SCERT AP Board 7th Class Telugu Solutions లేఖలు Questions and Answers.

AP State Syllabus 7th Class కరపత్రాలు / లేఖలు

1. ‘మాయాకంబళి’ పాఠం నుండి నీవేమి గ్రహించావో నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

స్నేహితుడు / స్నేహితురాలికి లేఖ

గుంటూరు,
xxxxx.

ప్రియమైన స్నేహితుడు / స్నేహితురాలికి,
శుభోదయం. నేను బాగున్నాను. నీవెలా ఉన్నావు. నేను . ఈ లేఖలో ‘మాయాకంబళి’ పాఠం గురించి చెప్పదలచాను. మా తెలుగు మాస్టారు పాఠం చెబుతుంటే ఎదురుగా జరుగుతోందా అన్నట్లు అనిపించింది. ఇంకా, ఈ పాఠం ద్వారా కొన్ని పాత్రలు మన నిజ జీవితంలో ఎదురుపడేవే అనే భావన కల్గించాయి. ‘ఆత్మానందుడు’ యోగి ఎలా ఉంటాడో అలాగే కోపం, గర్వం లేకుండా దయా స్వభావంతో ,కనబడతాడు. రాజు దేశం కోసం ఆలోచన తప్ప స్వార్థం లేనివాడు. విక్రముడు రాజునే చంపి రాజ్యం కాజేయాలనే స్వార్థపరుడు. చంచల రాజుకు ప్రక్కనే ఉంటూ గోతులు తవ్వేది. ఇలా ఇవన్నీ లోకంలో కనబడే పాత్రలే. రచయిత సదానందగారు కథ బాగా రాశారు. మనలాంటి పిల్లలకు మార్గదర్శనం చేసే విధంగా ఉందని నా ఉద్దేశం. మరి నీ ఉద్దేశం ఏమిటి ? ఉత్తరం రాయి. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు / స్నేహితురాలు,
xxxxxx.

చిరునామా :
కె. ఫణిరామ్,
7వ తరగతి, భాష్యం పబ్లిక్ స్కూలు,
గుంటూరు, గుంటూరు జిల్లా.

2. శతక పద్యం చదవడం వలన ప్రయోజనాలను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

చెరుకూరు,
xxxxx.

ప్రియమైన జస్వంత కు,
నీ మిత్రుడు లీలాకృష్ణ వ్రాయు లేఖ. ఉభయకుశలోపరి. ఇటీవల మాకు ‘పద్యపరిమళం’ పాఠం చెప్పారు. నాగేశ్వరరావు మాస్టారు పద్యాలు పాడుతుంటే వినడానికి ఎంతో బాగున్నాయి. అన్నీ నీతి శతకాలలోని పద్యాలే. “ఓర్పు, పెద్దలకు సేవ చేయుట, పరనింద పనికిరాదు, సత్యశీలనం, గురుభక్తి, ధారణ, దానం, శాస్త్రపఠనం” ఇలా చాలా వాటి గురించి చెప్పారు. మంచి విషయాలను వినడమే కాదు ఆచరణలో కూడా పెట్టాలని నాగేశ్వరరావు మాస్టారు చెప్పారు. నేను కుమార, భాస్కర శతకాలు – . కొనుక్కున్నాను. పద్యాలు చదువుతున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే రిప్లై రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
జస్వంత్.

చిరునామా:
కె. లీలాకృష్ణ, 7వ తరగతి,
భాష్యం హైస్కూలు,
తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా.

3. “కప్పతల్లి పెళ్ళి” పాఠం గురించి నీ మిత్రునికి లేఖ రాయి.
జవాబు:

మిత్రునికి లేఖ

ఒంగోలు,
xxxxx.

ప్రియమైన స్నేహితుడు ఫణికి,
నీ స్నేహితుడు నాగలక్ష్మణ్ వ్రాయునది. “కప్పతల్లి పెళ్ళి” పాఠం గురించి నీవు చెప్పినట్లే చాలా బాగుంది. మా తెలుగు మాస్టారు “రామారావు” గారు చాలా బాగా చెప్పారు. గేయం పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని పించింది. పూర్వపు ఆచారాలలో కొన్నింటిని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మన ఆచార, సంప్రదాయాలను వివరిస్తూ, వాటిని పాటించడంలో ఆవశ్యకతను వివరించారు. చావలి బంగారమ్మ గూర్చి, ఆమె కవిత్వంలోని సరళతను, లయాత్మకతను గురించి చెప్పారు. కప్పతల్లి పెళ్ళికి ప్రకృతి కూడా పరవశించిన తీరును కవయిత్రి రచనా శైలిని మా గురువుగారు చక్కగా తెలియజేశారు. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు. మళ్ళీ ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ మిత్రుడు,
ఎస్. నాగలక్ష్మ ణ్.

చిరునామా:
కె. ఫణిరామ్,
నెం. -6; 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
చెరుకూరు, ప్రకాశం జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

4. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గురించి నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాపట్ల,
xxxxx.

ప్రియమైన శ్రీవల్లికి,
నీ స్నేహితురాలు లలిత వ్రాయు లేఖ.

