AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

SCERT AP 10th Class Social Study Material Pdf 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Studies 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాటిని జతపరచండి : (AS1)

1) సరళీకృత ఆర్థిక విధానంa) విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు
2) ఇష్టమొచ్చినట్లు తొలగించటంb) కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు
3) ఇతరుల తొలగింపుc) తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు
4) సమాఖ్య సిద్ధాంతంd) రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి

జవాబు:

1) సరళీకృత ఆర్థిక విధానంa) విదేశీ దిగుమతులపై పన్నుల మీద పరిమితులు
2) ఇష్టమొచ్చినట్లు తొలగించటంb) కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు
3) ఇతరుల తొలగింపుc) తమ కంటే భిన్నంగా ఉన్న ప్రజలకు
4) సమాఖ్య సిద్ధాంతంd) రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్వయం ప్రతిపత్తి

ప్రశ్న 2.
స్వాతంత్ర్యానంతర రెండవ దశలో పార్టీ వ్యవస్థలో ప్రధాన మార్పులను గుర్తించండి. (AS1)
జవాబు:

  1. 1976-85 మధ్యకాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షాకాలం వంటిది.
  2. మౌలిక ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలై, రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది.
  3. ఈ కాలం కాంగ్రెస్ పార్టీ పాలనతోనే మొదలై ముగిసినప్పటికీ కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయాలు రూపొందాయి.
  4. ఈ కాలం భారతదేశం ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది.
  5. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోవటానికి అవకాశం లభించింది.
  6. దీనివల్ల రాష్ట్ర జాతీయస్థాయి రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
  7. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలు కూడా ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగారు.
  8. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తులుగా మారాయి.
  9. రాజకీయ పార్టీలు మారిన పరిస్థితులకనుగుణంగా తమ మ్యానిఫెస్టోలను మార్చుకోవలసి వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 3.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వివిధ ప్రభుత్వాల ప్రధాన ఆర్థిక విధానాలలో వేటిని గురించి ఈ అధ్యాయంలోనూ, ఇంతకు ముందు అధ్యాయాలలోనూ చర్చించారు ? వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి? (AS1)
జవాబు:
పోలికలు:

  1. హరిత విప్లవాన్ని రాష్ట్రాల సహకారంతో కేంద్రం అమలుచేసింది.
  2. వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఓబిసి’లకు రిజర్వేషన్లు అప్పటికే అనేక రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో వివిధ ప్రభుత్వాల ఆర్థిక విధానాల మధ్య తేడాలు :

కేంద్రస్థాయి ఆర్థిక విధానాలురాష్ట్రస్థాయి ఆర్థిక విధానాలు
1. ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన దేశంగా ఎదుగుతుందని భావించి నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చింది.1. పశ్చిమబెంగాల్ :
1977లో సిపిఎంకి చెందిన “జ్యోతిబసు” ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న భూసంస్కరణలను చేపట్టింది.
ఎ) 1978 లో పశ్చిమ బెంగాల్ లో కౌలుదార్ల పేర్లను నమోదుచేసింది.
బి) వాళ్ల హక్కులను కాపాడటానికి “ఆపరేషన్ బర్గా” ను చేపట్టింది. (కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు.)
సి) ఆపరేషన్ బర్గా ఫలితంగా కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించటానికి వీలులేకుండా పోయింది.
డి) కౌలుదార్ల హక్కును వారసత్వం చేసి అది కొనసాగేలా చూశారు.
ఇ) పంటలో, పెట్టుబడి కౌలుదారు పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది.
2. నెహ్రూ భూసంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన అనే మూడు రకాల భూసంస్కరణలను ప్రతిపాదించారు.
3. జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు విధానాల సంస్కరణ, భూపరిమితి విధానాలను నెహ్రూ ప్రవేశపెట్టారు.
4. 1964-67 మధ్య ఆహార ఉత్పత్తిని పెంచడానికి ‘హరిత విప్లవం’ను మొదలు పెట్టారు.
5. 1971 తరువాత ఇంధిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది.
6. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సరళీకృత విధానాలవైపు మొగ్గు చూపింది.2. ఆంధ్రప్రదేశ్ :
1982 లో ఆంధ్రప్రదేశ్ లో “నందమూరి తారక రామారావు” నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చిన్న వర్గ ప్రజలను ఆకర్షించడానికి కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది.
ఎ) రెండు రూపాయలకు బియ్యం
బి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం
సి) మద్యపాన నిషేధం.
డి) పేదవారికి, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు
7. వెనుకబడిన తరగతుల ప్రజలకి కూడా అవకాశాలు కల్పించుటకై ‘పి సింగ్’ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యాసదుపాయాలలోను రిజర్వేషన్లు ప్రకటించింది. అనేక సమస్యలను ఎదుర్కొన్నది.
8. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి 1992లో పి.వి. నరసింహారావు’ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధితో సంప్రదింపులు నిర్వహించింది. అది కొన్ని తీవ్ర షరతులతో భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించేలా చేసింది.
9. దీనివల్ల విదేశీ కంపెనీలు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పాయి. వ్యాపారాలు మొదలు పెట్టాయి. స్వదేశీ కర్మాగారాలు మూతపడ్డాయి.
10. భారతదేశం ప్రపంచ మార్కెట్ లోకి లాగబడింది. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాలు ప్రైవేటీకరణకు దారితీశాయి.

ప్రశ్న 4.
ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు ఎలా దారితీశాయి ? రెండు దశలలోని పోలికలు, తేడాలను వివరించండి. (AS1)
జవాబు:
ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం :
1) భారతదేశంలోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం విభిన్న ఉద్యమాలు జరిగాయి.

2) ఆంధ్రప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచు మారుస్తుండటం, పై నుంచి నాయకులను రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.

  • జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించటం లేదని బావించసాగారు.
  • తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు.

3) అసోం :
స్వయం ప్రతిపత్తికి ఇదోరకమైన బలమైన ఉద్యమం.

  • బ్రిటిష్ పాలన నాటి నుండి రాష్ట్ర పాలనలోని కింది, మధ్య స్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
  • బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సోమీయులు భావించేవారు.
  • స్వాతంత్ర్యం తరువాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో సిరపడసాగారు.
  • ఇవన్నీ చాలవన్నట్లు సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది వలస రాసాగారు.
  • దీంతో స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, బయటివాళ్ళు ఎక్కువై తమ జనాభా తగ్గుతుందనీ భయపడసాగారు.

4) పంజాబ్ :
ఇక్కడ అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతము ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.

  • దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ.
  • రాష్ట్రం ఏర్పడినపుడు వారికి అన్యాయం జరిగిందని, రాజధాని ప్రాంతం చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలనీ, భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలనీ, సైన్యంలోకి ఎక్కువమంది సిక్కులను తీసుకోవాలని కోరారు.

పోలికలు :

  1. తమ ఉనికిని గుర్తించాలనీ
  2. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనీ
  3. తమ జాతిమీద వేరొకరి ప్రభావం ఉండకూడదనీ
  4. తమకు అన్ని అవకాశాలు కల్పించాలనీ

తేడాలు:

  1. ఆంధ్రప్రదేశ్ లో తమ జాతి అవమానించబడుతోందనీ
  2. అసోంలో తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, తమ జనాభా తగ్గిపోతుందనీ
  3. పంజాబ్ లో తమకే మేలు జరగాలనీ ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయి.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 5.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి. స్వాతంత్ర్యానంతర రెండవ దశలో ఈ పనిని వివిధ రాజకీయ పార్టీలు ఎలా చేశాయి? (AS1)
జవాబు:

  1. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి.
  2. స్వాతంత్ర్యానంతర రెండవ దశలో ఈ పనిని అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి.
  3. సమాజంలోని రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలను కాపాడవలసిన అనసరం ఏర్పడింది.
  4. వారి అవసరాలను తీర్చటానికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటుచేయడం జరిగింది.
  5. పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు.
  6. స్త్రీ ప్రాధాన్యతను పెంచే చర్యలు.
  7. పౌరహక్కుల పరిరక్షణ కొరకు అనేక చర్యలు.
  8. సాహిత్యాన్ని రక్షించుటకు కొన్ని చర్యలను చేపట్టడం జరిగింది.
  9. పై చర్యలను చేపట్టడానికి, ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.

ప్రశ్న 6.
భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు ఏమిటి? వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటోంది? (AS1)
జవాబు:
భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు :

  1. అనేక ప్రజా ఉద్యమాలు చెలరేగడం
  2. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం
  3. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని అనుకోవడం
  4. వేర్పాటువాదం తలెత్తడం
  5. ప్రాంతీయ, భాషా మతాభిమానాలు పెరిగిపోవడం
  6. సమర్థవంతమైన నాయకత్వం లోపించడం
  7. ప్రజల మనోభావాలను సంతృప్తి పరచలేకపోవడం
  8. విభిన్న భావాలు గల రాజకీయ నాయకులు సంతృప్తి పడకపోవడం

వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటుంది అనగా –

  1. వివిధ ప్రజలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం
  2. వారి ప్రాంతీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం
  3. ప్రాంతీయ, కుల, మత ప్రయోజనాలను రెచ్చగొట్టి అత్యధికంగా ఓట్లు పొందాలని చూడటం
  4. స్వలాభం కొరకు జాతీయాభిమానాన్ని తాకట్టుపెట్టడం
  5. రాజకీయ ప్రయోజనాలతో సమాజ ప్రయోజనాలను దెబ్బతీయడం వంటి అంశాల వల్ల వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకుని వెళ్లగల సామర్థ్యం దెబ్బతింటోంది.

ప్రశ్న 7.
వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను ఏ విధంగా ఉపయోగించుకుంటాయి? (AS1)
జవాబు:
వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను కింది విధంగా ఉపయోగించుకుంటాయి.

  1. సంస్కృతిని, సంప్రదాయాలను పెంపొందిస్తాయి. వాటికి ప్రాధాన్యతను ఇస్తాయి.
    2
  2. భాషాభిమానాన్ని కలిగి ఉండి భాషాభివృద్ధికి దోహదం చేస్తాయి.
    ఉదా : ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్.టి. రామారావు ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.
  3. అంతేకాక పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి ఆర్థిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
  4. అసోంలోని వ్యాపారం, ఇతర సంస్థలు అస్సోమేతర ప్రజల చేతుల్లో ఉన్నాయని, వాటిని ఇతరుల నుండి తొలగించి తమకు చెందేలా చేసుకోవాలని అసోం ప్రజలు భావించారు.
  5. అలాగే పంజాబ్ ప్రజలు రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలనీ, భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్ళు కావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరడం మొదలగునవి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి దోహదం చేశాయి.

ప్రశ్న 8.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇవి రాజకీయ భావాలను ఎలా ప్రతిబింబించాయో చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి, రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణాలు :

  1. స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో భారతదేశంలో పేదరికాన్ని తొలగించడానికి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన వలస ఆర్థిక విధానం నుండి మన ఆర్థిక వ్యవస్థను రూపొందించుటకు ప్రణాళికాబద్ద ఆర్థికవ్యవస్థను ప్రవేశపెట్టారు.
  2. వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, సేవారంగాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను అమలుచేశారు.
  3. సుస్థిరంగా, సమర్ధవంతంగా, వేగవంతంగా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించారు.
  4. అయితే వాటి వలన ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం వలన రెండవ సగంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించారు. ఈ విధానం వలన –
    i) ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవటం అనగా రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో ప్రభుత్వ ఖర్చును తగ్గించటం.
    ii) విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవటం.
    iii) విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించటం.
    iv) ఆర్థికరంగంలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించటం వంటి చర్యల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

ప్రశ్న 9.
సంకీర్ణ ప్రభుత్వం వల్ల విధానాలలో మధ్యేమార్గాన్ని అవలంబించటానికి సంకీర్ణ ప్రభుత్వంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రాంతీయ కోరికలను సాధించుకునే విధానానికి ఉదాహరణలను వార్తాపత్రికలు, వార పత్రికలు చదవటం ద్వారా గుర్తించండి. (AS3)
జవాబు:

  1. 1990ల కాలంలో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
  2. పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థకు మార్పుతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితి ఏ ఒక్క పార్టీకీ లేదు.
  3. 1989 నుంచి జాతీయస్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణ మైనారిటీ ప్రభుత్వాలే.
  4. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చింది.
  5. అలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాలకు, ప్రజలకు అద్దంపడుతూ వాటి అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుంది.

10th Class Social Studies 19th Lesson రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000 InText Questions and Answers

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 1.
ఈ రెండు సమస్యలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మన ప్రజాస్వామిక రాజతంత్రాన్ని బలపరిచిందా, బలహీన పరిచిందా?
జవాబు:
ఈ రెండు సమస్యలు చాలా జటిలమై, ప్రభుత్వానికే సవాల్ గా నిలిచాయి. అయినప్పటికి ఈ సమస్యలలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామిక రాజతంత్రాన్ని బలపరచిందనే చెప్పాలి.

10th Class Social Textbook Page No.274

ప్రశ్న 2.
ప్రధానమంత్రి క్షమాపణ

రాజ్యసభలో డా|| మన్మో హన్ సింగ్ ప్రకటన –
………… 1984లో జరిగిన ఈ మహా జాతీయ విపతులో నాలుగు వేలమంది చంపబడ్డారు. ఒకే దేశంగా కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోటానికి ప్రయత్నించాలి. ……. ఒక్క సిక్కు ప్రజలకే కాకుండా మొత్తం భారతదేశానికి క్షమాపణలు చెప్పటానికి నేను తటపటాయించను, ఎందుకంటే 1984లో జరిగింది మన రాజ్యాంగంలో పొందుపరిచిన దానికి, జాలి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమయినది. మా ప్రభుత్వం తరపున, ప్రజలందరి తరపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను. అయితే దేశ వ్యవహారాల్లో శిఖరాలూ ఉంటాయి, లోయలు ఉంటాయి. గతం మనతో ఉంది, దానిని తిరగరాయలేం. కానీ మానవులుగా మనందరికీ మెరుగైన భవిష్యత్తును రూపొందించగల సామర్థ్యం , దృఢ చిత్తత మనకి ఉన్నాయి.
(pmindia mic co/Rs%20 speech.pdf) – 2005 ఆగస్టు 11.

పై సమాచారాన్ని చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
1) ఈ ఉపన్యాసంలోని ప్రధాన సందేశం ఏమిటి?
జవాబు:

  1. 1984లో జరిగిన ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోటానికి ప్రయత్నించాలి.
  2. 1984లో జరిగిన ఘోరానికి నేను క్షమాపణ తెలియచేస్తున్నాను అని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

2) ఈ ఉపన్యాసం ఏ సంకేతాలను పంపిస్తోంది?
జవాబు:

  1. దేశ వ్యవహారాలలో శిఖరాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రకాలైన పనులు చేయవలసి వస్తుంది.
  2. గతాన్ని తిరగ రాయలేం. కానీ మానవులం కనుక మెరుగైన భవిష్యత్తును రూపొందించగల సామర్థ్యం, దృఢ చిత్తం మనకున్నాయని సంకేతాలిస్తుంది.

3) ప్రధానమంత్రి ఈ ఉపన్యాసం చెయ్యటంలోని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:

  1. 1984లో జరిగినది మన రాజ్యాంగంలో పొందుపరచిన దానికి, జాతి అన్న భావనకు పూర్తి వ్యతిరేకమయినది.
  2. మా ప్రభుత్వం తరుపున, ప్రజల తరుపున ఇటువంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నానని తెలియచేశారు.

10th Class Social Textbook Page No.265

ప్రశ్న 3.
పలు పార్టీల ప్రజాస్వామ్యంతో పోలిస్తే ‘ఏక పార్టీ ప్రజాస్వామ్యం’ మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండేదా?
జవాబు:
పలు పార్టీల ప్రజాస్వామ్యంతో పోలిస్తే ఏక పార్టీ ప్రజాస్వామ్యం మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉండేది కాదు.

ఎందుకనగా:

  1. ఏకపార్టీ ప్రజాస్వామ్యం వలన నియంతృత్వ ధోరణి పెరుగుతుంది.
  2. మార్పులకు అవకాశం ఉండదు.
  3. అందరి క్షేమానికి అవకాశం ఉండేది కాదు.
  4. ఉద్యమాలు తలెత్తవు. ఉద్యమాలు తలెత్తకపోతే భిన్నాభిప్రాయాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదు.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 4.
ప్రజలు స్వేచ్ఛగా సంచరించే విధానం ఉంటే బయటి నుంచి వచ్చిన ధనిక, శక్తిమంతులైన వాళ్ళు భూమి, వనరులు మొత్తాన్ని కొనేసి అసలు ఆ ప్రాంతంలోని వాళ్లను పేదలు, నిర్భాగ్యులుగా మిగులుస్తారా?
జవాబు:
మిగల్చరు. కారణం భూమి, వనరులు అమ్మితే కొంటారు కాని అమ్మకపోతే కొనరు కదా. ఒకవేళ అమ్మినా ఎక్కువ రేటు వస్తుంది. దానితో పేదవారు ధనికులు కావడానికి అవకాశం ఉంటుంది. మరియు ధనికులు వచ్చి అక్కడ పరిశ్రమల లాంటివి స్థాపించితే దానిలో ఉపాధి లభిస్తుంది. కాబట్టి అక్కడ పేదలు నిర్భాగ్యులుగా మిగలరు.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 5.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రాజీవ్ గాంధీ దేశానికి ఒనగూర్చిన శాశ్వత ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. శాంతి ప్రక్రియలు మొదలు పెట్టారు.
  2. పేదవారికి ఉద్దేశించిన పథకాలను వారికి అందేటట్లు ఏర్పాట్లు చేశారు.
  3. అధికార వికేంద్రీకరణకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధత కల్పించారు.
  4. ఆర్థిక రంగంలో సరళీకృత ఆర్థికవ్యవస్థను ప్రవేశపెట్టారు.
  5. సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని ‘టెలికం విప్లవం’ ఆరంభించారు.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 6.
తమకోసం ఉద్దేశించిన పథకాల వల్ల పేద ప్రజలు తరచు ఎందుకు ప్రయోజనం పొందటం లేదో తరగతిలో చర్చించండి. ఇటువంటి ప్రయోజనాలు నిజంగా పేదవాళ్లకు చేరాలంటే ఏ దీర్ఘకాల చర్యలు తీసుకోవాలి?
జవాబు:

  1. ప్రభుత్వ శాఖలలో పేరుకుపోయిన అవినీతి
  2. ప్రజలు నిరక్షరాస్యత మూలంగా ప్రభుత్వం తమకోసం చేపట్టిన పథకాలను పొందలేకపోతున్నారు.
  3. అమాయకత్వం వలన కూడా పేదప్రజలు ప్రయోజనం పొందటం లేదు.

తీసుకోవాల్సిన దీర్ఘకాల చర్యలు:

  1. అక్షరాస్యతను పెంచాలి.
  2. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి.
  3. ప్రభుత్వోద్యోగులు నిజాయితీతో పనిచేస్తూ ఈ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి.

10th Class Social Textbook Page No.273

ప్రశ్న 7.
మీ పాఠశాల విద్యార్థులకు అందవలసిన ప్రయోజనాల జాబితా తయారుచెయ్యండి. ఇవి వాళ్లకు సరిగా అందుతున్నాయా? తరగతి గదిలోనూ, బయట క్రీడా మైదానాలలోనూ, ఇంటివద్ద చర్చించండి.
జవాబు:
పాఠశాల విద్యార్థులకు అందవలసిన ప్రయోజనాలు :

  1. మధ్యాహ్న భోజన పథకం
  2. ఉచిత పుస్తకాల పంపిణీ
  3. ఉచిత యూనిఫారం
  4. స్కాలర్షిప్లు
  5. లైబ్రరరి సౌకర్యాలు
  6. ఆటస్థలం
  7. ప్రయోగశాలలు

వీటన్నింటినీ విద్యార్ధులు పొందేలా చర్యలు తీసుకోవాలి. వీటి మీద విద్యార్ధులకు అవగాహన కలిగించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.264

ప్రశ్న 8.
గత అధ్యాయంలో చర్చించిన స్వతంత్ర భారతదేశంలోని రాజకీయ ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ఘటనలు :

  1. 1952, 1957, 1962లలో జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయాలు సాధించింది. ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగింది.
  2. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కొరకు అనేక ఉద్యమాలు ఆవిర్భవించాయి. చివరికి 1956లో భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  3. ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యి ప్రపంచమంతా రష్యా కూటమి (USSR) లేదా అమెరికా కూటమి (USA) గా విడిపోయింది. ఇటువంటి నేపథ్యంలో నెహ్రూ, మన దేశం ఈ రెండు శిబిరాలలో చేరకుండా విదేశీ విధానంలో స్వతంత్రంగా ఉంటూ, అలీన విధానమును మన విదేశీ విధానంగా స్వీకరించారు.
  4. చైనాతో నెహ్రూ పంచశీల సూత్రాల ఒప్పందం చేసుకున్నాడు.
  5. 1962లో చైనాతో మన దేశం యుద్ధం చేయవలసి వచ్చింది.
  6. 1965లో భారతదేశం పాకిస్థాన్‌తో యుద్ధం చేసింది.
  7. జాతీయ భాష అయిన హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో ఉద్యమం జరిగింది.
  8. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి గురైంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయి, ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
  9. 1969లో మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది.
  10. దేశంలోని చాలా రాష్ట్రాలలో అనేకాంశాల మీద ఉద్యమాలు లేచాయి.
  11. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో భారత్- పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది.
  12. 1971 ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
  13. 1973లో అరబ్- ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది.
  14. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి. ఈ ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం దేశంలో “అత్యవసర పరిస్థితి”ని విధించింది.

10th Class Social Textbook Page No.265

ప్రశ్న 9.
నిరసన, మార్పులకు సంబంధించి సామాజిక ఉద్యమాలకు అనువైన పరిస్థితులను పలు పార్టీల ప్రజాస్వామ్యం ఎలా దోహదం చేస్తుంది?
జవాబు:

  1. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోటానికి అవకాశం లభించింది.
  2. దీనివల్ల రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
  3. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గప్రయోజనాలు కూడా ముందుకొచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగారు.
  4. ఈ సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదకశక్తిగా మారాయి.

10th Class Social Textbook Page No.267

ప్రశ్న 10.
రాష్ట్రాలలో వేరే రాజకీయ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం వాటిని తొలగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజాస్వామిక సూత్రాలకు ఇది ఎలా భంగం కలిగిస్తోందో చర్చించండి.
జవాబు:

  1. ప్రపంచంలోనే విశాలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను తొలగించడమనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధం.
  2. జనతాపార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు సమాఖ్య సూత్రాలను బలహీనపరచి, అధికార కేంద్రీకరణకు మద్దతునిచ్చాయి.
  3. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతాపార్టీ అధికారంలోకి వచ్చి, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని నామరూపాల్లేకుండా చేసింది.
  4. ఇటువంటి చర్యలు కేంద్రం యొక్క ఆధికత్యను తెలుపుతూ, ప్రాథమిక హక్కులను భంగకరమవుతాయి.
  5. ఇటువంటి చర్యలు కొనసాగుతూనే ఉన్నట్లయితే భారతదేశం ఏకకేంద్ర రాజ్యంగా మారిపోతుంది.

10th Class Social Textbook Page No.268

ప్రశ్న 11.
ఎన్.టి.ఆర్ రాజకీయాలలో ఈ దిగువ అంశాల ప్రాముఖ్యతను చర్చించండి.
i) సినీ హీరోగా ఉన్న నేపథ్యం
ii) రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం
iii) పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు
iv) ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు
జవాబు:
i) సినీ హీరోగా ఉన్న నేపథ్యం :
ఎన్.టి.ఆర్ తెలుగు సినిమారంగంలో అనేక జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి తన నటనా శైలితో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మెప్పించి, వారి అభిమాన నటుడై, ఆదరాభిమానాలు పొందాడు.

ii) రాష్ట్ర ఆత్మగౌరవం కోసం పోరాటం:

  1. ఎన్.టి.ఆర్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచూ మారుస్తుండటం చూశారు.
  2. పై నుంచి నాయకులను రుద్దటం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.
  3. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించటం లేదని భావించసాగారు.
  4. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు.
  5. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తె.దే.పా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

iii) పేదలకు జనాకర్షక సంక్షేమ పథకాలు :
తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు :

  1. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం.
  2. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం.
  3. మద్యపాన నిషేధం.

iv) ఇతర ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు :

  1. 1984లో ఆపరేషన్ కోసమని అమెరికాకు వెళ్ళినప్పుడు గవర్నర్ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.
  2. తె.దే.పా నుంచి కాంగ్రెస్ కి పార్టీ ఫిరాయించిన ఎన్. భాస్కరరావుని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆహ్వానించారు.
  3. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్.టి.ఆర్ గవర్నర్ చర్యను సవాలుచేస్తూ శాసనసభ్యులలో మెజారిటీ మద్దతు తనకే ఉందని నిరూపించారు.
  4. తన ప్రభుత్వాన్ని అకారణంగా తొలగించటంపై చేసిన పోరాటంలో ఎన్.టి.ఆర్ కి ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సిపిఐ(ఎం), డి.ఎం.కె., ఎస్.ఎ.డి., నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు మద్దతు నిచ్చాయి.

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 12.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్ ఉద్యమానికి, అసోం ఉద్యమానికి పోలికలు, తేడాలు ఏవి?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్ ఉద్యమానికి, అసోం ఉద్యమానికి పోలికలు :

  1. స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకోవడం.
  2. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడం.

తేడాలు:

  1. తెలుగు ప్రజలు తమ ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించారు.
  2. అసోం ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, బయటివాళ్ళు ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు.
  3. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో ఆర్థిక కోణం లేదు. అసోం ఉద్యమంలో ఆర్థిక కోణం కలదు.
  4. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో మతపరమైన అంశం లేదు. అసోం ఉద్యమంలో మతపరమైన అంశం కలదు.
  5. ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో భారతదేశ వ్యతిరేకత లేదు. అసోం ఉద్యమంలో భారతదేశ వ్యతిరేకత వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.270

ప్రశ్న 13.
ఈ అంశాలపై మీ తరగతిలో చర్చ నిర్వహించండి.
ఒక ప్రాంతంలో ఒక సమూహానికి చెందిన ప్రజలు ఉండాలి, అన్ని ఉద్యోగాలు, అన్ని వ్యాపారాలు ఆ సమూహానికి చెందిన ప్రజల చేతిలోనే ఉండాలి. లేదా భారతదేశ ప్రజలందరూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళగలగాలి. తాము ఎంచుకున్న ప్రాంతంలో స్థిరపడటానికి, పని చెయ్యటానికి అవకాశం ఉండాలి.
జవాబు:
ఒక ప్రాంతంలో ఒకే సమూహానికి చెందిన ప్రజలు ఉండాలి అనేది అంత సమర్థనీయం కాదు. ఎందువల్ల అనగా భారతదేశం ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి, మరియు ఆర్టికల్ 19 ప్రకారం ఆరు రకాల స్వేచ్చలు ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి ఏ భారతీయుడైనా భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్థానికతకు కొంత ప్రాధాన్యత ఇచ్చినా వ్యాపారం విషయంలో, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్ళే విషయంలో, తాము ఎంచుకున్న ప్రాంతంలో స్థిరపడే విషయంలో, పనిచేసే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి.

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 14.
సిక్కుల వేర్పాటువాదం, తీవ్రవాదాలను ప్రేరేపించటంలో 1984 లో ఢిల్లీలో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్ల పాత్ర ఏమిటి?
జవాబు:

  1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి ఒక ఉద్యమం రూపుదిద్దుకుంది.
  2. ఇక్కడ అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతమూ ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది.
  3. రాజధాని నగరమైన చండీగఢ్ తమకే చెందాలని, భాక్రానంగల్ నుంచి ఎక్కువ నీరు రావాలని, సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరారు.
  4. 1980లో అకాలీ ప్రభుత్వాన్ని రద్దుచేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారన్న భావన పెరిగింది.
  5. తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న భింద్రేన్ వాలా వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరసాగాడు.
  6. తీవ్రవాదులు సిక్కుల మీదే కాకుండా పంజాబ్ లోని ఇతర మత ప్రజలపై కూడా సంప్రదాయ ఛాందసవాద జీవన విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు.
  7. ఈ ఘర్షణ మతపరమైన రంగును కూడా సంతరించుకుంది.
  8. సిక్కు మతానికి చెందని ప్రజలపై దాడులు జరిగాయి.
  9. వీటన్నింటి అంతిమ పర్యవసానంగా సిక్కు వేర్పాటు బృందాలు సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ ని అక్రమించుకోగా వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయటానికి సైన్వం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
  10. దీంతో తమ పుణ్యస్థలం అపవిత్రమైందని సిక్కులు భావించటంతో వాళ్ల విజాతి భావం మరింత తీవ్రమైంది.
  11. వీటన్నింటి కారణంగా 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
  12. దీని తరువాత అల్లర్లు చెలరేగి, ప్రత్యేకించి ఢిల్లీలో వేలాదిమంది సిక్కులపై దాడులు చేసి, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేసి, హత్య చేశారు.
  13. ఈ హింసను ఆపటానికి పాలనాయంత్రాంగం స్పందించినట్లు అనిపించలేదు.
  14. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక కొంత శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.

10th Class Social Textbook Page No.272

ప్రశ్న 15.
అసోం, పంజాబ్ ఉద్యమాల మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి. మన రాజకీయ వ్యవస్థకు అవి ఎటువంటి సవాళ్లను విసిరాయి?
జవాబు:

అసోం ఉద్యమంపంజాబ్ ఉద్యమం
1. బ్రిటిష్ పాలన నాటి నుండి అసోంలో బెంగాలీలు ఉండేవాళ్లు. బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించేవాళ్లు.1. పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమం జరిగింది.
2. స్వాతంత్ర్యం తరువాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో స్థిరపడసాగారు. బంగ్లాదేశ్ నుండి ఎంతోమంది వలసవచ్చి స్థానికులకు ఇబ్బంది కలిగించసాగారు. స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామనీ, అంతే కాకుండా ‘బయటివాళ్లు’ ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు.2. దేశాభివృద్ధిలో రాష్ట్రం పాత్రను విస్మరిస్తున్నారన్నదే పంజాబ్ ఆరోపణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు తమకు అన్యాయం జరిగిందని వాళ్లు భావిస్తున్నారు.
3. ప్రజలలో ఉన్న ఈ అసంతృప్తి 1970లలో సామాజిక ఉద్యమంగా మారింది.|3. చండీగఢ్ తమ రాష్ట్రానికి చెందాలని కోరసాగారు.
4. అఖిల అసోం విద్యార్థి సంఘం (ఎఎఎను) ఈ ఉద్యమానికి ముందు నిలిచింది.4. ఈ ఉద్యమం కొరకు 1978లో అకాలీదల్ ఏర్పడింది.
5. ఎఎయు ఉద్యమకారుల కోరికలు :
ఎ) బయటివాళ్లను తీసెయ్యాలని చేశారు.
బి) ఉపాధిలో స్థానిక ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని
సి) వనరులను స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించమని కోరారు.
5. అకాలీదళ్ కోరికలు:
ఎ) రాజ్యాంగాన్ని సవరించి అధికార వికేంద్రీకరణ చేయాలి.
బి) రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలి.
సి) భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలని, ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరసాగారు.
6. ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి ఈ ప్రాంతాలలో సాయుధ బలగాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నియమిం చింది. దీనితో పౌరహక్కులు, స్వేచ్ఛ రద్దయ్యా యి. సైన్యానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు.6. ఉద్యమకారులు సిక్కుల మీదే కాకుండా ఇతరమత ప్రజలపై కూడా ఘర్షణలకు కారణమయ్యారు.
7. తీవ్రవాదులు గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించుకోగా వాళ్లని అక్కడ నుండి ఖాళీ చేయించటానికి సైన్యం జోక్యం చేసుకోవలసి వచ్చింది. వారి పవిత్ర దేవాలయం అపవిత్రమైనదని భావించిన సిక్కుల కారణంగా 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యింది.
8. పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణచివెయ్యటానికి ప్రభుత్వం అనేక కఠినతర పద్ధతులను ఉపయోగించింది. వీటిలో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు.

సవాళ్లు :

  1. ఈ రెండు సమస్యలు దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా పరిణమించాయి. పంజాబ్ స్వయం ప్రతిపత్తిని కోరుట అనేది ఏర్పాటు వాదానికి నిదర్శనం.
  2. ఈ సమస్యలు మత ఘర్షణలకు దారితీశాయి.

10th Class Social Textbook Page No.276

ప్రశ్న 16.
సంకీర్ణ రాజకీయాల వల్ల ప్రభుత్వం బలహీనపడిందని కొంతమంది భావిస్తుండగా, దానివల్ల ఏ ఒక్క పార్టీ తన విధానాన్ని దేశం మీద రుద్దకుండా చేసిందని కొంతమంది భావిస్తారు. దీనిని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:

  1. సంకీర్ణ ప్రభుత్వాలలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చేది. దాంతో ఏ ఒక్క పార్టీ తన విధానాలను కొనసాగించటానికి వీలులేకపోతుంది.
  2. దీనివల్ల రాజకీయాలు, విధానాలలో అనేక దృష్టి కోణాల పట్ల కేంద్ర ప్రభుత్వాలు సున్నితత్వంలో వ్యవహరించవలసి వచ్చింది.
  3. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ఎంతో అస్థిరత కూడా నెలకొంది.
  4. చిన్న పార్టీలు కూడా తమ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పారిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రయోజనాలు రాబట్టుకోటానికి ప్రయత్నించాయి.
  5. కొన్నిసార్లు “విధాన పక్షపాతం” అనగా ఏదో ఒక భాగస్వామ్య పార్టీ తన మధతు ఉపసంహరించుకుంటుందన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలను అమలు చెయ్యటానికి సంకీర్ణ ప్రభుత్వం భయపడేది.
    ఉదా: మన్మో హన్‌సింగ్ ప్రభుత్వం

10th Class Social Textbook Page No.277

ప్రశ్న 17.
పశ్చిమ బెంగాల్ లోని భూ సంస్కరణలను చైనాలోని, లేదా వియత్నాంలోని భూసంస్కరణలతో పోల్చండి. వీటిల్లో పోలికలు, తేడాలు గుర్తించండి.
జవాబు:
పోలికలు :

పశ్చిమ బెంగాల్ లోని భూ సంస్కరణలువియత్నాంలోని భూ సంస్కరణలు
1. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూసంస్కరణలను అమలు చేసింది.1. కమ్యూనిస్ట్ పార్టీయే భూసంస్కరణలను అమలు చేసింది.
2. ఈ భూసంస్కరణలు ఎంతో కాలం నుండి గ్రామాలలో కొనసాగుతున్న సంప్రదాయాలను రూపుమాపాయి.2. వియత్నాంలో కూడా సంప్రదాయక వ్యవసాయ విధానాన్ని, భాగస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం జరిగింది.

తేడాలు :

పశ్చిమబెంగాల్వియత్నాం
1. “ఆపరేషన్ బర్గా” ప్రకారం గ్రామాలలో సమావేశాలు నిర్వహించి, భూస్వాముల సమక్షంలోనే కౌలుదారుల జాబితాను తయారుచేసి, సరిచూసేవాళ్లు, అన్ని చట్ట సంబంధ కాగితాలు తయారుచేసి వెంటనే పంచి పెట్టేవాళ్లు.1. భూమి లేని చిన్న రైతులకు భూమి మీద హక్కు కల్పించటం ముఖ్య ఉద్దేశం.
2. కౌలుదార్లను భూస్వాములు బలవంతంగా తొలగించ టానికి వీలులేదు. కౌలుదార్ల హక్కును వారసత్వం చేశారు. పంటలో, కౌలుదారు పెట్టుబడి పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకు దక్కేలా చట్టం చేశారు.2. వియత్నాంలో భూస్వాముల నుండి భూమిని సేకరించి భూమిలేని పేద రైతులకు భూమిని పునఃపంపిణీ చేయటం జరిగింది.
3. అన్ని రాష్ట్రాలలో కాకుండా పశ్చిమబెంగాల్ లో మరియు దేశంలో పాక్షికంగా భూసంస్కరణలు అమలయ్యాయి.3. వియత్నాంలోని ఉత్తర భాగానికి ఈ భూసంస్కరణ లను అమలు చేయడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 19 రాజకీయ ధోరణుల ఆవిర్భావం : 1977-2000

10th Class Social Textbook Page No.277

ప్రశ్న 18.
కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల ఉత్పత్తి ఎందుకు పెరిగింది?
జవాబు:

  1. కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల తమను కౌలు నుండి తీసేస్తారేమో అనే భయాలు తొలగిపోయాయి. కావున ధైర్యంగా మరియు స్వంత భూమి అనే భావనతో పూర్తి శ్రమను ఉపయోగించి సాగుచేయడం మూలంగా పంట పెరిగింది.
  2. రక్షణ లభించడం మూలంగా పొలం మీద అవసరం అయిన పెట్టుబడి పెట్టి మంచి ఎరువులు, పురుగుమందులను ఉపయోగించడం మూలంగా కూడా పంట పెరిగింది.
  3. కౌలుదార్లు పాత కాలంలో పంటసరిగా పండినా, పండకపోయినా భూస్వాములకు కౌలు మొత్తం చెల్లించవలసి వచ్చేది. కానీ కౌలుదార్లకు రక్షణ లభించటం వల్ల కేవలం పంట పండిన దానిని ఆధారంగా చేసుకొని కౌలు చెల్లించటం వల్ల కూడా ఉత్పత్తి పెరిగింది.
  4. భూసంస్కరణల మూలంగా కౌలుదారు, భూస్వామికి ఎంత పంట చెల్లించాలనేది స్పష్టంగా తెలియటంతో కౌలుదారుకి మిగులు ఎక్కువగా ఉండి, ఇంకా అధికోత్పత్తిని సాధించాలని ఆశపడేవాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

SCERT AP 10th Class Social Study Material Pdf 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
రష్యన్ విప్లవం ఆ సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. అవి ఏమిటి ? వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? (AS1)
జవాబు:
రష్యన్ విప్లవం సమాజంలో ఎన్నో మార్పులను తెచ్చింది. 1917లో ప్రారంభమైన రష్యన్ విప్లవం ఫలితంగా 1920 నాటికి అనేక మార్పులు జరిగాయి.

  1. జార్ చక్రవర్తుల పాలన దూరమై ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు పరిపాలన చేపట్టారు.
  2. రష్యాలో “బోల్షివిక్”లు లెనిన్ నాయకత్వంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
  3. షరతులు లేని శాంతిని నెలకొల్పి, భూమినంతటినీ జాతీయం చేసి దానిని రైతులందరికీ పంచిపెట్టడం జరిగింది.
  4. ధరలను నియంత్రించి కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  5. స్టాలిన్ ఆధ్వర్యంలో రష్యాను బలమైన శక్తిగా మార్చి, పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థను చేపట్టారు.

ఎదుర్కొనే సవాళ్ళు :

  1. భూముల ఏకీకరణ సందర్భంగా పెద్ద రైతులు వ్యతిరేకించగా హింస, మరణశిక్షలు అమలుచేశారు.
  2. 1929-30 లో తీవ్ర కరవు ఎదురై, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
  3. స్వేచ్ఛా మార్కెట్ కి అనుమతి లేకుండాపోయింది.
  4. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కర్మాగారాలు మూతబడి, వేలాదిమంది నిరుద్యోగులుగా మారారు.
  5. సాధారణ ప్రజాస్వామిక స్వేచ్ఛ లేదు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
తీవ్ర మాంద్యానికి కారణాల గురించి భిన్న వాదనలను పోల్చండి. వాటిల్లో దేనితో మీరు ఏకీభవిస్తారు ? కారణాలు పేర్కొనండి. (AS1)
జవాబు:
1929 చివరలో మొదలైన తీవ్ర ఆర్థికమాంద్యం 1939 వరకు కొనసాగింది.

  1. మొదటి ప్రపంచయుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది.
  2. అమెరికాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలడం వలన దాని పరిణామాలు అనతికాలంలోనే అన్ని దేశాలను ప్రభావితం చేశాయి.
  3. నిరుద్యోగం పెరిగి ఆదాయాలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వాలు కూడా ప్రభావితం అయ్యాయి.
  4. గిరాకీ తగ్గడంతో కర్మాగారాలు మూతబడి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది.

ప్రశ్న 3.
నాజీ జర్మనీల చేతిలో యూదులు ఏ విధమైన వేధింపులకు గురయ్యారు? ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతున్నారా? (AS4)
జవాబు:
నాజీ జర్మనీల చేతిలో యూదులు అనేక వేధింపులకు గురయ్యారు.

  1. అల్పసంఖ్యాక వర్గ ప్రజలైన యూదులను అరెస్టు చేసి హింసించేవాళ్ళు.
  2. అంతకు ముందెన్నడు లేనంతగా దారుణాలకు ఒడిగట్టారు.
  3. నిర్బంధ శిబిరాలకు తరలించి, వారిని దేశం నుంచి బహిష్కరించారు.
  4. రెండవ ప్రపంచయుద్ధం నీడలో అమాయకులైన ఆరు కోట్ల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపించారు.
  5. ఆష్విట్జ్ వంటి హత్యాకేంద్రాలలో యూదులను గదులలోకి పంపి, దాంట్లోకి గ్యాసు పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు.

ప్రతి దేశంలోనూ కొంతమంది తమ ప్రత్యేక గుర్తింపు కారణంగా వేరుగా చూడబడుతూ వివక్షతకు, అన్యాయాలకు, బలవంతపు చావులకు బలౌతున్నారు.

ప్రశ్న 4.
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అన్న భావన కింద చేపట్టిన వివిధ చర్యలను పేర్కొనండి. రష్యాలో చేపట్టిన సంస్కరణలకూ, వీటికీ ఉన్న పోలికలు, తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
తీవ్ర మాంద్య పరిస్థితులలో సంక్షేమ రాజ్యం అనే భావన కింద చేపట్టిన చర్యలు :

  1. సామాజిక భద్రతా విధానాన్ని అమలుచేశారు.
  2. అందరికీ వర్తించే పదవీ విరమణ, పింఛను, నిరుద్యోగ బీమా, వికలాంగులకు సంక్షేమ ప్రయోజనాలు సమకూర్చాయి.
  3. తండ్రిలేని కుటుంబాలలో అవసరమున్న పిల్లలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టారు.
  4. కనీస జీవనస్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం , విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ వంటి మౌలిక అంశాలకు హామీ ఇచ్చింది.

పోలికలు :
రష్యాలో కూడా రష్యన్ విప్లవం తరువాత

  1. ధరలను నియంత్రించి, కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశారు.
  2. భూమిని పునః పంపిణీ చేసి
  3. అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన వివక్షతలేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి రష్యా ప్రయత్నించింది.

తేడాలు:

  1. రష్యాలో దీర్ఘ కాలికంగా లాభం చేకూర్చి పథకాలు అమలు చేయగా, సంక్షేమ రాజ్యంలో తక్షణం లబ్ధి చేకూర్చే పథకాలు అమలుచేసారు.
  2. ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించడానికి రష్యా ఒక బృహత్ ప్రయోగం చేపట్టగా, సంక్షేమ రాజ్యంలో భాగంగా ప్రజలందరికీ కనీస జీవనస్థాయి, మౌళిక అంశాలకు ప్రాధాన్యత.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 5.
తీవ్ర మాంద్యంతో జర్మనీ ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? నాజీ పాలకులు, హిట్లర్ వాటిని ఎలా ఉపయోగించుకున్నారు? (AS1)
(లేదా)
జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరగడానికి దారితీసిన పరిస్థితులేవి?
జవాబు:
తీవ్ర మాంద్యంతో జర్మనీ అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయింది.

  1. పారిశ్రామిక ఉత్పత్తి 40% పడిపోయింది.
  2. నిరుద్యోగుల సంఖ్య ముందెన్నడూ లేని విధంగా 60 లక్షలకు చేరింది.
  3. పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అనే బోర్డులు మెడలో వేసుకొని తిరిగేవాళ్ళు.
  4. తమ పిల్లల కడుపులు నింపలేని మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు.
  5. ప్రభుత్వం కుప్పకూలి స్థిరమైన పాలన లేకుండాపోయింది.

పై పరిస్థితులను, నాజీ పాలకులు, హిట్లర్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. తీవ్ర నిరాశ, నిస్పృహలతో . ఉన్న దేశ ప్రజలను నాజీలు, హిట్లర్ ఉద్వేగ ప్రసంగాలతో అందరినీ ఆకర్షించారు.

