These AP 6th Class Telugu Important Questions 4th Lesson సమయస్ఫూర్తి will help students prepare well for the exams.
AP State Syllabus 6th Class Telugu 4th Lesson Important Questions and Answers సమయస్ఫూర్తి
6th Class Telugu 4th Lesson సమయస్ఫూర్తి Important Questions and Answers
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
1. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పంచవటం (ఐదు చెట్ల సమూహం) అనే ప్రాంతంలోని ఒక మర్రిచెట్టు తొర్రలో “రోమశుడు” అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు క్రింది కన్నంలో “పలితుడు” అనే ఎలుక కాపురముంటోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి, ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు.
అది తెలియని రోమశుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన పలితుడు “ఆహా ! ఎంత అదృష్టము. నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈ నాటితో వాడి పీడ…” అనుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) మర్రిచెట్టు ఏ ప్రాంతంలో ఉంది?
జవాబు:
మర్రి చెట్టు పంచవటం అనే ప్రాంతంలో ఉంది.
ఆ) పిల్లి ఎక్కడ నివసిస్తోంది?
జవాబు:
పిల్లి మర్రి చెట్టు తొర్రలో నివసిస్తోంది.
ఇ) రాత్రి వేటగాడు వచ్చి ఏమి చేశాడు?
జవాబు:
రాత్రి వేటగాడు వచ్చి చెట్టు చుట్టూ వలపన్నాడు.
ఈ) రోమశుడు ఎలా వలలో చిక్కుకున్నాడు?
జవాబు:
రోమశుడు వల విషయం తెలియక తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారన్వేషణకు బయలుదేరి వలలో చిక్కుకున్నాడు.
2. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఇదే సమయంలో “చంద్రకుడు” అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుని చూసి పలితుని గుండె గుభేలుమంది. అయిపోయింది నాపని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. “ఏం చెయ్యనురా దేవుడా” అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు “ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది” అని మనసులో బాధపడ్డాడు. ‘ఐనా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యమొందుతారు కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు’ అని ధైర్యం తెచ్చుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరిని చూచి ఎలుక భయపడింది?
జవాబు:
చంద్రకుని (గుడ్లగూబ) చూచి ఎలుక భయపడింది.
ఆ) పలితుడు ఎందుకు చంకలు కొట్టుకున్నాడు?
జవాబు:
తన శత్రువు పిల్లి వలలో చిక్కిందని చూచి పలితుడు చంకలు కొట్టుకున్నాడు.
ఇ) పలితుడు ఎందుకు గజగజలాడాడు?
జవాబు:
పలితుడు చంద్రకుని చూచి ప్రాణభయంతో గజగజలాడాడు.
ఈ) పలితుడు ఏమనుకొని ధైర్యం తెచ్చుకున్నాడు?
జవాబు:
‘బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి గాని ప్రాణం పోతుందని ఏడవరు’ అంటూ ధైర్యం తెచ్చుకున్నాడు.
3. కింది పరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి, తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేటకుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమశుడు “మిత్రమా ! పలితుడా ! ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు” అన్నాడు. పలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ, వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కున వల కొరికి, రోమశుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరుగెత్తాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) చంద్రకుడు ఎందుకు నిరాశపడ్డాడు?
జవాబు:
పిల్లి, ఎలుక స్నేహంగా మాట్లాడుకోవడం చూచి చంద్రకుడు వారి మైత్రికి భయపడ్డాడు. తన పథకం పారదని నిరాశపడ్డాడు.
ఆ) వేటగాడు ఎలా వచ్చాడు?
జవాబు:
వేటగాడు పిల్లికోసం వేటకుక్కలతో వచ్చాడు.
ఇ) కిరాతుని చూచి పిల్లి ఎలుకతో ఏమన్నది?
జవాబు:
కిరాతుని చూచి పిల్లి ఎలుకతో ‘కిరాతుడు కాల యముని వలె వస్తున్నాడు. నన్ను తొందరగా రక్షించు” అన్నది.
ఈ) ఎలుక వలను ఎప్పుడు కొరికింది?
జవాబు:
ఎలుక వేటగాడు దగ్గరకు వచ్చినప్పుడు వలను కొరికింది.
అపరిచిత గద్యాలు
1. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటిదేశం న్యూజిలాండ్ (1893). బ్రిటిష్ ఇండియాలో మహిళలు 1894 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 14,505 మంది మహిళలు మాత్రమే ఓటేశారు. స్వతంత్ర భారతావనిలో 1951లో పురుషులతో సమానంగా మహిళలు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటి దేశమేది?
జవాబు:
మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటిదేశం న్యూజిలాండ్ (1893).