ఇటీవల మా తెలుగు మాస్టారు ‘హితోక్తులు’ పాఠం చెప్పారు. దీనిని రాసిన కవి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు. రాళ్ళపల్లి గ్రంథ పరిష్కర్తగా, వ్యాస రచయితగా, విమర్శకునిగా, గానకళా ప్రపూర్ణగా సాహిత్య లోకానికి సుపరిచితులని చెప్పారు. రఘువంశం, స్వప్న వాసవదత్త గాథా సప్తశతి (ప్రాకృతభాష వంటి సంస్కృత గ్రంథాలను ఆంద్రీకరించారు. అనేక గ్రంథాలను పరిశీలించి, పరిశోధకుడిగా పరిష్కరించి సమగ్ర. పీఠికలను అందించారు. తిరుమలతిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 108 అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. రాళ్ళపల్లివారి పాత్ర చిత్రీకరణను తెలియజేసే వ్యాసాలు నిగమశర్మ అక్క తిక్కన తీర్చిన సీతమ్మ. వేమనపై ఏడు ఉపన్యాసాలు ఇచ్చారు. ‘ఏకసంథాగ్రాహి’ పేరు పొందారని మా సార్ చెబుతుంటే అద్భుతం అనిపించింది. ఇలాంటి గొప్పకవి రాసిన పద్యాలు చదవడం అదృష్టంగా భావిస్తున్నా. దీనిపై నీ అభిప్రాయం రాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
కె. లలిత.

చిరునామా :
ఎస్. శ్రీవల్లి, 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా.

5. ఏదైనా ఒక పండుగ / దర్శనీయ స్థలం గురించి మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

మిత్రునికి లేఖ

చిలకలూరి పేట,
xxxxx.

ప్రియమైన మిత్రుడు కౌశికకు,
నీ మిత్రుడు ఫణిరామ్ శుభాకాంక్షలు తెలుపుతూ రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నేను ఈ లేఖలో నాకు బాగా నచ్చిన పండుగలలో ఒకటైన ‘ఉగాది’ పండుగను గురించి వ్రాస్తున్నాను. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకున్నాను. ముందురోజే సిద్ధం చేసుకొన్న ఉగాది ప్రసాదం సామాన్లతో పచ్చడి అమ్మ చేయగా, దేవునికి నమస్కరించి ప్రసాదంగా తీసుకున్నాను. పంచాంగ శ్రవణం విని తద్వారా రాబోయే పరిస్థితులను అవగాహన చేసుకొన్నాను. అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకొన్నాను. చక్కని పిండి వంటలతో పండుగ బాగా జరుపుకున్నాము. నీకు ఇష్టమైన పండుగను గురించి ఉత్తరం రాయి.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
సి. హెచ్. కౌశిక్, 7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
చీరాల, ప్రకాశం జిల్లా.

6. ‘బాలచంద్రుని ప్రతిజ్ఞ’ నీకెలా నచ్చిందో నీ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

పూళ్ళ,
xxxxx.

ప్రియ మిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి,

నీ మిత్రుడు ఫణిరామ్ స్నేహపూర్వకంగా వ్రాయునది. ఇటీవల మా పాఠశాలలో మా తెలుగు మాస్టారు ‘బాలచంద్రుని ప్రతిజ్ఞ’ పాఠం రాగయుక్తంగా చెప్పారు. బాలచంద్రుని ప్రతిజ్ఞను, పరాక్రమాన్ని చక్కగా తెలిపారు. ‘ఉత్సాహం వీరలక్షణమ్’ అన్నట్లు బాలచంద్రుడు తల్లితో మాట్లాడిన ప్రతి మాటా అతనిలోని పరాక్రమాన్ని తెలుపుతున్నాయి. తెలుగు సాహిత్యంలో ‘ద్విపద’ ప్రత్యేకతను కూడా మా సార్ తెలిపారు. ఆనాటి యుద్ధ విశేషాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. పల్నాటి యుద్ధం ఆంధ్ర భారతముగా ప్రసిద్ధి చెందినదని తెలిపారు. నీవు కూడా ఈ పాఠం గురించి ఉత్తరం రాయి.

ఇట్లు,
కె. ఫణిరామ్.

చిరునామా:
సి. హెచ్. శ్రీరామచంద్రమూర్తి,
7వ తరగతి,
జిల్లా పరిషత్ పాఠశాల,
చెరుకూరు, ప్రకాశం జిల్లా,

7. కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తూ మిత్రునకు లేఖ.
జవాబు:

విశాఖపట్నం,
xxxxx.

ప్రియమైన మాధురికి,
నీ స్నేహితురాలు లావణ్య వ్రాయు లేఖ.

ఇక్కడంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలచెదను.

కోవిడ్ – 19 వలన మనం రెండు విద్యా సంవత్సరాలు నష్టపోయాము. సెకండ్ వేవ్ మరీ భయంకరంగా ఉంది.

ఐనా మనవాళ్లు చాలామంది బయట తిరగడం మానడం లేదు. కరోనా వైరస్ మన వరకూ రాకూడదంటే, అనవసరంగా బయట తిరగకూడదు. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లినా మాస్కులు రెండు ధరించాలి. మనిషికి 3 మీటర్ల దూరంలో ఉండాలి. శానిటైజర్ ఉపయోగించాలి. వేటినీ తాకకూడదు. ఇంటికి రాగానే బట్టలు తడిపేసి, సబ్బుతో స్నానం చేయాలి.

థర్డ్ వేవ్ చిన్న పిల్లలకు ప్రమాదం అంటున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను మరి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
వి.లావణ్య.