  1. కుదేలైన ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించి తిరిగి యథాస్థితికి తెస్తామని మాట ఇచ్చారు.
  2. పని కావాలి అనుకుంటున్న వాళ్ళకి పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని వాగ్దానం చేశారు.
  3. ప్రజల మధ్య ఐకమత్యం పెంచడానికి, సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ప్రదర్శనల ద్వారా ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారు.

ఈ విధంగా జర్మనీలో నాజీజం ప్రాబల్యం పెరిగింది.

ప్రశ్న 6.
నాజీ పాలనలో తీసుకొచ్చిన రాజకీయ మార్పులు ఏమిటి? ఒక బలమైన నాయకుడు ఉంటే చాలు దేశ సమస్యలు తీరిపోతాయని తరచు ప్రజలు వాదిస్తూ ఉంటారు. నాజీ జర్మనీలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ వాదనకు ఎలా స్పందిస్తారు? (AS4)
జవాబు:
నాజీ, పాలనలో, హిట్లర్ నాయకత్వంలో రాజకీయంగా అనేక మార్పులు తీసుకొచ్చారు.

  1. రాజకీయాలలో నాజీలు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు.
  2. పెద్ద ఎత్తున జన సమీకరణ చెయ్యటంలో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను వివరించారు.
  3. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు, నాజీ వందనం, ఉపన్యాసాల తరువాత చప్పట్లు కొట్టడం వంటివెన్నో పెనుమార్పులు చేశారు.
  4. ప్రపంచంపై జర్మనీ ఆర్యజాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతామన్న వాగ్దానంతో ఆకర్షించారు. బలమైన నాయకుడు ఉంటే దేశ సమస్యలు తీరుతాయి అనే ప్రజల వాదనలో వాస్తవముంది.

హిట్లర్ నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం కలిగి మెరుగైన భవిష్యత్తునాశిస్తూ ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా అతడిని నిలబెట్టారు. అయితే 1928 లో జర్మనీ పార్లమెంటు రీచ్ స్టాగ్ లో నాజీ పార్టీకి 2.6 శాతం ఓట్లు కూడా రాలేదు. కాని హిట్లర్ ను బలమైన నాయకుడిగా ప్రజలు గుర్తించిన పిదప 1937 నాటికి 37 శాతం ఓట్లతో నాజీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.

10th Class Social Studies 14th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II InText Questions and Answers

10th Class Social Textbook Page No.192

ప్రశ్న 1.
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ ప్రయోగం ఏ మేరకు విజయం సాధించిందో అంచనా వేయండి.
జవాబు:
సమానత్వం, స్వేచ్ఛ, సంపదలతో కూడిన ప్రపంచాన్ని నిర్మించటంలో సోవియట్ చాలా వరకు విజయం సాధించి బలమైన శక్తిగా ఎదిగింది. భూమినంతటినీ జాతీయం చేసి, దానిని రైతులందరికీ పంచిపెట్టి, బ్యాంకులను జాతీయం చేసి, ఫ్యూడల్ భూస్వాములు, రాజులు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని దేశాన్ని నిర్మించటానికి ఒక బృహత్తర ప్రయోగం అమలుచేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 2.
ఇటువంటి ప్రయోగాల కోసం వేలాదిమందిని చంపటం సమర్థనీయమేనా?
జవాబు:
సమర్ధనీయం కాదు. జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత “యానిమల్ ఫాం” అన్న తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను USSR ఎలా నీరు కార్చిందో వివరించాడు. ప్రతిపక్షాన్ని హింసాత్మకంగా నిర్మూలించడం. ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం హేతుబద్ధం కాదు. ప్రజలలో మార్పు తెచ్చి, ప్రజలకు విశ్వాసపాత్రులుగా వ్యవహరించాలి.

ప్రశ్న 3.
కమ్యూనిస్టు విధానాలపై వచ్చిన విమర్శలు ఏమిటి?
జవాబు:
సమానత, జాతి స్వేచ్ఛ వంటి ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచవ్యాప్త ప్రజలందరిలో కమ్యూనిస్టు విధానాలు కొంతకాలం ఆమోదం పొందినప్పటికీ కమ్యూనిస్టులు విప్లవాల కోసం కృషి చేశారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అణచివెయ్యడం, హింసాత్మకంగా నిర్మూలించడం, బహుళపార్టీ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లేకపోవడం వంటి దారుణమైన కమ్యూనిస్టు విధానాలు విమర్శలపాలైనాయి. భూముల ఏకీకరణను వ్యతిరేకించిన పెద్ద రైతులను జైలుపాలు చేసి, విదేశాలకు పంపించడమే కాకుండా, మరణశిక్షలు కూడా వేసి విమర్శలపాలైనారు.

ప్రశ్న 4.
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని ఏ ఏ అంశాలు అమలులో ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని అనేక అంశాలు అమలులో ఉన్నాయి.

  1. అందరికీ వర్తించే పదవీ విరమణ పింఛను.
  2. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు నెలసరి పింఛను.
  3. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర
  4. ఆరోగ్య పథకాలు
  5. శిశుసంరక్షణ పథకాలు
  6. ఆహారం, గృహవసతి, విద్య, వైద్య సహాయాలు
  7. ప్రజలందరికీ కనీస జీవనస్థాయి

10th Class Social Textbook Page No.197

ప్రశ్న 5.
నాజీ సిద్ధాంతం అధికస్వామ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. జర్మనీ జనాభాలో యూదులు 0.75 శాతం మాత్రమే. యూదులనే కాకుండా నాజీలను వ్యతిరేకించే వాళ్ళను కూడా శిక్షించే వాళ్ళు. పాస్టర్ నీ మొల్లర్ తన కవితలో దీనిని ఎలా చూపించాడు?
జవాబు:
నాజీ సామ్రాజ్యంలో పాలకశక్తులు సాధారణ ప్రజలపై, యూదులపై దారుణమైన హింసను, దమనకాండను సాగించాయి. అందుకనే కవితలో పాస్టర్ నీ మొల్లర్ ఇలా చెప్పాడు. “కమ్యూనిస్టులు, సోషల్ డెమోక్రాట్లు, కార్మిక సంఘాలు, యూదులు కోసం వచ్చి, వెతికి చివరకు పైవారెవరు కాని నన్ను కూడా తీసుకెళ్ళారు. పై వారి కోసం వచ్చినపుడు నేను నిరసన తెలియజేశాను. కానీ నా కోసం నాజీలు వచ్చినపుడు నాకు నిరసన తెలిపేవారు మిగలలేదని” రాసుకొచ్చాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 6.
జర్మను ప్రజల శత్రువులుగా హిట్లర్ యూదులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు?
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం, ఆర్ధికమాంద్యం వలన జర్మనీ ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కబడింది. జర్మనీలో ఎదురైన అన్ని సమస్యలకు మూలం యూదులని హిట్లర్ ప్రగాఢ నమ్మకం. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ, ఆ రెండింటినీ తిప్పికొట్టే క్రమంలో యూదులను తుదముట్టించడానికి హిట్లర్ పూనుకొన్నాడు.

ప్రశ్న 7.
హెలోకాస్ట్ గురించి, ఆష్విల్ట్ తరహా శిబిరాల గురించి మరింత తెలుసుకుని వాటి ఆధారంగా ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధం నీడలో జర్మనీ మానవ మారణహోమాన్ని చేపట్టింది. దీని ఫలితంగా అమాయకులైన ఎంపిక చేయబడ్డ పౌరులు పెద్ద సంఖ్యలో చంపివేయబడ్డారు. ప్రజలను చంపటానికి నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నారు. ఉదాహరణకు “ఆష్విట్జ్” వంటి హత్యాకేంద్రాలలో ప్రజలను గదులలోనికి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసే వాళ్ళు.

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 8.
యుద్ధం, తీవ్రమాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక నమూనాలు ముందుకు వచ్చాయి. వాటిని పేర్కొని, వాటి పరిమితులను కూడా పేర్కొనండి.
జవాబు:
నమూనాలు :
యుద్ధం, తీవ్ర మాంద్యం తరువాత జాతీయ అభివృద్ధికి అనేక కొత్త నమూనాలు ముందుకు వచ్చాయి.

అవి:

  1. రాజ్యం, ప్రజలందరూ గౌరవంగా బ్రతకడానికి అవసరం అయిన కనీస మౌలిక అవసారాలను కల్పించాలి.
  2. రాజ్యం, ప్రజల ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, ఆరోగ్యం, పిల్లలు, వృద్ధుల పరిరక్షణ, విద్య వంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాలి.
  3. రాజ్యం విశాలమైనది. సమర్థులైన పౌరులందరికి ఉద్యోగాలు కల్పించవలసిన బాధ్యత రాజ్యానిదే.

పరిమితులు :
ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సాధారణ పరిస్థితులలో మాత్రమే అమలు చేయుటకు వీలవుతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.190

ప్రశ్న 9.
విప్లవం గురించి గ్రామీణ ప్రాంతంలో రెండు పక్షాలను పాఠ్యాంశంలోనిది చదవండి. ఆ ఘటనలకు మీరు కూడా సాక్షిగా ఊహించుకోండి. 1) ఎస్టేట్ యజమాని 2) చిన్న రైతు 3) పత్రికా విలేఖరిగా ఆనాటి ఘటనల గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
1) ఎస్టేట్ యజమాని :
గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు కానవస్తున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఆస్తి, భూములు మాకు చెందుతాయో, కోల్పోతామో తెలియడం లేదు. కాని ప్రజల అంతరాత్మ సజీవంగా ఉందని మాకు సంతోషంగా ఉంది.

2) చిన్న రైతు :
నిశ్శబ్దంగా, శాంతియుతంగా ఎటువంటి బాధ లేకుండా తిరుగుబాటు జరిగిపోయింది. మాకు రెండు ఆవులు, రెండు గుర్రాలను ఉంచారు. పనివాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వమని, మానవత్వంతో చూడమని వేడుకున్నారు.

3) పత్రికా విలేఖరి :
1917 అక్టోబర్ 25 విప్లవం గ్రామీణ ప్రాంతాలలో పెనుమార్పులకు నాంది పలికింది. ప్రజలు ఉత్సాహంతో స్వాగతించారు. ఉచితంగా భూమి లభించి, ఆనందంగా బ్రతకవచ్చని తలచారు. జార్ భవనాలను కూలగొట్టి శిథిలాలుగా వదిలేశారు.

10th Class Social Textbook Page No.194

ప్రశ్న 10.
ప్రపంచాన్ని జయించాలన్న భావనను హిట్లర్ ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడా? బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
బలం, శక్తి ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచం చెందాలని నేను అనుకోవడం లేదు. ప్రపంచాన్ని జయించాలన్న ఆలోచన హిట్లర్కు బలీయంగా ఉంది. ఆనాటి పరిస్థితులు, వర్సయిల్స్ సంధి షరతులతో పాటు అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని ఈ సందర్భంగా హిట్లర్ అభిప్రాయం. తన ఉపన్యాసాలతో, నాజీ పార్టీ సిద్ధాంతాలతో పాటు దురహంకారపూరిత జాతీయతావాదం ద్వారా, సైనికవాదం అమలుచేయడం ద్వారా సిద్ధాంత బోధనతో ప్రజలను మైమరపించి, ప్రపంచంలో గల దేశాలను భయపెట్టి ప్రపంచాన్ని జయించాలన్న భావన ఈ సందర్భంగా హిట్లర్ ప్రతిపాదిస్తున్నాడు.

ప్రశ్న 11.
ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయి, కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికులుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ జీవితంలోని ఒక రోజు గురించి రాయండి.
జవాబు:
ఉద్యోగం కోల్పోయి కొన్ని సంవత్సరాలపాటు ఉద్యోగం దొరకని కార్మికుల జీవనం దుర్భరం. మాటల్లో వర్ణించలేము.

ఒక రోజు :
ఆ రోజు ఉదయం నుండి వెతలే. మంచాన పడిన తండ్రి, నా వంక దీనంగా చూసి, వైద్యం’ చేయించమనే మాటతో నా కళ్ళు చెమర్చాయి. నాన్నా ! స్కూల్ కు ఫీజు కట్టడానికి ఈ రోజు ఆఖరు, అన్న 10 సం||రాల రేవతి ఏడుపు ఓదార్చలేనిది. ఏమండీ ! ఈ రోజు వంటకి దినుసులు లేవన్న భార్య మాటలు ఇంకా చెప్పనలవి కాదు. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి బయటకు వెళ్ళడానికి కూడా చార్జీలు లేని స్థితిని నేను చెప్పలేను.

ప్రశ్న 12.
పండించిన పంట ధర సగానికంటే తక్కువకు పడిపోయిన రైతుగా మిమ్మల్ని ఊహించుకోండి. మీ స్పందనను మూడు వందల పదాలలో రాయండి.
జవాబు:
పంట చేతికి రాగానే మార్కెట్లో అప్పటివరకు ఉన్న ధర అమాంతం సగానికి పడిపోగా నా కళ్ళు చెమర్చాయి. అప్పుచేసి వ్యవసాయం చేసి, వడ్డీలకు ఎరువులు, పురుగుమందులు కొన్న నాకు ఈ ధరతో చేసిన రుణం ఎలా తీర్చగలను ? వారికి ఎలా సమాధానం చెప్పగలను? పండిన పంట ధరతో వచ్చిన డబ్బుతో పండగకి పిల్లలకు బట్టలు తీసి, ఆనందంగా జీవితం గడుపుదామనుకుంటే, ఎందుకీ దుస్థితి దాపురించింది ? నేనెవరికి ద్రోహం చేశాను అని మదనపడుతున్నాను. ” వ్యవసాయం జూదంలా పరిణమించడం ఈ పరిస్థితికి కారణం.

10th Class Social Textbook Page No.195

ప్రశ్న 13.
పిల్లల్ని పెంచే శ్రమ, బాధలకే మహిళలు పరిమితం కావాలన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా?
జవాబు:
నేను ఏకీభవించను. సమాజంలో కుటుంబానికి గుర్తింపు, పిల్లల భవిష్యత్తుకై మార్గదర్శకత్వం చేసి వీటికోసం తన శక్తి నంతటినీ ఒడి, భర్తకు చేదోడువాదోడుగా ఉండి, అనునిత్యం కుటుంబ పురోభివృద్ధికి ఆధారంగా ఉండేది మహిళలు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తన కుటుంబ అభివృద్ధికి దిక్సూచి వంటివారు మహిళలు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

ప్రశ్న 14.
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో స్త్రీ, పురుషులు సమానంగా భాగస్వాములు కాగలరని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
పిల్లల పెంపకం, కర్మాగారాలు, కార్యాలయాలు, పొలాల్లో పనిచెయ్యటం వంటి జీవితానికి సంబంధించిన అంశాలలో సీ, పురుషులు సమాన భాగస్వాములు. ఎందుకంటే పిల్లల పెంపకం, అమ్మ ప్రేమ, నాన్న లాలన పిల్లలకు ఎంతో అవసరం. పిల్లల పెంపకంలోనూ, పిల్లలను సన్మార్గంలో నడిపించుటలోను ఇరువురూ బాధ్యులే. కార్యాలయాల్లో స్త్రీ, పురుషులు ఇరువురు తమ మేధాశక్తితో సమానంగా పనిచేయగలరు. కర్మాగారాలు, పొలాల్లో తమతమ శక్తి మేరకు ఇరువురు కూడా పనిచేసి ఆయా పనులకు న్యాయం చేస్తారు.

10th Class Social Textbook Page No.199

ప్రశ్న 15.
హిట్లర్ సిద్ధాంతం, ఆర్థిక విధానాల ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధం సంభవించిందని ఎలా చెప్పవచ్చు?
జవాబు:
హిట్లర్ అద్భుతమైన వక్త. తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజితులను చేశాడు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత యుద్ధ నష్టాల చెల్లింపులు వంటి వాటి భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేతనాలు తగ్గాయి. జర్మనీ వీధులలో పురుషులు “ఏ పని చేయడానికైనా సిద్ధం” అని రాసి ఉన్న కారులు మెడలో తగిలించుకొనేవారంటే ఆనాటి పరిస్థితిని అంచనా వేయవచ్చు.

ఇటువంటి పరిస్థితులలో హిట్లర్ తన సిద్ధాంతం ద్వారా ఇటు ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచి, మరో ప్రక్క ప్రపంచ దేశాలలో అభద్రతాభావం, సైనికవాదాలు, జాత్యహంకారాలతో ప్రపంచం భయపడేటట్టు చేసి, పోలెండ్ పై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు.

AP Board 10th Class Social Solutions Chapter 14 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-II

10th Class Social Textbook Page No.200

ప్రశ్న 16.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యా, జర్మనీల అనుభవాలను పోల్చండి. వాటిల్లో పోలికలు, తేడాలు ఏమిటి?
జవాబు:
పోలికలు :

  1. మొదటి ప్రపంచయుద్ధం తరువాత జర్మనీ, రష్యా రెండు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
  2. రష్యాలో లెనిన్, స్టాలిన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ రాజ్య కార్యక్రమాలు అమలు జరుగగా, జర్మనీలో కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రజారంజక కార్యక్రమాలు రూపొందించారు.
  3. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉండడానికి జర్మనీ, రష్యా దేశాలు ప్రయత్నించాయి.

తేడాలు :

  1. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ రెండు దేశాలలో జర్మనీ ఆర్థికంగా మరియు బలీయమైన ప్రాంతాలను రష్యా కంటే – ఎక్కువగా పోగొట్టుకుంది.
  2. రష్యాలో భూముల ఏకీకరణ ద్వారా సామూహిక క్షేత్రాలకు, వ్యవసాయానికి ప్రాధాన్యతనీయగా, జర్మనీ వ్యవసాయ రంగాన్ని విస్మరించింది.
  3. రష్యా ప్రపంచంలో కార్మికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, సౌజీ పార్టీ సిద్ధాంతాలకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చింది.
  4. ఆర్ధికమాంద్యం సమయంలో జర్మనీ కంటే రష్యా బాగా చితికిపోయింది.
  5. జర్మనీ ప్రతీకార చర్యలతో సౌగగా, రష్యాదేశం అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
  6. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత రష్యా అగ్రదేశం కాగా, జర్మనీ కుదేలైంది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

SCERT AP 10th Class Social Study Material Pdf 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టు ముందున్న వ్యాఖ్యానానికి సంబంధించి అనువైన వ్యాఖ్యానం / వ్యాఖ్యానాలను బ్రాకెట్టు లోపల ఉన్నవాటి నుంచి గుర్తించండి. (AS1)
అ) రాజకీయ సమానత్వాన్ని దీనితో గుర్తించవచ్చు (ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందే హక్కు, ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం, దైవారాధన ప్రదేశంలోకి ప్రవేశించే హక్కు)
ఆ) భారతదేశ విషయంలో అందరికీ వయోజన ఓటు హక్కు అంటే (అందరినీ ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం, అందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యటానికి అనుమతించటం)
ఇ) కాంగ్రెస్ ఆధిపత్యం దీని వల్ల సాధ్యమయ్యింది (విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం, ఎన్నికల తరువాత అత్యధిక శాసన సభా స్థానాలను గెలుచుకోగలగటం, ఎన్నికలలో పోలీసు బలగాన్ని ఉపయోగించుకోగలగటం)
ఈ) అత్యవసర పరిస్థితి ఫలితంగా (ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి. పేదరికం తొలగింపబడింది. అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందింది)
జవాబు:
అ) ఒక వ్యక్తి – ఒక ఓటు అన్న సూత్రం
ఆ) అందరినీ ఎన్నికలలో ఓటు వెయ్యటానికి అనుమతించటం
ఇ) విభిన్న సిద్ధాంతాలు ఉన్న వాళ్లని ఆకర్షించగలగటం
ఈ) ప్రజల హక్కులకు పరిమితులు విధింపబడ్డాయి.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 2.
స్వాతంత్ర్యం వచ్చిన తొలి సంవత్సరాలలో సామాజిక-ఆర్థిక మార్పు తీసుకురావటానికి ఏ చర్యలు చేపట్టారు? (AS1)
జవాబు:
రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాలలో సమానత్వాన్ని కోరుకుంది. కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి ఆహార ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించబడింది. వ్యవసాయ రంగంలోని మార్పును నెహ్రూ కేవలం ఆర్ధిక అంశంగా చూడలేదు, దానిని గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్ధిక మార్పుగా పరిగణించాడు. కావున సామాజిక – ఆర్థిక మార్పు తీసుకురావడానికి నెహ్రూ ఈ క్రింది చర్యలను చేపట్టినాడు. ప్రధానంగా మూడు అంశాలున్నాయి.
అవి :

  1. భూసంస్కరణలు
  2. వ్యవసాయ సహకార సంఘాలు
  3. స్థానిక స్వపరిపాలన

1) భూసంస్కరణలు :
మూడు రకాలైన భూసంస్కరణలను నెహ్రూ ప్రతిపాదించాడు.
ఎ) జమిందారీ వ్యవస్థ రద్దు
బి) కౌలు విధానాల సంస్కరణ
సి) భూ పరిమితి విధానాలు

ఈ మూడు సంస్కరణల ముఖ్య ఉద్దేశం దున్నే వానికి, భూమి చెందేలా చూసి మరింత ఉత్పత్తి చెయ్యటానికి ప్రోత్సహించటం.

2) వ్యవసాయ సహకార సంఘాలు :
సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా లాభసాటి పరిమాణాన్ని చేరుకోవటమే కాకుండా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి.

3) స్థానిక స్వపరిపాలన :
భూసంస్కరణలు అమలు అయ్యేలా చూసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.

మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి విద్యుత్తు ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయుటపై దృష్టి సారించారు. ఆనకట్టల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వృద్ధి చెందాయి. దేశం ప్రగతి సాధించాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఎక్కువ మంది కర్మాగారాలలోనూ, సేవారంగంలోనూ పనిచేసేలా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రణాళిక కర్తలు గుర్తించి, రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాధాన్యత పరిశ్రమల వైపునకు మళ్లించారు.

ప్రశ్న 3.
ఒక పార్టీ ఆధిపత్యం అంటే ఏం అర్థం చేసుకున్నారు? అది ఎన్నికలలో మాత్రమే ఆధిపత్యమా, లేక సిద్ధాంత భావజాలంలో కూడా ఆధిపత్యమా? మీ కారణాలను పేర్కొంటూ చర్చించండి. (AS1)
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952, 1957, 1962 లలో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. భారతదేశానికి జవహర్‌లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయ్యాడు. ఇతర పార్టీలలో ఏ ఒక్క పార్టీకి కూడా 11% మించి ఓట్లు రాలేదు. కాంగ్రెస్ 70% పైగా స్థానాలను గెలుచుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ ఆధిపత్యం ఒక ఎన్నికలలోనే కాదు, సిద్ధాంత, భావజాలంలో కూడా కొనసాగుతుంది.

కాంగ్రెస్ ఆధిపత్యానికి కారణాలు :

  1. 1952, 1957, 1962 లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లతో విజయం సాధించి అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
  2. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ నాయకత్వం మితవాదుల చేతులలో ఉండేది. తరువాత అతివాదులు, చిట్ట చివరికి గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ పనిచేసింది. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ లక్ష్యం దేశ స్వాతంత్ర్యం అవటం వల్ల ఈ సంస్థలో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల ఈ సంస్థకు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. స్వాతంత్ర్యం తరువాత రాజకీయ పార్టీగా మారిన వాతావరణంలో కూడా ఈ బహుతావాద దృక్పథాన్ని కాంగ్రెస్ వదులుకోలేక పోయింది. ఇందులో వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు అందరూ ఉన్నారు. విభిన్న శక్తులకు ఆశ్రయం కల్పించింది.
  4. కాంగ్రెస్ లో ఎల్లప్పుడూ అంతర్గతంగా చిన్నచిన్న బృందాలు ఉండేవి. ఈ బృందాలు నాయకుల మధ్య పోటీ కారణంగా ఏర్పడ్డాయి. పార్టీ లక్ష్యాలతో వీళ్లు ఏకీభవించినప్పటికీ కొన్ని విధానాల విషయంలో విభేదాలు ఉండేవి.
  5. సభ్యుల ప్రయోజనాలను బట్టి ఈ బృందాలు వివిధ అంశాలపై వేరు వేరుగా స్పందించేవి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ విభిన్న దృక్పథాలు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనిపించేది. కొన్ని సందర్భాలలో ఈ బృందాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి నాయకత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నించేవి.
  6. ఏకపార్టీ ఆధిపత్యంలో ఉన్న పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లోపలే రాజకీయ పోటీ ఉంటూ ఉండేది. అయితే ఇతర పార్టీలు పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ ను సవాలు చేయగలిగే సంఖ్యలో స్థానాలను గెలుచుకోలేకపోయాయి.

ఇతర రాజకీయ పార్టీలు క్రమేపి బలం పుంజుకుని రెండు దశాబ్దాల కాలంలో అధికారానికి పోటీదారుగా ఎదిగాయి.

ప్రశ్న 4.
ఐక్యత సాధించే అంశంగానో లేక విభజించే దానిగానో భారతదేశ రాజకీయాలలో భాష కేంద్ర బిందువుగా అనేకసార్లు తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలను గుర్తించి వాటిని వివరించండి. (AS1)
జవాబు:
కొత్తగా ఏర్పడిన దేశం ఎదుర్కొన్న మొదటి సవాళ్లలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలన్న కోరిక ఒకటి మరియు 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీకి వ్యతిరేకంగా తమిళనాడు ఉద్యమాన్ని చేపట్టింది. ఈ విధంగా భాష అనేది భారతదేశంలో అనేక సందర్భాలలో కీలకమైన పాత్ర వహించింది.
1) బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు (కలకత్తా, మద్రాస్, బాంబే)గానూ, సెంట్రల్ ప్రావిన్సెస్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగానూ విభజింపబడి ఉండేది. దేశంలో అధికభాగం అనేక సంస్థానాల కింద ఉంది. ఈ రాష్ట్రాలలో పలు భాషలు మాట్లాడే ప్రజలు కలసి జీవిస్తున్నారు. ఒకే భాషను మాట్లాడుతూ పక్క పక్క ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా ఒక రాష్ట్రంగా సంఘటితపరచాలంటూ కోరసాగారు. వీటితో సంయుక్త కర్ణాటక (మద్రాసు, మైసూరు, బాంబే, హైదరాబాదులలో కన్నడ మాట్లాడే ప్రజలను కలుపుతూ) సంయుక్త మహారాష్ట్ర, మహా గుజరాత్ ఉద్యమం, ట్రావెన్ కోర్-కొచ్చిన్ సంస్థానాల విలీనం, సిక్కులకు పంజాబ్ రాష్ట్రం వంటి కోరికలు ఉండేవి. అయితే మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకులు ఆ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను పున్వ్యవస్థీకరిస్తే దేశం ముక్కలు కావటానికి దారితీస్తుందని భయపడసాగారు.

2) తెలుగు మాట్లాడే ప్రజలు అన్నిటికంటే తీవ్రంగా ఉద్యమాన్ని చేపట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు అనుగుణంగా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని అమలు చెయ్యాలని వాళ్లు పట్టుపట్టారు. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక్క తాటి కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ ఉద్యమం స్వాతంత్ర్యం తరువాత కూడా కొనసాగింది. విన్నపాలు, దరఖాస్తులు, వీధులలో కవాతులు, నిరాహారదీక్షలు వంటి పద్ధతులను ఇందుకు ఉపయోగించారు.

3) 1963లో అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి, డి.ఎం.కె తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్ లు నిర్వహించారు. దిష్టిబొమ్మలు, హిందీ పుస్తకాలు, చివరికి రాజ్యాంగంలోని పేజీలను కూడా తగలబెట్టారు. ‘సైన్ బోర్డులలో హిందీలో ఉన్న దాని మీద చాలా చోట్ల నలుపు రంగు పూశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా జనాదరణ పొందిన ఈ భాషా ఉద్యమాల వల్ల ప్రభుత్వం తన అధికారిక స్థానాన్ని పునః సమీక్షించుకోవలసి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, హిందీ వ్యతిరేక ఉద్యమాలలో ప్రధానమంత్రులు పరిస్థితులు చేజారిపోకుండా తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. సమస్యలను పరిష్కరించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 5.
1967 ఎన్నికల తరువాత రాజకీయ వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏవి? (AS1)
జవాబు:
భారతదేశ చరిత్రలో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నికలను ప్రజలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణిస్తున్నారని, వాటికి తమదైన ఉనికి ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.

ముఖ్యమైన మార్పులు:

  1. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ తక్కువ ఆధిక్యత (284 స్థానాలు) తో ఎన్నికయింది. కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ చవిచూడని ఫలితాలను చవిచూసింది.
  2. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మద్రాస్, కేరళ శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది.
  3. తమిళనాడు, కేరళలో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. తమిళనాడులో డి.ఎం.కె. ఘనవిజయం సాధించింది. ప్రజాదరణ ఉన్న సినిమా హీరో ఎం.జి. రామచంద్రన్ మద్దతును డి.ఎం.కె. ఉపయోగించుకుంది.
  4. పశ్చిమబెంగాల్, ఒరిస్సాలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది.
  5. ఈ ఓటములతో కాంగ్రెస్ ఆంతరంగికంగా బలహీనపడింది. ఉత్తరాది రాష్ట్రాలలో స్వల్ప విజయాలు పొందిన చోట్ల దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు ఫిరాయించారు. ఫలితంగా కాంగ్రెస్ పడిపోయి ‘సంయుక్త విధాయక దళ్ (ఎస్వీడి) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
  6. భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు ఒక మైలురాయిగా ఉంటాయి. ఒక విధంగా ప్రజాస్వామిక తిరుగుబాటును ఇది సూచిస్తుంది. మధ్యస్థాయి కులాలు భూసంస్కరణల వల్ల ప్రయోజనం పొంది, ఆర్ధికంగా లాభపడి, మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి.
    ఉదా : హర్యానా, ఉత్తరప్రదేశ్ లో జాట్, బీహార్ లో కుర్మి, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, కమ్మ. ఈ కులాలు ఆయా రాష్ట్రాలలో ఆధిపత్య కులాలు.
  7. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ భావాలు తిరిగి ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహించారు.
  8. 1969లో అసోంలోని ఖాసి, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలలో ‘మేఘాలయ’ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
  9. 1966లో ఏర్పడిన పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీఘర్ ని తమకు ఇమ్మని 1968-69లలో పంజాబ్ ప్రజలు ఆందోళనలు చేశారు.
  10. మహారాష్ట్రలో బొంబాయి మహారాష్ట్ర వాసులకే చెందాలన్న వింత వాదన మొదలయ్యింది. దీనికి ‘శివసేన’ నాయకత్వం వహించింది.
  11. బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో అనేక సమస్యలు తలెత్తాయి.

1967 ఎన్నికల తరువాత, పార్టీ లోపలి, పార్టీ బయట నుండి వచ్చే సమస్యలను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎదుర్కొంది.

ప్రశ్న 6.
రాష్ట్రాలను ఏర్పరచటానికి మరొక ఆధారం ఏమైనా ఉందా? భాష ఆధారంగా పునఃవ్యవస్థీకరణ కంటే అది ఏ విధంగా మెరుగైనదిగా ఉండేది? (AS1)
జవాబు:
రాష్ట్రాలను ఏర్పరచటానికి భాష కాకుండా “భౌగోళికంగా” పునర్వ్యవస్థీకరిస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకనగా –
1) భాష ఆధారంగా పునర్వ్యవస్థీకరణ మూలంగా ఇటీవలి కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.
ఉదా : తెలంగాణ ఉద్యమం. భాషా ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికి తెలంగాణా వాదులు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తున్నారు.

2) భౌగోళికంగా రాష్ట్రాలను విభజించినట్లయితే భాషాపరంగా వచ్చే సమస్యలు వచ్చేవి కావు. భౌగోళికంగా విభజించినప్పుడు ఆ ప్రాంతంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలుంటారు. కావున ప్రత్యేకంగా ఒక అంశం ఆధారంగా ఉద్యమాలు జరగకపోవచ్చు.

కావున నా అభిప్రాయం ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషాపరంగా, కులాల, మతాల ప్రాతిపదికగా కాకుంటే, భౌగోళికంగా జరిగివుంటే బాగుండేది.

ప్రశ్న 7.
ఇందిరాగాంధి తీసుకున్న ఏ చర్యలను ‘వామపక్ష పంథా వైపు మళ్లించటం’గా పేర్కొన్నారు? అందుకు ముందు దశాబ్దాల విధానాలతో పోలిస్తే ఇవి ఏ విధంగా భిన్నమైనవి? ఆర్థికశాస్త్ర అధ్యాయాల ఆధారంగా ప్రస్తుత విధానాలకూ, వాటికీ తేడా ఏమిటో పేర్కొనండి. (AS1)
జవాబు:
1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. “గరీబీ హటావో” అన్న జనాకర్శక నినాదంతో ఇందిరాగాంధీకి ప్రజాదరణ మరింత పెరిగింది. ప్రతిపక్షం అన్నది లేకుండా పోయింది. కాని ఇందిరాగాంధీ చేపట్టిన కొన్ని చర్యల మూలంగా వామపక్ష పంథావైపు మళ్లించటమనేది జరిగింది.

  1. 1973లో అరబ్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో చమురు ధరలు ఎన్నడూ లేనంతగా పెరగటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది.
  2. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఆహార కొరత, నిరుద్యోగం వంటివి ప్రభావం చూపసాగాయి.
  3. సామాజిక, ఆర్ధికమార్పు సాధించాలన్న లక్ష్యంతో అనేక ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తూ, చేసిన చట్టం, రాజ భరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టాల విషయంలో, సామాజిక, ఆర్ధిక మార్పు అన్న పేరుతో రాజ్యాంగాన్ని తరచు సవరిస్తున్నారని, అది వాస్తవానికి దాని స్వరూపాన్ని మార్చివేస్తుందని, భిన్న వ్యవస్థాగత నిర్మాణాల మధ్య ప్రస్తుతం ఉన్న సమతౌల్యం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. దీని మూలంగా రాజ్యాంగ సవరణకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు కొంతవరకు పరిమితులు విధింపబడ్డాయి.
  4. ప్రజలలో అధికశాతం సంతోషంగా లేరు. దీంతో ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది. దేశ వివిధ ప్రాంతాలలోని అసంతృప్తిని ఆసరా చేసుకోసాగారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఐక్యమైన ప్రతిపక్షాలు దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ కి ప్రత్యేకించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించాయి.

1971 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ రికార్డుస్థాయిలో విజయం సాధించింది. ఇందిరాగాంధీకి ప్రజాదరణ పెరిగింది. పేదలు, అట్టడుగు ప్రజలతో తాను, తమ పార్టీ మమేకం కావటం ద్వారా పార్టీకి కొత్త సామాజిక మద్దతులను కూడగట్టటానికి ఆమె ప్రయత్నించింది. 1971 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరాగాంధీ అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ అంచెలంచెలుగా అధికార కేంద్రీకరణ గావించింది. ఇది వామపక్షాల ఆవిర్భావానికి కారణమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

ప్రశ్న 8.
భారత ప్రజాస్వామ్యాన్ని అత్యవసర పరిస్థితి ఏ విధంగా వెనక్కి తీసుకుపోయింది? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితిలో శాంతిని కాపాడే పేరుతో పౌరహక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం అనేక తీవ్రమైన చట్టాలను చేసింది.

  1. దేశంలో శాంతి, భద్రతలకు అవసరమంటూ ప్రభుత్వం అనేక అణిచివేత చర్యలకు పాల్పడింది.
  2. అనేక ప్రాథమిక హక్కులను నిలిపివేశారు.
  3. ఏ కారణం లేకుండా అరెస్టు చెయ్యటం, హింసించటం, పౌర హక్కులకు భంగం కలిగించటం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి.
  4. అత్యవసర పరిస్థితి కాలంలో ధరల నియంత్రణ, నల్లబజారు, వెట్టిచాకిరీలకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలను ప్రజలు స్వాగతించారు.
  5. ఈ కాలంలో చేపట్టిన మురికివాడల తొలగింపు, జనాభా నియంత్రణ పేరుతో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించటం వంటి కార్యక్రమాలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. అయితే పౌరహక్కులు లేనందు వల్ల ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసే మార్గాలు లేకపోయాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి లేకుండా పోయింది.

శాంతి, భద్రతలు నెలకొల్పటానికి, దేశ సమగ్రతను కాపాడటానికి అత్యవసర పరిస్థితి అవసరమయ్యిందని ప్రభుత్వం సమర్థించుకుంది.

ప్రశ్న 9.
అత్యవసర పరిస్థితి కాలంలో ఏ విధమైన వ్యవస్థాగత మార్పులు వచ్చాయి? (AS1)
జవాబు:
అత్యవసర పరిస్థితి కాలంలో కొన్ని వ్యవస్థాగత మార్పులు జరిగినాయి. అవి :

1) రాజ్యాంగానికి 42 వ సవరణ జరిగింది. ఈ సవరణ అనేక మార్పులను తీసుకువచ్చింది. ఈ సవరణలోని అంశాలు:
ఎ) ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చెయ్యటం.
బి) రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచటం.
సి) సామాజిక, ఆర్థిక మార్పునకు ఉద్దేశించిన చట్టాలకు న్యాయస్థానాల నుంచి సాధ్యమైనంత రక్షణను కల్పించటం.
డి) న్యాయవ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయటం.

2) ఈ 42 వ సవరణతో “లౌకిక, సామ్యవాద” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. తద్వారా భారతదేశం మత ప్రమేయం లేని దేశమని, సామ్యవాద దేశమని ప్రకటించడం జరిగింది.

3) ఈ సవరణ ఉద్దేశాలుగా దేశ సమైక్యతను బలపరచటం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని న్యాయస్థానాల నుంచి కాపాడటం వంటి వాటిని పేర్కొన్నప్పటికీ వాస్తవంలో దీని వల్ల దేశ ప్రజాస్వామ్య స్వభావం బలహీనపడిందని చెప్పవచ్చు.

10th Class Social Studies 18th Lesson స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) InText Questions and Answers

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 1.
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పుకోటానికి వీలు ఉండేదా?
జవాబు:
ప్రజలందరికీ ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామిక దేశమని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు, అందరికీ ఓటు హక్కు ఉండడం. కావున ఓటు హక్కు లేకపోతే మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 2.
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
జవాబు:
భారతదేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 3.
మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే 1970 లకి ముందు సహకార సంఘాల వంటి సంస్థలను స్థాపించారేమో తెలుసుకోండి. దాంట్లో సభ్యులుగా ఎవరు ఉన్నారో తెలుసుకోండి.
జవాబు:
మా గ్రామంలో 1970కి ముందు “వ్యవసాయ సహకార సమితి” ఉంది. అందులో సభ్యులుగా గ్రామంలో ఉన్నత కుటుంబాలకు చెందినవారు ఉండేవారని మా తాత గారిని అడిగి తెలుసుకున్నాను.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 4.
జాతీయభాష అవసరం ఉందా?
జవాబు:
అవును. జాతీయ భాష అవసరం ఉంది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 5.
అన్ని భాషలకు సమాన హోదా ఉండాలా?
జవాబు:
అవును. అన్ని భాషలకూ సమాన హోదా ఉండాలి.

10th Class Social Textbook Page No.248

ప్రశ్న 6.
సామాజిక సమానత్వాన్ని సాధించామని మీరు అనుకుంటున్నారా? సామాజిక సమానత్వాన్ని, అసమానత్వాన్ని సూచించే మీకు ఎదురైన ఉదాహరణలను పేర్కొనండి.
జవాబు:

  1. కుల, మత, వర్గ, స్త్రీ పురుష, ధనిక, పేద వంటి తారతమ్యాలు లేకుండా అందరికి సమాన న్యాయం, స్వాతంత్ర్యం స్వేచ్ఛలను రాజ్యాంగం కల్పించింది. ఇది సమసమాజాన్ని చూపిస్తుంది.
  2. ప్రభుత్వ అవకాశాలలో కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద భేదాలు చూపకుండా అందరికి సమాన అవకాశాలున్నాయి. స్త్రీ, పురుష ఉద్యోగులకు ప్రభుత్వం సమాన వేతనాలు చెల్లిస్తుంది. ఎటువంటి విచక్షణ చూపదు. ఇది సమానత్వాన్ని సూచిస్తుంది.
  3. అయినప్పటికీ కూడా ఇంకా కుల వ్యవస్థకు సంబంధించి గ్రామాలలో వివక్ష ఎక్కువగా కనిపిస్తుంది. లింగ వివక్ష కూడా కొనసాగుతున్నది. ఇది అసమానత్వాన్ని సూచిస్తుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 7.
ఎన్నికలను, ప్రత్యేకించి ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవటాన్ని నిరక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు?
జవాబు:

  1. పాశ్చాత్య దేశాలలో ప్రజలు ఓటుహక్కును దశలవారీగా పొందారు. మన దేశంలో 1935 లో కేవలం 10% ప్రజలకే “ఓటు హక్కు ఉండేది. అయితే స్వాతంత్ర్యం తరువాత భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది.
  2. కానీ నిరక్షరాస్యత మూలంగా మొదటి సాధారణ ఎన్నికలు ప్రభుత్వానికి సవాలుగా పరిణమించాయి.
  3. నిరక్షరాస్యత సమస్యను అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయపార్టీ అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుండి కొన్ని గుర్తులను ఉపయోగించుట జరిగింది. ప్రజలు తమకు నచ్చిన గుర్తు ఉన్న డబ్బాలో తమ ఓటును వేశారు. ఈ రకంగా ఎన్నికల సంఘం నిరక్షరాస్యతను అధిగమించింది.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 8.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉండకపోతే దేశ ఐక్యతకు మరింత మేలు జరిగి ఉండేదా?
జవాబు:
అవును, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడకపోతే ఆయా ప్రాంతాలలో అనేక భాషలు మాట్లాడేవారు, అనేక కులాలు, మతాల ప్రజలు ఉండేవారు. అందరూ కలసిమెలసి జీవించటం మూలంగా వారిలో ఐకమత్యం కలిగేది. తమకు ప్రత్యేక ప్రాంతం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేక దేశం కావాలని పోరాటాలు, ఉద్యమాలు జరిగేవి కాదు. తద్వారా దేశ ఐక్యతకు మేలు జరిగేదని నా అభిప్రాయం.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 9.
ఆ సమయంలో గిరిజన భాషలను ఎందుకు పట్టించుకోలేదు?
జవాబు:

  1. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది అనేక భాషోద్యమాల ఫలితంగా జరిగింది. కావున భాషాప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  2. గోండి, సంథాలి లేదా ఒరావన్ వంటి భాషలను గిరిజన ప్రజలు మాట్లాడతారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న గిరిజనుల భాషను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదనుకొని ఉంటారు.
  3. సమాజంలో శక్తిమంత ప్రజానీకం మాట్లాడే తమిళం, తెలుగువంటి భాషలను పరిగణనలోకి తీసుకున్నారు.

10th Class Social Textbook Page No.253

ప్రశ్న 10.
భారతదేశంలో ఇటీవల ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఏవి, అవి ఎప్పుడు ఏర్పడ్డాయి?
జవాబు:
ఈ మధ్య కాలంలో భారతదేశంలో నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి –

  1. ఛత్తీస్ గఢ్ : ఇది 01-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  2. ఉత్తరాంచల్ : ఇది 09-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది. (ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ గా వ్యవహరించబడుతోంది.)
  3. జార్ఖండ్ : ఇది 15-11-2000 న రాష్ట్రంగా ఏర్పడింది.
  4. తెలంగాణ : ఇది 02-6-2014 న 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

10th Class Social Textbook Page No.256

ప్రశ్న 11.
భాషా విధానం జాతి ఐక్యత, సమగ్రతలకు ఎలా దోహదపడింది?
జవాబు:
భారతదేశం విశాలమైనది. ఇక్కడ వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ఆ కావున వారందరికి, స్వంత సంస్కృతి, స్వంత భాష ఉండడం మూలంగా, తాము ప్రత్యేక జాతి అనే భావన రావచ్చు. కానీ జాతీయ భాష ఉన్నట్లయితే దేశంలో ఉండే ప్రజలందరికి ఆ భాష వర్తిస్తుంది. కాబట్టి తామంతా ఒకటే అని, ఒకే జాతి అనే భావన కలిగి దేశ సమగ్రతకు, ఐక్యతకు దోహదపడుతుంది.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 12.
మహిళలలో అక్షరాస్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను – ఎలా ప్రభావితం చేసి ఉండేది?
జవాబు:
మహిళలకు ఓటు హక్కు కల్పించకుండా ఉంటే అది మన విధానాలను చాలా ప్రభావితం చేసి ఉండేది.

