున్నారు = మరో దేశానికి పోతున్నారు
కర్తవ్యం = చేయవలసిన పని

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 14th Lesson కరపత్రం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 14th Lesson కరపత్రం

7th Class Telugu 14th Lesson కరపత్రం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు ? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు?
జవాబు:
చిత్రంలో బాలబాలికలు ఉన్నారు. వారు ఊరేగింపుగా నడచి వెడుతున్నారు. వారు బాలల హక్కుల గురించి నినాదాలు ఇస్తున్నారు.

ప్రశ్న 2.
ఇలాంటి దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా?
జవాబు:
ఇలాంటి దృశ్యాల్ని నేను చాలామార్లు చూశాను. ఎయిడ్స్ వారోత్సవాలు, నెహ్రూ జయంతి ఉత్సవాలు, చిన్నపిల్లలకు టీకాలు వేయించడం, స్వచ్ఛభారత్ ఉద్యమం వంటి సందర్భాలలో పిల్లలు నినాదాలు చేస్తూ వీధుల్లో ఊరేగుతారు.

ప్రశ్న 3.
ఇలా ఎప్పుడెప్పుడు ఊరేగింపులు నిర్వహిస్తారు? ఎందుకు?
జవాబు:
ఇలాంటి ఊరేగింపులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, సేవాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు శోభాయాత్రలు చేస్తూ ఉంటారు. ప్రజలకు విషయాలు తెలియజేయడానికీ, తమ హక్కులను గూర్చి, – కోరికలను గూర్చి, ప్రభుత్వాలకు చాటి చెప్పడానికి ఇలాంటి ఊరేగింపులను నిర్వహిస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

ప్రశ్న 4.
ఊరేగింపులో ఏమి పంచుతున్నారు? వాటిని ఏమంటారు?
జవాబు:
ఊరేగింపులో కాగితాలు పంచుతున్నారు. వాటిని “కరపత్రాలు” అంటారు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఏదైనా ఒక కరపత్రాన్ని సేకరించండి. ఇద్దరిద్దరు కలిసి కూర్చోండి. ఒకరు తెచ్చిన కరపత్రాన్ని ఇంకొకరికి చదివి వినిపించండి. విన్న తరువాత ఆ కరపత్రంలో ఏ అంశాలు ఉన్నాయో చెప్పండి.
జవాబు:
నేను సేకరించిన కరపత్రం “సాయిబాబా గుడి ప్రారంభోత్సవానికి సంబంధించినది. మా నగరంలో కొత్తగా కట్టిన షిరిడీసాయి దేవాలయంలో వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ ఒక కార్యక్రమం ఉంది. వాటిని చూచి, ప్రసాదం తీసుకొని తరించండని కరపత్రం పంచారు

ప్రశ్న 2.
పిల్లల హక్కులను గూర్చి మీ తల్లిదండ్రులను అడగండి. వారు ఏమి చెప్పారో చెప్పండి.
జవాబు:
పిల్లలకు (1) చదువుకొనే హక్కు (2) అభివృద్ధి చెందే హక్కు’ (3) కూడు-గూడు-గుడ్డ హక్కు (4) తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉన్నాయని మా తల్లిదండ్రులు చెప్పారు.

ప్రశ్న 3.
మీ వాడలో / గ్రామంలో బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళను బళ్ళలో చేర్చడానికి మీరేం చేస్తారు?
జవాబు:
మా బడిలో జరిగే ఉత్సవాల గురించి, టీచర్లు చెప్పే కథలను గూర్చి, బడికిరాని పిల్లలకు చెపుతాను. వారిని బడికి . రమ్మని ప్రోత్సహిస్తాను. వాళ్ళకు నా పుస్తకాలు అరువు ఇస్తాను. బడికి రాని పిల్లల ఇళ్ళకు, నా మిత్రులతో, ఉపాధ్యాయులతో కలిసి వెళ్ళి, వారి పిల్లలను బడికి పంపమని, వారి తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పిస్తాను.

II. చదవడం – రాయడం

1. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

మదునయ్య చేపల వ్యాపారి. శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్ కు వెళ్ళి, ఆరో తరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి, పదివేలకు అతన్ని పనికి కుదుర్చుకున్నాడు. గంగయ్యను తన వెంట తీసుకొని శ్రీశైలం వచ్చాడు. గంగయ్య రోజూ నీటి ఒడ్డున కూర్చొని వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి కూడా అక్కడే పడుకొనేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించారు. గంగయ్యను బళ్ళో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.

అ) మదునయ్య ఎవరు? ఏం చేసేవారు?
జవాబు:
మదునయ్య చేపల వ్యాపారి. ఆయన శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు.

ఆ) గంగయ్య ఎవరు? శ్రీశైలానికి ఎందుకు వచ్చాడు?
జవాబు:
గంగయ్య బరంపురంలో 6వ తరగతి చదివేవాడు. మదునయ్య వద్ద చేపల చెరువును కాపలా కాసేందుకు శ్రీశైలం వచ్చాడు.

ఇ) గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేం కోల్పోయాడు?
జవాబు:
గంగయ్య పనిలో చేరడం వల్ల చదువుకొనే స్వేచ్ఛ కోల్పోయాడు.

ఈ) బాలల హక్కులలో గంగయ్య ఏ హక్కులకు దూరమయ్యాడు?
జవాబు:
బాలల హక్కులలో గంగయ్య (1) చదువుకొనే హక్కు (2) కూలి జీవితం నుండి బయటపడే హక్కు (3) ఆటపాటలతో కూడిన వినోదం, విశ్రాంతి పొందే హక్కు కోల్పోయాడు.

ఉ) మదునయ్యను ఎందుకు శిక్షించారు? ఇలా చేయడం సరైందేనా?
జవాబు:

  1. మదునయ్య గంగయ్య యొక్క చదువుకొనే హక్కుకు భంగం కలిగించాడు. .
  2. కష్టమైన పని చేయకుండా బయటపడే హక్కును భంగపరచాడు.
  3. చదువుకొనే బాలుడిని మదునయ్య పనిలో పెట్టుకున్నాడు. అది తప్పు కాబట్టి మదునయ్యను శిక్షించడం సబబే.

ఊ) గంగయ్య తల్లిదండ్రులు చేసినపని సరైందేనా? ఎందుకు?
జవాబు:
గంగయ్య యొక్క తల్లిదండ్రులు చేసిన పని సరైంది కాదు. 6వ తరగతి చదువుకొంటున్న గంగయ్యను వారు బడి మాన్పించి బాలకార్మికునిగా పనిచేయడానికి మదునయ్యకు అమ్మివేశారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

2. కింది వాక్యాలను చదివి తప్పో, ఒప్పో గుర్తించండి. కారణం రాయండి.
AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం 2

3. పాఠం చదవండి. జవాబులు రాయండి.

అ) కరపత్రం అంటే ఏమిటి? లేఖలకు, కరపత్రాలకు గల తేడాలు ఏమిటి?
జవాబు:
చేతిలో అనువుగా ఒదిగి, ఒక విషయానికి సంబంధించిన వివరణను “కరపత్రం” అంటారు. చేతిలో కాగితం అని దీని అర్థం. పదిమందికీ తెలియవలసిన విషయంతో కూడుకున్నదే కరపత్రం.

లేఖలలో రాసే, చదివే వ్యక్తుల వ్యక్తిగత విషయాలు ఉంటాయి. కరపత్రాలలో వ్యక్తిగత విషయాలే కాక, మనచుట్టూ ఉన్న సమాజం, దేశం, ప్రపంచంలోని విషయాలు ఉంటాయి.

ఆ) కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు? కరపత్రాలు ఎలా ఉంటాయి?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని అందరికీ తెలియచేయడం కోసమే కరపత్రాన్ని రూపొందిస్తారు.

కరపత్రాలు వేసిన వాళ్ల, రాసిన వాళ్ళ పేర్లు, ముద్రణాలయం పేరు, కరపత్రంలో ఉండాలి. సాధారణంగా కరపత్రాలు అన్నీ చౌకగా ఉండే రంగు కాగితాల్లోనే అచ్చువేస్తారు. ఎక్కువగా కరపత్రాలు ఒకటి రెండు పేజీలకు పరిమితం అవుతాయి. అవసరాన్ని బట్టి ఇవి వేరు వేరు కొలతలలో, పరిమాణాలలో కనిపిస్తాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనం ఉన్న అంశాలు సామాన్య ప్రజలకు చేరవేయడానికి, కరపత్రం మంచి సాధనంగా ఉపయోగిస్తుంది.

ఇ) పాఠంలోని కరపత్రం దేనికి సంబంధించినది? దీన్ని ఏ శాఖవారు తయారుచేశారు? ఎందుకు?
జవాబు:
పాఠంలోని కరపత్రం, బాలల హక్కుల వారోత్సవాలకు సంబంధించినది. దీనిని పాఠశాల విద్యాశాఖ వారు తయారుచేశారు. బాలల హక్కులను గూర్చి అందరికీ తెలియజేయడానికి ఈ కరపత్రాన్ని తయారుచేశారు.

ఈ) కరపత్రంలో ఏ చట్టాన్ని గురించి తెలిపారు? అది ఎప్పటి నుంచి అమలు జరుగుతున్నది?
జవాబు:
కరపత్రంలో ‘బాలల హక్కుల చట్టాన్ని గురించి తెలిపారు. ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కులను నిర్వచించి, వాటి అమలుకు పూనుకొన్నది. ఆగస్టు 2009లో భారత ప్రభుత్వం, బాలల విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించి చట్టం చేసింది. మన రాష్ట్రంలో 1-4-2010 నుండి నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చింది.

ఉ) బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా ఏ ఏ అంశాలను గురించి అవగాహన కల్పించాలని భావించారు?
జవాబు:
బాలల హక్కుల వారోత్సవాలలో విద్యాహక్కు చట్టం గురించి తెలియజేయాలని భావించారు. 6 -14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలందరూ, ఉచిత నిర్బంధ విద్యను పొందడం, బాలల హక్కులు రక్షింపబడటం, బడికి వెళ్ళని పిల్లల్ని బడుల్లో చేర్చడం, పిల్లల దగ్గర ఫీజులు, విరాళాలు వసూలు చేయడం, చట్ట విరుద్ధమని, తెల్పడం, వలస వచ్చిన పిల్లలకు కూడా విద్యా సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు అందించడం, వగైరా విషయాలపై అవగాహన కల్పించాలని భావించారు.

ఊ) బాలల హక్కుల జాబితా తయారుచేయండి.
జవాబు:

  1. జీవించే హక్కు
  2. చదువుకొనే హక్కు
  3. ఆరోగ్యం పోషణ హక్కు
  4. కూడు, గూడు, గుడ్డ హక్కు
  5. ఆటపాటలతో కూడిన వినోదం, విశ్రాంతి పొందే హక్కు
  6. కష్టమైన పని చేయకుండా బయటపడే హక్కు
  7.  కూలి జీవితం నుండి బయట పడే హక్కు
  8. కులమత వర్గ విచక్షణ లేని బాల్యం అనుభవించే హక్కు
  9. దౌర్జన్యాల నుండి రక్షణ పొందే హక్కు – ప్రత్యేకించి ఆడపిల్లలు దుర్మార్గుల నుండి రక్షణ పొందే హక్కు
  10. అభివృద్ధి చెందే హక్కు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.

అ) అందరూ చదువుకోవాలి కదా! కాని కొంతమంది ఆడపిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు చదివించడం లేదు. దీనిమీద మీ అభిప్రాయం తెలపండి.
జవాబు:
ఆడపిల్లలను తల్లిదండ్రులు తప్పక చదివించాలి. మగ పిల్లలవలె పోటీ పరీక్షలకు పంపించి, ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు సాధించేలా వారికి శిక్షణ ఇప్పించాలి.

ఇపుడు చదువుకొని, ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలకే పెళ్ళిళ్లు అవుతున్నాయి. నేడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే కాని, సంసారాలు నడవవు. ఒకవేళ ,,వారు ధనవంతులయినా, తల్లిదండ్రులు ఇద్దరూ విద్య చదువుకున్నవారు కాకపోతే, వారికి పుట్టిన పిల్లలు అభివృద్ధి కాలేరు. కాబట్టి ఆడపిల్లలను తప్పక చదివించాలి.

ఆ) బాలబాలికలలో ‘ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా ఉంటారు. మరి ఈ పిల్లలు బడిలో ఉంటే వాళ్ళ హక్కులను కాపాడటానికి మీరేం చేస్తారు?
జవాబు:
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, అంటే అంగవైకల్యం గల పిల్లలు. అంగవైకల్యం గలవారు మిగిలిన పిల్లలవలె చదువుకొనడం వీలుపడదు. కొందరికి సరిగా వినబడదు. కొందరు.సరిగా నడవలేరు. కొందరికి చూపు తక్కువ.

పైన చెప్పిన అంగవికలురకు ప్రత్యేక పాఠశాలలు, మండల కేంద్రాల్లో పెట్టాలి. లేదా రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనయినా, ప్రభుత్వము చెవిటి, మూగ మొదలయిన అంగవైకల్యం కలవారికి, వారికి పాఠం చెప్పే నేర్పు కల ఉపాధ్యాయులను నియమించి; పాఠశాలలు స్థాపించాలి.

నేను నా మిత్రుల సాయంతో కొంత నిధిని పోగుచేసి, అటువంటి మిత్రులకు వారి చదువుకు కావలసిన ఉపకరణాలు కొనియిస్తాను.

IV. పదజాలం

1. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) హక్కులు, బాధ్యతలు :
ప్రతి దేశపౌరుడూ తనకు గల హక్కులూ, బాధ్యతలూ తెలుసుకోవాలి.

ఆ) కంటికి రెప్పలా :
మన దేశ సైనికులు, రాత్రింబగళ్ళు శ్రమించి దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు.

ఇ) సొంతకాళ్ళమీద నిలబడు :
నా మిత్రుడు తాను ఉద్యోగం సంపాదించి,. సొంతకాళ్ళమీద నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ) విజయం సాధించు :
నేను పరీక్షలలో మంచి మార్కులతో విజయం సాధించాను.

ఉ) రక్షణ :
పిల్లలందరికీ తల్లిదండ్రులతో పాటు, ప్రభుత్వ రక్షణ కూడా అవసరం.

ఊ) పనితనం :
మంచి పనితనం ఉన్నవారికి, అన్ని రంగాలలో గుర్తింపు వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

2. నీకు వినోదాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? కష్టాన్ని, విసుగును, అలసటను కలిగించేవి ఏవి?
జవాబు:

వినోదం, విశ్రాంతి, ఆనందం కలిగించేవికష్టం, విసుగు, అలసట కలిగించేవి
1. సినీమా, టీవీ, పాటలు వినడం1. విశ్రాంతి లేకుండా చదవడం.
2. ఆటలు ఆడడం, చూడడం2. ఉదయాన్నే లేచి నడవడం, జాగింగ్ వగైరా శరీరశ్రమ.
3. క్రికెట్ ను టీవీలో చూడడం3. పెద్దవాళ్ళ చాదస్తపు సలహాలు
4. మిత్రులతో షికారుకు వెళ్ళడం, పూలతోటల్లో సంచరించడం.4: నీతి ఉపదేశాలు.
5. షవర్ కింద స్నానంచేయడం, చెరువులో,కాలువలో ఈత లాడడం.5. పరుగుపోటీల్లో పాల్గొనడం వగైరా

3. “బడి”, పిల్లల ప్రపంచం. ఇది పిల్లల అభివృద్ధికి కృషి చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బడికి సంబంధించిన పదాలు రాయండి.
జవాబు:
బడి క్రమశిక్షణకు ఉత్తమసాధనం. పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు. పాఠశాలల్లో క్రీడలు, భావి క్రీడాకారుల కార్చానాలు. పరీక్షలు విజ్ఞానాన్ని మెరుగుపెట్టే సానరాళ్ళు. బడి పిల్లలు, పుష్పాల వంటివారు. పిల్లలు దుర్మార్గం, కపటం, మోసం ఎరుగని జాతి పుష్పాలు. బడి పిల్లలకు వెలుగును, విజ్ఞానాన్ని పంచే దేవాలయం.

4. వారం రోజులపాటు ఏదైనా ఒక అంశం గురించి, కార్యక్రమాలను నిర్వహిస్తే ‘వారోత్సవం’ అంటారు. వారోత్సవాలలాగ, ఇంకా ఏ ఏ ఉత్సవాలు నిర్వహిస్తారు. వాటి పేర్లు రాయండి.
జవాబు:

  1. మాసోత్సవాలు : నెలరోజులు చేసే ఉత్సవాలు.
  2. పక్షోత్సవాలు : 15 రోజులు చేసే ఉత్సవాలు.
  3. సప్తాహాలు : ఏడు రోజులు చేసే ఉత్సవాలు.
  4. ప్రభాత సేవలు : తెల్లవారు జామున చేసే సేవలు.
  5. దినోత్సవం : స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం వంటివి ఒక్కరోజు మాత్రమే చేసే ఉత్సవాలు.
  6. వార్షికోత్సవాలు : సంవత్సరానికి ఒకసారి చేసే ఉత్సవాలు.
  7. సాంవత్సరికోత్సవం : సంవత్సరము (ఏడాది). చివరన చేసే ఉత్సవం.
  8. రజతోత్సవం : 25 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
  9. స్వర్ణోత్సవం : 50 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.
  10. వజోత్సవం : 60 సంవత్సరాల తరువాత చేసే ఉత్సవం.

5. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. మన సాహిత్య సమావేశం వివరాల కరపత్రం పంచి పెట్టాము. (చేతిలో కాగితం)
2. వ్యాపారంలో ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించాలి. (లోతుగా)
3. ఈ రోజు నగరంలో జనసమ్మర్దము ఎక్కువగా ఉంది. (జనుల సందడి)
4. ఆధునిక కాలం లో ప్రజలకు “టీవీ”లపై మోజు పెరిగింది. (నేటి కాలం)
5. పత్రికలలో అసంఖ్యాకమైన ప్రకటనలు వస్తున్నాయి. (లెక్కలేనన్ని)
6. నాకు ఈ విషయంలో ఇంకా సందిగ్ధంగా ఉంది. (సందేహాలు)
7. మాట్లాడేటప్పుడు అపార్థాలకు చోటివ్వకుండా మాట్లాడాలి. (అపోహలు)
8. కరపత్రం భావప్రకటనా స్వేచ్ఛకు సంకేతం. (గుర్తు)

6. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) నిశితంగా : మా తమ్ముడు ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తాడు.
2) ప్రపంచవ్యాప్తంగా : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు ధరలు పెరిగాయి.
3) జన సమ్మర్ధము : తీర్ధంలోని జన సమ్మర్టంలో మా తమ్ముడు ‘తప్పిపోయాడు.
4) ఆధునిక కాలం : ఆధునిక కాలంలో పిల్లలకు ఫ్యాషన్ల పిచ్చి ముదిరింది.
5) అసంఖ్యాకంగా : నేడు ప్రభుత్వం అసంఖ్యాకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది.
6) అపార్ధము : మాట్లాడే మాట అపార్థాలకు తావు లేకుండా ఉండాలి.
7) సందిగ్ధం : చేసే పనిలో సందిగ్గానికి చోటు ఉండరాదు. –
8) ఆస్కారము : నీవు చెప్పిన మాటను బట్టి అతడు ఇంట్లో ఉండడానికి ఆస్కారముంది.
9) సమకాలీనం : సహజంగా జనానికి, సమకాలీన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

7. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

1. సౌకర్యం × అసౌకర్యం
2. ప్రధానము × అప్రధానము
3. ప్రాచీనము × నవీనము
4. గట్టిగా × నెమ్మదిగా.
5. నిర్భయం × భయం
6. సందిగం × అసందిగం
7. సాధారణం × అసాధారణం
8. వాస్తవం × అవాస్తవం

V. సృజనాత్మకత

బాలల హక్కుల వారోత్సవాల గురించి కరపత్రం చదివారు కదా ! కింది అంశాలలో ఏదైనా ఒక అంశంపై మీ మిత్రులతో కలిసి ఒక కరపత్రం తయారు చేయండి.

అ) పరిసరాల పరిశుభ్రత,
ఆ) దోమల నిర్మూలన
ఇ) చెట్ల పెంపకం
జవాబు:

పరిసరాల పరిశుభ్రత

చదవండి ! – ఎదగండి !
రోగం వస్తే చేంతాడు క్యూలో నిలబడి, డాక్టరును కలిసి మందులు కొనుక్కొని మింగుతాం. అసలు రోగాలెందుకు వస్తున్నాయి? దానికి మనం ఎంతవరకు కారణం అని ఆలోచించం. నిజంగా ఆలోచిస్తే మన ఇంటిచుట్టూ పరిసరాల శుభ్రత లేకపోవడం వల్లే, ఈ రోగాలు మనపై దండయాత్ర చేస్తున్నాయి.

మనం ఇల్లు తుడిచి ఆ తుక్కు పక్క ఇంటి వాని గుమ్మం ముందు వేస్తాం. ‘మన ఇంట్లోని మురికినీరు రోడ్లపైకి వదలివేస్తాం. మనకు పనికిరాని ‘వస్తువులు రోడ్లపైకి విసరుతాం. మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు. దోమల వల్లే మనకు సగం రోగాలు. అందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మందులూ, డాక్టర్లూ అవసరం ఉండదు. పరిసరాల పరిశుభ్రత పాటించండి. మందుల అవసరం తగ్గించండి. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు మానండి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోండి.

మా మాట వినండి.
తేది XXX,
విజయవాడ.

ఇట్లు,
పాఠశాల ఆరోగ్యసమితి.

VI. ప్రశంసలు

* బాలల హక్కుల కోసం కృషి చేసే వారి గురించి / సంస్థల గురించి మీ అభిప్రాయాలు రాయండి. వారిని అభినందిస్తూ లేఖ రాయండి.
జవాబు:

అభినందనలేఖ

తిరుపతి,
XXXXX

రాజీవ్/నెహ్రూ బాలల హక్కుల సంఘాల వారికి,

ఆర్యులారా !
అభినందనలు నగరంలో మీరు చేస్తున్న కృషి వల్ల మన నగరంలోని బాల బాలికలందరూ, నేడు పాఠశాలల్లో చదువుతున్నారు. మీ కృషి వల్ల ఎందరో వీధి బాలలూ, రైళ్ళల్లో తిరుగుతూ ముష్టి ఎత్తుకొనే పిల్లలూ, అనాథ బాలబాళికలూ, నేడు మీరు స్థాపించిన సేవాసదన్లలో చేరి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఎందరో కాఫీ హోటళ్ళలో పనిచేస్తూ ఉండే బాలురు, వీధుల్లో చెత్త కాగితాలు ఏరుకొనే పిల్లలు, నేడు మీ సంస్థల ద్వారా సాయం పొంది, హాయిగా తిండికీ బట్టకూ లోటు లేకుండా చదువుకుంటున్నారు.

మీరు చేస్తున్న కృషికి, సేవా భావానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. నమస్సులు.

ఇట్లు, పి.
రాము & కె. సరోజ,
7వ తరగతి,
దేవస్థానం ఉన్నత పాఠశాల,
తిరుపతి.

చిరునామా :
కార్యదర్శి,
రాజీవ్/నెహ్రూ బాలల హక్కుల సంఘాలు,
తేరువీధి, తిరుపతి.

VII. ప్రాజెక్టు పని

* కొన్ని కరపత్రాలు సేకరించండి. వాటిని ఎవరు ముద్రించారు? ఎందుకోసమో తెలపండి.
జవాబు:

ముద్రించినవారుఎందుకోసం
1. అమలాపురం మునిసిపల్ కమీషనర్1. పిల్లలకు పోలియో చుక్కలు వేయించమని
2. మండల విద్యాధికారి, అమలాపురం2. బడి ఈడు పిల్లలను అందరినీ బడులలో చేర్పించమని
3. వేంకటేశ్వర దేవస్థానం, కార్యనిర్వహణాధికారి3. వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల కార్యక్రమం గురించి
4. డీలక్సు సినిమా హాలు వారు4. కొత్తగా రిలీజయిన సినిమా గురించి
5. చందన బ్రదర్సు, అమలాపురం5. ఆ సంస్థ వార్షికోత్సవంలో ఇస్తున్న రిబేట్ల గురించి, బంగారు వస్తువుల, బట్టల అమ్మకం గురించి.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1. అ) కింది వాక్యాలు భావాన్ని అనుసరించి ఏ వాక్యాలో గుర్తించండి. ఆ ప్రక్కన రాయండి.
ఉదా : ఎంత బాగుందో ! (ఆశ్చర్యార్థక వాక్యం)

అ. నువ్వు చదువు. (విధ్యర్థక వాక్యం)
ఆ. అల్లరి చేయవద్దు. (నిషేధార్థక వాక్యం)
ఇ. పరీక్షలు రాయవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఈ. తనూ బొమ్మలు వేయగలడు. (సామర్థ్యార్థక వాక్యం)

కింది వాక్య భేదాలు చూద్దాం.

1. రవి పనిచేస్తాడో చెయ్యడో !
ఈ వాక్యం చదివితే రవి పనిచేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదూ! ఇలా సందేహాన్ని తెలిపే పాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.

2. నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు !
ఈ వాక్యం ఏ అర్థాన్ని సూచిస్తున్నది? ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లు కనబడుతోంది కదా ! ఇలా ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచించే వాక్యాలను “ఆశీరక వాక్యాలు” అంటారు.

3. దయచేసి పని చేయండి
ఈ వాక్యం ఒక పనిని చేయమని ప్రార్థిస్తూ ఉంది. అంటే ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నది. కాబట్టి ఇది “ప్రార్థనార్థక వాక్యం”

ఒక వాక్యం ప్రార్థన అర్థాన్ని సూచిస్తున్నట్లు ఉంటే అది ప్రార్థనార్థక వాక్యం అన్నమాట.

4. ఏం ! ఎప్పుడొచ్చావ్ ?
ఈ వాక్యం ప్రశ్నిస్తున్నట్లుంది కదూ ! అంటే ఇది “ప్రశ్నార్థక వాక్యం”.
ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం.

5. వర్షాలు లేక పంటలు పండ లేదు.

ఈ వాక్యం మనకు రెండు విషయాల్ని తెలుపుతోంది. ఒకటి వర్షాలు లేవని, రెండు పంటలు పండలేదని. ఐతే పంటలు పండకపోవడానికి కారణం మొదటి విషయం. అంటే వర్షాలు లేకపోవటం. ఈ మొదటి విషయం . రెండో విషయానికి కారణం అవుతోంది. అంటే హేతువు అన్నమాట. ఇలా హేతువు అర్థాన్ని సూచించే వాక్యం “హేత్వర్థక వాక్యం”.

ఒక పని కావడానికి కారణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని “హేత్వర్థక వాక్యం” అంటాం.

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

2) కింది వాక్యాలు ఏ అర్థాన్ని సూచించే వాక్యాలో రాయండి.

అ) ఎవరా పైడిబొమ్మ? (ప్రశ్నార్థక వాక్యం)
ఆ) పంటలు పండలేదు. (సామాన్యవాక్యం)
ఇ) దయచేసి సెలవు ఇవ్వండి. (ప్రార్థనార్థక వాక్యం)

అభ్యాసాలు : ఇలాంటి వాక్యాల్ని మీ పాఠ్యాంశాలలో వెతికి రాయండి.