చిరునామా :
సి. హెచ్. మాధురి,
నెం. 12, 7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నారాకోడూరు, గుంటూరు జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

8. తెలుగు భాష గొప్పదనాన్ని గూర్చి ‘తెలుగు వెలుగు’ పాఠం ఆధారంగా మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కాకినాడ,
xxxxx

మిత్రుడు పి. రాజారావుకు,

శుభాభినందనలు. మిత్రమా! నీకు ఈ లేఖలో మన మాతృభాష తెలుగు యొక్క గొప్పదనాన్ని గూర్చి వ్రాస్తున్నాను. మన మాతృభాష తెలుగు భాష, తెలుగు భాష తేనెకన్న తీపిదనం కలది. తెలుగు భాషలో ఎన్నో చమత్కారాలు ఉన్నాయి. “దేశ భాషలలో తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. మన తెలుగు భాషలో పొడుపుకథలు, సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు ఉన్నాయి. తెలుగు భాష, సంగీతానికి అనువైన భాష. తెలుగులో త్యాగయ్య కీర్తనలు వ్రాశాడు. తెలుగులో జోలపాటలు, సంకీర్తనలు ఉన్నాయి. జానపద గేయాలు, స్త్రీల పాటలు, బుర్ర కథలు, హరికథలు ఉన్నాయి.

తెలుగులో పద్యం పాడడానికి వీలుగా చక్కగా ఉంటుంది. తెలుగులో అవధాన ప్రక్రియ ఉంది. ఆశు కవిత్వం ఉంది. తెలుగు అజంత భాష. దీనిని పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకున్నారు. నేను తెలుగు పద్యాలు 500 చదువుతా. నీవు కూడా చదువు. సెలవుల్లో పద్యపఠనం పోటీ పెడదాం. మీ నాన్నగార్కి నమస్కారం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కాంతారావు.

చిరునామా:
పి. రాజారావు,
S/O రమణరావు,
బాపూజీ నగర్, కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

9. స్వాతంత్ర్య దినోత్సవ లేఖ (జాతీయ వర్వదినం)
జవాబు:

అనంతపురం,
xxxxx

ప్రియ స్నేహితురాలు శశిరేఖకు,

నీ ఉత్తరం ఇప్పుడే అందింది. సంతోషం. మేము గడచిన ఆగస్టు 15వ తేదీనాడు మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకొన్నాము. మున్సిపల్ కమీషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మనదేశానికి స్వాతంత్ర్యం లభించిన విధానాన్ని చక్కగా వివరిస్తూ ఉపన్యసించారు. తరువాత మా ప్రధానోపాధ్యాయుడూ మరికొంతమంది ఉపాధ్యాయులూ, విద్యార్థులు కూడా ఉపన్యసించారు. చివరకు విద్యార్థులందరికీ స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. దివ్య.

చిరునామా:
కె. శశిరేఖ,
7వ తరగతి, మున్సిపల్ హైస్కూలు,
చీరాల, ప్రకాశం జిల్లా.

10. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వివరిస్తూ మిత్రునకు లేఖ
జవాబు:

నెల్లూరు,
xxxxx

ప్రియ మిత్రమా,
నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగుగా చదువుతున్నావని తలుస్తాను. గడచిన సోమవారం మా నెల్లూరు పట్టణంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు మూలల నుండి, వివిధ పాఠశాలల బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులచే తయారుచేయబడ్డ రకరకాల నమూనాలు ఇందులో ప్రదర్శింపబడ్డాయి. మా పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఆ ఆనందంతో నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. కోటేశ్వర్.

చిరునామా:
కోట శ్రీధర్ కుమార్,
7వ తరగతి,
టౌన్ హైస్కూలు,
గుడివాడ, కృష్ణా జిల్లా.

11. శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

శ్రీకాకుళం,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,

శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ లేఖలో శతక పద్యాల ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తున్నాను. శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. మనోజ్ఞ.

చిరునామా :
వి.సతీష్,
7వ తరగతి,
నిర్మలా హైస్కూల్,
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

12. చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

నెల్లూరు,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు రామారావుకు,

శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. పెద్దలకు నమస్కారాలు తెలుపు.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.చంద్రశేఖర్.

చిరునామా :
కె రామారావు,
7వ తరగతి,
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,
దక్షారామం, తూర్పుగోదావరి జిల్లా.

13. మాతృభాషా దినోత్సవం గూర్చి మిత్రునకు లేఖ
జవాబు:

చెరుకూరు,
xxxxx

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,

ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన : చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. – గిడుగు, గురజాడ వంటి మహనీయులకు పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు.

అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా:
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

14. ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ సోదరికి లేఖ
జవాబు:

చెరుకూరు,
xxxxx

ప్రియమైన పద్మావతి అక్కకు,

మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మావతి,
W/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

15. శ్రవణకుమారుడు ముసలివాళ్ళైన తన తల్లిదండ్రులను మోస్తూ పుణ్య క్షేత్రాలన్నింటినీ సర్శింపజేసాడు కదా! ఆయనలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో తెలియజేస్తూ మిత్రునకు లేఖ రాయి.
జవాబు:

లేఖ

కడప,
xxxxx

మిత్రుడు శంకర్ కు,
మిత్రమా! నీ లేఖ చేరింది. నీవు మీ తల్లిదండ్రులతో తిరుపతి వెళ్ళివచ్చానని రాశావు. సంతోషం. మనం పెద్ద వారం అయ్యాక మన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పెంచి పెద్ద చేస్తారు. ఎంతో కష్టపడి మనకు చదువు చెప్పించి, మనకు కావలసినవన్నీ వారు కొని పెడతారు. తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకోడం చాలా కష్టము.