ఆ) బ్రిటిష్ ఇండియాలో మహిళలు ఎప్పుడు ఓటు వేశారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియాలో మహిళలు 1894 సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేశారు.
ఇ) ఎంతమంది మహిళలు బ్రిటిష్ ఇండియాలో ఓటువేశారు?
జవాబు:
బ్రిటిష్ ఇండియాలో 14,505 మంది మహిళలు ఓటువేశారు.
ఈ) స్వతంత్ర భారతావనిలో మహిళలు ఓటుహక్కు ఎప్పుడు వినియోగించుకున్నారు?
జవాబు:
స్వతంత్ర భారతావనిలో 1951లో మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.
2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
కాశీ దగ్గర కురియారీ గ్రామపు స్త్రీలు తమ ఊరిని మద్యం, మాదకద్రవ్య రహితంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఆకుపచ్చరంగు చీరల్లో ఉండేవాళ్ళు. దీనికోసం ఇంటింటికీ తిరుగుతూ తాగుడూ, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తున్నారు. తాగేవాళ్ళకు మద్యం మానమంటూ తమ బృందాల ద్వారా వినతి పత్రాలు అందిస్తున్నారు. ప్రతి ఇంటి మహిళనూ తమ ఉద్యమంలో భాగస్వామిగా చేస్తూ ఎవరినీ ఊళ్లో మద్యం సేవించేందుకు అనుమతించడం లేదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) కురియారీ గ్రామపు స్త్రీలు ఎందుకు కంకణం కట్టుకున్నారు?
జవాబు:
తమ ఊరిని మద్యం, మాదక ద్రవ్య రహితంగా మార్చాలని కురియారీ గ్రామపు స్త్రీలు కంకణం కట్టుకున్నారు.
ఆ) ఎలా ప్రచారం చేస్తున్నారు?
జవాబు:
ఇంటింటికీ తిరుగుతూ తాగుడూ, మాదక ద్రవ్యాల వల్ల వచ్చే నష్టాలను వివరిస్తున్నారు.
ఇ) తమ బృందాల ద్వారా ఏమి ఇస్తున్నారు?
జవాబు:
త్రాగేవాళ్ళకు మద్యం మానమంటూ తమ బృందాల ద్వారా వినతిపత్రాలు ఇస్తున్నారు.
ఈ) కురియారీ గ్రామపు స్త్రీలు ఎవరికి అనుమతి ఈయట్లేదు?
జవాబు:
మద్యం త్రాగేందుకు ఎవరికీ అనుమతి ఈయట్లేదు.
3. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
భాషా శైలులు, పండుగలు జరుపుకోవడం, వస్త్రధారణ, ఆహారం, ఇళ్ళ నిర్మాణం, పంటలు, చదువు, గృహాలంకరణ, సాహిత్యం , కళలు, ఆటలు, సంగీతం మొదలైన అనేక అంశాలలో మనదేశంలో వైవిధ్యం కనిపిస్తుంటుంది. ప్రాంతాలను బట్టి, పట్టణ, గ్రామీణ, కొండ, సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు గిరిజనుల్లో వైద్యానికి సంబంధించిన స్థానిక పరిజ్ఞానం అధికంగా ఉంటుంది. స్థానికంగా దొరికే ఔషధ మొక్కలతో వారు చేసుకొనే వైద్యం నిరపాయకరం. చౌక కూడా. ఇలాంటి భిన్న సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ప్రశ్నలు – జవాబులు:
అ) మనదేశంలో వేనిలో వైవిధ్యం కనిపిస్తుంది?
జవాబు:
భాషా శైలులు, పండుగలు, చదువు, సాహిత్యం , కళలు, మొదలైన అనేక అంశాలలో మనదేశంలో వైవిధ్యం కనిపిస్తుంది.
ఆ) ఏవి భిన్నంగా ఉంటాయి?
జవాబు:
ప్రాంతాలను బట్టి సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి.
ఇ) గిరిజనులలో ఏ పరిజ్ఞానం అధికంగా ఉంటుంది?
జవాబు:
గిరిజనుల్లో వైద్యానికి సంబంధించిన స్థానిక పరిజ్ఞానం అధికంగా ఉంటుంది.
ఈ) మనం వేటిని కాపాడుకోవాలి?
జవాబు:
మనం భిన్న సాంప్రదాయాలను కాపాడుకోవాలి.
4. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మదునయ్య చేపల వ్యాపారి. శ్రీశైలం రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి శేఖరం అనే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి డబ్బులిస్తానని అతనిని పనిలో చేర్చుకున్నాడు. – శేఖరం పగలూ, రాత్రి వలలను చూస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించి శేఖరాన్ని బళ్ళో చేర్పించి అతని తల్లిదండ్రులను మందలించారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) మదునయ్య ఎవరు?