  1. భక్తిపాడర తమ్ముడా ! (ప్రార్థనార్థక వాక్యం)
  2. పదముపాడర తమ్ముడా ! (ప్రార్థనార్థక వాక్యం)
  3. గారవింపవె చెల్లెలా ! (ప్రార్థనార్థక వాక్యం)
  4. పాటపాడవె చెల్లెలా ! (ప్రార్థనార్థక వాక్యం)
  5. మీ ఆకలి బాధ నివారించుకోండి. (ప్రార్థనార్థక వాక్యం)
  6. తమరు కుశలమేకదా? (ప్రశ్నార్థక వాక్యం)
  7. తుదకు దొంగలకిత్తురో? దొరలకౌనో? (సందేహార్థక వాక్యం)
  8. తిరిగి యిమ్మువేగ తెలుగుబిడ్డ? (విధ్యర్థక వాక్యం)
  9. పుస్తకమ్ములను చింపబోకు మురికీ చేయబోకు (విధ్యర్థక వాక్యం)
  10. కుసుమ వల్లరు లేరీతి గ్రుచ్చినావు? (ప్రశ్నార్థక వాక్యం)
  11. మీరు పక్షులను గుర్తించగలరా? (ప్రశ్నార్థక వాక్యం)
  12. దేన్ని గురించి నేను మీకు రాయాలి? (ప్రశ్నార్థక వాక్యం)
  13. స్టేషన్లో టికెట్లను జారీ చెయ్యకండి. (నిషేధార్థక వాక్యం)
  14. కేబుల్ గ్రామ్ పంపించండి. (ప్రార్థనార్థక వాక్యం)
  15. దాచిన బడబానలమెంతో? (ప్రశ్నార్థక వాక్యం)
  16. సుకృతంబు గట్టికొనవన్న (ప్రార్థనార్థక వాక్యం)
  17. పోయిరమ్ము (విధ్యర్థక వాక్యం)
  18. మమత్వంబు విడువుమన్న (ప్రార్థనార్థక వాక్యం)
  19. ఆడకుమ సత్య భాషలు (విధ్యర్థక వాక్యం)

(ఆ) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. విషయాసక్తి = విషయ + ఆసక్తి = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2. వివాదాత్మకం = వివాద + ఆత్మకం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3. వివాదాస్పదం = వివాద + ఆస్పదం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
4. ముద్రణాలయం = ముద్రణ + ఆలయం = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
5. అపార్థాలు = అప + అర్థాలు = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
6. వారోత్సవాలు = వార + ఉత్సవాలు = (అ + ఉ = ఓ) – గుణసంధి
7. దినోత్సవం = దిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) – గుణసంధి
8. సాహిత్యపు విలువ = సాహిత్యము + విలువ – పుంప్వాదేశ సంధి

(ఇ) కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1. ముద్రణ సౌకర్యంముద్రణ యొక్క సౌకర్యంషష్ఠీ తత్పురుష సమాసం
2. ముద్రణాలయంముద్రణకు ఆలయంషష్ఠీ తత్పురుష సమాసం
3. భావప్రకటనభావము యొక్క ప్రకటనషష్ఠీ తత్పురుష సమాసం
4. దేశ భవిష్యత్తుదేశము యొక్క భవిష్యత్తుషష్ఠీ తత్పురుష సమాసం
5. బాలల భవిష్యత్తుబాలల యొక్క భవిష్యత్తుషష్ఠీ తత్పురుష సమాసం
6. చట్ట విరుద్ధంచట్టమునకు విరుద్ధంషష్ఠీ తత్పురుష సమాసం
7. గుడ్డ ఉత్తరాలుగుడ్డతో ఉత్తరాలుతృతీయ తత్పురుష సమాసం
8. విషయాసక్తివిషయము నందు ఆసక్తిసప్తమీ తత్పురుష సమాసం
9. చిత్తశుద్ధిచిత్తము నందు శుద్ధిసప్తమీ తత్పురుష సమాసం
10. అచ్చుతప్పులుఅచ్చు నందలి తప్పులుసప్తమీ తత్పురుష సమాసం
11. వార్తా పత్రికవార్తల కొఱకు పత్రికచతుర్థి తత్పురుష సమాసం
12. బాలల హక్కులుబాలల యొక్క హక్కులుషష్ఠీ తత్పురుష సమాసం
13. అమానుషముమానుషము కానిదినఇ! తత్పురుష సమాసం
14. అనాగరికమునాగరికము కానిదినxణ్ తత్పురుష సమాసం
15. రెండు పేజీలురెండు (2) సంఖ్య గల పేజీలుద్విగు సమాసం
16. ప్రాచీన మఠాలుప్రాచీనమైన మఠాలువిశేషణ పూర్వపద కర్మధారయం
17. భారతదేశముభారతము” అనే పేరుగల దేశంసంభావనా పూర్వపద కర్మధారయం

(ఈ) కింది ఖాళీలలో సరైన విభక్తులు రాయండి.

1. వీడు వాడి ……………. 1 ……………. కలిసి బడి ………….. 2 ……………. వెళ్ళాడు.
2. ఈ టీవీ ………………. 3 ……………. మద్రాసు ……………….. 4 ……………. తెచ్చాను.
3. పాప పొద్దున్నే బడి …………………… 5 ……………… వెళ్ళింది.
4. పిల్లవాడు ఆకలి ……………………. 6 ………………. ఉన్నాడు.
జవాబులు:
1) తో
2)కి
3) ని
4) నుండి
5) కి
6) తో

కొత్త పదాలు-అర్థాలు

అనువు = అనుకూలము
అసంఖ్యాకం = లెక్కలేనన్ని
అపార్థాలు = అపోహలు
ఆస్కారము = ఆధారము
అనుగుణం = తగినది
అమానుషం = మనుష్య శక్తికి మించినది (క్రూరమైనది)
అనాగరికం = నాగరికము కానిది
ఉపకరణాలు = పనిముట్లు
కరపత్రం = ప్రకటన పత్రం
గరిగ = చిన్నపాత్ర
జన సమ్మర్దము = జనుల రాయిడి
నిఘంటువు = అర్థములు తెలిపే గ్రంథం (Dictionary)
నిర్వచనం = అర్థమును వివరించి చెప్పుట
చిత్తశుద్ధి = మనశ్శుద్ధి
దృక్పథం = దృష్టిమార్గం
పర్యవసానము = సమాప్తి, చివరకు జరిగేది
ప్రతిబింబించేవి = ప్రతిఫలించేవి
నిశితంగా = తీక్షణముగా
పరిణామదశ = పర్యవసాన దశ (క్రమంగా వచ్చిన మార్పు)
వ్యక్తీకరణ = వెల్లడి

AP Board 7th Class Telugu Solutions Chapter 14 కరపత్రం

వ్యక్తిగతం = ఆ వ్యక్తికి సంబంధించినది
జన సమ్మర్దం = జనం గుంపు
కూడళ్ళు = రోడ్లు కలసిన స్థలాలు
సమాజం = సంఘము
శిలాశాసనం = రాతిపై చెక్కిన శాసనం
సమకాలీనం = ఒకే కాలమునకు చెందినది
వాస్తవ దృక్పథము = సత్య దృష్టి
ముద్రణాలయం = అచ్చుయంత్రం (Printing press)
సందిగ్ధం = సందేహం
సంక్షేమ పథకాలు = చక్కగా క్షేమం కలిగించే పనులు (Welfare schemes)
సంకేతం = గుర్తు
వాస్తవం = నిజం
వారోత్సవం = ఒక వారంపాటు చేసే ఉత్సవం
రూపుదిద్దుకున్నాయి = రూపం ధరించాయి (ఏర్పడ్డాయి)

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 13th Lesson ఆలోచనం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 13th Lesson ఆలోచనం

7th Class Telugu 13th Lesson ఆలోచనం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
మొదటి చిత్రంలోని పిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తూంది?
జవాబు:
మొడటి చిత్రంలోని పిల్లలు అనాథలు, దిక్కులేనివారు, వారికి తల్లిదండ్రులు లేరు, పెద్ద పిల్లవాడు చిన్న పిల్లవాడిని ఊరుకోపెడుతున్నాడు. ఆ పిల్లలు బీదవాళ్ళనీ, ఏ దిక్కులేని వారనీ అనిపిస్తోంది. వారు అనాథ బాలురనిపిస్తూంది.

ప్రశ్న 2.
రెండో చిత్రంలో ఏం జరుగుతోంది? యుద్ధాలు ఎందుకు జరుగుతాయి?
జవాబు:
రెండో చిత్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. రాజ్యాలను పాలించే ప్రభువులు, ప్రక్క దేశాలను ఆక్రమించడానికి యుద్దాలు చేస్తారు. అన్నదమ్ములు బంధువులు సైతం, రాజ్యాల కోసం యుద్ధాలు చేస్తారు. కులమత దురహంకారాలతో రాజులు యుద్ధాలు చేస్తారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
ఇలాంటి బాధలులేని లోకం కోసం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
ప్రపంచంలోని పిల్లలు అందరూ శాంతి, ప్రేమ, సహనం అనే మంచి గుణాలు కలిగి, చెట్టాపట్టాలు వేసుకొని జీవించాలి. విశ్వశాంతి కోసం. మానవులు అందరూ కృషి చేయాలి. నేను కూడా ఆ విశ్వశాంతి యజ్ఞంలో ఓ సమిథగా నిలబడతాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా గానం చేయండి.
జవాబు:
గేయాన్ని పాటగా పాడడానికి, మీ గురువుగారి సాయంతో ప్రయత్నం చేయండి.

ప్రశ్న 2.
కవి ఈ గేయం ద్వారా ఎవరిని గురించి చెప్పాడు?
జవాబు:

  1. అసంతృప్తి గలవారిని గూర్చి
  2. భూగోళం పుట్టుక గూర్చి
  3. మానవరూపం పరిణామం గూర్చి
  4. సైనికులను గూర్చి
  5. శ్రమ జీవులను గూర్చి
  6. నవయుగాన్ని గురించి
  7. పేదలను గూర్చి
  8. పసి పాపలను గూర్చి
  9. కులమత యుద్ధ బాధితులను గూర్చి కవి ఈ గేయంలో చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
పాఠంలో కవి ఆవేదనను మీ సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:

  1. సముద్రం మధ్యలో ఎంతో బడబాగ్ని దాగి ఉంది.
  2. ఆకాశంలో కనిపించని సూర్యగోళాలు ఎన్నో ఉన్నాయి.
  3. ఎన్నో సూర్యగోళాలు బద్దలయితే, ఈ భూగోళం ఏర్పడింది.
  4. ఎన్నో మార్పులు వస్తే ఈ మానవుడు తయారయ్యాడు.
  5. యుద్ధాల్లో రాజుకోసం ఎందరో సైనికులు మరణించారు.
  6. ఎంతోమంది శ్రమజీవుల రక్తం త్రాగి, ధనవంతులు తయారయ్యారో?
  7. తిండిలేనివారు, అనాథలు ఉండని నవయుగం ఎప్పుడు వస్తుందో కదా !
  8. కరవు కాటకాలు లేని రోజు ఎప్పుడు వస్తుందో కదా !
  9. పేదల శోకంలో కోపం ఎంతో ఉంది.
  10. నిద్రించే పసిపాపల అదృష్టం ఎలా ఉంటుందో కదా !
  11. కులమతాల కొట్లాటలు ఎప్పుడు నశిస్తాయో కదా !
  12. భారతీయులు ఎప్పుడు తమ బలపరాక్రమాలు ప్రదర్శిస్తారో కదా ! అని కవి ఆవేదన పడ్డాడు.

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
గేయాన్ని చదవండి. గేయంలోని కొన్ని పదాలు రెండు చిన్న పదాలతో కలిసి ఏర్పడ్డాయి. అలాంటి పదాలను వెతికి రాయండి.
ఉదా : సముద్రగర్భం , కవి గుండె.
జవాబు:

  1. నల్లని ఆకాశం
  2. సురగోళాలు
  3. మానవ రూపం
  4. నర కంఠాలు
  5. పచ్చినెత్తురు
  6. నవయుగం
  7. నిదుర కనులు
  8. పసిపాపలు
  9. సుడిగుండాలు
  10. బలపరాక్రమం

ప్రశ్న 2.
ఈ గేయం ప్రశ్నలతో ఉన్నది కదా ! వీటిలో, మిమ్మల్ని బాగా ఆలోచించేటట్లు చేసిన ప్రశ్నలు ఏవి? వాటిని రాయండి.
జవాబు:

  1. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో?
  2. కరవంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో?
  3. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో?
  4. అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరం?
    అన్న ప్రశ్నలు నన్ను ఆలోచించేటట్లు చేశాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

ప్రశ్న 3.
కింది వాక్యాలు చదవండి. ఈ భావాలు గల గేయపంక్తుల కింద గీత గీయండి.
అ) పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, ఎవరికీ కనిపించని అగ్ని దాగి ఉంటుంది.
జవాబు:
“ఆ చల్లని సముద్రగర్భం, దాచిన బడబానల మెంతో ”?

ఆ) కులమతాల గొడవలకు, వివక్షలకు ఎంతోమంది గొప్పవారు, మంచివారు బలైపోయారు.
జవాబు:
కులమతాల సుడిగుండాలకు, బలియైన పవిత్రులెందరో?”

ఇ) కరవుకాటకాలు లేని మంచికాలం ఎప్పుడు వస్తుందో?
జవాబు:
కరవంటూ, కాటకమంటూ కనుపించని కాలాలెపుడో“!

ఈ) ‘ఆకలితో బాధపడే పేదల దుఃఖంలో ఎంత కోపం ఉంటుందో?
జవాబు:
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో”?

4. పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి.
“భూగోళం ……………………..
……………………………………….

……………………………………….
…………… పరిణామాలెన్నో”
జవాబు:
పద్యం పూరించడం :

“భూగోళం పుట్టుక కోసం
కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ఈ గేయానికి మీరైతే ఏ పేరు పెడతారు? రెండు కారణాలు రాయండి.
జవాబు:
“మేధావి అంతరంగం” – అని నేను ఈ కవితకు పేరు పెడతాను. దాశరథి గొప్ప మేధావి. అభ్యుదయకాంక్షి. ఆయన మనోవేదనే ఈ. కవితగా వచ్చింది. కాబట్టి మేధావి ‘అంతరంగ మథనం’ అని కూడా దీనికి పేరు పెట్టవచ్చు. ఈ గేయానికి ఆలోచనం అని, ప్రశ్న అని కూడా పేర్లు పెట్టవచ్చు.

ఆ) కరవు కాటకాల వల్ల వచ్చే నష్టాలేమిటి?
జవాబు:
తినడానికి తిండి ఉండదు. కట్టుకోవడానికి బట్టలు ఉండవు. తిండిలేని వారు రక్తం లేక పాలిపోయి జబ్బుల పాలవుతారు.. ఎండి పీనుగుల్లా మనుషులు తయారవుతారు. ప్రజల ముఖాల్లో సుఖసంతోషాలు ఉండవు. దొంగతనాలు పెరిగిపోతాయి. ప్రజలు ఒకరితో ఒకరు తిండికోసం దెబ్బలాడుకుంటారు. త్రాగడానికి, స్నానం చేయడానికి నీరు దొరకక, పాడిపంటలు ఉండవు.

ఇ) “రాజును గెలిపించడంలో ఒరిగిన నరకంఠాలెన్నో” ఈ వాక్యాన్ని కవి ఎందుకోసం రాశాడు? కవి భావం ఏమిటి?
జవాబు:
తమ తమ రాజులను గెలిపించడానికి, ఆ రాజు వద్ద పనిచేసే సైనికులు ప్రాణాలకు తెగించి, కత్తి యుద్దాలతో, తుపాకీ గుండ్లతో పోరాటం చేస్తారు. అందులో ఎవరో ఒక రాజు గెలుస్తాడు. కాని ఆ రాజును గెలిపించడానికి, ఎందరో అమాయకులైన సైనికుల పీకలు తెగి యుంటాయి. గుండు దెబ్బలకు సైనికుల గుండెలు బద్దలయి ఉంటాయి. రాజు జయిస్తే పండుగలు చేసికొంటారు. కాని దానికోసం చచ్చిన సైనికులను గూర్చి, ఎవరూ పట్టించుకోరు అని కవి బాధపడ్డాడు.

ఈ) పేదల కోపాన్ని కవి లావాతో ఎందుకు పోల్చాడు?
జవాబు:
అగ్నిపర్వతం బద్దలయితే దాంట్లో నుండి ‘లావా’ అనే ద్రవం బయటకు వస్తుంది. అగ్నిపర్వతం లోపల బాగా మంట మండితేనే, ఆ పర్వతం బద్దలయి, లావా బయటకు వస్తుంది – అలాగే పేదవారి కడుపు బాగా మండితేనే, లావాలా వారి కోపం బయటకు ఎగదన్నుతుందని కవి భావం. లావా అగ్నిపర్వతంలో ఎప్పుడూ ఉంటుంది. కాని లోపల వేడి ఎక్కువయితే ఒక్కసారి పేదవాడి కోపంలా అది బయటకు ఎగదన్నుకు వస్తుంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) ఈ గేయం ఆధారంగా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
కవి ఈ గేయం రాసేనాటి పరిస్థితులు ఇవి.

  1. యుద్ధాలు జరుగుతున్నాయి. వాటిలో ఎందరో అమాయకులైన సైనికులు తమ రాజుల కోసం మరణిస్తున్నారు.
  2. ధనవంతులు శ్రామికులను, కార్మికులను దోచుకు తిని, ధనవంతులు అవుతున్నారు.
  3. దేశంలో అనాథలు, తిండిలేనివాళ్ళు, కరవు కాటకాలతో బాధపడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
  4. పేదవారు కోపంతో కసిగా ఉన్నారు. పసిపాపల భవిష్యత్తు మంచిగా లేదు.
  5. కవుల మనస్సులు గాయపడ్డాయి. కులమతాల చిచ్చులో మంచివారు నలిగిపోయారు. స్వతంత్రం వచ్చినా భారతీయులు, తమ బల పరాక్రమాలను ప్రదర్శించడం లేదు. వారింకా బానిసత్వంలో ఉన్నట్లే ఉంటున్నారు.

ఆ) “కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో?” అని కవి ఆవేదన చెందాడు కదా ! దీన్ని గురించి వివరించండి.
జవాబు:
మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయి. ప్రజలు కులమతాల ప్రాతిపదికగా విడిపోతున్నారు. భారతదేశంలో పుట్టిన వారంతా ఒక్కటే. వారంతా భారతీయులు. అటువంటి ఐక్యత నశించి ఒకరిని ఒకరు ద్వేషించుకొంటూ, కొట్టుకుంటూ జీవిస్తున్నారు. అంటరానితనాన్ని పాటిస్తున్నారు. దీనికి సాయం ఓట్ల కోసం, నాయకులు కులమతాల ద్వేషాగ్నిని మండిస్తున్నారు. కులాలకు, మతాలకు రిజర్వేషన్లు అంటూ అల్లర్లు సాగిస్తున్నారు. సాటి మానవులను కొట్టి చంపుతున్నారు. కులమతాలు నిజానికి కూడు పెట్టవు. మానవులందరిలో ఒకే రక్తం ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ‘మానవత’ అనేదే నిజమైన కులమని అందరూ కలసి మెలసి సుఖంగా ఒకరికొకరు సాయం చేసికొంటూ బ్రతకాలి.

ఇ) కులమతాలు లేని సమాజంలో ప్రజలందరూ ఎలా ఉంటారో ఊహించి రాయండి.
జవాబు:
కులమతాలు లేకపోతే ప్రజలంతా అన్నదమ్ములవలె. కలసిమెలసి ఆనందంగా జీవిస్తారు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ధనికులు పేదలకు సాయం చేస్తారు. బంధువుల్లా ప్రజలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పక్కవాడు తన తోటివాడు అనే ప్రేమభావం వారిలో పొంగిపొర్లుతుంది. అందరూ కలసి పండుగలు చేసుకుంటారు. అందరికీ ఒకే దైవం ఉంటాడు. ప్రజలలో హెచ్చుతగ్గులు భేదభావాలు ఉండవు.. ప్రజలందరూ ఒకే దేవుని బిడ్డలు. అంటే సోదరులు. లోకంలో అన్నదమ్ములు ఎలా ఐక్యతగా ప్రేమభావంతో జీవిస్తారో అలాగే కులమతాలు లేని సమాజంలో ప్రజలు ప్రేమభావంతో, సోదర భావంతో, కలిసిమెలిసి ఆనందంగా, హాయిగా ఉంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడ్పడతారు.

IV. పదజాలం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు, గేయంలో ఉన్నాయి. వాటిని గుర్తించి ఎదురుగా రాయండి.
ఉదా : భారతదేశంలో దిక్కులేనివారు ఎందరో ఉన్నారు.
జవాబు:
అనాథలు

అ) ఆకలితో అలమటించే వారికోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది.
జవాబు:
అన్నార్తులు

ఆ) సముద్రంలో పుట్టే అగ్ని చాలా ప్రమాదకరమయింది.
జవాబు:
బడబాగ్ని

ఇ) సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు.
జవాబు:
భాస్కరుడు

ఈ) అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి ద్రవం వల్ల చాలా వినాశనం కలుగుతుంది.
జవాబు:
లావా

ఉ) మన పాలపుంతలో ఎన్నో సూర్యగోళాలు ఉన్నాయి.
జవాబు:
సురగోళాలు

ఊ) దెబ్బతగిలితే పిల్లలు ఏడుపు ఆపుకోలేరు.
జవాబు:
శోకం

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2. కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వాటిని పట్టికలో రాయండి.

అ) రాజరాజు రాజమహేంద్రవరాన్ని పాలించేవాడు. ఆ రాయల ఆస్థానకవి నన్నయ.
ఆ) సముద్రంలో అలలు ఉంటాయి. సంద్రాలలో చేపలు ఎగసిపడతాయి.
ఇ) చెట్ల రాపిడిలో అగ్ని పుట్టింది. ఈ అగ్గికి అడవి తగలబడిపోతుంది.
ఈ) అతని రూపం ఎంతో మనోహరం. ఆ రూపురేఖలు కొందరికే ఉంటాయి.
ఉ) ఆకాశం నిండా మేఘాలు అలముకున్నాయి. ఆకసం వర్షించడానికి సిద్ధంగా ఉంది.
ఊ) పోతన భాగవత కబ్బాన్ని రచించాడు. ఆ కావ్యాన్ని దైవానికి అంకితం చేశాడు.
జవాబు:
ఉదా : రాజు (ప్రకృతి) – రాయలు (వికృతి)
ప్రకృతి – వికృతి
రాజు – రాయడు
సముద్రం – సంద్రం
అగ్ని – అగ్గి
రూపం – రూపు
ఆకాశం – ఆకసం
కావ్యం – కబ్బం
గర్భము – కడుపు
కంఠము – గొంతు
అనాథ – అనద
నిద్రా – నిదుర
కుండము – గుండము

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

3. గేయం ఆధారంగా కింది పదాలు వివరించి రాయండి

అ) కానరాని భాస్కరులు అంటే:
కనబడని సూర్యులు అని అర్థం. ఆకాశంలో ఎన్నో సూర్యగ్రహాలు ఉంటాయి. కాని అవి మనకు కంటికి కనబడవు. అలాగే లోకంలో ఉన్న ఎందరో గొప్పవార్ని మనం గుర్తించలేము. వారంతా సూర్యుని వంటివారు.

ఆ) దాగిన బడబానలం అంటే :
అంటే కనబడకుండా ఉన్న సముద్రం నీటిలోని బడబాగ్ని. బడబాగ్ని పైకి మనకు కనబడనట్లే, అసంతృప్తి గల మనుష్యుల గుండెల్లో అగ్ని వంటి కోపం ఎంతో దాగి ఉంటుంది.

ఇ) ఒరిగిన నరకంఠాలంటే :
యుద్ధంలో తెగిపడిన సైనికుల పీకలు. రాజుల కోసం సైనికులు పరస్పరం కంఠాలు ఖండించుకుంటారు.

ఈ) రాయబడని కావ్యాలంటే :
మనస్సులోని బాధను గ్రంథంగా రాయలేకపోవడం. లోకంలోని అసమానతల్నీ, అక్రమాల్నీ చూచి, ఆ బాధను కవితా రూపంలో పెట్టలేకపోవడం.

ఉ) నవయుగం అంటే : మరో ప్రపంచం, కరవు కాటకాలు, అనాథలు, అన్నార్తులు, పీడితులు లేని క్రొత్త ప్రపంచం అని అర్థం.

V. సృజనాత్మకత

ప్రశ్న 1.
“ఆలోచనం” గేయ సారాంశం ఆధారంగా వచన కవిత రాయండి.
జవాబు:
వచన కవిత
“సముద్రంలో దాగి యుంటుంది ‘బడబానలం’
ఆకాశంలో దాగియుంటారు సూర్యసహస్రం
సురగోళాలు విచ్ఛిన్నం భూగోళం ప్రసన్నం
పరిణామ బహుళం నేటి మానవాకారం.
పీకలెన్నో తెగితేనే ఒక రాజు విజయం,
శ్రామికుల రక్తం త్రాగితేనే డబ్బుమయం.
అనాథలు, అన్నార్తులు లేనికాలం రావాలి.

కరవు కాటకాలు అదృశ్యం కావాలి.
అగ్నిపర్వతాల నుండి లావా పొంగుతుంది.
పేదవారి ఆకల్లోంచి శోకం ఉప్పొంగుతుంది.
పసిపాపల భవితవ్యం అది అంతా శూన్యం
గుండె నొచ్చు కవి రాతలు అవి అన్నీ శూన్యం
కులమతాల సుడిగుండంలో చిక్కారు పవిత్రులు
దాస్యంలో చిక్కాయి భారతీయ బలశౌర్యాలు”.

ప్రశ్న 2.
కవి నవయుగాన్ని కోరుకుంటున్నాడు కదా ! మీరు కోరుకునే నవయుగం ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించి రాయండి.
జవాబు:
భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ ఉండాలి. ప్రతివ్యక్తికి విద్యా, వైద్య సదుపాయాలుండాలి. ప్రతి పల్లెకు రోడ్డు, జద్యుచ్ఛక్తి ఉండాలి. చదువుకున్న వారందరికీ జీవనభృతి దొరకాలి. ఉద్యోగ సదుపాయాలు పెరగాలి. ధనిక పేద తారతమ్యం, కులమతాల భేదం, అంటరానితనం నశించాలి. రైతులు నవ్వుతూ జీవించగలగాలి. కులవృత్తులకు ప్రోత్సాహం లభించాలి. పల్లెలకు అన్ని సౌకర్యాలు ఉండాలి. నగరాలకు వలసలు తగ్గాలి. ఇదే నేను కోరుకొనే నవయుగం. పసిపాపలు నవ్వుతూ ఆనందంగా రోడ్లపై తిరగాలి.

VI. ప్రశంస

ప్రశ్న 1.
‘ఆలోచనం’ గేయం మీ తంగితిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వాళ్ళను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి:
జవాబు:

ఒంగోలు,
దివి. xxxxxx

మిత్రుడు రవికుమార్‌కు, / స్నేహితురాలు కవితకు,

మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా మేష్టారు సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది.

అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆ రోజు మా తరగతి పిల్లలంతా రాజా, కమలలకు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత మేష్టారు వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా.

విశేషాలతో లేఖ రాయి.

నీ ప్రియమిత్రుడు / మిత్రురాలు,
రవికృష్ణ / లక్ష్మీకుమారి.

చిరునామా :
K. రవికుమార్,
S/o. బలరామ్ గారు,
మున్సిపల్ స్కూలు,
కడప.

K. కవిత,
D/o. గోపాలకృష్ణ,
మున్సిపల్ స్కూలు,
కడప.

VII. ప్రాజెక్టు పని

1). దాశరథి రచించిన ఇతర రచనలను సేకరించండి.
(లేదా)
2) దాశరథి రచనలు, పొందిన అవార్డులు, బిరుదులతో ఒక పట్టిక తయారు చేయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్య రచనలు, అవార్డులు, బిరుదుల పట్టిక

రచనలుఅవార్డులుబిరుదులు
1) అగ్నిధార1) 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి1) కవిసింహం
2) పునర్నవం2) 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి2) అభ్యుదయ కవితా చక్రవర్తి
3) రుద్రవీణ3) ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’3) ఆంధ్రప్రదేశ్, ఆస్థాన కవి 1977 నుంచి 1983 వరకు
4) అమృతాభిషేకం4) వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’4) ఆంధ్ర కవితా సారథి
5) మహాంద్రోదయం
6) ఆలోచనాలోచనలు
7) గాలిబ్ గీతాలు
8) కవితా పుష్పకం
9) తిమిరంతో సమరం
10) వేయి సినిమాపాటలు
11) నేత్ర పర్వం

VIII. భాషను గురించి తెలుసుకుందాం

1) కింది వాక్యాలను చదివి, గీత గీసిన పదాలను ఉదాహరణలలో చూపినట్లు విడదీయండి.