మనం మన ముసలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్చవద్దు. మనం వారిని మన ఇంట్లోనే ఉంచుకొని వారికి కావలసిన అవసరాలను తీర్చుదాం. కనీసం నెలకు ఒకసారి వారిని డాక్టర్లకు చూపిద్దాం. రోజూ వారితో కూర్చుని భోజనం చేద్దాం. వారి అవసరాలను అడిగి తెలుసుకుందాం… వారిని వారానికి ఒకసారి గుడికి తీసుకువెడదాం.

సెలవుల్లో వారికి కాశీ, రామేశ్వరం, తిరుపతి తీసుకువెడదాం. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు వారిని గౌరవిద్దాం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కె. రవికుమార్.

చిరునామా:
ఎన్. శంకర్, 7వ తరగతి,
జి.ప. హైస్కూలు, ప్రొద్దుటూరు, కడప.

AP Board 7th Class Telugu లేఖలు

16. తెలుగు భాష గొప్పదనాన్ని గూర్చి ‘తెలుగు వెలుగు’ పాఠం ఆధారంగా మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

లేఖ

కాకినాడ,
xxxx

మిత్రుడు పి. రాజారావుకు,

శుభాభినందనలు. మిత్రమా! నీకు ఈ లేఖలో మన మాతృభాష తెలుగు యొక్క గొప్పదనాన్ని గూర్చి వ్రాస్తున్నాను. మన మాతృభాష తెలుగు భాష. తెలుగు భాష తేనెకన్న తీపిదనం కలది. తెలుగు భాషలో ఎన్నో చమత్కారాలు ఉన్నాయి. “దేశ భాషలలో తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు. మన తెలుగు భాషలో పొడుపు కథలు. సామెతలు, జాతీయాలు, శబ్ద పల్లవాలు ఉన్నాయి. తెలుగు భాష, సంగీతానికి అనువైన భాష. తెలుగులో త్యాగయ్య కీర్తనలు వ్రాశాడు: తెలుగులో జోలపాటలు, సంకీర్తనలు ఉన్నాయి. జానపద గేయాలు, స్త్రీల పాటలు, బుర్ర కథలు, హరికథలు ఉన్నాయి.

తెలుగులో పద్యం పాడడానికి వీలుగా చక్కగా ఉంటుంది. తెలుగులో అవధాన ప్రక్రియ ఉంది. ఆశు కవిత్వం ఉంది. తెలుగు అజంత భాష. దీనిని పాశ్చాత్యులు ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మెచ్చుకున్నారు. నేను తెలుగు పద్యాలు 500 చదువుతా. నీవు కూడా చదువు. సెలవుల్లో పద్యపఠనం పోటీ పెడదాం. మీ నాన్నగార్కి నమస్కారం. ఉంటా.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
కాంతారావు.

చిరునామా :
పి. రాజారావు,
S/o రమణరావు,
బాపూజీ నగర్, కొవ్వూరు,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

17. వార్షికోత్సవమును గూర్చి సోదరునకు లేఖ

జగ్గయ్యపేట,
xxxxx

ప్రియ సోదరుడు శ్రీరాంకుమారు, ఈ ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాము. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను.

నిన్న మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగు రంగుల తోరణాలతో అలంకరించాము. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభింపబడింది. ఈ సభకు మా ప్రాంతం ఎం.ఎల్.ఏ. గారు ముఖ్యఅతిథిగా వచ్చారు. మా ప్రధానోపాధ్యాయుడు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథిగారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కని సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలోనూ, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలోనూ గెలుపొందిన వారికి బహుమతులు పంచి పెట్టబడ్డాయి. ఆ తరువాత పిల్లలచే నాటికలు వేయబడ్డాయి.

మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గూర్చి తప్పక లేఖవ్రాయి.

ఇట్లు,
నీ ప్రియ సోదరుడు,
ఆనంద్.

చిరునామా :
గార్లపాటి శ్రీరాంకుమార్,
7వ తరగతి,
ఎస్.పి.వి.కె.ఆర్. హైస్కూలు,
దొమ్మేరు, ప.గో. జిల్లా,
పిన్ : 534 351.

18. విహారయాత్రను గూర్చి స్నేహితునికి / స్నేహితురాలికి లేఖ

చీరాల,
xxxxx

ప్రియమైన స్వప్నకు,

శుభాకాంక్షలతో శశిరేఖ వ్రాయునది.
నేను గడచిన సెలవులలో హైదరాబాదు విహారయాత్ర చేసి వచ్చాను. అక్కడ చూడాల్సిన వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సాలార్‌జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూ), చార్మినార్, బిర్లా ‘ మందిర్, అసెంబ్లీ హాల్, గోలకొండ మొదలైనవి చూసి నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాల సౌందర్యాన్ని అందరూ తప్పక చూడవలసిందే. కాబట్టి హైదరాబాదును నీవు కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
శశిరేఖ.

చిరునామా :
కె. స్వప్న,
7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
ప్రత్తిపాడు,
గుంటూరు జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

19. సెలవు కోరుతూ ప్రధానోపాధ్యాయునికి లేఖ

విజయవాడ,
xxxxxx

ప్రధానోపాధ్యాయుడు,
ఎ.కె.ఆర్. హైస్కూలు,
గవర్నరుపేట,
విజయవాడ – 2.