జవాబు:
మదునయ్య చేపల వ్యాపారి.
ఆ) మదునయ్య ఏం చేసేవాడు?
జవాబు:
మదునయ్య పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలు పట్టేవాడు.
ఇ) శేఖరను మదునయ్య ఏమి చేశాడు?
జవాబు:
శేఖర్ తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి మదునయ్య పనిలో పెట్టుకున్నాడు.
ఈ) మదునయ్యను అధికారులు ఎందుకు శిక్షించారు?
జవాబు:
బాలల హక్కును ఉల్లంఘించినందుకు అధికారులు మదునయ్యను శిక్షించారు.
5. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
దేశానికి వెన్నెముక రైతు. ఒకప్పుడు వ్యవసాయం దాదాపు స్వయం ఆధారితంగా ఉండేది. ఇంట్లో ఉన్న గొడ్డు గోదా రైతుకు కావలసిన ఎరువును అందించేవి. సేంద్రియ ఎరువులతోనే పంటలు పండేవి. ఆహార ధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉండేవి. రసాయనిక ఎరువులు రాగానే పరిస్థితులు మారిపోయాయి. వాటిలోని విషపదార్థాలు ఆహారధాన్యాలు, ఆకుకూరలు మొదలైన వాటిలోకి ఇంకి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. జాతిని రోగగ్రస్త్రం చేస్తున్నాయి.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు దేశానికి వెన్నెముక?
జవాబు:
రైతు దేశానికి వెన్నెముక.
ఆ) పూర్వం వ్యవసాయానికి కావలసిన ఎరువు ఎలా లభించేది?
జవాబు:
ఇంట్లో ఉన్న గొడ్డు గోదా వ్యవసాయానికి కావలసిన సేంద్రియ ఎరువు అందించేవి.
ఇ) ఏ ఆహార ధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి?
జవాబు:
సేంద్రియ ఎరువులతో పండిన ఆహారధాన్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవి.
ఈ) జాతిని ఏవి రోగగ్రస్తం చేస్తున్నాయి?
జవాబు:
రసాయనిక ఎరువులతో పండిన పంటలు జాతిని రోగగ్రస్తం చేస్తున్నాయి.
2. కింది అపరిచిత గద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఆకాశవీధిలో కనిపించే జెండా మనదే, ఆ జెండా కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు రక్తం చిందించారు. ప్రాణాలు అర్పించారు. క్రొత్త క్రొత్త ఆలోచనలతో మనదేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనదేశం | అభివృద్ధి చెందాలి. స్వాతంత్ర్య సమరయోధుల కష్టం వృథా కాకూడదు.
ప్రశ్నలు – జవాబులు:
అ) అది ఏ దేశపు జెండా?
జవాబు:
అది మన భారతదేశపు జెండా.
ఆ) ఆ జెండా కోసం ఎవరు ప్రాణాలర్పించారు?
జవాబు:
ఆ జెండా కోసం స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలు అర్పించారు.
ఇ) ఏది అభివృద్ధి చెందాలి?
జవాబు:
మనదేశం అభివృద్ధి చెందాలి.
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
మనదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి?
7. కింది లేఖను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
బొబ్బిలి, మేనేజర్, అయ్యా , ఇట్లు చిరునామా : |
ప్రశ్నలు – జవాబులు:
అ) పై లేఖను ఎక్కడి నుండి రాశారు?
జవాబు:
పై లేఖను బొబ్బిలి నుండి రాశారు.
ఆ) వి.జి.యస్. పబ్లిషర్స్ వ్యాపారం ఏమిటి?
జవాబు:
వారిది పుస్తకాల వ్యాపారం.
ఇ) మొత్తం ఎన్ని పుస్తకాలు కావాలన్నారు?
జవాబు:
మొత్తం 27 పుస్తకాలు కావాలన్నారు.
ఈ) పై లేఖకు తగిన ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
పై లేఖను ఎక్కడికి రాశారు?
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
ప్రశ్న 1.
సమయస్ఫూర్తి కథలో ఎక్కువగా నష్టపోయింది ఎవరు? ఎందుకు?