అవి :

  1. స్త్రీ, పురుష వివక్ష చూపించినట్లు కనిపించేది. అప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి అర్థంలేదని అన్పించేది.
  2. అందరికీ ఓటు హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. మనది ప్రజాస్వామ్యమని చెప్పలేము.
  3. స్త్రీలకు ఓటు లేకపోతే వారికి ‘రాజకీయ హక్కు లేనట్లే’ ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలగడమే. మన దేశ పౌరులందరికి, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రాథమిక హక్కులను కల్పించామని చెప్పుకోవడానికి వీలు లేదు.
  4. సామ్యవాద దేశమని చెప్పుకోవడానికి వీలు లేదు.

10th Class Social Textbook Page No.249

ప్రశ్న 13.
క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించటం అన్నది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామనటానికి స్పష్టమైన సంకేతం. ఈ వ్యాఖ్యానంతో మీరు ఏకీభవిస్తారా? కారణాలను పేర్కొనండి.
జవాబు:
అవును. ఏకీభవిస్తాను. అందుకు కారణాలు :

  1. మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా రాజీనామా చేసినా లేదా ఇంకే కారణాల వలన అయినా వారి స్థానాలు ఖాళీ అయితే ఆరు నెలల లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించి ఆ స్థానాలను భర్తీ చేస్తున్నారు.
  2. భారతదేశంలో జాతి, మత, కుల, వర్గ, స్త్రీ, పురుష, ధనిక, పేద అనే విచక్షణ లేకుండా వయోజనులైన ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించారు. కాబట్టి మనది ప్రజాస్వామ్యమే.
  3. ఎన్నికల ద్వారా ఎక్కువ మంది మద్దతు ఉన్న ప్రజాప్రతినిధులచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున మనది

10th Class Social Textbook Page No.251

ప్రశ్న 14.
రాజకీయ వ్యవస్థలో కాంగ్రెసు ఆధిపత్యానికి దోహదం చేసిన కారణాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:

  1. స్వతంత్ర సమర పార్టీ కాంగ్రెస్. స్వతంత్రం తరువాత కూడా కాంగ్రెస్ కు ప్రాధాన్యత కొనసాగింది.
  2. కాంగ్రెస్ లో విభిన్న సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులందరూ పనిచేశారు. అందువల్ల కాంగ్రెస్ కు బహుతావాద దృక్పథం ఏర్పడింది.
  3. బహుతావాదం మూలంగా వామపక్షవాదులు, సంప్రదాయవాదులు, మితవాదులు, ప్రతిపక్ష, అధికార పార్టీలు ఉన్నాయి. అందువల్ల అత్యధిక మందిని ఆకర్షించి ఆధిపత్య పార్టీగా కొనసాగింది.
  4. 1952, 1957, 1962 ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి, మిగతా పార్టీలను నామమాత్రమైన వాటిగా చేసి, ఏకపార్టీగా నిలిచింది.
  5. మిగతా పార్టీలు కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాయి. మొదటి మూడు సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కు 45% ఓట్లు రాగా, ప్రతిపక్షాలకు 11% ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో కాంగ్రెస్ కు ఎదురులేకుండా పోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977)

10th Class Social Textbook Page No.254

ప్రశ్న 15.
తొలి దశాబ్దాల నాటి వయోజన విద్యాతరగతులకు సంబంధించిన ఫోటో. ఈ పథకాలతో సమాజంలో అభివృద్ధి లేదా మార్పులకు సంబంధించిన భావాలు ఎలా వ్యక్తం అవుతున్నాయో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 18 స్వతంత్ర భారతదేశం (మొదటి ముప్ఫై సంవత్సరాలు-1947-1977) 1
జవాబు:

  1. నిరక్షరాస్యత యొక్క సమస్యను ఎదుర్కొనుటకు ఆ రోజుల్లోనే ప్రభుత్వం వయోజన విద్యా తరగతులను నిర్వహించేదని తెలుస్తుంది.
  2. మొదటి సార్వత్రిక ఎన్నికలలో నిరక్షరాస్యత మూలంగా ఎదుర్కొన్న సమస్యలు మళ్ళీ ఎదుర్కోకూడదని, తాము చదువు నేర్చుకోవాలి అనే పట్టుదల వారిలో కనిపిస్తుంది.
  3. నిరక్షరాస్యత మూలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమ పిల్లలు ఎదుర్కోకూడదని తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నట్లు తెలుస్తుంది.

10th Class Social Textbook Page No.255

ప్రశ్న 16.
భారతదేశంలో చేపట్టిన భూసంస్కరణలను చైనాలోనూ, వియత్నాంలోనూ చేపట్టిన వాటితో పోల్చండి.
జవాబు:
భారతదేశంలోని భూసంస్కరణలు, వియత్నాంలోని భూసంస్కరణలు ఈ కింది విధంగా ఉన్నాయి.

భారతదేశంలో భూసంస్కరణలువియత్నాంలో భూసంస్కరణలు
1) భూసంస్కరణలకు సంబంధించిన ప్రస్తావన ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించింది.1) వియత్నాంలో కూడా భూసంస్కరణలను కమ్యూనిస్ట్ పార్టీయే ప్రారంభించింది.
2) భారతదేశంలో భూసంస్కరణలను అమలుచేసి, అంతకు ముందు ఉన్న పాత విధానాలను (జమీందారీ, కౌలు) రద్దు పరచినారు.2) ప్రభుత్వం భూసేకరణ చేసి దానిని పేద రైతులకు పునః పంపిణీ చేసింది.
3) భూసంస్కరణలు భారతదేశం అంతటా అమలు జరిగాయి.3) వియత్నాంలో భూసంస్కరణలు కేవలం ఉత్తరభాగంలో మాత్రమే అమలు జరిగాయి.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

SCERT AP 10th Class Social Study Material Pdf 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరిచేయండి. (AS1)
1) 20వ శతాబ్ది ఆరంభంలో ప్రపంచదేశాల మధ్య తేడాలు పాశ్చాత్య దేశాలు, మిగిలిన దేశాలుగా వ్యక్తమయ్యాయి.
2) ప్రజాస్వామ్యం పుంజుకోవటంతో పాటు కొన్ని నియంతృత్వ ధోరణులను, కొత్త సామ్రాజ్యాలు ఏర్పడటాన్ని 20వ శతాబ్దం చూసింది.
3) సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న సిద్ధాంతాల పునాదిపై సోషలిస్టు సమాజాలు ఏర్పడ్డాయి.
4) యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాటాలలో ఉన్నారు.
5) మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, లేదా ఆ తరువాత అనేక దేశాలు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.
జవాబు:

  1. 20వ శతాబ్ద ఆరంభంలో ప్రపంచంలోని దేశాలు పాశ్చాత్య దేశాలుగాను, వీటి వలన దోపిడీలతో మరింత వెనుకబడిన దేశాలుగా విభజింపబడ్డాయి.
  2. ప్రజాస్వామ్యం పుంజుకోవటంతోపాటు అందరికీ అక్షరాస్యతాస్థాయి, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి.
  3. సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంతాలతో, రాజకీయ స్వేచ్ఛ, ఉగ్రవాద, సామ్యవాద, పెట్టుబడిదారీ సమాజాలు ఏర్పడ్డాయి.
  4. యుద్ధంలో పాల్గొన్న దేశాల సైనికులే కాకుండా వివిధ దేశాల సైనికులు పోరాడి వీరమరణం పొందారు.
  5. మొదటి ప్రపంచయుద్దాల అనంతరం అనేక దేశాలు రాచరిక, వలస పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి.

ప్రశ్న 2.
ప్రపంచ యుద్ధాలలో మిత్ర రాజ్యాల, అక్ష రాజ్యాల, కేంద్ర రాజ్యాల కూటములలో భాగస్వాములైన దేశాలతో కూడిన “పట్టికను తయారుచేయడం : ఆస్ట్రేలియా, యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా), జర్మనీ, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యు.ఎస్.ఎ. (AS3)
జవాబు:

మిత్రదేశాలుఅక్ష/ కేంద్రరాజ్యాల కూటమి
రష్యాజపాన్
ఫ్రాన్స్జర్మనీ
బ్రిటన్ఇటలీ
అమెరికాఆస్ట్రియా
చైనా
సెర్బియా
పోలెండ్

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 3.
ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధకాంక్షను ఎలా ప్రభావితం చేశాయి? (AS1)
జవాబు:
జాతీయ రాజ్యాలలో జాతీయతా భావం ఒక ప్రముఖ ప్రేరేపణ. నూతన శక్తికి అంకురార్పణ. ఆధునిక రాజ్యాలు ఏర్పడడానికి, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఏకీకరణ సాధించడానికి ఇది మూలమైంది. జాతీయతా భావం ఆయా దేశాల అహంకారానికి, గర్వానికి పరాకాష్ఠ. అంతేకాకుండా ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగించడానికి కూడా ఈ దేశస్థులు జాతీయభావాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ద్వేషం, అహంకారం యూరపులోని దేశాల మధ్య వైరం పెరగడానికి, అభద్రతాభావం ఏర్పడడానికి మూలమైంది.

మరో ప్రక్క ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీయిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలో దురహంకారపూరిత జాతీయవాదాన్ని రెచ్చగొట్టి, జర్మనీయే ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని, విజేతయై ప్రపంచాన్ని పాలిస్తుందని, పుకార్లు షికార్లు చేయించి, ప్రపంచంలోని దేశాల మధ్య ద్వేషాలు, అభద్రతాభావం పెంచి యుద్ధకాంక్షను పురిగొల్పడానికి కారణమైంది.

ప్రశ్న 4.
రెండు ప్రపంచయుద్ధాల కారణాల మీద క్లుప్తంగా రాయండి. ప్రపంచంలో ఏదైనా దేశాలలో ఈనాటికీ ఈ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏ రూపంలో? (AS4)
జవాబు:
రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటన్ పారిశ్రామికంగా అగ్రగామిగా ఉండడమే కాకుండా ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు విస్తరింపచేసింది. ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల అన్వేషణ కొరకు, పాశ్చాత్య దేశాలు దోపిడీ పాలనతో వెనుకబడిన దేశాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాయి. ఏకీకరణ భావనతో ఫాసిజం, నాజీయిజం అనుచరులు అహంకారాన్ని ప్రేరేపించడమే కాకుండా ప్రపంచాన్నంత ద్వేషభావంతో చూశారు. పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ వలసపాలిత దేశాలపై ఆధిపత్యం చెలాయించాయి. రానురాను వలసపాలిత దేశాలు స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు మొదలు పెట్టాయి. ప్రపంచ ఆధిపత్యం కొరకు పారిశ్రామిక దేశాలు కూడా గొడవలు పడటం ప్రారంభించాయి. దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనికవాదం వంటి కారణాలు మొదటి ప్రపంచయుద్ధానికి కారణమవ్వగా, రెండవ ప్రపంచయుద్ధానికి కారణం వర్సయిల్స్ సంధిలో ఉన్న అవమానకర చర్యలు జర్మనీలో ద్వేషాలు పెరగడానికి కారణమయ్యాయి. అభద్రతాభావం విద్వేషాలు, అనుమానాలు యుద్దాలు సంభవించడానికి దోహదం చేశాయి. అయితే ఈ నాటికీ పై అంశాలు ప్రపంచంలో చాలా తక్కువగా కనిపిస్తుండగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో పై లక్షణాలు, కారణాలు అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

ప్రశ్న 5.
20వ శతాబ్దపు ప్రథమ అర్ధభాగంలో యుద్ధాల యొక్క వివిధ ప్రభావాలు ఏమిటి? (AS1)
(లేదా)
20 శతాబ్దపు మొదటి సగంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలను పేర్కొని ఏవేని రెండింటిని వివరించండి.
జవాబు:
చరిత్రకారుడైన “ఎరిక్ హాబ్స్ బామ్” పేర్కొన్నట్లు 20వ శతాబ్దం “తీవ్ర సంచలనాల యుగం”. జాతీయతాభావంతో ప్రపంచంలోని ఇతర ప్రజల పట్ల ద్వేషం, అవధులు లేని అధికారంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

1914-18 సం||రాల మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధం తదుపరి నాజీ, ఫాసిజం పార్టీలు భావజాలంతో ప్రపంచదేశాలను తక్కువగా చూడనారంభించారు. 1929-30 సం||రాల మధ్య తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి, ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. రెండు ప్రపంచయుద్ధాలు సంభవించి, లక్షలాదిమంది చనిపోయారు. ఇంకా ఎన్నో లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిణామాలు సంభవించాయి. ప్రపంచంలో చాలాదేశాలు చిన్నాభిన్నం కాగా, జర్మనీ, జపాన్ దేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రథమార్ధంలో సంభవించిన యుద్ధాల వల్ల ల్యుకేమియా, క్యాన్సర్ వంటి సమస్యలు దశాబ్దాలపాటు కొనసాగాయి. మాయామర్మం తెలియని 60 లక్షల యూదులు, ఒక్క నాగసాకి, హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల 1,50,000 నుంచి 2,46,000 మంది పౌరులు చనిపోయారు. మిత్రదేశాలు, కేంద్ర దేశాలుగా విడివడి ఒక దేశం మరో దేశం మీద ద్వేషాలు పెంచుకొనే స్థితికి చేరుకున్నాయి. యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పాటు యుద్ధ ప్రభావం ఆర్ధిక సామాజిక రంగాలపై పడింది.

10th Class Social Studies 13th Lesson ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I InText Questions and Answers

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 1.
దురహంకారపూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, అధికార కేంద్రాలు, మిలటరీవాదం ఇప్పుడు కూడా ఉన్నాయా ? ఉదాహరణలతో తరగతిలో చర్చించండి.
జవాబు:
పై లక్షణాలు అప్పుడప్పుడూ అగ్రదేశాలలో కనిపిస్తాయి. అమెరికా, ఇంగ్లండ్, రష్యా వంటి దేశాలలో అప్పుడప్పుడూ ప్రస్ఫుటమవుతుంది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 2.
గత పది సంవత్సరాలలో జరిగిన కొన్ని యుద్దాల గురించి తెలుసుకొని వాటికి పై నాలుగు కారణాలు ఎంతవరకు దోహదం చేశాయో చూడండి.
జవాబు:
గత 10 సం||లలో యుద్ధాలు సంభవించలేదు.

10th Class Social Textbook Page No.176&177

ప్రశ్న 3.
ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. వీటికీ పైన పేర్కొన్న అంశాలకీ సంబంధం గుర్తించి వాటి మీద చిన్న వ్యాసం రాయండి.
అ) నర్స్ బెర్గ్ వద్ద 1934లో హిట్లర్ నాజీ పార్టీ ప్రదర్శన. మీరు చూసిన రాజకీయపార్టీల ప్రదర్శనలతో దీనిని పోల్చండి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 1
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం తర్వాత జరిగిన అవమానకర ఒప్పందాలతో కృంగిపోయి, ప్రతీకార కాంక్షతో రగిలిపోయే నాజీపార్టీ స్థాపకుడు హిట్లర్, ప్రపంచానికి తమ అవధులు లేని భావజాలం ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీ. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్లడిగే క్రమంలో ఇలా ర్యాలీగా వెళ్ళడం చూస్తుంటాం.

ఆ) మాంద్య కాలంలో పోలిష్ వలస కార్మికురాలు ఫ్లోరెన్స్ ఓవెన్స్ ఫోటో, దారితియా లాంజ్ తీసిన ఈ ఫోటో ఎంతో ప్రఖ్యాతి గాంచింది. 1936 మార్చి సమయంలో కాలిఫోర్నియాలో బఠానీ కోసేవాళ్ళ తీవ్ర పరిస్థితిని ఇది సూచిస్తుంది. ఆమె ఏమి ఆలోచిస్తూ ఉంటుంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 2
జవాబు:
20వ శతాబ్దంలో ప్రపంచంలో పెనుమార్పులు సంభవించాయి. గొప్ప ప్రయోగాలు కూడా చోటు చేసుకున్నాయి. 1929-30 సం||లో తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించి ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ఫోటోలో కనిపిస్తున్న “ఫ్లోరెన్స్ ఓవెన్స్” ఆలోచిస్తూ నిరుద్యోగం పెరిగి, ఆర్థిక అవకాశాలు లేక, ఆకలితో అలమటించే పిల్లలకు ఆహారం తినిపించే మార్గం ఏదీ లేదా ? పిల్లల రోదనలను ఆపే మార్గం ఎలా ? అని ఆలోచిస్తుంది.

ఇ) నాగసాకి మీద ‘అణుబాంబు : ఈ బాంబు ప్రభావాన్ని తెలియజేసే ఫోటోలు ఈ అధ్యాయం చివరలో ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 3
జవాబు:
రెండవ ప్రపంచయుద్ధంలో దూసుకుపోతున్న జపానను అడ్డుకట్ట వేసి, యుద్ధాన్ని ముగించే క్రమంలో అమెరికా జపాన్లోని శక్తివంతమైన, పురోభివృద్ధిలో ముందున్న నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు ప్రయోగించి తునాతునకలు చేయగా, ఆ సందర్భంగా వెలువడు విధ్వంస దృశ్యాలు అవి.

ఈ) రష్యాలో బోల్షివిక్ విప్లవాన్ని సూచిస్తూ 1920 లో కుస్తోదీప్ వేసిన చిత్రం. చిత్రకారుడు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు? పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి ఎవరు?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 4
జవాబు:
రష్యాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రష్యా విప్లవంలో భాగంగా జార్ చక్రవర్తులను, వారి కోటల నివాసాలను తుదముట్టించే క్రమంలో “పెట్రోగ్రాడ్” నగరంలో లెనిన్ నాయకత్వం వహిస్తూ విప్లవంలో పాల్గొన్న దృశ్యం చూడవచ్చు.

ఉ) 1929లో జర్మనీలో వెలువడిన వ్యంగ్య చిత్రం. దాని కింద ‘యూదుల నుంచి కొనండి, మీ ప్రజలకు ద్రోహం చెయ్యండి’ అనే వ్యాఖ్యానం ఉంది. ఇది ఏ వివక్షతా ధోరణిని చూపిస్తోంది?
AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 భాగం-I 5
జవాబు:

  1. యూదుల వద్ద నుండి ఏ రకమైన వస్తువులనైనా, జర్మనీ ప్రజలు కొనుగోలు చేయకూడదనే వివక్షత ధోరణిని ఈ వ్యంగ్య చిత్రం చూపిస్తుంది.
  2. యూదుల నండి ఏ వస్తువునైనా కొన్నట్లయితే అది జర్మనీకి ద్రోహం చేసినట్లుగా భావించబడుతుంది అని ఆ చిత్రం తెలుపుతుంది.
  3. హిట్లర్ కాలంలో జర్మనీ ప్రజల ‘సోర్డిక్ జాతి’ ఆధిక్యతను తెలుపుతుంది.
  4. యూదుల మీద అపరిమితమైన ద్వేషమును పెంచుకున్నారు.
  5. ఆ తరువాత రోజులలో హిట్లరు అనుచరులచే దాదాపు 60 లక్షల యూదులు చంపబడినారు.

10th Class Social Textbook Page No.179

ప్రశ్న 4.
తెలుసుకోండి : భారతదేశం-పాకిస్తాన్ల మధ్య 1971లో యుద్ధం ఎంతకాలం కొనసాగింది? ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు?
జవాబు:

  1. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఇండియా – పాకిస్థాన్లు ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగినాయి.
  2. ఈ యుద్ధం 3-12-1971న ప్రారంభమై 16-12-1971న ముగిసినది.
  3. ఈ యుద్ధం మొత్తం 13 రోజులలో ముగిసినది. ఇది చరిత్రలోని చిన్న యుద్ధాలలో ఒకటిగా భావించబడుతుంది.
  4. ఈ యుద్ధంలో 3,843 భారత సైనికులు, 9,000 పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
  5. 9,861 మంది భారత సైనికులు, 4,350 పాకిస్తానీ సైనికులు గాయాలపాలైనారు.
  6. 97,368 పాకిస్థానీ సైనికులు ఈ యుద్ధంలో ఖైదు చేయబడినారు.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 5.
పారిశ్రామికీకరణ ఆధునిక యుద్ధాలకు ఎలా దారి తీసింది?
జవాబు:
ప్రపంచం పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా కీర్తింపబడి, గుర్తింపబడిన బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, జర్మనీలు పారిశ్రామికీకరణ వలన ముడిపదార్థాల కొరకు, నూతన మార్కెట్ల కొరకు అన్వేషణ చేసి చాలా దేశాలను వలసపాలిత ప్రాంతాలుగా చేసుకొనే క్రమంలో తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దేశం మరో దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉండటం వలన తరచు గొడవలు జరుగుచుండేవి. తద్వారా అభద్రతాభావం, జాత్యహంకారం, సామ్రాజ్యవాద రూపాలు అత్యున్నత దశకు చేరుకోవడంతో ఆధునిక యుద్ధాలకు దారితీసింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 6.
తమ దేశం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఇతర దేశాలతో యుద్ధానికి దారి తీస్తుందా?
జవాబు:
ప్రపంచ ఆధిపత్య క్రమంలో ప్రజలలో తమ దేశం పట్ల ప్రేమ. మితిమీరింది. అభివృద్ధి క్రమంలో, ఆర్ధిక పురోభివృద్ధిలో ముందుండాలనే ఆశతో పాటు, ఇతర దేశాల పట్ల, ప్రజల పట్ల ద్వేషాన్ని రగిల్చింది. తమ దేశం పట్ల ఉన్న ప్రేమ, ఇతర దేశ ప్రజలను రెచ్చగొట్టే విధానంలో ఆలోచనలు ఎక్కువయ్యాయి. తమ దేశమే విశ్వనాయకత్వం వహిస్తుందనే అహంకార పూరిత ప్రేమ యుద్ధాలకు దారితీస్తుంది.

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 7.
నానాజాతి సమితిలో ఏర్పడిన అంతర్జాతీయ కార్మిక సంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటివి ఈ నాటికీ పనిచేస్తున్నాయి. వాటి కార్యక్రమాల గురించి తెలుసుకొని వాటిల్లో ఒకదాని గురించి ఒక నివేదిక తయారుచేయండి.
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం అనంతరం, మరో ప్రపంచయుద్ధం జరగకుండా, ప్రపంచ శాంతిని నెలకొల్పే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ 1920లో నానాజాతి సమితిని ఏర్పాటుచేసి, అందులో అనుబంధ సంస్థలుగా అంతర్జాతీయ కార్మికసంఘం (ILO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లను ఏర్పాటు చేయగా అవి ఈనాటికీ అద్భుతంగా పనిచేస్తున్నాయి.

అంతర్జాతీయ కార్మిక సంఘం గూర్చి ఒక నివేదిక : అంతర్జాతీయ కార్మిక సంఘం ఈనాటికీ దిగ్విజయంగా పనిచేస్తుంది. నానాజాతి సమితిలోని సభ్యదేశాలలోని కార్మికుల స్థితిగతులు, జీవన విధానాన్ని మెరుగుపరచింది. చైనా, ఇంగ్లాండ్ దేశాల మధ్య యుద్ధాలకు కారణమైన నల్లమందు రవాణాను ఆపి, స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పింది. కార్మికుల, స్త్రీల స్థితిగతులలో మార్పుచేసి, విదేశాలకు స్త్రీలను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. బానిసత్వాన్ని, వెట్టిచాకిరీని నిషేధించి, సమానత్వాన్ని అందించి, కార్మికులలో ఆత్మస్టెర్యాన్ని పెంచింది.

10th Class Social Textbook Page No.181

ప్రశ్న 8.
ఒక దేశం రెండవ దేశంతో దురహంకారపూరితంగా ప్రవర్తిస్తే, రెండవ దేశం కూడా అదే విధంగా స్పందించాలా ? సమస్య పరిష్కారానికి ఇతర మార్గాలు ఏమున్నాయి?
జవాబు:
దురహంకారంతో కూడిన జాతీయతావాదం ప్రమాదకరం. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే దేశాలు అదనుకోసం ఎదురుచూస్తుంటే మరో ప్రక్క విద్వేషాలు పెరిగి, యుద్ధ వాతావరణాన్ని తలపించే ఏర్పాట్లు దేశాల మధ్య అంతరాన్ని సృష్టించాయి. ప్రతీ దేశం కూడా మేమే ప్రపంచ విజేత కాబోతున్నాం, ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించబోతున్నామంటూ ప్రకటించుకున్నాయి. గర్వం, ఇతరుల పట్ల ద్వేషం వీటివల్ల ప్రపంచం యావత్తు అభద్రతాభావంతో మునిగిపోయింది. తద్వారా ప్రతీ దేశం కూడా ఆ దేశం కంటే మేమేం తక్కువ కాదు అన్నట్లు దురహంకారపూరిత చర్యలకు పూనుకున్నాయి.

వేరే పరిష్కార మార్గాలున్నప్పటికీ “ప్రతీకారం” ఒక్కటే సరైన మార్గంగా దేశాలు భావించాయి. నానాజాతి సమితి వంటి అంతర్జాతీయ శాంతి సంస్థ ఉండి కూడా ప్రతీకారాన్ని ఆపి, మరో ప్రపంచయుద్ధాన్ని నివారించలేకపోయింది.

AP Board 10th Class Social Solutions Chapter 13 ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-I

10th Class Social Textbook Page No.183

ప్రశ్న 9.
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేదా?
జవాబు:
1919లో గెలిచిన దేశాలు జర్మనీ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఉండకపోతే రెండవ ప్రపంచయుద్ధం వచ్చి ఉండేది కాదు. బ్రిటన్, ఫ్రాన్లు గెలిచిన పిదప వర్సయిల్స్ శాంతి సమావేశంలో పెట్టిన అవమానకర షరతులు జర్మనీని అథఃపాతాళానికి నెట్టాయి. వర్సయిల్స్ శాంతి సంధికి కూడా విజేతలైన అమెరికా, బ్రిటన్లు, ఫ్రాన్స్, ఇటలీ, జపానులను ఆహ్వానించాయి. కానీ, జర్మనీని ఆహ్వానించలేదు. ప్రపంచ భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్న వాళ్ళు జర్మనీ సలహాలు, భావాలను పరిగణనలోకి తీసుకోలేదు. దీనివల్ల వర్సయిల్స్ ఒప్పందం తమపై బలవంతంగా రుద్దబడిందని జర్మనీ భావించింది. జర్మనీ భూభాగాలను ఆక్రమించడమే కాకుండా సైనిక బలగాన్ని తగ్గించి ఆల్వాస్, లోరైన్ వంటి ఐరోపా, ప్రాంతాలను జర్మనీ నుండి ఆక్రమించుకున్నాయి. ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వలన రెండవ ప్రపంచయుద్ధం రావడానికి మూలమైంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

SCERT AP 10th Class Social Study Material Pdf 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
మీరు తినే ఆహార పదార్థాలలో పదింటిని తీసుకొని, మీ వద్దకు చేరటానికి ఉత్పత్తి అయిన స్థలం నుంచి ఎంతదూరం ప్రయాణించాయో తెలుసుకోండి. (AS3)

ఆహారపదార్థంప్రయాణించిన దూరం
1. బియ్యం
2. వంటనూనె
3. అరటిపళ్ళు

చాలామంది ఆహారం దూర ప్రాంతాలు రవాణా చెయ్యటం కాకుండా స్థానికంగా ఉత్పత్తి చెయ్యాలని అంటారు. స్థానికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యటానికీ, పర్యావరణానికీ సంబంధం ఏమిటి? స్థానికంగా ఆహారాన్ని పండించి, వినియోగించాలన్న ఉద్యమం గురించి మరింత తెలుసుకుని తరగతి గదిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించండి. (మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యుట్యూబ్ లో కింద లింకులో ఉన్న హెలెనా నార్బెర్గ్ – హాడ్జ్ ఉపన్యాసాన్ని వినండి. https:/www.youtube.comwatch?v=4r06_F2FIRM
జవాబు:

ఆహారపదార్థంప్రయాణించిన దూరం
1. బియ్యం50 కి.మీ.
2. వంటనూనె100 కి.మీ.
3. అరటిపళ్ళు5 కి.మీ.
4. గోధుమలు10 కి.మీ.
5. రాగులు20 కి.మీ.
6. జామపళ్ళు10 కి.మీ.
7. జొన్నలు15 కి.మీ.
8. బొప్పాయి5 కి.మీ.
9. దానిమ్మ60 కి.మీ.
10. పెసలు20 కి.మీ.

సానికంగా ఆహారపదారాలను ఉత్పత్తి చేయడం వలన తాజా, నాణ్యమైన పదార్థాలు లభిస్తాయి. అంతేకాకుండా మనం పండించడం వలన పర్యావరణపరంగా సమస్యలు అధిగమించి, సేంద్రియ ఎరువులతో ఆరోగ్యవంతమైన • ఆహారపదార్థాలను పొందవచ్చు.

ప్రశ్న 2.
జలసింధి గ్రామ ప్రజలు తమ ఊరి నుంచి తరలి వెళ్ళటాన్ని ఎందుకు తిరస్కరించారు? (AS1)
జవాబు:
సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్ లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి గ్రామం. తద్వారా ఆ గ్రామ ప్రజలంతా మునిగిపోతారని తెలిసికూడా తరలివెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. మైదాన ప్రాంతాలకు వెళితే అభివృద్ధి చెందుతారని, జీవితాలు సుఖపడతాయని చెప్పి వాళ్ళమీద దౌర్జన్యాలు చేసినా వారు అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అడవులను నరికారు. దేవతలను పూజించారు. నేలను మెరుగుపరచారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. అక్కడ వ్యవసాయం ఖర్చు లేకుండా, లాభసాటి ఫలసాయాన్ని అందిస్తుంది. మొక్కజొన్న వాళ్ళకు తల్లిలా ఆహారాన్ని అందిస్తుంది. సజ్జలు, జొన్నలు, శనగలు, మినుములు, నువ్వులు వారికి ఆధారంగా లభిస్తున్నాయి. అడవి వలన వాళ్ళకు ప్రవహించే నీళ్ళు, చక్కటి మేత ఉన్నాయి. పశుసంపద ఎక్కువ. రకరకాల జబ్బులకు అడవి నుండి లభించే వనమూలికలే మందులుగా ఉపయోగపడతాయి. నిర్మలమైన సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సంబంధాలతో
సుఖంగా జీవిస్తున్నవాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి తిరస్కరించారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 3.
“ఇది మా పూర్వీకుల భూమి. దీనిపై మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతికి పారలు, గడ్డపారలు వస్తాయి తప్ప ఇంకేమీ మిగలదు…….” అన్న బావా మహాలియా మాటలను వివరించండి. (AS1)
జవాబు:
అనాదిగా బావా మహాలియా పూర్వీకులు అడవులను నరికి పోడు వ్యవసాయం ద్వారా చదును చేసి, కష్టించి, అటవీ భూములు తామే సాగుచేస్తున్నందున ఆ భూముల యజమానులుగా తలంచి, దర్జాగా అడవి మీద, వ్యవసాయం మీద ఆధిపత్యం పొందారు. అభివృద్ధి పేరుతో, పునరావాసం పేరుతో అక్కడ నుండి ఖాళీ చేయిస్తే, వ్యవసాయ భూములపై యజమానులుగా ఉన్న వాళ్లు వ్యవసాయ కూలీలుగా మారి, చేతికి పారలు, పలుగులు వచ్చి పేదరికంలో కూరుకుపోతారని, సంతోషం లేని జీవితాలవుతాయని మహాలియా భావన.

ప్రశ్న 4.
“చివరిగా (అంతమాత్రాన దీని ప్రాముఖ్యత తక్కువేమీ కాదు) వ్యర్థ పదార్థాలు, కాలుష్యం తక్కువగా ఉండేలా మన జీవన సరళిని మార్చుకోవటంపైన పర్యావరణ సమస్యల పరిష్కారం ఆధారపడి ఉంది.” (AS4)
ఎ) మన జీవనశైలి పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు తీసుకొని దీనిని వివరించండి.
జవాబు:
మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మనిషి ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నాడు కాని, ప్రకృతి మనిషి మీద ఆధారపడి జీవించటం లేదు. చెట్లను నరకకుండా, ప్రతీ పుట్టిన రోజున ఒక మొక్క నాటి పెంచే విధంగా మన జీవన విధానం ఉండాలి. వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గించడం ద్వారా ఆరోగ్యవంతమైన పంట ఫలాలను పొందవచ్చు. పారిశ్రామిక వ్యర్థాలు, మరల మరల ఉపయోగించడం వలన, కాలుష్యరహిత విధానం వలన పర్యావరణ సమస్యలు తగ్గుతాయి.

బి) ప్రపంచంలో, వివిధ ప్రాంతాలలో చెత్త, కాలుష్య విడుదల సమస్యలను అధిగమిస్తున్న వివిధ పద్ధతులను పేర్కొనండి.
జవాబు:
పర్యావరణంలో సంభవించు పెనుమార్పుల వలన ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. అభివృద్ధి మాటున, అనర్థాలు అధికమవ్వడంతో ఆర్థిక, సామాజిక, శీతోష్ణస్థితులలో చెడు పరిణామాలు సంభవించాయి. దీనికి అనుగుణంగా వివిధ పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలను రీసైక్లింగ్ పద్ధతులు, అదే విధంగా వాటి నుండి మరికొన్ని కొత్త ఆవిష్కరణలు కనుగొనడం జరిగింది. కాలుష్యం అధికంగా విడుదల చేసే పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయడమే కాకుండా, జల కాలుష్యం జరగకుండా అనేక కొత్త పద్ధతులు అనుసరించడం జరుగుతోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ప్రజలను చైతన్యపరుస్తూ, మీడియా ద్వారా ప్రజలలో మార్పు తీసుకురావడానికి ప్రపంచం యావత్తు కృషి చేస్తోంది.

ప్రశ్న 5.
ఖనిజాలు, ఇతర సహజ వనరులను వేగంగా సంగ్రహించడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. మీరు ఏకీభవిస్తారా? (AS4)
జవాబు:
నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు, అధికంగా గ్రహించడం వలన భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని నేను ఏకీభవిస్తాను. అదేపనిగా భూగర్భజలాల్ని, ఖనిజాలను వినియోగించడం వలన తరువాత లభించడం దుర్లభం. అడవులను, చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన, జీవావరణం, జీవవైవిధ్యం దెబ్బతిని, భవిష్యత్తు తరాలు అంధకారంలోకి నెట్టబడతాయి. ఆర్థికవ్యవస్థలోని ఇతర రంగాలు కూడా ఖనిజాలు, ఇతర సహజవనరుల మీద ఆధారపడి ఉండడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 6.
వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందని ఎందుకనుకుంటున్నారు? (AS1)
జవాబు:
ప్రపంచంలోని దేశాల శాస్త్రజ్ఞులు ఎంతోకాలంగా వాతావరణంలోని మార్పుల గురించి వివరాలు సేకరిస్తూనే ఉన్నారు. వాతావరణం అంటే మనచుట్టూ ఉండే తేమ, గాలిపీడనం, ఉష్ణోగ్రత మొదలైన వాటిలో రోజువారీ వచ్చే మార్పులు. వాతావరణం గంట గంటకీ, రోజు రోజుకీ, ఋతువు, ఋతువుకీ మారిపోవచ్చు. వాతావరణ మార్పు ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది. ఈ కారణంగానే ముందుగా టీవీ, రేడియో, వార్తాపత్రికలు మొ||నవి వాతావరణ వివరాలను ప్రతిరోజూ ప్రసారం చేస్తాయి. వాతావరణ మార్పు ప్రభావం గురించి తెలుసుకుంటున్నదానిని బట్టి రాబోయే కాలంలో వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తాయో అన్ని దేశాలు అంచనావేస్తాయి.

ప్రశ్న 7.
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగా పరిగణించాలా? (AS1)
జవాబు:
భూమి సగటు ఉష్ణోగ్రతలను ప్రజలందరికీ సహజ వనరుగానే పరిగణించాలి. 1992 సంవత్సరంలో రియోడిజెనీర్ లో ధరిత్రి సదస్సు జరిగింది. అందులో 154 దేశాలు సంతకం చేశాయి. గత 100 సం||లలో భూమి సగటు ఉష్ణోగ్రత 0. 5 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. భూమి సగటు ఉష్ణోగ్రత పర్యావరణ పరంగా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ప్రశ్న 8.
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఏ గుణపాఠాలు నేర్చుకోవచ్చు? (AS4)
జవాబు:
తెలంగాణలోని జహీరాబాద్ మండలంలోని ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి మనం అనేక గుణపాఠాలు నేర్చుకోవచ్చు.

స్థానిక ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, సుదూర ప్రాంతంలో రసాయనిక పురుగుమందులు, సారవంతం లేని వరి, గోధుమల స్థానంలో అధిక పౌష్టికాహార విలువలు గల చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా అక్కడ ఉండేది. (చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి వంటివి) పోషకాహారాన్ని అందించే చిరుధాన్యాలు పండించాక భూముల బీడు పోవడమే కాకుండా, నియంత్రణ కూడా సాధించారు.

ప్రత్యామ్నాయ ప్రజాపంపిణీ విధానం ద్వారా వారు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ స్థానిక అవసరాలు, కట్టుబాట్లు కొనసాగిస్తూ ఇంకొకరి మీద ఆధారపడకుండా, స్వశక్తితో వారిలో వారే అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. గ్రామాలు స్వయం సంపూర్ణ గ్రామాలుగా మారడానికి ఐక్యత, సామాజిక చైతన్యం, సమష్టి కృషి, విశిష్ట లక్షణాలు అందరికీ ఆదర్శవంతమయ్యాయి.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 9.
“స్థానిక జన జీవనానికి, జీవనోపాధులకు, పరిసరాలతో సహజీవనం చేసే జీవన విధానానికి పర్యావరణం చాలా ముఖ్యమైనది.” వివరించండి. (AS6)
జవాబు:
“నరుని అడుగు సోకని అడవి రమణీయంగా ఉందని” వాల్మీకి అన్నట్లు రామాయణంలో ఒక శ్లోకం ఉందంటారు. వ్యవసాయం కోసమైనా, పశువుల కోసమైనా, కలప కోసమైనా, కారణం ఏదైనా ఫలితం క్షణక్షణం అడవి తల్లిని బుగ్గిపాలు చేయడం జరుగుతోంది. అడవిని ఆధారంగా చేసుకొని ఆదివాసీలు, వివిధ జంతువులు, ఇతర జీవరాసులు జీవన సమరం సాగిస్తున్నాయి. తమ చుట్టూ ఉండే చెట్టు, పు, కొండా, కోన, వ్యవసాయం, మేత ఇలా అణువణువు వారికి ఆధారమే. పర్యావరణాన్ని పాడుచేయడం వలన మానవుడు తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కున్నట్లుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ పరిసరాల్లోనే, ఈ పర్యావరణంలోనే, ఈ ప్రకృతిలోనే మన శరీరం ఉంది. పర్యావరణంలోనే మనుగడ సాగుతుంది. పర్యావరణాన్ని నాశనం చేశామంటే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు. “మనం పర్యావరణాన్ని కలుషితం చేస్తే – పర్యావరణం మనల్ని కలుషితం చేస్తుంది.”

10th Class Social Studies 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.160

ప్రశ్న 1.
పర్యావరణ సమస్యల ద్వారా అభివృద్ధి అనే భావనను ఎలా ప్రశ్నించారో గుర్తించండి.
జవాబు:
అభివృద్ధి పేరుతో, పారిశ్రామికాభివృద్ధి ముసుగులో పర్యావరణం – ప్రజల మధ్య సంబంధాలు అతలాకుతలం అయినాయి. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ద్వారా అడవులను నరికి, నేలను కోతకు గురిచేసి, కాలుష్యం పెంచి, విచ్చలవిడిగా రసాయనిక పురుగుమందుల వాడకం చేపట్టి, శీతోష్ణస్థితిలో పెనుమార్పునకు పర్యావరణ సమస్యలు మూలమయ్యాయి. అభివృద్ధి జరిగినా సహజ వనరులు అంతరించి, మానవ మనుగడయే దుర్లభమయ్యే రోజులు దాపురించాయి.

10th Class Social Textbook Page No.162

ప్రశ్న 2.
భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్దతి ఎందుకు కాదు?
జవాబు:
సంప్రదాయ వ్యవసాయంలో వర్షపు నీటి ద్వారా భూగర్భజలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకొనేవారు. 10-15 అడుగులలో నీళ్ళు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో విద్యుత్, డీజిలు మోటార్లతో భూగర్భజలాలను తోడటం మొదలైన తర్వాత భూగర్భజలం కొన్ని వందల అడుగుల లోపలకు వెళ్ళిపోయింది. లోపలికి ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువవడం వలన భవిష్యత్తు తరాలు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు కానవస్తున్నాయి. కాబట్టి భూగర్భజలాలను ఎక్కువగా తోడటం సుస్థిర పద్ధతి కాదు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 3.
పర్యావరణాన్ని ‘సహజ పెట్టుబడి’ అని కూడా అంటారు. 9వ అధ్యాయంలో పెట్టుబడి నిర్వచనాన్ని మరొకసారి చూడండి. పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని ఎందుకు అంటారు?
జవాబు:
పర్యావరణాన్ని ఆధారం చేసుకొని, ఈ భూమి మీద 5 కోట్ల వేర్వేరు జాతులు ఉన్నాయి. మనం వాడుతున్న నీళ్ళు, మనచుట్టూ ఉన్న అడవి, అడవి ఆధారంగా సహజంగా లభించే సహజ అటవీ ఉత్పత్తులు, సెలయేళ్ళు, సహజ వనరులు, (ఇంధన వనరులు, ఖనిజ వనరులు) ఆధారం చేసుకొని మానవజీవితం కొనసాగుతుంది. మానవుడు తనచుట్టూ ఉండే పరిసరాల్ని ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కాబట్టి పర్యావరణాన్ని సహజ పెట్టుబడిగా వర్ణించవచ్చు.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 4.
నీటిని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు పరిగణించాలి?
జవాబు:
నీరే జీవాధారం. ప్రాణాధారం, నీరు లేకుండా ఏ జీవీ జీవనం సాగించడం దుర్లభం. ప్రకృతిలో కురిసే వానల వలన, పారే నీరు భూగర్భజలంలోకి చేరుతుంది. అంతేకాకుండా సహజవనరులైన సెలయేళ్ళు, నదులు, కాలువలు, జలాశయాలు, ఆనకట్టల ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన వారందరికీ నీరు ఉమ్మడి ఆస్తిగా చెందుతుంది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 5.
ఎండోసల్ఫాన్ వినియోగాన్ని నిలిపివెయ్యటానికి న్యాయస్థానానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?
జవాబు:
ఎండోసల్ఫాన్ అనేది రసాయనిక పురుగులమందు. ఈ పురుగులమందు అనేక రకాలుగా హానికారక ప్రభావాల్ని చూపించింది. గాలి, నీళ్ళు మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాతో కలుషితమయ్యాయి. దానిని పిచికారి చేయడం వలన ప్రజలలో ముఖ్యంగా వ్యవసాయ కూలీలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం 5000 మంది చనిపోయారు. అంతకంటే ఎక్కువమంది అవయవ లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడపగా ఆ పరిస్థితుల నుండి రక్షణ పొందేందుకు న్యాయస్థానానికి వెళ్ళవలసి వచ్చింది.

10th Class Social Textbook Page No.164

ప్రశ్న 6.
ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగుమందు వాడకం జీవించే హక్కుకు (రాజ్యాంగంలోని 21వ అధికరణానికి) భంగం కలిగించిందని పేర్కొంది. జీవించే హక్కుకు, ఎండోసల్ఫాన్ ఎలా భంగం కలిగించిందో వివరించండి.
జవాబు:
ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణం కలిగి ఉండే హక్కు కూడా ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు చెప్పడం జరిగింది. 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ద్వారా జీవించే హక్కు ద్వారా జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి, కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కుంటుందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ ఎండోసల్ఫాన్ పురుగుమందు వాడకం వలన, పరిసరాలు, పర్యావరణం, నీరు, గాలి కలుషితమై, ప్రజలలో అనేక మరణాలు సంభవించాయి. కాబట్టి, కోర్టు తీర్పునకు అనుగుణంగా-ఎండోసల్ఫాన్ విఘాతం కలిగించింది కాబట్టి దానిని నిషేధించడం జరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 7.
గిరిజనులకు వేరే రాష్ట్రంలో పునరావాసం కల్పిస్తే దిగువ పేర్కొన్న విషయాల్లో ప్రస్తుత అలవాట్లలో ఏమి మారతాయో చూపించటానికి ఒక పట్టిక తయారుచేయండి. ఆహార అలవాట్లు, వ్యవసాయం, ఆర్థిక అంశాలు, అడవితో సంబంధం, మత ఆచారాలు, ఇల్లు కట్టుకోవడం, సామాజిక సంబంధాలు.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 1

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 8.
జీవవైవిధ్యత కోల్పోటాన్ని ఉత్తరంలో ఎతా పేర్కొన్నారు?
జవాబు:
మా చుట్టూ అనేక పక్షులు, జంతువులు, చెట్లు, పువ్వులు, పండ్లు, కీటకాలు రకరకాలైనవి ఉన్నాయి. వాటితో మా బంధం పెనవేసుకుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు వంటి పశుసంపద మాకు ఆరోగ్యసంపద, ధన సంపద. ఈ అడవిలో తిరిగే ప్రతి పక్షి, జంతువు, ఇతర జీవరాసుల అరుపులు, వాటి జీవన విధానం మాకు తెలుసు. ప్రతీ జీవి కూడా పూజింపదగినదే. ఏ ప్రాణినీ తక్కువగా అంచనావేయం. అన్ని ప్రాణులపట్ల సమాన ప్రాధాన్యతతో, ప్రేమతో, కృతజ్ఞతతో మెలగుతాం.