అయ్యా,
వినయపూర్వక నమస్కారం. మోహన ప్రసాద్ అనే నేను, తమ హైస్కూలులో ఏడవ తరగతి చదువుతున్నాను. నాకు గత నాల్గు రోజులుగా ఆరోగ్యం బాగా ఉండటం లేదు. డాక్టరుగారు చెన్నై వెళ్ళి వైద్యం చేయించుకోవలసిందిగా సలహాయిచ్చారు. అందువల్ల నేను పాఠశాలకు హాజరు కాలేకపోతున్నాను. తమరు దయతో నేటి నుంచి వారం రోజులు నాకు సెలవును మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తిరిగి రాగానే డాక్టరు సర్టిఫికేట్ అందిస్తాను. ..

ఇట్లు,
తమ విధేయుడు,
కె. మోహన ప్రసాద్,
7వ తరగతి.

20. పండుగను గురించి స్నేహితురాలికి లేఖ

శ్రీకాకుళం,
xxxxx

ప్రియ స్నేహితురాలు పద్మకు,

నేను బాగా ‘చదువుతున్నాను. నీ చదువు ఎలా సాగుతున్నది? నేను .ఈ లేఖలో నాకు బాగా నచ్చిన దీపావళి’ – పండుగను గురించి వ్రాస్తున్నాను. దీపావళి పండుగకు మా నాన్నగారు రకరకాల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు . ఎన్నో తీసుకువస్తారు. నేను మా అన్నయ్య, మా తమ్ముడు ముగ్గురం కలిసి, సరదాగా కాలుస్తాం. మేము పువ్వొత్తులు కాలుస్తుంటే మా తల్లిదండ్రులు చూసి ఎంతో ఆనందిస్తారు. కాంతులను విరజిమ్మే ఈ పండుగ అంటే నాకెందుకో చెప్పరానంత ఇష్టం.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
ఆర్. స్వప్న.

చిరునామా :
జి. పద్మ,
7వ తరగతి,
బాలికల పాఠశాల,
తిరుపతి, చిత్తూరు జిల్లా.

21. పుస్తకాలు కొనడానికి రూ. 100/-పంపమని కోరుతూ నాన్నగారికి లేఖ

చిత్తూరు,
xxxxx

పూజ్యులైన నాన్నగారికి,
నమస్కారాలు. నేను ఇక్కడ బాగానే చదువుతున్నాను. వచ్చే నెలలో మా కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫీజు ఈ నెలాఖరులోపు కట్టాలి. పరీక్షకు సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధయయుంచి వెంటనే రూ. 100/- మనియార్డరు ద్వారా పంపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. నేను తమ్ముళ్ళనూ, చెల్లాయినీ అడిగినట్లు చెప్పగలరు. అమ్మగారికి నా నమస్కారాలు.

ఇట్లు,
మీ కుమారుడు,
ఐ. గణేష్.

చిరునామా :
ఐ. జగన్నాధరావు గారు,
చలమాజీ & కంపెనీ,
న్యూ గాజువాక,
విశాఖపట్నం.

22. స్వాతంత్ర్య దినోత్సవ లేఖ (జాతీయ పర్వదినం)

అనంతపురం,
xxxxx

ప్రియ స్నేహితురాలు శశిరేఖకు,

నీ ఉత్తరం ఇప్పుడే అందింది. సంతోషం. మేము గడచిన ఆగస్టు 15వ తేదీనాడు మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకొన్నాము. మున్సిపల్ కమీషనర్ గారు ముఖ్యఅతిథిగా వచ్చి, జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మనదేశానికి స్వాతంత్ర్యం లభించిన విధానాన్ని చక్కగా వివరిస్తూ ఉపన్యసించారు. తరువాత మా’ ప్రధానోపాధ్యాయుడూ మరికొంతమంది ఉపాధ్యాయులూ, విద్యార్థులు కూడా ఉపన్యసించారు. చివరకు విద్యార్థులందరికీ స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ స్నేహితురాలు,
పి. దివ్య.

చిరునామా :
కె. శశిరేఖ,
7వ తరగతి,
మున్సిపల్ హైస్కూలు,
చీరాల, ప్రకాశం జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

23. సోదరి వివాహానికి మిత్రుని ఆహ్వానిస్తూ

అమలాపురం,
xxxxx

ప్రియ మిత్రమా,

నేను క్షేమంగా ఉన్నాను. నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ఈ నెల 28వ తారీఖున మా సోదరి వివాహం తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి నీవు తప్పక రావలసిందిగా కోరుతున్నాను. మీ నాన్నగారికీ, అమ్మగారికీ నా నమస్కారములు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఆర్. మోహన్.

చిరునామా:
గార్లపాటి లక్ష్మీనారాయణ,
S/o డా. శ్రీనివాసరావు గారు,
ఫిజిక్స్ లెక్చరర్,
లయోలా కాలేజి,
విజయవాడ.

24. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వివరిస్తూ మిత్రునకు లేఖ

నెల్లూరు,
xxxxx

ప్రియ మిత్రమా,
నేను. బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగుగా చదువుతున్నావని తలుస్తాను. గడచిన సోమవారం మా నెల్లూరు పట్టణంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించబడింది. జిల్లాలోని నాలుగు మూలల నుండి, వివిధ పాఠశాలల బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థులచే తయారుచేయబడ్డ రకరకాల నమూనాలు ఇందులో ప్రదర్శింపబడ్డాయి. మా పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి లభించింది. ఆ ఆనందంతో నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. కోటేశ్వర్.