జవాబు:
సమయస్ఫూర్తి కథలో ఎక్కువగా నష్టపోయినది వేటగాడు. ఎందుకంటే వేటగాడు జంతువుల కోసం వలపన్నాడు. పిల్లి వలలో పడింది. అంతలో ఎలుకకు గుడ్లగూబ వలన ప్రాణభయం కలిగింది. ఎలుక గుడ్లగూబ నుండి రక్షించుకొనేందుకు పిల్లితో స్నేహం చేసింది. వల కొరికి పిల్లిని రక్షిస్తానంది. అన్నమాట ప్రకారం ఎలుక వలను కొరికింది. పిల్లిని రక్షించింది. అన్ని జంతువులు బాగానే ఉన్నాయి. వేటగాడికి పిల్లి దొరకలేదు సరికదా ! వల కూడా నాశనమయ్యింది. అందుచేత వేటగాడు ఎక్కువగా నష్టపోయాడు.
ప్రశ్న 2.
వలలో చిక్కిన పిల్లిని చూసి ఎలుక ఎందుకు ఆనందించింది?
జవాబు:
పంచవటం ప్రాంతంలో మర్రిచెట్టు తొర్రలో పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు కిందే కన్నంలో ఎలుక నివసిస్తోంది. పిల్లిని చూస్తే ఎలుకకు భయము. కన్నంలోంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయేది. పిల్లికి దొరికితే తన బ్రతుకు తెల్లారిపోతుంది. కానీ పిల్లిని ఎలుక ఏమి చేయలేదు. పిల్లి పీడ వదిలిపోవాలని కోరుకొనేది. అందుచేత పిల్లి వలలో పడగానే ఎలుక చాలా ఆనందించింది. ఇక తనకు పిల్లి బాధ ఉండదని స్వేచ్ఛగా తిరగవచ్చునని అనుకుంది.
ప్రశ్న 3.
శత్రువుతోనైనా స్నేహం చేసి ఆపదను అధిగమించినదెవరు? ఎలా?
జవాబు:
పంచవటంలో ఒక మర్రిచెట్టు తొర్రలో పిల్లి నివసించేది. ఆ చెట్టు క్రింద కన్నంలో ఎలుక నివసించేది. ఒకనాడు పిల్లి వలలో చిక్కింది. తన శత్రువు వలలో చిక్కినందుకు ఎలుక చాలా ఆనందించింది. ధైర్యంగా బయటకు వచ్చి తిరుగుతోంది. ప్రక్కనే మరొక శత్రువైన గుడ్లగూబను చూసింది. ఎలాగైనా తప్పించుకోవాలనుకుంది. గుడ్లగూబకు పిల్లి అంటే భయం. అందుచేత వెంటనే పిల్లి దగ్గరకు వెళ్ళింది. పిల్లితో స్నేహంగా మాట్లాడింది. పిల్లి గొంతు విన్న గుడ్లగూబ హడలిపోయింది. ప్రాణభయంతో పారిపోయింది. తను అన్నమాట ప్రకారం ఎలుక వలను కొరికి పిల్లిని రక్షించింది.
ప్రశ్న 4.
ఎలుక మాటలలోని తెలివితేటలను, సంస్కారాన్ని వివరించండి.
జవాబు:
ఎలుక పిల్లి వద్దకు వెళ్ళి మిత్రమా నమస్కారం అని సంభాషణ ప్రారంభించింది. శత్రువునైనా మిత్రమా అని సంభోదిస్తే అతని మనసులో ఉండే ద్వేషభావం కొంత పోతుంది. పెద్దలతో మాట్లాడేటప్పుడు నమస్కారం పెట్టడం సంస్కారం. అందుకే నమస్కారం పెడితే మనపట్ల ఇతరులకు ఆదరణ కలుగుతుంది. జాతి వైరమున్నా మనము శత్రుమిత్రులము అని పిల్లితో ఎలుక అన్నది. ఈ మాటలలో ఎలుక యొక్క నిజాయితీ అర్థమవుతోంది. మనం కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలి. మనం శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయట పడదామని ఎలుక పిల్లితో అన్నది. తను ఆపదలో ఉన్నా ఎలుక ధైర్యాన్ని కోల్పోలేదు. బేలతనంతో మాట్లాడలేదు. మీ అవసరం నాకూ ఉంది. నా అవసరం మీకూ ఉంది అన్నట్లుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మాట్లాడింది. దీనినిబట్టి ఎంత ఆపద ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇతరులకు లోకువ కాకూడదు. ఇలాగే ఎలుక చాలా తెలివితో, సంస్కారంతో ఆదర్శవంతంగా మాట్లాడింది.
ప్రశ్న 5.
ఎలుకను పిల్లి బయటకు రమ్మన్నప్పుడు ఎలుక ఏమన్నది?