ప్రశ్న 9.
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉందా?
జవాబు:
జలసింధి గ్రామంలోని ప్రజలకు ప్రస్తుతం ఆహారభద్రత ఉంది. వ్యవసాయాన్ని అనువుగా మార్చుకొని, తక్కువ వర్షాలతో కావలసినంత ఆహారాన్ని పొందుతున్నారు. జలసింధి గ్రామంలో గిరిజనులకు కడుపునింపేది మొక్కజొన్న. వీటితో పాటు, సజ్జలు, జొన్నలు, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు పండించి ఆహారభద్రత పొందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

ప్రశ్న 10.
పైన పేర్కొన్న పరిస్థితులలో మీరు నివసిస్తుంటే పునరావాసం పొందాలన్నప్పుడు ఎలా స్పందిస్తారు?
జవాబు:
అడవితో అనురాగం పెంచుకొని, పరిసరాలపై ప్రేమలో మునిగి, నేలతల్లిని ఆరాధించే మేము వేరే పునరావాస ప్రాంతంలో నివసించటానికి ఇష్టపడం. అభివృద్ధి ముసుగులో మా జీవన గమనాన్ని దెబ్బతీస్తే ఊరుకోం. ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడతాం. కొండా కోన, వాగు-వంకలతో అడవిలోనే నివసిస్తాం. ఐక్యమవుతాం. ఎదిరిస్తాం. అనుకున్నది సాధిస్తాం.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 11.
భారతదేశ ఆర్థిక విధానంలో సరళీకరణ, ప్రపంచీకరణ చోటు చేసుకున్న తరువాత స్థానిక అవసరాలకు, ఎగుమతులకు ఖనిజాల తవ్వకం వేగంగా పెరిగింది. ఈ కింద ఇచ్చిన పట్టికలోని గణాంకాల ఆధారంగా ఈ వ్యాఖ్యానాన్ని వివరించండి.
పట్టిక : భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకం (వేల టన్నులలో)

ఖనిజం1997 – 982008 – 09
బాక్సెట్6,10815,250
బొగ్గు2,97,0004,93,000
ఇనుప ఖనిజం75,7232,23,544
క్రోమైట్1,5153,976

జవాబు:
బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన మనదేశంలో స్థానిక అవసరాలు, ప్రపంచంలో మన స్థానాన్ని పదిలపరచుకోడానికిగాను, ఖనిజాలను ఎగుమతులు చేయడం జరిగింది. విరివిగా లభించే ఖనిజాలను వెలికితీసి సరళీకరణ ద్వారా, ప్రపంచ పోటీని నిలదొక్కుకోడానికి గాను విలువైన బాక్సెట్, బొగ్గు, ఇనుము, క్రోమైట్లను సగాని కంటే ఎక్కువగా వెలికితీయడం జరిగింది. 1997-98 కి, 2008-2009 కి మధ్య 10 సం||లలో అధికంగా ఖనిజాలను వెలికితీసి ఆదాయాలను పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగింది.

ప్రశ్న 12.
గనుల తవ్వకం వేగంగా వృద్ధి చెందటం వల్ల పర్యావరణానికి, మనుషులకి ఏ విధమైన నష్టాలు జరుగుతాయి?
జవాబు:
గనుల తవ్వకం విచ్చలవిడిగా పెంచడం వలన, అటు పర్యావరణానికి, ఇటు మనుష్యులకు తీవ్ర ప్రమాదాలు దాపురిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, వివిధ జంతువులు, పక్షులు, వివిధ రకాల జీవరాసులు నశించి, పర్యావరణం పాడైపోతుంది. అదేవిధంగా గనులను విరివిగా తవ్వడం వలన ఆయా ప్రాంతాలలో నివసించే ప్రజలు అనేక కాలుష్య సమస్యలతో సతమతమవుతున్నారు. . నీటి, వాయు కాలుష్యం వలన ఆరోగ్య సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి.

10th Class Social Textbook Page No.159

ప్రశ్న 13.
ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్ ఆధారంగా భారతదేశంలోని అంతరాల గురించి క్లుప్తంగా రాయండి.
గ్రాఫ్ 1 : భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ (లక్షలలో) (2010 సర్వే)
AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 2 AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి 3
జవాబు:
గ్రాఫ్ 1 ఆధారంగా 17 లక్షల పైన వార్షిక ఆదాయం కలిగిన వారు 30 లక్షల కుటుంబాలు ఉండగా, లక్షా యాభైవేల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు 13 కోట్ల 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రెండవ స్థానంలో తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారు అంటే లక్షా యాభైవేల నుండి 3 లక్షల 40 వేల మధ్య ఆదాయం కలిగిన వారు 7 కోట్ల 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీనినిబట్టి తక్కువ ఆదాయంతో పేదరికంతో బాధపడుతున్న వారు మన దేశంలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గ్రాఫ్ 2 ప్రకారం భారతదేశంలో శత కోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద -1996లో 212 బిలియన్ రూపాయలు, 2004 లో 1,157 బిలియన్ రూపాయలు కాగా, 2011లో 11,000 బిలియన్ రూపాయలకు చేరింది.

గ్రాఫ్ 3 ప్రకారం భారతదేశంలో శతకోటీశ్వరులు 1996లో ముగ్గురు ఉండగా 2004లో ఆ సంఖ్య 9 గా ఉంది. 2011లో శత కోటీశ్వరుల సంఖ్య 55కి చేరింది.

పై గ్రా ద్వారా తేలిందేమిటంటే, కొంతమంది ప్రపంచస్థాయి భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండగా అధికశాతం ప్రజలు సరైన ఉద్యోగం లేక, చాలినంత ఆదాయాలు లేక గౌరవప్రదంగా జీవించడానికి అవసరమయ్యే కనీస అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల ఆదాయాలు, అవకాశాలలో ఇంత అంతరం ఉండటం సమసమాజానికి ఆధారం కాబోదు.

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 14.
భారతీయ వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించి 9వ తరగతి పాఠాలను మరొకసారి చూడండి.
ఈ రెండు సందర్భాలలోనూ వనరుల పంపిణీ, అందుబాటుకు సంబంధించి అసమానతలను అవి ఎలా చర్చించాయి?
జవాబు:
భారతదేశంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచి పేదరికాన్ని దూరం చేయడానికి గాను, నూతన వ్యవసాయ పరిజ్ఞానంతోపాటు అధిక విత్తనాల దిగుబడికి రసాయనిక ఎరువులే కీలకం. సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించి, తక్కువ కాలంలో, పొట్టి కాడలతో ఎక్కువ దిగుబడిని అందించే వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. హరితవిప్లవం ద్వారా ఆధునిక పద్ధతులతో వరి, గోధుమలలో అధికోత్పత్తి సాధించడం జరిగింది.

అదేవిధంగా పరిశ్రమలను నెలకొల్పే క్రమంలో ఉన్న అనేక పరిమితులు దూరం చేసి, లైసెన్సింగ్ విధానంలో ఉన్న సమస్యలను అధిగమించి, నూతన పారిశ్రామిక విధానం ద్వారా అనేక పారిశ్రామిక కేంద్రాలను నెలకొల్పి, అత్యంత సమర్థవంతమైన ఉత్పత్తులు పెంపొందింపజేశారు.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.161

ప్రశ్న 15.
‘హరిత విప్లవం’ విస్తరించడం వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి? దీని నుంచి భవిష్యత్తుకు మనం ‘ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి?
జవాబు:
హరితవిప్లవం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, కొత్త రకం విత్తనాలు సృష్టించడంతో, ఆహారధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధి సాధించగా అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. అవి

  1. హరిత విప్లవంలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన వరి, గోధుమపంటల అధిక దిగుబడికిగాను పుష్కలంగా నీరు అవసరం. అందులకై అధిక సంఖ్యలో మోటార్లు, ఇంజన్లు ఉపయోగించి భారీగా భూగర్భజలాలను వెలికితీయడంతో, భూగర్భజలాలు పడిపోయాయి. దీనితో భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి భూగర్భజలాలు లేవు.
  2. సేంద్రియ ఎరువులు, పెంటపోగు గత్తం వంటి వాటి ఎరువులకు బదులుగా రసాయనిక పురుగుమందులు, క్రిమి సంహారక రసాయనాలు వాడడం వలన భూముల సారం తగ్గి, రైతుల ఖర్చు పెరిగింది.
  3. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి వాటికి ప్రాధాన్యం లేకపోవడం, ఇవి సుమారు 80% ప్రాంతాలలో పండించేవిగా ఉండడం వలన చాలా ప్రాంతాలలో సంప్రదాయ పంటలు దూరమయ్యాయి.

కాబట్టి మనం సంప్రదాయ పద్ధతులు అనుసరిస్తూ, ఆరోగ్యాన్ని పాడుచేసే విధానాలకు స్వస్తి చెప్పి, మన పూర్వీకుల పద్ధతులు పాటిస్తూ, భూసారాన్ని రక్షించుకుంటూ పర్యావరణ సమస్యలు లేకుండా చూసుకోవాలి.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 16.
అభివృద్ధి భావనలు అన్న అధ్యాయంలో ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చని చదివాం. దీనిని వివరించటానికి బావా మహాలియా ఉత్తరాన్ని ఉపయోగించండి.
జవాబు:
ప్రజల అవసరాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆహార ఉత్పత్తి, పారిశ్రామికీకరణ వలన అటవీ ప్రాంతంలో, నదీ పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో ఖాళీ చేయించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను పట్టణ ప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు తరలించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ప్రజలకు భద్రత, ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఎంతోమందికి మాత్రం అది పెను ప్రమాదంగా మారింది. అడవిని నమ్ముకొని, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ఫలసాయాల ద్వారా బ్రతుకుతున్న వారికి, కొండా కోన, పరిసరాలు తమకు అనుకూలమైనవి కావడం వలన వేరే ప్రాంతాలలో జీవించడం కష్టం. తమకు అలవాట్లు, పూర్వీకుల ఆచారాలకు అనుగుణంగా తమ తమ ప్రాంతాలలో నివసించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది.

10th Class Social Textbook Page No.167

ప్రశ్న 17.
గిరిజనులలో జీవనోపాధి, సంస్కృతి, సామాజిక సంబంధాలు అడవితో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. దీనిని వివరించండి.
జవాబు:
అడవిలో నివసించే గిరిజనులకు అడవే జీవనాధారం. గిరిజనులు వారి శ్రమతో రకరకాలైన సంప్రదాయ పంటలు పండిస్తారు. డబ్బుతో పని లేకుండా, నాణ్యమైన విత్తనాలు, పశువుల నుండి వచ్చే ఎరువును వాడి, మంచి ఫలసాయాల్ని పొందుతారు. పంటలు పండని సమయంలో అడవిలో దొరికే అనేక ఫలాలు, దుంపలు, కాయలు, పండ్లు గిరిజనుల ఆకలిని తీరుస్తాయి.

సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు ప్రాధాన్యం ఇస్తారు. క్రమం తప్పకుండా చెట్టు తల్లిని, అగ్నిని, అమ్మతల్లిని పూజిస్తారు. సంతలలో కలిసి ఒకరికొకరు ఇష్టపడి వివాహాలు జరుపుకుంటారు. సామాజిక సంబంధాలకు విలువనిస్తారు. కష్టసుఖాలలో ఒకటిగా జీవిస్తారు. అడవిలో దొరికే జంతువుల మాంసాలను సమంగా పంచుకొని, కలిసి తింటారు. సమూహాలుగా ఏర్పడి వేటకు బయలుదేరతారు.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 18.
‘అభివృద్ధి భావనలు’ అన్న అధ్యాయంలో మీరు కుడంకుళం అణువిద్యుత్తు కర్మాగారానికి నిరసనల గురించి చదివారు. ఇక్కడ తెలుసుకున్న వాటి ఆధారంగా ఆ నిరసనలను వివరించండి.
జవాబు:

  1. ‘కుడంకుళం’ తమిళనాడులోని ఒక ప్రశాంతమైన గ్రామం.
  2. అక్కడి ప్రజల జీవనోపాధి చేపలు పట్టడం.
  3. ‘కుడంకుళం’ అణువిద్యుత్ కర్మాగారాన్ని అక్కడ స్థాపించటంవలన, వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వస్తుంది.
  4. అందువలన వారికి జీవనోపాధి పోతుంది.
  5. అంతేకాకుండా అణువిద్యుత్ కర్మాగారాలలో జరిగే విధ్వంసాల వలన కూడా వారు భయపడుతున్నారు.
  6. వారి మనస్సులలో గత కొద్దికాలం క్రిందట జపాన్ అణుకర్మాగారంలో జరిగిన విధ్వంసం మెదలుతూ ఉంది.
  7. అందువలన అక్కడ దీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది.
  8. కనుక ఆధునిక అభివృద్ధి పథకాల వలన వీరి అతి ముఖ్యమైన వనరైన సముద్రము అందుబాటులో లేకుండాపోతుంది.

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 19.
పర్యావరణ పరిరక్షణ ప్రత్యక్షంగా ప్రభావితులయ్యే సమూహాలకే కాక మనందరికీ కూడా ఎంతో కీలకమైనది. కొన్ని ఉదాహరణలతో దీనిని వివరించండి.
(లేదా)
క్రింది పేరాను చదివి, మీ అభిప్రాయం రాయండి.

“వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాలలో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవి చూస్తున్నాం. భూగర్భ జలాలు, రసాయనిక పురుగు మందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చెయ్యటమంటే ఈ సమూహాలను మట్టుపెట్టడమే.
జవాబు:
పర్యావరణ పరిరక్షణ మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు, వాతావరణం, శీతోషసితిలో అనేక మార్పుల వలన మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో పరిశ్రమల స్థాపన ఆశయంతో చుట్టూ ఉండే అడవులు, జంతువులు, మిగతా జీవరాసులు నశిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పర్యావరణంలో ప్రకృతిలో ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి జీవిస్తున్నాయి.

అదే విధంగా వ్యవసాయరంగంలో సాంకేతికత పేరుతో సంప్రదాయ పద్ధతులు కాకుండా సంకరజాతి వంగడాలు, రసాయనిక పురుగుమందులు వాడడం వలన వాటి ప్రభావం మనష్యులందరి మీద పరోక్షంగా పడుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమైనది.

AP Board 10th Class Social Solutions Chapter 12 సమానత – సుస్థిర అభివృద్ధి

10th Class Social Textbook Page No.169

ప్రశ్న 20.
ఎనిమిదవ తరగతిలోని ఆంధ్రప్రదేశ్ లోని ఖనిజాలకు సంబంధించిన అధ్యాయాలను మరొకసారి చూడండి. పారిశ్రామిక వేత్తలకు, ఖనిజాలు ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు మధ్య ఎటువంటి వైరుధ్యాలు చోటు చేసుకుంటాయి?
జవాబు:
వెనుకబడిన దేశమైన భారతదేశం ఆర్థికంగా బలం పుంజుకోవడానికిగాను పరిశ్రమలను నెలకొల్పదలచి, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, అధిక ఆదాయం పొందగా ఆర్థిక ప్రగతి సాధించింది. అయితే పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్రదేశాలలో నివసించే ప్రజలకు అనేక విషయాలలో వైరుధ్యాలు ఉన్నాయి. ఖనిజ వనరులు లభ్యమయ్యే ప్రదేశాలలో అడవులను విచక్షణారహితంగా నరికివేయటం, ఖనిజాలను కడగడానికి పెద్ద మొత్తంలో నీళ్ళు కావాలి. తద్వారా దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితమవుతాయి. గనులలో పనిచేసే కార్మికులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఇలాంటివే మరెన్నో వైరుధ్యాలు చోటుచేసుకుంటాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

SCERT AP 10th Class Social Study Material Pdf 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Studies 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
నివాసప్రాంతం అంటే ఏమిటి? (AS1)
జవాబు:
ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్దతినే నివాసప్రాంతం అంటాం. ఇది మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. నివాస ప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి.

ప్రశ్న 2.
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలి ఎలా మారింది? (AS1)
(లేదా)
స్థిర జీవనం వల్ల మానవ జీవనశైలిలో వచ్చిన మార్పులను వివరించండి.
జవాబు:
స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటంతో మానవ జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారం సంపాదించుకోడానికి వాళ్లు చాలాదూరం తిరగాల్సిన పని తప్పింది. ఇప్పుడు ఎక్కువ కాలం ఉండడానికి వీలు కావడంతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నారు. ప్రకృతి రీతులను బాగా అర్థం చేసుకోగలిగారు. ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించడానికి వీరికి తీరిక దొరికింది. జనాభా కూడా పెరిగింది. రవాణా సౌకర్యాలు విస్తరించాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 3.
ప్రదేశం, పరిస్థితి అంశాలను నిర్వచించండి. మీరు ఉంటున్న ప్రాంతం నుంచి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి. (AS1)
జవాబు:
ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. మెట్టపల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉందో, నీటి వనరులు, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుండి రక్షణ వంటివి ప్రదేశం కిందకి వస్తాయి. విశాఖపట్టణాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇది బంగాళాఖాతం తీరంలో ఉంది. సహజ ఓడరేవు, విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలున్నాయి. పరిస్థితి : ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా ఇతర ప్రాంతాలతో సంబంధం ఉంటుంది. పరిస్థితి ఇతర ప్రాంతాలతో గల సంబంధాలను తెలియజేస్తుంది.

విశాఖపట్నం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు, రైలు, విమాన, నౌకా సదుపాయాలున్నాయి.

ప్రశ్న 4.
వివిధ ప్రాంతాలను భారతదేశ జనాభా గణన విభాగం ఎలా నిర్వచిస్తోంది ? పరిమాణం, ఇతర అంశాల రీత్యా వాటిని ఎలా వ్యవస్థీకరిస్తోంది? (AS1)
జవాబు:
భారత జనాభా గణన విభాగం కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాసప్రాంతాలను వర్గీకరిస్తుంది.

నివాస ప్రాంత రకంఉపయోగించిన ప్రామాణికాలుఉదాహరణలు
మహానగరాలుకోటి జనాభాకి మించి ఉన్న నగరాలు* ముంబై మహానగర ప్రాంతం (1.84 కోట్లు)
* ఢిల్లీ మహానగరం (1.63 కోట్లు)
* కోల్‌కతా మహానగరం (1.41 కోట్లు)
మెట్రోపాలిటన్ నగరాలు/పదిలక్షలు దాటిన నగరాలుపది లక్షలు – కోటి మధ్య జనాభా ఉన్న నగరాలు* చెన్నై (86 లక్షలు) నగరాలు/పదిలక్షలు .
* హైదరాబాదు (78 లక్షలు) దాటిన నగరాలు
* అహ్మదాబాదు (62 లక్షలు)
క్లాసు 1 నగరాలుఒక లక్ష – పది లక్షల మధ్య పట్టణ ప్రాంతాలు* విశాఖపట్టణం (2.03 మిలియన్లు) ఉన్న
* తిరుపతి (0.46 మిలియన్లు)
* వరంగల్ (0.76 మిలియన్లు)
పట్టణాలు5000 నుంచి ఒక లక్ష మధ్య గల* ప్రొద్దుటూరు (1,50,309)
* తెనాలి (1,53,756)
* సిద్దిపేట (61,809)
రెవెన్యూ గ్రామాలునిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామం* పెదకాకాని (18,947)
* కొల్లూరు (16,025)
* బండారుపల్లి (4,863)
ఆవాస ప్రాంతాలురెవెన్యూ గ్రామం (హామ్లెట్) లోపల కొన్ని ఇళ్ల సముదాయం* గోసాలపురం తండా (1570)

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

ప్రశ్న 5.
విమానాశ్రయ నగరం అంటే ఏమిటి ? దాని నిర్మాణ స్వరూపం ఏమిటి? (AS1)
జవాబు:
భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని విమానాశ్రయ నగరాలు (లేదా ఏరోట్రిపోలిస్) అంటున్నారు.

విమానాశ్రయ నగరాలలో విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సదుపాయాలు (హోటళ్లు, దుకాణాలు, వినోదం, ఆహారం, వ్యాపార సమావేశ సదుపాయాల వంటివి) అక్కడ కల్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాలలో వచ్చి తమకు అవసరమైన వాళ్లతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకుని తిరిగి విమానాల్లో వెళ్లిపోతారు. ట్రాఫిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా నగరంలోని సదుపాయాలన్నింటినీ పొందుతారు.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 1

10th Class Social Studies 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 1.
విమానాశ్రయ నగర కేంద్రం ఏమిటి?
జవాబు:
పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ కొత్తగా ఏర్పడే నగరాన్ని విమానాశ్రయ నగర కేంద్రం అంటారు.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 2.
విమానాశ్రయ నగర కేంద్రంలో, లేదా దాని దగ్గర ఉండే రెండు సదుపాయాలను పేర్కొనండి.
జవాబు:
విమానాశ్రయ నగర కేంద్రంలో ఉండే సదుపాయాలు :

  1. హోటళ్లు
  2. వ్యాపార సమావేశ సదుపాయాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 3.
మొహుదా గ్రామ ప్రజలు ఏ విషయం పట్ల ఆందోళన చెందుతున్నారు?
జవాబు:
తమ గ్రామం వద్ద చెత్త శుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేయడం వల్ల మొహుదా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 4.
చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంత మంది ప్రజలు, పశువులు ప్రభావితం కానున్నారు?
జవాబు:
మొహుదా గ్రామం వద్ద చెత్త శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటుచేస్తే ఆ ప్రాంతంలోని 30,000 మంది ప్రజలే కాకుండా 10,000 పశువులు కూడా ప్రభావితం అవుతాయి.

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 5.
సర్వే నివేదిక ప్రకారం బరంపురం ఎంత ఘన వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేసింది?
జవాబు:
2009 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు 150 టన్నుల ఘన వ్యర్థపదార్థాలు ఉత్పన్నం అవుతాయి.

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 6.
బరంపురం నగరపాలక సంస్థ అధికారులు “గత మూడు సంవత్సరాలలో ఉత్పత్తి అవుతున్న చెత్త పెరిగి ఉండవచ్చని” అంటున్నారు. వీళ్ల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా, లేదా ? మీ కారణాలు పేర్కొనండి.
జవాబు:
అవును, బరంపురం నగరపాలక సంస్థ అధికారులతో ఏకీభవిస్తున్నాను. నగర ప్రజల జీవనశైలి మారుతూ ఉండటంతో ఘన వ్యర్థ పదార్థాలు కూడా పెరగవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.94

ప్రశ్న 7.
నిలువు వరుస ‘అ’లో ఒక ప్రదేశం యొక్క అంశాలు ఉన్నాయి. ‘ఆ’ నిలువు వరసలో అది ప్రదేశానికి సంబంధించిన అంశమో, పరిస్థితికి సంబంధించిన అంశమో రాయండి. అది పరిస్థితికి సంబంధించిన అంశమైతే ‘ఇ’ నిలువు వరసలో దీని ప్రభావం ఎలా ఉంటుందో రాయండి.

1. బంకమట్టి నేల
2. వర్షపాతం చాలా ఎక్కువ.
3. దాని ప్రధానమైన మార్కెట్టు తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
4. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది.
5. అది ప్రధాన రైలు మార్గంలో ఉంది.
6. ఆసుపత్రి లేదు.
7. వ్యవసాయ భూములు ఎక్కువ.
8. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో
సంబంధం కలిగి ఉంది.
9. నది నుండి పది నిమిషాలు నడవాలి.
10. ఒక వడ్ల మిల్లు ఉంది.

జవాబు:

1. బంకమట్టి నేలప్రదేశంఇటుక, కుండల తయారీకి అనుకూలం.
2. వర్షపాతం చాలా ఎక్కువ.ప్రదేశంప్రదేశం పంటలు పండవు, నీటి సమస్య ఉండును.
3. దాని ప్రధానమైన మార్కెట్టు తీరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.పరిస్థితి
4. నేల చాలా తక్కువ వాలు కలిగి ఉంటుంది.ప్రదేశంపంటలకు అనుకూలం. ఇండ్ల నిర్మాణానికి అనుకూలం.
5. అది ప్రధాన రైలు మార్గంలో ఉంది.పరిస్థితిఅనుకూలమైనది.
6. ఆసుపత్రి లేదు.ప్రదేశంఅనుకూలం కాదు.
7. వ్యవసాయ భూములు ఎక్కువ.ప్రదేశంజనాభా ఎక్కువగా ఉంటారు.
8. మొబైల్ టవర్లతో అన్ని ప్రదేశాలతో
సంబంధం కలిగి ఉంది.
పరిస్థితిఅనుకూలమైనది.
9. నది నుండి పది నిమిషాలు నడవాలి.పరిస్థితిఅనుకూలమైనది.
10. ఒక వడ్ల మిల్లు ఉంది.ప్రదేశంఅనుకూలమైనది.

10th Class Social Textbook Page No.94

క్షేత్ర పరిశీలన :

ప్రశ్న 8.
మీరు గీసిన పటంలో గుర్తించిన ఉత్పత్తి ప్రదేశాలలో (వ్యవసాయ క్షేత్రాలు, కర్మాగారాలు, కార్యాలయాలు, దుకాణాలు, గనులు వంటివి) ఒకటి, రెండింటిని సందర్శించండి. వాళ్లకి కావలసిన ముడిసరుకులు/ఉత్పాదకాలు ఎక్కడి నుంచి వస్తాయో, ఉత్పత్తి చేసిన సరుకులు ఎక్కడ అమ్ముతారో తెలుసుకోండి. ఏ ముడిసరుకులు మీ నివాస ప్రాంతం నుంచి , వస్తాయి ? అదే విధంగా ఉత్పత్తి చేసిన సరుకులను మీ నివాస ప్రాంతంలోనే అమ్ముతున్నారో లేక ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారో (ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నట్లయితే, ఎక్కడికి పంపిస్తున్నారో) తెలుసుకోండి. ఇక్కడ ఉత్పత్తి ఎందుకు చేపట్టారు?
1) ఈ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రభావితం చేసిన ఆ ప్రదేశం అంశాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఇచ్చట వ్యవసాయ క్షేత్రాలు సారవంతమైనవి. నదీ ప్రవాహంతో వచ్చి ఒండ్రుమట్టితో చక్కని వరి, పెసర, జనుము, నువ్వులు పండుతాయి. నదీ తీర ప్రాంతం కావడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. నదిలో నీరు లేనపుడు తక్కువ లోతులోనే బోరుబావులకు నీరు లభ్యమౌతుంది.

2) ఈ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రభావితం చేసిన పరిస్థితి అంశాలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
గ్రామంలో వ్యవసాయేతర వృత్తులవారు, సమీప పట్టణ వ్యాపారులు వచ్చి పంటలను కొనుగోలు చేస్తారు. సమీప పట్టణానికి రహదారి సౌకర్యం ఉండటంతో రైతులే స్వయంగా పంటలను తీసుకొనిపోయి అమ్ముకొనే సదుపాయం కలదు. వేసవికాలంలో పండే కూరగాయలకు మార్కెట్ సౌకర్యం కలదు.

3) ఉత్పత్తిని ఆ ప్రాంత చరిత్ర ఎలా ప్రభావితం చేసింది?
జవాబు:
వ్యవసాయ క్షేత్రాలు, మార్కెట్ ఒకే జిల్లాలోనివి కావడం.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.95

ప్రశ్న 9.
మీ ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోండి…….

ఒక ప్రాంతం ఎంత పెద్దగా ఉంటే అక్కడ అన్ని ఎక్కువ సేవలు లభ్యం అవుతాయి. ఉదాహరణకు విద్య సదుపాయాలను తీసుకోండి. దీని ద్వారా పెద్ద ప్రదేశాలలో (అంటే పై స్థాయిలో ఉన్న ప్రాంతాలలో) ప్రత్యేక సేవలు విరివిగా లభ్యమవడాన్ని గమనించవచ్చు.
1) మీ ప్రాంతంలో ఏ స్థాయి వరకు విద్యా సదుపాయం ఉంది ? ఉదా : ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్, కళాశాల విద్య (డిగ్రీ, పీజి).
జవాబు:
ఉన్నత పాఠశాల విద్య

2) మీ ఊరిలో ఉన్న సదుపాయానికి మించి మీరు చదువు కొనసాగించదలుచుకుంటే మీరు ఎక్కడికి వెళ్లవలసి వస్తుంది?
జవాబు:
సమీప పట్టణానికి,

3) మీ ప్రాంతంలో ఎటువంటి వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి? ఉదా : ఇంజినీరింగ్, మెడిసిన్, కామర్స్, సాంకేతిక డిప్లామా వంటివి.
జవాబు:
మా గ్రామానికి 10 కి.మీ. పరిధిలో ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, కామర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

4) మీకు వేరే వృత్తి విద్యలో ఆసక్తి ఉంటే మీరు ఎక్కడికి వెళ్లవలసి ఉంటుంది?
జవాబు:
సమీప పట్టణానికి.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 10.
ఈ అధ్యాయం కోసం మీరు అధ్యయనం చేసిన ప్రదేశానికి దగ్గరలో విమానాశ్రయ నగరం ఏర్పడిందని ఊహించుకోండి. అప్పుడు ఆ ప్రాంత స్థలంలో వచ్చే మూడు మార్పులను పేర్కొనండి. అదే విధంగా ఆ ప్రాంత పరిస్థితులలో వచ్చే మూడు మార్పులను పేర్కొనండి.
జవాబు:
విమానాశ్రయ నగరం ఏర్పడితే వచ్చే మార్పులు :
ఎ) ఆ ప్రాంత స్థలంలో :

  1. గదులు అద్దెకిచ్చే హోటళ్లు, టాక్సీలు వెలుస్తాయి.
  2. వ్యాపారవేత్తలు, అధికారులు సమావేశాలు నిర్వహించేందుకు సమావేశ మందిరాలు నిర్మితమవుతాయి.
  3. అంతర్జాలం (Internet) వంటి సదుపాయాలతో కేస్లు కూడా వెలుస్తాయి.

బి) ఆ ప్రాంత పరిస్థితిలో మార్పులు :

  1. సమీప నగరానికి చక్కని రహదారులు వేస్తారు.
  2. రవాణా సౌకర్యం సమకూర్చుతారు.
  3. కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 11.
చెత్త శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పటానికి గుర్తించిన ఇతర ప్రదేశం ఏది ? దానిని ఎందుకు ఉపయోగించుకోలేదు?
జవాబు:
అంతకు ముందు ఈ చెత్త శుద్ధి కర్మాగారాన్ని నగర శివార్లలోని చందానియా కొండపైన ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాంతం అటవీ భూమి కిందకి వస్తుందని గుర్తించారు. దీనిని ముందుగా రెవెన్యూశాఖకు, ఆ తరువాత బరంపురం నగరపాలక సంస్థకు బదిలీ చేయవలసి రావటంతో ఈ ప్రతిపాదన విరమించారు.

10th Class Social Textbook Page No.88

క్షేత్ర పని

ప్రశ్న 12.
మీ ఊరు, పట్టణం లేదా నగరాన్ని పరిశీలించండి. ఇంతకుముందు నేర్చుకున్న పద్ధతుల ఆధారంగా ఎంపిక చేసిన ఒక చిన్న ప్రాంతం పటం గీయండి. మీ పటంలో ఈ కింద సూచించినవి ఉండాలి.
రోడ్లు, ఇళ్లు, బజారు, దుకాణాలు, వాగులు, మురికి కాలవలు, ఆసుపత్రి, పాఠశాల, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి కొన్ని ప్రదేశాలు.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 2

1) ప్రజా సౌకర్య ప్రదేశాలు అధికశాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో ఉన్నాయా?
జవాబు:
ప్రజా సౌకర్యాలు అధికశాతం ప్రజలకు వీలుగా ఉండే ప్రదేశంలో లేవు. గ్రామాలు, పట్టణాలు విస్తరించడంతో ప్రభుత్వ భూమి లభ్యమైన చోట ముఖ్యంగా గ్రామం చివరిలో లేదా ప్రారంభంలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు ప్రజలు చేరుకోలేనంత దూరంలో నిర్మిస్తున్నారు.

2) స్థానిక బజారులను కనుగొనడంలో ఏమైనా పద్దతి ఉందా?
జవాబు:
స్థానిక బజారులను గుర్తించడంలో ప్రత్యేక పద్ధతులు ఏమీ లేవు. ఇవి స్థానికులకు, పరిసర గ్రామస్థులకు సుపరిచయమైనవి అయినందున వీటి ఉనికిని చాటే నామ ఫలకాలు (Name Boards) లేవు. మార్కెట్ల స్థలంలో మాత్రం వాటి పేర్లుంటాయి.
ఉదా : రైతు బజారు, పొట్టి శ్రీరాములు మార్కెట్, పూర్ణా మార్కెట్.

3) ఇళ్లు గుంపులుగా ఉన్నాయా? వాటికి, ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం ఉందా?
జవాబు:
ఇళ్లు గుంపులుగా కాక వరుసలలోనే ఉన్నాయి. వీటికి, ప్రధాన రహదారులకు మధ్య అనుసంధానం కలదు.

4) ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి గత 20 సంవత్సరాలలో చోటుచేసుకున్న మార్పులు, వాటికి గల కారణాలు తెలుసుకోండి.
జవాబు:
గత 20 సంవత్సరాలలో మార్పులు – కారణాలు :
గత 20 సంవత్సరాలలో గ్రామాలు, పట్టణాలు బాగా విస్తరించాయి. గ్రామ, పట్టణ శివారులలో కాలనీలు, వాంబే గృహసముదాయాలు, ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు, హౌసింగ్ బోర్డు కాలనీలు విపరీతంగా పెరిగాయి. పట్టణ ప్రాంతాలలో సమీప గ్రామాలు కలసిపోయేంతగా విస్తరించాయి. పంచాయతీలకు నేరుగా కేంద్రప్రభుత్వ నిధులు రావడంతో బురదమయమైన రహదారులన్నీ సిమెంటు రోడ్లుగా మారాయి. గ్రామీణ ప్రాంతంలో కూడా కాలువల నిర్మాణం చేయడంతో రోడ్లపై నీరు నిలువ ఉండకపోవటం వల్ల శుభ్రంగా కనిపిస్తున్నాయి. అనేక గ్రామాలను పట్టణాలతో కలుపుతూ తారు రోడ్లు నిర్మించడంతో గ్రామాలు పట్టణాలతో అనుసంధానించబడ్డాయి.

5) ఉండవలసిన సదుపాయాలు ఏవి లేవు?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటి పథకాలు నెలకొల్పినా, పలు గ్రామాల్లో అవి అనేక కారణాలతో పనిచేయడం లేదు. వీధి కొళాయిలనేర్పాటు చేసి ఇంటింటికి శుభ్రమైన తాగునీటి సదుపాయం కల్పించాలి.

పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించి వాటిని ఉపయోగించే స్థితిలో ఉంచాలి. గ్రామీణ ప్రాంతంలో ఇండ్లలో ప్రభుత్వ సహాయంతో నిర్మించిన మరుగుదొడ్లు అత్యధిక నిరుపయోగంగా ఉన్నందున బహిరంగ మలవిసర్జన కొనసాగుతుంది.

నిర్మించిన రహదారులు సకాలంలో మరమ్మతులు లేక పాడైపోతున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో డాక్టర్ల సంఖ్య పెంచాలి. మందులు అందుబాటులోకి తేవాలి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.89

ప్రశ్న 13.
పోలికలు, తేడాలు పేర్కొనండి. పై సమాచారం ఆధారంగా సంచార, స్థిర జీవన శైలులలోని పోలికలు, తేడాలు పేర్కొనండి. మీరు ఎన్ని అంశాలు గుర్తించగలిగారో చూడండి. (ఇక్కడ పట్టిక సరిపోకపోతే మరొక పట్టిక తయారుచేయండి).
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 3
జవాబు:

సంచార జీవన విధానంస్థిర జీవన విధానం
1) తొలి మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకొనేవారు.1) వ్యవసాయం, పశుపోషణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నారు.
2) ఆహార సేకరణకు, వేటకు సంచార జీవనం సాగించేవారు.2) స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.
3) మొదట రాళ్లను ఆయుధాలుగా చేసుకొని వేటాడేవారు.3) వేట అవసరం తక్కువ. అవసరమైతే ఆధునిక ఆయుధాలు వాడుతున్నారు.
4) వారికి వ్యవసాయం తెలియదు.4) వ్యవసాయమే అధిక జనాభాకు జీవనాధారం.
5) గుహలలో, చెట్టు తొర్రలలో నివసించేవారు.5) ఇండ్లు నిర్మించుకొని వాటిల్లో నివసిస్తున్నారు.
6) జంతు చర్మాలను, చెట్ల బెరడులను ధరించేవారు.6) వస్త్రాలు ధరిస్తున్నారు.
7) కుటుంబ వ్యవస్థ లేదు.7) కుటుంబ వ్యవస్థీ ప్రధానమైనది.
8) మానవుడు ఎక్కువ సమయం ఆహార సేకరణ, వేటలో గడిపేవాడు.8) శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టే విశ్రాంతి లభించింది.
9) వీరు ఎటువంటి కళాత్మకమైన అంశాలను నేర్వలేదు.9) వీరు కళాత్మక దృష్టితో గృహాలు, దేవాలయాలు మొ||నవి నిర్మించారు.
10) వీరికి రాతరాయటం తెలియకపోయినా భాష నేర్చా రు.10) వీరు రాతని నేర్చారు. పన్ను విధానాలు వ్యాపారం మొ||నవి నేర్చారు.

10th Class Social Textbook Page No.92

ప్రశ్న 14.
మీరు నివసించే ప్రాంతాన్ని గత 10 సంవత్సరాల నుండి ఏ ఏ కారకాలు ప్రభావితం చేశాయో కనుక్కోండి.
జవాబు:

  1. జనాభా పెరగడంతో కుటుంబాల సంఖ్య, ఇండ్ల సంఖ్య పెరిగాయి.
  2. దీంతో గ్రామాలు, పట్టణాలు విస్తరించాయి.
  3. బీదవారు ప్రభుత్వ స్థలాలు, చెరువు గర్భాలు, నదీ తీరాలలో ఇండ్ల నిర్మాణం చేయడంతో అధిక వర్షాలు, వరదల సమయాల్లో ముంపునకు గురవుతున్నాయి.
  4. కాలనీలు విస్తరించడంతో మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి.
  5. పాఠశాలలు, ఆసుపత్రులను గ్రామాలకు దూరంగా నిర్మిస్తున్నారు.
  6. బోరుబావులు, నందనూతులు పెరగడంతో భూగర్భజలాలు త్వరితంగా అంతరించిపోతున్నాయి.
  7. ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయి, ఇవి భూమి పై పొరలను ఆక్రమించడం వల్ల నీరు భూమిలో ఇంకడం లేదు.
  8. ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు, బహుళ పంటలు పండే ప్రాంతాలకు వలసలు ఎక్కువైపోయాయి.

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు

10th Class Social Textbook Page No.93

ప్రశ్న 15.
క్రింది పట్టికను పరిశీలించండి.
విశాఖపట్టణం జనాభా

సంవత్సరంజనాభామార్పు శాతంలో
190140,892
191143,414+6.2%
192144,711+3.0%
193157,303+28.2%
194170,243+22.6%
19511,08,042+53.8%
19612,11,190+95.5%
19713,63,467+72.1%
19816,03,630+66.1%
19917,52,031+24.6%
200113,45,938+78.97%
201120,35,690+51.2%

విశాఖపట్టణ జనాభా మార్పు :
1) పైన ఇచ్చిన జనాభా వివరాలలో అన్ని దశకాల గణాంకాలు ఉన్నాయా ? ఒకవేళ లేకపోతే ఏ దశకం గణాంకాలు ఇక్కడ లేవు?
జవాబు:
విశాఖపట్టణం జనాభా వివరాలలో 1901 నుండి 2011 వరకు అన్ని దశాబ్దాల గణాంకాలు ఉన్నాయి.

2) ఏ దశకం నుంచి ఏ దశకానికి జనాభా పెరుగుదల (శాతంలో) అత్యధికంగా ఉంది?
జవాబు:
1951-1961 దశకంలో విశాఖపట్టణం జనాభా 95.5% అత్యధిక శాతం పెరిగింది.
(సూచన : 93వ పేజీలో పట్టిక 2 లో 1991 – 2001 మధ్య 123% పెరిగినట్లు తప్పుగా ముద్రించారు. వాస్తవంగా ఇది 78.97% మాత్రమే.)

3) ఏ దశకం నుంచి ఏ దశకానికి జనాభా పెరుగుదల (శాతంలో) అతి తక్కువగా ఉంది?
జవాబు:
1911-1921 దశకానికి జనాభా పెరుగుదల (3 శాతం) అతి తక్కువగా ఉంది.

4) 1901-2011 విశాఖపట్టణం జనాభాకి లైన్ గ్రాఫ్ తయారుచేయండి. జనాభా సంఖ్యలో ఏ మార్పులను మీరు పరిశీలించారు?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 4
గ్రాఫ్ విశ్లేషణ : 1961 వరకు క్రమేపీ పెరుగుతున్న విశాఖపట్నం జనాభా 1991 వరకు పెరుగుదల శాతం తగ్గుతూ వచ్చింది. అయితే 1991-2001 మధ్యకాలంలో జనాభా పెరుగుదల శాతం పెరిగినా 2001-2011లో పెరుగుదల శాతం తగ్గింది. పెరుగుదల శాతాలను పక్కకు పెడితే గత దశాబ్దంలో జనాభా అత్యధికంగా 6.89, 752 మంది పెరిగారు. దీనికి ఇతర ప్రాంతాల నుండి వలసలు ఎక్కువ కావడమే ప్రధాన కారణం.

10th Class Social Textbook Page No.95

• అట్లాస్ పని :
ప్రశ్న 16.
మీ అట్లాస్ లో భారతదేశ పటాన్ని చూడండి. వివిధ ప్రదేశాలను వివిధ ఆకృతులు, పరిమాణాలు ఉన్న గుర్తులతో సూచించటాన్ని గమనించండి. ఉదా : దేశ రాజధాని, రాష్ట్ర రాజధాని, ఇతర నగరాలు మొదలైనవి. వివిధ సంకేతాలను ఉపయోగించి ఎన్ని స్థాయిలను చూపించారు ? చిన్న చిన్న గ్రామాలను అట్లాస్లో చూపించారా ? మీరు సొంతంగా ఒక పట్టిక తయారు చేసి ప్రదేశాలను స్థాయిని బట్టి పై నుంచి కిందికి (అవరోహణ) క్రమంలో పేర్కొనండి. ఇక్కడ ఒక పట్టిక ఉదాహరణగా ఇచ్చాం. అందులో రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఇతర ప్రదేశాలు ఇచ్చి వివరాలను నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 5
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 6

10th Class Social Textbook Page No.96

ప్రశ్న 17.
పాఠ్యపుస్తకం 97వ పేజీలో ఇవ్వబడిన పిరమిడ్ లోని కింది భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతిచిన్న నివాసప్రాంతాలను సూచిస్తుంది. పైభాగం అతి పెద్ద నివాసప్రాంతాలను సూచిస్తుంది. క్రింది ఉన్న ఖాళీలను నింపండి.
1) ఒక ప్రత్యేక నివాసప్రాంత స్థాయికి ఇచ్చిన పేరు (రెండు ఉదాహరణలు ఉన్నాయి).
2) వివిధ నివాస ప్రాంతాలకు ఒక ఉదాహరణను ఆంధ్రప్రదేశ్ నుంచి పేర్కొనండి. (మహా నగరాలవి కాకుండా. ఎందుకు?)
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 7

4) నివాస ప్రాంతాలను కేవలం జనాభా ఆధారంగానే వర్గీకరించాలా? ఆలోచించండి. ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయా? మీ టీచరుతో చర్చించి అటువంటి వర్గీకరణకు ప్రామాణికాలను గుర్తించంది.
జవాబు:
1)
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 8
2) ఆంధ్రప్రదేశ్ నుండి విజయవాడ ఒక నివాస ప్రాంతం. కారణం, ఆంధ్రప్రదేశ్ లో మహానగరము లేనందున.
3) నేను కలిసిపూడిలో నివసిస్తున్నాను. ఆకివీడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. కలిసిపూడి మా స్వగ్రామము. నాకు తెలిసిన వాటిలో ఆకివీడులోని జిల్లాపరిషత్ పాఠశాల మంచిది.
4) నివాస ప్రాంతాల వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. మరియు ఈ వర్గీకరణ సౌలభ్యాలు, చారిత్రక విషయాలపై ఆధారపడుతుంది.