అ) చిట్టెలుక చెట్టు రంధ్రంలోకి దూరింది.
ఉదా : కుట్టుసురు – కులు + ఉసురు
చిట్టెలుక = చిఱు + ఎలుక

ఆ) కట్టెదుటి అన్యాయాలను ఎదిరిద్దాం.
ఉదా : కట్టెదురు = కడు + ఎదురు

ఇ) నట్టిల్లు బాగుంది.
నట్టిల్లు = నడు + – ఇల్లు

ఈ) నిట్టూర్పులతో కాలయాపన చేయవద్దు.
నిట్టూర్పు : నిడు + ఊర్పు

పైన పేర్కొన్న పదాలు, రెండు విధాలుగా కనబడుతున్నాయి. వాటిలోని పూర్వ, పర స్వరాలను కలిపితే ఎలా. మారుతున్నాయో చూడండి.
1. ఱు + ఉ = ట్టు
2. ఱు + ఎ = ట్టె
3. డు + ఊ = ట్టూ
4. డు + ఎ = ట్టె
5. డు + ఇ = ట్టి

గమనిక : అంటే, పూర్వపదం చివర ఉన్న ఐ, డ లకు, అచ్చు పరమైతే ‘మీ’ అంటే, ద్విరుక్త’ట’కారం వస్తున్నది. ‘ కాబట్టి దీన్ని ‘ద్విరుక్తటకార సంధి’ అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2) కింది పదాలను విడదీసి సంధిని గుర్తించండి.
చిట్టడవి = చిఱు + అడవి = ద్విరుక్తటకార సంధి
నట్టేట = నడు + ఏట = ద్విరుక్తటకార సంధి

3) కింది పదాలను ఉదాహరణలో చూపినట్లు విడదీయండి.
ఉదా : నట్టనడుమ =నడుమ + నడుమ

1. కట్టకడ = కడ + కడ
2. ఎట్టెదురు = ఎదురు + ఎదురు
3. తుట్టతుద = తుద + తుద
4. చిట్టచివర = చివర + చివర

గమనిక : ఇవి ద్విరుక్త టకార సంధికి సరిపోతాయా? సరిపోవు కదూ ! ఇవన్నీ ఆమ్రేడిత సంధికి ఉదాహరణలే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను పై తరగతుల్లో తెలుసుకుందాం.

1) కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. బడబానలము = బడబా + అనలము = (ఆ + అ + ఆ) – సవర్ణదీర్ఘ సంధి
2. అన్నార్తులు = అన్న + ఆర్తులు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
3. భరతావని = భరత + అవని = (అ + అ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి
4. అదేంత = అది + ఎంత = (ఇ + ఎ = ఎ) – ఇకార సంధి
5. భానువులెందరో = భానువులు ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
6. సురగోళాలెన్నో = సురగోళాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
7. పరిణామాలెన్నో = పరిణామాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
8. నాటకమంతా = నాటకము + అంతా = (ఉ + అ = అ) – ఉత్వ సంధి
9. కరవంటూ = కరవు + అంటూ = (ఉ +అ = అ) – ఉత్వ సంధి
10. ఇంకెన్నాళ్ళో = ఇంక + ఎన్నాళ్ళో = (అ + ఏ = ఎ) – అత్వ సంధి
11. కావ్యాలెన్నో = కావ్యాలు + ఎన్నో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి
12. అనాథలుండని = అనాథలు + ఉండని (ఉ + ఉ = ఉ) = ఉత్వ సంధి
13. ధనవంతులెందరో = ధనవంతులు + ఎందరో = (ఉ + ఎ = ఎ) – ఉత్వ సంధి

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

2) కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. సముద్రగర్భంసముద్రము యొక్క గర్భంషష్ఠీ తత్పురుష సమాసం
2. నరకంఠాలునరుల యొక్క కంఠాలుషష్ఠీ తత్పురుష సమాసం
3. నవయుగంకొత్తదైన యుగంవిశేషణ పూర్వపద కర్మధారయం
4. కులమతములుకులమూ, మతమూద్వంద్వ సమాసం
5. కవి గుండెలుకవి యొక్క గుండెలుషష్ఠీ తత్పురుష సమాసం

కవి పరిచయం

పాఠం పేరు : ఆలోచనం

కవి : దాశరథి కృష్ణమాచార్యులు

పాఠం దేని నుండి గ్రహింపబడింది : ఈ పాఠ్యభాగం ‘ఆలోచనం’ – దాశరథి రచించిన ‘అగ్నిధార’ కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.

రచయిత కలం పేరు : ‘దాశరథి’

జన్మస్థలం : చిన్న గూడూరు, వరంగల్ జిల్లా, – 1925 – 1987

రచనలు : అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం, ఆలోచనా ! లోచనాలు, గాలిబ్ గీతాలు.

బిరుదులు : కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి.

సాహిత్య సేవ : సినిమా గీతాలు, నాటికలు, వ్యాసాలు, పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన ! కవిగా సేవలు అందించారు.

సామాజిక సేవ : వీరు హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
పురస్కారాలు :
1) దాశరథి గారి ‘కవితా పుష్పకం’ రచనకు, 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి , బహుమతి లభించింది.
2) వీరి ‘తిమిరంతో సమరం’ అన్న కవితా సంపుటికి, 1974లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది.
3) వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదునూ, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘డి.లిట్’ బిరుదును ఇచ్చాయి.
4) 1977 నుండి 1983 వరకు వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు.

1. ‘ఆలోచనం’ గేయ రచయిత దాశరథిని గూర్చి రాయండి.
జవాబు:
దాశరథి కృష్ణమాచార్యులుగారు అగ్నిధార అనే కవితా సంపుటిని రచించారు. ‘ఆలోచనం’ అనే గేయం అగ్నిధారలోనిది. ఈయన 1925లో వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించారు. ఈయన అగ్నిధార, పునర్నవం, రుద్రవీణ, అమృతాభిషేకం, మహాంద్రోదయం వంటి కవితా సంపుటాలు, గాలిబ్ గీతాలు రచించారు.

ఈయనకు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి అనే బిరుదులు ఉన్నాయి. వీరి ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. వీరి ‘కవితా పుష్పకం’ రచనకు రాష్ట్ర సాహిత్యం అకాడమి బహుమతి లభించింది. వీరు అనేక సినీగేయాలు రచించారు.

గేయాలు – అర్థాలు – భావాలు

1. ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో?
అర్థాలు :
సముద్రగర్భం = సముద్రము లోపల
బడబానలము = ‘బడబా’ అనే అగ్ని
కానరాని = కంటికి కనబడని
భాస్కరులు = సూర్యులు

భావం :
పైకి చల్లగా, ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల, బడబాగ్ని దాగి ఉంటుంది.. అలాగే ఎన్నో అసమానతలు గల ఈ ప్రపంచంలో అసంతృప్తి గలవాళ్ళ గుండెల్లో కూడా, అగ్ని దాగి ఉంటుంది. నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో కంటికి కనిపించని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉంటాయి. అదే విధంగా, ఈ పెద్ద ప్రపంచంలో ప్రతిభ గలవారూ, గొప్పవాళ్ళూ, పైకి కనబడకుండా ఎంతమంది మరుగున పడియున్నారు?

విశేషం :
1) ‘బడబాగ్ని’ :
అనేది సముద్రం లోపల ఉండే అగ్ని. ఇది ఈశ్వరుడిచే పుట్టించబడిన “బడబా” అనే ఆడుగుఱ్ఱము నోటిలో ఉంటుంది. ఇది సముద్ర జలాలను తాగుతూ ఉంటుంది.

2) ఆకాశంలో కానరాని భాస్కరులు :
ఆకాశంలో మొత్తం 12 మంది సూర్యులు ఉంటారు. వారినే ‘ద్వాదశాదిత్యులు’ అంటారు. ఈ 12 మందే కాకుండా, ఇంకా ఎందరో సూర్యులు ఆకాశంలో ఉండి ఉంటారని కవి భావన.

2. భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళా లెన్నో?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో?
అర్థాలు :
భూగోళము = గోళాకారంలో ఉన్న భూమండలము
సురగోళాలు = సూర్యగోళాలు
పరిణామాలు = మార్పులు

భావం :
ఈ భూమండలం ఏర్పడడం కోసం, ఎన్నో సూర్యగోళాలు కూలిపోయాయి. ఆదిమానవుడి దగ్గర నుంచి, నేటి మనిషి రూపం ఏర్పడే వరకూ, ఎన్నో మార్పులు జరిగాయి.

విశేషం :
నక్షత్ర గ్రహాలు :
మనం ఇప్పుడు నివసించే ‘విశ్వం’ కోటానుకోట్ల విశ్వరూపాల్లో ఒకటి. ఈ విశ్వం 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వం, చిన్న ముద్దగా ఉండేది. ఆ ముద్దలో చిన్న గోళీకాయ అంత పదార్థమును, “ఆదియుగపు బ్రహ్మాణువు” అంటారు. ఈ బ్రహ్మాణువులో ఉష్ణోగ్రత 1500 కోట్ల డిగ్రీలకు పెరిగి, అది బద్దలయ్యింది. ఆ పదార్థము నాలుగు వైపులకూ విస్తరించింది. ఈ విస్తరణ మార్పు, దాదాపు 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. క్రమంగా ఉష్ణోగ్రత 4000 డిగ్రీలకు తగ్గింది. ఈ పదార్థంలోని మూలకాలు ఒకదానిని. మరొకటి ఆకర్షించుకొని, పెద్ద మేఘాలుగా మారుతాయి. అవి క్రమంగా దగ్గరయి, తిరిగి ఉష్ణోగ్రత పెరిగితే, ఆ మేఘంలో పేలుళ్ళు జరుగుతాయి. అదే ‘నక్షత్రము” అవుతుంది. ఇందులో పదార్థం తక్కువగా ఉన్న మేఘాలు, గ్రహాలు అయి, ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతాయి. దీన్ని “బిగ్ బాంగ్ సిద్ధాంతం” అంటారు.

2. నరజాతి పరిణామం :
నాలుగైదు కోట్ల సంవత్సరాల క్రితం ‘మనిషి’ లేడు. ‘మేట్స్’ అనే తులు ఉండేవి. ఈ కోతి జాతి నుండే, నేటి మానవజాతి పుట్టింది. ఈ మార్పు, 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. వానర జాతి నుండి నరజాతి పుట్టిందని ‘డార్విన్’ చెప్పాడు. మానవజాతికి చెందిన కోతులను నెపియన్స్’ అంటారు. ఇందులో మానవజాతి “హోమోసెపియన్స్” అనే ఉపజాతికి చెందినది. ఈ జాతి . అవశేషాలు, “క్రోమాన్యాన్ గుహలు” లో దొరికాయి. అందుకే ఈ జాతికి “క్రోమాన్యాన్ మానవులు” అంటారు. వీరే.నేటి నరజాతికి మూలపురుషులు.

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

3. ఒక రాజును గెలిపించుటలో
జరిగిన నరకంఠా లెన్నో?
శ్రమజీవుల పచ్చినెత్తురులు
తాగని ధనవంతులెందరో?
అర్థాలు :
ఒరిగిన = తెగిపడిన
నరకంఠాలు = మానవుల కంఠాలు
శ్రమజీవులు = శ్రమపడి జీవించే మానవులు
నెత్తురు = రక్తం

భావం :
ఒక రాజును యుద్ధంలో గెలిపించడానికి, ఎంతమంది సైనికులు మరణించి యుంటారో? శ్రామికుల కష్టాన్ని దోచుకోనటువంటి, ధనవంతులెందరుంటారో? నేటి ధనికులు అందరూ పేదలను పీడించి పైకి వచ్చారని కవి భావన.

4. అన్నార్తులు అనాథ లుండని
ఆ నవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటకమంటూ
కనుపించని కాలాలెపుడో?
అర్థాలు :
అన్నార్తులు (అన్న + ఆర్తులు) = అన్నం కోసం దుఃఖము పొందిన వారు
అనాథలు = దిక్కులేనివారు
నవయుగము = కొత్త యుగము
కాటకము = కరవు

భావం :
తిండి దొరకని వాళ్ళూ, దిక్కులేని వాళ్ళూ, ఉండని కొత్త ప్రపంచం ఎంతదూరంలో ఉందో ? కరవు కాటకాలు లేని సుభిక్షమైన కాలం, ఎప్పుడు వస్తుందో?

5. అణగారిన అగ్నిపర్వతం
కని పెంచిన “లావా” యెంతో ?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో ?
అర్థాలు :
అణగారిన = శాంతించిన
లావా = అగ్నిపర్వతం బలయినపుడు దానిలో నుండి వచ్చే ద్రవం
శోకం = దుఃఖం

భావం :
శాంతించిన అగ్నిపర్వతంలో కనపడని లావా ఎంత ఉంటుందో ? ఆకలితో మరణించే పేదవారి మనస్సులో ఎంత కోపమూ, బాధ, దాగి ఉంటాయో?

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

6. పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో ?
గాయపడిన కవిగుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో?

అర్థాలు :
పసిపాపలు = చిన్నబిడ్డలు, (శిశువులు)
ముసిరిన = చుట్టుముట్టిన, (వ్యాపించిన)
భవితవ్యం = భాగ్యము (శుభము)
గాయపడిన కవిగుండె = అక్రమాలు, అసమానతలు, అన్యాయాలు, అధర్మ కార్యాలు చూసి బాధపడిన కవి హృదయం

భావం :
హాయిగా నిద్రపోయే పసిపాపల కన్నులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, మరి అంత ప్రశాంతత, వారి భావి జీవితంలో ఉంటుందా ? ఎన్నో అసమానతలు ఉన్న ఈ లోకాన్ని చూసి, కవుల హృదయాలు ఎంత లోతుగా గాయపడతాయో ! ఆ ఆవేదనలో మునిగి ఎన్ని కావ్యాలను వారు రాయలేకపోయారో !

7. కులమతాల సుడిగుండాలకు
బలియైన పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో?
అర్థాలు :
సుడిగుండాలు = కలతలు
బలియైన = నాశనమైన
భరతావని (భరత + అవని) భారత భూమి
చెరవీడు = నిర్బంధం నుండి బయటపడు

భావం :
ఈ కుల దురహంకార ప్రపంచంలో కులమతాలు అనే సుడిగుండాలలో చిక్కుకొని, బలి అయిపోయిన మంచివారు ఎంతమంది ఉంటారో? భారతదేశంలోని వీరుల శక్తి సామర్థ్యాలు, ఇంకెన్ని
రోజులకు బయట పడతాయో !

AP Board 7th Class Telugu Solutions Chapter 13 ఆలోచనం

పదాలు – అర్థాలు

బడబానలము = బడబాగ్ని, (సముద్రంలో ‘పుట్టిన అగ్ని)
భాస్కరులు = సూర్యులు
సురగోళం = సూర్యగోళం
ఆర్తులు = దుఃఖము పొందినవారు
లావా = అగ్నిపర్వతం నుండి వెలువడే ద్రవం
చెరవీడు = నిర్బంధము నుండి బయటపడు
నరకంఠాలు = మానవుల గొంతులు
పరిణామాలు = మార్పులు
నెత్తురు = రక్తం
భవితవ్యం = అదృష్టం

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 12th Lesson అసామాన్యులు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 12th Lesson అసామాన్యులు

7th Class Telugu 12th Lesson అసామాన్యులు Textbook Questions and Answers

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
“ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు” దీన్ని వివరించండి.
జవాబు:
ఆహారం లేకపోతే ఎవరూ బతకరు. ఆహారం గురించి మనకు ఆదివాసులే తెలిపారు. ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడునీడగా జీవిస్తారు. వారు రాత్రింబగళ్ళు ప్రకృతితో కలిసి జీవిస్తూ ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో, ఏమి తినగూడదో, మనకు ఆదివాసులే చెప్పారు. ఇందుకోసం వారు ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలలో కొందరు ఆదివాసులు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినేముందు, వారు ఆ జంతువులనూ, వాటి ఆహారం అలవాట్లనూ, పరిశీలించారు. తర్వాతనే ఫలానా జంతువు. మాంసం తినవచ్చునని వారు తేల్చి చెప్పారు.

కోయలు, గోండులు, చెంచులు వంటి గిరిజనులకు ఉన్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వారికి తెలిసినంతగా, ఇతరులకు తెలియదు. ఆదివాసులు కూడా, శాస్త్రజ్ఞులే, వారికి రోగాలు వస్తే, చెట్ల మందులతోనే వారు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారు. అందువల్ల ఆదివాసులే గురువులై మనకు మార్గదర్శకులయ్యారు.

ప్రశ్న 2.
కుమ్మరివారి గొప్పతనాన్ని గురించి వివరించండి.
జవాబు:
కుమ్మరి వాని చక్రం నుంచి, బంకమట్టి నుంచి, మనం నిత్యం ఉపయోగించే కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, ప్రమిదలు వస్తున్నాయి. మెత్తటి మట్టి, బూడిద లేదా రంపం పొట్టు, సన్న ఇసుకను కలిపి, బంకమట్టిని తయారుచేస్తారు. వారు కాళ్ళతో తొక్కి, చెమటోడ్చి సిద్ధం చేసిన బంకమట్టిని కుమ్మరిసారెపై పెడతారు.

కుమ్మరి చక్రం తిప్పుతూ, చక్రం మీద పెట్టిన బంకమట్టిని తన చేతివేళ్ళ కొనలతో నేర్పుగా నొక్కుతాడు. ఆశ్చర్యంగా అనుకున్న రూపాలు వస్తాయి. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత ‘కుమ్మర ఆము’లో పెట్టి, బురదమట్టితో కప్పుతారు. కొలిమిని మండిస్తారు. వేడి అన్ని పాత్రలకూ సమానంగా అందుతుంది. మట్టి పాత్రలన్నీ కాలి, గట్టిగా తయారవుతాయి. వేసవికాలంలో వీరి కూజాలకు, కుండలకు మహాగిరాకీ. వీరు చేసే ప్రమిదలు భక్తి జీవితంలో ప్రధాన భాగం.

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

ప్రశ్న 3.
“వడ్రంగివారు నేటి ఆధునిక ఇంజనీర్లు” – దీన్ని సమర్థిస్తూ పదివాక్యాలు రాయండి.
జవాబు:
వడ్రంగుల పనిలో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంది. మనకు వ్యవసాయానికి కావః పిన నాగలి, గుంటక, గొర్రు వంటి పనిముట్లను అన్నింటినీ వడ్రంగులే తయారుచేస్తారు. ఆ పనిముట్ల ఈ రీకి ఏ చెట్టు కలప సరిపోతుందో వారు పరిశీలిస్తారు. చెట్టును చూస్తే సరిపోదు.

చెట్టును కొట్టి, దాన్ని కోసి, చిత్రిక పట్టాలి. తొలి కొట్టాలి. అందులో బిగించాలి. ఇలా వడ్రంగులు ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం చూపించాలి.

వ్యవసాయానికీ, ప్రయాణానికీ ఉపయోగించే బండి సౌకర్యాన్ని వడ్రంగులు సమాజానికి అందించారు. ఇంటి తలుపులు, వాసాలు, కిటికీలు, ఇళ్ళు, వడ్రంగుల పనితనం వల్లే, అందంగా తయారవుతున్నాయి. మనం వాడుకొనే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు అలమారలు సైతం వడ్రంగుల చేతుల్లోనే తయారవుతున్నాయి. వడ్రంగులు
“దారు శిల్పులు”. వారు నేటి కాలం “ఇంజినీర్లు”.

ప్రశ్న 4.
“రైతులు మన అన్నదాతలు” – వివరించండి.
జవాబు:
రైతులు మనకు అన్నదాతలు. రైతు దేశానికి వెన్నెముక. అతనికి కోపం వస్తే, మనకు అన్నం దొరకదు. రైతు నడుంవంచి కష్టించి పాడిపంటలు పెంచుతున్నాడు. తాను పస్తులు ఉండి, మన కడుపులు చల్లగా ఉండేటట్లు మనకు రైతు తిండి పెడుతున్నాడు. రైతు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాడు. తాను ఎండకు ఎండినా, వానకు ‘ తడిసినా, చలికి వణకినా ధైర్యంతో కష్టపడి, రైతు పంటలు పండించి మన పొట్టలు నింపుతున్నాడు.

మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు అనేవి, రైతులు చెమటోడ్చి పనిచేసిన కృషికి ఫలాలు. రైతు రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, శ్రమిస్తేనే మనం హాయిగా తింటున్నాము. అందుకే లాల్ బహదూర్ శాస్త్రిగారు “జై జవాన్, జై కిసాన్” – అన్నారు.

కాబట్టి రైతులు మనకు అన్నదాతలు. రైతుల త్యాగం, కృషి అపూర్వమైనవి.

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

ప్రశ్న 5.
“దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవారు అంత అవసరం” – దీన్ని సమర్థిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
“సమాజ నిర్మాణానికి అన్ని వృత్తుల వాళ్లూ అవసరమే” దీన్ని సమర్థిస్తూ రాయండి.
అన్ని వృత్తుల వారు పరస్పరం సహకరించుకుంటేనే సమాజ గమనం సాగుతుందని అసామాన్యులు పాఠంలో. చదివారు కదా ! మన సమాజంలోని వృత్తులను, వాటి ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:
కులవృత్తుల – ప్రాముఖ్యం

మన శరీరంలో కళ్లు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వంటి అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు అన్నీ. సరిగా పనిచేస్తేనే మన శరీరం పనిచేస్తుంది. శరీరానికి ఈ అవయవాలు అన్నీ ముఖ్యమే. సంఘంలో అనేక వృత్తులవారు ఉన్నారు. కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, మంగలి, చర్మకారుడు, సాలె, కురుమలు, రజకుడు వంటి ఎందరో వృత్తి పనివారలు ఉన్నారు.

ప్రతి వృత్తి పవిత్రమైనదే. ఏ వృత్తినీ మనం చిన్న చూపు చూడరాదు. మన ఇంట్లో శుభకార్యం జరగాలంటే, మంగళ వాద్యాలు వాయించేవారు కావాలి. కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ కావాలి. అంటే అన్ని వృత్తులవారు సహకరిస్తేనే ఏ పనులయినా జరుగుతాయి. ఒకరికొకరు తోడ్పడితేనే, సమాజం నడుస్తుంది.

రైతులు పొలం దున్నాలంటే నాగలి కావాలి. దాన్ని వడ్రంగి చెక్కాలి. కమ్మరి దానికి గొర్రు తయారుచేయాలి. రైతుకు. చర్మకారులు చెప్పులు కుట్టాలి. సాలెలు బట్టలు వేయాలి. కంసాలి, వారికి నగలు చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. ఇలా అన్ని వృత్తులవారూ సహకారం అందిస్తేనే, సమాజం సక్రమంగా నడుస్తుంది.

ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను, అన్ని వృత్తులవారు కలిసి మెలిసి తయారుచేసుకొనేవారు. వారు తమ కులాలను మరిచిపోయి, అక్క బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకొనేవారు. .. తిరిగి గ్రామాల్లో అటువంటి తియ్యని జీవితం రావాలి. శరీరం నడవడానికి అవయవాలు అన్నీ ఎంత ముఖ్యమో మనిషి జీవనానికి అన్ని వృత్తులవారి శ్రమ కూడా అంత ముఖ్యం అని గుర్తించాలి.

ప్రశ్న 6.
‘ఒకరిమీద ఒకరు ఆధారపడడం’. అనేది మన సంస్కృతిలో చాలా గొప్పది. ఎందుకు? దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు:
నిత్య జీవితంలో మనిషి ప్రక్కమనిషి మీద ఆధారపడి బతకక తప్పదు. పరస్పరం ఒకరిపై ఒకరు. ఆధారపడటం అనేది మన సంస్కృతిలో గొప్ప విషయం.

ఈ మన ఇంట్లో పెళ్ళి అయితే మంగళవాద్యాలు కావాలి. కుండలు, ప్రమిదలు కావాలి. నగలు కావాలి. వంటల వారు కావాలి. పెండ్లి చేయించేవారు కావాలి. బట్టలు కావాలి. లైటింగ్ ఏర్పాట్లు కావాలి. అలంకరణ చేసేవారు కావాలి. ఈ పనులన్నీ చేసేవారు ఉంటే తప్ప, మన వద్ద డబ్బు ఉన్నా పెళ్ళి జరుగదు. దీనిని బట్టి మనం సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నాం అని గ్రహించాలి.

రైతు పంటలు పండించాలి. ఆ పంటలను బజార్లకు తీసుకురావాలి. వాటిని వర్తకులు అమ్మాలి. అప్పుడే మనం వాటిని కొని, అనుభవించగలం. రోగం వస్తే వైద్యులు కావాలి, ఇళ్ళు కట్టడానికి, తాపీ పనివారు, వడ్రంగులు, ఇనుప పనివారు, విద్యుచ్ఛక్తి పనివారు, కుళాయిలు అమర్చేవారు కావాలి. ఇండ్లలో పనిచేసే పనివారు కావాలి.

దీనిని బట్టి మనం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్నాం అనీ, పరస్పరం ఆధారపడటం మన సంస్కృతిలో గొప్ప విషయం అని గ్రహిస్తాము.