చిరునామా :
కోట శ్రీధర్ కుమార్,
7వ తరగతి,
టౌన్ హైస్కూలు,
గుడివాడ, కృష్ణా జిల్లా.

25. రిపబ్లిక్ దినోత్సవ లేఖ (గణతంత్ర దినోత్సవం)

కందుకూరు,
xxxxx

ప్రియ స్నేహితుడు మోహన్ బాబుకు,
గడచిన జనవరి 26న, మా పాఠశాలలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకొన్నాం . నాటి సమావేశానికి మా జిల్లా విద్యాశాఖాధికారి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. ఆయన భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి చక్కగా ఉపన్యసించారు. సభా ప్రారంభానికి ముందు జాతీయ జెండాను ఎగురవేసి జెండాగీతాన్ని పాడాం. ‘జనగణమన’తో సభా కార్యక్రమం ముగిసింది. చివరిలో అందరికీ స్వీట్సు పంచిపెట్టబడ్డాయి.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితుడు,
వి. రాజేంద్ర ప్రసాద్.

చిరునామా :
జి. మోహన్ బాబు,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

26. తరగతి ఉపాధ్యాయునకు సెలవు చీటీ

కావలి,
xxxxx

7వ తరగతి ఉపాధ్యాయుల వారికి,
ఆర్. సి. యం. హైస్కూలు,
కావలి.

అయ్యా,
గడచిన రాత్రి నుండి నేను తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నాను. డాక్టరుగారు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. కనుక దయ ఉంచి ఈ రోజు, రేపు సెలవును మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
మీ విధేయుడు,
ఎస్. రాజారాం ,
7వ తరగతి.

AP Board 7th Class Telugu లేఖలు

27. పుస్తక విక్రేతకు లేఖ

కొవ్వూరు,
xxxxx

మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
విజయవాడ – 1.

అయ్యా !,
నేను ఈ క్రింద తెలియజేసిన పుస్తకాలను సాధ్యమైనంత త్వరలో రిజిష్టర్డ్ పోస్టుద్వారా పంపించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. పుస్తకాలపై ఇచ్చే కమిషన్ తగ్గించి మిగతా పైకమును చెల్లించగలవాడను.
1) 7వ తరగతి తెలుగు క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
2) 7వ తరగతి ఇంగ్లీషు క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
3) 7వ తరగతి గణితశాస్త్రం క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు
4) 7వ తరగతి సామాన్యశాస్త్రం క్వశ్చన్ బ్యాంక్ – 10 కాపీలు

ఇట్లు,
తమ విధేయుడు,
జి.యస్. కుమార్,
డోర్ నెం. 4-16-72,
-కొవ్వూరు,
ప.గో. జిల్లా.

చిరునామా:
మేనేజర్,
వి.జి.యస్. పబ్లిషర్స్,
తమ్మిన కృష్ణ వీధి,
విజయవాడ – 520 001.

28. జలల దినోత్సవం గురించి మిత్రునకు లేఖ

ఒంగోలు,
xxxxx

ప్రియ మిత్రుడు సతీష్ కు,
మా పాఠశాలలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న ‘బాలల దినోత్సవం’ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకున్నాం. చాచా నెహ్రూగారి జయంతి సందర్భంగా భారతదేశమంతటా ఈ బాలల దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. నెహ్రూగారికి చిన్న పిల్లలన్నా, గులాబీ పూలన్నా ఇష్టం. అందువల్ల ఆయన పుట్టినరోజున ఈ కార్యక్రమం అందరూ జరుపుకుంటారు. ఈ సందర్భంగా మా పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు కూడా నిర్వహింపబడ్డాయి. నాకు తెలుగు వ్యాసరచనలో ప్రథమ బహుమతి లభించింది.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
దివాకర్.

చిరునామా:
పి. సతీష్, 7వ తరగతి,
మున్సిపల్ హైస్కూల్,
చీరాల, ప్రకాశం జిల్లా,

AP Board 7th Class Telugu లేఖలు

29. గురుపూజోత్సవం గురించి మిత్రునకు లేఖ

కర్నూలు,
xxxxx

ప్రియమిత్రుడు ఆనంద్ కు,
గడచిన సెప్టెంబర్ 5న మా పాఠశాలలో గురుపూజోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతినే ప్రభుత్వం గురుపూజోత్సవ దినంగా ప్రకటించింది కదా! మేము మా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ ఆ రోజున ప్రత్యేకంగా సన్మానించాం. వారి ఆశీర్వచనాలు పొందాం. మనకు విద్య నేర్పుతున్న గురువులను గౌరవించి సన్మానించడం నా కెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇట్లు,
నీ మిత్రుడు,
రాజారాం.

చిరునామా:
ఎస్. ఆనంద్,
7వ తరగతి,
జిల్లాపరిషత్ హైస్కూలు,
కొండపల్లి, కృష్ణా జిల్లా.

30. శతక పద్యాలు మానవీయ విలువలను పెంచుతాయి. దీన్ని సమర్థిస్తూ మిత్రునికి లేఖ రాయండి.

శ్రీకాకుళం,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు,
శుభాకాంక్షలు. నేను బాగానే ఉన్నాను. నీవు కూడా బాగానే ఉన్నావని ఆశిస్తున్నాను. నేను ఈ లేఖలో శతక పద్యాల ప్రాధాన్యాన్ని గురించి తెలియజేస్తున్నాను. శతక పద్యాలు విద్యార్థుల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి. మానవీయ సంబంధాలను పరిపుష్టం చేస్తాయి. సమాజం పట్ల గౌరవాన్ని, సేవాదృక్పధాన్ని కలిగిస్తాయి. అందువల్ల శతక పద్యాలను అందరు చదువాలి. ఆదర్శవంతులుగా తయారవ్వాలి. నీవు కూడా శతక పద్యాలను చదివి అందరికి ఆదర్శంగా నిలిచే గుణాలను పెంపొందించుకుంటావని ఆశిస్తున్నాను.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
వి. మనోజ్ఞ.

చిరునామా :
వి.సతీష్,
7వ తరగతి,
నిర్మలా హైస్కూల్,
ఏలూరు,
పశ్చిమ గోదావరి జిల్లా.

31. చదువు ప్రాధాన్యతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి.

నెల్లూరు,
xxxxxxx

ప్రియమైన మిత్రుడు రామారావుకు,
శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉంటున్నారు. వివిధ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. చదువుకోవలసిన వయస్సులో పనులు చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని గుర్తించి బాలకార్మికులుగా — ఉన్నవారిని బడిలో చేర్పించాను. చదువు అవసరాన్ని వివరించి చెప్పాను. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాను. నీవు కూడా బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించు. వారందరికి చదువు ప్రాధాన్యతను వివరించు. ,పెద్దలకు నమస్కారాలు తెలుపు.

ఇట్లు,
నీ మిత్రుడు,
పి.చంద్రశేఖర్.

చిరునామా :
కె. రామారావు,
7వ తరగతి,
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల,
దక్షారామం, తూర్పుగోదావరి జిల్లా.

32. మాతృభాషా దినోత్సవం గూర్చి మిత్రునకు లేఖ

చెరుకూరు,
xxxxx

ప్రియ మిత్రుడు ప్రవీణ్ కుమార్‌కు,
ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాం. అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఇటీవల మా పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ‘ఫిబ్రవరి 21 న బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా చక్కనైన సూక్తులు రాసిన చార్టులు తగిలించి, అలంకరించాం. మన మాతృభాషను కాపాడిన, కాపాడుతున్న ఎందరో మహనీయులైన వారి చిత్రపటాలు సేకరించి, ప్రదర్శనగా ఉంచాం. ప్రక్కనే వారు మాతృభాష కోసం చేసిన కష్టాన్ని క్లుప్తంగా రాసి, ఉంచాం. గిడుగు, గురజాడ వంటి మహనీయులకు ‘పెద్దపీట వేసాం. ఆ సభకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త “ఆర్ష విద్యాసాగర్, మధురభారతి” శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిని ఆహ్వానించాం. వారి ఉపన్యాసం ఎలా సాగిందంటే బీడునేల మీద వాన చినుకులు పడిన విధంగా మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. ఆ తర్వాత మాలో కొంతమంది మాతృభాష గొప్పదనాన్ని గురించి మాట్లాడారు.

అలాగే మీ పాఠశాలలో జరిగిన విశేషాలను లేఖ వ్రాయి.

ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
డి. ప్రవీణ్ కుమార్,
8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
బాపట్ల, గుంటూరు జిల్లా.

AP Board 7th Class Telugu లేఖలు

33. ‘అమ్మకు వందనం’ కార్యక్రమంలోని విశేషాలను తెలుపుతూ సోదరికి లేఖ

చెరుకూరు,
xxxxx

ప్రియమైన పద్మావతి అక్కకు,
మేము ఇక్కడ క్షేమం. మీరు అక్కడ క్షేమమని తలుస్తాను. నేను బాగా చదువుతున్నాను. ఇటీవల మా పాఠశాలలో ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిని పిలిపించారు. ఆ తల్లులకు వారి పిల్లల చేత కాళ్ళు కడిగించి, పాదాల మీద పూలు వేసి, నమస్కరించమన్నారు. మేమంతా అట్లా చేసి, అమ్మల ఆశీస్సులు తీసుకొన్నాము. నేను, మరికొంతమంది విద్యార్థులు అమ్మ గొప్పదనాన్ని గురించి మాట్లాడాము. అమ్మ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. దానిని ఎప్పుడూ పోకుండా చూసుకోవాలని అనుకున్నాను. బావగారు, పిల్లలు ఏం చేస్తున్నారు? అందరినీ అడిగానని చెప్పు.

ఇట్లు,
నీ తమ్ముడు,
కె. ఫణిరామ్.

చిరునామా :
ఎస్. పద్మావతి,
w/o ఎస్. పూర్ణచంద్ర,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.

II. (స్వీయరచన – వ్యవహార రూపాలు)

1. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా! మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో తెలియజేస్తూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

పరిసరాల పరిశుభ్రత

మిత్రులారా! చదవండి.

రోగం వస్తే చేంతాడంత క్యూలో నిలబడి, డాక్టర్లను కలిసి, మనం గుప్పెళ్ళు కొద్దీ మందు బిళ్ళలను మ్రింగుతాం. ఆ మందులు మ్రింగడం వల్ల తాత్కాలికంగా తగ్గినా కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి.

అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయనే దాని గురించి మనం శ్రద్ధ తీసుకోము. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఇంటి చుట్టూ, మన వీధిలో మన రోడ్డు ప్రక్క మురికి కాలువలో, తుక్కు పేరుకుపోయి, దోమలు వ్యాపించడం వల్లే, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ వంటి భయంకర వ్యాధులు వస్తున్నాయి.