10th Class Social Textbook Page No.98

ప్రశ్న 18.
ప్రపంచ పటంలో పక్కన ఉదాహరణగా ఇచ్చిన నగరాలను గుర్తించండి. విమానాశ్రయాలు, దేశాల పేర్లను కూడా పటంలో వేరు వేరుగా రాయండి. దీనివల్ల ఏవి దేశాలో, ఏవి నగరాలో, ఏవి విమానాశ్రయాలో గుర్తించటం తేలిక అవుతుంది.
జవాబు:

  1. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం
  2. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ)
  3. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాదు)
  4. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం (బ్యాంకాక్, థాయ్ లాండ్)
  5. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం (దుబాయి, యుఎఇ)
  6. కైరో అంతర్జాతీయ విమానాశ్రయం (కైరో, ఈజిప్టు )
  7. లండన్ హీఛీ అంతర్జాతీయ విమానాశ్రయం (లండన్, యుకె)

AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 9

10th Class Social Textbook Page No.100

ప్రశ్న 19.
మీ అట్లాసు ఉపయోగించి బరంపురాన్ని గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 7 ప్రజలు – నివాస ప్రాంతాలు 10

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

SCERT AP 10th Class Social Study Material Pdf 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Studies 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
కింది వాక్యాలు చదివి అవి వాతావరణానికి లేదా శీతోష్ణస్థితికి, ఏ అంశానికి ఉదాహరణో చెప్పండి.
అ) హిమాలయాల్లోని అనేక మంచుపర్వతాలు గత కొద్ది సంవత్సరాలలో కరిగిపోయాయి.
ఆ) గత కొన్ని దశాబ్దాలలో విదర్భ ప్రాంతంలో కరవులు ఎక్కువగా సంభవించాయి. (AS1)
జవాబు:
ఈ రెండూ వాతావరణానికి ఉదాహరణలు.

ప్రశ్న 2.
కింది వాటిని జతపరచండి. అవసరమైతే పటాలను చూడండి. (ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండవచ్చు) (AS5)
అ) తిరువనంతపురం భూమధ్యరేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ఆ) గ్యాంక్ భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది, కాని సముద్రానికి దగ్గరగా లేదు, వర్షపాతం తక్కువ.
ఇ) అనంతపురం సముద్రానికి దగ్గరగా ఉంది, శీతోష్ణస్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువ.
జవాబు:
అ) తిరువనంత పురం : సముద్రానికి దగ్గరగా ఉంది, శీతోష్ణస్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువ.
ఆ) గ్యాంగ్ టక్ : భూమధ్యరేఖకు దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
ఇ) అనంతపురం : భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది, కాని సముద్రానికి దగ్గరగా లేదు, వర్షపాతం తక్కువ.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 3.
భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి. (AS1)
జవాబు:
శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే వాటిని శీతోష్ణస్థితి కారకాలు అంటారు. అవి.

  1. అక్షాంశం
  2. భూమికి – నీటికి మధ్య గల సంబంధం
  3. భౌగోళిక స్వరూపం
  4. ఉపరితల గాలి ప్రసరణ.

1) అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం :
భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం. భారతదేశం సుమారుగా 8° ఉత్తర -37° ఉత్తర రేఖాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది. కర్కటరేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కటరేఖ ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.

2) భూమికి – నీటికి గల సంబంధం :
దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదే విధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని “సమ శీతోష్ణస్థితి” అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది.

3) భౌగోళిక స్వరూపం :
సముద్ర మట్టం నుండి ఎత్తుకి వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

4) వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ :
భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను “జెట్ ప్రవాహం ” అంటారు. నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించేగాలులు ఇవి. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు. శీతాకాలంలో 184 కిలోమీటర్లు మధ్య ఉంటుంది. 25° ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్లీం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.

ప్రశ్న 4.
కొండ ప్రాంతాలలోని, ఎడారులలోని శీతోష్ణస్థితులను ప్రభావితం చేసే అంశాలను వివరించండి. (AS1)
జవాబు:
కొండ ప్రాంతాలు : సాధారణంగా సముద్ర మట్టం నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 1000మీ|| ఎత్తుకి పోయేకొలదీ 6°C ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి కొండ ప్రాంతాలలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎడారి ప్రాంతాలు : ఎడారి ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రతతోనూ, తక్కువ వర్షపాతంతోనూ ఉంటాయి. ఇవి భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటాయి. వీటికి అవతలవైపున అధిక పీడన ప్రాంతాలు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య జరిగే గాలుల ప్రసరణ ఇక్కడి వాతావరణంలో అనిశ్చితిని ఏర్పరుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 5.
భూగోళం వేడెక్కడంలో మానవుని పాత్రను తెలపండి. (AS4)
జవాబు:
అనేక మానవజనిత కారణాల వలన భూమి వేడెక్కడం, భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది. మనం మండించే ఇంధనాల వలన విడుదలయ్యే CO, దీనికి ముఖ్యకారణం. అడవులను నరికివేత
మరో కారణం. పారిశ్రామిక విప్లవం తరువాత భూమి అతి త్వరగా వేడెక్కడానికి కారణం మానవుడే.

ప్రశ్న 6.
AGW విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలేమిటి? (AS1)
జవాబు:
ముఖ్యంగా “అభివృద్ధి చెందిన” (ప్రధానంగా పాశ్చాత్య పారిశ్రామిక, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన) దేశాలు “అభివృద్ధి చెందుతున్న” (అంతగా పారిశ్రామికీకరణ చెందని) దేశాల మధ్య విభేదాలు తల ఎత్తాయి. వాతావరణంలోని హరితగృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన. శిలాజ ఇంధనాలు (ప్రధానంగా బొగ్గు) వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించటానికి ప్రత్యామ్నాయాలను చూపడంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని ఇవి కోరుతున్నాయి.

ప్రశ్న 7.
భూగోళం వేడెక్కడంలో శీతోష్ణస్థితిలో మార్పులు ఏ విధంగా కారణమవుతాయి? భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి కొన్ని చర్యలను సూచించండి. (AS4)
జవాబు:

  1. మానవజనిత కారణాల వలన భూమి వేడెక్కడం, భౌమ్యవ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతోంది.
  2. భూగోళం వేగంగా వేడెక్కడం వల్ల ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది.
  3. ఉష్ణ పునః ప్రసరణ గందరగోళం కావటంతో వాతావరణ, శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి. స్వల్పకాలిక (వాతావరణ) మార్పులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా (శీతోష్ణస్థితిలో) మారతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

ప్రశ్న 8.
భారతదేశ భౌగోళిక పటంలో కింది వానిని గుర్తించండి. (AS5)
i) 40° సెం.గ్రే. కన్నా ఎక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
ii) 10° సెం.గ్రే, కన్నా తక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు.
iii) భారతదేశంపై వీచే నైరుతి ఋతుపవనాల దిశమార్గం.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 1

ప్రశ్న 9.
కింది కైమోగ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.
i) ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది?
ii) ఏ నెలలలో అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి?
iii) జూన్, అక్టోబర్ మధ్య గరిష్ట వర్షపాతం ఎందుకు సంభవిస్తుంది?
iv) మార్చి, మే నెలల మధ్య అత్యధిక ఆ ఉష్ణోగ్రత ఎందుకు ఉంటుంది?
v) ఉష్ణోగ్రత, వర్షపాతాలలో మార్పులకు కారణమయ్యే భౌగోళిక అంశాలను పేర్కొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 2
జవాబు:
i) ఆగష్టు
ii) డిశంబరు – మే
iii) ఋతుపవన కాలం
iv) సూర్యపుటం అధికంగా ఉంది.
v) సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది.

10th Class Social Studies 4th Lesson భారతదేశ శీతోష్ణస్థితి InText Questions and Answers

10th Class Social Textbook Page No.44

ప్రశ్న 1.
44వ పేజీలో ఇచ్చిన వార్తాకథనం లాంటివే మరికొన్ని వార్తాకథనాలను సేకరించండి.
జవాబు:
స్వయం అభ్యాసం.

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 2.
లెహ్ లో బాగా వేడిగా, బాగా చలిగా ఉండే నెలలు ఏవి?
జవాబు:
వేడినెల – జూన్ ; చలిగా ఉండే నెల – డిశంబరు

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 3.
చెన్నెలో వర్షాకాల నెలలను గుర్తించండి. దీనిని జైపూర్ తో పోలిస్తే ఏవిధంగా భిన్నమైనది?
జవాబు:
చెన్నైలో వర్షాకాల నెలలు – జూన్ – ఆగష్టు, సెప్టెంబర్ – నవంబర్.
జైపూర్‌లో వర్షాకాల నెలలు – జూన్ – ఆగష్టు

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 4.
సిమ్లా, ఢిల్లీలు వేరు వేరు అక్షాంశాల మీద ఉన్నాయా ? మీ అట్లాసు చూసి చెప్పండి. వేసవిలో ఢిల్లీ కంటే సిమ్లాలో చల్లగా ఉంటుందా?
జవాబు:
సిమ్లా 31°611″ ఉ అక్షాంశంపై ఉన్నది. ఢిల్లీ, సిమ్లా వేర్వేరు అక్షాంశాలపై ఉన్నాయి. (3° తేడా) కాని సిమ్లా, ఢిల్లీ కన్నా చల్లగా ఉండటానికి కారణం అది బాగా ఎత్తైన ప్రాంతంలో ఉండటమే.

10th Class Social Textbook Page No.49

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో సగటు ఉష్ణోగ్రతల పరిధి ఏమిటి ?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో జనవరిలో సగటు ఉష్ణోగ్రతల పరిధి 15°C – 28°C.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.49

ప్రశ్న 6.
మీ అట్లాను ఉపయోగించి 15° సెం ఉష్ణోగ్రత ఉండే కొన్ని ప్రదేశాలను గుర్తించంది.
జవాబు:
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్

10th Class Social Textbook Page No.49

ప్రశ్న 7.
సగటు ఉష్ణోగ్రతలు 25° సెం ఉండే ప్రాంతాలకు దగ్గరగా 200 సెం ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతం ఉంది. ఇది ఎలా సాధ్యం?
జవాబు:
ఆ ప్రాంతం ఎత్తైన కొండలపై నుండటంవలన అది సాధ్యం.

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 8.
అడవుల నిర్మూలన అంటే ఏమిటి?
జవాబు:
మానవులు తమ అవసరాలకు పెద్ద పెద్ద అడవులను నరకడము అటవీ ప్రాంతాలను నాశనం చేయటము మొదలైన వాటిని “అడవుల నిర్మూలన” అంటారు.

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 9.
భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే ఇతర మానవ కార్యకలాపాలు ఏమిటి?
జవాబు:
భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే ఇతర మానవ కార్యకలాపాలు :

  1. ఇంధన వనరులని మండించడం
  2. అడవుల నరికివేత

10th Class Social Textbook Page No.55

ప్రశ్న 10.
లక్షలాదిమంది ప్రభావితమైతే అప్పుడు ఆ పరిస్థితులను ఎట్లా ఎదుర్కోగలమో ఊహించండి. పునరావాసానికి వీళ్లకు భూమి ఎక్కడ దొరుకుతుంది?
జవాబు:
ఇది చాలా కష్టసాధ్యమైన పని. లక్షలాది మందికి భూమి, ఉద్యోగాలు దొరకటం దుర్లభం.

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 11.
పై పట్టిక (పట్టిక కొరకు ఈ పుస్తకంలోని పేజీ నెం. 115 చూడండి.) లోని ఉష్ణోగ్రతల పరిధి ఆధారంగా లెహ్ కంటే జైపూర్ వేడిగా ఉంటుందని చెప్పవచ్చా? మీ సమాధానానికి వివరణ ఇవ్వండి.
జవాబు:
జైపూర్ లెహ్ కంటే వేడిగా ఉంటుంది. కారణాలు :

  1. జైపూర్ కంటే లెహ్ అధిక ఎత్తులో ఉన్నది.
  2. జైపూరు వాతావరణంపై థార్ ఎడారి ప్రభావం ఉన్నది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 12.
ఢిల్లీ, చెన్నెల శీతోష్ణ స్థితులను పోల్చండి. వాటిల్లో తేడాలు ఏమిటి?
జవాబు:

  1. ఢిల్లీలో వేసవి, చలికాలాల మధ్య, వర్షపాతాల మధ్య అనేక మార్పులున్నాయి. ఢిల్లీ వాతావరణాన్ని, హిమాలయాలు, థార్ ఎడారి ప్రభావితం చేస్తున్నాయి.
  2. చెన్నె వాతావరణంను సముద్రం ప్రభావితం చేయుచున్నది.

10th Class Social Textbook Page No.46

ప్రశ్న 13.
లెహ్ లో వర్షపాత తీరును జాగ్రత్తగా పరిశీలించండి. మిగిలిన ప్రాంతాలకు దీనికీ మధ్య తేడా ఏమిటి? మీ అట్లాసు సహాయంతో ఇదే వర్షపాత తీరును కనపరిచే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను గుర్తించండి.
జవాబు:
లెహ్ మంచు ఎడారి వాతావరణంను కలిగి ఉన్నది. ఇక్కడ చలికాలం దుర్భరంగా ఉంటుంది. చలికాలంలో ఇక్కడ మంచు పొడిగా కురుస్తుంది. ఇక్కడి సంవత్సర సగటు వర్షపాతం 102 mm మాత్రమే లెహ్లా ఎత్తైన ప్రాంతాలలో ఉన్న ప్రాంతాలు ఈ విధమైన వర్షపాతాన్ని కలిగి ఉంటాయి.

10th Class Social Textbook Page No.47

ప్రశ్న 14.
గ్లోబుని ఉపయోగించి ఇంతకు ముందు చదివింది మళ్లీ మననం చేసుకోండి. వివిధ అక్షాంశాల వద్ద సూర్య కిరణాల కోణాలలో ఏ తేడా ఉంటుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
వివిధ అక్షాంశాల వద్ద సూర్య కిరణాల కోణాలలో తేడా – దాని ప్రభావం :

  1. భూమి యొక్క అక్షం 2372° వాలి ఉండటం.
  2. ఈ అక్షం భూపరిభ్రమణ మార్గాన్ని నిర్దేశిస్తుంది.
  3. దీని మూలంగా భూమిపై ఋతువులు ఏర్పడతాయి.

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 15.
మీ అట్లాను ఉపయోగించి ముంబయి, నాగపూర్‌లో శీతాకాలం, వేసవికాలాల ఉష్ణోగ్రతలను పోల్చండి. వాటిల్లో పోలికలు ఏమిటి, తేడాలు ఏమిటి? సముద్రం నుంచి దూరాన్ని ఇది ఎలా తెలియచేస్తుంది?
జవాబు:

ముంబయినాగపూర్‌లలో సగటు ఉష్ణోగ్రతలు
జనవరి24°C – 21°C
ఫిబ్రవరి25°C – 23°C
మార్చి27°C – 28°C
ఏప్రిల్29°C – 33°C
మే31°C – 35°C
జూన్29°C – 32°C
జూలై28°C – 30°C
ఆగష్టు23°C – 30°C
సెప్టెంబరు28°C – 32°C
అక్టోబరు29°C – 32°C
నవంబరు28°C – 30°C
డిశంబరు26°C – 28°C

సంవత్సరం పొడవునా రెండు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే సగటు ఉష్ణోగ్రత చాలా వరకు – దగ్గరగా పోలి ఉన్నది. ఇది మనకు సముద్ర తీరాన్నుండి దూరాన్ని తెలియజేస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 16.
క్లైమోగ్రాఫీలను ఉపయోగించి జైపూర్, చెన్నైల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలను వివరించండి.
జవాబు:
తేడాలు :

జైపూర్చెన్నె
1) ఇది సముద్ర తీరానికి దూరంగా ఉన్నది.1) ఇది సముద్ర తీరంలో ఉన్నది.
2) ఈ ప్రాంతంపై థార్ ఎడారి ప్రభావం కలదు.2) ఈ ప్రాంతంపై ఏ ఎడారి ప్రభావాలు లేవు.

10th Class Social Textbook Page No.48

ప్రశ్న 17.
వేసవి కాలంలో కోల్‌కతాతో పోలిస్తే డార్జిలింగ్ లో వాతావరణం ఆహ్లాదకరంగా ఎందుకు ఉంటుంది?
జవాబు:
కలకత్తా సముద్ర మట్టానికి 6 మీటర్ల ఎత్తులో ఉండగా, డార్జిలింగ్ 2,645మీ|| ఎత్తులో ఉన్నది. రెండూ ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ డార్జిలింగ్ ఎత్తైన ప్రాంతంలో ఉండటం వలన తక్కువ ఉష్ణోగ్రతలుండి కలకత్తా కన్నా ఆహ్లాదకరంగా ఉంటుంది.

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 18.
ఇది కేవలం అటవీ ప్రాంతాలలోనే జరుగుతుందా ? మీ ప్రాంతాంలో అడవి లేకపోయినా సరే ఏం జరుగుతోంది?
జవాబు:
అడవుల నిర్మూలను ఒక అటవీ ప్రాంతంలోనే గాక పారిశ్రామిక ప్రాంతాలలోనూ, గనుల వద్ద, నగరాలలోనూ జరుగుతున్నది. మానవజాతికి అడవుల ఉనికి అత్యంత ఆవశ్యకం, ఒకప్పుడు 60% భూమి అడవులతో కప్పబడి ఉండేది. నాగరికత, పట్టణీకరణ అడవులను అంతరించిపోయేలా చేశాయి. అడవులు, చెట్లు లేకపోతే మనకి ప్రాణవాయువు ఉండదు. అధికంగా వరదలు వచ్చే అవకాశాలుంటాయి. ‘జలచక్రం’ కుంటుపడుతుంది. ప్రస్తుతం మా ప్రాంతంలో ఈ విధంగానే జరుగుతోంది.

AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి

10th Class Social Textbook Page No.54

ప్రశ్న 19.
భూగోళం వేడెక్కటాన్ని అడవులు అంతరించిపోవటం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? (విజ్ఞానశాస్త్రం తరగతిలో కిరణజన్య సంయోగక్రియ గురించి చదివింది గుర్తుకు తెచ్చుకోండి.)
జవాబు:
అడవుల నిర్మూలన → కొద్ది చెట్లు → ఎక్కువగా CO2 → గ్రీన్ హౌస్ వాయువుల పై ప్రభావం – భూగోళం వేడెక్కడం. అడవులలోని చెట్లు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా CO2 ను తీసుకుని O2 ను విడుదల చేస్తాయి. వీటిని నరకడం మూలంగా వాతావరణంలో CO2 పెరిగిపోతుంది. దీని మూలంగా భూగోళం వేడెక్కుతుంది.

10th Class Social Textbook Page No.45

ప్రశ్న 20.
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత, వర్షపాతాలలో తేడా ఉందని కింది క్లెమోగ్రాలు తెలియచేస్తున్నాయి. మీ అట్లాసు చూసి కింది ప్రాంతాలు ఏ భౌగోళిక ప్రదేశంలో ఉన్నాయో తెలుసుకోండి. కింది పటాలను చదివి, తరువాత పేజీలోని పట్టిక నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 3
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 4
ఉష్ణోగ్రతా వ్యాప్తి అత్యధికం నుండి అత్యల్పం
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 5

10th Class Social Textbook Page No.50

ప్రశ్న 21.
ఇంతకు ముందు ఇచ్చిన కైమోగ్రాఫ్ (4.1 – 4.4) ఆధారంగా నాలుగు పట్టణాలలో మే నెలలో సగటు ఉష్ణోగ్రతలు తెలుసుకుని వాటిని పై పటంలో గుర్తించండి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 4 భారతదేశ శీతోష్ణస్థితి 6

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

SCERT AP 10th Class Social Study Material Pdf 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Studies 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
బ్రాకెట్టులో ఇచ్చిన వాటి నుంచి సరైన వాటితో ఖాళీలు పూరించండి. (AS1)
i) ఉత్పత్తితో సమానంగా సేవారంగంలో ఉపాధి ……… (పెరిగింది / పెరగలేదు)
ii) ……………….. రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చెయ్యరు. (సేవా / వ్యవసాయం)
iii) …………… రంగంలోని అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంది. (వ్యవస్థీకృత / అవ్యవస్థీకృత)
iv) భారతదేశంలోని కార్మికులలో ………………. శాతం అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారు. (ఎక్కువ / తక్కువ)
v) పత్తి …………………. ఉత్పత్తి, గుడ్డ ……………….. ఉత్పత్తి. (సహజ / పారిశ్రామిక)
జవాబు:
i) పెరగలేదు.
ii) సేవా
iii) వ్యవస్థీకృత
iv) ఎక్కువ
v) సహజ, పారిశ్రామిక

ప్రశ్న 2.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి. (AS1)
అ) ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని ……………….. రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు.
i) ప్రాథమిక
ii) ద్వితీయ
iii) తృతీయ
iv) సమాచార సాంకేతిక
జవాబు:
i) ప్రాథమిక

ఆ) స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన ……………. మొత్తం విలువ.
i) అన్ని వస్తువులు, సేవలు
ii) అన్ని అంతిమ వస్తువులు, సేవల
iii) అన్ని మాధ్యమిక వస్తువులు, సేవల
iv) అన్ని అంతిమ, మాధ్యమిక వస్తువులు, సేవల
జవాబు:
ii) అన్ని అంతిమ వస్తువులు, సేవల

ఇ) 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా ………….
i) 20-30 శాతం మధ్య
ii) 30-40 శాతం మధ్య
iii) 50-60 శాతం మధ్య
iv) 70 శాతం
జవాబు:
iii) 50-60 శాతం మధ్య

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 3.
వేరుగా ఉన్నదానిని గుర్తించండి, కారణం చెప్పండి. (AS1)
i) టీచరు, డాక్టరు, కూరగాయలు అమ్మే వ్యక్తి, న్యాయవాది.
ii) పోస్టుమాన్, చెప్పులుకుట్టే వ్యక్తి, సైనికుడు, పోలీసు కానిస్టేబులు.
జవాబు:
1) కూరగాయలు అమ్మే వ్యక్తి:
– మిగతా మూడు విద్యావంతులైన, నైపుణ్యం కల వృత్తులు చేస్తున్నవారు.
– వీరు సేవా రంగానికి చెందినవారు.

ii) చెప్పులు కుట్టే వ్యక్తి : ఇతను ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు.

ప్రశ్న 4.
ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా ఎందుకో వివరించండి. (AS1)
(లేదా)
ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించటం ఉపయోగకరమేనా? ఏవేని రెండు ఉపయోగాలు తెల్పుము.
జవాబు:

  1. ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక (వ్యవసాయ), ద్వితీయ (పరిశ్రమలు), తృతీయ (సేవా) రంగాలుగా విభజించడం ఉపయోగకరమే.
  2. జాతీయాదాయం, తలసరి ఆదాయం మొదలగునటువంటివి గణించటానికి సులభంగా ఉంటుంది.
  3. ఏ రంగంలో ఎంత ఉత్పత్తి, ఉపాధి జరిగిందో తెలుసుకోవచ్చు. దానికనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించవచ్చును.
  4. సౌకర్యాల ఏర్పాటుకు, అభివృద్ధి చర్యలు చేపట్టుటకు ఇది ఉపయోగపడుతుంది.
  5. ఆదాయ, సంపద పంపిణీల్లో అసమానతలను తెలుసుకోవచ్చు. వాటిని రూపుమాపడానికి తగిన చర్యలు తీసుకోవచ్చు.
  6. జాతీయ ఉత్పత్తిలోని ఈ అంశాలు ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని తెలియచేస్తుంది. దేశంలోని ఆర్ధిక స్థితిగతులను తెలుసుకోవచ్చు.
  7. జాతీయ విధానాల రూపకల్పనకు, ప్రజల జీవన ప్రమాణస్థాయి తెలుసుకొనుటకు, మెరుగుపర్చుటకు.

ప్రశ్న 5.
ఈ అధ్యాయంలో మనం చూసిన ప్రతి రంగంలో స్థూల జాతీయోత్పత్తిలోనూ, ఉపాధిలోనూ దృష్టి ఎందుకు కేంద్రీకరించాలి? ఇంకా పరిశీలించాల్సిన ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? చర్చించండి. (AS4)
జవాబు:

  1. ఆర్థిక వ్యవస్థ (దేశం) అభివృద్ధి పథంలో ఉందో లేదో తెలుసుకొనుటకుగాను స్థూల జాతీయోత్పత్తిలోనూ, ఉపాధిలోనూ దృష్టి కేంద్రీకరించాలి. ఇంకా
  2. ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి తెలుసుకొనుటకు, అభివృద్ధిపరచుటకు
  3. అభివృద్ధి ప్రణాళికలను వ్యూహాలను రూపొందించుటకు, ప్రణాళికల్లో ఏ రంగానికి ప్రాధాన్యతనివ్వాలో నిర్ణయించుటకు.
  4. పేదరికం, నిరుద్యోగ స్థాయిలు తెలుసుకొనుటకు, వాటిని రూపుమాపుటకు.
  5. సమన్యాయ పంపిణీ కోసం (జాతీయాదాయం), సమతౌల్య అభివృద్ధి సాధించుటకు,
  6. అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించుటకు ; ఉత్పత్తి, ఉపాధిపై దృష్టి పెట్టాలి.

ఇతర అంశాలు:

  1. సాంకేతిక, వైజ్ఞానిక నైపుణ్యం
  2. ఆధునిక సమాచార, ప్రసార అభివృద్ధి
  3. ఎగుమతులు, దిగుమతులు
  4. ప్రాంతీయాభివృద్ధి
  5. విద్య, వైద్యం, విద్యుత్, రవాణా, త్రాగునీరు, సాగునీరు మొదలయిన అవస్థాపన సౌకర్యాలు.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 6.
సేవా రంగం ఇతర రంగాలకంటే ఎలా భిన్నమైనది? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
సేవా రంగం ఇతర రెండు రంగాల కంటే భిన్నమైనది.

  1. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సేవల రంగం ప్రాణవాయువులాంటిది.
  2. ఒక ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక, ద్వితీయ రంగాలు పుష్టినిస్తే, సేవల రంగం ఆధునికీకరణ చేస్తుంది.
  3. ఇతర రంగాలలాగా నేరుగా వస్తువులను తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు మాత్రమే ఈ రంగం అందిస్తుంది.
    ఉదా : వస్తువులు, ప్రయాణీకులను రవాణా చేయటం.
  4. సేవారంగం ఇతర రంగాల అభివృద్ధికి పరిపూరక రంగంగా పనిచేస్తూ ఉంటుంది.
    ఉదా : ఉత్పత్తి పెరుగుదలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను సేవా రంగం అందిస్తుంది.
  5. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు, విద్యుత్తు, పరపతి, రవాణా సౌకర్యాలు, రసాయనిక ఎరువులు మొదలయిన సేవలు అవసరం.
  6. పరిశ్రమల రంగం అభివృద్ధి చెందాలంటే యంత్ర పరికరాలు, విద్యుత్ (శక్తి వనరులు), బీమా సౌకర్యాలు, రవాణా, మార్కెట్ సౌకర్యాలు, బ్యాంకులు మొదలయిన సేవలు అవసరం.
  7. మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం విశ్వవ్యాప్తంగా అతి పెద్ద రంగంగా అభివృద్ధి చెందుతుంది.
  8. మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం ఎక్కువ భాగం ఉపాధిని, ఉత్పత్తిని కలిగిస్తోంది.

ప్రశ్న 7.
అల్ప ఉపాధి అంటే ఏమి అర్థం చేసుకున్నారు ? పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:

  1. ఎవరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా మరియు తగినంతగా పని దొరకని స్థితిని అల్ప ఉపాధి అనవచ్చును. తక్కువ ఉత్పాదకత గల వ్యవసాయ, సేవల రంగంలో పనిచేస్తున్న శ్రామికులను “అల్ప ఉద్యోగులు” అంటారు. కనపడని ఈ రకమైన అల్ప ఉపాధినే “ప్రచ్ఛన్న నిరుద్యోగం” అంటారు.
  2. సిరిపురం గ్రామంలోని సాంబయ్య అనే రైతుకు 5 ఎకరాల వర్షాధార భూమి ఉంది. మిరప, ప్రత్తి, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తాడు. కుటుంబంలోని ‘6’ గురు సభ్యులు సంవత్సరమంతా అందులోనే పనిచేస్తారు. కారణం వాళ్ళకు చెయ్యటానికి వేరే పనిలేదు. వారి శ్రమ విభజింపబడుతోంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికీ పూర్తి పని లేదు. ఈ కుటుంబంలోని ఇద్దరి ముగ్గురు వేరే పనికి వెళ్ళిన ఉత్పత్తి తగ్గదు.
  3. పట్టణ ప్రాంతంలో సేవా రంగంలో రోజుకూలీ కోసం వెతుక్కునేవాళ్లు వేలాదిగా ఉన్నారు. రంగులు వేయటం, నీటి పైపుల పని, మరమ్మతులు చేయటం వంటి పనులు చేస్తారు. వీళ్లల్లో చాలామందికి ప్రతిరోజూ పని దొరకదు.

ప్రశ్న 8.
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఈ కింది అంశాలలో రక్షణ కావాలి. (AS1)
కూలీ, భద్రత, వైద్యం : ఉదాహరణలతో వివరించండి. –
జవాబు:
అవ్యవస్థీకృతరంగంలో చిన్నచిన్న సంస్థలు అక్కడక్కడా ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి కానీ వాటిని అనుసరించరు. స్వయం ఉపాధి పొందే చిన్నచిన్న (మరమ్మతులు) పనులు చేసేవారు కూడా కష్టంగానే జీవితం వెల్లబుచ్చాల్సి వస్తుంది. అందుకని అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కూలీ, భద్రత, వైద్యం మొదలగు వాటిల్లో రక్షణ కల్పించాలి.

1) కూలి :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు జీతం తక్కువగా ఉంటుంది, పని ఎక్కువ, వేతనం తక్కువ, ఆర్జిత సెలవు, సెలవులు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి ఉండవు. వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కూలీలు అధికశాతం మంది చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. వీళ్లు తరచు దోపిడికి గురవుతుంటారు, వీళ్లకు న్యాయమైన – వేతనం చెల్లించబడదు. సంపాదన తక్కువ అది క్రమం తప్పకుండా ఉండదు.

ఈ రంగంలోని కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే, వీరి యొక్క కొనుగోలు శక్తి పెరగాలన్నా, ఆర్థిక, సామాజిక అభివృద్ధి పొందాలన్నా వీరికి రక్షణ, మద్దతు అవసరం.

2) భద్రత :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు, అలాగే జీవితానికి భద్రత ఉండదు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్తులను మానుకోమనవచ్చు. పని తక్కువగా ఉండే కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. మారుతున్న మార్కెటు పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న వాళ్ల మానసిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మరింత పని అవసరంతో పాటు అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.

3) వైద్యం :
అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు వైద్య ప్రయోజనాలు అందవు, అనారోగ్యమప్పుడు సెలవులు వంటివి కూడా ఉండవు. అనారోగ్యం పాలైతే వారి కుటుంబ జీవనం దుర్భరంగా మారుతుంది. కనుక ఖచ్చితంగా వీరికి జీవితబీమా, ఆరోగ్యబీమా మొదలయినటువంటి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే వారి కుటుంబాలకు, వారికి రక్షణ ఉంటుంది.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

ప్రశ్న 9.
అహ్మదాబాదు నగరంలో జరిపిన అధ్యయనంలో 15 లక్షలమంది కార్మికులు ఉండగా అందులో 11 లక్షలమంది అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారని తెలిసింది. ఆ సంవత్సరం (1997-98)లో నగరం మొత్తం ఆదాయం 6000 కోట్ల రూపాయలు. అందులో వ్యవస్థీకృత రంగం వాటా 3200 కోట్ల రూపాయలు. ఈ గణాంకాలను ఒక పట్టిక రూపంలో ఇవ్వండి. పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు ఏమిటి?
జవాబు:
అహ్మదాబాదు నగరంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల వాటాలు (1997-98) :

రంగంఉద్యోగస్తులుఆదాయం (కోట్లలో)
వ్యవస్థీకృత4,00,000₹ 3200/-
అవ్యవస్థీకృత11,00,000₹2800/-
మొత్తం15,00,000₹ 6000/-

పట్టణంలో మరింత ఉపాధి కల్పించే మార్గాలు :

  1. ప్రభుత్వం వివిధ పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలుచేయడం.
    ఉదా : TRVSEM, SHG లు
  2. స్వయం ఉపాధి పొందేవారికి ఆర్థిక మరియు ఇతరత్ర సహాయమందించడం.
    ఉదా : పన్నుల మినహాయింపు
  3. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహమందించాలి.
    ఉదా : సులభ లైసెన్సింగ్ విధానం, పరపతి సౌకర్యం కల్పించటం.
  4. విద్యావిధానం, మానవ వనరులను అభివృద్ధిపర్చే విధంగా ఉండాలి.
    ఉదా : వృత్తి విద్యా కళాశాలల ఏర్పాటు.
  5. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు కల్పించాలి.
    ఉదా : కనీస వేతనాల చట్టం అమలుచేయటం.

ప్రశ్న 10.
మన రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి అవకాశాల గురించి క్రింది పట్టికలో రాయండి. (AS3)

ప్రాంతంవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలుఅవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు
1. ఉత్తరాంధ్ర
2. దక్షిణ కోస్తా
3. రాయలసీమ

జవాబు:

ప్రాంతంవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలుఅవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు
1. ఉత్తరాంధ్ర1. ప్రభుత్వ రంగంలో రవాణా, వైద్యం విద్య ఆరోగ్యం మొదలైనవి.
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. మత్స్య పరిశ్రమ
3. చేతి వృత్తులు
4. పారిశ్రామిక రంగం
2. దక్షిణ కోస్తా1. ప్రభుత్వ రంగంలో
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. మత్స్య పరిశ్రమ
3. చేతి వృత్తులు
4. పారిశ్రామిక రంగం
5. నిర్మాణ రంగం
3. రాయలసీమ1. ప్రభుత్వ రంగంలో
2. ప్రైవేటు రంగంలో
1. వ్యవసాయ రంగం
2. చేతి వృత్తులు

10th Class Social Studies 3rd Lesson ఉత్పత్తి, ఉపాధి InText Questions and Answers

10th Class Social Textbook Page No.28

ప్రశ్న 1.
దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించండి. మీ వర్గీకరణకు కారణాలు ఇవ్వండి.

వృత్తివర్గీకరణ
బట్టలు కుట్టేవారు
బుట్టలు అల్లేవారు
పూల సాగు చేసేవారు
పాలు అమ్మేవారు
చేపలు పట్టేవారు
మత బోధకులు / పూజారులు
ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్
అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు
వడ్డీ వ్యాపారి
తోటమాలి
కుండలు చేసేవారు
తేనెటీగలను పెంచేవారు
వ్యోమగామి
కాల్ సెంటర్ ఉద్యోగులు

జవాబు:

వృత్తివర్గీకరణ
బట్టలు కుట్టేవారుసేవా రంగం
బుట్టలు అల్లేవారుపరిశ్రమల రంగం (కుటీర పరిశ్రమ)
పూల సాగు చేసేవారువ్యవసాయ రంగం
పాలు అమ్మేవారువ్యవసాయ రంగం
చేపలు పట్టేవారువ్యవసాయ రంగం
మత బోధకులు / పూజారులుసేవా రంగం
ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్సేవా రంగం
అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారుపరిశ్రమల రంగం
వడ్డీ వ్యాపారిసేవా రంగం
తోటమాలివ్యవసాయ రంగం
కుండలు చేసేవారుపరిశ్రమల రంగం (కుటీర పరిశ్రమ)
తేనెటీగలను పెంచేవారువ్యవసాయ రంగం
వ్యోమగామిసేవా రంగం
కాల్ సెంటర్ ఉద్యోగులుసేవా రంగం

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.29

ప్రశ్న 2.
కింది పట్టిక భారతదేశంలో 1972-73 లోనూ, తిరిగి 2009-10 అంటే 37 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియచేస్తుంది.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 1
(అ) పై పట్టిక ద్వారా మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏమిటి?
జవాబు:
1972-73 నుండి 2009-10 సం||ల మధ్య (దాదాపు 37 సం||లు) ఉపాధిలో వచ్చిన మార్పులు

  1. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 21% తగ్గింది.
  2. పరిశ్రమ రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 11% పెరిగింది.
  3. సేవల రంగంలో ఉపాధి పొందుతున్నవారి శాతం 10% పెరిగింది.
  4. ప్రాథమిక రంగం (వ్యవసాయ రంగం) లో ఉపాధి శాతం తగ్గటం, ద్వితీయ (పరిశ్రమ) తృతీయ (సేవల) రంగాలు అభివృద్ధి చెందటం ఆర్థికాభివృద్ధి సూచికగా చెప్పవచ్చు.

ఆ) ఇంతకుముందు మీరు చదివిన దాని ఆధారంగా ఈ మార్పులకు కారణాలు ఏమిటో చర్చించండి.
జవాబు:
ఈ మార్పులకు కారణాలు :

  1.  పారిశ్రామిక విప్లవం ద్వారా పరిశ్రమ అభివృద్ధి చెందడం వలన ఆ రంగంలో ఉపాధి పెరిగింది.
  2. ఉత్పత్తి పెరగడం, మార్కెట్స్ పెరగడం, వ్యాపారం, వాణిజ్యం పెరగడం (రవాణా పెరగడం) వలన సేవారంగంలో ఉపాధి పెరిగింది.
  3. ప్రభుత్వ విధానాలు (1991 పారిశ్రామిక విధానం, గ్లోబలైజేషన్ మొదలగునవి) ప్రణాళికలు కూడా ఈ మార్పుకు దోహదం చేశాయి.
  4. పెరుగుతున్న వైజ్ఞానిక, సాంకేతిక సమాచార వ్యవస్థ సేవారంగంలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది.

10th Class Social Textbook Page No.29

ప్రశ్న 3.
ఈ దిగువ చిత్రాలను పరిశీలించి అవి ఏ రంగాలకు చెందినవో పేర్కొనండి.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 2
జవాబు:

  1. వ్యవసాయ రంగం
  2. (గనులు) ప్రాథమిక రంగం
  3. సేవల రంగం
  4. పారిశ్రామిక రంగం

10th Class Social Textbook Page No.30

ప్రశ్న 4.
ఈ కింది గ్రాఫ్ రెండు వేరు వేరు సంవత్సరాలు, 1972-73, 2009-10 లకు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి విలువను చూపిస్తుంది. సంవత్సరాలలో మొత్తం ఉత్పత్తి పెరిగిన తీరును మీరు చూడవచ్చు.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 3
గ్రాఫ్ : వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల వారీగా స్థూల దేశీయోత్పత్తి
గ్రాఫ్ ను చూసి కింది ప్రశ్నలకు జవాబులివ్వండి :
(1) 1972-78లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది?
జవాబు:
1972-73లో వ్యవసాయం రంగం అధిక ఉత్పత్తి కలిగి ఉన్నది. మొత్తం GDP 5,86,346 కోట్లలో వ్యవసాయరంగం 2,43,082 కోట్లు కలిగి ఉంది.

(2) 2009-10 లో అధిక ఉత్పత్తి ఉన్న రంగం ఏది?
జవాబు:
2009-10 లో సేవా రంగం అధిక ఉత్పత్తి కలిగి ఉన్నది. మొత్తం GDP 45,16,071 కోటలో సేవా రంగం 26,78,165 కోట్లు మిగిలిన వ్యవసాయ రంగం 7,64,817 కోట్లు మరియు పరిశ్రమల రంగం 11,73,089 కోట్లు వాటా కలిగి ఉన్నాయి.

(3) 1972-73, 2009-10 సంవత్సరాల మధ్య భారతదేశంలో మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి సుమారుగా …….. రెట్లు పెరిగింది.
జవాబు:
8 రెట్లు పెరిగింది.

10th Class Social Textbook Page No.31

ప్రశ్న 5.
ప్రతి దశలో మొత్తం వస్తువుల విలువ :
మొదటి దశ (రైస్ మిల్లర్‌కు రైతు వడ్లు అమ్మడం) రూ. 2500
రెండవ దశ (మాటలు యజమానికి ఊక, బియ్యం అమ్మడం) రూ. 3600
మూడవ దశ (ఇడ్లీ, దోశలు అమ్మడం) రూ. 5000
– చర్చించండి : ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోటానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించాలా?
జవాబు:
అవసరం లేదు. ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల విలువను తెలుసుకోటానికి వీటన్నిటి మొత్తాన్ని జోడించనవసరం లేదు.

  • అంతిమ వస్తు ధరలో (విలువలో) ఆ వస్తువు తయారీలో వాడిన మాధ్యమిక వస్తువుల విలువ కలిసి ఉంటుంది.
  • అలా కనక జోడిస్తే ఆ వస్తువు ధరను రెండుసార్లు లెక్కించినట్లవుతుంది.
  • పై ఉదాహరణలో వడ్లు, బియ్యం, ఊక అనేవి మాధ్యమిక వస్తువులు, ఇడ్లీ, దోశ అనేవి అంత్య వస్తువులు.
  • ప్రతి దశలో ఉత్పత్తిదారులు ఉత్పాదకాలు తయారుచేసినవారికి మొత్తం విలువ చెల్లించారు.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.31

ప్రశ్న 6.
పై ఉదాహరణలో వడ్లు, బియ్యం మధ్య దశలోని ఉత్పాదకాలు కాగా, ఇడ్లీ, దోశ వంటివి తుది ఉత్పాదకాలు. మనం నిత్యజీవితంలో ఉపయోగించే కొన్ని వస్తువులను దిగువ సూచించడమైనది. వాటికి ఎదురుగా ఆయా వస్తువుల మధ్య దశ ఉత్పాదకాలను రాయండి.

తుది ఉత్పాదకాలుమధ్యదశ ఉత్పాదకాలు
నోటు పుస్తకం
కారు
కంప్యూటర్

జవాబు:

తుది ఉత్పాదకాలుమధ్యదశ ఉత్పాదకాలు
నోటు పుస్తకంకాగితపు గుజ్జు, కాగితం, కార్డ్ బోర్డు, బంక, పిన్నులు
కారుటైర్లు, లైట్స్, మెటల్ షీట్స్, రంగులు, సీట్లు, పెట్రోలు/డీసెల్
కంప్యూటర్సిలికాన్ చిప్స్, మానిటర్, కేబుల్స్, సాఫ్ట్ వేర్స్, సర్క్యుట్స్

10th Class Social Textbook Page No.32

ప్రశ్న 7.
మొదటి దశ (రైస్ మిల్లర్ కు రైతు వడ్లు అమ్మటం) = రూ. 2500 లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ ‘0’ రూపాయలు తీసేస్తే, జోడించిన విలువ 2500 రూపాయలు
రెండవ దశ (మాటలు యజమానికి ఊక, బియ్యం అమ్మటం) = రూ. 3600 లోంచి కొనుగోలు చేసిన ఉత్పాదకాల విలువ 2500 తీసేస్తే, జోడించిన విలువ 1100 రూపాయలు
మూడవ దశ (ఇడ్లీ, దోశల అమ్మకం) = రూ. 5000 లోంచి కొనుగోలు చేసిన విలువ 3600 తీసేస్తే, జోడించిన విలువ 1400 రూపాయలు.
ప్రతి దశలోనూ జోడించిన విలువ = 2500+ 1100 + 1400 = 5000
చర్చించండి : రెండు పద్ధతులలోనూ ఒకే సమాధానం ఎందుకు వచ్చింది?
జవాబు:

  1. ప్రతి దశలోనూ జోడించిన విలువ = (2500 + 1100 + 1400) = 5000
  2. అంతిమ వస్తువు ధర (దోశ ధర) = 5000. రెండు పద్ధతుల్లోను ఒకే సమాధానం వచ్చింది. కారణం
  3. జోడించిన విలువలు మాత్రమే లెక్కించడం వలన (మాధ్యమిక వస్తువులు జోడించిన విలువ)
  4. మొదటి పద్ధతిలో అంత్య వస్తువు (ఇడ్లీ) లోనే ఇవి అన్నీ ఇమిడి ఉంటాయి.
  5. రెండు పద్ధతుల్లో అంతిమ వస్తువుల విలువ ఒక్కటే కాబట్టి,
  6. రెండు పద్ధతుల్లోనూ ఒకే సమాధానం వచ్చింది.

AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి

10th Class Social Textbook Page No.32

ప్రశ్న 8.
కింది పట్టికలో స్థూల జాతీయోత్పత్తి విలువ ఇవ్వబడింది. 2010-2011 సంవత్సరానికి లెక్కించిన విధంగా స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల రేటును మిగతా సంవత్సరాలకు గణించండి.
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 4
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 5

10th Class Social Textbook Page No.34

ప్రశ్న 9.
వ్యాపారం, టళ్లు, రవాణా, ప్రసారాలకు కొన్ని ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:

  1. వివిధ రకాల వస్తువులు అమ్మే అన్నీ రకాల దుకాణాలు, ఎగుమతులు దిగుమతులు, సూపర్ మార్కెట్లు, మాల్స్
  2. చిన్న హెూటళ్ల నుండి స్టార్ హోటళ్లు దాకా.
  3. రోడ్డు, రైల్వే, విమానయాన, ఓడల ద్వారా రవాణా ఈ కోవ కిందకి వస్తాయి.
  4. రేడియో, టి.వి., వార్తాపత్రికలు, వివిధ మాస వార పత్రికలు, ఇంటర్నెట్ సౌకర్యం, టెలికమ్యూనికేషన్స్ (టెలిఫోన్, సెల్ ఫోన్) ఉపగ్రహ సాంకేతికత మొదలగునవి.

10th Class Social Textbook Page No.35

ప్రశ్న 10.
పట్టిక : భారతదేశంలో పరిశ్రమలవారీగా కార్మికుల వివరాలు, 2009-2010 (%)
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 6
పట్టికని జాగ్రత్తగా అధ్యయనం చేసి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు ………………………… లో నివసిస్తున్నారు.
2) చాలామంది ………………………. పనివారు వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు.
3) 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు ……………., ……………… రంగాలలో ఉపాధి పొందుతున్నారు.
4) స్త్రీ, పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు ………………., ………………….. రంగాలలో కొద్ది శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు.
జవాబు:
1) గ్రామప్రాంతం
2) మహిళ (స్త్రీ)
3) పారిశ్రామిక, సేవా
4) పారిశ్రామిక, సేవా

10th Class Social Textbook Page No.36 & 37

ప్రశ్న 11.
‘పై’ చార్టు : మూడు రంగాలలో ఉపాధి వాటా
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 8 AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 9 AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 10
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 3 ఉత్పత్తి, ఉపాధి 11

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

SCERT AP 10th Class Social Study Material Pdf 6th Lesson ప్రజలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 6th Lesson ప్రజలు

10th Class Social Studies 6th Lesson ప్రజలు Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను గుర్తించి వాటిని సరిచేయండి. (AS1)
అ) ప్రతి పది సంవత్సరాలకు జనాభా గణన చేపడతారు.
ఆ) జనాభాలోని పెద్దవాళ్లలో ఆడవాళ్ల సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది.
ఇ) వయస్సును బట్టి జనాభా విస్తరణను వయస్సు సమూహం తెలియజేస్తుంది.
ఈ) కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడతారు కాబట్టి అక్కడ జనాభా సాంద్రత ఎక్కువ.
జవాబు:
అ) ఒప్పు
ఆ) జనాభాలోని ఆడవాళ్ల సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది. ఇ) ఒప్పు
ఈ) కొండ ప్రాంతాలలోని వాతావరణాన్ని ప్రజలు ఇష్టపడరు కాబట్టి అక్కడ జనసాంద్రత తక్కువ.

ప్రశ్న 2.
దిగువ పట్టిక ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. (AS3)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు
ఎ) ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావటానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టిందో తెలుసుకోండి.
జవాబు:
ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి సుమారు మూడు శతాబ్దాలు పట్టింది.

బి) ఇంతకు ముందు తరగతులలో మీరు వలస పాలన గురించి చదివారు. పట్టిక చూసి 1800 నాటికి ఏ ఖండాలలో జనాభా తగ్గిందో తెలుసుకోండి.
జవాబు:
1800 సం|| నాటికి ఓషియానియాలో జనాభా తగ్గింది.

సి) ఏ ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది?
జవాబు:
ఆసియా ఖండంలో ఎక్కువ కాలంపాటు అధిక జనాభా ఉంది.

డి) భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం ఏదైనా ఉందా?
జవాబు:
భవిష్యత్తులో ఉత్తర అమెరికా ఖండంలో జనాభా గణనీయంగా తగ్గనుంది.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 3.
లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, లేదా చాలా తక్కువగాని ఉంటే సమాజంపై పడే ప్రభావాలను పేర్కొనండి. (AS4)
జవాబు:

  1. లింగ నిష్పత్తి చాలా ఎక్కువగాని, తక్కువగాని ఉంటే సామాజికంగా చాలా తేడా వస్తుంది.
    ఉదా : కాలేజీల విద్యార్థుల సంఖ్య.
  2. ఈ నిష్పత్తి సంపద పంపిణీని, అధికార హోదాలను, ఎగ్జిక్యూటివ్ స్థాయిని, ప్రభుత్వ పని గంటలను అన్నింటినీ ప్రభావితం చేస్తుంది.
  3. ఈ నిష్పత్తి నేర రేటును కూడా ప్రభావితం చేస్తుంది.
  4. స్త్రీల సంఖ్య మరీ తక్కువగా ఉంటే సాధారణ పురుషులకు వివాహం జరగటం కష్టమవుతుంది. అన్ని రకాలుగా ముందున్న వారినే స్త్రీలు భర్తలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.
  5. లింగ నిష్పత్తిలో అసమానతలు జనన రేటును ప్రభావితం చేస్తాయి.

ప్రశ్న 4.
భారతదేశ అక్షరాస్యతను ఇతర దేశాలతో పోల్చండి : (AS1)
బ్రెజిల్, శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, నార్వే, చిలి, ఇండోనేషియా.
ఎటువంటి సారూప్యాలు, తేడాలు మీరు గమనించారు?
జవాబు:

  1. భారతదేశ అక్షరాస్యత శాతం : 74.04% (82.1% – 65.5%)
  2. బ్రెజిల్ : 90.04% (90.1% – 90.7%)
  3. చిలీ : 98.6% (98.6% – 98.5%)
  4. బంగ్లాదేశ్ : 57.7% (62% – 53.4%)
  5. ఇండోనేషియా : 90.4% (94% – 86.8%)
  6. నార్వే : 100% (100% – 100%)
  7. నేపాల్ : 66% (75.1% – 57.4%)
  8. శ్రీలంక : 91.2% (92.6% – 90%)
  9. దక్షిణ ఆఫ్రికా : 93% . (93.9% – 92.2%)

పోలికలు మరియు భేదాలు :

  1. దాదాపు అన్ని ఆసియా దేశాలు సమాన అక్షరాస్యతా రేటును కలిగి ఉన్నాయి. ఒకటి రెండు దేశాలలో మాత్రము యివి తక్కువగా ఉన్నాయి.
  2. పురుషుల అక్షరాస్యత శాతం బ్రెజిల్, నార్వేలలో తప్ప మిగతా దేశాలలో అధికంగానే ఉంది.
  3. స్త్రీ, పురుషుల అక్షరాస్యత శాతం మధ్య తేడా భారతదేశం, నేపాల్ లో అధికంగా ఉంది.
  4. ఒక్క నార్వే మాత్రం 100% అక్షరాస్యతను సాధించింది.

ప్రశ్న 5.
ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతాలలో జన సాంద్రత ఎక్కువగా ఉంది, దానికి కారణాలు ఏమిటి? (AS1)
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా 519, పశ్చిమ గోదావరి 508, తూర్పు గోదావరి 477, గుంటూరు 429 జనసాంద్రతలతో మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.

కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలలో అధిక జనసాంద్రతకు గల కారణాలు :
ఎ) కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వలన వ్యవసాయానికి అనుకూలత.
బి) వ్యవసాయాధారిత పరిశ్రమలు వృద్ధి.
సి) వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 6.
జనాభా పెరుగుదల, జనాభా మార్పు మధ్య తేడాలను పేర్కొనండి. (AS1)
జవాబు:

  1. జనాభా పెరుగుదల జననాల, మరణాల రేటుపై ఆధారపడి ఉంటుంది. జనగణన కాలంనాటి జనాభా మరియు దశాబ్దం క్రిందటి జనగణన కాలంనాటి జనాభాల తేడానే “జనాభా పెరుగుదల” అంటాం.
  2. జనాభా మార్పు అనేది వలసల ప్రాధాన్యత గల అంశం.
  3. జనాభా మార్పు = (జననాల సంఖ్య + ఆ ప్రాంతం / దేశంలోని వలస వచ్చిన వారి సంఖ్య) – (మరణాల సంఖ్య + ఆ ప్రాంతం / దేశం నుండి బయటకు వలస వెళ్ళిన వారి సంఖ్య)
  4. జనాభా పెరుగుదల దేశం మొత్తానికి దశాబ్దానికోసారి లెక్కిస్తాం.
  5. జనాభా మార్పు నిరంతర ప్రక్రియ. . ఉదాహరణకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో వర్షాధార భూములు గల ప్రాంత కూలీలు వ్యవసాయ పనులు లేనపుడు బహుళపంటలు వేసే ప్రాంతాలకు వలసపోతారు.
  6. సాగర తీరప్రాంత మత్స్యకారులు చేపలవేట నిషేధకాలంలో వీరావల్ వంటి ప్రాంతాలకు వలసపోతారు.
  7. ఇవి కాలానుగుణ వలసలు. కాగా ఉపాధి కోసం శాశ్వతంగా పట్టణాలకు వలసలు పోయే కుటుంబాలెన్నో !
  8. ఈ రకంగా వలసల వలన ఓ ప్రాంతంలో జనసాంద్రత తగ్గి, మరో ప్రాంతంలో జనసాంద్రత పెరుగుతుంది. అయితే ఈ జనాభా మార్పు జనాభా పెరుగుదలను ప్రభావితం చేయలేదు.
  9. అంతర్జాతీయ శాశ్వత వలసలు మాత్రమే జనాభా పెరుగుదలపై ప్రభావితం చూపుతాయి.

ప్రశ్న 7.
క్రింద ఇచ్చిన స్వీడన్, కెన్యా, మెక్సికో దేశాల వయస్సు సమూహాన్ని పోల్చండి. (AS3)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 2 AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 3
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 4
ఎ) ఈ దేశాల్లో జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది?
బి) ఏ దేశాల జనాభా ఇంకా తగ్గవచ్చు?
సి) అన్ని దేశాలలో లింగ నిష్పత్తి సమతుల్యంగా ఉందా?
డి) ఈ దేశాల కుటుంబ సంక్షేమ పథకాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
ఎ) స్వీడన్లో జనాభా పెరుగుదల అధిక హెచ్చు తగ్గులతో ఉంది.
కెన్యా, మెక్సికోలలో జనాభా పెరుగుదల నిదానంగా ఒక పద్ధతిలో ఉన్నది.

బి) స్వీడన్

సి) స్వీడన్లో లింగ నిష్పత్తి – 980 పురుషులు 1000 స్త్రీలు
కెన్యాలో లింగ నిష్పత్తి – 1000 పురుషులు/1000 స్త్రీలు
మెక్సికోలో లింగ నిష్పత్తి – 960 పురుషులు 1000 స్త్రీలు

డి) ఈ 3 దేశాలలోకెల్లా కెన్యాలో కుటుంబ సంక్షేమ పథకాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

ప్రశ్న 8.
పటం పని (AS5)
అ) రాష్ట్రాలను సూచించే భారతదేశ పటంలో 2011 జనాభా గణాంకాల ఆధారంగా అయిదు స్థాయిలలో జనాభా సాంద్రతను సూచించండి.

స్థాయి – I:
1) ఉత్తరప్రదేశ్ – 199,581,477 (16.49%)
2) మహారాష్ట్ర – 112,372,972 (9.28%) 12 (9.28%)
3) బీహార్ – 103,804,637 (8.58%)
4) పశ్చిమబెంగాల్ – 91,374,736 (7.55%)
5) ఆంధ్రప్రదేశ్ – 49,368,776 (4.07%)
6) తెలంగాణ – 35,286,757 (2.91%)
7) మధ్య ప్రదేశ్ – 72,597,565 (6.00%)
8) తమిళనాడు – 72,138,958 (5.96%)

స్థాయి – II :
9) రాజస్థాన్ – 68,621,012 (5.67%)
10) కర్ణాటక – 61,130,704 (5.05%)
11) గుజరాత్ – 60,383,628 (5.00%)
12) ఒడిశా – 41,947,358 (3.47%)
13) కేరళ – 33,387,677 (2.76%)
14) జార్ఖండ్ – 32,966,238 (2.72%)
15) అసోం – 31,169,272 (2.58%)
16) పంజాబు – 27,704,236 (2.30%)
17) ఛత్తీస్ గఢ్ – 25,540,196 (2.11%)
18) హర్యా నా – 25,353,081 (2.09%)

స్థాయి – III :
19) జమ్ము , కాశ్మీర్ – 12,548, 926 (1.04%)
20) ఉత్తరాఖండ్ – 10,116,752 (0.84%)
21) హిమాచల్ ప్రదేశ్ – 6,856,509 (0.57%)

స్థాయి – IV:
22) త్రిపుర – 3,671,032 (0.30%)
23) మేఘాలయ – 2,964,007 (0.24%)
24) మణిపూర్ – 2,721,756 (0.22%)
25) నాగాలాండ్ – 1,980,602 (0.16%)
26) గోవా – 1,457,723 (0.12%)
27) అరుణాచల్ ప్రదేశ్ – 1,382,611 (0.11%)
28) మిజోరాం – 1,091,014 (0.09%)

స్థాయి – V:
29), సిక్కిం – 607, 6881 (0.05%)
30) ఢిల్లీ – 16,753,235 (1.38%) (NCT)
31) పుదుచ్చేరి – 1,244,464 (0.10%)(UTI)
32) చండీఘర్ – 1,054,686 (0.09%) (UTI)
33) అండమాన్,నికోబార్ దీవులు – 379,944 (0.03%)(UTI)
34) దా ద్రా నగర్ హవేలి – 342,853 (0.03%)(UTI)
35) డామన్, డయ్యు – 242,911 (0.02%)(UTI)
36) లక్షద్వీప్ – 64,429 (0.01%)(UTI)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 5

ఆ) జిల్లాలను సూచించే ఆంధ్రప్రదేశ్ పటంలో చుక్కల పద్ధతిని ఉపయోగించి (ఒక చుక్క పదివేల జనాభాను సూచిస్తుంది) జనాభా విస్తరణను చూపించండి.
జవాబు:

  1. చిత్తూరు – 4,170, 468 = [417]
  2. అనంతపురం : 4,083,315 = [408]
  3. కడప – 2,884,524 = [288]
  4. కర్నూలు – 4,046,601 = [405]
  5. నెల్లూరు – 2,966,082 = [297]
  6. ప్రకాశం – 3,392,764 = [339]
  7. గుంటూరు : 4,889,230 = [489]
  8. కృష్ణ – 4,529,009 = [453]
  9. తూర్పు గోదావరి – 5,151,549 = [515]
  10. పశిమ గోదావరి – 3,934,782 = [393]
  11. విశాఖపట్నం – 4,288,113 = [429]
  12. శ్రీకాకుళం – 2,699,471 = [270]
  13. విజయనగరం – 2,342,868 = [234]

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 6
గమనిక : విద్యార్ధులు పట్టికలోని బ్రాకెట్లలో చూపిన విధంగా చుక్కలను ఆయా జిల్లాలలో పెట్టవలయును.

10th Class Social Studies 6th Lesson ప్రజలు InText Questions and Answers

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 1.
మీ చుట్టుప్రక్కల గల వేరు వేరు జీవనోపాధులు, ఆదాయాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. ఎంతమంది పిల్లలు ఉండటం సరైనదో వాళ్లని అడగండి.
జవాబు:
మా చుట్టుప్రక్కల గల వేరు వేరు జీవనోపాధులు, ఆదాయాలు ఉండే వ్యక్తులతో మాట్లాడగా ఒకరు లేదా ఇద్దరు సంతానం సరియైనదని అభిప్రాయపడ్డారు.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 2.
పై చదువులకు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశాలు లభిస్తున్నాయా?
జవాబు:
పై చదువులకు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశాలు లభిస్తున్నాయి. కానీ తల్లిదండ్రుల వైఖరి కారణంగా కొద్దిమంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నతవిద్య నభ్యసించగలుగుతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 3.
పెళ్లిన మహిళలకు ఇంటి బయట పని చేయటానికి, ప్రయాణాలు చేయటానికి అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
పెళైన మహిళలకు ఇంటి, బయట పనిచేయడానికి, ప్రయాణాలు చేయడానికి అవకాశాలున్నాయి. అయితే సరియైన రక్షణ లేకపోవడం, పనిచేసే ప్రదేశాలలో మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 4.
మహిళలు వారి పుట్టింటితో సంబంధాలు పెట్టుకోకూడదా? వాళ్లకు ఆస్తులపై హక్కు ఉండకూడదా? భద్రత ఉండకూడదా?
జవాబు:
మహిళలు వారి పుట్టింటితో సంబంధాలు పెట్టుకోవచ్చు. వారికి ఆస్తులపై చట్టపరంగా హక్కులున్నాయి. భద్రత తప్పనిసరిగా ఉండాలి.

10th Class Social Textbook Page No.76

ప్రశ్న 5.
మీ ప్రాంతంలో మగ పిల్లలను ఎక్కువగా కోరుకుంటారా?
జవాబు:
మా ప్రాంతంలో మగ పిల్లలను, ఆడపిల్లలను ఇద్దరినీ కోరుకుంటారు. అయితే మగసంతానం తప్పనిసరి అని భావిస్తారు. అయితే క్రమేపీ ఈ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. ఆడైనా, మగైనా ఇద్దరు చాలు అనే భావన ఎక్కువ మందిలో ఉంది.

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 6.
మీ ఊళ్ళో, పట్టణంలో నిరక్షరాస్యులు ఉన్నారేమో తెలుసుకోండి. మీ సర్వే ఏం చెపుతోంది?
జవాబు:
మా గ్రామంలో నిరక్షరాస్యులున్నారు. మేం చేసిన సర్వే కూడా ఈ విషయాన్నే తెలిపింది. విద్యాహక్కు చట్టం వచ్చిన తరువాత శతశాతం నమోదు, నిలకడను చూడవచ్చు. అయితే వయోజనులైన నిరక్షరాస్యులు వారికి ఏర్పాటుచేసిన అక్షరభారత కేంద్రాలను పూర్తిగా సద్వినియోగపరచుకోవడం లేదు.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 7.
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే ఏమిటి అర్థం ? చర్చించండి.
జవాబు:
ఫెర్టిలిటీ శాతం 2 కి దగ్గరగా ఉంటే జంటలు ఇద్దరు పిల్లలను కనాలని కోరుకుంటున్నారని అర్ధం.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 8.
మీరు బృందాలలో చేసిన సర్వేలో 45 సంవత్సరాలు పైబడిన మొత్తం మహిళల సంఖ్య, వారి పిల్లల సంఖ్య తెలుసుకోండి. మీ సర్వేలో సగటున ప్రతి మహిళకు ఎంత మంది పిల్లలు ఉన్నారు?
జవాబు:
ఇద్దరు

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 9.
పిల్లల విషయంలో ఉమేర్ సింగ్ ని ఏ అంశాలు ప్రభావితం చేశాయి ? అతని కూతురు కూడా అలాగే ఆలోచిస్తోందా?
జవాబు:
ఉమేర్ సింగ్ కు అబ్బాయి కావాలనే కోరిక వలన సంతానం ఆరుకు చేరింది. అతని కూతురు తండ్రిలా కాకుండా ముగ్గురు పిల్లలను మాత్రమే కావాలనుకుంది.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 10.
ఏ సంవత్సరం నాటికి ఊరిలోని భూమి అంతా సాగులోకి వచ్చింది?
జవాబు:
1950 నాటికి ఊరిలోని భూమి అంతా సాగులోకి వచ్చింది.

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 11.
మీ ప్రాంతంలో, ఊరిలో, దేశమంతటిలో ఉంటున్న ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా సేకరిస్తారో, నమోదు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? జనగణనలో తమ అనుభవాలను చెప్పమని మీ టీచరుని అడగండి.
జవాబు:
భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభాను సేకరిస్తారు. జనాభా సేకరణకు ఒక ఏడాది ముందు మే నెలలో ఆవాస ప్రాంతాల గుర్తింపు, నివాసాలు, కుటుంబాలు గుర్తించటం వాటి వివరాలు నమోదుచేస్తారు. వీటి చిత్తుపటాలను రూపొందిస్తారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు మరుసటి సంవత్సరం ఫిబ్రవరిలో వివరంగా సేకరించి నమోదుచేస్తారు.

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 12.
కుటుంబాన్ని ఎలా నిర్వచిస్తారు ? ఎవరెవరిని కుటుంబం కింద పరిగణిస్తారు?
జవాబు:
కుటుంబాలు 2 రకాలు :

1) సాధారణ కుటుంబాలు :
ఒకే ప్రాంగణంలో నివసిస్తూ ఉమ్మడిగా వంట చేసుకొనే సభ్యులను కుటుంబంగా పేర్కొంటాం. కుటుంబంలోని వారు అనగా తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, తాత, నాన్నమ్మతో పాటు కుటుంబంలోని వారందరినీ కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారు.

2) సంస్థాగత కుటుంబాలు :
బంధుత్వాలు లేకపోయినా ఉమ్మడిగా వండిన వంటను తినేవారు, ఒకే ప్రాంగణంలో నివసించేవారిని “సంస్థాగత కుటుంబాలు” అంటాం.
ఉదా :
వసతి గృహాలు, జైలు మొ||నవి.

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 13.
విద్యకు ఎటువంటి వర్గీకరణను ఉపయోగిస్తారు? ఉదాహరణకు : 6 సంవత్సరాలలోపు పిల్లలు, పాఠశాల/కళాశాలలో చదువుతున్నారు, తరగతి…..; బడిలో ఉండాలి కాని పేరు నమోదు కాలేదు. ……. తరగతి వరకు చదివారు; బడికి అసలు వెళ్లలేదు.
జవాబు:
విద్య – వర్గీకరణ : 6-14 సం||ల పిల్లల వర్గీకరణ :

  1. పేరు
  2. వయస్సు
  3. పాఠశాల పేరు
  4. తరగతి
  5. పాఠశాలలో నమోదు కాకపోతే కారణం
  6. బడిలో చేరి మానివేస్తే కారణం ఏడో తరగతిలో మానివేశాడు
  7. ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేరుటకు (ఉదా : RBC/ KG స్కూల్సు) సిద్ధమా?

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.73

ప్రశ్న 14.
వృత్తికి ఎటువంటి వర్గీకరణను ఉపయోగిస్తారు?
ఉదాహరణలు : గృహిణి, విద్యార్థి, ……….. స్వయం ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగి, పదవీ విరమణ, వృద్ధులు.
జవాబు:
వృత్తి – వర్గీకరణ : గృహిణి | వ్యవసాయం / విద్యార్థి / శ్రామికుడు / వ్యవసాయ కూలీ / ఉద్యోగి / నిరుద్యోగి / వ్యాపారం / స్వయం ఉపాధి / ఆస్తిపై వచ్చే అద్దెలు / వడ్డీలతో పోషణ ………….

సర్వే తరువాత :
ఎ) సర్వే చేసిన కుటుంబాలలోని మనుషుల లెక్కను చూపించటానికి ప్రతి బృందమూ కింద చూపిన విధంగా పట్టిక తయారుచేయాలి:

పురుషులుస్త్రీలుమొత్తం జనాభా

జవాబు:

పురుషులుస్త్రీలుమొత్తం జనాభా
330315645

బి) మీ బృందంలో స్త్రీ : పురుషుల నిష్పత్తి ఏమిటి? వివిధ బృందాలలో ఈ నిష్పత్తిలో తేడా ఉందా? చర్చించండి.
6 – 14 సంవత్సరాల పిల్లలకు :
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 7
జవాబు:
6 – 14 సంవత్సరాల పిల్లలకు : (156 మంది)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 8

సి) అన్ని బృందాలకు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరనివాళ్లు, బడి మానేసినవాళ్ల శాతం ఎంత? దీనికి కారణాలు ఏమిటి?
జవాబు:
అన్ని బృందాలకు కలిపి మొత్తం పిల్లల్లో అసలు బడిలో చేరనివాళ్లు, బడి మానేసినవాళ్ల శాతం = 8%

కారణాలు:

  1. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి
  2. వారి మూఢ నమ్మకాలు
  3. బోధనా పద్ధతులు మరియు
  4. ఆంగ్లం, గణితం వంటి సబ్జెక్టులు మొదలగునవి.

డి) 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో బడిలో గడిపిన సగటు సంవత్సరాలు ఎంత? వివరాలు తెలుసుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందా?
జవాబు:
20 సంవత్సరాలు పైబడినవాళ్ళల్లో బడిలో గడిపిన సగటు సంవత్సరాలు 12 సంవత్సరాలు.
ఈ సమాచారం ప్రతి వ్యక్తి పాఠశాల, కళాశాల విద్య గురించి అంచనా వేయడానికి ఉపకరిస్తుంది.

ఇ) 15-59 సంవత్సరాల వాళ్లకు :

వృత్తిసంఖ్యశాతం
స్వయం ఉపాధి
గృహిణి
ఉద్యో గి
నిరుద్యో గి
విద్యార్థి
మొత్తం

మీ నమూనా గణనలో ‘పనిచేస్తున్న వారు’, ‘ఇతరులపై ఆధారపడేవారు’ అనే అంశాలను ఏ విధంగా వర్గీకరిస్తారు?
జవాబు:

వృత్తిసంఖ్యశాతం
స్వయం ఉపాధి9219%
గృహిణి19640%
ఉద్యో గి84617%
నిరుద్యో గి388%
విద్యార్థి8116%
మొత్తం491100%

10th Class Social Textbook Page No.74

ప్రశ్న 15.
క్రింది గ్రాఫ్ ను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 9-1
భారతదేశ జనాభా పిరమిడ్, 2011
పైన ఇచ్చిన జనాభా పిరమిడ్ ఆధారంగా జనాభాలో పిల్లల శాతం ఎంతో ఉజ్జాయింపుగా లెక్కగట్టండి.
జవాబు:
పిల్లల శాతం – 31%
పురుషులు – 190,075,426
స్త్రీలు – 172,799,553

10th Class Social Textbook Page No.74

ప్రశ్న 16.
మీరు చేసిన సర్వే ఆధారంగా ప్రతి బృందం పట్టికలో కింది వివరాలను పొందుపరచాలి. వయస్సు, ప్రజల సంఖ్య, పిల్లలు, పనిచేస్తున్నవాళ్లు, వృద్ధులు.
జవాబు:

పిల్లలు (0-6)12
బడి ఈడు పిల్లలు (6-14)15
పనిచేస్తున్నవారు20
వృద్ధులు25

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 17.
మీ సర్వేలో కనుగొన్న శ్రామికులను, జనాభా గణనలో నమోదైన వివిధ పనుల వారితో పోల్చండి.
జవాబు:
సర్వేలో కనుగొన్న శ్రామికులు ఒక ప్రాంతంలో గల పరిమిత రంగాలకు చెందినవారు ఉంటారు. జనాభా గణనలో నమోదైన శ్రామికులు దేశంలోని అన్ని రంగాలకు చెందినవారు ఉంటారు.

10th Class Social Textbook Page No.79

ప్రశ్న 18.
కింది విదేశాలకు సంబంధించిన రెండు పోస్టర్లు ఇవ్వబడ్డాయి. వాటిలో ఇవ్వబడిన సందేశాన్ని ఊహించగలరా? ఇటువంటి పోస్టర్లను భారతదేశంలో ఎప్పుడైనా చూశారా? చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 10
జవాబు:
మొదటి పోస్టర్ :
బిడ్డ ఆడైనా, మగైనా సమానమే అనే భావనను చెబుతుంది.

రెండో పోస్టర్ :
మొదటి అపరిమిత సంతానం వల్ల పడే ఇబ్బందులను, కొరతను తెలియజేస్తున్నది. రెండవది పరిమిత సంతానం ద్వారా పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. దుస్తులు, విద్య వైద్య సదుపాయాలు కల్పించవచ్చు అనేది తెలుస్తున్నది.

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 19.
ఇటీవల పెళ్లి జరిగి ఇంకా పిల్లలు లేని దంపతులతో మాట్లాడండి. వాళ్లు ఎంత మంది పిల్లల్ని కనాలనుకుంటున్నారు? దానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఇటీవల పెళ్లి జరిగి ఇంకా పిల్లలు లేని దంపతులలో ఎక్కువ మంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలను కుంటున్నారు. పరిమిత సంతానమైతే వారిని చక్కగా పెంచి మంచి భవిష్యత్తు అందివ్వవచ్చును అని భావిస్తున్నారు.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 20.
పెరుగుతున్న కుటుంబ పరిమాణానికి భూమి ఉన్నవాళ్లు ఎలా స్పందించారు?
జవాబు:
వర్షాధారమైన తన భూమిలో మరిన్ని పంటలు (బహుళ పంటలు) పండించటానికి బోరుబావులు త్రవ్వించి ఉత్పత్తిని పెంచారు. వ్యవసాయం లేని రోజులలో ఇతర పనులకు కూడా వెళ్లేవారు.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 21.
కుటుంబ పరిమాణం పెరిగినప్పుడు గోవిందులాంటి చిన్న రైతులు ఎలా స్పందించారు? బోరుబావిలో సాగునీరు ఎంతవరకు ఉపయోగపడింది?
జవాబు:
కుటుంబ పరిమాణం పెరిగినపుడు గోవిందు లాంటి చిన్నరైతులు ప్రత్యామ్నాయాలు ఆలోచించారు. వర్షాధార భూములలో బోరుబావులు త్రవ్వడం ద్వారా సాగునీటి సౌకర్యం పొందారు. బహుళ పంటలను పండించి ఆదాయాన్ని పెంచుకున్నారు. ఖాళీ సమయాల్లో ఇతర పనులకు వెళ్లి ఆదాయం పెంచుకున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.71

ప్రశ్న 22.
నమూనా సేకరణ, జన గణన ద్వారా సమాచారం సేకరించటంలో తేడాలు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో చర్చించండి.
జవాబు:
నమూనా సేకరణ, జన గణన ద్వారా సమాచారం సేకరించటంలో తేడాలు :

నమూనా సేకరణ ద్వారాజన గణన ద్వారా
1) సేకరించిన సమాచారం ఎంపికచేసిన ప్రాంతానికే పరిమితం.1) దేశం మొత్తానికి సంబంధించింది.
2) ఒక ప్రాంతానికి చెందిన నమూనా సేకరణ సులభం.2) జన గణన ద్వారా సమాచార సేకరణ సంక్లిష్టమైనది.
3) నమూనా సేకరణలో సమాచార సేకరణ కొన్ని అంశాలకే పరిమితం. ఉదా : ఆ ప్రాంతంలోని వారందరూ వ్యవసాయ కూలీలే కావచ్చు.3) అన్ని అంశాలపై సమాచార సేకరణకు వీలుంటుంది. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమాచారం సేకరిస్తాం.
4) దీనికి కొద్దిమంది సిబ్బంది చాలును.4) లక్షల సంఖ్యలో సిబ్బంది అవసరం అవుతారు.
5) ఆర్థిక ఖర్చు పరిమితం.5) జనగణనకు కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి.

సర్వే నిర్వహణ

10th Class Social Textbook Page No.72

ప్రశ్న 23.
ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులు గల సర్వే నిర్వహణ బృందం తమ ప్రాంతంలోని 10 కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించాలి. సర్వేకు ఉపయోగించాల్సిన పత్రం కింద ఉంది.
• ప్రతి బృందం కింద ఇచ్చిన పట్టికను పూరించాలి.
• అన్ని బృందాల పట్టికల ఆధారంగా ప్రశ్నలను తరగతి గదిలో చర్చించాలి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 11
జవాబు:
విద్యార్థి ఈ కృత్యాన్ని స్వయంగా నిర్వహించాలి.

సర్వే చేయటానికి ముందు:
• సర్వే ఫారంలో ఉపయోగించిన పదాలన్నింటిని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోటానికి తరగతి గదిలో చర్చించాలి. లేకపోతే సర్వే చేసేటప్పుడు గందరగోళం ఏర్పడి ఒక బృందం ఫలితాలను మరొక బృందంతో పోల్చటం కష్టమౌతుంది. మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ కింది పదాల గురించి చర్చించండి.

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 24.
అభివృద్ధిని అక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది? చర్చించండి.
జవాబు:
అభివృద్ధిని అక్షరాస్యత ప్రభావితం చేసే అంశాలు.

  1. అక్షరాస్యులు మూఢ నమ్మకాలను వదలి శాస్త్రీయంగా ఆలోచిస్తారు.
  2. వ్యవసాయ/వస్తూత్పత్తిలో నూతన విధానాలను అవలంబించి జాతీయ ఉత్పత్తిని పెంచెదరు.
  3. అధిక ఆదాయాన్ని పొంది జాతీయ ఆదాయాన్ని పెంచుతారు.
  4. ఉత్తమ పౌరులుగా బాధ్యతలను నిర్వర్తించగలరు.
  5. ఉత్తమ సమాజ రూపకల్పనకు కృషి చేస్తారు.
  6. తమ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.
  7. వృత్తిని దైవంగా భావించి ఇతరులకు ఆదర్శంగా ఉంటారు.
  8. నూతన పరికరాలు / విధానాలు కనుగొనేందుకు దోహదపడతారు.

AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు

10th Class Social Textbook Page No.77

ప్రశ్న 25.
వ్యవసాయ భూమిని సాగుచేసే వ్యక్తికి, వ్యవసాయ కూలీకి మధ్య గల తేడాలేమిటి?
జవాబు:

వ్యవసాయ భూమి సాగుచేసే వ్యక్తివ్యవసాయ కూలీ
1) తాను పండించే పంటపై ఆధారపడతాడు.1) లభించే కూలీపై ఆధారపడతాడు.
2) సమాజంలో గౌరవం ఉంటుంది.2) సాధారణ వ్యక్తిగా జీవిస్తాడు.
3) ఆదాయం ఎక్కువ.3) ఆదాయం పరిమితం.
4) ఆదాయంలో కొంత మిగులు ఉంటుంది.4) పరిమిత ఆదాయంతో కుటుంబ పోషణ అంతంత మాత్రంగా ఉంటుంది.
5) ఆదాయానికి కొంత మేర హోదా / పరపతి ఉంటాయి.5) పని దొరుకుతుందో లేదో అనే చింతన ఉంటుంది.
6) పంట పండుతుందో లేదో అనే భయం ఉంటుంది.6) రిస్కు ఉండదు.
7) వ్యవసాయభూమి సాగుచేస్తూనే విరామకాలంలో ఏదైనా వృత్తి, వ్యాపారం చేయవచ్చు.7) వ్యవసాయపనులు లేనప్పుడు ఇతర పనులకు వెళతారు.

10th Class Social Textbook Page No.78

ప్రశ్న 26.
క్రింది (ను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 12
i) పైన ఇచ్చిన ను పరిశీలించి ఏ దశాబ్ద కాలంలో జనాభా తగ్గిందో చెప్పండి.
జవాబు:
1911-1921 దశాబ్దంలో జనాభా తగ్గింది.

ii) ఏ సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతోంది?
జవాబు:
1921 సంవత్సరం నుండి జనాభా నిరంతరంగా పెరుగుతోంది.

iii) భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనాభా వేగంగా పెరగటానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
జవాబు:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కరవు, సహాయం, ఆహారధాన్యాల తరలింపు, చౌకధరల దుకాణాలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుకుగా పాల్గొనడం వంటి వాటి వల్ల కరవుల ప్రభావం తగ్గిపోయింది. అదే విధంగా కర, ప్లేగు, కొంతవరకు మలేరియా వంటి అంటురోగాలను నియంత్రించగలిగారు. అనేక రోగాలకు కలుషిత నీరు, ఇరుకు ఇళ్లల్లో ఉండటం, పారిశుద్ధ్య లోపం వంటివి ప్రధాన కారణాలు. ఈ రోగాలను ఎదుర్కోవాలంటే మెరుగైన పారిశుద్ధ్యం, శుభ్రమైన నీళ్లు, పోషకాహారం అందించాలని అందరూ గుర్తించసాగి ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు. ఆ తరువాత వైద్యరంగంలో పురోగమనం వల్ల ప్రత్యేకించి టీకాలు, యాంటిబయాటిక్స్ వల్ల మెరుగైన ఆరోగ్యం సాధ్యమయ్యింది. 1900తో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది. జననాల శాతం ఎక్కువగా ఉండటానికి తగ్గుతున్న మరణాల శాతం తోడై జనాభా వేగంగా పెరగసాగింది.

10th Class Social Textbook Page No.80

ప్రశ్న 27.
భారతదేశ జనాభా పెరుగుదల స్వరూపం, శాతం, ఖాళీలను పూరించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 13
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 14

10th Class Social Textbook Page No.81

ప్రశ్న 28.
మీ కుటుంబంలో మూడు తరాలపాటు ప్రతి మహిళకు ఎంతమంది సంతానమో తెలుసుకోండి. మీకు ఎటువంటి మార్పులు కనపడ్డాయి?
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 15
రెండవ తరంలోనే కుటుంబ నియంత్రణ పాటించడం నేను గమనించాను. కనుక ప్రస్తుతం పెరుగుదల శాతం తగ్గుతోంది.

10th Class Social Textbook Page No.82

ప్రశ్న 29.
కింద ఉన్న భారతీయ పటాన్ని చూడండి. భారతదేశ భౌగోళిక స్వరూపానికి, జనాభా సాంద్రతకు మధ్య ఏమైనా సంబంధం ఉందేమో చూడండి. దేశంలోని ప్రధాన నగరాలను గుర్తించగలరా? నగరాలలోని అధిక జనాభా సాంద్రతను ఎలా వివరిస్తారు?
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 16
జవాబు:
దేశంలోని ప్రధాన నగరాలను గుర్తించగలం.
సూచికలో చూపిన సూచనల ఆధారంగా నగరాలలోని అధిక జనసాంద్రతను వివరించగలం.

  1. భూమి సహజ స్వరూపాన్ని భౌగోళిక స్వరూపం అంటాం. చదరపు కిలోమీటరుకు సగటున నివసించే ప్రజలను జనసాంద్రత అంటాం.
  2. బాగా పంటలు పండే ప్రాంతాలు, పారిశ్రామికవాడలైన ‘గంగా-సింధు మైదానం’ లో జనసాంద్రత ఎక్కువ.
  3. థార్ ఎడారి ప్రాంతం ప్రజల జీవనానికి ఏమాత్రం అనుకూలంగా లేనందున అచ్చట జనసాంద్రత అత్యల్పం.
  4. తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. పంటలు బాగుగా పండును. అందుచే ఈ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ.
  5. హిమాలయ పర్వత ప్రాంతం సుందరమైనదైనప్పటికీ ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుచే కప్పబడియుండుటచే జన జీవనానికి అనుకూలంగా ఉండదు. అందుచే ఇచ్చట జనసాంద్రత తక్కువ.
  6. ఈశాన్య భారతదేశం కొండలతో నిండియున్నందున జనసాంద్రత తక్కువ.

10th Class Social Textbook Page No.83

ప్రశ్న 30.
ఈ క్రింది పటమును పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 17
ఇక్కడ 2011కి ఆంధ్రప్రదేశ్ జన సాంద్రత గణాంకాలు ఉన్నాయి. జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ జన సాంద్రత స్థాయిలను సూచించండి.
అధిక జన సాంద్రత ఉన్న ఒక జిల్లాను తక్కువ సాంద్రత ఉన్న మరొక జిల్లాతో కింది అంశాలలో పోల్చండి.

అ) భూ ఉపరితలం, వ్యవసాయ అభివృద్ధికి అవకాశాలు.
ఆ) ఆ ప్రాంతంలో వ్యవసాయ చరిత్ర – భూమి, నీరు, ఇతర సహజ వనరుల వినియోగం.
ఇ) ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రాంతంలోకి వలసలు, దీనికి కారణాలు.
జవాబు:
అ) అధికం – కృష్ణా
అల్పం – వై.యస్.ఆర్. కడప

అ)
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 18

ఇ) 1) వై.యస్.ఆర్. కడప జిల్లాకు వలసలు దాదాపు శూన్యం .
2) విద్య ఉద్యోగాల నిమిత్తం వై.యస్. ఆర్. కడప నుండి వలస వెళుతున్నారు.
3) విద్య, ఉద్యోగాల నిమిత్తం కృష్ణాజిల్లా నుండి మరియు కృష్ణాజిల్లాకు వలస వెళుతున్నారు.
AP Board 10th Class Social Solutions Chapter 6 ప్రజలు 19

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

SCERT AP 10th Class Social Study Material Pdf 11th Lesson ఆహార భద్రత Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 11th Lesson ఆహార భద్రత

10th Class Social Studies 11th Lesson ఆహార భద్రత Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
తప్పు వాక్యాలను సరి చేయండి. (AS1)
* ఆహార భద్రత సాధించటానికి ఆహార ఉత్పత్తిని మాత్రమే పెంచితే సరిపోతుంది.
* ఆహార భద్రత సాధించటానికి ఒకే పంటసాగును ప్రోత్సహించాలి.
* తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో తక్కువ కాలరీల వినియోగం ఎక్కువగా ఉంటుంది.
* ఆహార భద్రతను సాధించటంలో చట్ట సభల ప్రాధాన్యత ఎక్కువ.
* పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచెయ్యటానికి ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించవచ్చు.
జవాబు:

  • ఆహార భద్రత సాధించటానికి ఆహార ఉత్పత్తి ఒక్కటే పెంచితే సరిపోదు; ఉత్పత్తితో పాటు ఆహార ధాన్యాల లభ్యతా, ఆహార అందుబాటు కూడా ముఖ్యం.
  • ఆహార భద్రత సాధించటానికి ఒకే పంటసాగును కాక ఇతర పంటల దిగుబడి కూడా పెంచేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకు వరి, గోధుమలతో పాటు జొన్న, నూనెగింజల దిగుబడులు కూడా పెరుగుతున్నాయి.
  • తక్కువ ఆదాయం ఉన్న ప్రజలలో ‘తక్కువ కాలరీల వినియోగం’ ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న (పేద) ప్రజలకు కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది. ఆహార ధాన్యాల కొనుగోలు, వినియోగం తక్కువ ఉంటుంది. ఆ ఆహారం వల్ల వారు పొందే కాలరీలు కూడా సహజంగా తక్కువగానే ఉంటాయి.
  • ఆహార భద్రతను సాధించటంలో చట్ట సభలతో పాటు న్యాయస్థానాల ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మధ్యాహ్న భోజన పథకం అమలుపై న్యాయ వ్యవస్థ ఆదేశాలు.
  • పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచెయ్యటానికి ప్రజాపంపిణీ వ్యవస్థ కంటే ఎక్కువగా అంగన్‌వాడీలు (ICDS), మధ్యాహ్న భోజన పథకమును ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 2.
గ్రామీణ ప్రాంతాలలో కాలరీల వినియోగం గత కొద్ది కాలంగా ……. 2004-05 లో తలసరి సగటు కాలరీల వినియోగం అవసరమైన దానికంటే ….. ఉంది. పట్టణ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తికి రోజుకు కనీసం 2100 కాలరీలు అవసరం. పటణ ప్రాంతంలో 2004-05 లో కాలరీల అవసరం, వినియోగం మధ్య అంతరం ……… (AS1)
జవాబు:
తగ్గుతోంది. తక్కువగా, పెరిగింది.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 3.
ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అనుకుందాం. ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? (AS4)
(లేదా)
ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినపుడు, ఆహార ధాన్యాల లభ్యత పెరగడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలని నీవు అనుకుంటున్నావు?
జవాబు:
ఆహార ధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు :

  1. ఆహార ధాన్యాల లభ్యత పెంచటానికి ‘దిగుమతులు’ ఒక ముఖ్య మార్గం.
  2. ఆహార లభ్యతను పెంచటానికి ప్రభుత్వ నిల్వల (బఫర్ నిల్వలు)’ ను ఉపయోగించుకోవటం మరో ముఖ్యమైన మార్గం. (FCI ధాన్యాగారాలలోని నిల్వలను ఉపయోగించుకోవాలి.)
  3. ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల లభ్యతను అందుబాటులోకి తేవాలి.
  4. నల్ల బజారు (Black Market), అక్రమ నిల్వలను అరికట్టాలి.
  5. ఎగుమతులను నిషేధించుట మరియు అవసరమైన ఆంక్షలు విధించుట. (ధరలను అదుపులో ఉంచాలి.)
  6. తర్వాతి సంవత్సరంలో మంచి దిగుబడులు సాధించటానికి అవసరమైన చర్యలు చేపట్టడం చేయాలి.
    ఉదా : హరిత విప్లవం

ప్రశ్న 4.
బరువు తక్కువగా ఉండటానికి, ఆహార అందుబాటుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయటానికి మీ ప్రాంతం నుంచి ఒక ఊహాజనిత ఉదాహరణను ఇవ్వండి. జ. సరిపడా ఆహారం ఉంటే ఎవరూ ఉండవలసిన దానికంటే తక్కువ బరువు కానీ, తక్కువ ఎత్తుగానీ ఉండరు. దీనికి ఉదాహరణ, మా గ్రామం ప్రాంతంలోని సంఘటన. (AS4)
జవాబు:

  1. మా ప్రాంతంలోని ప్రజా వైద్యశాలకు తక్కువ బరువు ఉన్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారు.
  2. అక్కడి డాక్టరు ఈ పరిస్థితిని వివరించారు.
  3. కుటుంబానికి నెలకు రేషను దుకాణం ద్వారా లభించే ఆహార ధాన్యాలు అయిదుగురు ఉన్న కుటుంబంలో 11 రోజులకు సరిపోతాయి.
  4. మిగిలిన రోజులకు వాళ్లు తాము పండించిన ఆహారంపైన లేదా మార్కెట్లో కొన్న దానిపైన ఆధారపడాలి.
  5. వ్యవసాయ కూలీల, ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దె, కరెంటు ఇతరత్రా అవసరాలకు ఖర్చు అయిపోతుంది. కాబట్టి వీరు రిటైల్ మార్కెట్లో ఆహారధాన్యాల కొనుగోలు చేయలేకపోతున్నారు.
  6. ఈ విధంగా సరిపడినంత ఆహారం తీసుకోలేకపోతున్నారు, కనుక వీరు తీవ్ర శక్తి లోపం (BMI-18.5) కలిగి ఉన్నారు. (తక్కువ బరువు సమస్య తీవ్రంగా ఉంది.)
  7. అధిక శాతం ప్రజలు వారికి కావల్సిన దానికంటే తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు, కారణం పేదరికం వల్ల ఆహారం అందుబాటులో లేకపోవడమేనని నేను గుర్తించాను.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

ప్రశ్న 5.
వారం రోజుల మీ కుటుంబ ఆహార అలవాట్లను విశ్లేషించండి. దాంట్లోని పోషకాలను వివరించటానికి ఒక పట్టిక తయారుచెయ్యండి.
జవాబు:
విద్యార్థులు స్వయంగా చేయగలరు.
ఆధారం:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 1

ప్రశ్న 6.
ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహార భద్రతకు మధ్యగల సంబంధాన్ని వివరించండి. (AS1)
(లేదా)
ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతల మధ్య సంబంధాన్ని వివరించుము.
జవాబు:
ఆహార ఉత్పత్తి పెరగటానికి, ఆహార భద్రతకు మధ్య అవినాభావ సంబంధముందని చెప్పవచ్చు.