జవాబు:
పిల్లి స్వభావం ఎలుకకు తెలుసు. అవసరం కొద్దీ దానితో స్నేహం చేసినట్టు ఎలుక చెప్పింది. అప్పుడు ప్రాణభయం ఇద్దరికీ ఉంది. ఆ స్నేహం వల్ల ఇద్దరికీ ప్రాణాలు దక్కాయని చెప్పింది. కానీ నిరంతరం స్నేహం చేయటం కుదరదని చెప్పింది. ఎందుచేతనంటే. పిల్లికి, ఎలుకకూ జాతివైరం. ఎలుక కనిపిస్తే పిల్లి తినేస్తుంది. కనుక స్నేహం చేస్తే తనకు ప్రాణగండం తప్పదని ఎలుక ఖచ్చితంగా చెప్పింది, తప్పించుకొంది.
ప్రశ్న 6.
కందుకూరి వీరేశలింగం గారి గురించి మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
క్షేమం కడప, ప్రియమైన శివకు, నీ మిత్రుడు సృజిత్ వ్రాయు లేఖ ఇక్కడ మేమంతా క్షేమం, అక్కడ మీరంతా క్షేమమని తలచెదను. మాకు మొన్ననే సమయస్ఫూర్తి పాఠం చెప్పారు. ఆ పాఠం కందుకూరి వీరేశలింగం పంతులుగారు రచించిన గ్రంథంలోనిది, పాఠం చాలా బాగుంది. కందుకూరి వారు 130 గ్రంథాలు రచించారు. ఆయన తొలి నవల, తొలి నాటకం, తొలి ప్రహసనం రచించారు. ఆయన సంస్కృతం నుండి, ఆంగ్లం నుండి కూడా కొన్ని గ్రంథాలు అనువదించారు. ఆయన మన తెలుగు వారు కావడం మన అదృష్టం అని చెప్పారు. ఆయన మీ రాజమండ్రిలోనే జన్మించారట. ఈ సారి రాజమండ్రి వచ్చినపుడు ఆయన నివసించిన చోటు చూద్దాం. నీకు వీలైతే ఆయన నివసించిన ప్రాంతం ఫోటో తీసి నా ‘వాట్సప్’కు పెట్టు ఉంటాను. ‘జవాబు వ్రాయి. ఇట్లు, చిరునామా : |
ప్రశ్న 7.
సమయస్ఫూర్తి కథలోని పిల్లి ఏక పాత్ర రాయండి. ప్రదర్శించండి.
జవాబు:
పిల్లి
మ్యావ్, మ్యావ్. ఇలా అంటే మీకర్థం కాదుగా, నేను పిల్లిని అదే రోమశుడను. నేను చాలా తెలివైన దానిననుకొంటాను. ఆ వేటగాడు పన్నిన వలలో పడ్డాను, కేవలం ముందుచూపు లేక ఆ వలలో చిక్కాను. నన్ను చూస్తే వణికిపోయే ఎలుక కూడా ఎంత ఫోజు కొట్టేసిందో ! నాతో దానికి స్నేహమంట. నేను దాన్ని రక్షించాలట. ఏం చెయ్యను ఖర్మ! వలలోంచి బైటపడాలంటే ఆ చిట్టెలుక చెప్పినట్టు వినాలి. అందుకే స్నేహం నటించాను. పుటుక్కున వల కొరికితే గుట్టుక్కున మింగేద్దామనుకొన్నాను. దీని తెలివి తగలెయ్య. సరిగ్గా వేటగాడు వచ్చేటపుడు కొరికింది. ప్రాణభయంతో. అప్పటికి పారిపోయాను. తర్వాత స్నేహం చేద్దామన్నా కన్నంలోంచి రాలేదు. కుదరదని చెప్పేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. అది కందుకూరి వీరేశలింగం పంతులుగారి దగ్గర చదువుకొందేమో ! చాలా తెలివైంది. పిల్లలూ మీరు నాలాగ నటించకండి. ఎలుకలా తెలివిగా బతకండి. హాయిగా చదువుకోండి. తెలివి పెంచుకోండి. అదిగో మరో ఎలుక వస్తోంది. కడుపులో ఆకలి కరకరలాడుతోంది. ఇదెంత తెలివైందో చూస్తాను. –
III. భాషాంశాలు
పర్యాయపదాలు
వటము = మఱ్ఱిచెట్టు, బాహుపాదము
పిల్లి = బిడాలము, మార్జాలము
ఎలుక = మూషికము, ఖనకము
గుడ్లగూబ = ఉలూకము, గూబ
చెట్టు = వృక్షము, తరువు
వల = జాలకము, జాలము