కఠిన పదములకు అర్థములు

అసామాన్యమైన = సాటిలేనిదైన
ప్రతిభ = తెలివి
క్షణాలలో = నిమిషాలలో
సారించామా? = ప్రసరింపజేశామా?
కృషి = పరిశ్రమ; ప్రయత్నము
త్యాగాన్ని = దానాన్ని
జీవమ్ములు = ప్రాణులు
జీవకోటి = ప్రాణికోటి
ఆదివాసులు = మొదట నివసించిన వారు
కొండకోనలు = కొండలు, అరణ్యాలు
రేయింబవళ్ళు = రాత్రింబవళ్ళు
ఆహారపుటలవాటు = ఆహారం, అలవాట్లు
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పినమాట
జానపదులు = గ్రామీణులు
ప్రాచుర్యం = విస్తారం
సజావుగా = సరియైనరీతిలో
మురిసిపోతాం = ఆనందిస్తాము
గిరాకీ = అలభ్యత (దొరకకపోవడం)
అటికెలు = చిన్నకుండలు
గురుగులు = చిన్న పిడతలు
చకచకా = వేగంగా
సమాజగతిని = సంఘపు నడకను
ఆము = కుమ్మరి కుండలు కాల్చే నిప్పుల గుంట
తతంగము = కార్యక్రమము
కొలిమి = కమ్మరి ఇనుప పనిముట్లు కాల్చే నిప్పుల గుంట
కమ్మలు = చెవుల ఆభరణాలు (దుద్దులు)
ఆపాదమస్తకం = పాదాలనుండి తలవఱకు
సొమ్ములు = నగలు
మూస = బంగారం మున్నగువాటిని కరిగించే పాత్ర
అనారోగ్యము = ఆరోగ్యం చెడిపోవడం
నైపుణ్యం = నేర్పు
పొదగడం = అతకడం
గడ్డపార = గునపము
సెగ = వేడి
కీలకము = ముఖ్యము
గుంటక = విత్తనాలు చల్లడానికి నేలను చదును చేసే సాధనము
కొయ్య = కఱ్ఱ
దారు శిల్పులు = కఱ్ఱపై చెక్కే శిల్పులు
ఆవేదన = పెద్దనొప్పి
ఒడుపుగా = వీలుగా
ఔదార్యాన్ని = దాతృత్వాన్ని
కలిమిన్ కబళించి = సంపదను మ్రింగి
భరతావని = భారతభూమి
వక్కాణించారు = చెప్పారు

ముప్పు ఘటించి పద్యమునకు భావము

భావం :
చెప్పులు కుట్టి జీవించే వారి కులానికి కీడు చేసి, వారి సంపదను దోచుకొని, వారి శరీరాన్ని పిప్పి చేసిన భారతవీరుల యొక్క పాదాలు కందిపోకుండా వారికి చెప్పులు కుట్టి, చెప్పులుకుట్టేవారు జీవనాన్ని సాగిస్తారు. కాదని చెప్పరు. భరతభూమి చెప్పులు కుట్టేవారి సేవకు ఋణ పడింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 12 అసామాన్యులు

కాటికి = శ్మశానమునకు
బొక్కెనలు = చేదలు
క్షురకులు = మంగలులు
భాగస్వామ్యం = వాటా
అవగాహన = తెలిసికోవడం
గాట్లుపడటం = పుండ్లు పడడం
చిట్కాలు = సూక్ష్మరహస్యాలు
శరీరమర్ధనం = శరీరాన్ని పిసకడం; (మాలిష్ చేయడం)
ఆషామాషీ = అశ్రద్ధ
సుదీర్ఘము = మిక్కిలి పొడవైనది
శుభాశుభకార్యక్రమాలు = మంచి చెడుపనులు
ప్రమేయం = సంబంధము
ఆవిష్కరణలు = కొత్త వస్తువులను కనుక్కోడాలు
తల్లడిల్లుతాం = ఆవేదన చెందుతాము
నినాదము = కేక
పస్తులుండి (పస్తులు + ఉండి) = తిండితినకుండా ఉండి
సడలని స్టైర్యం = జారని (తొలగని) ఓర్పు (నిలుకడ)
పునీతుడు = పవిత్రుడు
పరస్పరం = ఒకరికొకరు
సహకరించుకుంటే = సాయం చేసుకుంటే
స్వయం సమృద్ధంగా = తనంతట తాను నిండుగా
చేదోడు వాదోడుగా = పనిలో మాటలో సాయముగా
ఆత్మీయ సంబంధం = తనవారనే సంబంధము
శ్రమైక జీవన సౌందర్యము = శ్రమించడమే ముఖ్యమైన
అందం పాటించడం = ఆచరించడం

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 11th Lesson సీత ఇష్టాలు Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 11th Lesson సీత ఇష్టాలు

7th Class Telugu 11th Lesson సీత ఇష్టాలు Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
చిత్రం చూడండి. ఎవరెవరు ఉన్నారు?
జవాబు:
చిత్రంలో తంబురా వాయిస్తూ బుర్రకథ చెపుతున్న కథకుడూ, వంత పాడుతున్న మరో ఇద్దరూ ఉన్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏం జరుగుతున్నది?
జవాబు:
చిత్రంలో బుర్రకథ చెప్పడం జరుగుతున్నది.

ప్రశ్న 3.
ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడైనా చూశారా? దీనిని ఏమంటారు?
జవాబు:
ఇటువంటి ప్రదర్శనను చూశాను. దీనిని “బుర్రకథ” అంటారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

ప్రశ్న 4.
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి ఏం మాట్లాడుతుండవచ్చు? ప్రక్కనున్నవారు ఏమంటున్నారు? ఊహించి చెప్పండి.
జవాబు:
చిత్రంలో మధ్యనున్న వ్యక్తి బుర్రకథలో ప్రధాన కథకుడు. అతడు అల్లూరి సీతారామరాజు వంటి సాహసవీరుని కథ చెపుతూ ఉండవచ్చు. ప్రక్కనున్నవారు వంతలు.. వారు “తందాన తాన” అంటూ వంత పాడుతూ ఉండవచ్చు. ప్రక్కవారిలో ఒకడు హాస్యం చెపుతూ ఉండి ఉండవచ్చు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
‘సీత’ లాంటి వాళ్ళను గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.
జవాబు:
సీతలాంటి తెలివైన ఆడవాళ్ళు, సంఘంలో ఎంతోమంది ఉంటారు. వారిలో చాలామందికి చదువు లేనందువల్ల వారు వంటింటి కుందేళ్ళుగా మారిపోయారు. సీతలా చదువుకుంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రాణించవచ్చు. ముద్దుగా నేర్పిస్తే, ముగుదలు నేర్చుకోలేని విద్యలు ఉండవు. కిరణ్ బేడీ లాంటి నిజాయితీ పోలీసు ఆఫీసర్లు, . ఇందిర, సిరిమావో వంటి గొప్ప రాజకీయ నాయకులు స్త్రీలలో ఉన్నారు.

ప్రశ్న 2.
ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎందుకు? కారణాలు చెప్పండి.
జవాబు:
ఆడవాళ్ళలో ఎంతోమంది చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినవారు, రాజ్యాలు పాలించిన వారూ ఉన్నారు. రాణి రుద్రమదేవి, ఇందిరాగాంధీ, ఝాన్సీలక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు వంటి గొప్ప నాయికామణులు ఉన్నారు. మమతాబెనర్జీ జయలలిత, మాయావతి, షీలాదీక్షిత్ వంటి ఆడ ముఖ్యమంత్రులు ఉన్నారు. ప్రతిభాపాటిల్ వంటి స్త్రీ రాష్ట్రపతులున్నారు. ముఖ్యంగా స్త్రీలు బిడ్డలను కనిపెంచుతున్నారు. స్త్రీలలో ఎందరో ప్రొఫెసర్లు, అంతరిక్ష యాత్రికులు, శాస్త్రకోవిదులు ఉన్నారు. సోనియాగాంధీ వంటి పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. కాబట్టి స్త్రీలు కూడా గొప్పవారే.

ప్రశ్న 3.
శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నారు కదా ! అట్లాగే మీ ఉపాధ్యాయులను గురించి మాట్లాడండి.
జవాబు:
మా ఉన్నత పాఠశాలలో ‘గౌరి’ అనే తెలుగు టీచరూ, ‘పార్వతి’ గారు అనే లెక్కలు టీచరూ ఉన్నారు. వారు మాకు చక్కగా పాఠాలు బోధిస్తారు. మా తెలుగు టీచరు మాకు భారత, భాగవత, రామాయణ కథలు చెపుతారు.. మాకు తెలుగు భాషపై మంచి ఇష్టం కల్గించారు.

ఇక మా లెక్కల టీచరు పార్వతిగారు, లెక్కలు చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతారు. రోజూ సాయంత్రము అదనంగా క్లాసు తీసుకొని, అక్కడే మాచే ఇంటిపని లెక్కలు అన్నీ చేయిస్తారు. ఆ ఇద్దరు టీచర్లు అంటే, మా పిల్లలందరికీ చాలా ఇష్టం.

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
‘కొత్త వింత – పాత పోత’ అనే అర్థంవచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయి?
జవాబు:
పాండవులూ, కౌరవుల కథ, నలమహారాజు కథ, సీతమ్మ కష్టాలు వంటి కథలు పాతకథలయిపోయాయి. – కాబట్టి కొత్త కథ చెప్పమని రాజు, కృష్ణవేణి అక్కను అడిగాడు. అప్పుడు రోజా “పాతంటే రోతగా ఉందా !” అని రాజును ప్రశ్నించింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

ప్రశ్న 2.
పాఠంలో మీకు నవ్వు పుట్టించిన అంశాలు రాయండి.
జవాబు:

  1. రాజు రోజాను, “కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అట్లా అరుస్తావ్” అన్నపుడు నవ్వు వచ్చింది.
  2. రాజు “ఆలస్యం అమృతం విషం” అంటే, ఇదేనేమో అన్నాడు. అప్పుడు రోజా “నువ్వు నోరు మూస్తావా? ముయ్యవా?” అంటుంది. అప్పుడు కూడా నవ్వు వచ్చింది.
  3. రాజు తాను “26 లెటర్సూ ABCD ” లాంటివి చదివానని తన చదువు – గురించి గొప్ప చెప్పినపుడు నవ్వు వచ్చింది.

ప్రశ్న 3.
కింది అపరిచిత వచన భాగం చదివి, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించి, రాయండి.

“1940 ప్రాంతంలో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీ క్లబ్, సోదరీ సమాజం, ఆంధ్ర యువతీమండలి, ఆంధ్రమహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి, సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి. – రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వితంతువుల కోసం వసతిగృహాలు ఏర్పాటు చేశారు. అనేకమంది రచయితలు, రచయిత్రులు పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి మొదలైనవాళ్ళు సంఘసంస్కరణకు కృషిచేశారు. అఘోరనాథ ‘ఛటోపాధ్యాయగారి భార్య వసుంధరా దేవి గారు, నాంపల్లిలో బాలికల కోసం ‘పాఠశాలను ప్రారంభించారు. ఈమె సరోజినీ నాయుడు గారి తల్లి.
అ) పైన పేర్కొన్న సంఘటనలన్నీ ఎప్పుడు జరిగాయి?
ఎ) స్వాతంత్ర్యానికి ముందు
బి) స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
సి) 19వ శతాబ్దంలో
జవాబు:
ఎ) స్వాతంత్ర్యానికి ముందు

ఆ) గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహిళ ఎవరు?
ఎ) లేడీ హైదరీక్లబ్
బి) రత్నదేశాయి
సి) ఇందిరాగాంధీ
జవాబు:
బి) రత్నదేశాయి

ఇ) సంగం లక్ష్మీబాయి ఏంచేశారు?
ఎ) వితంతువులకు హాస్టల్ ఏర్పరిచారు
బి) సంఘసంస్కరణ చేశారు
సి) క్లబ్బును స్థాపించారు
జవాబు:
బి) సంఘసంస్కరణ చేశారు

ఈ) నాంపల్లిలో బాలికా పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) అఘోరనాథ ఛటోపాధ్యాయ
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) శ్రీమతి సరోజినీ నాయుడు
జవాబు:
బి) శ్రీమతి అఘోరనాథ ఛటోపాధ్యాయ

ఉ) ఇది ఒక సమాజం పేరు.
ఎ) సోదరీ సమాజం
బి) ఆంధ్ర యువతీ మండలి
సి) లేడీ హైదరీక్లబ్
జవాబు:
ఎ) సోదరీ సమాజం

ఊ) సరోజినీ నాయుడు తండ్రి పేరు
ఎ) రత్నదేశాయి
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ
సి) గాంధీ
జవాబు:
బి) అఘోరనాథ ఛటోపాధ్యాయ

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

4. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) బుర్రకథ ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఎవరెవరు ప్రదర్శించారు?
జవాబు:
బుర్రకథ ప్రదర్శన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. కృష్ణవేణి కథకురాలు. రాజు, రోజాలు వంతలు.

ఆ) బుర్రకథలో మొదట ఎవరెవరిని ప్రార్థించారు? ఏమని వేడుకున్నారు?
జవాబు:
బుర్రకథలో మొదట కృష్ణవేణి, సరస్వతీదేవిని, మహాలక్ష్మిని, దుర్గను ప్రార్థించింది.

  1. చదువులనిచ్చే సరస్వతిని చల్లగా చూడమని ప్రార్థించింది.
  2. సంపదలనిచ్చే లక్ష్మిని కరుణించమని కోరింది. 3) శత్రువులను నశింపజేసే దుర్గను, జయము నిమ్మని కోరింది.

ఇ) బుర్రకథ ప్రారంభంలో సీతను ఏమని పరిచయం చేశారు?
జవాబు:
సీతను గురించి ఈ విధంగా పరిచయం చేశారు. “సీత పేదల ఇంటిలో పుట్టిన పైడిబొమ్మ, చదువు సందెలో – పేరు పొందిన చక్కనమ్మ. ఓటమిని ఎరుగక పోరాడే వీరబాల”

ఈ) సీత బడిలో చేరడానికి కారణం ఏమిటి?
జవాబు:
సీత ఊరి బడికి, ‘శ్రావణి’ అనే టీచర్ వచ్చింది. ఆమె బడిఈడు వచ్చిన పిల్లలు ఎవరు బడికి రావట్లేదో ఆమె తెలుసుకొంది. శ్రావణి సీతమ్మ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభివృద్ధి అవుతుందని చెప్పింది. రుద్రమదేవి, సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి వంటి ఆదర్శ మహిళల గూర్చి శ్రావణి వారికి చెప్పింది. శ్రావణి మాటలు, సీత వింది. తాను చదువుకుంటానని చెప్పి బడిలో చేరింది.

ఉ) బుర్రకథలో ఏ ఏ ఆదర్శ మహిళలను గురించి చెప్పారు? వారు ఏం చేశారు?
జవాబు:
బుర్రకథలో రుద్రమదేవి, సరోజినీనాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ ముఖ్, కల్పనా చావ్లా వంటి ఆదర్శ మహిళలను గురించి చెప్పారు. రుద్రమదేవి శత్రువులను చీల్చి చెండాడింది. సరోజినీ నాయుడు స్వరాజ్య సమరం చేసింది. సంగం లక్ష్మీబాయి బాలలను బాగుపరచింది. దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళల. మార్గము దిద్దింది. కల్పన చావ్లా అంతరిక్షంలోకి ఎగిరింది.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని తెలపండి.
జవాబు:
శ్రావణి మంచి టీచరు. ఈమె రామాపురం స్కూలుకు టీచరుగా వచ్చింది. ఆమె ఆ ఊరికి వెళ్ళగానే, బడి ఈడున్న పిల్లలు ఎవరు బడికి రావడం లేదో తెలుసుకుంది. తెలుసుకొని వారి ఇళ్ళకు వెళ్లింది. ఆ ఊళ్ళో సీత అనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బడికి పంపడం లేదు. శ్రావణి సీతవాళ్ళ ఇంటికి వెళ్ళి సీత తల్లిదండ్రులకు కొన్ని మంచిమాటలు చెప్పింది. మానవజన్మ గొప్పదనీ, ఆడపిల్లగా పుట్టడం శ్రేష్ఠమనీ, ఆడపిల్లను చక్కగా పెంచితే దేశం అభ్యున్నతి పొందుతుందని చెప్పింది. ఆ మాటలు విని, సీత బడికి వెళ్ళి చదువుకొంది.

ఆ) పాఠాన్ని ఆధారంగా చేసుకొని, ఆడపిల్లల పరిస్థితులు గురించి, 5 వాక్యాలు రాయండి.
జవాబు:
పూర్వము తల్లిదండ్రులు ఆడపిల్లలను శ్రద్ధగా బడికి పంపేవారు కాదు. ఆడపిల్లలకు ఉన్నత చదువులు అవసరం లేదని ఆనాడు భావించేవారు. ఆడపిల్లలను బడికి పంపండని టీచర్లు వచ్చి అడిగితే, తల్లిదండ్రులు తను పిల్లల్ని టీచరుకు కనబడకుండా దాచేవారు. కాని ఈ పాఠంలో సీతవలె చదివి మంచి ఉద్యోగాలు చేసి, పిల్లల చదువుల కోసం, స్త్రీలకు మేలు చేయడం కోసం, స్త్రీలు శ్రమించాలి. అందుకు తల్లిదండ్రులు స్త్రీలకు చేయూతనియ్యాలి.

ఇ) “పెద్దలు పనికి – పిల్లలు బడికి” – అనే నినాదాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పెద్దవారు పనిచేసి డబ్బు సంపాదించి, సంసారాన్ని పోషించాలి. పిల్లలు చక్కగా బడికి వెళ్ళి, చదువుకొని మంచి విజ్ఞానాన్ని సంపాదించాలి. చిన్నపిల్లలను పనులకు పంపి, వారు సంపాదించే చిన్నపాటి కూలీ డబ్బులను పెద్దలు ఆశించరాదు. పిల్లలను చదువులు మాన్పించి వారిని పనులకు పంపిస్తే, పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది.

ఈ) “ఆలస్యం అమృతం విషం” – అంటే మీకేమి అర్ధమైంది?
జవాబు:
సహజంగా మనం ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటే, దానిని త్వరగా ప్రారంభించాలి. అలా కాకుండా ఆ పని చేయడానికి ఆలస్యం చేస్తే, ఒకప్పుడు అది నష్టం తీసుకువస్తుంది. తీవ్రమైన వ్యాధితో ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టరు వద్దకు వెళ్ళాలి. ఆలస్యం చేస్తే అమృతంలా చక్కగా నయం కావలసిన జబ్బు. కాస్తా విషంగా మారి, ప్రాణం మీదికి రావచ్చు. కాబట్టి పీకల మీదకు తెచ్చుకోకుండా తలచుకున్న మంచి పనిని ముందే పూర్తిచేయాలి.

ఉ) మీరు చదువుకొని ఏం కావాలనుకుంటున్నారు? ఎందుకు?
జవాబు:
నేను డాక్టరు కోర్సులో చేరి, MBBS చదవాలని అనుకుంటున్నాను. మాది పల్లెటూరు. ఆ గ్రామంలో వైద్యసహాయం ప్రజలకు అందడం లేదు. కాబట్టి నేను వైద్యవృత్తిని చేబట్టి, మా గ్రామ ప్రజలకు వైద్యం అందించాలని ఉంది. కొద్దిపాటి ఫీజు వసూలు చేసి, గ్రామ ప్రజలకు సాయం చేయాలని ఉంది. ఆదర్శ వైద్యశాల ప్రారంభిద్దామని నా కోరిక.

ఊ) ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ సమానమే ! ఎందుకు ? మీ అభిప్రాయాలు రాయండి.
జవాబు:
స్త్రీలు, పురుషులు అనే భేదం తప్ప, ఆడ మగపిల్లల్లో మరో తేడా లేదు. ఇద్దరూ తెలివిగలవారే. ఇద్దరూ పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు తోడుగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయగలరు. స్త్రీ, పురుషులు అన్ని ఉద్యోగాలకూ అర్హులు. స్త్రీ కన్న పురుషుడు సహజంగా బలవంతుడు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చదువుకున్నా, వారు ఉద్యోగాలు చేస్తున్నా, వారి పెళ్ళికి, వరునికి కట్నం ఇవ్వవలసి వస్తుంది. పెళ్ళయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలకు అండగా ఉండవలసి వస్తోంది. ఆడపిల్లలు మాత్రం, తమ తల్లిదండ్రులకు వారి భర్తల అనుమతి లేనిదే ఏమీ సాయం చేయలేరు. క్రమంగా ఆడ-మగ భేదం పోతుంది. పోవాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) బుర్రకథలోని ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
బుర్రకథలో ఒకరు కథ చెపుతూ ఉంటారు. కథ చెప్పే వారికి చెరోప్రక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. – కథ చెప్పేవారిని కథకుడు’ అనీ, ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను ‘వంతలు’ అని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు. వంతలు డక్కీలు వాయిస్తారు.

బుర్రకథలో మొదట .కథకుడు సరస్వతినీ, మహాలక్ష్మినీ, దుర్గనూ ప్రార్థిస్తారు. వంతలలో ఒకడు హాస్య సంభాషణలు చేస్తాడు. బుర్ర కథ పూర్తి అయ్యాక, మంగళం పాడతారు.

జానపద కళల్లో బుర్రకథకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ప్రజలను చైతన్యపరచడంలో బుర్రకథ కీలక పాత్ర వహి తెచింది.

ఆ) సీత ఇష్టాలు పాఠం ఆధారంగా మీ ఇష్టాలను వివరించండి.
జవాబు:
నాకు పాఠశాలలో బాగా చదువుకోవాలని ఉంది. చదువుతోపాటు ఆటలపై నాకు ఆసక్తి ఎక్కువ. క్రికెట్, షటిల్ ఆటలపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. క్రికెట్ ఆటలో సచిన్ టెండూల్కర్ నాకు ఇష్టమైన ఆటగాడు. ఎప్పటికైనా నేను సచిన్ లాగ, నూరు సెంచరీలు చేసి, మన దేశానికి పేరు తేవాలని ఉంది. . .

నాకు సివిల్ ఇంజనీరు కావాలని ఉంది. ఐ.ఐ.టిలో చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ . ఉంది. ఎప్పటికయినా, ఏదో పెద్ద ప్రాజెక్టు కట్టే ఇంజనీరు కావాలని ఉంది. ఈ

IV. పదజాలం

1. కింది వాక్యాలు చదవండి. ఎవరెవరిని ఏమంటారో రాయండి.

అ. బుర్రకథలో కథ చెప్పేవాడు : (కథకుడు)
ఆ. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే వ్యక్తి : (మండల అభివృద్ధి అధికారి)
ఇ. నాయకత్వం వహించేవాడు : (నాయకుడు)
ఈ. ఉపన్యాసం ఇచ్చేవాడు : (వక్త)
ఉ. హరికథ చెప్పేవాడు : (హరిదాసు )

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

1. సినీమా పాటలలో ఘంటసాల వారి గీతాలు ప్రాచుర్యం పొందాయి. : (విస్తారము)
2. భర్తృహరి సుభాషితాలలో మంచి సూక్తులు ఉన్నాయి. : (మంచి మాటలు)
3. నేను వేసిన తారాజువ్వ అంతరిక్షాన్ని తాకింది. : (ఆకాశము)
4. దేశం అభ్యున్నతికి పౌరులంతా శ్రమించాలి. : (అభివృద్ధి)
5. రామయ్యగారు కథలను అలవోకగా రాస్తారు. : (అప్రయత్నము)
6. విద్యార్థులలో ప్రతిభ ఉంటే వారు చక్కగా రాణిస్తారు. : (తెలివి)

3. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1) కలకలలాడు :
పెళ్ళికి వచ్చిన బంధువులతో మా ఇల్లు కలకలలాడుతూ ఉంది.

2) ప్రదర్శించు :
తెలివి ఉంది కదా అని, గర్వమును ప్రదర్శించరాదు.

3) కీలకపాత్ర :
మా సంసారమును నడిపించడంలో మా నాన్నగారే కీలకపాత్ర వహిస్తారు.

4) వంతపాడు :
మా చెల్లి మా అమ్మ మాటలన్నింటికీ వంతపాడుతుంది.

5) దిగ్విజయం :
మా పాఠశాల నూరు శాతం ఫలితాలతో దిగ్విజయంగా నడుస్తోంది.

6) రసాభాస : మా పాఠశాలలో నాటక ప్రదర్శన వర్షం రావడంతో రసాభాస అయ్యింది.

7) చదువు సందెలు :
మా మేనల్లుడికి చదువుసందెలు అబ్బలేదు.

8) నోరుమూయు :
నాన్నగారు కోపపడడంతో.తమ్ముడు నోరుమూశాడు.

9) కుంగదీయు :
కష్టాలు మా తాతగార్ని కుంగదీశాయి.

10) తల్లడిల్లు :
చీకటి పడినా తమ్ముడు ఆటల నుండి రాలేదని మా ఇంటిల్లపాదీ తల్లడిల్లాము.

11) కొవ్వొత్తి :
కష్టాలతో మా అమ్మమ్మ జీవితం, కొవ్వొత్తిలా కరిగిపోయింది.

12) సూకులు :
గురువులు పిల్లలకు సూక్తులు బోధించాలి.

13) పుణ్యఫలం :
భారతదేశం పుణ్యఫలం కొద్దీ గాంధీ, నెహ్రూలు మనదేశంలో పుట్టారు.

14) అభ్యున్నతి :
దేశం అభ్యున్నతి కోసం దేశపౌరులందరూ శ్రమించాలి.

15) అలవోకగా :
మా చెల్లెలు అలవోకగా త్యాగరాజు కీర్తనలు పాడుతుంది.

16) వెక్కిరించు :
అంగవైకల్యం గలవారిని చూచి వెక్కిరించరాదు.

4. కింది పదాలకు వ్యతిరేకపదాలు రాయండి.

1. తొలి × మలి
2. ప్రయత్నము × అప్రయత్నము
3. జయము × అపజయము
4. పాత × కొత్త
5. ఇష్టం × అనిష్టం
6. ఉత్తముడు × అనుత్తముడు
7. కష్టము × సుఖము
8. పిల్లలు × పెద్దలు
9. నిజం × అబద్ధం
10. ముందు × వెనుక
11. మంచి × చెడ్డ
12. పుణ్యము × పాపము
13. అన్యాయము × న్యాయము
14. పెద్ద × చిన్న
15. అవకాశం × నిరవకాశం
16. మేలు × కీడు
17. సమానము × అసమానము

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

5. ఈ కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించి ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

1. కథ (ప్రకృతి) – కత (వికృతి)
2. సిరులు (వికృతి) – శ్రీలు (ప్రకృతి)
3. గాథ (ప్రకృతి) – గాద (వికృతి)
4. సన్నాసి (వికృతి) – సన్యాసి (ప్రకృతి)
5. కాకి (వికృతి) – కాకము (ప్రకృతి)
6. దీపము . (ప్రకృతి) – దివ్వె (వికృతి)
7. భారము (ప్రకృతి) – బరువు (వికృతి)
8. బొమ్మ, (వికృతి) – బ్రహ్మ (ప్రకృతి)
9. విషము (ప్రకృతి) – విసము (వికృతి)
10. దంపతులు (ప్రకృతి) – జంపతులు (వికృతి)
11. విజ్ఞానము (ప్రకృతి) – విన్నాణము (వికృతి)
12. అక్షరము (ప్రకృతి) – అక్కరము . (వికృతి)

V. సృజనాత్మకత

1. ఈ బుర్రకథను మీ పాఠశాలలో ప్రదర్శించండి. ఈ బుర్రకథకు ‘సీత ఇష్టాలు’ గాక మరేదైనా పేరును సూచించండి.
జవాబు:
ఈ కథకు “MDO సీతమ్మ” అని మరో పేరు పెట్టవచ్చును.
(లేదా)

2. ఆడపిల్లలను సమానంగా చూడాలన్న అంశాన్ని గురించి నినాదాలు రాయండి.
జవాబు:

  1. ఆడపిల్ల పుట్టింది – అదృష్టం పట్టింది.
  2. ఆడపిల్లే కావాలి – సౌభాగ్యం వర్ధిల్లాలి.
  3. ఆడపిల్లే మాకు యోగ్యం – ఆమే అత్తింటి సౌభాగ్యం.
  4. ఆడపిల్ల – ఆ యింటి మహాలక్ష్మి.
  5. ఆడా మగా తేడా వద్దు – ఎవరైనా మాకు ముద్దు.

VI. ప్రశంస

* మీ తరగతిలోని ఆడపిల్లల్లోని మంచి గుణాలను గుర్తించి, జాబితా రాయండి.
జవాబు:
మా తరగతిలో పదిమంది ఆడపిల్లలున్నారు. అందులో కింది బాలికలలో మంచి గుణాలున్నాయి.

1) సీత :
మంచి తెలివైన పిల్ల. ఈమె ఏక సంథాగ్రాహి.

2) రజని :
ఈమెలో కరుణ ఎక్కువ. ప్రక్కవారికి కష్టం కలిగితే కన్నీరు పెడుతుంది. వారికి సాయం చేస్తుంది.

3) గోపిక :
నిజాయితీ, ధర్మము, న్యాయముపై ఈమెకు మక్కువ.

4) పావని :
ఈమెకు శుభ్రతపై దృష్టి ఎక్కువ. తన బట్టలు, పుస్తకాలు నిర్మలంగా ఉంచుకుంటుంది. ఈమె స్నేహితురాళ్ళ పుస్తకాలు కూడా సర్దుతుంది.

5) రమ్య :
ఈమె పేరుకు తగినట్లుగా అందంగా ఉంటుంది. అభ్యుదయభావాలు కలది. ఈమె కొత్తదనాన్ని కోరుకుంటుంది.

6) గంగ :
ఈమెకు దేవునిపై మంచి విశ్వాసం. దైవభక్తి కలది. కమ్మగా దైవభక్తి గేయాలు పాడుతుంది.

VII. ప్రాజెక్టు పని

1. ఆడవాళ్ళపట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలను సేకరించండి.
జవాబు:
ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిచేయడానికి సంబంధించి వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తలను సేకరించి, కత్తిరించి ఇక్కడ అతికించండి.
ఉదా :
సమస్యలపై సైకిల్ యాత్ర!
AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు 2

(లేదా)

2. మీ ప్రాంతంలోని కళారూపాలను గురించి తెలుసుకొని, నచ్చిన కళారూపాన్ని గురించి రాయండి.
జవాబు:
మేము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా వాసులం. మేము కపిళేశ్వరపురం ఉన్నత పాఠశాలలో చదువుతున్నాం. మా గ్రామంలో SBPK సత్యనారాయణరావు గారు అనే జమిందారు గారు ఉండేవారు.