  1. రోజువారీ కనీస ఆహార అవసరాలు తీర్చటానికి సరిపడేటంత ఆహార పదార్థాల ఉత్పత్తి కచ్చితంగా ఉండటం ఆహార భద్రతకు ముఖ్యమైన అవసరం.
  2. ఆహార ఉత్పత్తి పెరిగినట్లయితే దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతుంది.
  3. ఆహార లభ్యత పెరిగినట్లయితే ప్రజలకు ఆహారం అందుబాటులో ఉంటుంది.
  4. ఆహారం అందుబాటులో ఉంటే ఆహార భద్రత సాధించినట్లే.
  5. ఆహార ఉత్పత్తి పెరిగితే బఫర్ నిల్వలు పెరుగుతాయి; ప్రజాపంపిణీ వ్యవస్థ సమర్థంగా పని చేస్తుంది, కొనుగోలు శక్తి తద్వారా వినియోగించే స్థితి పెరుగుతుంది. పోషకాహార స్థాయి పెరుగుతుంది. ఈ విధంగా ఆహార భద్రత సమర్ధవంతంగా కల్పించవచ్చు.

ప్రశ్న 7.
“ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదు.” ఈ వ్యాఖ్యానానికి మద్దతుగా వాదనలు పేర్కొనండి. (AS1)
(లేదా)
“ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఆహార భద్రత ఉండేలా చూడగలదనే” వాక్యాన్ని ఎలా సమర్థించగలవు?
జవాబు:

  1. ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాలు ప్రధానమయినవి. నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించేవి చౌకధరల దుకాణాలు.
  2. భారతదేశంలో ఆహారధాన్యాలు అందుబాటులో ఉండటానికి, ప్రజలకు చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  3. చౌకధరల దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహారధాన్యాలు, వాళ్ళ మొత్తం ఆహార ధాన్యాల వినియోగంలో ఎక్కువ శాతమే ఉంది.
  4. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే శక్తి పెంచుటకుగాను (ధరల యంత్రాంగం ద్వారా) ధరలను అదుపులో ఉంచుతుంది. తద్వారా ఆహార పదార్థాల అందుబాటు గుణాత్మకంగాను, పరిమాణాత్మకం గాను పెరుగుతుంది.
  5. పేదలకు, అత్యంత పేదలకు సబ్సిడీ ధరకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తూ (PDS ద్వారా) వారికి ఆహార భద్రత కల్పిస్తుంది.
  6. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75 శాతానికి, పట్టణ జనాభాలో 50 శాతానికి ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది.

ప్రశ్న 8.
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 2
ఆహార భద్రత గురించి పై పోస్టరు ఏమి తెలియజేస్తున్నది? (AS1)
జవాబు:
ఆహార భద్రత గురించి పై పోస్టరు మనలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారని, ఇంక ఇలా ఉండాల్సిన అవసరం లేదని తెలియచేస్తోంది. ఆ ఒక్కరూ కూడా ఆహారాన్ని తీసుకొని హాయిగా నిద్రిస్తారని తెలియచేస్తోంది.

ప్రశ్న 9.
ఆహార భద్రత గురించి ఇటువంటిదే ఒక పోస్టరు తయారుచెయ్యండి. (AS6)
జవాబు:
ఆధారం:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 3 AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 4

10th Class Social Studies 11th Lesson ఆహార భద్రత InText Questions and Answers

10th Class Social Textbook Page No.147

ప్రశ్న 1.
కింది వాక్యాలను చదివి హెక్టారుకు వరి, గోధుమల దిగుబడులు ఎలా ఉన్నాయో వివరించండి.
…………….., ……….. పంటల దిగుబడులు వరి, గోధుమలతో పోలిస్తే ఎప్పుడూ తక్కువగానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పంటల దిగుబడులు మెల్లగా పెరుగుతున్నాయి.
జవాబు:
జొన్న, నూనెగింజలు.

10th Class Social Textbook Page No.147

ప్రశ్న 2.
దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి ఏ అంశాలు దోహదం చేశాయి?
జవాబు:
దీర్ఘకాలం పాటు వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరగటానికి దోహదం చేసిన అంశాలు

  • మేలు జాతి, సంకర జాతి విత్తనాలు వాడటం (ఉదా : ‘SRI’ వరి)
  • నాణ్యమైన పురుగు మందులు వాడుట ద్వారా సస్యరక్షణ చేపట్టడం.
  • విస్తృతంగా రసాయన ఎరువులను వాడటం. (ఉదా : పొటాషియం, నైట్రోజన్ ఎరువులు)
  • సాగునీటి వసతులను విస్తరించటం. (ఉదా : కాలువలు, గొట్టపు బావుల తవ్వకం)
  • విత్తుటకు, దున్నుటకు, పంట కోత మొ||న వాటికి యంత్రాల వాడకం. (ఉదా : ట్రాక్టర్, కంబైన్డ్ హార్వెస్టర్)

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.152

ప్రశ్న 3.
దేశంలో అధిక శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యటం సరైనదేనా?
జవాబు:
సరియైన విధానం కాదు, దేశంలో అధిక ప్రజలకు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని నేపథ్యంలో స్వల్ప ఆదాయం కోసం ఆహార ధాన్యాలను ఎగుమతి చెయ్యడం సరికాదు.

  • ఎగుమతులు పెరిగినట్లయితే ఆహార ధాన్యాల ధరలు పెరిగి, పేదలకు ఆహార అందుబాటు ఇంకా దూరమవుతుంది.
  • ఆహార ధాన్యాల నిల్వలు పెంచకుండా, ఎగుమతులు చేసినట్లయితే PDS ద్వారా పంపిణీకి ధాన్యాల కొరత ఏర్పడుతుంది.
  • కరవుకాటకాలు, ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినట్లయితే ఆహార ధాన్యాల దిగుబడి తగ్గుతుంది, లభ్యత, అందుబాటు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అవసరమైతే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి.

10th Class Social Textbook Page No.152

ప్రశ్న 4.
క్రింది రేఖాచిత్రపటాన్ని పరిశీలించండి.
రేఖాచిత్రపటం : 2009-10 లో బియ్యం, గోధుమల కొనుగోళ్ళలో రేషను దుకాణాల నుంచి కొన్న శాతం
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 5
ఖాళీలను పూరించండి :
అఖిల భారతానికి ప్రజల మొత్తం వినియోగంలో …….. (1)……… శాతం బియ్యం , ……… (2)…….. శాతం గోధుమ చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు. దీని అర్థం ప్రజలు తమ ఆహార ధాన్యాల అవసరంలో అధిక భాగం …. (3)…… నుంచి కొనుక్కోవాలి. అయితే …… (4)…………….. (5)…….. రాష్ట్రాలలో పరిస్థితి బాగుంది. …… (6)…….. ……(7)……… …. (8)……. రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రజల ఆహార ధాన్యాల అవసరాలను నామమాత్రంగా తీరుస్తోంది.
జవాబు:

  1. 39,
  2. 28,
  3. రిటైల్ మార్కెట్,
  4. తమిళనాడు,
  5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
  6. బీహార్,
  7. రాజస్థాన్,
  8. పంజాబ్.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.155

ప్రశ్న 5.
బడిలో చేరే వయస్సు రాని పిల్లలకు పోషకాహార శాస్త్రజ్ఞులు మూడు చార్జులను ఉపయోగిస్తారు. ఈ మూడు వేరు వేరు సూచికలు మనకు పిల్లల పోషకాహార స్థాయికి సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాయి. వాటిని కింద ఇచ్చాం.
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 6
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 7

10th Class Social Textbook Page No.155

ప్రశ్న 6.
ఈ గణాంకాల నుంచి ఎటువంటి నిర్ధారణలకు వస్తారు ? ఒక పేరా రాయండి.
జవాబు:
ఈ గణాంకాల నుంచి నిర్ధారణలకు వచ్చిన అంశాలు :

  • 45% మంది పిల్లలు వయస్సుకు తగ్గ బరువు ఉండటం లేదు.
  • 41% మంది పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు లేరు.
  • 21% మంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. అంటే సరైన BMI కలిగి లేరు.
  • ఎక్కువ మంది పిల్లలు పోషకాహార లోపం కలిగి ఉన్నారు.
  • చాలా మంది పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంది.
  • అంగన్‌వాడీ (ICDS) లాంటి పథకాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడాలి.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.146

ప్రశ్న 7.
పాఠం 9 (రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ) లోని “భూమి, ఇతర సహజ వనరులు” అనే భాగాన్ని మళ్ళీ చదవండి. భూమి నుంచి పంట ఉత్పత్తి పెంచటానికి ఏ ఏ విధానాలు ఉన్నాయి?
జవాబు:
గత కొద్ది దశాబ్దాలుగా సాగు కింద ఉన్న భూమి ఇంచుమించు స్థిరంగా ఉందని మనకు తెలుసు, కాబట్టి భూమి నుంచి పంట ఉత్పత్తి పెంచటం ముఖ్యం.

  • హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచటానికి అవసరమైన ఉత్పాదకాలను (ఉదా : HYV విత్తనాలు) సక్రమంగా వినియోగించుకోవాలి.
  • సాగునీటి వసతులను (సక్రమ జల నిర్వహణ ద్వారా) పెంచటం. అయితే ఈ కీలక వనరు. అందరికీ అందేలా పంచుకునే పద్ధతిలో వినియోగించాలి. (ఉదా : గొట్టపు బావులు త్రవ్వడం).
  • వర్షాభావ పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తటం, వర్షపు నీటిని నిల్వ చేయటం, పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచాలి.
  • సరియైన ‘సస్య రక్షణ’ చర్యలు చేపట్టాలి. ఉదా : నాణ్యమైన పురుగు మందులు వాడుట.
  • అవసరమైన మేర ‘ఎరువుల వాడకం చేపట్టడం. ఉదా : రసాయన, సేంద్రియ ఎరువులను వాడుట.
  • నేల సారాన్ని పెంచి, దిగుబడులను పెంచే బహుళ పంటల నమూనాను అనుసరించాలి. అంటే ఒకే పంట పొలంలో – గోధుమ, సజ్జ, బంగాళదుంప మొ||న పంటలను ఒకేసారి పండించటం.
  • కంబైన్డ్ హార్వెస్టర్ లాంటి ఆధునిక యంత్రాలను వాడుట ద్వారా పంటకాలము ఆదా అవుతుంది. నూర్పిడి సమయంలో జరిగే ధాన్యాల వృథాను తగ్గిస్తుంది.

10th Class Social Textbook Page No.146

ప్రశ్న 8.
ఇవ్వబడిన రేఖాచిత్ర పటమును పరిశీలించి ఖాళీలను పూరించండి (ప్రతి బిందువు దగ్గర కచ్చితమైన విలువను తెలుసుకోటానికి ‘వై’ అక్షం మీది స్కేలుని ఉపయోగించండి).
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 8

ఆహారధాన్యాల ఉత్పత్తి 1970-71 నుండి ……(1)…… కు పెరిగింది. వరి ఉత్పత్తి 1970-71 నాటి 40 మిలియన్ టన్నుల నుండి 2010-11 నాటికి ….. (2)…… మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ 40 ఏళ్ల కాలంలో ఉత్పత్తి వేగంగా పెరిగిన మరొక ముఖ్యమైన ఆహారపంట …. (3)…… . వరి, గోధుమలతో పోలిస్తే 1970-2011 కాలంలో …..(4)……. ఉత్పత్తి పెరగలేదు. దీనికి కారణం …. (5)……. అయి ఉండవచ్చు.
జవాబు:
1) 2010-11 వరకు
2) 95 3 ) గోధుమ
4) జొన్న, నూనె గింజలు
5) i) ప్రాధాన్యతనివ్వకపోవడం,
ii) వర్షాధార పంటలు కావడం,

10th Class Social Textbook Page No.147

ప్రశ్న 9.
జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలి? చర్చించండి.
జవాబు:
జొన్న దిగుబడులను పెంచటంపై దృష్టి ఎందుకు పెట్టాలంటే –

  • జొన్నను మంచి పోషక ధాన్యంగా వ్యవహరిస్తున్నారు.
  • జొన్న పంటను వర్షాధార ప్రాంతాలలో కూడా సాగుచేయవచ్చు.
  • నేల, ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా, క్షీణతకు గురికాకుండా చూడటానికి.
  • ఆహార భద్రత, ఆహారధాన్యాల అందుబాటు పెంచుటకు.
  • పురుగు మందులు, రసాయన ఎరువులు ఎక్కువగా వాడనవసరం లేదు.
  • సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా జొన్న పంటను పండించవచ్చు.
  • జొన్నలకు మార్కెట్ కూడా బాగా ఉంది. లక్షలాది ప్రజల ప్రధాన ఆహారం జొన్న.

10th Class Social Textbook Page No.148

ప్రశ్న 10.
1971కి చూపించిన విధంగా, 1991, 2011 సంవత్సరాలకు తలసరి సగటు ఆహార ధాన్యాల అందుబాటును లెక్కగట్టండి.
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 9
గమనిక : 1 టన్ను = 1000 కిలోలు; 1 కిలో = 1000 గ్రాములు; # = మిలియన్ టన్నులు

* మీరు లెక్కించిన దాని ఆధారంగా ఖాళీలను పూరించండి : 1971 నుంచి 1991 నాటికి తలసరి ఆహారధాన్యాల లభ్యత ………….. (పెరిగింది/తగ్గింది), కానీ 2011లో ఇది ……………. (ఎక్కువ | తక్కువగా) ఉంది. ఇటీవల దశాబ్దాలలో జనాభావృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహారధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం. ………………. చర్యలు చేపట్టాలి.
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత 10
గమనిక : 1 టన్ను = 1000 కిలోలు; 1 కిలో = 1000 గ్రాములు; # = మిలియన్ టన్నులు.

మీరు లెక్కించిన దాని ఆధారంగా ఖాళీలను పూరించండి : 1971 నుంచి 1991 నాటికి తలసరి ఆహారధాన్యాల లభ్యత పెరిగింది (పెరిగింది/తగ్గింది), కానీ 2011లో ఇది తక్కువగా (ఎక్కువ తక్కువగా) ఉంది. ఇటీవల దశాబ్దాలలో జనాభావృద్ధిలో తగ్గుదల ఉన్నప్పటికీ ఇలా జరిగింది. భవిష్యత్తులో ఆహారధాన్యాల లభ్యత పెరగటానికి ప్రభుత్వం ఉత్పత్తి పెంచటం, , దిగుమతులు పెంచటం లాంటి చర్యలు చేపట్టాలి.

10th Class Social Textbook Page No.150

ప్రశ్న 11.
వ్యవసాయ వైవిధ్యీకరణకు సంబంధించిన పదాలు, వాక్యాల కింద గీత గీసి భారతీయ రైతులకు ఇది ఎందుకు అవసరమో వివరించండి.
జవాబు:
భారతీయ రైతులకు వ్యవసాయ వైవిధ్యీకరణ అవసరం; ఎందుకంటే,

  • భారతీయ రైతులు ఎక్కువ శాతం మంది చిన్న, సన్నకారు రైతులే.
  • ఎక్కువ మంది పేద రైతులే, వారి ఆదాయం పెరగాలంటే ఇది అవసరం.
  • అధిక దిగుబడులు పొందడానికి,
  • భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాలపై ఆధారపడి ఉంది కనుక వర్షాభావ కాలంలో, వర్షాభావ ప్రాంతంలో ఈ విధమైన వ్యవసాయం ఎంతో అవసరం.
  • అల్ప ఉపాధి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత నివారణకు కూడా ఇది ఎంతో అవసరం.
  • అల్ప ఆదాయ సన్న, చిన్నకారు రైతులకు ఆహార భద్రత కల్పించుటకు.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.150

ప్రశ్న 12.
మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన గ్రామంలో వ్యవసాయ వైవిధ్యీకరణను వివరించండి.
జవాబు:
నాకు తెలిసిన ‘బేతపూడి’ గ్రామంలోని వ్యవసాయ వైవిధ్యీకరణ గురించి వివరిస్తాను.

  • ఈ గ్రామంలోని అన్ని భూములకు సాగునీటి వసతులు (కాలువలు లేదా బోరుబావులు) ఉన్నాయి.
  • ఈ గ్రామంలో వ్యవసాయ పెట్టుబడులకుగాను ఋణసౌకర్యం అందించుటకు బ్యాంక్ సౌకర్యం కలదు.
  • ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సాంకేతిక విజ్ఞానం చాలా బాగుంది.
  • వరి, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వంటి ఆహార ధాన్యాలతోపాటు ప్రత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు.
  • పంటల మధ్య కాలంలో కూరగాయలు పండిస్తున్నారు. బెండ, వంగ, దోస, టమోట పండిస్తున్నారు.
  • అంతర్ పంటలుగా ‘కందులు’ (కందిపప్పు) ను పండిస్తున్నారు.
  • దాదాపుగా అందరికి 2-3 గేదెలు ఉన్నాయి. పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది.
  • గ్రామంలో 4 కంబైన్డ్ హార్వెస్టర్లు, దాదాపు 16 ట్రాక్టర్లు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ జరిగింది.
  • వివిధ మార్కెట్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగి ఉన్నది.
    సూచన : విద్యార్థులు తాము చూసిన గ్రామం గురించి స్వయంగా రాయగలరు.

10th Class Social Textbook Page No.150

ప్రశ్న 13.
ఎనిమిదవ తరగతిలోని ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చను గుర్తుకు తెచ్చుకోండి. ప్రజాపంపిణీ వ్యవస్థకు, ప్రజల ఆహార భద్రతకు గల సంబంధం ఏమిటి?
(లేదా)
భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఇది ప్రజా పంపిణి వ్యవస్థను అందరికి వర్తింపచేసిన రాష్ట్రాలు కావటము గమనించవలసిన విషయం. ఇవి అందరికి తక్కువ ధరలలో ఆహార ధాన్యాలను అందించాయి. ఇందుకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలు పేదవాళ్ళను గుర్తించి ఆహార ధాన్యాలను పేదలకు, పేదలు కాని వాళ్ళకు వేరు వేరు ధరలకు అమ్మాయి. పేదలలో కూడ అత్యంత పేదలకు కూడ వేరే హక్కులు ఉన్నాయి. వాళ్ళకు అందించే మోతాదు వేరు.
ప్రజాపంపిణీ వ్యవస్థకు, ప్రజల ఆహార భద్రతకు మధ్య గల సంబంధాన్ని వివరించండి.
జవాబు:
ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)కు, ప్రజల ఆహార భద్రతకు ఎంతో దగ్గరి సంబంధముంది.

  • ప్రజాపంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి.
  • పేదలకు, అత్యంత పేదలకు సబ్సిడి ధరకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తూ ఆహార పదార్థాల అందుబాటుకు తద్వారా ఆహారభద్రతకు PDS ఎంతో తోడ్పడుతుంది.
  • వివిధ పథకాలు (మధ్యాహ్న భోజన పథకం, MNREP, FFW, AAY, ICDS మొ||నవి) ద్వారా పేద ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ ఆహారం అందుబాటులోకి తెస్తుంది.
  • ధరలను అదుపులో ఉంచుట ద్వారా అల్ప ఆదాయ వర్గాల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఆహార ధాన్యాల అందుబాటు పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా పెరుగుతుంది.

AP Board 10th Class Social Solutions Chapter 11 ఆహార భద్రత

10th Class Social Textbook Page No.153

ప్రశ్న 14.
సమర్థంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రం ఈ పరిస్థితిని ఎలా సరిదిద్దగలదు ? చర్చించండి.
జవాబు:
మన దేశంలో మొత్తం మీద 16% పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి ఉంది. మొత్తంగా 45% పిల్లలు తక్కువ బరువు ఉన్నారు. 1-3 సం||రాల పిల్లలతో పోలిస్తే, 3-5 సం||రాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. సమరంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రం ఈ పరిస్తితిని చాలా వరకు సరిదిద్దగలదు.

  • అంగన్‌వాడీల్లో 1-5 సం||రాల పిల్లలు ఎక్కువగా ఉంటారు, వీరు శిక్షణ పొందిన ఆయాల సంరక్షణలో ఉంటారు.
  • ప్రభుత్వం పౌష్టికాహారం (పోషకాహారం)ను అంగన్‌వాడీల ద్వారానే సరఫరా చేస్తుంది.
  • పిల్లల యొక్క ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు పరీక్షించి, తగుచర్యలు తీసుకుంటారు.
  • పిల్లలకు అవసరమైన వైద్య, ఆరోగ్య సూచనలు అందించబడతాయి, వ్యాక్సినేషన్ ఉంటుంది.
  • ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉండటం వలన పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
  • అంగన్‌వాడీ కేంద్రంలో సరఫరా చేయు గ్రుడ్లు, ప్రోటీన్స్ (సోయాబీన్స్ పొడి), సమతౌల్య ఆహారం పొడి మొ||నవి పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

SCERT AP 10th Class Social Study Material Pdf 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 10th Lesson ప్రపంచీకరణ

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
విదేశీ పెట్టుబడి, వాణిజ్యాలపై భారత ప్రభుత్వం అవరోధాలు కల్పించటానికి గల కారణాలు ఏమిటి ? ఈ అవరోధాలను తొలగించాలని అది ఎందుకు అనుకుంది? (AS1)
జవాబు:
దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించిన భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులపై అవరోధాలు కల్పించింది. అయితే 1991 నుండి భారత ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీపడాల్సిన అవసరం ఉందని నిర్ణయించి ఈ అవరోధాలను తొలగించాలని నిర్ణయించింది.

ప్రశ్న 2.
కార్మిక చట్టాల సడలింపు కంపెనీలకు ఏ విధంగా సహాయపడుతుంది? (AS1)
జవాబు:
కార్మిక చట్టాల సడలింపు వలన కంపెనీకి కార్మీకుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. దీని మూలంగా కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాలవ్యవధికి నియమించుకొనే అవకాశం ఉంది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 3.
ఉత్పత్తిని చేపట్టటానికి, దానిని నియంత్రించటానికి, లేదా ఇతర దేశాలలో స్థిరపడటానికి బహుళజాతి సంస్థలు అవలంబించే విధానాలు ఏమిటి? (AS1)
జవాబు:
బహుళజాతి సంస్థలు ఉత్పత్తి ప్రక్రియను చిన్న భాగాలుగా చేసి ప్రపంచంలో పలుచోట్ల చేబడతాయి. వాటిని చౌకగా ఉత్పత్తి చేయగల ప్రాంతాన్ని దీనికై ఎన్నుకుంటాయి. మార్కెటింగ్ కు సమీపంలోని దేశాలను ఎంపిక చేసుకొని అచ్చట అసెంబ్లింగ్ యూనిట్లనేర్పాటు చేస్తారు. ఇంగ్లీషు మాట్లాడగలిగే జనాభా గల భారతదేశం లాంటి దేశాలలో కస్టమర్ కేర్ సేవలనేర్పాటు చేస్తాయి. వీరు ఆయా దేశాలలోని కొన్ని కంపెనీలతో కలసి తమ సంస్థలనేర్పాటు చేయడం ద్వారా ఆయా దేశాలలో నిలదొక్కుకుంటాయి.

ప్రశ్న 4.
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు కోరుకుంటున్నాయి? దీనికి ప్రతిగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏ షరతులను కోరాలి? (AS4)
జవాబు:
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్యం, పెట్టుబడులలో సరళీకృత విధానాలను అవలంబించాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకొంటాయి. ఎందుకంటే బహుళజాతి సంస్థలు అధికంగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవి మరియు ముడి సరుకులు, మార్కెట్లు గల అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాలంటే ఆ దేశాలు సరళీకృత విధానాలను అవలంబించాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా న్యాయపూరిత విధానాలు అవలంబించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు షరతులు విధించాలి.

ప్రశ్న 5.
“ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.” ఈ వాక్యాన్ని వివరించండి. (AS1)
జవాబు:
ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదని తెలుస్తోంది. విద్య, నైపుణ్యం, సంపద ఉన్న వాళ్లు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఇంకొకవైపున ఎటువంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రపంచీకరణ ఇప్పుడు ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి అనేది మన ముందున్న ప్రశ్న. న్యాయమైన ప్రపంచీకరణ అందరికీ అవకాశాలు సృష్టిస్తుంది. దాని ప్రయోజనాలు మరింత బాగా పంచుకోబడతాయి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించటం వల్ల ప్రపంచీకరణ ప్రక్రియకు మేలు ఎలా జరిగింది? (AS1)
జవాబు:
వాణిజ్య, పెట్టుబడి విధానాలను సరళీకరించడం వలన సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో విస్తరించి ప్రపంచీకరణకు దోహదం చేసాయి. టెలికమ్యూనికేషన్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందడంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. వాయిస్ మెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్స్ తో నామమాత్రపు ఖర్చుతో సమాచారం ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో చేరవేయవచ్చు.

ప్రశ్న 7.
దేశాల మధ్య మార్కెట్ల అనుసంధానానికి విదేశీ వాణిజ్యం ఎలా దోహదం చేస్తుంది? ఇక్కడ ఇచ్చినవి కాకుండా కొత్త ఉదాహరణలతో దీనిని వివరించండి. (AS1)
జవాబు:
దేశాల మధ్య అనుసంధానంగా చాలా కాలంగా వాణిజ్యం ఉంటుంది. భారతదేశం ప్రాచీన కాలం నుండి నూలు వస్త్రాలను అనేక దేశాలకు ఎగుమతి చేసింది. చైనా పట్టు వస్త్రాలను ఆసియా ఖండంలోని అనేక దేశాలకు ఎగుమతి చేసేది. భారతదేశం, ఇండోనేషియాలు సుగంధ ద్రవ్యాలతో వాణిజ్యం చేసినట్లు ఆధారాలున్నాయి.

ప్రశ్న 8.
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఇప్పటి నుంచి ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. మీ ఊహలకు కారణాలను పేర్కొనండి. (AS4)
జవాబు:
ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. 20 సంవత్సరాల తరువాత దేశీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలను తట్టుకోలేక మూతపడవచ్చు. ప్రజలు సేవలు, వస్తువులనే దృష్టిలో పెట్టుకొని స్వదేశీ వస్తువులపై మోజును పూర్తిగా కోల్పోతారు. వైద్యం, విద్యా రంగాలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రాచుర్యం పొందుతాయి. భారతీయ రైల్వేలలో కూడా బహుళజాతి సంస్థలు ప్రవేశిస్తాయి. ప్రధానంగా భారతీయ సంస్కృతిపై కూడా వీటి ప్రభావం పడుతుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

ప్రశ్న 9.
ఇద్దరు వ్యక్తులు వాదించుకోవటం మీరు వింటున్నారు : ఒకరు ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరిచిందని అంటున్నారు. మరొకరు భారతదేశం అభివృద్ధి చెందటానికి ప్రపంచీకరణ సహాయపడుతోందని అంటున్నారు. ఈ వాదనలకు మీరు ఎలా స్పందిస్తారు? (AS2)
జవాబు:
ఇరువురి వాదనలలో కూడా ఎంతో కొంత నిజం ఉంది. ఎందుకంటే ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ల ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవటం ముఖ్యం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 10.
ఖాళీలను పూరించండి : (AS1)
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. …………………. ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో …………………… పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు ……………………………., ……………………… కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ………………., వల్ల ఉత్పత్తిదారుల మధ్య ………………………. తీవ్రతరం అయ్యింది.
జవాబు:
భారతీయ కొనుగోలుదారులకు రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సరుకుల ఎంపికకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రక్రియ వల్ల ఇది సాధ్యమయ్యింది. అనేక ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన సరుకులను భారతదేశ మార్కెట్లలో అమ్ముతున్నారు. దీని అర్థం ఇతర దేశాలతో విదేశీ వాణిజ్యం పెరుగుతోంది. అంతేకాకుండా మనం మార్కెట్లో చూస్తున్న అనేక బ్రాండ్లను బహుళజాతి సంస్థలు భారతదేశంలోనే ఉత్పత్తి చేసి ఉండవచ్చు. బహుళజాతి సంస్థలు సరళీకృత ఆర్థిక విధానాలు, సెట్ల ఏర్పాటు కారణంగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్లో వినియోగదారుల ఎంపికకు అవకాశాలు పెరిగాయి కానీ కొత్త సాంకేతిక విజ్ఞానం, ఉత్పత్తి పద్ధతులు వల్ల ఉత్పత్తిదారుల మధ్య పోటీ తీవ్రతరం అయ్యింది.

ప్రశ్న 11.
క్రింది వాటిని జతపరచండి.

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి.(అ) వాహనాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు.(ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు.(ఇ) కాల్ సెంటర్లు
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది.(ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి.(ఉ) వాణిజ్య అవరోధాలు

జవాబు:

i) బహుళజాతి సంస్థలు తక్కువ ధరకు చిన్న ఉత్పత్తిదారుల నుంచి కొంటాయి.(ఆ) దుస్తులు, పాదరక్షలు, క్రీడాపరికరాలు
ii) వస్తువుల వాణిజ్యాన్ని నియంత్రించటానికి కోటాలు, పన్నులు ఉపయోగిస్తారు.(ఉ) వాణిజ్య అవరోధాలు
iii) విదేశాలలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు.(ఈ) టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, రానా బాక్సీ
iv) సేవల ఉత్పత్తి విస్తరించటానికి సమాచార సాంకేతిక రంగం (IT) దోహదపడింది.(ఇ) కాల్ సెంటర్లు
v) భారతదేశంలో ఉత్పత్తి చెయ్యటానికి అనేక బహుళజాతి సంస్థలు కర్మాగారాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాయి.(అ) వాహనాలు

10th Class Social Studies 10th Lesson ప్రపంచీకరణ InText Questions and Answers

10th Class Social Textbook Page No.133

ప్రశ్న 1.
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీయా? ఎందుకు?
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ. ఫోర్డ్ మోటర్స్ అనేక దేశాలకు కార్లను ఎగుమతి చేస్తుంది. అందుచే ఫోర్డ్ మోటర్స్ బహుళజాతి కంపెనీ.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 2.
విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి ? ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో ఎంత పెట్టుబడి పెట్టింది?
జవాబు:
ఒక దేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టి కంపెనీలు నిర్వహించడాన్ని విదేశీ పెట్టుబడి అంటాం. ఫోర్డ్ మోటర్స్ భారతదేశంలో 1700 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టింది.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 3.
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టటం వల్ల ఉత్పత్తి కార్యకలాపాలలో ఎటువంటి అనుసంధానం జరుగుతోంది?
జవాబు:
భారతదేశంలో ఫోర్డ్ మోటర్స్ కార్ల ఉత్పత్తిని చేపట్టడం వలన ఉత్పత్తి కార్యక్రమాలలో స్థానిక కంపెనీలతో అనుసంధానం చేసుకోవటం, ఇతర దేశాలలో మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

10th Class Social Textbook Page No.136

ప్రశ్న 4.
ప్రపంచీకరణ ప్రక్రియలో బహుళజాతి సంస్థల పాత్ర ఏమిటి?
జవాబు:
బహుళ జాతి కంపెనీల పెట్టుబడి ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రవాహం వలన సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడి ప్రపంచీకరణకు దారితీసింది.

ప్రశ్న 5.
దేశాలను అనుసంధానపరిచే వివిధ మార్గాలేవి?
జవాబు:
అధిక దేశీయ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం వలన వివిధ దేశాల ఉత్పత్తి, మార్కెట్ల మధ్య అనుసంధానం పెరిగి ఈ దేశాల మధ్య అనుసంధానం ఏర్పడింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

ప్రశ్న 6.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
ప్రపంచీకరణ దేశాలను అనుసంధానం చేయటం వల్ల
అ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని తగ్గిస్తుంది.
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.
ఇ) ఉత్పత్తిదారుల మధ్య పోటీలో తేడా ఉండదు.
జవాబు:
ఆ) ఉత్పత్తిదారుల మధ్య పోటీని పెంచుతుంది.

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 7.
ప్రపంచీకరణకు, సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి మధ్యగల సంబంధం ఏమిటి? సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమై ఉండేదా?
జవాబు:
సమాచార పరిజ్ఞానం విస్తరించడంవలననే ప్రపంచీకరణ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తరించకుండా ప్రపంచీకరణ సాధ్యమయ్యేది కాదు.

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 8.
విదేశీ వాణిజ్య సరళీకరణ అంటే ఏమి అర్థం చేసుకున్నారు?
జవాబు:
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు గల అవరోధాలను తొలగించటం, విదేశీ కంపెనీలు మనదేశంలో కార్యాలయాలు,కంపెనీలు స్థాపించుటకు అనుమతించడం వంటి చర్యలను విదేశీ వాణిజ్య సరళీకరణ అంటాం.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 9.
దేశాల మధ్య వాణిజ్యం మరింత న్యాయపూరితంగా ఉండటానికి ఏం చేయవచ్చు?
జవాబు:
అన్ని దేశాలు అవరోధాలు తొలగించాలి. అభివృద్ధి చెందిన దేశాలు దీనికి మినహాయింపు కారాదు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 10.
పెరుగుతున్న పోటీవల్ల రవి చిన్న ఉత్పత్తి కేంద్రం ఏ విధంగా ప్రభావితం అయ్యింది?
జవాబు:
పెరుగుతున్న పోటీవల రవి చిన్న ఉత్పత్తి కేంద్రంలో నేడు ఉత్పత్తి సగం పడిపోయింది. 35 శాతం మంది కార్మికులకు మాత్రమే నేడు పని కల్పించగలుగుతున్నాడు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 11.
ఈ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వ పాత్ర ఉందనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
అవును. ఈ రంగాలలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

10th Class Social Textbook Page No.130

ప్రశ్న 12.
మొబైల్ ఫోన్లు లేదా వాహనాలు వంటి ఏదో ఒక దానిని తీసుకోండి. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్లను గుర్తించండి. వాటి యజమానులు ఎవరు? అవి భారతదేశంలో తయారవుతున్నాయా? మీ తల్లిదండ్రులతో లేదా ఇతర పెదవాళ్లతో చర్చించి 30 సంవత్సరాల క్రితం ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
జవాబు:
సెల్ ఫోన్లు ఉదాహరణగా తీసుకుంటే జపాన్ దేశానికి చెందిన నోకియా వంటి కంపెనీలు భారతదేశ మార్కెట్ను పాలిస్తున్నాయి. జపాన్ మాత్రమే కాక అనేక బహుళజాతి కంపెనీలు వివిధ వస్తువులను భారతీయ మార్కెట్లో అమ్ముతున్నారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రధానమంత్రి వంటి ప్రముఖుల వద్దనే ఇలాంటి బ్రాండ్లు ఉండేవి. జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు చేతి గడియారాలను భారతదేశంలో మార్కెట్ చేశాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 13.
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను నెలకొల్పటం వల్ల ఇటువంటి దేశాలు అందించే పెద్ద మార్కెట్టునే కాకుండా తక్కువ ఉత్పత్తి ఖర్చు వల్ల కూడా లాభపడతాయి. ఈ వాక్యాన్ని వివరించండి.
జవాబు:
ఫోర్డ్ మోటర్స్ వంటి బహుళజాతి కంపెనీలు భారతదేశంలో తమ కంపెనీలు నెలకొల్పడం ద్వారా అత్యధిక జనాభా గల ఈ దేశంలో తమ మార్కెట్ ను సులభంగా విస్తరించగలుగుతారు. అదే సమయంలో భారత ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి యిస్తున్న వివిధ రాయితీలు, సరళీకృత ఆర్థిక విధానాలు ద్వారా సులభంగా అనుమతులను పొందడం, శ్రమ , శక్తి, నైపుణ్యం గల కార్మికులు చౌకగా లభించడం వంటి అనుకూల అంశాలతో ఉత్పత్తి ఖర్చు కూడా వీరికి తగ్గుతుంది.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 14.
ప్రపంచవ్యాప్త కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చెయ్యాలని కంపెనీ ఎందుకు అనుకుంటోంది? కింది అంశాలను చర్చించండి.
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చు.
ఆ) ఫోర్డ్ మోటరకు వివిధ విడి భాగాలను అందించే పలు స్థానిక ఉత్పత్తిదారులు ఉండటం,
ఇ) భారతదేశం, చైనాలలోని అధిక సంఖ్యాక కొనుగోలుదారులకు దగ్గరగా ఉండటం.
జవాబు:
ప్రపంచ వ్యాప్తంగా కార్ల ఉత్పత్తికి భారతదేశం విడి భాగాలను అందించేలా అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తుంది.
దీనికి కారణం :
అ) భారతదేశంలో కార్మికులు, ఇతర వనరుల ఖర్చులు తక్కువగా ఉండుట.
ఆ) ఫోర్డ్ మోటరు వివిధ విడి భాగాలను ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు అందుబాటులోకి తేవాలనుకుంటుంది.
ఇ) భారతదేశం, చైనా వేగంగా ప్రపంచంలోని ముఖ్య మార్కెట్లకు విస్తరించడం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 15.
నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి కంపెనీలు దాదాపుగా అమెరికా, జపాను, లేదా ఐరోపా దేశాలకు చెందినవే. ఎందుకో ఊహించగలరా?
జవాబు:
అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందంజలో ఉండటం, సరళీకృత ఆర్థిక విధానాలు పెట్టుబడిదారి వ్యవస్థ చాలాకాలం నుండి అమలులో ఉండటం వలన నైక్, కోకాకోలా, పెప్సి, హోండా, నోకియా వంటి బహుళజాతి సంస్థలు ఈ దేశాలలోనే ఉద్భవించాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 16.
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం ఏమిటి? గతానికి, ప్రస్తుత పరిస్థితికి తేడా ఏమిటి?
జవాబు:
గతంలో దేశాలను కలిపిన ప్రధాన అంశం వాణిజ్యం . ప్రస్తుతం కూడా పరిస్థితులు ఏమంతగా మారలేదు. గతంలో యూరోపియన్ దేశాలు భారతదేశంతోను, ఇతర దక్షిణాసియా దేశాలతోను సముద్ర మార్గాలు ద్వారా వాణిజ్యం నిర్వహించేవారు. ప్రజలు స్థానికంగా తయారయిన వస్తువుల కంటే స్థానికేతర వస్తువుల పట్లనే ఆసక్తి కనబరచేవారు. కాని ప్రస్తుతం మన భారతీయ కంపెనీలు చౌక ధరలకే అవే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి మరియు ఆ వస్తువులు స్థానిక మార్కెట్లలో అందుబాటులో ఉంటున్నాయి. మన దేశ వాణిజ్యంలో బహుళజాతి సంస్థల ఆగమనం కూడా మరొక అంశం.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 17.
విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు మధ్య తేడా ఏమిటి?
జవాబు:

విదేశీ వాణిజ్యంవిదేశీ పెట్టుబడి
1) ఒక కంపెనీ ఇతర దేశాలతో నిర్వహించే వాణిజ్యం.1) ఇది బహుళజాతి సంస్థలు భూములు, భవనాలు, యంత్రాలు మరియు ఇతర సామగ్రి కొనేందుకు ఖర్చు చేసే ధనం.
2) వస్తువుల ఉత్పత్తి ఒక దేశంలో జరుగుతుంది మరియు అవి ఇతర దేశాలలో విక్రయించబడతాయి.2) ఒక దేశంలో ఇతర దేశాల వ్యాపారులు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది మరియు వస్తువులు అధిక ధరలకు ఎగుమతి అవుతాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 18.
చైనాలోకి భారత ఉక్కును దిగుమతి చేసుకోవటం వల్ల రెండు దేశాల ఉక్కు మార్కెట్లు ఎలా అనుసంధానమౌతాయి?
జవాబు:
చైనాకు భారతదేశంలో సమృద్ధిగా ఉన్న ఉక్కు మరియు ఇతర ముడి సరకుల ఆవశ్యకత చాలా ఉంది. భారతదేశం నుండి కొనుగోలు చేసిన ఉక్కు మరియు ఇతర ముడి సరుకుల సహాయంతో చైనా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తోంది మరియు భారతదేశానికి వాటిని ఎగుమతి చేస్తోంది. ఇది ఈ రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య బంధాన్ని ఏర్పరచింది.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.137

ప్రశ్న 19.
ఈ ఉదాహరణలో ఉత్పత్తిలో సాంకేతిక విజ్ఞాన ఉపయోగాన్ని తెలియజేసే పదాల కింద గీత గీయండి.
జవాబు:
2వ లైన్ డిజైన్
3వ లైన్ ఇంటర్నెట్
4వ లైన్ టెలికమ్యూనికేషన్
5వ లైన్ డిజైన్
6వ లైన్ డిజైనింగ్
7వ లైన్ కంప్యూటర్, ముద్రించిన
8వ లైన్ డిజైనింగ్
9వ లైన్ ముద్రణకు
10వ లైన్ ఇంటర్నెట్ (e- Banking)

10th Class Social Textbook Page No.138

ప్రశ్న 20.
దిగుమతులపై పన్ను వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ. దిగుమతి చేసుకునే సరుకుల సంఖ్య మోతాదుపై కూడా ప్రభుత్వం పరిమితి విధించవచ్చు. దీనిని కోటాలు అంటారు. చైనా బొమ్మల ఉదాహరణలో కోటాలను ఉపయోగించి వాణిజ్య అవరోధాన్ని ఎలా విధించవచ్చో వివరించండి. ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలా? చర్చించండి.
జవాబు:
భారతదేశంలో చైనా బొమ్మల దిగుమతి ఉదాహరణకు మరొకసారి వద్దాం – బొమ్మల దిగుమతిపై భారతీయ ప్రభుత్వం పన్ను విధించిందనుకుందాం. పన్ను కారణంగా కొనుగోలుదారులు దిగుమతి చేసుకున్న బొమ్మలకు అధిక ధరలు చెల్లించాల్సివస్తుంది. అప్పుడు భారతీయ మార్కెట్లో చైనా బొమ్మలు మరీ అంత చవకగా ఉండవు, దాంతో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోతాయి. భారతదేశ ఉత్పత్తిదారులు పుంజుకుంటారు.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 21.
ఖాళీలను పూరించండి.
…………. దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం ………. . ప్రపంచ వాణిజ్య సంస్థ ………….. కు సంబంధించి నియమాలు రూపొందించి ……….. చూస్తుంది. అయితే, ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం ………… లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ………… . కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.
జవాబు:
అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలయ్యింది. ఈ సంస్థ ఉద్దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పాటు. ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్యాలకు సంబంధించి నియమాలు రూపొందించి అవి పాటింపబడేలా చూస్తుంది. అయితే ఆచరణలో దేశాల మధ్య వాణిజ్యం న్యాయపూరితంగా లేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అవరోధాలను కలిగిస్తున్నాయి. కానీ అనేక సందర్భాలలో అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉత్పత్తిదారులకు మద్దతు కొనసాగిస్తున్నాయి.