కన్నం = రంధ్రం, కలుగు
చీకటి = తమస్సు, తమము
గుండె = హృదయము, ఎద
ప్రాణము = అసువులు, ఉసురు
కష్టము = ప్రమాదం, ఇబ్బంది
సంతోషం = ఆనందం, మోదము
ప్రమాదం = ఆపద, కష్టం
బ్రతుకు = జీవితం, మనుగడ
మిత్రుడు = స్నేహితుడు, సఖుడు
నమస్కారం = కైమోడ్పు, అంజలి
వైరము = విరోధం, శత్రుత్వం
శత్రువు = విరోధి, వైరి
స్నేహం = సఖ్యం , మైత్రి
సంవత్సరం = వర్షం, వత్సరం
అపకారం = కీడు, చేటు
చావు = మరణం, చనిపోవు
భయం = పిరికితనం, జంకు
మెచ్చుకొను = పొగడు, నుతించు
అజ్ఞానం = అవిద్య, తెలివి లేకపోవడం
సత్యం = నిజం, యథార్థం
తెలివి = విజ్ఞత, వివేకం
వ్యతిరేక పదాలు
వచ్చి × వెళ్లి
చీకటి × వెలుగు
అదృష్టం × దురదృష్టం
శత్రువు × మిత్రుడు
వచ్చింది × రాలేదు
ఏడుపు × నవ్వు
కష్టం × సుఖం
సంతోషం × విచారం
బాధ × ఆనందం
బుద్ధిమంతులు × బుద్ధిహీనులు
ధైర్యం × అధైర్యం
అపకారం × ఉపకారం
వైరం × స్నేహం
ప్రస్తుతం × అప్రస్తుతం
రక్షించు × శిక్షించు
భయం × నిర్భయం
భీతి × నిర్భీతి
చావు × పుట్టుక
ధర్మం × అధర్మం
చివరి × మొదటి
కృతజ్ఞత × కృతఘ్నత
అజ్ఞానం × జ్ఞానం
కాలం × అకాలం
స్వ × పర
కపటం × నిష్కపటం
బయటకు × లోపలకు
అవసరం × అనవసరం
మాయమవడం × ప్రత్యక్షమవడం
ఆశ × నిరాశ
సుఖం × దుఃఖం
అంతం × ఆరంభం
సత్యం × అసత్యం
ఆశ్రయం × నిరాశ్రయం
ప్రకృతి-వికృతులు
ప్రాంతము = పొంత
ఆహారము = ఓగిరము
సంతోషము = సంతసము
స్నేహము = నెయ్యము
ధర్మము = దమ్మము
1) కింద గీతగీసిన పదాల అర్ధాలు రాసి సొంత వాక్యాలు రాయండి.
1. అందరూ సంతోషంగా ఉండాలి.
జవాబు:
సంతోషం = ఆనందం
పనిచేయడంలోనే ఆనందం ఉంది.
2. ఎప్పుడూ సత్యం పలకాలి.
జవాబు:
సత్యం = నిజం
గాంధీగారు నిజం మాత్రమే పలికే వారు.
3. ఎవరినీ దేనికీ అర్థించి కాదనిపించుకోకూడదు.
జవాబు:
అర్థించి = అడిగి
అడిగిన వారికి లేదనకూడదు.
2) కింద గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
1. పిల్లి సాధు జంతువు.
జవాబు:
పిల్లి = బిడాలము, మార్జాలము
2. మంచి మిత్రుడు వంద పుస్తకాలతో సమానం.
జవాబు:
మిత్రుడు = స్నేహితుడు, సఖుడు
3. భయం మనకు శత్రువు వంటిది.
జవాబు:
భయం = పిరికితనం, జంకు
3) కింది ఖాళీలను వ్యతిరేక పదాలతో పూరించండి.
1. చిన్నపిల్లల ఏడుపు చూస్తే నవ్వు వస్తుంది.
2. బుద్ధిమంతులు ఆపదలు ఎదుర్కొంటారు. బుద్ధిహీనులు భయపడతారు.
3. భయం పనికిరాదు. నిర్భయంగా జీవించు.
4) కింది ఖాళీలను పూరించండి.
1. ఉందామని = ………. + …………
జవాబు:
ఉందాము + అని
2. వారు + ……….. = వారిద్దరూ
జవాబు:
ఇద్దరూ
3. కాదు + అనలేను = …………..
జవాబు:
కాదనలేను.
5) కింది వానిలో నామవాచకాలు, అవ్యయాలు రాయండి.
సీత,
రాముడు అడవికి వెళ్లారు. అబ్బ ! అడవి ఎంత అందంగా ఉందో !, అక్కడ ఆహా ! సెలయేరు చూడు బాగుంది కదూ ! అన్నాడు రాముడు. సీత నవ్వింది.