ఆయనకు ‘హరికథ’ అనే కళారూపం అంటే చాలా ఇష్టం. మా గ్రామంలో హరికథను చెప్పడం నేర్పే పాఠశాలను ఆయన స్థాపించారు. ఇక్కడ వందలకొద్దీ హరికథా గాయనీగాయకులు తయారయ్యారు. ఇంకా అవుతున్నారు.

ఆదిభట్ల నారాయణదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు వంటి ప్రసిద్ధ హరికథకులు, ఆంధ్రదేశంలో పుట్టారు. వారు మన తెలుగువారికి రామాయణ భారత భాగవత కథలను పరిచయం చేశారు. ‘హరికథ’ సంగీత, సాహిత్య, నృత్య కళారూపం. హరిదాసులు, మెడలో దండ వేసుకొని, చేతిలో చిడతలు తీసుకొని, హార్మనీ, ఫిడేలు, మద్దెలల సహకారంతో హరికథను చెపుతారు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ. కింది వాక్యాలు చదవండి.

1. సీత బడికి వెళ్ళింది. (సామాన్య వాక్యం)
2. సీత అన్నం తిని, బడికి వెళ్ళింది. (సంక్లిష్ట వాక్యం)
3. సీత అన్నం తిన్నది, కాని బడికి వెళ్ళలేదు. (సంయుక్త వాక్యం)

ఇలా ఉన్న వాక్య భేదాల గురించి మీరు తెలుసుకున్నారు. అవేమిటంటే సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలు. ఐతే ఈ వాక్యాలు ఇలా వేరువేరుగా కనబడటానికి కారణం, ఆ వాక్యాల్లోని క్రియ. క్రియను బట్టే కాక, అర్థాన్ని బట్టి కూడా వాక్యాల్లో తేడాలు గమనించవచ్చు. అలాంటి వాక్య భేదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.

1. కింది వాక్యాల్ని చదివి అర్థం చేసుకోండి. అందులోని భేదాలను గుర్తించండి.

అ) ఆహా ఎంత బాగుందో !
ఆ) చేతుల కడుక్కో !
ఇ) చాలాసేపు టీవీ చూడొద్దు.
ఈ) లోపలికి రావచ్చు.
ఉ) గోపాల్ చెట్టు ఎక్కగలడు.

గమనిక :
పై వాక్యాలు ఒక్కో భావాన్ని సూచిస్తున్నాయి. అదెలాగో చూద్దాం !

ఉదా :
అ) ఆహా ! ఎంత బాగుందో ! :
ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది. కనుక ఈ వాక్యం. “ఆశ్చర్యార్థక వాక్యం ”.

ఆ) చేతులు కడుక్కో :
ఇది విధిగా ఆ పని చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే చేయవలసిన పనిని విధిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని “విధ్యర్థక వాక్యం” అంటాం.

ఇ) చాలా సేపు టీవీ చూడొద్దు :
ఈ వాక్యం టీవీ చూడటం వద్దని చెబుతున్నది. టీవీ చూడటాన్ని నిషేధిస్తున్నది. అంటే ‘నిషేధార్థక వాక్యం’. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం, “నిషేధార్థక వాక్యం”.

ఈ) లోపలికి రావచ్చు :
ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని ఇస్తున్నట్లు సూచిస్తున్నది. అంటే అనుమత్యక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం”.

ఉ) గోపాల్-చెట్టు ఎక్కగలడు :
ఈ వాక్యంలో గోపాల్ చెట్టు ఎక్కగలడు. అంటే గోపాల్ కు ఉన్న చెట్టును ఎక్కే – సామర్థ్యాన్ని సూచిస్తున్నది. ఇది “సామర్థ్యార్థక వాక్యం”.

ఒక వ్యక్తికి గాని, వ్యవస్థకు గాని లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే అర్థంగల వాక్యాన్ని . “సామర్థ్యార్థక వాక్యం” అంటాం. ఈ . అభ్యాసాలు.

అభ్యాసాలు

2. కింది వాక్యాలలోని భావాన్ని అనుసరించి ఏ వాక్యాలు అవుతాయో గుర్తించి రాయండి. ఈ వాక్యాలన్నీ మీ, పాఠ్యాంశంలోనివే.

అ) సీత కలెక్టరైందా? (ప్రశ్నార్థక వాక్యం )
ఆ) మీరు తర్వాత కొట్టుకోవచ్చు. (అనుమత్యర్థక వాక్యం)
ఇ) అక్క చెప్పేది విను. (విధ్యర్థక వాక్యం)
ఈ) రసాభాస చేయకండి. (నిషేధార్థక వాక్యం)

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

3. ఇలాంటి మరికొన్ని వాక్యాలు మీ పాఠ్యాంశాలలో నుంచి రాయండి.

1. ముందు సీత ఇష్టాలు విను. (విధ్యర్థక వాక్యం)
2. ఏం చదివావో చెప్పు. (విధ్యర్థక వాక్యం)
3. సీత చదువు ఆగిపోయిందా? (ప్రశ్నార్థక వాక్యం)
4. సీత బడికి వెళ్ళిందా లేదా ! (సందేహార్థక వాక్యం)
5. సరస్వతి తల్లీ ! చల్లగ. చూడమ్మా ! (ప్రార్థనాధ్యర్థక వాక్యం)
6. దుర్గా ! జయము నీయవమ్మా ! (ప్రార్థనార్థక వాక్యం)
7. అంతమాట అనకండి (నిషేధార్థక వాక్యం)
8. ఆహా ! ఎంత బాగుంది. (ఆశ్చర్యార్థక వాక్యం)
9. సీత లెక్కలు బాగా చేసింది. (సామాన్య వాక్యం)
10. నీవు ఇంటికి వెళ్ళవచ్చు. (అనుమత్యర్థక వాక్యం).

4. కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి.

1. జాతీయ దినోత్సవం = జాతీయదిన + ఉత్సవం = (అ + ఉ = ఓ) = గుణసంధి
2. పల్లెటూరు = పల్లె + ఊరు = టుగాగమ సంధి
3. కథకురాలు = కథక + ఆలు = రుగాగమసంధి
4. దిగ్విజయం = దిక్ + విజయం = జత్త్వసంధి
5. ఏందక్కా = ఏంది + అక్కా = (ఇ + అ = అ) = ఇకారసంధి
6. రసాభాస = రస + ఆభాస = (అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘసంధి
7. చక్కనమ్మ = చక్కని + అమ్మ = ఇకార సంధి
8. పదహారేళ్ళు = పదహారు + ఏళ్ళు = (ఉ + ఏ = ఏ) = ఉత్వసంధి
9. కొవ్వొత్తి = కొవ్వు + ఒత్తి = ఉత్వసంధి
10. అభ్యున్నతి = అభి + ఉన్నతి = (ఇ + ఉ = యు) = యణాదేశ సంధి
11. చిన్నక్క = చిన్న + అక్క = (అ + అ = అ) = అత్వసంధి
12. ఏమున్నది = ఏమి + ఉన్నది = (ఇ + ఉ = ఉ) = ఇత్వసంధి
13. ప్రధానోపాధ్యాయుడు = ప్రధాన + ఉపాధ్యా యుడు = (అ + ఉ = ఓ) = గుణసంధి
14. నాయకురాలు = నాయక + ఆలు = రుగాగమ సంధి
15. సీతక్క = సీత + అక్క న = (అ + అ = అ) = అత్వసంధి.

AP Board 7th Class Telugu Solutions Chapter 11 సీత ఇష్టాలు

5. కింది సమాసాలకు అర్థం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1) సీత ఇష్టాలుసీత యొక్క ఇష్టాలుషష్ఠీ తత్పురుష సమాసం
2) ప్రజాచైతన్యంప్రజల యొక్క చైతన్యంషష్ఠీ తత్పురుష సమాసం
3) దిగ్విజయముదిక్కుల యొక్క విజయముషష్ఠీ తత్పురుష సమాసం
4) చదువు బీజాలుచదువునకు బీజాలుషష్ఠీ తత్పురుష సమాసం
5) అక్షరమాలఅక్షరముల యొక్క మాలషష్ఠీ తత్పురుష సమాసం
6) ఉన్నత పాఠశాలఉన్నతమైన పాఠశాలవిశేషణ పూర్వపద కర్మధారయం
7) మంచి కథలుమంచివైన కథలువిశేషణ పూర్వపద కర్మధారయం
8) స్వరాజ్య సమరంస్వరాజ్యం కొఱకు సమరంచతుర్డీ తత్పురుష సమాసం
9) రెండు పక్కలురెండైన పక్కలుద్విగు సమాసం
10) నాలుగు రాళ్ళునాలుగు  (4) సంఖ్యగల రాళ్ళుద్విగు సమాసం
11) తల్లిదండ్రులుతల్లీ, తండ్రీద్వంద్వ సమాసం
12) లవకుశలులవుడూ, కుశుడూద్వంద్వ సమాసం
13) అన్యాయమున్యాయము కానిదినఞ్ తత్పురుష సమాసం
14) అనవసరముఅవసరం కానిదినఞ్ తత్పురుష సమాసం

కొత్త పదాలు-అర్థాలు

అంశం = విషయం
అనవసరం = అవసరం లేనిది
అభినయించు = నటించు
ఆలస్యం అమృతం విషం = ఆలస్యము వల్ల అమృతం కూడా విషంగా మారుతుంది.
అంకితము = గుర్తువేయబడినది
అంతరిక్షము = ఆకాశము
అక్షరమాల = అక్షరాలు
ఆదర్శం = ప్రతియైన (చూపబడిన)
అలవోకగా = అనాయాసముగా
కలకలలాడు = సంతోషంగా ఉండు
కీలకపాత్ర = ప్రధాన పాత్ర
తల్లడిల్లు = కలతపడు
నేపథ్యం = తెరవెనుక జరిగినది (పూర్వ రంగం)
దిగ్విజయం = సంపూర్ణ జయం
తుద = చివర
నిరంతరం = ఎల్లప్పుడు
పరిసరాలు = సమీప ప్రదేశాలు
పక్కా = కచ్చితంగా
ప్రతిభ = తెలివి
ప్రభావితులు = ప్రభావము పడినవారు
బాలభానుడు = ఉదయించే సూర్యుడు
ప్రాంగణం = ముంగిలి
ప్రాచుర్యం = విరివి, విస్తారం
ఫ్యాషన్ = Fashion (వైఖరి, విధము)
పైడిబొమ్మ = బంగారు బొమ్మ
బడాయి = గర్వము
ప్రేరణ = ప్రేరేపించుట
రోత = అసహ్యం
రాజనాలు = మంచి ధాన్యం
వంతపాడు = ఒకరన్న దానినే ఆలోచన లేకుండా తాను కూడా అనడం
శ్రీలు = సిరులు
సూక్తులు (సు + ఉక్తులు) = మంచిమాటలు
సహనము = ఓర్పు
మహిళలు = స్త్రీలు
వెక్కిరించు = పరిహాసం చేయు
లెటర్సు = Letters (అక్షరాలు)

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 10th Lesson ప్రకటన Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 10th Lesson ప్రకటన

7th Class Telugu 10th Lesson ప్రకటన Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
ఇలాంటి ప్రకటనలు ఎప్పుడైనా చూశారా? ఎక్కడ చూశారు?
జవాబు:
ఇలాంటి ప్రకటన నేను చూడలేదు. కాని మా ప్రక్క ఇంటివారి ‘కుక్కపిల్ల’ తప్పిపోయినపుడు పత్రికలో ఇలాంటి ప్రకటన ఇచ్చారు. బహుమతిగా దానిని తెచ్చి ఇచ్చిన వారికి రూ. 200 ఇస్తామని మా ప్రక్క ఇంటివారు ప్రకటించారు.

ప్రశ్న 2.
ఈ ప్రకటన ఎవరి కోసం?
ఈ ప్రకటన “శాంతి కపోతం” కోసం.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలోని కపోతాన్ని వెతకడానికి నీవేం చేస్తావు?
జవాబు:
అమెరికా ప్రెసిడెంటుకూ, రష్యా ప్రధానమంత్రికీ దేశాల మధ్య కలతలు సృష్టించవద్దని శాంతిలేఖలు పంపిస్తాను.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ కవితను భావయుక్తంగా చదవండి. సారాంశాన్ని సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
సాధన చేసి చదవండి.
పాఠ్యభాగ సారాంశం :
ఎవరికీ రైలు టిక్కెట్లు ఇవ్వకండి. రైళ్ళను ఆపివేయండి. ‘గుళ్ళ పూజలు చేయించండి. రేడియోల్లో ప్రకటనలు చేయండి. అన్నిచోట్లా జాగ్రత్తగా వెతకండి. సైన్యాన్ని, కాపలా పెట్టండి. రాకెట్లను అన్ని గ్రహాలకూ పంపండి. కాలిముద్రలు, వేలిముద్రలు పరిశీలించండి.

జనం గుంపులు గుంపులుగా వస్తూ భయంతో గుసగుసలాడుతున్నారు. స్వార్థం ఉన్నవాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఒప్పందాల కాగితాలు చింపేస్తున్నారు. సిద్ధాంతాల చర్చలు ఆగిపోయాయి.

ఇంక చరిత్రలు ఎవరూ రాయనక్కర లేదు. ఎవరూ పాలించనక్కరలేదు. అణుబాంబు ప్రజల్ని నాశనం చేసే ముహూర్తం, దగ్గరకు వచ్చేసింది. మనం మనజాతిని కాపాడుకోవాలంటే, పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలి. జయజయ ధ్వనులు చేస్తూ కదలండి.

శాంతి చక్కని తల్లి. ఆమె మన చెల్లి. ఆమె కళ్ళల్లో జాలి ఉంటుంది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆమె జడలో గులాబి పువ్వు ఉంటుంది. ఆమె ప్రజల మేలునే ఎప్పుడూ కోరుతుంది. తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.

ప్రశ్న 2.
మీరు ప్రకటనలు ఎక్కడెక్కడ విన్నారు? ఇవి వేటికి సంబంధించినవి.
జవాబు:
జాతరలలో, తీర్థాలలో పిల్లలూ, ముసలివారూ తప్పిపోతే పేపర్లలో, రేడియోలలోనూ, టీవీలలోనూ ప్రకటనలు ఇస్తారు. ఉద్యోగాల ఖాళీలను గూర్చి ప్రకటిస్తారు. కళాశాలలో సీట్ల ఖాళీలను ప్రకటిస్తారు. పరీక్ష ఫలితాలు ప్రకటిస్తారు. ధరల ప్రకటన ఉంటుంది. ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలను గూర్చి ప్రకటిస్తుంది. సభలను గూర్చి, అక్కడకు వచ్చే అతిథులను గూర్చి ప్రకటనలు ఇస్తారు. వర్తకులు, వ్యాపారులు తమ వద్ద ఉన్న సరకులను గురించి, ధర వరలను గురించి ప్రకటనలు చేస్తే నేను విన్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
ప్రకటనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మీకు ఇష్టమైన ఏదైనా ఒక ప్రకటనను గురించి చెప్పండి. అది ఎందుకు ఇష్టమైందో వివరించండి.
జవాబు:
ఉద్యోగ ప్రకటనలు, కొత్త సినిమాలు, కళాశాలల్లో సీట్ల వివరాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల ప్రకటనలు, వస్తువుల అమ్మకాలను గురించి ప్రకటనలు, పెళ్ళి కావలసిన వధూవరుల గురించి ప్రకటనలు ఉంటాయి. నాకు కొత్త సినిమాలను గురించి ఇచ్చే ప్రకటనలు అంటే చాలా ఇష్టం. సినిమాలలో మంచి హాస్యం ఉంటుంది. అందుకే ఆ సినిమా ప్రకటనలంటే నేను ఇష్టపడతాను. …

II. చదవడం – రాయడం

ప్రశ్న 1.
పాఠం చదవండి. కింది వాటిని పాఠంలో గుర్తించండి.

అ) ఆపివేయండి – పంపించండి – ప్రకటించండి – పరిశీలించండి.
జవాబు:
రైళ్ళు ఆపివేయండి. కేబుల్ గ్రామ్స్ పంపించండి. ఆకాశవాణిలో విషయం ప్రకటించండి. నిశితంగా పరిశీలించండి.

ఆ) గుసగుసలాడుతున్నారు – బాదుకుంటున్నారు – చింపేస్తున్నారు. ఇలాంటి పదాలు గల వాక్యాలను గుర్తించండి – వాటి కింద గీత గీయండి.
జవాబు:

  1. కంగారుగా భయంతో గుసగుసలాడుతున్నారు.
  2. స్వార్థ జీవనులు గభాలున టొమ్ములు బాదుకుంటున్నారు.
  3. సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు.
  4. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.

ప్రశ్న 2.
కవితలో శాంతిని గురించి వర్ణించిన పంక్తులు చదవండి. వాటి కింద గీత గీయండి.
జవాబు:
“అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ప్రశ్న 3.
పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) జాతిని కాపాడుకోవడానికి కవి ఏం చేయాలన్నారు?
జవాబు:
మనం మన జాతిని కాపాడుకోవాలంటే, ఒక్కటే మార్గం ఉందని కవి చెప్పాడు. పరారీ అయిన శాంతిని వెతికి తీసుకురావాలని చెప్పాడు. అంతకంటే మరోదారిలేదనీ, జై అంటూ శాంతిని వెదకడానికి కదలండనీ ప్రజలకు – కవి పిలుపునిచ్చాడు.

ఆ) కవి దేనికోసం వెతకమన్నారు? ఎక్కడెక్కడ వెతకమన్నారు?
జవాబు:
కవి పరారీ అయిన శాంతి కోసం వెతకమన్నారు. దాని కోసం కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో, సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకమన్నారు. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపి, అడుగుజాడల్నీ, వేలిముద్రల్నీ పరీక్షించమన్నారు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలతో సమాధానాలు రాయండి.

అ) ‘ప్రకటన’ అంటే ఏమిటి? ప్రకటనలు ఎందుకోసం?
జవాబు:
‘ప్రకటన’ అంటే వెల్లడి చేయడం. పదిమందికీ విషయాన్ని తెలపడం కోసం ప్రకటనలు చేస్తారు. పన్నులు ఫలానా తేదీ లోపల చెల్లించాలని, మున్సిపల్ కమిషనరు మైకు ద్వారా ప్రకటన చేస్తాడు. రేషను సరుకులు వచ్చాయనీ, వాటిని ఫలానా తేదీ నుండి పంపిణీ చేస్తారనీ దుకాణం దారులు ప్రకటన చేస్తారు. చౌకగా బట్టలు అమ్ముతున్నామని బట్టల వర్తకులు ప్రకటిస్తారు. ఈ విధంగా ప్రచారం చేసుకోవడం కోసం, ప్రకటనలు చేస్తారు. తప్పిపోయిన వారిని గూర్చి కూడా ప్రకటన ఇస్తారు.

ఆ) ఈ’ పాఠానికి మరొక శీర్షికను సూచించండి. దానికి మూడు కారణాలు తెలపండి.
జవాబు:
ఈ పాఠానికి మరో శీర్షిక “శాంతి పావురం”.

  1. ఈ పాఠంలో శాంతి లేకపోతే వచ్చే అలజడిని వర్ణించారు.
  2. ‘శాంతి’ స్వరూపాన్ని వర్ణించారు.
  3. జాతిని రక్షించుకోవడానికి శాంతిని వెదకడమే ఏకైక మార్గము అని కవి చెప్పాడు. కాబట్టి ఈ పాఠానికి ‘శాంతి పావురము’ పేరు బాగుంటుంది.

ఇ) ఆకాశవాణి, దూరదర్శన్లలో ఏ ఏ ప్రకటనలు వస్తాయి?
జవాబు:

  1. వీటిలో ముఖ్యంగా ఆనాడు వచ్చే కార్యక్రమాల ప్రకటనలు ఉంటాయి.
  2. ముఖ్యమైన కార్యక్రమాలు ఏ సమయంలో ఏ రోజు వస్తాయో ప్రకటిస్తారు.
  3. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఉంటాయి.
  4. తమకు కావలసిన కళాకారులను గూర్చి వారు ప్రకటనలు ఇస్తారు.
  5. అప్పుడప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గూర్చి, దరఖాస్తు పెట్టుకొనే తీరును గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  6. తప్పిపోయిన వారిని గూర్చి ప్రకటనలు ఉంటాయి.
  7. తుపాన్లు వంటి సమయాలలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రకటనలు ఉంటాయి.

ఈ) “ప్రకటన” పాఠం గురించి మీ అభిప్రాయాలు తెల్పండి.
జవాబు:
‘బాలగంగాధర తిలక్’ గొప్ప భావుకుడైన మహాకవి. తిలక్ వచన గేయాలు తెలుగు కవితకు మణిహారాలు. ఈ కవితలో కవి “శాంతి” అవసరాన్ని నొక్కి చెప్పాడు. యుద్దాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. తప్పిపోయిన వారిని ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో చెప్పాడు. దేశాల మధ్య జరిగిన ఒడంబడికలను వారు పాటించకపోవడాన్ని విమర్శించాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

అ) తిలక్ ప్రకటన కవితకు నేపథ్యం ఏమిటి? ఈ కవిత రాయడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు:
తిలక్ ఈ కవిత రాసేనాటికి రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, అంతర్యుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధ వ్యూహాలను పన్నుతున్న రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీ వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి.

భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమపోరాటం, విముక్తి, కరవులు వంటి స్థానిక విషయాలు ఉన్నాయి. . తిలక్ వీటిని పరిశీలించి ఈ కవిత రాశారు. ఇవే ఈ కవితకు నేపథ్యం.

ప్రపంచంలో అశాంతి పోవాలంటే, అణుయుద్ధ భయం పోవాలంటే, శాంతి ఒక్కటే మార్గమని, చెప్పడమే ఈ కవిత రాయడానికి గల ప్రధాన కారణం.

ఆ) తిలక్ శాంతి అనే స్త్రీని ఏ విధంగా వర్ణించాడు?
జవాబు:
శాంతి చల్లని తల్లి. చక్కని చెల్లి. ఆమె కనుగొలకులు దయతో నిండి ఉంటాయి. ఆమె ముఖంలో సంతోషం పొంగే చిరునవ్వు పరిమళాలు ఉంటాయి. ఆమె కొప్పులో ప్రేమ గులాబి ఉంటుంది. ఆమె ప్రజల హితాన్ని కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్ని, క్రూరత్వాన్ని, మాలిన్యాన్ని ఖండిస్తుంది. తెల్లని పావురాన్ని సరదాగా ఎగరేస్తుంది.

IV. పదజాలం

1. గీత గీసిన పదాలకు సమానమైన అర్థమిచ్చే పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని వెతికి ఎదురుగా రాయండి.

అ) సాగరంలో అలలు ఎగసిపడుతున్నాయి.
జవాబు:
1. సముద్రము
2. పారావారము

ఆ) ఆయుధాలు ధరించిన సైనికులు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు.
జవాబు:
సాయుధ దళాలు

ఇ) రేడియోలో రోజూ నేను వార్తలు వింటాను.
జవాబు:
విషయం

ఈ) శాంతికి గుర్తుగా కపోతాలను ఎగరవేద్దాం.
జవాబు:
పావురాలు

ఉ) నేను ఎప్పుడూ అబద్ధం ఆడను.
జవాబు:
కల్ల

ఊ) గులాబీ తోటలోని సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించాయి.
జవాబు:
పరిమళాలు

2. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సమానమైన పర్యాయపదాలు అదే వాక్యంలో ఉన్నాయి. వాటిని గుర్తించండి. ఆ.వాటి కింద గీత గీయండి.

అ) దేవాలయంలో దేవుడి విగ్రహాలు ఉంటాయి. పూజారులు కోవెలలో పూజలు చేస్తారు. గుడికి మనమందరం తప్పకుండా వెళతాం.
జవాబు:
దేవాలయం, కోవెల, గుడి (పర్యాయపదాలు)

ఆ) సర్వేంద్రియాణాం నయనం ప్రధానం, అంటూంటారు. అందుకే మన కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడప్పుడు నేత్ర వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి.
జవాబు:
నయనం, కన్ను, నేత్రం (పర్యాయపదాలు)

ఇ) సరిహద్దుల్లో సైనిక దళాలు ఉంటాయి. వాళ్ళను చూడడానికి మనం బృందాలుగా వెళ్లాం. సమూహంగా వెళ్ళడంలో ఆనందం ఉంటుంది.
జవాబు:
దళాలు, బృందాలు, సమూహం (పర్యాయపదాలు) :

ఈ) గూఢచారులు రహస్యంగా విషయాలను కూపీ లాగుతారు. వాళ్ళు ఆరా తీయడంలో చాలా నేర్పరులు.
జవాబు:
కూపీ, ఆరా (పర్యాయపదాలు)

3. పాఠ్యాంశం ఆధారంగా ఈ కింది. నానార్థాల మూలపదాలను వెతికి రాయండి.

అ) దళము = గుంపు, ఆకు
ఆ) ముద్ర = గుర్తు, ప్రభావం

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

4. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు మీ పాఠ్యాంశంలోనే ఉన్నాయి. వాటిని గుర్తించండి. రెండు పదాలనూ ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :
అజాగ్రత్త × జాగ్రత్త
నేను ఏ విషయమైనా జాగ్రత్తగా పరిశీలిస్తాను. ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను.

అభ్యాసము :
అ) నీతి × అవినీతి
వాక్య ప్రయోగం : నీతి కలవారు, అవినీతిని చూచి ‘సహించలేరు.

ఆ) నిస్స్వార్గం × స్వార్థం
వాక్య ప్రయోగం : నేను నిస్స్వార్థంగా జీవిస్తాను, స్వార్థంగా జీవించను.

ఇ) సుఖం × కష్టం
వాక్య ప్రయోగం : సుఖం వెంబడి కష్టం ఉంటుందని గుర్తించాలి.

ఈ) శాంతి × అశాంతి
వాక్య ప్రయోగం : ప్రపంచంలోని అశాంతి పోవాలంటే శాంతి దేవతను ఆహ్వానించాలి.

ఉ) నిగర్వి × గర్వి
వాక్య ప్రయోగం : నిగర్వి ఆనందాన్నీ, గర్వి దుఃఖాన్ని తప్పక పొందుతాడు.

ఊ) అంగీకారం × అనంగీకారం
వాక్య ప్రయోగం : నా చదువు విషయంలో అమ్మానాన్నాల మధ్య ఇంకా అంగీకారం, అనంగీకారం ఉంది.

ఎ) నిర్భయం × భయం
వాక్య ప్రయోగం : నిర్భయంగా మాట్లాడేవారంటే అందరికీ భయం.

5. కింది పదాలకు ప్రకృతి పదాలు పాఠ్యాంశంలో ఉన్నాయి. వాటిని గుర్తించి, సొంతవాక్యంలో ఉపయోగించి రాయండి.
ఉదా : దేవళం (వికృతి) – దేవాలయం (ప్రకృతి)
వాక్యము : నేను రోజూ దేవాలయానికి వెళ్లి దేవునికి దండం పెడతాను.

అ) దరి (వికృతి) – తీరము (ప్రకృతి)
నా మిత్రుడు గోదావరీ తీరమున ఇల్లు కట్టాడు.

ఆ) సంద్రం (వికృతి) – సముద్రం (ప్రకృతి)
మనదేశంలో తూర్పు దిక్కున “బంగాళాఖాతము” అనే సముద్రం ఉంది.

ఇ) గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)
గురువులపై భక్తి, గౌరవం కలిగియుండాలి.

ఈ) నిచ్చలు (వికృతి) – నిత్యము (ప్రకృతి)
నిత్యం శివునికి నేను అభిషేకం చేస్తాను.

6. కింది పదాలలో ఏవైనా రెండేసి పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు తయారుచేయండి.

అ) తండోపతండాలు
ఆ) విరగబడు
ఇ) రొమ్ములు బాదుకొను
ఈ) గుసగుసలాడు
ఉ) పరీక్షించండి
ఊ) ఆకర్షించటం
ఎ) విరుచుకుపడు
ఏ) నిరూపిస్తున్నది

వాక్య ప్రయోగాలు :
ఉదా : ఆ జాతరకు ప్రజలు తండోపతండాలుగా విరగబడి వచ్చారు.

  1. శత్రువుల ఘాతుకాల్ని చూచి, ప్రజలు రొమ్ములు బాదుకొని వారిపై విరుచుకుపడ్డారు.
  2. ఆమె ప్రజలను బాగా ఆకర్షించడం ద్వారా తన గొప్పతనాన్ని నిరూపిస్తున్నది.
  3. నిజమేమిటో పరీక్షించండని ప్రజలు భయంతో గుసగుసలాడారు.
  4. తండోపతండాలుగా వస్తున్న వారిని పరీక్షించండి.

V. సృజనాత్మకత

1. రవి నాలుగు సంవత్సరాల పిల్లవాడు. ఒకసారి కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళినపుడు కిక్కిరిసిన జనంలో తప్పిపోయాడు. అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లచొక్కా వేసుకున్నాడు. ఈ వివరాలతో ఒక ప్రకటన తయారు. చేయండి.
జవాబు:

తప్పిపోయాడు

మా అబ్బాయి రవికి నాలుగు ఏళ్ళు. కోటప్పకొండ తిరునాళ్ళకు మేము వెళ్ళినపుడు జనంలో తప్పిపోయాడు. అతడు అప్పుడు నీలంరంగు నిక్కరు, తెల్లరంగు చొక్కా వేసుకున్నాడు. నా పేరు ముదిరాజు. నా భార్య పేరు “గీర్వాణి. మాది గురజాల గ్రామం. మా పిల్లవాడు చామనచాయగా ఉంటాడు. చురుకుగా ఉంటాడు.

ఆచూకీ తెలిసినవారు, క్రింది చిరునామాకు తెలుపగోరిక. ఆచూకీ తెలిపినవారికి మంచి బహుమతి ఇస్తాము. వివరాలకు ‘గురజాల’ పోలీసు స్టేషను వారిని సంప్రదించండి.

ఇట్లు,
తండ్రి,
కె. ముదిరాజు,
గురజాల గ్రామం,
‘ఫోన్ నెంబరు 286742.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

2. పాఠం ఆధారంగా అంత్యప్రాస పదాలను ఉపయోగించి నాలుగు పంక్తుల కవిత రాయండి.
జవాబు:
విరివిగా చందాలను పంపించండి
మీ ఔదార్యగుణాన్ని ప్రకటించండి
ధర్మాధర్మాలను పరిశీలించండి
ధర్మాన్నీ, న్యాయాన్ని నిలబెట్టండి.”

3. అందరినీ ఆకర్షించే “శాంతి నినాదాలు” తయారు చేయండి.
ఉదా : యుద్ధాలు వద్దని చెప్పేద్దాం – శాంతే ముద్దని చాటిద్దాం.
జవాబు:

  1. మందుగుండు తగ్గిద్దాం – పదిమందికింత పెడదాం.
  2. కలహాలు మానేద్దాం – సలహాలు పాటిద్దాం
  3. యుద్ధం వద్దు – శాంతి ముద్దు.
  4. మైత్రిని పెంచు – ఆయుధాలు త్రుంచు.
  5. నమ్మకం పెంచుకుందాం – అందరం కలిసి మెలిసి తిరుగుదాం
  6. ప్రపంచ మానవులంతా దేవుని బిడ్డలే – వారంతా అన్నదమ్ములే
  7. మనుషుల మధ్య కలహం – వినాశానికి మూలం
  8. కావాలి తప్పక శాంతి – ఇచ్చేద్దాం యుద్ధాలకు విశ్రాంతి.

VI. ప్రశంసము

1. ఆయా సందర్భాల కనుగుణంగా శాంతికోసం జరిగే సభల్లో, ర్యాలీలో పాల్గొనండి. ఇతరులతో చర్చించండి. ‘ప్రపంచ శాంతి దినోత్సవాన్ని గురించి తెలుసుకోండి.
జవాబు:
ఈనాడు ప్రపంచంలో సుమారు 194 దేశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 21వ తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహింపబడుతుంది. దానిలో అందరూ పాల్గొనాలి.

VII. ప్రాజెక్టు పని

* మీ గ్రామంలో, వాడలో శాంతికోసం ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకోండి.
జవాబు:
మా వాడలో పుల్లయ్య, వెంకట్రావులు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాది అమలాపురం నగరంలో నారాయణ పేట అనే పేట. అక్కడ ఆంజనేయ దేవాలయానికి సంబంధించి ఖాళీస్థలాల్లో చాలామంది బీదలు పాకలు వేసుకొని నివసిస్తూ ఉంటారు.

వాళ్ళు నిత్యం కుళాయి నీటి కోసమో, లేక చిన్న చిన్న దొంగతనాల సంబంధంగానో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవారు.

పుల్లయ్య, వెంకట్రావు మునిసిపల్ అధికారులతో మాట్లాడి ప్రతి ఇంటికీ కుళాయిలు వేయించారు. ఇళ్ళ మధ్య తారురోడ్లు వేయించారు. వాడలో శాంతి సంఘాలు నెలకొల్పారు.

ఇప్పుడు మనుషులంతా అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెండ్రుగా ఉంటున్నారు. వారు శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వారి ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు.

(లేదా)

* ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల ఫోటోలు, వివరాలు సేకరించండి. వారి ఫోటోలను ఛార్జ్ మీద అతికించి వివరాలు ప్రదర్శించండి.
జవాబు:
ప్రపంచ శాంతికోసం కృషిచేసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల వివరాలు :

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన
1) నెల్సన్ మండేలా :
ఈయన దక్షిణాఫ్రికా దేశంలో “ట్రాన్సీలో 1918లో పుట్టారు. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెసులో చేరి, బ్రిటిషు పాలకుల జాతివర్ణ వివక్షతకు ఎదురొడ్డి పోరాడాడు. బ్రిటిషు వారి పాలనలో 27 సంవత్సరాలు చెరసాలలో ఉన్నారు. ఈయన . దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1993లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈయన 1990లో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీయుడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన 3
2) యాసర్ అరాఫత్ :
ఈయన కయిరోలో 1929లో జన్మించాడు. పాలస్తీనియన విద్యార్థి నాయకుడిగా, పాలస్తీనా విమోచన సైన్య నాయకుడిగా పోరాటం నడిపాడు. పాలస్తీనాకు అధ్యక్షుడయ్యాడు. ఈయన పాలస్తీనాలోని అతి పెద్ద గెరిల్లా గ్రూపు అయిన ‘ఆల్తా కు’ అధిపతి. ఈయనకు 1994లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈయన మన భారత్ కు మంచి మిత్రుడు.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది వాక్యాలను చదవండి. ఆమ్రేడిత పదాలను గుర్తించండి.

1) ఔర ! ఎంత పని చేశావు.
2) అరెరె ! అలా అయిందా?
3) ఆహాహా ! నేనే గొప్పవాడిని.
4) ఏమేమి? నువ్వు చూశావా?
5) ఎట్లెట్లూ? మరోసారి చెప్పండి.
6) ఏమిటేమిటి? నువ్వు వినలేదా?
7) ఓహోహో ! మీరు వచ్చారా !

గమనిక :
పై వాక్యాల్లో కొన్ని పదాలు రెండుసార్లు వచ్చాయి. అవి
ఉదా :
1) ఔర + ఔర = ఔరౌర
2) అరె + అరె = అరెరె
3) ఆహా + ఆహా = ఆహాహా
4) ఏమి + ఏమి = ఏమేమి?
5) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లూ?
6) ఏమిటి + ఏమిటి? = ఏమిటేమిటి?
7) ఓహో + ఓహో = ఓహోహో

గమనిక :
వీటిలో మనం తొలుత పలికిన పదాన్నే రెండోమారు పలుకుతున్నాం. అలా రెండోమారు పలికే పదాన్ని “ఆమ్రేడితం” అని అంటాం.

ఆ) పైన ఉన్న, పూర్వపదాల్లో చివరన ఏముందో చూద్దాం.
అ) ఔర్ + అ – (ఔర)
ఆ) అర్ + ఎ – (అరె)
ఇ) ఆహ్ + ఆ – (ఆహా)
ఈ) ఏమ్ + ఇ – (ఏమి)
ఉ) ఎట్ + ఉ – (ఎట్లు)
ఊ) ఏమిట్ + ఇ – (ఏమిటి)
ఎ) ఓహ్ + ఓ – (ఓహో)

ఈ పదాలను పరిశీలిస్తే అ, ఆ, ఇ, ఉ, ఎ, ఓ లు పదం చివరన ఉన్నాయి. అంటే అచ్చులు ఉన్నాయన్నమాట.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

ఇ) కింది పదాలను పరిశీలించండి.

1) ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
2) ఆహా + ఆహా = ఆహాహా = (అ + ఆ = ఆ)
3) ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
4) ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు – (ఉ + ఎ = ఎ)
5) ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
6) అరె + అరె = అరరె – (ఎ + అ = అ)
7) ఓహో + ఓహో = ఓహోహో = (ఓ + ఓ = ఓ) లుగా మారుతాయి.

ఈ) కింది వాటిలో కూడా అచ్చుకు ఆమ్రేడితం పరమైందనే విషయాన్ని గమనించండి.

ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి
ఎట్లు + ఎట్లు ఎట్లెట్లు, ఎట్లుయెట్లు
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత

గమనిక :
ఇలాంటి పదాల్లో ఒక్కోసారి ఆమ్రేడితం విడిగా ఉండటం జరుగుతున్నది.

పై విషయాలను బట్టి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. అదే ఆమ్రేడిత సంధి అని తెలుస్తున్నది.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది.

ఇప్పటివరకు ఆమ్రేడితానికి సంబంధించిన సంధి అంటే ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నారు.

ఉ) ఈ కింది పదాలను పరిశీలించి సూత్రాన్ని సరిచూడండి.
అభ్యాసం :
అ) అడిగడిగి = అడిగి + అడిగి = (ఇ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఆ) ఊరూరు = ఊరు + ఊరు = (ఉ + ఊ = ఊ) – ఆమ్రేడిత సంధి
ఇ) అంతంత = అంత + అంత = (అ + అ = అ) – ఆమ్రేడిత సంధి
ఈ) ఓరోరి = ఓరి + ఓరి = (ఇ + ఓ = ఓ) – ఆమ్రేడిత సంధి

సూత్రం :
అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.

1. కింది పదాలను విడదీసి, సంధి పేర్లు రాయండి.

అ) దేవాలయాలు : దేవ + ఆలయాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఆ) సాయుధ దళాలు = స + ఆయుధదళాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఇ) అంగారకాది గ్రహాలు = అంగారక + ఆదిగ్రహాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధీ
ఈ) యుగాంతాన్ని = యుగ + అంతాన్ని = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఉ) నయనాంచలాలు = నయన + అంచలాలు = (అ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘసంధి
ఊ) సంస్కారపు కేశపాశం = సంస్కారము + కేశపాశం – పుంప్వాదేశసంధి
ఎ) అనురాగపు గులాబి = అనురాగము + గులాబి – పుంప్వాదేశసంధి
ఏ) కళాలయాలు = కళా + ఆలయాలు = (ఆ + ఆ = ఆ) – సవర్ణదీర్ఘ సంధి

2. కింది సమాసాలకు విగ్రహవాక్యం రాసి, వాటి పేర్లు రాయండి.

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1) ప్రజాపారావారంప్రజలు అనే పారావారంరూపక సమాసం
2) దరహాస పరిమళాలుదరహాసము అనే పరిమళాలురూపక సమాసం
3) నయనాంచలాలునయనముల యొక్క అంచలాలుషష్ఠీ తత్పురుష సమాసం
4) యుగాంతముయుగము యొక్క అంతముషష్ఠీ తత్పురుష సమాసం
5) అనురాగపు గులాబిఅనురాగము అనే గులాబిరూపక సమాసం

కవి పరిచయం

పాఠం ఫేరు : ‘ప్రకటన’
కవి : దేవరకొండ బాలగంగాధర తిలక్
దేని నుండి గ్రహింపబడింది : తిలక్ రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
రచయిత కాలం : 1921-1966
జన్మస్థానం : ‘మండపాక’ గ్రామం, తణుకు తాలూకా, ప:గో జిల్లా.
రచనలు :
1) అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, (కవితా సంపుటాలు)
2) తిలక్ కథలు
పురస్కారాలు : ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా గ్రంథానికి 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.

1. ‘చల్లని తల్లి చక్కని చెల్లి’ అని శాంతిని ఉద్దేశిస్తూ ‘ప్రకటన’ కవితను రచించిన కవిని గురించి రాయండి.
జవాబు:
దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రకటన కవితను రాశాడు. ఈ కవిత ఆయన రచించిన ‘అమృతం కురిసిన
రాత్రి’ అనే కవితా సంకలనంలోది. తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో – 1921లో జన్మించాడు. ఈయన అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు, తిలక్ కథలు రచించాడు. 1971లో ఈయన అమృతం కురిసిన రాత్రి అనే కవిత సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

గేయానికి – ప్రతిపదారాలు – భావాలు

1 నుండి 5 పంక్తులు :
1. స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి
ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివెయ్యండి
దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి
దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి
ఆకాశవాణిలో యీ విషయం ప్రకటించండి.
ప్రతిపదార్ధం :
స్టేషన్లో = రైల్వే స్టేషన్లలో
టిక్కెట్లను = రైలు టిక్కెట్లను
జారీ చెయ్యకండి = ఇవ్వకండి (అమ్మకండి)
ఎక్కడి రైళ్ళు = ఏ స్టేషన్లో నిలిచిన రైళ్ళు
అక్కడ ఆపివెయ్యండి = ఆ స్టేషన్లోనే నిలిపి ఉంచండి
దేశదేశాలకి = విదేశాలన్నింటికీ
కేబుల్ గ్రామ్స్ = విదేశాలకు పంపే
(Cable gram) టెలిగ్రాము సమాచారాలు
పంపించండి = పంపండి
దేవాలయాల్లో = గుళ్ళలో
నిత్యం = ప్రతిరోజూ
పూజలు చేయండి = పూజలు జరిపించండి.
ఆకాశవాణిలో ఈ విషయం = రేడియోలో ఈ విషయాన్ని
ప్రకటించండి = ప్రకటన ఇవ్వండి

భావం :
ఎవరూ ప్రయాణం చెయ్యకుండా స్టేషన్లలో టిక్కెట్లు ఇవ్వడం ఆపివేయండి. ఎక్కడి రైళ్ళను అక్కడే నిలిపివేయండి. దేశాలు అన్నింటికీ టెలిగ్రాములు పంపండి. దేవాలయాల్లో రోజూ పూజలు చేయండి. అన్ని రేడియో స్టేషన్ల నుండి ఈ విషయం ప్రకటించండి.

విశేషం :
ఏ దొంగ అయినా పారిపోతే అతడు రైలు ఎక్కి పారిపోకుండా రైళ్ళు ఆపివేస్తారు. విదేశాలకు ఆ దొంగ పారిపోతే పట్టుకొని తమకు అప్పగించమని విదేశాలకు టెలిగ్రాములు పంపుతారు. దొంగ దొరికేలా చేయమనిదేవుడికి పూజలు చేస్తారు. దొంగ పారిపోయేడని ప్రజలకు, అందరికీ తెలిసేలా రేడియోలో ప్రకటనలు చేస్తారు. అలాగే ఇక్కడ శాంతి పావురం పారిపోయింది. కాబట్టి, దాన్ని వెతకడం కోసం పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

6 నుండి 12 పంక్తులు :
2. కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాల్లో
కాస్త జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి.
సముద్రతీరాలలో నదీజలాలలో వెదకండి
సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి
రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి.
అడుగుజాడల్ని కూపీ తియ్యండి
వేలిముద్రల్ని పరీక్షించండి
ప్రతిపదార్థం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో = కాఫీ హోటళ్ళలోనూ, క్లబ్బులలోనూ
కర్మాగారాలలో = కర్మాగారాలోనూ (ఫ్యాక్టరీలలోనూ)
కాస్త జాగ్రత్తగా = కొంచెం జాగ్రత్త తీసుకొని
నిశితంగా పరిశీలించండి = క్షుణ్ణంగా పరిశీలన చేయండి
సముద్రతీరాలలో = సముద్రము యొక్క తీర ప్రాంతాలలో
నదీజలాలలో వెదకండి = నదులలోని నీళ్ళలో వెతకండి
సాయుధ దళాన్ని = ఆయుధాలతో, ఉన్న సైనికుల్ని
దిక్కులలో నిలబెట్టండి = అన్ని దిక్కులలో కాపలా పెట్టండి (శాంతి పావురం పారిపోకుండా)
రాకెట్లను = రాకెట్లను
అంగారకాది (అంగారక + ఆది) = అంగారకుడు మొదలయిన
గ్రహాలకు పంపించండి = గ్రహముల వద్దకు పంపించండి (శాంతి పావురాన్ని వెదకడానికి)
అడుగుజాడల్ని = పాదముద్రలను (సంగీతం, నాటకం మొదలైనవి)
కూపీ తియ్యండి = గుట్టు లాగండి
వ్రేలి ముద్రల్ని = వేలి ముద్రల్ని
పరీక్షించండి = పరిశీలించండి

భావం :
కాఫీ హోటళ్ళలో, క్లబ్బులలో, కర్మాగారాలలో చాలా జాగ్రత్తగా అన్నిచోట్లా పరిశీలన చేయండి. సముద్ర తీరాలలో, నదీజలాలలో వెదకండి. ఆయుధాలు ధరించిన సైనికుల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకుడు మొదలైన గ్రహాల వద్దకు పంపించండి. నేలమీద అడుగుముద్రల్లో ఏమైనా జాడలు కనిపిస్తాయేమో గుట్టు తీయండి. వేలిముద్రల్ని కూడా పరిశీలించండి.

విశేషం :
శాంతి పావురం జాడను పట్టుకోడానికి పై విధంగా చెయ్యమని కవి చెప్పాడు. పారిపోయిన వానిని పట్టుకోవడానికి పై చర్యలు చేస్తారు కదా !

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

13 నుండి 18 పంక్తులు :
3. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు.
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు.
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు
ప్రతిపదార్థం :
ప్రజలు తండోపతండాలుగా = ప్రజలు గుంపులు గుంపులుగా
విరగబడుతున్నారు. = విరగబడి వస్తున్నారు
కంగారుతో భయంతో = ప్రజలు కంగారుపడి భయంతో
గుసగుసలాడుతున్నారు = ఒకరితో ఒకరు రహస్యంగా మాట్లాడు కుంటున్నారు
కావ్య చర్చలు = సాహిత్య చర్చలు
కళానిలయాలు = లలిత కళా స్థానములు
ఆకర్షించటంలేదు = జనాన్ని ఆకర్షించడం లేదు (జనం వీటిపై దృష్టి పెట్టడం లేదు)
స్వార్థ జీవనులు = తమకోసమే బ్రతికేవారు
గభాలున = గమ్ముని (వేగంగా)
రొమ్ములు బాదుకుంటున్నారు = గుండెలు బాదు కుంటున్నారు
సిద్ధాంతాలు, చర్చలు = విభిన్నవాద సిద్ధాంతాలు, దానిపై చర్చలు
ఎవరూ చేయడం లేదు = మౌనంగా ఉండిపోయారు
సిరా ఇంక కుండానే = శాంతి ఒప్పందాలపై సంతకం చేసిన పెన్ను సిరా ఆరకుండానే (వెంటనే)
ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు = ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు

భావం :
ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. కంగారుతో, భయంతో, ఏవేవో అనుమానాలతో గుసగుసలాడుతున్నారు. కావ్య చర్చలు, కళా నిలయాలు జనాన్ని ఆకర్షించడం లేదు. తమ స్వార్థం కోసమే ఆలోచించే మనుష్యులు మాత్రం, గుండెలు బాదుకుంటున్నారు. విభిన్నవాద సిద్ధాంతాల మీద రకరకాల చర్చలు జరిపే మేధావులు, మౌనంగా ఉండిపోయారు. ఎన్నో అంశాల మీద చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ సంతకం చేసిన సిరా ఆరకముందే, చింపేస్తున్నారు.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

19 నుండి 28 పంక్తులు :
4. అతృప్త అశాంత ప్రజాపారావార తరంగం
అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది.
ఇంక చరిత్రలు వ్రాయనక్కరలేదు.
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు
అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తున్నది
ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ – మన జాతిని మనం
కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం
వెదికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని
వేరుదారి లేదు కదలండి కదలండి జై అని
ప్రతిపదార్థం :
అతృప్త = తృప్తిలేని
అశాంత = శాంతిలేని
ప్రజా, పారావార, తరంగం = ప్రజలు అనే, సముద్రపు కెరటం (ప్రజా సమూహం)
అంచుల్ని దాటి = చెలియలి కట్టలను దాటి
భీకరంగా విరుచుకు పడుతోంది = భయంకరంగా మీదకు పడుతున్నారు
ఇంక చరిత్రలు వ్రాయ నక్కరలేదు = ఇకమీదట చరిత్రలు వ్రాయవలసిన అవసరం లేదు
ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు = రాజులు రాజ్యాలు పాలించవలసిన పనిలేదు
అణుబాంబు = ఆటంబాంబు
యుగాంతాన్ని (యుగ + అంతాన్ని) = యుగ సమాప్తి జరుగుతుందని
నిరూపిస్తున్నది = వెల్లడిస్తోంది
ఆ ముహూర్తం = యుగ సమాప్తి అయ్యే సమయము
త్వరలోనే వస్తున్నది = తొందరగానే వస్తోంది
కాబట్టి స్టాండ్ ఎటెన్షన్ = శ్రద్ధగా నిలబడండి
(Stand attention)
మన జాతిని = మన భారతజాతిని
మనం కాపాడుకోవాలంటే = మనము రక్షించుకోవాలంటే
ఒక్కటే మార్గం = ఒక్కటే దారి ఉంది
వెదకి తీసుకురండి = వెదకి వెనక్కు తీసుకురండి
పరారీ అయిన వ్యక్తిని = పారిపోయిన దానిని (శాంతి కపోతాన్ని)
వేరు దారి లేదు = మరో మార్గం లేదు
కదలండి కదలండి జై అని = జయ జయ ధ్వనులు చేస్తూ నడవండి.

భావం :
అసంతృప్తి, అశాంతితో ఉన్న ప్రజలు, సముద్రంలోని కెరటాల్లా భయంకరంగా విరుచుకు పడుతున్నారు. ఇకమీదట ఎవరూ చరిత్రలు రాయనవసరం లేదు. రాజులు రాజ్యాల్ని పాలింపవలసిన అవసరం లేదు. అణుబాంబు, ఈ యుగాన్నీ, మానవులనూ నాశనం చేసే సమయం తొందరలోనే ఎదురవుతుంది. కాబట్టి శ్రద్ధగా నిలబడండి. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. అందరూ కదలి పరారీ అయిన వ్యక్తిని వెతికి తీసుకురావాలి. మరోదారి లేదు. అందరూ ‘జై’ అంటూ కదలండి.

AP Board 7th Class Telugu Solutions Chapter 10 ప్రకటన

29 నుండి 35 పంక్తులు :
5. అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్నీ కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి.
ప్రతిపదార్ధం :
అపార – అంతులేని
కృపా తరంగితాలు + ఐన = దయతో పొంగి పొరలే వయిన (నిండిన)
నయనాంచలాలు (నయన + అంచలాలు) = కన్నుల అంచులు (కను గొలకులు)
ఆనందం జాలువారే = సంతోషం ప్రవహించే
స్నిగ్ధ దరహాస = స్వచ్ఛమైన చిఱునవ్వు యొక్క
పరిమళాలు = సువాసనలు
సంస్కారపు కేశపాశంలో = చక్కగా దువ్వుకొన్న తల వెండ్రుకల కొప్పులో
తురిమిన = ధరించిన
అనురాగపు గులాబి = ప్రేమ గులాబీ పుష్పం
సదా = ఎల్లప్పుడూ
ప్రజా హితైషిణి = ప్రజల మేలు కోరేది
సుభాషిణి = చక్కగా మాట్లాడేది
గర్వం లేని రాణి = గర్వము ఎరుగని రాణి
కల్లనీ = అబద్దాన్ని
క్రౌర్యాన్నీ = క్రూరత్వాన్ని
కాలుష్యాన్ని = మాలిన్యాన్ని
తిరస్కరిస్తుంది = నిరసిస్తుంది
తెల్లని పావురాన్ని = తెల్లని పావురాలను
సరదాగా ఎగరేస్తుంది = వేడుకగా ఎగురవేస్తుంది
చల్లని తల్లి = ఆమె చల్లని తల్లి
చక్కని చెల్లి = ఆమె మనకు చక్కని చెల్లెలు
ఆమె పేరు శాంతి . = ఆ చల్లని తల్లి, చెల్లి పేరు శాంతి

భావం :
ఆమె కనుగొలకులు అంతులేని దయతో నిండియుంటాయి. ఆమె ముఖంలో ఆనందమూ, స్వచ్ఛమైన చిఱునవ్వు పరిమళమూ కనిపిస్తాయి. ఆమె తలలో ప్రేమ గులాబిని ధరిస్తుంది. ఆమె ఎప్పుడూ చక్కగా మాట్లాడుతూ, ప్రజల హితాన్ని కోరుకుంటుంది. ఆమె గర్వంలేని రాణి. ఆమె అసత్యాన్నీ, క్రూరత్వాన్నీ, కాలుష్యాన్ని నిరసిస్తుంది. ఆమె ఎప్పుడూ తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది. ఆమె మన చల్లని తల్లి. చక్కని చెల్లెలు. ఆమె పేరు శాంతి.

AP Board 7th Class Telugu Solutions Chapter 9 కూచిపూడి నాట్యకళ

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 9th Lesson కూచిపూడి నాట్యకళ Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 9th Lesson కూచిపూడి నాట్యకళ

7th Class Telugu 9th Lesson కూచిపూడి నాట్యకళ Textbook Questions and Answers

ప్రశ్నలు జవాబులు

ఈ క్రింది ప్రశ్నలపై చర్చించండి – జవాబులు వ్రాయండి.

ప్రశ్న 1.
కూచిపూడి భాగవతులు ఎవరు? వారి ప్రదర్శనల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు:
కూచిపూడి భాగవతులు పది నుండి ఇరవైమంది వరకు, బృందంగా ఏర్పడి, ప్రదర్శనలు. ఇచ్చేవారు. ఆయా గ్రామాల కూడళ్ళలో వీధి భాగవత ప్రదర్శనలు జరిగేవి. వీధుల్లో జరిగే భాగవత ప్రదర్శనలు కాబట్టి వీటికి, వీధి భాగవతాలు, అనే పేరు వచ్చింది. వీరిని వీధి భాగవతులు అని, బయలాటగాండ్రు’ అని అంటారు.

భాగవతం, రామాయణం, భారతం, దేవీ భాగవతములలోని కథా ఘట్టాలను కూచిపూడి భాగవతులు ప్రదర్శిస్తారు. ఆ కథలలో ఎంతటి గొప్పవారైనా ధర్మాన్ని వదలి అధర్మపరులయితే, వారికి పతనం తప్పదనే నీతిని ప్రజలకు తెలియజేసి, వారిని మంచి మార్గంలో నడిచేలా చేయడమే, వీధి భాగవతుల నాట్య ప్రదర్శనలోని ప్రధాన లక్ష్యం.

భాగవతుల బృందాలను వారి వంశస్థుల పేర్లతో పిలిచేవారు. ఈ బృందాలను ‘మేళం’ అని కూడా అంటారు. ఈ భాగవతుల వారి మేళం, వేదాంతం వారి మేళం, మొదలయిన పేర్లతో వీరిని పిలిచేవారు. ఈ మేళాలు నాట్యమేళం, నట్టువ మేళం అని రెండు విధాలు. నాట్య మేళంలో భాగవతులంతా పురుషులే ఉండేవారు.

ప్రశ్న 2.
కూచిపూడి నాట్యకళపై కృషిచేసినవారి గురించి చర్చించండి. వారి కృషిని మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:
సిద్ధేంద్రుడు అనే యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. సిద్ధేంద్రుడి తర్వాత ‘భాగవతుల రామయ్య – గారు పేరు పొందారు.

తరువాత ‘కేళిక’, యక్షగానము వచ్చాయి. కందుకూరి రుద్రకవి యక్షగాన రచనకు మొదటివాడు. నృత్య నాటకాలను రామానుజయ్య సూరి, తిరునారాయణాచార్యులు రూపొందించారు. నృత్య రూపక, నృత్య నాటికలను, వెంపటి చినసత్యం, కేళికను వేదాంతం రామలింగ శాస్త్రి వెలువరించారు. కూచిపూడి నాట్యకళలో ‘వెంపటి వెంకట నారాయణగారు, చింతా వెంకట్రామయ్యగారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగార్లను, ‘మూర్తిత్రయం’ అని పిలుస్తారు.

వేదాంతం పార్వతీశం, వెంకటాచలపతి, రామకృష్ణయ్య, రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వెంపటి పెదసత్యం, చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మ, పసుమర్తి కృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణశర్మ, మొదలయినవారు, ‘కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

కూచిపూడి నాట్యానికి చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన వారిలో వేదాంతం పార్వతీశం, సత్యనారాయణ శర్మలు ముఖ్యులు. . కూచిపూడి నాట్యకళ తెలుగు వారికి స్వంతము. ఈ నాట్యకళకు ఆద్యుడైన సిద్ధేంద్రయోగిని, ఈ నాట్యకళను విశ్వవ్యాప్తం చేసిన కళాకారులను మనసారా అభినందిస్తున్నాను.

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

ప్రశ్న 3.
అభినయంలోని రకాల గూర్చి చర్చించండి.
జవాబు:
అభినయం నాల్గు రకాలు. అవి :

  1. ఆంగికం,
  2. వాచికం,
  3. ఆహార్యం,
  4. సాత్వికం.

1) ఆంగికాభినయం :
కళాకారులు తమ శరీరంలోని అవయవాల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలోని సారాంశాన్ని అందించడం ‘ఆంగికాభినయం’. ఆంగికాభినయంలో హస్తాలతో పట్టే ముద్రలు, చూసే చూపులలో తేడాలు, తలను అటూ ఇటూ త్రిప్పడంలో తేడాలు, పాదాల కదలికలో భేదాలు ముఖ్యము.

2) వాచికాభినయం :
భాష ద్వారా అందించే దానిని వాచికాభినయం అంటారు.

3) ఆహార్యాభినయం :
తాము ధరించిన వేషం, ద్వారా తెలియపరచే దాన్ని ‘ఆహార్యాభినయం’ అంటారు. ఏ వేషానికి ఏ వస్త్రాలు ధరించాలి? ఏ ఆభరణాలు ధరించాలి? ఎలాంటి రంగులు దిద్దుకోవాలి? అనే విషయాలను చెప్పేదే, ఆహార్యాభినయం.

4) సాత్వికాభినయం :
మనస్సులో కలిగే భావాలను ముఖం ద్వారా వెల్లడించడాన్ని సాత్వికాభినయం అంటారు.

కఠిన పదములకు అర్థములు

జీవనాడి = ప్రాణనాడి
సంప్రదాయం = పాదుకొన్న ఆచారము
అరుదైన = అపురూపమైన (దుర్లభమైన)
ఆవిర్భవించిన= పుట్టిన
అంగాలు = అవయవాలు
కథాఘట్టాలు – కథలోని రసవంతమైన చోటులు
అధర్మపరులు = అధర్మమునందు ఆసక్తి కలవారు
పతనం = భ్రష్టుడు కావడం
ప్రవర్తించేలా = నడిచేలా
బృందం = గుంపు
కూడళ్ళు = కలియు చోటులు
ప్రజా బాహుళ్యం = అనేకమంది ప్రజలు
పాలకులు = రాజులు, ప్రభువులు
దైవ కెంకర్యము = దైవసేవ
ఎల్లలు = పొలిమేరలు
నలుచెరగులు = నాల్గు వైపులు
సంతరించుకొన్నప్పుడు = సేకరించుకొన్నప్పుడు
గణుతి = ఎన్నిక
అపచారము = తప్పు చేయడం
సమకాలీన చరిత్రలు = అదే కాలానికి చెందిన చరిత్రలు
పరిష్కారాలు = సరిదిద్దడాలు
ఆవిష్కరింపబడినవి = వెల్లడి చేయబడ్డాయి
నృత్యాంశములు (నృత్య+అంశములు) = నృత్యమునకు చెందిన విషయములు
సొబగు = అందము

AP Board 7th Class Telugu Solutions Chapter 6 “ఎందుకు పారేస్తాను నాన్నా?”

వివాహం పాపా
ఆద్యుడు = మొదటివాడు
రూపొందించారు = ఏర్పాటు చేశారు
పరిమితం = మిక్కిలి మితమైనది
విశ్వవ్యాప్తం = ప్రపంచం అంతా వ్యాపించింది
మహనీయులు = గొప్పవారు
ప్రముఖులు = ప్రసిద్ధులు
పురస్కారాన్ని = బహుమానాన్ని
పురాతన గ్రంథాలు = ప్రాచీన పుస్తకాలు
మలచుకొని = తిప్పుకొని
సంధానం = కలయిక
సోపానములు = మెట్లు
కరచరణాది = చేతులు, పాదములు మొదలయిన
చలనాలు = కదలికలు
అభినయించడానికి = నటించడానికి
అనువుగా = అనుకూలముగా (వీలుగా)
తాళలయాన్వితము = తాళము, లయలతో కూడినది.
నర్తనము = నాట్యము
ప్రేక్షకులు = చూసేవారు
ఆంగికం = చేతులు మొదలయిన వాటితో చేసే అభినయము
వాచకం = మాటల ద్వారా అభినయం
ఆహార్యం = వస్త్రధారణ రూపమైన అభినయాలు
అంగములు = అవయవములు
వ్యక్తపరచడాన్ని = వెల్లడించడాన్ని
బాణి = పద్దతి
హస్తాలు = చేతులు

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

SCERT AP State 7th Class Telugu Textbook Solutions 8th Lesson నిజం-నిజం Questions and Answers.

AP State Syllabus 7th Class Telugu Solutions 8th Lesson నిజం-నిజం

7th Class Telugu 8th Lesson నిజం-నిజం Textbook Questions and Answers

ఆలోచించండి – మాట్లాడండి
AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 1

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1.
పై చిత్రంలో పిల్లవాడు ఏ పాత్ర ధరించాడు?
జవాబు:
పై చిత్రంలో పిల్లవాడు ‘భీముడు’ పాత్ర ధరించాడు.

ప్రశ్న 2.
ఏ సందర్భంలో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు? ఎందుకు?
జవాబు:
పాఠశాలలో వార్షికోత్సవం జరిగినప్పుడు పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు. తమలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి, తోడిపిల్లలను సంతోషపెట్టడానికి పిల్లలు ఇలాంటి వేషాలు వేస్తారు.

ప్రశ్న 3.
చిత్రంలో అమ్మాయి గదను గురించి ఏమనుకుంటోంది?
జవాబు:
చిత్రంలో అమ్మాయి, గదను చూసి తాను ఆడుకొనే బంతి అనుకుంటోంది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
వేషం ధరించిన పిల్లవాడు తన స్నేహితునితో ఏమి చెప్తున్నాడు?
జవాబు:
వేషం ధరించిన పిల్లవాడు, తాను భీముడి వేషం వేశానని, మిత్రుడికి చెప్తున్నాడు.

ఇవి చేయండి

I. వినడం – మాట్లాడడం

ప్రశ్న 1.
శీను ఎలాంటివాడో మీ మాటల్లో చెప్పండి. రచయిత ఇంట్లో ఎందుకున్నాడు?
జవాబు:
శీను పన్నెండేండ్ల వయస్సు పిల్లవాడు. శీను రంగయ్యకు కుమారుడు. రంగయ్య రచయితకు మిత్రుడు. శీను మంచి చెడ్డలు చూసి, శీనును మంచిదారిలో పెడతాడని, రంగయ్య, శీనును రచయిత ఇంట్లో ఉంచి అక్కడ బడిలో చదివిస్తున్నాడు.

శీను ఈ మధ్య అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు. దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి, బడి తెరిచాక నాల్గు రోజుల తర్వాత రచయిత ఇంటికి వచ్చాడు. బడికి ఆలస్యంగా వచ్చావేమిరా ? అని రచయిత అడిగితే, తన తండ్రి ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని ఎక్కడో పారవేశాననీ, అబద్దాలు చెప్పాడు.

తిరిగి స్కూలుకు నాల్గురోజులు సెలవులు ఇచ్చారు. ఇంట్లో ఆవు ఈనుతుంది జున్ను తినాలని, శీను మళ్ళీ రచయితతో అబద్దాలు చెప్పాడు. తన తండ్రి రమ్మన్నాడని, తన ఊరిపిల్లవాడు సీతయ్యతో కలిసి తన ఊరు వెడతానని, రచయిత దగ్గర శీను అబద్దాలు చెప్పాడు.

అనుకోకుండా రచయితకు బజారులో శీను తండ్రి కనబడ్డాడు. శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. విషయం తెలిసిన రచయిత, తెలివిగా శీనును డబాయించాడు. శీను తండ్రికి లేఖరాసిస్తానని దానికి జవాబు రాయించుకొని తెమ్మని శీనుకు చెప్పాడు.

దానితో శీను, తండ్రికి విషయం తెలుస్తుందని భయపడి తన ప్రయాణం మానుకొని, తన తప్పు అంగీకరించి, జీవితంలో ఇంక ఎప్పుడూ అబద్ధం ఆడనన్నాడు.

శీను తప్పు తెలిసికొన్నాడు. కాబట్టి మంచి పిల్లవాడు.

ప్రశ్న 2.
పాఠంలో ఏ అంశానికి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలు. మంచి అలవాట్లతో, నిజాయితీతో నడవాలి. అలా నడచుకొన్నవారే, జీవితంలో గొప్పవారుగా ఎదుగుతారు. మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా, నీతి మార్గంలోనే నడవాలని, అబద్దాలు ఎప్పుడూ చెప్పగూడదని, తెలియజేయడమే ఈ పాఠంలోని ప్రధాన అంశము. పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్పాలనే అంశానికే ఈ కథలో ప్రాధాన్యం ఉంది.

ఈ కథలో జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పిన శీనును, రచయిత నేర్పుగా తెలివిగా బుజ్జగించి, ఇంక తాను ఎప్పుడూ జీవితంలో అబద్దం చెప్పనని అనిపించాడు. శీనుకు పశ్చాత్తాపం కలిగించాడు. పిల్లలను కొట్టకుండా, * తిట్టకుండా వారికి నచ్చచెప్పి, వారిని మంచిదారిలోకి తేవాలని చెప్పడమే ఈ కథలోని ప్రధాన. అంశం.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
శీను, మామయ్య మాటలలో మీకు ఎక్కడ నవ్వు వచ్చింది? ఎందుకు?
జవాబు:
మామయ్య, శీనును “ఎందుకురా ఇన్ని అబద్దాలాడావు? మీ ఇంటికి మొన్ననేగా వెళ్ళివచ్చింది? ఎందుకు ఇంతలోనే బెంగ పెట్టుకొన్నావు? భయం లేదు చెప్పు” అని బుజ్జగించి అడిగాడు.

అప్పుడు శీను తమ ఇంట్లో ఆవు ఈనుతుందని, శీనుకు పెట్టకుండా తాము ఎలా ,తినగలం అని, శీను తల్లి బాధపడిందని, ఆ జున్ను కోసమే తాను తండ్రి రమ్మన్నాడని అబద్దం చెప్పానని మామయ్యతో నిజం చెప్పాడు. ఈ శీను మాటలు నాకు నవ్వు తెప్పించాయి.

అలాగే సీతయ్యతో కలిసి ఇంటికి వెడతానని శీను మామయ్యకు చెప్పాడు. దానితో మామయ్యకు సీతయ్య చెడ్డవాడనే అనుమానం వచ్చింది. సీతయ్య దుర్మార్గుడనీ, అతనితో స్నేహం వల్లనే శీను చెడిపోయాడనీ, సీతయ్య గురించి వాళ్ళ మేష్టారు తనకు చెప్పాడనీ, మామయ్య శీనును డబాయించాడు.

అప్పుడు శీను, సీతయ్య అనే పిల్లవాడే లేడని తాను సీతయ్య గురించి అబద్ధం చెప్పానని, నిజం బయటపెట్టాడు. : ఈ సందర్భంలో మామయ్య చెప్పిన డబాయింపు మాటలు, నాకు నవ్వు తెప్పించాయి.

ప్రశ్న 4.
‘కథ’ను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు:
రంగయ్య కుమారుడు శీను, తన మామయ్యగారి ఇంట్లో ఉండి, బడిలో చదువుతున్నాడు. మామయ్య శీనును మంచివాడిగా తీర్చిదిద్దుతాడనీ, శీనుకు అక్కడ చదివితే రెండు ముక్కలు వస్తాయనీ, రంగయ్య, శీనును మామయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు.

దసరా సెలవులకు శీను ఇంటికి వెళ్ళి స్కూలు తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. తన తండ్రి తనను – నాల్గురోజులు ఉండమన్నాడనీ, సెలవు చీటి తెచ్చాను కాని పడిపోయిందనీ, శీను మామయ్యకు అబద్ధం చెప్పాడు.

తిరిగి బడికి నాల్గురోజులు సెలవులు ఇచ్చారు.. తన తండ్రి, ఆ సెలవులకు తనను తప్పక రమ్మన్నాడనీ, తమ ఊరి పిల్లవాడు సీతయ్య’ తనకు తోడుగా వస్తాడనీ, శీను మామయ్యతో అబద్ధం చెప్పాడు.

ఎందుకో, మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడనే అనుమానం వచ్చింది. ఇంతలో శీను తండ్రి రంగయ్య, మామయ్యకు బజారులో కనబడ్డాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని రంగయ్య, మామయ్యకు చెప్పాడు.

దానితో మామయ్య, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి ఆ ఉత్తరానికి శీను తండ్రిచే జవాబు రాయించుకు రమ్మనీ, ఉత్తరం తీసుకురాకపోతే తనకు కోపం వస్తుందనీ శీనుతో చెప్పాడు.

ఉత్తరం చూస్తే, తాను అబద్ధం చెప్పానని తన తండ్రికి తెలుస్తుందని, శీను. తన ప్రయాణం మానుకున్నాడు. శీను, మామయ్యతో. నిజం చెప్పి, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడ్డాడు. ఈ విధంగా మామయ్య తెలివితో శీనును మంచిదారిలోకి మళ్ళించాడు.

ప్రశ్న 5.
మీరు ఎప్పుడైనా అబద్దాలు చెప్పారా? దానివల్ల ఏం జరిగింది?
జవాబు:
మా బడిలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కలు పరీక్ష. ఆ రోజే మా నగరంలోకి ‘బాహుబలి’ అనే సినిమా .. వచ్చింది. ఆ రోజు శనివారం. పరీక్షలు అయిపోయాయని, ఆ రోజు స్కూలుకు సెలవు అని నేను మా అమ్మగారితో . చెప్పి, పరీక్ష ఎగగొట్టి సినీమాకు వెళ్ళాను. ఆనందంగా సినిమా చూశాను. . . పరీక్షలు అయిన తర్వాత ఒకరోజు మాకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. దానిలో లెక్కల పరీక్ష నేను రాయలేదని రాసి ఉంది. ప్రోగ్రెస్ కార్డుపై మా నాన్నగారు సంతకం చేయాలి. నేను భయపడుతూనే నాన్నగార్కినా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాను. మా నాన్నగారు దానిపై సంతకం చేసి, లెక్కల పరీక్ష ఎందుకు రాయలేదని నన్ను అడిగారు. అమ్మ అక్కడే ఉంది. నాన్న పరీక్షల టైంటేబులు చూశారు. నా తప్పు వారికి దొరికింది. నేను ఏడుస్తూ నాన్నగారి కాళ్ళపై పడి క్షమించమన్నాను. నాన్నగార్కి ఆ కోపం, ఇంకా తగ్గలేదు.

II. చదవడం – రాయడం

అ) పాఠం చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ను గురించి వాళ్ళ మామయ్యకు గల బాధ్యతలు ఏవి?
జవాబు:
శీను ఎప్పుడయినా ఆలస్యంగా ఇంటికి పొద్దుపోయి వస్తే కోప్పడడం, శీను వేళకు. భోజనం చేస్తున్నదీ, లేని – కనుక్కోవడం, అనేవే శీను గురించి వాళ్ళ మామయ్యకు ఉన్న బాధ్యతలు.

ప్రశ్న 2.
రంగయ్య, మామయ్య ‘శీను’ను గురించి, ఏ ఏ సందర్భాలలో, ఏమేమి మాట్లాడారు?
జవాబు:
రంగయ్య తన కుమారుడు శీనును మామయ్య దగ్గర వదలి పెట్టి “కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా !” అని చెప్పాడు.

ఒకరోజు సాయంత్రం బజారులో మామయ్యకు రంగయ్య కనబడ్డాడు. “శీను చదువు ఎల్లా ఉందని” రంగయ్య మామయ్యను అడిగాడు. “చదువు ఎలా. ఉన్నా, శీను చెడుసావాసాలు చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉంది” .. అని మామయ్య రంగయ్యకు చెప్పాడు.

అప్పుడు రంగయ్య మామయ్యతో “కుర్రవాడిని బాగుచేసే బాధ్యత నీదిరా, అబ్బాయి ! మరి నీ ఇంట్లో ఉంచినది ఎందుకు? కాస్త మంచిచెడ్డ చూస్తావని కదూ ! వాడిని నీవే ఒక దారిలో పెట్టాలి. వాడు పన్నెండేళ్ళ. పిల్లాడు. ఇప్పుడే నీవు వాడిని మంచిదారిలో పెట్టాలి. అంతా నీదే భారం” అని రంగయ్య మామయ్యతో అన్నాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 3.
మామయ్య, ‘శీను’ను ఊరికి పంపకపోవడానికి కారణమేమిటి?
జవాబు:
‘శీను ఈ మధ్య ఏవో కుర్రతనపు చేష్టలు చేస్తున్నాడు. శీను ఈ మధ్య దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. స్కూలు తెరవగానే తిరిగి రాక, నాలుగు రోజులు ఆలస్యంగా మామయ్యగారి ఇంటికి వచ్చాడు. ఎందుకురా ఆలస్యంగా – వచ్చావు? అని మామయ్య అడిగితే, తన తండ్రి ఉండమన్నాడని అబద్దం చెప్పాడు. సెలవు చీటీ తెచ్చావురా? అంటే, తెచ్చాను కాని ఎక్కడో పారవేశానని మరో అబద్దం చెప్పాడు.

ఈ విధంగా శీను అభాద్దాలు చెపుతున్నాడనే అనుమానం మామయ్యకు వచ్చింది. అందుకే, శీనునీ ఊరికి పంపడానికి మామయ్య అంగీకరించలేదు.

ప్రశ్న 4.
‘శీను’ తమ ఊరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు?
జవాబు:
శీను దసరా సెలవుల నుండి మామయ్యగారింటికి వచ్చే రోజుననే, శీను ఇంట్లో ఆవు ఆ రోజుననో, మరునాడో ఈనుతుందని అందరూ అనుకుంటున్నారు. శీను తల్లి శీనుతో “నాయనా ! జున్ను తినకుండా వెడుతున్నావు. ఇంకో రెండు రోజులు ఉండరాదురా ! జున్ను నీకు పెట్టకుండా, మేము అందరం ఎలా తింటాం” అని ఎన్నోసార్లు అంది.

శీనుకు జున్ను తినాలని ఉంది. అందుకే శీను ఏదో అబద్ధం చెప్పి, తన ఊరుకు వెళ్ళాలనుకున్నాడు.

ప్రశ్న 5.
మామయ్య ‘సీతన్న’ గురించి ‘శీను’తో ఏం చెప్పాడు?
జవాబు:
మామయ్య శీనుతో సీతన్న గురించి ఇలా చెప్పాడు. – “ఒరే శీనూ ! ఆ సీతన్న వరివెధవ. వీధుల వెంట తిరిగే వెధవ. వాడు వర్థి అబద్ధాల కోరు. వాడు మీ ఊరు వాడయినా సరే వాడితో ఎప్పుడూ మాట్లాడకు.

ఆ సీతన్న గురించి నాకు అంతా తెలుసు. వాళ్ళ మాస్టారు కూడా సీతన్న వట్టి దుర్మార్గుడని, వాడి సహవాసం వల్ల నీవు కూడా చెడిపోతున్నావనీ నాకు చెప్పాడు.”

పై విధంగా మామయ్య శీనుతో సీతయ్య గురించి తనకు తెలిసినట్లు డబాయిస్తూ మాట్లాడాడు.

ప్రశ్న 6.
పాఠం చదవండి. అందులో ప్రశ్నా వాక్యాలను గుర్తించి, రాయండి.
జవాబు:

  1. ఏం కావాలిరా శీనూ?
  2. మళ్ళీ ఎందుకు రా వెళ్ళటం?
  3. ఎందుకురా శీనూ!, ఇప్పుడు నీవు మళ్ళీ ఊరికి వెళ్ళటం? మొన్ననే కదా వెళ్ళి వచ్చావు? ఇంతలోనే ఏమి తొందర?
  4. నిజంగా రమ్మన్నారా?
  5. ఏం రా? వెడతావా?
  6. ఏం వెళ్ళకపోతే ఏం?
  7. మీ నాన్న కోప్పడుతాడేం?
  8. నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా?
  9. వాడి పేరు?
  10. ఏ క్లాసు?
  11. ఏం చెయ్యాలి చెప్పు?
  12. ఎందుకు వెళ్ళవురా?
  13. హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
  14. ఏం జేశాడూ?
  15. ఏం అట్లా చూస్తావు?
  16. ఎందుకురా శీనూ, ఇన్ని అబద్ధాలాడావు? మొ||వి.

ప్రశ్న 7.
క్రింది పేరాను చదవండి. ఐదు ప్రశ్నలు తయారు చేయండి.

“ఈ సెలవులు నాలుగు రోజులూ ఇంటి దగ్గర ఉండివస్తాను మామయ్య”, అన్నాడు శీను. “మళ్ళీ ఎందుకురా వెళ్ళటం?” అన్నాడు మామయ్య. శీను బిక్కముఖంతో అక్కడే నుంచుని ఉన్నాడు.

శీను అంటే ఎవరో కాదు. మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎల్లాగున్నా ! రంగయ్యా, నేను చిన్నప్పటి నుండి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాణ్ణి నా దగ్గర వడలిపెట్టి, “కాస్త కని పెట్టి చూస్తూవుండరా ! అని చెప్పి వెళ్ళాడు.” కుర్రవాడు మామయ్య దగ్గరవుంటే వాడికో ముక్క వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని రంగయ్య ఉద్దేశ్యం.
జవాబు:
ప్రశ్నలు :
1) శీను మామయ్యతో ఏమి చెప్పాడు?
2) శీనునీ మామయ్య ఏమని అడిగాడు?
3) శీను ఎవరు?
4) రంగయ్య, మామయ్యల సంబంధం ఏమిటి?
5) రంగయ్య మామయ్యతో ఏమి చెప్పాడు?

గయ్య కొడుకు అక్కడే నుంచును” అన్నాడు.
రాకపోయినా, చర్చయిత కోరుకున్నారులు చెప్పిన పిల్లలు పిల్లలను కొట్టకు

III. స్వీయరచన

అ) కింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానాలు ఆలోచించి రాయండి.

ప్రశ్న 1.
పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని రచయిత కోరుకున్నారు? ఎందుకు?
జవాబు:
పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా, చదువుకోడం వల్ల వారి ప్రవర్తన బాగుపడాలి. చిన్నతనంలోనే పిల్లలను కాస్త మంచి మార్గంలో పెట్టాలని రచయిత కోరుకున్నాడు. … పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. లేకపోతే మొదట అబద్దాలు చెప్పిన పిల్లలు క్రమంగా దొంగతనాలు నేర్చుకుంటారు. తరువాత స్కూలుకు ఎగగొట్టి ఎందుకూ పనికిరాకుండా పోతారు. పిల్లలను కొట్టకుండా తప్పు చేస్తే గట్టిగా చీవాట్లు వేయాలి. అబద్ధం ఆడటం తప్పని పిల్లలకు నచ్చచెప్పాలని రచయిత అనుకున్నాడు.

ప్రశ్న 2.
ఈ కథ వలన మీరు గ్రహించిన విషయాలు ఏవి?
జవాబు:

  1. ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు.
  2. సీతన్నవంటి చెడ్డపిల్లలు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో సహవాసం చెయ్యకూడదు.
  3. అబద్దం చెప్పిన పిల్లలను పెద్దలు కొట్టకూడదు.
  4. ఎందుకు వారు అబద్దం చెప్పారో బుజ్జగించి అడిగి కారణం తెలుసుకొని ఆ పిల్లల కోరికలు తీర్చాలి. ఈ కథలో శీను జున్ను తినాలనే కోరికతో అబద్దం చెప్పాడు. అందుకోసం శీను ఎన్నో అబద్దాలు ఆడాడు. మామయ్య లేఖ రాసిస్తాననీ, దానికి శీను తండ్రి చేత జవాబు రాయించుకు రమ్మని చెప్పాడు. తండ్రికి ‘ విషయం తెలుస్తుందని శీను తన తప్పును అంగీకరించి ఇంక ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు మాట ఇచ్చాడు.
  5. దీనిని బట్టి పిల్లలను తెలివిగా మంచిదారిలోకి తేవాలని ఈ కథ ద్వారా నేను గ్రహించాను.
  6. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా నీతి మార్గంలో నడవాలనీ, అబద్ధం చెప్పరాదనీ ఈ పాఠం వల్ల నేను గ్రహించాను.

ప్రశ్న 3.
చెడ్డవాళ్ళతో స్నేహం చేయగూడదని రచయిత అన్నారు కదా ! అందువల్ల కలిగే నష్టాలు ఏవి?
(లేదా)
చెడ్డ వాళ్ళతో స్నేహం చేయరాదని పెద్దవారు చెబుతారు కదా ! అందువల్ల కలిగే నష్టాలను మీ పాఠ్యాంశము ఆధారంగా వివరించండి.
జవాబు:
చెడ్డవారితో స్నేహం చేస్తే వారి చెడుగుణాలు స్నేహం చేసిన వారికి వస్తాయి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే, అబద్ధాలు చెప్పడం, బడి మానివేయడం, పేకాట ఆడడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం, సినిమాలకు తరచుగా వేళ్ళడం, త్రాగడం వగైరా చెడు గుణాలు సంక్రమిస్తాయి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 4.
‘శీను’కు రచయిత ఎలా బుద్ధి చెప్పారో రాయండి.
జవాబు:
శీను’ సెలవులకు తనను ఇంటికి తప్పక రమ్మని, తన తండ్రి చెప్పాడని, రచయితతో అబద్ధం చెప్పాడు. రచయితకు శీను తండ్రి బజారులో కనబడి, తాను శీనును రమ్మని చెప్పలేదని చెప్పాడు.

అప్పుడు రచయిత తాను ఒక ఉత్తరం, శీను తండ్రికి రాసి ఇస్తానని, దానికి తప్పకుండా శీను తండ్రి చేత . జవాబు రాయించుకొని తేవాలని, శీనుకు చెప్పాడు. రచయిత రాసిన ఉత్తరం చదివితే తండ్రికి నిజం తెలుస్తుందని శీను భయపడి, తాను సెలవులకు ఇంటికి వెళ్ళనని చెప్పాడు. అంతేగాక తాను జున్ను తినాలని అబద్దం – చెప్పానని అంగీకరించాడు. ఇంక ఎప్పుడూ అబద్దం. చెప్పనన్నాడు. ఈ విధంగా తెలివిగా, రచయిత .శీనుకు .. బుద్ధి చెప్పాడు.