మనం ఇంటిని నిత్యం తుడుచుకుంటాం. అలాగే మన ఇంటి చుట్టూ శుభ్రం చేయాలి. మన రోడ్డును శుభ్రంగా ఉంచాలి. మన ఇంటివద్ద మురికి కాలువలను శుభ్రం చేయాలి. తుక్కు తుడిచి రోడ్లపై వేయకుండా పంచాయితీ, లేక మునిసిపల్ బళ్ళల్లో పోయాలి. దోమల మందులు చల్లాలి. ముగ్గు చల్లాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం మన వద్దకు రాదు. అందుకే మన ప్రధాని ‘స్వచ్ఛభారత్’ నినాదం చేశారు. మనం ప్రతిజ్ఞ చేద్దాం. మన ఇంటిని, మన పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. రోగాలను తరిమి కొడదాం. ‘జై స్వచ్ఛభారత్’

దివి. xxxxxx
కందుకూరు.

ఇట్లు,
స్వచ్ఛభారత్ గ్రామ కమిటీ

2. దోమల నిర్మూలన చేస్తే అసలు అంటురోగాలు మన దగ్గఱకే రావు. దోమలను నిర్మూలించే ఉద్యమం చేపట్టాలని కరపత్రం తయారు చెయ్యండి.
జవాబు:

స్నేహితులారా! ఈనాడు మన పరిసరాల్లో పెరిగిపోయిన దోమలవల్ల అనేక భయంకర రోగాలు సమాజంలో ప్రబలిపోతున్నాయి. మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ ఎ, బి, లు వంటి రోగాలన్నింటికీ దోమలే కారణం.

మన ఇల్లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే, దోమలు ప్రబలిపోతున్నాయి. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. మరుగుదొడ్ల గొట్టాలకు తెరలు కడదాం. దోమలు రాకుండా ‘ఆల్ అవుట్’ వంటి వాటిని వాడదాం. దోమల చక్రాలు వెలిగిద్దాం. నిత్యం మన రోడ్డుపై తుక్కు తొలగించేలా శ్రద్ధ తీసుకొందాం. మురికి కాలువలు నిత్యం శుభ్రం చేసేలా చర్యలు చేపడదాం. క్రిమిసంహారక మందులు చల్లుదాం.

వారంవారం, మన వాడలోని వారంతా కలసి ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం చేపడదాం. దోమలు వ్రాలడానికి వీలు లేకుండా, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. దోమల నిర్మూలనకు కంకణం కట్టుకుందాం. రోగాలను తరిమి కొడదాం. రోజూ మురికి కాలువలు శుభ్రం చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.

పేరూరు,
దివి. xxxxxx

ఇట్లు,
గ్రామ పంచాయితీ,
ఆరోగ్య రక్షణ సమితి.

AP Board 7th Class Telugu లేఖలు

3. ‘ఆలోచనం’ గేయం మీ తరగతిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వారిని ప్రశంసిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

ఒంగోలు,
xxxxx

మిత్రుడు రవికుమార్‌కు,

మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా టీచర్ సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది.

అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆరోజు మా తరగతి .పిల్లలంతా ‘రాజా, కమలల’కు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత టీచర్ వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా.
విశేషాలతో లేఖ రాయి.

నీ ప్రియమిత్రుడు,
రవికృష్ణ,

చిరునామా :
K. రవికుమార్,
S/o. బలరామ్ గారు,
మున్సిపల్ స్కూలు,
కడప.

4. చెట్ల పెంపకం గురించి శ్రద్ధ తీసుకోవాలని కరపత్రం తయారు చేయండి.
జవాబు:

చెట్లు ప్రగతికి. మెట్లు. పచ్చని చెట్లు, ఆరోగ్య సంజీవనులు. ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా పరిశుభ్రమైన గాలికి, నీటికి కొరత ఉంది. దీనికి కారణం, వర్షాలు లేకపోవడం, చెట్లు లేకపోవడం. మంచి వర్షాలు కురిస్తే, చెట్లు మొలుస్తాయి. చెట్లు పెంచితే, చల్లని ప్రాణవాయువు లభిస్తుంది. వర్షాలు కురుస్తాయి. దేశంలో 1/3 వంతు భాగంలో అడవులు ఉంటే, సకాలంలో చక్కని వర్షాలు పడతాయి.

చెట్లు మనం విడిచే కార్బన్ డై ఆక్సెడ్ ను పీల్చుకొని, మనకు ప్రాణవాయువును ఇస్తాయి. చెట్ల వల్ల పండ్లు, కాయలు, కూరగాయలు, కలప, తేనె వగైరా లభిస్తాయి. మంచి పువ్వులు దొరుకుతాయి. పండ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెట్లు దేశ భవితకు మెట్లు.

కాబట్టి ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచుదాం. దేశంలో వాతావరణంలో సమతుల్యతను సాధిద్దాం. చెట్లు మనకు కావలసిన అన్ని వస్తువులను ఇస్తాయి. చెట్లను కొట్టడం నేరం. ప్రతి బడిలోనూ, రోడ్డు ప్రక్కనూ, ఖాళీ స్థలాల్లోనూ కాలువ గట్ల వెంబడిని, చెట్లను ఉద్యమంగా నాటుదాం. పెంచుదాం. రండి. కదలిరండి.

దివి. xxxxxx,

ఇట్లు,
వన సంరక్షణ సమితి,
గన్నవరం.