జవాబు:
నామవాచకాలు : సీత, రాముడు, అడవి, సెలయేరు.
అవ్యయాలు : అబ్బ, ఆహా
6) కింది ప్రకృతి – వికృతులను జతపరచండి.
1. ప్రాంతం | అ) కస్తి |
2. రాత్రి | ఆ) పొంత |
3. కష్టము | ఇ) రాతిరి |
జవాబు:
1. ప్రాంతం | ఆ) పొంత |
2. రాత్రి | ఇ) రాతిరి |
3. కష్టము | అ) కస్తి |
7) ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులను బ్రాకెట్లలో గుర్తించండి.
1. వటవృక్షం కింద చల్లగా ఉంటుంది. (అర్థం గుర్తించండి)
అ) రావిచెట్టు
ఆ) వేపచెట్టు
ఇ) మట్టిచెట్టు
జవాబు:
ఇ) మట్టిచెట్టు
2. శత్రువును కూడా బాధపెట్టకూడదు. (అర్థం గుర్తించండి)
అ) విరోధి
ఆ) కోపం గలవాడు
ఇ) అప్పు ఇచ్చినవాడు
జవాబు:
అ) విరోధి
3. గుడ్లగూబను చూసి ఎలుక గుండె గుభేలుమంది. (అర్థం గుర్తించండి)
అ) మెదడు
ఆ) హృదయం
ఇ) మనసు
జవాబు:
ఆ) హృదయం
4. సదాలోచనతో జీవించాలి. (అర్థం గుర్తించండి).
అ) మంచి ఆలోచన
ఆ) ఆలోచన
ఇ) తలంపు
జవాబు:
అ) మంచి ఆలోచన
5. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. (అర్థం గుర్తించండి)
అ) హుషారు
ఆ) ఉత్సాహం
ఇ) ఆనందం
జవాబు:
ఇ) ఆనందం
6. దేనికీ నిరాశ పనికిరాదు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) దురాశ
అ) పేరాశ
ఇ) ఆశ
జవాబు:
ఇ) ఆశ
7. అవినీతిని అంతం చేయాలి. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) ఆరంభం
ఆ) ముగింపు
ఇ) చివర
జవాబు:
అ) ఆరంభం
8. కొందరు అవసరం ఉండే పొగడుతారు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) పని
ఆ) అనవసరం
ఇ) నిరాశ
జవాబు:
ఆ) అనవసరం
9. దేనికీ ఎప్పుడూ భయం పనికిరాదు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) పిరికితనం
ఆ) వెరపు
ఇ) నిర్భయం
జవాబు:
ఇ) నిర్భయం
10. చీకటిని చూసి భయపడకు. (వ్యతిరేక పదం గుర్తించండి)
అ) వెలుగు
ఆ) తమము
ఇ) అంధకారము
జవాబు:
అ) వెలుగు
11. గుడ్లగూబ భయపడింది. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) గూబ, దివాంధము
ఆ) పక్షి, పులుగు
ఇ) కళ్లు, కనుగ్రుడ్లు
జవాబు:
అ) గూబ, దివాంధము
12. ఎప్పుడూ పిల్లి అంటే ఎలుకకు భయమే. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) మూషకం, మూషికం
ఆ) బిడాలము, మార్జాలము
ఇ) జంతువు, మృగం
జవాబు:
ఆ) బిడాలము, మార్జాలము
13. ఆపదలో మిత్రుడు సాయం చేస్తాడు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) వైరి, విరోధి
ఆ) చెలికాడు, సూర్యుడు
ఇ) చెలికాడు, సఖుడు
జవాబు:
ఇ) చెలికాడు, సఖుడు
14. శత్రువుకు కూడా కీడు చేయకూడదు. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) ఖైది, కారాగారవాసి
ఆ) విరోధి, వైరి
ఇ) దొంగ, తస్కరుడు
జవాబు:
ఆ) విరోధి, వైరి
15. మంచివారితో స్నేహం చేయాలి. (పర్యాయపదాలు గుర్తించండి)
అ) చెలిమి, మైత్రి
ఆ) స్నేహితుడు, మిత్రుడు
ఇ) కాలక్షేపం, కబుర్లు
జవాబు:
అ) చెలిమి, మైత్రి
16. పండితులకు ఏ ప్రాంతంలోనైనా గౌరవం దక్కుతుంది. (వికృతి గుర్తించండి)
అ) పాత
ఆ) ప్రదేశం
ఇ) పొంత
జవాబు:
ఇ) పొంత
17. పనిచేసి ఆహారం సంపాదించుకోవాలి. (వికృతి గుర్తించండి)
అ) ఓగిరం
ఆ) అన్నం
ఇ) భోజనం
జవాబు:
అ) ఓగిరం
18. మంచి నెయ్యము విడువకూడదు. (ప్రకృతి గుర్తించండి)
అ) నెయ్యి
ఆ) స్నేహము
ఇ) ఆహారం
జవాబు:
ఆ) స్నేహము