ప్రశ్న 5.
“శీను విధేయతతో తల ఊపుతూ బస్సు ఎక్కాడు. నేను కిందనే నుంచున్నాను. ఇలా పాడు పైన – నేను కింద ఉన్నామని” రచయిత అన్నాడు కదా ! ఈ మాటల వల్ల మీరు ఏమి గ్రహించారో రాయండి.
జవాబు:
సీతయ్య అన్నవాడు తనకు తెలుసునని రచయిత శీను దగ్గర డబాయించాడు. ఆ సీతయ్యే శీనుకు మీ మామయ్యతో ఇలా చెప్పి రారా” అని బోధించి ఉంటాడని రచయిత అనుకున్నాడు. అందుకే శీను దుర్మార్గుడని వాడి – స్నేహంతోనే శీను చెడిపోతున్నాడని, సీతయ్య మాష్టారు కూడా తనకు చెప్పాడని రచయిత శీనును గట్టిగా .. దబాయించాడు.

రచయిత మాటలన్నీ విన్న శీను సీతయ్య అన్నవాడు లేనేలేడని, మెల్లగా నిజం బయటపెట్టాడు. ఈ విధంగా అబద్ధాలు కల్పించి చెప్పడంలో, రచయిత కన్నా శీను పైన ఉన్నాడని, రచయిత కింద ఉన్నాడని కథా. రచయిత చమత్కరించి చెప్పాడు.

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాలలో సమాధానాలు రాయండి.

ప్రశ్న 1.
‘శీను’ గురించి రాయండి.
జవాబు:
శీను రంగయ్యకు పుత్రుడు. రంగయ్య తనకు మిత్రుడూ, శీనుకు మామయ్య అయిన రచయిత ఇంట్లో ఉంచి శీనును చదివిస్తున్నాడు. శీనును రచయిత కనిపెట్టి చూస్తాడని రంగయ్య ఆశ.

శీను ఈ మధ్య అబద్దాలు ఆడుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి తన తండ్రి ఉండమన్నాడని బడి తెరిచాక నాల్గు రోజులకు తిరిగి వచ్చాడు. సెలవు చీటీ తెచ్చాను కాని ఎక్కడో పారవేశానన్నాడు.

మళ్ళీ నాల్గు రోజులు సెలవులు వచ్చాయి. ‘ శీను ఇంట్లో ఆవు ఈనుతోంది. దాని జున్ను తినాలని శీను ఆశపడ్డాడు. తండ్రి’ రమ్మన్నాడని, తమ ఊరి సీతయ్యతో కలిసి వెడతానని మామయ్యతో అబద్దం చెప్పాడు.

మామయ్యకు శీను అబద్దం చెపుతున్నాడని ఎందుకో తోచింది. బజారులో శీను తండ్రి రంగయ్య, శీనుమామయ్యను కలిశాడు. శీనును తాను ఇంటికి రమ్మనలేదని చెప్పాడు.

అప్పుడు శీను మామయ్య, శీనుతో, తాను శీను తండ్రికి ఉత్తరం రాసి ఇస్తానని, దానికి శీను తండ్రిచే జవాబు తప్పక రాయించి తెమ్మనీ చెప్పాడు – మామయ్య ఉత్తరం చూస్తే తండ్రికి నిజం తెలుస్తుందని, శీను తన తప్పు ఒప్పుకున్నాడు. ఇంక జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని మామయ్యకు శీను చెప్పాడు. మామయ్య జాలిపడి, శీనును జున్ను తినడానికి ఇంటికి పంపాడు.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ప్రశ్న 2.
పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
శీనువచ్చి ఈ నాలుగు సెలవు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెడతానని మామయ్యను అడిగాడు. శీను మామయ్య – గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. శీను తండ్రి రంగయ్య. మామయ్య శ్రద్ధగా చదివిస్తాడని శీనును మామయ్య గారింటి దగ్గర రంగయ్య ఉంచాడు. శీనును మామయ్య జాగ్రత్తగా చూస్తున్నా ఈ మధ్య అబద్ధాలు చెపుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళి బడి తెరిచిన నాల్గు రోజులకు వచ్చాడు. వాళ్ళ నాన్న, ఉండమన్నాడని మామయ్యతో అబద్దం చెప్పాడు. మామయ్యకు శీను ‘మీద అనుమానం వచ్చింది.

శీను తండ్రి రంగయ్య బజా మామయ్యకు కనబడి శీనును తాను రమ్మనలేదని చెప్పాడు. దానితో శీను అబద్దాలు ఆడుతున్నాడని మామయ్య గ్రహించాడు. శీనును తిడదామని మామయ్య అనుకున్నాడు. శీను ప్రయాణం ఆపాలని నీవు ఒక్కడివీ ఎలా వెడతావురా అని మామయ్య శీనును అడిగాడు. తన ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతానన్నాడు శీను.

మామయ్య శీనును వెళ్ళమని చెప్పాడు. శీను తండ్రికి తాను ఉత్తరం రాసి ఇస్తానని, దానికి తప్పక జవాబు రాయించి తెమ్మని, తేకపోతే తనకు కోపం వస్తుందనీ మామయ్య శీనుతో అన్నాడు.

ఉత్తరం చూస్తే తాను అబద్దం ఆడినట్లు తండ్రికి తెలుస్తుందని శీను ప్రయాణం మానివేశాడు. అప్పుడు మామయ్య శీనును మందలించాడు.

తరువాత ఎందుకు అబద్దమాడావురా ? అని మామయ్య శీనును అడిగి తెలుసుకున్నాడు. శీను జున్ను తినాలని అబద్దం చెప్పాడని మామయ్య జాలిపడి శీనును వాళ్ళ ఇంటికి బస్సు ఎక్కించి పంపాడు.

IV. పదజాలం

అ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి, వాక్యాలను తిరిగి రాయండి.

1. పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలి.
జవాబు:
ప్రవర్తన = నడవడి – వాక్యము
తిరిగి రాయడం : పిల్లలకు మంచి నడవడి నేర్పాలి.

2. రచయిత, ‘శీను’కి ఏ సంగతి చెప్పలేదు.
జవాబు:
సంగతి = సమాచారము
వాక్యము తిరిగి రాయడం : రచయిత శీనుకి ఏ సమాచారము చెప్పలేదు.

3. రంగయ్య బజారులో హఠాత్తుగా కనిపించాడు.
జవాబు:
హఠాత్తుగా = అకస్మాత్తుగా
వాక్యము తిరిగి రాయడం : రంగయ్య బజారులో అకస్మాత్తుగా కనిపించాడు.

4. విద్యార్థులు అల్లరి చేష్టలు చేయగూడదు.
జవాబు:
చేష్టలు = పనులు
వాక్యము తిరిగి రాయడం : విద్యార్థులు అల్లరి పనులు చేయగూడదు.

5. పెద్దలు, పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించాలి.
జవాబు:
బాధ్యత = పూచీ
వాక్యము తిరిగి రాయడం : పెద్దలు పిల్లల అభివృద్ధికి పూచీ వహించాలి.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు, వ్యతిరేకార్థాలనిచ్చే పదాలు పట్టికలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
ఉదా :

  1. మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ త్రాగుతూ, కూర్చున్నాను.
  2. నేను రంగయ్య మంచి స్నేహితులం.
  3. శీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.
  4. ఆ రోజు సాయంత్రం రంగయ్య కనిపించాడు.
  5. పిల్లవాన్ని సన్మార్గంలో పెట్టాలి.
  6. వాడికి ధైర్యం లేకపోయింది.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం 2
ఉదా :
1. చల్లని
2. చెడు
3. తొందరగా
4. ఉదయం
5. చెడు మార్గం
6. అధైర్యం

సొంతవాక్యాలు :

  1. చల్లని ఆ : నేను చల్లని మంచి నీళ్ళు తాగుతాను.
  2. చెడు : పిల్లలు చెడు అలవాట్లకు సులభంగా లొంగుతారు.
  3. తొందరగా : బడికి రోజూ తొందరగా వెళ్ళాలి.
  4. ఉదయం : నేను ఉదయం లేవగానే దేవుడికి నమస్కరిస్తాను.
  5. చెడు మార్గం : పిల్లలు చెడు మార్గంలోకి పోకుండా పెద్దలు శ్రద్ధ చూపాలి.
  6. అధైర్యం  : పరీక్షలంటే, పిల్లలు అధైర్యం చెందరాదు.

ఇ) కింది రెండు వరసల నుంచి ఏవైనా రెండు మాటలు తీసుకొని, వాటిని ఒకే వాక్యంతో ఉపయోగించి రాయండి.

ఉదా :
1) నిజం – అ) కీర్తి
2) ఊరు – ఆ) కష్టాలు
3) మంచి – ఇ) ప్రయాణం
4) చెడు స్నేహం – ఈ) సక్రమంగా
5) బస్సు – ఉ) సెలవులు
6) బడి – ఊ) అబద్ధం

ఉదా :
1. నిజం, అబద్దం : మనం ఎప్పుడూ నిజమే చెప్పాలిగాని అబద్దం చెప్పగూడదు.
2. ఊరు, సెలవులు : ఈ సెలవులకు తప్పక మా ఊరు వెడతాను.
3. మంచి, కీర్తి : మంచి గుణవంతుడికి, కీర్తి వస్తుంది.
4. చెడు స్నేహం, కష్టాలు: చెడు స్నేహం వలన కష్టాలు వస్తాయి.
5. బస్సు, ప్రయాణం : ఎ.సి. బస్సులో ప్రయాణం, సుఖంగా ఉంటుంది.
6. బడి, సక్రమంగా : విద్యార్థులు బడికి రోజూ సక్రమంగా వెళ్ళాలి.

ఈ) పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలను తెలుసుకోండి. వీటిని సొంతవాక్యాలలో రాయండి.

1. తెల్లముఖం వేయడం అంటే : వెలవెల పోవడం అని అర్థం.
వాక్య ప్రయోగం : గురువుగారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక, పిల్లలు తెల్లముఖం వేశారు.

2. బుజ్జగించడం అంటే : మారాము చేసేవారిని, మంచి మాటలు చెప్పి ఓదార్చి, ఒప్పించడం అని అర్థము.
వాక్య ప్రయోగం : కొత్త బట్టలు కావాలని ఏడుస్తున్న తమ్ముణ్ణి మా అమ్మ ఎలాగో బుజ్జగించింది.

3. బిక్కమొఖం వేయడం అంటే : భయంతో తెల్లమొగం వేయడం అని అర్థం.
వాక్య ప్రయోగం : బడి మాని సినిమాకు వెళ్ళిన తమ్ముణ్ణి, అమ్మ నిలదీసి ప్రశ్నిస్తే, వాడు బిక్కమొఖం వేశాడు.

4. ఎగగొట్టడం అంటే : తీర్చవలసిన ఋణం మొదలయిన వాటిని తీర్చకపోడం, చేయవలసిన పనిని మానివేయడం.
వాక్య ప్రయోగం :
1) రామయ్య బ్యాంకు నుండి తెచ్చుకొన్న ఋణాన్ని ఎగగొట్టాడు.
2) నా మిత్రుడు నిన్న బడికి ఎగగొట్టాడు.

5. చీవాట్లు వేయడం అంటే : తిట్టడం లేక నిందించడం అని అర్థం.
వాక్య ప్రయోగం : నా మీత్రుడు బడికి ఎగగొట్టాడని తెలిసి, వాళ్ళ నాన్నగారు వాడికి చీవాట్లు వేశారు.

V. సృజనాత్మకత

1. పాఠ్యాంశం ఆధారంగా రచయితకూ, ‘శీను’కూ జరిగే సంభాషణలను రాయండి.
జవాబు:
రచయిత : ఏం కావాలిరా శీనూ?
శీను : ఈ సెలవులు నాల్గు రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను.
రచయిత : మళ్ళీ ఎందుకురా వెళ్ళటం. మొన్నేకదా, వచ్చావు.
శీను : నాన్న తప్పకుండా రమ్మన్నాడు.
రచయిత : సరే ! అవసరం అయితే వెళ్ళుదువుగానిలే. నీవు ఒక్కడివీ ఎల్లా వెడతావురా?
శీను : మా ఊరి పిల్లాడు సీతయ్యతో కలిసి వెడతా.
రచయిత : సరే. నీకు ఒక ఉత్తరం రాసి ఇస్తా. అది మీ నాన్నకు ఇచ్చి దానికి జవాబు రాయించుకొని రావాలి.
రచయిత : నేను చెప్పిన విషయాలు తెలిశాయా?
శీను : (ఏడ్పు ముఖంతో) మా నాన్న చేత ఉత్తరం రాయించుకు రావాలి.
రచయిత : ఏం రా శీనూ ! డబ్బు కావాలా?
శీను : అక్కరలేదు. నేను వెళ్ళను మామయ్య.
రచయిత : ఎందుకు వెళ్ళవురా?
శీను : (తలవంచి తెల్లముఖం వేశాడు)
రచయిత : వెధవా చెడిపోతున్నావు. ప్రాణం పోయినా ‘అబద్దం ఆడకూడదు. తెలిసిందా?
శీను : తెలిసింది.
రచయిత : హరిశ్చంద్రుడి కథ తెలుసునా?
శీను : తెలుసు. ఎప్పుడూ అబద్దం ఆడలేదు.
రచయిత : అదీ మన ఆదర్శం. ఇక నుంచి ఎప్పుడూ నిజమే చెప్పాలి. చెడ్డ పిల్లలతో స్నేహం వద్దు.
శీను : సరే మామయ్యా ! నన్ను క్షమించు. తప్పు చేశా.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

VI. ప్రశంస

* ఇచ్చిన మాటకోసం లేదా ‘సత్యం’ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులను గురించి ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు:
1) బలిచక్రవర్తి :
వామనుడికి మూడు అడుగుల నేలను దానం చేస్తానన్నాడు. వామనుడు విష్ణుమూర్తి అని, మూడు అడుగులు దానం చేస్తే బలిచక్రవర్తికి ప్రమాదం వస్తుందని బలిచక్రవర్తిని గురువు శుక్రుడు హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి గురువు మాటను కాదని వామనుడికి దానం చేశాడు.

2) కర్ణుడు :
కర్ణుడు తన సహజ కవచకుండలాలను కోసి దేవేంద్రుడికి ఇచ్చాడు. అలా ఇవ్వవద్దని, కర్ణుడిని అతని తండ్రి సూర్యుడు హెచ్చరించినా వినకుండా కర్ణుడు దేవేంద్రుడికి తన కవచకుండలాలు ఇచ్చాడు.

3) హరిశ్చంద్రుడు :
హరిశ్చంద్రుడు, తాను అన్నమాట కోసం తన రాజ్యాన్ని విశ్వామిత్రునికి ఇచ్చాడు. తనను, భార్యను అమ్ముకొని గురువుగారికి ఇవ్వవలసిన మొత్తాన్ని చెల్లించాడు.

4) ఆవు :
తనను తినబోయిన ‘పులికి ఇచ్చినమాట ప్రకారం ఆవు తన దూడకు పాలిచ్చి తిరిగివచ్చి తనను తినమని పులిని బ్రతిమాలింది.

5) దిలీపుడు :
దిలీపుడు నందినీ, ధేనువును రక్షించడం కోసం, సింహానికి తన శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు.

ఆవు :
అమ్మకొని గురువుగారి అను అన్నమాట కోసి

VII. ప్రాజెక్టు పని

* ‘నిజం’ గొప్పతనాన్ని తెలిపే కథలను సేకరించండి. వాటిని మీ తరగతిలో చదివి వినిపించండి; ప్రదర్శించండి.
జవాబు:

  1. ఆవు – పులి కథ
  2. సత్యహరిశ్చంద్రుని కథ
  3. బలిచక్రవర్తి కథ మొదలయిన వాటిని సేకరించుట.
    విద్యార్థి కృత్యం.

VIII. భాషను గురించి తెలుసుకుందాం

అ) కింది పదాలను విడదీయండి.
1. ఉదా : వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ)
అ. రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
ఆ. సురైక = సుర + ఏక = (అ + ఏ = ఐ)
ఇ. ఏకైక క = ఏక + ఏక = (అ + ఏ = ఐ)

2. ఉదా : సమైక్య = సమ – + ఐక్య = (అ + ఐ = ఐ)
ఈ. అప్లైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఉ. దేవైశ్వర్యం = దేవ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)

3. ఉదా : పాపౌఘము = పాప + ఓఘము = (అ + ఓ = ఔ)
ఊ. దివాకసులు = దివ + ఓకసులు = (అ + ఓ = ఔ)
ఎ. వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)

4. ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యము = (అ + ఔ = ఔ)
ఏ. దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ)
ఐ. దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ)

గమనిక : పై పదాలను విడదీసినపుడు, ప్రతి పదంలోనూ పూర్వపదము యొక్క చివరి అక్షరం ‘అ’ కారం (‘అ’ – అక్షరం) ఉంది. అలాగే పరస్పరం (పరపధంలోని మొదటి అక్షరమైన అచ్చు) స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ — లు ఉన్నాయి. ఇలా ‘అ’కారానికి, ఏ, ఐ – లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది. ‘అ’ కారానికి ఓ, ఔ – లు కలిసినపుడు ‘ఔ’ వచ్చింది. దీనిని “వృద్ధి సంధి” అంటారు.

గమనిక :
ఐ, ఔ – లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి “వృద్ధి సంధి”.

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

వృద్ధిసంధి : సూత్రము :
అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ‘ఐ’ కారము, ఓ, ఔ లు పరమైనపుడు ‘ఔ’ కారము ఏకాదేశమగును.

ఆ) కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించండి.

అ. అభ్యుదయం = అభి – + ఉదయం = (ఇ + ఉ = య్) – యణాదేశసంధి
ఆ. సూర్యోదయం = సూర్య + ఉదయం = (అ + ఉ = ఓ) – గుణసంధి
ఇ. మహౌషధం = మహా + ఔషధం – (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఈ. భాషాన్నత్యం = భాషా + ఔన్నత్యం = (ఆ + ఔ = ఔ) – వృద్ధిసంధి
ఉ. లోకైక = లోక + ఏక = (అ + ఏ = ఐ) – వృద్ధిసంధి
ఊ. లఘూత్తరం = లఘు + ఉత్తరం = (ఉ + ఉ = ఊ) – సవర్ణదీర్ఘ సంధి
ఎ. మాతృణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ఋ) – సవర్ణదీర్ఘ సంధి.
ఏ. అణ్వస్త్రం = అణు + అస్త్రం = (ఉ + అ = వ్) – యణాదేశసంధి

పాఠంలోని వ్యతిరేకపదాలు

వెచ్చని × చల్లని
వెనుక × ముందు
స్నేహితులు × శత్రువులు
బుద్ధిమంతుడు × బుద్దిహీనుడు
జాగ్రత్త × అజాగ్రత్త
నిజము × అబద్ధము
అవసరం × అనవసరం
సన్మార్గం × దుర్మార్గంలో
ధైర్యం × అధైర్యం
దుఃఖం × సుఖం
ప్రశ్న × జవాబు
విచారం × ఆనందం
నమ్మకం × అపనమ్మకం
పాపం × పుణ్యం
భయం × అభయం

ప్రకృతి – వికృతి

ఘంటా – గంట
ముఖం – మొగం
భక్తి – బత్తి
ప్రయాణము – పయనము
నిమిషం – నిముసం
బ్రద్నుడు – ప్రొద్దు
స్నేహం – నెయ్యము
ప్రాణం – పానం
కథ – కత
సన్యాసి – సన్నాసి
సంతోషం – సంతసం
పుస్తకం – పొత్తము
కంఠము – గొంతు
ఆశ్చర్యం – అచ్చెరువు

సమానార్ధక పదాలు (పర్యాయపదాలు)

1. భార్య : 1) పెళ్ళాము, 2) ఇల్లాలు, 3) ఆలు
2. కొడుకు : 1) కుమారుడు, 2) సుతుడు, 3) తనయుడు
3. స్నేహితుడు : 1) మిత్రుడు, 2) నేస్తము, 3) హితుడు
4. ఊరు : 1) గ్రామము, 2) పల్లె
5. నాన్న : 1) తండ్రి, 2) అయ్య, 3) జనకుడు
6. చేయి : 1) చెయ్యి, 2) కరము, 3) హస్తము
7. అబద్ధము : 1) అసత్యము, 2) కల్ల, 3) బొంకు
8. ముఖము : 1) ఆననము, 2) మొగము, 3) మోము

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

సమాసములు – విగ్రహవాక్యాలు

సమాస పదంవిగ్రహవాక్యంసమాస నామం
1. తల్లిదండ్రులుతల్లి, తండ్రిద్వంద్వ సమాసం
2. భయభక్తులుభయము, భక్తిద్వంద్వ సమాసం
3. రెండు రూపాయలురెండు (2) సంఖ్యగల రూపాయలుద్విగు సమాసం
4. తొమ్మిది గంటలుతొమ్మిది (9) సంఖ్యగల గంటలుద్విగు సమాసం
5. రెండు అబద్దాలురెండు (2) సంఖ్యగల అబద్ధాలుద్విగు సమాసం
6. రెండు చొక్కాలురెండు (2) సంఖ్యగల చొక్కాలుద్విగు సమాసం

రచయిత పరిచయం

రచయిత : మునిమాణిక్యం నరసింహారావు
జననం : 15-03-1898.
మరణం : 1972వ సంవత్సరం.
జన్మస్థలం : సంగం జాగర్లమూడి (గ్రామం) తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా.
రచనలు :

  1. కాంతం కథలు
  2. కాంతం కైఫీయత్
  3. కాంతం కాపురం
  4. మేరీ కహానీ – మొదలైన 24 పుస్తకాలు రచించారు.
  5. దాంపత్యోపనిషత్తు
  6. వినోద వ్యాసములు – మొదలైన వ్యాస సంపుటాలు రచించారు.
  7. ‘మన హాస్యం’ అనే హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథము వ్రాశారు.

హాస్యరస సృష్టికర్త : వీరు దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార భరితంగా, చిత్రించిన గొప్ప రచయిత. తెలుగు కథా సాహిత్యంలో వీరు సృష్టించిన ‘కాంతం’ పాత్ర, జీవవంతమైనది.

రచనా శైలి : చమత్కారమును పుట్టించే సులభశైలి, ఆకర్షణీయమైన కథా శీర్షికలు, మునిమాణిక్యం గారి రచనలకు వన్నె తెచ్చాయి.

ఉద్యోగం : వీరు ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయ ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేశారు.

వీరి కథలోని ప్రధానాంశాలు :

  1. సజీవమైన వాడుక భాష
  2. అచ్చమైన తెనుగు నుడికారం

1. ‘నిజం నిజం’ కథ రాసిన హాస్యకథా రచయిత మునిమాణిక్యం గారిని గూర్చి రాయండి.
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావుగారు గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1898లో పుట్టారు. వీరు . ఉపాధ్యాయులుగా, ఆకాశవాణిలో విద్యావిషయాల ప్రయోక్తగా పనిచేశారు. వీరు దాంపత్య జీవితాన్ని చమత్కారంగా చిత్రించిన హాస్యకథా రచయిత. వీరు కాంతం కథలు, కాంతం కాపురం, దాంపత్యోపనిషత్తు, వంటి గ్రంథాలు రచించారు. హాస్యాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథం “మన హాస్యం” రచించారు.

కొత్త పదాలు-అర్థాలు

43వ పేజి
తమాషా = గమ్మత్తు
గిరుక్కున ఆ = శీఘ్రముగా తిరుగుటలో అనుకరణము (తొందరగా)
నిక్కరు = లాగు
షర్టు – = చొక్కా
బిక్క ముఖంతో = తెల్ల మొఖంతో (బెదరుతున్న ముఖంతో)
వాడికో ముక్క వస్తుందని = వాడికి కొద్దిగానైనా చదువు వస్తుందని
కుర్రతనపు చేష్టలు = చిన్నపిల్లవాడి పనులు
బిక్కముఖం పెట్టి = బెదరుతున్నట్లు ముఖం పెట్టి

44వ పేజి
తోచలేదు = స్పురించలేదు
నిర్బంధించడం = బలవంతపెట్టడం
హఠాత్తుగా = అకస్మాత్తుగా (అనుకోకుండా)
సంగతి = సమాచారము
సహవాసాలు = స్నేహాలు
ఒక దారిని పెట్టాలి = ఒక మంచి మార్గంలోకి నడిపించాలి
సన్మార్గం = (సత్ + మార్గం) . : = మంచి మార్గం (మంచి దారి)
భారం = బాధ్య త
వఠ్ఠిది = అసత్యమైనది
ఎగగొట్టి = ఎగవేసి (మాని)
చెయ్యి చేసుకోవలసిన అవసరం = కొట్టవలసిన అవసరం
ఈ దఫా = ఈ పర్యాయము
చీవాట్లు వేయు = మందలించు, తిట్టు
పిల్లిలాగ = నెమ్మదిగా, నిశ్శబ్దంగా
బ్రహ్మాండమైన = బాగా గొప్పదైన
బాదుదాము = కొడదాము
నచ్చజెప్పాలి = నచ్చేటట్లు చెప్పాలి

45వ పేజి
ఫోర్తు ఫారం = 9వ తరగతి
తల ఊపాడు = అంగీకరిస్తున్నట్లు తల తిప్పాడు
హడలిపోయేలాగున = భయపడే విధంగా
అక్కర లేదన్నాడు . = అవసరం లేదని చెప్పాడు
బైట పడుతుంది = వెల్లడి అవుతుంది (తెలిసిపోతుంది)
చీవాట్లు వేయటానికి = తిట్టడానికి
తెల్లముఖం వేశాడు = వెలవెల పోయాడు
వఠ్ఠి అబద్ధం = పూర్తిగా అసత్యం
ఓర్చుకున్నాడు = సహించాడు
ఆదర్శం = ఇతరులు చూసి నేర్చుకోదగిన గుణం
సహవాసం = స్నేహం
పాడైపోయినావు = చెడిపోయావు

46వ పేజి
సన్యాసి = అన్నింటినీ విడిచినవాడు
చీదరించుకొనేసరికి = కోపపడే సరికి
పశ్చాత్తాపం = తాను చేసినది తప్పని తెలిసినప్పుడు, అలా తాను చేశానే అని, బాధపడడం
వెక్కివెక్కి ఏడ్వటం = గట్టిగా ఏడ్వడం
సన్మార్గం (సత్ + మార్గం) = మంచి దారి
ఆదుర్థాపడు = ఆందోళన పడు
ఆరాటం = సంతాపము
ఖిన్నుడై (ఖిన్నుడు + ఐ) = దుఃఖము పొందినవాడై
బుజ్జగించి = బ్రతిమాలి
మాట పెగిలిరాలేదు = నోట మాటరాలేదు
రుద్దకంఠంతో = ఏడ్పు కంఠంతో
బస్టాండు (Bus stand) = బస్సులు ఆగే స్థలము
వ్యర్ధము = వృథా, ప్రయోజనం లేకపోడం

AP Board 7th Class Telugu Solutions Chapter 8 నిజం-నిజం

47వ పేజి
ఎరిగి ఉన్నట్లు = తెలిసినట్లు
డబాయిస్తే కాని = తనకు తెలిసినట్లు నటిస్తే కాని
బైట పెట్టడు = వెల్లడించడు, పైకి చెప్పడు
దుర్మార్గుడు . = చెడ్డవాడు
కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ = కళ్ళ నుండి వచ్చే నీరు తుడుచుకుంటూ (ఆపుకుంటూ)
గర్జించాను = గట్టిగా అరచాను
ఒళ్ళు = శరీరము
తెప్పరిల్లి = దుఃఖము నుండి తేరుకొని
విధేయతతో = వినయముతో