10th Class Social Textbook Page No.139

ప్రశ్న 22.
పై ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం ఉత్పత్తి చెయ్యటానికి రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుందని చూశాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు కొన్ని రకాల వస్తువుల, ఉదాహరణకు పర్యావరణ అనుకూలమైన వాటి ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. ఇది న్యాయమైనదో కాదో చర్చించండి.
జవాబు:
ఈ ఉదాహరణలో అమెరికా ప్రభుత్వం పంటలకు పెద్ద మొత్తంలో డబ్బులు యిచ్చినంతవరకు ఎవరికీ అభ్యంతరముండదు. తద్వారా వారు ఆహార ఉత్పత్తులను పెంచుకోవచ్చు. కానీ వాటిని చౌకగా విదేశాలలో అమ్మటం న్యాయసముచితం కాదు. దీనిమూలంగా యితర దేశాల రైతులు యిబ్బంది పడుతున్నారు. పర్యావరణమైన అనుకూల ఉత్పత్తికి మద్దతు యివ్వడం న్యాయసమ్మతమైనదే. మనదేశంలో కూడా వంట చెఱకు కోసం అడవులను నరకకుండా ఉండేందుకు గ్యాస్ వినియోగం ప్రోత్సహించటానికి గ్యాస్ కు సబ్సిడీలు యిస్తున్నాం.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 23.
భారతదేశ ప్రజలు పోటీవల్ల ఏ విధంగా లాభపడ్డారు?
జవాబు:
భారతదేశ అతి పెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీవల్ల ప్రయోజనం పొందాయి. వాళ్లు కొత్త సాంకేతిక విజ్ఞానంలోనూ, ఉత్పత్తి పద్ధతులలోనూ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి ప్రమాణాలను పెంచారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచెయ్యటం ద్వారా కొన్ని కంపెనీలు లాభపడ్డాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 24.
మరిన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదగాలా ? దేశంలోని ప్రజలకు దానివల్ల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా ‘బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. టాటా మోటర్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (IT), రానాలాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు), సుందరం ఫాసెనర్స్ (నటులు, బోల్టులు) వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్నాయి.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 25.
మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి?
జవాబు:
పన్నుల రూపంలో ప్రభుత్వాదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజలకు మరిన్ని సేవలనందజేయవచ్చు.
భారతీయులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. తద్వారా తలసరి, జాతీయాదాయాలు పెరుగుతాయి.
దేశ, విదేశీ వాణిజ్యం పెరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించవచ్చు.

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 26.
ఇతర దేశాలతో పోలిస్తే తమ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కాబట్టి రవిలాంటి వాళ్ళు ఉత్పత్తిని నిలిపివెయ్యాలా? మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ఉత్పత్తి ఖర్చు ఎక్కువేమీ కాదు. అయితే బహుళజాతి సంస్థలు అధునాతన , సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిన వస్తువులను మనం స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న యూనిట్లలో ఉత్పత్తి చేస్తే ప్రామాణికం గానీ, ధరలోగానీ పోటీపడలేం. ఈ వాస్తవాన్ని రవిలాంటివారు గుర్తించాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 27.
వీటిల్లో పెట్టుబడులు పెట్టటానికి బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపిస్తాయా? ఎందుకు?
జవాబు:
ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి స్వంతంగా విద్యుత్ ఉత్పత్తి, రవాణా మార్గాల ఏర్పాటు వంటి అంశాలలో బహుళ జాతి సంస్థలు తమ పరిశ్రమల వరకు మాత్రమే పరిమితమవుతాయి. విద్యుత్, రవాణా మార్గాలు వంటివి ప్రఖ్యాత రంగంలో ఉన్నాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 28.
ఇతర కంపెనీలకు, బహుళజాతి సంస్థలకు మధ్య తేడాలు ఏమిటి?
జవాబు:

కంపెనీలుబహుళ జాతి సంస్థలు
1. 20వ శతాబ్దం మధ్య భాగం వరకు జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి.1. 20వ శతాబ్దం రెండో అర్ధభాగం నుండి జరిగిన పారిశ్రామికీకరణ, వాణిజ్యం, ఉత్పత్తి.
2. మనదేశంలో పరిశ్రమలను నెలకొల్పి ఉత్పత్తి చేసేవారు.2. ఒకటి కంటే ఎక్కువ దేశాలలో కంపెనీలు స్థాపించి ఉత్పత్తి చేయటం.
3. విడిభాగాల తయారీ నుండి ఉత్పత్తి తుదిరూపం వరకు ఒకే చోట జరిగేది.3. విడిభాగాలు ఒక దేశంలో, అసెంబ్లింగ్ మరో దేశంలో, మార్కెటింగ్ వేరు వేరు దేశాలలో నిర్వహిస్తున్నారు.
4. శ్రామికులు నుండి సమ్మెలు, ఆందోళనలు వంటి సమస్యలు ఎదుర్కొనే వారు.4. అవసరమైతే సమస్యాత్మక ప్రాంతంలో యూనిట్ మూసివేసి ఈ వేరే ప్రాంతానికి తరలిస్తారు.
5. మార్కెట్ పరిధి తక్కువ.5. మార్కెట్ కు పరిధిలేదు. విశ్వవ్యాప్తం.
6. ఉద్యోగావకాశాలు తక్కువ.6. బహువిధ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

10th Class Social Textbook Page No.134

ప్రశ్న 29.
ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి చైనా ఉక్కును దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులు వీటిని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పండి :
అ) చైనాలోని ఉక్కు కర్మాగారాలు,
ఆ) భారతదేశంలోని ఉక్కు కర్మాగారాలు,
ఇ) చైనాలో ఇతర పారిశ్రామిక వస్తువులు తయారుచేయటానికి ఉక్కును కొనుగోలు చేసే పరిశ్రమలు
జవాబు:
భారతదేశ ఉక్కు తయారీదారులు చైనాకు, ఉక్కు మరియు ముడి సరకులను ఎగుమతి చేయడం ప్రారంభించారు. చైనాలోని కొనుగోలుదారులు ఇప్పుడు చైనా ఉక్కు మరియు భారతదేశ ఉక్కులలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చింది. చౌకధరల కారణంగా భారతదేశ ఉక్కు చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. అందువలన చైనా ఉక్కు -స్థానంలో భారతదేశ ఉక్కును వాడటం జరుగుతోంది. ఇది భారతీయ ఉక్కు తయారీదారులకు తమ వాణిజ్యం విస్తరింపచేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అయితే చైనా ఉక్కు తయారీదారులు అందుకు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొన్నారు. పోటీ కారణంగా కొందరు ఉక్కు తయారీదారులు సృజనాత్మకతతో అభివృద్ధి సాధించగా మరికొందరు చతికిలపడ్డారు.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 30.
ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి విధ్వంసం కావచ్చని మనం ఇదివరకే చదివాం. ఆర్థిక మండళ్లను నెలకొల్పటాన్ని భారతదేశంలోని కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లు ఎవరో, ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారో తెల్పండి.
జవాబు:
ప్రత్యేక ఆర్థిక మండలుల ఏర్పాటును అనేక వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు.

కారణాలు:

  1. ఇది పెట్టుబడి వ్యవస్థను సమర్ధిస్తుంది. అందుచే సామ్యవాదులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
  2. దేశీయ కంపెనీలను దెబ్బతీస్తుంది. కాబట్టి స్థానిక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
  3. విదేశీ సంస్కృతులను ప్రోత్సహిస్తుంది. అందుచే సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
  4. కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. అందుచే కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
  5. స్థానికులకు ఉద్యోగావకాశాలు నామమాత్రం. అందుచే స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
  6. వీటికి కేటాయించి భూములు సాధారణ రైతులు, బడుగువర్గాలకు చెందినవి కావటంతో ఈ వర్గాలు భూమిలేని వారై కూలీలుగా మారిపోతున్నారు. అందుచే వీరు వ్యతిరేకిస్తున్నారు.
  7. ప్రధానంగా వీరు పెట్టే పరిశ్రమలు పర్యావరణ నాశనం చేస్తున్నాయి. అందుచే ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

10th Class Social Textbook Page No.140

ప్రశ్న 31.
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీకి తట్టుకోవాలంటే మూడు అవసరాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి :
అ) మెరుగైన రోడ్లు, విద్యుత్తు, నీళ్లు, ముడిసరుకులు, మార్కెటింగ్, ఇన్ఫమేషన్ నెట్వర్క్
ఆ) సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి, ఆధునికీకరణ,
ఇ) తక్కువ వడ్డీకి సకాలంలో రుణాల అందుబాటు. ఈ మూడు అంశాలు భారతీయ ఉత్పత్తిదారులకు ఎలా సహాయపడతాయో వివరించండి.
జవాబు:
భారతదేశ చిన్న ఉత్పత్తిదారులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే వారికి కొన్ని కనీస సదుపాయాలు కల్పించాలి. ముడి సరుకులు వినియోగానికి గల అవరోధాలను తొలగించి అందుబాటులోకి తేవాలి. వీటిని తమ పరిశ్రమలోకి తేవడానికి, ఉత్పత్తులను సమీప ప్రధాన నగరాలు, ఓడరేవులు, రైల్వేస్టేషన్లకు చేర్చడానికి రోడ్డు మార్గాలను విస్తరించాలి. ఉత్పత్తికి కావలసిన నిరంతర నీరు, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి. మార్కెటింగ్ చేయడానికి కావలసిన ప్రోత్సాహకాలు అందజేయాలి. అన్ని రంగాలకు చెందిన ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ సదుపాయాలు అందుబాటులోకి తేవాలి. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, ఇవి తమ పరిశ్రమ ఆధునికీకరణకు ఏ విధంగా తోడ్పడగలవో సూచననివ్వగల సాంకేతిక నిపుణుల సహకారం అందివ్వాలి. బహుళ జాతి సంస్థల పోటీని తట్టుకొనే విధంగా పరిశ్రమలను ఆధునికీకరించే వీలుగా తక్కువ వడ్డీకి సకాలంలో రుణాలను అందజేయాలి.

AP Board 10th Class Social Solutions Chapter 10 ప్రపంచీకరణ

10th Class Social Textbook Page No.141

ప్రశ్న 32.
ప్రభుత్వం తీసుకోగల ఇతర చర్యల గురించి ఆలోచించండి. తరగతిలో చర్చించండి.
జవాబు:
ప్రభుత్వ విధానాలు ధనికులు, అధికారం ఉన్న వాళ్ళవే కాక దేశంలోని ప్రజలందరి ప్రయోజనాలను కాపాడేలా ఉండాలి. ప్రభుత్వం చేపట్టగలిగిన కొన్ని చర్యల గురించి మీరు తెలుసుకున్నారు. ఉదాహరణకు కార్మిక చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూసి కార్మికులకు తమ హక్కులు లభించేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు తమ సామర్థ్యాన్ని పెంచుకుని పోటీపడగల శక్తి వచ్చేంతవరకు వాళ్లకు సహాయపడాలి. అవసరమైతే ప్రభుత్వం వాణిజ్య, పెట్టుబడి అవరోధాలను ఉపయోగించుకోవచ్చు. మరింత న్యాయపూరిత నియమాల కోసం ప్రపంచ వాణిజ్య సంస్థతో సంప్రదింపులు జరుపవచ్చు. ఇవే ఆసక్తులు ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో ‘కలసి, ప్రపంచ వాణిజ్య సంస్థలో అభివృద్ధి చెందిన దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

SCERT AP 10th Class Social Study Material Pdf 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Social Solutions 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ Textbook Questions and Answers

Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)

ప్రశ్న 1.
భారతదేశంలోని ప్రతి గ్రామాన్ని ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా గణనలో సర్వేచేసి కింద ఇచ్చిన విధంగా వివరాలను పొందుపరుస్తారు. రాంపురానికి సంబంధించిన సమాచారం ఆధారంగా కింది వివరాలను నింపండి. (AS3)
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం :
ఇ. భూ వినియోగం హెక్టార్లలో :
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 1
జవాబు:
అ. ఎక్కడ ఉంది (ఉనికి) :
పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రునేలల్లో రాంపురం, ఉంది.

ఆ. గ్రామ మొత్తం విస్తీర్ణం : 290 హెక్టార్లు

ఇ. భూ వినియోగం హెక్టార్లలో : సాగులో ఉన్న భూమి.

ప్రశ్న 2.
రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? (AS1)
జవాబు:
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది, కాబట్టి తక్కువ కూలీకైనా పనిచేయ్యటానికి ప్రజలు సిద్ధపడతారు. పెద్దరైతులు ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, పంటకోత యంత్రాలపై ఆధారపడటం పెరగటంతో గ్రామీణ “ప్రాంతాలలో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి. అందుచే రాంపురంలోని వ్యవసాయ కూలీలకు కనీస కూలీ కంటే తక్కువ కూలీ లభిస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 3.
మీ ప్రాంతంలోని ఇద్దరు కూలీలతో మాట్లాడండి. ఇందుకు వ్యవసాయ కూలీలనుగానీ, భవన నిర్మాణంలో పని చేసేవాళ్ళనుగానీ ఎంచుకోండి. వాళ్ళకు ఎంత కూలీ లభిస్తోంది? వాళ్ళకు నగదు రూపంలో చెల్లిస్తారా, వస్తు రూపంలోనా? వాళ్ళకు క్రమం తప్పకుండా పని దొరుకుతుందా? వాళ్ళు అప్పుల్లో ఉన్నారా? (AS3)
జవాబు:
మా ప్రాంతంలో భవన నిర్మాణ కూలీలకు రోజుకు రూ. 300/- లభిస్తుంది. దీనిని నగదు రూపంలో చెల్లిస్తారు. వీరికి సుమారుగా క్రమం తప్పకుండా పని దొరుకుతుంది. మా ప్రాంతంలో కూలీ పనిచేసే ప్రతివారికి అప్పు ఉంటుంది.

ప్రశ్న 4.
ఒకే విస్తీర్ణం ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచటానికి ఉన్న వివిధ పద్ధతులు ఏమిటి ? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
ఒకే విస్తీర్ణంలో ఉన్న భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి ఉన్న వివిధ పద్ధతులు :

  1. బహుల పంటల సాగు విధానంలో నిరంతరం పంటలు పండించడం.
  2. ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేటట్లు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం.
  3. భూమి సారాన్ని పోగొట్టకుండా ఉండేందుకు పంట మార్పిడి విధానం అమలు చేయటం.
  4. అధిక దిగుబడినిచ్చే వంగడాలు వినియోగం, సస్యరక్షణ చర్యలు చేపట్టడం.
  5. అనువైన చోట అంతర్ పంట సాగు చేయటం.

ప్రశ్న 5.
మధ్యతరగతి, పెద్ద రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ఎలా సమకూరుతుంది? చిన్న రైతులకూ, వీళ్ళకు మధ్య ఉన్న తేడా ఏమిటి? (AS1)
జవాబు:
మధ్య తరగతి, పెద్ద రైతులకు వ్యవసాయంలో మిగులు ఉంటుంది. దీనిని తదుపరి పంటలకు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు కొనుగోలుకు ఖర్చు చేస్తారు. వీరు చిన్న రైతులకు వడ్డీకి అప్పులు యివ్వడం, ట్రాక్టర్లు అద్దెకు యివ్వడం, వ్యాపారాలు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతారు. అందుచే వీరికి పెట్టుబడి ఓ సమస్య కాదు. చిన్న రైతులు పండించే పంట తమ కుటుంబ అవసరాలకే సరిపోతుంది. అందుచే వీరు పెట్టుబడి కోసం అప్పులు చేస్తుంటారు.

ప్రశ్న 6.
ఏ షరతుల మీద తేజ్ పాల్ నుండి సవిత అప్పు పొందింది? తక్కువ వడ్డీకి బ్యాంకు నుంచి రుణం లభిస్తే సవిత పరిస్థితి . భిన్నంగా ఉండేదా? (AS1)
జవాబు:
సవిత అనే చిన్న రైతు గోధుమ పంట పండించడానికి పెట్టుబడికై తేజ్ పాల్ అనే రైతు వద్ద నాలుగు నెలల్లో తిరిగి యివ్వాలన్న షరతు మీద 36% వడ్డీకి 6000 రూపాయలు అప్పు తీసుకుంది. కోత సమయంలో రోజుకు వంద రూపాయల కూలీకి తేజ్ పాల్ పొలంలో పనిచేయడానికి కూడా ఈమె అంగీకరించింది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే సవిత తన మిగులు పంట నుండి అప్పు తీర్చేది. తాను చేసిన పనికి న్యాయమైన కూలీ లభించేది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 7.
మీ ప్రాంతంలోని పెద్దవాళ్ళతో మాట్లాడి గత 30 సంవత్సరాలలో సాగునీటి విధానాలలోనూ, వ్యవసాయ పద్ధతులలోనూ వచ్చిన మార్పుల గురించి ఒక నివేదిక రాయండి. (AS3)
జవాబు:
గత 30 సంవత్సరాలుగా సాగునీటి విధానంలో కొత్తగా కాలువలు, చెరువులు సమకూరలేదు. అనేక వ్యవసాయ చెరువులు ఆక్రమణలకు గురై, మరమ్మతులు లేక నిరుపయోగంగా మారాయి. చెరువులలోకి రావలసిన వర్షపు నీరు రావలసిన మార్గాలు గృహ నిర్మాణాలు, రహదారుల నిర్మాణం మూలంగా మూతపడ్డాయి. భూగర్భ జలాలు తగ్గడంతో బోరుబావులు లోతుగా తీయవలసి వస్తోంది. దగ్గర దగ్గరగా బోరుబావులు త్రవ్యడంతో నీరు అందుబాటులోకి రావటం లేదు. నిరంతర విద్యుత్ కోతల మూలంగా సాగునీరు సరిగ్గా అందటంలేదు. అంతరాష్ట్ర జల వివాదాల కారణంగా వర్షాభావ స్థితిలో ఆనకట్టలు నిండక కాలువలు’ ప్రవహింపక కాలువ చివరి భూములకు సాగునీరు అందడం లేదు.

కొత్త రకం వంగడాలు, క్రిమి సంహారక మందులు రావటంతో ఉత్పత్తి పెరిగింది. కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం, వ్యవసాయేతర పనులలో ఆదాయం బాగుండటంతో చిన్న చిన్న రైతులు వ్యవసాయంపై శ్రద్ధ తగ్గించారు.

ప్రశ్న 8.
మీ ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయేతర పనులు ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంచుకుని ఒక చిన్న నివేదిక తయారు చేయండి. (AS3)
జవాబు:
మా ప్రాంతం పట్టణానికి సమీపంలో ఉన్నందున నిర్మాణ కార్యక్రమాలలో ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తున్నారు. చద్దన్నం తిని మధ్యాహ్న భోజనం కేరేజిలో పట్టుకొని కూలీలందరూ ఆటోలలో బయలుదేరి గుత్తేదారు సూచించిన స్థలానికి ఉదయం 9 గంటల భోజన విరామం తరువాత 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారు. ఇంటికి కావలసిన సరుకులను కొనుగోలుచేసి తిరిగి శ్రామికులందరూ ఆటోలో ఇంటికి చేరుతారు. రోజు కూలీ రూ. 300/- చెల్లిస్తున్నారు. ఈ కార్మికులు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాల లబ్ధిదారులుగా స్వగృహాన్ని ఏర్పరచుకొని పిల్లలను తమ గ్రామంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. ఈ శ్రామికులలో చాలా మంది అక్షరాస్యులు. మహిళలు కూడా పురుషులతో సమానంగానే పనిచేస్తారు.

ప్రశ్న 9.
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉండే పరిస్థితిని ఊహించుకోండి. అప్పుడు రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేదా? ఎలా? తరగతిలో చర్చించండి. (AS1)
జవాబు:
ఉత్పత్తికి భూమి కాకుండా శ్రమ కొరతగా ఉంటే రాంపురం కథ ఇందుకు భిన్నంగా ఉండేది. వ్యవసాయ కూలీలకు ఇప్పటికంటే ఎక్కువ కూలీ లభించేది. చిన్న రైతులు తమ మిగులు కాలంలో వ్యవసాయకూలీ ద్వారా ఎక్కువ ఆదాయం పొంది దానిని తమ వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టేవారు. దీంతో పెద్దరైతుల నుండి అధిక వడ్డీలకు అప్పులు తేవడం, వారు చెప్పిన రేటుకు పనిచేయడం లాంటి సమస్యల నుండి బయటపడేవారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 10.
గోసాయిపూర్, మణాలి అనేవి ఉత్తర బీహార్‌లోని రెండు గ్రామాలు. రెండు గ్రామాలలోని 860 కుటుంబాల నుంచి 250 కంటే ఎక్కువ మగవాళ్ళు పంజాబ్ లేదా హర్యానా గ్రామీణ ప్రాంతాలలో, లేదా ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాలలో పనిచేస్తున్నారు. ఇలా వలస వెళ్ళటం భారతదేశమంతటా గ్రామాలలో సాధారణమే. ప్రజలు ఎందుకు వలస వెళతారు? (గత అధ్యాయానికి మీ ఊహను జోడించి) గోసాయిపుర్, మజాలి గ్రామల నుంచి వలస వెళ్ళినవాళ్లు ఆయా ప్రాంతాలలో ఏ పని చేస్తారో రాయండి. (AS4)
జవాబు:
ఉత్తర బీహార్‌లోని గోసాయిపూర్, మజాలి గ్రామాల నుండి వలసలు వెళ్ళుటకు బహుశా క్రింది కారణాలు కావచ్చును.

  1. ఆ గ్రామాలలో తగినంత పని దొరకపోవడం.
  2. పని దొరికినా తగినంత కూలీ లభించక పోవటం.
  3. సంవత్సరంలో ఎక్కువ భాగం పనిలేకుండా ఉండటం.
  4. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకాకపోవటం.
  5. ప్రజలు అధిక ఆదాయాలు పొందాలనుకోవటం తద్వారా జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆశించండం.
  6. సమీప పట్టణాలలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేకపోవటం.

ఢిల్లీ, ముంబయి, సూరత్, హైదరాబాదు, నాగపూర్ వంటి నగరాల్లో వలస వెళ్లేవారు చేయుపనులు.

రవాణా, నిర్మాణరంగం, పెయింటింగ్స్, వాచ్ మెన్ వంటి ఉద్యోగాలు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, గృహోపకరణాలు అమ్మటం, కర్మాగారాలలో పనిచేయడం, కార్పెంటరీ, బొంతలు కుట్టడం వంటివి.

ప్రశ్న 11.
పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి కూడా భూమి అవసరం. గ్రామీణ ప్రాంతంలో భూ వినియోగానికీ, పట్టణ ప్రాంతాలలో భూ వినియోగానికి మధ్య గల తేడా ఏమిటి? (AS1)
జవాబు:

పట్టణ ప్రాంతంలో భూ వినియోగంగ్రామీణ ప్రాంతంలో భూ వినియోగం
1) పట్టణ ప్రాంతాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించే భూమి రేట్లు అత్యధికం.1) గ్రామీణ ప్రాంతాలలో భూముల రేట్లు సాధారణంగా ఉంటాయి.
2) పట్టణ ప్రాంతాలలో స్వంత భూమి లేకున్న అద్దెకు/లీజుకు భూమి తీసుకొని వస్తు ఉత్పత్తి చేస్తారు.2) గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా భూమి కొనుగోలు చేసి వినియోగిస్తారు.
3) పరిమిత స్థలంలో ప్రణాళికాబద్ధంగా వస్తూత్పత్తి జరుపుకోవాలి.3) అవసరమైన స్థలం లభిస్తుంది.
4) పట్టణ ప్రాంతాల్లో భూమి గృహ నిర్మాణాలకు, వ్యాపార సంబంధ నిర్మాణాలకు వినియోగిస్తారు.4) గ్రామీణ ప్రాంతాలల్లో భూమి పంటలు పండించడానికి, తోటల పెంపకానికి వినియోగిస్తారు.

ప్రశ్న 12.
ఉత్పత్తి ప్రక్రియలో “భూమి” అన్న దాని అర్థం మరొకసారి చదవండి. వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరంగా ఉన్న మరొక మూడు ఉదాహరణలు ఇవ్వండి. (AS1)
జవాబు:
వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తి ప్రక్రియలో భూమి ముఖ్యమైన అవసరం ఉన్న వాటికి ఉదాహరణలు.

  1. పౌల్టీల ఏర్పాటు నిర్వహణ.
  2. ఇటుక బట్టీల ఏర్పాటు, విక్రయం.
  3. ఈమూ పక్షుల పెంపక కేంద్రం ఏర్పాటు.
  4. ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
  5. కుండీల తయారీ.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 13.
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందటానికి దీని వినియోగానికి , ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. ఈ వాక్యాలను వివరించండి. (AS2)
జవాబు:
ఉత్పత్తికి, ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన నీరు ఒక సహజ వనరు. ఇప్పుడు నీటిని పొందడానికి, దీని వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతోంది. నీరు సహజ వర్షం నుండి లభిస్తుంది. అయితే కొండలులో చెట్లు నరికివేయటం, గ్రానైట్, క్వారీలకై వాటి రూపాలే లేకుండా చేయడంతో సహజంగా పడాల్సిన వర్షాలు తుఫానులు వస్తే కానీ రావటం లేదు. వర్షాలు సకాలంలో కురవకపోవటంతో విత్తులు నాటిన నుండి పంటకోసే వరకు సాగు నీటిపైన ఆధారపడాల్సి ఉంటుంది. వర్షాలు సరిగా కురవకపోవటంతో సహజ నీటివనరులైన నదీ కాలువలు, చెరువులు, బావుల నుండి సకాలంలో సాగునీరు లభించటం లేదు. దీంతో విద్యుత్ మోటర్లుతో నడిచే బోరుబావుల ద్వారా సాగునీరు పొందవలసి వస్తోంది. భూగర్భ జలాలు లోలోతుకు పోతుండటంతో వాటి త్రవ్వకం, నిర్వహణ ఖర్చుతో కూడినదైపోయింది.

10th Class Social Studies 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ InText Questions and Answers

10th Class Social Textbook Page No.117

ప్రశ్న 1.
రాష్ట్ర లేక జిల్లా భౌగోళిక పటాలను చూసి బాగా సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాలను గుర్తించండి. మీరు ఉంటున్న ప్రాంతం దీని కిందికి వస్తుందా?
జవాబు:
అట్లాసు చూసి సాగునీటి సదుపాయం గల ప్రాంతాలను గుర్తించగా, మేము నివాసం ఉంటున్న ప్రాంతం కూడా దీని కిందకే వచ్చింది. అనగా మా ప్రాంతం కూడా సాగునీటి సదుపాయం కలిగి ఉంది.

10th Class Social Textbook Page No.126

ప్రశ్న 2.
ఈ పనికి మిశ్రిలాలకు ఏ భౌతిక పెట్టుబడులు అవసరం అయ్యాయి?
జవాబు:
చెరకు తయారీకి మిశ్రిలాలకు బెల్లం తయారీ యూనిట్ (చెరకు రసం తీసే యంత్రం, చెరకు రసం వేడిచేసే పెద్ద పెనం, మట్టి కుండలు, షెడ్ మొదలైనవి)కు అయ్యే ఖర్చును భౌతిక పెట్టుబడిగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 3.
దీనికి శ్రమ ఎవరిద్వారా అందుతోంది?
జవాబు:
దీనికి శ్రమ కూలీల ద్వారా అందుతుంది. విద్యుత్ తో యంత్రం నడుస్తుంది.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 4.
బెల్లాన్ని మిశ్రిలాల్ తన ఊళ్లో కాకుండా జహంగీరాబాదులోని వ్యాపారస్తులకు ఎందుకు అమ్ముతున్నాడు?
జవాబు:
మిశ్రిలాల్ గ్రామంలో బెల్లం పెద్ద మొత్తంలో ఒకేసారి కొనేవారుండరు. అందుచే ఆయన జహంగీరాబాదులోని వ్యాపారులకు బెల్లం అమ్ముతున్నాడు.

ప్రశ్న 5.
ఎవరి స్థలంలో దుకాణాలను నెలకొల్పుతారు?
జవాబు:
బస్టాండుకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లో కొన్ని కుటుంబాల వారు తమకున్న స్థలంలో కొంత భాగాన్ని దుకాణాలు తెరవడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 6.
తినే వస్తువులు అమ్మే ఈ దుకాణాలలో శ్రమ ఎవరిది?
జవాబు:
కుటుంబంలోని మహిళలు, పిల్లలు.

ప్రశ్న 7.
ఇటువంటి దుకాణాలకు ఎలాంటి నిర్వహణ పెట్టుబడి అవసరం అవుతుంది?
జవాబు:
ఇలాంటి దుకాణాలు సాధారణంగా స్వయం ఉపాధితో పెట్టినవే.

ప్రశ్న 8.
భౌతిక పెట్టుబడి కిందికి వచ్చే వాటిని పేర్కొనండి.
జవాబు:
భౌతిక పెట్టుబడి కింద వచ్చేవి – పిండిమర మొదలైనవి.

ప్రశ్న 9.
మీ ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవాళ్లల్లో ఒకరి నుంచి వాళ్ల రోజువారీ అమ్మకాలు ఎంతో తెలుసుకోండి. ఏమైనా పొదుపు చేస్తున్నారో, లేదో ఎలా తెలుస్తుంది ? టీచరుతో చర్చించండి.
జవాబు:
మా ప్రాంతంలో బజారులో తిరుగుతూ సరుకులు అమ్మేవారు తమ ఆదాయంలో కొంత మేరకు స్వయంశక్తి సంఘాల పొదుపుల్లోనో, గ్రామాల్లో వేసే చీటీ (చిట్స్)లోనో పొదుపు చేస్తున్నారు.

10th Class Social Textbook Page No.127

ప్రశ్న 10.
కిశోర్ స్థిర పెట్టుబడి ఏమిటి ? అతడి నిర్వహణ పెట్టుబడి ఏమై ఉంటుంది?
జవాబు:
గేదె, బండి – కిశోర్ యొక్క స్థిర పెట్టుబడి. గేదె దానా, బండి మరమ్మతులు, కందెన వంటివి నిర్వహణ పెట్టుబడి.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

ప్రశ్న 11.
కిశోర్ ఎన్ని ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొంటూ ఉన్నాడు?
జవాబు:
కిశోర్ పాల ఉత్పత్తి, రవాణా అనే రెండు రకాల ఉత్పత్తి కార్యకలాపాలలలో పాల్గొన్నాడు.

ప్రశ్న 12.
రాంపురంలో మెరుగైన రోడ్ల వల్ల కిశోర్ లాభపడ్డాడా?
జవాబు:
కిశోర్ తన గేదెతో నడిచే బండి సులువుగా నడపడానికి రాంపురంలోని మెరుగైన రోడ్లు ఉపయోగపడ్డాయి.

10th Class Social Textbook Page No.115

ప్రశ్న 13.
వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు ? వివిధ కాలాల్లో పంటలు ఎలా మారుతూ ఉంటాయి? వ్యవసాయం మీద ఆధారపడిన అధిక శాతం ప్రజలకు భూమి ఉందా, లేక వాళ్లు వ్యవసాయ కూలీలా?
జవాబు:
భూమి సాగుచేసి పంటలు పండించడాన్ని వ్యవసాయం అంటారు.. పంటలు కాలము, సాగునీటి సదుపాయం వంటి సౌకర్యాల ఆధారంగా పండుతాయి. ఉదా : వరి పంటకు 25°C ఉష్ణోగ్రత, మొదలలో నీరు నిలువ ఉండాలి. గోధుమ పంటకు తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. కాబట్టి కాలాన్ని, ప్రాంతాన్ని బట్టి పంటలు మారుతుంటాయి. వ్యవసాయం మీద ఆధారపడిన వారిలో అధిక శాతం మందికి భూమిలేదు. వారంతా వ్యవసాయ కూలీలు.

10th Class Social Textbook Page No.117

ప్రశ్న 14.
కింది పట్టిక భారతదేశంలో సాగుకింద ఉన్న భూమిని మిలియన్ హెక్టార్లలో చూపిస్తుంది. పక్కన ఉన్న గ్రాఫ్ లో వీటిని పొందుపరచండి. గ్రాఫ్ ఏం తెలియచేస్తోంది? తరగతి గదిలో చర్చించండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 3
జవాబు:
గ్రాఫ్ ను పరిశీలించగా 1950లో భారతదేశంలో గల సాగుభూమి 120 మిలియన్ హెక్టార్లు, 1960లో 130, 1970లో 110 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. అయితే గత 4 దశాబ్దాలుగా సాగుభూమి స్థిరంగా ఉండిపోయింది. ఏ మాత్రము పెరగలేదు. జనాభా మాత్రం దశాబ్దానికి దశాబ్దానికి పెరుగుతూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో తిండి గింజలు (ఆహార) కొరత ఏర్పడవచ్చు. కావునా, అందుబాటులో గల సాగుభూమికి సాగునీరందివ్వడానికి ప్రాజెక్టులను నిర్మించి బహుళ పంటల పద్ధతి అమలు చేయటం, పంట దిగుబడికి నూతన విధానాలు అమలు చేయటం వంటివి చేయాలి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 4

ప్రశ్న 15.
‘రాంపురంలో పండించిన పంటల గురించి తెలుసుకున్నారు. మీ ప్రాంతంలో పండించే పంటల ఆధారంగా కింది పట్టికను నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 5
జవాబు:
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 6

ప్రశ్న 16.
గ్రామీణ ప్రాంతాలలో ‘బహుళ పంటలు’ సాగు చెయ్యటానికి దోహదపడే కారణాలు ఏమిటి?
జవాబు:
గ్రామీణ ప్రాంతాలలో బహుళ పంటలు సాగుచేయుటకు దోహదపడే అంశాలు :

  1. వ్యవసాయ కూలీల అందుబాటు
  2. సాగునీరు లభ్యత
  3. సారవంతమైన నేల
  4. కాలానుగుణంగా పంటలు మార్చే నేర్పుగల అనుభవనీయులైన రైతులు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.119

ప్రశ్న 17.
ఈ క్రింది పటంలో చిన్న రైతులు సాగుచేసే భూమిని గుర్తించి రంగులు నింపండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 7
పటం : ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో సాగుభూమి పంపిణీ

ప్రశ్న 18.
అనేక మంది రైతులు ఇంత చిన్న కమతాలను ఎందుకు సాగుచేస్తున్నారు?
జవాబు:
అనేక మంది చిన్న చిన్న కమతాలను సాగుచేయుటకు గల కారణాలు.

  1. రైతుగా సామాజిక హోదా.
  2. తన పొలంలో పండే పంట తింటున్నాననే తృప్తి.
  3. ఈ భూమి రైతుకు పరపతినేర్పాటు చేస్తుంది.
  4. ఈ చిన్న కమతాలలో రెండు, మూడవ పంటలుగా వాణిజ్య పంటలు వేసి ఆర్థికంగా అవసరాలు తీర్చుకుంటాడు.
  5. చిన్న కమతాలలో వ్యవసాయం చేసుకుంటూ, మిగతా సమయాలలో ఇతరుల పనికి కూలీకి వెళ్లటం, వ్యాపారాలు చేయటం వంటివి చేస్తారు.

10th Class Social Textbook Page No.119

ప్రశ్న 19.
భారతదేశంలో రైతులు, వాళ్లు సాగుచేసే భూముల వివరాలు కింద ఇచ్చిన పట్టికలోనూ, ‘పై’ చార్టులోనూ ఉన్నాయి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 8
గమనిక : ఈ గణాంకాలు రైతులు సాగుచేస్తున్న భూమి వివరాలను తెలియజేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలుకు తీసుకున్నది కావచ్చు.
1) బాణం గుర్తులు ఏమి సూచిస్తున్నాయి?
2) భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలు ఉన్నాయని మీరు అంగీకరిస్తారా?
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 9
జవాబు:

  1. భారతదేశంలో సాగుభూమి పంపిణీలో అసమానతలను బాణం గుర్తులు సూచిస్తున్నాయి.
  2. రైతు జనాభాలో కేవలం 13% గల మధ్య తరగతి, భూస్వాముల చేతిలో మొత్తం భూమిలో సగం కంటే ఎక్కువ అనగా 52% భూమి ఉంది. 87%, చిన్న రైతుల వద్ద కేవలం 48% భూమి మాత్రమే ఉంది. అనగా దేశంలోని అత్యధిక సాగుభూమి కొద్ది మంది రైతుల చేతులలోనే ఉంది.

10th Class Social Textbook Page No.120

ప్రశ్న 20.
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఎందుకు ఉన్నారు?
జవాబు:
దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా ఉండుటకు కారణాలు :
రాంపురంలో పనికోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది. కాబట్టి తక్కువ కూలీకైనా పని చేయుటకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అందుచే దళ లాంటి వ్యవసాయ కూలీలు పేదవారుగా మిగిలిపోతున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.121

ప్రశ్న 21.
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలోని మధ్యతరగతి, పెద్ద రైతులు ఏం చేస్తారు? మీ ప్రాంతంలోని పరిస్థితిని దీనితో పోల్చండి.
జవాబు:
తమ కోసం వ్యవసాయ కూలీలు పనిచెయ్యటానికి రాంపురంలో మధ్యతరగతి పెద్ద రైతులు పేదవారికి, చిన్న రైతులకు అప్పులిచ్చి తామిచ్చే కూలీకి తమ పొలాల్లో తప్పనిసరిగా పనిచేయాలనే నిబంధన విధిస్తారు. మా ప్రాంతంలో అటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయేతర పనులు లభించడంతో వ్యవసాయ పనులపైనే ఆధారపడవలసిన అవసరం లేదు.

10th Class Social Textbook Page No.121

ప్రశ్న 22.
కింది పట్టికను నింపండి :

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి.
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు.
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు.

జవాబు:

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమఒక్కొక్కదానికి మూడు భిన్నమైన ఉదాహరణలు ఇవ్వండి.
యజమాని / కుటుంబం కూడా అవసరమైన పని చేస్తారు.తమ స్వంత పొలంలో వ్యవసాయ పనులు. ఇంటి మైనర్ రిపేర్లు, పంటలేని సమయంలో పొలాన్ని సిద్ధం చేయటం.
పని చెయ్యటానికి యజమాని కూలీలను నియమిస్తాడు.పొలానికి ఎరువు వేయించటం, పంట కాలంలో పనులు – ఉడుపు, కలుపుతీత, గొప్పు, కోత వంటివి. పొలానికి సాగునీరు రావలసిన కాలువలు త్రవ్వించుట మొదలైనవి.

ప్రశ్న 23.
మీ ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో ఏ ఏ రకాలుగా శ్రమను పొందుతారు?
జవాబు:
మా ప్రాంతంలో వస్తువుల, సేవల ఉత్పత్తిలో శ్రమను పొందు రకాలు:

  1. పనిచేసే కూలీలు
  2. పంటను సమీప మార్కెట్ కు తరలించే వాహనాల డ్రైవర్లుగా
  3. వాహనాలు నుంచి సరుకు దించే కూలీలుగా
  4. విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులు
  5. పేపరు మిల్లుల ఏజంట్లుగా

10th Class Social Textbook Page No.122

ప్రశ్న 24.
క్రింది పట్టికను పరిశీలించండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 10

1) పైన ఇచ్చిన కూలిరేట్లతో మీ ప్రాంతంలో ఏదైనా పనికి అమలులో ఉన్న కూలిరేట్లను పోల్చండి.
జవాబు:
మా ప్రాంతంలో రోజువారీ కూలీలు పైన పేర్కొన్న విధంగానే ఉన్నాయి. పురుషులకు కనీస కూలీ రూ. 200 కాగా, స్త్రీలకు రూ. 150. దత్తాంశంలో చాలా వ్యత్యాసాలున్నాయి.

2) కనీస కూలీరేట్ల గురించి తెలుసుకొని వాటితో పోల్చండి.
జవాబు:
1) నూర్పిడి చేసినందుకు స్త్రీలకు (పైన పేర్కొన్న విధంగా) కనీస కూలీ రూ. 118 లభిస్తుంది.
2) కాగా మా ప్రాంతంలో నూర్పిడి చేసినందుకు స్త్రీలకు రూ. 200ల కనీస కూలీ ఇస్తున్నారు.

3) ఒక పనికి ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ ఎందుకు లభిస్తోంది? చర్చించండి.
జవాబు:
ఆడవారికంటే మగవారు ఎక్కువ పనిచేయగలరనే భావన వలన ఒక పనికి ఆడవారికంటే మగవారికి ఎక్కువ కూలి ఇస్తున్నారు.

AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ

10th Class Social Textbook Page No.126

ప్రశ్న 25.
మిశ్రిలాల్ తన లాభాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నాడు? అతడికి నష్టాలు వచ్చే సందర్భాలు ఏమిటో ఆలోచించండి.
జవాబు:
మిశ్రిలాల్ బెల్లం తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నాడు. పెద్ద ఎత్తున చెరుకు కొని యంత్రాల సంఖ్య పెంచడం, శ్రామికులను వినియోగించడం ద్వారా ఆయన బెల్లం ఉత్పత్తిని పెంచి అధిక లాభాలను ఆర్జించగలడు. అయితే వ్యాపారంలో పోటీ, మార్కెట్ రిల మూలంగా నష్టాలు కూడా రావచ్చు.

10th Class Social Textbook Page No.124

ప్రశ్న 26.
ముగ్గురు రైతులను తీసుకోండి. ముగ్గురూ గోధుమలు పండించారు. అయితే వాళ్ళు ఉత్పత్తి చేసిన దానిలో తేడా ఉంది (రెండవ నిలువు వరుస). వివిధ రైతులు ఎదుర్కొనే పరిస్థితిని విశ్లేషించటానికి కొన్ని అంశాలు అందరికీ సమానమని అనుకోవాలి. తేలికగా లెక్క కట్టటానికి ఈ అంశాలను అనుకుందాం :
1) ప్రతి రైతు కుటుంబం వినియోగించే గోధుమల మొత్తం సమానం (మూడవ నిలువు వరుస).
2) ఈ సంవత్సరంలో మిగిలిన గోధుమనంతా వచ్చే సంవత్సరం విత్తనంగా రైతులందరూ ఉపయోగించుకుంటారు. అందుకు వాళ్లకు తగినంత భూమి ఉంది.
3) అందరికి ఉపయోగించిన విత్తనం కంటే రెట్టింపు దిగుబడి వస్తుందనుకుందాం. ఉత్పత్తిలో ఎటువంటి అకస్మాత్తు నష్టాలు లేవు.
పట్టికను పూర్తి చేయండి.
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 11

• మూడు సంవత్సరాలలో ముగ్గురు రైతుల గోధుమ ఉత్పత్తిని పోల్చండి.
• 3వ రైతు పరిస్థితి 3వ సంవత్సరంలో ఏమవుతుంది ? అతడు ఉత్పత్తిని కొనసాగించగలడా ? ఉత్పత్తిని కొనసాగించటానికి అతడు ఏం చెయ్యాలి?
జవాబు:
1వ రైతు
AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 12 AP Board 10th Class Social Solutions Chapter 9 రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ 13

వినియోగం కంటే ఉత్పత్తి రెట్టింపుతో ప్రారంభించిన 2వ రైతు మిగులునే వచ్చే సంవత్సరానికి పెట్టుబడిగా పెట్టి పంట కొనసాగిస్తున్నాడు.

వినియోగానికి రెట్టింపు కంటే ఎక్కువ ఉత్పత్తితో ప్రారంభించిన 1వ రైతు పెట్టుబడిని పెంచుకుంటూ మిగులును పెంచుకుంటున్నాడు.

3వ రైతుకు 2వ సంవత్సరానికే మిగులు లేకపోవడంతో 3వ సంవత్సరం ఉత్పత్తి సాధ్యంకాని స్థితి నెలకొంది. కాబట్టి 3వ రైతు సాగుభూమిని పెంచి ఉత్పత్తిని పెంచుకోవలసి ఉంది.