19. కస్తికి భయపడితే బతకలేం. (ప్రకృతి గుర్తించండి)
అ) కత్తి
ఆ) బాధ
ఇ) కష్టము
జవాబు:
ఇ) కష్టము
20. బుద్ధిలేని వారితో జాగ్రత్తగా ఉండాలి. (వికృతి గుర్తించండి)
అ) బుద్ధి
ఆ) బుర్ర
ఇ) ఆలోచన
జవాబు:
అ) బుద్ధి
21. ప్రమాదం ఎదురైనప్పుడు తెలివిగా తప్పుకోవాలి. (సంధి పేరు గుర్తించండి)
అ) ఇత్వ సంధి
ఆ) ఉత్వ సంధి
ఇ) వృద్ధి సంధి
జవాబు:
ఆ) ఉత్వ సంధి
22. వైరమున్నా మరచిపోవాలి. (సంధి విడదీసిన రూపం గుర్తించండి)
అ) వైరము + ఉన్నా
ఆ) వైరం + ఉన్నా
ఇ) వైరమూ + ఉన్నా
జవాబు:
అ) వైరము + ఉన్నా
23. వాడు తహతహలాడుతూ వచ్చాడు. (సంధి విడదీసి రూపం గుర్తించండి)
అ) తహతహలు + ఆడుతూ
ఆ) తహతహల + ఆడుతూ
ఇ) తహతహలా + ఆడుతూ
జవాబు:
అ) తహతహలు + ఆడుతూ
24. ‘ఉందాము + అని (సంధి కలిపిన రూపం గుర్తించండి)
అ) ఉందామాని
ఆ) ఉందాముని
ఇ) ఉందామని
జవాబు:
ఇ) ఉందామని
25. వచ్చాను + అనుకో – (సంధి కలిపిన రూపం గుర్తించండి)
అ) వచ్చాననుకో
ఆ) వచ్చాననకో
ఇ) వచ్చానుఅనుకో
జవాబు:
అ) వచ్చాననుకో
26. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాల పేరు గుర్తించండి.
అ) అంతస్థాలు
ఆ) మూర్ధన్యాలు
ఇ) ఊష్మాలు
జవాబు:
ఇ) ఊష్మాలు
27. పరుష, సరళాలు కాక మిగిలిన హల్లులనేమంటారు?
అ) స్పర్శాలు
ఆ) స్థిరాలు అంత
ఇ) అంతస్థాలు
జవాబు:
ఆ) స్థిరాలు అంత
28. కిందివానిలో మూర్ధన్యాలు గుర్తించండి.
అ) ట,ఠ,డ,ఢ,ణ
ఆ) చ,ఛ,జ,ఝ,ఞ
ఇ) త,థ,ద,ధ,న
జవాబు:
అ) ట,ఠ,డ,ఢ,ణ
29. కిందివానిలో కంఠాష్యాలు గుర్తించండి.
అ) ఎ,ఏ, ఐ
ఆ) ఒ,ఓ, ఔ
ఇ) ఋ,బ
జవాబు:
ఆ) ఒ,ఓ, ఔ
30. కిందివానిలో దంతో ష్ట్యం గుర్తించండి.
అ) వ
ఆ) బ
ఇ) శ
జవాబు:
అ) వ
చదవండి – ఆనందించండి
స్ఫూర్తి
చాలా కాలం క్రితం మగధను విక్రమ సేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండువుగా సంపద తులతూగుతూ ఉండేది.
మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగు దేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని మగధపై దాడి చేసాడు. విక్రమ సేనుడి వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమ సేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండగుహలో దాక్కున్నాడు.
ఒంటరితనం, పరాజయం , బాధ, అలసట… అన్నీ ఒక్కసారిగా విక్రమసేనుణ్ణి ఆవరించాయి.
“నా కన్న బిడ్డల్లాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకటం అనవసరం. నిస్సహాయుడిగా ఎంత కాలమిలా దాక్కోవాలి ?” అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది.
ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సాలీడు పైకి పాకే కొద్ది దాని నుండి వచ్చే దారం తెగి అది క్రిందికి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నోమార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది.
అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది. ‘ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెనను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనుడిలో నిరాశా, నిస్పృహలు పటాపంచలై పోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది.
విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి, చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు.